Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Redbook Constitution In AP: Posani Case Bail Plea Updates1
పోసాని కృష్ణమురళిపై మరో అక్రమ కేసు

అన్నమయ్య జిల్లా, సాక్షి: ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణమురళి(Posani KrishnaMurali) మరో కేసు నమోదు అయ్యింది. పల్నాడు జిల్లా నరసరావుపేట(Narasaraopeta) టూటౌన్‌ పీఎస్‌లో కేసు నమోదైనట్లు సమాచారం. దీంతో.. సోమవారం ఉదయం ఆయన్ని రాజంపేట సబ్‌ జైలు నుంచి అక్కడికి తరలిస్తున్నారు.ఈ ఉదయాన్నే పీటీ వారెంట్‌(PT Warrant)తో నరసరావుపేట టూటౌన్‌ పోలీసులు రాజంపేట సబ్‌జైలుకు చేరుకున్నారు. పోసాని మీద బీఎన్‌ఎస్‌ 152ఏ, 504, 67 ఐటీ యాక్టుల కింద కేసు నమోదు చేశారు. అయితే అభియోగాలు ఏంటన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది. అయితే పోసానికి బెయిల్‌ దక్కే అవకాశాలు ఉండడంతోనే ఇలా ఇప్పుడు మరో కేసు పెట్టారని వైఎస్సార్‌సీపీ(YSRCP) శ్రేణులు మండిపడుతున్నాయి. పోసాని భార్యను ఫోన్‌లో పరామర్శించి ధైర్యం చెప్పిన వైఎస్సార్సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి.. అవసరమైన న్యాయ సహాయం అందిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ కడప కోర్టు(Kadapa Court) పోసాని కృష్ణ మురళీ తరఫున లాయర్లు బెయిల్ పిటిషన్ దాఖలు చేయనున్నారు. ఇంకోవైపు పోసానిని కలిసేందుకు వైఎస్సార్‌సీపీ నేతలు ములాఖత్‌ పెట్టున్నారు. అయితే ఈ లోపే ఆయన్ని నరసరావుపేట తరలించడం గమనార్హం.పోసానిపై అక్రమ కేసులు బనాయిస్తూ కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని వైఎస్సార్‌సీపీ మొదటి నుంచి మండిపడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పోసానిపై రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 16 కేసులు నమోదు చేశారని అంటోంది. అయితే ఆయనకు గతంలో సర్జరీ జరగడంతో పాటు ఇతరత్ర ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. పోలీసులు వీటన్నంటిని పట్టించుకోవడం లేదు. కావాలనే ఇబ్బంది పెట్టేందుకు వివిధ పోలీసు స్టేషన్లు తిప్పుతున్నారు. పైగా పోసానిని అపహాస్యం చేసేలా మీడియా ముందు మాట్లాడుతున్నారు. అయితే కూటమి ప్రభుత్వ పెద్దల(Kutami Peddalu) డైరెక్షన్‌లోనే ఇలా పోలీసులు వ్యవహరిస్తున్నారని ఇటు వైఎస్సార్‌సీపీ నేతలు, అటు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

 Oscars 2025 Awards Winners List2
97వ ఆస్కార్‌ విజేతల పూర్తి జాబితా.. ఉత్తమ చిత్రం 'అనోరా'

97వ ఆస్కార్ అవార్డుల వేడుక అంగరంగ వైభవంగా లాస్‌ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో ఘనంగా జరిగాయి. ముందుగా అనుకున్న సమయం కంటే కాస్త ఆసల్యంగానే అవార్డుల ప్రకటన ప్రారంభమైంది. అవార్డుల కోసం హాలీవుడ్‌ టాప్‌ నటీనటులతో పాటు సాంకేతిక నిపుణులు హాజరయ్యారు. రెడ్‌ కార్పెట్‌పై సరికొత్త ట్రెండీ దుస్తుల్లో వారందరూ మెరిశారు. అమెరికాకు చెందిన 'అనోరా' ఉత్తమ చిత్రంగా ఆస్కార్‌-2025 అవార్డ్‌ను దక్కించుకుంది. అయితే ఇదే చిత్రంలో నటించిన మైకేలా మాడిసన్ రోస్‌బర్గ్ ఉత్తమ హీరోయిన్‌గా అవార్డ్‌ అందుకుంది. ఉత్తమ దర్శకుడిగా సీన్ బేకర్ (అనోరా) దక్కించుకున్నారు. ఉత్తమ నటుడిగా ఆడ్రిన్‌ బ్రాడీ అందుకున్నారు. ది బ్రూటలిస్ట్‌ అనే చిత్రంలో ఆయన నటనకు ఫ్యాన్స్‌ ఫిదా అయ్యారు. గతేడాది బాక్సాఫీస్‌ వద్ద దుమ్మురేపిన 'డ్యూన్‌: పార్ట్‌2' చిత్రం కూడా రెండు విభాగాల్లో అవార్డ్స్‌ను అందుకుంది. ఉత్తమ సౌండ్‌, విజువల్‌ ఎఫెక్ట్స్‌ విభాగంలో ఆస్కార్‌ను సొంతం చేసుకుంది ఆస్కార్‌ విజేతలు- 2025 ఉత్తమ చిత్రం – (అనోరా)ఉత్తమ నటుడు – అడ్రియన్ నికోలస్ బ్రాడీ (ది బ్రూటలిస్ట్) ఉత్తమ నటి – మైకేలా మాడిసన్ రోస్‌బర్గ్ (అనోరా) ఉత్తమ దర్శకుడు –సీన్ బేకర్ (అనోరా) ఉత్తమ సహాయ నటుడు – కీరన్ కల్కిన్ (ఏ రియల్‌ పెయిన్‌)ఉత్తమ సహాయ నటి – జోసల్దానా (ఎమీలియా పెరెజ్) ఉత్తమ సినిమాటోగ్రఫీ - లాల్‌ క్రాలే ( ది బ్రూటలిస్ట్‌)ఉత్తమ అడాప్టెడ్‌ స్క్రీన్‌ప్లే– పీటర్ స్ట్రౌగన్ (కాన్‌క్లేవ్‌)ఉత్తమ ఒరిజినల్‌ స్క్రీన్‌ప్లే – సీన్ బేకర్ (అనోరా)ఉత్తమ కాస్ట్యూమ్‌ డిజైన్‌ – పాల్ టాజ్‌వెల్ (విక్‌డ్‌- Wicked)ఉత్తమ యానిమేటెడ్‌ ఫీచర్‌ – (ఫ్లో- FLOW)ఉత్తమ యానిమేటెడ్‌ షార్ట్‌ ఫిలిం- ఇన్‌ ద షాడో ఆఫ్‌ ద సైప్రెస్‌ఉత్తమ మేకప్‌, హెయిల్‌స్టైల్‌ - ది సబ్‌స్టాన్స్‌ఉత్తమ ఎడిటింగ్ - సీన్‌ బేకర్‌ (అనోరా)ఉత్తమ ఒరిజినల్‌ సాంగ్‌ – "ఎల్ మాల్" (ఎమిలియా పెరెజ్)ఉత్తమ ప్రొడక్షన్‌ డిజైన్‌ – నాథన్ క్రౌలీ,లీ శాండల్స్ (విక్‌డ్‌- Wicked)ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్‌– నో అదర్ ల్యాండ్ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్‌ ఫిలిం- ది ఓన్లీ గర్ల్ ఇన్ ది ఆర్కెస్ట్రాఉత్తమ సౌండ్‌ - డ్యూన్‌- పార్ట్‌2బెస్ట్‌ విజువల్‌ ఎఫెక్ట్స్‌ – డ్యూన్‌- పార్ట్‌2 ఉత్తమ లైవ్‌ యాక్షన్‌ షార్ట్‌ ఫిలిం- ఐ యామ్ నాట్ ఎ రోబోట్బెస్ట్‌ ఒరిజినల్‌ స్కోర్‌ – డేనియల్ బ్లమ్‌బెర్గ్ (ది బ్రూటలిస్ట్)

Bitcoin Jumps Above 91000 Dollar After Trump US Crypto Reserve News3
ట్రంప్ ప్రకటన: భారీగా పెరిగిన బిట్‌కాయిన్ విలువ

డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత.. క్రిప్టో కరెన్సీ విలువ అమాంతం పెరిగిపోతూనే ఉంది. దేశాన్ని ప్రపంచ క్రిప్టో కరెన్సీకి రాజధానిగా మారుస్తానని, క్రిప్టో రిజర్వ్​ను ఏర్పాటు చేస్తానని ప్రకటించారు. దీంతో బిట్‌కాయిన్‌తో సహా.. అనేక క్రిప్టో కరెన్సీల విలువ మరింత పెరిగిపోయింది.డొనాల్డ్ ట్రంప్ ప్రకటనతో బిట్‌కాయిన్ ధర 91,000 డాలర్లను (సుమారు రూ.80 లక్షలు) దాటింది. ఎక్స్‌ఆర్‌పీ, సోలానా, కార్డానో, ఈథర్ ధరలు కూడా గణనీయంగా పెరిగాయి. ఎంఎస్టీఆర్, కాయిన్, హెచ్ఓఓడీ, ఎంఏఆర్ఏ, ఆర్ఐఓటీ వంటి క్రిప్టో లింక్డ్ స్టాక్‌లు కూడా బుల్లిష్ బిడ్‌లను చూసే అవకాశం ఉంది.మార్చి 7న ట్రంప్ క్రిప్టో సమ్మిట్‌ను నిర్వహిస్తారని వైట్ హౌస్ శుక్రవారం ప్రకటించడంతో క్రిప్టో ధరలు జీవిత కాల గరిష్టాలకు చేరుకోవడం ప్రారంభించాయి. సమ్మిట్‌కు ప్రముఖ వ్యవస్థాపకులు, సీఈఓలు, క్రిప్టో పరిశ్రమకు చెందిన పెట్టుబడిదారులు హాజరయ్యే అవకాశం ఉంది.క్రిప్టో కాయిన్స్ విలువలు ఇలా..భారత కాలమానం ప్రకారం.. ఆదివారం రాత్రి 8:55 గంటల సమాయానికి సొలనా కాయిన్ (ఎస్ఓఎల్) విలువ 24 శాతం పెరిగి 175.46 డాలర్లకు చేరుకుంది. ఎక్స్‌ఆర్‌పీ 31 శాతం పెరిగి 2.92 డాలర్లకు, కార్డానో విలువ 1.1 డాలర్లకు చేరింది. డొనాల్డ్ ట్రంప్ ప్రకటనతో క్రిప్టో కాయిన్స్ మాత్రమే కాకుండా.. మార్కెట్లు కూడా పుంజుకున్నాయి.గమనిక: క్రిప్టోకరెన్సీలో విపరీతమైన రిస్క్ ఉంటుందని తప్పకుండా గుర్తుంచుకోవాలి. కాబట్టి వీటి విలువ ఎప్పుడు పెరుగుతుందో.. ఎప్పుడు పతనావస్థకు చేరుతుందో ఎవరూ ఊహించలేరు. కాబట్టి ఇందులో పెట్టుబడులు పెట్టాలంటే.. దీనిపైన పూర్తి అవగాహన ఉండాలి, లేదా నిపుణులు సలహాలు తీసుకోవడం మంచిది.ఇదీ చదవండి: 12 మంది.. రూ. 60వేల పెట్టుబడి: పార్లే-జీ ప్రస్థానం గురించి తెలుసా?

LPU 2025 Btech Final Year Student Bags Rs 1.03 Cr Placement Package4
ఎల్‌పీయూ రికార్డు.. 1700 విద్యార్థులకు 10 లక్షలపైనే ప్యాకేజీలు

లవ్లీ ప్రొఫెషనల్‌ యూనివర్శిటీ (ఎల్‌పీయూ)కు ఈ ఏడాది చాలా ఉత్సాహంతో మొదలైంది. ఫైనల్‌ ఇయర్‌ బీటెక్‌ విద్యార్థి రూ.1.03 కోట్ల (1,18,000 డాలర్లు)తో ఉద్యోగావకాశం పొందారు. రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్‌లో B.Tech చేస్తున్న బేతిరెడ్డి నాగవంశీరెడ్డి 2025 మేలో తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేయనున్నారు. ప్రముఖ ఏఐ రోబోటిక్స్ సంస్థలో రోబోటిక్స్ ఇంజినీర్‌గా చేరనున్నారు. ఈ అసాధారణ విజయం అటు పరిశ్రమ వర్గాల్లోనూ ఇటు విద్యా ప్రపంచంలోనూ సంచలనం సృష్టించింది. విద్యార్థులకు సూపర్‌ డూపర్‌ ప్యాకేజీలు అందించగల అత్యున్నత విద్యా సంస్థగా ఎల్‌పీయూ తనస్థానాన్ని సుస్థిరం చేసుకుంది.వేర్వేరు బీటెక్‌ విభాగాల్లోని మొత్తం 7361 మంది విద్యార్థులకు పాలో ఆల్టో నెట్‌వర్క్స్, నుటానిక్స్‌, మైక్రోసాఫ్ట్‌, సిస్కో, పేపాల్‌ అమెజాన్‌ వంటి ప్రతిష్టాత్మక మల్టీనేషనల్‌ కంపెనీల నుంచి ప్లేస్‌మెంట్లు లభించాయి. వీరిలో 1700 మంది టాప్‌ ఎమ్మెన్సీల నుంచి ఏడాదికి రూ.10 లక్షల నుంచి రూ.కోటి వరకూ ప్యాకేజీలు అందాయి. టాప్‌ ఎంఎన్‌సీలు ఇచ్చిన సగటు ప్యాకేజీ రూ.16 లక్షలు (ఏడాదికి). ఉద్యోగ మార్కెట్‌లో ఎల్‌పీయూకు ఉన్న అధిక డిమాండ్‌కు నిదర్శనాలు ఈ ప్లేస్‌మెంట్లు.గత ప్లేస్‌మెంట్‌ సీజన్‌ కూడా ఆకట్టుకునేదే. ఇండస్ట్రీలోనే అతిపెద్ద కంఎనీలు ఆకర్షణీయమైన ప్యాకేజీలు అందించాయి. పాలో ఆల్టో నెట్‌వర్క్స్ ఏకంగా ఏడాదికి రూ.54.75 లక్షల ప్యాకేజీని అందించగా నుటానిక్స్‌ రూ.53 లక్షల ప్యాకేజీ ఇచ్చింది. మైక్రోసాఫ్ట్‌ రూ.52.20 LPA ప్యాకేజీ అందించింది. మొత్తం 1912మందికి ఒకటి కంటే ఎక్కువ ఆఫర్లు అందాయి. 377 మందికి మూడు ఆఫర్లు, 97 మందికి నాలుగు ఆఫర్లు, 18 మందికి ఐదు, ఏడుగురికి ఆరు ఆఫర్లు లభించాయి. ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌ ఇంజినీరింగ్‌ విద్యార్థి ఆదిరెడ్డి వాసుకు నమ్మశక్యం కాని రీతిలో ఏకంగా ఏడు ఆఫర్లు వచ్చాయి. ఇదో అరుదైన, ఆకట్టుకునే రికార్డు.పైన చెప్పుకున్న కంపెనీలు మాత్రమే కాకుండా.. అమెజాన్‌ (రూ.48.64 LPA), ఇన్‌ట్యూట్‌ లిమిటెడ్‌ (రూ. 44.92 LPA), సర్వీస్‌ నౌ ( రూ. 42.86 LPA), సిస్కో (రూ. 40.13 LPA), పేపాల్‌ (రూ. 34.4 LPA), APNA (రూ.34 LPA), కామ్‌వాల్ట్‌ (రూ. 33.42 LPA), స్కేలర్‌ (రూ. 32.50 LPA)లు కూడా స్కిల్‌ డెవెలప్‌మెంట్‌, అత్యాధునిక టెక్నాలజీల్లో నైపుణ్యం అందించేందుకు ఎల్‌పీయూ చూపుతున్న శ్రద్ధకు నిదర్శనంగా నిలుస్తున్నాయి.ఎల్పీయూ పట్టభద్రుల సాంకేతిక పరిజ్ఞాన బుద్ధికుశలత కారణంగా భారీ నియామకాలు చేపట్టే ఆక్సెంచర్‌, క్యాప్‌జెమినీ, టీసీఎస్‌ తదితర ప్రముఖ కంపెనీల నుంచి మంచి డిమాండ్‌ ఉంది. క్యాప్‌జెమినీ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ 736 మంది విద్యార్థులకు అనలిస్ట్‌, సీనియర్‌ అనలిస్ట్‌ రోల్స్‌ కోసం ఉద్యగావకాశం ఇచ్చింది. అలాగే మైండ్‌ట్రీ 467 మంది విద్యార్థులను గ్రాడ్యుయేట్‌ ఇంజినీర్‌ ట్రైనీ పొజిషన్‌ కోసం తీసుకుంది. కాగ్నిజెంట్‌ టెక్నాలజీ సొల్యూషన్స్‌ కూడా 418 మంది విద్యార్థులను జెన్‌సీ రోల్స్‌ కోసం తీసుకుంది. ఎల్‌పీయూ నుంచి విద్యార్థులను ఎంపిక చేసుకున్న ఇతర కంపెనీల్లో ఆక్సెంచర్‌ (279 మంది), టీసీఎస్‌ (260 మంది), కేపీఐటీ టెక్నాలజీస్‌ (229 మంది), డీఎక్స్‌సీ టెక్నాలజీ (203), MPHASIS (94 మంది) కంపెనీలు ఉన్నాయి.రొబోటిక్స్‌, ఆటోమేషన్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌, మెకానికల్‌ ఇంజినీరింగ్‌ వంటి కోర్‌ ఇంజినీరింగ్‌ విభాగాల్లో అత్యధిక స్థాయిలో ప్లేస్‌మెంట్లు లభించాయి. పాలో ఆల్టో నెట్‌వర్క్స్‌, సిలికాన్‌ ల్యాబ్స్‌, ట్రైడెంట్‌గ్రూప్‌, నుటానిక్స్‌, ఆటోడెస్క్‌, అమెజాన్‌ వంటి దిగ్గజ కంపెనీలు ఈ విభాగాల్లోని విద్యార్థులను భారీగా నియమించుకుంటున్నాయి.‘‘ఎప్పటికప్పుడు మారిపోతున్న ప్రపంచానికి అనుగుణంగా విద్యార్థులు విజయం సాధించేలా చేసేందుకు ఎల్‌పీయూ కట్టుబడి ఉంది. ఎల్‌పీయూలో బోధించే అంశాలు కంపెనీల అవసరాలకు తగ్గట్టుగా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఎల్‌పీయూలో సంప్రదాయ పద్ధతులకు అతీతంగా సృజనాత్మక రీతిలో సాగే బోధన విద్యార్థులునిమగ్నమైయెలా ఉంటుంది. విద్యార్థులు పెద్ద సంఖ్యలో టాప్‌ కంపెనీల నుంచి ప్లేస్‌మెంట్‌ ఆఫర్లు పొందుతూండటం దీనికి నిదర్శనం. ఎల్‌పీయూ బోధనాంశాల సత్తానుచాటుతున్నాయి ఈ ప్లేస్‌మెంట్లు. జాతీయ, అంతర్జాతీయ ప్రముఖ సంస్థల్లో విద్యార్థులకు మంచి మంచి ప్లేస్‌మెంట్స్‌ సాధించిన రికార్డు ఎల్‌పీయూ సొంతం. అమెరికా, యూకే, ఆస్ట్రేలియాలల్లోని ఎన్నో పేరొందిన కంపెనీల్లో ఎల్‌పీయూ విద్యార్థులు ఏడాదికి రూ.కోటి కంటే ఎక్కువ ప్యాకేజీలతో పని చేస్తున్నారు. అత్యున్నత నైపుణ్యం కలిగిన ప్రొఫెషనల్స్‌ను తయారు చేయగల ఎల్‌పీయూ శక్తి సామర్థ్యాలకు, అంతర్జాతీయ స్థాయి ఎదుగుదలకు ఇవి నిదర్శనాలు.’’ అని రాజ్యసభ సభ్యులు, ఎల్‌పీయూ ఫౌండర్‌ ఛాన్సలర్‌ డాక్టర్‌ అశోక్‌ కుమార్‌ మిట్టల్‌ వివరించారు.2025 బ్యాచ్‌ కోసం దరఖాస్తు చేసుకునేందుకు చివరితేదీ దగ్గరపడింది. ఎల్‌పీయూలో అడ్మిషన్లకు పోటీ ఎక్కువ. యూనివర్శిటీలో అడ్మిషన్‌ కోసం విద్యార్థులు ప్రవేశ పరీక్ష రాయాల్సి ఉంటుంది. అలాగే ‘ఎల్‌పీయూ నెస్ట్‌ 2025’, ఇంటర్వ్యూలలోనూ పాసైన వారికి మాత్రమే కొన్ని ప్రత్యేక కార్యక్రమాల్లోకి ప్రవేశం లభిస్తుంది. పరీక్ష, అడ్మిషన్‌ ప్రాసెస్‌ గురించి తెలుసుకోవాలనుకునే ఆసక్తిగల విద్యార్థులు https://bit.ly/43340ai ను సందర్శించగలరు.

He has got something different: Rohit Sharma on Varun Chakaravarthy5
వారిద్దరూ అద్భుతం.. కానీ అది మాకు తలనొప్పిగా మారింది: రోహిత్‌

ఛాంపియ‌న్స్ ట్రోఫీ 2025లో గ్రూపు స్టేజిని భార‌త్ ఆజేయంగా ముగించింది. దుబాయ్ వేదిక‌గా న్యూజిలాండ్‌తో జ‌రిగిన ఆఖ‌రి లీగ్ మ్యాచ్‌లో 44 ప‌రుగుల తేడాతో భార‌త్ ఘ‌న విజ‌యాన్ని అందుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది. భార‌త బ్యాట‌ర్ల‌లో శ్రేయస్‌ అయ్యర్‌ (98 బంతుల్లో 79; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీ సాధించగా... హార్దిక్‌ పాండ్యా (45 బంతుల్లో 45; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), అక్షర్‌ పటేల్‌ (61 బంతుల్లో 42; 3 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించారు.30 ప‌రుగుల‌కే మూడు వికెట్లు కోల్పోయిన భార‌త జ‌ట్టును అయ్య‌ర్‌, అక్ష‌ర్ త‌మ అద్భుత ఇన్నింగ్స్‌ల‌తో అదుకున్నారు. నాలుగో వికెట్‌కు వీరిద్ద‌రూ 98 పరుగులు జోడించారు. కివీస్‌ బౌలర్లలో మాట్‌ హెన్రీ (5/42) ఐదు వికెట్లతో భారత్‌ను దెబ్బ తీశాడు. అనంత‌రం ల‌క్ష్య చేధ‌న‌లో కివీస్ 205 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. భార‌త మిస్ట‌రీ స్పిన్న‌ర్ వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి 5 వికెట్ల‌తో కివీస్ ప‌తనాన్ని శాసించాడు.అత‌డితో పాటు కుల్దీప్ యాద‌వ్ రెండు, హార్దిక్‌, జ‌డేజా, అక్ష‌ర్ త‌లా వికెట్ సాధించారు. న్యూజిలాండ్ బ్యాట‌ర్ల‌లో కేన్ విలియ‌మ్స‌న్(81) టాప్ స్కోరర్ నిలిచాడు. కాగా భారత్ త‌మ తొలి సెమీఫైన‌ల్లో మంగ‌ళ‌వారం(మార్చి 4) ఆస్ట్రేలియాతో త‌ల‌ప‌డ‌నుంది. ఇక ఈ విజ‌యంపై మ్యాచ్ అనంత‌రం భార‌త కెప్టెన్ రోహిత్ శ‌ర్మ స్పందించాడు. సెమీస్‌కు ముందు ఇటువంటి విజయం సాధించ‌డం చాలా సంతోషంగా ఉంద‌ని రోహిత్ తెలిపాడు."ఈ మెగా టోర్నీ గ్రూపు స్టేజిని విజ‌యంతో ముగించాల‌ని భావించాము. మేము అనుకున్న‌ది జ‌రిగినందుకు చాలా అనందంగా ఉంది. న్యూజిలాండ్ జ‌ట్టు ఇటీవ‌ల కాలంలో మెరుగైన ప్రదర్శన చేస్తోంది. అటువంటి జ‌ట్టును ఓడించాలంటే మ‌న ప్ర‌ణాళిక‌లను స‌రిగ్గా అమ‌లు చేయాలి. ప‌వ‌ర్ ప్లేలో 30 ప‌రుగుల‌కే మూడు వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డ్డాము.ఆ స‌మ‌యంలో శ్రేయ‌స్ అయ్య‌ర్‌, అక్ష‌ర్ ప‌టేల్ అద్బుత‌మైన భాగ‌స్వామ్యం నెల‌కొల్పారు. ఆఖ‌రిలో హార్దిక్ పాండ్యా కీల‌క ఇన్నింగ్స్ ఆడాడు. మా ద‌గ్గ‌ర క్వాలిటీ బౌల‌ర్లు ఉండ‌డంతో డిఫెండ్ చేసుకునే టోట‌ల్ ల‌భించంద‌ని భావించాము. అదే ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగాం. నిజంగా వ‌రుణ్ చక్ర‌వ‌ర్తి ఒక మిస్ట‌రీ స్పిన్న‌రే.అత‌డిని ఎవ‌రితోనూ పోల్చ‌లేం. తొలి రెండు మ్యాచ్‌ల‌కే బెంచ్‌కే ప‌రిమిత‌మైన అత‌డికి ఓ ఛాన్స్ ఇద్దామ‌ని ఈ మ్యాచ్‌లో ఆడించాము. అత‌డు బంతితో అద్భుతం చేశాడు. త‌దుప‌రి మ్యాచ్ కోసం మేము ప్ర‌స్తుతం ఆలోచించ‌డం లేదు. కానీ అతని అద్భుత ప్రదర్శనతో టీమ్ కాంబినేషన్ కొంచెం తలనొప్పిగా మారింది. ఈ టోర్నమెంట్‌లో ప్ర‌తీ మ్యాచ్‌ను గెల‌వాలని ల‌క్ష్యంగా పెట్టుకున్నాము. ఇటువంటి మెగా ఈవెంట్‌ల‌లో త‌ప్పులు జ‌ర‌గ‌డం స‌హ‌జం.కానీ త‌ప్పిదాల‌ను సరిదిద్దుకుని ముందుకు వెళ్ల‌డం చాలా ముఖ్యం. ఆసీస్‌తో సెమీస్ మంచి గేమ్ కానుంది. ఐసీసీ టోర్నీల్లో ఆస్ట్రేలియాకు మంచి ట్రాక్ రికార్డు ఉంది. ఈ మ్యాచ్ కోసం నేను అతృతగా ఎదురుచూస్తున్నాను. ఈ మ్యాచ్‌లో మేము అన్ని విభాగాల్లో మెరుగ్గా రాణించేందుకు ప్రయత్నిస్తాము" అని పోస్ట్ మ్యాచ్ ప్రేజెంటేషన్‌లో రోహిత్ శర్మ పేర్కొన్నాడు.చదవండి: Champions Trophy: భారత్‌తో సెమీఫైన‌ల్‌.. ఆసీస్ జ‌ట్టులోకి విధ్వంస‌క‌ర ఆట‌గాడు

Police Arrested Accused In Congress Himani Narwal Case6
కాంగ్రెస్‌ నేత హిమాని కేసులో బిగ్‌ ట్విస్ట్‌.. అతడే హంతకుడు?

ఢిల్లీ: కాంగ్రెస్‌ నేత హిమాని నర్వాల్‌ దారుణ హత్య హర్యానాలో తీవ్ర కలకలం సృష్టించింది. ఆమె హత్య కేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసులో తాజాగా ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిందితుడు ఢిల్లీకి చెందిన వ్యక్తి కాగా.. అతడు హిమానికి స్నేహితుడు అని తెలుస్తోంది. హర్యానాకు చెందిన కాంగ్రెస్‌ నేత హిమాని హత్య కేసులో సోమవారం ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. అతడి పేరును మాత్రం వెల్లడించలేదు. ఇక, పోలీసులు అతడి దగ్గర నుంచి హిమాని మొబైల్ ఫోన్, ఆభరణాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో నిందితుడిని పోలీసులు విచారిస్తున్నారు. విచారణలో భాగంగా హిమానికి స్నేహితుడి అని తెలిసింది. అత్యంత సన్నిహితుడిగా ఉన్నట్టు సమాచారం. హిమాని ఇంటికి దగ్గరలోనే నివాసం ఉంటున్నట్టు పోలీసులు తెలిపారు. హిమాని అతడిని బ్లాక్‌మెయిల్‌ చేసి డబ్బులు వసూలు చేసిందని ఆరోపణలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండగా.. హర్యానాలోని రోహతక్ జిల్లాలో శనివారం హిమాని నర్వాల్ దారుణ హత్యకు గురయ్యారు. ఆమెను హత్య చేసిన అనంతరం సూట్ కేసులో మూటగట్టి ఓ నిర్మానుష ప్రాంతంలో మృతదేహాన్ని పడేశారు దుండగులు. సంప్లా బస్టాండ్ దగ్గర సూట్ కేసులో హిమానీ నార్వాల్ మృతదేహం ఉండటంతో స్థానికంగా కలకలం రేగింది. ఆ బస్టాండ్ వద్ద సూట్ కేసు పడి ఉండటంతో తెరిచి చూడటంతో ఈ దారుణం వెలుగు చూసింది. గతంలో కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన జోడో యాత్రలో ఆమె చురుగ్గా పాల్గొన్నారు. ఆమె మెడపై గాయాలుండటం కూడా ఇదే హత్యేనని అనడానికి మరింత బలం చేకూర్చుతోంది.ఇక, హిమాని నర్వాల్ హత్యపై దర్యాప్తు చేయడానికి పోలీసులు ప్రత్యేక దర్యాప్తు టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. బాధితురాలి కుటుంబం ఢిల్లీలో ఉండగా, హిమాని నర్వాల్ హర్యానాలో ఒంటరిగా ఉంటుందని సాంప్లా డీఎస్పీ రజనీష్ కుమార్ తెలిపారు.#WATCH | Rohtak, Haryana: Visuals of the accused who is arrested in Congress worker Himani Narwal murder case. pic.twitter.com/zSvHIEIP7a— ANI (@ANI) March 3, 2025బాధితురాలి తల్లి ఆరోపణలుఅంతకుముందు, బాధితురాలి తల్లి సవిత సంచలన ఆరోపణలు చేసింది. రాజకీయాల్లో తన కూతురు ఎదుగుదలను తట్టుకోలేక పార్టీలోని కొందరు వ్యక్తులే తన కూతురిని హతమార్చి ఉండొచ్చంటూ ఆమె సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ కోసం తన కూతురు పదేళ్లుగా ఎన్నో త్యాగాలు చేశారని తెలిపారు. పార్టీలోని గొడవలు, వాగ్వాదాలపై కూతురు తనతో చెప్పేదన్నారు. తన కూతురికి న్యాయం జరిగే వరకు తాను ఆమె అంత్యక్రియలు చేయనని అన్నారు.

SLBC rescue operation continues On Mar 3rd live updates7
SLBC: సహాయక చర్యలు కొనసాగింపు.. కన్వేయర్‌ బెల్టు విస్తరణ

సాక్షి, నాగర్‌కర్నూల్‌: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో పదో రోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. టన్నెల్‌లో టీబీఎం మిషన్‌ కటింగ్‌ పనులు చివరి దశకు చేరుకున్నాయి. అలాగే, నేడు కన్వేయర్‌ బెల్టు పునరుద్దరణ చర్యలను అధికారులు చేపట్టారు. పిల్లర్‌ వేసి కన్వేయర్‌ బెల్టును విస్తరించనున్నారు. ఇక, టన్నెల్‌లో ఊరుతున్న నీటితో పనులకు ఆటంకం కలుగుతోంది.👉మరోవైపు.. టన్నెల్‌లో ఏడు మీటర్ల లోతు తవ్వినా కూడా కార్మికుల ఆచూకీ లభ్యం కావడం లేదు. జీపీఆర్‌ టెక్నాలజీ విఫలం కావడంతో గందరగోళం ఏర్పడుతోంది. పది రోజులుగా టన్నెల్‌లో ఉన్న వారి కోసం కుటుంబ సభ్యులు ఎదురుచూస్తున్నారు.👉ఇదిలా ఉండగా సీఎం రేవంత్ రెడ్డి ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ వద్దకు ఆదివారం సాయంత్రం వెళ్లారు. అక్కడ జరుగుతున్న సహాయక చర్యలను పరిశీలించారు. రెస్క్యూ ఆపరేషన్ ఎలా జరుగుతుందని ఆరా తీసి.. అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. సొరంగంలో చిక్కుకున్న వారిని బయటకు తీసుకువచ్చేందుకు అవసరమైతే రోబోల సాయం తీసుకోవాలని అధికారులకు సూచించారు. సొరంగంలో చిక్కుకున్న వాళ్లు ఎక్కడున్నారో.. బతికి ఉన్నారో లేదో అంచనాకు రాలేదన్న సీఎం.. మరో రెండు రోజుల్లో కొలిక్కి వచ్చే అవకాశం ఉందని వెల్లడించారు. ప్రకృత్తి విపత్తులు జరిగినప్పుడు.. అండగా నిలవాల్సిన విపక్షాలు రాజకీయ విమర్శలు చేయడం తగదన్నారు.👉సహాయక చర్యలు, తవ్వకాలకు నిరంతర నీటి ఊట అడ్డంకిగా మారుతోంది. పూడిక, కత్తిరించిన టీబీఎం భాగాలను తరలించడంలోనూ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కన్వేయర్‌ బెల్ట్‌ ఇప్పటికీ అందుబాటులోకి రాలేదు. షిఫ్ట్‌కు 120 మంది చొప్పున రోజుకు మూడు షిఫ్టుల్లో సహాయక బృందాలు పనిచేస్తున్నాయి. ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌, హైడ్రా, సింగరేణి రెస్క్యూ బృందాలు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాయి. సహాయక చర్యల్లో 18 ఏజెన్సీలు, 700 మందికి పైగా సిబ్బంది పాల్గొంటున్నారు.అనుమానిత ప్రాంతాలు తాజాగా గుర్తింపు👉ఎస్‌ఎల్‌బీసీ సొరంగం కుప్పకూలిన ఘటనలో గల్లంతైన కార్మికుల జాడ ఉన్నట్టుగా అనుమానిస్తున్న ఇతర ప్రాంతాలను.. గ్రౌండ్‌ పెనెట్రేటింగ్‌ రాడార్‌ (జీపీఆర్‌) టెక్నాలజీ సహాయంతో నేషనల్‌ జియోఫిజికల్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఎన్జీఆర్‌ఐ) తాజాగా గుర్తించింది. నలుగురు కార్మీకులు టన్నెల్‌ బోరింగ్‌ యంత్రం (టీబీఎం)కు వెనుక మట్టిదిబ్బల కింద కూరుకుపోయి ఉన్నట్టు అనుమానిస్తుండగా, మరో నలుగురు టీబీఎం ఉన్న ప్రాంతంలోనే శిథిలాల కింద ఉన్నారని అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. ఎన్‌జీఆర్‌ఐ ఇచ్చిన సమాచారం ఆధారంగా ఎన్డీఆర్‌ఎఫ్‌ నిపుణులు ఆదివారం ఊహా చిత్రం రూపొందించారు. దీని ఆధారంగా డయాగ్రామ్‌ను తయారు చేసి, దాని ఆధారంగా మూడు దశల్లో రెస్క్యూ ఆపరేషన్‌ నిర్వహించేందుకు వ్యూహం సిద్ధం అయ్యింది.

Volodymyr Zelensky Video post Over Donald Trump8
డీల్‌ ఓకే.. ట్రంప్‌తో మరోసారి భేటీకి సిద్ధమే: జెలెన్‌స్కీ

కీవ్‌: ఉక్రెయిన్‌కు యూరోపియన్‌ యూనియన్‌ నేతల నుంచి మద్దతు వస్తున్న వేళ అధ్యక్షుడు జెలెన్‌స్కీ మరో కీలక ప్రకటన చేశారు. అమెరికా అధ్యక్షుడు ఆహ్వానిస్తే మరోసారి భేటీకి వెళ్తానని జెలెన్‌స్కీ చెప్పుకొచ్చారు. అమెరికాతో డీల్‌కు తాను సిద్ధంగా ఉన్నట్టు చెప్పుకొచ్చారు. దీంతో, ఆయన ప్రకటనపై ట్రంప్‌ ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది.ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తాజాగా వీడియోలో మాట్లాడుతూ.. ‘అమెరికాతో మేము సత్సంబంధాలను కాపాడుకోగలం. తీవ్రమైన, నిజమైన సమస్యలను పరిష్కరించుకోవడానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో మరోసారి భేటీ అయ్యేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. నిర్మాణాత్మక సంభాషణ కోసం ఆహ్వానిస్తే తప్పకుండా ట్రంప్‌ను కలుస్తాను. అలాగే, ఖనిజాల ఒప్పందంపై సంతకం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇరువర్గాల మధ్య ఏకాభిప్రాయం కుదిరితే సంతకం చేస్తాను. ఇది భద్రతా హామీల వైపు మొదటి అడుగు అవుతుంది. భద్రతా హామీలు లేని కాల్పుల విరమణ ఉక్రెయిన్‌కు ప్రమాదకరం. మేము గత మూడు సంవత్సరాలుగా పోరాడుతున్నాము. అమెరికా మా వైపు ఉందని ఉక్రేనియన్ ప్రజలు తెలుసుకోవాలి. మాకు కావాల్సింది శాంతి. అంతులేని యుద్ధం కాదు. అందుకే భద్రతా హామీలు దీనికి కీలకమని మేము చెబుతున్నాం’ అంటూ కామెంట్స్‌ చేశారు.ఇటీవల డొనాల్డ్‌ ట్రంప్‌, జెలెన్‌స్కీ మధ్య వైట్‌హౌస్‌ వేదికగా జరిగిన చర్యల వాగ్వాదానికి దారి తీసిన విషయం తెలిసిందే. అమెరికా, ఉక్రెయిన్‌ మధ్య ఖనిజాల ఒప్పందం ముందుకు సాగలేదు. జెలెన్‌‍స్కీపై ట్రంప్‌ సంచలన ఆరోపణలు చేశారు. ఉక్రెయిన్‌ కారణంగా మూడో ప్రపంచ యుద్ధం వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు. రష్యాకు భూభాగాన్ని కోల్పోవడానికి ఉక్రెయిన్‌ సిద్ధంగా ఉండాలన్నారు. ఇకపై ఉక్రెయిన్‌కు సాయం చేసేది లేదని కుండబద్దలు కొట్టారు. As a result of these days, we see clear support from Europe. Even more unity, even more willingness to cooperate.Everyone is united on the main issue – for peace to be real, we need real security guarantees. And this is the position of all of Europe – the entire continent. The… pic.twitter.com/inGxdO8jQz— Volodymyr Zelenskyy / Володимир Зеленський (@ZelenskyyUa) March 3, 2025

AP Three MLC Election Results Live Updates9
AP: కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌

MLC Election Results Updates..👉మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో ఓట్ల లెక్కింపు ప్రకియ కొనసాగుతోంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లతో లెక్కింపు ప్రారంభం.👉ఏపీలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. ఏయూ ఇంజనీరింగ్‌ కాలేజీ, ఏలూరు సీఆర్‌ రెడ్డి కాలేజీ, గుంటూరు ఏసీ కాలేజీలోని కౌంటింగ్‌ కేంద్రాల్లో ఓట్లు లెక్కింపు జరుగుతోంది. 👉రాష్ట్రంలో గత నెల 27న జరిగిన మూడు ఎమ్మెల్సీ స్థానాలకు 70 మంది అభ్యర్థులు పోటీ పడిన విషయం తెలిసిందే. ఉమ్మడి ఉత్తరాంధ్ర జిల్లాల టీచర్ల నియోజక­వర్గం, ఉమ్మడి ఉభయ గోదావరి, ఉమ్మడి కృష్ణ–గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గాల ఎన్నికల కౌంటింగ్‌ జరగనుంది. ఈ మూడు స్థానా­లకు పోటీ అధికంగా ఉండడం, ప్రాధాన్యత ఓట్ల ఆధారంగా లెక్కించాల్సి ఉండటంతో తుది ఫలితాలు వెలువడటానికి సుదీర్ఘ సమ­యం పడుతుందని అధికారులు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగ­కుండా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. విశాఖ..ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు..ఎనిమిది గంటలకు లెక్కింపు ప్రారంభం.ఏయూ ఇంజనీరింగ్ కాలేజీలో లెక్కింపు..బరిలో పదిమంది అభ్యర్థులు.123 బ్యాలెట్ బాక్సులు.20 టేబుల్స్ సిద్ధం చేసిన అధికారులుమొత్తం ఓట్లు 20,493, పోలైన ఓట్లు 20,795.తొలి ప్రాధాన్యత ఓటుతో తేలితే సాయంత్రం 5 గంటలకు ఫలితం.లేదా రాత్రి 9 గంటల దాటే అవకాశం..లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసిన అధికారులు..కౌంటింగ్ కేంద్రం వద్ద మూడు అంచెల భద్రత వ్యవస్థ ఏర్పాటు..కౌంటింగ్ కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలు.విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదన్న అధికారులుగుంటూరు..ఉమ్మడి కృష్ణ- గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గం ఎన్నికల కౌంటింగ్గుంటూరు ఏసీ కాలేజీలో కౌంటింగ్ ప్రక్రియఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభం కానున్న కౌంటింగ్మొత్తం 29 టేబుల్ ఏర్పాటుమూడు షిఫ్ట్ లో కౌంటింగ్ ప్రక్రియకౌంటింగ్ ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులుఏలూరు జిల్లా..ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ఏలూరులోని సీఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో ఓట్ల లెక్కింపు.456 కేంద్రాల్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు వేసిన 2,18,902 మంది ఓటర్లుమూడు షిప్టుల్లో 700 మంది సిబ్బందితో ఓట్ల లెక్కింపు28 టేబుల్స్ ఏర్పాటు17 రౌండ్స్‌లో తేలనున్న ఫలితం.కౌంటింగ్ కోసం పటిష్ట బందోబస్తు ఏర్పాటు

Dwarka To Somnath Temple: Visit More Tourist Places10
అరబిక్‌ కడలి సౌందర్య వీక్షణం! ఆ తీరానే కృష్ణుడు, జాతిపిత, గోరీ..

ప్రకృతి మన తెలుగువాళ్లకు వెయ్యి కిలోమీటర్ల తీరాన్నిచ్చింది. గుజరాత్‌కి మాత్రం 16 వందల కిలోమీటర్ల తీరాన్నిచ్చింది. ఆ తీరమే ఆ రాష్ట్రానికి పెద్ద ఆదాయవనరుగా మారింది. ఆ అరేబియా తీరమే విదేశీ వర్తకానికి దారులు వేసింది. ఆ తీరానే శ్రీకృష్ణుడు... మన జాతిపిత గాంధీజీ పుట్టారు. సోమనాథుడు వెలిశాడు... గోరీ మనదేశం మీద దండెత్తాడు. ఆ తీరం పర్యాటకపరంగానూ ప్రాధాన్యం సంతరించుకుంది. ద్వారక నుంచి సోమనాథ్‌ వరకు ప్రయాణమే ఈ వారం పర్యాటకం.అదిగో ద్వారక...బేట్‌ ద్వారక... ఇది ద్వారక తీరం నుంచి కనిపించే దీవి. సముద్ర తీరాన విహరించడంతోపాటు సముద్రం మధ్యలో పడవలో పయనించడాన్ని కూడా ఆస్వాదించవచ్చు. కృష్ణుడి ద్వారకను చూసి ఆ నేల మీద నడిస్తే కలిగే పులకింతను మాటల్లో చెప్పలేం. పురాణకాలంలో కూడా ప్రజలు ద్వారక ప్రధాన పట్టణం నుంచి బేట్‌ ద్వారకకు పడవలో ప్రయాణం చేసినట్లు గ్రంథాల్లో ఉంది. చారిత్రక యుగంలో కూడా ద్వారక గురించి సింధు నాగరకత, హర΄్పా నాగరకత, మౌర్య సామ్రాజ్య రచనల్లో కనిపిస్తుంది. ఈ తీరం నుంచి రోమన్‌తో వర్తక వాణిజ్యాలు జరిగేవి. ఇక్కడి మ్యూజియాలలో ప్రశాంతంగా గడిపే సమయాన్ని దృష్టిలో పెట్టుకుని టూర్‌ ΄్లాన్‌ చేసుకోవాలి. ఓఖా– బేట్‌ ద్వారకలను కలిపే బ్రిడ్జి ‘సుదర్శన సేతు’ మీద ఆగి ఫొటో తీసుకోవడం మరిచిపోవద్దు.అంబానీ సొంతూరుచోర్‌వాడ్‌ బీచ్‌... ఇది సోమనాథ్‌కు 40కి.మీ.ల దూరంలో ఉంది. ఇక్కడ బీచ్‌ క్లీన్‌గా ఉంటుంది. సూర్యాస్తమయాన్ని ఆస్వాదించడానికి, చక్కటి ఫొటోలు తీసుకోవడానికి బాగుంటుంది. అరేబియా సముద్రం ఈతకు అనువైనదే. కానీ చోర్‌వాడ్‌ దగ్గర మాత్రం ఈత క్షేమం కాదు. ఇక్కడ బీచ్‌ విజిట్‌ పూర్తయిన తర్వాత దీరూబాయ్‌ అంబానీ ఇంటిని చూడడం మర్చిపోవద్దు. నిజమే... ఇది అంబానీల సొంతూరు. ఈ ప్రదేశానికి చోర్‌వాడ్‌ అనే పేరు ఎందుకు వచ్చిందా అనే సందేహం తొలుస్తూనే ఉందా? అరేబియా తీరం నుంచి విదేశీ వ్యాపారం విరివిగా జరిగేది. సముద్రంలో ఓడల్లో సరుకుల రవాణా జరుగుతోందంటే అసంకల్పిత చర్యగా ఆ సరుకును దొంగలించే దొంగలు కూడా సిద్ధమై ΄ోతారు. ఆ సముద్రపు దొంగలు నివాసం ఏర్పరుచుకున్న ప్రదేశం ఇది. దొంగల నివాస ప్రదేశం అనే అర్థంలోనే పేరు స్థిరపడి΄ోయింది. రుక్మిణి కల్యాణంమాధవ్‌పూర్‌ బీచ్‌... ఇది పోర్‌బందర్‌ నుంచి వెరావల్‌కు వెళ్లే హైవే మీద ఉంటుంది. సముద్ర తీరాన హైవే ఉంటుంది. కాబట్టి రోడ్డు మీద ప్రయాణిస్తూ అరేబియా సముద్రపు నీటి నీలం గాఢతను చూడవచ్చు. ఆకాశానికి– సముద్రానికి మధ్య రేఖ ఎక్కడో తెలుసుకోవడం ఓ పెద్ద పజిల్‌. అన్నట్లు ఇక్కడ తాబేళ్ల సంతానోత్పత్తి కేంద్రం ఉంది.స్థానికులను అడిగితే దారి చూపిస్తారు. పోర్‌బందర్‌ వరకు కొబ్బరి నీరు దొరకవు. కానీ మాధవ్‌పూర్‌ నుంచి సముద్ర తీరాన కొబ్బరి బోండాలు కనిపిస్తాయి. సముద్ర తీరాన కామెల్‌ రైడ్‌ ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ. పెద్ద వాళ్లు మొహమాట పడకుండా ఒంటె విహారాన్ని ఆస్వాదించాలి. రుక్మిణీదేవిని శ్రీకృష్ణుడు తీసుకుని వెళ్లిన ప్రదేశం ఇదేనని చెబుతారు. ఇక్కడ ఓషో ఆశ్రమం కూడా ఉంది.ఓఖా– మాధీ బీచ్‌...ఇది ద్వారక వెళ్లే దారిలో వస్తుంది. హైవే మీద వాహనాన్ని ఆపుకుని దిగి ΄ావు కిలోమీటరు నడిస్తే ΄ాదాలు సముద్రపు నీటిలో ఉంటాయి. ఇక్కడ వర్తక వాణిజ్యాలేవీ జరగవు. కాబట్టి నీరు స్వచ్ఛంగా ఉంటుంది. ఇతర ప్రమాదాలు కూడా ఏవీ జరగవు. కాబట్టి సముద్రంలో స్నానం, స్విమ్మింగ్‌ సరదా తీరుతుంది. ఇక్కడ జనం రద్దీ తక్కువ. కాబట్టి ఏకాంతపు పర్యటనకు ఇది మంచి ప్రదేశం. సూర్యాస్తమయాన్ని వీక్షించడంతో΄ాటు రాత్రి బస ΄్లాన్‌ చేసుకోవడానికి అనువైన ప్రదేశం.కృష్ణుడికి బాణం దెబ్బవెరావల్‌ బీచ్‌... ఇది సోమనాథ్‌కు నాలుగుకిలోమీటర్ల దూరాన ఉంది. ఇది శ్రీకృష్ణుడు ప్రణత్యాగం చేసిన ప్రదేశం. కృష్ణుడు ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో జర అనే వేటగాడు జింక కాలుగా భావించి బాణం వేశాడని, కృష్ణుడు గాయపడి ప్రణత్యాగం చేశాడని చెబుతారు. ఈ ప్రదేశం భాల్క తీర్థంతో సందర్శన స్థలంగా అభివృద్ధి చెందింది. ఈ సంఘటన క్రీ. పూర్వం 3102, ఫిబ్రవరి 17 లేదా 18వ తేదీగా భావిస్తారు. కృష్ణుడి మరణంతో ద్వాపర యుగం అంతమైందని, మరుక్షణం నుంచి కలియుగం ప్రారంభమైందని చెబుతారు. వెరావల్‌ తీరంలో ప్రాచీన కాలం నుంచి వర్తక వాణిజ్యం జరిగేది.సౌరాష్ట్ర కశ్మీరంమహువా బీచ్‌... ప్రశాంతతకు మారు పేరు ఈ ప్రదేశం. ఏడాదంతా చల్లగా ఉంటుంది. ఒక్కమాటలో చెప్పాలంటే కేరళలో ఉన్నామా అనిపిస్తుంది. కొబ్బరిచెట్లు విస్తారంగా ఉంటాయి. ఈత చెట్లు కూడా. రెండు– మూడు గంటల కోసం వెళ్లడం కంటే రాత్రి బస ఇక్కడే ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది. ఇక్కడ సముద్ర తీరాన భవానీ మాత ఆలయం ఉండడంతో స్థానికులు భవానీ బీచ్‌ అంటారు.మన పర్షియా ఉద్వాద బీచ్‌... ఇది భారత భూభాగమే కానీ ఇక్కడ పర్యటిస్తుంటే పర్షియా సామ్రాజ్యంలో ఉన్నట్లు అనిపిస్తుంది. మనదేశంలో జొరాస్ట్రియన్‌ మత వికాసానికి నిదర్శనం. ఇక్కడి ఇళ్లన్నీ ్ర΄ాచీన పర్షియన్‌ నిర్మాణశైలిలో ఉంటాయి. మరమత్తులు చేసేటప్పుడు వాటి నిర్మాణ ప్రత్యేకతను కోల్పోనివ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. ఆలయం కూడా ప్రపంచంలో ఉన్న ఎనిమిది ప్రముఖ జొరాస్ట్రియా ఆలయాల్లో ఒకటి. ఆలయాల్లో అగ్నిమంట చల్లారనివ్వకుండా కాపాడుకోవడం వారి క్రతువుల్లో ప్రధానం. విజయాగ్ని ఆరని ఆలయాల జాబితాలో ఇక్కడ ఉన్న ఆటాశ్‌ మెహ్రామ్‌ కూడా ఒకటిగా చెప్పుకుంటారు. ప్రాచీన వారసత్వాన్ని పరిరక్షించుకోవడంలో వారు చూపిస్తున్న శ్రద్ధ కనిపిస్తుంది. అందుకే ఇది వరల్డ్‌ హెరిటేజ్‌ సైట్‌ జాబితాలో చేరింది.గాంధీజీ పుట్టాడుచౌపాటీ బీచ్‌... ఇది పోర్‌బందర్‌లోని అరేబియా తీరం. ΄ోర్‌బందర్‌ అంటే మన జాతిపిత గాంధీజీ పుట్టిన ఊరు. అంతకంటే ముందు పౌరాణిక కథనాలను చూస్తే ఇది శ్రీకృష్ణుడి స్నేహితుడు సుధాముడు పుట్టిన ప్రదేశం కూడా. గాంధీజీ ఇంటితోపాటు సుధాముడి ఆలయాన్ని కూడా చూడవచ్చు. ఈ ఆలయంలో అటుకులను ప్రసాదంగా ఇస్తారు. పోర్‌బందర్‌ జిల్లాకేంద్రమే, కానీ పట్టణంలో పెద్ద హడావుడి ఉండదు. తీర ప్రాంతం మాత్రం అభివృద్ధికి చిరునామాగా కనిపిస్తుంది. పోర్టు ఉండడంతో దాని అనుబంధ పరిశ్రమలు కూడా ఉంటాయి. ఖండాంతరాల నుంచి వచ్చిన ఫ్లెమింగోలు కూడా వేసవిలో ఇక్కడ సేదదీరుతుంటాయి. వాటి కోలాహలాన్ని కూడా ఆస్వాదించవచ్చు.జ్ఞాపకాలు దండిదండి సత్యాగ్రహం గురించి చిన్నప్పుడు చదువుకున్నాం. గాంధీజీ 1930లో ఉప్పు సత్యాగ్రహం మొదలు పెట్టింది ఇక్కడి నుంచే. అహ్మదాబాద్‌లోని సబర్మతి ఆశ్రమం నుంచి దండుగా బయలుదేరి ఈ ప్రదేశంలో సముద్రపు నీటిని సేకరించి మరిగించి ఉప్పు తయారు చేశాడు. ఆ సంఘటనకు చిహ్నంగా ఇక్కడ గాంధీజీ ఉప్పు రాశి పోస్తున్న విగ్రహం ఉంటుంది. ఈ తీరంలో విహరించడంతో΄ాటు దండి సత్యాగ్రహం సమయంలో గాంధీజీ బస చేసిన సైఫీ బంగ్లాను కూడా చూసి ఒక ఫొటో తీసుకోవచ్చు.గాయపడిన ఆలయంసోమనాథ్‌ బీచ్‌... ద్వాదశ జ్యోతిర్లింగాల్లో మొదటిది సోమనాథ్‌ జ్యోతిర్లింగం. ఈ ప్రదేశం విదేశీ దాడులకు ముఖద్వారం అని చెప్పవచ్చు. మహమ్మద్‌ గోరీ అనేకసార్లు మనదేశం మీద దాడులు చేశాడు. అరేబియా సముద్రం మీద వచ్చి ఈ తీరం నుంచే భారత భూభాగంలోకి అడుగుపెట్టేవాడు. ఆలయ సంపద దోపిడీతోపాటు ఈ ఆలయాన్ని ధ్వంసం చేయడం వంటివన్నీ చరిత్రపుటల్లో దాక్కున్నాయి. ఈ ఆలయం ఎన్నిసార్లు పునర్నిర్మాణం చేసుకుందో తెలియాలంటే చరిత్ర పుస్తకాలు చదవాల్సిందే. ఇప్పుడు మనం చూస్తున్న మారు– గుర్జర శైలి నిర్మాణం నిర్మాణం స్వాతంత్య్రం వచ్చిన తర్వాత గాంధీజీ అనుమతితో సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ చేసిన ప్రయత్నం. అందుకే ఆయన గౌరవార్థం ఆలయ ప్రాంగణంలో వల్లభాయ్‌ పటేల్‌ విగ్రçహాన్ని ప్రతిష్ఠించారు.అరేబియా సముద్రం చిరు అలలతో మంద్రమైన సవ్వడితో ఆలరిస్తుంది. కానీ ఇక్కడ మాత్రం కొంత అలజడిగా ఉంటుంది. అలలు వేగంగా వచ్చి ఆలయ గోడలను తాకుతుంటాయి.మన పర్షియా ఉద్వాద బీచ్‌... ఇది భారత భూభాగమే కానీ ఇక్కడ పర్యటిస్తుంటే పర్షియా సామ్రాజ్యంలో ఉన్నట్లు అనిపిస్తుంది. మనదేశంలో జొరాస్ట్రియన్‌ మత వికాసానికి నిదర్శనం. ఇక్కడి ఇళ్లన్నీ ప్రాచీన పర్షియన్‌ నిర్మాణశైలిలో ఉంటాయి. మరమత్తులు చేసేటప్పుడు వాటి నిర్మాణ ప్రత్యేకతను కోల్పోనివ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. ఆలయం కూడా ప్రపంచంలో ఉన్న ఎనిమిది ప్రముఖ జొరాస్ట్రియా ఆలయాల్లో ఒకటి. ఆలయాల్లో అగ్నిమంట చల్లారనివ్వకుండా కాపాడుకోవడం వారి క్రతువుల్లో ప్రధానం. విజయాగ్ని ఆరని ఆలయాల జాబితాలో ఇక్కడ ఉన్న ఆటాశ్‌ మెహ్రామ్‌ కూడా ఒకటిగా చెప్పుకుంటారు. ప్రాచీన వారసత్వాన్ని పరిరక్షించుకోవడంలో వారు చూపిస్తున్న శ్రద్ధ కనిపిస్తుంది. అందుకే ఇది వరల్డ్‌ హెరిటేజ్‌ సైట్‌ జాబితాలో చేరింది. (చదవండి: యమ రిచ్‌ దొంగ..! మూడు ఫ్లాట్లు భార్యకు, గర్ల్‌ఫ్రెండ్‌కు..!)

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

NRI View all
title
వలస కార్మికుల మృత్యు ఘోష

మోర్తాడ్‌ (బాల్కొండ): జగిత్యాల జిల్లా మల్లాపూర్‌ మండలం రేగుంటకు చెందిన కర్న గణేశ్‌ (55) రెండ్రోజుల కిందట సౌదీ అరేబియాలో

title
వీసా గోల్డెన్‌ చాన్సేనా?

గోల్డ్‌ కార్డ్‌ వీసా.. ప్రపంచవ్యాప్తంగా కొత్త చర్చకు దారితీసిన టాపిక్‌ ఇది.

title
తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) ఆధ్వర్యంలో శివాలయాల సందర్శన యాత్ర

తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) వారు గత మూడేళ్లుగా నిర్వహిస్తున్న మహా శివరాత్రి శివాలయాల సందర్శన యాత్రను  ఈ మహా శ

title
అమెరికా నుంచి భారత్‌కి అందుకే వచ్చేశా! సీఈవో హార్ట్‌ టచింగ్‌ రీజన్‌

మెరుగైన అవకాశాలు, ఆర్థిక భద్రత కోసం చాలామంది భారతీయులు విదేశాల బాటపడుతుంటార

title
USA: ‘కోమా’లో భారత విద్యార్థి.. ఎమర్జెన్సీ వీసాకు లైన్‌ క్లియర్‌

వాషింగ్టన్‌:  ఫిబ్రవ

Advertisement

వీడియోలు

Advertisement