Top Stories
ప్రధాన వార్తలు

తెలంగాణ టెన్త్ ఫలితాలు విడుదల.. ఒక్క క్లిక్‌తో చెక్ చేస్కోండిలా
సాక్షి,హైదరాబాద్ : తెలంగాణ పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. బుధవారం మధ్యాహ్నాం రవీంద్ర భారతిలో జరిగిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, భట్టి ఇతరులు టెన్త్ ఫలితాలను విడుదల చేశారు. మొత్తం ఐదు లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాయగా.. 92.78 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ప్రకటించారు. గురుకులాల్లో 98 శాతం, ఆశ్రమ పాఠశాలల్లో 95 శాతం, ప్రైవేట్ పాఠశాలల్లో 94.12 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. మొత్తంగా.. గతేడాది కంటే 1.47 శాతం అధికంగా ఉత్తీర్ణత సాధించినట్లు విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. విద్యార్థులు తమ టెన్త్ ఫలితాలను కింద ఇచ్చిన సాక్షి అధికారిక ఎడ్యుకేషన్ వెబ్ సైట్లో పొందవచ్చు. 👇 👉Server 1 https://results2.sakshieducation.com/Results2025/telangana/SSC/2025/ts-ssc-10th-class-results-2025.html👉Server 2 https://education.sakshi.com/sites/default/files/exam-result/TS-SSC-10th-Class-Results-2025-Direct-Link.html👉Server 3 http://results1.sakshieducation.com/results/SSC/ts-10th-class-results-2025.htmlసరికొత్త విధానం..కాగా.. ఈసారి గ్రేడింగ్ స్థానంలో మార్కుల మెమోలపై సబ్జెక్ల వారీగా మార్కులు, గ్రేట్లను ఇచ్చారు. ఈమేరకు కొత్త మెమో నమూనాను కూడా విద్యాశాఖ విడుదల చేసింది. ఉమ్మడి రాష్ట్రంలో మార్కుల విధానాన్ని తొలగించి గ్రేడింగ్ విధానాన్ని అమలులోకి తెచ్చిన విషయం తెలిసిందే. 2009 నుంచి ఈ విధానం అమలులోకి వచ్చింది. ఏ-1, ఏ-2, బీ-1,బీ-2, సీ-1, సీ-2, డి, ఈలుగా గ్రేడ్లను ఇచ్చేవారు. సబ్జెక్ట్‌ల వారీగా గ్రేడ్లతో పాటు సీజీపీఏ ఇచ్చేవారు. అయితే ఇప్పుడు అనూహ్యంగా ఈ విధానాన్ని తొలగించి సీజీపీఏ కాకుండా సబ్జెక్టులవారీగా మార్కులు, గ్రేడ్లు ఇవ్వాలని విద్యాశాఖ నిర్ణయించింది. అయితే విద్యావేత్తలు, ఉపాధ్యాయ సంఘాలు, తల్లిదండ్రులు, విద్యార్థులతో చర్చించకుండానే సరికొత్త విధానాన్ని అమలు చేయడం పట్ల అనేక ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.

విశాఖకు మాజీ సీఎం వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విశాఖ వెళ్లనున్నారు. సింహాచలం ఘటనలో బాధిత కుటుంబాలను ఆయన పరామర్శించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు వైఎస్ జగన్ విశాఖకు చేరుకోనున్నారు.విశాఖ జిల్లా సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవంలో గోడ కుప్పకూలి భక్తులు మృతి చెందడంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చందనోత్సవం సందర్భంగా రూ. 300 టికెట్ క్యూలైన్ పై గోడ కుప్పకూలి భక్తులు మృత్యువాత పడటంపై తీవ్రవిచారం వ్యక్తం చేశారు. స్వామివారి నిజరూప దర్శనానికి వచ్చిన భక్తులు ఇటువంటి దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమన్నారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని, మరణించిన భక్తుల కుటుంబాలను ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.

ఈ సందేహాలు తీర్చండి.. టీఎస్పీఎస్సీకి కేంద్ర మంత్రి బండి సంజయ్ లేఖ
న్యూఢిల్లీ, సాక్షి: తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షా ఫలితాల్లో అక్రమాలు, అవినీతి ఆరోపణలతోపాటు తీవ్రమైన తప్పిదాలు జరిగాయని ఆరోపణలు వెల్లువెత్తుతుండటంతో కరీంనగర్ ఎంపీ, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ రంగంలోకి దిగారు. గ్రూప్ 1 పరీక్షా ఫలితాలపై టీజీపీఎస్సీ నుండి సమాచారం కోరుతూ.. టీఎస్పీఎస్సీ ఛైర్మన్ బుర్రా వెంకటేశంకు ఆయన లేఖ రాశారు. అభ్యర్థుల నుంచి పెద్ద ఎత్తున తనకు విజ్ఞప్తులు వెల్లువెత్తడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల నిర్వహణ, మూల్యాంకన విధానం, ఫలితాల విషయంలో అనేక అక్రమాలు, అవకతవకలు, తప్పిదాలు జరిగాయని, నిబంధనల ఉల్లంఘన జరిగిందని పేర్కొంటూ గ్రూప్ 1 అభ్యర్థులు పలుమార్లు తన దృష్టికి తీసుకొచ్చిన నేపథ్యంలో.. ఆ అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత టీఎస్పీఎస్సీ పైన ఉందని ఆయన లేఖలో పేర్కొన్నారు. ప్రధానంగా మార్కుల ప్రకటన, నోటిఫికేషన్ ఉల్లంఘన, పరీక్షా పత్రాల మూల్యాంకనంలో జరిగిన పొరపాట్లతోపాటు ఉర్దూ మీడియంలో రాసిన అభ్యర్థులకు టాప్ ర్యాంకులు రావడాన్ని ఆ లేఖలో ప్రస్తావించారు. వీటికి సంబంధించి సమగ్ర సమాచారాన్ని వారం రోజుల్లో పంపాలని ఛైర్మన్ ను కేంద్ర మంత్రి బండి సంజయ్ కోరారు. మరోవైపు హైకోర్టులో గ్రూప్ 1 కేసు విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో.. టీజీపీఎస్సీ నుండి వచ్చిన సమాచారం ఆధారంగా అవసరమైతే తాను సైతం కేసులో ఇంప్లీడ్ కావాలని ఆయన నిర్ణయించారు. బండి సంజయ్ లేఖలో కోరిన అంశాలు1. మార్కుల ప్రకటన: ● UPSC తరహాలో ఎంపికైన మొత్తం 563 మంది అభ్యర్థుల పూర్తి మార్కుల జాబితాను(పేర్లతోసహా) అందించగలరు.●రీకౌంటింగ్ కు ముందునాటి జనరల్ ర్యాంకింగ్ జాబితా (GRL) మరియు ప్రొవిజనల్ మార్కుల జాబితా (PML) అందించగలరు. అట్లాగే నోటిఫికేషన్ యొక్క 15.2 & 15.3 నిబంధనలు ఉల్లంఘనకు కారణాలను వివరించగలరు.అభ్యర్థులకు వచ్చిన మార్కుల జాబితాను మీడియం వారీగా అందించగలరు. ప్రిలిమ్స్ & మెయిన్స్ హాల్ టికెట్ నంబర్లు, పేరు, వయస్సు, మీడియం, లింగం, కేటగిరీ, ప్రతి పేపర్‌కు సంబంధించిన మార్కులు మరియు మొత్తం మార్కులతో సహా తెలియజేయగలరు.2. మూల్యాంకన ప్రక్రియ: ●గ్రూప్ 1 పరీక్షల మూల్యాంకనానికి సంబంధించి మొత్తం దశల సంఖ్య, ప్రతి దశలో Evaluation జరిగిన రోజుల సంఖ్య, కేంద్రాలు లేదా పేపర్ వారీగా సమాచారం తెలియజేయగలరు. ప్రతిరోజు మూల్యాంకనకు ఉపయోగించిన గంటలు, మూల్యాంకనకారులకు ఇచ్చిన, మారిన సూచనలను తెలియజేయగలరు. ● పదవీ విరమణ పొందిన మూల్యాంకనకారులను ఎంపిక చేసిన ప్రమాణాలు ఏమిటి? బ్లూప్రింట్లు మీడియం స్పెసిఫిక్‌గా ఉన్నాయా లేక కేవలం ఇంగ్లీషులో మాత్రమేనా? ప్రతి పేపర్, ప్రతి మీడియంకు ప్రతి దశలో ఎంత మంది మూల్యాంకనకారులు ఉన్నారు? మూల్యాంకన సమయంలో ఉన్న CCTV ఫుటేజ్ భద్రత స్థితి ఏమిటి? గౌరవనీయ సుప్రీం కోర్టు ఆదేశించినట్లుగా UPSC స్థాయిలో మోడరేషన్ ప్రక్రియను పాటించకపోవడానికి కారణాలను తెలియజేయగలరు.3. హాజరు వివరాలు:● జనరల్ ఇంగ్లీష్ మరియు పేపర్లు 1–6కి పేపర్ వారీగా, మీడియం వారీగా హాజరు వివరాలను అందించగలరు. ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ హాజరు విధానం పాటించబడిందా లేదా? పాటించకపోతే కారణాలేమిటి? నమోదు అయిన హాజరులో ఉన్న వ్యత్యాసాలకు కారణాలను తెలియజేయగలరు.4. ఫలితాల ప్రకటనకు ముందు డేటా లీక్: ● మార్చి 15, 2025న ఒక టెలిగ్రామ్ గ్రూప్‌లో 450కి పైగా మార్కులు పొందిన అభ్యర్థుల సంఖ్య (618) సోషల్ మీడియాలో పోస్టు చేయబడింది. మార్చి 30న విడుదలైన GRLతో ఇది సమానం. సున్నితమైన డేటా లీక్‌కు బాధ్యులైన వారిపై తీసుకున్న చర్యలను తెలియజేయగలరు.5. కోడ్ ఆధారిత మార్కుల నకిలీ లక్షణాలు: ● 0–50 అంకెల తేడా ఉన్న హాల్ టికెట్ నంబర్ల కలిగిన 1,500కు పైగా అభ్యర్థుల జంటలకు ఒక్కటే మార్కులు రావడం, అంకె పదాంశాల వరకు సరిపోలేదని తెలిసింది. ఇది ఒక కోడెడ్ మార్కింగ్ అల్గోరిథం ఉపయోగించారని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. UPSC, APPSC లేదా గత TGPSC పరీక్షలలో ఇలాంటి ధోరణి కనుగొనబడలేదు. దీనికి కారణాలను వివరించగలరు.6. కేంద్రాల వారీగా అసమాన ఫలితాలు: ● కోఠి ఉమెన్స్ కాలేజ్ (సెంటర్లు 18 & 19) నుంచి ఎంత మంది మెయిన్స్ పరీక్ష రాశారు. వారిలో ఎంత మందికి టాప్ 500లోపు ర్యాంకులు వచ్చాయి? వివరించగలరు. అట్లాగే మిగిలిన కేంద్రాల నుండి ఎంత మంది పరీక్ష రాశారు? వారిలో ఎంత మందికి టాప్ 500లోపు ర్యాంకులు వచ్చాయి. కోఠి ఉమెన్స్ కాలేజీలో పరీక్ష రాసిన వారికే అత్యధిక ర్యాంకులు వచ్చినట్లు మా ద్రుష్టికి వచ్చింది? దీనిపై సమగ్ర వివరాలను అందించగలరు.7. అదనపు సమాచారం : ● హాల్ టికెట్లు మరియు పరీక్ష కేంద్రాల కేటాయింపు యాదృచ్ఛికంగా జరిగిందా లేక మానవీయంగా కల్పించారా?● UPSCలో హాల్ టికెట్ నంబర్లు స్థిరంగా ఉండగా, ఇక్కడ ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్ వరకు ఎందుకు మార్పు జరిగింది?● పరీక్ష కేంద్రాల వారీగా అభ్యర్థుల కూర్చునే పథకం, పర్యవేక్షణకారుల కేటాయింపు వివరాలు.● పరీక్ష కేంద్రాల నుంచి వచ్చిన CCTV ఫుటేజ్ భద్రత స్థితి.● సమాధాన పత్రాల కోడింగ్ విధానం, మరియు పేరు, జిల్లా కోడ్, పుట్టిన తేదీ వంటి వివరాలను ఎలా నిర్వహించారు?.. తదితర వివరాలను అందించాలని టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశంను బండి సంజయ్ లేఖలో కోరారు.

పాక్‌లో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు సాహసోపేత నిర్ణయం
ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్లో గల ప్రశాంతమైన బైసారన్ లోయలో పాక్ ఉగ్రమూకలు కాల్పులకు తెగబడి 26 మంది పర్యాటకులను పొట్టన పెట్టుకున్నారు. ఈ ఉగ్రదాడి తర్వాత భారత ప్రభుత్వం పాక్‌పై చాలా సీరియస్‌గా ఉంది. ఏ క్షణంలోనైనా భారత బలగాలు పాకిస్తాన్‌పై దాడులు చేయవచ్చని ప్రచారం జరుగుతుంది.పాక్‌లో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ బంగ్లాదేశ్ పురుషుల క్రికెట్ జట్టు ఓ సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్లో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడేందుకు ఒప్పుకుంది. ఈ సిరీస్ మే 25 నుంచి జూన్ 3 వరకు జరుగుతుంది. ఫ్యూచర్ టూర్ ప్రోగ్రాం (FTP) ప్రకారం పాక్ పర్యటనలో బంగ్లాదేశ్ మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడాల్సి ఉండింది. అయితే వచ్చే ఏడాది టీ20 వరల్డ్‌కప్ జరుగనుండటంతో ఇరు జట్ల బోర్డులు మూడు వన్డేల సిరీస్‌కు బదులు అదనంగా రెండు టీ20లు ఆడేందుకు ఒప్పందం చేసుకున్నాయి.ఈ సిరీస్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఇవాళ (ఏప్రిల్ 30) ప్రకటించింది. ఈ సిరీస్‌లోని మ్యాచ్‌లు ఫైసలాబాద్, లాహోర్ నగరాల్లో జరుగనున్నాయి. మే 25, 27న తొలి రెండు టీ20లు ఫైసలాబాద్‌లో జరుగనుండగా.. లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో మిగిలిన మూడు టీ20లు మే 30, జూన్ 1, జూన్ 3 తేదీల్లో జరుగనున్నాయి. ఈ సిరీస్ కోసం బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు మే 21న పాకిస్తాన్‌కు చేరుకుంటుంది. ఫైసలాబాద్‌లో ఆ జట్టు మే 22-24వ తేదీ వరకు ప్రాక్టీస్ సెషన్స్‌లో పాల్గొంటుంది.ఇదిలా ఉంటే, పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత ప్రభుత్వం చాలా విషయాల్లో పాక్‌ను కోలుకోలేని దెబ్బలు కొట్టింది. సింధు జలాల ఒప్పందం రద్దు సహా ఆ దేశ ట్విటర్, సినిమాలపై నిషేధం విధించింది. పాక్‌కు చెందిన 16 యూట్యూబ్ ఛానళ్లను, ఆ దేశ జర్నలిస్ట్‌లను కూడా బ్యాన్ చేసింది. తాజాగా పాక్‌కు అప్పు ఇవ్వొద్దని IMFకు సూచించింది.

ప్రిన్స్ హ్యారీతో విడాకులా? తొలిసారి మౌనం వీడిన మేఘన్
ప్రిన్స్ హ్యారీ (Prince Harry), మేఘన్ మార్కెల్ (Meghan Markle ) వివాహం ప్రపంచంలోనే అత్యధికమంది వీక్షించిన రాయల్ వెడ్డింగ్‌గా నిలిచింది. అయితేఈ దంపతులు విడిపోతున్నారనే ఊహాగానాలు బాగా వ్యాపించాయి. ఈ వార్తలను మేఘన్ మార్కెల్ తొలిసారి క్లారిటీ ఇవ్వడం విశేషం. తన భర్త మనసు చాలా మంచిదనీ, చాలా చాలా అందగాడని చెప్పుకొచ్చింది. ఇంకా వారి వివాహ బంధంపై ఆమె చెప్పిందో వివరాలను తెలుసుకుందాం. 2018, మే 19న యూకేలోని విండ్సర్ కాజిల్‌లోని సెయింట్ జార్జ్ చాపెల్‌లో అత్యంత ఘనంగా వీరి వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. బ్రిటిష్ రాచరికంలో సంచలన మార్పును ప్రకటించారు. 2020లో తాము తమ రాజ విధులనుండి తప్పుకున్నట్లు ప్రకటించి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఆ తరువాత ప్రిన్స్హ్యారీ, మేఘన్ విడిపోతున్నారనే వార్తలు జోరుగా వ్యాపించాయి. చాలా రోజుల తరువాత మేఘన్ మార్కెల్ భర్త ప్రిన్స్ హ్యారీతో తన అందమైన బంధాన్ని పంచుకుంది. తన స్నేహితురాలు, IT కాస్మెటిక్స్ CEO జామీ కెర్న్ లిమా పాడ్‌కాస్ట్‌లో ది జామీ కెర్న్ లిమా షో. చిట్-చాట్‌లో మేఘన్ మార్కెల్ మౌనం వీడి కొన్ని ఆసక్తికర సంగతులను పంచుకుంది. ఏడేళ్ల సుదీర్ఘ వివాహ బంధంలో తమ ప్రయాణాన్ని ఆనందంగా కొనసాగిస్తున్నామని తెలిపింది. అంతేకాదు తమ బంధాన్ని 1985 నాటి ప్రముఖ వీడియో గేమ్ సూపర్ మారియో బ్రదర్స్‌తో సరదాగా పోల్చారు. తన భర్త ప్రిన్స్ హ్యారీ చాలా, చాలా అందగాడని కితాబిచ్చింది. అతనికి చాలా మంచి హృదయం ఉన్నవాడని, తనను చాలా ప్రేమిస్తున్నాడని వెల్లడించింది. ఇద్దరం కలిసి ఒక అందమైన జీవితాన్ని నిర్మించు కున్నాం, ఇద్దరు అందమైన పిల్లలున్నారు. మాది చాలా హ్యాపీ ఫ్యామిలీ అంటూ చెప్పుకొచ్చింది.అదే పాడ్‌కాస్ట్‌లో, మేఘన్ మార్కెల్ డేటింగ్ , ప్రారంభ రోజులు ఎలా ఉన్నాయో కూడా వివరించింది. కాలక్రమేణా, ప్రతి సంబంధం అభివృద్ధి చెందుతుందని, అందుకే ఇదిఒకరికొకరు సహవాసాన్ని కొత్త మార్గంలో ఆస్వాదించడం లాంటిదని పేర్కొంది. హ్యారీతో ఆమె శాశ్వత ప్రయాణం ఇంకా కొనసాగుతుందా అని అడిగినప్పుడు 'అవును' అని స్పష్ట చేసింది మేఘన్.ఇదీ చదవండి: Akshaya tritiya 2025 దయచేసి ఇలా చేయండి : గాయని చిన్మయి ‘‘ మీకో విషయం తెలుసా? మా బంధం ప్రారంభంలో సీతాకోక చిలుకల్లా విహరించాం. ఆరు నెలల డేటింగ్ తరువాత పెళ్లి అనే బంధంలోకి వెళ్లాం. ఈ ఏడేళ్ల కాలం ఒకరినొకరు కొత్త మార్గంలో ఆనందిస్తున్నాం. మరో విధంగా చెప్పాలంటే ఇది మాకు హనీమూన్ కాలంలా అనిపిస్తుంది." అని మేఘన్ మార్కెల్ చెప్పడం విశేషం.2016లో, ఈ జంట తొలి సారు కలుసుకున్నారు. 2018లో పెళ్లి తరువాత, 2019లో తొలి బిడ్డ ప్రిన్స్ ఆర్చీని, 2021లో తమ రెండవ బిడ్డ ప్రిన్సెస్ లిలిబెట్ను స్వాగతించారు. ప్రస్తుతం, రాజ దంపతులు పిల్లలతో కలిసి అమెరికాలో ఉంటున్నారు.చదవండి: మనవడితో 50 ఏళ్ల మహిళ పెళ్లి : ఫ్యామిలీని లేపేసేందుకు కుట్ర?

సింహాచలం అప్పన్న సన్నిధిలో అపశ్రుతి.. ఏడుగురు భక్తులు మృతి
సాక్షి, విశాఖపట్నం: సింహాచలం చందనోత్సవంలో ఘోర అపశ్రుతి చోటుచేసుకుంది. గోడ కుప్పకూలి ఏడుగురు మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు. రూ.300 టికెట్ కౌంటర్ వద్ధ ఈ ప్రమాదం జరిగింది. ఇటీవలే అక్కడ గోడ నిర్మించారు. గోడ నాసిరకంగా నిర్మించడం వలనే కూలిపోయిందని అధికారులు భావిస్తున్నారు. తెల్లవారుజామున 2-3 గంటల మధ్య రూ.300 క్యూ లైన్లో ప్రమాదం జరిగింది. మృతులను యడ్ల వెంకటరావు(48),దుర్గా స్వామినాయుడు(32), మణికంఠ(28)గా గుర్తించారు.ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. మృతులను విశాఖపట్నం మధురవాడ సమీపంలోని చంద్రంపాలెం గ్రామానికి చెందిన పిళ్లా ఉమామహేశ్వరరావు (30), ఆయన భార్య శైలజ (26)గా అధికారులు గుర్తించారు. వీరితో పాటు పిల్లా శైలజ తల్లి వెంకటరత్నం, మేనత్త గుజ్జురి మహాలక్ష్మి కూడా ఈ ఘటనలో మృతిచెందారు. మృతదేహాలను కేజీహెచ్‌కు తరలించారు.👉ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఈ ప్రమాదం.. మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌తిరుపతిలో వైకుంఠ ఏకాదశి ఎంత విశిష్టత ఉంటుందోసింహాచలంలో చందనోత్సవానికి అంతే విశిష్టత ఉంటుందిప్రభుత్వ నిర్లక్ష్యం చేతకాని తనంతో ప్రమాదం జరిగిందిమూడు నాలుగు రోజుల క్రితం గోడ నిర్మించారుగోడ నిర్మాణంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోలేదుగోడ ప్లెక్సీ ఊగినట్లు ఊగిందని సాక్షులు చెప్పారుకొండవాలులో కాంక్రీట్ వాల్ నిర్మించాలిఇటుక బెడ్డలతో నిర్మాణం చేపట్టరాదుఒకే కుటుంబంలో నలుగురు చనిపోయారుచనిపోయిన వారి కుటుంబానికి కోటి రూపాయలు పరిహారం ఇవ్వాలిప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలిసంఘటన తెలిసిన వెంటనే వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారుకేజీహెచ్ లో బాధిత కుటుంబాలను పరామర్శిస్తారుప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే ప్రమాదం జరిగిందికొండపై చాలా గోడలు ఉన్నాయి.. అవి ఎందుకు పడుపోలేదునాణ్యాత లోపించింది కాబట్టే గోడ పడిపోయింది👉సింహాచలం దుర్ఘటన.. భక్తుల మృతిపై విచారణ కమిటీ ముగ్గురు అధికారులతో కమిటి వేసిన ప్రభుత్వం 👉సింహాచలం ఘటన.. ప్రభుత్వ వైఫల్యంపై మల్లాది విష్ణు ఫైర్ఈ ప్రభుత్వం మొద్దు నిద్ర పోతోంది...అచేతనంగా మారిపోయిందిప్రత్యర్థుల్ని ఇబ్బంది పెట్టడానికి మాత్రమే పోలీస్ శాఖ మాత్రమే పనిచేస్తుందితిరుపతి లడ్డూ అంశాన్ని తెరపైకి తెచ్చి వైఎస్ జగన్ పై బురద చల్లాలని చూశారుచందనోత్సవంలో అపశ్రుతి పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమేమంత్రులు, ప్రభుత్వం చేతకాని తనంతోనే భక్తులు ప్రాణాలు కోల్పోయారుచనిపోయిన వారిని తిరిగి తీసుకురాగలరా?రాష్ట్ర పండుగగా జరుపుకునే ఉత్సవానికి లోపభూయిష్టంగా ఏర్పాట్లు చేయడమేంటి?ఇంతపెద్ద ఘటన జరిగితే తప్పించుకునే ధోరణితో మంత్రులు, అధికారులు వ్యవహరిస్తున్నారువరుస అపచారాలు జరుగుతున్నా మొద్ద నిద్ర వీడటం లేదు 👉మరణించిన వారికి పోస్టుమార్టం చేయడానికి ఒప్పుకోని బంధువులుకోటి రూపాయల పరిహారం ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్తమ డిమాండ్లను ఒప్పుకున్న తర్వాతే పోస్టుమార్టం చేయాలంటున్న బంధువులుపోస్టుమార్టానికి సహకరించాలని బంధువులపై పోలీసులు ఒత్తిడిపోలీసులతో వాగ్వాదానికి దిగిన బంధువులుఎల్జీ పాలిమర్ ప్రమాదంలో చనిపోయిన వారికి కోటి రూపాయల పరిహారం చెల్లించారుఅదే తరహాలో నేడు కూడా పరిహారం చెల్లించాలని డిమాండ్..👉కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యమే: కొట్టు సత్యనారాయణతిరుపతి ఘటన మరవకముందే సింహాచలంలో ఏడుగురు భక్తులు మృతి దారుణంకూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందిలక్షలాది మంది భక్తులు వస్తారని తెలిసి కూడా ప్రభుత్వం ఏర్పాట్లు చేయలేదుసింహాచలం ఘటన బాధాకరంఘటన జరిగి కొన్ని గంటలు అవుతున్నా పవన్ కల్యాణ్ ఎక్కడ ఉన్నారు?క్యూలైన్ల దగ్గర ఎండోమెంట్,రెవెన్యూ అధికారులు ఎందుకు లేరు?గోదావరి పుష్కరాల్లో కూడా పదుల సంఖ్యలో భక్తులు చనిపోయారు.👉విశాఖకు మాజీ సీఎం వైఎస్ జగన్మధ్యాహ్నం 3 గంటలకు విశాఖకు చేరుకోనున్న వైఎస్ జగన్‌బాధిత కుటుంబాలను పరామర్శించనున్న వైఎస్ జగన్👉 సింహాచలం ఘటనపై ప్రధాని మోదీ విచారంవిశాఖ జిల్లా సింహాచలం దేవస్థానంలో గోడ కూలిన ఘటనపై ప్రధాని మోదీ విచారం గోడకూలి భక్తులు చనిపోవడం బాధాకరంమృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిగాయపడిన భక్తులు త్వరగా కోలుకోవాలి పీఎం సహాయ నిధి నుంచి ఎక్స్‌గ్రేషియా మృతుల కుటుంబాలకు PMNRF నుండి రూ. 2 లక్షల పరిహారం గాయపడిన వారికి రూ. 50,000 పరిహారం ఇస్తున్నట్లు పీఎంవో కార్యాలయం ఎక్స్ వేదికగా ట్వీట్ Deeply saddened by the loss of lives due to the collapse of a wall in Visakhapatnam, Andhra Pradesh. Condolences to those who have lost their loved ones. May the injured recover soon.An ex-gratia of Rs. 2 lakh from PMNRF would be given to the next of kin of each deceased. The…— PMO India (@PMOIndia) April 30, 2025 👉కేజీహెచ్ మార్చురి వద్ద విషాద ఛాయలుకేజీహెచ్ మార్చురి వద్దకు చేరుకుంటున్న మృతుల కుటుంబ సభ్యులుకన్నీరు మున్నీరవుతున్న కుటుంబ సభ్యులు...దైవదర్శనానికి వెళ్లి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారంటూ ఆవేదన👉సింహాచలం ఘటనపై వీహెచ్‌పీ ఆగ్రహంసింహాచలం సరైన రీతిలో ప్రభుత్వం చర్యలు చేపట్టలేదునిర్మాణ లోపం వల్లే ప్రమాదం జరిగిందిసింహాచలంలో పాలన కాదు.. లాబీయింగ్ నడుస్తోందిఎండోమెంట్ వ్యవస్థ ఓ చెత్తభగవంతుడికి భక్తులకు దూరం చేయడమే వారిపనిహిందువుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయిపాలకుల కబంధ హస్తాల నుంచి ఎండోమెంట్ వ్యవస్థ బయటకు వస్తేనే భక్తులకు మంచి జరుగుతోందిచందనోత్సవంలో ఒక ప్రణాళిక లేదు.. ఓ ప్లాన్ లేదు👉తిరుపతి తొక్కిసలాట ఘటన మరవకముందే..ఘటనపై సమగ్ర విచారణ చేసి.. మృతుల కుటుంబాలను ఆదుకోవాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి డిమాండ్ చేశారు. తిరుపతి తొక్కిసలాట ఘటన మరవకముందే సింహాచలంలో ఇలాంటి ఘటన జరగడం బాధాకరమని ఆమె అన్నారు. మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం ఇవ్వాలి. అన్యాయంగా ఏడుగురు చనిపోయారు. ప్రభుత్వం సరైన చర్యలు చేపట్టకపోవడం వల్లనే ప్రమాదం జరిగిందని వరుదు కల్యాణి అన్నారు.👉వైఎస్ జగన్ దిగ్భ్రాంతివిశాఖ జిల్లా సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవంలో గోడ కుప్పకూలి భక్తులు మృతి చెందడంపై మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చందనోత్సవం సందర్భంగా రూ. 300 టికెట్ క్యూలైన్ పై గోడ కుప్పకూలి భక్తులు మృత్యువాత పడటంపై తీవ్రవిచారం వ్యక్తం చేశారు. స్వామివారి నిజరూప దర్శనానికి వచ్చిన భక్తులు ఇటువంటి దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమన్నారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని, మరణించిన భక్తుల కుటుంబాలను ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.👉సింహాచలం ఘటనపై తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర విచారంగోడ కూలి భక్తులు మరణించిన ఘటన తీవ్ర ఆవేదనను కలిగించిందివారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి ఆంధ్ర ప్రదేశ్ లోని సింహాచలం ఆలయం వద్ద గోడ కూలి భక్తులు మరణించిన ఘటనతీవ్ర ఆవేదనను కలిగించింది. వారి కుటుంబ సభ్యులకునా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ…మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని…భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.— Revanth Reddy (@revanth_anumula) April 30, 2025

జాతీయ భద్రతా సలహా బోర్డు ఛైర్మన్‌గా అలోక్ జోషి
ఢిల్లీ: జాతీయ భద్రతా సలహా బోర్డును కేంద్ర ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించింది. జాతీయ భద్రతా సలహా బోర్డు ఛైర్మన్‌గా ‘రా’ మాజీ చీఫ్ అలోక్ జోషిని నియమించింది. ఏడుగురు సభ్యులతో జాతీయ భద్రతా సలహా బోర్డు పునర్వ్యవస్థీకరించింది. సభ్యులుగా మాజీ ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఆర్మీ అధికారులను నియమించింది. కాగా, ప్రధాని నివాసంలో బుధవారం.. భద్రతా వ్యవహారాల క్యాబినెట్ భేటీ నిర్వహించారు.ఈ సమావేశంలో రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా, జయశంకర్, నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు. ఉగ్రవాదులపై కఠిన చర్యలకు ఇప్పటికే భద్రత బలగాలకు ప్రధాని మోదీ సంపూర్ణ స్వేచ్ఛనిచ్చిన సంగతి తెలిసిందే. సీసీఎస్ అనంతరం సీసీపీఏ, సీసీఈఏ సమావేశాలు నిర్వహించారు. చివర్లో క్యాబినెట్ సమావేశం నిర్వహించారు. భద్రత వ్యవహారాలను సీసీఎస్ చర్చించింది. రాజకీయ పరిస్థితులను సీసీపీఏ చర్చించింది. ఆర్థిక అంశాలపై సీసీఈఏ పలు నిర్ణయాలు తీసుకుంది.సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్‌పై భారత్ మరిన్ని ఆంక్షలు విధించనుంది. ఫార్మా ఎగుమతులను నిలిపివేసే అవకాశం, భారత గగనతలంలోకి పాకిస్తాన్ విమానాల నిషేధం.. అరేబియా సముద్రంలో పోర్టుల కార్యకలాపాలపై ఆంక్షలు విధించే అవకాశం ఉంది. ఆంక్షలతో పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థను దెబ్బకొట్టే వ్యూహంలో భారత్ ఉంది. ఇవాళ 3 గంటలకు సీసీఎస్, సీసీపీఏ, సీసీఈఏ, కేంద్ర కేబినెట్ నిర్ణయాలను ప్రెస్మీట్లో వెల్లడించనున్నారు.

పాక్ కపట నాటకం.. వరుసగా రోజు భారత సైన్యంపై పాక్ సైన్యం కాల్పులు
జమ్మూ : భారత్ ఓ వైపు సైనిక చర్యకు సిద్ధమైందని, ఆ పని చేయొద్దంటూ ఐక్య రాజ్య సమితిని పాకిస్తాన్ బతిమలాడుతోంది. అదే సమయంలో భారత్‌ను రెచ్చగొట్టేలా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి యధేశ్చగా కాల్పులకు తెగబడుతుంది. తాజాగా, మంగళవారం రాత్రి జమ్మూలోని అఖ్నూర్ సెక్టార్, పరగ్వాల్ సెక్టార్లో అంతర్జాతీయ సరిహద్దు వద్ద పాకిస్తాన్ సైన్యం భారీ కాల్పులు జరిపింది. పాక్ కాల్పులపై భారత సైన్యం స్పందించింది. జమ్మూ ప్రాంతంలోని మూడు ప్రధాన సెక్టార్లలో కూడా కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘించింది. వరుసగా ఆరో రోజు పాక్ సైన్యం కాల్పులు జరిపింది. అంతే ధీటుగా భారత సైన్యం బదులిస్తోందని భద్రతా బలగాలు తెలిపాయి. BREAKING news :What kind of Pakistani army is this that is hell-bent on breaking its own country into 5 pieces?Pakistan indulges in ceasefire violation along the International Border (IB) in Jammu’s Akhnoor Sector, Pargwal. This is not LoC but IB making it a serious… pic.twitter.com/Z5VWPu4MVL— श्रवण बिश्नोई (किसान) (@SharwanKumarBi7) April 29, 2025 ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లో పహల్గాంలో ఉగ్రవాదులు 26మంది టూరిస్టుల ప్రాణాలు తీశారు. నాటి నుంచి భారత్-పాక్‌ల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. సైనిక దుస్తులు ధరించిన అమాయకుల ప్రాణాల్ని తీయడంపై భారత్.. పాక్‌ను అన్నీ అంశాల్లో దెబ్బకు దెబ్బతీయాలనే ప్రయత్నాల్ని ముమ్మరం చేస్తోంది.ఇందులో భాగంగా ఇండస్ వాటర్ ట్రీటీని తాత్కాలికంగా నిలిపివేసింది. ఏప్రిల్ 27 నుండి పాకిస్తాన్ పౌరులకు జారీ చేసిన వీసాలన్నీ రద్దు చేసింది. అటారీ బోర్డర్‌ను తక్షణమే మూసివేసింది.

తిరుపతి తొక్కిసలాట ఘటన మరవకముందే..
సాక్షి, విశాఖపట్నం: తిరుపతి తొక్కిసలాట ఘటన మరవకముందే.. సింహాచలంలో మరో ఘోర విషాదం జరిగింది. సింహాచలం అప్పన చందనోత్సవంలో ప్రభుత్వం నిర్లక్ష్యం ఫలితంగా.. గోడకూలి ఏడుగురు మృతిచెందారు. ఘటన జరిగిన సమయంలో ఒక్క పోలీసు కూడా కనిపించలేదు.. భక్తులను ఆదుకోవడానికి ఒక్క ఎండోమెంట్ ఉద్యోగి కూడా అక్కడ లేరు. అందుబాటులో ఉన్న వాలంటీర్లు, భక్తులు మాత్రమే సహాయక చర్యలు చేపట్టారు. కటిక చీకటిలో భక్తుల కోసం క్యూలైన్లు ఏర్పాటు చేయడంతో అంతా అంధకారం అలుముకుంది. గోడ కూలిపోవడంతో భక్తుల అరుపులు, రోదనలు మిన్నంటాయి. అప్పటికే భక్తుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.ఈ ఘటనపై సమగ్ర విచారణ చేసి.. మృతుల కుటుంబాలను ఆదుకోవాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం ఇవ్వాలన్నారు. అన్యాయంగా ఏడుగురు చనిపోయారు. ఘటనపై పూర్తి వివరాలు అధికారులను అడిగి తెలుసుకుంటున్నాం. సరైన చర్యలు చేపట్టకపోవడం వల్లనే ప్రమాదం జరిగిందని వరుదు కల్యాణి అన్నారు. కటిక చీకట్లో భక్తుల కోసం క్యూలైన్లా?. తిరుపతి తొక్కిసలాట ఘటన మరవకముందే. ఈ ఘటన ప్రభుత్వ వైఫల్యాన్ని బయటపెడుతోందని ఆమె అన్నారు.మరోవైపు, సింహాచలం ఘటనపై వీహెచ్‌పీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సింహాచలం సరైన రీతిలో ప్రభుత్వం చర్యలు చేపట్టలేదని.. నిర్మాణ లోపం వల్లే ప్రమాదం జరిగిందని మండిపడింది.సింహాచలంలో పాలన కాదు.. లాబీయింగ్ నడుస్తోంది. ఎండోమెంట్ వ్యవస్థ ఓ చెత్త.. భగవంతుడికి భక్తులకు దూరం చేయడమే వారిపని.. హిందువుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.. పాలకుల కబంధ హస్తాల నుంచి ఎండోమెంట్ వ్యవస్థ బయటకు వస్తేనే భక్తులకు మంచి జరుగుతోంది.. చందనోత్సవంలో ఒక ప్రణాళిక లేదు.. ఓ ప్లాన్ లేదు’’ అంటూ వీహెచ్‌పీ ఆగ్రహం వ్యక్తం చేసింది.

‘స్పిరిట్’ వెనక్కి.. సందీప్‌కి ట్విస్ట్ ఇచ్చిన ప్రభాస్!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) కొన్నేళ్లపాటు ఫుల్ బిజీ! ఇప్పటికే ఆయన అరడజను సినిమాల వరకు బాకీ ఉన్నాడు. వాటిల్లో ముందుగా రాబోయేది మారుతి దర్శకత్వం వహిస్తున్న ‘రాజాసాబ్’ సినిమా. పిపుల్స్ మీడియా నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ చివరి దశలో ఉంది. దీని తర్వాత ప్రభాస్ హను రాఘవపూడి దర్శకత్వంలో ‘ఫౌజీ’(ప్రచారంలో ఉన్న టైటిల్) చేయబోతున్నాడు. ఆ తర్వాత యానిమల్ ఫేం సందీప్ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga)తో ‘స్పిరిట్’(Spirit) చేయాల్సింది. ఈ రెండు పూర్తయిన తర్వాత నాగ్ అశ్విన్, ప్రశాంత్ నీల్‌తో పాటు యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మతో కూడా సినిమా చేయాలి. కానీ ఇప్పుడు ఈ ఆర్డర్ మారినట్లు తెలుస్తోంది. ‘స్పిరిట్’ని వెనక్కినెట్టి ప్రశాంత్ వర్మ సినిమా చేయడానికి ప్రభాస్ రెడీ అవుతున్నాడని టాలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.‘స్పిరిట్’కి బ్రేక్‌కి కారణం ఏంటి?సందీప్ రెడ్డి వంగా ‘స్పిరిట్’ స్క్రిప్ట్‌ను పూర్తి చేసి, లొకేషన్లు కూడా ఫైనల్ చేస్తున్నాడు. కానీ, ఈ సినిమా కోసం సందీప్ విధించిన కండీషన్లే ప్రభాస్‌ను కాస్త వెనకడుగు వేయించాయని టాక్. 65 రోజుల వరుస కాల్షీట్స్, డూప్ లేకుండా యాక్షన్ సీన్స్ చేయాలన్న సందీప్ షరతులకు ప్రభాస్ మొదట ఓకే చెప్పినప్పటికీ, ఇప్పుడు మాత్రం ప్రశాంత్ వర్మ సినిమాను ప్రాధాన్యతగా తీసుకున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో హీరోయిన్గా భాగ్యశ్రీ భోర్సే నటించనుందని బజ్.డబుల్ షూటింగ్‌తో బిజీ! ‘రాజాసాబ్’ షూటింగ్ పూర్తయిన వెంటనే హను రాఘవపూడి ‘ఫౌజీ’తో పాటు, ప్రశాంత్ వర్మ సినిమా షూటింగ్‌లోనూ ప్రభాస్ పాల్గొననున్నాడట. ప్రస్తుతం ఇటలీ టూర్లో ఉన్న ప్రభాస్, తిరిగి వచ్చిన తర్వాత ఈ విషయంపై క్లారిటీ రానుంది. మరి, ఈ షెడ్యూల్ మార్పు వెనుక అసలు కథేంటో తెలియాలంటే, మరికొన్ని రోజులు ఆగాల్సిందే!
నెల్లూరులో కారు బీభత్సం.. ఆరుగురి దుర్మరణం
అపుడు కాలుష్య కాసారం : ఇపుడు ఏడాదికి 600 టన్నుల పళ్లు
Bangladesh: చిన్మయ్ కృష్ణదాస్‌కు ఊరట
ఆ టికెట్‌తో ఇక రైలు ఎక్కలేరు! మే 1 నుంచి కొత్త రూలు..
అభిమానుల అత్యుత్సాహం.. ఆస్పత్రిలో కోలీవుడ్ స్టార్ అజిత్ కుమార్
భారత్‌తో టెస్టులకు ముందు.. ఇంగ్లండ్ బోర్డు కీలక నిర్ణయం!
Rohit Sharma: ఆ 'మూడు రికార్డులు' ఎవ్వరూ బద్దలు కొట్టలేరు..!
ప్రధాని మోదీ రష్యా పర్యటన రద్దు
బుల్లితెర నటి ఏఐ వీడియోలు.. ఇంత చెత్తగా ఆలోచిస్తారా?
ప్రిన్స్ హ్యారీతో విడాకులా? తొలిసారి మౌనం వీడిన మేఘన్
సింహాచలం అప్పన్న సన్నిధిలో అపశ్రుతి.. ఏడుగురు భక్తులు మృతి
తిరుపతి తొక్కిసలాట ఘటన మరవకముందే..
సింహాచలం చందనోత్సవంలో ఘోర అపశ్రుతి
తెలంగాణ టెన్త్ ఫలితాలు విడుదల.. ఒక్క క్లిక్‌తో చెక్ చేస్కోండిలా
సింహాచలం విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
విశాఖకు మాజీ సీఎం వైఎస్ జగన్
జాతీయ భద్రతా సలహా బోర్డు ఛైర్మన్‌గా అలోక్ జోషి
సింహాచలంలో ఘోర విషాదం.. చంద్రబాబు సర్కారుపై వీహెచ్‌పీ ఆగ్రహం
వివాహేతర సంబంధం.. భార్య కళ్లెదుటే ప్రియుడ్ని..
ఆమె నమ్మకమే కాపాడింది..! తృటిలో బయటపడ్డ పహల్గామ్ పర్యాటకుడి ఫ్యామిలీ
IPL 2025: రసవత్తరంగా సాగుతున్న ప్లే ఆఫ్స్ రేసు.. ఏ క్షణంలో ఏమైనా జరగవచ్చు..!
కెనడా కొత్త ప్రధానిగా మార్క్ కార్నీ
తక్కువ ధరకే బంగారం కావాలా!
సింహాచలం విషాదం.. ఏడుగురి ప్రాణం తీసిన గోడను నిర్మించింది అప్పుడే
అక్షయ ఫలాలనిచ్చే అక్షయ తృతీయ..!
DC VS KKR: చరిత్ర సృష్టించిన సునీల్ నరైన్
Kolkata: హోటల్లో ఘోర అగ్ని ప్రమాదం.. 14 మంది సజీవ దహనం
Vishakha: సింహాచలం ఘటనపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
థియేటర్, ఓటీటీలో బ్లాక్ బస్టర్.. ఇప్పుడు సీక్వెల్!
ఓటీటీలోకి వచ్చేసిన ఆంథాలజీ.. తెలుగులో స్ట్రీమింగ్
అతడిని బ్యాన్ చేయండి: టీమిండియా స్టార్‌పై నెటిజన్ల ఆగ్రహం
నాదేం లేదు.. దీనంతటికీ కారణం నా భార్య: స్టార్ హీరో
అల్లు అర్జున్ కోసం ఫ్లాపుల హీరోయిన్?
రంగులు మార్చే చాట్‌జీపీటీ
అక్షయ తృతీయ.. దయచేసి ఇలా చేయండి : గాయని చిన్మయి
గోల్డెన్ ఛాన్స్! బంగారం తులం ఎంతంటే..
పహల్గాం ఉగ్రదాడి మృతులకు నివాళులర్పించిన కేతిరెడ్డి
అసలు బంగారం ధర ఎందుకు పెరుగుతోంది?
IPL 2025: మాల్దీవ్స్‌లో ఎంజాయ్ చేస్తున్న ఇషాన్ కిషన్, ట్రవిస్ హెడ్
రెండు సార్లు ఫెయిల్ అయ్యా... పట్టుదలతో నాన్న కల నెరవేర్చా..
హైదరాబాద్‌లో ఆజాద్ ఇంజినీరింగ్ తయారీ ప్లాంటు
సాయి కుటుంబానికి అండగా ఉంటాం
టీమిండియాను శిక్షించిన ఐసీసీ
ఇద్దరిని బలిగొన్న అతివేగం
ఈ రాశి వారికి వృత్తి, వ్యాపారాలలో అనుకూలం
ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం: మరో 195 మంది ట్రైనీలు..
నా కొడుకుకి హిట్ 3 సినిమా చూపించను : నాని
ఈ సందేహాలు తీర్చండి.. టీఎస్పీఎస్సీకి కేంద్ర మంత్రి బండి సంజయ్ లేఖ
'హిట్ 3' నిర్మాత నేనే.. కానీ బడ్జెట్ ఎంతైందో తెలీదు
అప్పు ఇవ్వొద్దు.. పాక్‌పై భారత్ ఆర్థిక యుద్ధం
‘స్పిరిట్’ వెనక్కి.. సందీప్‌కి ట్విస్ట్ ఇచ్చిన ప్రభాస్!
వారెవ్వా ‘హిట్’మ్యాన్!.. పేద కుటుంబంలో పుట్టి.. కోటీశ్వరుడిగా!.. ఆస్తి ఎంతంటే?
ఆడుకుంటూ వెళ్లి అసువులు బాసింది
ఇండస్ఇండ్ సీఈఓ రాజీనామా!
బిడ్డా.. మీరెక్కడమ్మా
ప్రభుత్వ వైఫల్యంతోనే సింహాచలం దుర్ఘటన: వెల్లంపల్లి
విడాకుల తర్వాత కొత్తిల్లు కొన్న నటి.. 'నేను పేదదాన్ని అని మీకు చెప్పానా?'
సింహాచలం ఘటన.. మూడు రోజుల క్రితం గోడ కట్టడమేంటి?: లక్ష్మీపార్వతి
సడన్ గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమాలు
ఎక్కడికైనా సులభంగా చిన్న బయోచార్ యూనిట్
Akshaya Tritiya : ధగధగల వెనుక దగా!
ష్యూరిటీ ఇచ్చేముందే జాగ్రత్త పడాలి..!
మళ్లీ ఐపీవోల సందడి..!
అక్షయ తృతీయ.. రూ.16,000 కోట్ల అమ్మకాలు
ఢిల్లీలో పారని బాబు పాచిక!
పాక్ విమానాలకు నో ఎంట్రీ
Vaibhav Suryavanshi: ఈ ‘వైభవం’ కొనసాగాలి!
జూన్‌లో ఫిక్స్
ఫేమస్ అవగానే మారిపోతారు.. అలాంటి క్రేజ్ నాకొద్దని..: నాని
2026 ఏషియన్ గేమ్స్‌లో క్రికెట్.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఒలింపిక్ కమిటీ
‘అతడు వచ్చే ఏడాది ఆడకూడదు.. ఇప్పటికైనా జట్టును వదిలేయాలి’
ఇంగ్లండ్ టూర్‌కు ఆర్సీబీ కెప్టెన్.. కరుణ్, సాయి సుదర్శన్‌కు కూడా పిలుపు..?
హవ్వ.. ఇంకో 44 వేల ఎకరాలా?
జపాన్ కళతో శ్రీ వేంకటేశ్వర స్వామి రూపం..!
పాక్ కపట నాటకం.. వరుసగా రోజు భారత సైన్యంపై పాక్ సైన్యం కాల్పులు
పవన్ కొడుక్కి సైకియాట్రిస్ట్ ట్రీట్మెంట్!
స్వరలయ ఆర్ట్స్ సింగపూర్ ఫైన్ ఆర్ట్స్ అకాడమీ 6 వ వార్షికోత్సవ వేడుకలు
కొడుకు మృతదేహంతో మూడురోజులు
చుట్టుముట్టి చంపేశారు
గజం రూ.లక్షల్లో ఉంటే ఎకరా 99 పైసలకే ఇచ్చేస్తారా?
ప్రభుత్వం విచక్షణాధికార పరిధిని దాటితే ఎలా?
ఓటీటీ జోరు... డిజిటల్ మీడియా హోరు
శ్రీశైలం డ్యామ్‌కు తక్షణమే మరమ్మతులు చేయాలి
రాజకీయ ప్రేరేపిత చర్య
రన్ వేపై రెక్కల ముక్కలు
ప్రతిష్టాత్మకంగా ‘మిస్ వరల్డ్’
లిబరల్ పార్టీ విజయం
సైన్యానికి పూర్తి స్వేచ్ఛ; ప్రధాని మోదీ
కెమిస్ట్రీలో మూలకాలు.. ఫిజిక్స్‌లో థర్మోడైనమిక్స్
సోలార్ కాంట్రాక్టుల్లో అవకతవకలేమీ జరగలేదు
DC vs KKR: నైట్‌రైడర్స్ గెలుపు బాట
సూచీలకు స్వల్ప లాభాలు
బజాజ్ ఫైనాన్స్ బోనస్ బొనాంజా
కెనడాలో లిబరల్స్‌కు పట్టం
ప్రిన్స్ హ్యారీతో విడాకులా? తొలిసారి మౌనం వీడిన మేఘన్
సమస్యలు విని.. పరిష్కారాలు చెబుతోంది!
పాక్‌లో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు సాహసోపేత నిర్ణయం
తమ్ముడిని విమర్శించిన మాజీ క్రికెటర్.. అన్న కౌంటర్ అదుర్స్
కిచెన్ నైఫ్ పదును పోయిందా...!
పర్యావరణ హిత: ఈ చిత్రాన్ని మీకు సమర్పిస్తున్న వారు...
ఇప్పుడే జడ్జిమెంట్లు వద్దు.. మున్ముందు కఠిన సవాళ్లు: టీమిండియా మాజీ కోచ్
స్థిరంగా కదలాడుతున్న సూచీలు
బైబిల్... షేక్స్పియర్... అగథా క్రిస్టీ!
జనసేన కార్యాలయం వద్ద పీఈటీ అభ్యర్థుల నిరసన
ఎన్ఎఫ్హెచ్సీ.. సేవల్లో భేష్
ఎన్జీ రంగా అగ్రి వర్సిటీ వజ్రోత్సవాలు ప్రారంభం
అంతులేని అవినీతి.. అంతా అరాచకం: వైఎస్ జగన్
పార్లమెంట్‌ను సమావేశపర్చండి
ఎన్క్రిప్టెడ్ యాప్స్ ద్వారా డ్రగ్స్ దందా
కొత్త షెల్టర్ జోన్లకు మావో అగ్రనేతలు?
నెల్లూరులో కారు బీభత్సం.. ఆరుగురి దుర్మరణం
అపుడు కాలుష్య కాసారం : ఇపుడు ఏడాదికి 600 టన్నుల పళ్లు
Bangladesh: చిన్మయ్ కృష్ణదాస్‌కు ఊరట
ఆ టికెట్‌తో ఇక రైలు ఎక్కలేరు! మే 1 నుంచి కొత్త రూలు..
అభిమానుల అత్యుత్సాహం.. ఆస్పత్రిలో కోలీవుడ్ స్టార్ అజిత్ కుమార్
భారత్‌తో టెస్టులకు ముందు.. ఇంగ్లండ్ బోర్డు కీలక నిర్ణయం!
Rohit Sharma: ఆ 'మూడు రికార్డులు' ఎవ్వరూ బద్దలు కొట్టలేరు..!
ప్రధాని మోదీ రష్యా పర్యటన రద్దు
బుల్లితెర నటి ఏఐ వీడియోలు.. ఇంత చెత్తగా ఆలోచిస్తారా?
ప్రిన్స్ హ్యారీతో విడాకులా? తొలిసారి మౌనం వీడిన మేఘన్
సింహాచలం అప్పన్న సన్నిధిలో అపశ్రుతి.. ఏడుగురు భక్తులు మృతి
తిరుపతి తొక్కిసలాట ఘటన మరవకముందే..
సింహాచలం చందనోత్సవంలో ఘోర అపశ్రుతి
తెలంగాణ టెన్త్ ఫలితాలు విడుదల.. ఒక్క క్లిక్‌తో చెక్ చేస్కోండిలా
సింహాచలం విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
విశాఖకు మాజీ సీఎం వైఎస్ జగన్
జాతీయ భద్రతా సలహా బోర్డు ఛైర్మన్‌గా అలోక్ జోషి
సింహాచలంలో ఘోర విషాదం.. చంద్రబాబు సర్కారుపై వీహెచ్‌పీ ఆగ్రహం
వివాహేతర సంబంధం.. భార్య కళ్లెదుటే ప్రియుడ్ని..
ఆమె నమ్మకమే కాపాడింది..! తృటిలో బయటపడ్డ పహల్గామ్ పర్యాటకుడి ఫ్యామిలీ
IPL 2025: రసవత్తరంగా సాగుతున్న ప్లే ఆఫ్స్ రేసు.. ఏ క్షణంలో ఏమైనా జరగవచ్చు..!
కెనడా కొత్త ప్రధానిగా మార్క్ కార్నీ
తక్కువ ధరకే బంగారం కావాలా!
సింహాచలం విషాదం.. ఏడుగురి ప్రాణం తీసిన గోడను నిర్మించింది అప్పుడే
అక్షయ ఫలాలనిచ్చే అక్షయ తృతీయ..!
DC VS KKR: చరిత్ర సృష్టించిన సునీల్ నరైన్
Kolkata: హోటల్లో ఘోర అగ్ని ప్రమాదం.. 14 మంది సజీవ దహనం
Vishakha: సింహాచలం ఘటనపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
థియేటర్, ఓటీటీలో బ్లాక్ బస్టర్.. ఇప్పుడు సీక్వెల్!
ఓటీటీలోకి వచ్చేసిన ఆంథాలజీ.. తెలుగులో స్ట్రీమింగ్
అతడిని బ్యాన్ చేయండి: టీమిండియా స్టార్‌పై నెటిజన్ల ఆగ్రహం
నాదేం లేదు.. దీనంతటికీ కారణం నా భార్య: స్టార్ హీరో
అల్లు అర్జున్ కోసం ఫ్లాపుల హీరోయిన్?
రంగులు మార్చే చాట్‌జీపీటీ
అక్షయ తృతీయ.. దయచేసి ఇలా చేయండి : గాయని చిన్మయి
గోల్డెన్ ఛాన్స్! బంగారం తులం ఎంతంటే..
పహల్గాం ఉగ్రదాడి మృతులకు నివాళులర్పించిన కేతిరెడ్డి
అసలు బంగారం ధర ఎందుకు పెరుగుతోంది?
IPL 2025: మాల్దీవ్స్‌లో ఎంజాయ్ చేస్తున్న ఇషాన్ కిషన్, ట్రవిస్ హెడ్
రెండు సార్లు ఫెయిల్ అయ్యా... పట్టుదలతో నాన్న కల నెరవేర్చా..
హైదరాబాద్‌లో ఆజాద్ ఇంజినీరింగ్ తయారీ ప్లాంటు
సాయి కుటుంబానికి అండగా ఉంటాం
టీమిండియాను శిక్షించిన ఐసీసీ
ఇద్దరిని బలిగొన్న అతివేగం
ఈ రాశి వారికి వృత్తి, వ్యాపారాలలో అనుకూలం
ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం: మరో 195 మంది ట్రైనీలు..
నా కొడుకుకి హిట్ 3 సినిమా చూపించను : నాని
ఈ సందేహాలు తీర్చండి.. టీఎస్పీఎస్సీకి కేంద్ర మంత్రి బండి సంజయ్ లేఖ
'హిట్ 3' నిర్మాత నేనే.. కానీ బడ్జెట్ ఎంతైందో తెలీదు
అప్పు ఇవ్వొద్దు.. పాక్‌పై భారత్ ఆర్థిక యుద్ధం
‘స్పిరిట్’ వెనక్కి.. సందీప్‌కి ట్విస్ట్ ఇచ్చిన ప్రభాస్!
వారెవ్వా ‘హిట్’మ్యాన్!.. పేద కుటుంబంలో పుట్టి.. కోటీశ్వరుడిగా!.. ఆస్తి ఎంతంటే?
ఆడుకుంటూ వెళ్లి అసువులు బాసింది
ఇండస్ఇండ్ సీఈఓ రాజీనామా!
బిడ్డా.. మీరెక్కడమ్మా
ప్రభుత్వ వైఫల్యంతోనే సింహాచలం దుర్ఘటన: వెల్లంపల్లి
విడాకుల తర్వాత కొత్తిల్లు కొన్న నటి.. 'నేను పేదదాన్ని అని మీకు చెప్పానా?'
సింహాచలం ఘటన.. మూడు రోజుల క్రితం గోడ కట్టడమేంటి?: లక్ష్మీపార్వతి
సడన్ గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమాలు
ఎక్కడికైనా సులభంగా చిన్న బయోచార్ యూనిట్
Akshaya Tritiya : ధగధగల వెనుక దగా!
ష్యూరిటీ ఇచ్చేముందే జాగ్రత్త పడాలి..!
మళ్లీ ఐపీవోల సందడి..!
అక్షయ తృతీయ.. రూ.16,000 కోట్ల అమ్మకాలు
ఢిల్లీలో పారని బాబు పాచిక!
పాక్ విమానాలకు నో ఎంట్రీ
Vaibhav Suryavanshi: ఈ ‘వైభవం’ కొనసాగాలి!
జూన్‌లో ఫిక్స్
ఫేమస్ అవగానే మారిపోతారు.. అలాంటి క్రేజ్ నాకొద్దని..: నాని
2026 ఏషియన్ గేమ్స్‌లో క్రికెట్.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఒలింపిక్ కమిటీ
‘అతడు వచ్చే ఏడాది ఆడకూడదు.. ఇప్పటికైనా జట్టును వదిలేయాలి’
ఇంగ్లండ్ టూర్‌కు ఆర్సీబీ కెప్టెన్.. కరుణ్, సాయి సుదర్శన్‌కు కూడా పిలుపు..?
హవ్వ.. ఇంకో 44 వేల ఎకరాలా?
జపాన్ కళతో శ్రీ వేంకటేశ్వర స్వామి రూపం..!
పాక్ కపట నాటకం.. వరుసగా రోజు భారత సైన్యంపై పాక్ సైన్యం కాల్పులు
పవన్ కొడుక్కి సైకియాట్రిస్ట్ ట్రీట్మెంట్!
స్వరలయ ఆర్ట్స్ సింగపూర్ ఫైన్ ఆర్ట్స్ అకాడమీ 6 వ వార్షికోత్సవ వేడుకలు
కొడుకు మృతదేహంతో మూడురోజులు
చుట్టుముట్టి చంపేశారు
గజం రూ.లక్షల్లో ఉంటే ఎకరా 99 పైసలకే ఇచ్చేస్తారా?
ప్రభుత్వం విచక్షణాధికార పరిధిని దాటితే ఎలా?
ఓటీటీ జోరు... డిజిటల్ మీడియా హోరు
శ్రీశైలం డ్యామ్‌కు తక్షణమే మరమ్మతులు చేయాలి
రాజకీయ ప్రేరేపిత చర్య
రన్ వేపై రెక్కల ముక్కలు
ప్రతిష్టాత్మకంగా ‘మిస్ వరల్డ్’
లిబరల్ పార్టీ విజయం
సైన్యానికి పూర్తి స్వేచ్ఛ; ప్రధాని మోదీ
కెమిస్ట్రీలో మూలకాలు.. ఫిజిక్స్‌లో థర్మోడైనమిక్స్
సోలార్ కాంట్రాక్టుల్లో అవకతవకలేమీ జరగలేదు
DC vs KKR: నైట్‌రైడర్స్ గెలుపు బాట
సూచీలకు స్వల్ప లాభాలు
బజాజ్ ఫైనాన్స్ బోనస్ బొనాంజా
కెనడాలో లిబరల్స్‌కు పట్టం
ప్రిన్స్ హ్యారీతో విడాకులా? తొలిసారి మౌనం వీడిన మేఘన్
సమస్యలు విని.. పరిష్కారాలు చెబుతోంది!
పాక్‌లో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు సాహసోపేత నిర్ణయం
తమ్ముడిని విమర్శించిన మాజీ క్రికెటర్.. అన్న కౌంటర్ అదుర్స్
కిచెన్ నైఫ్ పదును పోయిందా...!
పర్యావరణ హిత: ఈ చిత్రాన్ని మీకు సమర్పిస్తున్న వారు...
ఇప్పుడే జడ్జిమెంట్లు వద్దు.. మున్ముందు కఠిన సవాళ్లు: టీమిండియా మాజీ కోచ్
స్థిరంగా కదలాడుతున్న సూచీలు
బైబిల్... షేక్స్పియర్... అగథా క్రిస్టీ!
జనసేన కార్యాలయం వద్ద పీఈటీ అభ్యర్థుల నిరసన
ఎన్ఎఫ్హెచ్సీ.. సేవల్లో భేష్
ఎన్జీ రంగా అగ్రి వర్సిటీ వజ్రోత్సవాలు ప్రారంభం
అంతులేని అవినీతి.. అంతా అరాచకం: వైఎస్ జగన్
పార్లమెంట్‌ను సమావేశపర్చండి
ఎన్క్రిప్టెడ్ యాప్స్ ద్వారా డ్రగ్స్ దందా
కొత్త షెల్టర్ జోన్లకు మావో అగ్రనేతలు?
సినిమా

సడన్ గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమాలు
ఓటీటీలో ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు రిలీజ్ అవుతూనే ఉన్నాయి. మిగతా భాషలతో పాటు తెలుగు చిత్రాలు కూడా అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. దీంతో టైమ్ కుదిరినప్పుడల్లా ప్రేక్షకులు వీటిని చూసి ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా రెండు తెలుగు మూవీస్.. సడన్ గా ఓటీటీలో ప్రత్యక్షమయ్యాయి. వేటిలో స్ట్రీమింగ్ అవుతున్నాయంటే?గతేడాది అక్టోబరు చివరి వారంలో 'సముద్రుడు' అనే సినిమా రిలీజైంది. ఇది ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లోకి వచ్చింది. రమాకాంత్, అవంతిక, భాను శ్రీ హీరోహీరోయిన్లుగా నటించారు. మత్స్యకారుల జీవితాలు ఎలా ఉంటాయి? వాళ్ళ కష్టాలు ఏంటి? దళారులు.. మత్స్యకారులను ఎలా మోసం చేస్తున్నారు లాంటి అంశాలతో ఈ మూవీ తీశారు. (ఇదీ చదవండి: 'కోర్ట్'ని మించిపోయేలా ఉంటుంది.. ఓటీటీ డేట్ ఫిక్స్) అలానే 2022లో రిలీజైన 'రుద్రవీణ'.. ఇప్పుడు ఎలాంటి హడావుడి లేకుండా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చింది. బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ ఇందులో హీరోయిన్ గా చేసింది. ఇదో రొటీన్ యాక్షన్ మూవీ. ఊరిని ఇబ్బంది పెట్టే రౌడీ. దీంతో హీరో రంగంలోకి దిగుతాడు. చివరకు విలన్ ని హీరో ఎలా చంపాడనేదే స్టోరీ.పై రెండు సినిమాలు కూడా అంతంత మాత్రంగానే ఉండటంతో ఇలా థియేటర్లలోకి వచ్చి అలా వెళ్లిపోయాయి. ఇవి ఇప్పుడు రెంట్ విధానంలో అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చాయి. గత కొన్ని వారాలుగా ఈ ఓటీటీ సంస్థ ఇలానే పలు తెలుగు చిన్న చిత్రాల్ని స్ట్రీమింగ్ చేస్తోంది. ఆసక్తి ఉంటే వీటిపై ఓ లుక్కేయండి.(ఇదీ చదవండి: ఓటీటీలోకి థ్రిల్లర్ సినిమా.. తొమ్మిదేళ్ల తర్వాత తెలుగులో)

పవన్ కొడుక్కి సైకియాట్రిస్ట్ ట్రీట్మెంట్!
పవన్ కల్యాణ్ కొడుకు మార్క్ శంకర్.. కొన్నిరోజుల క్రితం సింగపూర్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. స్కూల్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగేసరికి మార్క్ కి గాయాలు కాగా కొన్నాళ్ల పాటు అక్కడే చికిత్స అందించి హైదరాబాద్ తీసుకొచ్చారు. ప్రస్తుతం ఆరోగ్యం కుదట పడిందనే అందరూ అనుకున్నారు. కానీ మరో ట్రీట్ మెంట్ కూడా జరుగుతోందని పవన్ చెప్పుకొచ్చారు.(ఇదీ చదవండి: సంధ్య థియేటర్ ఘటన.. బాలుడు శ్రీతేజ్ డిశ్చార్జ్) పహల్గామ్ మృతులకు నివాళి ఆర్పించడంలో భాగంగా తాజాగా మంగళగిరిలో ఓ సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో మాట్లాడిన పవన్ కల్యాణ్.. తన కొడుకు ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి గురించి కూడా బయటపెట్టారు.అగ్ని ప్రమాదంలో మార్క్ శంకర్ ఊపిరితిత్తుల్లోకి పొగ చేరడంతో బ్రాంకోస్కోపీ చేయించారు. తర్వాత హైదరాబాద్ తీసుకొచ్చేశారు. అయితే తన కుమారుడు సురక్షితంగా ఇంటికి చేరుకున్నప్పటికీ.. ఇప్పటికీ ఆ ఘటన నుంచి తేరుకోలేకపోతున్నాడని, రాత్రుళ్ల నిద్రలో నుంచి భయపడి లేస్తున్నాడని చెప్పారు.(ఇదీ చదవండి: నాదేం లేదు.. దీనంతటికీ కారణం నా భార్య: స్టార్ హీరో) బిల్డింగ్ పై నుంచి కింద పడిపోయినట్లు తన కొడుకు మార్క్ శంకర్ కి కలలు వస్తున్నాయని పవన్ అన్నారు. ఈ ట్రామా, భయాన్ని తగ్గించేందుకు సైకియాట్రిస్ట్ ట్రీట్ మెంట్ ప్రస్తుతం చేయిస్తున్నామని చెప్పుకొచ్చారు.పవన్ కల్యాణ్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతానికి రెండింటికి పనిచేస్తున్నారు. అవే హరిహర వీరమల్లు, ఓజీ. వీటిలో పవన్ కి సంబంధించిన షూటింగ్ పెండింగ్ లో ఉంది. మరి వీటిని ఎప్పుడు పూర్తి చేస్తారో దానిబట్టి రిలీజ్ చేస్తామని నిర్మాతలు అనుకుంటున్నారు.(ఇదీ చదవండి: 13ఏళ్లకే హీరో, 15ఏళ్లకే టాలీవుడ్ స్టార్..ఒక్క యాక్సిడెంట్‌తో తెరమరుగు..)

ఓటీటీలోకి వచ్చేసిన ఆంథాలజీ.. తెలుగులో స్ట్రీమింగ్
ఒకప్పటితో పోలిస్తే వారంతో సంబంధం లేకుండా ఓటీటీలోకి కొత్త సినిమాలు, సిరీసులు రిలీజ్ అవుతున్నాయి. ఇతర భాషల్లో రిలీజైనవి కూడా కొన్నాళ్ల గ్యాప్ తర్వాత తెలుగులో స్ట్రీమింగ్ అవుతున్నాయి. అలా ఓ సిరీస్ తెలుగు వెర్షన్ ఓటీటీలోకి వచ్చేసింది. ఇంతకీ ఏంటి సంగతి? ఎందులో స్ట్రీమింగ్ అవుతోంది.సోనియా అగర్వాల్, శ్రీకాంత్ ప్రధాన పాత్రలో నటించిన తమిళ సిరీస్ 'ష్'. ఇది నాలుగు కథల సమాహారం. లస్ట్, రొమాన్స్ తదితర అంశాలని బోల్డ్ గానే చూపించే ప్రయత్నం చేశారు. స్కూల్ ఏజ్ లో సె*క్స్ ఎడ్యుకేషన్.. పెళ్లికి ముందు.. పెళ్లి తర్వాత శృంగార జీవితం తదితర స్టోరీలతో ఈ ఆంథాలజీ తీశారు. పృథ్వీ ఆదిత్య, వాలి మోహన్ దాస్, హరీష్, కార్తీకేయన్ దర్శకత్వం వహించారు. (ఇదీ చదవండి: అల్లు అర్జున్ కోసం ఫ్లాపుల హీరోయిన్?)గతేడాది తమిళంలో రిలీజ్ కాగా.. దీని తెలుగు వెర్షన్ ఇప్పుడు(ఏప్రిల్ 30 నుంచి) ఆహా ఓటీటీలోకి వచ్చింది. ఒరిజినల్ వెర్షన్ అయితే ఆహా, అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది. నెట్ ఫ్లిక్స్ లో అప్పట్లో సెన్సేషన్ సృష్టించిన 'లస్ట్ స్టోరీస్' స్ఫూర్తితో ఈ ఆంథాలజీని తెరకెక్కించారు. ట్రైలర్ చూస్తే మీకు ఇది అర్థమైపోతుంది. ఇందులో మరీ అంత బోల్డ్ సీన్స్ లేవని, క్లైమాక్స్ ని ఓపెన్ ఎండింగ్ తో ముగించడం కాస్త అసంతృప్తిని కలిగించిందని తమిళంలో రిలీజైనప్పుడు అన్నారు. మరి తెలుగు ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి?(ఇదీ చదవండి: 'కోర్ట్'ని మించిపోయేలా ఉంటుంది.. ఓటీటీ డేట్ ఫిక్స్)

అభినయమే ఆభరణం.. నటీనటులకు నగలతో అనుబంధం
పెళ్లి అయినా పేరంటమైనా అయినా నగలు అలంకరించుకోవాల్సిందే అంటారు ఆభరణాల ప్రియులు.. అభినయమైనా, ఆభరణమైనా నటులు ఉండాల్సిందే అంటున్నారు ప్రచార వ్యూహాల రూపకర్తలు. తారలు ఆభరణాల లేబుల్‌ల మధ్య అనుబంధం నిత్య కళ్యాణం పచ్చతోరణం అని చెప్పాలి. కళ్యాణం అనగానే పెళ్లి మాత్రమే కాదు కళ్యాణ్ జ్యుయలర్స్ ప్రకటన కూడా గుర్తొస్తుందంటే కారణం... నాగార్జున అని చెప్పొచ్చు, అమితాబ్ బచ్చన్ అని కూడా చెప్పొచ్చు. దేశంలోని బంగారు ఆభరణాల వ్యాపారంలో దక్షిణాది రాష్ట్రాలు దాదాపు 37% వాటాను కలిగి ఉన్న నేపధ్యంలో ఈ బ్రాండ్ తమిళనాడులో ప్రభు గణేషన్, తెలుగు రాష్ట్రాల కోసం అక్కినేని నాగార్జున, కన్నడిగుల్ని మెప్పించడానికి...శివరాజ్‌కుమార్, మంజు వారియర్... ఇలా నలుగురు ప్రధాన తారలతో ఒప్పందం కుదుర్చుకుంది .నమూనాలు, శైలులు, సున్నితత్వాలు ప్రాధాన్యతలు మన దేశంలో ఉన్న భాషలు మాండలికాలు విభిన్నంగా ఉంటాయి. అందుకే మా బ్రాండ్ దక్షిణాది రాష్ట్రాల్లో ఒక్కో ప్రాంతీయ బ్రాండ్ అంబాసిడర్‌ని ఎంపిక చేసిందని కళ్యాణ్ జ్యువెలర్స్ మార్కెటింగ్, హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రమేష్ కళ్యాణరామన్ అంటున్నారు. భారతీయ బంగారు ఆభరణాల మార్కెట్లో పశ్చిమ భారత రాష్ట్రాలు 32% వాటా కలిగి ఉన్నందున ఇదే బ్రాండ్ బాలీవుడ్ నుంచి గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్లుగా అమితాబ్ బచ్చన్, జయా బచ్చన్ కత్రినా కైఫ్‌లను ఎంపిక చేసింది. గతంలో ఈ బ్రాండ్ ఐశ్వర్య రాయ్ బచ్చన్ సోనమ్ కపూర్ వంటి వారితో కూడా జట్టు కట్టింది.బంగారం వెలిగిపోతోంది.. ఆభరణాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. అలాగే తారలతో ఆభరణాల బ్రాండ్స్ అనుబంధం కూడా అంతకంతకూ పెరిగిపోతోంది. టాలీవుడ్ హీరో యంగ్‌టైగర్ ఎన్టీయార్ మలబార్ గోల్డ్‌లో మెరిశారు. ఇక రామ్ చరణ్ భీమా జ్యుయలర్స్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా కనిపిస్తున్నారు. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్‌బాబు కుమార్తె సితార సైతం ప్రముఖ ఆభరణ బ్రాండ్ పిఎంజె జ్యుయల్స్‌కు అంబాసిడర్‌గా వ్యవహరిస్తోంది. గతంలో గానీ ప్రస్తుతం గానీ... చూసుకుంటే బ్రాండ్ అంబాసిడర్స్‌గా కావచ్చు కలెక్షన్లను ఆవిష్కరించిన సెలబ్రిటీలుగా కావచ్చు... ర్యాంప్ మీద ఆభరణాలను ప్రదర్శించి కావచ్చు..విభిన్న రకాలుగా అనేక మంది నటీనటులు నగధగలకు తమ స్టార్ డమ్ మెరుపులను జత చేశారు.ఒక్కసారి పరిశీలిస్తే...నటి తమన్నా భాటియా వైట్ అండ్ గోల్డ్ బ్రాండ్‌ను స్వయంగా లాంచ్ చేసింది. అంతేకాదు ఆమె హెడ్ డిజైనర్‌గానూ పనిచేస్తోంది. గతంలో ఓ ఆభరణాలను తాకట్టుపెట్టుకునే మరో బ్రాండ్‌కు ఆమె ప్రచారం చేసింది. బాలీవుడ్ నటి దిశా పటానీ రిలయన్స్ జ్యువెల్స్ రూపొందించిన మధ్యప్రదేశ్ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబింబించే ’వింధ్య కలెక్షన్’ను ఆవిష్కరించారు. త్రిభువన్ దాస్ భీమ్జీ జువేరీ తమ బ్రాండ్ అంబాసిడర్‌గా బాలీవుడ్ నటి సారా అలీ ఖాన్‌ను నియమించుకుంది. భీమా జ్యువెలర్స్‌కు మొదటి బ్రాండ్ అంబాసిడర్‌గా టాలీవుడ్, బాలీవుడ్ నటి పూజా హెగ్డే పనిచేస్తే, బాలీవుడ్ నటి కరీనా కపూర్ ఖాన్ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించింది. అంతగా పాప్యులర్ కాని ఓ మోస్తరు నటీమణులను సైతం బ్రాండ్స్ ఎంపిక చేసుకోవడం విశేషం. వెడ్డింగ్ పులావ్, గులాబీ లెన్స్ వంటి సినిమాల్లో పలు వెబ్‌సిరీస్‌లలో నటించిన అనుష్కా రంజన్ వరుణ డి జానీ అనే ఆభరణ బ్రాండ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా మెరిసింది. ఖన్నా జ్యువెలర్స్ నగల ప్రచారంలో నటి చిత్రాంగద సింగ్ పనిచేసింది.కలెక్షన్స్ విడుదల్లోనూ...బ్రాండ్ అంబాసిడర్‌గా చేయడంతో పాటు కేవలం ఒక కలెక్షన్స్‌ను మాత్రమే ప్రదర్శించడం, విడుదల చేయడం వంటివి కూడా తారలు చేస్తున్నారు.తాప్సీ పన్ను రిలయన్స్ జ్యువెల్స్ ’తంజావూర్ కలెక్షన్’ను లాక్మీ ఫ్యాషన్ వీక్‌లో ప్రదర్శించారు. జాన్వీ కపూర్ సైతం అంతకు ముందే ఈ తంజావూర్ కలెక్షన్‌ను పరిచయం చేశారు. బెంగాలీ నటి రితాభారి చక్రబర్తి గత ఏడాది కల్యాణ్ జ్యువెలర్స్ అక్షయ తృతీయ ప్రత్యేక కలెక్షన్స్‌ను ప్రారంభించింది. బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ తన భార్య ట్వింకిల్ ఖన్నాతో కలిసి పిసి జ్యువెలర్స్ బంగారు ఆభరణాలు సతీసమేతంగా ప్రదర్శించాడు. బంగారు ఆభరణాలను మాత్రమే కాదు బంగారంతో అనుబంధం ఉన్న ప్రతీ దాంట్లో తారలు తళుక్కుమంటున్నారు. డిజిటల్ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్‌ఫారమ్ అయిన ప్లస్ గోల్డ్ కు సోనాక్షి సిన్హా ప్లస్ గోల్డ్ బ్రాండ్ అంబాసిడర్‌గా పనిచేసింది. అలాగే బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టుకునే ముత్తూట్ ఫైనాన్స్‌కు టాలీవుడ్ సీనియర్ హీరో వెంకటేష్ జట్టు కట్టారు.ప్రతి పండుగ సీజన్లో మాదిరిగానే అక్షయ తృతీయ రోజున ప్రింట్ మీడియా సిటీ హోర్డింగ్‌లలో గోల్డ్ ఫీవర్ కనిపిస్తుంది. విలాసవంతమైన, మెరిసే ఆభరణాలను ధరించిన బాలీవుడ్, దక్షిణ భారత సినిమాలకు చెందిన తారల ప్రకటనలతో నిండిపోతాయిు. అయితే ఒక సెలబ్రిటీ పని బ్రాండ్ తాజా కలెక్షన్స్‌ను ప్రదర్శించేందుకు పోజులివ్వడమే కాదు – ఇది సీజన్ ట్రెండ్లు సమయాలు సందర్భాలను దృష్టిలో ఉంచుకుని వీరు తప్పనిసరిగా సోషల్ మీడియాలో బ్రాండ్ గురించి మాట్లాడాలి బ్రాండ్ ఆభరణాలను ధరించి ఈవెంట్స్‌లో కనిపించాలి. ఒప్పందాల గోప్యత కారణంగా సెలబ్రిటీ ఎండార్స్మెంట్ల కోసం కేటాయించిన ఖర్చుల గురించి చాలా బ్రాండ్లు పెదవి విప్పడం లేదు. అయితే ప్రతి ప్రచారానికి సెలబ్రిటీని బట్టి కనీసం రూ. 20 లక్షల నుంచి రూ. 1 కోటి అంతకంటే ఎక్కువ ముట్టచెబుతారని పరిశ్రమలోని సీనియర్లు చెబుతున్నారు.
న్యూస్ పాడ్‌కాస్ట్
క్రీడలు

పాక్‌లో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు సాహసోపేత నిర్ణయం
ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్లో గల ప్రశాంతమైన బైసారన్ లోయలో పాక్ ఉగ్రమూకలు కాల్పులకు తెగబడి 26 మంది పర్యాటకులను పొట్టన పెట్టుకున్నారు. ఈ ఉగ్రదాడి తర్వాత భారత ప్రభుత్వం పాక్‌పై చాలా సీరియస్‌గా ఉంది. ఏ క్షణంలోనైనా భారత బలగాలు పాకిస్తాన్‌పై దాడులు చేయవచ్చని ప్రచారం జరుగుతుంది.పాక్‌లో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ బంగ్లాదేశ్ పురుషుల క్రికెట్ జట్టు ఓ సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్లో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడేందుకు ఒప్పుకుంది. ఈ సిరీస్ మే 25 నుంచి జూన్ 3 వరకు జరుగుతుంది. ఫ్యూచర్ టూర్ ప్రోగ్రాం (FTP) ప్రకారం పాక్ పర్యటనలో బంగ్లాదేశ్ మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడాల్సి ఉండింది. అయితే వచ్చే ఏడాది టీ20 వరల్డ్‌కప్ జరుగనుండటంతో ఇరు జట్ల బోర్డులు మూడు వన్డేల సిరీస్‌కు బదులు అదనంగా రెండు టీ20లు ఆడేందుకు ఒప్పందం చేసుకున్నాయి.ఈ సిరీస్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఇవాళ (ఏప్రిల్ 30) ప్రకటించింది. ఈ సిరీస్‌లోని మ్యాచ్‌లు ఫైసలాబాద్, లాహోర్ నగరాల్లో జరుగనున్నాయి. మే 25, 27న తొలి రెండు టీ20లు ఫైసలాబాద్‌లో జరుగనుండగా.. లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో మిగిలిన మూడు టీ20లు మే 30, జూన్ 1, జూన్ 3 తేదీల్లో జరుగనున్నాయి. ఈ సిరీస్ కోసం బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు మే 21న పాకిస్తాన్‌కు చేరుకుంటుంది. ఫైసలాబాద్‌లో ఆ జట్టు మే 22-24వ తేదీ వరకు ప్రాక్టీస్ సెషన్స్‌లో పాల్గొంటుంది.ఇదిలా ఉంటే, పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత ప్రభుత్వం చాలా విషయాల్లో పాక్‌ను కోలుకోలేని దెబ్బలు కొట్టింది. సింధు జలాల ఒప్పందం రద్దు సహా ఆ దేశ ట్విటర్, సినిమాలపై నిషేధం విధించింది. పాక్‌కు చెందిన 16 యూట్యూబ్ ఛానళ్లను, ఆ దేశ జర్నలిస్ట్‌లను కూడా బ్యాన్ చేసింది. తాజాగా పాక్‌కు అప్పు ఇవ్వొద్దని IMFకు సూచించింది.

తమ్ముడిని విమర్శించిన మాజీ క్రికెటర్.. అన్న కౌంటర్ అదుర్స్
టీమిండియా రికార్డుల రారాజు విరాట్ కోహ్లి (Virat Kohli) ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లోనూ మేటి ఆటగాడిగా ఎన్నో అరుదైన ఘనతలు సాధించాడు. లీగ్ ఆరంభం నుంచి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB)కి ప్రాతినిథ్యం వహిస్తున్న కోహ్లి.. కెప్టెన్‌గానూ వ్యవహరించాడు. ఇప్పటి వరకు మొత్తంగా 262 మ్యాచ్‌లు పూర్తి చేసుకుని 8447 పరుగులు సాధించాడు.తద్వారా క్యాష్ రిచ్ లీగ్‌లో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్‌గా కింగ్ కొనసాగుతున్నాడు. ఇక కోహ్లి ఖాతాలో ఎనిమిది ఐపీఎల్ సెంచరీలు కూడా ఉండటం విశేషం. గతేడాది 15 మ్యాచ్‌లలో కలిపి 741 పరుగులు చేసిన కోహ్లి.. ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్నాడు. ఈ ఏడాది ఇప్పటికి పది మ్యాచ్‌లలో కలిపి 443 పరుగులు చేసి.. అత్యధిక పరుగుల వీరుల జాబితాలో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.స్ట్రైక్‌రేటుపై విమర్శలుఅయితే, ఇన్ని ఘనతలు సాధించినప్పటికీ కోహ్లి స్ట్రైక్‌రేటుపై సునిల్ గావస్కర్, సంజయ్ మంజ్రేకర్ వంటి భారత మాజీ క్రికెటర్లు పెదవి విరుస్తూనే ఉన్నారు. ఇటీవల ముంబై ఇండియన్స్‌తో ఆర్సీబీ మ్యాచ్ సందర్భంగా మంజ్రేకర్ కోహ్లిపై విమర్శలు గుప్పించాడు.బుమ్రా వర్సెస్ కోహ్లి ఇకపై బెస్ట్ వర్సెస్ బెస్ట్ కాదని పేర్కొన్నాడు. ఐపీఎల్-2025లో అగ్రస్థానంలో ఉండే పదిమందిలో తానైతే కోహ్లి పేరు చెప్పనని.. అతడు తన జాబితాలో లేడనే మంజ్రేకర్ వ్యాఖ్యానించాడు.మాట్లాడటం సులువేఈ నేపథ్యంలో విరాట్ కోహ్లి అన్నయ్య వికాస్ కోహ్లి సంజయ్ మంజ్రేకర్‌కు ‘ఎక్స్’ వేదికగా కౌంటర్ ఇచ్చాడు. ‘‘సంజయ్ మంజ్రేకర్.. వన్డే కెరీర్ స్ట్రైక్ రేటు: 64.31.. 200కి పైగా స్ట్రైక్రేట్ల గురించి మాట్లాడటం సులువే’’ అంటూ తన తమ్ముడిని విమర్శించినందుకు అతడి స్ట్రైక్‌రేటు గురించి ప్రస్తావిస్తూ చురకలు అంటించాడు.సింగిల్స్, డబుల్స్‌కి కూడా ప్రాధాన్యంకాగా అంతకుముందు విరాట్ కోహ్లి కూడా విమర్శకులకు కౌంటర్ ఇచ్చిన విషయం తెలిసిందే. పరిస్థితులకు తగ్గట్లుగా ఆడుతూ జట్టును విజయపథంలో నడపడమే అత్యంత ముఖ్యమని పేర్కొన్నాడు. తాను సింగిల్స్, డబుల్స్‌కి కూడా ప్రాధాన్యం ఇస్తానని.. ఒక్కోసారి ఆ పరుగులే ఎంతో కీలకం అవుతాయన్నాడు.కానీ కొందరు మాత్రం భాగస్వామ్యాల ప్రాధాన్యం గురించి మరిచి.. విమర్శలకు దిగుతుంటారని కోహ్లి పేర్కొన్నాడు. కాగా ఈ సీజన్లో ఆర్సీబీ దుమ్ములేపుతోంది. రజత్ పాటిదార్ నాయకత్వంలో ఇప్పటికి ఆడిన పది మ్యాచ్‌లలో ఏడు గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. చదవండి: అతడిని బ్యాన్ చేయండి: టీమిండియా స్టార్‌పై నెటిజన్ల ఆగ్రహం

ఇంగ్లండ్ టూర్‌కు ఆర్సీబీ కెప్టెన్.. కరుణ్, సాయి సుదర్శన్‌కు కూడా పిలుపు..?
ఐపీఎల్ 2025 ముగిశాక భారత క్రికెట్ జట్టు జూన్ మధ్యలో ఇంగ్లండ్ పర్యటనకు బయల్దేరుతుంది. ఈ పర్యటనలో టీమిండియా 5 టెస్ట్ మ్యాచ్‌లు ఆడుతుంది. ఈ సిరీస్ కోసం బీసీసీఐ 35 మంది ఆటగాళ్లను షార్ట్ లిస్ట్ చేసినట్లు తెలుస్తుంది.బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25, అంతకుముందు స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో ఘోరంగా విఫలమైన భారత కెప్టెన్ రోహిత్ శర్మకు సెలెక్టర్లు మరో అవకాశం ఇస్తారని తెలుస్తుంది. ఇన్ ఫామ్ బ్యాటర్ కరుణ్ నాయర్, ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ జట్టులో చోటు దక్కించుకోనున్నారని సమాచారం. ఐపీఎల్ 2025లో లీడింగ్ రన్ స్కోరర్‌గా కొనసాగుతున్న గుజరాత్ ఓపెనర్ సాయి సుదర్శన్‌ను ప్రత్యామ్నాయ ఓపెనర్‌గా ఎంపిక చేయనున్నారని తెలుస్తుంది. ప్రత్యామ్నాయ ఓపెనర్‌గా సీఎస్కే యువ సంచలనం ఆయుశ్ మాత్రే పేరును కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది.అశ్విన్ రిటైర్ కావడంతో అతని స్థానాన్ని కుల్దీప్ యాదవ్‌తో భర్తీ చేయనున్నారని సమాచారం. ఈ సిరీస్ కోసం అక్షర్ పటేల్ పేరు పరిగణలోకి తీసుకోలేదని తెలుస్తుంది. అలాగే మిడిలార్డర్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ పేరును కూడా సెలెక్టర్లు పక్కన పెట్టారని తెలుస్తుంది. పరిమిత ఓవర్ల ఫార్మాట్లో సత్తా చాటుతున్న శ్రేయస్ అయ్యర్‌ను ఎంపిక చేయాలా వద్దా అన్న అంశంపై చర్చలు సాగుతున్నట్లు సమాచారం. ప్రధాన పేసర్లుగా బుమ్రా, షమీ ఎంపిక దాదాపుగా ఖరారైనప్పటికీ.. సేఫ్టీగా వీలైనంత ఎక్కువ మంది రిజర్వ్ పేసర్లను ఎంపిక చేయనున్నారని తెలుస్తుంది. ఇంగ్లండ్ పర్యటన కోసం భారత సీనియర్ జట్టుతో పాటు భారత-ఏ జట్టును కూడా మే రెండో వారంలో ప్రకటించే అవకాశం ఉంది.ఇదిలా ఉంటే, భారత ఆటగాళ్లంతా ప్రస్తుతం ఐపీఎల్ 2025లో బిజీగా ఉన్నారు. ఈ లీగ్‌లో ప్రదర్శనల ఆధారంగా ఇంగ్లండ్ పర్యటనకు ఎంపికలు జరుగుతాయి. ఈ సీజన్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చే ఆటగాళ్లను భారత సెలెక్టర్లు పరిగణలోకి తీసుకోవచ్చు. ఫార్మాట్ వేరైనా ఆటగాళ్లలో కన్సిస్టెన్సీని గమనిస్తారు.ప్రస్తుతం ఐపీఎల్ 2025 రసవత్తరంగా సాగుతుంది. మొత్తం ఏడు జట్లు నాలుగు ప్లే ఆఫ్స్ బెర్త్‌ల కోసం ప్రధానంగా పోటీపడుతున్నాయి. ఏ జట్టుకు ఇప్పటివరకు ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు కాలేదు. సీఎస్కే మినహా అన్ని జట్లకు ప్లే ఆఫ్స్ అవకాశాలు ఉన్నాయి. ప్లే ఆఫ్స్ రేసులో ఆర్సీబీ ముందుంది. ఆ జట్టు 10 మ్యాచ్‌ల్లో 7 విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతుంది. ఆతర్వాత ముంబై, గుజరాత్, ఢిల్లీ తలో 12 పాయింట్లతో వరుసగా 2, 3, 4 స్థానాల్లో ఉన్నాయి. పంజాబ్ (11), లక్నో (10), కేకేఆర్ (9) ఆతర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నాయి. రాజస్థాన్ (6), సన్‌రైజర్స్ (6), సీఎస్కే (4) 8, 9, 10 స్థానాల్లో ఉన్నాయి.

IPL 2025: మాల్దీవ్స్‌లో ఎంజాయ్ చేస్తున్న ఇషాన్ కిషన్, ట్రవిస్ హెడ్
ఐపీఎల్ 2025లో తదుపరి ఆడబోయే అత్యంత కీలకమైన మ్యాచ్‌లకు ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు ప్రముఖ పర్యాటక దేశం మాల్దీవ్స్‌లో సేద తీరుతున్నారు. ఏప్రిల్ 25న సీఎస్కేపై విజయానంతరం ఆరెంజ్ ఆర్మీ మాల్దీవ్స్‌కు చెక్కేసింది. అప్పటి నుంచి సన్‌రైజర్స్ ఆటగాళ్లు మాల్దీవ్స్‌లో ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా సన్‌రైజర్స్ స్టార్ ఆటగాళ్లు సరదాగా గడుపుతున్న వీడియో ఒకటి సోషల్‌మీడియాలో ప్రత్యక్షమైంది. Ishan Kishan Vs Abhishek Sharma in the volleyball game. 😄 pic.twitter.com/d46iqYQlR7— Mufaddal Vohra (@mufaddal_vohra) April 28, 2025ఈ వీడియోలో సన్‌రైజర్స్ విధ్వంసకర ఆటగాడు ట్రవిస్ హెడ్ డ్రింక్ తాగుతూ సేద తీరుతుండగా.. మరో విధ్వంకర బ్యాటర్ ఇషాన్ కిషన్ సహచరులతో వాలీబాల్ ఆడుతూ కనిపించాడు. ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. కీలక మ్యాచ్‌లకు ముందు తమ ఆటగాళ్లకు రీఫ్రెష్మెంట్ అవసరమని సన్‌రైజర్స్ యాజమాన్యం మాల్దీవ్స్ టూర్ ప్లాన్ చేసింది. సన్‌రైజర్స్ తమ తదుపరి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌తో తలపడాల్సి ఉంది. ఈ మ్యాచ్ మే 2న అహ్మదాబాద్‌లో జరుగనుంది. దీని తర్వాత సన్‌రైజర్స్ వరుసగా ఢిల్లీ (మే 5, హైదరాబాద్), కేకేఆర్ (మే 10, హైదరాబాద్), ఆర్సీబీ (మే 13, బెంగళూరు), లక్నోతో (మే 18, లక్నో) మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది.గత మ్యాచ్‌లో సీఎస్కేపై గెలుపుతో సన్‌రైజర్స్ ప్లే ఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. ఈ సీజన్లో ఆ జట్టు ఆడిన 9 మ్యాచ్‌ల్లో కేవలం మూడే విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో చివరి నుంచి మూడో స్థానంలో ఉంది. ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే సన్‌రైజర్స్ తదుపరి ఆడాల్సిన ఐదు మ్యాచ్‌ల్లో భారీ తేడాతో గెలవాల్సి ఉంటుంది. ఇలా జరిగినా ఆ జట్టు ప్లే ఆఫ్స్ అవకాశాలు ఇతర జట్ల జయాపజయాలపై ఆధారపడి ఉంటాయి.ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో గతేడాది రన్నరప్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఆశించిన ఫలితాలు సాధించలేదు. తొలి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై గెలిచి.. ఆతర్వాత వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో ఓడింది (లక్నో, ఢిల్లీ, కేకేఆర్,గుజరాత్). తర్వాత పంజాబ్‌పై సంచలన విజయం సాధించి (246 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి).. ముంబై ఇండియన్స్ చేతుల్లో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడింది. తాజాగా సీఎస్కేను వారి సొంత ఇలాకాలో ఓడించి, సీజన్లో మూడో విజయాన్ని నమోదు చేసింది.కాగా, ఈ సీజన్ ప్రారంభానికి ముందు సన్‌రైజర్స్‌పై భారీ అంచనాలు ఉండేవి. అందుకు తగ్గట్టుగానే తొలి మ్యాచ్‌లో ఆ జట్టు రాజస్థాన్ రాయల్స్‌పై 286 పరుగుల రికార్డు స్కోర్ సాధించి విజయం సాధించింది. ఆ మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ సూపర్ సెంచరీతో మెరిశాడు.ఆ మ్యాచ్ తర్వాత మళ్లీ గెలవడానికి సన్‌రైజర్స్‌కు ఐదు మ్యాచ్‌ల సమయం పట్టింది. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో అభిషేక్ శర్మ విధ్వంసకర శతకంతో విరుచుకుపడటంతో సన్‌రైజర్స్ రెండో విజయం సాధించింది. తాజాగా సన్‌రైజర్స్ సీఎస్కేపై గెలిచినా అది వారిపై ఉన్న అంచనాలకు తగ్గట్టుగా లేదు. సీఎస్కే నిర్దేశించిన 155 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు ఆ జట్టు ఆపసోపాలు పడింది.
బిజినెస్

పెట్టుబడుల కొనసాగింపుపై సెబీ ఛైర్మన్ సూచనలు
అంతర్జాతీయంగా ప్రతికూల పవనాలు వీస్తున్నప్పటికీ భారత్ కాస్త పటిష్టమైన స్థితిలోనే ఉందని మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఛైర్మన్ తుహిన్ కాంత పాండే తెలిపారు. మార్కెట్ ఒడిదుడుకులపై ఆందోళన చెందకుండా, ఇన్వెస్టర్లు దీర్ఘకాలంపాటు తమ పెట్టుబడులను కొనసాగించడం శ్రేయస్కరమని ఆయన సూచించారు.టారిఫ్‌ల యుద్ధం మార్కెట్లపై ప్రభావాలు చూపడం మొదలైనప్పటి నుంచి కూడా భారత్ దీటుగా ఎదురు నిలుస్తోందని పాండే చెప్పారు. స్థిరమైన ఆర్థిక వృద్ధి, తక్కువ స్థాయిలో ద్రవ్య లోటు, సముచిత స్థాయిలో విదేశీ రుణభారం, కరెంటు అకౌంటు లోటు అదుపులోనే ఉండటం మొదలైనవి దేశానికి సానుకూల అంశాలని ఆయన పేర్కొన్నారు. భారత్ పలు ద్వైపాక్షిక ఒప్పందాలపై కూడా చర్చలు జరుపుతోందని వివరించారు. ఇటీవల పెట్టుబడులు పెట్టిన చాలా మంది రిటైల్ ఇన్వెస్టర్లకు మార్కెట్ల పతనం గురించి పెద్దగా తెలియదు కాబట్టి, ప్రస్తుత పరిస్థితులను ఒక పాఠంగా భావించి, పెట్టుబడులను కొనసాగిస్తే దీర్ఘకాలంలో ప్రయోజనకరంగా ఉంటుందని పాండే చెప్పారు.ఇదీ చదవండి: తక్కువ ధరకే బంగారం కావాలా!రిటైల్ ఇన్వెస్టర్లు అన్ని వివరాలను తెలుసుకుని, పూర్తి అవగాహనతోనే ఇన్వెస్ట్ చేయాలని పాండే సూచించారు. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్‌లో భారీ నష్టాలను ఉటంకిస్తూ.. మార్కెట్‌ను కేసినోగా భావించరాదని చెప్పారు. అధిక రాబడులు వస్తాయనే తప్పుడు హామీల వైపు ఆకర్షితులు కాకుండా వివేకవంతంగా వ్యవహరించాలని సూచించారు.

స్థిరంగా కదలాడుతున్న సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్‌తో పోలిస్తే బుధవారం స్థిరంగా కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 9:42 సమయానికి నిఫ్టీ(Nifty) 10 పాయింట్లు పెరిగి 24,345కు చేరింది. సెన్సెక్స్(Sensex) 41 పాయింట్లు పుంజుకుని 80,339 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 99.34 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 62.74 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.17 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో గతంతో పోలిస్తే లాభాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్‌తో పోలిస్తే 0.58 శాతం లాభపడింది. నాస్డాక్ 0.55 శాతం ఎగబాకింది.ఆసియా మార్కెట్లలో సానుకూల ధోరణులు, అంతర్జాతీయ వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడం మార్కెట్ సెంటిమెంట్‌కు దోహదపడుతుంది. ఇండియా-పాక్ ఉద్రిక్తతలను మార్కెట్ వర్గాలు నిశితంగా పరిశీలిస్తున్నాయి. తగ్గిన చమురు ధరలు ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను తగ్గించి, ఆర్థిక వృద్ధికి తోడ్పడుతున్నాయి. మహారాష్ట్ర డే సందర్భంగా రేపు గురువారం(మే 1న) మార్కెట్లు పనిచేయవు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

తక్కువ ధరకే బంగారం కావాలా!
అక్షయ తృతీయ కారణంగా ఈరోజు చాలామంది బంగారం కొనేందుకు షాపుల ముందు బారులు తీరుతున్నారు. దేశంలో పసిడి ధరలు దాదాపు తులం రూ.లక్షకు చేరువయ్యాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా భారీగా పెరుగుతున్న బంగారం ధర త్వరలో తులం రూ.ఒక లక్షకు చేరుతుందని కొందరు అంచనా వేస్తున్నారు. అయితే ప్రపంచంలోని కొన్ని దేశాల్లో భారత్ కంటే తక్కువ ధరకే బంగారం లభిస్తుంది. వాటి వివరాలు కింద తెలుసుకుందాం.దుబాయ్, యుఏఈఈ దేశం ‘బంగారు నగరం’గా ప్రసిద్ధి చెందింది. బంగారంపై తక్కువ పన్నులు ఉండడంతో ఇక్కడ అత్యంత సరసమైన ధరలకే పసిడి లభిస్తుంది. ఇక్కడ బంగారం సాధారణంగా భారతదేశం కంటే 10-15 శాతం చౌకగా ఉంటుంది. యూఏఈలో బంగారంపై విలువ ఆధారిత పన్ను(వ్యాట్) లేకపోవడం గమనార్హం. దీనికితోడు దిగుమతి సుంకాలు తక్కువగా ఉండడంతో సరసమైన ధరలకు బంగారాన్ని కొనుగోలు చేయాలనుకునే భారతీయులు ఈ దేశాన్ని అన్వేశిస్తున్నారు.థాయ్‌లాండ్‌ఇక్కడ బ్యాంకాక్, పట్టాయా బంగారం కొనుగోలుకు ప్రసిద్ధ ప్రదేశాలు. తక్కువ మేకింగ్ ఛార్జీలు, పన్నుల కారణంగా భారత్‌తో పోలిస్తే ఈ దేశం తక్కువ ధరకే బంగారు ఆభరణాలను అందిస్తోంది. సాధారణంగా థాయ్‌లాండ్‌లో బంగారం భారత్ కంటే 5-10 శాతం చౌకగా ఉంటుంది. ఆ దేశంలో తక్కువ తయారీ ఖర్చులు, బంగారంపై స్వల్పంగా పన్నులు విధిస్తున్నారు. భారత్‌తో పోలిస్తే సాపేక్షంగా తక్కువ మేకింగ్ ఛార్జీలతో బంగారు ఆభరణాలు లభిస్తాయి.సింగపూర్తక్కువ పన్నులు, బంగారం ధరల్లో పోటీ కారణంగా గోల్డ్ షాపింగ్‌కు సింగపూర్ కీలక గమ్యస్థానంగా ఉంది. నాణ్యమైన బంగారాన్ని విక్రయించడంలో ఈ దేశానికి మంచి పేరు ఉంది. ఇక్కడ ధరలు భారతదేశం కంటే 5-8 శాతం చౌకగా ఉంటాయి. ఈ దేశంలో గ్రేడ్ బంగారంపై జీఎస్టీ లేదు. దాంతో చౌకగా లభిస్తుంది.మలేషియాకౌలాలంపూర్‌లో సరసమైన బంగారం ధరలు ఉన్నాయి. తక్కువ తయారీ ఛార్జీలు, పన్నుల కోసం చూస్తున్న భారతీయ కొనుగోలుదారులను ఆకర్షిస్తున్నాయి. ఈ దేశంలో పోటీ ధరలను అందించే అనేక దుకాణాలు ఉన్నాయి. మలేషియాలో బంగారం భారతదేశం కంటే 5-10 శాతం చౌకగా ఉంటుంది. బంగారంపూ తక్కువ పన్నులు, మేకింగ్ ఛార్జీలను అందిస్తున్నారు.ఇదీ చదవండి: భారత్‌లో ఫాక్స్‌కాన్ ఆదాయం రూ.1.7 లక్షల కోట్లుహాంగ్ కాంగ్హాంగ్ కాంగ్ బంగారం, విలువైన లోహాలపై పన్ను మినహిస్తుంది. దాంతో తక్కువ ధరలకు లభిస్తాయి. ఈ దేశం బంగారం ట్రేడింగ్‌కు ప్రధాన కేంద్రంగా ఉంది. పోటీ ధరల కారణంగా చాలా మంది భారతీయులు ఇక్కడ బంగారాన్ని కొనుగోలు చేస్తారు. హాంకాంగ్‌లో బంగారం సాధారణంగా భారతదేశం కంటే 5-10 శాతం చౌకగా ఉంటుంది.

భారత్‌లో ఫాక్స్‌కాన్ ఆదాయం రూ.1.7 లక్షల కోట్లు
తైవాన్‌కి చెందిన ఎల్రక్టానిక్స్ దిగ్గజం ఫాక్స్‌కాన్ భారత విభాగం ఆదాయం గత ఆర్థిక సంవత్సరంలో రెట్టింపై 20 బిలియన్ డాలర్లకు (సుమారు రూ.1.7 లక్షల కోట్లు) చేరినట్లు సమాచారం. ఐఫోన్ విక్రయాలు గణనీయంగా పెరగడం ఇందుకు కారణమని సంబంధిత వర్గాలు తెలిపాయి. అలాగే, ఉద్యోగుల సంఖ్య కూడా 65 శాతం పెరిగి సుమారు 80,000కు చేరినట్లు పరిశ్రమ, ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.చైనాపై టారిఫ్‌ల కారణంగా అమెరికా మార్కెట్ కోసం ఐఫోన్లన్నింటినీ భారత్‌లోనే తయారు చేయించుకోవాలని యాపిల్ భావిస్తున్న నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఫాక్స్‌కాన్ ఆదాయం అనేక రెట్లు పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నాయి. ఐఫోన్లను అత్యధికంగా తయారు చేసే ఫాక్స్‌కాన్, చైనాకు వెలుపల రెండో అతి పెద్ద ప్లాంటును బెంగళూరులో సుమారు రూ.25,000 కోట్లతో ఏర్పాటు చేసే ప్రయత్నాల్లో ఉంది.ఇండియాలో తమిళనాడులోని శ్రీపెరంబుదూరులో ఫాక్స్‌కాన్ ప్రధాన కేంద్రం ఉంది. ఇక్కడ ఐఫోన్ అసెంబ్లింగ్ ప్లాంట్‌ను నిర్వహిస్తుంది. ఈ ప్లాంట్ 2017లో ఐఫోన్ల ఉత్పత్తిని ప్రారంభించింది. 2023లో ఐఫోన్ 15ను అసెంబుల్ చేసింది. ఇది తాజా ఐఫోన్ మోడళ్లలో భారతదేశం భాగస్వామ్యాన్ని సూచిస్తుంది. 2025 చివరి నాటికి ఐప్యాడ్ అసెంబ్లింగ్ ప్రారంభించాలని యోచిస్తోంది. చైనా నుంచి దిగుమతి చేసుకునే విడిభాగాలపై ఆధారపడటాన్ని తగ్గించడమే లక్ష్యంగా చెన్నై సమీపంలో స్మార్ట్‌ఫోన్ డిస్ప్లే మాడ్యూల్ అసెంబ్లింగ్ యూనిట్లో కంపెనీ పెట్టుబడులు పెట్టింది.ఇదీ చదవండి: మళ్లీ ఐపీవోల సందడి..!బెంగళూరు సమీపంలోని దేవనహళ్లిలో ఫాక్స్‌కాన్ 2.5 బిలియన్ డాలర్ల విలువైన ‘ప్రాజెక్ట్ ఎలిఫెంట్’ ఐఫోన్ ఫ్యాక్టరీని నిర్మిస్తోంది. ఏటా 20 మిలియన్ల ఐఫోన్లను ఉత్పత్తి చేయడంతో పాటు 40,000 ఉద్యోగాలను సృష్టించనుంది.
ఫ్యామిలీ

రెండు సార్లు ఫెయిల్ అయ్యా... పట్టుదలతో నాన్న కల నెరవేర్చా..
‘నన్ను కలెక్టర్‌గా చూడాలనేది మా నాన్న కోరిక.. దాన్ని ఎలాగైనా నెరవేర్చాలని పాఠశాల స్థాయిలోనే నిర్ణయించుకున్నా.. ఆయన అందించిన ప్రోత్సాహంతో ముందుకు సాగా.. రెండుసార్లు విఫలమయ్యా.. అయినా నిరాశ చెందలేదు.. రాత్రింబవళ్లు మరింత కష్టపడి చదివా.. లోటుపాట్లు సవరించుకుని ముందడుగు వేశాను. మూడో ప్రయత్నంలో విజయం సాధించా.. 2023 యూపీఎస్సీ ఫలితాల్లో జాతీయ స్థాయిలో 29వ ర్యాంకు సాధించా.. ఐఏఎస్‌గా తెలంగాణ క్యాడర్‌కు ఎంపికయ్యా.. నాన్న కల నెరవేర్చడం నాకెంతో ఆనందాన్నిచ్చింది. ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలను అమలు చేసి, పేదలకు సేవ చేయడమే లక్ష్యమని అంటున్నారు జిల్లాకు నూతనంగా విచ్చేసిన ట్రెయినీ కలెక్టర్ సలోని చాబ్రా (Saloni Chhabra). ‘సాక్షి’కి మంగళవారం ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె పలు విషమాలు వెల్లడించారు.-కైలాస్నగర్సాక్షి: ‘గుడ్ మార్నింగ్ మేడమ్.. వెల్కమ్ టు ఆదిలాబాద్. ట్రెయినీ కలెక్టర్‌గా జిల్లాకు విచ్చేసిన మీకు మరోసారి ప్రత్యేక అభినందనలు. మీ కుటుంబ నేపథ్యం వివరాలు.. ట్రెయినీ కలెక్టర్: మాది హర్యానా రాష్ట్రంలోని గురుగ్రాం. నాన్న ఇంద్రజిత్, అమ్మ సీమ. ఇద్ద రూ గురుగ్రాంలోనే బిజినెస్ చేస్తుంటారు. అన్న గ్రాడ్యూయేషన్ పూర్తి చేశాడు. ఊరిలోనే అమ్మనాన్నలకు తోడుగా ఉంటూ వ్యాపారం చూసుకుంటారు.ఇదీ చదవండి: మనవడితో 50 ఏళ్ల మహిళ పెళ్లి : ఫ్యామిలీని లేపేసేందుకు కుట్ర?సాక్షి: మీ విద్యాభ్యాసం ఎక్కడెక్కడ సాగింది..ట్రెయినీ కలెక్టర్: ఒకటి నుంచి ఇంటర్మీడియెట్ వరకు గురుగ్రాంలోని బ్లూ బెల్స్‌లో చదివా. చిన్నతనం నుంచే చదువులో ముందుండేదాన్ని. స్కూల్లో నిర్వహించే డిబేట్లు, ఎక్స్ట్రా కరిక్యూలమ్‌లో పాల్గొంటూ ప్రతి భ కనబర్చుతుండేది. చదువులో ఎప్పుడూ ముందుండే నేను టెన్త్, ఇంటర్లో ఫస్ట్‌క్లాస్ లో పాసయ్యా. అనంతరం ఢిల్లీలోని శ్రీరాం కాలేజ్ ఆఫ్ కామర్స్ యూనివర్సిటీలో బీఏ ఆనర్స్ ఎకానావిుక్స్ పూర్తి చేశాను. ఆ వెంటనే సివిల్స్ పరీక్షలపై దృష్టి సారించాను. సాక్షి: యూపీఎస్సీ కోచింగ్ ఎక్కడ తీసుకున్నారు.. ఎన్నోసారి విజయం సాధించారు..ట్రెయినీ కలెక్టర్: పదో తరగతిలోనే ఐఏఎస్ సాధించాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నా. ఆ దిశగా అడుగులు వేశాను. ఢిల్లీలోని కోచింగ్ సెంటర్లో ఏడాది పాటు శిక్షణ పొందాను. ఆప్షనల్ సబ్జెక్ట్‌గా సోషియాలజీని ఎంచుకు న్నా. ప్రణాళికాబద్ధంగా చదివా. 2021లో తొలిసారి యూపీఎస్సీ పరీక్షలకు హాజరయ్యా. ఇంటర్వ్యూ వరకు వెళ్లాను. అయితే కొద్దిపాటి తేడాతో విజయం సాధించలేకపోయాను. మరో ప్రయత్నంలో ప్రిలిమ్స్‌లోనే ఆగిపోయాను. అయినా నిరాశ చెందలేదు. మూడో ప్రయత్నం 2023లో జాతీయస్థాయిలో 29వ ర్యాంకు సాధించాను. ఐఏఎస్ కావాలనే నా సంకల్పంతోపాటు నాన్న కలను నెరవేర్చాను. తెలంగాణ క్యాడర్‌కు ఎంపికై ప్రస్తుతం ట్రైనింగ్ నిమిత్తం ఆదిలా బాద్‌కు రావడం జరిగింది. ఏడాది పాటు జిల్లాలో పని చేయాల్సి ఉంటుంది. రెండుసార్లు విఫలమైన సమయంలో నేను ఆత్మవిశ్వాసం కోల్పోకుండా అమ్మనాన్నలు అండగా నిలిచారు. వెన్నుతట్టారు. వారందించిన ప్రోత్సాహం తోనే విజయం సాధించాను. సివిల్స్, ఇతర పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే యువతకు మీరిచ్చే సలహా.. ట్రెయినీ కలెక్టర్: సివిల్ సర్వీసెస్‌కు సన్నద్ధమయ్యే అభ్యర్థుల్లో చాలా మంది ఒకటి, రెండు ప్రయత్నాలకే నిరాశకు లోనవుతారు. ఇక మా వల్ల కాదంటూ వెనుకడుగు వేస్తుంటారు. అపజయాలను చూసి నిరాశ చెందొద్దు. సంకల్పం వీడకుండా ముందుడుగు వేయాలి. పట్టుదలతో ప్రణాళికాబద్ధంగా చదివితే తప్పకుండా విజయం సాధించవచ్చు. రోజుకు కనీసం 8 నుంచి 10 గంటలు చదవాలి. ముఖ్యంగా సెల్‌ఫోన్, సోషల్ మీడియాకు దూరంగా ఉండాలి. ప్రతిరోజు పత్రికలను చదవడం అలవాటు చేసుకోవాలి. వర్తమాన అంశాలపై పట్టు సాధించాలి. గత ప్రశ్నాపత్రాలను విశ్లేషించుకోవాలి. సందేహాలుంటే ఎప్పటికప్పుడు నివృత్తి చేసుకోవాలి. ఆత్మవిశ్వాసం, సంకల్పబలంతో ప్రయత్నిస్తే తప్పకుండా లక్ష్యాన్ని సాధించవచ్చు.

ష్యూరిటీ ఇచ్చేముందే జాగ్రత్త పడాలి..!
నా స్నేహితుడు ఒక ప్రైవేటు చిట్‌ఫండ్ కంపెనీలో డబ్బు తీసుకునేటప్పుడు నేను హామీ (ష్యూరిటీ) ఇచ్చాను. ఇప్పుడు అతను పరారీ లో ఉన్నాడు. చిట్‌ఫండ్ వారు నాపై కేసు వేశారు. ఆ మొత్తం నేను కట్టవలసిందేనా?– రాహుల్, ఖమ్మం ష్యూరిటీ ఇమ్మని మిమ్మల్ని ఎవరూ బలవంతం చేయలేదు కదా! ష్యూరిటీ ఇచ్చిన తర్వాత మీరు ఎంత మొత్తానికి హామీ ఇచ్చారో అంత మొత్తం మీ వద్ద నుండి వసూలు చేస్తారు. వాయిదా పద్ధతుల్లో చెల్లించవచ్చు. మీ స్నేహితుడికి ఏవైనా ఆస్తులు ఉంటే అవి జప్తు చేయవలసినదిగా కోరవచ్చు. అలాంటివి ఏమైనా ఉన్నాయేమో చూడండి. ష్యూరిటీ ఇచ్చేముందు జాగ్రత్త వహించడం మంచిది. నమ్మకస్తులకి, డబ్బు తిరిగి చెల్లించే స్థితి ఉన్న వారికి మాత్రమే ష్యూరిటీ ఇవ్వడం మంచిది.నేను ఒక ప్రైవేటు సంస్థలో చిట్టీ కట్టాను. మొత్తం 50 నెలలు కట్టాలి కానీ నా పరిస్థితులు బాగుండక 15 నెలలు మాత్రమే కట్టాను. చిట్టీ ఎత్తలేదు. నేను కట్టిన డబ్బు నాకు తిరిగి రావాలంటే ఏం చేయాలి?– సుందర్, హైదరాబాద్చిట్టీ కట్టడాన్ని మధ్యలోనే ఆపేయడం తరచుగానే చూస్తుంటాం. మంచి సంస్థలలో అయితే లిఖితపూర్వక హామీపత్రాలు (అగ్రిమెంట్) ఉంటాయి కాబట్టి, అందులోని ఒప్పందం ప్రకారం కొంత జరిమానా విధించి మీరు అప్పటివరకు కట్టిన మొత్తాన్ని తిరిగి చెల్లిస్తుంటారు. కొన్ని సంస్థలు అయితే చిట్టీ గడువు పూర్తిగా ముగిశాక లేదా మీ బదులు ఇంకెవరైనా మీ గ్రూపు చిట్టీలో కలిస్తే కొంత కమీషన్ తీసుకొని డబ్బు తిరిగి ఇస్తుంటారు. ఏది ఏమైనా, మీరు కట్టినన్ని డబ్బులు మీకు రావు కానీ పూర్తి నష్టం మాత్రం ఉండదు. మీరు చిట్టీ కట్టిన సంస్థని సంప్రదించి క్యాన్సిలేషన్ అడగండి. వారి నిబంధనల మేరకు వారికి రావలసిన మొత్తాన్ని మినహాయించుకుని మిగిలినది ఇస్తారు. (చదవండి: ప్లంబర్లుగా మహిళా శక్తి!)

ప్లంబర్లుగా మహిళా శక్తి!
లింగ సమానత్వం కార్పొరేట్ రంగాల్లో కాదు శ్రామిక శక్తిలో చూపాలి అని నిరూపిస్తోంది జోర్డాన్ మహిళ. జోర్డాన్‌లో వందలాది మహిళలు ప్లంబర్లుగా విధులను నిర్వహిస్తున్నారు. మొదట్లో దీనిని అవమానకరంగా భావిస్తూ వీరి పనులపై గతంలో నిషేధం విధించారు. అక్కడి సామాజిక, సాంస్కృతిక నిబంధనల కారణంగా మహిళలు శ్రామిక శక్తిలోకి ప్రవేశించడం ఒక సవాల్‌గా ఉంది. ఇప్పుడు ఆ అనిశ్చితి తొలగి, జోర్డాన్‌లో మహిళా ప్లంబర్లపై ప్రభుత్వం నిషేధాన్ని తొలగించింది. 2006లో మొట్టమొదటి లైసెన్స్ పొందిన మహిళా ప్లంబర్ ఖవ్లా షేక్ ఈ పనిలోకి ఎక్కువ మంది మహిళలు వచ్చేలా ్ర΄ోత్సహిస్తుండగా, 2014 లో ఏర్పడిన వైజ్ ఉమెన్ ప్లంబర్స్ కో ఆపరేటివ్ ఈ రంగంలో లింగసమానత్వం సాధించడానికి కృషి చేస్తోంది. జోర్డాన్ సంప్రదాయ కట్టుబాట్ల కంచెను తొలగించుకుంటూ అక్కడి మహిళ తన ఉనికికోసం చేస్తున్న కృషి ప్రపంచం దృష్టిని ఆకట్టుకునేలా చేస్తోంది. ‘స్త్రీ ఉద్యోగం చేయకూడదు, అది కుటుంబానికే అవమానం. అటువంటిది మరీ చోద్యం కాక΄ోతే పురుషులకు దీటుగా చేసే ఆ పనులేంటి..!?’ తహానీ ఆల్ షాతి, యుస్రా మోహమ్మద్ న్మోర్.. వంటి వాళ్లు ప్లంబర్లుగా శిక్షణ ్ర΄ారంభించినప్పుడు ఇలాంటి ఎన్నో మాటలు తమ సాటి వారి నుంచి వచ్చినవే. జోర్డాన్‌లో సామాజిక, సాంస్కృతిక నిబంధనల కారణంగా జీతంతో కూడిన పనిలో మహిళల నిష్పత్తి ప్రపంచంలోనే అత్యల్పంగా ఉంది. శ్రామిక శక్తిలోకి ప్రవేశించడం ఇప్పటికీ చాలామంది మహిళలకు అతిపెద్ద సవాల్.సమర్థతే సరైన ఔషధంప్లంబర్లుగా శిక్షణ తీసుకుంటున్న తొలి రోజులను అల్షాతి గుర్తుచేసుకుంది. శిక్షణ తీసుకుంటున్న ఇతర మహిళలు వీధిలో నీళ్లు లీక్ అవుతున్న పైపును చూశారు. లీకేజీని ఆపడానికి తమ వద్ద గల ఉపకరణాలను బయటకు తీశారు. దారినపోతున్న ఒక మహిళ వారిని చూసి ‘మీరేంటి ఈ పనులు చేయడమేంటి?’ అని తిట్టడం మొదలుపెట్టింది. దాంతో అక్కడ ఇంకొంతమంది పోగయ్యారు. వాళ్లు కూడా అవే మాటలు.. అవేమీ ఈ శిక్షణ తీసుకుంటున్న బృందం పట్టించుకోలేదు. నీళ్ల లీకేజీని ఆ΄ాలనుకున్న పనిని సమర్థంగా పూర్తిచేశారు. నీటినష్టాన్ని నివారించారు. దీంతో అక్కడున్నవారి నోళ్లు మూతపడ్డాయి. తమలో తాము గొణుక్కుంటూ అక్కడినుంచి వెళ్లిపోయారు. ఇప్పుడు అక్కడ అల్ షాతి, న్మోర్ లాంటి వందలాది మహిళా సర్టిఫైడ్ ప్లంబర్లు ఉన్నారు. రాజధాని నగరమైన అమ్మాన్‌లోని ఈ మహిళలంతా ‘ఈ అసాధారణ కెరీర్ మా జీవితాలనే మార్చిందని, ఆత్మవిశ్వాసం, స్వాతంత్య్రాన్ని అందించిందని, ఇతర మహిళలకు శిక్షణ ఇస్తూ తమ దేశాన్ని పర్యటించే అవకాశాలను కల్పించిందని’ ముక్త కంఠంతో అంటున్నారు. ‘నా భర్త, పిల్లలు నన్ను చూసి చాలా గర్వపడుతుంటారు. నా పొరుగువారు నన్ను చూసి అసూయపడుతున్నారు’ అని న్మోర్ చెబుతుంది.భిన్నమైన సేవజోర్డాన్లో నీటి కొరత పెద్ద సమస్య. ఇందుకు భౌగోళిక, పర్యావరణ పరమైన కారణాలు మొదటివి కాగా, నీటిని దొంగిలించడం అనేది మరో ముఖ్యమైన కారణం. అందుకే జోర్డాన్‌లో మహిళల కోసం అనేక ప్రాజెక్టులను ప్రారంభించారు. ఇందులో భాగంగా నీటి పొదుపు కోసం రకరకాల ఉపకరణాలను బిగించడంలో మహిళలకు శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టారు. నీటి వనరుల నిర్వహణలో మహిళలను పాల్గొనేలా చేయడం మంచి నిర్ణయమని నీటి, పారిశుధ్య సలహాదారు హింద్ అల్లైఫాత్ పేర్కొన్నారు. ఎందుకంటే నీటి ప్రాముఖ్యత గురించి వారికే ఎక్కువ తెలుసు. ఈ మేరకు వారు యువత, వృద్ధులలో అవగాహనను తీసుకు రాగలరు. ఈ కోణంలో చూసినపుడు వారు తల్లులే కాదు, టీచర్లు కూడా!ఆర్థిక భద్రతఅల్ షాతి, న్మోర్ తో సహా కొంతమంది మహిళా ప్లంబర్లు 2014లో వైజ్ ఉమెన్ ప్లంబర్స్ కో ఆపరేటివ్ కార్యక్రమంలో చేరారు. కలిసి పనిచేయడం వల్ల భద్రత, ఆర్థిక స్థిరత్వం, అలాగే పెద్ద ప్రాజెక్టులను లీడ్ చేసే అవకాశాలు లభిస్తాయనేది వీరి ఆలోచన. ఇందులోని సభ్యులు తమ చుట్టుపక్కల ఇళ్లకు వెళ్లి ఉచిత సర్వీస్ అందిస్తున్నారు.మొదటిసారి 2004లో 15 మంది మహిళలతో కలిసి శిక్షణ తీసుకున్నప్పుడు ‘సంస్కృతికే అవమానం’ అనే కారణంగా ఇతరులెవరూ దానిని ఆమోదించలేదు. కానీ, ‘‘నేడు ఈ పనిరాని వారు కూడా సాధారణ మరమ్మతులు చేయడం నేర్చుకుంటే ఇండ్లలో తమ ప్లంబర్ పనిని తామే చేసుకోవచ్చు’ అని వివరిస్తూ తోటి మహిళలనూ ప్రోత్సహిస్తున్నారు. ఇలా ప్లంబర్ పనిచేసే ఈ మహిళలంతా చాలా కాలంగా తమ సమాజంలోని నిబంధనలను సవాల్ చేస్తూ తమ ఉనికిని చాటుతున్నారు. లింగ సమానత్వాన్ని కాపాడుకున్నారు. (చదవండి: 'రోబోటిక్ కేక్'..! శాస్త్రవేత్తలు, పేస్ట్రీ చెఫ్‌ల పాక నైపుణ్యం)

అక్షయ ఫలాలనిచ్చే అక్షయ తృతీయ..!
వైశాఖ శుద్ధ తదియనే అక్షయ తృతీయగా జరుపుకుంటారు. ఈ రోజునే సింహాచల వరాహ నరసింహ స్వామి వారి చందనోత్సవం (Chandanotsavam) కూడా జరుగుతుంది. స్వామి వారు భక్తులకు నిజరూప దర్శనం ఇస్తారు. అక్షయ తృతీయ ప్రాముఖ్యతలు చాలా ఉన్నాయి. అందులో కొన్ని చూద్దాం.1. పరశురాముని జన్మదినం.2. పవిత్ర గంగా నది భూమిని తాకిన పర్వదినం.3. త్రేతాయుగం మొదలైన దినం.4. శ్రీకృష్ణుడు తన బాల్యమిత్రుడైన కుచేలుని కలుసుకొన్న దినం.5. వ్యాస మహర్షి “మహా భారతము”ను, వినాయకుని సహాయముతో , వ్రాయడం మొదలుపెట్టిన దినం.6. సూర్య భగవానుడు అజ్ఞాతవాసములో వున్న పాండవులకు “అక్షయ పాత్ర” ఇచ్చిన దినం.7. శివుని ప్రార్థించి కుబేరుడు శ్రీమహాలక్ష్మితో సమస్త సంపదలకు సంరక్షకునిగా నియమింపబడిన దినం.8. ఆదిశంకరులు “కనకధారాస్తవం” ను చెప్పిన దినం.9. అన్నపూర్ణా దేవి తన అవతారాన్ని స్వీకరించిన దినం.10. ద్రౌపదిని శ్రీకృష్ణుడు దుశ్శాసనుని బారినుండి కాపాడిన దినం.అక్షయ తృతీయ నాడు మనం చేపట్టిన ఏ కార్యఫలమైనా, (అది పుణ్యం కావచ్చు, లేదా పాపం కావచ్చు) అక్షయంగా, నిరంతరం, జన్మలతో సంబంధం లేకుండా, మన వెంట వస్తూనే ఉంటుంది. పుణ్య కర్మలన్నీ విహితమైనవే. అందునా ఆ రోజు ఓ కొత్త కుండలో గానీ, కూజాలో గానీ, మంచి నీరు పోసి, దాహార్తులకు శ్రధ్ధతో సమర్పిస్తే, ఎన్ని జన్మలలోనూ, మన జీవుడికి దాహంతో గొంతు ఎండిపోయే పరిస్థితి రాదు.అతిథులకు, అభ్యాగతులకు, పెరుగన్నంతో కూడిన భోజనం సమర్పిస్తే, ఏ రోజూ ఆకలితో మనం అలమటించవలసిన రోజు రాదు. వస్త్రదానం వల్ల తదనుగుణ ఫలితం లభిస్తుంది. అర్హులకు స్వయంపాకం, దక్షిణ, తాంబూలాదులు సమర్పించుకుంటే, మన ఉత్తర జన్మలలో, వాటికి లోటురాదు. గొడుగులు, చెప్పులు, విసనకర్రల లాటివి దానం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఆ రోజు నిషిధ్ధ కర్మల జోలికి వెళ్ళక పోవడం ఎంతో శ్రేయస్కరం. అక్షయ తృతీయ అదృష్టాన్ని, విజయాన్ని చేకూర్చుతుంది అని పౌరాణిక ఉదంతాలు కొన్ని చెబుతున్నాయి.బంగారానికీ అక్షయ తృతీయకీ సంబంధం ఏమిటి?మన సంస్కృతిలో ప్రతి పండుగ వెనుకా ఓ కారణం కనిపిస్తుంది. కాకపోతే ఒక్కోసారి ఆ కారణాన్ని మర్చిపోయి, ఆచరణకే ప్రాధాన్యతని ఇస్తూ ఉంటాము. అందుకు ఉదాహరణే అక్షయ తృతీయ. అక్షయ తృతీయ రోజున బంగారం కొనితీరాల్సిందే అన్న స్థాయిలో ఇప్పుడు ఆలోచిస్తున్నారు. నిజంగా అక్షయ తృతీయ రోజు బంగారం (Gold) కొనాల్సిందేనా! అసలు బంగారానికీ అక్షయ తృతీయకీ సంబంధం ఏమిటి?అక్షయ తృతీయ రోజున బంగారం కొనితీరాలని ఏ శాస్త్రంలోనూ లేదు. కాకపోతే ఈ రోజున ఏ కార్యాన్ని తలపెట్టినా నిర్విఘ్నంగా సాగుతుందని, ఏ పుణ్య కర్మని ఆచరించినా కూడా దాని ఫలితాలు అక్షయంగా లభిస్తాయని పురాణాలు పేర్కొంటున్నాయి. అందుకనే అక్షయ తృతీయ రోజున తప్పకుండా దానధర్మాలు చేయాలని చెబుతారు. ముఖ్యంగా ఎండలు విపరీతంగా ఉండే ఈ కాలంలో ఉదకుంభదానం పేరుతో నీటితో నింపిన కుండను దానం ఇవ్వమని పెద్దలు సూచిస్తూ ఉంటారు.అక్షయ తృతీయనాడు విష్ణుమూర్తిని పూజించాలని మత్స్య పురాణం పేర్కొంటోంది. విష్ణుమూర్తి పాదాలను అక్షతలతో అర్చించి, ఆ అక్షతలను దానం చేస్తే విశేషమైన ఫలితం వస్తుందని చెబుతోంది. జపం, హోమం, వ్రతం, పుణ్యం, దానం... ఇలా అక్షయ తృతీయ నాడు చేసే ప్రతి పనీ అనంతమైన ఫలితాన్నిస్తుందని మాత్రమే మతగ్రంథాలు పేర్కొంటున్నాయి. అక్షయ తృతీయనాడు వివాహం చేసుకుంటే ఆ బంధం చిరకాలం నిలుస్తుందనీ, జాతకరీత్యా వివాహబంధంలో ఎలాంటి దోషాలు ఉన్నా తొలగిపోతాయని నమ్ముతారు.అక్షయ తృతీయ రోజున ఏ పని చేసినా అక్షయమైన ఫలితం దక్కుతుంది కాబట్టి, ఈ రోజున బంగారాన్ని కొనుగోలు చేస్తే... మన సంపదలు కూడా అక్షయం అవుతాయన్న నమ్మకం మొదలైంది. అయితే కష్టపడో, అప్పుచేసో, తప్పు చేసో సంపదను కొనుగోలు చేస్తే మన కష్టాలు, అప్పులు, పాపాలు కూడా అక్షయంగా మారే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు పెద్దలు.అక్షయ తృతీయ రోజున వర్జ్యం , రాహుకాలంతో పనిలేదు''వైశాఖ శుక్ల పక్షోతు తృతీయ రోసిణి యుతాదుర్లభా బుధచారేణ సోమనాపి ఉతా తథా''మత్స్య పురాణంలో 65వ అధ్యాయం ప్రకారం ఈశ్వరుడు పార్వతీదేవికి అక్షయ తృతీయ వ్రతం (Akshaya Tritiya Vratham) గూర్చి చెప్పాడు. వైశాఖ శుద్ధ తదియ రోజున చేసే ఏ వ్రతమైనా, జపమైనా, దానాలు ఏవైనా సరే అక్షయమౌతుంది.పుణ్యకార్యాచరణతో వచ్చే ఫలితం అక్షయమైనట్లే , పాపకార్యాచరణతో వచ్చే పాపం అక్షయమే అవుతుంది. అక్షయ తృతీయ రోజున ఉపవాస దీక్ష చేసి ఏ పుణ్య కర్మనాచరించినా అక్షయముగా ఫలము లభిస్తుంది. అక్షయుడైన విష్ణువును పూజిస్తున్నందునే దీనికి అక్షయ తృతీయ అని పేరు వచ్చింది.ఈ రోజున ఏ శుభకార్యాన్నైనా వారం, వర్జ్యం, రాహుకాలం (Rahu Kalam) వగైరాలతో నిమిత్తం లేకుండా జరుపుకోవచ్చునని పండితులు చెప్తున్నారు. ఇందులో పిల్లలను పాఠశాలలో చేర్చడం, పుస్తకావిష్కరణ, పుణ్యస్థలాలను సందర్శించడం మంచి కార్యాలను చేయవచ్చునని పురోహితులు అంటున్నారు.చదవండి: Akshaya Tritiya 2025 పదేళ్లలో పసిడి పరుగు, కొందామా? వద్దా?ఇంకా గృహనిర్మాణం, ఇంటిస్థలం కొనడం, బావి తవ్వడం వంటి పలు శుభకార్యాలను ప్రారంభించడం ద్వారా మంచి ఫలితాలు చేకూరుతాయని విశ్వాసం. అలాగే అక్షయ తృతీయనాడు శ్రీ నరసింహస్వామి ప్రహ్లాదుడిని అనుగ్రహించిన రోజేనని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ పర్వదినాన పుష్పమో, ఫలమో భగవంతుడికి సమర్పించినా, దైవనామస్మరణ చేసినా, చివరికి నమస్కారం చేసినా సంపద , పుణ్యఫలం ప్రాప్తిస్తుందని ప్రతీతి.- డీ వీ ఆర్
ఫొటోలు
అంతర్జాతీయం

రికార్డు స్థాయికి ప్రపంచ సైనిక వ్యయం
ప్రపంచవ్యాప్తంగా సైనిక వ్యయం భారీగా పెరిగింది. మారుతున్న భౌగోళిక, రాజకీయ సంబంధాలు, యుద్ధాల నేపథ్యంలో ప్రభుత్వాలు సైనిక భద్రతకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాయి. 2024లో ప్రపంచ దేశాలు సైన్యానికి 2.7 ట్రిలియన్ డాలర్లను ఖర్చు చేశాయి. గాజా, ఉక్రెయిన్లపై యుద్ధం నేపథ్యంలో ముఖ్యంగా యూరప్, మధ్యప్రాచ్యంలో ఈ సైనిక వ్యయం అధికంగా పెరిగింది. తాజా వివరాలను స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (సిప్రి) నివేదిక తెలిపింది. 2024లో ప్రపంచవ్యాప్తంగా 100కు పైగా దేశాలు తమ సైనిక వ్యయాన్ని పెంచాయి. 2023తో పోలిస్తే ప్రపంచవ్యాప్తంగా ఖర్చు 9.4 శాతం పెరిగింది. వరుసగా పదో సంవత్సరం కూడా సైనిక వ్యయంలో పెరుగుదల ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఉద్రిక్తతలకు అద్దం పడుతోంది. యూరప్‌లో ఊహించని పెరుగుదల యూరప్ దేశాల్లో (రష్యాతో సహా) సైనిక వ్యయంలో అధిక పెరుగుదల కనిపించింది. ఉక్రెయిన్‌లో యుద్ధం, నాటో కూటమి పట్ల అమెరికా నిబద్ధతపై సందేహాల మధ్య 17 శాతం పెరుగుదల నమోదైంది. ప్రచ్ఛన్న యుద్ధం ముగింపు సమయంలో సైనిక వ్యయాన్ని మించిపోయింది. ఇక రష్యా సైనిక వ్యయం 2024లో 149 బిలియన్ డాలర్లకు చేరుకుంది, ఇది 2023తో పోలిస్తే 38 శాతం పెరిగింది. ఇది రష్యా జీడీపీలో 7.1 శాతం. మొత్తం ప్రభుత్వ వ్యయంలో 19%. ఉక్రెయిన్ మొత్తం సైనిక వ్యయం 2.9 శాతం పెరిగి 64.7 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇది రష్యా వ్యయంలో 43 శాతం కాగా, ఆ దేశ జీడీపీలో 34 శాతం. 2024లో అత్యధిక సైనిక వ్యయం చేసిన దేశం ఉక్రెయిన్. రష్యా చేస్తున్న యుద్ధానికి ఉక్రెయిన్ ప్రస్తుతం తన పన్ను ఆదాయం మొత్తాన్ని సైన్యానికి కేటాయిస్తోంది. జర్మనీ కూడా సైనిక వ్యయాన్ని బాగానే పెంచింది. 28 శాతం పెరిగి, 88.5 బిలియన్ డాలర్లకు చేరుకుంది. దీంతో ఇది భారతదేశాన్ని అధిగమించి ప్రపంచంలో నాల్గో అతి పెద్ద దేశంగా నిలిచింది. పునరేకీకరణ తరువాత జర్మనీ ఇంతపెద్ద మొత్తంలో ఖర్చు చేయడం ఇదే మొదటిసారి. వ్యయాన్ని పెంచిన చైనా సైన్యానికి భారీగా ఖర్చు చేసే ప్రపంచంలోనే రెండో దేశమైన చైనా సైతం తన సైనిక బడ్జెట్‌ను పెంచింది. 7.0 శాతం పెరుగుదలతో చైనా సైనిక వ్యయం 314 బిలియన్ డాలర్లకు చేరుకుంది. తన సైన్యాన్ని ఆధునీకరించడానికి, సైబర్ వార్ఫేర్ సామర్థ్యాలు పెంచుకోవడానికి, అణ్వాయుధాల విస్తరణలో విస్తృతమైన పెట్టుబడులు పెడుతోంది. ఆసియా మొత్తం సైనిక వ్యయంలో సగం వాటాను చైనానే కలిగి ఉంది. తగ్గేదే లేదన్న అమెరికా ప్రపంచ పెద్దన్న అమెరికా కూ సైనిక వ్యయంలో వెనుకబడలేదు. మొత్తం ప్రపంచ సైనిక వ్యయంలో అమెరికా వాటా 37 శాతం గమనార్హం. ఇక 2024లో మొత్తం నాటో వ్యయంలో 66 శాతం ఆమెరికా పెట్టుబడులే. 2024లో 5.7 శాతం పెంచడంతో ఆ దేశ సైనిక వ్యయం 997 బిలియన్ డాలర్లకు చేరుకుంది. అమెరికా నేతృత్వంలోని కూటమిలోని 32 సభ్యదేశాల మొత్తం సైనిక వ్యయం 1.5 ట్రిలియన్లకు పెరిగింది. 2025లో రక్షణకు అత్యధిక బడ్జెట్‌ను కేటాయించిన దేశాలు అస్థిర, సంక్లిష్ట భౌగోళిక రాజకీయ పరిస్థితుల్లో ప్రపంచ దేశాలు తమ శక్తిని, పలుకుబడిని చాటుకునేందుకు సైనిక బలగాలను బలోపేతం చేసుకుంటున్నాయి. గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ డేటా ప్రకారం అమెరికా, చైనా, రష్యా, భారత్, సౌదీ అరేబియాలు తమ సైనిక శక్తికి అత్యధిక బడ్జెట్ కేయటాంచిన మొదటి ఐదు స్థానాల్లో ఉన్నాయి. యూఎస్ – 895 బిలియన్ డాలర్లు చైనా – 266.85 బిలియన్ డాలర్లు రష్యా – 126 బిలియన్ డాలర్లు భారత్ – 75 బిలియన్ డాలర్లు సౌదీ అరేబియా – 74.76 బిలియన్ డాలర్లు – సాక్షి, నేషనల్ డెస్క్

మే 7న నూతన పోప్ ఎన్నిక
వాటికన్ సిటీ: నూతన పోప్ ఎన్నిక ప్రక్రియకు ముహూర్తం ఖరారైంది. మే 7వ తేదీన వాటికన్ సిటీలోని సిస్టిన్ చాపెల్‌లో జరిగే కార్యక్రమంలో రహస్య ఓటింగ్ జరగనుంది. ప్రపంచ దేశాల నుంచి తరలిరానున్న సుమారు 135 కార్డినల్స్ ఈ ప్రక్రియలో భాగస్వాములు కానున్నారు. దాదాపు 12 ఏళ్లపాటు కేథలిక్కుల మత పెద్దగా కొనసాగిన పోప్ ఫ్రాన్సిస్ ఈ నెల 21వ తేదీన కన్నుమూయడంతో ఈ ఎన్నిక అనివార్యమైంది. పోప్ ఎన్నిక ప్రక్రియ ఎన్ని రోజులు కొనసాగుతుందనే విషయంలో స్పష్టత లేదు. గతంలో 2005, 2013ల్లో రెండు రోజుల వ్యవధిలోనే తదుపరి పోప్ ఎవరనే విషయం తేలిపోయింది. మే 7వ తేదీన కార్డినల్స్ ముందుగా సెయింట్ పీటర్స్ బసిలికాలో జరిగే సామూహిక ప్రార్థనల్లో పాల్గొంటారని, అనంతరం ఓటింగ్‌కు అర్హులైన వారంతా సిస్టిన్ చాపెల్ రహస్య విధానంలో జరిగే ఓటింగ్‌లో పాల్గొంటారని వాటికన్ ప్రతినిధి మాటియో బ్రునీ చెప్పారు. లోపలికి వెళ్లిన వారికి నూతన పోప్ ఎన్నికయ్యే వరకు బయటి ప్రపంచంతో ఎలాంటి సంబంధాలుండవు. మొదటి రోజు మధ్యాహ్నం జరిగే ఓటింగ్‌లో కార్డినల్స్ ఒకే ఒక్కసారి ఓటేస్తారు. ఫలితం తేలకుంటే తర్వాత రోజుల్లో నాలుగుసార్లు చొప్పున ఓటేయాల్సి ఉంటుంది. మూడింట రెండొంతుల మెజారిటీ ఓట్లు సాధించిన వారే నూతన పోప్ అవుతారు. ఇందుకు కొంత సమయం పడుతుంది. మూడో రోజూ ఫలితం తేలకుంటే ప్రార్థనల కోసం విరామమిచ్చి మరోసారి ఓటింగ్ ప్రక్రియ చేపడతారు. ఎన్నిక నేపథ్యంలో సోమవారం పర్యాటకులను బయటకు పంపించేసి వాటికన్ అధికారులు సిస్టిన్ చాపెల్‌కు తాళాలు వేశారు.

100 రోజుల ట్రంపరితనం
డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్ష పగ్గాలు చేపట్టి మంగళవారానికి 100 రోజులు. అమెరికాను మళ్లీ గొప్ప దేశంగా మారుస్తున్నాననే మిషతో రోజుకోటి అన్నట్టుగా ఈ మూడు నెలల్లో ఆయన లెక్కలేనన్ని అనాలోచిత చర్యలకు దిగారు. ‘పూటకో మాట, రోజుకో వైఖరి’ అన్నట్టుగా పదేపదే నిర్ణయాలను, విధానాలను మార్చుకుంటూ నవ్వులపాలవుతున్నారు. అంతర్జాతీయ సమాజం దృష్టిలో అమెరికాను పలుచన చేయడమే గాక వ్యక్తిగతంగా జీవితకాలానికి సరిపడా అప్రతిష్ట మూటగట్టుకున్నారు. అక్రమ వలసదారులకు అడ్డుకట్ట సాకుతో తలా తోకా లేని నిబంధనలతో అంతర్జాతీయ విద్యార్థుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నారు. పొదుపు పేరిట ఉద్యోగులను భారీగా తొలగించడం వంటి చర్యలతో అమెరికన్లను కూడా ఎన్నడూ లేనంత అభద్రతా భావంలోకి నెట్టేశారు. దాదాపుగా ఈ మూడు నెలల్లో ట్రంప్ తీసుకున్న అన్ని నిర్ణయాలూ న్యాయ వివాదాలకు దారితీయడం విశేషం. అమెరికా ద్రవ్యోల్బణానికి ముకుతాడు వేస్తానన్న వాగ్దానం నిలుపుకోవడంలోనూ ట్రంప్ ఘోరంగా విఫలమయ్యారు. నిత్యావసరాల ధరలు చుక్కలు తాకుతున్నాయి. చివరికి గుడ్ల ధరలు చూసి సగటు అమెరికన్ గుడ్లు తేలేసే పరిస్థితి నెలకొంది! ఇష్టారాజ్యపు నిర్ణయాలతో అటు ప్రపంచాన్ని, ఇటు అమెరికాను కూడా ఆర్థికంగా ప్రమాదపుటంచుల్లోకి నెట్టిన ట్రంప్, ఆ మంటల్లో తీరిగ్గా చలి కాచుకుంటున్నారు...మతిలేని టారిఫ్‌ల యుద్ధం ఈ 100 రోజుల్లో ట్రంప్ చేపట్టిన చర్యలన్నింట్లోనూ అత్యంత వివాదాస్పదమైనది, ఆనాలోచితమైనది టారిఫ్‌ల యుద్ధమే. అమెరికాపై భారీ టారిఫ్‌లు విధిస్తున్నాయంటూ చాలా దేశాలపై అంతర్జాతీయ వాణిజ్య సూత్రాలకు విరుద్ధంగా ప్రతీకార చర్యలకు దిగారు. అగ్ర రాజ్యాలు మొదలుకుని చివరికి అసలు జనమే ఉండని అంటార్కిటికా వంటి ప్రాంతాలపై కూడా ఎడాపెడా టారిఫ్‌లు పెంచి నవ్వులపాలయ్యారు. పైగా వాటిని రోజుకోలా మారుస్తూ అత్యంత చంచల ధోరణి కనబరిచారు. ఇక చైనా విషయంలోనైతే టారిఫ్‌లను రోజురోజుకూ అంతకంతకూ పెంచుతూ వేలంపాటను తలపించారు. చివరికి 145 శాతం దాకా తీసుకెళ్లి దాన్నో కామెడీ వ్యవహారంగా మార్చేశారు. టారిఫ్‌ల భయంతో ప్రపంచ మార్కెట్లన్నీ కుప్పకూలి కోలుకోలేని రీతిలో లక్షలాది కోట్ల రూపాయల మేర నష్టాలను చవిచూశాక తీరిగ్గా వాటి అమలును మూడు నెలల పాటు వాయిదా వేశారు. టారిఫ్‌లకు ప్రతీకారంగా అరుదైన ఖనిజాల ఎగుమతిని చైనా పూర్తిగా నిలిపేయడంతో అమెరికా దిక్కుతోచని పరిస్థితిలో పడిపోయింది.వలసలపై మొట్టి కాయలు అక్రమ వలసలపై ఉక్కుపాదం మోపే పేరిట వలసదారుల గుండెల్లో ట్రంప్ రైళ్లు పరుగెత్తిస్తున్నారు. పగ్గాలు చేపట్టిన కొద్ది రోజులకే అక్రమ వలసదారులను భారీ ఖర్చుతో ఏకంగా సైనిక విమానాల్లో స్వదేశాలకు పంపారు. సుదీర్ఘ ప్రయాణం పొడవునా ఒళ్లంతా సంకెళ్లు వేసి విమర్శలు మూటగట్టుకున్నారు. తర్వాత వారిని గ్యాటెమాలా తదితర సమీప దేశాలకు తరలించి నిర్బంధంలో ఉంచడం మొదలుపెట్టారు. దీనిపై కోర్టుల మందలింపులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇక విదేశీ విద్యార్థుల విషయంలోనైతే ట్రంప్ అత్యంత అమానవీయంగా వ్యవహరిస్తున్నారు. ఐదారేళ్ల చరిత్రను తవ్వుతూ ఎక్కడ ఏ చిన్న తప్పిదం కనిపించినా దేశం వీడాలని ఆదేశిస్తున్నారు. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన చిన్నాచితకా కారణాలకు కూడా వీసాలు రద్దు చేసి వెనక్కు పంపిస్తున్నారు. ఈ విషయంలో కోర్టులతో పదేపదే మొట్టికాయలు తింటూ వస్తున్నారు.డోజ్.. ఓవర్ డోస్ దుబారా వ్యయానికి కళ్లెం వేసేందుకంటూ ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సారథ్యంలో తీసుకొచ్చిన డోజ్ పనితీరు అమెరికన్లలో తీవ్ర అసంతృప్తికి దారితీసింది. లెక్కలేనన్ని ఉద్యోగాలను డోజ్ ఒక్క దెబ్బతో పీకిపారేసింది. కనీసం రెండు లక్షల కోట్ల డాలర్లు ఆదా చేస్తానని గొప్పగా చెప్పుకున్న మస్‌్క, ఓ రెండొందల కోట్ల డాలర్ల కంటే ఆదా కష్టమంటూ చివరికి చేతులెత్తేశారు. పైగా డోజ్ ముసుగులో అమెరికా ప్రభుత్వానికి సంబంధించిన కీలక, రహస్య డేటానంతా మస్క్ చేజిక్కించుకున్నట్టు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.జెలెన్స్కీకి అవమానం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని చర్చలకంటూ పిలిచి వైట్‌హౌస్‌లో మీడియా సాక్షిగా ట్రంప్, ఆయన డిప్యూటీ జేడీ వాన్స్ ఘోరంగా అవమానించిన తీరు చరిత్రలో నిలిచిపోయింది. దేశాధ్యక్షుడనే కనీస గౌరవం కూడా లేకుండా సూటిపోటి మాటలతో ఇద్దరూ రెచ్చిపోయారు. జెలెన్స్కీ ఎక్కడా తగ్గకుండా వాళ్లకు మాటకు మాట బదులిచ్చి శెభాష్ అనిపించుకున్నారు. చిర్రెత్తుకొచి్చన ట్రంప్ చివరికి ఆయన్ను వైట్‌హౌస్ నుంచి అవమానకర రీతిలో వెళ్లగొట్టిన తీరు చూసి ప్రపంచ దేశాలన్నీ షాక్‌కు గురయ్యాయి. ట్రంప్, వాన్స్ ప్రవర్తన వైట్‌హౌస్‌కే తీవ్ర కళంకమంటూ ఈసడించుకున్నాయి. ఆదరణ అట్టడుగుకు ట్రంప్ పట్ల అమెరికన్లలో వ్యతిరేకత నానాటికీ పెరిగిపోతోందని పోల్స్ అన్నీ ముక్త కంఠంతో చెబుతున్నాయి. అధ్యక్షుల తొలి 100 రోజుల పాలనకు జనామోదం విషయంలో ట్రంప్ గత 70 ఏళ్లలోనే అట్టడుగున నిలిచారు! ఆయన పాలనను గట్టిగా సమరి్థస్తున్న వారి సంఖ్య ఏకంగా 22 శాతానికి పడిపోయినట్టు సీఎన్ఎన్ పోల్ తేలి్చంది. గట్టిగా వ్యతిరేకించేవారి సంఖ్య 45 శాతానికి పెరిగింది. ముఖ్యంగా మార్చి నుంచి ట్రంప్ ఆదరణ శరవేగంగా అడుగంటుతూ వస్తోంది. టారిఫ్‌లపై ట్రంప్ తీరును 35 శాతం అమెరికన్లు గట్టిగా వ్యతిరేకిస్తున్నారు. ఆర్థికంగా దేశాన్ని ఆయన గట్టెక్కిస్తారని నమ్ముతున్న వారి సంఖ్య కూడా డిసెంబర్‌తో పోలిస్తే ఏకంగా 12 శాతం తగ్గింది. మతిలేని చర్యలతో దేశాన్ని ట్రంప్ ప్రమాదంలోకి నెడుతున్నారని 57 శాతం మంది భావిస్తున్నారు. ఆయన విదేశీ విధానాన్ని 60 శాతం మందికి పైగా తీవ్రంగా తప్పుబడుతున్నారు. వలసల విధానాన్ని కూడా 47 శాతం మంది ఆక్షేపిస్తున్నారు. ఉద్యోగ కల్పనలో ట్రంప్ తీరుతో 58 శాతం మంది పెదవి విరుస్తున్నారు. అధ్యక్షునిగా అధికారాన్ని బాధ్యతాయుతంగా వాడతారన్న నమ్మకం లేదని 54 శాతం మంది అమెరికన్లు అంటుండటం విశేషం. సరైన నాయకత్వం అందిస్తారని నమ్ముతున్నది 50 శాతమే. ఆయనకు ఓటేసి తప్పు చేశామని 20 శాతం మంది వాపోతుండటం పరిస్థితికి అద్దం పడుతోంది!దేశాలపై నోటి దురుసు కెనడా మొదలుకుని పలు దేశాలపై నోటి దురుసు వ్యాఖ్యలతో ట్రంప్ పరువు పోగొట్టుకున్నారు. అమెరికాలో 51వ రాష్ట్రంగా విలీనమైతే మేలంటూ అనవసర వ్యాఖ్యలు చేసి కెనడాతో శత్రుత్వాన్ని కొనితెచ్చుకున్నారు. పైగా ఆ దేశంపై విధించిన అడ్డగోలు టారిఫ్‌లతో అంతిమంగా అమెరికాకే నష్టం జరిగింది. అంతేగాక అమెరికాను ఇక జీవితంలో నమ్మేది లేదని కెనడా నాయకత్వంతో అనిపించుకున్నారు. గ్రీన్‌లాండ్‌ను ఆక్రమించేసుకుంటామని ప్రకటించి మరో వివాదాల తేనెతుట్టెను కదిపారు. గాజా నుంచి పాలస్తీనియన్లను పూర్తిగా తొలగించేసి దాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామంటూ తలాతోకా లేని ప్రకటన చేసి మొత్తం ముస్లిం ప్రపంచం ఆగ్రహానికి గురయ్యారు. ఉక్రెయిన్‌కు చేసిన యుద్ధ సాయానికి బదులుగా ఆ దేశ ఖనిజ నిల్వలను అమెరికాకు కట్టబెట్టాల్సిందేనంటూ భీష్మించుకున్నారు. రష్యాను ఒప్పించి ఒక్క రోజులో యుద్ధాన్ని ఆపిస్తానన్న ట్రంప్ ప్రకటన కూడా ఉత్తదేనని తేలిపోయింది. ‘పుతిన్‌కు యుద్ధం ఆపే ఉద్దేశమే లేనట్టుంది’ అంటూ ఇప్పుడాయన తీరిగ్గా నిట్టూరుస్తున్నారు.విద్యాసంస్థలపై ఉక్కుపాదం తన మాట వినడం లేదంటూ యూనివర్సిటీలపై ట్రంప్ కన్నెర్రజేశారు. ప్రపంచానికే తలమానికం వంటి అమెరికా విద్యా సంస్థల పునాదులనే పెకిలించే పనిలో పడ్డారు. వాటికి బిలియన్ల కొద్దీ ప్రభుత్వ నిధులను నిలిపేశారు. దారికొస్తే తప్ప వాటిని విడుదల చేసేది లేదంటున్నారు. అలా కొలంబియా వంటి వర్సిటీలను లొంగదీసుకున్నారు. కానీ ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీ మాత్రం ట్రంప్ తీరును తూర్పారబట్టింది. అణచివేత చర్యలకు తలొంచేది లేదని ప్రకటించింది. 300 కోట్ల డాలర్లకు పైగా నిధులను నిలిపేసినా ‘డోంట్ కేర్’ అనేసింది.

‘ఛీ’నా రాజకీయం...
అవకాశం దొరికింది కదాని ఇండియాను పాకిస్థాన్ భుజాల మీదుగా కాల్చాలని ప్రయత్నిస్తోంది కుటిల చైనా. ఆ దిశగానే బీజింగ్-ఇస్లామాబాద్ రక్షణ భాగస్వామ్యం బలపడుతోంది. పహల్గాంలో ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు పెచ్చరిల్లుతున్న తరుణంలో... గగనతలం నుంచి గగనతలంలోకి ప్రయోగించగల తమ అత్యాధునిక పీఎల్-15 క్షిపణులను పాక్ వైమానిక దళానికి చైనా అందించింది.బియాండ్ విజువల్ రేంజ్ (బీవీఆర్) పీఎల్-15 క్షిపణులను మోసుకెళుతున్న తమ జేఎఫ్-17 బ్లాక్ 3 యుద్ధ విమానాల ఫొటోలను పాక్ వైమానిక దళం (పీఏఎఫ్) ఇటీవల విడుదల చేయడం గమనార్హం. ‘పీఏఎఫ్’కు చైనా సరఫరా చేసినవి ఎగుమతులకు ఉద్దేశించిన ‘పీఎల్-15ఈ’ రకం క్షిపణులు అనుకుంటే పొరపాటు! తమ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ (పీఎల్ఏఏఎఫ్)కు చెందిన సొంత పీఎల్-15 క్షిపణులను చైనా నేరుగా పాక్ కు అందజేసినట్టు ‘యూరేషియన్ టైమ్స్’ ఓ కథనం ప్రచురించింది.భారత్, పాక్ నడుమ వైరం ముదురుతున్న అత్యంత కీలక తరుణంలో ఆగమేఘాలపై ఆయుధాలను సరఫరా చేయడానికి చైనా ఈ మార్గం ఎంచుకున్నట్టు తెలుస్తోంది. మరింత ఎక్కువ దూరం నుంచి భారత్ విమానాలను లక్ష్యంగా చేసుకోగల సామర్థ్యాన్ని పీఎల్-15 క్షిపణులు పాక్ యుద్ధ విమానాల పైలట్లకు కల్పిస్తాయి. అలా శత్రువుపై గెలుపును సునాయాసం చేస్తాయి.ఏమిటీ పీఎల్-15 మిసైల్?పీఎల్-15 క్షిపణి ఆధునిక వైమానిక యుద్ధరంగంలో చైనాకు ఓ ప్రధానాస్త్రం. ఇది ప్రభుత్వ ఏరోస్పేస్ సంస్థయిన ఏవియేషన్ ఇండస్ట్రీ కార్పొరేషన్ ఆఫ్ చైనా (ఏవీఐసీ) అభివృద్ధి చేసిన రాడార్ గైడెడ్ దూరశ్రేణి క్షిపణి. ధ్వని వేగానికి ఐదు రెట్లు (మ్యాక్ 5) మించిన వేగంతో గగనతలం నుంచి గగనతలానికి ప్రయోగించదగ్గ ఈ మిసైల్ 200-300 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదిస్తుంది.విదేశాలకు ఎగుమతి చేయడానికి ఉద్దేశించిన ‘పీఎల్-15ఈ’ వెర్షన్ మిసైల్ 145 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను మాత్రమే ఛేదించగలదు. జే-10సి, జే11-బి, జే-15, జే-16, జేఎఫ్-17 బ్లాక్ 3, జే-20 విమానాలకు పీఎల్-15 క్షిపణిని అమర్చవచ్చు. 160 కిలోమీటర్ల రేంజితో, శబ్ద వేగానికి నాలుగు రెట్ల వేగంతో ప్రయాణించగల అమెరికాకు చెందిన ఏఐఎం-120డి అమ్రామ్ క్షిపణితో పోలిస్తే రేంజి, వేగం పరంగా మెరుగైన ఈ పీఎల్-15 మిసైల్ 2018 నుంచి చైనా వైమానిక దళానికి సేవలు అందిస్తోంది.పీఎల్-15 వర్సెస్ మీటియర్... యూరోపియన్ ఎంబీడీఎం మీటియర్ క్షిపణితో పీఎల్-15ను పోల్చవచ్చు. గగనతలం నుంచి గగనతలానికి ప్రయోగించగల మీటియర్, ఎంఐసీఏ దూరశ్రేణి క్షిపణులను ప్రస్తుతం భారత్ చెంత ఉన్న రాఫెల్ యుద్ధ విమానాలకు అమర్చవచ్చు. లాంచ్ ప్లాట్ ఫాం, ఎత్తు, లక్ష్యపు చలనశీలత అంశాలపై ఆధారపడి మీటియర్ మిసైల్ పరిధి 100-200 కిలోమీటర్లు ఉంటుంది. ధ్వని వేగానికి నాలుగు రెట్లు మించిన వేగాన్ని అది అందుకోగలదు. సామర్థ్యం పరంగా పీఎల్-15ఈ (ఎగుమతి రకం)తో మీటియర్ క్షిపణిని పోల్చవచ్చు. కానీ పీఎల్-15 స్టాండర్డ్ వెర్షన్ (పాక్ కు చైనా సరఫరా చేసిన ప్రామాణిక రకం) మాత్రం మీటియర్ కంటే అధిక వేగం, దూరశ్రేణి గల క్షిపణి. రాంజెట్ ఇంజిన్ సాయంతో మీటియర్ క్షిపణి ప్రయాణమంతటా స్థిర వేగంతో దూసుకెళుతుంది.ఇందుకు భిన్నంగా పీఎల్-15 మిసైల్ డ్యూయల్ పల్స్ ఘన ఇంధన రాకెట్ మోటార్ సాయంతో ప్రయాణిస్తుంది. ఇందులోని ఘన ఇంధనం కొద్దిసేపు మాత్రమే జ్వలించినప్పటికీ రాంజెట్ ఇంజిన్ గల మీటియర్ కంటే ఎక్కువ వేగం అందిస్తుంది. అయితే ధ్వనికి ఐదు రెట్లు పైబడిన స్పీడ్ అందుకున్నా ప్రయాణం పొడవునా అదే వేగాన్ని పీఎల్-15 మిసైల్ కొనసాగించలేదు! క్షిపణుల బయటివైపు చిన్న రెక్కల్లాంటి భాగాలు (ఫిన్స్) ఉంటాయి. వాటిని మడవగలిగితే మరిన్ని క్షిపణులను యుద్ధవిమానాలకు అమర్చవచ్చు. ఈ బుల్లి రెక్కల్ని మడిచిన పీఎల్-15 క్షిపణి నమూనాను చైనా నిరుడు జూహాయ్ ఎయిర్ షోలో ప్రదర్శించింది. దీంతో జే-20 లాంటి యుద్ధవిమానాలు నాలుగు బదులుగా ఆరు పీఎల్-15 మిసైళ్లను మోసుకెళ్లే వీలు కలిగింది.రష్యన్ ‘ఆర్-37ఎం’ వైపు భారత్ చూపు?పాక్ మోహరించిన పీఎల్-15 మిసైళ్లతో భారత వైమానిక దళానికి తలనొప్పి తప్పేలా లేదు. వాటిపై పైచేయి సాధించే ఆప్షన్ ఇండియాకు లేకపోలేదు. అది... రష్యాకు చెందిన అత్యాధునిక ఆర్-37ఎం దూరశ్రేణి క్షిపణి! అతిధ్వానిక వేగాన్ని (మ్యాక్ 6) అందుకోగల ఈ హైపర్ సానిక్ మిసైల్ 300-400 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను తుత్తునియలు చేస్తుంది. ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా దీన్ని విస్తృతంగా వినియోగించింది. ఉక్రెయిన్ వైమానిక దళానికి ఆర్-37ఎం క్షిపణి నుంచే ప్రధాన ముప్పు ఎదురైందంటే అతిశయోక్తి కాదు.ఆర్-37ఎంను అమర్చిన మిగ్-31 విమానాలు పలు ఉక్రెయిన్ యుద్ధ విమానాలను కూల్చివేశాయి. ఉక్రెయిన్ ఎఫ్-16 యుద్ధ విమానాన్ని సైతం ఈ మిసైల్ సాయంతో రష్యా కూల్చివేసినట్టు ఇటీవల వార్తలు వచ్చాయి. విశేషం ఏమిటంటే సుఖోయ్ ఎస్యు-30ఎస్ఎం2 యుద్ధ విమానాలపై ఆర్-37ఎం క్షిపణులను మోహరించవచ్చు. భారత్ వద్ద ‘సుఖోయ్ ఎస్యు-30’ శ్రేణికి కొదవ లేదు. ప్రస్తుతం మనకు 260కి పైగా సుఖోయ్ ఎస్యు-30ఎంకెఐ యుద్ధ విమానాలు ఉన్నాయి.వాటిని సుఖోయ్ ఎస్యు-30ఎస్ఎం2 వేరియంట్లుగా ఉన్నతీకరించే అంశాన్ని భారత్ పరిశీలిస్తోంది. ఎస్యు-30ఎంకెఐ విమానాలకే ఆర్-37ఎం క్షిపణులను అమర్చాలంటే పెద్ద సాంకేతిక ప్రక్రియ ఉంది. దాదాపు 84 ఎస్యు-30ఎంకెఐ విమానాలను ఎస్ఎం2 వేరియంట్ స్థాయికి అప్‌గ్రేడ్ చేయడానికి రూ.63 వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా.ఆర్-37ఎం క్షిపణులను ఇండియాకు విక్రయించడానికి రష్యా కూడా ఆసక్తి కనబరుస్తోంది. రాఫెల్ యుద్ధ విమానాలపై ఈ క్షిపణులను మోహరించే అంశంలోనూ చర్చలు సాగుతున్నాయి. 2019లో బాలాకోట్ దాడుల సందర్భంగా ఇండియాకు చెందిన మిగ్-21 బైసన్ యుద్ధ విమానాన్ని పాక్ తన ఎఫ్-16 విమానం-అమ్రామ్ క్షిపణితో కూల్చివేసింది. నాడు ఇండియా చెంత దూరశ్రేణి క్షిపణులు లేకపోవడం పెద్ద లోటు. ఆ తర్వాత మీటియర్ క్షిపణులను అమర్చిన రాఫెల్ విమానాలను భారత్ మోహరించింది. - జమ్ముల శ్రీకాంత్
జాతీయం

‘ఉగ్రవాదులు మొదట ప్రాణం తీసింది లెఫ్టినెంట్ వినయ్ నార్వల్‌నే’
జమ్మూ: జమ్మూకశ్మీర్ పహల్గాంలో ఉగ్రదాడి ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పక్కా ప్లాన్ ప్రకారం పాక్ టెర్రరిస్టులు.. టూరిస్టులపై కాల్పులకు తెగబడ్డట్లు తేలింది.జమ్మూకశ్మీర్ అనంత్ నాగ్ జిల్లా పహల్గాంలో మినీ స్విట్జర్లాండ్‌గా పేరొందిన బైసరీన్ వ్యాలీలో ఉగ్రవాదులు పర్యాటకులపై ఏ విధంగా కాల్పులకు తెగబడింది. ప్రాణాలు తీసింది. టూరిస్టులు తప్పించుకోకుండా టెర్రరిస్టులు ఎలా కాపలా కాసారో ప్రత్యక్ష సాక్షుల స్టేట్మెంట్ను కేంద్ర దర్యాప్తు సంస్థ రికార్డ్ చేశారు. వాటి ఆధారంగా ఎగ్జిట్, ఎంట్రన్స్ గేటులో ఉగ్రవాదులు కాపలాప్రకృతి అందాల్ని ఆస్వాధిస్తున్న పర్యాటకులు తప్పించుకునేందుకు వీలు లేకుండా బైసరీన్ వ్యాలీలో ఎంట్రీ గేటు వద్ద ఇద్దరు ఉగ్రవాదులు కాపలా, ఎగ్జిట్ గేటు వద్ద ఒక ఉగ్రవాది కాపలా ఉండగా.. ఆ ఇద్దరికి సమాచారం అందించేందుకు బైసరీన్ వ్యాలీ బయట అడవిలో ఉన్నట్లు తేలింది. ముందుగా టెర్రరిస్టులు ఎంట్రీ గేటు దగ్గర పర్యాటకులపై కాల్పులు జరిపారు. కాల్పులు మోతతో ఒక్కసారిగా భయపడ్డ టూరిస్టులు ప్రాణ భయంతో ఎగ్జిట్ వైపు పరిగెత్తారు. అయితే, అక్కడే ఉన్న ఇద్దరు ఉగ్రవాదులు పర్యాటకుల్ని అడ్డుకున్నారు. తమవద్ద ఉన్న మెషీన్ గన్లతో పర్యాటకుల్ని బెదిరించారు. Grief beyond words. Can’t forget, can’t forgive. Indian Navy Lieutenant Vinay Narwal's wife bids an emotional farewell to her husband, who was killed in the Pahalgam terror attackThe couple got married on April 16. pic.twitter.com/GJXjG368i7— Anjana Om Kashyap (@anjanaomkashyap) April 23, 2025 ఉగ్రవాదుల తొలి ప్రాణం తీసింది లెఫ్టినెంట్ వినయ్ నార్వల్నేఎంట్రీ గేటు వద్ద టూరిస్టులను ఒక చోటకు చేర్చారు. అనంతరం మహిళలు, పురుషులు వేరు కావాలని ఆదేశించారు. అయితే, టూరిస్టులు టెర్రరిస్టుల మాటల్ని పట్టించుకోలేదు.దీంతో కోపంతో ఊగిపోయిన టెర్రరిస్టులు హిందువులు, ముస్లింలు వేర్వేరుగా నిలబడాలని సూచించారు. అయినా టూరిస్టులు పట్టించుకోలేదు.ఆ తరువాత, ఉగ్రవాదులు తాము ఇస్లాం మతం స్వీకరిస్తున్నామని అంగీకరిస్తూ ‘కల్మా’ఉచ్ఛరించమని పర్యాటకులను ఆదేశించారు. పర్యాటకులు కల్మా అనడం పూర్తయిన తర్వాత ఉగ్రవాదులు..అమాయకులపై కాల్పులు జరిపి ప్రాణాలు తీసుకున్నారు. ఈ సమయంలో ఎంట్రీ గేటు ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో మరణించిన మొట్టమొదటి వ్యక్తి భారత నేవీ అధికారి, లెఫ్టినెంట్ వినయ్ నార్వల్ అని తెలుస్తోంది.ఈ మరణాలు ఎక్కువగా టీ స్టాల్, భేల్ పూరి స్టాల్ సమీపంలో సంభవించాయి.ఈ రెండు ప్రాంతాల్లో పర్యాటకులు అధిక సంఖ్యలో ఉండడం వల్ల భారీ మొత్తంలో ప్రాణ నష్టం జరిగింది.

భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బీఆర్ గవాయి
ఢిల్లీ: సుప్రీంకోర్టు 52వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బీఆర్ గవాయి నియమితులయ్యారు. సీజేఐగా ఆయన నియామకానికి రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. మే 14న జస్టిస్ గవాయి బాధ్యతలు స్వీకరించనున్నారు.కాగా, మహారాష్ట్రలోని అమరావతికి చెందిన జస్టిస్ గవాయ్ 1985లో న్యాయవాదిగా ప్రాక్టీస్ ప్రారంభించారు. ప్రముఖ న్యాయవాది, మహారాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి రాజా భోన్సాలేతో కలిసి పనిచేశారు. 1987 నుండి 1990 వరకు ముంబై హైకోర్టులో స్వతంత్ర న్యాయవాదిగా పని చేశారు. 1992లో నాగ్‌పూర్ బెంచ్‌లో అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్‌గా, అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా నియమితులయ్యారు.2000లో ప్రభుత్వ న్యాయవాది, పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా వ్యవహరించారు. 2003లో హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా జస్టిస్ గవాయ్ నియమితులయ్యారు. 2005లో శాశ్వత న్యాయమూర్తిగా ప్రమోషన్ పొందారు. 2019లో సుప్రీంకోర్టుకు ప్రమోట్ అయ్యారు. జస్టిస్ గవాయ్ సుమారు ఆరు నెలలు ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగనున్నారు. ఆయన నవంబరులో పదవీవిరమణ చేయనున్నారు. 2007లో భారత అత్యున్నత న్యాయస్థాన పదవిని చేపట్టిన జస్టిస్ కేజీ బాలకృష్ణన్ తర్వాత, ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టే రెండో దళితుడు జస్టిస్ గవాయ్.

త్రివిధ దళాలకు ప్రధాని మోదీ ఫ్రీ హ్యాండ్.. సైన్యమే స్థలం,టైం చూసి..
ఢిల్లీ: పహల్గాంలో ఉగ్రదాడి నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలో వరుస కీలక సమావేశాలు కొనసాగుతున్నాయి. మంగళవారం జరిగిన త్రివిధ దళాదిపతులు సమావేశంలో ప్రధాని మోదీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉగ్రవాదుల్ని మట్టిలో కలిపేలా త్రివిధ దళాలకు పూర్తి స్థాయిలో స్వేచ్ఛ ఇచ్చారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. భారత దళాలపై పూర్తిగా నమ్మకం ఉంది. ఉగ్రవాదాన్ని అంత చేస్తాం. పహల్గాం దాడికి ధీటైన సమాధానం ఇస్తాం. సైన్యమే స్థలం,టైం చూసి జవాబు ఇస్తుంది’ అంటూ ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ నేతృత్వంలో జరిగిన రక్షణ శాఖ సమావేశంలో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్, సీడీఎస్ అనీల్ చౌహాన్లు పాల్గొన్నారు. ఈ సమావేశంలో గత బుధవారం భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల తీరుతెన్నులు ఎలా ఉన్నాయి. భద్రతా బలగాల మొహరింపు వంటి అంశాలపై చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.దీంతో పాటు త్వరలో ప్రారంభం కానున్న అమర్నాథ్ యాత్రలో పాక్ కవ్వింపులు చర్యలకు పాల్పడితే ఎలాంటి చర్యలు తీసుకోవాలి. ఒకవేళ పాక్ కవ్వింపులకు పాల్పడితే రక్షణ పరంగా ఎలా తిప్పికొట్టాలి. ఓ వైపు రక్షణ పరంగా దెబ్బకొడుతూనే.. దౌత్య పరంగా ప్రపంచ దేశాల ఎదుట పాకిస్తాన్‌ను ఇరుకున పెట్టేలా ఎలా దెబ్బకు దెబ్బ తీయాలనే తదితర అంశాలపై ప్రముఖంగా చర్చించారు. PM Modi chairs a meeting with Defence Minister, NSA, CDS and chiefs of all the Armed Forces. pic.twitter.com/fr9y5eVbet— ANI (@ANI) April 29, 2025

ప్రైవేట్ స్కూల్స్‌లో ఫీజుల దోపిడీకి చెక్.. చట్టం అమలుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్
ఢిల్లీ : ప్రైవేట్ స్కూళ్లల్లో అడ్డగోలు ఫీజుల దందాపై చరిత్రలో తొలిసారి ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మంగళవారం ఢిల్లీ స్కూళ్లలో ఫీజులు ఎంత మేరకు ఉండాలనే అంశంపై ప్రభుత్వం విధివిధానాల్ని ఖరారు చేసింది. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకోనుంది.ఫీజుల స్థిరీకరణ,నియంత్రణ బిల్లు- 2025పై ఢిల్లీ కేబినెట్ మీటింగ్ జరిగింది. ఈ సమావేశంలో పలు స్కూల్స్ ఏకపక్షంగా ఫీజుల పెంచుతున్నారంటూ వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో ఢిల్లీ కేబినెట్ మంగళవారం పాఠశాల ఫీజులను నియంత్రించడానికి చట్టాన్ని ఆమోదించింది. అనంతరం ఢిల్లీ సీఎం రేఖా గుప్తా మీడియాతో మాట్లాడారు. నా ఆనందానికి అవధుల్లేవు.ఢిల్లీ ప్రభుత్వం ధైర్యమైన నిర్ణయం నిర్ణయం తీసుకుంది. పలు స్కూల్స్ ఏకపక్షంగా ఫీజుల పెంచుతున్నారంటూ వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో ఢిల్లీ కేబినెట్ మంగళవారం పాఠశాల ఫీజులను నియంత్రించడానికి ఒక చట్టాన్ని ఆమోదించింది.📢 Big Reform in Delhi Education!CM Rekha Gupta: “For the first time in history, Delhi Govt has passed a foolproof Bill to regulate fees and set clear guidelines for all 1677 schools — aided, unaided, private, all included.”A bold step toward transparency and fairness in… pic.twitter.com/YzwzSBpLwP— भँ० अजीत सिंह तोमर (@Bhanwar_Ast) April 29, 2025 ఢిల్లీ ప్రభుత్వం చారిత్రాత్మక,సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. ఫీజుల స్థిరీకరణ,నియంత్రణ బిల్లు- 2025 ముసాయిదా బిల్లును ఈరోజు కేబినెట్ ఆమోదించిందని మీకు చెప్పడానికి నేను చాలా సంతోషంగా ఉన్నాను’అని అన్నారు.ఢిల్లీలోని 1,677 పాఠశాలలు ఎయిడెడ్, నాన్-ఎయిడెడ్ లేదా ప్రైవేట్ అయినా, ఫీజులకు సంబంధించిన పూర్తి మార్గదర్శకం, విధానాన్ని నిర్ణయిస్తారు. చరిత్రలో మొదటిసారిగా, అటువంటి బిల్లును ప్రభుత్వం రూపొందిస్తోందన్నారు. విద్యా మంత్రి ఆశిష్ సూద్ మాట్లాడుతూ, కొత్త నిబంధనలను అమలు చేయడానికి మూడు కమిటీలను ఏర్పాటు చేస్తామని, పాఠశాల మౌలిక సదుపాయాల ఆధారంగా మూడు సంవత్సరాల పాటు ఫీజులను ప్యానెల్లు నిర్ణయిస్తాయని అన్నారు. పాఠశాల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కూడా నిర్ణయం తీసుకునే ప్రక్రియలో పాల్గొంటారని చెప్పారు. ఈ నెల ప్రారంభంలో ఢిల్లీలోని పలు స్కూళ్లు ఏకపక్షంగా ఫీజులు వసూలు చేస్తున్నాయంటూ తల్లి దండ్రుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి.ఫిర్యాదులతో పలు పాఠశాలలకు ఢిల్లీ ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. తన ప్రభుత్వం పారదర్శకత, పిల్లల విద్యా హక్కు రక్షణకు కట్టుబడి ఉందని ఆ సమయంలో సీఎం రేఖా గుప్తా స్పష్టం చేశారు.
ఎన్ఆర్ఐ

దుబాయి హతుల వారసులకు ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు
ఇటీవల దుబాయిలో హత్యకు గురైన ఇద్దరు తెలంగాణ యువకుల కుటుంబ సభ్యులకు ఔట్ సోర్సింగ్ లో ఉద్యోగాలు ఇవ్వాలని జపాన్ పర్యటన నుంచి ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారని తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ది కార్పోరేషన్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే అనిల్ ఈరవత్రి ఒక ప్రకటనలో తెలిపారు. నిర్మల్ జిల్లా సోన్ మండల కేంద్రానికి చెందిన అష్టపు ప్రేమ్ సాగర్‌తో పాటు, జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం దమ్మన్నపేట కు చెందిన స్వర్గం శ్రీనివాస్ లు దుబాయి లో హత్యకు గురైన విషయం తెలిసిందే. దుబాయి నుంచి మృత దేహాలను త్వరగా స్వదేశానికి తెప్పించడానికి చర్యలు తీసుకోవాలని సీఎం అధికారుల్ని ఆదేశించినట్లు అనిల్ తెలిపారు.. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దుబాయి లోని భారత రాయబార కార్యాలయానికి, ఢిల్లీ లోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు లేఖలు రాసినట్లు వెల్లడించారు. మరిన్ని NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి:ఎన్నారై అడ్వయిజరీ కమిటీ చైర్మన్ డా. బిఎం వినోద్ కుమార్ బృందం, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి లు మృతుల కుటుంబాలను పరామర్శించారు.

రాయలసీమ ప్రగతికి డాలస్‌లో జీఆర్ఏడీఏ అడుగులు
గ్రేటర్ రాయలసీమ అసోసియేషన్ ఆఫ్ డాలస్ ఏరియా (GRADA) ఆధ్వర్యంలో ఏప్రిల్ 13న ఫ్రిస్కో, టెక్సాస్‌లో రాయలసీమ ప్రాంతం ఎదుర్కొంటున్న సమస్యలపై సమావేశం జరిగింది. రాయలసీమ సమస్యలు, అభివృద్ధి అవకాశాలు, తెలుగు భాషా సాహిత్యాల ప్రాముఖ్యతపై చర్చ జరిగింది. ఈ కార్యక్రమానికి రాయలసీమకు చెందిన రచయిత భూమన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన తన ప్రసంగంలో రాయలసీమ ప్రస్తుత పరిస్థితి, ముఖ్యంగా దీర్ఘకాలంగా వేధిస్తున్న నీటి సమస్యలు, వెనుకబాటుతనం గురించి ఎంతో ఆవేదనతో, స్పష్టంగా వివరించారు.మన ప్రాంత సహజ సంపద అయిన శేషాచలం అడవుల గురించి, ముఖ్యంగా ఎర్రచందనం చెట్ల గురించి ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ విలువైన సంపదను అక్రమ మార్గాల్లో ఇతర దేశాలకు తరలించి లాభం పొందకుండా, స్థానికంగానే వాటి ఆధారిత పరిశ్రమలను స్థాపించి, ఉత్పత్తులను తయారు చేయడం ద్వారా మన ప్రాంతాన్ని ఎలా ఆర్ధికంగా బలోపేతం చేయవచ్చో ఆయన చక్కగా వివరించారు. ఆయన మాటలు మనందరిలో కొత్త ఆలోచనలను రేకెత్తించాయి. సహజ వనరులను సక్రమంగా వినియోగించుకుంటే రాయలసీమ భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందనే ఆశాభావాన్ని ఆయన కలిగించారు.మరో గౌరవ అతిథిగా కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం మాజీ వైస్‌ఛాన్సలర్, ప్రఖ్యాత విద్యావేత్త ప్రొఫెసర్ పి. కుసుమ కుమారి హాజరయ్యారు. ఆమె తన ప్రసంగంలో తెలుగు భాష మాధుర్యం, సాహిత్యం గొప్పదనం, పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకత గురించి వివరించారు. నంద కోర్వి, అనిత నాగిరెడ్డి, సతీష్ సీరం, బ్రహ్మ చిరా, హరినాథ్ పొగకు, హేమంత్ కాకుట్ల, జగదీశ్వర నందిమండలం, జగదీష్ తుపాకుల, పవన్ పల్లంరెడ్డి, ప్రసాద్ నాగారపు, రాజు కంచం, శివ అద్దేపల్లి, శివ వల్లూరు, శ్రీధర్ బొమ్ము, శ్రీకాంత్ దొంత, సురేష్ మోపూరు, ఉమా గొర్రెపాటి, మరియు కార్తీక్ మేడపాటి ఈ సమావేశానికి హాజరయ్యారు.

సింగపూర్‌లో ‘అంతర్జాతీయ ఉగాది సాహిత్య సమ్మేళనం’
'వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా' 'శ్రీ సాంస్కృతిక కళాసారథి - సింగపూర్' మరియు 'వంశీ ఇంటర్నేషనల్ - ఇండియా' సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో, ఆదివారం 13వ తేదీ హైదరాబాద్ , శ్రీ త్యాగరాయ గానసభలో ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు 12 గంటల పాటు నిర్విరామంగా "అంతర్జాతీయ ఉగాది సాహిత్య సమ్మేళనం" కార్యక్రమం అద్వితీయంగా నిర్వహించబడింది.ఈ మూడు సంస్థలు కలసి విశ్వావసు నామ సంవత్సర ఉగాదిని పురస్కరించుకొని 80 మంది కవులతో 'అంతర్జాతీయ కవి సమ్మేళనము', 20 నూతన గ్రంధావిష్కరణలు, ఆచార్య శలాక రఘునాథ శర్మ 'రాయప్రోలు వంశీ జాతీయ సాహితీ జీవన సాఫల్య పురస్కార' ప్రదానము డా. బులుసు అపర్ణచే ప్రత్యేక 'మహిళా అష్టావధానము' మొదలైన అంశాలతో ఈ 'అంతర్జాతీయ ఉగాది సాహిత్య సమ్మేళనం' కార్యక్రమాన్ని ప్రత్యేకంగా రూపొందించి నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ్యులు మండలి బుద్ధ ప్రసాద్, విశిష్ట అతిథులుగా కవి జొన్నవిత్తుల, కిమ్స్ ఆస్పత్రి వ్యవస్థాపకులు బొల్లినేని కృష్ణయ్య, తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు ఆచార్య వెలుదండ నిత్యానంద రావు, ప్రముఖ రాజకీయవేత్త వామరాజు సత్యమూర్తి తదితరులు హాజరయ్యారు.ఉదయం 9 గంటలకు డా వంశీ రామరాజు అందించిన స్వాగతోపన్యాసంతో ఆరంభమైన ప్రారంభోత్సవ సభలో, కార్యక్రమ ప్రధాన సమన్వయకర్త రాధిక మంగిపూడి సభా నిర్వహణలో, మండలి బుద్ధ ప్రసాద్, కవి జొన్నవిత్తుల, బొల్లినేని కృష్ణయ్య, వామరాజు సత్యమూర్తి, డా. జననీ కృష్ణ తదితరుల ప్రసంగాలు అందరినీ ఆకర్షించాయి.తదనంతరం ఖతార్ నుండి విచ్చేసిన విక్రమ్ సుఖవాసి నిర్వహణలో అతిథుల చేతుల మీదుగా 18 తెలుగు నూతన గ్రంథాలు ఆవిష్కరించబడ్డాయి. వాటిలో కథల కవితల సంకలనాలు, వ్యాస సంపుటాలు, జెవి పబ్లికేషన్స్, మిసిమి మాసపత్రిక వారి ప్రచురణలు, సిద్ధాంత గ్రంథాలు మాత్రమే కాకుండా, ప్రతిష్టాత్మకంగా 2024 నవంబర్‌లో ఖతార్ దేశ రాజధాని దోహా మహానగరంలో వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా ఆధ్వర్యంలో జరిగిన "9వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు సభా విశేష సంచిక" కూడా ఆవిష్కరించబడడం ఈ సభకు మరింత శోభను చేకూర్చింది.మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 4:30 వరకు కొనసాగిన "అంతర్జాతీయ కవి సమ్మేళనం"లో ఆస్ట్రేలియా, ఖతార్, దక్షిణాఫ్రికా, అమెరికా మొదలైన దేశాలనుండి, ఉభయ తెలుగు రాష్ట్రాలనుండి, ముంబై, అండమాన్ దీవులు మొదలైన ప్రాంతాలనుండి కూడా వచ్చిన సుమారు 80 మంది కవులు కవయిత్రులు పాల్గొని తమ కవితలు వినిపించారు. వంశీ అధ్యక్షురాలు డా. తెన్నేటి సుధాదేవి, రేవూరు అనంత పద్మనాభరావు, జి భగీరథ, గుండు వల్లీశ్వర్, ప్రొ. రామా చంద్రమౌళి మహెజబీన్, ప్రొ. త్రివేణి వంగారి, డా కేతవరపు రాజ్యశ్రీ, డా. చిల్లర భవానీ దేవి, డా. శంకరనారాయణ, అంబల్ల జనార్ధన్, డా చాగంటి కృష్ణకుమారి మొదలైన ఎందరో కవులు కవయిత్రులు ఈ కవిసమ్మేళనంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం కొందరు రచయితలు ప్రసంగవ్యాసాలు వినిపించారు. సభా వ్యాఖ్యాతలుగా పేరి, కృష్ణవేణి, రాధిక వ్యవహరించారు.అనంతరం సాయంత్రం ఆచార్య శలాక రఘునాథ శర్మను ఘనంగా సత్కరించి, వారికి మూడు నిర్వాహక సంస్థల తరఫున "రాయప్రోలు వంశీ జాతీయ సాహితీ జీవన సాఫల్య పురస్కారం" అందించారు. దీనికి తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు ఆచార్య వెలుదండ నిత్యానందరావు ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. అనంతరం శలాక మాట్లాడుతూ తెలుగువారికి సొంతమైన అవధాన ప్రక్రియలో 'సమస్యా పూరణం' అనే అంశంలో ఉండే చమత్కారాలు వివరణలు తెలియజేస్తూ "అవధాన కవిత్వం - సమస్యలు" అనే అంశంపై ప్రత్యేక ప్రసంగాన్ని అందించారు.సాయంత్రం 5:30 గంటల నుండి ద్విశతావధాని డా. బులుసు అపర్ణ చేసిన అష్టావధానం ఈ సదస్సుకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రాధిక మంగిపూడి సంచాలకత్వంలో అమెరికా, యుగాండా, ఆస్ట్రేలియా, ఖతార్, అండమాన్ దీవులు, ముంబై, విశాఖపట్నం, విజయవాడ నుండి వచ్చిన 8 మంది మహిళలు పృచ్ఛకులుగా పాల్గొనడంతో ఇది "సంపూర్ణ మహిళా అష్టావధానం"గా ప్రశంసలు అందుకుంది.ఈ కార్యక్రమానికి ప్రధాన నిర్వాహకులుగా వంగూరి ఫౌండేషన్ వ్యవస్థాపకులు డా. వంగూరి చిట్టెన్ రాజు, వంశీ వ్యవస్థాపకులు డా. వంశీ రామరాజు, సింగపూర్ సంస్థ వ్యవస్థాపకులుకవుటూరు రత్నకుమార్ వ్యవహరించగా, వంగూరి ఫౌండేషన్ భారతదేశ ట్రస్టీ శైలజ సుంకరపల్లి ఆధ్వర్యంలో వేదిక ఏర్పాట్లు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమం యూట్యూబ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా పంచవ్యాప్తంగా సాహిత్య అభిమానుల మన్ననలు అందుకుంది.

టెక్సాస్‌లో రోడ్డు ప్రమాదం, ప్రాణాపాయ స్థితిలో తెలుగు విద్యార్థిని దీప్తి
ఉన్నత చదువులకోసం అమెరికాకు వెళ్లిన తెలుగు విద్యార్థిని ప్రాణలతో పోరాడుతోంది. అమెరికాలోని టెక్సాస్‌లోని డెంటన్ నగరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తెలుగు అమ్మాయిలు గాయపడ్డారు. వీరిలో తీవ్రంగా గాయపడిన విద్యార్థినిని దీప్తి వంగవోలుగా గుర్తించారు. మరో విద్యార్థినికి కూడా తీవ్రంగా గాయపడిందని అయితే ఆమెకు ప్రాణాపాయం లేదని అమెరికా మీడియా నివేదికలు తెలిపాయి.ఈ ప్రమాదం శనివారం (ఏప్రిల్ 12) తెల్లవారుజామున, ఎన్. బోనీ బ్రే స్ట్రీ మరియు డబ్ల్యు. యూనివర్శిటీ డ్రైవ్ సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరుకు చెందిన దీప్తి వంగవోలు ,ఆమె స్నేహితురాలు కాలినడకన ఇంటికి చేరుకోబోతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. వెంటనే ఆ వాహనం డ్రైవర్ని అక్కడినుంచి పారిపోయాడు. దీప్తికి తలకు లోతైన గాయం అయిందని, ఆమెకు శస్త్రచికిత్స జరుగుతోందని స్థానిక మీడియా తెలిపింది. ప్రస్తుతం డెంటన్ పోలీసులు ఈ హిట్ అండ్ రన్ ఘటనపై దర్యాప్తు ముమ్మరం చేశారు. పరారీలో ఉన్న డ్రైవర్‌ను, ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించేందుకు ప్రజల సహాయం కోరుతూ ప్రకటన కూడా విడుదల చేశారు. ఈ ఘటనపై మరిన్నివివరాలు అందాల్సి ఉంది. లింక్డ్ఇన్ ప్రొఫైల్ ప్రకారం, దీప్తి వంగవోలు నార్త్ టెక్సాస్ విశ్వవిద్యాలయంలో కంప్యూటర్ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్‌లో మాస్టర్స్ చదువుతోంది. 2023లో నరసరావు పేట ఇంజనీరింగ్ కళాశాల నుండి బీటెక్ పూర్తి చేసింది.
క్రైమ్

కొడుకు మృతదేహంతో మూడురోజులు
మంచిర్యాల క్రైం: మతిస్థిమితం కోల్పోయిన ఒక తండ్రి.. చనిపోయిన కుమారుడి శవం పక్కనే మూడు రోజుల పాటు ఉన్న ఘటన వెలుగు చూసింది. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని అశోక్‌రోడ్‌లో జరిగిన ఈ ఘటనపై స్థానికులు, ఎస్ఐ ప్రవీణ్‌కుమార్ తెలిపిన వివరాలివి. గూడెల్లి వెంకట్‌రెడ్డి అశోక్‌రోడ్డులో నివసిస్తున్నారు.ఈయనకు కుమారుడు లక్ష్మీనారాయణ ఉన్నాడు. వెంకట్‌రెడ్డి సింగరేణిలో పనిచేసి ఉద్యోగ విరమణ చేశారు. మూడేళ్ల క్రితం భార్య రాధమ్మ అనారోగ్యంతో చనిపోయాక వెంకట్‌రెడ్డి మతిస్థిమితం కోల్పోయారు. తండ్రీకొడుకులు ఇద్దరే ఇంట్లో ఉంటున్నారు. ఎస్టీపీపీలో కాంట్రాక్ట్ వర్కర్‌గా పనిచేస్తున్న కొడుకు లక్ష్మీనారాయణ.. తండ్రి బాగోగులు చూసుకునేవారు. ఇటీవల మద్యానికి బానిసైన లక్ష్మీనారాయణ.. ఆదివారం కూడా తాగి ఇంట్లోని సోఫాలో పడుకున్నారు. అప్పటి నుంచి బయటకు రాలేదు. మంగళవారం ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో.. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించగా.. సోఫాలో లక్ష్మీనారాయణ (30) శవమై కనిపించాడు. మరోవైపు వెంకట్‌రెడ్డి అచేతన స్థితిలో పడుకుని ఉన్నాడు. ‘నీ కొడుక్కి ఏమైంది..’ అని ప్రశ్నిస్తే.. ‘పడుకున్నాడు’.. అంటూ సమాధానం చెప్పారు. పోలీసులు లక్ష్మీనారాయణ మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, వెంకట్‌రెడ్డిని వైద్యం నిమిత్తం ఆసుపత్రిలో చేర్పించారు. వెంకట్‌రెడ్డి బంధువు గూడెల్లి శ్రీనివాస్‌రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు.

ఆడుకుంటూ వెళ్లి అసువులు బాసింది
చైతన్యపురి(హైదరాబాద్): ఇంటి పక్క నుంచి ఆడుకుంటూ వెళ్లిన ఆరేళ్ల బాలిక ప్రమాదవశాత్తు చెరువు నీళ్లలో పడి మృతి చెందిన ఘటన సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ సైదిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని నెల్లూరు జిల్లాకు చెందిన పాలకుర్తి శ్రీను, శ్రావణి దంపతులు. బతుకుదెరువు కోసం నగరానికి వచ్చి కూలిపనులు చేసుకుంటూ గ్రీన్‌పార్కు కాలనీ రోడ్‌నం.14లో నివసిస్తున్నారు. వీరికి నలుగురు కూతుళ్లు. సోమవారం సాయంత్రం 4 గంటల సమయంలో తల్లిదండ్రులు పక్కింటివారితో మాట్లాడుతుండగా రెండో కూతురు అభిత (6) ఆడుకుంటోంది. కొద్ది సేపటి తర్వాత తర్వాత చూడగా అభిత కనిపించలేదు. ఎక్కడ వెతికినా జాడ తెలియకపోవటంతో రాత్రి సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేశారు. మంగళవారం ఉదయం 9.30 గంటలకు అభిత మృతదేహం చెరువు నీటిలో తేలుతూ కనిపించింది. ఇంటి సమీపంలోనే చెరువు ఉండటంతో బాలిక ఆడుకుంటూ వెళ్లి అందులో పడి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. తమ ఆరేళ్ల కూతురు మృతి చెందడంతో శ్రీను, శ్రావణి దంపతులు కన్నీరుమున్నీరుగా విలపించారు. చెరువు చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని అధికారులకు ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా పట్టించుకోవడం లేదని కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇద్దరిని బలిగొన్న అతివేగం
బిట్రగుంట(నెల్లూరు): అతి వేగం ఇద్దరు స్నేహితుల ప్రాణాలను బలిగొంది. ఈ ఘటన కొడవలూరు మండలం నార్తురాజుపాళెం సమీపంలో ఆంజనేయస్వామి గుడి వద్ద హైవేపై సోమవారం అర్ధరాత్రి జరిగింది. పోలీసుల సమాచారం మేరకు.. బోగోలు పంచాయతీ బేతనీయపేటకు చెందిన షేక్ మన్సూర్‌బాషా (26), విశ్వనాథరావుపేట రామస్వామిపాళెంకు చెందిన బత్తుల ప్రవీణ్‌కుమార్ (26) చిన్ననాటి నుంచి స్నేహితులు. మన్సూర్‌కు వివాహమై రెండేళ్ల కుమారుడు ఉండగా, ప్రవీణ్‌కుమార్ అ వివాహితుడు. మన్సూర్ బిట్రగుంటలోనే వాహనాలకు నేమ్ బోర్డులు, స్టిక్కర్లు వేసే షాపు నిర్వహిస్తున్నాడు. ప్రవీణ్‌కుమార్ గౌరవరం టోల్‌ప్లాజా వద్ద పని చేస్తున్నాడు. స్నేహితులిద్దరూ పనిమీద సోమవారం నెల్లూరు వెళ్లారు. రాత్రి సుమారు 11.30 గంటల తర్వాత బైక్‌పై ఇంటికి బయలు దేరారు. బాగా ఆలస్యం కావడంతో త్వరగా ఇంటికి చేరుకొందామని బైక్‌ను వేగంగా నడుపుకొంటూ వచ్చారు. 12 గంటల ప్రాంతంలో నార్తురాజుపాళెం ఆంజనేయస్వామి గుడి వద్ద ఆగి ఉన్న లారీని అదే వేగంతో వెనుక వైపు ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న స్నేహితులు మన్సూర్, ప్రవీణ్‌కుమార్ అక్కడకక్కడే మృతి చెందారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఏఎస్సై గంధం ప్రసాద్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి మృతుల కుటుంబాలకు సమాచారం అందించారు. అనంతరం ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నెల్లూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై తెలిపారు.

చదివేది ఏడో తరగతి.. వాడేది ఐ ఫోన్
జీడిమెట్ల(హైదరాబాద్): ఆ బాలుడు ఏడో తరగతి చదువుతున్నాడు. ఇంట్లో ఎవరూ చూడకుండా సంవత్సర కాలంగా ఇంట్లో ఐ ఫోన్ వాడుతున్నాడు. కుమారుడు ఐ ఫోన్ వాడటాన్ని గమనించిన తండ్రి.. ‘నీకు ఫోన్ ఎలా వచి్చంది’ అని నిలదీయడంతో అసలు విషయం చెప్పేశాడు. ‘మన షాపులోంచి రోజూ కొంత డబ్బు తీసి ట్యూషన్ మాస్టారుకు ఇచ్చేవాణ్ని. మాస్టారే ఈ ఫోన్ కొనిచ్చాడు’ అని బాలుడు తన తండ్రికి వివరించాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు.పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.. షాపూర్‌నగర్‌కు చెందిన వ్యాపారవేత్త కమల్‌జైన్. ఆయన కుమారుడు ఏడో తరగతి చదువుతున్నాడు. సంవత్సర కాలంగా బాలుడు తమ షాపులోంచి కొంత నగదు దొంగిలించసాగాడు. ఆ డబ్బును తనకు ట్యూషన్ చెప్పే మాస్టారుకు ఇచ్చేవాడు. ఈ క్రమంలో బాలుడికి సదరు ట్యూషన్ మాస్టారు ఐ ఫోన్ కొనిచ్చాడు. ఈ విషయం ఇంట్లో తెలియడంతో కుమారుడికి ట్యూషన్ చెబుతున్న వ్యక్తిపై జీడిమెట్ల పీఎస్‌లో కమల్‌జైన్ ఫిర్యాదు చేశాడు. విచారణ చేపట్టిన పోలీసులు ట్యూషన్ మాస్టారు సందీప్‌పై కేసు నమోదు చేశారు. సంవత్సర కాలంగా కుమారుడు తమ షాపులోంచి డబ్బులు తీస్తున్న తండ్రి పసిగట్టకపోవడం గమనార్హం. అలాగే సంవత్సర కాలంగా కుమారుడు ఇంట్లో ఫోన్ వాడుతున్నా కుటుంబ సభ్యులు చూడకపోవడం మరో విచిత్రం. ఎవరైనా పిల్లలు ఇలాంటి పనులు చేస్తే వారికి కౌన్సెలింగ్ ఇప్పించాలని సీఐ గడ్డం మల్లేష్ తల్లిదండ్రులకు సూచించారు.