Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

YS Jagan Key Comments At YSRCP District Presidents Meeting Updates1
బాబు చేస్తున్న విధ్వంసం అంతా ఇంతా కాదు : వైఎస్‌ జగన్‌

గుంటూరు, సాక్షి: సీఎం చంద్రబాబుపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్రంలో చంద్రబాబు చేస్తున్న విధ్వంసం అంతా ఇంతా కాదంటూ మండిపడ్డారు. వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షులతో ఆయన సోమవారం సమావేశం అయ్యారు. ఈ భేటీలో తాజా రాజకీయ పరిణామాలు, పార్టీ భవిష్యత్ కార్యక్రమాలు సహా అనేక అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమానికి సీనియర్‌ నేతలు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా హాజరయ్యారు.ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. చంద్రబాబు చేస్తున్న విధ్వంసం అంతా ఇంతాకాదు. విద్య, వైద్యం, వ్యవసాయం ఇలా అన్నిరంగాల్లోనూ విద్వంసమే. రెడ్‌ బుక్‌ రాజ్యాంగం రాష్ట్రంలో అమలవుతోంది. విచ్చలవిడిగా అవినీతి జరుగుతోంది. వీటిని ప్రజల్లోకి బాగా తీసుకువెళ్లాలి’ అని సూచించారు. జిల్లాలో పార్టీ ఓనర్‌షిప్‌ మీదిప్రజా సంబంధిత అంశాల్లో ఒకరి ఆదేశాలకోసం మీరు ఎదురు చూడొద్దు. మీకు మీరుగా స్వచ్ఛందంగా కదలాలి. నియోజకవర్గ ఇన్‌ఛార్జితో కలిసి మొదట కదలాల్సిందే మీరే. ప్రజలకు అండగా మీరు చేస్తున్న కార్యక్రమాల వల్ల అది రాష్ట్రస్థాయి దృష్టిని ఆకర్షిస్తుంది. దీనిద్వారానే మీ పనితీరు బయటపడుతోంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ మన్ననలు పొందాల్సిన బాధ్యత మీది. సమాజంలో గొంతులేని వారికి బాసటగా నిలిచేది వైయస్సార్‌సీపీయే. ప్రతి సమస్యలోనూ బాధితులకు తోడుగా నిలిచేది వైఎస్సార్‌సీపీయే. మే నెలలోపు మండల కమిటీలు పూర్తిచేయాలిజూన్‌-జులైల్లో గ్రామస్థాయి, మున్సిపాల్టీలల్లో డివిజన్‌ కమిటీలు పూర్తిచేయాలి. ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరులో బూత్‌ కమిటీలు ఏర్పాటు కావాలి. ఈమేరకు లక్ష్యంగా పెట్టుకోండి. జిల్లా స్థాయి నుంచి పార్టీని గ్రామస్థాయి వరకూ తీసుకువెళ్లే బాధ్యతల్లో మీరు ఉన్నారు. పార్టీ వ్యవస్థీకృతంగా ముందుకు సాగాలి. జిల్లా అధ్యక్షుల పాత్ర పార్టీలో చాలా కీలకమైనది. గ్రామస్థాయి బూత్‌ కమిటీలు, గ్రామ కమిటీలు ఏర్పాటు అనేది అత్యంత కీలక విధుల్లో ఒకటి. పార్టీలో సమర్థులు ఎవరు, ప్రతిపక్షంలో ఎవరు లీడ్ చేయగలరు అని ఆలోచన చేసి మీకు బాధ్యతలు అప్పగించడం జరిగింది. మీమీ జిల్లాల్లో పార్టీ మీద మీకు పట్టు ఉండాలి. పార్టీ బలోపేతం కోసం గట్టిగా కృషిగా చేయాలి. బాధ్యతల నుంచే అధికారం వస్తుంది.జిల్లాల్లో మీరే సర్వం. మీరే పార్టీ.. పార్టీయే మీరుజిల్లాల్లో అన్నిస్థానాల్లో గెలిపించాల్సిన బాధ్యత మీది. మనసా వాచా కర్మేణా అదే తలంపుతో పార్టీని నడపాలి. జిల్లాల్లో అన్ని నియోజకవర్గాల్లో గెలిపించే బాధ్యత మీది. అది మీ ప్రధాన బాధ్యత. దీనికోసం ఏం చేయాలన్నదానిపై మీరు గట్టిగా పనిచేయాలి. జిల్లాస్థాయి నుంచి గ్రామస్థాయి వరకూ ప్రతి కమిటీ బలంగా ఉండాలి. ఏదైనా నియోజకవర్గ ఇన్‌ఛార్జి పనితీరు బాగోలేకపోతే పిలిచి చెప్పగలగాలి. అప్పటికీ పనితీరు బాగోలేకపోతే ప్రత్యామ్నాయం చూడ్డంలో మీ భాగస్వామ్యం కీలకం. పార్టీలో ఇద్దరి మధ్య వివాదం ఉన్నప్పుడు పిలిచి సమన్వయం చేయాల్సిన బాధ్యత మీది. మీ పరిధిలో 7కు ఏడు గెలిపించాల్సిన బాధ్యత మీది. బాధ్యత, అధికారం రెండూ తీసుకోండి. మీరు సమర్థులని భావించి, మీకు ఈ బాధ్యతలు అప్పగించడం జరిగింది. అసెంబ్లీ నియోజకవర్గాల్లో సమన్వయం చేయడం, జిల్లాస్థాయి నుంచి గ్రామస్థాయి వరకూ కమిటీ నిర్మాణం మీ ప్రధాన బాధ్యత. అలాగే ప్రజా సంబంధిత అంశాల్లో చురుగ్గా ఉండాలి.ప్రతిపక్షంలో ఉన్నప్పుడే మన నాయకత్వ ప్రతిభ బయటపడుతుందిప్రతిపక్షంలో ఉన్నప్పుడే మన నాయకత్వ ప్రతిభ బయటపడుతుంది. భారీ లక్ష్యం ఉన్నప్పుడే బ్యాట్స్‌మన్‌ ప్రతిభ బయటపడుతుంది. అప్పుడే ఆ బ్యాట్స్‌మెన్‌ ప్రజలకు ఇష్టుడు అవుతాడు. ఇదికూడా అంతే. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనం చేసే పనులవల్ల మనం ఎలివేట్‌ అవుతాం. ప్రజల దగ్గర, పార్టీలోనూ గౌరవం పెరుగుతుంది. ఇమేజీ పెరుగుతుంది. మన పనితీరు వల్లే మనం మన్ననలను పొందగలుగుతాం. అందరూ ధోనీల్లా తయారు కావాలి. అప్పుడే మీ జిల్లాల్లో ఏడుకు ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో గెలవగలుగుతాం. జిల్లాల్లో ఏ జరిగినా మీరు ప్రజల తరఫున నిలబడాలి.కార్యక్రమాలు చురుగ్గాచేయాలి, ఆయా కార్యక్రమాల్లో పాల్గొనాలి. ప్రజా వ్యతిరేక అంశాలమీద గట్టిగా పోరాటం చేయాలి. లేదంటే పార్టీపరంగా మనం అవకాశాలను కోల్పోయినట్టే. బాధితులకు మనం అండగా ఉండాలి.మనమంతా రాజకీయ నాయకులంమనమంతా రాజకీయ నాయకులం. మన జీవితాలను రాజకీయాలకోసం పెట్టామనే విషయం మరిచిపోవద్దు. ఎట్టి పరిస్థితుల్లోనూ మనం వెనకడుగు వేయకూడదు. ప్రతిపక్షంగా మనకు వచ్చిన అవకాశాలను వదిలిపెట్టకూడదు. జిల్లాస్థాయిలో ప్రజా సంబంధిత అంశాలను మీరు బాగా వెలుగులోకి తీసుకు వస్తేనే ప్రజలకు దగ్గరవుతాం. మనం అధికారంలోకి వస్తేనే ప్రజలకు మరింత మంచి చేయగలం. ప్రజలకు మరింత మంచి చేయాలన్న తపన, తాపత్రయం ఉంది కాబట్టే రాజకీయాలు చేస్తున్నాం. నాన్నగారు చనిపోయిన తర్వాత ప్రతి ఇంట్లో నా ఫొటో ఉండాలనుకున్నాను కాబట్టే నేను రాజకీయాలు చేస్తున్నాను. అలాగే ప్రతి జిల్లాల్లో మీ సేవల గురించి మాట్లాడుకోవాలి.రెండు మూడు సంవత్సరాలు అయితే కాని ప్రభుత్వ వ్యతిరేకత సాధారణంగా బయటకు కనిపించదు. కాని ఏడాదిలోపే ప్రభుత్వంమీద వ్యతిరేకత తీవ్రంగా ఉంది. అందుకే యుద్ధ ప్రాతిపదికన కమిటీ నిర్మాణం పూర్తిచేయాలి. దీని తర్వాత పార్టీ పరంగా మీకూ, నాకూ పూర్తిగా పని ఉంటుంది. అందరం కలిసికట్టుగా పార్టీపరంగా కార్యక్రమాలు బలంగా ముందుకు తీసుకెళ్లాలి. అందుకనే పార్టీ పరంగా నిర్మాణాన్ని వీలైనంత త్వరగా పూర్తిచేయాలి. గ్రామస్థాయిలోకూడా కమిటీలు, బూత్‌ కమిటీల ఏర్పాటు పూర్తిచేస్తే… పూర్తిస్థాయి సన్నద్ధతతో ఉన్నట్టు అవుతుంది ప్రతి జిల్లాల్లో పార్టీ నిర్మాణం ద్వారా దాదాపు 12వేల మంది పార్టీ కార్యక్రమాలకోసం మీకు అందుబాటులో ఉంటారు. ప్రతి నియోజకవర్గంలో కూడా దాదాపుగా 1500 మంది ఉంటారు.మద్దతు ధరలు దొరక్క రైతులు తీవ్రంగా నష్టపోతున్నారువివిధ జిల్లాల్లో రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. రైతుల తరఫున పోరాటాలు చేయాల్సిన అవసరం ఉంది. ఆ మేరకు జిల్లాల్లో రైతులకు అండగా ఉండాలి. రైతుల డిమాండ్లపై పోరాటం చేయాలి.

Ias Officer Smita Sabharwal Another Sensational Tweet2
స్మితా సబర్వాల్‌ మరో సంచలన ట్వీట్‌

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ సీనియర్‌ ఐఏఎస్‌ అధికారిణి స్మితా సబర్వాల్‌ ట్వీట్లు పలు వివాదాలకు దారి తీసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ క్రమంలో ఆమె మరో సంచలన ట్వీట్‌ చేశారు. తనపై వేటు తర్వాత ఎక్స్ వేదికగా ఆమె స్పందిస్తూ.. భగవద్గీతలోని అంశాన్ని తన బదిలీకి అన్వయిస్తూ ట్వీట్‌ చేశారు. కర్మణ్యే వాధికారస్తే, మా ఫలేషు కదాచన. 4 నెలలు టూరిజం అభివృద్ధి కోసం నా వంతు కృషి చేశాను. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న టూరిజం పాలసీ 25-30లో రాష్ట్రానికి పరిచయం చేశాను’’ అని ట్వీట్‌ చేశారు.‘‘నిర్లక్ష్యానికి గురైన టూరిస్ట్ సర్క్యూట్‌లలో దిశ, పెట్టుబడి కోసం పటిష్టమైన ఫ్రేమ్‌ని సృష్టించాను. డిపార్ట్‌మెంట్ పని శైలిని పునరుద్ధరించాను. జవాబుదారీతనం నింపడానికి ప్రయత్నించాను. లాజిస్టిక్స్, ప్లానింగ్ కోసం పునాది వేసి- గ్లోబల్ ఈవెంట్ కోసం ప్రయత్నం మొదలు పెట్టాను.. అది నాకు ఆనందం.. గౌరవంగా ఉంది’’అంటూ స్మితా ట్వీట్‌ చేశారు.కాగా, కంచ గచ్చిబౌలి భూవివాదంలో స్మితా సబర్మాల్‌.. ఏఐ ఫోటో రిట్వీట్ చేసిందని పోలీసులు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై ఆమె.. రేవంత్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టు చేయడం వివాదాస్పదంగా మారిన క్రమంలో తెలంగాణ ప్రభుత్వం.. స్మితాపై బదిలీ వేటు వేసింది. ఆమెను ఆర్థిక సంఘం (ఫైనాన్స్‌ కమిషన్‌) సభ్య కార్యదర్శిగా బదిలీ చేసింది.

IPL 2025, RR VS GT: Vaibhav Suryavanshi Coach Manish Ojha Said He Used To Hit 90m Sixes3
IPL 2025: పదేళ్ల వయసులోనే 90 మీటర్ల భారీ సిక్సర్లు కొట్టాడు: వైభవ్‌ కోచ్‌ ఓఝా

14 ఏళ్ల వయసులో ప్రపంచ స్థాయి బౌలర్లను గడగడలాడిస్తూ కేవలం 35 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసిన వైభవ్‌ సూర్యవంశీవైపు ప్రస్తుతం ప్రపంచం మొత్తం చూస్తుంది. ఈ కుర్రాడు ఎవరు..? అతని బ్యాక్‌ గ్రౌండ్‌ ఏంటి అని తెలుసుకునే పనిలో పడ్డారు క్రికెట్‌ అభిమానులు. ఈ క్రమంలో వైభవ్‌కు సంబంధించిన చాలా ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇండియా టుడే ఇచ్చిన ఇంటర్వ్యూలో వైభవ్‌ చిన్ననాటి కోచ్‌ మనీశ్‌ ఓఝా చాలా విషయాలు చెప్పాడు. బ్రియాన్‌ లారాకు వీరాభిమాని అయిన వైభవ్‌లో నమ్మశక్యంకాని సిక్స్‌ హిట్టింగ్‌ ప్రతిభ ఉందని వెల్లడించాడు. వైభవ్‌ టాలెంట్‌ ముందు ఈ సెంచరీ చిన్నది అన్ని అన్నాడు. వైభవ్‌ పదేళ్ల వయసులోనే 90 మీటర్ల భారీ సిక్సర్లు కొట్టేవాడని.. రోజూ నెట్స్‌లో 350–400 బంతులు ఎదుర్కొనేవాడని తెలిపాడు.వైభవ్‌ గురించి అతడి ఓఝా మాటల్లో.. వైభవ్‌కు శిక్షణ ఇస్తున్న సమయంలో ఒక్కసారి కూడా తిట్టాల్సిన అవసరం రాలేదు. వైభవ్‌కు ఏ షాట్‌ నేర్పించినా, ఏ టెక్నిక్‌ను వివరించినా దాన్ని పునరావృతం చేయాల్సిన అవసరం లేదు. అతను వెంటనే గ్రహిస్తాడు. వైభవ్‌ను పదిన్నరేళ్ల వయసులో తొలిసారి చూశాను.ఆ వయసులోనే అతను ప్రపంచ స్థాయి బ్యాటర్ల సామర్థ్యం కలిగి ఉన్నాడు. 2022లో ఓఝా కోచింగ్ సెంటర్‌లో నిర్వహించిన ఓ మ్యాచ్‌లో వైభవ్ 118 పరుగులు చేశాడు. ఆ మ్యాచ్‌లో అతను కొట్టిన సిక్సర్లు ఇప్పుడు ప్రజలు చూస్తున్న సిక్సర్ల మాదిరిగానే ఉన్నాయి. ప్రతి సిక్సర్‌ 90 మీటర్లపైనే ఉం​డింది. ఆ సమయంలోనే వైభవ్‌ శక్తి, ఖచ్చితత్వం అసాధారణంగా ఉండేది. ఆ రోజే వైభవ్‌ అద్భుతాలు చేయగలడని నమ్మాను.14 ఏళ్ల పిల్లాడిలో ఇంత శక్తి ఎలా వస్తుందనే దానిపై స్పందిస్తూ.. వైభవ్‌లో ఈ అబ్బురపరిచే శక్తి ప్రమాదవశాత్తు వచ్చింది కాదు. అతను భారీ సిక్సర్లు కొట్టే ప్రయత్నం చేయబట్టి నాలుగేళ్లవుతుంది. వైభవ్‌లో ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువ. అదే కాన్ఫిడెన్స్‌తో అతను భారీ షాట్లు ఆడుతాడు. వైభవ్‌కు ఈ స్థాయి సిక్స్‌ హిట్టింగ్‌ సామర్థ్యం రావడానికి అతని కఠోర ప్రాక్టీస్‌ కూడా ఓ కారణం. వైభవ్‌ టైమింగ్‌, టెక్నిక్‌ కూడా అద్భుతంగా ఉంటుంది. అతడికి ప్రాక్టీస్‌లో రోబోలతో త్రోలు వేయించేవాడిని. వైభవ్‌ ఎక్కువగా ఫుల్‌ టాస్‌ బంతులకు షాట్లు ప్రాక్టీస్‌ చేసేవాడు. రికార్డు సెంచరీకి ముందు రోజు కూడా వైభవ్‌తో మాట్లాడినట్లు ఓఝా తెలిపాడు.కాగా, ఐపీఎల్‌ 2025లో భాగంగా నిన్న గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వైభవ్‌ 35 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి, పొట్టి క్రికెట్‌లో సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడిగా, ఐపీఎల్‌లో అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన భారత ఆటగాడిగా రికార్డులు నెలకొల్పాడు.ఈ మ్యాచ్‌లో వైభవ్‌ ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్లపై 11 సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. ఇందులో మూడు సిక్సర్లు 85 మీటర్లకు పైబడినవి కాగా.. రెండు 90 మీటర్లు దాటి ప్రయాణించాయి. కొన్ని సిక్సర్లు స్టేడియంలోని స్టాండ్స్ పైకప్పుపై కూడా పడ్డాయి.

Govt Suspends Pakistan Defence Minister X Account After Crackdown4
భారత్‌లో పాక్ రక్షణ మంత్రి ఎక్స్ ఖాతా నిలిపివేత

ఢిల్లీ: పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా మహమ్మద్ ఎక్స్ ఖాతాను భారత ప్రభుత్వం నిలిపివేసింది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత జమ్ముకశ్మీర్ పై పాక్ మంత్రి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారన్న కారణంతో ఎక్స్ ఖాతాను కేంద్రం బ్లాక్ చేసింది. భారత్, పాకిస్థాన్ల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.ఇప్పటికే పాకిస్థాన్ కేంద్రంగా నిర్వహిస్తున్న పలు యూట్యూబ్ ఛానళ్ల ప్రసారాలను భారత్‌లో నిషేధించిన సంగతి తెలిసిందే. భారత్‌లో పాక్‌ జర్నలిస్టుల ఎక్స్‌ ఖాతాలను కూడా కేంద్ర ప్రభుత్వం నిలిపివేసింది. ఐఎస్‌ఐ, పాకిస్థాన్‌ ప్రభుత్వంతో కలిసి భారత్‌పై తప్పుడు ప్రచారం చేస్తున్నందుకు ఈ చర్యలు చేపట్టింది.భారత సైన్యం కదలికలపై పాక్‌ ఐఎస్‌ఐ కొత్త ఎత్తుగడమరోవైపు, భారత సైన్యం కదలికలపై పాక్‌ ఐఎస్‌ఐ కొత్త ఎత్తుగడలు వేస్తోంది. సైన్యం కదలికలపై పాకిస్థాన్‌ ఐఎస్‌ఐ ఆరా తీస్తోంది. సరిహద్దులోని మిలిటరీ సిబ్బంది, పౌరులకు.. భారతీయ సైనిక్‌ స్కూల్‌ ఉద్యోగులమంటూ ఐఎస్‌ఐ ఫోన్లు చేస్తోంది. గుర్తు తెలియని నెంబర్ల నుంచి వచ్చే ఫోన్‌ కాల్స్‌పై అప్రమత్తంగా ఉండాలని.. తెలియని వారికి ఎలాంటి సమాచారం ఇవ్వొద్దని సరిహద్దు ప్రజలకు కేంద్రం సూచిస్తోంది.కాగా, పహల్గాం దాడి తర్వాత పాక్‌ రక్షణ మంత్రి మీడియాతో మాట్లాడుతూ, అమెరికా, బ్రిటన్‌ కోసమే చెత్త పనులు చేశామని.. ఉగ్రవాదాన్ని పోత్సహించడం పొరబాటని అర్థమైందంటూ పాక్‌ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్‌ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అమెరికా కోసమే ఉగ్రవాదులను పెంచిపోషించామంటూ ఆయన తప్పును ఒప్పుకున్నారు. ఉగ్రవాదం వల్ల చాలా ఇబ్బందులు పడ్డామన్నారు. ఉగ్ర సంస్థలకు నిధులు, ఉగ్రవాదులకు శిక్షణ నిజమేనంటూ స్వయంగా ఆ దేశ రక్షణమంత్రే అంగీకరించారు. ఓ అంతర్జాతీయ మీడియాతో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

Telangana SSC 2025 Results Date Declared5
రేపు తెలంగాణ టెన్త్‌ ఫలితాలు

హైదరాబాద్‌, సాక్షి: తెలంగాణలో పదో తరగతి పరీక్షా ఫలితాలకు ముహూర్తం ఖరారైంది. రేపు.. అంటే ఏప్రిల్‌ 30వ తేదీన ఫలితాలు విడుదల కానున్నాయి. సీఎం రేవంత్‌ రెడ్డి ఫలితాలు విడుదల చేస్తారని సమాచారం. మార్చి 21వ తేదీ నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరిగాయి. సుమారు 5 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. మూల్యాంకనం పూర్తి కావడంతో రిజల్ట్స్‌ రిలీజ్‌ కోసం ప్రభుత్వం ఆదేశాల కోసం విద్యా శాఖ ఎదురు చూసింది. ఈలోపు గ్రీన్‌ సిగ్నల్‌ రావడంతో పలితాలు విడుదల చేస్తోంది. ఈసారి మెమోలో మార్కులతో పాటు సబ్జెక్టుల వారీగా గ్రేడులు ఇవ్వనున్నారు. త్వరగతిన.. కేవలం ఒకే ఒక్క క్లిక్‌తో ఫలితాలు చెక్‌ చేసుకునేందుకు https://education.sakshi.com/ క్లిక్‌ చేయండి.

Nothing wrong Supreme Court on Pegasus row6
‘పెగాసస్‌’పై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: పెగాసస్‌ వ్యవహారంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం (Supreme Court) కీలక వ్యాఖ్యలు చేసింది. జాతీయ భద్రతా ప్రయోజనాల కోసం ఓ దేశం స్పైవేర్‌(Spyware)ను కలిగి ఉండటం తప్పులేదని పేర్కొంది. అయితే.. అది ఎలా? ఎవరిపై ఉపయోగించారనే విషయాలను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది.దాదాపు నాలుగేళ్ల క్రితం దేశ రాజకీయాలను కుదిపేసిన పెగాసస్‌ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ స్పైవేర్‌ను వినియోగించి దేశంలోని ప్రముఖ పాత్రికేయులు, పౌరసమాజ ప్రముఖులపై నిఘా పెట్టారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో.. పెగాసస్‌ ఆరోపణలపై స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై మంగళవారం విచారణ జరిగింది. పిటిషన్‌ తరఫున న్యాయవాది మాట్లాడుతూ.. పెగాసస్‌ స్పైవేర్‌ను ఉపయోగిస్తోందా? లేదా? అనే విషయాన్ని కేంద్రం స్పష్టంగా చెప్పాలని డిమాండ్‌ చేశారు. అంతేగాక, ఈ ఆరోపణలపై దర్యాప్తు జరిపి సాంకేతిక నిపుణుల బృందం నివేదిక కోసం సర్వోన్నత న్యాయస్థానం గతంలో ఆదేశించిందని, ఇప్పటివరకూ ఆ నివేదిక అందలేదని, దానిని బయట పెట్టాలని ధర్మాసనాన్ని కోరారు. జస్టిస్‌ సూర్యకాంత్, జస్టిస్‌ ఎన్‌.కోటీశ్వర్‌ సింగ్‌తో కూడిన ధర్మాసనం స్పందిస్తూ.. దేశం స్పైవేర్‌ను వినియోగిస్తే గనుక అందులో తప్పేముంది. అయితే, దాన్ని ఎవరిపైన ఉపయోగిస్తున్నారన్నదే ఇక్కడ ప్రశ్న. పౌర సమాజంపై కాకుండా.. దేశ వ్యతిరేక శక్తులపై దీన్ని వినియోగిస్తే గనుక అందులో ఏ తప్పు లేదు. దేశ భద్రత విషయంలో రాజీపడకూడదు. ఒకవేళ సామాన్య పౌరులపై ఉపయోగిస్తే గనుక దాని గురించి మేం దర్యాప్తు జరిపిస్తాం. ఉగ్రవాదులు గోప్యత హక్కును కోరకూడదు. అయితే, సామాన్య పౌరుల గోప్యతకు మేం తప్పకుండా రక్షణ కల్పిస్తాం. ప్రస్తుతం మన దేశం ఎలాంటి పరిస్థితిలో ఉందో అందరికీ తెలుసు(పహల్గాం ఉగ్రదాడి ఘటనను పరోక్షంగా ప్రస్తావిస్తూ..). కాబట్టి మనం అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది’’ అని ద్విసభ్య ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఇక, సాంకేతిక బృందం నివేదిక గురించి మాట్లాడుతూ.. ‘‘దేశ భద్రత, సార్వభౌమత్వానికి సంబంధించిన నివేదికను బహిర్గతం చేయడం సరికాదు. ఒకవేళ ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు దాని గురించి తెలుసుకోవాలనుకుంటే.. వారికి సమాచారం అందిస్తాం’’ అని ధర్మాసనం స్పష్టం చేసింది.పెగాసస్‌ వ్యవహారం ఏంటంటే.. ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్‌ఎస్‌వో గ్రూప్‌ అనే సంస్థ ‘పెగాసస్‌’ స్పైవేర్‌ని అభివృద్ధి చేసింది. నిఘా కార్యకలాపాల కోసం ఈ స్పైవేర్‌ను ఎన్‌ఎస్‌వో పలు ప్రభుత్వాలు, ప్రభుత్వ అధీనంలో పనిచేసే సంస్థలకు విక్రయిస్తుంటుంది. అయితే, ఈ పెగాసస్‌ను ఉపయోగించి పాత్రికేయులు, పౌరసమాజ ప్రముఖుల ఫోన్లను హ్యాక్‌ చేశారంటూ 2021లో ఓ అంతర్జాతీయ పత్రిక సంచలన కథనం ప్రచురించింది. భారత్‌ నుంచి 300 మంది ఫోన్లు హ్యాక్‌ అయినట్లు పేర్కొంది. వీరిలో రాజకీయ ప్రముఖులు కూడా ఉన్నట్లు తెలిపింది. దీంతో ఈ వివాదం దేశ రాజకీయాలను కుదిపేసింది.

50 years Old UP Woman Marries Grandson and planned to assassinate husband7
మనవడితో 50 ఏళ్ల మహిళ పెళ్లి : ఫ్యామిలీని లేపేసేందుకు కుట్ర?

ఇటీవల అల్లుడితో అత్త పారిపోయిన సంఘటన మరిచిపోకముందే మరో విచిత్రకరమైన సంఘటన చోటు చేసుకుంది. తాజాగా ఓ బామ్మ, వరుసకు మనవడయ్యే వ్యక్తిని పెళ్లి చేసుకోవడం అందర్నీ షాక్‌కు గురి చేసింది. ప్రస్తుతం ఈ స్టోరీ నెట్టింట వైరల్‌గా మారింది. ఇంతకీ ఈ సంఘటన ఎక్కడ జరిగింది. అతడిని పెళ్లి చేసుకోవడం వెనుక ఉద్దేశం మరేదైనా ఉందా? అసలేం జరిగింది తెలుసుకుందాం.ఉత్తర్‌ప్రదేశ్‌ అంబేద్కర్ నగర్ జిల్లాలో జరిగిన ఈ సంఘటన సంచలనంగా మారింది. బందుత్వాలు, మానవ విలువలకు తిలోదకాలిచ్చి మనవడి వరసయ్యే వ్యక్తిని ఓ బామ్మ పెళ్లి చేసుకుంది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన 50 ఏళ్ల మహిళ ఇంద్రావతి తన 30 ఏళ్ల మనవడు ఆజాద్‌తో పారిపోయి గోవింద్ సాహిబ్ ఆలయంలో వివాహం చేసుకుంది. సింధూరం పూసుకుని , పవిత్ర అగ్ని చుట్టూ ఏడు ప్రదక్షిణలు చేసి, గ్రామం నుండి పారిపోయారు. ఇందుకోసం నలుగురు పిల్లలు, భర్త ( ఇద్దరు కుమారులు ,ఇద్దరు కూతుళ్లు) కుటుంబాన్ని వదిలేసింది. ఇంతవరకూ ఓకే గానీ. ఇక్కడ ఇంకో ట్విస్ట్‌ ఏంటంటే...?ట్విస్ట్‌ ఏంటంటే..?వారిద్దరూ అంబేద్కర్‌నగర్‌లో నివసించేవారు. ఈక్రమంలోనే ఇంద్రావతి, ఆజాద్ ప్రేమలో పడ్డారు. ఇరు కుటుంబాల మధ్య సాన్నిహత్యం కారణంగా వీరిని పెద్దగా అనుమానించలేదు. అయితే ఇంద్రావతి భర్త చంద్రశేఖర్, వారు పారిపోవడానికి నాలుగు రోజుల ముందు వీరిద్దరూ ఏకాంతంగా మాట్లాడుకోవడం చూశాడు. వద్దని వారించాడు. నచ్చజెప్పాలని ప్రయత్నించాడు. వారి వ్యవహారాన్ని తీవ్రంగా వ్యతిరేకించాడు. కానీ ఇద్దరూ దానికి సుతరామూ అంగీకరించలేదు. ఇక అంతే తమకు అడ్డురాకుండా ఎలాగైనా భర్తను తప్పించాలని ప్లాన్‌ వేసింది. ఇందుకోసం ఇద్దరూ కలిసి కుట్రపన్నారు. ఇంద్రావతి ఆజాద్‌తో కలిసి వారికి విషం ఇవ్వడానికి కుట్ర పన్నిందని ఇంద్రావతి భర్త చంద్రశేఖర్‌ ఆరోపణ.చదవండి: Vaibhav Suryavanshi Success Story: తండ్రి త్యాగం, పట్టుదలతో 13 ఏళ్లకే కోటీశ్వరుడు.. ఇదీ టాలెంట్‌!ఇదే చంద్రశేఖర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అక్రమంగా ఆజాద్‌ను పెళ్లి చేసుకోవడంతో పాటు, తనతోపాటు తన నలుగురు పిల్లల్ని హత మార్చేందుకు వారిద్దరూ కుట్ర చేశారని పోలీసులకు చేసిన ఫిర్యాదులో బాధితుడు వాపోయాడు. అయితే వారిద్దరూ మేజర్లు కావడంతో పోలీసులు చంద్రశేఖర్ ఫిర్యాదును తీసుకునేందుకు నిరాకరించారు. దీంతో తన భార్యకు పెద్ద కర్మ నిర్వహించి "చనిపోయినట్లు" ప్రకటించాలని నిర్ణయించు కున్నాడు. కాగా ఇంద్రావతి చంద్రశేఖర్‌కు రెండో భార్య. ఉద్యోగరీత్యా అతను ఎక్కువ క్యాంప్‌లకు వెళ్లేవాడట. ఈ సమయంలో ఇంద్రావతి, అజాద్‌ మధ్య సాన్నిహిత్యం పెరిగిందని భావిస్తున్నారు. ఇదీ చదవండి: Akshaya Tritiya 2025 పదేళ్లలో పసిడి పరుగు, కొందామా? వద్దా?

Infosys Terminates 195 More Trainees at Mysuru Campus8
ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం: మరో 195 మంది ట్రైనీలు..

2025లోనూ లేఆప్స్ పర్వం కొనసాగుతూనే ఉంది. టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ వరుస తొలగింపులు చేపడుతూనే ఉంది. తాజాగా మరో 195 మంది ఉద్యోగులను తొలగించింది. ఈ ఏడాదిలోనే ట్రైనీలను తొలగించడం వరుసగా నాలుగోసారి కావడం గమనార్హం.ఇంటర్నల్ అసెస్‌మెంట్‌ ప్రోగ్రామ్‌లో విఫలమైన కారణంగా 195 మందిని తొలగించినట్లు తెలుస్తోంది. వీరందరికీ కంపెనీ ఈ మెయిల్స్ ద్వారా సమాచారం అందించినట్లు ఆంగ్ల మీడియా కథనాలు వెల్లడించాయి. 2025 ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు సంస్థ సుమారు 800 మంది ట్రైనీలను తొలగించింది.భారతదేశంలో రెండవ అతిపెద్ద ఐటీ సేవల సంస్థ ఏప్రిల్ 18న దాదాపు 240 మందిని తొలగించగా, అంతకు ముందు ఫిబ్రవరిలో 300 మందికి పైగా ట్రైనీలను, మార్చిలో 30 నుంచి 35 మందిని తొలగించింది. తొలగించిన ట్రైనీలకు ఒక నెల ఎక్స్‌గ్రేషియాతో పాటు రిలీవింగ్‌ లెటర్‌ను కూడా సంస్థ అందిస్తోంది. ఇన్ఫోసిస్ కంపెనీ తొలంగించిన ట్రైనీలందరినీ.. 2022లో నియమించుకుంది.ఇదీ చదవండి: అద్దె అపార్ట్‌మెంట్‌లోనే విక్కీ కౌశల్: వామ్మో రెంట్ మరీ ఇంతనా..

Pankaj Tripathi Criminal Justice Season 4 OTT Date9
'కోర్ట్'ని మించిపోయేలా ఉంటుంది.. ఓటీటీ డేట్ ఫిక్స్

కోర్ట్ రూమ్ డ్రామా సినిమాలు తెలుగులో పెద్దగా రాలేదు. రీసెంట్ టైంలో మాత్రం 'కోర్ట్' అనే మూవీ సూపర్ హిట్ అయింది. తొలుత థియేటర్లలో హిట్ టాక్ తెచ్చుకుంది. ఆ పైన ఓటీటీలోకి వచ్చిన తర్వాత కూడా అదే జోరు చూపించింది. 'కోర్ట్'(Court Movie Telugu) గురించి కాసేపు పక్కనబెడితే ఇదే తరహాలో తీసిన వెబ్ సిరీసులు కూడా ఓటీటీలో ఉన్నాయి. అలాంటి వాటిలో ఒకటి 'క్రిమినల్ జస్టిస్'(Criminal Justice). 2019లో తొలి సీజన్ రిలీజ్ కాగా అద్భుతమైన స్పందన వచ్చింది. 'మీర్జాపుర్' ఫేమ్ పంకజ్ త్రిపాఠి(Pankaj Tripathi), విక్రాంత్ మస్సే ఇందులో నటించారు.(ఇదీ చదవండి: శోభిత ప్రెగ్నెంట్ అని రూమర్స్.. నిజమేంటి?) తొలి సీజన్ సూపర్ సక్సెస్ అయ్యేసరికి మరో కేసుని తీసుకుని 2020లో రెండో సీజన్, 2022లో మూడో సీజన్ రిలీజ్ చేశారు. వీటికీ మంచి స్పందన వచ్చింది. ఇప్పటివరకు వచ్చిన మూడు సీజన్లు కూడా థ్రిల్లింగ్ గా ఉన్నాయి. ఇప్పుడు చాలా గ్యాప్ తీసుకుని నాలుగో సీజన్ ని సిద్ధం చేశారు. 'క్రిమినల్ జస్టిస్: ఏ ఫ్యామిలీ మేటర్' పేరుతో నాలుగో సీజన్ టీజర్ తాజాగా రిలీజ్ చేశారు. మే 22 నుంచి హాట్ స్టార్ ఓటీటీలో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కాబోతున్నట్లు ప్రకటించారు. మరి ఈసారి ఎలాంటి కేసు వాదించబోతున్నారో అనేది చూడాలి?(ఇదీ చదవండి: నెలలోపే ఓటీటీలోకి వచ్చేసిన థ్రిల్లర్‌ సినిమా) Seedha aur simple toh Madhav Mishra ji ke syllabus mein hai hi nahi. Aapke favourite vakeel sahab aa rahe hain courtroom mein wapas! ⚖️#HotstarSpecials #CriminalJustice - A Family Matter, streaming from May 22, only on #JioHotstar@ApplauseSocial @BBCStudiosIndia @nairsameer… pic.twitter.com/Gu1B3bnLWF— JioHotstar (@JioHotstar) April 29, 2025

Vijay Antony issued a statement to clarify his Pahalgam Incident Post 10
పహల్గామ్‌ దాడి.. నా పోస్ట్‌ను తప్పుగా అర్థం చేసుకున్నారు: విజయ్ ఆంటోనీ క్లారిటీ!

పహల్గామ్ ఉగ్రదాడిపై ప్రముఖ నటుడు విజయ్ ఆంటోనీ చేసిన పోస్ట్‌ వివాదానికి దారితీసింది. ఆయన చేసిన పోస్ట్‌పై పలువురు నెటిజన్స్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. పాకిస్తాన్‌లో 50 లక్షల మంది భారతీయులు ఉన్నారన్న ఆయన వాదనపై నెటిజన్స్ మండిపడ్డారు. దీంతో తన పోస్ట్‌పై విజయ్ ఆంటోని క్లారిటీ ఇచ్చారు. తన సందేశాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారని మరో పోస్ట్ చేశారు.కాగా.. అంతకుముందు పహల్గామ్ దాడిని ఖండిస్తూ..కశ్మీర్‌లో తమ ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలకు నా హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నా. భారతీయులుగా మనందరికీ బాధాకరమైన క్షణమిది. పాకిస్తాన్‌లో 50 లక్షల మంది ఇండియన్స్‌ ఉన్నారని.. పాకిస్తానీలు మనలాగే శాంతి, ఆనందాన్ని కోరుకుంటారు. ఇలాంటి సమయంలో ద్వేషం కంటే మానవత్వాన్ని చూపిద్దాం' అంటూ విజయ్ ఆంటోని తన పోస్ట్‌లో రాసుకొచ్చారు. దీంతో ఆయనపై పలువురు విమర్శల దాడి చేశారు. పాకిస్తాన్‌లో ఉన్న ఈ 50 లక్షల మంది భారతీయులు ఎవరు? మీరు హిందువులను భారతీయులుగా పోలుస్తూ గందరగోళం సృష్టిస్తున్నారని ఓ నెటిజన్ ప్రశ్నించాడు. పాకిస్థాన్‌లో భారతీయులు అంటూ ఆయన చేసిన వాదనను పలువురు తప్పుపట్టారు.తాజాగా తన పోస్ట్‌పై వివరణ ఇచ్చేందుకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. కశ్మీర్‌లో దారుణమైన మారణకాండ పాల్పడ్డారు.. వారి లక్ష్యం మన ఐక్యతను, బలమైన బంధాన్ని దెబ్బతీయడమే. భారతీయులుగా మన ప్రభుత్వంతో కలిసి మన సార్వభౌమాధికారాన్ని కాపాడుకుంటామనేదే నా ఉద్దేశమని మరో పోస్ట్‌తో క్లారిటీ ఇచ్చారు. బిచ్చగాడు మూవీతో ఫేమస్ అయిన విజయ్ ఆంటోనీ సినిమాల విషయానికొస్తే చివరిసారిగా 'హిట్లర్‌లో కనిపించారు. ప్రస్తుతం 'గగన మార్గం', 'వల్లి మయిల్', 'అగ్ని సిరగుగల్', 'ఖాఖీ', 'శక్తి తిరుమగన్' లాంటి ఐదు చిత్రాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. pic.twitter.com/YbFIloXPQ9— vijayantony (@vijayantony) April 27, 2025 pic.twitter.com/Gne6EdT6yu— vijayantony (@vijayantony) April 28, 2025

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement