Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Zelensky Was Asked Why Hes Not Wearing Suit His Reply1
Zelensky: నా దారి రహదారి.. ఎక్కడా తగ్గేదేలే..!

వాషింగ్టన్: అమెరికా(USA) అధ్యక్షుడితో భేటీ అంటే హంగామా కాస్త ఎక్కువగానే ఉంటుంది. అగ్రదేశాధ్యక్షుడు ముందు మిగతా దేశాధ్యక్షులు చాలా నెమ్మదిగా వ్యవరిస్తారనే భావన మనలో చాలామందికే ఉంటుంది. . మరి అందరి దేశాధినేతలు వలే ఉంటే చెప్పుకోవడానికి ఏముంటుంది. ఉక్రెయిన్ అధ్యక్షుడి జెలెన్‌స్కీ(Zelensky) స్టైలే సెపరేటు.‘నలుగురు వెళ్లే దారిలో నేను వెళ్లను.. నా దారి రహదారి’ అనే ముక్కుసూటితనం జెలెన్‌స్కీలో కనిపిస్తూ ఉంటుంది. రష్యాతో యుద్ధం మొదలుకొని, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) తో నిన్నటి చర్చల వరకూ జెలెన్‌స్కీ ప్రత్యేక పంథాలోనే వెళుతున్నారు. ఎక్కడా తగ్గేదే లే.. నా రూటే సెపరేట్ అన్న శైలి ఆయనలో కనిపిస్తోంది. ట్రంప్ తో భేటి అయ్యే క్రమంలో కూడా జెలెన్‌స్కీ సాధారణంగానే వచ్చారు. ఎక్కడ హంగు, ఆర్భాటం లేకుండా వైట్ వైస్ లో దర్శనమిచ్చారు. అయితే జెలెన్‌స్కీ కనీసం సూట్ కూడా ధరించకుండా ట్రంప్ తో భేటీ కావడంపై అక్కడ ఉన్న ఒక రిపోర్టర్ లో ఆసక్తిని పెంచింది. ఉండబట్టలేక అడిగేశాడు.సూట్ ధరించకపోతే నీకేమైనా నష్టమా?అయితే దీనికి కూడా జెలెన్‌స్కీ తనదైన స్టైల్ లోనే సమాధానమిచ్చారు. ‘సూట్ ధరించకపోతే నీకేమైనా సమస్యా.. లేక ఏమైనా నష్టమా? అంటూ జెలెన్‌స్కీ అనడంతో సదరు రిపోర్టర్ కాస్త కంగుతిన్నాడు. దాన్ని సరిచేసుకునే క్రమంలోనే ఆ రిపోర్టర్.. కాదు కాదు.. చాలా మంది అమెరికన్లలో ఒక భావన ఉంది. వైట్ హౌస్ ఆఫీస్ కి హాజరయ్యే క్రమంలో డ్రెస్ కోడ్ కు విలువ ఇవ్వరనే అమెరికన్లు అనుకుంటూ ఉంటారు అంటూ సర్దుకునే యత్నం చేశాడు రిపోర్టర్..ఆ రోజు వచ్చినప్పుడే సూట్ ధరిస్తా..దీనికి ప్రతిగా జెలెన్‌స్కీ స్పందిస్తూ.. ‘ నేను కచ్చితంగా సూట్ ధరిస్తా, రష్యా‍ ఉక్రెయిన్ యుద్ధం ముగిసిన క్షణమే నేను సూట్ ధరిస్తా. ఆ రోజు వచ్చినప్పుడు నేను సూట్ ను కచ్చితంగా వేసుకుంటాను. డ్రెస్ కోడ్ ను బట్టి వ్యక్తిత్వాన్ని డిసైడ్ చేయొద్దు.. మీలాగ. థాంక్యూ’ అంటూ సమాధానమిచ్చారు.జెలెన్‌స్కీ మద్దతుగా నెటిజన్లు..జెలెన్‌స్కీ ఇచ్చిన సమాధానానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అసలు డ్రెస్ కోడ్ ను అంతగా పట్టించుకోవాల్సిన అవసరం ఏంటని అంటున్నారు. అలా అయితే ట్రంప్ తొలి క్యాబినెట్ సమావేశానికి ఎలన్ మస్క్ సూట్ తో ఎందుకు రాలేదు.. కేవలం టీ షర్ట్ మాత్రమే ఎందుక ధరించారు అని ఒక నెటిజన్ ప్రశ్నించగా, అసలు మిమ్ముల్ని ఆ క్వశ్చన్ అడిగిన రిపోర్టర్ సూట్ ఎందుకు ధరించలేదో అడగండి’ అంటూ మరొకరు నిలదీశారు. ఇలా జెలెన్‌స్కీపై ఏ రకంగా చూసినా ప్రశంసల వర్షం కురుస్తూనే ఉంది. అమెరికాతో పెట్టుకున్నప్పుడు భవిష్యత్ లో పరిస్థితులు ఎలా ఉంటాయో అని కొందరు ఆందోళన చెందుతున్నప్పటికీ ప్రస్తుతానికి జెలెన్‌స్కీకి మద్దతు మాత్రం పెద్ద ఎత్తులోనే లభిస్తూ ఉండటం విశేషం. Q: "Why don't you wear a suit?"Ukrainian President Zelenskyy: "I will wear costume after this war will finish." pic.twitter.com/FzJqjIAQHa— CSPAN (@cspan) February 28, 2025 WHY doesn’t THIS guy wear a suit? pic.twitter.com/ZAQHWYjIob— The Resistor Sister®️♥️🇺🇸 (@the_resistor) February 28, 2025 ట్రంప్‌ Vs జెలెన్‌స్కీ.. వెల్లువెత్తిన జోక్స్, మీమ్స్‌ట్రంప్‌ వర్సెస్‌ జెలెన్‌స్కీ.. అధ్యక్షుల వాగ్వాదం జరిగిందిలా!

Why Gold Rates Are Everyday Changing Check The Reason2
రోజుకో రేటు వద్ద బంగారం: కారణాలివే..

బంగారం ధరలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. రోజుకో రేటు.. ప్రాంతాన్ని బట్టి కూడా మారుతూ ఉంటుంది. ఒకరోజు భారీగా పెరిగితే.. ఇంకోరోజు తగ్గిపోతాయి. ఎందుకిలా జరుగుతుందో ఎప్పుడైనా ఆలోచించారా?.. ధరలు పెరగడానికి ప్రధానంగా ఐదు కారణాలున్నాయి. ఆ కారణాలు తెలుసుకోవాలంటే ఈ కథనం చదివేయాల్సిందే.అంతర్జాతీయ ధరలుబంగారం ధరలు ప్రపంచ మార్కెట్ ధోరణులపై ఆధారపడి ఉంటాయి. అంతర్జాతీయ ధరలలో జరిగే ఏవైనా మార్పులు.. దేశంలో బంగారం ధరను నేరుగా ప్రభావితం చేస్తాయి. ద్రవ్యోల్బణం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక స్థిరత్వం వంటి అంశాలు ప్రపంచ బంగారం ధరలను ప్రభావితం చేస్తాయి.దిగుమతి సుంకం & ప్రభుత్వ విధానాలుభారతదేశం భారీ మొత్తంలో బంగారాన్ని దిగుమతి చేసుకుంటుంది. దిగుమతి సుంకాలు, పన్ను విధానాలు భారతదేశంలో బంగారం ధరను ప్రభావితం చేస్తాయి. ప్రభుత్వం దిగుమతి సుంకాలను పెంచితే, బంగారం ధరలు పెరుగుతాయి. బంగారు నిల్వకు సంబంధించిన విధానాలు కూడా ధరలను ప్రభావితం చేస్తాయి.దేశీయ మార్కెట్‌లో డిమాండ్ & సరఫరాభారతదేశంలో బంగారం డిమాండ్ పండుగలు.. వివాహ సీజన్లలో గరిష్టంగా ఉంటుంది. డిమాండ్ పెరిగినప్పుడు, ధరలు పెరుగుతాయి. దీనికి విరుద్ధంగా, డిమాండ్ తక్కువగా ఉన్నప్పుడు బంగారం ధరలు తగ్గవచ్చు. సరఫరా కూడా ఒక పాత్ర పోషిస్తుంది. కొరత ఉన్నప్పుడు కూడా బంగారం ధర ఎక్కువగా ఉండవచ్చు.రూపాయి vs యూఎస్ డాలర్ మారకం రేటుప్రపంచవ్యాప్తంగా బంగారం వ్యాపారం.. అమెరికా డాలర్లతోనే జరుగుతుంది. డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి బలహీనపడితే, బంగారం ధర పెరుగుతుంది. అయితే రూపాయి బలపడితే.. బంగారం ధర తగ్గుతుంది. వడ్డీ రేట్లు & ద్రవ్యోల్బణం కూడా బంగారం ధరలపై ప్రభావం చూపుతాయి.ప్రపంచ ఆర్థిక, రాజకీయ సంఘటనలుఆర్ధిక మాంద్యం, మహమ్మారి, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు వంటి ప్రపంచ అనిశ్చితులు బంగారం ధరలను ప్రభావితం చేస్తాయి. స్టాక్ మార్కెట్లు హెచ్చుతగ్గులకు గురైనప్పుడు, పెట్టుబడిదారులు బంగారం మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేయడానికి ఆసక్తి చూపుతారు. దీంతో బంగారం ధరలు క్రమంగా పెరుగుతాయి.ఇదీ చదవండి: 'అర్ధరాత్రి 2 గంటల వరకు మేల్కొనే ఉంటారు': తండ్రి గురించి చెప్పిన ఆకాశ్ అంబానీ

Virat Kohli set to create world record against New Zealand3
Champions Trophy: చరిత్రకు అడుగు దూరంలో విరాట్ కోహ్లి..

ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోఫీ-2025లో ఆఖ‌రి లీగ్ మ్యాచ్ స‌మ‌రానికి సిద్ద‌మైంది. దుబాయ్ వేదిక‌గా న్యూజిలాండ్‌, భార‌త జ‌ట్లు త‌ల‌ప‌డ‌నున్నాయి. ఇప్ప‌టికే సెమీస్ బెర్త్‌ను ఖారారు చేసుకున్న ఇరు జ‌ట్లు లీగ్ స్టేజిని విజ‌యంతో ముగించాల‌ని భావిస్తున్నాయి. కాగా ఈ మ్యాచ్‌తో భార‌త స్టార్ ప్లేయ‌ర్ విరాట్ కోహ్లి 300 వన్డేలు పూర్తి చేసుకోబోతున్నాడు. కాగా ఈ ఘనత సాధించిన 7వ భారత ఆటగాడిగా, ఓవరాల్‌గా 22వ ఆటగాడిగా కోహ్లి నిలుస్తాడు. 2008లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన విరాట్‌.. భారత క్రికెట్‌ చరిత్రలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. తన పేరిట ఎన్నో అద్భుతమైన రికార్డులను లిఖించుకున్నాడు.ఇప్పటివరకు భారత జట్టు తరపున 299 వన్డేలు ఆడిన కోహ్లి.. 58.20 సగటుతో 14,085 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లలో 51 సెంచరీలు, 73 అర్ధసెంచరీలు ఉన్నాయి.300 కంటే ఎక్కువ వన్డేలు ఆడిన ఆడిన భార‌త ఆట‌గాళ్లు..స‌చిన్ టెండూల్క‌ర్ – 463 మ్యాచ్‌లుఎంఎస్ ధోని – 350 మ్యాచ్‌లురాహుల్ ద్ర‌విడ్ – 344 మ్యాచ్‌లుమ‌హ‌మ్మ‌ద్ అజారుద్దీన్ – 334 మ్యాచ్‌లుసౌర‌వ్ గంగూలీ – 311 మ్యాచ్‌లుయువ‌రాజ్ సింగ్ – 304 మ్యాచ్‌లువ‌ర‌ల్డ్ రికార్డుపై క‌న్ను..అదేవిధంగా ఈ మ్యాచ్‌తో అంత‌ర్జాతీయ క్రికెట్‌లో 300 వన్డేలు, 100 టెస్టులు, 100 టీ20లు ఆడిన తొలి క్రికెటర్‌గా విరాట్ కోహ్లి చరిత్ర సృష్టించనున్నాడు. విరాట్ ఇప్పటివరకు 299 వన్డేలు, 123 టెస్టులు, 125 టీ20లు ఆడాడు. సంగర్కరకు చేరువలో కోహ్లి..కాగా వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో కింగ్‌ కోహ్లి మూడో స్ధానంలో కొనసాగుతున్నాడు. కోహ్లి మరో 149 పరుగులు చేస్తే శ్రీలంక కుమార్‌ సంగక్కర(14234)ను అధిగమిస్తాడు. ఈ జాబితాలో భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ అగ్రస్ధానంలో ఉన్నాడు. సచిన్‌ తన కెరీర్‌లో 463 మ్యాచ్‌లు ఆడి 18426 పరుగులు చేశాడు. సచిన్‌ కంటే కోహ్లి ఇంకా 4,341 పరుగులు వెనకబడి ఉన్నాడు. చదవండి: Champions Trophy: టీమిండియా కోసం.. అన్ని జట్లు దుబాయ్‌లోనే?

Sandeep Reddy Vanga: Becoming IAS is Easier than Filmmaking4
సినిమాలు తీయడం కంటే IAS అవడం ఈజీ: సందీప్‌ రెడ్డి వంగా

తీసింది తక్కువ సినిమాలే అయినా సందీప్‌ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) పేరు దేశమంతా మార్మోగిపోయింది. ఆయన సినిమా తీస్తే హిట్టు కాదు ఏకంగా బ్లాక్‌బస్టర్‌ అవ్వాల్సిందే అన్న పేరు తెచ్చేసుకున్నాడు. తనను విమర్శించినా ఊరుకుంటాడేమో కానీ తన సినిమాల జోలికి వస్తే మాత్రం అస్సలు సహించడు. అవతలి వ్యక్తి ఎవరైనా సరే ఇచ్చిపడేస్తాడు. ఓ ఐఏఎస్‌ అధికారి వికాస్‌ దివ్యకీర్తి (IAS Vikas Divyakirti).. సందీప్‌ తెరకెక్కించిన యానిమల్‌ సినిమాపై గతేడాది విమర్శలు గుప్పించారు. యానిమల్‌ సినిమాలు ఎందుకు తీస్తారో!యానిమల్‌ (Animal Movie) వంటి చిత్రాలు మన సమాజాన్ని పదేళ్లు వెనక్కి తీసుకెళ్తున్నాయి. ఇలాంటి సినిమాలు రూపుదిద్దుకోకూడదు. మీ సినిమాలో హీరో జంతువులా ప్రవర్తిస్తాడని చూపించారు. దీనివల్ల మీకు డబ్బు వచ్చి ఉండొచ్చు. కానీ కేవలం డబ్బు కోణంలోనే ఆలోచిస్తే ఎలా? సామాజిక విలువలు కాస్తైనా ఉండాల్సిన పని లేదా? అని విమర్శించారు. వికాస్‌.. 12th ఫెయిల్‌ సినిమా (12th Fail Movie)లో యూపీఎస్‌సీ ప్రొఫెసర్‌గా యాక్ట్‌ చేశాడు.అవనసరంగా విమర్శిస్తే..ఈ విమర్శలపై తాజాగా సందీప్‌రెడ్డి స్పందించాడు. ఆయన మాట్లాడుతూ.. ఓ ఐఏఎస్‌ అధికారి యానిమల్‌ వంటి చిత్రాలు రాకూడదన్నారు. ఆయన చెప్పింది వింటే నేనేదో పెద్ద నేరం చేసినట్లుగా అనిపించింది. 'ఒకవైపు 12th ఫెయిల్‌ వంటి సినిమాలు తీస్తుంటే మరోవైపు యానిమల్‌ వంటివి తీసి సమాజాన్ని వెనక్కుతీసుకెళ్తున్నారు' అని వ్యాఖ్యానించారు. ఇలా ఎవరైనా అనవసరంగా నా సినిమాపై దాడి చేస్తే నాకు కచ్చితంగా కోపం వస్తుంది. ఆయన బాగా చదువుకుని ఐఏఎస్‌ అయ్యారు. యానిమల్‌ హీరోతో సందీప్‌ రెడ్డి వంగా, ఐఏఎస్‌ అధికారి వికాస్‌ దివ్యకీర్తిఎవరైనా ఐఏఎస్‌ అయిపోవచ్చునాకేమనిపిస్తోందంటే ఢిల్లీ వెళ్లి, ఏదో ఒక కోచింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో చేరి రెండుమూడేళ్ల జీవితాన్ని అక్కడే గడిపితే కచ్చితంగా ఐఏఎస్‌ ఎగ్జామ్‌ పాస్‌ అవుతారు. పైగా అందుకోసం చదవాల్సిన పుస్తకాలు కూడా వేలకొద్దీ ఉండవు. 1500 పుస్తకాలు చదివితే ఐఏఎస్‌ అయిపోతారు. కానీ సినిమాలో అలా కాదు.. మీరు దర్శకరచయితలు అయ్యేందుకు ప్రత్యేకంగా ఏ కోర్సు ఉండదు.. ఏ టీచర్‌ కూడా మిమ్మల్ని దర్శకుడిగా, రచయితలుగా తీర్చిదిద్దలేరు అన్నాడు.సినిమాసందీప్‌రెడ్డి డైరెక్ట్‌ చేసిన యానిమల్‌ 2023లో రిలీజైంది. రణ్‌బీర్‌ కపూర్‌, రష్మిక మందన్నా జంటగా నటించారు. అనిల్‌ కపూర్‌, బాబీ డియోల్‌, తృప్తి డిమ్రి కీలక పాత్రల్లో యాక్ట్‌ చేశారు. బాక్సాఫీస్‌ వద్ద ఈ మూవీ రూ.900 కోట్లకు పైగా వసూలు చేసింది.చదవండి: హీరోయిన్ కియారా ప్రెగ్నెన్సీ.. వాళ్లకు టెన్షన్

Who Was Sarojini Naidu First Female Governor Of United Provinces5
ఫైటింగేల్‌ ఆఫ్‌ ఇండియా..! ఆ ముగ్గురే..

కోకిల పాడుతుందని అంటారు. మరి, కోకిల పాటలు వింటుందా? 1949 మార్చి 1 రాత్రి సరోజినీ నాయుడు తనకు చికిత్స చేస్తున్న నర్సును పిలిచి పాట పాడమని కోరారని అంటారు. ఆ పాటే ఆమెను నిద్రపుచ్చిందట! సరోజినిని గాంధీజీ ‘నైటింగేల్‌ ఆఫ్‌ ఇండియా’ అన్నారు. సరోజిని ఎప్పుడైనా పాటలు కూడా పాడారేమో! గాంధీజీ అన్నది మాత్రం ఆమె కవిత్వం గురించి! ఆ కవిత్వంలోని భావయుక్తమైన లాలిత్యం ఆయనకు ఉద్యమ పోరాట గానంలా అనిపించి ఉండాలి. అలాగైతే ఆమెను ‘ఫైటింగేల్‌’ ఆఫ్‌ ఇండియా అని కూడా అనొచ్చు.సరోజినీ నాయుడుకి, ఈ ఏడాదికి ఒక ‘చారిత్రకత’ ఉంది. అలాగే ఈ యేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి, సరోజినీ నాయుడి ఆశయానికి ఒక ‘సారూప్యం’ ఉంది. ఇక నేడైతే (2, మార్చి) సరోజినీ నాయుడు ఈ లోకానికి ‘వీడ్కోలు’ చెప్పిన రోజు. రాజకీయ కార్యకర్తగా, మహిళా హక్కుల ఉద్యమ నేతగా, అంతిమ క్షణాల వరకు జీవితాన్ని ప్రేమించిన మనిషిగా ఆమె నుంచి స్ఫూర్తిగా తీసుకోవలసినవి ఈ మూడు సందర్భాలూ! చారిత్రకత (1925–2025)ఈ ఏడాది డిసెంబర్‌ 28కి, భారత జాతీయ కాంగ్రెస్‌కు 140 ఏళ్లు నిండుతాయి. ఇన్నేళ్ల చరిత్ర కలిగిన ఆ పార్టీకి సరిగ్గా 100 ఏళ్ల క్రితం 1925లో అధ్యక్షురాలయ్యారు సరోజినీ నాయుడు. స్వాతంత్య్రోద్యమాన్ని నడుపుతున్న భారత జాతీయ కాంగ్రెస్‌కు అప్పటివరకు ఒక భారతీయ మహిళ అధ్యక్షురాలిగా లేరు. తొలి మహిళా అధ్యక్షురాలు అనీబిసెంట్‌ (1917) అయితే, తొలి భారతీయ మహిళా అధ్యక్షురాలు సరోజినీ నాయుడు. ఆ తర్వాత నెల్లీ సేన్‌గుప్తా (1933) అధ్యక్షురాలయ్యారు. మొత్తం మీద స్వాతంత్య్రానికి పూర్వం జాతీయ కాంగ్రెస్‌కు అధ్యక్షులు అయింది ముగ్గురే మహిళలు.సరోజినీ నాయుడుకు ముందరి ఏడాది 1924లో మహాత్మా గాంధీ జాతీయ కాంగ్రెస్‌కు అధ్యక్షుడిగా ఉన్నారు. ఇద్దరి మధ్య వయసులో పదేళ్ల వ్యత్యాసం. ఇద్దరి మధ్య ముప్పై ఏళ్ల స్నేహం. స్వాతంత్య్రోద్యమ పోరాటంలో ఇద్దరిదీ దాదాపుగా సమానమైన భాగస్వామ్యం. గాంధీజీని తొలిసారిగా 1914లో లండన్‌లో చూశారు సరోజిని. తనే ఆయన్ని వెదుక్కుంటూ వెళ్లి కలిశారు. ఆయన్ని చూసీ చూడగానే ఆమెకు నవ్వొచ్చింది. ‘‘బక్కపల్చని మనిషి, నున్నటి గుండు. నేల మీద కూర్చొని.. చిదిపిన టమాటా ముక్కలు, ఆలివ్‌ నూనె కలిపి తింటూ కనిపించారు. ఒక ఉద్యమ నాయకుడు ఇలా వినోదాత్మకంగా కనిపించడంతో పగలబడి నవ్వాను..’’ అని సరోజిని ఆ తర్వాత ఒక చోట రాసుకున్నారు. తనను చూసి ఆమె నవ్వగానే : ‘‘అయితే నువ్వు సరోజినీ నాయుడివి అయుండాలి. ఇలా ప్రవర్తించే ధైర్యం వేరే ఎవరికుంటుంది?’’ అంటూ ఆమెను నవ్వుతూ పలకరించారు గాంధీజీ! అప్పటికే ఈ జాతీయవాద ఉద్యమ యువ నాయకురాలి గురించి ఆయన విని ఉన్నారు. 1917 తర్వాత ఆమె గాంధీ సత్యాగ్రహ ఉద్యమంలో చేరారు. సారూప్యం (1930 ఉప్పు సత్యాగ్రహం–2025 విమెన్స్‌ డే థీమ్‌)ఈ ఏడాది అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ఐక్యరాజ్య సమితి ప్రకటించిన థీమ్‌.. ఫర్‌ ఆల్‌ విమెన్‌ అండ్‌ గర్ల్స్‌ : రైట్స్‌. ఈక్వాలిటీ. ఎంపవర్‌ మెంట్‌ (మహిళలు, బాలికలందరికీ హక్కులు, సమానత్వం, సాధికారత). ఈ థీమ్‌కు, జాతీయవాద ఉద్యమంతో సమాంతరంగా సరోజినీ నాయుడు నడిపిన మహిళా హక్కుల పోరాటానికీ చాలా దగ్గరి పోలికలు ఉన్నాయి. సరోజిని కవయిత్రి. స్త్రీవిద్యను ప్రోత్సహించే క్రమంలో ఆమె మంచి వక్తగా కూడా అవతరించారు. ఆమె కవిత్వం, ప్రసంగ నైపుణ్యం.. రెండూ, మహిళా ఉద్యమానికి పదును పెట్టాయి. విద్యతోనే హక్కులు, సమానత్వం, సాధికారత సిద్ధిస్తాయని ఆమె ప్రబోధించారు. మహిళల చురుకైన సహకారం లేకుండా జాతీయవాద ఉద్యమం ముందుకు సాగలేదని ధైర్యంగా గాంధీజీకే చెప్పారు! ఇందుకొక ఉదాహరణ : ఉప్పు సత్యాగ్రహం లాంటి కార్యక్రమాలలో పాల్గొనడం మహిళలకు కఠినంగా ఉంటుందని భావించిన గాంధీజీ సుమారు 70 మంది మగవాళ్లతో కలిసి దండి యాత్రకు వెళుతున్నారు. ఈలోపు సరోజినీ నాయుడు నాయకత్వంలో కొందరు మహిళలు ఆ ఊరేగింపులోకి వచ్చి చేరారు! అనుకోని ఆ పరిణామానికి గాంధీజీ ముచ్చట పడ్డారు తప్ప ఆశ్చర్యపోలేదు. అసలు మహిళలు వాడే ఉప్పుకు సంబంధించిన సత్యాగ్రహాన్ని మగవారికి వదిలేయడం ఏమిటన్నది సరోజినీ నాయుడు ప్రశ్న. వీడ్కోలు (2, మార్చి 1949)దేశంలోనే తొలి మహిళా గవర్నర్‌ సరోజినీ నాయుడు. 1947లో భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన రోజే ఆమె ఉత్తరప్రదేశ్‌ (నాటి యునైటెడ్‌ ప్రావిన్సెస్‌) గవర్నర్‌గా నియమితులయ్యారు. గవర్నర్‌గా ఉండగానే 1949లో గుండెపోటుతో కన్నుమూశారు. ఆ ముందు రోజు రాత్రి ఆమె ఆరోగ్యం బాగా క్షీణించింది. తీవ్రమైన తలనొప్పి. ఉపశమన చికిత్స చేశారు. ఆ కొద్ది సేపటికే కుప్పకూలి పోయారు. మర్నాడు కన్నుమూశారు. మరణానంతరం గోమతి నది ఒడ్డున సరోజిని అంత్యక్రియలు జరిగాయి. ‘‘జీవితం ఒక పాట. పాడండి. జీవితం ఒక ఆట. ఆడండి. జీవితం ఒక సవాలు. ఎదుర్కొండి. జీవితం ఒక కల. నిజం చేసుకోండి. జీవితం ఒక త్యాగం. అర్పించండి. జీవితం ఒక ప్రేమ. ఆస్వాదించండి..’’ అంటారు సరోజిని. అయితే వీటన్నిటికీ కూడా పోరాట పటిమ అవసరం అని కూడా తన కవితల్లో చెబుతారు ఈ ‘ఫైటింగేల్‌’ ఆఫ్‌ ఇండియా. (చదవండి: నెస్ట్‌..ఆర్కిటెక్చర్‌లో బెస్ట్‌..!)

Congress demands justice On Haryana Congress worker Himari Death6
హిమానీ నార్వాల్ హత్య.. సమగ్ర దర్యాప్తునకు కాంగ్రెస్‌ డిమాండ్‌

చంఢీగడ్: హర్యానా కాంగ్రెస్ మహిళా కార్యకర్త హిమానీ నార్వాల్ హత్యపై సమగ్ర దర్యాప్తు చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. ఇంతటి దారుణానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని కాంగ్రెస్ ఆందోళన చేపట్టింది. శనివారం రాత్రి సమయంలో ఆమె మృతదేహాన్ని సూట్ కేసులో కనుగొనడంతో హిమానీ హత్య గావించబడ్డ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కేసును అనుమానాస్పద మృతిగా నమోదు చేసుకున్న పోలీసులు.. విచారణ ఆరంభించారు.అయితే దీనిపై సమగ్ర కోణంలో విచారణ జరిపించాలనేది కాంగ్రెస్ డిమాండ్. ఇందుకోసం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్(సిట్)ను ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పట్టుబడుతోంది. ఈ మేరకు హర్యానా కాంగ్రెస్ ఎంఎల్ఏ భరత్ భూషణ్ బర్రా.. పోలీసులు విజ్ఞప్తి చేశారు. ఈ ఘోరానికి పాల్పడ్డ వారికి కఠినమైన శిక్ష పడేలా చేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.సూట్ కేసులో మృతదేహంహర్యానాలోని రోహతక్ జిల్లాలో చోటు చేసుకున్న దారణం నిన్న(శనివారం) వెలుగులోకి వచ్చింది. మహిళా కాంగ్రెస్ నేత హిమానీ నార్వాల్ దారుణ హత్యకు గురయ్యారు. ఆమెను హత్య చేసిన అనంతరం సూట్ కేసులో మూటగట్టి ఓ నిర్మానుష ప్రాంతంలో పడేశారు దుండగులు. ఆమె మృతదేహం సూట్ కేసులో లభించింది. సప్లా బస్టాండ్ దగ్గర సూట్ కేసులో హిమానీ నార్వాల్ మృతదేహం ఉండటంతో స్థానికంగా కలకలం రేగింది. ఆ బస్టాండ్ వద్ద సూట్ కేసు పడి ఉండటంతో తెరిచి చూడటంతో ఈ దారుణం వెలుగు చూసింది. గతంలో కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన జోడో యాత్రలో ఆమె చురుగ్గా పాల్గొన్నారు. ఆమె మెడపై గాయాలుండటం కూడా ఇదే హత్యేనని అనడానికి మరింత బలంగా చేకూర్చుతోంది.రాహుల్ తో కలిసి జోడో యాత్రలోఏఐసీసీ సీనియర్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో ఆమె చురుగ్గా పాల్గొన్నారు. సోన్ పేట్ లోని కతారా గ్రామానికి చెందిన హిమానీ నార్వాల్.. కాంగ్రెస్ చేసిన ప్రతీ ర్యాలీలోనూ ఉత్సాహంగా పాల్గొనేది. దాంతో పార్టీ చేపట్టే సోషల్ ఈవెంట్స్ లో కూడా పాల్గొని ఆమె తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.రాష్ట్రంలో పరిస్థితులు మరింత దిగజారిపోయాయితాము మంచి కార్యకర్తను కోల్పోయామని హర్యానా మాజీ సీఎం భూపేందర్ సింగ్ హుడా పేర్కొన్నారు. రాష్ట్రంలో పరిస్థితులు ఇంతలా దిగజారిపోయాయి అనడానికి నార్వాల్ హత్య ఒక ఉదాహరణ అని ఆయన అన్నారు. దీనిపై హై లెవెల్ దర్యాప్తు చేస్తే కానీ అసలు నిందితులు ఎవరు బయటకు రారని ఆయన పేర్కొన్నారు. నిందితులకు అమలు చేసే అత్యంత కఠినంగా ఉండాలన్నారు. మరొకసారి భవిష్యత్ లో ఇటువంటి ఘటనలు జరగకుండా ఉండేలా శిక్ష అమలు చేయాలని భూపేందర్ సింగ్ డిమాండ్ చేస్తున్నారు. బీజేపీ ప్రభుత్వం పరిపాలన ఎంత దారుణంగా ఉందో ఈ హత్యోదంతాన్ని చూస్తే అర్థమవుతుందన్నారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో(ఎన్సీఆర్బీ) రికార్డులు చూస్తే రాష్ట్రం నేర చరిత్ర ఏ విధంగా తెలుస్తుందన్నారు. ప్రతి నిత్యం ఏదొక చోట మూడు నుంచి నాలుగు హత్యలు, అత్యాచారాలు, కిడ్నాప్ లు, దొంగతనలు జరుగుతూనే ఉన్నాయన్నారు ఆయన.

LPU 2025 Btech Final Year Student Bags Rs 1.03 Cr Placement Package7
ఎల్‌పీయూ రికార్డు.. 1700 విద్యార్థులకు 10 లక్షలపైనే ప్యాకేజీలు

లవ్లీ ప్రొఫెషనల్‌ యూనివర్శిటీ (ఎల్‌పీయూ)కు ఈ ఏడాది చాలా ఉత్సాహంతో మొదలైంది. ఫైనల్‌ ఇయర్‌ బీటెక్‌ విద్యార్థి రూ.1.03 కోట్ల (1,18,000 డాలర్లు)తో ఉద్యోగావకాశం పొందారు. రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్‌లో B.Tech చేస్తున్న బేతిరెడ్డి నాగవంశీరెడ్డి 2025 మేలో తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేయనున్నారు. ప్రముఖ ఏఐ రోబోటిక్స్ సంస్థలో రోబోటిక్స్ ఇంజినీర్‌గా చేరనున్నారు. ఈ అసాధారణ విజయం అటు పరిశ్రమ వర్గాల్లోనూ ఇటు విద్యా ప్రపంచంలోనూ సంచలనం సృష్టించింది. విద్యార్థులకు సూపర్‌ డూపర్‌ ప్యాకేజీలు అందించగల అత్యున్నత విద్యా సంస్థగా ఎల్‌పీయూ తనస్థానాన్ని సుస్థిరం చేసుకుంది.వేర్వేరు బీటెక్‌ విభాగాల్లోని మొత్తం 7361 మంది విద్యార్థులకు పాలో ఆల్టో నెట్‌వర్క్స్, నుటానిక్స్‌, మైక్రోసాఫ్ట్‌, సిస్కో, పేపాల్‌ అమెజాన్‌ వంటి ప్రతిష్టాత్మక మల్టీనేషనల్‌ కంపెనీల నుంచి ప్లేస్‌మెంట్లు లభించాయి. వీరిలో 1700 మంది టాప్‌ ఎమ్మెన్సీల నుంచి ఏడాదికి రూ.10 లక్షల నుంచి రూ.కోటి వరకూ ప్యాకేజీలు అందాయి. టాప్‌ ఎంఎన్‌సీలు ఇచ్చిన సగటు ప్యాకేజీ రూ.16 లక్షలు (ఏడాదికి). ఉద్యోగ మార్కెట్‌లో ఎల్‌పీయూకు ఉన్న అధిక డిమాండ్‌కు నిదర్శనాలు ఈ ప్లేస్‌మెంట్లు.గత ప్లేస్‌మెంట్‌ సీజన్‌ కూడా ఆకట్టుకునేదే. ఇండస్ట్రీలోనే అతిపెద్ద కంఎనీలు ఆకర్షణీయమైన ప్యాకేజీలు అందించాయి. పాలో ఆల్టో నెట్‌వర్క్స్ ఏకంగా ఏడాదికి రూ.54.75 లక్షల ప్యాకేజీని అందించగా నుటానిక్స్‌ రూ.53 లక్షల ప్యాకేజీ ఇచ్చింది. మైక్రోసాఫ్ట్‌ రూ.52.20 LPA ప్యాకేజీ అందించింది. మొత్తం 1912మందికి ఒకటి కంటే ఎక్కువ ఆఫర్లు అందాయి. 377 మందికి మూడు ఆఫర్లు, 97 మందికి నాలుగు ఆఫర్లు, 18 మందికి ఐదు, ఏడుగురికి ఆరు ఆఫర్లు లభించాయి. ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌ ఇంజినీరింగ్‌ విద్యార్థి ఆదిరెడ్డి వాసుకు నమ్మశక్యం కాని రీతిలో ఏకంగా ఏడు ఆఫర్లు వచ్చాయి. ఇదో అరుదైన, ఆకట్టుకునే రికార్డు.పైన చెప్పుకున్న కంపెనీలు మాత్రమే కాకుండా.. అమెజాన్‌ (రూ.48.64 LPA), ఇన్‌ట్యూట్‌ లిమిటెడ్‌ (రూ. 44.92 LPA), సర్వీస్‌ నౌ ( రూ. 42.86 LPA), సిస్కో (రూ. 40.13 LPA), పేపాల్‌ (రూ. 34.4 LPA), APNA (రూ.34 LPA), కామ్‌వాల్ట్‌ (రూ. 33.42 LPA), స్కేలర్‌ (రూ. 32.50 LPA)లు కూడా స్కిల్‌ డెవెలప్‌మెంట్‌, అత్యాధునిక టెక్నాలజీల్లో నైపుణ్యం అందించేందుకు ఎల్‌పీయూ చూపుతున్న శ్రద్ధకు నిదర్శనంగా నిలుస్తున్నాయి.ఎల్పీయూ పట్టభద్రుల సాంకేతిక పరిజ్ఞాన బుద్ధికుశలత కారణంగా భారీ నియామకాలు చేపట్టే ఆక్సెంచర్‌, క్యాప్‌జెమినీ, టీసీఎస్‌ తదితర ప్రముఖ కంపెనీల నుంచి మంచి డిమాండ్‌ ఉంది. క్యాప్‌జెమినీ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ 736 మంది విద్యార్థులకు అనలిస్ట్‌, సీనియర్‌ అనలిస్ట్‌ రోల్స్‌ కోసం ఉద్యగావకాశం ఇచ్చింది. అలాగే మైండ్‌ట్రీ 467 మంది విద్యార్థులను గ్రాడ్యుయేట్‌ ఇంజినీర్‌ ట్రైనీ పొజిషన్‌ కోసం తీసుకుంది. కాగ్నిజెంట్‌ టెక్నాలజీ సొల్యూషన్స్‌ కూడా 418 మంది విద్యార్థులను జెన్‌సీ రోల్స్‌ కోసం తీసుకుంది. ఎల్‌పీయూ నుంచి విద్యార్థులను ఎంపిక చేసుకున్న ఇతర కంపెనీల్లో ఆక్సెంచర్‌ (279 మంది), టీసీఎస్‌ (260 మంది), కేపీఐటీ టెక్నాలజీస్‌ (229 మంది), డీఎక్స్‌సీ టెక్నాలజీ (203), MPHASIS (94 మంది) కంపెనీలు ఉన్నాయి.రొబోటిక్స్‌, ఆటోమేషన్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌, మెకానికల్‌ ఇంజినీరింగ్‌ వంటి కోర్‌ ఇంజినీరింగ్‌ విభాగాల్లో అత్యధిక స్థాయిలో ప్లేస్‌మెంట్లు లభించాయి. పాలో ఆల్టో నెట్‌వర్క్స్‌, సిలికాన్‌ ల్యాబ్స్‌, ట్రైడెంట్‌గ్రూప్‌, నుటానిక్స్‌, ఆటోడెస్క్‌, అమెజాన్‌ వంటి దిగ్గజ కంపెనీలు ఈ విభాగాల్లోని విద్యార్థులను భారీగా నియమించుకుంటున్నాయి.‘‘ఎప్పటికప్పుడు మారిపోతున్న ప్రపంచానికి అనుగుణంగా విద్యార్థులు విజయం సాధించేలా చేసేందుకు ఎల్‌పీయూ కట్టుబడి ఉంది. ఎల్‌పీయూలో బోధించే అంశాలు కంపెనీల అవసరాలకు తగ్గట్టుగా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఎల్‌పీయూలో సంప్రదాయ పద్ధతులకు అతీతంగా సృజనాత్మక రీతిలో సాగే బోధన విద్యార్థులునిమగ్నమైయెలా ఉంటుంది. విద్యార్థులు పెద్ద సంఖ్యలో టాప్‌ కంపెనీల నుంచి ప్లేస్‌మెంట్‌ ఆఫర్లు పొందుతూండటం దీనికి నిదర్శనం. ఎల్‌పీయూ బోధనాంశాల సత్తానుచాటుతున్నాయి ఈ ప్లేస్‌మెంట్లు. జాతీయ, అంతర్జాతీయ ప్రముఖ సంస్థల్లో విద్యార్థులకు మంచి మంచి ప్లేస్‌మెంట్స్‌ సాధించిన రికార్డు ఎల్‌పీయూ సొంతం. అమెరికా, యూకే, ఆస్ట్రేలియాలల్లోని ఎన్నో పేరొందిన కంపెనీల్లో ఎల్‌పీయూ విద్యార్థులు ఏడాదికి రూ.కోటి కంటే ఎక్కువ ప్యాకేజీలతో పని చేస్తున్నారు. అత్యున్నత నైపుణ్యం కలిగిన ప్రొఫెషనల్స్‌ను తయారు చేయగల ఎల్‌పీయూ శక్తి సామర్థ్యాలకు, అంతర్జాతీయ స్థాయి ఎదుగుదలకు ఇవి నిదర్శనాలు.’’ అని రాజ్యసభ సభ్యులు, ఎల్‌పీయూ ఫౌండర్‌ ఛాన్సలర్‌ డాక్టర్‌ అశోక్‌ కుమార్‌ మిట్టల్‌ వివరించారు.2025 బ్యాచ్‌ కోసం దరఖాస్తు చేసుకునేందుకు చివరితేదీ దగ్గరపడింది. ఎల్‌పీయూలో అడ్మిషన్లకు పోటీ ఎక్కువ. యూనివర్శిటీలో అడ్మిషన్‌ కోసం విద్యార్థులు ప్రవేశ పరీక్ష రాయాల్సి ఉంటుంది. అలాగే ‘ఎల్‌పీయూ నెస్ట్‌ 2025’, ఇంటర్వ్యూలలోనూ పాసైన వారికి మాత్రమే కొన్ని ప్రత్యేక కార్యక్రమాల్లోకి ప్రవేశం లభిస్తుంది. పరీక్ష, అడ్మిషన్‌ ప్రాసెస్‌ గురించి తెలుసుకోవాలనుకునే ఆసక్తిగల విద్యార్థులు https://bit.ly/43340ai ను సందర్శించగలరు.

Daughter Rita Bites And Beats Mother In Haryana8
కూతురివేనా నువ్వు.. తల్లిని నిర్బంధించి కిరాతకంగా దాడి(వీడియో)

హిసార్‌: ఆస్తి కోసం కూతురు తన తల్లిని చిత్రహింసలకు గురిచేసిన హృదయవిదారక వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. రక్తం తాగుతాను అంటూ కన్న తల్లినే కూతురు హింసించింది. ఈ ఘటన హర్యానాలో చోటుచేసుకుంది. దీనిపై ఆమె కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటకు వచ్చింది.వివరాల ‍ప్రకారం.. హర్యానాలోని హిసార్‌కు చెందిన రీటాకు రెండేళ్ల క్రితం రాజ్‌గఢ్ సమీపంలోని గ్రామానికి చెందిన సంజయ్ పునియాతో వివాహం జరిగింది. వీరికి వివాహం జరిగిన సమయంలో పునియాకు ఎలాంటి సంపాదన లేదు. దీంతో, రీటా.. తన తల్లి నిర్మలాదేవి ఇంటికి తిరిగి వచ్చేసింది. తల్లి ఇంట్లోనే ఉంటోంది. ఈ క్రమంలోనే ఆస్తి కోసం తన తల్లిని నిర్భందించి వేధించడం ప్రారంభించింది.రీటా.. ఇప్పటికే కురుక్షేత్రలో తమ కుటుంబానికి చెందిన పలు ఆస్తులను అమ్మేసి దాదాపు రూ.65 లక్షలు తన దగ్గర ఉంచుకుంది. ఇప్పుడు తల్లి నివసిస్తున్న ఇంటిని తన పేరుమీదకు మార్చాలని వేధింపులకు గురిచేస్తోంది. ఇంటిని తన పేరు మీద రిజిస్టర్ చేయమని తల్లిని ఇంత దారుణంగా హింసించింది. ఈ సందర్భంగా రీటా.. ఆస్తి ఇస్తావా లేదా? నీ రక్తం తాగుతా అంటూ జుట్టు లాగి కొడుతూ, నోటితో కొరుకుతూ నానా విధాలుగా హింసించింది. దీంతో, నిర్మలాదేవి రోదిస్తూ రెండు చేతులూ జోడించి వేడుకుంటోంది. ఈ వీడియోలో ఒక పురుషుడి మాటలు కూడా వినిపిస్తున్నాయి. ​కాగా, తన తల్లిపై దాడి విషయం తెలియడంతో ఆమె కుమారుడు అమర్‌దీప్‌.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను ఇంట్లోకి రానివ్వడం లేదని తెలిపాడు. రీటాపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.A shocking incident of abuse has surfaced from Hisar, Haryana, where a viral video shows a daughter, Rita, physically assaulting her mother, Nirmala Devi, in a desperate attempt to gain control of family property. Police have now intervened, registering a case under the… pic.twitter.com/gpK7xPHHWv— Mojo Story (@themojostory) March 1, 2025

Posani Krishna Murali falls ill in jail9
ఇంత క్రూరత్వమా..?.. పోసాని పట్ల ప్రభుత్వ దాష్టీకం

సాక్షి కడప : రెడ్‌బుక్‌ రాజ్యాంగాన్ని ప్రయోగించి 67 ఏళ్ల వయస్సులో ఉన్న ప్రముఖ సినీనటుడు, రచయిత, నిర్మాత పోసాని కృష్ణమురళిని అక్రమ కేసులో ఇరికించి, అరెస్టు చేయడమే కాకుండా, ఆయన ఆరోగ్యం పట్ల కూడా ప్రభుత్వం కుట్రపూరితంగానే వ్యవహరించింది. బుధవారం రాత్రి హైదరాబాద్‌లో అరెస్టు చేసిన పోసాని మురళిని గురువారం రాత్రి కోర్టులో హాజరుపరిచి, శుక్రవారం రాజంపేట సబ్‌జైలుకు తీసుకెళ్లారు. అక్కడ విరే­చనాలు అయినట్లు కుటుంబ సభ్యులకు పోసాని తెలిపారు. శనివారం గుండెల్లో, కడుపులో నొప్పిగా ఉందని చెప్ప­డంతో ముందుగా అక్కడి పీహెచ్‌సీకి తరలించారు. అక్కడ ప్రాథమికంగా పరీక్షలు చేయించి, వైద్యుల సూచన మేరకు కడపలోని రిమ్స్‌కు తరలించారు. ఇక్కడ కూడా ఆయన పట్ల ప్రభుత్వం, పోలీసులు అత్యంత క్రూరంగా వ్యవహరించారు. గుండెల్లో, కడుపు నొప్పితో బాధపడుతున్నా అంబులెన్సులో కాకుండా పోలీసు వాహనంలోనే తీసుకెళ్లడం క్రూరత్వమే. పైగా, ఆయనది అనారోగ్యం కాదని, నటన అంటూ రైల్వే కోడూరు రూరల్‌ సీఐ వెంకటేశ్వర్లు రిమ్స్‌ ఆవరణలోనే మీడియాతో మాట్లాడుతూ చెప్పడం అందరినీ విస్మయపరిచింది. 67 ఏళ్ల వయస్సులో ఉన్న ఓ ప్రముఖుడు, సీనియ­ర్‌ సిటిజన్‌ పట్ల ఓ సీఐ ఇంత దారుణంగా మా­ట్లాడటం ప్రభుత్వ కర్కశత్వానికి నిదర్శనమని పలువురు మండిపడుతున్నారు. ఇదే తరుణంలో పోసో­ని మురళీకృష్ణకు ఏదైనా జరగరానిది జరిగితే బా«­ద్యత ఎవరిదంటూ ఆయన అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఇలాగేనా ఆస్పత్రికి తీసుకెళ్లేది? పోసానికి ఇప్పటికే ఓసారి గుండె ఆపరేషన్‌ అయింది. మరికొన్ని ఆరోగ్య సమస్యలూ ఉన్నాయి. ఓబులవారి పల్లె పోలీసు స్టేషన్‌లో స్థానిక పీహెచ్‌సీ వైద్యులు పరీక్షించినప్పుడు ఆయనకు కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నట్లు వెల్లడించారు. గుండెకు సంబంధించే కాకుండా ఇతర అరోగ్య సమస్యలు ఉన్నట్లు కుటుంబ సభ్యులు కూడా పేర్కొంటున్నారు. బుధవారం రాత్రి హైదరాబాద్‌లో అరెస్టు చేసిన ఆయన్ని పోలీసు వాహనంలో తిప్పీ తిప్పీ గురువారం మధ్యాహ్నం ఓబులవారిపల్లె పోలీసు స్టేషన్‌కు తీసుకొచ్చారు. అక్కడ 9 గంటలు విచారణ జరిపి, ఆ తర్వాత రైల్వేకోడూరు కోర్టులో హాజరుపరిచారు. కోర్టులో రాత్రంతా వాదనలు జరిగాయి. శుక్రవారం రాజంపేట సబ్‌జైలుకు తీసుకొచ్చేవరకు.. అంటే రెండు రాత్రులు, రెండు పగళ్లు ఆయనకు విశ్రాంతి, నిద్ర లేవు. ఆయన బాగా అలసిపోయారు. జైలుకు తీసుకొచ్చేప్పటికే బాగా నీరసించిపోయారు. సబ్‌జైలుకు తరలించిన తర్వాత విరేచనాలు అయినట్లు, ఇతర సమస్యలు ఎదుర్కొన్నట్లు ఆయన ములాఖత్‌లో సన్నిహితులకు తెలిపారు. శనివారం గుండెల్లో, కడుపులో నొప్పితో బాధపడ్డారు. ఇలాంటి తరుణంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన జైలు, పోలీసు అధికారులు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు స్పష్టంగా కనిపించింది. ఇలాంటి సమస్యలతో ఉన్న వారిని ఆస్పత్రికి తీసుకెళ్లాలంటే తప్పనిసరిగా ఆక్సిజన్, ఇతర అత్యవసర వైద్య సౌకర్యాలు ఉన్న అంబులెన్సులోనే తీసుకెళ్లాలి. వైద్యులు వెంట ఉండాలి. రాజంపేట పీహెచ్‌సీలో ఈసీజీ, ఇతర ప్రాథమిక వైద్య పరీక్షల అనంతరం మెరుగైన వైద్య సేవల కోసం కడపలోని రిమ్స్‌కు తీసుకెళ్లాలని వైద్యులు సూచించడం ఒకింత తీవ్రతకు నిదర్శనమే. అయినా పోలీసులు ఆయన్ని రాజంపేట పీహెచ్‌సీ నుంచి కడప రిమ్స్‌కు అంబులెన్స్‌లో కాకుండా పోలీసు వాహనంలో తీసుకెళ్లారు. అదీ.. సరిగా గాలి కూడా ఆడకుండా ఇద్దరు పోలీసుల మధ్య కూర్చోబెట్టి తీసుకెళ్లారు. రిమ్స్‌లో కూడా స్ట్రెచర్‌ కానీ, వీల్‌ చెయిర్‌ కానీ ఏర్పాటు చేయలేదు. వాహనం నుంచి ఆస్పత్రిలోకి నడిపించుకుంటూనే తీసుకెళ్లారు. రిమ్స్‌ వైద్యులు పరీక్షల అనంతరం పోసాని కిడ్నీలో రాయి ఉన్నట్లు చెప్పారు.ఇలాంటి పరిస్థితుల్లో ఎప్పుడైనా కడపులో నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు కూడా అంబులెన్సులో కాకుండా పోలీసు వాహనంలోనే తిరిగి రాజంపేటకు తరలించారు. పోసాని పట్ల ప్రభుత్వం క్రూరత్వానికి ఇదే నిదర్శనమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. కుటుంబ సభ్యులు అభిమానుల్లో ఆందోళన పోసాని కృష్ణమురళి ఆరోగ్యంపై కుటుంబ సభ్యులతోపాటు అభిమానుల్లోనూ ఆందోళన వ్యక్తమవుతోంది. అనారోగ్యంతో ఉన్న ఆయ­న్ని పోలీసు వాహనాల్లో తీసుకెళ్తున్నారని, ఏదై­నా అత్యవసరం అయితే పరిస్థితి ఏమిటని ప్రశ్ని­స్తున్నారు. శనివారం ములాఖత్‌లో రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి ఆయన్ని సబ్‌ జైలులో కలిశారు. అనంతరం ఆయన అనారోగ్యంతో బాధపడుతున్న తీరును సబ్‌జైలు అధికారులకు కూడా ఆకేపాటి వివరించారు. పోసాని ఛాతినొప్పి, ఇతర అరోగ్య సమస్యలతో బాధపడుతున్న నేపథ్యంలో ఏదైనా జరిగితే బాధ్యత వహించాల్సి ఉంటుందని కూడా అధికారులను హెచ్చరించారు. ఈ నేపథ్యంలో అధికారులు పోసానిని పీహెచ్‌సీకి తీసుకెళ్లి, అక్కడి నుంచి కడప రిమ్స్‌కు వైద్యం కోసం తరలించారు.

Sakshi Editorial On Chandrababu Coalition Govt By Vardhelli Murali10
మాయలేళ్లూ... మరీచికలు!

‘చెప్పేదొకటి, చేసేదొకటి’ స్వభావం గలవాళ్లను మోసగాళ్లనే అంటాము. ప్రజా జీవితంలో ఉంటూ మచ్చుకైనా పారదర్శకత లేని ఇటువంటి బ్యాచ్‌ కూడా మోసగాళ్లే! మాయ లేడి వేషం వేసుకొని మోసగించిన మారీచునికి వీళ్లు వారసులనుకోవాలి. ఇటువంటి మూడు మాయలేళ్లు కలిసి కూటమి కట్టి ఏర్పాటు చేసిన ప్రభుత్వం నుంచి హామీల అమలు గురించి ఆశించడమంటే మరీచికల వెంట పరుగులు తీయడమే! ఈ కూటమి ప్రవేశపెట్టిన రెండో బడ్జెట్‌లో కూడా ఎన్నికల వాగ్దానాలకు నామం పెట్టారని ప్రతిపక్షం విమర్శిస్తున్నది. ప్రతిపక్షంగా అది వాళ్ల డ్యూటీ కావచ్చు.కూటమి మాత్రం ఆ విమర్శలను పట్టించుకోదు. మేనిఫెస్టో హామీలను అమలుచేయలేమనీ, చేయబోమనీ వారికి ముందే తెలుసు. రాష్ట్ర శ్రేయస్సు, ప్రజా సంక్షేమం వగైరాల కంటే పరమ పవిత్రమైన ఆశయాలు, ప్రయోజనాలు వారికి విడివిడిగా వేరే ఉన్నాయి. ఆ ప్రయోజనాలు నెరవేరాలంటే అధికారం కావాలి. విడివిడిగా ఉంటే అది కుదిరే పని కాదు. అందుకని ఒక్కటయ్యారు. అయినా నమ్మకం లేక ‘కొండమీది కోతిని నేలకు దించుతాం, బొందితో కైలాసం తీసుకుపోతాం, కళ్ల ముందటే వైకుంఠాన్ని నిలబెడతాం’ తదితరాల స్థాయికి తగ్గని హామీలను మేనిఫెస్టోలో చేర్చుకున్నారు. వాటిని నెరవేర్చి తీరుతామని కూటమి నేతలు వివిధ సభల్లో చేసిన మంగమ్మ శపథాలు,భీష్మ ప్రతిజ్ఞలు ఇప్పటికీ జనం చెవుల్లో గింగిరుమంటూనే ఉన్నాయి.పిట్టల దొర వాగ్దానాలకు తోడు ఢిల్లీ సర్కార్‌ సౌజన్యంతో ఎన్నికల సంఘం కూడా ఓ చేయి వేయడంతో కూటమి అధికారంలోకి వచ్చింది. వచ్చిన అధికారాన్ని ఏ రకంగా ఉపయోగించుకోవాలి అనే విషయంపై ఎవరి ప్రాధాన్యాలు వారికున్నాయి. జాతీయ స్థాయిలో కూటమికి పెద్దన్నగా బీజేపీ ఉంటున్నా ఏపీలో మాత్రం తెలుగుదేశం పార్టీదే పెద్దన్న పాత్ర. ఆ పార్టీ చంద్రబాబు నాయుడు నాయకత్వంలోకి మారిన తర్వాత ప్రజా సంక్షేమ కార్యక్రమాలను వ్యతిరేకించే వైఖరి తీసుకుంటున్నది. విద్య, వైద్యం వంటి ప్రాథమిక విషయాలు కూడా ప్రభుత్వ బాధ్యత కాదనీ, ఆ రంగాల్లో ప్రైవేట్‌ సేవలు అవసరమనీ చెప్పిన చరిత్ర బాబుది.ప్రభుత్వం నుంచి పొందే సేవలకు కూడా ప్రజలు యూజర్‌ ఛార్జీలు చెల్లించవలసిందేనని ఆయన గతంలోనే ఘంటా పథంగా ప్రకటించారు. అదేరకంగా పాలించారు. మొన్నటి ఎన్ని కల సందర్భంగా ఆయన ప్రకటించిన సూపర్‌ సిక్స్‌ వాగ్దానాలకు ఆయన సిద్ధాంతపరంగానే వ్యతిరేకి! అయినప్పటికీ అటువంటి మేనిఫెస్టోకు రూపకల్పన చేయడమంటే అధికారం పొందడం కోసం ఉద్దేశపూర్వకంగా మోసానికి తెగబడ్డారంటే తప్పవుతుందా? ఈ మోసాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఆయన ఈ మధ్యనే ‘పీ4’ అనే ఓ వంటింటి చిట్కాను ప్రకటించారు.ఈ ఉగాది నుంచి అమలుచేయ సంకల్పించిన ఈ ‘పీ4’ చిట్కాతో రాష్ట్రంలోని పేదరికం మటుమాయమైపోతుందట! పబ్లిక్‌–ప్రైవేట్‌–పీపుల్‌ భాగస్వామ్యమని దాని పూర్తి పేరు. సమాజంలోని పది శాతం మంది అత్యంత సంపన్నులు అట్టడు గున ఉన్న 20 శాతం మంది కడుపేదలను దత్తత తీసుకో వాలట! ఈ పేదవారి అవసరాలను ఆ సంపన్నులు గుర్తించి తృణమో పణమో సాయం చేసి పేదరికం నుంచి బయట పడేయాలట! ఈ ‘సామాజిక బాధ్యత’ నెరవేర్చినందుకు ఆ సంపన్నులకు ఏ సహజ వనరుల్ని కట్టబెడతారన్నది ఇక్కడ రహస్యం.కుల మత ప్రాంతీయ లింగ భేదాల్లేకుండా ఈ దేశంలో పుట్టిన ప్రతి మనిషికీ భారత రాజ్యాంగం సమాన హక్కులను కల్పించింది. చారిత్రకంగా వివిధ సమూహాల మధ్య అభివృద్ధి క్రమంలో ఏర్పడిన అంతరాలను పూడ్చడానికి ప్రభుత్వాలు పూనుకోవాలని ఆదేశించింది. సహజ వనరుల్లో అందరికీ సమాన భాగస్వామ్యం ఉండాలి. అందరూ సమానస్థాయిలో పోటీ పడగలిగే అవకాశాలు (లెవల్‌ ప్లేయింగ్‌ ఫీల్డ్‌) ఏర్పడాలని రాజ్యాంగం చెబుతున్నది. అటువంటి పరిస్థితులను ప్రభు త్వాలు ఏర్పాటు చేసినట్లయితే పేదరికాన్ని పేదలే జయిస్తారు. ఈ దేశాన్ని కూడా సంపన్న దేశంగా నిర్మిస్తారు. రాజ్యాంగం ఆశయం కూడా అదే! ఎవరి ఎంగిలి మెతుకుల తోనో పండుగ చేసుకొమ్మని చెప్పలేదు.ఈ ‘పీ4’ కార్యక్రమాన్ని గురించి రానున్న రోజుల్లోయెల్లో మీడియా ఏ రకమైన ప్రచారాన్ని చేపట్టబోతున్నదోనని ఊహించుకుంటేనే గగుర్పాటు కలుగుతున్నది. ఇంతటి మహత్తరమైన ఆలోచన గతంలో కార్ల్‌ మార్క్స్‌కు గానీ, అంబేడ్కర్‌కు గానీ, మరెవ్వరికీ గానీ రాలేదని వీరతాడు వేయవచ్చు. ఇకముందు రాబోదని కూడా ఛాలెంజ్‌ చేయవచ్చు. ఈ చిట్కా వైద్యంతో చిటికెలోనే పేదరికం పరారైందని కూడా ప్రకటించవచ్చు.‘పీ4’ సంక్షేమ ప్రచారం హోరులో తెలుగుదేశం పార్టీ అధినేతలకు మిగిలిన పవిత్ర కార్యక్రమం ఏమున్నది? ఒక్క అమరావతి తప్ప! దానికి అభివృద్ధి అనే ముసుగు వేయడం తప్ప! మిగిలిన ఈ మూడేళ్లూ (ఒక సంవత్సరం జమిలి ఎన్నికల కోత ఉండవచ్చు) అమరావతి సేవలోనే ప్రభుత్వం తరించే అవకాశం ఉన్నది. అమరావతి నిర్మాణానికి రూపాయి కూడా ప్రభుత్వం ఖర్చు చేయవలసిన అవసరం లేదని, దాని ల్యాండ్‌ బ్యాంక్‌ ద్వారా సంపాదించిన సొమ్ముతోనే నిర్మాణం జరిగి పోతుందని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు పలుమార్లు చెప్పిన విషయం పాఠకులకు గుర్తుండే ఉంటుంది. అందుకు భిన్నంగా ఇప్పటికే ప్రపంచ బ్యాంకు, జర్మనీ, ‘హడ్కో’ల ద్వారా 30 వేల కోట్లకు పైగా అప్పులు చేశారు. ఇంకో ఇరవై వేల కోట్ల రూపాయలను సీఆర్‌డీఏ ద్వారా సమీకరించేందుకు ఆదేశిస్తూ జీవో కూడా ఇచ్చారు.జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో నిర్మించిన ప్రభుత్వ భవనాలను గనక ఉపయోగంలోకి తెచ్చుకుంటే వైజాగ్‌ తక్షణమే అందుబాటులోకి వచ్చేది. ఆ సంగతి పక్కనబెట్టి, వైజాగ్‌ను విస్మరించి, ఇన్ని వ్యయప్రయాసలకోర్చడం వెనుక అసలు కథ ఇప్పటికే చాలామందికి అర్థమై ఉంటుంది. రాష్ట్ర రాజధాని పేరుతో అతి పెద్ద రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారానికి తెరతీశారని, దాని ద్వారా ఆ పార్టీ ముఖ్యనేతలు, వారి అనుయాయులు వేల కోట్ల రూపాయలు దండుకోవడానికి ప్రణాళికలు రచించారనే విమర్శలు చాలాకాలంగా వినిపిస్తున్నాయి. ఈ విమర్శలను పూర్వపక్షం చేసే సంతృప్తికరమైన సమాధానాన్ని తెలుగుదేశం నాయకత్వం ఇప్పటికీ ఇవ్వలేకపోతున్నది. ప్రతిపక్షం వారు రుజువులు చూపిస్తూ చేస్తున్న ఆరోపణలను సహేతుకంగా ఖండించనూ లేకపోతున్నది. దీన్నిబట్టి ఈ మూడేళ్లలో జరగ బోయేది – పేదలకు ‘పీ4’ గంజినీళ్లు! పాలక పెద్దలకు కనక వర్షం!!ఇక భారతీయ జనతా పార్టీది జాతీయ స్థాయి లక్ష్యం. వరసగా మూడుసార్లు కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసి బీజేపీ, సంఘ్‌ పరివార్‌లు మంచి ఊపుమీదున్నాయి. ఇక ఆరెస్సెస్‌ స్థాపిత లక్ష్యమైన హిందూ రాష్ట్ర ఎజెండాను బయటకు తీసే ముహూర్తం ఇప్పుడు కాక ఇంకెప్పుడని అవి భావిస్తు న్నాయి. మొన్నటి ‘మహా కుంభమేళా’ సందడిలోనే అందుకు అంకురార్పణ కూడా జరిగిపోయిందట! ‘అమర్‌ ఉజాలా’ అనే ఉత్తరాది హిందీ పత్రిక కోసం అలోక్‌ కుమార్‌ త్రిపాఠీ రాసిన వార్తా కథనాన్ని ఉటంకిస్తూ ‘ది వైర్‌ తెలుగు డాట్‌ ఇన్‌’ ఈ విషయాన్ని వెల్లడించింది. ఇంకో పాతికేళ్లలో దేశాన్ని హిందూ దేశంగా ప్రకటించే అవకాశం ఉన్నదట! అందుకు అవసరమైన అడుగులన్నీ ఇక వరసగా వేసుకుంటూ వెళతారు. ‘రుషి సంవిధాన్‌’ అనే పేరుతో ప్రత్యామ్నాయ రాజ్యాంగం కూడా సిద్ధమైందట! దీన్నే ‘సనాతన రాజ్యాంగ’మని పరివార్‌ ముఖ్యులు పిలుచుకుంటున్నారు. రాజ్యాంగాన్ని మార్చబో మంటూ బీజేపీ నేతలు పదేపదే ఇస్తున్న హామీలన్నీ బూటకమే నని ఇప్పుడు సిద్ధంగా ఉన్న ‘రుషి సంవిధాన్‌’ లేదా సనాతన రాజ్యాంగం రుజువు చేస్తున్నది.సంఘ్‌ పరివార్‌ తన అంతిమ గమ్యాన్ని చేరుకోవడానికి కీలకమైన తొలి అడుగు జమిలి ఎన్నికలు లేదా ఒన్‌ నేషన్‌ ఒన్‌ ఎలక్షన్‌ (ఒక జాతి... ఒకే ఎన్నిక). ఆ తర్వాత ‘ఒక జాతి... ఒకే భాష’, ‘ఒక జాతి... ఒకే మతం’ వంటి నినాదాలు మొదలు కావచ్చు. కనుక ఎట్టి పరిస్థితుల్లో జమిలి ఎన్నికల కార్యక్రమాన్ని ఈ దఫా వాయిదా వేసే అవకాశం లేదు. అందుకు అవసరమైన రాజ్యాంగ సవరణలకు సరిపోయే సంఖ్యాబలం ఎన్డీఏకు ఉన్నదా లేదా అనే శంకలు అనవసరం. సమకూర్చుకోగలమనే నమ్మకం ఎన్డీఏకు ఉన్నది. బీజేపీ శిబిరానికి దూరంగా ఉండే తటస్థ పార్టీలకు కూడా వాటి అవసరాలు వేరువేరుగా ఉండవచ్చు. ఆంధ్రప్రదేశ్‌లో తీవ్రమైన రాజకీయ కక్షను, స్టేట్‌ టెర్రర్‌ను ఎదుర్కొంటున్న వైసీపీ వాళ్లు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈ దమన కాండను వదిలించుకుందామనే దిశలో ఆలోచించవచ్చు.తెలంగాణలో బీఆర్‌ఎస్‌ పార్టీ కూడా ఏడాది ముందుగానే అధికారంలోకి వచ్చే అవకాశాన్ని వదులుకోకపోవచ్చు. ఈ రెండు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాల పట్ల వ్యతిరేకత స్పష్టంగానే కనిపిస్తున్నది. ఇల్లలకంగానే పండగ కాదు. జమిలి ఎన్నికలు జరిగినంత మాత్రాన హిందూ రాష్ట్ర ఏర్పాటుకు మార్గం సుగమమైనట్టు కాదు. ఇంకా చాలా దూరం ఉన్నది. జమిలి ఎన్నికలకు సహ కరించిన పార్టీలన్నీ ‘రుషి సంవిధాన్‌’కు సహకరించకపోవచ్చు. జమిలి ఎన్నికల్లో ఏమైనా జరగవచ్చు. కాకపోతే చాప కింద నీరులా బీజేపీ చేస్తున్న సన్నాహాలకూ, ఆ పార్టీ నేతలు పైకి చెబుతున్న మాటలకూ ఏమాత్రం పొంతన లేదనే విషయాన్ని ఈ పరిణామాలు రుజువు చేస్తున్నాయి.ఇక మాటలకూ, చేతలకూ పొంతన ఉండనివాళ్లు తమ బ్రాండ్‌ అంబాసిడర్‌గా ‘జనసేనాని’ని నియమించుకోవచ్చు. ఈ పదేళ్లలో ఆయన తన ఐడియాలజీని తలకిందులుగా వేలాడ దీశారు. ఆయన ఆరాధన చేగువెరా నుంచి సావర్కర్‌కు బదిలీ అయింది. తన మాటలకు విరుద్ధంగా తానే మాట్లాడిన ఉదంతాలు కోకొల్లలు. సనాతన రాజ్యాంగం గురించిన మాటలు సంఘ్‌ పరివారంలో వినపడగానే సనాతన ధర్మ పోరాట యోధుడి అవతారమెత్తడం గమనార్హం. ఏ రాజకీయ స్రవంతిలో కలిసిపోతే తన ప్రయాణం సుఖంగా సాగుతుందని భావిస్తారో అందులో దూకెయ్యడం ఆయనకు రివాజుగా మారింది. ఇలా మాట నిలకడ లేని, పారదర్శకత అసలే లేని ముగ్గురు కలిసి ఏర్పాటు చేసుకున్న కూటమి నుంచి హామీల అమలు గురించి ఆశించడం నీటి కోసం ఎండమావుల వెంట పరుగులు తీయడమే అవుతుంది. కాకపోతే ఈ రాజకీయ వంచనా శిల్పాన్ని ఎండగట్టడం, ప్రజలను జాగృతం చేయడం ప్రజాస్వామ్య ప్రియుల తక్షణ కర్తవ్యం.వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

NRI View all
title
తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) ఆధ్వర్యంలో శివాలయాల సందర్శన యాత్ర

తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) వారు గత మూడేళ్లుగా నిర్వహిస్తున్న మహా శివరాత్రి శివాలయాల సందర్శన యాత్రను  ఈ మహా శ

title
అమెరికా నుంచి భారత్‌కి అందుకే వచ్చేశా! సీఈవో హార్ట్‌ టచింగ్‌ రీజన్‌

మెరుగైన అవకాశాలు, ఆర్థిక భద్రత కోసం చాలామంది భారతీయులు విదేశాల బాటపడుతుంటార

title
USA: ‘కోమా’లో భారత విద్యార్థి.. ఎమర్జెన్సీ వీసాకు లైన్‌ క్లియర్‌

వాషింగ్టన్‌:  ఫిబ్రవ

title
Hong kong: హాంకాంగ్‌లో ఘనంగా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం

హాంకాంగ్ తెలుగు సమాఖ్య అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం 2025ని ఘనంగా జరుపుకుంది.

title
తానా ప్రపంచసాహిత్యవేదిక ఆధ్వర్యంలో “నా భాషే నా శ్వాస” సదస్సు విజయవంతం

డాలస్ :  ఉత్తరఅమెరికా తెలుగుసంఘం (తానా) సాహిత్యవిభాగం

Advertisement

వీడియోలు

Advertisement