Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

TDP Govt Takes U Turn On Its  MLC Candidate Defeated1
ఓడిపోతే మా అభ్యర్థి కాదు.. గెలిస్తేనే మా అభ్యర్థి..!

విజయవాడ: టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ గట్టి షాక్ తగిలింది. ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం బలపరిచిన పాకలపాటు రఘువర్మ ఓడిపోయారు. రఘువర్మపై పీఆర్టీయూ అభ్యర్థి శ్రీనివాసుల నాయుడు గెలుపొందారు. అయితే తమ అభ్యర్థి ఓడిపోగానే టీడీపీ యూటర్న్ తీసుకుంది. అసలు తాము అక్కడ అభ్యర్థినే పెట్టలేదంటూ కొత్త పల్లవి అందుకుంది. ఇక శ్రీనివాసుల నాయుడు గెలుపును కూటమి ఖాతాలో వేసుకునే యత్నం చేస్తోంది టీడీపీ. తమ మద్దతుతోనే శ్రీనివాసుల నాయుడు గెలిచాడని మంత్రి అచ్చెన్నాయుడు వింత ప్రకటన చేశారు.ఓడిపోయిన రఘువర్మ తమ అధికారిక అభ్యర్థి కాదని కొత్త రాగంఅందుకుంది. ఎన్నికల ముందు రఘువర్మని తమ అభ్యర్థి అని ప్రకటించిన టీడీపీ, జనసేనలు.. ఓడిపోగానే మాట మార్చేశారు. కూటమి పార్టీల మద్దతు తోనే విజయం సాధించామని ప్రకటన చెయ్యాలని గాదె శ్రీనివాసులు నాయుడుపై అచ్చెన్ననాయుడు ఒత్తిడి తెస్తున్నారు. ఓడిపోతే తమ అభ్యర్థి కాదని, గెలిస్తేనే తమ అభ్యర్థిని చెప్పుకుంటున్న టీడీపీ వైఖరి చూసి జనం విస్తుపోతున్నారు.ప్రభుత్వంపై ప్రభుత్వ టీచర్ల వ్యతిరేకతఉత్తరాంధ్ర టీచర్‌ ఎన్నికల ఫలితాలతో 9 నెలలకే ప్రభుత్వంపై టీచర్ల వ్యతిరేకత సుస్పష్టమైంది. ప్రభుత్వంపై ఉపాధ్యాయులు తిరుగుబాటు ప్రకటించారు. అందుకు ఊతం ఇచ్చేలా ఉత్తరాంధ్ర టీచర్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రభుత్వ టీచర్లు కూటమికి ఓటమి రుచి చూపించారు. టీచర్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి పాకలపాటి రఘు వర్మను ఓడించారు. పీఆర్‌టీయూ అభ్యర్థి గాదె శ్రీనివాసులు నాయుడిని గెలిపించారు. చంద్రబాబుకు ఓటమి రుచి చూపించిన ప్రభుత్వ టీచర్లురఘువర్మను కూటమి అభ్యర్థిగా టీడీపీ, జనసేన,బీజేపీలు పోటీకి పెట్టాయి. తొలి ప్రాధాన్యత, రెండో ప్రాధాన్యతలోనూ కూటమి అభ్యర్థి వెనకపడ్డారు. బ్యాలెట్ ఓటింగ్‌లో కూటమి పార్టీ అభ్యర్థికి భంగపాటు ఎదురైంది. దీంతో చరిత్రలో ఏ ప్రభుత్వానికి ఎదురుకాని చేదు అనుభవం కూటమి ప్రభుత్వానికి ఎదురైంది. ఎన్నికల్లో గెలిచాక ఉద్యోగులు, ఉపాధ్యాయులను ప్రభుత్వం మోసం చేసింది. ఉద్యోగులకు కనీసం ఒక్క డీఏ ఇవ్వలేదు. ఉద్యోగులకు ఐఆర్, పీఆర్సీ ఊసెత్తలేదు. దీంతో ప్రభుత్వ టీచర్లలో చంద్రబాబు ప్రభుత్వంపై వ్యతిరేకత ఏర్పడింది. ఫలితంగా ఉత్తరాంధ్ర టీచర్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి పాకలపాటి రఘువర్మకు ఓటమి అనివార్యమైంది.

Woman From UP On Death Row In UAE Case2
యూఏఈలో భారతీయ మహిళకు మరణశిక్ష అమలు

న్యూఢిల్లీ: నాలుగు ఏళ్ల చిన్నారి మృతి కేసులో భాగంగా ఓ భారత మహిళకు యూఏఈలో మరణశిక్ష అమలైంది. గత నెల 15వ తేదీన శిక్షను ఖరారు చేసినప్పటికీ, ఆ విషయాన్ని తాజాగా విదేశాంగ శాఖ.. ఢిల్లీ హైకోర్టు తెలిపింది. యూపీకి చెందిన షెహజాదీ ఖాన్ అనే మహిళ.. గత కొంతకాలంగా అబుదాబిలో ఉంటోంది. 33 ఏళ్ల షెషజాదీ ఖాన్.. యూపీలోని బాంద్రా జిల్లాకు చెందిన మహిళ. టూరిస్టు వీసా మీద నాలుగేళ్ల క్రితం అబుదాబి వెళ్లింది.2022లో ఆగస్టులో తన కొడుకును చూసుకునే బాధ్యతను ఆమెకు అప్పగించాడు. షెహజాదీ కేర్ గివర్ కింద ఆ బాధ్యతలు తీసుకుంది. 2022, డిసెంబర్ 7 వ తేదీన వ్యాక్సినేషన్ కు తీసుకెళ్లింది నాలుగేళ్ల బుడతడికి. అయితే అది కాస్తా విషాదాంతమైంది. ఆ బాబు చనిపోవడంతో కేసు షెహజాదీ పడింది. తన కుమారుడు మరణానికి ఆమె కారణమంటూ కేసు ఫైల్ చేశాడు. ఇలా కొంతకాలం కోర్టులో చుట్టూ తిరగ్గా ఆమెకు మరణశిక్ష ఖరారైంది. ఆమెకు మరణశిక్ష ఖాయమైందన్న తెలుసుకున్న ​కుటుంబ సభ్యులు లబోదిబోమన్నారు. ఆ క్రమంలోనే ఆమె తండ్రి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు. అయితే యూఏఈ చట్టాల ప్రకారం ఆమె మరణశిక్ష అమలు కావడంతో ఆ విషయాన్ని విదేశాంగ శాఖ.. ఢిల్లీ హైకోర్టుకు స్పష్టం చేసింది.అక్రమంగా రవాణా చేసి.. ఆమె టూరిస్టు వీసా మీద వెళ్లి అక్కడ స్థిరపడాలనుకుంది షెహజాదీ. అయితే ఆమెను అక్కడికి తీసుకెళ్లేముందు అది టూరిస్టు వీసా అనే సంగతిని ఫైజ్, నాడియా దంపతులు ఆమెకు చెప్పలేదు. అలా వెళ్లి ఇరుక్కుపోయింది ఆమె.ఆమెను అక్రమంగా రవాణా చేసినందుకు ఫైజ్, నాడియా దంపతులపై కూడా కేసు నమోదు అయ్యింది. ఈ క్రమంలోనే వారి నాలుగేళ్ల కొడుకును షెహజాదీ చూసుకుంటోంది. కానీ ఆ బాబు ఆమె చేతుల మీదుగానే చనిపోవడంతో మరొక కేసు షెహజాదీకి చుట్టుకుంది. యూఏఈ చట్టాలు కఠినంగా అమలు చేయడంతో ఆమెకు మరణశిక్ష అమలు చేసింది అక్కడ కోర్టు.చివరి కోరికను అడగ్గా..మరణశిక్ష అమలుకు ముందు గత నెల 16వ తేదీన చివరి కోరిక ఏమటని అడగ్గా.. కుటుంబ సభ్యులతో మాట్లాడిన తెలిపింది. తాను నిర్దోషినని కుటుంబ సభ్యుల ముందు కన్నీటి పర్యంతమైంది. అదే చివరిసారి ఆమె కుటుంబంతో మాటలని తండ్రి అంటున్నారు.

Man arrested, had planned to target Ram Mandir 3
అయోధ్య రామమందిరంపై ఉగ్రదాడికి ఐఎస్‌ఐ కుట్ర.. భగ్నం చేసిన భారత్‌

గాంధీనగర్‌: అయోధ్య రామమందిరంపై ఉగ్రదాడి చేసేందుకు ప్రయత్నించిన పాకిస్థాన్‌(Pakistan) ఐఎస్‌ఐ ఉగ్రదాడిని భారత్‌ భగ్నం చేసింది. గుజరాత్‌, హర్యానా యాంటీ టెర్రరిస్ట్‌ స్వ్కాడ్‌ జాయింట్‌ ఆపరేషన్‌ నిర్వహించింది. ఈ జాయింట్‌ ఆపరేషన్‌లో భాగంగా హర్యానాలో ఉగ్రవాది రెహ్మాన్‌ను అరెస్ట్‌ చేసింది. పాకిస్థాన్‌ నిఘా సంస్థ ఐఎస్‌ఐ(ISI)తో సంబంధాలున్న ఉగ్రవాది అబ్దుల్ రెహ్మాన్ హర్యానా రాష్ట్రం ఫరీదాబాద్‌లో పట్టుబడ్డాడు. భద్రతా సంస్థల సమాచారం మేరకు.. ఐఎస్‌ఐ సంస్థ అబ్దుల్ రెహ్మాన్ ద్వారా అయోధ్య రామ్ మందిరంపై దాడి చేయించేందుకు ప్లాన్ చేసింది. ఉగ్రదాడిలో భాగంగా అబ్దుల్‌ రెహ్మాన్‌ రామమందిరంపై రెక్కీ నిర్వహించాడు. సమాచారాన్ని సేకరించి ఐఎస్‌ఐకి చేరవేర్చాడు. అనంతరం, అబ్దుల్‌ రెహ్మాన్‌ ఫైజాబాద్ నుంచి ట్రైన్‌లో మొదట ఫరీదాబాద్ చేరుకున్నాడు. ఫరీబాదాబాద్‌లో హ్యాండ్ గ్రనేడ్‌లను సేకరించాడు. వాటిని తీసుకుని ట్రైన్ ద్వారా అయోధ్య వెళ్లాల్సి ఉంది. అనంతరం ఆ హ్యాండ్‌ గ్రనేడ్‌తో రామమందిరంపై దాడి చేసేలా ప్లాన్‌ వేశాడు. అంతకంటే ముందే దేశ భద్రతా సంస్థలు అందించిన సమాచారంతో గుజరాత్ ఏటీఎస్‌, ఫరీదాబాద్ ఏటీఎస్‌ స్క్వాడ్‌ అబ్దుల్ రెహ్మాన్‌ను అదుపులోకి తీసుకున్నాయి. అయోధ్యరామ మందిరంపై ఉగ్రదాడిని భగ్నం చేశాయి.

Paklapati Raghavarma Trails in Uttarandhra Teacher MLC Elections4
కూటమి ప్రభుత్వానికి షాక్‌.. టీచర్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వ అభ్యర్థి ఓటమి

సాక్షి, అమరావతి : ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలలో కూటమి ప్రభుత్వానికి భారీ షాక్‌ తగిలింది. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీఆర్‌టీయూ అభ్యర్థి శ్రీనివాసుల నాయుడు గెలుపొందారు. కూటమి అభ్యర్థి పాకలపాటి రఘువర్మ ఓడిపోయారు. దీంతో ఓటమిని అంగీకరిస్తూ రఘువర్మ కౌంటింగ్ కేంద్రం నుంచి బయటకు వచ్చేశారు. ఓడిపోయినప్పటికీ టీచర్లకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ప్రభుత్వంపై ప్రభుత్వ టీచర్ల వ్యతిరేకతఉత్తరాంధ్ర టీచర్‌ ఎన్నికల ఫలితాలతో 9 నెలలకే ప్రభుత్వంపై టీచర్ల వ్యతిరేకత సుస్పష్టమైంది. ప్రభుత్వంపై ఉపాధ్యాయులు తిరుగుబాటు ప్రకటించారు. అందుకు ఊతం ఇచ్చేలా ఉత్తరాంధ్ర టీచర్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రభుత్వ టీచర్లు కూటమికి ఓటమి రుచి చూపించారు. టీచర్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి పాకలపాటి రఘు వర్మను ఓడించారు. పీఆర్‌టీయూ అభ్యర్థి గాదె శ్రీనివాసులు నాయుడిని గెలిపించారు. చంద్రబాబుకు ఓటమి రుచి చూపించిన ప్రభుత్వ టీచర్లురఘువర్మను కూటమి అభ్యర్థిగా టీడీపీ, జనసేన,బీజేపీలు పోటీకి పెట్టాయి. తొలి ప్రాధాన్యత, రెండో ప్రాధాన్యతలోనూ కూటమి అభ్యర్థి వెనకపడ్డారు. బ్యాలెట్ ఓటింగ్‌లో కూటమి పార్టీ అభ్యర్థికి భంగపాటు ఎదురైంది. దీంతో చరిత్రలో ఏ ప్రభుత్వానికి ఎదురుకాని చేదు అనుభవం కూటమి ప్రభుత్వానికి ఎదురైంది. ఎన్నికల్లో గెలిచాక ఉద్యోగులు, ఉపాధ్యాయులను ప్రభుత్వం మోసం చేసింది. ఉద్యోగులకు కనీసం ఒక్క డీఏ ఇవ్వలేదు. ఉద్యోగులకు ఐఆర్, పీఆర్సీ ఊసెత్తలేదు. దీంతో ప్రభుత్వ టీచర్లలో చంద్రబాబు ప్రభుత్వంపై వ్యతిరేకత ఏర్పడింది. ఫలితంగా ఉత్తరాంధ్ర టీచర్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి పాకలపాటి రఘువర్మకు ఓటమి అనివార్యమైంది.

Shami Saab Bahut Ho Gaya: India Great Blunt Advice To Beat Aus CT 2025 Semis5
షమీ సాబ్‌.. ఇప్పటికే చాలా ఎక్కువైంది.. ఇక..: టీమిండియా దిగ్గజం

ఆస్ట్రేలియాతో సెమీ ఫైనల్‌కు ముందు టీమిండియాకు భారత మాజీ క్రికెటర్‌ హర్భజన్‌ సింగ్‌(Harbhajan Singh) మూడు కీలక సూచనలు చేశాడు. కంగారూలకు ఏ దశలోనూ అవకాశం ఇవ్వకూడదని.. గత మూడు మ్యాచ్‌ల ఫలితాన్నే ఇక్కడా పునరావృతం చేయాలని కోరాడు. కాగా ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ-2025లో భాగంగా భారత్‌ గ్రూప్‌-ఎ టాపర్‌గా నిలిచింది.ఈ మెగా టోర్నమెంట్‌కు పాకిస్తాన్‌ ఆతిథ్యం ఇస్తుండగా.. దుబాయ్‌(Dubai)లో తమ మ్యాచ్‌లు ఆడుతున్న టీమిండియా హ్యాట్రిక్‌ విజయాలు నమోదు చేసింది. తొలుత బంగ్లాదేశ్‌ను.. ఆ తర్వాత చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌(India vs Pakistan)ను.. అనంతరం ఆఖరి మ్యాచ్‌లో భాగంగా న్యూజిలాండ్‌ జట్టును ఓడించింది. ఈ క్రమంలో ఈ వన్డే టోర్నమెంట్‌ తొలి సెమీ ఫైనల్లో భాగంగా మంగళవారం ఆస్ట్రేలియాను ఢీకొట్టనుంది.అయితే, ఐసీసీ టోర్నీల్లో 2011 తర్వాత నాకౌట్‌ మ్యాచ్‌లలో ఆసీస్‌దే పైచేయిగా ఉన్న నేపథ్యంలో భారత దిగ్గజ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ రోహిత్‌ సేనకు పలు సూచనలు చేశాడు. ముందుగా ట్రవిస్‌ హెడ్‌ ఆట కట్టించాలని.. ఆ తర్వాత గ్లెన్‌ మాక్స్‌వెల్‌ లాంటి వాళ్ల పనిపట్టాలని భారత బౌలర్లకు సూచించాడు. ఈ మేరకు స్టార్‌ స్పోర్ట్స్‌ షోలో మాట్లాడుతూ..షమీ సాబ్‌.. ఇప్పటికే చాలా ఎక్కువైంది కదా..‘‘ముందుగా ట్రవిస్‌ హెడ్‌ గురించి మీ మెదళ్లలో గూడు కట్టుకున్న భయాన్ని తీసేయండి. వీలైనంత త్వరగా అతడిని అవుట్‌ చేయడం మంచిది. షమీ సాబ్‌.. ఇప్పటికే చాలా ఎక్కువైంది కదా.. హెడ్‌కు ఎక్కువ పరుగులు చేసే అవకాశం అస్సలు ఇవ్వద్దని గుర్తుపెట్టుకోండి.ఇక నా రెండో సూచన ఏమిటంటే.. గ్లెన్‌ మాక్స్‌వెల్‌, జోష్‌ ఇంగ్లిస్‌ వంటి హార్డ్‌ హిట్టర్లు ఆస్ట్రేలియా జట్టులో ఉన్నారు. వాళ్లు అలవోకగా సిక్సర్లు, ఫోర్లు బాదుతారు. ఫాస్ట్‌ పేస్‌లో వాళ్లకు ఎక్కువగా పరుగులు చేసే అవకాశం ఇవ్వకండి.మూడోది.. ముఖ్యమైన సూచన.. ఇది నాకౌట్‌ మ్యాచ్‌ అన్న విషయాన్ని మీరు పూర్తిగా మర్చిపోండి. సాధారణ మ్యాచ్‌ మాదిరిగానే దీనిని భావించండి’’ అని భజ్జీ రోహిత్‌ సేనకు సలహాలు ఇచ్చాడు. ఈ మూడు బలహీనతలను అధిగమిస్తే విజయం కచ్చితంగా టీమిండియానే వరిస్తుందని అభిప్రాయపడ్డాడు.విధ్వంసకరవీరుడు.. చితక్కొట్టాడుకాగా ట్రవిస్‌ హెడ్‌కు టీమిండియాపై మంచి రికార్డు ఉంది. ముఖ్యంగా వన్డే వరల్డ్‌కప్‌-2023 ఫైనల్లో మ్యాచ్‌ టీమిండియా చేజారడానికి ప్రధాన కారణం ఈ విధ్వంసకరవీరుడు. నాడు అహ్మదాబాద్‌ మ్యాచ్‌లో భారత స్పిన్‌ త్రయం కుల్దీప్‌ యాదవ్‌, అక్షర్‌ పటేల్‌, రవీంద్ర జడేజా.. బౌలింగ్‌ను చితక్కొట్టాడు. కేవలం 120 బంతుల్లోనే 137 పరుగులు సాధించి ఆసీస్‌ ఆరోసారి విశ్వవిజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలోనే భజ్జీ హెడ్‌ను టార్గెట్‌ చేయాలని భారత బౌలర్లకు చెప్పాడు.టీమిండియాదే గెలుపుఇదిలా ఉంటే.. టీమిండియా మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ రోహిత్‌ సేనకు మద్దతు పలికాడు.‘‘గతేడాది టీ20 ప్రపంచకప్‌ గెలిచిన జట్టు ఇది. వన్డే వరల్డ్‌కప్‌ ఫైనల్‌ కూడా దాదాపుగా వీళ్లే ఆడారు. ఏ రకంగా చూసినా మన జట్టు పటిష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా పరిమిత ఓవర్ల క్రికెట్‌లో తిరుగులేని శక్తిగా ఎదిగింది. ప్రత్యర్థి జట్టు ఏదైనా దానిని ఓడించగల సత్తా టీమిండియాకు ఉంది’’ అని పేర్కొన్నాడు. సెమీ ఫైనల్లో భారత్‌ ఆసీస్‌ను ఓడించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశాడు. చదవండి: IPL 2025: కొత్త కెప్టెన్‌ పేరును ప్రకటించిన కేకేఆర్‌

AP Budget Session: YSRCP MLC Botsa Fire On Minister Atchannaidu6
వైఎస్‌ జగన్‌ ఆ మాట ఏనాడూ చెప్పలేదు: బొత్స

అమరావతి, సాక్షి: శాసన మండలిలో ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు(Atchannaidu) అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. వ్యక్తిగతంగా కించపరిచేలా మాట్లాడడంతో వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నేత, విపక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. సోమవారం అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో ఈ పరిణామం చోటు చేసుకుంది.‘‘మంత్రి అచ్చెన్నాయుడు నేను ఒకే ప్రాంతం నుంచి వచ్చాం. సుదీర్ఘ రాజకీయాలు చేసిన అనుభవం నాకు ఉందని అచ్చెన్నాయుడికి తెలుసు. మేం గాలికి వచ్చామని మంత్రి చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరం. ఆయన తన వ్యాఖ్యలు విత్ డ్రా చేసుకోవాలి. .. మేం ఎవరిని వ్యక్తిగతంగా కించపరిచేలా మాట్లాడటం లేదు. వ్యక్తిగతంగా నాపై మాట్లాడటం ఇద్దరికీ గౌరవంగా ఉండదు. మేమంతా రాజకీయంగా పోరాటాలు చేసే ఇక్కడకు వచ్చాం’’ అని బొత్స, అచ్చెన్నకు హితవు పలికారు. ఇదిలా ఉంటే.. సాక్షి టీవీ సహా నాలుగు ఛానెల్స్‌కు మండలి లైవ్‌ ప్రసారాలను సమాచార శాఖ నిలిపివేయడం గమనార్హం.మండలిలో అచ్చెన్న vs బొత్సమంత్రి అచ్చెన్నాయుడు👇2014-19 ఎన్టీఆర్ గృహ నిర్మాణం కింద పేదలకు ప్రభుత్వం ఇళ్లు కట్టించి ఇచ్చిందిగత ప్రభుత్వం ఒక్క ఇల్లు కూడా కట్టలేదుకట్టిన ఇళ్లకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదు.జగనన్న కాలనీలు అన్నారు.. దాని గురించి నేను ఏమీ మాట్లాడాల్సిన పనిలేదు.. ఏం జరిగిందో అందరికీ తెలుసు..కేంద్రం డబ్బులతోనే కథ నడిపారురాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదుమేము పేదలకు ఇళ్లు కట్టించి ఇవ్వాలని ఒక మంచి ఆలోచనతో ముందుకు వెళ్తున్నాం.మీరు ఎంత ఖర్చు చేశారో సమాధానం చెప్పాలి?విపక్ష నేత బొత్స సత్యనారాయణ👉🏼.. 2014 - 19 ఇళ్లు కట్టిన వారికి మా ప్రభుత్వ హయాంలో బిల్లులు ఇవ్వలేదనడం అవాస్తవం. అర్హులైన లబ్ధిదారులకు అందరికీ బిల్లులు ఇచ్చాం. అర్హత లేకుండా కట్టుకుని బిల్లులు కావాలన్న వారికి మాత్రమే ఇవ్వలేదు. కేవలం రాజకీయ ఆరోపణలు చేస్తున్నారు. ప్రభుత్వం రాజకీయ కక్షతో ఇవ్వలేదని చెప్పటం సరికాదు. గత ప్రభుత్వం అర్హులైన ప్రతీ ఒక్కరికీ అన్నీ పథకాలు ఇచ్చింది. మా పార్టీ వాళ్ళకే పనులు, పథకాలు ఇవ్వాలని మా అధినేత వైఎస్‌ జగన్ మోహన్‌రెడ్డి ఎప్పుడూ చెప్పలేదు. .. రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉన్న చంద్రబాబు పథకాల పై చేసిన వ్యాఖ్యలు కరెక్ట్ కాదు. ముఖ్యమంత్రి పదవిలో ఉండి చంద్రబాబు ఇలా మాట్లాడటానికి సిగ్గుపడాలి. లబ్ధిదారులకు పార్టీలు అంట గడతారా?. .. అర్హులైన లబ్ధిదారులకు పథకాలు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ప్రమాణం చేసి పదవులు తీసుకున్న వ్యక్తులు ఇలాంటి మాటలు మాట్లాడతారా?.. కేవలం కార్యకర్తలకు ఇవ్వమనటానికి ఇదేమైనా మీ సొంత ఆస్తి అనుకుంటున్నారా?. మా ప్రభుత్వంలో గత ఐదేళ్లలో అర్హులైన ప్రతీ ఒక్కరికీ పథకాలు ఇచ్చాం.

From Vision to Reality Celebrating Over a Century of Tata Steels Legacy7
దేశ ఉక్కు సంకల్పం.. టాటా

టాటా గ్రూప్ లో భాగమైన టాటా స్టీల్ లిమిటెడ్ భౌగోళికంగా ప్రపంచంలోని అత్యంత వైవిధ్యభరితమైన ఉక్కు ఉత్పత్తిదారులలో ఒకటి. 1907లో జంషెడ్‌జీ నుస్సెర్వాన్‌జీ టాటా చేత టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ లిమిటెడ్ (టిస్కో) గా స్థాపితమైన ఈ సంస్థ ఉక్కు పరిశ్రమలో గ్లోబల్ లీడర్‌గా ఎదిగింది. మహారాష్ట్రలోని ముంబై కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న టాటా స్టీల్ భారత్, నెదర్లాండ్స్, యునైటెడ్ కింగ్ డమ్ లలో కీలక కార్యకలాపాలతో 26 దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది.జేఎన్ టాటా జయంతిటాటా స్టీల్ దార్శనిక వ్యవస్థాపకుడు, క్లుప్తంగా జెఎన్ టాటా అని పిలిచే జంషెడ్‌జీ నుస్సెర్వాన్‌జీ టాటా జయంతి మార్చి 3న. ఈసారి 186వ జయంతిని ఆ సంస్థ సగర్వంగా జరుపుకుంటోంది. దేశ అత్యంత ఐకానిక్ కంపెనీలలో ఒకదానికి పునాది వేసిన మార్గదర్శక స్ఫూర్తి, పారిశ్రామిక ఔన్నత్యానికి అచంచలమైన నిబద్ధత ఉన్న వ్యక్తికి నివాళిగా ఆయన జయంతిని ఫౌండర్‌ డేగా నిర్వహిస్తున్నారు.దూరదృష్టి గల నాయకుడు1839 మార్చి 3న గుజరాత్ లో జన్మించిన జేఎన్ టాటా భారత పారిశ్రామిక ముఖచిత్రాన్ని తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించిన దార్శనిక పారిశ్రామికవేత్త. 1870 లలో మధ్య భారతదేశంలో ఒక వస్త్ర మిల్లుతో ఆయన వ్యవస్థాపక ప్రయాణం ప్రారంభమైంది. అయితే, ఆయన దార్శనికత వస్త్ర వ్యాపారాన్ని దాటి విస్తరించింది. భారత్ ను పారిశ్రామిక దేశాల సరసన నిలిపే ఉక్కు కర్మాగారాన్ని నెలకొల్పాలన్నది జేఎన్ టాటా కల. 1907లో టాటా స్టీల్ స్థాపనతో ఈ కల సాకారమైంది. ఇది భారతదేశ ఉక్కు పరిశ్రమకు నాంది పలికింది.టాటా స్టీల్‌ ఘనతలు● 2024 మార్చి 31 తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఈ గ్రూప్ దాదాపు 27.7 బిలియన్ డాలర్ల ఏకీకృత టర్నోవర్‌ను నమోదు చేసింది.● గ్రేట్ ప్లేస్ టు వర్క్ సంస్థగా గుర్తింపు పొందిన టాటా స్టీల్ లిమిటెడ్, దాని అనుబంధ సంస్థలు, అసోసియేట్‌లు, జాయింట్ వెంచర్‌లతో కలిసి, 78,000 కంటే ఎక్కువ మంది ఉద్యోగులతో ఐదు ఖండాలలో విస్తరించి ఉంది.● టాటా స్టీల్ 2045 నాటికి నికర జీరోతో సహా దాని ప్రధాన స్థిరత్వ లక్ష్యాలను ప్రకటించింది.● కంపెనీ తన జంషెడ్‌పూర్, కళింగనగర్ , ఐజేముదీన్‌ ప్లాంట్లకు వరల్డ్ ఎకనామిక్ ఫోరం గ్లోబల్ లైట్‌హౌస్ గుర్తింపును అందుకుంది. టాటా స్టీల్‌ను ఎకనామిక్ టైమ్స్ సీఐఓ 'డిజిటల్ ఎంటర్‌ప్రైజ్ ఆఫ్ ఇండియా - స్టీల్' అవార్డు 2024తో గుర్తించింది.● ఈ కంపెనీ వరల్డ్ ఎకనామిక్ ఫోరం గ్లోబల్ డైవర్సిటీ ఈక్విటీ & ఇంక్లూజన్ లైట్‌హౌస్ 2023తో గుర్తింపు పొందింది.● ఈ కంపెనీ 2012 నుండి డీజేఎస్‌ఐ ఎమర్జింగ్ మార్కెట్స్ ఇండెక్స్‌లో భాగంగా ఉంది. 2016 నుండి డీజేఎస్‌ఐ కార్పొరేట్ సస్టైనబిలిటీ అసెస్‌మెంట్‌లో టాప్ 10 స్టీల్ కంపెనీలలో స్థిరంగా స్థానం సంపాదించుకుంది.● టాటా స్టీల్ జంషెడ్‌పూర్ ప్లాంట్ భారతదేశంలో రెస్పాన్సిబుల్ స్టీల్ సర్టిఫికేషన్ పొందిన మొట్టమొదటి సైట్. తదనంతరం కళింగనగర్, మెరామండలి ప్లాంట్లు కూడా సర్టిఫికేషన్ పొందాయి దేశంలో, టాటా స్టీల్ ఇప్పుడు దాని ఉక్కు ఉత్పత్తిలో 90% కంటే ఎక్కువ రెస్పాన్సిబుల్ స్టీల్ సర్టిఫైడ్ సైట్‌ల నుండి కలిగి ఉంది.● 2016-17 సంవత్సరానికి ఉత్తమ పనితీరు కనబరిచిన ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్‌గా ప్రైమ్‌ మినిస్టర్స్‌ ట్రోపీ, 2024లో వరల్డ్‌ స్టీల్‌ నుంచి వరుసగా ఏడు సంవత్సరాలు స్టీల్ సస్టైనబిలిటీ ఛాంపియన్ గుర్తింపు, సీడీపీ ద్వారా 2023 క్లైమేట్ చేంజ్ లీడర్‌షిప్ అవార్డు, 2022లో డన్ & బ్రాడ్‌స్ట్రీట్ టాప్ 500 కంపెనీలలో అగ్రగామి, బ్రాండ్ ఫైనాన్స్ ద్వారా దేశంలో 2024 అత్యంత విలువైన మైనింగ్ అండ్‌ మెటల్స్ బ్రాండ్‌గా ర్యాంక్, ఎథిస్పియర్ ఇన్‌స్టిట్యూట్ నుండి 2021లో 'మోస్ట్ ఎథికల్ కంపెనీ' అవార్డు, స్పోర్ట్‌స్టార్ ఏసెస్ అవార్డ్స్ 2024లో 'బెస్ట్ కార్పొరేట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ స్పోర్ట్స్' గుర్తింపును పొందింది.● 2023 గ్లోబల్ ఈఆర్‌ఎం (ఎంటర్‌ప్రైజ్ రిస్క్ మేనేజ్‌మెంట్) అవార్డు ఆఫ్ డిస్టింక్షన్, వరుసగా ఎనిమిదవ సంవత్సరం 'మాస్టర్స్ ఆఫ్ రిస్క్' - మెటల్స్ & మైనింగ్ సెక్టార్ గుర్తింపు, ఐసీఎస్‌ఐ బిజినెస్ రెస్పాన్సిబిలిటీ అండ్ సస్టైనబిలిటీ అవార్డు 2023 అందుకుంది.

LPU 2025 Btech Final Year Student Bags Rs 1.03 Cr Placement Package8
ప్లేస్‌మెంట్‌లో ఎల్‌పీయూ సత్తా.. ఏకంగా 10 లక్షలపైనే ప్యాకేజీలు.. అదీ ఏకంగా 1,700 మందికి!!

లవ్లీ ప్రొఫెషనల్‌ యూనివర్శిటీ (ఎల్‌పీయూ)కు ఈ ఏడాది చాలా ఉత్సాహంతో మొదలైంది. ఫైనల్‌ ఇయర్‌ బీటెక్‌ విద్యార్థి రూ.1.03 కోట్ల (1,18,000 డాలర్లు)తో ఉద్యోగావకాశం పొందారు. రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్‌లో B.Tech చేస్తున్న బేతిరెడ్డి నాగవంశీరెడ్డి 2025 మేలో తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేయనున్నారు. ప్రముఖ ఏఐ రోబోటిక్స్ సంస్థలో రోబోటిక్స్ ఇంజినీర్‌గా చేరనున్నారు. ఈ అసాధారణ విజయం అటు పరిశ్రమ వర్గాల్లోనూ ఇటు విద్యా ప్రపంచంలోనూ సంచలనం సృష్టించింది. విద్యార్థులకు సూపర్‌ డూపర్‌ ప్యాకేజీలు అందించగల అత్యున్నత విద్యా సంస్థగా ఎల్‌పీయూ తనస్థానాన్ని సుస్థిరం చేసుకుంది.వేర్వేరు బీటెక్‌ విభాగాల్లోని మొత్తం 7361 మంది విద్యార్థులకు పాలో ఆల్టో నెట్‌వర్క్స్, నుటానిక్స్‌, మైక్రోసాఫ్ట్‌, సిస్కో, పేపాల్‌ అమెజాన్‌ వంటి ప్రతిష్టాత్మక మల్టీనేషనల్‌ కంపెనీల నుంచి ప్లేస్‌మెంట్లు లభించాయి. వీరిలో 1700 మంది టాప్‌ ఎమ్మెన్సీల నుంచి ఏడాదికి రూ.10 లక్షల నుంచి రూ.కోటి వరకూ ప్యాకేజీలు అందాయి. టాప్‌ ఎంఎన్‌సీలు ఇచ్చిన సగటు ప్యాకేజీ రూ.16 లక్షలు (ఏడాదికి). ఉద్యోగ మార్కెట్‌లో ఎల్‌పీయూకు ఉన్న అధిక డిమాండ్‌కు నిదర్శనాలు ఈ ప్లేస్‌మెంట్లు.గత ప్లేస్‌మెంట్‌ సీజన్‌ కూడా ఆకట్టుకునేదే. ఇండస్ట్రీలోనే అతిపెద్ద కంఎనీలు ఆకర్షణీయమైన ప్యాకేజీలు అందించాయి. పాలో ఆల్టో నెట్‌వర్క్స్ ఏకంగా ఏడాదికి రూ.54.75 లక్షల ప్యాకేజీని అందించగా నుటానిక్స్‌ రూ.53 లక్షల ప్యాకేజీ ఇచ్చింది. మైక్రోసాఫ్ట్‌ రూ.52.20 LPA ప్యాకేజీ అందించింది. మొత్తం 1912మందికి ఒకటి కంటే ఎక్కువ ఆఫర్లు అందాయి. 377 మందికి మూడు ఆఫర్లు, 97 మందికి నాలుగు ఆఫర్లు, 18 మందికి ఐదు, ఏడుగురికి ఆరు ఆఫర్లు లభించాయి. ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌ ఇంజినీరింగ్‌ విద్యార్థి ఆదిరెడ్డి వాసుకు నమ్మశక్యం కాని రీతిలో ఏకంగా ఏడు ఆఫర్లు వచ్చాయి. ఇదో అరుదైన, ఆకట్టుకునే రికార్డు.పైన చెప్పుకున్న కంపెనీలు మాత్రమే కాకుండా.. అమెజాన్‌ (రూ.48.64 LPA), ఇన్‌ట్యూట్‌ లిమిటెడ్‌ (రూ. 44.92 LPA), సర్వీస్‌ నౌ ( రూ. 42.86 LPA), సిస్కో (రూ. 40.13 LPA), పేపాల్‌ (రూ. 34.4 LPA), APNA (రూ.34 LPA), కామ్‌వాల్ట్‌ (రూ. 33.42 LPA), స్కేలర్‌ (రూ. 32.50 LPA)లు కూడా స్కిల్‌ డెవెలప్‌మెంట్‌, అత్యాధునిక టెక్నాలజీల్లో నైపుణ్యం అందించేందుకు ఎల్‌పీయూ చూపుతున్న శ్రద్ధకు నిదర్శనంగా నిలుస్తున్నాయి.ఎల్పీయూ పట్టభద్రుల సాంకేతిక పరిజ్ఞాన బుద్ధికుశలత కారణంగా భారీ నియామకాలు చేపట్టే ఆక్సెంచర్‌, క్యాప్‌జెమినీ, టీసీఎస్‌ తదితర ప్రముఖ కంపెనీల నుంచి మంచి డిమాండ్‌ ఉంది. క్యాప్‌జెమినీ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ 736 మంది విద్యార్థులకు అనలిస్ట్‌, సీనియర్‌ అనలిస్ట్‌ రోల్స్‌ కోసం ఉద్యగావకాశం ఇచ్చింది. అలాగే మైండ్‌ట్రీ 467 మంది విద్యార్థులను గ్రాడ్యుయేట్‌ ఇంజినీర్‌ ట్రైనీ పొజిషన్‌ కోసం తీసుకుంది. కాగ్నిజెంట్‌ టెక్నాలజీ సొల్యూషన్స్‌ కూడా 418 మంది విద్యార్థులను జెన్‌సీ రోల్స్‌ కోసం తీసుకుంది. ఎల్‌పీయూ నుంచి విద్యార్థులను ఎంపిక చేసుకున్న ఇతర కంపెనీల్లో ఆక్సెంచర్‌ (279 మంది), టీసీఎస్‌ (260 మంది), కేపీఐటీ టెక్నాలజీస్‌ (229 మంది), డీఎక్స్‌సీ టెక్నాలజీ (203), MPHASIS (94 మంది) కంపెనీలు ఉన్నాయి.రొబోటిక్స్‌, ఆటోమేషన్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌, మెకానికల్‌ ఇంజినీరింగ్‌ వంటి కోర్‌ ఇంజినీరింగ్‌ విభాగాల్లో అత్యధిక స్థాయిలో ప్లేస్‌మెంట్లు లభించాయి. పాలో ఆల్టో నెట్‌వర్క్స్‌, సిలికాన్‌ ల్యాబ్స్‌, ట్రైడెంట్‌గ్రూప్‌, నుటానిక్స్‌, ఆటోడెస్క్‌, అమెజాన్‌ వంటి దిగ్గజ కంపెనీలు ఈ విభాగాల్లోని విద్యార్థులను భారీగా నియమించుకుంటున్నాయి.‘‘ఎప్పటికప్పుడు మారిపోతున్న ప్రపంచానికి అనుగుణంగా విద్యార్థులు విజయం సాధించేలా చేసేందుకు ఎల్‌పీయూ కట్టుబడి ఉంది. ఎల్‌పీయూలో బోధించే అంశాలు కంపెనీల అవసరాలకు తగ్గట్టుగా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఎల్‌పీయూలో సంప్రదాయ పద్ధతులకు అతీతంగా సృజనాత్మక రీతిలో సాగే బోధన విద్యార్థులునిమగ్నమైయెలా ఉంటుంది. విద్యార్థులు పెద్ద సంఖ్యలో టాప్‌ కంపెనీల నుంచి ప్లేస్‌మెంట్‌ ఆఫర్లు పొందుతూండటం దీనికి నిదర్శనం. ఎల్‌పీయూ బోధనాంశాల సత్తానుచాటుతున్నాయి ఈ ప్లేస్‌మెంట్లు. జాతీయ, అంతర్జాతీయ ప్రముఖ సంస్థల్లో విద్యార్థులకు మంచి మంచి ప్లేస్‌మెంట్స్‌ సాధించిన రికార్డు ఎల్‌పీయూ సొంతం. అమెరికా, యూకే, ఆస్ట్రేలియాలల్లోని ఎన్నో పేరొందిన కంపెనీల్లో ఎల్‌పీయూ విద్యార్థులు ఏడాదికి రూ.కోటి కంటే ఎక్కువ ప్యాకేజీలతో పని చేస్తున్నారు. అత్యున్నత నైపుణ్యం కలిగిన ప్రొఫెషనల్స్‌ను తయారు చేయగల ఎల్‌పీయూ శక్తి సామర్థ్యాలకు, అంతర్జాతీయ స్థాయి ఎదుగుదలకు ఇవి నిదర్శనాలు.’’ అని రాజ్యసభ సభ్యులు, ఎల్‌పీయూ ఫౌండర్‌ ఛాన్సలర్‌ డాక్టర్‌ అశోక్‌ కుమార్‌ మిట్టల్‌ వివరించారు.2025 బ్యాచ్‌ కోసం దరఖాస్తు చేసుకునేందుకు చివరితేదీ దగ్గరపడింది. ఎల్‌పీయూలో అడ్మిషన్లకు పోటీ ఎక్కువ. యూనివర్శిటీలో అడ్మిషన్‌ కోసం విద్యార్థులు ప్రవేశ పరీక్ష రాయాల్సి ఉంటుంది. అలాగే ‘ఎల్‌పీయూ నెస్ట్‌ 2025’, ఇంటర్వ్యూలలోనూ పాసైన వారికి మాత్రమే కొన్ని ప్రత్యేక కార్యక్రమాల్లోకి ప్రవేశం లభిస్తుంది. పరీక్ష, అడ్మిషన్‌ ప్రాసెస్‌ గురించి తెలుసుకోవాలనుకునే ఆసక్తిగల విద్యార్థులు https://bit.ly/43340ai ను సందర్శించగలరు.

IIT Baba Arrested For Consuming Prasad Check Full Details Here9
గంజాయి కేసులో ఐఐటీ బాబా అరెస్ట్‌!

జైపూర్‌: మహా కుంభమేళాతో దేశం దృష్టిని ఆకర్షించిన ఐఐటీ బాబా(IIT Baba) అభయ్‌ సింగ్‌ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. గంజాయి కేసులో తాజాగా ఆయన్ని జైపూర్‌ పోలీసులు అరెస్ట్‌ చేసినట్లు సమాచారం. ఈ విషయాన్ని స్వయంగా ఐఐటీ బాబానే ధృవీకరించడం విశేషం. ఐఐటీ బాబా సూసైడ్‌ చేసుకుంటానన్న ఓ వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు జైపూర్‌ షిప్రా పాథ్‌ పోలీసులు ఓ హోటల్‌లో ఉన్నారనే సమాచారంతో అక్కడికి వెళ్లారు. ఆ టైంలో ఆయన నుంచి గంజాయి సేవిస్తుండడంతో పోలీసులు అదుపులోకి తీన్నారు. ఆయనపై నార్కోటిక్‌ డ్రగ్స్‌ &సైకోట్రోపిక్‌ సబ్‌స్టానెన్స్‌(NDPS) యాక్ట్‌ కింద కేసు నమోదు చేసినట్లు అక్కడి మీడియా కథనాలు ఇచ్చింది. VIDEO | Amid reports of his arrest, Maha Kumbh fame Abhay Singh, alias 'IIT Baba' was seen celebrating his birthday with followers in Jaipur. pic.twitter.com/WhA8aTIUv2— Press Trust of India (@PTI_News) March 3, 2025అయితే.. ఆయన అరెస్ట్‌ ప్రచారం నడుమ అనూహ్యంగా ఆయన తన భక్తుల మధ్య పుట్టినరోజు వేడుకలు చేసుకుంటూ కనిపించారు. దీంతో మీడియా ఆయన్ని అరెస్ట్‌పై ఆరా తీసింది. తాను ఆత్మహత్య చేసుకుంటానన్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని అన్నారాయన. అయితే తాను గంజాయి తీసుకున్న మాట వాస్తవమేనని.. అయితే పరిమితితో కూడి గంజాయి ఉండడంతో పోలీసులు బెయిల్‌ మీద తనను విడుదల చేశారని అన్నారాయన. అయితే తన దృష్టిలో అది గంజాయి కాదని.. ప్రసాదమని ఆయన వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే.. ఓప్రైవేట్‌ టీవీ ఛానెల్‌ ఇంటర్వ్యూలో తనపై దాడి జరిగిందంటూ నోయిడా పీఎస్‌ వద్ద ఐఐటీ బాబా హడావిడి చేసిన సంగతి తెలిసిందే. చివరకు పోలీసులు ఆయన్ని శాంతపర్చి అక్కడి నుంచి పంపించేశారు. అయితే ఇంటర్వ్యూకు ముందు ఆయనే సదరు ఛానెల్‌ యాంకర్‌పై దాడి చేశారంటూ ప్రచారం జరగడం గమనార్హం. ఈ ఘటనకు సంబంధించి ఎలాంటి కేసు నమోదు కాలేదు.ఐఐటీ బాబాగా ప్రయాగ్‌రాజ్‌ మహా కుంభమేళా(Prayagraj Maha Kumbh) అభయ్‌ సింగ్‌ ఓ టీవీ ఛానెల్‌ ఇంటర్వ్యూతో పాపులారిటీ సంపాదించుకున్నారు. హర్యానా చెందిన అభయ్‌ ఐఐటీ బాంబేలో ఏరోస్పేస్‌ ఇంజినీరింగ్‌ పూర్తిచేసినట్లు చెబుతున్నారు. కొంతకాలం ఓ కార్పొరేట్‌ సంస్థలో పనిచేసిన ఆయన.. దాన్ని వదిలేశారట. ఆపై కొంతకాలం ఫొటోగ్రఫీ.. అటు నుంచి ఆధ్యాత్మికం వైపు అడుగులు వేశారట.

Karnataka MLA On Rashmika Mandanna to Refuse attend the Film Festival10
ఈవెంట్‌ తెచ్చిన తంటా.. రష్మికకు ఎమ్మెల్యే స్ట్రాంగ్ వార్నింగ్

శాండల్‌వుడ్‌లో వివాదం మరింత ముదురుతోంది. ప్రతిష్టాత్మక ఈవెంట్‌కు కన్నడకు చెందిన అగ్ర సినీతారలు హాజరు కాకపోవడం రాజకీయ రంగు పులుముకుంది. ఈ అంశంపై ఇప్పటికే కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ అందరికీ నట్లు, బోల్టులు ఎప్పుడు బిగించాలో తమకు తెలుసని మండిపడ్డారు. తాజాగా మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే నేషనల్ క్రష్, పుష్ప భామ రష్మిక మందన్నాపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఇటీవల జరిగిన బెంగళూరు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు రష్మిక హాజరు కాకపోవడంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే రవి గణిగ మండిపడ్డారు. కన్నడ చిత్రం కిరిక్ పార్టీతో తన కెరీర్‌ను ప్రారంభించిన రష్మిక తన మూలాలు మరిచిపోవడం సరైంది కాదని హితవు పలికారు. గతేడాది కూడా ఈవెంట్‌కు ఆహ్వానించగా నిరాకరించిందని వెల్లడించారు. తాను కెరీర్ ప్రారంభించిన ఇండస్ట్రీని చిన్నచూపు చూస్తున్న రష్మికకు తగిన గుణపాఠం చెప్పకూడదా? అంటూ అని మాండ్యా నియోజకవర్గ ఎమ్మెల్యే రవి గణిగ ప్రశ్నించారు. కాగా.. రష్మిక 2016లో కన్నడ చిత్రం కిరిక్ పార్టీతో రక్షిత్ శెట్టి సరసన సినీ రంగ ప్రవేశం చేసింది.(ఇది చదవండి: ఇలాగే ఉంటే నటీనటులకు నట్లు, బోల్టులు బిగిస్తాం: డిప్యూటీ సీఎం)రష్మిక కన్నడ చిత్ర పరిశ్రమను పూర్తిగా విస్మరించిందని ఆయన అన్నారు. అలాగే కన్నడ భాషను కూడా విస్మరించి అగౌరవపరిచేలా మాట్లాడిందని ఎమ్మెల్యే ఆరోపించారు. ఈ కార్యక్రమానికి రష్మిక మందన్నను చాలాసార్లు ఆహ్వానించినప్పటికీ.. బెంగళూరు రావడానికి సమయం లేదని సమాధానమిచ్చిందని అన్నారు. మా శాసనసభ్యురాలు ఒకరు ఆమెను ఆహ్వానించడానికి 10 నుంచి 12 సార్లు ఆమె ఇంటికి వెళ్లారని గుర్తు చేశారు. కానీ రష్మిక కన్నడ పరిశ్రమను పట్టించుకోలేదని.. ఇలాంటి వారికి వారికి గుణపాఠం చెప్పాల్సిందేనని స్పష్టం చేశారు. రష్మిక ప్రవర్తనకు తగిన పరిణామాలు తప్పవని ఆయన హెచ్చరించారు. కాగా.. ఇటీవల బెంగళూరు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్-16 వేడుకలు గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్‌కు శాండల్‌వుడ్ అగ్రతారలు హాజరు కాకపోవడంపై డీసీఎం డీకే శివకుమార్ సైతం మండిపడ్డారు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

International View all
title
పెళ్లి ముద్దు,పిల్లలొద్దు ఎందుకంటే..అక్కడి యువత

పిల్లలను కనకూడదని యుక్తవయసులోనే నిర్ణయించుకుంటున్నవారి సంఖ్య రానురానూ పెరుగుతోంది.

title
యూఏఈలో భారతీయ మహిళకు మరణశిక్ష అమలు

న్యూఢిల్లీ: నాలుగు ఏళ్ల చిన్నారి మృతి  కేసులో భాగంగా  ఓ భారత మహిళకు యూఏఈలో మర

title
వారి కోసం జుకర్‌బర్గ్‌ ఫ్యావరెట్‌ హుడీ వేలం : మార్క్‌ డ్యాన్స్‌ వైరల్‌ వీడియో

మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్  తనకెంతో ఇష్టమైన పాత హుడీని వేలం వేశారు.

title
ఆకర్షించే స్క్వేర్ వేవ్స్.. దగ్గరకు వెళ్తే అంతే సంగతులు

మీరు సముద్రంలో ఎప్పుడైనా చతుర్భుజాకారపు అలలను(

title
అమెరికాలో కాల్పుల కలకలం.. వీడియో వైరల్‌

లూసియానా: అమెరికాలో మరోమారు కాల్పుల కలకలం చోటుచేసుకుంది.

NRI View all
title
టంపా వేదికగా నాట్స్‌ అమెరికా తెలుగు సంబరాల ఏర్పాట్లు

title
జర్మనీ పాఠ్యాంశాల్లో తెలుగు విద్యార్థి ప్రస్థానం

ప్రవాస తెలుగు విద్యార్ధి శ్రీనిహల్ తమ్మనకు మరో అరుదైన గౌరవం లభించింది.

title
గల్ఫ్ మృతుల కుటుంబాలతో సీఎం రేవంత్ రెడ్డి సహపంక్తి భోజనం

గల్ఫ్ దేశాలలో మరణించిన కార్మికుల కుటుంబాలతో హైదరాబాద్, ప్రజాభవన్‌లో త్వరలో 'గల్ఫ్ అమరుల సంస్మరణ సభ' ఏర్పాటు చేయాలని రాష్

title
వలస కార్మికుల మృత్యు ఘోష

మోర్తాడ్‌ (బాల్కొండ): జగిత్యాల జిల్లా మల్లాపూర్‌ మండలం రేగుంటకు చెందిన కర్న గణేశ్‌ (55) రెండ్రోజుల కిందట సౌదీ అరేబియాలో

title
వీసా గోల్డెన్‌ చాన్సేనా?

గోల్డ్‌ కార్డ్‌ వీసా.. ప్రపంచవ్యాప్తంగా కొత్త చర్చకు దారితీసిన టాపిక్‌ ఇది.

Advertisement

వీడియోలు

Advertisement