Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

YS Jagan Press Meet Highlights March 5th 2025 News1
మోసాల బడ్జెట్‌.. బాహుబలి అంటూ బిల్డప్‌లు: వైఎస్‌ జగన్‌

గుంటూరు, సాక్షి: కూటమి ప్రభుత్వ పాలనలో సంక్షేమం పేరుతో ప్రతీ వర్గాన్ని చంద్రబాబు మోసం చేశారని, బడ్జెట్‌ గారడీతో అది బయటపడిందని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy) అన్నారు. తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో ఆయన చంద్రబాబు చేస్తున్న దగాను వివరించారు.ప్రెస్‌మీట్‌లో వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. 👉అసెంబ్లీలో ప్రతిపక్షం చెబుతున్న మాటలు వినడం లేదు. అందుకే మీడియా ముందుకు వచ్చాం. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రెండు బడ్జెట్‌లు ప్రవేశపెట్టింది. సూపర్‌ సిక్స్‌, 143 హామీల కోసం అరకోర కేటాయింపులు చేశారు. అన్నిరకాలుగా మోసం చేసిన తీరు తేటతెల్లంగా కనిపిస్తోంది.👉బాబు ష్యూరిటీ.. భవిష్యత్తు గ్యారెంటీ కాస్త బాబు ష్యూరిటీ.. మోసం గ్యారెంటీ అయ్యింది. ఎన్నికలకు ముందు సూపర్‌ సిక్స్‌, సెవెన్‌ అంటూ ఊదరగొట్టారు. చంద్రబాబు దత్తపుత్రుడు కలిసి మేనిఫెస్టో రిలీజ్‌ చేశారు. ప్రతీ ఇంటికి బాండ్లు పంచారు. 20 లక్షల ఉద్యోగాలు,. రూ.3 వేల నిరుద్యోగ భృతి సాయం అన్నారు. 👉ఇప్పుడు హామీలపై అడిగితే సమాధానం లేదు. రెండు బడ్జెట్‌లలోనూ నిధులు కేటాయించలేదు. ప్రజలను మోసం చేసిన తీరు స్పష్టంగా కనిపిస్తోంది. తొమ్మిది నెలల్లోనే 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చేశామని చెప్పారు . గవర్నర్‌తో అబద్ధాలు చెప్పించారు. 👉ఆత్మస్తుతి పరనింద అన్నట్లుగా చంద్రబాబు బడ్జెట్‌ ప్రసంగం ఉంది. తొలిబడ్జెట్‌లో కేటాయిచింది బోడి సున్నా. ఈ ఏడాది కూడా నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. ప్రతి నిరుద్యోగి భృతి రూ.72 వేలు ఎగనామం పెట్టారు. 2024-25 సోషియో ఎకనమిక్‌ సర్వేలో ఎంఎస్‌ఎంఈ సెక్టార్‌లో 27 లక్షల ఉద్యోగాలిచ్చామని చెప్పారు. బడ్జెట్‌లో ప్రతిపాదించకుండా లక్షల ఉద్యోగాలు ఎలా ఇచ్చారు?👉జగన్‌ చెప్పినదానికంటే ఎక్కువ ఇస్తున్నామని ఫోజులు కొడుతున్నారు. ఉద్యోగాలు ఇవ్వకపోగా.. ఉన్న ఉద్యోగాలను పీకేస్తున్నారు. పారిశ్రామిక వేత్తలను బెదిరిస్తున్నారు. ఏపీ రావాలంటే కంపెనీలు భయపడుతున్నాయి👉చంద్రబాబు ఏది చెప్పినా అబద్ధం.. మోసం. చంద్రబాబు చేసేది.. దగా .. వంచన👉వైఎస్సార్సీపీ హయాంలో వివిధ సెక్టార్‌లో ప్రభుత్వ ఉద్యోగాల సంఖ్య 6 లక్షలు. మొత్తం మా పాలనలో అన్నీ రంగాలకు కలిపి 40 లక్షల పైచిలుకు ఉద్యోగాలిచ్చాం. ఆధార్‌ కార్డులతో సహా ఆ వివరాలు చెప్పగలం. ఇది ఎవరూ కాదనలేని సత్యాలివి👉18 నుంచి 60 ఏళ్ల మహిళకు సంవత్సరానికి రూ.18 వేలు ఆడబిడ్డ నిధి అన్నారు. దానికి ఎగనామం పెట్టారు. ఉచిత బస్సు కోసం మహిళలంతా ఎదురు చూస్తున్నారు. ఉచిత ప్రయాణాలు ఎప్పుడెప్పుడు చేస్తామా? అని ఆశగా చూస్తున్నారు. మహిళల సంక్షేమం పేరిట ఈ హామీతో రూ.7 వేల కోట్లు ఎగ్గొట్టారు. 👉స్కూల్‌కి వెళ్లే ప్రతి విద్యార్థికి రూ.15 వేల సాయం అన్నారు. ఎంత మంది ఉంటే అంత మందికి ఇస్తామని అన్నారు. తల్లికి వందనం కోసం మొదటి బడ్జెట్‌లో రూ. 5, 386 కోట్లు కేటాయింపులు చేశారు. ఈసారి నెంబర్‌ మోసంతో ప్రజలను మభ్య పెడుతున్నారు. ఎలాగూ మోసం చేసేది కదా అని ఇలా చేస్తున్నారు. చివరికి చిన్న పిల్లాడికి కూడా బకాయిలు పెడుతూ.. ఎగనామం పెడుతున్నారు. 👉అఫ్‌కోర్స్‌.. చంద్రబాబుకి రైతులను మోసం చేయడం కొత్తేం కాదు రైతు భరోసా పేరిట రైతన్నలను గతంలోనే కాదు.. ఇప్పుడూ మోసం చేస్తున్నారు. అన్నదాత సుఖీభవ పథకం కింద రూ.20 వేల సాయం అందిస్తామన్నారు. కిందటి ఏడాది ఎగ్గొట్టారు. ఈసారి కూడా ఆ పని చేస్తే.. రెండు బడ్జెట్‌లకు కలిపి రూ.40 వేలు ఎగనామం పెట్టినట్లు అవుతుంది. 👉 దీపం పథకం కింద మరో మోసానికి దిగారు. ఎలాగూ ఎగనామం పెట్టేదే కదా.. మోసమే కదా అని కేటాయింపులు చేసుకుంటూ పోయారు.👉 చంద్రబాబు ఇచ్చిన హామీ ప్రకారం.. 50 ఏళ్లు నిండిన వాళ్లకు పెన్షన్‌ల విషయంలో మరో 20 లక్షల మంది జత కావాల్సి ఉంది. రెండేళ్లలో రూ.96 వేల చొప్పున మోసం చేశారు. 👉 సూపర్‌ సిక్స్‌.. సెవెన్‌ కింద అన్ని పథకాలకు కలిపి మొత్తం.. దాదాపు రూ.80 వేల కోట్లు(రూ.79,867 కోట్లు) కావాలి. కిందటి ఏడాది రూ.7 వేల కోట్లు పెడితే.. రూ.800 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. ఈసారి బడ్జెట్‌ కేటాయింపులే రూ.17, 179 కోట్లు మాత్రమే. బాబు షూరిటీ.. మోగ్యారెంటీకి ఇదే నిదర్శనం. 👉వైఎస్సార్‌సీపీ వాళ్లకు పథకాలు ఇవ్వకూడదని, ఎలాంటి సాయం చేయకూడదని చంద్రబాబు అన్నారు. ఇవ్వకపోవడానికి అదేమైనా మీ బాబుగారి సొమ్మా?. అది ప్రజల సొమ్ము. ప్రజల సొమ్ముతో ప్రభుత్వం నడుస్తోంది. పక్షపాతానికి, రాగద్వేషాలకు అతీతంగా పాలన చేస్తానని రాజ్యాంగబద్ధంగా ప్రమాణం చేసి ఇలా.. బహిరంగంగా మాట్లాడతారా?. ఇలాంటి వ్యక్తి సీఎంగా అర్హుడేనా?.. ఇలాంటి సీఎం ఏ రాష్ట్రానికైనా శ్రేయస్కరమా?. ఇలాంటిక్తిని సీఎం స్థానంలో కొనసాగించడం ధర్మమేనా?. చంద్రబాబు చేసిన ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్ అందరూ చూడాలిఎన్నికల టైంలో చంద్రబాబు: జగన్‌ ఇప్పించిన సంక్షేమం ఆగదు. 143 హామీలు కాకుండా.. మరింత సంక్షేమం ఇస్తాంఅసెంబ్లీలో సీఎంగా చంద్రబాబు: మనం హామీలు ఇచ్చాం. సూపర్‌ సిక్స్‌ ఇచ్చాం. చూస్తే భయం వేస్తోంది. ముందుకు కదల్లేకపోతున్నాం. ఈ విషయాలు రాష్ట్ర ప్రజానీకం ఆలోచించాలి.👉సంక్షేమానికి కేరాఫ్‌గా నిలిచాం. మా హయాంలో 4 పోర్టులకు శ్రీకారం చుట్టాం. రాష్ట్రానికి 17 మెడికల్‌ కాలేజీలు తీసుకొచ్చాం. 10 పిషింగ్ హార్బర్ల నిర్మాణం చేపట్టాం. విద్యారంగంలో కీలక సంస్కరణలు తెచ్చాం. CBSE నుంచి IB వరకు బాటలు వేశాం. నాడు-నేడు కింద స్కూళ్ల రూపురేఖలు మార్చేశాం. చంద్రబాబు హయాంలో విద్యా వ్యవస్థ పూర్తిగా నాశనం అయ్యింది👉మా హయాంలో 66 లక్షల మందికి పెన్షన్‌లు అందించాం. బాబు పాలనలో 62 లక్షల మందికి పెన్షన్‌ ఇస్తున్నారు. కొత్తగా ఎవరిని చేర్చకపోగా.. ఉన్నవాళ్లలో 4 లక్షల మంది లబ్ధిదారులను తొలగించారు. బడ్జెట్‌ కేటాయింపుల్లోనూ పెన్షన్‌ నిధులు తగ్గించేశారు👉రూ.15 వేలు ఇస్తామని వాహనమిత్రకు ఎగనామం పెట్టారు. ముస్లింలకు మైనారిటీ కార్పొరేషన్‌ ద్వారా రూ.5 లక్షలు ఇస్తామని మోసం చేశారు. 👉దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ క్యాలెండర్‌ అమలు చేశాం. మా హయాంలో అక్కాచెల్లెళ్లకు భరోసా ఉండేది. తమ కాళ్లపై నిలబడేలా అడుగులు ముందుకు వేశాం. 👉ఇప్పుడు అమ్మ ఒడి, విద్యాదీవెన, వసతి పథకాలు లేవు. విద్యాదీవెన పథకానికి నిధులు ఇవ్వలేదు. ఫీజులు కట్టలేక పిల్లలు చదువులు వదిలేసే పరిస్థితికి వచ్చారు. ఈ పరిస్థితిపై వైఎస్సార్‌సీపీ పోరాటం చేయనుంది. మార్చి 12న విద్యార్థులు, తల్లిదండ్రుల సమన్వయంతో వైఎస్సార్‌సీపీ ఫీజు పోరు ఉంటుంది👉కూటమి ప్రభుత్వంలో.. వ్యవసాయం, వైద్యం, ఆరోగ్యం, విద్య ఇలా అన్ని రంగాలను నాశనం చేశారు. అన్ని వ్యవస్థలను ధ్వంసం చేశారు. మేం తెచ్చిన విప్లవాత్మక మార్పులను.. నిర్వీర్యం చేశారు. మిర్చి రైతులను దారుణంగా మోసం చేశారు. సమస్య పరిష్కరించామని అసెంబ్లీలో అబద్ధాలు చెబున్నారను. కేజీ మిర్చి కూడా కొనలేదు.👉ఉద్యోగులను చంద్రబాబు దారుణంగా మోసం చేశారు. కోవిడ్‌లాంటి మహమ్మారి టైంలోనూ మెరుగైన జీతాలు.. అదీ సకాలంలో మేం చెల్లించాం. ఇవాళ జీతాల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి. ఏటా ఇచ్చే ఇంక్రిమెంట్లను ఎగ్గొట్టారు. ఐఆర్‌, పీఆర్‌సీ, పెండింగ్‌బకాయిలు ఇవన్నీ ఇవ్వబోమని చంద్రబాబు ప్రభుత్వం చెబుతోంది.👉అయ్యా.. పయ్యావులగారూ.. కరోనా టైంలోనూ సాకులు చెప్పకుండా మేం అన్నీ సక్రమంగా నడిపించాం. ఇప్పుడు మీరు ఎగ్గొటడానికి సాకులు వెతుకుతున్నారు.అప్పులపై.. తప్పులు👉2014-19కి రూ.4 లక్షల కోట్ల అప్పులు ఉంటే.. 2024 నాటికిరూ.6 లక్షల కోట్ల అప్పు ఉంది. కాగ్‌ లెక్కలు కూడా ఇదే స్పష్టం చేశాయి. కానీ, రూ. 10 లక్షల కోట్ల అప్పు ఉందని ప్రచారం చేశారు. గవర్నర్‌ ప్రసంగంలోనూ అబద్ధాలు చెప్పించారు. 👉సాధారణంగా.. బడ్జెట్‌ గ్లాన్స్‌లో పదేళ్ల కిందట అప్పుల లెక్కలు ఉంటాయి. కానీ, లెక్కలు చూపిస్తే ఎక్కడ దొరికిపోతామోనని మొన్నటి బడ్జెట్‌లో అది చూపించలేదు. అంత దుర్మార్గంగా వ్యవహరించారు చంద్రబాబు.👉ఎందుకింత అబద్ధాలు.. ఎందుకింత మోసాలు?. చంద్రబాబు విచ్చలవిడిగా అప్పులు చేస్తున్నారు. ఇప్పుడు అమరావతి పేరు మీద అప్పులు చేస్తున్నారు. 👉రాష్ట్రానికి ఆదాయం రావట్లేదు. చంద్రబాబు, ఆయన మనుషుల జేబుళ్లోకి డబ్బులు వెళ్తున్నాయి. ఆర్థికవేత్తల అంచనాకి కూడా అందకుండా చంద్రబాబు ప్రజలపై బాదుడు బాదబోతున్నారు. అయ్యా స్వామీ.. ఏంది ఈ మోసాలు?.. బడ్జెట్‌ అంతా అంకెల గారడీ.. దీనిని పట్టుకుని బాహుబలి బడ్జెట్‌ అనడం వాళ్లకు మాత్రమే చెల్లుతుంది👉ఇదీ వాస్తవం. ఇబ్బడిముబ్బిడిగా అప్పు. గత మా ప్రభుత్వంలో కన్నా, ఇప్పుడు ఇబ్బడిముబ్బిడిగా చంద్రబాబు అప్పులు చేస్తున్నారు. మా హయాంలో 2023–24లో మేము రూ.62,207 కోట్లు చేస్తే, చంద్రబాబు 2024–25లో చేసిన అప్పు రూ,73,362 కోట్లు. నిజానికి అది ఇంకా ఎక్కువే ఉంది. ఇంకా అమరావతి కోసం చేసిన, చేస్తున్న అప్పులు వేరుగా ఉన్నాయి.ఇబ్బడిముబ్బిడిగా అప్పులు చేస్తున్నారు. మాట్లాడితే, అమరావతి సెల్ఫ్‌ ఫైనాన్సింగ్‌ మోడల్‌ అంటాడు. కానీ, బడ్జెట్‌లోని డిమాండ్, గ్రాంట్స్‌ చూస్తే.. రూ.6 వేల కోట్లు అమరావతి నిర్మాణం కోసమని చూపారు. మరి అలాంటప్పుడు అమరావతి సెల్ఫ్‌ ఫైనాన్సింగ్‌ మోడల్‌ అని ఎందుకు చెప్పాలి?👉రాష్ట్ర ప్రభుత్వ సొంత ఆదాయం (ఎస్‌ఓఆర్‌): 2023–24తో 2024–25ను పోలిస్తే రాష్ట్ర సొంత ఆదాయం ఏకంగా 9.5 శాతం పెరిగిందని చంద్రబాబు చెబుతున్నారు. ఎస్‌ఓఆర్‌ 2023–24లో రూ.93,084 కోట్ల నుంచి రూ.1,01,985 కోట్లకు పెరిగిందని చంద్రబాబు చెబుతున్నారు. కానీ, కాగ్‌ నివేదిక చూస్తే.. ఎస్‌ఓఆర్‌ తగ్గింది. 2025–26లో 37 శాతం పెరుగుదలతో రూ.1,27 లక్షల కోట్లకు ఎస్‌ఓఆర్‌ చేరుతాయంటున్నారు. ఇది మరో పచ్చి అబద్ధం. నిజానికి రాష్ట్ర ఆదాయం పెరగడం లేదు. కేవలం చంద్రబాబు, ఆయన మనుషులకే ఆదాయం వస్తోంది. ఖజానాకు సున్నా.👉నాన్‌ టాక్స్‌ రెవెన్యూ: 2024–25లో మిస్‌లీనియస్‌ జనరల్‌ సర్వీసెస్‌ కింద రూ.7,916 కోట్లు ఆదాయం చూపుతున్నారు. ల్యాండ్‌ రెవెన్యూ కింద రివైజ్డ్‌ అంచనా మేరకు రూ.1341 కోట్లు అని చూపుతున్నారు. కానీ, నిజానికి ఈ 10 నెలల్లో వచ్చింది కేవలం రూ.196 కోట్లు మాత్రమే. మరి ఏ రకంగా ఆ ఆదాయం పొందబోతున్నారు?👉మూల ధన వ్యయం: 2023–24లో 10 నెలల్లో మూలధన వ్యయం కింద మేము రూ.20,942 కోట్లు ఖర్చు చేస్తే, అదే చంద్రబాబు హయాంలో 2024–25లో తొలి 10 నెలల్లో చేసిన వ్యయం కేవలం రూ.10,854 కోట్లు అంటే మైనస్‌ 48 శాతం. ఇది వాస్తవం. కానీ రివైజ్డ్‌ అంచనాలో మరో రూ.15 వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు చూపారు.👉ఈ బడ్జెట్‌ అంకెల గారడీ కాదా?: చంద్రబాబు వచ్చాక ఆదాయం తగ్గింది. రాష్ట్ర సొంత ఆదాయం ఎస్‌ఓఆర్‌ పెరగలేదు. అది పెరగకపోగా, చాలా తగ్గింది. మూల ధన వ్యయం కూడా దారుణంగా తగ్గింది. ఇలాంటి పరిస్థితులున్నా, చంద్రబాబు ఏమంటున్నాడు. జీఎస్‌డీపీ 12.94 శాతం నమోదు అవుతుందని చెబుతున్నాడు. ఎలా సాధ్యం?. వాస్తవాలు ఇలా ఉంటే, ఈ ఏడాది బడ్జెట్‌ రూ.3,22,359 కోట్లు ఎలా సాధ్యం? ఇది అంకెల గారడీ కాదా?. పైగా దీన్ని బాహుభళీ బడ్జెట్‌ అనడం మీకే చెల్లింది. 👉ప్రతిపక్షం ఈ మేర చెప్పలేకపోతే.. ఎలా?. ప్రతిపక్షంలో ఉన్న వారిని అధికారంలో ఉన్నవారు గుర్తించకపోతే.. ఏం సాధించడం కోసం అసెంబ్లీ నడపడం👉ఇంత ప్రసంగంలోనూ నేను ఎవరినీ తిట్టలేదు. లెక్కలతో సహా చూపించాం. మరి సమాధానాలు చెబుతారా? చూద్దాం👉ఎమ్మెల్సీ ఫలితాలపై..ఎమ్మెల్సీ విజయంతో ప్రజల్లో తమకు సానుకూలత ఉందన్న కూటమి ప్రభుత్వ వాదనపై జగన్‌ స్పందించారు. ప్రపంచ చరిత్రలో ఎమ్మెల్సీ ఫలితాల్లో రిగ్గింగ్‌ చేసేవాళ్లను ఎక్కడా చూడలేదు. ఫస్ట్‌ టైం ఇక్కడే చూశా. అయినా ఉత్తరాంధ్ర స్థానంలో టీచర్లు కూటమికి బాగా బుద్ధి చెప్పారు. అక్కడ రిగ్గింగ్‌ కుదరదు కాబట్టి ఓడిపోయారు👉అసెంబ్లీలో రెండే పక్షాలు ఉన్నాయి.. ఒకటి అధికారం.. మరొకటి ప్రతిపక్షం . ప్రధాన ప్రతిపక్ష హోదా మాకు కాకుంటే ఇంకెవరికి ఇస్తారు? . రెండు వైపులా మీరే కొడతామంటే.. ఇదేమైనా డబుల్‌ యాక్షన్‌ సినిమానా?👉గతంలో టీడీపీ నుంచి ఐదుగురు మా వైపు వచ్చారు. మరో పది మందిని లాగుదామంటే నేనే వద్దన్నా.. ఏం మాట్లాడతావో మాట్లాడు.. నేను వింటా అని చంద్రబాబుకి ప్రతిపక్ష హోదా ఇచ్చా. ఇదే ఆయనకు నాకు తేడా👉మైక్‌ ఇస్తేనే ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయి. అది ఇవట్లేదు కాబట్టే ఇలా మీడియా ముందుకు రావాల్సి వస్తోందిపవన్‌పై సెటైర్లు..👉టీడీపీ తర్వాత జనసేన అతిపెద్ద పార్టీ అని.. కాబట్టి తాము ఉండగా ఈ ఐదేళ్లు వైఎస్సార్‌సీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా రాదని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ అన్నారని మీడియా ప్రతినిధులు జగన్‌ వద్ద ప్రస్తావించారు. పవన్‌ కల్యాణ్‌ అనే వ్యక్తి కార్పొరేటర్‌కు ఎక్కువ.. ఎమ్మెల్యేకు తక్కువ. జీవిత కాలంలో ఒక్కసారి ఆయన ఎ‍మ్మెల్యే అయ్యారు అని జగన్‌ సెటైర్‌ వేశారు.

Cabinet Approves Kedarnath Ropeway Project to Drastically Cut Travel Time2
కేదార్‌నాథ్ రోప్‌వేకి కేంద్ర కేబినెట్‌ ఆమోదం

కేదార్‌నాథ్ రోప్‌వే నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రూ .4,081 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్ట్.. 8-9 గంటలు పట్టే కఠినమైన ట్రెక్కింగ్‌ను కేవలం 36 నిమిషాల ప్రయాణానికి తగ్గిస్తుంది. యాత్రికులకు వేగవంతమైన, సురక్షితమైన, మరింత సౌకర్యవంతమైన ప్రత్యామ్నాయాన్ని అందిస్తుంది.ప్రాజెక్టు వివరాలుసోన్ ప్రయాగ్ నుంచి కేదార్ నాథ్ ను కలుపుతూ రోప్ వే 12.9 కిలోమీటర్లు ఉంటుంది. డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్ అండ్ ట్రాన్స్‌ఫర్ (డీబీఎఫ్ఓటీ) మోడల్ కింద ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో దీన్ని అభివృద్ధి చేయనున్నారు. ప్రతి దిశలో గంటకు 1,800 మంది ప్రయాణికులను తీసుకెళ్లగల అధునాతన ట్రై-కేబుల్ డిటాచబుల్ గొండోలా (3ఎస్) సాంకేతిక పరిజ్ఞానాన్ని ఈ ప్రాజెక్టు ఉపయోగిస్తుంది.ప్రయోజనాలుకేదార్‌నాథ్ రోప్ వే యాత్రికులకు గేమ్ ఛేంజర్ గా నిలవనుంది. అన్ని రకాల వాతావరణాల్లో 12 పవిత్ర జ్యోతిర్లింగాలలో ఒకటైన ఈ ఆలయాన్ని సందర్శించే భాగ్యం భక్తులకు కలుగుతుంది. ప్రస్తుతం గౌరీకుండ్ నుంచి కాలినడకన, గుర్రాల ద్వారా లేదా హెలికాఫ్టర్ సర్వీసుల ద్వారా 16 కిలోమీటర్ల ఎత్తుకు వెళ్లాల్సి వస్తోంది. రోప్ వే ఈ ప్రయాణాన్ని సులభతరం చేయడమే కాకుండా వృద్ధులు, దివ్యాంగ యాత్రికులకు మరింత సమ్మిళిత అనుభవాన్ని అందిస్తుంది.అంతేకాకుండా ఈ ప్రాజెక్టు ఈ ప్రాంతంలో పర్యాటకాన్ని పెంచుతుందని, నిర్మాణం, కార్యాచరణ దశలలో గణనీయమైన ఉపాధి అవకాశాలను సృష్టిస్తుందని భావిస్తున్నారు. ఆతిథ్యం, ట్రావెల్‌, ఆహార, పానీయాల వ్యాపారాలు వంటి అనుబంధ పరిశ్రమలు కూడా ప్రయోజనం పొందే అవకాశం ఉంది. ఇది ఈ ప్రాంత సామాజిక-ఆర్థిక అభివృద్ధికి దోహదం చేస్తుంది.పర్యావరణ, ఆర్థిక ప్రభావంసంప్రదాయ రవాణా విధానాలతో ముడిపడి ఉన్న కేదార్‌నాథ్‌ సందర్శనలో పర్యావరణ హితంగా రోప్‌వేను రూపొందించారు. గుర్రాలు, హెలికాప్టర్లపై ఆధారపడటాన్ని తగ్గించడం ద్వారా, సుస్థిర ప్రయాణ పరిష్కారాన్ని అందిస్తూ పెళుసైన హిమాలయ పర్యావరణ వ్యవస్థను పరిరక్షించడం ఈ ప్రాజెక్టు లక్ష్యం.ఆర్థికంగా, కొండ ప్రాంతాలలో సమతుల్య అభివృద్ధిని పెంపొందించే దిశగా ఈ ప్రాజెక్టు ఒక ముఖ్యమైన అడుగు. లాస్ట్ మైల్ కనెక్టివిటీని పెంపొందించడం, మారుమూల ప్రాంతాల్లో వేగవంతమైన ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించాలనే ప్రభుత్వ దార్శనికతకు అనుగుణంగా ఈ ప్రాజెక్ట్‌ ఉంటుంది.మరో రోప్‌వేకీ గ్రీన్‌ సిగ్నల్‌కనెక్టివిటీని పెంచడానికి, పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి మరో రోప్‌వేకి కేంద్ర కేబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఉత్తరాఖండ్‌లోని గోవింద్‌ఘాట్ నుండి హేమకుండ్ సాహిబ్‌జి వరకు 12.4 కిలోమీటర్ల పొడవైన రోప్వే ప్రాజెక్టును అభివృద్ధి చేయడానికి ఆమోదం తెలిపింది. నేషనల్ రోప్ వేస్ డెవలప్ మెంట్ ప్రోగ్రామ్ ‘పర్వతమాల పరియోజన’లో భాగంగా ఈ ప్రాజెక్ట్‌లను కేంద్ర ప్రభుత్వం చేపడుతోంది.రూ.2,730.13 కోట్ల అంచనా వ్యయంతో డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్, ట్రాన్స్ఫర్ (డీబీఎఫ్ఓటీ) మోడల్ కింద ఈ రోప్‌వేను అభివృద్ధి చేయనున్నారు. గోవింద్‌ఘాట్ నుంచి ఘంగారియా స్ట్రెచ్ (10.55 కిలోమీటర్లు) కోసం మోనోకేబుల్ డిటాచబుల్ గోండోలా (ఎండీజీ) వ్యవస్థ, ఘంగారియా నుంచి హేమకుండ్ సాహిబ్ జీ స్ట్రెచ్ (1.85 కిలోమీటర్లు) కోసం ట్రైకబుల్ డిటాచబుల్ గోండోలా (3ఎస్) వ్యవస్థతో సహా అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించనున్నారు. ఈ రోప్ వే యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం అయిన వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్‌కు ప్రవేశ ద్వారంగా మారనుంది.

KSR Comment On Pawan Kalyan Red Book Posani Arrest3
రెడ్‌బుక్‌ రూల్స్‌లో పవన్‌ వాటా! తిలాపాపం.. తలా పిడికెడు

ఏపీలో ఎవరి మనోభావాలు ఎప్పుడు గాయపడతాయో తెలియడం లేదు. దారిన పోతున్న వాళ్లకు బుర్రలో ఓ ఆలోచన పుడుతుంది.. ఆ వెంటనే పోలీసులకు ఫిర్యాదూ చేస్తారు. సదరు వ్యక్తి టీడీపీ, జనసేనలకు చెందిన వాడైతే.. యాక‌్షన్‌ తక్షణం మొదలవుతుంది కూడా. రెడ్‌బుక్‌ రాజ్యాంగాన్ని అమలు చేసేందుకు ఐపీఎస్‌ అధికారులుసహా అంతా వాయువేగంతో స్పందిస్తారు. అదే వైఎస్సార్‌సీపీ వాళ్లు ఫిర్యాదు చేస్తే.. దాన్ని పక్కన పడేయాల్నది రెడ్ బుక్(Red Book) ఆదేశం. ప్రముఖ నటుడు, రాజకీయాలకు దూరంగా ఉంటున్న పోసాని కృష్ణ మురళీ విషయంలో ఇదే జరిగింది. ఎప్పుడో 2017లో పోసాని తనకు ఇచ్చిన నంది అవార్డును తిరస్కరిస్తూ చేసిన కొన్ని వ్యాఖ్యలలో ఒకటి, రెండు కులాల ప్రస్తావన ఉందట. దాన్ని ఆయన 2023లో గుర్తు చేశారట. ఆ విషయం జనసేన నేతగా చెప్పుకుంటున్న మణి అనే వ్యక్తికి సడన్‌గా గుర్తుకొచ్చింది. ఇంకేముంది.. ఫిర్యాదు రెడి.. పోలీసులు హుటాహుటిన హైదరాబాద్ వెళ్లడం.. ఎవరో ఒక బందిపోటును, ఉగ్రవాదిని, తీవ్రమైన నేరాలకు పాల్పడిన వ్యక్తిపట్ల వ్యవహరించినట్లు ఆయన్ను అరెస్టు చేసి 15 గంటలు ప్రయాణించి మరీ తిరుపతి సమీపంలోని రైల్వేకోడూరు వద్ద ఒక పోలీస్ స్టేషన్‌కు తరలించడం... చకచకా జరిగిపోయాయి. అక్కడితో ఆగిపోయిందా.. ఊహూ లేదు. ఒక పెద్ద ఐపీఎస్‌ అధికారి మిగిలిన కేసులన్నిటిని పక్కన పడేసి మరీ పోసానిని తొమ్మిది గంటలపాటు విచారించారు. ఈ రకమైన ఫిర్యాదు.. వ్యవహారం రెండూ రికార్డు బుక్కులకు ఎక్కేస్తాయి. పక్కాగా! అరవై ఆరేళ్ల పోసానిని హింసించడం ద్వారా పోలీసులు రెడ్ బుక్ సృష్టికర్తలను సంతోషపెట్టి ఉండవచ్చు. కానీ.. ఆత్మ పరిశీలన చేసుకుంటే మాత్రం మనోవేదనకు గురి కాక తప్పదు. పోలీసు అధికారులందరిని తప్పు పట్టడం లేదు.పోసాని మీద పెట్టిన కేసులో సెక్షన్లు చూడండి.. సెక్షన్ 111ను న్యాయాధికారి ఆమోదిస్తే నిందితుడికి బెయిల్ రావడం కూడా కష్టం అవుతుంది. ఈ సెక్షన్ ను పోలీసులు దుర్వినియోగం చేస్తున్నారని పలుమార్లు ఉన్నత న్యాయ స్థానాలు హెచ్చరించాయి కూడా. పోసాని ఒక ప్రముఖ కళాకారుడు. వందకుపైగా సినిమాలకు కథలు, సంభాషణలు రాసి పేరు తెచ్చుకున్న వ్యక్తి. రాజకీయంగా కొంతకాలం ప్రజారాజ్యంలోను, ఆ తర్వాత వైఎస్సార్‌సీపీ లోనూ ఉన్నారు. కొంత ఆవేశపరుడు కూడా. రాజకీయ ప్రత్యర్థుల ఘాటు విమర్శలకు బదులిచ్చే క్రమంలో తీవ్ర వ్యాఖ్యలు చేసి ఉండవచ్చు. కానీ.. చిత్రంగా ఆయన ఎవరిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారో వారి మనోభావాలు గాయపడినట్లు ఫిర్యాదులు రాలేదు. వారి అభిమానులో, పార్టీ కార్యకర్తలెవరికో మనోభావాలు గాయపడ్డాయట. దానిపై వారు రాష్ట్ర వ్యాప్తంగా కేసులు పెట్టారు. ఈ నేపథ్యంలో ఈ గొడవలు ఎందుకులే.. అని పోసాని అసలు రాజకీయాల నుంచి తప్పుకున్నట్లు ప్రకటించి, ఇంటికే పరిమితం అయ్యారు. అయినా రెడ్‌ బుక్ టార్చర్ ఆగదట. ఆ విషయాన్ని ఆ బుక్ సృష్టికర్తలే చెప్పారు. పోసానిపై ఆ కేసులు కాకుండా, మరో కొత్త కేసు పెట్టి అరెస్టు చేశారు. ఆ కేసు వివరాలు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. 2017లో నంది అవార్డును తిరస్కరించి తన అభిప్రాయాలు చెప్పడం ఏమిటి? దానిపై జనసేన నేత ఎవరికో ఇప్పుడు బాధ కలగడం ఏమిటి? అసలు ఆయనకు ఈ కేసుతో ఏమి సంబందం? అంతేకాదు.. వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన కుమారుడు భార్గవరెడ్డి చెబితే ఆ భాష వాడారని ఎల్లో మీడియాకు లీక్. దీనిని ఎవరైనా నమ్ముతారా? కేవలం వైసీపీ ముఖ్యనేతలను వేధించాలన్న తలంపు కాకపోతే. టీడీపీ, జనసేన, బీజెపి కూటమి కొత్త ట్రెండ్ సృష్టించింది. వచ్చే ఎన్నికలలో కూటమి ఓడిపోయి వైసీపీ అధికారంలోకి వస్తే కేసులు ఎలా పెట్టవచ్చు.. ఒకటికి పది పోలీస్ స్టేషన్ల చుట్టూ ఎలా తిప్పవచ్చు? పిచ్చి కేసులనైనా ఎలా హ్యాండిల్ చేయవచ్చు? ఒక కేసులో బెయిల్ వస్తే, మరో కేసులో ఎలా అరెస్టు చేయవచ్చు? అన్నది నేర్పినట్లుగా ఉంది. రెడ్ బుక్ అంటే ఈ పిచ్చి యవారాలు చేయడమా అన్న భావన కలిగినా మనం చేయగలిగింది లేదు. ఎప్పుడో నంది అవార్డులపై అభిప్రాయాలు వ్యక్తం చేయడం మీద ఒక ఐపీఎస్‌ అధికారి తొమ్మిది గంటలు విచారణ చేశారంటే ఏమని అనుకోవాలి. కేవలం పోసానిని హింసించడం తప్ప మరొకటి అవుతుందా? పోసాని రిమాండ్ పై తెల్లవారుజాము వరకు గౌరవ న్యాయాదికారి వద్ద వాదనలు జరిగాయి. న్యాయాధికారి ఈ కేసులో సెక్షన్ 111 వర్తించదని చెప్పడం సమంజసంగానే ఉన్నా, ఆ తర్వాత రిమాండ్ కు పంపడం ఎందుకో అర్దం కాదు. ఏడేళ్ల శిక్ష పడే కేసులు అయితేనే రిమాండ్ కు పంపాలన్నది ఉన్నత న్యాయ స్థానం ఇచ్చిన గైడ్ లైన్ అని వైఎస్సార్‌సీపీ తరపు సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకరరెడ్డి చెప్పారు. దానిని గౌరవ కోర్టు పట్టించుకోలేదని ఆయన చెబుతున్నారు. దీనిపై పై ఏమి చేయాలో ఆలోచిస్తున్నామని అన్నారు. లీగల్ పండితుల సంగతేమో కాని, సాధారణ పౌరులకు మాత్రం ఇక్కడే కొన్ని విషయాలు అర్థం కాలేదు.గతంలో.. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపైన, ముఖ్యమంత్రి జగన్ పైన, ఆయన కుటుంబంపైన, మంత్రులపైన ఎవరైనా నీచమైన వ్యాఖ్యలు చేసినప్పుడు అరెస్టులు జరిగితే ఆ కేసుల్లో నిందితులలో కొందరిని రిమాండ్ కు పంపకుండా బెయిల్ ఇచ్చి పంపించిన ఘటనలు అనేకం ఉన్నాయి. ఉదాహరణకు ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న బండారు సత్యనారాయణమూర్తి అప్పటి మంత్రి రోజాను ఉద్దేశించి దారుణమైన అవమానకర వ్యాఖ్య చేస్తే పోలీసులు అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెడితే ఆయనకు వెంటనే బెయిల్ లభించింది. మరికొందరి విషయంలోను అలాగే జరిగింది. అంటే ఆనాటి పోలీస్ వ్యవస్థ గట్టి సెక్షన్ల కింద కేసులు పెట్టలేదా? పెట్టినా న్యాయ వ్యవస్థ సీరియస్ గా తీసుకోలేదా? లేక ఆనాటి ప్రతిపక్ష టీడీపీ, ఎల్లో మీడియా చేసిన ప్రచారాల నేపథ్యంలో ఆయా వ్యవస్థలు ఉదాసీనంగా పనిచేశాయా? టీడీపీ లాయర్ల మాదిరి వైఎస్సార్‌సీపీ లాయర్లు న్యాయ వ్యవస్థను ఒప్పించలేకపోతున్నారా? ఇలా పలు సందేహాలు వస్తాయి. కాని వీటికి సమాధానం ఇప్పట్లో దొరకకపోవచ్చు. ఇదేకాదు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ లు లేదా మరెవరైనా టీడీపీ నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేశారనో, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారనో ఇబ్బడి ముబ్బడిగా కేసులు పెడుతున్న తీరు కూడా భవిష్యత్తులో ప్రభుత్వాలకు మార్గదర్శకం అయ్యే అవకాశం ఉంది. వారు కూడా తమ నేతలను అవమానించడంతో మనోభావాలు దెబ్బతిన్నాయని రాష్ట్రం అంతటా కేసులు పెట్టవచ్చు. ఒక కేసులో బెయిల్ వస్తే,వెంటనే అదుపులోకి తీసుకుని మరిన్ని స్టేషన్ ల చుట్టూ తిప్పవచ్చు. ఇప్పుడు పోసాని విషయంలో కూడా అలాగే చేస్తున్నారు. ఆయనను రాజంపేట నుంచి నరసరావుపేటలో నమోదైన కేసులో అరెస్టు చేసి అక్కడకు తరలించారు. 16 కేసులు నమోదు చేసినందున ఇంకెన్ని జైళ్లకు తిప్పుతారో చూడాలి. ఆయనకు ఆరోగ్య సమస్య వస్తే దానిని అవహేళన చేసేలా ఒక సీఐ స్థాయి అదికారి మాట్లారంటే, ఈ ప్రభుత్వం ఏ రకంగా పనిచేస్తోందో అర్థం చేసుకోవచ్చు. గతంలో అవినీతి కేసులో చంద్రబాబు అరెస్టు అయితే అప్పటి జగన్ ప్రభుత్వం ఎంత జాగ్రత్తగా చూసుకుంది? ఆయన అనేక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని ఏఐజీ ఆస్పత్రి ఇచ్చిన సర్టిఫికెట్ ఆధారంగా బెయిల్ వచ్చింది. కాని చిత్రంగా ఆయన బెయిల్ వచ్చిన వెంటనే గంటల తరబడి ఊరేగింపు చేయగలిగారు. ఇప్పుడు ఆ విషయాలను వైఎస్సార్‌సీపీ నేతలు ప్రస్తావించి పోసాని విషయంలో ఇంత అమానుషంగా వ్యవహరిస్తారా? అని ప్రశ్నిస్తున్నారు. పోసాని కులాల పేరుతో దూషించారట. ప్రజలలో వర్గ విభేదాలు సృష్టించారట.ఆ కేసు వివరాలు చదివితే ఎవరైనా నమ్ముతారా? ఫలానా కమిటీలో ఫలానా కులం వారే ఉన్నారని చెబితే దూషించడం ఎలా అవుతుందో పోలీసులకే తెలియాలి. దానివల్ల ప్రజలలో వర్గ విభేదాలు వచ్చి ఉంటే అప్పుడే గొడవలు అయి ఉండాలి కదా! ఒకాయన ఢిల్లీలో చెట్టు కింద కూర్చుని కులాలు, మతాల గురించి ప్రస్తావించి దూషణలకు దిగితే.. ఆయనపై కేసు పెడితే భావ స్వేఛ్చ అని, ఇంకేదో అని టీడీపీ, జనసేన వారు, ఎల్లో మీడియా గుండెలు బాదుకున్నారే. పైగా ఆయనకు అధికారంలోకి వచ్చాక మంచి పదవి కూడా ఇచ్చారే. అంతెందుకు చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ లు తమ సభలలో దూషణలతో పాటు కొన్నిసార్లు బూతు పదాలు వాడిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. అప్పట్లో జగన్ ప్రభుత్వం వాటిని పట్టించుకోకపోవడం తప్పని ఈ అనుభవాలు చెబుతున్నట్లుగా ఉంది. అంతెందుకు.. ప్రధాని మోదీని టెర్రరిస్టు అని, దేశంలోనే ఉండడానికి అర్హుడు కాదని.. ఇంకా అంతకన్నా ఘాటైన వ్యాఖ్యలు 2019 ఎన్నికల సమయంలో చంద్రబాబు చేస్తే బీజేపీ వారి మనోభావాలు ఎందుకు దెబ్బ తినలేదో తెలియదు! అసలు మోదీ మనోభావాలు గాయపడలేదా? ఇక పవన్‌ కల్యాణ్‌ తనను తెలుగుదేశం పార్టీవారు ఎన్ని రకాలుగా అవమానించింది స్వయంగా ఆయా సభలలో చెప్పారే. అప్పుడు కూడా జనసేన వారి మనోభావాలకు ఏమీ కాలేదా? మళ్లీ అంతా ఒకటయ్యారే! అలాంటిది నంది అవార్డులపై ఏడేళ్ల క్రితం పోసాని చేసిన వ్యాఖ్యలతో ఏదో జరిగిపోయిందా? కోర్టులలో ఏమవుతుందన్నది వేరే విషయం. కాని ప్రజల కోర్టులో మాత్రం కూటమి ప్రభుత్వం ఇలా అక్రమ కేసులు పెడుతున్నందుకు దోషిగానే ఎప్పటికైనా నిలబడుతుంది. మరో సంగతి చెప్పాలి. పదేళ్లపాటు ఎమ్మెల్యేగా ఉన్న వల్లభనేని వంశీపై ఒక కల్పిత కేసు పెట్టి అరెస్టు చేయడమే కాకుండా, జైలులో మరో మనిషితో సంబంధం ఉండని సెల్‌లో పెట్టడం దారుణంగా ఉంది. ఇది కూడా కొత్తగా సృష్టించిన చెడు సంప్రదాయంగానే కనిపిస్తుంది. పోసాని, తదితర వైఎస్సార్‌సీపీ నేతలను ఈ తరహాలో వేధించడం చంద్రబాబు ప్రభుత్వ డైవర్షన్ రాజకీయాలలో భాగమా? లేక లోకేష్ రెడ్ బుక్ లో ఒక ఛాప్టరా? లేక పవన్ కూడా ఆ రెడ్ బుక్‌లో వాటా తీసుకున్నారా? అనేదానిపై రకరకాల విశ్లేషణలు వస్తున్నాయి.శాసనమండలిలో వైసీపీ అడిగిన ప్రశ్నలకు టీడీపీకి సౌండ్ లేకపోవడం, ఫైబర్ నెట్ ఛైర్మన్ జీవీ రెడ్డి రాజీనామా ఉదంతం, పవన్‌ను సంతృప్తిపరచడం ,సూపర్ సిక్స్ హామీల గురించి జనం మాట్లాడుకోకుండా.. ఈ కేసుల గురించి చర్చించుకోవాలనుకోవడం, వైఎస్సార్‌సీపీని అణగతొక్కడం వంటి లక్ష్యాలతో ప్రభుత్వం ఈ రెడ్ బుక్ ను ప్రయోగిస్తోందన్న భావన వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలో వంశీ, పోసాని తదితర బాధిత కుటుంబాలకు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్ నైతిక స్థైర్యం చెప్పడమే కాకుండా, న్యాయపరంగా పూర్తిగా అండగా నిలడడం సబబుగా ఉంది. రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పిన పోసానిని రెడ్ బుక్ పేరుతో గిల్లీ మరీ తిరిగి రాజకీయ రంగంలోకి తీసుకు వస్తున్నారేమో! ఇప్పటికే వందలు, వేల సంఖ్యలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, నేతలు కూటమి రెడ్ బుక్ వల్ల తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. కూటమి సర్కార్ ప్రతీకార రాజకీయాలతో వారంతా రాటుతేలి పార్టీకి మరింత గట్టిగా పని చేసేవారుగా తయార అవుతున్నారనిపిస్తోంది. :::కొమ్మినేని శ్రీనివాసరావు,సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

Kamal Haasan Hindia Comments Amid TN Govt Centre Hindi Jibe4
వాళ్ల కల హిందీయా.. కేంద్రంపై కమల్‌ హాసన్ విసుర్లు‌

ప్రముఖ నటుడు.. తమిళనాడు రాజకీయ నేత కమల్‌ హాసన్‌(Kamal Haasan) కేంద్రంలోని బీజేపీపై భగ్గుమన్నారు. హిందీయేతర రాష్ట్రాలపై బలవంతంగా భాషను రుద్దే ప్రయత్నం ఏమాత్రం సహించరానిదని.. అన్ని రాష్ట్రాలను హిందీ రాష్ట్రాలుగా మార్చేసి లబ్ధి పొందాలని బీజేపీ ప్రయత్నిస్తోందని తీవ్ర ఆరోపణలు చేశారాయన.బుధవారం తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌ అధ్యక్షతన అఖిలపక్ష పార్టీల సమావేశం జరిగింది. ఈ భేటీకి మక్కల్‌ నీది మయ్యం తరఫున కమల్‌ హాసన్‌ పాల్గొన్నారు. జాతీయ విద్యా విధానం హిందీ భాషను తప్పించడంతో పాటు.. 1971 జనాభాల లెక్కల ఆధారంగానే నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) చేపట్టాలని కేంద్రానికి వ్యతిరేకంగా డిమాండ్లతో ఈ భేటీలో ఓ తీర్మానం చేశారు. అనంతరం.. జరిగిన ఎంఎన్‌ఎం పార్టీ మీటింగ్‌లో కమల్‌ కీలక వ్యాఖ్యలు చేశారు.‘‘మన కల ఇండియా. కానీ వాళ్ల కల హిందీయా. బలవంతంగా హిందీని హిందీయేతర ప్రాంతాలకు రుద్దాలన్నదే వాళ్ల ప్రయత్నం. తద్వారా ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తున్నారు. అది నెరవేరకుండా తమిళులంతా ఏకమై పోరాడాలి’’ అని పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారాయన. అయితే హిందీయా కామెంట్లు గతంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ చేయడం గమనార్హం. 2019లో హిందీ దివస్‌ సందర్భంగా కేంద్ర మంత్రి అమిత్‌ షా.. సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్‌ చేశారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్న ఉన్న ఏకైక భారతీయ భాష హిందీనేనని పేర్కొన్నారాయన. అయితే.. ఈ పోస్టుకి నాడు డీఎంకే అధ్యక్షుడిగా ఉన్న స్టాలిన్‌ కౌంటర్‌ ఇచ్చారు. ఇది ఇండియా అని.. హిందీయా కాదని కౌంటర్‌ పోస్ట్‌ చేశారు. ఇదిలా ఉంటే.. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన ద్వారా తక్కువ జనాభా ఉన్న రాష్ట్రాల్లో పార్లమెంట్‌ స్థానాలు తగ్గుతాయంటూ తమిళనాడు కొంతకాలంగా చెబుతోంది. ఈ వ్యాఖ్యలను కేంద్ర హోంమంత్రి అమిత్‌షా కొట్టిపడేశారు. అయినప్పటికీ దీనిపై పలు రాష్ట్రాల తమ ఆందోళనను వ్యక్తంచేస్తున్నాయి. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్రలోని బీజేపీ, ఇతర రాష్ట్రాల్లోని పార్టీల మధ్య మాటల యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనిపై మరో ప్రముఖ నటుడు, తమిళగ వెట్రి కళగం పార్టీ అధినేత విజయ్‌ (Vijay) కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది పార్లమెంటులో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యాన్ని తగ్గిస్తుందదని.. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని అంగీకరించమని ఓ ప్రకటనలో తెలిపారాయన.

Big Twist In Malakpet Sirisha Case5
పాపం శిరీష.. ఆడపడుచు కపటప్రేమ కాటుకు బలైంది

ఆడపడుచు తప్పుడు మార్గంలో వెళ్తుంటే.. వద్దని శిరీష వారించింది. ఇది ఇలాగే కొనసాగితే పరువు పోతుందని చెప్పింది. అలా మంచి చెప్పడమే ఆమె పాలిట శాపమైంది. అదను కోసం ఎదురు చూసిన ఆడపడుచు.. కపట ప్రేమతో శిరీషను నమ్మించి బలిగొంది. నగరంలో చర్చనీయాంశమైన మలక్‌పేట శిరీష హత్య కేసులో సంచలన కోణం వెలుగు చూసింది ఇప్పుడు.. హైదరాబాద్‌, సాక్షి: మలక్‌పేట్ శిరీష(Malakpet Sirisha Case) హత్య కేసులో.. భర్త వినయ్, అతని సోదరి సరిత కలిసి నేరానికి పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో తాజాగా వివాహేతర సంబంధ కోణం వెలుగుచూసింది. ఆ గుట్టు ఎక్కడ బయటపడుతుందోననే భయంతో శిరీషను సరితే హత్య చేసినట్లు తేలింది. వినయ్‌ సోదరి సరిత(Vinay Sister Saritha) భర్త ఒమన్‌లో ఉంటాడు. దీంతో సరిత మరో వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ విషయం తెలియడంతో శిరీష.. పరువు పోతుందని ఆమెను మందలించింది. ఇది మనసులో పెట్టుకుని కోపంతో రగిలిపోయిన సరిత.. అవకాశం కోసం ఎదురు చూసింది. శిరీష కొంతకాలం నుంచి నిద్ర కోసం మత్తు ఇంజక్షన్లు వాడుతోంది. ఈ క్రమంలో ఈనెల 2న సరిత, శిరీష మధ్య మరోసారి ఘర్షణ జరిగింది. అయితే శిరీషకు క్షమాపణలు చెప్పినట్లు నటించిన సరిత.. ఇక నుంచి మంచిగా ఉంటానని నమ్మబలికింది. కాసేపు ఇద్దరూ కబుర్లు చెప్పున్నారు. ఆ ప్రేమ నిజమేనని శిరీష నమ్మింది. ఆపై నిద్రపోయేందుకు శిరీషకు సరితే మత్తు ఇంజక్షన్‌ ఇచ్చింది. అయితే.. నిద్ర మత్తులోకి జారిపోయిన శిరీషకు.. ఓవర్‌డోస్‌ ఇంజెక్షన్‌ ఇచ్చింది సరిత. అలా నిద్రలోనే ఆమె ప్రాణం తీసింది. మరుసటిరోజు శిరీషను లేపేందుకు ప్రయత్నించినట్టు.. ఆపై ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు నాటకం ఆడింది. ఈ నాటకంలో సరిత సోదరుడు, శిరీష భర్త వినయ్‌ కూడా భాగమయ్యాడు. శిరీష గుండెపోటుతో చనిపోయిందని డాక్టర్లతో చెప్పించింది. 👉ఆపై శిరీష సోదరి స్వాతికి.. ఫోన్‌ చేసి, శిరీష ఛాతి నొప్పితో మరణించినట్టు అక్కాతమ్ముడు సమాచారమిచ్చారు. ఈ విషయాన్ని స్వాతి నిజాంపేట్‌లోని మేనమామ మధుకర్‌కు చెప్పింది. అయితే తాను వచ్చేంత వరకు మృతదేహాన్ని ఆస్పత్రిలోనే ఉంచాలని ఆయన సూచించాడు. ఆపై పలుమార్లు ఫోన్‌చేసినా స్పందన లేకుండా పోయింది. దీంతో.. సదరు ఆసుపత్రి వాళ్లను ఆయన సంప్రదించాడు. వాళ్లు మృతదేహాన్ని అంబులెన్స్‌లో తీసుకెళ్తున్నట్లు సమాచారమిచ్చారు. ఆలస్యం చేయకుండా ఆయన అంబులెన్స్‌ డ్రైవర్‌ నెంబర్‌ తీసుకుని ఫోన్‌ చేసి.. ఆరా తీశారు. 👉మృతదేహాన్ని నాగర్‌కర్నూల్‌ దోమలపెంట(Domalpenta)కు తరలిస్తున్నట్లు ఆంబులెన్స్‌ డ్రైవర్‌ చెప్పాడు. దీంతో మధుకర్‌ పోలీసుల సాయంతో.. ఆ అంబులెన్స్‌ను వెనక్కి రప్పించారు. ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి.. ఆపై చాదర్‌ఘాట్‌ పోలీసులకు తన మేనకోడలు శిరీష మృతిపై అనుమానాలు ఉన్నాయని ఫిర్యాదు చేశాడు.👉శిరీష మెడ చుట్టూ గాయాలు ఉండడంతో మధుకర్‌, ఇతర బంధువులు వినయ్‌ను నిలదీశారు. ఛాతీ నొప్పితో శిరీష కుప్పకూలినపుడు సీపీఆర్‌ చేశామని.. ఆ సమయంలో చేతి గోళ్లు గుచ్చుకొని ఉండవచ్చని ఒకసారి.. మృతదేహాన్ని తరలించేటప్పుడు గాయాలైనట్టు మరోసారి పొంతన లేకుండా చెప్పాడు. దీంతో బంధువులను పోలీసులను ఆశ్రయించగా.. వాళ్లు తమదైన శైలిలో విచారించి అసలు విషయం బయటకు లాగారు. తాజాగా వచ్చిన ఉస్మానియా పోస్టు మార్టం రిపోర్టుతో ఈ కేసు మిస్టరీ వీడిపోయింది. 👉హత్య విషయం తెలిసినా దాన్ని బయటపెట్టకుండా సోదరి సరితతో కలిసి శిరీష మృతదేహాన్ని వినయ్‌ మాయం చేయాలనున్నాడు. దీంతో సరితకు సహకరించినందుకు వినయ్‌ను సహనిందితుడిగా చేర్చారు. పాపం శిరీషశిరీష స్వస్థలం హనుమకొండ జిల్లా పరకాల. చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోవడంతో.. ముగ్గురు పిల్లల్లో చిన్నదైన శిరీషను కరీంనగర్‌కు చెందిన ఓ ప్రొఫెసర్‌ దత్తత తీసుకుని చదవించాడు. కాలేజీ రోజుల్లో నాగర్‌కర్నూలు జిల్లా దోమలపెంటకు చెందిన వినయ్ ఆమెను ప్రేమించాడు. అయితే అప్పటికే వినయ్ కు రెండు పెళ్లిళ్లు అయ్యాయి. మొదటిభార్యను చంపేసినట్లుగా, రెండో భార్య ఇతడి టార్చర్ తట్టుకోలేక పారిపోయినట్లుగా పోలీసుల విచారణలో తేలింది. అయితే అవేం తెలియని శిరీష వినయ్‌ ప్రేమ మత్తులో ముగినిపోయింది. 2016లో వినయ్‌ను ప్రేమ వివాహం చేసుకుంది. ఈ పెళ్లి ఇష్టం లేని ప్రొఫెసర్‌ కుటుంబం ఆమెను దూరం పెట్టింది. ఆపై హైదరాబాద్‌ మలక్‌పేట జమున టవర్స్‌లో వినయ్-శిరీష్ కాపురం పెట్టారు. ప్రైవేటు ఉద్యోగం చేసిన వినయ్‌ ప్రస్తుతం ఖాళీగా ఉండగా... శిరీష్ నర్సుగా పని చేస్తూ భర్త, బిడ్డను పోషిస్తోంది. ఇదిలా ఉంటే.. వినయ్‌ తరచూ శిరీషపై అనుమానంతో హింసించేవాడని.. అందుకు ఆడపడుచు సరిత కూడా సహకరించేదని చుట్టుపక్కల వాళ్లు చెబుతున్నారు.

Gill Warned By Umpire Despite Head Clean Catch Reason Is This If Umpire Uses His6
గిల్‌ చేసిన ‘తప్పు’..! టీమిండియాకు శాపమయ్యేది! ఎందుకంటే..

ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లో భారత జట్టు అజేయంగా ఫైనల్‌కు చేరుకుంది. ఆస్ట్రేలియా(India vs Australia)తో మంగళవారం నాటి సెమీస్‌లో సమిష్టి ప్రదర్శనతో అదరగొట్టి.. టైటిల్‌ పోరుకు అర్హత సాధించింది. అయితే, ఈ మ్యాచ్‌కు ముందు భారత మాజీ క్రికెటర్లలో అత్యధిక మంది టీమిండియాకు చేసిన ప్రధాన సూచన.. ఆసీస్‌ విధ్వంసకర వీరుడు ట్రవిస్‌ హెడ్‌ను వీలైనంత త్వరగా అవుట్‌ చేయాలనే!!...ఎందుకంటే.. రోహిత్‌ సేన సొంతగడ్డపై వన్డే వరల్డ్‌కప్‌-2023(ODI World Cup) గెలవకుండా అడ్డుపడి.. ఆస్ట్రేలియాను ఒంటిచేత్తో గెలిపించిన ఘనత అతడి సొంతం. అందుకే ‘తలనొప్పి’ తెచ్చిపెట్టే ఈ బ్యాటర్‌పైనే ముందుగా దృష్టి సారించాలని సంజయ్‌ మంజ్రేకర్‌, హర్భజన్‌ సింగ్‌, దినేశ్‌ కార్తిక్‌ తదితరులు భారత బౌలర్లకు సూచించారు. అందుకు తగ్గట్లుగానే మంగళవారం హెడ్‌ను టీమిండియా తక్కువ స్కోరుకే పెవిలియన్‌కు పంపించింది.టీమిండియా మిస్టరీ స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తి బౌలింగ్‌లో శుబ్‌మన్‌ గిల్‌కు క్యాచ్‌ ఇచ్చి హెడ్‌ అవుటయ్యాడు. మొత్తంగా 33 బంతులు ఎదుర్కొని ఐదు ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 39 పరుగులు చేసి నిష్క్రమించాడు. ‘అతి’ ఆనందంఅయితే, హెడ్‌ ఇచ్చిన క్యాచ్‌ పట్టిన తర్వాత గిల్‌ చేసిన తప్పిదం టీమిండియా కొంపముంచేది. హెడ్‌ క్యాచ్‌ పట్టినప్పుడు శుబ్‌మన్‌ గిల్‌ ప్రదర్శించిన ‘అతి’ ఆనందం అంపైర్‌ నుంచి హెచ్చరికకు గురయ్యేలా చేసింది. క్యాచ్‌ అందుకోగానే కొద్ది సేపయినా తన చేతిలో ఉంచకుండా గిల్‌ బంతిని గాల్లోకి విసిరేశాడు.నిజానికి క్యాచ్‌ పట్టడంలో అతడు ఎక్కడా తడబడలేదు. అయితే బాల్‌ను ఎంతసేపు చేతిలో ఉంచుకోవాలనే విషయంలో నిబంధనలు సరిగ్గా లేకపోయినా... కనీసం 2–3 సెకన్ల పాటు ఫీల్డర్‌ బంతిని తన నియంత్రణలో ఉంచుకోవాలి.క్లీన్‌’గా ఉన్నా.. వార్నింగ్‌ ఎందుకు?ఇదే విషయాన్ని అంపైర్‌ ఇల్లింగ్‌వర్త్‌ ప్రత్యేకంగా గిల్‌కు వివరించాడు. ఇలాంటి సందర్భాల్లో అవుట్‌/నాటౌట్‌ ఇచ్చే విషయంలో అంపైర్‌కు విచక్షణాధికారం ఉంటుంది. ఒకవేళ ఇల్లింగ్‌వర్త్‌ గనుక గిల్‌ వెనువెంటనే బంతిని విసిరేయడాన్ని సీరియస్‌గా తీసుకుని నాటౌట్‌ ఇచ్చి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది. ఒక్కసారి లైఫ్‌ లభిస్తే హెడ్‌ను ఆపటం అంత తేలికేమీ కాదు. అందుకే గిల్‌ చర్య విమర్శలకు దారి తీసింది.ఇదిలా ఉంటే.. ఓపెనర్‌ హెడ్‌ అవుటైన తర్వాత కెప్టెన్‌ , వన్‌డౌన్‌ బ్యాటర్‌ స్టీవ్‌ స్మిత్‌ ఇన్నింగ్స్‌ చక్కదిద్దే బాధ్యతను తీసుకున్నాడు. మార్నస్‌ లబుషేన్‌(29) మరో ఎండ్‌ నుంచి సహకారం అందించగా అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు.నిజానికి అక్షర్‌ పటేల్‌ వేసిన ఇన్నింగ్స్‌ 14వ ఓవర్లో అనూహ్యం చోటు చేసుకుంది. స్మిత్‌ డ్రైవ్‌ చేయగా బంతి అతడి ప్యాడ్‌ల మీదుగా స్టంప్స్‌ను తాకింది. అయితే బెయిల్స్‌ పడకపోవడంతో స్మిత్‌ బతికిపోయాడు. ఆపే ప్రయత్నం చేస్తే తన కాలితోనే స్టంప్స్‌ పడిపోతాయని భావనతో కావచ్చు స్మిత్‌ అలా కూడా చేయలేదు. ఆ సమయంలో అతని స్కోరు 23 పరుగులు. అతని స్కోరు 36 వద్ద ఉన్నప్పుడు షమీ బౌలింగ్‌లో బలంగా షాట్‌ కొట్టగా... తన ఎడమ చేత్తో క్యాచ్‌ పట్టే ప్రయత్నం చేసిన షమీ విఫలమయ్యాడు. అయితే ఇది చాలా కఠినమైన క్యాచ్‌. ఏదేమైనా స్మిత్‌ 73 పరుగుల చేసి షమీ బౌలింగ్‌లో బౌల్డ్‌ కాగా.. అలెక్స్‌ క్యారీ అర్ధ శతకం(61) కారణంగా ఆసీస్‌ 264 పరుగులు చేయగలిగింది.వరల్డ్‌ చాంపియన్స్‌ను నాలుగు వికెట్ల తేడాతో ఓడించిఅయితే, లక్ష్య ఛేదనలో దూకుడుగా ఆరంభించిన టీమిండియా ఆ తర్వాత తడబడ్డప్పటికీ విరాట్‌ కోహ్లి(98 బంతుల్లో 84) అద్భుతం చేశాడు. అతడికి తోడుగా శ్రేయస్‌ అయ్యర్‌(45), వికెట్‌ కీపర్‌ కేఎల్‌ రాహుల్‌(34 బంతుల్లో 42) రాణించారు. గ్లెన్‌ మాక్స్‌వెల్‌ బౌలింగ్‌లో రాహుల్‌ కొట్టిన సిక్సర్‌తో టీమిండియా విజయం ఖరారైంది. ఫలితంగా వరల్డ్‌ చాంపియన్స్‌ను నాలుగు వికెట్ల తేడాతో ఓడించి రోహిత్‌ సేన ఫైనల్‌కూ దూసుకెళ్లింది.చదవండి: #Steve Smith: భార‌త్ చేతిలో ఓట‌మి.. స్టీవ్ స్మిత్ సంచ‌ల‌న నిర్ణ‌యం

Meenakshi Natarajan Review With Adilabad Congress Leaders7
ఎవరు నటిస్తున్నారో తెలుసు.. మీనాక్షి మరో వార్నింగ్‌

సాక్షి, హైదరాబాద్‌: ‘‘ఎవరి పనితీరు ఎంటో నాకు తెలుసు. ఎవరు పనిచేస్తున్నారో, ఎవరు నటిస్తున్నారో తెలుసు. పార్టీ కోసం సమయం కేటాయించాలి. అంతర్గత విషయాలు బయట చర్చించొద్దు’’ అంటూ కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ మీనాక్షి నటరాజన్‌ మరోసారి హెచ్చరించారు. పీసీసీ చీఫ్‌ మహేష్‌గౌడ్‌ అధ్యక్షతన గాంధీభవన్‌లో ఆదిలాబాద్‌ కాంగ్రెస్‌ నేతలతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మీనాక్షి నటరాజన్‌, మంత్రి సీతక్క పాల్గొన్నారు. కాంగ్రెస్‌ అనుబంధ సంఘాల నేతలకు మీనాక్షి దిశానిర్దేశం చేశారు.లోక్‌సభ నియోజకవర్గాల వారీగా నిర్వహిస్తున్న సమీక్షల్లో భాగంగా మంగళవారం గాందీభవన్‌లో మెదక్, మల్కాజ్‌గిరి స్థానాల పరిధిలోని పార్టీ నేతలతో ఆమె విడివిడిగా సమావేశయిన సంగతి తెలిసిందే. పార్టీ లైన్‌ ప్రకారమే ఎవరైనా వెళ్లాల్సి ఉంటుందని, గీత దాటితే ఊరుకునేది లేదని తేల్చి చెప్పారు. పార్టీకి వ్యతిరేకంగా ఎవరు బహిరంగ వ్యాఖ్యలు చేసినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.పార్టీలో అందరికీ అవకాశాలు కల్పిస్తామని, పదేళ్లుగా పార్టీ జెండాను భుజాన మోసిన వారికి తొలి ప్రాధాన్యత ఉంటుందని మీనాక్షి నటరాజన్‌ హామీ ఇచ్చారు. ఫ్లెక్సీల్లో ఫొటోలు కనిపిస్తే సరిపోదని, ప్రజల మధ్యలో ఉండాలని దిశానిర్దేశం చేశారు. పార్టీలో సామాజిక న్యాయం అమలు చేస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణన, ఎస్సీ వర్గీకరణలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు.

LPU 2025 Btech Final Year Student Bags Rs 1.03 Cr Placement Package8
క్యాంపస్ ఇంట‌ర్వ్యూలో జాక్‌పాట్‌!

లవ్లీ ప్రొఫెషనల్‌ యూనివర్శిటీ (ఎల్‌పీయూ)కు ఈ ఏడాది చాలా ఉత్సాహంతో మొదలైంది. ఫైనల్‌ ఇయర్‌ బీటెక్‌ విద్యార్థి రూ.1.03 కోట్ల (1,18,000 డాలర్లు)తో ఉద్యోగావకాశం పొందారు. రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్‌లో B.Tech చేస్తున్న బేతిరెడ్డి నాగవంశీరెడ్డి 2025 మేలో తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేయనున్నారు. ప్రముఖ ఏఐ రోబోటిక్స్ సంస్థలో రోబోటిక్స్ ఇంజినీర్‌గా చేరనున్నారు. ఈ అసాధారణ విజయం అటు పరిశ్రమ వర్గాల్లోనూ ఇటు విద్యా ప్రపంచంలోనూ సంచలనం సృష్టించింది. విద్యార్థులకు సూపర్‌ డూపర్‌ ప్యాకేజీలు అందించగల అత్యున్నత విద్యా సంస్థగా ఎల్‌పీయూ తనస్థానాన్ని సుస్థిరం చేసుకుంది.వేర్వేరు బీటెక్‌ విభాగాల్లోని మొత్తం 7361 మంది విద్యార్థులకు పాలో ఆల్టో నెట్‌వర్క్స్, నుటానిక్స్‌, మైక్రోసాఫ్ట్‌, సిస్కో, పేపాల్‌ అమెజాన్‌ వంటి ప్రతిష్టాత్మక మల్టీనేషనల్‌ కంపెనీల నుంచి ప్లేస్‌మెంట్లు లభించాయి. వీరిలో 1700 మంది టాప్‌ ఎమ్మెన్సీల నుంచి ఏడాదికి రూ.10 లక్షల నుంచి రూ.కోటి వరకూ ప్యాకేజీలు అందాయి. టాప్‌ ఎంఎన్‌సీలు ఇచ్చిన సగటు ప్యాకేజీ రూ.16 లక్షలు (ఏడాదికి). ఉద్యోగ మార్కెట్‌లో ఎల్‌పీయూకు ఉన్న అధిక డిమాండ్‌కు నిదర్శనాలు ఈ ప్లేస్‌మెంట్లు.గత ప్లేస్‌మెంట్‌ సీజన్‌ కూడా ఆకట్టుకునేదే. ఇండస్ట్రీలోనే అతిపెద్ద కంఎనీలు ఆకర్షణీయమైన ప్యాకేజీలు అందించాయి. పాలో ఆల్టో నెట్‌వర్క్స్ ఏకంగా ఏడాదికి రూ.54.75 లక్షల ప్యాకేజీని అందించగా నుటానిక్స్‌ రూ.53 లక్షల ప్యాకేజీ ఇచ్చింది. మైక్రోసాఫ్ట్‌ రూ.52.20 LPA ప్యాకేజీ అందించింది. మొత్తం 1912మందికి ఒకటి కంటే ఎక్కువ ఆఫర్లు అందాయి. 377 మందికి మూడు ఆఫర్లు, 97 మందికి నాలుగు ఆఫర్లు, 18 మందికి ఐదు, ఏడుగురికి ఆరు ఆఫర్లు లభించాయి. ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌ ఇంజినీరింగ్‌ విద్యార్థి ఆదిరెడ్డి వాసుకు నమ్మశక్యం కాని రీతిలో ఏకంగా ఏడు ఆఫర్లు వచ్చాయి. ఇదో అరుదైన, ఆకట్టుకునే రికార్డు.పైన చెప్పుకున్న కంపెనీలు మాత్రమే కాకుండా.. అమెజాన్‌ (రూ.48.64 LPA), ఇన్‌ట్యూట్‌ లిమిటెడ్‌ (రూ. 44.92 LPA), సర్వీస్‌ నౌ ( రూ. 42.86 LPA), సిస్కో (రూ. 40.13 LPA), పేపాల్‌ (రూ. 34.4 LPA), APNA (రూ.34 LPA), కామ్‌వాల్ట్‌ (రూ. 33.42 LPA), స్కేలర్‌ (రూ. 32.50 LPA)లు కూడా స్కిల్‌ డెవెలప్‌మెంట్‌, అత్యాధునిక టెక్నాలజీల్లో నైపుణ్యం అందించేందుకు ఎల్‌పీయూ చూపుతున్న శ్రద్ధకు నిదర్శనంగా నిలుస్తున్నాయి.ఎల్పీయూ పట్టభద్రుల సాంకేతిక పరిజ్ఞాన బుద్ధికుశలత కారణంగా భారీ నియామకాలు చేపట్టే ఆక్సెంచర్‌, క్యాప్‌జెమినీ, టీసీఎస్‌ తదితర ప్రముఖ కంపెనీల నుంచి మంచి డిమాండ్‌ ఉంది. క్యాప్‌జెమినీ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ 736 మంది విద్యార్థులకు అనలిస్ట్‌, సీనియర్‌ అనలిస్ట్‌ రోల్స్‌ కోసం ఉద్యగావకాశం ఇచ్చింది. అలాగే మైండ్‌ట్రీ 467 మంది విద్యార్థులను గ్రాడ్యుయేట్‌ ఇంజినీర్‌ ట్రైనీ పొజిషన్‌ కోసం తీసుకుంది. కాగ్నిజెంట్‌ టెక్నాలజీ సొల్యూషన్స్‌ కూడా 418 మంది విద్యార్థులను జెన్‌సీ రోల్స్‌ కోసం తీసుకుంది. ఎల్‌పీయూ నుంచి విద్యార్థులను ఎంపిక చేసుకున్న ఇతర కంపెనీల్లో ఆక్సెంచర్‌ (279 మంది), టీసీఎస్‌ (260 మంది), కేపీఐటీ టెక్నాలజీస్‌ (229 మంది), డీఎక్స్‌సీ టెక్నాలజీ (203), MPHASIS (94 మంది) కంపెనీలు ఉన్నాయి.రొబోటిక్స్‌, ఆటోమేషన్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌, మెకానికల్‌ ఇంజినీరింగ్‌ వంటి కోర్‌ ఇంజినీరింగ్‌ విభాగాల్లో అత్యధిక స్థాయిలో ప్లేస్‌మెంట్లు లభించాయి. పాలో ఆల్టో నెట్‌వర్క్స్‌, సిలికాన్‌ ల్యాబ్స్‌, ట్రైడెంట్‌గ్రూప్‌, నుటానిక్స్‌, ఆటోడెస్క్‌, అమెజాన్‌ వంటి దిగ్గజ కంపెనీలు ఈ విభాగాల్లోని విద్యార్థులను భారీగా నియమించుకుంటున్నాయి.‘‘ఎప్పటికప్పుడు మారిపోతున్న ప్రపంచానికి అనుగుణంగా విద్యార్థులు విజయం సాధించేలా చేసేందుకు ఎల్‌పీయూ కట్టుబడి ఉంది. ఎల్‌పీయూలో బోధించే అంశాలు కంపెనీల అవసరాలకు తగ్గట్టుగా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఎల్‌పీయూలో సంప్రదాయ పద్ధతులకు అతీతంగా సృజనాత్మక రీతిలో సాగే బోధన విద్యార్థులునిమగ్నమైయెలా ఉంటుంది. విద్యార్థులు పెద్ద సంఖ్యలో టాప్‌ కంపెనీల నుంచి ప్లేస్‌మెంట్‌ ఆఫర్లు పొందుతూండటం దీనికి నిదర్శనం. ఎల్‌పీయూ బోధనాంశాల సత్తానుచాటుతున్నాయి ఈ ప్లేస్‌మెంట్లు. జాతీయ, అంతర్జాతీయ ప్రముఖ సంస్థల్లో విద్యార్థులకు మంచి మంచి ప్లేస్‌మెంట్స్‌ సాధించిన రికార్డు ఎల్‌పీయూ సొంతం. అమెరికా, యూకే, ఆస్ట్రేలియాలల్లోని ఎన్నో పేరొందిన కంపెనీల్లో ఎల్‌పీయూ విద్యార్థులు ఏడాదికి రూ.కోటి కంటే ఎక్కువ ప్యాకేజీలతో పని చేస్తున్నారు. అత్యున్నత నైపుణ్యం కలిగిన ప్రొఫెషనల్స్‌ను తయారు చేయగల ఎల్‌పీయూ శక్తి సామర్థ్యాలకు, అంతర్జాతీయ స్థాయి ఎదుగుదలకు ఇవి నిదర్శనాలు.’’ అని రాజ్యసభ సభ్యులు, ఎల్‌పీయూ ఫౌండర్‌ ఛాన్సలర్‌ డాక్టర్‌ అశోక్‌ కుమార్‌ మిట్టల్‌ వివరించారు.2025 బ్యాచ్‌ కోసం దరఖాస్తు చేసుకునేందుకు చివరితేదీ దగ్గరపడింది. ఎల్‌పీయూలో అడ్మిషన్లకు పోటీ ఎక్కువ. యూనివర్శిటీలో అడ్మిషన్‌ కోసం విద్యార్థులు ప్రవేశ పరీక్ష రాయాల్సి ఉంటుంది. అలాగే ‘ఎల్‌పీయూ నెస్ట్‌ 2025’, ఇంటర్వ్యూలలోనూ పాసైన వారికి మాత్రమే కొన్ని ప్రత్యేక కార్యక్రమాల్లోకి ప్రవేశం లభిస్తుంది. పరీక్ష, అడ్మిషన్‌ ప్రాసెస్‌ గురించి తెలుసుకోవాలనుకునే ఆసక్తిగల విద్యార్థులు https://bit.ly/43340ai ను సందర్శించగలరు.

Singer Kalpana Daughter Comments On Incident9
మా కుటుంబంలో గొడవల్లేవ్.. కల్పన కూతురు కామెంట్స్

టాలీవుడ్ సింగర్ కల్పన ఆత్మహత్యాయత్నం చేసుకోవడం చర్చనీయాంశమైంది. సరైన సమయంలో స్పందించిన పోలీసులు ఈమెని ఆస్పత్రిలో చేర్పించడంతో పరిస్థితి కుదుటపడింది. కల్పన ఆరోగ్యం కూడా నిలకడగానే ఉందని వైద్యులు వెల్లడించారు.(ఇదీ చదవండి: భర్త కాదు కూతురితో సమస్య.. బయటపడుతున్న నిజాలు)కల్పన ఆత్మహత్య యత్నంపై పోలీసులు తొలుత ఆమె భర్తని అనుమానించారు. మంగళవారం సాయంత్రం ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. కానీ కూతురితో జరిగిన వాగ్వాదం వల్లే కల్పన ఇలా చేశారనే విషయం ఒకటి బయటకొచ్చింది. ఇప్పుడు మీడియాతో మాట్లాడిన కల్పన కూతురు.. పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.'నా తల్లి కల్పన ఆత్మహత్యాయత్నం చేయలేదు. డాక్టర్స్ సూచన మేరకు జోల్ ఫ్రెష్ మాత్రలు తీసుకుంటుంది. మాత్రలు ఎక్కువ మోతాదులో తీసుకోవడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లారు. మా కుటుంబంలో ఎలాంటి గొడవలు లేవు. హైదరాబాద్ లో మా అమ్మ లా పీజీ చేస్తోంది. మానసిక ఒత్తిడితో నిద్రలేమికి గురవుతూ ఉండేది' అని కల్పన కూతురు చెప్పుకొచ్చింది. (ఇదీ చదవండి: సింగర్ కల్పనకు ఏమైంది? పోలీసుల అదుపులో భర్త)

Best way to stay fit and lose weight 2:2:1 walking rule10
బరువు తగ్గాలన్నా, ఫిట్‌గా ఉండాలన్నా ది బెస్ట్‌ ఫార్ములా!

బరువు తగ్గాలంటే జీవన శైలి మార్పులు చేసుకోవాలి. వాకింగ్‌, యోగా ఇలాంటి ఏదో ఒక వ్యాయామం తప్పకుండా చేయాలి. అంతేకాదు ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండాలన్నా కూడా వాకింగ్‌కు మించింది లేదు. ఈ వాకింగ్‌లో చాలా పద్దతులు న్నాయి. రోజులో కనీసం 5 వేల అడుగులు వేయాలని, 10 వేల అడుగులు నడిచే వారికి ఊబకాయం అనే సమస్య ఉండదని నిపుణులు చెబుతారు. అయితే ఒక పద్ధతిని పాటిస్తే వాకింగ్‌ బోర్‌ కొట్టకుండా ఉత్సాహంగా ఉంటుందంటున్నారు నిపుణులు. అదేంటో తెలుసుకుందామా మరి.ఫిట్‌గా ఉండటానికి నడక కంటే మెరుగైన వ్యాయామం లేదు. రెగ్యులర్ వాకింగ్ వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. నడక వల్ల బరువు నియంత్రణలో ఉంటుంది. గుండెకు బలం చేకూరుతుంది. కీళ్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఎముకలు, దృఢంగా మారతాయి. కండరాల శక్తి పెరుగుతుంది. బీపీ, షుగర్‌ లాంటి వాటి నుంచి దూరంగా ఉండొచ్చు. వీటన్నింటికి మించి ఒత్తిడి తగ్గుతుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. అయితే, ఈ రోజువారీ నడకలో చిన్న మార్పులు చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలొస్తాయని నిపుణులు అంటున్నారు. అదే 2:2:1 వాకింగ్‌ ఫార్ములాచదవండి: ఇంటి గుట్టు :దెబ్బకి రూ. 80 లక్షలు ఖతం, చివరికి!ఏంటీ 2:2:1 వాకింగ్‌ ఫార్ములా రెండు(2) నిమిషాలు వేగంగా నడవడం (Brisk walking) తరువాతి రెండు(2) నిమిషాలు జాగింగ్‌ (jogging) చేయడంఆ తరువాత ఒక నిమిషం (1) పాటు సాధారణ నడక(normal walking) అన్నమాట. ఈ సైకిల్‌ను రిపీట్‌ చేస్తే అటు బరువు తగ్గడంతోపాటు, ఇటు ఆరోగ్యంగా కూడా ఉండవచ్చు. రోజులో కనీసం అరగంట ఈ పద్ధతినే పాటిస్తే మంచి ఫలితం ఉంటుంది. బరువు తగ్గాలని చూస్తున్న వారికి గేమ్-ఛేంజర్‌గా భావిస్తారు. ప్రయోజనాలుకేలరీలు తొందరగా,ఎక్కువగా బర్న్‌ అవుతాయి. 30 నిమిషాలు బ్రిస్క్ వాకింగ్ చేయడం వల్ల 200 కేలరీలు బర్న్ అవుతాయని పరిశోధనలు చెబుతున్నాయిజీవక్రియ వేగవంతమవుతుంది.వేగంగా నడవడం వల్ల హృదయ స్పందన రేటు పెరుగుతుంది. ఆ తరువాత చేసే జాగింగ్‌ కొవ్వును వేగంగా కరిగించడానికి సాయపడుతుంది. బ్రిస్క్‌ వాకింగ్‌, జాగింగ్‌ ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని బలోపేతం చేస్తుంది. శరీరంలో ఆక్సిజన్ స్తాయి పెరుగుతుంది. నెమ్మదిగా నడుస్తున్నప్పుడు జాగింగ్‌తో అలసిన కండరాలకు విశ్రాంతి లభిస్తుంది. ఈ విధానంలో అలసట రాదు , ఆసక్తికరంగా ఉంటుంది కూడా. నెమ్మదిగా, స్థిరంగా చేసే ఒకే రకమైన వ్యాయామాల కంటే ఇంటర్వెల్-స్టైల్ వ్యాయామాలు కొవ్వును కరిగించ డానికి, సమర్థవంతంగా ఉంటాయని అధ్యయనాల ద్వారా వెల్డైంది. కాబట్టి బరువు తగ్గాలనుకుంటే 2:2:1 ఫార్ములా ఉత్తమమంటున్నారు నిపుణులు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

NRI View all
title
మిసెస్‌ ఇండియా పోటీలకు తెలుగు ఎన్‌ఆర్‌ఐ

సాక్షి, సిటీబ్యూరో: లండన్‌ వేదికగా ప్రముఖ బహుళ జాతి సంస్థలో

title
టంపా వేదికగా నాట్స్‌ అమెరికా తెలుగు సంబరాల ఏర్పాట్లు

title
జర్మనీ పాఠ్యాంశాల్లో తెలుగు విద్యార్థి ప్రస్థానం

ప్రవాస తెలుగు విద్యార్ధి శ్రీనిహల్ తమ్మనకు మరో అరుదైన గౌరవం లభించింది.

title
గల్ఫ్ మృతుల కుటుంబాలతో సీఎం రేవంత్ రెడ్డి సహపంక్తి భోజనం

గల్ఫ్ దేశాలలో మరణించిన కార్మికుల కుటుంబాలతో హైదరాబాద్, ప్రజాభవన్‌లో త్వరలో 'గల్ఫ్ అమరుల సంస్మరణ సభ' ఏర్పాటు చేయాలని రాష్

title
వలస కార్మికుల మృత్యు ఘోష

మోర్తాడ్‌ (బాల్కొండ): జగిత్యాల జిల్లా మల్లాపూర్‌ మండలం రేగుంటకు చెందిన కర్న గణేశ్‌ (55) రెండ్రోజుల కిందట సౌదీ అరేబియాలో

Advertisement

వీడియోలు

Advertisement