Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Botsa Satyanarayana Is Angry With The Behavior Of Ministers In Legislative Council1
మంత్రి నారా లోకేష్‌పై బొత్స ఆగ్రహం

సాక్షి, అమరావతి: గవర్నర్ ప్రసంగంపై చర్చలో వైఎస్సార్‌సీపీ, టీడీపీ సభ్యుల మధ్య వాదోపవాదనలు జరిగాయి. ఎమ్మెల్సీ వరుద కళ్యాణి ప్రసంగాన్నిఅడ్డుకునేందుకు మంత్రులు ప్రయత్నించారు. ఆమె ప్రసంగాన్ని మంత్రి నారా లోకేష్ అడ్డుకున్నారు. నాలుగు లక్షల ఉద్యోగాలు చెప్పలేదంటూ మంత్రి నారా లోకేష్ వాదించారు. గవర్నర్ ప్రసంగంలో కల్పించినట్టు రాశారని వరుదు కళ్యాణి అన్నారు. తాము ఇంగ్లీష్ స్పీచ్‌లో ఉన్నదే చెప్తామంటూ మంత్రి లోకేష్ వితండ వాదం చేశారు.మంత్రులు మాటిమాటికీ అడ్డు తగలడంపై విపక్ష నేత బొత్స అభ్యంతరం వ్యక్తం చేశారు. మంత్రుల తీరుపై బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ఉద్యోగాలు ఇచ్చేశాం అని ఎలా చెప్తారంటూ బొత్స అభ్యంతరం తెలిపారు. కేంద్ర ప్రభుత్వం టీడీపీ, జనసేన పై ఆధారపడి ఉన్నా ప్రత్యేక హోదా సాధించలేదన్న వరుదు కళ్యాణి వ్యాఖ్యల పట్ల మంత్రి నారా లోకేష్ మళ్లీ అభ్యంతరం తెలిపారు.మేం కేంద్రానికి బేషరతుగా మద్దతు ఇచ్చాం.. మా మీద కేంద్ర ప్రభుత్వం ఆధారపడిందని ఏనాడూ అనలేదంటూ మంత్రి లోకేష్ చెప్పుకొచ్చారు. మంత్రి లోకేష్ వ్యాఖ్యలపై విపక్ష నేత బొత్స సత్యనారాయణ అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. కేంద్రంలో ఉన్నది వీళ్ల ఉమ్మడి ప్రభుత్వం కాదా..?. మా మీద ఆధారపడలేదని చెప్తారా..?. రాష్ట్ర ప్రయోజనాల కోసమన్నారు. అదే మా సభ్యురాలు చెప్తున్నది. 2014 నుండి 2019 మధ్యలో ప్యాకేజీ కోసం హోదాను వదిలేయలేదా..?’’ అంటూ విపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు.గవర్నర్ ప్రసంగం వాస్తవాలకు విరుద్ధంగా ఉందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మండిపడ్డారు. ‘‘చంద్రబాబు పాలన గొప్పలు చెప్పుకుంటున్నారు.. కానీ ఓటేసిన జనం చెప్పులతో కొట్టుకుంటున్నారు. తొమ్మిది నెలల్లో రైతులు, మహిళలు, పేదల జీవితాలు తలకిందులైపోయాయి. సూపర్ 6 పథకాలకు ఎగనామం పెట్టడం సుపరిపాలనా..?. ఉద్యోగులకు డీఏ, ఐ ఆర్, పీ ఆర్ సీ ఇవ్వకపోవడమే సుపరిపాలనా..?. అమ్మ ఒడి, రైతు భరోసా ఎగ్గొట్టడం సుపరిపాలన అవుతుందా.?’’ అంటూ వరుదు కల్యాణి నిలదీశారు.‘‘రూ.15 వేల కోట్ల విద్యుత్ ఛార్జీల భారం మోపారు. 60 శాతం నిత్యవసర వస్తువులు ధరలు పెంచారు. 4 లక్షలు ఉద్యోగాలు ఇచ్చేశాం అని చెప్పారు..ఎక్కడ ఇచ్చారు..? చూపించండి. గత ప్రభుత్వ హయాంలో వైఎస్‌ జగన్‌ జగన్ 6 నెలల్లో లక్షా 25 వేల ఉద్యోగాలు ఇచ్చారు. కూటమి ప్రభుత్వం.. తొలి సంతకం పెట్టిన మెగా డీఎస్సీని కూడా పూర్తి చేయలేదు. జాబ్ క్యాలెండర్ ఇస్తామని కూడా ఇవ్వకుండా మోసం చేశారు. టీడీపీ పై ఆధారపడ్డ కేంద్ర ప్రభుత్వం ఉన్నా ప్రత్యేక హోదాను సాధించలేదు’’ అని వరుదు కల్యాణి దుయ్యబట్టారు.

Donald Trump Latest Disapproval Rate Increasing In America2
దూకుడు ఫలితం.. ట్రంప్‌ క్రేజ్‌కు బీటలు..?

వాషింగ్టన్‌: రెండోసారి అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత వరుస దూకుడు నిర్ణయాలతో ట్రంప్‌కు అమెరికాలో క్రేజ్‌ తగ్గుతోందా..? ఆయన విధానాలతో అగ్ర దేశ ప్రజలు అంత సంతోషంగా లేరా..? అంటే తాజాగా వెల్లడైన పాపులర్‌ పోల్‌ సర్వే ఫలితాలు అవునేనే చెబుతున్నాయి. మంగళవారం(ఫిబ్రవరి 25)తో ముగిసిన రాయిటర్స్‌/ఇప్సోస్‌ తాజా పోల్‌లో ట్రంప్‌కు 44 శాతం మంది మాత్రమే మద్దతు పలికారు. జనవరి చివరి వారంలో నిర్వహించిన పోల్‌లో కంటే ట్రంప్‌కు మద్దతు పలికేవారి సంఖ్య కాస్త తగ్గింది. జనవరిలో వరుసగా ట్రంప్‌నకు 47 శాతం మంది అనుకూలంగా ఓటు వేయగా ప్రస్తుతం ఇది 44 శాతానికి పడిపోయింది. ఇదే సమయంలో ట్రంప్‌ను వ్యతిరేకించే వారి సంఖ్య జనవరితో పోలిస్తే ఏకంగా 10 శాతం పెరిగి 51 శాతానికి చేరింది. జనవరిలో నిర్వహించిన సర్వేలో ట్రంప్‌ను కేవలం 41 శాతం మంది మాత్రమే వ్యతిరేకించారు. ట్రంప్‌ వలస విధానానికి అత్యధికంగా 47 శాతం మంది మద్దతు పలుకుతుండగా అమెరికా ఆర్థిక వ్యవస్థను ట్రంప్‌ తిరోగమనం దిశగా తీసుకెళుతున్నారని ఏకంగా 53 శాతం మంది భావిస్తున్నారు.జనవరిలో ట్రంప్‌ ఆర్థిక విధానాలను కేవలం 43 శాతం మంది మాత్రమే వ్యతిరేకించగా ఇప్పుడు ఆ సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇదే సమయంలో ట్రంప్ ఇతర దేశాలపై విధిస్తున్న టారిఫ్‌ పన్నులు, ఇతర‌ ఆర్థిక విధానాలను కేవలం 39 శాతం మంది మాత్రమే బలపరుస్తున్నారు. ట్రంప్‌ హయాంలో ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉంటుందని అమెరికన్లు భావిస్తుంటారు. ఇదే గతేడాది జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ప్రధానంగా ఎన్నికల్లో ఆయనకు కలిసొచ్చిన అంశం. అయితే రెండో టర్ము మొదలై రెండు నెలలు కూడా కాకముందే ట్రంప్‌ ఈ విషయంలోనే ప్రజల మద్దతు కోల్పోతుండడంపై చర్చ జరుగుతోంది. చైనా కాకుండా ఇతర దేశాల వస్తువులపై ట్రంప్‌ దిగుమతి సుంకాలు విధించడాన్ని 54 శాతం మంది వ్యతిరేకిస్తున్నారు. అయితే చైనాపై టారిఫ్‌ల విధింపు అంశంలో మాత్రం ట్రంప్‌కు 49 శాతం మంది మద్దతు లభించింది. చైనాపై టారిఫ్‌లను కూడా 47 శాతం మంది వ్యతిరేకిస్తుండడం గమనార్హం. రాయిటర్స్‌,ఇప్సోస్‌ నిర్వహించిన తాజా పోల్‌లో మొత్తం 4145 మంది పాల్గొన్నారు.

Subramanian Swamy Support YSRCP Principal Opposition Demand3
ఏపీలో ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్‌సీపీనే: సుబ్రహ్మణ్య స్వామి

అమరావతి, సాక్షి: ఏపీలో ప్రధాన ప్రతిపక్ష హోదా వైఎస్సార్‌సీపీకే దక్కాలని బీజేపీ ఫైర్‌బ్రాండ్‌, ప్రముఖ లాయర్‌ సుబ్రహ్మణ్య స్వామి (Subramanian Swamy) అంటున్నారు. ఇటీవల తిరుపతి డిప్యూటీ మేయర్‌ ఎన్నిక సందర్భంగా జరిగిన హింసపై ఆయన కోర్టుకెక్కారు. ఏపీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే మీడియాకు వెల్లడించారు.‘‘తిరుపతి డిప్యూటీ మేయర్‌ ఎన్నిక(Tirupati Deputy Mayor Election) సందర్భంగా దురదృష్టకరమైన సంఘటన జరిగింది. చాలామందిని భయపెట్టి దాడులు చేశారు. ఎన్నికల సమయంలో హింసను నివారించేందుకు తీవ్రమైన చర్యలు తీసుకోవాలి అని పిల్‌ వేశా. నేను వేసిన పిల్‌ మార్చి 12వ తేదీన విచారణకు వస్తుంది’’ అని మీడియాకు తెలిపారాయన. తిరుపతి ఘటనలో కేవలం ఎఫ్‌ఐఆర్‌ మాత్రమే వేశారని, ఎలాంటి చర్యలు తీసుకోలేదని గుర్తు చేశారాయన. ఈ విషయంపై కోర్టు చర్యలు తీసుకుంటే.. దేశవ్యాప్తంగా ఇదొక చట్టంగా మారుతుంది అని సుబ్రహ్మణ్య స్వామి అభిప్రాయడ్డారు.ప్రధాన ప్రతిపక్ష హోదా వైఎస్సార్‌సీపీదేఏపీలో ప్రతిపక్షంలో ఒక్క వైఎస్సార్‌సీపీ(YSRCP)నే ఉంది. కాబట్టి ఆ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష(Principal Opposition) హోదా ఇవ్వడంలో ఎలాంటి తప్పులేదు. అసెంబ్లీలో తక్కువ మంది ఎమ్యెల్యేలు ఉన్నా వైఎస్సార్‌సీపీకి ఆ హోదా దక్కాల్సిందే అని స్పష్టం చేశారాయన. ఈ క్రమంలో ఆయన మరికొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 👉తిరుపతి లడ్డూ అంశం(Tirupati Laddu Controversy) ముగిసిపోయింది. కల్తీలాంటి అంశాలు జరగకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. తిరుపతి లడ్డూను కల్తీ చేయాలని నిజమైన భక్తులు ఎవరూ అనుకోరు. 👉మంచి విషయం ఎవరు చెప్పినా పార్టీలకతీతంగా అంగీకరించాలి. నా నిర్ణయాలను పార్టీ ఎన్నడూ వ్యతిరేకించలేదు అని అన్నారాయన. ఇదిలా ఉంటే.. ఏపీ కూటమి ప్రభుత్వం (AP Kutami Prabhutvam)లో బీజేపీ భాగమై ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామి వ్యాఖ్యలు ఆసక్తికర చర్చకు దారి తీసే అవకాశం లేకపోలేదు.

Over 1 crore Likely to Attend Last Amrit Snan on Mahashivratri4
Maha Kumbh: ఆఖరిరోజు పుణ్య స్నానాలకు ఎంత మంది అంటే..

ప్రయాగ్‌రాజ్‌: ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన ఉత్సవంగా పేరొందిన మహాకుంభమేళా ఫిబ్రవరి 26 శివరాత్రి పర్వదినంతో ముగియనుంది. మహా కుంభమేళా చివరి అమృత స్నానంలో కోటి మందికి పైగా భక్తులు పాల్గొంటారని స్థానిక అధికారులు అంచనా వేశారు. ఈ నేపధ్యంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం విస్తృత రీతిలో భద్రతా ఏర్పాట్లు చేసింది.జనవరి 13న మహా కుంభమేళా(Maha Kumbh) ప్రారంభమైనది మొదలు ఇప్పటివరకు దాదాపు 64 కోట్ల మంది భక్తులు గంగా, యమున, సరస్వతి నదుల సంగమమైన త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరించారు. రైళ్లు, విమానాలు, రోడ్డు మార్గాలలో కోట్లాదిమంది భక్తులు ప్రయాగ్‌రాజ్‌కు తరలివస్తున్నారు. శివరాత్రి( Mahashivratri) సందర్భంగా పవిత్ర స్నానాలు ఆచరించేందుకు వచ్చే భక్తుల కోసం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తుల రద్దీని నియంత్రించేందుకు నగరంలోనికి ఎటువంటి వాహనాలను అనుమతించరు. అయితే వాటి పార్కింగ్ కోసం ప్రత్యేక ‍స్థలాలను కేటాయించారు.ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లే అన్ని ప్రధాన రహదారులలో మోటార్‌బైక్‌లపై 40 పోలీసు బృందాలను మోహరించారు. కుంభమేళా చివరి రోజు మహాశివరాత్రి ఒకరోజు అయినందున ప్రయాగ్‌రాజ్‌లోని శివాలయాలను సందర్శించేందుకు భక్తులకు అనుమతినివ్వనున్నారు. ఆయా శివాలయాలలో శాంతిభద్రతలను కాపాడేందుకు ఇప్పుటికే అదనపు పోలీసు సిబ్బందిని నియమించారు. కాగా మహా కుంభమేళా ప్రారంభంలో యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్(UP Chief Minister Yogi Adityanath) ఈ కార్యక్రమానికి 45 కోట్లకు పైగా భక్తులు వస్తారని అంచనా వేశారు. ఈ సంఖ్య ఫిబ్రవరి 11 నాటికే నమోదయ్యింది. తరువాతి మూడు రోజుల్లో ఆ సంఖ్య 50 కోట్లు దాటింది. తాజాగా.. 60 కోట్ల మంది పుణ్య స్నానాలు ఆచరించారని ప్రభుత్వం ప్రకటించింది. మహాకుంభమేళాలో పవిత్ర స్నానం చేయడం వలన జీవన్మరణ చక్రం నుంచి విముక్తి లభిస్తుందని పండితులు చెబుతున్నారు. ఇది కూడా చదవండి: ‘ఆ గోధుమలతోనే జుట్టూడింది’

Naga Chaitanya Thandel Movie OTT Update5
ఓటీటీలోకి 'తండేల్'.. ప్లాన్ మారిందా?

నాగచైతన్య-సాయిపల్లవి జంటగా నటించిన సినిమా 'తండేల్'. ఈ నెల 7న థియేటర్లలో రిలీజైంది. హిట్ టాక్ తెచ్చుకుని రూ.100 కోట్ల కలెక్షన్స్ మార్క్ కూడా అందుకుంది. తాజాగా టీమ్ అంతా కలిసి సక్సెస్ పార్టీ కూడా చేసుకున్నారు. తండేల్ మూవీ రిలీజ్ రోజే పైరసీకి గురైంది. దీనిపై నిర్మాతలు ప్రెస్ మీట్ పెట్టారు. ప్రస్తుతానికి థియేటర్లలో సినిమా రన్ అవుతోంది. కానీ ఇప్పుడు ఓటీటీ రిలీజ్ పై బజ్ వినిపిస్తోంది. అనుకున్న టైం కంటే ముందే డిజిటల్ స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు.(ఇదీ చదవండి: సింగర్ పై 19 ఏళ్ల తర్వాత మరో కేసు పెట్టిన మొదటి భార్య!)తండేల్ మూవీ డిజిటల్ హక్కుల్ని నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంది. రీసెంట్ టైంలో 'పుష్ప 2' తప్పితే చాలా సినిమాల్ని ఈ ఓటీటీ సంస్థ.. నెల రోజులకు అటు ఇటుగా స్ట్రీమింగ్ చేసేస్తోంది. అలానే ఈ సినిమాని కూడా నెలకే ఓటీటీలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. సోషల్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం మార్చి 6 నుంచే తండేల్.. ఓటీటీలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. లేదంటే మార్చి 14న రావొచ్చని మాట్లాడుకుంటున్నారు.తండేల్ విషయానికొస్తే.. శ్రీకాకుళంలోని మత్సలేశం అనే ఊరికి చెందిన కొందరు జాలర్లు.. గుజరాత్ తీరంలో చేపలు పడుతుండగా, అనుకోకుంగా పాకిస్థాన్ నేవి చేతికి చిక్కారు. నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కించారు. తర్వాత పాకిస్థాన్ జైల్లో కొన్నాళ్ల పాటు ఉన్నారు. భారత ప్రభుత్వం జోక్యంతో తిరిగి ఇళ్లకు చేరారు. ఈ స్టోరీకి ప్రేమకథని జోడించిన డైరెక్టర్ చందూ మొండేటి.. తండేల్ తీశాడు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి వచ్చే సినిమాలు ఏంటంటే?)

KSR Comment On CM Chandrababu Cheating to Farmers6
చంద్రబాబు జస్ట్‌ బిల్డప్‌ బాబాయ్‌ అంతే!

విపక్షంలో ఉన్నప్పుడు.. నోటికొచ్చిన ఆరోపణలు చేయడం, అధికారంలోకి వస్తే.. ఎక్కడా లేని నీతులు చెప్పడం అందరికీ సాధ్యమయ్యే పనికాదు. కానీ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం ఈ విద్యలో ఆరితేరారు. దానికి బిల్డప్ బాబాయిలుగా పేరొందిన ఈనాడు, ఆంధ్రజ్యోతి.. లాంటి ఎల్లో మీడియా భజన ఎటూ ఉంటుంది. ఈమధ్య.. వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి(YS Jagan Mohan Reddy) గుంటూరు మిర్చియార్డులో రైతులను పరామర్శించడానికి వెళ్లారు. గిట్టుబాటు ధరలు రాక రైతులు విలవిలలాడుతున్న తరుణంలో జగన్ అక్కడకు వెళితే.. ఆ పర్యటనను చంద్రబాబు తీవ్రంగా తప్పు పడుతున్నారు!. రైతులు కష్టాలలో ఉంటే ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబుకాని, ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ కాని పరామర్శ చేసి.. వారిని ఆదుకోవడానికి ఏ చర్యలు తీసుకునేది చెప్పలేదు. పైగా జగనే ఏదో తప్పు చేశాడని చంద్రబాబు పదే పదే అంటున్నారు. శాసనమండలి గ్రాడ్యుయేట్ల నియోజకవర్గానికి ఎన్నికలు జరుగుతున్నాయట!. కోడ్ అమలులోకి వచ్చిందట!. అందుకే రైతులను ఎవరూ పలకరించి వారి కన్నీరు తుడవరాదట!. రాజకీయ పార్టీలు ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం నడుచుకోవాలట!. ఏమైనా అర్ధం ఉందా?.. అసలు మిర్చియార్డులో పడిగాపులు పడుతున్న రైతుల వద్దకు ఎవరూ వెళ్లరాదని ఎన్నికల కమిషన్ ఎక్కడైనా చెప్పిందా?. విచిత్రం ఏంటంటే.. ఇదే ఎన్నికల సంఘంపై ముఖ్యమంత్రిగా ఉండి 2019లో చంద్రబాబు(Chandrababu) ఎన్ని విమర్శలు చేశారో తెలియదా?. ఏకంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది ఛాంబర్‌కు వెళ్లి దబాయించి గొడవ చేశారు. మరి ఇప్పుడేమో సుద్దులు చెబుతున్నారు. కరోనా సమయంలో ర్యాలీల మాదిరి వెళ్లవద్దని, సభలు జరపవద్దని దేశ వ్యాప్తంగా నిబంధనలు వస్తేనే పట్టించుకోని పెద్దమనిషి చంద్రబాబు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు శాంతిభద్రత ల సమస్యలు వస్తాయని ,ఫలానా చోటకు వెళ్లవద్దని పోలీసులు వారించినా, వారిని తోసుకుని మరీ వెళ్లిన చరిత్ర చంద్రబాబుది. 👉అనపర్తి వద్ద అప్పట్లో ఏమి చేశారో గుర్తు లేదేమో!. మదనపల్లె సమీపంలోని అంగళ్లు వద్ద వైఎస్సార్‌సీపీవాళ్లను చూపిస్తూ.. తన్నండి.. అంటూ టీడీపీ కార్యకర్తలను రెచ్చగొట్టారు. అధికారంలోకి రాగానే ఫిర్యాదుదారుని బెదిరించి ఆ కేసు లేకుండా చేసుకోవడానికి ప్రయత్నించిన చంద్రబాబు చట్టం గురించి చెబుతున్నారు. 👉పుంగనూరు వద్ద తన సమక్షంలోనే టీడీపీ కార్యకర్తలు పోలీసుల వ్యాన్‌ను తగలబెట్టి, రాళ్లతో పోలీసులపై దాడి చేస్తే ఒక కానిస్టేబుల్ కన్నుపోయింది. ఆ ఘటనలో కనీసం సానుభూతి తెలపని చంద్రబాబు.. ముఖ్యమంత్రి కాగానే ఎక్కడాలేని చట్టాలు, నీతులు చెబుతుంటారు. పోనీ ఆయన ఏమైనా కోడ్ ఉందని ఏ కార్యక్రమం ప్రచారం చేయకుండా ఉంటున్నారా?. విజయవాడలో ఏకంగా మ్యూజిక్ నైట్ పెట్టుకుని ఎంజాయ్ చేశారే! అప్పుడు కోడ్ అడ్డం రాలేదా? రైతులను పరామర్శ చేస్తేనే కోడ్ వచ్చిందా?.. .. గుంటూరు మిర్చి యార్డుకు వెళ్లినందుకు జగన్‌తో సహా ఎనిమిదిమందిపై కేసులు పెట్టారు. మరి అక్కడలేని మాజీ మంత్రి పేర్నినానిపై కూడా కేసు పెట్టాలని ఏ చట్టం చెబుతోంది?. మాజీ ముఖ్యమంత్రి హోదాలో జగన్ వెళితే భద్రత కల్పించడం ప్రభుత్వ కనీస బాధ్యత కాదా?. అయితే సీఎంగా ఉండి ఏ మాత్రం బాధ్యత లేకుండా వ్యవహరించడమే కాకుండా.. ఎదురు ఆరోపణలు చేయడం చంద్రబాబుకే చెల్లుతుంది మరి. ఆయన మరికొన్ని చిత్రమైన ప్రకటనలు చేశారు. అధికారంలో ఉన్నప్పుడు జగన్ రైతులకు ఏమీ చేయలేదట..! రైతులకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఒక్క పైసా ఇవ్వలేదట. ఇంతకన్నా పచ్చి అబద్దాలు ఏమైనా ఉంటాయా?. రైతుల కోసం ప్రత్యేకంగా రైతు భరోసా కేంద్ర వ్యవస్థను తెచ్చి వాటి ద్వారా వాళ్లకు అవసరమైన విత్తనాలు, పురుగు మందులు, ఎరువులు అందించడంతో పాటు పంటల సలహలు, పంట కొనుగోళ్లు.. అన్నీ చేసిందే జగన్. అలాంటి నాయకుడిపై ఇలాంటి విమర్శ చేయడానికి చంద్రబాబు మనసు ఎలా వచ్చిందో అర్ధం కాదు. గతంలో ఎరువుల షాపుల వద్ద రైతులు తమ చెప్పులు క్యూలలో ఎట్టుకుని పడిగాపులు పడి ఉండవలసి వచ్చేది. ఆ పరిస్థితిని తప్పించి రైతులకు గౌరవం తెచ్చిన వ్యక్తి జగన్. దేశంలోనే మొదటిసారిగా రైతులకు పెట్టుబడి సాయం పధకాన్ని ప్రకటించిన రాజకీయ పార్టీ వైఎస్సార్సీపీ. అధికారంలోకి వచ్చాక అన్ని పార్టీల్లా హామీలను ఎగ్గొట్టకుండా.. దానిని అమలు చేసి చూపారాయన. ఏడాదికి రూ13,500 చొప్పున సాయం అందించడం ఒక ఎత్తు అయితే.. ఆయా పంటల ధరల స్థిరీకరణకు ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసింది జగన్ కాదా?టమోటా తదితర పంటలకు ధర తగ్గినప్పుడు వెంటనే జోక్యం చేసుకుని మార్కెట్ పెంచింది జగన్ ప్రభుత్వం కాదా?ఇప్పుడేమో కనీసం రైతులను పలకరించని చంద్రబాబేమో.. చాలా చేసేస్తున్నారని ఎల్లో మీడియా బిల్డప్ ఇస్తే సరిపోతుందా?పాపం!గత ఏడాది 21 వేల నుంచి 27 వేల రూపాయల వరకు మిర్చి ధర పలికితే ,ఈసారి అందులో సగం కూడా ఇప్పుడు రావడం లేదని రైతుల ఆక్రోశం. కేంద్రం కూడా దీనిపై తూతూమంత్రంగా వ్యవహరిస్తోంది. అయినా మిర్చి రైతులకు ఊరట అని ఈనాడు బిల్డప్. అవును డబ్బులు ఊరికే రావు.. అన్నట్లుగా ఈనాడుకు చంద్రబాబు ప్రభుత్వం నుంచి ఆ స్థాయిలో లాభం ఉంటోంది కదా!👉కొందరు రైతులు ఇప్పుడు ఓపెన్‌గానే చెబుతున్నారు.. 20వేల రూపాయల పెట్టుబడిసాయం ఇస్తామని చంద్రబాబు వాగ్దానం చేస్తే నమ్మి ఓట్లు వేశామని.. తీరా చూస్తే ఇరవై రూపాయలు కూడా ఇవ్వలేదని ఆవేదన చెందుతున్నారు. యూట్యూబ్ చానల్ నిర్వాహకుడు విజయ్ కేసరి చేసిన వీడియో ఆసక్తికరంగా ఉంది. 👉పవన్ కల్యాణ్‌ సినిమా టిక్కెట్ల రేట్లు పెంచుకోవడం కోసం ఎంతలా మాట్లాడారు?. సినిమా నిర్మాణానికి పెట్టుబడి ఎలా పెరిగింది?.. తదితర అంశాలపై ఆయన మాట్లాడారు. దానికి చంద్రబాబు కూడా మద్దతు ఇచ్చారు. ఈ పాయింట్‌నే విజయ్‌ కేసరి ప్రముఖంగా ప్రస్తావించారు 👉సినిమా టిక్కెట్ల ధరలు , మద్యం ధరలు పెంచుకోవడానికి చూపిన శ్రద్ద.. రైతుల ఉత్పత్తుల ధరలకు చూపరా? అని విజయ్‌ కేసరి ప్రశ్నించారు. అలాగే.. రైతులకు పెట్టుబడి వ్యయం పెరగలేదా? అని ఆయన అడిగారు. ఇవి వాస్తవాలు. 👉మిర్చి రైతుల విషయంలో ప్రభుత్వమే చొరవ తీసుకుని కొనుగోళ్లకు రంగంలో దిగాల్సింది. కానీ, ఆ పని చేయకపోగా.. జగన్ పైనే ఆరోపణలు చేస్తున్నారు. కేంద్రానికి ఆయన ఒక లేఖ రాసి చేతులు దులుపుకున్నారు. 👉చంద్రబాబు ప్రభుత్వం రైతుల పట్ల అనుసరిస్తున్న విధానాలను తప్పుపడుతూ జగన్ కూడా పలు వ్యాఖ్యలు చేశారు. ఫిబ్రవరి 15న మ్యూజికల్ నైట్ జరుపుకోవడానికి కోడ్ అడ్డం కాలేదా? అని ఆయన ప్రశ్నించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారానికి వెళ్లి.. రైతుల సమస్యలపై వెళ్లినట్లు కలరింగ్ ఇవ్వడమేమిటని చంద్రబాబును జగన్ నిలదీశారు. 👉ధాన్యం కొనుగోళ్లకు తమ హయాంలో 65వేల కోట్లు వ్యయం చేశామని, ఇతర పంటలకు స్థిరీకరణ నిధి ద్వారా సుమారు రూ.7,800 కోట్ల వ్యయం చేశామని కూడా జగన్‌ చెప్పారు. మిర్చియార్డులో ఓట్ల ప్రస్తావన తేకపోయినా, మైక్ వాడకపోయినా,అసలు ఎన్నికలలో తమ పార్టీ పోటీచేయకపోయినా కేసులు పెట్టారని, దీనికి భయపడేది లేదని.. రైతుల తరపున పనిచేస్తామని జగన్ స్పష్టం చేశారు. గతంలో ఎప్పుడూ ఇలా రైతుల సమస్యలపై పనిచేసిన రాజకీయ పార్టీల నేతలపై కేసులు పెట్టిన సందర్భాలు లేవు. ఏదో ఒక వంకతో మాజీ సీఎంకు భద్రత కల్పించకపోవడం.. పైగా తప్పుడు కేసులు పెట్టడం అంతా రెడ్ బుక్ పిచ్చి కుక్క ప్రభావంగానే వైఎస్సార్సీపీ భావిస్తోంది. ఒక్కటి మాత్రం వాస్తవం. ఉమ్మడి ఏపీలో రైతులకు ఉచిత విద్యుత్‌ ఇచ్చి చూపించింది వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి. అదే.. ఉచిత విద్యుత్‌ ఇవ్వడానికి వీలు లేదని చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. రైతుల రుణాలు మాఫీ అవ్వడానికి రాజశేఖరరెడ్డి కృషి చేస్తే.. తాకట్టులో ఉన్న బంగారంతో సహా రైతుల రుణాలన్నీ మాఫీ చేస్తానని చెప్పి చేతులెత్తేసిన నేతగా చంద్రబాబు చరిత్రకెక్కారు. అలాగే.. రైతులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్న నేత జగన్. అదే.. రైతులకు అన్నదాత సుఖీభవ కింద ఇరవైవేల రూపాయల సాయం చేస్తామని చెప్పి.. ఏడాది గడిచినా ఆ హామీని గాలికొదిలేసిన నేతగా చంద్రబాబు మిగిలిపోయారు. అయినా ఎల్లో మీడియా ద్వారా రైతన్నపై ఫోకస్ పెట్టారంటూ, మిర్చి రైతుకు ఊరట వచ్చేసిందంటూ బిల్డప్ ఇచ్చుకుని చంద్రబాబు అండ్ కో సంతోషపడవచ్చు. కాని దానివల్ల రైతులకు ఒరిగేది ఏమి ఉంటుంది?..:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

CT 2025: Is India Getting Venue Advantage Pat Cummins Honest Verdict7
భారత్‌ పటిష్ట జట్టు.. ఆ అడ్వాంటేజ్‌ కూడా ఉండటం వల్ల..: కమిన్స్‌

చాంపియన్స్‌ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లో టీమిండియా అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటోంది. ఇప్పటి వరకు జరిగిన రెండు మ్యాచ్‌లలో జయభేరి మోగించిన రోహిత్‌ సేన.. సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది. లీగ్‌ దశలో భాగంగా ఆఖరిగా నామమాత్రపు మ్యాచ్‌లో న్యూజిలాండ్‌(India vs New Zealand)ను ఢీకొట్టనుంది. ఇక కివీస్‌ కూడా ఇప్పటికే సెమీస్‌ చేరుకోగా.. ఇరుజట్లకు నాకౌట్‌ స్టేజ్‌ కోసం ఇదొక సన్నాహక మ్యాచ్‌గా ఉండబోతోంది.ఇదిలా ఉంటే.. ఈ మెగా వన్డే టోర్నమెంట్‌ నిర్వహణ హక్కులను పాకిస్తాన్‌ దక్కించుకున్న విషయం తెలిసిందే. అయితే, భద్రతా కారణాల దృష్ట్యా టీమిండియా మాత్రం అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ICC) ఆమోదంతో తటస్థ వేదికైన దుబాయ్‌లో తమ మ్యాచ్‌లన్నీ ఆడుతోంది.భారత్‌ పటిష్ట జట్టు.. ఆ అడ్వాంటేజ్‌ కూడా ఉండటం వల్ల..ఈ నేపథ్యంలో ఒకే వేదికపై ఆడటం భారత జట్టుకు అదనపు ప్రయోజనాన్ని చేకూరుస్తుందనే విమర్శలు వస్తున్నాయి. ఈ విషయంపై ఆస్ట్రేలియా కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌ స్పందించాడు. ‘‘టోర్నీ సజావుగా సాగిపోతోంది. అయితే, ఒకే మైదానంలో ఆడటం వల్ల టీమిండియాకు కచ్చితంగా ప్రయోజనం ఉంటుంది.అయినా ఆ జట్టు ఎంతో పటిష్టంగా ఉంది. అద్భుతంగా ఆడుతున్నారు. ఒకే వేదికపై ఆడటం మాత్రం అదనంగా ఎంతో కొంత లాభం చేకూరుస్తుందనడంలో సందేహం లేదు’’ అని యాహూ స్పోర్ట్‌తో కమిన్స్‌ పేర్కొన్నాడు. కాగా చీలమండ నొప్పి కారణంగా ప్యాట్‌ కమిన్స్‌ చాంపియన్స్‌ ట్రోఫీకి దూరమైన విషయం తెలిసిందే.ఈ క్రమంలో స్టీవ్‌ స్మిత్‌ కెప్టెన్సీలో ఆసీస్‌ ఈ వన్డే టోర్నీ బరిలో దిగింది. గ్రూప్‌-బిలో భాగంగా తమ తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌తో తలపడ్డ కంగారూ జట్టు ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది. విజయంతో టోర్నీని ఆరంభించిన స్మిత్‌ బృందం.. తదుపరి సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో నెగ్గి సెమీస్‌ చేరాలనే పట్టుదలతో ఉంది.ఐపీఎల్‌తో రీఎంట్రీఇదిలా ఉంటే.. కమిన్స్‌ ఐపీఎల్‌-2025 ద్వారా పునరాగమనం చేయనున్నాడు. ఈ విషయం గురించి ప్రస్తావిస్తూ... ‘‘చీలమండ గాయానికి చికిత్స తీసుకుంటున్నాను. ఏదేమైనా ఇంట్లో ఉండటం, కుటుంబ సభ్యులతో సమయం గడపటం సంతోషంగా ఉంది. వచ్చే వారం నుంచి బౌలింగ్‌ ప్రాక్టీస్‌ మొదలుపెడతాను.వచ్చే నెల నుంచి ఐపీఎల్‌ ఆరంభం కాబోతోంది. తదుపరి ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ ఆడాల్సి ఉంది. ఆ తర్వాత వెస్టిండీస్‌ పర్యటన.. ఇలా రానున్న ఆరు నెలలు బిజీబిజీగా గడువబోతోంది’’ అని కమిన్స్‌ చెప్పుకొచ్చాడు. కాగా కమిన్స్‌ ఇటీవలే రెండోసారి తండ్రయ్యాడు. కుమార్తె ఈదికి అతడి భార్య జన్మనిచ్చింది. కాగా ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.చాంపియన్స్‌ ట్రోఫీ-2025కి ఆస్ట్రేలియా జట్టుస్టీవ్‌ స్మిత్ (కెప్టెన్‌), జోష్ ఇంగ్లిస్ (వికెట్‌ కీపర్‌), మాథ్యూ షార్ట్, ట్రావిస్ హెడ్, మార్నస్ లబుషేన్‌, అలెక్స్ కారీ, గ్లెన్ మాక్స్‌వెల్, బెన్ ద్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా, స్పెన్సర్ జాన్సన్, సీన్ అబాట్, ఆరోన్ హార్డీ, జేక్ ఫ్రేజర్ మెగర్క్‌, తన్వీర్‌ సంఘా.చదవండి: Virat Kohli: ఇదేం తీరు కోహ్లి? ఇలాంటివి అవసరమా?.. మండిపడ్డ గావస్కర్‌

PM Narendra Modi Eats Makhana Around 300 Days A Year8
ప్రధాని మోదీకి మఖానా దండతో స్వాగతం..! 300 రోజులు ఆ సూపర్‌ ఫుడ్‌తో..

ప్రధాని నరేంద్ర మోదీకి బిహార్‌లోని భాగల్‌పూర్‌లో ఘన స్వాగతం లభించింది. అక్కడ ఆయనకు ప్రజలు భారీ మఖానా పూల దండతో స​త్కరించి గౌరవించారు. ఎందుకంటే తాజగా కేంద్ర బడ్జెట్‌లో సైతం మఖానా పంటకి పెద్దపీటవేయడంతో బీహార్‌ రైతులకు ఇది కాసుల పంటగా మారింది. అలాగే కేంద్ర ప్రభుత్వం మఖానా బోర్డుని ఏర్పాటు చేసి మరీ రైతులకు మరింత చేయూత అందించనున్నాట్లు ప్రకటించింది కూడా. ఈ నేపథ్యంలోనే మోదీకి ఇలా మఖానా దండతో స్వాగతం పలికారు. అలాగే మోదీ ఆ కార్యక్రమంలో తనకు ఈ సూపర్‌ ఫుడ్‌ ప్రీతికరమైన ఆహారమని హైలెట్‌ చేసి మరీ చెప్పారు. తాను ఏడాదిలో 300 రోజులు మఖానును చాలా ఇష్టంగా తింటానని అన్నారు. మరీ ప్రధాని మోదీ డైట్‌లో దీనికి ఎందుకంత ప్రాముఖ్యతను ఇచ్చారో చూద్దామా..!.భారతదేశంలో మఖాన్‌ ఉత్పత్తిలో బిహార్‌ అతిపెద్దది. దేశసరఫరాలో సుమారు 80% వాటాను కలిగి ఉంది. ఈ సూపర్‌ఫుడ్‌ కోసం పెరుగుతున్న ప్రపంచ డిమాండ్‌ను కొనసాగించడానికి రాష్ట్రం చాలా కష్టపడుతోంది. దీనికి పరిష్కారంగానే కేంద్ర బడ్జెట్‌ 2025లో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ బిహార్‌లో ప్రత్యేక మఖానా బోర్డుని ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ బోర్డు ద్వారా రైతులకు మఖానా ఉత్పత్తి, ప్రాసెసింగ్‌ మార్కెటింగ్‌కి మద్దతు ఇవ్వడమేగాక అందుకు కావాల్సిన సాంకేతిక పరిజ్ఞాన సహకారాన్ని అందిస్తుంది కేంద్ర ప్రభుత్వం. అంతేగాదు ప్రభుత్వ పథకాల నుంచి ప్రయోజనాలు పొందేలా కూడా చూస్తుంది.మఖానా అంటే..?మఖానాని ప్రిక్లీ వాటర్ లిల్లీ విత్తనాల నుంచి తయారు చేస్తారు. ఇది కాస్తా శ్రమతో కూడిన ప్రక్రియ. సూపర్ ఫుడ్‌గా ఎందుకు పరిగణిస్తారంటే..ప్రధానమంత్రి దీనిని తన రోజువారీ ఆహారంలో ఎందుకు చేర్చుకున్నారంటే..ఇది పోషకశక్తికి కేంద్రంగా ప్రజాదరణ పొందిన ఆహారం. దీనిలో కేలరీలు తక్కువగా ఉంటాయి, పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, ఫైబర్, ఖనిజాలు పుష్కలంగా ఉంటాబరువుని అదుపులో ఉంచుకోవాలనుకునేవారికి బెస్ట్‌ స్నాక్‌ ఐటెంశాకాహారులకు మొక్కల ఆధారిత ప్రోటీన్‌ మూలం శారీరక విధులకు అవసరమైన అమైనో ఆమ్లాలు ఉంటాయి. యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయిశరీరంలోని ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి సహాయపడే శక్తిమంతమైన యాంటీఆక్సిడెంట్‌లను కలిగి ఉంటాయి.వివిధ దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని సమర్థవంతంగా తగ్గిస్తాయి మధుమేహ వ్యాధిగ్రస్తులకు మంచి ఫుడ్‌ ఇదిజీర్ణ ఆరోగ్యానికి సహాయపడుతుందిఅలాగే మలబద్ధకాన్ని నివారించడంలో సహాయపడుతుంది పేగు ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. ఈ ఆరోగ్య ప్రయోజనాల దృష్ట్యా మోదీ దీన్ని సూపర్‌ఫుడ్‌గా పిలుస్తూ..తన రోజువారి ఆహారంలో ప్రాధాన్యత ఇచ్చారు. మరీ మనం కూడా మన డైట్‌లో భాగం చేసుకుని ఆరోగ్యంగా ఉందామా..!.(చదవండి: ఖోబార్‌ కళ: సీతమ్మ కాలం నాటిది..! కానీ ఇప్పుడు..)

Dramatic Video Shows Bridge Collapse In South Korea Viral9
వీడియో: చూస్తుండగానే ఘోరం.. కుప్పకూలిన బ్రిడ్జి

దక్షిణ కొరియాలో ఘోరం జరిగింది. నిర్మాణంలో ఉన్న ఓ బ్రిడ్జి కుప్పకూలిపోగా.. ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. శిథిలాల కింద చిక్కుకున్న మరో ముగ్గురి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరగొచ్చని అధికారులు అంటున్నారు.సౌత్‌ కొరియా(South Korea) నగరం చెయోనాన్‌లో ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణ పనులు జరుగుతున్నాయి. మంగళవారం ఉదయం 10గం. ప్రాంతలో క్రేన్‌ సాయంతో బ్రిడ్జికి సపోర్ట్‌గా ఉండే ఇనుప నిర్మాణాలను కార్మికులు తరలిస్తున్నారు. ఆ టైంలో అప్పటికే అమర్చిన ఐదు ఇనుప నిర్మాణాలు ఒక్కసారిగా ఒరిగిపోవడంతో.. బ్రిడ్జి కుప్పకూలిపోయింది(Bridge Accident).BIG BREAKING NEWSAt least 3 construction workers killed, 5 injured after portion of highway overpass collapsed near Anseong, South Korea🇰🇷🇰🇷‼️‼️‼️‼️‼️‼️‼️‼️‼️‼️‼️ pic.twitter.com/qk6LSajfLe— WW3 Monitor (@WW3_Monitor) February 25, 2025తొలుత ముగ్గురు మరణించార స్థానిక మీడియా కథనాలు ఇచ్చాయి. అయితే ఇద్దరే ఘటనా స్థలంలో మరణించారని అధికారులు స్పష్టత ఇచ్చారు. ఘటనపై ఆరా తీసిన తాత్కాలిక అధ్యక్షుడు చోయ్‌ సంగ్‌ మోక్‌(Choi Sang Mok).. సహాయక చర్యలను ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఇదిలా ఉంటే.. దక్షిణ కొరియా కార్మిక శాఖ గణాంకాల ప్రకారం.. పని ప్రాంతంలో మరణాలు ఆ దేశంలో గణనీయంగా నమోదు అవుతున్నాయి. 2020-23 మధ్యకాలంలో ఏకంగా 8 వేల మంది కార్మికులు మరణించారక్కడ.

Sushmita Sen Open About Her her wedding plans when fans Ask Her10
'అలాంటి వ్యక్తి దొరకాలి.. కచ్చితంగా పెళ్లి చేసుకుంటా': సుస్మితా సేన్

బాలీవుడ్‌ నటి, మాజీ మిస్ యూనివర్స్ సుష్మితా సేన్‌(Sushmita Sen) గురించి పరిచయం అక్కర్లేదు. ఆమె చివరిసారిగా తాలీ వెబ్ సిరీస్‌లో కనిపించింది. గౌరీ సావంత్ జీవితం ఆధారంగా నిర్మించారు. అంతకుముందు ఆర్య వెబ్ సిరీస్‌తో అభిమానులను ‍అలరించింది ఈ 49 ఏళ్లు బాలీవుడ్ భామ. అయితే తాజాగా తన అభిమానులతో సోషల్ మీడియా వేదికగా మాట్లాడింది. ఈ సందర్భంగా ఆమెను పెళ్లి గురించి ప్రశ్నించగా దానిపై స్పందించింది. తాను కూడా పెళ్లి చేసుకునేందుకు ఆసక్తిగా ఉన్నానని తెలిపింది. అయితే సరైన భాగస్వామి దొరకాలి కదా? అని వెల్లడించింది.తన అభిమాని ప్రశ్నకు స్పందిస్తూ.. "నేను కూడా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా. నాకు సరైన వ్యక్తి దొరకాలి కదా. మనం అనుకున్న వెంటనే పెళ్లి జరిగదు కదా. ఎందుకంటే ఇది రెండు హృదయాలకు సంబంధించింది. అతనితో ప్రేమ, సంబంధం నా హృదయానికి నచ్చాలి. అప్పుడే నేను కూడా పెళ్లి చేసుకుంటా' అని తెలిపింది సుస్మితా సేన్. కాగా.. గతంలో నటుడు రోహ్మన్‌ షాల్‌తో ప్రేమాయణం కొనసాగించింది ముద్దుగుమ్మ. (ఇది చదవండి: మూడేళ్లుగా సింగిల్‌గానే.. నా కూతురు పెళ్లి చేసుకోనివ్వట్లేదు)దాదాపు మూడు సంవత్సరాలు డేటింగ్ తర్వాత 2021లో అతనితో బంధానికి గుడ్‌బై చెప్పేసింది. అంతకుముందు ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోదీతో రిలేషన్‌లో ఉన్నారని వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత 2022లో లలిత్ మోడీ సుష్మితా సేన్‌ను తన "బెటర్ హాఫ్"గా పరిచయం చేసి మరోసారి వార్తల్లో నిలిచారు. ఆ తర్వాత సుస్మితా సేన్ మాట్లాడుతూ అదంతా గతమని కొట్టిపారేసింది. కాగా.. సుష్మితా సేన్‌.. 2000వ సంవత్సరంలో రెనీ అనే అమ్మాయిని దత్తత తీసుకుంది. 2010లో అలీసాను దత్త తీసుకుని పెంచుకుంటోంది.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

NRI View all
title
Hong kong: హాంకాంగ్‌లో ఘనంగా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం

హాంకాంగ్ తెలుగు సమాఖ్య అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం 2025ని ఘనంగా జరుపుకుంది.

title
తానా ప్రపంచసాహిత్యవేదిక ఆధ్వర్యంలో “నా భాషే నా శ్వాస” సదస్సు విజయవంతం

డాలస్ :  ఉత్తరఅమెరికా తెలుగుసంఘం (తానా) సాహిత్యవిభాగం

title
డా. తాడేపల్లి లోకనాథశర్మ శాస్త్రీయ సంగీతంపై ప్రత్యేక భాషణం

శ్రీ సాంస్కృతిక కళాసారథి సంస్థ ఆధ్వర్యంలో సింగపూర్‌లో తెలుగువారి కోసం, గానకళానిధి కలైమామణి డాక్టర్ తాడేపల్లి లోకనాథశర్మ

title
Canada New Visa Rules : భారతీయ విద్యార్థులు, వర్కర్లకు పీడకల!

వలసదారుల విషయంలో  డొనాల్డ్‌ ట్రంప్‌ నేతృత్వంలోని అమెరికా కఠిన చర్యలు ఆ

title
ఎఫ్‌బీఐ డైరెక్టర్‌ కాశ్‌ పటేల్‌ లవ్‌స్టోరీ : అందంలోనే కాదు టాలెంట్‌లోనూ!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌  ట్రంప్‌ (Donald Trump) తన  మద్దతు ద

International View all
title
దూకుడు ఫలితం.. ట్రంప్‌ క్రేజ్‌కు బీటలు..?

వాషింగ్టన్‌: రెండోసారి అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత వరుస దూక

title
గవర్నర్‌ రేసు..వివేక్‌ రామస్వామికి ట్రంప్‌ మద్దతు

వాషింగ్టన్‌:భారత సంతతికి చెందిన బయోటెక్‌ బిలియనీర్‌ వివేక్‌ర

title
వీడియో: చూస్తుండగానే ఘోరం.. కుప్పకూలిన బ్రిడ్జి

దక్షిణ కొరియాలో ఘోరం జరిగింది. నిర్మాణంలో ఉన్న ఓ బ్రిడ్జి కుప్పకూలిపోగా.. ఇద్దరు అక్కడికక్కడే మరణించారు.

title
బంగ్లాదేశ్‌కు జైశంకర్‌ సీరియస్‌ వార్నింగ్‌

న్యూఢిల్లీ:బంగ్లాదేశ్‌కు భారత విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర

title
మొత్తం ఖైదీల పరస్పర బదిలీకి సిద్ధం

కీవ్‌: రష్యాతో యుద్ధాన్ని ముగించేందుకు, ఇరుదేశాల్లో ఉన్న మొత

Advertisement
Advertisement