Top Stories
ప్రధాన వార్తలు

బాబు ఏడాది పాలనలోనే ఇంతటి దారుణాలు చూడాల్సి వచ్చింది: వైఎస్ జగన్
విశాఖపట్నం, సాక్షి: చంద్రబాబు ఏడాది పాలనలోనే దారుణమైన పరిస్థితులు.. అదీ ఆలయాల్లో చూడాల్సి వస్తోందని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అన్నారు. బుధవారం సింహాచలం బాధిత కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.సింహాచలంలో గోడ కూలిపోయి ఏడుగురు చనిపోయారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చనిపోయారు. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. వైకుంఠ ఏకాదశి నాడు కూడా ఇలాగే చేశారు. నాడు తిరుపతిలో జరిగిన తోపులాటలో ఆరుగురు చనిపోయారు. చందనోత్సవం ఎప్పుడు జరుగుతుందో ఈ ప్రభుత్వానికి తెలీదా?. లక్షల మంది భక్తులు వస్తారని తెలిసి కూడా నిర్లక్ష్యం వహించారు. కనీస సౌకర్యాలు కూడా లేవని భక్తులు చెబుతున్నారు. ఆరు రోజుల కిందట గోడ కట్టడం మొదలుపెట్టారు. రెండు రోజుల కిందట పూర్తి చేశారు. పదడుగుల ఎత్తు.. డెబ్బై అడుగుల పొడవుతో గోడ కట్టారు. కనీసం ఎటువంటి టెండర్లు లేకుండా ఈ గోడ పని పూర్తి చేశారు. దాదాపుగా సంవత్సరం అయ్యింది చంద్రబాబు అధికారంలోకి వచ్చి. చందనోత్సవం ఎప్పుడు జరుగుతుందో చంద్రబాబుకి తెలియదా?. జరుగుతుందని తెలిసి కూడా ముందే గోడ కట్టే కార్యక్రమం చేపట్టలేకపోయారు?. ముందస్తు ఏర్పాట్లపై ఎందుకు జాగ్రత్తలు తీసుకోలేదు. మంత్రుల కమిటీ ఏం చేసిందసలు?. కాంక్రీట్ గోడతో కట్టాల్సిన చోట.. ఫ్లైయాష్ ఇటుకలతో నిర్మించారు. కనీసం నాణ్యంగా ఆ గోడను ఎందుకు నిర్మించలేకపోయారు?. వర్షం పడిందని తెలుసు. చందనోత్సవం సందర్భంగా ప్రతీసారి వర్షం పడుతుందని తెలుసు. అయినా రెండు రోజుల కిందట కట్టిన ఆ గోడ పక్కనే క్యూ లైన్ పెట్టారు. చంద్రబాబు ఏడాది పాలనలో దారుణాలు చూడాల్సి వస్తోంది. రాజకీయాల కోసం తిరుమల లడ్డూ ప్రసాదంపై తప్పుడు ప్రచారం చేశారు. తొక్కిసలాట ఘటనలో ఏడుగురిని బలిగొన్నారు. తిరుమల గోశాలలో గోవులు కూడా చనిపోయాయి. కాశినాయన గుడిని బుల్డోజర్లతో కూల్చేశారు. శ్రీకాకుళం జిల్లాలోని శ్రీకూర్మం ఆలయంలో తాబేళ్లు మృతి చెందాయి. అంతకు ముందు గోదావరి పుష్కరాల్లో 29 మందిని బలిగొన్నారు. ఇన్ని జరుగుతున్నా చర్యలు లేవు. ఎందుకంటే అన్నింటిలోనూ చంద్రబాబే దోషి. అందుకే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తారు. ఈ ఘటనలోనూ నిందను మాపైకి నెట్టే యత్నం చేశారు. కానీ, వాళ్ల హయాంలో.. అదీ రెండు రోజుల కిందటే ఆ గోడ కట్టిందని తేలింది. అయినా చంద్రబాబులో ఎక్కడా పశ్చాత్తాపం కనిపించడం లేదు.ప్రభుత్వం అంటే ప్రజలకు భరోసా ఇచ్చేదిగా ఉండాలి. మొక్కుబడిగా రూ.25 లక్షల పరిహారం ప్రకటించారు. జగన్ వస్తున్నాడనే ఈ ప్రకటన చేశారు. ప్రభుత్వం తప్పిదం కాబట్టి పరిహారం పెంచి ఇవ్వాలి. మా ప్రభుత్వంలో ఇలాంటి ప్రమాదాలు జరిగితే.. బాధ్యతగా అధిక పరిహారం చెల్లించాం. ఈ బాధిత కుటుంబాలకు కూడా మా ప్రభుత్వం వచ్చాక ఆ పని తప్పకుండా చేస్తాం’’ అని వైఎస్ జగన్ ప్రకటించారు. కానీ, బాధ్యులపైనా కఠిన చర్యలు తీసుకుంటేనే ఇలాంటివి పునరావృతం కావని చంద్రబాబుకి వైఎస్ జగన్ హితవు పలికారు.

ఉమామహేష్, శైలజకు నివాళి.. జగన్ భావోద్వేగం
విశాఖపట్నం, సాక్షి: సింహాచలం బాధిత కుటుంబాన్ని పరామర్శించే క్రమంలో వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy) భావోద్వేగానికి లోనయ్యారు. ఆ కుటుంబ సభ్యులను ఓదారుస్తూ ధైర్యం చెప్పారు. సింహాచలంలో దైవదర్శనానికి వెళ్లిన పిల్లా ఉమామహేష్, అతని భార్య శైలజ గోడ కూలిన ఘటనలో మృతి చెందారు. వాళ్ల కుటుంబ సభ్యులను ఓదార్చేందుకు వైఎస్ జగన్ మధురవాడలోని చంద్రంపాలెంకు వెళ్లారు. ఆయన్ని చూసి ఆ కుటుంబ సభ్యులు భావోద్వేగాన్ని లోనయ్యారు. దీంతో ఆయన వాళ్లను హత్తుకుని ఓదార్చారు. అనంతరం.. ఉమా మహేశ్వరరావు, శైలజ భౌతికకాయాలకు నివాళి అర్పించి మీడియాతో మాట్లాడారాయన.

ఆ టికెట్‌తో ఇక రైలు ఎక్కలేరు! మే 1 నుంచి కొత్త రూలు..
దేశంలో కోట్లాది మంది రైలు ప్రయాణికులను ప్రభావితం చేసే కొత్త రూల్‌ను భారతీయ రైల్వే ప్రవేశపెడుతోంది. రైళ్లలో ప్రయాణ సౌకర్యాన్ని పెంచడం, రిజర్వ్డ్ కోచ్‌లలో రద్దీని నివారించడం లక్ష్యంగా ఇండియన్ రైల్వే మే 1 నుండి కొత్త నిబంధనను అమలు చేస్తోంది. ఈ నిబంధన ప్రకారం వెయిటింగ్ లిస్ట్ టికెట్లు ఉన్న ప్రయాణికులను ఇకపై స్లీపర్, ఏసీ బోగీల్లో అనుమతించరు.వీరిపైనే ప్రభావంరైల్వే అమలు చేస్తున్న ఈ కొత్త మార్గదర్శకాలు ముఖ్యంగా రైల్వే కౌంటర్ల నుంచి వెయిటింగ్ లిస్ట్ టికెట్లు బుక్ చేసుకునే వారిపై ప్రభావం చూపనున్నాయి. ఐఆర్సీటీసీ, ఇతర అధీకృత వెబ్సైట్ల ద్వారా ఆన్లైన్ చేసుకున్న టికెట్లు కన్ఫర్మ్ కాకపోతే ఆటోమేటిక్ అవి రద్దవుతాయి. ఆఫ్‌లైన్‌లో రైల్వే కౌంటర్ల ద్వారా బుక్ చేసుకున్న టికెట్లు కన్ఫర్మ్ కాకపోయినప్పటికీ ప్రయాణికులు వాటితో రైలు ఎక్కే అవకాశం ఉండేది. అలా ఎక్కిన ప్రయాణికులు ఎక్కడైనా ఖాళీ ఉంటే టీటీఈ ద్వారా వాటిని పొందే వీలు ఉండేది. అయితే ఇలా ఎక్కువ మంది స్లీపర్ లేదా ఏసీ బోగీల్లోకి ప్రవేశించి అన్ రిజర్వ్ డ్ సీట్లను ఆక్రమించుకోవడం లేదా ఆయా కోచ్‌లలో రద్దీకి కారణమవుతున్నారు.టీటీఈలకు అధికారాలుకొత్త ఆదేశాల ప్రకారం.. ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్లకు (టీటీఈ) భారతీయ రైల్వే కొన్ని అధికారాలు ఇచ్చింది. వెయిటింగ్ లిస్ట్ టికెట్లతో రిజర్వ్డ్ స్లీపర్ లేదా ఏసీ సీట్లను ఆక్రమించుకున్న ప్రయాణికులకు జరిమానా విధించవచ్చు. అలాగే అటువంటి ప్రయాణికులను అన్రిజర్వ్డ్ టికెట్ హోల్డర్లు ప్రయాణించే జనరల్ కోచ్‌కు పంపించే అధికారం టీటీఈలకు ఉంటుంది.ఈ నిబంధన ఎందుకంటే..ప్రయాణికుల సౌకర్యార్థం ఈ నిబంధనను అమలు చేస్తున్నామని నార్త్ వెస్ట్రన్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ కెప్టెన్ శశికిరణ్ వివరించారు. వెయిటింగ్ టికెట్ హోల్డర్లు కోచ్‌లలోకి ప్రవేశించి రిజర్వ్డ్ సీట్లను బలవంతంగా ఆక్రమించుకుంటున్నారని, ప్రయాణికులు తిరిగేందుకు కూడా వీలులేకుండా మార్గాలను స్తంభింపజేస్తున్నారని తరచూ ఫిర్యాదులు వస్తున్నాయని పేర్కొన్నారు.ఈ కొత్త నిబంధనతో రైళ్లలో ఎక్కేందుకు వెయిటింగ్ లిస్ట్ టికెట్లపై ఆధారపడే ప్రయాణికులు తమ ప్రయాణ ప్రణాళికలను పునరాలోచించుకోవాల్సి ఉంటుంది. ఇకపై స్లీపర్, ఏసీ బోగీల్లో ప్రయాణించాలంటే కన్ఫర్మ్ టికెట్ తప్పనిసరి. లేదంటే మీ ట్రిప్ క్యాన్సిల్ చేసుకోవడమో లేదా జనరల్ అన్ రిజర్వ్డ్ క్లాస్ లో ట్రావెల్ చేయడమో చేయాల్సి ఉంటుంది.

ఆపరేషన్ కగార్ సక్సెస్.. కర్రెగుట్టలపై జాతీయ జెండా
ములుగు, సాక్షి: తొమ్మిది రోజులపాటు కొనసాగిన ఆపరేషన్ కగార్‌లో భద్రతా బలగాలు మావోయిస్టులపై పైచేయి సాధించాయి. కర్రెగుట్టలపై మొత్తానికి పట్టు సాధించాయి. బుధవారం సాయుధ బలగాలు గుట్టలపై జాతీయ జెండాను ఎగరేశాయి. అంతేకాదు.. త్వరలో అక్కడ బేస్ క్యాంప్ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. కర్రెగుట్ట అటు ఛత్తీస్‌గఢ్ బీజాపూర్ జిల్లా ఊసూర్ బ్లాక్ పరిధిలో.. ఇటు ములుగు వాజేడు మండలం పరిధిలో విస్తరించి ఉన్నాయి. ఆపరేషన్ కగార్‌లో భాగంగా 10 వేలకు పైగా సాయుధ బలగాల సిబ్బందితో కర్రెలగుట్టను చుట్టుముట్టారు. డ్రోన్లు, హెలికాఫ్టర్లతో కూంబింగ్ కొనసాగించారు. ఈ క్రమంలో జరిగిన ఎదురు కాల్పుల్లో పలువురు మావోయిస్టులు మరణించిన సంగతీ తెలిసిందే.డీఆర్జీ బస్తర్ ఫైటర్, కోబ్రా, సీఆర్పీఎఫ్, ఎస్టీఎఫ్ సైనికులు ఈ కూంబింగ్‌లో పాల్గొన్నారు. ఈ క్రమంలో రాయ్‌పూర్ నుంచి ఆపరేషన్‌ను పర్యవేక్షించిన ఐబీ చీఫ్ ఇవాళ నేరుగా కర్రెలగుట్టకు చేరుకున్నట్లు సమాచారం. ఇప్పటిదాకా ఆపరేషన్‌లో పాల్గొన్న టీం మొత్తాన్ని వెనక్కి రప్పించి.. అక్కడికి కొత్త టీంను మోహరింపజేయనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే త్వరలో సీఆర్పీఎఫ్ అక్కడ బేస్ క్యాంప్‌ను ఏర్పాటు చేయనుంది. ఇటు తెలంగాణ, అటు ఛత్తీస్‌గఢ్‌లకు ఉపయోగపడేలా ఈ బేస్ ఉండనున్నట్లు సమాచారం.

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు
ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. జనగణనలోనే కుల గణన కూడా చేయడానికి కేబినెట్ అంగీకారం తెలిపింది. వచ్చే జనాభా లెక్కల్లో కులగణనను చేరుస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది జనగణన చేపట్టాలని కేబినెట్ నిర్ణయించింది. దీనిలో భాగంగా జనగణనతో కలిపి కులగణన కూడా చేయడానికి నిశ్చయించింది. 2019లోనే జనగణన చేయాల్సి ఉన్నప్పటికీ కరోనా కారణంగా అప్పుడు ముందుడగు పడలేదు. దాంతో పాటు షిల్లాంగ్-సిల్చారు జాతీయ రహదారి నిర్మాణానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. 22,864 కోట్ల రూపాయల ఖర్చుతో 166 కిలోమీటర్ల మేర గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఫలితంగా త్రిపుర, మిజోరం, మణిపూర్, అస్సాంలోని బరాక్ వ్యాలీకి కనెక్టివిటీ పెరగనుంది. అదే సమయంలో చెరకు మద్దతు ధర క్వింటా రూ. 350 పెంపునకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కేబినెట్ భేటీ అనంతరం మంత్రి మండలి నిర్ణయాలను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.పహల్గామ్ పై నో డిస్కషన్.. ఓన్లీ సైలెన్స్‌అయితే ఈరోజు జరిగిన కేంద్ర కేబినెట్ భేటీలో పహల్గామ్ ఉగ్రదాడి ఘటనకు సంబంధించి కేబినెట్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అంతా భావించారు. అయితే నేటి భేటీలో ఆ ఉగ్రదాడి ఘటనకు సంబంధించి ఎటువంటి చర్చ లేకుండా భేటీ ముగిసింది. దీనిపై కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఎటువంటి ప్రకటన చేయలేదు. దాంతో దాడికి సంబంధించి ప్రతిచర్యలపై కేంద్రం మౌనం పాటిస్తూ ముందుకెళ్లడం కూడా వ్యూహాత్మక ఎత్తుగడగా విశ్లేషకులు భావిస్తున్నారు.కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఏమన్నారంటే..జన గణనలో కులగణన చేయాలని క్యాబినెట్ నిర్ణయంవచ్చే జనాభా లెక్కల్లో కుల గణన కాలమ్ చేర్చాలని నిర్ణయంబీహార్, బెంగాల్, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మోడీ కీలక నిర్ణయంకుల గణన కోసం ఎన్నో ఏళ్లుగా ఉద్యమాలు చేస్తున్న బిసి సంఘాలుకుల గణనను కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎప్పుడూ వ్యతిరేకిస్తూనే ఉన్నాయి.స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి జరిగిన అన్ని జనాభా గణన కార్యకలాపాలలో కులాన్ని చేర్చలేదు.కుల గణన అంశాన్ని కేబినెట్లో పరిశీలిస్తామని 2010లో అప్పటి ప్రధాని దివంగత డాక్టర్ మన్మోహన్ సింగ్ లోక్‌సభకు హామీ ఇచ్చారు.ఈ అంశాన్ని పరిశీలించేందుకు మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేశారు. చాలా రాజకీయ పార్టీలు కుల గణనను సిఫార్సు చేశాయి.కుల గణనకు బదులు సర్వే మాత్రమే చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఆ సర్వేనే SECC అంటారు.కాంగ్రెస్ మరియు దాని భారత కూటమి భాగస్వామ్య పక్షాలు కుల గణనను రాజకీయ సాధనంగా మాత్రమే ఉపయోగించుకున్నాయని బాగా అర్థమైంది.భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 246 ప్రకారం, సబ్జెక్ట్ సెన్సస్ ఏడవ షెడ్యూల్లోని యూనియన్ జాబితాలో 69గా జాబితా చేయబడింది. భారత రాజ్యాంగం ప్రకారం, జనాభా గణన అనేది యూనియన్ సబ్జెక్ట్.కొన్ని రాష్ట్రాలు కులాలను లెక్కించేందుకు సర్వేలు నిర్వహించాయి. కొన్ని రాష్ట్రాలు దీన్ని బాగా చేశాయి, మరికొన్ని పారదర్శకంగా రాజకీయ కోణం నుండి ఇటువంటి సర్వేలను నిర్వహించాయి.ఇలాంటి సర్వేలు సమాజంలో అనుమానాలకు తావిస్తున్నాయి.ఈ వాస్తవాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని, రాజకీయాల వల్ల మన సామాజిక వ్యవస్థకు భంగం కలగకుండా చూసేందుకు, కుల గణనను సర్వేలకు బదులు పారదర్శకంగా జనాభా గణనలో చేర్చాలి.ఇది దేశం పురోగమిస్తూనే మన సమాజం యొక్క సామాజిక మరియు ఆర్థిక నిర్మాణాన్ని బలోపేతం చేస్తుంది.ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీజీ నేతృత్వంలో, రాజకీయ వ్యవహారాల క్యాబినెట్ కమిటీ, ఈ రోజు (30 ఏప్రిల్, 2025) రాబోయే జనాభా గణనలో కుల గణనను చేర్చాలని నిర్ణయించింది.గతంలో మా ప్రభుత్వం సమాజంలోని ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10% రిజర్వేషన్లు ప్రవేశపెట్టినప్పుడు సమాజంలోని ఏ వర్గానికి ఒత్తిడి కలిగించకుండా మన ప్రభుత్వం మన సమాజం మరియు దేశం యొక్క విలువలు మరియు ప్రయోజనాలకు కట్టుబడి ఉందని ఇది నిరూపిస్తుంది.

పిల్లలు పుట్టరని మధుబాలను వదిలేసిన స్టార్ హీరో.. చివరికేమైంది?
మొఘల్ ఇ ఆజామ్.. 1960లో వచ్చిన అద్భుతమైన సినిమా ఇది. సలీం, అనార్కలిగా దిలీప్ కుమార్ (Dilip Kumar), మధుబాల (Madhubala) నటించారు. ఆన్‌స్క్రీన్‌పై సూపర్ హిట్ జోడీగా పేరు తెచ్చుకున్న వీళ్లు నిజ జీవితంలో కూడా ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుని జీవితాంతం కలిసుండాలనుకున్నారు. దంపతులుగా కనిపిస్తారనుకుంటే విడిపోయిన ప్రేమ పక్షులుగా మారారు. అసలు ఈ జంట ఎందుకు విడిపోయిందన్న విషయాన్ని ప్రముఖ నటి ముంతాజ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది.పిల్లలు పుట్టరని..ముంతాజ్ మాట్లాడుతూ.. మధుబాల దిలీప్‌కు బ్రేకప్ చెప్పలేదు. అతడే ఆమెతో ప్రేమబంధాన్ని తెంచేసుకున్నాడు. తనకు పిల్లలు పుట్టరని వదిలేసి.. సైరా భానును పెళ్లి చేసుకున్నాడు. సైరా ఎంతో మంచి మనిషి. దిలీప్ అంటే ఆమెకు ఎంతో అభిమానం, ప్రేమ. అతడి చివరి శ్వాస వరకు ఎంతో జాగ్రత్తగా చూసుకుంది. వీళ్లిద్దరి మధ్య వయసు వ్యత్యాసం ఎక్కువ. కానీ ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ వల్లే జీవితాంతం కలిసి కొనసాగారు.మొఘల్ ఇ ఆజామ్ సినిమాలో ఓ దృశ్యంఅందుకే వదిలేశాడుదిలీప్కు పిల్లలంటే ఇష్టం. పిల్లలు కావాలన్న కోరికతోనే సైరాను పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం నాకు స్వయంగా మధుబాల చెప్పింది. అప్పుడప్పుడు తనను కలుస్తూ ఉండేదాన్ని. తను సంతోషంగా కనిపించేది కాదు. నాతో ఏమనేదంటే.. జీవితంలో నేను ప్రేమించిన ఏకైక వ్యక్తి యూసఫ్ (దిలీప్ కుమార్‌ను యూసఫ్ అని పిల్చుకునేది). నేను ఎప్పటికీ తల్లిని కానని తెలిసి నన్ను ఒంటరిగా వదిలేశాడు. నాకున్న గుండె సమస్య వల్ల పిల్లల్ని కంటే నేను బతకనని చెప్పారు.ఏనాడూ నిందించలేదుఅందుకే ఇలాంటి పరిస్థితి వచ్చింది. అయినా ఏ మగవాడికైనా పిల్లలు కావాలని ఉంటుంది కదా.. ఇందులో అతడి తప్పేముందిలే అనుకునేదే తప్ప దిలీప్‌ను నిందించేది కాదు. కానీ విషాదమేంటంటే.. దిలీప్- సైరా భానులకు సంతానమే లేదు. ఈ విషయంలో సైరాను చూస్తుంటే బాధగా అనిపించేది. కనీసం ఒక్కరైనా పుట్టుంటే వాళ్లెంతో మురిపెంగా చూసుకునేవాళ్లు అని ముంతాజ్ చెప్పుకొచ్చింది.వేర్వేరు దారుల్లో ప్రేమజంటదిలీప్ కుమార్ - మధుబాల దాదాపు దశాబ్దంపాటు కలిసున్నారు. వీరి బ్రేకప్ అనంతరం మధుబాల.. 1960లో కిషోర్ కుమార్‌ను పెళ్లి చేసుకుంది. 1969లో గుండెపోటుతో మరణించింది. దిలీప్ కుమార్ 1966లో తనకంటే 22 ఏళ్లు చిన్నదైన సైరా భానును పెళ్లి చేసుకున్నాడు. 1981లో రెహ్మాన్‌ను రెండో పెళ్లి చేసుకోగా 1983లో ఈమెకు విడాకులిచ్చేశాడు. తర్వాత సైరా భానుతోనే కలిసున్న దిలీప్ కుమార్ 2021లో మరణించాడు.చదవండి: అమ్మ చనిపోయి 5 నెలలు.. వీడియో డిలీట్ చేయమని అడుక్కున్నా: సోహైల్

'మైండ్‌బ్లోయింగ్ టాలెంట్'..! అటు ఇంజనీరింగ్, ఇటు మెడిసిన్..
జేఈఈ, నీట్ యూజీ వంటి ప్రతిష్టాత్మక పరీక్షలు ఎంత కఠినంగా ఉంటాయో తెలిసిందే. ఇందులో మంచి ర్యాంకు తెచ్చుకోవడం అనేది ఎందరో యువత కల. ఇంజనీరింగ్ వాళ్లు, జేఈఈ, మెడిసిన్ వాళ్లు నీట్ రాయడం జరుగుతుంది. అయితే ఈ అమ్మాయికి ఇంజనీరింగ్, మెడిసిన్ రెండూ ఇష్టమట. నిజానికి ఈ రెండు రంగాలు అత్యంత విరుద్ధమైనవి. ఏదో ఒక్కదాంట్లో రాణించడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. అలాంటిది ఏకంగా రెండింటిలోనూ బాగా రాణించడమే గాక రెండింటికి సంబంధించిన ఎంట్రెన్స్ టెస్ట్‌ల్లో కూడా మంచి ర్యాంకు సాధించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. పైగా అవి రెండు మిక్స్‌అయ్యి ఉండే కోర్సును అందించే కాలేజ్ కోసం అన్వేషించి మరీ అక్కడ సీటు సంపాదించింది. ఎంచక్కా చదివేస్తోంది కూడా. ఇంతకీ ఆ 'టాలెంటెడ్ గర్ల్' ఎవరంటే..?మన హైదరాబాద్‌కి చెందిన అమ్మాయి మింకూరి రిధిమా రెడ్డి. 10వ తరగతి వరకు తేజస్వి విద్యారణ్యలో, ఇంటర్ జాన్సన్ గ్రామర్ స్కూల్లో చదువుకుంది. ఆ తర్వాత జేఈఈ, నీటీ యజీ, బిట్‌శాట్, వీఐటీఈఈఈ వంటి ప్రతిష్టాత్మక పరీక్షలన్నీ రాసింది. వాటన్నింటిలోనూ రిధిమాకు మంచి మార్కులే వచ్చాయి. అయితే ఆమె ఇంజనీరింగ్(Engineering), మెడిసిన్(Medicine) రంగాలు రెండూ.. అమిత ఇష్టం. అవి రెండు తనకు ఎంతో ఇంట్రస్టింగ్ సబ్జెక్టులని చెబుతోంది రిధిమా. అందుకోసం అని అవి రెండూ కలిపి అందించే కాలేజ్‌ల కోసం అన్వేషించి మరీ ఐఐటీ మద్రాస్‌ని సెలెక్ట్ చేసుకుంది. అక్కడ జాయిన్ అయ్యేందుకు ఐఐఎసీఈఆర్ ఆప్టిట్యూడ్ టెస్ట్(ఐఏటీ)కి హాజరు కావాలని నిర్ణయించుకుంది. రిధిమా అనుకున్నట్లుగానే ఆ టెస్టలో మెరుగ్గా రాణించి ఆ కాలేజ్‌లో సీటు సంపాదించింది. అలా రిధిమా 2023లో ఐఐటీ మద్రాస్( IIT Madras)లో మెడికల్ సైన్స్, ఇజనీరింగ్ సైన్స్ కలగలిసిన కోర్సులో జాయిన్ అయ్యింది. ప్రస్తుతం రెండో సంవత్సరం చదువుతోంది. ఈ మేరకు రిధిమా మాట్లాడుతూ..తాను ఐఐటీ మద్రాస్‌లోని iGEM (ఇంటర్నేషనల్ జెనెటికల్లీ ఇంజనీర్డ్ మెషిన్) బృందంలో భాగం అని చెప్పుకొచ్చింది. ఇది జన్యుశాస్త్రం, పరిశోధన పట్ల అమిత ఇష్టమైన టీమ్ అని చెప్పుకొచ్చింది. తాము ప్రది ఏడాది జన్యు ఇంజనీరింగ్ ఆధారిత ప్రాజెక్ట్‌పై పనిచేస్తామని పేర్కొంది. ఆ ప్రాజెక్ట్‌లను పారిస్‌లోని గ్రాండ్ జాంబోరీలో ప్రదరిస్తామని తెలిపింది. తాను ఈ ఐఐటీలో ఉండటం వల్లే ప్రజలతో మరింత సమర్ధవంతంగా కమ్యూనికేట్ చేయడం సహకరించం నేర్చుకున్నాని అంటోంది. అలాగే క్లబ్‌లు, టెక్నికల్ టీమ్‌లలో పాల్గొనడం, ఈవెంట్ల నిర్వహించడం వల్ల కంఫర్ట్‌జోన్ నుంచి బయటపడటమే గాక సామాజికంగా ఎలా వ్యవహరించాలో తెలుసుకోగలిగానని చెబుతోంది.(చదవండి: సివిల్స్‌లో సక్సెస్ కాలేదు.. కానీ బిజినెస్‌లో ఇవాళ ఆ ఇద్దరూ..!)

క్రికెట్ నీకు రెండో ఛాన్స్ ఇచ్చింది.. కానీ..
ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ కరుణ్ నాయర్ ఆట తీరును భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా విమర్శించాడు. ఐపీఎల్-2025 (IPL 2025) రూపంలో తనకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంలో కరుణ్ విఫలమవుతున్నాడని పేర్కొన్నాడు. ఇలాగే కొనసాగితే వచ్చే సీజన్లో ఆడటం కష్టమేనని అభిప్రాయపడ్డాడు.కాగా 2013 నుంచి ఐపీఎల్లో ఆడుతున్న కరుణ్ నాయర్ (Karun Nair).. ఇటీవలి కాలంలో దేశవాళీ క్రికెట్లో దుమ్ములేపాడు. విదర్భ తరఫున రంజీల్లో, వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో వరుస శతకాలతో ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలో కరుణ్‌కు మళ్లీ జాతీయ జట్టులో చోటు ఇవ్వాలనే డిమాండ్లు పెరిగాయి.రూ. 30 లక్షల కనీస ధరతోఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 (ICC Champions Trophy)లోనూ ఆడించాలని హర్భజన్ సింగ్ వంటి మాజీ క్రికెటర్లు కరుణ్‌కు మద్దతు పలికారు. కానీ సెలక్టర్లు మాత్రం అతడిని పట్టించుకోలేదు. ఇదిలా ఉంటే.. రూ. 30 లక్షల కనీస ధరతో కరుణ్ నాయర్ ఐపీఎల్-2025 మెగా వేలంలో తన పేరును రిజిస్టర్ చేసుకున్నాడు.ఈ క్రమంలో రూ. 50 లక్షలకు ఢిల్లీ క్యాపిటల్స్ అతడిని కొనుగోలు చేసింది. అయితే, ఇప్పటి వరకు ఈ సీజన్లో ఆడిన ఆరు మ్యాచ్‌లలో కలిపి కరుణ్ నాయర్ కేవలం 154 పరుగులే చేశాడు. అత్యధిక స్కోరు 87. ఇక తాజాగా మంగళవారం నాటి మ్యాచ్‌లోనూ కరుణ్ విఫలమయ్యాడు.వన్‌డౌన్‌లో అరుణ్ జైట్లీ స్టేడియంలో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో.. లక్ష్య ఛేదనలో భాగంగా కరుణ్ వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చాడు. మొత్తంగా పదమూడు బంతులు ఎదుర్కొని 15 పరుగులు చేసిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. వైభవ్ అరోరా బౌలింగ్‌లో లెగ్ బిఫోర్ వికెట్ (LBW)గా వెనుదిరిగాడు.ఇక ఈ మ్యాచ్‌లో కేకేఆర్ విధించిన 205 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించలేక ఢిల్లీ ఓటమిపాలైంది. ఆఖరి వరకు పోరాడినా పద్నాలుగు పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ నేపథ్యంలో కేకేఆర్ చేతిలో ఢిల్లీ ఓటమి అనంతరం కామెంటేటర్ ఆకాశ్ చోప్రా కరుణ్ నాయర్‌ను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.క్రికెట్ నీకు రెండో అవకాశం ఇచ్చింది.. కానీ‘‘క్రికెట్ నీకు రెండో అవకాశం ఇచ్చింది. కానీ దానిని నువ్వు సద్వినియోగం చేసుకోవడం లేదు. ఇప్పటి వరకు కేవలం ఒక్కే మంచి ఇన్నింగ్స్ ఆడావు. రెండు, మూడు రనౌట్లలో భాగమయ్యావు.కానీ నీ స్థాయికి తగ్గట్లుగా ఆడలేకపోతున్నావు. నీ నుంచి భారీ ఇన్నింగ్స్ రావడం లేదు. ముఖ్యంగా టాపార్డర్‌లో అదీ వన్‌డౌన్‌లో ఆడుతున్నా బ్యాట్ ఝులిపించలేకపోతున్నావు. ఇలా అయితే కష్టమే’’ అని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు. కాగా కరుణ్ నాయర్ ఐపీఎల్లో ఇప్పటి వరకు మొత్తంగా 82 మ్యాచ్‌లు ఆడి 1650 పరుగులు చేశాడు. ఇందులో 11 అర్ధ శతకాలు ఉన్నాయి. గతంలో అతడు పంజాబ్ కింగ్స్ (రూ. 5.6 కోట్లు), రాజస్తాన్ రాయల్స్, కోల్‌కతా, లక్నో సూపర్ జెయింట్స్ తదితర ఫ్రాంఛైజీలకు ఆడాడు.ఐపీఎల్-2025: ఢిల్లీ వర్సెస్ కోల్‌కతా👉టాస్: ఢిల్లీ.. తొలుత బౌలింగ్👉కోల్‌కతా స్కోరు: 204/9 (20)👉ఢిల్లీ స్కోరు: 190/9 (20)👉ఫలితం: పద్నాలుగు పరుగుల తేడాతో ఢిల్లీపై కోల్‌కతా విజయం👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: సునిల్ నరైన్ (3/29).చదవండి: అతడు వచ్చే ఏడాది ఆడకూడదు.. ఇప్పటికైనా చెన్నైని వదిలేయాలి: గిల్‌క్రిస్ట్

తెలంగాణ టెన్త్ ఫలితాలు విడుదల.. ఒక్క క్లిక్‌తో చెక్ చేస్కోండిలా
సాక్షి,హైదరాబాద్ : తెలంగాణ పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. బుధవారం మధ్యాహ్నాం రవీంద్ర భారతిలో జరిగిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, భట్టి ఇతరులు టెన్త్ ఫలితాలను విడుదల చేశారు. మొత్తం ఐదు లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాయగా.. 92.78 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ప్రకటించారు. గురుకులాల్లో 98 శాతం, ఆశ్రమ పాఠశాలల్లో 95 శాతం, ప్రైవేట్ పాఠశాలల్లో 94.12 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. మొత్తంగా.. గతేడాది కంటే 1.47 శాతం అధికంగా ఉత్తీర్ణత సాధించినట్లు విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. విద్యార్థులు తమ టెన్త్ ఫలితాలను కింద ఇచ్చిన సాక్షి అధికారిక ఎడ్యుకేషన్ వెబ్ సైట్లో పొందవచ్చు. 👇 👉Server 1 https://results2.sakshieducation.com/Results2025/telangana/SSC/2025/ts-ssc-10th-class-results-2025.html👉Server 2 https://education.sakshi.com/sites/default/files/exam-result/TS-SSC-10th-Class-Results-2025-Direct-Link.html👉Server 3 http://results1.sakshieducation.com/results/SSC/ts-10th-class-results-2025.htmlసరికొత్త విధానం..కాగా.. ఈసారి గ్రేడింగ్ స్థానంలో మార్కుల మెమోలపై సబ్జెక్ల వారీగా మార్కులు, గ్రేట్లను ఇచ్చారు. ఈమేరకు కొత్త మెమో నమూనాను కూడా విద్యాశాఖ విడుదల చేసింది. ఉమ్మడి రాష్ట్రంలో మార్కుల విధానాన్ని తొలగించి గ్రేడింగ్ విధానాన్ని అమలులోకి తెచ్చిన విషయం తెలిసిందే. 2009 నుంచి ఈ విధానం అమలులోకి వచ్చింది. ఏ-1, ఏ-2, బీ-1,బీ-2, సీ-1, సీ-2, డి, ఈలుగా గ్రేడ్లను ఇచ్చేవారు. సబ్జెక్ట్‌ల వారీగా గ్రేడ్లతో పాటు సీజీపీఏ ఇచ్చేవారు. అయితే ఇప్పుడు అనూహ్యంగా ఈ విధానాన్ని తొలగించి సీజీపీఏ కాకుండా సబ్జెక్టులవారీగా మార్కులు, గ్రేడ్లు ఇవ్వాలని విద్యాశాఖ నిర్ణయించింది. అయితే విద్యావేత్తలు, ఉపాధ్యాయ సంఘాలు, తల్లిదండ్రులు, విద్యార్థులతో చర్చించకుండానే సరికొత్త విధానాన్ని అమలు చేయడం పట్ల అనేక ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ సందేహాలు తీర్చండి.. టీఎస్పీఎస్సీకి కేంద్ర మంత్రి బండి సంజయ్ లేఖ
న్యూఢిల్లీ, సాక్షి: తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షా ఫలితాల్లో అక్రమాలు, అవినీతి ఆరోపణలతోపాటు తీవ్రమైన తప్పిదాలు జరిగాయని ఆరోపణలు వెల్లువెత్తుతుండటంతో కరీంనగర్ ఎంపీ, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ రంగంలోకి దిగారు. గ్రూప్ 1 పరీక్షా ఫలితాలపై టీజీపీఎస్సీ నుండి సమాచారం కోరుతూ.. టీఎస్పీఎస్సీ ఛైర్మన్ బుర్రా వెంకటేశంకు ఆయన లేఖ రాశారు. అభ్యర్థుల నుంచి పెద్ద ఎత్తున తనకు విజ్ఞప్తులు వెల్లువెత్తడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల నిర్వహణ, మూల్యాంకన విధానం, ఫలితాల విషయంలో అనేక అక్రమాలు, అవకతవకలు, తప్పిదాలు జరిగాయని, నిబంధనల ఉల్లంఘన జరిగిందని పేర్కొంటూ గ్రూప్ 1 అభ్యర్థులు పలుమార్లు తన దృష్టికి తీసుకొచ్చిన నేపథ్యంలో.. ఆ అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత టీఎస్పీఎస్సీ పైన ఉందని ఆయన లేఖలో పేర్కొన్నారు. ప్రధానంగా మార్కుల ప్రకటన, నోటిఫికేషన్ ఉల్లంఘన, పరీక్షా పత్రాల మూల్యాంకనంలో జరిగిన పొరపాట్లతోపాటు ఉర్దూ మీడియంలో రాసిన అభ్యర్థులకు టాప్ ర్యాంకులు రావడాన్ని ఆ లేఖలో ప్రస్తావించారు. వీటికి సంబంధించి సమగ్ర సమాచారాన్ని వారం రోజుల్లో పంపాలని ఛైర్మన్ ను కేంద్ర మంత్రి బండి సంజయ్ కోరారు. మరోవైపు హైకోర్టులో గ్రూప్ 1 కేసు విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో.. టీజీపీఎస్సీ నుండి వచ్చిన సమాచారం ఆధారంగా అవసరమైతే తాను సైతం కేసులో ఇంప్లీడ్ కావాలని ఆయన నిర్ణయించారు. బండి సంజయ్ లేఖలో కోరిన అంశాలు1. మార్కుల ప్రకటన: ● UPSC తరహాలో ఎంపికైన మొత్తం 563 మంది అభ్యర్థుల పూర్తి మార్కుల జాబితాను(పేర్లతోసహా) అందించగలరు.●రీకౌంటింగ్ కు ముందునాటి జనరల్ ర్యాంకింగ్ జాబితా (GRL) మరియు ప్రొవిజనల్ మార్కుల జాబితా (PML) అందించగలరు. అట్లాగే నోటిఫికేషన్ యొక్క 15.2 & 15.3 నిబంధనలు ఉల్లంఘనకు కారణాలను వివరించగలరు.అభ్యర్థులకు వచ్చిన మార్కుల జాబితాను మీడియం వారీగా అందించగలరు. ప్రిలిమ్స్ & మెయిన్స్ హాల్ టికెట్ నంబర్లు, పేరు, వయస్సు, మీడియం, లింగం, కేటగిరీ, ప్రతి పేపర్‌కు సంబంధించిన మార్కులు మరియు మొత్తం మార్కులతో సహా తెలియజేయగలరు.2. మూల్యాంకన ప్రక్రియ: ●గ్రూప్ 1 పరీక్షల మూల్యాంకనానికి సంబంధించి మొత్తం దశల సంఖ్య, ప్రతి దశలో Evaluation జరిగిన రోజుల సంఖ్య, కేంద్రాలు లేదా పేపర్ వారీగా సమాచారం తెలియజేయగలరు. ప్రతిరోజు మూల్యాంకనకు ఉపయోగించిన గంటలు, మూల్యాంకనకారులకు ఇచ్చిన, మారిన సూచనలను తెలియజేయగలరు. ● పదవీ విరమణ పొందిన మూల్యాంకనకారులను ఎంపిక చేసిన ప్రమాణాలు ఏమిటి? బ్లూప్రింట్లు మీడియం స్పెసిఫిక్‌గా ఉన్నాయా లేక కేవలం ఇంగ్లీషులో మాత్రమేనా? ప్రతి పేపర్, ప్రతి మీడియంకు ప్రతి దశలో ఎంత మంది మూల్యాంకనకారులు ఉన్నారు? మూల్యాంకన సమయంలో ఉన్న CCTV ఫుటేజ్ భద్రత స్థితి ఏమిటి? గౌరవనీయ సుప్రీం కోర్టు ఆదేశించినట్లుగా UPSC స్థాయిలో మోడరేషన్ ప్రక్రియను పాటించకపోవడానికి కారణాలను తెలియజేయగలరు.3. హాజరు వివరాలు:● జనరల్ ఇంగ్లీష్ మరియు పేపర్లు 1–6కి పేపర్ వారీగా, మీడియం వారీగా హాజరు వివరాలను అందించగలరు. ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ హాజరు విధానం పాటించబడిందా లేదా? పాటించకపోతే కారణాలేమిటి? నమోదు అయిన హాజరులో ఉన్న వ్యత్యాసాలకు కారణాలను తెలియజేయగలరు.4. ఫలితాల ప్రకటనకు ముందు డేటా లీక్: ● మార్చి 15, 2025న ఒక టెలిగ్రామ్ గ్రూప్‌లో 450కి పైగా మార్కులు పొందిన అభ్యర్థుల సంఖ్య (618) సోషల్ మీడియాలో పోస్టు చేయబడింది. మార్చి 30న విడుదలైన GRLతో ఇది సమానం. సున్నితమైన డేటా లీక్‌కు బాధ్యులైన వారిపై తీసుకున్న చర్యలను తెలియజేయగలరు.5. కోడ్ ఆధారిత మార్కుల నకిలీ లక్షణాలు: ● 0–50 అంకెల తేడా ఉన్న హాల్ టికెట్ నంబర్ల కలిగిన 1,500కు పైగా అభ్యర్థుల జంటలకు ఒక్కటే మార్కులు రావడం, అంకె పదాంశాల వరకు సరిపోలేదని తెలిసింది. ఇది ఒక కోడెడ్ మార్కింగ్ అల్గోరిథం ఉపయోగించారని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. UPSC, APPSC లేదా గత TGPSC పరీక్షలలో ఇలాంటి ధోరణి కనుగొనబడలేదు. దీనికి కారణాలను వివరించగలరు.6. కేంద్రాల వారీగా అసమాన ఫలితాలు: ● కోఠి ఉమెన్స్ కాలేజ్ (సెంటర్లు 18 & 19) నుంచి ఎంత మంది మెయిన్స్ పరీక్ష రాశారు. వారిలో ఎంత మందికి టాప్ 500లోపు ర్యాంకులు వచ్చాయి? వివరించగలరు. అట్లాగే మిగిలిన కేంద్రాల నుండి ఎంత మంది పరీక్ష రాశారు? వారిలో ఎంత మందికి టాప్ 500లోపు ర్యాంకులు వచ్చాయి. కోఠి ఉమెన్స్ కాలేజీలో పరీక్ష రాసిన వారికే అత్యధిక ర్యాంకులు వచ్చినట్లు మా ద్రుష్టికి వచ్చింది? దీనిపై సమగ్ర వివరాలను అందించగలరు.7. అదనపు సమాచారం : ● హాల్ టికెట్లు మరియు పరీక్ష కేంద్రాల కేటాయింపు యాదృచ్ఛికంగా జరిగిందా లేక మానవీయంగా కల్పించారా?● UPSCలో హాల్ టికెట్ నంబర్లు స్థిరంగా ఉండగా, ఇక్కడ ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్ వరకు ఎందుకు మార్పు జరిగింది?● పరీక్ష కేంద్రాల వారీగా అభ్యర్థుల కూర్చునే పథకం, పర్యవేక్షణకారుల కేటాయింపు వివరాలు.● పరీక్ష కేంద్రాల నుంచి వచ్చిన CCTV ఫుటేజ్ భద్రత స్థితి.● సమాధాన పత్రాల కోడింగ్ విధానం, మరియు పేరు, జిల్లా కోడ్, పుట్టిన తేదీ వంటి వివరాలను ఎలా నిర్వహించారు?.. తదితర వివరాలను అందించాలని టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశంను బండి సంజయ్ లేఖలో కోరారు.
చెంప దెబ్బ వివాదం.. వాళ్లిద్దరూ మంచి ఫ్రెండ్స్: కేకేఆర్
ప్రముఖ బుల్లితెర నటికి ప్రెగ్నెన్సీ.. వీడియో షేర్ చేసిన బ్యూటీ!
బాబు ఏడాది పాలనలోనే ఇంతటి దారుణాలు చూడాల్సి వచ్చింది: వైఎస్ జగన్
‘ఇది తెలంగాణ ప్రభుత్వ విజయం’
'ఈసారైనా కప్ వచ్చేలా చూడు స్వామి'.. తిరుమలలో ఆర్సీబీ కెప్టెన్ పూజలు
'గుర్తుకొస్తున్నాయి.. గుర్తుకొస్తున్నాయి'..! కన్నీళ్లు పెట్టుకున్న యూకే వ్యక్తి..
ఉమామహేష్, శైలజకు నివాళి.. జగన్ భావోద్వేగం
ట్రెడిషన్ విత్ ట్రెండ్..51 ఏళ్ల వయసులో ట్రెండీ లుక్
పిల్లలు పుట్టరని మధుబాలను వదిలేసిన స్టార్ హీరో.. చివరికేమైంది?
చిగురిస్తున్న ఇండో-కెనడా స్నేహం
సింహాచలం అప్పన్న సన్నిధిలో అపశ్రుతి.. ఏడుగురు భక్తులు మృతి
తిరుపతి తొక్కిసలాట ఘటన మరవకముందే..
సింహాచలం చందనోత్సవంలో ఘోర అపశ్రుతి
తెలంగాణ టెన్త్ ఫలితాలు విడుదల.. ఒక్క క్లిక్‌తో చెక్ చేస్కోండిలా
సింహాచలం విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
ఆమె నమ్మకమే కాపాడింది..! తృటిలో బయటపడ్డ పహల్గామ్ పర్యాటకుడి ఫ్యామిలీ
విశాఖ: సింహాచలం బాధితులకు వైఎస్ జగన్ పరామర్శ
జాతీయ భద్రతా సలహా బోర్డు ఛైర్మన్‌గా అలోక్ జోషి
సింహాచలంలో ఘోర విషాదం.. చంద్రబాబు సర్కారుపై వీహెచ్‌పీ ఆగ్రహం
వివాహేతర సంబంధం.. భార్య కళ్లెదుటే ప్రియుడ్ని..
IPL 2025: రసవత్తరంగా సాగుతున్న ప్లే ఆఫ్స్ రేసు.. ఏ క్షణంలో ఏమైనా జరగవచ్చు..!
ఆ టికెట్‌తో ఇక రైలు ఎక్కలేరు! మే 1 నుంచి కొత్త రూలు..
కెనడా కొత్త ప్రధానిగా మార్క్ కార్నీ
తక్కువ ధరకే బంగారం కావాలా!
సింహాచలం విషాదం.. ఏడుగురి ప్రాణం తీసిన గోడను నిర్మించింది అప్పుడే
అక్షయ ఫలాలనిచ్చే అక్షయ తృతీయ..!
DC VS KKR: చరిత్ర సృష్టించిన సునీల్ నరైన్
Kolkata: హోటల్లో ఘోర అగ్ని ప్రమాదం.. 14 మంది సజీవ దహనం
Vishakha: సింహాచలం ఘటనపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
థియేటర్, ఓటీటీలో బ్లాక్ బస్టర్.. ఇప్పుడు సీక్వెల్!
అక్షయ తృతీయ.. దయచేసి ఇలా చేయండి : గాయని చిన్మయి
ఓటీటీలోకి వచ్చేసిన ఆంథాలజీ.. తెలుగులో స్ట్రీమింగ్
అతడిని బ్యాన్ చేయండి: టీమిండియా స్టార్‌పై నెటిజన్ల ఆగ్రహం
నాదేం లేదు.. దీనంతటికీ కారణం నా భార్య: స్టార్ హీరో
అల్లు అర్జున్ కోసం ఫ్లాపుల హీరోయిన్?
ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం: మరో 195 మంది ట్రైనీలు..
ఉమామహేష్, శైలజకు నివాళి.. జగన్ భావోద్వేగం
ఆపరేషన్ కగార్ సక్సెస్.. కర్రెగుట్టలపై జాతీయ జెండా
నెల్లూరులో కారు బీభత్సం.. ఆరుగురి దుర్మరణం
అభిమానుల అత్యుత్సాహం.. ఆస్పత్రిలో కోలీవుడ్ స్టార్ అజిత్ కుమార్
రంగులు మార్చే చాట్‌జీపీటీ
గోల్డెన్ ఛాన్స్! బంగారం తులం ఎంతంటే..
పహల్గాం ఉగ్రదాడి మృతులకు నివాళులర్పించిన కేతిరెడ్డి
బాబు ఏడాది పాలనలోనే ఇంతటి దారుణాలు చూడాల్సి వచ్చింది: వైఎస్ జగన్
పిల్లలు పుట్టరని మధుబాలను వదిలేసిన స్టార్ హీరో.. చివరికేమైంది?
నా కొడుకుకి హిట్ 3 సినిమా చూపించను : నాని
అసలు బంగారం ధర ఎందుకు పెరుగుతోంది?
IPL 2025: మాల్దీవ్స్‌లో ఎంజాయ్ చేస్తున్న ఇషాన్ కిషన్, ట్రవిస్ హెడ్
రెండు సార్లు ఫెయిల్ అయ్యా... పట్టుదలతో నాన్న కల నెరవేర్చా..
హైదరాబాద్‌లో ఆజాద్ ఇంజినీరింగ్ తయారీ ప్లాంటు
ఓటీటీకి డేవిడ్ వార్నర్ చిత్రం... ఆ రోజు నుంచే స్ట్రీమింగ్!
హైదరాబాద్‌లో భారీ బ్యాటరీ పరిశ్రమ
ఈ సందేహాలు తీర్చండి.. టీఎస్పీఎస్సీకి కేంద్ర మంత్రి బండి సంజయ్ లేఖ
సాయి కుటుంబానికి అండగా ఉంటాం
టీమిండియాను శిక్షించిన ఐసీసీ
ఇద్దరిని బలిగొన్న అతివేగం
ఈ రాశి వారికి వృత్తి, వ్యాపారాలలో అనుకూలం
'గుర్తుకొస్తున్నాయి.. గుర్తుకొస్తున్నాయి'..! కన్నీళ్లు పెట్టుకున్న యూకే వ్యక్తి..
నెల్లూరు: వైద్య విద్యార్థుల మృతి పట్ల వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
ఇండియాలో ఐస్‌క్రీం అమ్ముతున్న పాక్ మాజీ ఎంపీ!
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు
OTT: రాధికా ఆప్టే బోల్డ్ మూవీ ‘ది వెడ్డింగ్ గెస్ట్’ రివ్యూ
ఆగమైంది తెలంగాణ కాదు.. కేసీఆర్ కుటుంబం: సీఎం రేవంత్
పహల్గామ్ ఉగ్రదాడి.. ఇదే సరైన సమయమన్న మెగా కోడలు!
విడాకుల తర్వాత కొత్తిల్లు కొన్న నటి.. 'నేను పేదదాన్ని అని మీకు చెప్పానా?'
'హిట్ 3' నిర్మాత నేనే.. కానీ బడ్జెట్ ఎంతైందో తెలీదు
అప్పు ఇవ్వొద్దు.. పాక్‌పై భారత్ ఆర్థిక యుద్ధం
‘స్పిరిట్’ వెనక్కి.. సందీప్‌కి ట్విస్ట్ ఇచ్చిన ప్రభాస్!
వారెవ్వా ‘హిట్’మ్యాన్!.. పేద కుటుంబంలో పుట్టి.. కోటీశ్వరుడిగా!.. ఆస్తి ఎంతంటే?
ఎక్కడికైనా సులభంగా చిన్న బయోచార్ యూనిట్
ఆడుకుంటూ వెళ్లి అసువులు బాసింది
ఇండస్ఇండ్ సీఈఓ రాజీనామా!
‘ఉగ్రవాదులు మొదట ప్రాణం తీసింది లెఫ్టినెంట్ వినయ్ నార్వల్‌నే’
‘ఇది తెలంగాణ ప్రభుత్వ విజయం’
'ఈసారైనా కప్ వచ్చేలా చూడు స్వామి'.. తిరుమలలో ఆర్సీబీ కెప్టెన్ పూజలు
ట్రెడిషన్ విత్ ట్రెండ్..51 ఏళ్ల వయసులో ట్రెండీ లుక్
బుల్లితెర నటి ఏఐ వీడియోలు.. ఇంత చెత్తగా ఆలోచిస్తారా?
ప్రిన్స్ హ్యారీతో విడాకులా? తొలిసారి మౌనం వీడిన మేఘన్
బిడ్డా.. మీరెక్కడమ్మా
ప్రభుత్వ వైఫల్యంతోనే సింహాచలం దుర్ఘటన: వెల్లంపల్లి
సింహాచలం ఘటన.. మూడు రోజుల క్రితం గోడ కట్టడమేంటి?: లక్ష్మీపార్వతి
హవ్వ.. ఇంకో 44 వేల ఎకరాలా?
సడన్ గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమాలు
స్వరలయ ఆర్ట్స్ సింగపూర్ ఫైన్ ఆర్ట్స్ అకాడమీ 6 వ వార్షికోత్సవ వేడుకలు
Akshaya Tritiya : ధగధగల వెనుక దగా!
ష్యూరిటీ ఇచ్చేముందే జాగ్రత్త పడాలి..!
మళ్లీ ఐపీవోల సందడి..!
అక్షయ తృతీయ.. రూ.16,000 కోట్ల అమ్మకాలు
ఢిల్లీలో పారని బాబు పాచిక!
పాక్ విమానాలకు నో ఎంట్రీ
Vaibhav Suryavanshi: ఈ ‘వైభవం’ కొనసాగాలి!
బజాజ్ ఫైనాన్స్ బోనస్ బొనాంజా
జూన్‌లో ఫిక్స్
చిగురిస్తున్న ఇండో-కెనడా స్నేహం
ఫేమస్ అవగానే మారిపోతారు.. అలాంటి క్రేజ్ నాకొద్దని..: నాని
2026 ఏషియన్ గేమ్స్‌లో క్రికెట్.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఒలింపిక్ కమిటీ
‘అతడు వచ్చే ఏడాది ఆడకూడదు.. ఇప్పటికైనా జట్టును వదిలేయాలి’
ఇంగ్లండ్ టూర్‌కు ఆర్సీబీ కెప్టెన్.. కరుణ్, సాయి సుదర్శన్‌కు కూడా పిలుపు..?
జపాన్ కళతో శ్రీ వేంకటేశ్వర స్వామి రూపం..!
పాక్ కపట నాటకం.. వరుసగా రోజు భారత సైన్యంపై పాక్ సైన్యం కాల్పులు
పవన్ కొడుక్కి సైకియాట్రిస్ట్ ట్రీట్మెంట్!
కొడుకు మృతదేహంతో మూడురోజులు
చుట్టుముట్టి చంపేశారు
గజం రూ.లక్షల్లో ఉంటే ఎకరా 99 పైసలకే ఇచ్చేస్తారా?
ప్రభుత్వం విచక్షణాధికార పరిధిని దాటితే ఎలా?
ఓటీటీ జోరు... డిజిటల్ మీడియా హోరు
శ్రీశైలం డ్యామ్‌కు తక్షణమే మరమ్మతులు చేయాలి
రాజకీయ ప్రేరేపిత చర్య
రన్ వేపై రెక్కల ముక్కలు
ప్రతిష్టాత్మకంగా ‘మిస్ వరల్డ్’
చెంప దెబ్బ వివాదం.. వాళ్లిద్దరూ మంచి ఫ్రెండ్స్: కేకేఆర్
ప్రముఖ బుల్లితెర నటికి ప్రెగ్నెన్సీ.. వీడియో షేర్ చేసిన బ్యూటీ!
బాబు ఏడాది పాలనలోనే ఇంతటి దారుణాలు చూడాల్సి వచ్చింది: వైఎస్ జగన్
‘ఇది తెలంగాణ ప్రభుత్వ విజయం’
'ఈసారైనా కప్ వచ్చేలా చూడు స్వామి'.. తిరుమలలో ఆర్సీబీ కెప్టెన్ పూజలు
'గుర్తుకొస్తున్నాయి.. గుర్తుకొస్తున్నాయి'..! కన్నీళ్లు పెట్టుకున్న యూకే వ్యక్తి..
ఉమామహేష్, శైలజకు నివాళి.. జగన్ భావోద్వేగం
ట్రెడిషన్ విత్ ట్రెండ్..51 ఏళ్ల వయసులో ట్రెండీ లుక్
పిల్లలు పుట్టరని మధుబాలను వదిలేసిన స్టార్ హీరో.. చివరికేమైంది?
చిగురిస్తున్న ఇండో-కెనడా స్నేహం
సింహాచలం అప్పన్న సన్నిధిలో అపశ్రుతి.. ఏడుగురు భక్తులు మృతి
తిరుపతి తొక్కిసలాట ఘటన మరవకముందే..
సింహాచలం చందనోత్సవంలో ఘోర అపశ్రుతి
తెలంగాణ టెన్త్ ఫలితాలు విడుదల.. ఒక్క క్లిక్‌తో చెక్ చేస్కోండిలా
సింహాచలం విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
ఆమె నమ్మకమే కాపాడింది..! తృటిలో బయటపడ్డ పహల్గామ్ పర్యాటకుడి ఫ్యామిలీ
విశాఖ: సింహాచలం బాధితులకు వైఎస్ జగన్ పరామర్శ
జాతీయ భద్రతా సలహా బోర్డు ఛైర్మన్‌గా అలోక్ జోషి
సింహాచలంలో ఘోర విషాదం.. చంద్రబాబు సర్కారుపై వీహెచ్‌పీ ఆగ్రహం
వివాహేతర సంబంధం.. భార్య కళ్లెదుటే ప్రియుడ్ని..
IPL 2025: రసవత్తరంగా సాగుతున్న ప్లే ఆఫ్స్ రేసు.. ఏ క్షణంలో ఏమైనా జరగవచ్చు..!
ఆ టికెట్‌తో ఇక రైలు ఎక్కలేరు! మే 1 నుంచి కొత్త రూలు..
కెనడా కొత్త ప్రధానిగా మార్క్ కార్నీ
తక్కువ ధరకే బంగారం కావాలా!
సింహాచలం విషాదం.. ఏడుగురి ప్రాణం తీసిన గోడను నిర్మించింది అప్పుడే
అక్షయ ఫలాలనిచ్చే అక్షయ తృతీయ..!
DC VS KKR: చరిత్ర సృష్టించిన సునీల్ నరైన్
Kolkata: హోటల్లో ఘోర అగ్ని ప్రమాదం.. 14 మంది సజీవ దహనం
Vishakha: సింహాచలం ఘటనపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
థియేటర్, ఓటీటీలో బ్లాక్ బస్టర్.. ఇప్పుడు సీక్వెల్!
అక్షయ తృతీయ.. దయచేసి ఇలా చేయండి : గాయని చిన్మయి
ఓటీటీలోకి వచ్చేసిన ఆంథాలజీ.. తెలుగులో స్ట్రీమింగ్
అతడిని బ్యాన్ చేయండి: టీమిండియా స్టార్‌పై నెటిజన్ల ఆగ్రహం
నాదేం లేదు.. దీనంతటికీ కారణం నా భార్య: స్టార్ హీరో
అల్లు అర్జున్ కోసం ఫ్లాపుల హీరోయిన్?
ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం: మరో 195 మంది ట్రైనీలు..
ఉమామహేష్, శైలజకు నివాళి.. జగన్ భావోద్వేగం
ఆపరేషన్ కగార్ సక్సెస్.. కర్రెగుట్టలపై జాతీయ జెండా
నెల్లూరులో కారు బీభత్సం.. ఆరుగురి దుర్మరణం
అభిమానుల అత్యుత్సాహం.. ఆస్పత్రిలో కోలీవుడ్ స్టార్ అజిత్ కుమార్
రంగులు మార్చే చాట్‌జీపీటీ
గోల్డెన్ ఛాన్స్! బంగారం తులం ఎంతంటే..
పహల్గాం ఉగ్రదాడి మృతులకు నివాళులర్పించిన కేతిరెడ్డి
బాబు ఏడాది పాలనలోనే ఇంతటి దారుణాలు చూడాల్సి వచ్చింది: వైఎస్ జగన్
పిల్లలు పుట్టరని మధుబాలను వదిలేసిన స్టార్ హీరో.. చివరికేమైంది?
నా కొడుకుకి హిట్ 3 సినిమా చూపించను : నాని
అసలు బంగారం ధర ఎందుకు పెరుగుతోంది?
IPL 2025: మాల్దీవ్స్‌లో ఎంజాయ్ చేస్తున్న ఇషాన్ కిషన్, ట్రవిస్ హెడ్
రెండు సార్లు ఫెయిల్ అయ్యా... పట్టుదలతో నాన్న కల నెరవేర్చా..
హైదరాబాద్‌లో ఆజాద్ ఇంజినీరింగ్ తయారీ ప్లాంటు
ఓటీటీకి డేవిడ్ వార్నర్ చిత్రం... ఆ రోజు నుంచే స్ట్రీమింగ్!
హైదరాబాద్‌లో భారీ బ్యాటరీ పరిశ్రమ
ఈ సందేహాలు తీర్చండి.. టీఎస్పీఎస్సీకి కేంద్ర మంత్రి బండి సంజయ్ లేఖ
సాయి కుటుంబానికి అండగా ఉంటాం
టీమిండియాను శిక్షించిన ఐసీసీ
ఇద్దరిని బలిగొన్న అతివేగం
ఈ రాశి వారికి వృత్తి, వ్యాపారాలలో అనుకూలం
'గుర్తుకొస్తున్నాయి.. గుర్తుకొస్తున్నాయి'..! కన్నీళ్లు పెట్టుకున్న యూకే వ్యక్తి..
నెల్లూరు: వైద్య విద్యార్థుల మృతి పట్ల వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
ఇండియాలో ఐస్‌క్రీం అమ్ముతున్న పాక్ మాజీ ఎంపీ!
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు
OTT: రాధికా ఆప్టే బోల్డ్ మూవీ ‘ది వెడ్డింగ్ గెస్ట్’ రివ్యూ
ఆగమైంది తెలంగాణ కాదు.. కేసీఆర్ కుటుంబం: సీఎం రేవంత్
పహల్గామ్ ఉగ్రదాడి.. ఇదే సరైన సమయమన్న మెగా కోడలు!
విడాకుల తర్వాత కొత్తిల్లు కొన్న నటి.. 'నేను పేదదాన్ని అని మీకు చెప్పానా?'
'హిట్ 3' నిర్మాత నేనే.. కానీ బడ్జెట్ ఎంతైందో తెలీదు
అప్పు ఇవ్వొద్దు.. పాక్‌పై భారత్ ఆర్థిక యుద్ధం
‘స్పిరిట్’ వెనక్కి.. సందీప్‌కి ట్విస్ట్ ఇచ్చిన ప్రభాస్!
వారెవ్వా ‘హిట్’మ్యాన్!.. పేద కుటుంబంలో పుట్టి.. కోటీశ్వరుడిగా!.. ఆస్తి ఎంతంటే?
ఎక్కడికైనా సులభంగా చిన్న బయోచార్ యూనిట్
ఆడుకుంటూ వెళ్లి అసువులు బాసింది
ఇండస్ఇండ్ సీఈఓ రాజీనామా!
‘ఉగ్రవాదులు మొదట ప్రాణం తీసింది లెఫ్టినెంట్ వినయ్ నార్వల్‌నే’
‘ఇది తెలంగాణ ప్రభుత్వ విజయం’
'ఈసారైనా కప్ వచ్చేలా చూడు స్వామి'.. తిరుమలలో ఆర్సీబీ కెప్టెన్ పూజలు
ట్రెడిషన్ విత్ ట్రెండ్..51 ఏళ్ల వయసులో ట్రెండీ లుక్
బుల్లితెర నటి ఏఐ వీడియోలు.. ఇంత చెత్తగా ఆలోచిస్తారా?
ప్రిన్స్ హ్యారీతో విడాకులా? తొలిసారి మౌనం వీడిన మేఘన్
బిడ్డా.. మీరెక్కడమ్మా
ప్రభుత్వ వైఫల్యంతోనే సింహాచలం దుర్ఘటన: వెల్లంపల్లి
సింహాచలం ఘటన.. మూడు రోజుల క్రితం గోడ కట్టడమేంటి?: లక్ష్మీపార్వతి
హవ్వ.. ఇంకో 44 వేల ఎకరాలా?
సడన్ గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమాలు
స్వరలయ ఆర్ట్స్ సింగపూర్ ఫైన్ ఆర్ట్స్ అకాడమీ 6 వ వార్షికోత్సవ వేడుకలు
Akshaya Tritiya : ధగధగల వెనుక దగా!
ష్యూరిటీ ఇచ్చేముందే జాగ్రత్త పడాలి..!
మళ్లీ ఐపీవోల సందడి..!
అక్షయ తృతీయ.. రూ.16,000 కోట్ల అమ్మకాలు
ఢిల్లీలో పారని బాబు పాచిక!
పాక్ విమానాలకు నో ఎంట్రీ
Vaibhav Suryavanshi: ఈ ‘వైభవం’ కొనసాగాలి!
బజాజ్ ఫైనాన్స్ బోనస్ బొనాంజా
జూన్‌లో ఫిక్స్
చిగురిస్తున్న ఇండో-కెనడా స్నేహం
ఫేమస్ అవగానే మారిపోతారు.. అలాంటి క్రేజ్ నాకొద్దని..: నాని
2026 ఏషియన్ గేమ్స్‌లో క్రికెట్.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఒలింపిక్ కమిటీ
‘అతడు వచ్చే ఏడాది ఆడకూడదు.. ఇప్పటికైనా జట్టును వదిలేయాలి’
ఇంగ్లండ్ టూర్‌కు ఆర్సీబీ కెప్టెన్.. కరుణ్, సాయి సుదర్శన్‌కు కూడా పిలుపు..?
జపాన్ కళతో శ్రీ వేంకటేశ్వర స్వామి రూపం..!
పాక్ కపట నాటకం.. వరుసగా రోజు భారత సైన్యంపై పాక్ సైన్యం కాల్పులు
పవన్ కొడుక్కి సైకియాట్రిస్ట్ ట్రీట్మెంట్!
కొడుకు మృతదేహంతో మూడురోజులు
చుట్టుముట్టి చంపేశారు
గజం రూ.లక్షల్లో ఉంటే ఎకరా 99 పైసలకే ఇచ్చేస్తారా?
ప్రభుత్వం విచక్షణాధికార పరిధిని దాటితే ఎలా?
ఓటీటీ జోరు... డిజిటల్ మీడియా హోరు
శ్రీశైలం డ్యామ్‌కు తక్షణమే మరమ్మతులు చేయాలి
రాజకీయ ప్రేరేపిత చర్య
రన్ వేపై రెక్కల ముక్కలు
ప్రతిష్టాత్మకంగా ‘మిస్ వరల్డ్’
సినిమా

అభిమానుల అత్యుత్సాహం.. ఆస్పత్రిలో కోలీవుడ్ స్టార్ అజిత్ కుమార్
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్‌కుమార్ ఆస్పత్రిలో చేరారు. ఆయన కాలికి స్వల్ప గాయం కావడంతోనే చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరినట్లు తెలుస్తోంది. అయితే అజిత్‌కు ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు. చెన్నై ఎయిర్పోర్ట్ చేరుకున్న ఆయనకు స్వాగతం పలికేందుకు అభిమానులు పెద్దఎత్తున వచ్చారు. అదే సమయంలో భారీ సంఖ్యలో ఫ్యాన్స్ దూసుకు రావడంతో అజిత్ కాలికి స్వల్ప గాయాలైనట్లు ఆయన టీమ్ వెల్లడించింది.కాగా.. ఢిల్లీలో జరిగిన పద్మ అవార్డుల కార్యక్రమానికి హాజరైన అజిత్ కుమార్.. తిరిగి చెన్నై చేరుకున్నారు. అజిత్ రాకపై సమాచారం తెలుసుకున్న అభిమానులు ఆయనకు స్వాగతం పలికేందుకు చెన్నై ఎయిర్‌పోర్ట్‌కు పెద్దఎత్తున వచ్చారు. ఆ సమయంలో ఒక్కసారిగా అందరూ అజిత్ వైపు దూసుకు రావడంతో ఆయన పాదానికి స్వల్ప గాయాలయ్యాయి. దీంతో వెంటనే ఆస్పత్రిలో చేరాల్సి వచ్చింది.(ఇది చదవండి: బుల్లితెర నటి ఏఐ వీడియోలు.. ఇంత చెత్తగా ఆలోచిస్తారా?)అజిత్ కుమార్ ఇటీవలే గుడ్ బ్యాడ్ అగ్లీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. త్రిష హీరోయిన్గా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను టాలీవుడ్ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించింది. ఈ సినిమాలో సునీల్, అర్జున్ దాస్, సిమ్రాన్ కీలక పాత్రల్లో మెరిశారు.

బుల్లితెర నటి ఏఐ వీడియోలు.. ఇంత చెత్తగా ఆలోచిస్తారా?
బాలీవుడ్ బ్యూటీ మౌనీ రాయ్ నాగిని సీరియల్‌తో సౌత్‌లో ఫేమస్ అయింది. బాలీవుడ్లో పలు సూపర్ హిట్ సీరియల్స్‌లో నటించిన ముద్దుగుమ్మ.. ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ది భూత్నీ అనే హారర్ మూవీలో కనిపించనుంది. ఈ చిత్రంలో సంజయ్ దత్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ మే 1వ తేదీన థియేటర్లలో సందడి చేయనుంది.ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే మౌనీ రాయ్.. ఎక్కడికెళ్లినా తన ఫోటోలు, వీడియోలను అభిమానులతో షేర్ చేస్తూ ఉంటుంది. అయితే ఈ ముద్దుగుమ్మపై ఎప్పుడు ఏదో ఒక రూమర్స్ వినిపిస్తూనే ఉంటాయి. గ్లామర్ కోసం చాలాసార్లు సర్జరీ చేయించుకుందని సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ వచ్చాయి. ఆమె కాస్మెటిక్ సర్జరీ చేయించుకుందని.. దాన్ని కవర్ చేసేందుకు తన హెయిర్‌స్టైల్‌ను మార్చుకుందని నెటిజన్స్ విమర్శించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తనపై వస్తున్న ట్రోల్స్‌పై బాలీవుడ్ భామ స్పందించింది. ఇలాంటి వారిని చూసినప్పుడు తనకు జాలేస్తుందని చెప్పుకొచ్చింది.మౌనీ రాయ్ మాట్లాడుతూ.. 'నేను అలాంటి వ్యాఖ్యలను చదివినప్పుడు.. కొన్నిసార్లు ఏఐ వీడియోలను చూసినప్పుడు చాలా భయంకరంగా అనిపిస్తుంది. మీరు ఇతరులను అలా చూడటం ఎలా అనిపిస్తుందో ఒక్కసారి ఊహించుకోండి. నా ముఖాన్ని ఇతరుల శరీర ఆకృతిపకి జత చేసి వక్రీకరించడం చూస్తే అది చాలా అసహ్యంగా అనిపించింది. ఈ రకమైన వ్యక్తులు ఎక్కడికి వెళ్తున్నారు? దీంతో ఏమి సాధించాలనుకుంటున్నారు? వారి లక్ష్యం ఏమిటి? ఎందుకంటే మీరు చేస్తున్న దానితో ఎవరికీ ఉపయోగం లేదు. అలా చేస్తున్న వ్యక్తుల మంచిని ఎవరూ కోరుకోరు' అని తెలిపింది."మొదట సోషల్ మీడయాలోకి వచ్చినప్పుడు నా పట్ల చాలామందిలో ద్వేషం కలిగింది. అలాంటి వారి ప్రొఫైల్స్‌ను బ్లాక్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఆ సమయంలో నాకు చాలా జాలిగా అనిపిస్తుంది. అలాంటి వారితి సరైన బుద్ధిని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నా. ఇలాంటి వ్యక్తులు లైక్‌ల కోసం ఏమైనా చేస్తారు. ఇతరుల గురించి చెత్తగా రాస్తూ ప్రచారం చేస్తారు. కానీ నా అభిమానుల నుంచి లభించే ప్రేమను ఎప్పటికీ తిరస్కరించలేను' అని చెబుతోంది బాలీవుడ్ బ్యూటీ మౌనీ రాయ్.

నా కొడుకుకి హిట్ 3 సినిమా చూపించను : నాని
నాని(Nani) హీరోగా నటించిన హిట్ 3(HIT 3 ) సినిమా మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. హిట్ ఫ్రాంచైజీలో వస్తున్న మూడో చిత్రమిది. మొదటి భాగంలో విశ్వక్ సేన్, రెండో భాగంలో అడివి శేష్ హీరోగా నటించారు. ఇక మూడో భాగంలో అర్జున్ సర్కార్‌గా నాని అలరించబోతున్నాడు. అయితే మొదటి రెండు భాగాలు ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్ కాగా.. హిట్ 3 మాత్రం యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కింది. ఇందులో రక్తపాతం అధికంగా ఉండబోతుందట. అందుకే సెన్సార్ సభ్యులు ‘ఎ’ సర్టిఫికెట్ జారీ చేశారు. అలాగే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్సీ) కొన్ని మార్పులు చేయాలని చిత్రబృందానికి సూచించింది. ఈ లెక్కన సినిమా వయోలెన్స్ ఏ స్థాయిలో ఉంటుందో ఊహించుకోవచ్చు. హీరో నాని కూడా వయోలెన్స్ ఎక్కువగానే ఉంటుందని చెబుతున్నాడు. అంతేకాదు పిల్లలు ఎవరూ ఈ సినిమా చూడొద్దని విజ్ఞప్తి చేశాడు. తాజాగా ఆయన మీడియాతో ముచ్చటిస్తూ.. ‘హిట్ 3లో వయోలెన్స్ ఎక్కువగానే ఉంటుంది. నా పిల్లలకు ఈ చిత్రం చూపించను. టీజర్, ట్రైలర్ కూడా చూపించలేదు. వాళ్లకు హిట్ 3 అనే ఒక సినిమా వస్తుందని తప్పా..అందులో నేను ఎలా నటించాననే విషయం తెలియదు. మీరు(ప్రేక్షకులు) కూడా మీ పిల్లలకు ఈ సినిమా చూపించకండి. 18 ఏళ్లు పైబడిన వాళ్లు మాత్రమే ఈ సినిమాకి రండి. చాలా ఎంజాయ్ చేస్తారు’ అని నాని చెప్పారు. శైలేష్ కొలను తెరకెక్కించిన ఈ చిత్రం మే 1న రిలీజ్ కానుంది.

విడాకుల తర్వాత కొత్తిల్లు కొన్న నటి.. 'నేను పేదదాన్ని అని మీకు చెప్పానా?'
విడాకులు తీసుకున్న మగవాడిని ఈ సమాజం పట్టించుకోదేమో కానీ ఆడవారిని మాత్రం చులకనగా చూస్తుంది. అందుకు నేనే ప్రత్యక్ష ఉదాహరణ అంటోంది బుల్లితెర నటి చారు అసోపా (Charu Asopa). హీరోయిన్ సుష్మితా సేన్ సోదరుడు రాజీవ్ సేన్‌ను 2019లో గోవాలో పెళ్లి చేసుకుంది. వీరి అన్యోన్య దాంపత్యానికి గుర్తుగా జియానా అనే పాప కూడా పుట్టింది. కానీ తర్వాత వీరి మధ్య మనస్పర్థలు మొదలయ్యాయి. అవి పెద్దవి కావడంతో విడిపోవడానికే నిర్ణయించుకున్నారు. అలా 2023లో వీరికి విడాకులు మంజూరయ్యాయి.నెలకు రూ.1 లక్ష పైనే..ఆ తర్వాత ఆమెకు ముంబైలో ఇల్లు దొరకడం కూడా కష్టమైంది. సింగిల్ పేరెంట్ అని కొందరు, సెలబ్రిటీ అని మరికొందరు ఇల్లు ఇవ్వడానికే ఇష్టపడలేదు. చివరకు ఎలాగోలా సిటీ అంతా జల్లెడపట్టి అద్దెల్లు సంపాదించింది. కానీ చేతిలో సంపాదన లేనప్పుడు నగరంలో జీవించడం అంత ఈజీ కాదు. నెలవారీ ఖర్చులు లక్ష రూపాయల పైనే అవుతుండటంతో సొంతూరుకు వెళ్లిపోయింది. రాజస్థాన్‌లోని బికనీర్‌లో తన పుట్టింట్లో ఉంటోంది. డబ్బెలా వస్తోంది?అక్కడే బట్టల వ్యాపారం ప్రారంభించింది. అలాగే తను కొన్న కొత్తింటిని కూడా వీడియో తీసి చూపించింది. ఆ ఇంటికి ఆమె నెలనెలా ఈఎమ్ఐ కడుతోంది. ఇది చూసిన జనాలు తనకు డబ్బులెలా వస్తున్నాయి? ఈ ఇల్లు ఎలా కొనగలిగింది? అంటూ రకరకాల కామెంట్లు చేశారు. వాటిపై చారు అసోపా తాజాగా తన యూట్యూబ్ ఛానల్ వేదికగా స్పందించింది. నేను రైల్లో వెళ్లకుండా విమానంలో ఎందుకు ప్రయాణిస్తున్నాను? అని కొందరడిగారు. సింపతీ అక్కర్లేదుఆ ఎయిర్‌లైన్స్ వాళ్లు నన్ను ఆహ్వానించడం వల్లే విమానయానాన్ని ఎంచుకున్నాను. నేను షాపింగ్ చేస్తుంటే కూడా విమర్శిస్తున్నారు. కొత్తింటి విషయానికి వస్తే.. నెలనెలా అద్దె కట్టే బదులు అదే ఈఎమ్ఐ కడుతున్నాను. నన్ను విమర్శించడం ఆపండి.. మీ అందరికీ నేను చెప్పదలుచుకుందేంటంటే.. నేను పేదదాన్ని కాదు. దేవుడి దయ వల్ల నా ఖర్చులు నేను భరించగలను. నాకు ఎవరి సింపతీ అక్కర్లేదు. టీవీ ఇండస్ట్రీ నుంచి బ్రేక్ తీసుకోవాలనుకున్నాను. అందుకే ముంబై వదిలి వచ్చేశాను తప్ప పని లేక కాదు అని నటి వివరణ ఇచ్చింది.సీరియల్స్.. సినిమాచారు అసోపా.. అగ్లే జనం మోహే బిటియా హీ కిజో, యే రిష్తా క్యా కెహ్లాతా హై, బాల్వీర్, దేవోంక్ కె దేవ్.. మహాదేవ్, లవ్ బై ఛాన్స్, ఫిర్ జీనే కీ తమన్నా హై, లాడూ 2, జిజీ మా, కర్ణ్ సంగిని, విక్రమ్ బేతాల్ కీ రహస్య గాథ, కైసా హై యే రిష్తా అజంనా వంటి సీరియల్స్ చేసింది. ఇంపేషెంట్ వివేక్, కాల్ ఫర్ ఫన్, యోక్, జోహ్రి అనే సినిమాల్లోనూ నటించింది.చదవండి: సడన్ గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమాలు
న్యూస్ పాడ్‌కాస్ట్
క్రీడలు

Rohit Sharma: ఆ 'మూడు రికార్డులు' ఎవ్వరూ బద్దలు కొట్టలేరు..!
టీమిండియా కెప్టెన్, ముంబై ఇండియన్స్ స్టార్ ఆటగాడు రోహిత్ శర్మ ఇవాళ (ఏప్రిల్ 30) 38వ పడిలోకి అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా హిట్‌మ్యాన్‌కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సహచర క్రికెటర్లతో పాటు అభిమానులు సోషల్‌మీడియా వేదికగా రోహిత్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు.BIRTHDAY CELEBRATION OF INDIAN CAPTAIN ROHIT SHARMA ♥️ pic.twitter.com/cQQRzoRpCd— Johns. (@CricCrazyJohns) April 30, 2025ప్రస్తుతం ఐపీఎల్ 2025 ఆడుతున్న రోహిత్.. తన జట్టు సభ్యులు మరియు భార్య రితక సజ్దేతో కలిసి కేక్ కట్ చేశాడు. హిట్‌మ్యాన్ పుట్టిన రోజు సందర్భంగా అతను సాధించిన రికార్డులపై ఓ లుక్కేద్దాం.THE BIRTHDAY CELEBRATIONS OF HITMAN ROHIT SHARMA. 🥹- Moments of the Day. ❤️ pic.twitter.com/ZncZTNEVB6— Tanuj (@ImTanujSingh) April 30, 20252007లో టీమిండియా తరఫున అంతర్జాతీయ అరంగేట్రం చేసిన రోహిత్ శర్మ తన కెరీర్లో ఎన్నో అద్భుతాలు చేశాడు. ఆటగాడిగా, కెప్టెన్‌గా తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. టీమిండియా తరఫున 67 టెస్ట్‌లు, 273 వన్డేలు, 159 టీ20లు ఆడిన హిట్‌మ్యాన్ మూడు ఫార్మాట్లలో కలిపి 19700 పరుగులు చేశాడు. ఇందులో 49 సెంచరీలు, 108 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఐపీఎల్లో డెక్కన్ చార్జర్స్, ముంబై ఇండియన్స్ తరఫున ఆడిన రోహిత్ మొత్తం 266 మ్యాచ్‌లు ఆడి 2 సెంచరీలు, 45 హాఫ్ సెంచరీల సాయంతో 6868 పరుగులు చేశాడు.రోహిత్ తన సుదీర్ఘ కెరీర్లో భారత జట్టు, తన ఐపీఎల్ జట్లైన డెక్కన్ చార్జర్స్, ముంబై ఇండియన్స్ తరఫున ఎన్నో రికార్డులు సాధించాడు. వీటిలో మూడు రికార్డులు మాత్రం ఎప్పటికీ పదిలంగా ఉంటాయి. అవేంటంటే..వన్డేల్లో అత్యధిక స్కోర్ (264)2014, నవంబర్ 13న రోహిత్ శర్మ శ్రీలంకపై 264 పరుగులు (173 బంతుల్లో 33 ఫోర్లు, 9 సిక్సర్లు) చేశాడు. వన్డే క్రికెట్ చరిత్రలో ఇప్పటికీ ఇదే అత్యుత్తమ స్కోర్‌గా చలామణి అవుతుంది. బహుశా మున్ముందు కూడా ఈ రికార్డు పదిలంగానే ఉండే అవకాశం ఉంది. వన్డేల్లో ఇంత భారీ ఇన్నింగ్స్‌లు ఆడాలంటే చాలా సహనం కావాలి. నేటి తరం క్రికెటర్లలో ఇది కొరవడింది. కాబట్టి ఈ రికార్డు వన్డే క్రికెట్ చరిత్రలో చిరకాలం పదిలంగా ఉండే అవకాశం ఉంది.సింగిల్ వరల్డ్‌కప్‌లో అత్యధిక సెంచరీలు (5)2019 వన్డే వరల్డ్‌కప్‌లో రోహిత్ సెంచరీల సునామీ సృష్టించాడు. ఆ టోర్నీలో ఏకంగా ఐదు సెంచరీలు (సౌతాఫ్రికా, పాకిస్తాన్, ఇంగ్లండ్, బంగ్లాదేశ్, శ్రీలంక) సాధించి చరిత్ర సృష్టించాడు. ఓ వరల్డ్‌కప్ ఎడిషన్‌లో ఓ ఆటగాడు చేసిన అత్యధిక సెంచరీలు ఇవే. ఈ టోర్నీలో హిట్‌మ్యాన్ ఉగ్రరూపం దాల్చి 9 మ్యాచ్‌ల్లో 648 పరుగులు చేశాడు. వన్డే క్రికెట్ చరిత్రలో ఈ రికార్డు బద్దలు కొట్టడం కూడా దాదాపుగా అసాధ్యమే.వన్డేల్లో అత్యధిక డబుల్ సెంచరీలు (3)వన్డేల్లో ఒక్క డబుల్ సెంచరీ చేస్తేనే అత్యద్భుతం అనుకునే రోజుల్లో హిట్‌మ్యాన్ ఏకంగా మూడు డబుల్ సెంచరీలు బాది చరిత్ర సృష్టించాడు. వన్డేల్లో ఇప్పటివరకు 10 డబుల్ సెంచరీలు నమోదు కాగా.. అందులో రోహిత్ ఒక్కడే మూడు సాధించడమంటే మామూలు విషయం కాదు. 2013లో ఆస్ట్రేలియాపై తన తొలి డబుల్ సెంచరీ (208 నాటౌట్) సాధించిన హిట్‌మ్యాన్ ఆతర్వాతి ఏడాదే (2014) శ్రీలంకపై వరల్డ్ రికార్డు డబుల్ సెంచరీ (264) సాధించాడు. 2017లో రోహిత్ మరోసారి శ్రీలంకపై డబుల్ సెంచరీ (208 నాటౌట్) చేశాడు.అంతర్జాతీయ క్రికెట్లో రోహిత్ చాలా రికార్డులు నమోదు చేసినప్పటికీ ఈ రికార్డులను మాత్రం ఎవరూ బద్దలు కొట్టలేదు.ప్లేయర్‌గా, కెప్టెన్‌గా రోహిత్ సాధించిన పలు ఘనతలు/రికార్డులు..వరల్డ్‌కప్ సెంచరీలు- 7 కెప్టెన్‌గా 2 ఐసీసీ టైటిళ్లు (2024 టీ20 వరల్డ్‌కప్, 2025 ఛాంపియన్స్ ట్రోఫీ)ఆటగాడిగా 4 ఐసీసీ టైటిళ్లువన్డేల్లో మూడు డబుల్ సెంచరీలుసింగిల్ వరల్డ్‌కప్‌లో అత్యధిక సెంచరీలువన్డేల్లో అత్యధిక స్కోర్కెప్టెన్గా అత్యధిక విన్నింగ్ పర్సంటేజీ (కనీసం 100 అంతర్జాతీయ మ్యాచ్‌లు)కెప్టెన్‌గా 5 ఐపీఎల్ టైటిళ్లుఆటగాడిగా 6 ఐపీఎల్ టైటిళ్లు

2026 ఏషియన్ గేమ్స్‌లో క్రికెట్.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఒలింపిక్ కమిటీ
వచ్చే ఏడాది జపాన్‌లో జరుగనున్న 20వ ఆసియా క్రీడల్లో క్రికెట్ చేరికకు గ్రీన్ సిగ్నల్ లభించింది. ఆర్గనైజింగ్ కమిటీతో భేటి అనంతరం ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా ఈ విషయాన్ని వెల్లడించింది. తదుపరి ఆసియా క్రీడల్లో క్రికెట్‌తో పాటు మిక్సడ్ మార్షల్ ఆర్ట్స్ క్రీడకు కూడా అప్రూవల్ లభించింది. క్రితం ఆసియా క్రీడల్లో (2022 హాంగ్ఝౌ గేమ్స్, చైనా) లాగానే ఈసారి కూడా పురుషులు, మహిళల విభాగాల్లో క్రికెట్ పోటీలు జరుగుతాయి. టీ20 ఫార్మాట్లో మ్యాచ్‌లు నిర్వహిస్తారు. 14 పురుష జట్లు, 9 మహిళల టీమ్స్ పాల్గొంటాయి.గత ఆసియా క్రీడల్లో టీమిండియా పురుషులు, మహిళల విభాగాల్లో గోల్డ్ మెడల్స్ సాధించింది. ఆసియా క్రీడల్లో క్రికెట్‌ను తొలిసారి 2010లో పరిచయం చేశారు. ఆతర్వాత కేవలం రెండు సార్లు (2014, 2022) మాత్రమే ఆసియా క్రీడల్లో క్రికెట్‌కు అనుమతి లభించింది. 2028 లాస్ ఏంజెలెస్ ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చడంతో తదుపరి ఆసియా క్రీడల్లో కూడా క్రికెట్ నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ లభించింది.1900 (పారిస్ ఒలింపిక్స్) తర్వాత ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చడం ఇదే మొదటిసారి. కేవలం రెండు క్రికెట్ జట్లు పాల్గొన్న ఆ ఒలింపిక్స్‌లో ఫ్రాన్స్‌పై గ్రేట్ బ్రిటన్ 158 పరుగుల తేడాతో విజయం సాధించి గోల్డ్ మెడల్ గెలుచుకుంది. 2026 ఆసియా క్రీడలు సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు జరుగుతాయి. పురుషులు, మహిళల విభాగాల్లో భారత్ డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగుతుంది. గత ఆసియా క్రీడల్లో రుతురాజ్ గైక్వాడ్ నేతృత్వంలోని భారత పురుషుల టీమ్ అత్యధిక సీడింగ్ (పాయింట్లు) ఆధారంగా గోల్డ్ మెడల్ గెల్చుకోగా.. హర్మన్ నేతృత్వంలోని భారత మహిళల టీమ్ ఫైనల్లో శ్రీలంకపై 19 పరుగుల తేడాతో విజయం సాధించి పసిడి పతకం కైవసం చేసుకుంది.

‘అతడు వచ్చే ఏడాది ఆడకూడదు.. ఇప్పటికైనా జట్టును వదిలేయాలి’
ఐపీఎల్-2025 (IPL 2025)లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) దారుణ ఆట తీరుతో విమర్శలు మూటగట్టుకుంటోంది. గతంలో ఐదుసార్లు చాంపియన్‌గా నిలిచిన సీఎస్కే ఈసారి పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానాన్ని పటిష్టం చేసుకునే దిశగా పయనిస్తోంది.ఇప్పటికి ఆడిన తొమ్మిది మ్యాచ్‌లలో ఏకంగా ఏడు ఓడిపోయి అట్టడుగున పదో స్థానంలో కొనసాగుతోంది. ఐదుసార్లు ట్రోఫీ గెలవడంతో పాటు.. అనేకసార్లు ఫైనల్ చేరిన జట్టుగా ఘనత ఉన్న సీఎస్కేకు ఇలాంటి దుస్థితి ఇదే తొలిసారి.ఇక ఈ సీజన్లో ఐదు మ్యాచ్‌లు ఆడిన తర్వాత చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ గాయం వల్ల మిగతా మ్యాచ్‌లకు దూరమయ్యాడు. అతడి స్థానంలో దిగ్గజ సారథి మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni) మరోసారి సీఎస్కే సారథ్య బాధ్యతలు చేపట్టాడు.కాగా వికెట్ కీపర్‌గా ఇప్పటికీ మెరుపు వేగంతో పాదరసంలా కదిలి స్టంపింగ్‌లు చేస్తున్న ధోని.. బ్యాటర్‌గా మాత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాడు. 43 ఏళ్ల ఈ వెటరన్ క్రికెటర్ ఐపీఎల్-2025లో తొమ్మిది మ్యాచ్‌లు పూర్తి చేసుకుని కేవలం 140 పరుగులే చేశాడు.సీఎస్కే భవిష్యత్తు బాగుండాలంటేఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా దిగ్గజ వికెట్ కీపర్, ఐపీఎల్ విన్నింగ్ కెప్టెన్ అయిన ఆడం గిల్‌క్రిస్ట్ ధోనిని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు. సీఎస్కే భవిష్యత్తు బాగుండాలంటే ధోని ఆ జట్టుతో తెగదెంపులు చేసుకోవాలని సూచించాడు.ఈ మేరకు క్రిక్‌బజ్ షోలో మాట్లాడుతూ.. ‘‘ధోని ఇప్పటికే తాను సాధించాల్సిందంతా సాధించేశాడు. ఆటలో తను ఇంకా నిరూపించుకోవాల్సింది ఏమీ లేదు. అయితే, ఏం చేయాలన్నది మాత్రం అతడి ఇష్టమే.కానీ నా అభిప్రాయం ప్రకారం.. జట్టు భవిష్యత్ దృష్ట్యా అతడు వచ్చే ఏడాది ఆడాల్సిన అవసరం లేదు. ఎంఎస్ ఐ లవ్ యూ. నువ్వొక చాంపియన్‌వి. ఐకాన్వి. నువ్వు ఇప్పటికే అన్నీ సాధించేశావు’’ అని ఆడం గిల్‌క్రిస్ట్ పేర్కొన్నాడు.ఆ నలుగురిని వదిలించుకోవాలిఅదే విధంగా.. సీఎస్కే వచ్చే ఏడాది ధోనితో పాటు షేక్ రషీద్, డెవాన్ కాన్వే, దీపక్ హుడాలను వదిలించుకోవాలని గిల్‌క్రిస్ట్ సలహా ఇచ్చాడు. కాగా ఆడం గిల్‌క్రిస్ట్ 2009లో దక్కన్ చార్జర్స్ (హైదరాబాద్ ఫ్రాంఛైజీ- ఇప్పుడు మనుగడలో లేదు) కెప్టెన్‌గా వ్యవహరించి.. జట్టుకు ట్రోఫీ అందించాడు. మొత్తంగా ఐపీఎల్లో 80 మ్యాచ్‌లు ఆడి 2069 పరుగులు చేశాడు. ఇందులో రెండు శతకాలు కూడా ఉండటం విశేషం.ఇక అంతర్జాతీయ స్థాయిలో ఆస్ట్రేలియా తరఫున గిల్‌క్రిస్ట్.. 96 టెస్టులు, 287 వన్డేలు, 13 టీ20 మ్యాచ్‌లు ఆడి.. ఆయా ఫార్మాట్లలో 5570, 9619, 272 పరుగులు చేశాడు. మరోవైపు ధోని టీమిండియాకు మూడు ఐసీసీ ట్రోఫీలు అందించాడు.టీ20 ప్రపంచకప్-2007, వన్డే వరల్డ్‌కప్-2011, చాంపియన్స్ ట్రోఫీ-2013 గెలిచిన దిగ్గజ కెప్టెన్‌గా తన పేరును చరిత్ర పుటల్లో లిఖించుకున్నాడు. భారత్ తరఫున మొత్తంగా 90 టెస్టులు, 350 వన్డేలు, 98 టీ20లు ఆడాడు.టెస్టుల్లో 4876, వన్డేల్లో 10773, టీ20లలో 1617 పరుగులు సాధించాడు. ఇక ఐపీఎల్లో అత్యధికంగా ఇప్పటికి 273 మ్యాచ్‌లు ఆడిన ధోని 5383 పరుగులతో సీఎస్కే టాప్ బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు. అదే విధంగా కెప్టెన్‌గా సీఎస్కేకు టైటిల్ అందించిన ఘనత ధోని సొంతం.చదవండి: IPL 2025: రసవత్తరంగా సాగుతున్న ప్లే ఆఫ్స్ రేసు.. ఏ క్షణంలో ఏమైనా జరగవచ్చు..!

పాక్‌లో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు సాహసోపేత నిర్ణయం
ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్లో గల ప్రశాంతమైన బైసారన్ లోయలో పాక్ ఉగ్రమూకలు కాల్పులకు తెగబడి 26 మంది పర్యాటకులను పొట్టన పెట్టుకున్నారు. ఈ ఉగ్రదాడి తర్వాత భారత ప్రభుత్వం పాక్‌పై చాలా సీరియస్‌గా ఉంది. ఏ క్షణంలోనైనా భారత బలగాలు పాకిస్తాన్‌పై దాడులు చేయవచ్చని ప్రచారం జరుగుతుంది.పాక్‌లో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ బంగ్లాదేశ్ పురుషుల క్రికెట్ జట్టు ఓ సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్లో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడేందుకు ఒప్పుకుంది. ఈ సిరీస్ మే 25 నుంచి జూన్ 3 వరకు జరుగుతుంది. ఫ్యూచర్ టూర్ ప్రోగ్రాం (FTP) ప్రకారం పాక్ పర్యటనలో బంగ్లాదేశ్ మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడాల్సి ఉండింది. అయితే వచ్చే ఏడాది టీ20 వరల్డ్‌కప్ జరుగనుండటంతో ఇరు జట్ల బోర్డులు మూడు వన్డేల సిరీస్‌కు బదులు అదనంగా రెండు టీ20లు ఆడేందుకు ఒప్పందం చేసుకున్నాయి.ఈ సిరీస్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఇవాళ (ఏప్రిల్ 30) ప్రకటించింది. ఈ సిరీస్‌లోని మ్యాచ్‌లు ఫైసలాబాద్, లాహోర్ నగరాల్లో జరుగనున్నాయి. మే 25, 27న తొలి రెండు టీ20లు ఫైసలాబాద్‌లో జరుగనుండగా.. లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో మిగిలిన మూడు టీ20లు మే 30, జూన్ 1, జూన్ 3 తేదీల్లో జరుగనున్నాయి. ఈ సిరీస్ కోసం బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు మే 21న పాకిస్తాన్‌కు చేరుకుంటుంది. ఫైసలాబాద్‌లో ఆ జట్టు మే 22-24వ తేదీ వరకు ప్రాక్టీస్ సెషన్స్‌లో పాల్గొంటుంది.ఇదిలా ఉంటే, పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత ప్రభుత్వం చాలా విషయాల్లో పాక్‌ను కోలుకోలేని దెబ్బలు కొట్టింది. సింధు జలాల ఒప్పందం రద్దు సహా ఆ దేశ ట్విటర్, సినిమాలపై నిషేధం విధించింది. పాక్‌కు చెందిన 16 యూట్యూబ్ ఛానళ్లను, ఆ దేశ జర్నలిస్ట్‌లను కూడా బ్యాన్ చేసింది. తాజాగా పాక్‌కు అప్పు ఇవ్వొద్దని IMFకు సూచించింది.
బిజినెస్

అసలు బంగారం ధర ఎందుకు పెరుగుతోంది?
ఇండియాలో బంగారానికి ఎంత ప్రాధాన్యం ఇస్తారో అందరికీ తెలిసిందే. శుభకార్యాల్లో బంగారు నగలను ధరిస్తుంటారు. ఆపదలో ఆర్థికంగా ఆదుకునే వనరుగా పసిడి తోడ్పడుతుంది. అక్షయ తృతీయ రోజున కాసింత బంగారం కొంటే ఏడాదంతా సంపద సొంతం అవుతుందని నమ్ముతుంటారు. కానీ ఇటీవల బంగారం తులం ధర రూ.లక్ష చేరువలో ఉంది. రానున్న రోజుల్లో ఇది మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. అయితే ఇప్పటికీ కొన్ని దేశాల్లో భారత్ కంటే తక్కువకే పసిడి విక్రయిస్తున్నారు. అలాంటిది భారత్‌లో బంగారం అధిక ధరకు దోహదం చేసే కొన్ని కీలక అంశాలను తెలుసుకుందాం.దిగుమతి సుంకాలు, పన్నులుభారతదేశం బంగారంపై గణనీయమైన దిగుమతి సుంకాలు, పన్నులను విధిస్తుంది.ఈ సుంకాలు 12.5% వరకు ఉండవచ్చు. బంగారం కొనుగోళ్లపై అదనంగా 3% వస్తు సేవల పన్ను (జీఎస్టీ) ఉంటుంది. మేకింగ్ ఛార్జీలపై మరో 5 శాతం జీఎస్టీ వడ్డీస్తున్నారు.కరెన్సీ మారకం రేట్లుఅంతర్జాతీయంగా బంగారం అమెరికా డాలర్లలో ట్రేడ్ అవుతుంది. అమెరికా డాలరుతో పోలిస్తే భారత రూపాయి (ఐఎన్ఆర్) బలహీనపడినప్పుడు బంగారం దిగుమతి ఖర్చు పెరుగుతుంది. మారకం రేట్లలో ఈ హెచ్చుతగ్గులు భారతదేశంలో బంగారం ధరను నేరుగా ప్రభావితం చేస్తాయి .పండుగలు, పెళ్లిళ్లుభారతదేశంలో బంగారానికి అధిక డిమాండ్ ఉంటుంది. ముఖ్యంగా పెళ్లిళ్లు, దీపావళి, ధంతేరస్, అక్షయ తృతీయ వంటి పండుగల సమయంలో దీన్ని అధికంగా కొనుగోలు చేస్తారు.ప్రపంచ ఆర్థిక అనిశ్చితిప్రపంచ ఆర్థిక అనిశ్చితి నెలకొన్న సమయంలో ఇన్వెస్టర్లు సురక్షిత సంపదగా బంగారాన్ని ఆశ్రయిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో బంగారానికి పెరిగిన డిమాండ్ అధిక ధరలకు దారితీస్తుంది. ఇది భారత మార్కెట్లో ప్రతిబింబిస్తుంది.ఇదీ చదవండి: తక్కువ ధరకే బంగారం కావాలా!సెంట్రల్ బ్యాంక్ కొనుగోళ్లుఅమెరికా డాలర్‌పై ఆధారపడటాన్ని తగ్గించడానికి భారత రిజర్వ్ బ్యాంక్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు తమ బంగారు నిల్వలను పెంచుతున్నాయి. ఈ బల్క్ కొనుగోళ్లు ప్రపంచ డిమాండ్‌ను పెంచుతాయి.

గోల్డెన్ ఛాన్స్! బంగారం తులం ఎంతంటే..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా భారీగా పెరిగిన బంగారం తులం త్వరలో రూ.లక్షలకు చేరుతుందనే అంచనాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారంతో పోలిస్తే బుధవారం అక్షయ తృతీయ రోజున పసిడి ధర స్వల్పంగా తగ్గి కొనుగోలుదారులకు ఊరట కల్పించింది. వివిధ ప్రాంతాల్లో ఈ రోజు గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.89,750 (22 క్యారెట్స్), రూ.97,910 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. మంగళవారం ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర వరుసగా రూ.50, రూ.60 తగ్గింది.చెన్నైలో బుధవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.50, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.60 తగ్గింది. దీంతో గోల్డ్ రేటు రూ.89,750 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.97,910 (24 క్యారెట్స్ 10 గ్రామ్ గోల్డ్)కు చేరింది.దేశ రాజధాని నగరం దిల్లీలో బంగారం ధర నిన్నటితో పోలిస్తే తగ్గింది. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ.50 దిగి రూ.89,900కు చేరుకోగా.. 24 క్యారెట్ల ధర రూ.60 తగ్గి రూ.98,040 వద్దకు చేరింది.వెండి ధరలుబంగారం ధరలు తగ్గుముఖం పట్టినట్లుగానే వెండి ధరలు(Silver Price) కూడా బుధవారం తగ్గాయి. మంగళవారం ముగింపు ధరలతో పోలిస్తే వెండి ధర కేజీ రూ.2,000 తగ్గింది. దాంతో కేజీ వెండి రేటు రూ.1,09,000 వద్దకు చేరింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

పెట్టుబడుల కొనసాగింపుపై సెబీ ఛైర్మన్ సూచనలు
అంతర్జాతీయంగా ప్రతికూల పవనాలు వీస్తున్నప్పటికీ భారత్ కాస్త పటిష్టమైన స్థితిలోనే ఉందని మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఛైర్మన్ తుహిన్ కాంత పాండే తెలిపారు. మార్కెట్ ఒడిదుడుకులపై ఆందోళన చెందకుండా, ఇన్వెస్టర్లు దీర్ఘకాలంపాటు తమ పెట్టుబడులను కొనసాగించడం శ్రేయస్కరమని ఆయన సూచించారు.టారిఫ్‌ల యుద్ధం మార్కెట్లపై ప్రభావాలు చూపడం మొదలైనప్పటి నుంచి కూడా భారత్ దీటుగా ఎదురు నిలుస్తోందని పాండే చెప్పారు. స్థిరమైన ఆర్థిక వృద్ధి, తక్కువ స్థాయిలో ద్రవ్య లోటు, సముచిత స్థాయిలో విదేశీ రుణభారం, కరెంటు అకౌంటు లోటు అదుపులోనే ఉండటం మొదలైనవి దేశానికి సానుకూల అంశాలని ఆయన పేర్కొన్నారు. భారత్ పలు ద్వైపాక్షిక ఒప్పందాలపై కూడా చర్చలు జరుపుతోందని వివరించారు. ఇటీవల పెట్టుబడులు పెట్టిన చాలా మంది రిటైల్ ఇన్వెస్టర్లకు మార్కెట్ల పతనం గురించి పెద్దగా తెలియదు కాబట్టి, ప్రస్తుత పరిస్థితులను ఒక పాఠంగా భావించి, పెట్టుబడులను కొనసాగిస్తే దీర్ఘకాలంలో ప్రయోజనకరంగా ఉంటుందని పాండే చెప్పారు.ఇదీ చదవండి: తక్కువ ధరకే బంగారం కావాలా!రిటైల్ ఇన్వెస్టర్లు అన్ని వివరాలను తెలుసుకుని, పూర్తి అవగాహనతోనే ఇన్వెస్ట్ చేయాలని పాండే సూచించారు. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్‌లో భారీ నష్టాలను ఉటంకిస్తూ.. మార్కెట్‌ను కేసినోగా భావించరాదని చెప్పారు. అధిక రాబడులు వస్తాయనే తప్పుడు హామీల వైపు ఆకర్షితులు కాకుండా వివేకవంతంగా వ్యవహరించాలని సూచించారు.

స్థిరంగా కదలాడుతున్న సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్‌తో పోలిస్తే బుధవారం స్థిరంగా కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 9:42 సమయానికి నిఫ్టీ(Nifty) 10 పాయింట్లు పెరిగి 24,345కు చేరింది. సెన్సెక్స్(Sensex) 41 పాయింట్లు పుంజుకుని 80,339 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 99.34 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 62.74 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.17 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో గతంతో పోలిస్తే లాభాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్‌తో పోలిస్తే 0.58 శాతం లాభపడింది. నాస్డాక్ 0.55 శాతం ఎగబాకింది.ఆసియా మార్కెట్లలో సానుకూల ధోరణులు, అంతర్జాతీయ వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడం మార్కెట్ సెంటిమెంట్‌కు దోహదపడుతుంది. ఇండియా-పాక్ ఉద్రిక్తతలను మార్కెట్ వర్గాలు నిశితంగా పరిశీలిస్తున్నాయి. తగ్గిన చమురు ధరలు ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను తగ్గించి, ఆర్థిక వృద్ధికి తోడ్పడుతున్నాయి. మహారాష్ట్ర డే సందర్భంగా రేపు గురువారం(మే 1న) మార్కెట్లు పనిచేయవు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
ఫ్యామిలీ

పర్యావరణ హిత: ఈ చిత్రాన్ని మీకు సమర్పిస్తున్న వారు...
కోల్‌కత్తాకు చెందిన అశ్వికాకపూర్ బీబీసి నేచురల్ హిస్టరీ యూనిట్ డైరెక్టర్. పశ్చిమబెంగాల్ అడవుల్లో ‘వణ్య్రప్రాణుల వేట’ పేరుతో ఉత్సవాలు చేస్తారు, ఇందులో పిల్లలు కూడా పాల్గొంటారు. దీనిపై ఆమె ‘క్యాటపల్ట్స్ టు కెమెరాస్’ చిత్రాన్ని తీసింది. ఈ చిత్రం న్యూయార్క్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ స్ఫూర్తిదాయక చిత్రంగా అవార్డు గెలుచుకుంది.అశ్వికాలాంటి ఎంతోమంది మహిళా దర్శకుల విజయానికి ‘రౌండ్‌గ్లాస్ సస్టెయిన్’ దారి చూపింది.‘రౌండ్‌గ్లాస్ సస్టెయిన్ ద్వారా వణ్య్రప్రాణుల గురించి వీలైనంత ఎక్కువగా తెలుసుకునే అవకాశం వచ్చింది. ఎప్పుడూ వినని అరుదైన జీవులు గురించి కూడా తెలుసుకున్నాను. వైల్డ్‌లైఫ్ ఫిల్మ్‌మేకర్‌గా ఇది నాకు ఎంతో ఉపయోగపడుతుంది’ అంటుంది అశ్వికాకపూర్. ‘రౌండ్‌గ్లాస్ సస్టెయిన్’ సంస్థను సియాటెల్‌కు చెందిన పారిశ్రామికవేత్త, దాత గుర్ప్రీత్ సన్నీసింగ్ స్థాపించారు. వణ్య్రప్రాణులపై విలువైన కథలు వెండితెరపై చెప్పడానికి వీలుగా ఇది మహిళా కథకులకు ఒక వేదికగా ఉపయోగపడుతుంది.‘రౌండ్‌గ్లాస్ సస్టెయిన్ ఫిల్మ్స్ దేశవ్యాప్తంగా ఉన్న మహిళా ఫిల్మ్‌మేకర్స్‌తో కలిసి పనిచేస్తోంది. ఫండింగ్ నుంచి దర్శకులకు మార్గనిర్దేశం చేయడం వరకు రౌండ్‌గ్లాస్ సస్టెయిన్ ఎన్నో చేస్తుంది’ అంటుంది రౌండ్‌గ్లాస్ సస్టెయిన్ ఫిల్మ్స్’ క్రియేటివ్ డైరెక్టర్, ఫిల్మ్‌మేకర్ సమ్రీన్ ఫారూఖీ. ‘రౌండ్‌గ్లాస్ సస్టెయిన్’ నిర్మాణ సంస్థ తన వెబ్సైట్ ద్వారా సినిమాలను విడుదల చేస్తుంది. సినిమాలను ప్రమోట్ చేయడానికి టీమ్ విస్తృతంగా మార్కెటింగ్ కూడా చేస్తుంది. దేశవ్యాప్తంగా పలు భాషల్లో ఆన్లైన్ స్క్రీనింగ్‌లు నిర్వహిస్తారు.‘విస్మరించబడిన కథలను వెలుగులోకి తీసుకురావాలనుకుంటుంది. పెద్దగా ఎవరికీ తెలియని ఆవాసాలు, పర్యావరణ వ్యవస్థలు, జాతులకు ప్రాధాన్యత ఇస్తోంది. దీనికి తోడు లోకల్ ఫిల్మ్మేకర్స్పై దృష్టి పెట్టింది. సహజ ప్రపంచం గురించి మాట్లాడడానికి మల్టీమీడియా విధానాన్ని ఉపయోగిస్తోంది. ఫోటో స్టోరీలు, ఇన్ఫోగ్రాఫిక్స్, వ్యాసాలు, కార్లూన్లు ఇందులో ఉంటాయి. కథలను సంచలనం కోసం చెప్పాలనుకోవడం లేదు. స్పష్టంగా చెప్పాలనుకుంటుంది’ అని రౌండ్‌గ్లాస్ సస్టెయిన్ గురించి చెబుతోంది సమ్రీన్.పిల్లల జీవితాలను మార్చిందివైల్డ్ లెఫ్ ఫోటోగ్రఫీ, చిత్రాల ద్వారా వేటకు వెళ్లే పిల్లల మనస్తత్వాలను మార్చాం. ఇప్పుడు వారు అడవి జంతువులను ‘వేట కోసం’ అన్నట్లుగా చూడడం లేదు. సంరక్షించుకోవాల్సిన అందమైన జీవులుగా చూస్తున్నారు. మా చిత్రనిర్మాణ ప్రక్రియ వన్య్రప్రాణులను కాపాడడమే కాదు పిల్లల జీవితాలను కూడా మార్చింది. తమ చుట్టూ ఉన్న సహజ ప్రపంచంతో కనెక్ట్ కావడానికి వారికి ఇది కొత్త మార్గాన్ని చూపించింది.– నేహా దీక్షిత్, ఫిల్మ్మేకర్వారే నిజమై హీరోలుభూగోళ సంక్షోభం గురించి నిరాశపడడం కంటే కార్యాచరణ అనేది ముఖ్యం. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది సంరక్షకులు, శాస్త్రవేత్తలు, రేంజర్ల రూపంలో ఆశ కనిపిస్తుంది. వారు నిజమైన హీరోలు. ఈ హీరోలు మన భూగోళాన్ని సురక్షితంగా ఉంచడానికి అవిశ్రాంతంగా పనిచేస్తున్నారు. వారి అంకితభావం మన ఆశావాదానికి బలాన్ని ఇస్తుంది. ఆ ఆశావాదాన్ని దశదిశలా వ్యాప్తి చేయడం ఫిల్మ్‌మేకర్‌గా నా బాధ్యత.– అశ్వికా కపూర్, ఫిల్మ్మేకర్నోరు లేని మూగజీవాలు, విలువైన ప్రకృతి గురించి చెప్పడానికి ఎన్నో కథలు ఉన్నాయి. వాటికి చిత్రరూపం ఇవ్వడానికి, మహిళలలోని సృజనాత్మకతను ప్రోత్సహించడానికి, వారిని డైరెక్టర్లుగా తీర్చిదిద్దడానికి ‘రౌండ్‌గ్లాస్ సస్టెయిన్’ అనే స్వచ్ఛంద సంస్థ కృషి చేస్తోంది.(చదవండి: ష్యూరిటీ ఇచ్చేముందే జాగ్రత్త పడాలి..!)

ఎక్కడికైనా సులభంగా చిన్న బయోచార్ యూనిట్
భూసారాన్ని పెంపొందించడంతో పాటు దీర్ఘకాలం పాటు ప్రభావం చూపటం ద్వారా పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించటంలో ఉపయోగపడే బయోచార్ (కట్టెబొగ్గు) ఇటీవల కాలంలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. పత్తి కట్టె, కంది కట్టె, వరి ΄పొట్టు వంటి పంట వ్యర్థాలతో ఒక ప్రత్యేక పద్ధతిలో దగ్ధం చేయటం ద్వారా బయోచార్ను ఉత్పత్తి చేస్తున్నారు. అందుకు ఇప్పటికే అనేక రకాల యంత్ర పరికరాలు అందుబాటులో ఉన్నాయి. అయినా, న్న, సన్నకారు రైతులకు ఉపయోగకరంగా ఉండే రొటేటింగ్ డ్రమ్ ఆటోథర్మల్ బయోచార్ యూనిట్‌ను భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలికి అనుబంధ సంస్థ, భోపాల్‌లోని కేంద్రీయ వ్యవసాయ ఇంజనీరింగ్ సంస్థ (ఐసిఎఆర్-సిఐఎఇ) రూపొందింంది. పేటెంట్ పొందదిన ఈ యూనిట్ పంట వ్యర్థాలను బయోచార్గా మారుస్తుంది. వంద కిలోల కట్టెను వాడితే 20–35% కట్టె బొగ్గును అందించే సామర్థ్యంతో పనిచేస్తుంది. చిన్నది. ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లవచ్చు. బయోచార్ను తయారు చేసే ప్రక్రియను పైరోలిసిస్ అంటారు. పైరోలిసిస్ ఛాంబర్‌తోపాటు రెండు సర్క్యులర్ బీమ్‌లు రెండు వైపులా ఉంటాయి. రొటేటింగ్ హేండిల్, చిమ్నీతో కూడిన గ్యాస్ అవుట్లెట్, మూతతోపాటు లోడింగ్ పోర్టు, వీటన్నిటినీ మోసే ఫ్రేమ్ ఉంటాయి. ఈ బయోచార్ ఉత్పత్తి యూనిట్‌ను ఆరుబయట ఉంచి, దాంట్లో పైన ఉండే మూత తీసి పంట వ్యర్థాలను లోపల వెయ్యాలి. ఆ తర్వాత నిప్పంటించాలి. మంట చిన్నగా రగులు కుంటున్నప్పుడు ఎయిర్ బ్లోయర్ ద్వారా గాలిని సరఫరా చెయ్యాలి. ఈ ఛాంబర్ పైభాగాన ఉన్న గ్యాస్ అవుట్లెట్ ద్వారా మంట పొగ బయటకు వస్తాయి. బాగా ఎండబెట్టిన (తేమ సుమారు 10–15% ఉండే) పంట వ్యర్థాలను రియాక్టర్‌లోకి వెయ్యాలి. పూర్తిగా నింపెయ్యకుండా 80% వరకు వెయ్యాలి. రియాక్టర్ యూనిట్‌ను 3–4 సార్లు తిప్పటం ద్వారా మంట కట్టెకు అన్ని వైపులా పూర్తిగా మంట వ్యాపించేలా చెయ్యాలి. బయోచార్ 20 శాతం నుంచి 30% మధ్యలో లభిస్తుంది. సామర్థ్యం: 1.2 క్యూబిక్ మీటర్లు (సుమారు 150 కిలోల పంట వ్యర్థాల ముక్కలు) ధర: రూ. లక్ష + 18% జిఎస్టి. వివరాలకు: డాక్టర్ సందీప్ మండల్, సీనియర్ సైంటిస్ట్, ఐసిఎఆర్– సిఐఎఇ, భోపాల్, భారత్. మొబైల్: 97203 23421

Akshaya Tritiya : ధగధగల వెనుక దగా!
బంగారం ధర ఆకాశాన్నంటుతోంది. ఊహించని విధంగా ధరలు పెరుగుతుండటంతో సామాన్య, మధ్య తరగతి ప్రజల్లో ఆందోళన అధికమవుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారానికి డిమాండ్ పెరగడం, అమెరికాలో వడ్డీ రేట్లు తగ్గడం, పెట్టుబడిదారులు బంగారంపైనే అధికంగా దృష్టి పెట్టడం తదితర కారణాలు ధరల పెరుగుదలకు కారణంగా తెలుస్తోంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా 2024, 2025 సంవత్సరాల్లోనే ధరలు దూసుకుపోతున్నాయి. ఇవాళ (ఏప్రిల్30) అక్షయ తృతీయ. ఆ రోజున బంగారం కొంటే లక్ష్మిదేవిని ఇంటికి ఆహ్వానించినట్లేనన్న నమ్మకం ప్రజల్లో ఉంది. మిగతా రోజులతో పోలిస్తే ఆ రోజున బంగారం వ్యాపారం మూడు, నాలుగు రెట్లు ఎక్కువగా ఉంటుంది. అయితే ధరలు పెరిగిన నేపథ్యంలో అక్షయ తృతీయ రోజున బంగారం వ్యాపారం ఎలా ఉంటుందోననే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. స్వచ్ఛమైన బంగారానికి హాల్ మార్క్ బంగారం కొనుగోలులో తగిన జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. స్వచ్ఛమైన బంగారానికి సాధారణంగా హాల్ మార్క్ ఉంటుంది. బ్యూరో ఆఫ్ స్టాండర్డ్ (బిఐఎస్) హాల్ మార్క్ ఇస్తుంది. అయితే కార్పొరేట్ సంస్థలు హాల్ మార్క్ సెటప్ చేసుకున్నట్లుగా ప్రకటించుకుంటూ నాణ్యతకు సొంత మార్కు ఇచ్చుకుంటున్నాయి. బంగారం కొనుగోలులో హాల్ మార్క్, క్యారెట్లను దృష్టిలో ఉంచుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. నిబంధనల మేరకు బంగారాన్ని బ్యాంకుల ద్వారా దిగుమతి చేసుకోవాల్సి ఉంది. ఐసీఐసీఐ, యాక్సిస్, ఇండియన్ ఓవర్సీస్ తదితర బ్యాంకులు సరఫరా చేస్తున్నాయి. బిల్లు తీసుకోకపోతే నష్టమే.. బంగారం వ్యాపారంలో 85 శాతం జీరో జరుగుతోంది. 90 శాతం వ్యాపారులు ఆథరైజ్డ్ బిల్లులు ఇవ్వడం లేదు. కేవలం షాపు పేరు కలిగిన కాగితాలపై బిల్లులు ఇస్తున్నారు. వీటిలో పాన్‌నెంబర్, వ్యాట్ నెంబర్ ఇతరత్రా వివరాలు ఉండవు. ఇలా ఇవ్వడం జీరో వ్యాపారం కిందకు వస్తుంది. మరికొందరు తెల్లపేపర్‌పైనే వివరాలు రాసిస్తుండటం గమనార్హం. వాణిజ్య పన్నుల శాఖ, ఆదాయపు పన్ను, కస్టమ్స్ ఎక్సైజ్ సుంకం అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు. బంగారం పోగొట్టుకున్నా.. దొంగలు ఎత్తుకెళ్లినా పోలీసులకు ఫిర్యాదు చేయడానికి బిల్లులు తప్పనిసరి. కొంతమంది వ్యాపారులు తూకాల్లో దగా చేస్తున్నట్లు తెలుస్తోంది. తూనికలు, కొలతల శాఖకు వారి టార్గెట్లకు అనుగుణంగా తనిఖీలు చేయడం, కేసులు పెట్టడం తప్ప అక్రమాలను అరికట్టాలనే చిత్తుశుద్ధి లోపించినట్లు తెలుస్తోంది. కొనుగోలులో అప్రమత్తత అవసరం స్వచ్ఛమైన బంగారం కొంటే తిరిగి అమ్ముకున్నప్పుడు ఆ రోజు ఉన్న ధర లభిస్తుంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో దాదాపు 1,500 వరకు బంగారం దుకాణాలు ఉన్నాయి. 24 క్యారెట్ బంగారం బిస్కెట్ రూపంలో లభిస్తుంది. ఇది పూర్తిగా స్వచ్ఛమైనది. బంగారం ఆభరణాలు మాత్రం 22 క్యారెట్లలో ఉంటాయి. వీటి స్వచ్ఛత 916 ఉంటుంది. జిల్లాలో జరిగే వ్యాపారంలో 80 శాతం వరకు 22 క్యారెట్ల బంగారం(నగలు, ఆభరాణాలు) కొనుగోలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వినియోగదారులు 22 క్యారెట్ల బంగారం విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.14, 16, 18 క్యారెట్ల బంగారానికి 22 క్యారెట్ల ధర వసూలు కర్నూలు, నంద్యాల జిల్లా కేంద్రాలతో సహా అన్ని ప్రాంతాల్లోని కొందరు వ్యాపారులు 14, 16, 18, 20 క్యారెట్ల బంగారం ఆభరణాలు అమ్ముతూ వాటికి 22 క్యారెట్ల ధర వసూలు చేస్తుండటం గమనార్హం. ప్రస్తుతం 10 గ్రాముల ఆర్నమెంటు బంగారం ధర రూ.89,400 పలుకుతోంది. ఒక క్యారెట్ విలువ రూ.4,063.63. 22 క్యారెట్లు(916 స్వచ్ఛత) ఉన్న బంగారమైతే ఈ ధర చెల్లించాలి. వినియోగదారులు కొనుగోలు చేసే బంగారం 20 క్యారెట్లు కలిగినదైతే 10 గ్రాముల ధర రూ.81,272 అవుతుంది. కానీ అధిక శాతం జ్యువెలరీ షాపుల్లో తక్కువ క్యారెట్లు ఉన్న బంగారానికి కూడా 22 క్యారెట్ల బాంగారం ధర వసూలు చేస్తుండటం గమనార్హం.కొనక తప్పడం లేదు బంగారం ధరలు అందుబాటులో ఉంటే కాస్త ఎక్కువ కొంటాం. మా కుటుంబంలో వివాహం ఉన్నందున ధర ఎంతు న్నా కొనక తప్పడం లేదు. అక్షయ తృతీయ నేపథ్యంలో ఆఫర్లు ఉండటంతో బంగారం కొనడానికి మలబార్ గోల్డ్‌కు వచ్చాం. ఆర్నమెంటు బంగారం 10 గ్రాముల ధర రూ.89,800 ఉన్నప్పటికీ డిజైన్‌ను బట్టి తరుగు కలుపుతుండటంతో రూ.లక్షపైనే అవుతోంది. ఇంత ధర ఉండటం నిజంగా బాధాకరమే. – ప్రత్యూష, సంతోష్‌నగర్, కర్నూలుధరలు తగ్గించాలి బంగారం ధరలు తగ్గించే దిశగా కేంద్రం చర్యలు తీసుకోవాలి. రోజురోజుకు ధరలు భారీగా పెరిగిపోతుండటం మధ్యతరగతి వారిని ఆందోళనకు గురిచేస్తోంది. ప్రస్తుతం శుభకార్యాలు, అక్షయ తృతీయ ఉండటంతో బంగారం కొనడానికి వచ్చాం. బంగారం అంటే ప్రతి ఒక్కరికి మక్కువ ఉన్నప్పటికీ వనరులను బట్టి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఉంది. – శైలజ, కోడుమూరు(చదవండి: అక్షయ ఫలాలనిచ్చే అక్షయ తృతీయ..! బంగారం కొనాల్సిందేనా..?)

రెండు సార్లు ఫెయిల్ అయ్యా... పట్టుదలతో నాన్న కల నెరవేర్చా..
‘నన్ను కలెక్టర్‌గా చూడాలనేది మా నాన్న కోరిక.. దాన్ని ఎలాగైనా నెరవేర్చాలని పాఠశాల స్థాయిలోనే నిర్ణయించుకున్నా.. ఆయన అందించిన ప్రోత్సాహంతో ముందుకు సాగా.. రెండుసార్లు విఫలమయ్యా.. అయినా నిరాశ చెందలేదు.. రాత్రింబవళ్లు మరింత కష్టపడి చదివా.. లోటుపాట్లు సవరించుకుని ముందడుగు వేశాను. మూడో ప్రయత్నంలో విజయం సాధించా.. 2023 యూపీఎస్సీ ఫలితాల్లో జాతీయ స్థాయిలో 29వ ర్యాంకు సాధించా.. ఐఏఎస్‌గా తెలంగాణ క్యాడర్‌కు ఎంపికయ్యా.. నాన్న కల నెరవేర్చడం నాకెంతో ఆనందాన్నిచ్చింది. ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలను అమలు చేసి, పేదలకు సేవ చేయడమే లక్ష్యమని అంటున్నారు జిల్లాకు నూతనంగా విచ్చేసిన ట్రెయినీ కలెక్టర్ సలోని చాబ్రా (Saloni Chhabra). ‘సాక్షి’కి మంగళవారం ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె పలు విషమాలు వెల్లడించారు.-కైలాస్నగర్సాక్షి: ‘గుడ్ మార్నింగ్ మేడమ్.. వెల్కమ్ టు ఆదిలాబాద్. ట్రెయినీ కలెక్టర్‌గా జిల్లాకు విచ్చేసిన మీకు మరోసారి ప్రత్యేక అభినందనలు. మీ కుటుంబ నేపథ్యం వివరాలు.. ట్రెయినీ కలెక్టర్: మాది హర్యానా రాష్ట్రంలోని గురుగ్రాం. నాన్న ఇంద్రజిత్, అమ్మ సీమ. ఇద్ద రూ గురుగ్రాంలోనే బిజినెస్ చేస్తుంటారు. అన్న గ్రాడ్యూయేషన్ పూర్తి చేశాడు. ఊరిలోనే అమ్మనాన్నలకు తోడుగా ఉంటూ వ్యాపారం చూసుకుంటారు.ఇదీ చదవండి: మనవడితో 50 ఏళ్ల మహిళ పెళ్లి : ఫ్యామిలీని లేపేసేందుకు కుట్ర?సాక్షి: మీ విద్యాభ్యాసం ఎక్కడెక్కడ సాగింది..ట్రెయినీ కలెక్టర్: ఒకటి నుంచి ఇంటర్మీడియెట్ వరకు గురుగ్రాంలోని బ్లూ బెల్స్‌లో చదివా. చిన్నతనం నుంచే చదువులో ముందుండేదాన్ని. స్కూల్లో నిర్వహించే డిబేట్లు, ఎక్స్ట్రా కరిక్యూలమ్‌లో పాల్గొంటూ ప్రతి భ కనబర్చుతుండేది. చదువులో ఎప్పుడూ ముందుండే నేను టెన్త్, ఇంటర్లో ఫస్ట్‌క్లాస్ లో పాసయ్యా. అనంతరం ఢిల్లీలోని శ్రీరాం కాలేజ్ ఆఫ్ కామర్స్ యూనివర్సిటీలో బీఏ ఆనర్స్ ఎకానావిుక్స్ పూర్తి చేశాను. ఆ వెంటనే సివిల్స్ పరీక్షలపై దృష్టి సారించాను. సాక్షి: యూపీఎస్సీ కోచింగ్ ఎక్కడ తీసుకున్నారు.. ఎన్నోసారి విజయం సాధించారు..ట్రెయినీ కలెక్టర్: పదో తరగతిలోనే ఐఏఎస్ సాధించాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నా. ఆ దిశగా అడుగులు వేశాను. ఢిల్లీలోని కోచింగ్ సెంటర్లో ఏడాది పాటు శిక్షణ పొందాను. ఆప్షనల్ సబ్జెక్ట్‌గా సోషియాలజీని ఎంచుకు న్నా. ప్రణాళికాబద్ధంగా చదివా. 2021లో తొలిసారి యూపీఎస్సీ పరీక్షలకు హాజరయ్యా. ఇంటర్వ్యూ వరకు వెళ్లాను. అయితే కొద్దిపాటి తేడాతో విజయం సాధించలేకపోయాను. మరో ప్రయత్నంలో ప్రిలిమ్స్‌లోనే ఆగిపోయాను. అయినా నిరాశ చెందలేదు. మూడో ప్రయత్నం 2023లో జాతీయస్థాయిలో 29వ ర్యాంకు సాధించాను. ఐఏఎస్ కావాలనే నా సంకల్పంతోపాటు నాన్న కలను నెరవేర్చాను. తెలంగాణ క్యాడర్‌కు ఎంపికై ప్రస్తుతం ట్రైనింగ్ నిమిత్తం ఆదిలా బాద్‌కు రావడం జరిగింది. ఏడాది పాటు జిల్లాలో పని చేయాల్సి ఉంటుంది. రెండుసార్లు విఫలమైన సమయంలో నేను ఆత్మవిశ్వాసం కోల్పోకుండా అమ్మనాన్నలు అండగా నిలిచారు. వెన్నుతట్టారు. వారందించిన ప్రోత్సాహం తోనే విజయం సాధించాను. సివిల్స్, ఇతర పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే యువతకు మీరిచ్చే సలహా.. ట్రెయినీ కలెక్టర్: సివిల్ సర్వీసెస్‌కు సన్నద్ధమయ్యే అభ్యర్థుల్లో చాలా మంది ఒకటి, రెండు ప్రయత్నాలకే నిరాశకు లోనవుతారు. ఇక మా వల్ల కాదంటూ వెనుకడుగు వేస్తుంటారు. అపజయాలను చూసి నిరాశ చెందొద్దు. సంకల్పం వీడకుండా ముందుడుగు వేయాలి. పట్టుదలతో ప్రణాళికాబద్ధంగా చదివితే తప్పకుండా విజయం సాధించవచ్చు. రోజుకు కనీసం 8 నుంచి 10 గంటలు చదవాలి. ముఖ్యంగా సెల్‌ఫోన్, సోషల్ మీడియాకు దూరంగా ఉండాలి. ప్రతిరోజు పత్రికలను చదవడం అలవాటు చేసుకోవాలి. వర్తమాన అంశాలపై పట్టు సాధించాలి. గత ప్రశ్నాపత్రాలను విశ్లేషించుకోవాలి. సందేహాలుంటే ఎప్పటికప్పుడు నివృత్తి చేసుకోవాలి. ఆత్మవిశ్వాసం, సంకల్పబలంతో ప్రయత్నిస్తే తప్పకుండా లక్ష్యాన్ని సాధించవచ్చు.
ఫొటోలు
అంతర్జాతీయం

కెనడా ఎన్నికలు.. ఆధిక్యంలో లిబరల్ పార్టీ
అట్టావా: కెనడా (Canada)లో సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. మార్క్ కార్నీ నేతృత్వంలోని లిబరల్ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతోంది. కెనడాలో మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే అవకాశాలు కన్పిస్తున్నాయి. అటు ప్రతిపక్ష కన్జర్వేటివ్ పార్టీ కూడా గట్టి పోటీనిస్తోంది.ఇక, ఇప్పటివరకు వెలువడిన ఫలితాల ప్రకారం.. లిబరల్ పార్టీ 59 స్థానాల్లో గెలుపొందగా.. మరో 101 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇక, కన్జర్వేటివ్ పార్టీ 56 స్థానాలు దక్కించుకొని.. మరో 76 చోట్ల ముందంజలో కొనసాగుతోంది. ఖలిస్థానీ అనుకూలుడైన జగ్మీత్ సింగ్ నేతృత్వంలోని న్యూ డెమోక్రటిక్ పార్టీ 9 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. అయితే, కెనడా (Canada) పార్లమెంట్‌లోని హౌస్ ఆఫ్ కామన్స్‌లో మొత్తం 343 స్థానాలున్నాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాలంటే 172 మంది సభ్యులు అవసరం. కెనడా కాలమానం ప్రకారం ఏప్రిల్ 28న పోలింగ్ జరగగా.. ఆ వెంటనే ఓట్ల లెక్కింపు చేపట్టారు. ప్రస్తుతం ఫలితాలు వెలువడుతున్నాయి.కెనడాలో నాలుగు పార్టీలు ఎన్నికల బరిలో నిలిచాయి. వాటిలో లిబరల్ పార్టీ (Liberal party), కన్జర్వేటివ్ పార్టీ(Conservative Party), న్యూ డెమోక్రాట్స్ (NDP), బ్లాక్ క్యూబెకోయిస్ ఉన్నాయి. ప్రస్తుతం లిబరల్ పార్టీ దేశంలో అధికారంలో ఉంది. ఆ పార్టీకి 152 స్థానాలున్నాయి. ప్రతిపక్షంలో కన్జర్వేటివ్ పార్టీ ఉంది. అయితే ప్రస్తుత ఎన్నికల్లో లిబరల్ పార్టీ 189 సీట్లు గెలుచుకుని ఘన విజయం సాధించే అవకాశం ఉందని పలు కథనాలు పేర్కొన్నాయి. దీంతో మార్క్ కార్నీ మరోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టే చాన్స్ ఉంది. కన్జర్వేటివ్ పార్టీ సైతం గతంలో కంటే మెరుగైన ఫలితాలు సాధించే అవకాశం ఉందని తెలుస్తోంది.🚨🚨 The election in Canada is now a toss up.Conservative Party (Blue in Canada) massively outperforming expectations in early results. pic.twitter.com/Dd1eVSP2Rt— Spencer Hakimian (@SpencerHakimian) April 29, 2025ఇదిలా ఉండగా.. రెండుసార్లు సెంట్రల్ బ్యాంకులకు గవర్నర్‌గా పనిచేసిన మార్క్ కార్నీ ఈ ఏడాది మార్చి మధ్యలో కెనడా లిబరల్ పార్టీ నేతగా ఎన్నికైన తరువాత ఆ దేశ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. వెంటనే ఆయన సార్వత్రిక ఎన్నికలకు పిలుపునిచ్చారు. జనవరిలో మాజీ ప్రధాని జస్టిన్ ట్రూడో లిబరల్ పార్టీ నాయకత్వానికి రాజీనామా చేశారు. అప్పటి నుంచి కెనడాలో అనేకమంది రాజకీయనాయకులు ఎన్నికలు జరపాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే, కెనడాలో ఈ ఏడాది అక్టోబర్‌లో ఎన్నికలు జరగాల్సి ఉండగా ప్రధాని మార్క్ కార్నీ ముందస్తు ఎన్నికలకు పిలుపునిచ్చారు.మరోవైపు.. అమెరికాతో సుంకాల యుద్ధం, కెనడా యూఎస్‌లో 51వ రాష్ట్రంగా చేరాలంటూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బెదిరింపుల వేళ ఈ ఎన్నికలు అత్యంత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అటు భారత్‌తోనూ కెనడాకు దౌత్య విభేదాలు కొనసాగుతున్నాయి. దీంతో కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.BREAKING: Pierre Poilievre's Conservatives are TIED with the Liberals in Atlantic Canada..This election is gonna be an absolute blowout lol pic.twitter.com/Bri2eDwIvn— Jinglai He 🇨🇦 (@JinglaiHe) April 29, 2025

రికార్డు స్థాయికి ప్రపంచ సైనిక వ్యయం
ప్రపంచవ్యాప్తంగా సైనిక వ్యయం భారీగా పెరిగింది. మారుతున్న భౌగోళిక, రాజకీయ సంబంధాలు, యుద్ధాల నేపథ్యంలో ప్రభుత్వాలు సైనిక భద్రతకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాయి. 2024లో ప్రపంచ దేశాలు సైన్యానికి 2.7 ట్రిలియన్ డాలర్లను ఖర్చు చేశాయి. గాజా, ఉక్రెయిన్లపై యుద్ధం నేపథ్యంలో ముఖ్యంగా యూరప్, మధ్యప్రాచ్యంలో ఈ సైనిక వ్యయం అధికంగా పెరిగింది. తాజా వివరాలను స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (సిప్రి) నివేదిక తెలిపింది. 2024లో ప్రపంచవ్యాప్తంగా 100కు పైగా దేశాలు తమ సైనిక వ్యయాన్ని పెంచాయి. 2023తో పోలిస్తే ప్రపంచవ్యాప్తంగా ఖర్చు 9.4 శాతం పెరిగింది. వరుసగా పదో సంవత్సరం కూడా సైనిక వ్యయంలో పెరుగుదల ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఉద్రిక్తతలకు అద్దం పడుతోంది. యూరప్‌లో ఊహించని పెరుగుదల యూరప్ దేశాల్లో (రష్యాతో సహా) సైనిక వ్యయంలో అధిక పెరుగుదల కనిపించింది. ఉక్రెయిన్‌లో యుద్ధం, నాటో కూటమి పట్ల అమెరికా నిబద్ధతపై సందేహాల మధ్య 17 శాతం పెరుగుదల నమోదైంది. ప్రచ్ఛన్న యుద్ధం ముగింపు సమయంలో సైనిక వ్యయాన్ని మించిపోయింది. ఇక రష్యా సైనిక వ్యయం 2024లో 149 బిలియన్ డాలర్లకు చేరుకుంది, ఇది 2023తో పోలిస్తే 38 శాతం పెరిగింది. ఇది రష్యా జీడీపీలో 7.1 శాతం. మొత్తం ప్రభుత్వ వ్యయంలో 19%. ఉక్రెయిన్ మొత్తం సైనిక వ్యయం 2.9 శాతం పెరిగి 64.7 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇది రష్యా వ్యయంలో 43 శాతం కాగా, ఆ దేశ జీడీపీలో 34 శాతం. 2024లో అత్యధిక సైనిక వ్యయం చేసిన దేశం ఉక్రెయిన్. రష్యా చేస్తున్న యుద్ధానికి ఉక్రెయిన్ ప్రస్తుతం తన పన్ను ఆదాయం మొత్తాన్ని సైన్యానికి కేటాయిస్తోంది. జర్మనీ కూడా సైనిక వ్యయాన్ని బాగానే పెంచింది. 28 శాతం పెరిగి, 88.5 బిలియన్ డాలర్లకు చేరుకుంది. దీంతో ఇది భారతదేశాన్ని అధిగమించి ప్రపంచంలో నాల్గో అతి పెద్ద దేశంగా నిలిచింది. పునరేకీకరణ తరువాత జర్మనీ ఇంతపెద్ద మొత్తంలో ఖర్చు చేయడం ఇదే మొదటిసారి. వ్యయాన్ని పెంచిన చైనా సైన్యానికి భారీగా ఖర్చు చేసే ప్రపంచంలోనే రెండో దేశమైన చైనా సైతం తన సైనిక బడ్జెట్‌ను పెంచింది. 7.0 శాతం పెరుగుదలతో చైనా సైనిక వ్యయం 314 బిలియన్ డాలర్లకు చేరుకుంది. తన సైన్యాన్ని ఆధునీకరించడానికి, సైబర్ వార్ఫేర్ సామర్థ్యాలు పెంచుకోవడానికి, అణ్వాయుధాల విస్తరణలో విస్తృతమైన పెట్టుబడులు పెడుతోంది. ఆసియా మొత్తం సైనిక వ్యయంలో సగం వాటాను చైనానే కలిగి ఉంది. తగ్గేదే లేదన్న అమెరికా ప్రపంచ పెద్దన్న అమెరికా కూ సైనిక వ్యయంలో వెనుకబడలేదు. మొత్తం ప్రపంచ సైనిక వ్యయంలో అమెరికా వాటా 37 శాతం గమనార్హం. ఇక 2024లో మొత్తం నాటో వ్యయంలో 66 శాతం ఆమెరికా పెట్టుబడులే. 2024లో 5.7 శాతం పెంచడంతో ఆ దేశ సైనిక వ్యయం 997 బిలియన్ డాలర్లకు చేరుకుంది. అమెరికా నేతృత్వంలోని కూటమిలోని 32 సభ్యదేశాల మొత్తం సైనిక వ్యయం 1.5 ట్రిలియన్లకు పెరిగింది. 2025లో రక్షణకు అత్యధిక బడ్జెట్‌ను కేటాయించిన దేశాలు అస్థిర, సంక్లిష్ట భౌగోళిక రాజకీయ పరిస్థితుల్లో ప్రపంచ దేశాలు తమ శక్తిని, పలుకుబడిని చాటుకునేందుకు సైనిక బలగాలను బలోపేతం చేసుకుంటున్నాయి. గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ డేటా ప్రకారం అమెరికా, చైనా, రష్యా, భారత్, సౌదీ అరేబియాలు తమ సైనిక శక్తికి అత్యధిక బడ్జెట్ కేయటాంచిన మొదటి ఐదు స్థానాల్లో ఉన్నాయి. యూఎస్ – 895 బిలియన్ డాలర్లు చైనా – 266.85 బిలియన్ డాలర్లు రష్యా – 126 బిలియన్ డాలర్లు భారత్ – 75 బిలియన్ డాలర్లు సౌదీ అరేబియా – 74.76 బిలియన్ డాలర్లు – సాక్షి, నేషనల్ డెస్క్

మే 7న నూతన పోప్ ఎన్నిక
వాటికన్ సిటీ: నూతన పోప్ ఎన్నిక ప్రక్రియకు ముహూర్తం ఖరారైంది. మే 7వ తేదీన వాటికన్ సిటీలోని సిస్టిన్ చాపెల్‌లో జరిగే కార్యక్రమంలో రహస్య ఓటింగ్ జరగనుంది. ప్రపంచ దేశాల నుంచి తరలిరానున్న సుమారు 135 కార్డినల్స్ ఈ ప్రక్రియలో భాగస్వాములు కానున్నారు. దాదాపు 12 ఏళ్లపాటు కేథలిక్కుల మత పెద్దగా కొనసాగిన పోప్ ఫ్రాన్సిస్ ఈ నెల 21వ తేదీన కన్నుమూయడంతో ఈ ఎన్నిక అనివార్యమైంది. పోప్ ఎన్నిక ప్రక్రియ ఎన్ని రోజులు కొనసాగుతుందనే విషయంలో స్పష్టత లేదు. గతంలో 2005, 2013ల్లో రెండు రోజుల వ్యవధిలోనే తదుపరి పోప్ ఎవరనే విషయం తేలిపోయింది. మే 7వ తేదీన కార్డినల్స్ ముందుగా సెయింట్ పీటర్స్ బసిలికాలో జరిగే సామూహిక ప్రార్థనల్లో పాల్గొంటారని, అనంతరం ఓటింగ్‌కు అర్హులైన వారంతా సిస్టిన్ చాపెల్ రహస్య విధానంలో జరిగే ఓటింగ్‌లో పాల్గొంటారని వాటికన్ ప్రతినిధి మాటియో బ్రునీ చెప్పారు. లోపలికి వెళ్లిన వారికి నూతన పోప్ ఎన్నికయ్యే వరకు బయటి ప్రపంచంతో ఎలాంటి సంబంధాలుండవు. మొదటి రోజు మధ్యాహ్నం జరిగే ఓటింగ్‌లో కార్డినల్స్ ఒకే ఒక్కసారి ఓటేస్తారు. ఫలితం తేలకుంటే తర్వాత రోజుల్లో నాలుగుసార్లు చొప్పున ఓటేయాల్సి ఉంటుంది. మూడింట రెండొంతుల మెజారిటీ ఓట్లు సాధించిన వారే నూతన పోప్ అవుతారు. ఇందుకు కొంత సమయం పడుతుంది. మూడో రోజూ ఫలితం తేలకుంటే ప్రార్థనల కోసం విరామమిచ్చి మరోసారి ఓటింగ్ ప్రక్రియ చేపడతారు. ఎన్నిక నేపథ్యంలో సోమవారం పర్యాటకులను బయటకు పంపించేసి వాటికన్ అధికారులు సిస్టిన్ చాపెల్‌కు తాళాలు వేశారు.

100 రోజుల ట్రంపరితనం
డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్ష పగ్గాలు చేపట్టి మంగళవారానికి 100 రోజులు. అమెరికాను మళ్లీ గొప్ప దేశంగా మారుస్తున్నాననే మిషతో రోజుకోటి అన్నట్టుగా ఈ మూడు నెలల్లో ఆయన లెక్కలేనన్ని అనాలోచిత చర్యలకు దిగారు. ‘పూటకో మాట, రోజుకో వైఖరి’ అన్నట్టుగా పదేపదే నిర్ణయాలను, విధానాలను మార్చుకుంటూ నవ్వులపాలవుతున్నారు. అంతర్జాతీయ సమాజం దృష్టిలో అమెరికాను పలుచన చేయడమే గాక వ్యక్తిగతంగా జీవితకాలానికి సరిపడా అప్రతిష్ట మూటగట్టుకున్నారు. అక్రమ వలసదారులకు అడ్డుకట్ట సాకుతో తలా తోకా లేని నిబంధనలతో అంతర్జాతీయ విద్యార్థుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నారు. పొదుపు పేరిట ఉద్యోగులను భారీగా తొలగించడం వంటి చర్యలతో అమెరికన్లను కూడా ఎన్నడూ లేనంత అభద్రతా భావంలోకి నెట్టేశారు. దాదాపుగా ఈ మూడు నెలల్లో ట్రంప్ తీసుకున్న అన్ని నిర్ణయాలూ న్యాయ వివాదాలకు దారితీయడం విశేషం. అమెరికా ద్రవ్యోల్బణానికి ముకుతాడు వేస్తానన్న వాగ్దానం నిలుపుకోవడంలోనూ ట్రంప్ ఘోరంగా విఫలమయ్యారు. నిత్యావసరాల ధరలు చుక్కలు తాకుతున్నాయి. చివరికి గుడ్ల ధరలు చూసి సగటు అమెరికన్ గుడ్లు తేలేసే పరిస్థితి నెలకొంది! ఇష్టారాజ్యపు నిర్ణయాలతో అటు ప్రపంచాన్ని, ఇటు అమెరికాను కూడా ఆర్థికంగా ప్రమాదపుటంచుల్లోకి నెట్టిన ట్రంప్, ఆ మంటల్లో తీరిగ్గా చలి కాచుకుంటున్నారు...మతిలేని టారిఫ్‌ల యుద్ధం ఈ 100 రోజుల్లో ట్రంప్ చేపట్టిన చర్యలన్నింట్లోనూ అత్యంత వివాదాస్పదమైనది, ఆనాలోచితమైనది టారిఫ్‌ల యుద్ధమే. అమెరికాపై భారీ టారిఫ్‌లు విధిస్తున్నాయంటూ చాలా దేశాలపై అంతర్జాతీయ వాణిజ్య సూత్రాలకు విరుద్ధంగా ప్రతీకార చర్యలకు దిగారు. అగ్ర రాజ్యాలు మొదలుకుని చివరికి అసలు జనమే ఉండని అంటార్కిటికా వంటి ప్రాంతాలపై కూడా ఎడాపెడా టారిఫ్‌లు పెంచి నవ్వులపాలయ్యారు. పైగా వాటిని రోజుకోలా మారుస్తూ అత్యంత చంచల ధోరణి కనబరిచారు. ఇక చైనా విషయంలోనైతే టారిఫ్‌లను రోజురోజుకూ అంతకంతకూ పెంచుతూ వేలంపాటను తలపించారు. చివరికి 145 శాతం దాకా తీసుకెళ్లి దాన్నో కామెడీ వ్యవహారంగా మార్చేశారు. టారిఫ్‌ల భయంతో ప్రపంచ మార్కెట్లన్నీ కుప్పకూలి కోలుకోలేని రీతిలో లక్షలాది కోట్ల రూపాయల మేర నష్టాలను చవిచూశాక తీరిగ్గా వాటి అమలును మూడు నెలల పాటు వాయిదా వేశారు. టారిఫ్‌లకు ప్రతీకారంగా అరుదైన ఖనిజాల ఎగుమతిని చైనా పూర్తిగా నిలిపేయడంతో అమెరికా దిక్కుతోచని పరిస్థితిలో పడిపోయింది.వలసలపై మొట్టి కాయలు అక్రమ వలసలపై ఉక్కుపాదం మోపే పేరిట వలసదారుల గుండెల్లో ట్రంప్ రైళ్లు పరుగెత్తిస్తున్నారు. పగ్గాలు చేపట్టిన కొద్ది రోజులకే అక్రమ వలసదారులను భారీ ఖర్చుతో ఏకంగా సైనిక విమానాల్లో స్వదేశాలకు పంపారు. సుదీర్ఘ ప్రయాణం పొడవునా ఒళ్లంతా సంకెళ్లు వేసి విమర్శలు మూటగట్టుకున్నారు. తర్వాత వారిని గ్యాటెమాలా తదితర సమీప దేశాలకు తరలించి నిర్బంధంలో ఉంచడం మొదలుపెట్టారు. దీనిపై కోర్టుల మందలింపులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇక విదేశీ విద్యార్థుల విషయంలోనైతే ట్రంప్ అత్యంత అమానవీయంగా వ్యవహరిస్తున్నారు. ఐదారేళ్ల చరిత్రను తవ్వుతూ ఎక్కడ ఏ చిన్న తప్పిదం కనిపించినా దేశం వీడాలని ఆదేశిస్తున్నారు. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన చిన్నాచితకా కారణాలకు కూడా వీసాలు రద్దు చేసి వెనక్కు పంపిస్తున్నారు. ఈ విషయంలో కోర్టులతో పదేపదే మొట్టికాయలు తింటూ వస్తున్నారు.డోజ్.. ఓవర్ డోస్ దుబారా వ్యయానికి కళ్లెం వేసేందుకంటూ ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సారథ్యంలో తీసుకొచ్చిన డోజ్ పనితీరు అమెరికన్లలో తీవ్ర అసంతృప్తికి దారితీసింది. లెక్కలేనన్ని ఉద్యోగాలను డోజ్ ఒక్క దెబ్బతో పీకిపారేసింది. కనీసం రెండు లక్షల కోట్ల డాలర్లు ఆదా చేస్తానని గొప్పగా చెప్పుకున్న మస్‌్క, ఓ రెండొందల కోట్ల డాలర్ల కంటే ఆదా కష్టమంటూ చివరికి చేతులెత్తేశారు. పైగా డోజ్ ముసుగులో అమెరికా ప్రభుత్వానికి సంబంధించిన కీలక, రహస్య డేటానంతా మస్క్ చేజిక్కించుకున్నట్టు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.జెలెన్స్కీకి అవమానం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని చర్చలకంటూ పిలిచి వైట్‌హౌస్‌లో మీడియా సాక్షిగా ట్రంప్, ఆయన డిప్యూటీ జేడీ వాన్స్ ఘోరంగా అవమానించిన తీరు చరిత్రలో నిలిచిపోయింది. దేశాధ్యక్షుడనే కనీస గౌరవం కూడా లేకుండా సూటిపోటి మాటలతో ఇద్దరూ రెచ్చిపోయారు. జెలెన్స్కీ ఎక్కడా తగ్గకుండా వాళ్లకు మాటకు మాట బదులిచ్చి శెభాష్ అనిపించుకున్నారు. చిర్రెత్తుకొచి్చన ట్రంప్ చివరికి ఆయన్ను వైట్‌హౌస్ నుంచి అవమానకర రీతిలో వెళ్లగొట్టిన తీరు చూసి ప్రపంచ దేశాలన్నీ షాక్‌కు గురయ్యాయి. ట్రంప్, వాన్స్ ప్రవర్తన వైట్‌హౌస్‌కే తీవ్ర కళంకమంటూ ఈసడించుకున్నాయి. ఆదరణ అట్టడుగుకు ట్రంప్ పట్ల అమెరికన్లలో వ్యతిరేకత నానాటికీ పెరిగిపోతోందని పోల్స్ అన్నీ ముక్త కంఠంతో చెబుతున్నాయి. అధ్యక్షుల తొలి 100 రోజుల పాలనకు జనామోదం విషయంలో ట్రంప్ గత 70 ఏళ్లలోనే అట్టడుగున నిలిచారు! ఆయన పాలనను గట్టిగా సమరి్థస్తున్న వారి సంఖ్య ఏకంగా 22 శాతానికి పడిపోయినట్టు సీఎన్ఎన్ పోల్ తేలి్చంది. గట్టిగా వ్యతిరేకించేవారి సంఖ్య 45 శాతానికి పెరిగింది. ముఖ్యంగా మార్చి నుంచి ట్రంప్ ఆదరణ శరవేగంగా అడుగంటుతూ వస్తోంది. టారిఫ్‌లపై ట్రంప్ తీరును 35 శాతం అమెరికన్లు గట్టిగా వ్యతిరేకిస్తున్నారు. ఆర్థికంగా దేశాన్ని ఆయన గట్టెక్కిస్తారని నమ్ముతున్న వారి సంఖ్య కూడా డిసెంబర్‌తో పోలిస్తే ఏకంగా 12 శాతం తగ్గింది. మతిలేని చర్యలతో దేశాన్ని ట్రంప్ ప్రమాదంలోకి నెడుతున్నారని 57 శాతం మంది భావిస్తున్నారు. ఆయన విదేశీ విధానాన్ని 60 శాతం మందికి పైగా తీవ్రంగా తప్పుబడుతున్నారు. వలసల విధానాన్ని కూడా 47 శాతం మంది ఆక్షేపిస్తున్నారు. ఉద్యోగ కల్పనలో ట్రంప్ తీరుతో 58 శాతం మంది పెదవి విరుస్తున్నారు. అధ్యక్షునిగా అధికారాన్ని బాధ్యతాయుతంగా వాడతారన్న నమ్మకం లేదని 54 శాతం మంది అమెరికన్లు అంటుండటం విశేషం. సరైన నాయకత్వం అందిస్తారని నమ్ముతున్నది 50 శాతమే. ఆయనకు ఓటేసి తప్పు చేశామని 20 శాతం మంది వాపోతుండటం పరిస్థితికి అద్దం పడుతోంది!దేశాలపై నోటి దురుసు కెనడా మొదలుకుని పలు దేశాలపై నోటి దురుసు వ్యాఖ్యలతో ట్రంప్ పరువు పోగొట్టుకున్నారు. అమెరికాలో 51వ రాష్ట్రంగా విలీనమైతే మేలంటూ అనవసర వ్యాఖ్యలు చేసి కెనడాతో శత్రుత్వాన్ని కొనితెచ్చుకున్నారు. పైగా ఆ దేశంపై విధించిన అడ్డగోలు టారిఫ్‌లతో అంతిమంగా అమెరికాకే నష్టం జరిగింది. అంతేగాక అమెరికాను ఇక జీవితంలో నమ్మేది లేదని కెనడా నాయకత్వంతో అనిపించుకున్నారు. గ్రీన్‌లాండ్‌ను ఆక్రమించేసుకుంటామని ప్రకటించి మరో వివాదాల తేనెతుట్టెను కదిపారు. గాజా నుంచి పాలస్తీనియన్లను పూర్తిగా తొలగించేసి దాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామంటూ తలాతోకా లేని ప్రకటన చేసి మొత్తం ముస్లిం ప్రపంచం ఆగ్రహానికి గురయ్యారు. ఉక్రెయిన్‌కు చేసిన యుద్ధ సాయానికి బదులుగా ఆ దేశ ఖనిజ నిల్వలను అమెరికాకు కట్టబెట్టాల్సిందేనంటూ భీష్మించుకున్నారు. రష్యాను ఒప్పించి ఒక్క రోజులో యుద్ధాన్ని ఆపిస్తానన్న ట్రంప్ ప్రకటన కూడా ఉత్తదేనని తేలిపోయింది. ‘పుతిన్‌కు యుద్ధం ఆపే ఉద్దేశమే లేనట్టుంది’ అంటూ ఇప్పుడాయన తీరిగ్గా నిట్టూరుస్తున్నారు.విద్యాసంస్థలపై ఉక్కుపాదం తన మాట వినడం లేదంటూ యూనివర్సిటీలపై ట్రంప్ కన్నెర్రజేశారు. ప్రపంచానికే తలమానికం వంటి అమెరికా విద్యా సంస్థల పునాదులనే పెకిలించే పనిలో పడ్డారు. వాటికి బిలియన్ల కొద్దీ ప్రభుత్వ నిధులను నిలిపేశారు. దారికొస్తే తప్ప వాటిని విడుదల చేసేది లేదంటున్నారు. అలా కొలంబియా వంటి వర్సిటీలను లొంగదీసుకున్నారు. కానీ ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీ మాత్రం ట్రంప్ తీరును తూర్పారబట్టింది. అణచివేత చర్యలకు తలొంచేది లేదని ప్రకటించింది. 300 కోట్ల డాలర్లకు పైగా నిధులను నిలిపేసినా ‘డోంట్ కేర్’ అనేసింది.
జాతీయం

నేడు కేంద్ర కేబినెట్ భేటీ
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ సారథ్యంలో బుధవారం సాయంత్రం కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది. అంతకుముందు ఆయన నేతృత్వంలో రోజంతా అతి కీలకమైన అత్యున్నత స్థాయి సమావేశాలు జరగనున్నాయి. ఉదయం 11 గంటలకు భద్రత వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఎస్), తర్వాత రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీపీఏ), ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ భేటీలు ఉంటాయి. జాతీయ భద్రతకు సంబంధించి అత్యున్నత నిర్ణాయక విభాగమైన సీసీఎస్ సమావేశం వారం వ్యవధిలోనే ఇది రెండోసారి కావడం విశేషం.పహల్గాం దాడి జరిగిన మర్నాడే ఏప్రిల్ 23న జరిగిన సీసీఎస్ భేటీలో పాక్‌పై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ‘‘ఈ సమావేశాలన్నింటికీ పహల్గాం దాడే ప్రధాన అజెండా అని తెలుస్తోంది. పాక్‌కు బుద్ధి చెప్పేందుకు తీసుకోవాల్సిన సైనిక, రాజకీయ, ఆర్థికపరమైన నిర్ణయాలను సీసీఎస్ తదితర భేటీల్లో ఖరారు చేస్తారు. అనంతరం జరిగే మంత్రివర్గం భేటీలో వాటికి ఆమోదముద్ర వేస్తారు’’ అని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. పహల్గాం దాడి తర్వాత కేంద్ర కేబినెట్ సమావేశం అవుతుండడం ఇదే తొలిసారి.

సైన్యానికి పూర్తి స్వేచ్ఛ; ప్రధాని మోదీ
‘పహల్గాం’కు త్వరలో దీటైన జవాబు... ఎప్పుడు, ఎక్కడ, ఎలాగన్నది వారిష్టం బలగాల సామర్థ్యంపై పూర్తి విశ్వాసం ఉగ్రవాదాన్ని అంతం చేసి తీరాల్సిందే దేశమంతా అదే కోరుతోందన్న ప్రధాని సీడీఎస్, త్రివిధ దళాధిపతులతో భేటీ పాల్గొన్న రాజ్‌నాథ్, ఎన్ఎస్ఏ దోవల్ ఎన్ఎస్జీ చీఫ్‌తో హోం కార్యదర్శి భేటీ పాల్గొన్న బీఎస్ఎఫ్, ఎస్ఎస్బీ చీఫ్‌లు సరిహద్దుల్లో కొనసాగిన పాక్ కాల్పులుఉగ్రవాదంపై పోరాటంలో జవాన్లు పూర్తి స్వేచ్ఛగా వ్యవహరించవచ్చు. సొంతంగా నిర్ణయాలు తీసుకోవచ్చు. ఉగ్ర ముష్కరులకు, వారి సూత్రధారులకు చెప్పబోయే గుణపాఠం దాయాది జన్మలో మర్చిపోలేని రీతిలో ఉండాలి.ప్రతీకారానికి వేళైంది. ఉగ్ర వేటకు రంగం సిద్ధమైంది. ఈ దిశగా మంగళవారం రోజంతా కీల క పరిణామాలు చోటుచేసుకున్నాయి. ‘పహల్గాం’ కు దీటుగా బదులిచ్చేందుకు సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇస్తూ ప్రధాని మోదీ కీలక నిర్ణయం తీసుకున్నారు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, జాతీయ భద్రతా సలహాదారు, రక్షణ మంత్రి సమక్షంలో త్రివిధ దళాధిపతులతో ఆయన సమావేశమయ్యారు. ‘‘మీ సామర్థ్యంపై పూర్తి విశ్వాసముంది. ‘పహల్గాం’ ముష్కరులకు, వారి సూత్రధారుల కు ఎప్పుడు, ఎక్కడ, ఎలా బదులిస్తారో మీ ఇష్టం’’ అంటూ ఫుల్ పవర్స్ ఇచ్చేశారు. మరోవైపు ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్ కూడా మోదీతో సమావేశమయ్యారు. పహల్గాం ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ల కోసం ప్రత్యేకంగా ఏర్పాటైన ఎన్ఎస్జీ చీఫ్‌తో కేంద్ర హోం శాఖ కార్యదర్శి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. బీఎస్ఎఫ్, ఎస్ఎస్బీ, అస్సాం రైఫిల్స్ తదితర కీలక దళాల చీఫ్‌లు కూడా భేటీలో పాల్గొన్నారు. ఈ దిశగా మరిన్ని కీలక పరిణామాలు బుధవారం చోటు చేసుకోనున్నాయి. ఉదయం నుంచి సాయంత్రం దాకా భద్రత, రాజకీయ, ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీలతో మోదీ వరుస భేటీలు, ఆపై కేంద్ర కేబినెట్ భేటీ జరగనున్నాయి. దాయాదికి బుద్ధి చెప్పేందుకు రంగాలవారీగా తీసుకోవాల్సిన చర్యలను నిర్ణయించి ఆమోదముద్ర వేస్తారని తెలుస్తోంది.న్యూఢిల్లీ: ‘పహల్గాం’ ముష్కరులకు, వెనకుండి వారిని నడిపిస్తున్న దాయాది దేశానికి మర్చిపోలేని గుణపాఠం చెప్పేందుకు పూర్తిస్థాయిలో రంగం సిద్ధమవుతోంది. ఆ పాశవిక ఉగ్ర దాడికి పాల్పడ్డ, ప్రేరేపించిన వారు కలలో కూడా ఊహించని రీతిలో శిక్షించి తీరతామని ప్రతిజ్ఞ చేసిన ప్రధాని మోదీ ఆ దిశగా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయమై సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నట్టు స్పష్టం చేశారు. ‘‘దేశ భద్రతకు ముప్పుగా మారిన ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో అంతం చేసి తీరాల్సిందే. ప్రజలంతా అదే కోరుకుంటున్నారు. ఉగ్రవాదాన్ని ఖతం చేయాలన్నది దేశ సమష్టి సంకల్పం.పహల్గాం ఉగ్రదాడికి దీటైన జవాబు ఇవ్వక తప్పదు. ఉగ్ర ముష్కరులపై మన ప్రతిస్పందన ఎలా ఉండాలో నిర్ణయించే స్వేచ్ఛను సైన్యానికే ఇస్తున్నాం. శత్రువుపై ఎప్పుడు, ఎక్కడ, ఎలా దాడి చేయాలన్న దానిపై ఎలాంటి నిర్ణయమైనా సైన్యం తనంత తానుగా తీసుకోవచ్చు’’ అని పేర్కొన్నారు. ప్రధాని మంగళవారం ఢిల్లీలోని తన నివాసంలో త్రివిధ దళాల అధిపతులు జనరల్ ఉపేంద్ర ద్వివేది, అడ్మిరల్ దినేశ్ కె.త్రిపాఠి, ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్‌ప్రీత్ సింగ్‌తో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. గంటన్నరపాటు జరిగిన ఈ కీలక భేటీలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌తో పాటు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనీల్ చౌహాన్ కూడా పాల్గొన్నారు.పహల్గాం దాడి, తదనంతర పరిణామాలపై లోతుగా చర్చించారు. తగిన ప్రతీకారం తీర్చుకుని తీరాల్సిందేనని ప్రధాని పునరుద్ఘాటించారు. సైనిక దళాల శక్తి సామర్థ్యాలపై తనకు పూర్తి విశ్వాసముందన్నారు. ‘‘ఉగ్రవాదంపై పోరాటంలో జవాన్లు పూర్తిస్థాయిలో స్వేచ్ఛగా వ్యవహరించవచ్చు. సొంతంగా నిర్ణయాలు తీసుకోవచ్చు’’ అని స్పష్టం చేశారు. సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాక్ తీరుపై ప్రధాని ఈ సందర్భంగా తీవ్రంగా మండిపడ్డట్టు సమాచారం. ఉగ్ర ముష్కరులకు, వారి సూత్రధారులకు చెప్పబోయే గుణపాఠం దాయాది జన్మలో మర్చిపోలేని రీతిలో ఉండాలని ఆయన నిర్దేశించారు.ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్లో పహల్గాం సమీపంలోని బైసారన్ లోయలో అమాయక పర్యాటకులపై పాక్ ప్రేరేపిత లష్కరే తొయిబా ముసుగు సంస్థకు చెందిన ముష్కరులు కాల్పులకు తెగబడి 26 మందిని పొట్టన పెట్టుకోవడం తెలిసిందే. దీనిపై 140 కోట్ల పై చిలుకు భారతీయుల రక్తం మరిగిపోతోందని, ముష్కరులతో పాటు వారిని ప్రేరేపించిన వారిని కూడా కఠినాతి కఠినంగా శిక్షించి తీరతామని ఆదివారం మన్ కీ బాత్‌లో కూడా మోదీ పునరుద్ఘాటించారు. హోం శాఖ ఉన్నత స్థాయి భేటీ త్రవిధ దళాధిపతులతో మోదీ సమావేశానికి ముందే మంగళవారం కేంద్ర హోం శాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ సారథ్యంలో మరో ఉన్నతస్థాయి భేటీ జరిగింది. బీఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ దల్జీత్ సింగ్ చౌదరి, నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్ఎస్జీ) డీజీ బ్రిఘూ శ్రీనివాసన్, అస్సాం రైఫిల్స్ డీజీ లెఫ్టినెంట్ జనరల్ వికాస్ లఖేరా, సశస్త్ర సీమాబల్ అదనపు డీజీ అనుపమ నీలేకర్ చంద్రతో పాటు పలువురు సీనియర్ సైనికాధికారులు ఈ కీలక భేటీలో పాల్గొన్నారు.పహల్గాం దాడి నేపథ్యంలో ఉగ్రవాదుల అణచివేతతోపాటు దేశ సరిహద్దుల్లో భద్రతను మరింత పటిష్టం చేయాలని నిర్ణయించినట్టు చెబుతున్నా అసలు అజెండా వేరేనంటున్నారు. భేటీలో చర్చించిన అంశాలను అత్యంత రహస్యంగా ఉంచారు. పాక్, బంగ్లాదేశ్ సరిహద్దుల రక్షణ బీఎస్ఎఫ్ బాధ్యత. మయన్మార్ సరిహద్దులను అస్సాం రైఫిల్స్ గస్తీ కాస్తుంది. ఇక ఎన్ఎన్జీ ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్పెషలైజ్డ్ కమెండో విభాగం.2016లో సర్జికల్ స్ట్రైక్స్ 2019లో ‘బాలాకోట్’ ఇప్పుడెలా ఉంటుందో!ప్రతీకార చర్యలపై ఉత్కంఠసైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇస్తూ ప్రధాని తీసుకున్న నిర్ణయంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ముష్కర మూకపై, వారికి అన్నివిధాలా వెన్నుదన్నుగా నిలుస్తున్న దాయాదిపై ప్రతీకార చర్యలు ఎలా ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది. ఉగ్ర దాడులకు ప్రతిస్పందనగా మోదీ సర్కారు పాక్ భూభాగంపై 2016లో చేపట్టిన సర్జికల్ స్ట్రైక్స్, 2019లో చేసిన బాలాకోట్ వైమానిక దాడులు ప్రపంచవ్యాప్తంగా సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. భారత్ నుంచి ఈ స్థాయి దాడులను ఊహించని పాక్ ఒక్కసారిగా బిత్తరపోయింది. 2016లో జమ్మూ కశ్మీర్‌లోని ఉరి సెక్టర్లో సైనిక క్యాంప్‌పై జైషే మహ్మద్‌కు చెందిన నలుగురు ఉగ్రవాదులు పాశవిక దాడికి తెగబడ్డారు. 18 మంది సైనికులను పొట్టన పెట్టుకున్నారు. దానికి ప్రతీకారంగా సైన్యానికి చెందిన స్పెషల్ ఫోర్సెస్ కమెండోలు పాక్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి సర్జికల్ స్ట్రైక్స్ చేశారు. కనీసం 200 మందికి పైగా ఉగ్రవాదులను అంతం చేశారు. 2019లో జమ్మూలోని పుల్వామాలో సీఆరీ్పఎఫ్ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు జరిపిన ఆత్మాహుతి దాడిలో 40 మంది అమరులయ్యారు. ఇందుకు ప్రతీకారంగా పాక్‌లోని బాలాకోట్‌లో ఉగ్రవాదుల స్థావరాలపై అత్యంత కచ్చితత్వంతో వైమానిక దాడులు జరిపి వందలాది మంది ముష్కరులను మట్టుబెట్టింది.12 మిరాజ్ ఫైటర్ జెట్లు పాక్ కన్నుగప్పి, వారి రాడార్ వ్యవస్థలను ఏమార్చి లక్ష్యాలపై నిప్పుల వర్షం కురిపించాయి. బాలాకోట్‌లోని జైషే మహ్మద్ శిక్షణ స్థావరాలను నామరూపాల్లేకుండా చేసింది. గత అనుభవాల నేపథ్యంలో సర్జికల్ స్ట్రైక్స్, వైమానిక దాడులను ఎదుర్కొనేందుకు పాక్ సైన్యం పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతున్నట్టు వార్తలొస్తున్నాయి. కనుక ఈసారి కూడా భారత ప్రతి చర్య దాయాది ఊహించని విధంగా ఉంటుందని రక్షణ నిపుణులు అంటున్నారు. ‘‘పాక్ ఆక్రమిత కశ్మీర్లో క్షిపణి దాడుల వంటివి ఒక ఆప్షన్. కానీ ఆ క్రమంలో పాక్ ఆర్మీ యూనిట్లకు నష్టం వాటిల్లితే పరిస్థితి అదుపు తప్పి పూర్తిస్థాయి యుద్ధానికి దారితీసే ప్రమాదం లేకపోలేదు. కనుక ఏం జరుగుతుందన్నది వేచి చూడాల్సిందే’’ అని చెబుతున్నారు.

అందరి అనుమానం అదే.. NIA ప్రశ్నకు తడబడ్డ జిప్‌లైన్ ఆపరేటర్
జమ్మూ: ఎన్ఐఏ విచారణలో జిప్‌లైన్ ఆపరేటర్ ముజమ్మిల్ తీరుపై పలు అనుమానాలు వెలుగులోకి వస్తున్నాయి. పహల్గాం ఉగ్రదాడి సమయంలో జిప్‌లైన్‌పై ప్రయాణిస్తున్న ఓ టూరిస్ట్ తీసిన వీడియోలో ఉగ్రదాడి ఘటన రికార్డైంది. అయితే అప్పటికే కాల్పులు ప్రారంభమైనా తనను హెచ్చరించకుండా ఆపరేటర్ అల్లహో అక్బర్ అని అరుస్తూ తనను ముందుకు తోశాడని గుజరాత్‌కు చెందిన టూరిస్ట్ రిషి భట్ చెప్పాడు. రిషి వీడియో బయటకు రావడంతో జిప్ లైన్ ఆపరేటర్‌ను ఎన్ఐఏ అదుపులోకి తీసుకొని విచారిస్తోంది.ఎన్ఐఏ విచారణలో ముజమ్మిల్ అల్లాహు అక్బర్ అని అనడంలో ఎలాంటి అనుమానం లేదని ఎన్ఐఏ వర్గాల సమాచారం. ఆపత్కాలంలో హిందువులు రామా అని ఎలా స్మరిస్తారో.. ముజమ్మిల్ సైతం తాను కూడా అల్లాహో అక్బర్ అని పలికినట్లు చెప్పినట్లు తెలుస్తోంది. అంతవరకు బాగానే ఉన్నా.. ఎన్ఐఏ ప్రాథమిక విచారణలో ముజమ్మిల్‌కి ఈ ఉగ్రదాడిలో ప్రత్యక్ష పాత్ర లేకపోయినా, అతని తీరుపై పలు అనుమానాలు ప్రస్పుటమవుతున్నాయి. #PahalgamTerrorAttackA zipline operator when hears the first shot, said “Allah-hu-Akbar.” He’s at a vantage point—he sees everything unfolding belowInstead of stopping the ride, he waves next tourist in. He wasn’t scared. He seems complicit & aware!@smitaprakash@AartiTikoo pic.twitter.com/Fam4sYYOjg— Fatima Dar (@FatimaDar_jk) April 28, 2025ఘటనా స్థలంలో ఉగ్రవాదులు కాల్పులు జరిపినప్పుడు జిప్‌లైన్ ఆపరేటర్ ముజమ్మిల్.. టూరిస్ట్ రిషి భట్ని అల్లహో అక్బర్ అని అరుస్తూ ముందుకు తోశాడనేది ప్రశ్నార్ధకంగా మారింది. ఎన్ఐఏ అధికారులు జిప్ లైన్ ఆపరేటర్ ముజమ్మిల్ ప్రశ్నిస్తే.. ఆయన వ్యవహార శైలీ అనుమానాస్పదంగా మారింది. దీంతో ఎన్ఐఏ అధికారుల తమ దర్యాప్తును మరింత లోతుగా ముమ్మరం చేశారు.
‘ఉగ్రవాదులు మొదట ప్రాణం తీసింది లెఫ్టినెంట్ వినయ్ నార్వల్‌నే’
జమ్మూ: జమ్మూకశ్మీర్ పహల్గాంలో ఉగ్రదాడి ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పక్కా ప్లాన్ ప్రకారం పాక్ టెర్రరిస్టులు.. టూరిస్టులపై కాల్పులకు తెగబడ్డట్లు తేలింది.జమ్మూకశ్మీర్ అనంత్ నాగ్ జిల్లా పహల్గాంలో మినీ స్విట్జర్లాండ్‌గా పేరొందిన బైసరీన్ వ్యాలీలో ఉగ్రవాదులు పర్యాటకులపై ఏ విధంగా కాల్పులకు తెగబడింది. ప్రాణాలు తీసింది. టూరిస్టులు తప్పించుకోకుండా టెర్రరిస్టులు ఎలా కాపలా కాసారో ప్రత్యక్ష సాక్షుల స్టేట్మెంట్ను కేంద్ర దర్యాప్తు సంస్థ రికార్డ్ చేశారు. వాటి ఆధారంగా ఎగ్జిట్, ఎంట్రన్స్ గేటులో ఉగ్రవాదులు కాపలాప్రకృతి అందాల్ని ఆస్వాధిస్తున్న పర్యాటకులు తప్పించుకునేందుకు వీలు లేకుండా బైసరీన్ వ్యాలీలో ఎంట్రీ గేటు వద్ద ఇద్దరు ఉగ్రవాదులు కాపలా, ఎగ్జిట్ గేటు వద్ద ఒక ఉగ్రవాది కాపలా ఉండగా.. ఆ ఇద్దరికి సమాచారం అందించేందుకు బైసరీన్ వ్యాలీ బయట అడవిలో ఉన్నట్లు తేలింది. ముందుగా టెర్రరిస్టులు ఎంట్రీ గేటు దగ్గర పర్యాటకులపై కాల్పులు జరిపారు. కాల్పులు మోతతో ఒక్కసారిగా భయపడ్డ టూరిస్టులు ప్రాణ భయంతో ఎగ్జిట్ వైపు పరిగెత్తారు. అయితే, అక్కడే ఉన్న ఇద్దరు ఉగ్రవాదులు పర్యాటకుల్ని అడ్డుకున్నారు. తమవద్ద ఉన్న మెషీన్ గన్లతో పర్యాటకుల్ని బెదిరించారు. Grief beyond words. Can’t forget, can’t forgive. Indian Navy Lieutenant Vinay Narwal's wife bids an emotional farewell to her husband, who was killed in the Pahalgam terror attackThe couple got married on April 16. pic.twitter.com/GJXjG368i7— Anjana Om Kashyap (@anjanaomkashyap) April 23, 2025 ఉగ్రవాదుల తొలి ప్రాణం తీసింది లెఫ్టినెంట్ వినయ్ నార్వల్నేఎంట్రీ గేటు వద్ద టూరిస్టులను ఒక చోటకు చేర్చారు. అనంతరం మహిళలు, పురుషులు వేరు కావాలని ఆదేశించారు. అయితే, టూరిస్టులు టెర్రరిస్టుల మాటల్ని పట్టించుకోలేదు.దీంతో కోపంతో ఊగిపోయిన టెర్రరిస్టులు హిందువులు, ముస్లింలు వేర్వేరుగా నిలబడాలని సూచించారు. అయినా టూరిస్టులు పట్టించుకోలేదు.ఆ తరువాత, ఉగ్రవాదులు తాము ఇస్లాం మతం స్వీకరిస్తున్నామని అంగీకరిస్తూ ‘కల్మా’ఉచ్ఛరించమని పర్యాటకులను ఆదేశించారు. పర్యాటకులు కల్మా అనడం పూర్తయిన తర్వాత ఉగ్రవాదులు..అమాయకులపై కాల్పులు జరిపి ప్రాణాలు తీసుకున్నారు. ఈ సమయంలో ఎంట్రీ గేటు ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో మరణించిన మొట్టమొదటి వ్యక్తి భారత నేవీ అధికారి, లెఫ్టినెంట్ వినయ్ నార్వల్ అని తెలుస్తోంది.ఈ మరణాలు ఎక్కువగా టీ స్టాల్, భేల్ పూరి స్టాల్ సమీపంలో సంభవించాయి.ఈ రెండు ప్రాంతాల్లో పర్యాటకులు అధిక సంఖ్యలో ఉండడం వల్ల భారీ మొత్తంలో ప్రాణ నష్టం జరిగింది.
ఎన్ఆర్ఐ

దుబాయి హతుల వారసులకు ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు
ఇటీవల దుబాయిలో హత్యకు గురైన ఇద్దరు తెలంగాణ యువకుల కుటుంబ సభ్యులకు ఔట్ సోర్సింగ్ లో ఉద్యోగాలు ఇవ్వాలని జపాన్ పర్యటన నుంచి ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారని తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ది కార్పోరేషన్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే అనిల్ ఈరవత్రి ఒక ప్రకటనలో తెలిపారు. నిర్మల్ జిల్లా సోన్ మండల కేంద్రానికి చెందిన అష్టపు ప్రేమ్ సాగర్‌తో పాటు, జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం దమ్మన్నపేట కు చెందిన స్వర్గం శ్రీనివాస్ లు దుబాయి లో హత్యకు గురైన విషయం తెలిసిందే. దుబాయి నుంచి మృత దేహాలను త్వరగా స్వదేశానికి తెప్పించడానికి చర్యలు తీసుకోవాలని సీఎం అధికారుల్ని ఆదేశించినట్లు అనిల్ తెలిపారు.. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దుబాయి లోని భారత రాయబార కార్యాలయానికి, ఢిల్లీ లోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు లేఖలు రాసినట్లు వెల్లడించారు. మరిన్ని NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి:ఎన్నారై అడ్వయిజరీ కమిటీ చైర్మన్ డా. బిఎం వినోద్ కుమార్ బృందం, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి లు మృతుల కుటుంబాలను పరామర్శించారు.

రాయలసీమ ప్రగతికి డాలస్‌లో జీఆర్ఏడీఏ అడుగులు
గ్రేటర్ రాయలసీమ అసోసియేషన్ ఆఫ్ డాలస్ ఏరియా (GRADA) ఆధ్వర్యంలో ఏప్రిల్ 13న ఫ్రిస్కో, టెక్సాస్‌లో రాయలసీమ ప్రాంతం ఎదుర్కొంటున్న సమస్యలపై సమావేశం జరిగింది. రాయలసీమ సమస్యలు, అభివృద్ధి అవకాశాలు, తెలుగు భాషా సాహిత్యాల ప్రాముఖ్యతపై చర్చ జరిగింది. ఈ కార్యక్రమానికి రాయలసీమకు చెందిన రచయిత భూమన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన తన ప్రసంగంలో రాయలసీమ ప్రస్తుత పరిస్థితి, ముఖ్యంగా దీర్ఘకాలంగా వేధిస్తున్న నీటి సమస్యలు, వెనుకబాటుతనం గురించి ఎంతో ఆవేదనతో, స్పష్టంగా వివరించారు.మన ప్రాంత సహజ సంపద అయిన శేషాచలం అడవుల గురించి, ముఖ్యంగా ఎర్రచందనం చెట్ల గురించి ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ విలువైన సంపదను అక్రమ మార్గాల్లో ఇతర దేశాలకు తరలించి లాభం పొందకుండా, స్థానికంగానే వాటి ఆధారిత పరిశ్రమలను స్థాపించి, ఉత్పత్తులను తయారు చేయడం ద్వారా మన ప్రాంతాన్ని ఎలా ఆర్ధికంగా బలోపేతం చేయవచ్చో ఆయన చక్కగా వివరించారు. ఆయన మాటలు మనందరిలో కొత్త ఆలోచనలను రేకెత్తించాయి. సహజ వనరులను సక్రమంగా వినియోగించుకుంటే రాయలసీమ భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందనే ఆశాభావాన్ని ఆయన కలిగించారు.మరో గౌరవ అతిథిగా కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం మాజీ వైస్‌ఛాన్సలర్, ప్రఖ్యాత విద్యావేత్త ప్రొఫెసర్ పి. కుసుమ కుమారి హాజరయ్యారు. ఆమె తన ప్రసంగంలో తెలుగు భాష మాధుర్యం, సాహిత్యం గొప్పదనం, పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకత గురించి వివరించారు. నంద కోర్వి, అనిత నాగిరెడ్డి, సతీష్ సీరం, బ్రహ్మ చిరా, హరినాథ్ పొగకు, హేమంత్ కాకుట్ల, జగదీశ్వర నందిమండలం, జగదీష్ తుపాకుల, పవన్ పల్లంరెడ్డి, ప్రసాద్ నాగారపు, రాజు కంచం, శివ అద్దేపల్లి, శివ వల్లూరు, శ్రీధర్ బొమ్ము, శ్రీకాంత్ దొంత, సురేష్ మోపూరు, ఉమా గొర్రెపాటి, మరియు కార్తీక్ మేడపాటి ఈ సమావేశానికి హాజరయ్యారు.

సింగపూర్‌లో ‘అంతర్జాతీయ ఉగాది సాహిత్య సమ్మేళనం’
'వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా' 'శ్రీ సాంస్కృతిక కళాసారథి - సింగపూర్' మరియు 'వంశీ ఇంటర్నేషనల్ - ఇండియా' సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో, ఆదివారం 13వ తేదీ హైదరాబాద్ , శ్రీ త్యాగరాయ గానసభలో ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు 12 గంటల పాటు నిర్విరామంగా "అంతర్జాతీయ ఉగాది సాహిత్య సమ్మేళనం" కార్యక్రమం అద్వితీయంగా నిర్వహించబడింది.ఈ మూడు సంస్థలు కలసి విశ్వావసు నామ సంవత్సర ఉగాదిని పురస్కరించుకొని 80 మంది కవులతో 'అంతర్జాతీయ కవి సమ్మేళనము', 20 నూతన గ్రంధావిష్కరణలు, ఆచార్య శలాక రఘునాథ శర్మ 'రాయప్రోలు వంశీ జాతీయ సాహితీ జీవన సాఫల్య పురస్కార' ప్రదానము డా. బులుసు అపర్ణచే ప్రత్యేక 'మహిళా అష్టావధానము' మొదలైన అంశాలతో ఈ 'అంతర్జాతీయ ఉగాది సాహిత్య సమ్మేళనం' కార్యక్రమాన్ని ప్రత్యేకంగా రూపొందించి నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ్యులు మండలి బుద్ధ ప్రసాద్, విశిష్ట అతిథులుగా కవి జొన్నవిత్తుల, కిమ్స్ ఆస్పత్రి వ్యవస్థాపకులు బొల్లినేని కృష్ణయ్య, తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు ఆచార్య వెలుదండ నిత్యానంద రావు, ప్రముఖ రాజకీయవేత్త వామరాజు సత్యమూర్తి తదితరులు హాజరయ్యారు.ఉదయం 9 గంటలకు డా వంశీ రామరాజు అందించిన స్వాగతోపన్యాసంతో ఆరంభమైన ప్రారంభోత్సవ సభలో, కార్యక్రమ ప్రధాన సమన్వయకర్త రాధిక మంగిపూడి సభా నిర్వహణలో, మండలి బుద్ధ ప్రసాద్, కవి జొన్నవిత్తుల, బొల్లినేని కృష్ణయ్య, వామరాజు సత్యమూర్తి, డా. జననీ కృష్ణ తదితరుల ప్రసంగాలు అందరినీ ఆకర్షించాయి.తదనంతరం ఖతార్ నుండి విచ్చేసిన విక్రమ్ సుఖవాసి నిర్వహణలో అతిథుల చేతుల మీదుగా 18 తెలుగు నూతన గ్రంథాలు ఆవిష్కరించబడ్డాయి. వాటిలో కథల కవితల సంకలనాలు, వ్యాస సంపుటాలు, జెవి పబ్లికేషన్స్, మిసిమి మాసపత్రిక వారి ప్రచురణలు, సిద్ధాంత గ్రంథాలు మాత్రమే కాకుండా, ప్రతిష్టాత్మకంగా 2024 నవంబర్‌లో ఖతార్ దేశ రాజధాని దోహా మహానగరంలో వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా ఆధ్వర్యంలో జరిగిన "9వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు సభా విశేష సంచిక" కూడా ఆవిష్కరించబడడం ఈ సభకు మరింత శోభను చేకూర్చింది.మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 4:30 వరకు కొనసాగిన "అంతర్జాతీయ కవి సమ్మేళనం"లో ఆస్ట్రేలియా, ఖతార్, దక్షిణాఫ్రికా, అమెరికా మొదలైన దేశాలనుండి, ఉభయ తెలుగు రాష్ట్రాలనుండి, ముంబై, అండమాన్ దీవులు మొదలైన ప్రాంతాలనుండి కూడా వచ్చిన సుమారు 80 మంది కవులు కవయిత్రులు పాల్గొని తమ కవితలు వినిపించారు. వంశీ అధ్యక్షురాలు డా. తెన్నేటి సుధాదేవి, రేవూరు అనంత పద్మనాభరావు, జి భగీరథ, గుండు వల్లీశ్వర్, ప్రొ. రామా చంద్రమౌళి మహెజబీన్, ప్రొ. త్రివేణి వంగారి, డా కేతవరపు రాజ్యశ్రీ, డా. చిల్లర భవానీ దేవి, డా. శంకరనారాయణ, అంబల్ల జనార్ధన్, డా చాగంటి కృష్ణకుమారి మొదలైన ఎందరో కవులు కవయిత్రులు ఈ కవిసమ్మేళనంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం కొందరు రచయితలు ప్రసంగవ్యాసాలు వినిపించారు. సభా వ్యాఖ్యాతలుగా పేరి, కృష్ణవేణి, రాధిక వ్యవహరించారు.అనంతరం సాయంత్రం ఆచార్య శలాక రఘునాథ శర్మను ఘనంగా సత్కరించి, వారికి మూడు నిర్వాహక సంస్థల తరఫున "రాయప్రోలు వంశీ జాతీయ సాహితీ జీవన సాఫల్య పురస్కారం" అందించారు. దీనికి తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు ఆచార్య వెలుదండ నిత్యానందరావు ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. అనంతరం శలాక మాట్లాడుతూ తెలుగువారికి సొంతమైన అవధాన ప్రక్రియలో 'సమస్యా పూరణం' అనే అంశంలో ఉండే చమత్కారాలు వివరణలు తెలియజేస్తూ "అవధాన కవిత్వం - సమస్యలు" అనే అంశంపై ప్రత్యేక ప్రసంగాన్ని అందించారు.సాయంత్రం 5:30 గంటల నుండి ద్విశతావధాని డా. బులుసు అపర్ణ చేసిన అష్టావధానం ఈ సదస్సుకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రాధిక మంగిపూడి సంచాలకత్వంలో అమెరికా, యుగాండా, ఆస్ట్రేలియా, ఖతార్, అండమాన్ దీవులు, ముంబై, విశాఖపట్నం, విజయవాడ నుండి వచ్చిన 8 మంది మహిళలు పృచ్ఛకులుగా పాల్గొనడంతో ఇది "సంపూర్ణ మహిళా అష్టావధానం"గా ప్రశంసలు అందుకుంది.ఈ కార్యక్రమానికి ప్రధాన నిర్వాహకులుగా వంగూరి ఫౌండేషన్ వ్యవస్థాపకులు డా. వంగూరి చిట్టెన్ రాజు, వంశీ వ్యవస్థాపకులు డా. వంశీ రామరాజు, సింగపూర్ సంస్థ వ్యవస్థాపకులుకవుటూరు రత్నకుమార్ వ్యవహరించగా, వంగూరి ఫౌండేషన్ భారతదేశ ట్రస్టీ శైలజ సుంకరపల్లి ఆధ్వర్యంలో వేదిక ఏర్పాట్లు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమం యూట్యూబ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా పంచవ్యాప్తంగా సాహిత్య అభిమానుల మన్ననలు అందుకుంది.

టెక్సాస్‌లో రోడ్డు ప్రమాదం, ప్రాణాపాయ స్థితిలో తెలుగు విద్యార్థిని దీప్తి
ఉన్నత చదువులకోసం అమెరికాకు వెళ్లిన తెలుగు విద్యార్థిని ప్రాణలతో పోరాడుతోంది. అమెరికాలోని టెక్సాస్‌లోని డెంటన్ నగరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తెలుగు అమ్మాయిలు గాయపడ్డారు. వీరిలో తీవ్రంగా గాయపడిన విద్యార్థినిని దీప్తి వంగవోలుగా గుర్తించారు. మరో విద్యార్థినికి కూడా తీవ్రంగా గాయపడిందని అయితే ఆమెకు ప్రాణాపాయం లేదని అమెరికా మీడియా నివేదికలు తెలిపాయి.ఈ ప్రమాదం శనివారం (ఏప్రిల్ 12) తెల్లవారుజామున, ఎన్. బోనీ బ్రే స్ట్రీ మరియు డబ్ల్యు. యూనివర్శిటీ డ్రైవ్ సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరుకు చెందిన దీప్తి వంగవోలు ,ఆమె స్నేహితురాలు కాలినడకన ఇంటికి చేరుకోబోతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. వెంటనే ఆ వాహనం డ్రైవర్ని అక్కడినుంచి పారిపోయాడు. దీప్తికి తలకు లోతైన గాయం అయిందని, ఆమెకు శస్త్రచికిత్స జరుగుతోందని స్థానిక మీడియా తెలిపింది. ప్రస్తుతం డెంటన్ పోలీసులు ఈ హిట్ అండ్ రన్ ఘటనపై దర్యాప్తు ముమ్మరం చేశారు. పరారీలో ఉన్న డ్రైవర్‌ను, ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించేందుకు ప్రజల సహాయం కోరుతూ ప్రకటన కూడా విడుదల చేశారు. ఈ ఘటనపై మరిన్నివివరాలు అందాల్సి ఉంది. లింక్డ్ఇన్ ప్రొఫైల్ ప్రకారం, దీప్తి వంగవోలు నార్త్ టెక్సాస్ విశ్వవిద్యాలయంలో కంప్యూటర్ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్‌లో మాస్టర్స్ చదువుతోంది. 2023లో నరసరావు పేట ఇంజనీరింగ్ కళాశాల నుండి బీటెక్ పూర్తి చేసింది.
క్రైమ్

కొడుకు మృతదేహంతో మూడురోజులు
మంచిర్యాల క్రైం: మతిస్థిమితం కోల్పోయిన ఒక తండ్రి.. చనిపోయిన కుమారుడి శవం పక్కనే మూడు రోజుల పాటు ఉన్న ఘటన వెలుగు చూసింది. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని అశోక్‌రోడ్‌లో జరిగిన ఈ ఘటనపై స్థానికులు, ఎస్ఐ ప్రవీణ్‌కుమార్ తెలిపిన వివరాలివి. గూడెల్లి వెంకట్‌రెడ్డి అశోక్‌రోడ్డులో నివసిస్తున్నారు.ఈయనకు కుమారుడు లక్ష్మీనారాయణ ఉన్నాడు. వెంకట్‌రెడ్డి సింగరేణిలో పనిచేసి ఉద్యోగ విరమణ చేశారు. మూడేళ్ల క్రితం భార్య రాధమ్మ అనారోగ్యంతో చనిపోయాక వెంకట్‌రెడ్డి మతిస్థిమితం కోల్పోయారు. తండ్రీకొడుకులు ఇద్దరే ఇంట్లో ఉంటున్నారు. ఎస్టీపీపీలో కాంట్రాక్ట్ వర్కర్‌గా పనిచేస్తున్న కొడుకు లక్ష్మీనారాయణ.. తండ్రి బాగోగులు చూసుకునేవారు. ఇటీవల మద్యానికి బానిసైన లక్ష్మీనారాయణ.. ఆదివారం కూడా తాగి ఇంట్లోని సోఫాలో పడుకున్నారు. అప్పటి నుంచి బయటకు రాలేదు. మంగళవారం ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో.. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించగా.. సోఫాలో లక్ష్మీనారాయణ (30) శవమై కనిపించాడు. మరోవైపు వెంకట్‌రెడ్డి అచేతన స్థితిలో పడుకుని ఉన్నాడు. ‘నీ కొడుక్కి ఏమైంది..’ అని ప్రశ్నిస్తే.. ‘పడుకున్నాడు’.. అంటూ సమాధానం చెప్పారు. పోలీసులు లక్ష్మీనారాయణ మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, వెంకట్‌రెడ్డిని వైద్యం నిమిత్తం ఆసుపత్రిలో చేర్పించారు. వెంకట్‌రెడ్డి బంధువు గూడెల్లి శ్రీనివాస్‌రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు.

ఆడుకుంటూ వెళ్లి అసువులు బాసింది
చైతన్యపురి(హైదరాబాద్): ఇంటి పక్క నుంచి ఆడుకుంటూ వెళ్లిన ఆరేళ్ల బాలిక ప్రమాదవశాత్తు చెరువు నీళ్లలో పడి మృతి చెందిన ఘటన సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ సైదిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని నెల్లూరు జిల్లాకు చెందిన పాలకుర్తి శ్రీను, శ్రావణి దంపతులు. బతుకుదెరువు కోసం నగరానికి వచ్చి కూలిపనులు చేసుకుంటూ గ్రీన్‌పార్కు కాలనీ రోడ్‌నం.14లో నివసిస్తున్నారు. వీరికి నలుగురు కూతుళ్లు. సోమవారం సాయంత్రం 4 గంటల సమయంలో తల్లిదండ్రులు పక్కింటివారితో మాట్లాడుతుండగా రెండో కూతురు అభిత (6) ఆడుకుంటోంది. కొద్ది సేపటి తర్వాత తర్వాత చూడగా అభిత కనిపించలేదు. ఎక్కడ వెతికినా జాడ తెలియకపోవటంతో రాత్రి సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేశారు. మంగళవారం ఉదయం 9.30 గంటలకు అభిత మృతదేహం చెరువు నీటిలో తేలుతూ కనిపించింది. ఇంటి సమీపంలోనే చెరువు ఉండటంతో బాలిక ఆడుకుంటూ వెళ్లి అందులో పడి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. తమ ఆరేళ్ల కూతురు మృతి చెందడంతో శ్రీను, శ్రావణి దంపతులు కన్నీరుమున్నీరుగా విలపించారు. చెరువు చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని అధికారులకు ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా పట్టించుకోవడం లేదని కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇద్దరిని బలిగొన్న అతివేగం
బిట్రగుంట(నెల్లూరు): అతి వేగం ఇద్దరు స్నేహితుల ప్రాణాలను బలిగొంది. ఈ ఘటన కొడవలూరు మండలం నార్తురాజుపాళెం సమీపంలో ఆంజనేయస్వామి గుడి వద్ద హైవేపై సోమవారం అర్ధరాత్రి జరిగింది. పోలీసుల సమాచారం మేరకు.. బోగోలు పంచాయతీ బేతనీయపేటకు చెందిన షేక్ మన్సూర్‌బాషా (26), విశ్వనాథరావుపేట రామస్వామిపాళెంకు చెందిన బత్తుల ప్రవీణ్‌కుమార్ (26) చిన్ననాటి నుంచి స్నేహితులు. మన్సూర్‌కు వివాహమై రెండేళ్ల కుమారుడు ఉండగా, ప్రవీణ్‌కుమార్ అ వివాహితుడు. మన్సూర్ బిట్రగుంటలోనే వాహనాలకు నేమ్ బోర్డులు, స్టిక్కర్లు వేసే షాపు నిర్వహిస్తున్నాడు. ప్రవీణ్‌కుమార్ గౌరవరం టోల్‌ప్లాజా వద్ద పని చేస్తున్నాడు. స్నేహితులిద్దరూ పనిమీద సోమవారం నెల్లూరు వెళ్లారు. రాత్రి సుమారు 11.30 గంటల తర్వాత బైక్‌పై ఇంటికి బయలు దేరారు. బాగా ఆలస్యం కావడంతో త్వరగా ఇంటికి చేరుకొందామని బైక్‌ను వేగంగా నడుపుకొంటూ వచ్చారు. 12 గంటల ప్రాంతంలో నార్తురాజుపాళెం ఆంజనేయస్వామి గుడి వద్ద ఆగి ఉన్న లారీని అదే వేగంతో వెనుక వైపు ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న స్నేహితులు మన్సూర్, ప్రవీణ్‌కుమార్ అక్కడకక్కడే మృతి చెందారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఏఎస్సై గంధం ప్రసాద్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి మృతుల కుటుంబాలకు సమాచారం అందించారు. అనంతరం ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నెల్లూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై తెలిపారు.

చదివేది ఏడో తరగతి.. వాడేది ఐ ఫోన్
జీడిమెట్ల(హైదరాబాద్): ఆ బాలుడు ఏడో తరగతి చదువుతున్నాడు. ఇంట్లో ఎవరూ చూడకుండా సంవత్సర కాలంగా ఇంట్లో ఐ ఫోన్ వాడుతున్నాడు. కుమారుడు ఐ ఫోన్ వాడటాన్ని గమనించిన తండ్రి.. ‘నీకు ఫోన్ ఎలా వచి్చంది’ అని నిలదీయడంతో అసలు విషయం చెప్పేశాడు. ‘మన షాపులోంచి రోజూ కొంత డబ్బు తీసి ట్యూషన్ మాస్టారుకు ఇచ్చేవాణ్ని. మాస్టారే ఈ ఫోన్ కొనిచ్చాడు’ అని బాలుడు తన తండ్రికి వివరించాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు.పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.. షాపూర్‌నగర్‌కు చెందిన వ్యాపారవేత్త కమల్‌జైన్. ఆయన కుమారుడు ఏడో తరగతి చదువుతున్నాడు. సంవత్సర కాలంగా బాలుడు తమ షాపులోంచి కొంత నగదు దొంగిలించసాగాడు. ఆ డబ్బును తనకు ట్యూషన్ చెప్పే మాస్టారుకు ఇచ్చేవాడు. ఈ క్రమంలో బాలుడికి సదరు ట్యూషన్ మాస్టారు ఐ ఫోన్ కొనిచ్చాడు. ఈ విషయం ఇంట్లో తెలియడంతో కుమారుడికి ట్యూషన్ చెబుతున్న వ్యక్తిపై జీడిమెట్ల పీఎస్‌లో కమల్‌జైన్ ఫిర్యాదు చేశాడు. విచారణ చేపట్టిన పోలీసులు ట్యూషన్ మాస్టారు సందీప్‌పై కేసు నమోదు చేశారు. సంవత్సర కాలంగా కుమారుడు తమ షాపులోంచి డబ్బులు తీస్తున్న తండ్రి పసిగట్టకపోవడం గమనార్హం. అలాగే సంవత్సర కాలంగా కుమారుడు ఇంట్లో ఫోన్ వాడుతున్నా కుటుంబ సభ్యులు చూడకపోవడం మరో విచిత్రం. ఎవరైనా పిల్లలు ఇలాంటి పనులు చేస్తే వారికి కౌన్సెలింగ్ ఇప్పించాలని సీఐ గడ్డం మల్లేష్ తల్లిదండ్రులకు సూచించారు.