Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

YSRCP Yuvatha Poru: Ys Jagan Tweet On Chandrababu Conspiracies1
చంద్రబాబూ.. తొలి హెచ్చరిక ఇది: వైఎస్‌ జగన్

సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు కుట్రలను ఎక్స్‌ వేదికగా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎండగట్టారు. ‘‘పేద విద్యార్థులను చదువులకు దూరం చేసే మీ కుట్రపై వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ప్రజాస్వామ్యయుతంగా “యువత పోరు’’ ద్వారా గళమెత్తిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, నిరుద్యోగులపై పోలీసుల దౌర్జన్యాలను తీవ్రంగా ఖండిస్తున్నాను’’ అంటూ ఆయన ట్వీట్‌ చేశారు.‘‘పలుచోట్ల పోలీసులతో ఈ కార్యక్రమాన్ని అడ్డుకోవాలని చూసినా వాటన్నింటినీ అధిగమించి ఈ సంవత్సర కాలంగా మీ ప్రభుత్వం పెడుతున్న కష్టాలపై నిలదీశారు. నిరుద్యోగులు, విద్యార్థులు మీకు పంపిన తొలి హెచ్చరిక ఇది.. చంద్రబాబు’’ అని వైఎస్‌ జగన్ పేర్కొన్నారు. ‘‘పేదరికం వల్ల పెద్ద చదువులకు ఎవ్వరూ దూరం కాకూడదన్న దృఢ సంకల్పంతో మా ప్రభుత్వం విద్యాదీవెన ద్వారా సంపూర్ణ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను, వసతి దీవెన ద్వారా హాస్టల్‌, మెస్‌ ఛార్జీలను నేరుగా వారి తల్లులు, ఆ పిల్లల ఖాతాలకే జమచేస్తూ, అమలు చేసిన ఈ పథకాలను మీ ప్రభుత్వం పూర్తిగా నీరుగార్చింది. చంద్రబాబూ… మీ గత పాలనలోని ఆ చీకటి రోజులనే మళ్లీ మీరు తీసుకు వచ్చారు’’ అంటూ వైఎస్‌ జగన్‌ నిలదీశారు.‘‘2024 జనవరి - మార్చి త్రైమాసికానికి సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ డబ్బును ఏప్రిల్‌లో వెరిఫై చేసి, మేలో చెల్లించాల్సి ఉంది. అక్కడ నుంచి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కింద ప్రతి త్రైమాసికానికి రూ.700 కోట్ల చొప్పున ఏడాదికి రూ.2,800 కోట్లు ఇవ్వాలి. వసతి దీవెన కింద హాస్టల్‌ ఖర్చులకు మరో రూ.1,100 కోట్లు ఇవ్వాలి. ప్రతి ఏడాదికి ఈ రెండు పథకాలకు రూ.3,900 కోట్లు ఖర్చు చేయాలి. కానీ చంద్రబాబుగారూ, మీరిచ్చింది కేవలం రూ. 700 కోట్లు. అదికూడా ఇప్పటికీ పూర్తిగా పిల్లలందరికీ చేరలేదు...అంటే గతేడాది పిల్లలకు బాకీ పెట్టిన రూ.3,200 కోట్లు, అదీ కాక ఈ ఏడాది ఖర్చుచేయాల్సిన మరో రూ. 3,900 కోట్లు, రెండూ కలిపితే రూ.7,100 కోట్లు ఈ సంవత్సరం ఖర్చుపెట్టాలి. అయితే ఈ బడ్జెట్‌లో ప్రవేశపెట్టింది కేవలం రూ.2,600 కోట్లు మాత్రమే. దీని అర్థం పేద విద్యార్థుల చదువులు, వారి బాధ్యత విషయంలో మీరు తప్పించుకుంటున్నట్టే కదా ? ఆ పిల్లల జీవితాలను అంధకారంలోకి నెడుతున్నట్టే కదా? చదువుకుంటున్న పిల్లలకు మీరు చేస్తున్న ద్రోహం కాదా? విద్యార్థులను ఇంతగా ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు చంద్రబాబూ....అధికారంలోకి వస్తే 20 లక్షల ఉద్యోగాలు లేదా అందాక నెలకు రూ.3వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఉద్యోగాలు ఇవ్వడం లేదు కదా వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలను ఊడపీకుతున్నారు. నిరుద్యోగ భృతి ఇవ్వాలంటే ప్రతి ఏటా రూ.7,200 కోట్లు ఖర్చు చేయాలి. కాని, గత ఏడాది బడ్జెట్లో ఒక్కపైసా కేటాయింపూ లేదు. ఈ ఏడాదికి కూడా ఒక్కపైసా కేటాయించలేదు. ఈ రెండేళ్లలోనే ప్రతి నిరుద్యోగికీ రూ.72వేల చొప్పున బకాయి పడ్డారు. అలాగే వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలను ప్రయివేటు పరం చేస్తూ, పేదలకు ఉచితంగా నాణ్యమైన వైద్యాన్ని అందనీయకుండా అడ్డుకోవడమే కాదు, పేద విద్యార్థులకు మెడికల్‌ విద్యను దూరం చేస్తున్నారు. ..కొత్త ప్రభుత్వం వచ్చి ఏడాదికూడా కాకముందే మిమ్మల్ని ప్రశ్నిస్తూ, నిరుద్యోగులు, ఇంతమంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు రోడ్డెక్కడం ఎప్పుడైనా చూశారా చంద్రబాబూ? ప్రజల పక్షాన నిలుస్తూ, విద్యార్థుల సమస్యలపై, వారికోసం చంద్రబాబు కూటమి ప్రభుత్వాన్ని నిలదీస్తూ “యువత పోరు’’ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన పిల్లలు, వారి తల్లిదండ్రులు, నిరుద్యోగులు, వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలందర్నీ అభినందిస్తున్నాను. అనేక సమస్యలు ఎదుర్కొంటున్న విద్యార్థుల సహా అన్నివర్గాలకూ పార్టీ ఎప్పుడూ తోడుగా నిలుస్తుందని భరోసా ఇస్తున్నాను’’ అని వైఎస్‌ జగన్ ట్వీట్‌ చేశారు.1. @ncbn గారూ పేద విద్యార్థులను చదువులకు దూరం చేసే మీ కుట్రపై వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో ప్రజాస్వామ్యయుతంగా “యువత పోరు’’ ద్వారా గళమెత్తిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, నిరుద్యోగులపై పోలీసుల దౌర్జన్యాలను తీవ్రంగా ఖండిస్తున్నాను. పలుచోట్ల పోలీసులతో ఈ కార్యక్రమాన్ని అడ్డుకోవాలని… pic.twitter.com/dn2LslNZzI— YS Jagan Mohan Reddy (@ysjagan) March 12, 2025

 ysrcp yuvatha poru Protests Live Updates2
వైఎస్సార్‌సీపీ యువత పోరుపై పోలీసులు ఆంక్షలు..

Yuvatha Poru Updates..👉ఏపీలో విద్యార్థులు, వారి తల్లితండ్రులు.. నిరుద్యోగుల పక్షాన అన్ని జిల్లాల్లో వైఎస్సార్‌సీపీ తలపెట్టిన ‘యువత పోరు’ కార్యక్రమం ప్రారంభమైంది. విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ జిల్లా కేంద్రాల్లో విద్యార్థులు, వారి తల్లుతండ్రులు, నిరుద్యోగులతో కలిసి కలెక్టర్‌ కార్యాలయాల వరకు వైఎస్సార్‌సీపీ భారీ ర్యాలీలు నిర్వహించనుంది. ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెన బకాయిలు తక్షణమే చెల్లించాలని.. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల చొప్పున నిరుద్యోగ భృతి చెల్లించాలని.. కొత్త మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణను ఉపసంహరించుకుని, పేదలకు వైద్య విద్యను అందుబాటులో ఉంచాలని కోరుతూ కలెక్టర్లకు విజ్ఞాపన పత్రాలు అందజేయనుంది.యువత పోరును అడ్డుకున్న పోలీసులు..విజయవాడలో యువత పోరుకు అడ్డంకులు.వైఎస్సార్‌సీపీ శ్రేణులను అడ్డుకున్న పోలీసులు.యవత పోరుకు పెద్ద ఎత్తున తరలివచ్చిన విద్యార్థులు, తల్లిదండ్రులు.వైఎస్సార్‌సీపీ నేతల ర్యాలీని అడ్డుకున్న పోలీసులు.ర్యాలీకి అనుమతి లేదని బారికేడ్లు ఏర్పాటు. కృష్ణాజిల్లా..కూటమి ప్రభుత్వంపై పేర్ని నాని ఫైర్మాజీ మంత్రి పేర్ని నాని కామెంట్స్‌..చంద్రబాబు, పవన్, బీజేపీ కలిసి ప్రజలను మోసం చేశారుపార్టీ పెట్టిన ఎన్టీఆర్‌ను, ఓటేసిన ప్రజలకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారుమీ ఖర్చులకు డబ్బులుంటాయి కానీ.. విద్యార్ధుల ఫీజులకు డబ్బులుండవా?.చంద్రబాబు, పవన్, లోకేష్‌కు పదేసి కార్లలో తిరగడానికి.. వాటి సిబ్బందికి డబ్బులుంటాయిపిల్లలకు ఫీజుల బకాయిలు చెల్లించడానికి మనసు రాదాఎన్ని ఆంక్షలు పెట్టినా కూటమి ప్రభుత్వంపై మా పోరాటం కొనసాగుతుందిఅరెస్టులతో మమ్మల్ని అడ్డుకోలేరుఅరెస్టులు చేసి వైఎస్సార్‌సీపీ కార్యకర్తలతో జైళ్లను నింపుకున్నా మేం వెనకడుగువేసేది లేదుశ్రీకాకుళం..యువత పోరు కార్యక్రమానికి వెళుతున్న వైఎస్సార్‌సీపీ నేతలను అడ్డుకున్న పోలీసులుజిల్లా కేంద్రానికి వస్తున్న ఆముదాలవలస నియోజకవర్గ ఇంచార్జ్ చింతాడ రవికుమార్, నేతలను అడ్డుకున్న పోలీసులు.రోడ్డుపై బైఠాయించిన వైఎస్సార్‌సీపీ పార్టీ నాయకులుచింతాడ వద్ద పోలీసులకు, నేతలకు మధ్య వాగ్వాదంఅనంతరం, వైఎస్సార్‌సీపీ నేతలకు అడ్డుతప్పుకున్న పోలీసులు. విశాఖలో ఉద్రిక్తత..విశాఖ జిల్లా కలెక్టరేట్‌కు భారీగా తరలివచ్చిన వైఎస్సార్‌సీపీ శ్రేణులు..కలెక్టరేట్‌లోకి వైఎస్సార్‌సీపీ శ్రేణులను అనుమతించని పోలీసులు..కేవలం పది మందికి మాత్రమే కలెక్టర్‌ని కలిసేందుకు అనుమతి..గేటు బయట పోలీసులకు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం..జై జగన్ నినాదాలతో హోరెత్తిన జిల్లా కలెక్టరెట్విజయవాడ..రాష్ట్ర వైఎస్సార్‌సీపీ ట్రేడ్ యూనియన్ కార్యాలయం వద్ద పార్టీ 15వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలుపునూరు గౌతమ్ రెడ్డి కామెంట్స్విద్యార్థులకు ఫీజులు వసతులు కల్పించడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైందిచంద్రబాబు 7100 కోట్లు మాత్రమే రిలీజ్ చేసి ప్రజలను మోసం చేశారుగతంలో విద్యార్థుల భవిష్యత్తు కోసం వైఎస్ జగన్ 18వేల కోట్లు విడుదల చేశారుచంద్రబాబు అరకొర నిధులు విడుదల చేసి విద్యార్థుల జీవితాన్ని నాశనం చేశాడువిద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ చంద్రబాబు తక్షణమే అందించాలిఢిల్లీ..పార్లమెంట్‌లోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు..వేడుకల్లో పాల్గొన్న ఎంపీలు వైవీ.సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డి, మేడ రఘునాథ్ రెడ్డి, గురుమూర్తి, తనుజారాణి, గొల్ల బాబురావు, అయోధ్య రామిరెడ్డి,వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి కామెంట్స్‌..వైఎస్సార్‌ ఆశయ సాధన మా పార్టీ ధ్యేయంపేదల సంక్షేమం కోసం రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం ఎన్నో పథకాలు అమలు చేసిందిపేదల పక్షాన నాడు కాంగ్రెస్ పార్టీపై పోరాటం చేశాంప్రజలకు అండగా నిలబడ్డాం.విశాఖ..వైఎస్సార్‌సీపీ యువత పోరుపై పోలీసులు ఆంక్షలు..జెడ్పీ జంక్షన్‌కు భారీగా చేరుకుంటున్న వైఎస్సార్‌సీపీ శ్రేణులు..కలెక్టరేట్ వరకు ర్యాలీగా వెళ్లేందుకు అనుమతి లేదంటున్న పోలీసులు..ఆంక్షలు అమలు కోసం భారీగా పోలీసుల మోహరింపు..ర్యాలీగా వెళ్లి వినతిపత్రం ఇచ్చేందుకు సిద్దమైన వైఎస్సార్‌సీపీ నేతలు.తిరుపతి..ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కామెంట్స్..వైఎస్సార్‌సీపీ 14 ఏళ్లు పూర్తి చేసుకుని 15వ ఏట అడుగు పెడుతోందిఎన్నో ఆశలు పెట్టుకొని, దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌ ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం తీసుకువచ్చారువైఎస్ జగన్ పాలనలో 90 శాతం విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ పంపిణీ చేశారుపిల్లలు అందరూ కాలేజీలకు వెళ్లకుండా పంట పొలాలకు వెళ్తున్నారుఫీజు రీయింబర్స్‌మెంట్‌పై పోరు కొనసాగిస్తున్నాముయువతకు 3వేల రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని మోసం చేశారుప్రతి విద్యార్థికి పది నెలల్లో ముప్పై వేలు ఇవ్వాలిమహిళా సంఘాలు అక్కౌంట్ లు 50శాతం నిర్వీర్యం అయిపోయాయిఈ ప్రభుత్వం కక్ష సాధింపు పాలన సాగిస్తోంది.దీని పర్యవసానం చెల్లించక తప్పదుయువత పోరులో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలినెల్లూరు..వైఎస్సార్‌సీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ ఆఫీసులో జెండాను ఆవిష్కరించిన కాకాణి.హాజరైన అన్ని నియోజకవర్గ ఇన్‌చార్జులు అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలుమాజీ మంత్రి కాకాణి కామెంట్స్..ఒక్క ఎమ్మెల్యే, ఒక్క ఎంపీతో ప్రారంభమైన పార్టీ ప్రస్థానం ఇది.ప్రతిపక్ష పార్టీగా, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ ప్రజలకు మరింత చేరువయ్యారు.కోట్ల మంది ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తూ.. విలువలు విశ్వసనీయంతో ఐదేళ్లు జగన్ ప్రభుత్వాన్ని నడిపారుపార్టీ అధికారంలో ఉన్నా.. లేకపోయినా వాడవాడలా వైఎస్సార్‌సీపీ జెండా ఎగరడానికి కారణం వైఎస్‌ జగన్‌.వైఎస్‌ జగన్‌పై ప్రజల్లో నమ్మకం ఉంది.వైఎస్‌ జగన్ రూపం రాష్ట్ర ప్రజల గుండెల్లో ఉంది.పార్టీ పిలుపునిచ్చిన ప్రతి కార్యక్రమానికి ప్రజల స్వచ్ఛందంగా హాజరవుతున్నారు..యువత పోరుకు సైతం భారీ సంఖ్యలో హాజరుకావాలి. కృష్ణాజిల్లా..పెనమలూరు నియోజకవర్గ సమన్వయకర్త దేవభక్తుని చక్రవర్తి ఆధ్వర్యంలో యువత పోరు కార్యక్రమం.కానూరు నుంచి మచిలీపట్నం వరకు భారీ ర్యాలీ.దేవభక్తుని కామెంట్స్..కూటమి యువతను, విద్యార్థులను మోసం చేసింది.విద్య, వైద్యంపై ఉక్కు పాదం మోపుతుంది.విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు.ఫీజు కట్టే స్తోమత లేక పొలం పనులకు యువత వెళ్తున్నారు.విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు.జగనన్న హయాంలో పూర్తిగా ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించాం.దున్నపోతు మీద వర్షం పడినట్లు ప్రవర్తిస్తుంది.ప్రజల సమస్యలను గాలికి వదిలేసింది.అనంతపురం..వైఎస్సార్‌సీపీ యువత పోరుకు భారీ స్పందనజెడ్పీ కార్యాలయం నుంచి కలెక్టరేట్ దాకా భారీ ర్యాలీచంద్రబాబు సర్కార్ కు వ్యతిరేకంగా నినాదాలుయువత పోరులో భారీగా పాల్గొన్న విద్యార్థులు, యువకులుమాజీ ఎమ్మెల్యేలు అనంత వెంకటరామిరెడ్డి, విశ్వేశ్వరరెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి, వై.వెంకట్రామిరెడ్డి, మెట్టు గోవిందరెడ్డి ,మాజీ ఎంపీ తలారి రంగయ్య, మాజీ మంత్రి శైలజానాథ్, ఎమ్మెల్సీ మంగమ్మ,వై.శివరామిరెడ్డి, ప్రభుత్వ విద్య మాజీ సలహాదారు ఆలూరు సాంబశివారెడ్డి.

Soundarya Husband Raghu Responds Allegations On Mohan Babu3
మోహన్ బాబుతో మాకు ఎలాంటి ఆస్తి గొడవల్లేవు: సౌందర్య భర్త

దివంగత నటి సౌందర్య(Soundarya ), మోహన్‌ బాబు(Mohan Babu) మధ్య ఆస్తి తగాదాలు వచ్చాయని, సౌందర్య ప్రమాదంలో చనిపోలేదని, ప్లాన్‌ చేసి చంపేశారంటూ ఖమ్మం జిల్లాకు చెందిన ఓ వ్యక్తి బహిరంగ లేఖ రాసి నిరసనకు దిగిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ వివాదంపై సౌందర్య భర్త రఘు స్పందించాడు. మోహన్‌ బాబుతో తమకు ఎలాంటి ఆస్తి గొడవలు లేవని స్పష్టం చేశాడు. ఈ మేరకు బహిరంగ లేఖను విడుదల చేశాడు.‘గత కొన్ని రోజులుగా హైదరాబాద్ లోని సౌందర్య ఆస్తికి సంబందించి తప్పుడు ప్రచారం జరుగుతోంది. సౌందర్య ఆస్తిని మోహన్ బాబు ఆక్రమించుకున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. మోహన్ బాబుతో సౌందర్య ఎలాంటి భూ లావాదేవీలు జరపలేదు.మంచు ఫ్యామిలీతో మాకు 25 ఏళ్లుగా మంచి అనుబంధం ఉంది .మోహన్ బాబును నేను గౌరవిస్తాను, మేమంతా ఒకే కుటుంబంగా ఉంటాం.మోహన్ బాబుతో మాకు ఎలాంటి ఆస్తి గొడవలు, లావాదేవీలు లేవు. దయచేసి తప్పుడు ప్రచారాలు చేయకండి’ అని లేఖలో పేర్కొన్నాడు.

Former Bangladesh Pm Sheikh Hasina Home Seized And Family Assets Frozen4
బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని షేక్‌ హసీనాకు ఎదురుదెబ్బ

ఢాకా: బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని షేక్‌ హసీనాకు ఎదురుదెబ్బ తగిలింది. షేక్‌ హసీనా ఆస్తుల సీజ్‌కు ఢాకా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఆమె భారత్‌లో ఆశ్రయం పొందుతున్న సంగతి తెలిసిందే. షేక్‌ హసీనాతో పాటు, ఆమె కుటుంబ సభ్యుల ఆస్తులను కూడా సీజ్ చేయాలని ఢాకా కోర్టు ఆదేశాలిచ్చింది. దీంతో బ్యాంక్ అకౌంట్లను అధికారులు సీజ్ చేయనున్నారు.గత ఏడాది ఆగస్ట్‌లో బంగ్లాదేశ్‌లో అల్లర్లు చెలరేగగా, భారీ హింస చోటుచేసుకుంది. దీంతో ప్రధాని పదవికి రాజీనామా చేసిన ఆమె.. భారత్‌లో తలదాచుకుంటున్నారు. ఈ క్రమంలో హసీనాను బంగ్లాదేశ్‌కు రప్పించేందుకు ఆ దేశం చాలా ప్రయత్నాలు చేసింది. ఆమె పాస్ పోర్టును కూడా రద్దు చేసింది. హసీనాను తమ దేశానికి పంపించాలని భారత ప్రభుత్వానికి బంగ్లాదేశ్‌ కూడా లేఖ రాసింది. అయితే, తాజాగా ఢాకా కోర్టు హసీనా, ఆమె బంధువుల ఆస్తులు, బ్యాంక్ ఖాతాలను సీజ్ చేయాలని ఆదేశించింది.కాగా, భారత్‌లో తలదాచుకుంటున్న షేక్‌ హసీనాను బంగ్లాదేశ్‌కు రప్పించడమే తమ తొలి ప్రాధాన్యత అని ఆ దేశ ప్రభుత్వం ఇటీవల ఉద్ఘాటించింది. హసీనాను విచారించేందుకు ప్రయత్నాలను కొనసాగిస్తామని దేశ తాత్కాలిక సారథి మహమ్మద్‌ యూనస్‌ ప్రెస్‌ కార్యదర్శి షఫీకుల్‌ ఆలం తెలిపిన సంగతి తెలిసిందే. ‘‘హసీనా పార్టీ అవామీ లీగ్‌ భవితవ్యంపై నీడలు కమ్ముకున్నాయి...ఆ పార్టీ దేశ రాజకీయ ముఖచిత్రంలో ఉండాలా, వద్దా అనేది ప్రజలతో పాటు ఇతర పార్టీలు నిర్ణయిస్తాయి. హత్యలు, అదృశ్యాలు, నేరాలకు పాల్పడిన వారికి శిక్ష పడాల్సిందే’’ అంటూ ఆయన నొక్కి చెప్పారు. హసీనా ప్రభుత్వం మానవాళిపై నేరాలకు పాల్పడుతోందంటూ ఐరాస మానవ హక్కుల హైకమిషనర్‌ కార్యాలయం ఇచ్చిన నివేదికను ఉదాహరించారు. ఈ నేపథ్యంలో హసీనాను అప్పగించే విషయమై భారత్‌పై ఒత్తిడి పెరిగిందన్నారు.

Gambhir to travel with India A ahead of ENG vs IND 2025 Tests: Reports5
IND vs ENG: గంభీర్‌ మాస్టర్‌ ప్లాన్‌.. ఇంత వరకు ఏ కోచ్‌ చేయని విధంగా..

టీమిండియాకు అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి సుదీర్ఘ విరామం లభించనుంది. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(IPL)-2025 నేపథ్యంలో రెండు నెలలకు పైగా భారత జట్టు ఆటగాళ్లు వేర్వేరు ఫ్రాంఛైజీల తరఫున ప్రత్యర్థులుగా బరిలోకి దిగనున్నారు. ఈ మెగా క్యాష్‌ రిచ్‌ లీగ్‌ పద్దెనిమిదవ ఎడిషన్‌ మార్చి 22న మొదలై మే 25న ఫైనల్‌తో ముగియనుంది.ఈ పొట్టి ఫార్మాట్‌ టోర్నమెంట్‌ పూర్తైన తర్వాత టీమిండియా ఇంగ్లండ్‌ పర్యటన(India Tour Of England)కు వెళ్లనుంది. జూన్‌ 20 నుంచి ఇరుజట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ ఆరంభమయ్యే అవకాశం ఉంది. గంభీర్‌ కీలక నిర్ణయంఈ నేపథ్యంలో టీమిండియా హెడ్‌కోచ్‌ గౌతం గంభీర్‌(Gautam Gambhir) కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మెగా సిరీస్‌ కంటే ముందే ఇంగ్లండ్‌కు వెళ్లనున్న ఇండియా-‘ఎ’ జట్టుతో అతడు ప్రయాణించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ఇందుకు సంబంధించి భారత క్రికెట్‌ నియంత్రణ మండలి(BCCI) వర్గాలు టైమ్స్‌ ఆఫ్‌ ఇండియాతో మాట్లాడుతూ.. ‘‘ఆస్ట్రేలియా పర్యటన నుంచి తిరిగి వచ్చిననాటి నుంచి గంభీర్‌తో బీసీసీఐతో పలు దఫాలుగా చర్చలు జరుపుతున్నాడు. ఇండియా-‘ఎ’ జట్టుతో పాటు ప్రయాణం చేయాలని అతడు భావిస్తున్నాడు.అందుకే ఇలారిజర్వ్‌ ఆటగాళ్ల నైపుణ్యాలను దగ్గరగా పరిశీలించాలని అతడు భావిస్తున్నాడు. చాంపియన్స్‌​ ట్రోఫీ విజయం తర్వాత.. గంభీర్‌ మరింత దూకుడుగా ముందుకు వెళ్లాలనే యోచనలో ఉన్నాడు. ఈ మెగా టోర్నీలో వైల్డ్‌ కార్డ్‌ ద్వారా అతడు తీసుకువచ్చిన ఆటగాళ్ల నుంచి మెరుగైన ఫలితాలు వచ్చాయి. టెస్టుల్లోనూ ఇదే తరహా సూత్రాన్ని పాటించాలని భావిస్తున్నాడు.ముఖ్యంగా ఇండియా-‘ఎ’ జట్టులోని ప్రతిభావంతులకు అవకాశం ఇస్తే బాగుంటుందని అతడు భావిస్తున్నాడు. ద్రవిడ్‌ జాతీయ క్రికెట్‌ అకాడమీని వీడిన తర్వాత ఇండియా-‘ఎ’ టూర్లు నామమాత్రంగా మారిపోయాయి. టెస్టుల్లో ఘోర పరాభవాలుఅందుకే గంభీర్‌ ఈ అంశంపై దృష్టి సారించాడు. టూర్ల సంఖ్య పెంచితే బాగుంటుందని అభిప్రాయపడుతున్నాడు’’ అని పేర్కొన్నాయి. కాగా రాహుల్‌ ద్రవిడ్‌ తర్వాత టీమిండియా ప్రధాన కోచ్‌గా పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అద్భుత విజయాలు అందుకున్న గంభీర్‌.. టెస్టుల్లో మాత్రం ఘోర పరాభవాలు చవిచూశాడు. టీ20, వన్డే ద్వైపాక్షిక టోర్నీల్లో గౌతీ మార్గదర్శనంలో భారత్‌ క్లీన్‌స్వీప్‌ విజయాలు సాధించి సత్తా చాటింది. అయితే, సొంతగడ్డపై టెస్టుల్లో కనీవినీ ఎరుగని రీతిలో న్యూజిలాండ్‌ చేతిలో 3-0తో వైట్‌వాష్‌కు గురైంది.అదే విధంగా.. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీని చేజార్చుకుంది. ఈ ప్రతిష్టాత్మక టెస్టు సిరీస్‌లో 3-1తో కంగారూల చేతిలో ఓడి దశాబ్దకాలం తర్వాత ఓటమిని చవిచూసింది. దీంతో గంభీర్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. అతడిని తొలగించాలనే డిమాండ్లూ వినిపించాయి.ఇలాంటి తరుణంలో ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ-2025లో టీమిండియాను విజేతగా నిలపడం ద్వారా గంభీర్‌ తిరిగి గాడిలో పడ్డాడు. కాగా.. ఐపీఎల్‌ ఫ్రాంఛైజీ కోల్‌కతా నైట్‌ రైడర్స్‌కు తాను మెంటార్‌గా పనిచేసిన సమయంలో గుర్తించిన హర్షిత్‌ రాణా, వరుణ్‌ చక్రవర్తిలను ఈ మెగా వన్డే టోర్నీలో ఆడించడం ద్వారా మరోసారి విమర్శల పాలయ్యాడు గంభీర్‌. ఇండియా-‘ఎ’ టీమ్‌పై కూడా దృష్టి.. వారి గుండెల్లో గుబులుఅయితే, వారిద్దరు జట్టు విజయంలో తమవంతు పాత్ర పోషించడంతో గంభీర్‌ను విమర్శించిన వాళ్లే అతడి నిర్ణయాన్ని సమర్థించడం విశేషం. ఈ నేపథ్యంలో టెస్టుల్లోనూ తన ముద్ర వేసేందుకు గంభీర్‌ ఇండియా-‘ఎ’ టీమ్‌పై కూడా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఫలితంగా ఫామ్‌లేమితో సతమతమయ్యే సీనియర్లపై వేటు తప్పకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.కాగా ఇంతకు ముందు కోచ్‌లుగా పనిచేసిన ద్రవిడ్‌, రవిశాస్త్రి వంటి వారు ఎప్పుడూ ఇలా ఇండియా-‘ఎ’ జట్టుతో ప్రయాణించిన దాఖలాలు లేవని.. ఈ ప్రయోగం ద్వారా గంభీర్‌ ఎలాంటి ఫలితం పొందుతాడో చూడాలని విశ్లేషకులు అంటున్నారు.చదవండి: CT: ఇండియా-‘బి’ టీమ్‌ కూడా ఫైనల్‌ చేరేది: ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌

Cm Revanth Serious On Nagarjuna Sagar Mla Kunduru Jaiveer Reddy6
సీఎల్పీలో ఎమ్మెల్యేకి సీఎం రేవంత్‌ క్లాస్‌!

సాక్షి, హైదరాబాద్‌: సొంత పార్టీ ఎమ్మెల్యేపై సీఎం రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను మాట్లాడే సమయంలో మీరు మధ్యలో వెళ్లిపోతే ఎలా? క్రమశిక్షణతో మెలిగితేనే ఫ్యూచర్ ఉంటుందని క్లాస్‌ తీసుకున్నారు. ఇంతకి సీఎం రేవంత్‌ క్లాస్‌ తీసుకున్న ఎమ్మెల్యే ఎవరు? అసలేం జరిగింది. నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలిరోజు సమావేశాల్లో ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ శాసనసభలో ప్రసంగించారు. ఈ అసెంబ్లీ సమావేశాలకు బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై సీఎల్పీ సమావేశం జరిగింది.ఈ సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి ఆగ్రహానికి గురయ్యారు. అసెంబ్లీ సమావేశాల్లో వ్యవహరించాల్సిన విధానంపై సీఎం రేవంత్ ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలకు పలు సూచనలు చేస్తున్నారు. ఆ సమయంలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి కే.జానారెడ్డి కుమారుడు, నాగార్జున సాగర్ ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి సమావేశం నుంచి భయటకు వెళ్లారు. దీంతో ఎమ్మెల్యే తీరుపై రేవంత్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను మాట్లాడుతున్నా కదా. మీరు బయటకు వెళ్లడం ఏంటి? అని ప్రశ్నించారు. క్రమశిక్షణతో మెలిగితేనే ఫ్యూచర్ ఉంటుందని క్లాస్ తీసుకున్నారు. అనంతరం, తన ప్రసంగాన్ని కొనసాగించారు.

Narayana Murthy and Family Face Rs 6875 Crore Loss as Infosys Shares Enter Bear Territory7
ఒకే కుటుంబానికి రెండు రోజుల్లో రూ.6,875 కోట్ల నష్టం

ఇన్ఫోసిస్ లిమిటెడ్ షేర్‌ ధర వరుసగా రెండు రోజుల నుంచి భారీగా పతనమవుతోంది. దాంతో కంపెనీ షేర్‌ హోల్డర్లకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. అందులో మేజర్‌ వాటాదారులుగా ఉన్న కంపెనీ ప్రమోటర్ నారాయణమూర్తి, ఆయన కుటుంబ సభ్యులకు గణనీయంగా నష్టాలు నమోదయ్యాయి. బుధవారం ఇన్ఫోసిస్ 5.49 శాతం క్షీణించి 1,569.35 వద్ద కనిష్టాన్ని తాకింది. 2024 డిసెంబర్‌లో 52 వారాల గరిష్ట స్థాయి రూ.2,006.80తో పోలిస్తే ఈ షేరు దాదాపు 22 శాతం క్షీణించింది. దాంతో మూర్తి కుబుంబానికి ఏకంగా రెండు రోజుల్లో రూ.6,875 కోట్లు నష్టం వాటిల్లింది.అమెరికా ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా టారిఫ్ వార్ కారణంగా ఐటీ కంపెనీల క్లయింట్లు పెట్టుబడి నిర్ణయాలు తీసుకునేందుకు ఆలోచిస్తున్నట్లు అభిప్రాయపడుతున్నారు. దాంతో కొన్ని బ్రోకరేజీ సంస్థలు ఇన్ఫోసిస్‌ స్టాక్‌ను డౌన్‌గ్రేడ్‌ చేయడంతో తాజా పతనం సంభవించిందని చెబుతున్నారు. కేవలం ఐటీ స్టాక్‌లే కాకుండా దాదాపు చాలా స్టాక్‌లు నష్టాల్లోనే ట్రేడవుతున్నాయి.ఇదీ చదవండి: టెస్లా కారు కొనుగోలు చేసిన ట్రంప్‌!ఎవరి వాటా ఎంత..కార్పొరేట్ డేటాబేస్ ఏసీఈక్విటీతో సేకరించిన డేటా ప్రకారం ఎన్ఆర్ నారాయణమూర్తి కుటుంబానికి చెందిన ఐదుగురు సభ్యులు ఇన్ఫోసిస్‌లో రూ.26,287.19 కోట్ల విలువైన 4.02 శాతం వాటాను కలిగి ఉన్నారు. 2024 డిసెంబర్ 13న రూ.33,162.89 కోట్లతో పోలిస్తే ఇది ఇటీవల రూ.6,875.70 కోట్లు తగ్గింది. కంపెనీ సహ వ్యవస్థాపకుడు, ప్రమోటర్ మూర్తి ఇన్ఫోసిస్‌లో 0.40 శాతం వాటాను కలిగి ఉండగా, ఆయన భార్య సుధా మూర్తి డిసెంబర్ త్రైమాసికం చివరి నాటికి 0.92 శాతం వాటాను కలిగి ఉన్నారు. దేశంలోని రెండో అతిపెద్ద సాఫ్ట్‌వేర్‌గా పేరున్న ఇన్ఫోసిస్‌లో వారి కుమారుడు రోహన్ మూర్తి, బ్రిటన్ మాజీ ప్రధాని రిషి సునక్ భార్య, నారాయణమూర్తి కూతురు అక్షతా మూర్తికి వరుసగా 1.62 శాతం, 1.04 శాతం వాటాలు ఉన్నాయి. మూర్తి మనవడు ఏకాగ్రహ్ రోహన్ మూర్తికి ఇన్ఫోసిస్‌లో స్వల్పంగా 0.04 శాతం వాటా ఉంది.

Kannada Actor Ranya Rao Case: Bail Plea Arguments Updates March 128
రన్యారావును నిద్రపోనివ్వడం లేదు!

బెంగళూరు: అక్రమ బంగారం రవాణా కేసులో అరెస్టైన కన్నడ నటి రన్యారావు.. బెయిల్‌ కోసం ప్రత్యేక కోర్టును ఆశ్రయించారు. అయితే విచారణ పేరుతో అధికారులు ఆమెను నిద్రపోవడం లేదని ఆమె తరఫు న్యాయవాది బుధవారం కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. విచారణ పేరుతో నా క్లయింట్‌ రన్యారావును డీఆర్‌ఐ అధికారులు నిద్రపోనివ్వడం లేదు. అరెస్టైన సమయంలో తనకున్న హక్కుల గురించి ఆమెకు పూర్తిగా తెలియదని. హత్యా అభియోగాలు దాఖలైన కేసుల్లోనూ నిందితులు మహిళలైతే బెయిల్‌ లభించిన సందర్భాలూ అనేకం ఉన్నాయి. అలాంటప్పుడు నా క్లయింట్‌ కూడా బెయిల్‌​ పొందడానికి అర్హురాలే. కాబట్టి ఆమెకు ఊరట ఇవ్వాలని వాదనలు వినిపించారాయన.మార్చి 3వ తేదీన.. దుబాయ్‌ నుంచి విమానంలో అక్రమంగా బెంగళూరుకు బంగారాన్ని తెస్తూ కెంపగౌడ ఎయిర్‌పోర్టులో డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్సీ(DRI) అధికారులకు రన్యారావు దొరికిపోయారు. నడుము చుట్టూ, కాళ్ల కిందిభాగం, షూలో 14 కేజీల బంగారాన్ని దాచారు. అయితే.. ఈ కేసు దర్యాప్తులో లోతుకు వెళ్లే కొద్దీ.. కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గత ఏడాది చివర్లో రెండుసార్లు దుబాయ్‌లో బంగారం కొనుగోలు చేసిన ఆమె.. దానిని తీసుకొని తాను స్విట్జర్లాండ్‌ వెళ్తున్నానని అక్కడి కస్టమ్స్‌ అధికారులకు వెల్లడించినట్లు తేలింది. ఆమె ప్రయాణ వివరాలను పరిశీలిస్తే, ఆమె భారత్‌కు వచ్చినట్లు వెల్లడైందని డైరెక్టరేట్‌ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ తన అరెస్ట్‌ మెమోలో పేర్కొంది. అలాగే.. స్మగ్లింగ్‌ చేసే సమయంలో ఎయిర్‌పోర్టులో వీఐపీ ప్రొటోకాల్‌ను దుర్వినియోగం చేసినట్లు ఆమెపై ఆరోపణలు వచ్చాయి. ఈ అంశంపై విచారణ జరపాలని కర్ణాటక ప్రభుత్వం ఆదేశించింది. భద్రతా తనిఖీలను తప్పించుకునేందుకు ఆమె సవతి తండ్రి, సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి కె.రామచంద్రరావు పేరును ఉపయోగించుకున్నారంటూ ఆరోపణలు వచ్చాయి. దీనిపై పూర్తిస్థాయి దర్యాప్తు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.

The Most Magnificent Monuments Built bBy Indian Women9
మహిళలు నిర్మించిన అద్భుత స్మారక కట్టడాలు..!

చరిత్రలో చాలావరకు మగవాళ్లు కట్టిన అద్భుత స్మారక కట్టడాల గురించే కథలు కథలుగా చదివాం. అలాంటి అద్భుత కళా నైపుణ్య కట్టడాలకు మహిళలు కూడా అంకురార్పణ చేశారనే విషయం తెలుసా..!. ఆ మహిళలు తమ ప్రేమ, భక్తి, ఆశయాలకు చిహ్నంగా వాటిని అత్యద్భుతంగా తీర్చిదిద్దారు. అవికూడా యూనెస్కో గుర్తింపుని దక్కించుకున్నాయి. ఆ అద్భుత స్మారక చిహ్నలు ఎక్కడున్నాయి..? వాటిని నిర్మించిన ఆ శక్తిమంతమైన నారీమణులు ఎవరు..?కట్టడ నిర్మాణాలకు శ్రీకారం చుట్టిన ఆ మహిళల చొరవను బట్టి స్త్రీలు ఆనాడే తమ వ్యక్తిత్వం, భావాలను, గుర్తింపు వ్యక్తపరిచారని సుస్పష్టంగా తెలుస్తోంది. వారంతా ప్రేమకు చిహ్నమైన తాజ్‌ మహల్‌ని నిర్మించిన షాజహాన్‌ వలే తన భర్తలపై ఉన్నప్రేమ, అభిలాష, వారి విజయాల గుర్తుగా ఈ అద్భుత స్మారక కట్టడాలను నిర్మించారు. వాటి నిర్మాణ తీరు, శిల్పకళా సంపద, మలిచిన విధానం ఆ మహిళ సృజనాత్మకతకు, అభిరుచికి ప్రతిబింబంగా ఉన్నాయి. తొలి గార్డెన్‌ సమాధి(హుమయూన్ సమాధి, ఢిల్లీ)..ఇది 16వ శతాబ్దపు అద్భుతమైన కట్టడం. మొఘల్‌ సామ్రాజ్ఞి బేగా బేగం తన భర్త మొఘల్‌ చక్రవర్తి హుమయూన్‌ జ్ఞాపకార్థం నిర్మించింది. పెర్షియన్‌ వాస్తు శిల్పులు దీన్ని అద్భుతంగా నిర్మించారు. భారతదేశంలోని తొలి గార్డెన్‌ సమాధి. మొఘల్‌ వాస్తుశిల్పానికి ప్రసిద్ధి చెందిన కట్టడం ఇది. చుట్టూ ఒక మాదారిగా కనిపించేలా పాలరాతితో నిర్మించారు. పచ్చని తోటల మధ్య కొలువుదీరిని అద్భుత కట్టడంలా పర్యాటకులను కట్టిపడేస్తుంది. ఈ స్మారక చిహ్నం యునెస్కో గుర్తింపును కూడా పొందింది. రాణి కి వావ్, గుజరాత్పాట్న రాణి కి వావ్‌ 11వ శతాబ్దంలో భర్త రాజు భీమా జ్ఞాపకార్థం నిర్మించింది. హిందూ దేవతలు, పౌరాణిక వ్యక్తులు, ఖగోళానికి సంబంధించిన అద్భుతాలు తదితరాలను వర్ణించేలా శిల్పాల గ్యాలరీ ఉంటుంది. ఇది సెవెన్‌ స్టెప్‌వెల్‌ ఆర్కిటెక్చర్‌. అంటే ఇది ఏడు మెట్ట నుయ్యి మాదిరిగా ఉంటుంది. ఒక్కో మెట్టు దిగుతూ ఉంటే శిల్పాల గ్యాలరీ మరింత ఎక్కువగా చూడొచ్చు. ఒకరకంగా ఇది నీటి పరిరక్షణ కోసం ఆనాడే అద్భతంగా తీర్చిదిద్ధిన నుయ్యిలా ఉంటుంది.విరూపాక్ష ఆలయం, కర్ణాటకభారతదేశంలోని పురాతన దేవాలయాలలో ఒకటి ఈ విరుపాక్ష ఆలయం. దీన్ని ఏడవ శతాబ్దంలో లోకమహదేవి రాణి ఆధ్వర్యంలో నిర్మించారు. ఈ దేవాలయ అభివృద్ధికి ఆమె ఎంతగానో తోడ్పాటును అందించింది. లోకమహదేవి ఈ ఆలయాన్ని తన భర్త రాజు విక్రమాదిత్య II శత్రురాజులపై సాధించిన విజయానికి గుర్తుగా నిర్మించింది. ఇక్కడ హంపీ శిల్పాలు ప్రధాన ఆకర్షణగా ఉంటాయి. ఈ ఆలయం ముందు నిర్మించిన గ్రాండ్‌ గోపురం, వివరణాత్మక శిల్పాలు, క్లిష్టమైన స్థంభాల నిర్మాణం చూపురులను కట్టిపడేస్తుంది. ఈ ఆలయంలోని ఆచారాలు, అక్కడే నివాసం ఉండే ఏనుగుల సందడి ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. ఇతిమాడ్-ఉద్-దౌలా, ఆగ్రామొఘల్‌ రాణి ముంతాజ్ మహల్ జ్ఞాపకార్థం షాజహాన్ నిర్మించిన తాజ్‌మహల్‌ ఎదురుగా ఇతిమాద్-ఉద్-దౌలా కట్టడం ఆభరణంలా ఉంటుంది. దీన్ని మొఘల్‌ని దశాబ్దం పైగా పాలించిన శక్తిమంతమైన మహారాణి నూర్ జహాన్ నిర్మించింది. ఆమె తన తండ్రి మీర్జా ఘియాస్ బెగ్ జ్ఞాపకార్థం నిర్మించింది. యమునా ఒడ్డున నిర్మించిని సుందరమైన స్మారక చిహ్నం ఇది. ఇది ఆమె నిర్మాణాత్మక దృష్టిని, రాజకీయ శక్తిని ప్రతిబింబిస్తుంది.తాజ్-ఉల్-మస్జిద్, భోపాల్భోపాల్ బేగం కేవలం పాలకురాలేకాదు, కళ, వాస్తుశిల్పానికి పోషకులు కూడా. తాజ్-ఉల్-మస్జిద్ మసీదుల కీరీటంగా అభివర్ణించవచ్చు ఎందుకంటే ఏళ్లతరబడి నిర్మించి అద్భుత కట్టడం ఇది. పింక్‌ ఇసుకరాయి గోపురాలు, అత్యున్నత మినారెట్స్, విశాలమైన ప్రాంగణంతో అందంగా తీర్చిదిదదారు. ఇది బారతదేశంలో ఉన్న అతిపెద్ద మసీదులలో ఒకటి. దాని స్కైలైన్‌ ఆకృతి మహిళా పాలకురాలి ప్రత్యేక చరిత్రకు సాక్షిగా నిలిచింది.మిర్జన్ కోట, కర్ణాటకఈ కోట నిర్మాణం మనోహరంగా ఉంటుంది. దీన్ని 16వ శతాబ్దంలో రాణి చెన్నాభైరదేవి పాలనలో నిర్మించారు. మసాలా వాణిజ్యంలో ఆధిపత్యం కారణంగా ఆమెను "పెప్పర్ క్వీన్" అని పిలుస్తారు. ప్రస్తుతం పాక్షికంగా శిథిలావస్థలో ఉన్నప్పటికీ..ఆ కర్ణాట రాణి గొప్ప చరిత్రకు గుర్తుగా ప్రజల మనసులో నిలిచిపోయింది.దక్షణేశ్వర్‌ కాళి ఆలయం, కోల్‌కతా19వ శతాబ్దంలో రాణి రష్మోని నిర్మించిన దక్షిణేశ్వర కాళి ఆలయం. కాళి దేవత ఆరాధన కోసం హుగ్లీ నదితీరాన నిర్మించిన పుణ్యక్షేత్రం. చరిత్రలో రాజులు అధికారం లేదా విజయం కోసం ఇలాంటి దేవాలయాలను నిర్మించినట్లు విన్నాం. అయితే ఆ రాజుల మాదిరిగా కాకుండా రాణి రష్మోని పరోపకార బుద్ధితో ఆధ్యాత్మిక స్థలాలు ప్రజలందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశ్యంతో నిర్మించింది. ఆలయ నిర్మాణం అత్యంత విలక్షంగా ఉంటుంది. ఆధ్యాత్మిక గురువు రామకృష్ణ పరమహంస భోధనలకు అర్థం పట్టేలా ఉంటుంది ఈ ఆలయ నిర్మాణం. కోలకతా అనగానే గుర్తొచ్చే కాళిమాత ఆలయంగా ఇది ప్రసిద్ధికెక్కింది. ప్రతి ఏడాది వేలాది భక్తులు, సందర్శకులు ఈ ఆలయాన్ని సందర్శించుకోవడానికి తరలివస్తున్న గొప్ప క్షేత్రంగా అలరారుతోంది.(చదవండి: 'ఎగ్‌ ఫ్రీజింగ్‌' అంటే..? ఉపాసన, నటి మెహ్రీన్‌ , తానీషా ముఖర్జీ అంతా..!)

KSR Comment On Chandrababu Mark Politics in MLCs Selection10
మొత్తం చినబాబే చేశారు! రెడ్‌బుక్‌ ఎఫెక్ట్‌తో అంతా..

ఇచ్చిన మాటను గాలికి వదిలేయడం ఎలాగో తెలుసుకోవాలంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను చూడాల్సిందే. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత.. ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌లు ఈ విషయంలో పోటీ పడుతున్నారు. అందుకు తాజా ఉదాహరణే.. శాసనమండలి ఎన్నికలు!. మొత్తం ఐదు సీట్లలో.. టీడీపీ మూడు స్థానాలు, జనసేన, బీజేపీ చెరో స్థానంలో పోటీ చేస్తున్నాయి. వీరంతా ఏకగ్రీవంగా ఎన్నికవుతారు. అయితే ఈ ఎంపికలన్నీ ముఖ్యమంత్రి కుమారుడు లోకేష్‌ సొంత టీమ్‌ కోసమేనని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. టీడీపీకి జాతీయాధ్యక్షుడు చంద్రబాబు నాయుడే అయినప్పటికీ.. జాతీయ కార్యదర్శి అయిన లోకేష్‌ మాటకే పార్టీలో ఎక్కువ చెల్లుబాటు అవుతున్నట్లు సమాచారం. సీనియర్లను పూర్తిగా పక్కనబెట్టి, గతంలో తాము చేసిన బాసలకు తిలోదకాలు ఇచ్చి ఈ ఎంపికలు జరిపారన్న భావన టీడీపీ వర్గాలలో వ్యక్తం అవుతోంది. ఉన్నవి మూడు సీట్లే. కాబట్టి అందరిని సంతృప్తి పరచడం కష్టమే. కాని ఎంపిక చేసిన వారిని ఇతర ఆశావహులతో పోల్చి చూసినప్పుడు విమర్శలు వస్తున్నాయా? ప్రశంసలు వస్తున్నాయా? అనేది పరిశీలనకు వస్తుంది. ఆ రకంగా చూస్తే ఈ ఎంపికలు అంత సంతృప్తి కలిగించలేదని అంటున్నారు. 👉పార్టీలో 42 ఏళ్లు వేర్వేరు పదవులు నిర్వహించిన సీనియర్ నేత యనమల రామకృష్ణుడుకు టీడీపీ రిటైర్మెంట్‌ ఇచ్చినట్లే కనిపిస్తుంది. 1995లో యనమల స్పీకర్‌గా ఉండడం వల్లే.. ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రి పదవి నుంచి తోసేసి చంద్రబాబు తేలికగా సీఎం అయ్యారని అంటారు. చంద్రబాబుకు రాజకీయ సలహాలు ఇస్తుంటారని కూడా ప్రచారం ఉంది. లోకేష్ నాయకత్వం వచ్చాక ఈయనను మెల్లగా పక్కన పెట్టారు. అయితే యనమల కుమార్తెకు మాత్రం ఎమ్మెల్యే పదవి వచ్చింది. ఇంకో కూతురి భర్త ఎంపీ అయ్యారు. వియ్యంకుడు కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇది కూడా మైనస్ కావచ్చు. అయితే.. టీడీపీలో ఆయా కుటుంబాలకు ప్రాధాన్యం ఇవ్వలేదా అన్న చర్చ రావచ్చు. అది వేరే సంగతి. 👉ఇక అందరి దృష్టిని ఆకర్షించేది పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ వ్యవహారం. పిఠాపురం నుంచి పవన్ పోటీ చేయాలనుకున్నప్పుడు వర్మ సీటు వదలుకోవాల్సి వచ్చింది. ప్రభుత్వం రాగానే తొలి ఎమ్మెల్సీ పదవి ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. మరోవైపు పవన్‌ కల్యాణ్‌ కూడా ఆయన(వర్మ) ఎమ్మెల్సీ అయిపోయినట్లేనని ప్రచారం చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. పవన్ ఉప ముఖ్యమంత్రి అయ్యారు. అప్పటి నుంచి ఇప్పటి దాకా.. రెండుసార్లు ఎమ్మెల్సీ పదవులు భర్తీ అయ్యాయి. కాని వర్మకు అవకాశం ఇవ్వకుండా హామీని గాలికి వదలివేసి అవమాన భారం మిగిల్చారు. ఇప్పుడు వర్మ కక్కలేక, మింగలేక ఇబ్బంది పడుతున్న పరిస్థితి. వర్మకు పదవి ఇస్తే పిఠాపురంలో పోటీ కేంద్రం అవుతారన్నది పవన్ భయమట. ఏది ఏమైనా మాట ఇచ్చి ఎలా తప్పవచ్చో చెప్పడానికి వర్మ వ్యవహారం ఉదాహరణ అవుతుంది. కొంతకాలం క్రితం వరకు కనీసం తన వాయిస్ వినిపించే వారు. కాని ఇప్పుడు లోకేష్ రెడ్ బుక్ భయమో, మరేదైనా కారణంతోనో వర్మ కనీసం నిరసన కూడా చెప్పలేని నిస్సహాయ స్థితిలో పడ్డారన్న వ్యాఖ్యలు వస్తున్నాయి. 👉వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణను ఎలా ప్రలోభ పెట్టారో.. ఏకంగా ఆయన తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఎమ్మెల్సీ పదవి ఇస్తామని అన్నారు. కాని ఆయనకు పదవి హుళక్కి అయింది. పలువురు ఇతర ప్రముఖులు దేవినేని ఉమ, ప్రభాకర చౌదరి, బుద్దా వెంకన్న, వంగవీటి రాధాకృష్ణ మొదలైన వారంతా గత ఎన్నికలలో టిక్కెట్లు ఆశించి భంగపడ్డారు. అప్పుడు వారిని ఓదార్చడానికి ఎమ్మెల్సీ, ఇతర పదవులు ఇస్తామన్నారు. కాని వారికి ఏ పదవి ఇవ్వలేదు. ఇప్పుడు ఎమ్మెల్సీ పదవి కూడా రాలేదు. వైఎస్సార్‌సీపీ నుంచి పార్టీ మారిన జంగా కృష్ణమూర్తి పరిస్థితి అంతే. 👉ఒక్క బీటీ నాయుడుకు మాత్రం ఎమ్మెల్సీ పదవి తిరిగి వచ్చారు. చంద్రబాబుకు బాగా ఉపయోగపడ్డారని టీడీపీ మీడియా ఒక ప్రచారం చేస్తోంది కాని, ఆయనను మించి ఎవరూ లేరా? అనే సందేహం కూడా వస్తుంది. బీదా రవిచంద్రకు పదవి ఇవ్వడం మామూలుగా అయితే అభ్యంతరం ఉండదు. కాని, వైఎస్సార్‌సీపీ నుంచి ఆయన సోదరుడు టీడీపీలోకి వచ్చి మళ్లీ రాజ్యసభ సభ్యుడు అయ్యారు. ఇప్పుడు రవిచంద్రకు కూడా పదవి దక్కింది. ఇక కావలి గ్రీష్మకు ఇప్పటికే ఒక కార్పొరేషన్ ఛైర్ పర్సన్ పదవి ఉంది. ఆమెను ఎమ్మెల్సీ చేయడం విశేషం. మాజీ స్పీకర్ ప్రతిభా భారతి కుమార్తెగా కన్నా, ఆమె మహానాడులో చంద్రబాబు సమక్షంలోనే వేలాది మంది చూస్తుండగా, తొడలు గొట్టడం, అభ్యంతరక భాషలో వైఎస్సార్‌సీపీ వారిని దూషించడం వంటి కారణాలే ప్రామాణికతగా పదవి వచ్చిందన్న ప్రచారం సాగుతోంది. మరి ఆమె మండలిలో ఇంకెలాంటి బూతులకు దిగుతారోనన్న వ్యాఖ్యలు టీడీపీలో వస్తున్నాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బూతులను ఎంకరేజ్ చేసినట్లు వ్యవహరించిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చాక సుద్దులు చెబుతున్నారు. ఎల్లోమీడియా మాత్రం సహజంగానే ఈ టీడీపీ ఎమ్మెల్సీ ఎంపికలకు బిల్డప్ ఇస్తూ బలహీనవర్గాలకు పెద్ద పీట అని రాసి ప్రచారం చేశాయి. జనసేన అభ్యర్దిగా పవన్ సోదరుడు, నటుడు నాగబాబును ఎంపిక చేశారు. కొద్ది నెలల క్రితమే ఆయనకు మంత్రి పదవి ఇస్తున్నట్లుగా చంద్రబాబు ప్రకటించారు. కాని ఎందువల్లో ఇంకా ఇవ్వలేదు. ఇప్పుడు ఎమ్మెల్సీ అవుతున్నందున ఇవ్వకతప్పదేమో!. 👉ఎల్లో మీడియా నాగబాబుకు ఎమ్మెల్సీ ఇవ్వడం లేదని, కార్పొరేషన్ చైర్మన్‌ పదవి మాత్రమే ఇస్తారంటూ కథనాలు రాసింది. అందుకు పవన్ కూడా ఓకే అన్నట్లు చెప్పాయి. కాని ఏమైందో కాని, మరుసటి రోజు నాగబాబు ఎమ్మెల్సీ పదవికి నామినేషన్ వేయబోతున్నారని జనసేన ప్రకటించింది. విశేషం ఏమిటంటే గతంలో పవన్ తన బంధువులకు పదవులు ఇవ్వడం కోసం పార్టీని పెట్టడం లేదని గొంతెత్తి మరీ చెప్పారు. అంతేకాక కుల రాజకీయాలపై ఒక్కోసారి ఒక్కోరకంగా మాట్లాడారు. ఇప్పుడు జనసేన అంటే ఒక సామాజిక వర్గ పార్టీనే అన్న భావన కలిగించేలా పదవులు కేటాయిస్తున్నారు. ఇంతకుముందు ఒక ఎమ్మెల్సీ పదవిని కూడా అదే వర్గానికి ఇచ్చారు. ఇప్పుడు తన సోదరుడు నాగబాబుకు ఇచ్చుకున్నారు. తనతో పాటు కందుల దుర్గేష్ కూడా అదే వర్గం వారు కావడం గమనార్హం. నాదెండ్ల మనోహర్ మంత్రిగా ఉన్నారు. దీంతో జనసేనలో ఇతర సామాజిక వర్గాలకు అసలు ప్రాధాన్యత లేదన్న భావన ఆయన అభిమానులలో ఏర్పడడానికి ఆస్కారం కలిగింది. 👉గతంలో చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేసిన బీజేపీ సీనియర్ నేత సోము వీర్రాజు మరోసారి ఎమ్మెల్సీ అవుతున్నారు. వీర్రాజుకు ఎమ్మెల్సీ ఇవ్వడంపై బీజేపీ లో ఆక్షేపణ ఉండకపోవచ్చు. కాని ఈ పదవిని ఆశిస్తున్న ఇతర సీనియర్ లు కొందరికి ఆశాభంగం అవుతుంది. వీర్రాజుకు పదవి రావడం పార్టీ అధ్యక్షురాలు పురందేశ్వరికి, ముఖ్యమంత్రి చంద్రబాబుకు అంతగా ఇష్టం ఉండకపోవచ్చు. కాని బీజేపీ అధిష్టానాన్ని కాదనే పరిస్థితి వీరికి లేదు. వీర్రాజు నామినేషన్ చివరి క్షణంలో వేసిన తీరును బట్టి హైకమాండ్ కావాలనే ఆయనకు పదవి ఇచ్చిందని, తద్వారా టీడీపీకి, పురందేశ్వరికి చెక్ పెట్టే ఆలోచన చేసి ఉండవచ్చన్నది కొందరి విశ్లేషణ. ఇక్కడ ఒక సంగతి చెప్పాలి. గతంలో వీర్రాజు పార్టీ అధ్యక్షుడుగా ఉన్నప్పుడు 2014-19 టర్మ్‌లో చంద్రబాబు ప్రభుత్వ అవినీతిపై ఎక్కడకక్కడ కడిగి పారేసేవారు. నీరు-చెట్టు స్కీమ్ కింద తెలుగు తమ్ముళ్లు రూ.13 వేల కోట్లు దోచేశారని సంచలన ఆరోపణ కూడా చేశారు.ఇప్పుడు వాటన్నిటిని మరచి పోయి టీడీపీతో స్నేహం చేయకతప్పదు. ప్రధాని మోదీనే టీడీపీ పెద్దలు దారుణంగా దూషించినా పొత్తు పెట్టుకోగా లేనిది, వీర్రాజుది ఏముందిలే అనేవారు కూడా ఉన్నారు. ఏది ఏమైనా ఈ ఎంపికల వల్ల టీడీపీ, జనసేనలలో కొంతమేర అంతర్గతంగా లుకలుకలు రావచ్చు. తెలంగాణలో ప్రముఖ నటి విజయశాంతికి ఎమ్మెల్సీ పదవి వచ్చింది. అధిష్టానం ఆమెను ఎంపిక చేసిందని చెబుతున్నారు. మరో నేత అద్దంకి దయాకర్ గతసారి ఎన్నికలలో తన సీటును వదలుకుని ప్రచారానికి పరిమితం అయ్యారు. అయినా టిక్కెట్ వస్తుందా? రాదా? అనే టెన్షన్ ఉన్నప్పటికీ ఎట్టకేలకు సాధించగలిగారు. మరో సీటును శంకర్ నాయక్ అనే నేతకు కేటాయించారు.ఇంకో స్థానం సిపిఐకి కేటాయించారు. కాగా బీఆర్‌ఎస్‌ పక్షాన దాసోజు శ్రావణ్ కు ఇవ్వడం ద్వారా గతంలో ఆయనకు జరిగిన నష్టాన్ని భర్తీ చేసినట్లయింది. అప్పట్లో కేసీఆర్‌ నామినేట్ చేసినా, గవర్నర్ ఆమోదం జాప్యం అవడం, ఇంతలో ఎన్నికలు రావడం ,కాంగ్రెస్ గెలవడం వంటి కారణాలతో ఆయన ఎమ్మెల్సీ కాలేకపోయారు. ఇప్పటికి ఆయనకు పదవి లభించింది. తెలంగాణలో ఈ ఎంపికలు.. ఏపీతో పోల్చితే కాస్త బెటర్ గా ఉన్నట్లే కావచ్చు.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

International View all
title
పీఐఏను మరోసారి అమ్మ‌కానికి పెట్టిన పాకిస్తాన్‌

ఇస్లామాబాద్‌: ప్రభుత్వం ఆధీనంలోని పాకిస్తాన్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌లైన్స్‌ (పీఐఏ)ను పాక్‌ ప్రభుత్వం మరోసారి విక్రయానికి పె

title
బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని షేక్‌ హసీనాకు ఎదురుదెబ్బ

ఢాకా: బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని షేక్‌ హసీనాకు ఎదురుదెబ్బ తగిల

title
పాక్‌ రైలు హైజాక్‌.. కొనసాగుతున్న రెస్య్కూ ఆపరేషన్‌

ఇస్లామాబాద్‌: దాయాది దేశం పాకిస్థాన్‌లో వేర్పాటువాద బలోచ్‌ మ

title
జెలెస్కీ గ్రీన్‌సిగ్నల్‌.. పుతిన్‌ ప్లానేంటి?

జెద్దా: మూడేళ్లుగా కొనసాగుతున్న రష్యా–ఉక్రెయిన్‌ యుద్దానికి

title
మనిషిని కుక్క షూట్‌ చేసింది!!

మెంఫిస్‌ సిటీ: కుక్క మనిషిని కరవడం వార్తకాదు..

National View all
title
పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు ఆర్టీఐ సమాచారంలో షాకింగ్‌ లెక్కలు

సాక్షి ముంబై: రాష్ట్రంలో తొమ్మిదేళ్లలో జరిగిన వివిధ రోడ్డు

title
Haryana: కాంగ్రెస్‌కు ఘోర పరాభవం

ఛండీగఢ్‌: హర్యానా స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌‌ పార్

title
ప్రపంచంలోనే అత్యంత కలుషితమైన న‌గ‌రం మ‌న‌దే!

న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అత్యధిక జనాభాతో కిటకిటలాడుతున్న మన దేశం కాలుష్య నగరాల జాబితాలోనూ టాప్‌లో ఉంది.

title
రన్యారావును నిద్రపోనివ్వడం లేదు!

బెంగళూరు: అక్రమ బంగారం రవాణా కేసులో అరెస్టైన కన్నడ నటి రన్యా

title
రికార్డింగ్‌ డ్యాన్సర్‌కు ముద్దు.. బూతు పాటతో ఎమ్మెల్యే రచ్చ

అనుచిత వ్యాఖ్యలు చేసిన ఓ యూబ్యూటర్‌పై ఏకంగా ఓ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తే మండిపడ్డారు.

NRI View all
title
సుదీక్ష మిస్సింగ్‌.. కిడ్నాపైందా?

న్యూఢిల్లీ: కరీబియన్‌ దేశం డొమినికన్‌ రిపబ్లిక్‌లో తెలుగు వి

title
టీటీఏ (TTA) న్యూయార్క్‌ చాప్టర్‌ రీజినల్ వైస్ ప్రెసిడెంట్‌గా జయప్రకాష్ ఎంజపురి

తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్(TTA)  న్యూయార్క్ చాప్టర్‌కి రీజినల్ వైస్ ప్రెసిడెంట్ (RVP)గా జయప్రకాష్ ఎంజపురి &

title
న్యూజెర్సీలో ఘనంగా ‘మాట’ మహిళా దినోత్సవ వేడుకలు

మహిళలకు  ప్రాధాన్యత ఇస్తూ, మహిళా సాధికారతకు, అభ్యున్నతికి  పలు కార్యక్రమాలు చేపడుతున్న మన అమెరికన్ తెలుగు అసోస

title
ఫ్లోరిడాలో అత్యున్నత స్థాయి ‘హెర్ హెల్త్ ఆంకాలజీ కాంగ్రెస్ 2025’

అమెరికాలోని ఫ్లోరిడాలోని ఓర్లాండో నగరంలో  మెడికల్‌ కాన్ఫరెన్స్‌ ఘనంగా జరిగింది.

title
డాక్టర్‌ కావాలనుకుంది : భారతీయ విద్యార్థిని విషాదాంతం?!

డొమినికన్ రిపబ్లిక్‌లో  కనిపించకుండాపోయిన భారతీయ విద్యార్థిని ప్రాణాలు కోల్పోయిందా అంటే అవుననే అనుమానాలు బాగా బలపడు

Advertisement

వీడియోలు

Advertisement