Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Waqf Amendment Act Hearing Live Updates April 17th Updates1
వక్ఫ్‌ ఆస్తుల్లో ఎలాంటి మార్పు చేయొద్దు: సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ, సాక్షి: వక్ఫ్‌ సవరణ చట్టం 2025పై దేశసర్వోన్నత న్యాయస్థానం గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. వక్ఫ్‌పై సమాధానం ఇచ్చేందుకు కేంద్రం వారం గడువు కోరగా.. న్యాయస్థానం అందుకు అంగీకరించింది. వక్ఫ్ ఆస్తులు, నియామకాలపై సుప్రీంకోర్టు స్టేటస్ కో విధిస్తూ తదుపరి విచారణను మే 5వ తేదీకి వాయిదా వేసింది. వక్ఫ్‌ (సవరణ) చట్టం 2025ను సవాల్‌ చేస్తూ 73 పిటిషన్లు నమోదు కాగా.. గురువారం వరుసగా రెండో రోజూ సుప్రీం కోర్టు వాదనలు వింది. కొన్ని అంశాలతో ప్రాథమిక సమాధానం ఇవ్వడానికి కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వారం గడువు కోరారు. తదుపరి విచారణ వరకు వక్ఫ్‌ ఆస్తులను డీనోటిఫై చేయబోమని తెలిపారు. ఈ క్రమంలో.. వక్ఫ్‌ ఆస్తుల్లో ఎలాంటి మార్పు చేయొద్దని సీజేఐ నేతృత్వంలోని బెంచ్‌ ఆదేశాలు జారీ చేసింది. ‘‘వక్ఫ్‌ బోర్డులో నూతన నియామకాలు చేయొద్దు. వక్ఫ్‌ కౌన్సిల్‌లో ముస్లిమేతరులను సభ్యులుగా నియమించొద్దు. వక్ఫ్, వక్ఫ్ బై యూజర్ ఆస్తులను డీ నోటిఫై చేయొద్దు వక్ఫ్ ఆస్తులు, నియామకాలపై స్టేటస్ కో విధిస్తున్నాం. పిటిషనర్లు లేవనెత్తిన అంశాలకు వారం రోజుల్లో సవివర రిప్లై దాఖలు చేయాలి. మరో ఐదు రోజుల్లో రిజైన్డర్ దాఖలు చేయాలి’’ అని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ సంజయ్‌ కుమార్, జస్టిస్‌ కె.వి.విశ్వనాథన్‌ల త్రిసభ్య ధర్మాసనం ఆదేశించింది. గత విచారణలో(బుధవారం).. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వక్ఫ్ సవరణ చట్టం మత స్వేచ్ఛ హక్కుకు భంగం కలిగిస్తుందిఇది రాజ్యాంగ విరుద్ధమైన చట్టంవక్ఫ్ అంటే ఇస్లాం కు అంకితమైందికేంద్రప్రభుత్వం తరఫు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలుజేపిసీ ద్వారా సంపూర్ణంగా అన్ని వర్గాలతో చర్చలు జరిపామువక్ఫ్ అనేది కేవలం చారిటీకి సంబంధించినది మాత్రమేహిందూ ధార్మిక సంస్థలను కూడా ప్రభుత్వాలు నిర్వహిస్తున్నాయిహిందూయేతర అధికారులు హిందూ ధార్మిక సంస్థలను నిర్వహిస్తున్నారువక్ఫ్ భై యూజర్ ద్వారానే అనేక మసీదులను ఏర్పాటు చేశారురిజిస్టర్ చేసుకోవడంలో మసీదులకున్న అభ్యంతరం ఏమిటి సుప్రీంకోర్టు సీజేఐ వ్యాఖ్యలుసుదీర్ఘకాలంగా ముస్లిం కార్యక్రమాలకు వాడుతున్న (వక్ఫ్ బై యూజర్) ఆస్తులను డినోటిఫై చేస్తే అనేక సమస్యలు తలెత్తుతాయివక్ఫ్ బై యూజర్ ఆస్తులను రిజిస్టర్ చేయడం కష్టం..అయితే ఇది దుర్వినియోగమైందిఅయితే నిజంగా ముస్లిం ధార్మిక కార్యక్రమాలకు ఉపయోగిస్తున్న ఆస్తులు కూడా ఉన్నాయిహిందువుల ఆస్తులను హిందువులే నిర్వహిస్తున్నారు కదాపార్లమెంటుకు చట్టాలు చేసే అధికారం లేదా ?హిందువుల కోసం కూడా పార్లమెంట్ చట్టాలు చేస్తుంది కదాఢిల్లీ హైకోర్టు కూడా వక్ఫ్ భూమి లోనే ఉందని అంటున్నారు చారిత్రక , పురావస్తు ఆస్తులను వక్ఫ్ గా ప్రకటించడానికి వీలు లేదువక్ఫ్‌ పిటిషన్లపై విచారణ వేళ.. హైలైట్స్‌అంతకు ముందు.. వక్ఫ్ పిటిషన్ల విచారణను లైవ్ టెలికాస్ట్ కోరుతూ సుప్రీంకోర్ట్ బార్ అసోసియేషన్ లేఖ రాసింది. బుధవారం విచారణ టైంలో కిక్కిరిసిపోయిన కోర్టు హాల్‌లో కనీసం నిలబడటానికి కూడా స్థలం సరిపోలేదని, ఊపిరి ఆడక ఇద్దరు లాయర్లు స్పృహ కోల్పోయారని లేఖలో ప్రస్తావించింది.సుప్రీంకోర్టు మార్గదర్శకాలపై ఎమ్మెల్సీ అమీర్ అలీ ఖాన్ హర్షంహైదరాబాద్‌: వక్ఫ్ (సవరణ) బిల్లుపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలపై ఎమ్మెల్సీ అమీర్ అలీ ఖాన్ హర్షం వ్యక్తం చేశారు. సుప్రీం కోర్టు వైఖరి దేశవ్యాప్తంగా ముస్లింలకు ఊరట కలిగించిందన్నారు. న్యాయ వ్యవస్థపై విశ్వాసం మరింత బలోపేతం చేసిందన్నారు. వక్ఫ్‌ సవరణ చట్టంపై సుప్రీంలో జరిగిన పరిణామాలను స్వాగతిస్తున్నామన్నారు. 👉అధికారంలోకి రాగానే వక్ఫ్‌ చట్టాన్ని అడ్డుకుంటాం. బీహార్‌ను వక్ఫ్‌ అల్లర్లతో మరో బెంగాల్‌(ముర్షిదాబాద్‌)గా మార్చాలని వాళ్లు(కేంద్రంలోని బీజేపీ) అనుకుంటున్నారు. ఆర్జేడీ నాయకత్వంలో అది అయ్యే పని కాదు అని తేజస్వి యాదవ్‌ అన్నారు. 👉వక్ఫ్‌ చట్టం దేశ ప్రజల మధ్య ఐక్యతను క్రమంగా తుడిచిపెట్టేందుకేనని కేంద్రంలోని ఎన్డీయే సర్కారు వక్ఫ్‌ సవరణ చట్టం తెచ్చిందని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ఆరోపించారు. ఇది ఫెడరలిజాన్ని, రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 26ను ఉల్లంఘించడమేనని అన్నారాయన. రాజ్యాంగ విరుద్ధమైన ఈ చర్య ద్వారా.. ఆరెస్సెస్‌, బీజేపీలు వక్ఫ్‌ చట్టం ద్వారా రాజకీయ ప్రయోజనాలు పొందాలని చూస్తున్నాయని విమర్శించారు. ఇండియా కూటమి.. కలిసి పోరాడుదాంరాజ్యాంగ విరుద్ధమైన వక్ఫ్‌ సవరణ చట్టం అడ్డుకునేందుకు ప్రతిపక్ష కూటమి ఇండియా కలిసి రావాలని పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ పిలుపు ఇచ్చారు. సొంత దేశంలో ముస్లింలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న మోదీ ప్రభుత్వం.. సౌదీ అరేబియా, దుబాయ్‌ లాంటి పశ్చిమ ఆసియా దేశాల నుంచి ఆతిథ్యం మాత్రం స్వీకరిస్తున్నారని మండిపడ్డారు. ఏకతాటిపైకి వచ్చి వక్ఫ్‌ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఇండియా కూటమి పార్టీలు పోరాడాలని ఆమె అంటున్నారు.

TG High Court Breaks Group 1 Appointments2
TG: గ్రూప్ -1 నియామకాలకు హైకోర్టు బ్రేక్‌!

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 1 నియామకాలకు సంబంధించి తాత్కాలిక బ్రేక్ పడింది. గ్రూప్ 1 పరీక్షల్లో అనేక అవతవకలు జరిగాయని హైకోర్టులో 20 పిటిషన్ల వరకూ దాఖలు కావడంతో వాటిపై విచారణ చేపట్టిన హైకోర్టు.. నియామకాలకు తాత్కాలిక బ్రేక్ వేసింది. ఈ మేరకు గురువారం విచారణ చేపట్టిన హైకోర్టు.. నియామకాలను తాత్కాలికంగా నిలిపివేయాలని స్సష్టం చేసింది. విచారణ పూర్తయ్యే వరకూ నియామక పత్రాలు ఇవ్వొద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. అయితే సర్టిఫికేషన్ వెరిఫికేషన్ కొనసాగించవచ్చని హైకోర్టు తెలిపింది. పోస్టింగ్ లు మాత్రం తుది తీర్పు వెలువడే వరకూ ఇవ్వొద్దని క్లియర్ గా స్పష్టం చేసింది. కాగా, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో గ్రూప్‌ 1 పరీక్ష ప్రశ్నాపత్రం లీకవడంతో రద్దయింది. తర్వాత కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రూప్‌-1 పరీక్షను మళ్లీ నిర్వహించింది. అయితే పరీక్షను వాయిదా వేయాలని కొందరు అభ్యర్థులు డిమాండ్‌ చేసినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకుండా పరీక్ష నిర్వహించింది. దీనిపై సుప్రీంకోర్టు గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడంతో ఫలితాలు విడుదల చేయడానికి ఎటువంటి ఆటంకం ఏర్పడలేదు. అయితే గ్రూప్‌-1 సరీక్షల్లో అవతవకలు జరిగాయని పలు పిటిషన్లు దాఖలు కావడంతో నియామకాలను తాత్కాలికంగా నిలిపివేయాలని హైకోర్టు ఆదేశించింది. యథావిధిగా సర్టిఫికేట్‌ వెరిఫికేషన్‌ చేసుకోవచ్చని, కాకపోతే తుది తీర్పు ఇచ్చే వరకూ పోస్టింగ్‌లు ఇవ్వొద్దని హైకోర్టు తన ఆదేశాల్లో పేర్కొదది. దాంతో తమ నియామకాల కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న అభ్యర్థుల్లో నిరాశ అలముకుంది. మళ్లీ గ్రూప్‌-1 పరిస్థితి ఇలా టర్న్‌ తీసుకుందేమిటని అభ్యర్థుల్లో ఆందోళన మొదలైంది.

IPL 2025: Gujarat Titans Roped In Dasun Shanaka As A Replacement Of Injured Glenn Phillips3
IPL 2025: గ్లెన్‌ ఫిలిప్స్‌కు ప్రత్యామ్నాయ ఆటగాడు అతడే..!

ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో టేబుల్‌ సెకెండ్‌ టాపర్‌గా ఉన్న గుజరాత్‌ టైటాన్స్‌ తమ గాయపడిన ఆటగాడు గ్లెన్‌ ఫిలిప్స్‌కు ప్రత్యామ్నాయ ఆటగాడిగా శ్రీలంక పరిమిత ఓవర్ల మాజీ కెప్టెన్‌ దసున్‌ షనకను ఎంపిక చేసుకుంది. షనక 2023 సీజన్‌లో కూడా గుజరాత్‌ టైటాన్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. ఈ సీజన్‌ మెగా వేలంలో షనక అన్‌ సోల్డ్‌గా మిగిలిపోయినప్పటికీ.. ఫిలిప్స్‌ గాయపడటంతో అతనికి అవకాశం వచ్చింది. షనక త్వరలోనే గుజరాత్‌ టైటాన్స్‌తో జతకడతాడని సమాచారం. షనక 2023 సీజన్‌లో గుజరాత్‌ తరఫున 3 మ్యాచ్‌లు ఆడి కేవలం 26 పరుగులే చేశాడు. పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ అయిన షనకకు ఆ సీజన్‌లో బౌలింగ్‌ చేసే అవకాశం రాలేదు. 2023 సీజన్‌లో గుజరాత్‌ హార్దిక్‌ పాండ్యా నేతృత్వంలో రన్నరప్‌గా నిలిచింది. షనక ఈ ఏడాది ఇంటర్నేషనల్‌ టీ20 లీగ్‌ (దుబాయ్‌) టైటిల్‌ గెలిచిన దుబాయ్‌ క్యాపిటల్స్‌ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. 33 ఏళ్ల కుడి చేతి వాటం ఆల్‌రౌండర్‌ అయిన షనక శ్రీలంక తరఫున 6 టెస్ట్‌లు, 71 వన్డేలు, 102 టీ20లు ఆడాడు. షనక టెస్ట్‌ల్లో ఓ హాఫ్‌ సెంచరీ 13 వికెట్లు.. వన్డేల్లో 2 సెంచరీలు, 4 హాఫ్‌ సెంచరీలు, 27 వికెట్లు.. టీ20ల్లో 5 హాఫ్‌ సెంచరీలు, 33 వికెట్లు తీశాడు. షనక వన్డేల్లో ఓ ఐదు వికెట్ల ప్రదర్శన కూడా నమోదు చేశాడు. షనక తన ఐపీఎల్‌ కెరీర్‌ మొత్తంలో గుజరాత్‌ తరఫునే మూడు మ్యాచ్‌లు ఆడాడు.ఫిలిప్స్‌ విషయానికొస్తే.. ఈ సీజన్‌లోనే సన్‌రైజర్స్‌ నుంచి గుజరాత్‌కు వచ్చిన ఫిలిప్స్‌ ఈ సీజన్‌లో ఒక్క మ్యాచ్‌ కూడా ఆడలేదు. ఏప్రిల్‌ 6న సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫిలిప్స్‌ గాయపడ్డాడు. గాయం తీవ్రమైంది కావడంతో ఫిలిప్స్‌ సీజన్‌ మొత్తానికే దూరమ్యాడు.గుజరాత్‌ ఈ సీజన్‌ను నిదానంగా ఆరంభించి ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతుంది. ఆ జట్టు ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లో 4 విజయాలు సాధించి, రెండింట ఓటమిపాలైంది. గుజరాత్‌ తమ తదుపరి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌ ఏప్రిల్‌ 19న అహ్మదాబాద్‌లో జరుగనుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఢిల్లీ క్యాపిటల్స్‌ అగ్రస్థానంలో ఉంది. ఢిల్లీ ఈ సీజన్‌లో 6 మ్యాచ్‌లు ఆడి ఐదింట గెలిచింది. ఆర్సీబీ, పంజాబ్‌ చెరో 6 మ్యాచ్‌లు ఆడి తలో 4 విజయాలతో మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి. లక్నో, కేకేఆర్‌, ముంబై ఇండియన్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌, సన్‌రైజర్స్‌, సీఎస్‌కే వరుసగా ఐదు నుంచి పది స్థానాల్లో నిలిచాయి.

Bengaluru Man Rs 50 Crore Dog Turns ED Raids4
రూ. 50 కోట్ల కుక్క.. ఈడీ దాడులు!

ఏదైనా గొప్పలకు పోతే ఇలానే ఉంటుంది. గొప్పగా బ్రతకొచ్చు.. నీ గొప్పను అవతలి వాడు చెప్పుకోవాలి.. అంతేకానీ మనకు అవకాశం దొరికింది కదాని లేనిపోని గొప‍్పలకు పోతే ఇలానే ఉంటుంది. ఓ వ్యక్తి గొప్పలకు పోయాడు. తాను ఓ కుక్కును పెంచుకుంటున్నాడు. అది సహజమే. కాకపోతే ఆ కుక్క విలువ రూ. 50 కోట్లు అంటూ గొప్పలకు పోయాడు. నిజంగానే ఆ కుక్క విలువ రూ. 50 కోట్లు ఉంటుందో లేదో తెలీదు కానీ, ఇక్కడ ఆ మనిషి నోరు జారిన ‘గొప్ప’ ఈడీ రైడ్స్ వరకూ వెళ్లింది.విషయంలోకి వెళితే.. తాను అత్యంత ఖరీదు అని చెప్పుకునే కుక్కను తీసుకుని గత ఫిబ్రవరిలో ఓ షోకు వెళ్లాడు సతీష్ అనే వ్యక్తి. అక్కడ తన కుక్క విలువ రూ. 50 కోట్లంటూ ఏవో గొప్పలు చెప్పుకున్నాడు. ఇదొక అరుదైన జాతి కుక్క అని, దీని విలువ లక్షరాల రూ. 50 కోట్లని బహిరంగంగా ప్రకటించాడు. ఇది ఆనోట ఈనోట మారి ఈడీ వరకూ వెళ్లింది. ఫిబ్రవరిలో ఏదో చెప్పుకున్నాడు.. కానీ ఈడీ ఓ కన్నేసి ఉంచింది. అతనికి రెండు నెలల తర్వాత సోదాల పేరుతో వెళ్లింది. కుక్కనే అంత పెట్టి కొన్నాడంటే ఇంక ఎంత ఉంటుందో అని ఈడీ లెక్కలు వేసుకుంది. అంతే అతనికి ఇంటికి గురువారం వెళ్లి సోదాలు చేపట్టింది.ఈ క్రమంలోనే అతనికి సంబంధించి అన్నీ ఆరాలు తీసింది. అతని బ్యాంకు అకౌంట్లను క్షుణ్ణంగా పరిశీలించింది. అయితే పెద్ద మొత్తంలో ఏమీ లావాదేవీలను జరగలేదని విషయాన్ని గుర్తించింది. కుక్కను రూ. 50 కోట్లను పెట్టి కొనుగోలు చేసినట్లు అతను చెప్పిన కోణంలో సమగ్రంగా దర్యాప్తు చేసింది. అయితే అతను లావాదేవీల్లో అంత పెద్ద మొత్తాన్ని ఈడీ గుర్తించలేదు. హవాలా రూట్ లో ఏమైనా చేశాడా.. అనే కోణాన్ని ఈడీ దర్యాప్తు చేసినట్లు తెలుస్తోంది.

Can Anyone Get a Free New Five Star AC Under PM Modi AC Yojana Here Are the Discounts and Other Details5
పీఎం మోదీ ఏసీ యోజన: కొత్త AC కొనుగోలుపై డిస్కౌంట్

ప్రతి ఏటా వేసవిలో ఎండ తీవ్రత విపరీతంగా పెరిగిపోతోంది. దీంతో ఏసీ అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. 2021-22లో 84 లక్షలు.. 2023-24 నాటికి 1.1 కోట్ల ఏసీలు అమ్ముడైనట్లు కొన్ని గణాంకాల ద్వారా తెలుస్తోంది. ఏసీల విక్రయాలు పెరుగుతున్న సమయంలో.. విద్యుత్ వినియోగం ఎక్కువవుతోంది. ఈ వినియోగాన్ని కొంత వరకు తగ్గించడానికి.. ప్రభుత్వం 'పీఎం మోదీ ఏసీ యోజన' స్కీమ్ అమలు చేయడానికి సిద్ధమవుతున్నట్లు ప్రముఖ ఆంగ్ల మీడియా కథనాలు వెల్లడించాయి.ప్రధానమంత్రి మోదీ ఏసీ యోజన 2025 అమలు కోసం చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే పీఎం మోదీ ఏసీ యోజన పథకాన్ని.. విద్యుత్ మంత్రిత్వ శాఖ, బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (BEE) మిర్వహించనుంది. ఈ స్కీమ్ ప్రధాన ఉద్దేశ్యం ఏమిటంటే.. విద్యుత్ ఆదా చేయడమే. కొత్త ఏసీ.. పాత ఏసీ కంటే కొంత తక్కువ కరెంట్ వినియోగిస్తుంది. కాబట్టి ఎలక్ట్రిక్ బిల్ తగ్గుతుంది.బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (BEE) ప్రకారం, పాత ఏసీని ఫైవ్ స్టార్-రేటెడ్ మోడల్‌తో రీప్లేస్ చేసుకోవడం వల్ల ఒక ఇంటికి సంవత్సరానికి రూ. 6,300 వరకు విద్యుత్ బిల్లు ఆదా అవుతాయి. కుటుంబాలకు ఖర్చులను తగ్గించడంతో పాటు, ఇది పవర్ గ్రిడ్‌పై కూడా ఒత్తిడిని తగ్గిస్తుంది.పీఎం మోదీ ఏసీ యోజన అమలులోకి వచ్చిన తరువాత, ఈ స్కీమ్ కింద.. ఎక్కువ విద్యుత్ వినియోగించే లేదా పాత ఏసీని స్థానంలో 5 స్టార్ రేటెడ్ ఏసీని రీప్లేస్ చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల విద్యుత్ వినియోగం తగ్గుతుంది, తద్వారా కరెంట్ బిల్ తగ్గుతుంది. అంతే కాకుండా ఈ స్కీమ్ కింద ఏసీ కొనుగోలు చేస్తే.. డిస్కౌంట్ కూడా పొందవచ్చు.ఈ స్కీమ్ కింద కొత్త 5 స్టార్ ఏసీ పొందటం ఎలా?➤ఎక్కువ విద్యుత్ వినియోగించే ఏసీని గుర్తింపు కలిగిన రీసైక్లింగ్ కేంద్రంలో ఇవ్వండి. వారు మీకు ఒక సర్టిఫికెట్ అందిస్తారు. దీనిని ఉపయోగించి.. కొత్త ఏసీ కొనుగోలుపై తగ్గింపు పొందవచ్చు.➤బ్లూ స్టార్, ఎల్‌జీ, వోల్టాస్ వంటి పెద్ద ఏసీ బ్రాండ్స్ కూడా పాత ఏసీకి బదులుగా కొత్త ఏసీ కొనుగోలు చేసే కస్టమర్లకు డిస్కౌంట్ అందిస్తాయి.➤పాత ఏసీ స్థానంలో కొత్త ఏసీ వినియోగించేవారి.. విద్యుత్ బిల్లులో కూడా కొంత తగ్గింపు ఇవ్వడానికి ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. దీనికోసం విద్యుత్ పంపిణీ సంస్థలతో చర్చించనుంది.ఇదీ చదవండి: టోల్ కలెక్షన్ విధానంలో సంచలన మార్పు: 15 రోజుల్లో అమలు!

Elon Musk reaches out to women to have babies Report6
నరుడా.. ఓ నరుడా.. డోనరుడా..!

ఎలాన్‌ మస్క్.. ఈ పేరు ప్రపంచానికి పరిచయం అక్కర్లేని పేరు. ఆయన టెస్లా, స్పేస్ ఎక్స్ వంటి కంపెనీలకు అధిపతి. ఒక వ్యాపారవేత్తగానే కాకుండా ఆవిష్కరణ వేత్తగా కూడా పేరు సంపాదించారు. ప్రపంచ కుబేరుల్లో ఒకరు మస్క్‌. అయితే తన వారసత్వం తనతో ఆగిపోకూడదనే తపన కూడా ఆయనలో ఎక్కువగానే ఉంది. ప్రపంచానికి తనలాంటి మేధావులు మళ్లీ మళ్లీ పరిచయం కావాలంటే ఏం చేయాలనే ఆలోచన కూడా ఆయనకు ఎప్పుడో వచ్చిందట. దీనిలో భాగంగా తన తర్వాత తరాన్ని తయారు చేసే పనిలో పడ్డారట ఎలాన్‌ మస్క్‌. ప్రపంచ జనాభా పెంచే పనిలో మస్క్‌అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) క్యాబినెట్ లో కీలక పదవిలో ఉన్న ఎలాన్ మస్క్.. తన వీర్యాన్ని దానం చేసే పనిలో ఉన్నారని తాజా కథనాల సారాంశం. ఒకవైపు డొనాల్డ్ ట్రంప్ తన కాస్ట్ కటింగ్ లతో ప్రపంచానికి నిద్రపట్టనివ్వకుండా చేస్తుంటే.. మస్క్ మాత్రం తన వీర్యాన్ని పంచి ప్రపంచ జనాభాను పెంచే పనిలో ఉన్నారట. దీనికి సంబంధించి అమెరికన్ వార్త పత్రిక వాల్ స్ట్రీట్ జర్నల్ ఓ కథనాన్ని ప్ర‌చురించింది. మస్క్ కు బాగా తెలిసిన వాళ్లకు ఈ ఆఫర్ చేస్తూ ఉంటాడని, ఒకవేళ తెలియక పోయినా వారితో పరిచయం పెంచుకుని మరీ వారికి దగ్గరవుతూ ఉంటాడట. మేధావి వర్గం అనేది తర్వాత తరాలకు కూడా అందుబాటులో ఉండాలనే పదునైన సంకల్పంతో ఉన్న మస్క్ దీనికి పూనుకున్నట్లు పేర్కొంది. ’ఎక్స్’లో మహిళలకు దగ్గరవుతూ వారిని పిల్లల్ని కనమని ఆఫర్లు ఇస్తున్నాడని స్పష్టం చేసింది. ఇలా మస్క్‌ పిల్లల సంఖ్య పెరుగుతూ పోతూ ఉందని తెలిపింది. జనాభా సమతుల్యతను కాపాడే పనిలో..ఇప్పటికే 14 మంది పిల్లలకు తండ్రిగా ఉన్న ఎలాన్ మస్క్.. తన వారసత్వ సంపదగా ఒక దండునే తయారు చేయాలనే సంకల్పంతో ఉన్నాడని డబ్యూఎస్జే తెలిపింది. తగ్గిపోతున్న జనన రేట్ల మానవ నాగరికతను అస్తిత్వంలో పడేస్తాయని మస్క్ బలంగా నమ్ముతున్నాడని, ఇది కూడా తన వీర్యాన్ని దానం చేస్తూ జనాభా సమతుల్యతను కాపాడుకునే క్రమంలో సాధ్యమైనంత మేర తన వంతు ప్రయత్నం చేస్తున్నాడనేది ఆ కథనం సారాంశం. ఇప్పటికే ఎంతోమంది మహిళలకు తన వీర్యాన్ని డోనర్ రూపంలో దానం చేసినట్లు తెలిపింది. దీనికి సంబంధించి వ్యవహారాలపై సీక్రెట్ ఒప్పందాలు మస్క్ చేసుకున్నట్లు ప్రచురించింది. జపనీస్ మహిళను ఇలా కలిసి..?క్రిప్టో కరెన్సీ ఇన్ఫ్లూయెన్సర్ అయిన జపాన్ మహిళ టిఫనీ ఫాంగ్ కు కూడా మస్క్ నేరుగా మెస్సేజ్ చేసి తన బిడ్డ (వీర్యం దానం చేయడం ద్వారా) కావాలా అని అడిగినట్టు డబ్యూఎస్ జే పేర్కొంది. ఇది జరిగి ఏడాది అవుతుందని, మస్క్ ఆమెను ఎక్స్ లో ఫాలో అవ్వడం మొదలైన తర్వాత ఈ ఆఫర్ ఇచ్చాడట. ఆమెను మస్క్ ఫాలో అవ్వడంతో టిఫనీ ఫాంగ్ కు ఫాలోవర్స్ సంఖ్య కూడా గణనీయంగా పెరిగి రెండు వారాల్లోనే 21 వేల డాలర్లను సంపాదించినట్లు ఆ కథనంలోని మరొక విషయం. అయితే మస్క్ ఆఫర్ ను టిఫనీ ఫాంగ్ తిరస్కరించిందని, ఆమెకు అప్పటికే ఉన్న పిల్లల ఫోటోలను కూడా చూపించిందట.ఆష్లీ సెయింట్ క్లెయిర్ సంచలన ఆరోపణలుఇటీవల రచయిత్రి, ఇన్ఫ్లూయెన్సర్ ఆష్లీ సెయింట్ క్లెయిర్.. మస్క్‌పై సంచలన ఆరోపణలు చేశారు. తన బిడ్డకు మస్క్‌ తండ్రి అంటూ సోషల్‌ మీడియాలో వేదికగా పోస్టు పెట్టారు. ఆమె పోస్టుపై మస్క్‌ సమాధానం ఇస్తూ ఆసక్తికర సమాధానం ఇచ్చారు.ఆ చిన్నారికి తండ్రి మస్క్ అని ఎక్స్‌లో పోస్టు చేశారు. తన బిడ్డ మస్క్‌కు 13వ సంతానమని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో.. తమ బిడ్డ భద్రతను, గోప్యతను దృష్టిలో ఉంచుకుని ఇన్ని రోజులు ఈ విషయం బయటపెట్టలేదని, మా ప్రైవసీకి ఎవరూ భంగం కలిగించవద్దంటూ కామెంట్స్‌ చేశారు.గతేడాది న్యూయార్క్ టైమ్స్ ఓ కథనం ప్రచురించింది. తనకు పుట్టిన పిల్లలను, మాజీ భాగస్వామ్యులు ఉండేందుందుకు 14 వేల 400 స్క్వేర్ ఫీట్ కాంపౌడ్ లో ఒక పెద్ద భవనాన్ని నిర్మించి వారు బాగోగులు చూస్తున్నట్లు కూడా పేర్కొంది. ఆ ఇంటిని నిర్మించడం కోసం సుమారు 300 కోట్ల రూపాయిలు అయినట్లు తెలిపింది. ఏం లేదు.. అంతా గాసిప్‌: మస్క్‌జపాన్ మహిళకు వీర్యం ఆఫ‌ర్ చేసిన‌ట్టు వ‌చ్చిన‌ కథనాల్ని మస్క్‌ కొట్టిపారేస్తున్నారు. ఇందులో ఎటువంటి వాస్తవం లేదని అంటున్నారు. డబ్యూఎస్‌జే వెబ్‌సైట్‌ అనేది ఒక గాసిప్‌ వెబ్‌ సైట్‌ అని, అందులో గాసిప్‌ తప్పితే ఏమీ ఉండదని అంటున్నారు. అయితే స్పెర్మ్‌ డోనర్‌ అనే అంశం చాలా సీక్రెట్‌గానే ఉంచుతారు. మరి అటవంటప్పుడు మస్క్‌ ఎవరికైనా వీర్యాన్ని దానం చేసినా దానిని బహిరంగంగా చెప్పుకునే అవకాశం ఉండదు. ఇటీవల కాలంలో తన బిడ్డకు తండ్రి మస్క్‌ అంటూ బహిరంగంగా పలువురు వ్యాఖ్యానించిన క్రమంలోనే ఈ వార్తను డబ్యూఎస్‌జే పరిశోధానాత్మక కోణంలో ప్రచురించినట్లు తెలుస్తోంది.

Buldhana: Initially Hair Now Nails Are Shedding7
మరో చిక్కొచ్చిపడిందే.. అప్పుడు జుట్టు.. ఇప్పుడు గోళ్లు.. ఏం జరుగుతోందక్కడ?

షెగావ్: మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలోని కొన్ని గ్రామాల ప్రజలకు కొత్త చిక్కొచ్చిపడింది. ఆ జిల్లాలో కొన్ని గ్రామాల ప్రజలు ఆకస్మికంగా జుట్టు కోల్పోయిన వింత పరిస్థితి సంచలనం కలిగించిన సంగతి తెలిసిందే.. అప్పుడు జుట్టు సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడగా, ఇప్పుడు గోళ్ల సమస్యను ఎదుర్కొంటున్నారు.గత కొన్ని రోజులుగా అక్కడ ఉన్న మహిళలు, పురుషులు జుట్టు రాలిపోవడం అనే సమస్యను ఎదుర్కొంటున్నారు. చాలా మందికి బట్టతల కూడా వచ్చేసింది. మొదట్లో కొద్దిగా జుట్టు రాలడం మొదలై.. ఒక్క వారంలోనే ఇలా బట్టతలగా మారిపోయింది. జిల్లాలోని షెగావ్ తాలూకాలోని సుమారు 15 గ్రామాల ప్రజలు మూడు నెలలుగా జుట్టు సమస్య కొనసాగుతుండటంతో ఆందోళన చెందుతున్నారు. అయితే, మరో సమస్యతో ఆ గ్రామాలు భయపడుతున్నాయి.ఇప్పుడు నాలుగు గ్రామాల్లోని ప్రజలు గోళ్లు రాలిపోవడం, ముడతలు పడటం వంటి కొత్త సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం తదుపరి పరీక్షల కోసం షెగావ్‌ ఆసుపత్రికి పంపిస్తున్నట్లు వైద్యులు వెల్లడించారు. ఈ సమస్యకు కారణం సెలీనియం స్థాయిలు పెరగడమే కారణంగా భావిస్తున్నట్లు డాక్టర్లు తెలిపారు.ఇక్కడి గ్రామాల ప్రజలు ఆకస్మికంగా జుట్టు కోల్పోవడం, గోళ్లు రాలిపోవడానికా కారణం.. వారు తింటున్న గోధుములకు సంబంధముందని కొందరు వైద్య నిపుణులు పేర్కొన్నారు. ఆ గోధుమల్లో సెలీనియం అధిక మోతాదులో ఉండటమే ఇందుకు కారణంగా చెప్పారు. గతంలో విపరీతంగా జుట్టు కోల్పోయిన వారిలో అనేక మంది ఇప్పుడు గోళ్ల సమస్య ఎదుర్కొంటున్నట్లు వైద్యులు వెల్లడించారు.

Farmers Protest Against Minister Nadendla Manohar In Krishna District8
పట్టించుకోరా?.. మంత్రి నాదెండ్లను నిలదీసిన రైతులు

సాక్షి, కృష్ణా జిల్లా: మంత్రి నాదెండ్ల మనోహర్‌ను రైతులు నిలదీశారు. గురువారం.. పునాదిపాడులో పర్యటించిన మంత్రి నాదెండ్ల మనోహర్.. రైస్ మిల్లును, కల్లాల్లో ధాన్యాన్ని పరిశీలించారు. ధాన్యం కొనుగోలు చేయడం లేదని మంత్రిని రైతులు నిలదీశారు. కోత కోసి రెండు రోజులైనా ఎవరూ పట్టించుకోవడం లేదన్న రైతులు.. గన్నీ బ్యాగులు ఇవ్వడం లేదంటూ మండిపడ్డారు.డ్యామేజ్ అయిన (చిల్లులుపడిన) గన్నీ బ్యాగులు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దున్నపోతు ఈనిందా దొడ్లో కట్టేశామా అనేలా అధికారుల తీరు ఉందంటూ రైతులు మండిపడ్డారు. దళారులు, అధికారులు, మిల్లర్లతో కుమ్మక్కైపోయారని రైతులు ఆరోపించారు. బాలాజీ మిల్లు చెబితేనే ధాన్యం కొంటున్నారంటూ రైతులు ఆరోపించారు. రైతుల ప్రశ్నలకు మంత్రి నాదెండ్ల మనోహర్ సమాధానం చెప్పలేకపోయారు.

Puppies: Shocking Incident At Residential Apartment In Hyderabad9
హైదరాబాద్‌లో దారుణం.. గోడకేసి కొట్టి.. ఐదు కుక్క పిల్లలను కిరాతకంగా..

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి ఐదు కుక్క పిల్లలను గోడకేసి కొట్టి చంపేసిన ఘటన దిగ్భ్రాంతికి గురిచేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారగా, సైకోగా మారిన ఆ వ్యక్తిని నెటిజన్లు తిట్టి పోస్తున్నారు.అసలు ఏం జరిగిందంటే.. ఫతేనగర్‌లో ఇండిస్ అపార్టుమెంట్‌ దగ్గర ఓ వీధి కుక్క ఐదు పిల్ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చింది. అక్క‌డే ఉన్న అపార్ట్‌మెంట్‌ సెల్లార్‌లో ఆ కుక్క పిల్ల‌లు ఉంటున్నాయి. అదే అపార్ట్‌మెంట్‌లో నివశించే అశీష్ అనే వ్యక్తి తన పెంపుడు కుక్కతో రోజూ బయటకు వెళ్లే క్రమంలో ఆ కుక్కపిల్లలు దగ్గరకు వచ్చేవి. దీంతో ఓ కుక్క పిల్లను గోడకేసి బలంగా కొట్టగా.. అది రక్తం కక్కుకుని కింద పడిపోయింది. బతికిందో లేదో తెలుసుకోవడానికి మరోసారి గట్టిగా కొట్టాడు.. ఇలా మొత్తం ఐదు కుక్క పిల్లలను దారుణంగా చంపేశాడు.కుక్క పిల్ల‌లు చ‌నిపోయి ఉండ‌డంతో అనుమానం వచ్చిన అపార్ట్‌మెంట్ వాసులు.. ఈ క్ర‌మంలో అక్క‌డున్న సీసీటీవీ కెమెరాల‌ను ప‌రిశీలించ‌గా, అదే అపార్ట్‌మెంట్‌లో ఉన్న వ్యాపారి ఆశిష్ ఈ దారుణానికి పాల్ప‌డిన‌ట్లు తేలింది. ఖాన్ అనే వ్యక్తి ఈ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. జంతువులపై ఇంత కిరాతకంగా వ్యహరించిన వ్యక్తిని జైలుకు పంపించాలని కోరాడు.ఆశిష్‌ను అపార్ట్‌మెంట్ వాసులు ప్ర‌శ్నించ‌గా.. ఆ కుక్క పిల్లలు తన పెంపుడు కుక్క దగ్గరకు వచ్చాయని.. అందుకే చంపేశానంటూ సమాధానమిచ్చాడు. ఈ ఘటనపై అల్వాల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నగరంలో సైకోలు పెరిగిపోతున్నారని.. జంతు ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటిని అరికట్టడానికి కఠినమైన శిక్షలు విధించాలని కోరుతున్నారు.*VB City Community – Urgent Alert!* The safety of our community, especially our children, is at serious risk.A disturbing incident has come to light—an individual was caught on video brutally attacking puppies just 5 to 6 days old. This act of cruelty is not only heartbreaking pic.twitter.com/hedp136Mrt— Khan (@khanbr1983) April 17, 2025

Manchu Lakshmi Instagram hacked with a hilarious message for fans10
మంచు లక్ష్మీ సోషల్ మీడియా ఖాతా హ్యాక్‌.. ఎవరూ నమ్మొద్దని ట్వీట్!

టాలీవుడ్ నటి, మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మీ సోషల్ మీడియా ఖాతా హ్యాకింగ్‌ గురైంది. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో పోస్ట్ వాటిని ఎవరూ నమ్మవద్దని అభిమానులను, సన్నిహితులను కోరింది. తనకు డబ్బులు అవసరమైతే డైరెక్ట్‌గా అడుగుతానని తెలిపింది. సోషల్ మీడియాలో ఎవరినీ నేను డబ్బులు అడగనని ట్వీట్ చేసింది. ఇలాంటి వాటి పట్ల దయచేసి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరింది. ఈ విషయాన్ని ట్విటర్‌ ద్వారా వెల్లడించింది. కాగా.. మంచు లక్ష్మీ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో బిట్‌కాయిస్‌, క్రిప్టోకరెన్సీకి సంబంధించిన పోస్టులు ప్రత్యక్షమయ్యాయి. దీంతో అప్రమత్తమైన మంచు లక్ష్మీ వెంటనే ట్విటర్‌ ద్వారా అభిమానులను, సన్నిహితులను అలర్ట్‌ చేస్తూ ట్వీట్ చేసింది. చివరికీ నా మొబైల్ నంబర్ కూడా హ్యాకర్స్ గుర్తించారని ట్విటర్ ద్వారా వెల్లడించింది. ఆఫ్రికా దేశం నైజీరియాకు చెందిన సైబర్ కేటుగాళ్లు ఈ హ్యాకింగ్‌కు పాల్పడినట్లు తెలుస్తోంది.కాగా.. మంచు లక్ష్మీ ఇటీవలే హైదరాబాద్‌లో గ్రాండ్‌ ఫ్యాషన్ షో నిర్వహించింది. టీచ్ ఫర్ ఛేంజ్ పేరిట నిర్వహించిన ఈ ఈవెంట్‌లో పలువురు టాలీవుడ్ సినీతారలు హాజరైన సందడి చేశారు. ఆమె తమ్ముడు మంచు మనోజ్ సైతం ఈవెంట్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరలైన సంగతి తెలిసిందే.ఇక సినిమాల విషయానికొస్తే మంచు లక్ష్మీ చివరిసారిగా మలయాళ యాక్షన్ థ్రిల్లర్‌ మాన్‌స్టర్‌లో కనిపించింది. ఇందులో మోహన్‌లాల్, హనీ రోజ్, జానీ ఆంటోనీ, జగపతి బాబు కూడా అతిథి పాత్రలో కనిపించారు. ప్రస్తుతం ఆమె మెడికల్ సైకలాజికల్ థ్రిల్లర్ దక్ష – ది డెడ్లీ కాన్‌స్పిరసీలో కనిపించనుంది. వంశీ కృష్ణ మళ్ల దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రంలో సముద్రఖని, విశ్వంత్, చిత్ర శుక్లా, మహేశ్, వీరేన్ తంబిదొరై కూడా నటించారు. And they got to my number too! Wow! This is very scary! pic.twitter.com/3rOeiTgpwn— Manchu Lakshmi Prasanna (@LakshmiManchu) April 17, 2025 My Instagram has been hacked. Kindly do not engage with anything that is on my stories. If I need money, I will ask you directly not on social media 😂Will tweet once I get it all back in order…— Manchu Lakshmi Prasanna (@LakshmiManchu) April 17, 2025

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement