Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Simhachalam Temple Tragedy: Ys Jagan To Visakha Updates1
విశాఖకు మాజీ సీఎం వైఎస్‌ జగన్‌

సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విశాఖ వెళ్లనున్నారు. సింహాచలం ఘటనలో బాధిత కుటుంబాలను ఆయన పరామర్శించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు వైఎస్‌ జగన్‌ విశాఖకు చేరుకోనున్నారు.విశాఖ జిల్లా సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవంలో గోడ కుప్పకూలి భక్తులు మృతి చెందడంపై వైఎస్‌ జగన్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చందనోత్సవం సందర్భంగా రూ. 300 టికెట్‌ క్యూలైన్‌ పై గోడ కుప్పకూలి భక్తులు మృత్యువాత పడటంపై తీవ్రవిచారం వ్యక్తం చేశారు. స్వామివారి నిజరూప దర్శనానికి వచ్చిన భక్తులు ఇటువంటి దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమన్నారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని, మరణించిన భక్తుల కుటుంబాలను ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.

Wall Collapse Simhachalam Temple Incident Updates2
సింహాచలం అప్పన్న సన్నిధిలో అపశ్రుతి.. ఏడుగురు భక్తులు మృతి

సాక్షి, విశాఖపట్నం: సింహాచలం చందనోత్సవంలో ఘోర అపశ్రు‍తి చోటుచేసుకుంది. గోడ కుప్పకూలి ఏడుగురు మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు. రూ.300 టికెట్‌ కౌంటర్‌ వద్ధ ఈ ప్రమాదం జరిగింది. ఇటీవలే అక్కడ గోడ నిర్మించారు. గోడ నాసిరకంగా నిర్మించడం వలనే కూలిపోయిందని అధికారులు భావిస్తున్నారు. తెల్లవారుజామున 2-3 గంటల మధ్య రూ.300 క్యూ లైన్‌లో ప్రమాదం జరిగింది. మృతులను యడ్ల వెంకటరావు(48),దుర్గా స్వామినాయుడు(32), మణికంఠ(28)గా గుర్తించారు.ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. మృతులను విశాఖపట్నం మధురవాడ సమీపంలోని చంద్రంపాలెం గ్రామానికి చెందిన పిళ్లా ఉమామహేశ్వరరావు (30), ఆయన భార్య శైలజ (26)గా అధికారులు గుర్తించారు. వీరితో పాటు పిల్లా శైలజ తల్లి వెంకటరత్నం, మేనత్త గుజ్జురి మహాలక్ష్మి కూడా ఈ ఘటనలో మృతిచెందారు. మృతదేహాలను కేజీహెచ్‌కు తరలించారు.👉ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఈ ప్రమాదం.. మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌తిరుపతిలో వైకుంఠ ఏకాదశి ఎంత విశిష్టత ఉంటుందోసింహాచలంలో చందనోత్సవానికి అంతే విశిష్టత ఉంటుందిప్రభుత్వ నిర్లక్ష్యం చేతకాని తనంతో ప్రమాదం జరిగిందిమూడు నాలుగు రోజుల క్రితం గోడ నిర్మించారుగోడ నిర్మాణంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోలేదుగోడ ప్లెక్సీ ఊగినట్లు ఊగిందని సాక్షులు చెప్పారుకొండవాలులో కాంక్రీట్ వాల్ నిర్మించాలిఇటుక బెడ్డలతో నిర్మాణం చేపట్టరాదుఒకే కుటుంబంలో నలుగురు చనిపోయారుచనిపోయిన వారి కుటుంబానికి కోటి రూపాయలు పరిహారం ఇవ్వాలిప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలిసంఘటన తెలిసిన వెంటనే వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారుకేజీహెచ్ లో బాధిత కుటుంబాలను పరామర్శిస్తారుప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే ప్రమాదం జరిగిందికొండపై చాలా గోడలు ఉన్నాయి.. అవి ఎందుకు పడుపోలేదునాణ్యాత లోపించింది కాబట్టే గోడ పడిపోయింది👉సింహాచలం దుర్ఘటన.. భక్తుల మృతిపై విచారణ కమిటీ ముగ్గురు అధికారులతో కమిటి వేసిన ప్రభుత్వం 👉సింహాచలం ఘటన.. ప్రభుత్వ వైఫల్యంపై మల్లాది విష్ణు ఫైర్ఈ ప్రభుత్వం మొద్దు నిద్ర పోతోంది...అచేతనంగా మారిపోయిందిప్రత్యర్థుల్ని ఇబ్బంది పెట్టడానికి మాత్రమే పోలీస్ శాఖ మాత్రమే పనిచేస్తుందితిరుపతి లడ్డూ అంశాన్ని తెరపైకి తెచ్చి వైఎస్ జగన్ పై బురద చల్లాలని చూశారుచందనోత్సవంలో అపశ్రుతి పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమేమంత్రులు, ప్రభుత్వం చేతకాని తనంతోనే భక్తులు ప్రాణాలు కోల్పోయారుచనిపోయిన వారిని తిరిగి తీసుకురాగలరా?రాష్ట్ర పండుగగా జరుపుకునే ఉత్సవానికి లోపభూయిష్టంగా ఏర్పాట్లు చేయడమేంటి?ఇంతపెద్ద ఘటన జరిగితే తప్పించుకునే ధోరణితో మంత్రులు, అధికారులు వ్యవహరిస్తున్నారువరుస అపచారాలు జరుగుతున్నా మొద్ద నిద్ర వీడటం లేదు 👉మరణించిన వారికి పోస్టుమార్టం చేయడానికి ఒప్పుకోని బంధువులుకోటి రూపాయల పరిహారం ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్తమ డిమాండ్లను ఒప్పుకున్న తర్వాతే పోస్టుమార్టం చేయాలంటున్న బంధువులుపోస్టుమార్టానికి సహకరించాలని బంధువులపై పోలీసులు ఒత్తిడిపోలీసులతో వాగ్వాదానికి దిగిన బంధువులుఎల్జీ పాలిమర్ ప్రమాదంలో చనిపోయిన వారికి కోటి రూపాయల పరిహారం చెల్లించారుఅదే తరహాలో నేడు కూడా పరిహారం చెల్లించాలని డిమాండ్..👉కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యమే: కొట్టు సత్యనారాయణతిరుపతి ఘటన మరవకముందే సింహాచలంలో ఏడుగురు భక్తులు మృతి దారుణంకూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందిలక్షలాది మంది భక్తులు వస్తారని తెలిసి కూడా ప్రభుత్వం ఏర్పాట్లు చేయలేదుసింహాచలం ఘటన బాధాకరంఘటన జరిగి కొన్ని గంటలు అవుతున్నా పవన్‌ కల్యాణ్‌ ఎక్కడ ఉన్నారు?క్యూలైన్ల దగ్గర ఎండోమెంట్‌,రెవెన్యూ అధికారులు ఎందుకు లేరు?గోదావరి పుష్కరాల్లో కూడా పదుల సంఖ్యలో భక్తులు చనిపోయారు.👉విశాఖకు మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మధ్యాహ్నం 3 గంటలకు విశాఖకు చేరుకోనున్న వైఎస్‌ జగన్‌బాధిత కుటుంబాలను పరామర్శించనున్న వైఎస్‌ జగన్‌👉 సింహాచలం ఘటనపై ప్రధాని మోదీ విచారంవిశాఖ జిల్లా సింహాచలం దేవస్థానంలో గోడ కూలిన ఘటనపై ప్రధాని మోదీ విచారం గోడకూలి భక్తులు చనిపోవడం బాధాకరంమృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిగాయపడిన భక్తులు త్వరగా కోలుకోవాలి పీఎం సహాయ నిధి నుంచి ఎక్స్‌గ్రేషియా మృతుల కుటుంబాలకు PMNRF నుండి రూ. 2 లక్షల పరిహారం గాయపడిన వారికి రూ. 50,000 పరిహారం ఇస్తున్నట్లు పీఎంవో కార్యాలయం ఎక్స్‌ వేదికగా ట్వీట్‌ Deeply saddened by the loss of lives due to the collapse of a wall in Visakhapatnam, Andhra Pradesh. Condolences to those who have lost their loved ones. May the injured recover soon.An ex-gratia of Rs. 2 lakh from PMNRF would be given to the next of kin of each deceased. The…— PMO India (@PMOIndia) April 30, 2025 👉కేజీహెచ్ మార్చురి వద్ద విషాద ఛాయలుకేజీహెచ్ మార్చురి వద్దకు చేరుకుంటున్న మృతుల కుటుంబ సభ్యులుకన్నీరు మున్నీరవుతున్న కుటుంబ సభ్యులు...దైవదర్శనానికి వెళ్లి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారంటూ ఆవేదన👉సింహాచలం ఘటనపై వీహెచ్‌పీ ఆగ్రహంసింహాచలం సరైన రీతిలో ప్రభుత్వం చర్యలు చేపట్టలేదునిర్మాణ లోపం వల్లే ప్రమాదం జరిగిందిసింహాచలంలో పాలన కాదు.. లాబీయింగ్‌ నడుస్తోందిఎండోమెంట్‌ వ్యవస్థ ఓ చెత్తభగవంతుడికి భక్తులకు దూరం చేయడమే వారిపనిహిందువుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయిపాలకుల కబంధ హస్తాల నుంచి ఎండోమెంట్‌ వ్యవస్థ బయటకు వస్తేనే భక్తులకు మంచి జరుగుతోందిచందనోత్సవంలో ఒక ప్రణాళిక లేదు.. ఓ ప్లాన్‌ లేదు👉తిరుపతి తొక్కిసలాట ఘటన మరవకముందే..ఘటనపై సమగ్ర విచారణ చేసి.. మృతుల కుటుంబాలను ఆదుకోవాలని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి డిమాండ్ చేశారు. తిరుపతి తొక్కిసలాట ఘటన మరవకముందే సింహాచలంలో ఇలాంటి ఘటన జరగడం బాధాకరమని ఆమె అన్నారు. మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం ఇవ్వాలి. అన్యాయంగా ఏడుగురు చనిపోయారు. ప్రభుత్వం సరైన చర్యలు చేపట్టకపోవడం వల్లనే ప్రమాదం జరిగిందని వరుదు కల్యాణి అన్నారు.👉వైఎస్‌ జగన్‌ దిగ్భ్రాంతివిశాఖ జిల్లా సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవంలో గోడ కుప్పకూలి భక్తులు మృతి చెందడంపై మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చందనోత్సవం సందర్భంగా రూ. 300 టికెట్‌ క్యూలైన్‌ పై గోడ కుప్పకూలి భక్తులు మృత్యువాత పడటంపై తీవ్రవిచారం వ్యక్తం చేశారు. స్వామివారి నిజరూప దర్శనానికి వచ్చిన భక్తులు ఇటువంటి దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమన్నారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని, మరణించిన భక్తుల కుటుంబాలను ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.👉సింహాచలం ఘటనపై తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర విచారంగోడ కూలి భక్తులు మరణించిన ఘటన తీవ్ర ఆవేదనను కలిగించిందివారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి ఆంధ్ర ప్రదేశ్ లోని సింహాచలం ఆలయం వద్ద గోడ కూలి భక్తులు మరణించిన ఘటనతీవ్ర ఆవేదనను కలిగించింది. వారి కుటుంబ సభ్యులకునా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ…మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని…భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.— Revanth Reddy (@revanth_anumula) April 30, 2025

Pakistan Firing At International Border3
పాక్‌ కపట నాటకం.. వరుసగా రోజు భారత సైన్యంపై పాక్‌ సైన్యం కాల్పులు

జమ్మూ : భారత్‌ ఓ వైపు సైనిక చర్యకు సిద్ధమైందని, ఆ పని చేయొద్దంటూ ఐక్య రాజ్య సమితిని పాకిస్తాన్‌ బతిమలాడుతోంది. అదే సమయంలో భారత్‌ను రెచ్చగొట్టేలా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి యధేశ్చగా కాల్పులకు తెగబడుతుంది. తాజాగా, మంగళవారం రాత్రి జమ్మూలోని అఖ్నూర్ సెక్టార్, పరగ్‌వాల్ సెక్టార్‌లో అంతర్జాతీయ సరిహద్దు వద్ద పాకిస్తాన్ సైన్యం భారీ కాల్పులు జరిపింది. పాక్‌ కాల్పులపై భారత సైన్యం స్పందించింది. జమ్మూ ప్రాంతంలోని మూడు ప్రధాన సెక్టార్లలో కూడా కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘించింది. వరుసగా ఆరో రోజు పాక్ సైన్యం కాల్పులు జరిపింది. అంతే ధీటుగా భారత సైన్యం బదులిస్తోందని భద్రతా బలగాలు తెలిపాయి. BREAKING news :What kind of Pakistani army is this that is hell-bent on breaking its own country into 5 pieces?Pakistan indulges in ceasefire violation along the International Border (IB) in Jammu’s Akhnoor Sector, Pargwal. This is not LoC but IB making it a serious… pic.twitter.com/Z5VWPu4MVL— श्रवण बिश्नोई (किसान) (@SharwanKumarBi7) April 29, 2025 ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్‌లో పహల్గాంలో ఉగ్రవాదులు 26మంది టూరిస్టుల ప్రాణాలు తీశారు. నాటి నుంచి భారత్‌-పాక్‌ల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. సైనిక దుస్తులు ధరించిన అమాయకుల ప్రాణాల్ని తీయడంపై భారత్‌.. పాక్‌ను అన్నీ అంశాల్లో దెబ్బకు దెబ్బతీయాలనే ప్రయత్నాల్ని ముమ్మరం చేస్తోంది.ఇందులో భాగంగా ఇండస్ వాటర్ ట్రీటీని తాత్కాలికంగా నిలిపివేసింది. ఏప్రిల్ 27 నుండి పాకిస్తాన్ పౌరులకు జారీ చేసిన వీసాలన్నీ రద్దు చేసింది. అటారీ బోర్డర్‌ను తక్షణమే మూసివేసింది.

Chandrababu Govt Negligence In Simhachalam Appanna Chandanotsavam4
తిరుపతి తొక్కిసలాట ఘటన మరవకముందే..

సాక్షి, విశాఖపట్నం: తిరుపతి తొక్కిసలాట ఘటన మరవకముందే.. సింహాచలంలో మరో ఘోర విషాదం జరిగింది. సింహాచలం అప్పన చందనోత్సవంలో ప్రభుత్వం నిర్లక్ష్యం ఫలితంగా.. గోడకూలి ఏడుగురు మృతిచెందారు. ఘటన జరిగిన సమయంలో ఒక్క పోలీసు కూడా కనిపించలేదు.. భక్తులను ఆదుకోవడానికి ఒక్క ఎండోమెంట్‌ ఉద్యోగి కూడా అక్కడ లేరు. అందుబాటులో ఉన్న వాలంటీర్లు, భక్తులు మాత్రమే సహాయక చర్యలు చేపట్టారు. కటిక చీకటిలో భక్తుల కోసం క్యూలైన్‌లు ఏర్పాటు చేయడంతో అంతా అంధకారం అలుముకుంది. గోడ కూలిపోవడంతో భక్తుల అరుపులు, రోదనలు మిన్నంటాయి. అప్పటికే భక్తుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.ఈ ఘటనపై సమగ్ర విచారణ చేసి.. మృతుల కుటుంబాలను ఆదుకోవాలని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి డిమాండ్‌ చేశారు. మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం ఇవ్వాలన్నారు. అన్యాయంగా ఏడుగురు చనిపోయారు. ఘటనపై పూర్తి వివరాలు అధికారులను అడిగి తెలుసుకుంటున్నాం. సరైన చర్యలు చేపట్టకపోవడం వల్లనే ప్రమాదం జరిగిందని వరుదు కల్యాణి అన్నారు. కటిక చీకట్లో భక్తుల కోసం క్యూలైన్లా?. తిరుపతి తొక్కిసలాట ఘటన మరవకముందే. ఈ ఘటన ప్రభుత్వ వైఫల్యాన్ని బయటపెడుతోందని ఆమె అన్నారు.మరోవైపు, సింహాచలం ఘటనపై వీహెచ్‌పీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సింహాచలం సరైన రీతిలో ప్రభుత్వం చర్యలు చేపట్టలేదని.. నిర్మాణ లోపం వల్లే ప్రమాదం జరిగిందని మండిపడింది.సింహాచలంలో పాలన కాదు.. లాబీయింగ్‌ నడుస్తోంది. ఎండోమెంట్‌ వ్యవస్థ ఓ చెత్త.. భగవంతుడికి భక్తులకు దూరం చేయడమే వారిపని.. హిందువుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.. పాలకుల కబంధ హస్తాల నుంచి ఎండోమెంట్‌ వ్యవస్థ బయటకు వస్తేనే భక్తులకు మంచి జరుగుతోంది.. చందనోత్సవంలో ఒక ప్రణాళిక లేదు.. ఓ ప్లాన్‌ లేదు’’ అంటూ వీహెచ్‌పీ ఆగ్రహం వ్యక్తం చేసింది.

Capital Amaravati: Kommineni Comments On Chandrababu Real Estate5
హవ్వ.. ఇంకో 44 వేల ఎకరాలా?

పిచ్చి ముదిరిందంటే.. తలకు రోకలి చుట్టమన్నాడట వెనుకటికి ఎవడో. అలా ఉంది ఏపీ ప్రభుత్వం పరిస్థితి ఇప్పుడు. రాజధాని పేరుతో ఇప్పటికే 33 వేల ఏకరాల భూమి సేకరించిన చంద్రబాబు ప్రభుత్వం తాజాగా ఇంకో 44676 ఎకరాలు సేకరించాలని నిర్ణయించడం ఆందోళన కలిగిస్తోంది. రైతులపై మాత్రమే కాదు.. ఈ నిర్ణయం రాష్ట్ర ప్రజలందరిపై పిడుగుపాటే. ఇప్పటికే సేకరించిన భూమిలో ఒక్క భవనాన్ని కూడా పూర్తి చేయలేదు. అన్నీ తాత్కాలిక నిర్మాణాలే. అయినాసరే.. ఇంకో 44 వేల పైచిలుకు ఎకరాలు సేకరించాలన్న నిర్ణయం ఏ రకంగా చూసినా సహేతుకం కాదు.ఈ నిర్ణయానికి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ మినహా మిగిలిన పార్టీలన్నీ తమ జేబు పార్టీలే అన్న ధీమాతో టీడీపీ ఈ ప్రతిపాదన చేస్తున్నట్లు కనిపిస్తోంది. ప్రశ్నిస్తానని రాజకీయ పార్టీ పెట్టిన జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఇప్పుడు ఆ పని ఎప్పుడో మానేశారు. పురంధేశ్వరి వంటి స్థానిక బీజేపీ నేతలు సరేసరి. ఎన్టీయే వ్యతిరేకినని జాతీయ స్థాయిలో చెప్పుకునే కాంగ్రెస్‌ పార్టీ కూడా ఏపీలో పరోక్ష మద్దతుదారుగా మారిపోయింది.ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల ముఖ్యమంత్రి చంద్రబాబు సలహాలు, సూచనల మేరకే పార్టీని నడుపుతున్నారన్నది కాంగ్రెస్ వాదుల భావన. వామపక్ష పార్టీ సీపీఐ పైపైకి టీడీపీని విమర్శిస్తున్నట్లు కనిపిస్తున్నా, మానసికంగా చంద్రబాబుకే దగ్గరగా ఉన్న విమర్శ ఉంది. ఒక్క సీపీఎం మాత్రం కాస్తో, కూస్తో స్వతంత్రంగా ఉండే ప్రయత్నం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు ఇంత అడ్డగోలుగా నిర్ణయాలు చేయగలుగుతున్నారు. అమరావతి పేరుతో గత టర్మ్‌లో చంద్రబాబు నాయుడు 33 వేల ఎకరాలు సమీకరిస్తున్నప్పుడు కొంతమంది రైతులు స్వచ్ఛందంగానే ఇచ్చినా చాలా మంది తీవ్రంగా వ్యతిరేకించారు. భూ సేకరణను వ్యతిరేకించిన కొన్ని గ్రామాల వారికి పవన్ కళ్యాణ్ అప్పట్లో మద్దతిచ్చారు, చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు కూడా. కానీ కూటమి ప్రభుత్వంలో భాగస్వామయ్యాక ఆయన పన్నెత్తిన పాపన పోలేదు. పిఠాపురంలో శాంతిభద్రతల సమస్యపై తీవ్రంగా స్పందించిన తర్వాత ఏమైందో కాని, చంద్రబాబును పొగడడమే లక్ష్యంగా పెట్టుకుని పవన్ కళ్యాణ్ తన ఉప ముఖ్యమంత్రి పదవిని ఎంజాయ్ చేయడానికి అలవాటు పడ్డారు. ప్రభుత్వంలో జరిగే అవకతవకలు ఎత్తి చూపకుండా ఉండేందుకు ఏమైనా డీల్ కుదిరిందేమో!విశాఖతోసహా ఏపీ మొత్తమ్మీద రియల్ ఎస్టేట్ పెద్దగా పుంజుకుంది లేదు. అమరావతిలో రియల్ ఎస్టేట్ రంగం పుంజుకోవడం లేదన్న ఆందోళన ఇప్పటికే అక్కడి రైతులలో ఉంది. కృత్రిమంగానైనా పెంచేందుకు వేల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి మరీ ఖర్చుపెట్టేందుకు ప్రయత్నించినా ఫలితం పెద్దగా లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో అదనంగా మరింత భూమి సేకరిస్తే డిమాండ్‌ భారీగా పడిపోతుంది.అమరావతి గ్రామాలలో విమానాశ్రయం ఏర్పాటైతే భూముల విలువ పెరుగుతాయంటూ చంద్రబాబు తాజాగా కొత్త పాట అందుకున్నారు. భూ సమీకరణ ద్వారా మూడు పంటలు పండే పచ్చటి పొలాలను ప్రభుత్వం బీళ్లుగా మార్చింది. తెలంగాణలో 400 ఎకరాల ప్రభుత్వ భూమి అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రయత్నిస్తేనే పర్యావరణవేత్తలు, వివిధ రాజకీయ పక్షాలు తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేశాయి. సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ప్రధాని మోడీ సైతం కాంగ్రెస్‌పై విమర్శల వర్షం కురిపించారు. అలాంటిది అమరావతిలో లక్ష ఎకరాల భూమిని అనవసరంగా తీసుకుంటున్న తీరుపై మాత్రం ఎవరూ కిమ్మనడం లేదు.చంద్రబాబు తన ఇంటి కోసం ఐదు ఎకరాలు కొనుగోలు చేసి, శంకుస్థాపన చేసిన విషయంలో కూడా మతలబు ఉండవచ్చన్న భావన ఉంది. రియల్ ఎస్టేట్ పెరగడానికి వీలుగా ఆయన ఈ ప్రయత్నం చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. వచ్చే ఎన్నికలలో టీడీపీ కూటమి ఓటమి పాలైతే, చంద్రబాబు కాని, ఆయన కుటుంబం కాని అమరావతిలోనే నివసిస్తుందా? ఎందుకంటే చంద్రబాబు లోకేశ్‌లు పేరుకు అక్కడ నివసిస్తున్నా, కుటుంబ సభ్యులు.. వారాంతాల్లో ఆయన కూడా హైదరాబాద్‌కు వచ్చేస్తున్నారు. పవన్ కళ్యాణ్‌ది కూడా అదే తీరు. చిత్రమేమిటంటే చంద్రబాబు అమరావతిలో గజం రూ.60 వేలకుపైగా ఉందని ప్రచారం చేస్తున్నా, ఆయన కుటుంబం మాత్రం ఐదెకరాల భూమిని గజం రూ.7500లకే కొనుగోలు చేసిందట. రిజిస్ట్రేషన్ అయితే గజం రూ.ఐదు వేలకే చేశారు.మరి చంద్రబాబు ప్రచారం చేసిన విధంగా రియల్ ఎస్టేట్ విలువలు లేవా? లేక చంద్రబాబు నిర్దిష్ట మొత్తం కాకుండా మిగిలిన దానిని భూ యజమానులకు బ్లాక్‌లో నగదు రూపంలో అందించారా అన్నది చర్చనీయాంశం. ఏభైవేల మంది పేదలకు గత ప్రభుత్వం సెంటు భూమి చొప్పున ఇస్తే, దానిని వెనక్కి లాక్కుంటున్న కూటమి ప్రభుత్వం, ధనవంతులకు మాత్రం ఎకరాలలో ఇళ్లు కట్టుకునే వెసులుబాటు కల్పిస్తోందన్న మాట. రైతుల గుండెలు గుభేలు మనేలా ప్రభుత్వం అదనపు భూమి సమీకరణకు సిద్దమవుతున్న తరుణంలో ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి ఎల్లో మీడియా మాత్రం చంద్రబాబు సర్కారుకు వంత పాడుతూ కథనాలు ఇస్తోంది. ఈనాడు మీడియా ఎంత దారుణమైన కథనాన్ని ఇచ్చిందంటే రైతుల విజ్ఞప్తి మేరకే అదనంగా మరో 44 వేల ఎకరాల భూమి తీసుకోవాలని తలపెట్టారట.మంత్రి నారాయణను కలిసి వారు ఈ మేరకు కోరారట. మెడకాయ మీద తలకాయ ఉన్నవారెవరైనా ఈనాడు పిచ్చి రాతలను నమ్ముతారా? ప్రస్తుతం ఉన్న రాజధాని భూమిలో ప్రభుత్వానికి మిగిలేది రెండువేల ఎకరాలేనట.అది చాలదట. గతంలో పదివేల ఎకరాల భూమి మిగులుతుందన్నారు. ఇప్పుడు దానిని రెండువేలకు తగ్గించారు. అనేక సంస్థలు ఇక్కడ భూమి కావాలంటున్నాయట. నిజంగా ఇవన్ని జరిగి ఉంటే ఈ ఎల్లో మీడియా ఏ స్థాయిలో ఈపాటికి ఊదరగొట్టేవి! ఎవరిని మోసం చేయడానికి ఈ రాతలు? గతంలో చంద్రబాబు, ఎల్లో మీడియా ఏమని ప్రచారం చేశాయి? అమరావతికి అసలు ప్రభుత్వం డబ్బు రూపాయి ఖర్చు చేయనక్కర్లేదని, దానికి అదే సంపాదించుకుంటుందని కదా? కాని ఇప్పుడేమీ చేస్తున్నారు. బడ్జెట్లో రూ. ఆరు వేల కోట్లు కేటాయించారు. మరో రూ.ముప్పై వేల కోట్లు అప్పులు తీసుకు వస్తున్నారు. డబ్బై ఏడువేల కోట్లు అవసరం అవుతాయని చంద్రబాబు ఆర్థిక సంఘానికి తెలిపారు. కాని ఒక్క ఎకరాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయడానికి సుమారు రూ.రెండు నుంచి మూడు కోట్ల రూపాయలు అవసరం అవుతాయని అంచనా. ఆ రకంగా చూస్తే ఎన్ని లక్షల కోట్లు కావాలో లెక్క వేసుకోవచ్చు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు నుంచి వసూలు చేసే పన్నులతో చేపట్టవలసిన ఈ అభివృద్ది పనులను ప్రభుత్వమే చేపడుతోందన్నమాట. ఇది ప్రైవేటు వ్యక్తులకే ప్రయోజనం తప్ప, ప్రభుత్వానికి కాదు. అప్పులు మాత్రం రాష్ట్రం అంతా ప్రజలు భరించాలి.సదుపాయాలు మాత్రం కొద్దిమంది ప్రైవేటు ఆసాములు పొందుతారన్నమాట. అందుకే ఇది రైతులపైనే కాదు.. ఏపీ ప్రజలపైనే పిడుగుపాటుగా పరిగణించాలనిపిస్తుంది. ఇంత చేసినా ప్రభుత్వం అమ్ముకోవడానికి భూమి సరిపోదట. అందుకే మళ్లీ భూమి తీసుకుంటారట. అంటే ఇంతకాలం అబద్దాలు చెప్పి ప్రజలను మోసం చేసినట్లు వీరు ఒప్పుకుంటారా? అమరావతిలో మరో విమానాశ్రయానికి నాలుగైదువేల ఎకరాలు సేకరిస్తారట. ప్రస్తుతం 30, 40 కిలోమీటర్ల దూరంలో గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. అక్కడ విస్తరణకు కూడా భూమి తీసుకుంది. వారిలో పలువురికి అమరావతి గ్రామాలలో ప్లాట్లు ఇచ్చారు. ఇంతా చేసి ఆ విమానాశ్రయం కాదని మరోకటి కడతారట. ఉన్న ఎయిర్ పోర్టును వృథాగా పెట్టి కొత్తది కడతారట.ఇప్పటికే పచ్చటి పొలాలను బీడు పెట్టి, రైతులకు కౌలు రూపంలో ఏటా వందల కోట్లు చెల్లించవలసి వస్తోంది. మళ్లీ అదే ప్రకారం భూముల సేకరణ చేస్తే రైతులు ఎంతవరకు సిద్దపడతారాన్నది అనుమానమే. ఒకవేళ రైతులు తమ భూములు ఇవ్వబోమని అంటే చంద్రబాబు వద్ద ఎటూ తన కుమారుడు లోకేశ్‌ రెడ్ బుక్ ఉంటుంది. పోలీసులను ప్రయోగించి రైతులను వేధించవచ్చు. కిందటిసారి కూడా అలాగే చేశారు. అయితే ముందుగా తమకు అనుకూలంగా ఉన్న గ్రామాలలో భూములు సమీకరిస్తారట. ఆ తర్వాత మిగిలిన గ్రామాలపై పడతారట. రాజధాని పేరుతో తమ భూములకు ఎసరు పెట్టలేదులే అనుకున్న రైతులకు ఇది షాకింగ్ వార్తే అని చెప్పాలి. ఈ పరిస్థితిని వారు ఎలా ఎదుర్కుంటారో చూడాల్సిందే.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత

IPL 2025: SRH Stars Rejuvenate In Maldives6
IPL 2025: మాల్దీవ్స్‌లో ఎంజాయ్‌ చేస్తున్న ఇషాన్‌ కిషన్‌, ట్రవిస్‌ హెడ్‌

ఐపీఎల్‌ 2025లో తదుపరి ఆడబోయే అత్యంత కీలకమైన మ్యాచ్‌లకు ముందు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఆటగాళ్లు ప్రముఖ పర్యాటక దేశం మాల్దీవ్స్‌లో సేద తీరుతున్నారు. ఏప్రిల్‌ 25న సీఎస్‌కేపై విజయానంతరం ఆరెంజ్‌ ఆర్మీ మాల్దీవ్స్‌కు చెక్కేసింది. అప్పటి నుంచి సన్‌రైజర్స్‌ ఆటగాళ్లు మాల్దీవ్స్‌లో ఎంజాయ్‌ చేస్తున్నారు. తాజాగా సన్‌రైజర్స్‌ స్టార్‌ ఆటగాళ్లు సరదాగా గడుపుతున్న వీడియో ఒకటి సోషల్‌మీడియాలో ప్రత్యక్షమైంది. Ishan Kishan Vs Abhishek Sharma in the volleyball game. 😄 pic.twitter.com/d46iqYQlR7— Mufaddal Vohra (@mufaddal_vohra) April 28, 2025ఈ వీడియోలో సన్‌రైజర్స్‌ విధ్వంసకర ఆటగాడు ట్రవిస్‌ హెడ్‌ డ్రింక్‌ తాగుతూ సేద తీరుతుండగా.. మరో విధ్వంకర బ్యాటర్‌ ఇషాన్‌ కిషన్‌ సహచరులతో వాలీబాల్‌ ఆడుతూ కనిపించాడు. ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. కీలక మ్యాచ్‌లకు ముందు తమ ఆటగాళ్లకు రీఫ్రెష్‌మెంట్‌ అవసరమని సన్‌రైజర్స్‌ యాజమాన్యం మాల్దీవ్స్‌ టూర్‌ ప్లాన్‌ చేసింది. సన్‌రైజర్స్‌ తమ తదుపరి మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌తో తలపడాల్సి ఉంది. ఈ మ్యాచ్‌ మే 2న అహ్మదాబాద్‌లో జరుగనుంది. దీని తర్వాత సన్‌రైజర్స్‌ వరుసగా ఢిల్లీ (మే 5, హైదరాబాద్‌), కేకేఆర్‌ (మే 10, హైదరాబాద్‌), ఆర్సీబీ (మే 13, బెంగళూరు), లక్నోతో (మే 18, లక్నో) మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది.గత మ్యాచ్‌లో సీఎస్‌కేపై గెలుపుతో సన్‌రైజర్స్‌ ప్లే ఆఫ్స్‌ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. ఈ సీజన్‌లో ఆ జట్టు ఆడిన 9 మ్యాచ్‌ల్లో కేవలం మూడే విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో చివరి నుంచి మూడో స్థానంలో ఉంది. ప్లే ఆఫ్స్‌ రేసులో నిలవాలంటే సన్‌రైజర్స్‌ తదుపరి ఆడాల్సిన ఐదు మ్యాచ్‌ల్లో భారీ తేడాతో గెలవాల్సి ఉంటుంది. ఇలా జరిగినా ఆ జట్టు ప్లే ఆఫ్స్‌ అవకాశాలు ఇతర జట్ల జయాపజయాలపై ఆధారపడి ఉంటాయి.ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో గతేడాది రన్నరప్‌ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు ఆశించిన ఫలితాలు సాధించలేదు. తొలి మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌పై గెలిచి.. ఆతర్వాత వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో ఓడింది (లక్నో, ఢిల్లీ, కేకేఆర్‌,గుజరాత్‌). తర్వాత పంజాబ్‌పై సంచలన విజయం సాధించి (246 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి).. ముంబై ఇండియన్స్‌ చేతుల్లో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడింది. తాజాగా సీఎస్‌కేను వారి సొంత ఇలాకాలో ఓడించి, సీజన్‌లో మూడో విజయాన్ని నమోదు చేసింది.కాగా, ఈ సీజన్‌ ప్రారంభానికి ముందు సన్‌రైజర్స్‌పై భారీ అంచనాలు ఉండేవి. అందుకు తగ్గట్టుగానే తొలి మ్యాచ్‌లో ఆ జట్టు రాజస్థాన్‌ రాయల్స్‌పై 286 పరుగుల రికార్డు స్కోర్‌ సాధించి విజయం సాధించింది. ఆ మ్యాచ్‌లో ఇషాన్‌ కిషన్‌ సూపర్‌ సెంచరీతో మెరిశాడు.ఆ మ్యాచ్‌ తర్వాత మళ్లీ గెలవడానికి సన్‌రైజర్స్‌కు ఐదు మ్యాచ్‌ల సమయం పట్టింది. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో అభిషేక్‌ శర్మ విధ్వంసకర శతకంతో విరుచుకుపడటంతో సన్‌రైజర్స్‌ రెండో విజయం సాధించింది. తాజాగా సన్‌రైజర్స్‌ సీఎస్‌కేపై గెలిచినా అది వారిపై ఉన్న అంచనాలకు తగ్గట్టుగా లేదు. సీఎస్‌కే నిర్దేశించిన 155 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు ఆ జట్టు ఆపసోపాలు పడింది.

India Oppose International Monetary Fund Loan To Pakistan7
అప్పు ఇవ్వొద్దు.. పాక్‌పై భారత్‌ ఆర్థిక యుద్ధం

ఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడితో ప్రతీకారంతో రగిలిపోతున్న భారత్‌ .. పాకిస్తాన్‌ను ఆర్ధికంగా మరింత ఇబ్బందే పెట్టే ప్రయత్నాల్ని ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా దాయాది దేశంపై భారత్‌ ఆర్థిక యుద్ధం ప్రకటించింది.పాకిస్తాన్‌కు అప్పు ఇవ్వొద్దంటూ భారత్‌ అంతర్జాతీయ ద్రవ్య నిధి (International Monetary Fund - IMF) పై ఒత్తిడి చేస్తోంది. ఆ మేరకు అభ్యంతరం తెలిపింది. గతేడాదిలో ప్రకటించిన పాకిస్తాన్‌కు ఏడు బిలియన్ డాలర్ల బెయిల్ అవుట్ ప్యాకేజీ విషయంలో సమీక్షించాలని కోరింది. పాక్‌కు నిధులు ఇస్తే ఉగ్రవాదులకు మళ్ళిస్తోందని ఐఏఎఫ్ మెంబర్స్‌కు భారత్‌ వివరిస్తోంది.మే 9న పాకిస్తాన్‌కు అప్పు ఇచ్చే అంశంపై ఐఎంఎఫ్ బోర్డు చర్చించనుంది. ఈ తరుణంలో పాక్‌కు ఎట్టి పరిస్థితుల్లో అప్పు ఇవ్వొదని భారత్‌ వాదిస్తోంది. ఇదే అంశంపై భద్రతామండలి నాన్ పర్మినెంట్ మెంబర్స్‌తో భారత విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ చర్చలు జరుపుతున్నారు. పాకిస్తాన్‌కు ఏడు బిలియన్ డాలర్ల బెయిల్ అవుట్ ప్యాకేజీని సమీక్షించాలని కోరనున్నారుIndia can voice opposition to Pakistan’s $1.3 billion IMF loan, but its 2.63% voting share limits its influence. The IMF typically approves loans by consensus, and a formal vote only needs a simple majority, not an 85% supermajority. To block the loan, India would need to build…— Grok (@grok) April 29, 2025

Buzz: Prabhas Ready To Do Prasanth Varma Movie Before Spirit Film8
‘స్పిరిట్’ వెనక్కి.. సందీప్‌కి ట్విస్ట్‌ ఇచ్చిన ప్రభాస్‌!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) కొన్నేళ్లపాటు ఫుల్ బిజీ! ఇప్పటికే ఆయన అరడజను సినిమాల వరకు బాకీ ఉన్నాడు. వాటిల్లో ముందుగా రాబోయేది మారుతి దర్శకత్వం వహిస్తున్న ‘రాజాసాబ్‌’ సినిమా. పిపుల్స్‌ మీడియా నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ చివరి దశలో ఉంది. దీని తర్వాత ప్రభాస్‌ హను రాఘవపూడి దర్శకత్వంలో ‘ఫౌజీ’(ప్రచారంలో ఉన్న టైటిల్‌) చేయబోతున్నాడు. ఆ తర్వాత యానిమల్‌ ఫేం సందీప్‌ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga)తో ‘స్పిరిట్‌’(Spirit) చేయాల్సింది. ఈ రెండు పూర్తయిన తర్వాత నాగ్‌ అశ్విన్‌, ప్రశాంత్‌ నీల్‌తో పాటు యంగ్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మతో కూడా సినిమా చేయాలి. కానీ ఇప్పుడు ఈ ఆర్డర్‌ మారినట్లు తెలుస్తోంది. ‘స్పిరిట్‌’ని వెనక్కినెట్టి ప్రశాంత్‌ వర్మ సినిమా చేయడానికి ప్రభాస్‌ రెడీ అవుతున్నాడని టాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.‘స్పిరిట్’కి బ్రేక్‌కి కారణం ఏంటి?సందీప్ రెడ్డి వంగా ‘స్పిరిట్’ స్క్రిప్ట్‌ను పూర్తి చేసి, లొకేషన్లు కూడా ఫైనల్ చేస్తున్నాడు. కానీ, ఈ సినిమా కోసం సందీప్ విధించిన కండీషన్లే ప్రభాస్‌ను కాస్త వెనకడుగు వేయించాయని టాక్. 65 రోజుల వరుస కాల్షీట్స్, డూప్ లేకుండా యాక్షన్ సీన్స్ చేయాలన్న సందీప్ షరతులకు ప్రభాస్ మొదట ఓకే చెప్పినప్పటికీ, ఇప్పుడు మాత్రం ప్రశాంత్ వర్మ సినిమాను ప్రాధాన్యతగా తీసుకున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో హీరోయిన్‌గా భాగ్యశ్రీ భోర్సే నటించనుందని బజ్.డబుల్ షూటింగ్‌తో బిజీ! ‘రాజాసాబ్’ షూటింగ్ పూర్తయిన వెంటనే హను రాఘవపూడి ‘ఫౌజీ’తో పాటు, ప్రశాంత్ వర్మ సినిమా షూటింగ్‌లోనూ ప్రభాస్ పాల్గొననున్నాడట. ప్రస్తుతం ఇటలీ టూర్‌లో ఉన్న ప్రభాస్, తిరిగి వచ్చిన తర్వాత ఈ విషయంపై క్లారిటీ రానుంది. మరి, ఈ షెడ్యూల్ మార్పు వెనుక అసలు కథేంటో తెలియాలంటే, మరికొన్ని రోజులు ఆగాల్సిందే!

kow the places where gold cheaper than india9
తక్కువ ధరకే బంగారం కావాలా!

అక్షయ తృతీయ కారణంగా ఈరోజు చాలామంది బంగారం కొనేందుకు షాపుల ముందు బారులు తీరుతున్నారు. దేశంలో పసిడి ధరలు దాదాపు తులం రూ.లక్షకు చేరువయ్యాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా భారీగా పెరుగుతున్న బంగారం ధర త్వరలో తులం రూ.ఒక లక్షకు చేరుతుందని కొందరు అంచనా వేస్తున్నారు. అయితే ప్రపంచంలోని కొన్ని దేశాల్లో భారత్‌ కంటే తక్కువ ధరకే బంగారం లభిస్తుంది. వాటి వివరాలు కింద తెలుసుకుందాం.దుబాయ్, యుఏఈఈ దేశం ‘బంగారు నగరం’గా ప్రసిద్ధి చెందింది. బంగారంపై తక్కువ పన్నులు ఉండడంతో ఇక్కడ అత్యంత సరసమైన ధరలకే పసిడి లభిస్తుంది. ఇక్కడ బంగారం సాధారణంగా భారతదేశం కంటే 10-15 శాతం చౌకగా ఉంటుంది. యూఏఈలో బంగారంపై విలువ ఆధారిత పన్ను(వ్యాట్‌) లేకపోవడం గమనార్హం. దీనికితోడు దిగుమతి సుంకాలు తక్కువగా ఉండడంతో సరసమైన ధరలకు బంగారాన్ని కొనుగోలు చేయాలనుకునే భారతీయులు ఈ దేశాన్ని అన్వేశిస్తున్నారు.థాయ్‌లాండ్‌ఇక్కడ బ్యాంకాక్, పట్టాయా బంగారం కొనుగోలుకు ప్రసిద్ధ ప్రదేశాలు. తక్కువ మేకింగ్ ఛార్జీలు, పన్నుల కారణంగా భారత్‌తో పోలిస్తే ఈ దేశం తక్కువ ధరకే బంగారు ఆభరణాలను అందిస్తోంది. సాధారణంగా థాయ్‌లాండ్‌లో బంగారం భారత్ కంటే 5-10 శాతం చౌకగా ఉంటుంది. ఆ దేశంలో తక్కువ తయారీ ఖర్చులు, బంగారంపై స్వల్పంగా పన్నులు విధిస్తున్నారు. భారత్‌తో పోలిస్తే సాపేక్షంగా తక్కువ మేకింగ్ ఛార్జీలతో బంగారు ఆభరణాలు లభిస్తాయి.సింగపూర్తక్కువ పన్నులు, బంగారం ధరల్లో పోటీ కారణంగా గోల్డ్‌ షాపింగ్‌కు సింగపూర్ కీలక గమ్యస్థానంగా ఉంది. నాణ్యమైన బంగారాన్ని విక్రయించడంలో ఈ దేశానికి మంచి పేరు ఉంది. ఇక్కడ ధరలు భారతదేశం కంటే 5-8 శాతం చౌకగా ఉంటాయి. ఈ దేశంలో గ్రేడ్ బంగారంపై జీఎస్టీ లేదు. దాంతో చౌకగా లభిస్తుంది.మలేషియాకౌలాలంపూర్‌లో సరసమైన బంగారం ధరలు ఉన్నాయి. తక్కువ తయారీ ఛార్జీలు, పన్నుల కోసం చూస్తున్న భారతీయ కొనుగోలుదారులను ఆకర్షిస్తున్నాయి. ఈ దేశంలో పోటీ ధరలను అందించే అనేక దుకాణాలు ఉన్నాయి. మలేషియాలో బంగారం భారతదేశం కంటే 5-10 శాతం చౌకగా ఉంటుంది. బంగారంపూ తక్కువ పన్నులు, మేకింగ్ ఛార్జీలను అందిస్తున్నారు.ఇదీ చదవండి: భారత్‌లో ఫాక్స్‌కాన్‌ ఆదాయం రూ.1.7 లక్షల కోట్లుహాంగ్ కాంగ్హాంగ్ కాంగ్ బంగారం, విలువైన లోహాలపై పన్ను మినహిస్తుంది. దాంతో తక్కువ ధరలకు లభిస్తాయి. ఈ దేశం బంగారం ట్రేడింగ్‌కు ప్రధాన కేంద్రంగా ఉంది. పోటీ ధరల కారణంగా చాలా మంది భారతీయులు ఇక్కడ బంగారాన్ని కొనుగోలు చేస్తారు. హాంకాంగ్‌లో బంగారం సాధారణంగా భారతదేశం కంటే 5-10 శాతం చౌకగా ఉంటుంది.

UPSC IAS 2023 Topper Saloni Chhabra success story10
రెండు సార్లు ఫెయిల్‌ అయ్యా... పట్టుదలతో నాన్న కల నెరవేర్చా..

‘నన్ను కలెక్టర్‌గా చూడాలనేది మా నాన్న కోరిక.. దాన్ని ఎలాగైనా నెరవేర్చాలని పాఠశాల స్థాయిలోనే నిర్ణయించుకున్నా.. ఆయన అందించిన ప్రోత్సాహంతో ముందుకు సాగా.. రెండుసార్లు విఫలమయ్యా.. అయినా నిరాశ చెందలేదు.. రాత్రింబవళ్లు మరింత కష్టపడి చదివా.. లోటుపాట్లు సవరించుకుని ముందడుగు వేశాను. మూడో ప్రయత్నంలో విజయం సాధించా.. 2023 యూపీఎస్సీ ఫలితాల్లో జాతీయ స్థాయిలో 29వ ర్యాంకు సాధించా.. ఐఏఎస్‌గా తెలంగాణ క్యాడర్‌కు ఎంపికయ్యా.. నాన్న కల నెరవేర్చడం నాకెంతో ఆనందాన్నిచ్చింది. ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలను అమలు చేసి, పేదలకు సేవ చేయడమే లక్ష్యమని అంటున్నారు జిల్లాకు నూతనంగా విచ్చేసిన ట్రెయినీ కలెక్టర్‌ సలోని చాబ్రా (Saloni Chhabra). ‘సాక్షి’కి మంగళవారం ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె పలు విషమాలు వెల్లడించారు.-కైలాస్‌నగర్‌సాక్షి: ‘గుడ్‌ మార్నింగ్‌ మేడమ్‌.. వెల్‌కమ్‌ టు ఆదిలాబాద్‌. ట్రెయినీ కలెక్టర్‌గా జిల్లాకు విచ్చేసిన మీకు మరోసారి ప్రత్యేక అభినందనలు. మీ కుటుంబ నేపథ్యం వివరాలు.. ట్రెయినీ కలెక్టర్‌: మాది హర్యానా రాష్ట్రంలోని గురుగ్రాం. నాన్న ఇంద్రజిత్, అమ్మ సీమ. ఇద్ద రూ గురుగ్రాంలోనే బిజినెస్‌ చేస్తుంటారు. అన్న గ్రాడ్యూయేషన్‌ పూర్తి చేశాడు. ఊరిలోనే అమ్మనాన్నలకు తోడుగా ఉంటూ వ్యాపారం చూసుకుంటారు.ఇదీ చదవండి: మనవడితో 50 ఏళ్ల మహిళ పెళ్లి : ఫ్యామిలీని లేపేసేందుకు కుట్ర?సాక్షి: మీ విద్యాభ్యాసం ఎక్కడెక్కడ సాగింది..ట్రెయినీ కలెక్టర్‌: ఒకటి నుంచి ఇంటర్మీడియెట్‌ వరకు గురుగ్రాంలోని బ్లూ బెల్స్‌లో చదివా. చిన్నతనం నుంచే చదువులో ముందుండేదాన్ని. స్కూల్‌లో నిర్వహించే డిబేట్‌లు, ఎక్స్‌ట్రా కరిక్యూలమ్‌లో పాల్గొంటూ ప్రతి భ కనబర్చుతుండేది. చదువులో ఎప్పుడూ ముందుండే నేను టెన్త్, ఇంటర్‌లో ఫస్ట్‌క్లాస్‌ లో పాసయ్యా. అనంతరం ఢిల్లీలోని శ్రీరాం కాలేజ్‌ ఆఫ్‌ కామర్స్‌ యూనివర్సిటీలో బీఏ ఆనర్స్‌ ఎకానావిుక్స్‌ పూర్తి చేశాను. ఆ వెంటనే సివిల్స్‌ పరీక్షలపై దృష్టి సారించాను. సాక్షి: యూపీఎస్సీ కోచింగ్‌ ఎక్కడ తీసుకున్నారు.. ఎన్నోసారి విజయం సాధించారు..ట్రెయినీ కలెక్టర్‌: పదో తరగతిలోనే ఐఏఎస్‌ సాధించాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నా. ఆ దిశగా అడుగులు వేశాను. ఢిల్లీలోని కోచింగ్‌ సెంటర్‌లో ఏడాది పాటు శిక్షణ పొందాను. ఆప్షనల్‌ సబ్జెక్ట్‌గా సోషియాలజీని ఎంచుకు న్నా. ప్రణాళికాబద్ధంగా చదివా. 2021లో తొలిసారి యూపీఎస్సీ పరీక్షలకు హాజరయ్యా. ఇంటర్వ్యూ వరకు వెళ్లాను. అయితే కొద్దిపాటి తేడాతో విజయం సాధించలేకపోయాను. మరో ప్రయత్నంలో ప్రిలిమ్స్‌లోనే ఆగిపోయాను. అయినా నిరాశ చెందలేదు. మూడో ప్రయత్నం 2023లో జాతీయస్థాయిలో 29వ ర్యాంకు సాధించాను. ఐఏఎస్‌ కావాలనే నా సంకల్పంతోపాటు నాన్న కలను నెరవేర్చాను. తెలంగాణ క్యాడర్‌కు ఎంపికై ప్రస్తుతం ట్రైనింగ్‌ నిమిత్తం ఆదిలా బాద్‌కు రావడం జరిగింది. ఏడాది పాటు జిల్లాలో పని చేయాల్సి ఉంటుంది. రెండుసార్లు విఫలమైన సమయంలో నేను ఆత్మవిశ్వాసం కోల్పోకుండా అమ్మనాన్నలు అండగా నిలిచారు. వెన్నుతట్టారు. వారందించిన ప్రోత్సాహం తోనే విజయం సాధించాను. సివిల్స్, ఇతర పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే యువతకు మీరిచ్చే సలహా.. ట్రెయినీ కలెక్టర్‌: సివిల్‌ సర్వీసెస్‌కు సన్నద్ధమయ్యే అభ్యర్థుల్లో చాలా మంది ఒకటి, రెండు ప్రయత్నాలకే నిరాశకు లోనవుతారు. ఇక మా వల్ల కాదంటూ వెనుకడుగు వేస్తుంటారు. అపజయాలను చూసి నిరాశ చెందొద్దు. సంకల్పం వీడకుండా ముందుడుగు వేయాలి. పట్టుదలతో ప్రణాళికాబద్ధంగా చదివితే తప్పకుండా విజయం సాధించవచ్చు. రోజుకు కనీసం 8 నుంచి 10 గంటలు చదవాలి. ముఖ్యంగా సెల్‌ఫోన్, సోషల్‌ మీడియాకు దూరంగా ఉండాలి. ప్రతిరోజు పత్రికలను చదవడం అలవాటు చేసుకోవాలి. వర్తమాన అంశాలపై పట్టు సాధించాలి. గత ప్రశ్నాపత్రాలను విశ్లేషించుకోవాలి. సందేహాలుంటే ఎప్పటికప్పుడు నివృత్తి చేసుకోవాలి. ఆత్మవిశ్వాసం, సంకల్పబలంతో ప్రయత్నిస్తే తప్పకుండా లక్ష్యాన్ని సాధించవచ్చు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement