Top Stories
ప్రధాన వార్తలు

‘జబర్దస్త్ స్కిట్లు.. బాబు, పవన్ వెకిలి నవ్వులు’
సాక్షి, వైఎస్సార్ జిల్లా: అసెంబ్లీ సమావేశాల ముగింపు సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు వెటకారంగా నిర్వహించారని.. కేవలం మాజీ సీఎం వైఎస్ జగన్‌కు వ్యతిరేకంగా, వెటకారంగా నిర్వహించారు అనేది ప్రజలందరూ చూశారని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి సతీష్‌రెడ్డి అన్నారు. శనివారం ఆయన కడప వైఎస్సార్సీపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, జబర్దస్త్ కార్యక్రమంలా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారంటూ దుయ్యబట్టారు.‘‘జీవితంలో ఎప్పుడు నవ్వని చంద్రబాబు వెకిలి నవ్వులు నవ్వారు. కనీస సంస్కారం లేకుండా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు వెకిలి నవ్వులు ఎందుకు?. కేవలం జగన్‌ను హేళన చేసేందుకు ఈ కార్యక్రమం నిర్వహించారా?. ఇవన్నీ మానుకుంటే చంద్రబాబుకు బాగుంటుంది. సిగ్గు లేకుండా, హుందాతనం లేకుండా ప్రవర్తించిన గ్రీష్మ అనే మహిళకు ఏ విధంగా ఎమ్మెల్సీ ఇచ్చావో స్పష్టం చేయాలి. టీడీపీలో ఎంతో మంది సీనియర్లు, నాయకులను కాదని రౌడీలకు పదవులా?’’ అంటూ సతీష్‌రెడ్డి నిలదీశారు.‘‘పులివెందుల నియోజకవర్గం నుంచి పవన్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. హత్య సినిమాపై ట్రోల్ చేశారనే ఆరోపణలపై అదుపులోకి తీసుకున్నారు. సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చిన సినిమాలోని సన్నివేశాలపై సోషల్ మీడియాలో పోస్టులు పెడితే అదుపులోకి తీసుకుంటారా?. వివేకా హత్య కేసులో నిందితుడు సునీల్ యాదవ్ ఫిర్యాదు చేస్తే పోలిసులు స్పందించడం దారుణం. టీడీపీ, జనసేన నాయకులకు సిగ్గు లేదు. వైఎస్సార్సీపీ నాయకులు హుందాతనంతో ప్రవర్తిస్తారు. సనాతన ధర్మం గురించి పవన్ కల్యాణ్ మాట్లాడటం సిగ్గుచేటు. ప్రజాస్వామ్యాన్ని చంద్రబాబు, పవన్ కల్యాణ్ అపహస్యం చేశారు’’అని సతీష్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

IPL 2025 1st Match Live Updates: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆర్సీబీ
IPL 2025 RCB vs KKR 1st Match Live Updates: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆర్సీబీ..ఐపీఎల్-2025 తొలి మ్యాచ్‌లో ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆర్సీబీ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. తొలి పోరులో ఆర్సీబీ ముగ్గురు ఫాస్ట్ బౌలర్లు, ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగింది. 👉ఐపీఎల్-18వ సీజన్ ట్రోఫీని ఆవిష్కరించిన ఆర్సీబీ కెప్టెన్ రజిత్ పాటిదార్, కేకేఆర్ కెప్టెన్ అజింక్య రహానే.👉షారుఖ్ ఖాన్‌తో కలిసి డ్యాన్స్ చేసిన విరాట్ కోహ్లి, రింకూ సింగ్👉 కోల్‌కతా జట్టు సహ యజమాని, బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్‌తో కలిసి ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లి ప్రసంగిస్తున్నాడు. వీరితో కేకేఆర్ ఫినిషర్ రింకూ సింగ్ జతకట్టాడు.డ్యాన్స్‌తో అదరగొడుతున్న దిశాబాలీవుడ్ హీరోయిన్ దిశా పటానీ తన డ్యాన్స్‌తో అభిమానులను అలరిస్తోంది. ఈడెన్ గార్డెన్స్ స్టేడియం అభిమానులతో కిక్కిరిసిపోయింది.👉తన గాత్రంతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తున్న శ్రేయా ఘోషల్ఈడెన్ గార్డెన్స్‌లో ఐపీఎల్-2025 ఓపెనింగ్ సెర్మనీ వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ప్రముఖ గాయని శ్రేయా ఘోషల్ (Shreya Ghoshal) తన గాత్రంతో అభిమానులను మంత్రముగ్ధులను చేస్తోంది. పుష్ఫ-2 సినిమాలోని ‘సూసేకి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సామీ’ పాటను తెలుగులో పాడటం విశేషం.Shreya Ghosal is here. ❤️ pic.twitter.com/apPUNS1mG4— Kohlistic🔥 (@Kohlistic18) March 22, 2025👉ఈడెన్ గార్డెన్స్ షారుఖ్ ఖాన్ సందడిప్రఖ్యాత ఈడెన్ గార్డెన్స్ మైదానంలో డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా జట్టు సహ యజమాని, బాలీవుడ్ బాద్ షా ప్రసంగించాడు. ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన లీగ్‌గా వెలుగొందిన క్రికెట్ లీగ్‌లో భాగం కావడం సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశాడు.👉మరి కాసేపటిలో ఓపెనింగ్ సెర్మనీఐపీఎల్ 2025 ప్రారంభోత్సవ వేడుకలు మరి కాసేపటిలో ప్రారంభం కానున్నాయి. ప్రముఖ గాయకులు శ్రేయా ఘోషల్, అర్జిత్ సింగ్, కరణ్ ఔజ్లా అభిమానులను అలరించేందుకు సిద్దమయ్యారు. వీరితో పాటు బాలీవుడ్ హీరోయిన్ దిశా పటానీ తన డ్యాన్స్ ప్రదర్శనతో అదరగొట్టబోతోంది. ఇందుకోసం వీరు నలుగురు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌కు చేరుకున్నారు.👉ఐపీఎల్-2025కు సర్వం సిద్దం.. ఐపీఎల్-2025 సీజన్‌కు మరి కాసేపటిలో తెరలేవనుంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి శుభారంభం చేయాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. రాత్రి ఏడు గంటలకు టాస్ పడనుంది. 👉స్టేడియానికి చేరుకున్న ఇరు జట్లుఇక తొలి మ్యాచ్ కోసం కేకేఆర్, ఆర్సీబీ జట్లు ఈడెన్‌గార్డెన్స్ మైదానానికి చేరుకున్నాయి. ఫ్యాన్స్ కూడా భారీగా తరలివస్తున్నారు. ఈడెన్‌గార్డెన్స్ వద్ద సందడి వాతావరణం నెలకొంది.👉అభిమానులకు గుడ్న్యూస్కోల్కతాలో గత రెండు రోజులగా వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. దీంతో తొలి మ్యాచ్‌కు వరుణుడు అడ్డింకిగా మారుతాడో ఏమో అని అభిమానులు ఆందోళను చెందుతున్నారు. అయితే ఐపీఎల్ లవర్స్‌కు ఓ గుడ్ న్యూస్. ప్రస్తుతం కోల్‌కతాలో వర్షం పడడం లేదు. ఆకాశం మేఘావృతం ఉన్నప్పటికి వాతావరణం పొడిగా ఉంది.Reached Eden garden.. kya mast dikh rha hai yaar stadium#KKRvsRCB #KKRvsRCB pic.twitter.com/adGP1GcRhl— Ajay anshu (@Ajayanshu5) March 22, 2025

ఎట్టకేలకు పోసాని కృష్ణమురళి విడుదల
గుంటూరు, ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణమురళి ఎట్టకేలకు జైలు నుంచి విడుదల అయ్యారు. సీఐడీ నమోదు చేసిన కేసులో ఆయనకు బెయిల్ దక్కడంతో.. గుంటూరు జైలు నుంచి బయటకు వచ్చారు. కూటమి నేతలు చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని.. సోషల్ మీడియాలో పోస్టులు చేశారని ఆయా పార్టీల నేతలు రాష్ట్రవ్యాప్తంగా ఫిర్యాదులు చేసిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో.. ఫిబ్రవరి 26వ తేదీన హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో అన్నమయ్య జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి కూటమి ప్రభుత్వ ఆదేశాలతో.. వివిధ పోలీస్ స్టేషన్లకు.. కోర్టులకు.. జైళ్లకు.. తిప్పుతూ ఇబ్బంది పెట్టారు.వివిధ జిల్లాల్లో కేసుల నుంచి ఊరట లభించిందని అనుకునేలోపు.. అనూహ్యంగా సీఐడీ కేసు తెర మీదకు వచ్చింది. అయితే ఈ కేసులోనూ ఆయన నిన్న(శుక్రవారం మార్చి 21) ఊరట దక్కింది. సీఐడీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే..జిల్లా జైలుకు చేరిన రిలిజింగ్ ఆర్డర్స్ చేరడం ఆలస్యమైంది. ష్యూరిటీ సమర్పణకు నిన్న సమయం లేకపోవడం.. ప్రక్రియలన్నీ ఈ ఉదయాన్నే పూర్తవటంతో.. రిలీజ్ ఆర్డర్స్ ఆలస్యమైంది. మరోవైపు కోర్టుకు చేరుకున్న పోసాని న్యాయవాదులు మీడియాతో మాట్లాడే అవకాశం కనిపిస్తోంది.పోసాని కృష్ణమురళి(Posani Krishna Murali) పై మొత్తం ఏపీ వ్యాప్తంగా 30 ఫిర్యాదులకుగానూ 17 కేసులు నమోదు అయ్యాయి. ఫిబ్రవరి 26వ తేదీన అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పీఎస్‌లో నమోదైన కేసుకు గానూ ఆయన అరెస్ట్ అయ్యారు. అయితే న్యాయస్థానాల్లో ఊరట దక్కవచ్చనే ఉద్దేశంతోనే.. వరుసగా ఒక్కో పీఎస్‌లో నమోదైన కేసుకుగానూనా ఆయన్ని తరలిస్తూ వచ్చారు. అలా 2 వేల కిలోమీటర్లకుపైగా తిప్పి పోసానిని హింసించారు.అయితే చివరకు.. న్యాయమే గెలిచింది. బీఎన్ఎస్ సెక్షన్ 111 ప్రకారం వ్యవస్థీకృత నేరాల కింద కేసుల నమోదుకు న్యాయస్థానాలు సమ్మతించలేదు. పోసానిపై నమోదు చేసిన కేసులకు ఆ సెక్షన్ వర్తించదని స్పష్టం చేశాయి. పోసాని కృష్ణ మురళిపై నమోదు చేసిన అన్ని కేసుల్లోనూ న్యాయస్థానాలు బెయిళ్లు మంజూరు చేశాయి.అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లెలో కేసు.. బెయిల్‌పల్నాడు జిల్లా నరసరావుపేటలో కేసు.. బెయిల్‌ఎన్టీఆర్ జిల్లా విజయవాడ భవానీపురం పీఎస్‌లో కేసు.. బెయిల్‌కర్నూలు జిల్లా ఆదోనిలో నమోదైన కేసు.. బెయిల్ హైకోర్టులో ఆయనపై పెట్టిన కొన్ని కేసులు.. క్వాష్సీఐడీ పెట్టిన కేసు.. బెయిల్ మంజూరు

సింగిల్‌గానే అధికారంలోకి వస్తాం: కేసీఆర్
హైదరాబాద్, సాక్షి: తెలంగాణలో మరోసారి బీఆర్ఎస్ అధికారం చేపట్టడం తథ్యమని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు(Kalvakuntla Chandrasekar Rao) ఉద్ఘాటించారు. శనివారం ఎర్రవెల్లి ఫామ్‌హౌజ్‌లో జరిగిన రామగుండం నియోజకవర్గ బీఆర్ఎస్ నేతల సమావేశంలో ఆయన కీలక కామెంట్లు చేశారు.బెల్లం ఉన్న దగ్గర ఈగలు వస్తాయి. అలాగే సిరిసంపదలు ఉన్న తెలంగాణకు దోచుకోవడానికి కొందరు సిద్ధంగా ఉన్నారు. పదేళ్లు తెలంగాణలో ఎలాంటి ఇబ్బందులు లేవు. ఇప్పుడు సమస్యల వలయంలో చిక్కుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో రామగుండంలో గెలిచిన ఎమ్మెల్యే ఓ సన్నాసి అంటూ కామెంట్ చేశారు.ఆనాడు బలవంతంగా ఆంధ్రాలో కలిపారు. తెలంగాణను ఇందిరాగాంధీ మోసం చేశారు. మోదీ నా మెడపై కత్తి పెట్టినా.. నేను వెనకడుగు వేయలేదు. ఈ నేలపై ఎవరూ శాశ్వతం కాదు. అందరూ ఒక్కో కేసీఆర్(KCR)లా తయారు కావాలి. తెలంగాణ హక్కుల కోసం పోరాడాలి. ఏపీలో కూటమి లేకుంటే చంద్రబాబు(Chandrababu) గెలిచేవారు కాదు. కానీ, బీఆర్ఎస్ మాత్రం సింగిల్‌గానే అధికారంలోకి వస్తుంది.. ఇది ఖాయం అని కేసీఆర్ అన్నారు.కాంగ్రెస్ నోటికొచ్చిన హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది. కానీ ఒక్క హామీ కూడా నెరవేర్చడం లేదు. మేనిఫెస్టోలో పెట్టని హామీలు కూడా అమలు చేసిన ఘనత బీఆర్ఎస్దే. తెలంగాణ కోసం ఎప్పటికైనా పోరాడేది బీఆర్ఎస్ మాత్రమే అని కేసీఆర్ అన్నారు.

డీలిమిటేషన్‌పై ప్రధానికి వైఎస్ జగన్ లేఖ
అమరావతి, సాక్షి: నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియపై దక్షిణాది రాష్ట్రాల్లో ఆందోళన నెలకొన్న వేళ.. ప్రధాని నరేంద్ర మోదీకి వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy) ఓ లేఖ రాశారు. వచ్చే ఏడాది(2026) జరగబోయే డీలిమిటేషన్ ప్రక్రియలో ఆయా రాష్ట్రాల సీట్ల విషయంలో అన్యాయం జరగకుండా చూడాలని ప్రధానిని వైఎస్ జగన్ కోరారు. ‘‘గత 15 ఏళ్లలో దక్షిణ రాష్ట్రాల్లో జనాభా బాగా తగ్గింది. కేంద్రం ఇచ్చిన జనాభా నియంత్రణ పిలుపే అందుకు కారణమని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ దశలో జనాభా ఆధారంగా డీలిమిటేషన్(Delimitation) ప్రక్రియ గనుక చేపడితే.. తమ రాష్ట్రాల్లో నియోజకవర్గాలు తగ్గుతాయనే చర్చ దక్షిణాది రాష్ట్రాల్లో నడుస్తోంది. ఇప్పుడున్న జనాభా లెక్కల ప్రకారం డీలిమినేషన్ చేస్తే దక్షిణాది రాష్ట్రాల భాగస్వామ్యం కచ్చితంగా తగ్గుతుంది. అందుకే జనాభా లెక్కల ప్రకారం ఈ డీలిమిటేషన్ లేకుండా చూడండి.. .. పార్లమెంటులో తీసుకునే విధాన నిర్ణయాలలో రాష్ట్రాలకు సమాన భాగస్వామ్యం కల్పించేలా ఉండాలి. అప్పుడే జాతీయ విధాన రూపకల్పనలో అన్ని రాష్ట్రాలకు సరైన భాగస్వామ్యం ఉంటుంది. అందుకే దక్షిణాన సీట్ల తగ్గింపు లేకుండా చూడాలి. ఈ కోణంలో ఆలోచించి డీలిమిటేషన్ చేపట్టాలని కోరుకుంటున్నా. అటు లోక్‌సభ ఇటు రాజ్యసభలో.. ఏ రాష్ట్రానికి ప్రాతినిధ్యం తగ్గకుండా ఉండే విధంగా రాబోయే నియోజకవర్గాల పునర్విభజన కసరత్తు నిర్వహించాలని కేంద్రాన్ని కోరుకుంటున్నా’’ అని ప్రధాని మోదీని వైఎస్ జగన్ లేఖలో కోరారు. 👉పూర్తి లేఖ కోసం ఇక్కడ క్లిక్ చేయండిమరోవైపు డీలిమిటేషన్ ప్రక్రియపై కేంద్రంలోని బీజేపీకి తమిళనాడు అధికార పక్షం డీఎంకేకు మధ్య రాజకీయ సమరం జరుగుతోంది. ఈ క్రమంలో శనివారం(మార్చి 22న) తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ అధ్యక్షతన అన్ని రాష్ట్రాల పార్టీలతో అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. వైఎస్ జగన్ ఆదేశాల మేరకు వైఎస్సార్సీపీ పార్లమెంటరీ నేత వైవీ సుబ్బారెడ్డి ఈ లేఖ సారాంశాన్ని డీంఎకేకు కూడా పంపించారు.

భర్తను వదిలేస్తే పోయేది కదా!
ఆ భర్త భార్య, బిడ్డనే ప్రాణం అనుకున్నాడు. కానీ, ప్రియుడి మోజులో పడి ఆమె ఆ భర్తనే వద్దునుకుంది. అలాంటప్పుడు వదిలేసి వెళ్లిపోతే సరిపోయేది కదా అంటూ సోషల్‌మీడియా ఇప్పుడు కోడై కూస్తోంది. ఉత్తర ప్రదేశ్ మీరట్‌కు చెందిన మర్చంట్ నేవీ ఆఫీసర్ సౌరభ్ రాజ్‌పుత్ మర్డర్ కేసులో వెన్నులో వణుకు పుట్టించే విషయాలు వెలుగులోకి చూస్తుండగా.. ముస్కాన్ రాక్షసత్వంపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ నడుస్తోంది.భర్తను చంపాక అతనితో జాలీగా ట్రిప్పులు వేసిన ముస్కాన్.. అతని పుట్టినరోజుతో పాటు హోలీ పార్టీ కూడా జరుపుకుంది. అందుకు సంబంధించిన దృశ్యాలే ఇప్పుడు బయటకు వస్తున్నాయి.సౌరభ్ శవానికి పోస్టుమార్టం పూర్తయింది. డ్రమ్ములో సిమెంట్‌తో కప్పబడిన శరీరభాగాలను డాక్టర్లు అతి కష్టం మీద బయటకు తీశారు. వాటికి పోస్టుమార్టం నిర్వహించారు. పోస్టుమార్టం రిపోర్టు ప్రకారం.. నిద్రమాత్రల కారణంగా సౌరభ్ గాఢ నిద్రలోకి జారుకున్న తర్వాత ముస్కాన్ తన రాక్షసత్వాన్ని బయటపెట్టింది.సౌరభ్ గుండెల్లో కత్తితో మూడు సార్లు పొడిచింది. కత్తి లోతుగా అతడి గుండెల్లో దిగబడింది. ముస్కాన్ అతి దారుణంగా సౌరభ్ గుండెను చీల్చి పడేసింది. తర్వాత తలను శరీరంనుంచి వేరు చేసింది. శరీరాన్ని ముక్కలుముక్కలుగా కొసి పడేసింది. ముక్కల్ని డ్రమ్‌లో పడేసింది. ముస్కాన్ చేసిన దారుణం తెలిసి డాక్టర్లే షాక్ అయిపోయారు.ఇక, పోలీసులు కేసు దర్యాప్తులో భాగంగా హిమాచల్ ప్రదేశ్ వెళ్లారు. ముస్కాన్ పినతల్లిని కలిశారు. ఆమె ముస్కాన్‌పై ఫైర్ అయింది. చేసిన ఘోరానికి తన కూతురికి ఉరి శిక్ష వేయాలని డిమాండ్ చేసింది. ఈ దారుణంలో ముస్కాన్ హస్తంతో పాటు ఆమె ప్రియుడు సాహిల్ హస్తం కూడా ఉంది. ఇద్దరూ కలిసి, పక్కా ప్లాన్ ప్రకారం సౌరభ్‌ను చంపేశారు. మృతదేహాన్ని కనిపించకుండా చేసి తప్పించుకుందామనుకున్నారు. చాలా నాటకాలు ఆడారు. అవేవీ ఫలించలేదు. సౌరభ్ తల్లిదండ్రులకు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సౌరభ్ గురించి ఎంక్వైరీ చేయగా.. మర్డర్ విషయం బయటపడింది.ప్రేమ పెళ్లి.. ప్రియుడి కోసం..ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌కు చెందిన సౌరభ్ రాజ్‌పుత్ అదే ప్రాంతానికి చెందిన ముస్కాన్ రస్తోగి ప్రేమించుకున్నారు. 2016లో పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత భార్యతో గడపడానికి టైం దొరకటం లేదని నేవీలో ఉద్యోగం మానేశాడు. ఇంట్లో గొడవలు అవ్వటంతో భార్యతో కలిసి వేరుకాపురం పెట్టాడు. 2019లో వీరికి ఓ ఆడపిల్ల పుట్టింది. బిడ్డపుట్టిన తర్వాత సౌరభ్‌కు ఓ దారుణమైన విషయం తెలిసింది. ముస్కాన్.. ఆమె స్నేహితుడు సాహిల్‌తో అక్రమ సంబంధం పెట్టుకుందని తెలిసింది. ఈ విషయమై సౌరభ్, ముస్కాన్‌ల మధ్య గొడవలు అయ్యాయి. పరిస్థితి విడాకుల వరకు వెళ్లింది. కూతురు కోసం సౌరభ్ వెనక్కు తగ్గాడు. మళ్లీ జాబ్‌లో జాయిన్ అయ్యాడు. 2023లో విదేశానికి వెళ్లిపోయాడు. 2025 ఫిబ్రవరి నెలలో కూతురి పుట్టిన రోజు ఉండటంతో ఇండియా వచ్చాడు. ఇది నచ్చని ముస్కాన్, సాహిల్ .. అతడ్ని చంపేశారు. ప్రియుడితో కలిసి మనాలికిభర్తను హత్య చేసిన తర్వాత ప్రియుడితో కలిసి మనాలికి వచ్చిన ముస్కాన్.. ఆపై ట్యాక్సీలో కాసోల్ లోని తమ హెటల్ కు వచ్చినట్లు స్టాఫ్ ఒకరు తెలిపారు. హెటల్ లో రూమ్ తీసుకున్న తర్వాత రోజులో ఒకసారి మాత్రమే బయటకు వచ్చి చాలా స్వల్ప సమయం మాత్రమే ఉన్నారని హోటల్ స్టాఫ్ లో మరొకరు తెలిపారు.నా వైఫ్ అంటూ సిబ్బందితో గొడవహోటల్ చెక్ ఇన్ లో భాగంగా ఇద్దరి ఐడీ కార్డులను పరిశీలించే క్రమంలో ముస్కాన్ ప్రియుడు ఐడీ కార్డు చూపించాడు. ఆపై ఆమె ఐడీ కార్డును చూసేటప్పుడు హోటల్ సిబ్బంది చేతుల్లోంచి ఆ కార్డును లాక్కొని తన భార్య అంటూ వారితో వాదనకు దిగాడు. ఆపై కొంత ఒత్తిడి తర్వాత ముస్కాన్ ఐడీ కార్డు కార్డును కు ఇచ్చినట్లు సిబ్బంది పేర్కొన్నారు.ఆరు రోజులు రూమ్ లోనే..వారు వచ్చిన తర్వాత ఆరు రోజులు రూమ్ తీసుకున్నారని, ఎక్కడికి వెళ్లకుండా రూమ్ లోనే ఉండిపోయేవారని హోటల్ సిబ్బంది తెలిపారు. సాధారణంగా ఎవరైనా మనాలికి వస్తే కొన్ని ప్లేస్ లకు వెళతారని కానీ వీరు అలా వెళ్లకుండా రూమ్ లోనే గడిపేవారన్నారు. ఫుడ్ ను ఒక్కసారే ఆర్డర్ చేసేవారని, క్లీనింగ్ కి కూడా ఒక్కసారే అనుమతి ఇచ్చేవారని సిబ్బంది తెలిపారు. అసలు బయటకు వచ్చేవారు కాదని, అనుమానం రాకుండా ఉండటానికి కేవలం ఏదొకసారి వచ్చి లోపలికి వెళ్లిపోయేవారట. మార్చి 16వ తేదీన వారు హోటల్ ను వెళ్లిపోయారని, వెళ్లే క్రమంలో ఉత్తర్ ప్రదేశ్ కు తిరిగి వెళ్లిపోతున్నట్లు తమకు తెలిపారని స్టాఫ్ లో ఒకరు తెలిపారు.

24 ఏళ్లకే ఐపీఎల్ వేలంలో.. ఈ బ్యూటీ ముందు కావ్య కూడా దిగదుడుపే!
క్రికెట్ ప్రేమికులందరూ ఎదురు చూస్తున్న.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 (IPL 2025) ప్రారంభం కానుంది. మొదటి మ్యాచ్ కోల్‌కతా నైట్‌రైడర్స్ (KKR), రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య జరగనుంది. ఐపీఎల్ కేవలం క్రికెట్ అభిమానులను మాత్రమే కాకుండా.. అన్ని రంగలవారిని ఆకర్షిస్తోంది. ఆటకు అందం తోడైతే.. ఆ కిక్కే వేరు. ఐపీఎల్ అంటే ప్రీతి జింటా, కావ్య మారన్ పేర్లు మాత్రమే కాదు.. ఇప్పుడు 'జాహ్నవి మెహతా' (Jahnavi Mehta) పేరు కూడా ఎక్కువగా వినిపిస్తోంది. ఇంతకీ ఈమె ఎవరు?, ఈమె నెట్‌వర్త్ ఎంత? అనే వివరాలను ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.ఎవరీ జాహ్నవి మెహతా?జాహ్నవి మెహతా తల్లి ప్రముఖ నటి 'జూహి చావ్లా', తండ్రి ఫేమస్ బిజినెస్ మ్యాన్ 'జయ్ మెహతా'. అయితే 24 ఏళ్ల వయసులోనే జాహ్నవి ఐపీఎల్ వేలంపాటలతో సహా ప్రధాన కార్యక్రమాల్లో పాల్గొంటూ సుపరిచితురాలుగా మారింది. ముఖ్యంగా ఈమె తన తండ్రి సహ యాజమాన్యంలోని కోల్‌కతా నైట్ రైడర్స్ ఐపీఎల్ ఫ్రాంచైజీలో ఎక్కువగా పాల్గొంటోంది. 2025 వేలానికి హాజరై, జట్టుతో తన సంబంధాన్ని.. కేకేఆర్ కార్యకలాపాల నిర్వహణలో ఆమె పాత్రను మరింత పటిష్టం చేసుకుంది.క్రికెట్ అంటే కేవలం వ్యాపారం మాత్రమే కాదు, జాహ్నవికి ఇష్టం కూడా. ఈ కారణంగానే ఈమె కేకేఆర్ జట్టును ఫాలో అవుతూ వచ్చింది. కోల్‌కతా నైట్ రైడర్స్ ఐపీఎల్ ఫ్రాంచైజీలో భాగస్వామిగా ఉన్న షారుఖ్ ఖాన్ పిల్లలు సుహాన్ ఖాన్, ఆర్యన్ ఖాన్ ఇప్పటికి కూడా కేకేఆర్ జట్టు బాధ్యతలలోకి నేరుగా ప్రవేశించలేదు. కానీ జాహ్నవి మాత్రం తన తెలివితేటలతో.. కేకేఆర్ జట్టుకు సంబంధించిన కీలక వ్యవహారాలను చూసుకుంటోంది.నెట్‌వర్త్ ఎంతంటే?జాహ్నవి స్కూల్ చదువు ఇంగ్లండ్‌లోనే అక్కడి చాటర్ హౌస్ స్కూల్లో సాగింది. అంతకుముందు ముంబైలోని ధీరూబాయి అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్లో చదివింది. కొలంబియా యూనివర్శిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి జాహ్నవి మెహతా.. వేలకోట్ల సామ్రాజ్యానికి వారసురాలు. ఈమె ఆస్తి ఏకంగా రూ.4,000 కోట్ల కంటే ఎక్కువ అని తెలుస్తోంది. ఈమె తండ్రి జయ్ మెహతా.. తన మామ నాంజీ కాళిదాస్ మెహతా స్థాపించిన బహుళజాతి సమ్మేళన సంస్థ అయిన మెహతా గ్రూప్ చైర్మన్. ఈ సంస్థ ప్యాకేజింగ్, హార్టికల్చర్, సిమెంట్, నిర్మాణ సామగ్రి వంటి విభిన్న రంగాల కలయిక.మెహతా గ్రూప్ ఒక్క భారతదేశంలో మాత్రమే కాకుండా.. కెనడా, ఉగాండా, కెన్యా, యునైటెడ్ స్టేట్స్ వంటి దేశాలలో కూడా విస్తరించి ఉంది. ఈ కంపెనీ గత కొంత కాలంగా గణనీయమైన అభివృద్ధి చెందుతూనే ఉంది. జూహి చావ్లా ప్రపంచంలోనే అత్యంత సంపన్నురాలైన హీరోయిన్.ఇదీ చదవండి: వారానికి 70 గంటల పని: మొదటిసారి స్పందించిన సుధామూర్తి

మానసిక అనారోగ్యం ఇంత భయానకమైనదా..? పాపం ఆ వ్యక్తి..
కొన్ని రకాల మానసిక రుగ్మతలు చాలా భయానకంగా ఉంటాయి. ఓ పట్టాన వాటికి ఉపశమనం దొరకదు. మనిషి సంకల్పబలానికే పరీక్ష పెట్టేలా ఉంటాయి ఆ వ్యాధులు. కొందరు జయిస్తారు. మరికొందరు ఆ వ్యాధి పెట్టే బాధకు తలవొగ్గక తప్పని పరిస్థితి ఎదురవ్వుతుంది. అలాంటి దుస్థితిలోనే ఉన్నాడు ఈ 28 ఏళ్ల వ్యక్తి. ఇన్స్టాగ్రామ్ వేదిక తన వ్యథను పంచుకున్నాడు.బ్రిటన్ సంతతి ఘనా కళాకారుడు జోసెఫ్ అవువా-డార్కో మానసిక అనారోగ్యంతో జీవించడం కంటే ముగించేయడం మంచిదనే నిర్ణయానికి వచ్చేశాడు. అతడు మెదడుకి సంబంధించిన బైపోలార్ డిజార్డర్‌తో బాధపతున్నాడు. చట్టబద్ధంగా జీవితాన్ని ముగించేసేలా నెదర్లాండ్ దేశానికి వెళ్లాలనుకుంటున్నట్లు ఇన్‌స్టా వేదికగా తెలిపాడు. అనాయస మరణం కోసం దరఖాస్తు చేసుకున్నానని, ఆమోదం కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపాడు. అనుమతి రావడానికి సుమారు నాలుగేళ్లు పడుతుందని అన్నాడు. ఎలాగో ఇంతటి జఠిలమైన నిర్ణయం తీసుకున్నాను కదా అని.. 'ది లాస్ట్ సప్పర్ ప్రాజెక్ట్'ను ప్రారంభించాడు. ఏంటంటే ఇది..తన చివరి క్షణాలను ఎంజాయ్ చేయాలన్న ఉద్దేశ్యంతో అపరిచితులతో కనెక్ట్ అయ్యి వారితో విందులు ఆస్వాదించాలనేది అతడి కోరిక. ఆ నేపథ్యంలోనే ఈ ప్రాజెక్ట్ పేరుతో ప్రపంచవ్యాప్త పర్యటనలకు పయనమయ్యాడు కూడా. ఇప్పటి వరకు అతడు పారిస్, మిలన్, బ్రస్సెల్స్, బెర్లిన్లలో 57 విందులను ఆస్వాదించాడు. వచ్చే ఏడాదికి 120 విందులతో కూడిన టూర్స్‌కి ప్లాన్ చేశాడు. దీనివల్ల తాను ఇతరులతో కనెక్ట్ అవ్వడమేగాక తనకు ఓ రుగ్మత ఉందనే విషయం మర్చిపోయి ఆనందంగా గడపగలుగుతున్నాడట. మనల్ని ప్రేమించేవారు సంతోషంగా ఉండేలా వైద్య సహాయంతో పొందే ఈ అనాయస మరణం అహింసాయుతమైనదేనని చెబుతున్నాడు జోసఫ్. చివరగా తన బైపోలార్ సమస్య ఎంత తీవ్రతరమైనదో వివరించాడు. పొద్దుపొద్దున్నే లేవడమే ఓ నరకంలా ఉంటుందని, ప్రతి ఉదయం ఓ నరకమే అంటూ కన్నీటి పర్యంతమయ్యాడు. నాలుగేళ్లకు పైగా బాగా ఆలోచించే ఇక ఈ నిర్ణయం తీసుకున్నాని వివరించాడు.. జోసఫ్. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌గా మారింది. అతడి వ్యథను విన్న నెటిజన్లు అతని నిర్ణయాన్ని కొందరు గౌరవించగా, మరికొందరు నిర్ణయం మార్చుకో బ్రదర్..తమతో విందు షేర్ చేసుకోవాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. కాగా, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ ప్రకారం, బైపోలార్ డిజార్డర్ అనేది మెదడుకి సంబంధించిన మానిక్-డిప్రెసివ్ అనారోగ్యం. ఇది మానసిక స్థితి, శక్తి స్థాయిలలో తీవ్ర మార్పులకు కారణమవుతుంది. ఏటా చాలామంది ఈ రుగ్మత బారినపడుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. View this post on Instagram A post shared by Joseph “Nana Kwame” Awuah-Darko 🇬🇭 (@okuntakinte) (చదవండి: Round Egg Auction: కోటిలో ఒక్కటి ఇలా ఉంటుందేమో..! వేలంలో ఎంతకు అమ్ముడుపోయిందంటే..)

అప్పుడు కూడా జడ్జి యశ్వంత్ ఇంట్లో నోట్ల కట్టల కుప్ప!
న్యూఢిల్లీ: జస్టిస్ యశ్వంత్ వర్మ.. ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన పేరు. భారీ అవినీతి ఆరోపణ నడుమ యశ్వంత్ పేరు ఇప్పుడు ప్రముఖంగా వినిపిస్తోంది. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న యశ్వంత వర్మ ఇంట్లో ఇటీవల అగ్ని ప్రమాదం జరగ్గా, అక్కడ పెద్ద ఎత్తున నోట్ల కట్టలు కనిపించాయని ఒకవైపు ఆరోపణలు.. వీటి విలువ కోట్ల రూపాయిలు ఉంటుందని మరొవైపు అంచనాలు. ఒకవైపు జస్టిస్ ఇంట్లో ఏమీ నగదు దొరకలేదని ఢిల్లీ అగ్ని మాపక చీఫ్ అన్నట్లు ఒకవైపు, తాను అనలేదని మళ్లీ మరొకవైపు. ఇవే వార్తలు గత రెండు రోజుల నుంచి. చక్కర్లు కొడుతున్నాయి.అంటే ఈ కేసుపై సమగ్ర దర్యాప్తు జరిగితేనే అసలు విషయం బయటకురాదు. న్యాయవవస్థలో ఉన్న ఒక జడ్జిపై ఆరోపణ వచ్చినప్పుడు దాన్ని ‘లెక్క సరిచేసుకునే’ బాధ్యత సదరు జడ్జిపై కూడా ఉంటుంది. ఇప్పటివరకూ జస్టిస్ యశ్వంత్ వర్మ నుంచి ఒక్క మాట పెదవి దాటలేదు. మరి ఆయన మౌనం పాటిస్తున్నారా.. వెనుక ఉండి ఏమైనా ‘ కథ’ నడిపిస్తున్నారా అనేది కూడా ప్రజల్లో అనుమానాలు రేకెత్తిస్తోంది.2018లోనే వర్మపై సీబీఐ ఎఫ్ఐఆర్..!తాజాగా జరిగింది ఒకటైతే,. 2018లో జస్టిస్ యశ్వంత్ వర్మపై ఎఫ్ఐఆర్ నమోదైంది. సింబాలి సుగర్ మిల్స్ కుంభకోణానికి సంబంధించి యశ్వంత్ పై కేసు ఫైల్ చేసింది సీబీఐ. దానికి ఆ సమయంలో యశ్వంత్ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా వ్యవహరించారు. ఆ సమయంలో యశ్వంత్ వర్మ ఇంట్లో లెక్కల్లో చూపని భారీ నగదు దొరకడంతో సీబీఐ ఎప్ఐఆర్ నమోదు చేసింది. అయితే 2012 సంవత్సరంలో జనవరి, మార్చి నెలల మధ్యలో ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్(ఓబీసీ)కి సింభోలి షుగర్ మిల్స్ వందల కోట్లలో టోకరా వేసి ఘటన అప్పట్లో సంచలనమైంది.. సదరు బ్యాంకును మోసం సుమారు రూ. 148.59 కోట్లను అక్రమ మార్గంలో సింభోలి షుగర్ మిల్స్ ఖాతాలోకి మళ్లించారు. 5వేలు మంది రైతులకు విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేయడానికి బ్యాంక్ రుణానికి వెళ్లి, ఆ రైతుల పేర్లతో తప్పుడు పత్రాలు(కేవైసీ) సృష్టించి మోసానికి తెరలేపారు సింభోలి షుగర్ మిల్స్.2015లో అసలు విషయం వెలుగులోకి..అయితే సింభోలి షుగర్ మిల్స్ మోసం చేసిన విషయాన్ని ఓబీసీ బ్యాంకు 2015లో గ్రహించింది. ఆ షుగర్ మిల్స్ తీసుకున్న రుణం మోసం చేసి తీసుకున్నదిగా డిక్లేర్ చేసింది. ఇందులో మొత్తం రుణం రూ. 97.85 కోట్లు కాగా, అవుట్ స్టాండింగ్ అమౌంట్ రూ. 109 కోట్లుగా బ్యాంకు పేర్కొంది. దీనిపై కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ గా వ్యవహరించిన గుర్పాల్ సింగ్ పై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. అప్పటి పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ కి గుర్పాల్ సింగ్ అల్లుడు. ఆ తర్వాత ఈ కేసుకు సంబంధించి సీబీఐ ఎప్ఐఆర్ ఆధారంగా ఈడీ(ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్) కూడా రంగంలోకి దిగింది. ఈ రెండు కేంద్ర దర్యాప్తు సంస్థలు సమాంతరంగా దర్యాప్తు చేశాయి. అయితే ఈ కేసులో పెద్దగా పురోగతి కనిపించకపోవడంతో దర్యాప్తు అంశం పక్కకు పోయింది.అలహాబాద్ హైకోర్టు జోక్యంతో 2023లో మళ్లీ కొత్తగా..ఈ భారీ అవినీతిని సీరియస్ గా తీసుకున్న అలహాబాద్ హైకోర్టు.. దీనిపై సమగ్ర దర్యాప్తు చేయాలని సీబీఐకి ఆదేశాలు జారీ చేసింది. న్యాయవవస్థను కుదిపేసిన ఈ తరహా అవినీతిపై దర్యాప్తు కచ్చితంగా సమగ్రంగా జరగాలని పేర్కొంది. ఇందులో రుణాలు ఎగవేతకు సంబంధించి ఏడు బ్యాంకులను లింక్ చేసింది హైకోర్టు. సుమారు ఏడు బ్యాంకులు కలిపి బయారూ. 900 కోట్లు సింభోలి షుగర్ మిల్స్ కు రుణాన్ని మంజూరు చేసినట్లు గుర్తించిన హైకోర్టు.. ఆ మేరకు ఆదేశాలు ఇచ్చింది. దాంతో 2024 ఫిబ్రవరిలో సీబీఐ రంగంలోకి దిగింది. దీనికి సంబంధించిన కంపెనీ డైరెక్టర్లు, నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెకర్లపై ఎఫ్ఐఆర్ లు నమోదు చేసి విచారణను తిరిగి ప్రారంభించింది.

బాలీవుడ్లో ఒక్క హీరోకు కూడా చేతకాలేదు, కానీ అల్లు అర్జున్..: గణేశ్ ఆచార్య
రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు.. అలాగే 24 విభాగాలు సరిగా పనిచేస్తేనే సినిమా సంపూర్ణమవుతుంది. కానీ సినిమా విజయం సాధించినప్పుడు చాలామంది కేవలం దర్శకులు, హీరోలను మాత్రమే మెచ్చుకుంటారు. ఆ విజయానికి దోహదపడ్డవారిని ప్రత్యేకంగా గుర్తించరు. అయితే దక్షిణాదిన మాత్రం పరిస్థితి భిన్నంగా ఉందంటున్నాడు ప్రముఖ కొరియోగ్రాఫర్ గణేశ్ ఆచార్య (Ganesh Acharya). ముఖ్యంగా అల్లు అర్జున్ పిలిచి మరీ అభినందించడం మర్చిపోలేనంటున్నాడు. ఇతడు పుష్ప 1, పుష్ప 2 సినిమాల్లోని పలు పాటలకు కొరియోగ్రఫీ అందించాడు.ఒకేసారి మేకప్తాజాగా కమెడియన్ భారతీ సింగ్ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. గణేశ్ ఆచార్య మాట్లాడుతూ.. 'దక్షిణాదిలో టెక్నీషియన్లకు గుర్తింపు, గౌరవం ఇస్తారు. నటీనటులు పదేపదే మేకప్స్ వేసుకోరు. ఉదయం ఒక్కసారి మేకప్ వేసుకున్నాక నేరుగా లంచ్‌కు వెళ్లిపోతారు. ఆ మధ్యలో మళ్లీ ముఖానికి రంగు పూసుకోవడం ఉండదు. మేనేజర్ల హడావుడి అసలే ఉండదు. అంతా ఒక పద్ధతిగా సాగిపోతుంది.చివరి నిమిషంలో డ్యాన్స్ స్టెప్పులు మార్చమంటారుడ్యాన్స్ విషయానికి వస్తే.. చాలామంది దర్శనిర్మాతలు మా కొరియోగ్రఫీ బాగుందని, దాన్ని యథాతథంగా పాటలో ఉంచాల్సిందేనని మా ముందు బీరాలు పలుకుతారు. కానీ స్టార్ హీరోల ముందు మాత్రం మౌనంగా ఉండిపోతారు. వారు అభ్యంతరం చెప్పగానే చివరి నిమిషంలో స్టెప్పుల్ని మార్చేయమంటారు. ఆ పాట కోసం మేమెంత కష్టపడ్డామన్నది పట్టించుకోరు. ఇలాంటి సంఘటనలు చూసినప్పుడల్లా నాకెంతో బాధగా అనిపిస్తుంది.మనకు ఇగో ఎక్కువ.. కానీ సౌత్‌లో..బాలీవుడ్లో జనాలు కేవలం హీరోనే పొగుడుతారు. దర్శకుడు, కొరియోగ్రాఫర్, టెక్నీషియన్ల ప్రతిభను, కష్టాన్ని ఏమాత్రం గుర్తించరు. పైగా మనకు ఇగోలు ఎక్కువ. కానీ సౌత్‌లో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. పుష్ప పాటలకు నేను కొరియోగ్రఫీ చేసిన కొద్ది రోజుల తర్వాత అల్లు అర్జున్ (Allu Arjun) నన్ను పిలిచి మరీ అభినందించాడు. మాస్టర్, మీ వల్లే ఇదంతా సాధ్యమైంది అని మెచ్చుకున్నారు. బాలీవుడ్లో అలా అభినందించిన హీరో ఒక్కరంటే ఒక్కరు కూడా లేరు. (చదవండి: విశాల్ చెల్లెలి భర్తపై సీబీఐ కేసు)పుష్ప సక్సెస్ పార్టీకి ఆహ్వానంకానీ అల్లు అర్జున్ నన్ను గుర్తించాడు. జనాలు నా డ్యాన్స్ చూసి పొగుడుతున్నారంటే దానికి కారణం మీరే అన్నారు. మనసు సంతోషంతో నిండిపోయింది. అక్కడితో ఆగలేదు. హైదరాబాద్‌లో జరిగిన పుష్ప సక్సెస్ పార్టీకి నన్ను ఆహ్వానించాడు. తాగి తూలుతూ డ్యాన్స్ చేసే పార్టీ కాదది. ప్రతి టెక్నీషియన్ ఆ పార్టీలో భాగమయ్యాడు. స్టేజీపై పుష్ప సినిమాకు పని చేసిన లైట్మెన్ను కూడా అవార్డుతో సత్కరించారు.బాలీవుడ్‌ను తక్కువ చేయాలని కాదు!నేను బాలీవుడ్‌ను తక్కువ చేసి మాట్లాడటం లేదు. హిందీ ఇండస్ట్రీ మాకెంతో ఇచ్చింది. దానివల్లే ఈ స్థాయిలో ఉన్నాం. కానీ కొందరి కారణంగా మన చిత్రపరిశ్రమ అద్వాణ్నంగా మారిపోతోంది. దాన్ని సరిదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని గణేశ్ ఆచార్య చెప్పుకొచ్చాడు. ఈయన పుష్ప 1లో దాక్కో దాక్కో మేక.., ఊ అంటావా మావా.. ఉఊ అంటావా మావా పాటకు కొరియోగ్రఫీ చేశాడు. పుష్ప 2లో సూసేకి అగ్గిరవ్వ మాదిరి.., కిస్సిక్.. పాటకు స్టెప్పులు నేర్పించాడు.చదవండి: ఇంట్లో ఉన్నప్పుడు ఐదారుగురు మంది అసభ్యంగా తాకారు.. ఏడ్చేసిన వరలక్ష్మి
'న భూతో న భవిష్యత్' అనేలా నాట్స్ 8వ తెలుగు సంబరాలు.. సెలబ్రిటీలకు ఆహ్వానం
విక్రమ్ 'వీర ధీర శూర' ట్రైలర్ రిలీజ్
లెబనాన్‌పై ఇజ్రాయెల్ ప్రతిదాడులు
IPL 2025: తారలు దిగొచ్చిన వేళ.. అంగరంగ వైభవంగా.. అట్టహాసంగా..
ఐపీఎల్ ఆరంభం.. తెలుగు పాటతో అదరగొట్టిన శ్రేయా ఘోషల్
'గేమ్ ఛేంజర్'.. ఇప్పటికీ తెగని పంచాయితీ!
బ్యాంకుల బంద్‌పై అప్డేట్..
‘తమ్ముడూ.. నీ లైఫ్ స్టైల్ వేరు.. నా లైఫ్ స్టైల్ వేరు’
నాకు కోపమొస్తే తెలుగులోనే బూతులు తిడతా..: తమన్నా
యష్ 'టాక్సిక్'.. చరణ్ కి కాస్త ఇబ్బందే?
వీడియో: వెడ్డింగ్ ఫొటో షూట్లో మిస్ ‘ఫైర్’
నేడు వరల్డ్ వాటర్ డే
నీ భర్తను వదిలేసి నాతో రా... దుబాయ్‌కి వెళ్ళిపోదాం
న్యూజిలాండ్‌తో మూడో టీ20.. చరిత్ర సృష్టించిన పాకిస్తాన్
ఊహించని రీతిలో.. మరోమారు తగ్గిన బంగారం ధరలు
ఇవాళ గంటపాటు "స్విచ్ ఆఫ్"
నమ్మశక్యం కాని ఇన్నింగ్స్.. అతడి బ్యాటింగ్ అద్భుతం: కివీస్ కెప్టెన్
ఈ రాశి వారికి ఆర్థికాభివృద్ధి.. ఉద్యోగులకు ఉన్నత హోదాలు.
భారత జట్టు కెప్టెన్‌గా యువరాజ్ సింగ్
తొలియత్నంలోనే గ్రూప్-1లో విజయం
'న భూతో న భవిష్యత్' అనేలా నాట్స్ 8వ తెలుగు సంబరాలు.. సెలబ్రిటీలకు ఆహ్వానం
విక్రమ్ 'వీర ధీర శూర' ట్రైలర్ రిలీజ్
లెబనాన్‌పై ఇజ్రాయెల్ ప్రతిదాడులు
IPL 2025: తారలు దిగొచ్చిన వేళ.. అంగరంగ వైభవంగా.. అట్టహాసంగా..
ఐపీఎల్ ఆరంభం.. తెలుగు పాటతో అదరగొట్టిన శ్రేయా ఘోషల్
'గేమ్ ఛేంజర్'.. ఇప్పటికీ తెగని పంచాయితీ!
బ్యాంకుల బంద్‌పై అప్డేట్..
‘తమ్ముడూ.. నీ లైఫ్ స్టైల్ వేరు.. నా లైఫ్ స్టైల్ వేరు’
నాకు కోపమొస్తే తెలుగులోనే బూతులు తిడతా..: తమన్నా
యష్ 'టాక్సిక్'.. చరణ్ కి కాస్త ఇబ్బందే?
వీడియో: వెడ్డింగ్ ఫొటో షూట్లో మిస్ ‘ఫైర్’
నేడు వరల్డ్ వాటర్ డే
నీ భర్తను వదిలేసి నాతో రా... దుబాయ్‌కి వెళ్ళిపోదాం
న్యూజిలాండ్‌తో మూడో టీ20.. చరిత్ర సృష్టించిన పాకిస్తాన్
ఊహించని రీతిలో.. మరోమారు తగ్గిన బంగారం ధరలు
ఇవాళ గంటపాటు "స్విచ్ ఆఫ్"
నమ్మశక్యం కాని ఇన్నింగ్స్.. అతడి బ్యాటింగ్ అద్భుతం: కివీస్ కెప్టెన్
ఈ రాశి వారికి ఆర్థికాభివృద్ధి.. ఉద్యోగులకు ఉన్నత హోదాలు.
భారత జట్టు కెప్టెన్‌గా యువరాజ్ సింగ్
తొలియత్నంలోనే గ్రూప్-1లో విజయం
సినిమా

హీరోయిన్‌తో శ్రీకాంత్ అడ్డాల డేటింగ్.. దర్శకుడి రియాక్షన్
దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల( Srikanth Addala) పేరు చెప్పగానే కొత్త బంగారులోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు, ముకుందా చిత్రాలే ప్రధానంగా గుర్తుకు వస్తాయి. ఆయన డైరెక్ట్ చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ అవి ఇండస్ట్రీలో ఎప్పటికీ గుర్తుండిపోతాయి. వివాదాలకు దూరంగా ఉండే శ్రీకాంత్ అడ్డాల గురించి కొద్దిరోజులుగా ఇండస్ట్రీలో కొన్ని రూమర్స్ వైరల్ అవుతున్నాయి. తన సతీమణితో పలు విబేదాలు రావడంతో ఆయన కోలీవుడ్ హీరోయిన్‌తో కొంత కాలంగా కలిసి జీవిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో కోలీవుడ్ నటుడు, దర్శకుడు పార్ధిబన్ పలు విషయాలు పంచుకున్నారు.ఆర్. పార్తీబన్ (R. Parthiban) నటుడు మాత్రమే కాదు.. దర్శకుడు, నిర్మాత కూడా! దాదాపు 16 సినిమాలకు దర్శకుడిగా, 14 సినిమాలకు నిర్మాతగా పని చేయడం కాకుండా వందకుపైగా సినిమాల్లో యాక్టర్‌గా మెప్పించాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల గురించి మాట్లాడారు. కోలీవుడ్‌లో పార్తీబన్ పరిచయం చేసిన హీరోయిన్‌తోనే శ్రీకాంత్ అడ్డాల రిలేషన్లో ఉన్నారని రూమర్స్ రావడంతో ఆ ఇంటర్వ్యూలో ఆయనకొక ప్రశ్న ఎదురైంది.వారిద్దరి మధ్య రిలేషన్ రూమర్స్ మాత్రమే..శ్రీకాంత్ అడ్డాల- నటి బ్రిగిడా సాగా మధ్య ఎఫైర్ నడుస్తున్నట్లుగా వస్తున్న గాసిప్స్ నిజమేనా అని ఆయన్ను ప్రశ్నించగా.. పార్తీబన్ ఇలా చెప్పుకొచ్చారు. ఆ అమ్మాయిని చిత్రపరిశ్రమకు నేను పరిచయం చేశాను కాబట్టి ఈ ప్రశ్న చాలామంది నన్ను అడిగారు. వారిద్దరి మధ్య ఎలాంటి రిలేషన్ ఉందో నాకు తెలియదు. కానీ, ఆ అమ్మాయి మాత్రం మంచి నటి. చాలా కష్టమైన పాత్రను కూడా సులువుగా చేస్తుంది. తనలో నటన పరంగా చాలా టాలెంట్ ఉంది. అయితే, ఇలాంటి గాసిప్స్ లను ఆమె పెద్దగా పట్టించుకోదు. ఆమె ఇప్పుడు నాతో టచ్‌లో లేదు. ఆమె డ్రీమ్ సినిమా మాత్రమే.. ఇలాంటి రిలేషన్స్ పెట్టుకుని తన కెరీర్‌ను నాశనం చేసుకోదు. వారిద్దరి మధ్య ఇవన్నీ రూమర్స్ మాత్రమేనని నేను అనుకుంటున్నాను.' అని క్లారిటీ ఇచ్చారు.శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్లో నటించిన బ్రిగిడా సాగాబ్రిగిడా సాగా తెలుగులో రెండు సినిమాల్లో నటించింది. సింధూరం, పెద కాపు-1 (2023) సినిమాల్లో ఆమె ప్రధాన పాత్రలలో కనిపించింది. అయితే, పెద కాపు చిత్రానికి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. ఈ సినిమా సమయంలోనే వారిద్దరి మధ్య స్నేహం ఏర్పడిందని తెలుస్తోంది. ఇప్పటికే చెన్నైలో బ్రిగిడా సాగాతో శ్రీకాంత్ కలిసే ఉన్నారని వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై ఆయన సతీమణి రాగసుధాతో విభేదాలు వచ్చాయని సమాచారం అయితే, ఈ రూమర్స్ గురించి వారిద్దరూ ఎక్కడా కూడా రియాక్ట్ కాలేదు.

నాకు కోపమొస్తే తెలుగులోనే బూతులు తిడతా..: తమన్నా
పదిహేనేళ్ల వయసులోనే కెమెరా ముందుకు వచ్చేసింది మిల్కీ బ్యూటీ తమన్నా. హీరోయిన్గా ఎన్నో సినిమాలు చేసింది. ప్రస్తుతం ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ఓదెల 2. ఇది 2021లో వచ్చిన ఓదెల రైల్వే స్టేషన్‌కు సీక్వెల్‌గా తెరకెక్కింది. హెబ్బా పటేల్, వశిష్ట సింహ కీలక పాత్రలు పోషించారు. సంపత్ నంది పర్యవేక్షణలో అశోక్ తేజ దర్శకత్వం వహించాడు.శనివారం నాడు ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించారు. ఏప్రిల్ 17న ఓదెల 2 ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. అందులో తమన్నా ముఖం రక్తసిక్తంగా కనిపిస్తోంది. ఈ సందర్భంగా తమన్నా మాట్లాడుతూ.. అందరూ నన్ను తెలుగమ్మాయే అనుకుంటారు. నేను కూడా అలాగే ఫీలవుతాను. నాకు కోపం వచ్చినప్పుడు తెలుగే మాట్లాడతాను. తెలుగులోనే తిడతాను అని చెప్పుకొచ్చింది. ఇకపోతే ఓదెల 2 కోసం తమన్నా మాంసాహారం తినడం కూడా మనేసింది. A PRESENCE TO BE FELT. #Odela2 on April 17th. 🙏@iamsampathnandi @dimadhu @alle_ashok_teja @ihebahp@imsimhaa @b_ajaneesh @soundar16 @neeta_lulla@madhucreations9 pic.twitter.com/ihUozJX6Rt— Tamannaah Bhatia (@tamannaahspeaks) March 22, 2025 చదవండి: నన్ను తిట్టించడం కోసం లక్షలు ఖర్చు చేశారు: పూజా హెగ్డే

పూజా హెగ్డే భక్తి.. జిగర్తాండతో దివ్య భారతి!
సమ్మర్ హీట్.. జిగర్తాండతో హాట్ హీరోయిన్ దివ్య భారతిపెయింటింగ్ వేస్తూ చిల్ అవుతున్న 'మన్మథుడు' అన్షుపాలరాతి శిల్పంలా తళతళా మెరిసిపోతున్న తమన్నాఇద్దరు పిల్లలకు తల్లయినా అందంలో ప్రణీత తగ్గేదే లేరిషికేష్ లో గంగా హారతి కార్యక్రమంలో పూజా హెగ్డేఫన్నీ పోజులిచ్చిన యాంకర్ రష్మీ గౌతమ్వయసుతో పాటే అందాన్ని పెంచేస్తున్న శ్రియ శరణ్ View this post on Instagram A post shared by Anshu (@actressanshuofficial) View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) View this post on Instagram A post shared by Aditi Rao Hydari (@aditiraohydari) View this post on Instagram A post shared by Honey Rose (@honeyroseinsta) View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) View this post on Instagram A post shared by Shivani Rajashekar (@shivani_rajashekar1) View this post on Instagram A post shared by Avika Gor (@avikagor) View this post on Instagram A post shared by Divyabharathi (@divyabharathioffl) View this post on Instagram A post shared by Pujiitaa Ponnada (@pujita.ponnada) View this post on Instagram A post shared by Saanve Megghana (@saanve.megghana) View this post on Instagram A post shared by Rashi Singh (@rashi.real) View this post on Instagram A post shared by JyotiPoorvaj (Jayashree Rai K K) (@jyotipoorvaj) View this post on Instagram A post shared by Hari Teja (@actress_hariteja) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) View this post on Instagram A post shared by Reba Monica John (@reba_john) View this post on Instagram A post shared by Payal Rajput ⭐️ ♾ (@rajputpaayal) View this post on Instagram A post shared by Akshay Amberkar (@akshay_26)

కారవాన్‌లో డ్రెస్ చేంజ్ చేస్తుండగా.. ఆ దర్శకుడి తీరు నచ్చలేదు: షాలిని పాండే
అర్జున్ రెడ్డి సినిమాతో వెండితెరకు పరిచయం అయిన బ్యూటీ షాలిని పాండే(Shalini Pandey).. తొలి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఆమె మహానటి, 100% కాదల్, గొరిల్లా, 118 వంటి సినిమాలతో సౌత్ ఇండియాలో మెప్పించింది. కానీ, తర్వాత తను నటించిన సినిమాలు ఎవీ పెద్దగా మెప్పించలేదు. దీంతో ప్రస్తుతం బాలీవుడ్లో ఆమె ప్రయత్నాలు కొనసాగిస్తుంది. అయితే, తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న షాలిని.. తన కెరీర్ ఆరంభంలో ఒక దర్శకుడు వల్ల ఇబ్బందిపడినట్లు ఆమె చెప్పింది. షాలినీ పాండే తాజాగా 'డబ్బా కార్టెల్' వెబ్ సిరీస్‌లో నటించింది. ఇందులో షబానా అజ్మీ, జ్యోతిక ప్రధాన పాత్రల్లో నటించారు. నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది. ఈ క్రమంలో షాలినీ పాండే ఒక ఇంటర్వ్యూలో పాల్గొని ఒక దర్శకుడి గురించి ఆమె ఇలా చెప్పింది. 'సినిమా ఇండస్ట్రీలో రాణించాలనే కోరికతో నేను మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్ నుంచి వచ్చాను. ఒక రోజు దర్శకులు సందీప్ రెడ్డి వంగా నా ఫోటోలను ఫేస్బుక్లో చూసి ఆయన తన టీమ్‌తో నన్ను సంప్రదించారు. అలా అర్జున్ రెడ్డిలో ఛాన్స్ దక్కింది. సుమారు ఏనిమిదేళ్లుగా చిత్రపరిశ్రమలో ఉన్నాను. ఈ ప్రయాణంలో ఎందరో నటీనటులతో పాటు మేకర్స్ నాకెంతో అండగా నిలిచారు. అయినప్పటికీ నాకు కూడా కొన్ని సవాళ్లు ఇక్కడ ఎదుర్కొవాల్సి వచ్చింది. నా కెరీర్ ప్రారంభంలో సౌత్ ఇండియాలో ఒక సినిమా చేస్తున్నప్పుడు జరిగిన సంఘటన ఇప్పటికీ మరిచిపోలేను. ఒక సినిమా షూటింగ్ జరుగుతుండగా కారవాన్‌లో నేను దస్తులు మార్చకుంటున్నాను. ఆ సమయంలో నా అనుమతి లేకుండానే దర్శకుడు డోర్ తీశాడు. వెంటనే చాలా కోపంతో అరిచేశాను. దీంతో ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే, కొంత సమయం తర్వాత నా చుట్టూ ఉన్న వాళ్లు ఒక సలహా ఇచ్చారు.. అలా కోపంగా తిట్టడం కరెక్ట్ కాదని చెప్పారు. నేను సైలెంట్‌గానే వెళ్లిపోయాను. ఈ ఘటన తర్వాత నాకు ఎక్కడా కూడా అలాంటి సమస్య రాలేదు. ఒకవేళ వచ్చినా కూడా కోప్పడకుండా వారికి ఎలా సమాధానం చెప్పాలో తెలుసుకున్నాను.' అని షాలినీ చెప్పింది.
న్యూస్ పాడ్‌కాస్ట్
క్రీడలు

అతడిని ఆపటం ఎవరితరం కాలేదు: భారత మాజీ క్రికెటర్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)-2025లో డిఫెండింగ్ చాంపియన్‌గా కోల్‌కతా నైట్ రైడర్స్ బరిలోకి దిగనుంది. తాజా సీజన్లో తొలి మ్యాచ్‌లో భాగంగా సొంతమైదానం ఈడెన్ గార్డెన్స్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో శనివారం తలపడనుంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా.. కోల్‌కతా స్టార్ సునిల్ నరైన్ (Sunil Narine) గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.ఐపీఎల్-2025 ఆరంభ మ్యాచ్‌లో అందరి కళ్లు నరైన్‌పైనే ఉన్నాయని.. ఈసారి కూడా గతేడాది మాదిరి అతడు రాణిస్తే కేకేఆర్‌కు తిరుగు ఉండదని పేర్కొన్నాడు. బ్యాట్‌తో, బంతితో రాణించగల ఈ వెస్టిండీస్ ఆటగాడు మరోసారి కోల్‌కతాకు కీలకం కాబోతున్నాడని ఆకాశ్ చోప్రా (Aakash Chopra) పేర్కొన్నాడు.పవర్ ప్లేలో ధనాధన్ ఇన్నింగ్స్తోకాగా గతేడాది కేకేఆర్ చాంపియన్‌గా నిలవడంలో సునిల్ నరైన్‌ది కీలక పాత్ర. ఈ స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ ఓపెనర్‌గా బరిలోకి దిగి పరుగుల సునామీ సృష్టించాడు. పవర్ ప్లేలో ధనాధన్ ఇన్నింగ్స్‌తో దంచికొట్టి కేకేఆర్ విజయాలకు బాట వేశాడు. గత సీజన్లో పద్నాలుగు ఇన్నింగ్స్‌లో మొత్తంగా 488 పరుగులు సాధించాడు ఈ ఎడమచేతి వాటం బ్యాటర్. 180.74 స్ట్రైక్‌రేటుతో పరుగులు రాబట్టి కేకేఆర్ తరఫున టాప్ రన్ స్కోరర్‌గా నిలిచాడు.ఈ నేపథ్యంలో కామెంటేటర్ ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ.. ‘‘ఓపెనర్ సునిల్ నరైన్. నాలుగు ఓవర్లపాటు పూర్తి స్థాయిలో బౌలింగ్ చేయగలడు కూడా! అయితే, ఈసారి బ్యాట్‌తో ఎలా విజృంభిస్తాడన్నది ఆసక్తికరం.అతడిని ఆపటం ఎవరితరం కాలేదుగతేడాది కేకేఆర్ విజయాలను నిర్దేశించింది అతడే! అతడి అద్భుత ప్రదర్శన కారణంగా కేకేఆర్ రాత మారిపోయింది. నరైన్ బ్యాట్ నుంచి సెంచరీ కూడా జాలువారింది. ముఖ్యంగా పవర్‌ప్లేలో నిలకడైన బ్యాటింగ్‌తో పరుగులు రాబట్టిన తీరు అద్బుతం.టీ20 క్రికెట్‌కు ఏం కావాలో నరైన్ అది చేసి చూపించాడు. పరుగులు రాబట్టుకుంటూ పోయాడు. అతడిని ఆపటం ఎవరితరం కాలేదు. బౌలర్లు ఎన్ని వ్యూహాలు మార్చినా నరైన్‌ను కట్టడి చేయలేకపోయారు. సునిల్ నరైన్ ఈసారి కూడా అలాగే రాణిస్తే కేకేఆర్‌కు తిరుగు ఉండదు’’ అని పేర్కొన్నాడు. ఆర్సీబీ స్పిన్నర్లే కీలకంఇక తొలి మ్యాచ్‌లో కేకేఆర్- ఆర్సీబీ తలపడనున్న నేపథ్యంలో.. ‘‘ఆర్సీబీ స్పిన్నర్లు ఎలా బౌలింగ్ చేస్తారన్న అంశం మీదే మ్యాచ్ ఫలితం ఆధారపడి ఉంటుంది. కృనాల్ పాండ్యా, సూయశ్ శర్మలతో పాటు లియామ్ లివింగ్‌స్టోన్, జేకబ్ బెతెల్ ప్రదర్శనే ఆర్సీబీకి కీలకం కానుంది.ఇక కేకేఆర్‌కు ఈసారి మిచెల్ స్టార్క్ లేడు. అతడి స్థానంలో స్పెన్సర్ జాన్సన్ లేదంటే అన్రిచ్ నోర్జే ఆడతారు. బ్యాటర్ల విషయానికొస్తే ఫిల్ సాల్ట్, శ్రేయస్ అయ్యర్‌లను కేకేఆర్ కోల్పోయింది. నరైన్.. క్వింటన్ డికాక్ లేదంటే రహ్మనుల్లా గుర్బాజ్‌తో కలిసి ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది. టాపార్డర్ రాణిస్తేనే కోల్‌కతాకు గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి’’ అని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు.చదవండి: నమ్మశక్యం కాని ఇన్నింగ్స్.. అతడి బ్యాటింగ్ అద్భుతం: కివీస్ కెప్టెన్

ఇంతకంటే చెత్త ఫ్రాంఛైజీ మరొకటి ఉండదు: ‘లక్నో’పై నెటిజన్లు ఫైర్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ఆరంభానికి ముందు లక్నో సూపర్ జెయింట్స్ తీవ్ర స్థాయిలో విమర్శలు మూటగట్టుకుంటోంది. ఇంతకంటే చెత్త ఫ్రాంఛైజీ ఇంకొకటి ఉండదంటూ క్రికెట్ ప్రేమికులు సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డబ్బులు పెట్టి కొనుకున్నాం కాబట్టి.. ఆటగాళ్ల భావోద్వేగాలతో ఆడుకోవచ్చనే సంస్కృతికి వీడ్కోలు పలకాలని హితవు పలుకుతున్నారు.భారీ ధరకు కొనుగోలుఅసలేం జరిగిందంటే.. ఐపీఎల్ మెగా వేలం-2025లో లక్నో యాజమాన్యం సౌతాఫ్రికా హార్డ్ హిట్టర్ డేవిడ్ మిల్లర్ (David Miller)ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. గతేడాది గుజరాత్ టైటాన్స్‌కు ఆడిన ఈ విధ్వంసకర వీరుడు ఆక్షన్‌లోకి రాగా.. రూ. 7.5 కోట్లకు లక్నో కొనుగోలు చేసింది.ఇక మార్చి 22న ఐపీఎల్ తాజా ఎడిషన్ ఆరంభం కానుండగా.. మార్చి 24న లక్నో తమ తొలి మ్యాచ్ ఆడనుంది. విశాఖపట్నం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇరుజట్లు విశాఖకు చేరుకున్నాయి. ఇదిలా ఉంటే.. లక్నో ఫ్రాంఛైజీ డేవిడ్ మిల్లర్‌తో ఓ ఇంటర్వ్యూయర్ జరిపిన సంభాషణకు సంబంధించిన వీడియోను విడుదల చేసింది. ఇందులో ఓ వ్యక్తి.. మీ కెరీర్లో బిగ్గర్ హార్ట్‌బ్రేక్ ఏది? అంటూ మిల్లర్‌ను ప్రశ్నించాడు. బిగ్గర్ హార్ట్‌బ్రేక్ ఏది? నవ్వుతూ ప్రశ్నలుఇందులో.. ‘‘గుజరాత్ టైటాన్స్ తరఫున 2023 ఫైనల్లో ఓటమి.. 2014లో పంజాబ్ కింగ్స్ ఫైనల్ ఓటమి.. లేదంటే.. వరల్డ్‌కప్-2019, 2021లలో సౌతాఫ్రికా గ్రూప్ దశలోనే నిష్క్రమించడం.. లేదా టీ20 వరల్డ్‌కప్-2024 ఫైనల్లో ఓటమి.. అదీ కాదంటే వన్డే వరల్డ్‌కప్-2023 సెమీస్‌లో ఓటమి.. లేదంటే.. చాంపియన్స్ ట్రోఫీ-2025లో న్యూజిలాండ్ చేతిలో ఓటమి.. వీటిల్లో మీ హృదయాన్ని ముక్కలు చేసిన సంఘటన ఏది?’’ అంటూ బోలెడన్ని ఆప్షన్లు కూడా ఇచ్చాడు.అంతేకాదు.. సదరు వ్యక్తి నవ్వుతూ ఈ ప్రశ్నలు అడగటం గమనార్హం. ఇందుకు మిల్లర్ బాధగా, దిగాలుగా ముఖం పెట్టుకుని సమాధానాలు ఇచ్చాడు. అయితే, ఇంటర్వ్యూయర్ మాత్రం నవ్వుతూనే ఉన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన లక్నో.. ‘ఇకపై మిల్లర్‌కు ఇలాంటి బాధలు ఉండవు’ అంటూ తాము ఈసారి టైటిల్ గెలవబోతున్నట్లు క్యాప్షన్ ఇచ్చింది.ఇంతకంటే చెత్త ఫ్రాంఛైజీ మరొకటి లేదుమిలియన్కు పైగా వ్యూస్ సాధించిన ఈ వీడియోపై నెటిజన్లు మండిపడుతున్నారు. ‘‘ఇది వినోదం కాదు.. ఓ ఆటగాడిని మానసికంగా వేధించడం లాంటిది. ఓటములను గుర్తుచేస్తూ అతడి మనసును మరింత బాధపెట్టడం సరికాదు. వీడియోలు సృజనాత్మకంగా ఉండాలి గానీ.. ఇలా ఆటగాడి మనసును నొప్పించేలా ఉండకూడదు.డబ్బులు పెట్టి కొన్నారు కాబట్టి ఆటగాళ్లంతా తాము చెప్పినట్లు నడచుకోవాలనే లక్నో యాజమాన్యం అహంభావ వైఖరికి ఇది నిదర్శనం. గత సీజన్లో కేఎల్ రాహుల్‌ను అవమానించిన తీరును మేము ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాం. ఐపీఎల్లో ఇంతకంటే చెత్త ఫ్రాంఛైజీ మరొకటి లేదు’’ అంటూ తీవ్ర స్థాయిలో ట్రోల్ చేస్తున్నారు.రాహుల్ పట్ల అదే తీరుకాగా గతేడాది సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓటమి తర్వాత లక్నో జట్టు యజమాని సంజీవ్ గోయెంకా.. అప్పటి తమ కెప్టెన్ కేఎల్ రాహుల్‌పై మైదానంలోనే అరిచేశాడు. అందుకు సంబంధించిన దృశ్యాలు విస్తృతంగా వైరల్ కాగా.. గోయెంకాపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే.ఇక ఈ పరిణామాల నేపథ్యంలో కేఎల్ రాహుల్ లక్నోను వీడి వేలంలోకి రాగా.. ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది. మరోవైపు.. మరో టీమిండియా స్టార్ రిషభ్ పంత్‌ను రికార్డు స్థాయిలో రూ. 27 కోట్లకు కొన్న లక్నో.. కెప్టెన్‌గా అతడికి పగ్గాలు అప్పగించింది. చదవండి: నమ్మశక్యం కాని ఇన్నింగ్స్.. అతడి బ్యాటింగ్ అద్భుతం: కివీస్ కెప్టెన్Manifesting zero heartbreaks for Miller bhai this season 🤞 pic.twitter.com/4zd5FbtblW— Lucknow Super Giants (@LucknowIPL) March 20, 2025

‘ఫాస్ట్ బౌలర్ల మాదిరి బౌలింగ్ దేనికి? ఆ మాత్రం ధైర్యం లేదా?’
నవతరం స్పిన్నర్ల తీరును భారత స్పిన్ దిగ్గజం హర్భజన్ సింగ్ (Harbhajan Singh) విమర్శించాడు. ముఖ్యంగా టీ20 ఫార్మాట్లో చాలా మంది స్పిన్నర్లు తమ సహజత్వానికి భిన్నంగా బౌలింగ్ చేస్తున్నారన్నాడు. బంతిని స్పిన్ చేసేందుకు బదులు.. డిఫెన్సివ్‌గా ఆడేందుకే ఎక్కువగా మొగ్గుచూపుతున్నారని విమర్శలు గుప్పించాడు.కాగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)- 2025 సీజన్ శనివారం ఆరంభం కానున్న విషయం తెలిసిందే. ప్రఖ్యాత ఈడెన్ గార్డెన్స్ మైదానంలో కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్‌తో క్యాష్ రిచ్ లీగ్ తాజా సీజన్‌కు తెరలేవనుంది. ఇదిలా ఉంటే.. ఐపీఎల్లో గత పదిహేడు ఎడిషన్లలో స్పిన్నర్లు కేవలం మూడుసార్లు మాత్రమే పర్పుల్ క్యాప్ గెలుచుకున్నారు.ఇమ్రాన్ తాహిర్, ప్రజ్ఞాన్ ఓజా తర్వాత.. 2022లో అత్యధిక వికెట్ల వీరుడిగా టీమిండియా లెగ్‌బ్రేక్ స్పిన్నర్ యజువేంద్ర చహల్ ఈ ఘనత సాధించాడు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.ఫాస్ట్ బౌలర్ల మాదిరి బౌలింగ్ దేనికి? ఆ మాత్రం ధైర్యం లేదా?‘‘టీ20లలో.. మరీ ముఖ్యంగా ఐపీఎల్లో చాలా మంది స్పిన్నర్లు ఫాస్ట్ బౌలర్ల మాదిరి బౌలింగ్ చేస్తున్నారు. బంతిని స్పిన్ చేసేందుకు ఏమాత్రం ప్రయత్నించడం లేదు. అసలు బ్యాటర్లపై అటాకింగ్ చేయడమే లేదు. వికెట్లు తీయాలనే తాపత్రయం వారిలో కరువైంది.వికెట్లు తీసే విషయంలో స్పిన్నర్లు కాస్త ధైర్యం చూపించాలి. ప్రతిసారీ ఆత్మరక్షణ ధోరణితో ఉండటం సరికాదు’’ అని భజ్జీ స్పిన్నర్ల తీరును విమర్శించాడు. ఇండియా టుడేతో ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు.కాగా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి.. తన బౌలింగ్ శైలి ఫాస్ట్ బౌలర్ల మాదిరి ఉంటుంది కాబట్టి తాను కేవలం వన్డే, టీ20లు ఆడతానని.. టెస్టులకు సరిపడనని ఇటీవలే పేర్కొన్న విషయం తెలిసిందే. ఇక ఐపీఎల్-2025 సీజన్లో బంతిపై సెలైవా (లాలాజలం) ఉపయోగించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) అనుమతించిన విషయం తెలిసిందే.ఐపీఎల్-2025 కెప్టెన్ల సమావేశం తర్వాత.. వారి అంగీకారంతో ఈ మేరకు సెలైవా ఉపయోగంపై విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు బోర్డు ప్రకటించింది. అయితే, అంతర్జాతీయ క్రికెట్లో మాత్రం ఐసీసీ నిబంధనలకు కట్టుబడి ఉంటామని స్పష్టం చేసింది.స్వాగతించదగ్గ విషయంఈ నేపథ్యంలో హర్భజన్ సింగ్ స్పందిస్తూ.. ‘‘బౌలర్లు సెలైవా ఉపయోగించేందుకు అనుమతి లభించడం స్వాగతించదగ్గ విషయం. అంతర్జాతీయ క్రికెట్లోనూ ఇదే మాదిరి లాలాజలంతో బంతిని నునుపు చేసేందుకు అనుమతి వస్తే.. పేసర్లు బంతిని మరింత స్వింగ్ చేయగలుగుతారు. స్పిన్నర్లకు కూడా ప్రయోజనకరంగానే ఉంటుంది’’ అని అభిప్రాయపడ్డాడు.కాగా కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో అప్పట్లో లాలాజలంతో బంతిని రుద్దకుండా ఐసీసీ నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. హర్భజన్ సింగ్ టీమిండియా తరఫున టెస్టుల్లో 417, వన్డేల్లో 269, టీ20లలో 25 వికెట్లు తీశాడు. ఐపీఎల్లో 163 మ్యాచ్‌లు ఆడిన ఈ ఆఫ్ స్పిన్నర్ 150 వికెట్లు కూల్చాడు.చదవండి: నమ్మశక్యం కాని ఇన్నింగ్స్.. అతడి బ్యాటింగ్ అద్భుతం: కివీస్ కెప్టెన్

KKR Vs RCB: వర్షం వల్ల మ్యాచ్ రద్దయితే పరిస్థితి?
మెగా క్రికెట్ సమరం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) పద్దెనిమిదవ సీజన్‌కు శనివారం తెరలేవనుంది. తారల సందడితో ఈడెన్ గార్డెన్స్‌లో క్యాష్ రిచ్ లీగ్ తాజా ఎడిషన్‌ను ఆరంభించేందుకు నిర్వాహకులు సిద్ధమయ్యారు. డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)- ఇంత వరకు ఒక్కసారి కూడా ట్రోఫీ గెలవని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య పోరుతో ఈ క్రీడా సంబరం మొదలుకానుంది.పొంచి ఉన్న వర్షం ముప్పుఅయితే, ఆరంభ వేడుకలతో పాటు మ్యాచ్‌కు వర్షం అడ్డుతగిలే అవకాశం ఉంది. ఆక్యూవెదర్ నివేదిక ప్రకారం కోల్‌కతాలో శనివారం భారీ వాన పడే అవకాశం ఉంది. ఉదయం 11 గంటల తర్వాత వర్షం ఎక్కువయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.దీంతో సాయంత్రం 6.20 నిమిషాల నుంచి 6.45 నిమిషాల వరకు జరగాల్సిన ప్రారంభోత్సవ వేడుకల ఏర్పాట్లు సజావుగా సాగడం కష్టమే. సాయంత్రం ఆరు గంటల తర్వాత వర్షం పడే అవకాశం 25 శాతం ఉందని ఆక్యూవెదర్ పేర్కొంది. టాస్ సమయానికి అంటే ఏడు గంటల సమయంలో పదిశాతం వర్ష సూచనలు ఉన్నట్లు తెలిపింది. ఇక రాత్రి పదకొండు గంటల తర్వాత ఇందుకు డెబ్బై శాతం ఆస్కారం ఉన్నట్లు వెల్లడించింది.రెండు రోజులుగా వానఈ నేపథ్యంలో కేకేఆర్- ఆర్సీబీ మధ్య ఐపీఎల్-2025 ఆరంభ మ్యాచ్ సాఫీగా సాగడం కష్టమే అనిపిస్తోంది. కోల్‌కతాలో గత రెండు రోజులుగా వర్షం కురుస్తూనే ఉంది. దీంతో కేకేఆర్- ఆర్సీబీ ప్రాక్టీస్ మ్యాచ్‌లకు అంతరాయం కలిగింది. మరోవైపు.. శుక్రవారం కూడా వాన పడగా.. ఈడెన్ గార్డెన్స్ గ్రౌండ్‌స్టాఫ్ కవర్లతో మైదానాన్ని కప్పి ఉంచారు.అంతేకాదు.. ఎప్పటికప్పుడు మైదానం నుంచి నీటిని క్లియర్ చేసేందుకు డ్రైనేజీ సిస్టమ్ సిద్ధంగానే ఉంది. అయితే, ఎడతెరిపిలేని వర్షం పడితే మాత్రం మ్యాచ్ జరగడం సాధ్యం కాదు. మరి వర్షం వల్ల కేకేఆర్- ఆర్సీబీ మ్యాచ్ రద్దయితే పరిస్థితి ఏమిటి?జరిగేది ఇదే..ప్లే ఆఫ్స్, ఫైనల్ మాదిరి ఐపీఎల్ గ్రూప్ దశ మ్యాచ్‌లకు రిజర్వ్ డే ఉండదు. అయితే, వర్షం వల్ల మ్యాచ్ ఆలస్యమైతే.. మ్యాచ్ ముగియడానికి నిర్ణీత సమయం కంటే అరవై నిమిషాల అదనపు సమయం ఇస్తారు.ఫలితం తేల్చేందుకు ఇరుజట్లు కనీసం ఐదు ఓవర్లపాటు బ్యాటింగ్ చేసే అవకాశం ఉంటుంది. ఈ ఐదు ఓవర్ల మ్యాచ్‌కు కటాఫ్ టైమ్ రాత్రి 10.56 నిమిషాలు. అర్ధరాత్రి 12.06 నిమిషాల వరకు మ్యాచ్‌ను ముగించేయాల్సి ఉంటుంది. ఒకవేళ వర్షం వల్ల మ్యాచ్ మరీ ఆలస్యమైతే ఓవర్ల సంఖ్యను తగ్గించే అవకాశం కూడా ఉంటుంది.ఇంత చేసినా ఫలితం తేలకుండా.. మ్యాచ్ రద్దు చేయాల్సి వస్తే ఇరుజట్లకు చెరో పాయింట్ లభిస్తుంది. అయితే, టైటిల్ రేసులో నిలిచే క్రమంలో ఈ ఒక్క పాయింట్ కూడా తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. అందుకే.. ఇటు కేకేఆర్.. అటు ఆర్సీబీ అభిమానులు మ్యాచ్ సజావుగా సాగాలని కోరుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2025 ఆరంభ వేడుకలో శ్రేయా ఘోషాల్, కరణ్ ఔజ్లా, దిశా పటాని తదితరులు ఆట, పాటలతో అలరించేందుకు సిద్ధమయ్యారు.చదవండి: IPL 2025: కెప్టెన్ల మార్పు.. ఎవరి జీతం ఎంత?.. అతి చవగ్గా దొరికిన సారథి అతడే!A little rain won’t stop us! 🌧 The ground’s got its cozy cover, and the drainage system will be ready to save the day 𝘒𝘺𝘶𝘯𝘬𝘪 𝘠𝘦𝘩 𝘐𝘗𝘓 𝘩𝘢𝘪, 𝘺𝘢𝘩𝘢𝘯 𝘴𝘢𝘣 𝘱𝘰𝘴𝘴𝘪𝘣𝘭𝘦 𝘩𝘢𝘪!#IPLonJioStar 👉 SEASON OPENER #KKRvRCB | SAT, 22nd March, 5:30 PM | LIVE on… pic.twitter.com/UwdonS9FeN— Star Sports (@StarSportsIndia) March 21, 2025
బిజినెస్

హైదరాబాద్ రియల్ఎస్టేట్.. రైజింగ్!
కొత్త ప్రభుత్వం, ప్రతికూల ఆర్థిక పరిస్థితులు, వడ్డీ రేట్ల భారం, హైడ్రా దూకుడు కారణాలేవైనా ఏడాదిన్నర కాలంగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ఒడిదొడుకుల్లో ఉంది. ఈ ఏడాది ఆరంభం నుంచి మార్కెట్ క్రమంగా పుంజుకుంటోంది. ప్రభుత్వ స్థిరమైన విధానాలు, కార్యాచరణ, స్థిరపడిన ధరలు తదితర కారణాలతో జనవరి నుంచి నగర స్థిరాస్తి రంగం కోలుకుంటోంది. –సాక్షి, సిటీబ్యూరోగత నెలలో గ్రేటర్లో రూ.3,925 కోట్లు విలువ చేసే 5,900 యూనిట్లు రిజిస్ట్రేషన్ కాగా.. జనవరిలో రూ.3,293 కోట్ల విలువైన 5,464 ప్రాపర్టీలు రిజిస్ట్రేషన్ అయ్యాయి. నెల రోజుల్లో విలువల్లో 13 శాతం, యూనిట్ల రిజిస్ట్రేషన్లలో 10 శాతం వృద్ధి నమోదైందని నైట్‌ఫ్రాంక్ ఇండియా అధ్యయనం వెల్లడించింది. నగరవాసులు లగ్జరీ ప్రాపర్టీల కొనుగోళ్లకే మొగ్గు చూపుతున్నారు. విశాలమైన ఇళ్ల కోసం ఎంత ఖర్చు చేసేందుకైనా వెనకాడట్లేదు. గతేడాది ఫిబ్రవరిలో రూ.50 లక్షలలోపు ధర ఉన్న గృహాలు 59 శాతం విక్రయించగా.. గత నెలకొచ్చేసరికి వీటి వాటా 56 శాతానికి తగ్గింది.ఇదీ చదవండి: చారిత్రక ‘లక్ష్మీ నివాస్’ బంగ్లా అమ్మకం..వీటి స్థానంలో రూ.కోటి కంటే ఎక్కువ ధర ఉన్న లగ్జరీ ప్రాపర్టీల వాటా గతేడాది ఫ్రిబవరిలో 15 శాతంగా ఉండగా.. ఇప్పుడది ఏకంగా 18 శాతానికి పెరిగింది. అలాగే 2 వేల చ.అ. కంటే విస్తీర్ణమైన ఇళ్ల వాటా 2024 ఫిబ్రవరిలో 13 శాతంగా ఉండగా.. గత నెలలో 17 శాతానికి పెరిగింది. 1,000–2,000 చ.అ. మధ్య ఉన్న ప్రాపర్టీల వాటా 71 శాతం నుంచి 67 శాతానికి తగ్గింది.

టెస్లా కీలక నిర్ణయం: వేలాది కార్లపై ఎఫెక్ట్
అమెరికన్ కార్ల తయారీ దిగ్గజం టెస్లా (Tesla).. తన 'సైబర్ ట్రక్' కార్లకు రీకాల్ ప్రకటించింది. ఇప్పటి వరకు డెలివరీ చేసిన అన్ని సైబర్ ట్రక్కులలోనూ సమస్య ఉందని గుర్తించడంతో ఈ రీకాల్ ప్రకటించింది. ఈ ప్రభావానికి 46,000 కంటే ఎక్కువ కార్లు ప్రభావితమయ్యాయి.డ్రైవింగ్ చేస్తున్నప్పుడు.. బాహ్య ప్యానెల్ విడిపోతుందనే ఆందోళనల కారణంగా ఈ రీకాల్ ప్రకటించడం జరిగింద 'నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్' (NHTSA) వెల్లడించింది. మే 19 నుంచి వాహన యజమానులకు మెయిల్ ద్వారా రీకాల్ విషయాన్ని కంపెనీ తెలియజేయనుంది.టెస్లా సైబర్ ట్రక్ వెలుపలి భాగంలో ఉన్న స్టెయిన్లెస్ స్టీల్ ట్రిమ్ ప్యానెల్ విడిపోయే అవకాశం ఉంది. దీనివల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమస్యను పరిష్కరించడానికి కంపెనీ సన్నద్ధమైంది. దీనికోసం వాహనదారులు డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు. సంస్థ సర్వీస్ సెంటర్లలో ఉచితంగా భర్తీ చేస్తామని ఆటోమేకర్ కస్టమర్లకు హామీ ఇచ్చింది.టెస్లా.. తన సైబర్ ట్రక్ కోసం రీకాల్ ప్రకటించడం ఇదే మొదటిసారి కాదు. యాక్సిలరేటర్ పెడల్ ఇరుక్కుపోవడం, డ్రైవ్ పవర్ కోల్పోవడం, లోపభూయిష్ట విండ్‌షీల్డ్ వైపర్లు, ఎలక్ట్రిక్ ఇన్వర్టర్ సమస్య వంటి కారణాలతో 15 నెలల్లో పలుమార్లు రీకాల్ ప్రకటించింది. ఇప్పుడు తాజాగా మరోమారు ఈ రీకాల్ ప్రకటించడం గమనార్హం.

జొమాటో కొత్త పేరు: మార్చి 20 నుంచి అమల్లోకి
న్యూఢిల్లీ: ఫుడ్, గ్రాసరీ డెలివరీ సేవల సంస్థ జొమాటో పేరును ‘ఎటర్నల్ లిమిటెడ్’గా మార్చే ప్రతిపాదనకు కార్పొరేట్ వ్యవహారాల శాఖ (ఎంసీఏ) ఆమోదముద్ర వేసింది. ఈ మార్పు మార్చి 20 నుంచి అమల్లోకి వస్తుందని కంపెనీ తెలిపింది.తమ ఫుడ్ డెలివరీ వ్యాపార విభాగం పేరు జొమాటోగానే కొనసాగుతుందని, కార్పొరేట్ సంస్థ పేరు, స్టాక్ టికర్ మాత్రం మారతాయని పేర్కొంది. ఎటర్నల్‌లో నాలుగు ప్రధాన వ్యాపారాలు (జొమాటో, బ్లింకిట్, డిస్ట్రిక్ట్, హైపర్‌ప్యూర్) ఉన్నాయి.జొమాటో పేరును ‘ఎటర్నల్ లిమిటెడ్’గా మార్చే ప్రతిపాదికను.. కంపెనీ సీఈఓ దీపిందర్ గోయల్ 2025 ఫిబ్రవరిలోనే వెల్లడించారు. కాగా దానిని ఇప్పుడు ఆమోదం లభించింది. కొత్త పేరు త్వరలోకే అమలులోకి వస్తుంది.

వారంలో రూ.22 లక్షల కోట్ల సంపద
స్టాక్ మార్కెట్లు ఇటీవల భారీగా పతనమై చిన్నగా కొలుకుంటున్నాయి. ఈ క్రమంలో గడిచిన వారంలో వచ్చిన మార్కెట్ ర్యాలీ నాలుగేళ్లలో ఎప్పుడూ రాలేదని విశ్లేషకులు చెబుతున్నారు. కేవలం వారం రోజుల్లోనే సెన్సెక్స్ 3,000 పాయింట్లు ఎగబాకడంతో భారత స్టాక్ మార్కెట్ గణనీయమైన ర్యాలీని చూసింది. ఈ బుల్లిష్ రన్‌తో ఇన్వెస్టర్ల సంపద అదనంగా రూ.22 లక్షల కోట్లు పెరిగింది. ఇటీవల కాలం వరకు భారీగా పతనమైన మార్కెట్లు వారంలో ఇంతటి ర్యాలీని అందించడంతో లాభాలను నమోదు చేసుకోవడానికి ఇది సరైన సమయమా లేదా మరింత కాలం వేచి చూడాలా అనే అనుమానం వ్యక్తం అవుతుంది. దీనిపై నిపుణులు కింది విధంగా సూచిస్తున్నారు.మార్కెట్ ర్యాలీకి కారణాలుసెన్సెక్స్ ఇటీవల పుంజుకోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. సానుకూల అంతర్జాతీయ సంకేతాలు, ద్రవ్యోల్బణ ఆందోళనలు తగ్గుముఖం పట్టడం, వచ్చే త్రైమాసిక ఫలితాల్లో బలమైన కార్పొరేట్ రాబడులుంటాయనే అంచనాలు మార్కెట్ సెంటిమెంట్‌కు ఊతమిచ్చాయి. దీనికి తోడు విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల తీరు ర్యాలీకి మరింత ఊపునిచ్చాయి. ఇది భారత ఆర్థిక వ్యవస్థపై పెరుగుతున్న విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుంది. ఐటీ, బ్యాంకింగ్, కన్జ్యూమర్ గూడ్స్ వంటి రంగాలు ఈ పెరుగుదలకు కీలకంగా దోహదపడ్డాయి.స్టాక్స్ అమ్మాలా? ఉంచాలా?మార్కెట్లోని స్టాక్స్‌ను అమ్మి లాభాలు బుక్ చేయాలా లేదా మరిన్ని లాభాలను ఆశించి పెట్టుబడులను నిలుపుకోవాలా అనేది ప్రతి ఇన్వెస్టర్ మదిలో మెదులుతున్న ప్రశ్న. దీనికి సంబంధించి నిర్ణయం తీసుకోవాలంటే కింది అంశాలను పరిగణనలోని తీసుకోవాలి.మార్కెట్ వాల్యుయేషన్: మార్కెట్ ప్రస్తుత వాల్యుయేషన్ కీలక అంశం. చారిత్రాత్మక కొలమానాలతో పోలిస్తే కొన్ని స్టాక్స్ ఇప్పటికీ అధిక వ్యాల్యూయేషన్లలోనే ట్రేడ్ అవుతున్నాయి. వీటిలో దిద్దుబాటు ఉండవచ్చు. అటువంటి సందర్భాల్లో పాక్షికంగా ప్రాఫిట్ బుకింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇన్వెస్టర్ల పోర్ట్‌ఫోలియోలో కూడా ఇలాంటి స్టాక్స్ ఉంటే వాటిని ట్రాక్ చేయడం చాలా ముఖ్యం.పెట్టుబడి లక్ష్యాలు: ఇన్వెస్టర్లు తమ నిర్ణయాలను దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా మార్చుకోవాలి. భారతదేశం బలమైన ఆర్థిక మూలాలను దృష్టిలో ఉంచుకుని దీర్ఘకాలికంగా పెట్టుబడి పెట్టే వారు మరింత ఇన్వెస్ట్ చేసేందుకు వీలుంటుంది. తాత్కాలికంగా వచ్చే ర్యాలీకి ప్రభావితం చెంది ట్రేడ్‌లో నిర్ణయం తీసుకోకూడదు.సెక్టార్-స్పెసిఫిక్ అనాలిసిస్: ఏ ర్యాలీలోనైనా అన్ని రంగాలకు చెందిన స్టాక్స్ ఒకేలా పెరగవు..తగ్గవు. సెక్టోరల్ వారీగా స్టాక్స్‌ను విశ్లేషించి ప్రస్తుతం మెరుగైన రాబడినిస్తున్న వాటిని కొనసాగించాల్సి ఉంటుంది.అంతర్జాతీయ అంశాలు: అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ పరిణామాలు, వడ్డీరేట్ల మార్పులు, ప్రపంచ ఆర్థిక పరిస్థితులు మార్కెట్ ధోరణులను ప్రభావితం చేస్తాయి. ఈ కారకాలపై అప్డేట్లను నిత్యం పరిశీలిస్తుండాలి.డైవర్సిఫికేషన్: ఆకస్మికంగా మార్కెట్లో వచ్చే ర్యాలీ మీ పోర్ట్‌ఫోలియోను సమీక్షించడానికి, సరైన వైవిధ్యతను నిర్ధారించడానికి మంచి సమయం. రిస్క్ ఉన్న స్టాక్స్‌ను అమ్మేయడానికి ఈ ర్యాలీ తోడ్పడుతుంది. మంచి స్టాక్స్‌ను కొనసాగించేందుకు దోహదం చేస్తుంది.ఇదీ చదవండి: ఏఐతోనే 90 శాతం కోడింగ్.. కానీ..మార్కెట్ ర్యాలీలో స్టాక్స్ అమ్మాలా లేదా ఉంచాలా అనేది పెట్టుబడిదారుల దీర్ఘకాలిక లక్ష్యాలు, ఆర్థిక లక్ష్యాలు, పెట్టుబడి పరిధితో సహా వారి వ్యక్తిగత పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. ఇలాంటి సమయాల్లో ఫైనాన్షియల్ అడ్వైజర్‌తో సంప్రదింపులు జరిపి నిర్ణయం తీసుకోవాలి.
ఫ్యామిలీ

లాభాల తీరం ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన
పీఎమ్ఎస్సెస్వై (ప్రధానమంత్రి స్వస్థ సురక్ష యోజన) కిందకు వచ్చే ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకాన్ని 2020లో ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఈ స్కీమ్ ద్వారా ఎలాంటి పూచీకత్తు లేకుండా చేపలపెంపకందారులకు ఏడు శాతం వడ్డీతో రెండు లక్షల రూపాయాల వరకు రుణాన్ని అందిస్తున్నారు. చేపలు, రొయ్యల పెంపకంపై ఉచిత శిక్షణనూ అందిస్తున్నారు. షెడ్యూల్డ్ కులాలు, తెగలకు చెందిన మహిళలకు 60 శాతం వరకు గ్రాంట్ అందుతోంది. ఈ పథకం తీర్రప్రాంతంలోని చిన్న, సన్నకారు రైతులకు లాభాల పంట పండిస్తోంది. చేపల ఎగుమతిలో భారతదేశాన్ని ముందంజలో నడిపిస్తోంది. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు ఫిషరీస్, మత్స్యకారుల సంక్షేమశాఖ సహాయసంచాలకుల కార్యాలయంలో మరిన్ని వివరాలను పొదవచ్చు. జిల్లా మత్స్యశాఖ లేదా ఏదైనా హేచరీ నుంచి ఉచితంగా చేప సీడ్‌ను పొందవచ్చు. ఈ పథకానికి అధికారిక వెబ్సైట్ https://pmmsy.dof.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. వెబ్సైట్ హోమ్ పేజీలో స్కీమ్ లింక్‌పై క్లిక్ చేయాలి. నింపాల్సిన ఫామ్ కనిపిస్తుంది. అందులోని వివరాలను పూరించాలి. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, బ్యాంక్ ఖాతా, భూమి వివరాలనూ పొందుపరచాలి. డీపీఆర్ (డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్) సహా సూచించిన పత్రాలను అప్లోడ్ చేయాలి. తర్వాత సబ్మిట్ పై క్లిక్ చేసి.. ఫామ్‌ను సమర్పించాలి. దరఖాస్తుదారు అర్హతలు, సంబంధిత పత్రాలను ఆమోదించిన తరువాత పథకం ప్రయోజనాలను పొందవచ్చు. తీర్రప్రాంతం లేని చోటా మత్స్య సంపదను అభివృద్ధి చేసేందుకు ఈ పథకం రుణాన్ని అందిస్తోంది. కమర్షియల్ ఆక్వా కల్చర్ సిస్టమ్ కింద ఈ ప్రాజెక్ట్ విలువ రూ. 20 లక్షలు అయితే రూ. 5 లక్షల వరకు సొంత పెట్టుబడి ఉండాలి. అప్పుడు రూ. 15 లక్షల రుణాన్ని పొందవచ్చు. ఇందులో సబ్సిడీ ఉంటుంది. (చదవండి: Earth Hour: "'స్విచ్ ఆఫ్": ఆ ఒక్క గంగ ప్రకృతితో కనెక్ట్ అవుదామా..!)

నీటిని ఒడిసిపట్టారు
‘నీరు ఉన్న చోట ఊరు ఉంటుంది’ అనే మాట ఉంది. ఊరు సరే... నీటి మాట ఏమిటి?‘నీటిని డబ్బులా ఖర్చు చేయవద్దు’ అనే రోజులు వచ్చాయి.నీటి విలువ గురించి అవగాహన కలిగించడం నుంచి సంరక్షణ వరకు విమెన్ వాటర్ వారియర్స్ క్షేత్రస్థాయిలో, ఉద్యమ స్థాయిలో పనిచేస్తున్నారు...అస్సాంలోని అమ్తోలా గ్రామానికి చెందిన అరుణా దాస్ గుస్తా సామాజిక సమస్యలపై నిర్వహించే సమావేశాలకు తరచుగా హాజరయ్యేది. ఆ అలవాటే తనని నీటి పరిరక్షణ ఉద్యమంలో భాగం అయ్యేలా చేసింది. గ్రామంలోని వాటర్ యూజర్ గ్రూప్ (డబ్ల్యూయుజీ) అధ్యక్షురాలిగా నీటి సమస్యలపై గళమెత్తడంలో గణనీయమైన పాత్ర పోషించింది. ‘ప్రతి విషయం నీటితో ఆరంభమై నీటితో ముగిసిపోతుంది’ అంటున్న అరుణ యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ్రపోగ్రామ్ (ఇండియా) ద్వారా ‘వాటర్ ఛాంపియన్’గా గుర్తింపు పొందింది.ఉత్తర్‌ప్రదేశ్‌లోని లక్ష్మీపూర్ ఖేరీ జిల్లాలోని పాలియ కాలన్ గ్రామానికి చెందిన రమణ్‌దీప్ కౌర్ నీటి సంరక్షణ నుంచి నీటి కాలుష్యం వరకు....ఎన్నో విషయాలపై ప్రజలకు అవగాహన కలిగిస్తూ ‘వాటర్ ఛాంపియన్’గా గుర్తింపు పొందింది. కౌర్ సోషల్ సైన్సెస్‌లో పోస్ట్–గ్రాడ్యుయేషన్ చేసింది. గ్రామంలో ‘వాటర్ మేనేజ్మెంట్ కమిటీ’లు ఏర్పాటు చేసింది.ఇంటికే పరిమితమైన ఎంతోమంది మహిళలను వాటర్ మేనేజ్మెంట్ గ్రూపులలో భాగమయ్యేలా చేసింది.మహారాష్ట్రలోని కోటంబ గ్రామంలో మహిళలు నీటి కోసం కిలోమీటర్ల దూరం వెళ్లేవారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. దీనికి కారణం రేణుక. కోడలుగా ఆ ఊళ్లోకి అడుగు పెట్టిన రేణుక కొంత కాలానికి ఆ గ్రామానికి సర్పంచ్ అయింది. ‘వాటర్ ఎయిడ్ ఇండియా’ సహకారంతో గ్రామంలో ప్రభుత్వ భవనాలపై రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్స్‌ను ఏర్పాటు చేసింది. నీటి వృథాను అరికట్టడానికి, నీటి సంరక్షణపై అవగాహన కలిగించడానికి గ్రామీణ మహిళలతో కమిటీని ఏర్పాటు చేసింది.మధ్యప్రదేశ్‌లోని నయాపూరా గ్రామానికి చెందిన బబితా లిరోలియా నీటి సంరక్షణ, నీటి నాణ్యత పరీక్షించడం, నీటి పంపుల రిపేర్...మొదలైన ఎన్నో విషయాల గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ‘ఇంటర్నేషనల్ వాటర్ ఇనిస్టిట్యూట్’ బబితాను ‘వాటర్ ఛాంపియన్’గా గుర్తించింది.మధ్యప్రదేశ్‌లోని మహుకల గ్రామానికి చెందిన రాధ మీనా ‘విమెన్ ప్లస్ వాటర్ అలయెన్స్’ ్రపోగ్రామ్ వాలెంటరీ వర్కర్. గ్రామంలో నీటి సమస్య లేకుండా చేయడం నుంచి కుళాయిల్లో లీకేజీ సమస్య లేకుండా చేయడం, నీటి నాణ్యత పరీక్షలు నిర్వహించడం వరకు ఎన్నో పనులు చేస్తోంది. ప్రతీ వీధి తిరుగుతూ నీటి సంరక్షణ గురించి లౌడ్ స్పీకర్‌తో ప్రచారం చేసేది..దేశ వ్యాప్తంగా ఉన్న ఎంతో మంది విమెన్ వాటర్ వారియర్స్‌లో వీరు కొందరు మాత్రమే. ‘వరల్డ్ వాటర్ డే’ సందర్భంగా అందరికీ వందనాలు. – శిరీష చల్లపల్లినీటి నిజాలు⇒ ప్రపంచంలో 2 బిలియన్ మందికి సురక్షిత తాగునీరు అందుబాటులో లేదని ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది ⇒ ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 20 లక్షల మంది కలుషిత నీటి వల్ల సంభవించే వ్యాధులతో మరణిస్తున్నారు ⇒భవిష్యత్తులో నీటి కొరత ఒక ప్రధాన సమస్యగా మారనుంది. పరిష్కారంగా, డీసాలినేషన్ (సముద్ర జలాన్ని తాగే నీటిగా మార్చడం), వర్షపు నీటి సేకరణ, జల పునర్వినియోగం వంటి టెక్నాలజీలు అవసరం. ప్రతి వ్యక్తి నీటిని పొదుపుగా వాడడం ముఖ్యం.వాటర్ గర్ల్... నీటి పుస్తకాలు‘వాటర్ గర్ల్’గా గుర్తింపు పొందిన గర్విత గుల్హాటీ ‘వై వేస్ట్?’ అనే స్వచ్ఛంద సంస్థ ఫౌండర్, సీయివో. తన ఫౌండేషన్ ద్వారా నీటి విలువ, నీటి సంరక్షణ గురించి యువ రచయితలు రాసిన రచనలను ప్రచురిస్తోంది.

ఇవాళ గంటపాటు "స్విచ్ ఆఫ్"
మనిషికి జీవనాధారమైన భూమిని ఆహ్లాదంగా ఉండేలా ప్రయత్నిస్తే.. ఆటోమేటిగ్గా అన్ని బాగుంటాయి. అందుకోసమే ప్రంపచవ్యాప్తంగా ఉన్న మానవళి ప్రయోజనార్థమే లక్ష్యంగా కొన్ని కార్యక్రమాలను ఏర్పాటు చేశారు సామాజికవేత్తలు. అలా ఏర్పాటైనవే ప్రకృతికి సంబధించిన దినోత్సవాలు. ఆ విధంగా వచ్చిన వాటిలో ఒకటి ఈ ఎర్త్ అవర్. అసలేంటిది..? ఆ ఒక్క రోజు.. ఒక్క గంటపాటు పాటించేస్తే నిజంగానే భూమిని కాపాడేసినట్లేనా..? అంటే..?. .ఎర్త్ అవర్ అంటే.. పర్యావరణం కోసం ఒక గంట పాటు విద్యుత్ వినియోగాన్ని తగ్గించే ఒక కార్యక్రమం. ప్రతి ఏడాది మార్చి నెలలో చివరి శనివారం రాత్రి 8:30 నుంచి 9:30 గంటల మధ్య జరుగుతుంది. ఈపాటికే ఇరు తెలుగు రాష్టాల ప్రభుత్వాలు మార్చి 22 శనివారం రాత్రి 8.30 గంటల నుంచి 9.30 గంటల వరకు ఒక గంట పాటు అన్ని అనవసరమైన లైట్లను స్వచ్చందంగా ఆపేయాలని అధికారికంగా ప్రజలకు విజ్ఞప్తి చేసేసింది కూడా. అలాగే ఈ మహత్తర కార్యక్రమంలో ప్రజలందురూ స్వచ్ఛందంగా భాగం కావాలని కోరాయి ఇరు ప్రభుత్వాలు.ఎలా ప్రారంభమైందంటే? 2007లో ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. WWF (World Wildlife Fund) అనే సంస్థ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమం ముఖ్యోద్దేశం వాతావరణ మార్పులపై అవగాహన కల్పించడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు పాటుపడటమే ఈ కార్యక్రమం అసలు లక్ష్యం.ప్రాముఖ్యత ఎందుకు..మన ప్రపంచానికి మన సహాయం కావాలి. మనం తినే ఆహారం నుంచి పీల్చే గాలి వరకు ప్రకృతి మనకు చాలా ఇస్తుంది. అది మనల్ని ఆరోగ్యంగా, అభివృద్ధి చెందేలా చేస్తుంది. డబ్ల్యూబడ్యూఎఫ్(WWF) ఎర్త్ అవర్ అనేది స్విచ్ ఆఫ్ చేసి మనం నివశించే గ్రహానికి(భూమి) తిరిగి ఇవ్వడానికి సరైన సమయం. ఎందుకంటే మనం ప్రకృతిని పునరుద్ధరించినప్పుడే అది మనల్ని పునరుద్ధరిస్తుంది.'స్విచ్ ఆఫ్'లో ఉన్న ఆంతర్యం..ఎర్త్ అవర్ అంటే కేవలం లైట్లు ఆర్పేయడం మాత్రమే కాదు - మానసికంగా "స్విచ్ ఆఫ్" చేసి అంతర్ముఖులం కావడమే. అంటే ఇది వరకు చూడండి కరెంట్ పోతే చాలు అంతా బయటకు వచ్చి ముచ్చటలు ఆడుకునేవాళ్లు. ఆ వసంతకాలం వెన్నెలను వీక్షిస్తూ భోజనాలు చేస్తూ..హాయిగా గడిపేవాళ్లం గుర్తుందా..?. అచ్చం అలాగన్నమాట. ప్రకృతితో గడపటం అంటే ఏ అడువులో, ట్రెక్కింగ్‌లే అక్కర్లేదు..మన చుట్టు ఉన్న వాతావరణంతో కాసేపు సేదతీరుదాం. చిన్న పెద్ద అనే తారతమ్య లేకుండా ఫోన్ స్క్రీన్లతో గడిపే మనందరం కాసేపు అన్నింటికి స్విచ్ ఆఫ్ చెప్పేసి.. మనుషులతోనే కాదు మనతో మనమే కనెక్ట్ అవుదాం. తద్వారా గొప్ప మానసిక ఆనందాన్ని పొందుతాం కూడా. ఎందుకంటే సెల్‌ఫోన్ లేకుండా ప్రాణామే లేదన్నట్లుగా హైరానా పడుతున్న మనకు ఆ ఒక్క గంట అమూల్యమైన విషయాలెన్నింటినో నేర్పిస్తుందంటున్నారు మానసిక నిపుణులు.మరి అంత గొప్ప ఈ కార్యక్రమంలో మనం కూడా పాల్గొందామా..!. ఇది కేవలం భవిష్యతరాలకు మెరుగైన ప్రపంచాన్ని అందించడమే గాక మనకు ఈ ఒక్క గంట లైట్స్ ఆపి చీకటిలో గడిపే చిన్నపాటి విరామంలో అయినా మనలో ఆరోగ్యం, ప్రకృతిని రక్షించుకోవాలనే మార్పు వస్తుందేమోనని ఆశిద్దాం.(చదవండి: ఫుడ్ ప్యాకేజింగ్ లేబుల్స్‌లో ఇంత మోసమా..? వైరల్‌గా హర్ష గోయెంకా పోస్ట్)

చీటింగ్ యాప్ : భర్త ఫోన్లను ఎక్కువగా చెక్ చేస్తోంది ఈ నగరంలోనేనట!
భార్యాభర్తల బంధానికి పునాది నమ్మకం. పరస్పరం విశ్వాసమే ఏ బంధాన్నైనా పటిష్టంగా ఉంచుకుంది. ఆ నమ్మకం వమ్ము అయినపుడు అపోహలు, అనుమానాలకు తావిస్తుంది. పైగా స్మార్ట్ యుగం. చేతిలో స్మార్ట్ఫోన్లేనిదే క్షణం నడవదు. ప్రేమ మొదలు, షాపింగ్ దాకా అంతా అన్లైన్లోనే. అందుకే తమ భాగస్వాములను వ్యవహారాల్ని పసిగట్టేందుకు స్మార్ట్‌ఫోన్‌ను మించిన డిటెక్టర్ లేదు. దీనికి డేటింగ్ యాప్లుకూడా తోడయ్యాయి. ఈ నేపథ్యంలోనే భర్త మొబైల్ ఫోన్‌ను చెక్ చేయాలనే కోరిక భార్యకు ఉంటుంది. భార్య ఫోన్లో ఎవరితో చాట్ చేస్తుంది, ఎవరితో టచ్‌లో ఉందో అనే ఆరాటం కూడా భర్తలకు ఎక్కువగా. అన్నట్టు ఇది నేరుగా ఉండదు సుమా. గుట్టుచప్పుడు గాకుండా సాగుతుందన్నట్టు అచ్చం వాళ్లు మోసం చేస్తున్నట్టే. ఏదైనా తేడా వచ్చిందో... అంతే సంగతులు. ఇంతకీ విషయం ఏమిటంటే.. తెలుసుకుందాం.CheatEye.ai నివేదిక ప్రకారం, మహిళలు తమ భాగస్వాములను అనుమానించే నగరంగా లండన్ నిలుస్తోంది. భార్యలు భర్తల ఫోన్లను ఎంత చెక్ చేస్తున్నారనే విషయంపై ఈ స్టడీ జరిగింది. లండన్‌లో జరిగిన టిండర్-సంబంధిత శోధనలలో 27.4శాతం మంది తమ భాగస్వామి గుట్టును వెలికితీయడంపై దృష్టి సారించారని ఇటీవలి విశ్లేషణలో వెల్లడైంది. ముఖ్యంగా, ఈ శోధనలలో 62.4శాతం తమ భర్తలు లేదా బాయ్ఫ్రెండ్లు డేటింగ్ యాప్‌ను రహస్యంగా ఉపయోగిస్తున్నారా అని నిర్ధారించుకోవడానికే ఈ యాప్‌లోకి వస్తున్నారట. ఇక లండన్ తరువాత మాంచెస్టర్ బర్మింగ్‌హామ్ తరువాతి టాప్ ప్లేస్‌లో నిలిచాయి. భాగస్వాములపై అనుమానంతో జరిగి టిండర్ చెకింగ్స్‌లో మాంచెస్టర్‌లో, 8.8శాతంగా బర్మింగ్‌హామ్‌లో 8.3శాతంగా ఉన్నాయి. అయితే, బర్మింగ్‌హామ్ లో 69 అనుమానాస్పద శోధనలు పురుష భాగస్వాములపై మహిళలే నిర్వహింనవే ఎక్కువట. గ్లాస్గో నగరం కూడా కూడా ఈ జాబితాలో కనిపించింది, 4.7శాతం టిండర్-సంబంధిత శోధనలు అవిశ్వాసం గురించి ఆందోళనలతో ముడిపడి ఉన్నాయి. ఈ స్కాటిష్ నగరంలో, 62.1శాతం మంది అనుమానాస్పద కార్యకలాపాలు పురుష భాగస్వాములను లక్ష్యంగా ఉన్నాయట. దీనికి ప్రధాన నగరాల్లో, ముఖ్యంగా యువకులలో డేటింగ్ యాప్‌లకు పెరుగుతున్న ప్రజాదరణ కారణమని నిపుణురాలు సమంతా హేస్ విశ్లేషించారు."లండన్ వంటి నగరాల్లో, డేటింగ్ అనేది డైనమిక్‌గా ఉంటుంది. ఇది సహజంగానే భాగస్వాముల కార్యకలాపాలపై అనుమానం పరిశీలనకు దారితీస్తుంది" అని ఆమె వివరించారు. 18 నుండి 24 సంవత్సరాల వయస్సు గల యువకులు తమ భాగస్వాముల విశ్వసనీయత గురించి ముఖ్యంగా ఆందోళన చెందుతున్నారని హేస్ తెలిపారు.ఇలాంటి సర్వే మన ఇండియాలో జరిగితే పరిస్థితి ఏంటి భయ్యా అంటున్నారు నెటిజన్లు. జర జాగ్రత్త భయ్యో అంటూ కమెంట్ చేస్తున్నారు వ్యంగ్యంగా. భార్యభర్తల మధ్య నమ్మకం ఉండాలి బ్రో.. మూడో వ్యక్తి రాకూడదు. అప్పుడ అది నూరేళ్ల బంధం అవుతుంది అంటున్నారు మరికొంతమంది.
ఫొటోలు
International

డొనాల్డ్ ట్రంప్ మరో ‘సంచలన’ సంతకం
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం అమలు దిశగా అడుగు వేశారు. ఆ దేశ విద్యాశాఖ(Department of Education) మూసివేత ఉత్తర్వులపై సంతకం చేశారు. నాలుగు దశాబ్దాలుగా భారీగా ఖర్చు చేస్తున్నా అమెరికాలో విద్యా ప్రమాణాలు మెరుగుపడటం లేదని, ఇంకా యూరప్ దేశాలు.. చైనా కంటే వెనుకబడే ఉన్నామని, కాబట్టే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని వెల్లడించారాయన. అయితే.. విద్యార్థులకు ఫీజుల రాయితీలు, కొన్ని ముఖ్యమైన పథకాలు మాత్రం కొనసాగిస్తామని అన్నారాయన.గురువారం వైట్‌హౌజ్‌లోని ఈస్ట్ రూమ్‌లో స్కూల్ పిల్లల మధ్య డొనాల్డ్ ట్రంప్(Donald Trump) కూర్చుని ఈ ఉత్తర్వులపై ప్రత్యేక వేడుకలో సంతకం చేయడం గమనార్హం. ఈ కార్యక్రమానికి రిపబ్లికన్ లీడర్లు, పలు రాష్ట్రాల గవర్నర్లు హాజరయ్యారు. విద్యాశాఖ విభాగాన్ని మూసివేస్తూ.. ఆ అధికారాన్ని రాష్ట్రాలకు అప్పగించండి అని విద్యాశాఖ కార్యదర్శి, డబ్ల్యూడబ్ల్యూఈ మాజీ సీఈవో లిండా మెక్ మహోన్(Linda McMahon)కు ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు. అమెరికాకు లిండా మెక్ మహోన్నే చివరి విద్యాశాఖ కార్యదర్శి కావొచ్చని ఈ సందర్భంగా ట్రంప్ వ్యాఖ్యానించారు. మార్చి 3వ తేదీన ఆమె ఆ బాధ్యతలను స్వీకరించడం గమనార్హం.అమెరికాలో 1979 నుంచి విద్యాశాఖ విభాగాన్ని ఫెడరల్ గవర్నమెంట్ చూసుకుంటోంది. విద్యాశాఖ నిర్వహణలో పరిమితమైన పాత్రే పోషిస్తున్నప్పటికీ.. ఫండింగ్ విషయంలో మాత్రం భారీగా ఖర్చు చేయాల్సి వస్తోంది. అయితే.. తాజా ట్రంప్ ఆదేశాలతో ఇక నుంచి స్టేట్స్(రాష్ట్రాలు) ఆ బాధ్యతలను స్వీకరించాల్సి ఉంటుంది. అయితే.. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ఇటు డెమోక్రట్లు, అటు విద్యావేత్తలు మండిపడుతున్నారు. ఇది ట్రంప్ తీసుకున్న మరో వినాశకార నిర్ణయమని డెమోక్రట్ సెనేటర్ చుక్ షూమర్ అభిప్రాయపడ్డారు.ఇదిలా ఉంటే.. ట్రంప్ తాజా నిర్ణయం అమల్లోకి రావడం అంత సులువు కాదు. ఎందుకంటే.. అందుకు పార్లమెంట్ అనుమతి తప్పనిసరి. కానీ, ట్రంప్ మాత్రం వీలైనంత త్వరలో ఈ ఉత్తర్వులను ఆచరణలోకి తెస్తామని చెప్తున్నారు. ఎన్నికల సమయంలో తన ప్రచారంలోనూ ట్రంప్ ఈ నిర్ణయం తప్పకుండా అమలు చేస్తానని ప్రకటించడం తెలిసిందే. అధికారంలోకి వచ్చాక.. డోజ్(DOGE) విభాగం ద్వారా అనవసరపు ఖర్చులు తగ్గించుకునేందుకు పలు విభాగాలను ట్రంప్ ప్రభుత్వం రద్దు చేస్తోంది. ఈ క్రమంలోనే ప్రముఖ టెక్ బిలియనీర్ ఇలాన్ మస్క్ సాయం తీసుకుంటున్నారాయన.

చైనాలో దారుణం.. కెనడా పౌరులకు ఉరిశిక్ష
టొరంటో: డ్రగ్స్ సంబంధిత ఆరోపణలపై తమ నలుగురు పౌరులకు చైనా ప్రభుత్వం ఇటీవల ఉరిశిక్ష అమలు చేసిందని కెనడా వెల్లడించింది. ఈ పరిణామాన్ని తీవ్రంగా ఖండించింది. ద్వంద పౌరసత్వం ఉన్న ఈ నలుగురికీ క్షమాభిక్ష ప్రకటించాలని మాజీ ప్రధాని జస్టిన్ ట్రూడో, తాను గతంలో చైనాను కోరినట్లు విదేశాంగ మంత్రి మెలనీ జోలీ గురువారం చెప్పారు. ఇక, ఈ ఘటనపై ఒట్టావాలోని చైనా ఎంబసీ స్పందించింది. ద్వంద పౌరసత్వాన్ని తమ ప్రభుత్వం గుర్తించడం లేదని, ఆ నలుగురికీ డ్రగ్ సంబంధిత నేరాలపై ఉరి శిక్ష అమలు చేసిందని వివరించింది. ఇటువంటి నేరాలపై తమ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని, నలుగురిపై ఆరోపణలకు ఆధారాలు పక్కాగా ఉన్నాయని కూడా తెలిపింది. ఈ విషయంలో బాధ్యతారహితమైన వ్యాఖ్యలు చేయవద్దని కెనడా ప్రభుత్వాన్ని కోరింది. After being questioned by reports.... Melanie Joly explains the executions.4 dual citizens (Chinese and Canadian) were executed by China.These criminals had been charged with drug crimes.Joly would not expand on what drug crimes. Wonder if they would have been free in… pic.twitter.com/IAMvKszuXi— sonofabench (@therealmrbench) March 20, 2025ఇలా ఉండగా, డ్రగ్ స్మగ్లింగ్ కేసులో మరణ శిక్షను ఎదుర్కొంటున్న రాబర్ట్ షెల్లెన్బర్గ్ అనే కెనడా పౌరుడికి క్షమాభిక్ష ప్రసాదించాలంటూ చైనాను కోరామని మంత్రి జోలీ వెల్లడించారు. చైనా తయారీ ఎలక్ట్రిక్ వాహనాలు, స్టీల్ అల్యూమినియం ఉత్పత్తులపై గతేడాది అక్టోబర్‌లో కెనడా టారిఫ్‌లు విధించింది. ప్రతిగా, కెనడా వ్యవసాయ, ఆహారోత్పత్తులపై చైనా టారిఫ్‌లు ప్రకటించింది. 2018లో హువై మాజీ చీఫ్‌ను కెనడా అధికారులు అరెస్ట్ చేసినప్పటి నుంచి కొనసాగుతున్న ఉద్రిక్తతలు టారిఫ్ యుద్ధంతో మరింత ముదిరాయి. కాగా, కెనడాకు చైనా రెండో అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది.

గాజాపై మళ్లీ విరుచుకుపడ్డ ఇజ్రాయెల్
డెయిర్ అల్–బలాహ్: గాజాలోని పాలస్తీనియన్లకు బుధవారం రాత్రి కాళరాత్రే అయ్యింది. అంతా గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఇజ్రాయెల్ మరోమారు వైమానిక దాడులకు పాల్పడింది. దాడుల్లో మహిళలు, చిన్నారులు సహా కనీసం 110 మంది ప్రాణాలు కోల్పోయారు. పెద్ద సంఖ్యలో గాయాలపాలయ్యారు. సరిహద్దులకు సమీపంలోని ఖాన్‌యూనిస్ నగర వెలుపల అబసన్ అల్– కబీర్ గ్రామంపై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో 16 మంది చనిపోయినట్లు అక్కడున్న యూరోపియన్ ఆస్పత్రి తెలిపింది.మృతుల్లో తండ్రి, అతడి ఏడుగురు కుమారులు ఉన్నారు. వీరితోపాటు దంపతులు, వారి కుమారుడు చనిపోగా నెలల చిన్నారి, ఇద్దరు వృద్ధ దంపతులు సురక్షితంగా బయటపడ్డారు. సరిహద్దులకు సమీపంలోని బెయిట్ లహియాపై జరిగిన మరో దాడిలో 19 మంది మృత్యువాతపడ్డారని ఇండోనేసియన్ ఆస్పత్రి వివరించింది. ఇప్పటికే తీవ్రంగా ధ్వంసమైన బెయిట్ లహియాలో తాజా దాడితో పరిస్థితులు మరింత భీతావహంగా మారాయని ఆరోగ్య విభాగం తెలిపింది.రఫాలో 36 మంది చనిపోయినట్లు అక్కడి యూరోపియన్ ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. అదేవిధంగా, ఖాన్ యూనిస్‌లో ఏడుగురు మృతి చెందినట్లు నాసర్ ఆస్పత్రి తెలిపింది. శిథిలాల కింద చిక్కుకుపోయిన వారి కోసం గాలిస్తున్నామని ఆయా ప్రాంతాలకు చెందిన స్థానికులు తెలిపారు. మృతుల్లో 200 మంది చిన్నారులు..కాల్పుల విరమణ ఒప్పందం ముగిసిన తర్వాత మొదటిసారిగా ఇజ్రాయెల్ మంగళవారం ఉదయం గాజాపై జరిపిన దాడుల్లో కనీసం 400 మంది చనిపోవడం తెలిసిందే. మంగళవారం నుంచి గురువారం వరకు జరిగిన దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారిలో 200 మంది చిన్నారులే ఉన్నారని గాజా ఆరోగ్య విభాగం తెలిపింది. మరో 909 మంది క్షతగాత్రులుగా మారారని పేర్కొంది. కాగా, మిలిటెంట్లే లక్ష్యంగా తాము దాడులు చేపట్టినట్లు ఇజ్రాయెల్ మిలటరీ ప్రకటించుకుంది.డజన్ల కొద్దీ లక్ష్యాలపై జరిగిన ఈ దాడుల్లో మిలిటెంట్లతో పాటు వారి సైనిక వసతులు దెబ్బతిన్నాయని తెలిపింది. గురువారం ఉదయం యెమెన్‌లోని ఇరాన్ అనుకూల హౌతీ రెబల్స్ ప్రయోగించిన క్షిపణిని గగనతలంలోనే అడ్డుకున్నట్లు ఇజ్రాయెల్ మిలటరీ ప్రకటించింది. ఆ క్షిపణిని కూల్చి వేశామని, ఎవరికీ ఎటువంటి గాయా లు కాలేదని తెలిపింది. అదే విధంగా, ఇజ్రాయెల్ దాడులకు ప్రతిగా టెల్ అవీవ్‌పైకి తాము రా కెట్లను ప్రయోగించినట్లు హమాస్ తెలిపింది. దీంతో, బెన్ గురియె న్ విమానాశ్రయంలో రాకపో కలకు అంతరాయం ఏర్పడింది. పలు ప్రయాణికుల విమానాలను దారి మళ్లించారు.దిగ్బంధంలో ఉత్తర గాజాగాజా నగరం సహా ఉత్తర గాజా ప్రాంతాన్ని బుధవారం తిరిగి ఇజ్రాయెల్ ఆర్మీ దిగ్బంధించింది. సుమారు ఐదు మైళ్ల పొడవైన నెట్జరిమ్ కారిడార్‌ను స్వాధీనం చేసుకుంది. ఉత్తర గాజా ప్రాంతాన్ని విడిచి వెళ్లరాదని, ప్రధాన రహదారిపైకి రావద్దని పాలస్తీనా వాసులకు ఆర్మీ హెచ్చరికలు చేసింది. దక్షిణ ప్రాంతానికి వెళ్లే వారు తీరం వెంబడి ఉన్న రహదారిని మాత్రమే వాడుకోవాలని స్పష్టం చేసింది.బెయిట్ లహియా పట్టణంలోకి అదనంగా బలగాలను పంపిస్తున్నట్లు తెలిపింది. తమ ప్రతిపాదనకు హమాస్ అంగీకరించనందునే పోరాటం మళ్లీ ప్రారంభించినట్లు ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. ఇప్పటికే గాజా ప్రాంతంలోని 20 లక్షల మంది పాలస్తీనియన్లకు ఆహారం, ఇంధనం, ఇతర మానవీయ సాయాన్ని నిలిపివేసిన ఇజ్రాయెల్..మిగతా 59 మంది బందీలను హమాస్ విడుదల చేసేదాకా దాడులను తీవ్రతరం చేస్తామని హెచ్చరించింది.ఆయుధాలు వీడే ప్రసక్తే లేదు: హమాస్శాశ్వత కాల్పుల విరమణతో పాటు ఇజ్రాయెల్ ఆర్మీని గాజా నుంచి పూర్తిగా ఉపసంహరించుకుంటేనే మిగతా బందీలను విడిచిపెడతామని హమాస్ స్పష్టం చేసింది. గాజాలో ఇజ్రాయెల్ ఉనికిని తాము అంగీకరించే ప్రసక్తే లేదని కుండబద్దలు కొట్టింది. ఇజ్రాయెల్ ఆర్మీ పూర్తిగా వైదొలిగాకే పశ్చిమ దేశాల మద్దతున్న పాలస్తీనా అథారిటీకి లేదా స్వతంత్ర రాజకీయ నేతల కమిటీకి అధికారం బదిలీ చేస్తామని తేల్చి చెప్పింది. అప్పటి వరకు ఆయుధాలను వీడబోమని తెలిపింది.నెతన్యాహూ నివాసం వద్ద ఉద్రిక్తతబందీల విడుదల విషయంలో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ వందలాది మంది పశ్చిమ జెరూసలేంలోని ప్రధాని నెతన్యాహూ నివాసాన్ని చుట్టుముట్టారు. బారికేడ్లను దాటుకుని ముందుకు వెళ్లేందుకు నిరసనకారులు ప్రయత్నించగా పోలీసులు వాటర్ కెనన్లను ప్రయోగించి వారిని చెదరగొట్టారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య బాహాబాహీ చోటుచేసుకుంది. గాజాపై మళ్లీ దాడులు ప్రారంభిస్తే హమాస్ వద్ద బందీలుగా ఉన్న తమ సంబంధీకుల ప్రాణాలు ప్రమాదంలో పడతాయని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

మిత్ర దేశమే..కానీ టారిఫ్‌లే
వాషింగ్టన్: ఇండియాతో తమకు చక్కటి స్నేహ సంబంధాలు ఉన్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. కానీ, ఇండియాలో టారిఫ్‌లు అధికంగా విధిస్తున్నారని మరోసారి అసంతృప్తి వ్యక్తంచేశారు. ప్రపంచంలోనే అత్యధిక టారిఫ్‌లు విధిస్తున్న దేశాల్లో ఇండియా కూడా ఉందని, ఆ దేశంతో అదే ఏకైక సమస్య అని పేర్కొన్నారు. విదేశీ ఉత్పత్తులపై ఏప్రిల్ 2వ తేదీ నుంచి టారిఫ్‌లు వసూలు చేయబోతున్నట్లు ట్రంప్ పునరుద్ఘాటించారు.ఈ నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదన్నారు. అమెరికా ఉత్పత్తులపై అధిక టారిఫ్‌లు విధిస్తున్న దేశాల ఉత్పత్తులపైనా తాము అలాంటి చర్య తీసుకోబోతున్నట్లు వెల్లడించారు. తాజాగా ఓ వార్తా సంస్థ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. అమెరికా–ఇండియా సంబంధాలపై చర్చించారు. అమెరికా ఉత్పత్తులపై ఇండియాలో సుంకాలను క్రమంగా తగ్గిస్తారన్న విశ్వాసం తనకు ఉందని వ్యాఖ్యానించారు. ఇండియాతో తనకున్న ఏకైక సమస్య ఆ విధంగా పరిష్కారమవుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు.ఇండియాలో అమెరికా ఉత్పుత్తులపై ఎలాంటి టారిఫ్‌లు ఉన్నాయో ఏప్రిల్ 2 నుంచి ఇండియా ఉత్పత్తులపై తమ దేశంలో అలాంటి టారిఫ్‌లే అమల్లోకి తీసుకొస్తామని స్పష్టంచేశారు. ఇండియా–మిడిల్ ఈస్ట్–యూరప్–ఎకనామిక్ కారిడార్(ఐమెక్)ను సానుకూల చర్యగా అభివర్ణించారు. ఇది అద్భుతమైన దేశాల కూటమి అని చెప్పారు. వ్యాపారం, వాణిజ్యంలో దెబ్బతీయాలని చూస్తున్న ప్రత్యర్థి దేశాలకు వ్యతిరేకంగా కూటమిగా ఏర్పడ్డాయని అన్నారు. తమ శత్రువులను మర్చిపోయే ప్రసక్తే లేదన్నారు. వారికి ఎలాంటి మర్యాద చేయాలో తమకు బాగా తెలుసని డొనాల్డ్ ట్రంప్ స్పష్టంచేశారు. మిత్రుల కంటే శత్రువులపైనే ఎక్కువగా దృష్టి పెడతామన్నారు.
National

Haryana: జేజేపీ నేత దారుణ హత్య.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు
హర్యానాలోని పానీపట్‌లో ఘోరం చోటు చేసుకుంది. జననాయక్ జనతా పార్టీ(Jannayak Janata Party)(జేజేపీ)నేత రవీందర్ మిత్రాను గుర్తు తెలియని దుండగులు కాల్చిచంపారు. పానీపట్‌లోని వికాస్ నగర్లో జరిగిన ఈ ఘటనలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు.ఘటన జరిగిన వెంటనే దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. పానీపట్ సెక్టార్-29(Panipat Sector-29) పోలీసు అధికారి సుభాష్ మీడియాతో మాట్లాడుతూ జేజేపీ నేత రవీందర్ మిత్రాను దుండగులు కాల్చిచంపారని, ఈ ఘటనలో మరో ఇద్దరు గాయపడ్డారని, ఈ ఘటనపై తాము దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. శుక్రవారం సాయంత్రం పానీపట్‌లోని వికాస్ నగర్లో జేజేపీ నేత రవీందర్ మిత్రా తన ఇంటి వద్ద ఉన్నారన్నారు.ఈ సమయంలో ఆయుధాలతో వచ్చిన దుండగులు రవీందర్ మిత్రాపై కాల్పులు జరిపారన్నారు. వెంటనే అతని కింద పడిపోయారన్నారు. ఆస్పత్రికి తీసుకెళ్లగా రవీంద్ర మృతిచెందారని తెలిపారన్నారు. ఈ దాడిలో రవీందర్ మిత్రా వరుస సోదరునితో పాటు మరొకరు గాయపడ్డారన్నారు. కాగా రవిందర్ మిత్రా పార్టీ కార్యకలాపాల్లో చురుకుగా వ్యవహరిస్తుంటారు. రవింద్ మిత్రా హత్య స్థానికంగా సంచలనంగా మారింది. ఈ హత్యకు గల కారణాలు ఇంకా వెల్లడికాలేదు. ఇది కూడా చదవండి: అందుకే శంభు సరిహద్దు తెరిచాం: పంజాబ్ సర్కారు

అందుకే శంభు సరిహద్దు తెరిచాం: పంజాబ్ సర్కారు
న్యూఢిల్లీ: పంజాబ్-హర్యానా సరిహద్దులో గత 13 నెలలుగా మూసివేసిన శంభు సరిహద్దు ఇప్పుడు తెరుచుకుంది (Shambu Border Reopen). ఇక్కడ నిరసన చేస్తున్న రైతులను పోలీసులు తరలించారు. ఈ నేపధ్యంలో రైతు నేతలు జగ్జీత్ సింగ్ దల్లెవాల్, సర్వాన్ సింగ్ పంధేర్ సహా దాదాపు 400 మంది రైతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వాహనాలను కూడా స్వాధీనం చేసుకున్నారు.పంజాబ్ పోలీసులు శంభు సరిహద్దును తెరవడంతో ఈ దారిలో రాకపోకలు సాగించేవారు.. ముఖ్యంగా పారిశ్రామికవేత్తలు(Entrepreneurs) ఊపిరిపీల్చుకున్నారు. కాగా రైతు నేత రాకేష్ టికైత్ మాట్లాడుతూ పోలీసుల చర్య సరైనది కాదని, దీనిపై రైతు సంఘాలు పోరాడేందుకు సిద్ధంగా ఉన్నాయన్నారు. మరోవైపు యునైటెడ్ కిసాన్ మోర్చా మార్చి 26న పంజాబ్ అసెంబ్లీకి మార్చ్ నిర్వహించాలని నిర్ణయించింది. శంభు సరిహద్దు మూసివేయడం వల్ల పంజాబ్‌లోని పలు పరిశ్రమ భారీ నష్టాలను చవిచూశాయని ప్రభుత్వం చెబుతోంది. ఫలితంగా ఉపాధి సంక్షోభం ఏర్పడుతున్నదని, అందుకే శంభు సరిహద్దును ఖాళీ చేయించామని పేర్కొంది.శంభు సరిహద్దును మూసివేయడం వలన ఇక్కడి పరిశ్రమలు ఎగుమతులు, దిగుమతులను చేయలేకపోతున్నాయనే వాదన వినిపిస్తోంది. కాగా పంజాబ్ రాష్ట్రం పారిశ్రామిక అభివృద్ధికి కేంద్రంగా ఉండాలని భగవంత్ మాన్ ప్రభుత్వం కోరుకుంటోంది. తద్వారా పంజాబ్ యువతకు ఉపాధి లభిస్తుందని, దీంతో వారు మాదకద్రవ్యాల జోలికి వెళ్లకుండా ఉంటారని ప్రభుత్వం భావిస్తోంది. రైతులను ఆదుకుంటామని కూడా చెబుతోంది. ఇది కూడా చదవండి: గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడి.. 70 మంది మృతి

న్యాయమూర్తి ఇంట్లో నోట్ల కట్టలు
న్యూఢిల్లీ: ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ అధికారిక నివాసంలో పెద్ద ఎత్తున నోట్ల కట్టలు లభ్యం కావడం సంచలనాత్మకంగా మారింది. ఇదంతా లెక్కల్లో చూపని అక్రమ నగదేనని అధికారులు చెబుతున్నారు. సాక్షాత్తూ న్యాయమూర్తి ఇంట్లో భారీగా సొమ్ము లభించడం రాజకీయంగా పెనుదుమారం సృష్టిస్తోంది. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా తీవ్రంగా స్పందించారు.యశ్వంత్ వర్మపై బదిలీ వేటు వేయాలని సుప్రీంకోర్టు కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. అవినీతికి పాల్పడి అక్రమంగా నగదు కూడబెట్టినట్లు విచారణలో తేలితే యశ్వంత్ వర్మను పదవి నుంచి తొలగించే అవకాశం ఉందని న్యాయ నిపుణులు అంటున్నారు. అయితే, ఆయన ఇంట్లో ఎంత నగదు దొరికిందనే సంగతి అధికారులు ఇంకా బయటపెట్టలేదు. ఈ నెల 14వ తేదీన నగదు లభించగా, ఈ నెల 20దాకా ఆయన న్యాయమూర్తిగా విధులు నిర్వర్తించడం గమనార్హం. వారం రోజులదాకా విషయం బయటకు రాలేదు. అగ్నిప్రమాదంతో బయటపడ్డ నగదు ఢిల్లీ తుగ్లక్ రోడ్డులోని అధికారిక నివాసంలో జస్టిస్ యశ్వంత్ వర్మ తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నారు. ఈ నెల 14వ తేదీన రాత్రి సమయంలో ఆ ఇంట్లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. రాత్రి 11.30 గంటల సమయంలో యశ్వంత్ వర్మ కుటుంబ సభ్యులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఢిల్లీ ఫైర్ సర్విసు సిబ్బందితోపాటు పోలీసులు అక్కడికి చేరుకున్నారు. మంటలను అర్పివేశారు. ఆ సమయంలో యశ్వంత్ వర్మ ఇంట్లో లేరు. మంటలను ఆర్విన తర్వాత గదులను తనిఖీ చేస్తుండగా, ఓ గదిలో భారీగా నోట్లకట్టలు ఉన్నట్లు గుర్తించి పోలీసులు స్వా«దీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని ఢిల్లీ హోంశాఖకు తెలియజేశారు. నగదు వివరాలను తెలియజేస్తూ ఒక రిపోర్టు అందజేశారు.హోంశాఖ ఈ రిపోర్టును సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నాకు సమర్పించింది. ఢిల్లీ హైకోర్టు జడ్జి ఇంట్లో అక్రమ నగదు లభించడాన్ని జస్టిస్ సంజీవ్ ఖన్నా తీవ్రంగా పరిగణించారు. ఆయన నేతృత్వంలో సుప్రీంకోర్టు కొలీజియం గురువారం సమావేశమైంది. యశ్వంత్ వర్మను ఢిల్లీ హైకోర్టు నుంచి అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయాలని కేంద్రానికి సిఫార్సు చేసింది. వాస్తవానికి యశ్వంత్ వర్మ 2021లో అలహాబాద్ హైకోర్టు నుంచే బదిలీపై ఢిల్లీ హైకోర్టుకు వచ్చారు. తాజా వివాదం నేపథ్యంలో యశ్వంత్ వర్మ శుక్రవారం విధులకు హాజరు కాలేదు. ఆయనపై సుప్రీంకోర్టు కొలీజియం అంతర్గత విచారణ ప్రారంభించినట్లు తెలిసింది.కేవలం బదిలీతో సరిపెట్టకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కొలీజియంలోని కొందరు సభ్యులు సూచించినట్లు సమాచారం. యశ్వంత్ వర్మ వ్యవహార శైలిపై ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ నుంచి కొలీజియం వివరణ కోరింది. తాజా వివాదంపై ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సైతం విచారణ ప్రారంభించారు. యశ్వంత్ వర్మ విషయంలో తప్పుడు వార్తలు, పుకార్లు ప్రచారంలోకి వస్తున్నా యని సుప్రీంకోర్టు పేర్కొంది. ఆయనను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేస్తూ స్వతంత్రంగా నిర్ణయం తీసుకున్నామని, విచారణతో దీనికి సంబంధం లేదని స్పష్టంచేసింది. పూర్తి విచారణ తర్వాతే చర్యలు తీసుకుంటామని తెలియజేసింది. పదవి నుంచి తొలగించవచ్చా? న్యాయమూర్తులు అవినీతి అక్రమాలకు పాల్పడినట్లు తేలితే శాశ్వతంగా పదవి నుంచి తొలగించాలంటూ 1999లో సుప్రీంకోర్టు మార్గదర్శకాలు జారీ చేసింది. హైకోర్టు జడ్జిపై ఫిర్యాదు అందితే తొలుత ప్రధాన న్యాయమూర్తి విచారణ ప్రారంభించాలి. సదరు జడ్జి నుంచి వివరణ కోరాలి. జడ్జి ఇచ్చిన సమాధానంతో సంతృప్తి చెందకపోయినా లేక లోతైన దర్యాప్తు అవసరమని భావించినా అందుకోసం అంతర్గత కమిటీని నియమించాలి. ఆరోపణలు నిజమేనని కమిటీ దర్యాప్తులో తేలితే.. పదవికి రాజీనామా చేయాలంటూ జడ్జిని ఆదేశించాలి. శాశ్వతంగా పదవి నుంచి తొలగించడానికి అభిశంసన చర్యలు ప్రారంభించాలంటూ పార్లమెంట్‌కు సిఫా ర్సు చేయాలి. అభిశంసన తీర్మానాన్ని పార్లమెంట్ ఆమోదిస్తే జడ్జి పదవి ఊడినట్లే. ఫైర్ సిబ్బందికి నగదు దొరకలేదు: డీఎఫ్ఎస్ చీఫ్ జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసంలో తమ సిబ్బందికి ఎలాంటి నగదు దొరకలేదని ఢిల్లీ ఫైర్ సర్వీసెస్(డీఎఫ్ఎస్) చీఫ్ అతుల్ గార్గ్ శుక్రవారం చెప్పారు. అగ్నిప్రమాదం జరిగినట్లు ఈ నెల 14న రాత్రి 11.35 గంటలకు కంట్రోల్ రూమ్‌కు సమాచారం వచ్చిందని, తమ సిబ్బంది వెంటనే అక్కడికి వెళ్లి మంటలు ఆర్వివేశారని అన్నారు. 15 నిమిషాల్లో ఈ ప్రక్రియ ముగిసిందన్నారు. వారికి నగదేమీ దొరకలేదన్నారు. పార్లమెంట్లో అభిశంసించాలి జస్టిస్ యశ్వంత్ వర్మను బదిలీ చేయాలని కొలీజియం నిర్ణయించడం పట్ల పలువురు సీనియర్ న్యాయవాదులు విస్మయం వ్యక్తంచేశారు. తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న జడ్జిని మరో కోర్టుకు బదిలీ చేయడం ఏమిటని అడ్వొకేట్ వికాస్ సింగ్ ప్రశ్నించారు. ఆయనతో వెంటనే రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు. అవినీతిపై కఠినంగా వ్యవహరించాల్సిన వృత్తిలో ఉన్న వ్యక్తి అవినీతికి పాల్పడితే చర్యలు తీసుకోకుండా వదిలేయడం ఏమిటని అన్నారు.చట్టం దృష్టిలో అందరూ సమానమేనని పేర్కొన్నారు. సమగ్ర దర్యాప్తు జరిపి, పూర్తి నిజాలు బయటపెట్టాలని మరో అడ్వొకేట్ రాకేశ్ ద్వివేది చెప్పారు. యశ్వంత్ వర్మ తప్పు చేసినట్లు రుజువైతే చట్టప్రకారం శిక్షించాలని సూచించారు. యశ్వంత్ వర్మ వ్యవహారంలో సుప్రీంకోర్టు కొలీజియం పూర్తి పారదర్శకంగా, నిజాయతీగా పనిచేస్తుందని ఆశిస్తున్నట్లు సీనియర్ లాయర్ ఇందిరా జైసింగ్ వెల్లడించారు. ఈ నెల 14న నోట్ల కట్టలు దొరికితే ఈ నెల 21న విషయం బయటపడడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు.పనికిరాని చెత్త మాకొద్దుయశ్వంత్ వర్మను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయాలంటూ కొలీజియం సిఫార్సు చేయడాన్ని అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ శుక్రవారం వ్యతిరేకించింది. తమ హైకోర్టు చెత్తకుండీ కాదని తేల్చిచెప్పింది. పనికిరాని చెత్తను ఇక్కడికి తరలిస్తామంటే అంగీకరించే ప్రసక్తే లేదని హెచ్చరించింది. ఈ మేరకు బార్ అసోసియేషన్ ఒక తీర్మానం ఆమోదించింది. ఎవరీ యశ్వంత్ వర్మ? వివాదానికి కేంద్ర బిందువుగా మారిన జస్టిస్ యశ్వంత్ వర్మ 1969 జనవరి 6న ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్‌లో జన్మించారు. ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన హన్స్‌రాజ్ కాలేజీలో బీకాం(ఆనర్స్), మధ్యప్రదేశ్‌లోని రేవా యూనివర్సిటీలో ఎల్ఎల్బీ డిగ్రీ పూర్తిచేశారు. 1992 ఆగస్టు 8న అడ్వొకేట్‌గా న్యాయవాద వృత్తి ఆరంభించారు. అంచెలంచెలుగా ఎదుగుతూ 2014 అక్టోబర్ 13న అలహాబాద్ హైకోర్టు అదనపు జడ్జిగా నియమితులయ్యారు. 2016 ఫిబ్రవరి 1న అదే కోర్టులో శాశ్వత జడ్జిగా ప్రమాణం చేశారు. 2021 అక్టోబర్ 11న ఢిల్లీ హైకోర్టుకు బదిలీపై వచ్చారు. జడ్జిల నియామకం పారదర్శకంగా జరగాలి: కపిల్ సిబల్ ఢిల్లీ హైకోర్టు జడ్జి ఇంట్లో అక్రమ నగదు లభ్యం కావడం నిజంగా ఆందోళనకరమైన అంశమని సీనియర్ అడ్వొకేట్, రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబల్ అన్నారు. న్యాయ వ్యవస్థలో అవినీతిని ఎంతమాత్రం సహించడానికి వీల్లేదని చెప్పారు. న్యాయ వ్యవస్థలో అవినీతి అక్రమాలు పునరావృతం కాకుండా న్యాయమూర్తుల నియామకాన్ని మరింత పారదర్శకంగా మార్చాలని అభిప్రాయపడ్డారు. జడ్జిలను చాలాచాలా జాగ్రత్తగా నియమించాలని పేర్కొన్నారు. అవినీతి అనేది మొత్తం సమాజానికే కీడు చేస్తుందని హెచ్చరించారు. దేశంలో అవినీతి తగ్గుతున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం అవినీతి పెరిగిపోతోందని కపిల్ సిబల్ స్పష్టంచేశారు. మరొకరైతే పెద్ద వివాదం అయ్యేది: ధన్‌ఖడ్ జడ్జి యశ్వంత్ వర్మ ఇంట్లో పెద్ద ఎత్తున అవినీతి సొమ్ము దొరకడాన్ని కాంగ్రెస్ ఎంపీ జైరామ్ రమేశ్ శుక్రవారం రాజ్యసభలో లేవనెత్తారు. న్యాయ వ్యవస్థలో జవాబుదారీతనం అవసరమని, అందుకోసం చట్టసభలు చొరవ తీసుకోవాలని అన్నారు. దీనిపై ప్రభుత్వానికి తగిన ఆదేశాలు ఇవ్వాలని చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్‌ను కోరారు.ఈ వ్యవహారంపై సభలో నిర్మాణాత్మక చర్చ జరగడానికి ఒక విధానం రూపొందించే విషయం ఆలోచిస్తానని ధన్‌ఖడ్ చెప్పారు. జడ్జి ఇంట్లో అక్రమ నగదు లభ్యమైన వెంటనే ఆ విషయం బయటకు రాకపోవడం తనను బాధించిందని వ్యాఖ్యానించారు. ఒకవేళ రాజకీయ నాయకుడు లేదా ప్రభుత్వ అధికారి లేదా పారిశ్రామికవేత్త ఇంట్లో డబ్బులు దొరికి ఉంటే వెంటనే పెద్ద వివాదం అయ్యేదని అన్నారు.బదిలీతో చేతులు దులుపుకోవద్దు: కాంగ్రెస్ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న జస్టిస్ యశ్వంత్ వర్మను కేవలం బదిలీ చేసి, చేతు లు దులుపుకోవడం సరైంది కాదని కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖే రా శుక్రవారం పేర్కొన్నారు. ఆ డబ్బు ఎవరిదో, ఎక్కడి నుంచి వచ్చిందో తేల్చాలని డిమాండ్ చేశారు. న్యాయ వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం పెరిగేలా ప్రభుత్వం వ్యవహరించాలన్నారు. ఈడీ, సీబీఐల కంటే అగ్నిమాపక శాఖే అద్భుతంగా పనిచేస్తోందని పవన్ ఖేరా వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

జడ్జి ఇంట్లో నోట్ల కట్టల కేసులో బిగ్ ట్విస్ట్
ఢిల్లీ: ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్ వర్మ ఇంట్లో నోట్ల కట్టలు దొరికాయంటూ పెద్ద ఎత్తున కలకలం రేగిన గంటల వ్యవధిలోనే బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. జడ్జి యశ్వంత్ వర్మ ఇంట్లోలేని సమయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుందని, ఆ సమయంలో అగ్ని మాపక సిబ్బందికి భారీ స్థాయిలో నోట్ల కట్టలు దొరికాయని జాతీయ స్థాయిలో పెద్ద దుమారమే చెలరేగింది.అయితే యశ్వంత్ వర్మ ఇంట్లో ఎటువంటి నోట్ల కట్టలు దొరకలేదని ఢిల్లీ అగ్ని మాపక సర్వీస్ చీఫ్ అతుల్ గార్గ్ ఒక్కసారిగా ట్విస్ట్ ఇచ్చారు. తాము అగ్ని ప్రమాదం జరిగిందనే సమాచారంతో జడ్జి వర్మ ఇంటికి వెళ్లినమాట వాస్తవమేనని కానీ అక్కడ ఎటువంటి నోట్ల కట్టలు దొరకలేదంటూ స్పష్టం చేశారు.‘ మా కంట్రోల్ రూమ్ కు మార్చి 14వ తేదీ రాత్రి గం. 11. 30 నిమిషాలకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. భారీ అగ్ని ప్రమాదం జరిగిందనేది దాని సారాంశం. దాంతో మా అగ్ని మాపక సిబ్బంది రెండు ఫైరింజన్ల సాయంతో అక్కడికి వెళ్లారు. మేము సరిగ్గా 11.45 నిమిషాలకు అక్కడ వెళ్లారు మా సిబ్బంది. 15 నిమిషాల్లో అక్కడికి చేరుకున్నారు. అగ్ని ప్రమాదం తీవ్రత ఎక్కువగా ఉండటంతో పోలీసులకు కూడా మేము సమాచారం ఇచ్చాం. అగ్ని ప్రమాదాన్ని నివారించిన తర్వాత మా టీమ్ అక్కడ నుండి వెళ్లిపోయింది. మా ఆపరేషన్ లో ఎటువంటి నగదు జడ్జి యశ్వంత్ వర్మ ఇంట్లో లభించలేదు’ అని స్పష్టం చేశారు.
NRI

న్యూయార్లో ఘనంగా తెలుగువారి సంబరాలు.
అమెరికా వాణిజ్య రాజధాని న్యూయార్క్ లో తెలుగువారి సంబరాలు అంబరాన్ని అంటాయి. ఒకే రోజు రెండు ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకున్నారు. మహిళా దినోత్సవంతో పాటు మహా శివరాత్రి వేడుకలను కూడా ఓకేసారి న్యూయార్క్ లో స్థిరపడిన తెలుగువారి చేసుకున్నారు. న్యూయార్క్ తెలంగాణ తెలుగు సంఘం (నైటా) ఆధ్వర్యంలో ఫ్లషింగ్ గణేష్ టెంపుల్ ఆడిటోరియంలో ఈ వేడుకలు ఘనంగా జరిగాయి.వందలాది మంది తెలంగాణ, తెలుగు వాసులు తమ కుటుంబాలతో సహా చేరి ఉత్సవాల్లో పాల్గొని ఆడి పాడారు. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన న్యూయార్క్ మేయర్ ఎరిక్ ఆడమ్స్ మాట్లాడుతూ అమెరికాతో పాటు న్యూ యార్క్ మహానగరం అభివృద్ది, సంస్కృతిలో తెలుగువారు అంతర్భాగం అయ్యారని కొనియాడారు.తెలంగాణ ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్కమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, సీతక్క, తదితర ప్రముఖులు ప్రత్యేక సందేశాల ద్వారా నైటా కార్యక్రమాలను, ఆర్గనైజింగ్ కమిటీ కృషిని ప్రశంసిస్తూ ప్రత్యేక సందేశాలను పంపారు. వీటి సంకలనంతో పాటు నైటా సభ్యులు, కార్యక్రమాలతో కూడిన సమాహారంగా నైటా వార్షికోత్సవ సావనీర్ ను ఈ సందర్భంగా విడుదల చేశారు.ఈ ఫెస్టివల్ ఈవెంట్ లో తెలంగాణ సూపర్ రైటర్, సింగర్, మ్యూజిక్ డైరెక్టర్ కాసర్ల శ్యామ్ తో పాటు, యూకే నుంచి సింగర్ స్వాతి రెడ్డి, డాన్సింగ్ అప్సరాస్ గా పేరొందిన టీ అండ్ టీ సిస్టర్స్, ఇండియన్ ఫేమస్ ఫ్యూజన్ మ్యూజిక్ గ్రూప్ పరంపరా లైవ్ ఫెర్మామెన్స్ తో అదరగొట్టారు. కొన్ని గంటల పాటు జరిగిన కార్యక్రమం ఆద్యంతం అందరినీ కట్టిపడేసింది.తెలుగు యువత గుండెల్లో చిరకాలం నిలిచిపోయే పాటలను రచించటంతో పాటు, పాడిన యువ గాయకుడు కాసర్ల శ్యామ్ కొన్ని హిట్ సాంగ్స్ తో అందరినీ ఉర్రూతలూగించారు. అమెరికాలో తెలుగువారి బలగాన్ని, బలాన్ని తన పాటల ద్వారా శ్యామ్ చాటి చెప్పారు. ఇక కొంత ఆలస్యంగానైనా న్యూయార్క్ తెలుగువారు శివరాత్రి వేడుకలు జరుపుకున్నా ఆధ్యాత్మిక గీతాలు, చిన్నారులు భక్తి పాటలతో ఆడిటోరియటం మారు మోగింది.న్యూయార్క్ మహానగరంలో నిత్యం వారి వారి వృత్తుల్లో బిజీగా ఉండే మన తెలుగు వారు అన్నింటినీ పక్కన పెట్టి అటు శివ భక్తి, ఇటు మహిళా దినోత్సవాన్ని ఒకే సారి వేడుకగా జరుపుకున్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన నైటా ఆర్గనైజింగ్ టీమ్ తో పాటు తెరవెనుక సహకరించిన ప్రతీ ఒక్కరికీ పేరు పేరునా అధ్యక్షురాలు వాణీ రెడ్డి ఏనుగు కృతజ్జతలు తెలిపారు.నైటా కార్యక్రమాలకు వెన్నుముకగా నిలుస్తూ ప్రోత్సాహం అందిస్తున్న డాక్టర్ పైళ్ల మల్లారెడ్డిని నైటా టీమ్ ఘనంగా సత్కరించింది. ఈ కార్యక్రమంలో వందలాది మంది తెలుగు కుటుంబాలతో పాటు, న్యూయార్క్ కాంగ్రెస్ విమెన్ గ్రేస్ మెంగ్, ఇండియన్ కాన్సులేట్ జనరల్ నుంచి బిజేందర్ కుమార్ తదితరులు హాజరయ్యారు.

లండన్‌లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు
బిందువు బిందువు కలిస్తేనే సింధువు అనే విధంగా యూకే లో నివసిస్తున్న తెలుగు మహిళలు అందరూ “తెలుగు లేడీస్ యుకె” అనే ఫేస్బుక్ గ్రూప్ ద్వారా కలుసుకుని అంతర్జాతీయ మహిళా దినోత్సవ సంబరాలు జరుపుకున్నారు సహాయం కోరే వారికి మరియు సహాయం అందించే వారికి వారధిగా నిలిచే తెలుగు లేడీస్ ఇన్ యుకె గ్రూపును శ్రీదేవి మీనా వల్లి 14 ఏళ్ల క్రితం స్థాపించారు. ఈ గ్రూపులో ప్రస్తుతం ఐదు వేలకు పైగా తెలుగు మహిళలు ఉన్నారు.యూకే కి వచ్చినా తెలుగు ఆడపడుచులను ఆదరించి వారికి తగిన సూచనలు సలహాలు ఇస్తూ విద్యా వైద్య ఉద్యోగ విషయాల్లో సహాయం అందించడమే గ్రూప్ ఆశయమని శ్రీదేవి గారు తెలియజెప్పారు. ఈ సంవత్సరం యూకేలోని పలు ప్రాంతాల నుండి 300కు పైగా తెలుగు మహిళలు పాల్గొని ఆటపాటలతో ,లైవ్ తెలుగు బ్యాండ్ తో, పసందైన తెలుగు భోజనంతో పాటు,చారిటీ రాఫెల్ నిర్వహించి అవసరంలో ఉన్న మహిళలకు ఆసరాగా నిలిచారు.మస్తీ ఏ కాదు మానవత్వం లో కూడా ముందు ఉన్నాము అని నిరూపించారు.ఈవెంట్ లో డాక్టర్ వాణి శివ కుమార్ గారు మహిళలకు సెల్ఫ్ కేర్ గురించి ఎన్నో మంచి సూచనలు ఇచ్చారు. ఈవెంట్ కి వచ్చిన వాళ్లందరికీ మనసు నిండా సంతోషంతో పాటు మన తెలుగుతనాన్ని చాటిచెప్పేలా గాజులు,పూతరేకులు, కాజాలు వంటి పసందైన రుచులతో తాంబూలాలు పంచిపెట్టారు. ఈ ఈవెంట్లో శ్రీదేవి మీనావల్లితో పాటు సువర్చల మాదిరెడ్డి ,స్వాతి డోలా,జ్యోతి సిరపు,స్వరూప పంతంగి ,శిరీష టాటా ,దీప్తి నాగేంద్ర , లక్ష్మి చిరుమామిళ్ల , సవిత గుంటుపల్లి, చరణి తదితరులు పాల్గొన్నారు.

న్యూజెర్సీలో నాట్స్ ఇమ్మిగ్రేషన్ సెమినార్
న్యూ జెర్సీ: అమెరికాలో తెలుగు వారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా న్యూజెర్సీలో ఇమ్మిగ్రేషన్ సెమీనార్ నిర్వహించింది. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వంలో ఇమ్మిగ్రేషన్‌పై వస్తున్న వార్తలు ప్రవాస భారతీయులను కలవరపెడుతున్నాయి. ఈ తరుణంలో ప్రముఖ ఇమ్మిగ్రేషన్ న్యాయవాదులు భాను బి. ఇల్లింద్ర, శ్రీనివాస్ జొన్నలగడ్డలు ఈ ఇమ్మిగ్రేషన్ సెమీనార్‌కు ముఖ్యవక్తలుగా విచ్చేసి అనేక కీలకమైన విషయాలను వెల్లడించారు. ముఖ్యంగా జన్మత:పౌరసత్వం, హెచ్ ఒన్ బీ నుంచి గ్రీన్ కార్డు వరకు అనుసరించాల్సిన మార్గాలు, అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న భారతీయులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, హెచ్4 వీసా ఇలాంటి ఇమ్మిగ్రేషన్ అంశాలపై భాను ఇల్లింద్ర, శ్రీనివాస్ జొన్నలగడ్డలు పూర్తి అవగాహన కల్పించారు. ఈ సెమీనర్లో పాల్గొన్న వారి సందేహాలను కూడా నివృత్తి చేశారు. అమెరికాలో ఉండే తెలుగు వారు ఇమ్మిగ్రేషన్ విషయంలో మీడియాలో వస్తున్న వార్తలతో ఆందోళన చెందుతున్న నేపథ్యంలో వారి ఆందోళన తగ్గించి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ సెమీనార్ నిర్వహించామని నాట్స్ కార్యనిర్వాహక ఉపాధ్యక్షులు శ్రీహరి మందాడి తెలిపారు. అమెరికాలో తెలుగువారికి ఏ కష్టం వచ్చినా నాట్స్ అండగా ఉంటుందని శ్రీహరి భరోసా ఇచ్చారు. ఈ సెమీనార్ నిర్వహణ కోసం నాట్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ టీపీరావు, నాట్స్ నేషనల్ మార్కెటింగ్ కో ఆర్డినేటర్ కిరణ్ మందాడి, నాట్స్ న్యూజెర్సీ చాప్టర్ కో ఆర్డినేటర్ మోహన్ కుమార్ వెనిగళ్ల కృషి చేశారు. తమ ఆహ్వానాన్ని మన్నించి ఈ సెమీనార్‌కు విచ్చేసిన భాను ఇల్లింద్ర, శ్రీనివాస్ జొన్నలగడ్డలకు నాట్స్ నాయకత్వం ధన్యవాదాలు తెలిపారు. ఇంకా ఈ సెమీనార్ విజయవంతం కావడంలో శ్రీకాంత్ పొనకల, వెంకటేష్ కోడూరి, రాకేష్ వేలూరు, వెంకట్ గోనుగుంట్ల, కృష్ణ సాగర్ రాపర్ల, రామకృష్ణ బోను, వర ప్రసాద్ చట్టు, జతిన్ కొల్లా, బ్రహ్మానందం పుసులూరి, ధర్మ ముమ్మడి, అపర్ణ గండవల్ల, రమేష్ నూతలపాటి, రాజేష్ బేతపూడి, సూర్య గుత్తికొండ, కృష్ణ గోపాల్ నెక్కింటి, శ్రీనివాస్ చెన్నూరు, సాయిలీల మగులూరి కీలక పాత్రలు పోషించారు. తెలుగు వారికి ఎంతో ఉపయుక్తమైన ఇమ్మిగ్రేషన్ సెమీనార్ నిర్వహించిన నాట్స్ న్యూజెర్సీ టీంను నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి ప్రత్యేకంగా అభినందించారు.

టంపా వేదికగా నాట్స్ అమెరికా తెలుగు సంబరాల ఏర్పాట్లు
అమెరికాలో ప్రతి రెండేళ్లకు ఒక్కసారి అంగరంగ వైభవంగా నిర్వహించే నాట్స్ అమెరికా తెలుగు సంబరాలను ఈ సారి టంపా వేదికగా జూలై 4,5,6 తేదీల్లో టంపా వేదికగా నిర్వహిస్తున్నట్టు నాట్స్ అమెరికా తెలుగు సంబరాల కన్వీనర్ శ్రీనివాస్ గుత్తికొండ ఒక ప్రకటనలో తెలిపారు. ఫ్లోరిడా రాష్ట్రం టంపాలోని టంపా కన్వెన్షన్ సెంటరు వేదికగా జరగనున్న ఈ తెలుగు సంబరాలలో తెలుగు రాష్ట్రాలతో పాటు అమెరికా నలుమూలల నుండి పలు రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొంటారని, తెలుగువారి సాంస్కృతిక వైభవానికి పట్టం కట్టేలా కార్యక్రమాల రూపకల్పన చేస్తున్నామని శ్రీనివాస్ అన్నారు. ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ ఇప్పటికే ఏడు సార్లు ప్రతి రెండేళ్లకు అమెరికా సంబరాలను అద్భుతంగా నిర్వహించిందని.. ఈ సారి 8వ అమెరికా తెలుగు సంబరాలను కూడా అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు కసరత్తు చేస్తుందని నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని పేర్కొన్నారు. అమెరికాలో ఉండే తెలుగు వారంతా ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి పిలుపునిచ్చారు. తెలుగు వారిని అలరించే ఎన్నో సాంస్కృతిక, ఆధ్యాత్మిక, వినోదాల సమాహారాలు ఈ సంబరాల్లో ఉంటాయని నాట్స్ కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు శ్రీహరి మందాడి తెలిపారు. సంబరాల నిర్వహణ కమిటీ లను ఎంపిక చేశామని, 3లక్షల చదరపు అడుగులకు పైగా విస్తీర్ణం కలిగిన టంపా కన్వెన్షన్ సెంటరులో ఈ సంబరాల నిర్వహణ ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయని నాట్స్ పేర్కొంది. రోజుకి 10 వేలకు పైగా ప్రవాస అతిథులు ఈ వేడుకల్లో పాల్గొంటారనే అంచనాలతో నాట్స్ 8వ అమెరికా తెలుగు సంబరాల కోసం ఆ స్థాయిలో విజయవంతానికి నాట్స్ సంబరాల కమిటీ ఇప్పటి నుంచే కసరత్తు ముమ్మరం చేసింది.(చదవండి: జర్మనీ పాఠ్యాంశాల్లో తెలుగు విద్యార్థి ప్రస్థానం)
క్రైమ్

యువకుడి ప్రాణాలు తీసిన బెట్టింగ్ యాప్
మంథని/యైంటింక్లయిన్‌కాలనీ: ఆన్లైన్ బెట్టింగ్ యాప్‌లు(Online Betting App) అనేకమందిని బలితీసుకుంటున్నాయి. ఈ వ్యసనానికి అలవాటుపడ్డ యువ కులు అప్పులపాలై, ఆఖరు కు ఆత్మహత్య చేసుకుంటున్నారు. తాజాగా పెద్దపల్లి జిల్లా మంథని మండలం విలోచవరం గ్రామానికి చెందిన కోరవేన సాయితేజ (26) ఈనెల 18న రామగిరి మండలం సింగిరెడ్డిపల్లి గ్రామ శివారులో గడ్డి మందు తాగాడు. కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి చనిపోయాడు. సాయితేజ గోదావరిఖనిలో చదువుకున్నాడు. అక్కడే ఓ యువతిని ఆరేళ్ల క్రితం ప్రేమ వివా హం చేసుకున్నాడు. వీరికి కుమారుడు, కూతురు ఉన్నారు. సాయితేజ గోదావరిఖనిలోనే ఓ ప్రైవేటు స్కానింగ్ సెంటర్లో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్నాడు. ఆన్లైన్ బెట్టింగ్‌కు అలవాటు పడడంతో సాయితేజ దారితప్పినట్లు తెలుస్తోంది. ఏడాది నుంచి సాయితేజ బెట్టింగ్‌లకు అలవాటు పడటంతో రూ.6 లక్షల వరకు అప్పుల పాలయ్యాడు. ఇంట్లో ఈ విషయం తెలియడంతో కుటుంబ సభ్యులు అప్పులు తీర్చారు. మళ్లీ అటువైపు వెళ్లనని చెప్పడంతో కుటుంబ సభ్యులు నమ్మా రు. కానీ, బెట్టింగ్ వ్యసనం బారినపడ్డ సాయితేజ, మళ్లీ అదేతోవలో వెళ్లడంతో మరోసారి అప్పుల పాలయ్యాడని, ఈ క్రమంలో మద్యానికి బానిసయ్యాడని తెలుస్తోంది. అతను ఈ సారి రూ.4లక్షలకు పైగా అప్పు చేసినట్లు సమాచారం.

నీ భర్తను వదిలేసి నాతో రా... దుబాయ్‌కి వెళ్ళిపోదాం
హైదరాబాద్: దుబాయ్‌లో ఓ పబ్‌లో డ్యాన్సర్‌గా పనిచేస్తున్న హైదరాబాదీ యువతికి అక్కడే పరిచయయమైన యువకుడు మానసిక వేధింపులకు గురిచేయడంతో పాటు ఆమె భర్త, కుటుంబ సభ్యులకు వ్యక్తిగత వీడియోలు షేర్ చేస్తూ బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడుతున్నారని, ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ బాధిత డ్యాన్సర్ జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు దుబాయ్‌కు చెందిన నౌషాద్ అబూ బాకర్‌పై కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే..యూసుఫ్‌గూడ శ్రీకృష్ణానగర్‌లో నివసించే యువతి (38) 2018 అక్టోబర్ 6వ తేదీన ఉపాధి నిమిత్తం దుబాయ్‌కు వెళ్లింది.దుబాయ్‌లోని సౌత్ ఇండియా పబ్‌లో డ్యాన్సర్‌గా చేరింది. పబ్ సూపర్వైజర్ ఆమెకు ఏదైనా పని ఉంటే నౌషాద్ అబూబాకర్‌ను సంప్రదించాలని నెంబర్ ఇచ్చాడు. అప్పటి నుంచి తరచూ నౌషాద్ ఆమెతో ఫోన్లో మాట్లాడేవాడు. అయితే వీడియోలు తీసుకుని కొంతకాలంగా బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడుతున్నాడు. 2020లో ఆమె హైదరాబాద్‌కు తిరిగి వచ్చింది. ఆ సమయంలోనే అబూబాకర్ ఆమెతో ఫోన్లో మాట్లాడుతూ తిరిగి దుబాయ్ పబ్‌కు రావాలని, లేకపోతే వీడియోలు, ఫోటోలు కుటుంబసభ్యులకు షేర్ చేస్తానంటూ బెదిరించడంతో ఆమె తిరిగి దుబాయ్‌కు వెళ్లింది. ఇద్దరి మధ్య వీడియోల విషయంలో గొడవ జరిగింది. ఫోన్లో నుంచి వీడియోలు, ఫోటోలు డిలీట్ చేయాలని సూచించి తిరిగి హైదరాబాద్‌కు వచ్చింది. ఆరు నెలల తర్వాత అబూబాకర్ దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చి ఆమెకు ఫోన్ చేశాడు. ఇంటి నుంచి బయటకు రావాలని లేకపోతే భర్తతో పాటు కుటుంబ సభ్యులకు వీడియోలు పంపిస్తానని బెదిరించాడు. అయినా ఆమె వెళ్లకుండా ఇంట్లోనే ఉండిపోయింది. ఇదే అదునుగా నిందితుడు ఆమె ఫోటోలు, వీడియోలను భర్తకు, కుటుంబ సభ్యులకు పంపించాడు. తాను ఆమెను పెళ్లి చేసుకున్నానని, వదిలిపెట్టాలంటూ భర్తను హెచ్చరించాడు. ఈ వేధింపులు తట్టుకోలేక, అబూబాకర్ బ్లాక్మెయింలింగ్ భరించలేక బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇంకా పచ్చని పందిరి తీయలేదు..ఇంతలోనే విషాదం
సత్తుపల్లిటౌన్/రూరల్: ఇంకా పచ్చని పందిరి తీయలేదు.. భాజాభజంత్రీల శబ్దం చెవులను వీడలేదు.. ఇంతలోనే నూతన వధూవరులతో కలిసి దైవదర్శనానికి వెళ్లి వస్తుండగా జరిగిన ప్రమాదంలో వధువు తల్లి మృతి చెందగా.. తండ్రికి తీవ్ర గాయాలయ్యాయి. సత్తుపల్లి మండలం బేతుపల్లి వద్ద శుక్రవారం జరిగిన ఈ ప్రమాదం వివరాలిలా ఉన్నాయి. సత్తుపల్లికి చెందిన వ్యాపారి అడపా రాజేంద్రప్రసాద్ – పుష్పావతి ఏకైక కుమార్తె హర్షిణి వివాహం ఈనెల 16న జరిగింది.నూతన వధూవరులతో కలిసి అందరూ అశ్వారావుపేట సమీపాన శ్రీసుబ్రమణ్యేశ్వరస్వామి కల్యాణానికి వెళ్లారు. ఆతర్వాత నూతన దంపతులను జంగారెడ్డిగూడెంలోని అత్తగారి ఇంటికి సాగనంపి.. హర్షిణి తల్లిదండ్రులు పుష్పావతి(55), రాజేంద్రప్రసాద్ కారులో సత్తుపల్లికి తిరుగు ప్రయాణమయ్యారు. ఈక్రమాన బేతుపల్లి సమీపంలో వీరి కారు – ఎదురుగా వచ్చిన పాలవ్యాన్ ఢీకొన్నాయి. ఈ ఘటనలో పుష్పావతి, రాజేంద్రప్రసాద్‌కు గాయాలు కాగా 108 వాహనంలో సత్తుపల్లి ప్రభుత్వాస్పత్రికి తీసుకొచ్చేసరికి పుష్పావతి మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.ఈ విషయం తెలియడంతో జంగారెడ్డిగూడెం నుంచి వచ్చిన హర్షిణి తల్లి మృతదేహంపై పడి రోదించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది. కాగా, పలువురు వ్యాపారులు, స్థానికులు సైతం పుష్పావతి మృతదేహం వద్ద నివాలులరి్పంచారు. ఈమేరకు సత్తుపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఆటోను ఢీ కొట్టిన లారీ.. మహిళా కూలీల పరిస్థితి విషమం
మహబూబాబాద్, సాక్షి: నర్సింహులపేట మండలం పెద్దనాగారం స్టేజ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. మహిళా కూలీలతో వెళ్తున్న ఓ ఆటోను లారీ ఢీ కొట్టడంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఏరియా ఆస్పత్రికి తరలించగా.. వీళ్లలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. తొర్రూర్ మండలం చెర్లపాలెం గ్రామానికి చెందిన 14 మంది, ఫతేపురం గ్రామానికి చెందిన ముగ్గురు మహిళలు మిర్చి తోట ఏరడానికి బంగ్లా వైపు ఆటోలో వెళ్తున్నారు. ఆ సమయంలో ఆటోను లారీ వేగంగా వచ్చి ఢీ కొట్టింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. స్థానికుల సాయంతో మూడు ఆంబులెన్సులలో మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో 13 మందికి గాయాలు కాగా.. వాళ్లలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.