Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today

Top Stories

ప్రధాన వార్తలు

YS Jagan Slams Chandrababu Govt Over Simhachalam Tragedy1
బాబు ఏడాది పాలనలోనే ఇంతటి దారుణాలు చూడాల్సి వచ్చింది: వైఎస్‌ జగన్‌

విశాఖపట్నం, సాక్షి: చంద్రబాబు ఏడాది పాలనలోనే దారుణమైన పరిస్థితులు.. అదీ ఆలయాల్లో చూడాల్సి వస్తోందని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి అన్నారు. బుధవారం సింహాచలం బాధిత కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.సింహాచలంలో గోడ కూలిపోయి ఏడుగురు చనిపోయారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చనిపోయారు. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. వైకుంఠ ఏకాదశి నాడు కూడా ఇలాగే చేశారు. నాడు తిరుపతిలో జరిగిన తోపులాటలో ఆరుగురు చనిపోయారు. చందనోత్సవం ఎప్పుడు జరుగుతుందో ఈ ప్రభుత్వానికి తెలీదా?. లక్షల మంది భక్తులు వస్తారని తెలిసి కూడా నిర్లక్ష్యం వహించారు. కనీస సౌకర్యాలు కూడా లేవని భక్తులు చెబుతున్నారు. ఆరు రోజుల కిందట గోడ కట్టడం మొదలుపెట్టారు. రెండు రోజుల కిందట పూర్తి చేశారు. పదడుగుల ఎత్తు.. డెబ్బై అడుగుల పొడవుతో గోడ కట్టారు. కనీసం ఎటువంటి టెండర్లు లేకుండా ఈ గోడ పని పూర్తి చేశారు. దాదాపుగా సంవత్సరం అయ్యింది చంద్రబాబు అధికారంలోకి వచ్చి. చందనోత్సవం ఎప్పుడు జరుగుతుందో చం‍ద్రబాబుకి తెలియదా?. జరుగుతుందని తెలిసి కూడా ముందే గోడ కట్టే కార్యక్రమం చేపట్టలేకపోయారు?. ముందస్తు ఏర్పాట్లపై ఎందుకు జాగ్రత్తలు తీసుకోలేదు. మంత్రుల కమిటీ ఏం చేసిందసలు?. కాంక్రీట్‌ గోడతో కట్టాల్సిన చోట.. ఫ్లైయాష్‌ ఇటుకలతో నిర్మించారు. కనీసం నాణ్యంగా ఆ గోడను ఎందుకు నిర్మించలేకపోయారు?. వర్షం పడిందని తెలుసు. చందనోత్సవం సందర్భంగా ప్రతీసారి వర్షం పడుతుందని తెలుసు. అయినా రెండు రోజుల కిందట కట్టిన ఆ గోడ పక్కనే క్యూ లైన్‌ పెట్టారు. చంద్రబాబు ఏడాది పాలనలో దారుణాలు చూడాల్సి వస్తోంది. రాజకీయాల కోసం తిరుమల లడ్డూ ప్రసాదంపై తప్పుడు ప్రచారం చేశారు. తొక్కిసలాట ఘటనలో ఏడుగురిని బలిగొన్నారు. తిరుమల గోశాలలో గోవులు కూడా చనిపోయాయి. కాశినాయన గుడిని బుల్డోజర్లతో కూల్చేశారు. శ్రీకాకుళం జిల్లాలోని శ్రీకూర్మం ఆలయంలో తాబేళ్లు మృతి చెందాయి. అంతకు ముందు గోదావరి పుష్కరాల్లో 29 మందిని బలిగొన్నారు. ఇన్ని జరుగుతున్నా చర్యలు లేవు. ఎందుకంటే అన్నింటిలోనూ చంద్రబాబే దోషి. అందుకే డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తారు. ఈ ఘటనలోనూ నిందను మాపైకి నెట్టే యత్నం చేశారు. కానీ, వాళ్ల హయాంలో.. అదీ రెండు రోజుల కిందటే ఆ గోడ కట్టిందని తేలింది. అయినా చంద్రబాబులో ఎక్కడా పశ్చాత్తాపం కనిపించడం లేదు.ప్రభుత్వం అంటే ప్రజలకు భరోసా ఇచ్చేదిగా ఉండాలి. మొక్కుబడిగా రూ.25 లక్షల పరిహారం ప్రకటించారు. జగన్‌ వస్తున్నాడనే ఈ ప్రకటన చేశారు. ప్రభుత్వం తప్పిదం కాబట్టి పరిహారం పెంచి ఇవ్వాలి. మా ప్రభుత్వంలో ఇలాంటి ప్రమాదాలు జరిగితే.. బాధ్యతగా అధిక పరిహారం చెల్లించాం. ఈ బాధిత కుటుంబాలకు కూడా మా ప్రభుత్వం వచ్చాక ఆ పని తప్పకుండా చేస్తాం’’ అని వైఎస్‌ జగన్‌ ప్రకటించారు. కానీ, బాధ్యులపైనా కఠిన చర్యలు తీసుకుంటేనే ఇలాంటివి పునరావృతం కావని చంద్రబాబుకి వైఎస్‌ జగన్‌ హితవు పలికారు.

Jagan Pay Condolences to Simhachalam Victims Emotionally Console Family2
ఉమామహేష్‌, శైలజకు నివాళి.. జగన్‌ భావోద్వేగం

విశాఖపట్నం, సాక్షి: సింహాచలం బాధిత కుటుంబాన్ని పరామర్శించే క్రమంలో వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy) భావోద్వేగానికి లోనయ్యారు. ఆ కుటుంబ సభ్యులను ఓదారుస్తూ ధైర్యం చెప్పారు. సింహాచలంలో దైవదర్శనానికి వెళ్లిన పిల్లా ఉమామహేష్‌, అతని భార్య శైలజ గోడ కూలిన ఘటనలో మృతి చెందారు. వాళ్ల కుటుంబ సభ్యులను ఓదార్చేందుకు వైఎస్‌ జగన్‌ మధురవాడలోని చంద్రంపాలెంకు వెళ్లారు. ఆయన్ని చూసి ఆ కుటుంబ సభ్యులు భావోద్వేగాన్ని లోనయ్యారు. దీంతో ఆయన వాళ్లను హత్తుకుని ఓదార్చారు. అనంతరం.. ఉమా మహేశ్వరరావు, శైలజ భౌతికకాయాలకు నివాళి అర్పించి మీడియాతో మాట్లాడారాయన.

IAS Officer Ashok Khemka Retired, Transferred 57 Times In His Career3
చండశాసనుడు.. 57 సార్లు ట్రాన్స్ ఫర్.. ఇక ఆ చాన్స్ లేదు..!

ఛండీఘడ్: ఆయనొక ఐఏఎస్ ఆఫీసర్.. కానీ ఆయన కెరీర్ లో 57 సార్లు బదిలీలు. ఆయన బదిలీలతో బాగా ఫేమస్ అయిన ఐఏఎస్ ఆఫీసరే కాదు.. అత్యధిక సార్లు ట్రాన్స్ ఫర్లు చూసిన అధికారిగా రికార్డు కూడా ఆయన సొంతం. ఆయనే మనకు బాగా సుపరిచితమైన అశోక్ ఖేమ్కా.. ఎట్టకేలకు తన కెరీర్‌కు ముగింపు పలికారు, ఈరోజు(ఏప్రిల్ 30) ఆయన రిటైర్ అయ్యారు. ఇక విశ్రాంత ఆఫీసర్ గా ఆయన జీవనం కొనసాగనుంది. ఎప్పుడూ సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ప్రభుత్వాల ఆగ్రహానికి గురైన ఆయన.. అధికంగా ట్రాన్స్ ఫర్లతోనే జీవనం గడిపారు.సుమారు తన 34 ఏళ్ల కెరీర్‌లో సగటున ప్రతి ఆరు నెలలకొకసారి ఆయన బదిలీ అయ్యారు. హర్యానాలో ఏ అధికారికీ చేయని అత్యధిక బదిలీలుగా ఇది లిఖించబడింది. 1991 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి ఖేమ్కా హర్యానా కేడర్ అధికారి. అక్రమ భూ పందేరాల్లో ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా చండశాసనుడిగా పేరున్న అశోక్ ఖేమ్కా గతంలో హర్యానా విత్తనాభివృద్ధి సంస్థ ఎండీగా, హర్యానా ఆర్చీవ్స్‌కు ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. సోనియా గాంధీ అల్లుడైన రాబర్ట్ వాద్రాకు సంబంధించిన డీఎల్ఎఫ్ డీల్ ను రద్దు చేసి సంచలనం సృష్టించిన సీనియర్ ఐఏఎస్ అధికారే అశోక్ ఖేమ్కా. భూ రిజిస్ట్రేషన్లు, భూ గణాంకాల శాఖ డైరక్టర్ జనరల్‌గా పని చేస్తున్న సమయంలో రాబర్ట్ వాద్రాకు డీఎల్ఎఫ్ సంస్థకు నడుమ జరిగిన భూ ఒప్పందాల్లో అక్రమాలను గుర్తించి వాటిని రద్దు చేశారు. దీంతో దేశ వ్యాప్తంగా ఖేమ్కా పేరు మారుమోగిపోయింది. వీటితో పాటు ఖేమ్కా బెదిరింపు కాల్స్, చంపివేస్తామని హెచ్చరికలు సైతం ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. గతంలో బీజేపీ ఖేమ్కాను సమర్థించిన విషయం తెలిసిందే. అయితే ఎన్డీయే హయాంలో కూడా ఈ సిన్సియర్ అధికారిపై బదిలీల పరంపర కొనసాగడం గమనార్హం. పుట్టినరోజు నాడే.. రిటైర్మెంట్‌1965వ సంవత్సరంలో ఏప్రిల్ 30వ తేదీన జన్మించిన ఆయన.. 60 ఏళ్ల పూర్తైన క్రమంలో రిటైర్ అయ్యారు. పుట్టిన రోజు.. ఆయన రిటైర్మెంట్ ఒకే రోజు(ఏప్రిల్ 30) కావడం విశేషం.

Delhi Capitals Breaks Silence As Kuldeep Yadav Rinku Singh Slap Row4
చెంప దెబ్బ వివాదం.. వాళ్లిద్ద‌రూ మంచి ఫ్రెండ్స్‌: కేకేఆర్‌

ఐపీఎల్‌-2025లో మంగ‌ళ‌వారం అరుణ్‌జైట్లీ స్టేడియం వేదిక‌గా ఢిల్లీ క్యాపిట‌ల్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 14 ప‌రుగుల తేడాతో కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ అనంత‌రం ఢిల్లీ క్యాపిటల్స్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్.. కేకేఆర్ స్టార్ బ్యాట‌ర్ రింకూ సింగ్‌ను చెంపదెబ్బ కొట్ట‌డం వివాద‌స్ప‌ద‌మైంది. అప్పటివరకూ సరదాగా నవ్వుతూ మాట్లాడుతున్న రింకూ.. కుల్దీప్ చ‌ర్య‌తో ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ కావడంతో కుల్దీప్ ప్ర‌వ‌ర్త‌నను చాలా మంది త‌ప్పుబ‌ట్టారు. కుల్దీప్‌పై బీసీసీఐ కఠిన చర్యలు తీసుకోవాల‌ని నెటిజ‌న్లు డిమాండ్ చేస్తున్నారు.అయితే ఈ వివాదానికి కోల్‌క‌తా ఫ్రాంచైజీ ఫుల్‌స్టాప్ పెట్టింది. మీడియాలో వస్తున్న వార్త‌ల‌ను కేకేఆర్ ఖండించింది. యూపీకి చెందిన వీరిద్ద‌రూ మంచి స్నేహితులంటూ.. గ‌తంలో కుల్దీప్‌, రింకూ క‌లిసి ఉన్న ఫోటోల‌ను వీడియో రూపంలో కేకేఆర్ షేర్ చేసింది. మ‌రోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ కూడా ఈ వివాదంపై స్పందించింది. కుల్‌దీప్‌ యాదవ్‌, రింకు సింగ్‌ ఇద్దరూ హార్ట్‌ సింబల్స్‌తో ఫోజ్‌ ఇస్తున్న వారి వీడియోను షేర్‌ చేసింది. ఆ వీడియోకు ‘ఓన్లీ ప్యార్‌’ అనే క్యాప్షన్‌ ఇచ్చింది. దీంతో ఈ చెంప‌ వివాదానికి తెర‌ప‌డిన‌ట్లే. కాగా ఈ మ్యాచ్‌లో రింకూ సింగ్ 36 ప‌రుగుల‌తో కీల‌క ఇన్నింగ్స్ ఆడ‌గా.. కుల్దీప్ మాత్రం ఒక్క వికెట్ కూడా సాధించ‌లేక‌పోయాడు.Only pyaar 🫰🫂 pic.twitter.com/bePBy6Y54E— Delhi Capitals (@DelhiCapitals) April 30, 2025

Waiting List Passengers Wont Be Allowed Inside Sleeper AC Coaches From May 1st5
ఆ టికెట్‌తో ఇక రైలు ఎక్కలేరు! మే 1 నుంచి కొత్త రూలు..

దేశంలో కోట్లాది మంది రైలు ప్రయాణికులను ప్రభావితం చేసే కొత్త రూల్‌ను భారతీయ రైల్వే ప్రవేశపెడుతోంది. రైళ్లలో ప్రయాణ సౌకర్యాన్ని పెంచడం, రిజర్వ్‌డ్‌ కోచ్‌లలో రద్దీని నివారించడం లక్ష్యంగా ఇండియన్‌ రైల్వే మే 1 నుండి కొత్త నిబంధనను అమలు చేస్తోంది. ఈ నిబంధన ప్రకారం వెయిటింగ్ లిస్ట్ టికెట్లు ఉన్న ప్రయాణికులను ఇకపై స్లీపర్, ఏసీ బోగీల్లో అనుమతించరు.వీరిపైనే ప్రభావంరైల్వే అమలు చేస్తున్న ఈ కొత్త మార్గదర్శకాలు ముఖ్యంగా రైల్వే కౌంటర్ల నుంచి వెయిటింగ్ లిస్ట్ టికెట్లు బుక్ చేసుకునే వారిపై ప్రభావం చూపనున్నాయి. ఐఆర్‌సీటీసీ, ఇతర అధీకృత వెబ్‌సైట్ల ద్వారా ఆన్‌లైన్‌ చేసుకున్న టికెట్లు కన్‌ఫర్మ్‌ కాకపోతే ఆటోమేటిక్‌ అవి రద్దవుతాయి. ఆఫ్‌లైన్‌లో రైల్వే కౌంటర్ల ద్వారా బుక్ చేసుకున్న టికెట్లు కన్‌ఫర్మ్‌ కాకపోయినప్పటికీ ప్రయాణికులు వాటితో రైలు ఎక్కే అవకాశం ఉండేది. అలా ఎక్కిన ప్రయాణికులు ఎక్కడైనా ఖాళీ ఉంటే టీటీఈ ద్వారా వాటిని పొందే వీలు ఉండేది. అయితే ఇలా ఎక్కువ మంది స్లీపర్ లేదా ఏసీ బోగీల్లోకి ప్రవేశించి అన్ రిజర్వ్ డ్ సీట్లను ఆక్రమించుకోవడం లేదా ఆయా కోచ్‌లలో రద్దీకి కారణమవుతున్నారు.టీటీఈలకు అధికారాలుకొత్త ఆదేశాల ప్రకారం.. ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్లకు (టీటీఈ) భారతీయ రైల్వే కొన్ని అధికారాలు ఇచ్చింది. వెయిటింగ్ లిస్ట్ టికెట్లతో రిజర్వ్‌డ్‌ స్లీపర్ లేదా ఏసీ సీట్లను ఆక్రమించుకున్న ప్రయాణికులకు జరిమానా విధించవచ్చు. అలాగే అటువంటి ప్రయాణికులను అన్‌రిజర్వ్‌డ్ టికెట్ హోల్డర్లు ప్రయాణించే జనరల్‌ కోచ్‌కు పంపించే అధికారం టీటీఈలకు ఉంటుంది.ఈ నిబంధన ఎందుకంటే..ప్రయాణికుల సౌకర్యార్థం ఈ నిబంధనను అమలు చేస్తున్నామని నార్త్ వెస్ట్రన్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ కెప్టెన్ శశికిరణ్ వివరించారు. వెయిటింగ్ టికెట్ హోల్డర్లు కోచ్‌లలోకి ప్రవేశించి రిజర్వ్‌డ్‌ సీట్లను బలవంతంగా ఆక్రమించుకుంటున్నారని, ప్రయాణికులు తిరిగేందుకు కూడా వీలులేకుండా మార్గాలను స్తంభింపజేస్తున్నారని తరచూ ఫిర్యాదులు వస్తున్నాయని పేర్కొన్నారు.ఈ కొత్త నిబంధనతో రైళ్లలో ఎక్కేందుకు వెయిటింగ్ లిస్ట్ టికెట్లపై ఆధారపడే ప్రయాణికులు తమ ప్రయాణ ప్రణాళికలను పునరాలోచించుకోవాల్సి ఉంటుంది. ఇకపై స్లీపర్, ఏసీ బోగీల్లో ప్రయాణించాలంటే కన్ఫర్మ్ టికెట్ తప్పనిసరి. లేదంటే మీ ట్రిప్ క్యాన్సిల్ చేసుకోవడమో లేదా జనరల్ అన్ రిజర్వ్‌డ్ క్లాస్ లో ట్రావెల్ చేయడమో చేయాల్సి ఉంటుంది.

Operation Kagar: CRPF Success Hoisting National Flag On Karreguttalu6
ఆపరేషన్‌ కగార్‌ సక్సెస్‌.. కర్రెగుట్టలపై జాతీయ జెండా

ములుగు, సాక్షి: తొమ్మిది రోజులపాటు కొనసాగిన ఆపరేషన్‌ కగార్‌లో భద్రతా బలగాలు మావోయిస్టులపై పైచేయి సాధించాయి. కర్రెగుట్టలపై మొత్తానికి పట్టు సాధించాయి. బుధవారం సాయుధ బలగాలు గుట్టలపై జాతీయ జెండాను ఎగరేశాయి. అంతేకాదు.. త్వరలో అక్కడ బేస్‌ క్యాంప్‌ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. కర్రెగుట్ట అటు ఛత్తీస్‌గఢ్‌ బీజాపూర్‌ జిల్లా ఊసూర్‌ బ్లాక్‌ పరిధిలో.. ఇటు ములుగు వాజేడు మండలం పరిధిలో విస్తరించి ఉన్నాయి. ఆపరేషన్‌ కగార్‌లో భాగంగా 10 వేలకు పైగా సాయుధ బలగాల సిబ్బందితో కర్రెలగుట్టను చుట్టుముట్టారు. డ్రోన్‌లు, హెలికాఫ్టర్‌లతో కూంబింగ్‌ కొనసాగించారు. ఈ క్రమంలో జరిగిన ఎదురు కాల్పుల్లో పలువురు మావోయిస్టులు మరణించిన సంగతీ తెలిసిందే.డీఆర్‌జీ బస్తర్ ఫైటర్, కోబ్రా, సీఆర్పీఎఫ్‌, ఎస్టీఎఫ్‌ సైనికులు ఈ కూంబింగ్‌లో పాల్గొన్నారు. ఈ క్రమంలో రాయ్‌పూర్‌ నుంచి ఆపరేషన్‌ను పర్యవేక్షించిన ఐబీ చీఫ్‌ ఇవాళ నేరుగా కర్రెలగుట్టకు చేరుకున్నట్లు సమాచారం. ఇప్పటిదాకా ఆపరేషన్‌లో పాల్గొన్న టీం మొత్తాన్ని వెనక్కి రప్పించి.. అక్కడికి కొత్త టీంను మోహరింపజేయనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే త్వరలో సీఆర్‌పీఎఫ్‌ అక్కడ బేస్‌ క్యాంప్‌ను ఏర్పాటు చేయనుంది. ఇటు తెలంగాణ, అటు ఛత్తీస్‌గఢ్‌లకు ఉపయోగపడేలా ఈ బేస్‌ ఉండనున్నట్లు సమాచారం.

Caste survey to be part of upcoming population census7
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు

ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. జనగణనలోనే కుల గణన కూడా చేయడానికి కేబినెట్ అంగీకారం తెలిపింది. వచ్చే జనాభా లెక్కల్లో కులగణనను చేరుస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది జనగణన చేపట్టాలని కేబినెట్‌ నిర్ణయించింది. దీనిలో భాగంగా జనగణనతో కలిపి కులగణన కూడా చేయడానికి నిశ్చయించింది. 2019లోనే జనగణన చేయాల్సి ఉన్నప్పటికీ కరోనా కారణంగా అప్పుడు ముందుడగు పడలేదు. దాంతో పాటు షిల్లాంగ్-సిల్చారు జాతీయ రహదారి నిర్మాణానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. 22,864 కోట్ల రూపాయల ఖర్చుతో 166 కిలోమీటర్ల మేర గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఫలితంగా త్రిపుర, మిజోరం, మణిపూర్, అస్సాంలోని బరాక్ వ్యాలీకి కనెక్టివిటీ పెరగనుంది. అదే సమయంలో చెరకు మద్దతు ధర క్వింటా రూ. 350 పెంపునకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కేబినెట్‌ భేటీ అనంతరం మంత్రి మండలి నిర్ణయాలను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.పహల్గామ్‌ పై నో డిస్కషన్‌.. ఓన్లీ సైలెన్స్‌అయితే ఈరోజు జరిగిన కేంద్ర కేబినెట్ భేటీలో పహల్గామ్ ఉగ్రదాడి ఘటనకు సంబంధించి కేబినెట్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అంతా భావించారు. అయితే నేటి భేటీలో ఆ ఉగ్రదాడి ఘటనకు సంబంధించి ఎటువంటి చర్చ లేకుండా భేటీ ముగిసింది. దీనిపై కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఎటువంటి ప్రకటన చేయలేదు. దాంతో దాడికి సంబంధించి ప్రతిచర్యలపై కేంద్రం మౌనం పాటిస్తూ ముందుకెళ్లడం కూడా వ్యూహాత్మక ఎత్తుగడగా విశ్లేషకులు భావిస్తున్నారు.కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఏమన్నారంటే..జన గణనలో కులగణన చేయాలని క్యాబినెట్ నిర్ణయంవచ్చే జనాభా లెక్కల్లో కుల గణన కాలమ్ చేర్చాలని నిర్ణయంబీహార్, బెంగాల్, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మోడీ కీలక నిర్ణయంకుల గణన కోసం ఎన్నో ఏళ్లుగా ఉద్యమాలు చేస్తున్న బిసి సంఘాలుకుల గణనను కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎప్పుడూ వ్యతిరేకిస్తూనే ఉన్నాయి.స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి జరిగిన అన్ని జనాభా గణన కార్యకలాపాలలో కులాన్ని చేర్చలేదు.కుల గణన అంశాన్ని కేబినెట్‌లో పరిశీలిస్తామని 2010లో అప్పటి ప్రధాని దివంగత డాక్టర్ మన్మోహన్ సింగ్ లోక్‌సభకు హామీ ఇచ్చారు.ఈ అంశాన్ని పరిశీలించేందుకు మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేశారు. చాలా రాజకీయ పార్టీలు కుల గణనను సిఫార్సు చేశాయి.కుల గణనకు బదులు సర్వే మాత్రమే చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఆ సర్వేనే SECC అంటారు.కాంగ్రెస్ మరియు దాని భారత కూటమి భాగస్వామ్య పక్షాలు కుల గణనను రాజకీయ సాధనంగా మాత్రమే ఉపయోగించుకున్నాయని బాగా అర్థమైంది.భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 246 ప్రకారం, సబ్జెక్ట్ సెన్సస్ ఏడవ షెడ్యూల్‌లోని యూనియన్ జాబితాలో 69గా జాబితా చేయబడింది. భారత రాజ్యాంగం ప్రకారం, జనాభా గణన అనేది యూనియన్ సబ్జెక్ట్.కొన్ని రాష్ట్రాలు కులాలను లెక్కించేందుకు సర్వేలు నిర్వహించాయి. కొన్ని రాష్ట్రాలు దీన్ని బాగా చేశాయి, మరికొన్ని పారదర్శకంగా రాజకీయ కోణం నుండి ఇటువంటి సర్వేలను నిర్వహించాయి.ఇలాంటి సర్వేలు సమాజంలో అనుమానాలకు తావిస్తున్నాయి.ఈ వాస్తవాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని, రాజకీయాల వల్ల మన సామాజిక వ్యవస్థకు భంగం కలగకుండా చూసేందుకు, కుల గణనను సర్వేలకు బదులు పారదర్శకంగా జనాభా గణనలో చేర్చాలి.ఇది దేశం పురోగమిస్తూనే మన సమాజం యొక్క సామాజిక మరియు ఆర్థిక నిర్మాణాన్ని బలోపేతం చేస్తుంది.ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీజీ నేతృత్వంలో, రాజకీయ వ్యవహారాల క్యాబినెట్ కమిటీ, ఈ రోజు (30 ఏప్రిల్, 2025) రాబోయే జనాభా గణనలో కుల గణనను చేర్చాలని నిర్ణయించింది.గతంలో మా ప్రభుత్వం సమాజంలోని ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10% రిజర్వేషన్లు ప్రవేశపెట్టినప్పుడు సమాజంలోని ఏ వర్గానికి ఒత్తిడి కలిగించకుండా మన ప్రభుత్వం మన సమాజం మరియు దేశం యొక్క విలువలు మరియు ప్రయోజనాలకు కట్టుబడి ఉందని ఇది నిరూపిస్తుంది.

Mumtaz: Dilip Kumar broke up with Madhubala because This Reason8
పిల్లలు పుట్టరని మధుబాలను వదిలేసిన స్టార్‌ హీరో.. చివరికేమైంది?

మొఘల్‌ ఇ ఆజామ్‌.. 1960లో వచ్చిన అద్భుతమైన సినిమా ఇది. సలీం, అనార్కలిగా దిలీప్‌ కుమార్‌ (Dilip Kumar), మధుబాల (Madhubala) నటించారు. ఆన్‌స్క్రీన్‌పై సూపర్‌ హిట్‌ జోడీగా పేరు తెచ్చుకున్న వీళ్లు నిజ జీవితంలో కూడా ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుని జీవితాంతం కలిసుండాలనుకున్నారు. దంపతులుగా కనిపిస్తారనుకుంటే విడిపోయిన ప్రేమ పక్షులుగా మారారు. అసలు ఈ జంట ​ఎందుకు విడిపోయిందన్న విషయాన్ని ప్రముఖ నటి ముంతాజ్‌ తాజాగా ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది.పిల్లలు పుట్టరని..ముంతాజ్‌ మాట్లాడుతూ.. మధుబాల దిలీప్‌కు బ్రేకప్‌ చెప్పలేదు. అతడే ఆమెతో ప్రేమబంధాన్ని తెంచేసుకున్నాడు. తనకు పిల్లలు పుట్టరని వదిలేసి.. సైరా భానును పెళ్లి చేసుకున్నాడు. సైరా ఎంతో మంచి మనిషి. దిలీప్‌ అంటే ఆమెకు ఎంతో అభిమానం, ప్రేమ. అతడి చివరి శ్వాస వరకు ఎంతో జాగ్రత్తగా చూసుకుంది. వీళ్లిద్దరి మధ్య వయసు వ్యత్యాసం ఎక్కువ. కానీ ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ వల్లే జీవితాంతం కలిసి కొనసాగారు.మొఘల్‌ ఇ ఆజామ్‌ సినిమాలో ఓ దృశ్యంఅందుకే వదిలేశాడుదిలీప్‌కు పిల్లలంటే ఇష్టం. పిల్లలు కావాలన్న కోరికతోనే సైరాను పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం నాకు స్వయంగా మధుబాల చెప్పింది. అప్పుడప్పుడు తనను కలుస్తూ ఉండేదాన్ని. తను సంతోషంగా కనిపించేది కాదు. నాతో ఏమనేదంటే.. జీవితంలో నేను ప్రేమించిన ఏకైక వ్యక్తి యూసఫ్‌ (దిలీప్‌ కుమార్‌ను యూసఫ్‌ అని పిల్చుకునేది). నేను ఎప్పటికీ తల్లిని కానని తెలిసి నన్ను ఒంటరిగా వదిలేశాడు. నాకున్న గుండె సమస్య వల్ల పిల్లల్ని కంటే నేను బతకనని చెప్పారు.ఏనాడూ నిందించలేదుఅందుకే ఇలాంటి పరిస్థితి వచ్చింది. అయినా ఏ మగవాడికైనా పిల్లలు కావాలని ఉంటుంది కదా.. ఇందులో అతడి తప్పేముందిలే అనుకునేదే తప్ప దిలీప్‌ను నిందించేది కాదు. కానీ విషాదమేంటంటే.. దిలీప్‌- సైరా భానులకు సంతానమే లేదు. ఈ విషయంలో సైరాను చూస్తుంటే బాధగా అనిపించేది. కనీసం ఒక్కరైనా పుట్టుంటే వాళ్లెంతో మురిపెంగా చూసుకునేవాళ్లు అని ముంతాజ్‌ చెప్పుకొచ్చింది.వేర్వేరు దారుల్లో ప్రేమజంటదిలీప్‌ కుమార్‌ - మధుబాల దాదాపు దశాబ్దంపాటు కలిసున్నారు. వీరి బ్రేకప్‌ అనంతరం మధుబాల.. 1960లో కిషోర్‌ కుమార్‌ను పెళ్లి చేసుకుంది. 1969లో గుండెపోటుతో మరణించింది. దిలీప్‌ కుమార్‌ 1966లో తనకంటే 22 ఏళ్లు చిన్నదైన సైరా భానును పెళ్లి చేసుకున్నాడు. 1981లో రెహ్మాన్‌ను రెండో పెళ్లి చేసుకోగా 1983లో ఈమెకు విడాకులిచ్చేశాడు. తర్వాత సైరా భానుతోనే కలిసున్న దిలీప్‌ కుమార్‌ 2021లో మరణించాడు.చదవండి: అమ్మ చనిపోయి 5 నెలలు.. వీడియో డిలీట్‌ చేయమని అడుక్కున్నా: సోహైల్‌

Meet Minkuri Ridhima Reddy Life in an IIT Medicine or Engineering9
'మైండ్‌బ్లోయింగ్‌ టాలెంట్‌'..! అటు ఇంజనీరింగ్‌, ఇటు మెడిసిన్‌..

జేఈఈ, నీట్‌ యూజీ వంటి ప్రతిష్టాత్మక పరీక్షలు ఎంత కఠినంగా ఉంటాయో తెలిసిందే. ఇందులో మంచి ర్యాంకు తెచ్చుకోవడం అనేది ఎందరో యువత కల. ఇంజనీరింగ్‌ వాళ్లు, జేఈఈ, మెడిసిన్‌ వాళ్లు నీట్‌ రాయడం జరుగుతుంది. అయితే ఈ అమ్మాయికి ఇంజనీరింగ్‌, మెడిసిన్‌ రెండూ ఇష్టమట. నిజానికి ఈ రెండు రంగాలు అత్యంత విరుద్ధమైనవి. ఏదో ఒక్కదాంట్లో రాణించడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. అలాంటిది ఏకంగా రెండింటిలోనూ బాగా రాణించడమే గాక రెండింటికి సంబంధించిన ఎంట్రెన్స్‌ టెస్ట్‌ల్లో కూడా మంచి ర్యాంకు సాధించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. పైగా అవి రెండు మిక్స్‌అయ్యి ఉండే కోర్సును అందించే కాలేజ్‌ కోసం అన్వేషించి మరీ అక్కడ సీటు సంపాదించింది. ఎంచక్కా చదివేస్తోంది కూడా. ఇంతకీ ఆ 'టాలెంటెడ్‌ గర్ల్‌' ఎవరంటే..?మన హైదరాబాద్‌కి చెందిన అమ్మాయి మింకూరి రిధిమా రెడ్డి. 10వ తరగతి వరకు తేజస్వి విద్యారణ్యలో, ఇంటర్‌ జాన్సన్ గ్రామర్ స్కూల్‌లో చదువుకుంది. ఆ తర్వాత జేఈఈ, నీటీ యజీ, బిట్‌శాట్‌, వీఐటీఈఈఈ వంటి ప్రతిష్టాత్మక పరీక్షలన్నీ రాసింది. వాటన్నింటిలోనూ రిధిమాకు మంచి మార్కులే వచ్చాయి. అయితే ఆమె ఇంజనీరింగ్‌(Engineering), మెడిసిన్‌(Medicine) రంగాలు రెండూ.. అమిత ఇష్టం. అవి రెండు తనకు ఎంతో ఇంట్రస్టింగ్‌ సబ్జెక్టులని చెబుతోంది రిధిమా. అందుకోసం అని అవి రెండూ కలిపి అందించే కాలేజ్‌ల కోసం అన్వేషించి మరీ ఐఐటీ మద్రాస్‌ని సెలెక్ట్‌ చేసుకుంది. అక్కడ జాయిన్‌ అయ్యేందుకు ఐఐఎసీఈఆర్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌(ఐఏటీ)కి హాజరు కావాలని నిర్ణయించుకుంది. రిధిమా అనుకున్నట్లుగానే ఆ టెస్ట​లో మెరుగ్గా రాణించి ఆ కాలేజ్‌లో సీటు సంపాదించింది. అలా రిధిమా 2023లో ఐఐటీ మద్రాస్‌( IIT Madras)లో మెడికల్ సైన్స్, ఇజనీరింగ్‌ సైన్స్‌ కలగలిసిన కోర్సులో జాయిన్‌ అయ్యింది. ప్రస్తుతం రెండో సంవత్సరం చదువుతోంది. ఈ మేరకు రిధిమా మాట్లాడుతూ..తాను ఐఐటీ మద్రాస్‌లోని iGEM (ఇంటర్నేషనల్ జెనెటికల్లీ ఇంజనీర్డ్ మెషిన్) బృందంలో భాగం అని చెప్పుకొచ్చింది. ఇది జన్యుశాస్త్రం, పరిశోధన పట్ల అమిత ఇష్టమైన టీమ్‌ అని చెప్పుకొచ్చింది. తాము ప్రది ఏడాది జన్యు ఇంజనీరింగ్ ఆధారిత ప్రాజెక్ట్‌పై పనిచేస్తామని పేర్కొంది. ఆ ప్రాజెక్ట్‌లను పారిస్‌లోని గ్రాండ్ జాంబోరీలో ప్రదరిస్తామని తెలిపింది. తాను ఈ ఐఐటీలో ఉండటం వల్లే ప్రజలతో మరింత సమర్ధవంతంగా కమ్యూనికేట్‌ చేయడం సహకరించం నేర్చుకున్నాని అంటోంది. అలాగే క్లబ్‌లు, టెక్నికల్ టీమ్‌లలో పాల్గొనడం, ఈవెంట్‌ల నిర్వహించడం వల్ల కంఫర్ట్‌జోన్‌ నుంచి బయటపడటమే గాక సామాజికంగా ఎలా వ్యవహరించాలో తెలుసుకోగలిగానని చెబుతోంది.(చదవండి: సివిల్స్‌లో సక్సెస్‌ కాలేదు.. కానీ బిజినెస్‌లో ఇవాళ‌ ఆ ఇద్దరూ..!)

Telangana Class 10 results to release today10
తెలంగాణ టెన్త్‌ ఫలితాలు విడుదల.. ఒక్క క్లిక్‌తో చెక్‌ చేస్కోండిలా

సాక్షి,హైదరాబాద్‌ : తెలంగాణ పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. బుధవారం మధ్యాహ్నాం రవీంద్ర భారతిలో జరిగిన కార్యక్రమంలో సీఎం రేవంత్‌ రెడ్డి, భట్టి ఇతరులు టెన్త్‌ ఫలితాలను విడుదల చేశారు. మొత్తం ఐదు లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాయగా.. 92.78 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ప్రకటించారు. గురుకులాల్లో 98 శాతం, ఆశ్రమ పాఠశాలల్లో 95 శాతం, ప్రైవేట్‌ పాఠశాలల్లో 94.12 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. మొత్తంగా.. గతేడాది కంటే 1.47 శాతం అధికంగా ఉత్తీర్ణత సాధించినట్లు విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. విద్యార్థులు తమ టెన్త్ ఫలితాలను కింద ఇచ్చిన సాక్షి అధికారిక ఎడ్యుకేషన్‌ వెబ్‌ సైట్‌లో పొందవచ్చు. 👇 👉Server 1 https://results2.sakshieducation.com/Results2025/telangana/SSC/2025/ts-ssc-10th-class-results-2025.html👉Server 2 https://education.sakshi.com/sites/default/files/exam-result/TS-SSC-10th-Class-Results-2025-Direct-Link.html👉Server 3 http://results1.sakshieducation.com/results/SSC/ts-10th-class-results-2025.htmlసరికొత్త విధానం..కాగా.. ఈసారి గ్రేడింగ్ స్థానంలో మార్కుల మెమోలపై సబ్జెక్ల వారీగా మార్కులు, గ్రేట్లను ఇచ్చారు. ఈమేరకు కొత్త మెమో నమూనాను కూడా విద్యాశాఖ విడుదల చేసింది. ఉమ్మడి రాష్ట్రంలో మార్కుల విధానాన్ని తొలగించి గ్రేడింగ్ విధానాన్ని అమలులోకి తెచ్చిన విషయం తెలిసిందే. 2009 నుంచి ఈ విధానం అమలులోకి వచ్చింది. ఏ-1, ఏ-2, బీ-1,బీ-2, సీ-1, సీ-2, డి, ఈలుగా గ్రేడ్‌లను ఇచ్చేవారు. సబ్జెక్ట్‌ల వారీగా గ్రేడ్లతో పాటు సీజీపీఏ ఇచ్చేవారు. అయితే ఇప్పుడు అనూహ్యంగా ఈ విధానాన్ని తొలగించి సీజీపీఏ కాకుండా సబ్జెక్టులవారీగా మార్కులు, గ్రేడ్లు ఇవ్వాలని విద్యాశాఖ నిర్ణయించింది. అయితే విద్యావేత్తలు, ఉపాధ్యాయ సంఘాలు, తల్లిదండ్రులు, విద్యార్థులతో చర్చించకుండానే సరికొత్త విధానాన్ని అమలు చేయడం పట్ల అనేక ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement