1/9
నేను హోంమంత్రి అయితే తట్టుకోలేరంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ చిత్రమైన వ్యాఖ్యలు చేశారు
2/9
రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులో లేకపోతే తాను హోంమంత్రి బాధ్యతలు చేపట్టాల్సి వస్తుందని పోలీసులను హెచ్చరించారాయన.
3/9
ఈ క్రమంలో సొంత(కూటమి) ప్రభుత్వంపైనే ఆయన విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలపై హోం మంత్రి అనిత సమీక్ష జరపాలని.. తాను గనుక ఆ బాధ్యతలు తీసుకుంటే పరిస్థితులు మరోలా ఉంటాయన్నారు. ‘‘ నేతలు ఇలానే ఏమీ చేయకుండా నిశ్చలంగా ఉంటే హోంమంత్రి బాధ్యతలు కూడా తానే తీసుకుంటా’’ అని పవన్ అన్నారు.
4/9
చంద్రబాబు హయాంలో రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని పరోక్షంగా బాబు పాలన అట్టర్‌ప్లాఫ్ అని పేర్కొన్నారు. అలాగే.. హోం మంత్రిగా అనిత విఫలమయ్యారని సెన్సేషన్ స్టేట్‌మెంట్ ఇచ్చారు
5/9
ఉన్నట్లుండి పవన్ ఇలా మాట్లాడడంతో.. ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. పవన్ ఒక్కసారిగా ఇలా సహచర మంత్రిగా ఎందుకు వ్యాఖ్యానించి ఉంటారో అని రకరకాల కోణాల్లో విశ్లేషణలు జరుగుతున్నాయి
6/9
అయితే డిప్యూటీ సీఎం అయిన పవన్ తన వ్యాఖ్యలతో.. చంద్రబాబు ప్రభుత్వ డొల్లతనాన్ని బయటపెట్టారని వైఎస్సార్‌సీపీ అంటోంది. పవన్ వ్యాఖ్యల ఆధారంగా.. హోం మంత్రిని మార్చేయాలనే డిమాండ్ తెరపైకి తెచ్చింది.
7/9
కూటమి ప్రభుత్వ ఏర్పాటు టైంలో పవన్ కల్యాణ్ హోం మంత్రి అవుతారనే చర్చ ఒకటి జనసైనిక్స్‌లో విపరీతంగా నడిచింది. కానీ, హోం మంత్రిత్వ శాఖను తన పార్టీ వద్దే ఉంచుకుని.. డిప్యూటీ సీఎం పదవితో పాటు ఐదు మంత్రిత్వ శాఖలను పవన్‌కు కట్టబెట్టారు చంద్రబాబు.
8/9
రాష్ట్రంలో జరుగుతున్న అఘాయిత్యాలకు పవన్ సరైన తీరులో స్పందించట్లేదన్న తీవ్ర విమర్శలను తప్పించుకునేందుకు అనితపైకి నెట్టేసి పక్కదారి పట్టించే యత్నం చేస్తున్నారా? లేదంటే.. చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగమేనా ఈ స్కెచ్?.. అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయ్యో అనిత అనుకుంటున్నారు ఇంకొందరు
9/9
మొత్తానికి ప్రశ్నిస్తానంటూ ఒకనాడు ఊగిపోయిన పవన్.. ఇప్పుడు సొంత సర్కార్‌నే ప్రశ్నించడం భలే గమ్మత్తుగా ఉందంటూ నెట్టింట చర్చ నడుస్తోంది.