Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today

Top Stories

ప్రధాన వార్తలు

Paklapati Raghavarma Trails in Uttarandhra Teacher MLC Elections1
కూటమి ప్రభుత్వానికి షాక్‌.. టీచర్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వ అభ్యర్థి ఓటమి

సాక్షి, అమరావతి : ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలలో కూటమి ప్రభుత్వానికి భారీ షాక్‌ తగిలింది. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీఆర్‌టీయూ అభ్యర్థి శ్రీనివాసుల నాయుడు గెలుపొందారు. కూటమి అభ్యర్థి పాకలపాటి రఘువర్మ ఓడిపోయారు. దీంతో ఓటమిని అంగీకరిస్తూ రఘువర్మ కౌంటింగ్ కేంద్రం నుంచి బయటకు వచ్చేశారు. ఓడిపోయినప్పటికీ టీచర్లకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

Man arrested, had planned to target Ram Mandir 2
అయోధ్య రామమందిరంపై ఉగ్రదాడికి ఐఎస్‌ఐ కుట్ర.. భగ్నం చేసిన భారత్‌

గాంధీనగర్‌: అయోధ్య రామమందిరంపై ఉగ్రదాడి చేసేందుకు ప్రయత్నించిన పాకిస్థాన్‌(Pakistan) ఐఎస్‌ఐ ఉగ్రదాడిని భారత్‌ భగ్నం చేసింది. గుజరాత్‌, హర్యానా యాంటీ టెర్రరిస్ట్‌ స్వ్కాడ్‌ జాయింట్‌ ఆపరేషన్‌ నిర్వహించింది. ఈ జాయింట్‌ ఆపరేషన్‌లో భాగంగా హర్యానాలో ఉగ్రవాది రెహ్మాన్‌ను అరెస్ట్‌ చేసింది. పాకిస్థాన్‌ నిఘా సంస్థ ఐఎస్‌ఐ(ISI)తో సంబంధాలున్న ఉగ్రవాది అబ్దుల్ రెహ్మాన్ హర్యానా రాష్ట్రం ఫరీదాబాద్‌లో పట్టుబడ్డాడు. భద్రతా సంస్థల సమాచారం మేరకు.. ఐఎస్‌ఐ సంస్థ అబ్దుల్ రెహ్మాన్ ద్వారా అయోధ్య రామ్ మందిరంపై దాడి చేయించేందుకు ప్లాన్ చేసింది. ఉగ్రదాడిలో భాగంగా అబ్దుల్‌ రెహ్మాన్‌ రామమందిరంపై రెక్కీ నిర్వహించాడు. సమాచారాన్ని సేకరించి ఐఎస్‌ఐకి చేరవేర్చాడు. అనంతరం, అబ్దుల్‌ రెహ్మాన్‌ ఫైజాబాద్ నుంచి ట్రైన్‌లో మొదట ఫరీదాబాద్ చేరుకున్నాడు. ఫరీబాదాబాద్‌లో హ్యాండ్ గ్రనేడ్‌లను సేకరించాడు. వాటిని తీసుకుని ట్రైన్ ద్వారా అయోధ్య వెళ్లాల్సి ఉంది. అనంతరం ఆ హ్యాండ్‌ గ్రనేడ్‌తో రామమందిరంపై దాడి చేసేలా ప్లాన్‌ వేశాడు. అంతకంటే ముందే దేశ భద్రతా సంస్థలు అందించిన సమాచారంతో గుజరాత్ ఏటీఎస్‌, ఫరీదాబాద్ ఏటీఎస్‌ స్క్వాడ్‌ అబ్దుల్ రెహ్మాన్‌ను అదుపులోకి తీసుకున్నాయి. అయోధ్యరామ మందిరంపై ఉగ్రదాడిని భగ్నం చేశాయి.

AP Budget Session: YSRCP MLC Botsa Fire On Minister Atchannaidu3
వైఎస్‌ జగన్‌ ఆ మాట ఏనాడూ చెప్పలేదు: బొత్స

అమరావతి, సాక్షి: శాసన మండలిలో ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు(Atchannaidu) అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. వ్యక్తిగతంగా కించపరిచేలా మాట్లాడడంతో వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నేత, విపక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. సోమవారం అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో ఈ పరిణామం చోటు చేసుకుంది.‘‘మంత్రి అచ్చెన్నాయుడు నేను ఒకే ప్రాంతం నుంచి వచ్చాం. సుదీర్ఘ రాజకీయాలు చేసిన అనుభవం నాకు ఉందని అచ్చెన్నాయుడికి తెలుసు. మేం గాలికి వచ్చామని మంత్రి చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరం. ఆయన తన వ్యాఖ్యలు విత్ డ్రా చేసుకోవాలి. .. మేం ఎవరిని వ్యక్తిగతంగా కించపరిచేలా మాట్లాడటం లేదు. వ్యక్తిగతంగా నాపై మాట్లాడటం ఇద్దరికీ గౌరవంగా ఉండదు. మేమంతా రాజకీయంగా పోరాటాలు చేసే ఇక్కడకు వచ్చాం’’ అని బొత్స, అచ్చెన్నకు హితవు పలికారు. ఇదిలా ఉంటే.. సాక్షి టీవీ సహా నాలుగు ఛానెల్స్‌కు మండలి లైవ్‌ ప్రసారాలను సమాచార శాఖ నిలిపివేయడం గమనార్హం.మండలిలో అచ్చెన్న vs బొత్సమంత్రి అచ్చెన్నాయుడు👇2014-19 ఎన్టీఆర్ గృహ నిర్మాణం కింద పేదలకు ప్రభుత్వం ఇళ్లు కట్టించి ఇచ్చిందిగత ప్రభుత్వం ఒక్క ఇల్లు కూడా కట్టలేదుకట్టిన ఇళ్లకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదు.జగనన్న కాలనీలు అన్నారు.. దాని గురించి నేను ఏమీ మాట్లాడాల్సిన పనిలేదు.. ఏం జరిగిందో అందరికీ తెలుసు..కేంద్రం డబ్బులతోనే కథ నడిపారురాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదుమేము పేదలకు ఇళ్లు కట్టించి ఇవ్వాలని ఒక మంచి ఆలోచనతో ముందుకు వెళ్తున్నాం.మీరు ఎంత ఖర్చు చేశారో సమాధానం చెప్పాలి?విపక్ష నేత బొత్స సత్యనారాయణ👉🏼.. 2014 - 19 ఇళ్లు కట్టిన వారికి మా ప్రభుత్వ హయాంలో బిల్లులు ఇవ్వలేదనడం అవాస్తవం. అర్హులైన లబ్ధిదారులకు అందరికీ బిల్లులు ఇచ్చాం. అర్హత లేకుండా కట్టుకుని బిల్లులు కావాలన్న వారికి మాత్రమే ఇవ్వలేదు. కేవలం రాజకీయ ఆరోపణలు చేస్తున్నారు. ప్రభుత్వం రాజకీయ కక్షతో ఇవ్వలేదని చెప్పటం సరికాదు. గత ప్రభుత్వం అర్హులైన ప్రతీ ఒక్కరికీ అన్నీ పథకాలు ఇచ్చింది. మా పార్టీ వాళ్ళకే పనులు, పథకాలు ఇవ్వాలని మా అధినేత వైఎస్‌ జగన్ మోహన్‌రెడ్డి ఎప్పుడూ చెప్పలేదు. .. రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉన్న చంద్రబాబు పథకాల పై చేసిన వ్యాఖ్యలు కరెక్ట్ కాదు. ముఖ్యమంత్రి పదవిలో ఉండి చంద్రబాబు ఇలా మాట్లాడటానికి సిగ్గుపడాలి. లబ్ధిదారులకు పార్టీలు అంట గడతారా?. .. అర్హులైన లబ్ధిదారులకు పథకాలు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ప్రమాణం చేసి పదవులు తీసుకున్న వ్యక్తులు ఇలాంటి మాటలు మాట్లాడతారా?.. కేవలం కార్యకర్తలకు ఇవ్వమనటానికి ఇదేమైనా మీ సొంత ఆస్తి అనుకుంటున్నారా?. మా ప్రభుత్వంలో గత ఐదేళ్లలో అర్హులైన ప్రతీ ఒక్కరికీ పథకాలు ఇచ్చాం.

CT 2025 Pressure Will Be On: Rohit Sharma On Semi Final Against Australia4
Ind vs Aus: ఆసీస్‌ గొప్ప జట్టు.. కానీ..: రోహిత్‌ శర్మ కామెంట్స్‌ వైరల్‌

ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లో టీమిండియా టైటిల్‌ రేసులో ముందుకు దూసుకుపోతోంది. గ్రూప్‌-‘ఎ’లో భాగంగా బంగ్లాదేశ్‌, పాకిస్తాన్‌, న్యూజిలాండ్‌లను ఓడించి.. మూడింట మూడు విజయాలతో టాపర్‌గా నిలిచింది. ఇదే జోరులో సెమీ ఫైనల్లోనూ గెలుపొంది టైటిల్‌ పోరుకు అర్హత సాధించాలనే పట్టుదలతో ఉంది.నాకౌట్‌ మ్యాచ్‌లలో..అయితే, సెమీస్‌లో గ్రూప్‌-బి నుంచి ఆస్ట్రేలియా(India vs Australia) రూపంలో పటిష్టమైన ప్రత్యర్థి జట్టు రోహిత్‌ సేనకు సవాలుగా మారింది. ద్వైపాక్షిక సిరీస్‌ల సంగతి పక్కనపెడితే.. 2011 తర్వాత ఐసీసీ టోర్నమెంట్ల నాకౌట్‌ మ్యాచ్‌లలో కంగారూ జట్టు చేతిలో టీమిండియాకు పరాభవాలు తప్పడం లేదు. సొంతగడ్డపై లక్షలకు పైగా ప్రేక్షకుల నడుమ వన్డే ప్రపంచకప్‌-2023 ఫైనల్‌లో భారత్‌ కమిన్స్‌ బృందం చేతిలో ఓడిన తీరును అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు.ఈ క్రమంలో మంగళవారం దుబాయ్‌లో ఆసీస్‌తో జరిగే సెమీస్‌ మ్యాచ్‌లో ప్రతీకారం తీర్చుకోవాలని సోషల్‌ మీడియా వేదికగా విజ్ఞప్తి చేస్తున్నారు. భారత మాజీ క్రికెటర్లు సైతం గత చేదు అనుభవాలను మరిపించేలా రోహిత్‌ సేన ఆస్ట్రేలియాను ఓడించి ఫైనల్లో అడుగుపెట్టాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ(Rohit Sharma) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.ఆసీస్‌ గొప్ప జట్టు.. కానీ..‘‘ఆసీస్‌ పటిష్ట జట్టు. మాకు గొప్ప ప్రత్యర్థి. అయితే, సెమీస్‌తో మ్యాచ్‌లో మా విధానం మారదు. గత మూడు మ్యాచ్‌ల మాదిరే మా ప్రణాళికలు ఉంటాయి. అయితే, ఆసీస్‌ జట్టును బట్టి వ్యూహాల్లో కొన్ని మార్పులు చేసుకుంటాం.ఇక సెమీ ఫైనల్‌ అంటే మా మీద మాత్రమే ఒత్తిడి ఉంటుందని అనుకోకూడదు. ఆస్ట్రేలియా పరిస్థితి కూడా ఇలాగే ఉంటుంది. అయితే, జట్టుగా ఎలా రాణించాలన్న అంశం మీదే మేము ఎక్కువగా దృష్టి సారించాం. బ్యాటర్లు, బౌలర్లు సమిష్టిగా రాణిస్తే మాకు తిరుగే ఉండదు. సుదీర్ఘకాలంగా ఆస్ట్రేలియా గొప్ప జట్టుగా కొనసాగుతోంది. అందులో ఎలాంటి సందేహం లేదు. అయితే, మేము కూడా తక్కువేమీ కాదు. ప్రత్యర్థి ముందు అంత తేలికగా తలవంచే రకం కాదు.ఇరుజట్లకు ఈ మ్యాచ్‌ అత్యంత ముఖ్యమైంది. మేము అన్ని విధాలుగా సన్నద్ధమవుతున్నాం. ప్రణాళికలు పక్కాగా అమలు చేస్తే.. అనుకున్న ఫలితం అదే వస్తుంది. దాని గురించి పెద్దగా ఆలోచించాల్సిన పనిలేదు’’ అని రోహిత్‌ శర్మ చెప్పుకొచ్చాడు. న్యూజిలాండ్‌పై విజయం తర్వాత పీటీఐతో మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. కాగా రోహిత్‌ కామెంట్స్‌ నెట్టింట వైరల్‌గా మారాయి.ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ-2025భారత జట్టురోహిత్ శర్మ(కెప్టెన్‌), శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్(వికెట్‌ కీపర్‌), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహ్మద్‌ షమీ, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, రిషభ్‌ పంత్, వాషింగ్టన్ సుందర్, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా.ఆస్ట్రేలియా జట్టుజేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్, ట్రావిస్ హెడ్, స్టీవెన్ స్మిత్(కెప్టెన్‌), మార్నస్ లబుషేన్‌, జోష్ ఇంగ్లిస్(వికెట్‌ కీపర్‌), అలెక్స్ క్యారీ, గ్లెన్ మాక్స్‌వెల్, బెన్ డ్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, ఆడం జంపా, స్పెన్సర్ జాన్సన్, సీన్ అబాట్, ఆరోన్ హార్డీ, తన్వీర్‌ సంఘా, కూపర్‌ కన్నోలి.చదవండి: ఇదేం పని జడ్డూ? ఆటగాడు ఇలా చేయొచ్చా?: కివీస్‌ మాజీ క్రికెటర్‌ ఫైర్‌

BJLP Leader Maheswar Reddy On CM Revanth Reddy5
‘ఆమెకు ఇచ్చిన టాస్క్ ఒక్కటే.. సీఎం చేంజ్ ఆపరేషన్’

హైదరాబాద్: తెలంగాణలో నాలుగు స్తంభాలాటగా మంత్రి వర్గం నడుస్తోందని బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. తెలంగాణ క్యాబినెట్ లో కలహాలు, కథలు కథులుగా నడుస్తున్నాయని ఎద్దేవా చేశారు. ఈ ఆగస్టు వరకూ తెలంగాణలో సీఎం మార్పు తథ్యమని మహేశ్వర్ రెడ్డి జోస్యం చెప్పారు. అందులో భాగంగానే కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ తెలంగాణకు వచ్చారన్నారు. ఆమెకు రాహుల్ గాంధీ అప్పగించిన టాస్క్ ఒక్కటే.. సీఎం ఛేంజ్ ఆపరేషన్ అంటూ చమత్కరించారు.‘తెలంగాణ ఆడపిల్లల ఆశీర్వాదం కాదు.. ఢిల్లీ నుంచి వచ్చిన మీనాక్షి నటరాజన్ ఆశీర్వాదం ఉంటేనే రేవంత్ సీఎంగా కొనసాగుతారు. రాహుల్ గాంధీ సొంత టీం నుంచి మీనాక్షి నటరాజన్ ను ‘మిషన్ సీఎం ఛేంజ్ ఆపరేషన్’ కోసం పంపించారు. మంత్రులు.. సీఎంను లెక్క చేయడం లేదని స్వయంగా రేవంత్ పార్టీ ఇంచార్జ్ ముందుకు చెప్పుకున్నారు.* రాహుల్ గాంధీ ఇన్‌డైరెక్ట్ గా సీఎం ఛేంజ్ ఇండికేషన్ ఇచ్చినట్లు తెలుస్తుంది. సీఎం రేవంత్ ను పనిచేయనివ్వడం లేదని భట్టి, ఉత్తమ్, పొంగులేటిని అనుమానిస్తున్నారు. మూటల పంచాయతీ నడుస్తోంది. ఎవరి శాఖ వాళ్లదే అన్నట్లుగా ఉంది. తప్పనిసరి పరిస్థితుల్లో మేం ఎస్ఎల్బీసీకి వెళ్లిన తర్వాత సీఎం రేవంత్ అక్కడకు వెళ్లివచ్చారు.ప్రతీ అంశం ఢిల్లీ కి చెరవేస్తున్నది.. రేవంత్ ను ఏ పని చేయకుండా అడ్డుకుంటున్నది ఉత్తమ్ కుమార్ రెడ్డి అని అనుకుంటున్నారు. దీపాదాస్ మున్షీ స్థానంలో మీనాక్షి నటరాజన్ ను తీసుకు వచ్చిన.. మాస్టర్ ప్లాన్ ఉత్తమ్ కుమార్ రెడ్డే. మిలటరీ మాస్టర్ ప్లాన్స్ ఉత్తమ్ కుమార్ రెడ్డివే. గతంలో ఇంచార్జ్ గా కుంతియాను తెచ్చుకున్నది ఉత్తమ్ కుమారే. మూడు మంత్రులు పోటీపడి అధిష్టానానికి కప్పం కడుతున్నారు. ఆ ముగ్గురు సీఎం రేవంత్ తో సంబంధం లేకుండా నేరుగా అధిష్టానంతో డీల్ చేసుకుంటున్నారు’ అని మహేశ్వర్ రెడ్డి ఆరోపిస్తున్నారు.

Supreme Court Allowed Ranveer Allahbadia To Resume His Shows6
సుప్రీం కోర్టులో రణవీర్‌ అల్హాబాదియాకు ఊరట

ఢిల్లీ : తల్లిదండ్రుల గురించి, శృంగారం పైన ప్రశ్నించి వివాదాల్లో చిక్కుకున్న ప్రముఖ యూట్యూబర్‌ రణవీర్‌ అల్హాబాదియాకు సుప్రీం కోర్టులో (supreme court) ఊరట దక్కింది. వివాదాస్పద వ్యాఖ్యలతో ఆగిపోయిన పాడ్‌ కాస్ట్‌ ‘ది రణ్‌వీర్‌ షో’తో పాటు ఇతర షోలను తిరిగి ప్రారంభించుకోవడంతో పాటు వాటిని ప్రసారం చేసుకోవచ్చని తెలిపింది.‘ఇండియాస్‌ గాట్‌ లాటెంట్‌’ (India's Got Latent) వేదికగా యూట్యూబర్‌ రణవీర్‌ అల్హాబాదియా (Ranveer Allahbadia) చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. దీంతో అల్హాబాదియా వ్యాఖ్యలపై దేశ వ్యాప్తంగా పలు కేసులు నమోదయ్యాయి. అల్హాబాదియా చేస్తున్న షోలు సైతం ఆగిపోయాయి. అయితే, అల్హాబాదియా తాను ఇంటర్వ్యూలు, షోలు చేసుకునే అవకాశం కల్పించాలని కోరుతూ సుప్రీం కోర్టులో పిటిషన్‌లు దాఖలు చేశారు. అంతేకాదు,తాను చేస్తున్న షోలపై సుమారు 280 మంది ఆధారపడ్డారని, షోలు ఆగిపోవడం వల్ల వారికి ఆర్థిక ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని పిటిషన్‌లో పేర్కొన్నారు ఆ పిటిషన్‌పై సుప్రీం కోర్టు న్యాయమూర్తులు సూర్యకాంత్, ఎన్.కోటీశ్వర్ సింగ్ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. అల్హబాదియా పిటిషన్‌పై కేంద్రం తరఫు సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా (Solicitor General Tushar Mehta) తన వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా తాను ఉత్సుకతతో అల్హాబాదియా షోను చూశానని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అన్నారు. ఆ షో అసభ్యంగా మాత్రమే కాదు.. వక్రంగా ఉందని వ్యాఖ్యానించారు. హాస్యం, అసభ్యత, వక్రబుద్ధి మధ్య గణనీయమైన వ్యత్యాసం ఉందని నొక్కి చెప్పారు.ఇరుపక్షాల వాదనలు విన్న సుప్రీం ద్విసభ్య ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. వాక్ స్వాతంత్ర్యం ప్రాథమిక హక్కు, అశ్లీలత విషయంలో స్పష్టమైన సరిహద్దు ఉండాలని పునరుద్ఘాటించింది. ఈ సందర్భంగా అల్హాబాదియాకు సుప్రీం కోర్టు చురకలంటించింది. భావప్రకటనా స్వేచ్ఛకు పరిమితులు ఉన్నాయని, అసభ్య పదజాలం వాడటం హాస్యం కాదని మందలించింది. అల్హాబాదియా షోలు చేసుకోవచ్చని, నైతికంగా, మర్యాద ఉండాలని సూచించింది.👉చదవండి : హాస్యం పేరిట అల్హాబాదియా నీచపు వ్యాఖ్యలు

LPU 2025 Btech Final Year Student Bags Rs 1.03 Cr Placement Package7
ప్లేస్‌మెంట్‌లో ఎల్‌పీయూ సత్తా.. ఏకంగా 10 లక్షలపైనే ప్యాకేజీలు.. అదీ ఏకంగా 1,700 మందికి!!

లవ్లీ ప్రొఫెషనల్‌ యూనివర్శిటీ (ఎల్‌పీయూ)కు ఈ ఏడాది చాలా ఉత్సాహంతో మొదలైంది. ఫైనల్‌ ఇయర్‌ బీటెక్‌ విద్యార్థి రూ.1.03 కోట్ల (1,18,000 డాలర్లు)తో ఉద్యోగావకాశం పొందారు. రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్‌లో B.Tech చేస్తున్న బేతిరెడ్డి నాగవంశీరెడ్డి 2025 మేలో తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేయనున్నారు. ప్రముఖ ఏఐ రోబోటిక్స్ సంస్థలో రోబోటిక్స్ ఇంజినీర్‌గా చేరనున్నారు. ఈ అసాధారణ విజయం అటు పరిశ్రమ వర్గాల్లోనూ ఇటు విద్యా ప్రపంచంలోనూ సంచలనం సృష్టించింది. విద్యార్థులకు సూపర్‌ డూపర్‌ ప్యాకేజీలు అందించగల అత్యున్నత విద్యా సంస్థగా ఎల్‌పీయూ తనస్థానాన్ని సుస్థిరం చేసుకుంది.వేర్వేరు బీటెక్‌ విభాగాల్లోని మొత్తం 7361 మంది విద్యార్థులకు పాలో ఆల్టో నెట్‌వర్క్స్, నుటానిక్స్‌, మైక్రోసాఫ్ట్‌, సిస్కో, పేపాల్‌ అమెజాన్‌ వంటి ప్రతిష్టాత్మక మల్టీనేషనల్‌ కంపెనీల నుంచి ప్లేస్‌మెంట్లు లభించాయి. వీరిలో 1700 మంది టాప్‌ ఎమ్మెన్సీల నుంచి ఏడాదికి రూ.10 లక్షల నుంచి రూ.కోటి వరకూ ప్యాకేజీలు అందాయి. టాప్‌ ఎంఎన్‌సీలు ఇచ్చిన సగటు ప్యాకేజీ రూ.16 లక్షలు (ఏడాదికి). ఉద్యోగ మార్కెట్‌లో ఎల్‌పీయూకు ఉన్న అధిక డిమాండ్‌కు నిదర్శనాలు ఈ ప్లేస్‌మెంట్లు.గత ప్లేస్‌మెంట్‌ సీజన్‌ కూడా ఆకట్టుకునేదే. ఇండస్ట్రీలోనే అతిపెద్ద కంఎనీలు ఆకర్షణీయమైన ప్యాకేజీలు అందించాయి. పాలో ఆల్టో నెట్‌వర్క్స్ ఏకంగా ఏడాదికి రూ.54.75 లక్షల ప్యాకేజీని అందించగా నుటానిక్స్‌ రూ.53 లక్షల ప్యాకేజీ ఇచ్చింది. మైక్రోసాఫ్ట్‌ రూ.52.20 LPA ప్యాకేజీ అందించింది. మొత్తం 1912మందికి ఒకటి కంటే ఎక్కువ ఆఫర్లు అందాయి. 377 మందికి మూడు ఆఫర్లు, 97 మందికి నాలుగు ఆఫర్లు, 18 మందికి ఐదు, ఏడుగురికి ఆరు ఆఫర్లు లభించాయి. ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌ ఇంజినీరింగ్‌ విద్యార్థి ఆదిరెడ్డి వాసుకు నమ్మశక్యం కాని రీతిలో ఏకంగా ఏడు ఆఫర్లు వచ్చాయి. ఇదో అరుదైన, ఆకట్టుకునే రికార్డు.పైన చెప్పుకున్న కంపెనీలు మాత్రమే కాకుండా.. అమెజాన్‌ (రూ.48.64 LPA), ఇన్‌ట్యూట్‌ లిమిటెడ్‌ (రూ. 44.92 LPA), సర్వీస్‌ నౌ ( రూ. 42.86 LPA), సిస్కో (రూ. 40.13 LPA), పేపాల్‌ (రూ. 34.4 LPA), APNA (రూ.34 LPA), కామ్‌వాల్ట్‌ (రూ. 33.42 LPA), స్కేలర్‌ (రూ. 32.50 LPA)లు కూడా స్కిల్‌ డెవెలప్‌మెంట్‌, అత్యాధునిక టెక్నాలజీల్లో నైపుణ్యం అందించేందుకు ఎల్‌పీయూ చూపుతున్న శ్రద్ధకు నిదర్శనంగా నిలుస్తున్నాయి.ఎల్పీయూ పట్టభద్రుల సాంకేతిక పరిజ్ఞాన బుద్ధికుశలత కారణంగా భారీ నియామకాలు చేపట్టే ఆక్సెంచర్‌, క్యాప్‌జెమినీ, టీసీఎస్‌ తదితర ప్రముఖ కంపెనీల నుంచి మంచి డిమాండ్‌ ఉంది. క్యాప్‌జెమినీ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ 736 మంది విద్యార్థులకు అనలిస్ట్‌, సీనియర్‌ అనలిస్ట్‌ రోల్స్‌ కోసం ఉద్యగావకాశం ఇచ్చింది. అలాగే మైండ్‌ట్రీ 467 మంది విద్యార్థులను గ్రాడ్యుయేట్‌ ఇంజినీర్‌ ట్రైనీ పొజిషన్‌ కోసం తీసుకుంది. కాగ్నిజెంట్‌ టెక్నాలజీ సొల్యూషన్స్‌ కూడా 418 మంది విద్యార్థులను జెన్‌సీ రోల్స్‌ కోసం తీసుకుంది. ఎల్‌పీయూ నుంచి విద్యార్థులను ఎంపిక చేసుకున్న ఇతర కంపెనీల్లో ఆక్సెంచర్‌ (279 మంది), టీసీఎస్‌ (260 మంది), కేపీఐటీ టెక్నాలజీస్‌ (229 మంది), డీఎక్స్‌సీ టెక్నాలజీ (203), MPHASIS (94 మంది) కంపెనీలు ఉన్నాయి.రొబోటిక్స్‌, ఆటోమేషన్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌, మెకానికల్‌ ఇంజినీరింగ్‌ వంటి కోర్‌ ఇంజినీరింగ్‌ విభాగాల్లో అత్యధిక స్థాయిలో ప్లేస్‌మెంట్లు లభించాయి. పాలో ఆల్టో నెట్‌వర్క్స్‌, సిలికాన్‌ ల్యాబ్స్‌, ట్రైడెంట్‌గ్రూప్‌, నుటానిక్స్‌, ఆటోడెస్క్‌, అమెజాన్‌ వంటి దిగ్గజ కంపెనీలు ఈ విభాగాల్లోని విద్యార్థులను భారీగా నియమించుకుంటున్నాయి.‘‘ఎప్పటికప్పుడు మారిపోతున్న ప్రపంచానికి అనుగుణంగా విద్యార్థులు విజయం సాధించేలా చేసేందుకు ఎల్‌పీయూ కట్టుబడి ఉంది. ఎల్‌పీయూలో బోధించే అంశాలు కంపెనీల అవసరాలకు తగ్గట్టుగా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఎల్‌పీయూలో సంప్రదాయ పద్ధతులకు అతీతంగా సృజనాత్మక రీతిలో సాగే బోధన విద్యార్థులునిమగ్నమైయెలా ఉంటుంది. విద్యార్థులు పెద్ద సంఖ్యలో టాప్‌ కంపెనీల నుంచి ప్లేస్‌మెంట్‌ ఆఫర్లు పొందుతూండటం దీనికి నిదర్శనం. ఎల్‌పీయూ బోధనాంశాల సత్తానుచాటుతున్నాయి ఈ ప్లేస్‌మెంట్లు. జాతీయ, అంతర్జాతీయ ప్రముఖ సంస్థల్లో విద్యార్థులకు మంచి మంచి ప్లేస్‌మెంట్స్‌ సాధించిన రికార్డు ఎల్‌పీయూ సొంతం. అమెరికా, యూకే, ఆస్ట్రేలియాలల్లోని ఎన్నో పేరొందిన కంపెనీల్లో ఎల్‌పీయూ విద్యార్థులు ఏడాదికి రూ.కోటి కంటే ఎక్కువ ప్యాకేజీలతో పని చేస్తున్నారు. అత్యున్నత నైపుణ్యం కలిగిన ప్రొఫెషనల్స్‌ను తయారు చేయగల ఎల్‌పీయూ శక్తి సామర్థ్యాలకు, అంతర్జాతీయ స్థాయి ఎదుగుదలకు ఇవి నిదర్శనాలు.’’ అని రాజ్యసభ సభ్యులు, ఎల్‌పీయూ ఫౌండర్‌ ఛాన్సలర్‌ డాక్టర్‌ అశోక్‌ కుమార్‌ మిట్టల్‌ వివరించారు.2025 బ్యాచ్‌ కోసం దరఖాస్తు చేసుకునేందుకు చివరితేదీ దగ్గరపడింది. ఎల్‌పీయూలో అడ్మిషన్లకు పోటీ ఎక్కువ. యూనివర్శిటీలో అడ్మిషన్‌ కోసం విద్యార్థులు ప్రవేశ పరీక్ష రాయాల్సి ఉంటుంది. అలాగే ‘ఎల్‌పీయూ నెస్ట్‌ 2025’, ఇంటర్వ్యూలలోనూ పాసైన వారికి మాత్రమే కొన్ని ప్రత్యేక కార్యక్రమాల్లోకి ప్రవేశం లభిస్తుంది. పరీక్ష, అడ్మిషన్‌ ప్రాసెస్‌ గురించి తెలుసుకోవాలనుకునే ఆసక్తిగల విద్యార్థులు https://bit.ly/43340ai ను సందర్శించగలరు.

IIT Baba Arrested For Consuming Prasad Check Full Details Here8
గంజాయి కేసులో ఐఐటీ బాబా అరెస్ట్‌!

జైపూర్‌: మహా కుంభమేళాతో దేశం దృష్టిని ఆకర్షించిన ఐఐటీ బాబా(IIT Baba) అభయ్‌ సింగ్‌ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. గంజాయి కేసులో తాజాగా ఆయన్ని జైపూర్‌ పోలీసులు అరెస్ట్‌ చేసినట్లు సమాచారం. ఈ విషయాన్ని స్వయంగా ఐఐటీ బాబానే ధృవీకరించడం విశేషం. ఐఐటీ బాబా సూసైడ్‌ చేసుకుంటానన్న ఓ వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు జైపూర్‌ షిప్రా పాథ్‌ పోలీసులు ఓ హోటల్‌లో ఉన్నారనే సమాచారంతో అక్కడికి వెళ్లారు. ఆ టైంలో ఆయన నుంచి గంజాయి సేవిస్తుండడంతో పోలీసులు అదుపులోకి తీన్నారు. ఆయనపై నార్కోటిక్‌ డ్రగ్స్‌ &సైకోట్రోపిక్‌ సబ్‌స్టానెన్స్‌(NDPS) యాక్ట్‌ కింద కేసు నమోదు చేసినట్లు అక్కడి మీడియా కథనాలు ఇచ్చింది. VIDEO | Amid reports of his arrest, Maha Kumbh fame Abhay Singh, alias 'IIT Baba' was seen celebrating his birthday with followers in Jaipur. pic.twitter.com/WhA8aTIUv2— Press Trust of India (@PTI_News) March 3, 2025అయితే.. ఆయన అరెస్ట్‌ ప్రచారం నడుమ అనూహ్యంగా ఆయన తన భక్తుల మధ్య పుట్టినరోజు వేడుకలు చేసుకుంటూ కనిపించారు. దీంతో మీడియా ఆయన్ని అరెస్ట్‌పై ఆరా తీసింది. తాను ఆత్మహత్య చేసుకుంటానన్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని అన్నారాయన. అయితే తాను గంజాయి తీసుకున్న మాట వాస్తవమేనని.. అయితే పరిమితితో కూడి గంజాయి ఉండడంతో పోలీసులు బెయిల్‌ మీద తనను విడుదల చేశారని అన్నారాయన. అయితే తన దృష్టిలో అది గంజాయి కాదని.. ప్రసాదమని ఆయన వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే.. ఓప్రైవేట్‌ టీవీ ఛానెల్‌ ఇంటర్వ్యూలో తనపై దాడి జరిగిందంటూ నోయిడా పీఎస్‌ వద్ద ఐఐటీ బాబా హడావిడి చేసిన సంగతి తెలిసిందే. చివరకు పోలీసులు ఆయన్ని శాంతపర్చి అక్కడి నుంచి పంపించేశారు. అయితే ఇంటర్వ్యూకు ముందు ఆయనే సదరు ఛానెల్‌ యాంకర్‌పై దాడి చేశారంటూ ప్రచారం జరగడం గమనార్హం. ఈ ఘటనకు సంబంధించి ఎలాంటి కేసు నమోదు కాలేదు.ఐఐటీ బాబాగా ప్రయాగ్‌రాజ్‌ మహా కుంభమేళా(Prayagraj Maha Kumbh) అభయ్‌ సింగ్‌ ఓ టీవీ ఛానెల్‌ ఇంటర్వ్యూతో పాపులారిటీ సంపాదించుకున్నారు. హర్యానా చెందిన అభయ్‌ ఐఐటీ బాంబేలో ఏరోస్పేస్‌ ఇంజినీరింగ్‌ పూర్తిచేసినట్లు చెబుతున్నారు. కొంతకాలం ఓ కార్పొరేట్‌ సంస్థలో పనిచేసిన ఆయన.. దాన్ని వదిలేశారట. ఆపై కొంతకాలం ఫొటోగ్రఫీ.. అటు నుంచి ఆధ్యాత్మికం వైపు అడుగులు వేశారట.

Karnataka MLA On Rashmika Mandanna to Refuse attend the Film Festival9
ఈవెంట్‌ తెచ్చిన తంటా.. రష్మికకు ఎమ్మెల్యే స్ట్రాంగ్ వార్నింగ్

శాండల్‌వుడ్‌లో వివాదం మరింత ముదురుతోంది. ప్రతిష్టాత్మక ఈవెంట్‌కు కన్నడకు చెందిన అగ్ర సినీతారలు హాజరు కాకపోవడం రాజకీయ రంగు పులుముకుంది. ఈ అంశంపై ఇప్పటికే కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ అందరికీ నట్లు, బోల్టులు ఎప్పుడు బిగించాలో తమకు తెలుసని మండిపడ్డారు. తాజాగా మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే నేషనల్ క్రష్, పుష్ప భామ రష్మిక మందన్నాపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఇటీవల జరిగిన బెంగళూరు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు రష్మిక హాజరు కాకపోవడంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే రవి గణిగ మండిపడ్డారు. కన్నడ చిత్రం కిరిక్ పార్టీతో తన కెరీర్‌ను ప్రారంభించిన రష్మిక తన మూలాలు మరిచిపోవడం సరైంది కాదని హితవు పలికారు. గతేడాది కూడా ఈవెంట్‌కు ఆహ్వానించగా నిరాకరించిందని వెల్లడించారు. తాను కెరీర్ ప్రారంభించిన ఇండస్ట్రీని చిన్నచూపు చూస్తున్న రష్మికకు తగిన గుణపాఠం చెప్పకూడదా? అంటూ అని మాండ్యా నియోజకవర్గ ఎమ్మెల్యే రవి గణిగ ప్రశ్నించారు. కాగా.. రష్మిక 2016లో కన్నడ చిత్రం కిరిక్ పార్టీతో రక్షిత్ శెట్టి సరసన సినీ రంగ ప్రవేశం చేసింది.(ఇది చదవండి: ఇలాగే ఉంటే నటీనటులకు నట్లు, బోల్టులు బిగిస్తాం: డిప్యూటీ సీఎం)రష్మిక కన్నడ చిత్ర పరిశ్రమను పూర్తిగా విస్మరించిందని ఆయన అన్నారు. అలాగే కన్నడ భాషను కూడా విస్మరించి అగౌరవపరిచేలా మాట్లాడిందని ఎమ్మెల్యే ఆరోపించారు. ఈ కార్యక్రమానికి రష్మిక మందన్నను చాలాసార్లు ఆహ్వానించినప్పటికీ.. బెంగళూరు రావడానికి సమయం లేదని సమాధానమిచ్చిందని అన్నారు. మా శాసనసభ్యురాలు ఒకరు ఆమెను ఆహ్వానించడానికి 10 నుంచి 12 సార్లు ఆమె ఇంటికి వెళ్లారని గుర్తు చేశారు. కానీ రష్మిక కన్నడ పరిశ్రమను పట్టించుకోలేదని.. ఇలాంటి వారికి వారికి గుణపాఠం చెప్పాల్సిందేనని స్పష్టం చేశారు. రష్మిక ప్రవర్తనకు తగిన పరిణామాలు తప్పవని ఆయన హెచ్చరించారు. కాగా.. ఇటీవల బెంగళూరు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్-16 వేడుకలు గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్‌కు శాండల్‌వుడ్ అగ్రతారలు హాజరు కాకపోవడంపై డీసీఎం డీకే శివకుమార్ సైతం మండిపడ్డారు.

Cognizant Delays Salary Hikes Amid Rising Concerns says CEO Ravi Kumar10
ఈసారి బ్యాడ్‌ న్యూస్‌ కాగ్నిజెంట్‌ ఉద్యోగులకు..

దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ ఇటీవల వేతన పెంపును 5-8 శాతం మధ్య ప్రకటించి ఉద్యోగులను నిరాశ పరిచింది. టీఈఎస్‌లో కూడా శాలరీ హైక్‌ శాతం సింగిల్‌ డిజిట్‌కే పరిమితమవుతుందన్న నివేదికలు వచ్చాయి. తాజగా మరో మల్టీ నేషనల్‌ ఐటీ కంపెనీ కాగ్నిజెంట్‌ కూడా ఉద్యోగులకు బ్యాడ్‌ న్యూసే చెప్పింది.వేతన పెంపు వాయిదాఇటీవల జరిగిన టౌన్ హాల్ సమావేశంలో కాగ్నిజెంట్ సీఈఓ రవికుమార్ ఎస్ ఉద్యోగులనుద్దేశించి మాట్లడుతూ బోనస్ లు, జీతాల పెంపు ఆలస్యంతో సహా కంపెనీ వేతన పెంపు ప్రణాళికలపై అప్ డేట్స్ ఇచ్చారు. ఏప్రిల్ లో అమలు జరగాల్సిన జీతాల పెంపును ఆగస్టుకు వాయిదా వేయడంపై ఉద్యోగుల్లో నెలకొన్న అసంతృప్తిని అంగీకరించారు. అయితే వాగ్దానం చేసిన పెంపుదలను గౌరవించడానికి కంపెనీ కట్టుబడి ఉందని ఆయన ఉద్యోగులకు హామీ ఇచ్చారు. కంపెనీ ఆర్థిక లక్ష్యాలు, మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా జాప్యం ఒక వ్యూహాత్మక నిర్ణయం అని పేర్కొన్నారు.వేతన ప్రణాళికలుబోనస్ స్ట్రక్చర్ గురించి కూడా కాగ్నిజెంట్‌ సీఈవో రవి కుమార్ చర్చించారు. అర్హత కలిగిన ఉద్యోగులు తమ బోనస్ లను ప్రణాళిక ప్రకారం పొందుతారని ధృవీకరించారు. ఇంటర్నల్ మెమో ప్రకారం మార్చి 10లోగా ఉద్యోగులు తమ బోనస్ లకు సంబంధించిన ఈ లెటర్లను ఆశించవచ్చు. పనితీరును ప్రతిఫలించడం, పోటీ వేతన ప్యాకేజీలను నిర్వహించడంలో కంపెనీ నిబద్ధతను ఆయన పునరుద్ఘాటించారు.విస్తృత ఆర్థిక నేపథ్యంఅనిశ్చిత స్థూల ఆర్థిక పరిస్థితులు ఐటీ పరిశ్రమను ప్రభావితం చేస్తున్న నేపథ్యంలో వేతనాల పెంపులో జాప్యం జరుగుతోంది. ఈ సవాళ్లను నావిగేట్ చేస్తూ ఆపరేటింగ్ మార్జిన్లను పెంచడం, ఆఫీస్ స్పేస్‌ను ఆప్టిమైజ్ చేసుకోవడంపై కాగ్నిజెంట్ దృష్టి సారించింది. ప్రతిభను నిలుపుకోవడం, మార్కెట్లో పోటీగా నిలవడం అనే ఉద్దేశంతో కంపెనీ ఈ ప్రయత్నాలను బ్యాలెన్స్ చేస్తోంది.ఉద్యోగుల ప్రతిస్పందనవేతనాల పెంపు ఆలస్యం గురించి ముందుగానే ప్రస్తావించడం ఉద్యోగుల్లో మిశ్రమ స్పందనకు దారితీసింది. కొంతమంది దీనిని అట్రిషన్ తగ్గించడానికి మనోధైర్యాన్ని పెంచే చర్యగా భావిస్తుండగా మరికొందరు అదనపు ఒత్తిడి, వారి ఆర్థిక ప్రణాళికపై పడనున్న ప్రభావం గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్ అనిశ్చితి ఉన్నప్పటికీ పారదర్శకత, ఉద్యోగులకు విలువ ఉండేలా చూడటం పట్ల రవికుమార్ నిబద్ధత సానుకూల పరిణామమని నిపుణులు సూచిస్తున్నారు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

NRI View all
title
టంపా వేదికగా నాట్స్‌ అమెరికా తెలుగు సంబరాల ఏర్పాట్లు

title
జర్మనీ పాఠ్యాంశాల్లో తెలుగు విద్యార్థి ప్రస్థానం

ప్రవాస తెలుగు విద్యార్ధి శ్రీనిహల్ తమ్మనకు మరో అరుదైన గౌరవం లభించింది.

title
గల్ఫ్ మృతుల కుటుంబాలతో సీఎం రేవంత్ రెడ్డి సహపంక్తి భోజనం

గల్ఫ్ దేశాలలో మరణించిన కార్మికుల కుటుంబాలతో హైదరాబాద్, ప్రజాభవన్‌లో త్వరలో 'గల్ఫ్ అమరుల సంస్మరణ సభ' ఏర్పాటు చేయాలని రాష్

title
వలస కార్మికుల మృత్యు ఘోష

మోర్తాడ్‌ (బాల్కొండ): జగిత్యాల జిల్లా మల్లాపూర్‌ మండలం రేగుంటకు చెందిన కర్న గణేశ్‌ (55) రెండ్రోజుల కిందట సౌదీ అరేబియాలో

title
వీసా గోల్డెన్‌ చాన్సేనా?

గోల్డ్‌ కార్డ్‌ వీసా.. ప్రపంచవ్యాప్తంగా కొత్త చర్చకు దారితీసిన టాపిక్‌ ఇది.

International View all
Advertisement

వీడియోలు

Advertisement