Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

YSRCP Leader Malladi Vishnu Slams AAP Govt On Kasinayana Kshetram1
‘హిందూ ధర్మం మీద దాడి జరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోంది?’

తాడేపల్లి : కాశీనాయన జ్యోతి క్షేత్రం పరమ పవిత్రమైనదని, మహారాష్ట్ర, కర్ణాటక నుండి కూడా భక్తులు వచ్చే ప్రాంతమని అలాంటి క్షేత్రం మీద అటవీ శాఖ అధికారులు దాడులు చేయడం వెనుక ఏపీ ప్రభుత్వం హస్తం ఉందని వైఎస్సార్‌సీపీ నేత మల్లాది విష్ణు విమర్శించారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చి వేయడం నిజంగా దారుణమన్నారు. శుక్రవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మల్లాడి విష్ణు మాట్లాడుతూ.. కాశీనాయన‌క్షేత్రం మీద జరిగిన దాడి.. హైందవ ధర్మం మీద జరిగిన దాడిగా పేర్కొన్నారు. ‘ పవన్ కళ్యాణ్ పరిధిలోని అటవీ శాఖ ఈ దారుణానికి పాల్పడింది* అని మల్లాది విష్ణు స్పష్టం చేశారు. ఇది హిందూ ధర్మం మీద జరిగిన దాడిరాష్ట్రంలో హైందవ ధర్మాన్ని కాపాడతాననే పవన్ కళ్యాణ్.. మరి ఈ విషయంలో మిన్నుకుండి పోవడానికి కారణం ఏమిటి?, పవన్ కళ్యాణ్ కి తెలిసే ఇది జరిగింది. కూటమి నేతల అనుమతితోనే ఈ కూల్చివేతలు జరిగాయి. హిందూ ధర్మం మీద జరిగిన దాడిగా భావించే వైఎస్సార్‌సీపీ స్పందించింది. ఆ ప్రాంతాన్ని సందర్శించింది. ఎన్నో సేవా కార్యక్రమాలను కాశినాయన చేశారు. వందేళ్ల పాటు జీవించి అందరికీ ఆధ్యాత్మికతను బోధించారు. అలాంటి కాశీనాయన క్షేత్రం మీద అటవీ శాఖ దాడులు, కూల్చివేతలు జరిగాయి. వైఎస్సార్‌సీపీ ఆందోళనకు దిగాక మళ్ళీ నిర్మాణాలు చేస్తామంటూ హడావుడి చేస్తున్నారు. ప్రభుత్వం ఏం చేస్తోంది..?హిందూ ధర్మం మీద జరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోంది?, తిరుమల లడ్డూ విషయంలో జనాన్ని తప్పదారి పట్టించారు. భక్తులు క్యూలో చనిపోతే క్షమించమని ప్రాధేయపడ్డారు. అసలు ఇన్ని ఘోరాలు జరుగుతుంటే హిందూ భక్తులు ఎందుకు క్షమించాలి? , ముందు జాగ్రత్తగా ఎందుకు చర్యలు చేపట్టడం లేదు?, వైఎస్ జగన్ సీఎంగా ఉన్నప్పుడు ఆ 13 హెక్టార్లను మినహాయించాలని కేంద్రానికి లేఖ రాశారు. పవన్‌ కళ్యాణ్‌ ఏమైపోయావ్‌..?ఈ ప్రభుత్వం ఆ రికార్డులను కూడా పరిశీలించదా?, చంద్రబాబు ఎప్పుడు అధికారంలో ఉన్నా హిందూ ఆలయాల మీద దాడులు జరుగుతూనే ఉంటాయి. విజయవాడలో ఆలయాలు కూల్చారు. తిరుపతి లో వెయ్యి కాళ్ల మండపాన్ని కూల్చారు. సతావర్తి సత్రం భూముల కుంభకోణం చేశారు. పుష్కరాల్లో జనం చనిపోయారు. ఇలా అనేక సంఘటనలు చంద్రబాబు హయాంలోనే జరిగాయి. సంబంధం లేకపోయినా తిరుపతి విషయంలో పవన్ కళ్యాణ్ ఎందుకు క్షమాపణ చెప్పారు?, ఇప్పుడు కాశినాయన క్షేత్రం వద్ద కూల్చివేతలు చేస్తే ఆయన ఎందుకు పట్టించుకోలేదు?, లోకేష్ క్షమాపణలు చెప్పడం ఎందుకు?, మా హయాంలో ఏం జరిగినా వెంటనే స్పందించాం. అంతర్వేదిలో రధం తగులపడితే నూతన టెక్నాలజీతో కొత్త రధాన్ని నిర్మించాం. చంద్రబాబు హయాంలోనే హిందూ ఆలయాలపై నిర్లక్ష్యం జరుగుతోంది’ అని మల్లాది విష్ణు ధ్వజమెత్తారు. అటవీ ప్రాంతం పేరుతో ఆధ్యాత్మికతపై దాడి!

Janasena Leader Naga Satires On SVSN Varma Indirectly2
నాగబాబు వ్యంగ్యాస్త్రాలు.. మరింత అగ్గి రాజేసేలా!

పిఠాపురం: పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలవడానికి టీడీపీకి చెందిన కీలక నేత, మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ పాత్ర ఏమీ లేదని జనసేన నేత నాగబాబు ఒక్క దెబ్బలో తేల్చి పారేశారు. అసలు పవన్ గెలుపునకు ఏ నేతైనా కారణం అనుకుంటే అది వారి ‘ఖర్మ’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇది కూడా పిఠాపురం వేదికగా ఈరోజు(శుక్రవారం) జరిగిన జనసేన ఆవిర్భావ దినోత్సవ సభలో నాగబాబు పరోక్షంగా చురకలు అంటించారు. కేవలం పవన్ విజయానికి పిఠాపురం ప్రజలు, జన సైనికులే కారణమని ఒక్క ముక్కలో చెప్పేశారు నాగబాబు. ఇక్కడ పవన్ గెలుపునకు పవనే ప్రధాన కారణంగా చెప్పుకొచ్చారు. వర్మ సీటు త్యాగం సంగతి ఏంటో..?అసెంబ్లీలో అడుగు పెట్టడమే కలగా మారిన పవన్‌ కళ్యాణ్‌కు సహకరించి.. ఆ కల నెరవేరేలా చేసింది పిఠాపురం టీడీపీ ఇన్‌ఛార్జి ఎస్‌వీ­ఎస్‌ఎన్‌ వర్మ. ఇక్కడ తన సీటును త్యాగం చేసి మరీ పవన్ ను భుజాన వేసుకున్నారు వర్మ, అయితే అసెంబ్లీ ఎన్నికల సమయంలో వర్మకు ఎమ్మెల్సీ టికెట్ ఇస్తామని చంద్రబాబు ఆశ చూపడంతో పాటు దానికి పవన్ కళ్యాణ్ కూడా వంత పాడటం కూడా జరిగింది. సర్లే.. చంద్రబాబు మన నాయకుడే.. పవన్ కూడా మన వాడే అనుకున్నాడో ఏమో వర్మ.. ఎమ్మెల్సీ టికెట్ అన్నారు కదా అని ఆ ఎమ్మెల్యే సీటను త్యాగం చేశారు వర్మ,. మరి తీరా చూస్తే వర్మకు ఊహంచని పరిణామం ఎదురైంది. ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వకుండా పెద్ద షాకిచ్చారు చంద్రబాబు..పవనే దెబ్బ కొట్టారా..?ఆయనే రాజకీయంగా దెబ్బకొట్టా­రనే చర్చ జోరుగా జరుగుతోంది. ఆయనకు ఎమ్మెల్సీ సీటు రాకుండా పవన్‌ అడ్డుపడ్డారని టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వర్మకు ఎమ్మెల్సీ పదవి ఇస్తే పిఠాపురంలో తనకు ఇబ్బందులు వస్తాయని ఆయన చంద్రబాబుకు చెప్పడం వల్లే పక్కన పెట్టారని టీడీపీ నేతలు చెబుతున్నారు.తనకు ప్రొటోకాల్‌ సమస్యలు వస్తాయని, వర్మకు ఎమ్మెల్సీ సీటు ఇవ్వవద్దని స్వయంగా పవనే .. చంద్ర­బాబుకు చెప్పారని రెండు పార్టీల్లోనూ చర్చించుకుంటున్నారు. అలాగే వర్మకు పదవి లభిస్తే పిఠాపురంలో ఆయన ప్రాధాన్యత పెరిగి రెండు అధికార కేంద్రాలు ఏర్పాటవుతాయనే ఆందోళన­లోనూ పవన్‌ కళ్యాణ్‌ ఉన్నట్లు చెబుతున్నారు.అదే జరిగితే వచ్చే ఎన్నికల్లో మళ్లీ తాను అక్కడి నుంచి పోటీ చేయడం కష్టమవుతుందనే భావనలో ఆయన ఉన్నట్లు జనసేన వర్గాలు చెబుతున్నాయి. వర్మ ఎమ్మెల్సీ అయితే నియోజక వర్గానికి చెందిన కూటమి నేతలు ఆయన వద్దకే వెళతారని, ఇది రాజకీయంగా తమకు నష్టమని పవన్‌ అంచనా వేస్తున్నట్లు సమాచారం. మరింత అగ్గి రాజేసేలా..పవన్‌ కూడా వర్మ రాజకీయ భవిష్యత్తుకు ఇబ్బంది లేకుండా చూస్తానని అంతర్గతంగా చెప్పి­నట్లు ప్రచారం జరిగింది. దీంతో పవ­న్‌­ను గెలిపించేందుకు వర్మ అహర్నిశలు పని­­చేశారు. టీడీపీ శ్రేణులు పలుచోట్ల ఆయనను తిట్టినా లెక్క చేయకుండా తిరిగి పవన్‌ను గెలిపించారు. రెండుచోట్ల ఓడిపో­యిన వ్యక్తికి తన సీటును త్యాగం చేసి గెలిపించి అసెంబ్లీకి పంప­డంలో కీలకపాత్ర పోషించారు.ఇప్పుడు ఆయనకే పవన్‌ అడ్డు­పడడం ఏమిటని టీడీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. రాజకీ­య భవి­ష్యత్తు ఇచ్చిన వర్మను పవన్‌ దెబ్బ­కొ­ట్ట­డం దారుణ­మని వాపోతున్నాయి. ఎమ్మె­ల్సీ స్థానాల కేటాయింపులో ఆయనకు అన్యా­యం జరిగిందని ఆవేదన చెందుతున్నాయి. ఇప్పుడు ఏకంగా నాగబాబు నోటి వెంట వర్మ పేరు రాలేదు.. కదా పరోక్ష​ంగా సెటైర్లు వేయడం ఇప్పుడు మరో చర్చకు దారి తీసింది. ఇప్పటికే టీడీపీ-జనసేనలపై ఆగ్రహంగా ఉన్న వర్మ వర్గంలో మరింత అగ్గి రాజేశారనే వాదన తెరపైకి వచ్చింది.

Suryakumar Yadav Is Likely To Lead MI In Absence Of Hardik Pandya In Their 1st Match3
IPL 2025: హార్దిక్‌పై నిషేధం​.. ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌గా సూర్యకుమార్‌..?

ఐపీఎల్‌ 2025 సీజన్‌లో ముంబై ఇండియన్స్‌ తమ తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌ చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా మార్చి 23న జరుగనుంది. ఆ రోజు డబుల్‌ హెడర్‌ మ్యాచ్‌లు జరుగనుండగా.. ఎంఐ, సీఎస్‌కే మ్యాచ్‌ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది.ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ తమ కెప్టెన్‌ సేవలు కోల్పోనుంది. గత సీజన్‌లో ముంబై ఇండియన్స్‌ మూడు మ్యాచ్‌ల్లో స్లో ఓవర్‌ రేట్‌‌తో బౌలింగ్‌ చేసింది. దీంతో ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ముంబై కెప్టెన్‌గా ఉన్న హార్దిక్‌ పాండ్యాకు రూ.30లక్షల జరిమానా విధించడంతో పాటు ఓ మ్యాచ్‌ ఆడకుండా నిషేధం విధించింది. గత సీజన్‌లో ముంబై గ్రూప్‌ దశలోనే వెనుదిరగడంతో హార్దిక్‌పై నిషేధం సాధ్యం కాలేదు. ఈ క్రమంలోనే ఐపీఎల్‌ 2025 సీజన్‌లో తొలి మ్యాచ్‌లోనే అతను నిషేధం ఎదుర్కోవాల్సి ఉంటుంది.తొలి మ్యాచ్‌లో హార్దిక్‌ గైర్హాజరీలో సూర్యకుమార్ యాదవ్ ముంబై ఇండియన్స్‌ సారధిగా వ్యవహరించే అవకాశం ఉంది. భారత టీ20 జట్టుకు సారధిగా వ్యవహరిస్తుండటంతో ఎంఐ యాజమాన్యం అతనిరే సారథ్య బాధ్యతలు అప్పజెప్పనుందని తెలుస్తుంది. రోహిత్‌ కెప్టెన్సీపై అయిష్టతను ఇదివరకే తెలియజేశాడు. మరో సీనియర్‌ బుమ్రా ఆరంభ మ్యాచ్‌లకు దూరమవుతాడని సమాచారం. ఈ నేపథ్యంలో సీనియర్లలో ఒకరైన సూర్యకుమార్‌కే తొలి మ్యాచ్‌లో కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశం రావచ్చు.టీ20ల్లో టీమిండియా కెప్టెన్‌గా సూర్య కుమార్‌ యాదవ్‌కు మంచి ట్రాక్‌ రికార్డు ఉంది. స్కై సారథ్యంలో భారత్‌ 18 మ్యాచ్‌ల్లో కేవలం​ నాలుగింట మాత్రమే ఓడింది.కాగా, ఐపీఎల్‌ 2025 సీజన్‌లో ముంబై ఇండియన్స్‌ దేశీయ స్టార్లపై ఆధారపడి ఉంది. మెగా వేలానికి ముందు ఆ జట్టు యాజమాన్యం రోహిత్‌ శర్మ, హార్దిక్‌ పాండ్యా, తిలక్‌ వర్మ, సూర్యకుమార్‌ యాదవ్‌, జస్ప్రీత్‌ బుమ్రాను రీటైన్‌ చేసుకుంది. మెగా వేలంలోనూ ఆ జట్టు పెద్దగా విదేశీ స్టార్ల కోసం పాకులాడలేదు.విల్‌ జాక్స్‌, మిచెల్‌ సాంట్నర్‌, ముజీబ్‌ ఉర్‌ రెహ్మాన్‌, కార్బిన్‌ బాష్‌, ర్యాన్‌ రికెల్టన్‌ లాంటి ఆటగాళ్లు కొత్తగా జట్టులోకి చేర్చుకుంది. ఈసారి జట్టులోకి వచ్చిన ట్రెంట్‌ బౌల్ట్‌కు గతంలో ముంబై ఇండియన్స్‌తో అనుబంధం ఉంది. మెగా వేలంలో దక్కించుకున్న రీస్‌ టాప్లే గాయం కారణంగా ఈ సీజన్‌కు దూరమయ్యాడు. దేశీయ పేసర్‌ దీపక్‌ చాహర్‌ను ముంబై సీఎస్‌కేతో పోటీపడి దక్కించుకుంది.ఐపీఎల్‌ 2025 సీజన్‌ కోసం ముంబై ఇండియన్స్‌..హార్దిక్‌ పాండ్యా (కెప్టెన్‌), రోహిత్‌ శర్మ, తిలక్‌ వర్మ, నమన్‌ ధిర్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, బెవాన్‌ జాకబ్స్‌, రాజ్‌ భవా, విల్‌ జాక్స్‌, విజ్ఞేశ్‌ పుథుర్‌, మిచెల్‌ సాంట్నర్‌, కార్బిన్‌ బాష్‌, సత్యనారాయణ రాజు, అర్జున్‌ టెండూల్కర్‌, ర్యాన్‌ రికెల్టన్‌, రాబిన్‌ మింజ్‌, కృష్ణణ్‌ శ్రీజిత్‌, ట్రెంట్‌ బౌల్ట్‌, జస్ప్రీత్‌ బుమ్రా, అశ్వనీ కుమార్‌, రీస్‌ టాప్లే, కర్ణ్‌ శర్మ, దీపర్‌ చాహర్‌, ముజీబ్‌ రెహ్మాన్‌

Prudent CMD Sanjay Shah GIFTS shares worth Rs 34 CRORE to employees and personal staff4
ఇదీ హోలీ గిఫ్ట్‌ అంటే.. ఉద్యోగులకు రూ.34 కోట్లు..

హోలీ పండుగ సందర్భంగా పలు కంపెనీలు తమ ఉద్యోగులకు మిఠాయిలు, బహుమతులు ఇవ్వడం సాధారణమే. అయితే ఈ హోలీ సందర్భంగా ప్రూడెంట్ కార్పొరేట్ అడ్వైజరీ సర్వీసెస్ ప్రమోటర్ సంజయ్ షా కేవలం రంగులకే పరిమితం కాకుండా.. తన సిబ్బందికి రూ.34 కోట్ల విలువైన 1,75,000 ఈక్విటీ షేర్లను బహుమతిగా ఇస్తున్నారు.దాదాపు 650 మంది ఉద్యోగులు, వ్యక్తిగత సిబ్బంది దీంతో ప్రయోజనం పొందనున్నారు. ప్రూడెంట్ కార్పొరేట్ అడ్వైజరీ సర్వీసెస్ లిమిటెడ్ సీఎండీ సంజయ్ షా ఈ ఉదార చర్యతో వ్యాపారంలో 25వ ఏట అడుగుపెట్టారు. లబ్ధిదారుల్లో కంపెనీ ఉద్యోగులే కాకుండా ఆయన ఇంట్లో పనిచేసే సహాయకులు, డ్రైవర్లు వంటి వ్యక్తిగత సిబ్బంది కూడా ఉన్నారు.ఉద్యోగులకు రూ.కోట్ల షేర్లు ప్రకటించిన ప్రూడెంట్ ప్రమోటర్ సంజయ్ షా ఈయనే..ఈ సందర్భంగా సంజయ్ షా మాట్లాడుతూ.. 'ఇది కేవలం షేర్ల బదలాయింపు మాత్రమే కాదు. ఈ ప్రయాణంలో ఉద్యోగులుగా మాత్రమే కాకుండా సహచరులుగా నాకు అండగా నిలిచిన వారికి ఇవి నేను సమర్పించే హృదయపూర్వక ధన్యవాదాలు. మీ నిస్వార్థ సహకారాలు, విశ్వసనీయత, విధేయత అమూల్యమైనవి’ అని పేర్కొన్నారు.సంజయ్ షా తన నిర్ణయాన్ని కంపెనీకి తెలియజేశారు. ఇందుకోసం సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ)తో సహా అవసరమైన రెగ్యులేటరీ అనుమతులను ప్రూడెంట్ కార్పొరేట్ అడ్వైజరీ సర్వీసెస్ పొందింది. కాగా ఉద్యోగులకు రూ.కోట్ల షేర్లు ప్రకటించిన ప్రూడెంట్ అధినేతపై సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తాయి.

Ktr Sarcastic Counter To Cm Revanth Reddy5
బీజేపీ నేతలతో రేవంత్‌ రహస్య భేటీల మర్మమేమి?: కేటీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌: ‘‘గల్లీలో హోదాను మరిచి తిట్లు.. ఢిల్లీలో చిట్‌ చాట్లు’’ అంటూ సీఎం రేవంత్‌పై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కాలు గడప దాటదు కానీ.. ఢిల్లీలో మాటలు కోటలు దాటుతున్నాయి అంటూ ట్వీట్‌ చేశారు. నీళ్లు లేక పంటలు ఎండి- పొలాలు బీడువారి అన్నదాతలు అరిగోస పడుతుంటే.. కనీసం సాగునీళ్లపై సమీక్ష లేకుండా ఢిల్లీకి చక్కర్లు కొడుతున్నావ్ అంటూ ఎక్స్‌ వేదికగా కేటీఆర్‌ నిలదీశారు.‘‘39 సార్లు ఢిల్లీ పోయి మీడియా ముందు సెల్ఫ్ డబ్బా కొట్టుకునుడు తప్ప.. ఢిల్లీ నుంచి సాధించిన పని.. తెచ్చిన రూపాయి లేదు. రాహుల్ గాంధీతో నీ సంబంధాల గురించి తెలంగాణకు ఏం అవసరం.. మీ మధ్య సంబంధం ఉంటే మాకేంటి-ఊడితే మాకేంటి.. తెలంగాణకు ఒరిగేది ఏంటి?. గ్రామ గ్రామాన, గల్లీ గల్లీల్లో మీకు ఓటేసి మోసపోయాం అని జనం చివాట్లు పెడుతుంటే-చీమకుట్టినట్టు కూడా లేని నువ్వు ఢిల్లీకి చక్కర్లు కొడుతున్నావ్.. మొహం బాగోలేక అద్దం పగలగొట్టినట్లు.. ఆడ లేక పాతగజ్జెలు అన్నట్లు. హామీల అమలు చేతగాక గాలి మాటలు.. గబ్బు కూతలు.’’ అంటూ కేటీఆర్‌ దుయ్యబట్టారు.గల్లీలో హోదాను మరిచి తిట్లు - ఢిల్లీలో చిట్ చాట్లు.కాలు గడప దాటదు కానీ .. ఢిల్లీలో మాటలు కోటలు దాటుతున్నాయి.నీళ్లు లేక పంటలు ఎండి- పొలాలు బీడువారి అన్నదాతలు అరిగోస పడుతుంటే .. కనీసం సాగునీళ్లపై సమీక్ష లేకుండా ఢిల్లీకి చక్కర్లు కొడుతున్నావ్.39 సార్లు ఢిల్లీ పోయి మీడియా…— KTR (@KTRBRS) March 14, 2025మరో ట్వీట్‌లో ‘‘బీజేపీ నేతలతో కాంగ్రెస్ సీఎం రేవంత్‌రెడ్డి రహస్య సమావేశాలా.. సిగ్గు.. సిగ్గు..!. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి అధికారిక సమావేశాలు నిర్వహించాలి కానీ ఈ చీకటి మీటింగులు పెట్టడమేంటి?’’ అంటూ కేటీఆర్‌ ప్రశ్నించారు. ఇలాంటి దిక్కుమాలిన చిల్లర రాజకీయం తెలంగాణ నేలపై ఇంతవరకు ఎప్పుడూ లేదు. ఓ వైపు బయటకు బీజేపీ నేతలతో కుస్తీపడుతున్నట్టు ఫోజులు కొట్టి, దొంగచాటుగా దోస్తీ చేసే ఈ నీచ సంస్కృతికి తెరలేపడం అత్యంత దుర్మార్గం. ఏం గూడుపుఠాణి చేయడానికి ఈ తెరచాటు సమావేశాలు నిర్వహిస్తున్నారో ముఖ్యమంత్రికి దమ్ముంటే బయటపెట్టాలి’’ అంటూ కేటీఆర్‌ సవాల్‌ విసిరారు.‘‘పంటలు ఎండిపోయి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా, గురుకులాల్లో విద్యార్థులు పిట్టల్లా రాలిపోతున్నా ఒక్క సమీక్ష నిర్వహించే సమయం లేని సీఎంకు, ఈ రహస్య సమావేశాలకు మాత్రం టైమ్ దొరకడం క్షమించలేని ద్రోహం. కాంగ్రెస్‌లో బీజేపీ కోవర్టులున్నారని రంకెలు వేసే రాహుల్ గాంధీకి, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యలతో దొరికిపోయిన రేవంత్ రెడ్డిపై చర్య తీసుకునే ధైర్యం ఉన్నదా?. అట్టర్ ఫ్లాప్ ముఖ్యమంత్రిగా ముద్రపడి, ఇక ఏ క్షణంలోనైనా తన సీఎం కుర్చీ చేజారే సూచనలు కనిపించడం వల్లే చీప్ మినిస్టర్ బీజేపీతో ఈ చీకటి ఒప్పందాలు చేసుకుంటున్నట్టు స్పష్టమవుతోంది. ఏడాదిన్నరలోనే రాష్ట్రాన్ని ఆగంచేసి, డర్టీ పాలిటిక్స్ చేస్తున్న ఈ రాబందు రాజకీయాలను తెలంగాణ సమాజం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సహించదు. రెండు ఢిల్లీ పార్టీలకు కర్రుగాల్చి వాతపెడ్తది’’ అంటూ కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు.

Vulgar Chats With Friends After Marriage Amount To Mental Cruelty6
‘భార్య అలా చేస్తే భర్తకు ఇంతకు మించిన నరకం మరొకటి ఉండదు’ :హైకోర్టు

భోపాల్‌ : పెళ్లైన మహిళలు, వారి పురుష స్నేహితుల సాన్నిహిత్యంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వివాహం తర్వాత పురుషుడు లేదా స్త్రీ తమ స్నేహితులతో అసభ్యకరమైన ఫోన్‌ ఛాటింగ్‌లు చేయకూడదని, తన భార్య ఆ తరహా చాటింగ్‌లు చేస్తుంటే ఏ భర్త కూడా సహించలేడని పేర్కొంది. దిగువ కోర్టు విడాకులు మంజూరు చేస్తూ ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఓ మహిళ హైకోర్టును ఆశ్రయించింది. ఆ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం మహిళ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. ఈ సందర్భంగా ఫోన్‌ ఛాటింగ్‌పై వ్యాఖ్యానించింది. నా భార్య చాటింగ్‌ చేస్తోందిమధ్యప్రదేశ్‌కు చెందిన భార్య,భర్తల గొడవ ఇప్పుడు ఆ రాష్ట్రంలోనే చర్చకు దారితీసింది. 2018లో దంపతులకి వివాహమైంది. అయితే, ఆ ఇద్దరి దంపతుల మధ్య పొరపొచ్చలొచ్చాయి. అప్పుడే తన భార్య నుంచి విడాకులు కావాలని కోరుతూ భర్త ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. ‘విచారణలో నా భార్య వివాహం తరువాత కూడా ఆమె ప్రియుడితో మాట్లాడుతోంది. అందుకు వాట్సప్‌ చాటింగే నిద్శనం. పైగా ఆ చాటింగ్‌ అసభ్యంగా ఉందని ఆధారాల్ని అందించారు.లేదు.. నా భర్తే నాకు రూ.25లక్షల భరణం ఇవ్వాలికానీ పిటిషనర్‌ భార్య మాత్రం భర్త చేస్తున్న ఆరోపణల్ని ఖండించింది. నా భర్త చెప్పినట్లుగా నేను ఎవరితోను సాన్నిహిత్యంగా లేను. చాటింగ్‌ చేయడం లేదు.నా భర్త కావాలనే నాకు వ్యతిరేకంగా సాక్ష్యాలు పుట్టించాడు. నా ఫోన్‌ హ్యాక్‌ చేసి మరి మరో ఇద్దరు పురుషులతో చాటింగ్‌ కూడా చేశారు. నా వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించనందుకు రూ.25లక్షలు భరణం ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ, పలు ఆరోపణలు చేసింది.భార్యే నిందితురాలుఅంతేకాదు, ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు భార్య-భర్త ఏపిసోడ్‌ భర్త చెప్పేవన్నీ నిజాలేనని నిర్ధారించింది. వాటిని నివృత్తి చేసుకునేందుకు భార్య తండ్రిని సైతం విచారించింది. విచారణలో ఆమె తండ్రి కూడా అంగీకరించారు. తన కుమార్తె పరాయి మగాడితో చాటింగ్‌ చేస్తుందన్న విషయాన్ని గుర్తించినట్లు కోర్టుకు చెప్పారు. దీంతో ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసింది.నాకు విడాకులొద్దు.. భర్తతోనే కలిసుంటాఫ్యామీలి కోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ బాధిత మహిళ మధ్యప్రదేశ్‌ హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు జస్టిస్‌ వివేక్‌ రష్యా, జస్టిస్‌ గజేంద్ర సింగ్‌ల ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. విచారణలో పిటిషనర్‌ తన ప్రియుడితో సె* లైఫ్‌ గురించి చాటింగ్‌ చేసినట్లు గుర్తించింది. భార్య పరాయి పురుషుడితో ఈ తరహా చాటింగ్‌ చేస్తే ఏ భర్త సహించలగడనే అభిప్రాయం వ్యక్తం చేసింది. భర్తలకు ఇంతకంటే నరకం మరొకటి ఉండదువివాహం తర్వాత, భర్త మరియు భార్య ఇద్దరూ తమ స్నేహితులతో మొబైల్, చాటింగ్, ఇతర మార్గాల ద్వారా మాట్లాడుకునే స్వేచ్ఛ ఉందని గుర్తు చేస్తూ.. సంభాషణ స్థాయి సౌమ్యంగా, గౌరవప్రదంగా ఉండాలి. ముఖ్యంగా, మహిళ.. పురుషుడితో.. పురుషుడు స్త్రీతో మాట్లాడితే జీవిత భాగస్వామికి వ్యతిరేకంగా ఉండకూడదు’ అని కోర్టు పేర్కొంది. ఒక భాగస్వామి ఇలా అసభ్యకరమైన చాటింగ్‌ చేస్తే.. భర్తలకు ఇంతకంటే నరకం మరొకటి ఉండదని తెలిపింది. చివరగా.. కింది కోర్టు ఇచ్చిన తీర్పును సమర్ధించింది.

Economic Offences Court Rejected Ranya Rao Bail Application7
Ranya Rao : మరో బిగ్‌ షాక్‌.. రన్యారావు చుట్టూ బిగుస్తున్న ఉచ్చు!

బెంగళూరు : కన్నడ నటి రన్యారావు (Ranya Rao) చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. భారీ మొత్తంలో అక్రమంగా బంగారం (Gold) తరలిస్తూ పట్టుబడిన రన్యా రావుకు బెంగళూరు ఆర్థిక నేరాల కోర్టు (Court for Economic Offences) ఆమెకు బెయిల్‌ తిరస్కరించింది. బంగారం స్మగ్లింగ్‌ కేసులో రన్యారావు బెంగళూరు ప్రత్యేక కోర్టులో బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన కోర్టు ఆమెకు బెయిల్‌ ఇచ్చేందుకు నిరాకరించింది. ఆమె వెనక గోల్డ్‌ స్మగ్లింగ్‌ సిండికేట్‌ ఉందనే అనుమానం వ్యక్తం చేసింది. .డీఆర్‌ఐ అధికారుల విచారణ ముమ్మరంఇటీవల బెంగళూరు ఎయిర్‌ పోర్టులో రూ.12.56కోట్లు విలువైన గోల్డు బార్స్‌ని స్మగ్లింగ్‌ చేస్తూ రన్యారావు పట్టుబడిన కేసులో డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌(DRI)దర్యాప్తు అధికారులు విచారణను ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా రన్యారావుకు చెందిన ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో రూ.2.06కోట్లు విలువ చేసే బంగారం, రూ.2.67కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. రన్యారావు కేసులో భర్త?ఈ క్రమంలో గురువారం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ)అధికారులు సైతం కేసు విచారణ చేపట్టారు. రన్యా రావు తన భర్త జతిన్ హుక్కేరి క్రెడిట్ కార్డును ఉపయోగించి బెంగళూరు నుండి దుబాయ్‌కు రౌండ్ ట్రిప్ టిక్కెట్లు బుక్ చేసుకున్నారు. దీంతో రన్యారావు బంగారం స్మగ్లింగ్‌ కేసులో అతని పాత్ర ఎంత? అనే దిశగా విచారణ ప్రారంభించారు. రన్యారావు భర్తకు తాత్కాలిక ఊరటడైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డిఆర్‌ఐ) బెంగళూరులోని హుక్కేరికి చెందిన పది ప్రదేశాల్లో సోదాలు నిర్వహించారు. ఇదే కేసులో డీఆర్‌ఐ అధికారులు తనని అరెస్ట్‌ చేయకుండా ఉండేలా ఆయన కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు సైతం హుక్కేరీని అరెస్ట్‌ను తాత్కాలికంగా నిలిపివేసింది.రన్యారావుకు ఫోన్‌ చేసింది ఎవరు?డీఆర్‌ఐ విచారణలో రాన్యా రావుకు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఫోన్‌ కాల్స్‌ వచ్చినట్లు గుర్తించారు. సదరు అగంతకులు రన్యారావును గోల్డ్‌ స్మగ్లింగ్‌ చేయాలని ఆదేశించినట్లు అనుమానం వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని రన్యారావును విచారించగా.. యూట్యూబ్‌లో చూసి బంగారం అక్రమంగా ఎలా తరలించాలో నేర్చుకున్నట్లు వెల్లడించారు. ఇక ఆమెను దుబాయ్‌ ఎయిర్‌పోర్టులో టెర్మినల్‌ 3 aగేటు సమీపంలో ఓ వ్యక్తి వద్ద గోల్డ్‌ను తీసుకున్నానని, అంతకుముందు గోల్డ్‌ స్మగ్లింగ్‌ చేయలేదని చెప్పినట్లు సమాచారం.

Cyber Fraudsters Duped A Woman To The Tune Of Rs 1 Crore8
ఫోన్‌ కాల్‌తో రూ.1.95 కోట్లు కొట్టేశారు.. డబ్బుల్ని డ్రా చేయడం మరిచిపోయారు

సాక్షి,హైదరాబాద్‌ : హైదరాబాద్‌ కేంద్రంగా ఓ సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. అయితే, ఆ కంపెనీలో అకౌంట్స్ ఆఫీసర్‌గా పని చేస్తున్న రమేష్‌ (పేరు మార్చాం) ఫోన్‌కు సంస్థ ఛైర్మన్‌, ఎండీ సురేష్‌ ఓ ప్రాజెక్ట్‌ నిమిత్తం ముందస్తు చెల్లింపులు చేయాలి. అర్జంట్‌గా నా అకౌంట్‌కు రూ.1.95కోట్లు ట్రాన్స్‌ఫర్‌ చేయాలని కోరడమే ఆ మెసేజ్‌ సారాశం. మెసేజ్‌తో పాటు వాట్సప్‌ డిస్‌ప్లేలో ఉన్న ఫొటో తన ఎండీ సురేష్‌దేనని నిర్ధారించుకున్నాక ఆయన అకౌంట్‌కు అడిగిన మొత్తం పంపాడు.పంపిన కొద్ది సేపటికి అసలు మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఫోన్‌కు మెసేజ్‌ వచ్చింది. మేనేజింగ్‌ డైరెక్టర్‌ తన బ్యాంక్‌ అకౌంట్స్‌ నుంచి రూ.1.95కోట్లు ట్రాన్స్‌ఫరయినట్లు వచ్చింది. కంగుతిన్న ఎండీ సురేష్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌ సురేష్‌ను సంప్రదించాడు. సురేష్‌ తన వాట్సప్‌కు మీరు పంపిస్తే నేను డబ్బులు పంపారని చెప్పడంతో పాటు ఆధారాల్నిచూపించాడు. దీంతో మోసపోయామని గుర్తించారు. సదరు సంస్థ ప్రతినిధులు వెంటనే తెలంగాణ పోలీసులను ఆశ్రయించారు. తెలంగాణ పోలీసుల సహకారంతో నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (NCRP)లో ఫిర్యాదు చేసింది.సంస్థ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఎన్‌సీఆర్‌పీ డబ్బులు ఏ అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్‌ అయ్యాయో ట్రాక్‌ చేసింది. ప్రారంభంలో వివరాలు లేకపోవడంతో డబ్బులు ఎవరికి? ఎక్కడికి ట్రాన్స్‌ఫర్‌ అయ్యాయో నిర్ధారించడం కష్టంగా మారింది.ఎన్‌సీఆర్‌పీ సంస్థ ఎండీతో కలిసి బ్యాంక్‌ నోడల్‌ అధికారుల్ని సంప్రదించారు. డబ్బులు ఏ బ్యాంక్‌ అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్‌ చేశారో గుర్తించారు. అదృష్టం కొద్దీ సైబర్‌ నేరస్తులు డబ్బుల్ని దొంగిలించారు. కానీ వాటిని బ్యాంక్‌ అకౌంట్‌ను డబ్బుల్ని డ్రా చేసుకోలేకపోయారు. దీంతో సైబర్‌ నేరస్తులు బ్యాంక్‌ అకౌంట్‌ నుంచి తిరిగి బాధిత సంస్థ అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్‌ చేయడంతో కథ సుఖాంతమైంది.

Former Congress Mla Bamber Thakur Shot At In Bilaspur9
మాజీ ఎమ్మెల్యేపై కాల్పులు.. వీడియో వైరల్‌

బిలాస్‌పూర్‌లో కాల్పుల కలకలం రేగింది. కాంగ్రెస్‌ మాజీ ఎమ్మెల్యే బంబర్‌ ఠాకూర్‌పై గుర్తు తెలియని దుండగులు 12 రౌండ్లు కాల్పులు జరిపారు. శుక్రవారం.. బిలాస్‌పూర్‌లోని తన నివాసంలో జరిగిన ఈ కాల్పుల్లో ఠాకూర్‌ తీవ్రంగా గాయపడ్డారు. ఆయనతో పాటు సెక్యురిటీ అధికారి కూడా గాయపడ్డారు. ఈ ఘటనలో ఆయన కాలుకు బుల్లెట్ దిగినట్లు సమాచారం. ఈ దాడి ఎవరు చేశారనేదానిపై ఇంకా పూర్తి వివరాలు తెలియరాలేదు.ఠాకూర్‌ను మొదట సురక్షిత ప్రదేశానికి తరలించగా, ఆయన పీఎస్ఓను నేరుగా ఆసుపత్రికి తరలించారు. తరువాత, ఠాకూర్‌ను కూడా ఆసుపత్రిలో చేర్చారు. ఇద్దరినీ మెరుగైన చికిత్స కోసం బిలాస్‌పూర్ ప్రాంతీయ ఆసుపత్రి నుండి ఎయిమ్స్ బిలాస్‌పూర్‌కు తరలించారు. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజ్‌ల ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన విజువల్స్‌ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. बंबर ठाकुर पर गोली लगने का CCTV आया सामने#Bilaspur #BumberThakur #CCTVVideo #HimachalPradesh pic.twitter.com/PEdY1VMye9— Punjab Kesari-Himachal (@himachalkesari) March 14, 2025

Hrithik Roshan sister Sunaina on struggle with addiction10
మద్యానికి బానిసయ్యా.. రోజుకు 9 గంటల నరకం: స్టార్ హీరో చెల్లెలు

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్‌ ప్రస్తుతం వార్‌-2 చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో టాలీవుడ్ యంగ్ టైగర్‌ జూనియర్ ఎన్టీఆర్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాకు బాలీవుడ్ డైరెక్టర్‌ అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు.ఇదిలా ఉండగా స్టార్ హృతిక్ రోషన్‌కు సునయన రోషన్ అనే చెల్లెలు ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆమె తన జీవితంలో ఎదుర్కొన్న చేదు అనుభవాలను పంచుకున్నారు. తాను మద్యానికి బానిసైనట్లు వెల్లడించారు. ఆ వ్యసనం నుంచి బయప పడేందుకు చాలా ఇబ్బందులు పడినట్లు తెలిపారు. రిహబిలిటేషన్‌ సెంటర్‌లో నరకం అనుభవించినట్లు సునయన చెప్పుకొచ్చారు. అక్కడ సాధారణ పునరావాస కేంద్రం కంటే అధ్వాన్నంగా ఉంటుందని తాను ఊహించలేదన్నారు. సునయన రోషన్ మాట్లాడుతూ.. 'ఇది మొత్తం 28 రోజుల కోర్సు. అయితే ఇది సాధారణ పునరావాసం లాంటిది కాదు. ప్రాథమికంగా అక్కడ ఎలాంటి వ్యసనానికైనా చికిత్స అందస్తారు. ఆ సెంటర్‌లో దాదాపు 56 మంది కౌన్సిలర్లు ఉన్నారు. అయితే అక్కడి వాతావరణం సాధారణ పునరావాసం కంటే చాలా దారుణంగా ఉంది. అసలు నార్మల్ రిహాబిలిటేషన్‌ సెంటర్‌ ఎలా ఉంటుందో నాకు తెలియదు. కానీ నన్ను రోజుకు 9 గంటల పాటు ఓకే గదిలో ఉంచేవారు. అలా ప్రత్యక్షం నరకం అనుభవించా' అని తెలిపింది.అయితే తాను బాగుపడతానని తెలిసే అక్కడికి వెళ్లినట్లు సునయన రోషన్ తెలిపారు. మద్య వ్యసనం నుండి బయటపడేందుకు జీవితంలో ముందుకు సాగడానికి ఒక అడుగుగా భావించినట్లు పేర్కొన్నారు. ఆ సమయంలో కేవలం నాకు కాల్ చేసే వ్యక్తుల నంబర్లు మాత్రం అమ్మ వారికి ఇచ్చిందని వెల్లడించింది. అక్కడికి సెల్ ఫోన్‌లు, షుగర్, కాఫీ , చాక్లెట్, పెర్ఫ్యూమ్‌లు అనుమతించరని ఆమె చెప్పింది. అయితే పునరావాసం నుంచి బయటపడిన క్షణంలోనే తన తండ్రి రాకేష్ రోషన్‌కు క్యాన్సర్ ఉందని తెలిసింది. ఆ రోజు రాత్రి నిద్ర పట్టలేదని సునయన రోషన్ వెల్లడించింది.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

International View all
title
గ్రీన్‌కార్డులపై బాంబు పేల్చిన జేడీ వాన్స్‌.. అమెరికా పౌరసత్వం కట్‌!

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోసార

title
New Zealand: హోలీ వేడుకల్లో న్యూజిలాండ్‌ ప్రధాని

భారతదేశంతో పాటు ప్రపంచంలోని పలు దేశాల్లో నేడు హోలీ  వేడుకలు(

title
వేలంలోయువతి కన్యత్వం.. రూ.18 కోట్లకు కొనుగోలు చేసిన హీరో!

'పుర్రెకో బుద్ది.. జిహ్వకో రుచి' అన్నారు పెద్దలు. సమాజంలో కొందరిని చూస్తుంటే ఇది నిజమే అనిపిస్తుంది.

title
వీడియో: అమెరికాలో విమాన ప్రమాదం.. తృటిలో తప్పించుకున్న ప్రయాణీకులు

వాష్టింగన్‌: అగ్రరాజ్యం అమెరికాలో ఇటీవలి కాలంలో వరుస విమాన ప

title
పుతిన్‌కు యుద్దమే ఇష్టం.. ట్రంప్‌ ప్లాన్‌ కష్టమే: జెలెన్‌స్కీ

కీవ్‌: ఉక్రెయిన్‌-రష్యా మధ్య కాల్పుల విరమణ ఒప్పందంపై కసరత్తు

NRI View all
title
గ్రీన్‌కార్డులపై బాంబు పేల్చిన జేడీ వాన్స్‌.. అమెరికా పౌరసత్వం కట్‌!

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోసార

title
ఫిలడెల్ఫియాలో తానా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

తానా మిడ్-అట్లాంటిక్ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఫిలడెల్ఫియాలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు.

title
భారత విద్యార్థుల చూపు.. ఆ దేశాలవైపు!

ఉన్నత విద్య కోసం అగ్ర రాజ్యాలకు వెళ్తున్న భారతీయ విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది.

title
సుదీక్ష మిస్సింగ్‌.. కిడ్నాపైందా?

న్యూఢిల్లీ: కరీబియన్‌ దేశం డొమినికన్‌ రిపబ్లిక్‌లో తెలుగు వి

title
టీటీఏ (TTA) న్యూయార్క్‌ చాప్టర్‌ రీజినల్ వైస్ ప్రెసిడెంట్‌గా జయప్రకాష్ ఎంజపురి

తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్(TTA)  న్యూయార్క్ చాప్టర్‌కి రీజినల్ వైస్ ప్రెసిడెంట్ (RVP)గా జయప్రకాష్ ఎంజపురి &

Advertisement
Advertisement