Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Teachers union candidate Gade Srinivasulu Naidu wins in MLC Election1
బాబు ప్రజా కంటక పాలనకు టీచర్ల చెంపదెబ్బ..‘మాస్టర్‌’ స్ట్రోక్‌!

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: సూపర్‌ సిక్స్‌ హామీలను ఎగ్గొట్టి.. పది నెలలుగా ప్రజా కంటక పాలనతో ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్న టీడీపీ, జనసేన కూటమి పార్టీలకు ఏడాదిలోపే చావుదెబ్బ తగిలింది! అధికార మదంతో విర్రవీగుతున్న కూటమి నేతలకు విజ్ఞులైన ఉపాధ్యాయులు బెత్తంతో బడిత పూజ చేశారు! ప్రజాస్వామ్య విలువలను చాటిచెబుతూ.. కూటమి మోసాలను తిప్పికొడుతూ గుణపాఠం లాంటి తీర్పు ఇచ్చారు. పట్టుమని పది నెలల్లోనే టీడీపీ కూటమి సర్కారుపై వెల్లువెత్తుతున్న ప్రజా వ్యతిరేకతకు ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు అద్దం పట్టాయి. సీఎం చంద్రబాబు అనుసరిస్తున్న రెడ్‌బుక్‌ పాలన, ప్రజా కంటక విధానాలకు ఉపాధ్యాయులు చెంపపెట్టు లాంటి తీర్పు ఇచ్చారు. మొత్తం యంత్రాంగాన్ని మోహరించి అధికార బలాన్ని ప్రయోగించినా కూటమి సర్కారు పాచికలు పారలేదు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి పార్టీలు అధికారికంగా తమ అభ్యర్ధిగా ప్రకటించిన రఘువర్మ పరాజయం పాలయ్యారు. ప్రతి నియోజకవర్గంలో అధికార పార్టీ తన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో బలాన్ని ప్రయోగించినా.. ఓటుకు నోట్లు ఎరవేసినా ఈ సర్కారు పట్ల తమ వ్యతిరేకతను ఉపాధ్యాయులు స్పష్టంగా ఓటు రూపంలో వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర జిల్లాల టీచర్లు ఎన్నికల్లో పాల్గొన్న తీరు, ఫలితం.. ఈ ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఎంత వ్యతిరేకత నెలకొందో స్పష్టం చేస్తున్నాయి. ఎన్నికల్లో హామీలిచ్చి ఓట్లేయించుకుని అధికారంలోకి వచ్చాక చంద్రబాబు ప్రభుత్వం అన్ని వర్గాలను మోసగించిందని మండిపడుతున్నారు. కూటమి అభ్యర్థి రఘువర్మ గెలుపు కోసం కృషి చేయాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వెబెక్స్‌ ద్వారా స్వయంగా ఆదేశాలు జారీ చేస్తూ వచ్చినా భంగపాటు తప్పలేదు. ఉపాధ్యాయ సంఘాలన్నీ కలిసికట్టుగా తమ అభ్యర్ధిగా ప్రకటించిన గాదె శ్రీనివాసులు నాయుడును గెలిపించి కూటమి సర్కారుపై తమ ఆగ్రహాన్ని చాటుకున్నాయి. తమ ఓటు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకమని స్పష్టంగా తేల్చి చెప్పారు. కాగా తమ అభ్యర్థి ఓడిపోవడంతో కూటమి నేతలు ఒక్కసారిగా ప్లేటు ఫిరాయించారు. పోలింగ్‌ రోజు వరకూ తమ అభ్యర్థి రఘువర్మను గెలిపించాలంటూ ప్రచారం నిర్వహించి అనుకూల మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేసిన టీడీపీ నేతలు ఆయన ఓడిపోవడంతో.. గెలిచిన గాదె శ్రీనివాసులు కూడా తమవారేనంటూ కొత్త పల్లవి అందుకోవడం టీడీపీ దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ట. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ ఆదేశాలతోనే రఘువర్మను తమ అభ్యర్థిగా ప్రకటిస్తున్నట్లు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు స్వయంగా ప్రకటించారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గట్టి షాక్‌ తగలడంతో సీఎం చంద్రబాబు నేరుగా రంగంలోకి దిగారు. దీని నుంచి బయటపడేందుకు పోలీస్‌ కమిషనర్‌ ఫోన్‌ ద్వారా గెలిచిన అభ్యర్థి గాదెతో ఆయన స్వయంగా ఫోన్‌లో మాట్లాడారంటే టీడీపీని పరాజయం ఏ స్థాయిలో వణికించిందో అర్థం అవుతోంది. సజావుగా జరిగి ఉంటే.. ఆ రెండు చోట్ల కూడా! కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికారపార్టీ నేతలు భారీగా నగదు పంపిణీతో పాటు పీడీఎఫ్‌ అభ్యర్థి కుటుంబ సభ్యులు, ఏజెంట్లపై దాడులకు దిగి బీభత్సం సృష్టించారు. దొంగ ఓట్లను నమోదు చేసి... ఏకంగా రిగ్గింగుకు కూడా తెగబడ్డారు. స్వయంగా అధికార పార్టీ నేతలే విచ్చలవిడిగా డబ్బులను పంపిణీ చేశారు. ఎన్నికలు సజావుగా జరిగి ఉంటే ఇక్కడ కూడా అధికార కూటమికి కచ్చితంగా ఓటమి ఎదురయ్యేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రెండో స్థానం కోసం పోటాపోటీ... ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీఆర్‌టీయూ నుంచి బరిలో నిలిచిన గాదె శ్రీనివాసులు నాయుడు ప్రతి రౌండ్‌లోనూ స్పష్టమైన ఆధిక్యతను కనబరిచారు. ఏ రౌండ్‌లో కూడా కూటమి అభ్యర్థి రఘువర్మకు మెజార్టీ రాకపోవటాన్ని గమనిస్తే టీడీపీ సర్కారుపై ఉపాధ్యాయుల్లో ఎంత వ్యతిరేకత ఉందో తేటతెల్లమవుతోంది. పైగా పీడీఎఫ్‌ నుంచి బరిలో నిలిచిన విజయగౌరి నుంచి రెండో స్థానం కోసం కొన్ని రౌండ్లల్లో రఘువర్మ పోటీని ఎదుర్కొన్నారు. ఒక దశలో పీడీఎఫ్‌ అభ్యర్థికి, కూటమి అభ్యర్థి రఘువర్మకు మధ్య పెద్దగా తేడా లేకపోవడంతో మూడో స్థానానికి పడిపోతారా? అనే ఆందోళన కూటమి నేతల్లో గుబులు రేపింది. ప్రధానంగా అధికార టీడీపీ, జనసేన పట్ల తమ వ్యతిరేకతను ఉపాధ్యాయులు ఓట్ల ద్వారా చాటిచెప్పారు. రాజకీయ జోక్యంతో...! టీడీపీ, జనసేన అధికారికంగా రఘువర్మను తమ అభ్యర్థిగా ప్రకటించాయి. గెలుపు కోసం అధికారపార్టీ ఎమ్మెల్యేలు విశ్వ ప్రయత్నాలు చేశారు. కూటమి పార్టీల తరపున బరిలో నిలిచిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీని గెలిపించాలంటూ టీచర్లపై ఒత్తిళ్లు తెచ్చారు. ప్రధానంగా ప్రైవేటు టీచర్లను బెదిరించే ధోరణిలో వ్యవహరించారు. ఎంత చేసినా ప్రజా వ్యతిరేకతను తప్పించుకోలేకపోయారు. అధికార పార్టీకి చెందిన విద్యాలయాల్లో పని చేసే ప్రైవేట్‌ టీచర్లు సైతం కూటమి అభ్యర్ధికి వ్యతిరేకంగా ఓటేశారంటే ఈ ప్రభుత్వంపై ఎంత వ్యతిరేకత నెలకొందో ఊహించవచ్చు. కూటమికి చెంపదెబ్బ: బొత్ససాక్షి, విశాఖపట్నం: ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు కూటమి ప్రభుత్వానికి చెంప దెబ్బ లాంటివని శాసనమండలిలో విపక్షనేత బొత్స సత్యన్నారాయణ వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో అబద్ధాలతో అధికారంలోకి వచ్చిన టీడీపీ, జనసేన కూటమి పార్టీలకు ఏడాదిలోపే చావుదెబ్బ తగిలిందన్నారు. అధికారం ఉందనే అహంకారంతో అరాచకాలు చేస్తున్న టీడీపీ, జనసేన పార్టీలకు విజ్ఞులైన ఉత్తరాంధ్ర ఉపాధ్యాయులు బెత్తంతో కొట్టి మరీ గట్టిగా గుణపాఠం చెప్పారన్నారు. ఫలితాలపై సోమవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. ‘ఈ ఎన్నికల ద్వారా ఉపాధ్యాయులు ప్రజాస్వామ్య విలువలను మరోసారి చాటిచెప్పారు. కూటమి ప్రభుత్వ మోసాలను తిప్పికొడుతూ గట్టి తీర్పు ఇచ్చారు. ఉత్తరాంధ్ర జిల్లాల టీచర్లు ఎన్నికల్లో పాల్గొన్న తీరు, వచ్చిన ఫలితం.. ఈ ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఎంతటి వ్యతిరేకత ఉందో తేటతెల్లం చేస్తున్నాయి. ఎన్నికల్లో హామీలిచ్చి ఓట్లేయించుకుని అధికారంలోకి వచ్చాక చంద్రబాబు ప్రభుత్వం అన్ని వర్గాలను మోసగించింది. ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా దగా చేసింది. ఇప్పటికైనా ఎన్నికల హామీలను అమలు చేయాలి. లేదంటే స్థానిక ఎన్నికల నుంచి సార్వత్రిక ఎన్నికల వరకూ కూటమి ప్రభుత్వానికి గుణపాఠం చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు’ అని బొత్స పేర్కొన్నారు.విశాఖ ఏయూలోని కౌంటింగ్‌ కేంద్రంలో బ్యాలెట్‌ పత్రాల్ని లెక్కిస్తున్న పోలింగ్‌ సిబ్బంది అవునా.. అచ్చెన్న మద్దతిచ్చారా! : గాదెతమ ఫొటోలు పెట్టుకొని గెలిచారని మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలపై స్పందించాలని మీడియా ప్రతినిధులు గాదె శ్రీనివాసులు నాయుడును కోరగా.. అవునా..! అచ్చెన్న మద్దతిచ్చారా.. దానిపై నాకు అవగాహన లేదంటూ బదులిచ్చారు. ‘ఫొటోల వల్ల కాదు.. ఉపాధ్యాయ సంఘాల మద్దతుతో మాత్రమే గెలిచా’ అని పేర్కొన్నారు. కూటమికి కౌంట్‌డౌన్‌ : ధర్మాన కృష్ణదాస్‌నరసన్నపేట: ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ కూటమి అభ్యర్ధికి ఉపాధ్యాయులు తగిన బుద్ధి చెప్పారని, కూటమికి కౌంట్‌డౌన్‌ మొదలైందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌ పేర్కొన్నారు. విజయం సాధించిన గాదె శ్రీనివాసులు నాయుడికి అభినందనలు తెలిపారు. కూటమి బలపరిచిన అభ్యర్థి ఓటమికి కారణం ప్రభుత్వం పట్ల వ్యతిరేకతేనన్నారు. అధికారం కోసం అలవికాని హామీలు ఇచ్చి కూటమి నాయకులు ప్రజల్ని మభ్య పెట్టారన్నారు. తొమ్మిది నెలల్లోనే కూటమి పాలనపై అన్ని వర్గాల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోందన్నారు. ప్రభుత్వ వ్యతిరేకతకు నిదర్శనం ఉత్తరాంధ్ర ఫలితంఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి బలపరిచిన అభ్యర్థిని ఘోరంగా ఓడించి తొమ్మిది నెలల ప్రభుత్వ పాలనపై ఉపాధ్యాయులు ఎంత వ్యతిరేకంగా ఉన్నారో చూపించారని వైఎస్సార్‌ టీచర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి అశోక్‌ కుమార్‌ రెడ్డి, గడ్డం సు«దీర్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఆదర్శ పాఠశాలల ఏర్పాటుపై ఒత్తిడి తగదు ఆదర్శ పాఠశాలల ఏర్పాటుకు గ్రామస్తులను ఒప్పించాలని విద్యాశాఖ ఉన్నతాధికారులు ఉపాధ్యాయులపై ఒత్తిడి చేయొద్దని వైఎస్సార్‌ టీచర్స్‌ అసోసియేషన్‌ ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేసింది.ఆధిక్యంలో ఆలపాటిగుంటూరు ఎడ్యుకేషన్‌: ఉమ్మడి కృష్ణా – గుంటూరు జిల్లా పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అర్ధరాత్రి 12 గంటలకు ఐదో రౌండు ఓట్ల లెక్కింపు పూర్తయ్యే సరికి టీడీపీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ 47,872 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. మొత్తం పోలైన ఓట్లు 1,40,297 కాగా చెల్లని ఓట్లు 14,888 ఉన్నాయి. పోలైన ఓట్లలో ఆలపాటి రాజేంద్రప్రసాద్‌కు 84,595, పీడీఎఫ్‌ అభ్యర్థి కేఎస్‌ లక్ష్మణరావుకు 36,723 వచ్చాయి. కౌంటింగ్‌ ప్రక్రియ కొనసాగుతోంది. ఉభయ గోదావరి తొలిరౌండ్‌ ఫలితాల వెల్లడిసాక్షి ప్రతినిధి, ఏలూరు: ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియలో తొలి రౌండ్‌ పూర్తయింది. మొదటి రౌండులో కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్‌కు 16,520 ఓట్లు, స్వతంత్ర అభ్యర్థి దిడ్ల వీర రాఘవులుకు 5,815 ఓట్లు, జీవీ సుందర్‌కు 1,968 ఓట్లు వచ్చాయి. 2,416 చెల్లని ఓట్లుగా గుర్తించారు. ప్రతి రౌండ్‌కూ 28 వేల ఓట్ల చొప్పున 9 నుంచి 10 రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తయ్యేలా అధికారులు కౌంటింగ్‌లో మార్పులు చేశారు. ఇకనైనా సమస్యలపై దృష్టి సారించాలి ఉపాధ్యాయుల సమస్యలపై ప్రభుత్వం వెంటనే దృష్టి సారించాలి. గత తొమ్మిది నెలలుగా ఈ ప్రభుత్వ పాలనలో తమ సమస్యలు ఏవీ పరిష్కారం కాలేదన్న విషయాన్ని ఈ ఫలితం ద్వారా చాటారు. ఉపాధ్యాయుల సరెండర్‌ లీవ్స్, సీఎఫ్‌ఎంఎస్‌లో పెండింగ్‌లో ఉన్న బిల్లులను వెంటనే చెల్లించాలి. డీఏ బకాయిలను చెల్లించడంతో పాటు పీఆర్‌సీని వెంటనే ఏర్పాటు చేయాలి. – డాక్టర్‌ కరుణానిధి మూర్తి, రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్, పీఆర్‌టీయూపాలక పార్టీల ఓటమికి నిదర్శనం.. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన పార్టీలు ఒక అభ్యర్ధికి మద్దతు ప్రకటించి ప్రచారం చేశాయి. అధికార పార్టీ నేతలు ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంపై దృష్టి సారించకుండా అధికారాన్ని ఉపయోగించి ఎన్నికల్లో గెలిచేందుకు ప్రయత్నించారు. ఒకటో తేదీనే జీతాలు అని హామీ ఇచ్చినా ఆలస్యం అవుతున్నాయి. డీఏ బకాయిలు చెల్లించలేదు. పీఆర్‌సీ కమిటీని నియమించలేదు. బకాయిల విషయంలో స్పష్టత లేదు. ముఖ్యమంత్రి ఇప్పటివరకు ఒక్కసారి కూడా సమస్యల పరిష్కారం కోసం ఉపాధ్యాయ సంఘాలతో సమావేశాన్ని నిర్వహించలేదు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గాదె శ్రీనివాసులు నాయుడు విజయం సాధించడం పాలక పార్టీల ఓటమికి నిదర్శనం. – హృదయరాజు, ఏపీటీఎఫ్‌ (1938) రాష్ట్ర అధ్యక్షుడుకూటమి పార్టీలు – ఉపాధ్యాయ సంఘాల మధ్య పోటీ.. రాజకీయ పార్టీల కూటమి.. ఉపాధ్యాయ సంఘాల మధ్య జరిగిన పోటీ ఇది. ఈ ఎన్నికల్లో ఉపాధ్యాయ సంఘాల కూటమి విజయం సాధించింది. ఉపాధ్యాయ సంఘాలు సమస్యలపై పోరాడి సాధించుకోవాలి. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో రాజకీయ పార్టీలు జోక్యం చేసుకోవడం సరికాదు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీలు అభ్యర్థి రఘువర్మకు మద్దతుగా నిలిచాయి. ఉపాధ్యాయ సంఘాలన్నీ కలిసి అభ్యర్థి గాదె శ్రీనివాసులు నాయుడును బరిలో నిలిపి గెలిపించుకున్నాయి. – పైడి రాజు, విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి, ఎస్టీయూప్రభుత్వంపై సామ దాన భేద దండోపాయాలకు సిద్ధంఈవిజయం ఉత్తరాంధ్ర ఉపాధ్యాయులందరిదీ. నా గెలుపు కోసం మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. ప్రభుత్వ, ప్రైవేట్‌ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తా. ఈ విజయంతో నాకు కీలక బాధ్యతలు అప్పగించారు. నా విజయానికి ఏ పార్టీతోనూ సంబంధం లేదు. ఉపాధ్యాయ సంఘాల మద్దతుతోనే నేను గెలుపొందా. నా గెలుపును రాజకీయాలతో ముడిపెట్టొద్దు. ఉపాధ్యాయుల రుణం తీర్చుకుంటా. నా పనితీరును బట్టి నన్ను గెలిపించారు. 2007 నుంచి ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా రాజకీయాలకు అతీతంగానే పనిచేశా. ఉపాధ్యాయుల సమస్యలపై ప్రభుత్వంతో చర్చించి పరిష్కరిస్తా. అవసరమైతే ప్రభుత్వంపై సామ దాన బేధ దండోపాయాలకు సిద్ధంగా ఉన్నా. – గాదె శ్రీనివాసులునాయుడు, ఉత్తరాంధ్ర టీచర్స్‌ ఎమ్మెల్సీ విజేత

Poverty reduced during YS Jagan tenure, improved livelihoods of poor people2
జగన్‌దే జనరంజక పాలన

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అప్పులపై కూటమి నేతలు చేసిన ఆరోపణలన్నీ పచ్చి అబద్ధాలని మరోసారి కూటమి ప్రభుత్వం నిరూపించింది. అంతేకాకుండా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చేసిన అప్పుల కన్నా కూటమి ప్రభుత్వం ఒక్క ఏడాదిలోనే ఎక్కువ అప్పులు చేసినట్లు కూడా స్పష్టమైంది. 2024–25 సామాజిక ఆర్థిక సర్వేను ప్రభుత్వం సోమవారం అసెంబ్లీకి సమర్పించింది. ఇందులో కూటమి నాయకులు.. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఉండగా అనేక అంశా­లపై చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని తేలింది. మన బడి నాడు–నేడు కింద పాఠశాలల్లో రెండు దశల్లో భారీగా మౌలిక సదుపాయాలు కల్పించినట్లు గణాంకాలతో సహా సామాజిక ఆర్థిక సర్వే కుండబద్దలు కొట్టింది. నేరుగా నగదు బదిలీ(డీబీటీ) ద్వారా అనేక పథకాల లబ్ధిదా­రులకు ఆర్థిక సాయం అందించడంతో లీకేజీ లేకుండా వారికి ప్రయోజనం అంది.. జీవనోపాధి మెరుగైందని, పేదరిక శాతం తగ్గిందని స్పష్టమైంది.జగన్‌ హయాంలోనే పేదరిక నిర్మూలన..పేదరిక నిర్మూలనకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వినూత్న కార్యక్రమాలు అమలు చేసింది. సంక్షేమ, వైద్య, ఆరోగ్య పథకాలు, ఉపాధి అవకాశాల, సామా­జిక భద్రత, సాధికారత కార్యక్రమాల లబ్ధిదారులకు ప్రత్యక్ష నగదు బదిలీతో గ్రామీణ పేదలు, తక్కువ ఆదాయం ఉన్న కుటుంబాలకు లీకేజీలు, మధ్యవ­ర్తుల ప్రమేయం లేకుండా సకాలంలో సాయం అందింది. కీలకమైన ప్రభుత్వ కార్యక్రమాలు పేదరికం తగ్గడానికి దోహదపడ్డాయి. పేదరిక నిర్మూలనలో ఇతర రాష్ట్రాల కంటే ఏపీ మెరుగైన పనితీరు కనబ­రిచింది. నీతి ఆయోగ్‌ 2023లో విడుదల చేసిన బహుళ పేదరిక సూచికల్లో ఏపీలో పేదరికం 50 శాతం తగ్గింది. 2015–16 నాటి ఈ స్కోరు 0.053 ఉండగా, 2019–21లో 0.025కు తగ్గింది.2023–24 సుస్ధిరాభివృద్ధి లక్ష్యాల నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్‌ సరసమైన స్వచ్ఛ­మైన ఇంధనం అందించడంలో 1వ స్థానంలో ఉందని, స్థిరమైన అభివృద్ధి కోసం నీటి వనరులను సంరక్షించడం, స్థిరంగా ఉప­యోగించడంలో రెండో ర్యాంకు, పేదరిక నిర్మూ­లనలో మూడో ర్యాంకు, ఉత్పత్తుల బాధ్యతాయుత వినియోగంలో నాలుగో ర్యాంకులో ఉంది.వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో కంటే కూటమి సర్కారు ఏడాది పాలనలోనే ద్రవ్య లోటు, రెవెన్యూ లోటు భారీగా పెరిగాయి. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాం కన్నా కూటమి పాలనలో కేంద్రం నుంచి గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ నిధులు భారీగా తగ్గిపోయాయి.కూటమి ప్రభుత్వంలో గనుల ఆదాయం కూడా భారీగా పడిపోయింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో 2023ృ24లో రూ.3,425 కోట్లు రాబడి వస్తే 2024ృ25లో అది రూ.2,031 కోట్లే. కూటమి ప్రభుత్వంలో పారిశ్రామిక వృద్ధి అంతకు­ముందు ఆర్థిక ఏడాది కన్నా తగ్గింది. 2023ృ24లో ప్రస్తుత ధరల ప్రకారం పారిశ్రామిక వృద్ధి 7.42 శాతం ఉండగా, 2024ృ25లో 6.71 శాతానికే పరిమితమైంది.2023ృ24 ఆర్థిక సంవత్సరం వరకు వాస్తవ బడ్జెట్‌ గణాంకాల ప్రకారం జీఎస్‌డీపీలో 34.58 శాతం అప్పులు. 2024ృ25లో సవ­రించిన అంచనాల మేరకు కూటమి ప్రభుత్వం జీఎస్‌డీపీలో 35.15 శాతం అప్పులు చేసింది.ఇవిగో సాక్ష్యాలు..పేదరిక నిర్మూలన: జగన్‌ ప్రభుత్వం పేదరిక నిర్మూలనకు ఎన్నో వినూత్న కార్యక్రమాలు అమలుచేసింది. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా లబ్ధిదారులకే ప్రత్యక్ష నగదు బదిలీ జరిగింది. ఇతర రాష్ట్రాలకన్నా పేదరికం 50శాతం తగ్గింది.బడుల రూపురేఖలు మారాయి: 15,713 పాఠశాలల్లో రెండు దశల్లో అనేక మౌలిక సదుపాయాలు కల్పించింది.రైతులకు స్వర్ణయుగం: 10,778 ఆర్బీకేల ఏర్పాటు వినూత్న ప్రయోగం.. అవి అందించిన సేవలు రైతులకు బాగా ఉపకరించాయి. పంటల దిగుబడులు రికార్డు స్థాయిలో పెరిగాయి. గ్యాప్‌ సర్టిఫికేషన్‌తో రైతులకు ఎమ్మెస్పీకి మించి ఆదాయం లభించింది. ప్రకృతి వ్యవసాయం కూడా గణనీయంగా పెరిగింది..సెకీ విద్యుత్‌ రైతుల కోసమే: రైతులకు పగటిపూట 9 గంటల నిరంతర విద్యుత్‌ కోసమే గత ప్రభుత్వం సెకీ ఒప్పందం కుదుర్చుకుంది. దీనికి ఏపీఈఆర్‌సీ అనుమతించింది.అప్పులే కూటమి ఘనత.. నింగిలో నిత్యావసరాలు: కూటమి సర్కార్‌ ఏడాది తిరక్కుండా రూ. 53వేల కోట్ల బడ్జెట్‌ అప్పులు చేసింది.. (బడ్జెటేతర అప్పులతో కలిపితో1.25 లక్షల కోట్లకు పైమాటే..) ద్రవ్యలోటు, రెవెన్యూలోటు భారీగా పెరిగింది.. రాబడి బాగా తగ్గింది. పారిశ్రామికాభివృద్ధీ తగ్గింది.. నిత్యావసర సరుకుల ధరలు భారీగా పెరిగాయి.గత నెల 28న ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్‌ ఇన్‌ బ్రీఫ్‌లో మొత్తం అప్పుల చార్ట్‌ను తొలగించారు. అయితే, ఇప్పుడు సామాజిక ఆర్థిక సర్వేలో ఈ ఆర్థిక సంవత్సరం వరకు బడ్జెట్‌ అప్పులను పేర్కొన్నారు. దీనిప్రకారం చూస్తే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం దిగిపోయేనాటికి ఉన్న అప్పుల కన్నా ఈ ఆర్థిక ఏడాదిలో కూటమి ప్రభుత్వం చేసిన అప్పులు ఎక్కువగా ఉన్నట్లు స్పష్టమైంది. 2023-24 వరకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చేసిన అప్పులు రూ.4,91,734 కోట్లు ఉండగా.. 2024-25లో కూటమి ప్రభుత్వం చేసిన అప్పులతో అది రూ.5,64,488 కోట్లకు చేరింది.వైఎస్సార్‌సీపీ హయాంలో ఇంగ్లిష్‌ ల్యాబ్, స్మార్ట్‌ టీవీలు, ఐఎఫ్‌పీలు, కౌంపౌండ్‌ వాల్‌ సహా తొలి దశలో 15,713 పాఠశాలల్లో రూ.3,859.12 కోట్లతో 9 రకాల నిర్మాణాలను చేపట్టారు.రెండో దశలో 22,344 పాఠశాలల్లో రూ.8 వేల కోట్లతో 11 రకాల మౌలిక సదుపాయాలను చేపట్టారు. (వీటిని పట్టిక రూపంలో సర్వేలో పేర్కొన్నారు).

USA Donald Trump Pauses Military Aid To Ukraine3
ఉక్రెయిన్‌కు భారీ షాక్‌.. ట్రంప్‌ సంచలన నిర్ణయం

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. రష్యా (Russia)తో యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్‌కు షాకిస్తూ అమెరికా నుంచి అందే మిలటరీ సాయాన్ని నిలిపివేశారు. జెలెన్‌స్కీ ఖనిజాల ఒప్పందంపై అంగీకరించని నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకుంది.డొనాల్డ్‌ ట్రంప్‌ తనదైనా పంథాలో ముందుకు సాగుతున్నారు. అమెరికాకు వ్యతిరేకంగా ఎవరు ఉన్న వారిపై ఆంక్షలు, టారిఫ్‌లు విధిస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలోనే ఉక్రెయిన్‌తో చర్చలు విఫలమైన నేపథ్యంలో జెలెన్‌స్కీకి ట్రంప్‌ ఊహించని షాకిచ్చారు. ఉక్రెయిన్‌కు అమెరికా అందిస్తున్న సైనిక సహాయాన్ని నిలిపివేశారు. ఈ మేరకు ఓ ప్రకటనలో వెల్లడించారు. ఈ సందర్భంగా వైట్‌హౌస్‌ అధికారి ఒకరు మాట్లాడుతూ.. అధ్యక్షుడు ట్రంప్ శాంతిస్థాపనపై దృష్టిసారించారు. అమెరికా భాగస్వాములు కూడా ఆ లక్ష్యానికి కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉంది. మేము మా సాయాన్ని నిలిపివేస్తున్నాం. ఇది ఒక పరిష్కారాన్ని చూపిస్తోందని అనుకుంటున్నాం. రష్యాతో శాంతి చర్చలకు ఉక్రెయిన్‌ అంగీకరించాలనే ఉద్దేశ్యంతోనే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పుకొచ్చారు.ఇదిలా ఉండగా.. ఇటీవల ఖనిజాల ఒప్పందంపై చర్చించడానికి ట్రంప్‌, జెలెన్‌స్కీ వైట్‌హౌస్‌ వేదికగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వాడీవేడి చర్చ జరిగింది. భవిష్యత్తులో తమపై రష్యా ఏదైనా దురాక్రమణకు పాల్పడితే రక్షణ కల్పించాలని జెలెన్‌స్కీ ఒత్తిడి చేశారు. దీంతో, ట్రంప్‌ విరుచుకుపడ్డారు. సాయం అందించిన అమెరికాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఉక్రెయిన్‌ తీరు మూడో ప్రపంచ యుద్దానికి దారి తీస్తుందని హెచ్చరించారు. శాంతి ఒప్పందం చేసుకోవడం జెలెన్‌స్కీకి ఇష్టం లేదంటూ విమర్శలు గుప్పించారు. ఈ చర్చలు కాస్తా రసాభాసగా మారడంతో ఖనిజాల ఒప్పందంపై సంతకం చేయకుండానే జెలెన్‌స్కీ వైట్‌హౌస్‌ నుంచి వెళ్లిపోయారు. 🚨BREAKING: The Trump Administration has officially paused all U.S. military aid to Ukraine, abandoning our allies as they face a Russian invasion. RETWEET if you stand with President Zelenskyy against Donald Trump and Vladimir Putin! pic.twitter.com/C4LsP00NY7— Protect Kamala Harris ✊ (@DisavowTrump20) March 4, 2025మరోవైపు.. జెలెన్‌ స్కీ తాజాగా కీలక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అమెరికాతో ఖనిజాల ఒప్పందం కుదుర్చుకోవడానికి ఉక్రెయిన్‌ సిద్ధంగా ఉందని జెలెన్‌స్కీ స్పష్టం చేశారు. వాళ్లు సరేనంటే ఇప్పటికిప్పుడు ఒప్పందంపై సంతకాలు చేస్తానన్నారు. గతంలో జరిగిన వాటిని కొనసాగించాలన్నది మా విధానం. మేం నిర్మాణాత్మకంగా ఉన్నాం. అదే సమయంలో కొన్ని విషయాలను విశ్లేషించాల్సిందే. ఉక్రెయిన్‌ వైఖరి వినాలి. అది మాకు చాలా ముఖ్యం. అమెరికాతో మా సంబంధాలు కొనసాగుతాయని అనుకుంటున్నా. ఉక్రెయిన్‌ ప్రపంచంలో అతి పెద్ద దేశం కాకపోవచ్చు. కానీ తన స్వాతంత్య్రం కోసం అది చేస్తున్న పోరాటాన్ని అంతా చూస్తున్నారు. అమెరికా నుంచి ఏ అనుమానాలకూ తావు లేకుండా సాయం కొనసాగుతుందని ఆశిస్తున్నా. ఎందుకంటే మాకు సాయం నిలిపివేత అంతిమంగా రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు మాత్రమే ఉపయోగపడుతుంది. అమెరికా, ఇతర ప్రపంచ ప్రతినిధులు పుతిన్‌కు అలాంటి సాయం చేయరని అనుకుంటున్నా అంటూ వ్యాఖ్యలు చేశారు.

ICC Champions Trophy: Who are the umpires and match officials for IND vs AUS semifinal in Dubai?4
సెమీస్‌లో విజ‌యం టీమిండియాదే.. ఐరెన్ లెగ్ అంపైర్ లేడు!?

ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోఫీ-2025లో తొలి సెమీఫైన‌ల్‌కు మ‌రి కొన్ని గంటల్లో తెర‌లేవ‌నుంది. దుబాయ్ వేదిక‌గా భార‌త్‌-ఆస్ట్రేలియా జ‌ట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి. లీగ్ ద‌శ‌లో ఆజేయంగా నిలిచిన భార‌త జ‌ట్టు.. అదే జోరును సెమీస్ కొన‌సాగించాల‌ని ఉవ్విళ్లూరుతోంది. మ‌రోవైపు ఆస్ట్రేలియా ఎలాగైనా భార‌త్‌ను ఓడించి సెమీస్‌లో అడుగుపెట్టాల‌ని ప‌ట్టుద‌ల‌తో ఉంది.కాగా ఈ మ్యాచ్‌కు సంబంధించిన అఫిషయల్స్ జాబితాను ఐసీసీ సోమవారం ప్రకటించింది. ఈ సెమీస్ పోరుకు ఆన్ ఫీల్డ్ అంపైర్‌లుగా న్యూజిలాండ్‌కు చెందిన క్రిస్ గఫానీ, ఇంగ్లండ్‌కు చెందిన రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్ వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. అదేవిధంగా థ‌ర్డ్ అంపైర్‌గా మైకేల్ గాఫ్ .. నాలుగో అంపైర్‌గా అడ్రియన్ హోల్డ్‌స్టాక్ బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించ‌నున్నాడు. మ్యాచ్ రిఫ‌రీగా ఆండీ పైక్రాఫ్ట్ ఎంపిక‌య్యాడు.ఐరెన్ లెగ్ అంపైర్ లేడు? కాగా ఈ మ్యాచ్ అఫిషయల్స్ జాబితాలో ఐరెన్ లెగ్ అంపైర్ రిచర్డ్ కెటిల్‌బరో లేకపోవడం భారత అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు. 2014 నుంచి అతడు అంపైర్‌గా ఉన్న ఏ నాకౌట్ మ్యాచ్‌లోనూ భారత్ విజయం సాధించలేదు. దీంతో ఫ్యాన్స్ రిచర్డ్ కెటిల్‌బరోను ఐరెన్ లెగ్ అంపైర్‌గా పిలుస్తుంటారు. వన్డే వరల్డ్‌కప్‌-2023 ఫైనల్స్‌లో కూడా కెటిల్‌బరో ఫీల్డ్‌ అంపైర్‌గా ఉన్నాడు. ఈ మ్యాచ్‌లోనూ భార‌త్ ఓట‌మి పాలైంది. అంతకుముం‍దు 2023 ప్ర‌పంచ టెస్టు ఛాంపియ‌న్ షిప్ ఫైన‌ల్, 2019 వన్డే ప్రపంచ కప్ సెమీస్‌, ఛాంపియన్స్‌ ట్రోఫీ-2017 ఫైనల్‌, 2014 టీ20 ప్రపంచకప్‌ ఫైనల్లోనూ భారత్ ఓట‌మి చ‌విచూసింది. మరోవైపు న్యూజిలాండ్‌-దక్షిణాఫ్రికా మధ్య జరగనున్న రెండో సెమీఫైనల్‌కు కుమార్ ధర్మసేన, పాల్ రీఫిల్ ఆన్-ఫీల్డ్ అంపైర్లుగా ఉండనున్నారు.ఆసీస్‌దే పైచేయి..వ‌న్డే క్రికెట్‌లో భార‌త్‌పై ఆస్ట్రేలియా పూర్తి అధిప‌త్యం చెలాయించింది. ఇప్ప‌టివ‌ర‌కు ఇరు జ‌ట్లు 151 వ‌న్డేల్లో త‌ల‌ప‌డ్డాయి. 57 మ్యాచ్‌ల్లో భారత్‌... 84 మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియా గెలిచాయి. 10 మ్యాచ్‌లు రద్దయ్యాయి. ఛాంపియ‌న్స్ ట్రోఫీలో మాత్రం భార‌త్‌దే పైచేయిగా ఉంది. చాంపియన్స్‌ ట్రోఫీ చరిత్రలో భారత్, ఆ్రస్టేలియా ముఖాముఖిగా నాలుగుసార్లు తలపడ్డాయి. రెండుసార్లు భారత్‌ (1998లో ఢాకాలో 44 పరుగుల తేడాతో; 2000లో నైరోబిలో 20 పరుగుల తేడాతో) నెగ్గింది. ఒకసారి ఆ్రస్టేలియా గెలిచింది (2006లో మొహాలిలో 6 వికెట్ల తేడాతో). 2009లో దక్షిణాఫ్రికాలో ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దయింది. అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ వన్డే టోర్నమెంట్‌లలో (వరల్డ్‌కప్, చాంపియన్స్‌ ట్రోఫీ) భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఆరుసార్లు నాకౌట్‌ దశ మ్యాచ్‌లు జరిగాయి. మూడుసార్లు భారత్‌ (1998, 2000 చాంపియన్స్‌ ట్రోఫీ క్వార్టర్‌ ఫైనల్స్‌లో; 2011 వరల్డ్‌కప్‌ క్వార్టర్‌ ఫైనల్లో)... మూడుసార్లు ఆ్రస్టేలియా (2003 వరల్డ్‌కప్‌ ఫైనల్, 2015 వరల్డ్‌కప్‌ సెమీఫైనల్, 2023 వన్డే వరల్డ్‌కప్‌ ఫైనల్‌) గెలిచి 3–3తో సమంగా ఉన్నాయి.చదవండి: WPL 2025: మూనీ విధ్వంసం.. యూపీని చిత్తు చేసిన గుజరాత్‌

Rasi Phalalu: Daily Horoscope On 04-03-2025 In Telugu5
ఈ రాశి వారికి కొత్త ఉద్యోగాలు దక్కుతాయి.. సంఘంలో గౌరవం

గ్రహం అనుగ్రహం: శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, తిథి: శు.పంచమి రా.8.08 వరకు, తదుపరి షష్ఠి, నక్షత్రం: అశ్విని ఉ.9.03 వరకు, తదుపరి భరణి, వర్జ్యం: సా.5.57 నుండి 7.26 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.40 నుండి 9.27 వరకు, తదుపరి రా.10.57 నుండి 11.46 వరకు, అమృత ఘడియలు: రా.2.55 నుండి 4.23 వరకు; రాహుకాలం: ప.3.00 నుండి 4.30 వరకు, యమగండం: ఉ.9.00 నుండి 10.30 వరకు, సూర్యోదయం: 6.21, సూర్యాస్తమయం: 6.03. మేషం... కొత్త ఉద్యోగాలు దక్కుతాయి. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం. కీలక నిర్ణయాలు. పనులు సకాలంలో పూర్తి. చిరకాల మిత్రుల కలయిక. వస్తులాభాలు. వ్యాపార, ఉద్యోగాలలో కొత్త అవకాశాలు.వృషభం... వ్యవహారాలు మందగిస్తాయి. శ్రమాధిక్యం. మిత్రులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగ మార్పులు.మిథునం... కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆస్తి ఒప్పందాలు. వాహనయోగం. బంధువులను కలుసుకుంటారు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి.కర్కాటకం... రుణాలు తీరతాయి. ఆప్తుల సలహాలు పాటిస్తారు. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. వస్తులాభాలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో మరింత అనుకూలం.సింహం... రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. కుటుంబంలో కలహాలు. ఆరోగ్యం మందగిస్తుంది. స్థిరాస్తి ఒప్పందాలు వాయిదా. వృత్తి, వ్యాపారాలలో కొద్దిపాటి చికాకులు.కన్య... వ్యవహారాలలో అవరోధాలు. కష్టమే తప్ప ఫలితం ఉండదు. ఆధ్యాత్మిక చింతన. బంధువులతో మాటపట్టింపులు. ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.తుల.... కొన్ని వివాదాలు తీరి ఊరట చెందుతారు. పనులు చకచకా సాగుతాయి. ఆర్థికాభివృద్ధి. కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకూలత.వృశ్చికం... మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆలోచనలు అమలు చేస్తారు. ఆహ్వానాలు అందుతాయి. వ్యవహారాలలో ఆటంకాలు తొలగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడుల నుంచి విముక్తి.ధనుస్సు..... వ్యవహారాలలో అవాంతరాలు. రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆధ్యాత్మిక చింతన. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో లేనిపోని సమస్యలు.మకరం.... ఆర్థిక ఇబ్బందులు. బంధువిరోధాలు. కష్టపడ్డా ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. ప్రయాణాలు వాయిదా. దైవదర్శనాలు. కుటుంబంలో చికాకులు. వృత్తి, వ్యాపారాలలో ఇబ్బందులు.కుంభం... శుభకార్యాలలో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. వ్యవహారాలలో విజయం. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు.మీనం... కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. కుటుంబసభ్యులతో విభేదాలు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. ప్రయాణాలు వాయిదా. వ్యాపార, ఉద్యోగాలలో నిరాశాజనకంగా ఉంటాయి.

South Delhi Man Paid Rs 16680 For Phone He Got Biscuit And Soap Bar6
రూ. 16వేల మొబైల్ బుక్ చేస్తే.. ఏమొచ్చిందో తెలుసా?

టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో మోసాలు కూడా ఎక్కువవుతున్నాయి. ఆదమరిస్తే.. ఖాతాలు ఖాళీ అవుతున్నాయి. ఆన్‌లైన్ మోసాలకు సంబంధించిన కథనాలు గతంలో చాలానే తెలుసుకున్నాం. అలాంటిదే మరొకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇంతకీ.. ఇది ఎక్కడ, ఎప్పుడు, ఎలా జరిగింది? అనే విషయాలను వివరంగా ఇక్కడ తెలుసుకుందాం.దక్షిణ ఢిల్లీలోని షేక్ సారాయ్‌కు చెందిన ఒక వ్యక్తి మొబైల్ కోసం ఆన్‌లైన్ షాపింగ్ చేశారు. ఫోన్ కోసం ఎదురు చూస్తున్న అతనికి డెలివరీ వచ్చింది. కానీ బాక్స్ ఓపెన్ చేసి చూస్తే.. అందులో సోప్ బార్, బిస్కెట్ ప్యాకెట్ ఉండటం చూసి ఖంగుతిన్నాడు.బాధితుడు ఫిబ్రవరి 11న రూ.16,680 విలువైన మొబైల్ ఫోన్ ఆర్డర్ చేశాడు. క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఎంచుకున్నాడు. ఫిబ్రవరి 12న డెలివరీ ఏజెంట్ పేరుతో.. కాల్ చేసి ఈ రోజు డెలివరీ చేస్తానని చెప్పాడు. కానీ కొనుగోలుదారు (బాధితుడు) కోరికమేరకు మరుసటి రోజు ఉదయం డెలివరీ చేసాడు. డెలివరీ తీసుకున్న తరువాత, తాను చెల్లించాల్సిన మొత్తాన్ని.. యూపీఐ ద్వారా చెల్లించారు.డబ్బు చెల్లించి.. ఆఫీసుకు వెళ్లి దాన్ని ఓపెన్ చేస్తే, మొబైల్ స్థానంలో బిస్కెట్ ప్యాకెట్, సోప్ బార్ ఉన్నాయి. మోసపోయానని గ్రహించాడు. డెలివరీ ఏజెంట్ నెంబర్‌కు కాల్ చేసాడు. మొదట్లో, ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లో ఫిర్యాదు చేయడం ద్వారా సమస్య పరిష్కారమవుతుందని అతనికి డెలివరీ ఏజెంట్ చెప్పాడు. తరువాత ఆ నెంబర్‌కు కాల్ చేస్తే.. స్విచ్ ఆఫ్ వచ్చింది. షాపింగ్ వెబ్‌సైట్‌ కూడా అతని ఈమెయిల్‌లకు స్పందించలేదు.ఇదీ చదవండి: '8-8-8 రూల్ పాటించండి': పనిగంటలపై నీర్జా బిర్లాబాధితుడు చేసేదేమీ లేక.. పోలీసులకు ఫిర్యాదు చేసాడు. పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు. నకిలీ డెలివరీ ఏజెంట్‌ను ట్రాక్ చేయడానికి, మోసగాళ్లు కస్టమర్ వివరాలను ఎలా యాక్సెస్ చేశారో తెలుసుకోవడానికి దర్యాప్తు కొనసాగుతోంది.ఇలాంటి మోసాల నుంచి ఎలా బయటపడాలంటే?మోసగాళ్ళు ఆన్‌లైన్ షాపింగ్ పేరుతో.. ప్రజలను దోచుకుంటున్నారు. ఆన్‌లైన్ లావాదేవీల సంఖ్య పెరుగుతున్నందున, వినియోగదారులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని పలువురు నిపుణులు చెబుతున్నారు.➤డెలివరీ తీసుకోవడానికి ముందు.. డెలివరీ ఏజెంట్లు నిజమైనవారా? కాదా? అని ధృవీకరించుకోవాలి. ➤వ్యక్తిగత వివరాలను ఎప్పుడు పంచుకోకూడదు. లావాదేవీలను పూర్తి చేసే ముందు ప్యాకేజీలను చెక్ చేసుకోవాలి. ➤ఏదైనా అనుమానం కలిగితే.. ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్‌లకు ఫిర్యాదు చేయాలి.

World strongest ocean current is slowing down as ice sheets pump water7
ఆ సముద్ర ప్రవాహం... నెమ్మదిస్తోంది! 

పర్యావరణ మార్పుల తాలూకు విపరిణామాలు ఊహాతీత వేగంతో ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ధ్రువాల వద్ద మంచు ఎన్నడూ లేనంత వేగంతో కరిగిపోతుండటం కొన్నేళ్లుగా మనమంతా చూస్తున్న భయానక పరిణామమే. ఇది మరో పెను ప్రమాదానికి కూడా దారి తీస్తోందని తాజా అధ్యయనం ఒకటి తేల్చింది. అంటార్కిటికాలో అత్యంత బలమైన సముద్ర ప్రవాహ గతి కొన్నేళ్లుగా క్రమంగా నెమ్మదిస్తూ వస్తోందని వెల్లడించింది. అంటార్కిటికా వద్ద భారీ మంచు ప్రమాదకర వేగంతో కరుగుతుండటమే ఇందుకు కారణమని వివరించింది. ప్రపంచ వాతావరణాన్ని క్రమబదీ్ధకరించడంలో ఈ ప్రవాహానిదే అతి కీలకపాత్ర. అంతేగాక మహాసముద్రాల ప్రవాహాల గతి కూడా చాలావరకు ఈ ప్రవాహ గతిమీదే ఆధారపడి ఉంటుంది. ‘‘లక్షలాది ఏళ్లుగా సమతుల్యంగా కొనసాగుతూ వస్తున్న అత్యంత సంక్లిష్టమైన ఈ ప్రవాహం కూడా పర్యావరణ మార్పుల దెబ్బకు గాడి తప్పుతుండటం అత్యంత ఆందోళనకరం. ఇదిలాగే కొనసాగితే మానవాళి ఊహాతీతమైన పర్యావరణ విపత్తులు ఎదుర్కోవాల్సి వస్తుంది’’ అని అధ్యయనం హెచ్చరించింది. ఏసీసీ... పెట్టనికోట! ప్రపంచ పర్యావరణ సమతుల్యతకు అంటార్కిటికా అత్యంత కీలకమైనది. అంటార్కిటిక్‌ సర్కంపొలార్‌ కరెంట్‌ (ఏసీసీ)గా పిలిచే అక్కడి మహాసముద్ర ప్రవాహం ఈ విషయంలో పెద్దన్న పాత్ర పోషిస్తుంటుంది. ఇది ప్రపంచంలోనే అత్యంత బలమైన సముద్ర ప్రవాహం! పశ్చిమం నుంచి తూర్పుగా అంటార్కిటికా మహాసముద్రం పొడవునా సాగే ఈ ప్రవాహం ప్రపంచ వాతావరణాన్ని, ఇతర సముద్ర ప్రవాహాల గతిని నిత్యం నియంత్రిస్తూ ఉంటుంది. అంతేగాక ప్రధానంగా వేటాడే తత్వముండే ఇతర ప్రాంతాల్లోని సముద్ర జీవరాశులు అంటార్కిటికా జలాల్లోకి ప్రవేశించకుండా ప్రాకృతిక అడ్డుగోడలా కూడా ఏసీసీ నిలుస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే మానవాళి మనుగడకు ఇది పెట్టనికోట వంటిది. గ్లోబల్‌ వార్మింగ్‌ తదితరాల దెబ్బకు అంటార్కిటికాలోని అపారమైన మంచు కొన్నేళ్లుగా శరవేగంగా కరుగుతోంది. దాంతో అపార స్వచ్ఛ జలరాశి నిరంతరం సముద్రంలోకి పోటెత్తుతోంది. దాని దెబ్బకు అంటార్కిటికా మహాసముద్రంలో లవణీయత, నీటి సాంద్రత మార్పుచేర్పులకు లోనవుతున్నాయి. ఇదంతా అంతిమంగా ఏసీసీపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దాని ప్రవాహ గతి నానాటికీ నెమ్మదిస్తూ వస్తోంది.ఇలా చేశారుఏసీసీ ప్రవాహ గతిలో మార్పు లపై ఆస్ట్రేలియాలోని యూనివర్సిటీ ఆఫ్‌ మెల్‌బోర్న్‌కు చెందిన పరిశోధకుల బృందం పరిశోధన చేసింది. అధ్యయనంలో భాగంగా పలు అంశాలపై సైంటిస్టులు లోతుగా దృష్టి పెట్టారు. ఆ్రస్టేలియాలోనే అత్యంత వేగవంతమైన సూపర్‌ కంప్యూటర్‌ జీఏడీఐ సాయంతో సముద్ర ప్రవాహాల్లో మార్పులు తదితరాలను కచి్చతంగా లెక్కగట్టారు. హెచ్చు రెజల్యూషన్‌తో కూడిన సముద్ర, యాక్సెస్‌–ఓఎం2–01 క్లైమేట్‌ మోడల్‌ సేవలను కూడా ఇందుకు వాడుకున్నారు. మహాసముద్ర ప్రవాహాలపై మంచు, స్వచ్ఛ జలరాశి ప్రభావం, తద్వారా వేడిని మోసుకుపోయే సామర్థ్యంలో హెచ్చుతగ్గులు తదితరాలను నిశితంగా పరిశీలించారు. అంతిమంగా ఇవన్నీ ఉష్ణోగ్రత, లవణీయత, పవనాల గతి తదితరాల్లో ఎలాంటి మార్పులకు కారణమవుతాయో గమనించారు. మంచు కరిగి సముద్రంలోకి చేరే అపార జలరాశి ఏసీసీ ప్రవాహాన్ని వేగవంతం చేస్తుందన్న గత పరిశోధనల ఫలితాలు సరికావని స్పష్టం చేశారు. అందుకు పూర్తి విరుద్ధంగా ఏసీసీ ప్రవాహ గతి బాగా నెమ్మదిస్తోందని తేల్చారు. తాజా పరిశోధన ఫలితాలను ఎన్విరాన్‌మెంటల్‌ రీసెర్చ్‌ లెటర్స్‌లో ప్రచురించారు. పెను విపత్తులే...! ఏసీసీ ఒకరకంగా ప్రపంచ వాతావరణ సమతుల్యతకు ఇంజిన్‌ వంటిదని అధ్యయన బృంద సభ్యుడైన అసోసియేట్‌ ప్రొఫెసర్‌ భిషగ్దత్త గయేన్‌ వివరించారు. ‘‘మహాసముద్రాలన్నింటికీ కన్వేయర్‌ బెల్ట్‌ మాదిరిగా ఏసీసీ పని చేస్తుంది. వేడిమి, కార్బన్‌ డయాక్సైడ్‌తో పాటు సముద్రంలోని జీవరాశుల మనుగడకు అత్యంత కీలకమైన పలు పోషకాలు తదితరాలు పసిఫిక్, అట్లాంటిక్, హిందూ తదితర మహాసముద్రాల మధ్య సజావుగా పంపిణీ అయ్యేలా చూస్తుంది. అది గనక పడకేసిందంటే జరిగే విపరిణామాలు అన్నీ ఇన్నీ కావు’’ అని ఆయన స్పష్టం చేశారు. అవేమిటంటే... → ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పుల్లో తీవ్రమైన హెచ్చుతగ్గులు → పలు ప్రాంతాల్లో అత్యంత వేడిమి, ఆ వెనకే అతి శీతల పరిస్థితులు → సముద్ర జలాల్లో లవణీయత పరిమాణం నానాటికీ తగ్గిపోవచ్చు → ఫలితంగా గ్లోబల్‌ వార్మింగ్‌ ప్రక్రియ మరింత వేగం పుంజుకోవచ్చు → ఇతర ప్రాంతాల సముద్ర జలాలకే పరిమితమైన నాచు, కలుపు మొక్కలు, మొలస్కా వంటి జీవులు అంటార్కిటికాలోకి ప్రవేశించవచ్చు. అదే జరిగితే అక్కడి జీవావరణ వ్యవస్థ దెబ్బ తింటుంది. ఇవి అంతిమంగా పెంగి్వన్ల వంటి స్థానిక జీవరాశుల ఆహార వనరులకు కూడా ఎసరు పెట్టవచ్చు. – సాక్షి, నేషనల్‌ డెస్క్‌

Telangana: Results of Teacher MLC seats announced8
బీజేపీ, పీఆర్‌టీయూకు చెరొకటి

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌/నల్లగొండ: రాష్ట్రంలో రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. వీటిలో ఒకటి బీజేపీ కైవసం చేసుకోగా, మరొకటి పీఆర్‌టీయూ సొంతం చేసుకుంది. కరీంనగర్‌–మెదక్‌–నిజామాబాద్‌–ఆదిలాబాద్‌ జిల్లాల టీచర్స్‌ ఎమ్మెల్సీగా బీజేపీ అభ్యర్థి మల్క కొమురయ్య మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే గెలవగా, వరంగల్‌–ఖమ్మం–నల్లగొండ జిల్లాల టీచర్స్‌ ఎమ్మెల్సీగా పీఆర్‌టీయూ అభ్యర్థి శ్రీపాల్‌రెడ్డి రెండో ప్రాధాన్యత ఓట్లతో విజయం సాధించారు. కరీంనగర్‌–మెదక్‌– నిజామాబాద్‌–ఆదిలాబాద్‌ జిల్లాల గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఓట్ల వడబోత కార్యక్రమం సోమవారం సాయంత్రం మొదలుకాగా, ఇంకా కొనసాగుతూనే ఉంది. ఓట్ల వడబోత పూర్తయ్యాక, కట్టలు కట్టి, మంగళవారం మధ్యాహ్నం తర్వాత కౌంటింగ్‌ ప్రక్రియ ప్రారంభిస్తారు. వరంగల్‌–ఖమ్మం–నల్లగొండ స్థానంలో....వరంగల్‌–ఖమ్మం–నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి 19 మంది అభ్యర్థులు పోటీ చేశారు. సమీప ప్రత్యర్థి అయిన సిట్టింగ్‌ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డిపై 5,521 ఓట్ల మెజారిటీతో శ్రీపాల్‌రెడ్డి విజయం సాధించారు. శ్రీపాల్‌రెడ్డికి 13,969 ఓట్లు రాగా, నర్సిరెడ్డికి 8,848 ఓట్లు వచ్చాయి. శ్రీపాల్‌రెడ్డి గెలిచినట్టుగా ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, నల్లగొండ జిల్లా కలెక్టర్‌ ఇలా త్రిపాఠి సోమవారం రాత్రి ప్రకటించారు. మొదటి నుంచీ ఆధిక్యంలోనే... పీఆర్‌టీయూ–టీఎస్‌ బలపరిచిన అభ్యర్థి పింగిలి శ్రీపాల్‌రెడ్డి మొదటి నుంచీ ఆధిక్యంలోనే కొనసాగారు. నల్లగొండలోని ఆర్జాలబావిలో ఉన్న రాష్ట్ర గిడ్డంగుల సంస్థ గోదాముల్లోని స్ట్రాంగ్‌ రూమ్‌లో కౌంటింగ్‌ నిర్వహించారు. ఉదయం 7 గంటలకు స్ట్రాంగ్‌ రూమ్‌ల నుంచి బ్యాలెట్‌ బాక్సులను తీసుకొచ్చి కౌంటింగ్‌ హాలులో 25 టేబుళ్లపై మొదట కట్టలు కట్టే ప్రక్రియ చేపట్టి 11 గంటల వరకు పూర్తి చేశారు. అనంతరం కౌంటింగ్‌ ప్రారంభించారు. సాయంత్రం 3 గంటల వరకు మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది. మొదటి ప్రాధాన్యతలో శ్రీపాల్‌రెడ్డి అత్యధికంగా ఓట్లు సాధించారు. ఆయనకు 6,035 ఓట్లు లభించగా, ద్వితీయస్థానంలో 4,820 ఓట్లతో అలుగుబెల్లి నర్సిరెడ్డి నిలవగా, మూడో స్థానంలో 4,437 ఓట్లు పొంది గాల్‌రెడ్డి హర్షవర్ధన్‌రెడ్డి నిలిచారు. ఆ తర్వాత పూల రవీందర్‌ 3,115 ఓట్లతో నాలుగో స్థానంలో, బీజేపీ అభ్యర్థి సరోత్తంరెడ్డి 2,289 ఓట్లు సాధించి ఐదో స్థానంలో నిలిచారు. సుందర్‌రాజ్‌ యాదవ్‌ 2,040 ఓట్లతో ఆరో స్థానంలో ఉన్నారు. మిగిలిన అభ్యర్థుల్లో ఒక్కరు మినహా మిగిలిన వారంతా 500 లోపు ఓట్లు వచ్చినవారే ఉన్నారు. రౌండ్‌ రౌండ్‌కూ పెరిగిన ఆధిక్యం ఉపాధ్యాయ నియోజకవర్గంలో 25,797 మంది ఓటర్లు ఉండగా, 24,135 ఓట్లు పోలయ్యాయి. అందులో 499 ఓట్లు చెల్లలేదు. 23,641 ఓట్లు చెల్లుబాటు అయ్యాయి. అయితే చెల్లిన ఓట్లలో సగానికి ఒకటి ఎక్కువగా పరిగణనలోకి తీసుకొని 11,821 ఓట్లు గెలుపు కోటాగా ఎన్నికల అధికారి ఇలా త్రిపాఠి నిర్ణయించారు. మొదటి ప్రాధాన్యత కోటా ఓట్లు ఎవరికి రాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించారు. తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థులను ఎలిమినేట్‌ చేస్తూ ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. అలా 14 మందిని ఎలిమినేషన్‌ చేసి ఓట్లు లెక్కించడంతో శ్రీపాల్‌రెడ్డికి 6,165 ఓట్లు రాగా, నర్సిరెడ్డికి 4,946 ఓట్లు, హర్షవర్ధన్‌రెడ్డికి 4,596 ఓట్లు, పూల రవీందర్‌కు 3,249 ఓట్లు, సరోత్తంరెడ్డికి 2,394 ఓట్లు వచ్చాయి. ఆ తర్వాత తక్కువగా ఓట్లున్న సుందర్‌రాజును ఎలిమినేట్‌ చేసి 15వ రౌండ్‌ ఓట్లు లెక్కించారు. ఇందులో శ్రీపాల్‌రెడ్డి ఓట్లు 6,916కు పెరిగాయి. ఆ తర్వాత బీజేపీ అభ్యర్ధి సరోత్తంరెడ్డిని ఎలిమినేట్‌ చేసి 16వ రౌండ్‌లో ఓట్లు లెక్కించారు. ఇందులో శ్రీపాల్‌రెడ్డి ఓట్లు 7,673కు చేరుకున్నాయి. ఆ తర్వాత పూల రవీందర్‌ను ఎలిమినేట్‌ చేసి 17వ రౌండ్‌ ఓట్లు లెక్కించగా, శ్రీపాల్‌రెడ్డి 9,021 ఓట్లకు చేరుకున్నారు. ఆ తర్వాత మూడో స్థానంలో ఉన్న హర్షవర్ధన్‌రెడ్డిని ఎలిమినేట్‌ చేసి ఓట్లు లెక్కించారు. ఇందులో శ్రీపాల్‌రెడ్డికి 11,099 ఓట్లు లభించగా, నర్సిరెడ్డికి 8,448 ఓట్లు లభించాయి. నర్సిరెడ్డికి వచ్చిన మొదటి ప్రాధాన్యత ఓట్లలోని రెండో ప్రాధాన్యత ఓట్లను కూడా లెక్కించి.. శ్రీపాల్‌రెడ్డి గెలిచినట్టు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి ఇలా త్రిపాఠి ప్రకటించారు. కరీంనగర్‌లో కమల వికాసం కరీంనగర్‌–మెదక్‌–నిజామాబాద్‌–ఆదిలాబాద్‌ జిల్లాల టీచర్స్‌ ఎమ్మెల్సీ స్థానాన్ని ముందు నుంచీ ఊహించినట్టుగానే బీజేపీ కైవసం చేసుకుంది. ఉదయం 8 గంటలకే ఓట్ల లెక్కింపు ప్రారంభమైనా.. అధికారులు జాప్యం చేయడం వల్ల ఓట్ల వడబోత తీవ్ర ఆలస్యమైంది. దీంతో సాయంత్రం 7 గంటలు దాటాక టీచర్‌ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. రాత్రి 9.30 గంటలకు ఫలితం తేలింది. నియోజకవర్గ పరిధిలో మొత్తం 27,088 ఓట్లకుగాను.. 25,041 ఓట్లు పోల్‌ అయ్యాయి. అందులో 24,144 ఓట్లు చెల్లుబాలు అయ్యాయి. 897 ఓట్లు చెల్లలేదని అధికారులు ప్రకటించారు. గెలుపు కోటాగా 12,073 ఓట్లను నిర్ధారించారు. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులోనే బీజేపీ అభ్యర్థి మల్క కొమురయ్యకు 12,959 ఓట్లు, వంగ మహేందర్‌రెడ్డికి 7,182, అశోక్‌కుమార్‌కు 2,621, కూర రఘోత్తంరెడ్డికి 428 ఓట్లు వచ్చాయి. తొలిరౌండ్‌లోనే బీజేపీ అభ్యర్థి మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే గెలిచారు. రాత్రి 10.20 గంటల సమయంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కౌంటింగ్‌ సెంటర్‌ వద్దకు వచ్చి మల్క కొమురయ్యను అభినందించారు. అధికారుల లెక్కల్లో గందరగోళం.. టీచర్‌ ఎమ్మెల్సీకి సంబంధించి మొత్తం పోలైన ఓట్లలో మూడు రకాల గణాంకాలతో అధికారులు గందరగోళానికి తెరతీశారు. పోలింగ్‌ రోజు రాత్రి 24,895 ఓట్లు వచ్చాయని, మరునాడు శుక్రవారం 24,968 మంది ఓటేశారని, తాజాగా సోమవారం మొత్తంగా 25,041 ఓట్లు పోలయ్యాయని వెల్లడించడంపై అభ్యర్థులు మండిపడుతున్నారు. కొనసాగుతున్న గ్రాడ్యుయేట్‌ ఓట్ల వడబోత కరీంనగర్‌–మెదక్‌–నిజామాబాద్‌–ఆదిలాబాద్‌ జిల్లాల గ్రాడ్యుయేట్‌ స్థానానికి సంబంధించి కౌంటింగ్‌లో ఓట్ల వడబోత ఇంకా కొనసాగుతోంది. గ్రాడ్యుయేట్‌ నియోజకవర్గపరిధిలో 3.55 లక్షలకు 2,50,106 ఓట్లు పోలయ్యాయి. అందులో ముందుగా లక్ష ఓట్లను వడబోశారు. అందులో 92,000 ఓట్లు చెల్లుబాటు కాగా, 8,000 చెల్లనివిగా అధికారులు ప్రకటించారు. ఇంకా 1.5 లక్షల ఓట్లు వడబోయాల్సి ఉంది. గ్రాడ్యుయేట్‌ ఓటర్ల బ్యాలెట్లు కట్టలు కట్టే ప్రక్రియ మంగళవారం మధ్యాహ్నం వరకు సాగుతుందని, ఆ తర్వాతే ఓట్ల లెక్కింపు ఉంటుందని పేరు తెలిపేందుకు ఇష్టపడట్లో అధికారి సాక్షికి తెలిపారు. భారీగా ఇన్‌వాలీడ్‌ ఓట్లు.. ఆర్వోపై ఈసీకి ఫిర్యాదు గ్రాడ్యుయేట్‌కు సంబంధించి భారీగా ఇన్‌వాలీడ్‌ ఓట్లు నమోదయ్యాయని సమాచారం. దాదాపు 50 వేల ఓట్లు చెల్లకుండా పోయాయని ప్రచారం జరిగినా.. సాయంత్రానికి అధికారులు దానిని ఖండించారు. ఓటర్లు చిన్న చిన్న తప్పులతో తమ విలువైన ఓటును చెల్లకుండా చేసుకున్నారు. ప్రాధాన్యం ఇచ్చే క్రమంలో అంకెలకు ముందు సున్నా రాయడం, ఆ అంకెకు సున్నా చుట్టడం, అంకె వేసినాక సంతకం చేయడం, దానికి ఎదురుగా టిక్‌ గుర్తు పెట్టడం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా కామెంట్లు పెట్టడం తదితర తప్పిదాల వల్ల భారీగా ఓట్లు చెల్లకుండా పోయాయని కాంగ్రెస్‌ అభ్యర్థి నరేంందర్‌ రెడ్డి, ఏఐఎఫ్‌బీ అభ్యర్ధి, మాజీ మేయర్‌ రవీందర్‌ సింగ్‌లు వాపోయారు. అదే సమయంలో తమకు ఓటేసిన వారిలో అంకె ముందు సున్నా పెట్టిన వారి ఓట్లను ఇన్‌వాలీడ్‌ కాకుండా గుర్తించాలని ఆర్వోకు ఇచ్చిన వినతిపత్రంలో కోరారు. అదే విధంగా రవీందర్‌సింగ్‌ ఓట్లు లెక్కించే సమయంలో జంబ్లింగ్‌ విధానం పాటించలేదని ఆర్వోకు వినతిపత్రం ఇచ్చారు. అంతేకాకుండా పలు బూత్‌ల ఓట్ల విషయంలో గోప్యత పాటించకుండా బయటకు వెల్లడించేలా సిబ్బంది వ్యవహరించారని ఆరోపిస్తూ.. ఆర్వో మీద ఈసీకి ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేస్తానని రవీందర్‌సింగ్‌ చెప్పారు. కొత్త ఓటర్లకు ఓటేసే విధానంపై అవగాహన కల్పించడంలో ఎన్నికల కమిషన్‌ విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

TDP alliance Govt latest drama on Teachers MLC elections Results9
గెలిచినోడే... మా వాడు!

శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఉపాధ్యాయ, అధ్యాపక ఆచార్య మిత్రులకు విజ్ఞప్తి అంటూ.. తెలుగుదేశం, జనసేన బలపరిచిన ఏపీటీఎఫ్‌ అభ్యర్థి పాకలపాటి రఘువర్మను గెలిపించాలంటూ ఈ నెల 26వ తేదీన అంటే పోలింగ్‌కు ముందు రోజున ఈనాడు దినపత్రిక మొదటి పేజీలో చంద్రబాబు, పవన్‌తో పాటు లోకేశ్, పల్లా శ్రీనివాసరావు ఫోటోలు... ఆ పార్టీల గుర్తులతో భారీ ప్రకటనలు!!పాకలపాటిని గెలిపించండి అంటూ విశాఖ పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడు గండి బాబ్జీ, ఎమ్మెల్సీ చిరంజీవిలతో కలిసి టీడీపీ ఎమ్మెల్యే గంటా స్పష్టంగా ఆ పార్టీ నగర కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు.‘రఘువర్మకే కూటమి మద్దతు’ అని విశాఖ టీడీపీ కార్యాలయంలో ఫిబ్రవరి 19వ తేదీన నిర్వహించిన సమావేశంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు స్వయంగా చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి లోకేశ్‌ ఆదేశాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టంగా ప్రకటించారు. సమావేశంలో ఎంపీ భరత్, ఎమ్మెల్యే వెలగపూడి, ఎమ్మెల్సీ చిరంజీవి కూడా పాల్గొన్నారు.ఇవే కాదు.. ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడిన తర్వాత అటు టీడీపీ, ఇటు జనసేన నేతలు అధికారికంగా రఘువర్మకు మద్దతు ఇస్తున్నట్టు చెప్పటమే కాకుండా ప్రత్యక్షంగా ప్రచారంలో పాల్గొన్నారు. నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలపై ఒత్తిడి తెచ్చి సమావేశాలు ఏర్పాటు చేశారు. తీరా ఎన్నికల ఫలితాల తర్వాత ఆ పార్టీ మంత్రి అచ్చెన్న కొత్త రాగం అందుకున్నారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాము రఘువర్మ, గాదె శ్రీనివాసులునాయుడుకు మద్దతు ఇచ్చామన్నట్టు మాట్లాడారు. ‘‘మూడు జిల్లాల కార్యకర్తలందరికీ టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించి.... స్పష్టంగా మొదటి ప్రాధాన్యత, రెండో ప్రాధాన్యత ఓట్లు శ్రీనివాసులు నాయుడుకు వేయమని చెప్పారు. ఎవరు గెలిచినా మన వాళ్లేనని అన్నారు. ఇప్పుడు టీచర్‌ ఎమ్మెల్సీలో టీడీపీ ఓడిపోయిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారు’ అంటూ గెలుపును తమ ఖాతాలో వేసుకునేందుకు అచ్చెన్న ప్రయత్నం మొదలు పెట్టారు.బుట్టలో వేసుకునే యత్నం...!వాస్తవానికి ఎన్నికల కౌంటింగ్‌ ప్రారంభం నుంచీ గాదె శ్రీనివాసులు నాయుడుకే మెజార్టీ ఓట్లు పోలయ్యాయి. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి పార్టీలకు ఉపాధ్యాయులు బుద్ది చెప్పారన్న అభిప్రాయం రాష్ట్రవ్యాప్తంగా స్పష్టంగా వ్యక్తమవుతోంది. అటు సోషల్‌ మీడియాలోనూ, ఇటు సామాజిక మాధ్యమాల్లోనూ తెలుగుదేశం, జనసేన పార్టీల తీరును ప్రజలు గట్టిగా వ్యతిరేకించారనే విషయం సర్వత్రా చర్చనీయాంశమయ్యింది. ఈ నేపథ్యంలో దీనిని డైవర్ట్‌ చేసే ప్రణాళికలు వేసినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా గాదె గెలుపు దిశగా వెళుతున్న సమయంలో ... నేరుగా ముఖ్యమంత్రి ఫోన్‌లో మాట్లాడినట్టు తెలుస్తోంది. అక్కడ విధులు నిర్వర్తిస్తున్న ఒక పోలీసు అధికారి ఫోన్‌ ద్వారా గాదెతో మాట్లాడినట్టు చెబుతున్నారు. రఘువర్మ విజయానికి పనిచేయాలని పిలుపునిస్తున్న మంత్రి శ్రీనివాస్, టీడీపీ ఎంపీ అప్పలనాయుడు, టీడీపీ ఎమ్మెల్యే అదితి తదితరులు రఘువర్మకు అధికారికంగా మద్దతు ఇచ్చినప్పటికీ... మీకు రెండో ప్రాధాన్యత ఓటు వేయమని ఆదేశించామని... గాదె కూడా మనవాడే అని పార్టీ నేతలతో తాను చెప్పినట్టు సీఎం చంద్రబాబు వివరించే ప్రయత్నం చేసినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మంత్రి అచ్చెన్న గాదె తమ వాడేనని.... గెలిచిన తర్వాత ఆయన ఏం మాట్లాడతారో చూడాలంటూ వ్యాఖ్యలు చేసినట్లు చెబుతున్నారు.

Actress Sai Pallavi Remuneration Bigger Than Nayanthara10
నయనతారను బీట్‌ చేసిన సాయిపల్లవి

సినిమాలకు హద్దులుండవు. అదేవిధంగా తారల పారితోషికాలకు పరిదులుండకుండా పోతున్నాయనే చెప్పాలి. ఒక పక్క కొత్త వారు అవకాశాల కోసం పాకులాడుతుంటే, మరో పక్క ప్రముఖ తారలు తమ పారితోషికాన్ని పెంచుకుంటూ పోతున్నారని చెప్పడం అతిశయోక్తి కాదు. ముఖ్యంగా సక్సెస్‌ఫుల్‌ కథానాయికల పారితోషికం చూస్తుంటో అబ్బో అని అనకమానరు. దక్షిణాదిలో ఒకప్పటి వరకూ నటి నయనతారనే అత్యధిక పారితోషికం అందుకుంటున్న కథానాయకిగా పేరుగాంచారు. ఈమె బాలీవుడ్‌ చిత్రం జవాన్‌ కోసం రూ. 12 కోట్లు పారితోషికం తీసుకున్నట్లు ప్రచారం జరిగింది. కాగా నటి సాయిపల్లవి ఇప్పుడు ఆమెను అధిగమించేశారనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో జోరందుకుంది. ఈమె నటించిన చిత్రాల్లో అధిక శాతం విజయాన్ని అందుకోవడమే ఇందుకు కారణం అని భావించవచ్చు. ఇటీవల తమిళంలో శివకార్తికేయన్‌కు జంటగా సాయిపల్లవి నటించిన అమరన్‌ చిత్రం పెద్ద విజయాన్ని అందుకుంది. ఆ చిత్రంలో సాయిపల్లవి నటన అందరి ప్రశంసలు అందుకుంది. ఇక తాజాగా నాగచెతన్యకు జంటగా నటించిన తండేల్‌ చిత్రం హిట్‌ అయ్యింది. దీంతో మంచి అవకాశాలు సాయిపల్లవి వైపు చూస్తున్నాయి. కాగా ప్రస్తుతం ఈ సహజ నటి రామాయణ అనే హిందీ చిత్రంలో సీతగా నటిస్తున్నారు. నటుడు రణ్‌వీర్‌ కపూర్‌ రాముడిగానూ, యాష్‌ రావణుడిగానూ నటిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్‌ దశలో ఉంది. అంతే కాదు రామాయణ చిత్రంపై భారీ అంచనాలు నెలకొంటున్నాయి కూడా. కాగా ఈ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. అయితే ఇందులో తొలిభాగంలో నటించడానికే నటి సాయిపల్లవి రూ.15 కోట్లు తీసుకున్నట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. కాగా నటి నయనతార ఇప్పటి వరకూ రూ. 12 కోట్లు దాటలేదని, ఆ విధంగా చూస్తే నటి సాయిపల్లవి ఆమెను దాటేశారని ప్రచారం సాగుతోంది. ఇందులో నిజమెంతో తెలియదు గానీ, పారితోషికం విషయంలో సాయిపల్లవి నటి నయనతారను అధిగమించారనే ప్రచారం మాత్రం సామాజిక మాధ్యమాల్లో హల్‌ చల్‌ చేస్తోంది.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

International View all
title
ఉక్రెయిన్‌కు భారీ షాక్‌.. ట్రంప్‌ సంచలన నిర్ణయం

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరో సంచలన

title
ఉక్రెయిన్‌లో శాంతిస్థాపన...ఇక మా సారథ్యంలో: బ్రిటన్‌

లండన్‌/కీవ్‌/వాషింగ్టన్‌: అమెరికాకు బదులుగా ఇకపై ప్రపంచ పెద్

title
ఆ సముద్ర ప్రవాహం... నెమ్మదిస్తోంది! 

పర్యావరణ మార్పుల తాలూకు విపరిణామాలు ఊహాతీత వేగంతో ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.

title
Oscar Awards 2025: భావోద్వేగాలకు జీవం

2024 సంవత్సరానికి ఆస్కార్‌ ఉత్తమ నటిగా నిలిచారు మైకీ మ్యాడిసన్ .

title
పెళ్లి ముద్దు,పిల్లలొద్దు ఎందుకంటే..అక్కడి యువత

పిల్లలను కనకూడదని యుక్తవయసులోనే నిర్ణయించుకుంటున్నవారి సంఖ్య రానురానూ పెరుగుతోంది.

NRI View all
title
టంపా వేదికగా నాట్స్‌ అమెరికా తెలుగు సంబరాల ఏర్పాట్లు

title
జర్మనీ పాఠ్యాంశాల్లో తెలుగు విద్యార్థి ప్రస్థానం

ప్రవాస తెలుగు విద్యార్ధి శ్రీనిహల్ తమ్మనకు మరో అరుదైన గౌరవం లభించింది.

title
గల్ఫ్ మృతుల కుటుంబాలతో సీఎం రేవంత్ రెడ్డి సహపంక్తి భోజనం

గల్ఫ్ దేశాలలో మరణించిన కార్మికుల కుటుంబాలతో హైదరాబాద్, ప్రజాభవన్‌లో త్వరలో 'గల్ఫ్ అమరుల సంస్మరణ సభ' ఏర్పాటు చేయాలని రాష్

title
వలస కార్మికుల మృత్యు ఘోష

మోర్తాడ్‌ (బాల్కొండ): జగిత్యాల జిల్లా మల్లాపూర్‌ మండలం రేగుంటకు చెందిన కర్న గణేశ్‌ (55) రెండ్రోజుల కిందట సౌదీ అరేబియాలో

title
వీసా గోల్డెన్‌ చాన్సేనా?

గోల్డ్‌ కార్డ్‌ వీసా.. ప్రపంచవ్యాప్తంగా కొత్త చర్చకు దారితీసిన టాపిక్‌ ఇది.

Advertisement

వీడియోలు

Advertisement