Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

TDP Govt Takes U Turn On Its  MLC Candidate Defeated1
ఓడిపోతే మా అభ్యర్థి కాదు.. గెలిస్తేనే మా అభ్యర్థి..!

విజయవాడ: టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ గట్టి షాక్ తగిలింది. ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం బలపరిచిన పాకలపాటు రఘువర్మ ఓడిపోయారు. రఘువర్మపై పీఆర్టీయూ అభ్యర్థి శ్రీనివాసుల నాయుడు గెలుపొందారు. అయితే తమ అభ్యర్థి ఓడిపోగానే టీడీపీ యూటర్న్ తీసుకుంది. అసలు తాము అక్కడ అభ్యర్థినే పెట్టలేదంటూ కొత్త పల్లవి అందుకుంది. ఇక శ్రీనివాసుల నాయుడు గెలుపును కూటమి ఖాతాలో వేసుకునే యత్నం చేస్తోంది టీడీపీ. తమ మద్దతుతోనే శ్రీనివాసుల నాయుడు గెలిచాడని మంత్రి అచ్చెన్నాయుడు వింత ప్రకటన చేశారు.ఓడిపోయిన రఘువర్మ తమ అధికారిక అభ్యర్థి కాదని కొత్త రాగంఅందుకుంది. ఎన్నికల ముందు రఘువర్మని తమ అభ్యర్థి అని ప్రకటించిన టీడీపీ, జనసేనలు.. ఓడిపోగానే మాట మార్చేశారు. కూటమి పార్టీల మద్దతు తోనే విజయం సాధించామని ప్రకటన చెయ్యాలని గాదె శ్రీనివాసులు నాయుడుపై అచ్చెన్ననాయుడు ఒత్తిడి తెస్తున్నారు. ఓడిపోతే తమ అభ్యర్థి కాదని, గెలిస్తేనే తమ అభ్యర్థిని చెప్పుకుంటున్న టీడీపీ వైఖరి చూసి జనం విస్తుపోతున్నారు.ప్రభుత్వంపై ప్రభుత్వ టీచర్ల వ్యతిరేకతఉత్తరాంధ్ర టీచర్‌ ఎన్నికల ఫలితాలతో 9 నెలలకే ప్రభుత్వంపై టీచర్ల వ్యతిరేకత సుస్పష్టమైంది. ప్రభుత్వంపై ఉపాధ్యాయులు తిరుగుబాటు ప్రకటించారు. అందుకు ఊతం ఇచ్చేలా ఉత్తరాంధ్ర టీచర్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రభుత్వ టీచర్లు కూటమికి ఓటమి రుచి చూపించారు. టీచర్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి పాకలపాటి రఘు వర్మను ఓడించారు. పీఆర్‌టీయూ అభ్యర్థి గాదె శ్రీనివాసులు నాయుడిని గెలిపించారు. చంద్రబాబుకు ఓటమి రుచి చూపించిన ప్రభుత్వ టీచర్లురఘువర్మను కూటమి అభ్యర్థిగా టీడీపీ, జనసేన,బీజేపీలు పోటీకి పెట్టాయి. తొలి ప్రాధాన్యత, రెండో ప్రాధాన్యతలోనూ కూటమి అభ్యర్థి వెనకపడ్డారు. బ్యాలెట్ ఓటింగ్‌లో కూటమి పార్టీ అభ్యర్థికి భంగపాటు ఎదురైంది. దీంతో చరిత్రలో ఏ ప్రభుత్వానికి ఎదురుకాని చేదు అనుభవం కూటమి ప్రభుత్వానికి ఎదురైంది. ఎన్నికల్లో గెలిచాక ఉద్యోగులు, ఉపాధ్యాయులను ప్రభుత్వం మోసం చేసింది. ఉద్యోగులకు కనీసం ఒక్క డీఏ ఇవ్వలేదు. ఉద్యోగులకు ఐఆర్, పీఆర్సీ ఊసెత్తలేదు. దీంతో ప్రభుత్వ టీచర్లలో చంద్రబాబు ప్రభుత్వంపై వ్యతిరేకత ఏర్పడింది. ఫలితంగా ఉత్తరాంధ్ర టీచర్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి పాకలపాటి రఘువర్మకు ఓటమి అనివార్యమైంది.

alugubelli narsi reddy Responds On His Defeat In Teachers MLC Elections2
‘రెండోసారి నన్ను గెలిపించాలని అనుకోలేదేమో’

నల్లగొండ జిల్లా : వరంగల్-నల్లగొండ-ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ స్థానంలో పోటీ చేసిన యూటీఎఫ్ అభ్యర్థి అలుగుబెల్లి నర్సిరెడ్డి ఓటమి పాలయ్యారు. అంతకుముందు ఎమ్మెల్సీ గా ఉన్న ఆయన.. ఈసారి ఓటమి పాలయ్యారు. నర్సిరెడ్డిపై పీఆర్టీయూ టీఎస్ అభ్యర్థి పింగళి శ్రీపాల్ రెడ్డి గెలుపొందారు.ఓటమి అనంతరం నర్సిరెడ్డి కౌంటింగ్ కేంద్రం వద్ద మీడియాతో మాట్లాడారు. ‘ ఈ ఓటమి నన్ను బాధించటం లేదు. గెలుపు ఓటములు సహజం. ఓటమిని అంగీకరిస్తున్నా. గెలిచిన అభ్యర్థి ఉపాధ్యాయుల సమస్యలపై పోరాడాలని సూచిస్తున్నాను. ఉపాధ్యాయులు రెండోసారి నన్ను గెలిపించాలని అనుకోలేదేమో. ప్రచారం ఉధృతంగా చేసినా నేను ఎందుకు ఓడిపోయానో ఉపాధ్యాయులకు తెలుసు. దాని గురించి ఇప్పుడు మాట్లాడాలని అనుకోవడం లేదు’ అని తెలిపారు.ఇది ఉపాధ్యాయుల విజయంఇక నర్సిరెడ్డిపై విజయం సాధించిన పీఆర్టీయూ టీఎస్ అభ్యర్థి పింగళి శ్రీపాల్ రెడ్డి సైతం అదే కౌంటింగ్ కేంద్ర వద్ద మీడియాతో మాట్లాడుతూ.. ‘ ఉపాధ్యాయులు ఇచ్చిన తీర్పు విలువైనది. . ఉపాధ్యాయుల విజయం మండలి సభ్యుడిగా ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరిస్తా. విద్యారంగాన్ని పటిష్టం చేసేలా అవసరం అయితే ఉద్యమాలు సైతం చేస్తా. ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించేలా కృషి చేస్తాను. ఉన్నత విద్య అందరికీ అందుబాటులో ఉండేలా కృషి చేస్తాను. నా గెలుపు ముందుగా ఊహించిందే’ అని పేర్కొన్నారు పింగళి శ్రీపాల్ రెడ్డి.

Sakshi Editorial On Donald Trump White House reality show3
వైట్‌హౌస్‌ రియాలిటీ షో!

రోజులన్నీ ఒకేలా ఉండవు. ఈ పరమ సత్యం వైట్‌హౌస్‌ వేదికగా, ప్రపంచ మాధ్యమాల సాక్షిగా ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీకి సంపూర్ణంగా అర్థమైవుంటుంది. హోంవర్క్‌ ఎగ్గొట్టిన కుర్రాడిని మందలించినట్టు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ విరుచుకుపడుతుంటే జెలెన్‌స్కీ సంజాయిషీ ఇస్తూనే, అవకాశం చిక్కినప్పుడల్లా తన ఆత్మగౌరవాన్ని కాపాడుకునే ప్రయత్నం చేశారు. ఆయన దయనీయ స్థితిని ప్రత్యక్షంగా తిలకించిన సాధారణ ప్రజానీకం సరే... అంతర్జాతీయంగా చిన్నా పెద్దా దేశాధినేతలందరూ విస్మయపడ్డారు. కాస్త వెనక్కు వెళ్తే జరిగిందంతా వేరు. గత మూడేళ్లుగా ఆయనకు ఎక్కడికెళ్లినా రాజలాంఛనాలు! అమెరికన్‌ కాంగ్రెస్‌లోనూ, పాశ్చాత్య దేశాల పార్లమెంట్లలోనూ, అవార్డు ప్రదానోత్సవాల్లోనూ, న్యూయార్క్‌ స్టాక్‌ ఎక్ఛ్సేజ్‌లోనూ ఆయనకు సాదర స్వాగతాలు!! ఆయన కోరకుండానే మారణాయుధాలూ, యుద్ధ విమానాలూ, డాలర్లూ పెద్దయెత్తున వచ్చిపడ్డాయి. వాటి విలువ ట్రంప్‌ అంటున్నట్టు 35,000 కోట్ల డాలర్లా, జెలెన్‌స్కీ సవరించినట్టు 11,200 కోట్ల డాలర్లా అన్నది మున్ముందు తేలుతుంది. చిత్ర మేమంటే... ఆయనతో అమర్యాదకరంగా వ్యవహరిస్తున్న ట్రంప్‌ను పల్లెత్తు మాట అనని మీడియా, సూట్‌కు బదులు టీ షర్ట్‌ వేసుకురావటం అగ్రరాజ్యాధినేతను అవమానించినట్టేనని జెలెన్‌స్కీకి హితబోధ చేసింది! ట్రంప్‌ తీరు దౌత్యమర్యాదలకు విఘాతమనీ, వర్ధమాన దేశాధినేతను కించపరుస్తూ, ఆధిపత్యం చలాయిస్తూ మాట్లాడటం సరికాదనీ వస్తున్న వాదనలు ముమ్మాటికీ సమర్థించదగినవే. కానీ అమెరికా వ్యవహార శైలి గతంలో కూడా భిన్నంగా లేదు. మర్యాదలివ్వటం మాట అటుంచి గిట్టని పాలకులను పదవీచ్యుతుల్ని చేయటం, తిరుగుబాట్లకు ప్రోత్సహించటం రివాజు. కాకపోతే ట్రంప్‌ బహిరంగంగా ఆ పని చేశారు. అమెరికా చరిత్రనూ, పాశ్చాత్య దేశాల తీరుతెన్నులనూ చూస్తే ఎన్నో ఉదాహరణలు దొరుకుతాయి. 1946–49 మధ్య గ్రీస్‌లో రాచరిక నియంతృత్వంపై చెలరేగిన తిరుగుబాటును అణచటానికి అప్పటి అమెరికా అధ్యక్షుడు ట్రూమన్‌ సైన్యాన్ని తరలించారు. క్యూబా, చిలీ, వియత్నాం, ఇరాన్‌ వగైరాల్లో ప్రభుత్వాలను కూలదోసి తనకు అనుకూలమైనవారిని ప్రతిష్ఠించేందుకు అమెరికా ఎన్ని ప్రయత్నాలు చేసిందో తెలుసుకుంటే దిగ్భ్రాంతి కలుగుతుంది. ప్రచ్ఛన్న యుద్ధకాలంలో మనల్ని చీకాకు పరిచేందుకు పాకిస్తాన్‌లో సైనిక తిరుగుబాట్లకు ఉసి గొల్పింది అమెరికాయే. ప్రభుత్వాల కూల్చివేతకు క్యూబాలోనూ, ఇతరచోట్లా పన్నిన పథకాలను రిటైర్డ్‌ సీఐఏ అధికారులు ఏకరువు పెట్టారు. ఈ పరంపరలో పాశ్చాత్య దేశాలు అమెరికాతో కలిసి కొన్నీ, సొంతంగా కొన్నీ చేశాయి. మన దేశంలో దాదాపు 200 ఏళ్లు అధికారం చలాయించి ఇక్కడి సంపదను బ్రిటన్‌ కొల్లగొట్టింది. ఆ దేశమే 1982లో ఫాక్‌ల్యాండ్‌ ద్వీపసముదాయం కోసం అర్జెంటీ నాపై యుద్ధం చేసి ఆక్రమించింది. ఇంకా 1990–91 నాటి గల్ఫ్‌ యుద్ధం, 1992–95 మధ్య కొన సాగిన బోస్నియా యుద్ధం, 1999లో కొసావో యుద్ధం, 2001లో ఉగ్రవాదంపై యుద్ధం పేరుతో మొదలెట్టి 2021 వరకూ సాగించిన అఫ్గాన్‌ యుద్ధం, 2003–2011 మధ్య సాగిన ఇరాక్‌ యుద్ధం, 2011లో జరిగిన లిబియా దురాక్రమణ... ఇవన్నీ అమెరికా–పాశ్చాత్య దేశాలు ‘నాటో’ ఛత్ర ఛాయలో సాగించిన యుద్ధాల్లో కొన్ని. ఈ దేశాల్లో మానవ హక్కుల హననం జరుగుతున్నదనీ, ప్రభుత్వాలు నియంత పోకడలు పోతున్నాయనీ సంజాయిషీ ఇచ్చారు. కానీ అక్కడ పౌరులు లేరా... వారు తిరగబడలేరా?వాదోపవాదాల మధ్యన జెలెన్‌స్కీని ఉద్దేశించి ‘మీ దగ్గర పేకముక్కలు అయిపోయాయి’ అన్నారు ట్రంప్‌. అది వాస్తవం. ఒక వ్యంగ్యచిత్రకారుడు ఆ ఉదంతంపై వేసిన కార్టూన్‌ మాదిరే ఆయన్ను ఇన్నాళ్లూ అమెరికా, పాశ్చాత్య దేశాలు పేకమేడ ఎక్కించాయి. మారిన పరిస్థితులను జెలెన్‌స్కీ గ్రహించలేకపోతున్నారు. ఒక సార్వభౌమాధికార దేశంపై మరో దేశం విరుచుకుపడటం, దురాక్రమించటం, జనావాసాలను ధ్వంసం చేయటం ముమ్మాటికీ నేరం. ఉక్రెయిన్‌ విషయంలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ఆ తప్పు చేశారు. కానీ అందుకు తన చర్యల ద్వారా దోహదపడింది జెలెన్‌ స్కీయే. ఈ పోకడలు నివారించాలనీ, ఆయనకు మద్దతునీయటంకాక, చర్చల ద్వారా పరిష్కరించు కొమ్మని నచ్చజెప్పాలనీ పుతిన్‌ కోరినప్పుడు అమెరికా, పాశ్చాత్య దేశాలు ముఖం చాటేశాయి. ట్రంప్‌ తన పూర్వాశ్రమంలో రియాలిటీ షోలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచేవారు. ఇప్పుడు వైట్‌ హౌస్‌ ఉదంతం ఆ మాదిరి ప్రదర్శనే. తాను పుతిన్‌తో చేతులు కలపటం సరైందేనని అమెరికా ప్రజా నీకం అనుకునేలా చేయటమే ట్రంప్‌ లక్ష్యం. అది నెరవేరిందో లేదోగానీ ఉక్రెయిన్‌ కోసం పాశ్చాత్య దేశాలు ఏకమవుతున్న సూచనలు కనబడుతున్నాయి. సైన్యాన్ని కూడా తరలిస్తామంటున్నాయి. కానీ జెలెన్‌స్కీ ఒక సంగతి గ్రహించాలి. ఎవరి మద్దతూ ఉత్తపుణ్యానికి రాదు. ఉక్రెయిన్‌ నేల ఒడిలో నిక్షిప్తమైవున్న అపురూప ఖనిజాలు, ఇతర ప్రకృతి సంపదపైనే ఎవరి దృష్టి అయినా. ఇవాళ మద్దతు నిస్తామంటున్న పాశ్చాత్య దేశాలు రేపన్నరోజు అమెరికాతో రాజీపడితే ఉక్రెయిన్‌కు మళ్లీ సమస్యలే. నిన్నటివరకూ మద్దతిచ్చిన అమెరికా స్వరం మార్చడాన్ని చూసైనా యూరప్‌ దేశాలను నమ్ముకుంటే ఏమవుతుందో జెలెన్‌స్కీ గ్రహించాలి. రష్యాతో శాంతి చర్చలకు వేరే ప్రత్యామ్నాయం లేదు. ఇకపై స్వతంత్రంగా వ్యవహరించగలమన్న అభిప్రాయం కలగజేస్తే, దురాక్రమించిన భూభాగాన్ని వెనక్కివ్వాలని రష్యాను డిమాండ్‌ చేస్తే జెలెన్‌స్కీకి అన్నివైపులా మద్దతు లభిస్తుంది.

Sakshi Guest Column On India economy4
మన వృద్ధి నమూనా స్థిరమైనదేనా?

హైదరాబాద్‌ మురికివాడల్లో నివసిస్తున్న కార్మికులతో నా ఇంటర్వ్యూల సందర్భంగా, ఒక సాధారణ విషయం బయటపడింది: అదేమిటంటే వేతనాలు పెరగనందువల్ల రోజు వారీ ఖర్చులను తీర్చుకోవడం వారికి కష్టతరం అవుతోంది. జీవన ప్రమాణాలను మెరుగు పరచుకోవడం గురించి ఇక చెప్పనవసరం లేదు. అనధికారిక కార్మికులు అంటే వారు పెద్ద బహుళజాతి సంస్థలు లేదా మధ్య తరహా సంస్థలలో పనిచేసేవారు అయినా సరే... వారి వేతన పెరుగుదల చాలా తక్కువగా ఉంటోంది లేదా అసలు కనిపించడం లేదు. మరోవైపు జీవన వ్యయం పెరుగుతూనే ఉంది. ఆహార ద్రవ్యోల్బణం ఇప్పుడు 8 శాతం మించిపోవడంతో, ప్రాథమిక అవసరాలు తీర్చు కోవడం కూడా కష్టంగా మారుతోంది.ఈ పరిస్థితి విస్తృత స్థాయి ఆర్థిక సవాలును ప్రతిబింబిస్తుంది. వేతనాలు పెరగనప్పుడు, వృద్ధి నిలిచిపోతుంది. తక్కువ ఆదా యాలు కుటుంబంలో వినియోగాన్ని పరిమితం చేస్తాయి. ఇది తీవ్ర పరిణామాలను కలగజేస్తుంది. మొదటిది, ఇది ఆరోగ్యం, విద్య, పోషకాహారంపై అవసరమైన ఖర్చును ప్రభావితం చేస్తుంది. తద్వారా నేరుగా శ్రేయస్సుపై ప్రభావం చూపుతుంది. తక్కువ వేతన పెరుగుదల ఉన్న వినియోగదారులు తక్కువ ఖర్చు చేస్తారు, ఇది డిమాండ్‌ తగ్గడానికి దారితీస్తుంది. రెండవది, వినియోగదారుల వైపు నుంచి పడిపోయిన డిమాండ్, వ్యాపార సంస్థలు పెట్టుబడి పెట్టకుండా నిరుత్సాహపరుస్తుంది. మందగించిన ఆర్థిక కార్యకలాపాల చక్రాన్ని బలోపేతం చేస్తుంది. ఈ స్తబ్ధత ఒక క్లిష్టమైన ప్రశ్నను లేవ నెత్తుతుంది. అదేమిటంటే భారతదేశ ప్రస్తుత వృద్ధి నమూనా స్థిరమై నదా, లేదా దానిపై తీవ్రమైన పునరాలోచన అవసరమా?ప్రత్యామ్నాయం ఏమిటి?వేతనాల ఆధారంగా సాగే వృద్ధి వ్యూహం సరళమైనదే కానీ, అది శక్తిమంతమైన సూత్రంపై పనిచేస్తుంది. కార్మికులు ఎక్కువ సంపాదించినప్పుడు, వారు ఎక్కువ ఖర్చు చేస్తారు. డిమాండును, ఆర్థిక విస్తరణను నడిపిస్తారు. కార్పొరేట్‌ లాభాలు చివరికి కార్మికులకు కూడా ప్రయోజనం చేకూరుస్తాయని భావించే ‘ట్రికిల్‌ డౌన్‌’ నమూ నాల మాదిరిగా కాకుండా, వేతన ఆధారిత వృద్ధి తక్షణ, విస్తృత ఆర్థిక భాగస్వామ్యాన్ని నిర్ధారిస్తుంది.భారతదేశ ఆర్థిక పథం ఒక వైరుధ్యాన్ని ప్రదర్శిస్తోంది. ఒకవైపు అధిక జీడీపీ వృద్ధి, మరోవైపు స్తబ్ధుగా ఉన్న నిజ వేతనాలు తీవ్రమైన ఆదాయ అసమానతకు దారితీస్తున్నాయి. ఇది ముఖ్యంగా వస్త్రాలు, ఎలక్ట్రానిక్స్, నిర్మాణం వంటి పరిశ్రమలలో స్పష్టంగా కనిపిస్తోంది. ఇక్కడ ఉత్పాదకత పెరిగింది, అయినప్పటికీ వేతనాలు స్తబ్ధుగా ఉన్నాయి. బలమైన వేతన వృద్ధి లేకపోతే, దేశీయ డిమాండ్‌ బలహీ నంగా ఉంటుంది. ఇది దీర్ఘకాలిక ఆర్థిక పురోగతిని అడ్డుకుంటుంది.ఈ వలయాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రభుత్వ రంగ జోక్యమే కీలకమైన మార్గం. ఇటీవలి ఆర్థిక విధానాలు ప్రైవేట్‌ వ్యాపార సంస్థ లకు, వ్యక్తులకు క్రెడిట్‌ లీడ్‌ (రుణ ప్రాధాన్యతా) వ్యూహం రూపంలో మద్దతు ఇవ్వడానికి ప్రాధాన్యమిస్తున్నాయి. దీంట్లో రైతులు, వ్యాపా రస్తులు మొదలైన వివిధ రంగాలవారికి క్రెడిట్‌ కార్డుల రూపంలో సులభమైన రుణ కల్పన చేయడం జరుగుతోంది. కానీ డిమాండ్‌ను తక్షణమే పెంచడానికి ఏకైక ప్రత్యామ్నాయం ప్రభుత్వరంగ పెట్టుబడే. వేతన వృద్ధి కంటే ఖర్చు తగ్గింపునకు, ముఖ్యంగా చౌక శ్రమకు ప్రైవేట్‌ సంస్థలు ప్రాధాన్యమిస్తాయన్నది తెలిసిందే. దీనికి బదులుగా మౌలిక సదుపాయాలు, ఆరోగ్య సంరక్షణ, విద్య, ఉపాధి కార్యక్రమా లలో ప్రభుత్వాలు పెట్టే పెట్టుబడులు నేరుగా ఆదాయాలను పెంచు తాయి; ఇవి ఉద్యోగాలను సృష్టిస్తాయి; దీర్ఘకాలిక ఆర్థిక స్థితిస్థాపక తను పెంచుతాయి.రెండవ ప్రపంచ యుద్ధానంతరం జర్మనీ తన పునర్నిర్మాణంలో గానీ లేదా దక్షిణ కొరియా తన అభివృద్ధి నమూనాలోగానీ వేతన ఆధారిత వ్యూహాలను విజయవంతంగా అవలంబించిన దేశాలు. ఇవి వ్యూహాత్మక రంగాలలో ప్రభుత్వ పెట్టుబడిపై ఆధారపడ్డాయి. 2008 ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో కూడా, ఆర్థిక విస్తరణను అనుసరించిన స్వీడన్‌ వంటి దేశాలు, పొదుపుకు ప్రాధాన్యత ఇచ్చిన వాటి కంటే వేగంగా కోలుకున్నాయి.భారతదేశం అమలుపర్చిన ‘మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం’ కూడా ఒక గొప్ప కేస్‌ స్టడీని అందిస్తుంది. సామాజిక సంక్షేమ కార్యక్రమం అయినప్పటికీ, ఇది గ్రామీణ గృహా లలో వేతనాలను ప్రవేశపెట్టింది. దానివల్ల ఆర్థిక వ్యవస్థ అంతటా తీవ్ర ప్రభావాలను ప్రేరేపించింది. అధిక గ్రామీణ ఆదాయాలు వృద్ధికి కీలక చోదకాలైన వినియోగదారీ ఉత్పత్తులు, గృహనిర్మాణం, సేవలు వంటివాటికి డిమాండ్‌ను పెంచాయి. ఇలాంటి ఉపాధి కార్య క్రమాలను, ముఖ్యంగా పట్టణ ప్రాంతాలలో విస్తరించడం, బలో పేతం చేయడం కూడా ఇదే విధమైన సానుకూల ప్రభావాన్ని చూపుతుంది.ముందుకు సాగే మార్గంవేతన ఆధారిత వృద్ధిని విమర్శించేవారు తరచుగా అధిక వేతనాలు ద్రవ్యోల్బణానికీ, ఆర్థిక ఒత్తిడికీ దారితీయవచ్చని వాది స్తారు. అయితే, ముఖ్యంగా పెరుగుతున్న ఉత్పాదకతతో పాటు జీతాల పెంపు ఉన్నప్పుడు, మితమైన వేతన పెరుగుదల తప్పని సరిగా ద్రవ్యోల్బణానికి కారణం కాదు. ఉదాహరణకు, జపాన్‌లో స్తబ్ధతతో కూడిన వేతనాలు ద్రవ్యోల్బణ ప్రమాదాల కంటే ప్రతి ద్రవ్యోల్బణ ఒత్తిళ్లకు దోహదపడ్డాయి. అంతేకాకుండా, ఆర్థిక లోటుపై ఆందోళనలను వేతన ఆధారిత వ్యూహాల దీర్ఘకాలిక ప్రయోజనాలతో పోల్చి చూడాలి. ప్రభుత్వ రంగ వేతన వృద్ధికి నిధులను అధిక రుణాల ద్వారా కాకుండా, ప్రగతిశీల పన్నులు, మెరుగైన ఆదాయ సమీకరణ ద్వారా వ్యూహాత్మకంగా సమకూర్చుకోవచ్చు. మంచి లక్ష్యంతో కూడిన ప్రభుత్వ పెట్టుబడి... ఆర్థిక బాధ్యత, ఆర్థిక విస్తరణ రెండింటికీ ఉపకరిస్తుంది.వేతన ఆధారిత వృద్ధిని వాస్తవం చేయడానికి, భారతదేశం తన పారిశ్రామిక, కార్మిక విధానాలను పునరాలోచించాలి. కార్మిక రక్షణ లను బలోపేతం చేయడం, అర్థవంతమైన కనీస వేతన సంస్కరణ లను అమలు చేయడం, సామాజిక భద్రతా కవరేజీని విస్తరించడం ముఖ్యమైన చర్యలు. ప్రభుత్వ రంగ సంస్థలు కూడా న్యాయమైన వేతన ప్రమాణాలను నిర్దేశించాలి, తద్వారా ప్రైవేట్‌ రంగ యజ మానులు కూడా దీనిని అనుసరించేలా చేయాలి.ప్రస్తుత ప్రభుత్వ ఆర్థిక వ్యూహం ప్రధానంగా క్రెడిట్‌ విస్తరణ, ప్రైవేట్‌ ఖర్చులకు ప్రోత్సాహకాల ద్వారా వినియోగాన్ని ప్రేరేపించడం చుట్టూ తిరుగుతోంది. ఇది తాత్కాలికంగా డిమాండ్‌ను పెంచి నప్పటికీ, ఆదాయ స్తబ్ధతకు సంబంధించిన ప్రధాన సమస్యను పరిష్కరించదు. దీనికి విరుద్ధంగా, వేతన ఆధారిత వృద్ధి... కార్మికులు స్థిరమైన కొనుగోలు శక్తిని కలిగి ఉండేలా, స్వయం సమృద్ధ ఆర్థిక వ్యవస్థను సృష్టించేలా మరింత స్థిరమైన మార్గాన్ని అందిస్తుంది.భారతదేశం ప్రపంచ ఆర్థిక శక్తి కేంద్రంగా మారాలని కోరుకుంటున్నప్పుడు, విదేశీ పెట్టుబడులు లేదా కార్పొరేట్‌ ఆధారిత నమూనాలపై మాత్రమే ఆధారపడటం సరిపోదు. ప్రభుత్వ రంగ చొరవల ద్వారా బలోపేతమైన వేతన ఆధారిత వృద్ధి వ్యూహం, ఆర్థిక విస్తరణను వేగవంతం చేయడమే కాకుండా, దాన్ని సమానంగా, స్థిరంగా ఉండేలా చేస్తుంది. అసమానతలు పెరుగుతున్న ఈ కాలంలో, న్యాయమైన వేతనాలకు, బలమైన ప్రభుత్వ పెట్టుబడులకు ప్రాధాన్యత ఇవ్వడం అనేది కేవలం ఆర్థిక అవసరం మాత్రమే కాదు, నైతిక ఆవశ్యకత కూడా!బొడ్డు సృజన వ్యాసకర్త ఆర్థిక శాస్త్ర బోధకురాలు,ఎస్‌ఆర్‌ఎమ్‌ యూనివర్సిటీ, ఆంధ్రప్రదేశ్‌

LPU 2025 Btech Final Year Student Bags Rs 1.03 Cr Placement Package5
ప్లేస్‌మెంట్‌లో ఎల్‌పీయూ సత్తా.. ఏకంగా 10 లక్షలపైనే ప్యాకేజీలు.. అదీ ఏకంగా 1,700 మందికి!!

లవ్లీ ప్రొఫెషనల్‌ యూనివర్శిటీ (ఎల్‌పీయూ)కు ఈ ఏడాది చాలా ఉత్సాహంతో మొదలైంది. ఫైనల్‌ ఇయర్‌ బీటెక్‌ విద్యార్థి రూ.1.03 కోట్ల (1,18,000 డాలర్లు)తో ఉద్యోగావకాశం పొందారు. రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్‌లో B.Tech చేస్తున్న బేతిరెడ్డి నాగవంశీరెడ్డి 2025 మేలో తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేయనున్నారు. ప్రముఖ ఏఐ రోబోటిక్స్ సంస్థలో రోబోటిక్స్ ఇంజినీర్‌గా చేరనున్నారు. ఈ అసాధారణ విజయం అటు పరిశ్రమ వర్గాల్లోనూ ఇటు విద్యా ప్రపంచంలోనూ సంచలనం సృష్టించింది. విద్యార్థులకు సూపర్‌ డూపర్‌ ప్యాకేజీలు అందించగల అత్యున్నత విద్యా సంస్థగా ఎల్‌పీయూ తనస్థానాన్ని సుస్థిరం చేసుకుంది.వేర్వేరు బీటెక్‌ విభాగాల్లోని మొత్తం 7361 మంది విద్యార్థులకు పాలో ఆల్టో నెట్‌వర్క్స్, నుటానిక్స్‌, మైక్రోసాఫ్ట్‌, సిస్కో, పేపాల్‌ అమెజాన్‌ వంటి ప్రతిష్టాత్మక మల్టీనేషనల్‌ కంపెనీల నుంచి ప్లేస్‌మెంట్లు లభించాయి. వీరిలో 1700 మంది టాప్‌ ఎమ్మెన్సీల నుంచి ఏడాదికి రూ.10 లక్షల నుంచి రూ.కోటి వరకూ ప్యాకేజీలు అందాయి. టాప్‌ ఎంఎన్‌సీలు ఇచ్చిన సగటు ప్యాకేజీ రూ.16 లక్షలు (ఏడాదికి). ఉద్యోగ మార్కెట్‌లో ఎల్‌పీయూకు ఉన్న అధిక డిమాండ్‌కు నిదర్శనాలు ఈ ప్లేస్‌మెంట్లు.గత ప్లేస్‌మెంట్‌ సీజన్‌ కూడా ఆకట్టుకునేదే. ఇండస్ట్రీలోనే అతిపెద్ద కంఎనీలు ఆకర్షణీయమైన ప్యాకేజీలు అందించాయి. పాలో ఆల్టో నెట్‌వర్క్స్ ఏకంగా ఏడాదికి రూ.54.75 లక్షల ప్యాకేజీని అందించగా నుటానిక్స్‌ రూ.53 లక్షల ప్యాకేజీ ఇచ్చింది. మైక్రోసాఫ్ట్‌ రూ.52.20 LPA ప్యాకేజీ అందించింది. మొత్తం 1912మందికి ఒకటి కంటే ఎక్కువ ఆఫర్లు అందాయి. 377 మందికి మూడు ఆఫర్లు, 97 మందికి నాలుగు ఆఫర్లు, 18 మందికి ఐదు, ఏడుగురికి ఆరు ఆఫర్లు లభించాయి. ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌ ఇంజినీరింగ్‌ విద్యార్థి ఆదిరెడ్డి వాసుకు నమ్మశక్యం కాని రీతిలో ఏకంగా ఏడు ఆఫర్లు వచ్చాయి. ఇదో అరుదైన, ఆకట్టుకునే రికార్డు.పైన చెప్పుకున్న కంపెనీలు మాత్రమే కాకుండా.. అమెజాన్‌ (రూ.48.64 LPA), ఇన్‌ట్యూట్‌ లిమిటెడ్‌ (రూ. 44.92 LPA), సర్వీస్‌ నౌ ( రూ. 42.86 LPA), సిస్కో (రూ. 40.13 LPA), పేపాల్‌ (రూ. 34.4 LPA), APNA (రూ.34 LPA), కామ్‌వాల్ట్‌ (రూ. 33.42 LPA), స్కేలర్‌ (రూ. 32.50 LPA)లు కూడా స్కిల్‌ డెవెలప్‌మెంట్‌, అత్యాధునిక టెక్నాలజీల్లో నైపుణ్యం అందించేందుకు ఎల్‌పీయూ చూపుతున్న శ్రద్ధకు నిదర్శనంగా నిలుస్తున్నాయి.ఎల్పీయూ పట్టభద్రుల సాంకేతిక పరిజ్ఞాన బుద్ధికుశలత కారణంగా భారీ నియామకాలు చేపట్టే ఆక్సెంచర్‌, క్యాప్‌జెమినీ, టీసీఎస్‌ తదితర ప్రముఖ కంపెనీల నుంచి మంచి డిమాండ్‌ ఉంది. క్యాప్‌జెమినీ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ 736 మంది విద్యార్థులకు అనలిస్ట్‌, సీనియర్‌ అనలిస్ట్‌ రోల్స్‌ కోసం ఉద్యగావకాశం ఇచ్చింది. అలాగే మైండ్‌ట్రీ 467 మంది విద్యార్థులను గ్రాడ్యుయేట్‌ ఇంజినీర్‌ ట్రైనీ పొజిషన్‌ కోసం తీసుకుంది. కాగ్నిజెంట్‌ టెక్నాలజీ సొల్యూషన్స్‌ కూడా 418 మంది విద్యార్థులను జెన్‌సీ రోల్స్‌ కోసం తీసుకుంది. ఎల్‌పీయూ నుంచి విద్యార్థులను ఎంపిక చేసుకున్న ఇతర కంపెనీల్లో ఆక్సెంచర్‌ (279 మంది), టీసీఎస్‌ (260 మంది), కేపీఐటీ టెక్నాలజీస్‌ (229 మంది), డీఎక్స్‌సీ టెక్నాలజీ (203), MPHASIS (94 మంది) కంపెనీలు ఉన్నాయి.రొబోటిక్స్‌, ఆటోమేషన్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌, మెకానికల్‌ ఇంజినీరింగ్‌ వంటి కోర్‌ ఇంజినీరింగ్‌ విభాగాల్లో అత్యధిక స్థాయిలో ప్లేస్‌మెంట్లు లభించాయి. పాలో ఆల్టో నెట్‌వర్క్స్‌, సిలికాన్‌ ల్యాబ్స్‌, ట్రైడెంట్‌గ్రూప్‌, నుటానిక్స్‌, ఆటోడెస్క్‌, అమెజాన్‌ వంటి దిగ్గజ కంపెనీలు ఈ విభాగాల్లోని విద్యార్థులను భారీగా నియమించుకుంటున్నాయి.‘‘ఎప్పటికప్పుడు మారిపోతున్న ప్రపంచానికి అనుగుణంగా విద్యార్థులు విజయం సాధించేలా చేసేందుకు ఎల్‌పీయూ కట్టుబడి ఉంది. ఎల్‌పీయూలో బోధించే అంశాలు కంపెనీల అవసరాలకు తగ్గట్టుగా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఎల్‌పీయూలో సంప్రదాయ పద్ధతులకు అతీతంగా సృజనాత్మక రీతిలో సాగే బోధన విద్యార్థులునిమగ్నమైయెలా ఉంటుంది. విద్యార్థులు పెద్ద సంఖ్యలో టాప్‌ కంపెనీల నుంచి ప్లేస్‌మెంట్‌ ఆఫర్లు పొందుతూండటం దీనికి నిదర్శనం. ఎల్‌పీయూ బోధనాంశాల సత్తానుచాటుతున్నాయి ఈ ప్లేస్‌మెంట్లు. జాతీయ, అంతర్జాతీయ ప్రముఖ సంస్థల్లో విద్యార్థులకు మంచి మంచి ప్లేస్‌మెంట్స్‌ సాధించిన రికార్డు ఎల్‌పీయూ సొంతం. అమెరికా, యూకే, ఆస్ట్రేలియాలల్లోని ఎన్నో పేరొందిన కంపెనీల్లో ఎల్‌పీయూ విద్యార్థులు ఏడాదికి రూ.కోటి కంటే ఎక్కువ ప్యాకేజీలతో పని చేస్తున్నారు. అత్యున్నత నైపుణ్యం కలిగిన ప్రొఫెషనల్స్‌ను తయారు చేయగల ఎల్‌పీయూ శక్తి సామర్థ్యాలకు, అంతర్జాతీయ స్థాయి ఎదుగుదలకు ఇవి నిదర్శనాలు.’’ అని రాజ్యసభ సభ్యులు, ఎల్‌పీయూ ఫౌండర్‌ ఛాన్సలర్‌ డాక్టర్‌ అశోక్‌ కుమార్‌ మిట్టల్‌ వివరించారు.2025 బ్యాచ్‌ కోసం దరఖాస్తు చేసుకునేందుకు చివరితేదీ దగ్గరపడింది. ఎల్‌పీయూలో అడ్మిషన్లకు పోటీ ఎక్కువ. యూనివర్శిటీలో అడ్మిషన్‌ కోసం విద్యార్థులు ప్రవేశ పరీక్ష రాయాల్సి ఉంటుంది. అలాగే ‘ఎల్‌పీయూ నెస్ట్‌ 2025’, ఇంటర్వ్యూలలోనూ పాసైన వారికి మాత్రమే కొన్ని ప్రత్యేక కార్యక్రమాల్లోకి ప్రవేశం లభిస్తుంది. పరీక్ష, అడ్మిషన్‌ ప్రాసెస్‌ గురించి తెలుసుకోవాలనుకునే ఆసక్తిగల విద్యార్థులు https://bit.ly/43340ai ను సందర్శించగలరు.

Australia Cricketer David Warner Tollywood Entry With This Movie6
డేవిడ్ వార్నర్‌ టాలీవుడ్‌ ఎంట్రీ.. ఆ హీరో సినిమాతో అరంగేట్రం

పుష్ప డైలాగ్స్‌తో టాలీవుడ్‌ ప్రియులను ఆకట్టుకున్న ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్. బన్నీకి అభిమాని అయిన ఆస్ట్రేలియా క్రికెట్‌ స్టార్‌ టాలీవుడ్ సినిమా డైలాగ్స్‌తో రీల్స్ చేస్తూ ఫేమస్ అయ్యారు. గతంలో అల్లు అర్జున్‌ పుష్ప మూవీ డైలాగ్స్‌తో తగ్గేదేలా అంటూ అభిమానులను అలరించాడు. ఆయన తాజాగా టాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమయ్యారు. ఇంతకీ ఆ వివరాలేంటో మీరు కూడా చూసేయండి.నితిన్‌- వెంకీ కుడుముల కాంబోలో వస్తోన్న తాజా చిత్రం రాబిన్ హుడ్‌. ఈ మూవీలో శ్రీలీల హీరోయిన్‌గా కనిపించనుంది. భీష్మ' వంటి హిట్‌ ఫిల్మ్‌ తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తోన్న మూవీ కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌లో తెరకెక్కించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మార్చి 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.అయితే తాజాగా కింగ్‌స్టన్‌ మూవీ ఈవెంట్‌కు హాజరైన మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత వై రవిశంకర్‌ ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. ఈ మూవీలో ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్‌ ఓ చిన్న రోల్‌ చేశారని తెలిపారు. దీంతో నితిన్ ఫ్యాన్స్‌తో పాటు వార్నర్‌ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.గతంలో అల్లు అర్జున్ మూవీ పుష్ప డైలాగ్‌లో డేవిడ్‌ వార్నర్‌ టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. చాలాసార్లు బన్నీ డైలాగ్స్ చెబుతూ తనదైన స్టైల్లో ‍అలరించాడు. తాజాగా రాబిన్ హుడ్‌ మూవీతో డేవిడ్ వార్నర్ టాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తున్నాడు. దీంతో అటు క్రికెట్ ఫ్యాన్స్.. ఇటు టాలీవుడ్ ఫ్యాన్స్‌ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. డేవిడ్ వార్నర్ గతంలో ఐపీఎల్‌లో హైదరాబాద్ సన్‌రైజర్స్‌ జట్టుకు కెప్టెన్‌గా పనిచేసిన సంగతి తెలిసిందే.

Paklapati Raghavarma Trails in Uttarandhra Teacher MLC Elections7
కూటమి ప్రభుత్వానికి షాక్‌.. టీచర్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వ అభ్యర్థి ఓటమి

సాక్షి, అమరావతి : ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలలో కూటమి ప్రభుత్వానికి భారీ షాక్‌ తగిలింది. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీఆర్‌టీయూ అభ్యర్థి శ్రీనివాసుల నాయుడు గెలుపొందారు. కూటమి అభ్యర్థి పాకలపాటి రఘువర్మ ఓడిపోయారు. దీంతో ఓటమిని అంగీకరిస్తూ రఘువర్మ కౌంటింగ్ కేంద్రం నుంచి బయటకు వచ్చేశారు. ఓడిపోయినప్పటికీ టీచర్లకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ప్రభుత్వంపై ప్రభుత్వ టీచర్ల వ్యతిరేకతఉత్తరాంధ్ర టీచర్‌ ఎన్నికల ఫలితాలతో 9 నెలలకే ప్రభుత్వంపై టీచర్ల వ్యతిరేకత సుస్పష్టమైంది. ప్రభుత్వంపై ఉపాధ్యాయులు తిరుగుబాటు ప్రకటించారు. అందుకు ఊతం ఇచ్చేలా ఉత్తరాంధ్ర టీచర్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రభుత్వ టీచర్లు కూటమికి ఓటమి రుచి చూపించారు. టీచర్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి పాకలపాటి రఘు వర్మను ఓడించారు. పీఆర్‌టీయూ అభ్యర్థి గాదె శ్రీనివాసులు నాయుడిని గెలిపించారు. చంద్రబాబుకు ఓటమి రుచి చూపించిన ప్రభుత్వ టీచర్లురఘువర్మను కూటమి అభ్యర్థిగా టీడీపీ, జనసేన,బీజేపీలు పోటీకి పెట్టాయి. తొలి ప్రాధాన్యత, రెండో ప్రాధాన్యతలోనూ కూటమి అభ్యర్థి వెనకపడ్డారు. బ్యాలెట్ ఓటింగ్‌లో కూటమి పార్టీ అభ్యర్థికి భంగపాటు ఎదురైంది. దీంతో చరిత్రలో ఏ ప్రభుత్వానికి ఎదురుకాని చేదు అనుభవం కూటమి ప్రభుత్వానికి ఎదురైంది. ఎన్నికల్లో గెలిచాక ఉద్యోగులు, ఉపాధ్యాయులను ప్రభుత్వం మోసం చేసింది. ఉద్యోగులకు కనీసం ఒక్క డీఏ ఇవ్వలేదు. ఉద్యోగులకు ఐఆర్, పీఆర్సీ ఊసెత్తలేదు. దీంతో ప్రభుత్వ టీచర్లలో చంద్రబాబు ప్రభుత్వంపై వ్యతిరేకత ఏర్పడింది. ఫలితంగా ఉత్తరాంధ్ర టీచర్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి పాకలపాటి రఘువర్మకు ఓటమి అనివార్యమైంది.

Man arrested, had planned to target Ram Mandir 8
అయోధ్య రామమందిరంపై ఉగ్రదాడికి ఐఎస్‌ఐ కుట్ర.. భగ్నం చేసిన భారత్‌

గాంధీనగర్‌: అయోధ్య రామమందిరంపై ఉగ్రదాడి చేసేందుకు ప్రయత్నించిన పాకిస్థాన్‌(Pakistan) ఐఎస్‌ఐ ఉగ్రదాడిని భారత్‌ భగ్నం చేసింది. గుజరాత్‌, హర్యానా యాంటీ టెర్రరిస్ట్‌ స్వ్కాడ్‌ జాయింట్‌ ఆపరేషన్‌ నిర్వహించింది. ఈ జాయింట్‌ ఆపరేషన్‌లో భాగంగా హర్యానాలో ఉగ్రవాది రెహ్మాన్‌ను అరెస్ట్‌ చేసింది. పాకిస్థాన్‌ నిఘా సంస్థ ఐఎస్‌ఐ(ISI)తో సంబంధాలున్న ఉగ్రవాది అబ్దుల్ రెహ్మాన్ హర్యానా రాష్ట్రం ఫరీదాబాద్‌లో పట్టుబడ్డాడు. భద్రతా సంస్థల సమాచారం మేరకు.. ఐఎస్‌ఐ సంస్థ అబ్దుల్ రెహ్మాన్ ద్వారా అయోధ్య రామ్ మందిరంపై దాడి చేయించేందుకు ప్లాన్ చేసింది. ఉగ్రదాడిలో భాగంగా అబ్దుల్‌ రెహ్మాన్‌ రామమందిరంపై రెక్కీ నిర్వహించాడు. సమాచారాన్ని సేకరించి ఐఎస్‌ఐకి చేరవేర్చాడు. అనంతరం, అబ్దుల్‌ రెహ్మాన్‌ ఫైజాబాద్ నుంచి ట్రైన్‌లో మొదట ఫరీదాబాద్ చేరుకున్నాడు. ఫరీబాదాబాద్‌లో హ్యాండ్ గ్రనేడ్‌లను సేకరించాడు. వాటిని తీసుకుని ట్రైన్ ద్వారా అయోధ్య వెళ్లాల్సి ఉంది. అనంతరం ఆ హ్యాండ్‌ గ్రనేడ్‌తో రామమందిరంపై దాడి చేసేలా ప్లాన్‌ వేశాడు. అంతకంటే ముందే దేశ భద్రతా సంస్థలు అందించిన సమాచారంతో గుజరాత్ ఏటీఎస్‌, ఫరీదాబాద్ ఏటీఎస్‌ స్క్వాడ్‌ అబ్దుల్ రెహ్మాన్‌ను అదుపులోకి తీసుకున్నాయి. అయోధ్యరామ మందిరంపై ఉగ్రదాడిని భగ్నం చేశాయి.

AP Budget Session: YSRCP MLC Botsa Fire On Minister Atchannaidu9
వైఎస్‌ జగన్‌ ఆ మాట ఏనాడూ చెప్పలేదు: బొత్స

అమరావతి, సాక్షి: శాసన మండలిలో ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు(Atchannaidu) అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. వ్యక్తిగతంగా కించపరిచేలా మాట్లాడడంతో వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నేత, విపక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. సోమవారం అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో ఈ పరిణామం చోటు చేసుకుంది.‘‘మంత్రి అచ్చెన్నాయుడు నేను ఒకే ప్రాంతం నుంచి వచ్చాం. సుదీర్ఘ రాజకీయాలు చేసిన అనుభవం నాకు ఉందని అచ్చెన్నాయుడికి తెలుసు. మేం గాలికి వచ్చామని మంత్రి చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరం. ఆయన తన వ్యాఖ్యలు విత్ డ్రా చేసుకోవాలి. .. మేం ఎవరిని వ్యక్తిగతంగా కించపరిచేలా మాట్లాడటం లేదు. వ్యక్తిగతంగా నాపై మాట్లాడటం ఇద్దరికీ గౌరవంగా ఉండదు. మేమంతా రాజకీయంగా పోరాటాలు చేసే ఇక్కడకు వచ్చాం’’ అని బొత్స, అచ్చెన్నకు హితవు పలికారు. ఇదిలా ఉంటే.. సాక్షి టీవీ సహా నాలుగు ఛానెల్స్‌కు మండలి లైవ్‌ ప్రసారాలను సమాచార శాఖ నిలిపివేయడం గమనార్హం.మండలిలో అచ్చెన్న vs బొత్సమంత్రి అచ్చెన్నాయుడు👇2014-19 ఎన్టీఆర్ గృహ నిర్మాణం కింద పేదలకు ప్రభుత్వం ఇళ్లు కట్టించి ఇచ్చిందిగత ప్రభుత్వం ఒక్క ఇల్లు కూడా కట్టలేదుకట్టిన ఇళ్లకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదు.జగనన్న కాలనీలు అన్నారు.. దాని గురించి నేను ఏమీ మాట్లాడాల్సిన పనిలేదు.. ఏం జరిగిందో అందరికీ తెలుసు..కేంద్రం డబ్బులతోనే కథ నడిపారురాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదుమేము పేదలకు ఇళ్లు కట్టించి ఇవ్వాలని ఒక మంచి ఆలోచనతో ముందుకు వెళ్తున్నాం.మీరు ఎంత ఖర్చు చేశారో సమాధానం చెప్పాలి?విపక్ష నేత బొత్స సత్యనారాయణ👉🏼.. 2014 - 19 ఇళ్లు కట్టిన వారికి మా ప్రభుత్వ హయాంలో బిల్లులు ఇవ్వలేదనడం అవాస్తవం. అర్హులైన లబ్ధిదారులకు అందరికీ బిల్లులు ఇచ్చాం. అర్హత లేకుండా కట్టుకుని బిల్లులు కావాలన్న వారికి మాత్రమే ఇవ్వలేదు. కేవలం రాజకీయ ఆరోపణలు చేస్తున్నారు. ప్రభుత్వం రాజకీయ కక్షతో ఇవ్వలేదని చెప్పటం సరికాదు. గత ప్రభుత్వం అర్హులైన ప్రతీ ఒక్కరికీ అన్నీ పథకాలు ఇచ్చింది. మా పార్టీ వాళ్ళకే పనులు, పథకాలు ఇవ్వాలని మా అధినేత వైఎస్‌ జగన్ మోహన్‌రెడ్డి ఎప్పుడూ చెప్పలేదు. .. రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉన్న చంద్రబాబు పథకాల పై చేసిన వ్యాఖ్యలు కరెక్ట్ కాదు. ముఖ్యమంత్రి పదవిలో ఉండి చంద్రబాబు ఇలా మాట్లాడటానికి సిగ్గుపడాలి. లబ్ధిదారులకు పార్టీలు అంట గడతారా?. .. అర్హులైన లబ్ధిదారులకు పథకాలు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ప్రమాణం చేసి పదవులు తీసుకున్న వ్యక్తులు ఇలాంటి మాటలు మాట్లాడతారా?.. కేవలం కార్యకర్తలకు ఇవ్వమనటానికి ఇదేమైనా మీ సొంత ఆస్తి అనుకుంటున్నారా?. మా ప్రభుత్వంలో గత ఐదేళ్లలో అర్హులైన ప్రతీ ఒక్కరికీ పథకాలు ఇచ్చాం.

Shami Saab Bahut Ho Gaya: India Great Blunt Advice To Beat Aus CT 2025 Semis10
షమీ సాబ్‌.. ఇప్పటికే చాలా ఎక్కువైంది.. ఇక..: టీమిండియా దిగ్గజం

ఆస్ట్రేలియాతో సెమీ ఫైనల్‌కు ముందు టీమిండియాకు భారత మాజీ క్రికెటర్‌ హర్భజన్‌ సింగ్‌(Harbhajan Singh) మూడు కీలక సూచనలు చేశాడు. కంగారూలకు ఏ దశలోనూ అవకాశం ఇవ్వకూడదని.. గత మూడు మ్యాచ్‌ల ఫలితాన్నే ఇక్కడా పునరావృతం చేయాలని కోరాడు. కాగా ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ-2025లో భాగంగా భారత్‌ గ్రూప్‌-ఎ టాపర్‌గా నిలిచింది.ఈ మెగా టోర్నమెంట్‌కు పాకిస్తాన్‌ ఆతిథ్యం ఇస్తుండగా.. దుబాయ్‌(Dubai)లో తమ మ్యాచ్‌లు ఆడుతున్న టీమిండియా హ్యాట్రిక్‌ విజయాలు నమోదు చేసింది. తొలుత బంగ్లాదేశ్‌ను.. ఆ తర్వాత చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌(India vs Pakistan)ను.. అనంతరం ఆఖరి మ్యాచ్‌లో భాగంగా న్యూజిలాండ్‌ జట్టును ఓడించింది. ఈ క్రమంలో ఈ వన్డే టోర్నమెంట్‌ తొలి సెమీ ఫైనల్లో భాగంగా మంగళవారం ఆస్ట్రేలియాను ఢీకొట్టనుంది.అయితే, ఐసీసీ టోర్నీల్లో 2011 తర్వాత నాకౌట్‌ మ్యాచ్‌లలో ఆసీస్‌దే పైచేయిగా ఉన్న నేపథ్యంలో భారత దిగ్గజ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ రోహిత్‌ సేనకు పలు సూచనలు చేశాడు. ముందుగా ట్రవిస్‌ హెడ్‌ ఆట కట్టించాలని.. ఆ తర్వాత గ్లెన్‌ మాక్స్‌వెల్‌ లాంటి వాళ్ల పనిపట్టాలని భారత బౌలర్లకు సూచించాడు. ఈ మేరకు స్టార్‌ స్పోర్ట్స్‌ షోలో మాట్లాడుతూ..షమీ సాబ్‌.. ఇప్పటికే చాలా ఎక్కువైంది కదా..‘‘ముందుగా ట్రవిస్‌ హెడ్‌ గురించి మీ మెదళ్లలో గూడు కట్టుకున్న భయాన్ని తీసేయండి. వీలైనంత త్వరగా అతడిని అవుట్‌ చేయడం మంచిది. షమీ సాబ్‌.. ఇప్పటికే చాలా ఎక్కువైంది కదా.. హెడ్‌కు ఎక్కువ పరుగులు చేసే అవకాశం అస్సలు ఇవ్వద్దని గుర్తుపెట్టుకోండి.ఇక నా రెండో సూచన ఏమిటంటే.. గ్లెన్‌ మాక్స్‌వెల్‌, జోష్‌ ఇంగ్లిస్‌ వంటి హార్డ్‌ హిట్టర్లు ఆస్ట్రేలియా జట్టులో ఉన్నారు. వాళ్లు అలవోకగా సిక్సర్లు, ఫోర్లు బాదుతారు. ఫాస్ట్‌ పేస్‌లో వాళ్లకు ఎక్కువగా పరుగులు చేసే అవకాశం ఇవ్వకండి.మూడోది.. ముఖ్యమైన సూచన.. ఇది నాకౌట్‌ మ్యాచ్‌ అన్న విషయాన్ని మీరు పూర్తిగా మర్చిపోండి. సాధారణ మ్యాచ్‌ మాదిరిగానే దీనిని భావించండి’’ అని భజ్జీ రోహిత్‌ సేనకు సలహాలు ఇచ్చాడు. ఈ మూడు బలహీనతలను అధిగమిస్తే విజయం కచ్చితంగా టీమిండియానే వరిస్తుందని అభిప్రాయపడ్డాడు.విధ్వంసకరవీరుడు.. చితక్కొట్టాడుకాగా ట్రవిస్‌ హెడ్‌కు టీమిండియాపై మంచి రికార్డు ఉంది. ముఖ్యంగా వన్డే వరల్డ్‌కప్‌-2023 ఫైనల్లో మ్యాచ్‌ టీమిండియా చేజారడానికి ప్రధాన కారణం ఈ విధ్వంసకరవీరుడు. నాడు అహ్మదాబాద్‌ మ్యాచ్‌లో భారత స్పిన్‌ త్రయం కుల్దీప్‌ యాదవ్‌, అక్షర్‌ పటేల్‌, రవీంద్ర జడేజా.. బౌలింగ్‌ను చితక్కొట్టాడు. కేవలం 120 బంతుల్లోనే 137 పరుగులు సాధించి ఆసీస్‌ ఆరోసారి విశ్వవిజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలోనే భజ్జీ హెడ్‌ను టార్గెట్‌ చేయాలని భారత బౌలర్లకు చెప్పాడు.టీమిండియాదే గెలుపుఇదిలా ఉంటే.. టీమిండియా మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ రోహిత్‌ సేనకు మద్దతు పలికాడు.‘‘గతేడాది టీ20 ప్రపంచకప్‌ గెలిచిన జట్టు ఇది. వన్డే వరల్డ్‌కప్‌ ఫైనల్‌ కూడా దాదాపుగా వీళ్లే ఆడారు. ఏ రకంగా చూసినా మన జట్టు పటిష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా పరిమిత ఓవర్ల క్రికెట్‌లో తిరుగులేని శక్తిగా ఎదిగింది. ప్రత్యర్థి జట్టు ఏదైనా దానిని ఓడించగల సత్తా టీమిండియాకు ఉంది’’ అని పేర్కొన్నాడు. సెమీ ఫైనల్లో భారత్‌ ఆసీస్‌ను ఓడించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశాడు. చదవండి: IPL 2025: కొత్త కెప్టెన్‌ పేరును ప్రకటించిన కేకేఆర్‌

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

International View all
title
Oscar Awards 2025: భావోద్వేగాలకు జీవం

2024 సంవత్సరానికి ఆస్కార్‌ ఉత్తమ నటిగా నిలిచారు మైకీ మ్యాడిసన్ .

title
పెళ్లి ముద్దు,పిల్లలొద్దు ఎందుకంటే..అక్కడి యువత

పిల్లలను కనకూడదని యుక్తవయసులోనే నిర్ణయించుకుంటున్నవారి సంఖ్య రానురానూ పెరుగుతోంది.

title
యూఏఈలో భారతీయ మహిళకు మరణశిక్ష అమలు

న్యూఢిల్లీ: నాలుగు ఏళ్ల చిన్నారి మృతి  కేసులో భాగంగా  ఓ భారత మహిళకు యూఏఈలో మర

title
వారి కోసం జుకర్‌బర్గ్‌ ఫ్యావరెట్‌ హుడీ వేలం : మార్క్‌ డ్యాన్స్‌ వైరల్‌ వీడియో

మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్  తనకెంతో ఇష్టమైన పాత హుడీని వేలం వేశారు.

title
ఆకర్షించే స్క్వేర్ వేవ్స్.. దగ్గరకు వెళ్తే అంతే సంగతులు

మీరు సముద్రంలో ఎప్పుడైనా చతుర్భుజాకారపు అలలను(

NRI View all
title
టంపా వేదికగా నాట్స్‌ అమెరికా తెలుగు సంబరాల ఏర్పాట్లు

title
జర్మనీ పాఠ్యాంశాల్లో తెలుగు విద్యార్థి ప్రస్థానం

ప్రవాస తెలుగు విద్యార్ధి శ్రీనిహల్ తమ్మనకు మరో అరుదైన గౌరవం లభించింది.

title
గల్ఫ్ మృతుల కుటుంబాలతో సీఎం రేవంత్ రెడ్డి సహపంక్తి భోజనం

గల్ఫ్ దేశాలలో మరణించిన కార్మికుల కుటుంబాలతో హైదరాబాద్, ప్రజాభవన్‌లో త్వరలో 'గల్ఫ్ అమరుల సంస్మరణ సభ' ఏర్పాటు చేయాలని రాష్

title
వలస కార్మికుల మృత్యు ఘోష

మోర్తాడ్‌ (బాల్కొండ): జగిత్యాల జిల్లా మల్లాపూర్‌ మండలం రేగుంటకు చెందిన కర్న గణేశ్‌ (55) రెండ్రోజుల కిందట సౌదీ అరేబియాలో

title
వీసా గోల్డెన్‌ చాన్సేనా?

గోల్డ్‌ కార్డ్‌ వీసా.. ప్రపంచవ్యాప్తంగా కొత్త చర్చకు దారితీసిన టాపిక్‌ ఇది.

Advertisement

వీడియోలు

Advertisement