Top Stories
ప్రధాన వార్తలు

నిరంతర ‘కోత’లు!.. అల్లాడుతున్న ప్రజలు
చంటిపిల్లలతో అల్లాడిపోతున్నాం.. విద్యుత్ కోత వల్ల మేం సక్రమంగా నిద్రపోయి చాలా రోజులైంది. ఏ పనీ చేసుకోలేక పోతున్నాం. ఉక్కపోత వల్ల చంటి పిల్లలతో అల్లాడిపోతున్నాం. పట్టించుకునే నాధుడే లేడు. విద్యుత్ సరఫరా లేక వీధుల్లో నిరీక్షించాల్సి వస్తోంది. – చల్లపల్లి మంగ, తారకరామ కాలనీ, బొబ్బిలి.సాక్షి, అమరావతి: ఒకపక్క ముచ్చెమటలు పట్టిస్తున్న బిల్లులు.. మరోపక్క విద్యుత్తు కోతలతో రాష్ట్ర ప్రజలు అల్లాడుతున్నారు. ఎండాకాలం ప్రారంభంలోనే డిమాండ్‌కు సరిపడా విద్యుత్‌ను సరఫరా చేయలేక చేతులెత్తేసిన చంద్రబాబు సర్కారు మండు వేసవిలో అనధికారిక కోతలతో విసనకర్రలే శరణ్యమనే స్థితికి తెచ్చింది. అధికారంలోకి రాగానే వినియోగదారులపై ఏకంగా రూ.15,485 కోట్ల భారం మోపిన టీడీపీ కూటమి సర్కారు కరెంట్ సరఫరాలో దారుణంగా విఫలమైందని.. నిరంతర విద్యుత్తు దేవుడెరుగు.. నిరంతరం కోతలు విధిస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో విద్యుత్ కోతలపై ‘సాక్షి గ్రౌండ్ రిపోర్ట్’లో అన్నదాతల అగచాట్లు, పట్టణాలు, పల్లెల్లో ప్రజల దుస్థితి వ్యక్తమైంది. ఏప్రిల్ నెలలో విద్యుత్తు సరఫరాకు సంబంధించి గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది డిమాండ్ తక్కువగానే ఉన్నా అది కూడా సరఫరా చేయలేక కూటమి సర్కారు ఎడాపెడా కోతలు విధిస్తోంది. పల్లెల్లో అగమ్యగోచరం..నగరాల్లో గృహాలకు రోజుకు కనీసం మూడు గంటలు, పట్టణాల్లో నాలుగు గంటల పాటు అనధికారికంగా విద్యుత్ కోతలు విధిస్తున్నారు. వారంలో ఒక రోజు నిర్వహణ పనుల పేరుతో సరఫరా నిలిపి వేస్తున్నారు. పట్టణాల్లో ప్రాంతాలవారీగా రాత్రిళ్లు రెండు గంటలు విద్యుత్ కోత పెడుతున్నారు. ఇక గ్రామాల్లో పరిస్థితి గురించి చెప్పనవసరం లేదు. విద్యుత్ సరఫరా ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియని దుస్థితి తలెత్తింది. గంటల తరబడి విద్యుత్ కోతలు విధిస్తున్నారు. గతంలోనూ చంద్రబాబు హయాంలో ఇదే దుస్ధితి నెలకొందని గుర్తు చేసుకుంటున్నారు. ఎల్సీ, లైన్ల మరమ్మతులు, సబ్ స్టేషన్ నిర్వహణ సాకులు చెబుతూ కోతలు పెడుతున్నారు. ఎవరైనా ఇదేమిటని ప్రశ్నిస్తే పార్టీ ముద్ర వేసి పథకాలు రాకుండా చేస్తామని కూటమి నేతలు బెదిరిస్తున్నారు. బాబు హయాంలో పరిశ్రమలకు పవర్ హాలిడే..రాష్ట్రంలో ప్రస్తుతం రోజుకు 242.849 మిలియన్ యూనిట్ల విద్యుత్ డిమాండ్ ఉంది. గతేడాది ఇదే సమయంలో 250.804 మిలియన్ యూనిట్ల వినియోగం నమోదైంది. గతేడాదితో పోలిస్తే 3.17 మిలియన్ యూనిట్ల వినియోగం తక్కువే ఉన్నా సరఫరా చేయలేక కూటమి సర్కారు అనధికారిక కోతలు విధిస్తోంది. సాధారణంగా వేసవిలో విద్యుత్ వాడకం పెరుగుతుంది. కానీ ప్రస్తుతం డిమాండ్ గతేడాది కంటే తక్కువగా ఉన్నా సరఫరా చేయలేకపోతోంది. ఇక మే నెలలో రోజువారీ వినియోగం 260 మిలియన్ యూనిట్లకు చేరే అవకాశం ఉందని అంచనా. ఇక అప్పడు పరిస్థితి ఎలా ఉంటుందోననే ఆందోళన ప్రజల్లో వ్యక్తమవుతోంది. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ‘పవర్ హాలిడే’ పేరుతో పరిశ్రమలకు వారంలో రెండు రోజులు విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిపివేసింది. దీంతో కుటీర పరిశ్రమలు మూతపడ్డాయి. మళ్లీ ఇప్పుడు అవే దుర్భర పరిస్థితులు దాపురిస్తున్నాయనే ఆందోళన పారిశ్రామిక వర్గాల్లో వ్యక్తమవుతోంది.విజయనగరం జిల్లా బొబ్బిలి తారకరామ కాలనీలో విద్యుత్ కోతల వల్ల ఇళ్లలో ఉక్కపోత భరించలేక అర్ధరాత్రి చంటి బిడ్డతో సహా ఆరుబయట కూర్చుని జాగారం చేస్తున్న జనం భవిష్యత్ కోసం..భవిష్యత్‌లో విద్యుత్ కోసం ఇబ్బంది పడకుండా ముందస్తు ప్రణాళికలు అమలుకు గత ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అందులో భాగంగానే 33,240 మెగావాట్ల సామర్థ్యంతో 29 పంప్డ్ స్టోరేజ్ హైడ్రో పవర్ ప్రాజెక్టుల ఏర్పాటుకు చర్యలు తీసుకుంది. వ్యవసాయానికి 30 ఏళ్ల పాటు పగటిపూట 9 గంటలు ఉచిత విద్యుత్ అందించేందుకు 7 వేల మెగావాట్లను సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సెకీ) నుంచి అత్యంత తక్కువ ధరకే తీసుకునేలా ఒప్పందం కుదుర్చుకుంది.నాడు విద్యుత్తు వెలుగులుఆర్థిక, పారిశ్రామిక అభివృద్ధికి విద్యుత్ డిమాండ్ ప్రధాన సూచికగా భావిస్తుంటారు. వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్తును నిరంతరం సరఫరా చేయడంలో గత ప్రభుత్వం విజయం సాధించింది. తీవ్ర బొగ్గు కొరత కారణంగా పలు రాష్ట్రాలు సంక్షోభం ఎదుర్కొన్నప్పటికి ఏపీలో వినియోగానికి సరిపడా విద్యుత్ సరఫరాను వైఎస్సార్సీపీ ప్రభుత్వం అందించింది. ఫలితంగా 2020 నుంచి 2024కి 22.5 శాతం విద్యుత్ సరఫరా వృద్ధి చెందింది. తాజాగా కేంద్ర విద్యుత్ శాఖ ఈ విషయాన్ని వెల్లడించింది. 2020లో రాష్ట్రంలో ఏడాది మొత్తం మీద 65,414 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా ఉండగా 2024లో 80,151 మిలియన్ యూనిట్లకు పెరిగింది. గత ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో జాతీయ, అంతర్జాతీయ పరిస్థితుల కారణంగా తీవ్ర విద్యుత్ సంక్షోభం తలెత్తింది. భారత్‌కు చైనా బొగ్గు దిగుమతులు పడిపోయాయి. ఆస్ట్రేలియా నుంచి కూడా అంతంత మాత్రంగానే వచ్చాయి. జపాన్‌లోనూ విద్యుత్ సంక్షోభం తాండవించింది. శీతాకాలంలో వెచ్చదనాన్నిచ్చే దుస్తులు వాడి హీటర్లకు విద్యుత్ వినియోగం తగ్గించాలని అక్కడి ప్రభుత్వం అప్పట్లో ఆదేశాలు జారీ చేసింది. అమెరికాలో 15 శాతం విద్యుత్ వినియోగంతో పాటు సహజ ఇంధనం ధరలు పెరగడంతో ప్రతి ఆరు ఇళ్లలో ఒక ఇల్లు విద్యుత్ బకాయి చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ మన రాష్ట్రంలో అవసరానికి తగ్గట్టు విద్యుత్‌ను ఎలాంటి కోతలు లేకుండా గత ప్రభుత్వం ప్రజలకు అందించింది.మా బతుకుల్లో వెలుగు కరువుపగలు రెండు గంటలు, రాత్రి రెండు గంటలు కరెంట్ తీసేస్తున్నారు. రాత్రిళ్లు సరిగ్గా భోజనాల వేళకు కరెంట్ పోతోంది. వారంలో ఒక రోజు రోజంతా కరెంట్ ఉండదు. ఈ ప్రభుత్వం వచ్చాక మా ఇంటికి ఎలాంటి మంచి జరగలేదు. నా భర్తకు పక్షవాతం వస్తే కనీసం పింఛన్ ఇవ్వడం లేదు. కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. మా ఇంట్లో, మా బతుకుల్లో ఈ ప్రభుత్వం వల్ల వెలుగు లేకుండా పోయింది. –దిద్దె రత్నకుమారి, జ్యోతి కాలనీ, నిడదవోలు, తూర్పు గోదావరి జిల్లాఎప్పుడొస్తుందో.. ఎప్పుడు పోతుందోఉపాధి కోసం పిండి మర పెట్టుకుని జీవనం సాగిస్తున్నా. కరెంటు ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియడం లేదు. ఓల్టేజ్ ఎక్కువ, తక్కువ అవుతోంది. దీనివల్ల మోటార్లు కాలిపోతున్నాయి. –కిశోర్, నాగమణి పిండిమిల్లు, టీఆర్ కాలనీ, బొబ్బిలితెల్లార్లూ కూర్చునే ఉంటున్నాం..కరెంటు కోసం రోజంతా ఎదురు చూడాల్సిందే. తెల్లార్లూ కూర్చునే ఉండాల్సిన పరిస్థితి. సాయంత్రం తీసి తెల్లవారు జామున 3 గంటలకు ఇస్తున్నారు. అందాకా మెలకువగానే ఉంటున్నాం. ఇదేనా నాణ్యమైన విద్యుత్తు? –సీహెచ్ లక్ష్మి, బొబ్బిలిఏం ప్రభుత్వమో ఏమో?గత ప్రభుత్వంలో నగరంలో విద్యుత్ సరఫరా ఆగడం ఎప్పుడూ చూడలేదు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చెట్టుకొమ్మలు నరుకుతున్నాం, ట్రాన్స్ ఫార్మర్ బాగు చేస్తున్నాం.. అంటూ ఏదో ఒక సాకుతో వారంలో ఒక రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకూ కరెంటు కట్ చేస్తున్నారు. ఇదేం ప్రభుత్వమో ఏమో? వేసవిలో విద్యుత్ కోతలు లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే కదా..? మరి ఎందుకు పట్టించుకోరు? –డి.లలిత, విశాఖపట్నంపసిపాప అల్లాడుతోంది..మా అమ్మగారింటికి వచ్చా. ఇక్కడ కరెంట్ అసలు ఉండటం లేదు. అస్తమానూ తీసేస్తున్నారు. చిన్నపాప ఉక్కపోతకు అల్లాడి పోతోంది. మా పరిస్థితి ఏమని చెప్పుకుంటాం. కరెంటు కట్ చేయొచ్చు కానీ రాత్రిళ్లు కూడా లేకుండానా? కోతల వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాం. –దివ్య, బొబ్బిలిబిల్లుల మోత.. విద్యుత్ చార్జీలు తగ్గిస్తామని హామీలిచ్చి కూటమి అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు పగలు, రాత్రి అనే తేడా లేకుండా విద్యుత్ కోతలు విధిస్తున్నారు. విద్యుత్ బిల్లుల మోత మోగిస్తున్న ప్రభుత్వం కోతలను పట్టించుకోవడం లేదు. – షేక్ మహమ్మద్ అలి, కంభం, ప్రకాశం జిల్లారైతన్న కష్టం వృథా...!నాకున్న ఎకరం పొలానికి తోడు మూడెకరాలు కౌలుకి తీసుకుని వ్యవసాయం చేస్తున్నా. చివరి నేలకు తడి లేకపోతే ఇన్ని నెలల కష్టం వృథా అవుతుంది. ఎకరాకు కనీసం రూ.35 వేలు చొప్పున కౌలు చెల్లించాలి. గత ప్రభుత్వంలో వ్యవసాయానికి పగటిపూట 9 గంటలు విద్యుత్ ఒకే విడతలో ఇచ్చేవారు. ఇప్పుడు రోజులో రెండు, మూడు విడతలుగా ఇస్తున్నారు. అది కూడా 7 గంటలు మించడం లేదు. దీంతో తడిసిన నేలే మళ్లీ తడిచి పంటలు ఎండిపోతున్నాయి. గతంలో రైతు భరోసా వచ్చేది. ఇప్పుడు అదీ లేదు. –యాతం రామాంజనేయులు, కడియద్ద, పశ్చిమ గోదావరి జిల్లాఏ పురుగో పుట్రో కరిస్తే...!ఏం ప్రభుత్వమో ఏంటో..! చచ్చిపోతున్నాం ఆఫీసుల చుట్టూ తిరగలేక. నాలుగు రోజులుగా నరకం చూపిస్తున్నారు. ట్రాన్స్ఫార్మర్ కాలిపోయింది. పంట ఎండిపోతోందంటే ఎవరూ వినిపించుకోవడం లేదు. రోజుల తరబడి అధికారుల చుట్టూ తిరిగినా కొత్తది ఇవ్వడం లేదు. గతంలో 9 గంటలు కరెంటు ఇచ్చేవారు. ఇప్పుడు 7 గంటలు ఇస్తే అదే ఎక్కువ. తెల్లవారుజామున 4 గంటలకు ఇస్తుండటంతో ఆ సమయంలో పొలానికి వచ్చి చేలకు నీరు పెట్టుకుంటున్నాం. ఏ పురుగో పుట్రో కరిస్తే మా పరిస్థితి ఏంటి? ఇదేం బాలేదు. ప్రభుత్వం ఇవన్నీ చూసుకోవాలి కదా!! –మదుకూరి కొండల రాజు, కృష్ణాపురం, పశ్చిమగోదావరి జిల్లా

సెట్ చేయడానికే ఏడాది: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో జరుగుతున్న అన్ని అనర్థాలకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆరే కారణమని, రాష్ట్ర ఖజానా అంతా లూటీ చేసింది ఆయనేనని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. పార్టీ రజతోత్సవం పేరుతో ఎల్కతుర్తిలో నిర్వహించిన బీఆర్ఎస్ సభలో ఆయనలో ఉన్న అక్కసునంతా వెళ్లగక్కాడని విమర్శించారు. వాస్తవానికి తాను ముఖ్యమంత్రిని అయిన రోజునే కేసీఆర్ గుండె పగిలిందని వ్యాఖ్యానించారు. తాము అధికారంలోకి వచ్చాక.. అంతకుముందు పదేళ్లలో కేసీఆర్ చేసిన విధ్వంసాన్ని సెట్ చేయడానికే ఏడాది కాలం సరిపోయిందని, ఇప్పుడంతా స్ట్రీమ్‌లైన్ (క్రమబద్ధీకరణ) చేస్తున్నామని చెప్పారు. సోమవారం కాంగ్రెస్ సీనియర్ నేత కె.జానారెడ్డి నివాసంలో రేవంత్‌రెడ్డి మీడియాతో ముచ్చటించారు. బీఆర్ఎస్ సభ, మావోయిస్టుల సమస్య, కేసీఆర్ పాలన, తన పనితీరు, రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు, రాహుల్‌గాందీతో తనకున్న మైత్రి తదితర అంశాలపై మాట్లాడారు. ఎవరో అడుగుతున్నారని అరెస్టులు ఉండవు ‘కేసీఆర్ ప్రసంగంలో పస లేదు. బీఆర్ఎస్ ఎల్కతుర్తి సభ కంటే నేను గజ్వేల్‌లో పెట్టిన సభే హైలైట్. ఖమ్మంలో జరిగిన రాహుల్‌గాంధీ సభకు బీఆర్ఎస్ హయాంలో కనీసం బస్సులు కూడా ఇవ్వలేదు. కానీ మేం బీఆర్ఎస్ నేతలు అడిగినన్ని బస్సులు ఇచ్చాం. తద్వారా ఆర్టీసీకి ఆదాయం కూడా వచ్చింది. హరీశ్, కేటీఆర్‌లు చిన్నపిల్లలని నేను అసెంబ్లీలో మాట్లాడిన విషయాన్నే కేసీఆర్ ఎల్కతుర్తి సభలో చెప్పాడు. మరి పిల్లగాళ్లను అసెంబ్లీకి ఎందుకు పంపిస్తున్నాడు? కేసీఆర్, మోదీ వారి అవసరాలకు అనుగుణంగా మాట్లా డుతుంటారు. కేసీఆర్ తరహాలో నేను చట్టాన్ని అతిక్రమించి పనిచేయను. ఎవరో అడుగుతున్నా రని అరెస్టులు చేసే పరిస్థితి ఉండదు. కక్ష సాధింపు చర్యలకు పాల్పడేది లేదు. చట్టప్రకారమే అన్నీ జరుగుతాయి..’ ముఖ్యమంత్రి అన్నారు. ఏ పథకమైనా అర్హులందరికీ లబ్ధి చేకూరాలి ‘కేసీఆర్ తరహాలో లాంచింగ్, క్లోజింగ్ పథకాలు నేను పెట్టలేను. షోపుటప్ స్కీంలు నాతో కాదు. ఒక పథకాన్ని ప్రారంభిస్తే అర్హులందరికీ లబ్ధి కలిగేంతవరకు పనిచేస్తా. రేవంత్‌రెడ్డి చెప్పిందే చేస్తాడనే నమ్మకం ప్రజల్లో కలిగేలా పనిచేస్తా. ఇప్పటివరకు ప్లానింగ్‌కే సమయం సరిపోయింది. ఇక నుంచి స్పీడప్ చేయాల్సిన అవసరం ఉంది. పథకాల గ్రౌండింగ్ చేస్తాం. అయితే ఇప్పటివరకు చేసిన కార్యక్రమాలను చెప్పుకోవడంలో కూడా మేము వెనుకబడ్డాం. ఏడాదిన్నరలోనే ఎన్నో పథకాలు అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కాలంలోనే ఎన్నో పథకాలు తీసుకువచ్చాం. ఇప్పుడు వాటన్నింటినీ స్ట్రీమ్‌లైన్ చేస్తున్నాం. మేము అమలు చేస్తున్న పథకాలు దేశంలోని ఏ రాష్ట్రంలోనూ లేవు. బీఆర్ఎస్ తరహాలో మాకు కూడా తెలంగాణ ప్రజలు పదేళ్లు అవకాశం ఇస్తారు. వాస్తవానికి నా పాలన, పథకాల అమలుపై ఎన్నికలకు ఆరు నెలల ముందు నుంచే చర్చ జరుగుతోంది..’ అని రేవంత్ చెప్పారు. రాహుల్‌తో మంచి సంబంధాలున్నాయి ‘రాహుల్‌గాంధీతో నా స్నేహం గురించి నాకు తెలిస్తే చాలు. ఎవరో ఏదో చెబితే వినాల్సిన పనిలేదు. ఆయనతో నాకు మంచి సంబంధాలున్నాయి. మా ఇద్దరి గురించి బయటి వారు ఏం మాట్లాడుకుంటున్నారనేది నాకు అవసరం లేదు. ప్రపంచంలో ఇందిరాగాంధీకి మించిన రాజకీయ యోధురాలు లేరు. ఒక దేశాన్ని ఓడించిన చరిత్ర ఆమెది. వేరే ఆప్షన్ లేకే ఆ అధికారుల కొనసాగింపు పాలన అవసరాలను బట్టి అధికారులను వినియోగించుకుంటాం. కొందరు అధికారుల గురించి అన్ని విషయాలు తెలిసినా వేరే ఆప్షన్ లేకపోవడంతో కొనసాగించాల్సి వస్తోంది. కలెక్టర్లను మార్చుకునే వెసులుబాటు ఉంది కనుకనే మారుçస్తున్నాం. సీపీఐ, ఎంఐఎంకు అండగా ఉన్నా.. నేను ఇంకా ఇరవై ఏళ్లు రాజకీయాల్లో ఉంటా. నన్ను నమ్ముకున్న వారిని ఎప్పుడూ మర్చిపోను. నన్ను నమ్మిన సీపీఐకి, ఎంఐఎంకు అండగా ఉన్నా. అద్దంకి దయాకర్‌కు పదవి ఇప్పించగలిగా. దయాకర్ ఓపికతో ఉన్న కారణంగానే పదవి వచ్చింది. ఓపికతో ఉంటేనే నాకు కూడా బాధ్యత ఉంటుంది. అవకాశాలు వస్తాయి. అలా కాదని బయటకు వచ్చి స్లీపింగ్ రిమార్కులు చేస్తే నాపై భారం తగ్గించినట్టే అవుతుంది. పదవి ఇవ్వలేని పరిస్థితికి, వారి మాటలకు చెల్లుకు చెల్లు అయినట్టు నేను ఫీల్ అవుతా..’ అని ముఖ్యమంత్రి అన్నారు. ఎంత చెప్పినా కొందరు ఎమ్మెల్యేలు వినడం లేదు ‘కొందరు ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో సరిగా పనులు చేసుకోలేకపోతున్నారు. ఎన్నిసార్లు చెప్పినా వారు హైదరాబాద్ వదిలి వెళ్లలేకపోతున్నారు. మీడియా చుట్టూ తిరిగేందుకే పరిమితం అవుతున్నారు..’ అని సీఎం వ్యాఖ్యానించారు. మావోయిస్టులపై పార్టీ నిర్ణయమే ఫైనల్ ‘ఆపరేషన్ కగార్‌పై జాతీయ స్థాయిలో చర్చ జరగాలి. మావోయిస్టుల విషయంలో పార్టీ నిర్ణయమే ఫైనల్. కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రభుత్వ విధానాన్ని ప్రకటిస్తాం..’ అని రేవంత్ తెలిపారు. జానా నివాసంలో ‘కగార్’పై చర్చలు లోకాయుక్త, ఉప లోకాయుక్త పదవీ స్వీకార కార్యక్రమానికి సోమవారం రాజ్‌భవన్‌కు వెళ్లిన సీఎం రేవంత్‌రెడ్డి.. అక్కడి నుంచి నేరుగా మాజీ మంత్రి కె.జానారెడ్డి నివాసానికి వెళ్లారు. అక్కడ జానారెడ్డితో పాటు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు కె.కేశవరావు, వేం నరేందర్‌రెడ్డిలతో సమావేశమయ్యారు. ఆపరేషన్ కగార్ గురించి చర్చించారు. మావోయిస్టుల సమస్యకు సంబంధించి శాంతి చర్చల కమిటీ ఆదివారం తనతో సమావేశం కావడాన్ని, తాను చొరవ తీసుకుని కేంద్రాన్ని శాంతి చర్చలకు ఒప్పించేలా చూడాలని వారు కోరిన విషయాన్ని తెలియజేశారు. గతంలో మావోయిస్టులతో చర్చలు జరిగినప్పుడు జానారెడ్డి హోంమంత్రిగా, కేశవరావు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న నేపథ్యంలో.. శాంతి చర్చల కమిటీ ప్రతిపాదనలపై ఏం చేయాలన్న దానిపై వారితో చర్చించారు. అక్కడి నుంచే ఏఐసీసీ సీనియర్ నేతలు దిగ్విజయ్‌సింగ్, చిదంబరంలతో సీఎం మాట్లాడారని సమాచారం. కాగా శాంతి చర్చల కమిటీ ప్రతిపాదనను పార్టీ అధిష్టానానికి పంపాలని సమావేశంలో నిర్ణయించారు.

ఈ రాశి వారు భూములు, వాహనాలు కొంటారు
గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, తిథి: శు.విదియ రా.8.33 వరకు, తదుపరి తదియ, నక్షత్రం: కృత్తిక రా.9.51 వరకు, తదుపరి రోహిణి, వర్జ్యం: ప.10.39 నుండి 12.09 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.18 నుండి 9.08 వరకు తదుపరి రా.10.50 నుండి 11.36 వరకు, అమృత ఘడియలు: రా.7.40 నుండి 9.07 వరకు; రాహుకాలం: ప.3.00 నుండి 4.30 వరకు, యమగండం: ఉ.9.00 నుండి 10.30 వరకు, సూర్యోదయం: 5.40, సూర్యాస్తమయం: 6.14. మేషం... పనులు ముందుకు సాగవు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలలో చికాకులు. నిరుద్యోగులకు శ్రమాధిక్యం.వృషభం... ఇంటర్వ్యూలు అందుతాయి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఆస్తి వివాదాలు పరిష్కారం. వస్తు,వస్త్రలాభాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలలో చిక్కులు అధిగమిస్తారు.మిథునం.. రుణయత్నాలు సాగిస్తారు. అనుకున్న పనులు ముందుకు సాగవు. ఆకస్మిక ప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలలో ప్రోత్సాహం. విందువినోదాలు.కర్కాటకం... పరిచయాలు పెరుగుతాయి. భూవివాదాల నుంచి గట్టెక్కుతారు. ఆధ్యాత్మిక చింతన. వ్యవహారాలు విజయవంతంగా సాగుతాయి. వృత్తి, వ్యాపారాలలో పురోగతి ఉంటుంది. వాహనయోగం.సింహం..... పలుకుబడి పెరుగుతుంది. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభవార్తలు వింటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. భూములు, వాహనాలు కొంటారు. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి.కన్య.... ఆర్థిక పరిస్థితి మందగిస్తుంది. అనుకోని ధనవ్యయం. కుటుంబసభ్యులతో తగాదాలు. అనారోగ్య సూచనలు. పాతమిత్రుల కలయిక. వృత్తి, వ్యాపారాలలో గందరగోళం.తుల... ఆకస్మిక ప్రయాణాలు. ఆర్థిక లావాదేవీలు అంతగా అనుకూలించవు. ఆస్తి వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసభ్యులతో తగాదాలు. వృత్తి, వ్యాపారాలలో చికాకులు.వృశ్చికం... పరిస్థితులు అనుకూలిస్తాయి. సంఘంలో గౌరవం. ఆధ్యాత్మిక చింతన. నూతన ఒప్పందాలు. ఆర్థికాభివృద్ధి. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి. వస్తులాభాలు.ధనుస్సు... కొత్త వ్యక్తులు పరిచయం. శుభవార్తలు వింటారు. ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వాహనయోగం. వృత్తి, వ్యాపారాలు మరింత అనుకూలిస్తాయి.మకరం..... పనులు వాయిదా వేస్తారు. ప్రయాణాలు రద్దు. బంధువులతో విభేదాలు. కుటుంబ, ఆర్థిక సమస్యలు. వ్యాపార, ఉద్యోగాలలో ఒడిదుడుకులు. దైవచింతన. విద్యార్థులకు ఒత్తిడులు.కుంభం... వ్యయప్రయాసలు. బంధువులు, మిత్రులతో విభేదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసమస్యలు చికాకు పరుస్తాయి. వృత్తి, వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఆలయదర్శనాలు.మీనం... పరిచయాలు పెరుగుతాయి. ఆసక్తికర సమాచారం. ఇంటిలో శుభకార్యాలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. వృత్తి, వ్యాపారాలలో అనుకూల మార్పులు.

‘ఛీ’నా రాజకీయం...
అవకాశం దొరికింది కదాని ఇండియాను పాకిస్థాన్ భుజాల మీదుగా కాల్చాలని ప్రయత్నిస్తోంది కుటిల చైనా. ఆ దిశగానే బీజింగ్-ఇస్లామాబాద్ రక్షణ భాగస్వామ్యం బలపడుతోంది. పహల్గాంలో ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు పెచ్చరిల్లుతున్న తరుణంలో... గగనతలం నుంచి గగనతలంలోకి ప్రయోగించగల తమ అత్యాధునిక పీఎల్-15 క్షిపణులను పాక్ వైమానిక దళానికి చైనా అందించింది.బియాండ్ విజువల్ రేంజ్ (బీవీఆర్) పీఎల్-15 క్షిపణులను మోసుకెళుతున్న తమ జేఎఫ్-17 బ్లాక్ 3 యుద్ధ విమానాల ఫొటోలను పాక్ వైమానిక దళం (పీఏఎఫ్) ఇటీవల విడుదల చేయడం గమనార్హం. ‘పీఏఎఫ్’కు చైనా సరఫరా చేసినవి ఎగుమతులకు ఉద్దేశించిన ‘పీఎల్-15ఈ’ రకం క్షిపణులు అనుకుంటే పొరపాటు! తమ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ (పీఎల్ఏఏఎఫ్)కు చెందిన సొంత పీఎల్-15 క్షిపణులను చైనా నేరుగా పాక్ కు అందజేసినట్టు ‘యూరేషియన్ టైమ్స్’ ఓ కథనం ప్రచురించింది.భారత్, పాక్ నడుమ వైరం ముదురుతున్న అత్యంత కీలక తరుణంలో ఆగమేఘాలపై ఆయుధాలను సరఫరా చేయడానికి చైనా ఈ మార్గం ఎంచుకున్నట్టు తెలుస్తోంది. మరింత ఎక్కువ దూరం నుంచి భారత్ విమానాలను లక్ష్యంగా చేసుకోగల సామర్థ్యాన్ని పీఎల్-15 క్షిపణులు పాక్ యుద్ధ విమానాల పైలట్లకు కల్పిస్తాయి. అలా శత్రువుపై గెలుపును సునాయాసం చేస్తాయి.ఏమిటీ పీఎల్-15 మిసైల్?పీఎల్-15 క్షిపణి ఆధునిక వైమానిక యుద్ధరంగంలో చైనాకు ఓ ప్రధానాస్త్రం. ఇది ప్రభుత్వ ఏరోస్పేస్ సంస్థయిన ఏవియేషన్ ఇండస్ట్రీ కార్పొరేషన్ ఆఫ్ చైనా (ఏవీఐసీ) అభివృద్ధి చేసిన రాడార్ గైడెడ్ దూరశ్రేణి క్షిపణి. ధ్వని వేగానికి ఐదు రెట్లు (మ్యాక్ 5) మించిన వేగంతో గగనతలం నుంచి గగనతలానికి ప్రయోగించదగ్గ ఈ మిసైల్ 200-300 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదిస్తుంది.విదేశాలకు ఎగుమతి చేయడానికి ఉద్దేశించిన ‘పీఎల్-15ఈ’ వెర్షన్ మిసైల్ 145 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను మాత్రమే ఛేదించగలదు. జే-10సి, జే11-బి, జే-15, జే-16, జేఎఫ్-17 బ్లాక్ 3, జే-20 విమానాలకు పీఎల్-15 క్షిపణిని అమర్చవచ్చు. 160 కిలోమీటర్ల రేంజితో, శబ్ద వేగానికి నాలుగు రెట్ల వేగంతో ప్రయాణించగల అమెరికాకు చెందిన ఏఐఎం-120డి అమ్రామ్ క్షిపణితో పోలిస్తే రేంజి, వేగం పరంగా మెరుగైన ఈ పీఎల్-15 మిసైల్ 2018 నుంచి చైనా వైమానిక దళానికి సేవలు అందిస్తోంది.పీఎల్-15 వర్సెస్ మీటియర్... యూరోపియన్ ఎంబీడీఎం మీటియర్ క్షిపణితో పీఎల్-15ను పోల్చవచ్చు. గగనతలం నుంచి గగనతలానికి ప్రయోగించగల మీటియర్, ఎంఐసీఏ దూరశ్రేణి క్షిపణులను ప్రస్తుతం భారత్ చెంత ఉన్న రాఫెల్ యుద్ధ విమానాలకు అమర్చవచ్చు. లాంచ్ ప్లాట్ ఫాం, ఎత్తు, లక్ష్యపు చలనశీలత అంశాలపై ఆధారపడి మీటియర్ మిసైల్ పరిధి 100-200 కిలోమీటర్లు ఉంటుంది. ధ్వని వేగానికి నాలుగు రెట్లు మించిన వేగాన్ని అది అందుకోగలదు. సామర్థ్యం పరంగా పీఎల్-15ఈ (ఎగుమతి రకం)తో మీటియర్ క్షిపణిని పోల్చవచ్చు. కానీ పీఎల్-15 స్టాండర్డ్ వెర్షన్ (పాక్ కు చైనా సరఫరా చేసిన ప్రామాణిక రకం) మాత్రం మీటియర్ కంటే అధిక వేగం, దూరశ్రేణి గల క్షిపణి. రాంజెట్ ఇంజిన్ సాయంతో మీటియర్ క్షిపణి ప్రయాణమంతటా స్థిర వేగంతో దూసుకెళుతుంది.ఇందుకు భిన్నంగా పీఎల్-15 మిసైల్ డ్యూయల్ పల్స్ ఘన ఇంధన రాకెట్ మోటార్ సాయంతో ప్రయాణిస్తుంది. ఇందులోని ఘన ఇంధనం కొద్దిసేపు మాత్రమే జ్వలించినప్పటికీ రాంజెట్ ఇంజిన్ గల మీటియర్ కంటే ఎక్కువ వేగం అందిస్తుంది. అయితే ధ్వనికి ఐదు రెట్లు పైబడిన స్పీడ్ అందుకున్నా ప్రయాణం పొడవునా అదే వేగాన్ని పీఎల్-15 మిసైల్ కొనసాగించలేదు! క్షిపణుల బయటివైపు చిన్న రెక్కల్లాంటి భాగాలు (ఫిన్స్) ఉంటాయి. వాటిని మడవగలిగితే మరిన్ని క్షిపణులను యుద్ధవిమానాలకు అమర్చవచ్చు. ఈ బుల్లి రెక్కల్ని మడిచిన పీఎల్-15 క్షిపణి నమూనాను చైనా నిరుడు జూహాయ్ ఎయిర్ షోలో ప్రదర్శించింది. దీంతో జే-20 లాంటి యుద్ధవిమానాలు నాలుగు బదులుగా ఆరు పీఎల్-15 మిసైళ్లను మోసుకెళ్లే వీలు కలిగింది.రష్యన్ ‘ఆర్-37ఎం’ వైపు భారత్ చూపు?పాక్ మోహరించిన పీఎల్-15 మిసైళ్లతో భారత వైమానిక దళానికి తలనొప్పి తప్పేలా లేదు. వాటిపై పైచేయి సాధించే ఆప్షన్ ఇండియాకు లేకపోలేదు. అది... రష్యాకు చెందిన అత్యాధునిక ఆర్-37ఎం దూరశ్రేణి క్షిపణి! అతిధ్వానిక వేగాన్ని (మ్యాక్ 6) అందుకోగల ఈ హైపర్ సానిక్ మిసైల్ 300-400 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను తుత్తునియలు చేస్తుంది. ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా దీన్ని విస్తృతంగా వినియోగించింది. ఉక్రెయిన్ వైమానిక దళానికి ఆర్-37ఎం క్షిపణి నుంచే ప్రధాన ముప్పు ఎదురైందంటే అతిశయోక్తి కాదు.ఆర్-37ఎంను అమర్చిన మిగ్-31 విమానాలు పలు ఉక్రెయిన్ యుద్ధ విమానాలను కూల్చివేశాయి. ఉక్రెయిన్ ఎఫ్-16 యుద్ధ విమానాన్ని సైతం ఈ మిసైల్ సాయంతో రష్యా కూల్చివేసినట్టు ఇటీవల వార్తలు వచ్చాయి. విశేషం ఏమిటంటే సుఖోయ్ ఎస్యు-30ఎస్ఎం2 యుద్ధ విమానాలపై ఆర్-37ఎం క్షిపణులను మోహరించవచ్చు. భారత్ వద్ద ‘సుఖోయ్ ఎస్యు-30’ శ్రేణికి కొదవ లేదు. ప్రస్తుతం మనకు 260కి పైగా సుఖోయ్ ఎస్యు-30ఎంకెఐ యుద్ధ విమానాలు ఉన్నాయి.వాటిని సుఖోయ్ ఎస్యు-30ఎస్ఎం2 వేరియంట్లుగా ఉన్నతీకరించే అంశాన్ని భారత్ పరిశీలిస్తోంది. ఎస్యు-30ఎంకెఐ విమానాలకే ఆర్-37ఎం క్షిపణులను అమర్చాలంటే పెద్ద సాంకేతిక ప్రక్రియ ఉంది. దాదాపు 84 ఎస్యు-30ఎంకెఐ విమానాలను ఎస్ఎం2 వేరియంట్ స్థాయికి అప్‌గ్రేడ్ చేయడానికి రూ.63 వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా.ఆర్-37ఎం క్షిపణులను ఇండియాకు విక్రయించడానికి రష్యా కూడా ఆసక్తి కనబరుస్తోంది. రాఫెల్ యుద్ధ విమానాలపై ఈ క్షిపణులను మోహరించే అంశంలోనూ చర్చలు సాగుతున్నాయి. 2019లో బాలాకోట్ దాడుల సందర్భంగా ఇండియాకు చెందిన మిగ్-21 బైసన్ యుద్ధ విమానాన్ని పాక్ తన ఎఫ్-16 విమానం-అమ్రామ్ క్షిపణితో కూల్చివేసింది. నాడు ఇండియా చెంత దూరశ్రేణి క్షిపణులు లేకపోవడం పెద్ద లోటు. ఆ తర్వాత మీటియర్ క్షిపణులను అమర్చిన రాఫెల్ విమానాలను భారత్ మోహరించింది. - జమ్ముల శ్రీకాంత్

ముష్కర మూకలకు ముచ్చెమటలు
శ్రీనగర్: పహల్గాంలో ఉగ్రవాదుల రాక్షసకాండ తర్వాత కోపంతో రగిలిపోతున్న భారతసైన్యం ఏక్షణంలోనైనా పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే)లోని ఉగ్రవాదుల శిబిరాలపై దాడి చేయొచ్చనే భయా నుమానాలు పాక్ సైన్యంలో ఎక్కువయ్యాయి. దీంతో ఇన్నాళ్లూ తాము పెంచి పోషించిన ఉగ్రవాదులను పాక్ సైన్యం వెంటనే ఆయా ‘లాంచ్‌ప్యాడ్’ల నుంచి సురక్షితంగా దూర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ముందస్తుగా ఆ ముష్కరులను తమ సైనిక శిబిరాలు, బంకర్లలోకి పంపేస్తున్నట్లు తెలుస్తోంది. పాక్ ఆక్రమిత కశ్మీర్లో భారత సరిహద్దు వెంట ఉన్న లాంచ్ప్యాడ్లను ఖాళీచేయిస్తోంది. ఈ లాంచ్ప్యాడ్లు క్రియాశీలకంగా ఉన్న విషయాన్ని భారత సైనిక నిఘా వర్గాలు పసిగట్టడంతో ముందుజాగ్రత్తగా పాక్ సైన్యం అప్రమత్తమై అక్కడి ఉగ్రవాదులను వేరే చోట్లకు పంపేస్తోంది.ఇవన్నీ కీలక స్థావరాలుపాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని కేల్, సర్దీ, దుధ్నియాల్, అథ్ముఖాన్, జురా, లిపా, పచ్ఛిబన్, ఫార్వర్డ్ కహూతా, కోట్లీ, ఖుయిరాట్టా, మంధార్, నిఖాయిల్, ఛమన్కోట్, జాన్కోటేలలో ఈ ఉగ్రస్థావరాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాంతాలన్నింటి నుంచీ ఉగ్రవాదులు తాత్కాలికంగా వెళ్లిపోతున్నట్లు వార్తలొచ్చాయి. వాస్తవానికి ఇవన్నీ ఉగ్రవాదులకు కీలక స్థావరాలు(లాంచ్‌ప్యాడ్). వాస్తవాధీన రేఖ గుండా భారత్‌లోకి చొరబడటానికి ఉగ్రవాదులు ఈ స్థావరాల నుంచే బయల్దేరతారు. ఇక్కడే వీళ్లకు నెలల తరబడి ఉగ్రశిక్షణ ఇస్తారని తెలుస్తోంది. పీఓకేలో క్రియాశీలంకంగా ఉన్న 42 లాంచ్ప్యాడ్లను ఇటీవల భారత భద్రతా బలగాలు గుర్తించాయి. పహల్గాం దాడి ఉదంతం తర్వాత ఆగ్రహావేశాలతో ఊగిపోతున్న భారతసైన్యం ఏ క్షణంలోనైనా దాడి చేయవచ్చనే ఉద్దేశంతో ఉగ్రవాదులను పాక్ సైన్యం హుటాహుటిన ఇతర ప్రదేశాలకు పంపేస్తోంది. ఇలా తరలిస్తున్న ఉగ్రవాదుల సంఖ్య 150 నుంచి 200దాకా ఉంటుందని తెలుస్తోంది. అయితే ఇప్పటికే హిజ్బుల్ మొజాహిదీన్, జైషే మొహమ్మద్, లష్కరే తోయిబా ఉగ్రసంస్థలకు చెందిన దాదాపు 60 మంది విదేశీ కిరాయి ఉగ్రవాదులు కశ్మీర్లోకి చొరబడ్డారని జాతీయ మీడియాలో కథనం వెలువడింది. వీరిలో 17 మంది స్థానికులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే భారత సైన్యం సరిహద్దు వెంట గాలింపును మరింత ఉధృతంచేసింది.

100 రోజుల ట్రంపరితనం
డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్ష పగ్గాలు చేపట్టి మంగళవారానికి 100 రోజులు. అమెరికాను మళ్లీ గొప్ప దేశంగా మారుస్తున్నాననే మిషతో రోజుకోటి అన్నట్టుగా ఈ మూడు నెలల్లో ఆయన లెక్కలేనన్ని అనాలోచిత చర్యలకు దిగారు. ‘పూటకో మాట, రోజుకో వైఖరి’ అన్నట్టుగా పదేపదే నిర్ణయాలను, విధానాలను మార్చుకుంటూ నవ్వులపాలవుతున్నారు. అంతర్జాతీయ సమాజం దృష్టిలో అమెరికాను పలుచన చేయడమే గాక వ్యక్తిగతంగా జీవితకాలానికి సరిపడా అప్రతిష్ట మూటగట్టుకున్నారు. అక్రమ వలసదారులకు అడ్డుకట్ట సాకుతో తలా తోకా లేని నిబంధనలతో అంతర్జాతీయ విద్యార్థుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నారు. పొదుపు పేరిట ఉద్యోగులను భారీగా తొలగించడం వంటి చర్యలతో అమెరికన్లను కూడా ఎన్నడూ లేనంత అభద్రతా భావంలోకి నెట్టేశారు. దాదాపుగా ఈ మూడు నెలల్లో ట్రంప్ తీసుకున్న అన్ని నిర్ణయాలూ న్యాయ వివాదాలకు దారితీయడం విశేషం. అమెరికా ద్రవ్యోల్బణానికి ముకుతాడు వేస్తానన్న వాగ్దానం నిలుపుకోవడంలోనూ ట్రంప్ ఘోరంగా విఫలమయ్యారు. నిత్యావసరాల ధరలు చుక్కలు తాకుతున్నాయి. చివరికి గుడ్ల ధరలు చూసి సగటు అమెరికన్ గుడ్లు తేలేసే పరిస్థితి నెలకొంది! ఇష్టారాజ్యపు నిర్ణయాలతో అటు ప్రపంచాన్ని, ఇటు అమెరికాను కూడా ఆర్థికంగా ప్రమాదపుటంచుల్లోకి నెట్టిన ట్రంప్, ఆ మంటల్లో తీరిగ్గా చలి కాచుకుంటున్నారు...మతిలేని టారిఫ్‌ల యుద్ధం ఈ 100 రోజుల్లో ట్రంప్ చేపట్టిన చర్యలన్నింట్లోనూ అత్యంత వివాదాస్పదమైనది, ఆనాలోచితమైనది టారిఫ్‌ల యుద్ధమే. అమెరికాపై భారీ టారిఫ్‌లు విధిస్తున్నాయంటూ చాలా దేశాలపై అంతర్జాతీయ వాణిజ్య సూత్రాలకు విరుద్ధంగా ప్రతీకార చర్యలకు దిగారు. అగ్ర రాజ్యాలు మొదలుకుని చివరికి అసలు జనమే ఉండని అంటార్కిటికా వంటి ప్రాంతాలపై కూడా ఎడాపెడా టారిఫ్‌లు పెంచి నవ్వులపాలయ్యారు. పైగా వాటిని రోజుకోలా మారుస్తూ అత్యంత చంచల ధోరణి కనబరిచారు. ఇక చైనా విషయంలోనైతే టారిఫ్‌లను రోజురోజుకూ అంతకంతకూ పెంచుతూ వేలంపాటను తలపించారు. చివరికి 145 శాతం దాకా తీసుకెళ్లి దాన్నో కామెడీ వ్యవహారంగా మార్చేశారు. టారిఫ్‌ల భయంతో ప్రపంచ మార్కెట్లన్నీ కుప్పకూలి కోలుకోలేని రీతిలో లక్షలాది కోట్ల రూపాయల మేర నష్టాలను చవిచూశాక తీరిగ్గా వాటి అమలును మూడు నెలల పాటు వాయిదా వేశారు. టారిఫ్‌లకు ప్రతీకారంగా అరుదైన ఖనిజాల ఎగుమతిని చైనా పూర్తిగా నిలిపేయడంతో అమెరికా దిక్కుతోచని పరిస్థితిలో పడిపోయింది.వలసలపై మొట్టి కాయలు అక్రమ వలసలపై ఉక్కుపాదం మోపే పేరిట వలసదారుల గుండెల్లో ట్రంప్ రైళ్లు పరుగెత్తిస్తున్నారు. పగ్గాలు చేపట్టిన కొద్ది రోజులకే అక్రమ వలసదారులను భారీ ఖర్చుతో ఏకంగా సైనిక విమానాల్లో స్వదేశాలకు పంపారు. సుదీర్ఘ ప్రయాణం పొడవునా ఒళ్లంతా సంకెళ్లు వేసి విమర్శలు మూటగట్టుకున్నారు. తర్వాత వారిని గ్యాటెమాలా తదితర సమీప దేశాలకు తరలించి నిర్బంధంలో ఉంచడం మొదలుపెట్టారు. దీనిపై కోర్టుల మందలింపులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇక విదేశీ విద్యార్థుల విషయంలోనైతే ట్రంప్ అత్యంత అమానవీయంగా వ్యవహరిస్తున్నారు. ఐదారేళ్ల చరిత్రను తవ్వుతూ ఎక్కడ ఏ చిన్న తప్పిదం కనిపించినా దేశం వీడాలని ఆదేశిస్తున్నారు. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన చిన్నాచితకా కారణాలకు కూడా వీసాలు రద్దు చేసి వెనక్కు పంపిస్తున్నారు. ఈ విషయంలో కోర్టులతో పదేపదే మొట్టికాయలు తింటూ వస్తున్నారు.డోజ్.. ఓవర్ డోస్ దుబారా వ్యయానికి కళ్లెం వేసేందుకంటూ ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సారథ్యంలో తీసుకొచ్చిన డోజ్ పనితీరు అమెరికన్లలో తీవ్ర అసంతృప్తికి దారితీసింది. లెక్కలేనన్ని ఉద్యోగాలను డోజ్ ఒక్క దెబ్బతో పీకిపారేసింది. కనీసం రెండు లక్షల కోట్ల డాలర్లు ఆదా చేస్తానని గొప్పగా చెప్పుకున్న మస్‌్క, ఓ రెండొందల కోట్ల డాలర్ల కంటే ఆదా కష్టమంటూ చివరికి చేతులెత్తేశారు. పైగా డోజ్ ముసుగులో అమెరికా ప్రభుత్వానికి సంబంధించిన కీలక, రహస్య డేటానంతా మస్క్ చేజిక్కించుకున్నట్టు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.జెలెన్స్కీకి అవమానం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని చర్చలకంటూ పిలిచి వైట్‌హౌస్‌లో మీడియా సాక్షిగా ట్రంప్, ఆయన డిప్యూటీ జేడీ వాన్స్ ఘోరంగా అవమానించిన తీరు చరిత్రలో నిలిచిపోయింది. దేశాధ్యక్షుడనే కనీస గౌరవం కూడా లేకుండా సూటిపోటి మాటలతో ఇద్దరూ రెచ్చిపోయారు. జెలెన్స్కీ ఎక్కడా తగ్గకుండా వాళ్లకు మాటకు మాట బదులిచ్చి శెభాష్ అనిపించుకున్నారు. చిర్రెత్తుకొచి్చన ట్రంప్ చివరికి ఆయన్ను వైట్‌హౌస్ నుంచి అవమానకర రీతిలో వెళ్లగొట్టిన తీరు చూసి ప్రపంచ దేశాలన్నీ షాక్‌కు గురయ్యాయి. ట్రంప్, వాన్స్ ప్రవర్తన వైట్‌హౌస్‌కే తీవ్ర కళంకమంటూ ఈసడించుకున్నాయి. ఆదరణ అట్టడుగుకు ట్రంప్ పట్ల అమెరికన్లలో వ్యతిరేకత నానాటికీ పెరిగిపోతోందని పోల్స్ అన్నీ ముక్త కంఠంతో చెబుతున్నాయి. అధ్యక్షుల తొలి 100 రోజుల పాలనకు జనామోదం విషయంలో ట్రంప్ గత 70 ఏళ్లలోనే అట్టడుగున నిలిచారు! ఆయన పాలనను గట్టిగా సమరి్థస్తున్న వారి సంఖ్య ఏకంగా 22 శాతానికి పడిపోయినట్టు సీఎన్ఎన్ పోల్ తేలి్చంది. గట్టిగా వ్యతిరేకించేవారి సంఖ్య 45 శాతానికి పెరిగింది. ముఖ్యంగా మార్చి నుంచి ట్రంప్ ఆదరణ శరవేగంగా అడుగంటుతూ వస్తోంది. టారిఫ్‌లపై ట్రంప్ తీరును 35 శాతం అమెరికన్లు గట్టిగా వ్యతిరేకిస్తున్నారు. ఆర్థికంగా దేశాన్ని ఆయన గట్టెక్కిస్తారని నమ్ముతున్న వారి సంఖ్య కూడా డిసెంబర్‌తో పోలిస్తే ఏకంగా 12 శాతం తగ్గింది. మతిలేని చర్యలతో దేశాన్ని ట్రంప్ ప్రమాదంలోకి నెడుతున్నారని 57 శాతం మంది భావిస్తున్నారు. ఆయన విదేశీ విధానాన్ని 60 శాతం మందికి పైగా తీవ్రంగా తప్పుబడుతున్నారు. వలసల విధానాన్ని కూడా 47 శాతం మంది ఆక్షేపిస్తున్నారు. ఉద్యోగ కల్పనలో ట్రంప్ తీరుతో 58 శాతం మంది పెదవి విరుస్తున్నారు. అధ్యక్షునిగా అధికారాన్ని బాధ్యతాయుతంగా వాడతారన్న నమ్మకం లేదని 54 శాతం మంది అమెరికన్లు అంటుండటం విశేషం. సరైన నాయకత్వం అందిస్తారని నమ్ముతున్నది 50 శాతమే. ఆయనకు ఓటేసి తప్పు చేశామని 20 శాతం మంది వాపోతుండటం పరిస్థితికి అద్దం పడుతోంది!దేశాలపై నోటి దురుసు కెనడా మొదలుకుని పలు దేశాలపై నోటి దురుసు వ్యాఖ్యలతో ట్రంప్ పరువు పోగొట్టుకున్నారు. అమెరికాలో 51వ రాష్ట్రంగా విలీనమైతే మేలంటూ అనవసర వ్యాఖ్యలు చేసి కెనడాతో శత్రుత్వాన్ని కొనితెచ్చుకున్నారు. పైగా ఆ దేశంపై విధించిన అడ్డగోలు టారిఫ్‌లతో అంతిమంగా అమెరికాకే నష్టం జరిగింది. అంతేగాక అమెరికాను ఇక జీవితంలో నమ్మేది లేదని కెనడా నాయకత్వంతో అనిపించుకున్నారు. గ్రీన్‌లాండ్‌ను ఆక్రమించేసుకుంటామని ప్రకటించి మరో వివాదాల తేనెతుట్టెను కదిపారు. గాజా నుంచి పాలస్తీనియన్లను పూర్తిగా తొలగించేసి దాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామంటూ తలాతోకా లేని ప్రకటన చేసి మొత్తం ముస్లిం ప్రపంచం ఆగ్రహానికి గురయ్యారు. ఉక్రెయిన్‌కు చేసిన యుద్ధ సాయానికి బదులుగా ఆ దేశ ఖనిజ నిల్వలను అమెరికాకు కట్టబెట్టాల్సిందేనంటూ భీష్మించుకున్నారు. రష్యాను ఒప్పించి ఒక్క రోజులో యుద్ధాన్ని ఆపిస్తానన్న ట్రంప్ ప్రకటన కూడా ఉత్తదేనని తేలిపోయింది. ‘పుతిన్‌కు యుద్ధం ఆపే ఉద్దేశమే లేనట్టుంది’ అంటూ ఇప్పుడాయన తీరిగ్గా నిట్టూరుస్తున్నారు.విద్యాసంస్థలపై ఉక్కుపాదం తన మాట వినడం లేదంటూ యూనివర్సిటీలపై ట్రంప్ కన్నెర్రజేశారు. ప్రపంచానికే తలమానికం వంటి అమెరికా విద్యా సంస్థల పునాదులనే పెకిలించే పనిలో పడ్డారు. వాటికి బిలియన్ల కొద్దీ ప్రభుత్వ నిధులను నిలిపేశారు. దారికొస్తే తప్ప వాటిని విడుదల చేసేది లేదంటున్నారు. అలా కొలంబియా వంటి వర్సిటీలను లొంగదీసుకున్నారు. కానీ ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీ మాత్రం ట్రంప్ తీరును తూర్పారబట్టింది. అణచివేత చర్యలకు తలొంచేది లేదని ప్రకటించింది. 300 కోట్ల డాలర్లకు పైగా నిధులను నిలిపేసినా ‘డోంట్ కేర్’ అనేసింది.

కూటమి ఎత్తు.. ప్రజాస్వామ్యం చిత్తు
అధికార పార్టీ నేతలు ప్రలోభాల వల విసిరారు. ఉద్యోగాలు ఎరవేశారు. మాట వినని వారి అంతుచూస్తామని బెదిరించారు. కుప్పం, మాచర్ల, తుని, పాలకొండ, విశాఖపట్నం, గుంటూరు మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల్లో కౌన్సిలర్లు, కార్పొరేటర్లను అనైతిక మార్గాల్లో లొంగదీసుకున్నారు. సోమవారం జరిగిన మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్, మేయర్ ఉప ఎన్నికల్లో మాయా పాచికలనే కూటమి పార్టీలు నమ్ముకున్నాయి. బలం లేకున్నా.. బరిలోకి దిగాయి. మొదట భంగపడినా.. చివరకు మాయతోనే మోసగించాయి. శకునికి మించిన ఎత్తులతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేసి మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల్లో పెత్తనం చెలాయించేందుకు కూటమి నేతలు సిద్ధమయ్యారు.సాక్షి నెట్వర్క్: సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో అధికారపార్టీ నేతలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు. బలం లేకపోయినా కుప్పం మున్సిపల్ చైర్పర్సన్ పీఠాన్ని లాక్కున్నారు. వైఎస్సార్సీపీ గుర్తుతో గెలిచిన కౌన్సిలర్లలో ఒక్కొక్కరికీ రూ.50 లక్షలు, ఒకరికి మున్సిపల్ ఉద్యోగం ఎరవేసి లొంగదీసుకున్నారు. మరో ఇద్దరిని భయపెట్టి ఎన్నికలో పాల్గొనకుండా అడ్డుకున్నారు. 8మంది వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను టీడీపీలోకి లాక్కుని చైర్పర్సన్ కుర్చీని దక్కించుకుని అనైతికంగా విజయం సాధించారు.కుప్పం మున్సిపల్ చైర్పర్సన్ స్థానానికి సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ఉప ఎన్నికలో టీడీపీ అభ్యర్థి సెల్వరాజ్‌ను మున్సిపల్ చైర్‌పర్సన్‌గా ఎన్నుకున్నారు. మున్సిపాలిటీలో మొత్తం 25 వార్డులు ఉంటే.. అందులో 19 వార్డుల నుంచి వైఎస్సార్సీపీ కౌన్సిలర్లే ఎన్నికయ్యారు. టీడీపీకి కేవలం ఆరుగురు కౌన్సిలర్లు మాత్రమే ఉండగా.. కూటమి అధికారంలోకి వచ్చాక మున్సిపల్ చైర్పర్సన్ పదవి కోసం బెదిరింపులకు తెరలేపారు. మున్సిపల్ చైర్‌పర్సన్‌గా ఉన్న డాక్టర్ సుధీర్ రాజీనామా చేయటంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. నలుగురు వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు టీడీపీలో చేరినా.. వైఎస్సార్సీపీకి 15 మంది కౌన్సిలర్లతో చైర్‌పర్సన్‌ను ఎన్నుకునేందుకు అవసరమైన పూర్తిస్థాయి బలం ఉంది.బరితెగించి.. ఇబ్బందులకు గురిచేసి..టీడీపీ బరితెగింపునకు భయపడి 15 మంది వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు క్యాంప్ ఏర్పాటు చేసుకున్నారు. ఇద్దరు కౌన్సిలర్లకు చెందిన భూములు లాక్కుంటామని బెదిరించగా.. మరికొందరిని కేసులు పెడుతామని హెచ్చరించినట్లు తెలిసింది. తమకు మద్దతు ఇచ్చిన వారికి ఒక్కొక్కరికి రూ.50 లక్షలు ఇస్తామని ఆశ చూపించారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ విప్ జారీ చేసినా అధికారపార్టీ నేతల ప్రలోభాలకు 8 మంది కౌన్సిలర్లు లొంగిపోయారు.ఇద్దరు కౌన్సిలర్లు మునస్వామి, తిలగవతి టీడీపీ నేతల బెదిరింపులకు భయపడి ఎన్నికల్లో పాల్గొనకుండా గైర్హాజరయ్యారు. ఉప ఎన్నికలో మొత్తం 22 మంది కౌన్సిలర్లు పాల్గొనగా.. టీడీపీ బలపరచిన అభ్యర్థి సెల్వరాజ్‌కి 13 మంది కౌన్సిలర్లు మద్దతు తెలిపారు. కాగా.. విప్ ధిక్కరించిన కౌన్సిలర్లను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ఎమ్మెల్సీ, కుప్పం నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త భరత్ ప్రకటించారు. పాలకొండలో.. అడ్డదారిలో..పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ నగర పంచాయతీ చైర్పర్సన్ పదవి కోసం జరిగిన ఉప ఎన్నికలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ మున్సిపల్ చైర్పర్సన్ పదవిని ఎస్సీలకు రిజర్వు చేశారు. మొత్తం 20 వార్డులు ఉండగా.. 17 వార్డుల్లో వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు ఎన్నికయ్యారు. 19, 2వ వార్డులకు చెందిన ఇద్దరు మాత్రమే ఎస్సీ సభ్యులు ఉండగా.. 19వ వార్డుకు చెందిన యందవ రాధాకుమారిని చైర్‌పర్సన్‌గా అప్పట్లో వైఎస్సార్సీపీ ఎంపిక చేసింది.ఇటీవల వ్యక్తిగత కారణాలతో రాధాకుమారి తన పదవికి రాజీనామా చేశారు. దీంతో ఎన్నిక అనివార్యమైంది. చివరకు 2వ వార్డుకు చెందిన ఎస్సీ సభ్యురాలు ఆకుల మల్లీశ్వరి ఉండగా.. ఆమెనే తదుపరి చైర్‌పర్సన్‌గా ప్రకటించాలని వైఎస్సార్సీపీ నాయకులంతా ఏకాభిప్రాయానికి వచ్చారు. ఈ పీఠంపై కూటమి పార్టీలు కన్నేశాయి. సోమవారం మరోమారు ఎన్నిక నిర్వహించగా.. టీడీపీ మాయోపాయంతో స్వతంత్ర అభ్యర్థినంటూ మల్లీశ్వరి నామినేషన్ దాఖలు చేశారు.టీడీపీకి చెందిన ఇద్దరు సభ్యుల మద్దతు అందించడంతో ఆమె చైర్‌పర్సన్‌గా ఎన్నికైనట్టు ప్రకటించారు. ఆ వెంటనే మల్లీశ్వరికి రాష్ట్ర మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, జనసేన ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ టీడీపీ కండువా వేసి పాలకొండ చైర్పర్సన్ పదవి తమదేనని ప్రకటించుకున్నారు. ఈ ఎన్నికకు వైఎస్సార్సీపీకి చెందిన 14 మంది కౌన్సిలర్లు హాజరు కాలేదు. మిగిలిన చోట్ల ఇలా..⇒ గుంటూరు మేయర్‌గా కూటమి అభ్యర్థి కోవెలమూడి రవీంద్ర (నాని) గెలుపొందారు. మార్చిలో అప్పటి మేయర్ కావటి మనోహర్‌నాయుడు రాజీనామా చేయడంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. మొత్తం 56 మంది సభ్యుల్లో కూటమి బలం కేవలం 11.. కాగా 18 మందిని చేర్చుకోవడంతో వారి బలం 29కి చేరింది. ఎంపీ, ముగ్గురు ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ ఎక్స్–అఫిషియో సభ్యులు ఉండటంతో వారి బలం 34 అయ్యింది. వైఎస్సార్సీపీకి ఇద్దరు ఎమ్మెల్సీలతో కలిసి 29 మంది బలం ఉండగా.. ఇద్దరు సభ్యులు హాజరుకాకపోవడంతో 27 ఓట్లు వచ్చాయి. ⇒ కాకినాడ జిల్లా తుని మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికకు వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలో చేరిన 17 మంది కౌన్సిలర్లు హాజరు కాగా.. 11 మంది వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు ఎన్నికను బహిష్కరించారు. పోటీలో మరెవరూ లేకపోవడంతో చైర్‌పర్సన్‌గా నార్ల భువనసుందరి ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రిసైడింగ్ అధికారి, డీపీఓ రవికుమార్ ప్రకటించారు.⇒ గ్రేటర్ విశాఖ మేయర్‌గా టీడీపీ కార్పొరేటర్ పీలా శ్రీనివాస్ ఎన్నికయ్యారు. ఎన్నిక అనంతరం ప్రిసైడింగ్ అధికారి మయూరి అశోక్ ఆయనకు నియామక పత్రం అందజేశారు. ⇒ మొత్తం మాచర్ల మున్సిపాలిటీలో 31 వార్డులు ఉన్నాయి. 31 వార్డులనూ వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. కూటమి అధికారంలోకి రావడంతో వైఎస్సార్సీపీ సభ్యులపై రకరకాల ఒత్తిళ్లు తెచ్చి.. భయపెట్టి పలుదఫాలుగా 21 మంది కౌన్సిలర్లను టీడీపీ తనవైపు తిప్పుకుంది. వారి సాయంతో వైస్ చైర్‌పర్సన్‌గా మదార్ సాహెబ్‌ను గెలిపించుకుని విలువలకు పాతరేసింది.⇒ తాడిపత్రి మునిసిపల్ వైస్ చైర్పర్సన్–1గా టీడీపీకి చెందిన 26వ వార్డు కౌన్సిలర్ షెక్షావలి, వైస్ చైర్పర్సన్–2గా సీపీఐకి చెందిన 12వ వార్డు కౌన్సిలర్ అరుణ ఎన్నికయ్యారు. అధికార పార్టీకి సంఖ్యాబలం ఉండటంతో ఈ పదవులకు వైఎస్సార్సీపీ నుంచి ఎవరినీ పోటీకి దింపలేదు.కూటమి విజయం అనైతికం: ఎమ్మెల్సీ భరత్కుప్పం రూరల్: ‘కుప్పంలో ప్రజాస్వామ్యానికి బ్లాక్ డే. మున్సిపల్ చైర్పర్సన్ ఉప ఎన్నికల్లో టీడీపీ అనైతికంగా విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో ప్రజాస్వామ్యం అప్రతిష్ట పాలైంది’ అని ఎమ్మెల్సీ కేఆర్జే భరత్ అన్నారు. సోమవారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. ‘వైఎస్సార్ సీపీకి 18 మంది సభ్యుల బలముంది. అయినా ఓడిపోవాల్సిన దుస్థితి పట్టింది. అధికార పార్టీ నేతలు మా కౌన్సిలర్లను కూరగాయల్లా రూ.లక్షలకు లక్షలు పోసి కొన్నారు. అధికారం శాశ్వతం కాదు. హుందాతనం ముఖ్యం. సాక్షాత్తు సీఎం ప్రాతినిధ్య వహిస్తున్న నియోజకవర్గంలోనే ఇలా అనైతిక ఎన్నికలు జరుగుతుంటే.. ఇక రాష్ట్రమంతా పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతుంది. ఇప్పుడు కుప్పం మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా జరిగింది.ప్రజాస్వామ్యం ఖూనీ: ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి సాక్షి, అమరావతి: కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని, స్థానిక సంస్థల పదవులను చేజిక్కించుకునేందుకు గజారుడు రాజకీయానికి పాల్పడిందని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మండిపడ్డారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రలోభాలు, బెదిరింపులతో వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులను తమవైపు తిప్పుకుని పదవులను దక్కించుకోవడం హేయమైన చర్య అని పేర్కొన్నారు. చంద్రబాబు అరాచక పాలనను చూసి ప్రజాస్వామ్యవాదులు నివ్వెరపోతున్నారని అప్పిరెడ్డి విమర్శించారు. కుప్పం, పాలకొండ, మాచర్ల, తుని, గుంటూరు స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ అరాచకాలకు పాల్పడిందని ధ్వజమెత్తారు. గత ప్రభుత్వంలో తాడిపత్రి మున్సిపాలిటీలో వైఎస్సార్సీపీ కంటే 2 స్థానాలు టీడీపీ అధికంగా గెలుచుకుంటే నాటి సీఎం వైఎస్ జగన్ హుందాగా వ్యవహరించారని గుర్తుచేశారు.

పాక్ పాచికల్ని పారనీయొద్దు!
పహల్గామ్లో 26 మంది నిండు ప్రాణాలను బలితీసుకున్న ఉగ్రదాడిపై ప్రతీకారం తీర్చుకోవాల్సిందేనన్న అభిప్రాయం రోజురోజుకూ దేశంలో బలపడుతుండగా పాకిస్తాన్ మరింత రెచ్చగొట్టేలా మాట్లాడుతోంది. మొదటి నాలుగు రోజులూ ఉలకని, పలకని ఆ దేశం అటుతర్వాత ‘తటస్థ దర్యాప్తు’ రాగం అందుకుంది. ఆ మర్నాడే అణు బెదిరింపులకు దిగింది. మరోపక్క భద్రతా మండలిలో చడీచప్పుడూ లేకుండా లాబీయింగ్ సాగించి తన పాచిక పారేలా చూసుకుంది. ఇక్కడే మన లోపం కొట్టొచ్చినట్టు కనబడుతోంది. జమ్మూకశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడిని ‘తీవ్రంగా’ ఖండిస్తు న్నట్టు తీర్మానం చెబుతున్నా అందులో దాడికి కారణమైన ‘ద రెసిస్టెన్స్ ఫ్రంట్’ (టీఆర్ఎఫ్) సంస్థ పేరు ప్రస్తావనే లేకపోవటం ఆశ్చర్యం కలిగిస్తుంది. చైనా ఎప్పటిలాగే పాకిస్తాన్ వాదనతో శ్రుతి కలిపింది. కానీ మన కు చాలా సన్నిహితుడనుకున్న డోనాల్డ్ ట్రంప్ ఏలుబడి అమెరికాలో మొదలైనా పాక్‌తో ఆ దేశం అంటకాగుతున్న వైనం దిగ్భ్రాంతికరం కాదా? ఈమధ్యకాలంలో బలూచిస్తాన్‌లో రైలును దారిమళ్లించి అనేకుల్ని హతమార్చిన ఉదంతంలో భద్రతామండలి అందుకు కారణమైన బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) పేరు ప్రస్తావించింది. 2019లో పుల్వామాలో జరిగిన ఉగ్రదాడి ఉదంతంలో సైతం జైషే మొహమ్మద్ (జేఈఎం) ప్రమేయాన్ని మండలి తీర్మానం ఎత్తి చూపింది. కానీ ఇప్పుడేమైంది? ఇక్కడికొచ్చేసరికి ఈ నీళ్ల నములుడు దేనికి? అమెరికా రూపొందించిన తీర్మానంలో తొలుత ప్రస్తావనకొచ్చిన టీఆర్ఎఫ్ పేరు ఎందుకు ఎగిరిపోయింది? ఏ సంస్థనూ మాటమాత్రంగానైనా ఖండించటానికి ముందుకురాని తీర్మానం ‘అంతర్జాతీయ శాంతికీ, భద్రతకూ విఘాతం కలిగించే ఉగ్ర ఘాతుకాలపై అన్నివిధాలుగా పోరాడతాం’ అని బడాయి పోవటం చిత్రం కాదా! ఆ ఘనకార్యం మేమే చేశామని విర్రవీగిన సంస్థ పేరెత్తటానికి మండలికున్న అభ్యంతర మేమిటి? అఫ్గాన్‌లో సోవియెట్ సైన్యాన్ని ఎదుర్కొనటానికి అమెరికా ఆశీస్సులతో ఉగ్రవాద శిబిరాలు నడిపిన పాపిష్టి చరిత్ర తమకుందని ఈమధ్యే పాక్ రక్షణమంత్రి అంగీకరించాడు. తాజా పరిణామాల నేపథ్యంలో అలాంటి లాలూచీ ఇంకా కొన సాగుతున్నదనుకోవాలా? ప్రధాని నరేంద్ర మోదీ మొన్న బిహార్‌లో కావొచ్చు... తాజాగా ‘మన్ కీ బాత్’లో కావొచ్చు, పహల్గామ్ ఉదంతంలో బాధితులకు సరైన న్యాయం దక్కేలా చేస్తామని స్పష్టం చేశారు. పాత్ర ధారుల్ని, సూత్రధారుల్ని తీవ్రాతితీవ్రంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు. మంచిదే. అయితే ఈ కృషి బహుముఖాలుగా వుండాలి. ఉగ్రవాదుల్ని పట్టి బంధించటానికి ప్రయత్నించటంతో పాటు అంతర్జా తీయంగా పాక్‌ను ఏకాకిని చేయటానికి కృషి చేయాలి. ఉగ్రసంస్థల్ని కిరాయి ముఠాలుగా వాడుకుంటున్న దాని నైజాన్ని అంతర్జాతీయ వేదికలపై ఎండగట్టాలి. పాకిస్తాన్ తెరవెనకుండి భద్రతామండలి తీర్మానంలో చేయించిన మార్పులు చిన్నవేమీ కాదు. ఉగ్ర సంస్థ టీఆర్ఎఫ్తో పాక్ సర్కారు ఎంతగా చెట్టపట్టాలు వేసుకున్నదో మండలిలో జరిగిన పరిణామాలే తేటతెల్లం చేస్తున్నాయి. తీర్మానంలో టీఆర్ఎఫ్ ప్రస్తావన లేకుండా చేసిన క్షణాల్లోనే ఆ ఉగ్ర సంస్థ తన పాత ప్రకటన ‘అధికారికమైనది’ కాదంటూ స్వరం మార్చటం గమనించదగ్గది. దాడి జరిగిన వెంటనే తామే అందుకు కారకులమని చెప్పిన ఆ సంస్థ మండలిలో పాక్ వాదనకు అనుగుణంగా ఆ ప్రకటన తమది కాదనటమే కాదు... నింద మోపటం కోసం భారత సైన్యం కావాలని చేసిన పనిగా ఆ ఉదంతాన్ని వక్రీకరించే ప్రయత్నం చేసింది. లష్కరే తోయిబా విషపుత్రిక అయిన టీఆర్ఎఫ్ 2020 నుంచీ జమ్మూకశ్మీర్‌లో అనేక దాడులకు పాల్పడుతోంది. ఆ సంస్థను మన దేశం నిషేధించింది కూడా! ఏదో విధంగా మన దేశాన్ని ఇబ్బందులపాలు చేయటం కోసం ఏళ్ల తరబడి స్వయంగా నిర్మించిన ఉగ్రవాద సాలెగూటిలో తానే చిక్కుకుని పాకిస్తాన్ తరచు విలవిలలాడుతోంది. 2015లో పెషా వర్ కంటోన్మెంట్ ప్రాంతంలోని పాఠశాలపై ఉగ్రవాదులు ఒక్కుమ్మడిగా విరుచుకుపడి 140 మంది బాలబాలికల్ని కాల్చిచంపారు. ఆ మరుసటి ఏడాది క్వెట్టాలో పోలీసు శిక్షణ కేంద్రం ఆవరణలోకి ప్రవేశించి 60 మందిని హతమార్చారు. ఒక యూనివర్సిటీపై దాడికి దిగి ప్రొఫెసర్‌తోపాటు 20 మంది విద్యార్థుల ప్రాణాలు తీశారు. ఈ మాదిరి ఉదంతాలు ఎన్నెన్నో. అయినా పాకిస్తాన్ వైఖరిలో ఆవగింజంతైనా మార్పు లేదు. పశ్చాత్తాపం అసలే లేదు. పహల్గామ్ దాడిని ఖండించకుండా పర్యాటకులు ప్రాణాలు కోల్పోవటం విచారకరమంటూ ప్రకటన చేసి చేతులు దులుపుకుంది.పాకిస్తాన్ తీరు మారదని ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ దబాయింపు చూస్తే తెలుస్తుంది. ఉగ్రదాడిపై ఆయనగారికి ‘తటస్థ, పారదర్శక, విశ్వసనీయ’ దర్యాప్తు కావాలట! అసలు తన ఎన్నికే సంశయాస్పదమైంది. పాక్ సైన్యం అండదండలతో అందలమెక్కిన చరిత్ర షెహబాజ్‌ది. 2016నాటి పఠాన్‌కోట్ ఉగ్రదాడి తర్వాత జరిగిన ఇరు దేశాల సంయుక్త దర్యాప్తును నీరు గార్చిందెవరు? పాక్ ప్రతినిధులు మన దేశం వచ్చి దర్యాప్తులో పాల్గొని వెళ్లగా, మన ప్రతినిధి బృందాన్ని మాత్రం పాక్ గడ్డపైకి అనుమతించని వైనం, తాము సేకరించిన సాక్ష్యాలను భారత్‌తో పంచుకోని తీరు షెహబాజ్ మరిచారా? 2008 నాటి ముంబై పేలుళ్ల ఉదంతంలో ఇచ్చిన సాక్ష్యాధారాలకు ఏ గతి పట్టించారో గుర్తులేదా? అణ్వాయుధ దాడికి సిద్ధమంటూ బెదిరింపులకు దిగుతున్న పాక్ దుష్ట పన్నాగాలను ప్రపంచ దేశాలకు తెలియజెప్పాలి. అందుకు దౌత్యపరంగా మరింత కృషి చేయాలి. దాంతోపాటు అన్నివిధాలా సంసిద్ధతలు పెంపొందించుకోవాలి. సామాజిక మీడియాలో కశ్మీరీలపై విద్వేషాన్ని కక్కే అవాంఛనీయ శక్తుల ఆటకట్టించాలి. ఇది కలసికట్టుగా నిలబడాల్సిన కాలమని చాటాలి.

డొల్ల కంపెనీలతో డీల్!
సాక్షి, అమరావతి: ఊరూ పేరు లేని ఉర్సా కంపెనీకి టీడీపీ సర్కారు విశాఖలో రూ.3,000 కోట్ల విలువ చేసే అత్యంత ఖరీదైన భూములను ఎకరా 99 పైసలకే కేటాయించిన నేపథ్యంలో ఈ కుంభకోణం జాతీయ స్థాయిలో పెద్దఎత్తున చర్చకు దారి తీసింది. భూ కేటాయింపులపై చంద్రబాబు సర్కారు అనుసరిస్తున్న విధానాలను న్యాయ నిపుణులు, రాజకీయ పరిశీలకులు తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఒకపక్క కేంద్ర సంస్థలకు కేటాయించిన భూములకు రూ.కోట్లలో వసూలు చేస్తూ... మరోపక్క తన బినామీలు, వందిమాగదులకు కారుచౌకగా సంతర్పణ చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. గత పది రోజులుగా ఉర్సా భూ కుంభకోణంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నా కూటమి సర్కారుతోపాటు అనుకూల మీడియా కిక్కురుమనకపోవడం ఆరోపణలకు మరింత బలం చేకూరుతోందని పేర్కొంటున్నారు.చంద్రబాబు సర్కార్‌ను ప్రశ్నిస్తూ ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ చేసిన పోస్టు ఉర్సాకు భూ కేటాయింపులు చట్ట విరుద్ధం: ప్రశాంత్ భూషణ్ ఓ ఘోస్ట్ కంపెనీకి చంద్రబాబు సర్కారు చట్ట విరుద్ధంగా 59.6 ఎకరాలను కేటాయించిందని ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ఎక్స్ వేదికగా విమర్శించారు. కనీసం ఆఫీసు, ఎలాంటి ట్రాక్ రికార్డు లేని కంపెనీతో ప్రభుత్వం ఎలా ఒప్పందం కుదుర్చుకుంటుందని ప్రశ్నించారు. ఇలాంటి దొంగ కంపెనీలకు చంద్రబాబు ప్రభుత్వం దాదాపు ఉచితంగా భూమి ఇచ్చిందని, ఇది కిక్ బ్యాక్స్ ఒప్పందమా? లేక ఉన్నతస్థాయి నాయకుల సంబంధమా? అని ప్రశ్నించారు.ఉర్సా ఎవరి క్లస్టర్?: తెలకపల్లి రవిఉర్సా క్లస్టర్‌కు భూ కేటాయింపులపై చాలా సందేహాలున్నాయని, అది ఎవరి క్లస్టర్ అన్నది తేలాలని సీనియర్ రాజకీయ విశ్లేషకులు తెలకపల్లి రవి తన యూట్యూబ్ చానల్లో పేర్కొన్నారు. ‘రెండు నెలల కిందట ఏర్పాటైన ఉర్సా క్లస్టర్ ప్రైవేటు లిమిటెడ్‌కు దాదాపు 60 ఎకరాల భూమిని కేటాయించారు. ఎన్ని ఆరోపణలు వస్తున్నా ప్రభుత్వం ఫ్యాక్ట్ చెక్‌తో పాటు ఐటీ, ఏపీఐఐసీ విభాగాలు, సోషల్ మీడియా వింగ్ స్పందించడం లేదు. ఉర్సా కంపెనీ ప్రమోటర్లలో ఒకరైన అబ్బూరి సతీష్ చంద్రబాబు నాయుడుతో దిగిన ఫోటోలు ఉన్నాయి. తెలంగాణ పత్రికలు ఈ విషయాన్ని ప్రముఖంగా ఇస్తుంటే ఆంధ్రాలో మాత్రం మీడియా మౌనంగా ఉండటం చాలా సందేహాస్పదంగా ఉంది. 2014–19లో కూడా టీడీపీ ప్రభుత్వం తన సన్నిహితులకు చాలా విలువైన భూములను ధారాదత్తం చేసింది’ అని పేర్కొన్నారు.అదే నిజమైతే కేటాయింపులు ఆపాలి: కె.నాగేశ్వరరావుఊరూ పేరులేని కంపెనీకి, లోకేశ్ బినామీలకు భూకేటాయింపులు చేశారన్న ఆరోపణలు నిజమైతే ఉర్సాకు భూ కేటాయింపులను తక్షణం ఆపాలని ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కె.నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. ‘మా యూట్యూబ్ ఛానల్‌కు 99 పైసలకు విశాఖలో కనీసం ఒక ఎకరా ఇవ్వమని చెప్పండి. ఉర్సా.. టీసీఎస్ కంటే ఎక్కువ ఉద్యోగాలు కల్పిస్తా. పది పైసలకు పది గుంటలు ఇచ్చినా యూట్యూబ్ చానల్‌ను విస్తరించి పెద్ద మీడియా సంస్థ ఏర్పాటు చేస్తా.ప్రభుత్వం ప్రైవేటు సంస్థలకు భూములు విక్రయించడం ద్వారా హక్కులు వదులుకోకూడదు. ఫిబ్రవరిలో ఏర్పాటైన ఉర్సా కంపెనీకి 59.6 ఎకరాలు ఎలా కేటాయిస్తారు? ఉర్సాపై ఇంత దుమారం రేగుతున్నా ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంది? లోకేశ్ బినామీ కిలారు రాజేష్ సంస్థకు భూములు కేటాయించారంటున్నా ఎందుకు స్పందించడం లేదు?’అని తన యూ ట్యూబ్ చానల్లో పేర్కొన్నారు.

IPL 2025: విధ్వంసంలో వైభవం
సచిన్ వేగాన్ని ఆరాధించాం.సెహ్వాగ్ దూకుడును చూశాం. రో‘హిట్స్’ను ఆస్వాదించాం. కోహ్లి ‘షో’కు ముచ్చటపడ్డాం. వీళ్లందరూ ప్రొఫెషనల్ క్రికెటర్లు. కానీ వైభవ్ సూర్యవంశీ మాత్రం కాదు. 14 ఏళ్ల ఈ కుర్రాడు ఓ అనామకుడు. ఇంకా చెప్పాలంటే ఈ మ్యాచ్‌కు ముందు బహుశా చాలా మందికి అతనెవరో తెలియదు. కానీ తెలుసుకుంటారు. నెట్టింట గూగుల్‌లో సెర్చ్ చేస్తారు. ‘లైక్’లు కొట్టే షాట్లను ఫోన్ కెమెరాల్లో బంధించారు. ‘షేర్’ చేసే సమయం ఇవ్వనంతగా సిక్స్‌ల ‘షో’ చూశారు. 35 బంతుల సెంచరీకి ‘సబ్ స్క్రైబ్’ అయిపోయారు. ఐపీఎల్ కొత్త వైభవానికి పండగ చేసుకున్నారు. జైపూర్: ఐపీఎల్ 2008లో పుట్టింది. లీగ్ పుట్టిన మూడేళ్ల (2011లో) తర్వాత లోకం చూసిన బుడ్డొడిని పురుడు పోసిన కొద్దిమందే చూశారు! 14 ఏళ్లు తిరిగేసరికి ఇప్పుడా కుర్రాడిని మొత్తం క్రికెట్ ప్రపంచమే చూసి మురిసింది. అ బుడ్డొడు... ఇప్పటి కుర్రాడు... వైభవ్ సూర్యవంశీ. ఐపీఎల్లో అతనొక సంచలనం. బ్యాటింగ్ మెరుపులకే వై¿ోగం. క్రికెట్ ప్రేక్షకులకి కనుల పండగ అతని శతకం. బంతి సిక్స్‌లకే ఫిక్స్ అయినట్లు... అతని బ్యాట్ షాట్లకే అలవాటైనట్లు... అతని ‘షో’కు బంతులన్నీ దాసోహమైనట్లు అలవోకగా ఆడేశాడు. వైభవ్ (38 బంతుల్లో 101; 7 ఫోర్లు, 11 సిక్స్‌లు) శతకానికి జైపూర్‌లో నిశిరాతిరి కూడా వెలుగులు విరజిమ్మింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 209 పరుగుల భారీస్కోరు చేసింది. శుబ్‌మన్ గిల్ (50 బంతుల్లో 84; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు), జోస్ బట్లర్ (26 బంతుల్లో 50 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధసెంచరీలతో కదంతొక్కారు. అనంతరం రాజస్తాన్ రాయల్స్ 15.5 ఓవర్లలోనే కేవలం రెండే వికెట్లు కోల్పోయి 212 పరుగులు చేసి గెలిచింది. యశస్వీ జైస్వాల్ (40 బంతుల్లో 70 నాటౌట్; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) చెలరేగాడు. ఫిఫ్టీలో 48 పరుగులు... సిక్స్‌లు, ఫోర్లతోనే... పెద్ద లక్ష్యం... ఛేదించడం కష్టం... ఇలాంటి పరిస్థితుల మధ్య పరుగుల వేట మొదలుపెట్టిన యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ పరుగుల ఉప్పెన చూపెట్టారు. ముఖ్యంగా 14 ఏళ్ల వైభవ్ ఆట అసాంతం హైలైట్స్‌నే తలపించింది. సూర్యవంశీ షాట్ల ఎంపిక, సిక్స్‌ల తుఫాన్ ఒక్క మైదానాన్నే కాదు... క్రికెట్ ప్రపంచాన్నే తనవైపు తిప్పుకుంది. జైస్వాల్ పరుగుతో మొదలైన తొలిఓవర్ వైభవ్ సిక్సర్‌తో ఊపందుకుంది. రెండో ఓవర్లో యశస్వి సిక్స్ బాదడంతో రెండు ఓవర్లలో 19 పరుగులు వచ్చాయి. కానీ ఆ తర్వాతే విధ్వంసరచన మొదలైంది. సిరాజ్ మూడో ఓవర్లో జైస్వాల్ 3 ఫోర్లు కొట్టాడు. 3 ఓవర్లలో జట్టు స్కోరు 32. అప్పటికింకా వైభవ్ (9) పది పరుగులైనా చేయలేదు. ఇషాంత్ నాలుగో ఓవర్‌తో అతని షో మ్యాచ్ రూపాన్ని మార్చింది. 6, 6, 4, 0, 6, వైడ్, వైడ్, 4లతో ఏకంగా 28 పరుగులు పిండుకున్నాడు. తర్వాత ఐదో ఓవర్లో జైస్వాల్ బౌండరీ, సింగిల్ తీసివ్వగా, వైభవ్ 6, 0, 6, 4... ఈ బౌండరీతోనే 17 బంతుల్లోనే అతని ఫాస్టెస్ట్ అర్ధసెంచరీ అది కూడా ఐదో ఓవర్లోనే పూర్తయ్యింది. ఇందులో 3 బౌండరీలు, 6 సిక్స్‌లు అంటే 48 పరుగులు మెరుపులే! ఇలా ‘పవర్ ప్లే’నే పరుగెత్తుకున్న చందంగా, బౌండరీ లైన్–బంతి ముద్దు ముచ్చటలాడిన విధంగా అతని విధ్వంసం సాగింది. 35 బంతుల్లో భారతీయ శతకం రాయల్స్ జట్టు 6 ఓవర్లలో 87/0 స్కోరు చేసింది. జైస్వాల్ కొట్టిన వరుస బౌండరీలతో ప్రసిధ్ కృష్ణ 8వ ఓవర్లో జట్టు స్కోరు వందను దాటింది. ఇంకా డజను ఓవర్లు మిగిలివుంటే చేయాల్సిన లక్ష్యం (102) సగం కంటే తక్కువగా కరిగింది. ఐపీఎల్ అరంగేట్రం చేసిన కరీమ్ జనత్ వేసిన పదో ఓవర్లో అయితే వైభవ్ వీరబాదుడికి సిక్స్, ఫోర్ పోటీపడినట్లుగా అనిపించింది. 6, 4, 6, 4, 4, 6లతో 30 పరుగుల్ని రాబట్టాడు. 10 ఓవర్లలో 144/0 స్కోరు చేసింది. రషీద్‌ఖాన్ వేసిన మరుసటి ఓవర్లోనే మిడ్‌వికెట్ మీదుగా బాదిన సిక్స్‌తో వైభవ్ సెంచరీ 35 బంతుల్లోనే పూర్తయ్యింది. గేల్ (30 బంతుల్లో) తర్వాత ఐపీఎల్ చరిత్రలో రెండో వేగవంతమైన శతకం కాగా... భారత ఆటగాడు కొట్టిన తొలి ఫాస్టెస్ట్ సెంచరీగా పుటలకెక్కింది. 12వ ఓవర్లో వైభవ్‌ను బౌల్డ్ చేయడం ద్వారా ప్రసిధ్ కృష్ణ తొలివికెట్‌ను తీశాడు. 166 పరుగుల ఓపెనింగ్ వికెట్‌కు తెరపడింది. నితీశ్ (4) విఫలమైనా... మిగతా లాంఛనాన్ని జైస్వాల్, కెపె్టన్ రియాన్ పరాగ్ (15 బంతుల్లో 32 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) కూడా అంతే వేగంగా ముగించారు. స్కోరు వివరాలు గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్: సాయి సుదర్శన్ (సి) పరాగ్ (బి) తీక్షణ 39; గిల్ (సి) పరాగ్ (బి) తీక్షణ 84; బట్లర్ (నాటౌట్) 50; వాషింగ్టన్ సుందర్ (సి) హెట్‌మైర్ (బి) సందీప్ 13; తెవాటియా (ఎల్బీడబ్ల్యూ) (బి) ఆర్చర్ 9; షారుఖ్ ఖాన్ (నాటౌట్) 5; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 209. వికెట్ల పతనం: 1–93, 2–167, 3–193, 4–202. బౌలింగ్: ఆర్చర్ 4–0–49–1, తీక్షణ 4–0–35–2, యు«ద్వీర్ 3–0–38–0, సందీప్ శర్మ 4–0–33–1, పరాగ్ 1–0–14–0, హసరంగ 4–0–39–0. రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: జైస్వాల్ (నాటౌట్) 70; వైభవ్ (బి) ప్రసిధ్ కృష్ణ 101; నితీశ్ రాణా (ఎల్బీడబ్ల్యూ) (బి) రషీద్ ఖాన్ 4; పరాగ్ (నాటౌట్) 32; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (15.5 ఓవర్లలో 2 వికెట్లకు) 212. వికెట్ల పతనం: 1–166, 2–171. బౌలింగ్: సిరాజ్ 2–0–24–0, ఇషాంత్ 2–0–36–0, సుందర్ 1.5–0–34–0, ప్రసిధ్ కృష్ణ 4–0–47–1, రషీద్ 4–0–24–1, కరీమ్ 1–0–30–0, సాయి కిషోర్ 1–0–16–0. వైభవ్ సూర్యవంశీ రికార్డులు → టి20 క్రికెట్ చరిత్రలో సెంచరీ చేసిన పిన్న వయసు్కడిగా వైభవ్ (14 ఏళ్ల 32 రోజులు) ప్రపంచ రికార్డు సృష్టించాడు. గతంలో ఈ రికార్డు భారత్‌కే చెందిన మహారాష్ట్ర ప్లేయర్ విజయ్ జోల్ (18 ఏళ్ల 118 రోజులు; ముంబైపై 2013లో) పేరిట ఉంది. → ఐపీఎల్లో అర్ధ సెంచరీ, సెంచరీ చేసిన పిన్న వయస్కుడిగా వైభవ్ ఘనత వహించాడు. గతంలో అర్ధ సెంచరీ రికార్డు రియాన్ పరాగ్ (17 ఏళ్ల 175 రోజులు; 2019లో) పేరిట, సెంచరీ రికార్డు మనీశ్ పాండే (19 ఏళ్ల 253 రోజులు; 2009లో) పేరిట నమోదయ్యాయి. → ఐపీఎల్లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన భారతీయ ప్లేయర్‌గానూ వైభవ్ గుర్తింపు పొందాడు. యూసుఫ్ పఠాన్ (37 బంతుల్లో ముంబై ఇండియన్స్‌పై 2010లో) పేరిట ఉన్న రికార్డును వైభవ్ బద్దలు కొట్టాడు. క్రిస్ గేల్ (30 బంతుల్లో 2013లో పుణే వారియర్స్‌పై) తర్వాత ఐపీఎల్లో రెండో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ప్లేయర్ వైభవే కావడం విశేషం.చాలా ఆనందంగా ఉంది. ఐపీఎల్లో ఆడిన మూడో ఇన్నింగ్స్‌లోనే సెంచరీ చేయడం సంతోషం. మూడు, నాలుగు నెలల నుంచి పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కింది. నేను బౌలర్లు ఎవరనే విషయాన్ని పెద్దగా పట్టించుకోను. కేవలం బంతి మీదే దృష్టి పెడతా. యశస్వి జైస్వాల్‌తో కలిసి బ్యాటింగ్ చేయడం సౌకర్యవంతంగా ఉంటుంది. అవసరమైనప్పుడు సలహాలు ఇవ్వడంతో పాటు ఆత్మవిశ్వాసం నింపుతాడు. దీంతో బ్యాటింగ్ చేయడం సులువవుతుంది. ఐపీఎల్లో సెంచరీ చేయాలన్నది నా కల. క్రీజులో అడుగు పెట్టాక భయపడను. అసలు వేరే ఏ అంశాలను పట్టించుకోను. కేవలం నా ఆటపైనే దృష్టి పెడతా. –వైభవ్ సూర్యవంశీ
60+ సాహస యాత్ర!
ఈ ప్రశ్నకు జవాబు ఉందా?
రాజధానిలో మరిన్ని భూములు సమీకరణ
బీబీసీది పక్షపాత రిపోర్టింగ్
మే 7న నూతన పోప్ ఎన్నిక
రఫేల్ ఒప్పందంపై భారత్, ఫ్రాన్స్ సంతకాలు
రద్దు దిశగా ఆప్కాస్!
తహవ్వుర్ రాణా కస్టడీ పొడిగింపు
జేఎన్‌యూలో పట్టు నిలబెట్టుకున్న వామపక్షం
ముష్కర మూకలకు ముచ్చెమటలు
'ప్రవస్తి' నీకు నేను ఉన్నా.. మేము ఉన్నాం: గీతా మాధురి
ముద్దుల మూట, మనసెలా వచ్చింది : వైద్యురాలి వీడియో వైరల్
ఆట అదుర్స్.. అతడిని టీమిండియాకి ఎంపిక చేయండి: పీటర్సన్
Owaisi: నీ తల్లికి తూటా దింపిందెవరు?
వీళ్లు ఐదురూపాయలు బిచ్చమేశార్రా! దీంతో వైజాగ్‌లో ఐదెకరాల భూమి కొనేయవచ్చు... మనకూ ‘ఉర్సా’ లాంటి కంపెనీ ఉంటే!
'బాహుబలి' టైంకి నాకు 27 ఏళ్లే.. కానీ అలా చూపించేసరికి
మార్కెట్లోకి సరికొత్త హైటెక్ ఫ్యాన్: ధర ఎంతంటే?
ఈ రాశి వారు భూములు, వాహనాలు కొంటారు
ఏపీ రాజ్యసభ స్థానానికి అభ్యర్థి ఖరారు
IPL 2025: చరిత్ర సృష్టించిన సూర్యవంశీ.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా
నచ్చిన వారితో శృంగారం.. అజిత్‌పై నటి 'హీరా' సెన్సేషనల్ కామెంట్
నాలుగు రోజులు సెలవు పెట్టాను: హెచ్ఆర్ కాల్ చేసి..
స్తంభించిన విద్యుత్.. మూడు దేశాలు అతలాకుతలం
ఈవారం థియేటర్లో పెద్ద సినిమాలు.. ఓటీటీలో 20 చిత్రాలు
మహాభారతంలో నాని.. కన్ఫార్మ్ చేసిన రాజమౌళి
పాక్ పాచికల్ని పారనీయొద్దు!
మీరెలాంటి వ్యక్తో చిటికెలో చెప్పే ట్రిక్..! ఆ పప్పులుడకవిక..
వాడికి ఏడాదిన్నర వయసు.. మాకు అలాంటి పిచ్చిలేదు: సంజనా ఫైర్
జాబ్ చేస్తానంటే ఇంట్లోకి రమ్మంటారు.. బాధ చెప్పుకున్న దీపిక
లండన్ లో తప్పిపోయిన నిజామాబాద్ జిల్లా విద్యార్థి
బంగారం భారీగా పడిపోతుంది!
‘ఛీ’నా రాజకీయం...
ముష్కర మూకలకు ముచ్చెమటలు
అయ్యో దేవుడా..ఏమిటీ ఘోరం
ఇలా ఒక్కరినే టార్గెట్ చేయడం సరికాదు: రిషభ్ పంత్ అసహనం!
పాక్ ఆక్రమిత కశ్మీర్లోకి వరదలోచ్చిస్తున్నాయ్స్సార్.. ఎవరైనా కాపాడండి!
వామ్మో.. ఇదేం ట్రాఫిక్!
కొత్త లీవ్ పాలసీ జూలై 1 నుంచి..?
IPL 2025: ‘పంజాబ్ ఈసారీ టైటిల్ గెలవదు.. ఎందుకంటే?!’
IPL 2025: విధ్వంసంలో వైభవం
భార్య కళ్లెదుటే ప్రియుడ్ని?.. పట్టపగలే పెద్దపల్లిలో దారుణం
నన్ను ఇక్కడే ఉండనివ్వండి
బాహుబలి రిటర్న్స్
తెలుగు రాష్ట్రాల్లో జియో ఎయిర్ ఫైబర్ జోరు
సెట్ చేయడానికే ఏడాది: సీఎం రేవంత్
విభేదిస్తే వ్యతిరేకించాలా?
మోహన్ లాల్ ‘తుడరుమ్’ మూవీ రివ్యూ
సూర్యవంశీ సుడిగాలి ఇన్నింగ్స్.. గుజరాత్‌కు రాజస్తాన్ షాక్
IPL 2025: ఒక్క విజయం.. చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో ఉన్న ఆర్సీబీ
ఓటీటీలోకి బోల్డ్ మూవీ.. ఏడాది తర్వాత తెలుగులోకి
మార్చి రిపోర్ట్: నిండా మునిగిన నిర్మాతలు.. 15 సినిమాల్లో ఒక్కటే హిట్టు!
నిరంతర ‘కోత’లు!.. అల్లాడుతున్న ప్రజలు
తెలంగాణకు వర్షసూచన.. ఐదు రోజులు ఈ జిల్లాల్లో గట్టి వానలే..
బ్యాంకులో క్యాష్ వేస్తున్నారా..? జాగ్రత్త!!
ఏపీలో సమంత టెంపుల్.. ఇప్పుడు మరో విగ్రహం
ఇల్లు తుడిచిన హీరో.. ఎవరో తెలుసా?
రోజూ బాదాం తింటే.. ఈ నాలుగు గ్యారెంటీ!
IPL 2025: చరిత్ర సృష్టించిన సూర్యకుమార్.. తొలి భారత ప్లేయర్‌గా
అత్యంత కీలకంగా మారిన చెట్టు మీది వీడియో
AP: మళ్ళీ భూములు సమీకరణకు చంద్రబాబు
భారత్ దెబ్బ అదుర్స్.. పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఎమర్జెన్సీ!
సొంతంగా స్టార్టప్.. కుమార్తెపై బిల్‌గేట్స్ ప్రశంసల వర్షం
సమంత కాదు మాతాజీ.. ప్రియుడితో యానిమల్ బ్యూటీ!
పద్మ భూషణ్ పురస్కారాల్ని అందుకున్న హీరోలు
నా పరిస్థితి నా కూతురికి రాకూడదు: ఊర్వశి
వాళ్ల గురించి ఇలా మాట్లాడకండి.. నాకు బాధేస్తోంది: కోటి
'డ్రాగన్'తో హిట్.. క్రేజీ ఛాన్స్ కొట్టేసిన కాయదు
టీడీపీ నాయకుడి దురాగతం.. ఆస్తి కోసం అక్క, తల్లిపై దాడి
వక్ఫ్ ఆస్తులు ఆ రాష్ట్రంలోనే ఎక్కువ!
అక్కాచెల్లిలా సితార-నమ్రత.. చిన్న పాపతో శ్రీలీల
IPL 2025: ఆర్సీబీ తలరాత మార్చే ప్రయత్నం చేస్తున్న భువీ.. ఈ క్రమంలో అరుదైన ఘనత
క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఐపీఎల్లో 94 మ్యాచ్‌లు?
మీరంతా పనికిరాని వాళ్లనేగా అర్థం: షాహిద్ ఆఫ్రిది వివాదాస్పద వ్యాఖ్యలు
నాటి రైతు బిడ్డ... నేడు ఐపీఎల్ హీరో
ఈపీఎఫ్ క్లెయిమ్‌కు వెళ్తున్నారా..?
ఇంట్లో పాముల కలకలం
75 ఏళ్లుగా చెక్కుచెదరని పెంకుటిల్లు..!
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
మళ్లీ ఉగ్ర కాండ!
3 నిమిషాలకో మరణం
హైదరాబాద్‌లో హై అలర్ట్
అమ్మానాన్నా క్షమించండి.. వెళ్లిపోతున్నా..
ఎల్లో మీడియాకు ఎంత ముడుతోందో?
రెండు రోజులే పనిచేసే రోజులొస్తాయ్..
జిమ్ చేస్తూ గాయపడ్డ కేటీఆర్
మృత్యువుతో పోరాడి ఓడిన వైద్య విద్యార్థిని భావన యాదవ్
శోభిత ప్రెగ్నెంట్ అని రూమర్స్.. నిజమేంటి?
వాళ్ల మధ్య వేలెందుకు పెట్టార్సార్!
బంగారం.. ఈ దేశాల్లో చవకే..!!
ఇంతకీ ప్రవస్తి ఆరాధ్య ఎవరు? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి?
కొత్త కార్డులు 1,017
DC VS RCB: 3267 రోజుల తర్వాత చేసిన అర్ద సెంచరీ.. క్రెడిట్ విరాట్‌కే: కృనాల్ పాండ్యా
సరికొత్తగా...
డొల్ల కంపెనీలతో డీల్!
నిరాశపరిచిన ఎస్బీఐ కార్డ్
తీరంలో తూటా.. సీటీలో బాంబు
ఆ హీరో తండ్రి సలహాతో 15 రోజులు నా యూరిన్ తాగా: నటుడు
మరో పాపని దత్తత తీసుకున్న శ్రీలీల?
ధర ఎక్కువైనా అస్సలు తగ్గని జనం: ఒకేరోజు 52 కార్ల డెలివరీ
శ్రీ విష్ణు 'సింగిల్' ట్రైలర్ రిలీజ్.. బుల్లిరాజు కూడా
ఏప్రిల్‌లో విడుదలైన టాప్ 10 మొబైల్స్
ప్రభుత్వ సంస్థగా ‘వొడా’?.. కేంద్రమంత్రి స్పష్టత
'యానిమల్'తో పెద్ద స్టార్ అయిపోయాననుకున్నా.. కానీ ఆ రోజు
సూర్యవంశీ సెంచరీ.. గుజరాత్‌ను చిత్తు చేసిన రాజస్తాన్
నేను డైలాగ్స్ మింగేయడమే బెటర్.. లేదంటే
'లాహోర్‌ను లాక్కుంటే.. అర గంటలో తిరిగిచ్చేస్తారు'
విషాదం.. జర్మనీలో ప్రకాశం జిల్లా విద్యార్థిని మృతి
క్యాన్సర్ తో ప్రమఖ దర్శకుడు కన్నుమూత
‘నువ్వు’ కాదు ‘మీరు’.. విజయశాంతి రిక్వెస్ట్
IPL 2025: మరోసారి 'ఆ బిరుదుకు' సార్థకత చేకూర్చిన విరాట్ కోహ్లి
60+ సాహస యాత్ర!
ఈ ప్రశ్నకు జవాబు ఉందా?
రాజధానిలో మరిన్ని భూములు సమీకరణ
బీబీసీది పక్షపాత రిపోర్టింగ్
మే 7న నూతన పోప్ ఎన్నిక
రఫేల్ ఒప్పందంపై భారత్, ఫ్రాన్స్ సంతకాలు
రద్దు దిశగా ఆప్కాస్!
తహవ్వుర్ రాణా కస్టడీ పొడిగింపు
జేఎన్‌యూలో పట్టు నిలబెట్టుకున్న వామపక్షం
ముష్కర మూకలకు ముచ్చెమటలు
'ప్రవస్తి' నీకు నేను ఉన్నా.. మేము ఉన్నాం: గీతా మాధురి
ముద్దుల మూట, మనసెలా వచ్చింది : వైద్యురాలి వీడియో వైరల్
ఆట అదుర్స్.. అతడిని టీమిండియాకి ఎంపిక చేయండి: పీటర్సన్
Owaisi: నీ తల్లికి తూటా దింపిందెవరు?
వీళ్లు ఐదురూపాయలు బిచ్చమేశార్రా! దీంతో వైజాగ్‌లో ఐదెకరాల భూమి కొనేయవచ్చు... మనకూ ‘ఉర్సా’ లాంటి కంపెనీ ఉంటే!
'బాహుబలి' టైంకి నాకు 27 ఏళ్లే.. కానీ అలా చూపించేసరికి
మార్కెట్లోకి సరికొత్త హైటెక్ ఫ్యాన్: ధర ఎంతంటే?
ఈ రాశి వారు భూములు, వాహనాలు కొంటారు
ఏపీ రాజ్యసభ స్థానానికి అభ్యర్థి ఖరారు
IPL 2025: చరిత్ర సృష్టించిన సూర్యవంశీ.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా
నచ్చిన వారితో శృంగారం.. అజిత్‌పై నటి 'హీరా' సెన్సేషనల్ కామెంట్
నాలుగు రోజులు సెలవు పెట్టాను: హెచ్ఆర్ కాల్ చేసి..
స్తంభించిన విద్యుత్.. మూడు దేశాలు అతలాకుతలం
ఈవారం థియేటర్లో పెద్ద సినిమాలు.. ఓటీటీలో 20 చిత్రాలు
మహాభారతంలో నాని.. కన్ఫార్మ్ చేసిన రాజమౌళి
పాక్ పాచికల్ని పారనీయొద్దు!
మీరెలాంటి వ్యక్తో చిటికెలో చెప్పే ట్రిక్..! ఆ పప్పులుడకవిక..
వాడికి ఏడాదిన్నర వయసు.. మాకు అలాంటి పిచ్చిలేదు: సంజనా ఫైర్
జాబ్ చేస్తానంటే ఇంట్లోకి రమ్మంటారు.. బాధ చెప్పుకున్న దీపిక
లండన్ లో తప్పిపోయిన నిజామాబాద్ జిల్లా విద్యార్థి
బంగారం భారీగా పడిపోతుంది!
‘ఛీ’నా రాజకీయం...
ముష్కర మూకలకు ముచ్చెమటలు
అయ్యో దేవుడా..ఏమిటీ ఘోరం
ఇలా ఒక్కరినే టార్గెట్ చేయడం సరికాదు: రిషభ్ పంత్ అసహనం!
పాక్ ఆక్రమిత కశ్మీర్లోకి వరదలోచ్చిస్తున్నాయ్స్సార్.. ఎవరైనా కాపాడండి!
వామ్మో.. ఇదేం ట్రాఫిక్!
కొత్త లీవ్ పాలసీ జూలై 1 నుంచి..?
IPL 2025: ‘పంజాబ్ ఈసారీ టైటిల్ గెలవదు.. ఎందుకంటే?!’
IPL 2025: విధ్వంసంలో వైభవం
భార్య కళ్లెదుటే ప్రియుడ్ని?.. పట్టపగలే పెద్దపల్లిలో దారుణం
నన్ను ఇక్కడే ఉండనివ్వండి
బాహుబలి రిటర్న్స్
తెలుగు రాష్ట్రాల్లో జియో ఎయిర్ ఫైబర్ జోరు
సెట్ చేయడానికే ఏడాది: సీఎం రేవంత్
విభేదిస్తే వ్యతిరేకించాలా?
మోహన్ లాల్ ‘తుడరుమ్’ మూవీ రివ్యూ
సూర్యవంశీ సుడిగాలి ఇన్నింగ్స్.. గుజరాత్‌కు రాజస్తాన్ షాక్
IPL 2025: ఒక్క విజయం.. చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో ఉన్న ఆర్సీబీ
ఓటీటీలోకి బోల్డ్ మూవీ.. ఏడాది తర్వాత తెలుగులోకి
మార్చి రిపోర్ట్: నిండా మునిగిన నిర్మాతలు.. 15 సినిమాల్లో ఒక్కటే హిట్టు!
నిరంతర ‘కోత’లు!.. అల్లాడుతున్న ప్రజలు
తెలంగాణకు వర్షసూచన.. ఐదు రోజులు ఈ జిల్లాల్లో గట్టి వానలే..
బ్యాంకులో క్యాష్ వేస్తున్నారా..? జాగ్రత్త!!
ఏపీలో సమంత టెంపుల్.. ఇప్పుడు మరో విగ్రహం
ఇల్లు తుడిచిన హీరో.. ఎవరో తెలుసా?
రోజూ బాదాం తింటే.. ఈ నాలుగు గ్యారెంటీ!
IPL 2025: చరిత్ర సృష్టించిన సూర్యకుమార్.. తొలి భారత ప్లేయర్‌గా
అత్యంత కీలకంగా మారిన చెట్టు మీది వీడియో
AP: మళ్ళీ భూములు సమీకరణకు చంద్రబాబు
భారత్ దెబ్బ అదుర్స్.. పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఎమర్జెన్సీ!
సొంతంగా స్టార్టప్.. కుమార్తెపై బిల్‌గేట్స్ ప్రశంసల వర్షం
సమంత కాదు మాతాజీ.. ప్రియుడితో యానిమల్ బ్యూటీ!
పద్మ భూషణ్ పురస్కారాల్ని అందుకున్న హీరోలు
నా పరిస్థితి నా కూతురికి రాకూడదు: ఊర్వశి
వాళ్ల గురించి ఇలా మాట్లాడకండి.. నాకు బాధేస్తోంది: కోటి
'డ్రాగన్'తో హిట్.. క్రేజీ ఛాన్స్ కొట్టేసిన కాయదు
టీడీపీ నాయకుడి దురాగతం.. ఆస్తి కోసం అక్క, తల్లిపై దాడి
వక్ఫ్ ఆస్తులు ఆ రాష్ట్రంలోనే ఎక్కువ!
అక్కాచెల్లిలా సితార-నమ్రత.. చిన్న పాపతో శ్రీలీల
IPL 2025: ఆర్సీబీ తలరాత మార్చే ప్రయత్నం చేస్తున్న భువీ.. ఈ క్రమంలో అరుదైన ఘనత
క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఐపీఎల్లో 94 మ్యాచ్‌లు?
మీరంతా పనికిరాని వాళ్లనేగా అర్థం: షాహిద్ ఆఫ్రిది వివాదాస్పద వ్యాఖ్యలు
నాటి రైతు బిడ్డ... నేడు ఐపీఎల్ హీరో
ఈపీఎఫ్ క్లెయిమ్‌కు వెళ్తున్నారా..?
ఇంట్లో పాముల కలకలం
75 ఏళ్లుగా చెక్కుచెదరని పెంకుటిల్లు..!
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
మళ్లీ ఉగ్ర కాండ!
3 నిమిషాలకో మరణం
హైదరాబాద్‌లో హై అలర్ట్
అమ్మానాన్నా క్షమించండి.. వెళ్లిపోతున్నా..
ఎల్లో మీడియాకు ఎంత ముడుతోందో?
రెండు రోజులే పనిచేసే రోజులొస్తాయ్..
జిమ్ చేస్తూ గాయపడ్డ కేటీఆర్
మృత్యువుతో పోరాడి ఓడిన వైద్య విద్యార్థిని భావన యాదవ్
శోభిత ప్రెగ్నెంట్ అని రూమర్స్.. నిజమేంటి?
వాళ్ల మధ్య వేలెందుకు పెట్టార్సార్!
బంగారం.. ఈ దేశాల్లో చవకే..!!
ఇంతకీ ప్రవస్తి ఆరాధ్య ఎవరు? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి?
కొత్త కార్డులు 1,017
DC VS RCB: 3267 రోజుల తర్వాత చేసిన అర్ద సెంచరీ.. క్రెడిట్ విరాట్‌కే: కృనాల్ పాండ్యా
సరికొత్తగా...
డొల్ల కంపెనీలతో డీల్!
నిరాశపరిచిన ఎస్బీఐ కార్డ్
తీరంలో తూటా.. సీటీలో బాంబు
ఆ హీరో తండ్రి సలహాతో 15 రోజులు నా యూరిన్ తాగా: నటుడు
మరో పాపని దత్తత తీసుకున్న శ్రీలీల?
ధర ఎక్కువైనా అస్సలు తగ్గని జనం: ఒకేరోజు 52 కార్ల డెలివరీ
శ్రీ విష్ణు 'సింగిల్' ట్రైలర్ రిలీజ్.. బుల్లిరాజు కూడా
ఏప్రిల్‌లో విడుదలైన టాప్ 10 మొబైల్స్
ప్రభుత్వ సంస్థగా ‘వొడా’?.. కేంద్రమంత్రి స్పష్టత
'యానిమల్'తో పెద్ద స్టార్ అయిపోయాననుకున్నా.. కానీ ఆ రోజు
సూర్యవంశీ సెంచరీ.. గుజరాత్‌ను చిత్తు చేసిన రాజస్తాన్
నేను డైలాగ్స్ మింగేయడమే బెటర్.. లేదంటే
'లాహోర్‌ను లాక్కుంటే.. అర గంటలో తిరిగిచ్చేస్తారు'
విషాదం.. జర్మనీలో ప్రకాశం జిల్లా విద్యార్థిని మృతి
క్యాన్సర్ తో ప్రమఖ దర్శకుడు కన్నుమూత
‘నువ్వు’ కాదు ‘మీరు’.. విజయశాంతి రిక్వెస్ట్
IPL 2025: మరోసారి 'ఆ బిరుదుకు' సార్థకత చేకూర్చిన విరాట్ కోహ్లి
సినిమా

నేను డైలాగ్స్ మింగేయడమే బెటర్.. లేదంటే
శ్రీ విష్ణు అనగానే మంచి హీరో, ప్రయోగాత్మక, ఫన్ ఎంటర్ టైనర్ సినిమాలు చేస్తుంటాడు కదా అనే పేరుంది. అదే టైంలో సోషల్ మీడియాలో కుర్రాళ్లని అడిగితే శ్రీ విష్ణు.. ఎంత బాగా సెన్సార్ బోర్డ్ నుంచి తప్పించుకుంటాడనేది చెబుతారు. ఇప్పుడు దాని గురించే మీడియా అడగ్గా.. శ్రీ విష్ణు ఆసక్తికర సమాధానమిచ్చాడు.శ్రీ విష్ణు హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ '#సింగిల్'. తాజాగా ట్రైలర్ లాంచ్ జరిగింది. గతంలో ఇతడు నటించిన బ్రోచెవారెవరురా, సామజవరగమన, ఓం భీమ్ బుష్ చిత్రాల్లో కొన్ని బూతులా అనిపించే డైలాగ్స్ ఉన్నాయి. కానీ వాటిని శ్రీ విష్ణు చెప్పిన విధానం వల్ల అవి అలాంటివి అని సందేహం రాదు.(ఇదీ చదవండి: ఏపీలో సమంత టెంపుల్.. ఇప్పుడు మరో విగ్రహం) తాజాగా రిలీజైన '#సింగిల్' ట్రైలర్ చివర్లోనూ ఓ డైలాగ్ ఉంటుంది. అది కూడా బూతులానే అనిపిస్తుంది కానీ కాదు. ఇప్పుడు ఈ తరహా డైలాగ్స్ గురించి శ్రీ విష్ణుని మీడియా అడగ్గా.. నేను డైలాగ్స్ మింగేయడమే బెటర్, లేదంటే సంస్కృతం డైలాగ్స్ చెప్పినా డబుల్ మీనింగ్ అనుకుంటున్నారు అని చెప్పుకొచ్చాడు.తాను మాట్లాడేవి డబుల్ మీనింగ్ బూతులు కాదని, అది సంస్కృతం అని, మీకు ఉన్న ఫలంగా సంస్కృతం నేర్పించలేనని తనదైన శైలిలో కామెడీగా శ్రీ విష్ణు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఈ మూవీ మే 9న థియేటర్లలో రిలీజ్ కానుంది.(ఇదీ చదవండి: మరో పాపని దత్తత తీసుకున్న శ్రీలీల?)

ఈవారం థియేటర్లో పెద్ద సినిమాలు.. ఓటీటీలో 20 చిత్రాలు
మే నెలలో రెట్టింపు వినోదాన్ని పంచేందుకు సినిమాలు సిద్ధమయ్యాయి. థియేటర్లలో రెండు పెద్ద సినిమాలు రిలీజవుతుండగా ఓటీటీలోనూ పలు చిత్రాలు, వెబ్ సిరీస్‌లు విడుదల కానున్నాయి. మరి మే మొదటివారంలో అటు థియేటర్లో, ఇటు ఓటీటీలో రిలీజయ్యే సినిమాలేంటో చూసేద్దాం..థియేటర్లో విడుదలయ్యే సినిమాలివే..నాని హీరోగా నటించిన 'హిట్ 3' - మే 1సూర్య హీరోగా నటించిన 'రెట్రో' - మే 1అజయ్ దేవ్‌గణ్ 'రైడ్ 2' - మే 1సంజయ్‌దత్, సన్నీ సింగ్‌ల 'భూతిని' - మే 1ఓటీటీ రిలీజెస్..నెట్‌ఫ్లిక్స్🎬 చెఫ్స్ టేబుల్: లెజెండ్స్ (సిరీస్) - ఏప్రిల్ 28🎬 ఆస్ట్రిక్స్ అండ్ ఒబెలిక్స్: ద బిగ్ ఫైట్ (మినీ సిరీస్) - ఏప్రిల్ 30🎬 ఎక్స్‌టెరిటోరియల్ - ఏప్రిల్ 30🎬 ద ఎటర్నాట్ - ఏప్రిల్ 30🎬 టర్నింగ్ పాయింట్: ద వియత్నాం వార్ (వెబ్ సిరీస్) - ఏప్రిల్ 30🎬 ద రాయల్స్ (వెబ్ సిరీస్) - మే1🎬 యాంగి: ఫేక్ లైఫ్, ట్రూ క్రైమ్ - మే 1🎬 ద బిగ్గెస్ట్ ఫ్యాన్ - మే 1🎬 ద ఫోర్ సీజన్స్ (వెబ్ సిరీస్) - మే 1🎬 బ్యాడ్ బాయ్ (వెబ్ సిరీస్) - మే 2అమెజాన్ ప్రైమ్ వీడియో🎥 అనదర్ సింపుల్ ఫేవర్ - మే1జీ5🎬 కొస్టావో - మే 1హాట్‌స్టార్🎥 కుల్ల్: ద లెగసీ ఆఫ్ ద రైసింగ్స్ (వెబ్ సిరీస్) - మే 2🎥 ద బ్రౌన్ హార్ట్ (డాక్యుమెంటరీ) - మే 3ఆహా🎬 వేరేలెవల్ ఆఫీస్ రీలోడెడ్ - మే 1సోనీలివ్🎥 బ్రొమాన్స్ - మే 1🎥 బ్లాక్, వైట్ అండ్ గ్రే: లవ్ కిల్స్ (వెబ్ సిరీస్) - మే 1ఎంఎక్స్ ప్లేయర్🎬 ఈఎమ్ఐ - మే1టుబి🎥 సిస్టర్ మిడ్నైట్ - మే 2యాపిల్ టీవీ ప్లస్🎬 కేర్ మీ - ఏప్రిల్ 30చదవండి: దుస్తులు తీసేయమన్నాడు.. చేదు అనుభవం బయటపెట్టిన నటి

'ప్రవస్తి' నీకు నేను ఉన్నా.. మేము ఉన్నాం: గీతా మాధురి
'పాడుతా తీయగా' షో గురించి గాయని ప్రవస్తి ఆరాధ్య పలు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రోగ్రాంలో జడ్జెస్‌గా ఉన్న కీరవాణి, సునీత, చంద్రబోస్‌లు వారికి నచ్చినోళ్లను మాత్రమే ఎంకరేజ్ చేస్తారని ప్రవస్తి కామెంట్ చేసింది. ఆపై షోలో ఉన్న కాస్ట్యూమ్ డిజైనర్ బాడీ షేమింగ్ వంటి వ్యాఖ్యలతో బాధపెట్టారని ఆమె వాపోయింది. ఆపై సింగర్ సునీతకు పలు ప్రశ్నలతో వీడియో కూడా విడుదల చేసింది. అయితే, ఈ వివాదంపై తాజాగా సింగర్ గీతామాధురి తన అభిప్రాయాన్ని వీడియో ద్వారా పంచుకుంది.ప్రవస్తిని ఉద్దేశిస్తూ.. గీత మాధురి ఇలా మాట్లాడింది. 'కొన్నిసార్లు మనం ఉన్న పరిస్థితి కూడా ఇబ్బందులు తీసుకొస్తుంది. ప్రవస్తి చాలారోజులుగా పోటీలో ఉంది. దీంతో కాస్త ఒత్తిడిలో ఉండొచ్చు. ఆమెకు అందరం అండగా ఉంటాం. ఇంతవరకు జరిగిన వాటిని హార్ట్‌కు తీసుకోకు. నీకు తప్పకుండా మంచి అవకాశాలు వస్తాయి. ఇతరులు చేస్తున్న కామెంట్లు అన్నీ నీకు నువ్వే ఆపాదించుకోవద్దు. మేము నీకు సపోర్ట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. ఇలాంటి షోస్ నుంచే నేను కూడా వచ్చాను. ఒకరి ఒటమిని చూసి చంద్రబోస్ , సునీత, ఎం ఎం కీరవాణి ఎంజాయ్ చేయాలని అనుకోరు. వారికి అందరూ ఒక్కటే. ఒక్కోసారి వారు చేసిన కామెంట్లు ఇబ్బంది పెట్టొచ్చు కానీ, వాటిని మనం తీసుకునేందుకు సిద్ధంగా ఉండాలి. ఇలాంటివన్నీ కూడా విజయానికి మెట్లు అనుకోవాలి. ఒక్కోసారి ఎవరు ఏ పాట పాడితే బాగుంటుందని ఎంపిక చేయడంలో మేనేజ్మెంట్ ప్రమేయం ఉంటుంది. ఇలా ఎన్నో డిస్కషన్స్ సెట్స్‌లో అవుతూనే ఉంటాయి. కొన్నిసార్లు వాళ్లే కన్విన్స్ అయిపోయి వీళ్లకు నచ్చిన పాటలను కూడా పాడనిస్తారు. ఇలాంటివి అన్నీ సహజంగానే జరుగుతూ ఉంటాయి.జడ్జీలుగా ఉన్న ఆ ముగ్గురిలో ఒక్కరూ కూడా.. పలాన కంటెస్టెంట్ ఎలిమినేట్ అయిపోవాలి అనుకునే వ్యక్తులు కాదు. జీవితంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్న తర్వాతే వారు ఈ స్థాయికి వచ్చారు. కానీ, కంటెస్టెంట్ స్థానంలో ఉన్న వారిపై ఒక చిన్న కామెంట్ చేసినా వారికి డిస్టర్బ్‌గా అనిపించడం సహజమే. అదే సమయంలో వారు ఇచ్చే చిన్న కాంప్లిమెంట్ కూడా మళ్లీ మనకు సంతోషాన్ని ఇస్తుంది. ఈ పోటీ ప్రపంచంలో ఇలాంటివి అన్నీ ఉంటాయి. వాటిని మనకు పాజిటివ్‌గా మలుచుకోవాలి. ఇలాంటి సమయం కోసం ఎదురుచూసిన కొందరు దానిని ఆసరాగా తీసుకొని వారిని తిట్టడం కూడా మొదలుపెట్టారు. ఎప్పుడు లేని నెగటివిటిని వినాల్సి వస్తుంది. ప్రవస్తీని తిట్టినా.. జడ్జెస్‌ను తిట్టినా నాకు బాధగానే ఉంది. ఇది నా ఒపీనియన్.' అంటూ గీత మాధురి చెప్పుకొచ్చింది.

మరో పాపని దత్తత తీసుకున్న శ్రీలీల?
శ్రీలీల(Sreeleela) పేరు చెప్పగానే డ్యాన్సులే గుర్తొస్తాయి. అప్పట్లో పల్సర్ బండి పాటకు.. రీసెంట్ గా పుష్ప 2లో(Pushpa 2 Movie) కిస్సిక్ అంటూ స్టెప్పులేసి అదరగొట్టేసింది. ప్రస్తుతం తెలుగుతో పాటు హిందీలోనూ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న ఈమె గురించి ఇప్పుడో విషయం ఆసక్తికరంగా మారింది. ఇంతకీ ఏంటి సంగతి?తెలుగు మూలాలున్న అమ్మాయి శ్రీలీల. పుట్టి పెరిగింది అమెరికాలో గానీ ప్రస్తుతానికైతే బెంగళూరులో తల్లితో కలిసి ఉంటుంది. షూటింగ్ లేనప్పుడు తన ఇంట్లో చేసే అల్లరిని అప్పుడప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటుంది. యాక్టింగ్ పరంగా శ్రీలీలపై చిన్న చిన్న విమర్శలు వస్తుంటాయి. ఓ విషయంలో మాత్రం ఈమె అందరి మనసులు దోచేసింది.(ఇదీ చదవండి: సమంత పెట్ డాగ్ తో శోభిత.. చైతూ పోస్ట్ వైరల్) ఎంబీబీఎస్ పూర్తి చేసిన శ్రీలీల.. ఓవైపు హీరోయిన్ గా చేస్తోంది. ఇది అందరికీ తెలుసు. కానీ 2022లో ఓ అనాథశ్రమాన్ని సందర్శించినప్పుడు.. దివ్యాంగులైన గురు, శోభిత అనే ఇద్దరు పిల్లల పరిస్థితి చూసి చలించిపోయింది. వాళ్లని దత్తత తీసుకుంది(Adopted). వాళ్ల ఆలనపాలన చూసుకుంటోంది.తన కుటుంబంలోకి మరో పాప వచ్చిందని శ్రీలీల తాజాగా పోస్ట్ పెట్టింది. ఇందులో ఓ చిన్న పాపకు ముద్దులు పెడుతూ కనిపించింది. నెటిజన్ల అయితే ఈ పాప ఎవరా అని మాట్లాడుకుంటున్నారు. కొందరు మాత్రం మరో బిడ్డని దత్తత తీసుకుంది అని అంటున్నారు. లేదంటే బంధువులమ్మాయి అనేది శ్రీలీల చెబితే గానీ క్లారిటీ రాదు.(ఇదీ చదవండి: 'బాహుబలి' టైంకి నాకు 27 ఏళ్లే.. కానీ అలా చూపించేసరికి) View this post on Instagram A post shared by Sreeleela (@sreeleela14)
న్యూస్ పాడ్‌కాస్ట్
క్రీడలు

రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న అశ్విన్! వీడియో
టీమిండియా మజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డును అందుకున్నాడు. సోమవారం (April 28) రాష్ట్రపతి భవన్లో నిర్వహించిన అవార్డుల ప్రదానోత్సవంలో.. ఈ అవార్డును అశ్విన్ స్వీకరించాడు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, ఇతర ప్రముఖులు కూడా హాజరయ్యారు. కాగా భారత క్రికెట్‌కు అందించిన సేవలకు గాను అశ్విన్‌కు ఈ అరుదైన గౌరవం లభించింది. ఈ ప్రత్యేక గౌరవం పొందినందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) అశ్విన్‌ను ప్రశంసించింది. "భారత రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రతిష్టాత్మకమైన పద్మశ్రీ అవార్డును అందుకున్న అశ్విన్‌కు అభినందనలు. ఇది అతడి కెరీర్లో సాధించిన అద్బుత విజయాలకు దక్కిన గౌరవమని" బీసీసీఐ ఎక్స్‌లో రాసుకొచ్చింది. అశ్విన్ తన 15 ఏళ్ల కెరీర్లో భారత్ తరపున 287 మ్యాచ్‌లు ఆడాడు. అందులో 106 టెస్టులు, 116 వన్డేలు, 65 టీ20లు ఉన్నాయి. 106 టెస్టుల్లో అశ్విన్ 537 వికెట్లు పడగొట్టాడు. భారత్ తరపున టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన రెండో ఆటగాడిగా ఈ తమిళనాడు క్రికెటర్ కొనసాగుతున్నాడు. వన్డేల్లో 156 వికెట్లు, టీ20ల్లో 72 వికెట్లు పడగొట్టాడు. అశ్విన్‌తో పాటు భారత హాకీ దిగ్గజం పిఆర్ శ్రీజేష్ను పద్మభూషణ్ అవార్డుతో సత్కరించారు. 2024 పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ కాంస్య పతకాన్ని గెలుచుకోవడంలో శ్రీజేష్ కీలక పాత్ర పోషించాడు. పారిస్ ఒలింపిక్స్ అనంతరం శ్రీజేష్ హాకీకి రిటైర్మెంట్ ప్రకటించాడు. Congratulations to @ashwinravi99 on being conferred the prestigious Padma Shri award by the Hon'ble President of India @rashtrapatibhvn, honouring his remarkable achievements and an illustrious career with #TeamIndia pic.twitter.com/8HlYQx3Dsl— BCCI (@BCCI) April 28, 2025

క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఐపీఎల్లో 94 మ్యాచ్‌లు?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్).. ప్రపంచంలోనే అత్యంత ఆదరణ పొందిన క్రికెట్ లీగ్‌గా కొనసాగుతోంది. ఐపీఎల్‌ను మరింత ఆకర్షణగా మార్చేందుకు బీసీసీఐ కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. ప్రస్తుత 74 మ్యాచ్‌ల నుండి టోర్నమెంట్‌ను 94 మ్యాచ్‌ల సీజన్‌కు విస్తరించాలని బీసీసీఐ భావిస్తోంది. 2028 నుంచే మ్యాచ్‌ల సంఖ్య పెంచేందుకు బీసీసీఐ సన్నాహకాలు చేస్తోందని ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్ స్పష్టం చేశాడు."భవిష్యత్తులో ఐపీఎల్ మ్యాచ్‌ల సంఖ్యను పెంచే అవకాశముంది. ఇదే విషయాన్ని ఐసీసీతో చర్చిస్తున్నాము. బీసీసీఐలో కూడా అంతర్గతంగా చర్చలు జరుగుతున్నాయి. ఐసీసీ ఈవెంట్లు, ద్వైపాక్షిక సిరీస్‌లతో పాటు ఫ్రాంచైజీ క్రికెట్‌ను కూడా ఫ్యాన్స్ ఆదరిస్తున్నారు. మ్యాచ్‌ల సఖ్యను పెంచి అభిమానులకు మరింత వినోదాన్ని అందించడమే మా లక్ష్యం. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ తొమ్మిది వారాలు పాటు జరుగుతుంది. దాన్ని 11 వారాలకు పెంచాలని ఆలోచిస్తున్నాము. అంటే 74 మ్యాచ్‌ల నుంచి 84 లేదా 94కి పెంచవచ్చు. ప్రతి జట్టు సొంత గడ్డపై, ప్రత్యర్థి గడ్డపై రెండేసి మ్యాచ్‌లు ఆడేందుకు వీలు ఉంటుంది" అని ధుమాల్ పేర్కొన్నారు. అయితే ఈ క్యాష్ రిచ్ లీగ్‌లోకి ఇప్పటిలో కొత్త ఫ్రాంచైజీలను తీసుకొచ్చే ఆలోచన లేదని ఆయన తెలిపారు. కాగా 59 మ్యాచ్‌లతో ప్రారంభమైన ఐపీఎల్.. ప్రస్తుతం 74 మ్యాచ్‌ల సీజన్‌గా కొనసాగుతోంది.

సూర్యవంశీ సెంచరీ.. గుజరాత్‌ను చిత్తు చేసిన రాజస్తాన్
IPL Rajasthan Royals vs Gujarat Titans Live Updates:గుజరాత్‌ను చిత్తు చేసిన రాజస్తాన్జైపూర్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌లో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో రాజస్తాన్ రాయల్స్ ఘన విజయం సాధించింది. ఈ విజయంతో రాజస్తాన్ తమ ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. 210 పరుగుల భారీ లక్ష్యాన్ని రాజస్తాన్ కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 15.5 ఓవర్లలో చేధించింది. రాజస్తాన్ బ్యాటర్లలో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. కేవలం 35 బంతుల్లోనే తొలి ఐపీఎల్ సెంచరీని అందుకున్నాడు. ఐపీఎల్ ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన రెండో ఆటగాడిగా 14 ఏళ్ల వైభవ్ రికార్డులకెక్కాడు. ఓవరాల్‌గా 38 బంతుల్లో 7 ఫోర్లు, 11 సిక్స్‌లతో 101 పరుగులు చేసి ఔటయ్యాడు. అతడితో పాటు యశస్వి జైశ్వాల్(40 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లతో 70 నాటౌట్) సైతం కీలక ఇన్నింగ్స్ ఆడాడు. గుజరాత్ బౌలర్లు పూర్తిగా తేలిపోయారు. ప్రసిద్ద్, రషీద్ ఖాన్ మాత్రమే చెరో వికెట్ సాధించారు.రాజస్తాన్ రెండో వికెట్ డౌన్..సూర్యవంశీ రూపంలో రాజస్తాన్ రెండో వికెట్ కోల్పోయింది.101 పరుగులు చేసిన సూర్యవంశీ.. ప్రసిద్ద్ కృష్ణ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 12 ఓవర్లకు రాజస్తాన్ వికెట్ నష్టానికి 170 పరుగులు చేసింది.35 బంతుల్లో సూపర్ సెంచరీగుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ యువ ఓపెనర్ సూర్యవంశీ సెంచరీతో చెలరేగాడు. కేవలం 35 బంతుల్లోనే తన తొలి ఐపీఎల్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. అతడి ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు, 11 సిక్స్‌లు ఉన్నాయి. 11 ఓవర్లు ముగిసే సరికి రాజస్తాన్ వికెట్ నష్టానికి 155 పరుగులు చేసింది. క్రీజులో సూర్యవంశీ(101), జైశ్వాల్(49) ఉన్నారు.సూర్యవంశీ విధ్వంసంగుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో 14 ఏళ్ల సూర్యవంశీ విధ్వంసం సృష్టించాడు. కేవలం 17 బంతుల్లోనే 3 ఫోర్లు, 6 సిక్స్‌లతో తన తొలి ఐపీఎల్ హాఫ్ సెంచరీని అందుకున్నాడు. 6 ఓవర్లు ముగిసే సరికి రాజస్తాన్ వికెట్ నష్టపోకుండా 87 పరుగులు చేసింది.దూకుడుగా ఆడుతున్న రాజస్తాన్..రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్లు వైభవ్ సూర్యవన్షీ(35), యశస్వీ జైశ్వాల్ దూకుడుగా ఆడుతున్నారు. 4 ఓవర్లు ముగిసే సరికి రాజస్తాన్ వికెట్ నష్టపోకుండా 60 పరుగులు చేసింది.దూకుడుగా ఆడుతున్న రాజస్తాన్..3 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 32 పరుగులు చేసింది. క్రీజులో జైశ్వాల్(21), వైభవ్ సూర్యవంశీ(9) ఉన్నారు.చెలరేగిన గిల్.. రాజస్తాన్ ముందు భారీ టార్గెట్జైపూర్ వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. గుజరాత్ బ్యాటర్లలో శుబ్‌మన్ గిల్ మరోసారి తన బ్యాట్‌కు పని చెప్పాడు. 50 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 84 పరుగులు చేసి గిల్ ఔటయ్యాడు. అతడితో పాటు బట్లర్(50), సాయిసుదర్శన్(39) రాణించారు. రాజస్తాన్ బౌలర్లలో థీక్షణ రెండు, అర్చర్, సందీప్ శర్మ తలా వికెట్ సాధించారు.గుజరాత్ రెండో వికెట్ డౌన్..శుబ్‌మన్ గిల్ రూపంలో గుజరాత్ రెండో వికెట్ కోల్పోయింది. 84 పరుగులుచేసిన గిల్.. థీక్షణ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 17 ఓవర్లకు గుజరాత్ రెండు వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. క్రీజులో బట్లర్(37), సుందర్(1) ఉన్నారు.భారీ స్కోర్ దిశగా గుజరాత్..15 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ వికెట్ నష్టానికి 149 పరుగులు చేసింది. క్రీజులో జోస్ బట్లర్(30), గిల్(77) ఉన్నారు.శుబ్‌మన్ గిల్ ఫిప్టీ..జైపూర్ వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ హాఫ్ సెంచరీ సాధించాడు.51 పరుగులతో గిల్ తన బ్యాటింగ్‌ను కొనసాగిస్తున్నాడు. 10 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ వికెట్ నష్టపోకుండా 92 పరుగులు చేసింది. క్రీజులో గిల్‌తో పాటు సుదర్శన్(39) ఉన్నారు.3 ఓవర్లకు గుజరాత్ స్కోర్: 27/0మూడు ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ టైటాన్స్ వికెట్ నష్టపోకుండా 27 పరుగులు చేసింది. క్రీజులో శుబ్‌మన్ గిల్(16), సుదర్శన్(11) ఉన్నారు.ఐపీఎల్-2025లో జైపూర్ వేదికగా రాజస్తాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్తాన్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ రాజస్తాన్‌కు చాలా కీలకం. గుజరాత్‌పై గెలిస్తేనే ప్లే ఆఫ్స్ ఆశలను రాజస్తాన్ సజీవంగా ఉంచుకుంటుంది.ఈ మ్యాచ్ రాయల్స్ రెండు మార్పులతో బరిలోకి దిగింది. మతీషా థీక్షణ,యుద్ద్‌వీర్ సింగ్ తుది జట్టులోకి వచ్చారు. అదేవిధంగా గుజరాత్ తరపున కరీమ్ జనత్ ఐపీఎల్ అరంగేట్రం చేశాడు.తుది జట్లుగుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI): సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్(కెప్టెన్), జోస్ బట్లర్(వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, షారుక్ ఖాన్, రాహుల్ తెవాటియా, కరీం జనత్, రషీద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణరాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, నితీష్ రాణా, రియాన్ పరాగ్(కెప్టెన్), ధృవ్ జురెల్(వికెట్ కీపర్), షిమ్రాన్ హెట్మెయర్, వనిందు హసరంగా, జోఫ్రా ఆర్చర్, మహేశ్ తీక్షణ, సందీప్ శర్మ, యుధ్వీర్ సింగ్ చరక్”

చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. తొలి జట్టుగా రికార్డు
ఐపీఎల్-2025లో ముంబై ఇండియన్స్ తమ జైత్ర యాత్ర కొనసాగుతోంది. హార్దిక్ సేన వరుసగా ఐదో విజయాన్ని నమోదు చేసింది. ఈ మెగా టోర్నీలో భాగంగా ఆదివారం లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 54 పరుగుల తేడాతో ముంబై విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ముంబై ఆల్‌రౌండ్‌షోతో అదరగొట్టింది.టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 215 పరుగుల భారీ స్కోర్ చేసింది. ముంబై బ్యాటర్లలో రికెల్టన్(58), సూర్యకుమార్ యాదవ్(54) హాఫ్ సెంచరీలతో మెరవగా.. నమన్ ధీర్(25), జాక్స్(29), బాష్(20) రాణించారు. లక్నో బౌలర్లలో మయాంక్ యాదవ్, అవేష్ ఖాన్ తలా రెండు వికెట్లు సాధించారు.వీరితో పాటు ప్రిన్స్ యాదవ్, దిగ్వేష్, బిష్ణోయ్ చెరో వికెట్ పడగొట్టారు. 216 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 161 పరుగులకు ఆలౌటైంది. ముంబై బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా నాలుగు వికెట్లతో చెలరేగాడు. అతడితో పాటు ట్రెంట్ బౌల్ట్ మూడు, విల్ జాక్స్ రెండు, బాష్ ఓ వికెట్ సాధించారు. లక్నో బ్యాటర్లలో ఆయూష్ బదోని(35) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. మిచెల్ మార్ష్(34) పర్వాలేదన్పించాడు.ముంబై సరికొత్త చరిత్ర..ఈ విజయంతో ముంబై ఇండియన్స్ ఓ అరుదైన రికార్డును తమ ఖాతాలో వేసుకుంది. ఐపీఎల్లో 150 మ్యాచ్‌ల్లో గెలిచిన తొలి జట్టుగా ముంబై ఇండియన్స్ చరిత్ర సృష్టించింది.ఐపీఎల్ హిస్టరీలో ఇప్పటి వరకు 271 మ్యాచ్‌లు ఆడిన ముంబై 150 విజయాలు సాధించింది. ఈ జాబితాలో ముంబై తర్వాతి స్దానంలో సూపర్ కింగ్స్ (248 మ్యాచ్‌లు) ఉంది. మూడు నాలుగు స్ధానాల్లో కేకేఆర్(134), ఆర్సీబీ(129) కొనసాగుతున్నాయి.చదవండి: నాకంటూ ఓ ప్రణాళిక ఉంటుంది.. అది మర్చిపోతే ఎలా?!: కోహ్లి కౌంటర్
బిజినెస్

మార్కెట్లోకి సరికొత్త హైటెక్ ఫ్యాన్: ధర ఎంతంటే?
అసలే ఎండాకాలం.. భానుడి భగభగలు కారణంగా రోడ్డు మీదనే కాదు, ఇంట్లో ఉండటం కూడా కష్టతరమైపోయింది. డబ్బున్నవాళ్ళు ఏసీలు, కూలర్లు వంటివి కొనేస్తుంటారు. పేదవాళ్ళు ఫ్యాన్లకు మాత్రమే పరిమితమవుతారు. ఇప్పటికే మార్కెట్లో లెక్కకు మించిన ఫ్యాన్లు వివిధ ధరలలో అందుబాటులోకి వచ్చేసాయి. కాగా గోల్డ్‌మెడల్ ఎలక్ట్రికల్స్ కంపెనీ ఓ సరికొత్త ఫ్యాన్‌ను పరిచయం చేసింది. దీని గురించి వివరంగా ఇక్కడ తెలుసుకుందాం.భారతదేశంలోని ప్రముఖ ఫాస్ట్ మూవింగ్ ఎలక్ట్రికల్ గూడ్స్ (FMEG) కంపెనీలలో ఒకటైన గోల్డ్‌మెడల్ ఎలక్ట్రికల్స్ 'విస్టా 3600 పెడెస్టల్ ఫ్యాన్'ను పరిచయం చేసింది. 360 డిగ్రీలు కదిలే ఈ ఫ్యాన్ మంచి కూలింగ్ అనుభవాన్ని అందిస్తుంది. ఇది హై-గ్రేడ్ ప్లాస్టిక్ చేత నిర్మితమై ఉంది.విస్టా 3600 పెడెస్టల్ ఫ్యాన్.. మూడు స్పీడ్ సెట్టింగ్‌లతో పాటు, నార్మల్, బ్రీజ్, నైట్ వంటి మల్టిపుల్ ఆపరేటింగ్ మోడ్‌లను పొందుతుంది. ఇన్ఫ్రారెడ్ (IR) రిమోట్ సౌలభ్యంతో.. అడ్జస్టబుల్ సెట్టింగ్‌లు సులభంగా ఉంటాయి. అంతే కాకుండా స్మార్ట్ ఎల్ఈడీ డిస్ప్లే ఫ్యాన్ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.ఇదీ చదవండి: తెలుగు రాష్ట్రాల్లో జియో ఎయిర్ ఫైబర్ జోరుఎక్కువ రోజులు ఇది పనిచేసేలా ఉండటానికి కంపెనీ హై-గ్రేడ్ కాపర్ మోటార్‌ను ఇందులో ఫిక్స్ చేసింది. ఎనిమిది గంటల వ్యవధిలో ఈ ఫ్యాన్ స్విచ్ ఆఫ్ అయ్యేలా సెట్ చేసుకోవడానికి ఒక టైమర్ కూడా ఇందులో ఉంటుంది. విస్టా 3600 పెడెస్టల్ ఫ్యాన్ ధర అమెజాన్‌లో రూ. 11,427. కెంపెనీ దీనిపై రెండు సంవత్సరాల వారంటీని అందిస్తుంది.

తెలుగు రాష్ట్రాల్లో జియో ఎయిర్ ఫైబర్ జోరు
హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో జియో ఎయిర్ ఫైబర్ సేవల ద్వారా 5జీ ఫిక్స్డ్ వైర్లెస్ యాక్సెస్ (FWA) విభాగంలో జియో తన ఆధిపత్యాన్ని మరింత బల పరుచుకుంది. భారత టెలికాం నియంత్రణ సంస్థ (TRAI) ఫిబ్రవరి 2025కి విడుదల చేసిన తాజా డేటా ప్రకారం.. జియో తెలుగు రాష్ట్రాల్లో 5జీ ఎఫ్‌డబ్ల్యుఏ విభాగంలో అత్యధిక మార్కెట్ షేర్‌ను సంపాదించింది.ఈ గణాంకాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ టెలికాం సర్కిల్(తెలంగాణ, ఆంధ్రప్రదేశ్)లో జియో ఎయిర్‌ఫైబర్ యాక్టివ్ సబ్స్క్రైబర్లు 2025 జనవరిలో 4,27,439 ఉండగా ఫిబ్రవరిలో 4,58,372 మందికి పెరిగారు. భారతీ ఎయిర్టెల్ సబ్స్క్రైబర్లు ఫిబ్రవరిలో 95,164 మంది మాత్రమే ఉన్నారు. అంటే.. 84% మార్కెట్ వాటా, అద్భుతమైన పనితీరుతో ఈ విభాగంలో జియో తన పోటీదారుల కంటే 5 రెట్లు ఎక్కువగా సబ్‌స్క్రైబర్ బేస్‌ను సంపాదించుకుంది.తన 5జీ మౌలిక సదుపాయాలను వేగంగా అభివృద్ధి చేయడం, అందుబాటులో ఉన్న ప్లాన్లను అందించడం.. సులభమైన కస్టమర్ అనుభవాన్ని కల్పించడం ద్వారా జియో ఈ విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రత్యేకంగా గ్రామీణ, నగర ప్రాంతాలలో ఎన్నో సవాళ్లను అధిగమించి మారు మూల ప్రాంతాలకు సైతం హై స్పీడ్ కనెక్టివిటీని జియో అందిస్తోంది. ఆప్టికల్ ఫైబర్ (జియో ఫైబర్) విస్తరించలేని చోట్ల ప్రతి ఇల్లు మరియు చిన్న వ్యాపారానికి.. గృహ వినోదం, బ్రాడ్‌బ్యాండ్ సేవలను జియో ఎయిర్ ఫైబర్ అందుబాటులోకి తెచ్చింది.జియో ఎయిర్ ఫైబర్.. 800కి పైగా డిజిటల్ టీవీ ఛానళ్ళు, 11కి పైగా ఓటీటీ యాప్‌లు, నిరంతరాయంగా వైఫై, స్మార్ట్ హోమ్ సర్వీస్, హై-స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్‌తో ప్రపంచ స్థాయి హోమ్ ఎంటర్టైన్మెంట్ను అందిస్తోంది. వివిధ వయస్సుల.. నేపథ్యాల నుంచి వినియోగదారులు ఇప్పుడు నిరవధిక హై-స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ & ప్రపంచ స్థాయి హోమ్ ఎంటర్టైన్మెంట్ను పొందుతూ డిజిటల్ ఇండియా ప్రయోజనాలను నిజంగా అనుభవిస్తున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో వందలాది చిన్న, పెద్ద పట్టణాలు, వేలాది గ్రామాల్లో జియో ఎయిర్ ఫైబర్ డిజిటల్ ప్రాణశక్తిగా మారింది.

హైదరాబాద్‌లో బిర్లా ఓపస్ పెయింట్ స్టూడియో
హైదరాబాద్: ఆదిత్య బిర్లా గ్రూప్ కంపెనీ గ్రాసిమ్ ఇండస్ట్రీస్‌లో భాగమైన 'బిర్లా ఓపస్ పెయింట్స్'.. ఈరోజు హైదరాబాద్‌లో తన బిర్లా ఓపస్ పెయింట్ స్టూడియోను (కంపెనీ యాజమాన్యంలోని కంపెనీ ఆపరేటెడ్ ఎక్స్పీరియన్స్ స్టోర్) ప్రారంభించామని ప్రకటించింది. గురుగ్రామ్, లక్నో, ముంబయి, నవీ ముంబయి, బెంగళూరులో ఇప్పటికే విజయవంతంగా ప్రారంభించిన అనంతరం, పెయింట్, డెకర్ పరిశ్రమను ఆవిష్కరణ, ప్రీమియం ఆఫర్లు, నిజంగా లీనమయ్యే కస్టమర్ అనుభవం ద్వారా మార్చాలనే బ్రాండ్ నిబద్ధతను ఈ విస్తరణ మరింత బలోపేతం చేస్తుంది.బిర్లా ఓపస్ పెయింట్స్ హైదరాబాద్ స్టూడియో సాధారణ రిటైల్ ప్రయాణాన్ని స్ఫూర్తిదాయకమైన, లీనమయ్యే అనుభవంగా మార్చడానికి ఆలోచనాత్మకంగా రూపొందించారు. ఈ పెయింట్ స్టూడియో సంప్రదాయ పెయింట్ దుకాణాలకు అతీతంగా సృజనాత్మకతకు కేంద్రంగా తీర్చిదిద్దారు. ఇది ఒక ఎక్స్పీరియన్స్ కేంద్రం. ఇది వినియోగదారుల సృజనాత్మకతను మరింత కొత్తగా ఆవిష్కరించుకునేందుకు, నిజ జీవిత వాతావరణంలో రంగులను తాకడానికి, అనుభూతి చెందడానికి మరియు ఆస్వాదించేందుకు అనుమతిస్తుంది.వినియోగదారుల వ్యక్తిగతీకరించిన గైడ్ ద్వారా షేడ్ ఎంపిక, టెక్చర్లు, వినియోగించే నైపుణ్యాలపై నిపుణుల నుంచి ఉచిత మార్గదర్శకత్వాన్ని కూడా పొందవచ్చు. అధునాతన విజువలైజేషన్ సాధనాలు ఇంటి యజమానులు వారు ఎంచుకున్న రంగులు నిజ జీవిత సెట్టింగ్‌లలో ఎలా కనిపిస్తాయో ముందస్తుగా వీక్షించేందుకు సహాయపడతాయి. పెయింట్లకు మించి, పెయింట్ స్టూడియో వాల్కవరింగ్లు, డిజైనర్ ఫినిషింగ్‌లు మరియు సమగ్ర డెకర్ సొల్యూషన్ కోసం స్పెషాలిటీ కోటింగ్ ఎంపికలను కూడా కలిగి ఉంది.ఈ స్టోర్ 170 కంటే ఎక్కువ ఉత్పత్తులను ప్రదర్శించడమే కాకుండా, రంగుల ఎంపికపై నిపుణుల సంప్రదింపులు, వినూత్న అప్లికేషన్ టెక్నిక్‌లు, గొప్ప స్థానిక వారసత్వం నుంచి ప్రేరణ పొందిన క్యూరేటెడ్ డెకర్ సొల్యూషన్లతో సహా పలు ప్రత్యేక సేవలను అందిస్తుంది. ఇది స్థానిక అభిరుచులు, వారసత్వానికి అనుగుణమైన ఎంపికలతో శక్తివంతమైన నగర స్ఫూర్తిని ప్రతిబింబించే ప్రత్యేకమైన షేడ్స్‌ను క్యూరేటెడ్ డెకర్ ప్యాకేజీలను అందిస్తుంది.దేశ వ్యాప్తంగా.. తన రిటైల్ పాదముద్రను విస్తరించే లక్ష్యంతో బిర్లా ఓపస్ పెయింట్స్ వృద్ధి వ్యూహంలో ఈ ప్రారంభం కూడా ఒక ముఖ్యమైన అడుగు. అనుభవపూర్వక రిటైల్‌పై దృష్టి సారించి, రాబోయే నెలల్లో ఢిల్లీ, హైదరాబాద్, కోల్‌కతా, జైపూర్, అహ్మదాబాద్ మరియు సూరత్‌లలో అదనపు అనుభవ కేంద్రాలను ప్రారంభించాలని కంపెనీ యోచిస్తోంది.బిర్లా ఓపస్ పెయింట్స్ సీఈఓ రక్షిత్ హర్గవే మాట్లాడుతూ, “హైదరాబాద్‌లోని మా కొత్త పెయింట్ స్టూడియో కేవలం రిటైల్ స్థలం మాత్రమే కాదు, ఇది మీ పెయింటింగ్ అవసరాలకు ఒక అనుభవ కేంద్రం. అత్యాధునిక సాంకేతికత నుంచి స్థానికంగా ప్రేరణ పొందిన షేడ్ ప్యాలెట్ల వరకు, వినియోగదారులు, నిపుణులు అన్వేషించేందుకు, ప్రయోగాలు చేయడానికి, వ్యక్తీకరించడానికి మేము ఒక స్థలాన్ని సృష్టిస్తున్నాము. భారతదేశం పెయింట్లతో నిమగ్నమయ్యే విధానాన్ని మార్చడానికి, పెయింటింగ్ ప్రయాణాన్ని మరింత వ్యక్తిగతీకరించేందుకు, లీనమయ్యేలా.. స్ఫూర్తిదాయకంగా మార్చడానికి మా నిబద్ధతను ఈ స్టూడియో ప్రతిబింబిస్తుంది’’ అని వివరించారు.

సొంతంగా స్టార్టప్.. కుమార్తెపై బిల్‌గేట్స్ ప్రశంసల వర్షం
తల్లిదండ్రులు ఎంత సంపాదించినా.. వారి ఆస్తి నుంచి చిల్లిగవ్వ తీసుకోకుండా ఎదిగేవాళ్ళు చాలా తక్కువమందే ఉంటారు. ఇలాంటి కోవకు చెందిన వారిలో ఒకరు.. బిల్‌గేట్స్ కుమార్తె 'ఫోబ్ గేట్స్' (Phoebe Gates). ఈమె తండ్రిపై ఆధారపడకుండానే.. సొంతంగా స్టార్టప్ కోసం నిధులను సమకూర్చుకుంది. ఇది తనకు చాలా సంతోషంగా ఉందని టెక్ బిలియనీర్ న్యూయార్క్ టైమ్స్ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.తన కుమార్తె ఫోబ్ గేట్స్.. తన స్టార్టప్ కోసం నిధులను సేకరించే క్రమంలో, తన దగ్గరకు వస్తుందని నేను ఊహించాను. ఒకవేళ తను నన్ను సహాయం చేయమని అడిగి ఉంటే.. తప్పకుండా చేసేవాణ్ణి. అయితే కొన్ని షరతులు కూడా పెట్టేవాడినని బిల్‌గేట్స్ అన్నారు. అయితే నిధుల కోసం నన్ను సంప్రదించకుండా.. సొంతంగా సమకూర్చుకున్న కూతురిపై ఆయన ప్రశంసల వర్షం కురిపించారు.22 ఏళ్ల ఫోబ్ గేట్స్.. తన స్నేహితురాలు సోషియా కియానీతో కలిసి 'ఫియా' అనే స్టార్టప్ ప్రారంభించారు. ఇది ఒక సిజిటల్ ఫ్యాషన్ ప్లాట్‌ఫామ్. ఇందులో సుమారు 40,000 కంటే ఎక్కువ వెబ్సైట్లలో అందుబాటులో ఉన్న దుస్తుల ధరలను వెల్లడిస్తుంది. వినియోగదారులకు ఫ్యాషన్ ఉత్పత్తుల మీద బెస్ట్ డీల్స్ అందించడంతో పాటు.. ఆన్లైన్ షాపింగ్ అనుభవాన్ని మరింత మెరుగుపరచడమే దీని ప్రధాన లక్ష్యం.ఇదీ చదవండి: నాలుగు రోజులు సెలవు పెట్టాను: హెచ్ఆర్ కాల్ చేసి..2024లో స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన.. ఫోబ్ గేట్స్ తన స్టార్టప్ కోసం వెంచర్ క్యాపిటలిస్టులు & ఏంజెల్ ఇన్వెస్టర్ల నుంచి సుమారు 500000 డాలర్ల కంటే ఎక్కువ నిధులను సేకరించింది. సుమారు 102.2 బిలియన్ డాలర్ల సంపద కలిగిన తన తండ్రి బిల్‌గేట్స్ సహాయం పొందకుండా.. స్టార్టప్ ప్రారభించడం గొప్ప విషయం అని పలువు ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. బిల్ గేట్స్ తన మాజీ భార్య మెలిండా ఫ్రెంచ్ గేట్స్ తో ముగ్గురు పిల్లలను కన్నారు. వారు జెన్నిఫర్ (28), రోరీ (25), ఫోబ్.
ఫ్యామిలీ

షారుఖ్ ఖాన్ న్యూ జెన్ జెడ్ లుక్ అదిరిపోయిందిగా..
ఫ్యాషన్‌కి స్టైల్‌కి పెట్టింది పేరు బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan). డైలాగ్ చెప్పినా, స్టెప్ వేసినా, బట్ట కట్టినా తనకంటూ ఒక స్టైల్ ఉంటుంది. తాజాగా షారుఖ్ ఖాన్ కూల్ న్యూ జెన్ జెడ్(Gen-z) లుక్‌లో అదిరిపోయాడు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియో ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.సూపర్ స్టార్ ఇటీవల ముంబైలో అడుగుపెట్టినపుడు తన క్యాజువల్ వేర్లో వావ్ అనిపించాడు. ఎయిర్పోర్ట్ స్టైల్లో తెల్లటి టీ-షర్ట్, నీలిరంగు హూడీ జాకెట్, కార్గో ప్యాంటుకి జతగా కూల్ యాక్సెసరీస్ ధరించాడు. ఎప్పటిలాగానే మోచేతులపైకి స్లీవ్లను మడిచి, జెన్-జెడ్ స్టేపుల్స్ ధరించి అదరహో అనిపించాడు. ఫ్యాషన్‌కు వయస్సు లేదని ఒకసారి నిరూపించాడు. ప్రస్తుతం Gen-Z ఫాలో అవుతున్న బ్లూ కార్గో ప్యాంట్ ధరించి తగ్గేదే లే అన్నట్టు కనిపించాడు. యాక్సెసరీల విషయానికి వస్తే, బ్లాక్ సన్ గ్లాసెస్, క్రాస్బాడీ బ్యాగ్, వాచ్ , క్రిస్పీ వైట్ స్నీకర్లతో లుక్‌ను ఎలివేట్ చేశాడు. మెడలో సిల్వర్ చెయిన్‌తో మరింత కూల్‌గా ప్రతి అంగుళం సూపర్‌స్టార్‌గా కనిపించాడు. దీంతో ఫ్యాన్స్ కింగ్ ఖాన్ ఫ్యాషన్‌కి, స్టైల్‌కి ఫిదా అయిపోతున్నారు. ఇన్‌స్టాలో షేర్ అయిన షారూఖ్ వీడియో నెటిజనులను ఆకట్టుకుంటోంది. View this post on Instagram A post shared by Manav Manglani (@manav.manglani)కాగా సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ యాక్షన్-థ్రిల్లర్ ‘కింగ్’ షూటింగ్ ఈ ఏడాది జూన్‌లో షూటింగ్ ప్రారంభం కానుంది. కింగ్ తో పాటు, అమర్ కౌశిక్‌తో కలిసి నటించిన అడ్వెంచర్ చిత్రం టైగర్ vs పఠాన్ ,రాజ్ & డికె లాంటి ప్రాజెక్టులు షారూఖ్ చేతిలో ఉన్నాయి. ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీలతో బాలీవుడ్లో తిరుగులేని హీరోగాఎదిగాడు షారుఖ్ ఖాన్. ముఖ్యంగా అతని కరియర్లో బాజిగర్ ఒక మైలురాయి. ఈ సినిమాకు సండంధించి ఒక ఆసక్తికర విషయం ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. అసలు ఈ మూవీకి ఫస్ట్ చాయిస్ షారుఖ్కాదట. సల్మాన్ ఖాన్ , అక్షయ్ కుమార్ ఇద్దరూ ఆ పాత్రను తిరస్కరించిన తర్వాత మాత్రమే ఈ అవకాశం ఎస్ఆర్కేకి దక్కిందట. ఈ విషయాన్ని స్క్రీన్ రైటర్ రాబిన్ భట్ ఇటీవల వెల్లడించాడు.ఇదీ చదవండి: Pahalgam గడువు లోపు వెళ్లకపోతే...తప్పదు భారీ మూల్యం!

చింత చిగురా మజాకా.. కాస్త దట్టిస్తే చాలు ఆహా..!
వేసవి కాలం వచ్చిందంటే చిటారు కొమ్మన కొంచెం పచ్చగా, కొంచెం ఎర్రగా మెరుస్తూ ఊరిస్తూ ఉంటుంది. వగరుగా, వగరుగా, నోటికి పుల్లగా, వెజ్ అయినా నాన్‌వెజ్ అయినా దీన్ని కాస్త దట్టించామంటే అద్భుతమైన టేస్ట్.. ఆహా ఏమి రుచి అంటూ లొట్ట లేసుకుంటూ తినేయాల్సిందే. ఇంతకీ ఏమిటది. అదేనండీ...తలుచుకుంటేనే నోట్లో నీళ్లు ఊరిపోయే చింత చిగురు. అందుకే చింత చిగురు ఉంటే.. ఆరోగ్యంపై చింత అవసరం లేదు అంటారు పెద్దలు. మరి చింతచిగురుతో లభించే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.వేసవి కాలం వచ్చిందంటే.. దీనికి చాలా డిమాండ్ ఎక్కువ. చాలాసార్లు మటన్ ధరతో పోటీ పడుతూ అత్యంత ఖరీదైన కూరల్లో ఒకటిగా నిలుస్తుంది. చింత చిగురు, రుచి, లభించేపలు పోషకాహారాలు మెండుగా ఉండటంతో అధిక ధర పలుకుతున్నా దీనికి డిమాండ్ బాగుంది. సాధారణంగాచింత చిగురును పప్పుగా, కూరగా , పచ్చడి రూపంలో ఎక్కువగా ఆరగిస్తారు. కానీ చింత చిగురు, రొయ్యలు, చేపల కాంబినేషనే రుచే వేరు. చిగురుతో చేప, రొయ్య, కోడి కూర చింతచిరుగు దట్టిస్తే ఆహార ప్రియులకు పండగే.పోషకాల గని చింత చిగురులో ఆరోగ్యానికి అవసరమైన పోషకాలు ఉన్నాయి. 100 గ్రాముల చిగురులో 5.8 గ్రాముల ప్రొటీన్లు, 10.06 గ్రాముల పీచు పదార్థం, 100 మిల్లీగ్రాముల కాల్షియం, 140 మిల్లీగ్రాముల పాస్ఫరస్, 26 మిల్లీగ్రాముల మెగ్నీషియం, విటమిన్ ‘సి’ 3 మిల్లీ గ్రాములు ఉంటాయి. ఇండియన్ జర్నల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా చింత చిగురుతో అనేక ప్రయోజనాలు ఉన్నా యని ప్రకటించింది. చింత చిగురుతో ఆరోగ్య ప్రయోజనాలు వేసవికాలంలో చింత చిగురు తినడం చెమటకూడా ఎక్కువ పట్టదట. వేసవిలో వేధించే చెమట పొక్కులనుంచి ఉపశమనం లభిస్తుంది. చింత చిగురులోని ఫినాల్స్, యాంటీ ఆక్సిడెంట్లు చెడు కొలెస్టరాల్‌ను తగ్గించి, మంచి కొలెస్టరాల్‌ను పెంచుతాయి. శరీరంలో ఎర్రరక్త కణాల ఉత్పత్తికి అవసరమైన పోషకాలను అందించి, రక్తాన్ని శుద్ధి చేస్తుంది. యాంటీ ఇన్ఫల్మేటరీ గుణాలు ఉన్నాయి. చిగురును ఉడికించి నీటిని పుక్కిలిస్తే గొంతు నొప్పి, మంట, వాపు, నోటి పూత తగ్గుతాయి. చింత చిగురులో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుందిమలబద్ధకం సమస్య తొలగిపోతుంది. పైల్స్ నివారణకు ఉపయోగపడుతుంది. వైరల్ ఇన్ఫెక్షన్లతో వచ్చే జ్వరాన్ని తగ్గిస్తుంది. జీర్ణాశయ సంబంధ సమస్యలను తగ్గిస్తుంది. గుండె జబ్బులు రాకుండా చూస్తుంది. నులి పురుగుల సమస్యతో బాధపడుతున్న చిన్నారులకు చింత చిగురు ఔషధంగా పనిచేస్తుంది. విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండటంతో రోగ నిరోధక శక్తిగా పనిచేస్తుంది. ఎముకుల దృఢత్వం, థైరాయిడ్ నివారణకు దోహదపడుతుంది. షుగర్ వ్యాధిగ్రస్తుల్లో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. కీళ్ల వాపుల నివారణ, మలేరియా నుంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది. తల్లిపాలను మెరుగుపరుస్తుంది.

'గ్రాండ్‌మాకోర్' అంటే..? యువత ఇష్టపడుతున్న ట్రెండ్..
ఈకాలం యువత ఎంత ఫాస్ట్‌గా ఉంటుందో చెప్పనవసరం లేదు. ఇదివరకు 90ల యువత వంటపని, కుట్లు, అల్లికలు వంటి ఇతరత్ర కళలు నేర్చుకునేవారు. ఇప్పుడు ఇంటర్నెట్, స్మార్ట్ఫోన్ల యుగం. ఏది గంటలకొద్దీ నేర్చుకునేందుకు ఇష్టపడరు. క్షణాల్లో పట్టేసి చకచక నేర్చేసే జెన్ జెడ్ తరం ఇది. వారి మెదుడు కూడా మహాచురుకు. ఇట్టే నేర్చుకునే అపార ప్రతిభాపాటవాలు వారి సొంతం. పైగా డిజిటల్ హవా కాబట్టి ఆ దిశగానే స్కిల్స్ పెంచుకుంటోంది యువత. కానీ ప్రస్తుతం అందుకు విరుద్ధంగా సాంప్రదాయ హాబీలనే ఇష్టపడుతూ షాక్‌కి గురి చేస్తున్నారు. పరిగెడుతూ బిజీ లైఫ్‌లు, లక్షలు సంపాదనలు వద్దంటూ నిధానం, ప్రశాంతతే కావలంటూ..'గ్రాండ్‌మాకోర్'కి జై కొడుతున్నారు. అలసలేంటీ ట్రెండ్ అంటే..గత కొన్ని రోజులుగా సోషల్‌మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ జెన్ జెడ్ మిలీనియల్స్ అమ్మమ్మల నానమ్మల అభిరుచుల వైపుకి మొగ్గుచూపుతున్నారు. అలాంటి రెట్రో కార్యకలాపాలలోనే సౌకర్యం ఉందని నొక్కి చెబుతున్నారు. గ్రాండ్‌మాకోర్ అంటే..'గ్రానీ'ల జీవనశైలి. అంటే ఏంలేదు..ఇదివరకు మన అమ్మమ్మలు నానమ్మల కాలంలో వాళ్లు అనుసరించే అభిరుచులనే ఈతర యువత ఇష్టపడుతుండటం విశేషం. ఈ డిజిటల్ యుగంలో ఏ కోడింగ్, కంటెంట్ రైటింగ్, ఫ్యాషన్ డిజైనింగ్, మ్యూజిక్ అంటూ ఇతరత్ర కళలను ఇష్టపడే యువత మైండ్‌సెట్ మార్చుకుంది. ఏకంగా బామ్మల కాలం నాటి జీవనశైలికే ఓటేస్తూ..ఇదే అత్యంత హాయిగా ఉంటుంది, మసుసుకు మంచి ప్రశాంతతనిస్తుందని అని చెబుతున్నారు. అంతేకాదండోయ్.. ఈ ట్రెండ్‌కి సంబంధించి.. సోషల్‌మీడియా ఫ్లాట్‌ఫాంలలో గ్రాండ్‌మాకోర్ హ్యాష్‌ట్యాగ్‌లతో వాళ్ల బామ్మల అభిరుచులను డాక్యుమెంటు చేస్తున్నారు కూడా. నిధానంగా ఓపికతో నేర్చుకునే ఈ హాబీలే మనకు సరైన దృక్పథాన్ని ఇవ్వగలవని అంటున్నారు. వాళ్లు పనిచేయాలనుకోవడం లేదట..పనిలో పొందే ఆనందాన్ని వెతుకుతున్నారట..మంచి అభిరుచితో కూడిన పని ఇచ్చే ఆనందం వెలకట్టలేనిదని నమ్మకంగా చెబుతోంది నేటి యువత. ఒకరకంగా ఇది వారికి తమ అమ్మమ్మలు, నానమ్మలతో గడిపిన మధుర క్షణాలను జ్ఞప్తికి వచ్చేలా చేయడమే గాక స్వాంతన చేకూరుతుందని ఈ ట్రెండ్‌ని స్వీకరించిన అమెరికాకు చెందిన గృహిణి హన్నా ఆర్నాల్డ్ అంటున్నారు. దీనివల్ల వృద్ధాప్యంలో కూడా జీవితాన్ని ఆనందంగా ఆస్వాదించగలుగుతామని అంటున్నారామె.ఈ గ్రాండ్‌మాకోర్ భావోద్వేగాలకు సంబంధించింది, పైగా హానికరం కానీ సృజనాత్మకత మార్గాన్ని అందించే గొప్ప అభిరుచులట అవి. ఇంతకీ అవేంటో తెలుసా..ఏం లేదండీ..తోటను చూసుకోవడం, స్కార్ఫ్ అల్లడం, కుట్లు, ఆహారం వృధాకాకుండా కేర్ తీసుకుని చేసే చిరు వంటకాలు తదితరాలే..నిపుణులు ఏమంటున్నారంటే..ఈ ట్రెండ్ వల్ల ఆందోళన కలిగించే విషయాల నుంచి కాసేపు ఆలోచనలు మళ్లించడం సాధ్యపడుతుందట. భావోద్వేగాలు నియంత్రణలో ఉంటాయి. అలాగే మన చుట్టూ జరుగుతున్నదాన్ని ప్రశాంతంగా గమనించే అవకాశం ఏర్పడుతుందట. పైగా వీలైనంతగా మిమ్మల్ని మీరు పూర్తిగా తెలుసుకునే అవకాశం ఏర్పుడుతుందని చెబుతున్నారు వెస్ట్రన్ సిడ్నీ విశ్వవిద్యాలయానికి చెందిన మానసిక శాస్త్రవేత్త గాబ్రియెల్ వైడెమాన్. మరీ ఇంకెందుకు ఆలస్యం..మీరు కూడా మీ బామ్మల హాబీలను ట్రై చేసి చూడండి.(చదవండి: సాహసం చేద్దాం బ్రదర్..! అడ్వెంచర్కే ప్రాధాన్యత ఇస్తున్న భాగ్యనగరవాసులు)

తొందర తొందరగా లాగించేస్తున్నారా? అయితే లావైపోతారు!
వేగం..వేగం..అంతా స్పీడ్ యుగం. మల్టీ టాస్కింగ్.. పనులు ఎంత వేగంగా చేసుకుంటూ పోతే అంత మంచిది. నెమ్మదిగా నత్తనడకన చేస్తానంటే కుదరదు. అంతా ఫాస్ట్. పనులు చక్క బెట్టుకోవడం వరకు ఓకే కానీ.. ఆహారం విషయంలో వేగం అస్సలు పనికి రాదు. ఆహారాన్ని త్వరగా, ఆదరాబాదరగా మింగేయడం వల్ల వల్ల అనేక రకాల రోగాలొచ్చే ప్రమాదం ఉంటుంటున్నారు కొందరు ఆరోగ్య నిపుణులు. నిజమేనా. నమ్మశక్యంగా లేదు కదూ, అసలు ఎలాంటి అనర్ధాలు వస్తాయో చూసేద్దాంఅన్నం గానీ, ఇంకేదైనా ఆహారాన్నిగానీ నెమ్మదిగా ప్రశాంతంగా, బాగా నములుతూ తినడం అనేది ఉత్తమం. ఆహారం నమ్మిలే సమయంలో నోటిలో లాలాజలం ఉత్పత్తి అవుతుంది. ఇలా లాలాజలంతో కలిపి మింగడం వల్ల త్వరగా జీర్ణం అవుతుంది. లేదంటే త్వర, త్వరగా అన్నం తినడం వల్ల అతిగా తినడం బరువు పెరిగే అవకాశం ఉంది. అవును నిజమే. ఎందుకంటే గబా గబా తినడం వల్ల ఎంత తింటున్నాము అనేది అంచనా ఉండదు. కడుపు నిండిన సంకేతాలను మెదడు అంత తొందరగా నమోదు చేయకపోవచ్చు.త్వరగా తినడం వల్ల తీసుకునే కేలరీల సంఖ్యంగా బాగా పెరుగుతుంది. ముఖ్యంగా రైస్ వంటి అధిక కార్బోహైడ్రేట్ ఆహారాలతో కలిపి ఉన్నప్పుడు, కాలక్రమేణా బరువు పెరగడానికి దోహదం చేస్తుంది.ఆహారం నమలకుండా ఆబగా తినేయడంతోపాటు, కొంతమంది వెంటనే నీరు తాగుతూ ఉంటారు. ఇది కూడా మంచి పద్ధతి కాదు. ఇదీ జీర్ణ సమస్యలకు దారితీస్తుంది. కొవ్వు పేరుకు పోతుంది. అందువల్ల ఆహారాన్ని నోటిలోని మెత్తగా నమిలి ఆ తర్వాత మింగాలి.పూర్తిగా నమలకుండా తినడం వల్ల జీర్ణసమస్యలొస్తాయి. అజీర్తి కడుపు ఉబ్బరంతోపాటు, గట్ హార్మోన్ల పని నెమ్మదిస్తుంది. వేగంగా మింగడం వల్ల ఆహారంతోపాటు, గాలిని (సాధారణం కంటే ఎక్కువ మొత్తంలో) ఎక్కువగా మింగే అవకాశం ఉటుంది. దీంతో పొట్టలో గ్యాస్ పేరుకుపోతుంది. వుక్కిరిబిక్కిరి అయ్యే ప్రమాదం ఉంది.చాలా వేగంగా తినడం వల్ల తినే ఆహారం రుచిని పూర్తిగా ఆస్వాదించే అవకాశాన్ని కోల్పోతాం.అంతేకాదు ఆత్రంగా భోజనం తీసుకోవడం వల్ల మధుమేహం వ్యాధి వచ్చే అవకాశం కూడా ఉంది. తొందరగా ఆహారాన్ని తీసుకోవడం వల్ల చక్కెర నిల్వల స్థాయి పెరిగిపోతుంది. ఆహారంలోని గ్లూకోజ్ ఎక్కువ స్థాయిలో రక్తంలో కలిసిపోతుంది. దీంతో మధుమేహం వ్యాధి వచ్చే అవకాశం ఉంది. వేగంగా తినే వారు మెటబాలిక్ సిండ్రోమ్‌ను కలిగి ఉంటారు. దీని వల్ల గుండె జబ్బులు, గుండెపోటు వచ్చే అవకాశం కూడా ఉంది. ఈ అవకాశం 23 శాతం ఎక్కువగా ఉందని పరిశోధకులు చెబుతున్నమాట.భోజనం చేసే సమయాల్లో శుచిగా, శాంతంగా వ్యవహరించాలని, ప్రశాంత చిత్తంతో ఉండాలని కూడా పెద్దలు చెప్పేమాట. చివరగా .. కూటికోసంమే కోటి విద్యలన్నట్లు..కూర్చుని భోజనం చేయడానికి 20 నిమిషాలు కేటాయించడం కంటే ముఖ్యమైన పని ఏముంటుంది. ఒక పథకం ప్రకారం పనులు చేసుకుంటూ, ప్రశాంతంగా కూర్చుని భోజనం చేసేందుకు సమయాన్ని కేటాయించు కోవాలి. అనసరంగా సమయాన్ని వృధా చేసే పనులనుపక్కన బెట్టి శ్రద్ధగా, రుచిని ఆస్వాదిస్తూ ఆహారం తీసుకోవాలి.
ఫొటోలు
అంతర్జాతీయం

ముగిసిన ఇరాన్, అమెరికా మూడో దఫా చర్చలు
మస్కట్ (ఒమన్): యురేనియం శుద్ధి కార్యక్రమం వేగాన్ని తగ్గించడమే లక్ష్యంగా ఇరాన్‌తో అమెరికా చేపట్టిన మూడో దఫా పరోక్ష చర్చలు శనివారం ఒమన్‌లో ముగిశా యి. అయితే ఈ చర్చల్లో ఎలాంటి సానుకూల ఫలితాలు వచ్చాయి అనే వివరాలు ఇంకా వెల్లడికాలేదు. చర్చల తర్వాత అమెరికా తరఫున అధ్యక్షుడు ట్రంప్ పశ్చిమాసియా రాయబారి స్టీవ్ విట్కాఫ్, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీలు ఒమన్ నుంచి తమ స్వదేశాలకు పయనమయ్యారని విశ్వస నీయ వర్గాలు వెల్లడించాయి. ‘‘పరస్పర గౌరవం, హామీలకు కట్టుబడేలా ఒప్పందం కుదర్చుకునేందుకు రెండు దేశాలు ఆసక్తి కనబర్చాయి. కీలక ప్రతిపాదనలు, సాంకేతిక అభ్యంతరాలు, తదితరాలపై మరోదఫా చర్చలు జరుపుతాం. వచ్చే వారం సైతం సంప్రతింపుల ప్రక్రియ కొనసాగుతుంది. మళ్లీ అత్యున్నత స్థాయి సమావేశం జరుగుతుంది. మే మూడో తేదీన తదుపరి భేటీ ఉంటుంది’’అని ఒమన్ విదేశాంగ మంత్రి బదర్ అల్ బుసైదీ ప్రకటించారు. గతంలో మస్కట్, రోమ్‌లో ఇలా పరోక్ష చర్చలు జరిగాయి. గతంలో మాదిరే ఈసారి చర్చల్లో సైతం ఒమన్ విదేశాంగ మంత్రి బుసైదీ మధ్యవర్తిగా ఉన్న విషయం విదితమే. చర్చలకు ముందు విట్కాఫ్ రష్యాలో ఆ దేశ అధ్యక్షుడు పుతిన్‌తో భేటీ అయ్యారు. చర్చలు మొదలైన సమయంలోనే దక్షిణ ఇరాన్లో రజేయీ నౌకాశ్రయంలో శనివారం పేలుళ్లు సంభవించడం గమనార్హం. అర్ధశతాబ్ద శత్రుత్వాన్ని పక్కనబెట్టిమరీ ఇరాన్‌పై కఠిన ఆంక్షలను సడలిస్తామని, అందుకు ప్రతిగా అణ్వాయుధంలో ఉపయోగించే యురేనియం శుద్ధి వేగాన్ని తగ్గించాలని అమెరికా డిమాండ్ చేయడం తెల్సిందే. తమ డిమాండ్లను ఒప్పుకోకుంటే దాడులతో తెగబడతామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. అయితే అందుకు దీటుగా బదులిస్తామని ఇరాన్ ప్రతిస్పందించడం విదితమే.

ట్రంప్, జెలెన్స్కీ ఏకాంత చర్చలు
కీవ్: పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వాటికన్ సిటీకి వెళ్లిన అమెరికా అధ్యక్షుడు, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అక్కడే భేటీ అయ్యారు. అంత్యక్రియల కార్యక్రమానికి హాజరయ్యేందుకు ముందుగా వీరిద్దరూ సెయింట్ పీటర్స్ బసిలికాలో 15 నిమిషాలు మాట్లాడుకున్నారు. ప్రైవేట్‌గా సమావేశమైన ఇద్దరు నేతల మధ్య ఫలవంతమైన చర్చలు జరిగాయని వైట్‌హౌస్ కూడా తెలిపింది. ఇతర వివరాలను తర్వాత వెల్లడిస్తామని పేర్కొంది. మూడేళ్లుగా జరుగుతున్న యుద్ధానికి ముగింపు పలికేలా అత్యున్నత స్థాయి సమావేశం త్వరలోనే జరగనుందని అంతకుముందు రోమ్ చేరుకున్న ట్రంప్ తన సొంత ట్రూత్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ‘పుతిన్, జెలెన్స్కీ ఒప్పందానికి అతి సమీపంలో ఉన్నారు. యుద్ధం ముగింపునకు రావాలంటే వీరి సమావేశం జరగాలి. చాలా ముఖ్యమైన అంశాలపై ఏకాభిప్రాయం కుదిరింది. ఇప్పుడే ఈ రక్తపాతాన్ని ఆపాలి. క్రూరమైన, అర్థరహితమైన ఈ యుద్ధానికి ముగింపు పలుకుతాం’అని శుక్రవారం ఒక ఇంటర్వ్యూలో ఆయన వ్యాఖ్యానించారు. క్రిమియా రష్యాతోనే ఉంటుందని ట్రంప్ ప్రకటించారు. ట్రంప్ దూత స్టీవ్ విట్కాఫ్ శుక్రవారం మాస్కోలో పుతిన్‌తో సమావేశమవడం తెల్సిందే. వాటికన్లో ట్రంప్‌తో భేటీ అనంతరం జెలెన్స్కీ సైతం సోషల్ మీడియాలో స్పందించారు. ‘ఒక్కో అంశాన్ని సవివరంగా చర్చించాం. వీటిపై సానుకూల ఫలితాలను ఆశిస్తున్నాం. ప్రజల ప్రాణాలను కాపాడుకోవడం, సంపూర్ణ, బేషరతు కాల్పుల విరమణ, మళ్లీ యుద్ధం రాకుండా నివారించే విశ్వసనీయమైన, శాశ్వత శాంతి మాకు కావాలి’అని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో అత్యంత కీలకమైన సమావేశాలు జరగనున్నాయని రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో జరుగనున్న భేటీపై ఆయన సూచనప్రాయంగా తెలిపారు. ఇది చారిత్రాత్మకంగా మారే అవకాశం ఉందన్నారు. అయితే, భేషరతుగా కాల్పుల విరమణ ప్రకటించేలా రష్యాపై తక్షణమే ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. శనివారం మరోసారి చర్చలు కొనసాగించాలని ట్రంప్, జెలెన్స్కీ నిర్ణయించుకున్నారని ఉక్రెయిన్ అధ్యక్షభవనం ప్రతినిధి సెర్హి నికిఫొరోవ్ అంతకుముందు వెల్లడించారు. కానీ, పోప్ అంత్యక్రియలు ముగిసిన వెంటనే ట్రంప్ నేరుగా రోమ్ విమానాశ్రయం చేరుకుని, ఎయిర్ ఫోర్స్ విమానంలో అమెరికాకు బయలుదేరారు. దీంతో, రెండో సమావేశానికి అవకాశం లేకుండా పోయింది.

భారత్, పాక్‌లది వెయ్యేళ్ల పోరు!
న్యూయార్క్: భారత్, పాక్ తమ ఉద్రిక్తతలను అంతర్గతంగానే పరిష్కరించుకుంటాయమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆశాభావం వెలిబుచ్చారు. పోప్ అంత్యక్రియల నిమిత్తం వాటికన్ వెళ్తూ శుక్రవారం ఎయిర్‌ఫోర్స్‌వన్ విమానంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆ క్రమంలో హాస్యాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘‘భారత్, పాక్‌కు ఇది కొత్తేమీ కాదు. కశ్మీర్ కోసం ఇరుదేశాల మధ్య వెయ్యేళ్లకు పైగా పోరు నడుస్తోంది. బహుశా 1,500 ఏళ్లుగా అనుకుంటా’’అని చెప్పుకొచ్చారు. అంతేగాక పహల్గాం ఉగ్ర దాడిలో 30 మందికి పైగా పర్యాటకులు మరణించారంటూ సంఖ్యను కూడా తప్పుగానే చెప్పారు. ట్రంప్ వ్యాఖ్యలను నెటిజన్లు ఒక రేంజ్లో ట్రోల్ చేస్తున్నారు. కశీ్మర్ ఘర్షణల గురించి ట్రంప్‌కు తెలిసినంతగా బహుశా ఇంకెవరికీ తెలియదేమో అంటూ ఒకరు వ్యంగ్యంగా కామెంట్ చేశారు. ‘‘అవునా! నేనింకా పాకిస్తాన్ 1947లో పురుడు పోసుకుందనే అపోహలో ఉన్నా’’అని మరొకరు ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

ప్రజా పోప్‌కు అశ్రునయనాలతో తుది వీడ్కోలు
వాటికన్ సిటీ: నిరుపేదలు, అణగారిన వర్గాలకు ఆపన్నహస్తం అందించిన మానవతామూర్తి, విశ్వవ్యాప్తంగా కోట్లాది మంది క్యాథలిక్‌ల అత్యున్నత మతాధికారి పోప్ ఫ్రాన్సిస్‌కు ప్రపంచాధినేతలు, లక్షలాది మంది అభిమానులు నేరుగా వందల కోట్ల మంది క్రైస్తవులు టీవీల్లో ప్రత్యక్ష ప్రసారాల్లో చూస్తూ తుది వీడ్కోలు పలికారు. అభిమానులు, ఆప్తులు శోకతప్త హృదయాలతో వీడ్కోలు పలికాక తాను సదా స్మరించే మేరీమాత చిత్రపటం ఉన్న సెయింట్ మేరీ మేజర్ బాసిలికా చర్చి భూగర్బంలో 88 ఏళ్ల పోప్ శాశ్వత విశ్రాంతి తీసుకున్నారు. శనివారం వాటికన్ సిటీలో అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ ఈ అంతిమయాత్ర కొనసాగింది. పోప్ కోరిక మేరకు వాటికన్ శివారులోని రోమ్ పరిధిలోని సెయింట్ మేరీ మేజర్ బాసిలికా చర్చిలో ఆయన పార్థివదేహాన్ని ఖననం చేశారు. అత్యంత నిరాడంబరంగా ఈ కడసారి క్రతువు కొనసాగింది. ఆయన కోరిక మేరకు పోప్ సమాధి మీద లాటిన్ పదమైన ‘ఫ్రాన్సిస్క్యూస్’అనే పదాన్ని చెక్కారు. శ్వాససంబంధ వ్యాధి ముదిరి చివరకు బ్రెయిన్‌స్టోక్, గుండె వైఫల్యంతో ఈ నెల 21వ తేదీన పోప్ తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే.బరువైన హృదయాలతో బారులు తీరిన జనం అంతకుముందు సెయింట్ పీటర్స్ బాసిలికా చర్చిలో పోప్ ముఖంపై వాటికన్ మాస్టర్ ఆఫ్ సెరిమనీస్ ఆర్చ్‌బిషప్ డియాగో గియోవన్నీ రవెల్లీ దవళవర్ణ పట్టు వ్రస్తాన్ని కప్పారు. తర్వాత జింక్ పూత పూసిన శవపేటిక మూతను పెట్టి సీల్‌వేశారు. తర్వాత పోప్ పార్థివదేహాన్ని భద్రంగా ఉంచిన శవపేటికను చర్చి సహాయకులు సెయింట్ పీటర్స్ స్వే్కర్ భారీ బహిరంగ ప్రదేశానికి తీసుకొచ్చారు. అక్కడే ప్రపంచ దేశాల అధినేతలు, పలు రాజ్యాల రాజులు, పాలకులు, అంతర్జాతీయ సంస్థల అధినేతలు, ప్రతినిధులు దాదాపు 2,50,000 మంది పోప్ అభిమానులు ఆయనకు చివరిసారిగా ఘన నివాళులర్పించారు. అక్కడ ఉన్నవారిలో చాలా మంది కన్నీరుమున్నీరుగా విలపించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దంపతులు, భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, బ్రిటన్ ప్రధాని కెయిర్ స్టార్మర్, బ్రిటన్ యువరాజు విలియం, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయేల్ మేక్రాన్ దంపతులు, ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్, అమెరికా మాజీ అధ్యక్షుడు బైడెన్ దంపతులు, ఇరాన్ సాంస్కృతిక శాఖ మంత్రి సయ్యద్ అబ్బాస్ సలేహ్ షరియతా, ఇటలీ మహిళా ప్రధాని జార్జియా మెలోనీ, స్లోవేకియా అధ్యక్షుడు పీటర్, ఐర్లాండ్ అధ్యక్షుడు హిగ్గిన్స్సహా 160 మంది వీవీఐపీలు ఈ కార్యక్రమంలో పాల్గొని పోప్‌కు అంజలి ఘటించారు. భారత్ తరఫున ముర్ముతోపాటు కేంద్రమంత్రి కిరెణ్ రిజిజు, సహాయ మంత్రి జార్జ్ కురియన్, గోవా డెప్యూటీ స్పీకర్ జాషువా డిసౌజాలు హాజరయ్యారు. పోటెత్తిన లక్షలాది మంది పోప్ అభిమానులు, క్రైస్తవులతో సెయింట్ పీటర్స్ స్క్వేర్ కిక్కిరిసిపోయింది. తోపులాట ఘటనలు జరక్కుండా అధికారులు నగరవ్యాప్తంగా భారీ ఎల్ఈడీ తెరలు ఏర్పాటుచేసి మొత్తం అంత్యక్రియల కార్యక్రమాన్ని చివరిదాకా ప్రత్యక్ష ప్రసారాలుచేశారు. సెయింట్ పీటర్స్ స్క్వేర్ వద్ద అధినేతలు నివాళులర్పించాక శవపేటికను ప్రత్యేకవాహనంలోకి ఎక్కించాక అంతిమయాత్ర మొదలైంది. నగరంలో దారి పొడవునా వీధుల్లో లక్షలాది మంది జనం బారులు తీరి ప్రియతమ పోప్‌కు ‘‘పాపా ఫ్రాన్సిస్కో’’అని నినాదాలు చేస్తూ తుది వీడ్కోలు పలికారు. పోప్‌గా బాధ్యతలు చేపట్టాక ఈ 12 ఏళ్ల కాలంలో పోప్చేసిన మంచి పనులను గుర్తుచేసుకున్నారు. అంత్యక్రియలు మొత్తం 91 ఏళ్ల కార్డినల్ జియోవన్నీ బటిస్టా రే మార్గదర్శకత్వంలో నిర్వహించారు. వేలాది మంది ఇటలీ పోలీసుల పహారా మధ్య ఈ అంతిమయాత్ర ముందుకు సాగింది. గగనతల రక్షణ కోసం హెలికాప్టర్లను వినియోగించారు. స్వాగతం పలికిన ఖైదీలు, ట్రాన్స్జెండర్లు ఈ అంతిమయాత్రలో స్థానికులతోపాటు ప్రపంచదేశాల నుంచి తరలివచ్చిన లక్షలాది మంది జనం రహదారికి ఇరువైపులా నిలబడి కడసారి తమ పోప్‌ను చూసుకోగా శవపేటికను తీసు కొచ్చిన వాహనశ్రేణి ఎట్టకేలకు సెయింట్ మేరీ మేజర్ బాసిలికా చర్చి ప్రాంగణానికి చేరుకుంది. అక్కడే వేచి ఉన్న ఖైదీలు, లింగమారి్పడి వ్యక్తులు, నిరాశ్రయులు, శరణార్థులు, వలసదారులు స్విస్ గార్డ్స్ బలగాల నుంచి పోప్ అంతిమయాత్ర బాధ్యతలను తీసుకున్నారు. పోప్ మొదట్నుంచీ అణగారిన వర్గాలతోపాటు సమాజంలో వివక్షను ఎదుర్కొంటున్న ఖైదీ లు, ట్రాన్స్జెండర్లు, నిరాశ్రయులు, శరణార్థుల అభ్యున్నతి కోసం పాటుపడటం తెల్సిందే. చర్చి అంతర్భాగంలోని భూగర్భంలో శవపేటికను ఉంచే కార్యక్రమంలో ప్రధానంగా ఖైదీ లు, వలసదారులే పాల్గొన్నట్లు తెలుస్తోంది. ప్రత్యేక ప్రార్థనల అనంతరం కార్డినళ్లు, పోప్ అత్యంత సన్నిహితుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమ కవరేజీకి మీడియాను అనుమతించలేదు. వాటికన్ సిటీలో కాకుండా వేరే చోట పోప్‌ను ఖననం చేయడం గత వందేళ్ల చరిత్రలో ఇదే తొలిసారి.
జాతీయం

పహల్గాం ఉగ్రదాడిపై అనుచిత వ్యాఖ్యలు.. ప్రముఖ ఫోక్ సింగర్‌పై పదుల సంఖ్యలో కేసులు
లక్నో: పహల్గామ్ ఉగ్రదాడిపై రెచ్చగొట్టేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన ఫోక్ సింగర్‌పై కేసు నమోదైంది. ఆమెపై దేశద్రోహం కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.లక్నో పోలీసుల వివరాల ప్రకారం.. లక్నోకు చెందిన ఫోక్ సింగర్ నేహా సింగ్ రాథోడ్ ఎక్స్ వేదికగా ఓ ట్వీట్ చేశారు. అందులో జాతీయ సమగ్రతపై ప్రతీకూలం ప్రభావం చూపేలా అభ్యంతరకమైన పోస్టులు పెట్టారు. మతం ఆధారంగా సమాజంలో విధ్వేషాలు రెచ్చగొట్టేలా ట్వీట్ చేసిందంటూ అభయ్ ప్రతాప్ సింగ్ లక్నోలోని హజ్రత్‌గంజ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు నేహాసింగ్ రాథోడ్ చేసిన ట్వీట్లను పరిశీలించారు. ఆ ట్వీట్ల ఆధారంగా భారతీయ న్యాయ సంహిత (BNS) కింద ఆమెపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. వాటిలో మతాల మధ్య చిచ్చు పెట్టేలా ప్రోత్సహించడం, ప్రజా ప్రశాంతతకు భంగం కలిగించడం, దేశ సార్వభౌమాధికారం, ఐక్యత, సమగ్రతకు ప్రమాదం కలిగించారనే సెక్షన్లు ఉన్నాయి. వీటితో పాటు ఆమెపై సమాచార సాంకేతిక చట్టం కింద కూడా కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.In UP's Lucknow, FIR registered against folks singer Neha Singh Rathore (@nehafolksinger) for her alleged inflammatory tweet post the Pahalgam terror attack. Multiple sections of BNS and IT Act slapped in the FIR registered based on the complaint of Abhay Kumar Singh at… pic.twitter.com/CfHsHkQ1pS— Piyush Rai (@Benarasiyaa) April 28, 2025 కాగా, పహల్గామ్ విషాదంపై కేంద్రం సోషల్ మీడియాపై దృష్టిసారించింది. పహల్గాం దాడి గురించి అనుచిత వ్యాఖ్యలు చేసేలా పోస్టులు పెట్టేవారిపై చర్యలకు ఉపక్రమించింది. ఇప్పటికే దేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన నెటిజన్లపై కేసులు నమోదు చేసింది. తాజాగా, ఫోక్ సింగర్ నేహా సింగ్ రాథోడ్‌పై చర్యలకు సిద్దమైంది.

పహల్గాం ఉగ్రదాడి.. పాకిస్తాన్‌పై ఎంపీ అసదుద్దీన్ ఆగ్రహం
ఢిల్లీ: మీరు మా కంటే (భారత్) అరగంట వెనకబడలేదు.. అర్థ శతాబ్ధం వెనకబడ్డారంటూ ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ పాకిస్తాన్‌పై సెటైర్లు వేశారు. అదే సమయంలో భారత్‌లో పలు టీవీ ఛానెళ్ల యాంకర్లపై మండిపడ్డారు. కాశ్మీరీలకు వ్యతిరేకంగా మాట్లాడటాన్ని తప్పుబట్టారు. ఆదివారం మహారాష్ట్ర పర్భానిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారత్‌పై దాడి చేసేందుకు తాము అణు ఆయుధాల్ని సిద్ధం చేశామంటూ బాహాటంగా జారీ చేసిన పాక్ నాయకుల హెచ్చరికలపై ఆయన స్పందించారు. ‘తమ వద్ద అణు బాంబులు, అణు బాంబులు ఉన్నాయని పాకిస్తాన్ పదే పదే చెబుతోంది. గుర్తుంచుకోండి. మీరు వేరే దేశంలోకి వెళ్లి అమాయక ప్రజలను చంపితే.. ఏ దేశం ఎందుకు మౌనంగా ఉంటుంది. అందుకు గట్టిగానే బదులిస్తోంది.మీరు మాకంటే అరగంట కాదు.. అర్థశతాబ్ధం వెనకబడ్డారుఅభివృద్ధిలో మా దేశానికి, మీ దేశానికి పోలిక ఎక్కడా? అభివృద్ధిలో మీరు మాకంటే అరగంట కాదు.. అర్థశతాబ్ధం వెనకబడ్డారు. మీ దేశ బడ్జెట్ మా సైనిక బడ్జెట్‌కు కూడా సమానం కాదు’ అని గుర్తు చేశారు. పహల్గాంలో పర్యాటకుల ప్రాణాలు తీసే ముందు వారి మతాన్ని అడిగారు. మీరు ఏ మతం గురించి మాట్లాడుతున్నారు? మీరు ఖవారీజ్ (అరబ్ భాషలో తీవ్రవాదులు) కంటే దారుణంగా ఉన్నారు. ఈ చర్య మీరు ఐఎస్ఐఎస్ వారసులని చూపిస్తుంది’ అని ఎద్దేవా చేశారు.Parbhani, Maharashtra: AIMIM Chief Asaduddin Owaisi says, "Pakistan always talks about being a nuclear power; they need to remember if they enter a country and kill innocent people, that country will not sit quietly. No matter the government, by killing our people on our land,… pic.twitter.com/zB80FJcY8G— ANI (@ANI) April 27, 2025 ప్రధాని మోదీకి ఎంపీ అసదుద్దీన్ డిమాండ్అంతేకాదు భారత్‌ను లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ అనేక సంవత్సరాలుగా ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తోందని ఆరోపించారు. అంతర్జాతీయ చట్టం ప్రకారం.. పాకిస్తాన్ వైమానిక దళాన్ని దిగ్బంధించడానికి, హ్యాకర్లను ఉపయోగించి ఆ దేశంలో ఇంటర్నెట్ను హ్యాక్ చేసేందుకు భారత్‌కు అనుమతి ఉందని గుర్తు చేశారు. పాకిస్తాన్‌ను ఆర్థికంగా బలహీన పరిచేందుకు ప్రధాని మోదీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.షేమ్పలు టీవీ ఛానెళ్లలో పనిచేసే యాంకర్లు కశ్మీరీలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. షేమ్. కశ్మీర్ మన అంతర్భాగం. కాశ్మీరీలు కూడా మనదేశంలో అంతర్భాగమే. అలాంటి వారిని మనం ఎలా అనుమానించగలం? ఉగ్రవాదులతో పోరాడుతున్నప్పుడు తన ప్రాణాలను అర్పించింది ఓ కాశ్మీరీనే. గాయపడిన పిల్లవాడిని తన వీపుపై మోసుకుని 40 నిమిషాలు నడిచింది కూడా ఓ కాశ్మీరీనే అని ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఎత్తి చూపారు.

ఎంపీ మిథున్‌రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా
ఢిల్లీ: సుప్రీంకోర్టులో వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది. అరెస్టు చేయకుండా మధ్యంతర ఉత్తర్వులను కొనసాగిస్తున్నట్లు తెలిపింది. సోమవారం సుప్రీంకోర్టులో ఎంపీ మిథున్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిగింది. మిథున్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పార్థివాల, జస్టిస్ మహాదేవన్ ధర్మాసనం విచారించింది. విచారణలో భాగంగా సీఐడీ దర్యాప్తుకు హాజరయ్యామని మిథున్ రెడ్డి తరఫు న్యాయవాది అభిషేక్ సింగ్వి, నిరంజన్ రెడ్డిలు తెలిపారు. మిథున్‌రెడ్డి బెయిల్ పిటిషన్ కేసులో ఏపీ సిఐడి దాఖలు చేసిన కౌంటర్‌పై.. కౌంటర్‌ను పరిశీలించి రిజైన్డర్ దాఖలు చేసేందుకు మిథున్ రెడ్డి తరఫు న్యాయవాదులు సమయం కోరారు.ఇరు పక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పార్థివాల, జస్టిస్ మహాదేవన్ ధర్మాసనం.. తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది. అప్పటి వరకు మిథున్ రెడ్డిని అరెస్టు చేయొద్దని ఆదేశించింది.

పాకిస్తాన్‌కు మరో షాకిచ్చిన భారత్.. వాటిపై నిషేధం
ఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో పాకిస్తాన్‌కు భారత ప్రభుత్వం మరో షాకిచ్చింది. పాకిస్తాన్ యూట్యూబ్ ఛానళ్ల(Ban on Youtube Channels)పై భారత్ ఉక్కుపాదం మోపింది. పాక్‌కు చెందిన 16 యూట్యూబ్ ఛానళ్లపై భారత్‌లో నిషేధం విధించారు. ఇక, నిషేధం విధించిన వాటిలో మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ ఛానల్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా, ఇప్పటికే పాకిస్తాన్ ట్విట్టర్, సినిమాలపై భారత్ నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో బీబీసీ చానల్స్‌కు సైతం భారత ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది. ఉగ్రవాదులను మిలిటెంట్లుగా అభివర్ణించిన బీబీసీకి ప్రభుత్వం నోటీసులు అందజేసింది.భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సిఫార్సుల మేరకు పాకిస్థాన్ కేంద్రంగా నిర్వహిస్తున్న పలు యూట్యూబ్ ఛానళ్ల ప్రసారాలను భారత్‌లో నిషేధించింది. పాక్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మీడియాకు చెందిన 16 ఛానళ్లపై ఈ వేటు వేసింది. డాన్ న్యూస్, జియో న్యూస్, సామా టీవీ సహా పలు మీడియా ఛానళ్లు, కొంతమంది జర్నలిస్టుల ఖాతాలపై ఈ నిషేధం విధించింది.🚨 BIG BREAKING Modi govt BANS 16 #Pakistani #YouTube channels, including Dawn, Samaa TV, ARY, Geo News etc for spreading provocative content and false narratives against India, Army, and security forces after the Pahalgam terror attack.— Shoaib Akhtar’s channel also BLOCKED pic.twitter.com/DOzHwxgp4N— HIND KE SITARA ✨ (@ChanakyaRashtra) April 28, 2025ఇందులో భాగంగా.. ఈ ఛానళ్లను తెరవగానే.. కంటెంట్ అందుబాటులో లేదు. జాతీయ భద్రత దృష్ట్యా కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నాం అని కనిపిస్తోంది. భారత్‌కు వ్యతిరేకంగా రెచ్చగొట్టే వీడియోలు, మతపరమైన సున్నితమైన కంటెంట్, తప్పుదోవ పట్టించే కథనాలను ప్రసారం చేస్తున్నారన్న ఆరోపణలపై ఈ యూట్యూబ్ ఛానళ్లను నిషేధించినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
ఎన్ఆర్ఐ

టెక్సాస్‌లో రోడ్డు ప్రమాదం, ప్రాణాపాయ స్థితిలో తెలుగు విద్యార్థిని దీప్తి
ఉన్నత చదువులకోసం అమెరికాకు వెళ్లిన తెలుగు విద్యార్థిని ప్రాణలతో పోరాడుతోంది. అమెరికాలోని టెక్సాస్‌లోని డెంటన్ నగరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తెలుగు అమ్మాయిలు గాయపడ్డారు. వీరిలో తీవ్రంగా గాయపడిన విద్యార్థినిని దీప్తి వంగవోలుగా గుర్తించారు. మరో విద్యార్థినికి కూడా తీవ్రంగా గాయపడిందని అయితే ఆమెకు ప్రాణాపాయం లేదని అమెరికా మీడియా నివేదికలు తెలిపాయి.ఈ ప్రమాదం శనివారం (ఏప్రిల్ 12) తెల్లవారుజామున, ఎన్. బోనీ బ్రే స్ట్రీ మరియు డబ్ల్యు. యూనివర్శిటీ డ్రైవ్ సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరుకు చెందిన దీప్తి వంగవోలు ,ఆమె స్నేహితురాలు కాలినడకన ఇంటికి చేరుకోబోతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. వెంటనే ఆ వాహనం డ్రైవర్ని అక్కడినుంచి పారిపోయాడు. దీప్తికి తలకు లోతైన గాయం అయిందని, ఆమెకు శస్త్రచికిత్స జరుగుతోందని స్థానిక మీడియా తెలిపింది. ప్రస్తుతం డెంటన్ పోలీసులు ఈ హిట్ అండ్ రన్ ఘటనపై దర్యాప్తు ముమ్మరం చేశారు. పరారీలో ఉన్న డ్రైవర్‌ను, ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించేందుకు ప్రజల సహాయం కోరుతూ ప్రకటన కూడా విడుదల చేశారు. ఈ ఘటనపై మరిన్నివివరాలు అందాల్సి ఉంది. లింక్డ్ఇన్ ప్రొఫైల్ ప్రకారం, దీప్తి వంగవోలు నార్త్ టెక్సాస్ విశ్వవిద్యాలయంలో కంప్యూటర్ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్‌లో మాస్టర్స్ చదువుతోంది. 2023లో నరసరావు పేట ఇంజనీరింగ్ కళాశాల నుండి బీటెక్ పూర్తి చేసింది.

సింగపూర్ ఎన్నికల్లో సత్తా చాటనున్న భారతీయులు: హింటిచ్చిన పీఎం
సింగపూర్‌లో ( Singapore ) సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రధానమంత్రి లారెన్స్ వాంగ్ (Lawrence Wong) తన పార్టీ పీపుల్స్ యాక్షన్ పార్టీ (PAP) కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సారి ఎన్నికల్లో భారతీయ సంతతికి చెందిన అభ్యర్థులను పోటీలో నిలపబోతున్నామని ప్రకటించారు. త్వరలో ఎన్నికలకు నగారా మోగనున్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.ఆదివారం భారతీయ యువతతో సింగపూర్ ప్రధానమంత్రి ముచ్చటించారు. భారతీయ సమాజం చిన్నదే అయినా ప్రభావం చాలా గొప్పదని, పీఎం అన్నారు. మీరు ఇప్పటికే ఆ సింగపూర్ స్పూర్తిని ప్రతిబింబిస్తున్నారనీ, అది ప్రభావంతమైందన్న వాంగ్ వ్యాఖ్యలను ది స్ట్రెయిట్స్ టైమ్స్ నివేదించింది. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో భారత సంతతికి చెందిన కొత్త అభ్యర్థులను ఎంపిక చేస్తుందని హామీ ఇచ్చారు. 2020 ఎన్నికల్లో భారతీయులకు చోటు దక్కలేదని గుర్తు చేసిన ఆయన ఈ సారి 30కంటే ఎక్కువమంది భారతీయులు కూడా ఉంటారన్నారు. ది ఇటీవలి చరిత్రలో అతిపెద్దదని పీఎం వాంగ్ వ్యాఖ్యానించారు. వాణిజ్యం, వ్యాపారం, పరిశ్రమలు, ప్రజా సేవ సహా అనేక రంగాలలో భారతీయ కమ్యూనిటీ దేశానికి చేస్తున్న కృషిని ఆయన ప్రశంసించారు. అయితే, PM వాంగ్ గత శనివారం వెల్లడించిన ఎనిమిది కొత్త ముఖాల్లో భారత సంతతికి చెందిన వైద్యుడు హమీద్ రజాక్ కూడా ఉన్నారని ది స్ట్రెయిట్ టైమ్స్ నివేదిక పేర్కొంది. అయితే, రాబోయే సార్వత్రిక ఎన్నికలలో వారు ఏ నియోజకవర్గం నుండి పోటీ చేస్తారో వెల్లడించలేదు.చదవండి: Amarnath Yatra 2025 రిజిస్ట్రేషన్లు షురూ! త్వరపడండి!సింగపూర్ నివేదికల ప్రకారం. 2004లో సింగపూర్ పౌరులలో భారతీయులు 7.6 శాతం మంది ఉండగా , మలయ్, చైనీయులు వరుసగా 15.1 శాతం, 75.6 శాతం మంది ఉన్నారు. 2024 డేటా ప్రకారం, ఆగ్నేయాసియా దేశ జనాభాలో వరుసగా 15శాతం, 75శాతం మంది మలేషియన్లు , చైనీయులు ఉన్నారు.90 నిమిషాల పాటు వాంగా ఇప్పో పెసలామ్ చాట్ (రండి, తమిళంలో చాట్ చేద్దాం) అనే వీఐపీ చాట్‌ను తమిళ్ మరసు వార్తాపత్రికి నిర్వహించింది.భారత సంతతికి చెందిన డిజిటల్ అభివృద్ధి, సమాచార శాఖ సీనియర్ సహాయ మంత్రి జనిల్ పుతుచ్చేరి సహా దాదాపు 130 మంది యువకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.2020 సార్వత్రిక ఎన్నికల్లో పీఏపీ 93 స్థానాల్లో 83 స్థానాలను గెలుచుకుని, ఎన్నికలను కైవసం చేసుకుంది. వీరిలో 27 మంది కొత్త అభ్యర్ధులకు అవకాశం కల్పించగా. వీరిలో భారతీయులెవ్వరూ లేరు. ఇది పార్లమెంటులో సమాజ ప్రాతినిధ్యంపై విమర్శలకు తావిచ్చింది. అమెరికా, కెనడా రాజకీయాల్లో భారతీయ సంతతి అభ్యర్తులు సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే. మరి తాజా పరిణామాలతో ఎంతమంది భారత సంతతి వారు గెలుపు గుర్రాలుగా నిలవనున్నారో చూడాలి.

New York Plane Crash : భారతీయ సంతతి వైద్యురాలి కుటుంబం దుర్మరణం
న్యూయార్క్ (New York)లో శనివారం కుప్పకూలిన విమాన ప్రమాద ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. వారాంతపు సెలవుల్లో, పుట్టిన రోజు వేడుకలను ఆనందంగా జరుపుకునేందుకు వెళుతున్న న్యూయార్క్‌లోని ఒక ప్రైవేట్ విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.కొలంబియా కౌంటీ అండర్షెరీఫ్ జాక్వెలిన్ సాల్వటోర్ ఈ విషయాన్ని ధృవీకరించారు.కొలంబియాలోని కౌంటీ విమానాశ్రయానికి వెళ్తున్న ట్విన్ ఇంజిన్ (MU-2B)విమానం ఒక పొలంలో కుప్పకూలింది. కొలంబియా కౌంటీ అండర్షెరీఫ్ జాక్వెలిన్ సాల్వటోర్ ఈ విషయాన్ని వెల్లడించారు. మిత్సిబిషి ఎమ్‌యూ-2బీ విమానం కొలంబియాలోని కౌంటీ విమానాశ్రయానికి బయలుదేరింది. వాతారవణ అననుకూల పరిస్థితుల కారణంగా కోపాకేకు 30 మైళ్ల దూరంలో ఉండగానే ఒక పొలంలో కుప్పకూలింది. ప్రమాదానికి కొద్దిసేపటి ముందు, పైలట్ కొలంబియా కౌంటీ విమానాశ్రయంలోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌ను రేడియో ద్వారా తాను ప్రమాదంలో ఉన్నట్టు, కొత్త విధానాన్ని అభ్యర్థించారని కూడా జాతీయ రవాణా భద్రతా బోర్డు అధికారులు ఆదివారం జరిగిన బ్రీఫింగ్లో తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు పరిశీలిస్తున్నారు. బాధితులు వివరాలుభారతదేశానికి చెందిన యూరోజినెకాలజిస్ట్ డాక్టర్ జాయ్ సైని, ఆమె భర్త, కొడుకు, కోడలు, కుమార్తె అల్లుడు ఉన్నారు. సైనీ భర్త న్యూరో సైంటిస్ట్, డాక్టర్ మైఖేల్ గ్రాఫ్, కుమార్తె, 2022లో NCAA ఉమెన్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికైన మాజీ MIT సాకర్ క్రీడాకారిణి కరెన్నా గ్రాఫ్ ఆమె భర్త, ఇంకా సైనీ కుమారుడు జారెడ్ గ్రాఫ్, పారాలీగల్గా పనిచేసిన ,జారెడ్ గ్రాఫ్ భాగస్వామి అలెక్సియా కౌయుటాస్ డువార్టే ఉన్నారు.డా. జాయ్ సైని ఎవరంటే..!మిడ్ హడ్సన్ న్యూస్ ప్రకారం డాక్టర్ జాయ్ సైని భారతదేశంలోని పంజాబ్‌లో జన్మించారు. ఆమె తల్లిదండ్రులు కుల్జిత్ , గుర్దేవ్ సింగ్‌లతో అమెరికాకు వలస వెళ్లారు. డా. సైనీ నిష్ణాతులైన పెల్విక్ సర్జన్‌గా పేరొందారు. అలాగే బోస్టన్ పెల్విక్ హెల్త్ అండ్ వెల్నెస్ వ్యవస్థాపకురాలు కూడా.పిట్స్బర్గ్ విశ్వవిద్యాలయంలో మెడిసిన్ చదువుతుండగా, మైఖేల్ గ్రాఫ్‌ను ఆమె ప్రేమించి పెళ్లి చేసుకుంది. మైఖేల్ ప్రముఖ న్యూరో సర్జన్, అనుభవజ్ఞుడైన పైలట్ కూడా. ఈ దుర్వార్తతో సైనీ మరో కుమార్తె అనికా గ్రాఫ్, మైఖేల్ తల్లిదండ్రులు స్టీఫెన్, గెబెనా గ్రాఫ్; జాయ్ తల్లి కుల్జిత్;,తోబుట్టువులు రిన్నే గ్రాఫ్, య్రామ్ గ్రాఫ్, , ప్రశాంత్ సైని తీరని విషాదంలో మునిగిపోయారు.

పిట్స్‌బర్గ్‌లో నాట్స్ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు
అమెరికాలో తెలుగు వారిని కలిపే అనేక కార్యక్రమాలను చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా పిట్స్బర్గ్ లో ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించింది. తెలుగు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని నాట్స్ పిట్స్బర్గ్ చాప్టర్ నిర్వహించిన ఉగాది వేడుకలకు స్థానిక తెలుగు వారి నుంచి మంచి స్పందన లభించింది. కూచిపూడి, భరతనాట్యం వంటి శాస్త్రీయ నృత్య ప్రదర్శనలతో పాటు, జానపద నృత్యాలు, శాస్త్రీయ సంగీత గీతాలు, నాటక ప్రదర్శనలు, తదితర వినోద కార్యక్రమాలు అందరినీ అలరించాయి. సంస్కృతి డాన్స్ స్కూల్ శాస్త్రీయ నృత్య ప్రదర్శనలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఉగాది వేడుకల్లో భాగంగానే తెలుగు శ్లోక, తెలుగు వచనం, గణితం, చిత్రలేఖనం, లెగో డిజైన్, చెస్ పోటీలు పిల్లల కోసం నిర్వహించగా, ప్రత్యేకంగా విజేతలకు బహుమతులు అందించారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానం సాధించిన పిల్లలకు ప్రత్యేకంగా గుర్తింపు, పురస్కారాలను అందజేశారు. ఈ పోటీలు పిల్లలలో సృజనాత్మకతను, విజ్ఞానాన్ని, పోటీ భావనను పెంపొందించేందుకు ఒక గొప్ప వేదికగా నిలిచాయి ఈ వేడుకను విజయవంతంగా నిర్వహించడంలో నాట్స్ పిట్స్బర్గ్ చాప్టర్ కోఆర్డినేటర్ రవి కొండపి, నాట్స్ వెబ్ సెక్రటరీ రవికిరణ్ తుమ్మల కీలక పాత్ర పోషించారు. వారి నాయకత్వం, అంకితభావం వల్లే ఈ వేడుకలు దిగ్విజయంగా జరిగాయని స్థానిక తెలుగు వారి నుంచి ప్రశంసలు లభించాయి. ఈ వేడుకలకు వ్యాఖ్యాతలుగా శిల్పా శెట్టి, అర్చనా కొండపి, మోనికాలు వ్యవహారించారు. ఈ వేడుకల్లో సాంస్కృతిక కార్యక్రమాల్లో కీలక పాత్ర పోషించిన సంస్కృతి డ్యాన్స్ స్కూల్‌కి నాట్స్ ధన్యవాదాలు తెలిపింది. ఇక విందు భోజనాన్ని పిట్స్బర్గ్ తత్వా ఇండియన్ క్యూసిన్ అందింయింది., సంప్రదాయ తెలుగు విందు భోజనంతో అందరి చేత ఆహా అనిపించారు.ఉగాది వేడుకలకు సహకరించిన వారికి, వేడుకల కోసం పని చేసిన ప్రతి ఒక్కరికి నాట్స్ పిట్స్ బర్గ్ టీం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. తెలుగు వారి కోసం ఉగాది వేడుకలను దిగ్విజయంగా నిర్వహించిన పిట్స్బర్గ్ టీంకి నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి ప్రత్యేక అభినందనలు తెలిపారు.
క్రైమ్

రూ.1,000 కోట్లు హాంఫట్
మాటలతో మైమరపిస్తున్నారు.. ఆకాశాన్ని తెచ్చి అరచేతిలో పెడతామని ఆశలు కల్పిస్తున్నారు.. కో అంటే కోట్లు అలా వచ్చి పడతాయని నమ్మబలుకుతున్నారు. వందకి వెయ్యి, లక్షకి పది లక్షలు అంటూ ఆశల గాలం వేస్తున్నారు. ఇలా నరసరావుపేట కేంద్రంగా ఆర్థిక నేరగాళ్లు ప్రజలను నిండా ముంచేస్తున్నారు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఇప్పటి వరకు ఏకంగా సుమారు రూ.1,000 కోట్ల వరకు ప్రజలకు కుచ్చు టోపీ పెట్టారు. అత్యాశను ఆయుధంగా చేసుకుని సొమ్మంతా లాగేసుకున్నారు. రూ.వెయ్యి కోట్లకుపైగా స్కాములు జరిగినా ప్రభుత్వంలో చలనం లేదు. దీంతో మోసగాళ్లు మరింత రెచ్చిపోతున్నారు. సాక్షి, నరసరావుపేట/ నరసరావుపేట టౌన్: రాష్ట్రంలో ఆర్థిక నేరాలకు పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేట అడ్డాగా మారుతోంది. సాయి సాధన చిట్‌ఫండ్ స్కామ్, యానిమేషన్ పేరిట వందల కోట్ల రూపాయల వసూలు చేసిన ఘరానా మోసం ఇప్పటికే వెలుగుచూశాయి. ఈ రెండు స్కాంలలో మోసపోయిన బాధితులు నరసరావుపేటలోనే అధికంగా ఉన్నారు. కొత్తగా మరో రెండు గొలుసుకట్టు సంస్థలు ప్రజలను నిండా ముంచేస్తుండటం కలవరపాటుకు గురిచేస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆర్థిక నేరగాళ్లు అనేక మార్గాల్లో మోసాలకు తెగబడుతున్నారు. నరసరావుపేట కేంద్రంగా జరిగిన సాయిసాధన చిట్‌ఫండ్ స్కాం నాలుగు నెలల క్రితం వెలుగు చూసింది. అదే విధంగా యూపిక్స్ యానిమేషన్ స్కాం ఏడు నెలల నుంచి పెట్టుబడిదారులకు డబ్బులు ఇవ్వకుండా బోర్డు తిప్పేసింది. డబ్బులు ఇస్తానని నిర్వాహకుడు కొన్ని నెలలుగా మభ్యపెడుతూ వచ్చి, చివరకు పరారయ్యాడు. న్యాయం చేయాలంటూ ఐదు రోజులుగా బాధితులు అధికారులను వేడుకొంటున్నారు. ఈ రెండు వ్యవహారాల్లో సుమారు రూ.800 కోట్లు పెట్టుబడులు పెట్టి నరసరావుపేట వాసులు నిండా మునిగారు. తాజాగా మరో రెండు గొలుసుకట్టు ఆర్థిక మోసాలు వెలుగులోకి రావడం కలవరపాటుకు గురిచేస్తోంది. వీటిలో నరసరావుపేటవాసులు మరో రూ.200 కోట్ల దాకా పెట్టుబడులుపెట్టినట్టు తెలుస్తోంది. క్రిప్టో పేరుతో కొట్టేశారు! మరోవైపు క్రిప్టో కరెన్సీ రూపంలో పెట్టుబడులు పెడితే భారీ లాభాలంటూ మరో సంస్థ నరసరావుపేటలో భారీగా పెట్టుబడులు ఆకర్షించింది. వందలాది మంది నుంచి కోట్లాది రూపాయలు కొల్లగొట్టింది. తీరా పెట్టుబడులు పెట్టాక.. ఈ సంస్థలో పెట్టిన కరెన్సీ విలువ అమాంతం పతనమైందని, ఇప్పడు విత్‌డ్రా చేసుకోవడం మంచిది కాదంటూ చెబుతున్నారు. దీంతో పెట్టుబడిదారులు ఆందోళనలో ఉన్నారు. ఈ క్రమంలో మార్కెట్లోకి మరో ఆన్లైన్ కరెన్సీ తెరపైకి వచ్చి కొత్తగా నగదు వసూలు చేస్తున్నారు. మే 21న అంతర్జాతీయ ఎక్సే్ఛంజ్‌లో లిస్ట్ అవుతోందంటూ చెప్పుకొస్తున్నారు. ఏమాత్రం గ్యారెంటీ లేని క్రిప్టో కరెన్సీలో రూ.కోట్లు పెట్టుబడి పెట్టి వాటిని వెనక్కి తెచ్చుకోలేక పెట్టుబడిదారులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. 25 రోజులుగా విత్‌డ్రా నిలిపివేత.. గొలుసుకట్టు ఆర్థిక సంస్థకు సంబంధించి 25 రోజులుగా నగదు ఉపసంహరణ నిలిపివేశారు. ఇందులో పెట్టుబడి పెట్టిన వారికి ప్రతి రోజూ 1.8 శాతం వడ్డీ రూపంలో ఇస్తారని నమ్మబలికారు. మూడు నెలల్లో పెట్టుబడి డబుల్ అవుతుందని ఆశ చూపించారు. అడిగిన వెంటనే అసలు తిరిగి ఇచ్చేస్తామని చెప్పుకొచ్చారు. ఈ పెట్టుబడులన్నీ అమెరికన్ డాలర్ల రూపంలో పెట్టాల్సి ఉండటంతో ఏజెంట్లే నగదును ఎక్స్చేంజ్ చేసి మరీ పెట్టుబడులు పెట్టించారు.దీనికోసం నరసరావుపేటలోని పలు ప్రముఖ రోడ్లలో ప్రత్యేకంగా కార్యాలయాలు ఏర్పాటు చేసి ఏజెంట్ల ద్వారా భారీగా నగదుని పెట్టుబడులుగా పెట్టించారు. నగదు నిలిపివేయడంతో పెట్టుబడిదారులు కార్యాలయాల నిర్వహకులు, ఏజెంట్లపై ఒత్తిడి తెస్తున్నారు. అయితే కంపెనీ షట్‌డౌన్ చేసిందని, మరో ప్లాట్‌ఫాంలో త్వరలో కార్యకలాపాలు కొనసాగుతాయని, మీ డబ్బుకు ఢోకాలేదంటూ చెప్పుకొస్తున్నారు.

అఖిలను బలితీసుకున్నది.. బ్లాక్‌మెయిలే..!
రాజంపేట: అన్నమయ్య జిల్లా రాజంపేటలో ఫిబ్రవరిలో జరిగిన ఇంజినీరింగ్ విద్యార్థిని అఖిల (23) ఆత్మహత్య కేసులో మిస్టరీ వీడింది. ప్రేమజంటలు, మద్యం తాగేవారిని బ్లాక్మెయిల్ చేసి డబ్బు వసూలుచేసే పల్లపోతుల అనిల్‌కుమార్‌రెడ్డి అరాచకాలకు అఖిల బలైందని తాజాగా వెల్లడైంది. ఇప్పటికే పలు కేసుల్లో నిందితుడైన అనిల్‌కుమార్‌రెడ్డిని శనివారం రాత్రి పోలీసులు అరెస్టు చేశారు. ఈ వివరాలను మన్నూరు పోలీసుస్టేషన్లో ఆదివారం రాజంపేట ఏఎస్పీ మనోజ్ రామ్‌నాథ్‌హెగ్డే తెలిపారు. ఆయన తెలిపిన మేరకు.. వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం చౌడూరుకు చెందిన అనిల్‌కుమార్‌రెడ్డి కడప టౌన్, పాలకొండలు, ఔటర్‌రింగ్‌రోడ్డు, పులివెందుల టౌన్ ఔటర్ రింగ్ రోడ్, కదిరిరోడ్డులోని బట్రపల్లె మార్గాలలో ప్రేమ జంటలను, మద్యం తాగేవారిని టార్గెట్ చేసుకునేవాడు. పోలీసుశాఖకు చెందిన వాడినని చెప్పి.. వారి పేర్లు, ఫోన్ నంబర్లు తీసుకునేవాడు. కేసు నమోదుకాకుండా చూడాలంటే డబ్బులివ్వాలని బెదిరించి వసూలు చేసేవాడు. కొందరివద్ద లాక్కునేవాడు. ఈ నేపథ్యంలో రిమ్స్ హాస్పిటల్ సమీపంలోని వాటర్‌ఫాల్ చూడటానికి వెళ్లిన అఖిల, ఆమె స్నేహితుల నుంచి వారి వివరాలను, డబ్బును తీసుకున్నాడు. అనంతరం అఖిల, ఆమె స్నేహితులకు ఫోన్‌చేసి బ్లాక్మెయిల్ చేయసాగాడు. దీంతో భయపడిన అఖిల రాజంపేటలోని ఒక హాస్టల్లో ఫిబ్రవరి 3న ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. విచారణలో అనిల్‌కుమార్‌రెడ్డి బ్లాక్‌మెయిలే దీనికి కారణమని పోలీసులు తేల్చారు. నిందితుడిపై ఇప్పటికే గుత్తి పోలీసుస్టేషన్లో పొక్సో, అనంతపురం త్రీటౌన్ పీఎస్‌లో దొంగతనం, ప్రొద్దుటూరు రూరల్ పోలీసుస్టేషన్లో రేప్ అటెంప్ట్ కేసులున్నాయి. దొంగతనం కేసులో నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా ఉంది.

పాకిస్థాన్ నుంచి ఆపరేట్.. విశాఖలో లోన్ యాప్ ముఠా అరెస్ట్
సాక్షి, విశాఖపట్నం: నగరంలో లోన్ యాప్ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ లోన్ యాప్.. పాకిస్థాన్ నుంచి ఆపరేట్ అవుతున్నట్లు పోలీసులు గుర్తించారు. రూ. 200 కోట్ల రూపాయల లావాదేవీలను పోలీసులు గుర్తించారు.ఈ ముఠా లోన్ యాప్‌ల ద్వారా ఆర్థిక నేరాలకు పాల్పడుతోంది. ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ కేసులో ప్రధాన నిందితుడితో సహా 9 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లోన్ యాప్‌లో రూ. 2 వేల రూపాయలు అప్పు తీసుకున్న నరేంద్ర అనే యువకుడిని వేధించిన కేసులో పోలీసులు పురోగతి సాధించారు. నరేంద్ర భార్య ఫోటోలను మార్ఫింగ్ చేసిన సైబర్ నేరగాళ్లు.. బంధువులకు పంపించారు. దీంతో అవమాన భారంతో పెళ్లయిన 40 రోజులకే నరేంద్ర ఆత్మహత్య చేసుకున్నాడు.పాకిస్థాన్ కేంద్రంగా ఈ ముఠా నడుస్తున్నట్టు సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. సుమారు భారత్ నుంచి 9 వేల మంది బాధితులు ఈ ముఠా చేతిలో మోసపోయినట్టు గుర్తించిన పోలీసులు.. 18 మొబైల్ ఫోన్లు, ఒక ల్యాప్ టాప్, 54 సిమ్‌లు, రూ.60 లక్షల రూపాయల నగదును ఫ్రిజ్ చేశారు.

అయ్యో దేవుడా..ఏమిటీ ఘోరం
కొన్ని క్షణాలకు ముందు పక్కనే భర్త.. ఆడుకుంటూ బిడ్డలు.. సంతోషంగా జీవిస్తున్న ఆ కుటుంబంపై విధి చిన్నచూపు చూసింది.నీళ్లలో ఆడుకుంటున్న చిన్నారులు మునిగిపోతుండగా కాపాడేందుకు ప్రయతి్నంచిన భర్త కళ్ల ముందు కడతేరిపోవడంతో ఆ తల్లి కన్నీరుమున్నీరుగా విలపించింది. సరదాలతో నిండిన ఆ కుటుంబంలో ఇప్పుడు ఆమె ఒక్కతే మిగిలింది. ఇక ఒంటరిగానే బతకాలి. చిన్నారులు దేవుడితో సమానం అంటారు. ఆ దేవునికి అభం శుభం తెలియని పసిబిడ్డలపై జాలి కూడా కలగలేదేమో. వారితోపాటు తండ్రిని తీసుకెళ్లిపోయిన విషాద ఘటన మాటల్లో చెప్పలేనిది. బిడ్డల్లారా అప్పుడే నూరేళ్లు నిండాయా..దేవుడా ఏమిటీ ఘోరం అంటూ స్థానికుల కంటతడి పెట్టించిన విషాదకర ఘటన ఇది.ములకలచెరువు: బట్టలు ఉతికేందుకు చెరువు వద్దకు వెళ్తున్న తల్లిని చూసి అమ్మా మేము వస్తామంటూ ఇద్దరు పిల్లలు వెంట వెళ్లారు. వీళ్లతో పాటు పొరుగింటి చిన్నారి కూడా వెళ్లింది. వీరు ముగ్గురు చెరువు నీటిలో ఆడుకుంటూ మునిగిపోతుంటే చూసిన తండ్రి కాపాడేందుకు నీళ్లలోకి దిగి మృత్యువాత పడ్డాడు. ఈ సంఘటన అన్నమయ్య జిల్లా ములకలచెరువు సమీపంలోని పెద్దచెరువులో శనివారం సాయంత్రం జరిగింది. వివరాల్లోకి వెళితే... జగనన్న కాలనీలో ఈశ్వరమ్మ(34), మల్లే‹Ù(38) నివాసం ఉంటున్నారు. వీరికి లావణ్య(12) నందకిషోర్(09) సంతానం. వీరి ఇంటి పక్కనే నందిత(11) అనే బాలిక ఉంటోంది. వీరు ముగ్గురు సమీపంలోని పెద్దచెరువు వద్దకు వెళ్లారు. బట్టలు ఉతుక్కుంటున్న ఈశ్వరమ్మ, మల్లే‹Ùలు పిల్లలు ఆడుకుంటున్నారని వారి పనిలో నిమగ్నమయ్యారు. చెరువు కుంటలో ఆడుకుంటూ పిల్లలు మునిగిపోయారు. వీరి అరుపులు వినిపించకపోవడంతో పిల్లల కోసం మల్లేష్ కుంటలోకి దూకాడు.వారిని కాపాడే ప్రయత్నంలో అతను కూడా నీటిలో మునిగిపోయాడు. ముగ్గురు చిన్నారులు మృతిచెందడంతో ములకలచెరువులో విషాద ఛాయలు అలుముకున్నాయి. కళ్లేదుటే పిల్లలు, భర్త మునిగి చనిపోతుంటే వారిని కాపాడేవారి కోసం ఈశ్వరమ్మ గట్టిగా కేకలు వేసింది.అయితే సమీపంలో ఎవ్వరూ లేకపోవడంతో పక్కనే ఉన్న రాజీవ్నగర్లోకి పరుగెత్తుకెళ్లి స్థానికులకు విషయం చెప్పింది. వెంటనే స్థానికులు చెరువు వద్దకు పరుగుతీసి కాపాడేందుకు ప్రయతి్నంచారు. అప్పటికే జరగకూడని ఘోరం జరిగిపోయింది. ఒంటరిగా మిగిలి... ఈశ్వరమ్మ, మల్లేష్ కూలిపనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. వీరి పిల్లలు లావణ్య ఆరోతరగతి, నందకిషోర్ ఐదోతరగతి చదువుతున్నారు. రోజూ పాఠశాలకు వెళ్లే పిల్లలు సెలవులు కావడంతో బట్టలు ఉతికేందుకు వెళ్లిన తల్లి వెంట వచ్చారు. చెరువులో నీటిని చూసి మురిసిపోయిన చిన్నారులు ఆడుకుంటూ మడుగులో పడి ఊపిరాడక చనిపోయారు. కాపాడేందుకు వెళ్లిన మల్లేష్ సైతం మునిగి చనిపోయాడు. భర్త పిల్లలు దూరం కావడంతో ఈశ్వరమ్మ ఒంటరిగా మిగిలిపోయింది. కళ్లెదుటే భర్త పిల్లలు చనిపోవడంతో అమె బోరున విలపించడం చూసి చూపరులు కంటతడిపెట్టారు.తోడుగా వెళ్లి... జగనన్న కాలనీలో ఉంటున్న మల్లే‹Ù, ఈశ్వరమ్మ ఇంటి పక్కనే మంజుల, వెంకటరమణలు ఉంటున్నారు. వీరికి నందిత అనే కుమార్తె ఉంది. ఇరుగు పొరుగు కావడంతో సఖ్యతతో ఉండేవారు.ముగ్గురు చిన్నారులు కలిసి ఆడుకునేవారు. శనివారం లావణ్య, నందకిషోర్ ఈశ్వరమ్మ వెంట వెళుతుండగా నేను వస్తానని నందిత వెళ్లింది. చెరువులో ఆడుకుంటూ ముగ్గురు మునిగి చనిపోయారు. ఒక్కగానొక్క కుమారై మృతి చెందడంతో అయ్యో దేవుడా మేమేం పాపం చేశాం అంటూ మంజుల, వెంకటరమణలు బోరున విలపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.