Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today

Top Stories

ప్రధాన వార్తలు

Make Yuvatha Poru a grand success YSRCP State Coordinator Sajjala1
12న జరిగే 'యువత పోరు'తో ప్రభుత్వాన్ని నిలదీద్దాం: సజ్జల

తాడేపల్లి : ఈ నెల 12వ తేదీన వైఎస్సార్‌సీపీ తలపెట్టిన ‘యువత పోరు’ ద్వారా ప్రభుత్వాన్ని నిలదీద్దామని పార్టీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు.. ఈ మేరకు ఆయన టెలికన్ఫరెన్స్ లో మాట్లాడారు. దీనికి వైఎస్సార్‌సీపీ ముఖ్యనేతలు, విద్యార్థి, యువజన విభాగం నేతలు, 13 యూనివర్శిటీల విద్యార్థి నాయకులు, మేధావులు, విద్యారంగం ప్రముఖులు హాజరయ్యారు.‘12న జరిగే 'యువత పోరు'తో ప్రభుత్వాన్ని నిలదీద్దాం. ఫీజు రీయంబర్స్‌మెంట్‌, నిరుద్యోగ భృతి, ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణపై ప్రభుత్వం దిగివచ్చేవరకూ పోరాడదాం. రేపు యూనివర్శిటీల లోపల లేదా బయట "యువత పోరు" పోస్టర్‌ ఆవిష్కరణ చేయాలి. యూనివర్శిటీల నుంచి విద్యార్థులు ర్యాలీలో పాల్గొనేలా చూడాలి. అప్పుడే ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగి వారి సమస్యలు పరిష్కారమవుతాయి వైఎస్సార్‌సీపీ విద్యార్ధి, యువజన విభాగాలు సమన్వయంతో కార్యక్రమాన్ని నిర్వహించాలి’ సూచించారు సజ్జల రామకృష్ణారెడ్డి. ప్రతీ పల్లెలో ఘనంగా వైఎస్సార్‌సీపీ ఆవిర్భావ వేడుకలు

Posani Krishna Murali custody petition has been dismissed2
పోసాని కస్టడీ పిటిషన్ కొట్టివేత

సాక్షి,కర్నూలు.: కూటమి సర్కారు అక్రమంగా బనాయించిన కేసులో అరెస్టైన ప్రముఖ నటుడు, రచయిత పోసాని కృష్టమురళీని కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్‌ను కర్నూల్ జేఎఫ్‌సీఎం కోర్టు కొట్టివేసింది. పోసాని కస్టడీ పిటిషన్‌ను డిస్మిస్ చేశారు కోర్టు మేజిస్ట్రేట్. ఈ నెల ఆరో తేదీన జేఎఫ్‌సీఎం కోర్టులో ఆదోని పోలీసులు కస్టడీ పిటిషన్ వేశారు. పోసానిని విచారించే క్రమంలో కస్టడీకి ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఏడో తేదీన తీర్పును రిజర్వ్ చేసిన మేజిస్ట్రేట్.. ఇవాళ పిటిషన్‌ను డిస్మిస్ చేస్తూ తీర్చు ఇచ్చారు. ఇక బెయిల్ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్ చేశారు మేజిస్ట్రేట్‌.ఇదిలా ఉంటే, అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసులో పోసానికి బెయిల్ మంజూరు చేస్తూ కడప మొబైల్ కోర్టు గత శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చింది. పోసానికి బెయిలు ఇవ్వకూడదని పోలీసుల తరపు న్యాయవాదులు వాదనలు వినిపించినప్పటికీ.. కోర్టు పోసాని తరఫు న్యాయవాదుల వాదనలతో ఏకీభవిస్తూ... బెయిల్ మంజూరు చేసింది. పోసాని కస్టడీ పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. ఈ కేసులోనే పోసాని ఫిబ్రవరి 26వ తేదీన అరెస్టయ్యారు.పోసానిని హైదరాబాద్‌లోని నివాసంలో అరెస్ట్‌ చేసి.. ఆ మరుసటి రోజు ఓబులవారిపల్లెకు తీసుకెళ్లారు. అటుపై పల్నాడు జిల్లా నరసరావుపేటలో, కర్నూల్‌ జిల్లా ఆదోనీ పీఎస్‌లలో నమోదైన కేసుల్లో పీటీ వారెంట్‌ కింద ఆయన్ని తరలించారు. ఈ కేసుల్లో ఉపశమనం కోరుతూ ఆయన వేశారు. మరోవైపు హైకోర్టులోనూ ఆయన వేసిన క్వాష్‌ పిటిషన్‌ విచారణ దశలో ఉంది.పోసాని క్వాష్‌ పిటిషన్లపై హైకోర్టు కీలక ఆదేశాలు

Pranay Case Final verdict: Nalgonda SC/ST Court Sensational Judgement3
ప్రణయ్‌ కేసులో ఒకరికి ఉరి.. ఆరుగురికి జీవితఖైదు

నల్లగొండ, సాక్షి: తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైన మిర్యాలగూడ పరువు హత్య కేసులో(Nalgonda Miryalaguda Honour Killing Case) సంచలన తీర్పు వెలువడింది. ప్రణయ్‌(24)ను దారుణంగా చంపిన సుభాష్‌ శర్మకు నల్లగొండ ఎస్సీ/ ఎస్టీ కోర్టు మరణశిక్ష శిక్ష విధించింది. అలాగే మిగతా ఆరుగురు నిందితులందరికీ జీవిత ఖైదును ఖరారు చేసింది. అమృత వర్షిణి-ప్రణయ్‌లు చిన్నప్పటి నుంచి స్నేహితులు. ఆ స్నేహం.. ప్రేమగా మారి 2018లో పెద్దలను ఎదిరించి వివాహం చేసుకున్నారు. ప్రణయ్‌ కుటుంబ సభ్యులు ఆ ప్రేమ వివాహాన్ని అంగీకరించగా.. తన కుమార్తె కులాంతర వివాహం చేసుకుందని మారుతీ రావు(Maruthi Rao) రగిలిపోయాడు. ఈ క్రమంలో ఆమె భర్త ప్రణయ్‌ను హతమార్చడానికి అస్ఘర్‌ అలీకి కోటి రూపాయల సుపారీ ఇచ్చాడు. అస్ఘర్‌ ఏడుగురితో కలిసి గ్యాంగ్‌ను ఏర్పాటు చేసి ప్రణయ్‌ను అంతమొందించాడు.👉ఆరేళ్లకు పైగా ప్రణయ్‌ కేసు(Pranay Case) విచారణ జరిగింది. ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితుడు మారుతి రావు ఆత్మహత్య చేసుకోగా.. మరో ముగ్గురు నిందితులు జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. మిగతా నలుగురు నిందితులు బెయిల్‌ మీద బయట ఉన్నారు. ఈ నేపథ్యంలో నిందితులదరినీ ఇవాళ కోర్టులో పోలీసులు హాజరు పరిచి.. తీర్పు అనంతరం అదుపులోకి తీసుకున్నారు.👉2018లో ప్రణయ్‌- అమృతల వివాహం జరిగింది. ఐదు నెలల గర్భంతో ఉన్న భార్య అమృత(Amrutha Pranay)తో కలిసి చెకప్‌నకు వెళ్లి తిరిగి వస్తుండగా.. సుపారీ గ్యాంగ్‌లోని సుభాష్‌ శర్మ గొడ్డలితో ప్రణయ్‌పై దాడి చేయడంతో తల్లి, భార్య చూస్తుండగానే రక్తపు మడుగులో విలవిలలాడుతూ మరణించాడు. 👉మిర్యాలగూడలో 2018 సెప్టెంబరు 14వ తేదీన పెరుమాళ్ల ప్రణయ్‌(Perumalla Pranay) అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఈ కేసుకు సంబంధించి.. ప్రణయ్‌ తండ్రి బాలస్వామి ఫిర్యాదుతో మొత్తం ఎనిమిది మందిపై కేసు నమోదు అయ్యింది. 👉ఈ కేసులో అమృత తండ్రి మారుతీ రావు ఏ1గా ఉండగా.. ప్రణయ్‌ను కత్తితో నరికి చంపిన సుభాష్ శర్మ ఏ2గా ఉన్నాడు. మొత్తంగా ఎనిమిది మందిపై కేసు నమోదు కాగా.. దాదాపు ఐదున్నరేళ్ల పాటు సాగిన విచారణ సాగింది. 👉ఏ-3 అజ్గర్ అలీ, ఏ-4 అబ్దుల్ భారీ, ఏ-5 ఎంఏ కరీం, ఏ-6 తిరునగరు శ్రవణ్ కుమార్(మారుతి రావు సోదరుడు), ఏ-7 సముద్రాల శివ(మారుతి రావు డ్రైవర్‌), ఏ-8 నిజాం(నిందితులు ప్రయాణించిన ఆటో డ్రైవర్‌ ఓనర్‌)గా ఉన్నారు. 👉2019 జూన్ 12న పోలీసుల చార్జ్ షీట్ దాఖలు చేశారు. ఈ కేసులో అరెస్టైన అమృత తండ్రి మారుతి రావుకు బెయిల్‌ దక్కింది.ఏ-1 మారుతీరావు 2020 మార్చి7వ తేదీన హైదరాబాద్‌ ఖైరతాబాద్ వైశ్య భవన్ లో ఆత్మహత్య చేసుకున్నారు. ఇక నల్లగొండ జిల్లా కోర్టు సముదాయంలోని.. ఎస్సీ ఎస్టీ కోర్టు ఈ కేసును సుదీర్ఘంగా విచారించి.. మార్చి 10కి(ఇవాళ్టికి) తీర్పును రిజర్వ్‌ చేసింది.👉మరో ఏడుగురు నిందితుల పాత్రపై సైంటిఫిక్ ఎవిడెన్స్, పోస్టుమార్టం నివేదిక, చార్జ్ షీట్ తో పాటు సాక్షులను విచారించింది కోర్టు👉నిందితుల్లో అస్ఘర్‌ అలీ ఐఎస్ఐ ఉగ్రవాదిగా తేలింది. గతంలో గుజరాత్ మాజీ హోంమంత్రి హరేన్ పాండ్యా హత్యతో పాటు పలు ఉగ్ర కుట్రల్లో కీలకంగా వ్యవహరించాడు. అంతేకాదు.. ప్రణయ్‌ కేసులో మారుతి రావు సుపారీ ఇచ్చింది కూడా ఇతనికే. మొత్తం ఏడుగురిని ఒక గ్రూప్‌గా చేసి.. ప్రణయ్‌ హత్య స్కెచ్‌ను అస్ఘర్‌ అమలు పరిచాడు.

Mitchell Starc To Join Harry Brook, 3 Overseas Stars To Opt Out Of IPL 20254
IPL 2025: బ్రూక్‌ బాటలో మరో ముగ్గురు విదేశీ స్టార్లు..?

మరికొద్ది రోజుల్లో ఐపీఎల్‌ 2025 సీజన్‌ ప్రారంభం కానుండగా ఢిల్లీ క్యాపిటల్స్‌ కీలక ఆటగాడు, ఇంగ్లండ్‌ వైస్‌ కెప్టెన్‌ హ్యారీ బ్రూక్‌ క్యాష్‌ రిచ్‌ లీగ్‌ నుంచి వైదొలిగాడు. జాతీయ జట్టు సేవలకు సిద్దమయ్యేందుకు ఐపీఎల్‌ నుంచి తప్పుకుంటున్నట్లు బ్రూక్‌ తెలిపాడు. బ్రూక్‌ను గత డిసెంబర్‌లో జరిగిన మెగా వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్‌ రూ. 6.25 కోట్లకు కొనుగోలు చేసింది. బ్రూక్‌ ఐపీఎల్‌ నుంచి వైదొలగడం ఇది వరుసగా రెండోసారి. గత సీజన్‌లోనూ బ్రూక్‌ ఇలాగే పొంతన లేని కారణాలు చెప్పి క్యాష్‌ రిచ్‌ లీగ్‌ నుంచి వైదొలిగాడు. గత సీజన్‌లో కూడా ఢిల్లీనే బ్రూక్‌ను కొనుగోలు చేసింది. ఆ సీజన్‌లో బ్రూక్‌ వ్యక్తిగత కారణాలను సాకుగా చూపి వైదొలిగినా, అసలు కారణాలు వేరే అని తెలిసింది. ఆ సీజన్‌ వేలంలో తక్కువ ధర (రూ. 4 కోట్లు) పలికినందుకు బ్రూక్‌ వైదొలిగాడట. 2023 సీజన్‌లో బ్రూక్‌ను సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ రూ. 13.25 కోట్ల రికార్దు ధర వెచ్చింది సొంతం చేసుకుంది. 2024 వేలంలోనూ బ్రూక్‌ ఇదే స్థాయి మొత్తాన్ని ఆశించగా.. నిరాశ ఎదురైంది.కాగా, బ్రూక్‌ తాజా నిర్ణయంతో బీసీసీఐ అతనిపై నిషేధం విధించే అవకాశం ఉంది. బీసీసీఐ కొత్త రూల్స్ ప్ర‌కారం.. వేలంలో అమ్ముడుపోయిన ఆట‌గాడు స‌రైన కార‌ణం లేకుండా ఐపీఎల్ నుంచి వైదొలిగితే రెండేళ్ల బ్యాన్ పడుతుంది. మ‌రి బ్రూక్‌పై ఐపీఎల్ నిర్వ‌హ‌కులు ఎలాంటి చ‌ర్య‌లు తీసుకుంటారో వేచి చూడాలి.బ్రూక్‌ ఎపిసోడ్‌ బయటికి వచ్చాక మరో ముగ్గురు విదేశీ స్టార్లు ఐపీఎల్‌-2025 నుంచి వైదొలుగుతారని ప్రచారం జరుగుతుంది. వీరిలో ఆసీస్‌ ఆటగాళ్లు మిచెల్‌ స్టార్క్‌, ఆడమ్‌ జంపా, ఇంగ్లండ్‌ సీమర్‌ జోఫ్రా ఆర్చర్‌ ఉన్నారని సమాచారం​.ఆర్చర్‌ జాతీయ విధుల దృష్ట్యా ఐపీఎల్‌కు డుమ్మా కొడతాడని తెలుస్తుంది. ఇంగ్లండ్‌ హోమ్‌ సమ్మర్‌కు ముందు ఆ జట్టు ఫాస్ట్‌ బౌలర్‌ మార్క్‌ వుడ్‌ గాయపడటంతో ఆర్చర్‌ను ఐపీఎల్‌ నుంచి వైదలగాలని ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ ఏడాది హోం సమ్మర్‌లో ఇంగ్లండ్‌ టెస్ట్‌ల్లో భారత్‌ను ఢీకొట్టాల్సి ఉంది. ఆర్చర్‌ను 2025 మెగా వేలంలో రాజస్థాన్‌ రాయల్స్‌ రూ. 12.5 కోట్లకు కొనుగోలు చేసింది.ఆడమ్‌ జంపా విషయానికొస్తే.. ఇతన్ని ఐపీఎల్‌ 2025 మెగా వేలంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ రూ. 2.4 కోట్లకు సొంతం చేసుకుంది. జంపా కూడా జాతీయ విధుల పేరుతో ఐపీఎల్‌కు డుమ్మా కొట్టనున్నాడని తెలుస్తుంది. జంపా 2024 సీజన్‌లోనూ వ్యక్తిగత కారణాలను సాకుగా చూపి ఐపీఎల్‌ నుంచి తప్పుకున్నాడు. గత సీజన్‌లో జంపా రాజస్థాన్‌ రాయల్స్‌కు ఆడాల్సి ఉండింది.మిచెల్‌ స్టార్క్‌ విషయానికొస్తే.. గత సీజన్‌లో అత్యంత ఖరీదైన ఆటగాడు మిచెల్‌ స్టార్క్‌ను ఈ ఏడాది మెగా వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్‌ రూ. 11.75 కోట్లకు దక్కించుకుంది. 2025 సీజన్‌కు ముందు స్టార్క్‌ వ్యక్తిగత కారణాలను సాకుగా చూపి వైదొలుగుతాడని ప్రచారం జరుగుతుంది. వాస్తవానికి ఐపీఎల్‌ 2025 తర్వాత ఆస్ట్రేలియా సౌతాఫ్రికాతో డబ్ల్యూటీసీ ఫైనల్లో తలపడాల్సి ఉంది. ఇదే కారణం చేత స్టార్క్‌ తదితర ఆసీస్‌ టెస్ట్‌ జట్టు సభ్యులు ఐపీఎల్‌ నుంచి వైదొలుగుతారని సమాచారం.

Hydra Ranganath Reveals SHOCKING Truth About Amrutha Pranay Case5
ప్రణయ్‌ కేసు.. హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ షాకింగ్‌ కామెంట్స్‌

నల్లగొండ, సాక్షి: సంచలనం సృష్టించిన మిర్యాలగూడ ప్రణయ్‌ పరువు హత్య కేసులో(Nalgonda Miryalaguda Honour Killing Case) సంచలన తీర్పు వెలువడింది. ప్రణయ్‌(24)ను దారుణంగా చంపిన సుభాష్‌ శర్మకు నల్లగొండ ఎస్సీ/ ఎస్టీ కోర్టు మరణశిక్ష శిక్ష విధించింది. అలాగే మిగతా ఆరుగురు నిందితులందరికీ జీవిత ఖైదును ఖరారు చేసింది.అయితే ప్రణయ్‌ హత్య కేసులో విచారణ అధికారిగా ఉన్న అప్పటి అప్పటి నల్గొండ ఎస్పీ, ఐపీఎస్ అధికారి రంగనాథ్ (ప్రస్తుతం హైడ్రా కమిషనర్) కీలక వ్యాఖ్యాలు చేశారు. ప్రణయ్‌- అమృతల ప్రేమ అంశం టీనేజీ యువతకు గుణ పాఠంలాంటిందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. టీనేజీ వయస్సులో పిల్లలు జాగ్రత్తగా ఉండాలని, లేదంటే తీవ్ర పరిణామాల్ని ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. అదే సమయంలో ఈ కేసు దర్యాప్తులో ఎదురైన సవాళ్లు, మారుతీరావు ప్రవర్తన, కేసును ఛేదించిన విధానం గురించి ఆయన వివరించారు. కాంట్రాక్ట్ కిల్లర్లతో హత్య..ప్రణయ్‌ హత్య సమయంలో నేను నల్లగొండ జిల్లా ఎస్పీగా ఉన్న ఆ సమయంలో ప్రణయ్‌ హత్యకేసులో మొదటి నుంచి సాక్షలు బలంగా ఉన్నారు. సుదీర్ఘ విచారణ తర్వాత న్యాయం గెలిచింది. ఈ కేసులో అన్ని కోణాలు ఉన్నాయని, కాంట్రాక్ట్ కిల్లర్లతో హత్య చేయించడంతో పాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నేరస్థులు చాలా తెలివిగా వ్యవహరించారు. కేసు మొదట్లో చాలా గందరగోళంగా ఉంది. మారుతీరావు కూడా తనకు ఏమీ తెలియదనే అన్నారు. చాకచక్యంగా ఛేదించాండీఎస్పీగా శ్రీనివాస్‌, ఎస్సై వెంకటేశ్వర్‌రెడ్డి, ధనుంజయ్‌,టాస్క్‌ ఫోర్స్‌,కానిస్టేబుల్స్‌, ఎస్సైలు,రైటర్స్‌తో పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ నరసింహ, సీనియర్‌ అధికారురు ఐజీ స్టీఫెన్‌ రవీంద్ర,అప్పటి డీజీ మహేందర్‌రెడ్డిల సూచనలు,సలహాలతో ఈ కేసును చాకచక్యంగా ఛేదించాం. ప్రణయ్‌ హత్య తర్వాత నిందితులు దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో తలదాచుకున్నారు. అయినప్పటికీ టెక్నాలజీ, విచారణ సాయంతో నిందితుల్ని కేవలం వారం రోజుల వ్యవధిలో అదుపులోకి తీసుకున్నాం.ముందు లైఫ్‌లో సెటిల్‌ అవ్వండిప్రణయ్‌ -అమృత కేసు నేటి తరం బాల్యం నుంచి యవవ్వనంలోకి అడుగు పెట్టే పిల్లలకు, వారి తల్లిదండ్రులకు ఒక గుణపాఠం లాంటింది. టీనేజీ నుంచి యవ్వనంలోకి అడుగుపెట్టే సమయంలో పిల్లలు, వారి తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి. టీనేజీలోకి అడుగు పెట్టాం కదా అని ఇష్టం వచ్చినట్లు నిర్ణయాలు తీసుకోవద్దని, జీవితంలో కొంత పరిణితి సాధించిన తర్వాత నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. ముందు పిల్లలు లైఫ్‌లో స్థిరపడిన తర్వాత నిర్ణయాలు తీసుకోవడం మంచిది.నేటి యువతకు ఓ గుణపాఠం లాంటిందిలేదంటే ప్రణయ్‌ హత్య కేసుతో ఏం జరిగిందో మనం అందరం చూశాం. బాలస్వామి తన కుమారుణ్ని(ప్రణయ్‌),అమృత తన తండ్రిని కోల్పోయింది. వాళ్లు తీసుకున్న నిర్ణయం వల్ల ఎవరూ సంతృప్తిగా లేరు. ఈ కేసు ద్వారా సమాజం నుంచి నేర్చుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి.అమృతమీద అమితమైన ప్రేమేప్రణయ్‌ హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఏ1 గా ఉన్న మారుతిరావు చనిపోవడం బాధాకరం. మారుతి రావుకి కుమార్తె అమృత అంటే అమితమైన ప్రేమ. లేక లేక పుట్టిన సంతానం. అమృత ఫొటోల్ని 15 నుంచి 20 అడుగల మేర ఫ్లెక్సీ కట్టించుకునేంత ప్రేముంది. ఆ ప్రేమే ఇన్ని అనార్ధాలకు దారి తీసింది. మారుతిరావు రియల్‌ ఎస్టేట్‌ బిజినెస్‌ చేస్తున్నారు. ఎవరైతే ప్రణయ్‌ హత్యకేసులో ఉన్న ఏ4 బారీ సాయంతో రియల్‌ ఎస్టేట్‌లో సమస్యల నుంచి బయటపడేవారు.అలాగే అమృత విషయంలో అలాగే ఆలోచించారు. డబ్బు, పరపతి ఉండొచ్చేమో.. కానీ పిల్లల టీనేజీ పెంపకం ఎలా ఉండాలనే అంశంలో అవగాహన లేకుండా పోయింది. మన పెంపకంలో ఏదైనా తప్పుంటే దానికి వేరే వాళ్లని బాధ్యుల్ని చేయడం ఎంతవరకు కరెక్ట్‌ అనే అంశంపై మారుతి రావుతో మాట్లాడాను’ అని అన్నారు.పైకోర్టుకు వెళ్లినా లాభం ఉండదుఇదే కేసులో పైకోర్టులకు వెళ్లినా న్యాయం పరంగా ఎలాంటి మార్పులు ఉండదు. అంత పకడ్బందీగా ఈ కేసులో 1600 పేజీల ఛార్జ్‌ షీట్‌ వేశామని, కేసు విచారణ సమయంలో పోలీసులు మేనేజ్ చేశారంటూ కొందరు నిరాధార ఆరోపణలు చేశారని, వాటిని పట్టించుకోకుండా నిజం నిలకడ మీద తెలుస్తుందనే నమ్మకంతో ముందుకు సాగామని రంగనాథ్‌ ముగించారు.

KSR Comments On Chandrababu Delimitation Stand6
ఏంటి సీనియర్‌ మరీ ఇలా చేశారు?

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసే ప్రకటనలు అవసరాన్ని బట్టి మారిపోతుంటాయి. ప్రజలకోసం ఇలా మాటమారిస్తే ఓకే కానీ.. ఆయనెప్పుడు రాజకీయాల కోసమే ఇలా చేస్తూంటారు. కొన్ని రోజులుగా ఆయన చేస్తున్న ఉపన్యాసాలను పరిశీలిస్తే.. పొంతన లేకుండా కనిపిస్తాయి. ఒకపక్క దేశం మొత్తమ్మీద నియోజకవర్గాల పునర్విభజన కోసం రంగం సిద్ధమవుతూంటే.. దానిపై ఆయన తన స్పష్టమైన నిర్ణయం చెప్పకుండా కప్పదాటు వైఖరి ప్రదర్శిస్తున్నారు. ఇదెలా ఉందంటే.. కడుపు నొప్పి అంటే తలనొప్పికి మందు ఇచ్చినట్లుగా ఉంది!. జనాభా ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) జరుగుతున్న నేపథ్యంలో ఉత్తరాదిలో సీట్లు భారీగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. యూపీ, బీహార్‌ వంటి రాష్ట్రాల్లో జనాభా నియంత్రణ సక్రమంగా చేపట్టని కారణంగా పెరుగుదల ఎక్కువ ఉందని.. ఫలితంగా వారికి అక్కడ ఎక్కువ పార్లమెంటరీ స్థానాలు అందుబాటులోకి వస్తున్నాయన్న భావన చాలామందిలో ఉంది. దక్షిణాది రాష్ట్రాలు అధిక జనాభాతో వచ్చే ముప్పును ముందుగానే గుర్తించి నియంత్రణ సమర్థంగా నిర్వహించినందుకు ఇక్కడి సీట్లలో పెద్దగా మార్పుల్లేకుండా పోనున్నాయి. 👉ఈ అంశంపై తమిళనాడు, కర్ణాటక, తలంగాణ ముఖ్యమంత్రులు ఇప్పటికే తమ అభ్యంతరాలను వ్యక్తం చేయగా.. చంద్రబాబు మాత్రం దాటవేసే ధోరణి అవలంబిస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి (Revanth Reddy) ఒకడుగు ముందుకేసి నియోజకవర్గాల పునర్విభజన ఇదే పంథాలో సాగితే దక్షిణాది తిరగబడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఉత్తరాది రాష్ట్రాల ప్రభావం ఇప్పటికే ఎక్కువగా ఉందని.. సీట్లు పెరిగితే వారి ఆధిపత్యం మరింత పెరిగిపోతుంది. పార్లమెంటులోని ప్రస్తుత 543 లోక్‌సభ సీట్లను 753కు పెంచేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. దక్షిణాదిలో ప్రస్తుతం 129 సీట్లు ఉండగా.. డీలిమిటేషన్‌ తరువాత అత్యధికంగా 144 స్థాయికి చేరవచ్చు. ఏపీ, తెలంగాణల్లో చెరో మూడు సీట్లే పెరిగే అవకాశం ఉంటుంది. కేరళలో ఒక సీటు తగ్గుతుందట!. తమిళనాడులో రెండు సీట్లే పెరుగుతాయి. కర్ణాటకలో మాత్రం ఎనిమిది సీట్లు ఎక్కువ కావచ్చు. ఫలితంగా కొత్తగా ఏర్పాటయ్యే సీట్లను కలుపుకుని చూసినప్పుడు దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిథ్యం ప్రస్తుతమున్న 24 శాతం నుంచి నుంచి 19 శాతానికి పడిపోనుంది. 👉డీలిమిటేషన్ పూర్తి అయితే ఒక్క ఉత్తరప్రదేశ్‌లోనే 48 స్థానాలు పెరిగి మొత్తం సంఖ్య 128 స్థానాలకు చేరనుంది. బీహార్‌ పార్లమెంటరీ స్థానాలు కూడా 40 నుంచి 70కి చేరతాయి. మధ్యప్రదేశ్‌లో 29 నుంచి 47 అవుతాయి. ఈ రకమైన పరిస్థితి వల్ల ఉత్తరాది గుత్తాధిపత్యం అధికం అవుతుందన్న ఆందోళన వ్యక్తం అవుతుంది. ఈ నేపథ్యంలోనే నియోజకవర్గాల పునర్విభజన జనాభా ప్రాతిపదిక కాకుండా 1971 నాటి లెక్కలు తీసుకోవాలని స్టాలిన్ డిమాండ్ చేశారు. కొందరు మేధావులు విస్తీర్ణం ప్రాతిపదికగా డీలిమిటేషన్ చేస్తే ఈ సమస్య కొంత తగ్గవచ్చని అభిప్రాయపడుతున్నారు. నిజానికి దక్షిణాది రాష్ట్రాలలో ఉన్న ముఖ్యమంత్రులలో సీనియర్ చంద్రబాబు నాయుడు. ఆయన మాత్రం దీనిపై విభిన్నంగా స్పందించారు. ఉత్తరప్రదేశ్, బీహారు రాష్ట్రాలు ఎక్కువమంది జనాభాతో దేశాన్ని కాపాడుతున్నాయని, ఈ విధానాన్ని అన్ని రాష్ట్రాలు అనుసరించాలని చంద్రబాబు సూచిస్తున్నారు. 2026 డీలిమిటేషన్ వల్ల లోక్‌సభ సీట్లలో దక్షిణాదికి అన్యాయం జరుగుతుందని ఈ ప్రాంత నాయకులు అంతా బాధ పడుతుంటే చంద్రబాబు జనాభాను పెంచండని చెప్పి అసలు సమస్య జోలికి వెళ్లకుండా జాగ్రత్తపడ్డారు. 👉గతంలో.. ఇదే చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ఉత్తరాది రాష్ట్రాలు సరిగా పనిచేయడం లేదని, అందువల్ల వాటికి అధిక నిధులు ఇవ్వరాదని చెప్పేవారు. బాగా పనిచేస్తున్న ఏపీ తదితర రాష్ట్రాలకు తక్కువ నిధులు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేసేవారు. ఆ రాష్ట్రాలలో జనాభా నియంత్రణ లేకపోవడాన్ని ఆక్షేపించేవారు. కాని అన్ని అంశాలలో మాదిరే చంద్రబాబు ఇక్కడ కూడా యు టర్న్ తీసుకున్నట్లు కనిపిస్తుంది. 👉కేంద్రంలోని బీజేపీని గట్టిగా నిలదీసే పరిస్థితిలో లేరు. ఎన్డీయే ప్రభుత్వం తెలుగుదేశం సీట్లపై ఆధారపడి ఉన్నా, చంద్రబాబు ఎందువల్లో ఎక్కువగా భయపడుతున్నారేమో అనే వ్యాఖ్యలు వస్తున్నాయి. అందుకే ధైర్యంగా డీలిమిటేషన్‌లో ఏపీతో సహా దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్న నష్టంపై గొంతెత్తలేకపోతున్నారని అంటున్నారు. పైగా ఇప్పుడు ఉత్తరాది రాష్ట్రాలు జనాభాను పెంచి దేశాన్ని కాపాడుతున్నాయని చెబుతున్నారు. ఇది ఒక రకంగా ఆంధ్రతో సహా దక్షిణాదిని అవమానించడమే కదా అని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. 👉జనాభా పెంచే విధానాన్ని అన్ని రాష్ట్రాలు అనుసరించాలట. కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో ఎన్డీయే ఉంది కనుక, వారికి ఎక్కడ అసంతృప్తి వస్తుందో అని ఆయన మాట్లాడకపోగా అర్జంట్‌గా పిల్లలను కనండని చెబితే ఏమి చేయాలి? నిజంగానే ప్రజలు తమ ఆర్థిక పరిస్థితులతో సంబంధం లేకుండా జనాభాను పెంచితే ఎవరు పోషించాలి? చంద్రబాబు ఎన్నికల సమయంలో చేసే హామీలను నమ్మి ప్రజలు ఎలా మోసపోతున్నారో అంతా గమనిస్తున్నారు. ఇంకో సంగతి చెప్పాలి. ఓ పాతికేళ్లకు దక్షిణాదిలో జనాభాను పెంచినా, అప్పటికి ఉత్తరాదిలో ఇంకా జనాభా పెరిగిపోతుంది కదా!. అందువల్ల ఆయన చెబుతున్న తర్కంలో హేతుబద్దత కనిపించదు. ఉత్తరాది, దక్షిణాది మధ్య ఒక సమతుల్యత రావడం అవసరం కాదా? దానిని వదలి ఉత్తరాది రాష్ట్రాల వారు దేశాన్ని కాపాడుతున్నారట.. అంటే దక్షిణాది వారు కాపాడడం లేదని చెప్పడమా?. తమిళనాడు సీఎం డిమాండ్‌పై చంద్రబాబు మాత్రం స్పందించడం లేదు. వచ్చే ఏడాది పునర్విభజన వల్ల నష్టం జరుగుతుందని అంతా చెబుతుంటే, ఇప్పుడు పిల్లలను కని జనాభాను పెంచండి అని అనడంవల్ల ఏమి ప్రయోజనం ఉంటుందో చంద్రబాబే చెప్పాలి. ఏది ఏమైనా.. కేవలం తక్షణ రాజకీయ ప్రయోజనాలకన్నా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా చూడడంలో చంద్రబాబు పాత్ర తీసుకోకపోతే చరిత్ర ఆయనను క్షమిస్తుందా?. - కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత

Gulmargs Controversial Fashion Show: Shivan And Narresh 7
కశ్మీర్‌ వివాదాస్పద ఫ్యాషన్‌ షో: ఆ డిజైనర్లు ఎవరంటే..?

పవిత్ర రంజాన్‌ మాసం వేళ జమ్ము కశ్మీర్‌లో జరిగిన ఫ్యాషన్‌ షో తీవ్ర దుమారం రేపింది. ఫ్యాషన్‌ షోలో మహిళలు, పురుషులు పొట్టి పొట్టి దుస్తులతో తెల్లటి మంచుపై ర్యాంప్‌ వాక్‌ చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు వైరల్‌ అయ్యాయి. దీంతో ఒక్కసారిగా ఈ ఈవెంట్‌పై రాజకీయ, సామాజిక వర్గాల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. అంతేగాదు ఫ్యాషన్‌ షో దూమారం జమ్ముకశ్మీర్‌ అసెంబ్లీని కూడా అట్టుడికించింది. ఈ వ్యవహారంపై ప్రతిపక్ష నేతలు ఒమర్‌ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోశాయి. ఈ నెల మార్చి 7న గుల్మార్గ్‌లో జరిగిన ఈ ఫ్యాషన్‌ షోపై తారాస్థాయిలో విమర్శలు వచ్చాయి. దీనిపై జమ్ముకశ్మీర్‌ సీఎం ఒమర్‌ అబ్దుల్లా 24 గంటల్లో నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. వివాదాస్పదంగా మారిన ఈ షో వెనుకున్న డిజైనర్లు ఎవరంటే..?ఎవరా డిజైనర్‌ ద్వయం..?ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన డిజైనర్లు శివన్‌ భాటియా, నరేష్ కుక్రేజా. ఈ ఇద్దరు స్థానిక సున్నితత్వాన్ని విస్మరించి పవిత్ర రంజాన్‌ మాసంలో అశ్లీల దుస్తులతో ప్రదర్శన ఇవ్వడంతోనే ఈ షో వివాదాస్పదమైంది. అయితే డిజైనర్ల ద్వయం ఫ్యాషన్‌ పరిశ్రమలో తమ 15వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని గుల్మార్గ్‌లోని ప్రఖ్యాత స్కీ రిసార్ట్‌లో ఈ ఫ్యాషన్‌ షోని నిర్వహించారు. వాళ్ల బ్రాండ్‌కి సంబంధించిన శిల్పకళా స్కీ సూట్‌లు, అప్రెస్-స్కీ దుస్తులు, ఆర్ట్ ప్రింట్‌లు ఉన్న ట్రాన్స్‌పరేంట్‌ దుస్తులు ధరించారు ఇందులో పాల్గొన్న పురుషులు, మహిళలు. అయితే వాళ్లు సరిగ్గా రంజాన్‌ పర్వదినం సమయంలో దీన్ని నిర్వహించడతో ఇంతలా స్థానిక ప్రజల నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకతను దారితీసింది. పైగా ఈ ఈవెంట్‌ సాంస్కృతిక విలువలకు తిలోదాకలిచ్చే రీతిలో దారుణంగా ఉందంటూ మత పెద్దలు, ప్రజలు, రాజకీయనాయకులు మండిపడ్డారు. అయితే ఈ షోని నిర్వహించింది ప్రఖ్యాత ఫ్యాషన్‌ బ్రాండ్‌ హాలిడే. ఇది కేన్స్‌లోని 'మారే డి మోడా'లో భారతదేశపు తొలి లగ్జరీ బ్రాండ్‌గా పేరు తెచ్చుకుంది. అధునాతన సౌందర్యానికి చెందిన ఈ బ్రాండ్‌ హాలిడే రిసార్ట్‌, స్విమ్‌ దుస్తుల పరంగా ఫ్యాషన్‌లో సంచలనాలు సృష్టించింది. వారి కలెక్షన్లు డీఎల్‌ఎఫ్‌ ఎంపోరియో (ఢిల్లీ), కలఘోడా (ముంబై), బంజారా హిల్స్ (హైదరాబాద్), ఎంబసీ చాంబర్ (బెంగళూరు) లలో అందుబాటులో ఉన్నాయి.ఇద్దరు డిజైనర్లు ఫ్యాషన్‌ ఇండస్ట్రీలో అద్భుతమైన స్థానాన్ని దక్కించుకున్నారు. వారిలో శివన్ NIFT ఢిల్లీ నుంచి బ్యాచిలర్ ఆఫ్ డిజైన్, ఇస్టిట్యూట్‌​ యూరోపియో డి డిజైన్ నుంచి మాస్టర్స్ డిగ్రీని పొందారు. కాగా నరేష్ అదే సంస్థ నుంచి లగ్జరీ అండ్‌ మార్కెటింగ్‌లో మాస్టర్‌ డిగ్రీ చేశారు. ఈ బ్రాండ్‌ని ఎక్కువగా బాలీవుడ్‌ నటులు కిమ్ కర్దాషియాన్, ప్రియాంక చోప్రా, సోనమ్ కపూర్, కంగనా రనౌత్ వంటి ప్రముఖులు నిర్వహించారు. ఈ బ్రాండ్‌కి వరించిన అవార్డులు..స్వరోవీస్కీ మోస్ట్ క్రియేటివ్ డిజైనర్ ఆఫ్ ది ఇయర్ (2007)ఉత్తమ ఎమర్జింగ్ డిజైనర్లు (మేరీ క్లైర్ ఫ్యాషన్ అవార్డ్స్, 2010)ఉత్తమ రిసార్ట్ వేర్ (ఎల్లే స్టైల్ అవార్డ్స్, 2010)ఉత్తమ క్రూయిజ్ వేర్ (గ్రాజియా యంగ్ ఫ్యాషన్ అవార్డ్స్, 2011)‘మేడ్ ఇన్ ఇండియా’ లేబుల్ టు ది వరల్డ్ (గ్రాజియా యంగ్ ఫ్యాషన్ అవార్డ్స్, 2012)యంగ్ అచీవర్స్ అవార్డు (ఎంబసీ ఆఫ్ ఇండియా, ఖాట్మండు అండ్‌ టుడేస్ యూత్ ఆసియా)ఇంత మంచి పేరు, కీర్తీ దక్కించుకున్న ఈ ఫ్యాషన్‌ డిజైనర్లు గుల్మార్గ్‌ ఫ్యాషన్‌ షోతో ఒక్కసారిగా వివాదాస్పద వ్యక్తులుగా అపకీర్తిని మూటగట్టుకున్నారు, విమర్శలపాలయ్యారు. View this post on Instagram A post shared by SHIVAN & NARRESH (@shivanandnarresh) (చదవండి: వర్కౌట్లకు టైం లేదా..? ఐతే ఇలా బరువు తగ్గించుకోండి..)

Dont Ask Demand Tax Cuts Says Nitin Gadkari8
జీఎస్‌టీ తగ్గింపుపై నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు

పేదల కోసం సంక్షేమ పథకాలను అమలు చేయడానికి ప్రభుత్వానికి నిధులు అవసరం. కాబట్టి, పరిశ్రమలు పన్నులను తగ్గించాలని నిరంతరం డిమాండ్ చేయకూడదని కేంద్ర మంత్రి 'నితిన్ గడ్కరీ' న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో వెల్లడించారు.జీఎస్‌టీ, ఇతర పన్నులను తగ్గించమని అడగకూడదు, ఒకవేళా పన్నులను తగ్గిస్తే.. ఇంకా తగ్గించాలని చెబుతారు. ఎందుకంటే అది మానవ నైజం. పన్నులు వసూలు చేయకుండా.. ప్రభుత్వం ప్రజలకు సంక్షేమ పథకాలను అందించడం కష్టం. ధనవంతుల నుంచి పన్ను తీసుకొని.. పేదలకు ప్రయోజనాలు కల్పించడం ప్రభుత్వ దార్శనికత అని గడ్కరీ అన్నారు.రెండేళ్లలోపు భారతదేశంలోని లాజిస్టిక్స్ ఖర్చు 9 శాతానికి తగ్గుతుందని నితిన్ గడ్కరీ అన్నారు. ప్రస్తుతం భారతదేశ లాజిస్టిక్స్ ఖర్చు 14 నుంచి 16 శాతంగా ఉంది. చైనాలో లాజిస్టిక్స్ ఖర్చు 8 శాతంగా ఉంది. అమెరికా, యూరోపియన్ దేశాలలో ఇది 12 శాతం అని మంత్రి అన్నారు. కాబట్టి మరో రెండేళ్లలో మన దేశంలో కూడా లాజిస్టిక్ ఖర్చులను తగ్గించనున్నట్లు స్పష్టం చేశారు. అంత కాకుండా పెట్టుబడిని పెంచడం ద్వారా భారతదేశం మరిన్ని ఉద్యోగాలను సృష్టించబోతోందని మంత్రి పేర్కొన్నారు.ఇదీ చదవండి: నెలకు 10 రోజులు.. టెక్ కంపెనీ కొత్త రూల్!మీరు సంపద సృష్టికర్తలు మాత్రమే కాదు, ఉద్యోగాల సృష్టికర్తలు కూడా. ఈ స్వర్ణ యుగాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలని నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. అంతేకాకుండా, భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికి దిగుమతులను తగ్గించి ఎగుమతులను పెంచాల్సిన అవసరాన్ని గడ్కరీ నొక్కి చెప్పారు.

Jyotika: Suriya Kanguva got Harsher Reviews than Other Pathetic South films9
ఎన్నో దారుణమైన సౌత్‌ సినిమాలకంటే కంగువా బెటర్‌: జ్యోతిక

కోలీవుడ్‌ స్టార్‌ సూర్య హీరోగా నటించిన కంగువా సినిమా (Kanguva Movie) కలెక్షన్స్‌ కొల్లగొడుతుందనుకుంటే బాక్సాఫీస్‌ వద్ద బొక్కబోర్లా పడింది. దాదాపు మూడేళ్లపాటు కష్టపడి తీసిన ఈ సినిమా డిజాస్టర్‌గా నిలిచింది. సినిమా ఏమీ బాగోలేదని, చాలా బోరింగ్‌గా ఉందన్న విమర్శలు వచ్చాయి. దీనిపై సూర్య సతీమణి, హీరోయిన్‌ జ్యోతిక అప్పట్లోనే ఘాటుగా రియాక్ట్‌ అయింది. కంగువ అద్భుతమైన సినిమా అని.. ఇలాంటి సాహసం చేయడానికి ధైర్యం కావాలంది. తొలి అరగంట బాగోలేదంతేసూర్య (Suriya)ను చూస్తుంటే గర్వంగా ఉందని తెలిపింది. తొలి అరగంట సినిమా బాగోలేదు, అలాగే మ్యూజిక్‌ కూడా కాస్త ఎక్కువగా ఉన్నట్లు అనిపించిందని పేర్కొంది. తప్పులు జరగడం సహజమేనని, ఇలాంటి చిత్రంలో చిన్న చిన్న పొరపాట్లు జరుగుతూ ఉంటాయంది. ఇలాంటి మూవీకి నెగెటివ్‌ రివ్యూలు చూసి ఆశ్చర్యపోయానంది. డబుల్‌ మీనింగ్స్‌, ఓవర్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌, పాత స్టోరీలతో తీసే సినిమాలకు వీళ్లెవరూ నెగెటివ్‌ రివ్యూలు ఇవ్వడం చూడలేదని బుగ్గలు నొక్కుకుంది.సినిమాను తొక్కేశారుకంగువా పాజిటివ్‌ అంశాలు కనబడలేదా? అని ప్రశ్నించింది. తొలిరోజే కంగువాపై నెగెటివిటీ చూస్తుంటే బాధగా ఉందని, కావాలనే సినిమాను తొక్కేస్తున్నారని మండిపడింది. తాజాగా డబ్బా కార్టెల్‌ వెబ్‌ సిరీస్‌ ప్రమోషన్స్‌లో మరోసారి కంగువా సినిమా నెగెటివిటీపై స్పందించింది. జ్యోతిక (Jyotika) మాట్లాడుతూ.. కొన్ని సినిమాలు అస్సలు బాగోవు. అయినా సరే కమర్షియల్‌గా బాగా ఆడతాయి. వాటికి మంచి రివ్యూలు కూడా ఇస్తుంటారు. కానీ నా భర్త సినిమా (కంగువా) విషయానికి వచ్చేసరికి మాత్రం కాస్త కఠినంగా ప్రవర్తించారనిపిస్తుంది.ఎన్నో దారుణ సినిమాల కంటే కంగువా నయంసినిమాలో బాగోలేని సన్నివేశాలు కొన్ని ఉండొచ్చు. కానీ ఆ మూవీ కోసం అందరూ ఎంతగానో కష్టపడ్డారు. అది కళ్ల ముందు స్పష్టంగా కనిపిస్తోంది. అయినా సరే.. దక్షిణాదిలో ఎన్నో అద్వాణ్నమైన సినిమాలకంటే కూడా ఈ చిత్రానికే ఎక్కువ దారుణమైన రివ్యూలు ఇచ్చారు. అది చూసి నాకెంతో బాధేసింది అని చెప్పుకొచ్చింది. సుమారు రూ.350 కోట్లతో తెరకెక్కిన కంగువా కేవలం రూ.160 కోట్లు మాత్రమే రాబట్టింది. ఈ చిత్రానికి శివ దర్శకత్వం వహించాడు.చదవండి: భారత్‌లో తొలి ఏఐ సినిమా.. హీరోహీరోయిన్లు కూడా..

TGPSC Group 1 Result 2025 released in telangana10
TSPSC : తెలంగాణ గ్రూప్‌-1 మెయిన్స్‌ ఫలితాలు విడుదల

సాక్షి,హైదరాబాద్‌ : తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (TSPSC) తెలంగాణ గ్రూప్‌-1 పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. అభ్యర్థి లాగిన్‌లో ప్రొవిజనల్‌ మార్కులు చూసుకునే అవకాశం ఉంది. మొత్తం 563 పోస్టులకు‌గానూ గత ఏడాది అక్టోబర్‌లో జరిగిన మెయిన్స్‌కు 21,093 మంది అభ్యర్థులు హాజరయ్యారు,అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా 1:2 నిష్పత్తిలో మెరిట్‌ జాబితా సిద్ధం చేసేందుకు కమిషన్‌ తుది పరిశీలన నిర్వహిస్తోంది. ఇక రేపు గ్రూప్-2 అభ్యర్థుల జనరల్ ర్యాంకింగ్ లిస్ట్, 14న గ్రూప్-3 పరీక్ష జనరల్ ర్యాంకింగ్ జాబితాను రిలీజ్ చేయనున్నారు.ఫలితాల విడుదల షెడ్యూల్మార్చి 10 - గ్రూప్‌-1 ఫలితాల విడుదల, ప్రొవిజినల్ మార్కుల వెల్లడింపు.మార్చి 11 - గ్రూప్‌-2 జనరల్ ర్యాంకింగ్ జాబితా విడుదల.మార్చి 14 - గ్రూప్‌-3 జనరల్ ర్యాంకింగ్ జాబితా విడుదల.మార్చి 17 - హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ తుది ఫలితాల ప్రకటన.మార్చి 19 - ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ తుది ఫలితాల విడుదల.అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాల పరిశీలన గ్రూప్-1 ఫలితాల విడుదల అనంతరం చేపట్టనున్నారు.గతేడాది అక్టోబర్‌లో మెయిన్స్‌తెలంగాణ గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలను అక్టోబర్‌ 21 నుంచి అక్టోబర్‌ 27వ తేదీ వరకూ తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ మెయిన్స్ పరీక్షలను నిర్వహించింది. గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షల్ని అధికారులు పకడ్బందీగా నిర్వహించారు. ఉమ్మడి హైదరాబాద్‌,రంగారెడ్డి జిల్లాలో 46 పరీక్ష కేంద్రాలను కేటాయించారు. 2011 సంవత్సరం తర్వాత గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షల కోసం తెలంగాణ ప్రభుత్వం బయోమెట్రిక్‌ కోసం ప్రత్యేక సిబ్బందిని నియమించింది. పరీక్ష కేంద్రాలు, పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసింది. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలు చేసింది.హైదరాబాద్‌,రంగారెడ్డి,మేడ్చల్‌ కేంద్రాల్లో ఐపీఎస్‌ అధికారాలకు బాధ్యతలు అప్పగించింది.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

National View all
title
పట్టపగలే దొంగల ముఠా బీభత్సం.. భారీ దోపిడీ!

పాట్నా: బీహార్ రాష్ట్రంలో పట్టపగలే దోపిడీ దొంగలు బీభత్సం స్ప

title
దుబాయ్ నుంచి ఎంత బంగారం తీసుకురావచ్చు?

కన్నడ నటి 'రన్యా రావు' 14.2 కేజీల బంగారాన్ని అక్రమంగా రవాణా చేస్తున్నారనే ఆరోపణలతో బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమా

title
Ranya Rao : రన్యారావు వ్యవహారంలో మరో బిగ్‌ ట్విస్ట్‌

బెంగళూరు: గోల్డ్‌ స్మగ్లింగ్‌ చేస్తూ దొరికి పోయిన కన్ననటి రన

title
రంజాన్‌ వేళ కశ్మీర్‌లో అర్ధనగ్న ఫ్యాషన్‌ షో.. సీఎం ఒమర్‌కు ఝలక్‌!

శ్రీనగర్‌: పవిత్ర రంజాన్‌ మాసం వేళ జమ్ము కశ్మీర్‌లో అర్ధనగ్న

title
విమానంలో 322 మంది.. 8 గంటల జర్నీ తర్వాత వెనక్కి!

న్యూఢిల్లీ, సాక్షి: ముంబై-న్యూయార్క్‌ ఎయిరిండియా విమానం.

NRI View all
title
ఫ్లోరిడాలో అత్యున్నత స్థాయి ‘హెర్ హెల్త్ ఆంకాలజీ కాంగ్రెస్ 2025’

అమెరికాలోని ఫ్లోరిడాలోని ఓర్లాండో నగరంలో  మెడికల్‌ కాన్ఫరెన్స్‌ ఘనంగా జరిగింది.

title
డాక్టర్‌ కావాలనుకుంది : భారతీయ విద్యార్థిని విషాదాంతం?!

డొమినికన్ రిపబ్లిక్‌లో  కనిపించకుండాపోయిన భారతీయ విద్యార్థిని ప్రాణాలు కోల్పోయిందా అంటే అవుననే అనుమానాలు బాగా బలపడు

title
USA: భారత సంతతి సుదీక్ష అదృశ్యం.. బీచ్‌లో ఏం జరిగింది?

వర్జీనియా: అమెరికాలో చదువుతున్న భారత సంతతి విద్యార్థిని సుదీ

title
ఈ ఏడాది హెచ్‌1బీ వీసాలు కష్టమే

సాక్షి, అమరావతి: అమెరికా వీసాల్లో అత్యధిక డిమాండ్‌ ఉన్న హెచ్

title
న్యూయార్‌లో ఘనంగా తెలుగువారి సంబరాలు.

అమెరికా వాణిజ్య రాజధాని న్యూయార్క్ లో తెలుగువారి సంబరాలు అంబరాన్ని అంటాయి.

Advertisement

వీడియోలు

Advertisement