Top Stories
ప్రధాన వార్తలు

ఝూటా వకీల్ సాబ్ పతనం మొదలైందా?
సూపర్ సిక్స్ హామీలు, ఎన్నికల ప్రణాళికలోని అంశాలతో తనకు సంబంధం లేనట్లు, అదేదో టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేశ్‌ల బాధ్యత అన్నట్లు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడుతున్నారు. ప్రశ్నించడానికే పార్టీని పెట్టానని గొప్పగా చెప్పుకున్న పవన్.. ఇప్పుడు చంద్రబాబు, లోకేశ్‌లను రాజకీయంగా మోయడానికి, తన ఉప ముఖ్యమంత్రి పదవిని ఎంజాయ్ చేయడానికే అన్నట్లు ప్రవర్తిస్తున్నారని విమర్శ. దీంతో ఆయనకు ఇప్పుడిప్పుడే నిరసన సెగ తగులుతోంది. కొద్ది రోజుల క్రితం విశాఖ, గిరిజన ప్రాంతాలకు వెళ్లినప్పుడు వలంటీర్లు పవన్ కల్యాణ్(Pawan Kalyan)ను నిలదీసే యత్నం చేశారు. ఇప్పటికే ఆయా చోట్ల వలంటీర్లు ధర్నాలు, ర్యాలీలు నిర్వహించారు. అయినా కూటమి ప్రభుత్వంలో కనీస స్పందన లేదు. కూటమి పెద్దలకు చీమ కుట్టినట్లుగా కూడా లేదు. దాంతో వలంటీర్లు నేతలను ప్రశ్నించడానికి సిద్ధమవుతున్నారు. నిజానికి వీరే కాదు. సూపర్ సిక్స్ తదితర హామీలు ఏమయ్యాయంటూ మహిళలు, నిరుద్యోగులు తదితర వర్గాలు నిరసన ర్యాలీలు చేయడం ఆరంభమైంది.వలంటీర్లకు సంబంధించి పవన్ చేసిన ప్రకటనను గమనిస్తే ఆయన ఎలా మాట మార్చుతున్నది ఇట్టే తెలిసిపోతుంది. గత ప్రభుత్వం వలంటీర్లను అధికారికంగా నియమించలేదని చంద్రబాబు, లోకేశ్‌లు క్యాబినెట్ సమావేశంలో చెప్పారని, వారికి ఇచ్చేది జీతం కాదు.. గౌరవ వేతనం మాత్రమేనని, అందుకే ఏమీ చేయలేదని తెలియ చేశారని పవన్ అన్నట్లుగా మీడియాలో కథనం వచ్చింది. లక్షన్నర మంది జీవితాలను నట్టేట ముంచేసి, అదేదో స్వల్ప విషయమన్నట్లుగా పవన్ వ్యవహరించడం శోచనీయం. 👉ఎన్నికల ప్రణాళికలో వలంటీర్లకు పదివేల జీతం ఇస్తామని, వారి సేవలను కొనసాగిస్తామని ప్రకటించింది వాస్తవం కాదా? పలు ఎన్నికల ప్రచార సభలలో పవన్ కళ్యాణ్ ఎన్నిసార్లు వలంటీర్ల అంశం ప్రస్తావించారో గుర్తు లేదా? వలంటీర్ల కడుపు కొట్టబోమని, అందులోను లక్షమంది యువతులకు అన్యాయం చేస్తానా? అని ప్రసంగించారు. వాస్తవానికి రాష్ట్రంలో రెండున్నర లక్షల మంది వలంటీర్లు ఉండే వారు. కాని ఎన్నికల సమయంలో సుమారు ఎనభై వేల నుంచి లక్ష మంది వరకు రాజీనామాలు సమర్పించారు. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఉంటే వారిని కూడా బాధ్యతలలోకి తీసుకునే వారు. కాని కూటమి ప్రభుత్వం రావడంతో తమకు గౌరవ వేతనం పెరుగుతుందని రాజీనామా చేయని వలంటీర్లు ఆశపడ్డారు. తీరా చూస్తే కూటమి ప్రభుత్వం అసలుకే మోసం తెచ్చింది. 👉వలంటీర్లు(Volunteers) అంటే స్వచ్ఛందంగా సేవలందించే వారని, వారికి గత జగన్ ప్రభుత్వం గౌరవ వేతనం ఇచ్చిందన్న సంగతి పవన్ కళ్యాణ్ కు తెలియదా? ఆ విషయం తెలియకుండానే, గుడ్డిగా చంద్రబాబుతో కలిసి ఎన్నికల ప్రణాళికపై సంతకం చేశారని నమ్మాలా? అదే వాస్తవం అయితే పవన్ కళ్యాణ్ ఈ పదవిలో ఉండడానికి అర్హుడవుతారా? పైగా క్యాబినెట్లో చంద్రబాబు, లోకేశ్‌లు ఏదో చెప్పారని వారిపై నెట్టేసి తప్పించుకునే యత్నం చేస్తారా? ప్రభుత్వంలో వారు ఏమి చేసినా సమర్థిస్తున్న పవన్ కళ్యాణ్ వలంటీర్ల విషయం తనకు ఏమీ తెలియదన్నట్లుగా నటించడం ధర్మమేనా?. వలంటీర్లకు ఇచ్చేది గౌరవ వేతనం కనుక ,వారికి ఆ బాధ్యతలు అప్పగించడం కుదరదని చంద్రబాబు, లోకేశ్ లు చెబితే పవన్ కళ్యాణ్ చెవిలో పువ్వు పెట్టుకుని విన్నారా?మనం హామీ ఇచ్చాం కదా! ఎందుకు చేయలేం. ప్రభుత్వం అనుకుంటే ఇది ఒక పెద్ద సమస్యా?అ ని పవన్ కళ్యాణ్ ప్రశ్నించి ఉండాలి కదా? ఉగాది పర్వదినానా పవిత్రమైన పూజలు నిర్వహించి మరీ వలంటీర్లకు హామీ ఇచ్చారు కదా? ఇప్పుడు కాదంటే పాపం కదా అని చంద్రబాబును అడగాలి కదా? అలా అడగలేదంటే ఏమిటి దాని అర్థం? వలంటీర్లు సామాన్యులు కనుక, వారిని ఏమి చేసినా ఏమీ కాదన్న భావనే కదా?. 👉జగన్ ప్రభుత్వం(Jagan Govt) విజయవంతంగా నిర్వహించిన వలంటీర్లు అంటే చంద్రబాబు, లేదా పవన్ కళ్యాణ్‌లకు ఎప్పుడూ గౌరవం లేదు. వారిని అసలు సమాజంలో గౌరవనీయమైన వ్యక్తులుగా చూడడానికి కూడా ఇష్టపడలేదు. చంద్రబాబు నాయుడు వీరిని మూటలు మోసే వారని, ఆడవాళ్ళు ఇళ్లలో ఉన్నప్పుడు వెళ్లి వేధించేవారని ఒకసారి నీచమైన రీతిలో వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ అయితే మరీ దారుణంగా వలంటీర్లను కిడ్పాపర్లతో పోల్చారు. ఏపీలో 30 వేల మంది అమ్మాయిలు తప్పిపోయారని అంటూ వలంటీర్లపై ఆరోపణలు చేశారు. కాని ప్రజలలో వలంటీర్ల పట్ల ఉన్న సానుకూలత వల్ల అది వైఎస్సార్సీపీకి ఎక్కడ అడ్వాంటేజ్ అవుతుందోనన్న భయంతో, మాట మార్చి తాము అధికారంలోకి వస్తే వలంటీర్లను కొనసాగించడమే కాకుండా, గౌరవ వేతనం రూ.ఐదు వేల నుంచి రూ.పది వేలు చేస్తామని ప్రకటించారు. అప్పటికి వారికి అధికారం వస్తుందన్న నమ్మం లేదు. కాని అనూహ్యంగా గెలిచేసరికి, ఇప్పుడు సూపర్ సిక్స్‌తో సహా అనేక అంశాలపై స్వరం మార్చుతున్నారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముందు సినీ నటుడు. ఆ తర్వాతే రాజకీయ నేత. సినిమాలలో వకీల్ సాబ్‌గా ఆయన నటన అభిమానులను మెప్పించింది. కానీ రాజకీయ జీవితంలో మాత్రం ఆయన వ్యవహారశైలి వకీల్‌సాబ్ పాత్రకు భిన్నంగా ఉంది. ఈ సంగతిని ప్రజలూ గుర్తిస్తున్నారు. కరడుకట్టిన, గుడ్డి అభిమానులు మినహా మిగిలిన వారిలో పవన్ కళ్యాణ్ మాట మార్చేస్తున్నారన్న భావన క్రమేపీ బలపడిపోతోంది. 👉అబద్దాలు బాగా ఆడతారన్న పేరు ఉన్న చంద్రబాబుకు తానా అంటే తందానా అని తబలా వాయిస్తున్న చందంగా పవన్ వ్యవహరిస్తున్నారు. ఆయనతో పోటీ పడి అసత్యాలు చెబుతున్నారు. తాము మాట మార్చుతున్నామని ధైర్యంగా పవన్ కళ్యాణ్ చెప్పి ఉంటే కొంతైనా బెటర్‌గా ఉండేది. అలా కాకుండా చంద్రబాబు, లోకేశ్‌లదే తప్పు అన్నట్లు, తనకేమీ సంబంధం లేదన్నట్లు పవన్ కళ్యాణ్ డ్రామా ఆడినట్లు డైలాగులు చెబితే ప్రజలను పిచ్చివాళ్లను చేసినట్లు కాదా? వలంటీర్లను మోసం చేయడం కాదా? 30 వేల మంది అమ్మాయిల మిస్సింగ్ గురించి ఏపీ అంతటా తిరిగి చేసిన ప్రచారం అంతా అసెంబ్లీ సాక్షిగా పచ్చి అబద్దం అని తేలింది కదా! కేవలం 47 మంది మాత్రమే మిస్ అయ్యారని, వారిలో ఎక్కువ మంది తిరిగి వచ్చారని అసెంబ్లీలో సమాధానం చెప్పింది కూటమి ప్రభుత్వమే కదా? పవన్ కళ్యాణ్ పచ్చి అబద్దం ప్రచారం చేసి ఆంధ్ర సమాజాన్ని చీట్ చేసినట్లు అవుతుందా? అవ్వదా?.చంద్రబాబు, లోకేశ్‌ల పట్ల పవన్ కళ్యాణ్ ఎంత విధేయుడిగా ఉన్నా ప్రజలకు అభ్యంతరం లేదు. కాని ఎన్నికల ప్రణాళికను చంద్రబాబుతో కలిసి ఆయన కూడా విడుదల చేశారన్న సంగతి మర్చిపోకూడదు కదా! వకీల్ సాబ్ పాత్రను సినిమాలలో పోషించడం కాదు.. ప్రజా జీవితంలో ఆ మాదిరి నిలబడితేనే మంచి పేరు వస్తుంది. పవన్ కళ్యాణ్ విశాఖ వెళ్లినప్పుడు ఆయన కాన్వాయ్ కోసం పోలీసులు ఆంక్షలు విధించడం, తత్పలితంగా సుమారు 30 మంది జెఈఈ పరీక్షలు రాయలేకపోయిన ఘటన కూడా కూటమి ప్రభుత్వ తీరుకు అద్దం పడుతుంది. పవన్ కళ్యాణ్ పదవిని ఎంజాయ్ చేసే మోజులో విద్యార్ధుల భవిష్యత్తును కూడా దెబ్బతీశారన్న విమర్శకు ఆస్కారం ఇచ్చారు. ఏది ఏమైనా వలంటీర్లను చంద్రబాబు, లోకేశ్‌లే కాదు.. పవన్ కళ్యాణ్ కూడా మోసం చేసినట్లే!. :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

విశాఖ: ప్రలోభాల పర్వంలో కూటమి నేతలకు ఛీత్కారాలు
విశాఖపట్నం, సాక్షి: అధికార దాహంతో.. గత 11 నెలల పదవి కాలంలో కూటమి ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేసింది. ఈ క్రమంలో ఇప్పుడు విశాఖ మేయర్‌పై అవిశ్వాసం వేళ (GVMC No Confidence Motion).. మరోసారి భారీగా ప్రలోభాలకు తెరలేపింది. ఈ క్రమంలోనే వైఎస్సార్సీపీ కార్పొరేటర్లకు గాలం వేసేందుకు కోట్లాది రూపాయలను మంచి నీళ్లలా ఖర్చు చేస్తోంది. అవిశ్వాసానికి సమయం దగ్గర పడుతుండడంతో కూటమి నేతలు ప్రలోభాల ఉధృతిని పెంచారు. వైఎస్సార్సీపీ కార్పొరేటర్ల ఇళ్లకు వెళ్లి వాళ్ల కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నారు. భారీగా డబ్బు ఇస్తామని, భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా చూస్తామని హామీలు గుప్పిస్తున్నారు. అలాగే.. శ్రీలంక, కేరళ నుంచి విశాఖకు తీసుకురావడానికి ప్రత్యేక విమానం ఏర్పాటు చేస్తామంటున్నారు. విమానం కాకపోతే హెలికాప్టర్స్ అయినా ఏర్పాటు చేస్తామంటూ ఆఫర్లు చేస్తున్నారు. అయితే.. తాము వైఎస్సార్ అభిమానులమని, ఎలాంటి పరిస్థితుల్లోనైనా వైఎస్ జగన్(YS Jagan)తోనే ఉంటామని చెబుతూ వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు ఆ ఆఫర్లను తిరస్కరిస్తున్నారు. ఈ క్రమంలో బెదిరింపులకు సైతం కొందరు లొంగడం లేదని సమాచారం. దీంతో చేసేది లేక కూటమి నేతలు వెనుదిరుగుతున్నట్లు సమాచారం. జీవీఎంసీ(GVMC) ఎన్నికల్లో 58 స్థానాలను వైఎస్సార్ సీపీ కైవసం చేసుకుని మేయర్ పదవిని చేజిక్కించుకుందని, 30 స్థానాలు మాత్రమే గెలుచుకున్న టీడీపీ ఇప్పుడు మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలనే దురాలోచనతో ఉంది. ఈ క్రమంలోనే భారీగా డబ్బు ఆశ చూపించడం, బెదిరింపులలాంటి అప్రజాస్వామిక ప్రయత్నాలకు దిగింది.

మెలోనీతో భేటీ.. సుంకాలపై మెత్తబడ్డ ట్రంప్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల విషయంలో కాస్త మెత్తబడ్డారు. సుంకాలపై పలు దేశాలు అగ్రరాజ్యంతో చర్చలకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ అమెరికా అధినేతతో సమావేశమయ్యారు. ఈ భేటీ సందర్భంగా ఆయన సానుకూల వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఈయూ దేశాలపై అమెరికా 20 శాతం సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. అయితే దాని అమలును 90 రోజులపాటు నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పరిణామాల నడుమ.. ట్రంప్‌ను కలిసిన తొలి యూరప్ దేశపు నేత మెలోనీనే కావడం గమనార్హం. ఐరోపా సమాఖ్య(European Union)తో పాటు ఇతర దేశాలతో వాణిజ్య ఒప్పందం అంశంపై వీరు చర్చలు జరిపారు. అయితే ఈయూతో సుంకాలపై ఒప్పందం నూటికి నూరు శాతం కుదురుతుందని ట్రంప్ భరోసా ఇచ్చారు. ఈ డీల్ విషయంలో మాత్రం తాను తొందర పడటం లేదని వ్యాఖ్యానించడం గమనార్హం. ప్రతీ ఒక్కరూ అమెరికాతో డీల్ కుదుర్చుకోవాలని తాపత్రయపడుతున్నారు. ఒకవేళ అలా వాళ్లు అనుకోకుంటే గనుక మేమే వాళ్లతో ఒప్పందానికి దిగి వస్తాం అంటూ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్య చేశారు. ఇక.. మరోవైపు ఈ భేటీలో మెలోనీని ట్రంప్ ఆకాశానికెత్తారు. ఆమె ఓ అద్భుతమైన నేత అంటూ పొగడ్తలు గుప్పించారు. మరోవైపు.. పశ్చిమాన్ని గొప్పగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని, కలిసికట్టుగా ఆ పని చేయగలమని అనుకుంటున్నా’ అని ఓవల్ ఆఫీసులో రిపోర్టర్లతో మెలోనీ మాట్లాడారు. ట్రంప్‌ను రోమ్ను ఆహ్వానించిన మెలోనీ.. అక్కడ ఈయూ దేశాల ప్రతినిధులతో సుంకాల అంశంపై చర్చిస్తామని వెల్లడించారు. Rendiamo l’Occidente di nuovo grande - Make the West Great Again pic.twitter.com/Z499ZRGx85— Giorgia Meloni (@GiorgiaMeloni) April 17, 2025

నీతా అంబానీ దగ్గరికి వెళ్లిన ఇషాన్.. మాజీ ఓనర్ రియాక్షన్ ఇదే!
ఐపీఎల్-2025 (IPL 2025)లో ముంబై ఇండియన్స్- సన్‌రైజర్స్ హైదరాబాద్ (MI vs SRH) మ్యాచ్ సందర్భంగా గురువారం ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. రైజర్స్ స్టార్ బ్యాటర్ ఇషాన్ కిషన్ (Ishan Kishan).. ముంబై జట్టు యజమాని నీతా అంబానీ (Nita Ambani)ని కలిశాడు. ముంబై చేతిలో ఓటమి అనంతరం తన మాజీ ఓనర్ దగ్గరకు వెళ్లి మర్యాదపూర్వకంగా పలకరించాడు.ప్రేమగా చెంప నిమిరిన మాజీ ఓనర్బదులుగా ఇషాన్ కిషన్ చేతిని పట్టుకుని.. తల్లి మాదిరి ప్రేమపూర్వకంగా నీతా అంబానీ అతడి చెంప నిమిరారు. ఓటమికి కుంగిపోవాల్సిన పనిలేదన్నట్లుగా ఇషాన్‌ను ఓదార్చారు. ఇందుకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఈ నేపథ్యంలో లక్నో సూపర్ జెయింట్స్ ఓనర్ సంజీవ్ గోయెంకాపై మీమ్స్ పేలుతున్నాయి. ‘‘తమ జట్టుతో ప్రయాణించిన మాజీ ఆటగాడి పట్ల నీతా తల్లిలా ప్రేమను కురిపిస్తుంటే.. గోయెంకా మాత్రం ఒక్క మ్యాచ్‌లో ఓడినా తమ కెప్టెన్లను అందరి ముందే ఉతికి ఆరేస్తాడు.. ఇదే ఈ ఇద్దరికి ఉన్న తేడా’’ అంటూ ముంబై అభిమానులు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.కాగా 2016లో ఇషాన్ కిషన్ ఐపీఎల్లో అరంగేట్రం చేశాడు. గుజరాత్ లయన్స్ అతడిని రూ. 35 లక్షల కనీస ధరకు కొనుగోలు చేయగా.. రెండేళ్ల పాటు అదే జట్టుకు ఆడి 319 పరుగులు చేశాడు.ముంబైతో సుదీర్ఘ అనుబంధంఅయితే, గుజరాత్ ఫ్రాంఛైజీ ఐపీఎల్ నుంచి కనుమరుగైన తర్వాత ముంబై ఇండియన్స్ ఇషాన్ కిషన్‌ను కొనుగోలు చేసింది. 2018 వేలంలో ఈ ఎడమచేతి వాటం బ్యాటర్‌ను సొంత చేసుకోగా.. రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఆ ఏడాది 500కు పైగా పరుగులు సాధించాడు. అప్పటి నుంచి ఏడేళ్లపాటు ముంబై జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. 2022 వేలంలో అత్యధికంగా రూ. 15.25 కోట్ల ధర పలికాడు.రూ. 11.25 కోట్లకు రైజర్స్‌కు సొంతంఅయితే, మెగా వేలం-2025కి ముందు ముంబై ఇషాన్ కిషన్‌ను వదిలేసింది. ఈ క్రమంలో వేలంపాటలోనూ అతడిని కొనుగోలు చేసేందుకు పెద్దగా ఆసక్తి చూపించలేదు. ఇక అతడి కోసం ఇతర ఫ్రాంఛైజీలతో పోటీ పడి మరీ సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ. 11.25 కోట్లకు ఇషాన్‌ను కొనుక్కుంది. ఇప్పటి వరకు ఐపీఎల్-2025లో విధ్వంసకర శతకం (106 నాటౌట్) బాదడం మినహా ఇషాన్ ఆకట్టుకోలేకపోతున్నాడు. ఏడు మ్యాచ్‌లలో కలిపి అతడు సాధించిన పరుగులు 138. నాలుగు వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ ఓటమిఇక ముంబై- సన్‌రైజర్స్ మధ్య మ్యాచ్ విషయానికొస్తే.. వాంఖడేలో టాస్ గెలిచిన హార్దిక్ పాండ్యా తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ క్రమంలో బ్యాటింగ్ దిగిన కమిన్స్ బృందం.. నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది.లక్ష్య ఛేదనకు దిగిన ముంబై ఆరు వికెట్లు నష్టపోయి 18.1 ఓవర్లలో టార్గెట్‌ను పూర్తి చేసింది. బంతితో, బ్యాట్‌తో రాణించిన ముంబై ఆల్‌రౌండర్ విల్ జాక్స్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఆఫ్ స్పిన్నర్ అయిన జాక్స్ మూడు ఓవర్ల బౌలింగ్‌లో కేవలం 14 పరుగులే ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. ట్రవిస్ హెడ్ (28), ఇషాన్ కిషన్ (2) రూపంలో రెండు కీలక వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక లక్ష్య ఛేదనలో వన్‌డౌన్‌లో వచ్చిన విల్ జాక్స్ 26 బంతుల్లో 36 పరుగులు సాధించాడు.చదవండి: ఇలాంటి వికెట్ మీద కష్టమే.. మా వాళ్లు నిర్లక్ష్యంగా ఆడలేదు.. కానీ: కమిన్స్Applying the finishing touches 🤌🎥 #MI skipper Hardik Pandya gave them the final flourish with a brilliant cameo of 21(9)Scorecard ▶ https://t.co/8baZ67Y5A2#TATAIPL | #MIvSRH | @mipaltan | @hardikpandya7 pic.twitter.com/hPI3CxwzLF— IndianPremierLeague (@IPL) April 17, 2025

Texas: మృత్యువుతో పోరాడి ఓడిన దీప్తి
ఆస్టిన్: అమెరికా టెక్సాస్‌లో తెలుగు విద్యార్థిని హిట్ అండ్ రన్ కేసు విషాదాంతంగా ముగిసింది. తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న వంగవోలు దీప్తి(Deepthi Vangavolu)కన్నుమూశారు. ఈ విషయాన్ని అక్కడి అధికారులు ఇచ్చిన సమాచారం ద్వారా కుటుంబ సభ్యులు ధృవీకరించారు. దీంతో గుంటూరులోని ఆమె స్వస్థలంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. దీప్తి(23) తండ్రి హనుమంత రావు చిరువ్యాపారి. ఆమె కుటుంబం గుంటూరు(Guntur) రాజేంద్రనగర్ రెండో లైనులో నివాసం ఉంటోంది. టెక్సాస్‌లోని డెంటన్ సిటీలో యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సాస్‌లో ఎంఎస్ చేసేందుకు వెళ్లారు. మరో నెల రోజుల్లో కోర్సు పూర్తి కావాల్సి ఉంది. అయితే ఈలోపు రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు ఆమెను కబళించింది. ఈ నెల 12వ తేదీన స్నేహితురాలైన మేడికొండూరుకు చెందిన స్నిగ్ధతో కలిసి రోడ్డుపై నడచి వెళ్తుండగా వేగంగా ప్రయాణిస్తున్న కారు ఢీకొట్టింది. దీప్తి తలకు తీవ్ర గాయమైంది. స్నిగ్ధకు కూడా గాయాలయ్యాయి. దీప్తి స్నేహితురాళ్లు ప్రమాద విషయాన్ని ఆమె తండ్రి హనుమంతరావుకు తెలిపారు. క్రౌడ్ ఫండింగ్(Crowd Funding) ద్వారా ఆమె చికిత్స కోసం ప్రయత్నాలు కొనసాగగా.. మంచి స్పందన లభించింది. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. ఈ నెల 15న దీప్తి చికిత్స పొందుతూ కన్నుమూసింది. శనివారం(ఏప్రిల్ 19) నాటికి మృతదేహం గుంటూరుకు వచ్చే అవకాశం ఉంది. మరో బాధితురాలు స్నిగ్ధ ప్రస్తుతం అక్కడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె పరిస్థితి నిలకడగానే ఉందని సమాచారం. అవే ఆమె చివరి మాటలు..దీప్తి మృతి వార్త విని ఆ తల్లిదండ్రులు గుండెలు అవిసెలా రోదిస్తున్నారు. చదువులో చాలా చురుకైన విద్యార్థిని అని, అందుకే పొలం అమ్మి మరీ అమెరికాకు పంపించామని చెప్పారు. నెల రోజుల్లో గ్రాడ్యుయేషన్ పూర్తి కావాల్సి ఉందని, ఆ టైంకి మమ్మల్ని అమెరికాకు రావాలని ఆమె కోరిందని, అందుకు ఏర్పాట్లలో ఉండగానే ఇలా జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 10వ తేదీన దీప్తి చివరిసారిగా తమతో ఫోన్లో మాట్లాడినట్లు తెలిపారు. కాలేజీకి టైం అవుతోందని.. ఆదివారం మాట్లాడతానని చెప్పి హడావిడిగా ఫోన్ పెట్టేసిందని.. అవే తమ బిడ్డ మాట్లాడిన చివరి మాటలని గుర్తు చేసుకుని బోరున విలపించారు.

విశాఖలో కీచక ముఠా! 30 మంది యువతులకు మత్తు మందు ఇచ్చి..
విశాఖపట్నం, సాక్షి: కూటమి పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోతోంది. ఈ 11 నెలలకాలంలో అఘాయిత్యాలు పెరిగిపోయాయి. అదే సమయంలో విశాఖ నేరాలమయంగా మారిపోయింది. తాజాగా.. నగరంలో మ్యారేజ్ బ్యూరో పేరిట అరాచకాలకు పాల్పడుతున్న ఓ ముఠా గట్టు రట్టయ్యింది. యువతులకు మత్తు మందు ఇచ్చి అత్యాచారాలకు పాల్పడుతుండడమే కాకుండా.. ఆపై బ్లాక్మెయిల్ చేస్తున్న వ్యవహారం ఓ బాధితురాలు ముందుకు రావడంతో వెలుగు చూసింది. నాలుగో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ వ్యవహారం వివరాల్లోకి వెళ్తే.. మ్యారేజ్ బ్యూరో, హెర్బల్ ప్రొడక్ట్స్, టూవీలర్ రైడ్ యాప్ పేరిట ఓ ముఠా పెళ్లికాని అమ్మాయిల నుంచి వివరాలు సేకరిస్తోంది. ఆపై సంబంధాలు, ప్రొడక్టులను చూపించే వంకతో పరిచయాలు పెంచుకుంటోంది. మత్తు మందు ఇచ్చి యువతులు స్పృహలో లేనప్పుడు అత్యాచారం చేయడంతో పాటు వీడియోలు తీస్తోంది. అలా ఇప్పటిదాకా 30 మంది యువతుల నగ్న వీడియోలను సేకరించి బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్నట్లు బాధితురాలు చెబుతోంది. ఒకవేళ గర్భం దాలిస్తే బలవంతంగా అబార్షన్లు చేయిస్తున్నారని తెలిపిందామె. గర్భం దాల్చిన తననూ అబార్షన్ చేయించుకోవాలని ఆ ముఠా ఒత్తిడి చేసిందని, లేకుంటే సుపారీ ఇచ్చి చంపేయిస్తామని బెదిరించిందని ఆమె పోలీసులను ఆశ్రయించింది. అయితే.. ఈ విషయంలో పోలీసుల నుంచి కూడా తనకు న్యాయం జరగడం లేదంటూ బాధితురాలు మీడియా ముందు వాపోయింది. ఆ ముఠాను ఆగడాలను కట్టడి చేసి.. నిందితులను కఠినంగా శిక్షించాలని బాధితురాలు కోరుకుంటోంది. ఈ వ్యవహారంపై, యువతి చేస్తున్న ఆరోపణలపై పోలీసులు స్పందించాల్సి ఉంది.

ఖబడ్దార్ రేవంత్.. ‘సీఎం పదవి నుంచి దించేస్తాం’
మహబూబ్‌నగర్,సాక్షి: మహబూబ్ నగర్లో లేఖ కలకలం సృష్టించాయి. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు ఉత్తంకుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డిలను హెచ్చరిస్తూ రాసిన లేఖలు మహబూబ్ నగర్ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని నారాయణ్‌పేట్ జిల్లా మక్తల్‌లో వెలుగులోకి వచ్చాయి. ఆ లేఖలో ‘మేం నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలం. సీఎం రేవంత్‌రెడ్డికి ఇదే మా హెచ్చరిక. ఖబడ్దార్. మీ పలుకుబడి ఉపయోగించి మా ఎమ్మెల్యేకి(మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి) మంత్రి పదవి రాకుండా చేశావో అప్పుడు నీ భరతం పట్టడం ఖాయం. రాష్ట్రంలో పార్టీ అడ్రస్ గల్లంతవుతుంది. మిమ్మల్ని సీఎం పదవి నుంచి దించడం’ అని హెచ్చరిస్తూ లేఖలో రాశారు.ముదిరాజు సామాజిక వర్గం పేరుతో ఆ లేఖలు వెలుగులోకి రావడంపై పోలీసులు రంగంలోకి దిగారు. ఆ లేఖలు ఎవరు రాశారా? అని ఆరా తీస్తున్నారు.ఆ లేఖలపై సమాచారం అందుకున్న ముదిరాజు సంఘం నేతలు పోలీసులు ఫిర్యాదు చేశారు. ఆ లేఖలతో తమకు సంబంధం లేదని పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

కరణ్ జోహార్ షాకింగ్ వెయిట్ లాస్ ఒజెంపిక్ ఇంజెక్షన్లే కారణమా?
చిత్రనిర్మాత కరణ్ జోహార్ (Karan Johar) అకస్మాత్తుగా బరువు తగ్గి, బక్కిచిక్కిపోవడం అందర్నీ దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇంత త్వరగా బాగా బరువు తగ్గి అటు అభిమానులను, ఇటు నెటిజన్ల దృష్టిని ఆకర్షించాడు. అదనపు బరువును తగ్గించడానికి అసహజ పద్ధతులను ఉపయోగిస్తున్నాడనే పుకార్లు జోరుగా వ్యాపించాయి. బరువు తగ్గడానికి ఓజెంపిక్ (Ozempic) ఇంజెక్షన్లను ఉపయోగిస్తున్నాడనే ఆరోపణలు గుప్పుమన్నాయి. దీనిపై కరణ్ జోహార్ (కేజో) తాజాగా స్పందించాడు. అసలేంటీ ఓజెంపిక్ ఇంజెక్షన్, దీంతో అంత తొందరగా బరువు తగ్గవచ్చా? కరణ్ జోహార్ ఏమన్నాడు? తెలుసుకుందాం.స్టైలిష్; ఆరోగ్యంగా, ఫిట్‌గా కనిపించే కరణ్ జోహార్ కరణ్ ఉన్నట్టుండి బక్కగా మారిపోవడం అందర్నీ షాక్‌కు గురిచేసింది. విపరీతంగా ఓజెంపిక్స్ తీసుకోవడంతోనే ఇలా అయ్యాడని కామెంట్లు వినిపించాయి.అయితే తాజాగా వీటిపై కరణ్ స్పందించాడు. తనపై వచ్చిన ఆరోపణలను ఖండించాడు. తాను బరువు తగ్గడానికి ప్రధానంగా రోజుకు ఒకసారి మాత్రమే భోజనం చేస్తున్నానని తెలిపాడు. కఠినమైన ఆహార ప్రణాళిక ఈ మార్పునకు కారణమని కరణ్ వెల్లడించాడు. ఇటీవల, కరణ్ జోహార్ తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో 'ఆస్క్ కేజో' సెషన్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా వినియోగదారులు అతని ఆకస్మిక బరువు తగ్గడం స్లిమ్‌గా మారడం వెనుక గల కారణం గురించి ప్రశ్నించారు. తాను ఇలా మారడానికి చాలా సమయం పట్టిందని, అందరూ అనుకున్నట్టుగా తాను ఎలాంటి మందులు తీసుకోలేదని స్పష్టంగా పేర్కొన్నాడు. ఆహార నియమాలు, జీవనశైలి మార్పులు, వ్యాయామంతో సరైన మార్గంలో బరువు తగ్గాను. ఇపుడు చాలా బావుంది.కొత్త ఉత్సాహం పని చేయడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపాడు. అంతేకాదు తాను ఆరోగ్యంగా,హ్యాపీగా ఉన్నానంటూ అభిమానులకు హామీ ఇచ్చాడు. నెటిజన్లు ఒప్పుకోవడం లేదుమరోవైపు కరణ్ జోహార్ ఓజెంపిక్‌ను ఉపయోగించడం లేదని చేసిన వాదనలపై నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. ‘ఓజెంపిక్‌తో మీరు బరువు తగ్గారని అంగీకరించడంలో తప్పు లేదు. బరువు తగ్గడానికి చాలా సమయం పడుతుంది. బరువు మీ జీవితాన్ని అనేక విధాలుగా ప్రభావితం చేస్తుంది, మీరు బరువు తగ్గిన తర్వాత బాగానే ఉంటే, మీరు దానిని ఎలా కోల్పోయారన్నది ముఖ్యం కాదు. మీరు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో గర్వపడండి మీ డ్రీమ్ అదే కదా .. ఉన్నది ఒక్కటే జీవితం. మన శరీరంతో సంతోషంగా ఉండాలనుకోవడంలో తప్పులేదు. ఆల్ ది బెస్ట్..’ అంటూ ఒక నెటిజన్ కామెంట్ చేశాడు. ‘‘అది ఓజెంపిక్ ముఖమే.. దానిని అంగీకరించడంలో సిగ్గు లేదు. ప్రపంచం మొత్తం ఇప్పుడు దీనిని ఉపయోగిస్తోంది .దాని గురించి బహిరంగంగా చెప్పే వ్యక్తులు గతంలో కంటే ఎక్కువ ప్రశంసలు దక్కించుకుంటున్నారు. సార్ నిజం నిర్భయంగా చెప్పడి" అంటూ మరో యూజర్ వ్యాఖ్యానించాడు. కరణ్ గణనీయంగా బరువుగా తగ్గడం ఇదే తొలిసారి కాదు. గత సంవత్సరం కూడా ఆయన బరువు తగ్గడం ఆకర్షించింది. బరువు తగ్గడానికి ముందు, తరువాత అంటూ ఫోటోలు నెట్టింట హల్చల్ చేశాయి. అలాగే కరణ్ జోహార్ ఓజెంపిక్ ఉపయోగిస్తున్నాడని ఎక్స్ ఖాతాలో ఒక యూజర్ ఆరోపించాడు. దీంతో ఈ ప్రచారం మరింత జోరందుకుంది.అసలేంటీ ఓజెంపిక్ టైప్ 2 డయాబెటిస్ మెల్లిటస్ ఉన్న పెద్దలలో ఆహారం, వ్యాయామంతో రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడటానికి ఇంజెక్షన్ ఒక మెడిసిన్‌గా వాడతారు. 2017లో తొలిసారి దీనికి ఆమోదం లభించింది. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు ఎక్కువగా ఉన్నప్పుడు శరీరంలోకి ఇన్సులిన్ సరైన విడుదలను ఇది నియంత్రిస్తుంది. Ozempic ఇంజెక్షన్ ఆకలిని తగ్గిస్తుంది . జీర్ణక్రియను నెమ్మదిస్తుంది. ఇది చివరికి బరువు తగ్గడానికి దారితీస్తుంది. అయితే దీన్ని వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే వాడాల్సి ఉంటుంది. ఇటీవలి సంవత్సరాల్లో బరువు తగ్గించే ఔషధంగా సెలబ్రిటీలు ఓజెంపిక్‌ను ఉపయోగిస్తున్నారా అని ఊహాగానాలు ఎక్కువయ్యాయి.

ఇన్ఫోసిస్ డివిడెండ్.. 17 నెలల బుడ్డోడికి రూ. 3.3 కోట్లు
దేశంలో అగ్రగామి ఐటీ సంస్థల్లో ఒకటైన ఇన్ఫోసిస్ 2025 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి డివిడెండ్‌ను ప్రకటించింది. ఈ డివిడెండ్ల నుంచి ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి మనవడు 17 నెలల ఎకాగ్రహ్ రోహన్ మూర్తి రూ. 3.3 కోట్లు అందుకోనున్నాడు. ఈ బుడ్డోడికి ఇన్ఫోసిస్‌లో 15 లక్షల షేర్లు (0.04% వాటా) ఉన్నాయి. ఎకాగ్రహ్ నాలుగు నెలల వయసున్నప్పుడు నారాయణ మూర్తి బహుమతిగా ఇచ్చారు. ఆ సమయంలో ఈ షేర్ల విలువ రూ. 240 కోట్లకు పైగా ఉండేది.ఇన్ఫోసిస్ త్రైమాసిక ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా 2025 ఆర్థిక సంవత్సరానికి గానూ ఒక్కో షేరుకు రూ. 22 డివిడెండ్‌ను ప్రకటించింది. దీని ద్వారా ఎకాగ్రహ్‌కు రూ. 3.3 కోట్ల డివిడెండ్ లభించనుంది. ఈ చిన్నారి ఇప్పటివరకు మొత్తం రూ. 10.65 కోట్ల డివిడెండ్‌ను సంపాదించాడు. చిన్న వయసులోనే ఎకాగ్రహ్‌కు రూ.కోట్లలో ఆదాయం లభించడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.ఇన్ఫోసిస్, భారత ఐటీ రంగంలో అగ్రగామిగా ఉంటూ, తన వాటాదారులకు స్థిరమైన డివిడెండ్లను అందిస్తోంది. నారాయణ మూర్తి తన మనవడికి ఇచ్చిన ఈ బహుమతి, ఎకాగ్రహ్ భవిష్యత్తును ఆర్థికంగా బలోపేతం చేయడమే కాకుండా, కుటుంబ ఆస్తుల పంపిణీలో ఒక ఉదాహరణగా నిలుస్తోంది. రాయణ మూర్తి, సుధా మూర్తి దంపతుల కుమారుడు రోహన్ మూర్తి, అపర్ణా కృష్ణన్‌ల ముద్దుల కొడుకే ఈ ఎకాగ్రహ్.ఇక నారాయణ మూర్తి కుమార్తె, యూకే మాజీ ప్రధాని సతీమణి అక్షతా మూర్తికి ఇన్ఫోసస్‌లో 3.89 లక్షల షేర్లు (1.04% వాటా) ఉన్నాయి. దీంతో ఆమె రూ.85.71 కోట్లు అందుకోబోతున్నారు. అలాగే నారాయణ మూర్తి రూ.93.33 కోట్లు, ఆయన భార్య సుధా మూర్తి రూ.76 కోట్లు ఈ డివిడెండ్ల ద్వారా ఆర్జించనున్నారు. ఈ డివిడెండ్లకు మే 30వ తేదీని రికార్డ్ డేట్‌గా ప్రకటించగా జూన్ 30న ఆయా మొత్తాలు వాటాదారుల చేతికి అందనున్నాయి.

వెనక్కి తగ్గని ఐఏఎస్ స్మితా సబర్వాల్.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వరుస రీట్వీట్లు
హైదరాబాద్,సాక్షి: కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో మార్ఫింగ్ ఫొటోను రీ ట్వీట్ చేసిన ఐఏఎస్ స్మితా సబర్వాల్‌కు (Smita Sabharwal) తెలంగాణ పోలీసులు (telangana police) నోటీసులు ఇచ్చారు. అయితే, పోలీసులు నోటీసులు ఇచ్చిన ఐఏఎస్ స్మితా సబర్వాల్ వెనక్కి తగ్గడం లేదు. ప్రభుత్వ వ్యతిరేక ట్వీట్లను రీట్వీట్లు చేస్తున్నారు.కంచ గచ్చిబౌలి భూముల (Kancha Gachibowli row) ఇష్యూకు సంబంధించి పలువురు నేతలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన పోస్టుల్ని డిలీట్ చేస్తున్నారు. కానీ ఐఏఎస్ స్మిత సబర్వాల్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు.ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా వరుస ట్వీట్లు పెడుతున్నారు. తాజాగా, ప్రభుత్వ వ్యతిరేక ట్వీట్లపై వరుసగా రెండోరోజు రీపోస్ట్ చేశారు. వాటిల్లో 100 ఎకరాలను పునరుద్ధరించాలంటూ సుప్రీం ఆదేశాలు ఉన్న ఫొటో ఉంది. మరో పోస్టులో తెలంగాణ పోలీసులు సొంత ఐఏఎస్ అధికారికే నోటీసులిస్తరా? ఇది దేనికి సంకేతం?’ అంటూ ఓ ఇద్దరు మహిళలు పెట్టిన పోస్టును రీపోస్ట్ చేశారు. ఏఐతో క్రియేట్ చేసిన బుల్డోజర్లు, నెమళ్లు, జింకలు ఉన్న రెండు పోస్టులను స్మితా సబర్వాల్ రీపోస్ట్ చేయడం. ఆ పోస్టులకు వివరణ ఇవ్వాలంటూ తెలంగాణ పోలీసులు ఆమెకు నోటీసులు జారీ చేయడం..అయినప్పటికీ ప్రభుత్వ వ్యతిరేక ట్వీట్లను రీట్వీట్ చేయడంపై స్మితా సబర్వాల్ తీరుపై ఐఏఎస్ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది.
బద్రీనాథ్ పక్కనే నా పేరుపై గుడి.. నాకు పూజలు, పూలదండలు: ఊర్వశి
విశాఖ: ప్రలోభాల పర్వంలో కూటమి నేతలకు ఛీత్కారాలు
నేపాల్ పరిణామాలకు బాధ్యులెవరు?
గ్రిడ్ స్థిరీకరణకు స్టోరేజ్ సిస్టమ్
ట్రిపుల్ ట్రీట్.. ఆర్య 3, కార్తికేయ 3.. ఇంకా ఎన్నెన్నో..
అవసరాలకు అప్పు ఇచ్చి.. భార్యను లొంగదీసుకున్నాడు..
ఝూటా వకీల్ సాబ్ పతనం మొదలైందా?
Good Friday మనిషి కొరకు దైవపుత్రుడే...
World Heritage Day: చరిత్రలో ఈ రోజు..!
ప్రధానిగారూ.. చిత్తశుద్ధి నిరూపించుకోండి: కేటీఆర్
పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో అత్యధిక పారితోషికం అతడిదే.. ఐపీఎల్‌తో పోలిస్తే..!
చల్లటి కబురు!
చైనా పై 245 శాతం సుంకాలు విధించిన అమెరికా
రెండో పెళ్లి చేసుకున్న ప్రముఖ యాంకర్, ఫోటోలు వైరల్
పీఎం మోదీ ఏసీ యోజన: కొత్త AC కొనుగోలుపై డిస్కౌంట్
IPl 2025: 'మరీ అంత స్వార్ధం పనికిరాదు బ్రో.. నీ వల్లే రాజస్తాన్ ఓడిపోయింది'
ఈ రాశి వారికి భూలాభాలు.. వ్యాపారాలు విస్తరిస్తారు
MI VS SRH: సిక్సర్ల సెంచరీ పూర్తి చేసిన రోహిత్.. కోహ్లి, గేల్, ఏబీడీ సరసన చోటు
అల్లుడితో కలిసి 7 ఎకరాలు కొన్న బాలీవుడ్ నటుడు.. ఎక్కడంటే?
కమిన్స్, స్టార్క్ కాదు!.. అతడిని ఎదుర్కోవడమే అత్యంత కష్టం: రోహిత్
‘నన్ను బలవంతంగా తీసుకెళ్లారు’
'బురుజులు' ఎందుకు నిర్మించేవారో తెలుసా..?
అర్జున్ చిన్నకూతురి ఎంగేజ్మెంట్.. 13 ఏళ్ల ప్రేమ అంటూ..
వేములవాడ రాజన్నకు కొత్త గుడి
రూ. 50 కోట్ల కుక్క.. ఈడీ దాడులు!
రాజ్‌తరుణ్ పేరెంట్స్‌ను ఇంట్లోకి రానిచ్చిన లావణ్య
అర్ధరాత్రి నర్సింగ్ హాస్టల్లో దూరిన ప్రిన్సిపాల్.. నిర్భంధించిన విద్యార్థినులు
విద్యార్థికి రూ.2 కోట్ల అప్పు.. వడ్డీ 40 రూపాయలు!
అభిషేక్ శర్మ, నితీశ్ కుమార్‌కు జాక్ పాట్..?
మాట నిలబెట్టుకున్న టీమిండియా దిగ్గజం.. కాంబ్లీకి జీవితాంతం నెలకు..
విజయసాయి సాక్ష్యం చెల్లుబాటు అవుతుందా?
హాలీవుడ్ రేంజ్లో ఫైట్
PSLతో పోలికా?.. ఐపీఎల్‌కు ఏదీ సాటి రాదు: ఇచ్చి పడేసిన ఇంగ్లండ్ స్టార్
భారత్‌లోకి వెల్లువలా చైనా ఉత్పత్తులు?
వైద్యులే కంటతడి పెట్టేలా.. 11 ఏళ్ల బాలికపై అత్యాచారం
‘సీఐ పొన్నూరు భాస్కర్ నన్ను టార్చర్ చేశారు సర్’..కోర్టులో కృష్ణవేణి ఆవేదన
26 బంతుల్లో సెంచరీ.. పొట్టి క్రికెట్లో పెను సంచలనం
సడన్‌గా ఓటీటీలోకి వచ్చిన తెలుగు థ్రిల్లర్.. ఎక్కడంటే?
హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో మరో లగ్జరీ ప్రాజెక్ట్
రాష్ట్రాల మీద ఆధిపత్యం కాస్త తగ్గించుకుంటే బెటరేమో సార్!
కుమారుడి వివాహేతర సంబంధానికి తండ్రి బలి..!
ఏ క్షణమైనా గుండెపోటు ఖాయం..! కాలమిస్ట్ శోభా డే కుమార్తె వెయిట్ లాస్ స్టోరీ
ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తాం
ఇద్దరు కొడుకుల గొంతుకోసి చంపి.. తల్లి ఆత్మహత్య
జిమ్‌లో అనసూయ కసరత్తులు.. కళ్లతోనే కవ్విస్తోన్న బిగ్‌బాస్ దివి!
వెనక్కి తగ్గని ఐఏఎస్ స్మితా సబర్వాల్.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వరుస రీట్వీట్లు
మామిడి తోటలో మృత్యువు కాటేసింది
‘రారండోయ్..వేడుక చేద్దాం’..! మంచి ముహూర్తాల తేదీలు ఇవే..!
ముంబైకి ప్రధాన సమస్య అతడే!.. సీజన్ మొత్తం ఎలా భరిస్తారో!?
పెరుగుతున్న మత సమ్మతి
రైళ్లు ఇలా మళ్లిస్తున్నారు..
వక్ఫ్ ఆస్తుల్లో ఎలాంటి మార్పు చేయొద్దు: సుప్రీంకోర్టు
IPL 2025: గ్లెన్ ఫిలిప్స్‌కు ప్రత్యామ్నాయ ఆటగాడు అతడే..!
'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' ట్విటర్ రివ్యూ
గుండెపోటుతో భక్తుడి మృతి.. ఆలయం మూసివేత..!
కాబోయే అల్లుడితో అత్త జంప్ ఎపిసోడ్లో ట్విస్ట్.. ఎందుకిలా చేసిందంటే..
జ్యోతిష్యం చెప్తుండగా టైర్ పేలి తుర్రుమన్న చిలుక
సూర్య, శ్రేయస్, పృథ్వీ షా.. అందరూ ఆడాల్సిందే!.. అదనంగా రూ. 15 లక్షలు!
ఆ చట్టం కేవలం కోడళ్ల కోసమే చేయలేదమ్మా: అలహాబాద్ హైకోర్టు
టీమిండియాలోకి ట్రిపుల్ సెంచరీ వీరుడు.. ఐదేళ్ల తర్వాత రీ ఎంట్రీ?
డ్రైవర్‌గా చేరి ప్రైవేటు వీడియోలతో బ్లాక్ మెయిల్
నాన్న ఆస్తిపై నా భార్య కుట్ర.. ఆయన పాడె మోసేందుకు ఎవరూ రాలేదు
‘కోచ్‌లు అహాన్ని పక్కన పెట్టాలి.. అతడి వ్యూహం వల్లే ముంబై గెలుపు’
భారత్‌లో పత్తి పండుతున్నా దిగుమతులెందుకు?
ప్రతి దరఖాస్తుకు ఒక డెడ్‌లైన్
బంగారం కొనేముందు ఇవి తెలుసుకోండి
ట్రైన్ రిజర్వేషన్: టికెట్‌పై ఈ పదాలు కనిపిస్తే బెర్త్ కన్ఫర్మ్!
అమెరికాలో కొత్త టెన్షన్.. వారి వీసా రద్దు
50 ఏళ్ల వయసులో పడుచుపిల్లలా ఖుష్బూ.. సీక్రెట్ అదే!
గ్రూప్–1 నియామకాలు నిలిపివేయండి
'ఓదెల 2' మూవీ రివ్యూ.. శివశక్తిగా తమన్నా మెప్పించిందా..?
మందు బాబులకు షాక్.. ఎల్లుండి వైన్ షాపులు బంద్
'ఇక మమ్మల్ని ఎవరూ విడదీయలేరు'
త్వరలో ఆర్థిక మాంద్యం!
ఏడాది తర్వాత ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా
ఇంకా చాలామంది మోసగాళ్లు దాక్కున్నారు..
వాటిని వక్ఫ్ ఆస్తులుగా భావిస్తాం: సుప్రీంకోర్టు
బామ్మర్ది మీ అక్క చనిపోయింది..!
మన మీద అనుమానపడటం ఇదేం కొత్తకాదుగా.. లైట్ తీస్కోండి!
మరోసారి చిక్కుల్లో దసరా విలన్.. నటి ఫిర్యాదుతో పరారైన నటుడు!
సౌర వ్యవస్థకు ఆవల జీవం!
IPL 2025: కలిసి కట్టుగా రాణించిన ముంబై.. చిత్తుగా ఓడిన సన్‌రైజర్స్
ఎస్ఆర్హెచ్ జట్టులోకి విధ్వంసకర వీరుడు..
మారిన తత్కాల్ టికెట్ బుకింగ్ రూల్స్: ఏప్రిల్ 15 నుంచే అమలు
విడాకులు తీసుకునే రోజు దగ్గర్లోనే.. నోరు మూయించిన సోనాక్షి
భూకంపం నుంచి బిడ్డను రక్షించుకునేందుకు.. వలయాన్ని సృష్టించిన ఏనుగులు
Texas: మృత్యువుతో పోరాడి ఓడిన దీప్తి
పిఠాపురంలో రైతుల వినూత్న నిరసన..
అంతర్జాతీయ విమానాశ్రయానికి 30 వేల ఎకరాలు
మొబైల్ పోయిందా డోంట్ వర్రీ! కొత్త టెక్నాలజీతో ఇట్టే ..!
ఫ్రెషర్స్ జీతం ఎందుకు పెరగదు? ఐటీ కంపెనీ సమాధానం
Goshala Row: ఎవరిది అసత్య ప్రచారం?.. ప్రశ్నిస్తే కేసులే!
సరికొత్త ఆధ్యాత్మిక ప్రపంచంలో...
మార్చిలో అధికంగా అమ్ముడైన టాప్ 5 మొబైళ్లు
ఇంటర్వ్యూ స్లాట్లు అదృశ్యం
వర్క్ ఫ్రమ్ హోమ్‌తో సైడ్ జాబ్.. ఏఐతో పట్టుకున్న సీఈవో
జిడ్డు బ్యాటింగ్!.. ఇలా అయితే కష్టం రాహుల్: పుజారా విమర్శలు
మరో చిక్కొచ్చిపడిందే.. అప్పుడు జుట్టు.. ఇప్పుడు గోళ్లు.. ఏం జరుగుతోందక్కడ?
ఇన్ఫోసిస్ డీలా
అమెరికా వీసాలు.. కొందరి అదృష్టం
శిక్షణతో.. భవిష్యత్తుకు పునాది
సావిత్రి పాటకు అసభ్యంగా డ్యాన్స్.. సపోర్ట్ చేసిన డైరెక్టర్?
MI VS SRH: రికార్డుల్లోకెక్కిన ట్రావిస్ హెడ్.. గేల్, మ్యాక్స్‌వెల్ కంటే వేగంగా..!
గద్దర్ అవార్డ్స్.. 15 మంది జ్యూరీ కమిటీ సభ్యులు వీళ్లే
ముగిసిన యువవికాసం దరఖాస్తు గడువు
మద్యం మాఫియా మూలవిరాట్టు బాబే
ఇది కదా నీతా అంబానీ ఫ్యాషన్ : స్టైలిష్ లుక్‌లో మెరిసిపోతూ..!
రూ.50 కోట్ల కుక్క..ఈడీ సోదాల ఎపిసోడ్లో అదిరిపోయే ట్విస్ట్!
మెలోనీతో భేటీ.. సుంకాలపై మెత్తబడ్డ ట్రంప్
తొడగొట్టి.. తోక ముడిచారు!
బద్రీనాథ్ పక్కనే నా పేరుపై గుడి.. నాకు పూజలు, పూలదండలు: ఊర్వశి
విశాఖ: ప్రలోభాల పర్వంలో కూటమి నేతలకు ఛీత్కారాలు
నేపాల్ పరిణామాలకు బాధ్యులెవరు?
గ్రిడ్ స్థిరీకరణకు స్టోరేజ్ సిస్టమ్
ట్రిపుల్ ట్రీట్.. ఆర్య 3, కార్తికేయ 3.. ఇంకా ఎన్నెన్నో..
అవసరాలకు అప్పు ఇచ్చి.. భార్యను లొంగదీసుకున్నాడు..
ఝూటా వకీల్ సాబ్ పతనం మొదలైందా?
Good Friday మనిషి కొరకు దైవపుత్రుడే...
World Heritage Day: చరిత్రలో ఈ రోజు..!
ప్రధానిగారూ.. చిత్తశుద్ధి నిరూపించుకోండి: కేటీఆర్
పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో అత్యధిక పారితోషికం అతడిదే.. ఐపీఎల్‌తో పోలిస్తే..!
చల్లటి కబురు!
చైనా పై 245 శాతం సుంకాలు విధించిన అమెరికా
రెండో పెళ్లి చేసుకున్న ప్రముఖ యాంకర్, ఫోటోలు వైరల్
పీఎం మోదీ ఏసీ యోజన: కొత్త AC కొనుగోలుపై డిస్కౌంట్
IPl 2025: 'మరీ అంత స్వార్ధం పనికిరాదు బ్రో.. నీ వల్లే రాజస్తాన్ ఓడిపోయింది'
ఈ రాశి వారికి భూలాభాలు.. వ్యాపారాలు విస్తరిస్తారు
MI VS SRH: సిక్సర్ల సెంచరీ పూర్తి చేసిన రోహిత్.. కోహ్లి, గేల్, ఏబీడీ సరసన చోటు
అల్లుడితో కలిసి 7 ఎకరాలు కొన్న బాలీవుడ్ నటుడు.. ఎక్కడంటే?
కమిన్స్, స్టార్క్ కాదు!.. అతడిని ఎదుర్కోవడమే అత్యంత కష్టం: రోహిత్
‘నన్ను బలవంతంగా తీసుకెళ్లారు’
'బురుజులు' ఎందుకు నిర్మించేవారో తెలుసా..?
అర్జున్ చిన్నకూతురి ఎంగేజ్మెంట్.. 13 ఏళ్ల ప్రేమ అంటూ..
వేములవాడ రాజన్నకు కొత్త గుడి
రూ. 50 కోట్ల కుక్క.. ఈడీ దాడులు!
రాజ్‌తరుణ్ పేరెంట్స్‌ను ఇంట్లోకి రానిచ్చిన లావణ్య
అర్ధరాత్రి నర్సింగ్ హాస్టల్లో దూరిన ప్రిన్సిపాల్.. నిర్భంధించిన విద్యార్థినులు
విద్యార్థికి రూ.2 కోట్ల అప్పు.. వడ్డీ 40 రూపాయలు!
అభిషేక్ శర్మ, నితీశ్ కుమార్‌కు జాక్ పాట్..?
మాట నిలబెట్టుకున్న టీమిండియా దిగ్గజం.. కాంబ్లీకి జీవితాంతం నెలకు..
విజయసాయి సాక్ష్యం చెల్లుబాటు అవుతుందా?
హాలీవుడ్ రేంజ్లో ఫైట్
PSLతో పోలికా?.. ఐపీఎల్‌కు ఏదీ సాటి రాదు: ఇచ్చి పడేసిన ఇంగ్లండ్ స్టార్
భారత్‌లోకి వెల్లువలా చైనా ఉత్పత్తులు?
వైద్యులే కంటతడి పెట్టేలా.. 11 ఏళ్ల బాలికపై అత్యాచారం
‘సీఐ పొన్నూరు భాస్కర్ నన్ను టార్చర్ చేశారు సర్’..కోర్టులో కృష్ణవేణి ఆవేదన
26 బంతుల్లో సెంచరీ.. పొట్టి క్రికెట్లో పెను సంచలనం
సడన్‌గా ఓటీటీలోకి వచ్చిన తెలుగు థ్రిల్లర్.. ఎక్కడంటే?
హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో మరో లగ్జరీ ప్రాజెక్ట్
రాష్ట్రాల మీద ఆధిపత్యం కాస్త తగ్గించుకుంటే బెటరేమో సార్!
కుమారుడి వివాహేతర సంబంధానికి తండ్రి బలి..!
ఏ క్షణమైనా గుండెపోటు ఖాయం..! కాలమిస్ట్ శోభా డే కుమార్తె వెయిట్ లాస్ స్టోరీ
ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తాం
ఇద్దరు కొడుకుల గొంతుకోసి చంపి.. తల్లి ఆత్మహత్య
జిమ్‌లో అనసూయ కసరత్తులు.. కళ్లతోనే కవ్విస్తోన్న బిగ్‌బాస్ దివి!
వెనక్కి తగ్గని ఐఏఎస్ స్మితా సబర్వాల్.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వరుస రీట్వీట్లు
మామిడి తోటలో మృత్యువు కాటేసింది
‘రారండోయ్..వేడుక చేద్దాం’..! మంచి ముహూర్తాల తేదీలు ఇవే..!
ముంబైకి ప్రధాన సమస్య అతడే!.. సీజన్ మొత్తం ఎలా భరిస్తారో!?
పెరుగుతున్న మత సమ్మతి
రైళ్లు ఇలా మళ్లిస్తున్నారు..
వక్ఫ్ ఆస్తుల్లో ఎలాంటి మార్పు చేయొద్దు: సుప్రీంకోర్టు
IPL 2025: గ్లెన్ ఫిలిప్స్‌కు ప్రత్యామ్నాయ ఆటగాడు అతడే..!
'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' ట్విటర్ రివ్యూ
గుండెపోటుతో భక్తుడి మృతి.. ఆలయం మూసివేత..!
కాబోయే అల్లుడితో అత్త జంప్ ఎపిసోడ్లో ట్విస్ట్.. ఎందుకిలా చేసిందంటే..
జ్యోతిష్యం చెప్తుండగా టైర్ పేలి తుర్రుమన్న చిలుక
సూర్య, శ్రేయస్, పృథ్వీ షా.. అందరూ ఆడాల్సిందే!.. అదనంగా రూ. 15 లక్షలు!
ఆ చట్టం కేవలం కోడళ్ల కోసమే చేయలేదమ్మా: అలహాబాద్ హైకోర్టు
టీమిండియాలోకి ట్రిపుల్ సెంచరీ వీరుడు.. ఐదేళ్ల తర్వాత రీ ఎంట్రీ?
డ్రైవర్‌గా చేరి ప్రైవేటు వీడియోలతో బ్లాక్ మెయిల్
నాన్న ఆస్తిపై నా భార్య కుట్ర.. ఆయన పాడె మోసేందుకు ఎవరూ రాలేదు
‘కోచ్‌లు అహాన్ని పక్కన పెట్టాలి.. అతడి వ్యూహం వల్లే ముంబై గెలుపు’
భారత్‌లో పత్తి పండుతున్నా దిగుమతులెందుకు?
ప్రతి దరఖాస్తుకు ఒక డెడ్‌లైన్
బంగారం కొనేముందు ఇవి తెలుసుకోండి
ట్రైన్ రిజర్వేషన్: టికెట్‌పై ఈ పదాలు కనిపిస్తే బెర్త్ కన్ఫర్మ్!
అమెరికాలో కొత్త టెన్షన్.. వారి వీసా రద్దు
50 ఏళ్ల వయసులో పడుచుపిల్లలా ఖుష్బూ.. సీక్రెట్ అదే!
గ్రూప్–1 నియామకాలు నిలిపివేయండి
'ఓదెల 2' మూవీ రివ్యూ.. శివశక్తిగా తమన్నా మెప్పించిందా..?
మందు బాబులకు షాక్.. ఎల్లుండి వైన్ షాపులు బంద్
'ఇక మమ్మల్ని ఎవరూ విడదీయలేరు'
త్వరలో ఆర్థిక మాంద్యం!
ఏడాది తర్వాత ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా
ఇంకా చాలామంది మోసగాళ్లు దాక్కున్నారు..
వాటిని వక్ఫ్ ఆస్తులుగా భావిస్తాం: సుప్రీంకోర్టు
బామ్మర్ది మీ అక్క చనిపోయింది..!
మన మీద అనుమానపడటం ఇదేం కొత్తకాదుగా.. లైట్ తీస్కోండి!
మరోసారి చిక్కుల్లో దసరా విలన్.. నటి ఫిర్యాదుతో పరారైన నటుడు!
సౌర వ్యవస్థకు ఆవల జీవం!
IPL 2025: కలిసి కట్టుగా రాణించిన ముంబై.. చిత్తుగా ఓడిన సన్‌రైజర్స్
ఎస్ఆర్హెచ్ జట్టులోకి విధ్వంసకర వీరుడు..
మారిన తత్కాల్ టికెట్ బుకింగ్ రూల్స్: ఏప్రిల్ 15 నుంచే అమలు
విడాకులు తీసుకునే రోజు దగ్గర్లోనే.. నోరు మూయించిన సోనాక్షి
భూకంపం నుంచి బిడ్డను రక్షించుకునేందుకు.. వలయాన్ని సృష్టించిన ఏనుగులు
Texas: మృత్యువుతో పోరాడి ఓడిన దీప్తి
పిఠాపురంలో రైతుల వినూత్న నిరసన..
అంతర్జాతీయ విమానాశ్రయానికి 30 వేల ఎకరాలు
మొబైల్ పోయిందా డోంట్ వర్రీ! కొత్త టెక్నాలజీతో ఇట్టే ..!
ఫ్రెషర్స్ జీతం ఎందుకు పెరగదు? ఐటీ కంపెనీ సమాధానం
Goshala Row: ఎవరిది అసత్య ప్రచారం?.. ప్రశ్నిస్తే కేసులే!
సరికొత్త ఆధ్యాత్మిక ప్రపంచంలో...
మార్చిలో అధికంగా అమ్ముడైన టాప్ 5 మొబైళ్లు
ఇంటర్వ్యూ స్లాట్లు అదృశ్యం
వర్క్ ఫ్రమ్ హోమ్‌తో సైడ్ జాబ్.. ఏఐతో పట్టుకున్న సీఈవో
జిడ్డు బ్యాటింగ్!.. ఇలా అయితే కష్టం రాహుల్: పుజారా విమర్శలు
మరో చిక్కొచ్చిపడిందే.. అప్పుడు జుట్టు.. ఇప్పుడు గోళ్లు.. ఏం జరుగుతోందక్కడ?
ఇన్ఫోసిస్ డీలా
అమెరికా వీసాలు.. కొందరి అదృష్టం
శిక్షణతో.. భవిష్యత్తుకు పునాది
సావిత్రి పాటకు అసభ్యంగా డ్యాన్స్.. సపోర్ట్ చేసిన డైరెక్టర్?
MI VS SRH: రికార్డుల్లోకెక్కిన ట్రావిస్ హెడ్.. గేల్, మ్యాక్స్‌వెల్ కంటే వేగంగా..!
గద్దర్ అవార్డ్స్.. 15 మంది జ్యూరీ కమిటీ సభ్యులు వీళ్లే
ముగిసిన యువవికాసం దరఖాస్తు గడువు
మద్యం మాఫియా మూలవిరాట్టు బాబే
ఇది కదా నీతా అంబానీ ఫ్యాషన్ : స్టైలిష్ లుక్‌లో మెరిసిపోతూ..!
రూ.50 కోట్ల కుక్క..ఈడీ సోదాల ఎపిసోడ్లో అదిరిపోయే ట్విస్ట్!
మెలోనీతో భేటీ.. సుంకాలపై మెత్తబడ్డ ట్రంప్
తొడగొట్టి.. తోక ముడిచారు!
సినిమా

'ఓదెల 2' మూవీ రివ్యూ.. శివశక్తిగా తమన్నా మెప్పించిందా..?
టైటిల్ : ఓదెల 2నటీనటులు: తమన్నా, హెబ్బా పటేల్, వశిష్ఠ ఎన్.సింహ,యువ, మురళీ శర్మ, యువ, నాగ మహేశ్, వంశీ తదితరులునిర్మాణ సంస్థలు: సంపత్ నంది టీమ్ వర్క్స్, మధు క్రియేషన్స్నిర్మాతలు: డీ. మధుఎడిటింగ్: అవినాష్దర్శకత్వం: అశోక్ తేజ కథ, దర్శకత్వ పర్యవేక్షణ: సంపత్ నందిసంగీతం: అజనీష్ లోక్నాథ్సినిమాటోగ్రఫీ: సౌందర్ రాజన్.ఎస్విడుదల: ఏప్రిల్ 17, 2025సుమారు మూడేళ్ల క్రితం వచ్చిన ‘ఓదెల రైల్వేస్టేషన్’ చిత్రానికి కొనసాగింపుగా ‘ఓదెల 2’ చిత్రాన్ని దర్శకుడు అశోక్‌తేజ తెరకెక్కించారు. సంపత్ నంది టీమ్ వర్క్స్‌తో కలిసి మధు క్రియేషన్స్ పతాకంపై డి.మధు నిర్మించారు. తమన్నా ప్రధాన పాత్రలో నటించగా హెబ్బా పటేల్, వశిష్ఠ ఎన్.సింహ కీలక పాత్రలలో మెప్పించారు. 2022లో ఓటీటీ వేదికలో విడుదలైన ‘ఓదెల రైల్వేస్టేషన్’ ప్రేక్షకులలో మంచి గుర్తింపు పొందింది. దర్శకుడు సంపత్ నంది ఇచ్చిన కథతో, అశోక్‌తేజ ఆ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇదే కలయికలో మరింత ఘనంగా, థ్రిల్లింగ్‌గా 'ఓదెల2' చిత్రాన్ని రూపొందించామని చిత్ర ప్రమోషన్స్ కార్యక్రమాలలో చెప్పారు. విజువల్ ఎఫెక్ట్స్‌కి పెద్ద పీట వేస్తూ.. తమన్నా గుర్తుండిపోయే పాత్రలో కనిపించారని ట్రైలర్ చూస్తే అర్థం అవుతుంది. ఓదెల మల్లన్న స్వామి తన గ్రామాన్ని దుష్ట శక్తుల నుంచి ఎలా రక్షిస్తాడనేది 'ఓదెల2' అసలు కథ. నేడు విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం.కథేంటి..తిరుపతి (వశిష్ఠ) మరణంతో ‘ఓదెల రైల్వేస్టేషన్’ సినిమా ముగుస్తుంది. అయితే, ఓదెల 2 అక్కడి నుంచే మొదలౌతుంది. తిరుపతి మరణించడంతో గ్రామస్థులందరూ సంతోషంగా ఉంటారు. తమ గ్రామంలో కొత్తగా పెళ్ళైన అమ్మాయిల శోభనం నాడే చంపిన తిరుపతిని రాధ (హెబా పటేల్) చంపేసి మంచి పనిచేసిందని అనుకుంటారు. అయితే, తిరుపతి ఆత్మకు కూడా శాంతి ఉండకూడదని గ్రామ పెద్దలు నిర్ణయించుకుందటారు. అలా జరగాలంటే అతని అంత్యక్రియలు ఎలా చేయాలో గ్రామంలోని పూజారిని అడిగి తెలుసుకుంటారు. శాస్త్రాల ప్రకారం 'సమాధి శిక్ష' పద్ధతి ద్వారా ఆ కార్యక్రమాన్ని పూర్తి చేస్తారు. దీంతో తిరుపతి ఆత్మ గోషిస్తూ ఉంటుంది. అదే అతనికి శిక్ష అంటూ గ్రామ పెద్దలు నిర్ణయిస్తారు. అలా కొద్దిరోజులు గడిచిన తర్వాత ఆ గ్రామంలో మళ్లీ పెళ్లి జరుగుతుంది. గతం మాదిరే శోభనం నాడే అత్యంత క్రూరంగా యువతులు హత్య చేయబడుతారు. ఇలాంటి ఘటనలు రెండు జరగడంతో గ్రామంలో మళ్లీ భయం మొదలౌతుంది. పోలీసులు రంగప్రవేశం చేసినప్పటికీ వారి చావులకు అసలు కారణాలు కనుగొనలేరు. అయితే, అదే గ్రామానికి చెందిన దర్గాలో ఉన్న మురళీ శర్మ (ఫకీర్) అసలు కారణం కనుక్కొంటాడు. తిరుపతి దెయ్యంగా తిరిగొచ్చాడని చెప్తాడు. దీంతో తమ గ్రామాన్ని ఎవరు కాపాడుతారని ఆందోళనలో గ్రామస్తులు ఉంటారు. అయితే, ఒకరోజు జైల్లో ఉన్న రాధ (హెబా పటేల్) వద్దకు వెళ్లి జరిగిన హత్యల గురించి చెప్తారు. ఎలాగైనా తిరుపతి నుంచి ఓదెల గ్రామాన్ని కాపాడాలని వేడుకుంటారు. దీంతో శివశక్తి (తమన్నా) మాత్రమే కాపాడుతుందని వారికి చెబుతుంది. శివశక్తి గతం గురించి చెబుతూ ఆమె ఎక్కడ ఉంటుందో వివరాలు తెలుపుతుంది. అలా ఒదెల గ్రామాన్ని కాపాడేందుకు శివశక్తి (తమన్నా)ను అక్కడ తీసుకొస్తారు. అలా దైవశక్తికి, ప్రేతాత్మ శక్తిల మధ్య పెద్ద పోరాటమే జరుగుతుంది. మరణించిన తిరుపతి 'సమాధి శిక్ష' నుంచి ఎలా తిరిగొస్తాడు..? శివశక్తి (తమన్నా), రాధ (హెబా పటేల్) మధ్య ఉన్న బంధం ఏంటి..? శివశక్తిలా తమన్నా మారడం వెనుకన్న అసలు స్టోరీ ఎంటి..? ఫైనల్‌గా తిరుపతి అంతం అవుతాడా..? మళ్లీ తిరిగొస్తాడా..? అనేది తెలియాలంటే ఓదెల2 చూడాల్సిందే.ఎలా ఉందంటే..దుష్టశక్తి, దైవశక్తిల పోరాటం గురించి చాలా సినిమాలు వచ్చాయి. ఓదెల2 కూడా ఇదే కోవకు చెందిన కథే.. సినిమా ఎక్కడా కూడా కొత్తగా అనిపించదు. ప్రతి సీన్ దాదాపు అంచనా వేయవచ్చు. మూడేళ్ల క్రితం వచ్చిన ‘ఓదెల రైల్వేస్టేషన్’లో చూపించిన ఉదంతాలే పార్ట్-2లో ఎక్కువ భాగం కనిపిస్తాయి. గ్రామంలోని కొత్తగా పెళ్ళైన అమ్మాయిలు తమ శోభనం నాడే అత్యంత దారుణంగా చనిపోతారు. అందుకు కారణం ఒక ప్రేతాత్మ అనేది మాత్రమే ఇక్కడ కాస్త భిన్నంగా ఉంటుంది. ఒదెల2 కథ ప్రారంభం ఘనంగా ఉన్నప్పటికీ మొదటి 15 నిమిషాల్లోనే తేలిపోతుంది. సుమారు ఇంటర్వెల్ వరకు కొత్తగా పెళ్లైన ఇద్దరి అమ్మాయిల చావుల చుట్టే కథ మొత్తం తిరుగుతుంది. పార్ట్1 చూసిన వారికి ఇవేమీ అంత కొత్తగా అనిపించవు.. అయితే, వారి హత్యలు చాలా క్రూరంగా ఉంటాయి. మరీ వయలెన్స్ ఎక్కువ అయిందేమో అనిపించేలా ఆ సీన్స్ ఉంటాయి. శివశక్తిగా (తమన్నా) ఎంట్రీ చాలా ఆలస్యంగా ఉంటుంది. అది కాస్త ప్రేక్షకులకు రుచించకపోవచ్చు. ఎప్పుడైతే తమన్నా కథలోకి ఎంట్రీ ఇస్తుందో కథ అనేక మలుపులు తిరుగుతుందని అనుకుంటారు. కానీ, సాధారణ రొటీన్ పద్ధతిలోనే స్టోరీ కొనసాగుతుంది. ఆమె నాగసాధువుగా ఎందుకు మారిందో చెప్పిన తీరు ఫర్వాలేదనిపిస్తుంది. అయితే, ఓదెల2లో ప్రేతాత్మగా ఉన్న తిరుపతి (వశిష్ఠ) పాత్రను చాలా బలంగా రాసుకున్న రచయిత.. శివశక్తిగా (తమన్నా) పాత్రను అంత పవర్‌ఫుల్‌గా ప్రజెంట్ చేయలేకపోయాడు. దుష్టశక్తి, దైవశక్తిల పోరాటంలో పైచెయి దుష్టశక్తిదే ప్రతిసారి కనిపించడంతో ప్రేక్షకులలో విసుగు తెప్పిస్తుంది. హార్రర్ సినిమా అంటే భయపడుతారని అందరిలో అంచనాలు ఉంటాయి. కానీ, అలాంటిదేవీ ఇందులో ఉండదు.. పైగా హత్యలకు సంబంధించిన వయలెన్స్ సీన్లే ఎక్కువగా కలవరపెడుతాయి. శివశక్తిగా తమన్నాకు మొదట ఇచ్చిన అంత ఎలివేషన్ దుష్టశక్తితో పోరాడే విషయంలో ఎంతమాత్రం దాని ప్రభావం చూపించలేదు. కథలో చాలాసార్లు రిపీటెడ్ సీన్లే ఎక్కువగా కనిపిస్తాయి. సినిమా మొత్తానికి చివరి 15 నిమిషాలు చాలా హైప్ ఉంటుంది. అక్కడ మాత్రమే శివశక్తిగా తమన్నా విశ్వరూపం చూడొచ్చు.. ఈ సినిమాకు బలం తమన్నా నటన మాత్రమే.. శివశక్తిగా విశ్వరూపం చూపించాల్సిన పాత్రకు ఎలాంటి శక్తులు లేకుండా ప్రేక్షకులకు చూపించడాన్ని పెద్దగా కనెక్ట్ కాలేరు. సినిమా చివరి వరకు కూడా దుష్టశక్తి మీద దైవశక్తి పైచెయి అనేది కనిపించకపోవడం అంతగా రుచించదు. ప్రేతాత్మకు, పంచాక్షరీ మంత్రానికి మధ్య జరిగిన యుధ్దం అని చెప్పినప్పటికీ కనీసం దైవశక్తికి ఉన్న బలం ఏంటి అనేది దర్శకుడు చివరి వరకు చూపించకపోవడం పెద్ద పొరపాటుగా చెప్పవచ్చు. అయితే, పార్ట్-3 కూడా ప్రకటించారు. అందులో శివశక్తిగా (తమన్నా) పాత్ర బలంగా ఉండబోతుందేమో తెలియాల్సి ఉంది.ఎవరెలా చేశారంటే..ఓదెల-2 కేవలం తమన్నా కోసం మాత్రమే వెళ్లోచ్చు. తన ఎంట్రీ ఆలస్యంగా ఉన్నప్పటికీ కొత్తగా ఉంటుంది. ఇంటర్వెల్ సీన్లో తమన్నాను చూస్తే గూస్ బంప్స్ రావడం గ్యారెంటీ. ఇప్పటి వరకు గ్లామర్ పాత్రలు మాత్రమే చేసిన తమన్నా మొదటిసారి శివశక్తిగా అదరగొట్టేసింది. ఆ తర్వాత ఈ మూవీకి అజనీష్ లోక్‌నాథ్ ఇచ్చిన బీజీఎమ్‌తో పాటు సంగీతం సూపర్బ్ అనిచెప్పవచ్చు. తమన్నా ఎంట్రీ సీన్‌తో పాటు క్లైమాక్స్‌లో అదరగొట్టేశాడని చెప్పవచ్చు. ఆపై సౌందర్ రాజన్.ఎస్ అందించిన సినిమాటోగ్రఫీ కథకు బాగా సెట్ అయింది. ముఖ్యంగా రాత్రి సమయంలో తీసిన సీన్స్ బాగున్నాయి. అక్కడక్కడా ప్రేక్షకులను భయపెట్టే వర్క్ కెమెరాలతో తను మాత్రమే చేశాడని చెప్పవచ్చు. ఓదెల2లో ఎక్కువగా రిపీటెడ్ సీన్స్ వస్తున్నాయనే ఫీలింగ్ చాలామందిలో కలుగుతుంది. ఇంకాస్త కత్తెరకు పనిచెప్పింటే బాగుండు. బడ్జెట్ మేరకు వీఎఫ్ఎక్స్, నిర్మాణ విలువలు ఫర్వాలేదనిపిస్తాయి. తిరుపతి (వశిష్ఠ) ప్రేతాత్మగా చాలా బాగా చేశాడు. తనదైన నటనతో ప్రేక్షకులను మెప్పించాడు. కానీ, శివశక్తిగా (తమన్నా) పాత్రను అత్యంత బలహీనంగా రాసుకోవడమే ఈ సినిమాకు పెద్ద మైనస్.. తమన్నా పాత్ర కాస్త పవర్‌ఫుల్‌గా ఉండుంటే ఓదెల-2 బ్లాక్‌బస్టర్ గ్యారెంటీ అని చెప్పవచ్చు.

ఓటీటీకి రూ.250 కోట్ల సూపర్ హిట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన యాక్షన్ చిత్రం ఎల్2: ఎంపురాన్. ఈ మూవీకి సలార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించారు. 2019లో వచ్చిన లూసిఫర్‌కు సీక్వెల్‌గా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఉగాది కానుకగా థియేటర్లలో విడుదలైన ఎంపురాన్ బాక్సాఫీస్ వద్ద అదరగొట్టింది. విడుదలైన 15 రోజుల్లోనే ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్ల మార్కును దాటేసింది. మార్చి 27న థియేటర్లలోకి వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ దేశీయ మార్కెట్లో వందకోట్లకు పైగా నికర వసూళ్లు సాధించింది. ప్రపంచవ్యాప్తంగా రూ.250 కోట్లకు పైగా వసూళ్ల సాధించిన ఎంపురాన్.. మలయాళ ఇండస్ట్రీలోనే తొలి చిత్రంగా నిలిచింది.తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది. ఈ మూవీ జియో హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈనెల 24 నుంచి మలయాళం, తెలుగు, తమిళం, కన్నడలో స్ట్రీమింగ్ కానుందని ఓటీటీ సంస్థ ట్వీట్ చేసింది. ఈ మేరకు ప్రత్యేక పోస్టర్‌ను పంచుకుంది. అయితే హిందీలో స్ట్రీమింగ్ ఎప్పుడనేది మాత్రం క్లారిటీ లేదు. కాగా.. ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్‌తో పాటు మంజు వారియర్, టోవినో థామస్, జెరోమ్ ఫ్లిన్, సూరజ్ వెంజరమూడు కీలక పాత్రల్లో నటించారు. അബ്റാമിൻറെ ലോകം ഇവിടെ തുടങ്ങുന്നു.L2: Empuraan will be streaming from 24 April only on JioHotstar. @mohanlal @prithviofficial @GopyMurali @antonypbvr @gokulamstudios @aashirvadcine @LycaProductions @ManjuWarrier4 @ttovino @Indrajith_S @SaniyaIyappan_ @sujithvasudev… pic.twitter.com/QL6ELgED9u— JioHotstar Malayalam (@JioHotstarMal) April 17, 2025

సిర్రాకైంది సింగిల్ బతుకు!
శ్రీవిష్ణు హీరోగా, కేతికా శర్మ, ఇవాన హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘సింగిల్’. ‘నిను వీడని నీడను నేనే’ మూవీ ఫేమ్ కార్తీక్ రాజు దర్శకత్వం వహించారు. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, కళ్యా ఫిల్మ్స్‌పై విద్యా కొప్పినీడి, భాను ప్రతాప్, రియాజ్ చౌదరి నిర్మించిన ఈ సినిమా మే 9న విడుదల కానుంది. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించిన ఈ చిత్రం నుంచి ‘సిర్రాకైంది సింగిల్ బతుకు...’ అంటూ సాగే రెండో పాటని విడుదల చేశారు. ఈ పాటకి రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా, రాహుల్ సిప్లిగంజ్ పాడారు. ‘‘సిర్రాకైంది సింగిల్ బతుకు...’ పాట ఫ్రస్ట్రేషన్ యాంథమ్‌గా సాగుతుంది. శ్రీవిష్ణు, ‘వెన్నెల’ కిశోర్ కలిసి ఒంటరితనానికి హ్యూమర్‌ని జోడించి పాడుకునే ఈ పాట వినోదాత్మకంగా ఉంటుంది. ఈ సాంగ్‌లోని సరదా సాహిత్యం, మాస్ అప్పీల్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి’’ అని చిత్రయూనిట్ తెలిపింది. ఈ చిత్రానికి కెమేరా: ఆర్. వేల్రాజ్, ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూసర్: అజయ్ గద్దె.

మరోసారి చిక్కుల్లో దసరా విలన్.. నటి ఫిర్యాదుతో పరారైన నటుడు!
దసరా మూవీతో తెలుగులో క్రేజ్ తెచ్చుకున్న మలయాళ నటుడు షైన్ టామ్ చాకో. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విలన్‌గా ప్రేక్షకులను మెప్పించారు. గతేడాది విడుదలైన టాలీవుడ్ మూవీ దేవరలోనూ కీలక పాత్ర పోషించారు. ఇటీవల విడుదలైన అజిత్ కుమార్ గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రంలోనూ కనిపించారు. గతంలో ఓ డ్రగ్స్ కేసులో ఆయన నిర్దోషిగా బయటపడిన సంగతి తెలిసిందే. 2015లో అతనిపై నమోదైన కేసులో షైన్ టామ్ చాకో కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. గతంలో వీరంతా కొకైన్ సేవించారని పోలీసులు కేసు నమోదు చేశారు.అయితే తాజాగా టామ్ చాకో మరో వివాదం చిక్కుకున్నట్లు తెలుస్తోంది. షూటింగ్ సెట్లో డ్రగ్స్ తీసుకుని తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడని మలయాళ నటి విన్సీ సోనీ అలోషియస్ ఆరోపణలు చేస్తోంది. దీంతో అతనిపై కేరళ ఫిల్మ్ ఛాంబర్‌తో పాటు అమ్మ అసోసియేషన్‌కు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై ఓ కమిటీ ఏర్పాటు చేసిన విచారణ చేయనున్నట్లు అమ్మ(AMMA) అసోసియేషన్ వెల్లడించింది. షైన్ టామ్ చాకోతో కలిసి విన్సీ సోనీ సూత్రవాక్యం అనే సినిమాలో నటించింది. ఆమె ఆరోపణలతో చాకోపై విచారణ చేపట్టనున్నట్లు తెలుస్తోంది.(ఇది చదవండి: దసరా విలన్‌కు బిగ్ రిలీఫ్.. ఆ కేసులో నిర్దోషిగా ప్రకటన)మరోవైపు షైన్ టామ్ చాకో కొచ్చిలోని ఓ హోటల్లో డ్రగ్స్ తీసుకుంటున్నట్లు ఆరోపణలొస్తున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు రైడ్‌కు వెళ్లగా ఆయన హోటల్ నుంచి పారిపోయినట్లు టాక్ వినిపిస్తోంది. పోలీసుల బృందం హోటల్‌కు రావడానికి ముందే తప్పించుకున్నారని సమాచారం. మూడో అంతస్తులో ఉన్న నటుడు.. కిటికీలో నుంచి రెండో అంతస్తులోకి దూకి మెట్ల మార్గం ద్వారా పారిపోయినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఏదైమైనా గతంలో ఓ డ్రగ్స్ కేసు నుంచి నిర్దోషిగా విడుదలైన కొద్ది రోజుల్లోనే డ్రగ్స్ ఆరోపణలు రావడం గమనార్హం.
న్యూస్ పాడ్‌కాస్ట్
క్రీడలు

హంపి, దివ్య విజయం
పుణే: అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) మహిళల గ్రాండ్‌ప్రి సిరీస్ ఐదో అంచె చెస్ టోర్నమెంట్లో నాలుగో రోజు భారత స్టార్ గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి, ప్రపంచ జూనియర్ చాంపియన్ దివ్య దేశ్‌ముఖ్ మెరిశారు. హంపి వరుసగా రెండో విజయం నమోదు చేసుకోగా... దివ్య ఖాతాలో మూడో గెలుపు చేరింది. భారత్‌కే చెందిన ఇద్దరు గ్రాండ్‌మాస్టర్లు ద్రోణవల్లి హారిక, వైశాలి రమేశ్‌బాబుల మధ్య జరిగిన ముఖాముఖి పోరు ‘డ్రా’గా ముగిసింది. పొలీనా షువలోవా (రష్యా)తో జరిగిన గేమ్‌లో నల్లపావులతో ఆడిన హంపి 33 ఎత్తుల్లో గెలిచింది. మెలియా సలోమి (జార్జియా)తో జరిగిన గేమ్‌లో నల్లపావులతో ఆడిన మహారాష్ట్ర అమ్మాయి దివ్య 77 ఎత్తుల్లో విజయాన్ని అందుకుంది. హారిక, వైశాలి మధ్య జరిగిన గేమ్ 34 ఎత్తుల్లో ‘డ్రా’ అయింది. బత్కుయాగ్ మున్‌గున్‌తుల్ (మంగోలియా)తో జరిగిన గేమ్‌లో నుర్గుల్ సలీమోవా (బల్గేరియా) 55 ఎత్తుల్లో... జు జినెర్ (చైనా) 39 ఎత్తుల్లో అలీనా కష్లిన్స్కాయా (పోలాండ్)పై గెలుపొందారు. 10 మంది క్రీడాకారిణుల మధ్య తొమ్మిది రౌండ్లపాటు ఈ టోర్నీ జరుగుతోంది. నాలుగో రౌండ్ తర్వాత జు జినెర్ 3.5 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా... హంపి, దివ్య 3 పాయింట్లతో సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నారు. హారిక, పొలీనా, మున్‌గున్‌తుల్ 2 పాయింట్లతో ఉమ్మడిగా మూడో స్థానంలో ఉన్నారు. మరోవైపు బత్కుయాగ్ మున్‌గున్‌తుల్ (మంగోలియా) 34 ఎత్తుల్లో అలీనా కష్లిన్స్కాయా (పోలాండ్)పై గెలుపొందగా... జు జినెర్ (చైనా)–మెలియా సలోమి (జార్జియా) మధ్య గేమ్ 76 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగిసింది.

వన్డే వరల్డ్‌కప్ టోర్నీకి పాక్ అర్హత
లాహోర్: ఈ ఏడాది సెప్టెంబర్ –అక్టోబర్లలో భారత్ వేదికగా జరగనున్న మహిళల వన్డే వరల్డ్‌కప్ క్రికెట్ టోర్నమెంట్‌కు పాకిస్తాన్ జట్టు అర్హత సాధించింది. పాకిస్తాన్లో జరుగుతున్న వరల్డ్‌కప్ క్వాలిఫయింగ్ టోర్నమెంట్లో టాప్–2లో నిలిచిన జట్లకు ప్రపంచకప్ బెర్త్‌లు లభిస్తాయి. గురువారం థాయ్‌లాండ్‌తో జరిగిన నాలుగో లీగ్ మ్యాచ్‌లో పాకిస్తాన్ 87 పరుగుల తేడాతో గెలిచింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లకు 205 పరుగులు చేసింది. సిద్రా అమిన్ (80; 9 ఫోర్లు), కెపె్టన్ సనా ఫాతిమా (62 నాటౌట్; 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలతో రాణించారు. అనంతరం థాయ్‌లాండ్ జట్టు 34.4 ఓవర్లలో 118 పరుగులకు ఆలౌటైంది. పాక్ బౌలర్లలో సనా ఫాతిమా, నష్రా సంధూ, రమీన్ షమీమ్ 3 వికెట్ల చొప్పున పడగొట్టారు. ఎనిమిది పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్న పాకిస్తాన్ మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ప్రపంచకప్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. శనివారం జరిగే చివరి లీగ్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో పాకిస్తాన్ ఆడుతుంది. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ ఓడిపోయినా ఆ జట్టుకు వచ్చిన ఢోకా లేదు.బంగ్లాదేశ్ గెలిస్తే ఎనిమిది పాయింట్లతో ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా ప్రపంచకప్ టోర్నీకి అర్హత పొందుతుంది. బంగ్లాదేశ్ ఓడిపోయి... వెస్టిండీస్, స్కాట్లాండ్ జట్లు తమ చివరి లీగ్ మ్యాచ్‌ల్లో గెలిస్తే ఈ మూడు జట్లు 6 పాయింట్లతో సమఉజ్జీగా నిలుస్తాయి. ఈ నేపథ్యంలో మెరుగైన రన్‌రేట్ ఉన్న జట్టు ప్రపంచకప్ టోర్నీకి అర్హత సాధిస్తుంది. రన్‌రేట్ పరంగా బంగ్లాదేశ్‌కే మరో బెర్త్ దక్కే అవకాశం ఉంది.

సమఉజ్జీల సమరం!
బెంగళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఇప్పటి వరకు ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేకపోయిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), పంజాబ్ కింగ్స్ జట్లు ఈ సీజన్లో మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్నాయి. ఆరేసి మ్యాచ్‌లు ఆడిన ఇరు జట్లు నాలుగింట గెలిచి 8 పాయింట్లతో సమంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో సమఉజ్జీలుగా కనిపిస్తున్న ఈ రెండు జట్ల మధ్య శుక్రవారం కీలక పోరు జరగనుంది. తాజా సీజన్లో ప్రత్యర్థి జట్ల మైదానాల్లో వరుస విజయాలు సాధిస్తున్న ఆర్సీబీ... బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో మాత్రం గెలుపు రుచి చూడలేకపోయింది. మాజీ చాంపియన్లు కోల్‌కతా నైట్‌రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్, రాజస్తాన్ రాయల్స్‌ను వారి వారి సొంత మైదానాల్లో ఓడించిన ఆర్సీబీ... బెంగళూరు వేదికగా గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌ల్లో పరాజయం పాలైంది. మరోవైపు గత మ్యాచ్‌లో 111 పరుగులే చేసినా... బౌలింగ్ బలంతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను నిలువరించిన పంజాబ్ కింగ్స్ మంచి ఊపు మీద ఉంది. పంజాబ్ స్పిన్నర్లను బెంగళూరు బ్యాటర్లు ఎలా ఎదుర్కొంటారనే దానిపైనే మ్యాచ్ ఫలితం ఆధారపడి ఉంది. చహల్ మ్యాజిక్ కీలకం... శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని పంజాబ్ కింగ్స్ ఈ సీజన్లో మెరుగైన ప్రదర్శన కనబరుస్తోంది. ప్రభ్‌సిమ్రన్ సింగ్, ప్రియాన్ష్ ఆర్య రూపంలో ప్రతిభావంతులైన ఓపెనర్లు అందుబాటులో ఉండగా... అయ్యర్, ఇన్‌గ్లిస్, నేహల్ వధేరా, మ్యాక్స్‌వెల్, శశాంక్ సింగ్‌తో మిడిలార్డర్ మెరుగ్గా ఉంది. చాంపియన్స్ ట్రోఫీ ఫామ్‌ను ఐపీఎల్లో సైతం కొనసాగిస్తున్న అయ్యర్... తనకు అనువైన రోజు భారీ స్కోర్లతో చెలరేగుతున్నాడు. అదే సమయంలో నిలకడ కొనసాగించలేకపోతున్నాడు. మ్యాక్స్‌వెల్ బౌలింగ్‌లో అదనపు స్పిన్నర్‌గా సేవలందిస్తున్నా... బ్యాటర్‌గా మాత్రం అతడి స్థాయి ప్రదర్శన ఇంకా రాలేదు. బౌలింగ్‌లోనూ పంజాబ్‌కు విభిన్న ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉన్నాయి. మార్కో యాన్సెన్, అర్ష్ దీప్ సింగ్, జేవియర్ బార్ట్లెట్ పేస్ బాధ్యతలు పంచుకోనున్నారు. గత మ్యాచ్‌లో కోల్‌కతాపై 4 వికెట్లు తీసి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచిన పంజాబ్ ప్రధాన స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ కీలకం కానున్నాడు. బెంగళూరు పిచ్‌పై అతడికి మంచి అవగాహన ఉండటం పంజాబ్‌కు అదనపు ప్రయోజనం చేకూర్చనుంది.చిన్నస్వామిలో బోణీ కొట్టేనా... ఈ సీజన్ ఆరంభం నుంచి మెరుగైన ప్రదర్శనతో ముందుకు సాగుతున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ప్రధానంగా బ్యాటర్లపైనే ఆధారపడుతోంది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి, ఫిల్ సాల్ట్ రూపంలో ఆ జట్టుకు ఇద్దరు విధ్వంసకర ఓపెనర్లు అందుబాటులో ఉన్నారు. దేవదత్ పడిక్కల్, కెప్టెన్ రజత్ పాటీదార్, లివింగ్‌స్టోన్, జితేశ్ శర్మ, టిమ్ డేవిడ్‌తో మిడిలార్డర్ పటిష్టంగా కనిపిస్తోంది. అయితే పవర్‌ప్లేతో పాటు స్లాగ్ ఓవర్లలో ధాటిగా ఆడుతున్న ఆర్సీబీ... మధ్య ఓవర్లలో మాత్రం సులువుగా పరుగులు రాబట్టలేకపోతోంది. ప్రధానంగా స్పిన్నర్లను ఎదుర్కోవడంలో బెంగళూరు బ్యాటర్లు తడబడుతున్నారు. గుజరాత్ స్పిన్నర్ సాయికిషోర్, ఢిల్లీ స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, విప్రాజ్ నిగమ్ బౌలింగ్ ఆడలేక ఇబ్బంది పడ్డారు. బౌలింగ్‌లో హాజల్‌వుడ్, యశ్ దయాళ్, భువనేశ్వర్ కుమార్ పేస్ బారం మోయనుండగా... సుయాశ్ శర్మ, కృనాల్ పాండ్యా స్పిన్ బాధ్యతలు పంచుకోనున్నారు. 33 ఐపీఎల్ చరిత్రలో బెంగళూరు, పంజాబ్ కింగ్స్ జట్లు ముఖాముఖిగా 33 సార్లు తలపడ్డాయి. 16 మ్యాచ్‌ల్లో బెంగళూరు, 17 మ్యాచ్‌ల్లో పంజాబ్ విజయం సాధించాయి. 2023లో పంజాబ్‌తో ఆడిన ఏకైక మ్యాచ్‌లోనూ, గత ఏడాది పంజాబ్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల్లోనూ బెంగళూరు జట్టే గెలిచింది. పంజాబ్‌పై బెంగళూరు అత్యధిక స్కోరు 241 కాగా... అత్యల్ప స్కోరు 84. బెంగళూరుపై పంజాబ్ అత్యధిక స్కోరు 232 కాగా, అత్యల్ప స్కోరు 88. తుది జట్లు (అంచనా) రాయల్ చాలెంజర్స్ బెంగళూరు: రజత్ పాటీదార్ (కెప్టెన్), విరాట్ కోహ్లి, ఫిల్ సాల్ట్, దేవదత్ పడిక్కల్, లివింగ్‌స్టోన్, జితేశ్ శర్మ, టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్, హాజల్‌వుడ్, యశ్ దయాల్, సుయాశ్ శర్మ. పంజాబ్ కింగ్స్: శ్రేయస్ అయ్యర్ (కెపె్టన్), ప్రియాన్ష్ ఆర్య, ప్రభ్‌సిమ్రన్ సింగ్, ఇన్‌గ్లిస్, నేహల్ వధేరా, మ్యాక్స్‌వెల్, శశాంక్ సింగ్, యాన్సెన్, జేవియర్, అర్ష్ దీప్ , స్టొయినిస్, చాహల్.

రైజర్స్ ఓటమి బాట
ఐదు రోజుల క్రితం అద్భుత ఆటతో 245 పరుగుల లక్ష్యాన్ని అలవోకగా ఛేదించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇప్పుడు సమష్టి వైఫల్యంతో మరో పరాజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. నాలుగు వరుస ఓటముల తర్వాత గత మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఖాతాలో మళ్లీ ఓటమి చేరింది. బ్యాటింగ్‌లో మెరుపులు కనిపించక టీమ్ సాధారణ స్కోరుకే పరిమితమైంది. ఆ తర్వాత ఛేదనలో ముంబై ఇండియన్స్ కొంత తడబడినా... మరో 11 బంతులు మిగిలి ఉండగా లక్ష్యాన్ని అందుకోవడంలో సఫలమైంది. ముంబై: ఐపీఎల్లో ఐదుసార్లు చాంపియన్ ముంబై ఇండియన్స్ కీలక విజయాన్ని అందుకుంది. గురువారం జరిగిన పోరులో ముంబై 4 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ (28 బంతుల్లో 40; 7 ఫోర్లు), హెన్రిచ్ క్లాసెన్ (28 బంతుల్లో 37; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. అనంతరం ముంబై 18.1 ఓవర్లలో 6 వికెట్లకు 166 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్‌ద మ్యాచ్’ విల్ జాక్స్ (26 బంతుల్లో 36; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), ర్యాన్ రికెల్టన్ (23 బంతుల్లో 31; 5 ఫోర్లు) కీలక పరుగులు సాధించారు. కనిపించని దూకుడు... ఇన్నింగ్స్ తొలి బంతికే అభిషేక్‌కు అదృష్టం కలిసొచ్చింది. దీపక్ చహర్ వేసిన బంతి అభిక్ బ్యాట్ ఎడ్జ్‌ను తీసుకొని స్లిప్ వైపు దూసుకెళ్లగా విల్ జాక్స్ దానిని అందుకోలేకపోయాడు. అనంతరం అతను కొన్ని చక్కటి షాట్లతో పరుగులు రాబట్టారు. మరోవైపు ట్రవిస్ హెడ్ (29 బంతుల్లో 28; 3 ఫోర్లు) బ్యాటింగ్‌లో సహజమైన ధాటి కనిపించలేదు. చహర్ ఓవర్లో అభిషేక్ వరుసగా మూడు ఫోర్లు కొట్టడంతో పవర్‌ప్లే ముగిసేసరికి స్కోరు 46 పరుగులకు చేరింది. ఆ తర్వాత ఒక్కసారిగా ముంబై బౌలర్ల ఆధిపత్యం మొదలైంది. కట్టుదిట్టమైన బంతులతో వారు రైజర్స్‌ను నిలువరించారు. తొలి వికెట్‌కు 59 పరుగుల భాగస్వామ్యం (45 బంతుల్లో) తర్వాత అభిషేక్‌ను పాండ్యా వెనక్కి పంపాడు. 24 పరుగుల వద్ద క్యాచ్ ఇచ్చినా... నోబాల్‌తో బతికిపోయిన హెడ్ దానిని వాడుకోలేకపోయాడు. ఇషాన్ కిషన్ (2) మళ్లీ విఫలం కాగా, నితీశ్ కుమార్ రెడ్డి (21 బంతుల్లో 19; 1 ఫోర్) మరోసారి ప్రభావం చూపలేకపోయాడు. పవర్‌ప్లే ముగిసిన తర్వాత 7–17 ఓవర్ల మధ్యలో రైజర్స్ 5 ఫోర్లు మాత్రమే కొట్టగా... ఇన్నింగ్స్‌లో 17వ ఓవర్ వరకు ఒక్క సిక్స్ కూడా రాలేదు. చివర్లో 2 ఓవర్ల కారణంగా (మొత్తం 43 పరుగులు) రైజర్స్ స్కోరు 160 దాటింది. చహర్ వేసిన 18వ ఓవర్లో క్లాసెన్ వరుసగా 6, 4, 4, 6 బాదగా... పాండ్యా వేసిన ఆఖరి ఓవర్లో అనికేత్ 2 సిక్స్‌లు, కమిన్స్ ఒక సిక్స్ కొట్టారు. కీలక భాగస్వామ్యం.. ఎప్పటిలాగే ఫటాఫట్ షాట్లతో ఛేదనను మొదలు పెట్టిన రోహిత్ శర్మ (16 బంతుల్లో 26; 3 సిక్స్‌లు) మరోసారి తక్కువ స్కోరుకే పరిమితమయ్యాడు. ఐదు బంతుల వ్యవధిలో అతను మూడు సిక్సర్లు బాదాడు. మలింగ ఓవర్లో రికెల్టన్ మూడు ఫోర్లు కొట్టగా, 4 పరుగుల వద్ద జాక్స్ ఇచ్చిన క్యాచ్‌ను హెడ్ వదిలేశాడు. రికెల్టెన్ అవుటైన తర్వాత జాక్స్, సూర్యకుమార్ (15 బంతుల్లో 26; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) మూడో వికెట్‌కు 29 బంతుల్లో 52 పరుగులు జోడించి జట్టు విజయానికి బాటలు వేశారు. వీరిద్దరు ఏడు పరుగుల తేడాతో వెనుదిరిగినా... కెప్టెన్ హార్దిక్ పాండ్యా (9 బంతుల్లో 21; 3 ఫోర్లు, 1 సిక్స్), తిలక్ వర్మ (17 బంతుల్లో 21 నాటౌట్; 2 ఫోర్లు) కలిసి గెలుపు దిశగా నడిపించారు. స్కోరు వివరాలు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: అభిషేక్ శర్మ (సి) (సబ్) బావా (బి) పాండ్యా 40; హెడ్ (సి) సాంట్నర్ (బి) జాక్స్ 28; ఇషాన్ కిషన్ (స్టంప్డ్) రికెల్టన్ (బి) జాక్స్ 2; నితీశ్ కుమార్ రెడ్డి (సి) తిలక్ వర్మ (బి) బౌల్ట్ 19; క్లాసెన్ (బి) బుమ్రా 37; అనికేత్ వర్మ (నాటౌట్) 18; కమిన్స్ (నాటౌట్) 18; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 162. వికెట్ల పతనం: 1–59, 2–68, 3–82, 4–113, 5–136. బౌలింగ్: దీపక్ చహర్ 4–0–47–0, బౌల్ట్ 4–0–29–1, బుమ్రా 4–0–21–1, విల్ జాక్స్ 3–0–14–2, హార్దిక్ పాండ్యా 4–0–42–1, సాంట్నర్ 1–0–8–0. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: రికెల్టన్ (సి) హెడ్ (బి) హర్షల్ పటేల్ 31; రోహిత్ (సి) హెడ్ (బి) కమిన్స్ 26; విల్ జాక్స్ (సి) అన్సారీ (బి) కమిన్స్ 36; సూర్యకుమార్ (సి) అన్సారీ (బి) కమిన్స్ 26; తిలక్ వర్మ (నాటౌట్) 21; పాండ్యా (సి) ఇషాన్ కిషన్ (బి) మలింగ 21; నమన్ (ఎల్బీ) (బి) మలింగ 0; సాంట్నర్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (18.1 ఓవర్లలో 6 వికెట్లకు) 166. వికెట్ల పతనం: 1–32, 2–69, 3–121, 4–128, 5–162, 6–162. బౌలింగ్: షమీ 3–0–28–0, కమిన్స్ 4–0–26–3, ఇషాన్ మలింగ 4–0–36–2, అన్సారీ 3.1–0–35–0, హర్షల్ 3–0–31–1, రాహుల్ చహర్ 1–0–9–0. అనూహ్య ‘నోబాల్’ క్యాచ్‌ను అందుకునే లేదా స్టంపింగ్ ప్రయత్నంలో వికెట్ కీపర్ గ్లవ్స్ స్టంప్స్ ముందుకు రాకూడదు. ఇది అందరికీ తెలిసిన, చాలా కాలంగా అమల్లో ఉన్న నిబంధనే. కానీ గురువారం అనూహ్య ఘటన చోటు చేసుకుంది. అన్సారీ వేసిన బంతిని రికెల్టన్ ఆడి కమిన్స్‌కు క్యాచ్ ఇచ్చాడు. అయితే దీనిని ‘నోబాల్’గా ప్రకటిస్తూ అంపైర్లు నాటౌట్‌గా ప్రకటించారు. జరిగిందేమిటంటే రికెల్టన్ షాట్ ఆడక ముందే క్లాసెన్ గ్లవ్స్ ముందుకు వచ్చాయి. ఇది ఐసీసీ రూల్స్ 27.3.1కు విరుద్ధం. అందుకే నోబాల్ ఇచ్చారు. క్లాసెన్ కూడా తాను చేసిన తప్పును వెంటనే అంగీకరిస్తూ సైగ చేయడం గమనార్హం. ఐపీఎల్లో నేడుబెంగళూరు X పంజాబ్ వేదిక: బెంగళూరురాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం
బిజినెస్

హోటల్స్ బిజినెస్.. చిన్న నగరాల్లోనే సగం లావాదేవీలు
ముంబై: దేశంలో ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో (టైర్–2, 3) ఆతిథ్య రంగం జోరుమీదున్నది. ఇందుకు నిదర్శనంగా 2024లో ఆతిథ్య రంగంలో జరిగిన హోటల్ లావాదేవీల్లో సగం ఇక్కడే నమోదైనట్టు రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ జేఎల్ఎల్ తెలిపింది. గతేడాది మొత్తం 25 లావాదేవీలు జరిగినట్టు తన తాజా నివేదికలో పేర్కొంది. వ్యాపార, విహార ప్రదేశాల్లో హోటల్స్ లావాదేవీలు (కొనుగోలు, విక్రయాలు) ఎక్కువగా ఉన్నట్టు తెలిపింది.దీంతో అమృత్సర్, మధుర, బికనేర్ తదితర నగరాల్లో నాణ్యమైన వసతి సదుపాయాలు పెరిగేందుకు దోహదపడినట్టు తెలిపింది. మొత్తం లావాదేవీల్లో 51 శాతం అధిక ధనవంతులు (హెచ్ఎన్ఐలు), ఫ్యామిలీ ఆఫీసులు, ప్రైవేటు హోటల్ యజమానులు నుంచి ఉన్నట్టు వెల్లడించింది. లిస్టెడ్ హోటల్ కంపెనీల నుంచి 34 శాతం లావాదేవీలు జరిగినట్టు తెలిపింది. ముంబై, బెంగళూరు, హైదరాబాద్, పుణె, చెన్నైలో 250 అంతంటే ఎక్కువ గదులున్న హోటల్ లావాదేవీలు చోటు చేసుకున్నాయి.ఈ నగరాల్లో వాణిజ్య కార్యకలాపాలు పెరగడం, బలమైన డిమాండ్ మద్దతుగా ఉన్నట్టు పేర్కొంది. ‘‘2025 మొదటి త్రైమాసికంలో చెన్నై, గోవాలో ఇప్పటికే రెండు డీల్స్‌కు జేఎల్ఎల్ సేవలు అందించింది. కార్యకలాపాలు నిర్వహించే వాటితోపాటు భూముల పట్ల ఇన్వెస్టర్లలో పెరిగిన విశ్వాసాన్ని ఇవి సూచిస్తున్నాయి’’అని జేఎల్ఎల్ ఇండియా ఎండీ జైదీప్ దంగ్ తెలిపారు.

భారీ కార్పొరేట్ డీల్స్.. మూడేళ్లలో ఇవే అత్యధికం
ప్రస్తుత క్యాలండర్ ఏడాది(2025) తొలి త్రైమాసికంలో డీల్స్ జోరు పెరిగింది. జనవరి–మార్చి(క్యూ1)లో 29 బిలియన్ డాలర్ల విలువైన 669 లావాదేవీలు జరిగాయి. గత మూడేళ్లలో ఇవి అత్యధికం కాగా.. 2022 క్యూ1 పరిమాణాన్ని మించాయి. విలువలో 2022 క్యూ3ను అధిగమించాయి. కన్సల్టింగ్ దిగ్గజం గ్రాంట్ థోర్న్టన్ భారత్ డీల్ ట్రాకర్ వివరాల ప్రకారం విలీనాలు, కొనుగోళ్లు(ఎంఅడ్ఏ), పీఈ లావాదేవీలు ప్రధాన పాత్ర పోషించాయి.ఐపీవోలు, క్విప్ లావాదేవీలను మినహాయిస్తే 24.4 బిలియన్ డాలర్ల విలువైన 636 డీల్స్ నమోదయ్యాయి. త్రైమాసికవారీగా అంటే 2024 క్యూ4తో పోలిస్తే పరిమాణంరీత్యా 28 శాతం, విలువరీత్యా 34 శాతం వృద్ధి సాధించాయి. వార్షికంగా చూస్తే డీల్ పరిమాణం 43 శాతం జంప్‌చేయగా.. విలువ 17 శాతం ఎగసింది. ఇందుకు ఇన్వెస్టర్ల విశ్వాసం, వ్యూహాత్మక పెట్టు బడులు పుంజుకోవడం సహకరించింది. ప్రధానంగా ఎంఅండ్ఏ విభాగంలో కొత్త చరిత్రను సృష్టిస్తూ 15.8 బిలియన్ డాలర్ల విలువైన 228 డీల్స్ నమోదుకావడం తోడ్పాటునిచ్చినట్లు గ్రాంట్ థోర్న్టన్ భారత్ పార్ట్నర్ శాంతి విజేత పేర్కొన్నారు.భారీ లావాదేవీలు ఈ ఏడాది క్యూ1లో ఆరు బిలియన్ డాలర్ల విలువైన లావాదేవీలు జరిగాయి. మొత్తం డీల్ విలువలో వీటి వాటా 41 శాతానికి చేరింది. తద్వారా భారీ డీల్స్ హవాకు తెరలేచింది. పూర్తి ఏడాది(2025) ఇవే పరిస్థితులు కొనసాగే వీలున్నట్లు శాంతి అంచనా వేశారు. రిటైల్, బ్యాంకింగ్, పునరుత్పాదక ఇంధనం, ఈమొబిలిటీ తదితర అత్యధిక వృద్ధి రంగాలలో ఇన్వెస్టర్లు వ్యూహాత్మకంగా పెట్టుబడులు చేపడుతున్నట్లు వివరించారు. కాగా.. కన్సాలిడేషన్ లావాదేవీలు సైతం జోరందుకున్నట్లు నివేదిక పేర్కొంది.అదానీ గ్రూప్, కోఫోర్జ్ లిమిటెడ్, జెన్ టెక్నాలజీస్, నిట్కో లిమిటెడ్ తదితరాలు పలు ఇతర సంస్థల కొనుగోళ్ల ద్వారా విస్తరిస్తున్నట్లు తెలియజేసింది. బజాజ్ అలియెంజ్ జనరల్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్‌లో బజాజ్ గ్రూప్ 26 శాతం వాటా కొనుగోలు చేయడాన్ని ఈ జాబితాలో ప్రధానంగా ప్రస్తావించింది. ఇందుకు బజాజ్ గ్రూప్ 2.7 బిలియన్ డాలర్లు వెచ్చించిన విషయం విదితమే. పీఈ విభాగంలో 408 డీల్స్ నమోదయ్యాయి. వీటి విలువ 8.6 బిలియన్ డాలర్లు. 2022 క్యూ3 తదుపరి ఇవి గరిష్టంకాగా.. డీల్ పరిమాణంలో 36 శాతం, పెట్టుబడుల్లో 66 శాతం పురోగతి నమోదైంది.

ఇన్ఫోసిస్ డీలా
న్యూఢిల్లీ: గతేడాది(2024–25) చివరి త్రైమాసికంలో సాఫ్ట్వేర్ సేవల దిగ్గజం ఇన్ఫోసిస్ పనితీరు నిరాశ పరచింది. జనవరి–మార్చి(క్యూ4)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 12 శాతం క్షీణించి రూ. 7,033 కోట్లకు పరిమితమైంది. 2023–24 ఇదే కాలంలో రూ. 7,969 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం 8 శాతం ఎగసి రూ. 40,925 కోట్లకు చేరింది. అంతక్రితం క్యూ4లో రూ. 37,923 కోట్ల టర్నోవర్ సాధించింది. అయితే త్రైమాసికవారీగా(క్యూ3) చూస్తే నికర లాభం 3.3 శాతం పుంజుకోగా.. ఆదాయం 2 శాతం నీరసించింది. కాగా.. పూర్తి ఏడాదికి నికర లాభం 2 శాతం వృద్ధితో రూ. 26,713 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం 6 శాతం పెరిగి రూ. 1,62,990 కోట్లకు చేరింది. వెరసి గత ఆదాయ గైడెన్స్ 4.5–5 శాతాన్ని అధిగమించింది. అతిపెద్ద కాంట్రాక్ట్‌తో కలిపి గతేడాది 11.6 బిలియన్ డాలర్ల విలువైన ఆర్డర్లు సాధించింది. వీటిలో 56 శాతం కొత్త ఆర్డర్లే! అంచనాలు వీక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26)లో ఆదాయం 0–3 శాతం మధ్య బలపడే వీలున్నట్లు ఇన్ఫోసిస్ తాజాగా అంచనా వేసింది. నిలకడైన కరెన్సీ ప్రాతిపదికన గైడెన్స్ ప్రకటించింది. కాగా.. గతేడాది కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా 4.1 బిలియన్ డాలర్ల క్యాష్ ఫ్లో సాధించినట్లు ఇన్ఫోసిస్ సీఎఫ్‌వో జయేష్ ఎస్. వెల్లడించారు. వాటాదారులకు షేరుకి రూ. 22 చొప్పున తుది డివిడెండ్ ప్రకటించింది. ఇతర విశేషాలు... → 2025 మార్చికల్లా మొత్తం సిబ్బంది సంఖ్య 6,000 మంది పెరిగి 3,23,578కు చేరింది. → గతంలోప్రకటించినట్లు ఈ ఏడాది 20,000 మంది ఫ్రెషర్స్‌కు ఉపాధి → ఉద్యోగ వలసల రేటు 14 శాతంగా నమోదైంది. మార్కెట్లు ముగిశాక ఫలితాలు వెలువడ్డాయి. బీఎస్ఈలో ఇన్ఫోసిస్ షేరు 0.5% లాభంతో రూ. 1,420 వద్ద ముగిసింది. కొనుగోళ్ల బాటలో... మిస్సింగ్ లింక్: ఆ్రస్టేలియన్ సైబర్ సెక్యూరిటీ సంస్థ మిస్సింగ్ లింక్‌ను తాజాగా ఇన్ఫోసిస్ సొంతం చేసుకోనుంది. ఇందుకు సొంత అనుబంధ సంస్థ ఇన్ఫోసిస్ సింగపూర్ పీటీఈ ద్వారా తప్పనిసరి ఒప్పందం కుదుర్చుకుంది. నగదు రూపేణా 9.8 కోట్ల ఆ్రస్టేలియన్ డాలర్లు (సుమారు రూ. 532 కోట్లు) చెల్లించనుంది. ఎంఆర్‌ఈ: సొంత అనుబంధ సంస్థ ఇన్ఫోసిస్ నోవా హోల్డింగ్స్ ఎల్ఎల్సీ ద్వారా టెక్నాలజీ, బిజినెస్ కన్సల్టింగ్ సంస్థ ఎంఆర్‌ఈ కన్సల్టింగ్(టెక్సాస్)ను కొనుగోలు చేయనుంది. పూర్తి నగదు రూపేణా కుదుర్చుకున్న డీల్‌లో భాగంగా 3.6 కోట్ల డాలర్లు(రూ. 307 కోట్లు) వెచ్చించనుంది. మిత్సుబిషీ హెవీ: ఇన్ఫోసిస్ జేవీ సంస్థ హైపస్‌లో మిత్సుబిషీ హెవీ ఇండస్ట్రీస్ 2 శాతం వాటా కొనుగోలు చేయనుంది. ఇందుకు 15 కోట్ల జపనీస్ యెన్లు(రూ.9 కోట్లు) ఇన్వెస్ట్ చేయనుంది.పటిష్ట ఫలితాలు సాధించాం మార్కెట్‌కు అనుగుణంగా, క్లయింట్ కేంద్రంగా ప్రత్యేక దృష్టిపెట్టడం ద్వారా నిలకడైన సంస్థను నిర్మించాం. ఆదాయం, నిర్వహణ మార్జిన్లు, చరిత్రాత్మక స్థాయిలో ఫ్రీ క్యాష్ సాధనరీత్యా పటిష్ట ఫలితాలు సాధించాం. క్లౌడ్, డిజిటల్, ఏఐలో లోతైన నైపుణ్యం, వ్యయ నియంత్రణ, ఆటోమేషన్.. క్లయింట్ల అవసరాలలో కంపెనీకి పటిష్ట స్థానాన్ని కల్పిస్తున్నాయి. – సలీల్ పరేఖ్, సీఈవో, ఎండీ, ఇన్ఫోసిస్

ఇకపై ప్రతి నెలా 28న ఐఐపీ డేటా
న్యూఢిల్లీ: పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) గణాంకాలను వెల్లడించే వ్యవధిని రెండు వారాల పాటు తగ్గిస్తూ కేంద్ర స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రాం ఇంప్లిమెంటేషన్ (ఎంవోఎస్పీఐ) గురువారం నిర్ణయం తీసుకుంది. ఇకపై 42 రోజుల తర్వాత కాకుండా ప్రతి నెలా 28న ఈ డేటాను ప్రకటించనున్నట్లు తెలిపింది. ఒకవేళ 28వ తారీఖు గానీ సెలవు రోజు అయితే, మరుసటి పనిదినం నాడు డేటాను ప్రకటిస్తారు. ఇది ఈ నెల (ఏప్రిల్) నుంచే అమల్లోకి వస్తుంది. ప్రస్తుతం ఎంవోఎస్పీఐ ఐఐపీ డేటాను రిఫరెన్స్ నెల ముగిసిన ఆరు వారాల తర్వాత ప్రతి నెలా 12న విడుదల చేస్తోంది. సాధారణంగా ఐక్యరాజ్య సమితికి చెందిన ఇంటర్నేషనల్ రికమండేషన్స్ ఫర్ ఐఐపీ (ఐఆర్ఐఐపీ)–2010 ప్రకారం పారిశ్రామికోత్పత్తి తీరుతెన్నులను తెలియజేసే నెలవారీ ఐఐపీ గణాంకాలను రిఫరెన్స్ నెల ముగిసిన 45 రోజుల్లోగా, అంతర్జాతీయ ద్రవ్య నిధి ప్రకారం ఆరు వారాల్లోగా ప్రకటించాల్సి ఉంటుంది. వాటికి అనుగుణంగానే ఎంవోఎస్పీఐ 42 రోజుల్లోగా వెల్లడిస్తోంది.
ఫ్యామిలీ

Puri Jagannath Temple : ఆలయ జెండాతో గద్ద ప్రదక్షిణలు వీడియో వైరల్
ఒడిశాలోని ప్రఖ్యాత పూరీ జగన్నాథుడి (Puri Jagannath temple) ఆలయంలో అద్భుతమైన ఘటన చోటుచేసుకుంది. శ్రీమందిర్ ఆలయ శిఖరంపై ఉన్న పవిత్రమైన జెండాను ఒక గద్ద తన ముక్కుతో పట్టుకుని ఆకాశంలో ప్రదక్షిణ చేసింది. ఈ అసాధారణ ఘటన భక్తులను ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఇది అనర్థమా, శుభసూచికగా అనేక చర్చకు దారితీసింది ఇది భక్తులను విపరీతంగా ఆకర్షించడంతో ఈ వీడియో వైరల్‌గా మారింది. ఇదీ చదవండి: షారూక్ ఖాన్ భార్య హోటల్లో ఫేక్ పనీర్ ఆరోపణల దుమారం : టీం స్పందనపూరీ ఆలయ శిఖరంపై ఉన్న (Neela Chakra) నీలచక్రంపైన ఎగిరే జెండాను ముక్కున కరుచుకుని ఓ గద్ద ఆకాశంలో చక్కర్లు కొట్టింది. పూరీకి వచ్చే భక్తులు పవిత్రంగా భావించే ఆ జెండాను దర్శనం చేసుకుని , తరించడం ఆనవాయితీ. అలాంటిది ఇపుడు శ్రీమహావిష్ణువు వాహనమైన గద్ద తన ముక్కుతో ఈ జెండాను జాగ్రత్తగా పట్టుకుని, ఆకాశంలో ప్రదక్షిణం చేయడం విశేషంగా మారింది. ఈ దృశ్యం కెమెరాలో రికార్డ్ అయింది. ఇది దైవిక సంకేతంగా భక్తులు భావించారు.What is going to happen?Eagle takes away flag from Jagannath Temple pic.twitter.com/0AzUZb1uDE— Woke Eminent (@WokePandemic) April 13, 2025 నెటిజన్లు స్పందనఆలయ జెండాను పోలి ఉన్నప్పటికీ, ఆ వస్త్రం నిజానికి జగన్నాథ ఆలయానికి చెందినదా లేదా కేవలం ఒక సాధారణ గుడ్డ ముక్కేనా అనేది ఇంకా నిర్ధారించలేదు. ఆన్లైన్లో చర్చలకు దారి తీసింది. "జగన్నాథ ఆలయం నుండి ఒక గద్ద పవిత్ర జెండాను తీసుకెళ్లినప్పుడు, అది దొంగతనం కాదనీ, అది స్వర్గపు సందేశం. జగన్నాథుని ఆశీర్వాదాలతో గరుడుడు స్వయంగా స్వర్గానికి ఎక్కినట్లుగా. దైవిక జోక్యం, పునరుద్ధరణ ,క్తివంతమైన మార్పుకు సంకేతమన్నవాదనలు వినిపించాయి. సోషల్ మీడియాలో వేలాదిమంది భక్తులు దీన్ని షేర్ చేయడంతో ఇది వైరల్‌గా మారింది. “PuriJagannathEagle” హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌లో నిలిచింది, ఈ ఘటన జగన్నాథుని అనుగ్రహంగా కొంతమంది భావించారు.‘జగన్నాథుని కృప’’, ‘‘గరుడ దర్శనం’’ వంటి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వెల్లువెత్తాయి. మరోవైపు ఈ ఘటనను సహజమైనదని కామెంట్ చేశారు. దాన్ని ఆహారంగానో, మరేదో ఆసక్తికరమైన వస్తువుగా గద్ద భావించి ఉండవచ్చని వ్యాఖ్యానించారు. ఏది ఏమైనా ఈ ఘటనతో ఒడిశాలోని భారతదేశంలోని అత్యంత పవిత్రమైన క్షేత్రాల్లో ఒకటైన పూరీ జగన్నాథ ఆలయం ఒక్కసారి చర్చల్లో నిలిచింది. ఆలయ వైభవాన్ని, ఖ్యాతిని పలువురు గుర్తుచేసుకున్నారు. చదవండి: రెండో పెళ్లి చేసుకున్న ప్రముఖ యాంకర్, ఫోటోలు వైరల్

షారూక్ ఖాన్ భార్య హోటల్లో ఫేక్ పనీర్ ఆరోపణల దుమారం : టీం స్పందన
బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ భార్య గౌరీ రెస్టారెంట్ బిజినెస్‌లో ఉన్నారు. అంతేకాదుఇంటీరియర్ డిజైనర్, చిత్ర నిర్మాత ,వ్యవస్థాపకురాలిగా తన కంటూ ప్రత్యేకమైన పేరు ఫ్రఖ్యాతులు సంపాదించుకున్న సెలబ్రిటీ మహిళ. ముఖ్యంగా ఇంటీరియర్ డిజైనర్‌గా ఆమెకు అనేకమంది సెలబ్రిటీ కష్టమర్లు ఉన్నారు. బాలీవుడ్ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు ,అంతర్జాతీయ ప్రముఖుల క్లయింట్లకు సేవలు అందించే లగ్జరీ ఇంటీరియర్ డిజైన్ స్టోర్ గౌరీ ఖాన్ డిజైన్స్‌ను ముంబైలో నడుపుతోంది.అలాగే ఇటీవల టోరీ పేరుతో ముంబైలో ఒక హై-ఎండ్ రెస్టారెంట్ లగ్జరీ రెస్టారెంట్‌ను నిర్వహిస్తోంది. తాజాగా ఈ హోటల్ వివాదంలో ఇరుక్కుంది.సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ , యూట్యూబర్, సార్థక్ సచ్‌దేవా గౌరీ ఖాన్ టోరీ ఫుడ్‌పై సంచలన ఆరోపణలు చేశాడు. ఇక్కడ 'నకిలీ' పనీర్ వడ్డిస్తున్నారంటూ ఒక వీడియో చేశాడు. దీంతో ఇంటర్నెట్లో వైరల్ అయింది. ఇదీ చదవండి : రెండో పెళ్లి చేసుకున్న ప్రముఖ యాంకర్, ఫోటోలు వైరల్ఫుడ్ ఇన్ఫ్లుయెన్సర్లు తరచుగా సెలబ్రిటీలు నడిపే రెస్టారెంట్లను సందర్శించి, వాటి నుండి సమీక్షలను పంచుకుంటూ ఉంటారు. ఇలాంటి వీడియోలు సాదారణంగా ప్రజాదరణ పొందుతాయి. అలాగే సదరు హోటల్ ఖ్యాతిని పెంచుకోవడానికి కూడా దోహదపడతాయి. కానీ ఈ విషయంలో మాత్రం గౌరీ ఖాన్‌కు ఎదురు దెబ్బ తగిలింది. గౌరీ ఖాన్ఖు చెందిన లగ్జరీ హోటల్ టోరీ నకిలీ పనీర్ (కాటేజ్ చీజ్)ను అందిస్తుందని, ఇది కల్తీకి గుర్తు అని తన వీడియోలో పేర్కొన్నాడు సార్థక్ సచ్‌దేవా. తన వీడియోలో టోరీలో వడ్డించే పనీర్ ముక్కపై అయోడిన్ టింక్చర్ పరీక్ష కూడా చేసాడు. ఇది స్టార్చ్ స్థాయిని గుర్తించడానికి ఉపయోగిస్తారట. , అయోడిన్ వేయగానే పనీర్ ముక్క రంగు నలుపు నీలం రంగులోకి మారిపోయింది. దీంతో తాను షాక్ అయ్యానంటూ సార్థక్ సచ్‌దేవా ఆరోపించారు.దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. కొందరు ఫన్నీగా, మరికొందరు అతణ్ని ట్రోల్ చేస్తూ కమెంట్స్ చేశారు. మరికొందరు యూజర్లు అతనిని సమర్థించారు."గౌరీ, షారూఖ్ ఖాన్ ఇది నిజమేనా, లేదా అతనుఅబద్ధం చెబుతున్నాడా? దయచేసి స్పందించండి అంటూ మరికొంతమంది స్పందించారు. మరొక అభిమాని అయితే హెల్తీ సెలబ్రెటీలు నక్లీ పనీర్ తింటున్నారా అంటూ వ్యాఖ్యానించడం గమనార్హం. గౌరీ ఖాన్ టీం స్పందన"అయోడిన్ పరీక్ష స్టార్చ్ ఉనికిని ప్రతిబింబిస్తుంది తప్ప పనీర్ నాణ్యత ప్రామాణికతను కాదు అంటూ టోరీ టీం స్పందించింది. వంటకంలో సోయా ఆధారిత పదార్థాలు ఉన్నం వల్లే, అలాంటి రియాక్షన్ వచ్చే అవకాశం ఉంది తప్ప, అది నకిలీదికాదని స్పష్టత ఇచ్చింది. తమ పనీర్ చాలా స్వచ్చమైందనీ, టోరీలో పదార్థాలన్నీ నాణ్యంగా, ఆరోగ్యంగా ఉంటాయని హామీ ఇచ్చింది.

50 ఏళ్ల వయసులో పడుచుపిల్లలా ఖుష్బూ.. సీక్రెట్ అదే!
నటి, రాజకీయ నాయకురాలు ఖుష్బూ సుందర్ టాలీవుడ్ కోలీవుడ్‌లో తనదైన ముద్రవేసిన ప్రసిద్ధ నటి. 90లలో తన అందం, నటనతో సినీ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపిన నటి ఆమె. ఎన్నో వైవిద్య భరితమైన పాత్రలో ప్రేక్షకుల, విమర్శకుల మెప్పుని పొందారు. అంతేగాదు వేలాదిగా అభిమానులను సొంతం చేసుకున్న తమిళ నటి. అలాగే సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చి.. అక్కడ కూడా తన హవాను చాటుతున్నారు. అవసరమైనప్పుడూ ప్రజల తరుపున గళం విపుత్తు..వార్తల్లో నిలుస్తున్నారు కూడా. రాజకీయ నాయకురాలిగా బిజీగా ఉండే ఆమె కూడా ఫిట్‌నెస్‌పై శ్రద్ధ పెడుతుంటారు. అందుకు నిదర్శనమే ఆమె కొత్త గ్లామరస్ లుక్. ఎంతో లావుగా ఉండే ఆమె ఒక్కసారిగా పదహారణాల పడుచు పిల్లలా మారిపోయారు. నెటిజన్లు సైతం ఆమె కొత్త లుక్‌ని చూసి ఆశ్చర్యపోతున్నారు. మరీ.. అంతలా బరువు కోల్పోయినా..ఖుష్బు వెయిట్‌లాస్ సీక్రెట్ ఏంటో ఆమె మాటల్లోనే చూద్దామా..!.ఐదుపదుల వయసులో ఖుష్బూ అద్భుతంగా తన బాడీ ఆకృతిని మార్చుకుని అందర్నీ ఆశ్చర్యచకితుల్ని చేశారామె. ఇటీవలే అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో నెట్టింట తెగ వైరల్‌గా మారాయి. నిజంగా ఆమెనా..? ఖుష్బు కూతురా..? అని కన్ఫ్యూజ్ అయ్యేలా గ్లామరస్ లుక్‌లో కనిపించారామె. అయితే ఆమె కొత్త లుక్‌ని చూసి.. కొందరు నెటిజన్లు మెచ్చుకోగా మరికొందరు మాత్రం ఇంజెక్షన్లు ఏవో తీసుకునే బరువు తగ్గారామె అంటూ కామెంట్లు చేశారు. అయితే ఖుష్బూ వాటిన్నంటిని కొట్టిపారేస్తూ..తాను ఎలా బరువుని తగ్గించుకోగలిగరో షేర్ చేసుకున్నారు. అలాగే తన ఫిట్నెస్ సీక్రెట్ ఏంటో కూడా చెప్పారు. బరువు తగ్గడానికి షార్ట్ కట్స్ ఉండవని నర్మగర్భంగా తేల్చి చెప్పారామె. ఒకవేళ్ల తగ్గినా..అది తాత్కాలికమే అని కూడా అన్నారు ఖుష్బూ. కేవలం క్రమశిక్షణాయుతమైన జీవనశైలి, బరువు తగ్గాలన్న కృత నిశ్చయాలే..అద్బుతంగా బరువు తగ్గేందుకు దారితీస్తాయని అంటున్నారామె. అంతేగాదు అందుకోసం తాను ఎలాంటి లైఫ్‌స్టైల్‌ని అనుసరించారో కూడా పంచుకున్నారు. మనసుపెట్టి తినడం, ఒక గంటపాటు వర్కౌట్లు, అలాగే సాయంత్రం 45 నుంచి 50 నిమిషాలు తప్పనిసరి వాక్ తదితరాలే ఈ సరికొత్త లుక్‌కి కారణమని అన్నారు. అయితే తాను ఇలా ఫిట్‌నెస్‌పై దృష్టిపెట్టడానికి ప్రధాన కారణం కూడా వివరించారు. షూటింగ్‌ల సమయంలో సంవత్సరాల తరబడి అయిన గాయాలు, శస్త్రచికిత్సలు తన మోకాళ్లను పూర్తిగా బలహీనపరిచాయన్నారు. వాటిపై ఒత్తిడిపడకూడదంటే బరువు తగ్గక తప్పదని వైద్యులు సూచించినట్లు తెలిపారు. చీలమండలాలు బాగానే ఉన్నాయని, మోకాళ్లు ఆల్మోస్ట్ అరిగిపోయాయని అన్నారు. అప్పుడే ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టకపోతే అంతే సంగతులని భావించి..బరువు తగ్గాలని గట్టిగా ఫిక్స్ అయ్యానన్నారు. అలా తాను దాదాపు 20 కేజీల బరువుని కోల్పాయానన్నారు.ఇక్కడ ఖుష్బూ బరువు తగ్గేందుకు ఎటువంటి సౌందర్య చికిత్సల జోలికిపోకుండా.. అందంగా..ఆరోగ్యకరంగా వృద్ధాప్యాన్ని ఎలా మలుచుకోవచ్చో చూపించారు. ఏదీఏమైనా.. వయసురీత్యా మార్పులనేవి సహజం. వాటిని దాచే ప్రయత్నం కంటే..ఆరోగ్యదాయకమైన పద్ధతిలో తీసుకొస్తే..అటు అందం, ఇటు ఆరోగ్యాన్ని పదిలపరుచుకున్న వాళ్లమవుతామని తన చేతలతో చెప్పకనే చెప్పింది నటి ఖుష్బూ. (చదవండి: ఎవరీ రేష్మా కేవల్రమణి..? ఏకైక భారత సంతతి మహిళగా టైమ్స్‌లో చోటు..)

రెండో పెళ్లి చేసుకున్న ప్రముఖ యాంకర్, ఫోటోలు వైరల్
ప్రముఖ యాంకర్, టీవీ ప్రెజెంటర్, బిగ్ బాస్ తమిళ సీజన్ 5 ఫేమ్ ప్రియాంక దేశ్‌పాండే తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. తన నైపుణ్యంతో ప్రేక్షకులను ఆకర్షించడమే కాదు, ఆయా షోలకు సక్సెస్‌కు కీలకంగా నిలిచింది. అందుకే ఆమెను దక్షిణ భారత టీవీ పరిశ్రమలో అత్యధిక పారితోషికం తీసుకునే యాంకర్‌గా పేరొందింది. తాజాగా ఆమె తనప్రియుడితో మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టింది. ప్రియాంక వివాహానికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట సందడిగా మారాయి.సూపర్ సింగర్, ది వాల్ అండ్ కింగ్స్ ఆఫ్ కామెడీ జూనియర్స్ వంటి షోలలో హోస్ట్‌గా పాపులర్ అయిన ప్రియాంక DJ వాసి సచ్చితో ఏడడగులు వేసింది.కరియర్లో సక్సెస్అయినప్పటికీ వైవాహిక జీవితంలో ఫెయిల్ అయిన ప్రియాంక రెండోసారి ప్రేమను వెదుక్కుంది. ఏప్రిల్ 16 కొంతమంది సన్నిహితుల మధ్య నిరాడంబరంగా వివాహం చేసుకుంది. ప్రియాంక తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో అభిమానులతో ఈ ఆనందకరమైన క్షణాలను పంచుకుంది. దీంతో ఈ జంటకు ఫ్యాన్స్‌కు అభినందనలు తెలిపారు. టెలివిజన్ ఐకాన్ పెళ్లి అవతార్‌పై నెటిజన్లు ముగ్ధులైపోతున్నారు. దీంతో ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి, నెటిజన్లు ముగ్ధులయ్యారు. View this post on Instagram A post shared by Priyanka Deshpande (@priyankapdeshpande)రాయల్ లుక్‌లో వధూవరులుప్రియాంక , వాసి కొత్త దంపతులుగా చాలా అనందంగా కనిపించారు. చాలా సంతోషంగా ఇరు కుటుంబాలతో కలిసి పోజులిచ్చారు. ముఖ్యంగా ప్రియాంక తన స్పెషల్ డే కోసం ఐవరీ అండ్ గోల్డెన్ సిల్క్ చీరలో ముగ్ధమనోహరిలాగా మెరిసిసోయింది. హెవీ ఎంబ్రాయిడరీ , జరీ వర్క్ బ్లౌజ్, సన్నని బంగారు అంచు, సింపుల్ ఎంబ్రాయిడరీతో ఎరుపు దుపట్టాతో కొత్త పెళ్లికూతురిలా కళకళలాడింది. ఇంకా సింపుల్ మేకప్ లాంగ్ నెక్లెస్, గాజులు, ఝుమ్కి, కమర్ బంద్ ,మాంగ్ టీకాతోపాటు, ఆమె ఉత్సాహభరితమైన చిరునవ్వుతో అలంకరించుకుంది. మరోవైపు, వాసి సాధారణ తెల్లటి కుర్తా , వేష్టి ధరించాడు.మొత్తం మీద ఇద్దరూ రాయల్ లుక్‌లో అభిమానులను ఆకట్టుకున్నారు. ఒక అభిమాన ప్రేమ పూర్వక సందేశం"మనం కోరుకునే ప్రేమను పొందడం నిజంగా చాలా అరుదు. అలాంటి ప్రేమ దొరికడం అత్యంత అందమైన విషయం. ప్రేమ అంటే యవ్వనంగా కనిపించడం లేదా పరిపూర్ణంగా ఉండటం గురించి కాదు; ఇది ఒకరినొకరు లోతుగా అర్థం చేసుకోవడం,ఒకరినొకరు సంతోషపెట్టేది ఏమిటో తెలుసుకోవడం,ఒకరికొకరు చిన్న విషయాలను మార్చుకునేంత శ్రద్ధ వహించడం..అంతేగా.. అదే ప్రేమ. ప్రియాంక, స్వచ్ఛమైన, సంతోషకరమైన ప్రేమకు మీరు అర్హులు, నేను చాలా సంతోషంగా ఉన్నాను. మీ చుట్టూ ప్రేమతో ఈ కొత్త అధ్యాయంలోకి అడుగుపెట్టడం చూసి హృదయం నిండిపోతుంది. "మీకు చాలా, చాలా, చాలా సంతోషకరమైన వివాహ జీవితం కావాలని కోరుకుంటున్నాను."ప్రియాంక దేశ్పాండేప్రియాంక దేశ్‌పాండే 2016 ఫిబ్రవరిలో సీనియర్ నిర్మాత ప్రవీణ్ కుమార్‌ను వివాహం చేసుకుంది. అయితే, వ్యక్తిగత విభేదాల కారణంగా ఇద్దరూ 2022లో విడిపోయినట్లు సమాచారం. ఎవరీ డీజే వాసిమ్యూజిక్ ఇండస్ట్రీలో సుపరిచితమైన పేరు. ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ క్లిక్ 187 కంపెనీకి డైనమిక్ వ్యవస్థాపకుడు. అగ్రశ్రేణి క్లబ్‌లు, ప్రైవేట్ పార్టీలు సెలబ్రిటీ వివాహాలను నిర్వహణలో దిట్ట. దీనికితోడు సంగీత నైపుణ్యం ,ఈవెంట్ నైపుణ్యం అతన్ని హై-ప్రొఫైల్ ఈవెంట్స్‌లో కీలకంగామారాడు. ప్రియాంక హోస్ట్ చేస్తున్న వాసి ఈవెంట్లలో అయిన పరిచయం ప్రేమ, పెళ్లికి దారి తీసింది.
ఫొటోలు
అంతర్జాతీయం

టైమ్స్ జాబితాలో భారతీయులకు దక్కని చోటు!
ప్రపంచమంతా ప్రతిష్టాత్మకంగా భావించే టైమ్ మ్యాగజైన్(Time Magazine List 2025) జాబితా 2025 విడుదలైంది. వంద మంది పేర్లతో కూడిన జాబితాను విడుదల చేసింది. అయితే అత్యంత ప్రభావశీల వ్యక్తుల జాబితాలో ఈ ఏడాది భారతీయులెవరికీ చోటు దక్కకపోవడం గమనార్హం.2025కి గానూ మోస్ట్ ఇన్ఫ్లూయెన్షియల్ పీపుల్ జాబితాను టైమ్ మ్యాగజైన్ విడుదల చేసింది. ఇందులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, యూకే ప్రధాని కీర్ స్టార్మర్, నోబెల్ బహుమతి గ్రహీత.. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, టెస్లా సీఈవో ఇలాన్ మస్క్ తదితరులకు చోటు దక్కింది. జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్, పాపులర్ సింగర్ ఈద్ షరీన్, ఏఐ దిగ్గజం డెమిస్ హస్సాబిస్(Demis Hassabis) తదితరుల పేర్లు ఉన్నాయి.ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. భారత్ నుంచి ఈ ఏడాది జాబితాలో ఒక్కరికి కూడా చోటు దక్కలేదు. గతంలో.. షారూఖ్ ఖాన్, అలియా భట్, సాక్షి మాలిక్(రెజ్లర్) పేర్లు ఈ జాబితాకు ఎక్కిన సంగతి తెలిసిందే. అయితే ఈ మధ్య సంవత్సరాల్లో ఇలా భారతీయుల పేర్లు లేకపోవడం ఇదే తొలిసారి. ఈసారి విశేషం ఏంటంటే.. నేరుగా భారతీయులకు చోటు దక్కకపోయినా భారత సంతతికి చెందిన వర్టెక్స్ ఫార్మాసూటికల్స్ సీఈవో రేష్మా కేవలరమణి(Reshma Kewalramani) పేరు ఈ జాబితాలోకి ఎక్కింది. రేష్మ ముంబైలో పుట్టారు. ఆమెకు 11 ఏళ్ల వయసున్నప్పుడు ఆ కుటుంబం అమెరికాకు వలస వెళ్లి స్థిరపడింది. రేష్మా కేవలరమణి(52)టైమ్ జాబితాకు ప్రాధాన్యత ఎందుకు?టైమ్ మ్యాగజైన్ అనేది న్యూయార్క్ కేంద్రంగా నడిచే వార్త ప్రచురణ సంస్థ. 1923 మార్చి 3వ తేదీన ఇది ప్రారంభమైంది. సమకాలీన వార్తలకు పాఠకులకు అందించే ఉద్దేశంతో హెన్రీ లూస్, బ్రిటన్ హాడెన్ దీనిని స్థాపించారు. కాలక్రమేణా దీనికి ప్రపంచస్థాయి ఆదరణ లభించింది. అనేక రంగాలను మలుపు తిప్పిన వ్యక్తుల పేర్లతో ప్రతీ ఏటా జాబితా విడుదల చేస్తూ వస్తోంది టైమ్స్ మ్యాగజైన్. అలా..అత్యంత ప్రభావశీలురైన వ్యక్తుల జాబితాను 1999లో తొలిసారి రిలీజ్ చేసింది టైమ్ మ్యాగజైన్. మేధావులు, రాజకీయ నాయకులు, జర్నలిస్టులు ఈ జాబితా గురించి విస్తృతంగా చర్చించుకోవడం మొదలుపెట్టారు. అయితే 2004 నుంచి క్రమం తప్పుకుండా ప్రతీ ఏడాది జాబితాను విడుదల చేస్తూ వస్తోంది టైమ్ మ్యాగజైన్.

భారత సంతతి వైద్యురాలు ముంతాజ్ పటేల్‌కి అరుదైన గౌరవం
లండన్: ప్రతిష్టాత్మక రాయల్ కాలేజ్ ఆఫ్ ఫిజీషియన్స్(ఆర్సీపీ) 124వ ప్రెసిడెంట్‌గా భారత సంతతికి చెందిన డాక్టర్ ముంతాజ్ పటేల్ ఎన్నికయ్యారు. యూకే వైద్య నిపుణుల సంఘంలో ప్రపంచవ్యాప్తంగా నిపుణులుగా పేరున్న 40 వేల మంది వైద్యులు సభ్యులుగా ఉన్నారు.ఇక, ఇంగ్లండ్‌లోని లంకాషైర్‌లో డాక్టర్ పటేల్ జన్మించారు. ఈమె తల్లిదండ్రులు భారత్‌కు చెందిన వారు. మాంచెస్టర్‌లో కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్‌గా డాక్టర్ ముంతాజ్ పనిచేస్తున్నారు. ఆర్సీపీకు మొట్టమొదటి ఇండో–ఆసియన్ ముస్లిం ప్రెసిడెంట్‌గా ఆమె చరిత్ర సృష్టించారు. 16వ శతాబ్దంలో ఆర్సీపీ ఏర్పాటయ్యాక ఐదో మహిళా అధ్యక్షురాలుగా ముంతాజ్ పటేల్ నిలిచారు. సోమవారం ముగిసిన ఎన్నికలో డాక్టర్ ముంతాజ్ గెలుపొందారు. నాలుగేళ్ల పదవీకాలం ప్రారంభం ఖరారు కావాల్సి ఉంది. ఆర్సీపీ వైస్ ప్రెసిడెంట్(ఎడ్యుకేషన్–ట్రెయినింగ్)గా, తాత్కాలిక ప్రెసిడెంట్‌గా 2024 జూన్ నుంచి కొనసాగుతున్నారు. ఆర్సీపీ ప్రెసిడెంట్‌గా కౌన్సిల్ సమావేశాలకు అధ్యక్షత వహిస్తారు. బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సభ్యురాలుగా ఉంటారు.

భూకంపం నుంచి బిడ్డను రక్షించుకునేందుకు.. వలయాన్ని సృష్టించిన ఏనుగులు
ప్రాణి ఏదైనా పిల్లల పట్ల చూపించే ప్రేమ, తీసుకునే జాగ్రత్తలు ఒకేతీరుగా ఉంటాయి. అందుకు తాజా ఉదాహరణ ఈ ఘటన. సోమవారం దక్షిణ కాలిఫోర్నియాలో 5.2 తీవ్రతతో భూకంపం వచ్చింది. ఒక్కసారిగా కదలికలను గమనించిన శాన్‌డియాగో జంతు ప్రదర్శనశాలలోని ఏనుగులు అప్రమత్తమయ్యాయి. జూ సఫారీ పార్కులో ఉన్న ఆఫ్రికన్ ఏనుగుల గుంపు ఒకేచోట చేరింది. తమ పిల్లలను రక్షించుకోవడానికి వలయం ఏర్పాటు చేసింది. మధ్యలో పిల్లలను ఉంచిన ఏనుగులు ఏ పక్క నుంచి ఏ ముప్పు ఉందోనని చుట్టుపక్కల పరిశీలించడం మొదలుపెట్టాయి. చెవులు చాచి, కళ్లు పరిసరాలను పరిశీలిస్తూ, ఎలాంటి ప్రమాదాన్నైనా ఎదుర్కొనేందుకు సిద్ధమన్నట్టుగా నిలబడి ఉన్నాయి. గుంపులో ఉన్న మగ ఏనుగు పిల్ల కూడా రక్షణ వలయంలోకి వచ్చి నిలబడింది. దానికి తల్లి ఏనుగు తొండంసాయంతో నేనున్నా అనే భరోసాను సైతం ఇచ్చింది. భూమి కంపించడం ప్రారంభించిన క్షణాల్లోనే ఏనుగులు చర్యకు దిగాయి. ఎన్‌క్లోజర్‌లోని నిఘా కెమెరాలు ఈ దృశ్యాలను బంధించాయి. ‘అలర్ట్ సర్కిల్’అనిపిలిచే ఈ సహజ రక్షణ వలయం. బలహీనమైన సభ్యులు భయపడకుండా ఉండేందుకు ఏనుగులు ఈ విలక్షణమైన పవర్తనను కలిగి ఉంటాయి. ఇది వాటి తెలివితేటలకు, సామాజిక బంధానికి నిదర్శనమని జంతుప్రదర్శనశాల క్షీరదాల క్యూరేటర్ మిండీ ఆల్బ్రైట్ తెలిపారు. ఏనుగులు తమ పాదాల ద్వారా భూకంప కార్యకలాపాలను గ్రహించగలవని, ఆయా జంతువులకు ముందుగానే తెలిసిపోతుందని వెల్లడించారు. సుమారు గంట తర్వాత భూప్రకంపనలు రావడంతో ఆ గుంపు మరోసారి రక్షణ వలయాన్ని ఏర్పరిచింది. ముప్పేమీ లేదని నిర్ణయించుకున్నాకే విశ్రాంతి తీసుకుంది.– సాక్షి, నేషనల్ డెస్క్

జర్మనీలో కిల్లర్ డాక్టర్
బెర్లిన్: తన వద్ద చికిత్స పొందుతున్న రోగులను కంటికి రెప్పలా సంరక్షించాల్సిన ఓ వైద్యుడు వారిని కిరాతకంగా హత్య చేశాడు. వైద్య వృత్తికే మచ్చ తెచ్చాడు. ఏకంగా 15 మంది రోగుల ప్రాణాలు బలి తీసుకున్నాడు. ఈ ఘటన జర్మనీలో చోటుచేసుకుంది. హంతక డాక్టర్‌పై దర్యాప్తు కొనసాగుతోంది. 40 ఏళ్ల ఆ డాక్టర్ 2021 సెపె్టంబర్ నుంచి 2024 జూలై వరకు 15 హత్యలు చేశాడు. బాధితుల్లో 12 మంది మహిళలు, ముగ్గురు పురుషులు ఉన్నారు. వారి వయసు 25 నుంచి 94 ఏళ్ల దాకా ఉంది. చాలామంది వారి సొంత ఇళ్లల్లోనే హత్యకు గురయ్యారు. చికిత్స పేరిట రోగుల ఇళ్లకు చేరుకొని ప్రమాదకరమైన డ్రగ్స్‌ను ఇంజెక్షన్ రూపంలో ఇచ్చినట్లు గుర్తించారు. దీంతో శ్వాస ఆగిపోయి నిమిషాల వ్యవధిలోనే రోగులు ప్రాణాలు విడిచారు. బాధితుల ఇళ్లకు నిప్పు పెట్టడం ద్వారా సాక్ష్యాధారాలను మాయం చేసేందుకు కిల్లర్ డాక్టర్ ప్రయత్నించినట్లు తేలింది. తొలుత నలుగురి మృతిపై అనుమానం రాగా అధికారులు దర్యాప్తు చేపట్టారు. కానీ, డాక్టర్ చేతిలో 15 మంది హత్యకు గురైనట్లు వెల్లడయ్యింది. అయితే, అతడు ఈ హత్యలు ఎందుకు చేశాడన్నది తెలియరాలేదు. హంతకుడు తన నేరం ఒప్పుకోవడం లేదని సమాచారం. నిబంధనల ప్రకారం గోప్యత దృష్ట్యా అతడి పేరును ఇంకా బయటపెట్టలేదు. గత ఏడాది ఆగస్టు 6వ తేదీ నుంచి కస్టడీలో ఉన్నాడని, విచారణ కొనసాగుతోందని అధికారులు బుధవారం వెల్లడించారు. జర్మనీలో హత్య కేసుల్లో సాధారణంగా యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తారు.
జాతీయం

రూ. 50 కోట్ల కుక్క.. ఈడీ దాడులు!
ఏదైనా గొప్పలకు పోతే ఇలానే ఉంటుంది. గొప్పగా బ్రతకొచ్చు.. నీ గొప్పను అవతలి వాడు చెప్పుకోవాలి.. అంతేకానీ మనకు అవకాశం దొరికింది కదాని లేనిపోని గొప్పలకు పోతే ఇలానే ఉంటుంది. ఓ వ్యక్తి గొప్పలకు పోయాడు. తాను ఓ కుక్కును పెంచుకుంటున్నాడు. అది సహజమే. కాకపోతే ఆ కుక్క విలువ రూ. 50 కోట్లు అంటూ గొప్పలకు పోయాడు. నిజంగానే ఆ కుక్క విలువ రూ. 50 కోట్లు ఉంటుందో లేదో తెలీదు కానీ, ఇక్కడ ఆ మనిషి నోరు జారిన ‘గొప్ప’ ఈడీ రైడ్స్ వరకూ వెళ్లింది.విషయంలోకి వెళితే.. తాను అత్యంత ఖరీదు అని చెప్పుకునే కుక్కను తీసుకుని గత ఫిబ్రవరిలో ఓ షోకు వెళ్లాడు సతీష్ అనే వ్యక్తి. అక్కడ తన కుక్క విలువ రూ. 50 కోట్లంటూ ఏవో గొప్పలు చెప్పుకున్నాడు. ఇదొక అరుదైన జాతి కుక్క అని, దీని విలువ లక్షరాల రూ. 50 కోట్లని బహిరంగంగా ప్రకటించాడు. ఇది ఆనోట ఈనోట మారి ఈడీ వరకూ వెళ్లింది. ఫిబ్రవరిలో ఏదో చెప్పుకున్నాడు.. కానీ ఈడీ ఓ కన్నేసి ఉంచింది. అతనికి రెండు నెలల తర్వాత సోదాల పేరుతో వెళ్లింది. కుక్కనే అంత పెట్టి కొన్నాడంటే ఇంక ఎంత ఉంటుందో అని ఈడీ లెక్కలు వేసుకుంది. అంతే అతనికి ఇంటికి గురువారం వెళ్లి సోదాలు చేపట్టింది.ఈ క్రమంలోనే అతనికి సంబంధించి అన్నీ ఆరాలు తీసింది. అతని బ్యాంకు అకౌంట్లను క్షుణ్ణంగా పరిశీలించింది. అయితే పెద్ద మొత్తంలో ఏమీ లావాదేవీలను జరగలేదని విషయాన్ని గుర్తించింది. కుక్కను రూ. 50 కోట్లను పెట్టి కొనుగోలు చేసినట్లు అతను చెప్పిన కోణంలో సమగ్రంగా దర్యాప్తు చేసింది. అయితే అతను లావాదేవీల్లో అంత పెద్ద మొత్తాన్ని ఈడీ గుర్తించలేదు. హవాలా రూట్ లో ఏమైనా చేశాడా.. అనే కోణాన్ని ఈడీ దర్యాప్తు చేసినట్లు తెలుస్తోంది.

మరో చిక్కొచ్చిపడిందే.. అప్పుడు జుట్టు.. ఇప్పుడు గోళ్లు.. ఏం జరుగుతోందక్కడ?
షెగావ్: మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలోని కొన్ని గ్రామాల ప్రజలకు కొత్త చిక్కొచ్చిపడింది. ఆ జిల్లాలో కొన్ని గ్రామాల ప్రజలు ఆకస్మికంగా జుట్టు కోల్పోయిన వింత పరిస్థితి సంచలనం కలిగించిన సంగతి తెలిసిందే.. అప్పుడు జుట్టు సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడగా, ఇప్పుడు గోళ్ల సమస్యను ఎదుర్కొంటున్నారు.గత కొన్ని రోజులుగా అక్కడ ఉన్న మహిళలు, పురుషులు జుట్టు రాలిపోవడం అనే సమస్యను ఎదుర్కొంటున్నారు. చాలా మందికి బట్టతల కూడా వచ్చేసింది. మొదట్లో కొద్దిగా జుట్టు రాలడం మొదలై.. ఒక్క వారంలోనే ఇలా బట్టతలగా మారిపోయింది. జిల్లాలోని షెగావ్ తాలూకాలోని సుమారు 15 గ్రామాల ప్రజలు మూడు నెలలుగా జుట్టు సమస్య కొనసాగుతుండటంతో ఆందోళన చెందుతున్నారు. అయితే, మరో సమస్యతో ఆ గ్రామాలు భయపడుతున్నాయి.ఇప్పుడు నాలుగు గ్రామాల్లోని ప్రజలు గోళ్లు రాలిపోవడం, ముడతలు పడటం వంటి కొత్త సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం తదుపరి పరీక్షల కోసం షెగావ్ ఆసుపత్రికి పంపిస్తున్నట్లు వైద్యులు వెల్లడించారు. ఈ సమస్యకు కారణం సెలీనియం స్థాయిలు పెరగడమే కారణంగా భావిస్తున్నట్లు డాక్టర్లు తెలిపారు.ఇక్కడి గ్రామాల ప్రజలు ఆకస్మికంగా జుట్టు కోల్పోవడం, గోళ్లు రాలిపోవడానికా కారణం.. వారు తింటున్న గోధుములకు సంబంధముందని కొందరు వైద్య నిపుణులు పేర్కొన్నారు. ఆ గోధుమల్లో సెలీనియం అధిక మోతాదులో ఉండటమే ఇందుకు కారణంగా చెప్పారు. గతంలో విపరీతంగా జుట్టు కోల్పోయిన వారిలో అనేక మంది ఇప్పుడు గోళ్ల సమస్య ఎదుర్కొంటున్నట్లు వైద్యులు వెల్లడించారు.

ఆ చట్టం కేవలం కోడళ్ల కోసమే చేయలేదమ్మా: అలహాబాద్ హైకోర్టు
లక్నో: గృహ హింస చట్టం కింద రక్షణ కోరే అవకాశం కుటుంబంలోని ప్రతీ స్త్రీకి ఉంటుందని అలహాబాద్ హైకోర్టు తన తాజా తీర్పులో స్పష్టం చేసింది. కేవలం అది కోడలకు మాత్రమే నిర్దేశించిన చట్టం మాత్రమే కాదని, అత్తకు కూడా ఈ చట్టం వర్తిస్తుందని తెలిపింది. తనకు కోడలు పెట్టే గృహ హింస నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ ఓ మహిళ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ చేపట్టిన అలహాబాద్ హైకోర్టు ఈ విషయంపై క్లారిటీ ఇచ్చింది. అది కేవలం కోడళ్లకు మాత్రమే ఉద్దేశించిన చట్టం మాత్రమే కాదని, కుటుంబంలో ఎవరైనా స్త్రీ దీనికి అర్హులేనని పేర్కొంది. జస్టిస్ అలోక్ మాథుర్ నేతృత్వంలోని హైకోర్టు ఈ మేరకు తీర్పునిచ్చింది. గృహ హింస ఫిర్యాదులో తన అత్త దాఖలు చేసిన పిటిషన్‌కు సంబంధించి మేజిస్ట్రేట్ జారీ చేసిన సమన్లను కోడలు, ఆమె తరుఫు బంధువులు సవాల్ చేస్తూ అలహాబాద్ హైకోర్టుకు వెళ్లారు. ఇకడ కోడలు పిటిషన్‌ను కొట్టివేసిన అలహాబాద్ హైకోర్టు.. మేజిస్ట్రేట్ ఇచ్చిన తీర్పును జస్టిస్ అలోక్ మాథుర్ నేతృత్వంలోని హైకోర్టు సమర్ధించింది. అది కేవలం కోడళ్ల చట్టమంటూ హైకోర్టుకు..ఆ చట్టం అనేది కేవలం కోడళ్లకి మాత్రమే ఉద్దేశించబడినదంటూ హైకోర్టుకు వెళ్లింది కోడలు. గృహ హింస చట్టం అనేది కోడళ్లకు మాత్రమే చేయబడిదని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై మేజిస్ట్రేట్ తీర్పును సవాల్ చేసింది. దీన్ని కొట్టివేసేన హైకోర్టు,..గృహ హింసకు గురయ్యే ప్రతీ మహిళకి ఈ చట్టం వర్తిస్తుందని తెలిపింది. ఇది కేవలం కోడళ్లకి మాత్రమే చేయబడిన చట్టం కాదని చురకలంటించింది. డీసీ(డొమస్టిక్ వయెలెన్స్) చట్టంలోని సెక్షన్ 12 కింద కుటుంబంలోని ఏ స్త్రీ అయినా రక్షణ కోరవచ్చని తెలిపింది.ఇంతకీ కేసు ఏంటంటే..!యూపీ రాష్ట్రానికి చెందిన గరిమా అనే మహిళ సుధా మిశ్రాను వేధింపులకు గురి చేయడంతో ఆమె కోర్టు మెట్లు ఎక్కింది. రాయబేరీలోని సొంత ఇంటి నుంచి వెళ్లిపోదామని భర్తపై గరిమా పదే పదే ఒత్తిడి తెచ్చింది. దాన్ని తన కొడుకు తిరస్కరించడంతో తనపై కోడలు వేధింపులు అధికమైనట్లు అత్త సుధా మిశ్రా పేర్కొంది.. అదే సమయంలో తన ఇంటి నుంచి కోడలు గరిమా, ఆమె తరఫు బంధులతో కలిసి బలవంతంగా డబ్బును, బంగారాన్ని ఎత్తుకెళ్లినట్లు ఆమె తెలిపింది. దీనిపై గృహ హింస చట్టం కింద కోర్టును ఆశ్రయించింది.

సుప్రీం కోర్టు తీర్పు.. ఉపరాష్ట్రపతి హాట్ కామెంట్స్
న్యూఢిల్లీ: శాసనసభలు ఆమోదించిన బిల్లులను ఆమోదించడం లేదంటే తిప్పి పంపే విషయంలో గవర్నర్‌తో పాటు రాష్ట్రపతికీ ఇటీవల సుప్రీం కోర్టు గడువు విధించిన సంగతి తెలిసిందే. ఈ తీర్పుపై ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ హాట్ హాట్ కామెంట్స్ చేశారు. న్యాయస్థానాలు రాష్ట్రపతిని నిర్దేశించే పరిస్థితి ఉండకూడదంటూ వ్యాఖ్యలు చేశారాయన. రాజ్యసభ ఇంటర్న్స్ 6వ బ్యాచ్‌ను ఉద్దేశించి ప్రసంగించిన ఆయన.. న్యాయస్థానాలు రాష్ట్రపతిని నిర్దేశించే పరిస్థితి ఉండకూడదన్నారు. అదే జరిగితే రాజ్యాంగంలోకి ఆర్టికల్ 142 కింద సుప్రీం కోర్టు తనకున్న ప్రత్యేక అధికారాలను.. ప్రజాస్వామ్య శక్తులపై ఒక అణ్వాయుధాన్నే ప్రయోగించినట్లు అవుతుందని అభిప్రాయపడ్డారు. సుప్రీం కోర్టు నిర్దిష్ట సందర్భాల్లో ఈ అధికారాన్ని విస్తృతంగా ఉపయోగించడం వల్ల ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రభావం పడుతుందనే అభిప్రాయం వ్యక్తం చేశారాయన.తమిళనాడు పెండింగ్ బిల్లుల వ్యవహారంపై జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ ఆర్ మహదేవన్ నేతృత్వంలోని ధర్మాసనం సంచలన తీర్పు వెల్లడించిన సంగతి తెలిసిందే. తమిళనాడు శాసనసభ ఆమోదించిన పది బిల్లులను రాష్ట్ర గవర్నర్ ఆర్ ఎన్ రవికుమార్ తొక్కిపెట్టడం రాజ్యాంగ విరుద్ధమన్న సర్వోన్నత న్యాయస్థానం.. ఏదైనా బిల్లును మంత్రిమండలి సలహా మేరకు రాష్ట్రపతి ఆమోదం కోసం నిలిపి ఉంచాల్సివస్తే అందుకు గవర్నర్ తీసుకోదగిన అత్యధిక గడువు ఒక నెల మాత్రమేనని తన తీర్పులో స్పష్టం చేసింది. ఈ తీర్పు వెలువడిన తర్వాత తమిళనాడు ప్రభుత్వం 10 పెండింగ్ బిల్లుల్ని చట్టాలుగా ప్రకటించింది.అయితే అటుపై రాష్ట్రపతి పరిశీలన కోసం గవర్నర్లు పంపే బిల్లులను ఉద్దేశించి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలే చేసింది. గవర్నర్లు పంపిన బిల్లులపై రాష్ట్రపతి మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని సూచించింది. గవర్నర్ పంపిన బిల్లులను రాష్ట్రపతి ఎటూ తేల్చకపోతే అప్పుడు రాష్ట్రాలు నేరుగా తమను ఆశ్రయించవచ్చని సుప్రీంకోర్టు చెప్పడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఈ తీర్పుపై కేంద్రం ప్రభుత్వం సమీక్షకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఇదే వేదిక నుంచి.. ఢిల్లీ హైకోర్టు జడ్జి బంగ్లాలో నోట్ల కట్టలు బయటపడిన వ్యవహారంపైనా ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ స్పందించారు. ఘటన జరిగి నెలరోజులు గడుస్తున్నా.. ఎఫ్ఐఆర్ లేకపోవడం, దర్యాప్తులో ఎలాంటి పురోగతి లేకపోవడం, జడ్జిలకు కలిగే ఉపశమనం గురించీ ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఎన్ఆర్ఐ

హాంగ్‌కాంగ్‌లో ఘనంగా శ్రీ విశ్వావసు నామ ఉగాది వేడుకలు
హాంకాంగ్‌లో ఉగాది వేడుకలు తెలుగు కుటుంబాలకు యెంతో ఉత్సాహాన్నిచ్చాయి, తెలుగు సంవత్సరాదిని ఐక్యతతో, సాంస్కృతిక సంపదతో జరుపుకుంన్నారు. ది హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య (THKTS) నిర్వహించే ఈ కార్యక్రమం, అనధికారికంగా ఇరవై రెండు సంవత్సరాలుగా మరియు పదమూడు సంవత్సరాల అధికారిక సంస్థగా తెలుగు సేవ కొనసాగిస్తోంది. చింగ్ మింగ్ ఉత్సవం కారణంగా హాంకాంగ్‌లో సుదీర్ఘ వారాంతం సెలవలు ఉన్నప్పటికీ, విశేషమైన సంఖ్యలో సభ్యులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమానికి హాంకాంగ్ & మకావులోని భారత కాన్సులేట్ జనరల్ నుంచి కాన్సుల్ శ్రీ కూచిభొట్ల వెంకట రమణ గారు; హోం అఫైర్స్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ జిల్లా అధికారి శ్రీ మొక్ మాంగ్-చాన్ గారు; ఎన్.ఎ.ఎ.సి టచ్ సెంటర్ ప్రాంతీయ డైరెక్టర్ శ్రీమతి కోనీ వాంగ్ గారు; మరియు హాంకాంగ్‌లో ఐసిఐసిఐ బ్యాంక్ లిమిటెడ్ ఉన్నత అధికారి శ్రీ దేవేష్ శర్మ గారు హాజరయ్యారు.చీకటిని పారద్రోలడానికి మరియు కొత్త ప్రారంభాలను స్వాగతించడానికి ప్రతీకగా గౌరవనీయ అతిథుల దీప ప్రజ్వలనతో ఉగాది వేడుకలు ప్రారంభమైంది. ప్రార్థన తర్వాత, హాజరైన వారిని "మా తెలుగు తల్లి" శ్రావ్యమైన పాట ఆకట్టుకుంది,తెలుగుతనాన్ని ప్రేక్షక హృదయాలలో ప్రతిధ్వనించింది. ప్రముఖుల ప్రసంగాలు సమాజ ప్రయాణం మరియు దాని సభ్యులను బంధించే లక్ష్యం గురించి ప్రతిబింబించాయి. శ్రీ కూచిభొట్ల వెంకట రమణ గారు తెలుగు భాష మరియు సాంస్కృతిక విలువలను పునరుద్ఘాటిస్తూ ఇది భావితరాలికి అందించాల్సిన కర్తవ్య ప్రాముఖ్యతని గుర్తుచేశారు. తెలుగు సమాఖ్య ద్వారా హాంగ్ కాంగ్ తెలుగు ప్రజలకు చేస్తున్న సేవలను ఆయన అభినందించారు.తన ప్రసంగంలో, తెలుగు సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షురాలు హాంకాంగ్‌లోని తెలుగు వారిలో ఒక అనుబంధ భావన మరియు సంబంధాన్ని సృష్టించడం ముఖ్యోద్దేశంగా సంస్థ ప్రయాణం మరియు దాని లక్ష్యం గురించి ప్రతిబింబించారు. సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకోవడం మరియు సమాజానికి తిరిగి ఇవ్వడం యొక్క ప్రాముఖ్యతను ఆమె యెంతో అవసరం అని చెప్పారు. హాంకాంగ్ మరియు భారతదేశంలోని వెనుకబడిన వర్గాలకు మద్దతు ఇవ్వడానికి తమ సంస్థ చేస్తున్న ప్రయత్నాలను ప్రస్తావించారు.వినోదాత్మక స్కిట్ వైవిధ్యమైన ప్రదర్శనలను సజావుగా అనుసంధానించింది, ప్రేక్షకుల హర్షధ్వానాలు - కరతాళధ్వనులతో సాంస్కృతికోత్సవం ముగిసింది. ప్రదర్శలిచ్చిన కళాకారులను కాన్సల్ శ్రీ కూచిభొట్ల వెంకట్ రమణ గారు పురస్కరాలు అందజేస్తూ అభినందించారు.హాంకాంగ్‌లోని తెలుగు సమాజం శ్రీ విశ్వవాసు నామ ఉగాది వేడుకలను ప్రారంభిస్తున్నందున, తెలుగు నూతన సంవత్సర ప్రారంభాన్ని సూచిస్తూ సాంప్రదాయ ఉగాది పచ్చడితో, తెలుగు భోజనంతో వేడుకలు ముగిశాయి. ఈ కార్యక్రమం సమాజం యొక్క ఐక్యత, సేవా స్ఫూర్తికి నిదర్శనం, స్నేహం మరియు సేవా బంధాలను పెంపొందించడం, ఆనందం, విజయం మరియు సద్భావనతో నిండిన సంవత్సరాన్ని వాగ్దానం చేయడం మరియు తెలుగు ప్రజల గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని జరుపుకోవడం తార్కాణం.అధ్యక్షురాలు తన కృతజ్ఞతా ప్రసంగంలో,గౌరవనీయులైన అతిథులు, కమిటీ సభ్యులు, స్వచ్ఛంద సేవకులు, సమాఖ్య సభ్యులు, స్నేహితులు మరియు తుంగ్ చుంగ్ కమ్యూనిటీ హాల్ సిబ్బందికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

రాజాంలో విద్యార్ధులకు నాట్స్ ఉపకారవేతనాలు
జన్మభూమి రుణం తీర్చుకునేందుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ అనేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే నాట్స్ తాజాగా శ్రీకాకుళం జిల్లా రాజాం లో విద్యార్ధులకు ఉపకారవేతనాలు, మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేసింది. నాట్స్ ఫినిక్స్ చాప్టర్ జాయింట్ కో ఆర్డినేటర్ సతీశ్ గంథం తన సొంత ఊరికి చేతనైన సాయం చేయాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. రాజాంలోని శ్రీ విద్యానికేతన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో సతీశ్ గంథం విద్యార్ధులకు ఉపకారవేతనాలు అందించారు. అలాగే ఇక్కడే మహిళలు స్వశక్తితో ఎదిగేందుకు వారికి ఉచితంగా కుట్టుమిషన్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రముఖులు పాల్గొని సతీశ్ గంథం సేవా నిరతిని ప్రశంసించారు. జన్మభూమి రుణం తీర్చుకునేందుకు నాట్స్ ఫినిక్స్ చాప్టర్ జాయింట్ కో ఆర్డినేటర్ సతీష్ గంథం చూపిన చొరవను నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి, నాట్స్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ శ్రీహరి మందాడి లు ప్రత్యేకంగా అభినందించారు.

డల్లాస్‌లో నాట్స్ అడాప్ట్ ఎ పార్క్ కార్యక్రమం
అమెరికాలో సామాజిక బాధ్యత పెంచే కార్యక్రమాలను నాట్స్ తరచూ చేపడుతోంది. ఈ క్రమంలోనే నాట్స్ అడాప్ట్ ఎ పార్క్ కార్యక్రమాన్ని డల్లాస్‌లోని ఫ్రిస్కో నగరంలో చేపట్టింది. డల్లాస్ నాట్స్ విభాగం ఆధ్వర్యలో ప్రిస్కోలోని మోనార్క్ పార్క్‌లో 50 మందికి పైగా నాట్స్ సభ్యులు, తెలుగు విద్యార్ధులు పాల్గొని పార్క్‌ని శుభ్రం చేశారు. ప్రకృతిని కాపాడేందుకు, శుభ్రతను ప్రోత్సహించేందుకు అడాప్ట్ ఎ పార్క్ వంటి కార్యక్రమాలు ఎంతో మేలును కలిగిస్తాయని, పార్కులను శుభ్రంగా ఉంచడం వల్ల పర్యావరణ హితమైన జీవనశైలికి మార్గం సుగమం అవుతుందని నాట్స్ పూర్వ అధ్యక్షులు బాపు నూతి అన్నారు. విద్యార్ధుల్లో సామాజిక బాధ్యత పెంచేందుకు నాట్స్ చేపట్టిన ఈ సామాజిక సేవా కార్యక్రమం ద్వారా విద్యార్ధుల సేవను అమెరికా ప్రభుత్వం గుర్తిస్తుందని నాట్స్ బోర్డ్ డైరెక్టర్ రాజేంద్ర మాదాల తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, యువత తమ విలువైన సమయాన్ని వినియోగించి పార్కును శుభ్రపరిచారు. చెత్తను తొలగించారు. చెట్లకు నీరు పట్టారు ప్రకృతి పరిరక్షణకు తోడ్పడ్డారు. విద్యార్ధులకు ఇది ఒక సామాజిక బాధ్యతగా మాత్రమే కాకుండా, భవిష్యత్తులో పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించే గొప్ప అనుభవంగా మిగులుతుందని డల్లాస్ చాప్టర్ వ్కోఆర్డినేటర్లు స్వప్న కాట్రగడ్డ, శ్రావణ్ నిడిగంటి అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించటానికి ప్రోత్సాహాన్ని అందిస్తున్న దాతలకు ధన్యవాదాలు తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో జాయింట్ ట్రెజరర్ రవి తాండ్ర, నాట్స్ జోనల్ వైస్ ప్రెసిడెంట్ సత్య శ్రీరామనేని, నేషనల్ కోఆర్డినేటర్ ఫర్ మీడియా రిలేషన్స్ కిషోర్ నారె, నాట్స్ సభ్యులు శివ మాధవ్, బద్రి, కిరణ్, పావని, శ్రీ దీపిక, ఉదయ్, వంశీ, వీరా తదితరులు పాల్గొన్నారు. మరిన్ని NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి! రేపటి తరంలో సామాజిక బాధ్యత పెంచే అడాప్ట్ ఎ పార్క్ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించిన డల్లాస్ చాప్టర్ జట్టుకు నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షులు మదన్ పాములపాటి తమ అభినందనలు తెలిపారు. జూలై 4,5,6 తేదీల్లో టంపాలో జరిగే 8 వ అమెరికా తెలుగు సంబరాలకు డల్లాస్‌లో ఉండే తెలుగువారంతా తరలిరావాలని కోరారు.

30వ ఉగాది ఉత్తమ రచనల పోటీ విజేతల ప్రకటన
గత మూడు దశాబ్దాల సత్ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ.....“విశ్వావసు” నామ సంవత్సర ఉగాది (మార్చ్ 30, 2025) సందర్భంగా వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారు నిర్వహించిన 30వ ఉగాది ఉత్తమ రచనల పోటీ లో ఈ క్రింది రచనలు ఉత్తమ రచనలుగా వంగూరు ఫౌండేషన్ ఎంపిక చేసి విజేతల వివరాలను ప్రకటించింది. అలాగే విజతలకు శాయి రాచకొండ, దీప్తి పెండ్యాల, వంగూరి చిట్టెన్ రాజు అభినందనలు తెలిపారు.వంగూరు ఫౌండేషన్ ప్రకటనఅమెరికా, కెనడా, భారత దేశం, దక్షిణ ఆఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్, ఖతార్, చెకొస్లొవేకియా, అబుదాభి, బోస్ట్వానా, దుబై తదితర ప్రాంతాల నుండి ఈ పోటీలో పాలు పంచుకుని, విజయవంతం చేసిన రచయితలకు మా ధన్యవాదాలు. చేయి తిరిగిన రచయితలు, ఔత్సాహిక రచయితలూ అనేక మంది ఈ పోటీ కాని పోటీలో పాల్గొనడం సంతోషంగా ఉంది. అన్ని రచనలకూ సర్వ హక్కులూ రచయితలవే. బహుమతి పొందిన రచనలు, ప్రచురణకి అర్హమైన రచనలూ కౌముది.నెట్, సిరిమల్లె. కామ్ మొదలైన పత్రికలలో ఆయా సంపాదకుల నిర్ణయానుగుణంగా ప్రచురించబడతాయి.మరిన్ని NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి! అందుబాటులో ఉన్న విజేతల నగదు బహుమతులు, ప్రశంసాపత్రాలు ఏప్రిల్ 13, 2025 నాడు శ్రీ త్యాగరాజ గాన సభ వేదిక, హైదరాబాద్ లో నిర్వహించబడుతున్న "అంతర్జాతీయ ఉగాది సాహిత్య సమ్మేళనం" లో ఆహూతుల సమక్షంలో బహూకరిస్తాం.30వ ఉగాది ఉత్తమ రచనల పోటీ విజేతలుప్రధాన విభాగం – 30వ సారి పోటీఉత్తమ కథానిక విభాగం విజేతలు“కాంతా విరహగురుణా”- పాణిని జన్నాభట్ల, Boston, MA,)“నల్లమల్లె చెట్టు” - గౌతమ్ లింగా (Johannesburg, South Africa)ప్రశంసా పత్రాలు‘లూసఫర్’ -నిర్మలాదిత్య (భాస్కర్ పులికల్), Tampa, FL‘తెలివి’ - మురళీశ్రీరాం టెక్కలకోట, Frisco, TXఉత్తమ కవిత విభాగం విజేతలు“వర్ణాక్షరం” - గౌతమ్ లింగా, (జొహానెస్ బర్గ్, దక్షిణ ఆఫ్రికా)“కృత్రిమ మేధా వికూజనము” – స్వాతి శ్రీపాద (Detroit, MI)ప్రశంసా పత్రాలు“డయాస్పోరా ఉగాది పచ్చడి”- సావిత్రి మాచిరాజు, Edmonton, Canada“చెప్పిన మాట వింటా!”- అమృత వర్షిణి, Parker, CO, USA“మొట్టమొదటి రచనా విభాగం” -17వ సారి పోటీ“నా మొట్టమొదటి కథ” విభాగం విజేతలు‘ప్రత్యూష రాగం -కైలాస్ పులుగుర్త’ – హైదరాబాద్,“మనో నిశ్చలత” – సీతా సుస్మిత, మద్దిపాడు గ్రామం,ఒంగోలు - ప్రశంసా పత్రం“మంకెన పూలు” -సుజాత గొడవర్తి, ఆశ్వాపురం, తెలంగాణా - ప్రశంసా పత్రం"నా మొట్ట మొదటి కవిత” విభాగం విజేతలు“ఇంకెంత కాలమని?” కరిపె రాజ్ కుమార్, ఖానాపూర్, నిర్మల్ జిల్లా, తెలంగాణా “వర్షాగమనానికి ఆశగా ఎదురుచూసే ప్రకృతిని హృద్యంగా, కొంత కరుణాత్మకంగా వర్ణించే కవిత”“అచ్చం నాలానే” -మళ్ళ కారుణ్య కుమార్, అమ్మవారి పుట్టుగ (గ్రామం), శ్రీకాకుళం“వయసు ఒక అనిరిర్ధారిత సంఖ్య” - ప్రొఫెసర్ దుర్గా శశికిరణ్ వెల్లంచేటి, Bangalore, India-
క్రైమ్

డ్రైవర్‌గా చేరి ప్రైవేటు వీడియోలతో బ్లాక్ మెయిల్
విశాఖపట్నం: ప్రైవేటు వీడియోలతో సాఫ్ట్వేర్ ఉద్యోగి కుటుంబాన్ని బ్లాక్మెయిల్ చేస్తూ డబ్బులు డిమాండ్ చేస్తున్న కారు డ్రైవర్ అప్పలరాజును ద్వారకా పోలీసులు గురువారం అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సాఫ్ట్వేర్ ఇంజినీర్ చేకూరి గిరీష్, భార్య పిల్లలతో కలిసి సీతమ్మధార ప్రాంతంలో నివాసముంటున్నారు. అతనికి అంగవైకల్యం కారణంగా పిల్లలను చూసుకోవడానికి, ఇంటి పనుల కోసం డ్రైవర్‌గా రామెళ్ల అప్పలరాజును పెట్టుకున్నాడు. అతడు నమ్మకంగా ఉండడంతో వారి మధ్య స్నేహం పెరిగింది. ఒక రోజు గిరీష్‌ను హోటల్‌కు తీసుకెళ్లి అమ్మాయిని పరిచయం చేశాడు. ఆమెతో సన్నిహితంగా ఉన్న దృశ్యాలను అప్పలరాజు మొబైల్లో చిత్రీకరించాడు. కొద్ది రోజుల తరువాత ఆ వీడియోలు సాయంతో గిరీష్‌ను బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడు. తనకు రూ.లక్ష ఇవ్వాలని లేదంటే ఫొటోలు సోషల్ మీడియాలోను, కుటుంబ సభ్యులకు పంపిస్తానని బెదిరించాడు. దీంతో పరువు పోతుందని భావించిన గిరీష్ తన బంధువు సిబ్బంది ద్వారా ఆ మొత్తాన్ని ఏర్పాటు చేసి ఆరు యూపీఐ లావాదేవీల ద్వారా డ్రైవర్‌కు బదిలీ చేశారు. చాలా కాలంగా గిరీష్‌తో పాటు అతని కుటుంబ సభ్యులను డ్రైవర్ అప్పలరాజు వేధిస్తూ వచ్చాడు. ఎప్పటికప్పుడు డబ్బులు తీసుకుంటున్నాడు. ఐఫోన్16 ప్లస్‌ను కూడా కొనుగోలు చేయించుకున్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరి 21న గిరీష్‌ను అప్పలరాజు కత్తితో బెదిరించి అతని వద్ద ఉన్న రూ.5 వేలు బలవంతంగా తీసుకున్నాడు. అలాగే గిరీష్ తన భార్య పేరు మీద కొనుగోలు చేసిన ఫ్లాట్‌ను కూడా కాజేయడానికి ప్రయత్నించాడు. అంతటితో ఆగకుండా గిరీష్ వీడియోలు అతని భార్యకు పంపించి ఆమెను సైతం వేధింపులకు గురి చేశాడు. వీరి పార్కింగ్ స్థలాన్ని ఆక్రమించి అక్కడ పోలీస్ స్టిక్కర్ ఉన్న కారును పార్క్ చేసేవాడు. డ్రైవర్ అప్పలరాజు వేధింపులను భరించలేక గిరీష్ చివరకు ద్వారకా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు అప్పలరాజును అరెస్టు చేసి గురువారం రిమాండ్‌కు పంపించారు. అతడి నుంచి నకిలీ పిస్టల్‌తో పాటు కొంత మొత్తంలో నగదు, కారు, ఫోన్ స్వా«దీనం చేసుకున్నారు.

బాండ్‌పేపర్‌పై సూసైడ్‌నోట్ రాసి..
సంగారెడ్డి జిల్లా: సమృద్ధి జీవన్ సంస్థలో ఏజెంట్‌గా చేసి, డిపాజిట్లు చేసిన వారికి తిరిగి చెల్లించేందుకు అప్పులు చేసి, వాటిని తీర్చలేక ఓ ఎల్ఐసీ ఏజెంట్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్.ఐ కాశీనాథ్, మృతుడి భార్య తుల్జమ్మ వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలంలోని అల్గోల్ గ్రామానికి చెందిన వెంకన్న (48) గురువారం సాయంత్రం గ్రామ శివారులో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వెంకన్న గతంలో సమృద్ధి యోజన సంస్థలో ఏజెంట్‌గా చేశాడు. ఈ క్రమంలో ప్రజల నుంచి పెద్దమొత్తంలో బాండ్లు (డిపాజిట్లు) కట్టించాడు. సంస్థను అర్ధాంతరంగా ఎత్తివేయడంతో ప్రజల వద్ద నుంచి సేకరించిన డిపాజిట్ డబ్బులు చెల్లించేందుకు బయట అప్పులు చేశాడు. ఇందుకోసం భూమిని సైతం తాకట్టు పెట్టాడు. చేసిన అప్పుల బాధలు పెరిగిపోవడం, రుణంతీర్చే దారిలేక జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వెంకన్న రాసిన సూసైడ్‌నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు జహీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. కాగా, వెంకన్న పెద్ద కుమార్తె పరమేశ్వరికి వివాహం కాగా, రెండో కుమార్తె ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. కుమారుడు ఎంబీఏ రెండో సంవత్సరం చదువుతున్నాడు. రూ.100 బాండ్ పేపర్‌పై సూసైడ్ నోట్ఆత్మహత్యకు పాల్పడే ముందు వెంకన్న బాండ్ పేపర్‌పై సూసైడ్ నోట్ రాశాడు. ‘టి.వెంకన్న తండ్రి అంజన్న గ్రా: అల్గోల్ అను నేను. అప్పుల బాధ భరించలేకపోతున్నాను. సమృద్ధి జీవన్ ఫౌండేషన్‌లో ఏజెంట్‌గా చేశాను. కస్టమర్లకు మొత్తం డబ్బు నేనే చెల్లించాను. దానివల్ల అప్పులు ఎక్కువై.. ఇప్పుడు ఇతరులకు అప్పుకట్టలేక పోతున్నాను. అప్పుల బాధ భరించలేక నేను సూసైడ్ చేసుకుంటున్నాను. నన్ను క్షమించండి. అప్పు ఇచ్చినవారిని క్షమాపణలు కోరకుంటున్నాను. శివుని దయతో మీకందరికి లాభం జరుగుతుంది. ఓం నమఃశివాయ’ అని రాసిపెట్టిన సూసైడ్ నోటును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ప్రియుడు పెళ్లికి నిరాకరించాడని..
హైదరాబాద్: ప్రియుడు పెళ్లికి నిరాకరించడంతో మనస్తాపానికి లోనైన ఓ యువతి ప్రియుడి ఇంటిపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన గురువారం రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని బంజారానగర్‌లో చోటు చేసుకుంది. ఎస్ఐ రాములు కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. అస్సాం రాష్ట్రం, బస్కంది గ్రామానికి చెందిన సుల్తానా బేగం(26) సిద్ధిఖీనగర్‌లో ఉంటూ గచ్చిబౌలిలోని అంతేరా హోటల్లో సర్వర్‌గా పని చేస్తోంది. వెస్ట్ బెంగాల్‌కు చెందిన సైదుల్లా షేక్ గచ్చిబౌలిలోని నావాబ్ హోటల్లో మేనేజర్‌గా పని చేస్తూనే పెస్ట్ కంట్రోల్ పని చేసేవాడు. సుల్తానా, సైదుల్లా షేక్ మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. సుల్తానా తల్లిదండ్రులు ఆమెకు పెళ్లి చేసేందుకు సంబంధాలు చూస్తుండటంతో తనను పెళ్లి చేసుకోవాలని సుల్తానా సైదుల్లాపై ఒత్తిడి పెంచింది. బుధవారం సాయత్రం పెళ్లి విషయమై గొడవ జరిగింది. దీంతో పెళ్లికి నిరాకరించిన అతను ఆమె ఫోన్‌ను బ్లాక్‌లో పెట్టాడు. దీంతో సుల్తానా మరో యువతికి ఫోన్ చేసి షైదుల్లా ఉంటున్న ఇంటిపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటానని చెప్పింది. దీంతో ఆమె ఈ విషయాన్ని సైదుల్లాకు చెప్పినా అతను పట్టించుకోలేదు. దీంతో మనస్తాపానికి లోనైన సుల్తానా గురువారం ఉదయం సైదుల్లా నివాసం ఉండే భవనంపైకి ఎక్కి 6వ అంతస్తు నుంచి దూకడంతో కింద పార్క్ చేసి ఉన్న కారుపై పడింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆమెను కొండాపూర్ కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి నిమ్స్‌కు తరలించగా ఉదయం మృతి చెందింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఆన్లైన్ బెట్టింగ్‌కు యువకుడి బలి
హైదరాబాద్: ఆన్లైన్ బెట్టింగ్‌కు బానిసగా మారిన బీటెక్ విద్యార్థి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన అత్తాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం.. గద్వాల్ జిల్లాకు చెందిన పవన్ (30) తన స్నేహితులు గౌతమ్, రోహితులతో కలిసి అత్తాపూర్‌లో ఉంటున్నారు. కొంత కాలంగా ఆన్లైన్ బెట్టింగ్‌కు అలవాటు పడిన పవన్.. తన స్నేహితులు, బంధువులు, కుటుంబ సభ్యుల వద్ద అప్పులు చేశాడు. బీటెక్ చదివిన కుమారుడు ప్రయోజకుడు కావాలని పవన్ తండ్రి పెద్ద నర్సింహులు వ్యవసాయాధారిత పంటలపై వచి్చన డబ్బులను కూడా ఇస్తుండేవాడు. ఆన్లైన్ బెట్టింగ్‌లో డబ్బులు సంపాదించుకోవచ్చని భావించిన పవన్ తన బుల్లెట్ వాహనాన్ని, ఐఫోన్‌ను సైతం విక్రయించి మరీ బెట్టింగ్‌లకు పాల్పడేవాడు. స్నేహితులు, బంధువుల వద్ద తీసుకున్న డబ్బులు కూడా పోగొట్టుకోవడంతో మానసికంగా కుంగిపోయిన పవన్ నిరాశతో గదిలో స్నేహితులు లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్నేహితుల ఫిర్యాదు మేరకు మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.