Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Child Rights Commission writes to School Education Department on teacher shortage1
డీఎస్సీపై సర్కారు డ్రామాలు..

మేం అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ ప్రకటించి ఖాళీగా ఉన్న అన్ని ఉపాధ్యాయ పోస్టు లను భర్తీ చేస్తాం. సీఎంగా తొలి సంతకం మెగా డీఎస్సీ ఫైలు పైనే చేస్తా..!– ఎన్నికల సభల్లో టీచర్‌ పోస్టుల ఆశావహులకు చంద్రబాబు హామీ16,347 పోస్టులతో మెగా డీఎస్సీ ఇస్తాం. త్వరలోనే నోటిఫికేషన్‌ ఇచ్చి మొత్తం నియామక ప్రక్రియను డిసెంబర్‌ నాటికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించాం..– గతేడాది జూన్‌లో సీఎంగా చంద్రబాబు ప్రకటన!మెగా డీఎస్సీకి మేం కట్టుబడి ఉన్నాం. వచ్చే విద్యా సంవత్సరం నాటికి పోస్టులు భర్తీ చేస్తాం..– తాజాగా శాసనసభలో బడ్జెట్‌ ప్రసంగంలో ఆర్థిక మంత్రి పయ్యావుల మాట! గతేడాది అసెంబ్లీ సమావేశాల్లోనూ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ ఇదే మాట చెప్పారు!సాక్షి, అమరావతి: ఎప్పటి మాదిరిగానే సీఎం చంద్రబాబు ఇచ్చిన మరో హామీ నీరుగారింది! అధికారంలోకి వచ్చిన 60 రోజుల్లోనే మెగా డీఎస్సీ నిర్వహిస్తామని నమ్మబలికారు. తీరా అధికారంలోకి వచ్చాక.. త్వరలో.. త్వరలో... అంటూ తొమ్మిది నెలలు గడిచిపోయినా డీఎస్సీపై అతీగతీ లేకుండా ఉపాధ్యాయ అభ్యర్థులను వంచించిన టీడీపీ కూటమి సర్కారు టీచర్‌ పోస్టుల సంఖ్యలోనూ భారీగా కోత పెట్టింది! ఏకంగా 11 వేలకుపైగా పోస్టులను దాచిపెట్టి నిరుద్యోగులతో ఆడుకుంటోంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు తొలి సంతకం చేసిన డీఎస్సీ ఫైలుకు ఇప్పటికీ మోక్షం కలగకపోవడం ఒక ఎత్తయితే.. టీచర్‌ పోస్టుల ఖాళీలకు తూట్లు పొడవడం మరోఎత్తు! రాష్ట్రంలో మొత్తం 27,409 టీచర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు స్వయంగా విద్యాశాఖే వెల్లడించగా.. కేవలం 16,347 మాత్రమే భర్తీ చేస్తామని చెప్పుకొస్తూ నెలల తరబడి కాలయాపన చేయడం గమనార్హం. డీఎస్సీ నిర్వహణ, ఉపాధ్యాయ ఖాళీలపై టీడీపీ కూటమి సర్కారు డ్రామాలపై నిరుద్యోగులు మండిపడుతున్నారు. ఖాళీలపై విద్యాశాఖ వివరాలు.. రాష్ట్రంలోని పాఠశాలలు, ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలపై వివరాలు ఇవ్వాలని ‘హెల్ప్‌ ద పీపుల్‌’ చారిటబుల్‌ ట్రస్ట్‌ చైర్మన్‌ గురుతేజ ఇటీవల సమాచార హక్కు చట్టం ద్వారా పాఠశాల విద్యాశాఖను కోరారు. దీనిపై విద్యాశాఖ స్పందిస్తూ.. రాష్ట్రంలో 34,245 ప్రాథమిక పాఠశాలలు, 3,206 ప్రాథమికోన్నత పాఠశాలలు ఉన్నాయని తెలిపింది. వీటితో­పాటు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ మేనేజ్‌మెంట్‌ పాఠశాలల్లో 2,06,393 టీచర్‌ పోస్టులు మంజూ­రైనట్లు వెల్లడించింది. అయితే ప్రస్తుతం 1,78,984 మంది మాత్రమే పనిచేస్తున్నారని, 27,409 టీచర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొంది. ఈ వివరాలతో హెల్ప్‌ ది పీపుల్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ చైర్మన్‌ జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ (ఎన్‌సీపీసీఆర్‌)ను ఆశ్రయించారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉచిత, నిర్బంధ విద్యా హక్కు చట్టాన్ని ఉల్లంఘిస్తోందని, దీనిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఏపీ పాఠశాల విద్యాశాఖ అందచేసిన వివరాలను సమర్పించారు. దీనిపై స్పందించిన ఎన్‌సీపీసీఆర్‌.. పాఠశాల విద్య డైరెక్టర్‌కు లేఖ రాసింది. నోటిఫికేషనే లేకుండా భర్తీపై హామీలా? రాష్ట్రంలో 25 వేల టీచర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయంటూ సార్వత్రిక ఎన్నికలకు ముందు టీడీపీ కూటమి నేతలు విస్తృతంగా ప్రచారం చేశారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని ఖాళీలను మెగా డీఎస్సీ ద్వారా భర్తీ చేస్తామని ప్రకటించారు. పైగా గత ప్రభుత్వం 6,100 పోస్టులతో ఇచ్చిన నోటిఫికేషన్‌ను రద్దు చేసి.. మెగా డీఎస్సీ ఇస్తామంటూ ఉపాధ్యాయ అభ్యర్థుల్లో ఆశలు రేకెత్తించారు. అధికారం చేపట్టాక 16,347 డీఎస్సీ పోస్టుల భర్తీ ఫైల్‌పై తొలి సంతకం చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గతేడాది డిసెంబర్‌ నాటికే పోస్టుల భర్తీ పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. కానీ తొమ్మిది నెలలు గడిచినా నోటిఫికేషన్‌ ఇవ్వకుండా నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుతున్నారు. తాజాగా శాసన సభలో ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ వచ్చే విద్యా సంవత్సరం నాటికి పోస్టులు భర్తీ చేస్తామని చెప్పారు. అసలు ఇంతవరకూ నోటిఫికేషన్‌ ప్రక్రియే చేపట్టకుండా భర్తీపై మాట్లాడడం ఏమిటని ఉపాధ్యాయ అభ్యర్థులు వాపోతున్నారు. రాష్ట్రంలో 13.28 శాతం టీచర్‌ పోస్టులు ఖాళీగా ఉండటం విద్యాహక్కు చట్టం ఉల్లంఘన కిందకు వస్తుందని హెచ్చరిస్తూ ఫిబ్రవరి 19వ తేదీన పాఠశాల విద్య డైరెక్టర్‌కు ఎన్‌సీపీసీఆర్‌ రాసిన లేఖ నోరు విప్పని సర్కారు ‘వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం విద్యారంగాన్ని నాశనం చేస్తోంది. టీచర్‌ పోస్టులను భర్తీ చేయకుండా కాలయాపన చేస్తోంది. పాఠశాలల్లో 25 వేలకు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నా భర్తీ చేయడం లేదు. మేం అధికారంలోకి రాగానే తొలి సంతకం మెగా డీఎస్సీపైనే చేస్తాం. 25 వేల ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీ చేస్తాం’ అని ఎన్నికల వేళ చంద్రబాబుతో పాటు కూటమి నేతలు నమ్మబలికారు. తీరా అధికారంలోకి రాగానే 25 వేల ఖాళీలు కాదు.. 16,347 పోస్టులే అంటూ మాట మార్చి కనీసం వాటిని కూడా భర్తీ చేయకుండా కాలక్షేపం చేస్తున్నారు. అంతేకాకుండా వైఎస్సార్‌ సీపీ హయాంలో 6,100 పోస్టుతో ఇచ్చిన డీఎస్సీ నోటిఫికేషన్‌ను సైతం సరిగ్గా పరీక్షల ముందు రద్దు చేశారు. కొత్తగా బీఈడీ, డీఈడీ పూర్తి చేసిన వారికి కూడా మెగా డీఎస్సీలో అవకాశం కల్పిస్తామంటూ గతేడాది జూలై 2న టెట్‌ నోటిఫికేషన్‌ ఇచ్చి ఆగస్టులో ఆ పరీక్షలంటూ ప్రచారం చేశారు. అనంతరం టెట్, డీఎస్సీకి మధ్య 90 రోజులు గడువు ఉండాలంటూ టెట్‌ షెడ్యూల్‌ను తొలుత సెప్టెంబర్‌కు తర్వాత అక్టోబర్‌కు మార్చారు. టెట్‌ ఫలితాలు వచ్చి ఐదు నెలలు గడుస్తున్నా డీఎస్సీ నోటిఫికేషన్‌ మాత్రం ఇవ్వలేదు. జాతీయ బాలల హక్కుల కమిషన్‌ సీరియస్‌.. రాష్ట్రంలో వేల సంఖ్యలో టీచర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నా ప్రభుత్వం భర్తీ చేయకపోవడాన్ని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ (ఎన్‌సీపీసీఆర్‌) తీవ్రంగా పరిగణిస్తోంది. విద్యా హక్కు చట్టం ప్రకారం ఏ రాష్ట్రంలోనూ 10 శాతానికి మించి ఉపాధ్యాయ పోస్టులు ఖాళీలు ఉండకూడదని, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఏకంగా 27,409 టీచర్‌ పోస్టులు (13.28 శాతం) ఖాళీగా ఉన్నాయని, వీటిని ఎందుకు భర్తీ చేయడం లేదని నిలదీసింది. ఇన్ని ఖాళీలు ఉన్నా డీఎస్సీ నోటిఫికేషన్‌ ఎందుకు ఇవ్వలేదో వెల్లడించాలని పేర్కొంటూ పాఠశాల విద్య డైరెక్టర్‌కు లేఖ రాసింది. ఉచిత, నిర్బంధ విద్యా హక్కు చట్టానికి విరుద్ధంగా... మంజూరైన ఉపాధ్యాయ పోస్టుల్లో 10 శాతానికి మించి ఖాళీలు ఉండడం పిల్లల విద్యపై తీవ్ర ప్రభావం చూపుతుందని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో దీనిపై వెంటనే తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా పాఠశాల విద్య డైరెక్టర్‌కు సూచించింది. పది లక్షల మంది పడిగాపులు..దాదాపు 10 లక్షల మంది ఉపాధ్యాయ అభ్యర్థులు ఆర్ధికంగా నలిగిపోతూ డీఎస్సీ కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నా విద్యాశాఖ మంత్రి కనీసం ఫలానా రోజు డీఎస్సీ షెడ్యూల్‌ ఇస్తామని చెప్పే ప్రయత్నం కూడా చేయడం లేదు. ఏళ్ల తరబడి శిక్షణ పొందుతున్న అభ్యర్థులంతా డీఎస్సీపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత లేక తీవ్ర ఆందోళన చెందుతున్నారు. 27,409 టీచర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు సాక్షాత్తూ పాఠశాల విద్యాశాఖే చెబుతుండగా ఏకంగా 11 వేలకుపైగా పోస్టులను కుదించడం.. నోటిఫికేషన్‌ ఇవ్వకుండా ఆటలాడటంపై రగిలిపోతున్నారు.10 లక్షల మంది పిల్లలపై ప్రభావం..రాష్ట్రంలోని 45 వేల ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు, విద్యార్థుల నిష్పత్తి 1 : 40 ప్రకారం బోధనకు 2,06,393 మంది టీచర్లు అవసరం కాగా, ప్రస్తుతం 1,78,984 మంది ఉపాధ్యాయులు మాత్రమే ఉన్నట్లు విద్యాశాఖ వెల్లడించింది. అంటే 27,409 టీచర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఫలితంగా రాష్ట్రంలో 10,96,360 మంది విద్యార్థుల బోధనపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఇంత భారీగా టీచర్‌ పోస్టులు ఖాళీలు ఉన్నా ప్రభుత్వం డీఎస్సీలో పోస్టులు తగ్గించి చూపడంతో పాటు అసలు నోటిఫికేషన్‌ ఎప్పుడిస్తుందో కూడా చెప్పడం లేదు.

US President Donald Trump Comments In US Congress Joint session2
ఇది ఆరంభమే.. అసలు కథ ముందుంది: ట్రంప్‌

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికాకు మంచి జరగాలనే ఉద్దేశంతోనే ప్రజలు తనను ఎన్నుకున్నట్టు ట్రంప్‌ చెప్పుకొచ్చారు. తాను అధికారంలోకి వచ్చిన ఆరు వారాల్లోనే వందకు పైగా సంతకాలు చేసినట్టు ట్రంప్‌ తెలిపారు.అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత డొనాల్డ్‌ తొలిసారి కాంగ్రెస్‌ సంయుక్త సెషన్‌లో ప్రసంగించారు. ఈ సందర్బంగా ట్రంప్‌ తాను అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశారో వివరించారు. ఈ క్రమంలో ట్రంట్‌ మాట్లాడుతూ..‘ఆరు వారాల్లో వందకు పైగా ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్లపై సంతకాలు చేశాను. నాలుగేళ్లు, ఎనిమిదేళ్లలో సాధించిన దానికంటే ఎక్కువగా తాను ఈ 43 రోజుల్లోనే సాధించినట్టు అనిపిస్తోంది. అమెరికాలో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ మళ్లీ తిరిగి వచ్చింది. ఈ పని చేయడానికి అమెరికా ప్రజలు నన్ను ఎన్నుకున్నారు.. చేసుకుంటూ పోతున్నాను. త్వరలోనే అమెరికన్ల కల నిజం కాబోతుంది. గతంలో కంటే మెరుగైన జీవితం వారికి లభిస్తుంది. ఇది ఆరంభం మాత్రమే. ఇంకా చేయాల్సింది చాలా ఉంది’ అంటూ వ్యాఖ్యానించారు. #WATCH | While addressing a joint session, US President Donald Trump says, " America is back. 6 weeks ago, I stood beneath the dome of this capitol and proclaimed the dawn of the golden age of America. From that moment on, there has been nothing but swift and unrelenting action… pic.twitter.com/5es6k7Idpg— ANI (@ANI) March 5, 2025ఇతర దేశాలు దశాబ్దాలుగా మనపై సుంకాలను విధిస్తున్నాయి. ఇప్పుడు ఆ ఇతర దేశాలపై వాటిని ఉపయోగించడం ప్రారంభించాల్సిన సమయం వచ్చింది. యూరోపియన్ యూనియన్, చైనా, బ్రెజిల్, భారత్‌, ఇతర దేశాలు మనం వసూలు చేసే దాని కంటే చాలా ఎక్కువ సుంకాలను మన నుండి వసూలు చేస్తాయి. ఇది చాలా అన్యాయం. భారత్‌ మన నుండి ఆటో సుంకాలను 100% వసూలు చేస్తుంది. ఇందులో భాగంగానే ఏప్రిల్ 2వ తేదీ నుంచి పరస్పర సుంకాలు ప్రారంభమవుతాయి. వారు మనపై ఎలాంటి సుంకాలు వేస్తారో.. మనం వాటిపై అంతే సుంకాలు విధిస్తాం అని చెప్పారు.#WATCH | While addressing a joint session of US Congress, US President Donald Trump says, " Other countries have used tariffs against us for decades and now it is our turn to start using them against those other countries. On average, the European Union, China, Brazil,… pic.twitter.com/7lRu4udKEN— ANI (@ANI) March 5, 2025అమెరికాలో ద్రవ్యోల్బణం కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నష్టాన్ని తిప్పికొట్టి అమెరికాను మళ్లీ రేసులోకి తీసుకురావడానికి నేను ప్రతిరోజూ పోరాడుతున్నాను. అలాగే, సరిహద్దుల నుంచి అక్రమ వలసలు కూడా ఆగిపోయాయి అంటూ కామెంట్స్‌ చేశారు. #WATCH | US President Donald Trump says, "Within hours of taking the oath of office, I declared a national emergency on our southern border. I deployed US military and border patrol to repel the invasion of our country and what a job they have done! As a result, illegal border… pic.twitter.com/Nn4xc97rj7— ANI (@ANI) March 5, 2025 ఇదిలా ఉండగా.. అంతకుముందు రిపబ్లికన్‌ పార్టీ మద్దతుదారులు ట్రంప్‌కు ఘన స్వాగతం పలికారు. ట్రంప్‌ వస్తున్న సమయంలో అమెరికా, అమెరికా, అమెరికా అంటూ నినాదాలు చేశారు. దీంతో, సభా ప్రాంగణం హోరెత్తిపోయింది. #WATCH LIVE via ANI Multimedia | Republicans in Congress stand up and chant 'USA, USA' to a Democrat heckler during US President Donald Trump's Address. (Video Source: US Network Pool Via Reuters) pic.twitter.com/IV8hygCPpp— ANI (@ANI) March 5, 2025

Rohit Sharma Reveals Rationale For Team Combination3
ఆఖరి వరకు ఏమీ చెప్పలేం.. వారిద్దరి వల్లే ఈ విజయం: రోహిత్‌ శర్మ

ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భార‌త క్రికెట్ జ‌ట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది. మంగళవారం దుబాయ్ వేదికగా జరిగిన తొలి సెమీఫైన‌ల్లో వ‌ర‌ల్డ్ ఛాంపియ‌న్స్ ఆస్ట్రేలియాను 4 వికెట్ల తేడాతో మ‌ట్టిక‌ర్పించిన టీమిండియా.. ఐదోసారి ఈ మెగా టోర్నీ ఫైన‌ల్లో అడుగుపెట్టింది. ఈ విజ‌యంతో వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్-2023 ఫైన‌ల్ ఓట‌మికి భార‌త్ బ‌దులు తీర్చుకుంది. ఈ సెమీస్ పోరులో భారత్ ఆల్‌రౌండ్ షోతో అద‌ర‌గొట్టింది.తొలుత బౌల‌ర్లు స‌త్తాచాట‌గా.. అనంత‌రం బ్యాట‌ర్లు స‌మిష్ట‌గా రాణించారు. 265 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 4 వికెట్లు కోల్పోయి 48.1 ఓవర్లలో చేధించింది. ఛేజ్‌ మాస్టర్‌ విరాట్‌ కోహ్లి(Virat Kohli) మరోసారి అద్భుత ఇన్నింగ్స్‌ ఆడాడు. ఆరంభంలో ఓపెనర్లు రోహిత్‌ శర్మ, గిల్‌ వికెట్లు కోల్పోయినప్పటికి విరాట్‌​ మాత్రం తన క్లాస్‌ను చూపించాడు.మిడిలార్డర్‌ బ్యాటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌తో కలిసి స్కోర్‌బోర్డును ముందుకు నడిపించాడు. అయ్యర్‌(45) ఔటయ్యాక అక్షర్‌ పటేల్‌తో కూడా కోహ్లి భాగస్వామ్యం నెలకొల్పాడు. అయితే విజయానికి మరో 39 పరుగులు కావల్సిన దశలో ఓ భారీ షాట్‌కు ప్రయత్నించి కోహ్లి ఔటయ్యాడు. 98 బంతులు ఎదుర్కొన్న కోహ్లి 5 ఫోర్ల సాయంతో 84 పరుగులు చేశాడు. కేవలం 16 పరుగుల దూరంలో తన 52వ వన్డే సెంచరీ చేసే అవకాశాన్ని కింగ్‌ కోహ్లి కోల్పోయాడు. ఆఖరిలో కేఎల్‌ రాహుల్‌(34 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 42 నాటౌట్), హార్దిక్‌ పాండ్యా(24 బంతుల్లో 1 ఫోర్‌, 3 సిక్స్‌లతో 28) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. ఆసీస్ బౌలర్లలో ఎల్లీస్, జంపా రెండు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. బెన్ ద్వార్షుయిస్, కొన్నోలీ చెరో వికెట్ ప‌డ‌గొట్టారు. ఇక అద్భుత విజయంపై మ్యాచ్‌ అనంతరం టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ(Rohit Sharma) స్పందించాడు. ఈ మెగా టోర్నీ ఫైనల్‌కు చేరడం చాలా సంతోషంగా ఉందని రోహిత్‌ చెప్పుకొచ్చాడు."ఆటలో ఆఖరి బంతి పడే వరకు ఏమీ చెప్పలేం. ఆసీస్‌ ఇన్నింగ్స్‌ ముగిశాక ఇది మరీ చిన్న స్కోరేమీ కాదని, విజయం కోసం మేం చాలా బ్యాటింగ్‌ చేయాల్సి ఉంటుందని అర్థమైంది. ఎందుకంటే సెకెండ్ ఇన్నింగ్స్‌లో పిచ్ ఎలా ప్రవ‌ర్తిస్తుందో మ‌నం అంచ‌నా వేయలేం. పిచ్‌పై ఎక్కువ దృష్టి పెట్టకుండా మా ఆటనే నమ్ముకున్నాం. కానీ పిచ్ కూడా కాస్త మెరుగ్గా అనిపించింది. న్యూజిలాండ్‌తో మ్యాచ్ కంటే ఈ రోజు పిచ్ చాలా బెట‌ర్‌గా ఉంది.ఈ మ్యాచ్‌లో మా బ్యాట‌ర్లు అద్బుతంగా రాణించారు. మేము 48 ఓవ‌ర్ వ‌ర‌కు గేమ్‌ను తీసుకుండొచ్చు. కానీ మా ఛేజింగ్‌లో ప్రశాంతంగా ఎటువంటి ఒత్తిడి లేకుండా టార్గెట్‌ను ఫినిష్ చేశాము. మాకు అదే ముఖ్యం. అన్ని విభాగాల్లో మెరుగ్గా రాణించిడంతోనే ఈ విజ‌యం సాధ్య‌మైంది. జట్టులో అనుభవం కలిగిన ఆటగాళ్లు ఉన్నారు.ఇక తుది జ‌ట్టు కూర్పు ఎప్పుడూ స‌వాల్‌గానే ఉంటుంది. ఆరు బౌలింగ్‌ ప్రత్యామ్నాయాలు, ఎనిమిదో నంబర్‌ వరకు బ్యాటింగ్‌ చేయగలవారు ఉండాలని మేం కోరుకున్నాం. దానిని బట్టే జట్టును ఎంపిక చేశాం. ఇప్పుడు ఆ ఆరుగురు బౌలర్లను సమర్థంగా వాడుకున్నాం.విరాట్ కోహ్లి మ‌రోసారి అద్బుత ఇన్నింగ్స్ ఆడాడు. అత‌డు ఎన్నో ఏళ్లుగా ఇదే తరహాలో జట్టును గెలిపిస్తూ వస్తున్నాడు. ప‌వ‌ర్ ప్లేలో రెండు వికెట్లు కోల్పోయిన త‌ర్వాత మాకు ఓ పెద్ద భాగస్వామ్యం కావాలనుకున్నాం. శ్రేయస్ అయ్యర్, కోహ్లి మాకు ఆ భాగ‌స్వామ్యం అందించారు. కేఎల్‌(రాహుల్‌), హార్దిక్‌ పాండ్యా కూడా ఆఖరిలో అద్భుతంగా ఆడారు. ఫైనల్‌కు ముందు ఆటగాళ్లంతా ఫామ్‌లో ఉంటే జట్టులో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అయితే దాని గురించి అతిగా ఆలోచించడం లేదు. సమయం వచి్చనప్పుడు అంతా సరైన రీతిలో స్పందిస్తారు అని పోస్ట్‌​ మ్యాచ్‌ ప్రేజెంటేషన్‌లో రోహిత్‌ పేర్కొన్నాడు. కాగా ఆదివారం జరగనున్న ఫైనల్లో దక్షిణాఫ్రికా లేదా న్యూజిలాండ్‌తో భారత్‌ తలపడనుంది.చదవండి: కుల్దీప్‌ యాదవ్‌పై మండిపడ్డ కోహ్లి, రోహిత్‌!.. గట్టిగానే తిట్టేశారు!

UP CM Yogi Says Family with 130 boats made 30cr profit during Kumbh4
కుటుంబం తలరాత మార్చిన ‘కుంభమేళా’.. 30 కోట్లు సంపాదన

లక్నో: ఇటీవల ముగిసిన మహాకుంభమేళా నిర్వహణపై ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వంపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్న వేళ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ దీటుగా బదులిచ్చారు. పడవలు నడిపే కుటుంబాలకు పెద్దగా ఒరిగిందేమీ లేదని సమాజ్‌వాదీ పార్టీ చేసిన విమర్శకు రాష్ట్ర బడ్జెట్‌పై చర్చ సందర్భంగా శాసనసభలో సీఎం యోగి సమాధానమిచ్చారు.ఈ సందర్భంగా సీఎం యోగి మాట్లాడుతూ..‘45 రోజులపాటు కనీవినీ ఎరుగని రీతిలో జరిగిన సనాతన ఆధ్యాత్మిక వైభవం మహాకుంభ్‌మేళా. ప్రయాగ్‌రాజ్‌లో ఒక కుటుంబం విజయగాథ చెప్తా. ఆ కుటుంబానికి 130 పడవలు ఉన్నాయి. 45 రోజుల కుంభమేళా రోజుల్లో ఈ కుటుంబం ఏకంగా రూ.30 కోట్ల లాభాలను కళ్లజూసింది. అంటే ఒక్కో బోటు రూ.23 లక్షల లాభాల తెచ్చింది. రోజుల లెక్కన చూస్తే ఒక్కో బోటు నుంచి రోజుకు రూ.50,000 నుంచి రూ.52,000 లాభం వచ్చింది’ అని అన్నారు.ఇదే సమయంలో కుంభమేళా వివరాలను యోగి వెల్లడించారు. ఒక్క తొక్కిసలాట ఘటన తప్పితే 45 రోజుల్లో ఏకంగా 66 కోట్ల మంది భక్తులు సంతోషంగా మేళాకు వచ్చి వెళ్లారు. ఒక్క నేరం జరగలేదు. మహిళలపై వేధింపులు, కిడ్నాప్, దోపిడీ, హత్య ఘటన ఒక్కటి కూడా జరగలేదు అని అన్నారు.One Boatman family who has 130 boats earn ₹ 30cr in just 45 days during the Kumbh Mela. pic.twitter.com/7UhvKZZosc— Farrago Abdullah Parody (@abdullah_0mar) March 4, 2025వేల కోట్లు పెడితే లక్షల కోట్ల వ్యాపారం..కుంభమేళాకు ఏర్పాట్లు, రక్షణ, భద్రత తదితరాల కోసం అయిన మొత్తం ఖర్చు రూ.7,500 కోట్లు. 200కుపైగా రోడ్లను వెడల్పు చేశాం. 14 ఫ్లైఓవర్లు కట్టాం. 9 అండర్‌పాస్‌లు నిర్మించాం. 12 కారిడార్లను సిద్ధంచేశాం. దీంతో పలు రంగాల్లో మొత్తంగా ఏకంగా రూ.3 లక్షల కోట్ల వ్యాపారం జరిగింది. హోటల్‌ రంగంలో రూ.40,000 కోట్ల వ్యాపారం జరిగింది. ఇక ఆహారం, నిత్యావసరాల విభాగంలో రూ.33,000 కోట్లు, రవాణారంగంలో రూ.1.5 లక్షల కోట్ల వ్యాపారం జరిగింది. రూ.660 కోట్ల విరాళాలు వచ్చాయి. జాతీయరహదారుల వెంట టోల్‌ట్యాక్స్‌ రూపంలో రూ.300 కోట్లు వచ్చాయి. ఇతర రెవిన్యూ మార్గాల్లో రూ.66,000 కోట్ల వ్యాపారం జరిగింది. ఈఏడాది దేశ స్తూలజాతీయోత్పత్తికి కుంభమేళా సైతం తన వంతు వాటాను అందించింది అని యోగి చెప్పారు.

Singer Kalpana Present Health And Incident Details5
సింగర్ కల్పనకు ఏమైంది? పోలీసుల అదుపులో భర్త

టాలీవుడ్ ప్రముఖ సింగర్ కల్పన(Singer Kalpana) ఆత్మహత్యాయత్నం చేసుకోవడం కలకలం రేపింది. నిద్రమాత్రలు మింగి చనిపోయేందుకు ప్రయత్నించిన ఈమె.. గత రెండు రోజులుగా ఇంట్లోనే ఉండిపోయినట్లు పోలీసులు గుర్తించారు. ఎంతకీ తలుపు తీయకపోవడంతో బద్దలు కొట్టుకుని మరీ ఇంట్లోకి వెళ్లి ఆమెని రక్షించారు.(ఇదీ చదవండి: పెళ్లికి ముందే విడాకులు.. హైదరాబాద్‌ అబ్బాయితో తమన్నా కటిఫ్‌)ఇంతకీ ఏమైంది?కల్పన నివాసముంటున్న వర్టేక్స్ ప్రివిలేజ్ విల్లా సెక్రటరీ వెంకటరెడ్డి చెప్పిన దానిబట్టి చూస్తే.. కల్పన భర్త ప్రసాద్ నాకు ఫోన్ చేశారు. సాయంత్రం నాలుగన్నరకు కాల్ లిఫ్ట్ చేస్తే సాయం కావాలని అన్నారు. నేను ఆయనకు అపార్ట్ మెంట్ సూపర్ వైజర్ నంబర్ ఇచ్చారు. భర్త ఫోన్ చేసినా సరే కల్పన కాల్ లిఫ్ట్ చేయలేదు. సీసీ కెమెరాలు పరిశీలించగా అప్పటికే తన భార్య అపస్మారక స్థితిలో ఉందని ఆయన అన్నారు.దీంతో మేం పోలీసులకు సమాచారం ఇచ్చాం. వాళ్లొచ్చి డోర్స్ పగలగొట్టి చూడగా.. కల్పన బెడ్ పై పడి ఉంది. దీంతో దగ్గర్లోని ప్రైవేట్ హాస్పిటల్ కి షిఫ్ట్ చేశామని సెక్రటరీ చెప్పుకొచ్చారు. ఈ విల్లాలో ఐదేళ్లుగా వీళ్లు నివాసముంటున్నారని, గత రెండు రోజులుగా మాత్రం కల్పన భర్త ఇంట్లో లేరని అన్నారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 11 సినిమాలు.. మరి థియేటర్లలో?)కల్పన, ఆమె భర్త మంచిగా ఉండేవారు. మాతో మాట్లాడేవారు. ఇద్దరు మధ్య ఏమైనా ఎలాంటి విభేదాలు ఉన్నాయో మాకు తెలియదు. విల్లాలో ఏదైనా ప్రోగ్రామ్స్ ఉన్నా, ఈవెంట్స్ ఉన్నా కల్పన వచ్చేవారని సదరు సెక్రటరీ చెప్పుకొచ్చారు. కానీ కల్పన ఆత్మహత్యాయత్నం చేసుకోవడంపై విచారణ ప్రారంభించిన పోలీసులు.. ఈమె భర్తని అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు నిజాంపేటలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కల్పనని చూసేందుకు సింగర్స్ సునీత, శ్రీకృష్ణ తదితరులు వచ్చారు. ప్రస్తుతం ఈమె ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు పోలీసులు చెప్పారు.(ఇదీ చదవండి: కూతురిచ్చిన గిఫ్ట్.. రూ.6 కోట్లకు అమ్మేసిన నటుడు)గాయని కల్పన భర్త ప్రసాదను హాస్పిటల్ నుండి కేపీఎచ్బీ పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్న దృశ్యం..@pskkp_cyb @hydcitypolice https://t.co/qG9WggK9aH pic.twitter.com/QWSYlN5720— Telangana Awaaz (@telanganaawaaz) March 4, 2025

Ukraine Zelensky Regrets Trump Spat After US Aid Pause6
అమెరికా దెబ్బకు జెలెన్‌స్కీ యూటర్న్‌.. ట్రంప్‌ బిగ్‌ ప్లాన్‌?

కీవ్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌(Donald Trump)తో జరిగిన వాగ్వాదంపై ఉక్రెయిన్‌ అధినేత జెలెన్‌స్కీ మరోసారి స్పందించారు. ట్రంప్‌తో సంవాదం జరగడం నిజంగా విచారకరమని జెలెన్‌స్కీ చెప్పారు. విభేదాలు సరి చేసుకోవడానికి ఇదే సరైన సమయమని భావిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఆయన తాజాగా ‘ఎక్స్‌’లో పోస్టుచేశారు.ఈ సందర్భంగా ట్రంప్‌తో చర్చలు జరగాల్సిన విధంగా జరగలేదని జెలెన్‌స్కీ అంగీకరించారు. ఉక్రెయిన్‌–అమెరికా మధ్య భవిష్యత్తులో పరస్పర సహకారం, కమ్యూనికేషన్‌ నిర్మాణాత్మకంగా ఉండేలా జాగ్రత్తపడతామని వెల్లడించారు. అమెరికా కోరుతున్న అరుదైన ఖనిజాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. దీనిపై ఒప్పందం కుదుర్చుకోవడానికి తమకు అభ్యంతరం లేదన్నారు. అయితే, ఉక్రెయిన్‌కు అందించే సైనిక సాయాన్ని నిలిపివేస్తున్నట్లు అమెరికా ప్రకటించిన కొన్ని గంటల్లోనే జెలెన్‌స్కీ (Volodymyr Zelenskyy) నుంచి ఈ స్పందన వచ్చింది.ఇదే సమయంలో యుద్ధాన్ని ముగించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని జెలెన్‌స్కీ పేర్కొన్నారు. తొలిదశలో ఖైదీల విడుదలతో పాటు క్షిపణులు, దీర్ఘ శ్రేణి డ్రోన్లు, ఇంధన వనరులు, ఇతర మౌలిక సదుపాయాలపై బాంబు దాడులపై నిషేధం వంటి వాటికి రష్యా అంగీకరిస్తే తదుపరి దశల ద్వారా ముందుకు వెళ్లాలని అనుకుంటున్నామన్నారు. బలమైన తుది ఒప్పందం కోసం అమెరికాతో కలిసి పని చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.అమెరికా ఇచ్చిందెంత? 2022 జనవరి నుంచి 2024 డిసెంబర్‌ ఉక్రెయిన్‌కు 300 బిలియన్‌ డాలర్లకుపైగా సాయం అందించినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ స్వయంగా ప్రకటించారు. యూరప్‌ దేశాలు మాత్రం 100 బిలియన్‌ డాలర్లే ఇచ్చాయని అన్నారు. కానీ, ఆమెరికా ఇచ్చింది 182.8 బిలియన్‌ డాలర్లేనని సాక్షాత్తూ ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. అయితే, అందులో నిజం లేదని, అమెరికా నుంచి ఉక్రెయిన్‌కు అందిన సాయం 119.7 బిలియన్‌ డాలర్లు మాత్రమేనని జర్మనీకి చెందిన కీల్‌ ఇన్‌స్టిట్యూట్‌ స్పష్టంచేసింది. పుతిన్‌ను నిలువరించేది ఖనిజాల ఒప్పందం మాత్రమే: వాన్స్‌రష్యా అధ్యక్షుడు పుతిన్‌ దురాక్రమణ ప్రయత్నాలను నిలువరించగలిగేది యూఎస్‌– ఉక్రెయిన్‌ మధ్య కీలక ఖనిజాల ఒప్పందం మాత్రమేనని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ పేర్కొన్నారు. ఇది మాత్రమే ఆచరణ సాధ్యమైన పరిష్కారమన్నారు. యుద్ధం ముగిశాక బ్రిటన్, ఫ్రాన్స్‌ల సారథ్యంలో ఏర్పాటయ్యే అంతర్జాతీయ బలగాలతో ఉక్రెయిన్‌కు ఎటువంటి భద్రతా ఉండదని వ్యాఖ్యానించారు. ఫాక్స్‌ న్యూస్‌ చానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వాన్స్‌.. గత 30, 40 ఏళ్లుగా ఎలాంటి యుద్ధాలు చేయని ఏవో కొన్ని దేశాలకు చెందిన 20 వేల బలగాల కంటే అమెరికాతో కీలక ఖనిజాల ఒప్పందం కుదుర్చుకుంటే ఉక్రెయిన్‌కు మెరుగైన భద్రత లభిస్తుందని చెప్పారు. భద్రతకు గ్యారెంటీ కావాలన్నా, రష్యా అధ్యక్షుడు పుతిన్‌ మరోసారి ఆక్రమించుకోరాదనుకున్నా ఉక్రెయిన్‌కు అమెరికా మాత్రమే ఆ గ్యారంటీ ఇస్తుందని తెలిపారు.

Randstad Workmonitor 2025 report insights into employee work satisfaction7
వేతనం కాదు.. ఉద్యోగుల మనోభావాలివి..

ఉద్యోగుల మొదటి ప్రాధాన్యం వేతనానికే అనుకుంటాం. కానీ, అలా అనుకోవడం పొరపాటే అవుతుంది. వేతనం కంటే పనిచేసే చోట సానుకూల పరిస్థితులు, నేర్చుకునే, ఎదిగే అవకాశాలకు ఎక్కువ మంది ఉద్యోగులు ప్రాధాన్యం ఇస్తున్నట్టు రాండ్‌స్టాడ్‌ నిర్వహించిన ‘ఇండియా వర్క్‌ మానిటర్‌ 2025’(Randstad Workmonitor 2025) సర్వేలో తెలిసింది. సర్వేలోని వివరాలు కింది విధంగా ఉన్నాయి.పనిలో సౌలభ్యం లేకపోతే ఆ ఉద్యోగానికి గుడ్‌బై చెబుతామని 52 శాతం మంది చెప్పారు.సౌకర్యవంతమైన పనివేళలు లేని ఉద్యోగాన్ని తిరస్కరిస్తామని 60 శాతం మంది తెలిపారు.పనిచేసే ప్రదేశం అనుకూలంగా లేకపోతే ఆ ఉద్యోగాన్ని కాదనుకుంటామని 56 శాతం మంది చెప్పారు. తమ మేనేజర్‌తో మంచి సంబంధాలు లేకపోతే ఉద్యోగాన్ని వీడుతామని 60 శాతం మంది తెలిపారు.తాము చేసే ఉద్యోగంలో నేర్చుకోవడానికి, అభివృద్ధి చెందడానికి అవకాశం లేకపోతే దాన్ని వదులుకుంటామని 67 శాతం మంది చెప్పారు. అంతర్జాతీయంగా ఇదే అభిప్రాయం చెప్పిన వారు 41 శాతమే.దేశీయంగా 69 శాతం మంది ఉద్యోగులు సమష్టి పని సంస్కృతిని కోరుకుంటున్నారు. అంతర్జాతీయంగా 55 శాతం మందిలో ఇదే భావన నెలకొంది.తమ విలువలకు సరిపడని సంస్థలో పనిచేయబోమని 70% మంది తేల్చిచెప్పారు.పనిలో ప్రయోజనాలుంటే (పనివేళల్లో, పని ప్రదేశాల్లో వెసులుబాట్లు) యాజమాన్యాలను విశ్వసిస్తామని 73 శాతం మంది సర్వేలో తమ అభిప్రాయాన్ని తెలిపారు. ఇదీ చదవండి: రిలయన్స్‌కు రూ.24,500 కోట్ల డిమాండ్‌ నోటీసులుయాజమాన్యాలు మారాల్సిందే..పని ప్రదేశాల్లో వస్తున్న మార్పులకు ఈ సర్వే ఫలితాలు అద్దం పడుతున్నట్టు రాండ్‌స్టాడ్‌ సర్వే నివేదిక తెలిపింది. ‘జెన్‌ జెడ్‌ లేదా మిలీనియల్స్‌ అయినా వ్యక్తిగత కట్టుబాట్లు, కెరీర్‌ వృద్ధిని సమతుల్యం చేసుకోవాలని అనుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ తమదైన రీతిలో (స్వేచ్ఛగా) పనిచేయడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. పనిలో నేర్చుకోవడానికి ప్రాధాన్యం ఇస్తున్నారంటే, వారు కేవలం ఉద్యోగాలనే కోరుకోవడం లేదు. కెరీర్‌ పురోగతిని కోరుకుంటున్నారని అర్థమవుతోంది. యాజమాన్యాలు ఈ మార్పును తప్పకుండా గుర్తించి, నిపుణులైన మానవ వనరుల అంచనాలను అందుకునే వ్యూహాలను రూపొందించుకోవాలి. లేదంటే నిపుణులను కోల్పోవాల్సి వస్తుంది’ అని రాండ్‌స్టాడ్‌ ఇండియా ఎండీ, సీఈవో విశ్వనాథ్‌ పీఎస్‌ తెలిపారు.

Coalition leaders are bickering over quota of MLAs and MLC seats8
టీడీపీకి రెండేనా!.. కూటమి మల్లగుల్లాలు

సాక్షి, అమరావతి: ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ స్థానాలపై కూటమి నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. ఈ నెలాఖరులో ఖాళీ అవుతున్న ఐదు సీట్లను భర్తీ చేసేందుకు ఎన్నికల కమిషన్‌ నోటిఫికేషన్‌ జారీ చేయడంతో ఆశావహులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఆ స్థానాలను ఆశిస్తున్న నేతలు.. బడ్జెట్‌ సమావేశాలు జరుగుతుండడంతో అసెంబ్లీకి చేరుకుని ముఖ్యులను కలిసి తమ వాదన వినిపిస్తున్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌ సోమవారం సభ ముగిసిన తర్వాత ఇదే అంశంపై చర్చించిన విషయం బయటకు పొక్కడంతో ఆశావహుల్లో ఉత్కంఠత పెరిగింది. ఇప్పటికే ఒక స్థానం పవన్‌ సోదరుడు నాగబాబుకు దాదాపు ఖరారైంది. ఆయన్ను ఎమ్మెల్సీ చేసి వెంటనే మంత్రివర్గంలోకి తీసుకోవడం లాంఛనమే.కూటమిలో రెండు నెలల క్రితం జరిగిన ఒప్పందం ప్రకారం నాగబాబుకు ఎమ్మెల్సీ, మంత్రి పదవి ఇస్తున్నారు. అయితే, జనసేన కోసం పనిచేసిన చాలామంది పదవులు కోరుతున్నారని వారికోసం మరో ఎమ్మెల్సీ స్థానాన్ని తమకు కేటాయించాలని చంద్రబాబును పవన్‌కళ్యాణ్‌ కోరినట్లు జనసేన వర్గాలు చర్చించుకుంటున్నాయి.ఒక స్థానం కోసం బీజేపీ పట్టు..బీజేపీ కూడా కచ్చితంగా ఒక స్థానం ఇవ్వాలని పట్టుబడుతోంది. సోము వీర్రాజు, విష్ణువర్ధన్‌రెడ్డి, పీఎన్‌వీ మాధవ్‌ల పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. న్యాయంగా అయితే సోము వీర్రాజుకు అవకాశం దక్కాల్సివున్నా.. టీడీపీ పట్ల ఆయన వైఖరి కారణంగా చంద్రబాబు సుముఖంగా లేరనే వాదన వినిపిస్తోంది. బీజేపీకి ఒక స్థానం ఇస్తే మాధవ్, విష్ణువర్ధన్‌రెడ్డిల్లో ఒకరికి అవకాశం దక్కొచ్చని చెబుతున్నారు. టీడీపీలో ఆశావహుల జాబితా చాంతాడంత..జనసేన, బీజేపీ కోరిక మేరకు మూడు స్థానాలు వారికి పోతే టీడీపీకి మిగిలేది రెండే. ఆ పార్టీలో ఆశావహుల జాబితా చాంతాడంత ఉంది. చంద్రబాబు సమకాలీకులు, ఆయనతో కలిసి సుదీర్ఘకాలంగా పనిచేస్తున్నవారితో పాటు గత ఎన్నికల్లో ఎమ్మెల్యే సీట్లు దక్కని నేతలు గట్టిగా అడుగుతున్నారు. ఈ జాబితాలో పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్‌వీఎస్‌ఎన్‌ వర్మ, మైలవరం మాజీ ఎమ్మెల్యే దేవినేని ఉమామహేశ్వరరావు, విజయవాడ నేత బుద్ధా వెంకన్న, నెల్లూరుకి చెందిన మాజీ ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, జి.మాడుగుల నాయకుడు పైలా ప్రసాదరావు, నెల్లిమర్ల నేత, మార్క్‌ఫెడ్‌ ఛైర్మన్‌ బంగార్రాజు తదితరులు గట్టిగా ఒత్తిడి చేస్తున్నారు. మంగళవారం అసెంబ్లీలో చంద్రబాబును మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్, బుద్ధా, ఏరాసు ప్రతాప్‌రెడ్డి, మల్లెల లింగారెడ్డి, రెడ్డి సుబ్రహ్మణ్యం, సిట్టింగ్‌ ఎమ్మెల్సీలు బీటీ నాయుడు, దువ్వారపు రామారావు, అశోక్‌బాబు తదితరులు కలిశారు. కొద్దిరోజులుగా పలువురు నేతలు చంద్రబాబు, లోకేశ్‌ను కలిసి తమకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. ఇలాంటివారు 25 మందికిపైగా ఉన్నారు. వీరిలో ఎవరికి అవకాశం దక్కుతుందనేది లోకేశ్‌ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఆయన పరిశీలనలో విజయవాడకు చెందిన మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ ఉన్నట్లు తెలుస్తోంది. మిగిలినవారి పేర్లు ఇంకా బయటకు రాలేదు. ఒకటి, రెండు రోజుల్లో అభ్యర్థుల ఎంపికపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

More than half of the world adult population has become obese9
సగం జనాభా లావెక్కింది

న్యూఢిల్లీ: ప్రపంచ జనాభాలో సగానికి పైగా వయోజనులు ఊబకాయులుగా మారిపోయారు! 2050 నాటికి ఇది 57 శాతం దాటనుంది. అంతేగాక పిల్లలు, టీనేజర్లు, యువకుల్లో మూడింట ఒక వంతు ఊబకాయులుగా మారొచ్చని లానెస్‌ట్‌ జర్నల్‌ అంచనా వేసింది. 200 పైగా దేశాలకు చెందిన గ్లోబల్‌ డేటాను విశ్లేషించిన మీదట ప్రచురించిన తాజా అధ్యయనంలో ఈ వివరాలను వెల్లడించింది. దశాబ్ద కాలంలో ముఖ్యంగా అల్పాదాయ దేశాల్లో ఊబకాయం వేగంగా పెరుగుతోందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. దీని కట్టడికి ప్రభుత్వాలు తక్షణ చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ వాషింగ్టన్‌లోని ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ హెల్త్‌ మెట్రిక్స్‌ అండ్‌ ఎవాల్యుయేషన్‌ (ఐహెచ్‌ఎంఈ)కు చెందిన ప్రొఫెసర్‌ ఇమ్మాన్యుయేల్‌ నాయకత్వంలో ఈ పరిశోధన జరిగింది. ఊబకాయుల సంఖ్య 1990తో పోలిస్తే నేడు రెట్టింపైంది. 2021 నాటికి ప్రపంచ వయోజనుల్లో సగం మంది ఊబకాయులుగా మారిపోయారు. 25 ఏళ్లు, అంతకు పైబడ్డ వారిలో ఏకంగా 100 కోట్ల పురుషులు, 111 కోట్ల మంది మహిళలు అధిక బరువుతో బాధపడుతున్నారు. ఈ ధోరణులు ఇలాగే కొనసాగితే 2050 ప్రపంచవ్యాప్తంగా వయోజనుల్లో ఊబకాయుల సంఖ్య పురుషుల్లో 57.4 శాతానికి, స్త్రీలలో 60.3 శాతానికి పెరగవచ్చు. ఇక 1990 నుంచి 2021 నాటికి పిల్లలు, టీనేజర్లలో ఊబకాయులు 8.8 శాతం నుంచి 18.1 శాతానికి పెరిగారు. 20–25 మధ్య వయసు యువతలో 9.9 నుంచి 20.3 శాతానికి పెరిగింది. చైనాలో 62 కోట్లు ఊబకాయుల సంఖ్య 2050 నాటికి చైనాలో 62.7 కోట్లు, భారత్‌లో 45 కోట్లు, అమెరికాలో 21.4 కోట్లకు చేరనుంది. సబ్‌ సహారా ఆఫ్రికా దేశాల్లో ఈ సంఖ్య ఏకంగా 250 శాతానికి పైగా పెరిగి 52.2 కోట్లకు చేరుతుదని అంచనా. నైజీరియా 2021లో 3.66 కోట్ల మంది అధిక బరువుతో ఉండగా 2050 కల్లా 14.1 కోట్లకు చేరనుంది. సామాజిక వైఫల్యం... వయోజనుల్లో సగం ఊబకాయులే కావడాన్ని సామా జిక వైఫల్యంగా చూడాలని ప్రొఫెసర్‌ ఇమ్మాన్యుయేల్‌ అన్నారు. యువతలో ఊబకాయం వేగంగా పెరుగుతుండటం ఆందోళనకరమన్నారు. ‘‘కొత్తగా వచ్చిన బరువు తగ్గించే మందుల ప్రభావాన్ని అధ్యయనం పరిగణనలోకి తీసుకోలేదు. ప్రభుత్వాలు తక్షణ చర్యలు తీసుకుంటే విపత్తును ఎంతో కొంత నివారించవచ్చు’’అని ఆమె వెల్లడించారు. ఆరోగ్య వ్యవస్థలకు సవాలు ఊబకాయం పెరగడం ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలకు సవాలేనంటున్నారు ఆస్ట్రేలియాలోని మర్డోక్‌ చి్రల్డన్స్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌కు చెందిన డాక్టర్‌ జెస్సికా కెర్‌. ‘‘పిల్లలు, టీనేజర్ల విషయంలో ఇప్పట్నుంచే శ్రద్ధ పెడితే ఊబకాయాన్ని నివారించడం సాధ్యమే. యూరప్, దక్షిణాసియా దేశాల్లో పిల్లలు, టీనేజర్లు అధిక బరువుతో ఉన్నట్టు అధ్యయనంలో తేలింది.ఉత్తర అమెరికా, ఆస్ట్రలేషియా, ఓషియానియా, ఉత్తర ఆఫ్రికా, పశ్చిమాసియా, లాటిన్‌ అమెరికా దేశాల్లో కూడా ఊబకాయుల సంఖ్య భారీగా పెరుగుతోంది. టీనేజీ బాలికల్లో ఎక్కువగా ఉంది’’అని చెప్పారు. భావి తరాలు అనారోగ్యం బారిన పడకుండా చూడటం, ఆర్థిక, సామాజిక నష్టాలను నివారించడం తక్షణ కర్తవ్యమని సూచించారు.

Rasi Phalalu: Daily Horoscope On 05-03-2025 In Telugu10
ఆకస్మిక ధనలాభం.. ఆస్తి వివాదాల పరిష్కారం

గ్రహం అనుగ్రహం: శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, తిథి: శు.షష్ఠి సా.5.46 వరకు, తదుపరి సప్తమి, నక్షత్రం: భరణి ఉ.7.21 వరకు, తదుపరి కృత్తిక, వర్జ్యం: సా.6.36 నుడి 8.07 వరకు, దుర్ముహూర్తం: ప.11.47 నుండి 12.33 వరకు, అమృతఘడియలు: రా.3.36 నుండి 5.03 వరకు; రాహుకాలం: ప.12.00 నుండి 1.30 వరకు, యమగండం: ఉ.7.30 నుండి 9.00 వరకు, సూర్యోదయం: 6.20, సూర్యాస్తమయం: 6.03. మేషం...కొత్త పనులు ప్రారంబిస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.వృషభం....ప్రయాణాలు వాయిదా. బంధువిరోధాలు. అనారోగ్యం. ఆస్తి వివాదాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని సమస్యలు.మిథునం....నూతన ఉద్యోగయోగం. ముఖ్య నిర్ణయాలు.పనులు సజావుగా సాగుతాయి. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. ఉద్యోగులకు పనిభారం తగ్గుతుంది.కర్కాటకం....ఆకస్మిక ధనలాభం. ప్రముఖులతో పరిచయాలు. ఆస్తి వివాదాల పరిష్కారం. విందులువినోదాలు. వ్యాపారాలలో పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలు సజావుగా సాగుతాయి.సింహం....కుటుంబంలో చికాకులు. పనులు అవాంతరాలు. ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలలో ఆటుపోట్లు. ఉద్యోగులకు మార్పులు జరిగే సూచనలు.కన్య....చేపట్టిన కార్యక్రమాలలో ఆటంకాలు. అనుకోని ధనవ్యయం. అంచనాలు తప్పుతాయి. అనారోగ్యం. బంధువులతో తగాదాలు. వ్యాపారాలు నిరుత్సాహం. ఉద్యోగాలలో ఒత్తిళ్లు. తుల....పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. ఉద్యోగావకాశాలు. యత్నకార్యసిద్ధి. బాకీలు వసూలవుతాయి. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు.వృశ్చికం...పరిచయాలు పెరుగుతాయి. ఆశ్చర్యకరమైన సంఘటనలు. విలువైన వస్తువులు సేకరిస్తారు. వ్యాపారులకు కొత్త ఆశలు. ఉద్యోగులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది.ధనుస్సు....అప్పులు చేస్తారు. దూరప్రయాణాలు. బంధువులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలలో కొత్త బాధ్యతలు. ఉద్యోగాలలో పనిభారం.మకరం...ఆదాయం కంటే ఖర్చులు పెరుగుతాయి. పనులు అవరోధాలు. కుటుంబంలో చికాకులు. ఆరోగ్య సమస్యలు. మిత్రులతో విభేదాలు. వ్యాపారాలు అనుకూలించవు. ఉద్యోగాలలో పనిభారం.కుంభం....కాంట్రాక్టులు పొందుతారు. యత్నకార్యసిద్ధి. వ్యాపారులకు పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు పనిఒత్తిడులు తొలగుతాయి.మీనం....కొన్ని పనులు ముందుకు సాగవు. ఆకస్మిక ప్రయాణాలు. కొత్తగా అప్పులు చేస్తారు. కుటుంబంలో చికాకులు. వ్యాపారాలు నిరాశ పరుస్తాయి. ఉద్యోగాలలో లేనిపోని చికాకులు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

NRI View all
title
టంపా వేదికగా నాట్స్‌ అమెరికా తెలుగు సంబరాల ఏర్పాట్లు

title
జర్మనీ పాఠ్యాంశాల్లో తెలుగు విద్యార్థి ప్రస్థానం

ప్రవాస తెలుగు విద్యార్ధి శ్రీనిహల్ తమ్మనకు మరో అరుదైన గౌరవం లభించింది.

title
గల్ఫ్ మృతుల కుటుంబాలతో సీఎం రేవంత్ రెడ్డి సహపంక్తి భోజనం

గల్ఫ్ దేశాలలో మరణించిన కార్మికుల కుటుంబాలతో హైదరాబాద్, ప్రజాభవన్‌లో త్వరలో 'గల్ఫ్ అమరుల సంస్మరణ సభ' ఏర్పాటు చేయాలని రాష్

title
వలస కార్మికుల మృత్యు ఘోష

మోర్తాడ్‌ (బాల్కొండ): జగిత్యాల జిల్లా మల్లాపూర్‌ మండలం రేగుంటకు చెందిన కర్న గణేశ్‌ (55) రెండ్రోజుల కిందట సౌదీ అరేబియాలో

title
వీసా గోల్డెన్‌ చాన్సేనా?

గోల్డ్‌ కార్డ్‌ వీసా.. ప్రపంచవ్యాప్తంగా కొత్త చర్చకు దారితీసిన టాపిక్‌ ఇది.

Advertisement

వీడియోలు

Advertisement