Top Stories
ప్రధాన వార్తలు

మా జీవితాలతో చెలగాటం.. వాయిదాపై వంచన
సాక్షి, అమరావతి: అర్ధరాత్రి వరకు ఆందోళనలు.. అడ్డగింతలు.. అరెస్టులు.. తరలింపులు.. తీవ్ర ఉత్కంఠ మధ్య ప్రభుత్వం ఏపీపీఎస్సీ గ్రూప్–2 మెయిన్స్ పరీక్ష నిర్వహించి తమ జీవితాలతో ఆడుకుందని రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థులు మండిపడ్డారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌లు తమను నమ్మించి నిండా ముంచారని, తమ జీవితాలతో చెలగాటం ఆడారని నిప్పులు చెరిగారు. ప్రభుత్వ తీరుతో తీవ్ర మనస్థాపానికి గురయ్యామని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వమే ఇంత గందరగోళం సృష్టించిందని, ఇంత టెన్షన్ ఎప్పుడూ పడలేదని ధ్వజమెత్తారు. రోస్టర్ విధానంలో తప్పులున్నాయని తొలుత చెప్పిందే టీడీపీ అని, అలాంటప్పుడు అది సరిచేయకుండా ఎలా పరీక్ష నిర్వహిస్తారని నిలదీశారు. పరీక్ష వాయిదా వేయడం వల్ల ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏమిటని ప్రశ్నించారు. ప్రభుత్వ వైఖరి వల్లే తమ సమయం వృథా అయిందని, ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే దోబూచులాట మధ్య పరీక్ష నిర్వహించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఉదయం పరీక్ష ఉందనగా, శుక్రవారం రాత్రి వాయిదాకు అనుకూలంగా మానవ వనరుల శాఖ మంత్రి లోకేశ్ ట్వీట్ చేసి ఆశలు రేపారని.. ఇప్పుడింత గందరగోళం జరుగుతుంటే ఆయన మాత్రం ఫ్యామిలీతో కలిసి దుబాయ్‌లో ఇండియా–పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ చూస్తూ కూర్చున్నారని విరుచుకుపడ్డారు. తమను ఇంత దగా చేసిన కూటమి సర్కారును ఊరికే వదిలి పెట్టం అని.. ‘బాయ్‌కాట్ ఎమ్మెల్సీ ఎలక్షన్’ కాదు.. ‘ఎన్నికల్లో పాల్గొందాం.. కూటమికి గట్టిగా బుద్ధి చెబుదాం’ నినాదంతో తమ సత్తా చాటుతామని శపథం చేశారు. కూటమి ప్రభుత్వం నిరుద్యోగులను ఏ విధంగా ముంచిందో కళ్లారా చూశామని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాము కూడా తమ శక్తి ఏపాటిదో చూపిస్తామని లక్షలాది మంది గ్రాడ్యుయేట్స్ స్పష్టం చేస్తున్నారు. ఇంతటి గందరగోళం సృష్టించి ఎన్నికల్లో లబ్ధి పొందాలనుకోవడం దుర్మార్గమని కోపంతో రగిలిపోయారు. పచ్చి దగా.. దుర్మార్గం ‘పరీక్ష వాయిదా పడుతుందని సాక్షాత్తు విద్యా శాఖ మంత్రి ట్వీట్ చేసినప్పుడు నమ్మకుండా ఎలా ఉంటాం? పరీక్షపై సమీక్షిస్తున్నాం అంటూ ప్రభుత్వం గందరగోళం సృష్టించింది. శనివారం అర్ధరాత్రి అయోమయమే. ఎటూ పాలుపోని పరిస్థితి. టెన్షన్‌తో రాత్రంతా నిద్రపోలేదు. ఈ గందరగోళంలేకుండా ఉండివుంటే పరీక్ష ఇంకా బాగా రాసి ఉండేదాన్ని’ అని తిరుపతికి చెందిన సౌజన్య ఆవేదన వ్యక్తం చేసింది. ‘రోస్టర్ విధానంలో తప్పులున్నాయని ప్రభుత్వంలోని పెద్దలు చెప్పినా, దీన్ని సవరించకుండా పరీక్ష నిర్వహించడమేంటి? రేపు న్యాయపరమైన చిక్కులతో పరీక్ష రద్దయితే.. మా కష్టమంతా వృథానే కదా? ఇంత గందరగోళం మధ్య పరీక్ష నిర్వహించడం దుర్మార్గం కాదా?’ అని అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన హరి ఆగ్రహం వ్యక్తం చేశాడు. అసలు పరీక్ష వాయిదా వేయడం వల్ల ప్రభుత్వానికి వచ్చే నష్టమేంటని శ్రీకాకుళంకు చెందిన గణేష్ ప్రశ్నించాడు. పరీక్ష జరుగుతుందో లేదో ముందు రోజు రాత్రి వరకు తేల్చకపోతే ఎలా అంటూ కడపకు చెందిన మూల బిందు మాధవి నిలదీసింది. ఇది చంద్రబాబు మార్కు రాజకీయం ‘ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యా శాఖా మంత్రి నారా లోకేశ్‌ల ప్రకటనల వల్ల పరీక్ష వాయిదా పడుతుందని భావించాను. చివరి నిమిషం వరకు స్పష్టత లేకపోవడంతో తీవ్రంగా ఆందోళన చెందాను. పరీక్షకు బాగా ప్రిపేర్ అయినప్పటికీ తీవ్రంగా కలత చెందాను. పరీక్షను సరిగా రాయలేకపోయాను. ఇది చంద్రబాబు మార్కు రాజకీయం’ అంటూ విజయవాడకు చెందిన కె.కాంతారావు మండిపడ్డాడు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవడం కోసం 92 వేల మందిని మోసం చేశారని నంద్యాలకు చెందిన హుస్సేన్ బాషా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరూ ఏమి చేసుకోలేరనే అభిప్రాయంతోనే ప్రభుత్వ పెద్దలు ఇలా మా జీవితాలతో ఆడుకున్నారన్నారు. ఇంత టెన్షన్ ఎన్నడూ పడలేదన్నారు. ప్రభుత్వం, ఏపీపీఎస్సీ కలిసి ఆడిన డ్రామా అని నిప్పులు చెరిగారు. అంతా టెన్షన్.. టెన్షన్.. ⇒ పరీక్షకు కొన్ని గంటల ముందు వరకు అభ్యర్థుల భవితవ్యంతో ప్రభుత్వం ఆటలాడింది. పరీక్ష వాయిదా పడుతుందని మానవ వనరుల శాఖ మంత్రి లోకేశ్‌తో పాటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సైతం ఓ వైపు ప్రకటించడం.. మరోవైపు ఎట్టిపరిస్థితుల్లోను పరీక్ష కొనసాగుతుందని ఏపీపీఎస్సీ స్పష్టం చేయడం.. వెరసి అసలు పరీక్ష ఉంటుదా.. లేదా? అన్న సందిగ్ధంలో అభ్యర్థులు ఉండిపోయారు. ఈ క్రమంలో పరీక్ష వాయిదా పడుతుందని ప్రకటించిన ప్రభుత్వాన్ని పూర్తిగా నమ్మిన అభ్యర్థులు తమకు కేటాయించిన సెంటర్లున్న ప్రాంతాలకు వెళ్లకుండా నిలువునా మోసపోయారు. రెండు వ్యవస్థల విరుద్ధ ప్రకటనలతో మీ మాంసలో మరికొందరు పరీక్ష ఉంటుందో ఉండదో తెలియక చాలా మంది సమయానికి సెంటర్లకు చేరుకోలేకపోయారు. దీంతో చాలా మంది అభ్యర్థులు నష్టపోయారు. ⇒ గ్రూప్–2 మెయిన్స్ పరీక్షను వాయిదా వేయాలని శనివారం అర్ధరాత్రి వరకు అభ్యర్థులు ఆందోళన చేశారు. తాము కూడా వాయిదా వేయమని సర్వీస్ కమిషన్‌ను కోరామని సాక్షాత్తూ ముఖ్యమంత్రి ప్రకటించడం, కానీ చైర్మన్ అంగీకరించలేదని ఆరోపణలు చేయడం వంటి నాటకీయ పరిణామాల మధ్య ఆదివారం పరీక్ష నిర్వహించారు. ఉదయం 9.45 తర్వాత అభ్యర్థులను అనుమతించేది లేదని సర్వీస్ కమిషన్ ప్రకటించడంతో సమయం దాటాక వచ్చిన మరికొంత మంది పరీక్షకు దూరమయ్యారు. గ్రూప్–2 పోస్టుల భర్తీకి 2023 డిసెంబర్‌లో నోటిఫికేషన్ విడుదల చేశారు. అర నిమిషం ఆలస్యం అవడంతో పరీక్షకు దూరమైన కొండబాబు, శ్యామల ⇒ ఫిబ్రవరిలో ప్రిలిమ్స్ నిర్వహించి, 92,250 మందిని మెయిన్స్‌కి ఎంపిక చేశారు. వీరికి 2024 జూలైలో మెయిన్స్ నిర్వహించేందుకు షెడ్యూల్ ప్రకటించారు. అయితే, సాధారణ ఎన్నికల అనంతరం జూన్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఎన్‌డీఏ కూటమి ఏపీపీఎస్సీ చైర్మన్‌ను అర్ధంతరంగా తొలగించింది. దాదాపు 3 నెలల పాటు కమిషన్‌కు చైర్మన్ లేకుండా చేయడంతో జూలైలో జరగాల్సిన మెయిన్స్ డిసెంబర్‌కు వాయిదా వేశారు. ⇒ అక్టోబర్‌లో ఏఆర్ అనురాధను చైర్మన్‌గా నియమించి పరీక్షను ఫిబ్రవరి 23కి మార్చారు. సరిగ్గా పరీక్షకు వారం రోజుల ముందు కూటమి నాయకులు కొత్త డ్రామాకు తెరతీశారు. హైకోర్టు పరీక్ష నిర్వహించుకునేందుకు అనుమతి ఇవ్వడంతో ఏపీపీఎస్సీ తన ప్రక్రియను ప్రారంభించింది. అయితే, ఈనెల 20 నుంచి పరీక్షపై అనేక నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ⇒ రోస్టర్‌లో జరిగిన తప్పులను సరిచేసి మెయిన్స్ నిర్వహించాలన్న డిమాండ్‌తో అభ్యర్థులు రోడ్లపైకి రావడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఈ అంశంపై చివరి వరకు స్పందించని ప్రభుత్వం.. ఈనెల 21న రాత్రి మానవ వనరుల శాఖ మంత్రి లోకేశ్ ట్వీట్‌తో పరీక్ష వాయిదా పడుతుందన్న అభిప్రాయాన్ని సూత్రప్రాయంగా వెల్లడించింది. పరీక్షకు ఒక్కరోజు ముందు ప్రభుత్వం ఏపీపీఎస్సీకి లేఖ రాసి పరీక్ష వాయిదా వేయాలని కోరడం, సాయంత్రం సీఎం చంద్రబాబునాయుడు పరీక్ష వాయిదాపై సర్వీస్ కమిషన్ చైర్మన్ అంగీకరించలేదని వాయిస్ లీక్ చేసి తప్పును చైర్మన్‌పైకి నెట్టే ప్రయత్నం చేశారు. సర్వీస్ కమిషన్ చరిత్రలో అత్యంత ఉత్కంఠ వాతావరణంలో జరిగిన పరీక్షగా గ్రూప్–2 మెయిన్స్ నిలిచింది.గ్రూప్–2 మెయిన్స్ పరీక్ష పూర్తిఏపీపీఎస్సీ ఆదివారం నిర్వహించిన గ్రూప్–2 మెయిన్స్ పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని ఏపీపీఎస్సీ ప్రకటించింది. ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్స్‌లో జరిగిన పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సెంటర్లలో పరీక్ష నిర్వహించినట్లు సర్వీస్ కమిషన్ తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి 13 జిల్లాల్లో 175 సెంటర్లను ఏర్పాటు చేశారు. మొత్తం 905 పోస్టులకు 92,250 మంది మెయిన్స్‌కు అర్హత సాధించగా, 86,459 మంది హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఆదివారం ఉదయం జరిగిన పేపర్–1కు 79,599 మంది హాజరు కాగా, మధ్యాహ్నం నిర్వహించిన పేపర్–2కి 79,451 మంది అభ్యర్థులు హాజరైనట్టు కమిషన్ పేర్కొంది. విశాఖపట్నం జిల్లాలో 16 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు. ఉదయం 6.30 గంటలకే లైజన్ అధికారులు సంబంధిత మెటీరియల్‌తో కేంద్రాలకు చేరుకున్నారు. పరీక్షా పత్రాలను స్ట్రాంగ్ రూమ్‌ల నుంచి పోలీసు భద్రత నడుమ పరీక్షా కేంద్రాలకు తరలించారు. డ్రోన్లతో పరీక్షా కేంద్రాల వద్ద భద్రతను పర్యవేక్షించారు. ఉదయం వచ్చిన వారిలో కొంత మంది మధ్యాహ్నం జరిగిన పరీక్షకు హాజరు కాలేదు. కొమ్మాది చైతన్య ఇంజనీరింగ్ కళాశాల పరీక్షా కేంద్రంలో ఆదివారం మధ్యాహ్నం ఒక అభ్యరి్థకి పరీక్ష రాస్తున్న సమయంలో బీపీ తగ్గటంతో అస్వస్థతకు గురయ్యాడు. పోలీసు భద్రత నడుమ అతన్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.మమ్మల్ని మోసం చేశారు గ్రూప్–2 పరీక్ష వాయిదా పడుతుందంటూ మమ్మల్ని మోసం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోతామనే వార్తలు రావడంతో మేలుకున్నట్లు కలరింగ్ ఇచ్చారు. అభ్యర్థుల సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి లోకేశ్, సీఎం చంద్రబాబు ప్రకటనలు చేశారు. రాజకీయ లబ్ధి కోసం సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ డబుల్ గేమ్ ఆడారు. చివరకు చేతులెత్తేశారు. మేమంతా.. ఇది డబుల్ గేమ్ అని తెలియని అమాయకులమా? మమ్మల్ని మానసికంగా హింసించారు. – హుస్సేన్‌బాషా, నంద్యాలభావోద్వేగాలతో ఆడుకుంటారా?గ్రూప్–2 మెయిన్స్ పరీక్ష వాయిదా అంటూ వార్తలు వచ్చాయి. గ్రూప్–2లో రోస్టర్ విధానం ప్రకటించాలని పెద్ద ఎత్తున ఆందోళనలు చేశాం. రోస్టర్‌లో తప్పులు ఉన్నాయంటూ టీడీపీయే గతంలో పలు మార్లు చెప్పింది. ఇప్పుడు వారే అధికారంలో ఉన్నారు. కానీ విద్యార్థుల భావోద్వేగాలతో ఆడుకుంటూ వచ్చారు. పరీక్ష వాయిదా పడుతుందంటూ మమ్మల్ని డైవర్ట్ చేసి నాశనం చేశారు. నిరుద్యోగులను వంచిస్తే ఫలితం ఎలా ఉంటుందో ప్రభుత్వానికి త్వరలోనే తెలిసి వస్తుంది. – రవికుమార్, తిరుపతిఇంత టెన్షన్ ఎప్పుడూ పడలేదు తొలుత ఏపీపీఏస్సీ అధికారులు గ్రూప్–2 మెయిన్ పరీక్ష ఆదివారం జరగుతుందన్నారు. కానీ పరీక్షపై సమీక్షిస్తున్నాం.. వాయిదా పడుతుందంటూ ప్రభుత్వ పెద్దల ప్రకటనలు హల్‌చల్ చేశాయి. పరీక్షపై గందరగోళం సృష్టించారు. పరీక్ష జరుగుతుందో లేదో అనే అనుమానం కలిగింది. శనివారం అర్ధరాత్రి వరకు పరీక్ష నిర్వహణపై స్పష్టత లేదు. అంతా గందరగోళం. రాత్రంతా టెన్షన్‌తో గడిపా. నిరుద్యోగుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం ఆడటం దారుణం. పరీక్షా కేంద్రాల వద్ద పోలీసులు, అధికారులు ఓవరాక్షన్ చేశారు. గతంలో ఏ పరీక్షప్పుడూ ఇలా వ్యవహరించలేదు. – సౌజన్య, తిరుపతిఫలితం అనుభవిస్తారు.. ప్రభుత్వ ఉద్యోగం దక్కించుకోవాలనేది నా కల. తాడిపత్రి నుంచి విశాఖపట్నం వచ్చి ఇక్కడ కోచింగ్ తీసుకుంటున్నాను. గ్రూప్–2 మెయిన్స్ కోసం అహోరాత్రులు కష్టపడి చదివాను. రోస్టర్ విధానంలో తప్పులున్నాయని, ప్రభుత్వంలోని పెద్దలే చెప్పినా, దీన్ని సవరించకుండా పరీక్ష నిర్వహించడమేంటి? న్యాయ చిక్కులతో రేపు పరీక్ష రద్దయితే.. మా కష్టమంతా వృథానే కదా? అందుకే మేము ఆందోళన చేశాం. కానీ మా బాధను ప్రభుత్వం అర్థం చేసుకోలేదు. నిరుద్యోగులతో ప్రభుత్వం చెలగాటమాడింది. ఇది ఎంతమాత్రం భావ్యం కాదు. ఇందుకు ఫలితం చవిచూడక తప్పదు. – హరి, తాడిపత్రి ప్రభుత్వం తీరు దారుణం గ్రూప్–2 మెయిన్స్ పరీక్ష విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీరు బాధించింది. రాత్రి పొద్దుపోయే వరకు పరీక్ష జరుగుతుందో లేదో అనే టెన్షన్ ఎదుర్కోవాల్సి వచ్చింది. ప్రభుత్వ వైఖరి కారణంగా మా సమయం వృథా అయింది. ఈ గందరగోళం మధ్య పరీక్ష వాయిదా వేయడం వల్ల ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏమిటో అర్థం కాలేదు. ప్రతి సంవత్సరం రెగ్యులర్‌గా వదిలే పోస్టులు కావని తెలిసినప్పటికీ, ఈ పరీక్ష నిర్వహణ విషయంలో ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యం వహించడం దారుణం. – మూల బిందు మాధవి, కడపతప్పులు ఎందుకు సరిదిద్ద లేదు? రిజర్వేషన్ రోస్టర్‌లో తప్పులు ఉన్నాయని చెప్పింది టీడీపీనే. ఇప్పుడు అధికారంలో ఉన్నది మీ ప్రభుత్వమే కదా.. అలాంటప్పుడు ఆ తప్పులు సరిదిద్దాక పరీక్ష నిర్వహించాలన్న కనీస విషయాన్ని విస్మరించడం దారుణం. ఏపీపీఎస్సీ తమ మాట వినలేదని చెప్పడం భావ్యం కాదు. అలా చెప్పడం ప్రభుత్వ పెద్దలకు ఇన్సల్ట్. – ఎ.ఢిల్లేశ్వరరావు, శ్రీకాకుళంప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు గ్రూప్–2 పరీక్ష నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. ఒక వైపు రోస్టర్ సమస్య ఉన్నప్పటికీ దాన్ని సకాలంలో పరిష్కరించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. చివరి నిమిషంలో పరీక్షలు రద్దు చేయాలంటూ ఏపీపీఎస్సీకి లేఖ రాయడం నాటకమే. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ముందుగానే సరైన నిర్ణయం తీసుకొని ఉండేది. – మేఘన, ఒంగోలుప్రభుత్వం, ఏపీపీఎస్సీ కలిసి ఆడిన డ్రామా రాష్ట్ర ప్రభుత్వం అనుసరించిన విధానం వల్ల గ్రూప్–2 పరీక్ష రాసిన అభ్యర్థులందరం డైలమాలో పడ్డాం. ఇది సీఎం చంద్రబాబు తనకున్న రాజకీయ అనుభవంతో ఆడిన డ్రామా అని చాలా స్పష్టంగా తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వం, ఏపీపీఎస్సీ అనుసరించిన విధానం వల్ల పరీక్ష ఉంటుందా, ఉండదా.. అనే విషయంలో చాలా గందరగోళానికి గురయ్యాను. ప్రభుత్వం, ఏపీపీఎస్సీ కలిసి ఆడిన డ్రామాగా భావిస్తున్నా. ప్రభుత్వాలు నిరుద్యోగుల జీవితాలతో ఇలా ఆడుకోకూడదు. – కె.కాంతారావు, విజయవాడనిరుద్యోగులతో రాజకీయం దుర్మార్గం రోస్టర్ విధానం పాటించకుండా అభ్యర్థులను చివరి ఘడియ వరకు ఉత్కంఠకు గురిచేశారు. ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించి తీవ్రమైన గందరగోళానికి తెరలేపింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోసమే ఇంత డ్రామా ఆడింది. కష్టపడి చదివాం. తీరా పరీక్ష రాసే సమయంలో తీవ్రంగా టెన్షన్ పడ్డాం. నిరుద్యోగులతో రాజకీయం చేయడం దుర్మార్గం. – రౌతు రామచంద్రులు, విజయనగరంనిరుద్యోగులను మోసం చేస్తారా? గ్రూపు–2 పోస్టులు భర్తీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదు. అందుకే కాలయాపన చేసేందుకు పూనుకుంది. రోస్టర్‌లో తప్పులున్నాయని ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ ఒప్పుకున్నారు. మరి అలాంటప్పుడు లోపాలు సరి చేసి మరో 10 రోజులు తర్వాత పరీక్ష జరిపితే వచ్చే నష్టమేముంది? కోర్టు తీర్పు అంటూ మరికొంత కాలం కాలయాపన చేసి ఉద్యోగాలను భర్తీ చేయకుండా నిరుద్యోగులను మోసం చేసేందుకు ప్రభుత్వం పూనుకోవడం దారుణం. – గుడిపాటి చంద్రశేఖర్, కండాపురం, నెల్లూరు జిల్లా అర నిమిషం ఆలస్యంతో పరీక్షకు దూరంఓ అభ్యర్థి అర నిమిషం ఆలస్యంతో మెయిన్స్ పరీక్షకు దూరమైన ఘటన విశాఖపట్నంలో చోటుచేసుకుంది. విశాఖ గ్రామీణ ప్రాంతం రొంగలినాయుడుపాలేనికి చెందిన అభ్యర్థి కొండబాబుకు విశాఖపట్నం ద్వారకానగర్‌లోని బీవీకే కళాశాలలో సెంటర్ కేటాయించారు. ఉదయం 9.45 గంటల వరకు విద్యార్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతించి, సమయం దాటగానే గేట్లు మూసివేశారు. ఇంటి నుంచి బస్సులో బయలుదేరిన కొండబాబు సెంటర్‌కు రావడం అర నిమిషం ఆలస్యమైంది. దీంతో అతన్ని లోనికి అనుమతించలేదు. తాను ఈ పరీక్ష కోసం ఏడేళ్లుగా కష్టపడుతున్నానని, లోనికి అనుమతించాలని ఎంత ప్రాధేయపడ్డా సిబ్బంది అనుమతివ్వలేదు. దీంతో తాను పడ్డ శ్రమ వృథా అయిందని కన్నీరు పెట్టుకుంటూ వెనుదిరిగాడు. మరో ఘటనలో అనకాపల్లి జిల్లా చీడికాడ మండలానికి చెందిన డి.శ్యామలకు విశాఖపట్నంలోని విజయం స్కూల్లో సెంటర్ కేటాయించారు. ఈమె ఐదు నిమిషాలు ఆలస్యం కావడంతో పరీక్ష రాయలేకపోయింది. ఎంతో కష్టపడి మెయిన్స్‌కి సిద్ధమయ్యానని, ఐదు నిమిషాల ఆలస్యంతో తాను పరీక్ష రాయలేకపోయానని ఆవేదన వ్యక్తం చేసింది.

సొరంగంలో ఆశలు గల్లంతు!
సాక్షి ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్/ సాక్షి, నాగర్‌కర్నూల్: శ్రీశైలం ఎడమగట్టు కాల్వ (ఎస్‌ఎల్‌బీసీ) తొలి సొరంగం పైకప్పు కుప్పకూలడంతో గల్లంతైన 8 మంది కార్మికుల ఆచూకీ తెలియరాలేదు. కార్మీకులను బయటికి తీసుకొచ్చేందుకు ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్, సింగరేణి, ఆర్మీ సహాయక బృందాలు ఆదివారం రోజంతా చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. ప్రమాదం జరిగి 40 గంటలైనా కార్మీకుల జాడగానీ, వారి యోగక్షేమాలుగానీ తెలియకపోవడంతో... వారు సురక్షితంగా బయటపడే అవకాశం తక్కువనే చర్చ జరుగుతోంది. ఆదివారం ఎన్డీఆర్‌ఎఫ్, ఇతర రెస్క్యూ బృందాలతో కలసి లోకో ట్రైన్ ద్వారా సొరంగం లోపలికి వెళ్లి.. సుమారు 6 గంటల తర్వాత తిరిగి వచి్చన మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా.. పరిస్థితి నిరాశాజనకంగా ఉందని పేర్కొన్నారు. సొరంగం లోపలి వరకు వెళ్లి బయటికి వచి్చనవారు తెలిపిన వివరాల ప్రకారం.. ఇన్‌లెట్ నుంచి 13.93 కిలోమీటర్ల లోపల పైకప్పు కూలిన చోట దాదాపు 200 మీటర్ల మేర మట్టి, బురద నీరు, శిథిలాలతో సొరంగం మూసుకుపోయింది. ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలో 12 కిలోమీటర్ల వద్ద సైతం మోకాలి లోతు నీళ్లు ఉన్నాయి. కూలిన మట్టి, శిథిలాలను తొలగిస్తేగానీ గల్లంతైన కార్మికులను చేరుకోలేని పరిస్థితి నెలకొని ఉంది. ఇప్పటివరకు అలాంటి ప్రయత్నాలేమీ ప్రారంభం కాలేదు. ఏదైనా అద్భుతం జరిగితే కానీ.. సొరంగం లోపల పరిస్థితి భీతావహంగా ఉండటం, మళ్లీ పైకప్పు కూలవచ్చనే ఆందోళనల నేపథ్యంలో రెస్క్యూ కష్టసాధ్యంగా మారింది. దోమలపెంట వద్దనున్న ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ఇన్‌లెట్ నుంచి ప్రమాద స్థలానికి చేరుకునేందుకు ఒక్క లోకో ట్రైన్ మాత్రమే ఆధారం. దాని ద్వారా 12.6 కిలోమీటర్ల దూరం వరకు మాత్రమే ప్రయాణించేందుకు వీలుంది. అక్కడి నుంచి కన్వేయర్ బెల్టు మీద లోపలికి చేరుకోవాల్సి వస్తోంది. సొరంగం కుప్పకూలిన ప్రాంతానికి 100 మీటర్ల సమీపం వరకే సహాయక బృందాలు వెళ్లగలిగాయి. శిథిలాలు కొట్టుకురావడంతో వాటిని తొలగించకుండా ముందుకు కదల్లేని పరిస్థితి నెలకొంది. ఎప్పటికప్పుడు పెరుగుతున్న నీటి ఊటను మోటార్ల సాయంతో తొలగిస్తున్నారు. నిమిషానికి 10 వేల లీటర్ల నీటిని ఎత్తిపోసే మోటార్లను వినియోగిస్తున్నారు. లోపలికి వెళ్లి బయటికి వచి్చన రెస్క్యూ బృందాలతో ‘సాక్షి’ మాట్లాడింది. గల్లంతైన కార్మీకుల మీద కాంక్రీట్ సెగ్మెంట్లు, మట్టి, శిథిలాలు పడి ఉండవచ్చని వారు పేర్కొన్నారు. లేదా వారు సొరంగం కూలిన ప్రాంతానికి ఆవలివైపు చిక్కుకుని ఉన్నా.. రెండు వైపులా మూతపడి ఉండటంతో ఆక్సిజన్ లభించడం కష్టమేనని భావిస్తున్నట్టు చెప్పారు. ఏదైనా అద్భుతం జరిగితేనే వారు ప్రాణాలతో ఉంటారనే అభిప్రాయం వ్యక్తం చేశారు. సొరంగం కూలిన ప్రాంతానికి 100 మీటర్ల సమీపం దాకా వెళ్లిన రెస్క్యూ సిబ్బంది.. కార్మికులను ఉద్దేశించి గట్టిగా అరుస్తూ పిలిచినా ఎలాంటి స్పందన రాలేదని అంటున్నారు. తీవ్ర ఉత్కంఠ మధ్య.. ఎస్‌ఎల్‌బీసీ సొరంగం–1 ఇన్‌లెట్ నుంచి 13.93 కిలోమీటర్ల లోపల శనివారం ఉదయం 8.30 గంటలకు పైకప్పు కూలిపడింది. ఆదివారం అర్ధరాత్రి సమయానికి 40 గంటల కీలక సమయం గడిచిపోయింది. దీనితో కార్మీకుల క్షేమంపై ఆశలు సన్నగిల్లుతున్నాయి. తీవ్ర ఉత్కంఠ మధ్య ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్, సింగరేణి, అగ్నిమాపక శాఖ, ఆర్మీకి చెందిన రెస్క్యూ సిబ్బంది మూడు వేర్వేరు బృందాలుగా ఏర్పడి సొరంగం లోపలికి లోకో ట్రైన్ ద్వారా వెళ్లారు. వారు తిరిగి వచ్చి గల్లంతైన కార్మీకుల యోగక్షేమాల గురించి చెబుతారేమోనని.. సొరంగం బయట అధికారులు, నేతలు, మీడియా ప్రతినిధులు ఉత్కంఠగా ఎదురు చూశారు. కానీ మంత్రితోపాటు రెస్క్యూ సిబ్బంది నిరాశ వ్యక్తం చేశారు. సహాయక చర్యల్లో ఆర్మీ ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలో జరుగుతున్న సహాయక చర్యల కోసం సైన్యం కూడా రంగంలోకి దిగింది. సికింద్రాబాద్ నుంచి ఆర్మీ బైసన్ డివిజన్‌కు చెందిన ఇంజనీర్ టాస్‌్కఫోర్స్ (ఈటీఎఫ్) ఈ ఆపరేషన్‌లో పాల్గొంటున్నట్టు అధికారులు తెలిపారు. ఆర్మీ వైద్య బృందాలను సైతం టన్నెల్ వద్ద అందుబాటులో ఉంచారు. తెలంగాణ, ఆంధ్రా సబ్ ఏరియా ఆర్మీ అధికారులు రెస్క్యూ ఆపరేషన్లను సమన్వయం చేస్తున్నారు.శిథిలాలు, బురద తొలగించేదెలా?సొరంగం కూలిపడి పేరుకుపోయిన మట్టిని, శిథిలాలను తొలగించనిదే కార్మీకుల వద్దకు రెస్క్యూ బృందాలు చేరుకోలేని పరిస్థితి. కానీ నీటి ఊటల కారణంగా.. మట్టిని తొలగించిన కొద్దీ పైకప్పు మళ్లీ కూలే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ సొరంగం భూఉపరితలం నుంచి సుమారు 400 మీటర్ల దిగువన ఉందని, కూలిన చోట మట్టిని తీసినకొద్దీ.. పైన వదులుగా ఉన్న మట్టి మళ్లీ సొరంగంలోకి పడిపోతుందని రెస్క్యూ సిబ్బంది పేర్కొంటున్నారు. అయితే సొరంగంపైన భూమి ఉపరితలం నుంచి డ్రిల్లింగ్ చేసి కార్మీకులను బయటికి తీసుకువచ్చేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నట్టు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపినా.. 400 మీటర్ల లోతున రంధ్రం చేయడానికి చాలా రోజుల సమయం పడుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. సొరంగంలో పేరుకున్న మట్టి, నీళ్లు, ఇతర శిథిలాలను తొలగించేందుకూ కొన్ని రోజుల సమయం పట్టే అవకాశం ఉందని పేర్కొంటున్నాయి.పైకప్పు కూలిన చోట.. కాంక్రీట్ సెగ్మెంట్ లేదు! సొరంగంలో ప్రమాదం జరిగిన చోట పైకప్పుకు రక్షణగా కాంక్రీట్ సెగ్మెంట్లు లేవని తెలిసింది. టన్నెల్ చివరన పనులు జరిగిన చోట సుమారు 100 మీటర్ల మేర కాంక్రీట్ సెగ్మెంట్లను ఏర్పాటు చేయలేదని సమాచారం. అంతేగాకుండా సొరంగంలో నాలుగేళ్లుగా నీటి ఊటలు (సీపేజీ) కొనసాగుతుండటంతో మట్టి వదులుగా మారడం, తవ్వకం పనుల్లో రక్షణ గోడ నిర్మించకపోవడం, భద్రతా ప్రమాణాలను పాటించకపోవడంతో పైకప్పు కుప్పకూలిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏదైనా వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంటేనే.. సొరంగం లోపల చిక్కుకున్న కార్మీకులను బయటికి తెచ్చేందుకు ఏదైనా వ్యూహాన్ని సిద్ధం చేసుకుని ఆచరణలో పెడితేనే ఫలితమిచ్చే పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతానికి ఎలాంటి ప్రత్యేక వ్యూహం లేకుండా రెస్క్యూ బృందాలు లోపలి వరకు వెళ్లి వచి్చనట్టు తెలిసింది. సొరంగంలో పేరుకున్న మట్టిని తొలగించి కన్వేయర్ బెల్టుల ద్వారా, లేదా లోకో ట్రైన్ ద్వారా బయటికి పంపితే గానీ చిక్కుకున్న కార్మీకుల జాడ కనుక్కోలేని పరిస్థితి నెలకొంది. అడ్డంకులన్నీ అధిగమించి కార్మీకులను చేరుకునేందుకు ఎంత సమయం పడుతుందో చెప్పలేమని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. టీబీఎం మెషీన్ దగ్గరికి చేరుకోవడమే కష్టంగా ఉంది సొరంగంలో పైకప్పు కూలిన చోట ఉన్న టీబీఎం మెషీన్ వద్దకు చేరుకోవడమే కష్టంగా ఉంది. ఇప్పటివరకు రెండు సార్లు లోపలికి వెళ్లి వచ్చాం. మెషీన్ వద్ద 200 మీటర్ల దాకా భారీగా బురద పేరుకుని ఉంది. దాన్ని దాటడం వీలుపడటం లేదు. టన్నెల్ పైకప్పు మళ్లీ కుంగకుండా సేఫ్టీ కోసం రాక్ బోల్టింగ్ చేస్తున్నాం. నీటి తొలగింపు కొనసాగుతోంది. – కలేందర్, సింగరేణి మైనింగ్ సేఫ్టీ సూపర్‌వైజర్ వారి జాడ కనిపించలేదు.. టన్నెల్‌లో భారీగా మట్టి, శిథిలాలు పేరుకుపోవడంతో మెషీన్ దగ్గరికి వెళ్లేందుకు కుదరడం లేదు. చిక్కుకున్న వారి జాడ ఏదీ కనిపించలేదు. ఎలాంటి అరుపులు సైతం వినిపించలేదు. – రాందేవ్, సుబేదార్, ఆర్మీ రాళ్లు, నీరు, బురదతో నిండిపోయింది టన్నెల్ రాళ్లు, నీరు, బురదతో నిండిపోయింది. 200 నుంచి 500 మీటర్ల మధ్య టన్నెల్ బోరింగ్ మెషీన్ బురదలో కూరుకుపోయింది. 35 మందిమి సహాయక చర్యలకు అవసరమైన సామగ్రి తీసుకొని వెళ్లాం. రాత్రంతా కష్టపడి దగ్గరకు చేరుకోగలిగాం. – రవినాయక్, ఎన్‌డీఆర్‌ఎఫ్ టీం, విజయవాడ పెద్ద శబ్దంతో నీళ్లు వచ్చాయి.. మేం పనుల కోసం టన్నెల్ చివరికి చేరుకుంటున్న సమయంలోనే ఒక్కసారిగా పెద్ద శబ్దంతో నీళ్లు వచ్చాయి. సిమెంట్ దిమ్మెలు కూలి, పెద్ద ఎత్తున మట్టి కుంగింది. మేమంతా భయంతో వెనక్కి పరుగెత్తుకు వచ్చాం. చేతులు, కాళ్లు, ముఖానికి చిన్న గాయాలయ్యాయి. – చమేల్ సింగ్, ప్రమాదం నుంచి బయటపడిన ఫోర్‌మెన్ ఏం జరుగుతోందో అర్థం కాలేదు శనివారం ఉదయం టన్నెల్‌లో ఒక్కసారిగా శబ్దం వచ్చింది. ఏం జరుగుతోందో అర్థం కాలేదు. మా వాళ్లు కొందరు మెషీన్ వైపు ఉన్నా, ఏమీ చేయలేక భయంతో వెనక్కి వచ్చాం. వాళ్లు మట్టి, బురదలో మునిగారు. ప్రాణాలతో బయటికి వస్తారో, లేదో తెలియదు. – ఎడుమలై, ప్రమాదం నుంచి బయటపడ్డ కన్వేయర్ బెల్ట్ ఫోర్‌మెన్ మా వాళ్ల పరిస్థితి ఏంటో తెలియదు.. టీబీఎం ముందు భాగంలో 8 మంది ఉన్నారు. మేం వెనక భాగంలో ఉన్నాం. ఒక్కసారిగా పైకప్పు కూలడంతో భయాందోళన నెలకొంది. మాతో కలసి పనిచేసే వాళ్ల పరిస్థితి ఏమిటో తెలియదు. చాలా బాధగా ఉంది. – జగదీశ్ పాండా, ప్రమాదం నుంచి బయటపడ్డ మెకానికల్ ఫోర్‌మెన్

ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం.. యత్నకార్యసిద్ధి
గ్రహం అనుగ్రహం: శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘ మాసం, తిథి: బ.ఏకాదశి ఉ.10.46 వరకు, తదుపరి ద్వాదశి, నక్షత్రం: పూర్వాషాఢ సా.4.36 వరకు, తదుపరి ఉత్తరాషాఢ, వర్జ్యం: రా.12.42 నుండి 2.18 వరకు, దుర్ముహూర్తం: ప.12.39 నుండి 1.27 వరకు, తదుపరి ప.2.59 నుండి 3.47 వరకు, అమృతఘడియలు: ఉ.11.33 నుండి 1.13 వరకు; రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు, యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు, సూర్యోదయం: 6.26, సూర్యాస్తమయం: 6.01. మేషం... దూరప్రయాణాలు. కార్యక్రమాలు వాయిదా. ఆరోగ్యసమస్యలు. వ్యాపారులకు శ్రమాధిక్యం. ఉద్యోగులకు చిక్కులు. నిర్ణయాలు మార్చుకుంటారు. ఆలయ దర్శనాలు.వృషభం... మిత్రులతో విభేదాలు. కష్టమే తప్ప ఫలితం కనిపించదు. అనుకోని ధనవ్యయం. వ్యాపారులకు కష్టమే తప్ప ఫలితం కనిపించదు. ఉద్యోగులకు కొన్ని సమస్యలు.మిథునం... ఆకస్మిక ధనలాభం. యత్నకార్యసిద్ధి. విలువైన సమాచారం. భూములు, వాహనాలు సమకూర్చుకుంటారు. వ్యాపారవృద్ధి. ఉద్యోగులకు అనుకూల సమయం.కర్కాటకం... కొత్త ఉద్యోగ యత్నాలలో పురోగతి. అదనపు ఆదాయం సమకూరుతుంది. వ్యాపారులకు లాభాలు దక్కుతాయి. ఉద్యోగులు విధి నిర్వహణలో ముందడుగు వేస్తారు.సింహం.... ఆదాయం కంటే ఖర్చులు పెరుగుతాయి. కార్యక్రమాలలో ఆటంకాలు. కుటుంబసభ్యులతో విభేదాలు. అనారోగ్యం. వ్యాపారులకు శ్రమకు ఫలితం కనిపించదు. ఉద్యోగులకు పనిఒత్తిడులు. .కన్య...... కుటుంబసభ్యులతో అకారణ వైరం. ఉద్యోగులకు శ్రమ పెరుగుతుంది. వ్యాపారులకు ఆటుపోట్లు. చిన్ననాటి స్నేహితుల కలయిక. ఖర్చులు. దూరప్రయాణాలు.తుల...... నూతన పరిచయాలు. కొన్ని చర్చలు సçఫలం. పనుల్లో విజయం. ఉద్యోగులకు నూతనోత్సాహం. వ్యాపారులకు ఆశించిన లాభాలు తథ్యం. దైవదర్శనాలు.వృశ్చికం... కార్యక్రమాలలో ఆటంకాలు. భూసంబంధిత వివాదాలు. ఆదాయం తగ్గుతుంది. దూరప్రయాణాలు. వ్యాపారులకు పెట్టుబడుల్లో ఆటంకాలు. ఉద్యోగులకు లేనిపోని చికాకులు.ధనుస్సు...... పరిచయాలు పెరుగుతాయి. సన్నిహితుల ముఖ్య సమాచారం. వాహనాలు కొంటారు. వ్యాపారులు ఉత్సాహంగా ముందడుగు వేస్తారు. ఉద్యోగులకు మరింత గుర్తింపు.మకరం... ఆదాయం నిరాశ కలిగిస్తుంది. కార్యక్రమాలలో ఆటంకాలు. ఆరోగ్యసమస్యలు. కుటుంబసభ్యుల నుంచి విమర్శలు. వ్యాపారులకు పనిఒత్తిడులు. ఉద్యోగులకు గందరగోళం.కుంభం... ఉద్యోగులు అనుకున్నది సాధిస్తారు. వ్యాపారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. పనులు చకచకా సాగుతాయి. ఆసక్తికరమైన సమాచారం. యత్నకార్యసిద్ధి. స్థిరాస్తి వృద్ధి.మీనం.... కుటుంబసభ్యులతో తగాదాల పరిష్కారం.. అదనపు రాబడి ఉంటుంది. ఉద్యోగులు ప్రమోషన్లు అందుకుంటారు. వ్యాపారులకు ఒడిదుడుకులు తొలగుతాయి.

గ్రూప్-2 అభ్యర్థులను కూడా చంద్రబాబు మోసం చేశారు: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: సీఎం చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) అందరినీ ఏ విధంగా మోసం చేస్తారో చెప్పేందుకు గ్రూప్–2(Group-2) పరీక్షల అభ్యర్థుల పరిస్థితే ప్రత్యక్ష నిదర్శనం. మూడు వారాలుగా వారి అభ్యంతరాలు వింటున్నట్లుగా నటించి.. సమస్యను పరిష్కరిస్తానని నమ్మబలికి చివరకు నట్టేట ముంచాడు. విద్యార్థులను లాఠీలతో కొట్టించడమే కాకుండా ఆఖరికి తీవ్ర అయోమయం, గందరగోళం, అస్పష్టత మధ్యే పరీక్షలు పెట్టడం అత్యంత దారుణమని చంద్రబాబు సర్కారు మోసాలపై వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి(YS Jaganmohan Reddy) నిప్పులు కురిపించారు.అధికారం చేపట్టినప్పటి నుంచి చంద్రబాబు అన్ని వర్గాలను ఏ విధంగా మోసం చేస్తున్నారో అంశాల వారీగా వివరిస్తూ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా కడిగి పారేశారు. మోసాలకు, అన్యాయాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన చందబాబుపై ప్రజలు ఆగ్రహంతో పోరాటాలు చేస్తున్నారని, వారికి వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని ప్రకటించారు. వైఎస్ జగన్ ట్వీట్‌లో ప్రస్తావించిన అంశాలివీ..⇒ చంద్రబాబు నాయుడు నిరుద్యోగులను, ఉద్యోగులనే కాదు.. అన్ని వర్గాల ప్రజలనూ మోసం చేయడమే అలవాటుగా మార్చుకున్నారు. ఇప్పుడు గ్రూప్‌ృ2 అభ్యర్థులను కూడా నిలువునా మోసం చేశారు.⇒ మూడు వారాలుగా గ్రూప్‌ృ2 అభ్యర్థుల అభ్యంతరాలను వింటున్నట్లు నటించి, వాటిని పరిగణనలోకి తీసుకుని తగిన న్యాయం చేస్తున్నట్లు నమ్మబలికి, చివరకు వారిని నట్టేట ముంచారు. అభ్యర్థుల నుంచి అందిన విజ్ఞాపనలను వింటున్నానని, తప్పకుండా పరిష్కారం చూపిస్తానని పరీక్షలకు రెండు రోజుల ముందు విద్యాశాఖ మంత్రి, మీ కుమారుడు మోసపూరిత ప్రకటన చేశారు. మరోవైపు తాను చెప్పినా సరే, ప్రభుత్వం నుంచి లేఖ ఇచ్చినా సరే పట్టించుకోకుండా ఏపీపీఎస్సీ ముందుకు వెళ్తోందని సాక్షాత్తూ ముఖ్యమంత్రిగా ఉన్న మీ వాయిస్‌తో ఆడియోను లీక్ చేసి మరో డ్రామా చేశారు. ఇంకోవైపు ఆందోళన చేస్తున్న వారిపై పోలీసులతో లాఠీఛార్జీ చేయించి అమానుషంగా ప్రవర్తించారు. మీరు ప్రజలను ఎలా మోసం చేస్తారో చెప్పడానికి ఇది మరొక ఉదాహరణ మాత్రమే. ఆఖరికి అయోమయం, గందరగోళం, అస్పష్టత మధ్యే పరీక్షలు పెట్టడం అత్యంత దారుణం.⇒ మా ప్రభుత్వంలో ఇచ్చిన డీఎస్సీని రద్దు చేసి.. మెగా డీఎస్సీ పేరుతో ఇప్పటికీ ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకుండా కాలయాపన చేయడం ఒక మోసమే.⇒ ప్రతి జనవరిలో జాబ్ క్యాలెండర్ అని చెప్పి అసలు దాని గురించి పట్టించుకోకపోవడం కూడా మీరు చేసిన మోసమే.⇒ వలంటీర్లకు రూ.పది వేలు ఇస్తానని చెప్పి.. జీతం సంగతి దేవుడెరుగు చివరకు 2.6 లక్షల మంది ఉద్యోగాలను ఊడగొట్టడమూ మోసమే.⇒ గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది కుదింపు పేరిట వారిని వేరే డిపార్ట్‌మెంట్లకు సర్దుబాటు చేసి అక్కడ ఖాళీలకు శాశ్వతంగా కోత పెట్టడమూ మోసమే.⇒ నిరుద్యోగ భృతి అని, నెల నెలా రూ.3,000 అని, ప్రతి ఇంటినీ మోసం చేయడం ఇంకో మోసం.⇒ తాము అధికారంలోకి వస్తే ఉద్యోగాలే ఉద్యోగాలు అంటూ ఊదరగొట్టి ఇప్పుడు ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్‌లో 18 వేల మందిని, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లనూ, ఫైబర్ నెట్ కార్పొరేషన్‌లోనూ, ఏపీ ఎండీసీలోనూ, వైద్య ఆరోగ్య శాఖలో పని చేస్తున్న వారిని తొలగించి వారి జీవితాలను నడిరోడ్డుపై నిలబెట్టడం కూడా మీరు చేస్తున్న మోసాల్లో భాగమే.⇒ అధికారంలోకి రాగానే ఐఆర్ ఇస్తామన్న మీ హామీపై ఇప్పటికీ ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం ఉద్యోగులకు చేస్తున్న మోసమే.⇒ ఉద్యోగులకు మెరుగైన పీఆర్‌సీ అంటూ ఉన్న పీఆర్‌సీ ఛైర్మన్‌ను బలవంతంగా రాజీనామా చేయించి, కొత్త పీఆర్‌సీ ఇంతవరకూ వేయకపోవడమూ ఇంకో మోసమే.⇒ ఒకటో తేదీనే జీతాలు అంటూ ఒకే ఒక నెల మాత్రమే ఇచ్చి, ఆ తర్వాత ప్రతి నెలా ఉద్యోగులు ఎదురు చూసేలా చేయడం కూడా మీరు చేసిన మోసాల్లో భాగమే.⇒ ఉద్యోగులకు ఇవ్వాల్సిన 3 డీఏలు పెండింగ్‌లో పెట్టడం కూడా ఒక అన్యాయమే.⇒ ట్రావెల్ అలవెన్స్‌లు, సరెండర్ లీవ్స్, మెడికల్ రీయింబర్స్‌మెంట్.. అన్నీ పెండింగ్‌లో పెట్టడం కూడా ఇంకో అన్యాయమే.⇒ ఉద్యోగస్తులకు సంబంధించి వారి జీఎల్‌ఐ, జీపీఎఫ్ కూడా మీ అవసరాలకు వాడేసుకుని ఉద్యోగులకు ఇబ్బందులు సృష్టించడం కూడా మీరు చేస్తున్న అన్యాయాల్లో భాగమే.⇒ మోసాలు, అన్యాయాలకు కేరాఫ్‌గా మారిన చంద్రబాబూ.. మీ వైఖరిపై ప్రజలు ఇప్పటికే ఆగ్రహంతో పోరాటాలు చేస్తున్నారు. ప్రజా పోరాటాలకు మా పార్టీ ఎప్పుడూ తోడుగా నిలుస్తుంది. 1. @ncbn గారూ… నిరుద్యోగులను, ఉద్యోగులనే కాదు అన్నివర్గాల ప్రజలనూ మోసం చేయడమే అలవాటుగా మార్చుకున్నారు. ఇప్పుడు గ్రూప్-2 అభ్యర్థులనుకూడా నిలువునా మోసం చేశారు.2. మూడు వారాలుగా గ్రూప్-2 అభ్యర్థుల అభ్యంతరాలను వింటున్నట్టు నటించి, వాటిని పరిగణలోకి తీసుకుని తగిన న్యాయం…— YS Jagan Mohan Reddy (@ysjagan) February 23, 2025

‘ఆరోగ్య భారతం’ అత్యావశ్యకం
న్యూఢిల్లీ: దేశంలో స్థూలకాయుల సంఖ్య నానాటికీ పెరిగిపోతుండడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తంచేశారు. ఒబేసిటీ నేడు అతిపెద్ద సమస్యగా మారిందని అన్నారు. దేశంలో ప్రతి ఎనిమిది మందిలో ఒకరు స్థూలకాయంతో బాధపడుతున్నట్లు పరిశోధనల్లో తేలిందని గుర్తుచేశారు. ఇండియాలో గత కొన్నేళ్లలో స్థూలకాయుల సంఖ్య రెండు రెట్లు పెరిగిందని చెప్పారు. ప్రధానంగా చిన్నారుల్లో స్థూలకాయ సమస్య విపరీతంగా పెరగడం నిజంగా ఆందోళనకరమేనని తెలిపారు. ఇండియా చక్కటి ఆరోగ్యకరమైన, దృఢమైన దేశంగా మారడం అత్యావశ్యకం అని ఉద్ఘాటించారు. ఆరోగ్య భారతం కోసం స్థూలకాయ సమస్యపై పోరాటం చేయాలని, ఇందులో భాగంగా ప్రతి ఒక్కరూ వంటనూనెల వినియోగాన్ని కనీసం 10 శాతం తగ్గించుకోవాలని సూచించారు. ఈ సూచన పాటించాలంటూ 10 మందికి తాను సవాల్ విసురుతున్నానని, ఆ 10 మందిలో ఒక్కొక్కరు మరో 10 మందికి ఇదే సవాల్ విసరాలని స్పష్టంచేశారు. ఈ శృంఖలాన్ని కొనసాగించాలని, అంతిమంగా ప్రజలంతా వంటనూనెల వినియోగాన్ని గణనీయంగా తగ్గించుకోవాలని, తద్వారా ఆరోగ్యానికి ఎనలేని మేలు జరుగుతుందని పిలుపునిచ్చారు. ఒలింపిక్ గోల్డ్ మెడల్ విజేత నీరజ్ చోప్రా సహా పలువురు ప్రముఖులు ఆడియో సందేశాన్ని ప్రధానమంత్రి ఈ సందర్భంగా వినిపించారు. స్థూలకాయాన్ని తగ్గించుకోవడానికి వారు ఇచ్చిన సలహాలు, సూచనలు ఇందులో ఉన్నాయి. ప్రధాని మోదీ ఆదివారం ‘మన్‌కీ బాత్’ కార్యక్రమంలో దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. అంతరిక్షం నుంచి క్రీడల దాకా పలు అంశాలను ప్రస్తావించారు. ఆయన ఏం మాట్లాడారంటే... మహిళల స్ఫూర్తిని గౌరవించుకోవాలి ‘‘వేర్వేరు రంగాల్లో మన మహిళలు ఎన్నో విజయాలు సాధించారు. వారిచ్చిన స్ఫూర్తిని మనం గౌరవించుకోవాలి. వచ్చే నెలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోబోతున్నాం. ఈ సందర్భంగా భారతదేశ నారీశక్తికి నా సెల్యూట్. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వచ్చే నెల 8వ తేదీన నా సోషల్ మీడియా ఖాతాలను మహిళా విజేతలకే అప్పగిస్తా. వారు తమ కార్యాచరణ, ఎదుర్కొన్న సవాళ్లు, సాధించిన విజయాలు, అనుభవాలను అందులో పంచుకోవచ్చు. ప్రజలకు సందేశం ఇవ్వొచ్చు. ఇందులో మీరు పాల్గొనాలంటే నమో యాప్ ద్వారా పేర్లు నమోదు చేసుకోండి. నేడు ఎన్నో కీలక రంగాల్లో మహిళల భాగస్వామ్యం పెరుగుతుండడం సంతోషంగా ఉంది. ‘ఒక్కరోజు సైంటిస్టు’గా మారడానికి విద్యార్థులు, యువత ప్రయత్నించాలి. ఈ నెల 28వ తేదీన నేషనల్ సైన్స్ డే సందర్భంగా రీసెర్చ్ ల్యాబ్‌లు లేదా ప్లానిటోరియమ్స్‌ను సందర్శించాలని కోరుతున్నా. ‘ఇస్రో’ సెంచరీ హర్షణీయం ఐసీసీ చాంపియన్స్ ట్రోపీ క్రికెట్ మ్యాచ్‌లు అభిమానులను అలరిస్తున్నాయి. ఎక్కడ చూసినా క్రికెట్ వాతావరణం, అభిమానుల సందడి కనిపిస్తోంది. క్రికెట్‌లో మన జట్టు సెంచరీ సాధిస్తే కలిగే ఆనందం అందరికీ తెలిసిందే. అంతరిక్ష రంగంలో మన దేశం ఇటీవలే సెంచరీ సాధించింది. గత నెలలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(నాసా) 100వ రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించింది. ఇది కేవలం ఒక సంఖ్య మాత్రమే కాదు. స్పేస్‌సైన్స్‌లో నిత్యం కొత్త శిఖరాలను అధిరోహించాలన్న మన పట్టుదల, అంకితభావానికి ఇదొక ప్రతీక’’. జింక మహిళ అనూరాధ రావు అనూరాధ రావు గురించి మీకు చెప్పాలి. అండమాన్ నికోబార్ దీవుల్లో జంతువుల సంరక్షణ కోసం ఆమె ఎంతగానో శ్రమిస్తున్నారు. చిన్నప్పటి నుంచే జంతువుల సేవలో నిమగ్నమయ్యారు. జంతుజాలం సంక్షేమం కోసం జీవితాన్ని అంకితం చేశారు. ప్రజలు ఆమెను ‘జింక మహిళ’ అని పిలుస్తుంటారు. వచ్చే నెలలో ‘వరల్డ్ వైల్డ్‌లైఫ్ డే’ నిర్వహించుకుంటాం. జంతుజాలం పరిరక్షణ కోసం శ్రమిస్తున్నవారిని ప్రోత్సహించండి’’ అని ప్రధాని మోదీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

కోహ్లి‘నూరు’.. పాకిస్తాన్ చిత్తు
ఇంట (పాక్‌లో) జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో... దుబాయ్‌లో జరిగిన పోరులో భారత్ చేతిలో... చిత్తుగా ఓడిన పాకిస్తాన్‌కు ఇక ఆతిథ్య మురిపెమే మిగలనుంది. సెమీఫైనల్‌కు వెళ్లే దారైతే మూసుకుపోయింది. 2017 విజేత పాక్.. గ్రూప్ ‘ఎ’లో అందరికంటే ముందే ని్రష్కమించే జట్టుగా అట్టడుగున పడిపోనుంది. ఈ ఆదివారం కోసం అందరూ ఎదురుచూసిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ సారథ్యంలోని భారత్ 6 వికెట్ల తేడాతో పాకిస్తాన్‌పై ఘనవిజయం సాధించింది. 2017లో తమపైనే ఫైనల్లో గెలిచి కప్‌ను లాక్కెళ్లిన పాక్ జట్టును టీమిండియా ఈసారి పెద్ద దెబ్బే కొట్టింది. అసలు కప్ రేసులో పడకముందే లీగ్ దశలోనే ని్రష్కమించేలా ఓడించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ 49.4 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌటైంది. సౌద్ షకీల్ (76 బంతుల్లో 62; 5 ఫోర్లు), రిజ్వాన్ (77 బంతుల్లో 46; 3 ఫోర్లు) రాణించారు. కుల్దీప్ 3 వికెట్లు, హార్దిక్ పాండ్యా 2 వికెట్లు తీశారు. అనంతరం భారత్ 42.3 ఓవర్లలో నాలుగే వికెట్లు కోల్పోయి 244 పరుగులు చేసి గెలిచింది. సులువైన విజయం ముంగిట విరాట్ కోహ్లి (111 బంతుల్లో 100 నాటౌట్; 7 ఫోర్లు) బౌండరీ కొట్టి సెంచరీని పూర్తి చేసుకోగా.. భారత్ కూడా లక్ష్యాన్ని అధిగమించింది. శ్రేయస్ అయ్యర్ (67 బంతుల్లో 56; 5 ఫోర్లు, 1 సిక్స్), శుబ్‌మన్ గిల్ (52 బంతుల్లో 46; 7 ఫోర్లు) రాణించారు. షాహిన్ షా అఫ్రిది 2 వికెట్లు తీశాడు. కోహ్లికి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ లభించింది. భారత్ తమ చివరి లీగ్ మ్యాచ్‌ను మార్చి 2న న్యూజిలాండ్‌తో ఆడుతుంది. భారత క్రికెట్ జట్టు పాకిస్తాన్ టీమ్‌కంటే ఒక ‘కాంతి సంవత్సరం’ ముందుంది! దుబాయ్‌లో ఇది మరోసారి రుజువైంది. అందరిలోనూ ఆసక్తి, చర్చను రేపుతూ ప్రసారకర్తలు, ప్రకటనకర్తలకు అతి పెద్ద బ్రాండ్ ఈవెంట్‌గా మారిన భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ మళ్లీ ఏకపక్షంగా ముగిసింది. మ్యాచ్ ఆరంభమైనప్పటి నుంచి టీమిండియా సంపూర్ణ ఆధిపత్యం కనబర్చగా, ఏ దశలోనూ పాక్ కనీస పోటీ ఇచ్చే స్థితిలో కనిపించలేదు.పిచ్ నెమ్మదిగా ఉండవచ్చు... పరుగులు రావడం కష్టంగా మారవచ్చు... అయినా సరే పాక్ బ్యాటింగ్ బృందం పేలవ ఆటతో అతి సాధారణ స్కోరుకే పరిమితమైంది... మన బౌలర్లు సమష్టిగా రాణిస్తూ ప్రత్యర్థి ని పూర్తిగా అడ్డుకున్నారు. ఆపై ఛేదనలో భారత్ అలవోకగా దూసుకుపోయింది... పాక్ బౌలర్లు టీమిండియాను ఏమాత్రం నిలువరించలేకపోయారు. పిచ్ ఎలా ఉన్నా సత్తా ఉంటే పరుగులు రాబట్టవచ్చనే సూత్రాన్ని చూపిస్తూ మన బ్యాటర్లంతా తమ స్థాయిని ప్రదర్శించాడు.ఎప్పటిలాగే ఛేదనలో వేటగాడైన విరాట్ కోహ్లి తన లెక్క తప్పకుండా పరుగులు చేస్తూ ఒకే షాట్‌తో భారత్‌ను గెలిపించడంతో పాటు తన శతకాన్ని కూడా పూర్తి చేసుకున్నాడు. తాజా గెలుపుతో భారత్ దాదాపు సెమీఫైనల్లో చోటు ఖాయం చేసుకోగా... రెండు పరాజయాల తర్వాత డిఫెండింగ్ చాంపియన్ పాక్ టోర్నీ నుంచి నిష్క్రమించడం దాదాపుగా ఖాయమైంది. ఆతిథ్య దేశమైన ఆ జట్టు ఇక తమ సొంతగడ్డకు వెళ్లి అభిమానుల మధ్య నామమాత్రమైన చివరి పోరులో ఆడటమే మిగిలింది. దుబాయ్: చాంపియన్స్ ట్రోఫీ వన్డే క్రికెట్ టోర్నమెంట్‌లో భారత్ దాదాపుగా సెమీఫైనల్ స్థానాన్ని ఖాయం చేసుకుంది. తొలి పోరులో బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన రోహిత్ శర్మ బృందం ఇప్పుడు గ్రూప్ ‘ఎ’ రెండో మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ పాకిస్తాన్ జట్టుపై గెలిచింది. ఆదివారం జరిగిన పోరులో భారత్ 6 వికెట్ల తేడాతో పాకిస్తాన్‌పై ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ 49.4 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌటైంది. సౌద్ షకీల్ (76 బంతుల్లో 62; 5 ఫోర్లు) అర్ధ సెంచరీ సాధించగా... కెప్టెన్ మొహమ్మద్ రిజ్వాన్ (77 బంతుల్లో 46; 3 ఫోర్లు), ఖుష్‌దిల్ షా (39 బంతుల్లో 38; 2 సిక్స్‌లు) ఫర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్‌కు 3 వికెట్లు దక్కగా...హార్దిక్ పాండ్యా 2 కీలక వికెట్లు తీశాడు. అనంతరం భారత్ 42.3 ఓవర్లలో 4 వికెట్లకు 244 పరుగులు చేసి విజయాన్నందుకుంది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ విరాట్ కోహ్లి (111 బంతుల్లో 100 నాటౌట్; 7 ఫోర్లు) సెంచరీ సాధించాడు. శుబ్‌మన్ గిల్ (52 బంతుల్లో 46; 7 ఫోర్లు), శ్రేయస్ అయ్యర్ (67 బంతుల్లో 56; 5 ఫోర్లు, 1 సిక్స్) అండగా నిలిచారు. కోహ్లి, అయ్యర్ మూడో వికెట్‌కు 114 పరుగులు జోడించారు. తమ ఆఖరి మ్యాచ్‌లో వచ్చే ఆదివారం న్యూజిలాండ్‌తో భారత్ తలపడుతుంది. షకీల్ అర్ధ సెంచరీ... షమీ నియంత్రణ కోల్పోయి వేసిన తొలి ఓవర్‌తో పాక్ ఇన్నింగ్స్ మొదలైంది. ఈ ఓవర్లో అతను ఏకంగా 5 వైడ్‌లు వేయడంతో మొత్తం 11 బంతులతో ఓవర్ పూర్తి చేయాల్సి వచ్చింది! ఆ తర్వాత బాబర్ ఆజమ్ (26 బంతుల్లో 23; 5 ఫోర్లు) చక్కటి కవర్‌డ్రైవ్‌లతో పరుగులు రాబట్టాడు. అయితే బాబర్‌ను పాండ్యా వెనక్కి పంపించగా, అక్షర్ ఫీల్డింగ్‌కు ఇమామ్ ఉల్ హక్ (10) రనౌటయ్యాడు. ఈ దశలో రిజ్వాన్, షకీల్ జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. అయితే వీరిద్దరు మరీ నెమ్మదిగా ఆడటంతో పరుగుల వేగం మందగించింది. ఒకదశలో 32 బంతుల తర్వాత గానీ బౌండరీ రాలేదు.హార్దిక్ పాండ్యా చక్కటి స్పెల్ (6–0–18–1)తో పాక్‌ను కట్టి పడేసాడు. తొలి 10 ఓవర్లలో 52 పరుగులు చేసిన జట్టు తర్వాతి 10 ఓవర్లలో 27 పరుగులు మాత్రమే రాబట్టగలిగింది. ఆ తర్వాతా ఒక దశలో వరుసగా 53 బంతుల పాటు ఫోర్ రాలేదు! అనంతరం కాస్త ధాటిని పెంచిన షకీల్ 63 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అక్షర్ బౌలింగ్‌లో ముందుకొచ్చి షాట్ ఆడబోయే క్రమంలో రిజ్వాన్ బౌల్డ్ కావడంతో 104 పరుగుల మూడో వికెట్ భాగస్వామ్యానికి తెర పడింది. మరో 14 పరుగుల వ్యవధిలో షకీల్, తాహిర్ (4) వెనుదిరగ్గా... ఆపై కుల్దీప్ వరుస బంతుల్లో 2 వికెట్లు తీసి దెబ్బ కొట్టాడు. చివర్లో ఖుష్‌దిల్ కాస్త వేగంగా ఆడటంతో పాక్ ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది. శతక భాగస్వామ్యం... స్వల్ప లక్ష్యమే అయినా భారత్ తమ ఇన్నింగ్స్‌ను ధాటిగా ప్రారంభించింది. ఛేదనలో రోహిత్ శర్మ (15 బంతుల్లో 20; 3 ఫోర్లు, 1 సిక్స్), గిల్ చకచకా పరుగులు రాబట్టారు. అయితే షాహిన్ అఫ్రిది అద్భుత బంతితో రోహిత్‌ను క్లీన్»ౌల్డ్ చేయడంతో జట్టు తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత అఫ్రిది వరుస రెండు ఓవర్లలో కలిపి 5 ఫోర్లు బాదిన గిల్ జోరు ప్రదర్శించాడు. మరోవైపు కోహ్లి కూడా తనదైన శైలిలో చక్కటి షాట్లతో ఆధిక్యం ప్రదర్శించాడు. కోహ్లితో రెండో వికెట్‌కు 69 పరుగులు జోడించిన తర్వాత గిల్ వెనుదిరిగాడు. ఈ దశలో కోహ్లి, అయ్యర్ పార్ట్‌నర్íÙప్ జట్టును గెలుపు దిశగా తీసుకెళ్లింది.వీరిద్దరు ఎక్కడా తడబాటు లేకుండా చక్కటి సమన్వయంతో దూసుకుపోయారు. వీరిని నిలువరించేందుకు పాక్ బౌలర్లు తీవ్రంగా ప్రయత్నించినా లాభం లేకపోయింది. ఈ క్రమంలో కోహ్లి 62 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 25 పరుగుల వద్ద అయ్యర్ ఇచ్చిన క్యాచ్‌ను షకీల్ వదిలేయడం కూడా కలిసొచ్చింది. అనంతరం 63 బంతుల్లో అతని హాఫ్ సెంచరీ పూర్తయింది. విజయానికి 28 పరుగుల దూరంలో అయ్యర్... 19 పరుగుల దూరంలో హార్దిక్ పాండ్యా (8) అవుటైనా ... అక్షర్ పటేల్ (3 నాటౌట్)తో కలిసి కోహ్లి మ్యాచ్ ముగించాడు. స్కోరు వివరాలు పాకిస్తాన్ ఇన్నింగ్స్: ఇమామ్ (రనౌట్) 10; బాబర్ (సి) రాహుల్ (బి) పాండ్యా 23; షకీల్ (సి) అక్షర్ (బి) పాండ్యా 62; రిజ్వాన్ (బి) అక్షర్ 46; సల్మాన్ (సి) జడేజా (బి) కుల్దీప్ 19; తాహిర్ (బి) జడేజా 4; ఖుష్‌దిల్ (సి) కోహ్లి (బి) రాణా 38; అఫ్రిది (ఎల్బీ) (బి) కుల్దీప్ 0; నసీమ్ (సి) కోహ్లి (బి) కుల్దీప్ 14; రవూఫ్ (రనౌట్) 8; అబ్రార్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 17; మొత్తం (49.4 ఓవర్లలో ఆలౌట్) 241. వికెట్ల పతనం: 1–41, 2–47, 3–151, 4–159, 5–165, 6–200, 7–200, 8–222, 9–241, 10–241. బౌలింగ్: షమీ 8–0–43–0, హర్షిత్ రాణా 7.4–0–30–1, హార్దిక్ పాండ్యా 8–0–31 –2, అక్షర్ పటేల్ 10–0–49–1, కుల్దీప్ యాదవ్ 9–0–40–3, జడేజా 7–0–40–1. భారత్ ఇన్నింగ్స్: రోహిత్ శర్మ (బి) షాహిన్ అఫ్రిది 20; గిల్ (బి) అబ్రార్ 46; విరాట్ కోహ్లి (నాటౌట్) 100; శ్రేయస్ అయ్యర్ (సి) ఇమామ్ (బి) ఖుష్‌దిల్ 56; పాండ్యా (సి) రిజ్వాన్ (బి) షాహిన్ అఫ్రిది 8; అక్షర్ (నాటౌట్) 3; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (42.3 ఓవర్లలో 4 వికెట్లకు) 244. వికెట్ల పతనం: 1–31, 2–100, 3–214, 4–223. బౌలింగ్: అఫ్రిది 8–0–74–2, నసీమ్ షా 8–0–37–0, హారిస్ రవూఫ్ 7–0–52–0, అబ్రార్ 10–0–28–1, ఖుష్‌దిల్ 7.3–0–43–1, సల్మాన్ 2–0–10–0.సెంచరీ నంబర్ 82లక్ష్య ఛేదనలో భారత్ అలవోకగా విజయం వైపు దూసుకుపోతోంది...36 ఓవర్లు ముగిసే సరికి భారత్ స్కోరు సరిగ్గా 200కు చేరింది. 84 బంతుల్లో 42 పరుగులు చేయడం ఇక లాంఛనమే! సరిగ్గా ఇక్కడే అభిమానులు ఫలితం గురించి కాకుండా కోహ్లి శతకం గురించి ఆలోచించడం మొదలు పెట్టారు. ఆ సమయంలో విరాట్ స్కోరు 81. అంటే మరో 19 పరుగులు కావాలి. కానీ మరో వైపు అయ్యర్, పాండ్యా చకచకా పరుగులు రాబట్టడంతో ఉత్కంఠ పెరిగింది. పరుగులు తరుగుతూ పోవడంతో అటు వైపు బ్యాటర్ పరుగులు చేయరాదని, కోహ్లి సెంచరీ పూర్తి చేసుకోవాలని అంతా కోరుకున్నారు. ముందుగా అయ్యర్ 7, ఆపై పాండ్యా 8 పరుగులు చేశారు! పాండ్యా అవుటయ్యే సమయానికి కోహ్లి 86 వద్ద ఉన్నాడు. విజయానికి 19 పరుగులు కావాలి. ఈ సమయంలో అక్షర్ కాస్త సంయమనం పాటించాడు. సింగిల్స్ తీసే అవకాశం ఉన్నా ఆగిపోయాడు. దాంతో కోహ్లి పని సులువైంది. గెలుపు కోసం 2 పరుగులు చేయాల్సిన స్థితిలో కోహ్లి 96 వద్ద ఉన్నాడు. తర్వాతి బంతికి ఎక్స్‌ట్రా కవర్ మీదుగా ఫోర్ కొట్టడంతో కోహ్లి 51వ వన్డే సెంచరీ, భారత్ గెలుపు పూర్తయ్యాయి. విరాట్ స్థాయి దిగ్గజానికి శతకాలు కొత్త కాదు. కానీ పెర్త్‌లో సెంచరీ తర్వాత అతని బ్యాటింగ్‌లో తడబాటు కనిపించింది. తర్వాతి నాలుగు టెస్టుల్లో ఘోర వైఫల్యంతో పాటు రంజీ మ్యాచ్‌లో కూడా నిరాశపర్చాడు. ఆ తర్వాత ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో ఒక హాఫ్ సెంచరీ చేసినా బంగ్లాతో మ్యాచ్‌లో మళ్లీ విఫలం. ఇలాంటి స్థితిలో పాకిస్తాన్ లాంటి జట్టుపై చేసిన సెంచరీ ఎంతో కీలకమైంది. అతనిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచడంతో పాటు సచిన్ ‘100’ సెంచరీల మైలురాయికి మరింత చేరువ చేసింది. 14000 వన్డేల్లో 14 వేల పరుగులు దాటిన మూడో ఆటగాడిగా కోహ్లి నిలిచాడు. సచిన్ (350), సంగక్కర (378)కంటే చాలా తక్కువ ఇన్నింగ్స్ (287)లలో అతను ఈ మైలురాయిని దాటాడు.158 వన్డేల్లో కోహ్లి క్యాచ్‌ల సంఖ్య. అత్యధిక క్యాచ్‌లు పట్టిన భారత ఫీల్డర్‌గా అజహరుద్దీన్ (156) రికార్డును అతను అధిగమించాడు. 82 అంతర్జాతీయ క్రికెట్‌లో మూడు ఫార్మాట్‌లలో కలిపి కోహ్లి శతకాల సంఖ్య. వన్డేల్లో 51, టెస్టుల్లో 30, టి20ల్లో 1 సెంచరీ అతని ఖాతాలో ఉన్నాయి. సెమీస్ చేరే అవకాశం ఉన్న కీలక మ్యాచ్‌లో ఈ తరహాలో ఆడటం సంతృప్తిగా ఉంది. రోహిత్ అవుటైన తర్వాత మధ్య ఓవర్లలో ఎలాంటి సాహసోపేత షాట్లకు పోకుండా జాగ్రత్తగా ఆడే బాధ్యత నాపై పడింది. ఇది సరైన వ్యూహం. నేను వన్డేల్లో ఎప్పుడూ ఇలాగే ఆడతాను. నా ఆట గురించి నాకు చాలా బాగా తెలుసు. బయటి విషయాలను పట్టించుకోకుండా నా సామర్థ్యాన్ని నమ్ముకోవడం ముఖ్యం. ఎన్నో అంచనాలు ఉండే ఇలాంటి మ్యాచ్‌లలో వాటిని అందుకోవడం నాకు కష్టం కాదు. స్పిన్‌లో జాగ్రత్తగా ఆడుతూ పేస్ బౌలింగ్‌లో పరుగులు రాబట్టాలనే స్పష్టత నాకు ఉంది. గిల్, అయ్యర్ కూడా బాగా ఆడారు. ఈ ఇన్నింగ్స్‌తో నేను చాలా అలసిపోయాను. తర్వాతి మ్యాచ్‌కు వారం రోజుల విరామం ఉంది. 36 ఏళ్ల వయసు ఉన్న నాకు ఇది సంతోషాన్ని కలిగించే విషయం. –విరాట్ కోహ్లి చాంపియన్స్ ట్రోఫీలో నేడున్యూజిలాండ్ X బంగ్లాదేశ్‌మధ్యాహ్నం గం. 2:30 నుంచి స్టార్ స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం

నేటి నుంచి ఏపీ బడ్జెట్ సమావేశాలు
సాక్షి, అమరావతి: శాసనసభ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. సోమవారం ఉదయం 10 గంటలకు ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగంతో సమావేశాలు ప్రారంభమవుతాయి. అనంతరం సభ వాయిదా పడనుంది. మధ్యాహ్నం 12 గంటల సమయంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు అధ్యక్షతన జరిగే బీఏసీ సమావేశంలో సభను ఎన్ని రోజులు నిర్వహించాలి? ప్రవేశ పెట్టాల్సిన బిల్లులు, చర్చించాల్సిన అంశాలు, తీర్మానాలను నిర్ణయిస్తారు. ప్రాథమికంగా మూడు వారాలపాటు సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. 25వ తేదీన గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానాన్ని ప్రవేశపెట్టి చర్చిస్తారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో 26, 27వ తేదీల్లో సభకు సెలవు ఇవ్వనున్నారు. 28వ తేదీన ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ శాసన సభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. దానికి ముందు మంత్రివర్గం సమావేశమై బడ్జెట్‌కు ఆమోదం తెలపనుంది. బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత సభను వాయిదా వేసే అవకాశం ఉంది. మార్చి 1, 2వ తేదీలు సెలవు రోజులు కావడంతో తిరిగి 3వ తేదీన సభ ప్రారంభం కానుంది. ⇒ ఈ సమావేశాలకు ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ కాంగ్రెస్ పార్టీ సభ్యులు హాజరవుతారనే సమాచారంతో ఆంక్షలు పెంచారు. భద్రత పేరుతో మంత్రులు, ఎమ్మెల్యేల ప్రవేశాలు, రాకపోకలకు సంబంధించి నిబంధనలను పెంచారు. అసెంబ్లీ, శాసన మండలికి వెళ్లేందుకు వేర్వేరు రంగులతో పాస్‌లు ఇచ్చారు. అధికారులు, మీడియా, విజిటర్లు, పోలీసులకు ప్రత్యేక పాస్‌లు జారీ చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కూటమికి చెందిన పార్టీలకు ఎన్ని కావాలంటే అన్ని పాసులు జారీ చేసి వైఎస్సార్‌సీపీకి మాత్రం చాలా పరిమితంగా పాసులు ఇచ్చారు.

‘నాటో’లో చేర్చుకుంటే పదవి వదులుకుంటా..
కీవ్: ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సంచలన ప్రకటన చేశారు. ఉక్రెయిన్‌ను ‘నాటో’ కూటమిలో చేర్చుకుంటే అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవడానికి తాను సిద్ధమేనని తేల్చిచెప్పారు. ఉక్రెయిన్‌లో శాంతిని, నాటో సభ్యత్వాన్ని కోరుకుంటున్నామని ఉద్ఘాటించారు. ఆదివారం రాజధాని కీవ్‌లో ప్రభుత్వ అధికారుల సమావేశంలో జెలెన్‌స్కీ మాట్లాడారు. ఉక్రెయిన్‌పై రష్యా సైన్యం దండయాత్ర ప్రారంభించి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా ఈ సమావేశం నిర్వహించారు. భేటీ అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. నాటో సైనిక కూటమి రక్షణ కింద ఉక్రెయిన్ భద్రంగా ఉండాలన్నదే తన ఉద్దేశమని వివరించారు. నాటో ఛత్రఛాయలో ఉక్రెయిన్‌లో శాశ్వతంగా శాంతియుత పరిస్థితులు నెలకొంటాయని భావిస్తున్నట్లు తెలిపారు. శాంతి కోసం పదవి నుంచి దిగిపోవడానికి ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. ‘‘ఉక్రెయిన్‌లో శాంతిని సాధించడానికి నేను అధ్యక్ష పదవిని వదుకోవాల్సిన అవసరం తప్పనిసరిగా ఉందంటే, అందుకు సిద్ధంగా ఉన్నాను’’ అని స్పష్టంచేశారు. అధ్యక్షుడిగా పదేళ్లు అధికారంలో ఉండాలన్నది తన కల కాదని వ్యాఖ్యానించారు. ‘జెలెన్‌స్కీ ఒక నియంత’ అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ఆరోపణలపైనా స్పందించారు. ట్రంప్ వ్యాఖ్యలను అభినందనగా భావించడం లేదని తేలిగ్గా కొట్టిపారేశారు. సోమవారం యూరోపియన్ నేతలతో జరిగే సమావేశం ‘టర్నింగ్ పాయింట్’ అవుతుందని భావిస్తున్నట్లు తెలిపారు. తమకు ఇప్పుడు సహకారం అవసరమని అన్నారు. తమ స్వాతంత్య్రాన్ని, గౌరవాన్ని కోల్పోయే ప్రసక్తే లేదని స్పష్టంచేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఉక్రెయిన్–రష్యా యుద్ధాన్ని సాధ్యమైనంత త్వరగా ముగించాలన్న లక్ష్యంతో ఉన్నారు. ఉక్రెయిన్‌లో ఎన్నికలు నిర్వహించాలని ట్రంప్‌తోపాటు రష్యా అధినేత పుతిన్ అంటున్నారు. ప్రస్తుతం యుద్ధం జరుగుతుండడంతో ఉక్రెయిన్‌లో మార్షల్ లా విధించారు. ఎన్నికలపై నిషేధం అమల్లో ఉంది. ఈ నేపథ్యంలో పదవి నుంచి తప్పుకోవడానికి అభ్యంతరం లేదని జెలెన్‌స్కీ స్వయంగా ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ముఖ్యంగా అమెరికా నుంచి వస్తున్న ఒత్తిళ్లతో ఆయన ఈ ప్రకటన చేసినట్లు తెలుస్తోంది.

ఆరోగ్య బీమా.. భారం తగ్గేదెలా?
ఆరోగ్య అత్యవసర స్థితి చెప్పి రాదు. ఆహారం, నిద్ర వేళల్లో మార్పులు.. గంటల తరబడి కూర్చొని చేసే ఉద్యోగాల ప్రభావంతో జీవనశైలి వ్యాధుల రిస్క్ పెరిగింది. వీటి కారణంగా ఆస్పత్రి పాలైతే బిల్లులు చెల్లించడం మెజారిటీ వ్యక్తులకు అసాధ్యమే కాదు, ఆర్థికంగా కుదేలయ్యే పరిస్థితి. ఇలాంటి అనిశ్చితులకు రక్షణ కవచమే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ. కరోనా తర్వాత వీటి ప్రీమియంలు దాదాపుగా రెట్టింపయ్యాయి. మోయలేనంత భారంగా మారాయి. ఇది చూసి ఇప్పటికీ హెల్త్ ప్లాన్‌కు దూరంగా ఉన్నవారు ఎందరో. కానీ, ప్రతి వ్యక్తికీ, ప్రతి కుటుంబానికీ ఇది తప్పనిసరి. కావాలంటే ప్రీమియం తగ్గించుకునే మార్గాన్ని వెతకండి. అంతేకానీ, ఆరోగ్యపరంగా, ఆర్థికంగా రక్షణ కల్పించే హెల్త్ ఇన్సూరెన్స్‌కు దూరంగా ఉండొద్దనేది నిపుణుల మాట! ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) అధ్యయనం ప్రకారం.. దేశంలో 35 శాతం మంది హైపర్‌టెన్షన్ (అధిక రక్తపోటు)తో బాధపడుతున్నారు. 10 శాతం మందికి మధుమేహం సమస్య ఉంటే, 28 శాతం మంది అధిక కొలెస్ట్రాల్‌ను ఎదుర్కొంటున్నారు. జీవనశైలి వ్యాధులు ఏ స్థాయిలో పెరుగుతున్నాయో ఈ అధ్యయనం స్పష్టం చేస్తోంది. మరోవైపు వైద్య రంగంలో అత్యాధునిక చికిత్సా విధానాలు.. మరింత కచ్చితత్వంతో, మెరుగైన ఫలితాలనిచ్చే రోబోటిక్ సర్జరీలు అందుబాటులోకి వస్తున్నాయి. ఈ వ్యయాలను అందరూ భరించలేరు. అందుకే హెల్త్ ఇన్సూరెన్స్ తప్పకుండా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆరోగ్యంగా ఉన్నప్పుడే.. హెల్త్ ఇన్సూరెన్స్‌ను వీలైనంత చిన్న వయసులోనే తీసుకోవాలి. అంటే ఆరోగ్యంగా ఉన్నప్పుడు తీసుకోవడం వల్ల ప్రీమియం తక్కువగా ఖరారవుతుంది. వయసు, ఆరోగ్య చరిత్ర తదితర అంశాలను బీమా సంస్థ పాలసీ జారీకి ముందు మదింపు చేస్తుంది. హెల్త్ ఇన్సూరెన్స్ కొనుగోలు విషయంలో.. 25 ఏళ్ల వయసు వ్యక్తికి, 40 ఏళ్ల వయసు వ్యక్తికి ప్రీమియంలో ఎంతో వ్యత్యాసం ఉంటుంది. చిన్న వయసులో, ఆరోగ్యంగా ఉన్నప్పుడు పాలసీ తీసుకుంటే, ఆ తర్వాతి కాలంలో ప్రీమియం పెరగదా? అన్న సందేహం రావచ్చు. 35 ఏళ్లు నిండిన తర్వాత, 45 ఏళ్లు, 55 ఏళ్లు, 60 ఏళ్లు నిండిన తర్వాత వయసువారీ ప్రీమియం రేట్లు కచ్చితంగా సవరణకు నోచుకుంటాయి. కానీ, 35–40 ఏళ్ల తర్వాత కొత్తగా పాలసీ తీసుకునే వారితో పోల్చితే, 25 ఏళ్లలోపు వారికి ప్రీమియం తక్కువే ఉంటుంది. ఆరోగ్యంగా ఉన్నప్పుడు తీసుకుంటే, మూడేళ్లలో అన్ని రకాల వెయిటింగ్ పీరియడ్‌లు దాటేస్తారు. ముందస్తు వ్యాధులకు సైతం కవరేజీ అర్హత లభిస్తుంది. పైగా పాలసీ తీసుకుని 60 నెలలు (ఐదేళ్ల ప్రీమియం చెల్లింపులు) ముగిస్తే, ఆరోగ్య చరిత్రను సరిగ్గా వెల్లడించలేదనో, సమాచారం దాచిపెట్టారనే కారణంతో క్లెయిమ్‌ను బీమా సంస్థ తిరస్కరించడానికి కుదరదని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. ముందుగా తీసుకోవడం వల్ల ఇన్ని ప్రయోజనాలతోపాటు ప్రీమియం భారం తగ్గుతుంది. బోనస్, రీస్టోరేషన్ కేవలం రూ.5 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్‌నే తీసుకున్నప్పటికీ అదనపు ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేకుండా కవరేజీని పెంచుకునే మార్గాలు కూడా ఉన్నాయి. దాదాపు అన్ని బీమా కంపెనీలు నో క్లెయిమ్ బోనస్, రీస్టోరేషన్ ఫీచర్లను అందిస్తున్నాయి. ఒక పాలసీ సంవత్సరంలో ఎలాంటి క్లెయిమ్ లేకపోతే 50–200 శాతం మేర సమ్ అష్యూర్డ్ (బీమా కవరేజీ)ను నో క్లెయిమ్ బోనస్ రూపంలో బీమా సంస్థలు ఇస్తుంటాయి. అప్పుడు రూ.5 లక్షల కవరేజీ రూ.10–15 లక్షలకు చేరుతుంది. రీస్టోరేషన్ సదుపాయం అన్నది.. హాస్పిటల్‌లో చేరినప్పుడు కవరేజీ పూర్తిగా అయిపోతే అంతే మొత్తాన్ని తిరిగి ఆ పాలసీ సంవత్సరానికి పునరుద్ధరించడం. కొన్ని బీమా సంస్థలు ఏడాదిలో ఒక్క రీస్టోరేషన్‌నే ఇస్తుంటే, కేర్, ఆదిత్య బిర్లా హెల్త్ ఇన్సూరెన్స్ తదితర కంపెనీలు కొన్ని ప్లాన్లలో అపరిమిత రీస్టోరేషన్ సదుపాయాలను ఆఫర్ చేస్తున్నాయి. ఇవి తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి. దీనివల్ల బేస్ సమ్ అష్యూర్డ్ తక్కువగా ఎంపిక చేసుకున్నప్పటికీ ఎలాంటి నష్టం ఉండదు. పైగా ప్రీమియం భారం తగ్గుతుంది. చిన్న క్లెయిమ్‌లకు దూరం ఏడాదిలో ఎలాంటి క్లెయిమ్ లేకపోతేనే నో క్లెయిమ్ బోనస్ వస్తుంది. కనుక చిన్న క్లెయిమ్‌లకు దూరంగా ఉండాలి. ఉదాహరణకు రూ.5 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్‌కు ఎలాంటి క్లెయిమ్ లేకపోతే ఏటా 50 నుంచి 100 శాతం చొప్పున సమ్ అష్యూర్డ్ పెరుగుతుంది. ఒకవేళ క్లెయిమ్ చేస్తే ఎంత అయితే పెరిగిందో, అంతే మేర తగ్గిపోతుంది. కనుక చిన్న క్లెయిమ్ కోసం రూ.2.5–5 లక్షల సమ్ అష్యూర్డ్‌ను ఒక ఏడాదిలో నష్టపోవాల్సి వస్తుంది. అందుకే రూ.50 వేల లోపు చిన్న వ్యయాలను సొంతంగా భరించడమే మంచిది. మంచి ఆహారం, జీవనశైలి.. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నాం కదా అన్న భరోసాతో ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేస్తామా? అలా చేయడం మన సమస్యలను మరింత పెంచుతుంది. మంచి ఆరోగ్యం కోసం తమ వంతు కృషి చేయాల్సిందే. దీనివల్ల ఆస్పత్రి పాలు కావడాన్ని సాధ్యమైన మేర నివారించొచ్చు. దీనివల్ల ప్రీమియం కూడా తగ్గుతుంది. హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీల్లో చాలా వరకు ఈ ప్రయోజనాన్ని అందిస్తున్నాయి. ఎన్ని కేలరీలు ఖర్చు చేస్తే అంత ప్రయోజనం లభిస్తుంది. రోజువారీ నడక, పరుగు, ఏరోబిక్ వ్యాయా మాలు చేయడం ద్వారా హెల్త్ క్రెడిట్స్ పొందొచ్చు. వీటిని ప్రీమియంలో సర్దుబాటు చేసుకోవచ్చు. తద్వారా ప్రీమియంలో 100% రాయితీని సైతం కొన్ని సంస్థలు ఆఫర్ చేస్తున్నాయి. ముఖ్యంగా పొగతాగడం, మద్యపానం, గుట్కా/జర్దాలకు దూరంగా ఉండాలి. ఈ అలవాట్ల గురించి ఆరోగ్య చరిత్రలో వెల్లడించాల్సిందే. వీటి కారణంగా ప్రీమియం గణనీయంగా పెరిగిపోతుంది. వీటిని మానేయడం ద్వారా ప్రీమియం తగ్గించుకోవచ్చు.సూపర్ టాపప్ నేటి రోజుల్లో నలుగురు సభ్యుల ఒక కుటుంబానికి కనీసం రూ.10 లక్షల హెల్త్ కవరేజీ ఉండాలి. కొన్ని సందర్భాల్లో ఇది కూడా చాలకపోవచ్చు. కానీ, రూ.10 లక్షల హెల్త్ ప్లాన్ కోసం 30 ఏళ్ల వ్యక్తి కుటుంబానికి రూ. 20 వేల వరకు ప్రీమియం చెల్లించాల్సి వస్తుంది. దీనికి బదులు రూ.5 లక్షల బేసిక్ ఇండెమ్నిటీ ప్లాన్ పరిశీలించొచ్చు. దీనికి అదనంగా రూ.5 లక్షల డిడక్టబుల్‌తో సూపర్ టాపప్ ప్లాన్ తీసుకోవాలి. ఉదాహరణకు రూ.50 లక్షల సూపర్ టాపప్ ప్లాన్ రూ.3,000కే వస్తుంది. ఇందులో మొదటి రూ.5 లక్షల బిల్లును మినహాయించి, ఆపై ఉన్న మొత్తానికి చెల్లింపులు లభిస్తాయి. రూ.10 లక్షల హెల్త్ ప్లాన్ ప్రీమియం అందుబాటు ధరలోనే వస్తే, అప్పుడు రూ.10 లక్షల డిడక్టబుల్‌తో రూ.50 లక్షలు లేదా రూ.కోటికి సూపర్ టాపప్ ప్లాన్ జోడించుకోవడం మంచి నిర్ణయం అవుతుంది. మెరుగైన క్రెడిట్ స్కోర్ వ్యక్తిగత రుణ చరిత్రకు, హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంకు సంబంధం ఏంటని అనుకుంటున్నారా?.. కొన్ని బీమా సంస్థలు మెరుగైన సిబిల్ స్కోర్ ఉన్న కస్టమర్లకు ప్రీమియంలో తగ్గింపు ఇస్తున్నాయి. ఎక్కువ స్కోరు ఉందంటే.. ఆర్థిక క్రమశిక్షణతో నడుచుకుంటున్నారని అర్థం. ఇలాంటి వారిని తక్కువ రిస్క్ కస్టమర్లుగా చూస్తూ ప్రీమియంలో డిస్కౌంట్ ఆఫర్ చేస్తున్నాయి. 15 శాతం వరకు తగ్గింపు పొందొచ్చు.ఆన్‌లైన్‌లో కొనుగోలు హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీ, ఫీచర్లపై అవగాహన కలిగిన వారు ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయడం ద్వారా ప్రీమియంలో డిస్కౌంట్ పొందొచ్చు. పైగా పాలసీబజార్ పోర్టల్‌పై మొబైల్ ఓటీపీతో లాగిన్ అయ్యి, అన్ని బీమా సంస్థల పాలసీలను పరిశీలించొచ్చు. వాటి ఫీచర్లు, ప్రీమియం వ్యత్యాసాన్ని గమనించొచ్చు. తద్వారా మెరుగైన ఫీచర్లతో, తక్కువ ప్రీమియంతో ఉండే పాలసీని గుర్తించొచ్చు. బీమా సంస్థ పోర్టల్ ద్వారా నేరుగా పాలసీని కొనుగోలు చేయవచ్చు. దీనివల్ల స్వయంగా వివరాలు నమోదు చేయడం, నియమ, నిబంధనల గురించి అవగాహన కూడా ఏర్పడుతుంది. కొంత రాజీపడితే? సదుపాయాల విషయంలో కొంత రాజీధోరణితో వెళ్లేట్టు అయితే అప్పుడు కూడా ప్రీమియం భారాన్ని గణనీయంగా తగ్గించుకోవచ్చు. ఇందులో రూమ్ టైప్ ఒకటి. ఆస్పత్రిలో చేరినప్పుడు రోగికి ఐసీయూ వెలుపల పడక అవసరమవుతుంది. జనరల్ వార్డ్, షేరింగ్, సింగిల్ రూమ్, డీలక్స్ రూమ్ ఇలా పలు రకాలుంటాయి. పడక విషయంలో ఎలాంటి పరిమితుల్లేని పాలసీకి ఎక్కువ మంది మొగ్గు చూపిస్తుంటారు. ఒక విధంగా ఇదే సౌకర్యమైనది. ప్రీమియం భరించగలిగే వారు రూమ్ రెంట్‌లో పరిమితులు లేకుండా ఎంపిక చేసుకోవాలి. ప్రీమియం భారంగా భావించే వారు.. షేరింగ్ ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవచ్చు. ఎందుకంటే ప్రైవేటు రూమ్‌ల్లోని సేవలతో పోల్చినప్పుడు షేరింగ్‌లో అందించే వైద్య సేవల చార్జీలు తక్కువగా ఉంటాయి. కనుక మొత్తం మీద బిల్లు తగ్గుతుంది. ఇది బీమా సంస్థపై భారాన్ని తగ్గిస్తుంది. షేరింగ్‌లోనూ రోగికి మెరుగైన సేవలే అందుతాయి. కనుక దీన్ని పరిశీలించొచ్చు. పైన చెప్పుకున్న అన్ని ఆప్షన్లు దాటి వచి్చన తర్వాత కూడా ప్రీమియం భారంగా అనిపిస్తే.. కోపేమెంట్‌కు వెళ్లడమే. ఈ విధానంలో ప్రతి ఆస్పత్రి బిల్లులో పాలసీదారు తన వంతు చెల్లించాల్సి వస్తుంది. ఉదాహరణకు 10 శాతం కో–పేమెంట్ ఎంపిక చేసుకున్నారని అనుకుందాం. రూ.2 లక్షల బిల్లు వచి్చనప్పుడు రోగి తన జేబు నుంచి రూ.20 వేలు చెల్లించాల్సి ఉంటుంది. ఇంతకంటే ఎక్కువ కోపేమెంట్ ఆప్షన్‌కైనా వెళ్లొచ్చు. కానీ, దీనివల్ల ఏటా ప్రీమియం భారం తగ్గుతుంది కానీ, ఆస్పత్రిలో చేరినప్పుడు ఆ మేరకు జేబుపై భారం పడుతుందిఈఎంఐ రూపంలో హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం ఏడాదికి ఒకే వాయిదాలో చెల్లించాల్సి ఉంటుంది. జీవిత బీమాలో మాదిరి నెలవారీ లేదా త్రైమాసికం లేదా ఆరు నెలలకోసారి ఆప్షన్ లేదు. హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం గణనీయంగా పెరిగిన నేపథ్యంలో ఒకే విడత అంత మొత్తం అంటే భారంగా అనిపించొచ్చు. అలాంటి వారు ఈఎంఐ ఆప్షన్ ఎంపిక చేసుకోవచ్చు. కొన్ని రకాల కార్డులపై బీమా సంస్థలు ఈ సదుపాయం కల్పిస్తున్నాయి. నెట్‌వర్క్ ఆస్పత్రుల్లోనే.. ప్రతి హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ నెట్‌వర్క్ ఆస్పత్రులతో ఒక జాబితాను నిర్వహిస్తుంటుంది. తమ క్లయింట్లకు కొంచెం తగ్గింపు రేట్లపై సేవలు అందించే దిశగా ఆయా ఆస్పత్రులతో బీమా కంపెనీకి టైఅప్ ఉంటుంది. కనుక నాన్ నెట్‌వర్క్ ఆస్పత్రులతో పోల్చి చూస్తే నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో చికిత్స తీసుకోవడం వల్ల తక్కువ చార్జీలు పడతాయి. ఈ మేరకు బీమా కంపెనీలకు ఆదా అవుతుంది. కనుక స్టార్ హెల్త్ వంటి కొన్ని బీమా సంస్థలు నెట్‌వర్క్ ఆస్పత్రుల్లోనే చికిత్స తీసుకుంటే ప్రీమియంలో 15 శాతం వరకు రాయితీని అందిస్తున్నాయి. ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్ కుటుంబంలో ప్రతి ఒక్కరికీ ఇండివిడ్యువల్ హెల్త్ కవరేజీ తీసుకుంటే ప్రీమియం ఎక్కువ పడుతుంది. దీనికి బదులు కుటుంబం అంతటికీ ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీ తీసుకోవాలి. ఎందుకంటే కుటుంబంలో అందరికీ కలిపి కవరేజీ ఒక్కటే అవుతుంది. కనుక ప్రీమియం తగ్గుతుంది. వెల్‌నెస్ ప్రయోజనాలు ఉపయోగించుకోవాలి.. తీసుకునే హెల్త్ ప్లాన్‌లో హెల్త్ చెకప్ వంటి వెల్‌నెస్ ప్రయోజనాలు ఉండేలా చూసుకోవాలి. దీనివల్ల ఏడాదికోసారి ఉచితంగా అన్ని రక్త పరీక్షలు చేయించుకోవచ్చు. ఇందుకు అదనంగా పడే ప్రీమియం ఉండదు. కానీ, ఆరోగ్యం ఎలా ఉందన్నది గమనించుకోవచ్చు. ఈ మేరకు కొంత ఆదా చేసినట్టే అవుతుంది. – సాక్షి, బిజినెస్ డెస్క్

న్యాయ వ్యవస్థకు తాడు మీద నడక
రణవీర్ అలహాబాదియా కేసు ఎంత సంక్లిష్టమో సుప్రీంకోర్టు దాన్ని డీల్ చేసిన తీరు తేటతెల్లం చేస్తోంది. ఈ విచారణ... నైతిక ఆగ్రహానికీ, రాజ్యాంగ ఔచిత్యానికీ నడుమ తాడు మీద చేసిన నడకను తలపిస్తోంది. వాదప్రతివాదాలు విన్న తర్వాత యూ ట్యూబ్ ఇన్‌ఫ్లుయెన్సర్ రణవీర్‌కు ఊరట కల్పిస్తూ న్యాయస్థానం మధ్యంతర ఉత్త ర్వులు జారీ చేసింది. రణవీర్ సామాజిక మాధ్యమాల్లో ప్రముఖ వ్యక్తి. ‘ఇండియా గాట్ లేటెంట్’ అనే వెబ్ టాలెంట్ షోలో అతను చేసిన వ్యాఖ్యలపై అనేక ఎఫ్‌ఐఆర్‌లు దాఖలు అయ్యాయి. ఆ వ్యాఖ్యలు సరదా కోసమే చేసినప్పటికీ వాటిపై దేశవ్యాప్తంగా ఆగ్రహం పెల్లుబికింది. మీడియా సంస్థలు, రాజకీయ నేతలు గగ్గోలు పెట్టడం అగ్నికి ఆజ్యం పోసి నట్లయింది. రణవీర్ భాష ఎంత అసహ్యకరంగా ఉంది అన్నది న్యాయపరంగా ప్రధాన ప్రశ్న కాదు, అది భారతీయ చట్టాల ప్రకారం నేరపూరిత అపరాధం అవుతుందా అవ్వదా అన్నదే ముఖ్యం. ఆయన న్యాయవాది అభినవ్ చంద్రచూడ్ న్యాయస్థానంలో చేసిన ఈ వాదన ఎంతైనా సమంజసం. వారికీ రాజ్యాంగ రక్షణ అవసరంకానీ కోర్టు ఇలాంటి సూక్ష్మ అంశాలను పట్టించుకునే మూడ్‌లో లేదు. భాష ‘డర్టీ’గా, ‘పర్వర్టెడ్’గా ఉందంటూ విచారణ ఆసాంతం ఆ వివాదాస్పద వ్యాఖ్యలపై తన ఏహ్యభావం వ్యక్తం చేసింది. ఒక దశలో న్యాయమూర్తి కల్పించుకుని, ‘‘ఇలాంటి భాషను మీరు సమర్థిస్తున్నారా?’’ అని చంద్రచూడ్‌ను ప్రశ్నించారు. నిజానికి డిఫెన్స్ లాయర్ పాత్ర... అత్యంత తీవ్ర నేరారోపణలు ఎదుర్కొంటున్ననిందితుడికి సైతం న్యాయవ్యవస్థ ద్వారా చట్టపరమైన రక్షణ లభించేట్లు చూడటమే!సుప్రీంకోర్టు సమాజ నైతికతకు సంరక్షకురాలు కాదు. భావ ప్రకటన స్వేచ్ఛ, వ్యక్తిగత స్వేచ్ఛ వంటి రాజ్యాంగ హక్కులను కాపాడటమే దాని ప్రాథమిక విధి. భావప్రకటన స్వేచ్ఛను పరిరక్షించడం అంటే జనామోదం పొందిన భావప్రకటనను పరిరక్షించడం అనుకోకూడదు. అప్రియమైన, జనాదరణ లేని భావప్రకటన చేసి నప్పుడు అలాంటి వారికి రాజ్యాంగపరమైన రక్షణ అవసరం అవుతుంది.అభినవ్ చంద్రచూడ్ ఈ విచారణ సందర్భంగా న్యాయ సూత్రాల మీదకు కోర్టు దృష్టిని మరల్చారు. అపూర్వ అరోరా వెబ్ సిరీస్ (కాలేజ్ రొమాన్స్) కేసును ఉదహరిస్తూ, అసభ్యత మాత్రమే అశ్లీలత అవ్వదన్న సుప్రీం తీర్పును ఆయన ప్రస్తావించారు. ఒకరి భావప్రకటన ఇతరుల లైంగిక వాంఛలను ప్రేరేపించడానికి ఉద్దేశించి నదా, హద్దులు దాటి నేరపూరితమైన అశ్లీలతకు అది కారణమైందా అనే అంశాల ప్రాతిపదికగా దాన్ని పరీక్షకు పెట్టాలని ఈ తీర్పు చెబుతోంది. న్యాయస్థానం దీన్ని పట్టించుకున్నట్లు లేదు. ‘‘ఇది అశ్లీలత కాకుంటే, మరేది అశ్లీలత అవుతుంది?’’ అని ప్రశ్నించింది. కోర్టులు నైతిక శూన్యంలో పని చేయాలని అనడం లేదు. అలా అని వాటి నైతిక పరమైన ఏహ్యత... న్యాయ తర్కాన్ని కప్పివేయకూడదు. అరోరా కేసు ‘‘మీరు ఏదనుకుంటే అది మాట్లాడేందుకు లైసెన్స్ ఇచ్చిందా?’’ అని కోర్టు ప్రశ్నించడం గమనార్హం. తన వ్యక్తిగత మర్యాద భావన నుంచి వాక్ స్వాతంత్య్ర సంరక్షణను వేరు చేయడానికి కోర్టు విముఖంగా ఉన్నట్లు ఈ ప్రశ్న సంకేతాలు ఇచ్చింది. వివాదాస్పద వ్యాఖ్యలతో కేసు ఎదుర్కొంటున్న ‘యూట్యూబ్ ఇన్‌ఫ్లుయెన్సర్’ రణవీర్ అలహాబాదియా పితృస్వామ్య కథనంరణవీర్‌ను చంపేస్తామని బెదిరింపులు వస్తున్నట్లు ఆయన న్యాయవాది చంద్రచూడ్ కోర్టు దృష్టికి తీసుకురాగా, జస్టిస్ సూర్య కాంత్ చేసిన వ్యాఖ్య ప్రస్తుత హియరింగ్‌లో అత్యంత కలవరం కలిగించిన అంశం! ఈ తరహాలో చౌకబారు ప్రచారం పొందాలని మీరు ప్రయత్నించినట్లే, బెదిరింపుల ద్వరా చౌకబారు ప్రచారం సంపాదించాలని ప్రయత్నించే వారు కూడా ఉంటారు అని ఆయన వ్యాఖ్యానించారు. రణవీర్ మాటలు ఎంత అభ్యంతర కరమైనవి అన్నది పక్కనపెడితే, చంపేస్తామనే బెదిరింపులు వాటికి పర్యవ సానం కారాదు. రణవీర్ వ్యాఖ్యలు తన తల్లిదండ్రులకు అవమానం కలిగించా యని విచారణలో కోర్టు పదేపదే ప్రస్తావించింది. భారతీయ సాంస్కృతిక నియమాలను ఈ పితృస్వామ్య నెరేటివ్ ప్రతిఫలిస్తుంది. రాజ్యాంగంలో దీనికి చోటు లేదు. న్యాయస్థానాలు నైతికతకు పున రావాస కేంద్రాలు కావు. రణవీర్ నేరం చేశాడా లేదా అన్నదానికి... అతడు తన కుటుంబాన్ని సిగ్గుతో తలదించుకునేలా చేశాడన్నది సంబంధం లేని విషయం. సామాజిక తిరస్కారాన్ని చట్టపరమైన నేరారోపణతో ముడిపెట్టడం అనేది కోర్టులు దాటకూడని ప్రమాదకమైన రేఖ. కోర్టు చిట్టచివరకు రణవీర్‌కు మధ్యంతర ఉపశమనం మంజూరు చేసింది. ప్రతివాదులకు నోటీసు జారీచేసి వారి సమాధానం కోరింది. ఇది సరైన నిర్ణయం. రణవీర్ వ్యాఖ్యలకు అభ్యంతరకర స్వభావం ఉన్నప్పటికీ, వాటిని నేరంగా గుర్తించడానికి అది చాలదు.‘ఇండియా గాట్ లేటెంట్’ వెబ్ షో వివాదం, పెద్దలకు మాత్రమే ఉద్దేశించిన ఈ కార్యక్రమ స్వభావం సందర్భపరమైన ఒక ముఖ్యమైన అంశం లేవనెత్తింది. రణవీర్ వ్యాఖ్యల క్లిప్ అసందర్భంగా లీక్ అయ్యింది. ఆ విషయం కోర్టుకూ తెలిసినట్లే ఉంది. అయినా విచారణలో ఈ ఎరుక ప్రభావం కనిపించలేదు. భావప్రకటన స్వేచ్ఛ కేసుల్లో సంద ర్భానికి చాలా ప్రాధాన్యం ఉంటుంది. మూక ప్రేరేపిత నైతిక భయాందోళనల నుంచి కోర్టులు వాక్ స్వేచ్ఛను పరిరక్షించాలి. న్యాయస్థానాలు తమ విచారణలో ఎంత సంయమనం పాటించాల్సి ఉంటుందో గుర్తు చేసేందుకు రణవీర్ కేసు చక్కటి ఉదా హరణగా నిలుస్తుంది. న్యాయమూర్తులు కూడా మనుషులే. అందరి లానే వారికీ అసహ్యం, కోపం, అనైతికత పట్ల ఏహ్యభావం ఉంటాయి. కాని వారి వృత్తి... భావోద్వేగాలకు లోనై తీర్పులు చెప్పేది కాదు. రాగద్వేషాలకు అతీతంగా నిష్పక్షపాతంగా న్యాయాన్ని పరిరక్షించాలి. జనాభిప్రాయం వేరేలా ఉన్నప్పుడు ఈ విధి కష్టతరంగానే ఉంటుంది. కత్తి మీద సాములా వారు తమ విద్యుక్త ధర్మం నిర్వర్తించాల్సి వస్తుంది. విచారణ జరగాల్సిన తీరువ్యక్తిగత స్వేచ్ఛను పరిరక్షించడానికి రాజ్యాంగానికి లోబడి అంతిమంగా తాను ఏం చేయాలో అదే మన సర్వోన్నత న్యాయ స్థానం చేసింది. మధ్యంతర ఉపశమనం మంజూరు చేస్తూ ఉత్తర్వు జారీ చేసింది. అయితే, ఈ క్రమంలో అది వ్యవహరించిన తీరు ప్రజలకు అస్పష్ట సంకేతాలు పంపింది. న్యాయవ్యవస్థ నిన్ను కాపాడు తుంది... కానీ ఆ పని నిన్ను అవమానానికి గురి చేసిన తర్వాతే,అసంతృప్తితోనే నీ హక్కులను గౌరవిస్తున్నట్లు నీకు స్పష్టం చేసిన తర్వాతే, నీ మీద తన నైతిక ఆధిక్యతను రుజువు చేసుకున్న తర్వాత మాత్రమే జరుగుతుందని చెప్పకనే చెప్పింది. రాజ్యాంగబద్ధ న్యాయస్థానాలు పని చేయాల్సిన తీరు ఇది కాదు. జనామోదం కొరవడిన వారికీ, అభ్యంతకరమైన వారికీ, ఆఖరుకు పెర్వర్ట్ అయిన వారికీ ప్రజాస్వామ్యంలో భావప్రకటన స్వేచ్ఛ ఉంటుంది. దాన్ని కాపాడేందుకే సుప్రీం కోర్టు ఉన్నది. అసభ్యత నుంచి సమాజాన్ని శుద్ధి చేయడం తన బాధ్యత కాదనీ, తనకు దీపస్తంభంలా నిలవాల్సింది చట్టమే కాని నైతికత కానేకాదనీ న్యాయ స్థానం గుర్తు పెట్టుకోవాలి. అలా గుర్తు పెట్టుకుంటూ ఈ కేసు విచా రణ కొనసాగిస్తుందని ఆశిద్దాం.సంజయ్ హెగ్డే వ్యాసకర్త సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాది(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో)
ఓయూ పీహెచ్డీ ప్రవేశపరీక్షకు 4800 దరఖాస్తులు
పర్యాటకంపై ప్రై‘వేటు’
అవస్థల ‘అపార్’!
ఆక్సిజన్ ఛాంబరే అతని ఆఫీస్
రేపటి నుంచి బయో ఏషియా
ఇది కూటమి చెక్‌పోస్టు.. ఓకే అంటేనే ముందుకు!
బడుగు పరిశ్రమలపై కూటమి పిడుగు
1967 ఉలకదు.. పలకదు
ఏప్రిల్‌లో ఏఐసీసీ భేటీ
స్థూల భారతం.. మందుల మార్గం!
'తండేల్' రామారావుకు రూ. 20 లక్షలు, ఇల్లు: మత్స్యకారులు
IND Vs PAK: పాకిస్తాన్‌తో మ్యాచ్.. టీమిండియాకు భారీ షాక్!
విరాట్ కోహ్లి ప్రపంచ రికార్డు.. సచిన్‌కు సాధ్యం కాని ఘనత
లంకపై భారత్ మాస్టర్స్ గెలుపు
టీసీఎస్‌లో ఉద్యోగం ఇక మరింత కష్టం!
Hanamkonda: నిద్రలోనే కన్నుమూసిన కవలలు
ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.. వ్యాపార వృద్ధి
IND vs PAK: రోహిత్ శర్మ వరల్డ్ రికార్డు..
‘ఏంటిది?’.. రిజ్వాన్ చర్యకు హర్షిత్ రాణా రియాక్షన్ వైరల్.. గంభీర్ కూడా!
పిల్లర్లు లేకుండా ఇందిరమ్మ ఇళ్లు!
ఓయూ పీహెచ్డీ ప్రవేశపరీక్షకు 4800 దరఖాస్తులు
పర్యాటకంపై ప్రై‘వేటు’
అవస్థల ‘అపార్’!
ఆక్సిజన్ ఛాంబరే అతని ఆఫీస్
రేపటి నుంచి బయో ఏషియా
ఇది కూటమి చెక్‌పోస్టు.. ఓకే అంటేనే ముందుకు!
బడుగు పరిశ్రమలపై కూటమి పిడుగు
1967 ఉలకదు.. పలకదు
ఏప్రిల్‌లో ఏఐసీసీ భేటీ
స్థూల భారతం.. మందుల మార్గం!
'తండేల్' రామారావుకు రూ. 20 లక్షలు, ఇల్లు: మత్స్యకారులు
IND Vs PAK: పాకిస్తాన్‌తో మ్యాచ్.. టీమిండియాకు భారీ షాక్!
విరాట్ కోహ్లి ప్రపంచ రికార్డు.. సచిన్‌కు సాధ్యం కాని ఘనత
లంకపై భారత్ మాస్టర్స్ గెలుపు
టీసీఎస్‌లో ఉద్యోగం ఇక మరింత కష్టం!
Hanamkonda: నిద్రలోనే కన్నుమూసిన కవలలు
ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.. వ్యాపార వృద్ధి
IND vs PAK: రోహిత్ శర్మ వరల్డ్ రికార్డు..
‘ఏంటిది?’.. రిజ్వాన్ చర్యకు హర్షిత్ రాణా రియాక్షన్ వైరల్.. గంభీర్ కూడా!
పిల్లర్లు లేకుండా ఇందిరమ్మ ఇళ్లు!
సినిమా

సందేశంతో...
వాతావరణ పరిరక్షణపై సామాజిక సందేశం నేపథ్యంలో రూపొందిన చిత్రం ‘బందీ’(Bandhi). ఆదిత్య ఓం(Aditya Om) ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకు రఘు తిరుమల దర్శకత్వం వహించారు. గల్లీ సినిమాపై వెంకటేశ్వర్ రావు దగ్గు, రఘు తిరుమల నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 28న రిలీజ్ కానుంది.‘‘భారతదేశంతో పాటు ఇతర విదేశాల్లోని అనేక అటవీ ప్రాంతాల్లో రియల్ లొకేషన్స్‌లో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. పర్యావరణ ప్రేమికులందరినీ ఈ సినిమా కదిలించేలా ఉంటుంది. అటవీ ప్రాంతంలో అనేక సవాళ్లు ఎదుర్కొంటూ ఆదిత్య ఓం అద్భుతంగా నటించారు’’ అని యూనిట్ పేర్కొంది.

అమ్మాయి కాదనుకుని లోపలకు రానివ్వలేదన్న వర్ష.. కుటుంబంతో రోడ్డుమీద అమర్..
టాలీవుడ్ నటి సురేఖ కూతురు సుప్రిత (Suprita) త్వరలోనే హీరోయిన్గా పరిచయం కానుంది. బిగ్‌బాస్ 7 రన్నరప్ అమర్దీప్ చౌదరి (Amardeep Chowdary)తో కలిసి ప్రస్తుతం ఓ సినిమా చేస్తోంది. ఇదిలా ఉంటే ఈ మధ్యే ఆమె యాంకర్ అవతారమెత్తింది. పీలింగ్స్ విత్ సుప్రిత అనే టాక్ షో చేస్తోంది. తాజాగా ఈ షోకు నటుడు అమర్దీప్, కమెడియన్ వర్ష అతిథులుగా విచ్చేశారు. సముద్రంలో సునామీని, కెమెరా ముందు సుప్రితను ఎవ్వరూ ఆపలేరు అని డైలాగ్ వేసింది. అందుకు అమర్.. 'సునామీలో T సైలెంట్.. ఆవిడ (సుప్రిత) వచ్చిందంటే జనాలు సైలెంట్' అన్నాడు.అమ్మాయిని కాదనుకుని..మీరు అమ్మాయా? అబ్బాయా? అని వర్షను ప్రశ్నించింది. అందుకామె.. నేను అమ్మాయిని కాదనుకుని ఒక పార్లర్లోనికి పంపించలేదని తెలిపింది. ఎంత డౌట్ వస్తే అలా చేసుంటారు? అని ఆశ్చర్యం వ్యక్తం చేసింది. బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలే తర్వాత ఓ సంఘటన జరిగింది కదా.. అప్పుడు మీ రియాక్షన్ ఏంటి? అని సురేఖ ప్రశ్నించింది. అందుకు అమర్.. ఆరోజు నేను నా కుటుంబంతో రోడ్డు మీద నిల్చున్నాను. నేనేం చేయాలనుకుంటున్నానో ఆ దారిలో వెళ్తున్నాను. లాస్ట్ బట్ నాట్ లీస్ట్.. బ్రో, వి డోంట్ కేర్ అని చెప్పుకొచ్చాడు.చదవండి: ఆ హీరోయిన్ను చూశాక నా ఆలోచన మార్చుకున్నా: లక్ష్మీ మంచు

'తండేల్' రామారావుకు రూ. 20 లక్షలు, ఇల్లు: మత్స్యకారులు
నాగచైతన్య- సాయిపల్లవి నటించిన తండేల్ సినిమా (Thandel Movie) భారీ విజయం సాధించింది. పద్నాలుగు నెలలు పాకిస్తాన్ జైలులో మగ్గిపోయిన 22 మంది మత్స్యకారుల జీవితాలను ఆధారంగా చేసుకొని ఈ సినిమాను తెరకెక్కించారు. అయితే, ఈ సినిమాతో తండేల్ రామారావు బాగా పాపులర్ కావడమే కాకుండా ఆయన చిత్ర యూనిట్ నుంచి ఎక్కువగా లబ్ధి పొందాడంటూ మిగిలిన మత్స్యకారులు మీడియా ముందుకు వచ్చారు. సినిమాలో సగం నిజమే చెప్పినా.., చూపించని కోణాలు ఎన్నో ఉన్నాయని వారు చెబుతున్నారు. గనగళ్ల రామారావు, ఆయన సతీమణి నూకమ్మకు దక్కుతున్న గౌరవం, లబ్ధి.. 21 మత్స్యకార కుటుంబాలకు దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.రామారావుకు మాత్రమే గౌరవంమత్స్యలేశం గ్రామంలో 21 మత్స్యకార కుటుంబాలు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి తండేల్ రామారావు గురించి సంచలన విషయాలు పంచుకున్నారు. 'సినిమాలో రియల్ తండేల్ రామారావు ఒక్కడే అని చూపారు. అందులో ఎలాంటి నిజం లేదు. పాకిస్థాన్‌కు దొరికిన మూడు బోట్లలో ముగ్గురు తండేల్‌లు ఉన్నారు. కేవలం రామారావు చేసిన తప్పు వల్లే మేము పాకిస్థాన్‌కు దొరికిపోయాం. మేము హెచ్చిరించినా మాట వినకుండా రామారావు బోటును ముందుకు పోనిచ్చాడు. దీంతో పాక్ దళాలకు దొరికిపోయాం. కానీ, సినిమా విషయానికి వస్తే కేవలం రామారావు, అతడి భార్య నూకమ్మకు మాత్రమే గౌరవం దక్కుతుంది. మిగిలిన 21 మత్స్యకార కుటుంబాలకు ఎలాంటి గౌరవం దక్కడం లేదు. (చదవండి: దుబాయ్‌లో టాలీవుడ్ సెలబ్రిటీలు.. అఖిల్ 'నాటు నాటు' స్టెప్పులు)చెప్పుతో కొట్టినట్లు..సినిమా కథ రాసిన కార్తీక్, రామారావు మాకు తీరని అన్యాయం చేశారు. సినిమా ప్రారంభంలో మా 20 మంది మత్స్యకారుల కుటుంబాలకు రూ. 45 వేల చొప్పున ఇచ్చి సంతకాలు చేయించుకున్నారు. అయితే, రామారావు, ఆయన బావమరిది ఎర్రయ్యకు మాత్రం చెరో రూ. 90 వేలు ఇచ్చారు. కొద్దిరోజుల క్రితం శ్రీకాకుళంలో జరిగిన తండేల్ ఈవెంట్‌కు మా 20 కుటుంబాలను పిలిపించి.. కనీసం స్టేజీ మీదకు కూడా పిలవలేదు. స్టేజీ మీద రామారావు, ఆయన సతీమణి నూకమ్మ మాత్రమే ఉన్నారు. మమ్మల్ని పిలిపించి చెప్పుతో కొట్టినంత పని చేశారు. వారిద్దరికి సినిమా కథ రచయిత కార్తీక్ అండదండలు ఎక్కువగా ఉన్నాయి. ఎవరి వల్ల రిలీజయ్యామో అందరికీ తెలుసుఈ సినిమాతో రామారావు జీవితం మాత్రం మారిపోయింది. ఆయనకు ఒక ఇళ్లు, రూ. 20 లక్షల డబ్బు చిత్ర యూనిట్ నుంచి అందినట్లు తెలుస్తోంది. అందుకే రామారావు కూడా వారు ఏం చెబితే అది మీడియా ముందు మాట్లాడుతున్నాడు. అతనితో పాటు మేము కూడా పాకిస్థాన్ జైల్లో ఉన్నాం. అక్కడ ఏం జరిగిందో మాకూ తెలుసు. ఎవరి వల్ల విడుదలయ్యామో కూడా అందరికీ తెలుసు. మేము స్టేజీ ఎక్కితే అవన్నీ చెబుతామని ఆ అవకాశం లేకుండా చేశారు. రామారావు, కథా రచయిత కార్తీక్ మమ్మల్ని మోసం చేశారు. వాళ్లు మాత్రమే లబ్ధి పొందారు. మాకు ఎలాంటి సాయం చేయలేదు' అని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేశారు.చదవండి: ఎంత పని చేశావు రా మనోజ్.. సుహాస్ ఎమోషల్ పోస్ట్

పావుకిలో టమాట రూ.850, పుట్టగొడుగు రూ.5 లక్షలు.. రానా షాప్‌లో రేట్లు ఎక్కువే!
చాలామంది ఇప్పుడు ఒకే ఆదాయవనరుపై ఆధారపడకుండా సైడ్ బిజినెస్‌లు కూడా చేస్తున్నారు. ఈ క్రమంలోనే రానా (Rana Daggubati) దంపతులు హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఫుడ్ స్టోర్స్ అనే షాప్‌ను జనవరిలో ప్రారంభించారు. ఇక్కడ కిరాణా సరుకులతో పాటు కూరగాయలు, పండ్లు, మాంసం, దుస్తులు, షూలు, బ్యాగ్స్, హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ ఇలా అన్నీ దొరుకుతాయి. అయితే అన్నీ ప్రీమియం సరుకులే ఉంటాయి. బయట ఎక్కడా దొరకని అంతర్జాతీయ ఐటంస్ ఈ చోట లభించడం విశేషం.ఖరీదైన కూరగాయలుఈ ఫుడ్ స్టోరీస్‌లో స్మూతీస్, జ్యూస్, కాఫీ, చాక్లెట్స్, నూడుల్స్.. ఇలా ఎన్నో ఉన్నాయి. క్రికెటర్ విరాట్ కోహ్లి వంటి ప్రముఖులు ఉపయోగించే వాటర్ బాటిల్స్ కూడా ఉన్నాయి. విదేశాల్లో మాత్రమే దొరికే ప్రత్యేక చీజ్‌లు, డ్రై ఫ్రూట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. దాదాపు ఆరు కిలోల మష్రూమ్ ఈ ఫుడ్ స్టోరీస్‌లో ఉంది. దీని విలువ ఏకంగా రూ.5 లక్షలు. మామూలు పుట్టగొడుగులు 100 గ్రాముల ధర రూ.175 నుంచి వెయ్యి రూపాయలపైనే ఉంది. కొబ్బరి బోండా వెయ్యి రూపాయలుకూరగాయల్ని సైతం విదేశాలనుంచి తీసుకొస్తారు. మెక్సికో, స్పెయిన్, నెదర్లాండ్స్.. ఇలా ఎన్నో దేశాల నుంచి దిగుమతి చేస్తారు. ఉదాహరణకు నెదర్లాండ్స్ నుంచి తీసుకొచ్చిన టమాట ధర 200 గ్రాములకుగానూ రూ.850గా నిర్ణయించారు. ఒక గ్లాస్ చెరకు రసం రూ.275గా ఉంది. థాయ్‌లాండ్‌కు చెందిన కొబ్బరి బోండాం ఒక్కోటి వెయ్యి రూపాయలని తెలుస్తోంది. ఈ ధరలు చూసిన నెటిజన్లు.. రానా- మిహికా పెట్టిన షాప్ కేవలం ధనవంతులకేనని, సామాన్యులు ఇక్కడ ఏదీ కొనే పరిస్థితి లేదని కామెంట్లు చేస్తున్నారు.చదవండి: అరియానాకు ఏమైంది? బక్కచిక్కిపోయి.. అస్థిపంజరంలా!
క్రీడలు

క్రీడల మంత్రి... సైకిల్ సవారీ...
న్యూఢిల్లీ: దేశం నుంచి ఊబకాయాన్ని పారద్రోలాలంటే ప్రతి ఒక్కరూ దైనందిన జీవితంలో వ్యాయామాన్ని భాగం చేసుకోవాలని కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ పిలుపునిచ్చారు. ఆదివారం న్యూఢిల్లీలో నిర్వహించిన ‘ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమంలో కేంద్ర క్రీడల మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ... ‘ఊబకాయంపై అవగాహన అత్యవసరం. ప్రధాని నరేంద్ర మోదీ చెప్పినట్లు రోజువారీ జీవితంలో వ్యాయామం ఎంతో ముఖ్యం. సైక్లింగ్ అతి సులువైన ఎక్స్‌ర్‌సైజ్. దీని వల్ల ఆరోగ్యం మెరుగవడంతో పాటు... పర్యావరణానికి కూడా ఎంతో మేలు జరుగుతుంది. ప్రతి రోజూ సైక్లింగ్ చేసే వాళ్లు కాలుష్యాన్ని నివారించడంతో పాటు ఆరోగ్యాన్ని కాపాడుకోగలరు’ అని అన్నారు. ఈ సందర్భంగా మాండవీయ సైకిల్ తొక్కి ప్రజల్లో ఫిట్‌నెస్‌పై అవగాహన పెంచే ప్రయత్నం చేశారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ఐసీసీఐ, సీఐఐ ప్రతినిదులు పాల్గొన్నారు. ప్రతి వారం ఒక్కో రంగానికి చెందిన ఔత్సాహికులు ఈ సైకిల్ ర్యాలీలో పాల్గొంటున్నారు. గతంలో ఆర్మీ అధికారులు, పోస్ట్మెన్లు, వెల్‌నెస్ నిపుణులు ఇలా పలు రంగాలకు చెందిన వాళ్లు ఇందులో పాల్గొన్నారు. ర్యాలీలో పాల్గొన్న ఒలింపియన్ అర్జున్‌లాల్ జాట్ మాట్లాడుతూ... ‘ఒక అథ్లెట్‌గా ప్రజల్లో ఆరోగ్యంపై వస్తున్న అవగాహన చూస్తుంటే సంతోషంగా ఉంది. ఆదివారం ఉదయం పెద్ద సంఖ్యలో ప్రజలు వ్యాయామం కోసం సమయాన్ని వెచ్చించడం ఆహ్వానించదగ్గ విషయం. ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టడం ప్రతి ఒక్కరి బాధ్యత. ఆ దిశగా ‘ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమం దేశ ప్రజల్లో స్ఫూర్తి నింపుతోంది’ అని అన్నారు. మరోవైపు గువాహటిలోని భారత క్రీడా ప్రాధికార సంస్థ కేంద్రంలో నిర్వహించిన ర్యాలీలో భారత మెడికల్ అసోసియేషన్‌కు చెందిన వందలాది మంది వైద్యులు పాల్గొని ఆరోగ్యంపై అవగాహన కల్పించారు. ఓవరాల్‌గా దేశంలోని 4,200 కేంద్రాల్లో ‘ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆదివారం ఒక్క రోజే దేశంలో 1200 ప్రాంతాల్లో ఈ ర్యాలీలు జరిగినట్లు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రతి నెల చివరి ఆదివారం ప్రధానమంత్రి దేశ ప్రజలతో తన మనసులోని మాటలు పంచుకునే ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో భాగాగా ఆదివారం నరేంద్ర మోదీ ఒబేసిటీ గురించి ప్రస్తావించారు. ఊబకాయాన్ని పారదోలేందుకు వంట నూనెల వినియోగాన్ని 10 శాతం తగ్గించుకోవాలని దేశ ప్రజలకు సూచించారు.

జాతీయ కబడ్డీ విజేత సర్వీసెస్
కటక్: ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన జాతీయ సీనియర్ కబడ్డీ చాంపియన్‌షిప్‌లో సర్వీసెస్ జట్టు విజేతగా అవతరించింది. ఆదివారం జరిగిన తుదిపోరులో సర్వీసెస్ జట్టు టైబ్రేక్‌లో 6–4 పాయింట్ల తేడాతో రైల్వేస్‌పై విజయం సాధించింది. నువ్వా నేనా అన్నట్లు సాగిన పోరు నిర్ణీత సమయంలో 30–30 పాయింట్లతో సమం అయింది. దాంతో విజేతను తేల్చేందుకు టైబ్రేక్ నిర్వహించగా సర్వీసెస్ రెండు పాయింట్లతో పైచేయి సాధించింది.ప్రొ కబడ్డీ లీగ్ స్టార్ నవీన్ కుమార్ సారథ్యంలో బరిలోకి దిగిన సర్వీసెస్ జట్టు టోర్నీ ఆసాంతం కనబర్చిన నిలకడనే ఫైనల్లోనూ కొనసాగించింది. పీకేఎల్ 11వ సీజన్ విజేతలైన జైదీప్ దహియా, రాహుల్ సర్వీసెస్ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. అంతకుముందు సెమీఫైనల్లో సర్వీసెస్ 43–35 పాయింట్ల తేడాతో పంజాబ్‌పై విజయం సాధించగా... మరో సెమీస్‌లో రైల్వేస్ 42–34 పాయింట్ల తేడాతో ఉత్తరప్రదేశ్‌పై గెలుపొందింది.

తారలు తరలి వెళ్లారు...
దుబాయ్: దాయాదుల దమ్మెంతో ప్రత్యక్షంగా చూసేందుకు తారలంతా దుబాయ్‌కి తరలి వెళ్లారు. ఏదో ఒక రంగమని కాకుండా... సినీ, క్రీడా, వ్యాపార, రాజకీయ రంగాలకు చెందిన హేమాహేమీలతో దుబాయ్ స్టేడియం ఓ తారాతీరమైంది. మైదానంలో భారత ఆటగాళ్లు, గ్యాలరీలో భారత అతిరథులతో స్టేడియం కళకళలాడింది.టీమిండియా క్రికెటర్లు జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, అభిషేక్ శర్మ, టీమిండియా మాజీ సభ్యులు శిఖర్ ధావన్, వెంకటేశ్ ప్రసాద్... తెలుగు సినీ ప్రముఖులు మెగాస్టార్ చిరంజీవి, ‘పుష్ప’ సీక్వెల్స్‌తో పాన్ ఇండియా డైరెక్టర్ అయిన సుకుమార్, బాలీవుడ్ నుంచి హీరోయిన్ సోనమ్ కపూర్ తన భర్త ఆనంద్ అహుజాతో కలిసి రాగా, వివేక్ ఒబెరాయ్, ఊర్వశీ రౌతేలా, మేఘాలయ ముఖ్యమంత్రి కాన్‌కర్డ్ సంగ్మా, త్రిపుర వెస్ట్ నియోజకవర్గం లోక్‌సభ సభ్యుడు బిప్లాబ్ కుమార్ దేబ్, ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, బ్రిటన్ పాప్ సింగర్ జాస్మిన్ వాలియా, బాలీవుడ్ చిత్ర గీతాలతో పాపులర్ అయిన పాకిస్తాన్ సింగర్ అతీఫ్ అస్లామ్ తదితరులతో వీఐపీ గ్యాలరీలు కొత్త శోభను సంతరించుకున్నాయి. పాకిస్తాన్ దిగ్గజ క్రికెటర్ షాహిద్ అఫ్రిది, ఇమాద్ వసీమ్, పాక్ దివంగత ప్రధాని బెనజీర్ భుట్టో కుమార్తె భక్తావర్ భుట్టో జర్దారి, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కుమారుడు ఖాసీమ్ ఖాన్, హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) అధ్యక్షుడు జగన్మోహన్ రావు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ క్రీడా విభాగం, ఐటీ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేశ్ రంజన్ తదితరులు మ్యాచ్‌ను తిలకించిన వారిలో ఉన్నారు.

రెండు టోపీలు... రెండు ట్రోఫీలు
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఇదివరకే ప్రకటించిన అవార్డుల్ని ఆదివారం భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా అందుకున్నాడు. 2024 క్యాలెండర్ ఇయర్‌కు సంబంధించి అంతర్జాతీయ క్రికెట్‌లో విశేష ప్రదర్శన కనబరిచిన ఈ భారత సీనియర్ పేసర్ పురుషుల క్రికెట్‌లో నాలుగు అవార్డులకు ఎంపికయ్యాడు. ‘క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’... ‘టెస్టు క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’ వ్యక్తిగత అవార్డులు కాగా... 2024 ప్రదర్శన ఆధారంగా అన్ని దేశాల నుంచి ఆటగాళ్లతో ఐసీసీ జట్లను ఎంపిక చేసింది. ఐసీసీ ప్రకటించిన టి20, టెస్టు జట్లలోనూ బుమ్రా ఉన్నాడు. దీంతో ‘టి20 టీమ్ ఆఫ్ ద ఇయర్’... ‘టెస్టు టీమ్ ఆఫ్ ద ఇయర్’ పురస్కారాలల్లో భాగంగా ఐసీసీ ప్రత్యేకమైన రెండు టోపీలను అందజేసింది. వ్యక్తిగత అవార్డులుగా రెండు ట్రోఫీలను బహూకరించింది. ప్రస్తుతం వెన్నుగాయంతో ప్రతిష్టాత్మక ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి దూరమైన ఈ ‘పేస్ ఎక్స్‌ప్రెస్’ అవార్డు స్వీకరించేందుకే దుబాయ్‌కి వచ్చాడు. ఉదయం మ్యాచ్‌కు ముందు తుది కసరత్తులో ఉన్న తమ జట్టు సహచరులతో ఆత్మీయంగా భేటీ అయ్యాక దాయాదుల మ్యాచ్ ఆరంభానికి ముందు అవార్డులు అందుకున్నాడు. ప్రేక్షకులంతా చప్పట్లతో అభినందనలు తెలిపారు. గతేడాది టెస్టుల్లో కేవలం 13 మ్యాచ్‌లే ఆడిన 31 ఏళ్ల బుమ్రా 71 వికెట్లు పడగొట్టడం విశేషం. ఓ క్యాలెండర్ ఇయర్లో 70 పైచిలుకు వికెట్లు తీసిన నాలుగో భారత బౌలర్‌గా ఘనతకెక్కాడు. అతనికంటే ముందువరుసలో దిగ్గజ ఆల్‌రౌండర్ కపిల్ దేవ్, లెజెండ్ స్పిన్నర్లు అనిల్ కుంబ్లే, అశి్వన్ ఉన్నారు. స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో 19 వికెట్లు తీసిన బుమ్రా... ఆ్రస్టేలియాలో జరిగిన ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’లో 32 వికెట్లు తీశాడు. అంటే కేవలం రెండే రెండు జట్లతో జరిగిన ముఖాముఖి సిరీస్‌ల్లోనే 51 వికెట్లు పడగొట్టడం విశేషం.
బిజినెస్

వేసవి వచ్చేస్తోంది.. ఇంటి సీలింగ్ ఎలా ఉండాలంటే..
వేసవి కాలం వచ్చేస్తోంది.. బయటే కాదు ఇంట్లో ఉన్నా ఎండ వేడి తగులుతుంది. అసలు ఇంటి పైకప్పు ఉందా లేదా అన్నట్టుగా ఉంటుంది ఇంట్లో వేడి. సాధారణ సీలింగ్ ఉన్న ఇంట్లో అయితే ఈ వేడిమి తీవ్రత మరింత ఎక్కువే. దీనికి పరిష్కారం చూపించి.. మండు వేసవిలో ఇంటిని చల్లగా మార్చేస్తుంది ‘ఫాల్స్ సీలింగ్’! ఫాల్స్ సీలింగ్ ప్రధాన ఉద్దేశం.. గదిలో ఆహ్లాద వాతావరణం ఏర్పర్చడమే. అలసిన మనసు, శరీరానికి సాంత్వన చేకూర్చడమే. ఫాల్స్ సీలింగ్‌తో ఇంట్లోని వాతావరణాన్ని అందంగా, ఆహ్లాదంగా మార్చుకోవటమే కాకుండా సాధారణ ఇంటి పైకప్పును డైమండ్, చతురస్రం, గోళాకారం వంటి విభిన్న ఆకృతుల్లో అందంగా కూడా తీర్చిదిద్దుకోవచ్చు.– సాక్షి, సిటీబ్యూరో» ఫాల్స్ సీలింగ్ రంగుల ఎంపికలో పలు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. వారేమంటారంటే.. » గోడ రంగుతో పోల్చుకుంటే సీలింగ్‌కు వేసే వర్ణం తేలికగా ఉండాలి. అప్పుడు పైకప్పు తక్కువ ఎత్తులో ఉందనిపిస్తూ, విశాలంగా ఉన్న భావనను కలిగిస్తుంది. ముదురు షేడ్లను ఎంచుకుంటే పైకప్పు ఎత్తులో ఉందన్న అభిప్రాయాన్ని కలిగిస్తుంది. » మిగతా గదులతో పోల్చుకుంటే పడక గది సీలింగ్‌నే ఎక్కువసేపు చూస్తాం కాబట్టి వర్ణాల్లో సాదాసీదావి కాకుండా నేటి పోకడలకు అద్దంపట్టేవి ఎంచుకోవాలి. మధ్యస్తం, డార్క్, బ్రౌన్ వర్ణాలు పడకగదికి చక్కగా నప్పుతాయి. ఎందుకంటే ఈ వర్ణాలు ఉత్సాహపరిచే విధంగా, స్వభావానికి అనుకూలంగా ఉంటాయి మరి. » తాజాదనం ఉట్టిపడుతున్న లుక్ రావాలంటే మోనోక్రోమాటిక్ థీమ్‌ను ఎంచుకోవాలి. రెండు, మూడు వర్ణాలు కలిసినవి ఎంచుకుంటే మాత్రం అది పడకగది గోడలకు వేసిన రంగు కంటే తేలికగా ఉండేలా చూసుకోవాలి. అప్పుడే మీ సీలింగ్ ప్రశాంత భావనను కలగజేస్తుంది. » గోడల రంగుకు, సీలింగ్‌కు ఒకే రకమైనవి కాకుండా.. వేర్వేరు వర్ణాల్ని కూడా వేసుకోవచ్చు. దగ్గర దగ్గర రంగులు కాకుండా, చూడగానే తేడా ఇట్టే కన్పించే వర్ణాలను ఎంపిక చేసుకోవటం మేలు. దృశ్య వ్యక్తీకరణ ప్రదేశంగా సీలింగ్‌ను వినియోగించుకోండి. ఆహ్లాదభరితమైన ఆకాశం, లేదంటే గదితో కలిసిపోయేలా ఆకట్టుకునే ఆకారాలు, వర్ణాలతో నాటకీయత కన్పించేలా అలంకరించుకోవచ్చు. జాగ్రత్తలివే.. » ఫాల్స్ సీలింగ్ ఎంపికలో ధర కంటే నాణ్యతకే ప్రాధాన్యమివ్వాలి. » ఫ్లోర్ నుంచి పైకప్పు మధ్య కనీసం 12 అడుగుల ఎత్తు అయినా ఉండాలి. » ఏమరుపాటుగా ఉంటే ఫాల్స్ సీలింగ్‌తో పాటు ఎయిర్ కండిషన్ మెషిన్ కూడా పాడయ్యే అవకాశం ఉంటుంది. » ఉడెన్ ఫాల్స్ సీలింగ్‌లో అయితే ఎలుకలతో పాటు చెదలు, పురుగులు చేరే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్త వహించాలి. » దుమ్ము, ధూళి చేరకుండా అప్పుడప్పుడు శుభ్రం చేయాలి.

మొదటి బిడ్డకు స్వాగతం పలికిన శామ్ ఆల్ట్మాన్ - ఫొటో వైరల్
ఓపెన్ఏఐ సీఈఓ 'శామ్ ఆల్ట్మాన్'.. మగబిడ్డకు స్వాగతం పలికారు. ఈ విషయాన్ని తన ఎక్స్ ఖాతాలో అధికారికంగా వెల్లడించారు. ఫోటో కూడా షేర్ చేశారు.ప్రపంచానికి స్వాగతం, చిన్నవాడా!, అని పేర్కొంటూ శామ్ ఆల్ట్మాన్.. బిడ్డ చేతిని చూపుడు వేలుతో పట్టుకున్న ఫోటో షేర్ చేశారు. తన బిడ్డ ముందుగానే జన్మించినట్లు, ప్రస్తుతం నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (NICU)లో వైద్య సంరక్షణలో ఉన్నట్లు వెల్లడించారు. నేను ఇంత ప్రేమను ఎప్పుడూ అనుభవించలేదని అన్నారు.శామ్ ఆల్ట్మాన్ వెల్లడించిన ఈ విషయంపై.. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల స్పందించారు. "నా హృదయపూర్వక అభినందనలు, శామ్! పేరెంట్‌హుడ్ అనేది జీవితంలో అత్యంత గొప్ప అనుభవాలలో ఒకటి. మీకు.. మీ కుటుంబానికి శుభాకాంక్షలు" అని ట్వీట్ చేశారు. పలువురు నెటిజన్లు కూడా శుభాకాంక్షలు చెబుతున్నారు.ఇదీ చదవండి: బిలియనీర్ కుమార్తె జైలు కష్టాలు: ఆహారం, నీరు ఇవ్వడానికి కూడా..శామ్ ఆల్ట్మాన్.. సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆలివర్ ముల్హెరిన్‌ను వివాహం చేసుకున్నారు. ఈ జంట సముద్రతీర ప్రదేశంలో ఉంగరాలు మార్చుకుంటున్న ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వీరు జంటగా కనిపించిన సందర్భాలు చాలా తక్కువ.My heartfelt congratulations, @sama! Parenthood is one of life’s most profound and rewarding experiences. Wishing you and your family the very best.— Satya Nadella (@satyanadella) February 22, 2025

చిటికెలో మొటిమలను మాయం చేసే ఎల్ఈడీ ప్యాచ్
యువతను ఇబ్బంది పెట్టే సమస్యల్లో మొటిమలు ఒకటి. చాలామంది ముఖంపై మొటిమలు వస్తే అసలు బయటకే రారు. మరికొంతమంది వాటిని కవర్ చేయడానికి ప్రయత్నిస్తుంటారు. అందుకే, చిటికెలో మొటిమలను మాయం చేసే ఒక స్మార్ట్ సొల్యూషన్ మార్కెట్లోకి వచ్చేసింది.నెదర్లండ్స్‌కు చెందిన ‘ఫీవీస్’ కంపెనీ మొటిమలను తగ్గించే ఎల్ఈడీ ప్యాచ్‌ను తయారుచేసింది. ఇది పిల్లిపిల్ల బొమ్మతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఈ ప్యాచ్‌ను మొటిమలపై అతికించుకుంటే చాలు, ఎల్ఈడీ స్పాట్ ట్రీట్మెంట్ సాయంతో మొటిమలను, వాటి మచ్చలను తగ్గిస్తుంది. దీనిని ఒక్కసారి చార్జ్ చేస్తే దాదాపు వారంపాటు పనిచేస్తుంది. నీలం, ఎరుపు, నారింజ రంగుల్లో మార్కెట్లో అందుబాటులో ఉంది. ధర 50 డాలర్లు (అంటే రూ. 4,339) మాత్రమే!ఇదీ చదవండి: బిలియనీర్ కుమార్తె జైలు కష్టాలు.. ఆహారం, నీరు ఇవ్వడానికి కూడా..

బిలియనీర్ కుమార్తె జైలు కష్టాలు: ఆహారం, నీరు ఇవ్వడానికి..
భారత సంతతికి చెందిన బిలియనీర్ పంకజ్ ఓస్వాల్ కుమార్తె 'వసుంధర ఓస్వాల్' ఉగాండాలో జైలు పాలైన దాదాపు నాలుగు నెలల తర్వాత.. అక్కడ తాను అనుభవించిన కొన్ని కష్టాలను వివరించింది. తనను ఐదు రోజుల పాటు నిర్బంధించారని.. ఆహారం, నీరు వంటి ప్రాథమిక సౌకర్యాలను అందించలేదని పేర్కొంది. ఆఖరికి స్నానం చేయడానికి కూడా నిరాకరించారని వెల్లడించింది.ఇంటర్‌పోల్‌కు వెళ్లడానికి తాను అయిష్టత చూపినప్పుడు.. ఒక పురుష అధికారి తనను ఎత్తుకుని వారి వ్యాన్‌లో పడేశారని వసుంధర ఓస్వాల్ ఆరోపించింది.వసుంధర (26)పై గత సంవత్సరం తన తండ్రి పంకజ్ ఓస్వాల్ మాజీ ఉద్యోగి ముఖేష్ మెనారియా కిడ్నాప్ & హత్య కేసులో తప్పుడు అభియోగం మోపబడింది. తరువాత అతను టాంజానియాలో సజీవంగా కనిపించాడు. అయితే ఈమెను 2024 అక్టోబర్ 1న అరెస్టు చేశారు. అదే నెలలో (అక్టోబర్ 2) బెయిల్ మంజూరు చేశారు.నన్ను ఐదు రోజులు నిర్బంధించారు, మరో రెండు వారాల పాటు జైలులో పెట్టారని.. వసుంధర ఓస్వాల్ పేర్కొంది. ఆ సమయంలో వారు స్నానం చేయనివ్వలేదు. ఆహారం & నీరు ఇవ్వడానికి కూడా నిరాకరించారు. నాకు ఆహారం, నీరు వంటి ప్రాథమిక అవసరా కోసం నా తల్లిదండ్రులు న్యాయవాదుల ద్వారా పోలీసు అధికారులకు లంచం ఇవ్వవలసి వచ్చిందని పేర్కొంది.ఇదీ చదవండి: గ్రామంలో నివాసం.. వేలకోట్ల కంపెనీకి సారథ్యం!.. ఎవరో తెలుసా?ఒక విధమైన శిక్షగా వాష్‌రూమ్‌ను ఉపయోగించుకోవడానికి అనుమతించలేదని వసుంధర ఓస్వాల్ ఆరోపించారు. పోలీసులు వారెంట్ లేకుండా తన ఇంటిని సోదా చేశారని ఆరోపించారు.
ఫ్యామిలీ

వామ్మో ఇదేం బిజినెస్? విలన్ కావాలా..!
‘ఎవరినైనా బెదిరించాలన్నా, గుండాయిజం, రౌడీయిజం వంటి విలనీ పనులు చేయాలన్నా సంప్రదించండి ‘విలన్ ఫర్ హైర్’. విలన్‌ను చావగొట్టి మీ గర్ల్‌ఫ్రెండ్ దగ్గర హీరోయిజం ప్రదర్శించాలనుకుంటున్నారా? ‘విలన్ ఫర్ హైర్’ను సంప్రదిస్తే, సులువుగా మీ కోరిక తీరిపోతుంది. మలేసియాలో ఈ సేవలు అందిస్తున్న షజాలీ సులేమాన్‌కు తగిన రుసుము చెల్లిస్తే, మీకోసం అతగాడు విలన్లా నటిస్తాడు. మీ గర్ల్‌ఫ్రెండ్ మీతో ఉన్నప్పుడు హఠాత్తుగా వచ్చి, ఆమెను అల్లరిపెడతాడు. అప్పుడు మీరు హీరోలా అతడితో కలబడి, అతడిని తరిమికొట్టి మీ గర్ల్‌ఫ్రెండ్ దృష్టిలో హీరోగా ఫోజు కొట్టవచ్చు. సులేమాన్ మరికొన్ని సేవలు కూడా అందిస్తున్నాడు. బెదిరించి తగాదాలను పరిష్కరించడం, సోషల్ మీడియాలోను, సమాజంలోను ఇబ్బందులు పడుతున్న వారి సమస్యలను తీర్చడం వంటి పనులను ‘విలన్’లా ప్రవేశించి ఇట్టే పూర్తిచేస్తాడు. ఈ పనులకు అతడు వసూలు చేసే మొత్తం పనిదినాల్లోనైతే, రూ.1,975, వీకెండ్స్లోనైతే రూ. 2,963 మాత్రమే! ఇతడి వ్యాపారం రోజురోజుకూ బ్రహ్మాండంగా సాగుతోంది. (చదవండి: జనరల్ మోటార్స్ డైట్..! దెబ్బకు బరువు మాయం..)

మా బీటే సపరేటు..
‘హాయ్ తెలుగు ట్రాక్ ప్లీజ్..’ కొన్నేళ్ల క్రితం ఈవెంట్స్, కేఫ్స్‌లో లైవ్ బ్యాండ్‌ని ఇలా అభ్యరి్థంచిన వ్యక్తిని.. మిగిలిన వాళ్లంతా ఎవరీ ఎర్రబస్సు అన్నట్టు చూసేవాళ్లు, బ్యాండ్ సభ్యులు నోటితో నవ్వేసి నొసటితో వెక్కిరించేవాళ్లు.. ఇదంతా గతం ఇప్పుడు క్లబ్‌లలో అత్యంత క్రేజీగా ఉండేనైట్స్ అంటే టాలీవుడ్ నైట్స్. బ్యాండ్ ఏదైనా సరే, ప్లేస్ ఏదైనా సరే ఏఆర్ రెహమాన్, ఇళయరాజా, డీఎస్పీ.. మ్యూజిక్‌ని వినిపించాల్సిందే.. తెలుగు ట్రాక్స్‌కి పేరొందిన కొన్ని నగర సంగీత బృందాల విశేషాలివి.. గరంలో తెలుగు లైవ్ మ్యూజిక్కు క్లాప్ కొట్టింది కాప్రిíÙయో. పేరొందిన ట్రాక్‌ల మాషప్లతో వీరు తెలుగు శ్రోతల మనసులు గెలుచుకున్నారు. నేటికీ సిటీ లైవ్ మ్యూజిక్‌ని ఈ బ్యాండ్ శాసిస్తోందని చెప్పొచ్చు. తరచూ తెలుగు సినీ ప్రముఖుల ప్రైవేట్ పారీ్టస్లో వీరు కనిపిస్తారు. దేశ విదేశాల్లోనూ ప్రదర్శనలిచి్చన ఈ బ్యాండ్ ఉరుములు నీ నవ్వులై, యమహానగరి కలకత్తా పురి, మధుర మీనాక్షి.. తదితర తెలుగు పాటలతో పాటు సొంత ట్యూన్స్‌తో ఎనిమిదేళ్లుగా నగర సంగీతాభిమానులను ఉర్రూతలూగిస్తోంది.మా థ్రియరీయే వేరు.. తొమ్మిది మంది సభ్యుల బ్యాండ్ థ్రియరీ, సితార్, తబలా వయోలిన్లతో రాక్ సంగీతానికి భారతీయ హంగులను జోడించడం ద్వారా ప్రత్యేకంగా ప్రసిద్ధి చెందింది. వీరి నుంచి రోజా, బొంబాయి వంటి సినిమాల్లో ప్రసిద్ధ వయోలిన్ ట్రాక్‌లను వినొచ్చు. పదేళ్ల క్రితం ప్రారంభమైన ఈ బ్యాండ్ తొలుత హిందీ, ఆంగ్ల సంగీతానికి పెద్ద పీట వేసినా.. ఇటీవలే తెలుగు, తమిళ సంగీతాన్ని కూడా అందిస్తోంది. ఫ్యూజన్ సంగీతాన్ని ఇష్టపడేవారికి థియరీ లైవ్ మ్యూజిక్ మంచి ఎంపిక. ఐఎన్సీఏ నుంచి బెస్ట్ లైవ్ యాక్ట్ బ్యాండ్ అవార్డును గెలుచుకోవడంతో పాటు 2018లో నగరంలో జరిగిన బ్రయాన్ ఆడమ్స్ ఈవెంట్లో వేదిక పంచుకోవడం, ఆ్రస్టేలియాలో సంగీత పర్యటన.. వంటివెన్నో వీరిని టాప్ బ్యాండ్స్‌లో ఒకటిగా మార్చాయి.పల్లె మసాలా.. రామ్ మిరియాల.. తెలుగు సినీ గీతాభిమానులకు చిరపరిచితమైన పేరు రామ్ మిరియాల. ఆయన తొలుత బ్యాండ్ చౌరస్తాలో ప్రధాన గాయకుడిగా పేరొందారు. సూపర్ హిట్ ప్రైవేట్ సాంగ్స్ అందించారు. అనంతరం సినిమాల్లోనూ రాణిస్తున్నారు. ప్రస్తుతం ఆయన సొంత బ్యాండ్ ఏర్పాటు చేసుకున్నారు. దాదాపు ప్రతి వారం నగరంలో ఎక్కడో ఒక చోట ఆయన బృందం ప్రదర్శన ఉంటుంది. డీజే టిల్లూ పేరు.. వీని స్టైలే వేరు.. దండకడియాల్.. వంటి ఆయన ట్రాక్‌లతో పాటు పల్లెదనానికి పట్టం గట్టే అనేక సొంత పాటలను కూడా వినిపిస్తారు. జానపదమిస్తా.. చౌరాస్తా.. గ్రామీణ, తెలుగు జానపదాలతో చౌరాస్తా ధ్వని చాలా ప్రత్యేకమైనది. వీరి సంగీత శైలి హృదయాన్ని తాకుతుంది. రెగె, జానపద, రెట్రో బ్లూస్ రాగాలను వీరి ద్వారా వినొచ్చు. మాయ, ఊరెళ్లిపోతా మామా, లక్ష్మమ్మో తదితర హిట్ సాంగ్స్ వీరి సొంతం. తమ రెగె స్టైల్ ట్రాక్‌లలో గోరేటి వెంకన్న పాటలు సహా ఉత్తేజపరిచే సంగీతానికి జీవం పోస్తారు. ముఖ్యంగా 80ల జానపద సంగీతాన్ని ఇష్టపడే వారికి నప్పే, నచ్చే బ్యాండ్ ఇది పార్టీస్‌కి డెక్కన్.. ‘హైదరాబాద్స్ పార్టీ బ్యాండ్’ అని పేరు తెచ్చుకుంది. డెక్కన్ ప్రాజెక్ట్ ఫంక్, బ్లూస్, రాక్, స్వింగ్ ప్రభావాలను మిక్స్ చేస్తుంది. ఈ బ్యాండ్ సభ్యులు కళాశాల చదువుల నుంచి స్నేహితుల బృందంగా కొనసాగుతున్నారు. ప్రైవేటు ఉద్యోగాలు చేస్తూనే తమ సంగీత కలలను సాకారం చేసుకుంటున్నారు. పెత్తరప్, కుర్రలు, హమ్మా హమ్మా.. ఇంకా ఎన్నో పాటలు వీరు అందిస్తారు. ఏడేళ్ల వయసున్న ఈ బ్యాండ్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ప్రత్యేక ప్రదర్శన ఇవ్వడం విశేషం. అలాగే రామ్‌చరణ్ ఆస్కార్ పారీ్టలోనూ వీరు మ్యూజిక్ అందించారు.

వసంత యోగం
ఒత్తిడి సమస్యతో యోగాకు దగ్గరైన వసంత లక్ష్మి ఆ విద్యలోప్రావీణ్యం సాధించి రికార్డులు బ్రేక్ చేస్తోంది. తాజాగా... సమకోణాసనంలో 3.22 గంటలుగా నమోదైన గత గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డును బ్రేక్ చేసింది. 3.42 గంటల పాటు సమకోణాసనం వేసి సరికొత్త రికార్డు సృష్టించింది తిరుపతి జిల్లా వెంకటగిరికి చెందిన వసంతలక్ష్మి.‘నేర్చుకోవాలి–చదువుకోవాలి’ అనేది వసంతలక్ష్మి తారకమంత్రం. పెళ్లి అయిన తరువాత చదువుకు దూరం అయింది. ‘ఇక ఇంటి బాధ్యతలు చాలు’ అనుకునేలోపే తారకమంత్రం తనను అప్రమత్తం చేసింది.‘చదువుకోవాలి–నేర్చుకోవాలి’అంతే...ఆమె మళ్లీ చదువుకు దగ్గర అయింది. తిరుపతిలో డిగ్రీ, హిందీ పండిట్ కోర్సు పూర్తి చేసింది. ఆ తరువాత భర్త ఉద్యోగ నిమిత్తం హైదరాబాద్‌కు చేరుకుంది. అక్కడ ఓ ప్రైవేట్ సంస్థలో సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేసేది. మొదట్లో బాగానే ఉండేది కాని ఆ తరువాత కుటుంబ నిర్వహణ, సేల్స్ ఎగ్జిక్యూటివ్ పనుల వల్ల తీవ్ర ఒత్తిడికి గురయ్యేది. ఆ సమయంలో తనకు యోగా గుర్తుకు వచ్చింది. యోగా అనేది ఒత్తిడిని చిత్తు చేసే తారకమంత్రం అనే విషయం చాలాసార్లు విని ఉన్నది వనంతలక్ష్మి. హైదరాబాద్ అమీర్‌పేటలోని ‘స్వామి వివేకానంద ఇన్ స్టిట్యూట్’లో యోగా క్లాస్‌లో చేరింది. ఇది తన జీవితానికి మేలి మలుపుగా చెప్పుకోవాలి. క్రమం తప్పకుండా సాధన చేసి యోగాలో కేంద్రప్రభుత్వం నుంచి క్వాలిటీ కౌన్సెలర్ ఆఫ్ ఇండియా (క్యూసీఐ) సర్టిఫికెట్ అందుకుంది. ఆ తరువాత నిజామాబాద్‌లోని యోగా ఇన్ స్టిట్యూట్లో గురువు రామచంద్ర దగ్గర అడ్వాన్స్ డ్ యోగాలో ఆరు నెలలపాటు శిక్షణ తీసుకుంది. తనలోని క్రమశిక్షణ, ప్రతిభను గుర్తించిన గురువు రామచంద్ర జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనేలా వసంతలక్ష్మిని ప్రోత్సహించాడు. తెలుగు రాష్ట్రాలతో సహా బెంగళూరు, గుజరాత్, హరియాణా, దిల్లీ, తమిళనాడులో నిర్వహించిన వివిధ పోటీల్లో సత్తా చాటి 25 స్వర్ణ, రజత పతకాలు సాధించింది. ఒకవైపు యోగా సాధన చేస్తూనే మరోవైపు ఎమ్మెస్సీ సర్టిఫికెట్ కోర్సు పూర్తి చేసింది. ‘యోగా అకాడమి’కి శ్రీకారం చుట్టింది. ఆఫ్‌లైన్, ఆన్ లైన్ లో ఎంతోమందికి యోగా నేర్పిస్తోంది. చిత్తూరు జిల్లా తవణంపల్లె మండలంలో అపోలో హెల్త్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో రెండు సంవత్సరాల పాటు పిల్లలకు యోగాలో శిక్షణ ఇచ్చింది. గతంలో 45 మందితో 108 సూర్య నమస్కారాలను కేవలం 28 నిముషాల్లో పూర్తి చేసి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్, నోబెల్ వరల్డ్ రికార్డు, తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డులో స్థానం దక్కించుకుంది. తాజాగా గత రికార్డ్‌ను బ్రేక్ చేసి సమకోణాసనంలో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్‌లో చోటు సాధించింది. ఆరోగ్య భారత్ కోసం....రికార్డ్‌లు కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయి. గిన్నిస్ బుక్ రికార్డు సాధించడం సంతోషంగా ఉంది. ఇదే స్ఫూర్తితో ఆరోగ్య భారత్ కోసం ఒక ఆశ్రమం ఏర్పాటు చేయాలని ఉంది. ప్రజల అనారోగ్య సమస్యలకు యోగా ద్వారా పరిష్కారం చూపాలనేదే నా లక్ష్యం. – వసంతలక్ష్మి – నిడిగింటి విజయకుమార్, సాక్షి , తిరుపతి డెస్క్/ కలపాటి భాస్కర్, వెంకటగిరి రూరల్

సగౌరవ మరణం నాప్రాథమిక హక్కు
ఆమె మరణించదలుచుకుంది. ‘సగౌరవంగా మరణించే హక్కును ప్రసాదించండి’ అని 24 ఏళ్ల పాటు పోరాడి ఆ హక్కును సాధించుకుంది. ‘రైట్ టు డై విత్ డిగ్నిటీ’ అనే డిమాండ్‌తో ‘యుథనేసియా’ ద్వారా ప్రాణం విడువనున్న 85 ఏళ్ల కరిబసమ్మ కొత్త చర్చను లేవనెత్తే అవకాశం ఉంది. ‘మన దేశంలో పేదరికం వల్ల వైద్యం చేయించుకోలేక, వైద్యం లేని జబ్బుల వల్ల కోట్ల మంది బాధపడుతున్నారు. వారికి సగౌరవంగా మరణించే హక్కు ఉంది’ అంటోంది కరిబసమ్మ. వివరాలు....‘రాజ్యాంగం జీవించే హక్కు ఇచ్చినట్టుగానే మరణించే హక్కు కూడా ఇచ్చింది. నేనెందుకు గౌరవంగా మరణించకూడదు? నేను మరణించేందుకు ప్రభుత్వం ఎందుకు సాయపడకూడదు? యుథనేసియా (మెర్సీ కిల్లింగ్) నెదర్లాండ్స్, నార్వే వంటి దేశాల్లో ఉంది. అది ఎక్కువ అవసరమైనది మన దేశంలోనే’ అంటుంది 85 ఏళ్ల కరిబసమ్మ. ‘మెర్సీ కిల్లింగ్’ కోసం 24 ఏళ్లుగా పోరాడుతోందామె. ఇప్పుడు ఆమెకు కర్ణాటక ప్రభుత్వం నుంచి అనుమతి లభించింది. ఈ మేరకు జనవరి 30న ప్రభుత్వం ఒక సర్క్యులర్ జారీ చేస్తూ రాష్ట్రంలో అనివార్యమైన పరిస్థితుల్లో ఉన్న 70 ఏళ్లకు పైబడిన వారు ‘రైట్ టు డై’ హక్కును ఉపయోగించవచ్చని పేర్కొంది. అయితే ఇతర అనుమతులు కూడా ఓకే అయితేనే రెండు వారాల్లో కరిబసమ్మకు దయామరణం ప్రాప్తించవచ్చు.ఎవరు ఈ కరిబసమ్మ?కర్నాటకలోని దావణగెరెకు చెందిన కరిబసమ్మ రిటైర్డ్ గవర్నమెంట్ టీచర్. ఇప్పుడు వయసు 85 ఏళ్లు. 30 ఏళ్ల క్రితం ఆమెకు డిస్క్ స్లిప్ అయ్యింది. దాంతో నడవడం ఆమెకు పెద్ద సమస్య అయ్యింది. నొప్పికి తట్టుకోలేక చావే నయం అని నిశ్చయించుకుంది. దాదాపుగా 24 ఏళ్లుగా ఆమె ఇందుకై పోరాడుతోంది. 2010లో పదివేల సంతకాలతో ప్రభుత్వానికి మెమొరాండం సమర్పించింది. సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. ఎందరో అధికారులకు, మంత్రులకు, రాష్ట్రపతికి ఆమె లేఖలు రాసింది. రాష్ట్రపతికి లేఖ రాశాక పోలీసులు వచ్చి ఇందుకు మన దేశంలో అనుమతి లేదని, కనుక పిటిషన్లు పంపవద్దని కోరారు. దాంతో కరిబసమ్మ కుటుంబ సభ్యుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతూ నువ్వు జైలుకెళితే మా మర్యాద ఏం కాను అని వారు ఆమెను నిలదీశారు. దాంతో ఆమె కేర్ హోమ్‌కు మారింది. తన పోరాటం కోసం ఇంటిని అమ్మి అందులో ఆరు లక్షలు బి.ఎస్.ఎఫ్ జవాన్ల సంక్షేమానికి ఇచ్చింది. మిగిలిన డబ్బుతో తన పోరాటం సాగించింది. ఇప్పుడు ఆమె కేన్సర్‌తో బాధ పడుతోంది.2018లో సుప్రీంకోర్టురైట్ టు డై హక్కును సుప్రీంకోర్టు 2018లో అంగీకరించింది. ‘రాజ్యాంగపరంగా మరణించే హక్కు పౌరులకు లభిస్తుంది’ అని చెప్పింది. 2023లో ఎవరు ఏ వయసు, పరిస్థితుల్లో ఉంటే ఇటువంటి విన్నపాన్ని కోరవచ్చో మార్గదర్శకాలను సూచించింది. అయితే కర్నాటక ప్రభుత్వం ఇప్పటి వరకూ సుప్రీంకోర్టు డైరెక్షన్ గురించి దృష్టి పెట్టలేదు. అంటే మెర్సీ కిల్లింగ్ పట్ల సంశయ మౌనం దాల్చింది. కాని కరిబసమ్మ పట్టుదల వల్ల ఇన్నాళ్లకు అనుమతినిచ్చింది.70 ఏళ్లు పైబడి‘70 ఏళ్లు పైబడి, వైద్యపరంగా మందులకు స్పందించని స్థితిలో, సపోర్ట్ సిస్టమ్ మీద ఉంటే అటువంటి వారికి మెర్సీ కిల్లింగ్ గురించి ప్రభుత్వం అనుమతిని పరిశీలిస్తుంది. మనది సభ్య సమాజం. బాధితులను ఎన్నో విధాలుగా ఆదుకోవచ్చు. కాబట్టి అడిగిన వెంటనే మరణించే హక్కుకు అనుమతి లభిస్తుందని ఆశించవద్దు. కరిబసమ్మ విషయంలో కూడా ఆరోగ్యశాఖ ఆమెను పరిశీలించి ఆరోగ్యపరంగా దుర్భర స్థితిలో ఉందని తేల్చితేనే ఆమెకు రైట్ టు డై అనుమతి లభిస్తు్తంది’ అని కర్నాటక ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.ప్రాణం తీసుకోవడం పాపం కాదా?‘ఆత్మహత్య, మరణాన్ని కోరుకోవడం ఏ మతమూ అంగీకరించదు. దీనిపై మీరేమంటారు?’ అని కరిబసమ్మను అడిగితే ‘అలా మతాచారాలు, విశ్వాసాలు మాట్లాడేవారు రోడ్డు మీద దిక్కు లేక అనారోగ్యంతో బాధపడే వృద్ధులను తీసుకెళ్లి వాళ్ల ఇళ్లల్లో పెట్టుకోవాలి. అప్పుడు మాట్లాడాలి. అనుభవించేవారికి తెలుస్తుంది బాధ. మన దేశంలో పేదరికంలో ఉన్న వృద్ధులు జబ్బున పడితే చూసే దిక్కు ఉండదు. వాళ్లు మలమూత్రాలలో పడి దొర్లుతుండాలా? వారు సగౌరవంగా మరణించాలని కోరుకుంటే మనం ఆ కోరికను ఎందుకు గౌరవించకూడదు? అన్నారామె.
ఫొటోలు
National View all

‘ఆరోగ్య భారతం’ అత్యావశ్యకం
న్యూఢిల్లీ: దేశంలో స్థూలకాయుల సంఖ్య నానాటికీ పెరిగిపోత

ఏప్రిల్‌లో ఏఐసీసీ భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: అఖిల భారత కాంగ్రెస్ కమిటీ(ఏఐసీసీ) సమావే

అవమానిస్తున్నా నోరు మెదపరా?
న్యూఢిల్లీ: భారత్‌లో ఓటర్ల సంఖ్య పెంచేందుకు అమెరికా కోట్ల రూ

కొత్త మలుపు తీసుకున్న యూఎస్ఎయిడ్ వివాదం
న్యూఢిల్లీ: భారత్‌లో ఓటర్ల సంఖ్యను పెంచేందుకు అమెరికా నుంచి

అమెరికా నుంచి భారత్‌కు అక్రమ వలస దారులు.. ఈసారి ఎంతమందంటే?
అమెరికాలో అక్రమ వలసదారుల డిపోర్టేషన్ కొనసాగుతుంది.
International View all

ఆక్సిజన్ ఛాంబరే అతని ఆఫీస్
వృద్ధాప్య ఛాయలను దరిచేరనీయకుండా నిత్యం యవ్వన కాంతులీనడమే ధ్యేయంగా ప్రతి ఏటా కోట్ల రూపాయలు ఖర్చుచేస్తున్న అమెరికన్ వ్యాప

వెస్ట్ బ్యాంక్‌పై పట్టు బిగించిన ఇజ్రాయెల్
కబాటియా: గాజాలో హమాస్‌తో కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకున్న

హసన్ నస్రల్లాకు కన్నీటి వీడ్కోలు
బీరూట్: లెబనాన్ మిలిటెంట్ సంస్థ ‘హెజ్బొల్లా’దివంగత

గత వారం దేశం కోసం ఏం చేశారు?
న్యూయార్క్: డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష బాధ్యతలు స్వీ

తదుపరి జర్మనీ చాన్స్‌లర్ మెర్జ్ !
బెర్లిన్: క్రిస్టియన్ డెమొక్రటిక్ యూనియన్(సీడీయూ) నేత ఫ్
NRI View all

ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాశ్ పటేల్ లవ్‌స్టోరీ : అందంలోనే కాదు టాలెంట్‌లోనూ!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తన మద్దతు ద

మాట నూతన కార్యవర్గం ఏర్పాటు
మన అమెరికన్ తెలుగు అసోసియేషన్-మాట బోర్డు మీటింగ్ డల్లాస్ లో ఘనంగా జరిగింది.

న్యూయార్క్ వేదికగా ఇంద్రాణి ఫేమ్ అంకితా జాదవ్ ఆల్బమ్ సాంగ్స్
ఇంద్రాణి ఫేమ్ అంకితా జాదవ్ నటించిన తెలుగు , హిందీ ఆల్బమ్ పాటలు న్యూయార్క్ వేదికగా రిలీజ్ కానున్నాయి.

సులభతర వీసా విధానం అవసరం
న్యూఢిల్లీ: వైద్య చికిత్సల కోసం భారత్‌కు వచ్చే విదేశీ రోగులకు సులభతర వీసా విధానాన్ని ప్రవేశపెట్టాలని అపోలో హాస్పిటల్స్

గుంటూరులో కుట్టుమిషన్లను పంపిణి చేసిన నాట్స్
క్రైమ్

అరుణవ్ చిరునవ్వులు.. ఇక కానరావు
నాంపల్లి: చిరునవ్వుల అరుణవ్ ఊపిరాగింది. ఇరు కుటుంబాల ఆశల కిరణం ఆరిపోయింది. లిఫ్టులో ఇరుక్కుని చావుబతుకుల నడుమ కొట్టుమిట్టాడుతూ నిలోఫర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆరేళ్ల బాలుడు అరుణవ్ శనివారం ఉదయం 11.30 గంటల సమయంలో మృతి చెందాడు. అరుణవ్‌ను బతికించడానికి నిలోఫర్ వైద్యులు శత విధాలా ప్రయతి్నంచినా ఫలితం దక్కలేదు. మెదడుకు ఆక్సిజన్ సరఫరా నిలిచిపోవడంతో బాలుడు మృతి చెందినట్లు నిలోఫర్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎన్.రవికుమార్ ప్రకటించారు. బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించి బంధువులకు అప్పగించారు. ఎంతో అల్లారుముద్దుగా పెంచుకుంటున్న ఒక్కగానొక్క కుమారుడు ఆరేళ్లకే కన్నుమూయడంతో అజయ్‌కుమార్ దంపతులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు. అత్తను చూసేందుకు వచ్చి.. గోడేఖీ ఖబర్ ప్రాంతానికి చెందిన అజయ్‌కుమార్ దంపతులకు ఒకే ఒక సంతానం. మగ పిల్లాడు పుట్టడంతో ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. అజయ్‌కుమార్ సోదరి, అరుణవ్ మేనత్త జయశ్రీ అలియాస్ ఆయేషా శాంతినగర్‌లో నివాసం ఉంటున్న ఇమ్రాన్‌తో ప్రేమ వివాహం చేసుకున్నారు. సోదరి ప్రేమ వివాహం చేసుకోవడంతో చాలా రోజులు అజయ్‌కుమార్ కుటుంబం జయశ్రీ అలియాస్ ఆయేషాతో దూరంగా ఉంటోంది. ఆయేషాకు ఇటీవల తన పుట్టింటితో బంధం మళ్లీ చిగురించింది. మాట్లాడుకోవడాలు, వచి్చపోవడాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే బాలుడు అరుణవ్ శుక్రవారం తన తాతయ్యతో కలిసి శాంతినగర్‌లోని మేనత్త ఇంటికి వచ్చి లిఫ్టులో ఇరుక్కుపోయాడు. అపస్మారక స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం తుదిశ్వాస విడిచాడు. రెండు కుటుంబాల మధ్య చిగురించిన బంధంలో బాలుడి మరణం విషాదాన్ని నింపింది.

పీఈటీ కొట్టారని విద్యార్థి ఆత్మహత్య
ఉప్పల్ (హైదరాబాద్): నగరంలోని ఓ పాఠశాలలో విషాద ఘటన చోటుచేసుకుంది. స్కూల్ పీఈటీ కొట్టడమే కాకుండా తోటి విద్యార్థుల ముందు అవమానించాడంటూ ఎనిమిదో తరగతి విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్కూల్ భవనం నాల్గో అంతస్తు నుంచి కిందికి దూకి బలవన్మరణం పొందిన ఘటన శనివారం ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు, బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలంలోని సిద్ద హంగిర్గా గ్రామానికి చెందిన ముంగ ధర్మారెడ్డి, సంగీత దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు లింగారెడ్డి, చిన్న కుమారుడు సంగారెడ్డి(14). వీరి కుటుంబం 15 ఏళ్ల క్రితం నగరానికి వచ్చి బోడుప్పల్ పరిధిలోని ద్వారకా నగర్లో నివాసముంటోంది. తోపుడు బండిపై వ్యాపారం చేసుకుంటూ జీవనం గడుపుతున్నారు. సంగారెడ్డి.. ఉప్పల్‌లోని న్యూ భరత్‌నగర్‌లోని సాగర్ గ్రామర్ స్కూల్లో 8వ తరగతి చదువుతున్నాడు. శుక్రవారం సాయంత్రం స్టడీ అవర్ సమయంలో సంగారెడ్డి స్కూల్లో సీసీ కెమెరాలను కదిలించాడంటూ క్లాస్ టీచర్.. పీఈటీ ఆంజనేయులుకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆంజనేయులు కొట్టడంతోపాటు మందలించారు. శనివారం ఉదయాన్నే స్కూల్‌కు వచి్చన సంగారెడ్డిని పీఈటీ పనిష్మెంట్ పేరిట మరోసారి తరగతి గదిలో కొట్టడంతోపాటు అరగంటపాటు నిలబెట్టారు. తల్లిదండ్రులను పిలిపిస్తానని, టీసీ ఇచ్చి పంపిస్తానని బెదిరించారు. తోటి విద్యార్థుల ముందు దీన్ని అవమానంగా భావించిన సంగారెడ్డి.. ఆత్మహత్య చేసుకుందామని నిర్ణయించుకున్నాడు. ముందుగా తన నోట్ బుక్‌లో ‘సారీ మదర్– ఐ విల్ డై టుడే’అని రాసి వాష్‌రూంకు వెళ్తున్నానని చెప్పి తరగతి బయటకు వచ్చాడు. వస్తూ వస్తూ స్నేహితులకు బైబై అని చెప్పాడు. మూడవ అంతస్తులో ఉన్న తరగతి గది నుంచి నాల్గో అంతస్తుకు చేరుకుని అక్కడినుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న మల్కాజిగిరి ఏసీపీ చక్రపాణి, ఉప్పల్ సీఐ ఎలక్షన్ రెడ్డి, మేడిపల్లి సీఐ గోవింద్ రెడ్డి హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. పంచనామా నిర్వహించి సంగారెడ్డి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ అసుపత్రికి తరలించారు. స్కూల్ యాజమాన్యం, పీఈటీ ఆంజనేయులు, క్లాస్ టీచర్‌పై కేసు నమోదు చేశారు. ఆత్మహత్యకు యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమంటూ డీఈవో పాఠశాలను సీజ్ చేశారు. కన్నీరు మున్నీరైన తల్లి ‘ప్రయోజకుడు కావాలని రెక్కలు ముక్కలు చేసుకుని పిల్లలను ప్రైవేట్ బడిలో చదివిస్తున్నా. ఎంతకష్టమొచి్చనా ఫీజును ఆపే వాళ్లం కాదు. నా కొడుకు ఏ పాపం చేశాడని చంపేశారు? అంటూ సంగారెడ్డి తల్లి కన్నీరు మున్నీరైంది. బాధ్యులను కఠినంగా శిక్షించాలని పోలీసులను వేడుకుంది. ఆమె ఉదయం నుంచి సాయంత్రం వరకు స్కూల్ ఆవరణలో కూర్చుని రోదించడం స్థానికులను కలచివేసింది.

వివాహ వేడుకలో విషాదం.. విచారణలో బయటపడ్డ అసలు విషయం
Shocking Viral Video: పెళ్లి వేడుకలో అంతా హుషారుగా డ్యాన్సులు వేస్తున్నారు. అంతలో ఊహించిన ఘటన.. ఆ ఊరిలో తీవ్ర విషాదం నింపింది. హుషారుగా డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో ఆ ఊరి సర్పంచ్ భర్త ఊపిరి ఆగిపోయిందని వార్తలు వచ్చాయి. అయితే.. ఈలోపు సోషల్ మీడియాలో ఓ షాకింగ్ వీడియో చక్కర్లు కొట్టగా.. విచారణలో అసలు విషయం బయటపడింది.పంజాబ్ జలంధర్ గోరయా ప్రాంతంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఆ ఊరి సర్పంచ్ భర్త పరమ్‌జిత్ సింగ్(49) ఓ వివాహ వేడుకలో హుషారుగా చిందులేస్తూ కుప్పకూలిపోయారు. గుండెపోటుతో ఆయన మరణించారని కుటుంబ సభ్యులు, పోలీసులు వెల్లడించారు. అయితే సోషల్ సోషల్ మీడియాలో ఓ వైరల్ అయ్యింది.వివాహ వేడుకలో ఓ వ్యక్తి చిందులేస్తూ.. తుపాకీ పేల్చాడు. అయితే అది పక్కనే డ్యాన్స్ చేస్తున్న పరమ్జిత్కు తగిలింది. దీంతో ఆయన కిందపడిపోయారు. కిందపడిన పరమ్‌జిత్.. తుపాకీతో కాల్చిన వ్యక్తిని మందలించారు కూడా. అయితే ఆ వెంటనే ఆయన అలాగే స్పృహ కోల్పోయారు. వీడియో వైరల్ కావడంతో ఉన్నతాధికారులు దర్యాప్తునకు ఆదేశించారు. బుల్లెట్ గాయంతోనే పరమ్‌జిత్ మరణించాడని, విషయం బయటకు రాకుండా బాధిత కుటుంబం పెద్దల సమక్షంలో డబ్బు తీసుకుందని తేలింది. పిస్టల్ పేల్చిన వ్యక్తి పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. పంజాబ్ సహా భారతదేశంలో ఇలాంటి వేడుకలలో బహిరంగంగా ఆయుధాల్ని ప్రదర్శించడం నిషిద్ధం. ఒకవేళ అది ఉల్లంఘిస్తే నేరం కిందకే వస్తుంది. जालंधर में एक शादी समारोह में की गई हवाई फायरिंग में एक युवक को गोली लग गई, जिससे उसकी मौत हो गई. जानकारी के मुताबिक मृतक गांव की मौजूदा सरपंच के पति हैं. घटना का वीडियो सोशल मीडिया पर वायरल हो रहा है. #Jalandhar | #Firing pic.twitter.com/NovyLH21vK— Veer Arjun (@VeerArjunDainik) February 22, 2025 VIDEO Credits: VeerArjunDainik

Visakhapatnam: మహిళపై జ్యోతిష్యుడు అత్యాచారం..
కొమ్మాది(విశాఖపట్నం): పెందుర్తి బీసీ కాలనీకి చెందిన జ్యోతిష్యుడు మోతి అప్పన్న అలియాస్ అప్పన్న దొర (50) అస్థి పంజరం కేసు మిస్టరీ వీడింది. భీమిలి నేరెళ్ల వలసకు చెందిన భార్యాభర్తలు గుడ్డాల మౌనిక, ఊళ్ల చిన్నారావు పథకం ప్రకారం అతన్ని హత్య చేశారు. ఘటనా స్థలంలో లభించిన వస్తువులు, సీసీ ఫుటేజ్, సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా భీమిలి పోలీసులు నిందితులను గుర్తించి గురువారం అరెస్ట్ చేశారు. భీమిలి సీఐ బి.సుధాకర్ తెలిపిన వివరాలివి..పెందుర్తి బీసీ కాలనీకి చెందిన మోతి అప్పన్న.. భార్య కొండమ్మ, కుమారులు ప్రసాద్, దుర్గా ప్రసాద్‌లతో కలిసి నివాసం ఉంటున్నాడు. ఆయన ఇంటింటికీ వెళ్లి జ్యోతిష్యం చెబుతుంటాడు. ఇబ్బందుల్లో ఉన్న వారి ఇళ్లలో పూజలు చేస్తూ.. తద్వారా వచ్చిన ఆదాయంతో తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఇదిలా ఉండగా ఆయన ఈ నెల 9న ఆనందపురం వెళ్తున్నట్లు ఇంటి వద్ద చెప్పాడు. ఆ రోజు రాత్రి అప్పన్న ఇంటికి రాకపోవడంతో 10న ఆయన పెద్ద కుమారుడు దుర్గా ప్రసాద్ ఆనందపురం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దర్యాప్తులో భాగంగా ఉప్పాడ ప్రాంతంలో అప్పన్న తప్పిపోయినట్లు గుర్తించి, ఆ ప్రాంతంలో అతని కుటుంబ సభ్యులు, పోలీసులు గాలించారు. అక్కడ ఓ ప్రైవేట్ లేఅవుట్లో అప్పన్నకు సంబంధించిన అవశేషాలు గుర్తించారు.పథకం ప్రకారం.. కత్తితో పొడిచికాగా.. నిందితులు నెల రోజుల కిందట ఆనందపురం మండలం లొగడలవానిపాలెంలో ఒక అద్దె ఇంట్లో దిగారు. అక్కడకు సమీపంలో ఉన్న యడ్ల తిరుపతమ్మ అనే టీ దుకాణం యజమానితో వారికి పరిచయం ఏర్పడింది. అదే టీ దుకాణానికి ప్రతి మంగళ, ఆదివారాల్లో అప్పన్న దొర వస్తుండేవాడు. చుట్టు పక్కల గ్రామాల్లో వాస్తు, పూజలు చేస్తుండేవాడు. తనకు కూడా సమస్యలు ఉన్నాయని, పరిష్కరించాలని నిందితురాలు అప్పన్నకు చెప్పగా ఇంటికి వచ్చి పూజలు చేస్తానని చెప్పాడు. ఈ క్రమంలో మౌనిక ఇంటికి వెళ్లిన అప్పన్న ఆమెతో అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా అత్యాచారం చేశాడు.ఈ విషయం ఎవరికై నా చెపితే కుటుంబాన్ని నాశనం చేస్తానని బెదిరించాడు. ఆమె ఈ విషయాన్ని తన భర్త చిన్నారావుకు తెలియజేయగా అప్పన్న దొరను హత్య చేయడానికి పథకం వేశారు. ఉప్పాడలో ఉన్న తన తల్లికి ఆరోగ్యం సరిగా లేదని, పూజ చేయాలని చిన్నారావు అప్పన్నను నమ్మించాడు. రూ.7 వేలు ఇవ్వడానికి ఒప్పందం చేసుకున్నాడు. ఈ నెల 9న బటన్ కత్తి, పల్సర్ బైక్ తెప్పించుకుని అతన్ని ఆనందపురం మండలం క్రాస్ రోడ్డు, బోయపాలెం మీదుగా భీమిలి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ప్రైవేట్ లే అవుట్‌కు తీసుకువెళ్లాడు. అతన్ని కత్తితో పొడిచి హత్య చేశాడు. ఈ క్రమంలో జరిగిన పెనుగులాటలో చిన్నారావు కుడిచేతి చూపుడు వేలికి గాయం కాగా కేజీహెచ్‌లో చికిత్స తీసుకున్నాడు.ఒక రోజు ఆగి..ఆధారాలు లేకుండా చేసేందుకు తర్వాత రోజు టిన్నర్, పెట్రోల్ కొనుగోలు చేశాడు. 11వ తేదీ వేకువజాము 4 గంటల సమయంలో రెండు లీటర్ల టిన్నర్, మరో రెండు లీటర్ల పెట్రోల్ తీసుకొని తన భార్యతో కలిసి బయలుదేరాడు. ఉదయం ఆరు గంటల సమయంలో మృతదేహాన్ని కాల్చివేశాడు. ఘటనా స్థలంలో లభించిన వస్తువులు ఆధారంగా పోలీసులు నిందితులను గుర్తించారు. తన భార్యతో అసభ్యకరంగా ప్రవర్తించాడనే కోపంతో చిన్నారావు జ్యోతిష్యుడిని హత్య చేశాడని, ఈ ఘటనలో భర్తకు మౌనిక సహకారం అందించడంతో ఇద్దరినీ అరెస్ట్ చేసినట్లు సీఐ బి.సుధాకర్ తెలిపారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు బటన్ కత్తి, రక్తపు మరకలు కలిగిన నిందితుడి జీన్ ప్యాంటు, అప్పన్నదొర ఫోన్ పౌచ్, లైటర్, పల్సర్ ద్విచక్రవాహనం, కీ పాడ్ మొబైల్ స్వాధీనం చేసుకున్నట్టు వివరించారు.అదృశ్యమైన జ్యోతిష్యుడు.. అస్థిపంజరమై!