Top Stories
ప్రధాన వార్తలు

తిరుమలలో గోవుల మృతిపై కేసు వేస్తా: సుబ్రహ్మణ్యస్వామి
సాక్షి, న్యూఢిల్లీ: తిరుమల తిరుపతి దేవస్థానంలోని గోశాలలో గోవుల మృతిపై తాను త్వరలోనే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి(Subramanian Swamy) ప్రకటించారు. అంతేకాదు ఈ విషయంలో నిర్లక్ష్యంగా మాట్లాడిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడిపైనా ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఢిల్లీ సాక్షి ప్రతినిధితో ఆయన శుక్రవారం మాట్లాడారు. రాజ్యాంగంలో గోవులకు అత్యున్నత స్థానం కలిపించారు. గోవు అంటే జంతువు మాత్రమే కాదు.. కోట్ల మందికి ఆరాధ్య దైవం కూడా. అలాంటిది గోవుల ఆలనా పాలనా పట్టించుకోకపోవడం వల్లే ఈ దుస్థితి తలెత్తింది. తిరుమలలో సరైన వైద్యం అందించకుండా గోవులను వదిలేస్తున్నారు. పైగా గోవుల మరణాల విషయంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు నిర్లక్ష్యపూరితంగా మాట్లాడారు. వయసు మళ్లిన మనుషుల్లాగే.. వయసు మళ్లిన ఆవులూ చనిపోతున్నాయని బాధ్యతారహిత్యంగా మాట్లాడుతున్నారు. రేపు మీరు కూడా చనిపోతారు. అప్పుడు వయసు మల్లారని పట్టించుకోకుండా మీ కుటుంబ సభ్యులు వదిలేస్తారా?. అని స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి మాటలు మాట్లాడిన చైర్మన్‌ను సీఎం చంద్రబాబు వెంటనే భర్తరఫ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ‘‘వందల సంఖ్యలో గోవులు చనిపోవడం వెనుక కుట్ర ఉంది. టీటీడీలో వ్యాపార ధోరణితో చూడడం వల్ల ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. చనిపోయిన గోవులను రెస్టారెంట్లకు పంపుతున్నారా?. గోవుల మృతి పై దర్యాప్తు జరగాలి. టీటీడీ గోశాలలో గోవుల మృతి పై త్వరలో కోర్టులో కేసులు దాఖలు చేస్తా. ఇప్పుడున్న టీటీడీ బోర్డు పాలన అధ్వాన్నంగా ఉంది. గత టీటీడీ బోర్డు చైర్మన్ అందరికీ అందుబాటులో ఉండేవారు.. ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చేవారు’’ అని సుబ్రహ్మణ్యస్వామి గుర్తు చేసుకున్నారు.

రాజాసింగ్‌కు మళ్లీ కోపమొచ్చింది..!
హైదరాబాద్: బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు మళ్లీ కోపమొచ్చింది. ఈసారి తనకు పార్టీ నేతలు బర్త్ డే విషెస్ చెప్పలేదని రాజాసింగ్ కు అలకబూనారట. రాజాసింగ్‌కు సీఎం రేవంత్ రెడ్డి బర్త్ డే విషెస్ చెప్పగా, బీజేపీ నుంచి ముఖ్య నేతల ఎవరూ కూడా ఆయనకు విషెస్ చెప్పలేదట. దాంతో రాజాసింగ్ మళ్లీ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే శుక్రవారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అధ్యక్షతన హరిత ప్లాజాలో జరిగిన సమావేశానికి రాజాసింగ్ డుమ్మా కొట్టారట. ఈటెల రాజేందర్‌తో సహా పలువురు ప్రముఖ నేతలు ఆ మీటింగ్ కు హాజరు కాగా, రాజాసింగ్ మాత్రం అందుకు దూరంగా ఉన్నారు. అందులోనూ హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికపై సమావేశం నిర్వహించిన సమయంలో రాజాసింగ్ ఇలా దూరంగా ఉండటం చర్చనీయాంశంగా మారింది. కేవలం ఆయనకు బర్త్ డే విషెస్ చెప్పలేదనే కారణమా?.. లేక ఇంకేమైనా ఉందా? అనే కోణంలో చర్చ నడుస్తోంది.బండి సంజయ్ రాజీ చేశారు.. కానీకొద్ది రోజుల క్రితం హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ అభ్యర్థికి సంబంధించి అలక పాన్పు ఎక్కిన రాజాసింగ్ఎం ను ఇటీవల ఎంపీ బండి సంజయ్ స్వయంగా కలిసి ఆయనకు నచ్చజెప్పి వచ్చారు. ప్రధానంగ బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గౌతంరావు అభ్యర్థిత్వాన్ని రాజాసింగ్ తీవ్రంగా వ్యతిరేకించిన క్రమంలో బండి సంజయ్ స్వయంగా రంగంలోకి దిగారు. గౌతంరావును ఆ స్థానంలో నిలబెట్టడానికి ప్రధాన కారణం బండి సంజయ్ కాబట్టి.. రాజాసింగ్ ను బుజ్జగించి వచ్చారు. అప్పుడు గౌతంరావుతో రాజాసింగ్ ను కరాచలనం చేయించడమే కాకుండా ఇరువురు నేతలు శాలువాలతో సత్కరించుకునే కార్యక్రమం కూడా జరిగింది. ఇంతలోనే రాజాసింగ్ మళ్లీ పార్టీ శ్రేణులపై కోపంగా ఉన్నారంటూ పెద్ద ఎత్తును ప్రచారం జరుగుతోంది ఇందుకు తన బర్త్ డేకు పార్టీలోని ప్రముఖలు విషెస్ చెప్పకపోవడంగా సమాచారం. ప్రత్యర్థి పార్టీలో సీఎంగా ఉన్న సీఎం రేవంత్ విషెస్ చెప్పగా, తమ సొంత పార్టీలోని ముఖ్యులు ఎవరూ కూడా కనీసం శుభాకాంక్షలు కూడా చెప్పలేదనే కారణంతో రాజాసింగ్ కోపంగా ఉన్నారట, నేటి బీజేపీ కీలక సమావేశానికి రాజాసింగ్ దూరంగా ఉండటానికి ఇదే కారణమనే వాదన ప్రముఖంగా వినిపిస్తోంది.

విశాఖ: ప్రలోభాల పర్వంలో కూటమి నేతలకు ఛీత్కారాలు
విశాఖపట్నం, సాక్షి: అధికార దాహంతో.. గత 11 నెలల పదవి కాలంలో కూటమి ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేసింది. ఈ క్రమంలో ఇప్పుడు విశాఖ మేయర్‌పై అవిశ్వాసం వేళ (GVMC No Confidence Motion).. మరోసారి భారీగా ప్రలోభాలకు తెరలేపింది. ఈ క్రమంలోనే వైఎస్సార్సీపీ కార్పొరేటర్లకు గాలం వేసేందుకు కోట్లాది రూపాయలను మంచి నీళ్లలా ఖర్చు చేస్తోంది. అవిశ్వాసానికి సమయం దగ్గర పడుతుండడంతో కూటమి నేతలు ప్రలోభాల ఉధృతిని పెంచారు. వైఎస్సార్సీపీ కార్పొరేటర్ల ఇళ్లకు వెళ్లి వాళ్ల కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నారు. భారీగా డబ్బు ఇస్తామని, భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా చూస్తామని హామీలు గుప్పిస్తున్నారు. అలాగే.. శ్రీలంక, కేరళ నుంచి విశాఖకు తీసుకురావడానికి ప్రత్యేక విమానం ఏర్పాటు చేస్తామంటున్నారు. విమానం కాకపోతే హెలికాప్టర్స్ అయినా ఏర్పాటు చేస్తామంటూ ఆఫర్లు చేస్తున్నారు. అయితే.. తాము వైఎస్సార్ అభిమానులమని, ఎలాంటి పరిస్థితుల్లోనైనా వైఎస్ జగన్(YS Jagan)తోనే ఉంటామని చెబుతూ వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు ఆ ఆఫర్లను తిరస్కరిస్తున్నారు. ఈ క్రమంలో బెదిరింపులకు సైతం కొందరు లొంగడం లేదని సమాచారం. దీంతో చేసేది లేక కూటమి నేతలు వెనుదిరుగుతున్నట్లు సమాచారం. జీవీఎంసీ(GVMC) ఎన్నికల్లో 58 స్థానాలను వైఎస్సార్ సీపీ కైవసం చేసుకుని మేయర్ పదవిని చేజిక్కించుకుందని, 30 స్థానాలు మాత్రమే గెలుచుకున్న టీడీపీ ఇప్పుడు మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలనే దురాలోచనతో ఉంది. ఈ క్రమంలోనే భారీగా డబ్బు ఆశ చూపించడం, బెదిరింపులలాంటి అప్రజాస్వామిక ప్రయత్నాలకు దిగింది.

‘ద్రవిడ్‌కు సంజూ నచ్చడు.. అందుకే ఇలా!’.. రాయల్స్ క్యాంపులో విభేదాలు?
‘రాజస్తాన్ రాయల్స్ నాయకత్వ బృందంలో విభేదాలు తలెత్తాయా?.. హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid)- కెప్టెన్ సంజూ శాంసన్ (Sanju Samson) మధ్య సఖ్యత కొరవడిందా?.. వీరిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తాయా?’.. అంటే.. ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్ సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలు అవుననేందుకు ఆస్కారం ఇస్తున్నాయి.ఐపీఎల్-2025లో రాజస్తాన్ రాయల్స్‌కు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్న విషయం తెలిసిందే. సీజన్ ఆరంభానికి ముందే హెడ్‌కోచ్ ద్రవిడ్ గాయపడ్డాడు. అయినప్పటికీ వీల్‌చైర్‌లో కూర్చునే జట్టుకు మార్గదర్శనం చేస్తున్నాడు.మరోవైపు.. ఐపీఎల్ ఆరంభానికి ముందు కెప్టెన్ సంజూ శాంసన్ కూడా గాయం కారణంగా చాలా కాలం ఆటకు దూరమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజా ఎడిషన్‌లో తొలి మూడు మ్యాచ్‌లకు అతడు కేవలం ఇంపాక్ట్ ప్లేయర్‌గా మాత్రమే అందుబాటులో ఉన్నాడు. సారథిగా, వికెట్ కీపర్‌గా జట్టు అతడి సేవలను కోల్పోయింది.ఇక సంజూ స్థానంలో తాత్కాలిక కెప్టెన్ వచ్చిన రియాన్ పరాగ్ (Riyan Parag) సారథ్యంలో.. మూడు మ్యాచ్‌లలో రాజస్తాన్ కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే గెలిచింది. అయితే, సంజూ వచ్చిన తర్వాత కూడా పరిస్థితిలో పెద్దగా మార్పు రాలేదు. ఈ క్రమంలో చివరగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో బుధవారం నాటి మ్యాచ్‌లో రాయల్స్ తలపడింది.అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు సరిగ్గా 188 పరుగులు చేయడంతో మ్యాచ్ టై అయింది. ఈ క్రమంలో సూపర్ ఓవర్ నిర్వహించగా.. ఢిల్లీ రాయల్స్‌ను ఓడించి గెలుపు జెండా ఎగురవేసింది. కాగా ఈ మ్యాచ్ సందర్భంగా సంజూ పక్కటెముకల నొప్పితో రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగాడు.ఇదిలా ఉంటే.. సూపర్ ఓవర్ సమయంలో రాజస్తాన్ రాయల్స్ తీసుకున్న నిర్ణయం క్రికెట్ విశ్లేషకులను ఆశ్చర్యపరిచింది. రియాన్ పరాగ్‌తో పాటు షిమ్రన్ హెట్‌మెయిర్‌ను రాయల్స్ బ్యాటింగ్‌కు పంపింది. వీరిద్దరు రనౌట్ అయి ఐదు బంతుల్లో 11 పరుగులు మాత్రమే చేసి జట్టు ఓటమికి పరోక్ష కారణమయ్యారు.𝙉𝙚𝙧𝙫𝙚𝙨. 𝘿𝙧𝙖𝙢𝙖. 𝙀𝙢𝙤𝙩𝙞𝙤𝙣𝙨! 😉A quick morning catch-up on that late-night Super-Over nail-biter! 🙌#TATAIPL | #DCvRR | @DelhiCapitals pic.twitter.com/QeKsfPmCyk— IndianPremierLeague (@IPL) April 17, 2025 PC: BCCIనిజానికి ఈ మ్యాచ్‌లో నితీశ్ రాణా అద్భుత అర్ధ శతకం (28 బంతుల్లో 51)తో రాణించాడు. కానీ మేనేజ్మెంట్ మాత్రం అతడిని సూపర్ ఓవర్లో పంపలేదు. ఇక సూపర్ ఓవర్‌కు ముందు ద్రవిడ్ డగౌట్లో తన సహాయక సిబ్బంది, ఆటగాళ్లతో ప్రణాళికల గురించి చర్చించాడు.ఆ సమయంలో కెప్టెన్ సంజూ మాత్రం తనకు ఈ విషయం పట్టనట్లుగా ఆటగాళ్ల వెనుక అటూ ఇటూ తిరిగాడు. మధ్యలో సహచర ఆటగాడు రమ్మని పిలిచినా తనకు ఇష్టం లేదన్నట్లుగా వద్దంటూ చేతితో సైగ చేశాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రాయల్స్ క్యాంపులో విభేదాలు అన్న వార్తలు పుట్టుకొచ్చాయి. ఇది చూసిన సంజూ అభిమానులు ద్రవిడ్‌కు సంజూ నచ్చడని.. అందుకే ఇక్కడా తనకు సమస్యలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నాడని కామెంట్లు చేస్తున్నారు. ఇక ఐపీఎల్-2025లో ఇప్పటికి ఏడు మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న రాజస్తాన్ కేవలలం రెండే గెలిచింది.చదవండి: నీతా అంబానీ దగ్గరికి వెళ్లిన ఇషాన్.. ప్రేమగా చెంప నిమిరిన మాజీ ఓనర్! I knew there was definitely a rift within the setup when there were absolutely no discussions or chat in the dugout before the super over.Everyone was standing quite in a circle in the dugout.Look at Sanju's hand signal in the first video,he is deliberately ignoring everyone. https://t.co/DfxmlwGgBG pic.twitter.com/688ji3MXrS— Delhi Capitals Fan (@pantiyerfc) April 17, 2025

పవన్.. ‘సనాతన ధర్మం అంటే కాషాయ దుస్తులు ధరించడం కాదు’
పల్నాడు జిల్లా,సాక్షి: తిరుమల లడ్డు వ్యవహారంలో కట్టుకథ అల్లి వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై నెట్టే ప్రయత్నించారు. ఇదే అంశంలో సాక్షాత్తూ సుప్రీంకోర్టు అక్షింతలు వేసిన కూటమి ప్రభుత్వానికి ఇంకా బుద్ధి రాలేదని మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారుతిరుమల గోశాలలో కూటమి ప్రభుత్వం చేస్తున్న రాజకీయంపై కాసు మహేష్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘తిరుపతిలో గోవులు చనిపోవడం బాధాకరం. గోవులు చల్లగా ఉంటేనే ఈ విశ్వం చల్లగా ఉంటుంది. గోవులు చనిపోతున్నాయని టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చెప్పేంతవరకు విషయం బయటికి రాలేదు.టీటీడీ ఈవో,ఛైర్మన్ గోవులు చనిపోతున్నాయని చెప్తుంటే చంద్రబాబు నాయుడు, లోకేష్ మాత్రం గోవులు చనిపోవటం లేదని చెబుతున్నారు. తొమ్మిది పది నెలల నుంచి నెలకు 10 నుంచి 15 గోవులు చనిపోతుంటే అధికారులు ఏం చేస్తున్నారు? గోవుల మరణాలపై చర్చకి సిద్ధమని తెలుగుదేశం నాయకులు చెబుతున్నారు.భూమన కరుణాకర్‌రెడ్డి చర్చకు వెళ్తుంటే పోలీసులతో అడ్డుకున్నారు. చర్చ పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కూటమి ప్రభుత్వం రాజకీయం కోసం వాడుకుంటుంది. పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం అని హడావిడి చేశాడు. సనాతన ధర్మం అంటే కాషాయం బట్టలు వేసుకొని తిరగటం కాదు. ధర్మాన్ని మనం కాపాడితే అది మనల్ని కాపాడుతుంది.గతంలో లడ్డు వ్యవహారంలో కట్టు కధ అల్లి రాజకీయం చేసి వైఎస్ జగన్ మీద వేసే ప్రయత్నించారు. సుప్రీంకోర్టు అక్షింతలు వేసిన ప్రభుత్వానికి ఇంకా బుద్ధి రాలేదు. ప్రభుత్వం రాజకీయాలు పక్కనపెట్టి గోవులు ఎందుకు చనిపోతున్నాయో కారణాలు కనుక్కోండిగిట్టుబాటు ధర లేక రైతులు అల్లాడిపోతున్నారు. చంద్రబాబు నాయుడు ప్రతి రైతుకు 20 వేలుఇస్తానని ప్రకటించారు. ఇప్పటికి 40 వేలు రైతులకి బకాయి ఉన్నారు. చంద్రబాబు రైతులకు ఇస్తానన్న డబ్బులు చెల్లిస్తే వారికి ఎంతో కొంత ఉపయోగపడతాయి’అని సూచించారు.

అతిగా వంటనూనెలు వాడుతున్నారా..? నిపుణుల స్ట్రాంగ్ వార్నింగ్
ఇన్నాళ్లు వంటలు చేయగా మిగిలిన నూనెని తిరిగి వాడొద్దని హెచ్చరించేవారు. ఇప్పుడు ఏకంగా అసలు వంటనూనెలే వాడొద్దని వార్నింగ్ ఇచ్చేస్తున్నారు. పైగా అవి కేన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయంటూ.. విస్తుపోయే విషయాలు చెబుతున్నారు. ఇదేంటి ఇంకేం వాడాలి వంటకు అన్న అనుమానం రావడం సహజమే. కానీ తాజా పరిశోధనలు వంట నూనెలు కేన్సర్ ప్రమాదాన్ని ప్రోత్సహిత్సాయని చెబుతున్నాయి. అంతేగాదు అదెలా జరుగుతుందో కూడా సవివరంగా వివరించారు పరిశోధకులు.వీల్ కార్నెల్ మెడిసిన్ పరిశోధకుల బృందం చేసిన పరిశోధనల్లో వంట నూనెలు, కూరగాయల నూనెలు అతిగా వాడకూడదని తేలింది. ఆ నూనెల్లో ఉండే లినోలెయిక్ కేన్సర్ కణాల పెరుగుదలను ప్రోత్సహిస్తుందట. ముఖ్యంగా రొమ్మ కేన్సర్(Breast Cancer)లోని కణాల్లో పెరుగుదల అనూహ్యంగా ఉంటుందని తెలిపాయి. అత్యంత ప్రమాదకరమైన ట్రిపుల్-నెగటివ్ రొమ్ము కేన్సర్ ప్రమాదాన్ని ఈ లినోయిక్ ఆమ్లం వేగవంతం చేస్తుందట. అంటే సాధారణ రొమ్ము కేన్సర్‌లో కంటే ఈ ట్రిపుల్ నెగటివ్‌లో కేన్సర్ కణాలు వేగంగా అభివృద్ధి చెందుతుంటాయి. ఇక మనం వాడే ఈ నూనెలు ఆ కేన్సర్ కణాలను మరింత అభివృద్ధి చేస్తాయని గుర్తించామని అంటున్నారు నిపుణులు. ముఖ్యంగా సోయాబీన్, కుసుమ నూనె వంటి సీడ్స్ ఆయిల్స్, పందిమాంసం, గుడ్లు వంటి జంతువుల్లో కనిపించే ఒమేగా 6 కొవ్వు ఆమ్లం లినోలెయిక్ చికిత్స చేయడానికే కష్టతరమైన ట్రిపుల్ నెగిటివ్ రొమ్ము కేన్సర్ పెరుగదలను ప్రత్యేకంగా పెంచగలదని పరిశోధనలో నిరూపితమైందన్నారు. లినోలెయిక్ ఆమ్లం FABP5 అనే ప్రోటీన్‌తో బంధించడం ద్వారా కేన్సర్ కణితి కణాలను మరింత వేగంగా అభివృద్ధి చెందేలా సక్రియం చేస్తుందని పరిశోధకులు గుర్తించారు. కానీ ఇతర హార్మోన్ సెన్సిటివ్ ఉప రకాల్లో అలా జరగడం లేదు. అంటే ఇక్కడ లినోలెయిక్ ఆమ్లం అధికంగా ఉన్న ఆహారం కేన్సర్ కణితి పెరుగుదల మెరుగ్గా ఉంచుతుందని క్లియర్‌గా నిరూపితమైందన్నారు. ఈ పరిశోధన ఆహార కొవ్వులు, కేన్సర్ మధ్య సంబంధాన్ని వివరించడంలో సహాయపడటటేమ గాక నిర్దిష్ట పోషక సిఫార్సులు ఏ రోగులకు ఎక్కువ ప్రయోజనం అనేది క్లియర్ నిర్వచించగలమని అంటున్నారు పరిశోధకులు. (చదవండి: నలుగురిలో కలవనివ్వకుండా చేసే వ్యాధి.. ! గంటల్లోనే నయం అయిపోతుందట..)

'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' మూవీ రివ్యూ
టైటిల్ : అర్జున్ సన్నాఫ్ వైజయంతినటీనటులు: నందమూరి కల్యాణ్‌రామ్, విజయశాంతి, సయీ మంజ్రేకర్,పృథ్వి, సోహైల్ ఖాన్, శ్రీకాంత్ తదితరులునిర్మాణ సంస్థలు: అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్నిర్మాతలు: అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసుఎడిటింగ్: తమ్మిరాజుదర్శకత్వం, కథ: ప్రదీప్ చిలుకూరిస్క్రీన్‌ప్లే: శ్రీకాంత్ విస్సాసంగీతం: అజనీష్ లోక్నాథ్సినిమాటోగ్రఫీ: రామ్ ప్రసాద్విడుదల: ఏప్రిల్ 18, 2025విజయశాంతి (Vijayashanthi), నందమూరి కల్యాణ్‌రామ్ (Nandamuri Kalyan Ram) తల్లీ కుమారులుగా నటించిన సినిమా ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ (Arjun son of Vyjayanthi) తాజాగా థియేటర్స్‌లోకి వచ్చేసింది. నూతన దర్శకుడు ప్రదీప్ చిలుకూరి(Pradeep Chilukuri) ఈ మాస్ చిత్రంతో డైరెక్టర్‌గా నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్‌పై అశోక్ వర్ధన్, సునీల్ నిర్మించారు. అమ్మ కోసం మనం ఎన్ని త్యాగాలైనా చేయొచ్చు అని చెప్పే అర్జున్ సన్నాఫ్ వైజయంతి చిత్రం ఎలా ఉంది..? ప్రీరిలీజ్ వేడుక సమయంలో ఎన్టీఆర్ చెప్పినట్లుగా ఈ మూవీ కళ్యాణ్ కెరీర్లో ఒక స్పెషల్‌గా మిగిలుతుందా..? ఈ రివ్యూలో తెలుసుకుందాం.కథేంటి..?‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ కథ చాలా సినిమాల మాదిరే రొటిన్ స్టోరీ.. ఇందులో తల్లీకొడుకుల మధ్య బలమైన ఎమోషన్ కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా సరిహద్దు ప్రాంతంలో వైజయంతి IPS (విజయశాంతి) డ్యూటీలో భాగంగా ఎన్కౌంటర్ చేస్తూ తెరపైకి ఎంట్రీ ఇస్తుంది. వైజయంతి ఒక కఠినమైన, నిజాయితీతో కూడిన పోలీసు అధికారిణిగా ఉంటుంది. తన కుమారుడు అర్జున్ (కల్యాణ్‌రామ్) కూడా నిజాయితీగల IPS ఆఫీసర్ కావాలని, తన అడుగుజాడల్లో నడుస్తాడని ఆశిస్తుంది. అయితే, ఒక మాఫియా డాన్‌తో ఊహించని ఎదురుదెబ్బ అర్జున్ను మరో దారిలో నడిచేలా చేస్తుంది. ఉద్దేశపూర్వకంగా అర్జున్ నేరస్థుడు కాకపోయినా, ప్రజలను రక్షించడానికి స్థానిక మాఫియాను ఎదుర్కొనే ఆయుధంగా అర్జున్ మారతాడు. అర్జున్ చేస్తున్న మంచిపనిని చూసిన పృథ్వి తన పోలీస్ ఉద్యోగాన్ని పక్కనపెట్టి అతనితో పాటుగా అడుగులేస్తాడు. అలా వారిద్దరూ ఒక పెద్ద గ్యాంగ్‌నే ఏర్పాటు చేస్తారు. ఏకంగా పోలీస్ వ్యవస్థనే సవాల్ చేసేంతలా అర్జున్ గ్యాంగ్ బలోపేతం అవుతుంది. ఇవన్నీ అర్జున్‌కు తన తల్లితో విభేదాలకు దారితీస్తాయి.. దీంతో అర్జున్ వెళ్తున్న దారి ఎంతమాత్రం కరెక్ట్ కాదంటూ ఆమె హెచ్చరిస్తూనే ఉంటుంది. ఏకంగా అర్జున్ను ఇంటి నుంచి బయటకు పంపేసి ఒంటరిగానే ఉంటుంది. అర్జున్ తరువాత విశాఖలోని ఒక కాలనీకి వెళ్లి అక్కడే ఉంటూ నగరంలోనే టాప్ గ్యాంగ్‌స్టర్‌గా ఎదుగుతాడు. పేదలజోలికి వచ్చిన వారందరిని వేటాడుతూ ముందుకు వెళ్తుంటాడు. ఐపీఎస్‌కు సెలక్ట్ అయిన అర్జున్ ప్రజల కోసం కత్తి ఎందుకు పట్టాడు..? ఉద్యోగ రిత్యా ఎన్నో ఎన్కౌంటర్లు చేసిన వైజయంతిని నేరస్థుల నుంచి అర్జున్ ఎలా కాపాడుకుంటాడు. డ్రగ్స్ మాఫీయా అర్జున్ తండ్రిని ఎందుకు చంపుతుంది..? చివరకు తన ప్రాణాలను కాపాడిన కొడుకునే వైజయంతి ఎందుకు జైలుకు పంపుతుంది..? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే..ఈ సినిమా కథ చాలా పాత కథే.. ఇప్పటికే ఈ కాన్సెప్ట్‌తో చాలా సినిమాలు వచ్చాయి. అయితే, ఈ సినిమాకు ప్రధాన బలం విజయశాంతి అని చెప్పవచ్చు. ఒక శక్తిమంతమైన తల్లి పాత్రలో ఆమె దుమ్మురేపారు. తల్లి ఎంత స్థాయిలో ఉన్నా తన బిడ్డ భవిష్యత్ చాలా ముఖ్యం అని ఇందులో చక్కగా చూపించారు. కథలో భాగంగా వైజాక్ కమీషనర్‌గా శ్రీకాంత్ రావడంతో కథలో స్పీడ్ అందుకుంటుంది. గతంలో వైజయంతి టీమ్‌లో అతను పనిచేసిన అనుభవం ఉండటం వల్ల ఆ కుటుంబంతో దగ్గరి సాన్నిహిత్యం ఉంటుంది. ఒక సిన్సియర్ ఆఫీసర్ కుమారుడు గ్యాంగ్‌స్టర్ అవడం ఏంటి..? అని అర్జున్ గతం తెలుసుకుంటాడు. కానీ, ఆ సీన్లు ఏవీ పెద్దగా వర్కౌట్ కాలేదు.'అర్జున్ సన్నాఫ్ వైజయంతి ' సినిమా కథ పాతదే అయినా సరే అభిమానులను మాత్రం ఆకట్టుకునే విధంగానే ఉంటుంది. దర్శకుడు కూడా మాస్‌తో పాటు భారీ యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కించడంలో ప్రేక్షకులను మెప్పిస్తాడు. ఫస్టాఫ్ కొంతమేరకు ఫర్వాలేదనిపిస్తుంది. అయితే, రెండవ భాగంలోకి కథ వెళ్ళే కొద్దీ పాత తరహా కథనే చూపిస్తున్నాడని అభిప్రాయం అందరిలో కలుగుతుంది. మాస్ యాక్షన్ బ్లాక్‌లు బాగానే టేకింగ్ చేసిన దర్శకుడు ప్రదీప్ చిలుకూరి కథ చెప్పడంలో చాలా వరకు తడబడ్డాడని చెప్పవచ్చు. సులువుగా ఉన్న కథను కొత్తగా చెప్పే క్రమంలో స్క్రీన్‌ప్లే దెబ్బతిందని అర్థం అవుతుంది. అజనీష్ లోక్‌నాథ్ నేపథ్య సంగీతం బాగుంది. క్లైమాక్స్‌లో ఆయన ఇచ్చిన బీజీఎమ్ పీక్స్‌లో ఉంటుంది. కానీ, పాటల విషయంలో పెద్దగా మ్యూజిక్ ప్రభావం లేదు. ముఖ్యంగా ఇంటర్వెల్ ముందు, తర్వాత వచ్చే సీన్లకు కల్యాణ్‌రామ్ అభిమానులు పండుగ చేసుకుంటారు. ఆ సమయంలో థియేటర్స్ దద్దరిల్లడం గ్యారెంటీ అని చెప్పవచ్చు. క్లాస్ ప్రేక్షకులకు పెద్దగా నచ్చకపోయినప్పటికీ మాస్ ఆడియన్స్‌ను మాత్రం మెప్పిస్తుంది. కంటెంట్ ఆధారంగా సినిమా చూసే వారికి ఈ చిత్రం పెద్దగా నచ్చకపోవచ్చు. సినిమా క్లైమాక్స్‌లో విజయశాంతి, కల్యాణ్‌రామ్ పోటీ పడి నటించారు. క్లైమాక్స్ కంటతడి పెట్టించేలా ఉంటుంది. కథ విషాదాంతం కాకపోయినప్పటికీ పతాక ఘట్టాల్లో ఎమోషన్స్ ఆ స్థాయిలో ఉంటాయి. ఆ భావోద్వేగాలే ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. కల్యాణ్‌రామ్ బలం ఎమోషన్.. దాన్ని ఈ చిత్రంలో అద్భుతంగా పండించారు. అందుకే సినిమా క్లైమాక్స్ బాగా హిట్ అయింది. ఆఖర్లో సుమార 30 నిమిషాలు అన్ని వర్గాల ప్రేక్షకులను 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి ' కట్టిపడేస్తుంది.ఎవరెలా చేశారంటే..అర్జున్‌గా కల్యాణ్ రామ్ మంచి నటనను కనబరిచాడు. వైజయంతిగా విజయశాంతి దుమ్మురేపింది. ఇద్దరూ భావోద్వేగ, యాక్షన్ సన్నివేశాలలో ఎంతమాత్రం నిరాశపరచలేదు. ఈ వయసులోనూ విజయశాంతి డూప్ లేకుండా స్వయంగా యాక్షన్ సీక్వెన్స్‌లు చేయడం అందరినీ ఆశ్చర్యం కలిగించేలా ఉంటాయి. శక్తిమంతమైన తల్లి పాత్రలో ఆమె వంద శాతం న్యాయం చేసింది. పోలీస్ ఆఫీసర్‌గా ఆమె మరికొంత సమయం పాటు స్క్రీన్ మీద కనిపించి ఉండుండే బాగుండని అభిమానులకు కలుగుతుంది. అర్జున్ భార్య చిత్ర పాత్రలో సాయి మంజ్రేకర్ పరిదిమేరకు మాత్రమే ఉంటుంది. పఠాన్ పాత్రలో సోహైల్ ఖాన్ పాత్ర చిత్రీకరణ చాలా పేలవంగా ఉంటుంది. విలన్‌గా భారీ ఎలివేషన్స్‌కు మాత్రమే ఆయన పాత్ర ఉంటుంది. శ్రీకాంత్ కమిషనర్‌గా చాలా బాగా చేశాడు. తనకు ఇచ్చిన పాత్రలో సమర్థవంతంగా నటించాడు. హీరోకు ఎప్పుడు వెన్నంటి ఉండే మిత్రులలో ఒకరిగా పృథ్వీ తప్పకుండా ప్రేక్షకులను మెప్పిస్తాడు. ఈ సినిమా ఆయనకు ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చిపెడుతుంది. బడ్జెట్ మేరకు నిర్మాణ విలువలు పర్వాలేదు. దర్శకుడు ప్రదీప్ చిలుకూరి మాస్ యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కించడంలో మెప్పించాడు. కానీ, కథ విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోలేదనిపిస్తుంది. అర్జున్ S/O వైజయంతి సినిమా మాస్ ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది. అభిమానులకు పండుగలాంటి సినిమా అవుతుంది. కామన్ ఆడియన్స్‌కు మాత్రం చివరి 30 నిమిషాలు ఎప్పటికీ గుర్తుండిపోతుంది.

Bhagavad Gita: గర్వించ దగ్గ క్షణం.. భగవద్గీతకు యునెస్కో గుర్తింపు
సాక్షి,న్యూఢిల్లీ: భగవద్గీతకు అరుదైన గుర్తింపు లభించింది. యునెస్కో మెమరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్లో భగవద్గీతకు చోటు దక్కింది. భగవద్గీత,భరతముని రాసిన నాట్య శాస్త్రానికి గుర్తింపు లభించింది.ఈ ఘనతపై ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ‘భారత నాగరిక వారసత్వానికి ఒక చారిత్రాత్మక క్షణం ఇది. భగవద్గీత, భరతముని నాట్యశాస్త్రం ఇప్పుడు యునెస్కో మెమరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్లో లిఖించబడ్డాయని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఎక్స్‌వేదికగా ట్వీట్ చేశారు. ప్రధాని మోదీ స్పందిస్తూ రీట్వీట్ చేశారు.‘ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి భారతీయుడికి గర్వకారణమైన క్షణం ఇది. యునెస్కో మెమొరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్ లో గీత, నాట్యశాస్త్రం చేర్చబడటం మన కాలాతీత జ్ఞానం, గొప్ప సంస్కృతికి ప్రపంచవ్యాప్త గుర్తింపు. భగవత్ గీత,నాట్యశాస్త్రం శతాబ్దాలుగా నాగరికతను, చైతన్యాన్ని పెంపొందించాయి. అవి ప్రపంచానికి స్ఫూర్తినిస్తూనే ఉన్నాయి’ అని మోదీ పేర్కొన్నారు. A proud moment for every Indian across the world! The inclusion of the Gita and Natyashastra in UNESCO’s Memory of the World Register is a global recognition of our timeless wisdom and rich culture. The Gita and Natyashastra have nurtured civilisation, and consciousness for… https://t.co/ZPutb5heUT— Narendra Modi (@narendramodi) April 18, 2025

ఆ బంగారం మర్చిపోండి.. ఈ లోహమే ‘భవిష్యత్ బంగారం’
బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. రోజుకో కొత్త ధరకు చేరుతూ సామాన్యులకు అందనంత దూరంగా జరిగిపోతోంది పసిడి. ఇన్వెస్టర్లు సైతం స్వర్ణంపై సంపూర్ణ విశ్వాసం పెట్టలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో ‘భవిష్యత్ బంగారం’గా మరో లోహం ఆశలు పూయిస్తోంది. అదే ‘రాగి’ (Copper). ఎందుకు.. ఏమిటి అన్నది ఈ కథనంలో తెలుసుకుందాం..మల్టీ నేషనల్ మైనింగ్ సంస్థ వేదాంతా గ్రూప్ చైర్మన్ అనిల్ అగర్వాల్ కాపర్‌ను 'తదుపరి బంగారం'గా అభివర్ణించారు. ఇది క్లీన్ ఎనర్జీ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన రంగాలలో ఎక్కువగా ప్రాముఖ్యతను పొందుతోందని పేర్కొన్నారు. ఎలక్ట్రిక్ వాహనాలు, పునరుత్పాదక శక్తి మౌలిక సదుపాయాలు, ఏఐ, రక్షణ పరికరాలలో కాపర్‌కు పెరుగుతున్న డిమాండ్‌ను ఆయన ప్రస్తావించారు. కెనడాలోని బారిక్ గోల్డ్ సంస్థ తన పేరులో గోల్డ్ పదాన్ని తొలగించి కేవలం 'బారిక్'గా మార్చడం గ్లోబల్ స్థాయిలో కాపర్ గనులపై దృష్టి మారే సంకేతంగా ఆయన పేర్కొన్నారు.భారత్‌కు మంచి అవకాశాలుభారతదేశం ఈ ధోరణిలో పెద్ద అవకాశాలను కలిగి ఉందని అగర్వాల్ అభిప్రాయపడ్డారు. వర్ధమాన పారిశ్రామికవేత్తలు, యువ పెట్టుబడిదారులు ఆశాజనకమైన, భవిష్యత్తు ఉన్న లోహాలపై దృష్టి సారించి ఈ అవకాశాన్ని స్వాధీనం చేసుకోవాలని పిలుపునిచ్చారు. కాపర్, ఇతర ముఖ్యమైన ఖనిజాలను ప్రోత్సహించేందుకు జాతీయ మిషన్‌ను ప్రారంభించాలని కూడా ఆయన సూచించారు. ప్రపంచవ్యాప్తంగా కాపర్ గనులను పునరుద్ధరించడం ఆ లోహానికి పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చేందుకు ముఖ్యమైందని ఆయన పేర్కొన్నారు.ఇదిలా ఉండగా భారతదేశంలో బంగారం ధరలు గురువారం (ఏప్రిల్ 17) రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఢిల్లీలో 10 గ్రాముల మేలిమి బంగారం రూ.98,170 పలికింది. ప్రపంచవ్యాప్త డిమాండ్‌తో బంగారం ధరలు పెరిగిపోయి పెట్టుబడులకు ఆస్కారం తగ్గిపోతున్న క్రమంలో అగర్వాల్ భవిష్యత్‌లో కాపర్‌ను పెట్టుబడి ఎంపికగా గుర్తించారు. ఇది ఆర్థిక వృద్ధికి, ఆరోగ్యకరమైన పరిశ్రమలకు మద్దతు ఇస్తుందని అన్నారు.కాపర్‌కు గల ఈ పునరుద్ధరణ భారత ఆర్థిక వ్యవస్థకు గొప్ప లాభాలను తీసుకురావచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే, ఈ రంగంలో పెట్టుబడులు పెట్టే ముందు పర్యావరణ సమస్యలను పరిగణనలోకి తీసుకోవాలని సూచిస్తున్నారు. అగర్వాల్ ఈ విషయంలో ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యం (PPP) ద్వారా భారతదేశం కాపర్ రంగంలో స్వావలంబన సాధించాలని ఆకాంక్షించారు. ఈ ప్రస్థానం భారత యువతకు ఉపాధి అవకాశాలను కల్పిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.The world's second largest gold producer, Barrick Gold is rebranding to just Barrick. That is because it sees its future in copper.Copper is the new super metal which is being heavily used in every advanced technology, whether EVs, renewable energy infrastructure, AI or defence… pic.twitter.com/YUDC5Rid4r— Anil Agarwal (@AnilAgarwal_Ved) April 17, 2025

ఝూటా వకీల్ సాబ్ పతనం మొదలైందా?
సూపర్ సిక్స్ హామీలు, ఎన్నికల ప్రణాళికలోని అంశాలతో తనకు సంబంధం లేనట్లు, అదేదో టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేశ్‌ల బాధ్యత అన్నట్లు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడుతున్నారు. ప్రశ్నించడానికే పార్టీని పెట్టానని గొప్పగా చెప్పుకున్న పవన్.. ఇప్పుడు చంద్రబాబు, లోకేశ్‌లను రాజకీయంగా మోయడానికి, తన ఉప ముఖ్యమంత్రి పదవిని ఎంజాయ్ చేయడానికే అన్నట్లు ప్రవర్తిస్తున్నారని విమర్శ. దీంతో ఆయనకు ఇప్పుడిప్పుడే నిరసన సెగ తగులుతోంది. కొద్ది రోజుల క్రితం విశాఖ, గిరిజన ప్రాంతాలకు వెళ్లినప్పుడు వలంటీర్లు పవన్ కల్యాణ్(Pawan Kalyan)ను నిలదీసే యత్నం చేశారు. ఇప్పటికే ఆయా చోట్ల వలంటీర్లు ధర్నాలు, ర్యాలీలు నిర్వహించారు. అయినా కూటమి ప్రభుత్వంలో కనీస స్పందన లేదు. కూటమి పెద్దలకు చీమ కుట్టినట్లుగా కూడా లేదు. దాంతో వలంటీర్లు నేతలను ప్రశ్నించడానికి సిద్ధమవుతున్నారు. నిజానికి వీరే కాదు. సూపర్ సిక్స్ తదితర హామీలు ఏమయ్యాయంటూ మహిళలు, నిరుద్యోగులు తదితర వర్గాలు నిరసన ర్యాలీలు చేయడం ఆరంభమైంది.వలంటీర్లకు సంబంధించి పవన్ చేసిన ప్రకటనను గమనిస్తే ఆయన ఎలా మాట మార్చుతున్నది ఇట్టే తెలిసిపోతుంది. గత ప్రభుత్వం వలంటీర్లను అధికారికంగా నియమించలేదని చంద్రబాబు, లోకేశ్‌లు క్యాబినెట్ సమావేశంలో చెప్పారని, వారికి ఇచ్చేది జీతం కాదు.. గౌరవ వేతనం మాత్రమేనని, అందుకే ఏమీ చేయలేదని తెలియ చేశారని పవన్ అన్నట్లుగా మీడియాలో కథనం వచ్చింది. లక్షన్నర మంది జీవితాలను నట్టేట ముంచేసి, అదేదో స్వల్ప విషయమన్నట్లుగా పవన్ వ్యవహరించడం శోచనీయం. 👉ఎన్నికల ప్రణాళికలో వలంటీర్లకు పదివేల జీతం ఇస్తామని, వారి సేవలను కొనసాగిస్తామని ప్రకటించింది వాస్తవం కాదా? పలు ఎన్నికల ప్రచార సభలలో పవన్ కళ్యాణ్ ఎన్నిసార్లు వలంటీర్ల అంశం ప్రస్తావించారో గుర్తు లేదా? వలంటీర్ల కడుపు కొట్టబోమని, అందులోను లక్షమంది యువతులకు అన్యాయం చేస్తానా? అని ప్రసంగించారు. వాస్తవానికి రాష్ట్రంలో రెండున్నర లక్షల మంది వలంటీర్లు ఉండే వారు. కాని ఎన్నికల సమయంలో సుమారు ఎనభై వేల నుంచి లక్ష మంది వరకు రాజీనామాలు సమర్పించారు. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఉంటే వారిని కూడా బాధ్యతలలోకి తీసుకునే వారు. కాని కూటమి ప్రభుత్వం రావడంతో తమకు గౌరవ వేతనం పెరుగుతుందని రాజీనామా చేయని వలంటీర్లు ఆశపడ్డారు. తీరా చూస్తే కూటమి ప్రభుత్వం అసలుకే మోసం తెచ్చింది. 👉వలంటీర్లు(Volunteers) అంటే స్వచ్ఛందంగా సేవలందించే వారని, వారికి గత జగన్ ప్రభుత్వం గౌరవ వేతనం ఇచ్చిందన్న సంగతి పవన్ కళ్యాణ్ కు తెలియదా? ఆ విషయం తెలియకుండానే, గుడ్డిగా చంద్రబాబుతో కలిసి ఎన్నికల ప్రణాళికపై సంతకం చేశారని నమ్మాలా? అదే వాస్తవం అయితే పవన్ కళ్యాణ్ ఈ పదవిలో ఉండడానికి అర్హుడవుతారా? పైగా క్యాబినెట్లో చంద్రబాబు, లోకేశ్‌లు ఏదో చెప్పారని వారిపై నెట్టేసి తప్పించుకునే యత్నం చేస్తారా? ప్రభుత్వంలో వారు ఏమి చేసినా సమర్థిస్తున్న పవన్ కళ్యాణ్ వలంటీర్ల విషయం తనకు ఏమీ తెలియదన్నట్లుగా నటించడం ధర్మమేనా?. వలంటీర్లకు ఇచ్చేది గౌరవ వేతనం కనుక ,వారికి ఆ బాధ్యతలు అప్పగించడం కుదరదని చంద్రబాబు, లోకేశ్ లు చెబితే పవన్ కళ్యాణ్ చెవిలో పువ్వు పెట్టుకుని విన్నారా?మనం హామీ ఇచ్చాం కదా! ఎందుకు చేయలేం. ప్రభుత్వం అనుకుంటే ఇది ఒక పెద్ద సమస్యా?అ ని పవన్ కళ్యాణ్ ప్రశ్నించి ఉండాలి కదా? ఉగాది పర్వదినానా పవిత్రమైన పూజలు నిర్వహించి మరీ వలంటీర్లకు హామీ ఇచ్చారు కదా? ఇప్పుడు కాదంటే పాపం కదా అని చంద్రబాబును అడగాలి కదా? అలా అడగలేదంటే ఏమిటి దాని అర్థం? వలంటీర్లు సామాన్యులు కనుక, వారిని ఏమి చేసినా ఏమీ కాదన్న భావనే కదా?. 👉జగన్ ప్రభుత్వం(Jagan Govt) విజయవంతంగా నిర్వహించిన వలంటీర్లు అంటే చంద్రబాబు, లేదా పవన్ కళ్యాణ్‌లకు ఎప్పుడూ గౌరవం లేదు. వారిని అసలు సమాజంలో గౌరవనీయమైన వ్యక్తులుగా చూడడానికి కూడా ఇష్టపడలేదు. చంద్రబాబు నాయుడు వీరిని మూటలు మోసే వారని, ఆడవాళ్ళు ఇళ్లలో ఉన్నప్పుడు వెళ్లి వేధించేవారని ఒకసారి నీచమైన రీతిలో వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ అయితే మరీ దారుణంగా వలంటీర్లను కిడ్పాపర్లతో పోల్చారు. ఏపీలో 30 వేల మంది అమ్మాయిలు తప్పిపోయారని అంటూ వలంటీర్లపై ఆరోపణలు చేశారు. కాని ప్రజలలో వలంటీర్ల పట్ల ఉన్న సానుకూలత వల్ల అది వైఎస్సార్సీపీకి ఎక్కడ అడ్వాంటేజ్ అవుతుందోనన్న భయంతో, మాట మార్చి తాము అధికారంలోకి వస్తే వలంటీర్లను కొనసాగించడమే కాకుండా, గౌరవ వేతనం రూ.ఐదు వేల నుంచి రూ.పది వేలు చేస్తామని ప్రకటించారు. అప్పటికి వారికి అధికారం వస్తుందన్న నమ్మం లేదు. కాని అనూహ్యంగా గెలిచేసరికి, ఇప్పుడు సూపర్ సిక్స్‌తో సహా అనేక అంశాలపై స్వరం మార్చుతున్నారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముందు సినీ నటుడు. ఆ తర్వాతే రాజకీయ నేత. సినిమాలలో వకీల్ సాబ్‌గా ఆయన నటన అభిమానులను మెప్పించింది. కానీ రాజకీయ జీవితంలో మాత్రం ఆయన వ్యవహారశైలి వకీల్‌సాబ్ పాత్రకు భిన్నంగా ఉంది. ఈ సంగతిని ప్రజలూ గుర్తిస్తున్నారు. కరడుకట్టిన, గుడ్డి అభిమానులు మినహా మిగిలిన వారిలో పవన్ కళ్యాణ్ మాట మార్చేస్తున్నారన్న భావన క్రమేపీ బలపడిపోతోంది. 👉అబద్దాలు బాగా ఆడతారన్న పేరు ఉన్న చంద్రబాబుకు తానా అంటే తందానా అని తబలా వాయిస్తున్న చందంగా పవన్ వ్యవహరిస్తున్నారు. ఆయనతో పోటీ పడి అసత్యాలు చెబుతున్నారు. తాము మాట మార్చుతున్నామని ధైర్యంగా పవన్ కళ్యాణ్ చెప్పి ఉంటే కొంతైనా బెటర్‌గా ఉండేది. అలా కాకుండా చంద్రబాబు, లోకేశ్‌లదే తప్పు అన్నట్లు, తనకేమీ సంబంధం లేదన్నట్లు పవన్ కళ్యాణ్ డ్రామా ఆడినట్లు డైలాగులు చెబితే ప్రజలను పిచ్చివాళ్లను చేసినట్లు కాదా? వలంటీర్లను మోసం చేయడం కాదా? 30 వేల మంది అమ్మాయిల మిస్సింగ్ గురించి ఏపీ అంతటా తిరిగి చేసిన ప్రచారం అంతా అసెంబ్లీ సాక్షిగా పచ్చి అబద్దం అని తేలింది కదా! కేవలం 47 మంది మాత్రమే మిస్ అయ్యారని, వారిలో ఎక్కువ మంది తిరిగి వచ్చారని అసెంబ్లీలో సమాధానం చెప్పింది కూటమి ప్రభుత్వమే కదా? పవన్ కళ్యాణ్ పచ్చి అబద్దం ప్రచారం చేసి ఆంధ్ర సమాజాన్ని చీట్ చేసినట్లు అవుతుందా? అవ్వదా?.చంద్రబాబు, లోకేశ్‌ల పట్ల పవన్ కళ్యాణ్ ఎంత విధేయుడిగా ఉన్నా ప్రజలకు అభ్యంతరం లేదు. కాని ఎన్నికల ప్రణాళికను చంద్రబాబుతో కలిసి ఆయన కూడా విడుదల చేశారన్న సంగతి మర్చిపోకూడదు కదా! వకీల్ సాబ్ పాత్రను సినిమాలలో పోషించడం కాదు.. ప్రజా జీవితంలో ఆ మాదిరి నిలబడితేనే మంచి పేరు వస్తుంది. పవన్ కళ్యాణ్ విశాఖ వెళ్లినప్పుడు ఆయన కాన్వాయ్ కోసం పోలీసులు ఆంక్షలు విధించడం, తత్పలితంగా సుమారు 30 మంది జెఈఈ పరీక్షలు రాయలేకపోయిన ఘటన కూడా కూటమి ప్రభుత్వ తీరుకు అద్దం పడుతుంది. పవన్ కళ్యాణ్ పదవిని ఎంజాయ్ చేసే మోజులో విద్యార్ధుల భవిష్యత్తును కూడా దెబ్బతీశారన్న విమర్శకు ఆస్కారం ఇచ్చారు. ఏది ఏమైనా వలంటీర్లను చంద్రబాబు, లోకేశ్‌లే కాదు.. పవన్ కళ్యాణ్ కూడా మోసం చేసినట్లే!. :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.
“చరిత్రలోకి అడుగేసి మన నగర గత వైభవాన్ని గుర్తిద్దాం”
ఒకే కాలనీ...56 పార్కులు ఎక్కడో తెలుసా?
‘బంగ్లాదేశ్ తిరుగుబాటుతో తెలంగాణకు సంబంధమేంటి?’
నటుడికి క్యాన్సర్ నాలుగో స్టేజ్.. ఆదుకోమని వేడుకోలు..
కర్ణాటకలో రోడ్డు ప్రమాదం.. నలుగురు ఏపీ వాసుల మృతి
ఆరోజు నాకు కోపం వచ్చింది.. అందుకే అలా అరిచాను: రోహిత్ శర్మ
MMTS రైలు ఘటన: ఇన్ స్టా రీల్స్ కోసం ‘అత్యాచారం’ డ్రామా!
జ్యోతి పూర్వాజ్ లీడ్ రోల్లో వస్తోన్న కిల్లర్.. క్రేజీ అప్డేట్ వచ్చేసింది!
Bhoodan Movementసర్వోదయ స్ఫూర్తిని నిలపాలి!
'ఇన్ఫోసిస్‌లో 20వేల ఉద్యోగాలు'
చైనా పై 245 శాతం సుంకాలు విధించిన అమెరికా
పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో అత్యధిక పారితోషికం అతడిదే.. ఐపీఎల్‌తో పోలిస్తే..!
చల్లటి కబురు!
రెండో పెళ్లి చేసుకున్న ప్రముఖ యాంకర్, ఫోటోలు వైరల్
పీఎం మోదీ ఏసీ యోజన: కొత్త AC కొనుగోలుపై డిస్కౌంట్
ఈ రాశి వారికి భూలాభాలు.. వ్యాపారాలు విస్తరిస్తారు
IPl 2025: 'మరీ అంత స్వార్ధం పనికిరాదు బ్రో.. నీ వల్లే రాజస్తాన్ ఓడిపోయింది'
అల్లుడితో కలిసి 7 ఎకరాలు కొన్న బాలీవుడ్ నటుడు.. ఎక్కడంటే?
ఝూటా వకీల్ సాబ్ పతనం మొదలైందా?
MI VS SRH: సిక్సర్ల సెంచరీ పూర్తి చేసిన రోహిత్.. కోహ్లి, గేల్, ఏబీడీ సరసన చోటు
కమిన్స్, స్టార్క్ కాదు!.. అతడిని ఎదుర్కోవడమే అత్యంత కష్టం: రోహిత్
'బురుజులు' ఎందుకు నిర్మించేవారో తెలుసా..?
‘నన్ను బలవంతంగా తీసుకెళ్లారు’
వేములవాడ రాజన్నకు కొత్త గుడి
వెనక్కి తగ్గని ఐఏఎస్ స్మితా సబర్వాల్.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వరుస రీట్వీట్లు
మామిడి తోటలో మృత్యువు కాటేసింది
అర్జున్ చిన్నకూతురి ఎంగేజ్మెంట్.. 13 ఏళ్ల ప్రేమ అంటూ..
అర్ధరాత్రి నర్సింగ్ హాస్టల్లో దూరిన ప్రిన్సిపాల్.. నిర్భంధించిన విద్యార్థినులు
ఓర్నీ'పుష్ప 2' మొత్తం గ్రాఫిక్సే.. వీఎఫ్ఎక్స్ వీడియో రిలీజ్
రాజ్‌తరుణ్ పేరెంట్స్‌ను ఇంట్లోకి రానిచ్చిన లావణ్య
రూ. 50 కోట్ల కుక్క.. ఈడీ దాడులు!
హాలీవుడ్ రేంజ్లో ఫైట్
PSLతో పోలికా?.. ఐపీఎల్‌కు ఏదీ సాటి రాదు: ఇచ్చి పడేసిన ఇంగ్లండ్ స్టార్
భారత్‌లోకి వెల్లువలా చైనా ఉత్పత్తులు?
వైద్యులే కంటతడి పెట్టేలా.. 11 ఏళ్ల బాలికపై అత్యాచారం
విద్యార్థికి రూ.2 కోట్ల అప్పు.. వడ్డీ 40 రూపాయలు!
మాట నిలబెట్టుకున్న టీమిండియా దిగ్గజం.. కాంబ్లీకి జీవితాంతం నెలకు..
అభిషేక్ శర్మ, నితీశ్ కుమార్‌కు జాక్ పాట్..?
'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' మూవీ రివ్యూ
'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' ట్విటర్ రివ్యూ
విజయసాయి సాక్ష్యం చెల్లుబాటు అవుతుందా?
హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో మరో లగ్జరీ ప్రాజెక్ట్
‘సీఐ పొన్నూరు భాస్కర్ నన్ను టార్చర్ చేశారు సర్’..కోర్టులో కృష్ణవేణి ఆవేదన
పెరుగుతున్న మత సమ్మతి
ఇద్దరు కొడుకుల గొంతుకోసి చంపి.. తల్లి ఆత్మహత్య
తిరుమలలో గోవుల మృతిపై కేసు వేస్తా: సుబ్రహ్మణ్యస్వామి
26 బంతుల్లో సెంచరీ.. పొట్టి క్రికెట్లో పెను సంచలనం
‘రారండోయ్..వేడుక చేద్దాం’..! మంచి ముహూర్తాల తేదీలు ఇవే..!
నీతా అంబానీ దగ్గరికి వెళ్లిన ఇషాన్.. మాజీ ఓనర్ రియాక్షన్ ఇదే!
రాష్ట్రాల మీద ఆధిపత్యం కాస్త తగ్గించుకుంటే బెటరేమో సార్!
ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తాం
డ్రైవర్‌గా చేరి ప్రైవేటు వీడియోలతో బ్లాక్ మెయిల్
జ్యోతిష్యం చెప్తుండగా టైర్ పేలి తుర్రుమన్న చిలుక
ఏ క్షణమైనా గుండెపోటు ఖాయం..! కాలమిస్ట్ శోభా డే కుమార్తె వెయిట్ లాస్ స్టోరీ
ముంబైకి ప్రధాన సమస్య అతడే!.. సీజన్ మొత్తం ఎలా భరిస్తారో!?
సడన్‌గా ఓటీటీలోకి వచ్చిన తెలుగు థ్రిల్లర్.. ఎక్కడంటే?
కాబోయే అల్లుడితో అత్త జంప్ ఎపిసోడ్లో ట్విస్ట్.. ఎందుకిలా చేసిందంటే..
ఆ చట్టం కేవలం కోడళ్ల కోసమే చేయలేదమ్మా: అలహాబాద్ హైకోర్టు
రైళ్లు ఇలా మళ్లిస్తున్నారు..
జిమ్‌లో అనసూయ కసరత్తులు.. కళ్లతోనే కవ్విస్తోన్న బిగ్‌బాస్ దివి!
ఇంటర్వ్యూ స్లాట్లు అదృశ్యం
కుమారుడి వివాహేతర సంబంధానికి తండ్రి బలి..!
వక్ఫ్ ఆస్తుల్లో ఎలాంటి మార్పు చేయొద్దు: సుప్రీంకోర్టు
త్వరలో ఆర్థిక మాంద్యం!
హ్యాట్రిక్ కొట్టిన బంగారం.. తులం ఎంతకు చేరిందంటే..
వైరల్: వధువు తెగించేసింది భయ్యా! వరుడి నోట్లో నోరు పెట్టి..
గ్రూప్–1 నియామకాలు నిలిపివేయండి
సూర్య, శ్రేయస్, పృథ్వీ షా.. అందరూ ఆడాల్సిందే!.. అదనంగా రూ. 15 లక్షలు!
50 ఏళ్ల వయసులో పడుచుపిల్లలా ఖుష్బూ.. సీక్రెట్ అదే!
బంగారం కొనేముందు ఇవి తెలుసుకోండి
భారత్‌లో పత్తి పండుతున్నా దిగుమతులెందుకు?
ఆడవాళ్లు కనిపిస్తే వదలడు.. అలాంటి నటుడితో నన్ను..: టాలీవుడ్ హీరోయిన్
టీమిండియాలోకి ట్రిపుల్ సెంచరీ వీరుడు.. ఐదేళ్ల తర్వాత రీ ఎంట్రీ?
IPL 2025: గ్లెన్ ఫిలిప్స్‌కు ప్రత్యామ్నాయ ఆటగాడు అతడే..!
గుండెపోటుతో భక్తుడి మృతి.. ఆలయం మూసివేత..!
‘కోచ్‌లు అహాన్ని పక్కన పెట్టాలి.. అతడి వ్యూహం వల్లే ముంబై గెలుపు’
ట్రైన్ రిజర్వేషన్: టికెట్‌పై ఈ పదాలు కనిపిస్తే బెర్త్ కన్ఫర్మ్!
'ఇక మమ్మల్ని ఎవరూ విడదీయలేరు'
రోహిత్ శర్మకు ఫ్రెండ్.. సీనియర్లకు అతడి ప్రవర్తన నచ్చలేదు!
నాన్న ఆస్తిపై నా భార్య కుట్ర.. ఆయన పాడె మోసేందుకు ఎవరూ రాలేదు
మందు బాబులకు షాక్.. ఎల్లుండి వైన్ షాపులు బంద్
సౌర వ్యవస్థకు ఆవల జీవం!
వాటిని వక్ఫ్ ఆస్తులుగా భావిస్తాం: సుప్రీంకోర్టు
భూకంపం నుంచి బిడ్డను రక్షించుకునేందుకు.. వలయాన్ని సృష్టించిన ఏనుగులు
ప్రతి దరఖాస్తుకు ఒక డెడ్‌లైన్
మారిన తత్కాల్ టికెట్ బుకింగ్ రూల్స్: ఏప్రిల్ 15 నుంచే అమలు
అమెరికాలో కొత్త టెన్షన్.. వారి వీసా రద్దు
మొబైల్ పోయిందా డోంట్ వర్రీ! కొత్త టెక్నాలజీతో ఇట్టే ..!
'ఓదెల 2' మూవీ రివ్యూ.. శివశక్తిగా తమన్నా మెప్పించిందా..?
రేషన్ కార్డులపై క్షేత్రస్థాయి సర్వే
ఇంకా చాలామంది మోసగాళ్లు దాక్కున్నారు..
ఏడాది తర్వాత ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా
ఫ్రెషర్స్ జీతం ఎందుకు పెరగదు? ఐటీ కంపెనీ సమాధానం
మార్చిలో అధికంగా అమ్ముడైన టాప్ 5 మొబైళ్లు
పిఠాపురంలో రైతుల వినూత్న నిరసన..
అంతర్జాతీయ విమానాశ్రయానికి 30 వేల ఎకరాలు
మన మీద అనుమానపడటం ఇదేం కొత్తకాదుగా.. లైట్ తీస్కోండి!
విశాఖ: ప్రలోభాల పర్వంలో కూటమి నేతలకు ఛీత్కారాలు
బామ్మర్ది మీ అక్క చనిపోయింది..!
తార్నాక జంక్షన్..రీ ఓపెన్!
Texas: మృత్యువుతో పోరాడి ఓడిన దీప్తి
ఇన్ఫోసిస్ డీలా
రూ.50 కోట్ల కుక్క..ఈడీ సోదాల ఎపిసోడ్లో అదిరిపోయే ట్విస్ట్!
మరోసారి చిక్కుల్లో దసరా విలన్.. నటి ఫిర్యాదుతో పరారైన నటుడు!
ఓటీటీల్లోకి వచ్చేసిన 20 సినిమాలు.. ఆ మూడు స్పెషల్
వ్యభిచార ముఠా గుట్టు రట్టు
అతిగా వంటనూనెలు వాడుతున్నారా..? నిపుణుల స్ట్రాంగ్ వార్నింగ్
ఎస్ఆర్హెచ్ జట్టులోకి విధ్వంసకర వీరుడు..
విడాకులు తీసుకునే రోజు దగ్గర్లోనే.. నోరు మూయించిన సోనాక్షి
ప్రియాంక చోప్రా భర్తతో మహేశ్ ఫ్యామిలీ.. థాంక్స్ చెప్పిన నమ్రత
“చరిత్రలోకి అడుగేసి మన నగర గత వైభవాన్ని గుర్తిద్దాం”
ఒకే కాలనీ...56 పార్కులు ఎక్కడో తెలుసా?
‘బంగ్లాదేశ్ తిరుగుబాటుతో తెలంగాణకు సంబంధమేంటి?’
నటుడికి క్యాన్సర్ నాలుగో స్టేజ్.. ఆదుకోమని వేడుకోలు..
కర్ణాటకలో రోడ్డు ప్రమాదం.. నలుగురు ఏపీ వాసుల మృతి
ఆరోజు నాకు కోపం వచ్చింది.. అందుకే అలా అరిచాను: రోహిత్ శర్మ
MMTS రైలు ఘటన: ఇన్ స్టా రీల్స్ కోసం ‘అత్యాచారం’ డ్రామా!
జ్యోతి పూర్వాజ్ లీడ్ రోల్లో వస్తోన్న కిల్లర్.. క్రేజీ అప్డేట్ వచ్చేసింది!
Bhoodan Movementసర్వోదయ స్ఫూర్తిని నిలపాలి!
'ఇన్ఫోసిస్‌లో 20వేల ఉద్యోగాలు'
చైనా పై 245 శాతం సుంకాలు విధించిన అమెరికా
పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో అత్యధిక పారితోషికం అతడిదే.. ఐపీఎల్‌తో పోలిస్తే..!
చల్లటి కబురు!
రెండో పెళ్లి చేసుకున్న ప్రముఖ యాంకర్, ఫోటోలు వైరల్
పీఎం మోదీ ఏసీ యోజన: కొత్త AC కొనుగోలుపై డిస్కౌంట్
ఈ రాశి వారికి భూలాభాలు.. వ్యాపారాలు విస్తరిస్తారు
IPl 2025: 'మరీ అంత స్వార్ధం పనికిరాదు బ్రో.. నీ వల్లే రాజస్తాన్ ఓడిపోయింది'
అల్లుడితో కలిసి 7 ఎకరాలు కొన్న బాలీవుడ్ నటుడు.. ఎక్కడంటే?
ఝూటా వకీల్ సాబ్ పతనం మొదలైందా?
MI VS SRH: సిక్సర్ల సెంచరీ పూర్తి చేసిన రోహిత్.. కోహ్లి, గేల్, ఏబీడీ సరసన చోటు
కమిన్స్, స్టార్క్ కాదు!.. అతడిని ఎదుర్కోవడమే అత్యంత కష్టం: రోహిత్
'బురుజులు' ఎందుకు నిర్మించేవారో తెలుసా..?
‘నన్ను బలవంతంగా తీసుకెళ్లారు’
వేములవాడ రాజన్నకు కొత్త గుడి
వెనక్కి తగ్గని ఐఏఎస్ స్మితా సబర్వాల్.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వరుస రీట్వీట్లు
మామిడి తోటలో మృత్యువు కాటేసింది
అర్జున్ చిన్నకూతురి ఎంగేజ్మెంట్.. 13 ఏళ్ల ప్రేమ అంటూ..
అర్ధరాత్రి నర్సింగ్ హాస్టల్లో దూరిన ప్రిన్సిపాల్.. నిర్భంధించిన విద్యార్థినులు
ఓర్నీ'పుష్ప 2' మొత్తం గ్రాఫిక్సే.. వీఎఫ్ఎక్స్ వీడియో రిలీజ్
రాజ్‌తరుణ్ పేరెంట్స్‌ను ఇంట్లోకి రానిచ్చిన లావణ్య
రూ. 50 కోట్ల కుక్క.. ఈడీ దాడులు!
హాలీవుడ్ రేంజ్లో ఫైట్
PSLతో పోలికా?.. ఐపీఎల్‌కు ఏదీ సాటి రాదు: ఇచ్చి పడేసిన ఇంగ్లండ్ స్టార్
భారత్‌లోకి వెల్లువలా చైనా ఉత్పత్తులు?
వైద్యులే కంటతడి పెట్టేలా.. 11 ఏళ్ల బాలికపై అత్యాచారం
విద్యార్థికి రూ.2 కోట్ల అప్పు.. వడ్డీ 40 రూపాయలు!
మాట నిలబెట్టుకున్న టీమిండియా దిగ్గజం.. కాంబ్లీకి జీవితాంతం నెలకు..
అభిషేక్ శర్మ, నితీశ్ కుమార్‌కు జాక్ పాట్..?
'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' మూవీ రివ్యూ
'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' ట్విటర్ రివ్యూ
విజయసాయి సాక్ష్యం చెల్లుబాటు అవుతుందా?
హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో మరో లగ్జరీ ప్రాజెక్ట్
‘సీఐ పొన్నూరు భాస్కర్ నన్ను టార్చర్ చేశారు సర్’..కోర్టులో కృష్ణవేణి ఆవేదన
పెరుగుతున్న మత సమ్మతి
ఇద్దరు కొడుకుల గొంతుకోసి చంపి.. తల్లి ఆత్మహత్య
తిరుమలలో గోవుల మృతిపై కేసు వేస్తా: సుబ్రహ్మణ్యస్వామి
26 బంతుల్లో సెంచరీ.. పొట్టి క్రికెట్లో పెను సంచలనం
‘రారండోయ్..వేడుక చేద్దాం’..! మంచి ముహూర్తాల తేదీలు ఇవే..!
నీతా అంబానీ దగ్గరికి వెళ్లిన ఇషాన్.. మాజీ ఓనర్ రియాక్షన్ ఇదే!
రాష్ట్రాల మీద ఆధిపత్యం కాస్త తగ్గించుకుంటే బెటరేమో సార్!
ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తాం
డ్రైవర్‌గా చేరి ప్రైవేటు వీడియోలతో బ్లాక్ మెయిల్
జ్యోతిష్యం చెప్తుండగా టైర్ పేలి తుర్రుమన్న చిలుక
ఏ క్షణమైనా గుండెపోటు ఖాయం..! కాలమిస్ట్ శోభా డే కుమార్తె వెయిట్ లాస్ స్టోరీ
ముంబైకి ప్రధాన సమస్య అతడే!.. సీజన్ మొత్తం ఎలా భరిస్తారో!?
సడన్‌గా ఓటీటీలోకి వచ్చిన తెలుగు థ్రిల్లర్.. ఎక్కడంటే?
కాబోయే అల్లుడితో అత్త జంప్ ఎపిసోడ్లో ట్విస్ట్.. ఎందుకిలా చేసిందంటే..
ఆ చట్టం కేవలం కోడళ్ల కోసమే చేయలేదమ్మా: అలహాబాద్ హైకోర్టు
రైళ్లు ఇలా మళ్లిస్తున్నారు..
జిమ్‌లో అనసూయ కసరత్తులు.. కళ్లతోనే కవ్విస్తోన్న బిగ్‌బాస్ దివి!
ఇంటర్వ్యూ స్లాట్లు అదృశ్యం
కుమారుడి వివాహేతర సంబంధానికి తండ్రి బలి..!
వక్ఫ్ ఆస్తుల్లో ఎలాంటి మార్పు చేయొద్దు: సుప్రీంకోర్టు
త్వరలో ఆర్థిక మాంద్యం!
హ్యాట్రిక్ కొట్టిన బంగారం.. తులం ఎంతకు చేరిందంటే..
వైరల్: వధువు తెగించేసింది భయ్యా! వరుడి నోట్లో నోరు పెట్టి..
గ్రూప్–1 నియామకాలు నిలిపివేయండి
సూర్య, శ్రేయస్, పృథ్వీ షా.. అందరూ ఆడాల్సిందే!.. అదనంగా రూ. 15 లక్షలు!
50 ఏళ్ల వయసులో పడుచుపిల్లలా ఖుష్బూ.. సీక్రెట్ అదే!
బంగారం కొనేముందు ఇవి తెలుసుకోండి
భారత్‌లో పత్తి పండుతున్నా దిగుమతులెందుకు?
ఆడవాళ్లు కనిపిస్తే వదలడు.. అలాంటి నటుడితో నన్ను..: టాలీవుడ్ హీరోయిన్
టీమిండియాలోకి ట్రిపుల్ సెంచరీ వీరుడు.. ఐదేళ్ల తర్వాత రీ ఎంట్రీ?
IPL 2025: గ్లెన్ ఫిలిప్స్‌కు ప్రత్యామ్నాయ ఆటగాడు అతడే..!
గుండెపోటుతో భక్తుడి మృతి.. ఆలయం మూసివేత..!
‘కోచ్‌లు అహాన్ని పక్కన పెట్టాలి.. అతడి వ్యూహం వల్లే ముంబై గెలుపు’
ట్రైన్ రిజర్వేషన్: టికెట్‌పై ఈ పదాలు కనిపిస్తే బెర్త్ కన్ఫర్మ్!
'ఇక మమ్మల్ని ఎవరూ విడదీయలేరు'
రోహిత్ శర్మకు ఫ్రెండ్.. సీనియర్లకు అతడి ప్రవర్తన నచ్చలేదు!
నాన్న ఆస్తిపై నా భార్య కుట్ర.. ఆయన పాడె మోసేందుకు ఎవరూ రాలేదు
మందు బాబులకు షాక్.. ఎల్లుండి వైన్ షాపులు బంద్
సౌర వ్యవస్థకు ఆవల జీవం!
వాటిని వక్ఫ్ ఆస్తులుగా భావిస్తాం: సుప్రీంకోర్టు
భూకంపం నుంచి బిడ్డను రక్షించుకునేందుకు.. వలయాన్ని సృష్టించిన ఏనుగులు
ప్రతి దరఖాస్తుకు ఒక డెడ్‌లైన్
మారిన తత్కాల్ టికెట్ బుకింగ్ రూల్స్: ఏప్రిల్ 15 నుంచే అమలు
అమెరికాలో కొత్త టెన్షన్.. వారి వీసా రద్దు
మొబైల్ పోయిందా డోంట్ వర్రీ! కొత్త టెక్నాలజీతో ఇట్టే ..!
'ఓదెల 2' మూవీ రివ్యూ.. శివశక్తిగా తమన్నా మెప్పించిందా..?
రేషన్ కార్డులపై క్షేత్రస్థాయి సర్వే
ఇంకా చాలామంది మోసగాళ్లు దాక్కున్నారు..
ఏడాది తర్వాత ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా
ఫ్రెషర్స్ జీతం ఎందుకు పెరగదు? ఐటీ కంపెనీ సమాధానం
మార్చిలో అధికంగా అమ్ముడైన టాప్ 5 మొబైళ్లు
పిఠాపురంలో రైతుల వినూత్న నిరసన..
అంతర్జాతీయ విమానాశ్రయానికి 30 వేల ఎకరాలు
మన మీద అనుమానపడటం ఇదేం కొత్తకాదుగా.. లైట్ తీస్కోండి!
విశాఖ: ప్రలోభాల పర్వంలో కూటమి నేతలకు ఛీత్కారాలు
బామ్మర్ది మీ అక్క చనిపోయింది..!
తార్నాక జంక్షన్..రీ ఓపెన్!
Texas: మృత్యువుతో పోరాడి ఓడిన దీప్తి
ఇన్ఫోసిస్ డీలా
రూ.50 కోట్ల కుక్క..ఈడీ సోదాల ఎపిసోడ్లో అదిరిపోయే ట్విస్ట్!
మరోసారి చిక్కుల్లో దసరా విలన్.. నటి ఫిర్యాదుతో పరారైన నటుడు!
ఓటీటీల్లోకి వచ్చేసిన 20 సినిమాలు.. ఆ మూడు స్పెషల్
వ్యభిచార ముఠా గుట్టు రట్టు
అతిగా వంటనూనెలు వాడుతున్నారా..? నిపుణుల స్ట్రాంగ్ వార్నింగ్
ఎస్ఆర్హెచ్ జట్టులోకి విధ్వంసకర వీరుడు..
విడాకులు తీసుకునే రోజు దగ్గర్లోనే.. నోరు మూయించిన సోనాక్షి
ప్రియాంక చోప్రా భర్తతో మహేశ్ ఫ్యామిలీ.. థాంక్స్ చెప్పిన నమ్రత
సినిమా

ఆడవాళ్లు కనిపిస్తే వదలడు.. అలాంటి నటుడితో నన్ను..: టాలీవుడ్ హీరోయిన్
బాలీవుడ్ నటి అమృత అరోరా సోదరి, నటి ప్రీతిక రావు (Preetika Rao).. ఓ నెటిజన్‌పై భగ్గుమంది. వద్దంటున్నా వినకుండా నటుడు హర్షద్ అరోరా (Harshad Arora)తో కలిసున్న వీడియోను పదేపదే షేర్ చేయడంపై అసహనం వ్యక్తం చేసింది. ఒకసారి చెప్తే అర్థం కాదా? అంటూ విరుచుకుపడింది. హర్షద్ అరోరా, ప్రతీక రావు బెయింటెహా సీరియల్లో కలిసి నటించారు. అందులోని సీన్లను ఓ అభిమాని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. అవి ప్రీతికకు నచ్చలేదు. వాటిని తీసేయమని కోరింది. దీంతో సదరు అభిమాని.. పదేళ్ల క్రితం మీరు అతడితో కలిసి నటించినప్పుడు లేని బాధ ఇప్పుడెందుకు? అని ప్రశ్నించాడు. బుర్ర లేదా? చెప్తే అర్థం కాదా?అందుకామె.. ఓరి నీ తెలివితక్కువవాడా.. నీకేం చెప్పినా అర్థం కాదు. కొన్ని సన్నివేశాలు సడన్‌గా చెప్పి చేయమంటారు. అందుకే నేను టీవీలో అలాంటి సీన్లలో నటించాను. అంతమాత్రానికి ఆ సీన్ వీడియోలను పదేపదే షేర్ చేయాల్సిన అవసరం ఏంటి? నిన్ను చూస్తే సిగ్గుగా ఉంది. ఇండస్ట్రీలో కొత్తగా ఎవరొస్తే వారితో పడక పంచుకునే వ్యక్తి తను.. అలాంటివాడితో కలిసి నటించిన వీడియోలు పోస్ట్ చేయొద్దని ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవే.. నా మనసుకు నచ్చని పని చేస్తున్నావు. అనుభవిస్తావ్..అందుకు కర్మ అనుభవిస్తావ్. బెయింటెహా సీరియల్లో 95 శాతం వరకు సాధారణ సీన్లే ఉంటాయి. కేవలం 5 శాతం మాత్రమే ఎక్కువ సాన్నిహిత్యంతో ఉన్న సన్నివేశాలున్నాయి. నా మాట లెక్క చేయకుండా వాటిని షేర్ చేస్తూనే ఉన్నావ్.. ఇంతకింతా అనుభవిస్తావ్ అని శపించింది. ఈ చాటింగ్‌కు సంబంధించిన స్క్రీన్‌షాట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అప్పట్లో హిట్ సీరియల్బెయింటెహా సీరియల్ 2013లో ప్రసారమైంది. ఇందులో ప్రీతిక- హర్షద్ జంటగా నటించారు. అప్పట్లో ఈ ధారావాహిక విజయవంతంగా కొనసాగింది. తర్వాత ప్రీతిక.. లవ్ కా హై ఇంతేజార్, లాల్ ఇష్క్ వంటి సీరియల్స్ చేసింది. తెలుగులో 'ప్రియుడు' సినిమాలో వరుణ్ సందేశ్ సరసన కథానాయికగా యాక్ట్ చేసింది. తమిళంలో 'చిక్కు బుక్కు', కన్నడలో 'రెబల్' సినిమాలు చేసింది. హర్షద్.. ఘమ్ హై కిసీకే ప్యార్ మే, సాసురాల్ సిమర్ కా, డల్హీజ్, దేవోంకే దేవ్.. మహదేవ్ వంటి సీరియల్స్‌లో నటించాడు.చదవండి: 'కోర్ట్' హీరో కొత్త మూవీ.. సైలెంట్‌గా ఓటీటీలో స్ట్రీమింగ్

బద్రీనాథ్ పక్కనే నా పేరుపై గుడి.. నాకు పూజలు, పూలదండలు: ఊర్వశి
ఊర్వశి రౌతేలా (Urvashi Rautela).. ఐటం సాంగ్స్‌తోనే కాదు ఆసక్తికర వ్యాఖ్యలతోనూ నిత్యం వార్తల్లో ఉంటుంది. ఆ మధ్య బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్‌పై దాడి గురించి మాట్లాడమంటే.. తన వేలికున్న డైమండ్ రింగ్ చూపిస్తూ షోఆఫ్ చేసింది. తన తీరుపై విమర్శలు రావడంతో సారీ చెప్పింది. తర్వాత రామ్‌చరణ్-కియారాల గేమ్ ఛేంజర్ డిజాస్టర్ అవడం, తను ఐటం సాంగ్‌తో పాటు చిన్న పాత్ర చేసిన డాకు మహారాజ్ హిట్టవడంతో సంతోషం తట్టుకోలేకపోయింది. నేనే గొప్ప అన్నట్లుగా..చూశారా? నా సినిమా సూపర్ హిట్టయింది. కియారా నటించిన గేమ్ ఛేంజర్ షెడ్డుకు వెళ్లిపోయింది. ఇందులో నా తప్పయితే లేదు సుమీ.. సినిమా బాగోలేకపోతే జాకీలు పెట్టి లేపినా జనాలు లెక్కచేయరు అని కామెంట్లు చేసింది. కొద్ది రోజుల క్రితం హీరో షారూఖ్ ఖాన్ తర్వాత సినిమా కోసం భారీ స్థాయిలో ప్రమోషన్స్ చేసేది నేనే.. హాలీవుడ్ వాళ్లు కూడా వారి సినిమా కోసం నన్నే ప్రమోషన్స్ చేయమన్నారు అంటూ సెల్ఫ్ డబ్బా కొట్టుకుంది.ఇక్కడో గుడి.. సౌత్‌లో కూడా ఉంటే..ఇప్పుడేకంగా తనకు దక్షిణాదిన గుడి కట్టి తీరాల్సిందే అని చెప్తోంది. తాజాగా ఊర్వశి రౌతేలా మాట్లాడుతూ.. ఉత్తరాఖండ్‌లో నాకు ఓ గుడి కట్టారు. బద్రీనాథ్‌కు దగ్గర్లోనే ఊర్వశి దేవాలయం ఉంది. జనాలు అక్కడికి వెళ్లి నా ఆశీర్వాదం తీసుకుంటారు. ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థులు నన్ను భక్తిగా పూజ చేసి నా ఫోటోకు దండలు కూడా వేస్తారు. నన్ను ఆ గుడిలో దండమామై అని పిలుస్తుంటారు. పనిలో పనిగా దక్షిణాదిన కూడా నాకో గుడి కడితే బాగుంటుంది అని పేర్కొంది. ఊర్వశి.. చివరగా సన్నీడియోల్ 'జాట్' సినిమాలో సారీ బోల్ పాటలో కనిపించింది.చదవండి: ట్రిపుల్ ట్రీట్.. ఆర్య 3, కార్తికేయ 3.. ఇంకా ఎన్నెన్నో..

ఓటీటీలోకి విక్రమ్ కొత్త సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్
పేరుకే తమిళ హీరో గానీ విక్రమ్ కి తెలుగులోనూ బోలెడంతమంది అభిమానులు ఉన్నారు. ఇతడు అందరిలా రెగ్యులర్ కమర్షియల్ మూవీస్ కాకుండా కాస్త వైవిధ్యంగా ఉండే సినిమాలు తీస్తుంటాడు. దీంతో అప్పుడో ఇప్పుడో అన్నట్లు హిట్స్ పడుతుంటాయి. అలాంటిది ఇప్పుడు ఇతడి కొత్త సినిమా నెలలోపే ఓటీటీలోకి(OTT Movie) వచ్చేస్తోంది.విక్రమ్(Vikram)హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'వీరధీరశూర'(Veera Dheera Sooran Movie). యాక్షన్ బ్యాక్ డ్రాప్ కథతో తీసిన ఈ సినిమాలో ఎస్జే సూర్య, సూరజ్ వెంజుమోడ్ లాంటి స్టార్స్ నటించారు. అయితే మార్చి 27న ఉగాది కానుకగా థియేటర్లలో రిలీజైంది. అదే టైంకి తెలుగులో మ్యాడ్ స్క్వేర్, రాబిన్ హుడ్ రిలీజ్ కావడంతో దీన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు.(ఇదీ చదవండి: ట్రిపుల్ ట్రీట్.. ఆర్య 3, కార్తికేయ 3.. ఇంకా ఎన్నెన్నో.. )మరోవైపు ఈ చిత్రానికి యావరేజ్ టాక్ రావడం కూడా మైనస్ అయిందని చెప్పొచ్చు. అలా చాలామంది చూడకుండానే థియేటర్లలో నుంచి ఈ సినిమా తీసేశారు. ఇప్పుడు వాళ్ల కోసమా అన్నట్లు నెలలోపే ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఏప్రిల్ 24 నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుందని అధికారికంగా ప్రకటించారు. 'వీరధీరశూర' విషయానికొస్తే.. కాళి (విక్రమ్) ఓ కిరాణా దుకాణం నడుపుతుంటాడు. భార్య వాణి, పిల్లలతో ప్రశాంతంగా బతికేస్తుంటాడు. కానీ కాళి గతం వేరు. రవి (పృథ్వీ) దగ్గర చాన్నాళ్లు పనిచేసుంటాడు. ఓ రోజు రవి వచ్చి కాళిని సాయం అడుగుతాడు. తనని, తన కొడుకు కన్నా (సూరజ్ వెంజరమూడు)ని ఎన్కౌంటర్ చేయాలనుకున్న ఎస్పీ అరుణగిరి (ఎస్.జె.సూర్య)ని అంతం చేయాలని అంటాడు. దీనికి కాళి ఒప్పుకోవల్సిన పరిస్థితులు ఎందుకొచ్చాయి? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: 'కోర్ట్' హీరో కొత్త మూవీ.. సైలెంట్‌గా ఓటీటీలో స్ట్రీమింగ్) One night. No rules. Only survival. A night that will change everything. 🔥#VeeraDheeraSooranOnPrime, April 24 pic.twitter.com/os8pfrjyUJ— prime video IN (@PrimeVideoIN) April 18, 2025

మొన్నే సినిమా రిలీజ్.. ఇప్పుడు టీమ్ పై పోలీస్ కేసు
వారం క్రితం థియేటర్లలో రిలీజైన సినిమాకు వరస షాకులు తగులుతూనే ఉన్నాయి. తొలుత తమిళనాడులో వ్యతిరేకత రాగా.. తర్వాత క్రైస్తవుల నుంచి వచ్చింది. ఇప్పుడు ఏకంగా మూవీ టీమ్ అందరిపై పోలీస్ కేసు(FIR On Jaat Team) నమోదు కావడం చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ అసలేమైంది?తెలుగు దర్శకుడు గోపీచంద్ మలినేనితో మైత్రీ మూవీ మేకర్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు నిర్మించిన లేటెస్ట్ సినిమా 'జాట్'(Jaat Movie). బాలీవుడ్ హీరో సన్నీ డియోల్(Sunny Deol) నటించాడు. టాలీవుడ్ యాక్టర్స్ జగపతిబాబు, రమ్యకృష్ణ, రెజీనా తదితరులు కీలక పాత్రలు పోషించారు.(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 20 సినిమాలు)యావరేజ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాకు వివాదాలు మాత్రం తప్పట్లేదు. తమిళుల హక్కుల కోసం పోరాడిన ఎల్టీటీఈని ఓ ఉగ్రవాద సంస్థగా చూపించారని కొందరు తమిళియన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు చర్చిల కొన్ని సన్నివేశాలు తీయడంపై పలు క్రైస్తవ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. మూవీని బ్యాన్ చేయాలని కోరాయి.ఇప్పుడు మనోభావాలు దెబ్బతీశారని జాట్ మూవీ టీమ్ పై.. పంజాబ్ లోని జలంధర్ లో పోలీస్ కేసు పెట్టారు. వికల్ప్ గోల్డ్ అనే వ్యక్తి చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ చిత్రంలో శిలువను కించపరిచేలా చూపించారని, క్రైస్తవుల పర్వదినాలైన గుడ్‌ప్రైడే, ఈస్టర్ వచ్చే నెలలో ఈ మూవీని ఉద్దేశపూర్వకంగా రిలీజ్ చేశారని వికల్ప్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి విక్రమ్ కొత్త సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్)
న్యూస్ పాడ్‌కాస్ట్
క్రీడలు

అసభ్యకర ఫొటోలు పంపేవారు.. ఆ సీనియర్ క్రికెటర్ కార్లో కూర్చోమంటూ..
టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ బంగర్ బిడ్డ అనయా బంగర్ (Anaya Bangar) సంచలన ఆరోపణలతో వార్తల్లో నిలిచింది. తాను ఆర్యన్ (Aryan Bangar)గా ఉన్నపుడు క్రికెటర్లతో మంచి అనుబంధం ఉండేదని.. అయితే, అనయాగా మారిన తర్వాత కొంత మంది నిజస్వరూపాలు బయటపడ్డాయంటూ విస్మయకర విషయాలు వెల్లడించింది. సీనియర్ ఆటగాడు ఒకరు తనకు అండగా మాట్లాడినట్లు నటించి.. తనతో నిద్రించాలని ఉందంటూ అసభ్యంగా ప్రవర్తించాడని పేర్కొంది.అమ్మాయిగా మారిపోయిన ఆర్యన్కాగా టీమిండియా మాజీ కోచ్ అయిన సంజయ్ బంగర్- కశ్మీర దంపతులకు ఇద్దరు కుమారులు సంతానం. వీరిలో ఆర్యన్ పెద్దవాడు. అతడు కూడా తండ్రి బాటలోనే క్రికెటర్‌గా ఎదగాలనే ఆశయంతో దేశీ టోర్నీల్లో ఆడాడు. కానీ శరీర ధర్మానికి అనుగుణంగా తాను అబ్బాయిని కాదు.. అమ్మాయినని గుర్తించి హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ చేయించుకున్నాడు.తద్వారా అమ్మాయిగా మారిపోయిన ఆర్యన్.. అనయా బంగర్గా కొత్త పేరుతో ముందుకు వచ్చాడు. ప్రస్తుతం అనయా యునైటెడ్ కింగ్డమ్లో జీవిస్తోంది. ఈ క్రమంలో తాజాగా ‘లలన్‌టాప్’నకు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. క్రికెట్ ప్రపంచంలో ఎంతో మంది విషపూరితమైన మగాళ్లు ఉన్నారంటూ అనయా బంగర్ సంచలన విషయాలు వెల్లడించింది.నేను అమ్మాయిని.. అమ్మాయిలాగే ఉండాలి‘‘నాకు అప్పుడు ఎనిమిది- తొమ్మిదేళ్ల వయసు ఉంటుంది. మా అమ్మ కబోర్డ్‌లోని దుస్తులు తీసుకుని వేసుకునే వాడిని. అద్దంలో చూసుకుని మురిసిపోయేవాడిని. అప్పుడే నాకు.. ‘నేను అమ్మాయిని.. అమ్మాయిలాగే ఉండాలి’ అనే కోరిక కలిగింది.దేశీ క్రికెట్లో నేను ముషీర్ ఖాన్, సర్ఫరాజ్ ఖాన్, యశస్వి జైస్వాల్ వంటి ప్రసిద్ధ క్రికెటర్లతో ఆడాను. అప్పుడు నా శరీర ధర్మం గురించి బయటపడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకునేవాడిని.ఎందుకంటే.. నాన్నకు క్రికెటర్‌గా, టీమిండియా కోచ్‌గా గొప్ప పేరుంది. అందుకే నా విషయాన్ని దాచాల్సి వచ్చింది. క్రికెట్ ప్రపంచం మొత్తం అభద్రతాభావం, మగాళ్ల ఆధిపత్యంతో నిండిపోయింది.దుస్తుల్లేకుండా ఫొటోలు పంపేవారునా గురించి తెలిసిన తర్వాత కొంత మంది మంచి మాటలు చెబుతూ అండగా నిలబడ్డారు. మరికొందరు మాత్రం వేధించారు. అప్పుడప్పుడు దుస్తుల్లేకుండా వారి ఫొటోలు నాకు పంపించేవారు.ఓ వ్యక్తి అయితే అందరి ముందు నన్ను తిట్టేవాడు. ఆ తర్వాత నా దగ్గరికి వచ్చి వ్యక్తిగత ఫొటోలు పంపమని అడిగేవాడు. ఇంకో సందర్భంలో ఓ వెటరన్ క్రికెటర్ తన బుద్ధిని బయటపెట్టాడు.పద కార్లో కూర్చో.. నీతో కలిసినా పరిస్థితి గురించి అతడికి చెప్పగానే.. ‘పద కార్లో కూర్చో.. నీతో కలిసి నిద్రించాలని నాకు ఆశగా ఉంది’ అంటూ చెత్త మాటలు మాట్లాడాడు’’ అని అనయా బంగర్ తాను ఎదర్కొన్న చేదు అనుభవాల గురించి పంచుకుంది.చదవండి: ఇలాంటి వికెట్ మీద కష్టమే.. మా వాళ్లు నిర్లక్ష్యంగా ఆడలేదు.. కానీ: కమిన్స్

నీతా అంబానీ దగ్గరికి వెళ్లిన ఇషాన్.. మాజీ ఓనర్ రియాక్షన్ ఇదే!
ఐపీఎల్-2025 (IPL 2025)లో ముంబై ఇండియన్స్- సన్‌రైజర్స్ హైదరాబాద్ (MI vs SRH) మ్యాచ్ సందర్భంగా గురువారం ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. రైజర్స్ స్టార్ బ్యాటర్ ఇషాన్ కిషన్ (Ishan Kishan).. ముంబై జట్టు యజమాని నీతా అంబానీ (Nita Ambani)ని కలిశాడు. ముంబై చేతిలో ఓటమి అనంతరం తన మాజీ ఓనర్ దగ్గరకు వెళ్లి మర్యాదపూర్వకంగా పలకరించాడు.ప్రేమగా చెంప నిమిరిన మాజీ ఓనర్బదులుగా ఇషాన్ కిషన్ చేతిని పట్టుకుని.. తల్లి మాదిరి ప్రేమపూర్వకంగా నీతా అంబానీ అతడి చెంప నిమిరారు. ఓటమికి కుంగిపోవాల్సిన పనిలేదన్నట్లుగా ఇషాన్‌ను ఓదార్చారు. ఇందుకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఈ నేపథ్యంలో లక్నో సూపర్ జెయింట్స్ ఓనర్ సంజీవ్ గోయెంకాపై మీమ్స్ పేలుతున్నాయి. ‘‘తమ జట్టుతో ప్రయాణించిన మాజీ ఆటగాడి పట్ల నీతా తల్లిలా ప్రేమను కురిపిస్తుంటే.. గోయెంకా మాత్రం ఒక్క మ్యాచ్‌లో ఓడినా తమ కెప్టెన్లను అందరి ముందే ఉతికి ఆరేస్తాడు.. ఇదే ఈ ఇద్దరికి ఉన్న తేడా’’ అంటూ ముంబై అభిమానులు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.కాగా 2016లో ఇషాన్ కిషన్ ఐపీఎల్లో అరంగేట్రం చేశాడు. గుజరాత్ లయన్స్ అతడిని రూ. 35 లక్షల కనీస ధరకు కొనుగోలు చేయగా.. రెండేళ్ల పాటు అదే జట్టుకు ఆడి 319 పరుగులు చేశాడు.ముంబైతో సుదీర్ఘ అనుబంధంఅయితే, గుజరాత్ ఫ్రాంఛైజీ ఐపీఎల్ నుంచి కనుమరుగైన తర్వాత ముంబై ఇండియన్స్ ఇషాన్ కిషన్‌ను కొనుగోలు చేసింది. 2018 వేలంలో ఈ ఎడమచేతి వాటం బ్యాటర్‌ను సొంత చేసుకోగా.. రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఆ ఏడాది 500కు పైగా పరుగులు సాధించాడు. అప్పటి నుంచి ఏడేళ్లపాటు ముంబై జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. 2022 వేలంలో అత్యధికంగా రూ. 15.25 కోట్ల ధర పలికాడు.రూ. 11.25 కోట్లకు రైజర్స్‌కు సొంతంఅయితే, మెగా వేలం-2025కి ముందు ముంబై ఇషాన్ కిషన్‌ను వదిలేసింది. ఈ క్రమంలో వేలంపాటలోనూ అతడిని కొనుగోలు చేసేందుకు పెద్దగా ఆసక్తి చూపించలేదు. ఇక అతడి కోసం ఇతర ఫ్రాంఛైజీలతో పోటీ పడి మరీ సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ. 11.25 కోట్లకు ఇషాన్‌ను కొనుక్కుంది. ఇప్పటి వరకు ఐపీఎల్-2025లో విధ్వంసకర శతకం (106 నాటౌట్) బాదడం మినహా ఇషాన్ ఆకట్టుకోలేకపోతున్నాడు. ఏడు మ్యాచ్‌లలో కలిపి అతడు సాధించిన పరుగులు 138. నాలుగు వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ ఓటమిఇక ముంబై- సన్‌రైజర్స్ మధ్య మ్యాచ్ విషయానికొస్తే.. వాంఖడేలో టాస్ గెలిచిన హార్దిక్ పాండ్యా తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ క్రమంలో బ్యాటింగ్ దిగిన కమిన్స్ బృందం.. నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది.లక్ష్య ఛేదనకు దిగిన ముంబై ఆరు వికెట్లు నష్టపోయి 18.1 ఓవర్లలో టార్గెట్‌ను పూర్తి చేసింది. బంతితో, బ్యాట్‌తో రాణించిన ముంబై ఆల్‌రౌండర్ విల్ జాక్స్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఆఫ్ స్పిన్నర్ అయిన జాక్స్ మూడు ఓవర్ల బౌలింగ్‌లో కేవలం 14 పరుగులే ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. ట్రవిస్ హెడ్ (28), ఇషాన్ కిషన్ (2) రూపంలో రెండు కీలక వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక లక్ష్య ఛేదనలో వన్‌డౌన్‌లో వచ్చిన విల్ జాక్స్ 26 బంతుల్లో 36 పరుగులు సాధించాడు.చదవండి: ఇలాంటి వికెట్ మీద కష్టమే.. మా వాళ్లు నిర్లక్ష్యంగా ఆడలేదు.. కానీ: కమిన్స్Applying the finishing touches 🤌🎥 #MI skipper Hardik Pandya gave them the final flourish with a brilliant cameo of 21(9)Scorecard ▶ https://t.co/8baZ67Y5A2#TATAIPL | #MIvSRH | @mipaltan | @hardikpandya7 pic.twitter.com/hPI3CxwzLF— IndianPremierLeague (@IPL) April 17, 2025

ఇలాంటి వికెట్ మీద కష్టమే.. మా వాళ్లు నిర్లక్ష్యంగా ఆడలేదు.. కానీ: కమిన్స్
సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH)కు మరోసారి చేదు అనుభవమే మిగిలింది. ఐపీఎల్-2025 (IPL 2025)లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో కమిన్స్ బృందం నాలుగు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. వాంఖడే స్టేడియంలో గురువారం జరిగిన మ్యాచ్‌లో సమిష్టి వైఫల్యం కారణంగా ఈ సీజన్లో ఐదో పరాజయాన్ని మూటగట్టుకుంది.అంతేకాదు.. ఐపీఎల్ తాజా ఎడిషన్‌లో ఇప్పటి వరకు సొంత మైదానం వెలుపల ఒక్క మ్యాచ్ కూడా గెలవని ఏకైక జట్టుగా నిలిచింది. ఈ నేపథ్యంలో ముంబై చేతిలో ఓటమి అనంతరం సన్‌రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ (Pat Cummins)తీవ్ర విచారం వ్యక్తం చేశాడు.ఇలాంటి వికెట్ మీద కష్టమే..‘‘వాంఖడే వికెట్‌పై పరుగులు రాబట్టడానికి కష్టపడాల్సి వచ్చింది. బ్యాటింగ్‌కు వచ్చినప్పుడు సులువుగానే రన్స్ చేయొచ్చనే అనిపించింది. కానీ అనూహ్యంగా పిచ్ పరిస్థితి అందుకు భిన్నంగా మారిపోయింది. ఏదేమైనా వాళ్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు.ఎక్కడిక్కడ మమ్మల్ని కట్టడి చేశారు. మేము కూడా బాగానే బ్యాటింగ్ చేశాం. ఇలాంటి వికెట్ మీద 160 అనేది మెరుగైన స్కోరే. కానీ మేము ఇంకాస్త బెటర్‌గా బ్యాటింగ్ చేయాల్సింది. ఈరోజు మా వాళ్లు పవర్‌ప్లేలో ఎలాంటి తొందరపాటు చర్యలకు పోలేదు.మా వాళ్లు నిర్లక్ష్యంగా ఆడలేదు.. కానీనిర్లక్ష్య రీతిలో హిట్టింగ్ కూడా ఆడలేదు. కానీ ఇలా జరిగిపోయింది. మేము ఇంకొన్ని పరుగులు చేసి ఉంటే ఫలితం వేరేలా ఉండేదేమో!.. ఇక మా బౌలింగ్ విషయానికొస్తే డెత్ ఓవర్లలో మా ప్రదర్శన పర్వాలేదనిపించింది.ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన బౌలర్‌తో 1-2 ఓవర్లు మాత్రమే వేయించగలము అనిపించింది. అందుకే రాహుల్ చహర్‌ను తీసుకువచ్చాం. ఫైనల్‌కు చేరుకోవాలంటే హోం గ్రౌండ్ వెలుపల ఎక్కువగా మ్యాచ్‌లు గెలవాల్సి ఉంటుంది.కానీ దురదృష్టవశాత్తూ ఈ సీజన్లో మేము ఇంత వరకు ఇతర వేదికలపై ఒక్క మ్యాచ్ కూడా గెలవలేకపోయాం. పొరపాట్లను సమీక్షించుకుని సానుకూలంగా ముందుకు వెళ్తాం. తదుపరి మా సొంత మైదానంలో మ్యాచ్ ఆడబోతున్నాం. మాకు అక్కడి పరిస్థితులపై పూర్తి అవగాహన ఉంది కాబట్టి.. అనుకున్న ఫలితం రాబట్టగలమని నమ్ముతున్నాం’’ అని ప్యాట్ కమిన్స్ పేర్కొన్నాడు.శైలికి భిన్నంగాకాగా వాంఖడే వేదికగా టాస్ ఓడిన సన్‌రైజర్స్ తొలుత బ్యాటింగ్ చేసింది. దూకుడైన తమ శైలికి భిన్నంగా రైజర్స్ ఓపెనర్లు అభిషేక్ శర్మ (28 బంతుల్లో 40), ట్రవిస్ హెడ్ (29 బంతుల్లో 28) నెమ్మదిగా ఆడారు. ఇషాన్ కిషన్ (2), నితీశ్ రెడ్డి (21 బంతుల్లో 19) పూర్తిగా విఫలం కాగా.. క్లాసెన్ (28 బంతుల్లో 37) ఫర్వాలేదనిపించాడు.ఆఖర్లో అనికేత్ వర్మ (8 బంతుల్లో 18 నాటౌట్), కమిన్స్ (4 బంతుల్లో 8 నాటౌట్) కాస్త వేగంగా ఆడగా.. 20 ఓవర్లు పూర్తయ్యేసరికి రైజర్స్ ఐదు వికెట్ల నష్టానికి 162 పరుగులు చేయగలిగింది. ముంబై బౌలర్లలో బుమ్రా, కెప్టెన్ హార్దిక్ పాండ్యా చెరో వికెట్ తీయగా.. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ విల్ జాక్స్ రెండు వికెట్లు కూల్చాడు.పాండ్యా మెరుపులుఇక లక్ష్య ఛేదనకు దిగిన ముంబై ఆరు వికెట్లు కోల్పోయి 18.1 ఓవర్లలోనే పని పూర్తి చేసింది. ఓపెనర్లు రియాన్ రికెల్టన్ (31), రోహిత్ శర్మ (26) ఫర్వాలేదనిపించగా.. విల్ జాక్స్ (36), సూర్యకుమార్ యాదవ్ (26), తిలక్ వర్మ (17 బంతుల్లో 21 నాటౌట్) రాణించారు. హార్దిక్ పాండ్యా కెప్టెన్ ఇన్నింగ్స్ (9 బంతుల్లో 21)తొ మెరిసి ముంబై విజయంలో కీలక పాత్ర పోషించాడు. రైజర్స్ కెప్టెన్ కమిన్స్‌కు మూడు, ఇషాన్ మలింగకు రెండు, హర్షల్ పటేల్‌కు ఒక వికెట్ దక్కాయి. చదవండి: అభిషేక్ శర్మ, నితీశ్ కుమార్‌కు జాక్ పాట్..?Applying the finishing touches 🤌🎥 #MI skipper Hardik Pandya gave them the final flourish with a brilliant cameo of 21(9)Scorecard ▶ https://t.co/8baZ67Y5A2#TATAIPL | #MIvSRH | @mipaltan | @hardikpandya7 pic.twitter.com/hPI3CxwzLF— IndianPremierLeague (@IPL) April 17, 2025

స్వర్ణంతో శుభారంభం
న్యూఢిల్లీ: భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా 2025 సీజన్‌ను స్వర్ణ పతకంతో శుభారంభం చేశాడు. దక్షిణాఫ్రికాలో జరిగిన పాచెఫ్్రస్టూమ్ ఇన్విటేషనల్ ట్రాక్ ఈవెంట్లో 27 ఏళ్ల నీరజ్ చోప్రా విజేతగా నిలిచాడు. ఆరుగురు పోటీపడ్డ ఈ ఈవెంట్లో నీరజ్ జావెలిన్‌ను 84.52 మీటర్ల దూరం విసిరి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. డూ స్మిట్ (దక్షిణాఫ్రికా; 82.44 మీటర్లు) రజతం, డంకన్ రాబర్ట్సన్ (దక్షిణాఫ్రికా; 71.22 మీటర్లు) కాంస్యం సాధించారు. నీరజ్ పాల్గొన్న ఈ మీట్‌కు వరల్డ్ అథ్లెటిక్స్ కాంటినెంటల్ టూర్ చాలెంజర్ ఈవెంట్‌గా గుర్తింపు ఉంది. దిగ్గజం జాన్ జెలెజ్నిను కొత్త కోచ్‌గా నియమించుకున్నాక నీరజ్ పోటీపడ్డ తొలి టోర్నీలో టాప్ ర్యాంక్‌లో నిలువడం విశేషం. నీరజ్ తదుపరి మే 16వ తేదీన జరిగే దోహా డైమండ్ లీగ్ మీట్లో, ఆ తర్వాత మే 24న పంచ్కులాలో జరిగే నీరజ్ చోప్రా క్లాసిక్ జావెలిన్ త్రో టోర్నీలో పోటీపడతాడు. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం నెగ్గి చరిత్ర సృష్టించిన నీరజ్... 2024 పారిస్ ఒలింపిక్స్‌లో రజత పతకం కైవసం చేసుకున్నాడు. 2022 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రజతం సొంతం చేసుకున్న నీరజ్... 2023 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో విశ్వవిజేతగా అవతరించాడు.
బిజినెస్

40+ ఉద్యోగులను టీసీఎస్ టార్గెట్ చేసిందా?
లేఆఫ్‌లలో అమెరికన్ ఉద్యోగుల పట్ల వివిక్ష చూపుతోందంటూ వచ్చిన ఆరోపణలను భారత్‌కు చెందిన ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) ఖండించింది. ఈ ఆరోపణలు సంస్థ "నిరాధారమైనవి, తప్పుడు అభిప్రాయాలు" అని పేర్కొంది. తమది అందరికీ సమాన అవకాశాలు కల్పించే సంస్థ అని, సమగ్రతలో గొప్ప రికార్డ్‌ను కలిగి ఉందని టీసీఎస్ వివరించింది.40 ఏళ్లకు పైబడిన, దక్షిణ ఆసియన్లు కాని తమను లక్ష్యంగా చేసుకుని ఉద్యోగాల నుంచి టీసీఎస్ తొలగించిందని, కానీ H-1B వీసాలపై ఉన్న భారతీయ ఉద్యోగులను మాత్రం కొనసాగించిందని కొందరు మాజీ ఉద్యోగులు ఆరోపించారు. 2023 చివర నుండి ఇలాంటి ఆరోపణలు వస్తుండటంతో యూఎస్ ఈక్వల్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ కమిషన్ (EEOC) దీనిపై విచారణ చేపట్టింది. యుకేలో కూడా ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పటికీ, టీసీఎస్ దానిని కూడా ఖండించింది.టీసీఎస్‌పై వచ్చిన ఆరోపణలు ఇతర ఐటీ సంస్థల ఉద్యోగ విధానాలపైనా ప్రభావం చూపవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. టీసీఎస్‌పై వచ్చిన ఆరోపణలు ఎలా ఉన్నా నేటి కార్పొరేట్ వాతావరణంలో నలభైలలో ఉన్న ఉద్యోగులే తొలగింపులకు తొలి లక్ష్యంగా మారుతున్నారని బాంబే షేవింగ్ కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈఓ శంతను దేశ్ పాండే కూడా ఇటీవల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.పిల్లల చదువులు, వృద్ధులైన తల్లిదండ్రుల బాధ్యతలు, ఇంటి కోసం చేసిన అప్పుల ఈఎంఐలు ఇలా సవా లక్ష ఆర్థిక భారాలను నలభైలలోకి అడుగుపెట్టిన ఉద్యోగులు మోస్తున్నారని దేశ్‌పాండే ఇటీవలి సోషల్ మీడియా పోస్ట్‌లో పేర్కొన్నారు. ఇంతటి సమస్యలతో నెట్టుకొస్తున్న వీరినే కంపెనీలు టార్గెట్ చేస్తున్నాయని విచారం వ్యక్తం చేశారు. పునర్వ్యవస్థీకరణ, సిబ్బంది కుదింపు సందర్భాల్లో మొదట నలభైలలోని ఉద్యోగులనే తొలగించి ఇంటికి పంపిస్తున్నాయని అప్రమత్తం చేశారు.ఈ వయస్సులో ఉద్యోగం కోల్పోవడం ఆర్థికంగా, మానసికంగా తీవ్ర అస్థిరతకు గురిచేస్తుందని దేశ్ పాండే హెచ్చరించారు. ఒకవేళ ఇలాంటి పరిస్థితి ఎదురైనా తట్టుకుని నిలబడేందుకు మూడు కీలకమైన మనుగడ వ్యూహాలను ఆయన అందించారు. కృత్రిమ మేధపై నైపుణ్యాన్ని పెంచుకోవాలని, పొదుపు ఎక్కువగా చేయాలని, వ్యవస్థాపక మనస్తత్వాన్ని అలవరచుకోవాలని సూచించారు.

ఫెడ్ ఛైర్మన్‌ను తొలగిస్తామని ట్రంప్ హెచ్చరిక
అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఛైర్మన్ జెరోమ్ పావెల్ తొలగింపు త్వరగా జరగకూడదని భావిస్తున్నట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరోక్షంగా హెచ్చరించారు. పావెల్ పనితీరుపట్ల ట్రంప్ మండిపడ్డారు. ఇతర సెంట్రల్ బ్యాంకులు వడ్డీరేట్లను తగ్గిస్తున్నా తాను అనుకున్న విధంగా అమెరికా వేగంగా వాటిని తగ్గించడంలేదని అభిప్రాయపడ్డారు.తీవ్ర అనిశ్చితి పరిస్థితుల నేపథ్యంలో అమెరికా ఆర్థిక వ్యవస్థ మందగమనంలోకి అడుగుపెట్టొచ్చని ఫెడరల్ రిజర్వ్ ఛైర్మన్ జెరోమ్ పావెల్ ఇటీవల ఓ సమావేశంలో తెలిపారు. వినియోగదారుల వ్యయంలో మందగమనం సంభవించే అవకాశముందని, ముఖ్యంగా ఆర్థిక పరిస్థితులపై తీవ్ర అనిశ్చితి కొనసాగుతోందని వ్యాపార వర్గాల్లో అంచనాలు నెలకొన్న సమయంలో ఫెడ్ ఛైర్మన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ ప్రభుత్వ విధానాలు ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపుతాయో అన్న అంశంపై స్పష్టత వచ్చే వరకు ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గించడంలో ఏ మాత్రం తొందరపడబోమని పావెల్ స్పష్టం చేశారు. కానీ ట్రంప్ త్వరగా వడ్డీరేట్ల కోతను కోరుకుంటున్నారు.ఇదీ చదవండి: గ్రిడ్ స్థిరీకరణకు స్టోరేజ్ సిస్టమ్ఇమిగ్రేషన్, టాక్సేషన్, నియంత్రణలు, టారిఫ్ వంటి విధానపరమైన మార్పుల వల్ల ఆర్థిక వ్యవస్థపై కలిగే ప్రభావంపట్ల ఫెడరల్ రిజర్వ్ స్పష్టత కోరుతోందని పావెల్ పేర్కొన్న మరుసటి రోజే ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ (ఈసీబీ) ఎప్పుడో రేట్లు తగ్గించిందని ట్రంప్ అన్నారు. ఇకనైనా పావెల్ రేట్ల కోతకు పూనుకోవాలని సూచించారు. ఫెడరల్ రిజర్వ్ ఛైర్మన్‌గా జెరోమ్ పావెల్ తొలగింపు త్వరగా జరగకూడదని భావిస్తున్నట్లు ట్రంప్ పరోక్షంగా హెచ్చరించారు. పావెల్ పదవీ కాలం 2026 చివరి వరకు ఉంది. ఆయనను 2017లో ట్రంప్ ప్రతిపాదించారు. తర్వాత 2022లో బైడెన్ మరో నాలుగేళ్ల పాటు ఫెడ్ ఛైర్మన్‌గా కొనసాగించారు.

భారత జాబ్ మార్కెట్ భేష్
న్యూఢిల్లీ: అంతర్జాతీయ అనిశ్చితుల్లోనూ భారత ఉద్యోగ మార్కెట్ బలంగా నిలబడిందని.. పలు రంగాల్లో నియామకాలు మెరుగ్గా సాగాయని మైఖేల్ పేజ్ ఇండియా (అంతర్జాతీయ నియామకాల సంస్థ) ఎండీ నిలయ్ ఖండేల్వాల్ తెలిపారు. సాంకేతిక నైపుణ్యాల్లో లోతైన అనుభవం, వ్యయ నియంత్రణలు, సిబ్బంది కొత్త నైపుణ్యాలను వేగంగా అలవరుచుకోవడాన్ని భారత్ బలాలుగా పేర్కొన్నారు.ఆర్థిక వృద్ధి మందగమనంతో అంతర్జాతీయంగా కొన్ని ప్రాంతాల్లో నియామకాల పట్ల అప్రమత్త ధోరణి నెలకొనగా.. భారత్‌లో మాత్రం నిపుణులకు డిమాండ్ ఉన్నట్టు చెప్పారు. ముఖ్యంగా టెక్నాలజీ, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్లో ఈ పరిస్థితి ఉన్నట్టు తెలిపారు. స్టెమ్ విభాగంలో (సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్) ఆధిపత్యంతో భారత్ నైపుణ్య కేంద్రంగా కొనసాగుతోందని.. పోటీతో కూడిన వేతనాలు, ప్రభుత్వ మద్దతుతో నైపుణ్యాల కల్పన, అంతర్జాతీయ క్యాపబులిటీ కేంద్రాల (జీసీసీలు) విస్తరణ ఇందుకు మద్దతుగా నిలుస్తున్నట్టు పేర్కొన్నారు.జీసీసీలు ఏఐ, ఆటోమేషన్, ఆర్అండ్డీపై దృష్టి సారించడం వల్ల ఆవిష్కరణలకు భారత్ కీలక కేంద్రంగా మారినట్టు చెప్పారు. స్కిల్ ఇండియా, ఏఐ ఆధారిత నైపుణ్యాల అభివృద్ధి నిపుణులకు ఉపాధి అవకాశాలను పెంచుతాయన్నారు. భారత్ తన ఆధిపత్యాన్ని కొనసాగించాలంటే, నైపుణ్యాల అభివృద్ధిని వేగవంతం చేయాలంటూ.. ఏఐ, సెమీకండక్టర్ పరిశ్రమల్లో అధిక నైపుణ్య మానవ వనరుల అవసరం ఉంటుందని సూచించారు.ఉద్యోగం–వ్యక్తిగత జీవితానికి ప్రాధాన్యం పెరుగుతున్నందున ఉత్పాదకత ఆధారిత పని నమూనాలపై కంపెనీలు దృష్టి సారించాల్సి ఉంటుందన్నారు. ఈవై జీసీసీ సర్వే, 2024ను ఉదహరిస్తూ.. అంతర్జాతీయ సంస్థల్లో 50 శాతం భారత్‌లో తమ జీసీసీ కార్యకలాపాలను విస్తరించాలని చూస్తున్నట్టు తెలిపారు.

హ్యాట్రిక్ కొట్టిన బంగారం.. తులం ఎంతకు చేరిందంటే..
దేశంలో బంగారం ధరలు (Gold Prices) గత కొన్ని వారాలుగా హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు, డాలర్‌తో రూపాయి మారకం రేటు, స్థానిక డిమాండ్ వంటి అంశాలు ఈ ధరలపై ప్రభావం చూపుతున్నాయి. ఏప్రిల్ 28 నాటికి దేశంలోని ప్రధాన నగరాల్లో 24 క్యారెట్, 22 క్యారెట్ బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి..తెలుగు రాష్ట్రాల్లో..- 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.97,580- 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.89,450హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో బంగారం ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ, స్థానిక జ్యువెలరీ షాపుల్లో మేకింగ్ ఛార్జీలు,జీఎస్టీ కారణంగా కొంత వ్యత్యాసం కనిపిస్తుంది. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు వరుసగా రూ.250, రూ.270 చొప్పున ఎగిశాయి.చెన్నైలో..- 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.97,580- 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.89,450చెన్నైలో బంగారం ధరలు ఇతర నగరాలతో పోలిస్తే కొంచెం ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ పోర్ట్ సౌకర్యాలు, డిమాండ్ ఈ ధరలను ప్రభావితం చేస్తున్నాయి. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు వరుసగా రూ.250, రూ.270 చొప్పున ఎగిశాయి.ఢిల్లీలో.. - 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.97,730- 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.89,600ఢిల్లీలో బంగారం ధరలు రవాణా ఖర్చులు, స్థానిక ట్యాక్స్‌ల కారణంగా కొంత ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ నగరంలో బంగారం కొనుగోలుదారులు హాల్‌మార్క్ ఆభరణాలపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు వరుసగా రూ.250, రూ.270 చొప్పున పెరిగాయి.ముంబైలో..- 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.97,580- 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.89,450ముంబైలో బంగారం ధరలు స్థానిక డిమాండ్, జ్యువెలరీ డిజైన్లపై ఆధారపడి మారుతూ ఉంటాయి. ఈ నగరంలో బంగారం కొనుగోలు చేసే ముందు పలు జ్యువెలరీ షాపుల ధరలను సరిపోల్చడం మంచిది. నిన్నటితో పోలిస్తే ఇక్కడ ధరలు వరుసగా రూ.250, రూ.270 చొప్పున ఎగిశాయి.బెంగళూరులో..- 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.97,580- 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.89,450బెంగళూరులో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి, కానీ స్థానిక ఆర్థిక పరిస్థితులు, ఫెస్టివల్ సీజన్ డిమాండ్ ఈ ధరలను ప్రభావితం చేయవచ్చు. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు వరుసగా రూ.250, రూ.270 చొప్పున పెరుగుదలను నమోదు చేశాయి.బంగారం ధరలపై ప్రభావం చూపే అంశాలు అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు ప్రస్తుతం ట్రాయ్ ఔన్స్‌కు 3,340 డాలర్ల వద్ద ఉన్నాయని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ తెలిపింది. భారత రూపాయి విలువ, దిగుమతి సుంకాలు, స్థానిక ట్యాక్స్‌లు, రవాణా ఖర్చులు ధరలలో వ్యత్యాసాలకు కారణమవుతున్నాయి. అదనంగా, భారతదేశంలో వివాహ సీజన్, పండుగల సమయంలో బంగారం డిమాండ్ పెరగడం వల్ల ధరలు కొంత పెరిగే అవకాశం ఉంది.నిపుణులు ఏం చెబుతున్నారంటే..బంగారం కొనుగోలు చేసే ముందు, హాల్‌మార్క్ సర్టిఫికేషన్‌ను తప్పనిసరిగా తనిఖీ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) హాల్‌మార్క్ బంగారం యొక్క స్వచ్ఛతను నిర్ధారిస్తుంది. అలాగే, వివిధ జ్యువెలరీ షాపుల్లో ధరలు మరియు మేకింగ్ ఛార్జీలను సరిపోల్చడం ద్వారా మంచి డీల్ పొందవచ్చు.బంగారం ధరలు రాబోయే రోజుల్లో రూ.1,00,000 (10 గ్రాముల 24 క్యారెట్) మార్కును తాకే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కాబట్టి, బంగారంలో పెట్టుబడి పెట్టాలనుకునే వారు ప్రస్తుత ధరలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకోవాలి.👉ఇది చదివారా? మహిళలకు ప్రత్యేక బీమా పాలసీలువెండి ధరలుదేశవ్యాప్తంగా వెండి ధరల్లో మాత్రం నేడు స్వల్ప తగ్గుదల నమోదైంది. క్రితం రోజుతో పోలిస్తే కేజీకి రూ.100 మేర వెండి ధర క్షీణించింది. ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి కేజీ రూ.1,09,900 వద్ద ఉండగా ఢిల్లీలో రూ. 99,900 వద్ద కొనసాగుతోంది.(గమనిక: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి)
ఫ్యామిలీ

World Heritage Day: చరిత్రలో ఈ రోజు..!
ప్రపంచ మానువులంతా ఒక్కేటనన్న భావన పెంపొందించేలా వివిధ దేశాలూ, ప్రాంతాల్లోని వారసత్వ చిహ్నలను పరిరక్షించడానికి యునెస్కో శ్రమిస్తోంది. వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యతను ప్రభుత్వాలను, ప్రజలకు తెలియజేసేలా గుర్తుచేస్తోంది. ఇవాళ ప్రపంచ వారసత్వ దినోత్సవం(world Heritage Day). ప్రతి ఏటా ఏప్రిల్ 18న నిర్వహిస్తారు. దీన్నే ఇంటర్నేషనల్ డే ఫర్ మాన్యుమెంట్స అండ్ సైట్స్ అని కూడా పిలుస్తారు. ప్రపంచంలోని వారసత్వ ప్రదేశాలను గుర్తించి వాటి ప్రాముఖ్యతను చెప్పి, భవిష్యత్తు తరాల కోసం వాటిని రక్షించాల్సిన అవసరంపై ప్రజల్లో అవగాహన కల్పించడం ఈ రోజు ముఖ్యోద్దేశం.చారిత్రక నేపథ్యం: ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఫర్ మాన్యుమెంట్స్ అండ్ సైట్స్(ఐసీఓఎంఓఎస్)సంస్థ 1982 ఏప్రిల్ 18న మొదటిసారి ఈ దినోత్సవాన్ని ప్రతిపాదించింది. 1983లో యునెస్కో ఇదే తేదీన ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని నిర్వహించాలని తీర్మానించింది.భారతదేశం గొప సాంస్కృతిక వారసత్వానికి నిలయం. అవి మన సంస్కృతి, చరిత్రలో ముఖ్యభాగం. వాటిని కాపాడం మనందరి బాధ్యత. ఐక్యరాజ్య సమితి విద్యా శాస్త్రీయ సాంస్కృతిక సంస్థ(యునెస్కో) వారసత్వ ప్రదేశాలను సాంస్కృతిక, సహజ, మిశ్రమ అనే వర్గాలుగా విభజించింది. 2024 జులై నాటికి 168 దేశాల్లో మొత్తం 1223 హెరిటేజ్ స్టేల్స్ ఉన్నాయి. మన దేశంలో వాటి సంఖ్య 43 ఉన్నాయి. అయితే ఇందులో 35 సాంస్కృతిక ప్రాముఖ్యతను తెలుపుతుండగా, ఏడు సహజ సౌందర్యానికి ప్రతీకగాఉన్నాయి. మిగిలింది మిశ్రమ సంస్కృతి ఇందులో సిక్కింలోని కాంచన్‌జంగ్ జాతీయ ఉద్యానవనం చోటు దక్కించుకుంది.ఆ జాబితాలో మనవి..మొట్టమొదటిసారిగా 1983లలో మహారాష్ట్ర ఎల్లోరా గుహలు, ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా కోట, తాజ్‌మహల్ ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో చోటు దక్కించుకున్నాయి. 2024లో అహోమ రాజవంశీకులు అసోంలోని నిర్మించిన సమాధులు కూడా ఇందులోకి చేరాయి. అంతేగాదు ఈశాన్య భారతదేశం నుంచి ఈ జాబితాలో చేరిన తొలి వారసత్వ సంపద ఇదే. ఇక మన తెలుగువారంతా గర్వించేలా తెలంగాణ నుంచి రామప్ప దేవాలయం కూడా ఈ జాబితాలో చేరడం విశేషం.ఏవేవి ఉన్నాయంటే..ఫతేపూర్ సిక్రి, భీంబేట్కాలోని రాతి ఆవాసాలు, చంపానేర్- పావగఢ్ ఆర్కియోలాజికల్ పార్క్, సాంచీ బౌద్ధ కట్టడాలు, కుతుబ్‌మినార్, డార్జిలింగ్ పర్వత రైల్వే, ముంబైలోని ఛత్రపతి శివాజీ టెర్మినస్, ఢిల్లీలోని ఎర్రకోట, జైపుర్‌లోని జంతర్‌మంతర్, రాజస్థాన్ గిరి దుర్గాలు, నలందాలోని నలందా మహావిహార, పటన్‌లోని రాణీకీ వావ్, చండీగఢ్‌లోని లే కార్బుజియర్ నిర్మించిన వాస్తు కట్టడాలు, అహ్మదాబాద్ చారిత్రక నగరం, ముంబైలోని విక్టోరియన్ గోథిక్, కళాత్మక నిర్మాణాలు, ధోలావీరా-హరప్పా నగరం, అస్సాంలోని మియోడమ్స్.మహాబలిపురం, హంపీ స్మారక చిహ్నాలు.కజిరంగా, కియోలాదేవ్, సుందరబన్ జాతీయ ఉద్యాన వనాలు, మానస్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం, నందాదేవి పువ్వుల లోయ జాతీయ ఉద్యానాలు, హిమాలయాల్లోని నేషనల్ పార్కు కన్జర్వేషన్ ఏరియా, కాంచన్‌జంగ్ జాతీయ ఉద్యానం, శాంతినికేతన్, పశ్చిమ కనుమలు.కోణార్క్ సూర్య దేవాలయం, తమిళనాడులోని గంగైకొండ చోళపురం, తంజావూరులోని బృహదీశ్వరాలయం, దారాసురంలోని ఐరావతేశ్వర ఆలయం, పట్టదకల్ దేవాలయాలు, ఖజురహో దేవాలయం, బోధ్ గయలోని మహాబోధి ఆలయం, బేలూరు చెన్నకేశవ, హలెబీడు-హోయసలేశ్వర, సోమనాథ్‌పూర్ కేశవ(హోయసల) దేవాలయాలు, గోవాలో చర్చిలు, కాన్వెంట్లు.(చదవండి: సూర్యుడి భగభగలు పెరిగిపోవచ్చు తస్మాత్ జాగ్రత్త..! ఆహారం, పానీయాలపై శ్రద్ధ పట్టాల్సిందే..!)

గంటల్లోనే వణుకుడు వ్యాధి మాయం..!
చేతులు, కాళ్లు విపరీతంగా వణికిపోతూ.. మనమీద మనకే నియంత్రణ లేకుండా చేసే దారుణమైన సమస్య ..పార్కిన్సన్స్ డిసీజ్. దాదాపు ఏడాది క్రితం వరకు దీనికి డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అనే ఒక శస్త్రచికిత్స మాత్రమే ఉండేది. కానీ వైద్య పరిజ్ఞానం అభివృద్ధి చెందడంతో ఇప్పుడు ఓ సరికొత్త చికిత్స వచ్చింది. అదే.. ఎంఆర్ గైడెడ్ ఫోకస్డ్ అల్ట్రాసౌండ్ (ఎంఆర్జీఎఫ్యూఎస్). దీని సాయంతో.. కేవలం మూడు నుంచి నాలుగు గంటల్లోనే వణుకుడు సమస్య పూర్తిగా మటుమాయం అయిపోతుందని కిమ్స్ ఆస్పత్రికి చెందిన వైద్య ప్రముఖులు చెబుతున్నారు. పార్కిన్సన్స్ వ్యాధి బాధితులు, వారి కుటుంబసభ్యులకు ఈ సమస్య, దాని లక్షణాలు, ఉన్న చికిత్స అవకాశాల గురించి ఒక అవగాహన కార్యక్రమాన్ని కిమ్స్ హాస్పిటల్స్‌లోని మూవ్మెంట్ డిజార్డర్స్ బృందం డాక్టర్ మానస్, డాక్టర్ జయశ్రీ, డాక్టర్ గోపాల్ మూవ్మెంట్ డిజార్డర్ బృందం ఆధర్యంలో గురువారం నిర్వహించారు. సుమారు 150 మంది రోగులు, వారి కుటుంబసభ్యులు ఈ కార్యక్రమానికి హాజరై.. తమ అనుమానాలు నివృత్తి చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో న్యూరోసర్జరీ విభాగాధిపతి, చీఫ్ న్యూరోసర్జన్ డాక్టర్ మానస్ కుమార్ పాణిగ్రాహి మాట్లాడుతు.. “పార్కిన్సన్స్ డిసీజ్ అనేది మనిషిని పూర్తిగా కుంగదీసే సమస్య. దీనివల్ల వచ్చే శారీరక సమస్యలతో పాటు.. అవి ఉన్నాయన్న బాధ వల్ల వచ్చే మానసిక సమస్యలు కూడా ఎక్కువే. ఇంతకాలం మందులు, డీబీఎస్ లాంటి శస్త్రచికిత్సలు మాత్రమే దీనికి పరిష్కారంగా ఉండేవి. ఇప్పుడు చిన్న కోత కూడా అవసరం లేకుండా కేవలం ఎంఆర్ఐ యంత్రానికి మరో ఫోకస్డ్ అల్ట్రాసౌండ్ యంత్రాన్ని అమర్చి మూడు నాలుగు గంటల పాటు చికిత్స చేస్తాం. ఇది పూర్తయ్యి రోగి బయటకు రాగానే ఒకవైపు ఉన్న సమస్య పూర్తిగా నయం అయిపోతుంది. అప్పటివరకు ఉన్న వణుకు మటుమాయం అవుతుంది. పైగా ఈ ప్రక్రియ చేసేటప్పుడే వణుకు తగ్గిందా లేదా అని చూసుకుంటూ ఉంటాం కాబట్టి... పూర్తిగా తగ్గిన తర్వాతే చికిత్స పూర్తవుతుంది. అంతేకాదు గతంలో డీబీఎస్ లాంటి శస్త్రచికిత్సలకు ఎంత వ్యయం అయ్యేదో.. దాదాపుగా దీనికి కూడా అంతే అవుతుంది. వణుకు ప్రాథమిక దశలో ఉన్నవారి నుంచి బాగా తీవ్రంగా ఉన్నవారి వరకు ఎవరైనా ఈ చికిత్స చేయించుకోవచ్చు. వారికి ఒక చిన్న పరీక్ష చేసి, ఈ చికిత్స వారికి సరిపోతుందో లేదో నిర్ణయిస్తాం. ఆ తర్వాత చికిత్స చేయించుకుని.. హాయిగా ఎవరి సాయం లేకుండా ఒక్కరే నడుచుకుంటూ వెళ్లిపోవచ్చు” అని తెలిపారు.ఈ కార్యక్రమానికి నిర్వాహక కార్యదర్శిగా వ్యవహరించిన కిమ్స్ ఆస్పత్రి కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, మూమెంట్ డిజార్డర్ స్పెషలిస్ట్ డాక్టర్ ఎం జయశ్రీ మాట్లాడుతూ, “ఎంఆర్జీ ఎఫ్యూఎస్ అనేది చాలా అత్యాధునికమైన చికిత్స. ఇప్పటికే కిమ్స్ ఆస్పత్రిలో ఎనిమిది మంది రోగులకు దీని సాయంతో చికిత్స చేసి సత్పఫలితాలు సాధించాం. ఇందులో ఎలాంటి కోత అవసరం లేకుండా ఎంఆర్ఐతోనే అల్ట్రాసౌండ్ తరంగాలను పంపుతారు. పార్కిన్సన్స్ వ్యాధి వల్ల మెదడులో ప్రభావితమైన ప్రాంతాలను ఎంఆర్ఐ ద్వారా గుర్తించి, వెంటనే చికిత్స చేసేటప్పుడు ముందుగా తక్కువ హీట్‌తో టెంపరెరీ థర్మోఅబ్లేషన్న్ చేసి వణుకు తగ్గిందా లేదా అని చూస్తాం. తర్వాత ఎక్కువ హీట్ తో పర్మినెంట్ థర్మోఅబ్లేషన్ ద్వారా పూర్తి చికిత్స చేయడం జరుగుతుంది. అలా చేస్తుడంగానే వణుకు పూర్తిగా తగ్గిపోతుంది. సాధారణంగా పార్కిన్సన్స్ రోగులకు ఒకవైపే (కుడి లేదా ఎడమ) సమస్య తీవ్రంగా ఉంటుంది. వ్యాధి త్రీవత ఎక్కువ ఉన్న వైపు చికిత్స చేయడం వల్ల వారికి ఎక్కువ ప్రయోజనం కనిపిస్తుంది. ఈ మొత్తం చికిత్సకు సుమారు 3-4 గంటల సమయం పడుతుంది. ఫలితాలు మాత్రం వెంటనే కనిపిస్తాయి."ఓ కేసులో 28 ఏళ్ల యువకుడు, ఇంకా పెళ్లి కూడా కాలేదు. టీచర్ అవుదామనుకుంటే ఆ ఉద్యోగం కూడా రాలేదు. చికిత్స పొందిన తర్వాత ఇప్పుడు హాయిగా టీచర్ ఉద్యోగం చేసుకుంటున్నాడు, చాలామందికి సాయపడుతున్నాడు. అలాంటి నాణ్యమైన జీవితాన్ని అందరికీ ఇవ్వాలని కిమ్స్ తహతహలాడుతుంటుంది. కిమ్స్ ఆస్పత్రిలోని న్యూరాలజీ బృందం అత్యుత్తమ సేవలు అందిస్తోంది. అందుకు వారికి అభినందనలు” అని కిమ్స్ ఆస్పత్రి సీఎండీ డాక్టర్ బొల్లినేని భాస్కరరావు తెలిపారు.చీఫ్ కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ డాక్టర్ ఎస్. మోహన్ దాస్, కన్సల్టెంట్ న్యూరాలజిస్టులు డాక్టర్. సీతా జయలక్ష్మి, డాక్టర్ ఈఏ వరలక్ష్మి, డాక్టర్ ప్రవీణ్ కుమార్ యాడా, సీనియర్ కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ డాక్టర్ సుభాష్ కౌల్, మెడికల్ డైరెక్టర్ డాక్టర్ సంబిత్ సాహు, కన్సల్టెంట్ న్యూరోసర్జన్ డాక్టర్ గోపాలకృష్ణ తదితరులు మాట్లాడారు. “సాధారణంగా పార్కిన్సన్స్ వ్యాధిలో రెండు రకాల సమస్యలు ఉంటాయి. అవి మోటార్, నాన్ మోటార్. మోటార్ సమస్యలు అంటే కదలికలకు సంబంధించినవి. వణుకు, గట్టిగా అయిపోవడం, నెమ్మదించడం లాంటివి ఇందులో ప్రధానంగా ఉంటాయి. చేతులు, కాళ్లు విపరీతంగా వణుకుతుంటాయి. ఏవీ పట్టుకోలేరు, సరిగా నడవలేరు. నడకమీద నియంత్రణ ఉండదు. ఐదు నిమిషాల్లో అయిపోయే పనికి 20 నిమిషాలు పడుతుంది. ముఖంలో కదలికలు తగ్గిపోతాయి. ఇక నాన్ మోటార్ సమస్యల్లో నిద్ర లేకపోవడం, మూత్రవిసర్జనపై నియంత్రణ లేకపోవడం, మలబద్ధకం, మానసిక సమస్యలు, వాసన లేకపోవడం లాంటి వాటితో పాటు.. శరీరం బ్యాలెన్స్ లేకపోవడం వల్ల తరచు పడిపోయి గాయపడతారు. ఈ సమస్యల వల్ల వాళ్లు నలుగురితో కలవలేక ఒంటరిగా మిగిలిపోతారు. పెళ్లిళ్లు, ఇతర ఫంక్షన్లకు వెళ్లలేరు. విపరీతమైన కుంగుబాటు ఉంటుంది. ఇలాంటి సమస్యలన్నీ పార్కిన్సన్స్ వల్ల అదనంగా వస్తాయి.(చదవండి: శిల్పారామంలో..సమ్మర్ ఆర్ట్ క్యాంపు.. )

శిల్పారామంలో..సమ్మర్ ఆర్ట్ క్యాంపు..
పరీక్షలు అయిపోయాయి.. వేసవి సెలవులు వచ్చాయి.. మరి సెలవులను వృథా చేసుకోకుండా విద్యార్థులు ఏం చేయాలి? వారికి నచ్చిన రంగాల్లో, ఆసక్తి ఉన్న అంశాల్లో శిక్షణ ఇప్పిస్తే సరి.. నేర్చుకోవడం నిరంతర ప్రక్రియ.. నేర్చుకున్నవారికి నేర్చుకున్నంత.. మాదాపూర్‌లోని శిల్పారామం ప్రతి ఏడాది సమ్మర్ ఆర్ట్ క్యాంప్ చేపడుతోంది. ఈ ఏడాది కూడా మే 1వ తేదీ నుంచి 17వ తేదీ వరకు ఈ ఆర్ట్ క్యాంపు నిర్వహిస్తోంది. దీనిలో మట్టికుండల తయారీ విధానం, పెన్సిల్ స్కెచ్, మధుబని పెయింటింగ్, ట్రైబల్ పెయింటింగ్, మండల పెయింటింగ్, ఆక్రిలిక్ పెయింటింగ్, సీసెల్ క్రాఫ్ట్, భగవద్గీత శ్లోకాల పఠనం, సంస్కృతంలో మాట్లాడటం వంటి అంశాల్లో శిక్షణ తరగతులను నిర్వహించనున్నారు. శిక్షణ తరగతుల ద్వారా విద్యార్థులకు ఏఏ రంగాలపై ఆసక్తి ఉందో తెలుస్తుంది. విద్యార్థులు ఎంచుకున్న రంగంలో రాణించేందుకు అధ్యాపకులు శిక్షణ ఇస్తారు. కేవలం విద్యార్థులే కాకుండా గృహిణులు, ఉద్యోగినులు సైతం వివిధ రంగాల్లో శిక్షణ తీసుకుని ఆర్థికంగా ఎదుగుతున్నారు. గత ఏడాది శిక్షణ పొందిన మహిళలు వివిధ రకాల బట్టలపై పెయింటింగ్‌లు వేసి ఆర్థికంగా సంపాదిస్తున్నారు. కొంత మంది మహిళలు సొంతంగా వ్యాపారం చేస్తున్నారు. 6 సంవత్సరాలకుపై బడినవారు ఎవరైనా సమ్మర్ ఆర్ట్ క్యాంపులో పాల్గనవచ్చు. చిన్నారులకు భగవద్గీత, సంస్కృత భాషలను నేర్పడం వల్ల వారు ప్రయోజకులు కావడంతోపాటు సంస్కృతి, సంప్రదాయాలు, పురాణాలు, ఇతిహాసాల ప్రత్యేకతను తెలుసుకుంటారని అధ్యాపకులు తెలుపుతున్నారు. కేవలం సరదాగా నేర్చుకోవడమే కాకుండా వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకునేందుకు శిక్షణ తరగతులు ఎంతగానో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. వివిధ అంశాలలో శిక్షణ పొందేందుకు నామమాత్రపు రుసుముతో వేసవి శిక్షణ శిబిరాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు. సంస్కృతంలో అనర్గళంగా మాట్లాడవచ్చు.. సంస్కృత భాషకు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. అలాంటి భాషను నేరి్పంచడం అరుదు. శిల్పారామం విద్యార్థులకు, ఆసక్తిగల వారికి సమ్మర్ క్యాంపు ద్వారా ఈ అవకాశాన్ని కలి్పస్తోంది. సులభ పద్ధతిలో సంస్కృత భాషను నేర్చుకోవచ్చు. సంస్కృత భాషను పూర్తి స్థాయిలో నేర్చుకోవడం వల్ల అనేక గ్రంథాలను, పుస్తకాలను చదువుకొని అర్థం చేసుకోవచ్చు. – సంతోష్, అధ్యాపకుడు, సంస్కృత భాష మధుబని పెయింటింగ్‌లో శిక్షణ మధుబని పెయింటింగ్‌ను ఆసక్తితో నేర్చుకోవాలి. ప్రత్యేకత ఉన్న మధుబని పెయింట్లను చాలా మంది కొనుగోలు చేస్తున్నారు. గృహిణులు ఇంట్లో సరదాగా వేసి అమ్ముకోవచ్చు. ఆర్థికంగా ఎదిగేందుకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. పూర్తిస్థాయిలో నేర్చుకున్న వారు మరి కొంతమందికి శిక్షణ ఇవ్వవచ్చు. – రాజేశ్, మధుబని పెయింటింగ్ అధ్యాపకుడు ఆసక్తి గలవారు 8886652030,8886652004లలో సంప్రదించగలరు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు తరగతులను నిర్వహించనున్నట్టు తెలిపారు. మే 1వ తేదీ నుంచి 17వ తేదీ వరకు జరుగుతాయి. అలాగే ఆరు నుంచి 60 సంవత్సరాల వారు ఎవరైనా శిక్షణ పొందవచ్చు. మొత్తం 9 అంశాలలో శిక్షణ (చదవండి: హెరిటేజ్ వాక్..ఎక్స్పర్ట్స్ టాక్..!)

హెరిటేజ్ వాక్..ఎక్స్పర్ట్స్ టాక్..!
సికింద్రాబాద్‌లోని రాష్ట్రపతి నిలయంలో సందడి నెలకొంది. విద్యార్థుల కోలాహలంతో ఉత్సాహపూరిత వాతావరణం ఏర్పడింది.. ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని పురస్కరించుకుని అక్కడ గురువారం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. నగరంలోని పలు పాఠశాలలు, కళాశాలల నుంచి 1,628 మంది విద్యార్థులు తరలివచ్చారు. ఈ సందర్భంగా దేశంలోని మూడు రాష్ట్రపతి నిలయాల చరిత్ర, ప్రాముఖ్యతను వివరించే వీడియోను వీక్షించారు. అనంతరం విద్యార్థులు హెరిటేజ్ వాక్‌లో భాగంగా రాష్ట్రపతి నిలయంలోని పురాతన భవనాలను సందర్శించి వాటి చారిత్రక ప్రాముఖ్యత గురించి తెలుసుకున్నారు. కార్యక్రమంలో వారసత్వ పరిరక్షణకు సంబంధించిన నిపుణులు విద్యార్థులతో ఇంటరాక్టివ్ సెషన్లను నిర్వహించారు. ఈ సెషన్లలో ఇంజినీర్ వేదకుమార్ మణికొండ (డెక్కన్ హెరిటేజ్ అకాడమీ ట్రస్ట్ చైర్మన్), మధు వొటెరి (సీనియర్ ఫెలో – కేంద్ర సాంస్కతిక మంత్రిత్వ శాఖ, తెలంగాణ టూరిజం వాక్ కోఆర్డినేటర్), కల్పనా రమేష్ (కావా డిజైన్ స్టూడియో – ది రైన్ వాటర్ ప్రాజెక్ట్ వ్యవస్థాపకురాలు) పాల్గొన్నారు. (చదవండి: సూర్యుడి భగభగలు పెరిగిపోవచ్చు తస్మాత్ జాగ్రత్త..! ఆహారం, పానీయాలపై శ్రద్ధ పట్టాల్సిందే..!)
ఫొటోలు
అంతర్జాతీయం

ఉత్తరకొరియా మరో సంచలనం.. కిమ్ ప్లాన్‌తో ప్రపంచానికే హెచ్చరిక!
పాంగ్య్యాంగ్: ఉత్తరకొరియా తన శత్రు దేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. నిత్యం క్షిపణి పరీక్షలతో కవ్వించే కిమ్.. ఇప్పుడు అత్యాధునిక యుద్ధనౌకను తయారుచేసే పనిలో స్పీడ్ పెంచారు. మాక్సర్ టెక్నాలజీస్, ప్లానెట్ ఉపగ్రహాలు తీసిన చిత్రాల ద్వారా ఈ విషయం బయటకు వచ్చింది. ప్రస్తుతం ఉత్తర కొరియా నౌకాదళంలో ఉన్న వార్‌షిప్‌ల కంటే ఇది దాదాపు రెండింతలు పెద్దదిగా ఉన్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.వివరాల ప్రకారం.. కిమ్ అధికారం చేపట్టాక సైనిక దళాలను అత్యంత వేగంగా ఆధునికీకరిస్తున్నారు. ఈ క్రమంలోనే ఉత్తర కొరియా నౌకాదళం ఓ అతిపెద్ద నౌకను తయారుచేసే పనిలో బిజీగా ఉంది. ప్రస్తుతం ఆ యుద్ధ నౌకపై ఆయుధ, అంతర్గత వ్యవస్థలను నిర్మిస్తున్నారు. దీని పనులు ఆ దేశ ఉత్తర తీరంలో జరుగుతున్నాయి. ఈ విషయాన్ని మాక్సర్ టెక్నాలజీస్, ప్లానెట్ ఉపగ్రహాలు పసిగట్టాయి. ప్రస్తుతం ఆ దేశ నౌకాదళంలో ఉన్న వార్‌షిప్‌ల కంటే ఇది దాదాపు రెండింతలు పెద్దదిగా ఉందని సమాచారం. దీని పొడవు సుమారు 140 మీటర్లుగా అంచనా వేశారు. దీని నిర్మాణానికి అవసరమైన టెక్నాలజీ మాస్కో నుంచి అంది ఉంటుందని దక్షిణ కొరియా నిపుణులు చెబుతున్నారు.***UPDATE***New warship revealed by #NorthKorea hints at VLS and phased array radars. #OSINT pic.twitter.com/2pzm01QcLr— H I Sutton (@CovertShores) December 29, 2024ఇదిలా ఉండగా.. అమెరికాకు చేరే స్థాయి ఖండాంతర క్షిపణులను ఇప్పటికే ఉత్తర కొరియా సమకూర్చుకొంది. ఈ ఆయుధాల తయారీకి అవసరమైన టెక్నాలజీ, పరికరాలను ఎవరూ ఉత్తరకొరియాకు విక్రయించకుండా ఐరాస ఆంక్షలు విధించింది. రష్యాతో మంచి సంబంధాలు ఉండటంతో ఆంక్షల ప్రభావం లేకుండా చూసుకొంది. మొత్తానికి ఈ భారీ నౌక నిర్మాణం ఉత్తర కొరియా సైనిక శక్తిని మెరుగుపరిచే మరో ముఖ్యమైన అడుగుగా చెప్పవచ్చు. దీంతో, అమెరికా.. ఈ విషయంపై ఫోకస్ పెంచే అవకాశం ఉంది.🇰🇵🛳️ North Korea is building the largest warship in its arsenal, measuring 140 meters long, — CNN.❗️The missile frigate is said to have vertical launchers for missiles at air and ground targets. DPRK receiving military technology from Russia, as it is under strict sanctions. pic.twitter.com/ivEEVwmQAY— MAKS 24 🇺🇦👀 (@Maks_NAFO_FELLA) April 14, 2025

టైమ్స్ జాబితాలో భారతీయులకు దక్కని చోటు!
ప్రపంచమంతా ప్రతిష్టాత్మకంగా భావించే టైమ్ మ్యాగజైన్(Time Magazine List 2025) జాబితా 2025 విడుదలైంది. వంద మంది పేర్లతో కూడిన జాబితాను విడుదల చేసింది. అయితే అత్యంత ప్రభావశీల వ్యక్తుల జాబితాలో ఈ ఏడాది భారతీయులెవరికీ చోటు దక్కకపోవడం గమనార్హం.2025కి గానూ మోస్ట్ ఇన్ఫ్లూయెన్షియల్ పీపుల్ జాబితాను టైమ్ మ్యాగజైన్ విడుదల చేసింది. ఇందులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, యూకే ప్రధాని కీర్ స్టార్మర్, నోబెల్ బహుమతి గ్రహీత.. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, టెస్లా సీఈవో ఇలాన్ మస్క్ తదితరులకు చోటు దక్కింది. జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్, పాపులర్ సింగర్ ఈద్ షరీన్, ఏఐ దిగ్గజం డెమిస్ హస్సాబిస్(Demis Hassabis) తదితరుల పేర్లు ఉన్నాయి.ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. భారత్ నుంచి ఈ ఏడాది జాబితాలో ఒక్కరికి కూడా చోటు దక్కలేదు. గతంలో.. షారూఖ్ ఖాన్, అలియా భట్, సాక్షి మాలిక్(రెజ్లర్) పేర్లు ఈ జాబితాకు ఎక్కిన సంగతి తెలిసిందే. అయితే ఈ మధ్య సంవత్సరాల్లో ఇలా భారతీయుల పేర్లు లేకపోవడం ఇదే తొలిసారి. ఈసారి విశేషం ఏంటంటే.. నేరుగా భారతీయులకు చోటు దక్కకపోయినా భారత సంతతికి చెందిన వర్టెక్స్ ఫార్మాసూటికల్స్ సీఈవో రేష్మా కేవలరమణి(Reshma Kewalramani) పేరు ఈ జాబితాలోకి ఎక్కింది. రేష్మ ముంబైలో పుట్టారు. ఆమెకు 11 ఏళ్ల వయసున్నప్పుడు ఆ కుటుంబం అమెరికాకు వలస వెళ్లి స్థిరపడింది. రేష్మా కేవలరమణి(52)టైమ్ జాబితాకు ప్రాధాన్యత ఎందుకు?టైమ్ మ్యాగజైన్ అనేది న్యూయార్క్ కేంద్రంగా నడిచే వార్త ప్రచురణ సంస్థ. 1923 మార్చి 3వ తేదీన ఇది ప్రారంభమైంది. సమకాలీన వార్తలకు పాఠకులకు అందించే ఉద్దేశంతో హెన్రీ లూస్, బ్రిటన్ హాడెన్ దీనిని స్థాపించారు. కాలక్రమేణా దీనికి ప్రపంచస్థాయి ఆదరణ లభించింది. అనేక రంగాలను మలుపు తిప్పిన వ్యక్తుల పేర్లతో ప్రతీ ఏటా జాబితా విడుదల చేస్తూ వస్తోంది టైమ్స్ మ్యాగజైన్. అలా..అత్యంత ప్రభావశీలురైన వ్యక్తుల జాబితాను 1999లో తొలిసారి రిలీజ్ చేసింది టైమ్ మ్యాగజైన్. మేధావులు, రాజకీయ నాయకులు, జర్నలిస్టులు ఈ జాబితా గురించి విస్తృతంగా చర్చించుకోవడం మొదలుపెట్టారు. అయితే 2004 నుంచి క్రమం తప్పుకుండా ప్రతీ ఏడాది జాబితాను విడుదల చేస్తూ వస్తోంది టైమ్ మ్యాగజైన్.

భారత సంతతి వైద్యురాలు ముంతాజ్ పటేల్‌కి అరుదైన గౌరవం
లండన్: ప్రతిష్టాత్మక రాయల్ కాలేజ్ ఆఫ్ ఫిజీషియన్స్(ఆర్సీపీ) 124వ ప్రెసిడెంట్‌గా భారత సంతతికి చెందిన డాక్టర్ ముంతాజ్ పటేల్ ఎన్నికయ్యారు. యూకే వైద్య నిపుణుల సంఘంలో ప్రపంచవ్యాప్తంగా నిపుణులుగా పేరున్న 40 వేల మంది వైద్యులు సభ్యులుగా ఉన్నారు.ఇక, ఇంగ్లండ్‌లోని లంకాషైర్‌లో డాక్టర్ పటేల్ జన్మించారు. ఈమె తల్లిదండ్రులు భారత్‌కు చెందిన వారు. మాంచెస్టర్‌లో కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్‌గా డాక్టర్ ముంతాజ్ పనిచేస్తున్నారు. ఆర్సీపీకు మొట్టమొదటి ఇండో–ఆసియన్ ముస్లిం ప్రెసిడెంట్‌గా ఆమె చరిత్ర సృష్టించారు. 16వ శతాబ్దంలో ఆర్సీపీ ఏర్పాటయ్యాక ఐదో మహిళా అధ్యక్షురాలుగా ముంతాజ్ పటేల్ నిలిచారు. సోమవారం ముగిసిన ఎన్నికలో డాక్టర్ ముంతాజ్ గెలుపొందారు. నాలుగేళ్ల పదవీకాలం ప్రారంభం ఖరారు కావాల్సి ఉంది. ఆర్సీపీ వైస్ ప్రెసిడెంట్(ఎడ్యుకేషన్–ట్రెయినింగ్)గా, తాత్కాలిక ప్రెసిడెంట్‌గా 2024 జూన్ నుంచి కొనసాగుతున్నారు. ఆర్సీపీ ప్రెసిడెంట్‌గా కౌన్సిల్ సమావేశాలకు అధ్యక్షత వహిస్తారు. బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సభ్యురాలుగా ఉంటారు.

భూకంపం నుంచి బిడ్డను రక్షించుకునేందుకు.. వలయాన్ని సృష్టించిన ఏనుగులు
ప్రాణి ఏదైనా పిల్లల పట్ల చూపించే ప్రేమ, తీసుకునే జాగ్రత్తలు ఒకేతీరుగా ఉంటాయి. అందుకు తాజా ఉదాహరణ ఈ ఘటన. సోమవారం దక్షిణ కాలిఫోర్నియాలో 5.2 తీవ్రతతో భూకంపం వచ్చింది. ఒక్కసారిగా కదలికలను గమనించిన శాన్‌డియాగో జంతు ప్రదర్శనశాలలోని ఏనుగులు అప్రమత్తమయ్యాయి. జూ సఫారీ పార్కులో ఉన్న ఆఫ్రికన్ ఏనుగుల గుంపు ఒకేచోట చేరింది. తమ పిల్లలను రక్షించుకోవడానికి వలయం ఏర్పాటు చేసింది. మధ్యలో పిల్లలను ఉంచిన ఏనుగులు ఏ పక్క నుంచి ఏ ముప్పు ఉందోనని చుట్టుపక్కల పరిశీలించడం మొదలుపెట్టాయి. చెవులు చాచి, కళ్లు పరిసరాలను పరిశీలిస్తూ, ఎలాంటి ప్రమాదాన్నైనా ఎదుర్కొనేందుకు సిద్ధమన్నట్టుగా నిలబడి ఉన్నాయి. గుంపులో ఉన్న మగ ఏనుగు పిల్ల కూడా రక్షణ వలయంలోకి వచ్చి నిలబడింది. దానికి తల్లి ఏనుగు తొండంసాయంతో నేనున్నా అనే భరోసాను సైతం ఇచ్చింది. భూమి కంపించడం ప్రారంభించిన క్షణాల్లోనే ఏనుగులు చర్యకు దిగాయి. ఎన్‌క్లోజర్‌లోని నిఘా కెమెరాలు ఈ దృశ్యాలను బంధించాయి. ‘అలర్ట్ సర్కిల్’అనిపిలిచే ఈ సహజ రక్షణ వలయం. బలహీనమైన సభ్యులు భయపడకుండా ఉండేందుకు ఏనుగులు ఈ విలక్షణమైన పవర్తనను కలిగి ఉంటాయి. ఇది వాటి తెలివితేటలకు, సామాజిక బంధానికి నిదర్శనమని జంతుప్రదర్శనశాల క్షీరదాల క్యూరేటర్ మిండీ ఆల్బ్రైట్ తెలిపారు. ఏనుగులు తమ పాదాల ద్వారా భూకంప కార్యకలాపాలను గ్రహించగలవని, ఆయా జంతువులకు ముందుగానే తెలిసిపోతుందని వెల్లడించారు. సుమారు గంట తర్వాత భూప్రకంపనలు రావడంతో ఆ గుంపు మరోసారి రక్షణ వలయాన్ని ఏర్పరిచింది. ముప్పేమీ లేదని నిర్ణయించుకున్నాకే విశ్రాంతి తీసుకుంది.– సాక్షి, నేషనల్ డెస్క్
జాతీయం

రాష్ట్రపతిని కోర్టులు ఆదేశించలేవు
న్యూఢిల్లీ: రాష్ట్రపతిని ఆదేశించే అధికారం న్యాయ వ్యవస్థకు లేదని ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ తేల్చిచెప్పారు. సుప్రీంకోర్టు సూపర్ పార్లమెంట్‌గా వ్యవహరించవద్దని అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలపై సుప్రీంకోర్టు అణు క్షిపణి ప్రయోగించాలనుకోవడం సమంజసం కాదని చెప్పారు. పరిశీలన కోసం రాష్ట్ర గవర్నర్లు పంపించిన బిల్లులపై నిర్ణయం తీసుకొనే విషయంలో రాష్ట్రపతికి గడువు నిర్దేశిస్తూ ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశాలివ్వడం పట్ల జగదీప్ ధన్‌ఖడ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. ఇది నిజంగా ఆందోళనకరమని అన్నారు. ఇలాంటి పరిణామం కోసం మనం ప్రజాస్వామ్య వ్యవస్థను ఏర్పాటు చేసుకోలేదన్నారు. సుప్రీంకోర్టుకు అలాంటి ఆదేశాలిచ్చే అధికారం ఎక్కడిదని ఆక్షేపించారు. గురువారం రాజ్యసభలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. శాసన, కార్యనిర్వాహక వ్యవస్థ చేయాల్సిన పనులను న్యాయ వ్యవస్థ చేయాలనుకోవడం ఏమిటని ప్రశ్నించారు. అసలు మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఈ దేశంలో ఏం జరుగుతోంది? అని నిలదీశారు. ఇలాంటి రోజు ఒకటి వస్తుందని తాను ఏనాడూ ఊహించలేదన్నారు. సుప్రీంకోర్టు సూపర్ పార్లమెంట్‌గా వ్యవహరిస్తూ ఏకంగా రాష్ట్రపతికే ఆదేశాలు జారీ చేయడం సరైంది కాదన్నారు. మన ప్రజాస్వామ్య వ్యవస్థ సుప్రీంకోర్టుకు అలాంటి అధికారాలు ఇవ్వలేదని ఉద్ఘాటించారు. న్యాయ వ్యవస్థకు చట్టాలు వర్తించడం లేదని, అందుకే పారదర్శకత కనిపించడం లేదని పేర్కొన్నారు. న్యాయ వ్యవస్థ హద్దులు దాటుతోందని విమర్శించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 కింద సుప్రీంకోర్టుకు ఇచ్చిన ప్లీనరీ అధికారాలు.. నిత్యం ప్రజాస్వామ్య వ్యవస్థలపై ప్రయోగించడానికి న్యూక్లియర్ మిస్సైల్‌గా మారాయని వ్యాఖ్యానించారు.నోట్లకట్టల ఘటనలో ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదు? ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో మార్చి 14న నోట్ల కట్టలు దొరికిన ఘటనపై ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదని జగదీప్ ధన్‌ఖడ్ ప్రశ్నించారు. న్యాయమూర్తులు విచారణకు అతీతమా? అని ప్రశ్నించారు. వారికి అలాంటి వెసులుబాటు ఉందా? అని అడిగారు. సాధారణ పౌరుల ఇంట్లో నగదు దొరికి ఉంటే దర్యాప్తు ఎలక్ట్రానిక్ రాకెట్ వేగంతో జరిగేదని చెప్పారు. యశ్వంత్ వర్మ విషయంలో దర్యాప్తు కనీసం ఎడ్లబండి వేగంతోనూ జరగడం లేదని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. న్యాయ వ్యవస్థ స్వతంత్రత అనేది దర్యాప్తు నుంచి రక్షణ పొందడం కాకూడదని తెలిపారు.

ఆధునిక టెక్నాలజీతో యమునా నది ప్రక్షాళన
న్యూఢిల్లీ: కాలుష్యమయంగా మారిన యమునా నదిని పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయాల్సిందేనని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ అంశంపై ఆయన గురువారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాతోపాటు స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. నది ప్రక్షాళన కోసం చేపట్టాల్సిన చర్యలపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రక్షాళన క్రతువులో ఢిల్లీ ప్రజలను తప్పనిసరిగా భాగస్వా ములను చేయాలని ప్రధానమంత్రి సూచించారు. రియల్–టైమ్ డేటా, స్పేస్ టెక్నాలజీ వంటి ఆధునిక సాంకేతికతల సాయంతో నదిని పరిశుభ్రంగా మార్చాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కాలుష్యానికి తావులేకుండా యమునా నదిలో ఛాత్ పూజలు నిర్వహించుకొనే అవకాశం కల్పించాలని అన్నారు. నది పట్ల మరింత గౌరవం పెంచేలా చూడాలన్నారు. పవిత్ర యుమునతో ప్రజల అనుబంధం మరింత పెరగాలని ఆకాంక్షించారు.

వక్ఫ్ ఆస్తులను డీనోటిఫై చేయబోం
న్యూఢిల్లీ: ఇప్పటికే వక్ఫ్ ఆస్తులుగా పరిగణనలో ఉన్న ఆస్తులను డీనోటిఫై చేయబోమని సర్వోన్నత న్యాయస్థానానికి కేంద్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. మే 5వ తేదీదాకా సెంట్రల్ వక్ఫ్ బోర్డులు, మండళ్లలో నియామకాలు చేపట్టబోమని పేర్కొంది. అయితే వక్ఫ్ ఆస్తుల డీనోటిఫికేషన్‌కు వ్యతిరేకంగా మధ్యంతర ఉత్తర్వులు ఇస్తామంటూ సుప్రీంకోర్టు చేసిన ప్రతిపాదనపై మాత్రం కేంద్రప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. వక్ఫ్(సవరణ) చట్టాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌ల త్రిసభ్య ధర్మాసనం గురువారం సైతం కొనసాగించింది. ఈ సందర్భంగా వక్ఫ్(సవరణ) చట్టాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై ఏడు రోజుల్లోపు స్పందన తెలియజేసేందుకు కేంద్రప్రభుత్వం సిద్ధంగా ఉందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా గురువారం కోర్టుకు తెలిపారు. చట్టంలోని సెక్షన్ 9, సెక్షన్ 14 ప్రకారం వక్ఫ్ బోర్డులు, కౌన్సిళ్లలో ఎలాంటి నియామ కాలను కేసు తదుపరి విచారణ తేదీదాకా చేపట్ట బోమని ఆయన హామీ ఇచ్చారు. ఇప్పటికే ‘వక్ఫ్ బై యూజర్’ విధానం ద్వారా వక్ఫ్ ఆస్తులుగా రిజిస్ట్రర్ అయిన, ధృవీకరించబడిన ఆస్తులకు సంబంధించిన నోటిఫికేషన్‌ను డీనోటిఫై చేసి గందరగోళం చేయబోమని ఆయన మాటిచ్చారు. ‘‘ ఎంతో విస్తృతస్థాయి చర్చలు, సంప్రదింపుల ప్రక్రియ తర్వాత ప్రభుత్వం తన నిర్ణయాన్ని చట్టంగా తీసుకొచ్చాక ప్రభుత్వ వాదన వినకుండానే ధర్మాసనం ఆ చట్టాన్ని నిలుపుదలచేయడం సహేతుకం అనిపించుకోదు. ప్రభుత్వంలో భాగమైన మేము పార్లమెంట్‌కు, ప్రజలకు జవాబు చెప్పాల్సి ఉంటుంది. న్యాయమూర్తులు ‘వక్ఫ్ బై యూజర్’ నిబంధనపై తీసుకునే నిర్ణయాలు ఎలాంటి ఫలితాలను ఇవ్వబోతున్నాయి?’’ అని మెహతా ప్రశ్నించారు. దీనిపై సీజేఐ ఖన్నా స్పందించారు. ‘‘ 1995నాటి వక్ఫ్ చట్టం ప్రకారం గతంలో రిజిస్ట్రేషన్ పూర్తిచేసుకున్న వక్ఫ్ ఆస్తులను ఈ కేసుల తదుపరి విచారణదాకా డీనోటిఫై చేయకూడదు’’ అని కేంద్రాన్ని ఆదేశించారు. గతంలో వక్ఫ్ ఆస్తులుగా కోర్టులు ప్రకటించిన ఆస్తుల డీనోటిఫైకు వీలుకల్పించే నూతన చట్టంలోని సెక్షన్లను నిలుపుదల చేస్తూ ఉత్తర్వులకు ప్రతిపాదిస్తామని బుధవారం కోర్టు వ్యాఖ్యానించడం తెల్సిందే.ప్రైవేట్ ఆస్తులనూ వశపర్చుకున్నారుసెక్షన్ల నిలుపుదల ప్రతిపాదనను తుషార్ మెహతా తప్పుబట్టారు. ‘‘ చట్టంలోని సుదీర్ఘ సెక్షన్లను జడ్జీలు హడావిడిగా, యథాలాపంగా చదివి ఉండొచ్చు. చట్టబద్ధ్దమైన సెక్షన్‌ను నిలుపుదలచేయడం నిజంగా అరుదైన విషయం. ఈ విషయంలో ఈ చట్టం పూర్వాపరాలను జడ్జీలు మరోసారి పరిశీలించాలని వేడుకుంటున్నా. అన్ని వర్గాల నుంచి వినతులను స్వీకరించాకే ప్రభుత్వం ఈ సవరణ చట్టాన్ని తెచ్చింది. వక్ఫ్ పేరిట ప్రైవేట్ ఆస్తులనూ తమ వశం చేసుకున్నారు. కొన్ని చోట్ల గ్రామాల్లోని భూములు మొత్తం వక్ఫ్ పేరిట నమోదై ఉన్నాయి. లెక్కలేనన్ని ప్లాట్లు వక్ఫ్ ఆక్రమణలో ఉన్నాయి’’ అని మెహతా వాదించారు. ‘‘ప్రభుత్వం నుంచి ప్రాథమికస్థాయి స్పందనను అనుమతించకుండానే చట్టంలోని నిబంధనలను నిలుపుదలచేయడమంటే ధర్మాసనం అత్యంత కఠిన వైఖరిని అవలంబిస్తోందని అర్థమవుతోంది’’ అని మెహతా అసహనం వ్యక్తంచేశారు. ‘‘ మా వాదనలకు బలం చేకూర్చే సాక్ష్యాధారాలు, డాక్యుమెంట్లు, పాత శాసనాలను మీ ముందు ఉంచుతాం. మాకు ఒక వారం గడువు ఇవ్వండి. ఈలోపు ఏమీ జరిగిపోదుగా’’ అని మెహతా వ్యాఖ్యానించారు. ‘‘ కోర్టు తాత్కాలిక ఉత్తర్వులు ఇవ్వకుండా వారం రోజులు ఆగినంత మాత్రాన ఆకాశం విరిగిపడదుగా’’ అని ఒక రాష్ట్రం తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది రాకేశ్ ద్వివేది వ్యాఖ్యానించారు. దీంతో సీజేఐ స్పందించారు. ‘‘ మీరు వక్ఫ్ ఆస్తులకు సంబంధించి యతాతథ స్థితిని మార్చకుండా ఉంటే చాలు’’ అని అన్నారు. వక్ఫ్ చట్టం అమలుకాకుండా తాత్కాలిక ఉత్తర్వులు ఇవ్వాలన్న పిటిషన్ల అభ్యర్థనను ధర్మాసనం తోసిపుచ్చింది. అలాగే చట్టం మొత్తం పూర్తిగా నిలుపుదల చేయడం కుదరదని కోర్టు స్పష్టంచేసింది. ‘‘ నూతన చట్టంలోని కొన్ని సెక్షన్లు సమతుల్యతతో ఉన్నాయి. అందుకే మొత్తం చట్టాన్ని నిలుపుల చేయడం అస్సలు కుదరదు. అలా చేయడం సహేతుకం కూడా కాదు. ఈ అంశం కోర్టు పరిధిలో ఉన్నందున డీనోటిఫై లాంటి వాటి జోలికి పోవద్దు’’ అని ధర్మాసనం సూచించింది.ముగ్గురే వాదించాలి‘‘ఎన్నో పిటిషన్లు వచ్చినా ప్రస్తుతానికి మేం ఐదు పిటిషన్లనే స్వీకరిస్తాం. మీ అందరిలో కేవలం ముగ్గురు న్యాయవాదులనే అన్ని పిటిషన్ల తరఫున వాదించేందుకు అనుమతిస్తాం. ఏ ముగ్గురు వాదించాలో మీరే నిర్ణయించుకోండి’’ అని పలు పిటిషన్ల తరఫు లాయర్లకు సీజేఐ సూచించారు. ఏడు రోజుల తర్వాత కేంద్రప్రభుత్వం స్పందన తెలిపాక ఐదురోజుల్లోపు రీజాయిండర్లను సమర్పించేందుకు పిటిషన్లకు ధర్మాసనం గడువు ఇచ్చింది. మే ఐదో తేదీన ప్రాథమిక స్థాయి అభ్యంతరాలను ఆలకించాక తాత్కాలిక ఉత్తర్వులిస్తామని బెంచ్ తెలిపింది. 1995 వక్ఫ్ చట్టాన్ని, ఆ చట్టానికి 2013లో చేసిన సవరణను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లనూ వేరుగా విచారిస్తామని కోర్టు పేర్కొంది. వైఎస్సార్సీపీ, ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ, ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్, జమియత్ ఉలేమా–ఇ–హింద్ అధ్యక్షుడు అర్షద్ మదానీ, డీఎంకే, ఆకాఫ్ కర్ణాటక రాష్ట్ర బోర్డు మాజీ ఛైర్మన్ అన్వర్ బాషా, సమçస్త కేరళ జమియతుల్ ఉలేమా, అంజుమ్ ఖదారీ, తయ్యబ్ ఖాన్ సల్మానీ, మొహమ్మద్ షఫీ, మొహమ్మద్ ఫజుల్‌రహీమ్, ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా, కాంగ్రెస్ ఎంపీలు ఇమ్రాన్ ప్రతాప్‌గఢీ, మొహమ్మద్ జావేద్, ఢిల్లీ ఆప్ ఎంపీ అమానతుల్లా ఖాన్, అసోసియేషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ తదితరులు మొత్తంగా దాదాపు 72 పిటిషన్లను వక్ఫ్ చట్టాన్ని సవాల్‌చేస్తూ దాఖలు చేయడం తెల్సిందే.

రూ. 50 కోట్ల కుక్క.. ఈడీ దాడులు!
ఏదైనా గొప్పలకు పోతే ఇలానే ఉంటుంది. గొప్పగా బ్రతకొచ్చు.. నీ గొప్పను అవతలి వాడు చెప్పుకోవాలి.. అంతేకానీ మనకు అవకాశం దొరికింది కదాని లేనిపోని గొప్పలకు పోతే ఇలానే ఉంటుంది. ఓ వ్యక్తి గొప్పలకు పోయాడు. తాను ఓ కుక్కును పెంచుకుంటున్నాడు. అది సహజమే. కాకపోతే ఆ కుక్క విలువ రూ. 50 కోట్లు అంటూ గొప్పలకు పోయాడు. నిజంగానే ఆ కుక్క విలువ రూ. 50 కోట్లు ఉంటుందో లేదో తెలీదు కానీ, ఇక్కడ ఆ మనిషి నోరు జారిన ‘గొప్ప’ ఈడీ రైడ్స్ వరకూ వెళ్లింది.విషయంలోకి వెళితే.. తాను అత్యంత ఖరీదు అని చెప్పుకునే కుక్కను తీసుకుని గత ఫిబ్రవరిలో ఓ షోకు వెళ్లాడు సతీష్ అనే వ్యక్తి. అక్కడ తన కుక్క విలువ రూ. 50 కోట్లంటూ ఏవో గొప్పలు చెప్పుకున్నాడు. ఇదొక అరుదైన జాతి కుక్క అని, దీని విలువ లక్షరాల రూ. 50 కోట్లని బహిరంగంగా ప్రకటించాడు. ఇది ఆనోట ఈనోట మారి ఈడీ వరకూ వెళ్లింది. ఫిబ్రవరిలో ఏదో చెప్పుకున్నాడు.. కానీ ఈడీ ఓ కన్నేసి ఉంచింది. అతనికి రెండు నెలల తర్వాత సోదాల పేరుతో వెళ్లింది. కుక్కనే అంత పెట్టి కొన్నాడంటే ఇంక ఎంత ఉంటుందో అని ఈడీ లెక్కలు వేసుకుంది. అంతే అతనికి ఇంటికి గురువారం వెళ్లి సోదాలు చేపట్టింది.ఈ క్రమంలోనే అతనికి సంబంధించి అన్నీ ఆరాలు తీసింది. అతని బ్యాంకు అకౌంట్లను క్షుణ్ణంగా పరిశీలించింది. అయితే పెద్ద మొత్తంలో ఏమీ లావాదేవీలను జరగలేదని విషయాన్ని గుర్తించింది. కుక్కను రూ. 50 కోట్లను పెట్టి కొనుగోలు చేసినట్లు అతను చెప్పిన కోణంలో సమగ్రంగా దర్యాప్తు చేసింది. అయితే అతను లావాదేవీల్లో అంత పెద్ద మొత్తాన్ని ఈడీ గుర్తించలేదు. హవాలా రూట్ లో ఏమైనా చేశాడా.. అనే కోణాన్ని ఈడీ దర్యాప్తు చేసినట్లు తెలుస్తోంది.
ఎన్ఆర్ఐ

హాంగ్‌కాంగ్‌లో ఘనంగా శ్రీ విశ్వావసు నామ ఉగాది వేడుకలు
హాంకాంగ్‌లో ఉగాది వేడుకలు తెలుగు కుటుంబాలకు యెంతో ఉత్సాహాన్నిచ్చాయి, తెలుగు సంవత్సరాదిని ఐక్యతతో, సాంస్కృతిక సంపదతో జరుపుకుంన్నారు. ది హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య (THKTS) నిర్వహించే ఈ కార్యక్రమం, అనధికారికంగా ఇరవై రెండు సంవత్సరాలుగా మరియు పదమూడు సంవత్సరాల అధికారిక సంస్థగా తెలుగు సేవ కొనసాగిస్తోంది. చింగ్ మింగ్ ఉత్సవం కారణంగా హాంకాంగ్‌లో సుదీర్ఘ వారాంతం సెలవలు ఉన్నప్పటికీ, విశేషమైన సంఖ్యలో సభ్యులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమానికి హాంకాంగ్ & మకావులోని భారత కాన్సులేట్ జనరల్ నుంచి కాన్సుల్ శ్రీ కూచిభొట్ల వెంకట రమణ గారు; హోం అఫైర్స్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ జిల్లా అధికారి శ్రీ మొక్ మాంగ్-చాన్ గారు; ఎన్.ఎ.ఎ.సి టచ్ సెంటర్ ప్రాంతీయ డైరెక్టర్ శ్రీమతి కోనీ వాంగ్ గారు; మరియు హాంకాంగ్‌లో ఐసిఐసిఐ బ్యాంక్ లిమిటెడ్ ఉన్నత అధికారి శ్రీ దేవేష్ శర్మ గారు హాజరయ్యారు.చీకటిని పారద్రోలడానికి మరియు కొత్త ప్రారంభాలను స్వాగతించడానికి ప్రతీకగా గౌరవనీయ అతిథుల దీప ప్రజ్వలనతో ఉగాది వేడుకలు ప్రారంభమైంది. ప్రార్థన తర్వాత, హాజరైన వారిని "మా తెలుగు తల్లి" శ్రావ్యమైన పాట ఆకట్టుకుంది,తెలుగుతనాన్ని ప్రేక్షక హృదయాలలో ప్రతిధ్వనించింది. ప్రముఖుల ప్రసంగాలు సమాజ ప్రయాణం మరియు దాని సభ్యులను బంధించే లక్ష్యం గురించి ప్రతిబింబించాయి. శ్రీ కూచిభొట్ల వెంకట రమణ గారు తెలుగు భాష మరియు సాంస్కృతిక విలువలను పునరుద్ఘాటిస్తూ ఇది భావితరాలికి అందించాల్సిన కర్తవ్య ప్రాముఖ్యతని గుర్తుచేశారు. తెలుగు సమాఖ్య ద్వారా హాంగ్ కాంగ్ తెలుగు ప్రజలకు చేస్తున్న సేవలను ఆయన అభినందించారు.తన ప్రసంగంలో, తెలుగు సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షురాలు హాంకాంగ్‌లోని తెలుగు వారిలో ఒక అనుబంధ భావన మరియు సంబంధాన్ని సృష్టించడం ముఖ్యోద్దేశంగా సంస్థ ప్రయాణం మరియు దాని లక్ష్యం గురించి ప్రతిబింబించారు. సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకోవడం మరియు సమాజానికి తిరిగి ఇవ్వడం యొక్క ప్రాముఖ్యతను ఆమె యెంతో అవసరం అని చెప్పారు. హాంకాంగ్ మరియు భారతదేశంలోని వెనుకబడిన వర్గాలకు మద్దతు ఇవ్వడానికి తమ సంస్థ చేస్తున్న ప్రయత్నాలను ప్రస్తావించారు.వినోదాత్మక స్కిట్ వైవిధ్యమైన ప్రదర్శనలను సజావుగా అనుసంధానించింది, ప్రేక్షకుల హర్షధ్వానాలు - కరతాళధ్వనులతో సాంస్కృతికోత్సవం ముగిసింది. ప్రదర్శలిచ్చిన కళాకారులను కాన్సల్ శ్రీ కూచిభొట్ల వెంకట్ రమణ గారు పురస్కరాలు అందజేస్తూ అభినందించారు.హాంకాంగ్‌లోని తెలుగు సమాజం శ్రీ విశ్వవాసు నామ ఉగాది వేడుకలను ప్రారంభిస్తున్నందున, తెలుగు నూతన సంవత్సర ప్రారంభాన్ని సూచిస్తూ సాంప్రదాయ ఉగాది పచ్చడితో, తెలుగు భోజనంతో వేడుకలు ముగిశాయి. ఈ కార్యక్రమం సమాజం యొక్క ఐక్యత, సేవా స్ఫూర్తికి నిదర్శనం, స్నేహం మరియు సేవా బంధాలను పెంపొందించడం, ఆనందం, విజయం మరియు సద్భావనతో నిండిన సంవత్సరాన్ని వాగ్దానం చేయడం మరియు తెలుగు ప్రజల గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని జరుపుకోవడం తార్కాణం.అధ్యక్షురాలు తన కృతజ్ఞతా ప్రసంగంలో,గౌరవనీయులైన అతిథులు, కమిటీ సభ్యులు, స్వచ్ఛంద సేవకులు, సమాఖ్య సభ్యులు, స్నేహితులు మరియు తుంగ్ చుంగ్ కమ్యూనిటీ హాల్ సిబ్బందికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

రాజాంలో విద్యార్ధులకు నాట్స్ ఉపకారవేతనాలు
జన్మభూమి రుణం తీర్చుకునేందుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ అనేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే నాట్స్ తాజాగా శ్రీకాకుళం జిల్లా రాజాం లో విద్యార్ధులకు ఉపకారవేతనాలు, మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేసింది. నాట్స్ ఫినిక్స్ చాప్టర్ జాయింట్ కో ఆర్డినేటర్ సతీశ్ గంథం తన సొంత ఊరికి చేతనైన సాయం చేయాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. రాజాంలోని శ్రీ విద్యానికేతన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో సతీశ్ గంథం విద్యార్ధులకు ఉపకారవేతనాలు అందించారు. అలాగే ఇక్కడే మహిళలు స్వశక్తితో ఎదిగేందుకు వారికి ఉచితంగా కుట్టుమిషన్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రముఖులు పాల్గొని సతీశ్ గంథం సేవా నిరతిని ప్రశంసించారు. జన్మభూమి రుణం తీర్చుకునేందుకు నాట్స్ ఫినిక్స్ చాప్టర్ జాయింట్ కో ఆర్డినేటర్ సతీష్ గంథం చూపిన చొరవను నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి, నాట్స్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ శ్రీహరి మందాడి లు ప్రత్యేకంగా అభినందించారు.

డల్లాస్‌లో నాట్స్ అడాప్ట్ ఎ పార్క్ కార్యక్రమం
అమెరికాలో సామాజిక బాధ్యత పెంచే కార్యక్రమాలను నాట్స్ తరచూ చేపడుతోంది. ఈ క్రమంలోనే నాట్స్ అడాప్ట్ ఎ పార్క్ కార్యక్రమాన్ని డల్లాస్‌లోని ఫ్రిస్కో నగరంలో చేపట్టింది. డల్లాస్ నాట్స్ విభాగం ఆధ్వర్యలో ప్రిస్కోలోని మోనార్క్ పార్క్‌లో 50 మందికి పైగా నాట్స్ సభ్యులు, తెలుగు విద్యార్ధులు పాల్గొని పార్క్‌ని శుభ్రం చేశారు. ప్రకృతిని కాపాడేందుకు, శుభ్రతను ప్రోత్సహించేందుకు అడాప్ట్ ఎ పార్క్ వంటి కార్యక్రమాలు ఎంతో మేలును కలిగిస్తాయని, పార్కులను శుభ్రంగా ఉంచడం వల్ల పర్యావరణ హితమైన జీవనశైలికి మార్గం సుగమం అవుతుందని నాట్స్ పూర్వ అధ్యక్షులు బాపు నూతి అన్నారు. విద్యార్ధుల్లో సామాజిక బాధ్యత పెంచేందుకు నాట్స్ చేపట్టిన ఈ సామాజిక సేవా కార్యక్రమం ద్వారా విద్యార్ధుల సేవను అమెరికా ప్రభుత్వం గుర్తిస్తుందని నాట్స్ బోర్డ్ డైరెక్టర్ రాజేంద్ర మాదాల తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, యువత తమ విలువైన సమయాన్ని వినియోగించి పార్కును శుభ్రపరిచారు. చెత్తను తొలగించారు. చెట్లకు నీరు పట్టారు ప్రకృతి పరిరక్షణకు తోడ్పడ్డారు. విద్యార్ధులకు ఇది ఒక సామాజిక బాధ్యతగా మాత్రమే కాకుండా, భవిష్యత్తులో పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించే గొప్ప అనుభవంగా మిగులుతుందని డల్లాస్ చాప్టర్ వ్కోఆర్డినేటర్లు స్వప్న కాట్రగడ్డ, శ్రావణ్ నిడిగంటి అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించటానికి ప్రోత్సాహాన్ని అందిస్తున్న దాతలకు ధన్యవాదాలు తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో జాయింట్ ట్రెజరర్ రవి తాండ్ర, నాట్స్ జోనల్ వైస్ ప్రెసిడెంట్ సత్య శ్రీరామనేని, నేషనల్ కోఆర్డినేటర్ ఫర్ మీడియా రిలేషన్స్ కిషోర్ నారె, నాట్స్ సభ్యులు శివ మాధవ్, బద్రి, కిరణ్, పావని, శ్రీ దీపిక, ఉదయ్, వంశీ, వీరా తదితరులు పాల్గొన్నారు. మరిన్ని NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి! రేపటి తరంలో సామాజిక బాధ్యత పెంచే అడాప్ట్ ఎ పార్క్ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించిన డల్లాస్ చాప్టర్ జట్టుకు నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షులు మదన్ పాములపాటి తమ అభినందనలు తెలిపారు. జూలై 4,5,6 తేదీల్లో టంపాలో జరిగే 8 వ అమెరికా తెలుగు సంబరాలకు డల్లాస్‌లో ఉండే తెలుగువారంతా తరలిరావాలని కోరారు.

30వ ఉగాది ఉత్తమ రచనల పోటీ విజేతల ప్రకటన
గత మూడు దశాబ్దాల సత్ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ.....“విశ్వావసు” నామ సంవత్సర ఉగాది (మార్చ్ 30, 2025) సందర్భంగా వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారు నిర్వహించిన 30వ ఉగాది ఉత్తమ రచనల పోటీ లో ఈ క్రింది రచనలు ఉత్తమ రచనలుగా వంగూరు ఫౌండేషన్ ఎంపిక చేసి విజేతల వివరాలను ప్రకటించింది. అలాగే విజతలకు శాయి రాచకొండ, దీప్తి పెండ్యాల, వంగూరి చిట్టెన్ రాజు అభినందనలు తెలిపారు.వంగూరు ఫౌండేషన్ ప్రకటనఅమెరికా, కెనడా, భారత దేశం, దక్షిణ ఆఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్, ఖతార్, చెకొస్లొవేకియా, అబుదాభి, బోస్ట్వానా, దుబై తదితర ప్రాంతాల నుండి ఈ పోటీలో పాలు పంచుకుని, విజయవంతం చేసిన రచయితలకు మా ధన్యవాదాలు. చేయి తిరిగిన రచయితలు, ఔత్సాహిక రచయితలూ అనేక మంది ఈ పోటీ కాని పోటీలో పాల్గొనడం సంతోషంగా ఉంది. అన్ని రచనలకూ సర్వ హక్కులూ రచయితలవే. బహుమతి పొందిన రచనలు, ప్రచురణకి అర్హమైన రచనలూ కౌముది.నెట్, సిరిమల్లె. కామ్ మొదలైన పత్రికలలో ఆయా సంపాదకుల నిర్ణయానుగుణంగా ప్రచురించబడతాయి.మరిన్ని NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి! అందుబాటులో ఉన్న విజేతల నగదు బహుమతులు, ప్రశంసాపత్రాలు ఏప్రిల్ 13, 2025 నాడు శ్రీ త్యాగరాజ గాన సభ వేదిక, హైదరాబాద్ లో నిర్వహించబడుతున్న "అంతర్జాతీయ ఉగాది సాహిత్య సమ్మేళనం" లో ఆహూతుల సమక్షంలో బహూకరిస్తాం.30వ ఉగాది ఉత్తమ రచనల పోటీ విజేతలుప్రధాన విభాగం – 30వ సారి పోటీఉత్తమ కథానిక విభాగం విజేతలు“కాంతా విరహగురుణా”- పాణిని జన్నాభట్ల, Boston, MA,)“నల్లమల్లె చెట్టు” - గౌతమ్ లింగా (Johannesburg, South Africa)ప్రశంసా పత్రాలు‘లూసఫర్’ -నిర్మలాదిత్య (భాస్కర్ పులికల్), Tampa, FL‘తెలివి’ - మురళీశ్రీరాం టెక్కలకోట, Frisco, TXఉత్తమ కవిత విభాగం విజేతలు“వర్ణాక్షరం” - గౌతమ్ లింగా, (జొహానెస్ బర్గ్, దక్షిణ ఆఫ్రికా)“కృత్రిమ మేధా వికూజనము” – స్వాతి శ్రీపాద (Detroit, MI)ప్రశంసా పత్రాలు“డయాస్పోరా ఉగాది పచ్చడి”- సావిత్రి మాచిరాజు, Edmonton, Canada“చెప్పిన మాట వింటా!”- అమృత వర్షిణి, Parker, CO, USA“మొట్టమొదటి రచనా విభాగం” -17వ సారి పోటీ“నా మొట్టమొదటి కథ” విభాగం విజేతలు‘ప్రత్యూష రాగం -కైలాస్ పులుగుర్త’ – హైదరాబాద్,“మనో నిశ్చలత” – సీతా సుస్మిత, మద్దిపాడు గ్రామం,ఒంగోలు - ప్రశంసా పత్రం“మంకెన పూలు” -సుజాత గొడవర్తి, ఆశ్వాపురం, తెలంగాణా - ప్రశంసా పత్రం"నా మొట్ట మొదటి కవిత” విభాగం విజేతలు“ఇంకెంత కాలమని?” కరిపె రాజ్ కుమార్, ఖానాపూర్, నిర్మల్ జిల్లా, తెలంగాణా “వర్షాగమనానికి ఆశగా ఎదురుచూసే ప్రకృతిని హృద్యంగా, కొంత కరుణాత్మకంగా వర్ణించే కవిత”“అచ్చం నాలానే” -మళ్ళ కారుణ్య కుమార్, అమ్మవారి పుట్టుగ (గ్రామం), శ్రీకాకుళం“వయసు ఒక అనిరిర్ధారిత సంఖ్య” - ప్రొఫెసర్ దుర్గా శశికిరణ్ వెల్లంచేటి, Bangalore, India-
క్రైమ్

విశాఖలో కీచక ముఠా! 30 మంది యువతులకు మత్తు మందు ఇచ్చి..
విశాఖపట్నం, సాక్షి: కూటమి పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోతోంది. ఈ 11 నెలలకాలంలో అఘాయిత్యాలు పెరిగిపోయాయి. అదే సమయంలో విశాఖ నేరాలమయంగా మారిపోయింది. తాజాగా.. నగరంలో మ్యారేజ్ బ్యూరో పేరిట అరాచకాలకు పాల్పడుతున్న ఓ ముఠా గట్టు రట్టయ్యింది. యువతులకు మత్తు మందు ఇచ్చి అత్యాచారాలకు పాల్పడుతుండడమే కాకుండా.. ఆపై బ్లాక్మెయిల్ చేస్తున్న వ్యవహారం ఓ బాధితురాలు ముందుకు రావడంతో వెలుగు చూసింది. నాలుగో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ వ్యవహారం వివరాల్లోకి వెళ్తే.. మ్యారేజ్ బ్యూరో, హెర్బల్ ప్రొడక్ట్స్, టూవీలర్ రైడ్ యాప్ పేరిట ఓ ముఠా పెళ్లికాని అమ్మాయిల నుంచి వివరాలు సేకరిస్తోంది. ఆపై సంబంధాలు, ప్రొడక్టులను చూపించే వంకతో పరిచయాలు పెంచుకుంటోంది. మత్తు మందు ఇచ్చి యువతులు స్పృహలో లేనప్పుడు అత్యాచారం చేయడంతో పాటు వీడియోలు తీస్తోంది. సాక్షి టీవీతో బాధితురాలుఅలా ఇప్పటిదాకా 30 మంది యువతుల నగ్న వీడియోలను సేకరించి బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్నట్లు బాధితురాలు చెబుతోంది. ఒకవేళ గర్భం దాలిస్తే బలవంతంగా అబార్షన్లు చేయిస్తున్నారని తెలిపిందామె. గర్భం దాల్చిన తననూ అబార్షన్ చేయించుకోవాలని ఆ ముఠా ఒత్తిడి చేసిందని, లేకుంటే సుపారీ ఇచ్చి చంపేయిస్తామని బెదిరించిందని ఆమె పోలీసులను ఆశ్రయించింది. అయితే.. ఈ విషయంలో పోలీసుల నుంచి కూడా తనకు న్యాయం జరగడం లేదంటూ బాధితురాలు మీడియా ముందు వాపోయింది. ఆ ముఠాను ఆగడాలను కట్టడి చేసి.. నిందితులను కఠినంగా శిక్షించాలని బాధితురాలు కోరుకుంటోంది. ఈ వ్యవహారంపై, యువతి చేస్తున్న ఆరోపణలపై పోలీసులు స్పందించాల్సి ఉంది.

అవసరాలకు అప్పు ఇచ్చి.. భార్యను లొంగదీసుకున్నాడు..
మహబూబాబాద్: ఇంటి అవసరాల కోసం అప్పు ఇప్పించా డు. ఇది ఆసరా చేసుకుని అప్పు తీసుకున్న వ్యక్తి భార్యను శారీరకంగా లొంగదీసుకున్నాడు. ఈ విషయం తెలిసిన భర్త పరువు పోయిందని భావించి భార్యను నిలదీశాడు. దీంతో తాము కలిసి ఉండాని నిర్ణయించుకుని లొంగదీసుకున్న వ్యక్తిని పథకం ప్రకారం భార్యాభర్తలు హత్యచేశారు. నల్లబెల్లి మండలం మూడు చెక్కలపల్లిలో ఈ నెల 12వ తేదీన జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. బుధవారం నర్సంపేటలోని దుగ్గొండి సీఐ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సీఐ సాయిరమణ.. ఎస్సై గోవర్ధన్‌తో కలిసి హత్య వివరా లు వెల్లడించారు. ఐదేళ్ల క్రితం మూడుచెక్కలపల్లి గ్రామానికి చెందిన బానోత్ జంపయ్య 23 గుంటల వ్యవసాయ భూమి కొనుగోలు చేశాడు. ఇంటి ని ర్మాణ పనులు చేపట్టారు. ఈక్రమంలో బానోత్ కొమ్మాలు(40) మధ్యవర్తిగా ఉండి రెండుసార్లు రూ.1.50 లక్షలు జంపయ్యకు అప్పుగా ఇప్పించా డు. ఇది ఆసరా చేసుకుని జంపయ్య భార్య విజ యను కొమ్మాలు శారీరకంగా లొంగదీసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న జంపయ్య పెద్ద మనుషులను ఆశ్రయించగా కొమ్మాలుకు రూ.70 వేలు జరి మానా విధించారు. ఈ క్రమంలో కొమ్మాలు వ్యవహరశైలితో తన పరువు పోయిందని భావించిన జంపయ్య.. కొమ్మాలును చంపాలని అనుకున్నాడు. కాగా, జంపయ్య తన భర్య విజయతో గొడవపడ్డాడు. కొమ్మాలును అయినా, నిన్ను అయినా చంపుతానని చెప్పాడు. దీంతో భయపడిన విజయ మనం కలిసే ఉందామని భర్తకు తెలిపింది. అనంతరం కొమ్మాలును హత్య చేయాలని ఇద్దరు నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా కొమ్మాలు ఫోన్ చేసిన ప్రతీసారి అతడితో మాట్లాడడానికి వెళ్లమని జంపయ్య తన భార్య విజయకు చెప్పాడు. దీంతో విజయ పూర్తిగా కొమ్మాలును నమ్మించింది. ఈ క్రమలో పథకం ప్రకారం ఈ నెల 12న విజయ.. కొమ్మాలుకు ఫోన్ చేసి మాట్లాడాలి మొక్కజొన్న చేనువద్దకు రావాలని కోరింది. అనంతరం దంపతులు పథకం ప్రకారం కత్తులు తీసుకుని మొక్కజొన్న చేనులోకి వెళ్లారు. జంపయ్య ఎవరికీ కనిపించకుండా మొక్కజొన్న చేనులో కొంతదూరంగా ఉన్నాడు. ఈ విషయం గమనించకుండా కొమ్మాలు మొక్కజొన్న చేనువద్దకు చేరుకున్నాడు. ఇదే అదునుగా భావించి జంపయ్య వెనుకవైపు నుంచి కొ మ్మాలును కత్తితో పలుమార్లు పొడిచాడు. అనంతరం దంపతులిద్దరు పరారయ్యారు. ఈ క్రమంలో రుద్రగూడెంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించడంతో అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు. కాగా, హత్య కేసు ఛేదనలో ప్రతిభకనబర్చిన ఎస్సై గోవర్ధన్, సిబ్బందిని సీఐ అభినందించారు.

డ్రైవర్‌గా చేరి ప్రైవేటు వీడియోలతో బ్లాక్ మెయిల్
విశాఖపట్నం: ప్రైవేటు వీడియోలతో సాఫ్ట్వేర్ ఉద్యోగి కుటుంబాన్ని బ్లాక్మెయిల్ చేస్తూ డబ్బులు డిమాండ్ చేస్తున్న కారు డ్రైవర్ అప్పలరాజును ద్వారకా పోలీసులు గురువారం అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సాఫ్ట్వేర్ ఇంజినీర్ చేకూరి గిరీష్, భార్య పిల్లలతో కలిసి సీతమ్మధార ప్రాంతంలో నివాసముంటున్నారు. అతనికి అంగవైకల్యం కారణంగా పిల్లలను చూసుకోవడానికి, ఇంటి పనుల కోసం డ్రైవర్‌గా రామెళ్ల అప్పలరాజును పెట్టుకున్నాడు. అతడు నమ్మకంగా ఉండడంతో వారి మధ్య స్నేహం పెరిగింది. ఒక రోజు గిరీష్‌ను హోటల్‌కు తీసుకెళ్లి అమ్మాయిని పరిచయం చేశాడు. ఆమెతో సన్నిహితంగా ఉన్న దృశ్యాలను అప్పలరాజు మొబైల్లో చిత్రీకరించాడు. కొద్ది రోజుల తరువాత ఆ వీడియోలు సాయంతో గిరీష్‌ను బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడు. తనకు రూ.లక్ష ఇవ్వాలని లేదంటే ఫొటోలు సోషల్ మీడియాలోను, కుటుంబ సభ్యులకు పంపిస్తానని బెదిరించాడు. దీంతో పరువు పోతుందని భావించిన గిరీష్ తన బంధువు సిబ్బంది ద్వారా ఆ మొత్తాన్ని ఏర్పాటు చేసి ఆరు యూపీఐ లావాదేవీల ద్వారా డ్రైవర్‌కు బదిలీ చేశారు. చాలా కాలంగా గిరీష్‌తో పాటు అతని కుటుంబ సభ్యులను డ్రైవర్ అప్పలరాజు వేధిస్తూ వచ్చాడు. ఎప్పటికప్పుడు డబ్బులు తీసుకుంటున్నాడు. ఐఫోన్16 ప్లస్‌ను కూడా కొనుగోలు చేయించుకున్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరి 21న గిరీష్‌ను అప్పలరాజు కత్తితో బెదిరించి అతని వద్ద ఉన్న రూ.5 వేలు బలవంతంగా తీసుకున్నాడు. అలాగే గిరీష్ తన భార్య పేరు మీద కొనుగోలు చేసిన ఫ్లాట్‌ను కూడా కాజేయడానికి ప్రయత్నించాడు. అంతటితో ఆగకుండా గిరీష్ వీడియోలు అతని భార్యకు పంపించి ఆమెను సైతం వేధింపులకు గురి చేశాడు. వీరి పార్కింగ్ స్థలాన్ని ఆక్రమించి అక్కడ పోలీస్ స్టిక్కర్ ఉన్న కారును పార్క్ చేసేవాడు. డ్రైవర్ అప్పలరాజు వేధింపులను భరించలేక గిరీష్ చివరకు ద్వారకా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు అప్పలరాజును అరెస్టు చేసి గురువారం రిమాండ్‌కు పంపించారు. అతడి నుంచి నకిలీ పిస్టల్‌తో పాటు కొంత మొత్తంలో నగదు, కారు, ఫోన్ స్వా«దీనం చేసుకున్నారు.

బాండ్‌పేపర్‌పై సూసైడ్‌నోట్ రాసి..
సంగారెడ్డి జిల్లా: సమృద్ధి జీవన్ సంస్థలో ఏజెంట్‌గా చేసి, డిపాజిట్లు చేసిన వారికి తిరిగి చెల్లించేందుకు అప్పులు చేసి, వాటిని తీర్చలేక ఓ ఎల్ఐసీ ఏజెంట్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్.ఐ కాశీనాథ్, మృతుడి భార్య తుల్జమ్మ వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలంలోని అల్గోల్ గ్రామానికి చెందిన వెంకన్న (48) గురువారం సాయంత్రం గ్రామ శివారులో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వెంకన్న గతంలో సమృద్ధి యోజన సంస్థలో ఏజెంట్‌గా చేశాడు. ఈ క్రమంలో ప్రజల నుంచి పెద్దమొత్తంలో బాండ్లు (డిపాజిట్లు) కట్టించాడు. సంస్థను అర్ధాంతరంగా ఎత్తివేయడంతో ప్రజల వద్ద నుంచి సేకరించిన డిపాజిట్ డబ్బులు చెల్లించేందుకు బయట అప్పులు చేశాడు. ఇందుకోసం భూమిని సైతం తాకట్టు పెట్టాడు. చేసిన అప్పుల బాధలు పెరిగిపోవడం, రుణంతీర్చే దారిలేక జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వెంకన్న రాసిన సూసైడ్‌నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు జహీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. కాగా, వెంకన్న పెద్ద కుమార్తె పరమేశ్వరికి వివాహం కాగా, రెండో కుమార్తె ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. కుమారుడు ఎంబీఏ రెండో సంవత్సరం చదువుతున్నాడు. రూ.100 బాండ్ పేపర్‌పై సూసైడ్ నోట్ఆత్మహత్యకు పాల్పడే ముందు వెంకన్న బాండ్ పేపర్‌పై సూసైడ్ నోట్ రాశాడు. ‘టి.వెంకన్న తండ్రి అంజన్న గ్రా: అల్గోల్ అను నేను. అప్పుల బాధ భరించలేకపోతున్నాను. సమృద్ధి జీవన్ ఫౌండేషన్‌లో ఏజెంట్‌గా చేశాను. కస్టమర్లకు మొత్తం డబ్బు నేనే చెల్లించాను. దానివల్ల అప్పులు ఎక్కువై.. ఇప్పుడు ఇతరులకు అప్పుకట్టలేక పోతున్నాను. అప్పుల బాధ భరించలేక నేను సూసైడ్ చేసుకుంటున్నాను. నన్ను క్షమించండి. అప్పు ఇచ్చినవారిని క్షమాపణలు కోరకుంటున్నాను. శివుని దయతో మీకందరికి లాభం జరుగుతుంది. ఓం నమఃశివాయ’ అని రాసిపెట్టిన సూసైడ్ నోటును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.