Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Do You Know Who is Shivon Zilis And Interesting Details1
ప్రపంచ కుబేరుడితో నాల్గవ బిడ్డకు జన్మనిచ్చింది: ఎవరీ షివోన్ జిలిస్?

ప్రపంచ కుబేరుడు 'ఎలాన్ మస్క్' (Elon Musk) గురించి తెలిసిన చాలామందికి.. అతని నలుగురు పిల్లలకు తల్లి అయిన 'షివోన్ జిలిస్' (Shivon Zilis) గురించి బహుశా తెలిసుండకపోవచ్చు. ఇంతకీ ఈమె ఎవరు? ఈమె గురించి ఆసక్తికరమైన విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం.నిజానికి.. షివోన్ జిలిస్ భారతీయ మూలాలున్న మహిళ. ఎలా అంటే ఈమె తల్లి పంజాబీ ఇండియన్ శారద. అయితే శారద కెనడియన్ అయిన రిచర్డ్‌ని వివాహం చేసుకుంది. వీరిద్దరికి పుట్టిన సంతానమే షివోన్ జిలిస్. ఈమె 1986 ఫిబ్రవరి 8న కెనడాలోని అంటారియోలోని మార్ఖమ్‌లో జన్మించింది.షివోన్ జిలిస్ అమెరికాలోని ప్రతిష్టాత్మక యేల్ విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్రం, తత్వశాస్త్ర డిగ్రీలు పూర్తి చేశారు. ఐటీ దిగ్గజం ఐబీఎం కంపెనీలో తన కెరీర్‌ ప్రారంభించింది. యేల్ యూనివర్సిటిలో చదువుకునే సమయంలో ఐస్ హాకీ జట్టులో కీలక సభ్యురాలు. గోల్ కీపర్‌గా ఆల్ టైమ్ బెస్ట్. ఆమె గిటార్, డ్రమ్స్ కూడా ప్లే చేసేది.షివోన్ జిలిస్ కెనడియన్ ఏఐ నిపుణురాలు, వెంచర్ క్యాపిటలిస్ట్. ఆమె మస్క్ వ్యాపార సామ్రాజ్యంలో కీలక పాత్ర పోషిస్తుంది. అంతే కాకుండా ఏఐ అండ్ మెషిన్ లెర్నింగ్‌లో ప్రత్యేకత కలిగిన టెస్లా, ఓపెన్‌ఏఐ, న్యూరాలింక్ వంటి కంపెనీలలో పనిచేసినట్లు సమాచారం.షివోన్ జిలిస్ 2016లో ఓపెన్ఏఐ (OpenAI)లో బోర్డు సభ్యురాలిగా చేరింది. తరువాత 2017 నుంచి 2019 వరకు టెస్లాలో పనిచేసింది, అక్కడ ఆమె కంపెనీ ఆటోపైలట్ ప్రోగ్రామ్, సెమీకండక్టర్ వంటి విభాగాల్లో కీలక పాత్ర పోషించింది. ఆ సమయంలో మస్క్ బ్రెయిన్ చిప్ స్టార్టప్ న్యూరాలింక్‌లో ప్రధాన పాత్ర పోషించింది. అక్కడ ఆమె ఆపరేషన్స్, ప్రత్యేక ప్రాజెక్టుల డైరెక్టర్‌గా పనిచేస్తోంది.ఇదీ చదవండి: ఆ నగరం భారతదేశ బాహుబలి: ఆనంద్ మహీంద్రా2021లో షివోన్ జిలిస్ కవలలకు జన్మనించింది, 2024లో మూడవ బిడ్డను స్వాగతించింది. కాగా ఇటీవల నాల్గవ బిడ్డకు జన్మనిచ్చినట్లు, బిడ్డకు సెల్డాన్ లైకుర్గస్ (Seldon Lycurgus) అని పేరు పెట్టినట్లు వెల్లడించింది. మొత్తం మీద ఇప్పుడు ఎలాన్ మస్క్ 14 మంది పిల్లలకు తండ్రి అయ్యారు.

Ysrcp Leader Perni Nani Fires On Tdp And Yellow Media2
చంద్రబాబు తప్పుడు మాటలు.. ఈనాడు రోత రాతలు: పేర్ని నాని

సాక్షి, తాడేపల్లి: ఈనాడు రోత రాతలపై వైఎస్సార్‌సీపీ మండిపడింది. వైఎస్‌ జగన్‌ లక్ష్యంగా ఈనాడు విషపు రాతలు రాస్తోందని ఆ పార్టీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. వివేకా హత్య కేసులో నారాయణ సాక్షిగా ఉన్నారని ఈనాడు రోత రాతలు రాసింది. కేబినెట్‌లో చంద్రబాబు ఏదో మాట్లాడితే.. ఈనాడు తప్పుడు వార్తలు వండి వార్చింది. వివేకా వాచ్‌మెన్‌ రంగయ్య మృతిని కూడా వైఎస్‌ జగన్‌కు ఆపాదించే యత్నం చేసింది. హామీలు అమలు గురించి తప్పించుకునేందుకు చంద్రబాబు డైవర్షన్‌ పాలిటిక్స్‌’’ అంటూ పేర్ని నాని నిప్పులు చెరిగారు.‘‘డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. సంపద సృష్టిస్తానన్న చంద్రబాబు.. ఎన్నికలయ్యాక చేతులెత్తేశారు. రాజకీయ ప్రత్యర్థులపై తప్పుడు వార్తలు రాయించడం బాబుకు వెన్నతో పెట్టిన విద్య. ఎన్టీఆర్‌ పరపతిని కూడా ఈనాడును అడ్డంపెట్టకుని బాబు దెబ్బతీశాడు. గతంలో లక్ష్మీపార్వతిపై కూడా ఈనాడులో ఇలాగే తప్పుడు రాతలు రాయించారు. వైఎస్‌ జగన్‌ వ్యక్తిత్వాన్ని హననం చేయడానికి ఈనాడును చంద్రబాబు వాడుతున్నారు. వైఎస్‌ వివేకా హత్యతో వైఎస్‌ జగన్‌కు ఏం సంబంధం?. వ్యవస్థలను ప్రభావితం చేసి వైఎస్సార్‌సీపీ నేతలను బాబు ఇబ్బంది పెట్టాలని చూశారు’’ అని పేర్ని నాని ధ్వజమెత్తారు.‘‘వైఎస్‌ జగన్‌, వైఎస్‌ అవినాష్‌రెడ్డిలపై విషం చిమ్మడమే చంద్రబాబు లక్ష్యం. న్యాయ వ్యవస్థలను కూడా ప్రభావితం చేసేలా ఈనాడులో వార్తలురాస్తున్నారు. డైవర్షన్‌ పాలిటిక్స్‌లో భాగంగా రంగన్న మృతిని కేబినెట్‌లో చర్చించారు. నారాయణ యాదవ్‌ అనారోగ్యంతో మృతి చెందారు. గంగాధర్‌రెడ్డిది సహజ మరణమని పోస్టుమార్టం రిపోర్ట్‌ చెప్తుంది. గంగాధర్‌రెడ్డి మరణం అనుమానం అంటూ బాబు డైరెక్షన్‌లో ఈనాడు తప్పుడు రాతలు రాసింది. గన్‌మెన్లు ఉండగా రంగన్న మృతిపై చంద్రబాబుకు సందేహం ఏంటో అర్థం కావడం లేదు. చంద్రబాబు ఇచ్చిన గన్‌మెన్లు ఉండగా.. రంగన్న మృతి ఎలా అనుమానాస్పదం?’’ అంటూ పేర్ని నాని ప్రశ్నించారు.‘‘పరిటాల మృతి తర్వాత చంద్రబాబు సీఎం అయ్యారు. 2014- 2019 మధ్య పరిటాల సునీత కూడా మంత్రిగా ఉన్నారు. పరిటాల రవి హత్యపై ఎందుకు విచారణ చేయలేదు. వివేకా హత్య కేసులో నారాయణ సాక్షి కాదని రికార్డులు చెప్తూ ఉంటే.. నారాయణ సాక్షి అని ఈనాడు ఎలా రాస్తోంది?’’ పేర్ని నాని నిలదీశారు.‘‘వివేకా హత్య కేసులో ఈనాడు తప్పుడు వార్తలు రాసింది. సుగాలి ప్రీతి హత్య కేసు గురించి తీవ్రంగా పరిగణించరుగానీ రంగయ్య మృతిపై మాత్రం తీవ్రంగా స్పందిస్తారంట. జగన్ డ్రైవర్ నారాయణ యాదవ్ ఆ కేసులో సాక్షి అంటూ తప్పుడు కథనాలు రాశారు. జగన్ లక్ష్యంగా విషపు రాతలు రాసింది. చంద్రబాబువి.. తప్పుడు మాటలు, ఈనాడువి తప్పుడు రాతలు. కేబినెట్‌లో ప్రజలకు చేయాల్సిన మేలు గురించి చర్చించలేదు. ఎన్నికలలో ఓట్ల కోసం ప్రజలను మోసం చేస్తారు. అధికారంలోకి వచ్చాక తన తప్పుడు హామీల నుండి బయట పడటానికి డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారు. హామీలకు పంగనామాలు పెట్టారు...రాజకీయ ప్రత్యర్థులపై ఈనాడులో విషం కక్కించటం చంద్రబాబుకు అలవాటే. ఎన్టీఆర్ కు వెన్నుపోటు నుండి అనేక అంశాలలో ఇదే జరిగింది. లక్ష్మీ పార్వతి విషయంలో కూడా అప్పట్లో ఇలాగే రాయించారు. అవినాష్ కు సంబంధం లేకపోయినా కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. న్యాయవ్యవస్థను కూడా ప్రభావితం చేసేలాగ పెద్దపెద్ద అక్షరాలతో వార్తలు రాయిస్తున్నారు. నారాయణకు వివేకా కేసుకు ఎలాంటి సంబంధం లేదు. బ్రెయిన్ ట్యూమర్ తో నారాయణ చనిపోయారు. కల్లూరి గంగాధరరెడ్డిని 243వ సాక్షిగా ఉన్నాడు. దీర్ఘకాలంగా షుగర్ వ్యాధితో మృతి చెందారు. ఆయనది సహజ మరణం అని పోస్టుమార్టం రిపోర్టు కూడా ఉంది. శ్రీనివాసరెడ్డి 2018 సెప్టెంబరు లో ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వేధింపుల కారణంగానే సూసైడ్ చేసుకున్నట్టు సూసైడ్ నోట్ రాశారు..వైఎస్ అభిషేక్‌రెడ్డి తీవ్ర అనారోగ్యంతో మృతి చెందారు. జగన్, సునీతమ్మ ఇద్దరికీ అభిషేక్ బంధువే. మల్టీ ఆర్గన్స్ డేమేజ్ వలన అభిషేక్ మృతి చెందిన సంగతి అందరికీ తెలిసినా ఈనాడు విషపు రాతలు రాసింది. వాచ్‌మెన్ రంగన్నకు పోస్టుమార్టం అయ్యాక ఖననం చేశారు. రంగన్న గురించి కేబినెట్‌లో చర్చించారు. డీజీపీతో పాటు కడప నుండి పోలీసు అధికారులు వచ్చి ప్రభుత్వ పెద్దల సందేశం తీసుకుని వెళ్లారు. రంగన్నకు 2+2 గన్ మెన్‌లతో జగన్ ప్రభుత్వం భద్రత కల్పించారు. చంద్రబాబు వచ్చాక 1+1 భద్రతకు తగ్గించారు. చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన గన్‌మెన్ ఉండగా ఎలా అనుమానాస్పదంగా రంగన్న మృతి చెందారు?. ఖననం చేసిన రంగన్న మృతదేహాన్ని మళ్ళీ బయటకు తీసి రీపోస్టుమార్టం చేస్తున్నారు. ఆ నివేదికలు రాకముందే ఈనాడులో తప్పుడు కథనాలు ఎలా రాశారు?..పరిటాల రవి హత్యలో సాక్షుల మృతిపై చంద్రబాబు ఎందుకు విచారణ జరపలేదు?. ఎప్పుడో చనిపోయిన నారాయణ యాదవ్ మృతితో సహా అందరిపై విచారణ చేస్తారట, ఎవరిని ఇరికించటానికి విచారణల పేరుతో వ్యవస్థలను నాశనం చేస్తారు?. ఎన్నికల హామీలను డైవర్షన్ చేయటానికి ఇలాంటి తప్పుడు వార్తలు, తప్పుడు విచారణలు చేయిస్తున్నారు. రంగన్న ఇచ్చిన 164 స్టేట్‌మెంటులో అవినాష్‌ రెడ్డి పేరు లేదు. అసలు ఏ సాక్షి కూడా అవినాష్ పేరు చెప్పలేదు. ఇలాంటి తప్పుడు కథనాలు రాసే విష సంస్కృతి మానుకోవాలి’’ అని పేర్ని నాని హితవు పలికారు.

Grand Father Of MP Man Dies After Grandson Died3
మనవడి చితిలోనే తాత మరణ శాసనం..

భోపాల్: ఇదొక కల్లోలం.. ముగ్గురి జీవితాలపై విధి ఆడిన వింత నాటకం. సాఫీగా సాగుతున్న జీవితంలో ఒక్క ఉదుటను దూకిన ‘మృత్యుఘోష’. ఈ ఘటనలో ఒకరు హత్యకు గురైతే, మరొకరు ఆత్మహత్య చేసుకున్నారు. ఇంకొకరు ఆత్మాహుతి చేసుకున్నారు. మధ్యప్రదేశ్ లో జరిగిన ఈ విషాద ఘటన తలుచుకుంటేనే ఒళ్లు గగుర్పాటుకు గురౌవుతుంది.రాష్ట్రంలోని బాహ్రి పోలీస్ స్టేషన్ పరిధిలో సిహోలియా గ్రామంలో ఈ దారుణం చోటు చేసుకుంది. ముందుగా భార్యను చంపిన భర్త ఆపై ఆత్మహత్య చేసుకున్నాడు. మెడకు ఉరితాడు బిగించుకుని తాను కూడా ప్రాణాలు విడిచాడు. ఆ తర్వాత మనవడి మరణాన్ని జీర్ణించుకోలేని తాత.. అదే చితిమంటల్లో దూకి ఆత్మార్పణం చేసుకున్నాడు.అభయ్ రాజ్ అనే 34 ఏళ్ల వ్యక్తి.. భార్య సవితా యాదవ్(31)ను హత్య చేశాడు. ఇక తనులేని జీవితం వద్దనుకున్నాడో, లేక జైలు పాలు కావాల్సి వస్తుందని భయపడ్డాడో కానీ ఉరి వేసుకుని అతను కూడా తనువు చాలించాడు. ఇది శుక్రవారం ఉదయం జరగ్గా, అదే రోజు సాయంత్ర వారి అంత్యక్రియలు నిర్వహించారు. అయితే మనవడిఅభయ్ రాజ్) లేని జీవితం వద్దనుకున్న తాత రామావతార్‌.. తాను కూడా ఆ మనవడి అంత్యక్రియలు నిర్వహించిన చితి మంటల్లోనే దూకి ప్రాణం తీసుకున్నాడు. అయితే శనివారం ఉదయమే ఈ వార్త తెలుసుకున్న పోలీసులు.. అక్కడకు చేరుకుని కాలిన మృతదేహాన్ని బయటకు తీశారు. అయితే ఒక హత్య, రెండు ఆత్మహత్యల వెనుక కారణాలు ఏమిటో తెలియలేదని సిధి జిల్లా డీఎస్పీ గాయత్రి తివారీ తెలిపారు. దీనిపై దర్యాప్తు సాగిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.

Russian Missile Strike On Ukraine4
ఉక్రెయిన్‌పై రష్యా మరోసారి భీకర దాడి.. 14 మంది మృతి

రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం ముగింపు దిశగా ప్రయత్నాలు జరుగుతోన్న క్రమంలో కూడా రష్యా భీకర దాడులు కొనసాగుతూనే ఉంది. తాజాగా, ఉక్రెయిన్‌పై మరోసారి క్షిపణులతో విరుచుకుపడింది. డోబ్రాపిలియా ప్రాంతంపై జరిగిన మిస్సైల్‌ దాడిలో 14 మంది మృతి చెందారు. ఉక్రెయిన్ తూర్పు నగరం డోబ్రాపిలియా, ఖార్కివ్ ప్రాంతంలోని ఒక స్థావరంపై రాత్రిపూట రష్యా క్షిపణి, డ్రోన్ దాడులు జరిపింది. ఈ దాడుల్లో ఐదుగురు పిల్లలు సహా 37 మంది గాయపడ్డారని ఉక్రెయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ శనివారం తెలిపింది.కాగా, రెండు రోజుల క్రితం జెలెన్‌స్కీ సొంత పట్టణంలోని కూడా క్షిపణి దాడి జరిగిన సంగతి తెలిసిందే. రాత్రి సమయంలో క్రీవి రీహ్‌లోని ఓ హోటల్‌పై రష్యా క్షిపణిదాడిలో నలుగురు మృతి చెందారు. ఆ హోటల్‌లో తమ దేశ పౌరులతో పాటు అమెరికా, బ్రిటన్ జాతీయులు ఉన్నారని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు తెలిపారు. ఈ ఘటనలో సుమారు 30 మంది గాయపడ్డారు. 112 షాహెడ్‌, డెకాయ్‌ డ్రోన్లను, రెండు బాలిస్టిక్‌ ఇస్కందర్‌ మిస్సైల్స్‌ను ప్రయోగించినట్టు ఉక్రెయిన్‌ వైమానికదళం ప్రకటించింది.యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఉక్రెయిన్‌కు అమెరికా మద్దతుగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే, ట్రంప్ అధ్యక్ష బాధ్యతలను స్వీకరించిన తర్వాత ఆ దేశం పట్ల ఆయన కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఉక్రెయిన్‌కు మిలిటరీ, ఇంటెలిజెన్స్ సాయాన్ని కూడా అమెరికా నిలిపేసింది. మరో వైపు, ఉక్రెయిన్‌ భద్రత కోసం రష్యాను బెదిరించేందుకు అవసరమైతే తన అణ్వాయుధాలను నిరోధంగా వాడేందుకు సిద్ధమంటూ ఫ్రాన్స్‌ వివాదాస్పద ప్రతిపాదన చేసిన సంగతి విదితీమే.గత గురువారం బెల్జియం రాజధాని బ్రసెల్స్‌లో యూరోపియన్‌ యూనియన్‌ దేశాల తాజా శిఖరాగ్ర సమావేశం ఇందుకు వేదికైంది. రష్యా బారినుంచి యూరప్‌కు రక్షణ కల్పించేందుకు ఫ్రాన్స్‌ అణుపాటవాన్ని ఆయుధంగా ఉపయోగించేందుకు సిద్ధమని అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మాక్రాన్‌ ఈ సందర్భంగా ప్రకటించారు. సభ్య దేశాల నుంచి ఇందుకు భారీ స్పందన లభించింది.

LPU 2025 Btech Final Year Student Bags Rs 1.03 Cr Placement Package5
ప్లేస్‌మెంట్‌లో ఒక్కడికే ఏకంగా ఏడు ఆఫ‍ర్లు!!.. కోటి రూపాయల ప్యాకేజీతో కుర్రాడికి జాబ్‌

లవ్లీ ప్రొఫెషనల్‌ యూనివర్శిటీ (ఎల్‌పీయూ)కు ఈ ఏడాది చాలా ఉత్సాహంతో మొదలైంది. ఫైనల్‌ ఇయర్‌ బీటెక్‌ విద్యార్థి రూ.1.03 కోట్ల (1,18,000 డాలర్లు)తో ఉద్యోగావకాశం పొందారు. రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్‌లో B.Tech చేస్తున్న బేతిరెడ్డి నాగవంశీరెడ్డి 2025 మేలో తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేయనున్నారు. ప్రముఖ ఏఐ రోబోటిక్స్ సంస్థలో రోబోటిక్స్ ఇంజినీర్‌గా చేరనున్నారు. ఈ అసాధారణ విజయం అటు పరిశ్రమ వర్గాల్లోనూ ఇటు విద్యా ప్రపంచంలోనూ సంచలనం సృష్టించింది. విద్యార్థులకు సూపర్‌ డూపర్‌ ప్యాకేజీలు అందించగల అత్యున్నత విద్యా సంస్థగా ఎల్‌పీయూ తనస్థానాన్ని సుస్థిరం చేసుకుంది.వేర్వేరు బీటెక్‌ విభాగాల్లోని మొత్తం 7361 మంది విద్యార్థులకు పాలో ఆల్టో నెట్‌వర్క్స్, నుటానిక్స్‌, మైక్రోసాఫ్ట్‌, సిస్కో, పేపాల్‌ అమెజాన్‌ వంటి ప్రతిష్టాత్మక మల్టీనేషనల్‌ కంపెనీల నుంచి ప్లేస్‌మెంట్లు లభించాయి. వీరిలో 1700 మంది టాప్‌ ఎమ్మెన్సీల నుంచి ఏడాదికి రూ.10 లక్షల నుంచి రూ.కోటి వరకూ ప్యాకేజీలు అందాయి. టాప్‌ ఎంఎన్‌సీలు ఇచ్చిన సగటు ప్యాకేజీ రూ.16 లక్షలు (ఏడాదికి). ఉద్యోగ మార్కెట్‌లో ఎల్‌పీయూకు ఉన్న అధిక డిమాండ్‌కు నిదర్శనాలు ఈ ప్లేస్‌మెంట్లు.గత ప్లేస్‌మెంట్‌ సీజన్‌ కూడా ఆకట్టుకునేదే. ఇండస్ట్రీలోనే అతిపెద్ద కంఎనీలు ఆకర్షణీయమైన ప్యాకేజీలు అందించాయి. పాలో ఆల్టో నెట్‌వర్క్స్ ఏకంగా ఏడాదికి రూ.54.75 లక్షల ప్యాకేజీని అందించగా నుటానిక్స్‌ రూ.53 లక్షల ప్యాకేజీ ఇచ్చింది. మైక్రోసాఫ్ట్‌ రూ.52.20 LPA ప్యాకేజీ అందించింది. మొత్తం 1912మందికి ఒకటి కంటే ఎక్కువ ఆఫర్లు అందాయి. 377 మందికి మూడు ఆఫర్లు, 97 మందికి నాలుగు ఆఫర్లు, 18 మందికి ఐదు, ఏడుగురికి ఆరు ఆఫర్లు లభించాయి. ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌ ఇంజినీరింగ్‌ విద్యార్థి ఆదిరెడ్డి వాసుకు నమ్మశక్యం కాని రీతిలో ఏకంగా ఏడు ఆఫర్లు వచ్చాయి. ఇదో అరుదైన, ఆకట్టుకునే రికార్డు.పైన చెప్పుకున్న కంపెనీలు మాత్రమే కాకుండా.. అమెజాన్‌ (రూ.48.64 LPA), ఇన్‌ట్యూట్‌ లిమిటెడ్‌ (రూ. 44.92 LPA), సర్వీస్‌ నౌ ( రూ. 42.86 LPA), సిస్కో (రూ. 40.13 LPA), పేపాల్‌ (రూ. 34.4 LPA), APNA (రూ.34 LPA), కామ్‌వాల్ట్‌ (రూ. 33.42 LPA), స్కేలర్‌ (రూ. 32.50 LPA)లు కూడా స్కిల్‌ డెవెలప్‌మెంట్‌, అత్యాధునిక టెక్నాలజీల్లో నైపుణ్యం అందించేందుకు ఎల్‌పీయూ చూపుతున్న శ్రద్ధకు నిదర్శనంగా నిలుస్తున్నాయి.ఎల్పీయూ పట్టభద్రుల సాంకేతిక పరిజ్ఞాన బుద్ధికుశలత కారణంగా భారీ నియామకాలు చేపట్టే ఆక్సెంచర్‌, క్యాప్‌జెమినీ, టీసీఎస్‌ తదితర ప్రముఖ కంపెనీల నుంచి మంచి డిమాండ్‌ ఉంది. క్యాప్‌జెమినీ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ 736 మంది విద్యార్థులకు అనలిస్ట్‌, సీనియర్‌ అనలిస్ట్‌ రోల్స్‌ కోసం ఉద్యగావకాశం ఇచ్చింది. అలాగే మైండ్‌ట్రీ 467 మంది విద్యార్థులను గ్రాడ్యుయేట్‌ ఇంజినీర్‌ ట్రైనీ పొజిషన్‌ కోసం తీసుకుంది. కాగ్నిజెంట్‌ టెక్నాలజీ సొల్యూషన్స్‌ కూడా 418 మంది విద్యార్థులను జెన్‌సీ రోల్స్‌ కోసం తీసుకుంది. ఎల్‌పీయూ నుంచి విద్యార్థులను ఎంపిక చేసుకున్న ఇతర కంపెనీల్లో ఆక్సెంచర్‌ (279 మంది), టీసీఎస్‌ (260 మంది), కేపీఐటీ టెక్నాలజీస్‌ (229 మంది), డీఎక్స్‌సీ టెక్నాలజీ (203), MPHASIS (94 మంది) కంపెనీలు ఉన్నాయి.రొబోటిక్స్‌, ఆటోమేషన్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌, మెకానికల్‌ ఇంజినీరింగ్‌ వంటి కోర్‌ ఇంజినీరింగ్‌ విభాగాల్లో అత్యధిక స్థాయిలో ప్లేస్‌మెంట్లు లభించాయి. పాలో ఆల్టో నెట్‌వర్క్స్‌, సిలికాన్‌ ల్యాబ్స్‌, ట్రైడెంట్‌గ్రూప్‌, నుటానిక్స్‌, ఆటోడెస్క్‌, అమెజాన్‌ వంటి దిగ్గజ కంపెనీలు ఈ విభాగాల్లోని విద్యార్థులను భారీగా నియమించుకుంటున్నాయి.‘‘ఎప్పటికప్పుడు మారిపోతున్న ప్రపంచానికి అనుగుణంగా విద్యార్థులు విజయం సాధించేలా చేసేందుకు ఎల్‌పీయూ కట్టుబడి ఉంది. ఎల్‌పీయూలో బోధించే అంశాలు కంపెనీల అవసరాలకు తగ్గట్టుగా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఎల్‌పీయూలో సంప్రదాయ పద్ధతులకు అతీతంగా సృజనాత్మక రీతిలో సాగే బోధన విద్యార్థులునిమగ్నమైయెలా ఉంటుంది. విద్యార్థులు పెద్ద సంఖ్యలో టాప్‌ కంపెనీల నుంచి ప్లేస్‌మెంట్‌ ఆఫర్లు పొందుతూండటం దీనికి నిదర్శనం. ఎల్‌పీయూ బోధనాంశాల సత్తానుచాటుతున్నాయి ఈ ప్లేస్‌మెంట్లు. జాతీయ, అంతర్జాతీయ ప్రముఖ సంస్థల్లో విద్యార్థులకు మంచి మంచి ప్లేస్‌మెంట్స్‌ సాధించిన రికార్డు ఎల్‌పీయూ సొంతం. అమెరికా, యూకే, ఆస్ట్రేలియాలల్లోని ఎన్నో పేరొందిన కంపెనీల్లో ఎల్‌పీయూ విద్యార్థులు ఏడాదికి రూ.కోటి కంటే ఎక్కువ ప్యాకేజీలతో పని చేస్తున్నారు. అత్యున్నత నైపుణ్యం కలిగిన ప్రొఫెషనల్స్‌ను తయారు చేయగల ఎల్‌పీయూ శక్తి సామర్థ్యాలకు, అంతర్జాతీయ స్థాయి ఎదుగుదలకు ఇవి నిదర్శనాలు.’’ అని రాజ్యసభ సభ్యులు, ఎల్‌పీయూ ఫౌండర్‌ ఛాన్సలర్‌ డాక్టర్‌ అశోక్‌ కుమార్‌ మిట్టల్‌ వివరించారు.2025 బ్యాచ్‌ కోసం దరఖాస్తు చేసుకునేందుకు చివరితేదీ దగ్గరపడింది. ఎల్‌పీయూలో అడ్మిషన్లకు పోటీ ఎక్కువ. యూనివర్శిటీలో అడ్మిషన్‌ కోసం విద్యార్థులు ప్రవేశ పరీక్ష రాయాల్సి ఉంటుంది. అలాగే ‘ఎల్‌పీయూ నెస్ట్‌ 2025’, ఇంటర్వ్యూలలోనూ పాసైన వారికి మాత్రమే కొన్ని ప్రత్యేక కార్యక్రమాల్లోకి ప్రవేశం లభిస్తుంది. పరీక్ష, అడ్మిషన్‌ ప్రాసెస్‌ గురించి తెలుసుకోవాలనుకునే ఆసక్తిగల విద్యార్థులు https://bit.ly/43340ai ను సందర్శించగలరు.

CORBIN BOSCH REPLACES LIZAAD WILLIAMS IN MUMBAI INDIANS FOR IPL 20256
IPL 2025: ముంబై ఇండియన్స్‌తో జతకట్టిన సౌతాఫ్రికా ఆల్‌రౌండర్‌

సౌతాఫ్రికా ఫాస్ట్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ కార్బిన్‌ బాష్‌ ఫైవ్‌ టైమ్‌ ఐపీఎల్‌ ఛాంపియన్‌ ముంబై ఇండియన్స్‌తో జతకట్టాడు. సహచరుడు లిజాడ్‌ విలియమ్స్‌ గాయం కారణంగా తదుపరి సీజన్‌కు దూరం కావడంతో అతని స్థానాన్ని బాష్‌ భర్తీ చేస్తున్నాడు. 30 ఏళ్ల బాష్‌ను ముంబై ఇండియన్స్‌ తమ హ్యామిలీలోకి ఆహ్వానించింది. రైట్‌ హ్యాండ్‌ బ్యాట్‌, రైట్‌ ఆర్మ్‌ ఫాస్ట్‌ బౌలింగ్‌ వేసే బాష్‌ సౌతాఫ్రికా తరఫున ఓ టెస్ట్‌, 2 వన్డేలు ఆడాడు. బాష్‌ గతేడాది డిసెంబర్‌లో టెస్ట్‌ల్లో అరంగేట్రం చేశాడు.బాష్‌ తన తొలి టెస్ట్‌ మ్యాచ్‌లోనే ఇరగదీశాడు. పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో బాష్‌ తొలి ఇన్నింగ్స్‌లో అజేయమైన 81 పరుగులు చేయడంతో పాటు బౌలింగ్‌లో 4 వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌లో బాష్‌ అద్భుత ఆల్‌రౌండ్‌ ప్రదర్శన కారణంగా సౌతాఫ్రికా పాకిస్తాన్‌ను 2 వికెట్ల తేడాతో చిత్తు చేసింది.ఈ మ్యాచ్‌కు ముందు బాష్‌ అదే పాకిస్తాన్‌పైనే వన్డే అరంగేట్రం చేశాడు. బాష్‌ ఇప్పటివరకు 2 వన్డేలు ఆడి 2 వికెట్లు సహా 55 పరుగులు చేశాడు. అరంగేట్రం ఇన్నింగ్స్‌లో బాష్‌ 44 బంతుల్లో 40 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇదే అతనికి వన్డేల్లో అత్యధిక స్కోర్‌. బాష్‌ తన రెండో వన్డేను కూడా పాక్‌తోనే ఆడాడు. ఛాంపియన్స్‌ ట్రోఫీకి ముందు జరిగిన ట్రై సిరీస్‌లో బాష్‌ పాకిస్తాన్‌ మ్యాచ్‌లో ఆడాడు.అంతర్జాతీయ అరంగేట్రం అనంతరం బాష్‌ సౌతాఫ్రికా టీ20 లీగ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ ఏడాది బాష్‌ ఎంఐ కేప్‌టౌన్‌ తరఫున బరిలో నిలిచాడు. ఈ సీజన్‌లో బాష్‌ 8 మ్యాచ్‌ల్లో 11 వికెట్లు తీసి ఎంఐ కేప్‌టౌన్‌ తమ తొలి టైటిల్‌ సాధించడంలో కీలకపాత్ర పోషించాడు.బాష్‌ సౌతాఫ్రికా 2014 అండర్‌-19 వరల్డ్‌కప్‌ గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. నాడు పాకిస్తాన్‌తో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో చెలరేగి ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా నిలిచాడు. ఆ మ్యాచ్‌లో బాష్‌ 4 వికెట్లు తీశాడు. బాష్‌ తన కెరీర్‌లో వివిధ ఫార్మాట్లలో ఇప్పటివరకు 2500కు పైగా పరుగులు చేసి 150కిపైగా వికెట్లు తీశాడు. బాష్‌ టీ20ల్లో 86 మ్యాచ్‌లు ఆడి 59 వికెట్లు తీశాడు. బాష్‌ చేరికతో ముంబై ఇండియన్స్‌లో ఆల్‌రౌండర్ల సంఖ్య 9కి చేరింది. ఇప్పటికే ఆ జట్టులో కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా, బెవాన్‌ జాకబ్స్‌, మిచెల్‌ సాంట్నర్‌, విల్‌ జాక్స్‌, అర్జున్‌ టెండూల్కర్‌ తదితర ఆల్‌రౌండర్లు ఉన్నారు. త్వరలో ప్రారంభంకానున్న ఐపీఎల్‌-2025 ఎడిషన్‌లో ముంబై తమ తొలి మ్యాచ్‌ను మార్చి 23న ఆడుతుంది. చెన్నైలో జరిగే ఆ మ్యాచ్‌లో ముంబై సీఎస్‌కేను ఢీకొంటుంది.ఐపీఎల్‌-2025లో ముంబై ఇండియన్స్‌..రోహిత్‌ శర్మ, తిలక్‌ వర్మ, సూర్యకుమార​ యాదవ్‌, నమన్‌ ధిర్‌, బెవాన్‌ జాకబ్స్‌, రాజ్‌ బవా, విల్‌ జాక్స్‌, హార్దిక్‌ పాండ్యా (కెప్టెన్‌), విజ్ఞేశ్‌ పుథుర్‌, సత్యనారాయణ రాజు, కార్బిన్‌ బాష్‌, మిచెల్‌ సాంట్నర్‌, అర్జున్‌ టెండూల్కర్‌, ర్యాన్‌ రికెల్టన్‌, కృష్ణణ్‌ శ్రీజిత్‌, రాబిన్‌ మింజ్‌, జస్ప్రీత్‌ బుమ్రా, అశ్వనీ కుమార్‌, కర్ణ్‌ శర్మ, ట్రెంట్‌ బౌల్ట్‌, దీపక్‌ చాహర్‌, ముజీబ్‌ ఉర్‌ రెహ్మాన్‌

Not like a fridge Air chief on US F 35 jets7
‘అది ఫ్రిజ్, వాషింగ్ మెషీన్ కాదు.. యుద్ధ విమానం’

న్యూఢిల్లీ: ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎఫ్-35 ఫైటర్ జెట్ విమానాలను భారత్ కు అమ్మడానికి హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో అధునాతన ఐదో తరం ఎఫ్ 35 జెట్ విమానాలను భారత్ కు విక్రయించడానికి ట్రంప్ హామీ ఇచ్చారు. అయితే ఈ ఒక్కో ఫైటర్ జెట్ విమానం విలువ 80 మిలియన్ డాలర్లు( సుమారు రూ. 680 కోట్లు) ఉంటుంది. ఇలా వెళ్లి అలా తెచ్చుకునే వస్తువు కాదు..అయితే దీనిపై భారత ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఏపీ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇండియా టుడే కాంక్లేవ్ లో ఏపీ సింగ్ మాట్లాడుతూ.. ఈ జెట్ ఫైటర్స్ ను పూర్తిగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందన్నారు. అది ఏమీ మార్కెట్ కు ఇలా వెళ్లి అలా తెచ్చుకునే వాషింగ్ మిషీన్, ఫ్రిడ్జ్ లాంటి కాదని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం భారత్ కు అధునాతన యుద్ధ విమానాల ఆవశక్యత ఉందంటూనే, మనం వాటిని కొనుగోలు చేసే క్రమంలో టెక్నాలజీని అన్ని విధాలు పరిక్షీంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇక్కడ ఒక జెట్ ఫైటర్ ను కొనుగోలు చేస్తున్నామంటే దాని సామర్థ్యంతో పాటు దాని ఖరీదును కూడా బేరీజు వేసుకోవాలన్నారు. ఆ జుట్‌ ఫైటర్స్‌ ను కొనుగోలు చేయడానికి ఇంకా తమకే అమెరికా నుంచి ఆపర్‌ ఏమీ రాలేదని, వచ్చినప్పుడు దానిపై సమ గ్రంగా పరిశీలన చేసిన నిర్ణయం తీసుకుంటామన్నారుమన దేశం నుంచి 2035లోనే..ప్రస్తుతం చైనా ఆరో జనరేషన్ యుద్ధ విమానాలను వాడటానికి సిద్ధమైన క్రమంలో మనం ఇంకా ఐదో జనరేషన్ ప్రోగ్రామ్ లో ఉన్నామన్నారు. మన దేశ ఐదవ తరం ఫైటర్ జెట్ ప్రోగ్రామ్‍ లో భాగంగా అడ్వాన్స్‌డ్‌ ఇండియా కాంబేట్ ఎయిర్ క్రాప్ట్(ఏఎంసీఏ) ఇంకా అభివృద్ధి దశలోనే ఉందని, మన దేశం నుంచి అధునాతన యుద్ధ విమానం 2035లో అందుబాటులోకి రావచ్చని పేర్కొన్నారు. అప్పటివరకూ యుద్ధ విమానాలను బయట నుంచే తెచ్చుకోక తప్పదన్నారు. ప్రస్తుత తరుణంలో చైనా ఆరో తరం ఫైటర్ జెట్ ల వాడకానికి సిద్ధం కాగా, పాకిస్తాన్ ఎఫ్ 16 ఫైటర్ జెట్ ల కోసం అమెరికా నుంచి నిధులు సమకూరుస్తున్న తరుణంలో అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకోవాల్సి న అవసరం ఉందని ఏపీ సింగ్ తేల్చి చెప్పారు. ఎఫ్‌-35.. అంతు ‘చిక్కదు’

Chiranjeevi Sisters Vijaya Durga, Madhavi about Anjanamma8
కష్టాల్లో ఉన్నప్పుడు అమ్మ ఇంటికి రావొద్దంది: చిరంజీవి సోదరి

పిల్లలు ఇబ్బందుల్లో ఉంటే ఆ తల్లి అల్లాడిపోతుంది. అదే సమయంలో ఆ ఇబ్బందులను ఎలా ఎదుర్కోవాలో కూడా నేర్పుతుంది. చిరంజీవి తల్లి అంజనమ్మ తన కూతుర్లకు విలువైన సలహాలు ఇచ్చి వారిని బలంగా నిలబెట్టింది. ఏ కష్టం వచ్చినా సరే ఎవరి మీదా ఆధారపడకూడని, ఆధారపడితే నీ ఆత్మగౌరవాన్ని కోల్పోయినట్లేనని చెప్పేదట. మహిళా దినోత్సవం సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi Konidela), నాగబాబు, అంజనమ్మ, మెగా సిస్టర్స్ విజయ దుర్గా, మాధవి ముచ్చట్లు పెట్టారు. ఈ సందర్భంగా ఎన్నో విషయాల్ని పంచుకున్నారు.కష్టాల్లో ఉన్నా ఒంటరిగా పోరాడాలందివిజయదుర్గ (Vijaya Durga) మాట్లాడుతూ .. ‘మా అమ్మ ఎప్పుడూ కూడా మమ్మల్ని స్వతంత్ర భావాలతోనే పెంచారు. ఎప్పుడూ ఎవరి మీదా ఆధారపడకూడదు. నీ కాళ్ల మీద నువ్వు నిలబడాలి.. సొంతంగా ఎదగాలి.. సొంతంగా నిలబడాలి అని చెబుతూ ఉండేవారు. నేను కష్టాల్లో ఉన్నప్పుడు కూడా నువ్వు ఒక్కదానివే పోరాడాలి. ఎవరి దగ్గరా ఉండకూడదు, మా దగ్గర కూడా ఉండొద్దు. నీ ఇద్దరు పిల్లలతో నువ్వే ఉండు అని చెప్పారు. ఎవరి దగ్గరైనా ఉంటే నీ గౌరవం తగ్గిపోతుందనేవారు.అమ్మ ఇచ్చిన ధైర్యం వల్లే..ఇప్పటికీ నాకు మా అమ్మ చెప్పిన మాటలు గుర్తుకు వస్తాయి. ఆ మాటలు నాకు ఎంతో ధైర్యాన్ని ఇస్తాయి. అందుకే నాకు ఎన్ని సమస్యలు వచ్చినా ఒంటరిగా పోరాడేందుకు ప్రయత్నిస్తాను. ఈ ధైర్యాన్ని నాకు మా అమ్మే ఇచ్చారు’ అని అన్నారు. మాధవి (Madhavi) మాట్లాడుతూ.. ‘నేను మానసిక ఒత్తిడిలో ఉన్నప్పుడు మా అమ్మ నాకు అండగా నిలబడింది. కొన్ని సందర్భాల్లో నేను ఒంటరిని అయిపోయానే అని బాధపడుతూ ఉన్నాను. ఆ టైంలో మా అమ్మ నా వద్దకు వచ్చి ఎంతో ధైర్యాన్ని ఇచ్చారు. ఎవ్వరు ఏమన్నా.. ఏం జరిగినా.. ఈ అమ్మ నీ వెంటే ఉంటుంది.. నీకు సపోర్ట్‌గా నిలుస్తుంది అని చేయి పట్టుకుని ధైర్యాన్ని ఇచ్చారు’ అని అన్నారు.శ్రీజ విషయంలో ఆమె వల్లే..చిరంజీవి మాట్లాడుతూ.. నా కూతురు శ్రీజ (వైవాహిక) జీవితంలో కొన్ని సమస్యలు వచ్చాయి. అప్పుడు శ్రీజ (Sreeja Konidela) ఏమందంటే.. నేను నానమ్మ దగ్గరకు వెళ్లాను. తనిచ్చిన భరోసాతో నాలో ఎక్కడలేని ఎనర్జీ వచ్చింది. నానమ్మతో ఎప్పుడు కూర్చున్నా పాజిటివ్‌ ఫీలింగ్‌ వస్తుంది అని నాతో షేర్‌ చేసుకుంది. అప్పుడు నేను శ్రీజతో ఒకటే చెప్పా.. ఏం పర్లేదమ్మా.. జీవితమంటే ఒక్కరితోనే అయిపోదు. ఆ ఒక్కరు మనల్ని నియంత్రించలేరు. నీ గురించి నువ్వు ఆలోచించుకో.. నీ మనసులో ఏదనిపిస్తే అది చేయు అని సూచించాను అని పేర్కొన్నారు. కాగా శ్రీజ.. రెండుసార్లు పెళ్లి చేసుకోగా రెండుసార్లూ విడాకులిచ్చింది.చదవండి: కట్నంగా 40 గోల్డ్‌ బ్యాంగిల్స్‌ దానం.. నాకు 3 కిలోల బంగారం..: సింగర్‌ కల్పననా సోదరి మరణం.. ఇప్పటికీ మరిచిపోలేను: చిరంజీవి

Vijayawada Court Remands Posani Krishna Murali Till March 209
నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారో తెలియడం లేదు: పోసాని

సాక్షి, విజయవాడ: పోసాని కృష్ణమురళీపై కూటమి ప్రభుత్వం కక్షసాధింపును కొనసాగిస్తూనే ఉంది. వరుస కేసుల్లో అరెస్ట్ చేస్తూ స్టేషన్ల చుట్టూ పోలీసులు తిప్పుతున్నారు. ఇవాళ విజయవాడ చీఫ్ మెట్రోపాలిటిన్ మెజిస్ట్రేట్ కోర్టులో పోసానిని పోలీసులు హాజరుపరిచారు. ఈ నెల 20 వరకు కోర్టు రిమాండ్‌ విధించింది. తనకు ఆనారోగ్య సమస్యలున్నాయని న్యాయమూర్తికి పోసాని చెప్పారు. గుండె ఆపరేషన్ అయ్యిందని.. పక్షవాతం కూడా వచ్చిందని ఆయన తెలిపారు. ‘‘నాపై అక్రమ కేసులు పెట్టారు. నన్ను ఎక్కడికి తీసుకెళుతున్నారో కూడా తెలియడం లేదు’’ అంటూ పోసాని ఆవేదన వ్యక్తం చేశారు.పోలీసు వాహనంలో గంటల తరబడి కూర్చోలేకపోతున్నానని.. తనను ఒకే జైలులో ఉంచేలా ఆదేశాలివ్వాలని పోసాని కోరగా, పిటి వారెంట్‌పై వచ్చినందున తాను ఎలాంటి ఆదేశాలివ్వలేనని న్యాయమూర్తి తెలిపారు. పోసాని కృష్ణమురళికి ఈనెల 20 వరకూ న్యాయమూర్తి రిమాండ్ విధించారు. పోసానిని కర్నూలు జైలుకి తరలించారు.కాగా, అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసులో పోసానికి బెయిల్ మంజూరు చేస్తూ కడప మొబైల్ కోర్టు శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చింది. పోసానికి బెయిలు ఇవ్వకూడదని పోలీసుల తరపు న్యాయవాదులు వాదనలు వినిపించినప్పటికీ.. కోర్టు పోసాని తరఫు న్యాయవాదుల వాదనలతో ఏకీభవిస్తూ... బెయిల్ మంజూరు చేసింది. పోసాని కస్టడీ పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. ఈ కేసులోనే పోసాని ఫిబ్రవరి 26వ తేదీన అరెస్టయ్యారు.

Singer Swarnalatha Son Anil Raju About His Mother10
కట్నంగా 40 గోల్డ్‌ బ్యాంగిల్స్‌ దానం.. నాకు 3 కిలోల బంగారం..: సింగర్‌ కుమారుడు

కొత్త పెళ్లికూతురా రారా.., ఓహో బావా.. మార్చుకో నీ వంకరటింకర దోవ.., కాశీకి పోయాను రామా హరి.. వంటి ఎన్నో హిట్‌ సాంగ్స్‌ ఆలపించింది లెజెండరీ సింగర్‌ స్వర్ణలత (Singer Swarnalatha). తెలుగు సినిమా స్వర్ణయుగ కాలంలో ఎన్నో హాస్య గీతాలు ఆలపించింది. ఎనిమిది భాషల్లో పాటలు పాడిన ఆమె దాదాపు 30 చిత్రాల్లో నటించింది కూడా! ఈమె పుట్టుక, చావు ఒకే రోజు జరిగాయి. ఆమె పెద్ద కుమారుడు ఆనంద్‌ రాజ్‌ తెలుగు, తమిళ చిత్రాల్లో విలన్‌గా ఎన్నో సినిమాల్లో నటించాడు. చిన్న కుమారుడు అనిల్‌రాజు పలు సినిమాల్లో డ్యాన్స్‌మాస్టర్‌గా పని చేశాడు. మరో ఏడుగురు సంతానం డాక్టర్స్‌ అయ్యారు.ఏడేళ్లకే గాయనితాజాగా అనిల్‌ రాజు ఓ ఇంటర్వ్యూలో తల్లి గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ఆయన మాట్లాడుతూ.. అమ్మ ఏడు సంవత్సరాల వయసులోనే గాయని అయింది. తన అసలు పేరు మహాలక్ష్మి. రేడియోలో అమ్మ గాత్రం విని డైరెక్టర్‌ బాలచందర్‌ తనకు తొలి అవకాశం ఇచ్చాడు. అలా సినిమాల్లోకి వచ్చింది. మా అమ్మగారికి తొమ్మిదిమంది సంతానమవగా పదిమంది కుక్కల్ని పెంచుకునేది. ఓసారి అమ్మ ముస్లింకుటుంబ వివాహానికి వెళ్లింది. కట్నం ఇ‍వ్వలేదని వరుడు పెళ్లే వద్దనడంతో అమ్మ తన చేతికున్న 40 బంగారు గాజుల్ని ఇచ్చి ఆ పెళ్లి చేసింది. ఆ మాటలు బాధించేవిఅయితే అన్నల పెళ్లిళ్లయ్యేసరికి కొన్ని సమస్యలు వచ్చిపడ్డాయి. మా వదిన.. అమ్మను వృద్ధాశ్రమంలో వదిలేద్దామనేది. అవి అమ్మ మనసును బాధించేవి. అమ్మ ఎప్పుడూ బంగారు ఆభరణాలు ధరించేది. 1972లో సినిమా ఇండస్ట్రీ నుంచి బయటకు వచ్చేసి భక్తిగీతాలు పాడేది. అలా 1997న మార్చి 5న నేను, అమ్మ చెన్నై నుంచి హైదరాబాద్‌కు వస్తున్నాం. అప్పుడు అమ్మ ఒంటిమీద రూ.4.50 లక్షల విలువైన బంగారం ఉంది. చిన్నవంగల్‌ అనే ‍గ్రామానికి రాగానే గుర్తు తెలియని దుండగులు మా కారును ఆపేశారు.3 కిలోల బంగారండ్రైవర్‌ను, నన్ను, అమ్మను కొట్టారు. ఐదురోజులవరకు అమ్మ ఆస్పత్రిలో పోరాడుతూ మార్చి 10న తుదిశ్వాస విడిచింది. అమ్మ నివసించిన ఇంటిని అమ్మేయగా రూ.100 కోట్లు వచ్చాయి. దాన్ని తొమ్మిది మంది పంచుకున్నాం. అందులో రూ.3 కోట్లతో తన జీవితకథపై సినిమా తీస్తున్నాం. అమ్మ వెళ్లిపోతూ నాకు 3 కిలోల బంగారం ఇచ్చింది. తన 500 పట్టుచీరలు ఇప్పటికీ నాదగ్గరే ఉన్నాయి. కొన్ని చీరల్లో బంగారంతో తయారు చేసినవి.నేను హిజ్రా..నాకు 16 ఏళ్ల వయసు రాగానే నాలో ఆడలక్షణాలు ఎక్కువయ్యాయి. ఇంట్లో నుంచి ముంబైకి వెళ్లిపోయాను. మా అమ్మకు విషయం అర్థమై.. నువ్వు చీర కట్టుకో, ప్యాంటు షర్ట్‌ వేసుకో.. ఎలాగైనా ఉండు, కానీ నేను చనిపోయేవరకు నా దగ్గరే ఉండు అంది. మా అన్నకేమో నేను హిజ్రాలా ఉంటే నచ్చేది కాదు. చాలా ఏండ్లు కాటుక, లిప్‌స్టిక్‌ పెట్టుకుని చీర కట్టుకుంటూ ఉండేవాడిని. అన్నదమ్ములెవరూ నాతో మాట్లాడేవారు కాదు. ఇప్పుడు నాలో హిజ్రా లక్షణాలు తగ్గిపోయాయి అని చెప్పుకొచ్చాడు.చదవండి: ‘ఛావా’ తెలుగు వెర్షన్‌కి ఊహించని ఓపెనింగ్స్‌!

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

International View all
title
ఉక్రెయిన్‌పై రష్యా మరోసారి భీకర దాడి.. 14 మంది మృతి

రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం ముగింపు దిశగా ప్రయత్నాలు జరుగుతోన్న క్రమంలో కూడా రష్యా భీకర దాడులు కొనసాగుతూనే ఉంది.

title
దక్షిణ కొరియా: జైలు నుంచి యోల్‌ విడుదల

సియోల్‌: మార్షల్‌ లా విధించిన కేసులో అభిశంసనకు గురై పదవి కోల

title
భారత్‌తో చాలా కష్టం.. వదిలిపెట్టే ప్రసక్తే లేదు: ట్రంప్‌ హెచ్చరిక

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి భా

title
ట్రంప్‌ కేబినెట్‌ మీటింగ్‌లో రచ్చ.. రచ్చ!

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అధ్యక్షతన

title
ఈ ఏడాదితో ఉత్తరాల బట్వాడా బంద్‌

కోపెన్‌హాగెన్‌: డెన్మార్క్‌లో ఉత్తరాల బట్వాడాను ఈ ఏడాది చివర

NRI View all
title
లండన్‌లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు

బిందువు బిందువు కలిస్తేనే సింధువు అనే విధంగా యూకే లో నివసిస్తున్న తెలుగు మహిళలు అందరూ “తెలుగు లేడీస్ యుకె” అనే ఫేస్‌బుక్

title
న్యూజెర్సీలో నాట్స్ ఇమ్మిగ్రేషన్ సెమినార్

న్యూ జెర్సీ: అమెరికాలో తెలుగు వారి కోసం అనేక కార్యక్రమాలు చ

title
అమెరికాలో కాల్పులు.. కేశంపేట యువకుడి మృతి

కేశంపేట: ఉన్నత ఆశయాలతో అమెరికా వెళ్లిన ఓ విద్యార్థి..

title
గిఫ్ట్‌ సిటీ ఫండ్స్‌లో భారీగా ఎన్నారైల పెట్టుబ‌డులు

ముంబై: గిఫ్ట్‌ సిటీలోని ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్స్‌లో ప్రవాస భారతీయులు దాదాపు 7 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు (Investments) ప

title
మిసెస్‌ ఇండియా పోటీలకు తెలుగు ఎన్‌ఆర్‌ఐ

సాక్షి, సిటీబ్యూరో: లండన్‌ వేదికగా ప్రముఖ బహుళ జాతి సంస్థలో

Advertisement

వీడియోలు

Advertisement