Top Stories
ప్రధాన వార్తలు

ప్రజల పక్షాన పోరాడితే గెలుపు మనదే: వైఎస్ జగన్
సాక్షి,తాడేపల్లి: క్షేత్రస్థాయిలో ప్రభుత్వం మీద వ్యతిరేకత తీవ్రంగా ఉందని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ అన్నారు. అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసి బయటికి వచ్చిన తర్వాత సోమవారం(ఫిబ్రవరి24) తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో వైఎస్ జగన్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ‘మనం యుద్ధ రంగంలో ఉన్నాం, విజయం దిశగా అడుగులు వేయాలి. ప్రజా సమస్యల విషయంలో రాజీలేని పోరాటం చేయాలి. నిజాయితీ, చిత్తశుద్ధితో ప్రజల తరఫున పోరాటం చేయాలి.ప్రజలకు తోడుగా, ప్రజల్లో ఉంటే గెలుపు సాధించినట్టే. అందుకనే ప్రజాసమస్యలపై పోరాటంలో వెనుకడుగు వేయొద్దు. ఈ ప్రభుత్వాన్ని చూసి భయపడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరికీ నేను భరోసా ఇస్తున్నాను, అండగా ఉంటా.ప్రతిపక్షంలో మన సమర్థతను నిరూపించుకోవడానికి ఇదొక అవకాశం. పార్టీకోసం, ప్రజలకోసం గట్టిగా పనిచేస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది. కళ్లుమూసుకుని, తెరిచేలోగా ఏడాది గడిచిపోతోంది. జమిలి ఎన్నికలు అంటున్నారు. అదే జరిగితే ఎన్నికలు మరింత ముందుగా వస్తాయి. అందుకే ప్రజా సమస్యల విషయంలో ఎక్కడా రాజీ వద్దు. ప్రజల తరఫున గొంతు విప్పే విషయంలో ఎక్కడా తగ్గాల్సిన అవసరం లేదు. రాజకీయాల్లో మనం విలువలు, విశ్వసనీయత పాటిస్తున్నాం కాబట్టే ఎన్నో క్లిష్టపరిస్థితులను అధిగమించాం. ఇంత దూరం ప్రయాణం చేశాం. అసెంబ్లీలో మనం తప్ప వేరే ప్రతిపక్షం లేదు. ప్రతిపక్ష హోదా విషయంలో అధికార పార్టీ వైఖరిని ప్రజలకు తేటతెల్లం చేసేందుకే ఇవాళ అసెంబ్లీకి వెళ్లాం. ప్రతిపక్షహోదా ఇస్తే.. హక్కుగా మనకు సమయం ఇవ్వాల్సి వస్తుంది. సభా నాయకుడితో దాదాపు సమాన స్థాయిలో సమయం ఇవ్వాల్సి ఉంటుంది. అందుకనే ప్రతిపక్ష హోదాను ఇచ్చేందుకు ముందుకు రావడంలేదు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. నేను ఏ అంశంపై మాట్లాడినా నిందలకు, దూషణలకు దూరం. ప్రతి అంశాన్నీ ఆధారాలు, రుజువులతో మాట్లాడతాను. అసెంబ్లీలో ఎలాగూ అవకాశం లేదు కాబట్టి ప్రెస్మీట్లలో ప్రజలకు వివరిస్తున్నాను. కౌన్సిల్లో మంచి మెజార్టీ ఉంది. దీన్ని వినియోగించుకోవాలి’ అని వైఎస్ జగన్ సూచించారు.అన్యాయంగా ఇళ్లపట్టాలు రద్దు చేస్తున్నారు: వైఎస్ జగన్ దృష్టికి తీసుకు వచ్చిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలుమన ప్రభుత్వ హయాంలో 31 లక్షలమందికి ఇళ్లపట్టాలు ఇచ్చామని వైఎస్ జగన్ అన్నారు. ‘పార్టీలు చూడకుండా, పక్షపాతం లేకుండా ఇళ్లపట్టాలు ఇచ్చాం, ఎవరైనా ఇళ్లుకట్టుకోకపోతే ప్రభుత్వం వారికి ఇళ్లు మంజూరుచేసి ఇవ్వాలి. అంతేగాని, పేదలపై కక్ష కట్టి పట్టాలు రద్దుచేయడం ఏంటి? పట్టాలు రద్దు చేస్తే తప్పకుండా కోర్టును ఆశ్రయిస్తాం. ఎవరు ఇళ్లస్థలాలు ఇచ్చారో, ఎవరు కాలనీలు ఏర్పాటు చేశారో ప్రజలకు తెలుసు. విజయవాడలో అంబేద్కర్ స్మృతి వనాన్ని మనం నిర్మించాం. కాని పేరు తీసేయాలన్న ఉద్దేశంతో ఏకంగా అంబేద్కర్ విగ్రహంమీదే దాడికి దిగారు. ప్రభుత్వం ఆదేశాలతో ఏకంగా అధికారులే దీనికి ఒడిగట్టారు. స్మృతివనం ఎవరు కట్టారో ప్రజలకు తెలియదా?’ అని వైఎస్ జగన్ ప్రశ్నించారు.

మస్క్ గొప్ప పని చేస్తున్నాడు, కానీ..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ప్రపంచ కుబేరుడు 'ఎలాన్ మస్క్' (Elon Musk)ను ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. ఫెడరల్ వర్క్‌ఫోర్స్‌ను పునర్నిర్మించడానికి చేసిన ప్రయత్నాలను కొనియాడుతూ.. మరింత దూకుడుగా వ్యవహరించాలని అన్నారు. దీనికి సంబంధించిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.''ఎలాన్ గొప్ప పని చేస్తున్నాడు, కానీ అతను మరింత దూకుడుగా ఉండటం నేను చూడాలనుకుంటున్నాను. గుర్తుంచుకోండి, మనం కాపాడుకోవాల్సిన దేశం ఉంది, ఇంతకు ముందు కంటే గొప్పగా చేయాలి" అని అన్నారు. దీనికి మస్క్ రిప్లై ఇస్తూ.. ''చేస్తాను మిస్టర్ ప్రెసిడెంట్'' అని అన్నారు.డొనాల్డ్ ట్రంప్.. ఆదేశాల మేరకు ఫెడరల్ ఉద్యోగులందరికీ ఒక మెయిల్ వస్తుందని, గత వారం వారంతా ఏం పనిచేశారో రిపోర్ట్ ఇవ్వాలన్నారు. ఎవరైతే ఈ మెయిల్‌కు స్పందించరో వారు రాజీనామా చేసినట్లుగా భావించాల్సి వస్తుందని ఎలాన్ మస్క్ పేర్కొన్నారు.ఇదీ చదవండి: రోజుకు రూ.27 కోట్లు విరాళం ఇచ్చిన వ్యక్తి.. ఈయన గురించి తెలుసా?మస్క్ తన ట్వీట్లో చెప్పినట్లుగానే ఉద్యోగులకు శనివారం రాత్రి మెయిల్స్ అందాయి. ఈ మెయిల్లో ఐదు బుల్లెట్ పాయింట్లలో ప్రశ్నలు అడిగారు. గత వారం మీరు మీ పనిలో ఏం సాధించారనేది ఆ ప్రశ్నల సారాంశం. ఈ మెయిల్‌కు సమాధానమిచ్చేందుకు ఉద్యోగులకు సోమవారం రాత్రి దాకా సమయమిచ్చారు. అయితే మెయిల్‌కు సమాధానమివ్వని వారిపై ఏం చర్య తీసుకుంటారన్నది ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది.Will do, Mr. President! pic.twitter.com/2VMS2wY7mw— Elon Musk (@elonmusk) February 22, 2025

Mega Jhumur: ప్రధాని మోదీ గెస్ట్‌గా మెగా ఝుమైర్
ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో సోమవారం అస్సాం అతిపెద్ద ఝుమైర్ నృత్య కార్యక్రమం జరగనుంది. ఇందులో ఎనిమిదివేల మందికి పైగా పాల్గొంటారు. అంతేగాదు ఈ నృత్య ప్రదర్శనను విదేశాంగ మంత్రి జైశంకర్ నేతృత్వంలో సుమారు 60 మందికి పైగా విదేశీ దౌత్యవేత్తలు వీక్షించనున్నారు. అలాగే ప్రజలందరూ వీక్షించేలా దాదాపు 800 టీ ఎస్టేట్లలో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ఇంతకీ అసలేంటీ నృత్యం..? దాని ప్రాముఖ్యత తదితరాల గురించి తెలుసుకుందాం. అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ ఝుమైర్ ప్రాముఖ్యత గురించి పలుమార్లు పునరుద్ఘాటించారు. ఇది అస్సామీ సంస్కృతిలో అంతర్భాగం, టీ తెగ కమ్యూనిటీ భావాలను ప్రతిబింబిస్తోంది. ముఖ్యమంత్రి బిస్వా ఢిల్లీలో రాబోయే ప్రదర్శనల ప్రణాళికలను ప్రకటిస్తూ..అంతర్జాతీయ వేదికపై కూడా ఈ నృత్యం ప్రదర్శించాలనే తన ఆశయాన్ని వ్యక్తం చేశారు. ఇంతలా అస్సాం గిరిజనులతో లోతుగా పాతుకు పోయిన ఝుమైర్ నృత్యం అంటే ఏంటంటే.. ఝుమైర్ నృత్యం అంటే.. ఝుమోయిర్ అనేది అస్సాంలోని టీ తెగ సంఘం, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఒడిశా వంటి పొరుగు రాష్ట్రాల గిరిజనులు ప్రదర్శించే సంప్రదాయ జానపద నృత్యం. ఇది టీ తోట కార్మికుల రోజువారీ జీవితాలలో లోతుగా పాతుకుపోయింది. తరచుగా పండుగలు, పంటకోత వేడుకలు, సామాజిక సమావేశాల సమయంలో ప్రదర్శిస్తారు. చూడటానికి ముగ్ధమనోహరంగా డప్పుల దరువులకు అనుగుణంగా లయబద్ధమైన కదలికలతో కూడిన ఝుమైర్ నృత్యం ఇది. సంప్రదాయ మడోల్(డ్రమ్) లయబద్ధమైన దరువులు నడుమ టీతోటల శ్రమైక జీవుల కథలను శ్రావ్యమైన జానపద పాటలతో చెబుతారు. ఈ నృత్యాన్ని సమూహాలుగా చేస్తారు. ఒకరి నడుములు ఒకరు పట్టుకుని లయబద్ధమైన చప్పట్లు, డ్రమ్ లయలకు అణుగుణంగా పాదాలు కదుపుతారు. ఈ సాంస్కృతిక దృశ్య రూప నృత్యం టీ తోటల కార్మికుల ఐక్యత, సాముహిక స్ఫూర్తిని తెలియజేస్తుంది. అంతటి ప్రాముఖ్యతను సంతరించుకున్న ఈ నృత్యాన్ని ఇందిరా గాంధీ అథ్లెటిక్ స్టేడియంలో ప్రధాన మోదీ సమక్షంలో ప్రదర్శించనున్నారు. అంతేగాదు ఈ ప్రతిష్టాత్మక కళారూపానికి జాతీయ, ప్రపంచ గుర్తింపు తీసుకురావాలనే లక్ష్యంతో ఉంది అస్సాం రాష్ట్రం. అస్సాం గతంలో 2023లో ఇదే వేదికపై సుమారు 12 వేల మందికి పైగా నృత్యకారులతో రికార్డు స్థాయి బిహు నృత్య ప్రదర్శన ఇచ్చి చరిత్ర సృష్టించింది. మళ్లీ ఈసారి కూడా ఆ స్థాయిలో శాశ్వత ముద్రను వేసే దిశగా అగుడులు వేస్తున్నారు అస్సాం ప్రదర్శనకారులు.(చదవండి: నో ఛాన్స్ మోడల్ కాలేవంటూ తిరస్కారాలు..కానీ అతడే ఇవాళ..)

సీఎం రేవంత్‌కు కిషన్‌రెడ్డి బహిరంగ లేఖ
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(Revanth Reddy)కి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్‌రెడ్డి బహిరంగ లేఖ రాశారు. కాంగ్రెస్ ప్రభుత్వం 14 నెలల పాలనపై కిషన్‌కెడ్డి(Kishan Reddy) లేఖ రాశారు. ‘14 నెలల మీ పాలన అసంతృప్తిగా ఉంది. డీఏలు, జీపీఎఫ్, పెండింగ్ బకాయిలు చెల్లించకుండా ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లను రోడ్డున పడేస్తారా?, రిటైర్మెంట్ బెన్ ఫిట్స్ కూడా చెల్లించకుండా మానసిక క్షోభకు గురిచేయడం ఎంత వరకు న్యాయం?, ఉద్యోగులకు రోటీన్ గా చెల్లించాల్సిన బిల్లుల్లో కూడా సీలింగ్ పెట్టడం సిగ్గు చేటు, నిజాయితీగా పనిచేసే ఉద్యోగులకు మీరు ఏ సందేశం ఇస్తున్నట్లు?, కళాశాలల యాజమాన్యాలపట్ల మీ తీరు దుర్మార్గం, ఏళ్ల తరబడి ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు చెల్లించకుండా వేధిస్తున్నారు. కాలేజీల యాజమాన్యాలు బిచ్చమెత్తుకునే దుస్థితి దాపురించింది. ఏప్రిల్, మే నెలలో బకాయిలు చెల్లిస్తామని కాలేజీ యాజమాన్యాలను మళ్లీ మభ్యపెట్టడం ఎంత వరకు కరెక్ట్?, ఎమ్మెల్సీ ఎన్నికల్లో గట్టెక్కేందుకు మళ్లీ మోసపూరిత హామీలకు సిద్ధమవడం సిగ్గు చేటు, నిరుద్యోగ భృతి ఆశ చూపి 14 నెలలుగా రూ.56 వేల బకాయిపడి యువతను దగా చేశారు. మీలో ఏమాత్రం నిజాయితీ ఉన్నా యుద్ద ప్రాతిపదికన బకాయిలు విడుదల చేయండి. ఈరోజే రూ.7500 కోట్ల ఫీజు రీయింబర్స్ మెంట్ సొమ్మును కాలేజీ యాజమాన్యాల ఖాతాల్లో జమ చేయండి. ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ బకాయిలన్నీ ఈరోజే విడుదల చేయండి. యువత అకౌంట్లలో 14 నెలల బకాయి కలిపి రూ.56 వేల నిరుద్యోగ భృతి జమ చేయాలి. ఇవన్నీ యుద్ద ప్రాతిపదికన విడుదల చేసిన తరువాతే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు అడగాలి. దగా హామీలు, మోసపు మాటలతో మభ్యపెడితే మోసపోయేందుకు పట్టభద్రులు, ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ వర్గాలు సిద్ధంగా లేవు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్(Congress) తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు’ కిషన్‌రెడ్డి హెచ్చరించారు.

బాబర్ ఆజం ఒక మోసగాడు.. మొదటి నుంచి అంతే: షోయబ్ అక్తర్
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో పాకిస్తాన్ వరుసగా రెండో ఓటమి చవిచూసింది. దీంతో తమ సెమీస్ అవకాశాలను పాక్ జట్టు సంక్లిష్టం చేసుకుంది. తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో ఓటమి చవిచూసిన పాకిస్తాన్.. రెండో మ్యాచ్‌లో కూడా అదే ఫలితం పునరావృతమైంది. దుబాయ్ వేదికగా భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో పాక్ పరాజయం పాలైంది. బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ విఫలమైన ఆతిథ్య జట్టు ఈ ఘోర ఓటమిని మూటకట్టుకుంది.దీంతో పాక్ జట్టు ఇంటాబయట విమర్శలు ఎదుర్కొంటుంది. తాజాగా ఈ జాబితాలోకి పాకిస్తాన్ ఫాస్ట్ బౌలింగ్ దిగ్గజం షోయబ్ అక్తర్ చేరాడు. ఈ మ్యాచ్‌లో విఫలమైన పాక్ స్టార్ ప్లేయర్ బాబర్ ఆజం(Babar Azam)పై విమర్శలు గుప్పించాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగిన బాబర్ ఆట తీరును అక్తర్ తప్పుబట్టాడు."మనం ఎప్పుడూ బాబర్ ఆజంను విరాట్ కోహ్లితో పోలుస్తాం. విరాట్‌కు బాబర్‌కు చాలా వ్యత్యాసం ఉంది. కోహ్లి.. సచిన్ టెండూల్కర్‌ను రోల్‌మోడల్‌గా తీసుకుని తన కెరీర్‌ను ప్రారంభించాడు. టెండ్కూలర్ అంతర్జాతీయ క్రికెట్లో 100 సెంచరీలు చేశాడు. విరాట్ ఇప్పుడు అతడి వారసత్వాన్ని పొందేందుకు ప్రయత్నిస్తున్నాడు.సచిన్ సెంచరీలకు చేరువతున్నాడు. కానీ బాబర్ ఆజంకు ఎవరూ ఆదర్శం లేరు. అతడి ఆలోచిన విధానం సరిగ్గాలేదు. అనవసరమైన విషయాలపై దృష్టి పెట్టి తన రిథమ్‌ను కోల్పోయాడు. బాబర్ ఆజం ఒక మోసగాడు. అతడు కెరీర్ ఆరంభం నుంచి సెల్ఫిష్‌గా ఉన్నాడు. పాకిస్థాన్ క్రికెట్ జట్టు గురించి మాట్లాడేందుకు నాకు ఆసక్తి లేదు" అని అక్తర్ ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. కాగా ఈ మ్యాచ్‌లో బాబర్ ఆజం 23 పరుగులు చేసి ఔటయ్యాడు.విరాట్ కోహ్లి సూపర్ సెంచరీ..కాగా ఈ మ్యాచ్‌లో 242 పరుగుల టార్గెట్‌ను భారత్ కేవలం నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి 42.3 ఓవర్లలో చేధించింది. భారత బ్యాటర్లలో విరాట్ కోహ్లి ఆజేయ సెంచరీతో చెలరేగాడు. కోహ్లి 111 బంతుల్లో 7 ఫోర్లతో సరిగ్గా 100 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.అతడితో పాటు శ్రేయస్ అయ్యర్(67 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 56), శుబ్‌మన్ గిల్(46) పరుగులతో రాణించారు. పాక్ బౌలర్లలో షాహీన్ అఫ్రిది రెండు వికెట్లు పడగొట్టగా.. ఆర్బర్ ఆహ్మద్, కుష్దిల్ షా తలా రెండు వికెట్లు వికెట్ సాధించారు.చదవండి: పాకిస్తాన్ మ్యాచ్‌లో హార్దిక్ ధరించిన వాచీ ధర తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే..!

అభిమాని అత్యుత్సాహం.. కోపంతో ఫోన్ లాక్కున్న హీరో
మార్కో సినిమాతో బాక్సాఫీస్ విధ్వంసం సృష్టించాడు ఉన్ని ముకుందన్ (Unni Mukundan). ఈ మూవీలో యాక్షన్ హీరోగా రక్తపాతాన్ని పారించిన ఆయన నిర్మాతలకు కాసుల వర్షం కురిపించాడు. ఇటీవల ఆయన ప్రధాన పాత్రలో నటించిన గెట్ సెట్ బేబీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ఓ మల్టీప్లెక్స్‌కు వెళ్లాడు హీరో. అతడిని చూసిన ఓ అభిమాని హీరోకు దగ్గరగా వెళ్లాడు. ఉన్ని ముకుందన్ నడుస్తూ ఉంటే అతడిని వెంబడిస్తూ ఫోన్లో వీడియో చిత్రీకరించాడు.ఫోన్ లాక్కున్న హీరోఅది చూసి సహనం నశించిన హీరో సదరు అభిమాని దగ్గరి నుంచి ఫోన్ లాక్కున్నాడు. దాన్ని జేబులో పెట్టుకుని కోపంతో అలాగే ముందుకు నడుచుకుంటూ వెళ్లిపోయాడు. అభిమాని బతిమాలడంతో ఫోన్ వెనక్కిచ్చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇది చూసిన అభిమానులు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.ఇంకా నయం.. ఫోన్ తీసుకెళ్లిపోలేదులేమీరు హీరోగా ఎదిగే సమయంలో ఎవరైనా మీ అభిమాని అని మీ దగ్గరకు వస్తే సంతోషపడతారు. ఇలా స్టార్డమ్ వచ్చాక మాత్రం ఇరిటేట్ అవుతుంటారు అని ఓ వ్యక్తి రాసుకొచ్చాడు. మరికొందరేమో.. హీరోకు మరీ అంత దగ్గరగా వెళ్లి వీడియో షూట్ చేయాలా? అలా చేస్తే ఎవరికైనా ఇరిటేషన్ వస్తుంది.. ఫోన్‌ను అలాగే తీసుకెళ్లకుండా తిరిగిచ్చేసినందుకు సంతోషించండి. అని కామెంట్లు చేస్తున్నారు. Marco Mode of Unni Mukundan in Real Time.Fan should not take advantage of stars like this.#UnniMukundan#Marco#GetSetBaby pic.twitter.com/mq2AOxLkq2— Deepak Kaliamurthy (@Dheeptweet) February 23, 2025చదవండి: రూ.50 లక్షల ప్రైజ్‌మనీ.. ఇంతవరకు ముట్టనేలేదు: బిగ్‌బాస్ విజేత

KCR: హైకోర్టులో కేసీఆర్ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్
సాక్షి,హైదరాబాద్: మేడిగడ్డ వ్యవహారంపై తెలంగాణ హైకోర్టులో ఇవాళ కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ అధినేత.. మాజీ సీఎం కేసీఆర్(KCR), మాజీ మంత్రి హరీష్ రావులు వేసిన పిటిషన్‌ను విచారించిన కోర్టు.. తీర్పు రిజర్వు చేసింది. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు.. తీర్పును తర్వాత వెల్లడిస్తామని తెలిపింది. మేడిగడ్డ కుంగిన వ్యవహరంపై భూపాలపల్లి కోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ కేసీఆర్, హరీష్ రావులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై ఇవాళ (ఫిబ్రవరి24) హైకోర్టు విచారణ జరపింది. విచారణ సందర్భంగా.. లోయర్ కోర్టులో పిటిషన్ వేసిన రాజలింగమూర్తి(Raja Lingamurthy) చనిపోయాడని కేసీఆర్, హరీష్ తరుఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అయితే.. కేసు వేసిన పిటిషనర్ చనిపోయినా లీగల్ హైర్(Legal Heir)ను ఇంప్లీడ్ చేస్తే.. పిటిషన్ మెయింటేనబుల్ అని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించారు. కాబట్టి, మళ్లీ లోయర్ కోర్టుకు రిఫర్ చేయాలని బెంచ్‌కు విజ్ఞప్తి చేశారు. అయితే.. ఇది క్రిమినల్ పిటిషన్ కాబట్టి లీగల్ హైర్‌కు ఆస్కారం ఉండబోదని కేసీఆర్ అడ్వకేట్ వాదించారు. లీగల్ హైర్ ను ఇంప్లీడ్ చేయడం సమన్స్ కేసుకు మాత్రమే వర్తిస్తుందని కోర్టుకు నివేదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది.

జనసేన ఉండగా ప్రతిపక్షం ఎలా ఇస్తారు?: పవన్ కల్యాణ్
అమరావతి, సాక్షి: వైఎస్సార్సీపీ ప్రతిపక్ష హోదా అంశంపై జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) విచిత్రమైన వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం తర్వాత సభలో ఉంది తామేనని, కాబట్టి ప్రజాగళం వినిపించేందుకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ వైఎస్సార్సీపీ(YSRCP) డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. ఆ లోటును తాము భర్తీ చేస్తామన్న రీతిలో పవన్ మాట్లాడారు.గవర్నర్ ప్రసంగం ముగిశాక.. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద జనసేన ఎమ్మెల్యేలతో పవన్ మాట్లాడారు. అసెంబ్లీలో అధికార టీడీపీ తర్వాత రెండో అతిపెద్ద పార్టీ జనసేన పార్టీ(Jana Sena Party). అలాంటిది జనసేన ఉండగా వైఎస్సార్సీపీకి ప్రతిపక్ష హోదా ఎలా ఇస్తారు?. జనసేన కంటే ఒక్క సీటు వచ్చి ఉన్నా వాళ్లకు ప్రతిపక్ష హోదా దక్కేది.ఓట్ల శాతం ప్రకారం ప్రతిపక్ష హోదా కావాలని అనుకుంటే గనుక జర్మనీకి వెళ్లాలి. ఎందుకంటే అక్కడ మాత్రమే అది సాధ్యమవుతుంది. ఇవాళ గవర్నర్ ప్రసంగాన్ని(Governor Speech) వైఎస్సార్సీపీ బహిష్కరించడం కరెక్ట్ కాదు. అది ఎవరో ఇచ్చేది కాదు. గౌరవీనయులైన సీఎం చంద్రబాబుగారి చేతిలో అది లేదు. దానికి రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఈ ఐదేళ్లలో మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వబడదు. దానికి మీరు ప్రిపేర్ అవ్వండి’’ అని పవన్ వైఎస్సార్సీపీని ఉద్దేశించి అన్నారు.ఇదీ చదవండి: ఇదీ చంద్రబాబు రాజకీయం!

చంద్రబాబు రాజకీయం ఇలాగే ఉంటుంది!
అడ్డగోలు వాదనలు చేయడంలో కొంతమంది రాజకీయ నేతలు సిద్దహస్తులుగా ఉంటారు. వారిలో మొదటి పేరు ఎవరిదైనా చెప్పవలసి వస్తే అది ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుదే అవుతుంది. అలాగే అడ్డగోలు చెత్త కథనాలు ప్రచారం చేయడంలో ఈనాడు, ఆధ్రజ్యోతి వంటి ఎల్లో మీడియాకు మొదటి ర్యాంకు ఇవ్వవలసిందే. ఈ విషయం పలుమార్లు రుజువు అవుతూనే ఉంది. తాజాగా సోలార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా( సెకీ ) నుంచి ఏపీకి విద్యుత్ కొనుగోలు చేయడానికి గత జగన్ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందంపై విషం చిమ్మడానికి టీడీపీతో పాటు, ఎల్లో మీడియా పోటీ పడ్డాయి. సాధారణంగా.. నిజం నిలకడమీద తెలుస్తుందంటారు. కాకపోతే వాస్తవం బయటపడే లోపు అబద్దాలు లోకం అంతా చుట్టేస్తుంటాయి. సెకీతో ఒప్పందం వల్ల ఏపీకి జగన్ తీరని నష్టం చేశారని ఎల్లో మీడియా అసత్యాన్ని ఒకటికి పదిసార్లు ప్రచారం చేసింది. లక్ష కోట్ల భారం ఏపీపై జగన్ వల్ల పడిందని కూడా ఆ మీడియా సంస్థలు ఆరోపించాయి. వాస్తవం ఏమిటంటే జగన్ చేసుకున్న ఒప్పందం వల్ల లక్షా పదివేల కోట్ల రూపాయల మేర ఏపీ ప్రజలకు ఆదా అయింది. ఒకరకంగా చెప్పాలంటే జగన్ వల్ల ఏపీకి లక్ష కోట్లకు పైగా ఆదాయం వచ్చినట్లన్నమాట.👉సెకీ(SECI)తో విద్యుత్ కొనుగోలు ఒప్పందం ప్రకారం యూనిట్ 2.49 రూపాయలకు ఏపీకి సరఫరా అవుతుంది. ఇంత తక్కువ ధరకు గతంలో ఎప్పుడూ ఒప్పందం జరగలేదు. అయినా అది చాలా ఎక్కువ ధర అని, దీనికి ట్రాన్సిమిషన్ చార్జీలు అదనంగా చెల్లించాలంటూ ఇష్టం వచ్చినట్లు ఆ మీడియా ప్రచారం చేయడం, దానిని చంద్రబాబు తలకు ఎత్తుకుని విమర్శలు చేయడం.. కొద్ది నెలల క్రితం నిత్యకృత్యంగా సాగింది. రాష్ట్రం ఏమైపోయినా ఫర్వాలేదు..పెట్టుబడులపై ప్రభావం చూపినా ఫర్వాలేదన్నట్లుగా జగన్ పై దుష్ప్రచారం చేశాయి.అర్ధరాత్రి టైమ్ లో ఫైల్ పై సంతకం పెట్టించారని జనసేనలోకి వెళ్లిన మాజీ విద్యుత్ శాఖ మంత్రితో చెప్పించారు. అయినా జగన్ చేసింది రాష్ట్రానికి మంచి అని ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వమే ఒప్పుకోక తప్పలేదు. 👉తాము ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు(Super Six Promises), ఎన్నికల ప్రణాళిక వాగ్దానాలనుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి అదాని,జగన్ మద్య లింక్ అని, అదాని నుంచి జగన్ లంచం తీసుకున్నారని, అమెరికాలో కేసు అయిందని విపరీతంగా పబ్లిసిటీ చేశారు. ఏపీ ప్రభుత్వంతో నేరుగా అదానీ ఒప్పందమే జరగనప్పుడు లంచాల ప్రస్తావన ఎలా వస్తుందని వైఎస్సార్సీపీ వారు చెప్పినా.. తమ దుర్మార్గపు మీడియాతో పదే పదే ప్రచారం చేయించారు. సరే.. వారు చెబుతున్నారు కదా! సెకీతో ఒప్పందం వల్ల ఏపీకి లక్ష కోట్ల భారం పడుతుందని అంటున్నారు కదా! దానిని రద్దు చేసుకోండని ఎవరైనా సవాల్ చేస్తే మాత్రం దానికి జవాబు చెప్పేవారు కారు. వైఎస్ జగన్‌పై ఈ విద్యుత్ ఒప్పందంపై ఏసీబీతో విచారణ చేయిస్తున్నామని కూడా బిల్డప్ ఇచ్చారు. అవన్నీ ఉత్తిత్తివేనని అందరికి తెలుస్తూనే ఉంది. కాకపోతే జగన్ పై ప్రజలలో ఒక అపనమ్మకం కలిగించడానికి ఈనాడు, ఆంధ్రజ్యోతి మీడియా సంస్థలు నానా చెత్త అంతా ప్రచారం చేసేవి. దానికి అనుగుణంగా చంద్రబాబు మాట్లాడడమో,లీక్ ఇవ్వడమో చేస్తుండేవారు. విశేషం ఏమిటంటే దేశం బీజెపీయేతర రాజకీయ పక్షాలు అదానీపై, ప్రధాని మోదీపైన విమర్శలు చేస్తుంటే, చంద్రబాబు మాత్రం వారిని పల్లెత్తి అనకుండా, జగన్ పై మాత్రం ఆరోపణలు గుప్పిస్తుండేవారు. ఇలా ఉంటుంది చంద్రబాబు రాజకీయం. ఇప్పుడు ఏపీలో విద్యుత్ నియంత్రణ మండలి(AP ERC) సెకీ ఒప్పందం సక్రమమని, దానివల్ల ఎపికి మేలు జరుగుతుందని, కేంద్ర విద్యుత్ నియంత్రణ మండలి కూడా ఈ ఒప్పందానికి ఆమోదం తెలిపిందని స్పష్టం చేసింది. ఏపీఈఆర్సి లో చైర్మన్ ను చంద్రబాబు ప్రభుత్వమే నియమిస్తుంది. అంటే ప్రభుత్వ అభిష్టానికి వ్యతిరేకంగా ఈ మండలి సాధారణంగా నిర్ణయాలు తీసుకోదు. మండలి ఒప్పుకున్నా.. కోకున్నా చంద్రబాబు ప్రభుత్వం తాము సెకీతో ఒప్పదం ప్రకారం విద్యుత్ సరఫరా చేసుకోబోమని కూడా చెప్పి ఉండవచ్చు. ఆ పని చేయలేదు. అంటే చంద్రబాబు అండ్ కో(Chandrababu & Co) ఎప్పటిమాదిరే డబుల్ గేమ్ ఆడారన్నమాట. 👉జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల వచ్చే ప్రయోజనం వారు పొందాలి. అదే టైమ్ లో జగన్ ను బదనాం చేయాలి..ఇది వారి వ్యూహం. అదానీ వివాదం చెలరేగినప్పుడు చాలా స్పష్టంగా ఏ విచారణకు అయినా సిద్దం అని జగన్ చాలెంజ్ చేశారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వం యూనిట్ విద్యుత్‌ను రూ.4.50 నుంచి రూ.6 వరకు కొనుగోలు చేయడానికి చేసుకున్న ఒప్పందాలను సమీక్షించడానికి జగన్ ప్రభుత్వం ప్రయత్నిస్తే.. దానిని టీడీపీ, ఎల్లో మీడియా వ్యతిరేకించి పెట్టుబడులపై ప్రభావం పడుతుందని ప్రచారం చేశాయి. అదే జగన్ రూ.2.49 ఒప్పందం అయితే మాత్రం ఏదో ఘోరం జరిగినట్లు అబద్దాలు సృష్టించారు. ఇప్పుడు ఏపీఈఆర్సీ నిర్ణయంతో చంద్రబాబుకాని, ఎల్లో మీడియాకాని ఎంత తప్పుడు ప్రచారం చేసింది జనానికి పూర్తిగా అర్దం అవుతుంది. 👉ఈనాడు మీడియాలో వచ్చిన హెడింగ్‌లు చూస్తే.. జర్నలిజం ఇంత నీచంగా మారిందా? అనే బాధ కలుగుతుంది. అదానీ కేసులో జగన్ పేరు లేకపోయినా, పనికట్టుకుని ఒకటికి రెండుసార్లు ఆయన పేరు రాసేవారు. నేరుగా అదానీ నుంచి జగన్‌కు రూ. 1,750 కోట్ల లంచం అందిందని అచ్చేశారు. ఇప్పుడు అదే ఒప్పందాన్ని చంద్రబాబు కొనసాగిస్తున్నందున ఆయనకు రూ.2,750 కోట్ల ముడుపులు ముట్టాయా? అని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది.👉అబద్దాల ఆంధ్రజ్యోతి ఇప్పటికీ ఏదో రూపంలో వైఎస్సార్సీపీ బురదచల్లడానికి నిస్సిగ్గుగా యత్నిస్తోంది. ఈనాడు పెట్టిన కొన్ని శీర్షికలు చూడండి..⇒నిబంధనలు ఉల్లంఘించి అదానీకి అనుమతిచ్చేశారుఅసలు అదానీతో ఒప్పందమే లేదని ఈఆర్సీ నివేదిక ప్రకారం కూడా తెలుసుకోవచ్చు. జగన్ ఈ అంశంపై తన వాదన తెలిపితే.. ⇒అవినీతి ఒప్పందానికి అడ్డగోలు సమర్ధనా? అని ఈనాడు విషం కక్కింది. ఇప్పుడు ఈనాడు ఎవరి నుంచి ముడుపులు తీసుకుని ఇలాంటి అవినీతి కధనాలు రాసిందో అని వైఎస్సార్సీపీ ప్రశ్నిస్తోంది.'రాష్ట్రానికి నష్టం..రాజస్తాన్ కు లాభం" అంటూ మరో వార్త ఇచ్చారు. రాజస్తాన్ కు ఇందులో ప్రత్యేకంగా వచ్చే లాభం ఏమి ఉండదు. అదానీ లేదంటే ఇతర పారిశ్రామికవేత్తలు ఆయా చోట్ల నెలకొప్పిన సౌర విద్యుత్ కేంద్రాల నుంచి కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీ విద్యుత్ కొనుగోలు చేసి రాష్ట్రాలకు సరఫరా చేస్తుంది. పైగా అక్కడ నుంచి ఏపీకి ట్రాన్సిమిషన్ చార్జీలు ఉండవని కేంద్రం స్పష్టం చేసినా.. జగన్ పై బురదచల్లుడు కధనాలు ఇచ్చి తన కుసంస్కారాన్ని ప్రదర్శించుకుంది.అంతర్జాతీయ స్థాయికి జగన్ అవినీతి అంటూ చంద్రబాబు ,ఈనాడు,ఆంధ్రజ్యోతి దారుణాతిదారుణంగా ప్రచారం చేశాయి. ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో పరువు పొగొట్టుకున్నది చంద్రబాబు, ఎల్లో మీడియా కాదా?. అదానీ స్కామ్ నిజంగా జరిగి ఉంటే.. అందులో చంద్రబాబు, ఎల్లో మీడియాకు వాటా ఉన్నట్లు అనుకోవాల్సిందేగా! ఏది ఏమైనా ద్వేషంతో జర్నలిజం ప్రాధమిక సూత్రాలను విస్మరించి ఈనాడు చేస్తున్నది పచ్చి పాపం అని చెప్పాలి. అందుకే జగన్ ఈ మీడియాపై పరువు నష్టం దావా వేశారు.అది ఎప్పటికి తేలుతుందో కాని,కచ్చితంగా న్యాయం నిలబడి వారికి శిక్షపడడానికి ఇప్పుడు ఈఆర్సీ చేసిన నిర్ణయం ఒకటే సరిపోవచ్చు.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

SLBC: ఎనిమిది మంది సేఫ్ కంటైనర్‌లోకి వెళ్తే ప్రాణాలతో ఉండే అవకాశం
టన్నెల్ వద్ద సహాయక చర్యలు అప్డేట్స్.. నాగర్‌కర్నూల్ జిల్లాలోని దోమలపెంట సమీపంలో ఉన్న ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. టన్నెల్లో ఇరుక్కున్న ఎనిమిది రక్షించేందుకు చర్యలు చేపట్టారు. ఈ ఆపరేషన్‌లో ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ, సింగరేణి రెస్క్యూ టీమ్, హైడ్రా, సికింద్రాబాద్ బైసన్ డివిజన్ ఇంజినీరింగ్ టాస్క్‌ఫోర్స్ సిబ్బంది పాల్లొన్నారు.తీవ్రంగా శ్రమిస్తున్న ఎన్డీఆర్ఎప్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలుకార్మికులు ఉన్న ప్రాంతానికి దగ్గరగా వెళ్లిన బృందాలుగ్యాస్ కట్టర్లతో బోర్ మిషన్ ను కట్ చేసేందుకు యత్నం ఎస్ఎల్బీసీ టన్నెల్‌ను సందర్శించిన జానారెడ్డిఎస్ఎల్బీసీ వద్ద విషాద ఘటన జరిగిందిపనులు ముమ్మరంగా జరుగుతున్న సమయంలో ఘటన జరగటం విషాదంరెస్క్యూలో అందరు చురుకుగా పని చేస్తున్నారుఏ పద్దతుల్లో వారిని గుర్తించగలమో చర్యలు చేపడుతున్నారుఆచూకీ దొరక్క వారు చనిపోతే మృతదేహాలను ఎలా తీసుకురావాలో చూస్తున్నారుబాధితుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది.మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కామెంట్స్ఘటనకు తీవ్రంగా బాధపడుతున్నానుమా ప్రాజెక్టు పనుల కోసం వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికులు ప్రమాదంలో పడటం విచారకరంఎనిమిది మందిని ప్రాణాలతో తీసుకురావటమే మా ముందున్న లక్ష్యంశ్రీశైలం మల్లన్న దయతో బాధితులు బయటకు రావాలి.రాజకీయాలు చేయాలని చూస్తున్న వారి విజ్ఞతకే వదిలేస్తున్నాంసిరిసిల్ల ఘటనలో చనిపోయిన వారి గురించి కేటీఆర్‌కు గుర్తుకురాలేదా?సహయక చర్యలకు ఆటంకం కలగవద్దని సీఎం రేవంత్ రెడ్డి ఘటన స్థలానికి రావటం లేదుగతంలో పెద్ద పెద్ద ఘటనలు జరిగినప్పుడు పలకరించని కేటీఆర్ ఇప్పుడు రాద్దాంతం చేస్తున్నారుప్రతిపక్ష నాయకుడిగా ఇక్కడికి వచ్చి తెలుసుకోవాలనే చిత్తశుద్ది కేసీఆర్‌కు లేదు ప్రత్యేక పరికరాలతో టన్నెల్లో గాలింపు చర్యలు..ఎస్ఎల్బీసీ టన్నెల్లో టన్నెల్లో 50 గంటలకు పైగా కొనసాగుతున్న సహాయక చర్యలుతీవ్రంగా శ్రమించి టన్నెల బోరింగ్ మిషన్ వద్దకు చేరుకున్న సహాయక బృందంబురదలో మరో 40 మీటర్లు ముందుకు వెళ్లేందుకు తీవ్ర ప్రయత్నాలుగల్లంతైన వారికోసం బురదలోనూ గాలిస్తున్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలుబురదలో కూడా వ్యక్తులను గుర్తించే పరికరాలతో గాలింపు చర్యలుటన్నెల్ బోరింగ్ మిషన్‌లో సేఫ్ కంటైనర్ ఉంటుందని తెలిపిన సిబ్బందికార్మికులు సేఫ్ కంటైనర్‌లోకి వెళ్తే ప్రాణాలతో ఉండే అవకాశం ఉందన్న సిబ్బందిఎస్ఎల్బీసీ టన్నెల్ సహాయక చర్యలపై క్లారిటీ ఇచ్చి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు.శిథిలాలను తొలగించడానికి నెల రోజుల సమయం పట్టొచ్చు.టన్నెల్లో చిక్కుకున్న వాళ్లు ప్రాణాలతో ఉంటారని భావించలేం.ప్రస్తుతం శిథిలాలను తొలగించడం ఒక సవాల్.టీబీఎంను తొలగిస్తే గానీ శిథిలాల తొలగింపు సాధ్యం కాదు.శిథిలాలు టీబీఎంపై పడిపోయి పూర్తిగా ధ్వంసమైంది.సొరంగం లోపల నెలకొన్న పరిస్థితులను చూస్తే దాదాపు నెల రోజుల సమయం పట్టే అవకాశం ఉంది.ప్రమాదం జరిగిన ప్రాంతంలో కరెంట్ కూడా పునరుద్దరించలేదు.నడుము లోతు వరకు నీరు, బురద పేరుకుపోయి ఉంది.టన్నెల్ బోరింగ్ మిషన్ పూర్తిగా కట్ చేయాల్సిందే.మట్టి, సిమెంట్ రింగుల శిథిలాలతో సొరంగం మూసుకుపోయింది.శిథిలాలను తొలగించాలంటే ఉన్న ఏకైక మార్గం రైల్వే ట్రాక్.రైల్వే ట్రాక్ కూడా రెండు కిలోమీటర్ల వరకు నీటిలో మునిగిపోయింది.సొరంగం లోపల నెలకొన్న పరిస్థితులు చూస్తే పప్రమాదం జరిగిన ప్రాంతం నుంచి 500 మీటర్ల వరకు మూసుకుపోయింది. 👉సొరంగంలో మట్టి, నీరు భారీగా చేరడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో సొరంగం పైనుంచి లోపలికి వెళ్లే అంశాన్ని పరిశీలిస్తున్నామని అధికారులు వెల్లడించారు. ఇక, నిరంతరం ఆక్సిజన్ పంపింగ్ చేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు.టన్నెల్ వద్దకు మంత్రి కోమటిరెడ్డి..👉మరోవైపు.. తాజాగా ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద పనులను పరిశీలించేందుకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హైదరాబాద్ నుంచి బయలుదేరారు. టన్నెల్ వద్ద ప్రమాద సహాయకచర్యలు పూర్తి అయ్యేంత వరకు మంత్రి అక్కడే ఉండనున్నట్టు తెలుస్తోంది. పనులను పర్యవేక్షించనున్నారు.మరో 50 మీటర్లే.. 👉ఇక, టన్నెల్‌లోని 13.5 కిలోమీటరు వద్ద పైకప్పు కూలింది. అక్కడి వరకు వెళ్లిన సహాయక బృందాలు టన్నెల్ బోరింగ్ మిషన్ వద్దకు వెళ్లేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అక్కడి నుంచి అర కిలోమీటరు వెళ్లేందుకు మట్టి, నీటితో అడ్డంకులు ఏర్పడుతున్నాయి. హై కెపాసిటీ పంపింగ్ సెట్లు, క్రేన్లు, బుల్డోజర్ల సాయంతో ముందుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు.👉టన్నెల్లో 14వ కి.మీ వద్ద 100 మీటర్ల మేర 15 అడుగుల ఎత్తు బురద పేరుకుపోయింది. ఫిషింగ్ బోట్లు, టైర్లు, చెక్కబల్లలు వేసి దాటేందుకు ప్రయత్నిస్తున్నారు. మరో 50 మీటర్ల బురద స్థలాన్ని దాటితేనే ప్రమాద స్థలానికి వెళ్లగలమని సహాయక బృందాలు చెబుతున్నాయి. ఆర్మీ వైద్య బృందాలు కూడా సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. బాధితుల ఆచూకీ ఇంకా తెలియలేదని ఎన్డీఆర్ఎఫ్ డిప్యూటీ కమాండెంట్ సుఖేంద్ తెలిపారు. సహాయక చర్యల కోసం నేవీ బృందం శ్రీశైలం చేరుకోనుంది.ఆందోళనలో బాధితుల కుటుంబ సభ్యులు.. 👉టన్నెల్లోకి చిక్కుకుపోయిన వారిని కాపాడేందుకు అన్ని రకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో వారు ఎలా ఉన్నారోనని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎనిమిది మంది ఆచూకీ ఎప్పుడు తెలుస్తుందా? అని ఎదురుచూస్తున్నారు. టన్నెల్ లోపల ఉన్నది వీరే.. జేపీ సంస్థకు చెందిన మనోజ్‌కుమార్ (పీఈ), శ్రీనివాస్ (ఎస్ఈ), రోజువారీ కార్మికులు సందీప్‌సాహు (28), జక్తాజెస్ (37), సంతోష్‌సాహు (37), అనూజ్ సాహు (25) ఉన్నారు. రాబిన్సన్ సంస్థకు చెందిన ఆపరేటర్లు సన్నీ సింగ్ (35), గురుదీప్ సింగ్ (40) సొరంగం లోపల చిక్కుకు పోయారు.
అమ్మా.. నేనేం పాపం చేశా!
IND vs PAK: ‘కావాలనే అలా చేశాడు.. లూజర్’
అవే కొంపముంచాయా? కోలకత్తా సెన్సేషనల్ కేసులో బిగ్ ట్విస్ట్!
కావాలనే రాంగ్ మెడిసిన్ ఇచ్చారు.. చావుబతుకుల మధ్య ఆస్పత్రిలో..: బాలా
‘గవర్నర్ ప్రసంగంలో సూపర్ సిక్స్ హామీల ఊసే లేదు’
బాబర్ ఆజం ఒక మోసగాడు.. మొదటి నుంచి అంతే: షోయబ్ అక్తర్
Mega Jhumur: ప్రధాని మోదీ గెస్ట్‌గా మెగా ఝుమైర్
ప్రభాస్ కి కండీషన్స్ పెట్టిన సందీప్ రెడ్డి వంగా?
అతి చేయొద్దు.. ఇలాంటి ప్రవర్తన సరికాదు: పాక్ దిగ్గజం ఆగ్రహం
స్టాక్‌మార్కెట్లు బేర్.. ఐటీ షేర్లు విలవిల
సాక్షి కార్టూన్ 24-02-2025
‘ఏంటిది?’.. రిజ్వాన్ చర్యకు హర్షిత్ రాణా రియాక్షన్ వైరల్.. గంభీర్ కూడా!
Hanamkonda: నిద్రలోనే కన్నుమూసిన కవలలు
'గేమ్ ఛేంజర్'తో మోసపోయామని పోలీసులకు ఫిర్యాదు
జనసేన ఉండగా ప్రతిపక్షం ఎలా ఇస్తారు?: పవన్ కల్యాణ్
'తండేల్' రామారావుకు రూ. 20 లక్షలు, ఇల్లు: మత్స్యకారులు
ఇదేం తీరు కోహ్లి? ఇలాంటివి అవసరమా?.. మండిపడ్డ గావస్కర్
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం.. యత్నకార్యసిద్ధి
'వెళ్లి జింబాబ్వేతో సిరీస్ ఆడుకోండి'.. పాక్‌పై ఆక్మల్ ఫైర్
IND Vs PAK: చాలా సంతోషంగా ఉంది.. అతడు అందుకే నెం1 అయ్యాడు: విరాట్ కోహ్లి
అమ్మా.. నేనేం పాపం చేశా!
IND vs PAK: ‘కావాలనే అలా చేశాడు.. లూజర్’
అవే కొంపముంచాయా? కోలకత్తా సెన్సేషనల్ కేసులో బిగ్ ట్విస్ట్!
కావాలనే రాంగ్ మెడిసిన్ ఇచ్చారు.. చావుబతుకుల మధ్య ఆస్పత్రిలో..: బాలా
‘గవర్నర్ ప్రసంగంలో సూపర్ సిక్స్ హామీల ఊసే లేదు’
బాబర్ ఆజం ఒక మోసగాడు.. మొదటి నుంచి అంతే: షోయబ్ అక్తర్
Mega Jhumur: ప్రధాని మోదీ గెస్ట్‌గా మెగా ఝుమైర్
ప్రభాస్ కి కండీషన్స్ పెట్టిన సందీప్ రెడ్డి వంగా?
అతి చేయొద్దు.. ఇలాంటి ప్రవర్తన సరికాదు: పాక్ దిగ్గజం ఆగ్రహం
స్టాక్‌మార్కెట్లు బేర్.. ఐటీ షేర్లు విలవిల
సాక్షి కార్టూన్ 24-02-2025
‘ఏంటిది?’.. రిజ్వాన్ చర్యకు హర్షిత్ రాణా రియాక్షన్ వైరల్.. గంభీర్ కూడా!
Hanamkonda: నిద్రలోనే కన్నుమూసిన కవలలు
'గేమ్ ఛేంజర్'తో మోసపోయామని పోలీసులకు ఫిర్యాదు
జనసేన ఉండగా ప్రతిపక్షం ఎలా ఇస్తారు?: పవన్ కల్యాణ్
'తండేల్' రామారావుకు రూ. 20 లక్షలు, ఇల్లు: మత్స్యకారులు
ఇదేం తీరు కోహ్లి? ఇలాంటివి అవసరమా?.. మండిపడ్డ గావస్కర్
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం.. యత్నకార్యసిద్ధి
'వెళ్లి జింబాబ్వేతో సిరీస్ ఆడుకోండి'.. పాక్‌పై ఆక్మల్ ఫైర్
IND Vs PAK: చాలా సంతోషంగా ఉంది.. అతడు అందుకే నెం1 అయ్యాడు: విరాట్ కోహ్లి
సినిమా

పాక్‌ను ఆడేసుకుంటోన్న నెటిజన్స్.. పుష్ప-2 సీన్‌ను కూడా వదల్లేదు!
భారత్- పాకిస్తాన్ మధ్య ఆదివారం జరిగిన వన్డే మ్యాచ్‌లో టీమిండియా జయకేతనం ఎగరేసింది. దుబాయ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో అతిథ్య పాక్ జట్టును భారత్ మట్టికరిపించింది. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా జరిగిన ఈ లీగ్ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ సెంచరీతో చెలరేగాడు. పాక్ జట్టు నిర్దేశించిన లక్ష్యాన్ని కేవలం నాలుగు వికెట్లు మాత్రమే టీమిండియా ఘనవిజయం సాధించింది. అయితే దాయాదుల పోరు అంటే ఓ రేంజ్లో ఫైట్ ఉంటుంది. అందుకు తగ్గట్టుగానే ఇరుదేశాల అభిమానుల్లోనూ భారీ అంచనాలు పెట్టుకుని ఉంటారు. ఆటలో గెలుపోటములు సహజమే అయినప్పటికీ భారత్- పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఓ రేంజ్ ఉంటుంది. ఇలాంటి ప్రతిష్టాత్మక మ్యాచ్‌లో ఓటమి పాలైన జట్టుపై విమర్శలు కూడా అదేస్థాయిలో ఉంటాయి.ఇంకేముంది పాక్ జట్టు ఇండియాతో ఓడిపోవడంతో నెటిజన్స్ ఓ ఆటాడేసుకుంటున్నారు. ఆ జట్టుపై నెట్టింట ట్రోల్స్ తెగ వైరలవుతున్నాయి. కింగ్ కోహ్లీని ప్రశంసలు కురిపిస్తూ.. పాక్ టీమ్‌ను ఫుట్‌బాల్ ఆడేస్తున్నారు నెటిజన్స్. తాజాగా పాక్ జట్టుపై చేసిన ఓ మీమ్ మాత్రం తెగ వైరలవుతోంది. ఇందులో మన పుష్పరాజ్‌ను కూడా వాడేశారు. అల్లు అర్జున్ పుష్ప-2 చిత్రంలోని ఓ పైట్ సీన్‌తో క్రియేట్ చేసిన మీమ్ నెట్టింట నవ్వులు పూయిస్తోంది.పుష్ప-2 చిత్రంలోని గంగమ్మ జాతర సాంగ్ తర్వాత వచ్చే ఫైట్ సీన్ గురించి సినిమా చూసిన ఎవ్వరైనా మర్చిపోలేరు. తాజాగా ఆ ఫైట్ సీన్లోని ఓ క్లిప్‌తో పాక్ టీమ్‌ను ట్రోల్ చేశారు. అల్లు అర్జున్‌కు ఫేస్‌కు కోహ్లీని చూపిస్తూ.. రౌడీలను పాక్ జట్టుతో పోలుస్తూ మీమ్ క్రియేట్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో మాత్రం తెగ వైరలవుతోంది. ఇంకేముంది ఈ ఫన్నీ మీమ్ చూసిన మన టీమిండియా ఫ్యాన్స్ మాత్రం తెగ నవ్వేసుకుంటున్నారు. ఇంకేందుకు ఆలస్యం ఆ మీమ్ మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. #INDvsPAK pic.twitter.com/7dP4diEwq7— Unlisted-pre IPO Investment Zone (@reddy73375) February 23, 2025

రూ.50 లక్షల ప్రైజ్‌మనీ.. ఇంతవరకు ముట్టనేలేదు: బిగ్‌బాస్ విజేత
బిగ్‌బాస్ (Bigg Boss Reality Show) విన్నర్ గెల్చుకునే ప్రైజ్‌మనీ రూ.50 లక్షలు. తెలుగులోనే కాదు హిందీలోనూ ఈ ప్రైజ్‌మనీ దాదాపు అంతే ఉంటుంది. అయితే వినడానికి, చెప్పుకోవడానికి బాగానే ఉంది కానీ అది వెంటనే చేతికి ఇస్తే ఇంకా బాగుండేదంటున్నాడు హిందీ బిగ్‌బాస్ 18వ సీజన్ విజేత కరణ్ వీర్ మెహ్రా (Karan Veer Mehra). సల్మాన్ ఖాన్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన హిందీ బిగ్‌బాస్ 18వ సీజన్ గత నెలలోనే పూర్తయింది. ఈ షోలో కరణ్ టైటిల్ గెలవగా వివియన్ డిసేన రన్నరప్‌గా నిలిచారు. కరణ్.. రూ.50 లక్షలు గెలిచాడన్నమాటేకానీ ఇంతవరకు ఒక్క రూపాయి కూడా ముట్టలేదట!చేతికందని ప్రైజ్మనీతాజాగా అతడు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కలర్స్ ఛానల్లో నేను పాల్గొన్న మొదటి షో ఖత్రోన్ కె ఖిలాడీ-సీజన్ 14. గతేడాది జరిగిన ఈ షోలో విజయం సాధించాను. తద్వారా రావాల్సిన డబ్బు ఇటీవలే ముట్టింది. ఇదే ఛానల్లో ప్రసారమైన బిగ్‌బాస్ షోలోనూ పాల్గొని మరోసారి విజయం సాధించాను. కానీ ఇప్పటివరకు రూ.50 లక్షల ప్రైజ్‌మనీని నాకివ్వనేలేదు. అలాగే కారు కూడా బహుమతిగా ఇస్తామన్నారు. దానికోసం ఎంతో ఎదురుచూడగా ఇప్పుడు నాచేతికి వచ్చేసింది.అభిమానులతో జాలీగా..అయితే ఈ షో నేను గెలుస్తాననుకోలేదు. అభిమానుల అండదండల వల్లే నా విజయం సాధ్యమైంది. ఒకవేళ నేను గెలవకపోయినా ఇంతే సాధారణంగా ఉండేవాడిని. బిగ్‌బాస్ తర్వాత నాకు విపరీతమైన ప్రేమాభిమానాలు దక్కుతున్నాయి. చాలా సమయం ఫ్యాన్స్‌తోనే గడుపుతున్నాను. నన్ను ఆశీర్వదించిన మహిళలకూ సమయం కేటాయిస్తున్నాను అని చెప్పుకొచ్చాడు. కరణ్ బిగ్‌బాస్ ద్వారా గెలిచిన డబ్బుతో తన సిబ్బంది పిల్లలకు చదువు చెప్పిస్తానన్నాడు. View this post on Instagram A post shared by KaranVeerMehra (@karanveermehra) చదవండి: తండ్రిని కోల్పోయిన బాధలోనూ సాయం చేసిన ప్రభాస్..

సుకుమార్ చేయి వదలని ఐటమ్ బ్యూటీ.. వీడియో వైరల్
ఆదివారం ఇండియా-పాక్ క్రికెట్ మ్యాచ్ ఫీవర్ నడిచింది. దుబాయిలో జరిగిన ఈ మ్యాచ్ చూసేందుకు తెలుగు సెలబ్రిటీలు కూడా వెళ్లారు. మెగాస్టార్ చిరంజీవి, ఫ్యామిలీతో కలిసి దర్శకుడు సుకుమార్ కూడా మ్యాచ్ చూసేందుకు వెళ్లారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి వచ్చే సినిమాలు ఏంటంటే?)ఇదే మ్యాచ్ లో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా కూడా సందడి చేసింది. తన పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకోవడంతో పాటు సుకుమార్ ని కూడా గట్టిగానే కాక పట్టేందుకు ప్రయత్నించినట్లు అనిపించింది. ఎందుకంటే సుకుమార్ ని కలిసిన ఆనందంలో ఆయన చేయి పట్టుకున్న ఊర్వశి.. కాసేపటి వరకు అస్సలు వదల్లేదు. ఆ వీడియోనే తన ఇన్ స్టాలోనూ పోస్ట్ చేసింది.సుకుమార్ ని కలిసిన వీడియోని పోస్ట్ చేసిన ఊర్వశి.. ఈయన్ని తెగ పొగిడేసింది. 'సుకుమార్ గారు మీరు సాధించిన విజయాలకు శుభాకాంక్షలు. మీ మేధస్సు, డెడికేషన్ మమ్మల్ని ఎంతగానో స్పూర్తి కలిగిస్తున్నాయి. మేమంతా మిమ్మల్ని ఎంతగానో అభిమానిస్తున్నాం' అని రాసుకొచ్చింది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'సంక్రాంతి' హిట్ సినిమా.. డేట్ ఫిక్సయిందా?)ఈ మధ్యే సంక్రాంతికి వచ్చిన 'డాకు మహారాజ్'లో దబిడి దిబిడి అంటూ ఐటమ్ పాటకు స్టెప్పులేసిన ఊర్వశి.. బాగానే క్రేజ్ తెచ్చుకుంది. ఇప్పుడు పనిలో పనిగా సుకుమార్ ని కూడా కాకా పట్టేసి తెలుగు ఇండస్ట్రీలో సెటిలైపోయే ప్లాన్ ఏమైనా వేస్తుందా అనిపిస్తుంది.మ్యాచ్ విషయానికొస్తే తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 241 పరుగులు చేసింది. ఛేదనలో కొన్ని ఓవర్లు మిగిలుండగానే భారత్ గెలిచేసింది. కోహ్లీ సెంచరీతో ఆకట్టుకున్నాడు.(ఇదీ చదవండి: 'హిట్ 3' టీజర్ రిలీజ్.. అస్సలు ఊహించలే!) View this post on Instagram A post shared by URVASHI RAUTELA (@urvashirautela)

తండ్రిని కోల్పోయిన బాధలోనూ సాయం చేసిన ప్రభాస్.. రచయిత ఎమోషనల్
డార్లింగ్ ప్రభాస్ (Prabhas) మంచితనం గురించి అందరికీ తెలుసు. సెట్లోని వారికి ఇంటిభోజనం తెచ్చి కడుపు నిండే ఈయన ఆపదలో ఉన్న ఎంతోమందిని ఆదుకున్నాడు. ఆ జాబితాలో తానూ ఉన్నానంటున్నాడు రచయిత తోట ప్రసాద్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. 2010 ఫిబ్రవరిలో మహాశివరాత్రికి ముందు అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరాను. దురదృష్టవశాత్తూ అదేరోజు ప్రభాస్ తండ్రి సూర్యనారాయణరాజు (Uppalapati Surya Narayana Raju) కన్నుమూశారు. అది పన్నెండవ తారీఖు అనుకుంటాను!తండ్రిని కోల్పోయిన బాధలోనూ..తండ్రి మరణంతో శోకంలో మునిగిపోయిన ఆయన.. నేను ఆస్పత్రిలో ఉన్నానన్న విషయం తెలిసి నాకోసం కొంత డబ్బు పంపించారు. నాపై అంత శ్రద్ధ తీసుకున్నారు. ఎవరైనా తన ఇంట్లో కష్టం ఉన్నప్పుడు ఎదుటివారి గురించి ఆలోచించరు. అందులోనూ తండ్రిని కోల్పోవడం అంటే మామూలు బాధాకర విషయం కాదు. అటువంటి పరిస్థితిలోనూ ఆయన.. నా సినిమా రచయిత అని నన్ను సొంత మనిషిగా భావించి వెంటనే స్పందించారు. కన్నప్ప ద్వారా..ప్రభాస్.. అంతటి మంచి వ్యక్తి. చాలాకాలం తర్వాత కన్నప్ప మూవీ ద్వారా ఆయనతో కలిసి పనిచేసే అవకాశం దక్కింది అని ఎమోషనలయ్యాడు. ప్రభాస్ బిల్లా సినిమాకు ప్రసాద్ సహరచయితగా పనిచేశాడు. ఇకపోతే ప్రభాస్ ప్రస్తుతం మారుతి 'రాజా సాబ్', హను రాఘవపూడి 'ఫౌజీ' సినిమాల్లో నటిస్తున్నాడు. అనంతరం స్పిరిట్, సలార్ 2, కల్కి 2 చిత్రాలు పట్టాలెక్కించనున్నాడు.చదవండి: 'హిట్ 3' టీజర్ రిలీజ్.. అస్సలు ఊహించలే!
క్రీడలు

‘పాకిస్తాన్లో గెలిచి ఉంటే బాగుండేది’.. ఇచ్చిపడేసిన శ్రేయస్ అయ్యర్
టీమిండియా విజయాన్ని తక్కువ చేసేలా మాట్లాడిన పాకిస్తాన్ జర్నలిస్టుకు శ్రేయస్ అయ్యర్(Shreyas Iyer) గట్టి కౌంటర్ ఇచ్చాడు. వేదిక ఏదైనా పాక్‌పై గెలుపు తమకు ఎల్లప్పుడూ మధురంగానే ఉంటుందని.. ఆదివారం నాటి మ్యాచ్‌లో తనకు మజా వచ్చిందంటూ అతడికి తమ జట్టు ఓటమిని గుర్తు చేశాడు.కాగా చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) ఆతిథ్య హక్కులను డిఫెండింగ్ చాంపియన్ హోదాలో పాకిస్తాన్ దక్కించుకున్న విషయం తెలిసిందే. అయితే, భద్రతా కారణాల దృష్ట్యా టీమిండియాను అక్కడికి పంపేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI) నిరాకరించగా.. ఐసీసీ జోక్యంతో హైబ్రిడ్ విధానంలో టోర్నీ జరుగుతోంది. తటస్థ వేదికైన దుబాయ్‌లో భారత జట్టు తమ మ్యాచ్‌లు ఆడుతోంది.42.3 ఓవర్లలోనే..ఇందులో భాగంగా తొలుత బంగ్లాదేశ్‌ను ఓడించిన రోహిత్ సేన.. తాజా మ్యాచ్‌లో పాకిస్తాన్‌ను చిత్తు చేసి సెమీస్ బెర్తును దాదాపుగా ఖాయం చేసుకుంది. దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో టాస్ ఓడి తొలుత బౌలింగ్ చేసిన భారత్ పాక్‌ను 241 పరుగులకు కట్టడి చేసింది. ఇక 42.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి పాక్‌పై గెలుపొందింది.ఈ విజయంలో విరాట్ కోహ్లి(100 నాటౌట్)తో పాటు శుబ్‌మన్ గిల్(46), శ్రేయస్ అయ్యర్(56)లది కూడా కీలక పాత్ర. ఈ నేపథ్యంలో విజయానంతరం శ్రేయస్ మీడియా సమావేశంలో మాట్లాడగా.. ఓ పాకిస్తానీ జర్నలిస్టు.. దుబాయ్‌లో గాకుండా పాకిస్తాన్లో పాకిస్తాన్‌ను ఓడించి ఉంటే ఇంకా బాగుండేది కదా అని ప్రశ్నించాడు.ఇరుజట్లకు తటస్థ వేదికే..సదరు జర్నలిస్టు మాటల్లోని వ్యంగ్యాన్ని అర్థం చేసుకున్న శ్రేయస్ అయ్యర్ హుందాగానే కౌంటర్ వేశాడు. ‘‘పాకిస్తాన్లో నేను ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. కాబట్టి అక్కడ గెలిస్తే ఆ అనుభూతి ఎలా ఉంటుందో నాకు తెలియదు. అయితే, దుబాయ్ అనేది ఇరుజట్లకు తటస్థ వేదికే.ఇక భారత్- పాక్ మ్యాచ్ అంటే అంచనాలు భారీగానే ఉంటాయి. అయినా మేము దుబాయ్‌లో ఎక్కువగా మ్యాచ్‌లు ఆడలేదు. ఏదైతేనేం ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్‌ను ఓడించాము కదా. అదే ఓ మధురానుభూతి. బయట నుంచి వచ్చే ఒత్తిడిని అధిగమించి మరీ మా పని పూర్తి చేశాం.నేనైతే ఈ విజయాన్ని పూర్తిగా ఆస్వాదిస్తున్నా. పాకిస్తాన్‌పై ఇది నాకు మూడో మ్యాచ్. ఇందులో గెలవడం ఎంతో మజాన్నిచ్చింది’’ అని శ్రేయస్ అయ్యర్ సమాధానమిచ్చాడు. సొంతగడ్డపై పాక్ బలమైన జట్టుగా ఉంటుందనే ఉద్దేశంతో ఆ దేశ జర్నలిస్టు చేసిన వ్యాఖ్యలను తన మాటలతో ఇలా తిప్పికొట్టాడు.ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025: టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ స్కోర్లు👉వేదిక: దుబాయ్👉టాస్: పాకిస్తాన్.. తొలుత బ్యాటింగ్👉పాకిస్తాన్ స్కోరు- 241(49.4) ఆలౌట్👉భారత్ స్కోరు- 244/4 (42.3)👉ఫలితం: పాక్‌ను ఆరు వికెట్ల తేడాతో ఓడించిన టీమిండియా👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: విరాట్ కోహ్లి(100 పరుగులు నాటౌట్).చదవండి: Virat Kohli: ఇదేం తీరు కోహ్లి? ఇలాంటివి అవసరమా?.. మండిపడ్డ గావస్కర్

గిల్‌ను ఔట్ చేశాక పాక్ బౌలర్ ఓవరాక్షన్.. ఏకి పారేస్తున్న టీమిండియా అభిమానులు
భారత్, పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్‌ల్లో ఆటగాళ్లు ఒకరినొకరు కవ్వించుకోవడం, మాటల యుద్దానికి దిగడం సర్వ సాధారణం. అయితే ఇటీవలికాలంలో ఇలాంటి వాతావరణంలో బాగా మార్పు వచ్చింది. ఇరు జట్ల ఆటగాళ్లు ఒకరినొకరు గౌరవించుకుంటున్నారు. స్నేహపూర్వకంగా మెలుగుతున్నారు. మైదానంలో హుందాగా ప్రవర్తిస్తున్నారు. కోహ్లి, రోహిత్ జమానా మొదలయ్యాక భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌ల్లో స్లెడ్జింగ్ అనేదే కనిపించడం లేదు. జూనియర్లు సీనియర్లను గౌరవిస్తున్నారు. వీలైతే సలహాలు తీసుకుంటున్నారు. ఇటీవలి కాలంలో చాలామంది పాక్ ఆటగాళ్లు విరాట్ కోహ్లి దగ్గర చిట్కాలు తీసుకోవడం చూశాం.Virat Kohli to Abrar Ahmed pic.twitter.com/4BrIhnw6vb— Sagar (@sagarcasm) February 23, 2025అయితే తాజాగా జరిగిన భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌లో పాక్ యువ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ ఈ మంచి సంప్రదాయానికి తూట్లు పొడిచాడు. ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భాగంగా జరిగిన ఈ మ్యాచ్‌లో అబ్రార్ చాలా ఓవరాక్షన్ చేశాడు. ఫలితంగా భారత క్రికెట్ అభిమానుల నుంచి తిట్ల దండకాన్ని అందుకుంటున్నాడు. Look at audacity of Abrar 🤬Beta Karachi airport ke liye flight pakdo, hold this elimination ✌🏽 pic.twitter.com/J6c3ax7LDS— 🥹 shim8u (@veerjatt007) February 23, 2025అసలేం జరిగిందంటే.. భారత్, పాకిస్తాన్ జట్లు నిన్న (ఫిబ్రవరి 23) దుబాయ్‌లో తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో భారత్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో అబ్రార్ అహ్మద్ అతి చేశాడు. పాక్ నిర్దేశించిన లక్ష్యాన్ని భారత్ సాఫీగా ఛేదిస్తుండగా.. శుభ్‌మన్ గిల్ రెండో వికెట్‌గా వెనుదిరిగాడు. గిల్‌ను అబ్రార్ క్లీన్ బౌల్డ్ చేశాడు. గిల్‌ను ఔట్ చేశాక అబ్రార్ ఓవరాక్షన్ అంతాఇంతా కాదు. Batao, ye Abrar Ahmed ne utne matches nahi khele jitney ki Centuries Gill ki hai, lekin send-off dekho lukkhe ka https://t.co/3C8Sd4TLNz pic.twitter.com/dhtHqbPUPG— Mihir Jha (@MihirkJha) February 23, 2025చేతులు కట్టుకుని నిలబడి 'వెళ్లు.. ఇక వెళ్లు.. వెళ్లి బ్యాగ్ సర్దుకో' అన్నట్టు సైగలు చేశాడు. దీంతో భారత అభిమానులకు చిర్రెత్తుకొచ్చింది. అబ్రార్‌ను సోషల్ మీడియా వేదికగా ఓ రేంజ్లో ఆడుకుంటున్నారు. బ్యాగ్ సర్దుకోవాల్సింది గిల్ కాదు, మీరే అంటూ కామెంట్లు చేస్తున్నారు. Watch it before it get remove Abrar reaction to Gill One word for abrar 👇🏼👇🏼 #indvspak #viratkohli pic.twitter.com/coEQydD2qy— Vodka triceps (@vodkatriceps) February 24, 2025కొందరు గిల్ హార్డ్ కోర్ అభిమానులు వాడకూడని భాషలో అబ్రార్‌ను దూషిస్తున్నారు. ఇంకొందరేమో నీకు సరిగ్గా బుద్ది చెప్పే విరాట్ కోహ్లి ఇంకా క్రీజ్‌లోనే ఉన్నాడంటూ కామెంట్స్ చేశారు. మొత్తానికి అబ్రార్ చేసిన ఓవరాక్షన్‌తో పాక్ జట్టు మొత్తం ట్రోలింగ్‌కు గురైంది.మ్యాచ్ విషయానికొస్తే.. విరాట్ సూపర్ సెంచరీతో కదంతొక్కడంతో పాక్‌పై భారత్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. విరాట్ అజేయ సెంచరీతో భారత్‌ను విజయతీరాలకు చేర్చాడు. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్.. 49.4 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌటైంది. సౌద్ షకీల్ (62) అర్ద సెంచరీతో రాణించగా.. కెప్టెన్ రిజ్వాన్ (46), ఖుష్దిల్ షా (38) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. వీరు మినహా పాక్ ఇన్నింగ్స్‌లో ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. ఇమామ్ ఉల్ హక్ 10, బాబర్ ఆజమ్ 23, సల్మాన్ అఘా 19, తయ్యబ్ తాహిర్ 4, షాహీన్ అఫ్రిది 0, నసీం షా 14, హరీస్ రౌఫ్ 8 పరుగులు చేసి ఔటయ్యారు. భారత బౌలర్లలో కుల్దీప్ 3, హార్దిక్ 2, హర్షిత్ రాణా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా తలో వికెట్ తీశారు.అనంతరం బరిలోకి దిగిన భారత్.. కోహ్లి శతక్కొట్టడంతో (111 బంతుల్లో 100 నాటౌట్; 7 ఫోర్లు) 42.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. శ్రేయస్ అయ్యర్ (56).. విరాట్‌తో కలిసి కీలకమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పి భారత విజయాన్ని ఖరారు చేయగా.. ఓపెనర్లు రోహిత్ శర్మ (20), శుభ్‌మన్ గిల్ (46) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. పాక్ బౌలర్లలో అఫ్రిది 2, అబ్రార్ అహ్మద్, ఖుష్దిల్ షా తలో వికెట్ తీశారు. ఈ గెలుపుతో భారత్ సెమీస్ బెర్త్ దాదాపుగా ఖరారు చేసుకుంది. వరుస పరాజయాలతో పాక్ సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది.

IPL 2025: సీఎస్కే ప్రకటన.. అసిస్టెంట్ కోచ్‌గా మాజీ క్రికెటర్
ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL)-2025 ఆరంభానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్(CSK) కీలక నియామకం చేపట్టింది. తమిళనాడు మాజీ క్రికెటర్ శ్రీధరన్ శ్రీరామ్(Sridharan Sriram)ను తమ అసిస్టెంట్ బౌలింగ్ కోచ్‌గా నియమించింది. ఇందుకు సంబంధించి సోమవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది.కాగా ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన జట్లలో ఒకటిగా సీఎస్కేకు పేరుంది. మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలో ఏకంగా ఐదుసార్లు చాంపియన్‌గా నిలిచిన చెన్నై జట్టుకు.. గతేడాది కొత్త కెప్టెన్ వచ్చాడు. మహారాష్ట్ర ఆటగాడు, టీమిండియా ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ ధోని వారసుడిగా పగ్గాలు చేపట్టాడు.గతేడాది ఐదో స్థానంలోఅయితే, ఐపీఎల్-2024లో పద్నాలుగు మ్యాచ్‌లకు గానూ ఏడు గెలిచిన రుతుసేన నెట్రన్ రేటు తక్కువగా ఉన్న కారణంగా ప్లే ఆఫ్స్ చేరలేకపోయింది. పదిజట్లున్న ఈ క్యాష్ రిచ్ లీగ్‌లో పాయింట్ల పట్టికలో ఐదో స్థానంతో సరిపెట్టుకుంది. ఈ క్రమంలో ఐపీఎల్ మెగా వేలం-2025కి ముందు జట్టును ప్రక్షాళన చేసిన సీఎస్కే యాజమాన్యం సరికొత్త వ్యూహాలతో ఈ సీజన్లో ముందుకు రానుంది.ఈ క్రమంలో తమ సహాయక సిబ్బందిలోకి శ్రీధరన్ శ్రీరామ్‌ను కూడా చేర్చుకోవడం గమనార్హం. కాగా సీఎస్కే హెడ్‌కోచ్‌గా స్టీఫెన్ ఫ్లెమింగ్ ఉండగా.. ఎరిక్ సిమ్మన్స్ బౌలింగ్ కోచ్‌గా సేవలు అందిస్తున్నాడు. ఇప్పుడు అతడికి అసిస్టెంట్‌గా శ్రీధరన్ శ్రీరామ్ కూడా సీఎస్కే కోచింగ్ స్టాఫ్‌లో చేరాడు.కాగా తమిళనాడుకు చెందిన శ్రీధరన్ ఎనిమిది వన్డేలు ఆడి 81 పరుగులు చేయడంతో పాటు.. తొమ్మిది వికెట్లు కూడా తీశాడు. ఆటగాడిగా తన ప్రయాణం ముగిసిన తర్వాత ఈ లెఫ్టార్మ్ స్పిన్నర్.. ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు కోచింగ్ విభాగంలో పనిచేశాడు. రెండేళ్ల పాటు కంగారూ టీమ్ స్పిన్ బౌలింగ్ కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు. బంగ్లాదేశ్ జట్టుకు కూడా సేవలు అందించాడు.ఇక గతేడాది లక్నో సూపర్ జెయింట్స్‌కు అసిస్టెంట్ కోచ్‌గా వ్యవహరించిన శ్రీధరన్ తాజాగా సీఎస్కేలో చేరాడు. ఈ విషయం గురించి.. ‘‘మా అసిస్టెంట్ బౌలింగ్ కోచ్ శ్రీధరన్ శ్రీరామ్‌కు స్వాగతం. చెపాక్ స్టేడియం నుంచి ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ జట్లకు కోచ్‌గా ఎదిగిన ఆయన ప్రయాణం మాకు గర్వకారణం’’ అని సీఎస్కే తమ సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసింది.ఐపీఎల్-2025లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టురుతురాజ్ (రూ. 18 కోట్లు) జడేజా (రూ. 18 కోట్లు) పతిరణ (రూ. 13 కోట్లు) శివమ్ దూబే (రూ. 12 కోట్లు) ధోని (రూ. 4 కోట్లు) నూర్ అహ్మద్ (రూ.10 కోట్లు) ఆర్. అశి్వన్ (రూ. 9.75 కోట్లు) కాన్వే (రూ. 6.25 కోట్లు) ఖలీల్ అహ్మద్ (రూ. 4.80 కోట్లు) రచిన్ రవీంద్ర (రూ. 4 కోట్లు) రాహుల్ త్రిపాఠి (రూ. 3.40 కోట్లు) అన్షుల్ కంబోజ్ (రూ.3.40 కోట్లు) స్యామ్ కరన్ (రూ. 2.40 కోట్లు) గుర్జప్నీత్ సింగ్ (రూ. 2.20 కోట్లు) నాథన్ ఎలిస్ (రూ. 2 కోట్లు) దీపక్ హుడా (రూ.1.70 కోట్లు) జేమీ ఓవర్టన్ (రూ.1.50 కోట్లు) విజయ్ శంకర్ (రూ. 1.20 కోట్లు) వంశ్ బేడీ (రూ. 55 లక్షలు) ముకేశ్ చౌదరీ (రూ. 30 లక్షలు) షేక్ రషీద్ (రూ. 30 లక్షలు) అండ్రి సిద్ధార్థ్ (రూ. 30 లక్షలు) కమలేశ్ నాగర్కోటి (రూ. 30 లక్షలు) రామకృష్ణ ఘోష్ (రూ. 30 లక్షలు) శ్రేయస్ గోపాల్ (రూ.30 లక్షలు).చదవండి: Virat Kohli: ఇదేం తీరు కోహ్లి? ఇలాంటివి అవసరమా?.. మండిపడ్డ గావస్కర్

ఇదేం తీరు కోహ్లి? ఇలాంటివి అవసరమా?.. మండిపడ్డ గావస్కర్
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి(Virat Kohli) తీరుపై భారత క్రికెట్ దిగ్గజం సునిల్ గావస్కర్(Sunil Gavaskar) అసహనం వ్యక్తం చేశాడు. పాకిస్తాన్(India vs Pakistan)తో మ్యాచ్‌లో అనవసర చర్య ద్వారా వికెట్ కోల్పోయే ప్రమాదం తెచ్చుకున్నాడని.. అయితే, అదృష్టవశాత్తూ బయటపడటంతో తాము ఊపిరి పీల్చుకున్నామన్నాడు. కాగా చాంపియన్స్ ట్రోఫీ-2025లో భాగంగా భారత్ ఆదివారం పాకిస్తాన్‌తో తలపడింది.దుబాయ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన రోహిత్ సేన తొలుత ఫీల్డింగ్ చేసింది. బౌలర్ల విజృంభణ కారణంగా దాయాదిని 241 పరుగులకే ఆలౌట్ చేసింది. అనంతరం లక్ష్య ఛేదనను దూకుడుగా ఆరంభించిన టీమిండియా.. మిడిల్ ఓవర్లలో మాత్రం ఆచితూచి నిలకడగా ఆడింది. సెంచరీ మార్కు.. విన్నింగ్ షాట్ముఖ్యంగా ఓపెనర్ శుబ్‌మన్ గిల్(46), నాలుగో నంబర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్(56)లతో కలిసి విరాట్ కోహ్లి అద్భుత భాగస్వామ్యాలు నెలకొల్పాడు.ఏ దశలో నిర్లక్ష్యపు షాట్లకు యత్నించకుండా.. సహచర బ్యాటర్లతో చక్కగా సమన్వయం చేసుకుంటూ ఇన్నింగ్స్ నిర్మించాడు. ఈ క్రమంలో అర్ధ శతకం పూర్తి చేసుకున్న కోహ్లి.. దానిని శతకంగా మలిచాడు. అంతేకాదు బౌండరీ బాది సెంచరీ మార్కు అందుకున్న ఈ రన్‌మెషీన్.. టీమిండియాను గెలుపుతీరాలకు చేర్చాడు. ఈ క్రమంలో విరాట్ కోహ్లిపై భారత్‌తో పాటు పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు, అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.అయితే, బ్యాటింగ్ చేస్తున్న సమయంలో కోహ్లి చేసిన ఓ పని మాత్రం సునిల్ గావస్కర్‌కు ఆగ్రహం తెప్పించింది. భారత ఇన్నింగ్స్‌లో 21 ఓవర్‌ను పాక్ బౌలర్ హ్యారిస్ రవూఫ్ వేయగా.. ఐదో బంతికి కోహ్లి సింగిల్ తీశాడు. ఈ క్రమంలో సురక్షితంగానే క్రీజులోకి చేరుకున్న కోహ్లి.. ఆ తర్వాత ఓవర్ త్రో కాబోతున్న బంతిని తన చేతితో ఆపేశాడు.నిజానికి అక్కడ దగ్గర్లో పాకిస్తాన్ ఫీల్డర్లు ఎవరూ లేరు. ఒకవేళ ఓవర్ త్రో అయినా ఓ అదనపు పరుగు వచ్చేది. అయినా, ఎంసీసీ నిబంధనల ప్రకారం ఓ బ్యాటర్ బంతి లైవ్‌లో ఉన్నపుడు దానిని తన మాటలు, చేతల ద్వారా అడ్డుకునే ప్రయత్నం చేయకూడదు. ఒకవేళ ఉద్దేశపూర్వకంగా అతడు అలా చేసినట్లు భావించి ఫీల్డింగ్ చేస్తున్న జట్టు అప్పీలు చేస్తే.. సదరు బ్యాటర్‌ను అవుట్‌గా ప్రకటించవచ్చు.అబ్స్ట్రక్ట్ ఫీల్డ్ నిబంధన కింద..కోహ్లి విషయంలో ఒకవేళ పాక్ జట్టు ఈ విషయంలో అప్పీలుకు వెళ్లి ఉంటే పరిస్థితి చేజారిపోయేదని గావస్కర్ అన్నాడు. కామెంట్రీ సమయంలో.. ‘‘అతడు తన చేతితో బంతిని ఆపాడు. ఒకవేళ పాకిస్తాన్ గనుక అప్పీలు చేస్తే ఏమయ్యేది?.. అబ్స్ట్రక్ట్ ఫీల్డ్ నిబంధన కింద అతడు అవుటయ్యేవాడేమో?!.. కానీ వాళ్లు అలా చేయలేదు. ఎందుకంటే.. అక్కడ దగ్గర్లో ఫీల్డర్ లేడు.అంతేకాదు ఓవర్ త్రో ద్వారా అదనపు పరుగు రాకుండా ఉండిపోయిందని భావించి ఉండవచ్చు. నిజానికి మిడ్‌వికెట్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న ఆటగాడు డైవ్ చేస్తే బాగుండేది. కానీ ముందుకు వెళ్లిపోతున్న బంతిని కోహ్లి జోక్యం చేసుకుని మరీ ఆపడం సరికాదు. అదృష్టవశాత్తూ ఎవరూ అప్పీలు చేయలేదు కాబట్టి సరిపోయింది’’ అని గావస్కర్ అసహనం వ్యక్తం చేశాడు. కాగా 21వ ఓవర్ ముగిసే సరికి కోహ్లి కేవలం 41 పరుగుల వద్ద ఉండటం గమనార్హం. ఇక ఈ మ్యాచ్‌లో 111 బంతులు ఎదుర్కొన్న కోహ్లి సరిగ్గా 100 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. వన్డేల్లో అతడికి ఇది 51వ సెంచరీ కాగా.. అంతర్జాతీయ కెరీర్లో 82వది కావడం విశేషం. సచిన్ టెండ్కులర్ వంద సెంచరీల రికార్డుకు కోహ్లి ఇంకా 18 శతకాల దూరంలో ఉన్నాడు.చాంపియన్స్ ట్రోఫీ-2025: భారత్ వర్సెస్ పాకిస్తాన్ స్కోర్లు👉పాకిస్తాన్- 241(49.4) ఆలౌట్👉భారత్- 244/4 (42.3)👉ఫలితం: పాక్‌ను ఆరు వికెట్ల తేడాతో ఓడించిన భారత్.చదవండి: ‘ఏంటిది?’.. రిజ్వాన్ చర్యకు హర్షిత్ రాణా రియాక్షన్ వైరల్.. గంభీర్ కూడా!
బిజినెస్

ఇంటర్నెట్ లేకుండానే యూపీఐ చెల్లింపులు: ఎలా చేయాలంటే..
ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా.. యూపీఐ చెల్లింపులు చేయడం సాధ్యం కాదని అందరూ అనుకుంటారు. కానీ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ప్రారంభించిన *99# సర్వీస్ ద్వారా ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం లేకుండానే లావాదేవీలను పూర్తి చేయవచ్చు. ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా యూపీఐ ట్రాన్సక్షన్ ఎలా చేయాలి?.. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.ఎన్పీసీఐ ప్రారంభించిన *99# సర్వీస్ ద్వారా ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం లేకుండానే.. బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. ఇంటర్‌బ్యాంక్ ఫండ్ బదిలీ చేయవచ్చు, యూపీఐ పిన్ను సెట్ చేసుకోవచ్చు లేదా మార్చుకోవచ్చు. అయితే యూపీఐ చెల్లింపులు చేయాలంటే కొన్ని టిప్స్ పాటించాల్సి ఉంటుంది.ఇంటర్నెట్ లేకుండా యూపీఐ చెల్లింపు చేయడం ఎలా..➤మీ బ్యాంక్ ఖాతాకు లింక్ అయిన.. రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి *99# కు డయల్ చేయండి.➤డయల్ చేసిన తరువాత భాషను ఎంచుకోవాలి.➤మీ బ్యాంక్ పేరును ఎంటర్ చేసిన తరువాత.. మీ మొబైల్ నెంబర్‌కు లింక్ అయిన బ్యాంక్ ఖాతాల జాబితా కనిపిస్తుంది.➤కావాల్సిన ఖాతాను ఎంచుకోవాలి. ధృవీకరణ ప్రక్రియను పూర్తి చేయడానికి.. డెబిట్ కార్డ్ చివరి ఆరు అంకెలు, గడువు తేదీని ఎంటర్ చేయాలి.➤యూపీఐ పిన్ నెంబర్ సెట్ చేయకపోతే.. సెట్ చేసుకోవాలి. ఈ పిన్ లావాదేవీలను నిర్దారించడానికి ఉపయోగపడుతుంది.డబ్బు పంపించాలంటే..➤మీ ఫోన్లో *99# డయల్ చేసిన తరువాత.. డబ్బు పంపడానికి ఆప్షన్ ఎంచుకోవాలి.➤ఆ తరువాత ఎవరికైతే డబ్బు పంపించాలనుకుంటున్నారో.. వారి యూపీఐ ఐడీ లేదా బ్యాంక్ ఖాతా నెంబర్ ఎంటర్ చేయడానికి కావలసిన ఆప్షన్ ఎంచుకోవాలి.➤మీరు పంపించాలనుకున్న మొత్తాన్ని.. ఎంటర్ చేసి చేసిన తరువాత.. లావాదేవీలను ధృవీకరించడానికి పిన్ నెంబర్ నమోదు చేయండి.

యాపిల్ తయారీ ప్లాంట్ అమెరికాకు తరలింపు
యాపిల్ సీఈఓ టిమ్ కుక్ మెక్సికోలోని సంస్థ తయారీ యూనిట్‌ను అమెరికాకు తరలించే యోచనలో ఉన్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. కుక్ మెక్సికోలో రెండు ప్లాంట్లను నిలిపివేశారని, దానికి బదులుగా అమెరికాలో ఉత్పత్తులను తయారు చేస్తారని అమెరికా గవర్నర్ల సమావేశంలో ట్రంప్ పేర్కొన్నారు. పెరుగుతున్న టారిఫ్ ఒత్తిళ్లు, కొనసాగుతున్న అమెరికా-చైనా వాణిజ్య వివాదానికి ప్రతిస్పందనగా ఈ మేరకు నిర్ణయాలు తీసుకుంటున్నట్లు కొందరు భావిస్తున్నారు.అమెరికా-చైనా వాణిజ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఇటీవల టిమ్ కుక్ ట్రంప్‌తో వైట్‌హౌజ్‌లో సమావేశమయ్యారు. చైనాలో యాపిల్ తన తయారీ ప్లాంట్ నుంచి భారీగానే వివిధ దేశాలకు ఉత్పత్తులను ఎగుమతి చేస్తోంది. అందులో కొంతభాగం అమెరికాకూ ఎగుమతి అవుతోంది. అయితే ఇటీవల అమెరికా-చైనాల మధ్య సుంకాల విషయంలో తీవ్ర చర్చ సాగుతున్న నేపథ్యంలో టిమ్ కుక్ ట్రంప్‌తో భేటీ అయ్యారు. కానీ గతంలో మాదిరి కాకుండా ఈసారి యాపిల్‌కు ఎలాంటి మినహాయింపులు ఉండవని ట్రంప్ సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం. ఈ క్రమంలో ట్రంప్ కుక్‌తో సమావేశమైన మరుసటి రోజే యూఎస్‌కు తయారీ ప్లాంట్ తరలింపు ప్రకటన చేయడం చర్చనీయాంశం అయింది.అమెరికాలో పెట్టుబడులు..అమెరికాలో వందల మిలియన్ డాలర్లు పెట్టుబడి పెడతానని కుక్ హామీ ఇచ్చినట్లు ట్రంప్ తెలిపారు. ఈ పెట్టుబడి ఉద్యోగాలను సృష్టిస్తుందని, యూఎస్ సరఫరా గొలుసును బలోపేతం చేస్తుందని భావిస్తున్నారు. ఈ చర్య వల్ల దేశీయ ఉత్పత్తిని పునరుద్ధరించడం, బాహ్య ఆర్థిక ఒత్తిళ్ల నుంచి కీలక పరిశ్రమలను రక్షించవచ్చని చెప్పారు. కంపెనీలు తీసుకునే నిర్ణయాలు తన పరిపాలన విస్తృత లక్ష్యాలకు అనుగుణంగా ఉన్నాయని ట్రంప్ అభిప్రాయపడ్డారు.ఇదీ చదవండి: ఎస్బీఐ ధోనీకి రూ.6 కోట్లు, అభిషేక్‌కు రూ.18 లక్షలు చెల్లింపుయాపిల్పై ప్రభావంట్రంప్ వ్యాఖ్యలకు సంబంధించి యాపిల్ ఇంకా అధికారిక ప్రకటన చేయనప్పటికీ, ఇది సంస్థపై గణనీయమైన ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు. తయారీ కార్యకలాపాలను అమెరికాకు తరలించడం ద్వారా దిగుమతి సుంకాల ప్రభావాన్ని తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తుంది. ఇది లాభాల మార్జిన్లు, ధరలను ప్రభావితం చేస్తుంది. ఈ వ్యూహాత్మక మార్పు ఉద్యోగాల కల్పనతో పాటు అమెరికా ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తుందని కొందరు అంచనా వేస్తున్నారు.

రోజుకు రూ.27 కోట్లు విరాళం ఇచ్చిన వ్యక్తి.. ఈయన గురించి తెలుసా?
భారతదేశం సర్వమత సమ్మేళనం.. కాబట్టి ఇక్కడ అనేక మతాల ప్రజలు నివసిస్తున్నారు. ఇందులో ముస్లింల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. వీరు (ముస్లింలు) కళ, సాహిత్యం, సైన్స్ వంటి వివిధ రంగాలలో తమదైన ముద్ర వేసినప్పటికీ.. వ్యాపార రంగంలో మాత్రం ఇతరులతో పోలిస్తే కొంత వెనుకబడి ఉన్నట్లు తెలుస్తోంది. అయితే అజీమ్ ప్రేమ్‌జీ కుటుంబం మాత్రం దీనికి భిన్నం. ఎందుకంటే మూడు తరాలుగా వ్యాపార సామ్రాజ్యాన్ని పాలిస్తోంది.1947లో దేశ విభజన సమయంలో మహమ్మద్ అలీ జిన్నా.. అజీమ్ ప్రేమ్‌జీ తండ్రి 'మహ్మద్ ప్రేమ్‌జీ'ని పాకిస్తాన్‌కు రమ్మని ఆహ్వానించడమే కాకుండా.. అక్కడ ఆర్ధిక మంత్రి పదవిని కూడా ఇస్తామని చెప్పారు. కానీ మహ్మద్ ప్రేమ్‌జీ నిరాకరించి, భారతదేశంలో ఉండిపోయారు. నిజానికి మహ్మద్ ప్రేమ్‌జీ బియ్యం వ్యాపారి. ఈయన మొదట్లో మయన్మార్‌లో వ్యాపారం చేసేవారు. ఆ తరువాత 1940లో ఇండియాకు వచ్చి ఇక్కడే స్థిరపడ్డారు. అజీమ్ ప్రేమ్‌జీ ముంబైలోనే 1945లో జన్మించారు.అజీమ్ ప్రేమ్‌జీ.. ఐటీ దిగ్గజం విప్రో వ్యవస్థాపకుడు. ఈయన ప్రపంచ ధనవంతుల జాబితాలో ఒకరు. ఫోర్బ్స్ ప్రకారం అజీమ్ ప్రేమ్‌జీ నికర విలువ రూ. లక్ష కోట్ల కంటే ఎక్కువ.ప్రాథమిక విద్యను భారతదేశంలోనే పూర్తి చేసిన అజీమ్ ప్రేమ్‌జీ.. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లారు. అమెరికాలోని ప్రతిష్టాత్మక స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ డిగ్రీని పొందారు. ఆ సమయంలోనే అజీమ్ ప్రేమ్‌జీ అన్న ఫరూఖ్ ప్రేమ్‌జీ తన తండ్రి వ్యాపారం చూసుకోవడం మొదలుపెట్టారు. అయితే అతని వివాహానంతరం.. పాకిస్తాన్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నారు.ముహమ్మద్ ప్రేమ్‌జీ మరణానంతరం.. అజీమ్ ప్రేమ్‌జీ అప్పులపాలైన కుటుంబ వ్యాపారాన్ని (చమురు వ్యాపారం) నిర్వహించాల్సి వచ్చింది. తన తెలివితో చమురు వ్యాపారాన్ని సంక్షోభం నుంచి బయటపడేశాడు. ఆ తరువాత దానిని విస్తరించడం మాత్రమే కాకుండా.. ఇతర రంగాలలోకి కూడా అడుగుపెట్టారు. ఇందులో భాగంగానే విప్రో కంపెనీ ప్రారంభించారు.ఇదీ చదవండి: బిలియనీర్ కుమార్తె జైలు కష్టాలు.. ఆహారం, నీరు ఇవ్వడానికి కూడా..భారతదేశంలో 19వ ధనవంతుడు.. ప్రపంచంలోని 195వ ధనవంతుడైన అజీమ్ ప్రేమ్‌జీ, ఉదారంగా విరాళాలు అందించడంలో కూడా ముందున్నారు. 2020- 2021ఆర్ధిక సంవత్సరంలో భారతదేశంలో ఎక్కువ విరాళాలు అందించిన వ్యక్తుల జాబితాలో.. ఈయన రూ. 9713 కోట్లు విరాళం అందించి అగ్రస్థానంలో నిలిచారు. దీన్ని బట్టి చూస్తే అజీమ్ ప్రేమ్‌జీ రోజుకు రూ. 27 కోట్లు విరాళంగా అందిస్తున్నట్లు తెలుస్తోంది.

ధోనీకి రూ.6 కోట్లు, అభిషేక్‌కు రూ.18 లక్షలు చెల్లింపు.. ఎందుకంటే..
దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఇద్దరు ప్రముఖ భారతీయ వ్యక్తులు మహేంద్ర సింగ్ ధోనీ, అభిషేక్ బచ్చన్‌కు పెద్ద మొత్తంలో డబ్బు చెల్లిస్తూ వార్తల్లో నిలిచింది. ప్రముఖ క్రికెటర్ ధోనికేమో బ్యాంక్ బ్రాండ్‌ను ఎండార్స్ చేస్తున్నందుకు డబ్బు చెల్లిస్తుంటే.. అభిషేక్ బచ్చన్‌కు తన ప్రాపర్టీని బ్యాంకు అద్దెకు తీసుకున్నందుకు చెల్లింపులు చేస్తుంది.ఎంఎస్ ధోనీతో డీల్కెప్టెన్ కూల్‌గా పిలవబడే మహేంద్ర సింగ్ ధోనీని ఎస్బీఐ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకుంది. క్రికెట్ జట్టులో అసాధారణ నాయకత్వ నైపుణ్యాలకు ప్రసిద్ధి చెందిన ధోని ఎస్బీఐతో కలిసి పనిచేయడం సంస్థ ఉత్పత్తులను, రెవెన్యూ వృద్ధికి ఎంతో తోడ్పడుతుందని బ్యాంకు నమ్ముతుంది. ధోనీకి తమ బ్రాండ్ ఎండార్స్మెంట్ కోసం ఎస్బీఐ రూ.ఆరు కోట్లు చెల్లిస్తుంది. ఐసీసీ పురుషుల ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకున్న చివరి భారత కెప్టెన్‌గా ధోనీకి ఎంతో గుర్తింపు ఉంది. క్రికెట్ అభిమానులను తనదైన శైలిలో ఆకట్టుకున్నారు.ఇదీ చదవండి: ఆదాయపన్నులో మార్పులు.. తరచూ అడిగే ప్రశ్నలుఅభిషేక్ బచ్చన్‌తో ప్రాపర్టీ లీజు ఒప్పందంబాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ ప్రస్తుతం ఎస్బీఐ నుంచి ప్రతి నెల రూ.18,00,000 అద్దె పొందుతున్నారు. ముంబయిలోని ప్రముఖులు నివసించే జుహు ప్రాంతాలోని బచ్చన్ కుటుంబానికి చెందిన జుహు బంగ్లాను లీజుకు ఇవ్వడానికి బ్యాంకుతో 15 సంవత్సరాల లీజు ఒప్పందం కుదుర్చుకున్నారు. దాంతో లీజు ఒప్పందంలో భాగంగా బచ్చన్ కుటుంబానికి స్థిరమైన ఆదాయ సమకూరుతోంది. ఈ ఒప్పందంలో కాలానుగుణ అద్దె పెంపు కోసం క్లాజులు ఉన్నాయి. అభిషేక్ బచ్చన్ విజయవంతమైన నటుడిగానే కాకుండా వ్యూహాత్మక పెట్టుబడుల ద్వారా తన వ్యాపార చతురతను నిరూపించుకున్నారు. జుహు బంగ్లాను ఎస్బీఐకు లీజుకు ఇవ్వాలని ఆయన తీసుకున్న నిర్ణయం మెరుగైన ఆర్థిక ప్రణాళికల్లో ఒకటిగా చూస్తున్నారు.
ఫ్యామిలీ

శివరాత్రి మహోత్సవాలకు ముస్తాబవుతున్న శ్రీ ఛాయా సోమేశ్వరాలయం
చుట్టూ పచ్చని పంట పొలాల మధ్య ఓం నమఃశివాయ స్మరణతో మారుమోగే అద్భుత దేవాలయమే శ్రీ ఛాయా సోమేశ్వరాలయం. సోమవారం వచ్చిందంటే భక్తులతో కిటకిటలాడే ఈ ఆలయం అద్భుత నిర్మాణ శైలికి నిలయం. ప్రసిద్ధ శైవ క్షేత్రంగా విరాజిల్లుతున్న నల్లగొండ పట్టణానికి సమీపంలోని పానగల్ వద్ద ఉన్న ఛాయా సోమేశ్వరాలయం శివరాత్రి సందర్భంగా మహోత్సవాలకు సిద్ధం అవుతోంది.ఎక్కడైనా సూర్యకాంతి, విద్యుత్తు దీపాల వెలుతురులో ఏర్పడే ఛాయ (నీడ) గమనాన్ని బట్టి మారడం సహజం. కానీ ఇక్కడ శివలింగంపై పడే ఛాయ సూర్యుని గమనంతో సంబంధం లేకుండా స్తంభాకారంలో నిశ్చలంగా ఉండటం విశేషం. సూర్యరశ్మితో సంబంధం లేకుండా, వర్షం పడినా, ఆకాశం మేఘావృతమైనా ఆ నీడ ఉదయం నుంచి సాయంత్రం వరకు అన్నివేళలా ఒకేలా ఉంటుంది. అందుకే ఇది ఛాయా సోమేశ్వరాలయంగా ప్రసిద్ధి పొందింది. రాజసం ఉట్టిపడే అద్భుత శిల్ప కళాసంపద, కాకతీయుల నాటి శిల్ప కళారీతులు శ్రీఛాయాసోమేశ్వర స్వామి సొంతం. ఈ ఆలయంలోని ఎంతో విశేషమైన బ్రహ్మసూత్ర లింగాన్ని భక్తులే స్వయంగా అభిషేకించడం మరోప్రత్యేకత. ఆ శివలింగాన్ని ఒక్కసారి తాకితే వేయి లింగాలను దర్శించిన భాగ్యం కలుగుతుందని భక్తుల నమ్మకం.వెయ్యేళ్ల కిందటి అద్భుత కట్టడం...భారతీయ వాస్తు, శిల్పకళా చాతుర్యంలో సాంకేతిక విజ్ఞానాన్ని మిళితం›చేసి ఆలనాటి కుందూరు చోళులు ఈ దేవాలయాన్ని నిర్మించారని చరిత్ర చెబుతోంది. పానగల్‌ను రాజధానిగా చేసుకొని పాలించిన కాకతీయుల సామంత రాజులైన కుందూరు చాళుక్య రాజు ఉదయ భానుడు ఈ ఆలయాన్ని 11వ శతాబ్దంలో నిర్మించినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. తమ ఆరాధ్యదైవమైన పరమేశ్వరునికి నిర్మించిన ఆలయాల్లో దీంతో పాటు సమీపంలోనే పచ్చల సోమేశ్వరాలయం కూడా నిర్మించారు. శివలింగం చుట్టూ పచ్చని వజ్రాలను పొదగడంతో ఆలయం అంతా పచ్చని వెలుతురు వెదజల్లేదని చెబుతారు.మూడు గర్భాలయాలు...చతురస్రాకారంలో ఉండే ఈ ఆలయంలో మూడు గర్భగుడులు ఉంటాయి. అందుకే దీనిని త్రికూటాలయంగా పేర్కొంటారు. మరోవైపు ఉపాలయాలు ఇక్కడ ఉన్నాయి. స్తంభాలపై రామాయణ, మహాభారతాలు...గుడి ఆవరణ మొత్తం 18 స్తంభాలతో ఉంటుంది. అందులో పడమరన ఉన్న సోమేశ్వరుడి ఆలయం ముందు 8 స్తంభాలు ఉంటాయి. వాటిల్లో ఏ స్తంభం నీడ శివలింగంపై పడుతుందన్నది ఇక్కడి రహస్యం. మరోవైపు ఆయా స్తంభాలపై రామాయణ, మహాభారతాలు విగ్రహ రూపంలో ఉండటం విశేషం. నాలుగు స్తంభాలపై ఉండే మండపం పైభాగంలో అష్టదిక్పాలకులు, మూడు గర్భ గుడుల ముందు గజలక్ష్మి కొలువై ఉంటుంది. అయితే సూర్యభగవానుడి భార్య ఛాయాదేవి పరమ శివుని ప్రార్థించి శివుని వరంతో ఛాయగా ఉన్నట్లు భావిస్తారు.ప్రతి సోమవారం, పర్వదినాల్లో ప్రత్యేక పూజలుఆలయంలో ప్రతి రోజు ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు పూజలు కొనసాగుతాయి. ప్రతి సోమవారం ప్రత్యేక పూజలు చేస్తారు. తొలి ఏకాదశితో పాటు నిత్యాభిషేకాలు, కార్తీక పౌర్ణమి, దసరా, మహాశివరాత్రి, ఉగాది వంటి పర్వదినాలలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఆరుద్ర నక్షత్రం, అమావాస్య రోజుల్లోనూ విశేషంగా భక్తులు వస్తారు. మహాశివరాత్రి సందర్భంగా యజ్ఞాలు, మహాన్యాస పూర్వక రుద్రాభిషేకాలు, శివ పార్వతీ కళ్యాణం, అగ్నిగుండాలు, తెప్పొత్సవాలను నిర్వహిస్తారు.ఉదయ సముద్రం నీరే కోనేరులోకి పక్కనే ఉన్న ఉదయ సముద్రం చెరువులోని నీరే కోనేరులోకి రావడం ఇక్కడ విశేషం. దానికి ప్రత్యేకంగా పాయ అంటూ లేకపోయినా నీరు కోనేరులోకి రావడం ప్రత్యేకత. ఇప్పటికీ నీటి తడి (చెమ్మ) శివలింగం ఉన్న గర్భగుడిలో ఉంటుంది. – ప్రధాన అర్చకుడు ఉదయ్‌కుమార్.– చింతకింది గణేశ్, సాక్షి ప్రతినిధి, నల్లగొండ

అల్లు అర్జున్ 'పుష్ప 2', విక్కీ కౌశల్ 'ఛావా'.. రెండు సినిమాల వెనక ఓ మహిళ!
ఇటీవల బాక్సాఫీస్ వద్ద బ్లాక్బాస్టర్ హిట్ అందుకుని కలెక్షన్ల వర్షం కురిపించిన మూవీలుగా నిలిచినవి టాలీవుడ్ నటుడు అల్లు అర్జున్ పుష్ఫ2, బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్ ఛావా మూవీలు. ఈ రెండు మూవీల్లో హీరోలిద్దరివి ఓ డిఫరెంట్ లుక్. అదికూడా సహజసిద్ధంగా ఆయా పాత్రలో హీరోలు ఒదిగిపోయూలా చూపించాలి. అలా తెరపై కనిపించేలా చేసే మహిళా మేకప్ ఆర్టిస్ట్ ఎవరో తెలుసా..?. అది అలాంటి ఇలాంటి మేకప్ కాదు. అత్యంత విలక్షణమైన మేకప్‌ని వేస్తుందామె. అసలు ఆమెలాంటి మేకప్ ఆర్టిస్టులు దొరకడం కూడా అరుదు.. ఆమెనే ప్రఖ్యాత మహిళా మేకప్ అండ్ ప్రోస్థటిక్ ఆర్టిస్ట్ ప్రీతిషీల్ సింగ్ డిసౌజా. పుష్ప, చావా, బాజీరావ్ మస్తానీ, పద్మావత్, పుష్ప: ది రైజ్, మామ్, బాలా, ముల్క్, అంధాధున్, హైదర్, రంగూన్, రోమియో అక్బర్ వాల్టర్, బచ్చన్ పాండే, బంటీ ఔర్ బాబ్లి 2, చుప్ వంటి మూవీలలోని హీరోలందరికి మంచి లుక్ ఇచ్చింది ఆమెనే. ఆ మూవీలలో హీరోల పాత్ర చాలా విలక్షణమైనది అందుకు తగ్గట్టుగా ఆ రోల్లో వాళ్లు ఒదిగిపోయినట్లుగా సహజసిద్ధంగా కనిపించడం వెనుక ఆమె ప్రొస్థటిక్ మేకప్ నైపుణ్యం ఎంతో ఉంది. అంతేగాదు ఆమె ఉత్తమ మేకప్ విభాగంలో జాతీయ అవార్డుని అందుకుంది కూడా. ఆమె అందిరిలా మేకప్ వేయడం కాకుండా విలక్షణమైన ప్రొస్థటిక్ మేకప్‌లో ప్రావీణ్యం సంపాదించింది. ఇదేంటంటే సహజసిద్ధమైన బట్టతల, గాయాలు, అలాగే ఏజ్‌ని తక్కువ చేసి చూపించే మేకప్ నైపుణ్యం ఇది. ఈ నైపుణ్యం పదిమందికి నేర్పేలా తన భర్త డిసౌజాతో కలిసి తొలి మేకప్ అండ్ ప్రోస్థటిక్ స్టూడియో స్కూల్‌ని ప్రారంభించి వర్క్‌షాప్‌లు నిర్వహించింది. ఈ మేకప్‌లో ప్రోస్థటిక్ ముక్కలతో సహజత్వం ఉట్టిపడేలా చేస్తారు. ఇది విగ్ మేకింగ్ నుంచి బట్టతల క్యాప్స్, వృద్ధాప్యం, క్యారెక్టర్ మేకప్, కాలిన గాయలు, మచ్చలతో కూడిన ముఖం వరకు తదితరాలన్ని నిజంగానే వచ్చాయనే ఒరిజినాలిటిని ఉట్టిపడేలా చేస్తుంది ఈ మేకప్. ఈ నైపుణ్యాన్ని తస స్టూడియో ద్వారా ఔత్సాహిక విద్యార్థులకు నేర్పిస్తోంది. ఆచరణాత్మక శిక్షణను ఇస్తోంది ప్రీతిషీల్. నిజానికి ఆమె స్టార్ చేసిన ఈ వర్క్ షాప్ విజయవంతమైంది. ఈ కళను నేర్చుకునేందుకు దేశంలోని వివిధప్రాంతాల నుంచి భారీగా విద్యార్థులు తరలివచ్చారు. అంతేగాదు ఆమె తన వర్క్‌షాప్‌కి ఇంతలా అనూహ్య స్పందన వస్తుందని ఊహించలేదని సంతోషంగా చెబుతోంది. తన కళ వాస్తవికతను తలపించే నైపుణ్యం అని, ఈ అపారమయైన జ్ఞానం, స్కిల్స్‌ని నలుగురికి అందించడమే తన లక్ష్యం అని అంటోంది. ఈ కళను ప్రపంచస్థాయికి తీసుకురావాలనేది తన ఆకాంక్ష అని చెబుతోంది. తన మేకప్ స్కూల్లో అత్యాధునిక సౌకర్యాల తోపాటు అనుభవజ్ఞులైన మేకప్ నిపుణలతో విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నట్లు వెల్లడించింది.(చదవండి: వర్క్ షేరింగ్‌తో ఆమె ముఖంలో చిరునవ్వులు తెప్పిద్దామిలా..!)

మూత్రంలో రక్తపు చార కనిపిస్తోందా?
మూత్రవిసర్జన సమయంలో రక్తపు చార కనిపించడం ఎవరిలోనైనా ఆందోళన కలిగించే అంశమే. అయితే అంతగా బెంబేలు పడాల్సిన అవసరం లేదు. సాధారణంగా మూత్రంలో ఇన్ఫెక్షన్ (యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్), కిడ్నీలో రాళ్లు ఉండటం వల్ల ఇలా జరగవచ్చు. కాకపోతే మూత్రవిసర్జన సమయంలో రక్తం కనిపిస్తున్నవారు మాత్రం ఒకసారి ఫిజీషియన్ లేదా యూరాలజిస్ట్‌ను సంప్రదించి... మూత్రపరీక్షలు, అబ్డామిన్ స్కానింగ్ తప్పక చేయించుకోవాలి. అవసరమైతే ఐవీపీ (ఇంట్రావీనస్ పైలోగ్రామ్) వంటి పరీక్షలూ చేయించాల్సిరావచ్చు. ఆ పరీక్షల్లో నిర్ధారణ (డయాగ్నోజిస్) అయిన జబ్బును బట్టి చికిత్స ఉంటుంది. కాకపోతే మరీ భయాందోళనలు అక్కర్లేదుగానీ... తక్షణం డాక్టర్‌ను సంప్రదించడం మాత్రం అవసరమని గుర్తించాలి. (చదవండి: మెనోపాజ్ నిద్రలేమికి లింకప్ ఏమిటి)

ఆదివారం ఆమెకు రెస్ట్ ఇద్దామా..!
ఉదయం లేచింది మొదలు.. టీ పెట్టివ్వడం నుంచి కూరగాయలు కోయడం, వంట చేయడం. బట్టలు ఆరేయడం.. ఆరేసినవి మడత బెట్టడం. ఇంటిని సర్దడం.. పిల్లలకు స్నానాలు చేయించడం. వారిని చదివించడం.. ఇలా చూడడానికి అన్నీ చిన్న పనులే.. కానీ అవే ఆమె ముఖాన చిరునవ్వులు మొలిపిస్తాయి. ‘ప్రతీ క్షణం నీకోసం నువ్వు.. వారానికి ఒక్కరోజు నీ ఇల్లాలికి ఇవ్వు’ అన్నట్లు ఆదివారం ‘ఇల్లాలి’కి ఇంటి పనుల్లో సాయమందించాల్సిన అవసరం ఉంది. గంపెడు బాధ్యతలతో ఇంటి బండిని నడిపే ఆమెకు వారంలో ఒక్కరోజైనా విశ్రాంతి కావాలంటున్నారు.. ఆదివారం ఇంటి, వంట పనుల్లో పాలు పంచుకుంటే అనుబంధం మరింత పెరిగే అవకాశమూ ఉంది. నవ్వులు విరియాలంటే..ఆమె ఆరోగ్యవంతురాలైతే.. ఇంటిల్లిపాదికీ ఆరోగ్యమే. కుటుంబం సక్రమంగా నడవడానికి ఆమే ప్రధాన కారణం. అలాంటి ఇల్లాలికి వారంలో ఒక్కరోజైనా విశ్రాంతి కావాలి. వారాంతంలో భార్య చేసే ఇంటి పనుల్లో ఓ చెయ్యి వేస్తే ఆ ఇంట్లో ఆనందం వెల్లివిరుస్తుంది. ఆమెకూ విశ్రాంతి దొరుకుతుంది. ఉదయం లేచింది మొదలు.. టీ పెట్టివ్వడం నుంచి కూరగాయలు కోయడం, వంట చేయడం. బట్టలు ఆరేయడం.. ఆరేసినవి మడత బెట్టడం. ఇంటిని సర్దడం.. పిల్లలకు స్నానాలు చేయించడం. వారిని చదివించడం.. ఇలా చూడడానికి అన్నీ చిన్న పనులే.. కానీ అవే ఆమె ముఖాన చిరునవ్వులు మొలిపిస్తాయి. వర్క్ షేరింగ్.. హ్యాపీనెస్ లోడింగ్కలిగే ప్రయోజనాలుఇల్లాలిపై ప్రేమను చూపడంలో అతను ఇంటిపనుల్లో చేసే సహాయం కీలకం. ప్రతి పనిని భారంగా తీసుకోకుండా చేస్తున్నప్పుడు భర్త తనను ఎంతగా ప్రేమిస్తున్నాడో, పట్టించుకున్నాడో భార్య అర్థం చేసుకుంటుంది. ఒకరినొకరు బాగా అర్థం చేసుకునేందుకు దోహద పడుతుంది. భర్త తన కష్టాలను మోస్తున్నాడని, తనకు వెన్నుదన్నుగా నిలుస్తున్నాడని నమ్మకం ఏర్పడుతుంది. ఇంట్లో భార్యాభర్తల మధ్య కొన్ని అపార్థాలు ఉంటాయి. కుటుంబ పరిస్థితులు, సంఘటనలతో ఇవి తలెత్తుతుంటాయి. వంట చేయడం, దుస్తులు ఉతికి ఆరబెట్టడం వంటి కొన్ని పనులు కలిసి చేయడం వల్ల ఇద్దరి మధ్య మనస్పర్థలు తొలగిపోయే అవకాశం ఉంది.ఇంటిపని మహిళలకే పరిమితమనే భావన నెలకొంది. కానీ, భార్యాభర్తలు ఇంటిపనులు పంచుకోవడం వల్ల దాంపత్యంలో సామరస్యం పెరుగుతుంది.పనులను షేర్ చేసుకున్నప్పుడు త్వరగా పూర్తవుతాయి. మిగిలిన సమయంలో కూర్చుని కబుర్లు చెప్పుకోవచ్చు. ఒకరి అభిప్రాయాలు మరొకరు పంచుకోవచ్చు. అప్పుడు ఒకరి అభిప్రాయాన్ని మరొకరు గౌరవించడం ప్రారంభిస్తారు.ఏమి చేయొచ్చంటే..ఇంట్లోని దుమ్ము దులపడం, వాక్యూమింగ్ చేయడం, నేలలను తుడవడం, బాత్రూం శుభ్రపరచడం, వంటగది శుభ్రపరచడం (పాత్రలు, కౌంటర్‌టాప్‌లు), కూరగాయలు కోయడం, భోజనం తయారీ, దుస్తులు ఉతికి ఆరబెట్టడం, ఆరాక మడతబెట్టడం, అవసరమైనప్పుడు ఇస్త్రీ చేయడం.పిల్లల సంరక్షణలో ఇలా..ఆ రోజు పిల్లలకు కూడా సెలవుదినం కావడం వల్ల స్నానం చేయించి దుస్తులు ధరింపజేయాలి.హోంవర్క్‌లో సహాయం చేయడం, ఆ రోజు పాఠశాలలో ఏదైనా కార్యక్రమం ఉన్నా హాజరు కావడం. ఇంటి ఆవరణలో పెరిగిన పిచ్చిమొక్కలను తొలగించడం, పచ్చిక కోయడం, తోటపని చేయడం.ఆదివారం ప్రత్యేకమైన వంటలు చేస్తారు...నా భర్త ఉద్యోగరీత్యా ఉదయమే వెళ్తారు. ఆదివారం సెలవు కావడంతో నాకు సహాయంగా ఉంటారు. కూరగాయలు తరగడం, బట్టలు ఉతికితే ఆరేయడం, వంటగదిని శుభ్రం చేయడం వంటి పనులు చేస్తారు. మా బాబుకు ఇష్టమైన చికెన్ బిర్యానీ చేసి స్వయంగా వడ్డిస్తారు. – సీత స్వప్న, పోచమ్మకుంట, హనుమకొండభాగస్వామికి విశ్రాంతినివ్వాలి..నిత్యం పని ఒత్తిడిలో బిజీగా ఉండే భార్యకు వారాంతపు సెలవు దినంలో విశ్రాంతినివ్వాలి. ఇలా చేయడం వల్ల జీవితభాగస్వామి మానసిక ఒత్తిడికి దూరమవుతుంది. వారాంతపు సెలవు దినంలో ఇంటిపని, గార్డెనింగ్, ఇంటి శుభ్రతలో నిమగ్నమవుతుంటాను. నేనే స్వయంగా పిల్లలకు ఇష్టమైన, ఆరోగ్యకరమైన వంటలు చేసి వడ్డిస్తాను. పిల్లలకు అవసరమైన వస్తువులు కొనిస్తాను. సంతోషంగా గడుపుతాను. – డాక్టర్ బీఆర్ శరవణభవ, ప్రొఫెసర్, హెడ్ ఫార్మ్ డీ, వాగ్దేవి కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, హనుమకొండఇంటి పనుల్లో సాయంగా ఉంటాను..నా జీవితభాగస్వామితో కలిసి ఉదయమే దేవతారాధన చేస్తాను. అనంతరం మార్కెట్‌కు వెళ్లి కూరగాయలు, నిత్యవసర సరుకులు అందిస్తాను. నా భార్యకు ప్రతీ పనిలోనూ సాయంగా ఉంటాను. వారాంతంలో రుచికరమైన భోజనం సిద్ధం చేసుకొని హైదరాబాద్‌లో ఉన్న మా పిల్లల వద్దకు వెళ్తాం.– మునుగోటి రమేశ్, వరంగల్(చదవండి: ‘ఫాఫో పేరెంటింగ్’ అంటే..? నెట్టింట వైరల్)
ఫొటోలు
International View all

యుద్ధభూమిలో ఉక్రెయిన్.. మూడేళ్ళలో జరిగిన నష్టాలు
ఉక్రెయిన్ - రష్యా యుద్ధం ప్రారంభమై.. మూడేళ్లు పూర్తయ్యాయి. ఈ రోజుకి (సోమవారం) నాలుగో ఏడాదిలోకి అడుగుపెడుతోంది.

ఛాంపియన్స్ ట్రోఫి మ్యాచ్‌లు..పాక్ ఇంటెలిజెన్స్ వార్నింగ్
ఇస్లామాబాద్: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 మ్యాచ్‌లకు సంబంధ

13 ఏళ్లు రాజకీయాలకు దూరం.. రీఎంట్రీలో అదిరే విజయం
ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో పార్టీ ఓడింది.

Ukraine War ఈ యుద్ధంలో అంతిమ విజయం అమెరికాదే?
గత మూడు సంవత్సరాలుగా జరుగుతున్న ఉక్రెయిన్, రష్యా యుద్ధాన్ని ఆపే ప్రయత్నంలో అమెరికా ఆధ్యక్షుడు ట్రంప్ 90 నిమిషాలపాటు పుత

ట్రంప్ సంచలనం.. రెండు వేల మంది ఉద్యోగులు అవుట్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూకుడు పెం
National View all

Mahashivratri: నేపాల్‌కు 10 లక్షలమంది భారతీయులు
ఫిబ్రవరి 26.. మహాశివరాత్రి..

New expressway: బెంగళూరు- మంగళూరు మధ్య తగ్గనున్న ప్రయాణ దూరం
కర్నాటక ప్రజలకు కేంద్రప్రభుత్వం శుభవార్త చెప్పింది.

మహిళలకు నెలకు రూ.2500.. ఢిల్లీ సీఎం కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: ఢిల్లీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత తొలి

Delhi: రేఖా గుప్తా జీతమెంత? కేజ్రీవాల్ పింఛనెంత?
న్యూఢిల్లీ: మొన్నటి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయాన్ని సాధించి,

Mahakumbh: ప్రధాని బాటలో సీఎం.. పారిశుద్ధ్య కార్యికుల కాళ్లు కడిగి..
ప్రయాగ్‌రాజ్: యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా(
NRI View all

ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాశ్ పటేల్ లవ్‌స్టోరీ : అందంలోనే కాదు టాలెంట్‌లోనూ!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తన మద్దతు ద

మాట నూతన కార్యవర్గం ఏర్పాటు
మన అమెరికన్ తెలుగు అసోసియేషన్-మాట బోర్డు మీటింగ్ డల్లాస్ లో ఘనంగా జరిగింది.

న్యూయార్క్ వేదికగా ఇంద్రాణి ఫేమ్ అంకితా జాదవ్ ఆల్బమ్ సాంగ్స్
ఇంద్రాణి ఫేమ్ అంకితా జాదవ్ నటించిన తెలుగు , హిందీ ఆల్బమ్ పాటలు న్యూయార్క్ వేదికగా రిలీజ్ కానున్నాయి.

సులభతర వీసా విధానం అవసరం
న్యూఢిల్లీ: వైద్య చికిత్సల కోసం భారత్‌కు వచ్చే విదేశీ రోగులకు సులభతర వీసా విధానాన్ని ప్రవేశపెట్టాలని అపోలో హాస్పిటల్స్

గుంటూరులో కుట్టుమిషన్లను పంపిణి చేసిన నాట్స్
క్రైమ్

వివాహమైన నెలకే భార్య దూరమైందని .....
సికింద్రాబాద్: వివాహమైన నెల రోజులకే భార్యతో మనస్పర్థలు వచ్చి విడిపోవడంతో..జీవితంపై విరక్తి చెందిన ఒక యువకుడు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న ఘటన సికింద్రాబాద్ రైల్వే పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..మధ్యప్రదేశ్ రాష్ట్రం ఖాదౌర గ్రామానికి చెందిన నీలేశ్ సింగ్ (25) తన సోదరుడు ముఖేశ్ సింగ్ ఇతర స్నేహితులతో కలిసి ఉపాధి కోసం నగరానికి వచ్చారు. మేడ్చల్ ప్రాంతంలో ఉంటూ రాయల్‌పూర్ క్వారీలో టిప్పర్ డ్రైవర్‌గా పని చేస్తున్నారు. మేడ్చల్ ప్రాంతంలో వీరందరి పని పూర్తవడంతో కడపలోని క్వారీలో పని చూసుకున్నారు. æకడపకు వెళ్లేందుకు నీలేశ్ తన సోదరుడు ముఖేష్, మిత్రులతో కలిసి శనివారం సాయంత్రం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు చేరుకున్నాడు. రాయలసీమ ఎక్స్‌ప్రెస్ రైలు టికెట్ తీసుకున్న వారంతా రైల్వేస్టేషన్ వెయిటింగ్ హాలులో కూర్చున్నారు. అదే సమయంలో తన పాకెట్లోంచి సెల్‌ఫోన్, పర్సు తీసిన నీలేశ్ తన బ్యాగులో పెట్టి ఇప్పుడే వస్తానని సోదరుడికి చెప్పి బయటకు వెళ్లాడు. రైలు వచ్చే సమయం అవుతున్నా నీలేశ్ రాకపోవడంతో అతడి సోదరుడు, మిత్రులు స్టేషన్ అంతటా గాలించినా ఆచూకీ లభించలేదు. ఇదిలా ఉండగా రైల్వేస్టేషన్ యార్డు సమీపంలో ఒక యువకుడు ఆత్మహత్య చేసుకున్నట్టు స్టేషన్ డిప్యూటీ మేనేజర్ రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసుల దర్యాప్తులో నీలేశ్ ఆత్మహత్యకు పాల్పడినట్టు తేలింది. ఇదిలా ఉండగా ఇటీవలే నీలేశ్‌కు వివాహం జరిగిందని, వ్యక్తిగత కారణాలతో నెల రోజుల కాపురం అనంతరం వారిద్దరు విడిపోయారని మృతుడి సోదరుడు ముఖేష్ పోలీసులకు వివరించాడు. అప్పటి నుంచి నీలేశ్ ముభావంగా ఉంటన్నాడని, అదే కారణంతో ఆత్మహత్యకు పాల్పడ్డట్టు తెలిపాడు. కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు నీలేష్ మృతదేహానికి పోస్టుమార్టం చేయించి బంధువులకు అప్పగించారు.

అరుణవ్ చిరునవ్వులు.. ఇక కానరావు
నాంపల్లి: చిరునవ్వుల అరుణవ్ ఊపిరాగింది. ఇరు కుటుంబాల ఆశల కిరణం ఆరిపోయింది. లిఫ్టులో ఇరుక్కుని చావుబతుకుల నడుమ కొట్టుమిట్టాడుతూ నిలోఫర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆరేళ్ల బాలుడు అరుణవ్ శనివారం ఉదయం 11.30 గంటల సమయంలో మృతి చెందాడు. అరుణవ్‌ను బతికించడానికి నిలోఫర్ వైద్యులు శత విధాలా ప్రయతి్నంచినా ఫలితం దక్కలేదు. మెదడుకు ఆక్సిజన్ సరఫరా నిలిచిపోవడంతో బాలుడు మృతి చెందినట్లు నిలోఫర్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎన్.రవికుమార్ ప్రకటించారు. బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించి బంధువులకు అప్పగించారు. ఎంతో అల్లారుముద్దుగా పెంచుకుంటున్న ఒక్కగానొక్క కుమారుడు ఆరేళ్లకే కన్నుమూయడంతో అజయ్‌కుమార్ దంపతులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు. అత్తను చూసేందుకు వచ్చి.. గోడేఖీ ఖబర్ ప్రాంతానికి చెందిన అజయ్‌కుమార్ దంపతులకు ఒకే ఒక సంతానం. మగ పిల్లాడు పుట్టడంతో ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. అజయ్‌కుమార్ సోదరి, అరుణవ్ మేనత్త జయశ్రీ అలియాస్ ఆయేషా శాంతినగర్‌లో నివాసం ఉంటున్న ఇమ్రాన్‌తో ప్రేమ వివాహం చేసుకున్నారు. సోదరి ప్రేమ వివాహం చేసుకోవడంతో చాలా రోజులు అజయ్‌కుమార్ కుటుంబం జయశ్రీ అలియాస్ ఆయేషాతో దూరంగా ఉంటోంది. ఆయేషాకు ఇటీవల తన పుట్టింటితో బంధం మళ్లీ చిగురించింది. మాట్లాడుకోవడాలు, వచి్చపోవడాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే బాలుడు అరుణవ్ శుక్రవారం తన తాతయ్యతో కలిసి శాంతినగర్‌లోని మేనత్త ఇంటికి వచ్చి లిఫ్టులో ఇరుక్కుపోయాడు. అపస్మారక స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం తుదిశ్వాస విడిచాడు. రెండు కుటుంబాల మధ్య చిగురించిన బంధంలో బాలుడి మరణం విషాదాన్ని నింపింది.

పీఈటీ కొట్టారని విద్యార్థి ఆత్మహత్య
ఉప్పల్ (హైదరాబాద్): నగరంలోని ఓ పాఠశాలలో విషాద ఘటన చోటుచేసుకుంది. స్కూల్ పీఈటీ కొట్టడమే కాకుండా తోటి విద్యార్థుల ముందు అవమానించాడంటూ ఎనిమిదో తరగతి విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్కూల్ భవనం నాల్గో అంతస్తు నుంచి కిందికి దూకి బలవన్మరణం పొందిన ఘటన శనివారం ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు, బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలంలోని సిద్ద హంగిర్గా గ్రామానికి చెందిన ముంగ ధర్మారెడ్డి, సంగీత దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు లింగారెడ్డి, చిన్న కుమారుడు సంగారెడ్డి(14). వీరి కుటుంబం 15 ఏళ్ల క్రితం నగరానికి వచ్చి బోడుప్పల్ పరిధిలోని ద్వారకా నగర్లో నివాసముంటోంది. తోపుడు బండిపై వ్యాపారం చేసుకుంటూ జీవనం గడుపుతున్నారు. సంగారెడ్డి.. ఉప్పల్‌లోని న్యూ భరత్‌నగర్‌లోని సాగర్ గ్రామర్ స్కూల్లో 8వ తరగతి చదువుతున్నాడు. శుక్రవారం సాయంత్రం స్టడీ అవర్ సమయంలో సంగారెడ్డి స్కూల్లో సీసీ కెమెరాలను కదిలించాడంటూ క్లాస్ టీచర్.. పీఈటీ ఆంజనేయులుకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆంజనేయులు కొట్టడంతోపాటు మందలించారు. శనివారం ఉదయాన్నే స్కూల్‌కు వచి్చన సంగారెడ్డిని పీఈటీ పనిష్మెంట్ పేరిట మరోసారి తరగతి గదిలో కొట్టడంతోపాటు అరగంటపాటు నిలబెట్టారు. తల్లిదండ్రులను పిలిపిస్తానని, టీసీ ఇచ్చి పంపిస్తానని బెదిరించారు. తోటి విద్యార్థుల ముందు దీన్ని అవమానంగా భావించిన సంగారెడ్డి.. ఆత్మహత్య చేసుకుందామని నిర్ణయించుకున్నాడు. ముందుగా తన నోట్ బుక్‌లో ‘సారీ మదర్– ఐ విల్ డై టుడే’అని రాసి వాష్‌రూంకు వెళ్తున్నానని చెప్పి తరగతి బయటకు వచ్చాడు. వస్తూ వస్తూ స్నేహితులకు బైబై అని చెప్పాడు. మూడవ అంతస్తులో ఉన్న తరగతి గది నుంచి నాల్గో అంతస్తుకు చేరుకుని అక్కడినుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న మల్కాజిగిరి ఏసీపీ చక్రపాణి, ఉప్పల్ సీఐ ఎలక్షన్ రెడ్డి, మేడిపల్లి సీఐ గోవింద్ రెడ్డి హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. పంచనామా నిర్వహించి సంగారెడ్డి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ అసుపత్రికి తరలించారు. స్కూల్ యాజమాన్యం, పీఈటీ ఆంజనేయులు, క్లాస్ టీచర్‌పై కేసు నమోదు చేశారు. ఆత్మహత్యకు యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమంటూ డీఈవో పాఠశాలను సీజ్ చేశారు. కన్నీరు మున్నీరైన తల్లి ‘ప్రయోజకుడు కావాలని రెక్కలు ముక్కలు చేసుకుని పిల్లలను ప్రైవేట్ బడిలో చదివిస్తున్నా. ఎంతకష్టమొచి్చనా ఫీజును ఆపే వాళ్లం కాదు. నా కొడుకు ఏ పాపం చేశాడని చంపేశారు? అంటూ సంగారెడ్డి తల్లి కన్నీరు మున్నీరైంది. బాధ్యులను కఠినంగా శిక్షించాలని పోలీసులను వేడుకుంది. ఆమె ఉదయం నుంచి సాయంత్రం వరకు స్కూల్ ఆవరణలో కూర్చుని రోదించడం స్థానికులను కలచివేసింది.

వివాహ వేడుకలో విషాదం.. విచారణలో బయటపడ్డ అసలు విషయం
Shocking Viral Video: పెళ్లి వేడుకలో అంతా హుషారుగా డ్యాన్సులు వేస్తున్నారు. అంతలో ఊహించిన ఘటన.. ఆ ఊరిలో తీవ్ర విషాదం నింపింది. హుషారుగా డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో ఆ ఊరి సర్పంచ్ భర్త ఊపిరి ఆగిపోయిందని వార్తలు వచ్చాయి. అయితే.. ఈలోపు సోషల్ మీడియాలో ఓ షాకింగ్ వీడియో చక్కర్లు కొట్టగా.. విచారణలో అసలు విషయం బయటపడింది.పంజాబ్ జలంధర్ గోరయా ప్రాంతంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఆ ఊరి సర్పంచ్ భర్త పరమ్‌జిత్ సింగ్(49) ఓ వివాహ వేడుకలో హుషారుగా చిందులేస్తూ కుప్పకూలిపోయారు. గుండెపోటుతో ఆయన మరణించారని కుటుంబ సభ్యులు, పోలీసులు వెల్లడించారు. అయితే సోషల్ సోషల్ మీడియాలో ఓ వైరల్ అయ్యింది.వివాహ వేడుకలో ఓ వ్యక్తి చిందులేస్తూ.. తుపాకీ పేల్చాడు. అయితే అది పక్కనే డ్యాన్స్ చేస్తున్న పరమ్జిత్కు తగిలింది. దీంతో ఆయన కిందపడిపోయారు. కిందపడిన పరమ్‌జిత్.. తుపాకీతో కాల్చిన వ్యక్తిని మందలించారు కూడా. అయితే ఆ వెంటనే ఆయన అలాగే స్పృహ కోల్పోయారు. వీడియో వైరల్ కావడంతో ఉన్నతాధికారులు దర్యాప్తునకు ఆదేశించారు. బుల్లెట్ గాయంతోనే పరమ్‌జిత్ మరణించాడని, విషయం బయటకు రాకుండా బాధిత కుటుంబం పెద్దల సమక్షంలో డబ్బు తీసుకుందని తేలింది. పిస్టల్ పేల్చిన వ్యక్తి పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. పంజాబ్ సహా భారతదేశంలో ఇలాంటి వేడుకలలో బహిరంగంగా ఆయుధాల్ని ప్రదర్శించడం నిషిద్ధం. ఒకవేళ అది ఉల్లంఘిస్తే నేరం కిందకే వస్తుంది. जालंधर में एक शादी समारोह में की गई हवाई फायरिंग में एक युवक को गोली लग गई, जिससे उसकी मौत हो गई. जानकारी के मुताबिक मृतक गांव की मौजूदा सरपंच के पति हैं. घटना का वीडियो सोशल मीडिया पर वायरल हो रहा है. #Jalandhar | #Firing pic.twitter.com/NovyLH21vK— Veer Arjun (@VeerArjunDainik) February 22, 2025 VIDEO Credits: VeerArjunDainik