Top Stories
ప్రధాన వార్తలు

విశాఖకు మాజీ సీఎం వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విశాఖ వెళ్లనున్నారు. సింహాచలం ఘటనలో బాధిత కుటుంబాలను ఆయన పరామర్శించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు వైఎస్ జగన్ విశాఖకు చేరుకోనున్నారు.విశాఖ జిల్లా సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవంలో గోడ కుప్పకూలి భక్తులు మృతి చెందడంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చందనోత్సవం సందర్భంగా రూ. 300 టికెట్ క్యూలైన్ పై గోడ కుప్పకూలి భక్తులు మృత్యువాత పడటంపై తీవ్రవిచారం వ్యక్తం చేశారు. స్వామివారి నిజరూప దర్శనానికి వచ్చిన భక్తులు ఇటువంటి దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమన్నారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని, మరణించిన భక్తుల కుటుంబాలను ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.

సింహాచలం అప్పన్న సన్నిధిలో అపశ్రుతి.. ఏడుగురు భక్తులు మృతి
సాక్షి, విశాఖపట్నం: సింహాచలం చందనోత్సవంలో ఘోర అపశ్రుతి చోటుచేసుకుంది. గోడ కుప్పకూలి ఏడుగురు మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు. రూ.300 టికెట్ కౌంటర్ వద్ధ ఈ ప్రమాదం జరిగింది. ఇటీవలే అక్కడ గోడ నిర్మించారు. గోడ నాసిరకంగా నిర్మించడం వలనే కూలిపోయిందని అధికారులు భావిస్తున్నారు. తెల్లవారుజామున 2-3 గంటల మధ్య రూ.300 క్యూ లైన్లో ప్రమాదం జరిగింది. మృతులను యడ్ల వెంకటరావు(48),దుర్గా స్వామినాయుడు(32), మణికంఠ(28)గా గుర్తించారు.ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. మృతులను విశాఖపట్నం మధురవాడ సమీపంలోని చంద్రంపాలెం గ్రామానికి చెందిన పిళ్లా ఉమామహేశ్వరరావు (30), ఆయన భార్య శైలజ (26)గా అధికారులు గుర్తించారు. వీరితో పాటు పిల్లా శైలజ తల్లి వెంకటరత్నం, మేనత్త గుజ్జురి మహాలక్ష్మి కూడా ఈ ఘటనలో మృతిచెందారు. మృతదేహాలను కేజీహెచ్‌కు తరలించారు.👉ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఈ ప్రమాదం.. మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌తిరుపతిలో వైకుంఠ ఏకాదశి ఎంత విశిష్టత ఉంటుందోసింహాచలంలో చందనోత్సవానికి అంతే విశిష్టత ఉంటుందిప్రభుత్వ నిర్లక్ష్యం చేతకాని తనంతో ప్రమాదం జరిగిందిమూడు నాలుగు రోజుల క్రితం గోడ నిర్మించారుగోడ నిర్మాణంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోలేదుగోడ ప్లెక్సీ ఊగినట్లు ఊగిందని సాక్షులు చెప్పారుకొండవాలులో కాంక్రీట్ వాల్ నిర్మించాలిఇటుక బెడ్డలతో నిర్మాణం చేపట్టరాదుఒకే కుటుంబంలో నలుగురు చనిపోయారుచనిపోయిన వారి కుటుంబానికి కోటి రూపాయలు పరిహారం ఇవ్వాలిప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలిసంఘటన తెలిసిన వెంటనే వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారుకేజీహెచ్ లో బాధిత కుటుంబాలను పరామర్శిస్తారుప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే ప్రమాదం జరిగిందికొండపై చాలా గోడలు ఉన్నాయి.. అవి ఎందుకు పడుపోలేదునాణ్యాత లోపించింది కాబట్టే గోడ పడిపోయింది👉సింహాచలం దుర్ఘటన.. భక్తుల మృతిపై విచారణ కమిటీ ముగ్గురు అధికారులతో కమిటి వేసిన ప్రభుత్వం 👉సింహాచలం ఘటన.. ప్రభుత్వ వైఫల్యంపై మల్లాది విష్ణు ఫైర్ఈ ప్రభుత్వం మొద్దు నిద్ర పోతోంది...అచేతనంగా మారిపోయిందిప్రత్యర్థుల్ని ఇబ్బంది పెట్టడానికి మాత్రమే పోలీస్ శాఖ మాత్రమే పనిచేస్తుందితిరుపతి లడ్డూ అంశాన్ని తెరపైకి తెచ్చి వైఎస్ జగన్ పై బురద చల్లాలని చూశారుచందనోత్సవంలో అపశ్రుతి పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమేమంత్రులు, ప్రభుత్వం చేతకాని తనంతోనే భక్తులు ప్రాణాలు కోల్పోయారుచనిపోయిన వారిని తిరిగి తీసుకురాగలరా?రాష్ట్ర పండుగగా జరుపుకునే ఉత్సవానికి లోపభూయిష్టంగా ఏర్పాట్లు చేయడమేంటి?ఇంతపెద్ద ఘటన జరిగితే తప్పించుకునే ధోరణితో మంత్రులు, అధికారులు వ్యవహరిస్తున్నారువరుస అపచారాలు జరుగుతున్నా మొద్ద నిద్ర వీడటం లేదు 👉మరణించిన వారికి పోస్టుమార్టం చేయడానికి ఒప్పుకోని బంధువులుకోటి రూపాయల పరిహారం ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్తమ డిమాండ్లను ఒప్పుకున్న తర్వాతే పోస్టుమార్టం చేయాలంటున్న బంధువులుపోస్టుమార్టానికి సహకరించాలని బంధువులపై పోలీసులు ఒత్తిడిపోలీసులతో వాగ్వాదానికి దిగిన బంధువులుఎల్జీ పాలిమర్ ప్రమాదంలో చనిపోయిన వారికి కోటి రూపాయల పరిహారం చెల్లించారుఅదే తరహాలో నేడు కూడా పరిహారం చెల్లించాలని డిమాండ్..👉కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యమే: కొట్టు సత్యనారాయణతిరుపతి ఘటన మరవకముందే సింహాచలంలో ఏడుగురు భక్తులు మృతి దారుణంకూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందిలక్షలాది మంది భక్తులు వస్తారని తెలిసి కూడా ప్రభుత్వం ఏర్పాట్లు చేయలేదుసింహాచలం ఘటన బాధాకరంఘటన జరిగి కొన్ని గంటలు అవుతున్నా పవన్ కల్యాణ్ ఎక్కడ ఉన్నారు?క్యూలైన్ల దగ్గర ఎండోమెంట్,రెవెన్యూ అధికారులు ఎందుకు లేరు?గోదావరి పుష్కరాల్లో కూడా పదుల సంఖ్యలో భక్తులు చనిపోయారు.👉విశాఖకు మాజీ సీఎం వైఎస్ జగన్మధ్యాహ్నం 3 గంటలకు విశాఖకు చేరుకోనున్న వైఎస్ జగన్‌బాధిత కుటుంబాలను పరామర్శించనున్న వైఎస్ జగన్👉 సింహాచలం ఘటనపై ప్రధాని మోదీ విచారంవిశాఖ జిల్లా సింహాచలం దేవస్థానంలో గోడ కూలిన ఘటనపై ప్రధాని మోదీ విచారం గోడకూలి భక్తులు చనిపోవడం బాధాకరంమృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిగాయపడిన భక్తులు త్వరగా కోలుకోవాలి పీఎం సహాయ నిధి నుంచి ఎక్స్‌గ్రేషియా మృతుల కుటుంబాలకు PMNRF నుండి రూ. 2 లక్షల పరిహారం గాయపడిన వారికి రూ. 50,000 పరిహారం ఇస్తున్నట్లు పీఎంవో కార్యాలయం ఎక్స్ వేదికగా ట్వీట్ Deeply saddened by the loss of lives due to the collapse of a wall in Visakhapatnam, Andhra Pradesh. Condolences to those who have lost their loved ones. May the injured recover soon.An ex-gratia of Rs. 2 lakh from PMNRF would be given to the next of kin of each deceased. The…— PMO India (@PMOIndia) April 30, 2025 👉కేజీహెచ్ మార్చురి వద్ద విషాద ఛాయలుకేజీహెచ్ మార్చురి వద్దకు చేరుకుంటున్న మృతుల కుటుంబ సభ్యులుకన్నీరు మున్నీరవుతున్న కుటుంబ సభ్యులు...దైవదర్శనానికి వెళ్లి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారంటూ ఆవేదన👉సింహాచలం ఘటనపై వీహెచ్‌పీ ఆగ్రహంసింహాచలం సరైన రీతిలో ప్రభుత్వం చర్యలు చేపట్టలేదునిర్మాణ లోపం వల్లే ప్రమాదం జరిగిందిసింహాచలంలో పాలన కాదు.. లాబీయింగ్ నడుస్తోందిఎండోమెంట్ వ్యవస్థ ఓ చెత్తభగవంతుడికి భక్తులకు దూరం చేయడమే వారిపనిహిందువుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయిపాలకుల కబంధ హస్తాల నుంచి ఎండోమెంట్ వ్యవస్థ బయటకు వస్తేనే భక్తులకు మంచి జరుగుతోందిచందనోత్సవంలో ఒక ప్రణాళిక లేదు.. ఓ ప్లాన్ లేదు👉తిరుపతి తొక్కిసలాట ఘటన మరవకముందే..ఘటనపై సమగ్ర విచారణ చేసి.. మృతుల కుటుంబాలను ఆదుకోవాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి డిమాండ్ చేశారు. తిరుపతి తొక్కిసలాట ఘటన మరవకముందే సింహాచలంలో ఇలాంటి ఘటన జరగడం బాధాకరమని ఆమె అన్నారు. మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం ఇవ్వాలి. అన్యాయంగా ఏడుగురు చనిపోయారు. ప్రభుత్వం సరైన చర్యలు చేపట్టకపోవడం వల్లనే ప్రమాదం జరిగిందని వరుదు కల్యాణి అన్నారు.👉వైఎస్ జగన్ దిగ్భ్రాంతివిశాఖ జిల్లా సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవంలో గోడ కుప్పకూలి భక్తులు మృతి చెందడంపై మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చందనోత్సవం సందర్భంగా రూ. 300 టికెట్ క్యూలైన్ పై గోడ కుప్పకూలి భక్తులు మృత్యువాత పడటంపై తీవ్రవిచారం వ్యక్తం చేశారు. స్వామివారి నిజరూప దర్శనానికి వచ్చిన భక్తులు ఇటువంటి దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమన్నారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని, మరణించిన భక్తుల కుటుంబాలను ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.👉సింహాచలం ఘటనపై తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర విచారంగోడ కూలి భక్తులు మరణించిన ఘటన తీవ్ర ఆవేదనను కలిగించిందివారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి ఆంధ్ర ప్రదేశ్ లోని సింహాచలం ఆలయం వద్ద గోడ కూలి భక్తులు మరణించిన ఘటనతీవ్ర ఆవేదనను కలిగించింది. వారి కుటుంబ సభ్యులకునా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ…మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని…భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.— Revanth Reddy (@revanth_anumula) April 30, 2025

పాక్ కపట నాటకం.. వరుసగా రోజు భారత సైన్యంపై పాక్ సైన్యం కాల్పులు
జమ్మూ : భారత్ ఓ వైపు సైనిక చర్యకు సిద్ధమైందని, ఆ పని చేయొద్దంటూ ఐక్య రాజ్య సమితిని పాకిస్తాన్ బతిమలాడుతోంది. అదే సమయంలో భారత్‌ను రెచ్చగొట్టేలా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి యధేశ్చగా కాల్పులకు తెగబడుతుంది. తాజాగా, మంగళవారం రాత్రి జమ్మూలోని అఖ్నూర్ సెక్టార్, పరగ్వాల్ సెక్టార్లో అంతర్జాతీయ సరిహద్దు వద్ద పాకిస్తాన్ సైన్యం భారీ కాల్పులు జరిపింది. పాక్ కాల్పులపై భారత సైన్యం స్పందించింది. జమ్మూ ప్రాంతంలోని మూడు ప్రధాన సెక్టార్లలో కూడా కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘించింది. వరుసగా ఆరో రోజు పాక్ సైన్యం కాల్పులు జరిపింది. అంతే ధీటుగా భారత సైన్యం బదులిస్తోందని భద్రతా బలగాలు తెలిపాయి. BREAKING news :What kind of Pakistani army is this that is hell-bent on breaking its own country into 5 pieces?Pakistan indulges in ceasefire violation along the International Border (IB) in Jammu’s Akhnoor Sector, Pargwal. This is not LoC but IB making it a serious… pic.twitter.com/Z5VWPu4MVL— श्रवण बिश्नोई (किसान) (@SharwanKumarBi7) April 29, 2025 ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లో పహల్గాంలో ఉగ్రవాదులు 26మంది టూరిస్టుల ప్రాణాలు తీశారు. నాటి నుంచి భారత్-పాక్‌ల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. సైనిక దుస్తులు ధరించిన అమాయకుల ప్రాణాల్ని తీయడంపై భారత్.. పాక్‌ను అన్నీ అంశాల్లో దెబ్బకు దెబ్బతీయాలనే ప్రయత్నాల్ని ముమ్మరం చేస్తోంది.ఇందులో భాగంగా ఇండస్ వాటర్ ట్రీటీని తాత్కాలికంగా నిలిపివేసింది. ఏప్రిల్ 27 నుండి పాకిస్తాన్ పౌరులకు జారీ చేసిన వీసాలన్నీ రద్దు చేసింది. అటారీ బోర్డర్‌ను తక్షణమే మూసివేసింది.

తిరుపతి తొక్కిసలాట ఘటన మరవకముందే..
సాక్షి, విశాఖపట్నం: తిరుపతి తొక్కిసలాట ఘటన మరవకముందే.. సింహాచలంలో మరో ఘోర విషాదం జరిగింది. సింహాచలం అప్పన చందనోత్సవంలో ప్రభుత్వం నిర్లక్ష్యం ఫలితంగా.. గోడకూలి ఏడుగురు మృతిచెందారు. ఘటన జరిగిన సమయంలో ఒక్క పోలీసు కూడా కనిపించలేదు.. భక్తులను ఆదుకోవడానికి ఒక్క ఎండోమెంట్ ఉద్యోగి కూడా అక్కడ లేరు. అందుబాటులో ఉన్న వాలంటీర్లు, భక్తులు మాత్రమే సహాయక చర్యలు చేపట్టారు. కటిక చీకటిలో భక్తుల కోసం క్యూలైన్లు ఏర్పాటు చేయడంతో అంతా అంధకారం అలుముకుంది. గోడ కూలిపోవడంతో భక్తుల అరుపులు, రోదనలు మిన్నంటాయి. అప్పటికే భక్తుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.ఈ ఘటనపై సమగ్ర విచారణ చేసి.. మృతుల కుటుంబాలను ఆదుకోవాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం ఇవ్వాలన్నారు. అన్యాయంగా ఏడుగురు చనిపోయారు. ఘటనపై పూర్తి వివరాలు అధికారులను అడిగి తెలుసుకుంటున్నాం. సరైన చర్యలు చేపట్టకపోవడం వల్లనే ప్రమాదం జరిగిందని వరుదు కల్యాణి అన్నారు. కటిక చీకట్లో భక్తుల కోసం క్యూలైన్లా?. తిరుపతి తొక్కిసలాట ఘటన మరవకముందే. ఈ ఘటన ప్రభుత్వ వైఫల్యాన్ని బయటపెడుతోందని ఆమె అన్నారు.మరోవైపు, సింహాచలం ఘటనపై వీహెచ్‌పీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సింహాచలం సరైన రీతిలో ప్రభుత్వం చర్యలు చేపట్టలేదని.. నిర్మాణ లోపం వల్లే ప్రమాదం జరిగిందని మండిపడింది.సింహాచలంలో పాలన కాదు.. లాబీయింగ్ నడుస్తోంది. ఎండోమెంట్ వ్యవస్థ ఓ చెత్త.. భగవంతుడికి భక్తులకు దూరం చేయడమే వారిపని.. హిందువుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.. పాలకుల కబంధ హస్తాల నుంచి ఎండోమెంట్ వ్యవస్థ బయటకు వస్తేనే భక్తులకు మంచి జరుగుతోంది.. చందనోత్సవంలో ఒక ప్రణాళిక లేదు.. ఓ ప్లాన్ లేదు’’ అంటూ వీహెచ్‌పీ ఆగ్రహం వ్యక్తం చేసింది.

హవ్వ.. ఇంకో 44 వేల ఎకరాలా?
పిచ్చి ముదిరిందంటే.. తలకు రోకలి చుట్టమన్నాడట వెనుకటికి ఎవడో. అలా ఉంది ఏపీ ప్రభుత్వం పరిస్థితి ఇప్పుడు. రాజధాని పేరుతో ఇప్పటికే 33 వేల ఏకరాల భూమి సేకరించిన చంద్రబాబు ప్రభుత్వం తాజాగా ఇంకో 44676 ఎకరాలు సేకరించాలని నిర్ణయించడం ఆందోళన కలిగిస్తోంది. రైతులపై మాత్రమే కాదు.. ఈ నిర్ణయం రాష్ట్ర ప్రజలందరిపై పిడుగుపాటే. ఇప్పటికే సేకరించిన భూమిలో ఒక్క భవనాన్ని కూడా పూర్తి చేయలేదు. అన్నీ తాత్కాలిక నిర్మాణాలే. అయినాసరే.. ఇంకో 44 వేల పైచిలుకు ఎకరాలు సేకరించాలన్న నిర్ణయం ఏ రకంగా చూసినా సహేతుకం కాదు.ఈ నిర్ణయానికి వైఎస్సార్ కాంగ్రెస్ మినహా మిగిలిన పార్టీలన్నీ తమ జేబు పార్టీలే అన్న ధీమాతో టీడీపీ ఈ ప్రతిపాదన చేస్తున్నట్లు కనిపిస్తోంది. ప్రశ్నిస్తానని రాజకీయ పార్టీ పెట్టిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆ పని ఎప్పుడో మానేశారు. పురంధేశ్వరి వంటి స్థానిక బీజేపీ నేతలు సరేసరి. ఎన్టీయే వ్యతిరేకినని జాతీయ స్థాయిలో చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ కూడా ఏపీలో పరోక్ష మద్దతుదారుగా మారిపోయింది.ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల ముఖ్యమంత్రి చంద్రబాబు సలహాలు, సూచనల మేరకే పార్టీని నడుపుతున్నారన్నది కాంగ్రెస్ వాదుల భావన. వామపక్ష పార్టీ సీపీఐ పైపైకి టీడీపీని విమర్శిస్తున్నట్లు కనిపిస్తున్నా, మానసికంగా చంద్రబాబుకే దగ్గరగా ఉన్న విమర్శ ఉంది. ఒక్క సీపీఎం మాత్రం కాస్తో, కూస్తో స్వతంత్రంగా ఉండే ప్రయత్నం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు ఇంత అడ్డగోలుగా నిర్ణయాలు చేయగలుగుతున్నారు. అమరావతి పేరుతో గత టర్మ్‌లో చంద్రబాబు నాయుడు 33 వేల ఎకరాలు సమీకరిస్తున్నప్పుడు కొంతమంది రైతులు స్వచ్ఛందంగానే ఇచ్చినా చాలా మంది తీవ్రంగా వ్యతిరేకించారు. భూ సేకరణను వ్యతిరేకించిన కొన్ని గ్రామాల వారికి పవన్ కళ్యాణ్ అప్పట్లో మద్దతిచ్చారు, చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు కూడా. కానీ కూటమి ప్రభుత్వంలో భాగస్వామయ్యాక ఆయన పన్నెత్తిన పాపన పోలేదు. పిఠాపురంలో శాంతిభద్రతల సమస్యపై తీవ్రంగా స్పందించిన తర్వాత ఏమైందో కాని, చంద్రబాబును పొగడడమే లక్ష్యంగా పెట్టుకుని పవన్ కళ్యాణ్ తన ఉప ముఖ్యమంత్రి పదవిని ఎంజాయ్ చేయడానికి అలవాటు పడ్డారు. ప్రభుత్వంలో జరిగే అవకతవకలు ఎత్తి చూపకుండా ఉండేందుకు ఏమైనా డీల్ కుదిరిందేమో!విశాఖతోసహా ఏపీ మొత్తమ్మీద రియల్ ఎస్టేట్ పెద్దగా పుంజుకుంది లేదు. అమరావతిలో రియల్ ఎస్టేట్ రంగం పుంజుకోవడం లేదన్న ఆందోళన ఇప్పటికే అక్కడి రైతులలో ఉంది. కృత్రిమంగానైనా పెంచేందుకు వేల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి మరీ ఖర్చుపెట్టేందుకు ప్రయత్నించినా ఫలితం పెద్దగా లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో అదనంగా మరింత భూమి సేకరిస్తే డిమాండ్ భారీగా పడిపోతుంది.అమరావతి గ్రామాలలో విమానాశ్రయం ఏర్పాటైతే భూముల విలువ పెరుగుతాయంటూ చంద్రబాబు తాజాగా కొత్త పాట అందుకున్నారు. భూ సమీకరణ ద్వారా మూడు పంటలు పండే పచ్చటి పొలాలను ప్రభుత్వం బీళ్లుగా మార్చింది. తెలంగాణలో 400 ఎకరాల ప్రభుత్వ భూమి అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రయత్నిస్తేనే పర్యావరణవేత్తలు, వివిధ రాజకీయ పక్షాలు తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేశాయి. సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ప్రధాని మోడీ సైతం కాంగ్రెస్‌పై విమర్శల వర్షం కురిపించారు. అలాంటిది అమరావతిలో లక్ష ఎకరాల భూమిని అనవసరంగా తీసుకుంటున్న తీరుపై మాత్రం ఎవరూ కిమ్మనడం లేదు.చంద్రబాబు తన ఇంటి కోసం ఐదు ఎకరాలు కొనుగోలు చేసి, శంకుస్థాపన చేసిన విషయంలో కూడా మతలబు ఉండవచ్చన్న భావన ఉంది. రియల్ ఎస్టేట్ పెరగడానికి వీలుగా ఆయన ఈ ప్రయత్నం చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. వచ్చే ఎన్నికలలో టీడీపీ కూటమి ఓటమి పాలైతే, చంద్రబాబు కాని, ఆయన కుటుంబం కాని అమరావతిలోనే నివసిస్తుందా? ఎందుకంటే చంద్రబాబు లోకేశ్‌లు పేరుకు అక్కడ నివసిస్తున్నా, కుటుంబ సభ్యులు.. వారాంతాల్లో ఆయన కూడా హైదరాబాద్‌కు వచ్చేస్తున్నారు. పవన్ కళ్యాణ్‌ది కూడా అదే తీరు. చిత్రమేమిటంటే చంద్రబాబు అమరావతిలో గజం రూ.60 వేలకుపైగా ఉందని ప్రచారం చేస్తున్నా, ఆయన కుటుంబం మాత్రం ఐదెకరాల భూమిని గజం రూ.7500లకే కొనుగోలు చేసిందట. రిజిస్ట్రేషన్ అయితే గజం రూ.ఐదు వేలకే చేశారు.మరి చంద్రబాబు ప్రచారం చేసిన విధంగా రియల్ ఎస్టేట్ విలువలు లేవా? లేక చంద్రబాబు నిర్దిష్ట మొత్తం కాకుండా మిగిలిన దానిని భూ యజమానులకు బ్లాక్‌లో నగదు రూపంలో అందించారా అన్నది చర్చనీయాంశం. ఏభైవేల మంది పేదలకు గత ప్రభుత్వం సెంటు భూమి చొప్పున ఇస్తే, దానిని వెనక్కి లాక్కుంటున్న కూటమి ప్రభుత్వం, ధనవంతులకు మాత్రం ఎకరాలలో ఇళ్లు కట్టుకునే వెసులుబాటు కల్పిస్తోందన్న మాట. రైతుల గుండెలు గుభేలు మనేలా ప్రభుత్వం అదనపు భూమి సమీకరణకు సిద్దమవుతున్న తరుణంలో ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి ఎల్లో మీడియా మాత్రం చంద్రబాబు సర్కారుకు వంత పాడుతూ కథనాలు ఇస్తోంది. ఈనాడు మీడియా ఎంత దారుణమైన కథనాన్ని ఇచ్చిందంటే రైతుల విజ్ఞప్తి మేరకే అదనంగా మరో 44 వేల ఎకరాల భూమి తీసుకోవాలని తలపెట్టారట.మంత్రి నారాయణను కలిసి వారు ఈ మేరకు కోరారట. మెడకాయ మీద తలకాయ ఉన్నవారెవరైనా ఈనాడు పిచ్చి రాతలను నమ్ముతారా? ప్రస్తుతం ఉన్న రాజధాని భూమిలో ప్రభుత్వానికి మిగిలేది రెండువేల ఎకరాలేనట.అది చాలదట. గతంలో పదివేల ఎకరాల భూమి మిగులుతుందన్నారు. ఇప్పుడు దానిని రెండువేలకు తగ్గించారు. అనేక సంస్థలు ఇక్కడ భూమి కావాలంటున్నాయట. నిజంగా ఇవన్ని జరిగి ఉంటే ఈ ఎల్లో మీడియా ఏ స్థాయిలో ఈపాటికి ఊదరగొట్టేవి! ఎవరిని మోసం చేయడానికి ఈ రాతలు? గతంలో చంద్రబాబు, ఎల్లో మీడియా ఏమని ప్రచారం చేశాయి? అమరావతికి అసలు ప్రభుత్వం డబ్బు రూపాయి ఖర్చు చేయనక్కర్లేదని, దానికి అదే సంపాదించుకుంటుందని కదా? కాని ఇప్పుడేమీ చేస్తున్నారు. బడ్జెట్లో రూ. ఆరు వేల కోట్లు కేటాయించారు. మరో రూ.ముప్పై వేల కోట్లు అప్పులు తీసుకు వస్తున్నారు. డబ్బై ఏడువేల కోట్లు అవసరం అవుతాయని చంద్రబాబు ఆర్థిక సంఘానికి తెలిపారు. కాని ఒక్క ఎకరాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయడానికి సుమారు రూ.రెండు నుంచి మూడు కోట్ల రూపాయలు అవసరం అవుతాయని అంచనా. ఆ రకంగా చూస్తే ఎన్ని లక్షల కోట్లు కావాలో లెక్క వేసుకోవచ్చు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు నుంచి వసూలు చేసే పన్నులతో చేపట్టవలసిన ఈ అభివృద్ది పనులను ప్రభుత్వమే చేపడుతోందన్నమాట. ఇది ప్రైవేటు వ్యక్తులకే ప్రయోజనం తప్ప, ప్రభుత్వానికి కాదు. అప్పులు మాత్రం రాష్ట్రం అంతా ప్రజలు భరించాలి.సదుపాయాలు మాత్రం కొద్దిమంది ప్రైవేటు ఆసాములు పొందుతారన్నమాట. అందుకే ఇది రైతులపైనే కాదు.. ఏపీ ప్రజలపైనే పిడుగుపాటుగా పరిగణించాలనిపిస్తుంది. ఇంత చేసినా ప్రభుత్వం అమ్ముకోవడానికి భూమి సరిపోదట. అందుకే మళ్లీ భూమి తీసుకుంటారట. అంటే ఇంతకాలం అబద్దాలు చెప్పి ప్రజలను మోసం చేసినట్లు వీరు ఒప్పుకుంటారా? అమరావతిలో మరో విమానాశ్రయానికి నాలుగైదువేల ఎకరాలు సేకరిస్తారట. ప్రస్తుతం 30, 40 కిలోమీటర్ల దూరంలో గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. అక్కడ విస్తరణకు కూడా భూమి తీసుకుంది. వారిలో పలువురికి అమరావతి గ్రామాలలో ప్లాట్లు ఇచ్చారు. ఇంతా చేసి ఆ విమానాశ్రయం కాదని మరోకటి కడతారట. ఉన్న ఎయిర్ పోర్టును వృథాగా పెట్టి కొత్తది కడతారట.ఇప్పటికే పచ్చటి పొలాలను బీడు పెట్టి, రైతులకు కౌలు రూపంలో ఏటా వందల కోట్లు చెల్లించవలసి వస్తోంది. మళ్లీ అదే ప్రకారం భూముల సేకరణ చేస్తే రైతులు ఎంతవరకు సిద్దపడతారాన్నది అనుమానమే. ఒకవేళ రైతులు తమ భూములు ఇవ్వబోమని అంటే చంద్రబాబు వద్ద ఎటూ తన కుమారుడు లోకేశ్ రెడ్ బుక్ ఉంటుంది. పోలీసులను ప్రయోగించి రైతులను వేధించవచ్చు. కిందటిసారి కూడా అలాగే చేశారు. అయితే ముందుగా తమకు అనుకూలంగా ఉన్న గ్రామాలలో భూములు సమీకరిస్తారట. ఆ తర్వాత మిగిలిన గ్రామాలపై పడతారట. రాజధాని పేరుతో తమ భూములకు ఎసరు పెట్టలేదులే అనుకున్న రైతులకు ఇది షాకింగ్ వార్తే అని చెప్పాలి. ఈ పరిస్థితిని వారు ఎలా ఎదుర్కుంటారో చూడాల్సిందే.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత

IPL 2025: మాల్దీవ్స్‌లో ఎంజాయ్ చేస్తున్న ఇషాన్ కిషన్, ట్రవిస్ హెడ్
ఐపీఎల్ 2025లో తదుపరి ఆడబోయే అత్యంత కీలకమైన మ్యాచ్‌లకు ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు ప్రముఖ పర్యాటక దేశం మాల్దీవ్స్‌లో సేద తీరుతున్నారు. ఏప్రిల్ 25న సీఎస్కేపై విజయానంతరం ఆరెంజ్ ఆర్మీ మాల్దీవ్స్‌కు చెక్కేసింది. అప్పటి నుంచి సన్‌రైజర్స్ ఆటగాళ్లు మాల్దీవ్స్‌లో ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా సన్‌రైజర్స్ స్టార్ ఆటగాళ్లు సరదాగా గడుపుతున్న వీడియో ఒకటి సోషల్‌మీడియాలో ప్రత్యక్షమైంది. Ishan Kishan Vs Abhishek Sharma in the volleyball game. 😄 pic.twitter.com/d46iqYQlR7— Mufaddal Vohra (@mufaddal_vohra) April 28, 2025ఈ వీడియోలో సన్‌రైజర్స్ విధ్వంసకర ఆటగాడు ట్రవిస్ హెడ్ డ్రింక్ తాగుతూ సేద తీరుతుండగా.. మరో విధ్వంకర బ్యాటర్ ఇషాన్ కిషన్ సహచరులతో వాలీబాల్ ఆడుతూ కనిపించాడు. ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. కీలక మ్యాచ్‌లకు ముందు తమ ఆటగాళ్లకు రీఫ్రెష్మెంట్ అవసరమని సన్‌రైజర్స్ యాజమాన్యం మాల్దీవ్స్ టూర్ ప్లాన్ చేసింది. సన్‌రైజర్స్ తమ తదుపరి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌తో తలపడాల్సి ఉంది. ఈ మ్యాచ్ మే 2న అహ్మదాబాద్‌లో జరుగనుంది. దీని తర్వాత సన్‌రైజర్స్ వరుసగా ఢిల్లీ (మే 5, హైదరాబాద్), కేకేఆర్ (మే 10, హైదరాబాద్), ఆర్సీబీ (మే 13, బెంగళూరు), లక్నోతో (మే 18, లక్నో) మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది.గత మ్యాచ్‌లో సీఎస్కేపై గెలుపుతో సన్‌రైజర్స్ ప్లే ఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. ఈ సీజన్లో ఆ జట్టు ఆడిన 9 మ్యాచ్‌ల్లో కేవలం మూడే విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో చివరి నుంచి మూడో స్థానంలో ఉంది. ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే సన్‌రైజర్స్ తదుపరి ఆడాల్సిన ఐదు మ్యాచ్‌ల్లో భారీ తేడాతో గెలవాల్సి ఉంటుంది. ఇలా జరిగినా ఆ జట్టు ప్లే ఆఫ్స్ అవకాశాలు ఇతర జట్ల జయాపజయాలపై ఆధారపడి ఉంటాయి.ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో గతేడాది రన్నరప్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఆశించిన ఫలితాలు సాధించలేదు. తొలి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై గెలిచి.. ఆతర్వాత వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో ఓడింది (లక్నో, ఢిల్లీ, కేకేఆర్,గుజరాత్). తర్వాత పంజాబ్‌పై సంచలన విజయం సాధించి (246 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి).. ముంబై ఇండియన్స్ చేతుల్లో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడింది. తాజాగా సీఎస్కేను వారి సొంత ఇలాకాలో ఓడించి, సీజన్లో మూడో విజయాన్ని నమోదు చేసింది.కాగా, ఈ సీజన్ ప్రారంభానికి ముందు సన్‌రైజర్స్‌పై భారీ అంచనాలు ఉండేవి. అందుకు తగ్గట్టుగానే తొలి మ్యాచ్‌లో ఆ జట్టు రాజస్థాన్ రాయల్స్‌పై 286 పరుగుల రికార్డు స్కోర్ సాధించి విజయం సాధించింది. ఆ మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ సూపర్ సెంచరీతో మెరిశాడు.ఆ మ్యాచ్ తర్వాత మళ్లీ గెలవడానికి సన్‌రైజర్స్‌కు ఐదు మ్యాచ్‌ల సమయం పట్టింది. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో అభిషేక్ శర్మ విధ్వంసకర శతకంతో విరుచుకుపడటంతో సన్‌రైజర్స్ రెండో విజయం సాధించింది. తాజాగా సన్‌రైజర్స్ సీఎస్కేపై గెలిచినా అది వారిపై ఉన్న అంచనాలకు తగ్గట్టుగా లేదు. సీఎస్కే నిర్దేశించిన 155 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు ఆ జట్టు ఆపసోపాలు పడింది.

అప్పు ఇవ్వొద్దు.. పాక్‌పై భారత్ ఆర్థిక యుద్ధం
ఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడితో ప్రతీకారంతో రగిలిపోతున్న భారత్ .. పాకిస్తాన్‌ను ఆర్ధికంగా మరింత ఇబ్బందే పెట్టే ప్రయత్నాల్ని ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా దాయాది దేశంపై భారత్ ఆర్థిక యుద్ధం ప్రకటించింది.పాకిస్తాన్‌కు అప్పు ఇవ్వొద్దంటూ భారత్ అంతర్జాతీయ ద్రవ్య నిధి (International Monetary Fund - IMF) పై ఒత్తిడి చేస్తోంది. ఆ మేరకు అభ్యంతరం తెలిపింది. గతేడాదిలో ప్రకటించిన పాకిస్తాన్‌కు ఏడు బిలియన్ డాలర్ల బెయిల్ అవుట్ ప్యాకేజీ విషయంలో సమీక్షించాలని కోరింది. పాక్‌కు నిధులు ఇస్తే ఉగ్రవాదులకు మళ్ళిస్తోందని ఐఏఎఫ్ మెంబర్స్‌కు భారత్ వివరిస్తోంది.మే 9న పాకిస్తాన్‌కు అప్పు ఇచ్చే అంశంపై ఐఎంఎఫ్ బోర్డు చర్చించనుంది. ఈ తరుణంలో పాక్‌కు ఎట్టి పరిస్థితుల్లో అప్పు ఇవ్వొదని భారత్ వాదిస్తోంది. ఇదే అంశంపై భద్రతామండలి నాన్ పర్మినెంట్ మెంబర్స్‌తో భారత విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ చర్చలు జరుపుతున్నారు. పాకిస్తాన్‌కు ఏడు బిలియన్ డాలర్ల బెయిల్ అవుట్ ప్యాకేజీని సమీక్షించాలని కోరనున్నారుIndia can voice opposition to Pakistan’s $1.3 billion IMF loan, but its 2.63% voting share limits its influence. The IMF typically approves loans by consensus, and a formal vote only needs a simple majority, not an 85% supermajority. To block the loan, India would need to build…— Grok (@grok) April 29, 2025

‘స్పిరిట్’ వెనక్కి.. సందీప్‌కి ట్విస్ట్ ఇచ్చిన ప్రభాస్!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) కొన్నేళ్లపాటు ఫుల్ బిజీ! ఇప్పటికే ఆయన అరడజను సినిమాల వరకు బాకీ ఉన్నాడు. వాటిల్లో ముందుగా రాబోయేది మారుతి దర్శకత్వం వహిస్తున్న ‘రాజాసాబ్’ సినిమా. పిపుల్స్ మీడియా నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ చివరి దశలో ఉంది. దీని తర్వాత ప్రభాస్ హను రాఘవపూడి దర్శకత్వంలో ‘ఫౌజీ’(ప్రచారంలో ఉన్న టైటిల్) చేయబోతున్నాడు. ఆ తర్వాత యానిమల్ ఫేం సందీప్ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga)తో ‘స్పిరిట్’(Spirit) చేయాల్సింది. ఈ రెండు పూర్తయిన తర్వాత నాగ్ అశ్విన్, ప్రశాంత్ నీల్‌తో పాటు యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మతో కూడా సినిమా చేయాలి. కానీ ఇప్పుడు ఈ ఆర్డర్ మారినట్లు తెలుస్తోంది. ‘స్పిరిట్’ని వెనక్కినెట్టి ప్రశాంత్ వర్మ సినిమా చేయడానికి ప్రభాస్ రెడీ అవుతున్నాడని టాలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.‘స్పిరిట్’కి బ్రేక్‌కి కారణం ఏంటి?సందీప్ రెడ్డి వంగా ‘స్పిరిట్’ స్క్రిప్ట్‌ను పూర్తి చేసి, లొకేషన్లు కూడా ఫైనల్ చేస్తున్నాడు. కానీ, ఈ సినిమా కోసం సందీప్ విధించిన కండీషన్లే ప్రభాస్‌ను కాస్త వెనకడుగు వేయించాయని టాక్. 65 రోజుల వరుస కాల్షీట్స్, డూప్ లేకుండా యాక్షన్ సీన్స్ చేయాలన్న సందీప్ షరతులకు ప్రభాస్ మొదట ఓకే చెప్పినప్పటికీ, ఇప్పుడు మాత్రం ప్రశాంత్ వర్మ సినిమాను ప్రాధాన్యతగా తీసుకున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో హీరోయిన్గా భాగ్యశ్రీ భోర్సే నటించనుందని బజ్.డబుల్ షూటింగ్‌తో బిజీ! ‘రాజాసాబ్’ షూటింగ్ పూర్తయిన వెంటనే హను రాఘవపూడి ‘ఫౌజీ’తో పాటు, ప్రశాంత్ వర్మ సినిమా షూటింగ్‌లోనూ ప్రభాస్ పాల్గొననున్నాడట. ప్రస్తుతం ఇటలీ టూర్లో ఉన్న ప్రభాస్, తిరిగి వచ్చిన తర్వాత ఈ విషయంపై క్లారిటీ రానుంది. మరి, ఈ షెడ్యూల్ మార్పు వెనుక అసలు కథేంటో తెలియాలంటే, మరికొన్ని రోజులు ఆగాల్సిందే!

తక్కువ ధరకే బంగారం కావాలా!
అక్షయ తృతీయ కారణంగా ఈరోజు చాలామంది బంగారం కొనేందుకు షాపుల ముందు బారులు తీరుతున్నారు. దేశంలో పసిడి ధరలు దాదాపు తులం రూ.లక్షకు చేరువయ్యాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా భారీగా పెరుగుతున్న బంగారం ధర త్వరలో తులం రూ.ఒక లక్షకు చేరుతుందని కొందరు అంచనా వేస్తున్నారు. అయితే ప్రపంచంలోని కొన్ని దేశాల్లో భారత్ కంటే తక్కువ ధరకే బంగారం లభిస్తుంది. వాటి వివరాలు కింద తెలుసుకుందాం.దుబాయ్, యుఏఈఈ దేశం ‘బంగారు నగరం’గా ప్రసిద్ధి చెందింది. బంగారంపై తక్కువ పన్నులు ఉండడంతో ఇక్కడ అత్యంత సరసమైన ధరలకే పసిడి లభిస్తుంది. ఇక్కడ బంగారం సాధారణంగా భారతదేశం కంటే 10-15 శాతం చౌకగా ఉంటుంది. యూఏఈలో బంగారంపై విలువ ఆధారిత పన్ను(వ్యాట్) లేకపోవడం గమనార్హం. దీనికితోడు దిగుమతి సుంకాలు తక్కువగా ఉండడంతో సరసమైన ధరలకు బంగారాన్ని కొనుగోలు చేయాలనుకునే భారతీయులు ఈ దేశాన్ని అన్వేశిస్తున్నారు.థాయ్‌లాండ్‌ఇక్కడ బ్యాంకాక్, పట్టాయా బంగారం కొనుగోలుకు ప్రసిద్ధ ప్రదేశాలు. తక్కువ మేకింగ్ ఛార్జీలు, పన్నుల కారణంగా భారత్‌తో పోలిస్తే ఈ దేశం తక్కువ ధరకే బంగారు ఆభరణాలను అందిస్తోంది. సాధారణంగా థాయ్‌లాండ్‌లో బంగారం భారత్ కంటే 5-10 శాతం చౌకగా ఉంటుంది. ఆ దేశంలో తక్కువ తయారీ ఖర్చులు, బంగారంపై స్వల్పంగా పన్నులు విధిస్తున్నారు. భారత్‌తో పోలిస్తే సాపేక్షంగా తక్కువ మేకింగ్ ఛార్జీలతో బంగారు ఆభరణాలు లభిస్తాయి.సింగపూర్తక్కువ పన్నులు, బంగారం ధరల్లో పోటీ కారణంగా గోల్డ్ షాపింగ్‌కు సింగపూర్ కీలక గమ్యస్థానంగా ఉంది. నాణ్యమైన బంగారాన్ని విక్రయించడంలో ఈ దేశానికి మంచి పేరు ఉంది. ఇక్కడ ధరలు భారతదేశం కంటే 5-8 శాతం చౌకగా ఉంటాయి. ఈ దేశంలో గ్రేడ్ బంగారంపై జీఎస్టీ లేదు. దాంతో చౌకగా లభిస్తుంది.మలేషియాకౌలాలంపూర్‌లో సరసమైన బంగారం ధరలు ఉన్నాయి. తక్కువ తయారీ ఛార్జీలు, పన్నుల కోసం చూస్తున్న భారతీయ కొనుగోలుదారులను ఆకర్షిస్తున్నాయి. ఈ దేశంలో పోటీ ధరలను అందించే అనేక దుకాణాలు ఉన్నాయి. మలేషియాలో బంగారం భారతదేశం కంటే 5-10 శాతం చౌకగా ఉంటుంది. బంగారంపూ తక్కువ పన్నులు, మేకింగ్ ఛార్జీలను అందిస్తున్నారు.ఇదీ చదవండి: భారత్‌లో ఫాక్స్‌కాన్ ఆదాయం రూ.1.7 లక్షల కోట్లుహాంగ్ కాంగ్హాంగ్ కాంగ్ బంగారం, విలువైన లోహాలపై పన్ను మినహిస్తుంది. దాంతో తక్కువ ధరలకు లభిస్తాయి. ఈ దేశం బంగారం ట్రేడింగ్‌కు ప్రధాన కేంద్రంగా ఉంది. పోటీ ధరల కారణంగా చాలా మంది భారతీయులు ఇక్కడ బంగారాన్ని కొనుగోలు చేస్తారు. హాంకాంగ్‌లో బంగారం సాధారణంగా భారతదేశం కంటే 5-10 శాతం చౌకగా ఉంటుంది.

రెండు సార్లు ఫెయిల్ అయ్యా... పట్టుదలతో నాన్న కల నెరవేర్చా..
‘నన్ను కలెక్టర్‌గా చూడాలనేది మా నాన్న కోరిక.. దాన్ని ఎలాగైనా నెరవేర్చాలని పాఠశాల స్థాయిలోనే నిర్ణయించుకున్నా.. ఆయన అందించిన ప్రోత్సాహంతో ముందుకు సాగా.. రెండుసార్లు విఫలమయ్యా.. అయినా నిరాశ చెందలేదు.. రాత్రింబవళ్లు మరింత కష్టపడి చదివా.. లోటుపాట్లు సవరించుకుని ముందడుగు వేశాను. మూడో ప్రయత్నంలో విజయం సాధించా.. 2023 యూపీఎస్సీ ఫలితాల్లో జాతీయ స్థాయిలో 29వ ర్యాంకు సాధించా.. ఐఏఎస్‌గా తెలంగాణ క్యాడర్‌కు ఎంపికయ్యా.. నాన్న కల నెరవేర్చడం నాకెంతో ఆనందాన్నిచ్చింది. ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలను అమలు చేసి, పేదలకు సేవ చేయడమే లక్ష్యమని అంటున్నారు జిల్లాకు నూతనంగా విచ్చేసిన ట్రెయినీ కలెక్టర్ సలోని చాబ్రా (Saloni Chhabra). ‘సాక్షి’కి మంగళవారం ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె పలు విషమాలు వెల్లడించారు.-కైలాస్నగర్సాక్షి: ‘గుడ్ మార్నింగ్ మేడమ్.. వెల్కమ్ టు ఆదిలాబాద్. ట్రెయినీ కలెక్టర్‌గా జిల్లాకు విచ్చేసిన మీకు మరోసారి ప్రత్యేక అభినందనలు. మీ కుటుంబ నేపథ్యం వివరాలు.. ట్రెయినీ కలెక్టర్: మాది హర్యానా రాష్ట్రంలోని గురుగ్రాం. నాన్న ఇంద్రజిత్, అమ్మ సీమ. ఇద్ద రూ గురుగ్రాంలోనే బిజినెస్ చేస్తుంటారు. అన్న గ్రాడ్యూయేషన్ పూర్తి చేశాడు. ఊరిలోనే అమ్మనాన్నలకు తోడుగా ఉంటూ వ్యాపారం చూసుకుంటారు.ఇదీ చదవండి: మనవడితో 50 ఏళ్ల మహిళ పెళ్లి : ఫ్యామిలీని లేపేసేందుకు కుట్ర?సాక్షి: మీ విద్యాభ్యాసం ఎక్కడెక్కడ సాగింది..ట్రెయినీ కలెక్టర్: ఒకటి నుంచి ఇంటర్మీడియెట్ వరకు గురుగ్రాంలోని బ్లూ బెల్స్‌లో చదివా. చిన్నతనం నుంచే చదువులో ముందుండేదాన్ని. స్కూల్లో నిర్వహించే డిబేట్లు, ఎక్స్ట్రా కరిక్యూలమ్‌లో పాల్గొంటూ ప్రతి భ కనబర్చుతుండేది. చదువులో ఎప్పుడూ ముందుండే నేను టెన్త్, ఇంటర్లో ఫస్ట్‌క్లాస్ లో పాసయ్యా. అనంతరం ఢిల్లీలోని శ్రీరాం కాలేజ్ ఆఫ్ కామర్స్ యూనివర్సిటీలో బీఏ ఆనర్స్ ఎకానావిుక్స్ పూర్తి చేశాను. ఆ వెంటనే సివిల్స్ పరీక్షలపై దృష్టి సారించాను. సాక్షి: యూపీఎస్సీ కోచింగ్ ఎక్కడ తీసుకున్నారు.. ఎన్నోసారి విజయం సాధించారు..ట్రెయినీ కలెక్టర్: పదో తరగతిలోనే ఐఏఎస్ సాధించాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నా. ఆ దిశగా అడుగులు వేశాను. ఢిల్లీలోని కోచింగ్ సెంటర్లో ఏడాది పాటు శిక్షణ పొందాను. ఆప్షనల్ సబ్జెక్ట్‌గా సోషియాలజీని ఎంచుకు న్నా. ప్రణాళికాబద్ధంగా చదివా. 2021లో తొలిసారి యూపీఎస్సీ పరీక్షలకు హాజరయ్యా. ఇంటర్వ్యూ వరకు వెళ్లాను. అయితే కొద్దిపాటి తేడాతో విజయం సాధించలేకపోయాను. మరో ప్రయత్నంలో ప్రిలిమ్స్‌లోనే ఆగిపోయాను. అయినా నిరాశ చెందలేదు. మూడో ప్రయత్నం 2023లో జాతీయస్థాయిలో 29వ ర్యాంకు సాధించాను. ఐఏఎస్ కావాలనే నా సంకల్పంతోపాటు నాన్న కలను నెరవేర్చాను. తెలంగాణ క్యాడర్‌కు ఎంపికై ప్రస్తుతం ట్రైనింగ్ నిమిత్తం ఆదిలా బాద్‌కు రావడం జరిగింది. ఏడాది పాటు జిల్లాలో పని చేయాల్సి ఉంటుంది. రెండుసార్లు విఫలమైన సమయంలో నేను ఆత్మవిశ్వాసం కోల్పోకుండా అమ్మనాన్నలు అండగా నిలిచారు. వెన్నుతట్టారు. వారందించిన ప్రోత్సాహం తోనే విజయం సాధించాను. సివిల్స్, ఇతర పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే యువతకు మీరిచ్చే సలహా.. ట్రెయినీ కలెక్టర్: సివిల్ సర్వీసెస్‌కు సన్నద్ధమయ్యే అభ్యర్థుల్లో చాలా మంది ఒకటి, రెండు ప్రయత్నాలకే నిరాశకు లోనవుతారు. ఇక మా వల్ల కాదంటూ వెనుకడుగు వేస్తుంటారు. అపజయాలను చూసి నిరాశ చెందొద్దు. సంకల్పం వీడకుండా ముందుడుగు వేయాలి. పట్టుదలతో ప్రణాళికాబద్ధంగా చదివితే తప్పకుండా విజయం సాధించవచ్చు. రోజుకు కనీసం 8 నుంచి 10 గంటలు చదవాలి. ముఖ్యంగా సెల్‌ఫోన్, సోషల్ మీడియాకు దూరంగా ఉండాలి. ప్రతిరోజు పత్రికలను చదవడం అలవాటు చేసుకోవాలి. వర్తమాన అంశాలపై పట్టు సాధించాలి. గత ప్రశ్నాపత్రాలను విశ్లేషించుకోవాలి. సందేహాలుంటే ఎప్పటికప్పుడు నివృత్తి చేసుకోవాలి. ఆత్మవిశ్వాసం, సంకల్పబలంతో ప్రయత్నిస్తే తప్పకుండా లక్ష్యాన్ని సాధించవచ్చు.
రోజూ 13,698 వాహనాలు అమ్ముతారట!
'హిట్ 3' నిర్మాత నేనే.. కానీ బడ్జెట్ ఎంతైందో తెలీదు
అక్షయ తృతీయ.. దయచేసి ఇలా చేయండి : గాయని చిన్మయి
అసలు బంగారం ధర ఎందుకు పెరుగుతోంది?
ఇంగ్లండ్ టూర్‌కు ఆర్సీబీ కెప్టెన్.. కరుణ్, సాయి సుదర్శన్‌కు కూడా పిలుపు..?
నా బిడ్డకు న్యాయం చేయండి
హవ్వ.. ఇంకో 44 వేల ఎకరాలా?
జపాన్ కళతో శ్రీ వేంకటేశ్వర స్వామి రూపం..!
అప్పు ఇవ్వొద్దు.. పాక్‌పై భారత్ ఆర్థిక యుద్ధం
‘స్పిరిట్’ వెనక్కి.. సందీప్‌కి ట్విస్ట్ ఇచ్చిన ప్రభాస్!
సింహాచలం అప్పన్న సన్నిధిలో అపశ్రుతి.. ఏడుగురు భక్తులు మృతి
తిరుపతి తొక్కిసలాట ఘటన మరవకముందే..
సింహాచలం చందనోత్సవంలో ఘోర అపశ్రుతి
సింహాచలం విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
వివాహేతర సంబంధం.. భార్య కళ్లెదుటే ప్రియుడ్ని..
విశాఖకు మాజీ సీఎం వైఎస్ జగన్
IPL 2025: రసవత్తరంగా సాగుతున్న ప్లే ఆఫ్స్ రేసు.. ఏ క్షణంలో ఏమైనా జరగవచ్చు..!
తక్కువ ధరకే బంగారం కావాలా!
సింహాచలంలో ఘోర విషాదం.. చంద్రబాబు సర్కారుపై వీహెచ్‌పీ ఆగ్రహం
అక్షయ ఫలాలనిచ్చే అక్షయ తృతీయ..!
Kolkata: హోటల్లో ఘోర అగ్ని ప్రమాదం.. 14 మంది సజీవ దహనం
Vishakha: సింహాచలం ఘటనపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
DC VS KKR: చరిత్ర సృష్టించిన సునీల్ నరైన్
కెనడా కొత్త ప్రధానిగా మార్క్ కార్నీ
పహల్గాం ఉగ్రదాడి మృతులకు నివాళులర్పించిన కేతిరెడ్డి
థియేటర్, ఓటీటీలో బ్లాక్ బస్టర్.. ఇప్పుడు సీక్వెల్!
రెండు సార్లు ఫెయిల్ అయ్యా... పట్టుదలతో నాన్న కల నెరవేర్చా..
ఓటీటీలోకి వచ్చేసిన ఆంథాలజీ.. తెలుగులో స్ట్రీమింగ్
అతడిని బ్యాన్ చేయండి: టీమిండియా స్టార్‌పై నెటిజన్ల ఆగ్రహం
నాదేం లేదు.. దీనంతటికీ కారణం నా భార్య: స్టార్ హీరో
అల్లు అర్జున్ కోసం ఫ్లాపుల హీరోయిన్?
హైదరాబాద్‌లో ఆజాద్ ఇంజినీరింగ్ తయారీ ప్లాంటు
IPL 2025: మాల్దీవ్స్‌లో ఎంజాయ్ చేస్తున్న ఇషాన్ కిషన్, ట్రవిస్ హెడ్
ఇద్దరిని బలిగొన్న అతివేగం
ఈ రాశి వారికి వృత్తి, వ్యాపారాలలో అనుకూలం
అప్పు ఇవ్వొద్దు.. పాక్‌పై భారత్ ఆర్థిక యుద్ధం
‘స్పిరిట్’ వెనక్కి.. సందీప్‌కి ట్విస్ట్ ఇచ్చిన ప్రభాస్!
వారెవ్వా ‘హిట్’మ్యాన్!.. పేద కుటుంబంలో పుట్టి.. కోటీశ్వరుడిగా!.. ఆస్తి ఎంతంటే?
గోల్డెన్ ఛాన్స్! బంగారం తులం ఎంతంటే..
ఆడుకుంటూ వెళ్లి అసువులు బాసింది
ఇండస్ఇండ్ సీఈఓ రాజీనామా!
ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం: మరో 195 మంది ట్రైనీలు..
సాయి కుటుంబానికి అండగా ఉంటాం
టీమిండియాను శిక్షించిన ఐసీసీ
Akshaya Tritiya : ధగధగల వెనుక దగా!
ష్యూరిటీ ఇచ్చేముందే జాగ్రత్త పడాలి..!
మళ్లీ ఐపీవోల సందడి..!
అక్షయ తృతీయ.. రూ.16,000 కోట్ల అమ్మకాలు
ఢిల్లీలో పారని బాబు పాచిక!
పాక్ విమానాలకు నో ఎంట్రీ
Vaibhav Suryavanshi: ఈ ‘వైభవం’ కొనసాగాలి!
జూన్‌లో ఫిక్స్
సడన్ గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమాలు
ఎక్కడికైనా సులభంగా చిన్న బయోచార్ యూనిట్
కొడుకు మృతదేహంతో మూడురోజులు
చుట్టుముట్టి చంపేశారు
గజం రూ.లక్షల్లో ఉంటే ఎకరా 99 పైసలకే ఇచ్చేస్తారా?
ప్రభుత్వం విచక్షణాధికార పరిధిని దాటితే ఎలా?
ఓటీటీ జోరు... డిజిటల్ మీడియా హోరు
శ్రీశైలం డ్యామ్‌కు తక్షణమే మరమ్మతులు చేయాలి
రాజకీయ ప్రేరేపిత చర్య
రన్ వేపై రెక్కల ముక్కలు
ప్రతిష్టాత్మకంగా ‘మిస్ వరల్డ్’
లిబరల్ పార్టీ విజయం
కెమిస్ట్రీలో మూలకాలు.. ఫిజిక్స్‌లో థర్మోడైనమిక్స్
సోలార్ కాంట్రాక్టుల్లో అవకతవకలేమీ జరగలేదు
DC vs KKR: నైట్‌రైడర్స్ గెలుపు బాట
సూచీలకు స్వల్ప లాభాలు
బజాజ్ ఫైనాన్స్ బోనస్ బొనాంజా
కెనడాలో లిబరల్స్‌కు పట్టం
పాక్ కపట నాటకం.. వరుసగా రోజు భారత సైన్యంపై పాక్ సైన్యం కాల్పులు
పవన్ కొడుక్కి సైకియాట్రిస్ట్ ట్రీట్మెంట్!
కిచెన్ నైఫ్ పదును పోయిందా...!
పర్యావరణ హిత: ఈ చిత్రాన్ని మీకు సమర్పిస్తున్న వారు...
స్థిరంగా కదలాడుతున్న సూచీలు
బైబిల్... షేక్స్పియర్... అగథా క్రిస్టీ!
జనసేన కార్యాలయం వద్ద పీఈటీ అభ్యర్థుల నిరసన
ఎన్ఎఫ్హెచ్సీ.. సేవల్లో భేష్
ఎన్జీ రంగా అగ్రి వర్సిటీ వజ్రోత్సవాలు ప్రారంభం
అంతులేని అవినీతి.. అంతా అరాచకం: వైఎస్ జగన్
పార్లమెంట్‌ను సమావేశపర్చండి
ఎన్క్రిప్టెడ్ యాప్స్ ద్వారా డ్రగ్స్ దందా
కొత్త షెల్టర్ జోన్లకు మావో అగ్రనేతలు?
భూభారతిలో తప్పు చేస్తే కఠిన చర్యలు
పాస్‌బుక్ ఉంటే తహసీల్దార్.. లేదంటే ఆర్డీవోకు
సైన్యానికి పూర్తి స్వేచ్ఛ; ప్రధాని మోదీ
ఇంగ్లండ్ మహిళల జట్టు కొత్త కెప్టెన్‌గా సీవర్ బ్రంట్
స్నేహ్ మాయాజాలం
'వేతన యాతన'!
ఏడాదిలో ఎనిమిది!
మన రాష్ట్రంలో వీధి వీధికి బెల్ట్‌షాపులు తొలగించాలి సార్!
ఇంతకూ పరిష్కారం ఏమిటి?
నివేదిక అందించాలని డిప్యూటీ డైరెక్టర్ ఆదేశం
శ్రీవారి క్షేత్రంలో భక్తజన సందోహం
కొవ్వొత్తులతో పీస్ వాక్..!
ఇప్పుడే జడ్జిమెంట్లు వద్దు.. మున్ముందు కఠిన సవాళ్లు: టీమిండియా మాజీ కోచ్
స్వరలయ ఆర్ట్స్ సింగపూర్ ఫైన్ ఆర్ట్స్ అకాడమీ 6 వ వార్షికోత్సవ వేడుకలు
చదివేది ఏడో తరగతి.. వాడేది ఐ ఫోన్
డాల్ఫిన్.. నాట్ ఫైన్!
విద్యా రుణం.. నిబంధనలు శరాఘాతం
ఏజెన్సీలో ఎదురుకాల్పులు
అధ్యక్షుడి కోసం.. నిరీక్షణ తప్పదా?
పాక్‌కు భారత ఫార్మా ఉత్పత్తులు బంద్!
నేడు కేంద్ర కేబినెట్ భేటీ
మళ్లీ ఓడిన భారత బ్యాడ్మింటన్ జట్టు
నిజాయితీగా పనిచేయండి
బొలేరో వాహనం ఢీకొని కూలీకి తీవ్ర గాయాలు
బసినికొండ ప్రభుత్వ స్థలంలో హెచ్చరిక బోర్డు
సెలవులొచ్చాయి ఆడించండి... చదివించండి..
వాటర్‌లో వార్
రోజూ 13,698 వాహనాలు అమ్ముతారట!
'హిట్ 3' నిర్మాత నేనే.. కానీ బడ్జెట్ ఎంతైందో తెలీదు
అక్షయ తృతీయ.. దయచేసి ఇలా చేయండి : గాయని చిన్మయి
అసలు బంగారం ధర ఎందుకు పెరుగుతోంది?
ఇంగ్లండ్ టూర్‌కు ఆర్సీబీ కెప్టెన్.. కరుణ్, సాయి సుదర్శన్‌కు కూడా పిలుపు..?
నా బిడ్డకు న్యాయం చేయండి
హవ్వ.. ఇంకో 44 వేల ఎకరాలా?
జపాన్ కళతో శ్రీ వేంకటేశ్వర స్వామి రూపం..!
అప్పు ఇవ్వొద్దు.. పాక్‌పై భారత్ ఆర్థిక యుద్ధం
‘స్పిరిట్’ వెనక్కి.. సందీప్‌కి ట్విస్ట్ ఇచ్చిన ప్రభాస్!
సింహాచలం అప్పన్న సన్నిధిలో అపశ్రుతి.. ఏడుగురు భక్తులు మృతి
తిరుపతి తొక్కిసలాట ఘటన మరవకముందే..
సింహాచలం చందనోత్సవంలో ఘోర అపశ్రుతి
సింహాచలం విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
వివాహేతర సంబంధం.. భార్య కళ్లెదుటే ప్రియుడ్ని..
విశాఖకు మాజీ సీఎం వైఎస్ జగన్
IPL 2025: రసవత్తరంగా సాగుతున్న ప్లే ఆఫ్స్ రేసు.. ఏ క్షణంలో ఏమైనా జరగవచ్చు..!
తక్కువ ధరకే బంగారం కావాలా!
సింహాచలంలో ఘోర విషాదం.. చంద్రబాబు సర్కారుపై వీహెచ్‌పీ ఆగ్రహం
అక్షయ ఫలాలనిచ్చే అక్షయ తృతీయ..!
Kolkata: హోటల్లో ఘోర అగ్ని ప్రమాదం.. 14 మంది సజీవ దహనం
Vishakha: సింహాచలం ఘటనపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
DC VS KKR: చరిత్ర సృష్టించిన సునీల్ నరైన్
కెనడా కొత్త ప్రధానిగా మార్క్ కార్నీ
పహల్గాం ఉగ్రదాడి మృతులకు నివాళులర్పించిన కేతిరెడ్డి
థియేటర్, ఓటీటీలో బ్లాక్ బస్టర్.. ఇప్పుడు సీక్వెల్!
రెండు సార్లు ఫెయిల్ అయ్యా... పట్టుదలతో నాన్న కల నెరవేర్చా..
ఓటీటీలోకి వచ్చేసిన ఆంథాలజీ.. తెలుగులో స్ట్రీమింగ్
అతడిని బ్యాన్ చేయండి: టీమిండియా స్టార్‌పై నెటిజన్ల ఆగ్రహం
నాదేం లేదు.. దీనంతటికీ కారణం నా భార్య: స్టార్ హీరో
అల్లు అర్జున్ కోసం ఫ్లాపుల హీరోయిన్?
హైదరాబాద్‌లో ఆజాద్ ఇంజినీరింగ్ తయారీ ప్లాంటు
IPL 2025: మాల్దీవ్స్‌లో ఎంజాయ్ చేస్తున్న ఇషాన్ కిషన్, ట్రవిస్ హెడ్
ఇద్దరిని బలిగొన్న అతివేగం
ఈ రాశి వారికి వృత్తి, వ్యాపారాలలో అనుకూలం
అప్పు ఇవ్వొద్దు.. పాక్‌పై భారత్ ఆర్థిక యుద్ధం
‘స్పిరిట్’ వెనక్కి.. సందీప్‌కి ట్విస్ట్ ఇచ్చిన ప్రభాస్!
వారెవ్వా ‘హిట్’మ్యాన్!.. పేద కుటుంబంలో పుట్టి.. కోటీశ్వరుడిగా!.. ఆస్తి ఎంతంటే?
గోల్డెన్ ఛాన్స్! బంగారం తులం ఎంతంటే..
ఆడుకుంటూ వెళ్లి అసువులు బాసింది
ఇండస్ఇండ్ సీఈఓ రాజీనామా!
ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం: మరో 195 మంది ట్రైనీలు..
సాయి కుటుంబానికి అండగా ఉంటాం
టీమిండియాను శిక్షించిన ఐసీసీ
Akshaya Tritiya : ధగధగల వెనుక దగా!
ష్యూరిటీ ఇచ్చేముందే జాగ్రత్త పడాలి..!
మళ్లీ ఐపీవోల సందడి..!
అక్షయ తృతీయ.. రూ.16,000 కోట్ల అమ్మకాలు
ఢిల్లీలో పారని బాబు పాచిక!
పాక్ విమానాలకు నో ఎంట్రీ
Vaibhav Suryavanshi: ఈ ‘వైభవం’ కొనసాగాలి!
జూన్‌లో ఫిక్స్
సడన్ గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమాలు
ఎక్కడికైనా సులభంగా చిన్న బయోచార్ యూనిట్
కొడుకు మృతదేహంతో మూడురోజులు
చుట్టుముట్టి చంపేశారు
గజం రూ.లక్షల్లో ఉంటే ఎకరా 99 పైసలకే ఇచ్చేస్తారా?
ప్రభుత్వం విచక్షణాధికార పరిధిని దాటితే ఎలా?
ఓటీటీ జోరు... డిజిటల్ మీడియా హోరు
శ్రీశైలం డ్యామ్‌కు తక్షణమే మరమ్మతులు చేయాలి
రాజకీయ ప్రేరేపిత చర్య
రన్ వేపై రెక్కల ముక్కలు
ప్రతిష్టాత్మకంగా ‘మిస్ వరల్డ్’
లిబరల్ పార్టీ విజయం
కెమిస్ట్రీలో మూలకాలు.. ఫిజిక్స్‌లో థర్మోడైనమిక్స్
సోలార్ కాంట్రాక్టుల్లో అవకతవకలేమీ జరగలేదు
DC vs KKR: నైట్‌రైడర్స్ గెలుపు బాట
సూచీలకు స్వల్ప లాభాలు
బజాజ్ ఫైనాన్స్ బోనస్ బొనాంజా
కెనడాలో లిబరల్స్‌కు పట్టం
పాక్ కపట నాటకం.. వరుసగా రోజు భారత సైన్యంపై పాక్ సైన్యం కాల్పులు
పవన్ కొడుక్కి సైకియాట్రిస్ట్ ట్రీట్మెంట్!
కిచెన్ నైఫ్ పదును పోయిందా...!
పర్యావరణ హిత: ఈ చిత్రాన్ని మీకు సమర్పిస్తున్న వారు...
స్థిరంగా కదలాడుతున్న సూచీలు
బైబిల్... షేక్స్పియర్... అగథా క్రిస్టీ!
జనసేన కార్యాలయం వద్ద పీఈటీ అభ్యర్థుల నిరసన
ఎన్ఎఫ్హెచ్సీ.. సేవల్లో భేష్
ఎన్జీ రంగా అగ్రి వర్సిటీ వజ్రోత్సవాలు ప్రారంభం
అంతులేని అవినీతి.. అంతా అరాచకం: వైఎస్ జగన్
పార్లమెంట్‌ను సమావేశపర్చండి
ఎన్క్రిప్టెడ్ యాప్స్ ద్వారా డ్రగ్స్ దందా
కొత్త షెల్టర్ జోన్లకు మావో అగ్రనేతలు?
భూభారతిలో తప్పు చేస్తే కఠిన చర్యలు
పాస్‌బుక్ ఉంటే తహసీల్దార్.. లేదంటే ఆర్డీవోకు
సైన్యానికి పూర్తి స్వేచ్ఛ; ప్రధాని మోదీ
ఇంగ్లండ్ మహిళల జట్టు కొత్త కెప్టెన్‌గా సీవర్ బ్రంట్
స్నేహ్ మాయాజాలం
'వేతన యాతన'!
ఏడాదిలో ఎనిమిది!
మన రాష్ట్రంలో వీధి వీధికి బెల్ట్‌షాపులు తొలగించాలి సార్!
ఇంతకూ పరిష్కారం ఏమిటి?
నివేదిక అందించాలని డిప్యూటీ డైరెక్టర్ ఆదేశం
శ్రీవారి క్షేత్రంలో భక్తజన సందోహం
కొవ్వొత్తులతో పీస్ వాక్..!
ఇప్పుడే జడ్జిమెంట్లు వద్దు.. మున్ముందు కఠిన సవాళ్లు: టీమిండియా మాజీ కోచ్
స్వరలయ ఆర్ట్స్ సింగపూర్ ఫైన్ ఆర్ట్స్ అకాడమీ 6 వ వార్షికోత్సవ వేడుకలు
చదివేది ఏడో తరగతి.. వాడేది ఐ ఫోన్
డాల్ఫిన్.. నాట్ ఫైన్!
విద్యా రుణం.. నిబంధనలు శరాఘాతం
ఏజెన్సీలో ఎదురుకాల్పులు
అధ్యక్షుడి కోసం.. నిరీక్షణ తప్పదా?
పాక్‌కు భారత ఫార్మా ఉత్పత్తులు బంద్!
నేడు కేంద్ర కేబినెట్ భేటీ
మళ్లీ ఓడిన భారత బ్యాడ్మింటన్ జట్టు
నిజాయితీగా పనిచేయండి
బొలేరో వాహనం ఢీకొని కూలీకి తీవ్ర గాయాలు
బసినికొండ ప్రభుత్వ స్థలంలో హెచ్చరిక బోర్డు
సెలవులొచ్చాయి ఆడించండి... చదివించండి..
వాటర్‌లో వార్
సినిమా

నాదేం లేదు.. దీనంతటికీ కారణం నా భార్య: స్టార్ హీరో
తమిళ హీరోల్లో అజిత్ కాస్త డిఫరెంట్. సినిమాలు చేసి ప్రేక్షకుల్ని అలరించడం తప్పితే మిగతా విషయాల్లో పెద్దగా తలదూర్చడు. తన పనేదో తాను అన్నట్లు ఉంటాడు. కారే రేసింగ్ లో ఈ మధ్య కాలంలో రఫ్ఫాడిస్తున్నాడనే చెప్పాలి. ఈసారి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పద్మభూషణ్ ఇతడిని వరించింది. తాజాగా ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి చేతుల మీదుగా అజిత్ ఈ పురస్కారం అందుకున్నాడు.(ఇదీ చదవండి: 'కోర్ట్'ని మించిపోయేలా ఉంటుంది.. ఓటీటీ డేట్ ఫిక్స్) ఈ క్రమంలోనే కుటుంబంతో కలిసి ఢిల్లీ వెళ్లిన అజిత్.. పద్మ భూషణ్ పురస్కారాన్ని అందుకున్నాడు. అయితే తను ఇలా ఉండటానికి భార్యనే కారణం అని చెబుతూ మొత్తం క్రెడిట్ ఆమెకే ఇచ్చేశాడు. తాజాగా ఓ ఇంగ్లీష్ వెబ్ సైట్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశాడు.'ఇప్పటికీ సామాన్యుడిలానే ఆలోచిస్తాను. ఇంత ఎత్తు ఎదిగానా అని ఒక్కోసారి ఆశ్చర్యం వేస్తుంటుంది. దీనంతటికీ నా భార్య షాలినినే కారణం. ఎందుకంటే నా కోసం చాలా త్యాగాలు చేసింది. ప్రతిదానిలో నాకు తోడుంది. ఒక్కోసారి కరెక్ట్ నిర్ణయాలు తీసుకోలేకపోయాను. ఆ టైంలోనూ షాలిని నాకు అండగా నిలిచింది తప్పితే నిరుత్సాహపరచలేదు'(ఇదీ చదవండి: థియేటర్, ఓటీటీలో బ్లాక్ బస్టర్.. ఇప్పుడు సీక్వెల్!)'నా జీవితంలో సాధించిన సక్సెస్ క్రెడిట్ అంతా షాలినికే ఇస్తాను. నటిగా ఎంతో గుర్తింపు ఉన్నప్పటికీ నాకోసం అన్నింటినీ వదులుకుంది. ఆమెకు చాలామంది అభిమానులున్నారు. వాళ్లకు నా థ్యాంక్స్. నేను కేవలం యాక్టర్ నే. సూపర్ స్టార్ అని పిలిపించుకోవడం నచ్చదు. అలాంటి ట్యాగ్స్ పై నాకు నమ్మకం లేదు' అని అజిత్ చెప్పుకొచ్చాడు.తమిళ హీరోగా అజిత్ చాలా ఫేమస్. హీరోయిన్ గా కలిసి పనిచేసిన షాలిని.. 2000లో ఇతడిని పెళ్లిచేసుకుంది. అప్పటినుంచి సినిమాలు, నటనకు దూరమైంది. ఈ జంటకు కొడుకు-కూతురు ఉన్నారు.(ఇదీ చదవండి: అల్లు అర్జున్ కోసం ఫ్లాపుల హీరోయిన్?)

అల్లు అర్జున్ కోసం ఫ్లాపుల హీరోయిన్?
పుష్ప 2 మూవీతో అల్లు అర్జున్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. నెక్స్ట్ ఎవరితో చేస్తాడా అని ఫ్యాన్స్ చూస్తున్న టైంలో తమిళ దర్శకుడు అట్లీ పేరు తెరపైకి వచ్చింది. అంతకు ముందు త్రివిక్రమ్ ప్రాజెక్ట్ లాక్ అవడంతో.. గురూజీతోనే మూవీ ఉంటుందని అందరూ అనుకున్నారు. కానీ అట్లీతో సినిమాను అనౌన్స్ చేశారు.(ఇదీ చదవండి: 'కోర్ట్'ని మించిపోయేలా ఉంటుంది.. ఓటీటీ డేట్ ఫిక్స్) తమిళ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్.. భారీ బడ్జెట్ తో అల్లు అర్జున్-అట్లీ సినిమాను నిర్మించబోతుంది. రీసెంట్ గా రిలీజ్ చేసిన అనౌన్స్ మెంట్ వీడియోతోనే ఈ విషయం అర్థమైపోయింది. హాలీవుడ్ గ్రాఫిక్స్ నిపుణులతో హీరో-దర్శకుడు చర్చలు జరపడం అవి చూస్తుంటే ఈసారి గట్టిగానే ప్లాన్ చేస్తున్నారుగా అనిపించింది.అట్లీ సినిమా అంటే హీరోకు ఎన్ని ఎలివేషన్లు ఉంటాయనే సంగతి పక్కనబెడితే హీరోయిన్లు ఒకరు కంటే ఎక్కువ మందే ఉంటారు. ఇక బన్నీతో చేయబోయే మూవీలోనూ ఏకంగా ముగ్గురు భామలు ఉంటారని ప్రచారం జరుగుతోంది. అయితే వీళ్లందరూ బాలీవుడ్ బ్యూటీలా లేదంటే దక్షిణాది హీరోయిన్లు ఉంటారా అనే దగ్గర కన్ఫ్యూజన్ నడుస్తోంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి థ్రిల్లర్ సినిమా.. తొమ్మిదేళ్ల తర్వాత తెలుగులో) మొన్నటివరకు జాన్వీ కపూర్, మృణాల్ ఠాకుర్ పేర్లు వినిపించాయి. తాజాగా అనన్య పాండే పేరు వినిపించేసరికి బన్నీ ఫ్యాన్స్ షాకవుతున్నారు. ఎందుకంటే అనన్య ఇప్పటివరకు హిందీలో సినిమాలైతే చేస్తోంది గానీ ఒక్కటంటే ఒక్క హిట్ కూడా లేదు. దానికి తోడు ఈమె యాక్టింగ్ పై బోలెడన్ని విమర్శలు.దీంతో హీరోయిన్ గా అనన్య పాండే వద్దు బాబోయ్ అని బన్నీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. అయితే హీరోయిన్లు ఎవరనే సస్పెన్స్.. షూటింగ్ మొదలయ్యే వరకు కొనసాగే అవకాశముంది. మొన్నటివరకు సమంత, దిశా పటానీ పేర్లు కూడా వినిపించాయి కానీ బన్నీ-అట్లీ ఎవరిని ఫైనల్ చేస్తారో చూడాలి?(ఇదీ చదవండి: థియేటర్, ఓటీటీలో బ్లాక్ బస్టర్.. ఇప్పుడు సీక్వెల్!)

థియేటర్, ఓటీటీలో బ్లాక్ బస్టర్.. ఇప్పుడు సీక్వెల్!
పాన్ ఇండియా స్థాయిలో పేరు తెచ్చుకున్న నటుడు విజయ్ సేతుపతి. స్వతహాగా తమిళం అయినప్పటికీ.. తెలుగు, హిందీతో పాటు ఇతర భాషల్లోనూ మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. కొన్నాళ్ల క్రితం తెలుగులో ఉప్పెన చిత్రంలో ప్రతినాయకుడిగా నటించి మనోళ్లకు బాగా దగ్గరయ్యాడు. (ఇదీ చదవండి: 'కోర్ట్'ని మించిపోయేలా ఉంటుంది.. ఓటీటీ డేట్ ఫిక్స్) షారూఖ్ ఖాన్ జవాన్‌లో విలన్‌గా తన నట విశ్వరూపాన్ని చూపించాడు. ఇలా ఎప్పటికప్పుడు వైవిధ్యమైన సినిమాలు తీస్తున్న సేతుపతి.. ప్రస్తుతం మిష్కిన్ దర్శకత్వంలో ట్రైన్, తెలుగు దర్శకుడు పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తూ బిజీగా ఉన్నాడు. అలానే 'కాక్కా ముట్టై' ఫేమ్ మణికంఠన్ దర్శకత్వంలో ఓ వెబ్ సిరీస్ చేసేందుకు సేతుపతి రెడీ అవుతున్నాడు. గత కొన్నాళ్లుగా హీరోగా హిట్ లేక డీలా పడిపోయిన విజయ్ సేతుపతికి హిట్ ఇచ్చిన సినిమా మహారాజ. గతేడాది రిలీజైంది. తొలుత థియేటర్లలో ఆపై ఓటీటీలోనూ బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ అందుకుంది. (ఇదీ చదవండి: నెలలోపే ఓటీటీలోకి వచ్చేసిన థ్రిల్లర్ సినిమా) ఇది విజయ్ సేతుపతికి 50వ చిత్రం కావడం విశేషం. ఇదే సినిమా చైనీష్ లోనూ అనువాదం అయ్యి చైనాలో రిలీజై మంచి వసూళ్లు సాధించింది. కాగా మహారాజా చిత్రానికి సీక్వెల్ చేయాలని విజయ్ సేతుపతి ఆలోచిస్తున్నట్లు, దానికి తగ్గ కథను సిద్ధం చేయమని దర్శకుడు నితిలన్ స్వామినాథన్ కు చెప్పినట్లు తెలుస్తోంది. కాగా విజయ్ సేతుపతి ప్రస్తుతం చేస్తున్న సినిమాలు పూర్తి చేసిన తర్వాత మహారాజ 2 మొదలు పెడతారా లేదంటే వాటితో పాటే ప్రారంభించి పూర్తి చేస్తారా అనేది చూడాలి?(ఇదీ చదవండి: ఓటీటీలోకి థ్రిల్లర్ సినిమా.. తొమ్మిదేళ్ల తర్వాత తెలుగులో)

సంధ్య థియేటర్ ఘటన.. బాలుడు శ్రీతేజ్ డిశ్చార్జ్
సంధ్య థియేటర్ ఘటనలో గాయపడిన బాలుడు శ్రీతేజ్ కోలుకున్నారు. ఇవాళ బాలుడిని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. అనంతరం బాలుడిని రిహాబిలిటేషన్ కేంద్రానికి తరలించారు. అయితే ప్రస్తుతం శ్రీతేజ్ కళ్లు తెరిచి చూస్తున్నాడని.. 15 రోజుల నుంచి లిక్విడ్స్ నోటి ద్వారా తీసుకుంటున్నాడని శ్రీతేజ్ తండ్రి భాస్కర్ వెల్లడించారు. మనుషుల్ని గుర్తు పట్టట్లేదని.. ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలిపారు.సంధ్య థియేటర్ తొక్కిసలాటలో గాయపడిన బాలుడు శ్రీతేజ్ 4 నెలల 25 రోజులుగా సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దాదాపు 146 రోజుల తర్వాత డిశ్చార్జ్ అవుతున్నారు. శ్రీ తేజకు 15 రోజుల పాటు ఫిజియోథెరపీ చేయించి ఇంటికి తీసుకెళ్లొచ్చవని వైద్యులు సూచించారు.గతేడాది డిసెంబర్లో ఘటనకాగా.. గతేడాది డిసెంబర్ 4న పుష్ప-2 సినిమా రిలీజ్ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ తన కుటుంబంతో కలిసి అల్లు అర్జున్ను చూసేందుకు వెళ్లింది. అయితే విపరీతమైన క్రౌడ్ రావడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ క్రమంలోనే రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చేరారు. ఈ ఘటనతో టాలీవుడ్ ఇండస్ట్రీ షాకింగ్‌కు గురైంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు థియేటర్ యాజమాన్యంతో పాటు అల్లు అర్జున్ను కూడా అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
న్యూస్ పాడ్‌కాస్ట్
క్రీడలు

ఇప్పుడే జడ్జిమెంట్లు వద్దు.. మున్ముందు కఠిన సవాళ్లు: టీమిండియా మాజీ కోచ్
వైభవ్ సూర్యవంశీ.. క్రికెట్ వర్గాల్లో ఎక్కడ చూసినా అతడి గురించే చర్చ. పద్నాలుగేళ్ల వయసులోనే టీ20 క్రికెట్లో చరిత్ర సృష్టించిన ఈ చిచ్చర పిడుగును చూసి దిగ్గజ ఆటగాళ్లే ఆశ్చర్యపోతున్నారు. ఏమాత్రం భయం లేకుండా అంతర్జాతీయ స్థాయి బౌలర్లను ఎదుర్కొన తీరు తనకు ముచ్చటగొలిపిందని భారత లెజెండరీ బ్యాటర్ సచిన్ టెండుల్కర్ వైభవ్‌ను కొనియాడాడు.అసలు పద్నాలుగేళ్ల వయసులో ఇలాంటి ఆటను అస్సలు ఊహించలేమని.. వైభవ్ మాత్రం బౌలర్లకు కాళరాత్రిని మిగిల్చి చరిత్రలో తన పేరు లిఖించుకున్నాడని మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ అబ్బురపడ్డాడు. ఇర్ఫాన్ పఠాన్, యూసఫ్ పఠాన్, రాహుల్ ద్రవిడ్, మైకేల్ హస్సీ వంటి వారంతా రాజస్తాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ ఆట తీరుపై ప్రశంసలు కురిపించారు.అయితే, టీమిండియా మాజీ కోచ్, కామెంటేటర్ రవిశాస్త్రి మాత్రం కాస్త భిన్నంగా స్పందించాడు. ఇప్పడే వైభవ్ సూర్యవంశీపై ఓ అంచనాకు రాకూడదని.. భవిష్యత్తులో అతడు కఠిన సవాళ్లు ఎదుర్కోబోతున్నాడని పేర్కొన్నాడు. వైఫల్యాలు, ఒత్తిడిని అధిగమించే తీరుపైనే అతడి ఫ్యూచర్ ఆధారపడి ఉంటుందని వ్యాఖ్యానించాడు.ఈ మేరకు ఐసీసీ రివ్యూ షోలో భాగంగా రవిశాస్త్రి.. స్పోర్ట్స్ ప్రజెంటర్ సంజనా గణేషన్‌తో మాట్లాడుతూ.. వైభవ్ అరంగేట్రంలో ఆడిన తీరు తనను ఆశ్చర్యానికి గురిచేసిందన్నాడు. అతడికి అసాధారణ నైపుణ్యాలు ఉన్నాయని కొనియాడాడు. ‘‘లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో అతడు కొట్టిన మొదటి షాట్ ప్రేక్షకులను ఊపిరి బిగపట్టేలా చేసింది.అయితే, అతడు ఇంకా చిన్న పిల్లాడే. ఈ వయసులో వైఫల్యాలను ఎలా ఎదుర్కొంటాడో కూడా చూడాలి. ముఖ్యంగా తొలి బంతినే సిక్సర్‌గా మలిచిన వైభవ్ పట్ల బౌలర్లు ఇకపై కనికరం చూపబోరు.అతడి వయసు 14 లేదంటే 12, 20 ఏళ్లా అని చూడరు. అతడి ఆటకు తగ్గట్లుగా సరైన వ్యూహాలు, ప్రణాళికలతో ముందుకు వస్తారు. అలాంటి వారిని వైభవ్ ఎలా ఎదుర్కొంటాడో చూడాలి. అప్పుడే అతడి ఆట తీరుపై సరైన అవగాహన, అంచనాకు రాగలము’’ అని రవిశాస్త్రి పేర్కొన్నాడు. క్రమశిక్షణతో ముందుకు సాగితేనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని వైభవ్‌కు ఈ సందర్భంగా సలహా ఇచ్చాడు.కాగా ఐపీఎల్-2025 మెగా వేలంలో రాజస్తాన్ రాయల్స్ 1.10 కోట్లకు బిహార్ కుర్రాడు వైభవ్ సూర్యవంశీని కొనుగోలు చేసింది. కెప్టెన్ సంజూ శాంసన్ గాయం కారణంగా అతడికి రాజస్తాన్ ఓపెనర్‌గా అవకాశం వచ్చింది. లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్ సందర్భంగా ఐపీఎల్లో అరంగేట్రం చేసిన వైభవ్.. ఎదుర్కొన్న తొలి బంతినే సిక్సర్‌గా మలిచి రికార్డులకెక్కాడు.ఆడిన తొలి మ్యాచ్‌లో 20 బంతులు ఎదుర్కొని 34 పరుగులు సాధించిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. చివరగా గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ముప్పై ఐదు బంతుల్లోనే శతక్కొట్టి సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఈ నేపథ్యంలో వైభవ్‌పై ప్రశంసలు కురిపిస్తూనే.. ఇక ముందు మరింత జాగ్రత్తగా ఆడాలంటూ రవిశాస్త్రి హెచ్చరించాడు. In case you missed it… 🍿🔥pic.twitter.com/rOXwTuxgyX— Rajasthan Royals (@rajasthanroyals) April 29, 2025

IPL 2025: రసవత్తరంగా సాగుతున్న ప్లే ఆఫ్స్ రేసు.. ఏ క్షణంలో ఏమైనా జరగవచ్చు..!
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ప్లే ఆఫ్స్ రేసు రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటివరకు ఏ జట్టుకు అధికారికంగా ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు కాలేదు. ఏ జట్టు అధికారికంగా రేసు నుంచి నిష్క్రమించలేదు. ఈ రేసులో ఆర్సీబీ అన్ని జట్ల కంటే కాస్త ముందుంది.ఆ జట్టు ఇప్పటివరకు (ఏప్రిల్ 29) ఆడిన 10 మ్యాచ్‌ల్లో 7 విజయాలు సాధించి టేబుల్ టాపర్‌గా కొనసాగుతోంది. పేరుకు ఆర్సీబీ టేబుల్ టాపర్‌గా ఉన్నా.. ఆ జట్టు కూడా ప్లే ఆఫ్స్ బెర్త్ కోసం మిగిలిన తొమ్మిది జట్లతో పోటీపడాల్సిందే.ప్రస్తుతం ప్లే ఆఫ్స్ రేసులో ఆర్సీబీ సహా మరో ఆరు జట్లు ముందు వరుసలో ఉన్నాయి. సీజన్ ప్రారంభంలో వరుస పరాజయాలతో సతమతమైన ముంబై ఇండియన్స్ ఆతర్వాత అనూహ్య విజయాలతో ప్లే ఆఫ్స్ రేసులో రెండో స్థానానికి దూసుకొచ్చింది. ఇప్పటివరకు ఆ జట్టు ఆడిన 10 మ్యాచ్‌ల్లో 6 విజయాలు సాధించి, ఆర్సీబీ తర్వాత పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది.ప్రస్తుతం ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తలో 12 పాయింట్లతో ప్లే ఆఫ్స్ బెర్త్ కోసం హోరాహోరీగా పోరాడుతున్నాయి. గుజరాత్ 9 మ్యాచ్‌ల్లో 6 విజయాలతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉండగా.. ఢిల్లీ పదింట ఆరు విజయాలతో నాలుగో స్థానంలో ఉంది.ప్లే ఆఫ్స్ బెర్త్ కోసం ఈ నాలుగు జట్లతో పాటు మరో రెండు జట్లు కూడా ప్రధానంగా పోటీపడుతున్నాయి. పంజాబ్ ఆడిన 9 మ్యాచ్‌ల్లో 5 విజయాలతో పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది. కేకేఆర్‌తో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో పంజాబ్‌కు ఓ పాయింట్ (మరో పాయింట్ కేకేఆర్‌కు) లభించింది. ప్లే ఆఫ్స్ రేసులో చివరికి ఈ ఒక్క పాయింట్ చాలా కీలకంగా మారే అవకాశం ఉంది.పై ఏడు జట్లతో పాటు ప్లే ఆఫ్స్ రేసులో ప్రధానంగా ఉన్న మరో రెండు జట్లు లక్నో, కేకేఆర్. లక్నో ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్‌ల్లో 5 విజయాలు సాధించి, పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంది. ఈ జట్టు ఖాతాలో 10 పాయింట్లు ఉన్నాయి. లక్నో ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే రన్‌రేట్‌ను భారీగా మెరుగుపర్చుకోవాలి. ప్రస్తుతం పోటీలో ఉన్న ఏడు జట్లలో ఈ ఒక్క జట్టు రన్‌రేట్ మాత్రమే మైనస్‌లో (-0.325) ఉంది.నిన్న ఢిల్లీపై అనూహ్య విజయంతో కేకేఆర్ కూడా ప్లే ఆఫ్స్ రేసులోకి వచ్చింది. ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్‌ల్లో 4 విజయాలతో పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉంది. పంజాబ్‌తో మ్యాచ్ రద్దు కావడంతో లభించిన పాయింట్‌తో కేకేఆర్ పాయింట్ల సంఖ్య 9కి చేరింది. ప్రస్తుతానికి పైన పేర్కొన్న ఏడు జట్ల మధ్య నాలుగు ప్లే ఆఫ్స్ బెర్త్‌ల కోసం ప్రధానంగా పోటీ జరుగుతుంది. అయితే పాయింట్ల పట్టికలో చివరి మూడు స్థానాల్లో ఉన్న రాజస్థాన్, సన్‌రైజర్స్, సీఎస్కే అవకాశాలను కూడా కొట్టి పారేయడానికి వీల్లేదు.రాజస్థాన్ తాజాగా గుజరాత్ టైటాన్స్‌పై సంచలన విజయం సాధించి ప్లే ఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్‌ల్లో 3 విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో (6 పాయింట్లు) ఉంది.ప్లే ఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకున్న మరో జట్టు సన్‌రైజర్స్. ఈ జట్టు ఇప్పటివరకు ఆడిన 9 మ్యాచ్‌ల్లో 3 విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో ఉంది. రాజస్థాన్‌తో పోలిస్తే సన్‌రైజర్స్‌కు ప్లే ఆఫ్స్ బెర్త్ సాధించే అవకాశాలు కాస్త మెరుగ్గా ఉన్నాయి. ఇప్పటివరకు రాజస్థాన్ 10 మ్యాచ్‌లు ఆడగా.. సన్‌రైజర్స్ తొమ్మిదే ఆడింది. ఈ సీజన్లో అధికారికంగా ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించకపోయినా , ఏ మాత్రం అవకాశం లేని ఏకైక జట్టు సీఎస్కే . సీఎస్కే ఇప్పటివరకు ఆడిన 9 మ్యాచ్‌ల్లో రెండే విజయాలతో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. ఆ జట్టు తదుపరి ఆడాల్సిన 5 మ్యాచ్‌ల్లో గెలిచినా, ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ప్లే ఆఫ్స్ రేసులో ఉండదు.

అతడిని బ్యాన్ చేయండి: టీమిండియా స్టార్‌పై నెటిజన్ల ఆగ్రహం
టీమిండియా స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ (Kuldeep Yadav)పై నెటిజన్లు మండిపడుతున్నారు. అనుచితంగా ప్రవర్తించినందుకు అతడిపై నిషేధం విధించాలంటూ సోషల్ మీడియా వేదికగా భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI)కి విజ్ఞప్తి చేస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే..?!ఐపీఎల్-2025 (IPL 2025)లో కుల్దీప్ యాదవ్ ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు పది మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న అతడు 12 వికెట్లు తీశాడు. ప్రదర్శన పరంగా ఫర్వాలేదనిపిస్తున్నా.. కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)తో మంగళవారం నాటి మ్యాచ్‌లో కుల్దీప్ ప్రవర్తించిన తీరు విమర్శలకు దారితీసింది.204 పరుగులుఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆతిథ్య జట్టు.. కేకేఆర్‌ను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఈ క్రమంలో రహానే సేన నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 204 పరుగుల స్కోరు సాధించింది.భారీ లక్ష్య ఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ ఆఖరి వరకు పోరాడి పద్నాలుగు పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఇక మ్యాచ్ ముగిసిన తర్వాత ఆనవాయితీ ప్రకారం ఇరుజట్ల ఆటగాళ్ల కరచాలనం చేసుకున్న తర్వాత.. కొంత మంది విడివిడిగా మాట్లాడుకున్నారు.రింకూ చెంపపై కొట్టిన కుల్దీప్ఈ నేపథ్యంలో కుల్దీప్ యాదవ్ (ఢిల్లీ)- రింకూ సింగ్ (కేకేఆర్)తో సరదాగా సంభాషించాడు. ఇద్దరూ కలిసి జోకులు వేసుకుంటూ నవ్వులు చిందించారు. కానీ అంతలోనే కుల్దీప్ రింకూ చెంపపై కొట్టాడు. దీంతో రింకూ కాస్త ఆశ్చర్యానికి లోనయ్యాడు.అయితే, మరోసారి కుల్దీప్ అదే పని చేయడంతో రింకూ ముఖంలో రంగులు మారిపోయాయి. కుల్దీప్ చర్య అతడికి ఎంతమాత్రం నచ్చలేదని అతడి ఎక్స్ప్రెషన్ను బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.Yo kuldeep watch it pic.twitter.com/z2gp4PK3OY— irate lobster🦞 (@rajadityax) April 29, 2025అతడి నిబ్యాన్ చేయండిఈ నేపథ్యంలో కుల్దీప్ యాదవ్ తీరుపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంత చొరవ ఉన్నప్పటికీ లైవ్‌లో ఉన్నప్పుడు సహచర ఆటగాడి పట్ల ఇలా ప్రవర్తించడం సరికాదంటూ హితవు పలుకుతున్నారు. ఇలాంటి వాళ్లను ఉపేక్షించకూడదని.. ఒకటీ, రెండు మ్యాచ్‌లలో ఆడకుండా నిషేధం విధిస్తేనే దారిలోకి వస్తారంటూ బీసీసీఐని ట్యాగ్ చేస్తున్నారు.ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌లో కుల్దీప్ యాదవ్ మూడు ఓవర్ల బౌలింగ్‌లో 27 పరుగులు ఇచ్చి.. వికెట్లు ఏమీ తీయలేకపోయాడు. మరోవైపు రింకూ కేకేఆర్ తరఫున ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి.. 25 బంతుల్లో 36 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో మూడు ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి.ఐపీఎల్-2025: ఢిల్లీ వర్సెస్ కేకేఆర్👉కేకేఆర్ స్కోరు: 204/9 (20)👉ఢిల్లీ స్కోరు: 190/9 (20)👉ఫలితం: ఢిల్లీపై 14 పరుగుల తేడాతో గెలిచిన కేకేఆర్👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: సునిల్ నరైన్ (16 బంతుల్లో 27 రన్స్, 4 ఓవర్లలో 29 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు).చదవండి: సూర్యవంశీపై శుబ్‌మన్ గిల్ కామెంట్స్.. జడేజా కౌంటర్The @KKRiders pulled back things in a fitting way 🥳And it was all fueled by the brilliance of Sunil Narine 😎Scorecard ▶ https://t.co/saNudbWaXT #TATAIPL | #DCvKKR pic.twitter.com/zp5CDNEJsw— IndianPremierLeague (@IPL) April 29, 2025

DC VS KKR: చరిత్ర సృష్టించిన సునీల్ నరైన్
పొట్టి క్రికెట్లో విండీస్ దిగ్గజ ఆల్‌రౌండర్ సునీల్ నరైన్ మరో భారీ రికార్డును సొంతం చేసుకున్నాడు. ఈ ఫార్మాట్లో ఓ జట్టు తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. ఈ రికార్డును నరైన్ ఇంగ్లండ్ బౌలర్ సమిత్ పటేల్‌తో షేర్ చేసుకున్నాడు. సమిత్ ఇంగ్లండ్ దేశవాలీ క్రికెట్లో నాటింగ్హమ్షైర్ తరఫున 208 వికెట్లు తీయగా.. నరైన్ ఐపీఎల్లో కేకేఆర్ తరఫున అన్నే వికెట్లు తీశాడు. ఐపీఎల్ 2025లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో నరైన్ ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో నరైన్ 3 కీలక వికెట్లు తీసి కేకేఆర్‌ను గెలిపించాడు. ఈ మ్యాచ్‌లో నరైన్ బ్యాటర్‌గా, ఫీల్డర్‌గా కూడా రాణించాడు. తొలుత బ్యాటింగ్‌లో మెరుపు ఇన్నింగ్స్ (16 బంతుల్లో 27; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆడి, ఆతర్వాత ఫీల్డింగ్‌లో ఓ క్యాచ్ సహా, ఓ అద్భుతమైన రనౌట్ చేశాడు. ఈ మ్యాచ్‌లో ప్రదర్శనకు గానూ నరైన్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.టీ20ల్లో ఓ జట్టు తరఫున అత్యధిక వికెట్లు తీసిన టాప్-5 బౌలర్లుసునీల్ నరైన్- 208 (కేకేఆర్)సమిత్ పటేల్- 208 (నాటింగ్హమ్షైర్)క్రిస్ వుడ్- 199 (హ్యాంప్‌షైర్)లసిత్ మలింగ- 195 (ముంబై ఇండియన్స్)డేవిడ్ పెయిన్- 193 (గ్లోసెస్టర్‌షైర్)కాగా, నిన్న (ఏప్రిల్ 29) అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా మ్యాచ్‌లో సునీల్ నరైన్ ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టడంతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై కేకేఆర్ 14 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో కేకేఆర్‌కు సుడిగాలి ప్రారంభం లభించినప్పటికీ ఆతర్వాత చప్పబడి నామమాత్రపు స్కోర్‌తోనే సరిపెట్టుకుంది. కేకేఆర్ ఇన్నింగ్స్‌లో గుర్భాజ్ 26, నరైన్ 27, రహానే 26, రఘువంశీ 44, వెంకటేశ్ అయ్యర్ 7, రింకూ సింగ్ 36, రసెల్ 17, పావెల్ 5, అనుకూల్ రాయ్ 0 పరుగులకు ఔటయ్యారు. ఢిల్లీ బౌలర్లలో స్టార్క్ 3, విప్రాజ్, అక్షర్ తలో 2, చమీరా ఓ వికెట్ పడగొట్టారు.అనంతరం 205 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఢిల్లీ ఓ దశలో సునాయాసంగా గెలిచేలా కనిపించినప్పటికీ.. నరైన్ మ్యాజిక్ చేయడంతో నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 190 పరుగులకే పరిమితమై ఓటమిపాలైంది. డుప్లెసిస్ (62), అక్షర్ పటేల్ (43), విప్రాజ్ నిగమ్ (38) పోరాడినా ఫలితం లేకుండా పోయింది. ఇన్నింగ్స్ 14వ ఓవర్లో నరైన్ అక్షర్, స్టబ్స్‌కు ఔట్ చేసి ఢిల్లీని దెబ్బకొట్టాడు. ఆ మరుసటి ఓవర్లోనే డుప్లెసిస్‌కు కూడా పెవిలియన్‌కు పంపి గెలుపు బాటలో నడుస్తున్న ఢిల్లీని ఒక్కసారిగా డిఫెన్స్‌లో పడేశాడు. ఈ దశలో వరుణ్ చక్రవర్తి కూడా చెలరేగి అశుతోష్ శర్మ (7), స్టార్క్‌ను (0) ఔట్ చేశాడు. ఆఖర్లో విప్రాజ్ ఢిల్లీని గెలిపించే ప్రయత్నం చేసినప్పటికీ రసెల్ ఓ అద్బుతమైన బంతితో అతన్ని క్లీన్ బౌల్డ్ చేశాడు. కేకేఆర్ బౌలర్లలో నరైన్ 3, వరుణ్ 2, అనుకూల్ రాయ్, వైభవ్ అరోరా, రసెల్ తలో వికెట్ తీశారు. ఈ గెలుపుతో కేకేఆర్ ప్లే ఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఢిల్లీ వరుసగా రెండో పరాజయాన్ని మూటగట్టుకుని ప్లే ఆఫ్స్ అవకాశాలను చేజేతులా సంక్లిష్టం చేసుకుంది.
బిజినెస్

భారత్‌లో ఫాక్స్‌కాన్ ఆదాయం రూ.1.7 లక్షల కోట్లు
తైవాన్‌కి చెందిన ఎల్రక్టానిక్స్ దిగ్గజం ఫాక్స్‌కాన్ భారత విభాగం ఆదాయం గత ఆర్థిక సంవత్సరంలో రెట్టింపై 20 బిలియన్ డాలర్లకు (సుమారు రూ.1.7 లక్షల కోట్లు) చేరినట్లు సమాచారం. ఐఫోన్ విక్రయాలు గణనీయంగా పెరగడం ఇందుకు కారణమని సంబంధిత వర్గాలు తెలిపాయి. అలాగే, ఉద్యోగుల సంఖ్య కూడా 65 శాతం పెరిగి సుమారు 80,000కు చేరినట్లు పరిశ్రమ, ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.చైనాపై టారిఫ్‌ల కారణంగా అమెరికా మార్కెట్ కోసం ఐఫోన్లన్నింటినీ భారత్‌లోనే తయారు చేయించుకోవాలని యాపిల్ భావిస్తున్న నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఫాక్స్‌కాన్ ఆదాయం అనేక రెట్లు పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నాయి. ఐఫోన్లను అత్యధికంగా తయారు చేసే ఫాక్స్‌కాన్, చైనాకు వెలుపల రెండో అతి పెద్ద ప్లాంటును బెంగళూరులో సుమారు రూ.25,000 కోట్లతో ఏర్పాటు చేసే ప్రయత్నాల్లో ఉంది.ఇండియాలో తమిళనాడులోని శ్రీపెరంబుదూరులో ఫాక్స్‌కాన్ ప్రధాన కేంద్రం ఉంది. ఇక్కడ ఐఫోన్ అసెంబ్లింగ్ ప్లాంట్‌ను నిర్వహిస్తుంది. ఈ ప్లాంట్ 2017లో ఐఫోన్ల ఉత్పత్తిని ప్రారంభించింది. 2023లో ఐఫోన్ 15ను అసెంబుల్ చేసింది. ఇది తాజా ఐఫోన్ మోడళ్లలో భారతదేశం భాగస్వామ్యాన్ని సూచిస్తుంది. 2025 చివరి నాటికి ఐప్యాడ్ అసెంబ్లింగ్ ప్రారంభించాలని యోచిస్తోంది. చైనా నుంచి దిగుమతి చేసుకునే విడిభాగాలపై ఆధారపడటాన్ని తగ్గించడమే లక్ష్యంగా చెన్నై సమీపంలో స్మార్ట్‌ఫోన్ డిస్ప్లే మాడ్యూల్ అసెంబ్లింగ్ యూనిట్లో కంపెనీ పెట్టుబడులు పెట్టింది.ఇదీ చదవండి: మళ్లీ ఐపీవోల సందడి..!బెంగళూరు సమీపంలోని దేవనహళ్లిలో ఫాక్స్‌కాన్ 2.5 బిలియన్ డాలర్ల విలువైన ‘ప్రాజెక్ట్ ఎలిఫెంట్’ ఐఫోన్ ఫ్యాక్టరీని నిర్మిస్తోంది. ఏటా 20 మిలియన్ల ఐఫోన్లను ఉత్పత్తి చేయడంతో పాటు 40,000 ఉద్యోగాలను సృష్టించనుంది.

మళ్లీ ఐపీవోల సందడి..!
టారిఫ్లపరమైన అనిశ్చితితో ఈక్విటీ మార్కెట్లలో ఒడిదుడుకులు నెలకొన్నప్పటికీ మరిన్ని కంపెనీలు పబ్లిక్ ఇష్యూ సన్నాహాలు చేసుకుంటున్నాయి. తాజాగా రియల్టీ దిగ్గజం ప్రెస్టీజ్ ఎస్టేట్స్ ప్రాజెక్ట్స్‌లో భాగమైన ప్రెస్టీజ్ హాస్పిటాలిటీ వెంచర్స్, కెనరా రోబెకో అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ, కెనరా హెచ్ఎస్బీసీ లైఫ్ ఇన్సూరెన్స్, అర్బన్ కంపెనీ తమ ముసాయిదా పత్రాలను (డీఆర్‌హెచ్‌పీ) మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి సమరి్పంచాయి. డీఆర్‌హెచ్‌పీ ప్రకారం ప్రెస్టీజ్ హాస్పిటాలిటీ వెంచర్స్, పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ. 1,700 కోట్లు సమీకరించనుంది. ఇందులో రూ. 1,000 కోట్ల వరకు విలువ చేసే షేర్లను ఆఫర్ ఫర్ సేల్ విధానంలో ప్రమోటర్ సెల్లింగ్ షేర్‌హోల్డరయిన ప్రెస్టీజ్ ఎస్టేట్స్ ప్రాజెక్ట్స్ విక్రయించనుంది. దేశీయంగా దిగ్గజ రియల్ ఎస్టేట్ డెవలపర్లలో ఒకటైన ప్రెస్టీజ్ ఎస్టేట్స్ .. బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. హౌసింగ్, ఆఫీస్, రిటైల్, హోటల్ ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తోంది. 2024 డిసెంబర్ 31 నాటికి కంపెనీ పోర్ట్‌ఫోలియోలో 1,445 గదులతో ఏడు హోటల్స్ ఉన్నాయి. వీటిలో 1,255 గదుల ప్రాజెక్టులు ఇప్పటికే నిర్వహణలో ఉండగా, 190 గదుల ప్రాపర్టీ ప్రస్తుతం రెనోవేషన్‌లో ఉంది. అదనంగా 951 గదులకు సంబంధించి మూడు హాస్పిటాలిటీ అసెట్స్ నిర్మాణం కొనసాగుతోంది. ఓఎఫ్ఎస్గా కెనరా రోబెకో..కెనరా రోబెకో అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ కూడా ఐపీవోకి సంబంధించి ప్రాస్పెక్టస్‌ను సెబీకి సమర్పించింది. ఇది పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) రూపంలో ఉండనుంది. ప్రమోటర్ సంస్థలు కెనరా బ్యాంక్, ఓరిక్స్ కార్పొరేషన్ (గతంలో రోబెకో గ్రూప్ ఎన్వీ) వరుసగా 2.59 కోట్లు, 2.39 కోట్ల షేర్లను విక్రయించనున్నాయి. ఇందులో కెనరా బ్యాంకునకు 51 శాతం వాటాలు ఉండగా, మిగతావి ఓరిక్స్ కార్పొరేషన్‌కి ఉన్నాయి. పూర్తిగా ఓఎఫ్ఎస్ రూపంలో ఉండటం వల్ల ఇష్యూ ద్వారా సమీకరించే నిధులేవీ కంపెనీకి దక్కవు. కెనరా రోబెకో అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ 1993లో ఏర్పాటైంది. ప్రధానంగా మ్యుచువల్ ఫండ్స్ నిర్వహణ, దేశీ ఈక్విటీలకు సంబంధించి పెట్టుబడుల సలహాల సేవలు అందిస్తోంది. గతేడాది డిసెంబర్ 31 నాటికి 12 ఈక్విటీ స్కీములు, 10 డెట్ పథకాలు, మూడు హైబ్రిడ్ స్కీములు కలిపి మొత్తం 25 స్కీములను నిర్వహిస్తోంది. ఈ ఇష్యూకి ఎస్బీఐ క్యాపిటల్ మార్కెట్స్, యాక్సిస్ క్యాపిటల్, జేఎం ఫైనాన్షియల్ సంస్థలు బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్లుగా వ్యవహరిస్తున్నాయి. కెనరా హెచ్ఎస్బీసీ లైఫ్ లిస్టింగ్ బాటకెనరా హెచ్ఎస్బీసీ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. ఇటీవలే కెనరా రొబెకో అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ(ఏఎంసీ) ఐపీవో చేపట్టేందుకు సెబీకి దరఖాస్తు చేసిన సంగతి తెలిసిందే. కెనరా రొబెకో ఏఎంసీ తరహాలోనే కెనరా హెచ్ఎస్బీసీ లైఫ్ సైతం ఆఫర్ ఫర్ సేల్ ద్వారా ప్రమోటర్లు, ప్రస్తుత ఇన్వెస్టర్ 23.75 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయానికి ఉంచనున్నారు. వీటిలో కెనరా బ్యాంక్ 13.77 కోట్ల షేర్లు, హెచ్ఎస్బీసీ ఇన్సూరెన్స్(ఆసియా పసిఫిక్) హోల్డింగ్స్ 47.5 లక్షల షేర్లు చొప్పున ఆఫర్ చేస్తున్నాయి. ఈ బాటలో పీఎస్‌యూ పంజాబ్ నేషనల్ బ్యాంక్ 9.5 కోట్ల షేర్లు విక్రయించనుంది. కెనరా హెచ్ఎస్బీసీ లైఫ్‌ను 51 శాతం వాటాతో కెనరా బ్యాంక్, 26 శాతం వాటాతో హెచ్ఎస్బీసీ ఇన్సూరెన్స్(ఆసియా పసిఫిక్) హోల్డింగ్స్ భాగస్వామ్య సంస్థ(జేవీ)గా 2007లో ఏర్పాటు చేశాయి.అర్బన్ కంపెనీ.. రూ.1,900 కోట్లుయాప్ ఆధారిత బ్యూటీ, హోమ్ కేర్ సరీ్వసుల సంస్థ అర్బన్ కంపెనీ తాజాగా పబ్లిక్ ఇష్యూకి రానుంది. ఇందుకు సంబంధించి మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా పత్రాలు (డీఆర్‌హెచ్‌పీ) దాఖలు చేసింది. ఈ ఇష్యూ ద్వారా కంపెనీ రూ. 1,900 కోట్లు సమీకరించనుంది. ఇందులో భాగంగా రూ. 429 కోట్ల విలువ చేసే షేర్లను తాజాగా జారీ చేయనుండగా, ఆఫర్ ఫర్ సేల్ విధానంలో ప్రస్తుత ఇన్వెస్టర్లు రూ. 1,471 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించనున్నారు. ఇందులో యాక్సెల్ ఇండియా, ఎలివేషన్ క్యాపిటల్, బెస్సీమర్ ఇండియా క్యాపిటల్ హోల్డింగ్స్ టూ, ఇంటర్నెట్ ఫండ్ ఫైవ్, వీవైసీ11 మొదలైనవి ఉన్నాయి. ఐపీవో ద్వారా సమీకరించే నిధుల్లో రూ. 190 కోట్లను కొత్త టెక్నాలజీ, క్లౌడ్ మౌలిక సదుపాయాలపై, రూ. 70 కోట్ల మొత్తాన్ని ఆఫీసుల లీజుల చెల్లింపుల కోసం, రూ. 80 కోట్లు మార్కెటింగ్ కార్యకలాపాల కోసం, మిగతాది కార్పొరేట్ అవసరాల కోసం కంపెనీ వినియోగించుకోనుంది.ఇదీ చదవండి: మొక్కుబడిగా ఏసీ కొనవద్దు..ట్రావెల్ ఫుడ్... రూ. 2,000 కోట్ల సమీకరణకు రెడీక్విక్ సర్వీసు రెస్టారెంట్లు(క్యూఎస్ఆర్), వివిధ విమానాశ్రయాలలో లాంజ్ బిజినెస్ నిర్వహించే ట్రావెల్ ఫుడ్ సరీ్వసెస్ పబ్లిక్ ఇష్యూకి రానుంది. ఇందుకు తాజాగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ గ్రీన్‌సిగ్నల్ ఇచి్చంది. ఐపీవోలో భాగంగా కంపెనీ రూ. 2,000 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్ కపూర్ కుటుంబ ట్రస్ట్ విక్రయానికి ఉంచనుంది. వెరసి ఐపీవో ద్వారా కంపెనీకి ఎలాంటి నిధులు లభించబోవు. వీటిని ప్రమోటర్లు అందుకోనున్నారు. కాగా.. 2024 డిసెంబర్లో ట్రావెల్ ఫుడ్ సెబీకి ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. 2009లో తొలి క్యూఎస్ఆర్ ఔట్లెట్ ప్రారంభించిన కంపెనీ ప్రస్తుతం దేశీయంగా హైదరాబాద్, ముంబై, కోల్కతాసహా 14 ఎయిర్‌పోర్టులలో విస్తరించింది. మలేసియాలోనూ మూడు విమానాశ్రయాలలో సరీ్వసులు అందిస్తోంది. సొంత బ్రాండ్లతోపాటు.. దేశ, విదేశీ బ్రాండ్లతో విభిన్న పోర్ట్‌ఫోలియోను కలిగి ఉంది. లండన్‌లో లిస్టయిన ఎస్ఎస్పీ గ్రూప్, కపూర్ కుటుంబ ట్రస్ట్ కంపెనీని ఏర్పాటు చేశాయి.

అక్షయ తృతీయ.. రూ.16,000 కోట్ల అమ్మకాలు
న్యూఢిల్లీ: అక్షయ తృతీయ రోజున (నేడు) దేశవ్యాప్తంగా రూ.16,000 కోట్ల విలువైన ఆభరణాల అమ్మకాలు నమోదు కావొచ్చని ఆల్ ఇండియా జ్యుయలర్స్ అండ్ గోల్డ్‌స్మిత్ ఫెడరేషన్ అంచనా వేస్తోంది. ధరలు గణనీయంగా పెరిగిపోయిన నేపథ్యంలో బంగారం, వెండి కొనుగోళ్లలో మిశ్రమ ధోరణి ఉంటుందని అఖిల భారత రిటైల్ వర్తకుల సమాఖ్య (సీఏఐటీ) అంచనా వేసింది. ప్రస్తుతం బంగారం ధర 10 గ్రాములకు రూ.లక్ష స్థాయిలో ఉండగా, వెండి ధర సైతం కిలోకి రూ.లక్ష సమీపంలో ఉండడం గమనార్హం. గతేడాది అక్షయ తృతీయ నుంచి బంగారం ధర చెప్పుకోతగ్గ స్థాయిలో పెరిగిపోవడం తెలిసిందే. ‘‘సాధారణంగా అక్షయ తృతీయ రోజున కొనుగోళ్లు పెరుగుతుంటాయి. ధరలు పెరిగిపోవడం ఈ ఏడాది వినియోగ డిమాండ్‌పై ప్రభావం చూపించొచ్చు. అక్షయ తృతీయ రోజున 12 టన్నుల బంగారం (రూ.12,000 కోట్లు), 400 టన్నుల వెండి (రూ.4,000 కోట్లు) కలిపి మొత్తం మీద రూ.16,000 కోట్ల అమ్మకాలు ఉండొచ్చని అంచనా’’అని ఆల్ ఇండియా జ్యుయలర్స్ అండ్ గోల్డ్‌స్మిత్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ పంకజ్ అరోరా తెలిపారు. కస్టమర్ల కొనుగోళ్ల సెంటిమెంట్ కొంత తగ్గొచ్చన్నారు.అంతర్జాతీయంగా భౌగోళిక, వాణిజ్య ఉద్రిక్తతల నేపథ్యంలో సురక్షిత సాధనంగా బంగారంలో పెట్టుబడులు పెరిగిపోవడం ధరల ర్యాలీకి కారణమని తెలిసిందే. ప్రస్తుతం వివాహాల సీజన్ నడుస్తుండడం జ్యుయలరీ డిమాండ్ పడిపోకుండా సాయపడుతున్నట్టు సీఏఐటీ నేషనల్ ప్రెసిడెంట్ బీసీ భార్తియా తెలిపారు. అక్షయ తృతీయ సందర్భంగా అమ్మకాలు పెంచుకునేందుకు ప్రముఖ జ్యయలరీ సంస్థలు ధరలో, తయారీ చార్జీల్లో తగ్గింపును ఇప్పటికే ప్రకటించాయి.

సోలార్ కాంట్రాక్టుల్లో అవకతవకలేమీ జరగలేదు
న్యూఢిల్లీ: సౌర విద్యుత్ కాంట్రాక్టులు దక్కించుకునే విషయంలో తాము ఎలాంటి అవకతవకలకు పాల్పడలేదంటూ స్వతంత్ర దర్యాప్తులో తేలిందని అదానీ గ్రీన్ వెల్లడించింది. సౌర విద్యుత్ కాంట్రాక్టుల కోసం భారత్‌లో ప్రభుత్వ వర్గాలకు లంచాలిచ్చారని, అమెరికన్ ఇన్వెస్టర్ల నుంచి నిధులు సమీకరించే క్రమంలో ఆ విషయాన్ని దాచిపెట్టారని అదానీ గ్రూప్ చైర్మన్ గౌతం అదానీ, ఆయన సోదరుడి కుమారుడు సాగర్ అదానీ, ఎండీ వినీత్ జైన్‌లపై అమెరికాలో అభియోగాలు మోపారు. అదానీ గ్రూప్ ఈ ఆరోపణలను ఖండించింది. స్వతంత్ర దర్యాప్తులో అవకతవకలు జరగలేదని వెల్లడైనట్లు అదానీ గ్రీన్ పేర్కొంది.
ఫ్యామిలీ

అందంలోనే కాదు.. చదువులోనూ అదుర్స్
చార్టర్డ్ అకౌంటెంట్ అవడం అంటే మామూలు విషయం కాదు. దేశంలోనే అత్యంత క్లిష్టమైన పరీక్షల్లో ఒకటైన సీఏ ఎగ్జామ్‌లో పాసవడం కోసం సంవత్సరాల తరబడి ప్రిపేర్ అవుతుంటారు. సీఏ పరీక్షల్లో నెగ్గేందుకు ఏళ్లబడి పుస్తకాలతో కుస్తీ పట్టేవారెందరినో మనం చూసుంటాం. అయితే నందిని అగర్వాల్ అలా కాదు. అత్యంత చిన్నవయసులోనే సీఏ ఫైనల్స్ క్లియర్ చేయడమే కాదు, ఏకంగా ఆలిండియా టాపర్‌గా నిలిచి ప్రపంచ రికార్డు సాధించింది. ఇది జరిగి నాలుగేళ్లయింది. తాను ఎంచుకున్న రంగంలోనే కెరీర్ కొనసాగిస్తూ డిజిటల్ కంటెంట్ క్రియేటర్‌గానూ రాణిస్తోంది నందిని.అన్నయ్యకు క్లాస్మేట్!మధ్యప్రదేశ్‌లోని మొరెనా పట్టణానికి చెందిన నందిని అగర్వాల్ (Nandini Agrawal) యంగెస్ట్ ఫిమేల్ చార్టర్డ్ అకౌంటెంట్‌గా 2021లో గిన్నీస్ రికార్డు సృష్టించింది. ఆ ఏడాది జూలై జరిగిన సీఏ (న్యూ) పరీక్షల్లో ఫస్ట్ ర్యాంక్‌తో ఆలిండియా టాపర్‌గా నిలిచింది. 19 ఏళ్ల 8 నెలల 18 రోజుల వయసులో ఆమె ఈ ఘనత సాధించినట్టు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ వెబ్సైట్ వెల్లడించింది. 2001, అక్టోబర్ 18న నందిని జన్మించింది. చదువులో ఎంతో చురుగ్గా ఉండే నందిని.. రెండు క్లాసులు జంప్ చేసి తన అన్నయ్య సచిన్‌కు క్లాస్మేట్గా మారింది. చెల్లెలితో పాటు సీఏ ఫైనల్స్ రాసిన సచిన్‌కు 18వ ర్యాంక్ రావడం గమనార్హం. ఇక సీఏ ఇంటర్‌ను 16 ఏళ్ల వయసులో పూర్తి చేసింది నందిని. ఆలిండియా 31వ ర్యాంక్ సాధించి సత్తా చాటింది.వరల్డ్ ఫేమస్ కంపెనీల్లో జాబ్నందిని ప్రస్తుతం ప్రైవేటు ఈక్విటీ ఎనలిస్ట్‌గా పనిచేస్తున్నారు. అంతకుముందు వరల్డ్ ఫేమస్ కార్పొరేట్ కంపెనీల్లో పనిచేశారు. పీడబ్ల్యూసీ కంపెనీలో ఆర్టికల్ ట్రైయినీగా కెరీర్ మొదలు పెట్టిన ఈ యంగ్ టాలెంట్ గాళ్ అంచెలంచెలుగా ఎదిగారు. స్టాట్యూటరీ ఆడిట్, గ్రూప్ రిపోర్టింగ్, రెఫర్డ్ రిపోర్టింగ్, IFRS అసైన్మెంట్లు, టాక్స్ ఆడిట్, ఫోరెన్సిక్ ఆడిట్లలో తనకు మూడేళ్ల అనుభవం ఉందని తన లింక్డ్ఇన్ బయోలో రాసుకున్నారు నందిని. బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (BCG)లో ఒకటిన్నర సంవత్సరాలు అసోసియేట్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్‌గా పనిచేసినట్టు వెల్లడించారు. BCGలో కీలకమైన G20 టీమ్‌లోనూ ఉన్నట్టు పేర్కొన్నారు.చదవండి: కళ్ల తప్పిన బైండ్ల బతుకులుసోషల్ మీడియాలోనూ సంచలనండిజిటల్ కంటెంట్ క్రియేటర్‌గా తనదైన స్టయిల్లో దూసుకెళుతోంది నందిని అగర్వాల్. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెను 74 వేల మంది ఫాలో అవుతున్నారు. యూట్యూబ్‌లోనూ ఆమెకు 2 లక్షలకు పైగా సబ్‌స్కైబర్లు ఉన్నారు. సీఏ ఎగ్జామ్స్ పరీక్షల సంబంధించిన స్టడీ టిప్స్ వీడియోలను యూట్యూబ్‌లో ఆమె షేర్ చేస్తుంటుంది.

మండే ఎండలు : కిడ్నీలో రాళ్లు, పెరుగుతున్న కేసులు, బీ అలర్ట్!
హైదరాబాద్ తెలంగాణలో వేసవి ముదురుతోంది. ఎండలు ఠారెత్తిస్తున్నాయి. అదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా ఈ సీజన్ల కిడ్నీలలో రాళ్లు ఏర్పడే కేసులు రెండు నుంచి రెండున్నర రెట్లు పెరిగాయని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ (ఏఐఎన్‌యూ) తన నివేదికలో తెలిపింది. డీహైడ్రేషన్, ఆహారపు అలవాట్లు సరిగా లేకపోవడం, విపరీతంగా ఎండల్లో తిరగడం వల్ల రోజుకు సుమారు 300 నుంచి 400 మంది రోగులు కిడ్నీలో రాళ్ల సమస్యతో రావడంతో వారికి ఏఐఎన్‌యూల చికిత్సలు చేస్తున్నారు. వేసవి అంటేనే “స్టోన్ సీజన్” అంటారు. ఈ కాలంలో ముఖ్యంగా కిడ్నీలకు చాలా ప్రమాదం ఉంటుంది. ప్రధానంగా శరీరంలో నీరు ఆవిరి అయిపోవడం, ఉప్పు ఎక్కువగా తినడం, తగినంత నీరు తీసుకోకపోవడం వంటి కారణాల వల్ల వేసవిలో కిడ్నీలలో రాళ్లు ఎక్కువగా ఏర్పడతాయి.ప్రధానాంశాలు: రోజుకు సగటున 300 నుంచి 400 వరకు కిడ్నీలో రాళ్ల కేసులు వస్తున్నాయి. ఇటీవలి కాలంలో ఇది బాగా ఎక్కువ. రాష్ట్ర వ్యాప్తంగా శీతాకాలంతో పోలిస్తే ఈ బాధితుల సంఖ్య రెట్టింపు దాటిపోయింది. జంక్ ఫుడ్ తినడం, ఎక్కువగా కదలకపోవడం, తగినంత నీరు తాగకపోవడంతో పిల్లలు, యువతలో ఈ సమస్య ఎక్కువవుతోంది. 10-17 సంవత్సరాల మధ్య పిల్లల్ల రాళ్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. పాఠశాలలో ఉన్నప్పుడు నీళ్లు తాగకపోవడం, స్నాక్స్ ప్యాకెట్లు కొని తినడం, కూల్ డ్రింకులు తాగడం దీనికి కారణం. పురుషులతో పోలిస్తే మహిళలకు ఈ సమస్య కొంత తక్కువే (సుమారు 40% తక్కువ). కానీ, గర్బవతులుగా ఉన్నప్పుడు ఈ సమస్య వచ్చి, గుర్తించకపోతే ముప్పు ఎక్కువ. పిల్లల్లో ఈ సమస్య వల్ల దీర్ఘకాలంలో వారి కిడ్నీల ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది.ఈ సందర్భంగా ఏఐఎన్‌యూకు చెందిన సీనియర్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ డాక్టర్ తైఫ్ బెండెగెరి మాట్లాడుతూ, “కిడ్నీలో రాళ్ల కేసులు ఈసారి అసాధారణంగా పెరిగాయి. ముఖ్యంగా పిల్లలు, యువతలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. వేడి పెరిగిపోవడం, తగినంత నీరు తాగకపోవడం ఇందుకు ప్రధాన కారణాలు. పాఠశాలకు వెళ్లే పిల్లలు జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం వల్ల వారికి ఈ కిడ్నీలో రాళ్ల సమస్య ఎక్కువ అవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ రాళ్ల సమస్య కేవలం పెద్దవాళ్లది అనుకోకూడదు. పిల్లల తల్లిదండ్రులతో పాటు పాఠశాలలు కూడా దీనిపై అవగాహన పొందాలి. తగినంత నీళ్లు తాగడం, సరైన ఆహారం తీసుకోవడం, సమస్యను త్వరగా గుర్తించడం వల్ల చాలా తేడా ఉంటుంది. ముఖ్యంగా.. వేసవి నెలల్ల ఈ జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి” అని సూచించారు.జాగ్రత్తగా ఉండండిలా...తగినన్ని నీళ్లు తాగాలి. మూత్రం స్పష్టంగా, లేతరంగులో ఉండేలా చూసుకోవాలి.ఉప్పు, ప్రాసెస్డ్ ఆహారం, జంతువుల కొవ్వు పదార్థాల వాడకం తగ్గించాలి. ముఖ్యంగా పిల్లల్లో జంక్ ఫుడ్, ప్యాకేజ్డ్ చిరుతిళ్లు, కూల్ డ్రింకుల వాడకం మానేయాలి.స్కూల్లో ఉన్నప్పుడు, ఇళ్ల దగ్గర కూడా తగినన్ని నీళ్లు తాగేలా చూడాలికుటుంబంలో ఎవరికైనా గతంలో కిడ్నీ రాళ్లు ఏర్పడితే మరింత జాగ్రత్తగా ఉండాలి.ఎప్పటికప్పుడు కిడ్నీ పరీక్షలు చేయించుకోవడం చాలా అవసరం. ముఖ్యంగా పిల్లలకు కారణం లేకుండా కడుపునొప్పి రావడం, తరచు మూత్ర విసర్జనకు ఇబ్బంది పడడం లాంటి లక్షణాలుంటే వెంటనే వైద్యులకు చూపించాలి. తగినన్ని నీళ్లు తాగడం చాలావరకు ఈ సమస్యను దూరం పెడుతుంది.

తినదగిన 'రోబోటిక్ కేక్'ను చూశారా?
ఎన్నో రకాల కేక్‌లు చూసుంటారు. కానీ ఇలాంటి కేక్‌ని మాత్రం చూసుండరు. అదికూడా సాంకేతికతను, సైన్సుని మిళితం చేసేలా కేక్‌ని రూపొందించారు. అయితే దీనిని భవిష్యత్తులో ఒక పర్పస్ కోసమే తయారు చేశారట. శాస్త్రవేత్తలు, పరిశోధకులు, పేస్ట్రీ చెఫ్‌లు కలిసి ఎంతో శ్రమించి తయారు చేశారు. మరిదాన్ని వేటితో తయారు చేశారో సవివరంగా చూద్దామా..!. వినూత్నంగా తయారు చేసిన కేకులు ఇటర్నెట్లో పెను తుఫాను సృష్టిస్తున్నాయి. అయితే ఈ 'రోబోటిక్ కేక్' మాత్రం అందుకోసం చేసింది మాత్రం కాదు. దీన్ని తినదగిన సాంకేతికతలో పురోగతికి చిహ్నంగా తయారుచేశారు. ఈయూ నిధులతో కూడిన రోబోఫుడ్ ప్రాజెక్ట్‌లో భాగంగా రూపొందించారు. దీన్ని ఓ వెడ్డింగ్ కేక్ మాదిరిగా తయారు చేశారు. స్విస్ ఫెడరల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లౌసాన్ (EPFL), ఇటాలియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) శాస్త్రవేత్తలు, అలాగే లౌసాన్ స్కూల్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ (EHL) పాక నిపుణులు కలిసి తయరు చేశారు. ఈ నెల ఏప్రిల్ మధ్యలో ఒసాకాలో జరిగిన ఎక్స్పో 2025లో దీనిని ప్రదర్శించారు. ఈ "రోబోకేక్" అత్యంత వినూత్న భాగాలలో ఒకటి తినదగిన రీఛార్జబుల్ బ్యాటరీలు. వీటిని B2, క్వెర్సెటిన్, యాక్టివేటెడ్ కార్బన్, చాక్లెట్‌తో తయారు చేశారు. కేక్‌పై LED కొవ్వొత్తులను వెలిగించడానికి వాటిని ఉపయోగించారు. ప్రముఖ డిజైనర్ మారియో కైరోని సమన్వయంతో IIT పరిశోధకులు ఈ బ్యాటరీలను రూపొందించారు. అలాగే ఈ కేక్‌పై రెండు పూర్తిగా తినదగిన రోబోటిక్ టెడ్డీ బేర్లు ఉంచారు. వాటిని తయారు చేసేందుకు జెలటిన్, సిరప్, ఫుడ్ కలర్స్‌ని ఉపయోగించారు. అంతర్గత వాయు వ్యవస్థ ద్వారా యానిమేట్ చేయబడతాయి. ఇవి ప్రత్యేక మార్గాల ద్వారా గాలిని ఇంజెక్ట్ చేసినప్పుడు, వాటి తలలు, చేతులు కదులుతాయి కూడా. అలాగే రుచికి ఇవి దానిమ్మ గమ్మీల టేస్ట్‌ని కలిగి ఉంటాయి. ఎందుకోసం ఇలా..రోబోటిక్స్ ,ఆహారం రెండూ వేర్వేరు ప్రపంచాలు. అయితే, వాటిని ఇలా విలీనం చేయడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయంటున్నారు శాస్త్రవేత్తలు. ఈ తినదగిన రోబోట్లను అంతరించిపోతున్న ప్రాంతాలకు ఆహారాన్ని అందించడానికి, మింగడంలో ఇబ్బంది ఉన్న వ్యక్తులకు లేదా జంతువులకు వినూత్న మార్గాల్లో మందులను అందింవచ్చట. పైగా తినగలిగే సెన్సార్లను ఉపయోగించి ఆహారాన్ని దాని తాజాదనాన్ని కూడా పర్యవేక్షించొచ్చట. చివరగా ఈ రోబోటిక్స్ భాగాలు తినడానికి సురక్షితంగా ఉన్నాయని, మంచి రుచిని కలిగి ఉన్నాయని చెబుతున్నారు పరిశోధకులు. రానున్న కాలంలో ఇక కేకులు ఇలానే ఉంటాయేమో కాబోలు. (చదవండి: Free AI healthcare revolution: మైక్రోసాఫ్ట్ సీఈవో, టెక్కీ తండ్రుల ఆవేదన ఫలితం..!)

అక్షయ తృతీయ పదేళ్లలో పసిడి పరుగు, కొందామా? వద్దా?
వైశాఖమాసం, శుక్ల పక్ష తృతీయ నాడు జరుపుకునే నాడు జరుపుకునే అక్షయ తృతీయ అంటే ఆ సందడే వేరు. ఈ ఏడాది ఏప్రిల్ 30న అక్షయ తృతీయ పండుగ జరుపుకోనున్నారు. ఈ రోజున చేసే ఏ పని అయినా అక్షయం అవుతుందని, ఇంట్లో సిరిసంపదలు నిండుగా ఉంటాయని విశ్వసిస్తారు. అందుకే ఈ పవిత్రమైన రోజున బంగారం, వెండి వంటి విలువైన వస్తువులు కొనుగోలు చేయడం ఆనవాయితీ. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని భావిస్తారు. అందుకే గోరంతైనా బంగారమో, వెండో కొనుగోలు చేయాలని ఆశపతారు. అలాగే కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి, శుభకార్యాలు చేయడానికి ఇది అత్యంత అనుకూలమైన రోజు అక్షయ తృతీయను అనేది ప్రగాఢ విశ్వాసం.భారతీయులకు బంగారం అంటే లక్ష్మదేవి అంత ప్రీతి. ఇక అక్షయ తృతీయ అనగానే బంగారు నగల్ని సొంతం చేసుకోవాలని ఆశపడతారు. బంగారం కొనుగోళ్లు భారతీయులకు అక్షయ తృతీయ వేడుకలలో అంతర్భాగం. కానీ ఇటీవలికాలంలో బంగారం ధరలు ఆకాశన్నంటేంతగా ఎగిసి అందనంటున్నాయి. ఇప్పుడు 24 క్యారెట్ల నస్వచ్ఛమైన బంగారం ధర 10 గ్రాములకు రూ. లక్షకు సమీపంలో ఉంది. ఈ క్రమంలో గత పదేళ్లలో బంగారం ధరల్లో మార్పు గురించి తెలుసుకుందాం. ఈ క్రమంలో 11 ఏళ్లలోనే రికార్డు స్థాయిలో పుంజుకోవడం గమనార్హం.2014లో అక్షయ తృతీయ నాడు 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర పది గ్రాములకురూ. 30,182 వద్ద ఉండగా అదే 2025 నాటి ధరలను గమనిస్తే ఏకంగా 218 శాతం పెరిగి రూ. 95,900 కు చేరుకుంది. ఈ ఒక్క సంవత్సరం 2025లోనే ఇప్పటివరకు బంగారం ధర ఏకంగా 30 శాతానికి పైగా పుంజుకుంది.ఇదీ చదవండి : Akshaya Tritiya 2025 : శుభ సమయం, మంగళవారం గోల్డ్ కొనొచ్చా? కేవలం 1942లో క్విట్ ఇండియా సమయంలో బంగారం ధర 10 గ్రాములకు రూ.44గా ఉంది. 1947లో రూ.రూ.88.62 రెట్టింపు అయింది. ఇక తరువాత తగ్గడం అన్న మాట లేకుండా సామాన్యుడికి అందనంత ఎత్తుకు చేరింది. స్వాతంత్ర్యం తరువాత మొదలైన బంగారం ధర పెరుగుదల అలా అప్రతిహతంగా కొనసాగుతూ వచ్చింది. స్వాతంత్ర్యం తర్వాత బంగారం ధరలో అతిపెద్ద పతనం 1964లో జరిగింది. ఆ సమయంలో 10 గ్రాముల బంగారం రూ.63.25 మాత్రమే.పదేళ్లలో పసిడి పరుగుబంగారం ధర 10 సంవత్సరాలలో రూ. 68,500 పెరిగింది. 2015లో అక్షయ తృతీయకు నాటి ధరలతో పోలిస్తే నేటికి HDFC సెక్యూరిటీస్ డేటా ప్రకారం, గత 10 సంవత్సరాలలో బంగారం ధరలు రూ. 68,500 కంటే ఎక్కువ పెరిగాయి.2019లో అక్షయ తృతీయ నాడు బంగారం కొనుగోలు చేసి ఉంటే, అప్పుడు ధరలు 10 గ్రాములకు రూ.31,729గా ఉంది. అంటే అప్పటి పెట్టుబడిపై 200 శాతం పుంజుకున్నట్టే. గత ఏడాది అక్షయ తృతీయ నుండి పుత్తడి 30 శాతానికి పైగా ర్యాలీ అయింది. 2024లో 10 గ్రాముల రూ. 73,240 వద్ద ఉంది. 2024 మధ్యకాలం నుండి బంగారం ధరలు విపరీతంగా పుంజుకున్నాయి. దాదాపు 22 శాతం పెరిగి రూ. 73,240 వద్దకు చేరాయి.చదవండి: Vaibhav Suryavanshi Success Story: తండ్రి త్యాగం, పట్టుదలతో 13 ఏళ్లకే కోటీశ్వరుడు.. ఇదీ టాలెంట్! హై నుంచి కాస్త తగ్గే అవకాశం, కానీ మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్‌లోని కమోడిటీ రీసెర్చ్ సీనియర్ విశ్లేషకుడు మానవ్ మోడీ “చాలావరకు డిమాండ్ ,సరఫరా కారకాలు బంగారం ధరలపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపలేదు. ముఖ్యంగా మార్కెట్లో అధిక అనిశ్చితులు ఉన్న సందర్భంలో. గత రెండు నెలలుగా బంగారం ధరలు బాగా పెరిగాయి. అందువల్ల ధరల్లో కొత్త తగ్గుదల కనిపించవచ్చు. అయితే బంగారం ధరలకు సానుకూలతలు , ప్రతికూలతలు రెండూ ఉన్నాయి, మిశ్రమ ఆర్థిక డేటా పాయింట్లు, సుంకాల యుద్ధం, అధిక ద్రవ్యోల్బణ అంచనాలు, నెమ్మదించిన వృద్ధి ఆందోళనలు, రేటు తగ్గింపు అంచనాలు, భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలు, పెరుగుతున్న రుణాలు లాంటి బంగారం ధరలను ప్రభావితం చేస్తాయి.
ఫొటోలు
అంతర్జాతీయం

100 రోజుల ట్రంపరితనం
డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్ష పగ్గాలు చేపట్టి మంగళవారానికి 100 రోజులు. అమెరికాను మళ్లీ గొప్ప దేశంగా మారుస్తున్నాననే మిషతో రోజుకోటి అన్నట్టుగా ఈ మూడు నెలల్లో ఆయన లెక్కలేనన్ని అనాలోచిత చర్యలకు దిగారు. ‘పూటకో మాట, రోజుకో వైఖరి’ అన్నట్టుగా పదేపదే నిర్ణయాలను, విధానాలను మార్చుకుంటూ నవ్వులపాలవుతున్నారు. అంతర్జాతీయ సమాజం దృష్టిలో అమెరికాను పలుచన చేయడమే గాక వ్యక్తిగతంగా జీవితకాలానికి సరిపడా అప్రతిష్ట మూటగట్టుకున్నారు. అక్రమ వలసదారులకు అడ్డుకట్ట సాకుతో తలా తోకా లేని నిబంధనలతో అంతర్జాతీయ విద్యార్థుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నారు. పొదుపు పేరిట ఉద్యోగులను భారీగా తొలగించడం వంటి చర్యలతో అమెరికన్లను కూడా ఎన్నడూ లేనంత అభద్రతా భావంలోకి నెట్టేశారు. దాదాపుగా ఈ మూడు నెలల్లో ట్రంప్ తీసుకున్న అన్ని నిర్ణయాలూ న్యాయ వివాదాలకు దారితీయడం విశేషం. అమెరికా ద్రవ్యోల్బణానికి ముకుతాడు వేస్తానన్న వాగ్దానం నిలుపుకోవడంలోనూ ట్రంప్ ఘోరంగా విఫలమయ్యారు. నిత్యావసరాల ధరలు చుక్కలు తాకుతున్నాయి. చివరికి గుడ్ల ధరలు చూసి సగటు అమెరికన్ గుడ్లు తేలేసే పరిస్థితి నెలకొంది! ఇష్టారాజ్యపు నిర్ణయాలతో అటు ప్రపంచాన్ని, ఇటు అమెరికాను కూడా ఆర్థికంగా ప్రమాదపుటంచుల్లోకి నెట్టిన ట్రంప్, ఆ మంటల్లో తీరిగ్గా చలి కాచుకుంటున్నారు...మతిలేని టారిఫ్‌ల యుద్ధం ఈ 100 రోజుల్లో ట్రంప్ చేపట్టిన చర్యలన్నింట్లోనూ అత్యంత వివాదాస్పదమైనది, ఆనాలోచితమైనది టారిఫ్‌ల యుద్ధమే. అమెరికాపై భారీ టారిఫ్‌లు విధిస్తున్నాయంటూ చాలా దేశాలపై అంతర్జాతీయ వాణిజ్య సూత్రాలకు విరుద్ధంగా ప్రతీకార చర్యలకు దిగారు. అగ్ర రాజ్యాలు మొదలుకుని చివరికి అసలు జనమే ఉండని అంటార్కిటికా వంటి ప్రాంతాలపై కూడా ఎడాపెడా టారిఫ్‌లు పెంచి నవ్వులపాలయ్యారు. పైగా వాటిని రోజుకోలా మారుస్తూ అత్యంత చంచల ధోరణి కనబరిచారు. ఇక చైనా విషయంలోనైతే టారిఫ్‌లను రోజురోజుకూ అంతకంతకూ పెంచుతూ వేలంపాటను తలపించారు. చివరికి 145 శాతం దాకా తీసుకెళ్లి దాన్నో కామెడీ వ్యవహారంగా మార్చేశారు. టారిఫ్‌ల భయంతో ప్రపంచ మార్కెట్లన్నీ కుప్పకూలి కోలుకోలేని రీతిలో లక్షలాది కోట్ల రూపాయల మేర నష్టాలను చవిచూశాక తీరిగ్గా వాటి అమలును మూడు నెలల పాటు వాయిదా వేశారు. టారిఫ్‌లకు ప్రతీకారంగా అరుదైన ఖనిజాల ఎగుమతిని చైనా పూర్తిగా నిలిపేయడంతో అమెరికా దిక్కుతోచని పరిస్థితిలో పడిపోయింది.వలసలపై మొట్టి కాయలు అక్రమ వలసలపై ఉక్కుపాదం మోపే పేరిట వలసదారుల గుండెల్లో ట్రంప్ రైళ్లు పరుగెత్తిస్తున్నారు. పగ్గాలు చేపట్టిన కొద్ది రోజులకే అక్రమ వలసదారులను భారీ ఖర్చుతో ఏకంగా సైనిక విమానాల్లో స్వదేశాలకు పంపారు. సుదీర్ఘ ప్రయాణం పొడవునా ఒళ్లంతా సంకెళ్లు వేసి విమర్శలు మూటగట్టుకున్నారు. తర్వాత వారిని గ్యాటెమాలా తదితర సమీప దేశాలకు తరలించి నిర్బంధంలో ఉంచడం మొదలుపెట్టారు. దీనిపై కోర్టుల మందలింపులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇక విదేశీ విద్యార్థుల విషయంలోనైతే ట్రంప్ అత్యంత అమానవీయంగా వ్యవహరిస్తున్నారు. ఐదారేళ్ల చరిత్రను తవ్వుతూ ఎక్కడ ఏ చిన్న తప్పిదం కనిపించినా దేశం వీడాలని ఆదేశిస్తున్నారు. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన చిన్నాచితకా కారణాలకు కూడా వీసాలు రద్దు చేసి వెనక్కు పంపిస్తున్నారు. ఈ విషయంలో కోర్టులతో పదేపదే మొట్టికాయలు తింటూ వస్తున్నారు.డోజ్.. ఓవర్ డోస్ దుబారా వ్యయానికి కళ్లెం వేసేందుకంటూ ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సారథ్యంలో తీసుకొచ్చిన డోజ్ పనితీరు అమెరికన్లలో తీవ్ర అసంతృప్తికి దారితీసింది. లెక్కలేనన్ని ఉద్యోగాలను డోజ్ ఒక్క దెబ్బతో పీకిపారేసింది. కనీసం రెండు లక్షల కోట్ల డాలర్లు ఆదా చేస్తానని గొప్పగా చెప్పుకున్న మస్‌్క, ఓ రెండొందల కోట్ల డాలర్ల కంటే ఆదా కష్టమంటూ చివరికి చేతులెత్తేశారు. పైగా డోజ్ ముసుగులో అమెరికా ప్రభుత్వానికి సంబంధించిన కీలక, రహస్య డేటానంతా మస్క్ చేజిక్కించుకున్నట్టు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.జెలెన్స్కీకి అవమానం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని చర్చలకంటూ పిలిచి వైట్‌హౌస్‌లో మీడియా సాక్షిగా ట్రంప్, ఆయన డిప్యూటీ జేడీ వాన్స్ ఘోరంగా అవమానించిన తీరు చరిత్రలో నిలిచిపోయింది. దేశాధ్యక్షుడనే కనీస గౌరవం కూడా లేకుండా సూటిపోటి మాటలతో ఇద్దరూ రెచ్చిపోయారు. జెలెన్స్కీ ఎక్కడా తగ్గకుండా వాళ్లకు మాటకు మాట బదులిచ్చి శెభాష్ అనిపించుకున్నారు. చిర్రెత్తుకొచి్చన ట్రంప్ చివరికి ఆయన్ను వైట్‌హౌస్ నుంచి అవమానకర రీతిలో వెళ్లగొట్టిన తీరు చూసి ప్రపంచ దేశాలన్నీ షాక్‌కు గురయ్యాయి. ట్రంప్, వాన్స్ ప్రవర్తన వైట్‌హౌస్‌కే తీవ్ర కళంకమంటూ ఈసడించుకున్నాయి. ఆదరణ అట్టడుగుకు ట్రంప్ పట్ల అమెరికన్లలో వ్యతిరేకత నానాటికీ పెరిగిపోతోందని పోల్స్ అన్నీ ముక్త కంఠంతో చెబుతున్నాయి. అధ్యక్షుల తొలి 100 రోజుల పాలనకు జనామోదం విషయంలో ట్రంప్ గత 70 ఏళ్లలోనే అట్టడుగున నిలిచారు! ఆయన పాలనను గట్టిగా సమరి్థస్తున్న వారి సంఖ్య ఏకంగా 22 శాతానికి పడిపోయినట్టు సీఎన్ఎన్ పోల్ తేలి్చంది. గట్టిగా వ్యతిరేకించేవారి సంఖ్య 45 శాతానికి పెరిగింది. ముఖ్యంగా మార్చి నుంచి ట్రంప్ ఆదరణ శరవేగంగా అడుగంటుతూ వస్తోంది. టారిఫ్‌లపై ట్రంప్ తీరును 35 శాతం అమెరికన్లు గట్టిగా వ్యతిరేకిస్తున్నారు. ఆర్థికంగా దేశాన్ని ఆయన గట్టెక్కిస్తారని నమ్ముతున్న వారి సంఖ్య కూడా డిసెంబర్‌తో పోలిస్తే ఏకంగా 12 శాతం తగ్గింది. మతిలేని చర్యలతో దేశాన్ని ట్రంప్ ప్రమాదంలోకి నెడుతున్నారని 57 శాతం మంది భావిస్తున్నారు. ఆయన విదేశీ విధానాన్ని 60 శాతం మందికి పైగా తీవ్రంగా తప్పుబడుతున్నారు. వలసల విధానాన్ని కూడా 47 శాతం మంది ఆక్షేపిస్తున్నారు. ఉద్యోగ కల్పనలో ట్రంప్ తీరుతో 58 శాతం మంది పెదవి విరుస్తున్నారు. అధ్యక్షునిగా అధికారాన్ని బాధ్యతాయుతంగా వాడతారన్న నమ్మకం లేదని 54 శాతం మంది అమెరికన్లు అంటుండటం విశేషం. సరైన నాయకత్వం అందిస్తారని నమ్ముతున్నది 50 శాతమే. ఆయనకు ఓటేసి తప్పు చేశామని 20 శాతం మంది వాపోతుండటం పరిస్థితికి అద్దం పడుతోంది!దేశాలపై నోటి దురుసు కెనడా మొదలుకుని పలు దేశాలపై నోటి దురుసు వ్యాఖ్యలతో ట్రంప్ పరువు పోగొట్టుకున్నారు. అమెరికాలో 51వ రాష్ట్రంగా విలీనమైతే మేలంటూ అనవసర వ్యాఖ్యలు చేసి కెనడాతో శత్రుత్వాన్ని కొనితెచ్చుకున్నారు. పైగా ఆ దేశంపై విధించిన అడ్డగోలు టారిఫ్‌లతో అంతిమంగా అమెరికాకే నష్టం జరిగింది. అంతేగాక అమెరికాను ఇక జీవితంలో నమ్మేది లేదని కెనడా నాయకత్వంతో అనిపించుకున్నారు. గ్రీన్‌లాండ్‌ను ఆక్రమించేసుకుంటామని ప్రకటించి మరో వివాదాల తేనెతుట్టెను కదిపారు. గాజా నుంచి పాలస్తీనియన్లను పూర్తిగా తొలగించేసి దాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామంటూ తలాతోకా లేని ప్రకటన చేసి మొత్తం ముస్లిం ప్రపంచం ఆగ్రహానికి గురయ్యారు. ఉక్రెయిన్‌కు చేసిన యుద్ధ సాయానికి బదులుగా ఆ దేశ ఖనిజ నిల్వలను అమెరికాకు కట్టబెట్టాల్సిందేనంటూ భీష్మించుకున్నారు. రష్యాను ఒప్పించి ఒక్క రోజులో యుద్ధాన్ని ఆపిస్తానన్న ట్రంప్ ప్రకటన కూడా ఉత్తదేనని తేలిపోయింది. ‘పుతిన్‌కు యుద్ధం ఆపే ఉద్దేశమే లేనట్టుంది’ అంటూ ఇప్పుడాయన తీరిగ్గా నిట్టూరుస్తున్నారు.విద్యాసంస్థలపై ఉక్కుపాదం తన మాట వినడం లేదంటూ యూనివర్సిటీలపై ట్రంప్ కన్నెర్రజేశారు. ప్రపంచానికే తలమానికం వంటి అమెరికా విద్యా సంస్థల పునాదులనే పెకిలించే పనిలో పడ్డారు. వాటికి బిలియన్ల కొద్దీ ప్రభుత్వ నిధులను నిలిపేశారు. దారికొస్తే తప్ప వాటిని విడుదల చేసేది లేదంటున్నారు. అలా కొలంబియా వంటి వర్సిటీలను లొంగదీసుకున్నారు. కానీ ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీ మాత్రం ట్రంప్ తీరును తూర్పారబట్టింది. అణచివేత చర్యలకు తలొంచేది లేదని ప్రకటించింది. 300 కోట్ల డాలర్లకు పైగా నిధులను నిలిపేసినా ‘డోంట్ కేర్’ అనేసింది.

‘ఛీ’నా రాజకీయం...
అవకాశం దొరికింది కదాని ఇండియాను పాకిస్థాన్ భుజాల మీదుగా కాల్చాలని ప్రయత్నిస్తోంది కుటిల చైనా. ఆ దిశగానే బీజింగ్-ఇస్లామాబాద్ రక్షణ భాగస్వామ్యం బలపడుతోంది. పహల్గాంలో ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు పెచ్చరిల్లుతున్న తరుణంలో... గగనతలం నుంచి గగనతలంలోకి ప్రయోగించగల తమ అత్యాధునిక పీఎల్-15 క్షిపణులను పాక్ వైమానిక దళానికి చైనా అందించింది.బియాండ్ విజువల్ రేంజ్ (బీవీఆర్) పీఎల్-15 క్షిపణులను మోసుకెళుతున్న తమ జేఎఫ్-17 బ్లాక్ 3 యుద్ధ విమానాల ఫొటోలను పాక్ వైమానిక దళం (పీఏఎఫ్) ఇటీవల విడుదల చేయడం గమనార్హం. ‘పీఏఎఫ్’కు చైనా సరఫరా చేసినవి ఎగుమతులకు ఉద్దేశించిన ‘పీఎల్-15ఈ’ రకం క్షిపణులు అనుకుంటే పొరపాటు! తమ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ (పీఎల్ఏఏఎఫ్)కు చెందిన సొంత పీఎల్-15 క్షిపణులను చైనా నేరుగా పాక్ కు అందజేసినట్టు ‘యూరేషియన్ టైమ్స్’ ఓ కథనం ప్రచురించింది.భారత్, పాక్ నడుమ వైరం ముదురుతున్న అత్యంత కీలక తరుణంలో ఆగమేఘాలపై ఆయుధాలను సరఫరా చేయడానికి చైనా ఈ మార్గం ఎంచుకున్నట్టు తెలుస్తోంది. మరింత ఎక్కువ దూరం నుంచి భారత్ విమానాలను లక్ష్యంగా చేసుకోగల సామర్థ్యాన్ని పీఎల్-15 క్షిపణులు పాక్ యుద్ధ విమానాల పైలట్లకు కల్పిస్తాయి. అలా శత్రువుపై గెలుపును సునాయాసం చేస్తాయి.ఏమిటీ పీఎల్-15 మిసైల్?పీఎల్-15 క్షిపణి ఆధునిక వైమానిక యుద్ధరంగంలో చైనాకు ఓ ప్రధానాస్త్రం. ఇది ప్రభుత్వ ఏరోస్పేస్ సంస్థయిన ఏవియేషన్ ఇండస్ట్రీ కార్పొరేషన్ ఆఫ్ చైనా (ఏవీఐసీ) అభివృద్ధి చేసిన రాడార్ గైడెడ్ దూరశ్రేణి క్షిపణి. ధ్వని వేగానికి ఐదు రెట్లు (మ్యాక్ 5) మించిన వేగంతో గగనతలం నుంచి గగనతలానికి ప్రయోగించదగ్గ ఈ మిసైల్ 200-300 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదిస్తుంది.విదేశాలకు ఎగుమతి చేయడానికి ఉద్దేశించిన ‘పీఎల్-15ఈ’ వెర్షన్ మిసైల్ 145 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను మాత్రమే ఛేదించగలదు. జే-10సి, జే11-బి, జే-15, జే-16, జేఎఫ్-17 బ్లాక్ 3, జే-20 విమానాలకు పీఎల్-15 క్షిపణిని అమర్చవచ్చు. 160 కిలోమీటర్ల రేంజితో, శబ్ద వేగానికి నాలుగు రెట్ల వేగంతో ప్రయాణించగల అమెరికాకు చెందిన ఏఐఎం-120డి అమ్రామ్ క్షిపణితో పోలిస్తే రేంజి, వేగం పరంగా మెరుగైన ఈ పీఎల్-15 మిసైల్ 2018 నుంచి చైనా వైమానిక దళానికి సేవలు అందిస్తోంది.పీఎల్-15 వర్సెస్ మీటియర్... యూరోపియన్ ఎంబీడీఎం మీటియర్ క్షిపణితో పీఎల్-15ను పోల్చవచ్చు. గగనతలం నుంచి గగనతలానికి ప్రయోగించగల మీటియర్, ఎంఐసీఏ దూరశ్రేణి క్షిపణులను ప్రస్తుతం భారత్ చెంత ఉన్న రాఫెల్ యుద్ధ విమానాలకు అమర్చవచ్చు. లాంచ్ ప్లాట్ ఫాం, ఎత్తు, లక్ష్యపు చలనశీలత అంశాలపై ఆధారపడి మీటియర్ మిసైల్ పరిధి 100-200 కిలోమీటర్లు ఉంటుంది. ధ్వని వేగానికి నాలుగు రెట్లు మించిన వేగాన్ని అది అందుకోగలదు. సామర్థ్యం పరంగా పీఎల్-15ఈ (ఎగుమతి రకం)తో మీటియర్ క్షిపణిని పోల్చవచ్చు. కానీ పీఎల్-15 స్టాండర్డ్ వెర్షన్ (పాక్ కు చైనా సరఫరా చేసిన ప్రామాణిక రకం) మాత్రం మీటియర్ కంటే అధిక వేగం, దూరశ్రేణి గల క్షిపణి. రాంజెట్ ఇంజిన్ సాయంతో మీటియర్ క్షిపణి ప్రయాణమంతటా స్థిర వేగంతో దూసుకెళుతుంది.ఇందుకు భిన్నంగా పీఎల్-15 మిసైల్ డ్యూయల్ పల్స్ ఘన ఇంధన రాకెట్ మోటార్ సాయంతో ప్రయాణిస్తుంది. ఇందులోని ఘన ఇంధనం కొద్దిసేపు మాత్రమే జ్వలించినప్పటికీ రాంజెట్ ఇంజిన్ గల మీటియర్ కంటే ఎక్కువ వేగం అందిస్తుంది. అయితే ధ్వనికి ఐదు రెట్లు పైబడిన స్పీడ్ అందుకున్నా ప్రయాణం పొడవునా అదే వేగాన్ని పీఎల్-15 మిసైల్ కొనసాగించలేదు! క్షిపణుల బయటివైపు చిన్న రెక్కల్లాంటి భాగాలు (ఫిన్స్) ఉంటాయి. వాటిని మడవగలిగితే మరిన్ని క్షిపణులను యుద్ధవిమానాలకు అమర్చవచ్చు. ఈ బుల్లి రెక్కల్ని మడిచిన పీఎల్-15 క్షిపణి నమూనాను చైనా నిరుడు జూహాయ్ ఎయిర్ షోలో ప్రదర్శించింది. దీంతో జే-20 లాంటి యుద్ధవిమానాలు నాలుగు బదులుగా ఆరు పీఎల్-15 మిసైళ్లను మోసుకెళ్లే వీలు కలిగింది.రష్యన్ ‘ఆర్-37ఎం’ వైపు భారత్ చూపు?పాక్ మోహరించిన పీఎల్-15 మిసైళ్లతో భారత వైమానిక దళానికి తలనొప్పి తప్పేలా లేదు. వాటిపై పైచేయి సాధించే ఆప్షన్ ఇండియాకు లేకపోలేదు. అది... రష్యాకు చెందిన అత్యాధునిక ఆర్-37ఎం దూరశ్రేణి క్షిపణి! అతిధ్వానిక వేగాన్ని (మ్యాక్ 6) అందుకోగల ఈ హైపర్ సానిక్ మిసైల్ 300-400 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను తుత్తునియలు చేస్తుంది. ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా దీన్ని విస్తృతంగా వినియోగించింది. ఉక్రెయిన్ వైమానిక దళానికి ఆర్-37ఎం క్షిపణి నుంచే ప్రధాన ముప్పు ఎదురైందంటే అతిశయోక్తి కాదు.ఆర్-37ఎంను అమర్చిన మిగ్-31 విమానాలు పలు ఉక్రెయిన్ యుద్ధ విమానాలను కూల్చివేశాయి. ఉక్రెయిన్ ఎఫ్-16 యుద్ధ విమానాన్ని సైతం ఈ మిసైల్ సాయంతో రష్యా కూల్చివేసినట్టు ఇటీవల వార్తలు వచ్చాయి. విశేషం ఏమిటంటే సుఖోయ్ ఎస్యు-30ఎస్ఎం2 యుద్ధ విమానాలపై ఆర్-37ఎం క్షిపణులను మోహరించవచ్చు. భారత్ వద్ద ‘సుఖోయ్ ఎస్యు-30’ శ్రేణికి కొదవ లేదు. ప్రస్తుతం మనకు 260కి పైగా సుఖోయ్ ఎస్యు-30ఎంకెఐ యుద్ధ విమానాలు ఉన్నాయి.వాటిని సుఖోయ్ ఎస్యు-30ఎస్ఎం2 వేరియంట్లుగా ఉన్నతీకరించే అంశాన్ని భారత్ పరిశీలిస్తోంది. ఎస్యు-30ఎంకెఐ విమానాలకే ఆర్-37ఎం క్షిపణులను అమర్చాలంటే పెద్ద సాంకేతిక ప్రక్రియ ఉంది. దాదాపు 84 ఎస్యు-30ఎంకెఐ విమానాలను ఎస్ఎం2 వేరియంట్ స్థాయికి అప్‌గ్రేడ్ చేయడానికి రూ.63 వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా.ఆర్-37ఎం క్షిపణులను ఇండియాకు విక్రయించడానికి రష్యా కూడా ఆసక్తి కనబరుస్తోంది. రాఫెల్ యుద్ధ విమానాలపై ఈ క్షిపణులను మోహరించే అంశంలోనూ చర్చలు సాగుతున్నాయి. 2019లో బాలాకోట్ దాడుల సందర్భంగా ఇండియాకు చెందిన మిగ్-21 బైసన్ యుద్ధ విమానాన్ని పాక్ తన ఎఫ్-16 విమానం-అమ్రామ్ క్షిపణితో కూల్చివేసింది. నాడు ఇండియా చెంత దూరశ్రేణి క్షిపణులు లేకపోవడం పెద్ద లోటు. ఆ తర్వాత మీటియర్ క్షిపణులను అమర్చిన రాఫెల్ విమానాలను భారత్ మోహరించింది. - జమ్ముల శ్రీకాంత్

స్తంభించిన విద్యుత్.. మూడు దేశాలు అతలాకుతలం
మాడ్రిడ్: విద్యుత్ సప్లై పూర్తిగా నిలిచిపోవడంతో మూడు ఐరోపా దేశాలు అతలాకుతలమవుతున్నాయి. పవర్ గ్రిడ్ లో తీవ్రమైన సమస్యలు తలెత్తడంతో స్పెయిన్, పోర్చుగల్, ఫ్రాన్స్ దేశాలు పూర్తిగా స్తంభించిపోయాయి.ప్రస్తుతం పవర్ గ్రిడ్ తిరిగి పునరుద్దరించే పనిలో పడ్డ మూడు దేశాలు.. సోమవారమంతా చీకటిలో మగ్గిపోయాయి. విమానాల రాకపోకల్లో తీవ్ర సమస్యలే కాకుండా భారీ ట్రాఫిక్ జామ్ లు వంటి ఘటనలు ఆ దేశాల్లో తల్తెతాయి. దీనిపై ఆయా దేశాలు అత్యవసరంగా క్యాబినెట్ భేటీ నిర్వహించి పవర్ గ్రిడ్ ను పునరుద్దరించేందుకు కసరత్తులు చేస్తున్నాయి. ఎక్కడికక్కడే నిలిచిపోయిన రైళ్లు..చిమ్మ చీకటిలో గడుపుతున్న ఈ మూడు దేశాల్లో మెట్రో సేవలు ఉన్నపళంగా నిలిచిపోయాయి. . రైళ్లు కూడా ఎక్కడికక్కడి స్తంభించిపోయాయి. . దీంతో ఆయా దేశాల ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ సంక్షోభంపై ఇప్పటివరకూ ఎటువంటి క్లారిటీ లేకపోవడంతో జనాలు బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. మాడ్రిడ్ లోని నాలుగు టవర్ బిల్డింగ్ ల్లో ఒక దాన్ని ఖాళీ చేయించారు. ఇందులో బ్రిటీష్ ఎంబాసీ పనిచేస్తున్న దరిమిలా ఆ కార్యాలయాన్ని ఆకస్మింగా ఖాళీ చేయించారు.ఆఫీసులు వదిలి.. రోడ్లపైనేతీవ్రమైన విద్యుత్ సంక్షోభంతో కార్యాలయాలు ఏవీ పని చేయడం లేదు. ఆఫీసులకు వచ్చిన ఉద్యోగులు.. రోడ్లపైనే తిరుగుతూ కాలయాపన చేస్తున్నారు. అయితే దీనిపై స్పానిష్ ఎలక్ట్రిసిటీ గ్రిడ్ ఆపరేట్ రెడ్ ఎలక్ట్రికా స్పందించింది. విద్యుత్ ను తిరిగి పునరుద్దరించే క్రమంలో స్థానిక విద్యుత్ కంపెనీలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపింది. అన్ని యూరోపియన్ విద్యుత్ యూనియన్లను సమన్వయం చేసుకుంటూ సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు తాత్కాలిక ప్రయత్నాలు చేస్తున్నట్లు స్పష్టం చేసింది.

ఉక్రెయిన్‌లో రష్యా తాత్కాలిక కాల్పుల విరమణ
మాస్కో: ఉక్రెయిన్‌లో రష్యా తాత్కాలిక కాల్పుల విరమణ (Ceasefire)ను ప్రకటించింది. విక్టరీ డే నేపథ్యంలో వచ్చే నెల 8 నుంచి 10వ తేదీవరకు పూర్తిస్థాయి కాల్పుల విరమణ పాటిస్తామని క్రెమ్లిన్ వెల్లడించింది.మానవతా దృక్పథంతో దేశాధ్యక్షుడు పుతిన్ ఈమేరకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపింది. యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న వేళ ఈ ప్రకటన వెలువడింది. రెండో ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీపై విజయానికి గుర్తుగా రష్యా ప్రభుత్వం ఏటా మే 9న విక్టరీ డే వేడుకలు నిర్వహిస్తుంది.అమెరికా నుంచి శాశ్వత కాల్పుల విరమణ, శాంతి చర్చల ఒప్పందంపై ఒత్తిడి పెరుగుతున్న వేళ.. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ నిర్ణయం ప్రకటించారు. ఇదిలా ఉంటే.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉక్రెయిన్ మీద దాడులు ఆపాలంటూ రష్యాను కోరిన సంగతి తెలిసిందే. ఉక్రెయిన్‌పై రష్యా బలగాలు జరుపుతున్న భీకరదాడులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారాయన. అదే సమయంలో.. శాంతి ఒప్పందంలో భాగంగా క్రిమియాను వదులుకోవాలంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లోదిమిర్ జెలెన్స్కీకి సూచించారు కూడా.
జాతీయం

భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బీఆర్ గవాయి
ఢిల్లీ: సుప్రీంకోర్టు 52వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బీఆర్ గవాయి నియమితులయ్యారు. సీజేఐగా ఆయన నియామకానికి రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. మే 14న జస్టిస్ గవాయి బాధ్యతలు స్వీకరించనున్నారు.కాగా, మహారాష్ట్రలోని అమరావతికి చెందిన జస్టిస్ గవాయ్ 1985లో న్యాయవాదిగా ప్రాక్టీస్ ప్రారంభించారు. ప్రముఖ న్యాయవాది, మహారాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి రాజా భోన్సాలేతో కలిసి పనిచేశారు. 1987 నుండి 1990 వరకు ముంబై హైకోర్టులో స్వతంత్ర న్యాయవాదిగా పని చేశారు. 1992లో నాగ్‌పూర్ బెంచ్‌లో అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్‌గా, అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా నియమితులయ్యారు.2000లో ప్రభుత్వ న్యాయవాది, పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా వ్యవహరించారు. 2003లో హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా జస్టిస్ గవాయ్ నియమితులయ్యారు. 2005లో శాశ్వత న్యాయమూర్తిగా ప్రమోషన్ పొందారు. 2019లో సుప్రీంకోర్టుకు ప్రమోట్ అయ్యారు. జస్టిస్ గవాయ్ సుమారు ఆరు నెలలు ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగనున్నారు. ఆయన నవంబరులో పదవీవిరమణ చేయనున్నారు. 2007లో భారత అత్యున్నత న్యాయస్థాన పదవిని చేపట్టిన జస్టిస్ కేజీ బాలకృష్ణన్ తర్వాత, ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టే రెండో దళితుడు జస్టిస్ గవాయ్.

త్రివిధ దళాలకు ప్రధాని మోదీ ఫ్రీ హ్యాండ్.. సైన్యమే స్థలం,టైం చూసి..
ఢిల్లీ: పహల్గాంలో ఉగ్రదాడి నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలో వరుస కీలక సమావేశాలు కొనసాగుతున్నాయి. మంగళవారం జరిగిన త్రివిధ దళాదిపతులు సమావేశంలో ప్రధాని మోదీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉగ్రవాదుల్ని మట్టిలో కలిపేలా త్రివిధ దళాలకు పూర్తి స్థాయిలో స్వేచ్ఛ ఇచ్చారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. భారత దళాలపై పూర్తిగా నమ్మకం ఉంది. ఉగ్రవాదాన్ని అంత చేస్తాం. పహల్గాం దాడికి ధీటైన సమాధానం ఇస్తాం. సైన్యమే స్థలం,టైం చూసి జవాబు ఇస్తుంది’ అంటూ ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ నేతృత్వంలో జరిగిన రక్షణ శాఖ సమావేశంలో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్, సీడీఎస్ అనీల్ చౌహాన్లు పాల్గొన్నారు. ఈ సమావేశంలో గత బుధవారం భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల తీరుతెన్నులు ఎలా ఉన్నాయి. భద్రతా బలగాల మొహరింపు వంటి అంశాలపై చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.దీంతో పాటు త్వరలో ప్రారంభం కానున్న అమర్నాథ్ యాత్రలో పాక్ కవ్వింపులు చర్యలకు పాల్పడితే ఎలాంటి చర్యలు తీసుకోవాలి. ఒకవేళ పాక్ కవ్వింపులకు పాల్పడితే రక్షణ పరంగా ఎలా తిప్పికొట్టాలి. ఓ వైపు రక్షణ పరంగా దెబ్బకొడుతూనే.. దౌత్య పరంగా ప్రపంచ దేశాల ఎదుట పాకిస్తాన్‌ను ఇరుకున పెట్టేలా ఎలా దెబ్బకు దెబ్బ తీయాలనే తదితర అంశాలపై ప్రముఖంగా చర్చించారు. PM Modi chairs a meeting with Defence Minister, NSA, CDS and chiefs of all the Armed Forces. pic.twitter.com/fr9y5eVbet— ANI (@ANI) April 29, 2025

ప్రైవేట్ స్కూల్స్‌లో ఫీజుల దోపిడీకి చెక్.. చట్టం అమలుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్
ఢిల్లీ : ప్రైవేట్ స్కూళ్లల్లో అడ్డగోలు ఫీజుల దందాపై చరిత్రలో తొలిసారి ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మంగళవారం ఢిల్లీ స్కూళ్లలో ఫీజులు ఎంత మేరకు ఉండాలనే అంశంపై ప్రభుత్వం విధివిధానాల్ని ఖరారు చేసింది. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకోనుంది.ఫీజుల స్థిరీకరణ,నియంత్రణ బిల్లు- 2025పై ఢిల్లీ కేబినెట్ మీటింగ్ జరిగింది. ఈ సమావేశంలో పలు స్కూల్స్ ఏకపక్షంగా ఫీజుల పెంచుతున్నారంటూ వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో ఢిల్లీ కేబినెట్ మంగళవారం పాఠశాల ఫీజులను నియంత్రించడానికి చట్టాన్ని ఆమోదించింది. అనంతరం ఢిల్లీ సీఎం రేఖా గుప్తా మీడియాతో మాట్లాడారు. నా ఆనందానికి అవధుల్లేవు.ఢిల్లీ ప్రభుత్వం ధైర్యమైన నిర్ణయం నిర్ణయం తీసుకుంది. పలు స్కూల్స్ ఏకపక్షంగా ఫీజుల పెంచుతున్నారంటూ వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో ఢిల్లీ కేబినెట్ మంగళవారం పాఠశాల ఫీజులను నియంత్రించడానికి ఒక చట్టాన్ని ఆమోదించింది.📢 Big Reform in Delhi Education!CM Rekha Gupta: “For the first time in history, Delhi Govt has passed a foolproof Bill to regulate fees and set clear guidelines for all 1677 schools — aided, unaided, private, all included.”A bold step toward transparency and fairness in… pic.twitter.com/YzwzSBpLwP— भँ० अजीत सिंह तोमर (@Bhanwar_Ast) April 29, 2025 ఢిల్లీ ప్రభుత్వం చారిత్రాత్మక,సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. ఫీజుల స్థిరీకరణ,నియంత్రణ బిల్లు- 2025 ముసాయిదా బిల్లును ఈరోజు కేబినెట్ ఆమోదించిందని మీకు చెప్పడానికి నేను చాలా సంతోషంగా ఉన్నాను’అని అన్నారు.ఢిల్లీలోని 1,677 పాఠశాలలు ఎయిడెడ్, నాన్-ఎయిడెడ్ లేదా ప్రైవేట్ అయినా, ఫీజులకు సంబంధించిన పూర్తి మార్గదర్శకం, విధానాన్ని నిర్ణయిస్తారు. చరిత్రలో మొదటిసారిగా, అటువంటి బిల్లును ప్రభుత్వం రూపొందిస్తోందన్నారు. విద్యా మంత్రి ఆశిష్ సూద్ మాట్లాడుతూ, కొత్త నిబంధనలను అమలు చేయడానికి మూడు కమిటీలను ఏర్పాటు చేస్తామని, పాఠశాల మౌలిక సదుపాయాల ఆధారంగా మూడు సంవత్సరాల పాటు ఫీజులను ప్యానెల్లు నిర్ణయిస్తాయని అన్నారు. పాఠశాల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కూడా నిర్ణయం తీసుకునే ప్రక్రియలో పాల్గొంటారని చెప్పారు. ఈ నెల ప్రారంభంలో ఢిల్లీలోని పలు స్కూళ్లు ఏకపక్షంగా ఫీజులు వసూలు చేస్తున్నాయంటూ తల్లి దండ్రుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి.ఫిర్యాదులతో పలు పాఠశాలలకు ఢిల్లీ ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. తన ప్రభుత్వం పారదర్శకత, పిల్లల విద్యా హక్కు రక్షణకు కట్టుబడి ఉందని ఆ సమయంలో సీఎం రేఖా గుప్తా స్పష్టం చేశారు.

‘పెగాసస్’పై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: పెగాసస్ వ్యవహారంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం (Supreme Court) కీలక వ్యాఖ్యలు చేసింది. జాతీయ భద్రతా ప్రయోజనాల కోసం ఓ దేశం స్పైవేర్(Spyware)ను కలిగి ఉండటం తప్పులేదని పేర్కొంది. అయితే.. అది ఎలా? ఎవరిపై ఉపయోగించారనే విషయాలను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది.దాదాపు నాలుగేళ్ల క్రితం దేశ రాజకీయాలను కుదిపేసిన పెగాసస్ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ స్పైవేర్‌ను వినియోగించి దేశంలోని ప్రముఖ పాత్రికేయులు, పౌరసమాజ ప్రముఖులపై నిఘా పెట్టారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో.. పెగాసస్ ఆరోపణలపై స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై మంగళవారం విచారణ జరిగింది. పిటిషన్ తరఫున న్యాయవాది మాట్లాడుతూ.. పెగాసస్ స్పైవేర్‌ను ఉపయోగిస్తోందా? లేదా? అనే విషయాన్ని కేంద్రం స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు. అంతేగాక, ఈ ఆరోపణలపై దర్యాప్తు జరిపి సాంకేతిక నిపుణుల బృందం నివేదిక కోసం సర్వోన్నత న్యాయస్థానం గతంలో ఆదేశించిందని, ఇప్పటివరకూ ఆ నివేదిక అందలేదని, దానిని బయట పెట్టాలని ధర్మాసనాన్ని కోరారు. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎన్.కోటీశ్వర్ సింగ్‌తో కూడిన ధర్మాసనం స్పందిస్తూ.. దేశం స్పైవేర్‌ను వినియోగిస్తే గనుక అందులో తప్పేముంది. అయితే, దాన్ని ఎవరిపైన ఉపయోగిస్తున్నారన్నదే ఇక్కడ ప్రశ్న. పౌర సమాజంపై కాకుండా.. దేశ వ్యతిరేక శక్తులపై దీన్ని వినియోగిస్తే గనుక అందులో ఏ తప్పు లేదు. దేశ భద్రత విషయంలో రాజీపడకూడదు. ఒకవేళ సామాన్య పౌరులపై ఉపయోగిస్తే గనుక దాని గురించి మేం దర్యాప్తు జరిపిస్తాం. ఉగ్రవాదులు గోప్యత హక్కును కోరకూడదు. అయితే, సామాన్య పౌరుల గోప్యతకు మేం తప్పకుండా రక్షణ కల్పిస్తాం. ప్రస్తుతం మన దేశం ఎలాంటి పరిస్థితిలో ఉందో అందరికీ తెలుసు(పహల్గాం ఉగ్రదాడి ఘటనను పరోక్షంగా ప్రస్తావిస్తూ..). కాబట్టి మనం అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది’’ అని ద్విసభ్య ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఇక, సాంకేతిక బృందం నివేదిక గురించి మాట్లాడుతూ.. ‘‘దేశ భద్రత, సార్వభౌమత్వానికి సంబంధించిన నివేదికను బహిర్గతం చేయడం సరికాదు. ఒకవేళ ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు దాని గురించి తెలుసుకోవాలనుకుంటే.. వారికి సమాచారం అందిస్తాం’’ అని ధర్మాసనం స్పష్టం చేసింది.పెగాసస్ వ్యవహారం ఏంటంటే.. ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్ఎస్వో గ్రూప్ అనే సంస్థ ‘పెగాసస్’ స్పైవేర్‌ని అభివృద్ధి చేసింది. నిఘా కార్యకలాపాల కోసం ఈ స్పైవేర్‌ను ఎన్ఎస్వో పలు ప్రభుత్వాలు, ప్రభుత్వ అధీనంలో పనిచేసే సంస్థలకు విక్రయిస్తుంటుంది. అయితే, ఈ పెగాసస్‌ను ఉపయోగించి పాత్రికేయులు, పౌరసమాజ ప్రముఖుల ఫోన్లను హ్యాక్ చేశారంటూ 2021లో ఓ అంతర్జాతీయ పత్రిక సంచలన కథనం ప్రచురించింది. భారత్ నుంచి 300 మంది ఫోన్లు హ్యాక్ అయినట్లు పేర్కొంది. వీరిలో రాజకీయ ప్రముఖులు కూడా ఉన్నట్లు తెలిపింది. దీంతో ఈ వివాదం దేశ రాజకీయాలను కుదిపేసింది.
ఎన్ఆర్ఐ

దుబాయి హతుల వారసులకు ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు
ఇటీవల దుబాయిలో హత్యకు గురైన ఇద్దరు తెలంగాణ యువకుల కుటుంబ సభ్యులకు ఔట్ సోర్సింగ్ లో ఉద్యోగాలు ఇవ్వాలని జపాన్ పర్యటన నుంచి ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారని తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ది కార్పోరేషన్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే అనిల్ ఈరవత్రి ఒక ప్రకటనలో తెలిపారు. నిర్మల్ జిల్లా సోన్ మండల కేంద్రానికి చెందిన అష్టపు ప్రేమ్ సాగర్‌తో పాటు, జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం దమ్మన్నపేట కు చెందిన స్వర్గం శ్రీనివాస్ లు దుబాయి లో హత్యకు గురైన విషయం తెలిసిందే. దుబాయి నుంచి మృత దేహాలను త్వరగా స్వదేశానికి తెప్పించడానికి చర్యలు తీసుకోవాలని సీఎం అధికారుల్ని ఆదేశించినట్లు అనిల్ తెలిపారు.. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దుబాయి లోని భారత రాయబార కార్యాలయానికి, ఢిల్లీ లోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు లేఖలు రాసినట్లు వెల్లడించారు. మరిన్ని NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి:ఎన్నారై అడ్వయిజరీ కమిటీ చైర్మన్ డా. బిఎం వినోద్ కుమార్ బృందం, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి లు మృతుల కుటుంబాలను పరామర్శించారు.

రాయలసీమ ప్రగతికి డాలస్‌లో జీఆర్ఏడీఏ అడుగులు
గ్రేటర్ రాయలసీమ అసోసియేషన్ ఆఫ్ డాలస్ ఏరియా (GRADA) ఆధ్వర్యంలో ఏప్రిల్ 13న ఫ్రిస్కో, టెక్సాస్‌లో రాయలసీమ ప్రాంతం ఎదుర్కొంటున్న సమస్యలపై సమావేశం జరిగింది. రాయలసీమ సమస్యలు, అభివృద్ధి అవకాశాలు, తెలుగు భాషా సాహిత్యాల ప్రాముఖ్యతపై చర్చ జరిగింది. ఈ కార్యక్రమానికి రాయలసీమకు చెందిన రచయిత భూమన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన తన ప్రసంగంలో రాయలసీమ ప్రస్తుత పరిస్థితి, ముఖ్యంగా దీర్ఘకాలంగా వేధిస్తున్న నీటి సమస్యలు, వెనుకబాటుతనం గురించి ఎంతో ఆవేదనతో, స్పష్టంగా వివరించారు.మన ప్రాంత సహజ సంపద అయిన శేషాచలం అడవుల గురించి, ముఖ్యంగా ఎర్రచందనం చెట్ల గురించి ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ విలువైన సంపదను అక్రమ మార్గాల్లో ఇతర దేశాలకు తరలించి లాభం పొందకుండా, స్థానికంగానే వాటి ఆధారిత పరిశ్రమలను స్థాపించి, ఉత్పత్తులను తయారు చేయడం ద్వారా మన ప్రాంతాన్ని ఎలా ఆర్ధికంగా బలోపేతం చేయవచ్చో ఆయన చక్కగా వివరించారు. ఆయన మాటలు మనందరిలో కొత్త ఆలోచనలను రేకెత్తించాయి. సహజ వనరులను సక్రమంగా వినియోగించుకుంటే రాయలసీమ భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందనే ఆశాభావాన్ని ఆయన కలిగించారు.మరో గౌరవ అతిథిగా కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం మాజీ వైస్‌ఛాన్సలర్, ప్రఖ్యాత విద్యావేత్త ప్రొఫెసర్ పి. కుసుమ కుమారి హాజరయ్యారు. ఆమె తన ప్రసంగంలో తెలుగు భాష మాధుర్యం, సాహిత్యం గొప్పదనం, పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకత గురించి వివరించారు. నంద కోర్వి, అనిత నాగిరెడ్డి, సతీష్ సీరం, బ్రహ్మ చిరా, హరినాథ్ పొగకు, హేమంత్ కాకుట్ల, జగదీశ్వర నందిమండలం, జగదీష్ తుపాకుల, పవన్ పల్లంరెడ్డి, ప్రసాద్ నాగారపు, రాజు కంచం, శివ అద్దేపల్లి, శివ వల్లూరు, శ్రీధర్ బొమ్ము, శ్రీకాంత్ దొంత, సురేష్ మోపూరు, ఉమా గొర్రెపాటి, మరియు కార్తీక్ మేడపాటి ఈ సమావేశానికి హాజరయ్యారు.

సింగపూర్‌లో ‘అంతర్జాతీయ ఉగాది సాహిత్య సమ్మేళనం’
'వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా' 'శ్రీ సాంస్కృతిక కళాసారథి - సింగపూర్' మరియు 'వంశీ ఇంటర్నేషనల్ - ఇండియా' సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో, ఆదివారం 13వ తేదీ హైదరాబాద్ , శ్రీ త్యాగరాయ గానసభలో ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు 12 గంటల పాటు నిర్విరామంగా "అంతర్జాతీయ ఉగాది సాహిత్య సమ్మేళనం" కార్యక్రమం అద్వితీయంగా నిర్వహించబడింది.ఈ మూడు సంస్థలు కలసి విశ్వావసు నామ సంవత్సర ఉగాదిని పురస్కరించుకొని 80 మంది కవులతో 'అంతర్జాతీయ కవి సమ్మేళనము', 20 నూతన గ్రంధావిష్కరణలు, ఆచార్య శలాక రఘునాథ శర్మ 'రాయప్రోలు వంశీ జాతీయ సాహితీ జీవన సాఫల్య పురస్కార' ప్రదానము డా. బులుసు అపర్ణచే ప్రత్యేక 'మహిళా అష్టావధానము' మొదలైన అంశాలతో ఈ 'అంతర్జాతీయ ఉగాది సాహిత్య సమ్మేళనం' కార్యక్రమాన్ని ప్రత్యేకంగా రూపొందించి నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ్యులు మండలి బుద్ధ ప్రసాద్, విశిష్ట అతిథులుగా కవి జొన్నవిత్తుల, కిమ్స్ ఆస్పత్రి వ్యవస్థాపకులు బొల్లినేని కృష్ణయ్య, తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు ఆచార్య వెలుదండ నిత్యానంద రావు, ప్రముఖ రాజకీయవేత్త వామరాజు సత్యమూర్తి తదితరులు హాజరయ్యారు.ఉదయం 9 గంటలకు డా వంశీ రామరాజు అందించిన స్వాగతోపన్యాసంతో ఆరంభమైన ప్రారంభోత్సవ సభలో, కార్యక్రమ ప్రధాన సమన్వయకర్త రాధిక మంగిపూడి సభా నిర్వహణలో, మండలి బుద్ధ ప్రసాద్, కవి జొన్నవిత్తుల, బొల్లినేని కృష్ణయ్య, వామరాజు సత్యమూర్తి, డా. జననీ కృష్ణ తదితరుల ప్రసంగాలు అందరినీ ఆకర్షించాయి.తదనంతరం ఖతార్ నుండి విచ్చేసిన విక్రమ్ సుఖవాసి నిర్వహణలో అతిథుల చేతుల మీదుగా 18 తెలుగు నూతన గ్రంథాలు ఆవిష్కరించబడ్డాయి. వాటిలో కథల కవితల సంకలనాలు, వ్యాస సంపుటాలు, జెవి పబ్లికేషన్స్, మిసిమి మాసపత్రిక వారి ప్రచురణలు, సిద్ధాంత గ్రంథాలు మాత్రమే కాకుండా, ప్రతిష్టాత్మకంగా 2024 నవంబర్‌లో ఖతార్ దేశ రాజధాని దోహా మహానగరంలో వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా ఆధ్వర్యంలో జరిగిన "9వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు సభా విశేష సంచిక" కూడా ఆవిష్కరించబడడం ఈ సభకు మరింత శోభను చేకూర్చింది.మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 4:30 వరకు కొనసాగిన "అంతర్జాతీయ కవి సమ్మేళనం"లో ఆస్ట్రేలియా, ఖతార్, దక్షిణాఫ్రికా, అమెరికా మొదలైన దేశాలనుండి, ఉభయ తెలుగు రాష్ట్రాలనుండి, ముంబై, అండమాన్ దీవులు మొదలైన ప్రాంతాలనుండి కూడా వచ్చిన సుమారు 80 మంది కవులు కవయిత్రులు పాల్గొని తమ కవితలు వినిపించారు. వంశీ అధ్యక్షురాలు డా. తెన్నేటి సుధాదేవి, రేవూరు అనంత పద్మనాభరావు, జి భగీరథ, గుండు వల్లీశ్వర్, ప్రొ. రామా చంద్రమౌళి మహెజబీన్, ప్రొ. త్రివేణి వంగారి, డా కేతవరపు రాజ్యశ్రీ, డా. చిల్లర భవానీ దేవి, డా. శంకరనారాయణ, అంబల్ల జనార్ధన్, డా చాగంటి కృష్ణకుమారి మొదలైన ఎందరో కవులు కవయిత్రులు ఈ కవిసమ్మేళనంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం కొందరు రచయితలు ప్రసంగవ్యాసాలు వినిపించారు. సభా వ్యాఖ్యాతలుగా పేరి, కృష్ణవేణి, రాధిక వ్యవహరించారు.అనంతరం సాయంత్రం ఆచార్య శలాక రఘునాథ శర్మను ఘనంగా సత్కరించి, వారికి మూడు నిర్వాహక సంస్థల తరఫున "రాయప్రోలు వంశీ జాతీయ సాహితీ జీవన సాఫల్య పురస్కారం" అందించారు. దీనికి తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు ఆచార్య వెలుదండ నిత్యానందరావు ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. అనంతరం శలాక మాట్లాడుతూ తెలుగువారికి సొంతమైన అవధాన ప్రక్రియలో 'సమస్యా పూరణం' అనే అంశంలో ఉండే చమత్కారాలు వివరణలు తెలియజేస్తూ "అవధాన కవిత్వం - సమస్యలు" అనే అంశంపై ప్రత్యేక ప్రసంగాన్ని అందించారు.సాయంత్రం 5:30 గంటల నుండి ద్విశతావధాని డా. బులుసు అపర్ణ చేసిన అష్టావధానం ఈ సదస్సుకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రాధిక మంగిపూడి సంచాలకత్వంలో అమెరికా, యుగాండా, ఆస్ట్రేలియా, ఖతార్, అండమాన్ దీవులు, ముంబై, విశాఖపట్నం, విజయవాడ నుండి వచ్చిన 8 మంది మహిళలు పృచ్ఛకులుగా పాల్గొనడంతో ఇది "సంపూర్ణ మహిళా అష్టావధానం"గా ప్రశంసలు అందుకుంది.ఈ కార్యక్రమానికి ప్రధాన నిర్వాహకులుగా వంగూరి ఫౌండేషన్ వ్యవస్థాపకులు డా. వంగూరి చిట్టెన్ రాజు, వంశీ వ్యవస్థాపకులు డా. వంశీ రామరాజు, సింగపూర్ సంస్థ వ్యవస్థాపకులుకవుటూరు రత్నకుమార్ వ్యవహరించగా, వంగూరి ఫౌండేషన్ భారతదేశ ట్రస్టీ శైలజ సుంకరపల్లి ఆధ్వర్యంలో వేదిక ఏర్పాట్లు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమం యూట్యూబ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా పంచవ్యాప్తంగా సాహిత్య అభిమానుల మన్ననలు అందుకుంది.

టెక్సాస్‌లో రోడ్డు ప్రమాదం, ప్రాణాపాయ స్థితిలో తెలుగు విద్యార్థిని దీప్తి
ఉన్నత చదువులకోసం అమెరికాకు వెళ్లిన తెలుగు విద్యార్థిని ప్రాణలతో పోరాడుతోంది. అమెరికాలోని టెక్సాస్‌లోని డెంటన్ నగరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తెలుగు అమ్మాయిలు గాయపడ్డారు. వీరిలో తీవ్రంగా గాయపడిన విద్యార్థినిని దీప్తి వంగవోలుగా గుర్తించారు. మరో విద్యార్థినికి కూడా తీవ్రంగా గాయపడిందని అయితే ఆమెకు ప్రాణాపాయం లేదని అమెరికా మీడియా నివేదికలు తెలిపాయి.ఈ ప్రమాదం శనివారం (ఏప్రిల్ 12) తెల్లవారుజామున, ఎన్. బోనీ బ్రే స్ట్రీ మరియు డబ్ల్యు. యూనివర్శిటీ డ్రైవ్ సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరుకు చెందిన దీప్తి వంగవోలు ,ఆమె స్నేహితురాలు కాలినడకన ఇంటికి చేరుకోబోతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. వెంటనే ఆ వాహనం డ్రైవర్ని అక్కడినుంచి పారిపోయాడు. దీప్తికి తలకు లోతైన గాయం అయిందని, ఆమెకు శస్త్రచికిత్స జరుగుతోందని స్థానిక మీడియా తెలిపింది. ప్రస్తుతం డెంటన్ పోలీసులు ఈ హిట్ అండ్ రన్ ఘటనపై దర్యాప్తు ముమ్మరం చేశారు. పరారీలో ఉన్న డ్రైవర్‌ను, ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించేందుకు ప్రజల సహాయం కోరుతూ ప్రకటన కూడా విడుదల చేశారు. ఈ ఘటనపై మరిన్నివివరాలు అందాల్సి ఉంది. లింక్డ్ఇన్ ప్రొఫైల్ ప్రకారం, దీప్తి వంగవోలు నార్త్ టెక్సాస్ విశ్వవిద్యాలయంలో కంప్యూటర్ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్‌లో మాస్టర్స్ చదువుతోంది. 2023లో నరసరావు పేట ఇంజనీరింగ్ కళాశాల నుండి బీటెక్ పూర్తి చేసింది.
క్రైమ్

ఇద్దరిని బలిగొన్న అతివేగం
బిట్రగుంట(నెల్లూరు): అతి వేగం ఇద్దరు స్నేహితుల ప్రాణాలను బలిగొంది. ఈ ఘటన కొడవలూరు మండలం నార్తురాజుపాళెం సమీపంలో ఆంజనేయస్వామి గుడి వద్ద హైవేపై సోమవారం అర్ధరాత్రి జరిగింది. పోలీసుల సమాచారం మేరకు.. బోగోలు పంచాయతీ బేతనీయపేటకు చెందిన షేక్ మన్సూర్‌బాషా (26), విశ్వనాథరావుపేట రామస్వామిపాళెంకు చెందిన బత్తుల ప్రవీణ్‌కుమార్ (26) చిన్ననాటి నుంచి స్నేహితులు. మన్సూర్‌కు వివాహమై రెండేళ్ల కుమారుడు ఉండగా, ప్రవీణ్‌కుమార్ అ వివాహితుడు. మన్సూర్ బిట్రగుంటలోనే వాహనాలకు నేమ్ బోర్డులు, స్టిక్కర్లు వేసే షాపు నిర్వహిస్తున్నాడు. ప్రవీణ్‌కుమార్ గౌరవరం టోల్‌ప్లాజా వద్ద పని చేస్తున్నాడు. స్నేహితులిద్దరూ పనిమీద సోమవారం నెల్లూరు వెళ్లారు. రాత్రి సుమారు 11.30 గంటల తర్వాత బైక్‌పై ఇంటికి బయలు దేరారు. బాగా ఆలస్యం కావడంతో త్వరగా ఇంటికి చేరుకొందామని బైక్‌ను వేగంగా నడుపుకొంటూ వచ్చారు. 12 గంటల ప్రాంతంలో నార్తురాజుపాళెం ఆంజనేయస్వామి గుడి వద్ద ఆగి ఉన్న లారీని అదే వేగంతో వెనుక వైపు ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న స్నేహితులు మన్సూర్, ప్రవీణ్‌కుమార్ అక్కడకక్కడే మృతి చెందారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఏఎస్సై గంధం ప్రసాద్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి మృతుల కుటుంబాలకు సమాచారం అందించారు. అనంతరం ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నెల్లూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై తెలిపారు.

చదివేది ఏడో తరగతి.. వాడేది ఐ ఫోన్
జీడిమెట్ల(హైదరాబాద్): ఆ బాలుడు ఏడో తరగతి చదువుతున్నాడు. ఇంట్లో ఎవరూ చూడకుండా సంవత్సర కాలంగా ఇంట్లో ఐ ఫోన్ వాడుతున్నాడు. కుమారుడు ఐ ఫోన్ వాడటాన్ని గమనించిన తండ్రి.. ‘నీకు ఫోన్ ఎలా వచి్చంది’ అని నిలదీయడంతో అసలు విషయం చెప్పేశాడు. ‘మన షాపులోంచి రోజూ కొంత డబ్బు తీసి ట్యూషన్ మాస్టారుకు ఇచ్చేవాణ్ని. మాస్టారే ఈ ఫోన్ కొనిచ్చాడు’ అని బాలుడు తన తండ్రికి వివరించాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు.పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.. షాపూర్‌నగర్‌కు చెందిన వ్యాపారవేత్త కమల్‌జైన్. ఆయన కుమారుడు ఏడో తరగతి చదువుతున్నాడు. సంవత్సర కాలంగా బాలుడు తమ షాపులోంచి కొంత నగదు దొంగిలించసాగాడు. ఆ డబ్బును తనకు ట్యూషన్ చెప్పే మాస్టారుకు ఇచ్చేవాడు. ఈ క్రమంలో బాలుడికి సదరు ట్యూషన్ మాస్టారు ఐ ఫోన్ కొనిచ్చాడు. ఈ విషయం ఇంట్లో తెలియడంతో కుమారుడికి ట్యూషన్ చెబుతున్న వ్యక్తిపై జీడిమెట్ల పీఎస్‌లో కమల్‌జైన్ ఫిర్యాదు చేశాడు. విచారణ చేపట్టిన పోలీసులు ట్యూషన్ మాస్టారు సందీప్‌పై కేసు నమోదు చేశారు. సంవత్సర కాలంగా కుమారుడు తమ షాపులోంచి డబ్బులు తీస్తున్న తండ్రి పసిగట్టకపోవడం గమనార్హం. అలాగే సంవత్సర కాలంగా కుమారుడు ఇంట్లో ఫోన్ వాడుతున్నా కుటుంబ సభ్యులు చూడకపోవడం మరో విచిత్రం. ఎవరైనా పిల్లలు ఇలాంటి పనులు చేస్తే వారికి కౌన్సెలింగ్ ఇప్పించాలని సీఐ గడ్డం మల్లేష్ తల్లిదండ్రులకు సూచించారు.

వివాహేతర సంబంధం.. భార్య కళ్లెదుటే ప్రియుడ్ని..
పెద్దపల్లిరూరల్: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌యార్డు ఆవరణలో సోమవారం పొలం కుమార్‌ను హతమార్చిన కేసులో నిందితులు వేల్పుల సంతోష్, వేల్పుల శైలజను మంగళవారం పోలీసులు అరెస్ట్ చేశారు. విలేకరుల సమావేశంలో వివరాలను ఏసీపీ గజ్జి కృష్ణ వెల్లడించారు. కొన్నిరోజులుగా కుమార్‌తో శైలజ సన్నిహితంగా ఉండడాన్ని చూసి వివాహేతర ఉందని సంతోష్ అనుమానించాడు. పద్ధతి మార్చుకోవాలని శైలజను మందలించాడు. అయితే తన వెంటపడుతూ ఇబ్బంది పెడుతున్నాడని ఆమె చెప్పడంతో కుమార్‌పై సంతోష్ కోపం పెంచుకున్నాడు. అయితే బంధువుల వద్ద శైలజతో సంబంధం ఉందని కుమార్ చెబుతున్నాడు. శైలజకు కూడా ఫోన్లు చేస్తుండడంతో కుమార్‌ను చంపాలనే నిర్ణయానికి వచ్చాడు. ఈక్రమంలో సోమవారం మాట్లాడుకుందాం రమ్మని కుమార్‌కు ఫోన్‌చేసి చెప్పడంతో వ్యవసాయమార్కెట్‌కు కారులో చేరుకున్నాడు. ఈలోగా పెద్దపల్లికి వచ్చిన సంతోష్.. జెండా వద్ద ఓ కత్తిని కొనుగోలు చేసి భార్య శైలజకు కుమార్‌ను చంపుదామనే విషయాన్ని చెప్పాడు. శైలజ దొంగతుర్తి నుంచి బస్సులో పెద్దపల్లికి చేరుకోగా.. ఆమెను బైక్‌పై తీసుకుని మార్కెట్ యార్డుకు చేరుకున్నారు. అక్కడ కొద్దిసేపు కుమార్, సంతోష్ గొడవపడ్డారు. ఆ సమయంలోనే తన వద్ద ఉన్న కత్తి తీసి మెడ, చాతి, ముఖంపై పొడిచి చంపారు. కుమార్ చనిపోయాడని నిర్ధారించుకుని నిందితులు పరారయ్యారు. ఈమేరకు నిందితులైన భార్యాభర్తలు సంతోష్, శైలజు దొంగతుర్తిలో ఉన్నారనే సమాచారంతో అక్కడకు వెళ్లి పోలీసులు అరెస్టు చేశారు. సమావేశంలో సీఐ ప్రవీణ్‌కుమార్, ఎస్సై మల్లేశ్ పాల్గొన్నారు.వివాహేతర సంబంధం.. శైలజ నుంచి ఫోన్ వచ్చిందని..!

ఎన్క్రిప్టెడ్ యాప్స్ ద్వారా డ్రగ్స్ దందా
సాక్షి, హైదరాబాద్: ఎన్క్రిప్టెడ్ యాప్స్ ద్వారా ఐదారేళ్లుగా సాగుతున్న అంతర్జాతీయ డ్రగ్స్ దందా గుట్టును హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ (హెచ్–ఎన్ఈడబ్ల్యూ) రట్టు చేసింది. నలుగురు నిందితులను అరెస్టు చేసి వారి నుంచి మొత్తంగా రూ. 1.4 కోట్ల విలువైన 1.38 కిలోల ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్‌గా (ఓజీ) పిలిచే హైడ్రోపోనిక్ గంజాయి, 44 ఎల్ఎస్డీ (లైసెర్జిక్ యాసిడ్ డైఎథిలమైడ్) బ్లాట్లు, 250 గ్రాముల మ్యాజిక్ మష్రూమ్స్ (సైలోసైబిన్ డ్రగ్), మరికొన్ని వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ నిందితులంతా ఉన్నత విద్యావంతులే కావడం గమనార్హం. టాస్‌్కఫోర్స్ డీసీపీ వైవీఎస్ సుదీంద్రతో కలిసి మంగళవారం విలేకరుల సమావేశంలో అదనపు సీపీ (నేరాలు) పి.విశ్వప్రసాద్ ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించారు.కస్టమర్ నుంచి పెడ్లర్‌గా మారి... సికింద్రాబాద్‌కు చెందిన అభిషేక్ ఛత్తీస్‌గడ్‌లోని రాయ్‌పూర్ ఐఐఐటీ నుంచి బీటెక్ పూర్తిచేశాడు. ప్రస్తుతం సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పని చేస్తూ నెలకు రూ. 2 లక్షలు సంపాదిస్తున్నాడు. రాయ్‌పూర్‌లో ఉండగా మాదకద్రవ్యాల వినియోగానికి అలవాటుపడిన అతను.. తేలిగ్గా డబ్బు సంపాదన కోసం పెడ్లర్గానూ మారాడు. అభిషేక్‌కు డార్క్ వెబ్‌లో ఉన్న డ్రెడ్ మార్కెట్ అనే కమ్యూనిటీ ద్వారా ‘హెచ్‌హెచ్ హ్యాండ్లర్’అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. తనకు కావాల్సిన ఓజీ, ఎల్ఎస్డీ కోసం సిగ్నల్, స్నాప్‌చాట్ వంటి ఎన్‌క్రిపె్టడ్ యాప్స్ ద్వారా ఆర్డర్ ఇచ్చేవాడు.జబల్పూర్కు చెందిన హర్షవర్థన్ శ్రీవాస్తవ బీ–ఆర్క్ పూర్తి చేసినప్పటికీ ఆ రంగంపై ఆసక్తిలేక ఓ స్టార్టప్ కంపెనీ తెరవడానికి డబ్బు కోసం డ్రగ్ పెడ్లర్ అవతారం ఎత్తాడు. డ్రెడ్ మార్కెట్ ద్వారానే ‘హెచ్‌హెచ్ హ్యాండ్లర్’కి లోకల్ ఏజెంట్‌గా మారాడు. అయితే అతనికి డ్రగ్స్ అలవాటు లేకపోవడం గమనార్హం. సికింద్రాబాద్‌కు చెందిన మరో ఆర్కిటెక్ట్ ధావల్ కూడా హర్షవర్థన్‌కు మరో పెడ్లర్‌గా వ్యవహరిస్తున్నాడు. అలాగే డ్రగ్స్ సప్లయిర్ అయిన చెన్నైవాసి బి. శ్రీనివాస రాహుల్‌ను కొన్నేళ్ల క్రితం పరిచయం చేసుకున్న అభిషేక్ అతన్నుంచి డ్రగ్స్ కొని విక్రయిస్తున్నాడు. ఈ దందాపై హెచ్–న్యూకు సమాచారం అందడంతో ఇన్స్పెక్టర్ జీఎస్ డానియేల్ నేతృత్వంలో ఎస్సై సి.వెంకట రాములు, నల్లకుంట ఇన్స్పెక్టర్ బి.జగదీశ్వర్‌రావు తమ బృందాలతో వలపన్ని హర్షవర్థన్, రాహుల్, ధావల్, అభిషేక్‌లను నగరంలో పట్టుకున్నారు. రాహుల్ చెన్నైతోపాటు బెంగళూరు, హైదరాబాద్‌లోని కస్టమర్లకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు తేలింది. ఈ కేసును తదుపరి చర్యల నిమిత్తం నల్లకుంట పోలీసులకు అప్పగించారు. పోలీసుల నిఘాకు చిక్కకుండా సరఫరా... థాయ్‌లాండ్ నుంచి ఓడల ద్వారా డ్రగ్స్ భారత్‌లోకి.. అక్కడి నుంచి జబల్పూర్లో ఉంటున్న హర్షవర్థన్ వద్దకు చేరుతున్నాయి. అతను వినియోగదారుడికి కొరియర్ సంస్థల ద్వారా పంపుతున్నాడు. పోలీసుల నిఘాకు చిక్కకుండా ఉండేందుకు పార్శిల్ బుక్ చేసేటప్పుడు చిరునామా, ఫోన్ నంబర్ ఇచ్చి ట్రాకింగ్ ఐడీని మాత్రం అభిõÙక్ వంటి వినియోగదారులకు పంపుతున్నాడు. ఆ పార్శిల్ కొరియర్ ఆఫీసుకు చేరగానే అక్కడకు వెళ్లి వారు తీసుకొనేవారు. హ్యాండ్లర్ నుంచి డ్రగ్స్‌ను ఔన్స్ (28.34 గ్రాములు)కు రూ. 15 వేల నుంచి రూ. 25 వేల వరకు క్రిప్టో కరెన్సీ రూపంలో చెల్లించి తెప్పించుకొని వినియోగదారులకు ఔన్స్‌కు రూ. 25 వేల నుంచి రూ. 35 వేల మధ్య విక్రయిస్తున్నారు.