Top Stories
ప్రధాన వార్తలు
బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి అరెస్టు
సాక్షి,హైదరాబాద్:బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి(Kaushik Reddy)ని పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం సాయంత్రం (జనవరి13) కౌశిక్‌రెడ్డిని జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్(Sanjaykumar)ను నెట్టివేసిన కేసులో కౌశిక్‌రెడ్డిని కరీంనగర్ వన్‌టౌన్ పోలీసులు(Karimnagar police) అరెస్టు చేశారు. అరెస్టు చేసిన అనంతరం కౌశిక్‌రెడ్డిని పోలీసులు కరీంనగర్‌కు తరలించారు. కరీంనగర్ కలెక్టరేట్లో జరిగిన సమావేశంలో ఆదివారం తనను కౌశిక్‌రెడ్డి దుర్భాషలాడుతూ నెట్టివేసిన వ్యవహారంలో పోలీసులకు ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తులో భాగంగా కౌశిక్‌రెడ్డిని అరెస్టు చేశారు. కాగా, కరీంనగర్ కలెక్టరేట్లో ఆదివారం జరిగిన ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధుల సమావేశంలో ఎమ్మెల్యేలు కౌశిక్‌రెడ్డి, సంజయ్‌కుమార్ మధ్య వాగ్వాదం జరిగింది. సంజయ్‌కుమార్ మాట్లాడుతుండగా కౌశిక్‌రెడ్డి కల్పించుకుని ఏ పార్టీలో గెలిచి ఏ పార్టీ తరపున మాట్లాడుతున్నావని ప్రశ్నించడంతో గొడవ పెద్దదైంది. ఈ క్రమంలోనే కౌశిక్‌రెడ్డి సంజయ్‌కుమార్‌పై చేయి వేసి ఆయను నెట్టివేశారు. అనంతరం సమావేశ మందిరం నుంచి కౌశిక్‌రెడ్డిని పోలీసులు లాక్కెల్లారు. ఈ సమావేశంలో మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కూడా ఉండడం గమనార్హం. ఈ ఘటనపై ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ కౌశిక్‌రెడ్డిపై కరీంనగర్ పోలీసులతో పాటు తన హక్కులకు భంగం కలిగించారని స్పీకర్‌కు కూడా రాత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ కేసులోనే కౌశిక్‌రెడ్డిని కరీంనగర్ పోలీసులు ప్రస్తుతం కౌశిక్‌రెడ్డిని అరెస్టు చేశారు. కౌశిక్ రెడ్డి అరెస్టు దారుణం:కేటీఆర్హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని అక్రమంగా అరెస్టుచేయడం అత్యంత దుర్మార్గమైన చర్యపూటకో అక్రమ కేసు పెట్టడం.. రోజుకో బీఆర్ఎస్ నేతను అన్యాయంగా అరెస్టుచేయడం రేవంత్ సర్కారుకు అలవాటుగా మారిందిముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి తన చేతకానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికే ఇలాంటి దిగజారుడు పనులకు దిగుతున్నారుపార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేను వెనకేసుకొచ్చి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని ఏకపక్షంగా అరెస్టుచేయడం పూర్తిగా అప్రజాస్వామికం
జపాన్‌లో భారీ భూకంపం..సునామీ హెచ్చరిక జారీ
టోక్యో:జపాన్(Japan)లో సోమవారం(జనవరి13) భారీ భూకంపం(EarthQuake) సంభవించింది. క్యుషు ప్రాంతంలో వచ్చిన ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.9గా నమోదైంది. 37 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్లు యురోపియన్ భూకంప పరిశోధనా కేంద్రం తెలిపింది. ఈ భూకంపం ధాటికి ఎలాంటి పప్రాణ, ఆస్తి నష్టాలు సంభవించలేదని సమాచారం. అయితే ముందు జాగ్రత్తగా కొన్ని తీర ప్రాంతాలకు సునామీ(Tsunami) హెచ్చరికలు జారీ చేశారు. గతేడాది ఆగస్టు 8న క్యుషు ప్రాంతంలో రెండు భారీ భూకంపాలు రాగా జనవరి 1 2024న 7.6 తీవ్రతతో సుజు,వజీమాలో భారీ భూకంపం సంభవించింది.ఈ భూకంపం ధాటికి ఏకంగా 300 మంది ప్రాణాలు కోల్పోయారు. పలు టెక్టానిక్ ప్లేట్లు కలిసే రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతంలో జపాన్ ఉండడంతో ఇక్కడ తరచు భూకంపాలు వస్తుంటాయి.
డైరెక్టర్ అసభ్యకర వ్యాఖ్యలు.. స్పందించిన మన్మథుడు హీరోయిన్
మన్మథుడు హీరోయిన్ అన్షు (Anshu)పై దర్శకుడు నక్కిన త్రినాధరావు (Trinadha Rao Nakkina) అసభ్యకర వ్యాఖ్యలు చేయడం తీవ్ర వివాదాస్పదంగా మారింది. ఆమె శరీరాకృతి గురించి అభ్యంతరకరంగా మాట్లాడటంతో మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అటు సోషల్ మీడియాలోనూ నెటిజన్లు దర్శకుడి తీరును ఎండగడుతున్నారు. దీంతో తప్పు తెలుసుకున్న త్రినాధరావు హీరోయిన్ అన్షుతో పాటు మహిళందరికీ క్షమాపణలు తెలిపిన విషయం తెలిసిందే!నాపై ఎంతో ప్రేమ చూపిస్తున్నారుతాజాగా ఈ వివాదంపై అన్షు స్పందించింది. ఆమె మాట్లాడుతూ.. ముందుగా మజాకా సినిమా టీజర్ (Mazaka Movie)ను ఇంతలా ఆదరిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. చాలాకాలం తర్వాత మిమ్మల్ని ఎంటర్టైన్ చేసేందుకు వస్తున్నాను. మీరు చూపిస్తున్న ప్రేమను ఎప్పటికీ మర్చిపోలేను. త్రినాధరావు చేసిన వ్యాఖ్యల గురించి చాలా కథనాలు వస్తున్నాయి. నాకెన్నో సలహాలు, సూచనలిచ్చారుమీ అందరికీ చెప్పాలనుకుంటున్నదేంటంటే.. ఈ ప్రపంచంలోనే ఆయన చాలా మంచి వ్యక్తి. నన్ను తన ఫ్యామిలీ మెంబర్లా చూసుకున్నారు. తనపై నాకు చాలా గౌరవం ఉంది. మజాకా సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నాను. త్రినాధ్ సర్‌తో కలిసి పని చేసినందుకు హ్యాపీగా ఉంది. తెలుగు ఇండస్ట్రీలో రీఎంట్రీ ఇవ్వడానికి నాకు ఇంతకంటే మంచి దర్శకుడు దొరకరేమో! ఆయన నాకెన్నో సలహాలు, సూచనలు ఇచ్చారు. తనపై నాకు ప్రేమ, గౌరవం తప్ప ఎలాంటి కోపం లేదు. దయచేసి ఈ వివాదాన్ని ఇక్కడితే ఆపేయండి' అని కోరింది.(చదవండి: త్వరలోనే తల్లి కాబోతున్న హీరోయిన్.. ఘనంగా సీమంతం)రెండు దశాబ్దాల తర్వాత రీఎంట్రీహీరోయిన్ అన్షు అప్పట్లో వచ్చిన మన్మథుడు సినిమాలో అందంతో, అమాయకత్వంతో ఆకట్టుకుంది. తర్వాత ప్రభాస్‌తో రాఘవేంద్ర సినిమా చేసింది. పెళ్లి తర్వాత లండన్‌లోనే సెటిలైపోయి సినిమాలకు దూరంగా ఉంటోంది. దాదాపు 20 ఏళ్ల తర్వాత మజాకా మూవీతో అన్షు రీఎంట్రీ ఇస్తోంది. ఈ సినిమాలో అన్షుతో పాటు సందీప్ కిషన్, రీతూ వర్మ, రావు రమేశ్ ప్రధాన పాత్రల్లో నటించారు. కథ, డైలాగ్స్ ప్రసన్న కుమార్ బెజవాడ అందించగా త్రినాధ రావు దర్శకత్వం వహించాడు.టీజర్ లాంచ్ ఈవెంట్లో అసభ్యకర వ్యాఖ్యలుఆదివారం (జనవరి 12న) మజాకా సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమంలో దర్శకుడు త్రినాధరావు హీరోయిన్ అన్షుపై నోరు జారాడు. మొదటగా ఆమెకు పెద్ద అభిమానిని అన్నట్లుగా ప్రసంగం మొదలుపెట్టిన ఈయన చివరకు వచ్చేసరికి మాత్రం ఆమె శరీరాకృతి గురించి అసభ్య వ్యాఖ్యలు చేశాడు. అన్షు సన్నగా ఉందని.. ఇలా ఉంటే సరిపోదు.. లావెక్కాలి.. అంటూ అసహ్యకరంగా మాట్లాడాడు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన మహిళా కమిషన్ త్రినాధరావు వ్యాఖ్యలను సుమోటోగా తీసుకుంది. ఇక ఇదే ఈవెంట్లో హీరోయిన్ రీతూ వర్మ పేరు మర్చిపోయినట్లు నాటకం ఆడాడు త్రినాధరావు. దీనిపై కూడా నెట్టింట విమర్శలు వచ్చాయి. మజాకా సినిమా విషయానికి వస్తే ఇది వచ్చే నెల 21న విడుదల కానుంది.చదవండి: హీరోయిన్‌పై అసభ్యకర వ్యాఖ్యలు.. డైరెక్టర్‌పై మహిళా కమిషన్ ఆగ్రహం
జాతీయ పసుపు బోర్డు చైర్మన్‌గా పల్లె గంగారెడ్డి
సాక్షి,న్యూఢిల్లీ:జాతీయ పసుపు బోర్డు(Turmeric Board) ఛైర్మన్‌గా తెలంగాణ వాసి పల్లె గంగారెడ్డి(Palle Gangareddy) నియమితులయ్యారు. మూడేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం(Central Government) సోమవారం(జనవరి 13) నోటిఫికేషన్ విడుదల చేసింది. పల్లె గంగారెడ్డి నిజామాబాద్ జిల్లా అంకాపూర్ వాసి. సంకక్రాంతి వేళ పసుపు రైతులకు శుభవార్త చెప్పేందుకే కేంద్ర ప్రభుత్వం పసుపు బోర్డును నోటిఫై చేసిందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.పసుపు బోర్డు చైర్మన్‌గా పల్లె గంగారెడ్డిని నియమించడంపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ స్పందించారు. ఇది చాలా గొప్ప శుభవార్త అని పేర్కొన్నారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని నిజామాబాద్ కేంద్రంగా మంగళవారం నుంచే పసుపు బోర్డు కార్యకలాపాలు ప్రారంభమవుతాయని అర్వింద్ తెలిపారు. గతంలో పసుపుబోర్డుపై నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ రాజకీయాలు నడిచాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో పసుపు బోర్డు హామీతోనే బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ గెలుపొందారు. అయితే 2024 ఎన్నికల వరకు పసుపు బోర్డు కాకపోయినప్పటికీ స్పైసెస్ బోర్డు కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లోనూ తిరిగి ధర్మపురి అర్వింద్ బీజేపీ తరపున ఎంపీగా గెలిచారు. ఎట్టకేలకు 2025లో సంక్రాంతి సందర్భంగా పసుపు బోర్డును కేంద్రం నోటిఫై చేసింది.
నలుగురిని కంటే రూ.లక్ష బహుమతి: పరశురాం బోర్డు
భోపాల్:మధ్యప్రదేశ్(MadhyaPradesh)లో పరశురామ్ కల్యాణ్ బోర్డు(Parashuram Kalyan Board) ఓ ఆసక్తికర ప్రకటన చేసింది. తమ సామాజికవర్గాన్ని పెంచుకునేందుకు బ్రాహ్మణులు ఎక్కువ మంది పిల్లలను కనాలిని పిలుపునిచ్చింది. సోమవారం(జనవరి13) జరిగిన ఓ కార్యక్రమంలో పరశురామ్ కల్యాణ్ బోర్డు అధ్యక్షుడు పండిత్ విష్ణు రాజోరియా ఈ మేరకు ఓ ప్రకటన చేశారు.మనం మన కుటుంబాలపై దృష్టి పెట్టడం లేదని,ఈ మధ్య యువత ఒక బిడ్డతో సరిపెడుతున్నారన్నారు. ఇది చాలా సమస్యాత్మకంగా మారిందన్నారు. భవిష్యత్ తరాన్ని కాపాడాల్సిన బాధ్యత మనదేనన్నారు. అందుకే కనీసం నలుగురు సంతానం ఉండాలని పిలుపునిచ్చారు.నలుగురు పిల్లల్ని కనే మహిళలకు బోర్డు తరఫున రూ.లక్ష నజరానా అందిస్తామని ప్రకటించారు.తాను బోర్డు అధ్యక్షుడిగా దిగిపోయిన తర్వాత కూడా ఈ అవార్డు కొనసాగుతుందని రాజోరియా స్పష్టం చేశారు.రాజోరియా చేసిన ప్రకటన ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఇదీ చదవండి: ఇంటి నుంచే కుంభమేళా స్నానం..ఎలాగంటే..
‘నల్ల పెట్టె’ మౌనరాగం!
బ్లాక్ బాక్స్... చూసేందుకు నల్ల రంగులో ఉండదు. ‘డెత్ కోడ్’ను రహస్యంగా తనలో దాచుకుంటుంది. ఈ బాక్స్ ఒకటి కూడా కాదు. నిజానికి రెండు పెట్టెలు! విమానం కూలిపోతే అందరి కళ్లూ దానికోసమే చూస్తాయి. రికవరీ బృందాలు దాని వేటలో నిమగ్నమవుతాయి. అది దొరికితే చాలు... ప్రమాద కారణాలు తెలిసినట్టే. ఆ తప్పులు, లోపాలు పునరావృతమవకుండా జాగ్రత్తపడితే భవిష్యత్ ప్రమాదాలను నివారించవచ్చు. విమానయానాన్ని అందరికీ సురక్షితం చేయవచ్చు.గాలిలో ప్రయాణం గాలిలో దీపం. రన్ వే మీది నుంచి పైకి ఎగిరిన విమానం మళ్లీ క్షేమంగా కిందికి దిగేదాకా టెన్షనే. వైమానిక దుర్ఘటనలకు కారణాలు తెలియాలంటే, కచ్చితమైన ఆధారాలు కనుగొనాలంటే తొలుత దాని బ్లాక్ బాక్స్ పరిశోధకుల చేతికి చిక్కాలి. అందుకే దర్యాప్తు సంస్థలు ముందుగా దాని అన్వేషణ కోసం రంగంలోకి దిగుతాయి. బ్లాక్ బాక్స్ వాస్తవానికి రెండు భాగాలు. అవి ఫ్లైట్ డేటా రికార్డర్ (ఎఫ్డీఆర్), కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ (సీవీఆర్). వీటిని ఫ్లైట్ రికార్డర్స్ అంటారు. బ్లాక్ బాక్స్ పేరుకు తగ్గట్టుగా ఇవి నల్ల రంగులో ఉండవు! ప్రమాద స్థలిలో సులభంగా గుర్తుపట్టగలిగేలా ప్రకాశవంతమైన ఆరెంజ్ రంగులో ఉంటాయి.విమానం కూలిపోయినప్పుడు ఆ నష్ట ప్రభావం దాని తోకభాగంపై స్వల్పంగా పడుతుంది. అందుకే కీలక డేటా నిక్షిప్తమైన బ్లాక్ బాక్స్ సురక్షితంగా ఉండేలా దాన్ని విమానం తోక భాగంలో అమర్చుతారు. సెకన్ల వ్యవధిలో ఎఫ్డీఆర్ దాదాపు వెయ్యి పరామితులను నమోదు చేస్తుంది. ప్రమాద సమయంలో విమానం ఎంత ఎత్తులో, ఎంత వేగంతో ఎగురుతోంది? ఇంజిన్ పనితీరు ఎలా ఉంది? ప్రయాణ మార్గం, దిశ వంటి వివరాలను అది నమోదు చేస్తుంది. ఎయిర్ ట్రాఫిక్ నియంత్రణ కేంద్రానికి పైలట్లు పంపిన, స్వీకరించిన సమాచారమేంటి? పైలట్ల సంభాషణలు, విమానంలోని కాక్‌పిట్ శబ్దాలు వంటి వివరాలను సీవీఆర్ రికార్డు చేస్తుంది.విమాన ప్రమాదాలకు దారితీసిన కారణాలేమిటి? దుర్ఘటన చివరి నిమిషాల్లో ఎలాంటి మార్పులు సంభవించాయి? అనే వివరాలను బ్లాక్ బాక్స్ మాత్రమే వెల్లడించగలదు. ఫ్లైట్ రికార్డర్ల డేటాను విశ్లేషించి ప్రమాద హేతువులపై పరిశోధకులు ఓ అంచనాకు వస్తారు. మరి దర్యాప్తులో ఇంత కీలకమైన ఈ ‘నల్ల పెట్టె’… తాను మాట్లాడబోనంటూ అప్పుడప్పుడు మొండికేస్తుంది. కావాల్సిన డేటా ఇవ్వకుండా మొరాయించి ఇన్వెస్టిగేటర్లను ముప్పుతిప్పలు పెడుతుంది. క్లిష్ట సమయాల్లో రహస్యాలు బయటికి చెప్పకుండా మూగనోము పడుతుంది. దక్షిణ కొరియాకు చెందిన ‘జెజు ఎయిర్’ విమానం గత నెల 29న కూలిపోయి ఇద్దరు మినహా 179 మరణించిన సంగతి తెలిసిందే. ఆ విమానం కూలడానికి నాలుగు నిమిషాల ముందు నుంచే అందులోని ఫ్లైట్ రికార్డర్లు పనిచేయడం మానివేశాయి. దాంతో ఆ దుర్ఘటన దర్యాప్తు ప్రస్తుతం క్లిష్టంగా మారింది. దక్షిణ కొరియా విమానంలోని బ్లాక్ బాక్స్ ఎందుకు విఫలమైంది? బ్లాక్ బాక్సులు ఇలా విఫలమైన సందర్భాలు గతంలో ఉన్నాయా? అందుకు దారితీసే కారణాలేంటి? ఈ సమస్యను అధిగమించేదేలా? వివరాలు మీకోసం... వైఫల్యానికి కారణాలివీ...బ్లాక్ బాక్సులో భాగమైన రెండు ఫ్లైట్ రికార్డర్ల బరువు సుమారు 4.5 కిలోల దాకా ఉంటుంది. గురుత్వశక్తి కంటే 3,400 రెట్ల అధిక శక్తితో విమానం కూలుడు సంభవించినా బ్లాక్ బాక్స్ తట్టుకోగలదు. వెయ్యి డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతనూ కొంతసేపు భరించగలదు. విమానం సముద్రంలో కూలినా తానెక్కడున్నదీ తెలిపేలా హై పిచ్ శబ్దాలతో బ్లాక్ బాక్స్ 90 రోజులపాటు సంకేతాలు పంపగలదు. నీటిలో 20 వేల అడుగుల లోతులోనూ 30 రోజులు పనిచేయగలదు. దానిలోని కీలక డేటా, ఆడియో చెరిగిపోకుండా టెక్నీషియన్లు జాగ్రత్తగా వివరాలు సేకరిస్తారు. డేటాను డౌన్లోడ్ చేసుకుని కాపీ చేస్తారు. అనంతరం డేటాను డీకోడ్ చేసి గ్రాఫ్స్ రూపొందిస్తారు. సర్క్యూట్ పాడవటం, సెన్సర్లు విఫలమవడం తదితర సాంకేతిక అవరోధాలు, సాఫ్ట్వేర్ (Software) లోపాలు తలెత్తినప్పుడు బ్లాక్ బాక్సులు పనిచేయవు.ప్రమాద తీవ్రత విపరీతంగా ఉండి భౌతికంగా ధ్వంసమైనప్పుడు వాటిపై ఆశ వదిలేసుకోవాల్సిందే. విమాన సిబ్బంది ఉద్దేశపూర్వకంగా డీ-యాక్టివేట్ చేసినప్పుడు అవి పనిచేయడం మానివేస్తాయి. డేటా ఓవర్ లోడ్ (Overload) అయినప్పుడు కూడా అవి మొరాయిస్తాయి. కొన్ని పాత బ్లాక్ బాక్సుల్లో నిర్ణీత కాలం తర్వాత డేటా ఓవర్ రైట్ అయిపోతుంది. ఫలితంగా వాటి నుంచి ఎలాంటి సమాచారం లభించదు. నిరుడు జనవరిలో అలస్కా ఎయిర్‌లైన్స్ (airlines) బోయింగ్ విమానం ప్రయాణ సమయంలో దాని తలుపు ఊడినప్పుడు (డోర్ ప్లగ్ బ్లో-అవుట్) సీవీఆర్ పూర్తిగా ఓవర్ రైట్ అయింది. దాని నుంచి డేటా లభ్యం కాలేదు. అత్యుష్ణ లేదా అత్యల్ప ఉష్ణోగ్రతలు, నీటిలో ఎక్కువ కాలం నానడం వల్ల కూడా ఫ్లైట్ రికార్డర్లు పాడవుతాయి. తేమ చేరుకుని సున్నిత భాగాల్లోని ఎక్విప్మెంట్ దెబ్బతిని షార్ట్ సర్క్యూట్ కావడం, అత్యధిక ఎత్తుల్లోని పీడనం, పక్షులు ఢీకొనడం, పిడుగుపాట్లు వంటి వాటి వల్ల కూడా బ్లాక్ బాక్సులు పనిచేయకపోవచ్చు. పదేళ్లుగా జాడ లేని మలేసియా విమానం!ఫ్లైట్ రికార్డర్ల సామర్థ్యంపై కొన్నేళ్లుగా చర్చ సాగుతోంది. ఆవశ్యకత ఎంతో ఉన్నా ఖర్చు, పరిమితుల దృష్ట్యా వాటి సామర్థ్యం పెంపు అంశంలో కొంత జాప్యం సంభవిస్తోంది. అత్యవసర సందర్భాల్లో ఫ్లైట్ రికార్డర్లు పనిచేయాలంటే వాటికి విమానంలోని సాధారణ సిస్టమ్స్ నుంచి కాకుండా వేరే వ్యవస్థల నుంచి పవర్ సరఫరా తప్పనిసరి. విమానంలోని రెండు ఇంజిన్లూ విఫలమైనప్పుడు విమానం అంతటా ఎలక్ట్రికల్ పవర్ నిలిచిపోతుంది. 1999లో న్యూయార్క్ నుంచి కైరో వెళుతున్న ‘ఈజిప్ట్ ఎయిర్’ విమానం అట్లాంటిక్ మహాసముద్రంలో కూలిపోయి అందులోని 217 మంది మరణించారు. ఈ విమానంలో ఆన్‌బోర్డ్ (onboard) ఎలక్ట్రికల్ పవర్ ఆగిపోగానే ఫ్లైట్ రికార్డర్లు పనిచేయడం మానివేశాయి.విమానం లోపల సాధారణ అవసరాలకు సరఫరా అయ్యే కరెంటుపై ఆధారపడకుండా ఫ్లైట్ రికార్డర్లు మరో 10 నిమిషాలపాటు అదనంగా రికార్డింగ్ చేయడానికి వీలుగా ప్రత్యామ్నాయ బ్యాకప్ పవర్ ఏర్పాట్లు ఉండాలని సదరు ప్రమాదం దరిమిలా అమెరికా జాతీయ రవాణా సేఫ్టీ బోర్డు సిఫార్సు చేసింది. బ్లాక్ బాక్సులకు బ్యాకప్ బ్యాటరీలున్నా వాటి జీవితకాలం తక్కువ. ఆ బ్యాటరీలు కొన్ని సందర్భాల్లో పనిచేయవు. దక్షిణ కొరియా ‘జెజు ఎయిర్’ విమానంలోనూ విద్యుత్ వ్యవస్థ విఫలమవడంతో ఫ్లైట్ రికార్డర్లకు పవర్ అందక అవి పనిచేయడం మానివేసి ఉంటాయని భావిస్తున్నారు.ఇక సీవీఆర్ విషయానికొస్తే అది సాధారణంగా ఒక విడతలో గరిష్ఠంగా రెండు గంటలపాటు మాత్రమే రికార్డు చేయగలదు. ఆ రెండు గంటల్లో రికార్డయిన డేటానే అది రిపీట్ చేస్తుంది. ఈ రికార్డింగ్ నిడివిని 25 గంటలకు పెంచాలనేది ఎప్పట్నుంచో వినిపిస్తున్న డిమాండ్. ఇది ప్రస్తుతం కార్యరూపం దాలుస్తోంది. 2009లో ఎయిర్ ఫ్రాన్స్ ఫ్లైట్ 447 రియో డి జెనీరో (బ్రెజిల్) నుంచి ప్యారిస్ వెళుతూ నడి అట్లాంటిక్ మహాసముద్రంలో కూలిపోయి విమానంలోని 228 మంది చనిపోయారు. ఇక మలేసియా ఎయిర్‌లైన్స్ (airlines) ఎంహెచ్ 370 ఫ్లైట్ వ్యధ... ఇప్పటికీ అంతు లేని కథ! 2014లో కౌలాలంపూర్ నుంచి బీజింగ్ ప్రయాణిస్తూ అకస్మాత్తుగా రాడార్ తెర మీది నుంచి ఆ విమానం అదృశ్యమైంది.అందులోని 239 మందీ మరణించారని భావిస్తున్నారు. విమానం అలా ఎందుకు అదృశ్యమైందో ఇప్పటికీ అంతుచిక్కలేదు. వైమానిక చరిత్రలో అదొక పెద్ద మిస్టరీ. ఆ విమానం ఏమైపోయిందో కనుక్కోవడానికి బోలెడు వ్యయమైంది. ఆ అన్వేషణ ఇప్పటికీ కొనసాగుతుండటం విశేషం. ఆ విమానం దక్షిణ హిందూమహాసముద్రంలో కూలి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. దాని జాడ కనుగొనేందుకు అన్వేషణ పునః ప్రారంభించాలని మలేసియా తాజాగా నిర్ణయించింది. ‘ఎయిర్ ఫ్రాన్స్’ విమానం దుర్ఘటన దరిమిలా... మహాసముద్రాలను దాటి దూర ప్రయాణాలు చేసే ట్రాన్స్-ఓషనిక్ ఫ్లైట్స్ విషయంలో కాక్‌పిట్ వాయిస్ రికార్డర్లో 25 గంటల వాయిస్ డేటా రికార్డింగ్ ఉండాల్సిందేనని ఫ్రాన్స్ సిఫార్సు చేసింది.మలేసియా ఎయిర్‌లైన్స్ విమానం అదృశ్యంతో ఆ సిఫార్సుకు ప్రాముఖ్యం ఏర్పడింది. ఈ దిశగా అమెరికా కూడా ముందడుగు వేసింది. కాక్‌పిట్ వాయిస్ రికార్డర్లో 25 గంటల రికార్డింగును తమ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ రీ-ఆథరైజేషన్ చట్టంలో చేర్చింది అమెరికా. అయితే కొత్తగా తయారయ్యే విమానాల్లోనే ఈ మార్పులకు వీలవుతోంది. ఇప్పుడు తిరుగుతున్న చాలా విమానాల జీవిత కాలం 40-50 ఏళ్లు. పాత విమానాల్లో సీవీఆర్ రికార్డింగ్ వ్యవధి పెంపు సాధ్యపడటం లేదు.కొత్త టెక్నాలజీతో బ్లాక్ బాక్సులు!తాజా సవాళ్లు, మారిన సాంకేతికత నేపథ్యంలో అధునాతన రీతిలో సరికొత్త బ్లాక్ బాక్సులకు రూపకల్పన జరుగుతోంది. ఎక్కువ గంటల రికార్డింగ్, అధిక డేటా స్టోరేజి, బ్యాకప్ బ్యాటరీల జీవిత కాలం పెంపు వంటివి ఇందులోని ప్రధానాంశాలు. విమానాల కూలుళ్ల తీవ్రత ఎంత ఎక్కువగా ఉన్నా సమర్థంగా పనిచేసే బ్లాక్ బాక్సులూ రాబోతున్నాయి. విమానాలు సముద్రాల్లో కూలిపోయే మెరైన్ ప్రమాదాల్లో రికవరీ బృందాలు తక్కువ శ్రమతో సత్వరం బ్లాక్ బాక్సును గుర్తించేలా మెరుగుపరచిన ‘అండర్ వాటర్ లొకేటర్ బీకాన్స్ అభివృద్ధి దశలో ఉన్నాయి. దీంతోపాటు అతి ముఖ్యమైన రియల్ టైమ్ డేటాను గ్రౌండ్ స్టేషన్లకు ప్రసారం చేసే కొత్త డిజైన్లతో బ్లాక్ బాక్సులు రూపుదిద్దుకుంటున్నాయి. విమానానికి సంబంధించిన కీలక సమాచారం ఎప్పటికప్పుడు గ్రౌండ్ స్టేషనుకు చేరుతుంది కనుక ఒకవేళ ప్రమాదంలో బ్లాక్ బాక్స్ భౌతికంగా నాశనమైనా పెద్దగా ఎలాంటి ఇబ్బంది ఉండబోదు. - జమ్ముల శ్రీకాంత్
భట్టి విక్రమార్కకు హరీశ్‌రావు ఛాలెంజ్
సాక్షి,సంగారెడ్డి: కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ ఏమైందని మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. సంగారెడ్డిలో హరీశ్‌రావు సోమవారం(జనవరి13) మీడియాతో మాట్లాడారు. ‘కాంగ్రెస్ ప్రభుత్వం ఎగవేతల ప్రభుత్వం.రూ.15వేలు రైతు భరోసా ఇస్తామని మోసం చేశారు. రుణమాఫీకి నవంబర్ 30న సీఎం రేవంత్ ఇచ్చిన చెక్కు ఏమైంది.వ్యవసాయ కూలీలకు రూ.15వేలు ఇస్తామని చెప్పి ఇప్పుడేమో సెంటు భూమి ఉన్నా ఇవ్వబోమంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ఎలా మోసం చేస్తోందో పండుగకు ఊళ్లకు వెళ్లేవారు రైతులకు చెప్పాలి. కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలన్నీ మోసాలే. కాంగ్రెస్ మోసాలపై పోరాడాల్సిన సమయం వచ్చింది’అని హరీశ్‌రావు అన్నారు. భట్టి గోబెల్స్‌ను మించి పోతున్నారు: ఆయనకిదే నా ఛాలెంజ్..రైతు ప్రభుత్వంగా చెప్పుకునే కాంగ్రెస్ రైతులను దగా చేస్తోందిసీఎం మాటలు కోటలు దాటుతున్నాయికానీ చేతలు గడప దాటడం లేదు2750 కోట్ల రూపాయలు చెక్కుని రుణమాఫీ కోసం నవంబర్ 30న సీఎం రేవంత్ ఇచ్చారుసీఎం రేవంత్ ఇచ్చిన చెక్కు డమ్మీది కావచ్చు..లేదా దారి తప్పిపోయిందా..?రైతులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న దగాని ప్రజలు గమనించాలికేసీఆర్ రైతుల కడుపులో సల్ల కదలకుండా చూసుకుంటే 13 నెలల్లో సీఎం రేవంత్ రైతులను ముప్పుతిప్పలు పెడుతున్నాడుకాంగ్రెస్ పథకాల తీరు అయితే ఎగవేతలు లేకపోతే కోతలురైతులందరూ కలిసి ఉద్యమానికి సిద్ధం కావాలికాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి... మనకి రావాల్సిన పథకాలు తీసుకుందాంఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అంటే దళిత గిరిజన రైతుల పొట్ట కొట్టుడేనా..?కోటి మంది కూలీలు ఉంటే 10 లక్షల మందికే పథకాన్ని ఇస్తామని చెబుతున్నారుమాట తప్పినందుకు సీఎం రేవంత్ రైతులకు, కూలీలకు క్షమాపణ చెప్పాలిగ్రామసభలు పెడితే మీపై కూలీలు తిరగబడతారు జాగ్రత్తఎకరం లోపు భూమి ఉన్నవారిని కూడా కూలీలుగా గుర్తించి వారికి రూ. 12 వేలు ఇవ్వాల్సిందేఆర్ధికమంత్రి భట్టి విక్రమార్క గోబెల్స్ ని మించిపోతున్నారుపూటకో తీరుగా ఆయన మాట్లాడుతున్నారునిన్న నాగర్ కర్నూల్ లో బీఆర్ఎస్ హయాంలో ఒక్క ప్రాజెక్టు పూర్తికాలేదు అని అంటున్నారుమేము మహబూబ్‌నగర్ జిల్లాలోనే 600 లక్షల ఎకరాలకు నిరిచ్చాంభట్టి వ్యాఖ్యలపై నేను బహిరంగ చర్చకు సిద్ధం...ఎక్కడికి రమ్మంటే అక్కడకు వస్తాఇదీ చదవండి: బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై నాలుగు కేసులు
తెలుగు ప్రజలకు వైఎస్ జగన్ సంక్రాంతి శుభాకాంక్షలు
సాక్షి, తాడేపల్లి: తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా తెలుగు ప్రజలకు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పారు. ఈ పండుగ అందరి కుటుంబాల్లో భోగ భాగ్యాలు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తెలిపారు.వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా తెలుగు ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా వైఎస్ జగన్.. తెలుగువారి సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక సంక్రాంతి. ఈ పండుగ అందరి కుటుంబాల్లో భోగ భాగ్యాలు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు చెప్పారు. తెలుగువారి సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక సంక్రాంతి. ఈ పండుగ అందరి కుటుంబాల్లో భోగ భాగ్యాలు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు.— YS Jagan Mohan Reddy (@ysjagan) January 13, 2025
మోదీ జీ.. వారిని ఎప్పుడు ఓబీసీల్లో చేరుస్తారో చెప్పండి?
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా అటు ఆప్ ప్రభుత్వం, ఇటు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీజేపీలు ఎక్కడా కూడా తగ్గడం లేదు. కౌంటర్‌కు రీ కౌంటర్ అన్నట్లు వారి ప్రచారం సాగుతోంది. రోజూ ఏదో కొత్త అంశంపై వీరి ప్రచారం జోరు సాగుతోంది. అయితే దీనిలో భాగంగా ప్రధాని మోదీకి లేఖాస్త్రం సంధించారు ఢిల్లీ మాజీ సీఎం, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal). ఇందులో ఢిల్లీలోని జాట్ కమ్యూనిటీని కేంద్రం ఎప్పుడుఓబీసీ జాబితాలో చేరుస్తారో చెప్పాలంటూ ప్రశ్నించారు కేజ్రీవాల్,ఈ మేరకు ఒక సుదీర్ఘనమైన లేఖను ప్రధాని మోదీకి రాసినట్లు కేజ్రీవాల్ తెలిపారు. కేజ్రీవాల్ ‘ జాట్స్ కమ్యూనిటీని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వ ఓబీసీ జాబితాలో చేర్చాం. కానీ కేంద్ర ప్రభుత్వం జాబితాలో వారిని ఇంకా ఓబీసీ జాబితాలో చేర్చలేదు. ఒకవేళ ఇలా చేస్తే రాజస్తాన్ నుంచే వచ్చే జాట్స్ ఢిల్లీ యూనివర్శటీల్లో అడ్మిషన్లు పొందడంతో పాటు, ఎయిమ్స్‌లో జాబ్స్‌కూ పొందవచ్చు. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని అన్మి సంస్థల్లో ఉపాధి అవకాశాలు పొందే అవకాశం ఉంటుంది. కేవలం ఇది ఢిల్లీలోని జాట్స్‌కు మాత్రమే ఇలా ఉండకూడదు కదా? అని డిమాండ్ చేశారుమీరు ప్రామిస్ చేశారు.. మరిచిపోయారా?దేశంలోని జాట్స్ కమ్యూనిటీని ఓబీసీల్లో చేర్చుతామని మీరే ప్రామిస్ చేశారు. బీజేపీలో ఇద్దరు అగ్రనేతలు హామీ ఇచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi), కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit Shah), జాట్స్‌కు ప్రామిస్ చేశారు. వారిని కేంద్ర స్థాయిలో ఓబీసీల్లో చేర్చుతామని హామీలు అయితే ఇచ్చారు కానీ దాన్ని ఇంకా అమలు చేయలేదు. ఆ హామీ ఇంకా అసంపూర్ణంగానే ఉండిపోయింది’ అని ఆరోపించారు కేజ్రీవాల్మోదీ జీ, అమిత్ షాలను అడుగుతున్నా..ఈ హామీ ఇచ్చిన ప్రధాని మోదీని, అమిత్ షాలను అడుగుతున్నాను. జాట్స్ కమ్యూనిటీని ఎప్పుడు కేంద్ర ఓబీసీ జాబితాలో చేర్చుతారో చెప్పండి. ఈ విషయంలో జాట్ నాయకులు నన్ను కలిశారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దీనిపై ఇప్పటివరకూ నోరు మెదపకపోవడం వారు ఆగ్రహంతో ఉన్నారు. గత పదేళ్ల నుంచి తమకు అన్యాయం జరుగుతూనే ఉందని వారు ఆరోపిస్తున్నారు’ అని కేజ్రీవాల్ స్పష్టం చేశారు.మీరు మురికివాడలను బాగు చేయండి..ఢిల్లీలో అన్ని మురికివాడల కంటే.. కేజ్రీవాల్ సీఎంగా ఉన్న సమయంలో నివసించిన శీష్ మహల్ టాయిలెట్ల ఖరీదే ఎక్కవంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను కేజ్రీవాల్ తిప్పికొట్టారు. మీరు మురికివాడ(Delhi Slums)లను బాగు చేస్తే, తాను ఎన్నికల్ల్లో పోటీచేయనంటూ సవాల్ విసిరారు. ఢిల్లీలోని మురికివాడల కూల్చివేతలపై కేసులను ఉపసంహరించుకోవడంతో పాటు వారికి పునరావాసం కల్పిస్తే తాను ఎన్నికల్లో పోటీ చేయడాన్ని విరమించుకుంటానన్నారు.‘మీరు మురికివాడల ప్రజలపై నమోదు చేసిన కేసులను ఉపసంహరించుకోండి. దీనిపై కోర్టులో అఫిడవిట్ దాఖలు చేయండి. ఇళ్లు కోల్పోయిన మురికివాడ ప్రజలందరికీ అదే స్థలంలో ఇళ్లు నిర్మించండి. అప్పుడు నేను ఎన్నికల్లో పోటీ చేయాల్సిన అవసరమే ఉండదు. ఈ నా చాలెంజ్ మీరు స్వీకరిస్తారా? అని ధ్వజమెత్తారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 5 వ తేదీన జరుగనున్న సంగతి తెలిసిందే.
బంగ్లాదేశ్‌కు భారత్ కౌంటర్..రాయబారికి సమన్లు
న్యూఢిల్లీ:బంగ్లాదేశ్(Bangladesh) నుంచి భారత్(India)లోకి చొరబాట్లను అడ్డుకునేందుకు సరిహద్దులో కంచె నిర్మాణంపై బంగ్లాదేశ్ అభ్యంతరం వ్యక్తం చేసింది.ఈ నేపథ్యంలో భారత హైకమిషనర్ ప్రణయ్ వర్మను బంగ్లాదేశ్ విదేశాంగశాఖ ఆదివారం పిలిచి వివరణ కోరింది.ఈ వ్యవహారంపై భారత్ కూడా ధీటుగా స్పందించింది. ఢిల్లీలోని బంగ్లాదేశ్ డిప్యూటీ హైకమిషనర్ నురల్ ఇస్లామ్‌కు విదేశాంగశాఖ సమన్లు జారీ చేసింది.దీంతో ఆయన సోమవారం(జనవరి13) విదేశాంగశాఖ కార్యాలయానికి చేరుకుని వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది.సరిహద్దులో అయిదుచోట్ల కంచెల ఏర్పాటుకు భారత్ ప్రయత్నిస్తోందని,ఇది రెండు దేశాల మధ్య ఉన్న ద్వైపాక్షిక ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని బంగ్లాదేశ్ ఇప్పటికే ఆరోపణలు చేసింది.ఆరోపణలు చేసిన కొన్ని గంటల్లోనే భారత హైకమిషనర్ ప్రణయ్ వర్మ(Pranay Verma)కు బంగ్లాదేశ్ సమన్లు జారీ చేసింది. బంగ్లాదేశ్‌కు వివరణ ఇచ్చిన అనంతరం వర్మ మీడియాతో మాట్లాడుతూ కంచెల విషయంలో రెండు దేశాల రక్షణ దళాలు బీఎస్ఎఫ్,బీజీబీ (బార్డర్ గార్డ్ బంగ్లాదేశ్)లు ఓ అవగాహనతో ఉన్నాయన్నారు.సరిహద్దు వెంట నేరాల నియంత్రణకు ఈ అవగాహన కొనసాగుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.
పేరు మార్చుకున్న హీరో.. ఇకపై అలా పిలవొద్దంటూ..
జాతీయ పసుపు బోర్డు చైర్మన్‌గా పల్లె గంగారెడ్డి
సులభతర వ్యాపారానికి పది చర్యలు
మహా కుంభమేళాకు సైబర్ భద్రత
డైరెక్టర్ అసభ్యకర వ్యాఖ్యలు.. స్పందించిన మన్మథుడు హీరోయిన్
నాలుగు నెలల కనిష్ఠానికి రిటైల్ ద్రవ్యోల్బణం
బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి అరెస్టు
120 మంది అనాథలను దత్తత తీసుకున్న మంచు విష్ణు
జపాన్‌లో భారీ భూకంపం..సునామీ హెచ్చరిక జారీ
కేన్ విలియమ్సన్కు అవమానం
తిరుమల లడ్డూ కౌంటర్ల వద్ద అగ్నిప్రమాదం
సాక్షి కార్టూన్ 13-01-2025
టికెట్ రేట్ల విషయంలో ప్రైవేట్ ట్రావేల్స్ నిలువు దోపిడీ చేశారు మామయ్య!
డెలివరీ తర్వాత వీల్‌చైర్‌కు పరిమితం.. జీవితాంతం ఇంజక్షన్స్..!
ర్యాంకు ఆధారంగా ఇందిరమ్మ ఇల్లు
26 నుంచి రేషన్ కార్డుల జారీ
ఇదెక్కడి ఫామ్ రా సామీ.. 6 ఇన్నింగ్స్‌ల్లో 5 సెంచరీలు.. ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో చోటిస్తారా..?
తిరుమలలో ‘లక్ష్మణ’ లీలలు!
ఈ రాశి వారికి కుటుంబసౌఖ్యం. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. శ్రమకు ఫలితం కనిపిస్తుంది.
తల్లే కూతురు పెళ్లిని ఆపేసింది..! ట్విస్ట్ ఏంటంటే..
పేరు మార్చుకున్న హీరో.. ఇకపై అలా పిలవొద్దంటూ..
జాతీయ పసుపు బోర్డు చైర్మన్‌గా పల్లె గంగారెడ్డి
సులభతర వ్యాపారానికి పది చర్యలు
మహా కుంభమేళాకు సైబర్ భద్రత
డైరెక్టర్ అసభ్యకర వ్యాఖ్యలు.. స్పందించిన మన్మథుడు హీరోయిన్
నాలుగు నెలల కనిష్ఠానికి రిటైల్ ద్రవ్యోల్బణం
బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి అరెస్టు
120 మంది అనాథలను దత్తత తీసుకున్న మంచు విష్ణు
జపాన్‌లో భారీ భూకంపం..సునామీ హెచ్చరిక జారీ
కేన్ విలియమ్సన్కు అవమానం
తిరుమల లడ్డూ కౌంటర్ల వద్ద అగ్నిప్రమాదం
సాక్షి కార్టూన్ 13-01-2025
టికెట్ రేట్ల విషయంలో ప్రైవేట్ ట్రావేల్స్ నిలువు దోపిడీ చేశారు మామయ్య!
డెలివరీ తర్వాత వీల్‌చైర్‌కు పరిమితం.. జీవితాంతం ఇంజక్షన్స్..!
ర్యాంకు ఆధారంగా ఇందిరమ్మ ఇల్లు
26 నుంచి రేషన్ కార్డుల జారీ
ఇదెక్కడి ఫామ్ రా సామీ.. 6 ఇన్నింగ్స్‌ల్లో 5 సెంచరీలు.. ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో చోటిస్తారా..?
తిరుమలలో ‘లక్ష్మణ’ లీలలు!
ఈ రాశి వారికి కుటుంబసౌఖ్యం. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. శ్రమకు ఫలితం కనిపిస్తుంది.
తల్లే కూతురు పెళ్లిని ఆపేసింది..! ట్విస్ట్ ఏంటంటే..
సినిమా
డాకు మహారాజ్లో నటనతో కట్టిపడేసిన ఈ చిన్నారి ఎవరో తెలుసా?
నందమూరి బాలకృష్ణ నటించిన తాజా చిత్రం డాకు మహారాజ్ (Daaku Maharaaj Movie). బాబీ డైరెక్ట్ చేసిన ఈ మూవీ సంక్రాంతి కానుగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జనవరి 12న థియేటర్లలో విడుదల కాగా తొలిరోజు నుంచే పాజిటివ్ టాక్ వస్తోంది. హీరోకు బాబీ ఇచ్చిన ఎలివేషన్స్, తమన్ బీజీఎమ్ అదిరిపోయిందని కామెంట్లు వినిపిస్తున్నాయి.డాకు మహారాజ్‌లోని చిన్నారి ఎవరు?ఈ సినిమాలో వైష్ణవిగా నటించిన చిన్నారి నటనకు సైతం మంచి మార్కులు పడ్డాయి. ఈ పాప సినిమా సెట్స్‌లో బాలకృష్ణను పట్టుకుని ఏడుస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ క్రమంలో ఆ చిన్నారి ఎవరని పలువురూ ఆరా తీస్తున్నారు. ఈ బేబీ వైష్ణవి పేరు వేద అగర్వాల్ (Veda Agrawal). తను నటి మాత్రమే కాదు, సింగర్ కూడా! ప్రముఖ గాయకుడు మాధవ్ అగర్వాల్ కూతురే వేద.(డాకు మహారాజ్ మూవీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)ఉప్పొంగిపోయిన సింగర్తన గారాలపట్టి ఇంత పెద్ద సినిమాలో భాగం కావడంతో తండ్రిగా ఉప్పొంగిపోయాడు మాధవ్. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టాడు. నేను ఆగ్రాలో పుట్టినా పెరిగిందంతా హైదరాబాద్‌లోనే! నా ఎనిమిదేళ్ల కూతురు తెలుగులో నటించిన పెద్ద సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నేను పెరిగిన హైదరాబాద్‌లోని థియేటర్లలో ఆడుతోంది. ఎంత యాదృచ్చికం.కల నెరవేరినట్లుగా ఉందిఈ ప్రయాణం నాకు సంపూర్ణమైన అనుభూతినిస్తోంది. మా భావోద్వేగాలు ఆగడం లేదు. హైదరాబాద్ నగరంలో బిగ్ స్క్రీన్‌పై తనను చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది. నా కల నెరవేరినట్లుగా ఉంది. మీ ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు అని రాసుకొచ్చాడు. డాకు మహారాజ్లో వైష్ణవిగా కట్టిపడేసింది వేద. ఈ సినిమాతో తనకు మరిన్ని ఆఫర్లు రావడం ఖాయంగా కనిపిస్తోంది.డాకు మహారాజ్ సినిమా విశేషాలుడాకు మహారాజ్ సినిమా విషయానికి వస్తే.. బాలకృష్ణ హీరోగా నటించిన ఈ మూవీలో ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటించారు. ఊర్వశి రౌతేలా ఐటం సాంగ్‌తో మెరిసింది. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్‌ఫోర్ సినిమాస్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. సంక్రాంతి కానుకగా ముందుకు వచ్చిన ఈ మూవీకి తొలి రోజే సక్సెస్ టాక్ రావడంతో కలెక్షన్లు భారీగానే వచ్చాయి. సక్సెస్ పార్టీపైగా జనవరి 10న రిలీజైన రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' మూవీకి వస్తున్న మిక్స్డ్ టాక్ డాకు మహారాజ్‌కు కలిసొచ్చినట్లైంది. తొలి రోజే బాలకృష్ణ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.56 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ విషయాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ అధికారిక పోస్టర్ ద్వారా వెల్లడించింది. డాకు మహారాజ్‌కు సక్సెస్ టాక్ రావడంతో చిత్రబృందం పార్టీ చేసుకుంది. హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ పార్టీలో బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా మరోసారి సందడి చేసింది. దబిడి దిబిడి సాంగ్‌తో అలరించిన ఈ బ్యూటీ బాలయ్యతో కలిసి స్టెప్పులు వేసింది. అటు ఆన్ స్క్రీన్‌లో, ఇటు ఆఫ్ స్క్రీన్‌లో బాలకృష్ణ.. ఊర్వశిని దబిడి దిబిడి ఆడేసుకున్నారు. View this post on Instagram A post shared by Madhav Agrawal (@abmadhav) View this post on Instagram A post shared by Veda Agrawal (@veda.agrawal) View this post on Instagram A post shared by Veda Agrawal (@veda.agrawal) చదవండి: పవన్ సినిమా..ఆ హీరోయిన్ పాలిట శాపమైందా ?
హీరోయిన్‌పై అసభ్యకర వ్యాఖ్యలు.. డైరెక్టర్‌పై మహిళా కమిషన్ ఆగ్రహం
తెలుగు సినిమా డైరెక్టర్ నక్కిన త్రినాథ రావు (Trinadha Rao Nakkina)పై తెలంగాణ మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. హీరోయిన్ అన్షు (Actress Anshu)పై అసభ్యకర వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా తప్పుపట్టింది. త్రినాథరావు వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరించినట్లు మహిళా కమిషన్ చైర్మన్ నేరెళ్ల శారద వెల్లడిచింది. దర్శకుడికి త్వరలోనే నోటీసు జారీ చేస్తామని తెలిపింది.హీరోయిన్ కోసమే సినిమా చూశా..కాగా నక్కినేని త్రినాథరావు ప్రస్తుతం మజాకా సినిమా (Mazaka Movie)కు డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నాడు. సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా టీజర్ లాంచ్ ఆదివారం (జనవరి 12న) జరిగింది. ఈ సందర్భంగా దర్శకుడు త్రినాధ రావు.. హీరోయిన్ అన్షు గురించి మాట్లాడాడు. అన్షును చూసేందుకే మన్మథుడు సినిమాకు వెళ్లామని, అందులో ఆమె ఓ రేంజ్లో ఉంటుందని చెప్పాడు. అలాంటి అన్షు.. మరోసారి హీరోయిన్గా కళ్లముందుకు వచ్చేసరికి నమ్మలేకపోయానన్నాడు.సన్నబడింది.. కానీ!అయితే అప్పటికి, ఇప్పటికి అన్షు కాస్త సన్నబడిందన్నాడు. మరీ ఇంత సన్నగా ఉంటే సరిపోదు, లావు పెరగమని చెప్పానంటూ హద్దులు దాటుతూ అసభ్యకరంగా మాట్లాడాడు. తన శరీరాకృతి గురించి అనుచిత వ్యాఖ్యలు చేశాడు. అలాగే ఇదే ఈవెంట్లో అల్లు అర్జున్ (Allu Arjun) ఇన్సిడెంట్ను రీక్రియేట్ చేశాడు. పుష్ప 2 ఈవెంట్లో బన్నీ.. తెలంగాణ సీఎం పేరు మర్చిపోయి వాటర్ బాటిల్ అడిగి.. కవర్ చేసి తర్వాత పేరు చెబుతాడు. సేమ్.. అలాగే ఇక్కడ కూడా త్రినాధరావు రెండో హీరోయిన్ పేరు మర్చిపోయినట్లు నాటకమాడాడు. సమయానికి గుర్తు రావడం లేదన్నట్లుగా వాటర్ బాటిల్ అడిగాడు. కాసేపటికి రీతూ వర్మ కదూ.. నిజంగానే నీ పేరు పేరు గుర్తుండదంటూ కవర్ చేశాడు. పేరు మర్చిపోయినట్లుగా యాక్టింగ్ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా దర్శకుడి ఓవరాక్షన్ ఎక్కువైందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అతడి కామెంట్లపై సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో త్రినాధరావు సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు కోరాడు. 'మహిళలకి, అన్షు గారికి, నా మాటలు వల్ల బాధపడ్డ ఆడవాళ్ళందరికీ క్షమాపణలు తెలియజేసుకుంటున్నాను, నా ఉద్దేశ్యం ఎవరిని బాధ కలిగించడం కాదు తెలిసి చేసినా తెలియకుండా చేసిన తప్పు తప్పే.. మీరందరూ పెద్ద మనసు చేసుకొని నన్ను క్షమిస్తారని కోరుకుంటున్నాను' అని వీడియో రిలీజ్ చేశాడు. (చదవండి: మళ్లీ ‘దంచిన’ బాలయ్య.. పార్టీలో హీరోయిన్‌తో ఆ స్టెప్పులు! ఇప్పట్లో ఆగేలా లేడుగా)20 ఏళ్ల తర్వాత రీఎంట్రీహీరోయిన్ అన్షు చాలామంది గుర్తుండే ఉంటుంది. అప్పట్లో వచ్చిన మన్మథుడు సినిమాలో అందంతో, అమాయకత్వంతో ఆకట్టుకుంది. తర్వాత ప్రభాస్‌తో రాఘవేంద్ర సినిమా చేసింది. 20 ఏళ్ల తర్వాత ఆమె మజాకా మూవీతో రీఎంట్రీ ఇస్తోంది మజాకా సినిమా విషయానికి వస్తే ఇందులో సందీప్ కిషన్, రీతూ వర్మ, రావు రమేశ్, అన్షు ప్రధాన పాత్రల్లో నటించారు. కథ, డైలాగ్స్ ప్రసన్న కుమార్ బెజవాడ అందించగా త్రినాధ రావు డైరెక్షన్ చేస్తున్నాడు.ధమాకాతో బ్లాక్‌బస్టర్ హిట్రాజేశ్ దండ నిర్మిస్తున్న ఈ మూవీకి లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్నాడు. కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఫిబ్రవరి 21న విడుదల కానుంది. త్రినాధరావు విషయానికి వస్తే.. ఈయన ప్రియతమా నీవచ కుశలమా సినిమాతో దర్శకుడిగా మారారు. మేం వయసుకు వచ్చాం, నువ్వలా నేనిలా, సినిమా చూపిస్త మావ, నేను లోకల్, హలో గురు ప్రేమ కోసమే, ధమాకా.. ఇలా పలు సినిమాలు తెరకెక్కించాడు. మూడేళ్ల గ్యాప్ తర్వాత మజాకా మూవీ చేస్తున్నాడు. Yesterday was an unfortunate slip of the tongue by Dir #NakkinaTrinadhRaoIt’s a wrong example to set & we should have been cautious to avoid itTrinadh garu & Team #Mazaka apologise for the poor choice of words to Anshu garu & to all Women out there,We are because of you ♥️ pic.twitter.com/KQvLSeBtJ1— Sundeep Kishan (@sundeepkishan) January 13, 2025 చదవండి: పవన్ సినిమా..ఆ హీరోయిన్ పాలిట శాపమైందా ?
కూతురి పేరును రివీల్ చేసిన ప్రముఖ నటి.. అర్థం అదేనట!
ప్రముఖ బాలీవుడ్ నటి మసాబా గుప్తా (Masaba Gupta) గతేడాది పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. 2024 అక్టోబర్‌లో కుమార్తెకు(daughter) స్వాగతం పలికింది. ఈ విషయాన్ని మసాబా సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. తాజాగా తన ముద్దుల కూతురి పేరును రివీల్ చేసింది. మతారా అనే పేరు పెట్టినట్లు వెల్లడించింది. అంతేకాదు ఆ పేరుకు అర్థాన్ని కూడా వివరించింది మసాబా. తన చేతికి ధరించిన గాజును కూతురి పేరు కనిపించేలా డిజైనా చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది.మసాబా తన ఇన్‌స్టాలో రాస్తూ..'నా ముద్దుల కూతురు మాతారకు అప్పుడే 3 నెలలు. తన పేరు 9 మంది హిందూ దేవతల స్త్రీ శక్తులను కలిగి ఉంది. తన కూతురికి ఆ దేవతల ఆశీర్వాదం ఎప్పుడు ఉంటుంది. అంతేకాదు మా కళ్లకు నక్షత్రం లాంటిది." అంటూ పోస్ట్ చేసింది.2023లో పెళ్లి..కాగా.. మసాబా గుప్తా (Masaba Gupta), సత్యదీప్ మిశ్రా (Satyadeep Mishra) జనవరి 27, 2023న వివాహం చేసుకున్నారు. కాగా.. గతేడాది ఏప్రిల్ 18న మసాబా గర్భం దాల్చినట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. తన భర్త సత్యదీప్‌తో కలిసి ఉన్న ఫోటోలను పంచుకుంది. అక్టోబర్ 10, 2024న కూతురికి జన్మనిచ్చింది.ఎవరీ మసాబా గుప్తా..?కాగా ప్రముఖ బాలీవుడ్ నటి నీనా గుప్తా కూతురే మసాబా గుప్తా. ఈమె గతేడాది జనవరిలో నటుడు సత్యదీప్ మిశ్రాను రెండో పెళ్లి చేసుకుంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఈ దంపతులు త్వరలో పేరెంట్స్ కాబోతున్నట్లు ప్రకటించారు. ఇకపోతే మసాబా తన జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన మసాబా మసాబా అనే సిరీస్‌లో నటించింది. View this post on Instagram A post shared by Masaba 🤎 (@masabagupta)
పవన్ సినిమా..ఆ హీరోయిన్ పాలిట శాపమైందా ?
సాధారణంగా ఓ హీరోయిన్ ఏడాది మూడు నాలుగు సినిమాలు చేసేస్తుంటారు. స్టార్ హీరోయిన్లు అయితే కనీసం ఒకటైనా రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేసుకుంటారు. కానీ ఓ హీరోయిన్ మాత్రం దాదాపు మూడేళ్లుగా వెండితెరకు దూరంగా ఉంది. అలా అని అవకాశాలు రాలేదని కాదు. ఎన్ని అవకాశాలు వచ్చిన వదులుకోవాల్సిన వచ్చింది. దానికి కారణం ఓ స్టార్ హీరో సినిమా. ఆ హీరో సినిమా టీమ్‌తో చేసుకున్న ఒప్పందమే ఆమె కెరీర్‌ని ముంచేసింది. మూడేళ్లుగా ఆ సినిమా కోసం ఎదురుచూస్తోంది. అయినా కూడా ఆ సినిమా పూర్తి కాలేదు. ఆ సినిమా పేరే హరిహర వీరమల్లు. హీరో పవన్ కల్యాణ్.. మూడేళ్లుగా ఎదురు చూస్తోన్న హీరోయిన్ నిధి అగర్వాల్.కొంప ముంచిన ఒప్పందంపవన్ కల్యాణ్(pawan kalyan) హీరోగా నటించాల్సిన సినిమాల్లో ‘హరిహర వీరమల్లు’ ఒకటి. కరోనా కంటే ముందే ఈ సినిమాను ప్రకటించారు. కొంత షూటింగ్ అయిన తర్వాత ఎన్నికలతో నెపంతో పవన్ అందుబాటులోకి రాలేదు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఇంకా బిజీ అయిపోయారు. దీంతో ఈ సినిమా షూటింగ్ ఇప్పటికీ పూర్తికాలేకపోయింది. అయితే ఈ సినిమా ఒప్పుకోవడమే నిధి అగర్వాల్(Nidhi Aggarwal ) కెరీర్‌కి శాపంగా మారింది. షూటింగ్ పూర్తయ్యే వరకు ఇతర సినిమాల్లో నటించరాదని ఒప్పందం చేసుకున్నారట. ఆ కారణంగానే వేరే సినిమాల్లో నటించలేకపోయారట. ఈ విషయాన్ని నిధి అగర్వాలే చెప్పారు.‘లాక్‌డౌన్‌కు ముందే ‘హరిహర వీరమల్లు’ సినిమాకు సైన్ చేశాను. పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ తో బిజీగా ఉన్నారు కాబట్టి ఆయన షూటింగ్ కి డేట్స్ ఇచ్చినప్పుడు నేను కూడా ఇవ్వాలని, కాబట్టి సినిమా అయ్యేంతవరకు వేరే సినిమా ఒప్పుకోకూడదని కాంట్రాక్ట్ మీద సైన్ చేశాను. ఆ సమయంలోనే లాక్డౌన్ వచ్చింది. తర్వాత షూటింగ్ మొదలు పెట్టినా.. రెండోసారి లౌక్‌డౌన్ కారణంగా మళ్లీ వాయిదా పడింది. తర్వాత పవన్ పాలిటిక్స్‌లో బిజీ అయిపోయారు. ఇలా దాదాపు నాలుగేళ్లుగా ఈ సినిమా కోసమే ఉండాల్సి వచ్చింది. ఈ గ్యాప్ లో చాలా సినిమాలు వచ్చాయి కానీ ఆ కాంట్రాక్టు వల్లే వేరే ఏ సినిమా ఒప్పుకోలేదు. ప్రభాస్ రాజాసాబ్ సినిమా రావడంతో ఆ సినిమా వదులుకోకూడదు అని హరిహర వీరమల్లు మూవీ టీమ్ తో మాట్లాడి, రిక్వెస్ట్ చేసి, షూటింగ్స్ కి క్లాష్ రానివ్వను అని చెప్పి రాజాసాబ్ సినిమాకు ఓకే చెప్పాను. ఈ రెండింటిపై పూర్తి నమ్మకంతో ఉన్నాను’ అని నిధి చెప్పారు.తట్టుకోలేక తప్పుకున్న క్రిష్!హరిహర వీరమల్లు చిత్రానికి తొలుత క్రిష్ దర్శకుడు. ఈ పాటికే షూటింగ్ అయిపోయి..రిలీజ్ కావాల్సిన ఈ సినిమా ఇప్పటికీ రాలేదు. దానికి కారణం పవన్ కల్యాణే. ఆయన పాలిటిక్స్‌లో బిజీ కావడంతో కొంతకాలం క్రిష్ ఎదురు చూశాడు. అయితే గ్యాప్‌లో కూడా ఈ సినిమాను పూర్తి చేయకుండా ఇతర సినిమాలు ఒప్పుకోవడం..వాటికి డేట్స్ కేటాయించడంతో ఈ సినిమాకు మరింత గ్యాప్ వచ్చింది. దీంతో క్రిష్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు. దీంతో మిగిలిన పోర్షన్ పూర్తి చేసే బాధ్యతను నిర్మాత ఏఎం రత్నం తనయుడు జ్యోతికృష్ణ తీసుకున్నాడు. అతడి కెరీర్లో ఇప్పటిదాకా హిట్ అన్నదే లేదు. చివరి చిత్రం ‘రూల్స్ రంజన్’ దారుణమైన ఫలితాన్నందుకుంది. మరి అతను తీసే మిగతా పార్ట్ ఔట్ పుట్ ఎలా ఉంటుందో చూడాలి.మాటల రచయిత బుర్రా సాయిమాధవ్ కూడా ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకోవడం గమనార్హం. కాగా, పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రం రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తొలి భాగం మార్చి 28న విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
న్యూస్ పాడ్‌కాస్ట్
క్రీడలు
టీ20ల్లో అరుదైన ప్రదర్శన.. రికార్డుల వెల్లువ
టీ20ల్లో అరుదైన ప్రదర్శన నమోదైంది. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్-2025లో భాగంగా దర్బార్ రాజ్షాహీతో జరిగిన మ్యాచ్‌లో ఇద్దరు ఢాకా క్యాపిటల్స్ ఆటగాళ్లు (తంజిద్ హసన్ తమీమ్, లిటన్ దాస్) సెంచరీలు చేశారు. టీ20ల్లో ఇలా ఒకే ఇన్నింగ్స్‌లో ఇద్దరు ఆటగాళ్లు సెంచరీలు చేయడం ఇది తొమ్మిదో సారి.టీ20ల్లో ఒకే ఇన్నింగ్స్‌లో ఇద్దరు సెంచరీలు చేసిన సందర్భాలు..కెవిన్ ఓ'బ్రియన్ & హమీష్ మార్షల్ vs మిడిల్సెక్స్, ఉక్స్బ్రిడ్జ్, 2011విరాట్ కోహ్లీ & ఎబి డివిలియర్స్ vs గుజరాత్ లయన్స్, బెంగళూరు, 2016అలెక్స్ హేల్స్ & రిలీ రోసౌ vs చిట్టగాంగ్ వైకింగ్స్, చట్టోగ్రామ్, 2019డేవిడ్ వార్నర్ & జానీ బెయిర్‌స్టో vs ఆర్సిబి, హైదరాబాద్, 2019సబావూన్ డేవిజి & డిలాన్ స్టెయిన్ vs బల్గేరియా, మార్సా, 2022లాచ్లాన్ యమమోటో-లేక్ & కెండెల్ కడోవాకి-ఫ్లెమింగ్ vs చైనా, మోంగ్ కోక్, 2024శుభ్‌మన్ గిల్ & బి సాయి సుదర్శన్ vs CSK, అహ్మదాబాద్, 2024సంజు సామ్సన్ & తిలక్ వర్మ vs దక్షిణాఫ్రికా, జోహన్నెస్‌బర్గ్, 2024తాంజిద్ హసన్ తమీమ్ & లిట్టన్ దాస్ vs దర్బార్ రాజ్షాహి, సిల్హెట్, 2025మ్యాచ్ విషయానికొస్తే.. దర్బార్ రాజ్షాహీతో జరిగిన మ్యాచ్‌లో ఢాకా క్యాపిటల్స్ తొలుత బ్యాటింగ్ చేసి రికార్డు స్కోర్ చేసింది. తంజిద్ హసన్ (64 బంతుల్లో 108; 6 ఫోర్లు, 8 సిక్సర్లు), లిటన్ దాస్ (55 బంతుల్లో 125 నాటౌట్; 10 ఫోర్లు, 9 సిక్సర్లు) సెంచరీలతో కదంతొక్కడంతో ఢాకా క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో వికెట్ నష్టానికి 254 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో ఇదే అత్యధిక స్కోర్.ఈ మ్యాచ్‌లో లిటన్ దాస్ 44 బంతుల్లో శతక్కొట్టాడు. బీపీఎల్‌లో ఇది మూడో వేగవంతమైన సెంచరీ. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం బంగ్లాదేశ్ జట్టును నిన్ననే ప్రకటించారు. ఈ జట్టులో లిటన్ దాస్‌కు చోటు దక్కలేదు. తనను జట్టు నుంచి తప్పించిన రోజే దాస్ సెంచరీతో కదంతొక్కడం విశేషం.ఈ మ్యాచ్‌లో లిటన్ దాస్, తంజిద్ హసన్ తొలి వికెట్‌కు 241 పరుగులు జోడించారు. బీపీఎల్ చరిత్రలో ఏ వికెట్‌కు అయినా ఇదే అత్యధిక భాగస్వామ్యం. టీ20 క్రికెట్ చరిత్రలో ఏ వికెట్‌కు అయినా ఇది రెండో అత్యధిక భాగస్వామ్యం. టీ20ల్లో అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పిన రికార్డు జపాన్ ఆటగాళ్లు యమమోటో, కడోవాకీ పేరిట ఉంది. ఈ జోడీ 2024లో చైనాతో జరిగిన మ్యాచ్‌లో అజేయమైన 258 పరుగులు జోడించింది. ఢాకా క్యాపిటల్స్ నిర్దేశించిన 255 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో దర్బార్ రాజ్‌షాహీ చేతులెత్తేసింది. ఆ జట్టు 15.2 ఓవర్లలో 105 పరుగులకు ఆలౌటైంది. ఫలితంగా ఢాకా క్యాపిటల్స్ 149 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. పరుగుల పరంగా బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో ఇదే భారీ విజయం. ఈ సీజన్లో ఢాకా క్యాపిటల్స్‌కు ఇదే తొలి విజయం. ఈ మ్యాచ్‌కు ముందు ఢాకా క్యాపిటల్స్ ఆరు మ్యాచ్‌లు ఆడగా.. ఒక్క మ్యాచ్‌లో కూడా గెలవలేకపోయింది.
ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే సౌతాఫ్రికా జట్టు ఇదే..!
పాకిస్తాన్, యూఏఈ వేదికలుగా వచ్చే నెల (ఫిబ్రవరి) 19 నుంచి జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ కోసం 15 మంది సభ్యుల సౌతాఫ్రికా జట్టును ఇవాళ (జనవరి 13) ప్రకటించారు. ఈ జట్టుకు సారధిగా టెంబా బవుమా వ్యవహరించనున్నాడు. గాయాల నుంచి కోలుకున్న స్టార్ పేసర్లు అన్రిచ్ నోర్జే, లుంగి ఎంగిడి ఈ టోర్నీతో రీఎంట్రీ ఇచ్చారు. 2023 వన్డే వరల్డ్‌కప్ ఆడిన జట్టులోని 10 మంది సభ్యులు ఈ టోర్నీ కోసం ఎంపికయ్యారు. ఈ జట్టులో టోనీ డి జోర్జీ, ర్యాన్ రికెల్టన్, ట్రిస్టన్ స్టబ్స్, వియాన్ ముల్దర్ లాంటి కొత్త ముఖాలు ఉన్నాయి. ఈ ముగ్గురికి ఇదే తొలి 50 ఓవర్ల ఐసీసీ టోర్నీ.ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో పాల్గొనే సౌతాఫ్రికా జట్టు..టెంబా బవుమా (కెప్టెన్), టోనీ డి జోర్జి, మార్కో జన్సెన్, హెన్రిచ్ క్లాసెన్, కేశవ్ మహరాజ్, ఐడెన్ మర్క్రమ్, డేవిడ్ మిల్లర్, వియాన్ ముల్డర్, లుంగి ఎంగిడి, అన్రిచ్ నోర్ట్జే, కగిసో రబడ, ర్యాన్ రికెల్టన్, తబ్రైజ్ షమ్సీ, ట్రిస్టన్ స్టబ్స్, రస్సీ వాన్ డెర్ డస్సెన్ఛాంపియన్స్ ట్రోఫీలో సౌతాఫ్రికా గ్రూప్-బిలో ఉంది. ఈ గ్రూప్‌లో ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్లు ఉన్నాయి. మెగా టోర్నీలో సౌతాఫ్రికా తమ తొలి మ్యాచ్‌ను ఫిబ్రవరి 21న ఆడనుంది. కరాచీ వేదికగా జరిగే ఆ మ్యాచ్‌లో ప్రొటీస్ టీమ్ ఆఫ్ఘనిస్తాన్‌తో తలపడుతుంది. అనంతరం ఫిబ్రవరి 25న రావల్పిండిలో జరిగే మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఆస్ట్రేలియాను ఢీకొంటుంది. తదనంతరం మార్చి 1న కరాచీలో జరిగే మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఇంగ్లండ్‌తో పోటీపడనుంది.కాగా, సౌతాఫ్రికా ఇటీవలికాలంలో ఐసీసీ ఈవెంట్లలో అదరగొడుతున్న విషయం తెలిసిందే. 2023 వన్డే వరల్డ్‌కప్‌లో ప్రొటీస్ టీమ్ సెమీఫైనల్‌కు చేరుకుంది. గతేడాది జరిగిన టీ20 వరల్డ్‌కప్‌లో సౌతాఫ్రికా రన్నరప్‌గా నిలిచింది. సౌతాఫ్రికా గత రెండు ఐసీసీ ఈవెంట్లలో చేసిన ప్రదర్శనలే ఛాంపియన్స్ ట్రోఫీలోనూ రిపీట్ చేయాలని భావిస్తుంది. సౌతాఫ్రికాకు ఛాంపియన్స్ ట్రోఫీ నెగ్గిన అనుభవం కూడా ఉంది. ఈ జట్టు 1998 ఇనాగురల్ ఎడిషన్‌లో విజేతగా నిలిచింది. నాటి ఫైనల్లో సౌతాఫ్రికా వెస్టిండీస్‌ను చిత్తు చేసి ఛాంపియన్‌గా అవతరించింది.ఇదిలా ఉంటే, సౌతాఫ్రికా తాజాగా స్వదేశంలో పాకిస్తాన్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను 2-0 తేడాతో గెలుచుకుంది. ఈ సిరీస్‌లో సౌతాఫ్రికా అన్ని విభాగాల్లో అద్భుతంగా రాణించి పాక్‌ను మట్టికరిపించింది. ఈ సిరీస్‌లోని తొలి టెస్ట్ అనంతరం సౌతాఫ్రికా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023-25 ఫైనల్‌కు అర్హత సాధించింది. బవుమా నేతృత్వంలోని సౌతాఫ్రికా డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆస్ట్రేలియాతో తలపడనుంది.
అందుకే నాపై వేటు వేశారు.. చాంపియన్స్ ట్రోఫీ జట్టులో నో ప్లేస్!
స్టార్ ఆల్‌రౌండర్, మాజీ కెప్టెన్ షకీబ్ అల్ హసన్‌తో పాటు సీనియర్ బ్యాటర్ లిటన్ దాస్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 కోసం ప్రకటించిన బంగ్లాదేశ్ జట్టులో వీరికి చోటు దక్కలేదు. షకీబ్ విషయానికొస్తే.. సందేహాస్పద బౌలింగ్ యాక్షన్ కారణంగా సస్పెన్షన్‌కు గురైన అతడిని సెలెక్టర్లు ఈ ఐసీసీ టోర్నీకి పరిగణించలేదు. ఇప్పటికే టీ20, టెస్టు ఫార్మాట్లకు వీడ్కోలు పలికిన 37 ఏళ్ల షకీబ్... చాంపియన్స్ ట్రోఫీ తర్వాత వన్డే ఫార్మాట్ నుంచి కూడా తప్పుకొంటానని ఇదివరకే వెల్లడించాడు.అయితే, తాజాగా బంగ్లాదేశ్ సెలక్టర్లు తీసుకున్న నిర్ణయంతో షకీబ్ అంతర్జాతీయ కెరీర్ ఇక ముగిసినట్లే. షకీబ్‌తో పాటు ఫామ్‌లేక తంటాలు పడుతున్న సీనియర్ బ్యాటర్ లిటన్ దాస్‌కు కూడా నిరాశే ఎదురైంది. గత 13 మ్యాచ్‌ల్లో ఒక్క అర్ధశతకం కూడా సాధించని లిటన్ దాస్... గత ఏడు ఇన్నింగ్స్‌ల్లో వరుసగా 6, 1, 0, 0, 2, 4, 0 పరుగులు చేశాడు. దీంతో అతడిని ఈ టోర్నీకి ఎంపిక చేయలేదు.అందుకే నాపై వేటు వేశారుఈ విషయంపై స్పందించిన లిటన్ దాస్ తనపై వేటు పడటానికి గల కారణాన్ని వెల్లడించాడు. ‘‘గతంలో నేను ఎన్నెన్నో గొప్ప ఇన్నింగ్స్ ఆడాను. అయితే, ఇప్పుడు జీరో నుంచి మళ్లీ మొదలుపెట్టాల్సి వచ్చింది. నేను ఇకపై మరింత కఠినంగా శ్రమించాలి. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం.అయినా, చాంపియన్స్ ట్రోఫీ జట్టు ఎంపికకు ముందే నాకొక స్పష్టమైన సందేశం వచ్చింది. అయితే, సెలక్టర్ల నుంచి నేరుగా రాలేదు. కానీ.. ఈ జట్టులో చోటు దక్కదని తెలుసు. నేను బాగా ఆడటం లేదు కాబట్లే నన్ను టీమ్ నుంచి తప్పించారు. ఇందులో దాచాల్సింది, సిగ్గుపడాల్సింది ఏమీ లేదు. అందరి విషయంలోనూ సాధారణంగా జరిగేదే ఇది.కొత్త ఇన్నింగ్స్ ఆరంభిస్తాఏదేమైనా నేను నా ఆటను మెరుగుపరచుకోవాల్సి ఉంది. రాత్రికి రాత్రే అద్భుతాలు జరిగిపోవు గానీ.. నేను మాత్రం ఎక్కడా వెనుకడుగు వేయను. అయినా... నేను ఇప్పుడు కొత్తగా నిరూపించుకోవాల్సింది ఏమీ లేదు. నిలకడైనా ఆట తీరుతో కొత్త ఇన్నింగ్స్ ఆరంభిస్తా’’ అని 30 ఏళ్ల లిటన్ దాస్ ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫోతో పేర్కొన్నాడు. కాగా గతనెల(డిసెంబరు 2024)లో వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో లిటన్ దాస్ బంగ్లాదేశ్‌కు చివరగా ఆడాడు.ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభంకాగా ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానున్న చాంపియన్స్ ట్రోఫీ కోసం బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) శుక్రవారం 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది. ఈ టీమ్‌కు నజ్ముల్ హుసేన్ షాంటో సారథ్యం వహిస్తుండగా... ముష్ఫికర్ రహీం, మహ్ముదుల్లా, ముస్తాఫిజుర్ వంటి సీనియర్ ప్లేయర్లు చోటు దక్కించుకున్నారు. కాగా పాకిస్తాన్ వేదికగా చాంపియన్స్ ట్రోఫీ జరుగనుండగా.. టీమిండియా మాత్రం తటస్థ వేదికైన దుబాయ్‌లో తమ మ్యాచ్‌లు ఆడనుంది.ఇక చాంపియన్స్ ట్రోఫీ-2025లో బంగ్లాదేశ్.. ఆస్ట్రేలియా, అఫ్గనిస్తాన్, ఇంగ్లండ్‌లతో కలిసి గ్రూప్-‘బి’లో ఉంది. మరోవైపు.. టీమిండియా, న్యూజిలాండ్, పాకిస్తాన్, సౌతాఫ్రికా గ్రూప్-‘ఎ’ నుంచి పోటీపడుతున్నాయి. ఈ నేపథ్యంలో తమ తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఫిబ్రవరి 20న దుబాయ్ వేదికగా టీమిండియాతో తలపడనుంది.తదుపరి.. రావల్పిండి వేదికగా ఫిబ్రవరి 24న న్యూజిలాండ్‌తో, ఫిబ్రవరి 27న అదే వేదికపై పాకిస్తాన్‌తోనూ బంగ్లాదేశ్ మ్యాచ్‌లు ఆడనుంది. ఇక ఈ టోర్నీలో మార్చి 4న తొలి సెమీఫైనల్ దుబాయ్‌లో జరుగనుండగా.. మార్చి 5న రెండో సెమీ ఫైనల్‌కు లాహోర్ ఆతిథ్యం ఇవ్వనుంది. మార్చి 9న ఫైనల్ నిర్వహించేందుకు ముహూర్తం ఖరారు కాగా.. మార్చి 10 రిజర్వ్ డేగా ఖరారు చేశారు..బంగ్లాదేశ్ జట్టు: నజ్ముల్ హుసేన్ షాంటో (కెప్టెన్), ముష్ఫికర్ రహీమ్, తౌహిద్ హృదయ్, సౌమ్య సర్కార్, తాంజిద్ హసన్, మహ్ముదుల్లా, జాకీర్ అలీ, మెహదీ హసన్ మిరాజ్, రిషాద్ హుసేన్, తస్కీన్ అహ్మద్, ముస్తఫిజుర్ రహమాన్, పర్వేజ్ హుసేన్, నసుమ్ అహ్మద్, తన్జిమ్ హసన్, నహిద్ రాణా.చదవండి: ఇదెక్కడి ఫామ్ రా సామీ.. 6 ఇన్నింగ్స్‌ల్లో 5 సెంచరీలు.. ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో చోటిస్తారా..?
ఇదెక్కడి ఫామ్ రా సామీ.. 6 ఇన్నింగ్స్‌ల్లో 5 సెంచరీలు.. ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో చోటిస్తారా..?
విజయ్ హజారే ట్రోఫీ-2025లో విదర్భ కెప్టెన్ కరుణ్ నాయర్ అరివీర భయంకరమైన ఫామ్‌లో ఉన్నాడు. ఈ టోర్నీలో కరుణ్ 6 ఇన్నింగ్స్‌ల్లో 5 సెంచరీలు సాయంతో 664 పరుగులు చేశాడు. వీహెచ్‌టీలో కరుణ్ ఒంటిచేత్తో తన జట్టును సెమీస్‌కు చేర్చాడు. ఈ ప్రదర్శనల అనంతరం కరుణ్ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఎంపిక చేసే భారత జట్టులో చోటు ఆశిస్తున్నాడు. కరుణ్ ఫామ్ చూస్తే అతన్ని తప్పక ఎంపిక చేయాల్సిందే అన్నట్లుగా ఉంది. ఇలాంటి ప్రదర్శనలు కరున్ ఇటీవలి కాలంలో చాలా చేశాడు. కరుణ్ ఫార్మాట్లకతీతంగా ఇరగదీశాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీ, రంజీ ట్రోఫీల్లో, కౌంటీ క్రికెట్లోనూ కరుణ్ అద్బుత ప్రదర్శనలు చేశాడు. ఇలాంటి ప్రదర్శనల తర్వాత కూడా భారత సెలెక్టర్లు కరుణ్‌ను పట్టించుకోకపోతే పెద్ద అపరాధమే అవుతుంది. మిడిలార్డర్లో కరుణ్ చాలా ఉపయోగకరమైన బ్యాటర్‌గా ఉంటాడు. ఇందులో ఎలాంటి సందేహమూ లేదు. అయితే కరుణ్.. ఫామ్‌లో ఉన్న కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ లాంటి సీనియర్ల నుంచి తీవ్రమైన పోటీ ఎదుర్కొంటున్నాడు. ఈ ముగ్గురిలో ఫిల్టర్ చేయడం సెలెక్టర్లకు కత్తి మీద సామే అవుతుంది. కరుణ్ ప్రదర్శనలు చూస్తే తప్పక ఎంపిక చేయాల్సిందే అన్నట్లుగా ఉన్నాయి. రాహుల్, శ్రేయస్‌లను పక్కకు పెట్టే సాహసాన్ని టీమిండియా సెలెక్టర్లు చేయలేరు. సెలెక్టర్లు ఏం చేయనున్నారో తెలియాలంటే మరి కొద్ది రోజులు ఎదురుచూడాల్సిందే. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత్ జట్టును జనవరి 19వ తేదీ ప్రకటించే అవకాశం ఉంది. కరుణ్‌తో పాటు మరో ఆటగాడు కూడా సెలెక్టర్లకు సవాలు విసురుతున్నాడు. కర్ణాటక సారధి మయాంక్ అగర్వాల్ కూడా విజయ్ హజారే ట్రోఫీలో ఇంచుమించు కరుణ్ ఉన్న ఫామ్‌లోనే ఉన్నాడు. వీహెచ్‌టీలో మయాంక్ 8 ఇన్నింగ్స్‌ల్లో 4 సెంచరీల సాయంతో 619 పరుగులు చేశాడు. మయాంక్ ఓపెనర్ స్థానం కోసం అంతగా ఫామ్‌లో లేని శుభ్‌మన్ గిల్‌తో పోటీ పడతాడు. భారత సెలెక్టర్లు కరణ్ నాయర్, మయాంక్ అగర్వాల్ విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటారో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.కరుణ్ విషయానికొస్తే.. వీహెచ్‌టీ-2025లో వరుసగా ఆరు ఇన్నింగ్స్‌ల్లో నాటౌట్‌గా (112*, 44*, 163*, 111*, 112*, 122*) నిలిచి ఐదు శతకాలు బాదాడు. ఈ టోర్నీలో కరుణ్ లీడింగ్ రన్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. వీహెచ్‌టీలో కరుణ్ ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఔట్ కాకుండా 600కు పైగా పరుగులు స్కోర్ చేశాడు.లిస్ట్-ఏ క్రికెట్లో ఔట్ కాకుండా అత్యధిక పరుగులు స్కోర్ చేసిన రికార్డును కరుణ్ తన ఖాతాలో వేసుకున్నాడు.వీహెచ్‌టీ సింగిల్ ఎడిషన్‌లో తమిళనాడుకు చెందిన ఎన్ జగదీశన్ తర్వాత ఐదు సెంచరీలు చేసిన రెండో ఆటగాడిగానూ రికార్డుల్లోకెక్కాడు. లిస్ట్-ఏ క్రికెట్లో వరుసగా నాలుగు సెంచరీలు బాదిన మూడో ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు.రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి రిటైర్మెంట్కు దగ్గర పడిన నేపథ్యంలో కరుణ్ తన అరివీర భయంక ఫామ్‌తో టీమిండియాలో పాగా వేయాలని భావిస్తున్నాడు. కరుణ్ విదర్భ జట్టుకు రాక ముందు గడ్డు రోజులు ఎదుర్కొన్నాడు. అతనికి తన సొంత రాష్ట్రం తరఫున ఆడే అవకాశాలు రాక చాలా ఇబ్బందులు పడ్డాడు. 33 ఏళ్ల కరుణ్ ఎనిమిదేళ్ల క్రితం టీమిండియాకు ఆడాడు. కరుణ్.. సెహ్వాగ్ తర్వాత భారత్ తరఫున టెస్ట్‌ల్లో ట్రిపుల్ సెంచరీ చేసిన రెండో ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. కరుణ్ తన మూడో ఇన్నింగ్స్‌లోనే ట్రిపుల్ సెంచరీ చేసి సంచలనం సృష్టించాడు. ట్రిపుల్ సెంచరీ చేశాక కరుణ్ కేవలం నాలుగు ఇన్నింగ్స్‌లు మాత్రమే ఆడాడు. ఆతర్వాత సరైన అవకాశాలు రాక కనుమరుగయ్యాడు. తాజా ప్రదర్శన తర్వాత కరుణ్ మళ్లీ ఫ్రేమ్‌లోకి వచ్చాడు. కరుణ్ విషయంలో సెలెక్టర్లు ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.
బిజినెస్
అంతర్జాతీయ పరిణామాలు.. భారీ నష్టాల్లో మార్కెట్లు
దేశీయ స్టాక్‌మార్కెట్లు సోమవారం భారీ నష్టాలతో ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 165 పాయింట్లు లాభపడి 23,735 వద్దకు చేరింది. సెన్సెక్స్ 498 పాయింట్లు పుంజుకుని 78,540 వద్దకు చేరింది. ఇటీవల భారీగా మార్కెట్లు పడిపోతున్నాయి. గతవారం ట్రెండ్ ఈవారం కొనసాగే అవకాశం ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. ట్రంప్ ప్రమాణ స్వీకారం వరకు ఈ ఒడిదొడుకులు తప్పవని అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్ల పరిణామాలు దేశీయ మార్కెట్లపై ప్రభావం చూపుతున్నాయి. బాండ్ ఈల్డ్‌లు భారీగా పెరుగుతున్నాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ జీవితకాల గరిష్టాలను చేరుతోంది.ఇదీ చదవండి: ఏడాదిలో రికార్డు స్థాయిలో ఐఫోన్ ఎగుమతులుసెన్సెక్స్ 30 సూచీలో టీసీఎస్, యాక్సిస్ బ్యాంక్, ఇండ్స్ ఇండ్ బ్యాంక్, హిందుస్థాన్ యూనిలివర్ స్టాక్‌లు లాభాల్లో ముగిశాయి. జొమాటో, అదానీ పోర్ట్స్ అండ్ సెజ్, పవర్‌గ్రిడ్, టాటా స్టీల్, ఎన్టీపీసీ, టాటా మోటార్స్, టెక్ మహీంద్రా, ఎం అండ్ ఎం, ఏషియన్ పెయింట్స్, సన్‌ఫార్మా, ఎస్బీఐ, ఆల్ట్రాటెక్ సిమెంట్, ఎల్ అండ్ టీ, టైటాన్ స్టాక్‌లు భారీగా నష్టపోయాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
ఏడాదిలో రికార్డు స్థాయిలో ఐఫోన్ ఎగుమతులు
దేశంలో తయారవుతున్న ఐఫోన్(iPhone) ఎగుమతుల విలువ 2024 ఏడాదిలో రూ.1.08 లక్షల కోట్లుగా ఉంది. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 42% పెరుగుదలను సూచిస్తుంది. ఈ ఎగుమతులు గణనీయంగా పెరగడానికి ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం(PLI) కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. భారత్‌లో ఐఫోన్ల వాడకం కూడా పెరగడం గమనార్హం. స్థానికంగా గతంలో కంటే వీటి వినియోగం 15-20%కి పెరిగిందని గణాంకాలు చెబుతున్నాయి.భారతదేశంలో యాపిల్(Apple) ప్రధాన తయారీదారులుగా ఫాక్స్‌కాన్, టాటా ఎలక్ట్రానిక్స్, పెగట్రాన్ వంటి కంపెనీలు ఉన్నాయి. ఈ కంపెనీలతోపాటు ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందించింది. దాంతో వీటి ఉత్పాదకత పెరిగింది. ఆయా కంపెనీల్లో బ్లూకాలర్ ఉద్యోగాలు సైతం గణనీయంగా పెరిగాయి. ఇటీవల కాలంలో ఏడాదిలో 1,85 వేల ఉద్యోగాలు కొత్తగా సృష్టించబడినట్లు కంపెనీల అధికారులు పేర్కొన్నారు. వీటిలో 70 శాతానికి పైగా మహిళలకే అవకాశం ఇచ్చినట్లు చెప్పారు.ఇదీ చదవండి: 40 కోట్ల జనం.. రూ.2 లక్షల కోట్ల ఆదాయం! ఎలాగో తెలుసా?యాపిల్ 2024లో దేశీయంగా 12.8 బిలియన్ డాలర్లు(రూ.1.08 లక్షల కోట్లు) ఎగుమతుల మార్కును సాధించింది. భవిష్యత్తులో వీటి విలువ ఏటా 30 బిలియన్ డాలర్లకు చేర్చాలనేలా లక్ష్యం పెట్టుకున్నట్లు కంపెనీ ప్రకటించింది. మొత్తం ఐఫోన్ ఉత్పత్తి ఎకోసిస్టమ్‌లో భారతదేశం ఉత్పాదక(Productivity) వాటా ప్రస్తుతం 14%గా ఉందని, దాన్ని భవిష్యత్తులో 26%కి పైగా పెంచేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి.
40 కోట్ల జనం.. రూ.2 లక్షల కోట్ల ఆదాయం! ఎలాగంటే..
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా ప్రారంభమైంది. గంగా, యమునా, సరస్వతి నదులు కలిసే ప్రదేశంలో 50 లక్షల మందికి పైగా ప్రజలు మొదటి పవిత్ర స్నానం చేశారు. ఈ కుంభమేళాకు సుమారు 40 కోట్ల మందికిపైగా ప్రజలు వచ్చే అవకాశం ఉందని సమాచారం.12 సంవత్సరాల తర్వాత నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ఫిబ్రవరి 26 వరకు జరుగుతుంది. ఈ కుంభమేళా కారణంగా రాష్ట్ర ఆర్థిక వృద్ధి కూడా భారీగా పెరుగుతుందని చెబుతున్నారు. ఈ కార్యక్రమానికి కేటాయించిన బడ్జెట్ రూ.7,000 కోట్లు కాగా.. రాష్ట్రానికి వచ్చే ఆదాయం రూ. 2 లక్షల కోట్ల వరకు ఉంటుందని అంచనా.45 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమానికి వచ్చే సందర్శకులు సగటున రూ. 5,000 ఖర్చు చేస్తే ఏకంగా రూ. 2 లక్షల కోట్ల ఆదాయం వస్తుందని చెబుతున్నారు. ఈ ఖర్చు రూ.10వేలకు పెరిగితే.. వచ్చే ఆదాయం రూ. 4 లక్షల కోట్లకు చేరుతుంది.2019లో జరిగిన ప్రయాగ్‌రాజ్ అర్ధ కుంభమేళా సమయంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు 1.2 లక్షల కోట్ల రూపాయలు వచ్చిందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వెల్లడించారు. ఆ సమయంలో 24 కోట్లమంది కుంభమేళా సందర్శించారని పేర్కొన్నారు. అంతే కాకుండా ఈ కార్యక్రమ సంస్కృతుల సంగమం అని.. భిన్నత్వంలో ఏకత్వ సందేశంగా అభివర్ణించారు.जहां संस्कृतियों का संगम भी है, श्रद्धा और समरसता का समागम भी है।'अनेकता में एकता' का संदेश देता महाकुम्भ-2025, प्रयागराज मानवता के कल्याण के साथ ही सनातन से साक्षात्कार करा रहा है।#एकता_का_महाकुम्भ pic.twitter.com/kZt5xtBItW— Yogi Adityanath (@myogiadityanath) January 13, 2025
స్టాక్ మార్కెట్లోకి రావాలా?.. పోవాలా?
స్టాక్ మార్కెట్లను నియంత్రించే సెబీ (సెక్యూరిటీస్ ఎక్స్చేంజి బోర్డ్ ఆఫ్ ఇండియా) ఆమధ్య కొన్ని చర్యలు తీసుకుంది. అవి నవంబర్ 20 నుంచి అమల్లోకి వచ్చాయి కూడా. కొన్ని ఇండెక్స్‌లలో వారాంతపు ట్రేడింగ్‌లు నిలిపివేయడం, లాట్ సైజులను పెంచడం వీటిలో ప్రధానమైనది. ఇలా చేయడం ద్వారా రిటైల్ ట్రేడర్లు భారీ స్థాయిలో నష్టపోకుండా చూడవచ్చన్నది సెబీ ఉద్దేశం. నిజంగా సెబీ లక్ష్యం నెరవేరిందా / నెరవేరుతుందా.. అంటే ఎన్నో ప్రశ్నలు. ఆ చర్యలను ఒకసారి విశ్లేషిస్తే...గత నవంబర్ దాకా మిడ్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ, బ్యాంకు నిఫ్టీ, నిఫ్టీ, సెన్సెక్స్‌లలో వారాంతపు కాంట్రాక్టులు ఉండేవి. ప్రతి వారం.. సోమవారం మిడ్ నిఫ్టీ, మంగళ వారం ఫిన్ నిఫ్టీ, బుధవారం బ్యాంకు నిఫ్టీ, గురువారం నిఫ్టీ, శుక్రవారం సెన్సెక్స్ ఎక్సపైరీలు జరిగేవి. తదనుగుణంగా ట్రేడర్లు పొజిషన్స్ తీసుకుని ట్రేడ్ చేసుకునేవారు. ఇప్పుడు కేవలం నిఫ్టీ, సెన్సెక్స్‌లలో మాత్రమే వారాంతపు కాంట్రాక్టులు అమలు చేస్తున్నారు.మిడ్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ, బ్యాంకు నిఫ్టీలలో ట్రేడ్ చేయాలి అనుకునేవారు.. తప్పనిసరిగా నెలవారీ కాంట్రాక్టులు మాత్రమే తీసుకోవాల్సి వస్తోంది. పైన పేర్కొన్న అయిదు సూచీల్లో మీకు నచ్చిన ఏదో ఒక సూచీని వారాంతపు ఎక్సపైరీ సూచీలుగా కొనసాగించుకోవచ్చని నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి, బొంబాయి స్టాక్ ఎక్స్చేంజీలకు సెబీ సూచించింది. ఈ రెండు ఎక్స్చేంజీలు సహజంగానే వాటి ప్రామాణిక సూచీలైన నిఫ్టీ, సెన్సెక్స్‌లలో వారాంతపు కాంట్రాక్టులు నిర్వహిస్తామని సెబీకి చెప్పాయి. దీంతో నిఫ్టీ, సెన్సెక్స్‌లలో మాత్రమే ఇప్పుడు వారాంతపు కాంట్రాక్టులు నడుస్తూండగా.. మిగిలిన మూడూ నెలవారీ కాంట్రాక్టులుగా కొనసాగుతున్నాయి. అలాగే మిడ్ నిఫ్టీ లాట్ సైజు ఇప్పటిదాకా 50 ఉంటే.. ఫిబ్రవరి నుంచి 120కి పెరిగింది. ఫిన్ నిఫ్టీ లాట్ సైజు 25 నుంచి 65కి, బ్యాంకు నిఫ్టీ 15 నుంచి 30కి, నిఫ్టీ 25 నుంచి 75కి, సెన్సెక్స్ 10 నుంచి 20కి పెరిగాయి.వారాంతపు కాంట్రాక్టులు ఇప్పటికే నెలవారీ కాంట్రాక్టులుగా మారిపోగా.. లాట్ సైజుల్లో మార్పులు త్వరలోనే అమల్లోకి రానున్నాయి. ఇంతవరకూ బాగానే ఉంది. అన్ని అలవాట్లకు లోనైన వ్యక్తి తొందరగా వాటిని ఎలా మానుకోలేడో.. ట్రేడింగ్ కూడా అలాంటిదే. పైగా ఇది ఆర్ధిక పరమైన అంశం. స్టాక్ మార్కెట్లో ఉండే బలహీనత ఏమిటంటే.. పోగొట్టుకున్న వ్యక్తి అంతటితో ఊరుకోడు. ఎలాగైనా ఆ పోగొట్టుకున్నది రాబట్టుకోవాలన్న తాపత్రయంతో ఇంకా ఇంకా డబ్బులు తెచ్చి ట్రేడింగ్‌లో పెడుతూనే ఉంటాడు. వీక్లీ కాంట్రాక్టులు తీసేయడం వల్ల వారం వారం డబ్బులు పోగొట్టుకునే ట్రేడర్లు తగ్గిపోతారని.. తద్వారా సగటు ట్రేడర్లను కాపాడినట్లు అవుతుందన్నది సెబీ సదుద్దేశం. కానీ అలా జరిగిందా..??సగటు ట్రేడర్.. ట్రేడింగ్ ఆపేయలేదు. నెలవారీ కాంట్రాక్టులు కొనడం మొదలుపెట్టాడు. ఇవి రేటు ఎక్కువ ఉంటాయి. పైగా లాట్ సైజు పెరిగింది కూడా.. దీనికి ఒక ఉదాహరణ పరిశీలిద్దాం..బ్యాంకు నిఫ్టీ లాట్ ప్రస్తుతం15 షేర్స్. ఈ సూచీ 51000 దగ్గర ఉంది అనుకుందాం. దాని కాల్ ప్రీమియం రూ. 200 ఉంది అనుకుంటే రూ. 3,000 చేతిలో ఉంటే చాలు. 1 లాట్ వస్తుంది. ఇప్పుడు మంత్లీ కాంట్రాక్టు మాత్రమే కొనాలి. మంత్లీ కాంట్రాక్ట్స్ రేట్లు ఎక్కువ ఉంటాయి. ఇదే 51000 కాల్ మంత్లీలో రూ. 1000 దరిదాపుల్లో ఉంది. కనీసం ఒక లాట్ కొనాలంటే రూ. 15,000 కావాలి. అదే ఫిబ్రవరి నుంచి అయితే లాట్ సైజు 30కి పెరుగుతుంది. అప్పుడు 30,000 అవసరమవుతాయి. దీంతో అంత పెట్టుబడి పెట్టలేక చాలామంది రిటైల్ ట్రేడర్లు మార్కెట్‌కి దూరమవుతారని, తద్వారా ఇలాంటి చిన్న ట్రేడర్లను నష్టాల నుంచి కాపాడవచ్చు అన్నది సెబీ ఉద్దేశం.ఇది జరగొచ్చు.. జరక్కపోవచ్చు కూడా.. అదెలాగంటే... 1. అంత డబ్బులు పెట్టలేని వ్యక్తి ట్రేడింగ్‌కు దూరమవుతాడు. సెబీ కోరుకున్నది ఇదే.2. ట్రేడింగ్‌కు అలవాటు పడ్డ వ్యక్తి, డబ్బులు పోగొట్టుకున్న వ్యక్తి అంత తొందరగా ట్రేడింగ్ మానేయడు. అప్పు చేసో, పొదుపు మొత్తాలు ఖాళీ చేసో.. మరిన్ని డబ్బులు తెచ్చి పెడతాడు. ఇది సెబీ ఉద్దేశాన్ని నెరవేర్చకపోగా రిటైల్ ట్రేడర్లను మరిన్ని కష్టాల్లోకి నెట్టేస్తుంది.కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చిన తర్వాత ఫిన్ నిఫ్టీ, మిడ్ నిఫ్టీ, బ్యాంకు నిఫ్టీల్లో వారాంతపు కాంట్రాక్టుల్లో ట్రేడ్ చేసే వ్యక్తులు ఇప్పుడు మంత్లీ వైపు మళ్లినట్లు గణాంకాలు చెబుతున్నాయి. గత డిసెంబర్లో (అంతక్రితం 11 నెలలతో పోలిస్తే) బ్యాంకు నిఫ్టీ మంత్లీ కాంట్రాక్టుల్లో రోజువారీ ప్రీమియం టర్నోవర్ 377 శాతం పెరిగి రూ.12,200 కోట్లుగా నమోదైంది. అదే మిడ్ నిఫ్టీలో 819 శాతం పెరిగి 512 కోట్లకు చేరగా, ఫిన్ నిఫ్టీ లో 575 శాతం పెరిగి రూ. 398 కోట్లకు చేరింది.దీన్నిబట్టి చూస్తే ట్రేడర్లు ఎక్కడా తగ్గడం లేదని తెలుస్తోంది. వ్యాపార పరిమాణం మందగించవచ్చేమో కానీ వ్యాపారం మాత్రం తగ్గట్లేదు. దీనివల్ల పోగొట్టుకునే వ్యక్తులు మరింత పోగొట్టుకోవడానికి, లబ్ది పొందేవాళ్ళు మరింత ప్రయోజనం పొందడానికి తలుపులు తెరిచినట్లే అవుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. పోగొట్టుకునేది చిన్న ట్రేడర్లే కానీ.. ప్రయోజనం పొందేది మాత్రం భారీ స్థాయిలో లావాదేవీలు నిర్వహించే విదేశీ మదుపర్లు, హై నెట్ వర్త్ ఇండివిడ్యువల్సే.సెబీ నిర్ణయాలు అమల్లోకి వచ్చి ఇంచుమించు రెండు నెలలే కావస్తోంది. కాబట్టి మరికొన్ని నెలల పరిశీలన తర్వాత సెబీ తన నిర్ణయాలను ఏవైనా మార్చుకుంటుందా.. కొత్త పద్ధతినే కొనసాగిస్తుందా.. ఏవైనా మార్పులు చేస్తుందా.. ఇవన్నీ వేచి చూడాల్సిన ప్రశ్నలే.-బెహరా శ్రీనివాస రావు, స్టాక్ మార్కెట్ విశ్లేషకులు
ఫ్యామిలీ
గీతాభాస్కర్ సమర్పించు సంక్రాంతికి సకినాలు
గీతాభాస్కర్ సినిమాలలో నటిస్తే నటన ఎక్కడా కనిపించదు. పూర్తిగా సహజత్వమే. ఆమె ఏ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లోనూ శిక్షణ తీసుకోలేదు. ‘డెస్టినీస్ చైల్డ్’ అనే పుస్తకం రాస్తే.... ‘పుస్తకం అంటే ఇలా ఉండాలి నాయనా’ అనిపిస్తుంది. ఆమె పెద్ద పుస్తకాలు రాసిన పెద్ద రచయిత్రి కాదు. నటన అయినా రచన అయినా వంట అయినా... ఏదైనా ఇట్టే నేర్చుకోగల సామర్థ్యం గీతమ్మ సొంతం. గీత పుట్టి పెరిగింది చెన్నైలో. అయినప్పటికీ... ఆమె సకినాలు చేస్తే తెలంగాణ పల్లెకి చెందిన తల్లి చేసినంత రుచిగా ఉంటాయి. పెళ్లయిన తరువాత గీత... దాస్యం గీతాభాస్కర్ అయింది. అత్తగారిది పక్కా తెలంగాణ. తెలంగాణ అంటే ది గ్రేట్ సకినాలు. ఇక నేర్చుకోకుండా ఉంటారా! సకినాలు ఎలా చెయ్యాలి... నుంచి ఫ్యామిలి ముచ్చట్ల వరకు ‘సాక్షి’తో పంచుకున్నారు గీతాభాస్కర్. ఆమె మాటల్లోనే.. అరిసెల పిండిలానే సకినాల పిండి కూడా తయారు చేసుకోవాలి. మామూలుగా వరి పిండి అయితే గట్టిగా అయిపోతుంది. పైగా అంతకుముందు వేరే గోధుమ పిండిలాంటివి పట్టి ఉంటే... అదే గిర్నీలో ఈ పిండి పడితే సరిగ్గా ఉండదు. అదే తడి పిండి అనుకోండి వేరే పిండి ఏదీ పట్టరు... బియ్యం పిండి మాత్రమే పడతారు. అయితే అరిసెల పిండికి రోజంతా బియ్యం నానబెట్టాలి. కానీ సకినాలకి నాలుగు గంటలు నానబెడితే సరిపోతుంది.మా ఆయన ఉన్నప్పుడు ముగ్గుల పోటీకి తీసుకుని వెళ్లేవారు. ఒకసారి గవర్నర్ చేతుల మీదగా బహుమతి కూడా అందు కున్నాను. పండగ రోజున మంచి మంచి ముగ్గులు వేస్తుంటాను. నా ముగ్గులన్నీ డిఫరెంట్‌గా ఉంటాయి. దసరా, సంక్రాంతి అంటే ముగ్గుల పోటీలో నేను పాల్గొనాల్సిందే. ఆయన అలా తీసుకువెళ్లేవారు.– గీతాభాస్కర్ గీతా భాస్కర్ వేసిన ముగ్గునువ్వులు ఎక్కువ వేస్తాసకినాల పిండికి కొలతలు అంటూ ఉండవు. ఒక గ్లాసు పిండికి నేను పావుకిలో నువ్వులు వేస్తాను. నువ్వులు ఎక్కువ వేస్తే గ్యాప్ ఎక్కువ వస్తుంది... పైగా నువ్వుల నుంచి కూడా నూనె వస్తుంది కదా.. బాగా ఉడుకుతుంది. దాంతో సకినం కరకరలాడుతుంది. కొంతమందైతే పచ్చి నువ్వులు వేసేస్తారు. నేను చెన్నై నుంచి వచ్చినదాన్ని కదా... మాకు అక్కడ మురుకులు అలవాటు. అక్కడ వేయించిన నువ్వులు వేస్తారు. నేను సకినాల్లో అలానే వేస్తా. అసలు ఇక్కడికి వచ్చాకే నేను సకినాలు వండటం నేర్చుకున్నాను. సకినాలకి దొడ్డు బియ్యం బాగుంటుంది. నేను దాదాపు రేషన్ బియ్యమే వాడతాను. అవి ఎక్కువ పాలిష్ ఉండవు కాబట్టి సకినాలకి బాగుంటుంది. అలాగే వేరు శెనగ నూనె వాడతాను.అమ్మ వైపు... నాన్న సైడుమా తండ్రి, తల్లివైపు వాళ్లందరూ చెన్నైలో సెటిల్ అయ్యారు. నేను పుట్టింది, పెరిగిందీ అక్కడే. రెండు కుటుంబాల వాళ్లు బిగ్ బిజినెస్ పీపుల్. ఇక మా అమ్మగారివైపు అయితే పూర్తిగా కాస్మోపాలిటన్. ఆవిడ హార్స్ రైడ్ చేసేవారు. చెన్నైలో శివాజీ గణేశన్‌లాంటి స్టార్స్ ఉండే మలోని స్ట్రీట్‌లో మా తాత ఉండేవారు. పొలిటికల్‌గా ఆయనకు చాలా స్ట్రాంగ్ కనెక్షన్స్ ఉండేవి. నెహ్రూగారితో పరిచయం ఉండేది. మా అమ్మ బట్టలన్నీ సినిమా కాస్ట్యూమర్స్ కుట్టేవారు. ఇక నాన్నవైపు పూర్తిగా భిన్నం. వాళ్లు కూడా వ్యాపారవేత్తలే. నాన్న వాళ్లది పప్పుల వ్యాపారం. నాన్నగారి కుటుంబంలో అమ్మాయిలు బయటకు వెళ్లకూడదు... మగవాళ్లతో మాట్లాకూడదు... అలా ఉండేది. నేను ఇటు అమ్మవైపు అటు నాన్నవైపుఇలాంటి కాంబినేషన్లో పెరిగా. మా అమ్మ ఒక్కతే కూతురు. ఆమెకి ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు. ఒక్కతే కూతురు కావడంతో రాణిలా పెంచారు. నాన్నవాళ్లు పదమూడుమంది. నాన్నమ్మ వాళ్లు బాగా ట్రెడిషనల్. ఇంటికి పెద్ద కోడలిగా అమ్మకి చాలా బాధ్యతలు ఉండేవి. అయితే అమ్మ ఎక్కడిది అక్కడే అన్నట్లుగా తనను మలచుకుంది. అత్తింటి విషయాలు పుట్టింటికి, అక్కడివి ఇక్కడ ఎప్పుడూ చెప్పలేదు. మా నాన్నమ్మ సైడ్‌లో పూర్తి ట్రెడిషనల్ పిండి వంటలు వండేవాళ్లు. అమ్మ సైడ్ కొంచెం డిఫరెంట్. అలా నాకు అమ్మ వల్ల, నాన్నమ్మ వల్ల వంటలు చేయడం అలవాటైంది. ఇక నేను పెళ్లి చేసుకుని ఇక్కడికి (తెలంగాణ) వచ్చాక పూర్తి భిన్నమైన వంటలు వండాల్సి వచ్చింది.అత్తింట్లోనే సకినాలు నేర్చుకున్నాఅత్తింటికి వచ్చాకే సకినాలు చేయడం నేర్చుకున్నాను. మా అత్తగారైతే అన్ని వంటలు బాగా వండుతావు... ఈ సకినాలు ఎందుకు చేయలేకపోతున్నావు... ఇవి కూడా చేయడం వస్తది అనేవారు. మా పెద్ద ఆడబిడ్డ, చిన్న ఆడబిడ్డ సకినాలు నేర్పించారు. మామూలుగా సకినాలకు ఉల్లికారం బాగుంటుంది. మా తరుణ్ (హీరో–దర్శకుడు– రచయిత తరుణ్‌భాస్కర్) కాస్త కారంగా తింటాడు. ఉల్లికారం తనకి తగ్గట్టుగా చేస్తాను. అయితే మా అత్తవాళ్లు ఉప్పు, కారం నూరి దానిమీద పచ్చి నూనె వేసేవారు. నేను కాస్త చింతపండు వేస్తాను. పండగకి అరిసెలు కూడా వండుతాను. యాక్చువల్లీ మా అమ్మ బాగా వండేది. నాకు కుదిరేది కాదు. అత్తింటికి వచ్చాక కూడా సరిగ్గా వండలేక΄ోయేదాన్ని. అయితే నా ఫ్రెండ్ వాళ్ల అమ్మ నేర్పించారు. అప్పట్నుంచి అరిసెలు చక్కగా మెత్తగా వండటం నేర్చుకున్నాను. ఇట్లు... బొబ్బట్లుఒకప్పుడు బుట్టలు బుట్టలు పిండివంటలు వండేవాళ్లు. మా ఇంట్లో మా అమ్మమ్మ, నాన్నమ్మ అలా వండటం చూశా. కానీ ఇప్పుడు ఒకట్రెండు కేజీలు వండటానికే కష్టపడిపోతున్నాం. అప్పట్లో పిండి దంచి వండేవాళ్లు. ఇప్పుడు అన్నింటికీ మిషన్ ఉంది. అయినా చేయలేకపోతున్నాం. కానీ బయట కొనుక్కుని తింటే అంత సంతృప్తి ఉండదు. ఇంట్లో వండితే పండగకి ఇంట్లో వండాం అనే తృప్తి ఉంటుంది. కానీ ఎందుకింత శ్రమ తీసుకుంటున్నావని తరుణ్ అంటుంటాడు. ఇప్పుడు తను కూడా బిజీ కాబట్టి హెల్ప్ చేసే వీలుండదు. కానీ నాకు పండగకి ఇంట్లో వండితేనే మనసుకి బాగుంటుంది. పోయిన గురువారం నాకు స్కూల్లో ఓ వర్క్‌షాప్ ఉంది. అలాగే కల్చరల్ డిపార్ట్మెంట్ వాళ్లు గవర్నమెంట్ సపోర్ట్‌తో ఓ నాలుగైదు ప్రోగ్రామ్స్ చేయమన్నారు. ఇంకా ‘ఇట్లు బొబ్బట్లు’ అని పిల్లలు తయారు చేస్తుంటారు. వాళ్లు పిలిస్తే వెళ్లాను. మా నాన్నగారు మాతోనే ఉంటారు. ఆయనకు 90 ఏళ్లు. ఆయన్ని చూసుకుంటూ, బయట పనులు చూసుకుని, ఇంటికొచ్చాక పిండి వంటలు మొదలుపెట్టా. ఇలా ఇంట్లో వండుకుంటే ఫీల్‌గుడ్ హార్మోన్‌తో మనసు హాయిగా ఉంటుంది. అది మన హెల్త్‌కి మంచిది. సకినాలు ఈ తరానికి నేర్పుదాంమన యంగర్ జనరేషన్‌కి మనం స్ఫూర్తిగా ఉండాలనుకుంటాను. ఇప్పుడు మనం వండితే భవిష్యత్తులో అప్పట్లో మన అమ్మ అలా వండేది కదా అనుకుంటారు. సో... యంగర్ జనరేషన్‌కి మన కల్చర్ అలవాటు చేయాలి. అందుకే మనం ఇంట్లోనే వండాలి. అమ్మ కష్టపడి వంట చేస్తుంటే పిల్లలకు హెల్ప్ చేయాలనిపిస్తుంది. మా తరుణ్ ఈ మధ్య ఓ రెండు రోజులు ఇంటికి రావడానికి కూడా కుదరలేదు. ఒక సినిమాకి డైలాగ్స్ రాస్తున్నాడు. ఆ స్ట్రెస్‌లో ఉన్నాడు. ఇంటికి వచ్చాక ఒక గిల్ట్తో ‘ఇంకో రెండు మూడు పేజీలు రాయాలమ్మా... అయిపోతుంది’ అన్నాడు. ఎంత బిజీగా ఉన్నప్పటికీ సకినాలు చేయడంలో నాకు హెల్ప్ చేశాడు (నవ్వుతూ). స్ట్రెస్ ఉంటే తరుణ్ ‘చెఫ్’మా తరుణ్‌కి కూడా వంటలంటే ఇష్టం. నేను చేస్తుంటే వచ్చి చేస్తుంటాడు. నేనేదైనా బాగా వండితే, ఎలా వండావు అని అడిగి తెలుసుకుంటాడు. మా ఇంటి పక్కనే మాకు బాగా పరిచయం ఉన్న ఫ్యామిలీ ఉంది. అలాగే మా ఆఫీసు ఒకటి క్లోజ్ చేశాం... ఆ ఆఫీసులో ఉన్న ఇద్దరు పిల్లలు మా ఇంట్లో ఉంటారు. ఇక ఆ ఫ్యామిలీ, ఈ పిల్లలు అందరూ కలిసి చేస్తుంటాం. మా నాన్న కూడా సలహాలు ఇస్తుంటారు. మా తరుణ్‌కి చాలా స్ట్రెస్ ఉండిందనుకోండి... అప్పుడు వంట చేస్తాడు. నా వంటిల్లు మొత్తం హైజాక్ అయి΄ోతుంది (నవ్వుతూ). వాడి బర్త్‌డేకి వాడికి తెలియకుండా వంటల బుక్ రాసి, గిఫ్ట్‌గా ఇచ్చాను. ఈ తరానికి నేర్పుదాంమన యంగర్ జనరేషన్‌కి మనం స్ఫూర్తిగా ఉండాలనుకుంటాను. ఇప్పుడు మనం వండితే భవిష్యత్తులో అప్పట్లో మన అమ్మ అలా వండేది కదా అనుకుంటారు. సో... యంగర్ జనరేషన్‌కి మన కల్చర్ అలవాటు చేయాలి. అందుకే మనం ఇంట్లోనే వండాలి. అమ్మ కష్టపడి వంట చేస్తుంటే పిల్లలకు హెల్ప్ చేయాలనిపిస్తుంది. మా తరుణ్ ఈ మధ్య ఓ రెండు రోజులు ఇంటికి రావడానికి కూడా కుదరలేదు. ఒక సినిమాకి డైలాగ్స్ రాస్తున్నాడు. ఆ స్ట్రెస్‌లో ఉన్నాడు. ఇంటికి వచ్చాక ఒక గిల్ట్తో ‘ఇంకో రెండు మూడు పేజీలు రాయాలమ్మా... అయిపోతుంది’ అన్నాడు. ఎంత బిజీగా ఉన్నప్పటికీ సకినాలు చేయడంలో నాకు హెల్ప్ చేశాడు (నవ్వుతూ).
డబ్బాలు, బొట్టు పెట్టెలు, అట్టపెట్టెలు
సాక్షి, సిద్దిపేట: తరతరాల నుంచి సంక్రాంతి నోములు నోచుకునే కుటుంబాలూ ఉన్నాయి. సిద్దిపేట, హైదరాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్, వరంగల్, హనుమకొండ, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో పండుగ వేళ.. లలితాదేవి పుస్తకం, శ్రీచక్రం, మంగళగౌరి, పీటమీద పిల్లెన్లు, అరుగు మీద అద్దాలు, లాలి గౌరవమ్మ, డబ్బాలు, బొట్టు పెట్టెలు, అట్ట పెట్టెలు, పల్లకి, బతుకమ్మ, కుంకుమ భరణి, క్యారంబోర్డు, గాలిపటాలు, చరఖాలు ఇలా వందల రకాల వస్తువుల్లో ఏదో ఒకదానితో నోముకుంటారు. గౌరమ్మను పెట్టి పసుపు, కుంకుమ వేసి, ఏవైనా ఒకే రకమైన 13 వస్తువులను పెట్టి బంధువులు, స్నేహితుల ఇంటికెళ్లి వాయనం ఇచ్చి వస్తారు. బాలింతలు, చిన్న పిల్లలు ఉన్నవారు ఉగ్గు గిన్నె, నూనె పావు నోములు నోస్తారు. ఆరునెలల ముందే నోము సామగ్రి తెప్పిస్తాంపండుగకు ఆరు నెలల ముందే నోము సామగ్రి తెప్పిస్తాం. స్టీల్ అయితే మచిలీపట్నం, ఇత్తడి సామాను చెన్నై, ప్లాస్టిక్ వస్తువు లను ఢిల్లీ నుంచి తెప్పిస్తాం. మా షాప్‌నకు వివిధ జిల్లాలవారు వచ్చి కొనుగోలు చేస్తుంటారు. కొందరు ఆన్లైన్లో ఆర్డర్ ఇస్తారు. – నార్ల నాగరాజు, నోముల సామగ్రి షాప్ యజమాని, సిద్దిపేట
భావోద్వేగాల 'కిజిక్ తివాచీ..!
ఏ దేశ చారిత్రక సంస్కృతి చూసినా అక్కడి స్థానిక మహిళల సంప్రదాయ వారసత్వం ఉనికిలోకి వస్తూనే ఉంటుంది. టర్కిలోని మధ్య–నల్ల సముద్రం ప్రాంతంలోని కిజిక్ గ్రామానికి ప్రత్యేకమైన సాంప్రదాయ కళ ఒకటుంది. ఆ వారసత్వం పేరు కిజిక్ కార్పెట్. సాంస్కృతికపరంగా, మహిళలకు ఆదాయ వనరుగా సంరక్షించబడుతోంది అక్కడి తివాచీ. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అధ్యయనాలు, జియొగ్రాఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రేషన్‌తో కిజిక్ కార్పెట్ ఇప్పటికీ రక్షించబడుతుంది. భవిష్యత్ తరాలకు దాని నిరంతర ఉనికిని తెలియజేస్తుంది.చారిత్రక జీవనశైలికిజిక్ గ్రామ మహిళల ఆనందం, దుఃఖం, ఆశ.. భావోద్వేగాలు, ఆలోచనలను ప్రతిబింబించే దాని సంక్లిష్టమైన మూలాంశాలతో కిజిక్ కార్పెట్ తయారీ విభిన్నంగా ఉంటుంది. ఈ తివాచీలు అలంకార వస్తువులు మాత్రమే కాదు. అవి లోతైన సాంస్కృతిక అర్థాన్ని కూడా కలిగి ఉంటాయి. కిజిక్ ప్రాంత చరిత్ర, జీవనశైలి, సంస్కృతిని ఈ కార్పెట్లు సూచిస్తాయి.టోకాట్ ప్రావిన్షియల్ డైరెక్టరేట్ ఆఫ్ నేషనల్ ఎడ్యుకేషన్, టోకాట్ మెచ్యూరేషన్ ఇన్స్టిట్యూట్ మధ్య సహకార ప్రయత్నం ద్వారా, విస్తృతమైన, ఫీల్డ్ పరిశోధనలు నిర్వహించారు. ఫలితంగా కిజిక్ కార్పెట్ భౌగోళిక సూచిక విజయవంతంగా నమోదయ్యింది. టోకాట్ మెచ్యూరేషన్ ఇన్స్టిట్యూట్లో ఉపాధ్యాయురాలు సెరాప్ బుజ్లుదేరే, ఈ సాంస్కృతిక విలువలను కా΄ాడటంలో ప్రాముఖ్యతను హైలైట్ చేసింది.మూలాంశాల ద్వారా సందేశంతివాచీలలో ఉపయోగించే మూలాంశాలు తరచుగా స్త్రీల నుండి వారి కాబోయే భర్తలకు సందేశాలు, బహిరంగంగా తెలియజేయలేని భావోద్వేగాలను వ్యక్తపరుస్తాయి. కిజిక్ సంస్కృతి సంఘం అధ్యక్షుడు అహ్మెట్ ఓజ్టెక్, కిజిక్ తివాచీల చారిత్రక ప్రాముఖ్యతను చెబుతూ– ‘కిజిక్ ప్రజలు ఓఘుజ్ టర్క్‌లకు చెందినవారు. చారిత్రాత్మకంగా, వారు సంచార జీవితాన్ని గడిపారు. పశుశోషణ, మేకల పెంపకం ప్రధాన జీవనోపాధిగా ఉంది. గొర్రెల నుండి ఉన్ని తివాచీలు తయారు చేయడంతో సహా వివిధ ప్రయోజనాల కోసం ఉపయోగించబడింది. సుధీర్ఘ శీతాకాలపు రాత్రులలో, పెద్దలు పర్యావరణం నుండి సేకరించిన సహజ మూలికలతో ఉన్నిని తయారుచేయడం, వాటికి రంగు వేయడం, తరువాత తివాచీలు, సంచులు, రగ్గులు వంటి ఇతర ఉత్పత్తులను నేసేవారు. తమ కమ్యూనిటీలో ఎవరి వివాహం కుదిరినా, ఆ వధూవరులకు స్వయంగా తివాచీని తయారుచేసి, ఇచ్చేవారు’ అని వివరిస్తారు. ఈ తివాచీలు కేవలం గృహోపకరణాలు మాత్రమే కాదు, వ్యక్తిగత సందేశాలు, భావాలను కలిగి ఉంటాయి. అయితే, సాంప్రదాయ కిజిక్ తివాచీలు పారిశ్రామికీకరణతో సవాళ్లను ఎదుర్కొన్నాయి. కానీ, సాంస్కృతిక వారసత్వాన్ని ముందు తరాలకు సజీవంగా అందజేయడానికి కిజిక్ మహిళ కృషి జరుపుతూనే ఉంది. (చదవండి: ఆ ఫ్రాక్చర్ని ఏఐ పసిగట్టింది..కానీ డాక్టర్లు..)
బ్రహ్మాండం... కృష్ణుడి పాకుండలు
కృష్ణుడు నవ్వడు. తెగ నవ్విస్తాడు. కృష్ణుడు అమాయకంగా కనిపిస్తాడు. కానీ అల్లరల్లరి చేస్తాడు. ‘అయ్ బాబోయ్... మా రాజోలులో ఇలా కాదండీ’ అనేది ‘వినాయకుడు’ సినిమాలో కృష్ణుడి మార్క్ డైలాగ్. కృష్ణుడు నటుడు మాత్రమే కాదు ్రపొఫెషనల్ ఫొటోగ్రాఫర్ కూడా. ఈ ‘కూడా’కు మరో ‘కూడా’ కలిపితే వంటలు చేయడంలో దిట్ట కూడా! కృష్ణుడు కోనసీమ బిడ్డ. ఉమ్మడి కుటుంబాల విలువ తెలిసిన కృష్ణుడు ఈస్ట్, వెస్ట్ స్పెషల్ పాకుండల గురించి నోరూరించేలా చెబుతాడు. అంతేనా! ‘అయ్ బాబాయ్. మా రాజోలులో అలా కాదండి. ఎలా ఉంటాయో చెప్పడంతో పాటు ఎలా చేయాలో కూడా చెబుతామండీ’... మరి ఆయన మాటల్లోనే... పాకుండలు, పెద్ద చెగోడీలతో పాటు... తన స్వీట్ ఫ్యామిలీ కబుర్లు...కనుల పండగ చేసే రంగవల్లులే కాదు... సంక్రాంతి అంటే కమ్మని కర కరలు కూడా తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ్రపాంతానికి ప్రత్యేక వంటకాలు ఉన్నాయి. పెద్ద పండగ రోజు ఆ కరకరల స్వరాలు వినాల్సిందే. తన సహజ నటనతో ప్రేక్షక అభిమానాన్ని సొంతం చేసుకున్న గీతాభాస్కర్ చేసే సకినాల రుచి ఇంతా అంతా కాదు. కృష్ణుడు అంటే అల్లరి. వెండితెర కృష్ణుడు అంటే నవ్వుల సందడి. కోనసీమ బిడ్డ కృష్ణుడు పాకుండల గురించి చెబితే తీయగా నోరూరాల్సిందే. తమకు ఇష్టమైన వంటకాల గురించి చెప్పడమే కాదు... ఎలా చేయాలో కూడా చెబుతున్నారు గీతాభాస్కర్, కృష్ణుడు. ఆ కబుర్ల కరకరలు... కృష్ణుడు: ట్రెడిషనల్ పిండి వంటలు చేయడం అనేది నాకు చిన్నప్పుడు అలవాటు. మా అమ్మ చేసేవారు. అలాగే మా ఇంట్లో సుబ్బయ్య అని కుక్ ఉండేవారు. ఆయన దగ్గర్నుంచి నేర్చుకున్నా. బియ్యం నానబెట్టి, తర్వాత ఆరబెట్టి, దంచేవాళ్లు. నా చిన్నప్పుడు బాగా గుర్తున్నది అంటే ఇదే. ఇప్పుడంటే మిషన్‌లో పిండి ఆడిస్తున్నారు కానీ అప్పట్లో దంచడమే. మన చిన్నప్పుడు మనం తిన్నంత టేస్టీగా ఇప్పుడు ఉండటంలేదు. చిన్నప్పుడు టేస్ట్ చూశాం కాబట్టి మనకు ఆ తేడా తెలుస్తుంది. ఇప్పటి జనరేషన్‌కి ఆ తేడా తెలియదు. అప్పట్లో ఎక్కువగా ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. అందరూ కలిసి రోజుకొక ఇంటికి అన్నట్లు వండేవారు. అది చాలా బాగుండేది.మాకు పాకుండలు ఫేమస్మేం ఈ సంక్రాంతికి పాకుండలు చేశాం. మాకు అదే ప్రత్యేకత. ఈస్ట్, వెస్ట్‌లో సంక్రాంతికి పాకుండలు ఫేమస్. విడిగా పెద్దగా చేయరు. ఈ పండగకే చేస్తుంటారు. అరిసెల పిండి ఫార్మాట్లోనే పాకుండల పిండి కూడా ఉంటుంది. బియ్యాన్ని ఓ రోజంతా కానీ 30 గంటలు కానీ నానబెట్టి, పిండి పట్టించుకోవాలి. బెల్లం పాకం పట్టి చేసుకోవాలి. పాకం సరిగ్గా కుదరడానికి కొలతలు ముఖ్యం. నాలుగు గ్లాసుల బియ్యం పిండికి రెండు గ్లాసుల బెల్లం వాడాలి. ఒక అరగ్లాసు నీళ్లు పోసి, పాకం పట్టాలి. పాకుండలలో కొబ్బరి ముక్కలు వేస్తారు. అది టేస్టీగా ఉంటుంది. సంక్రాంతికి అరిసెలు ఉంటాయి కానీ కోనసీమ జిల్లాల్లో పాకుండలనే ప్రిఫర్ చేస్తారు.ఆ మంచు... అదో అందంచిన్నప్పుడు సంక్రాంతి అంటే భోగి మంటలు, హరిదాసులు, ఇరుగుపొరుగు కలిసి పిండి వంటలు వండుకోవడం... ఊర్లో ఇలాంటి సందడి ఉండేది. ఇప్పటికీ ఊళ్లో ఉన్నాయి. కానీ సిటీలో అంత సందడి కనిపించదు. చిన్నప్పుడు ఆ మంచులో భోగి మంటలు వేయడం, హరిదాసులు రావడం, పెద్ద పెద్ద ముగ్గులు చూడటం... అంతా ఓ అందంగా ఉండేది. అదో మంచి అనుభూతి. సిటీల్లో గేటెడ్ కమ్యూనిటీల్లో భోగి మంటలు అవి వేస్తారు కానీ ఊళ్లో ఉన్నంత సందడి ఇక్కడ కనిపించదు. అందుకే చాలామంది పండగలకి ఊరు వెళ్లిపోతుంటారు. నేను కూడా వీలున్నప్పుడల్లా వెళుతుంటాను. మా పాపకి ఆ కల్చర్ తెలియాలని తనని కూడా తీసుకెళుతుంటాను. ఉద్యోగాలు, వ్యాపారాలంటూ సిటీల్లో స్థిరపడుతున్నారు. వాళ్లల్లో ఎక్కువ మంది పండగకి ఊరికి వెళుతుంటారు. అందుకే సంక్రాంతి అంటే అందర్నీ కలిపే పండగ. బయటి ఫుడ్ తినదుమాది లవ్ మ్యారేజ్. మా ఆవిడ (లలితా గాయత్రి) వాళ్లది నిజామాబాద్. ఆ వంటల స్టయిల్ వేరు. ఏ ్రపాంతం రుచి ఆ ్రపాంతానిది. నేను బేసిక్‌గా ఫుడ్ లవర్ని. బాగా వండిన ప్రతిదీ నాకు ఇష్టం. ఇక మా ఆవిడకి కూడా పాకుండలు చేడయం వచ్చు. నిజానికి పెళ్లయ్యాక నేను వంట చేయడం మానేశాను. అయితే అప్పుడప్పుడూ చేస్తుంటాను. ఈ పండగకి నేనే చేశాను... తను పక్కనే ఉండి, కాస్త హెల్ప్ చేసింది. మా పాపకు నచ్చిన పిజ్జా, గార్లిక్ బ్రెడ్ అవన్నీ కూడా చేస్తుంటాను. మా పాప బయటి ఫుడ్ దాదాపు తినదు. ఇంట్లోనే చేసి పెడతాం.పండగకి పెద్ద చెగోడీలూ చేస్తాంసంక్రాంతికి మేం పాకుండలతో పాటు పెద్ద చెగోడీలు చేస్తుంటాం. మా రాజోలులో ఈ చెగోడీలు ఫేమస్. కారపొ్పడితో చేస్తాం. చాలా సాఫ్ట్‌గా ఉంటాయి. నాకు చాలా ఇష్టం. ఊరెళ్లినప్పుడుల్లా తింటాను. ఇప్పుడు పాకుండలతోపాటు అవి కూడా వండాను. చెగోడీలకు కూడా బియ్యం పిండినే వాడతాం. ఒక గ్లాసుడు పిండికి ఒక గ్లాసు నీళ్ల రేషియోతో చేయాలి. పచ్చి మిరపకాయలు, అల్లం, జీలకర్ర... మూడూ నూరి, వేడి నీళ్లలో కలిపి, ఉప్పు వేసి, అందులో బియ్యం పిండి వేసి, కలపాలి. ఆ తర్వాత చెగోడీలను లావుగా వత్తి, పెసరపప్పు అద్ది, నూనెలో వేసి వేయించుకోవాలి.
ఫొటోలు
National View all
జాతీయ పసుపు బోర్డు చైర్మన్‌గా పల్లె గంగారెడ్డి
సాక్షి,న్యూఢిల్లీ:జాతీయ పసుపు బోర్డు(Turmeric Board) ఛైర్మన్
కిషన్‌రెడ్డి ఇంట్లో సంక్రాంతి సంబరాలు.. హాజరైన ప్రధాని
సాక్షి,న్యూఢిల్లీ:కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి నివాసంలో సోమవార
నలుగురిని కంటే రూ.లక్ష బహుమతి: పరశురాం బోర్డు
భోపాల్:మధ్యప్రదేశ్(MadhyaPradesh)లో పరశురామ్ కల్యాణ్ బోర
మోదీ జీ.. వారిని ఎప్పుడు ఓబీసీల్లో చేరుస్తారో చెప్పండి?
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్ల
బంగ్లాదేశ్‌కు భారత్ కౌంటర్..రాయబారికి సమన్లు
న్యూఢిల్లీ:బంగ్లాదేశ్(Bangladesh) నుంచి భారత్(India)లోకి చ
International View all
జపాన్‌లో భారీ భూకంపం..సునామీ హెచ్చరిక జారీ
టోక్యో:జపాన్(Japan)లో సోమవారం(జనవరి13) భారీ భూకంపం(EarthQua
‘నల్ల పెట్టె’ మౌనరాగం!
బ్లాక్ బాక్స్... చూసేందుకు నల్ల రంగులో ఉండదు.
బంగ్లాదేశ్‌కు భారత్ కౌంటర్..రాయబారికి సమన్లు
న్యూఢిల్లీ:బంగ్లాదేశ్(Bangladesh) నుంచి భారత్(India)లోకి చ
ట్రంప్ ప్రకటన: గ్రీన్‌ల్యాండ్ రేటెంతో తెలుసా?
అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్న 'డొనాల్డ్ ట్రంప్' (Donald Trump) డెన్మార్క్‌లోని గ్రీన్‌ల్యాండ్‌ను కొనుగోలు చేయనున్
కనీవినీ ఎరగని కార్చిచ్చుతో అల్లాడిపోతోంటే... మారువేషాల్లో దారుణం!
లాస్ ఏంజిల్స్‌లో రగిలిన కార్చిచ్చు అమెరికాను అతలాకుతలం చేసింది.
NRI View all
Sankranti 2025 : జపాన్‌లో తెలుగువారి సంక్రాంతి సంబరాలు
సంక్రాంతి వచ్చిందంటే ఊరా వాడా అంతా సంబరంగా జరుపుకుంటారు.
17 ప్రేమ జంటలకు టోకరా ఇచ్చిన ఎన్ఆర్ఐ మహిళ : 20 ఏళ్ల నుంచి దందా
ఎదుటి వారి అమాయకత్వాన్ని, అవకాశాన్ని స్మార్ట్‌గా సొమ్ము చేసుకునే కంత్రీగాళ్
యాపిల్‌లో భారతీయ ఉద్యోగుల అక్రమాలు, తానాపై ఎఫ్‌బీఐ కన్ను?!
అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణపై టెక్ దిగ్గజం యాపిల్ 185 మంది ఉద్యోగులను త
సింగపూర్ దక్షిణ భారత బ్రాహ్మణ సభ (SDBBS) శాస్త ప్రీతి కార్యక్రమం ఘనంగా
సింగపూర్ దక్షిణ భారత బ్రాహ్మణ సభ (SDBBS) శాస్త ప్రీతి (నూతన సంవత్సరంలో జరిగే తొలి కార్యక్రమము) ని జనవరి 5న ఘనంగా నిర్వహి
జాహ్నవి కందుల కేసులో ఎట్టకేలకు న్యాయం!
భారతీయ విద్యార్థిని జాహ్నవి కందుల(Jaahnavi Kandula)
క్రైమ్
వేడి నీళ్లు మీద పడి బాలుడి మృతి
గచ్చిబౌలి: తల్లి స్నానం కోసం పెట్టుకున్న వేడి నీళ్ల బకెట్‌ను పట్టుకోవడంతో ప్రమాదవశాత్తు నీళ్లు మీదపడి తీవ్ర గాయాలపాలై చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందిన సంఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ సీహెచ్ వెంకన్న తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. వికారాబాద్ జిల్లా దోమ మండలం గొడుగోనిపల్లికి చెందిన దంపతులు మైసం రాజు, సోనీ బతుకు దెరువు కోసం వచ్చి మణికొండలోని శివపురి కాలనీలో నివాసం ఉంటున్నారు. రాజు వాచ్‌మెన్‌గా పని చేస్తూనే కారు డ్రైవింగ్ చేస్తుంటాడు. ఈ నెల 6న సాయంత్రం 4.40 గంటల సమయంలో సోనీ స్నానం చేసేందుకు బకెట్లో హీటర్ పెట్టి నీళ్లను వేడి చేసింది. ఆమె కొడుకు ధీరజ్ (04) ఆడుకుంటూ బకెట్‌ను పట్టుకున్నాడు. బకెట్ కిందపడటతో నీళ్లన్నీ శరీరంపై పడి బాలుడికి 60 శాతం కాలిన గాయాలయ్యాయి. వెంటనే గమనించిన తల్లి హుటాహుటిని సమీపంలోని ఓ ప్రైవేట్ అస్పత్రికి తరలించింది. అక్కడి నుంచి నిలోఫర్‌కు వెళ్లగా ఉస్మానియా ఆస్పత్రికి పంపించారు. ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ధీరజ్ శుక్రవారం రాత్రి 11 గంటలకు మృతి చెందాడు. వేడి నీళ్లు మీదపడి ఒక్కగానొక్క మృతి చెందడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా విలపించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
గృహిణి అదృశ్యంపై కేసు నమోదు
పహాడీషరీఫ్: గృహిణి అదృశ్యమైన సంఘటన పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ గురువారెడ్డి శనివారం తెలిపిన వివరాల ప్రకారం.. జల్పల్లి శ్రీరాం కాలనీకి చెందిన సంపంగి గణేష్ ఏడాది క్రితం శిరీష(21) అనే యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. అప్పటి నుంచి శిరీష కుటుంబ సభ్యులు ఆమెతో మాట్లాడడం లేదు. తాజాగా ఆమె తల్లితో మాట్లాడుతుంది. ఈ క్రమంలోనే ఈ నెల 9న తల్లి వద్దకు వెళ్లొస్తానని చెప్పి శిరీష బయటికి వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. ఈ విషయమై గణేష్ అత్తగారింటిలో వాకబు చేయగా, అక్కడికి రాలేదని తెలిపారు. దీంతో పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఆచూకీ తెలిసిన వారు పోలీస్‌స్టేషన్‌లోగాని 87126 62367 నంబర్లో గాని సమాచారం అందించాలని తెలిపారు.
సంక్రాంతికి వస్తానని.. తిరిగిరాని లోకాలకు
జవహర్‌నగర్: ‘సంక్రాంతికి వస్తా..నీవు ఆరోగ్యంగా ఉండు. నాకు చిన్న పని ఉంది చూసుకుని రేపు ఇంటికి బయలుదేరి వస్తా. పండగ అయ్యాక మనమిద్దరం కలిసి బియ్యం తీసుకుని హైదరాబాద్‌కు వెళ్దాం..’ అని గర్భవతి అయిన భార్యతో ఫోన్లో మాట్లాడి వెళ్లిన కొన్ని గంటలకే ఆ ఇంటి యజమాని తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. కరెంటు అధికారుల నిర్లక్ష్యం కారణంగా మృతిచెందాడు. జవహర్‌నగర్ సీఐ సైదయ్య, బాధితుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం గోవింద్రాల బంజారా తండాకు చెందిన బానోతు ప్రశాంత్ (26), సరిత దంపతులు. వీరు సంతో నగర్లో నివాసం ఉంటున్నారు. ప్రశాంత్ బాలాజీనగర్ సబ్‌స్టేషన్‌లో విద్యుత్ కాంట్రాక్ట్ లేబర్‌గా పనిచేస్తున్నాడు. రోజు మాదిరిగానే ప్రశాంత్ శుక్రవారం సంతోష్‌నగర్‌లో విద్యుత్ లైన్ల మరమ్మతులకు తోటి కారి్మకులతో కలిసి వెళ్లాడు. ఈ క్రమంలో ఏఈ సాంబశివరావు, లైన్మెన్ నాగరాజుతో పాటు కాంట్రాక్టర్ రాజేశ్‌లు ఎల్సీ తీసుకున్నామని, మీరు పని పూర్తి చేయాలని చెప్పడంతో ప్రశాంత్ ఉదయం 10.20 నిమిషాల సమయంలో విద్యుత్ స్తంభం ఎక్కి వైర్ కట్‌చేస్తుండగా 11కేవీ తీగలు తగిలాయి. ప్రశాంత్ స్తంభంపైన పనిచేస్తుండగానే అధికారులు, కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరించి విద్యుత్ సరఫరాను ఆన్ చేశారు. దీంతో విద్యుదాఘాతానికి గురై ప్రశాంత్ మృతిచెందాడు. తోటి కార్మికులు, ఉన్నతాధికారులు పోలీసులకు సమాచారం అందించి సమీప ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. భార్యతో ఉదయం ఫోన్లో మాట్లాడిన కొద్దిసేపటికే..మృత్యువాత పడిన విషయం తెలిసి కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించారు. ప్రశాంత్ కుటుంబాన్ని ప్రభుత్వం, అధికారులు అన్ని విధాలా ఆదుకోవాలని ఖమ్మం జిల్లా కామేపల్లి మండల మాజీ జెడ్పీటీసీ ప్రవీణ్‌కుమార్ నాయక్ డిమాండ్ చేశారు. స్థానిక నాయకులు, కుటుంబ సభ్యులతో కలిసి పోలీస్ స్టేషన్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. కార్మికుని కుటుంబానికి అన్నివిధాల ఆదుకుంటామని విద్యుత్ అధికారులు హమీ ఇచ్చారు. ప్రస్తుతానికి తక్షణ సహాయంగా రూ.10 లక్షలు ఇస్తున్నట్లు అధికారులు, కాంట్రాక్టర్ ప్రకటించారు. పండక్కి ఊరికి వస్తానంటివే.!
మీరట్‌లో దారుణం
మీరట్: ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ నగరంలో దారుణం చోటుచేసుకుంది. దంపతులు, వారి 8 ఏళ్లలోపు ముగ్గురు కుమార్తెలు దారుణ హత్యకు గురవడం సంచలనం రేపింది. పాత గొడవలే ఈ దారుణానికి కారణమని భావిస్తున్నారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ జరుపుతున్నారు. లిసారి గేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుహైల్ గార్డెన్ ప్రాంతంలోని ఓ ఇంట్లో ఇటీవలే మొయిన్ అలియాన్ మోయినుద్దీన్(52), అస్మా(45)దంపతులు అద్దెకు దిగారు. వీరికి ముగ్గురు కుమార్తెలు అఫ్సా(8), అజిజా(4), అడీబా(1)ఉన్నారు. మొయిన్ దంపతులు బుధవారం నుంచి కనిపించకపోవడంతో అస్మా సోదరుడు షమీమ్, మొయిన్ సోదరుడు సలీ వారుండే ఇంటికి వచ్చి చూడగా బయట తాళం వేసి ఉంది. శుక్రవారం అతికష్టమ్మీద ఇంటి పైకప్పును తొలగించి, లోపలికి వెళ్లి చూడగా భయానక దృశ్యాలు కనిపించాయి. పడుకునే మంచానికి ఉన్న అరలో ముగ్గురు చిన్నారుల మృతదేహాలు కుక్కి ఉండగా దంపతులను బెడ్‌షీట్‌లో చుట్టి పడేశారు. వీరి కాళ్లు కట్టేసి ఉన్నాయి. షమీమ్, సలీమ్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు అస్మా చిన్న మరదలు, ఆమె ఇద్దరు సోదరులతోపాటు మరికొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మరో అనుమానితుడి కోసం గాలింపు చేపట్టారు. ఇది తెలిసిన వారి పనే కావొచ్చని పోలీసులు తెలిపారు.