Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today

Top Stories

ప్రధాన వార్తలు

USA Travel Advisory Warning Issued To Pakistan Tour1
పాకిస్థాన్‌, భారత్‌ సరిహద్దులకు వెళ్లకండి.. అమెరికా పౌరులకు హెచ్చరిక

వాషింగ్టన్‌: పాకిస్థాన్‌ విషయంలో అమెరికా మరో కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికా పౌరులు ఎవరూ పాకిస్థాన్‌కు వెళ్లొద్దు అంటూ తాజాగా ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది. ఈ క్రమంలో పాకిస్థాన్‌లో ఉగ్రదాడులు జరిగే ప్రమాదం ఎక్కువ.. టెర్రరిస్టులు దాడులు జరిపే ప్రమాదం ఉందని హెచ్చరించింది.అమెరికా తమ దేశ పౌరులకు హెచ్చరికలు జారీ చేసింది. పాకిస్థాన్‌లో దాడులు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో వీలైనంత వరకూ ఆ దేశానికి వెళ్లకుండా ఉండడమే మంచిదంటూ పౌరులకు తాజాగా ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది. ఇదే సమయంలో.. పాకిస్థాన్ వెళ్లేందుకు ఇప్పటికే ఏర్పాట్లు చేసుకుంటే భారత సరిహద్దు ప్రాంతాలకు, బలూచిస్థాన్, ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లకు మాత్రం అస్సలు వెళ్లొద్దని హెచ్చరించింది. ఆయా ప్రావిన్స్‌లలో టెర్రరిస్టులు దాడులు చేసే అవకాశం ఉందని తెలిపింది. పౌరులను లక్ష్యంగా చేసుకుని దాడులు జరగవచ్చని పేర్కొంది. ఇదే సమయంలో పాకిస్థాన్‌కు వెళ్లేవారూ ఈ విషయాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది.అలాగే.. మార్కెట్లు, రవాణా కేంద్రాలు తదితర ఏరియాలలో పౌరులను, పోలీసులను, సైనికులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడులు చేసే అవకాశం ఉందని చెప్పింది. మరోవైపు.. పాక్ నుంచి భారత్‌లో అడుగుపెట్టేందుకు ఉన్న ఏకైక అధికారిక మార్గం వాఘా బార్డర్ మాత్రమేనని, సరిహద్దులు దాటి భారత్ లో అడుగుపెట్టాలంటే వీసా తప్పనిసరి అని పేర్కొంది. ముందు వీసా తీసుకున్నాకే బార్డర్ వద్దకు వెళ్లాలని, వాఘా బార్డర్ వద్ద వీసా పొందే అవకాశం లేదని వివరించింది.ఇదిలా ఉండగా.. పాకిస్థాన్‌ పౌరుల విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌(trump) సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. పాకిస్థాన్‌ నుంచి అమెరికాకు వచ్చే వారిపై నిషేధం విధించేందుకు ట్రంప్‌ సిద్ధమయ్యారు. భద్రతా కారణాల రీత్యా.. పాక్‌ పౌరులపై ట్రావెల్‌ బ్యాన్‌ విధించనున్నట్టు సమాచారం. ఇక, డొనాల్డ్‌ ట్రంప్‌ మొదటిసారి అధ్యక్షుడైన సమయంలోనూ కొన్ని ముస్లిం దేశాల పౌరులను అమెరికాలోకి అనుమతించడంపై నిషేధం విధించిన విషయం తెలిసిందే.🇺🇸 The US warns against travel to Pakistan, citing terrorism risks. A "Do Not Travel" advisory applies to areas near the India-Pakistan border, the LoC, Balochistan, and Khyber Pakhtunkhwa due to threats of violence and armed conflict. pic.twitter.com/q2dLj1pkDa— Eye On News (@EyeOnNews24) March 9, 2025

Janasena Leader Thammayya Babu Overaction In Prathipadu Chc2
జనసేన నేత వీరంగం.. వైద్యురాలిపై దౌర్జన్యం

సాక్షి, కాకినాడ జిల్లా: అధికారం చేతిలో ఉంది కదా అని కూటమి నేతలు బరితెగిస్తున్నారు. జనసేన నాయకుడు రెచ్చిపోయాడు. ప్రత్తిపాడు సిహెచ్‌సీ వైద్య సిబ్బందిపై దౌర్జన్యానికి దిగారు. ఒళ్లు దగ్గర పెట్టుకుని ఉద్యోగం చేయాలంటూ వేలు చూపిస్తూ వైద్యులకు నియోజకవర్గ జనసేన ఇన్‌ఛార్జ్‌ వరుపుల తమ్మయ్య బాబు వార్నింగ్‌ ఇచ్చాడు.రోగులకు వైద్యం చేస్తున్న సమయంలో డాక్టర్‌ శ్వేతకు తమ్మయ్యబాబు ఫోన్‌ చేశారు. ఆయనెవరో తెలియదని.. వేరొకరికి వైద్యం చేస్తున్నానని వైద్యురాలు చెప్పారు. ఫోన్‌లో మాట్లాడడానికి వైద్యురాలు నిరాకరించడంతో తమ్మయ్య బాబు.. నేరుగా ఆసుపత్రికి వచ్చి డాక్టర్‌ శ్వేతతో పాటుగా అక్కడున్న వైద్య సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించారు. జ్ఞానం ఉందా?.. నోర్మూయ్ అంటూ వైదురాలిపై అరుపులతో వీరంగం సృష్టించారు.

Yuvraj Singh, Rayudus fireworks Help to India Masters march into IML 2025 semis3
యువ‌రాజ్‌, రాయుడు విధ్వ‌ంసం..సెమీస్‌కు చేరిన టీమిండియా

అంతర్జాతీయ మాస్టర్స్ లీగ్ టీ20-2025 టోర్నీలో ఇండియన్‌ మాస్టర్స్ టీమ్ మరో విజయాన్ని అందుకుంది. ఈ టోర్నీలో భాగంగా శనివారం రాయ్‌పూర్‌ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 పరుగుల తేడాతో భారత్ గెలుపొందింది. ఈ విజయంతో టీమిండియా తమ సెమీస్ బెర్త్‌ను ఖారారు చేసుకుంది. ఇక ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన భారత మాస్టర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 253 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది. భారత బ్యాటర్లలో సౌరబ్ తివారీ(37 బంతుల్లో 7 ఫోర్లు,2 సిక్స్‌లతో 60), అంబటి రాయుడు(35 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్స్‌లతో 63) హాఫ్‌ సెంచరీలతో మెరవగా.. ఆఖరిలో కెప్టెన్‌ యువరాజ్‌​ సింగ్‌ విధ్వంసం సృష్టించాడు.విండీస్‌ బౌలర్లను యువీ ఉతికారేశాడు. కేవలం 20 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 49 పరుగులు చేసి ఆజేయగా నిలిచాడు. వీరితో పాటు గుర్‌క్రీత్‌ సింగ్‌ మానన్‌(21 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 46) తుపాన్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. వెస్టిండీస్‌ బౌలర్లలో బెన​, కార్టర్‌, టేలర్‌ తలా వికెట్‌ సాధించారు.అనంతరం భారీ లక్ష్య చేధనలో విండీస్‌ ఆఖరి వరకు పోరాడింది. 253 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కరేబియన్లు.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 246 పరుగులు చేసింది. వెస్టిండీస్‌ బ్యాటర్లలో డ్వైన్‌ స్మిత్‌(34 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్స్‌లతో 79), విలియమ్‌ పెర్కిన్స్‌(52) హాఫ్‌ సెంచరీలు సాధించాడు.లెండల్‌ సిమిన్స్‌( 13 బంతుల్లో 1 ఫోరు, 5 సిక్స్‌లతో 38) విధ్వంసకర ఇన్నింగ్స్‌ ఆడాడు. కానీ ఆఖరిలో వరుస క్రమంలో వికెట్లు కోల్పోవడంతో వెస్టిండీస్‌ ఓటమి చవిచూడాల్సి వచ్చింది. భారత బౌలర్లలో స్టువర్ట్‌ బిన్నీ మూడు వికెట్లు పడగొట్టగా.. పవన్‌ నేగి రెండు, ఇర్ఫాన్‌​ పఠాన్‌ ఒక్క వికెట్‌ సాధించారు.చదవండి: Champions Trophy final: 'అత‌డు 20 ఓవ‌ర్లు ఆడితే ఛాంపియ‌న్స్ ట్రోఫీ భార‌త్‌దే'

Vice President Jagdeep Dhankhar admitted to AIIMS4
ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్‌కు అ‍స్వస్థత.. ఎయిమ్స్‌కు తరలింపు

ఢిల్లీ: భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్‌(Jagdeep Dhankar) అస్వస్థతకు గురయ్యారు. దీంతో, ఆయనను వెంటనే ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరారు. అయితే, ఛాతి నొప్పితో బాధపడినట్లు తెలుస్తోంది.వివరాల ప్రకారం.. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్‌ ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. ఆదివారం తెల్లవారుజామున ఆయనకు ఛాతి నొప్పితో బాధపడినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో, తెల్లవారుజామున 2 గంటలకు ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌ (AIIMS)కు తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో కార్డియాలజీ విభాగాధిపతి డాక్టర్‌ రాజీవ్‌ నారంగ్‌ ఆధ్వర్యంలో ఆయనకు చికిత్సను అందిస్తున్నారు. ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు వైద్యబృందం తెలిపింది. ఇక, ధన్కర్‌ అస్వస్థత విషయం తెలిసిన వెంటనే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. ఎయిమ్స్‌కు వెళ్లి ఆయనను పరామర్శించారు. Vice President Jagdeep Dhankhar was admitted to the cardiac department at AIIMS Delhi in the early morning. He is stable and under observation: AIIMS Hospital Sources— ANI (@ANI) March 9, 2025

Conspiracy to divert the investigation into the YS Viveka case5
చంద్రబాబు క్షుద్ర రాజకీయం

సాక్షి, అమరావతి: మాజీ ఎంపీ వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తును పక్కదారి పట్టించి, తమ రాజకీయ ప్రయోజనాల కోసం దుష్ప్రచార కుట్రకు టీడీపీ కూటమి ప్రభుత్వం మరోమారు తెరతీసింది. ఈ కేసులో సాక్షిగా ఉన్న వాచ్‌మేన్‌ రంగన్న అనారోగ్యంతో మరణిస్తే, ఆ ఉదంతాన్ని వక్రీకరిస్తూ కుతంత్రం పన్నుతోంది. సీబీఐ దర్యాప్తు చేస్తున్న కేసు పరిధిలోకి రాష్ట్ర పోలీసులను జొప్పించడం ద్వారా చంద్రబాబు తన కుయుక్తులను చాటుకున్నారు. ఇందుకోసం ఏకంగా రాష్ట్ర మంత్రి మండలి సమావేశాన్ని వేదికగా చేసుకోవడం కూటమి ప్రభుత్వ పన్నాగా­ని­కి నిదర్శనం. నాడు చంద్రబాబు ప్రభుత్వ హ­యాంలోనే 2019 మార్చి 14న వైఎస్‌ వివేకా హత్య­కు గురవ్వగా, ప్రస్తుతం అదే చంద్రబాబు ప్రభుత్వంలో రం­గన్న మరణించారన్న వాస్తవాలను కప్పిపుచ్చు­తూ తిమ్మిని బమ్మి చేసేందుకు బరి తెగిస్తున్నారు. వాస్తవంగా ఇందుకు బాధ్యత వహించాల్సింది టీడీ­పీ ప్రభుత్వం. కానీ అందుకు విరుద్ధంగా వివేకా హ­త్య వెనుక ఉన్న కుట్రను కప్పి పుచ్చేందుకే ఇలా చేస్తున్నారని తెలుస్తోంది. దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న రంగన్నను తొలుత పులివెందుల ఆసుపత్రికి, అనంతరం కడపలోని రిమ్స్‌ ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తీసుకెళ్లి చికిత్స చేయించినా ఫలితం లేకపోయింది. ఈ సహజ మరణానికి రాజకీయ రంగు పులమాలన్న ఆలోచన రా­వడం ఒక్క చంద్రబాబు ముఠాకే సాధ్యమైంది. ఎవరికైనా, ఏమైనా సందేహాలు ఉంటే ఈ కేసును విచారిస్తున్న సీబీఐకి నివేదించాలి. ఇంకోవైపు న్యాయస్థానంలో విచారణ ప్రక్రియ కొ­న­సాగుతోంది. ఈ నేపథ్యంలో రంగన్నతోపాటు గత ఐదేళ్ల­లో సంభవించిన మరికొన్ని స­హజ మరణాలపై దర్యాప్తు­నకు ప్రత్యేక దర్యాప్తు బృందా­న్ని (సిట్‌) నియమించారు. తద్వారా వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తును పరోక్షంగానైనా సరే రాష్ట్ర పోలీసులకు అప్పగించాలన్నది చంద్రబాబు కుతంత్రమని స్పష్టమవుతోంది. తద్వారా తన రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా వైఎస్సార్‌సీపీపై దు్రష్పచారం చేసే కుట్ర­ను అమలు చేయాలన్నది అసలు ఉద్దేశం. అందుకే కుట్ర పూరితంగా గురువారం బీజేపీ ఎమ్మెల్యే ఆది నారా­యణ రెడ్డితో అసెంబ్లీలో మాట్లాడించి, ఆ రా­త్రి­కే సిట్‌ను నియమిస్తున్నట్టు ప్రకటించారు. రెడ్‌­బుక్‌ కుట్రలను అమలు చేసేందుకే ప్రత్యేకంగా వైఎస్సార్‌ జిల్లా ఎస్పీగా నియమించిన ఇ.జి.అశోక్‌కు­మా­ర్‌తోనూ అదే రాత్రి హడావుడిగా మాట్లాడించారు. మంత్రివర్గ సమావేశం వేదికగా కుట్ర సచివాలయంలో శుక్రవారం మంత్రి మండలి సమా­వేశంలో అజెండా అంశాలపై చ­ర్చ అనంతరం.. ముందస్తు పన్నాగం ప్రకారం రంగన్న మృతిపై చర్చకు తెరతీశారు. ఏకంగా డీజీపీ హరీశ్‌కుమార్‌ గుప్తాను మంత్రి మండలి సమావేశ మందిరంలోకి పిలిపించి రంగన్న మృతిపై ఆరా తీసినట్టు హైడ్రా­మా నడిపారు. ముందు ఇచి్చన స్క్రిప్టు ప్రకారమే డీజీపీ తన పాత్రలో నటించారు. రంగన్నది అనుమానాస్పద మృతేనని ప్రాథమిక దర్యాప్తు పూర్తి కాకుండానే, పోస్టుమార్టం నివేదిక రాకుండానే ఆయన ఏకపక్షంగా ప్రకటించడం విడ్డూరం. బాబు గూటిలో చిలుకే దస్తగిరి స్వయంగా వివేకానందరెడ్డిని దారుణంగా హత్య చేశానని అంగీకరించిన దస్తగిరిని అప్రూవర్‌గా మార్చడం న్యాయ నిపుణు­లను విభ్రాంతికి గురి చేసింది. తద్వారా తాము లక్ష్యంగా చేసుకున్న వారి పేర్లను అతనితో వాంగ్మూ­లం ద్వారా చెప్పించడం అన్నది టీడీపీ పకడ్బందీ కుట్రకు తార్కాణం. అప్రూవర్‌గా మారక ముందు అతను ఇచ్చిన వాంగ్మూలం, అప్రూవర్‌గా మారిన తర్వాత ఇచ్చిన వాంగ్మూలం పూర్తి పరస్పర విరుద్ధంగా ఉన్నాయి. అత్యంత నేర చరిత్ర కలిగిన దస్తగిరి వైఎస్‌ వివేకా హత్యకు కొన్ని రోజుల ముందు వరకు రూ.500 కోసం కూడా అప్పులు చేసే దయనీయ స్థితిలో ఉండేవాడు. స్నేహితుడు సునీల్‌ యాదవ్‌తో అతని వాట్సాప్‌ చాటింగులే ఆ విషయాన్ని నిర్ధారించాయి. అటువంటి దస్తగిరి అప్రూవర్‌గా మారిపోగానే... అత­ని వద్దకు కోట్లాది రూపాయలు ఎలా వచ్చాయన్నది ఈ కేసులో అత్యంత కీలకం. ఇతను బహి­రంగంగా సాగిస్తున్న దందాగిరీ అంతా ఇంతా కా­దు. ఇలాంటి కిరాయి రౌడీకి సిద్ధార్థ లూథ్రా వంటి ఢిల్లీ స్థాయి లాయర్లు కేసు వాదిస్తుండటం గమనార్హం. గురువారం ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు లూథ్రా­తో రహస్యంగా భేటీ కావడం గమనార్హం. అ­నం­తరమే రాష్ట్ర ప్రభుత్వం సిట్‌ను నియమించింది.వివేకా రెండో భార్య వాంగ్మూలాన్ని పట్టించుకోరా? వైఎస్‌ వివేకానందరెడ్డి రెండో భార్య షమీమ్‌ ఆవేదనతో ఇచి్చన వాంగ్మూలాన్ని అటు సీబీఐ, ఇటు చంద్రబాబు ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగా విస్మరిస్తున్నాయి. ఆమెతో రెండో వివాహంతోనే వివేకా కుటుంబంలో విభేదాలు ఏర్పడ్డాయి. షమీమ్‌కు ఆస్తిలో వాటా ఇస్తానని చెప్పడంతోపాటు ఆమె కుమారుడిని తన రాజకీయ వారసుడిగా ప్రకటిస్తానని వివేకా చెప్పడాన్ని ఆయన మొదటి భార్య సౌభాగ్యమ్మ, కుమార్తె సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. షమీమ్‌ను సునీత తీవ్రంగా దూషిస్తూ అవమానించారు. వారిద్దరి మధ్య వాట్సాప్‌ చాటింగ్‌లు ఆ విషయాన్ని బయట పెట్టాయి. వివేకా హత్య వెనుక ఆయన సొంత కుటుంబ సభ్యులు.. అంటే కుమార్తె సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్‌ రెడ్డి, పెద్ద బావమరిది నర్రెడ్డి శివ ప్రకాశ్‌ రెడ్డి పాత్ర ఉందని షమీమ్‌ వాంగ్మూలం ఇచ్చారు. మరి ఆ అంశానికి చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు ప్రాధాన్యం ఇవ్వడం లేదన్నది ప్రశ్నార్థకంగా మారింది. తద్వారా వైఎస్‌ వివేకా హత్య వెనుక కారణాలను కప్పిపుచ్చి, తమ రాజకీయ ప్రయోజనాలే లక్ష్యంగా ముందుకెళ్లాలని టీడీపీ కూటమి ప్రభుత్వం భావిస్తోందనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రంగన్న మృతదేహానికి రీ పోస్టుమార్టంసిట్‌ పర్యవేక్షణలో 4 గంటలపాటు నిర్వహణపులివెందుల: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి ఇంటి వాచ్‌మేన్‌ రంగన్న మృతదేహానికి శనివారం రీ పోస్టుమార్టం నిర్వహించారు. ఉబ్బసం, శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో తీవ్ర అనారోగ్యానికి గురైన రంగన్న కడప రిమ్స్‌లో చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందిన విషయం తెలిసిందే. ఆయన మృతదేహానికి గురువారం కడప రిమ్స్‌లో వైద్యులు పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతదేహాన్ని పులివెందులలోని భాకరాపురం శ్మశానవాటికలో ఖననం చేశారు. అయితే, రంగన్న మృతి పట్ల సీఎం చంద్రబాబు శుక్రవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో అనుమానం వ్యక్తంచేశారు. ఈ నేపథ్యంలో సిట్, వైద్య బృందం సభ్యులు కలిసి భాకరాపురం శ్మశానంలో పూడ్చిపెట్టిన రంగన్న మృతదేహాన్ని వెలికితీయించారు. శ్రీకాకుళం జిల్లా ఏఎస్పీ శ్రీనివాసులు పర్యవేక్షణలో కడపకు చెందిన వైద్య బృందం, తిరుపతి నుంచి వచ్చిన ఫోరెన్సిక్‌ బృందం సభ్యులు.. రెవెన్యూ అధికారుల సమక్షంలో 4గంటల­పాటు రంగన్న మృతదేహానికి రీ పోస్టుమార్టం నిర్వహించారు. ముఖ్యమైన శరీర భాగాలను సేకరించి తిరుపతి ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు తరలించారు.

Adani Group Chairperson Gautam Adani Shares Personal Note On International Women Day6
'అప్పుడే అలా ప్రతిజ్ఞ చేశాను': గౌతమ్ అదానీ

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా.. ప్రముఖ పారిశ్రామికవేత్త, అదానీ గ్రూప్ చైర్మన్ 'గౌతమ్ అదానీ' (Gautam Adani) లింగ సమానత్వం, అన్ని రంగాలలో మహిళల సాధికారత పట్ల తన నిబద్ధతను వెల్లడించారు. తన ప్రయాణాన్ని రూపొందించిన బలమైన మహిళల గురించి మాట్లాడుతూ.. ''బనస్కాంత నుండి బోర్డ్‌రూమ్‌ల వరకు: నా ప్రపంచాన్ని తీర్చిదిద్దిన మహిళలు" అనే పేరుతో ఓ పోస్ట్ చేశారు.లింగ సమానత్వం అంటే..తన మనవరాళ్లు.. తమ కలలను సాధించడంలో మహిళలు ఎటువంటి అడ్డంకులు ఎదుర్కోని ప్రపంచాన్ని నిర్మించాలనే తన సంకల్పాన్ని ఆదానీ వివరించారు. నన్ను, నా ప్రయాణాన్ని దృఢంగా రూపందించుకోవడంలో.. నా తల్లి, భార్య సహాయం చేశారని చెప్పారు. లింగ సమానత్వం అంటే.. ''కేవలం మహిళలకు అవకాశాలు కల్పించడం మాత్రమే కాదు, ఇది మానవ మనుగడకు ఎంతో అవసరం'' అని నొక్కి చెప్పారు.అవధులు లేని ప్రపంచాన్నిదశాబ్దం క్రితం, నా మొదటి మనవరాలి సున్నితమైన వేళ్లను నేను పట్టుకున్నప్పుడు, నేను నిశ్శబ్దంగా ఒక ప్రతిజ్ఞ చేసాను. ఆమె ఆకాంక్షలకు అవధులు లేని ప్రపంచాన్ని నిర్మించడంలో సహాయం చేయాలని అనుకున్నాను. ఇప్పుడు అందమైన ముగ్గురు మానవరాళ్లను చూస్తుంటే.. నా వాగ్దానం మరింత గుర్తుకొస్తోందని అదానీ చెప్పుకొచ్చారు.ఇదీ చదవండి: ప్రపంచ కుబేరుడితో నాల్గవ బిడ్డకు జన్మనిచ్చింది: ఎవరీ షివోన్ జిలిస్?క్యాలెండర్‌లో ఒక తేదీఅంతర్జాతీయ మహిళా దినోత్సవం కేవలం క్యాలెండర్‌లో ఒక తేదీ కాదు, మనం సాధించిన పురోగతిని.. ముందుకు సాగుతున్న ప్రయాణాన్ని గుర్తుచేస్తుంది. వ్యక్తిగతంగా.. తల్లి నుంచి ప్రేరణ పొందిన చిన్న పిల్లవాడిగా, నాయకత్వంలో మహిళలు ఎదుర్కొంటున్న సవాళ్లను చూస్తున్న వ్యాపారవేత్తగా, నా భార్య ప్రీతి అదానీ ఫౌండేషన్ పట్ల అచంచలమైన అంకితభావంతో ప్రేరణ పొందిన భర్తగా.. నన్ను దాదూ అని ఆప్యాయంగా పిలిచే అమ్మాయిల కోసం పరిమితులు లేని ప్రపంచం గురించి కలలు కంటున్న తాతగా నన్ను నేను చూసుకుంటున్నాను.ప్రతిభకు హద్దులు లేవుగౌతమ్ అదానీ.. తన కంపెనీ ఓడరేవులలో ఒకదానిని సందర్శించినప్పుడు తనకు ఎదురైన వ్యక్తిగత అనుభవాన్ని పంచుకున్నారు. అక్కడ నాయకత్వ పాత్రల్లో మహిళలు లేకపోవడాన్ని గమనించారు. ఇదే ఆయనలో మార్పు తీసుకురావడానికి దోహదపడింది. నాయకత్వ పాత్రల్లో మహిళలు లేకపోవడానికి కారణం.. సామర్థ్యం లేకపోవడం కాదు, పురుషాధిక్యంతో వివిధ రంగాలలో మార్గాలు లేకపోవడం అని తెలుసుకున్నారు. మహిళల ప్రతిభకు హద్దులు లేవు, వారికి కూడా సమాన అవకాశాలు కల్పించాలి. కాబట్టి అన్ని రంగాల్లోనూ మహిళలకు సమానమైన అవకాశాలు కల్పించాలని మహిళా దినోత్సవం సందర్భంగా అదానీ సంకల్పించారు.

Rescue Operation In Slbc Tunnel Enters 16th Day Updates7
SLBC: కాంక్రీట్‌లో కూరుకుపొయిన మృతదేహం గుర్తింపు

Slbc Tunnel Rescue Operation Updates:👉జీపీఆర్‌, కేడవర్ డాగ్స్ గుర్తించిన ప్రదేశాలలో చిక్కుకున్న వారి ఆచూకీ కోసం తవ్వకాలు ముమ్మరం చేశారు. టీబీఎంకు ఎడమ పక్కన కనిపించిన ఓ మృతదేహానికి సంబంధించిన చేయిని గుర్తించారు. మృతదేహం పూర్తిగా కాంక్రీట్‌లో కూరుకుపోయింది. డ్రిల్లింగ్ ద్వారానే బయటికి తీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. నేడు రెస్క్యూ ఆపరేషన్‌లో 130 మంది నిపుణుల బృందం పాల్గొంటున్నారు.👉ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో 16వ రోజు రెస్క్యూ ఆపరేషన్‌ కొనసాగుతోంది. ఇంకా 8 మంది కార్మికుల జాడ తెలియలేదు. ఇక రోబోల వినియోగం తప్పదని అధికారులు అంటున్నారు. ఆ మేరకు చర్యలకు ఉపక్రమిస్తున్నారు. చివరి 50 మీటర్ల ప్రాంతంలో సహాయక చర్యలు క్లిష్టంగా మారాయి. టెన్నెల్‌ ఎండ్‌ పాయింట్‌లో కీలక స్పాట్స్‌ను గుర్తించారు. కీలకమైన స్పాట్స్‌లో ర్యాట్‌ హోల్‌ మైనర్ల తవ్వకాలు చేపట్టారు. రెస్య్కూలో జాతీయ, అంతర్జాతీయ నిపుణులు పాల్గొంటున్నారు.👉కాగా, ఎనిమిది మందిని గుర్తించేందుకు చేపడుతున్న సహాయక చర్యలకు అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఇప్పటి వరకు 13.50 కిలోమీటర్ల దూరం వరకు వెళ్లిన రెస్క్యూ బృందాలు మిగిలిన 50 మీటర్ల ముందుకు వెళ్లడానికి చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. సొరంగంలోకి నీటి ఊట వేగంగా వస్తుండటంతో ప్రత్యేక మోటార్ల ద్వారా నీటిని బయటికి తోడేస్తున్నారు. 👉కన్వేయర్‌ బెల్ట్‌ పూర్తిగా మరమ్మతు జరగడంతో.. పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి. సొరంగంలో పేరుకుపోయిన మట్టి, బురద, రాళ్లు, టీబీఎం విడిభాగాలు (ఇనుము), ఊడిపోయిన కాంక్రీట్‌ సెగ్మెంట్లను తొలగించే రోబోలు తయారు చేసేందుకు కనీసం వారం రోజుల సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే రోబోలు సాయం వారం రోజుల తర్వాతే వినియోగంలోకి వస్తోంది. 👉ప్రమాదం జరిగిన సొరంగంలో పరిశోధన చేసేందుకు కేరళ నుంచి వచ్చిన కాడవర్‌ డాగ్స్‌ కూడా ఇది వరకు గుర్తించిన డాగ్స్‌ స్థానాల్లోనే గుర్తించాయి. 13.500 కి.మీ., అవుతల ఒకే దగ్గర ముగ్గురు వ్యక్తుల అవశేషాలు ఉన్నట్లు నిర్ధారించాయి. కారి్మకులు చిక్కుకున్నట్లు డాగ్స్‌ చూపించిన ప్రదేశాల్లో శనివారం రెస్క్యూ బృందాలు తవ్వకాలు ప్రారంభించాయి. టీబీఎం పరికరాలు గ్యాస్‌ కట్టర్‌తో కత్తిరించి లోకో ట్రైన్‌ ద్వారా సొరంగం బయటికి పంపించారు. కూలిపడిన పైకప్పు మట్టి దిబ్బలను హిటాచీతో ఒకవైపు తరలిస్తున్నారు. రోజుకో బృందాన్ని సింగరేణి నుంచి రప్పించి సహాయక చర్యలు ముమ్మరం చేస్తున్నారు. సొరంగంలో వస్తున్న దుర్వాసన సహాయక చర్యలకు ఇబ్బంది కలిగిస్తోంది.👉టన్నెల్‌లో జరిగిన ప్రమాదం జాతీయ విపత్తు అని, అందులో చిక్కుకున్న కార్మికులను రక్షించడానికి ప్రపంచంలోని అత్యుత్తమ సాంకేతికత ఉపయోగిస్తున్నామని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. శనివారం టన్నెల్‌ను సందర్శించిన ఆయన రెస్క్యూ బృందాల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.👉సొరంగంలో చిక్కుకున్న కార్మికులను గుర్తించేందుకు ఇప్పటి వరకు జరిగిన పురోభివృద్ధి గురించి రాష్ట్ర డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ కార్యదర్శి అరవింద్‌కుమార్, ఆర్మీ కమాండెంట్‌ పరీక్షిత్‌ మెహ్రా మంత్రికి వివరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ సహాయక చర్యల్లో అవంతరాలను అధిగమిస్తూ వేగంగా ముందుకెళ్తున్నామని, సొరంగం లోపల ఆక్సిజన్‌ సరిగా లేకపోవడం, నీటి ఊట అధికంగా రావడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు. 👉టీబీఎం దృఢమైన లోహ శకలాలు, రాళ్లు, మట్టితో కూరుకుపోయి ఇబ్బందులు ఉన్నప్పటికీ సహాయక చర్యలు కొనసాగించేందుకు ప్రభుత్వం కృతనిత్చయంతో ఉందన్నారు. రెస్క్యూ ఆపరేషన్‌లో పనిచేసే కారి్మకులకు, అధికారులకు ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌, ఎస్పీ వైభవ్‌ గైక్వాడ్‌ రఘనాథ్, అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ, మిలటరీ ఇంజినీర్‌ వికాస్‌సింగ్, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ కమాండెంట్‌ ప్రసన్నకుమార్, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ కమాండెంట్‌ ప్రభాకర్, సింగరేణి, రైల్వే, ఎన్‌జీఆర్‌ఐ, హైడ్రా తదితర బృందాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

1000 Dead In Syria Over Assad Loyalists Clash With Forces8
సిరియాలో మళ్లీ మారణహోమం.. 1000 మంది మృతి

బీరుట్‌: సిరియా అట్టుడుకుతోంది. మాజీ అధ్యక్షుడు అసద్ మద్దతుదారులు, ప్రభుత్వ భద్రతా దళాల మధ్య జరిగిన ఘర్షణల కారణంగా దాదాపు 1000 మంది మరణించారు. వీరిలో 750 మంది పౌరులు ఉన్నట్టు స్థానిక మీడియా సంస్థలు చెబుతున్నాయి.గత రెండు రోజులుగా సిరియాలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ అధ్యక్షుడు బషర్‌ అల్‌-అసద్ మద్దతుదారులు, ప్రభుత్వ భద్రతా దళాల మధ్య జరిగిన ఘర్షణ చోటుచేసుకుంది. ఇరు వర్గాల మధ్య ప్రతీకార దాడుల్లో భారీగా ప్రాణ నష్టం జరిగింది. అసద్ మద్దతుదారులు జాబ్లే నగరంలో భద్రతా సిబ్బందిని హత్య చేయడం కారణంగా ఈ ఘర్షణలు మొదలయ్యాయి. శుక్రవారం నుంచి ప్రభుత్వ దళాలు భారీ స్థాయిలో అసద్ తెగకు చెందిన అలావైట్లు అధికంగా ఉండే ప్రాంతాల్లో ప్రతీకార దాడులకు దిగాయి. అలవైట్‌లను ఊచకోత కోశారని స్థానికులు తెలిపారు.దీంతో, సిరియా మరోసారి అతలాకుతలమైంది. దాడుల నేపథ్యంలో మృతదేహాలు వీధుల్లో చెల్లాచెదురుగా పడి ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. బ్రిటన్‌కు చెందిన సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ ప్రకారం ప్రభుత్వ భద్రతా బలగాలకు చెందిన 125 మందితో పాటు అసద్‌కు మద్దతుగా పోరాడిన 148 మంది ప్రాణాలు కోల్పోయారు. తీరప్రాంత నగరం లటాకియా చుట్టుపక్కల ప్రాంతాలలో విద్యుత్ , తాగునీటిని నిలిపివేశారని, బేకరీలను మూసివేశారని అబ్జర్వేటరీ పేర్కొంది.ఇదిలాఉండగా.. 14 ఏళ్ల సిరియా సంక్షోభంలో ఇది భయంకరమైన మారణకాండ అని యుద్ధ నియంత్రణ సంస్థ ఒకటి తెలిపింది. అసద్‌ను పదవి నుంచి దించేసి తిరుగుబాటుదారులు అధికారాన్ని చేజిక్కించుకున్న మూడు నెలల తర్వాత డమాస్కస్‌లో ఏర్పడిన ఘర్షణలు నూతన ప్రభుత్వానికి సవాల్‌గా మారాయి. 🚨🇸🇾 THIS IS HAPPENING IN SYRIA!THE WEST CAUSED THIS! pic.twitter.com/oWbU2oOhVl— Jackson Hinkle 🇺🇸 (@jacksonhinklle) March 8, 2025

Kayadu Lohar Sensitive Comment On Two Actors9
ఏ ఎండకు ఆ గొడుగు పట్టేస్తే ఎలా.. డ్రాగన్‌ బ్యూటీపై సెటైర్స్‌

సినిమా రంగంలోనైనా, రాజకీయరంగంలోనైనా చెప్పేదొక్కటి చేసే దొక్కటి. ఈ రంగాల్లో సందర్భాన్ని బట్టి మాట మార్చడం చాలా మంది విషయంలో సహజమే. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, డ్రాగన్‌ నటి కయాదు లోహార్‌నే కారణం. ఈ అస్సామీ బ్యూటీ 21 ఏళ్ల పరువంలోనే నటిగా ఎంట్రీ ఇచ్చారు. అలా మొదట్లో కన్నడంలో ముగిల్‌పేట అనే చిత్రంలో కథానాయకిగా నటించారు. ఆ తరువాత మలయాళంలో పథోన్‌పత్తం నూత్తాండు అనే చిత్రంలో ఎంట్రీ ఇచ్చారు. ఆపై తెలుగులో 2022లో అల్లూరి అనే చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అదే విధంగా మరాఠీ భాషలోనూ ప్రేమ్‌ యు అనే చిత్రంలో నటించారు. అలా రెండేళ్లలోనే నాలుగు భాషలను చుట్టేసిన ఈ అమ్మడికి తాజాగా తమిళంలో నటించిన డ్రాగన్‌ చిత్రంతో సంచలన విజయం వరించింది. ఇప్పుడు దక్షిణాదిలో క్రేజీ కథానాయకిగా మారిపోయారు. కాగా తాజాగా అధర్వకు జంటగా ఇదయం మురళి అనే చిత్రంలో నటిస్తున్నారు. అదే విధంగా మరో తెలుగు చిత్రంలో నటించే అవకాశాన్ని దక్కించుకున్నారు. కాగా తెరపై అందాలను ఆరబోయడంలో ఏమాత్రం వెనుకాడని ఈ అమ్మడి తన నోటీకొచ్చింది మాట్లాడేస్తుండటంతో నెటిజన్లు ఆడేసుకుంటున్నారు. ఇటీవల ఒక కార్యక్రమంలో పాల్గన కయాదు లోహర్‌ను సెలబ్రిటీ క్రష్‌ ఎవరు అన్న ప్రశ్నకు దళపతి విజయ్‌ తన సెలబ్రిటీ క్రష్‌ అని చెప్పారు. ఆన నటన తనకు చాలా ఇష్టం అని కూడా పేర్కొన్నారు. ఆయన నటించిన చిత్రాల్లో తెరి అంటే చాలా ఇష్టం అని చెప్పారు. అయితే అలా అన్న కొద్ది రోజుల్లోనే తన ఇన్‌స్ట్రాగామ్‌లో అభిమానులతో ముచ్చటిస్తూ తనకు నచ్చిన హీరో ధనుష్‌ అనీ, ఈ విషయంలో మరొకరికి చోటు లేదు అని చెప్పారు. దీంతో ఈ బ్యూటీ వ్యవహారాన్ని గమనించిన నెటిజన్లు ఏ ఎండకు ఆ గొడుగు పట్టే నటి అంటూ ఆడేసుకుంటున్నారు. అలా కయాదు లోహర్‌ వారికి దొరికిపోయారు. అయినా, సినిమాల్లో ఇదంతా సహజమే అంటున్నారు సినీ ప్రముఖులు.

Odisha Teacher Denied Sick Leave After Saline Drip In Balangir10
సెలవు లేదన్న హెడ్మాస్టర్‌.. లెక్కల టీచర్‌ ఏం చేశారంటే?

భువనేశ్వర్‌: తీవ్ర అనారోగ్యం పాలైన ఓ ఉపాధ్యాయుడు సెలవు కోసం పెట్టుకున్న దరఖాస్తును ప్రధానోపాధ్యాయురాలు తిరస్కరించారు. ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా సెలవివ్వడం కుదరదంటూ తెగేసి చెప్పారు. పాపం ఆ ఉపాధ్యాయుడు విధిలేక చేతికి ఐవీ డిప్‌ సెలైన్‌ పెట్టుకునే విధులకు హాజరయ్యారు. ఆయన ఆరోగ్యం విషమించడం చూసి తోటి వారే ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ ఘటన ఒడిశాలోని బొలంగీర్‌లో చోటుచేసుకుంది.వివరాల ప్రకారం.. బొలంగీర్‌ ప్రభుత్వ పాఠశాలలో విజయలక్ష్మి ప్రధాన్‌ హెడ్మాస్టర్‌ కాగా, ప్రకాశ్‌ భోయి గణితం టీచర్‌. ఇటీవల తన తాత అంత్యక్రియల కార్యక్రమానికి హాజరైన అనంతరం ప్రకాశ్‌ ఆరోగ్యం దెబ్బతింది. విధులకు హాజరు కాలేనందున, సెలవు ఇప్పించమంటూ ఆయన ప్రధానోపాధ్యాయినికి విజ్ఞప్తి చేశారు. పరీక్షల సమయం కాబట్టి, మ్యాథ్స్‌ టీచర్‌ అవసరం ఎంతో ఉంటుందని చెబుతూ ఆమె ఆ వినతిని తిరస్కరించారు.అయితే, ఎన్ని సార్లు కోరినా హెడ్మాస్టర్‌ వినిపించుకోకపోవడంతో ప్రకాశ్‌ భోయి చేతికి సెలైన్‌ పెట్టుకునే విధులకు వచ్చారు. ఆయన పరిస్థితి చూసి తోటి టీచర్లే ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పటన్‌గఢ్‌ బ్లాక్‌ విద్యాధికారి(బీఈవో) ప్రసాద్‌ మాఝి స్పందించారు. కాజువల్‌ లీవ్‌ కోసం ప్రకాశ్‌ భోయి పంపించిన దరఖాస్తును ప్రధానోపాధ్యాయురాలు విజయలక్ష్మీ ప్రధాన్‌ ఎందుకు తిరస్కరించారనే విషయమై విచారణ చేపట్టామన్నారు. ఆమెదే తప్పని తేలితే చర్యలు తీసుకుంటామని చెప్పారు. #ମିଳିଲାନି_ଛୁଟି #ସାଲାଇନ୍_ଧରି_ସ୍କୁଲରେ_ଶିକ୍ଷକଦେହ ଖରାପ ସତ୍ତ୍ବେ ମିଳିଲାନି ଛୁଟି। ମାନିଲେନି ପ୍ରିନ୍ସିପାଲ୍, ଶିକ୍ଷକ ହେଲେ ଗୁରୁତର। ସାଲାଇନ୍ ଲଗାଇ ସ୍କୁଲ ଦୁଆରେ ଛାଡ଼ିଲେ ପରିବାର। ଦେଖନ୍ତୁ ଏ ଦୃଶ୍ୟକୁ, ସ୍କୁଲ ଦୁଆରେ ଛିଡ଼ା ହୋଇଛନ୍ତି ଶିକ୍ଷକ। #Teacher #Leave #Saline #Controversy #Balangir #OTV pic.twitter.com/tlnV7Sxlvj— ଓଟିଭି (@otvkhabar) March 8, 2025

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

International View all
NRI View all
title
ఆస్ట్రేలియాలో మహిళలపై లైంగిక దాడి.. భారతీయ ప్రముఖుడికి 40 ఏళ్ల జైలు శిక్ష

సిడ్నీ: ఆస్ట్రేలియాలో ఐదుగురు మహిళలపై లైంగిక దాడికి పాల్పడిన

title
లండన్‌లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు

బిందువు బిందువు కలిస్తేనే సింధువు అనే విధంగా యూకే లో నివసిస్తున్న తెలుగు మహిళలు అందరూ “తెలుగు లేడీస్ యుకె” అనే ఫేస్‌బుక్

title
న్యూజెర్సీలో నాట్స్ ఇమ్మిగ్రేషన్ సెమినార్

న్యూ జెర్సీ: అమెరికాలో తెలుగు వారి కోసం అనేక కార్యక్రమాలు చ

title
అమెరికాలో కాల్పులు.. కేశంపేట యువకుడి మృతి

కేశంపేట: ఉన్నత ఆశయాలతో అమెరికా వెళ్లిన ఓ విద్యార్థి..

title
గిఫ్ట్‌ సిటీ ఫండ్స్‌లో భారీగా ఎన్నారైల పెట్టుబ‌డులు

ముంబై: గిఫ్ట్‌ సిటీలోని ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్స్‌లో ప్రవాస భారతీయులు దాదాపు 7 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు (Investments) ప

Advertisement

వీడియోలు

Advertisement