Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

TDP Means Telugu Drama Party Says YS Jagan1
టీడీపీ.. తెలుగు డ్రామా పార్టీ: వైఎస్‌ జగన్‌

సాక్షి, గుంటూరు: తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమంపై, ఆ పార్టీ అధినేత చంద్రబాబు పై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బుధవారం పార్టీ స్థానిక సంస్థల ప్రతినిధులతో భేటీలో బాబు సర్కార్‌ ఎన్నికల హామీల అమలును ప్రశ్నించారాయన.టీడీపీ అంటే.. తెలుగు డ్రామా పార్టీ. మహానాడు పెద్ద డ్రామా. చంద్రబాబు మహానాడులో ఫోజులు ఇస్తున్నారు. సత్తా అంటే కడపలో మహానాడు పెట్టడం కాదు. కడపలో మహానాడు పెట్టి.. జగన్‌ను తిట్టడం సత్తా ఎలా అవుతుంది?. ఇచ్చిన హామీలు నెరవేర్చడం నిజమైన సత్తా అవుతుంది.... జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో సమస్యలు చెప్పి, ఎక్కువ పరిష్కారాలు పొందిన వాళ్లు టీడీపీ వాళ్లే. ఎమ్మెల్యేలు వద్దన్నా.. వారికి మనం మంచి చేశాం. కానీ, ఈరోజు చంద్రబాబు అన్యాయాలు చేస్తున్నారు. దీనికి వడ్డీ సహా చెల్లిస్తాం. అప్పుడే మరోసారి ఇలాంటి తప్పులు చేయడానికి భయపడతారు’’ అని జగన్‌ అన్నారు... చంద్రబాబు.. సూపర్‌ సిక్స్‌, సూపర్‌ సెవెన్‌ గాలికొదిలేశారు.143 హామీలను పూర్తిగా పక్కనపెట్టారు.చిన్నహామీ అయిన ఉచిత బస్సుకోసం కూడా ప్రజలు ఎదురుచూస్తున్నారు. గ్యాస్‌ సిలెండర్లు కూడా సరిగ్గా ఇవ్వలేకపోయారు. ప్రభుత్వ స్కూళ్లలో చదువులు అటకెక్కాయి. సీబీఎస్‌ఈ, టోఫెల్‌, నాడు-నేడు, పిల్లలకు ట్యాబులు అన్నీ ఆగిపోయాయి. మా హయాంలో ప్రతి మూడు నెలలకూ ఫీజు రియింబర్స్‌మెంట్‌ ఇచ్చేవాళ్లం. కూటమి ప్రభుత్వంలో అమ్మ ఒడికి పంగనామాలు పెట్టారు. ఫీజు రియంబర్స్‌మెంట్‌, వసతి దీవెన లేదు. చదివించలేక పిల్లలను పనులకు పంపే పరిస్థితులు కనిపిస్తున్నాయి... ఆరోగ్య శ్రీనికూడా పూర్తిగా నిర్వీర్యం చేశారు. పేషెంట్లకు ఆరోగ్య శ్రీ అందని పరిస్థితి నెలకొంది. పేదలు వైద్యంకోసం అప్పులు పాలు అవుతున్నారు. చంద్రబాబు పాలనలో రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. ఏడాది కాలంగా రైతు భరోసా లేదు. ధాన్యం సహా ఏ పంటకూ కనీస మద్దతు ధరలు రావడంలేదు. ధాన్యానికి కనీస మద్దతు ధరే కాదు, జీఎల్టీ రూపంలో ప్రతి ఎకరాకు రూ.1౦వేలు అదనంగా రైతుకు వచ్చేది. మిరప, పత్తి, చీనీ, టమోటో.. పొగాకు.. ఇలా ఏ పంట తీసుకున్నా రైతులకు ధరలు రాడంలేదు. రైతు బతుకు దళారీ పాలయ్యింది:.. ఏడాది కాలంలో ఒక్క ఉద్యోగంకూడా ఇవ్వలేకపోయారు. ఉన్న ఉద్యోగాలూ పీకేస్తున్నారు. 2.6 లక్షల మంది వాలంటీర్లు, 15వేల మంది బెవరేజెస్‌ కార్పొరేషన్లు, రేషన్‌ వాహనాల మీద ఆధారపడ్డ 20వేల మంది ఇలా మొత్తంగా 3లక్షల ఉద్యోగాలను తీసేశారు. మన పాలనలో ఉద్యోగస్తుల్లో చంద్రబాబు విషం నింపారు. ఇప్పుడు ఒక్కరికీ ఐఆర్‌ ఇచ్చిన పాపాన పోలేదు, పీఆర్‌సీ లేదు. మూడు డీఏలు పెండింగ్‌, బకాయిలు పెండింగ్‌. చంద్రబాబును ఎందుకు తెచ్చుకున్నామని ఉద్యోగులు తలపట్టుకుంటున్నారు. ఏ వర్గం కూడా సంతోషంగా లేదు. ఇసుక, మట్టి, సిలికా, క్వార్ట్జ్‌, రాజధాని పనులు.. లిక్కర్‌ ఇలా దేన్నీ వదలకుండా దోచేస్తున్నారు.వైఎస్సార్‌సీపీ హయాంలో మనం రూ.2.73లక్షల కోట్లు డీబీటీ చేశాం. జగన్‌ చేశాడు, ఇప్పుడు చంద్రబాబు ఎందుకు చేయలేకపోతున్నాడు. మరణం తర్వాత ప్రతి ఇంట్లో నేను బతికే ఉండాలని ఆశపడ్డాను. అందుకే నేను ఇచ్చిన మాట నిలబెట్టుకోగలిగాను. కానీ చంద్రబాబు బటన్‌ నొక్కడంలేదు, దోచేసుకోవడం, దోచేసినది పంచేసుకోవడం చేస్తున్నాడు. రాష్ట్రానికి వచ్చిన ఆదాయాలు కూడా తగ్గిపోయాయి. దేశం మొత్తం 11 శాతం పెరిగితే.. మనకు ౩శాతం పెరిగాయి. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు టీడీపీకి చెందిన గజ దొంగల ముఠా జేబుల్లోకి పోతోంది’’ అని జగన్‌ అన్నారు.క్లిక్‌ చేయండి: మహానాడులో చంద్రబాబు మహానటన

Jagan Gollaprollu Penukonda YSRCP Leaders Meeting Key Comments Updates2
చంద్రబాబుది దౌర్భాగ్యపు పాలన: వైఎస్‌ జగన్‌

గుంటూరు, సాక్షి: ప్రజలకు మనం చేసిన మంచి ఎక్కడకూ పోలేదని, కానీ కూటమి ప్రభుత్వం అరాచక పాలన సాగిస్తోందని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy) అన్నారు. బుధవారం తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో స్థానిక సంస్థల ప్రతినిధులతో భేటీ అయిన ఆయన.. కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘రాష్ట్రం ఎలాంటి పరిస్థితుల్లో ఉందో మీ అందరికీ తెలిసిందే. రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత ఉండాలి. చంద్రబాబు రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లను ప్రలోభ పెట్టి, బెదిరించి, భయపెట్టి చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. మన హయాంలో.. కోవిడ్‌ లాంటి మహమ్మారి వచ్చి ఆదాయాలు తగ్గి, ఖర్చులు పెరిగి, తీవ్ర సంక్షోభం ఉన్నా.. ఏరోజు కూడా వాటిని సాకులుగా చూపించలేదు. ప్రజలకు చేయాల్సిన మేలు చేయకుండా పక్కనపెట్టలేదు. ఎన్ని సమస్యలున్నా ప్రజలకు సంతోషంగా మేలు చేశాం. ఎన్నికల వేళ ఇచ్చిన ప్రతి హామీని కూడా నెరవేర్చాం. సీఎం కార్యాలయం నుంచి ప్రతి కార్యాలయంలోనూ కూడా మేనిఫెస్టో పెట్టాం. ప్రతి ఒక్కరూ ప్రతిరోజూ దాన్ని అమలు చేసేట్టుగా చేశాం. 99శాతం హామీలను అమలు చేశాం. అంత గొప్పగా ప్రజలకు మేలు చేశాం. అందుకనే అప్పటి స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్‌ స్వీప్‌ చేశాం.కానీ, చంద్రబాబుది(Chandrababu) దౌర్భాగ్యపు పాలన. తాను ప్రానిథ్యం వహిస్తున్న కుప్పం నుంచే చంద్రబాబు అరాచకాలను ప్రోత్సహించాడు. ఇలాంటి పరిస్థితుల్లో మన పార్టీల్లో చిన్న చిన్న పదవుల్లో ఉన్నవారు చంద్రబాబు కుట్రలకు తలొగ్గక విలువలు చాటారు. అందుకు మీ అందరికీ హ్యాట్సాఫ్‌ చెప్తున్నా.ప్రజలకు మనం చేసిన మంచి ఎక్కడకూ పోలేదు. చంద్రబాబు పాలనకు, మన పాలనకు తేడా స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజలకు మంచి చేశామన్న తృప్తి మనకు ఉంది. వైఎస్సార్‌సీపీ(YSRCP)కి చెందిన ఏ కార్యకర్త అయినా, ఏ నాయకుడు అయినా రాష్ట్రంలో ఏ ఇంటికైనా వెళ్లి పలానా వైఎస్సార్‌సీపీ వాళ్లం అని చెప్పే ధైర్యం ఉంది. రాష్ట్రంలో ఏ ఇంటికైనా వెళ్లి తాము ఈ పనిచేశామని టీడీపీ వాళ్లు ధైర్యంగా చెప్పుకోగలరా?. టీడీపీ వాళ్లు ఇచ్చిన మేనిఫెస్టోలు, బాండ్లు, కరపత్రాలు ఇప్పటికీ ప్రతి ఇంట్లో ఉన్నాయి.సూపర్‌ సిక్స్‌, సూపర్‌ సెవెన్‌ హామీలు ఏమయ్యాయని ప్రజలు నిలదీస్తారు’’ అని జగన్‌ అన్నారు. ఇదీ చదవండి: నారావారి ఏఐ తిప్పలు, ఎన్టీఆర్‌ ఉండి ఉంటేనా..

Political Analysts On Pawan Double Stand Cine Industry3
అధికారం ఉంది కదా అని అడ్డంగా నడుస్తున్నారా?

ఏపీలోని సినిమా థియేటర్లపై కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. అయితే ఇక్కడ ఎంపిక చేసిన థియేటర్లలో మాత్రమే కక్ష సాధింపు చర్యలు కొనసాగడం గమనార్హం. ఒక వర్గాన్ని టార్గెట్ చేస్తూ థియేటర్లలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఒకవేళ టీడీపీ, జనసేనకు సంబంధించిన వారి థియేటర్లలోకి తనిఖీలు పేరుతో వెళ్లినా అక్కడ తూతూ మంత్రంగానే సోదాలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ హరిహరవీరమల్లు సినిమా రిలీజ్ కు సిద్ధమవుతున్న తరుణంలో అధికారులకు తనిఖీల ఆదేశాలు వెళ్లాయి.మల్టీఫ్లెక్స్‌లు, సింగిల్ స్క్రీన్ ల ధరల్లో గుత్తాధిపత్యం నడుస్తోందని, థియేటర్లలో పారిశుధ్యం లేకపోతే చర్యలు ఉంటాయని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కార్యాలయం నుంచి ఆదేశాలు జారీ నేపథ్యంలో తనిఖీలు షురూ చేశారు. పాప్ కార్న్, కూల్ డ్రింక్స్, వాటర్ బాటిళ్ల ధరలు థియేటర్లలో అధికంగా ఉన్నాయని, ఆ ధరలన్నీ నియంత్రించాలని కూడా ఆదేశాల్లో పేర్కొన్నారు. ఇదంతా బాగానే ఉన్నా ఇక్కడ పవన్‌ ద్వంద్వ వైఖరి అనేది ప్రధానంగా కనిపిస్తుందని విశ్లేషకులు అంటున్నారు.కూటమి నేతల థియేటర్లలో తనిఖీలు ఏవి?డిప్యూటీ సీఎం కార్యాలయం ఆదేశాలు సరే కానీ, ఇక్కడ ఎవరి థియేటర్లని తనిఖీలు చేయాలనే ఆదేశాలు కూడా ఆఫ్ ద రికార్డు చెప్పినట్లు తెలుస్తోంది. దాంతో టీ\డీపీ, జనసేన నేతల థియేటర్ల వైపు అదికారులు కన్నెత్తి కూడా చూడటం లేదు. ఒకవేళ ఆ థియేటర్లకు పొరపాటున వెళ్లినా నామమాత్రంగా తనిఖీలు చేస్తున్నారు. ఒకేసారి ఫైర్, రెవెన్యూ, మున్సిపల్, ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేస్తున్నారు. ప్రధానంగా నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ అల్లు అరవింద్ లీజుకు తీసుకున్న థియేటర్లలోనే తనిఖీలు ఎక్కువగా చేస్తున్నట్లు తెలుస్తోంది.కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది దాటింది. మరి అప్పట్నుంచి థియేటర్లలో ఎందుకు తనిఖీలు చేపట్టలేదనేది ప్రధాన ప్రశ్న. థియేటర్లలో పారిశుధ్యం బాగా లేదని, తినుబండారాలు ధరలు ఎక్కువగా ఉన్నాయని, కొంతమంది గుత్తాధిపత్యం నడుస్తోందని ప్రధానంగా ప్రస్తుతం వినిపిస్తున్నమాట. అంటే పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అవుతున్న సందర్భంలోనే ఈ తనిఖీలు నిర్వహించడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.బంద్ కుట్ర చేసింది జనసేన నేతని తేలినా..సినిమా థియేటర్ల బంద్ డ్రామాకు తెరలేపింది జనసేన నేత అని తేలినా, థియేటర్లలో తనిఖీలు మాత్రం ఆగడం లేదు. కక్ష గట్టి థియేటర్లలో తనిఖీలు చేసేస్తున్నారు. విశాఖ, కాకినాడ, రాజమండ్రి, విజయవాడ థియేటర్లలో తనిఖీలు చేపట్టారు. అయితే ఇక్కడ వైఎస్సార్ కాంగ్రెస్ నేతల థియేటర్లలోనే తనిఖీలు చేస్తున్నారు. టీడీపీ నేతల చేతుల్లో అత్యధికంగా సినిమా థియేటర్లు ఉన్నప్పటికీ ఆ వైపు కన్నెత్తి చూడటం లేదు. టీడీపీ, జనసేన నేతల థియేటర్లలో తనిఖీలు చేపట్టకుండా కొందరిని మాత్రమే టార్గెట్ చేసి తనిఖీలు చేస్తున్నారు.సినిమా వాళ్ల పట్ల, సినిమా పట్ల ప్రభుత్వ జోక్యం ఏమిటని గతంలో ఊగిపోయిన పవన్.. ఇప్పుడు మాత్రం రగిలిపోతున్నారు. అంటే ఇప్పుడు ప్రభుత్వంలో కీలక పదవిలో పవన్ కళ్యాణ్ ఉన్నారు. అందుకే ఇప్పుడు ‘రగులుతోంది మొగలి పొద’ అన్నట్లు వ్యవహరిస్తున్నారు డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న నటుడు పవన్. అధికారం ఉంది కదా అని అడ్డంగా వెళ్లిపోయినా నడుస్తుందని మన డిప్యూటీ అనుకుంటున్నట్లు ఉన్నారని రాజకీయ విశ్లేషకులు విమర్శిస్తున్నారు.

Poor Kamal Haasan Siddaramaiah On Kannada Language Row4
పాపం కమల్‌ హాసన్‌.. సిద్ధరామయ్య సెటైర్లు

బెంగళూరు: కన్నడ భాష తమిళం నుంచే పుట్టిందన్న ప్రముఖ నటుడు కమల్‌ హాసన్‌ వ్యాఖ్యలపై(Kamal Kannada Comment) కన్నడనాట తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం అన్నాయి. ఈ క్రమంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కమల్‌ కామెంట్‌పై స్పందించారు.కన్నడ భాషకు(Kannada Language) ఎంతో చరిత్ర ఉంది. పాపం కమల్‌ హాసన్‌కు ఆ విషయం తెలియకపోయి ఉండొచ్చు అంటూ సిద్ధరామయ్య అన్నారు. మరోవైపు కర్ణాటక బీజేపీ చీఫ్‌ విజయేంద్ర యడియూరప్ప సైతం కమల్‌ వ్యాఖ్యపై మండిపడ్డారు. ‘‘మాతృభాషను ప్రేమించడం మంచిదే అయినా.. ఇతర భాషలను అవమానించడం సరైంది కాదని అన్నారాయన. ఇది కన్నడ ప్రజలను మాత్రమే కాదు.. శివరాజ్‌ కుమార్‌ లాంటి అగ్రనటుడిని కూడా అవమానించడమే. కన్నడ ప్రజల ఆత్మగౌరవాన్ని అవమానించిన కమల్‌ తక్షణమే క్షమాపణలు చెప్పాలి’’ అని విజయేంద్ర డిమాండ్‌ చేశారాయన. చెన్నైలో జరిగిన థగ్‌ లైఫ్‌ చిత్ర(Thug Life) ఈవెంట్‌లో కన్నడ సూపర్‌ స్టార్‌ శివరాజ్‌ కుమార్‌ను ఉద్దేశిస్తూ ‘‘మీ భాష(కన్నడ) కూడా తమిళం నుంచే పుట్టింది’ అని అన్నారు. ఈ కామెంట్‌పై ఇటు రాజకీయంగా, అటు సోషల్‌ మీడియాలోనూ కమల్‌పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కన్నడ పరిరక్షణ సంస్థ కర్ణాటక రక్షణ వేదిక కమల్‌ వ్యాఖ్యలపై భగ్గుమంది. క్షమాపణలు చెప్పకపోతే సినిమా విడుదలను అడ్డుకుంటామని హెచ్చరించింది. మణిరత్నం డైరెక్షన్‌లో కమల్‌ హాసన్‌, శింబు, త్రిష, అభిరామి లీడ్‌ రోల్స్‌లో నటించిన థగ్‌ లైఫ్‌ సినిమా జూన్‌ 5వ తేదీన విడుదల కావాల్సి ఉంది. ఇదీ చదవండి: ఖబడ్దార్‌ కమల్‌.. నల్ల ఇంకు పోస్తాం

Shah Rukh Khan As Brand Ambassador of Candere5
ఒకే ఇంట్లో షెహన్‌షా, బాద్‌షా: కందేరే బ్రాండ్ అంబాసిడర్‌గా షారుక్ ఖాన్

ముంబయి: సోషల్ మీడియాలో జరిగిన చర్చల అనంతంరం చివరకు అధికారిక ప్రకటన వెలువడింది. బాలీవుడ్ సూపర్‌స్టార్ 'షారుక్ ఖాన్‌'ను కందేరే ప్రీమియం లైఫ్‌స్టైల్ జ్యూవెలరీ బ్రాండ్, తన బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించింది. ఈ ప్రకటన కేవలం ఊహాగానాలకు ముగింపు మాత్రమే కాదు. భారత ఆభరణాల పరిశ్రమలోను, బ్రాండ్ కథనాల ప్రపంచంలోను ఒక కీలక మలుపుగా నిలుస్తోంది.ఈ ప్రచార యాత్ర ప్రారంభమైంది ఒక స్టైలిష్ టీజర్‌తో. అందులో ఖాన్ మెరిసే ఆభరణాలతో ఆకర్షణీయంగా కనిపించడంతో, అభిమానులు ఇది ఆయన సొంత బ్రాండ్ అని భావించారు. షారుక్ ఇప్పటికే అనేక వ్యాపారాల్లో పాల్గొన్న నేపథ్యంలో.. కంపెనీలో ఆయనకు షేర్స్ ఉంటాయనే ఊహలు వెలుగులోకి వచ్చాయి.దీనిపై కందేరే సంస్థ తక్షణమే స్పందిస్తూ.. షారుక్ ఖాన్ కేవలం బ్రాండ్ అంబాసిడర్ మాత్రమేనని, కంపెనీలో ఆయనకు ఎలాంటి వాటా లేదని స్పష్టంగా పేర్కొంది. ఇది ప్రచార సంబంధిత భాగస్వామ్యమే అయినప్పటికీ, దీని వెనుక ఉన్న సాంస్కృతిక, వాణిజ్య పరమైన ప్రభావం భారీగానే ఉంది.ఈ భాగస్వామ్యం ద్వారా కల్యాణ్ జ్యూవెలర్స్ గ్రూప్.. భారత సినిమా రంగంలోని ఇద్దరు అగ్రనటులను ఒకే బ్రాండ్ గూటిలో చేర్చింది. ఒకవైపు సంప్రదాయానికి ప్రతీక అయిన అమితాబ్ బచ్చన్ కల్యాణ్ బ్రాండ్‌కు, మరోవైపు ఆధునికత, డిజైన్‌పై దృష్టి పెట్టిన కందేరే బ్రాండ్‌కు షారుక్ ఖాన్ అంబాసిడర్‌లుగా వ్యవహరిస్తున్నారు.కందేరే ఓమ్ని-చానెల్ బ్రాండ్‌గా 75కి పైగా రిటైల్ అవుట్‌లెట్లు కలిగి ఉంది. ఇది వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే, రోజువారీ ఉపయోగానికి సరిపోయే, ఆధునిక శైలికి అనుగుణంగా రూపొందించిన లైఫ్‌స్టైల్ ఆభరణాలను అందిస్తుంది. షారుక్ ఖాన్ కొత్త ప్రచారం.. కందేరే బ్రాండ్ సంప్రదాయం.. ఆధునికత మధ్య ఉన్న అందమైన సమతౌల్యానికి ప్రతీకగా మారుతోంది. సినిమా గ్లామర్, మిల్లీనియల్స్, జెన్ జెడ్ తరాల అభిరుచులతో మిళితంగా నిలుస్తోంది.మార్కెటింగ్ పరంగా చూస్తే, ఈ డ్యూయల్ సెలబ్రిటీ వ్యూహం అనేది తెలివిగా రూపొందించిన ఒక తరాల వారసత్వ కథనంగా నిలుస్తోంది. బ్రాండ్ విలువను క్షీణింపచేయకుండా, యువత నుంచి వృద్ధుల దాకా అందరినీ కలిపే విధంగా. షెహన్‌షా (బచ్చన్) మరియు బాద్‌షా (ఖాన్) ను ఒకే సంస్థ గూటిలో చేర్చిన కల్యాణ్ హౌస్, సంప్రదాయానికి గౌరవం ఇస్తూనే మార్పును ఆలింగనం చేసే ఆభరణాల సామ్రాజ్యాన్ని నిర్మించింది. ఇది శాశ్వత సంప్రదాయాల నుంచి ఆధునిక మెరుపుల దాకా, ఇప్పుడు తరాలను ఒకచోట చేర్చే వారసత్వాన్ని సృష్టిస్తోంది.

Meet Minnu Joshy Became A Mom At 23 Becoming An IAS Officer At 326
చిన్న వయసులోనే పెళ్లి, బాధ్యతలు: పట్టుదలతో IAS అధికారిగా

మహిళలు అన్ని రంగాల్లోనూ తమ ప్రతిభను చాటుకుంటున్నారు. అడ్డంకులు ఎన్ని వచ్చినా, అధిగమించి ఉన్నత స్థాయి నైపుణ్యాలతో రాణిస్తున్నారు. ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కొన్ని సంవత్సరాలుగా, పౌర సేవలలో మహిళా అధికారుల సంఖ్య గణనీయంగా పెరిగింది. అలాంటి వారిలో ఒకరు మిన్ను జోషి. ఒక బిడ్డకు తల్లిగా కుటుంబ బాధ్యతల్లో మునిగి పోయిన ఆమె నేడు ఆమె కేవలం శ్రద్ధగల అధికారి మాత్రమే కాదు, ఆమె మొత్తం కుటుంబం గర్వించదగిన వ్యక్తిగా ఎదిగింది. సంకల్పం ఉంటే ఒక స్త్రీ తన ఇంటి బాధ్యతలను పోషిస్తూనే తన కలలను ఎలా సాకారం చేసుకోవచ్చో నిరూపించింది.ప్రపంచవ్యాప్తంగా అనేకమంది మహిళలు తమ దృఢ సంకల్పం, ఆకాంక్ష శ్రద్ధతో ఉన్నత శిఖరాల అధిరోహిస్తున్నారు. పట్టుదలతో ప్రయత్నిస్తే సాధ్యం కానిది ఏదీ లేదని నిరూపిస్తున్నారు. ఒక్కొక్కరిదీ ఒక్కో విజయగాథ. కుటుంబం ఇచ్చిన మద్దతుతో, ఆకాశాన్ని లక్ష్యంగా చేసుకుంది.భారతదేశంలోని అత్యంత కఠినమైన సివిల్స్‌లో సత్తా చాటినమిన్ను జోషి సక్సెస్‌ జర్నీని పరిశీలిద్దాం. చదవండి: ట్విటర్‌ గాలం : ఇండో-అమెరికన్‌ , యూట్యూబ్‌ సీఈవోకి గూగుల్‌ భారీ ఆఫర్‌కేరళలోని పతనంతిట్ట అనే చిన్న గ్రామంలో మిన్ను జోషి పుట్టింది. మిన్ను తండ్రి పోలీసు. మిన్నుకి 21 ఏళ్ల వయస్సులోనే వివాహం అయింది. ఒక మగబిడ్డకు జన్మనిచ్చింది. భార్యగా, కోడలిగా, తల్లిగా కుటుంబ బాధ్యతల్లో మునిగిపోయినా తన కలను సాకారం కోసం తనను తాను సంసిద్ధం చేసుకుంది. దివంగత తండ్రి కలను సాకారం చేయాలని గట్టిగా నిర్ణయించుకుంది.ఇదీ చదవండి: పాపులర్‌ యూ ట్యూబర్‌ సీక్రెట్‌ వెడ్డింగ్‌ : స్టూడెంట్స్‌కి సర్‌ప్రైజ్‌పోలీసుగా గౌరవ స్థానంలో ఉన్న తండ్రిని చూసి తాను కూడా మరింత ఉన్నతంగా ఎదగాలని కలకనింది. అయితే, ఎంతో ప్రేమించిన తండ్రి అకాల మరణం ఆమెను దిగ్భ్రాంతికి గురిచేసింది. 2012లో 'డై-ఇన్-హార్నెస్' పథకం ద్వారా ఆమె కేరళ పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో క్లరికల్ పదవిని పొందింది. అయినా ‘ఐఏఎస్‌’ డ్రీమ్‌ను విడిచిపెట్టలేదు. బయోకెమిస్ట్రీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ చదివిన 26 సంవత్సరాల వయస్సులో, ఆమె ఐఎఎస్ పరీక్షకు సిద్ధం కావడం ప్రారంభించింది. ఇది కేవలం తన కలకోసం మాత్రం కాదని, మరణించిన తండ్రి సేవకు కొనసాగింపు అని భావించింది. 2015లో శంకర్ ఐఏఎస్ అకాడమీలో చేరిం కష్టపడింది. రెండేళ్ల తరువాత మెయిన్స్ పరీక్షలో ఉత్తీర్ణురాలైంది. అయితే, ఆమె ఇంటర్వ్యూలలో విఫలమైంది. అయినా పట్టువీడలేదు. నిరుత్సాహపడలేదు. చివరికి తొలి ఆరు ప్రయత్నాలు, సుదీర్ఘమైన అధ్యయన సెషన్ల తర్వాత, సివిల్ సర్వీసెస్ పరీక్షలో 150 ఆల్ ఇండియా ర్యాంక్‌ను సాధించి తానేంటో నిరూపించుకుంది.చదవండి: ‘ఎర్ర’ గౌనులో దీపికా రాయల్‌ లుక్‌ : స్పిరిట్‌పై ఫ్యాన్‌ కామెంట్‌ వైరల్‌

India to conduct mock drills tomorrow in 4 states7
రేపు పాక్‌ సరిహద్దు రాష్ట్రాల్లో భారత్‌ మాక్‌ డ్రిల్‌

సాక్షి,ఢిల్లీ: ఆపరేషన్ సిందూర్‌ తర్వాత పాక్‌ మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడింది. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో భారీ ఎత్తున పాకిస్తాన్‌ తన సైన్యాన్ని భారీ ఎత్తున మొహరించింది. దీంతో భారత్‌ అప్రమత్తమైంది. రేపు (మే29న) పాక్‌ సరిహద్దు రాష్ట్రాల్లో భారత్‌ మాక్‌ డ్రిల్ నిర్వహించేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా గుజరాత్‌, పంజాబ్‌, రాజస్థాన్‌, జమ్మూలో మాక్‌ డ్రిల్‌ను నిర్వహించనుంది. అయితే, మాక్‌ డ్రిల్ జరిగే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇప్పటికే మాక్‌ డ్రిల్‌ నిర్వహించేందుకు కేంద్రం ఏర్పాట్లను పూర్తి చేసింది. The grand welcome for the #PakistanArmy in Pakistan Occupied Jammu & Kashmir. pic.twitter.com/znELGTYUN7— Lt Col Vikas Gurjar 🇮🇳 (@Ltcolonelvikas) May 27, 2025 ఇదే తరహా మాక్‌ డ్రిల్‌ ఈ నెల ప్రారంభంలో జరిగింది. ఏప్రిల్ 22న మినీ స్విట్జర్లాండ్‌ పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారత్‌ మే 6, 7 తేదీల మధ్య పాక్‌పై భారత్‌ ఆపరేషన్‌ సిందూర్‌ను నిర్వహించింది. BIG BREAKING NEWS 🚨 India to conduct mock drills tomorrow in 4 states, UT.Mock drills will be conducted in Gujarat, Rajasthan, Punjab, and Jammu and Kashmir tomorrow.The drills will be held in districts bordering Pakistan.This comes weeks after India launched ‘Operation… pic.twitter.com/GbWJkDB1nr— Times Algebra (@TimesAlgebraIND) May 28, 2025 భారత్‌ ఆపరేషన్ సిందూర్‌ను ప్రారంభించడానికి కొన్ని గంటల ముందు, మే 7న హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MHA) దేశవ్యాప్తంగా ఆపరేషన్ అభ్యాస్‌ పేరుతో మాక్ డ్రిల్‌ను నిర్వహించించింది. ఆపరేషన్‌ అభ్యాస్‌ కొన్ని వారాల తర్వాత ఈ గురువారం పాక్‌ సరిహద్దు రాష్ట్రాల్లో మరోసారి కేంద్రం మాక్‌ డ్రిల్‌ నిర్వహించనుంది. కాగా, భారత్‌-పాక్‌ మధ్య ఉద్రిక్తతలు తారా స్థాయికి చేరడంతో కేంద్ర హోంశాఖ సంక్షోభ సమయంలో పౌరులు ప్రాణాలు ఎలా కాపాడుకోవాలో అవగాహన కల్పించడమే మాక్‌ డ్రిల్‌ ఉద్దేశం. ఇటీవల పాకిస్తాన్‌పై భారత్‌ చేపట్టిన మిలటరీ ఆపరేషన్‌ ఆపరేషన్‌ సిందూర్‌ ముందు కంటే 1971లో పాకిస్తాన్‌తో పోరాడాల్సి రావడం, అంతకుముందు 1962,1965 యుద్ధ సమయంలో మాక్‌ డ్రిల్‌ జరిగింది. మళ్లీ దాదాపూ 50ఏళ్ల తర్వాత పౌరుల భద్రత దృష్ట్యా కేంద్రం ఆపరేషన్‌ సిందూర్‌కు ముందు మాక్‌ డ్రిల్స్‌ చేపట్టింది.

IPL 2025 Final Qualification Explained If Qualifier 1 Ends In No Result8
RCB VS PBKS Qualifier-1: అలా జరిగితే గెలవకపోయినా పంజాబ్‌ ఫైనల్‌కు చేరుతుంది..!

ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో లీగ్‌ దశ మ్యాచ్‌లన్నీ ముగిశాయి. పంజాబ్‌, ఆర్సీబీ, గుజరాత్‌, ముంబై ఇండియన్స్‌ ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించాయి. మే 29న జరిగే క్వాలిఫయర్‌-1లో ఆర్సీబీ, పంజాబ్‌ తలపడతాయి. మే 30న జరిగే ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో గుజరాత్‌, ముంబై ఇండియన్స్‌ అమీతుమీ తేల్చుకుంటాయి. లీగ్‌ దశలో సాధించిన విజయాలు, నెట్‌ రన్‌రేట్‌ ఆధారంగా ప్లే ఆఫ్స్‌ బెర్త్‌లు ఖరారయ్యాయి. పంజాబ్‌, ఆర్సీబీ తలో 14 మ్యాచ్‌ల్లో చెరో 9 విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిచాయి. పాయింట్లు సమంగా (19) ఉన్నా, ఆర్సీబీతో పోలిస్తే నెట్‌ రన్‌రేట్‌ మెరుగ్గా ఉండటంతో పంజాబ్‌కు తొలి ప్లే ఆఫ్స్‌ బెర్త్‌ దక్కింది.గుజరాత్‌ 14 మ్యాచ్‌ల్లో 9 విజయాలు, ముంబై ఇండియన్స్‌ 14 మ్యాచ్‌ల్లో 8 విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో మూడు, నాలుగు స్థానాల్లో నిలిచాయి. గుజరాత్‌ కూడా పంజాబ్‌, ఆర్సీబీ మాదిరి 14 మ్యాచ్‌ల్లో 9 విజయాలు సాధించినా.. పంజాబ్‌, ఆర్సీబీ ఆడాల్సిన ఓ మ్యాచ్‌ (వేర్వేరుగా) రద్దైంది. దీంతో పంజాబ్‌, ఆర్సీబీలకు అదనంగా తలో పాయింట్‌ లభించింది.ప్లే ఆఫ్స్‌ మ్యాచ్‌లు ఎలా..?పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిచే జట్లు (పంజాబ్‌, ఆర్సీబీ) మొదటి క్వాలిఫయర్‌లో తలపడతాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు చేరుతుంది. ఈ మ్యాచ్‌లో ఓడిన జట్టుకు మరో ఛాన్స్‌ ఉంటుంది. క్వాలిఫయర్‌-2లో (జూన్‌ 1) పోటీ పడే అవకాశం దక్కుతుంది. క్వాలిఫయర్‌-2లో ఇంకో బెర్త్‌ ఎలిమినేటర్‌ మ్యాచ్‌ ద్వారా తెలుస్తుంది. పాయింట్ల పట్టికలో మూడు, నాలుగు స్థానాల్లో నిలిచే జట్లు ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో తలపడతాయి. గెలిచిన జట్టు క్వాలిఫయర్‌-2లో పోటీ పడాల్సి ఉంటుంది. ఎలిమినేటర్‌లో ఓడిన జట్టు ఇంటి ముఖం పడుతుంది. క్వాలిఫయర్‌-2లో గెలిచే జట్టు.. క్వాలిఫయర్‌-1లో గెలిచే జట్టుతో ఫైనల్‌లో (జూన్‌ 3) తలపడుతుంది.ఆర్సీబీ, పంజాబ్‌ క్వాలిఫయర్‌ మ్యాచ్‌ రద్దైతే..?పంజాబ్‌, ఆర్సీబీ మధ్య మే 29న జరగాల్సిన క్వాలిఫయర్‌-1 మ్యాచ్‌ ఏ కారణంగా అయినా రద్దైతే పంజాబ్‌ ఫైనల్‌కు చేరుతుంది. పాయింట్ల పట్టికలో పంజాబ్‌ అగ్రస్థానంలో ఉంది కాబట్టి, ఆ జట్టుకు ఈ అవకాశం దక్కుతుంది. షెడ్యూల్‌ ప్రకారం క్వాలిఫయర్‌-1కు రిజర్వ్‌ డే లేదు. కాబట్టి తప్పనిసరిగా మ్యాచ్‌ జరిగి గెలిస్తేనే ఆర్సీబీ ఫైనల్‌కు చేరుతుంది. పంజాబ్‌కు అలా కాదు. ఏ కారణంగా అయినా మ్యాచ్‌ రద్దైనా ఆ జట్టు ఫైనల్‌కు చేరుతుంది. ప్రస్తుతమున్న సమాచారం ప్రకారం ఏ కారణంగా కూడా పంజాబ్‌, ఆర్సీబీ క్వాలిఫయర్‌-1 మ్యాచ్‌ రద్దయ్యే అవకాశం లేదు.

SSMB29: Nana Patekar Rejected Rajamouli, Mahesh Babu Film9
SSMB29: రూ.20 కోట్ల ఆఫర్‌ని రిజెక్ట్‌ చేసిన బాలీవుడ్‌ నటుడు!

రాజమౌళి..ఇప్పుడు ఇండియాలోనే నెంబర్‌ వన్‌ దర్శకుడు. ఇందులో నో డౌట్‌. ఆయన నుంచి ఒక సినిమా వస్తుందంటే కచ్చితంగా అది రికార్డులు సృష్టిస్తుంది. అలాంటి దర్శక దిగ్గజం సినిమాలో నటించే అవకాశం వస్తే ఏ నటుడైనా వదులుకుంటాడా? కానీ బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు నానా పటేకర్‌ మాత్రం రాజమౌళి ఆఫర్‌ని సున్నితంగా తిరస్కరించాడట. రూ. 20 కోట్ల పారితోషికం ఇస్తానని చెప్పినప్పటికీ ఆయన ఒప్పుకోలేదట. నమ్మశక్యంగా లేనిఈ వార్తను బాలీవుడ్‌ మీడియా తెగ ప్రచారం చేస్తోంది.న్యూస్‌ 18 కథనం ప్రకారం.. మహేశ్‌ బాబుతో రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం(SSMB 29)లో కీలక పాత్ర కోసం నానా పటేకర్‌ని తీసుకుందాం అనుకున్నారట. ఈ మేరకు రాజమౌళి పూణే వెళ్లి నానా పటేకర్‌కు స్క్రిప్ట్‌ మొత్తం వివరించారట. కథ, పాత్ర బాగున్నప్పటికీ.. దానికి నేను న్యాయం చేయలేనని నానా పటేకర్‌(Nana Patekar ) భావించారట. ఈ విషయం రాజమౌళి టీమ్‌కి చెప్పి.. సున్నితంగా తప్పుకున్నాడని బాలీవుడ్‌ మీడియా పేర్కొంది. అంతేకాదు..ఇందులో నటించేందుకు నానా పటేకర్‌ని భారీగా పారితోషికం ఇస్తామని చెప్పారట. కేవలం 15 రోజుల షూటింగ్‌ కోసం దాదాపు రూ. 20 కోట్ల వరకు ఇస్తామని చెప్పినప్పటికీ, నానా పటేకర్ ఈ ఆఫర్‌ని సున్నితంగా తిరస్కరించినట్టుగా బాలీవుడ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. పాత్ర నచ్చకపోవడంతోనే నానా పటేకర్‌ మహేశ్‌ సినిమాను రిజెక్టర్‌ చేశారనే వార్తలు కూడా వచ్చాయి. అయితే ఇదంతా బాలీవుడ్‌ మీడియా చేస్తున్న తప్పుడు ప్రచారం అని, రాజమౌళి అడిగితే నానా పటేకరే కాదు అమితాబ్‌ లాంటి స్టార్స్‌ కూడా నటించేందుకు ముందుకు వస్తారని టాలీవుడ్‌ ఫ్యాన్స్‌ అంటున్నారు. రాజమౌళి- మహేశ్‌ సినిమా విషయానికొస్తే.. SSMB 29 వర్కింగ్‌ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రియాంకా చోప్రా, మలయాళ నటుడు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ ఇతర లీడ్‌ రోల్స్‌ చేస్తున్నారు. ఆఫ్రికన్‌ ఫారెస్ట్‌ నేపథ్యం తెరకెక్కుతున్న ఈ చిత్రం 2027లో విడుదలయ్యే అవకాశం ఉంది.

From EPFO To Fixed Deposit Rate Change Key Financial Changes From June 110
కొత్త ఈపీఎఫ్‌వో.. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు.. జూన్‌ 1 నుంచి కీలక మార్పులు

మే నెల ముగింపునకు వచ్చేసింది. మరి కొన్ని రోజుల్లో జూన్‌ నెల ప్రారంభం కాబోతోంది. దేశంలో అనేక ముఖ్యమైన ఆర్థిక మార్పులు జూన్ 1 నుంచి అమలులోకి రానున్నాయి. ఇవి మీ పొదుపు, క్రెడిట్ కార్డు వాడకం, ప్రావిడెంట్ ఫండ్ రాబడిని ప్రభావితం చేస్తాయి. జూన్ 1 నుంచి ఏయే మార్పులు అమల్లోకి రానున్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం..ఈపీఎఫ్ఓ 3.0ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ( EPFO) జూన్ 1 నుంచి అప్‌గ్రేడ్‌ చేసిన నూతన ఈపీఎఫ్ఓ 3.0 వ్యవస్థను ప్రారంభించనుంది. పీఎఫ్ ఉపసంహరణలను సులభతరం చేయడం, కేవైసీ అప్‌డేట్‌లను క్రమబద్ధీకరించడం, క్లెయిమ్ ప్రాసెసింగ్‌ను వేగవంతం చేయడం ఈ కొత్త విధానం లక్ష్యం. ఈపీఎఫ్ నిధులను సులభంగా, వేగంగా పొందేందుకు వీలుగా ఏటీఎం తరహా కార్డులను ప్రవేశపెట్టడం ఇందులో ప్రధాన ఆకర్షణ.క్రెడిట్ కార్డ్ రూల్స్‌🔸యాక్సిస్ బ్యాంక్ జూన్‌ 20 నుంచి క్రెడిట్ కార్డు లావాదేవీల వర్గీకరణలో సవరణలు చేయనుంది. రివార్డ్ పాయింట్లు, ఫీజు మినహాయింపులు ఏ లావాదేవీలకు వర్తిస్తాయో కొత్త అప్ డేట్ స్పష్టం చేస్తుంది.🔸కోటక్ మహీంద్రా బ్యాంక్ తన క్రెడిట్ కార్డ్ రివార్డ్ ప్రోగ్రామ్‌లు, ఫీజులలో జూన్ 1 నుండి మార్పులను అమలు చేస్తుంది. ఖర్చు కేటగిరీలలో సంపాదించిన రివార్డ్ పాయింట్లపై కొత్త పరిమితులు రానున్నాయి. అలాగే కొన్ని క్రెడిట్ కార్డ్ ఫీజులు పెరుగుతాయి. ఇవి కార్డు రకాన్ని బట్టి మారుతాయి. సవరించిన బెనిఫిట్ లు, ఖర్చులకు అనుగుణంగా కార్డుదారులు తమ కార్డు వినియోగాన్ని మార్చుకోవాలి.ఫిక్స్‌డ్‌ డిపాజిట్ వడ్డీ రేట్ల సవరణలుహెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ వంటి బ్యాంకులు ఇప్పటికే తమ ఎఫ్‌డీ వడ్డీ రేట్లను తగ్గించాయి. మరిన్ని బ్యాంకులు జూన్ 1 నుండి వడ్డీ రేట్లను తగ్గించవచ్చు. ప్రస్తుత రేట్లు 6.5 శాతం నుంచి 7.5 శాతం మధ్య ఉన్నందున, రేట్ల కోతకు ముందు అధిక రాబడిని పొందడానికి ఇన్వెస్టర్లు తమ డిపాజిట్లను ఇప్పుడే లాక్ చేసుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.సెబీ మ్యూచువల్ ఫండ్ కటాఫ్ టైమింగ్ మార్పులుసెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) జూన్ 1 నుండి ఓవర్‌ నైట్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ (ఎంఎఫ్ఓఎస్) కటాఫ్ సమయాలను సవరించనుంది. ఈ మార్పు క్లయింట్ ఫండ్స్ తాకట్టు ఆధారిత అప్‌ స్ట్రీమింగ్‌ను క్రమబద్ధీకరిస్తుంది. ఒక రోజులో మెచ్యూరిటీ అయ్యే రిస్క్ లేని ప్రభుత్వ సెక్యూరిటీలలో పెట్టుబడి పెట్టే ఓవర్‌నైట్ ఫండ్‌లు సర్దుబాటు చేసిన రిడంప్షన్, లావాదేవీ సమయాలను కలిగి ఉంటాయి. ఇది నెట్ అసెట్ వాల్యూ (ఎన్‌ఏవీ) లెక్కలను ప్రభావితం చేస్తుంది.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement