Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

India Win Champions Trophy 2025 By Beating New Zealand In Final1
ఛాంపియన్స్‌ ట్రోఫీ-2025 విజేత భారత్‌.. ఉత్కంఠగా సాగిన ఫైనల్లో న్యూజిలాండ్‌పై విజయం

పాకిస్తాన్‌, దుబాయ్‌ సంయుక్తంగా ఆతిథ్యమిచ్చిన ఛాంపియన్స్‌ ట్రోఫీ-2025 ఎడిషన్‌లో టీమిండియా విజేతగా నిలిచింది. దుబాయ్‌ వేదికగా ఇవాళ (మార్చి 9) జరిగిన ఫైనల్లో భారత్‌ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఉత్కంఠగా సాగిన ఫైనల్లో తొలుత బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. భారత స్పిన్నర్లు చెలరేగిన వేల డారిల్‌ మిచెల్‌ (63), మైఖేల్‌ బ్రేస్‌వెల్‌ (53 నాటౌట్‌) అద్భుతమైన అర్ద సెంచరీలు సాధించి న్యూజిలాండ్‌కు గౌరవప్రదమైన స్కోర్‌ అందించారు. ఆదిలో రచిన్‌ రవీంద్ర (37), ఆఖర్లో గ్లెన్‌ ఫిలిప్స్‌ (34) మంచి ఇన్నింగ్స్‌లు ఆడారు. న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌లో విల్‌ యంగ్‌ (15), కేన్‌ విలియమ్సన్‌ (11), టామ్‌ లాథమ్‌ (14),మిచెల్‌ సాంట్నర్‌ (8) తక్కువ స్కోర్లకు ఔటయ్యారు. భారత్‌ బౌలర్లలో వరుణ్‌ చక్రవర్తి, కుల్దీప్‌ యాదవ్‌ తలో 2.. షమీ, జడేజా చెరో వికెట్‌ పడగొట్టారు. భారత బౌలర్లలో షమీ, హార్దిక్‌ ధారాళంగా పరుగులు సమర్పించుకోగా.. కుల్దీప్‌, వరుణ్‌, జడ్డూ, అక్షర్‌ పొదుపుగా బౌలింగ్‌ చేశారు. ఈ మ్యాచ్‌లో భారత స్పిన్నర్లు అద్భుతంగా బౌలింగ్‌ చేసి న్యూజిలాండ్‌ బ్యాటర్లు భారీ స్కోర్‌ చేయకుండా కట్టడి చేశారు.అనంతరం స్పిన్‌కు అనుకూలించే పిచ్‌పై 252 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్‌.. 49 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. ఛేదనలో రోహిత్‌ (76) భారత్‌కు శుభారంభాన్ని అందించారు. శుభ్‌మన్‌ గిల్‌తో (31) కలిసి తొలి వికెట్‌కు 105 పరుగులు జోడించాడు. అయితే భారత్‌ 17 పరుగుల వ్యవధిలో గిల్‌, కోహ్లి (1), రోహిత్‌ వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో శ్రేయస్‌ అయ్యర్‌ (48), అక్షర్‌ పటేల్‌ (29) మంచి భాగస్వామ్యం నెలకొల్పి భారత్‌ను తిరిగి గేమ్‌లోకి తెచ్చారు. అయితే శ్రేయస్‌, అక్షర్‌ కూడా స్వల్ప వ్యవధిలో ఔట్‌ కావడంతో టీమిండియా మరోసారి ఒత్తిడిలో పడింది. ఇన్నింగ్స్‌ మధ్యలో పరుగులు చేసేందుకు భారత బ్యాటర్లు తెగ ఇబ్బంది పడ్డారు. న్యూజిలాండ్‌ స్పిన్నర్లు అద్భుతంగా బౌలింగ్‌ చేసి టీమిండియా బ్యాటర్లపై తీవ్రమైన ఒత్తిడి తెచ్చారు.ఈ దశలో కేఎల్‌ రాహుల్‌ (34 నాటౌట్‌).. హార్దిక్‌ పాండ్యా (18), రవీంద్ర జడేజాతో (18 నాటౌట్‌) కలిసి మ్యాచ్‌ విన్నింగ్‌ భాగస్వామ్యాలు నెలకొల్పి భారత్‌ను విజయతీరాలకు చేర్చాడు. జడేజా బౌండరీ బాది భారత్‌ను గెలిపించాడు. న్యూజిలాండ్‌ బౌలర్లలో సాంట్నర్‌, బ్రేస్‌వెల్‌ తలో 2 వికెట్లు పడగొట్టగా.. జేమీసన్‌, రచిన్‌ చెరో వికెట్‌ దక్కించుకున్నారు. ఛాంపియన్స్‌ ట్రోఫీని గెలవడం భారత్‌కు ఇది మూడోసారి (2002, 2013, 2025). ఫైనల్లో అద్భుతంగా బ్యాటింగ్‌ చేసిన రోహిత్‌ శర్మకు ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు లభించగా.. టోర్నీ ఆధ్యాంతం రాణించిన రచిన్‌ రవీంద్రకు ప్లేయర్‌ ఆఫ్‌ ద టోర్నీ అవార్డు లభించింది.

CT 2025 Winner India: Rohit Sharma Lauds KL Rahul And Varun Hails Teamwork2
మా స్పిన్నర్లు అద్భుతం.. అతడు ఒత్తిడిని చిత్తు చేశాడు: రోహిత్‌

పుష్కరకాలం తర్వాత టీమిండియా మరోసారి చాంపియన్స్‌ ట్రోఫీ(ICC Champions Trophy 2025)ని ముద్దాడింది. పాతికేళ్ల క్రితం న్యూజిలాండ్‌ చేతిలో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుని 2025 విజేతగా ఆవిర్భవించింది. దుబాయ్‌ వేదికగా ఆదివారం నాటి ఫైనల్లో కివీస్‌ను నాలుగు వికెట్ల తేడాతో ఓడించి టైటిల్‌ కైవసం చేసుకుంది. ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో సాంట్నర్‌ బృందంపై పైచేయి సాధించి అభిమానులకు కనులవిందు చేసింది.మా స్పిన్నర్లు అద్భుతంఈ నేపథ్యంలో విజయానంతరం భారత జట్టు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ(Rohit Sharma) మాట్లాడుతూ సమిష్టి కృషి వల్లే గెలుపు సాధ్య​మైందని సహచరులపై ప్రశంసలు కురిపించాడు. ముఖ్యంగా స్పిన్నర్లు చాంపియన్స్‌ ట్రోఫీ-2025 ఆసాంతం అదరగొట్టారని కితాబులిచ్చాడు. అదే విధంగా తమకు మద్దతుగా నిలిచిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపాడు.‘‘ఇది మా సొంత మైదానం కాదు. అయినప్పటికీ మాకు మద్దతుగా అభిమానులు ఇక్కడికి తరలివచ్చారు. మా హోం గ్రౌండ్‌ ఇదే అన్నంతలా మాలో జోష్‌ నింపారు. గెలుపుతో మేము వారి మనసులను సంతృప్తిపరిచాం.ఫైనల్లో మాత్రమే కాదు.. టోర్నీ ఆరంభం నుంచీ మా స్పిన్నర్లు గొప్పగా రాణించారు. దుబాయ్‌ పిచ్‌ స్వభావరీత్యా వారిపై భారీ అంచనాలు నెలకొన్నప్పటికీ ఒత్తిడికి లోనుకాకుండా పనిపూర్తి చేశారు. వారి నైపుణ్యాలపై నమ్మకంతో మేము తీసుకున్న నిర్ణయాలు సరైనవే అని నిరూపించారు. వారి బలాలను మాకు అనుకూలంగా మలచుకోవడంలో మేము సఫలమయ్యాం.అతడు ఒత్తిడిని చిత్తు చేశాడుఇక.. కేఎల్‌ రాహుల్‌(KL Rahul) గురించి చెప్పాలంటే.. ఎలాంటి పరిస్థితుల్లోనూ ఒత్తిడిని దరిచేరనీయడు. అందు​కే మేము అతడి సేవలను మిడిల్‌లో ఎక్కువగా ఉపయోగించుకున్నాం. ఈరోజు తను బ్యాటింగ్‌ చేస్తున్నపుడు పరిస్థితులు మాకు అంత అనుకూలంగా లేవు. అయినప్పటికీ అతడు ఏమాత్రం తడబడకుండా షాట్ల ఎంపికలో సంయమనం పాటించాడు.తనతో పాటు బ్యాటింగ్‌ చేస్తున్న ఆటగాడు స్వేచ్ఛగా బ్యాట్‌ ఝులిపించేలా చక్కటి సహకారం అందిస్తాడు. తను సరికొత్తగా కనిపిస్తున్నాడు. నాణ్యమైన బౌలర్‌ఇక వరుణ్‌ టోర్నీ ఆరంభంలో ఆడలేదు. అయితే, న్యూజిలాండ్‌తో లీగ్‌ మ్యాచ్‌లో ఐదు వికెట్లతో మెరిసిన తర్వాత అతడి సేవలను పూర్తిగా వినియోగించుకోవాలని మేము నిర్ణయించుకున్నాం. అతడొక నాణ్యమైన బౌలర్‌. ట్రోఫీ గెలవడంలో ప్రతి ఒక్క సభ్యుడు తమ వంతు పాత్ర పోషించారు’’ అని జట్టు ప్రదర్శన పట్ల రోహిత్‌ శర్మ సంతృప్తి వ్యక్తం చేశాడు. కాగా చాంపియన్స్‌ ట్రోఫీ-2025 ఫైనల్లో టాస్‌ గెలిచిన న్యూజిలాండ్‌ తొలుత బ్యాటింగ్‌ చేసింది. డారిల్‌ మిచెల్‌(63), మైకేల్‌ బ్రాస్‌వెల్‌(53 నాటౌట్‌) అర్ధ శతకాలతో రాణించారు. ఈ క్రమంలో నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది.భారత బౌలర్లలో వరుణ్‌ చక్రవర్తి, కుల్దీప్‌ యాదవ్‌ రెండేసి వికెట్లు పడగొట్టగా.. షమీ, రవీంద్ర జడేజా ఒక్కో వికెట్‌ తీశారు.ఇక లక్ష్య ఛేదనలో భారత్‌కు ఓపెనర్లు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, శుబ్‌మన్‌ గిల్‌(31) శుభారంభం అందించారు. విరాట్‌ కోహ్లి(1) విఫలం కాగా.. శ్రేయస్‌ అయ్యర్‌(48)తో కలిసి రోహిత్‌ ఇన్నింగ్స్‌ చక్కదిద్దాడు. 76 పరుగుల వద్ద రోహిత్‌ స్టంపౌట్‌ కాగా.. అక్షర్‌ పటేల్‌(29), కేఎల్‌ రాహుల్‌(33 బంతుల్లో 34 నాటౌట్‌), హార్దిక్‌ పాండ్యా(18 బంతుల్లో 18), రవీంద్ర జడేజా(6 బంతుల్లో 9) వేగంగా ఆడి మరో ఓవర్‌ మిగిలి ఉండగానే జట్టును విజయతీరాలకు చేర్చారు. రోహిత్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కింది.

Chandrababu Naidu Skips As SVSN Varma For MLC Ticket3
పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మకి చంద్రబాబు షాక్

అమరావతి: పిఠాపురం మాజీ ఎమ్మెల్యే SVSN వర్మకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు షాకిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో వర్మకి ఎమ్మెల్సీ టికెట్ ఇస్తానని హామీ ఇచ్చిన బాబు..ఇప్పుడు ఆ హామీని గాలికొదిలేశారు. దాంతో చంద్రబాబు మాట నమ్మి ఇప్పటికే రెండు సార్లు మోసపోయిన వర్మ.. మరోసారి దానికి గురి కాకతప్పలేదు. తాజాగా టీడీపీ ప్రకటించిన ఎమ్మెల్సీ టికెట్ల జాబితాలో వర్మ పేరు ఎక్కడా కనిపించలేదు.పవన్ కళ్యాణ్ కు పిఠాపురం ఎమ్మెల్యే సీటును వర్మ వదులుకున్న క్రమంలో ఎమ్మెల్సీ టికెట్ హామీ ఇచ్చారు చంద్రబాబు. ఇప్పుడు తీరా చూస్తే వర్మ కి ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేదు చంద్రబాబు. దాంతో చంద్రబాబు తీరుపై వర్మ వర్గంలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. మరొకవైపు వర్మ రాజకీయ భవిష్యత్ ముగిసిందనే ప్రచారం కూడా సాగుతోంది. చంద్రబాబు ఇచ్చిన షాక్ తో వర్మ వర్గం అయోమయంలో పడింది. తమనేత రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిన సమయంలో ఏం చేయాలనే దానిపై వారు సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం.

CT 2025 Winner India: Kohli Says Its Been Amazing After A Tough Australia Tour4
Virat Kohli: అద్భుత విజ‌యం.. అంతులేని సంతోషం!.. ఆసీస్ టూర్ త‌ర్వాత‌..

ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ-2025(ICC Champions Trophy 2025) ఫైనల్లో టీమిండియా విజయం పట్ల స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి(Virat Kohli) హర్షం వ్యక్తం చేశాడు. టోర్నమెంట్‌ ఆసాంతం జట్టులోని ప్రతి ఒక్క సభ్యుడు టైటిల్‌ గెలిచేందుకు తమ వంతు సహకారం అందించాడని తెలిపాడు. భారత జట్టులో ప్రస్తుతం ప్రతిభకు కొదువలేదని.. యువ ఆటగాళ్లు సీనియర్ల సలహాలు తీసుకుంటూనే తమదైన శైలిలో ముందుకు సాగుతున్న తీరును కొనియాడాడు.కాగా పాకిస్తాన్‌ వేదికగా ఫిబ్రవరి 19న మొదలైన చాంపియన్స్‌ ట్రోఫీ తాజా ఎడిషన్‌.. ఆదివారం దుబాయ్‌ వేదికగా భారత్‌- న్యూజిలాండ్‌ మధ్య ఫైనల్‌తో ముగిసింది. ఈ వన్డే టోర్నీలో గ్రూప్‌-ఎ నుంచి భారత్‌, పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌, న్యూజిలాండ్‌.. గ్రూప్‌-బి నుంచి ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, అఫ్గనిస్తాన్‌ ఇంగ్లండ్‌ పోటీపడ్డాయి. అయితే, ఆసీస్‌ను ఓడించి టీమిండియా.. సౌతాఫ్రికాను ఓడించి న్యూజిలాండ్‌ తుదిపోరుకు అర్హత సాధించాయి.ఈ క్రమంలో మార్చి 9 నాటి మ్యాచ్‌లో రోహిత్‌ సేన ఆఖరి వరకు పోరాడి కివీస్‌పై నాలుగు వికెట్ల తేడాతో గెలుపొంది.. టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో విజయానంతరం కోహ్లి తన మనసులోని భావాలు పంచుకున్నాడు. ‘‘ఇది అద్భుత విజయం. ఆస్ట్రేలియా పర్యటనలో చేదు అనుభవం తర్వాత పెద్ద టోర్నమెంట్‌ గెలవాలని మేము కోరుకున్నాం.సరైన దిశలోఇలాంటి తరుణంలో చాంపియన్స్‌ ట్రోఫీ గెలవడం అద్భుతంగా అనిపిస్తోంది. యువ ఆటగాళ్లతో కలిసి ఆడటం సంతోషంగా ఉంది. సీనియర్లుగా మేము మా అనుభవాలను వారితో పంచుకుంటున్నాం. వారు కూడా మా సలహాలు, సూచనలు తీసుకుంటూనే తమదైన శైలిలో రాణిస్తున్నారు.జట్టు ప్రస్తుతం సరైన దిశలో వెళ్తోంది. ఈ టోర్నీ మొత్తాన్ని మేము ఆస్వాదించాం. కొంతమంది బ్యాట్‌తో రాణిస్తే.. మరికొందరు బంతితో ప్రభావం చూపారు. అంతా కలిసి జట్టు విజయంలో భాగమయ్యారు. ఐదు మ్యాచ్‌లలో ప్రతి ఒక్కరు సరైన సమయంలో సరైన విధంగా రాణించి జట్టు గెలుపునకు బాటలు వేశారు. నిజంగా మాకు ఇది చాలా చాలా అద్భుతమైన టోర్నమెంట్‌’’ అంటూ కోహ్లి ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు.కాగా ఈ టోర్నీలో దాయాది పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో శతకం(100 నాటౌట్‌)తో మెరిసిన కోహ్లి.. ఆసీస్‌తో సెమీ ఫైనల్లోనూ అద్భుత అర్ధ శతకం(84)తో రాణించాడు. అయితే టైటిల్‌ పోరులో మాత్రం దురదృష్టవశాత్తూ ఒక్క పరుగుకే పెవిలియన్‌ చేరాడు. ఇదిలా ఉంటే.. గ్రూప్‌ దశలో బంగ్లాదేశ్‌, పాకిస్తాన్‌, న్యూజిలాండ్‌లను చిత్తు చేసిన రోహిత్‌ సేన.. సెమీస్‌లో ఆసీస్‌ను, ఫైనల్లో కివీస్‌ను ఓడించి అజేయంగా టైటిల్‌ విజేతగా నిలిచింది. ఇక కెప్టెన్‌గా రోహిత్‌ శర్మకు ఇది రెండో ఐసీసీ టైటిల్‌. గతేడాది టీ20 ప్రపంచకప్‌ గెలిచిన హిట్‌మ్యాన్‌.. తాజాగా చాంపియన్స్‌ ట్రోఫీ టైటిల్‌ను కూడా సాధించాడు.ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ-2025 ఫైనల్‌ భారత్‌ వర్సెస్‌ న్యూజిలాండ్‌ స్కోర్లు👉వేదిక: దుబాయ్‌ ఇంటర్నేషనల్‌ స్టేడియం, దుబాయ్‌👉టాస్‌: న్యూజిలాండ్‌... తొలుత బ్యాటింగ్‌👉న్యూజిలాండ్‌ స్కోరు: 251/7 (50)👉కివీస్‌ టాప్‌ రన్‌ స్కోరర్‌: డారిల్ మిచెల్‌(101 బంతులలో 63)👉టీమిండియా స్కోరు: 254/6 (49)👉ఫలితం: న్యూజిలాండ్‌పై నాలుగు వికెట్ల తేడాతో టీమిండియా గెలుపు👉ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌: రోహిత్‌ శర్మ(83 బంతుల్లో 7 ఫోర్‌లు,3 సిక్స్ లు 76 పరుగులు).చ‌ద‌వండి: మా స్పిన్నర్లు అద్భుతం: రోహిత్‌

Telangana Congress MLC candidates list released5
TG: ఊహించని విధంగా విజయశాంతికి ఎమ్మెల్సీ టికెట్‌

సాక్షి,హైదరాబాద్‌ : తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులపై కసరత్తు పూర్తయింది. కొద్ది సేపటి క్రితమే ఎమ్మెల్సీ అభ్యర్థులను కాంగ్రెస్‌ అధిష్టానం ఖారారు చేసింది. ఎవరూ ఊహించని విధంగా పార్టీ అధిష్టానం విజయశాంతితో పాటు అద్దంకి దయాకర్‌, కెతావత్‌ శంకర్ నాయక్‌కు టికెట్లు ఇచ్చినట్లు అధికారికంగా ప్రకటించింది. సీపీఐ నుంచి ఒకరికి ఎమ్మెల్సీ టికెట్‌ కేటాయించింది.తెలంగాణ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై ఉత్కంఠ నెలకొంది. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికను ఖరారు చేసేందుకు తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు ఢిల్లీ పర్యటనకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు.అయితే, చివరి నిమిషంలో ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ లేకపోవడంతో తెలంగాణ నేతల ఢిల్లీ పర్యటన రద్దయ్యింది. అయినప్పటికీ రాష్ట్ర అగ్రనేతలతో కేసీ వేణుగోపాల్ ఫోన్‌లో మంతనాలు జరిపారు. ముగ్గురు అభ్యర్థుల ఎంపికను ఖరారు చేయడంతో ఉత్కంఠతకు తెరపడింది. మరోవైపు ఎమ్మెల్సీ స్థానాల కోసం కాంగ్రెస్‌లో భారీ పోటీ నెలకొంది. తమకు అవకాశం కల్పించాలంటూ ఆశావహులు పెద్ద ఎత్తున లాబియింగ్‌లు జరిపారు. చివరికి పార్టీ అధిష్టానం విజయశాంతి, అద్దంకి దయాకర్‌, కెతావత్‌ శంకర్‌ నాయక్‌ పేర్లను ఫైనల్‌ చేసింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ బరిలో ఓసీ కేటగిరి నుంచి వేం నరేందర్ రెడ్డి, పారిజాత నరసింహ రెడ్డి, సామ రామ్మోహన్ రెడ్డి, కుమార్ రావు, కుసుమ కుమార్ పేర్లు బలంగా వినిపించాయి. వీరితో పాటు బీసీ కేటగిరి నుండి ఇరవత్రి అనిల్, కొనగాల మహేష్, జెర్పేటి జైపాల్, గాలి అనిల్, ఎస్సీ కేటగిరి నుండి అద్దంకి దయాకర్, జ్ఞాన సుందర్, దొమ్మటి సాంబయ్య, రాచమల్ల సిద్దేశ్వర్, ఎస్టీ నుంచి బెల్లయ్య నాయక్, బానోతు విజయాభాయి, రేఖా నాయక్ పేర్లు వినిపించాయి.

Hollywood Actor Michael Sheen Pays Off Rs 8 Crore to Clear Debts of 900 People After Tata Steel Closure in Wales6
టాటా స్టీల్‌ మూసివేత.. 900 మంది అప్పు తీర్చిన హాలీవుడ్ నటుడు

సౌత్ వేల్స్ లోని పోర్ట్ టాల్‌బోట్‌లోని టాటా స్టీల్ బ్లాస్ట్ ఫర్నేస్‌ మూసివేత తర్వాత అక్కడి వారి జీవితాలు దుర్భరంగా మారాయి. 2,800 మంది కార్మికుల ఉపాధిపై తీవ్ర ప్రభావం చూపింది. ఈ నేపథ్యంలో అదే ప్రాంతానికి చెందిన ప్రముఖ హాలీవుడ్ నటుడు మైఖేల్ షీన్.. తమ ప్రాంత ప్రజలను ఆదుకునేందుకు ముందుకువచ్చారు. సుమారు 900 మందికి చెందిన 1 మిలియన్ పౌండ్ల (సుమారు రూ.8 కోట్లు) రుణాలను తాను చెల్లించారు.ది క్వీన్, గుడ్ ఓమెన్స్, ట్విలైట్ చిత్రాల్లో నటించిన మైఖేల్ షీన్ బాధితుల ఆర్థిక భారాన్ని తగ్గించే బాధ్యతను తనపై వేసుకున్నాడు. షీన్ తన వ్యక్తిగత సంపాదన లోంచి 1,00,000 పౌండ్లు వెచ్చించి 900 మందికి సంబంధించిన రుణాలను తీర్చడం కోసం ఒక సంస్థను స్థాపించాడు. రుణ పరిశ్రమ ఎలా పనిచేస్తుందనే దానిపై మొదట్లో తనకు అవగాహన లేదని, కానీ మార్పు తీసుకురావాలని నిశ్చయించుకున్నానని షీన్‌ చెప్పాడు. మైఖేల్ షీన్ సీక్రెట్ మిలియన్ పౌండ్ గిఫ్ట్ గురించి త్వరలో ప్రసారం కానున్న ఛానెల్ 4 షోలో డాక్యుమెంట్ చేశారు.టాటా స్టీల్ మూసివేత ప్రభావంపోర్ట్ టాల్‌బోట్‌లోని టాటా స్టీల్ బ్లాస్ట్ ఫర్నేస్ మూసివేత ఈ ప్రాంతంలో సాంప్రదాయ ఉక్కు తయారీ ముగింపును సూచిస్తోంది. పునర్నిర్మాణ ప్రణాళికలో భాగంగా తీసుకున్న ఈ నిర్ణయం వల్ల గణనీయ సంఖ్యలో ఉద్యోగాలు కోల్పోవడంతోపాటు స్థానికులకు సైతం ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టింది. పోర్ట్ టాల్‌బోట్‌కు చెందిన షీన్.. కార్మికులు, వారి కుటుంబాల దుస్థితిని చూసి చలించిపోయారు. స్థానిక కేఫ్ ను సందర్శించిన సందర్భంగా ఆయన ఉద్యోగుల తొలగింపు భావోద్వేగాలను కళ్లారా చూశారు. ఉక్కు కార్మికులు తమ అనిశ్చిత భవిష్యత్తుపై కన్నీటి పర్యంతమయ్యారు. దీంతో వారిని ఆదుకునేందుకు ఏదైనా చేయాలని సంకల్పించారు.ఎవరీ మైఖేల్ షీన్?మైఖేల్ షీన్ బహుముఖ ప్రజ్ఞతోపాటు సామాజిక కారణాల పట్ల నిబద్ధతకు ప్రసిద్ధి చెందిన నటుడు. 1969లో వేల్స్ లోని న్యూపోర్ట్ లో జన్మించిన షీన్ రాయల్ అకాడమీ ఆఫ్ డ్రామాటిక్ ఆర్ట్ (రాడా)లో శిక్షణ పొంది నాటకరంగంలో తన కెరీర్ ను ప్రారంభించారు. ది క్వీన్ అండ్ ది స్పెషల్ రిలేషన్ షిప్ లో బ్రిటిష్ ప్రధాని టోనీ బ్లెయిర్ పాత్రలకు అంతర్జాతీయ ప్రశంసలు పొందాడు. తన నటజీవితానికి మించి, సామాజిక పోరాటకారుడైన షీన్.. తనను తాను "లాభాపేక్ష లేని నటుడిగా" ప్రకటించుకున్నాడు. తన సంపాదనను సామాజిక కార్యక్రమాల కోసం వెచ్చిస్తున్నాడు. ఇప్పుడే కాదు.. 2021లోనే అతను తన సంపదను ధార్మిక కార్యక్రమాలకు విరాళంగా ఇవ్వాలనే నిర్ణయాన్ని ప్రకటించాడు.

Sajjala Ramakrishna Reddy Key Comments Over YSRCP Yuvatha Poru7
ప్రతీ పల్లెలో ఘనంగా వైఎస్సార్‌సీపీ ఆవిర్భావ వేడుకలు: సజ్జల

సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ ఈనెల 12న చేపట్టిన ‘యువత పోరు’ ద్వారా రాష్ట్రంలో యువతను, నిరుద్యోగులను మోసం చేస్తున్న కూటమి ప్రభుత్వ వైఖరిని నిలదీయాలని పార్టీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. అలాగే, 12వ తేదీన వైఎస్సార్‌సీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని వాడవాడలా పార్టీ ఆవిర్భావ వేడుకలను ఉత్సాహంగా జరుపుకోవాలన్నారు. ప్రతి పల్లెలోనూ పార్టీ జెండాలను ఎగురవేయాలని సూచించారు.యువత పోరు, పార్టీ ఆవిర్భావ దినోత్సవాలపై ఆదివారం తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులతో సజ్జల రామకృష్ణారెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘రాష్ట్ర వ్యాప్తంగా యువకులు, నిరుద్యోగులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కూటమి ప్రభుత్వం సకాలంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయకపోవడంతో లక్షలాది మంది విద్యార్ధులు ఆందోళన చెందుతున్నారు. మొత్తం రూ.3900 కోట్ల మేరకు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు ఉంటే ఈ బడ్జెట్‌లో కేవలం రూ.2600 కోట్లు కేటాయించడం దుర్మార్గం. అంటే విద్యార్ధుల సంఖ్యను కూడా కుదించేందుకు ఈ ప్రభుత్వం కుట్ర చేస్తోంది.బకాయిలు పెండింగ్‌..పేద, మధ్యతరగతి విద్యార్ధులను చదువులకు దూరం చేసేలా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. అయిదు త్రైమాసికాలుగా ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పెండింగ్ పెట్టడం రాక్షసత్వం. ఫీజులు చెల్లించకపోవడంతో కాలేజీల నుంచి విద్యార్ధులను వెళ్లగొడుతున్నారు. దిక్కుతోచని స్థితిలో చదువులు మధ్యలో ఆగిపోతున్నా సర్కారు చోద్యం చూస్తోంది. పేద పిల్లలకు పెద్ద చదువులు సాకారం చేస్తూ ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని ఆనాడు మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి తీసుకువచ్చారు. నిరుపేద ఇళ్ల నుంచి డాక్టర్లు, ఇంజనీర్లు, సైంటిస్టులు తయారు కావాలన్న సమున్నత లక్ష్యంతో నాడు ఫీజు రీయింబర్స్‌మెంట్ కు శ్రీకారం చుట్టారు.చంద్రబాబు సర్కార్ 2014-19 మధ్యలో ఈ పథకానికి తిలోదకాలు ఇచ్చింది. ఉద్దేశపూర్వకంగా బకాయిలు పెట్టి, కాలేజీ యాజమాన్యాలను, విద్యార్ధులను ఇబ్బందుల పాలు చేసింది. వైఎస్సార్‌ బాటలో మరో రెండు అడుగులు ముందుకు వేసిన వైఎస్‌ జగన్ 93 శాతం మంది విద్యార్ధులకు మేలు చేసేలా ఈ పథకాన్ని విస్తరింపచేశారు. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు కూటమి సర్కార్ ఈ పథకాన్ని నీరు గార్చేందుకు ప్రయత్నిస్తోంది.నిరుద్యోగులను వంచిస్తున్న కూటమి..కూటమి ప్రభుత్వంపై యువతలోనూ ప్రభుత్వం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. నిరుద్యోగ యువతకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీని విస్మరించారు. ఇరవై లక్షల ఉద్యోగాలు లేదా ప్రతినెలా మూడు వేల రూపాయల చొప్పున నిరుద్యోగ భృతి చెల్లిస్తామంటూ ఇచ్చిన హామీ ఏమైంది?. ఈ హామీని అమలు చేయాలంటే ఏడాదికి రూ.7200 కోట్లు అవసరం. కానీ గత బడ్జెట్ లో దీనికి కేటాయింపులు లేవు. ఈ ఏడాది బడ్జెట్ లోనూ పైసా కూడా కేటాయించలేదు.మెడికల్‌ కాలేజీలు ప్రైవేటుపరం..ప్రజారోగ్య రంగాన్ని బలోపేతం చేసేందుకు వైఎస్సార్‌సీపీ హయాంలో పదిహేడు కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టారు. ఇందులో అయిదు కాలేజీల నిర్మాణం పూర్తై, తరగతులు కూడా ప్రారంభమయ్యాయి. మిగిలిన వాటిల్లో నిర్మాణపనులు పూర్తిచేసి, తరగతులను ప్రారంభించాల్సి ఉంది. కానీ వాటిని కూడా ప్రైవేటీకరించేందుకు కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తోంది. ఇచ్చిన మెడికల్ సీట్లను కూడా వద్దంటూ రాష్ట్రప్రభుత్వమే లేఖ రాయడం దుర్మార్గం. 2019లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎనిమిది వేల కోట్ల రూపాయలకు పైగా నిధులతో ఒకేసారి పదిహేడు ప్రభుత్వ వైద్య కళాశాలలకు శ్రీకారం చుట్టింది.వీటిల్లో విజయనగరం, ఏలూరు, రాజమహేంద్రవరం, మచిలీపట్నం, నంద్యాల కాలేజీలు 2023లో ప్రారంభమయ్యాయి. వీటి ద్వారా అదనంగా 750 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వచ్చాయి. 2019 వరకు రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలో కేవలం 11 వైద్య కాలేజీలే ఉండేవి. వందేళ్ళ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒకేసారి 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని చేపట్టిన ఘనత వైఎస్‌ జగన్‌కు దక్కుతుంది. అయితే కొత్త మెడికల్ కాలేజీలను, వాటిద్వారా వచ్చే సీట్లను కూటమి ప్రభుత్వం అడ్డుకుంటోంది. వాటిని ప్రైవేటుపరం చేసేందుకు ప్రయత్నిస్తోంది.విద్యార్థి సంఘాలు కలిసి రావాలి..ఈ తరుణంలో ప్రధాన ప్రతిపక్షంగా వైఎస్సార్‌సీపీ.. యువతకు, విద్యార్ధులకు అండగా నిలిచి ప్రభుత్వం విధానాలపై పోరాడాలి. అందుకోసం తలపెట్టిన యువత పోరులో కలిసి వచ్చే అన్ని విద్యార్థిసంఘాలు, యువజన సంఘాలతో వైఎస్సార్‌సీపీ నేతృత్వంలో శాంతియుతంగా నిరసన కార్యక్రమాలను నిర్వహించాలి. అన్ని జిల్లా కలెక్టరేట్ల ఎదుట విద్యార్థులు, నిరుద్యోగులు, యవతతో కలిసి వైఎస్సార్‌సీపీ శ్రేణులు ప్రదర్శన, ధర్నా కార్యక్రమం చేపట్టాలి. అనంతరం కలెక్టర్లకు సమస్యలపై విజ్ఞాపన పత్రాలు అందజేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని జిల్లా పార్టీ అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు, మండల స్థాయి నేతలు సమన్వయంతో విజయవంతం చేయాలి.వాడవాడలా పార్టీ ఆవిర్భావ వేడుకలు..ఈనెల 12వ తేదీ వైఎస్సార్‌సీపీ ఆవిర్భావ దినోత్సవం. రాష్ట్రంలోని వాడవాడలా పార్టీ ఆవిర్భావ వేడుకలను ఉత్సాహంగా జరుపుకోవాలి. ప్రతి పల్లెలోనూ పార్టీ జెండాలను ఎగురవేయాలి. ప్రజల్లో వైఎస్సార్‌సీపీకి ఉన్న బలాన్ని చాటుకోవాలి. పార్టీ పట్ల సానుభూతితో ఉన్న శ్రేణులను ఆవిర్భావ వేడుకల్లో భాగస్వాములను చేయాలి. ప్రజల్లో పార్టీకి ఉన్న ఆదరణను నిలబెట్టుకుంటూ, రానున్న రోజుల్లో వారికి అండగా ఉంటామనే భరోసాను కల్పించాలి. మండలస్థాయి కమిటీల ఏర్పాటుకు కూడా నియోజకవర్గ ఇన్‌చార్జీలు వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు.

Pranay Case Investigation Enters Final Stage8
Pranay Amrutha: ప్రణయ్ అమృత కేసులో రేపే తుది తీర్పు

సాక్షి,నల‍్లగొండ : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో రెండో అదనపు సెషన్స్‌ కోర్టు,ఎస్సీ ఎస్టీ కోర్టు సోమవారం (మార్చి 10న) తుది తీర్పును వెలవరించనుంది. దీంతో ఈ కేసులో నిందితుల పాత్రపై సాక్ష్యాధారాలను పరిగణించి శిక్ష ఖరారు చేస్తూ న్యాయస్థానం వెల్లడించే తుదితీర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.ఇక కేసు విషయానికొస్తే.. తన కుమార్తె అమృత కులాంతర వివాహం చేసుసుకుందన్న నెపంతో తండ్రి మారుతీరావు సుపారీ గ్యాంగ్‌తో 2018 సెప్టెంబరు 14వ తేదీన ప్రణయ్‌ను హత్యచేయించాడు. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసుశాఖ అన్ని కోణాల్లో విచారణ పూర్తిచేసి 1600పేజీల్లో చార్జిషీట్‌ నివేదికను రూపొందించింది. 2019 జూన్‌ 12న చార్జిషీట్‌ దాఖలు చేయగా ఎస్సీ, ఎస్టీ జిల్లా సెషన్‌కోర్టు విచారణ మొదలుపెట్టింది.సుమారు ఐదున్నర ఏళ్ల పాటు విచారణ కొనసాగగా, ఈ కేసులో ఇప్పటికే ఏ-1 మారుతీరావు 2020 మార్చి 7న ఖైరతాబాద్ వైశ్య భవన్‌లో ఆత్మహత్య చేసుకున్నారు. మరో ఏడుగురు నిందితుల పాత్రపై సైంటిఫిక్ ఎవిడెన్స్, పోస్టుమార్టం నివేదిక, చార్జ్ షీట్‌తో పాటు సాక్షులను విచారించిన న్యాయస్థానం విచారించి తుది తీర్పును మార్చి 10వ తేదీకి రిజర్వు చేసింది. రేపు తుది తీర్పును వెలువరించనుంది.ఈ కేసులో ఏ-2 సుబాష్ శర్మ, ఏ-3 అజ్గర్ అలీ, ఏ-4 అబ్దుల్ బారీ, ఏ-5 ఎంఏ కరీం, ఏ-6 తిరునగరు శ్రవణ్ కుమార్, ఏ-7 శివ, ఏ-8 నిజాంలుగా నిర్ధారించారు. సుబాష్ శర్మ, అస్గర్ అలీ మినహా మిగతా ఐదుగురు నిందితులు గతంలోనే బెయిల్ పొందారు. నిందితుల్లో అస్గర్ అలీ గతంలో గుజరాత్ మాజీ హోంమంత్రి హరేన్ పాండ్యా హత్యతో పాటు పలు ఉగ్ర కుట్రల్లో కీలక నిందితుడు.

Rescue Operation In Slbc Tunnel 16th Day Continues9
SLBC: ఒక మృతదేహం వెలికితీత

నాగర్ కర్నూల్: ఎస్ఎల్బీసీ టన్నెల్ నుంచి ఒక మృతదేహాన్ని ఎట్టకేలకు వెలికితీశారు. మృతదేహాన్ని రెస్క్యూ టీమ్ వెలికి తీసుకొచ్చింది. అతన్ని టీబీఎం ఆపరేటర్ గురుప్రీత్ సింగ్ గా అనుమానిస్తున్నారు. వెలికితీసిన మృతదేహాన్ని నాగర్‌ కర్నూల్‌ ఆస్పత్రికి తరలించారు.ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో 16వ రోజు రెస్క్యూ ఆపరేషన్‌ కొనసాగుతోంది. ఇంకా 8 మంది కార్మికుల జాడ తెలియలేదు. ఇక రోబోల వినియోగం తప్పదని అధికారులు అంటున్నారు. ఆ మేరకు చర్యలకు ఉపక్రమిస్తున్నారు. చివరి 50 మీటర్ల ప్రాంతంలో సహాయక చర్యలు క్లిష్టంగా మారాయి. టెన్నెల్‌ ఎండ్‌ పాయింట్‌లో కీలక స్పాట్స్‌ను గుర్తించారు. కీలకమైన స్పాట్స్‌లో ర్యాట్‌ హోల్‌ మైనర్ల తవ్వకాలు చేపట్టారు. రెస్య్కూలో జాతీయ, అంతర్జాతీయ నిపుణులు పాల్గొంటున్నారు.జీపీఆర్‌, కేడవర్ డాగ్స్ గుర్తించిన ప్రదేశాలలో చిక్కుకున్న వారి ఆచూకీ కోసం తవ్వకాలు ముమ్మరం చేశారు. టీబీఎంకు ఎడమ పక్కన కనిపించిన ఓ మృతదేహానికి సంబంధించిన చేయిని గుర్తించారు. మృతదేహం పూర్తిగా కాంక్రీట్‌లో కూరుకుపోయింది. డ్రిల్లింగ్ ద్వారానే బయటికి తీసేందుకు ప్రయత్నాలు చేశారు. ఎట్టకేలకు ఆ మృతదేహాన్ని బయటకు తీసుకొచ్చింది రెస్క్యూ టీమ్.కాగా, గత నెల 22వ తేదీన శైలం ఎడమ గట్టు కాల్వ (ఎస్‌ఎల్‌బీసీ) సొరంగం తవ్వకం పనుల్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సొరంగం పైకప్పు ఒక్కసారిగా కుప్పకూలడంలో 8 మంది లోపలే చిక్కుకుపోయారు. అందులో ఇద్దరు ఇంజనీర్లు, మరో ఇద్దరు మెషీన్‌ ఆపరేటర్లు, నలుగురు కార్మికులు ఉన్నారు. వారిని కాపాడేందుకు అధికారులు హుటాహుటిన సహాయక చర్యలు చేపట్టారు. కానీ బాధితులు సొరంగంలో 14 కిలోమీటర్ల లోపల శిథిలాలు, బురదలో చిక్కుకుపోవడంతో బయటికి తీసుకురావడం కష్టంగా మారింది.

Tollywood Comedian Racha Ravi emotional post on his Marriage day10
'ఈ జన్మలో నీ రుణం తీర్చుకోలేను'.. టాలీవుడ్ కమెడియన్ ఎమోషనల్ పోస్ట్

టాలీవుడ్‌ సినీ ఇండస్ట్రీలో రచ్చ రవి అందరికీ సుపరిచితమే. బుల్లితెర కామెడీ షో జబర్దస్త్ ద్వారా పరిశ్రమలోకి అడుగు పెట్టాడు. తనదైన కామెడీ, పంచ్‌ డైలాగ్స్‌తో కమెడియన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవలే బాపు సినిమాలో రచ్చరవి నటించారు. ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించారు. నటుడిగా తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. టాలీవుడ్‌లో దాదాపు అందరు స్టార్‌ హీరోల సినిమాల్లో నటించారు.తాజాగా రచ్చ రవి సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది. ఇవాళ తన పెళ్లి రోజు కావడంతో భార్యకు ప్రత్యేకంగా విషెస్ తెలిపారు. తన పెళ్లి ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ తన ప్రేమను వ్యక్తం చేశారు. నా ప్రపంచానికి చిరుదివ్యల వెలుగును పంచుతూ నా జీవన ప్రయాణంలో తోడుగా నిలిచిన తన భార్య స్వాతిని ప్రశంసిస్తూ ఎమోషనల్ నోట్ రాసుకొచ్చారు. ఇది చూసిన రచ్చ రవి అభిమానులు తమ అభిమాన నటుడికి పెళ్లి రోజు శుభాకాంక్షలు చెబుతూ పోస్టులు పెడుతున్నారు.రచ్చ రవి తన ఇన్‌స్టాలో రాస్తూ..' నిన్ను పరిచయం చేసిన నీ... నా... తల్లిదండ్రుల రుణం తీరదు. నా జీవన ప్రయాణంలో నీ పూర్తి సహాయ సహకారం అందిస్తున్న నాకు తృప్తి ఉండదు. ఎన్ని ఆశలు.. కోరికలు.. ఇష్టాలు.. ఉన్నాయో నీకు వాటిని నేను తీర్చగలనో లేదో అని ఎన్నడు నేను అడగలేదు..నువ్వు చెప్పలేదు. నా ప్రపంచానికి చిరుదివ్యల వెలుగును పంచుతూ నా జీవన ప్రయాణానికి వసంతాలు పూయిస్తూ కష్టాలను భరిస్తూ దుఃఖాలను దిగమింగుకుంటూ... కాంప్రమైజ్ అవుతూ లైఫ్‌లో నన్ను సక్సెస్ చేయిస్తూ.... ఇదే జీవితంలో నీ ఇష్టాలు కోరికలు ఆశలను తీర్చాలని... అంత శక్తి నాకు భగవంతుడు ఇవ్వాలని.. నా నిస్వార్థ కోరిక అర్థం చేసుకొని ఇస్తాడని.... నీ రుణం కూడా తీరదని తెలిసి కూడా కనీసం వడ్డీగానైనా ప్రేమిస్తానని ప్రేమగా చూసుకుంటానని...నా సహచరికి పెళ్లిరోజు శుభాకాంక్షలు.. ఐ లవ్ యు స్వాతి..' అంటూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. View this post on Instagram A post shared by Ravi Racha (@meracharavi)

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

International View all
title
White House: గన్ తో సంచరిస్తున్న వ్యక్తి కాల్చివేత

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు నివాసముండే వైట్ హౌస్ కు కూతవే

title
ఎఫ్‌బీఐ డైరెక్టర్‌ కాష్‌ పటేల్‌ వింత కోరిక.. ట్రంప్‌ అందుకు ఒప్పుకుంటారా?

వాషింగ్టన్‌: అమెరికాలోని అత్యున్నత దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐకు

title
ఐఎస్‌ఎస్‌ కమాండ్‌ బాధ్యతలు.. రష్యా వ్యోమగామికి అప్పగించిన సునీత

వాషింగ్టన్‌: కేవలం పది రోజుల మిషన్‌ కోసం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఎస్‌)కి వెళ్లి అనుకోని పరిస్థితుల్లో 9 నెలలపాట

title
వీడియో: న్యూయార్క్‌లో కార్చిర్చు మంటలు.. ఎమర్జెన్సీ విధింపు

న్యూయార్క్‌: అమెరికాలోని న్యూయార్క్‌ నగరంలో కార్చిర్చు అంటుక

title
భారత్‌ వ్యతిరేక రాతలు.. అమెరికా టెంపుల్‌ ధ్వంసం

కాలిఫోర్నియా: అమెరికాలో హిందూ దేవాలయంపై దాడి జరిగింది.

NRI View all
title
న్యూయార్‌లో ఘనంగా తెలుగువారి సంబరాలు.

అమెరికా వాణిజ్య రాజధాని న్యూయార్క్ లో తెలుగువారి సంబరాలు అంబరాన్ని అంటాయి.

title
ఆస్ట్రేలియాలో మహిళలపై లైంగిక దాడి.. భారతీయ ప్రముఖుడికి 40 ఏళ్ల జైలు శిక్ష

సిడ్నీ: ఆస్ట్రేలియాలో ఐదుగురు మహిళలపై లైంగిక దాడికి పాల్పడిన

title
విశాఖకు ఎన్నారై మహిళ ఎందుకొచ్చింది?.. ఆ రూమ్‌లో ఏం జరిగింది?

విశాఖ సిటీ: విశాఖలో ఖాకీ క్రైమ్‌ కథా చిత్రం..

title
లండన్‌లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు

బిందువు బిందువు కలిస్తేనే సింధువు అనే విధంగా యూకే లో నివసిస్తున్న తెలుగు మహిళలు అందరూ “తెలుగు లేడీస్ యుకె” అనే ఫేస్‌బుక్

title
న్యూజెర్సీలో నాట్స్ ఇమ్మిగ్రేషన్ సెమినార్

న్యూ జెర్సీ: అమెరికాలో తెలుగు వారి కోసం అనేక కార్యక్రమాలు చ

National View all
title
సీఎం నితీష్‌కు మీరు ఏదో ఆఫర్ చేశారంట కదా?

పాట్నా:  ఈ ఏడాది చివర్లో బీహార్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక

title
TG: తుది దశకు కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక

ఢిల్లీ ; తెలంగాణ రాష్ట్రంలోని ఎమ్మెల్యే కోటా ఎంఎల్‌సీ అభ్యర్థుల ఖరారు అంశం తు

title
ఉప రాష్ట్రపతి జగదీప్ దన్కర్ త్వరగా కోలుకోవాలి: ప్రధాని

న్యూఢిల్లీ:  భారత ఉపరాష్ట్రపతి జగదీప్ దన్కర్ త్వరలో కోల

title
ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్‌కు అ‍స్వస్థత.. ఎయిమ్స్‌కు తరలింపు

ఢిల్లీ: భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్‌(Jagdeep Dhankar) అస

title
సెలవు లేదన్న హెడ్మాస్టర్‌.. లెక్కల టీచర్‌ ఏం చేశారంటే?

భువనేశ్వర్‌: తీవ్ర అనారోగ్యం పాలైన ఓ ఉపాధ్యాయుడు సెలవు కోసం

Advertisement

వీడియోలు

Advertisement