Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Wall Collapse Simhachalam Temple Incident Updates1
సింహాచలం అప్పన్న సన్నిధిలో అపశ్రుతి.. ఏడుగురు భక్తులు మృతి

సాక్షి, విశాఖపట్నం: సింహాచలం చందనోత్సవంలో ఘోర అపశ్రు‍తి చోటుచేసుకుంది. గోడ కుప్పకూలి ఏడుగురు మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు. రూ.300 టికెట్‌ కౌంటర్‌ వద్ధ ఈ ప్రమాదం జరిగింది. ఇటీవలే అక్కడ గోడ నిర్మించారు. గోడ నాసిరకంగా నిర్మించడం వలనే కూలిపోయిందని అధికారులు భావిస్తున్నారు. తెల్లవారుజామున 2-3 గంటల మధ్య రూ.300 క్యూ లైన్‌లో ప్రమాదం జరిగింది. మృతుల్లో ముగ్గురిని అధికారులు గుర్తించారు. యడ్ల వెంకటరావు(48),దుర్గా స్వామినాయుడు(32), మణికంఠ(28)గా గుర్తించారు. మృతదేహాలను కేజీహెచ్‌కు తరలించారు.👉కేజీహెచ్ మార్చురి వద్ద విషాద ఛాయలుకేజీహెచ్ మార్చురి వద్దకు చేరుకుంటున్న మృతుల కుటుంబ సభ్యులుకన్నీరు మున్నీరవుతున్న కుటుంబ సభ్యులు...దైవదర్శనానికి వెళ్లి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారంటూ ఆవేదన👉సింహాచలం ఘటనపై వీహెచ్‌పీ ఆగ్రహంసింహాచలం సరైన రీతిలో ప్రభుత్వం చర్యలు చేపట్టలేదునిర్మాణ లోపం వల్లే ప్రమాదం జరిగిందిసింహాచలంలో పాలన కాదు.. లాబీయింగ్‌ నడుస్తోందిఎండోమెంట్‌ వ్యవస్థ ఓ చెత్తభగవంతుడికి భక్తులకు దూరం చేయడమే వారిపనిహిందువుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయిపాలకుల కబంధ హస్తాల నుంచి ఎండోమెంట్‌ వ్యవస్థ బయటకు వస్తేనే భక్తులకు మంచి జరుగుతోందిచందనోత్సవంలో ఒక ప్రణాళిక లేదు.. ఓ ప్లాన్‌ లేదు👉తిరుపతి తొక్కిసలాట ఘటన మరవకముందే..ఘటనపై సమగ్ర విచారణ చేసి.. మృతుల కుటుంబాలను ఆదుకోవాలని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి డిమాండ్ చేశారు. తిరుపతి తొక్కిసలాట ఘటన మరవకముందే సింహాచలంలో ఇలాంటి ఘటన జరగడం బాధాకరమని ఆమె అన్నారు. మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం ఇవ్వాలి. అన్యాయంగా ఏడుగురు చనిపోయారు. ప్రభుత్వం సరైన చర్యలు చేపట్టకపోవడం వల్లనే ప్రమాదం జరిగిందని వరుదు కల్యాణి అన్నారు.👉వైఎస్‌ జగన్‌ దిగ్భ్రాంతివిశాఖ జిల్లా సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవంలో గోడ కుప్పకూలి భక్తులు మృతి చెందడంపై మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చందనోత్సవం సందర్భంగా రూ. 300 టికెట్‌ క్యూలైన్‌ పై గోడ కుప్పకూలి భక్తులు మృత్యువాత పడటంపై తీవ్రవిచారం వ్యక్తం చేశారు. స్వామివారి నిజరూప దర్శనానికి వచ్చిన భక్తులు ఇటువంటి దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమన్నారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని, మరణించిన భక్తుల కుటుంబాలను ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.👉సింహాచలం ఘటనపై తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర విచారంగోడ కూలి భక్తులు మరణించిన ఘటన తీవ్ర ఆవేదనను కలిగించిందివారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి ఆంధ్ర ప్రదేశ్ లోని సింహాచలం ఆలయం వద్ద గోడ కూలి భక్తులు మరణించిన ఘటనతీవ్ర ఆవేదనను కలిగించింది. వారి కుటుంబ సభ్యులకునా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ…మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని…భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.— Revanth Reddy (@revanth_anumula) April 30, 2025

Chandrababu Govt Negligence In Simhachalam Appanna Chandanotsavam2
తిరుపతి తొక్కిసలాట ఘటన మరవకముందే..

సాక్షి, విశాఖపట్నం: తిరుపతి తొక్కిసలాట ఘటన మరవకముందే.. సింహాచలంలో మరో ఘోర విషాదం జరిగింది. సింహాచలం అప్పన చందనోత్సవంలో ప్రభుత్వం నిర్లక్ష్యం ఫలితంగా.. గోడకూలి ఏడుగురు మృతిచెందారు. ఘటన జరిగిన సమయంలో ఒక్క పోలీసు కూడా కనిపించలేదు.. భక్తులను ఆదుకోవడానికి ఒక్క ఎండోమెంట్‌ ఉద్యోగి కూడా అక్కడ లేరు. అందుబాటులో ఉన్న వాలంటీర్లు, భక్తులు మాత్రమే సహాయక చర్యలు చేపట్టారు. కటిక చీకటిలో భక్తుల కోసం క్యూలైన్‌లు ఏర్పాటు చేయడంతో అంతా అంధకారం అలుముకుంది. గోడ కూలిపోవడంతో భక్తుల అరుపులు, రోదనలు మిన్నంటాయి. అప్పటికే భక్తుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.ఈ ఘటనపై సమగ్ర విచారణ చేసి.. మృతుల కుటుంబాలను ఆదుకోవాలని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి డిమాండ్‌ చేశారు. మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం ఇవ్వాలన్నారు. అన్యాయంగా ఏడుగురు చనిపోయారు. ఘటనపై పూర్తి వివరాలు అధికారులను అడిగి తెలుసుకుంటున్నాం. సరైన చర్యలు చేపట్టకపోవడం వల్లనే ప్రమాదం జరిగిందని వరుదు కల్యాణి అన్నారు. కటిక చీకట్లో భక్తుల కోసం క్యూలైన్లా?. తిరుపతి తొక్కిసలాట ఘటన మరవకముందే. ఈ ఘటన ప్రభుత్వ వైఫల్యాన్ని బయటపెడుతోందని ఆమె అన్నారు.మరోవైపు, సింహాచలం ఘటనపై వీహెచ్‌పీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సింహాచలం సరైన రీతిలో ప్రభుత్వం చర్యలు చేపట్టలేదని.. నిర్మాణ లోపం వల్లే ప్రమాదం జరిగిందని మండిపడింది.సింహాచలంలో పాలన కాదు.. లాబీయింగ్‌ నడుస్తోంది. ఎండోమెంట్‌ వ్యవస్థ ఓ చెత్త.. భగవంతుడికి భక్తులకు దూరం చేయడమే వారిపని.. హిందువుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.. పాలకుల కబంధ హస్తాల నుంచి ఎండోమెంట్‌ వ్యవస్థ బయటకు వస్తేనే భక్తులకు మంచి జరుగుతోంది.. చందనోత్సవంలో ఒక ప్రణాళిక లేదు.. ఓ ప్లాన్‌ లేదు’’ అంటూ వీహెచ్‌పీ ఆగ్రహం వ్యక్తం చేసింది.

YS Jagan Expresses Shock Over Tragic Deaths of Devotees at Simhachalam Temple in Visakhapatnam3
Vishakha: సింహాచలం ఘటనపై వైఎస్ జగన్‌ దిగ్భ్రాంతి

విశాఖ,సాక్షి : విశాఖ జిల్లా సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవంలో ఘోర విషాదం చోటు చేసుకుంది. గోడ కుప్పకూలి ఏడుగురు భక్తులు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. ఈ విషాదంపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. చందనోత్సవం సందర్భంగా రూ. 300 టికెట్‌ క్యూలైన్‌ పై గోడ కుప్పకూలి భక్తులు మృత్యువాత పడటంపై తీవ్రవిచారం వ్యక్తం చేశారు. స్వామివారి నిజరూప దర్శనానికి వచ్చిన భక్తులు ఇటువంటి దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమన్నారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని, మరణించిన భక్తుల కుటుంబాలను ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.

IPL 2025 Playoff Race Getting Excited4
IPL 2025: రసవత్తరంగా సాగుతున్న ప్లే ఆఫ్స్‌ రేసు.. ఏ క్షణంలో ఏమైనా జరగవచ్చు..!

ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో ప్లే ఆఫ్స్‌ రేసు రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటివరకు ఏ జట్టుకు అధికారికంగా ప్లే ఆఫ్స్‌ బెర్త్‌ ఖరారు కాలేదు. ఏ జట్టు అధికారికంగా రేసు నుంచి నిష్క్రమించలేదు. ఈ రేసులో ఆర్సీబీ అన్ని జట్ల కంటే కాస్త ముందుంది.ఆ జట్టు ఇప్పటివరకు (ఏప్రిల్‌ 29) ఆడిన 10 మ్యాచ్‌ల్లో 7 విజయాలు సాధించి టేబుల్‌ టాపర్‌గా కొనసాగుతోంది. పేరుకు ఆర్సీబీ టేబుల్‌ టాపర్‌గా ఉన్నా.. ఆ జట్టు కూడా ప్లే ఆఫ్స్‌ బెర్త్‌ కోసం మిగిలిన తొమ్మిది జట్లతో పోటీపడాల్సిందే.ప్రస్తుతం​ ప్లే ఆఫ్స్‌ రేసులో ఆర్సీబీ సహా మరో ఆరు జట్లు ముందు వరుసలో ఉన్నాయి. సీజన్‌ ప్రారంభంలో వరుస పరాజయాలతో సతమతమైన ముంబై ఇండియన్స్‌ ఆతర్వాత అనూహ్య విజయాలతో ప్లే ఆఫ్స్‌ రేసులో రెండో స్థానానికి దూసుకొచ్చింది. ఇప్పటివరకు ఆ జట్టు ఆడిన 10 మ్యాచ్‌ల్లో 6 విజయాలు సాధించి, ఆర్సీబీ తర్వాత పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది.ప్రస్తుతం ముంబై ఇండియన్స్‌, గుజరాత్‌ టైటాన్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ తలో 12 పాయింట్లతో ప్లే ఆఫ్స్‌ బెర్త్‌ కోసం హోరాహోరీగా పోరాడుతున్నాయి. గుజరాత్‌ 9 మ్యాచ్‌ల్లో 6 విజయాలతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉండగా.. ఢిల్లీ పదింట ఆరు విజయాలతో నాలుగో స్థానంలో ఉంది.ప్లే ఆఫ్స్‌ బెర్త్‌ కోసం ఈ నాలుగు జట్లతో పాటు మరో రెండు జట్లు కూడా ప్రధానంగా పోటీపడుతున్నాయి. పంజాబ్‌ ఆడిన 9 మ్యాచ్‌ల్లో 5 విజయాలతో పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది. కేకేఆర్‌తో జరగాల్సిన మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దు కావడంతో పంజాబ్‌కు ఓ పాయింట్ (మరో పాయింట్‌ కేకేఆర్‌కు) లభించింది. ప్లే ఆఫ్స్‌ రేసులో చివరికి ఈ ఒక్క పాయింట్‌ చాలా కీలకంగా మారే అవకాశం ఉంది.పై ఏడు జట్లతో పాటు ప్లే ఆఫ్స్‌ రేసులో ప్రధానంగా ఉన్న మరో రెండు జట్లు లక్నో, కేకేఆర్‌. లక్నో ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్‌ల్లో 5 విజయాలు సాధించి, పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంది. ఈ జట్టు ఖాతాలో 10 పాయింట్లు ఉన్నాయి. లక్నో ప్లే ఆఫ్స్‌ రేసులో నిలవాలంటే రన్‌రేట్‌ను భారీగా మెరుగుపర్చుకోవాలి. ప్రస్తుతం పోటీలో ఉన్న ఏడు జట్లలో ఈ ఒక్క జట్టు రన్‌రేట్‌ మాత్రమే మైనస్‌లో (-0.325) ఉంది.నిన్న ఢిల్లీపై అనూహ్య విజయంతో కేకేఆర్‌ కూడా ప్లే ఆఫ్స్‌ రేసులోకి వచ్చింది. ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్‌ల్లో 4 విజయాలతో పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉంది. పంజాబ్‌తో మ్యాచ్‌ రద్దు కావడంతో లభించిన పాయింట్‌తో కేకేఆర్‌ పాయింట్ల సంఖ్య 9కి చేరింది. ప్రస్తుతానికి పైన పేర్కొన్న ఏడు జట్ల మధ్య నాలుగు ప్లే ఆఫ్స్‌ బెర్త్‌ల కోసం ప్రధానంగా పోటీ జరుగుతుంది. అయితే పాయింట్ల పట్టికలో చివరి మూడు స్థానాల్లో ఉన్న రాజస్థాన్‌, సన్‌రైజర్స్‌, సీఎస్‌కే అవకాశాలను కూడా కొట్టి పారేయడానికి వీల్లేదు.రాజస్థాన్‌ తాజాగా గుజరాత్‌ టైటాన్స్‌పై సంచలన విజయం సాధించి ప్లే ఆఫ్స్‌ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్‌ల్లో 3 విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో (6 పాయింట్లు) ఉంది.ప్లే ఆఫ్స్‌ అవకాశాలను సజీవంగా ఉంచుకున్న మరో జట్టు సన్‌రైజర్స్‌. ఈ జట్టు ఇప్పటివరకు ఆడిన 9 మ్యాచ్‌ల్లో 3 విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో ఉంది. రాజస్థాన్‌తో పోలిస్తే సన్‌రైజర్స్‌కు ప్లే ఆఫ్స్‌ బెర్త్‌ సాధించే అవకాశాలు కాస్త మెరుగ్గా ఉన్నాయి. ఇప్పటివరకు రాజస్థాన్‌ 10 మ్యాచ్‌లు ఆడగా.. సన్‌రైజర్స్‌ తొమ్మిదే ఆడింది. ఈ సీజన్‌లో అధికారికంగా ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి నిష్క్రమించకపోయినా , ఏ మాత్రం అవకాశం లేని ఏకైక జట్టు సీఎస్‌కే . సీఎస్‌కే ఇప్పటివరకు ఆడిన 9 మ్యాచ్‌ల్లో రెండే విజయాలతో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. ఆ జట్టు తదుపరి ఆడాల్సిన 5 మ్యాచ్‌ల్లో గెలిచినా, ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ప్లే ఆఫ్స్‌ రేసులో ఉండదు.

kow the places where gold cheaper than india5
తక్కువ ధరకే బంగారం కావాలా!

అక్షయ తృతీయ కారణంగా ఈరోజు చాలామంది బంగారం కొనేందుకు షాపుల ముందు బారులు తీరుతున్నారు. దేశంలో పసిడి ధరలు దాదాపు తులం రూ.లక్షకు చేరువయ్యాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా భారీగా పెరుగుతున్న బంగారం ధర త్వరలో తులం రూ.ఒక లక్షకు చేరుతుందని కొందరు అంచనా వేస్తున్నారు. అయితే ప్రపంచంలోని కొన్ని దేశాల్లో భారత్‌ కంటే తక్కువ ధరకే బంగారం లభిస్తుంది. వాటి వివరాలు కింద తెలుసుకుందాం.దుబాయ్, యుఏఈఈ దేశం ‘బంగారు నగరం’గా ప్రసిద్ధి చెందింది. బంగారంపై తక్కువ పన్నులు ఉండడంతో ఇక్కడ అత్యంత సరసమైన ధరలకే పసిడి లభిస్తుంది. ఇక్కడ బంగారం సాధారణంగా భారతదేశం కంటే 10-15 శాతం చౌకగా ఉంటుంది. యూఏఈలో బంగారంపై విలువ ఆధారిత పన్ను(వ్యాట్‌) లేకపోవడం గమనార్హం. దీనికితోడు దిగుమతి సుంకాలు తక్కువగా ఉండడంతో సరసమైన ధరలకు బంగారాన్ని కొనుగోలు చేయాలనుకునే భారతీయులు ఈ దేశాన్ని అన్వేశిస్తున్నారు.థాయ్‌లాండ్‌ఇక్కడ బ్యాంకాక్, పట్టాయా బంగారం కొనుగోలుకు ప్రసిద్ధ ప్రదేశాలు. తక్కువ మేకింగ్ ఛార్జీలు, పన్నుల కారణంగా భారత్‌తో పోలిస్తే ఈ దేశం తక్కువ ధరకే బంగారు ఆభరణాలను అందిస్తోంది. సాధారణంగా థాయ్‌లాండ్‌లో బంగారం భారత్ కంటే 5-10 శాతం చౌకగా ఉంటుంది. ఆ దేశంలో తక్కువ తయారీ ఖర్చులు, బంగారంపై స్వల్పంగా పన్నులు విధిస్తున్నారు. భారత్‌తో పోలిస్తే సాపేక్షంగా తక్కువ మేకింగ్ ఛార్జీలతో బంగారు ఆభరణాలు లభిస్తాయి.సింగపూర్తక్కువ పన్నులు, బంగారం ధరల్లో పోటీ కారణంగా గోల్డ్‌ షాపింగ్‌కు సింగపూర్ కీలక గమ్యస్థానంగా ఉంది. నాణ్యమైన బంగారాన్ని విక్రయించడంలో ఈ దేశానికి మంచి పేరు ఉంది. ఇక్కడ ధరలు భారతదేశం కంటే 5-8 శాతం చౌకగా ఉంటాయి. ఈ దేశంలో గ్రేడ్ బంగారంపై జీఎస్టీ లేదు. దాంతో చౌకగా లభిస్తుంది.మలేషియాకౌలాలంపూర్‌లో సరసమైన బంగారం ధరలు ఉన్నాయి. తక్కువ తయారీ ఛార్జీలు, పన్నుల కోసం చూస్తున్న భారతీయ కొనుగోలుదారులను ఆకర్షిస్తున్నాయి. ఈ దేశంలో పోటీ ధరలను అందించే అనేక దుకాణాలు ఉన్నాయి. మలేషియాలో బంగారం భారతదేశం కంటే 5-10 శాతం చౌకగా ఉంటుంది. బంగారంపూ తక్కువ పన్నులు, మేకింగ్ ఛార్జీలను అందిస్తున్నారు.ఇదీ చదవండి: భారత్‌లో ఫాక్స్‌కాన్‌ ఆదాయం రూ.1.7 లక్షల కోట్లుహాంగ్ కాంగ్హాంగ్ కాంగ్ బంగారం, విలువైన లోహాలపై పన్ను మినహిస్తుంది. దాంతో తక్కువ ధరలకు లభిస్తాయి. ఈ దేశం బంగారం ట్రేడింగ్‌కు ప్రధాన కేంద్రంగా ఉంది. పోటీ ధరల కారణంగా చాలా మంది భారతీయులు ఇక్కడ బంగారాన్ని కొనుగోలు చేస్తారు. హాంకాంగ్‌లో బంగారం సాధారణంగా భారతదేశం కంటే 5-10 శాతం చౌకగా ఉంటుంది.

Ajith Credits Wife Shalini For His Success6
నాదేం లేదు.. దీనంతటికీ కారణం నా భార్య: స్టార్ హీరో

తమిళ హీరోల్లో అజిత్ కాస్త డిఫరెంట్. సినిమాలు చేసి ప్రేక్షకుల్ని అలరించడం తప్పితే మిగతా విషయాల్లో పెద్దగా తలదూర్చడు. తన పనేదో తాను అన్నట్లు ఉంటాడు. కారే రేసింగ్ లో ఈ మధ్య కాలంలో రఫ్ఫాడిస్తున్నాడనే చెప్పాలి. ఈసారి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పద్మభూషణ్ ఇతడిని వరించింది. తాజాగా ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి చేతుల మీదుగా అజిత్ ఈ పురస్కారం అందుకున్నాడు.(ఇదీ చదవండి: 'కోర్ట్'ని మించిపోయేలా ఉంటుంది.. ఓటీటీ డేట్ ఫిక్స్) ఈ క్రమంలోనే కుటుంబంతో కలిసి ఢిల్లీ వెళ్లిన అజిత్.. పద్మ భూషణ్ పురస్కారాన్ని అందుకున్నాడు. అయితే తను ఇలా ఉండటానికి భార్యనే కారణం అని చెబుతూ మొత్తం క్రెడిట్ ఆమెకే ఇచ్చేశాడు. తాజాగా ఓ ఇంగ్లీష్ వెబ్ సైట్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశాడు.'ఇప్పటికీ సామాన్యుడిలానే ఆలోచిస్తాను. ఇంత ఎత్తు ఎదిగానా అని ఒక్కోసారి ఆశ్చర్యం వేస్తుంటుంది. దీనంతటికీ నా భార్య షాలినినే కారణం. ఎందుకంటే నా కోసం చాలా త్యాగాలు చేసింది. ప్రతిదానిలో నాకు తోడుంది. ఒక్కోసారి కరెక్ట్ నిర్ణయాలు తీసుకోలేకపోయాను. ఆ టైంలోనూ షాలిని నాకు అండగా నిలిచింది తప్పితే నిరుత్సాహపరచలేదు'(ఇదీ చదవండి: ‍థియేటర్, ఓటీటీలో బ్లాక్ బస్టర్.. ఇప్పుడు సీక్వెల్!)'నా జీవితంలో సాధించిన సక్సెస్ క్రెడిట్ అంతా షాలినికే ఇస్తాను. నటిగా ఎంతో గుర్తింపు ఉన్నప్పటికీ నాకోసం అన్నింటినీ వదులుకుంది. ఆమెకు చాలామంది అభిమానులున్నారు. వాళ్లకు నా థ్యాంక్స్. నేను కేవలం యాక్టర్ నే. సూపర్ స్టార్ అని పిలిపించుకోవడం నచ్చదు. అలాంటి ట్యాగ్స్ పై నాకు నమ్మకం లేదు' అని అజిత్ చెప్పుకొచ్చాడు.తమిళ హీరోగా ‍అజిత్ చాలా ఫేమస్. హీరోయిన్ గా కలిసి పనిచేసిన షాలిని.. 2000లో ఇతడిని పెళ్లిచేసుకుంది. అప్పటినుంచి సినిమాలు, నటనకు దూరమైంది. ఈ జంటకు కొడుకు-కూతురు ఉన్నారు.(ఇదీ చదవండి: ‍అల్లు అర్జున్ కోసం ఫ్లాపుల హీరోయిన్?)

Akshaya Tritiya 2025: Spiritual Significance Story History7
అక్షయ ఫలాలనిచ్చే అక్షయ తృతీయ..!

వైశాఖ శుద్ధ తదియ lనే అక్షయ తృతీయగా జరుపుకుంటారు. ఈ రోజునే సింహాచల వరాహ నరసింహ స్వామి వారి చందనోత్సవం కూడా జరుగుతుంది. స్వామి వారు భక్తులకు నిజరూప దర్శనం ఇస్తారు. అక్షయ తృతీయ ప్రాముఖ్యతలు చాలా ఉన్నాయి. అందులో కొన్ని చూద్దాం1. పరశురాముని జన్మదినం.2. పవిత్ర గంగా నది భూమిని తాకిన పర్వదినం.3. త్రేతాయుగం మొదలైన దినం.4. శ్రీకృష్ణుడు తన బాల్యమిత్రుడైన కుచేలుని కలుసుకొన్న దినం.5. వ్యాస మహర్షి “మహా భారతము”ను, వినాయకుని సహాయముతో , వ్రాయడం మొదలుపెట్టిన దినం.6. సూర్య భగవానుడు అజ్ఞాతవాసములో వున్న పాండవులకు “అక్షయ పాత్ర” ఇచ్చిన దినం.7. శివుని ప్రార్థించి కుబేరుడు శ్రీమహాలక్ష్మితో సమస్త సంపదలకు సంరక్షకునిగా నియమింపబడిన దినం.8. ఆదిశంకరులు “కనకధారాస్తవం” ను చెప్పిన దినం.9. అన్నపూర్ణా దేవి తన అవతారాన్ని స్వీకరించిన దినం.10. ద్రౌపదిని శ్రీకృష్ణుడు దుశ్శాసనుని బారినుండి కాపాడిన దినం.అక్షయ తృతీయ నాడు మనం చేపట్టిన ఏ కార్య ఫలమైనా , (అది పుణ్యం కావచ్చు , లేదా పాపం కావచ్చు) అక్షయంగా , నిరంతరం , జన్మలతో సంబంధం లేకుండా , మన వెంట వస్తూనే ఉంటుంది. పుణ్య కర్మలన్నీ విహితమైనవే. అందునా ఆ రోజు ఓ కొత్త కుండలో గానీ , కూజాలో గానీ , మంచి నీరు పోసి , దాహార్తులకు శ్రధ్ధతో సమర్పిస్తే, ఎన్ని జన్మలలోనూ, మన జీవుడికి దాహంతో గొంతు ఎండి పోయే పరిస్థితి రాదు. అతిథులకు , అభ్యాగతులకు , పెరుగన్నంతో కూడిన భోజనం సమర్పిస్తే , ఏ రోజూ ఆకలితో మనం అలమటించవలసిన రోజు రాదు. వస్త్రదానం వల్ల తదనుగుణ ఫలితం లభిస్తుంది. అర్హులకు స్వయంపాకం , దక్షిణ , తాంబూలాదులు సమర్పించుకుంటే , మన ఉత్తర జన్మలలో, వాటికి లోటు రాదు. గొడుగులు , చెప్పులు , విసన కర్రల లాటివి దానం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఆ రోజు నిషిధ్ధ కర్మల జోలికి వెళ్ళక పోవడం ఎంతో శ్రేయస్కరం. అక్షయ తృతీయ అదృష్టాన్ని, విజయాన్ని చేకూర్చుతుంది అని పౌరాణిక ఉదంతాలు కొన్ని చెబుతున్నాయి.బంగారానికీ అక్షయ తృతీయకీ సంబంధం ఏమిటి ?మన సంస్కృతిలో ప్రతి పండుగ వెనుకా ఓ కారణం కనిపిస్తుంది. కాకపోతే ఒక్కోసారి ఆ కారణాన్ని మర్చిపోయి , ఆచరణకే ప్రాధాన్యతని ఇస్తూ ఉంటాము. అందుకు ఉదాహరణే అక్షయ తృతీయ. అక్షయ తృతీయ రోజున బంగారం కొనితీరాల్సిందే అన్న స్థాయిలో ఇప్పుడు ఆలోచిస్తున్నారు. నిజంగా అక్షయ తృతీయ రోజు బంగారం కొనాల్సిందేనా ! అసలు బంగారానికీ అక్షయ తృతీయకీ సంబంధం ఏమిటి ?అక్షయ తృతీయ రోజున బంగారం కొనితీరాలని ఏ శాస్త్రంలోనూ లేదు. కాకపోతే ఈ రోజున ఏ కార్యాన్ని తలపెట్టినా నిర్విఘ్నంగా సాగుతుందని , ఏ పుణ్య కర్మని ఆచరించినా కూడా దాని ఫలితాలు అక్షయంగా లభిస్తాయని పురాణాలు పేర్కొంటున్నాయి. అందుకనే అక్షయ తృతీయ రోజున తప్పకుండా దానధర్మాలు చేయాలని చెబుతారు. ముఖ్యంగా ఎండలు విపరీతంగా ఉండే ఈ కాలంలో ఉదకుంభదానం పేరుతో నీటితో నింపిన కుండను దానం ఇవ్వమని పెద్దలు సూచిస్తూ ఉంటారు.అక్షయ తృతీయనాడు విష్ణుమూర్తిని పూజించాలని మత్స్య పురాణం పేర్కొంటోంది. విష్ణుమూర్తి పాదాలను అక్షతలతో అర్చించి , ఆ అక్షతలను దానం చేస్తే విశేషమైన ఫలితం వస్తుందని చెబుతోంది. జపం, హోమం, వ్రతం, పుణ్యం , దానం... ఇలా అక్షయ తృతీయ నాడు చేసే ప్రతి పనీ అనంతమైన ఫలితాన్నిస్తుందని మాత్రమే మతగ్రంథాలు పేర్కొంటున్నాయి. అక్షయ తృతీయనాడు వివాహం చేసుకుంటే ఆ బంధం చిరకాలం నిలుస్తుందనీ, జాతకరీత్యా వివాహబంధంలో ఎలాంటి దోషాలు ఉన్నా తొలగిపోతాయని నమ్ముతారు.అక్షయ తృతీయ రోజున ఏ పని చేసినా అక్షయమైన ఫలితం దక్కుతుంది కాబట్టి , ఈ రోజున బంగారాన్ని కొనుగోలు చేస్తే... మన సంపదలు కూడా అక్షయం అవుతాయన్న నమ్మకం మొదలైంది. అయితే కష్టపడో , అప్పుచేసో , తప్పు చేసో సంపదను కొనుగోలు చేస్తే మన కష్టాలు , అప్పులు , పాపాలు కూడా అక్షయంగా మారే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు పెద్దలు.అక్షయ తృతీయ రోజున వర్జ్యం , రాహుకాలంతో పనిలేదు''వైశాఖ శుక్ల పక్షోతు తృతీయ రోసిణి యుతాదుర్లభా బుధచారేణ సోమనాపి ఉతా తథా''మత్స్య పురాణంలో 65వ అధ్యాయం ప్రకారం ఈశ్వరుడు పార్వతీదేవికి అక్షయ తృతీయ వ్రతం గూర్చి చెప్పాడు. వైశాఖ శుద్ధ తదియ రోజున చేసే ఏ వ్రతమైనా , జపమైనా , దానాలు ఏవైనా సరే అక్షయమౌతుంది.పుణ్యకార్యాచరణతో వచ్చే ఫలితం అక్షయమైనట్లే , పాపకార్యాచరణతో వచ్చే పాపం అక్షయమే అవుతుంది. అక్షయ తృతీయ రోజున ఉపవాస దీక్ష చేసి ఏ పుణ్య కర్మనాచరించినా అక్షయముగా ఫలము లభిస్తుంది. అక్షయుడైన విష్ణువును పూజిస్తున్నందునే దీనికి అక్షయ తృతీయ అని పేరు వచ్చింది. ఈ రోజున ఏ శుభకార్యాన్నైనా వారం, వర్జ్యం, రాహుకాలం వగైరాలతో నిమిత్తం లేకుండా జరుపుకోవచ్చునని పండితులు చెప్తున్నారు. ఇందులో పిల్లలను పాఠశాలలో చేర్చడం, పుస్తకావిష్కరణ, పుణ్యస్థలాలను సందర్శించడం మంచి కార్యాలను చేయవచ్చునని పురోహితులు అంటున్నారు.ఇంకా గృహ నిర్మాణం , ఇంటిస్థలం కొనడం , బావి తవ్వడం వంటి పలు శుభకార్యాలను ప్రారంభించడం ద్వారా మంచి ఫలితాలు చేకూరుతాయని విశ్వాసం. అలాగే అక్షయ తృతీయనాడు శ్రీ నరసింహస్వామి ప్రహ్లాదుడిని అనుగ్రహించిన రోజేనని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ పర్వదినాన పుష్పమో , ఫలమో భగవంతుడికి సమర్పించినా , దైవనామస్మరణ చేసినా , చివరికి నమస్కారం చేసినా సంపద , పుణ్యఫలం ప్రాప్తిస్తుందని ప్రతీతి.- డీ వీ ఆర్(చదవండి:

Fire Breaks Out at Hotel in Central Kolkata8
Kolkata: హోటల్‌లో ఘోర అగ్ని ప్రమాదం.. 14 మంది సజీవ దహనం

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రం కోల్‌కతాలో ఘోర విషాదం చోటు చేసుకుంది. బుర్రాబజార్‌ ఏరియా ఫల్పట్టి మచ్చువా అనే పండ్ల మార్కెట్‌ సమీపంలో ఉన్న హోటల్‌ రుతురాజ్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 14 మంది సజీవ దహనమయ్యారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద మరణాల్ని కోల్‌కతా సీపీ మనోజ్‌ కుమార్‌ వర్మ అధికారికంగా ప్రకటించారు. ఈ ఘటన మంగళవారం రాత్రి 8:15 గంటలకు జరిగినట్లు సమాచారం. VIDEO | Kolkata hotel fire: Police Commissioner Manoj Verma says, "A fire incident was reported at Ritu Raj Hotel in Mechuapatti area at about 8:15 am on Tuesday evening. At least 15 casualties have been reported so far and several people were rescued from rooms and roof of the… pic.twitter.com/8YkIfq6oSe— Press Trust of India (@PTI_News) April 30, 2025ఈ దుర్ఘటనపై సీపీ మనోజ్‌ కుమార్‌ మాట్లాడారు.‘ అగ్ని ప్రమాదంలో సజీవ దహనమైన పద్నాలుగు మృతదేహాలను వెలికితీశాం. గాయపడిన బాధితులను మెరుగైన వైద్యం కోసం ఆస్పత్రికి తరలించాం. మంటలు అదుపులోకి వచ్చాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి’ అని అన్నారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. దీనిపై సమగ్ర దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాల్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రాణాలతో బయటపడిన పలువురు ప్రమాదంపై మాట్లాడారు. ముందుగా హోటల్ కారిడార్లలో దట్టమైన పొగకమ్ముకుంది. ఆ తర్వాత కరెంట్‌ పోయిందని చెప్పారు. హోటల్‌లో ఉన్న పలువురు ప్రాణాల్ని రక్షించుకునేందుకు హోటల్‌ కిటికీలను పగలగొట్టి బయటపడేందుకు ప్రయత్నించారు. మరి కొంతమంది ప్రమాదం నుంచి బయటపడే దారిలేక అలాగే గదుల్లోనే ఉండిపోయారు. అగ్ని ప్రమాదంపై సమాచారం అందుకు సిబ్బంది వారిని రక్షించేందుకు ప్రయత్నించినట్లు వెల్లడించారు.

BJP top leadership selects Paka Satyanarayana for Rajya Sabha seat9
ఢిల్లీలో పారని బాబు పాచిక!

సాక్షి, అమరావతి : బీజేపీ రాజ్యసభ అభ్యర్థిత్వం ఖరారులో ముఖ్యమంత్రి చంద్రబాబు నడిపిన మంత్రాంగం పని చేయలేదు. ఆయన్ను పట్టించుకోకుండా పార్టీకి చెందిన ముఖ్య నేత పాకా సత్యనారాయణను బీజేపీ అగ్ర నాయకత్వం ఎంపిక చేసింది. విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానాన్ని బీజేపీ తన ఖాతాలో వేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ స్థానాన్ని బీజేపీలో తనకు అనుకూలంగా ఉండే వారికి ఇప్పించుకోవడానికి చంద్రబాబు తెర వెనుక శాయశక్తులా ప్రయత్నించినట్లు తెలిసింది. ఇటీవల రెండుసార్లు ఢిల్లీ వెళ్లినప్పుడు కూడా ఈ విషయం గురించి ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌షాతో మాట్లాడినట్లు సమాచారం. కానీ వారు చంద్రబాబు సూచనను పరిగణనలోకి తీసుకోలేదని తెలుస్తోంది. ఆయన ఒక నాయకుడి పేరు చెప్పి ఆయనకు ఇస్తే కూటమికి ఉపయోగం ఉంటుందని తన మాయజాలంతో బీజేపీ పెద్దలను ఒప్పించేందుకు యత్నించారు. ఆ వ్యక్తికే అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయించేందుకు బీజేపీలోని తన మనుషులతో గట్టి లాబీయింగ్‌ కూడా చేయించారు. బీజేపీలో ఉంటూ చంద్రబాబు కోసం పనిచేసే నేతలు అటు ఢిల్లీలో, ఇటు రాష్ట్రంలో చాలా మంది ఉన్నారు. ముఖ్యమైన స్థానాల్లో ఉన్న వారంతా చంద్రబాబు సూచించిన వ్యక్తికి సీటు ఇప్పించేందుకు గట్టిగా ప్రయత్నించారు. కానీ బీజేపీ పెద్దలు మాత్రం అవేమీ పట్టించుకోకపోవడం విశేషం.రకరకాల ప్రచారాలు..ఎత్తులుతాను సూచించిన అభ్యర్థికి రాజ్యసభ అభ్యర్థిత్వం వచ్చే అవకాశం లేదని తెలిశాక, మొదటి నుంచి బీజేపీలోనే ఉంటూ ఇప్పుడు రేసులో ఉన్న నాయకుల్లో తనకు అనుకూలంగా ఉండే ఒక నేతను చంద్రబాబు ప్రోత్సహించినట్లు తెలిసింది. ఒక దశలో ఈ సీటును తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా పనిచేసిన అన్నామలైకి ఇస్తారనే ప్రచారం జరిగింది. కానీ బీజేపీ అనూహ్యంగా భీమవరానికి చెందిన ఆ పార్టీ సీనియర్‌ నేత పాకా సత్యనారాయణను ఎంపిక చేసింది. ఈ పేరు ఖరారైన తర్వాతే ఆయన గురించి అందరికీ తెలిసింది. నిజానికి ఒరిజినల్‌ బీజేపీకి చెందిన నేతలు చాలా మంది మాత్రం ఆయనకు అవకాశం ఉంటుందని భావించారు. కొద్ది రోజుల క్రితం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లోనే ఆయన పేరు బలంగా వినిపించింది. కానీ ఆ సీటును సోము వీర్రాజుకు కేటాయించారు. దీంతో ఇప్పుడు పాకా సత్యనారాయణకు రాజ్యసభ అవకాశం దక్కింది. ఈయనతో పాటు ప్రస్తుత కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, సోము వీర్రాజు వంటి వారంతా సు­దీర్ఘకాలం నుంచి బీజేపీలో ఉంటూ ఆ పార్టీ కోసం క్రమశిక్షణతో పని చేస్తున్న వారుగా పేరుంది. చంద్రబాబుకు షాకే!చంద్రబాబు బీజేపీతో పొత్తు ఉన్నప్పుడు, లేనప్పుడు కూడా తనకు అనుకూలంగా ఉండే వారిని విడతల వారీగా బీజేపీలోకి పంపారు. ప్రస్తుత ఎమ్మెల్యేలు సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్, ఆదినారాయణరెడ్డి, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్‌ వంటి చాలా మంది చంద్రబాబు అనుయాయులే. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరి చంద్రబాబుకు స్వయానా వదిన. ఈ నేపథ్యంలో ఏపీ బీజేపీలో సగం మంది చంద్రబాబు వర్గానికి చెందిన వారే కనిస్తారు. తద్వారా బీజేపీకి కేటాయించిన ఏ పదవినైనా తన వర్గంలోని ఎవరో ఒకరికి ఇప్పించేందుకు చంద్రబాబు ప్రయత్నిసూ్తనే ఉన్నారు. చాలా సందర్భాల్లో ఆయన మనుషులకే పదవులు కూడా దక్కాయి. కానీ కొద్ది కాలంగా బీజేపీ బాబు వ్యవహారాన్ని గమనించి సొంత నిర్ణయాలు తీసుకుంటోంది. ఫలితంగా శ్రీనివాసవర్మకు కేంద్ర మంత్రి పదవి, సోము వీర్రాజుకు ఎమ్మెల్సీ, ఇప్పుడు పాకా సత్యనారాయణకు రాజ్యసభ పదవులు దక్కాయి. ఈ నిర్ణయాలు ఒకరకంగా చంద్రబాబుకు షాక్‌లేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Liberal Party Mark Carney wins election in Canada10
లిబరల్‌ పార్టీ విజయం

టొరంటో: కెనడా సార్వత్రిక ఎన్నికల్లో ప్రధానమంత్రి మార్క్‌ కార్నీ సారథ్యంలోని అధికార లిబరల్‌ పార్టీ అనూహ్యంగా విజయం సాధించింది. జస్టిన్‌ ట్రూడో హయాంలో ప్రజాదరణ కోల్పోయిన అధికార పార్టీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆక్రమణ హెచ్చరికలు, ఆ దేశంతో వాణిజ్య యుద్ధం వంటివి కలిసొచ్చాయి. దీనికి తోడు ఆర్థిక నిపుణుడిగా పేరున్న కార్నీ అమెరికాకు వ్యతిరేకంగా కెనడా ప్రజలను ఏకం చేయడంలో విజయం సాధించారు. అధికార పార్టీ అనుకూల పవనాలను ప్రతిపక్ష కన్జర్వేటివ్‌ పార్టీ గట్టిగా ఎదుర్కొనలేక రెండోస్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.ట్రంప్‌ మాదిరిగా కెనడా ఫస్ట్‌ అంటూ ఆ పార్టీ నేత పియెర్రె తీసుకువచ్చిన నినాదాన్ని జనం నమ్మలేదు. మొన్నమొన్నటిదాకా ప్రజాదరణలో ముందుండి, కెనడా తదుపరి ప్రధాని, ఫైర్‌బ్రాండ్‌ అంటూ ప్రచారం జరిగిన పియెర్రె స్వయంగా ఒట్టావా నియోజకవర్గంలో ఓటమి చవిచూశారు. పార్లమెంట్‌లోని మొత్తం 343 స్థానాలకు గాను కన్జర్వేటివ్‌ల కంటే లిబరల్స్‌కే అత్యధికంగా దక్కుతాయనే అంచనాలున్నాయి. ఫలితాలు వెలువడే సమయానికి లిబరల్‌ పార్టీకి చెందిన అభ్యర్థులు 168 సీట్లలో గెలుపు/ఆధిక్యం సాధించారు. మెజారిటీ మార్కు 172కు మరో నాలుగు సీట్ల దూరంలో ఆ పార్టీ నిలిచింది. ఒకవేళ 168 సీట్లకే పరిమితమైన పక్షంలో అధికారంలో కొనసాగాలన్నా, చట్టాలు చేయాలన్నా ఏదో ఒక చిన్న పార్టీని కలుపుకుని వెళ్లాల్సి ఉంటుంది. కెనడా ఆక్రమణ ట్రంప్‌ తరంకాదు: మార్క్‌ కార్నీ లిబరల్‌ పార్టీ నేతలు, కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయారు. ఈ సందర్భంగా ప్రధాని మార్క్‌ కార్నీ విజయోత్సవ ప్రసంగం చేశారు అమెరికా నుంచి ముప్పు ఎదురవుతున్న తరుణంలో కెనడా ప్రజలంతా ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. కెనడా–అమెరికాలు పరస్పరం సహకరించుకుంటూ ప్రయోజనం పొందే విధానం రెండో ప్రపంచ యుద్ధం నుంచి అమలవుతోందని గుర్తుచేశారు. అది ఇటీవలే ముగిసిందని అన్నారు. అమెరికా తమను దగా చేసిందని మండిపడ్డారు.అమెరికా తీరుపట్ల దిగ్భ్రాంతికి గురైనప్పటికీ ఆ పాఠాలు ఎప్పటికీ మర్చిపోలేమని వ్యాఖ్యానించారు. కొన్ని నెలలుగా హెచ్చరికలు వస్తున్నాయని, మన భూమి, మన వనరులు, మన నీరు, మన దేశాన్ని ఆక్రమించుకుంటామని కొందరు బెదిరిస్తున్నారని ఆరోపించారు. కెనడాను విచి్ఛన్నం చేసి, సొంతం చేసుకోవాలన్నదే అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ పన్నాగమని ధ్వజమెత్తారు. అది ఎప్పటికీ సాధ్యం కాదన్న సంగతి తెలుసుకోవాలని హితవు పలికారు. అయితే, ప్రపంచం మారుతోందన్న నిజాన్ని మనం గుర్తించాలని కెనడా పౌరులకు మార్క్‌ కార్నీ సూచించారు. సార్వత్రిక ఎన్నికల్లో లిబరల్‌ పార్టీ విజయం సాధించడంతో ఆయన మరోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. కెనడాతో బంధం బలోపేతం చేసుకుంటాం: మోదీ కెనడా ఎన్నికల్లో లిబరల్‌ పార్టీ విజయం సొంతం చేసుకున్న నేపథ్యంలో ప్రధానమంత్రి మార్క్‌ కార్నీకి భారత ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం అభినందనలు తెలియజేశారు. కెనడాతో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలన్నదే తమ లక్ష్యమని ఉద్ఘాటించారు. రెండు దేశాల పౌరులకు ఎన్నో అవకాశాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఈ మేరకు మోదీ సోషల్‌ మీడియాలో పోస్టుచేశారు. ప్రజాస్వామ్య విలువలు, చట్టబద్ధ పాలనలకు ఇరుదేశాలూ కట్టుబడి ఉన్నాయని పేర్కొన్నారు. సత్తా చాటిన భారత సంతతి అభ్యర్థులుకెనడా ఎన్నికల్లో పలువురు భారత సంతతి అభ్యర్థులు సత్తా చాటారు. లిబరల్, కన్జర్వేటివ్‌ పార్టీల నుంచి రికార్డు స్థాయిలో 22 మంది అభ్యర్థులు విజయం సాధించడం గమనార్హం. ప్రస్తుతం కెనడా పార్లమెంట్‌ దిగువ సభలో 17 మంది భారత సంతతి ఎంపీలున్నారు. ఈ సంఖ్య 22కు చేరుకుంది. పంజాబ్‌ నుంచి వలసవెళ్లిన కుటుంబంలో జన్మించిన సుఖ్‌ దలీవాల్‌(లిబరల్‌) ఆరోసారి నెగ్గడం విశేషం. బర్నాబై సెంట్రల్‌ స్థానం నుంచి పోటీ చేసిన న్యూ డెమొక్రటిక్‌ పార్టీ(ఎన్‌డీపీ) నేత జగ్మీత్‌సింత్‌(46) పరాజయం పాలయ్యారు. 18.1 శాతం ఓట్లతో మూడోస్థానంలో నిలిచారు. ఇక్కడ లిబరల్‌ పార్టీ అభ్యర్థి వేడ్‌ చాంగ్‌ గెలిచారు. కెనడా జనాభాలో 3 శాతానికిపైగా భారత సంతతి ప్రజలు ఉన్నారు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement