Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today

Top Stories

ప్రధాన వార్తలు

Who Is Diana Carney Canada New PM And Bio Details Check Here1
కెనడా కొత్త ప్రధానిగా మార్క్‌ కార్నీ

ఒట్టావా: కెనడాలో తొమ్మిదేళ్ల జస్టిన్‌ ట్రూడో(Justin Trudeau) పాలనకు తెరపడింది. ఆ దేశ నూతన ప్రధానిగా మార్క్‌ కార్నీ(Mark Carney) ఖరారు అయ్యారు. తాజాగా జరిగిన సమావేశంలో తమ కొత్త సారథిగా అధికార లిబరల్‌ పార్టీ కార్నీని ఎన్నుకుంది. ఏనాడూ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయని, కేబినెట్‌లో పనిచేయని ఆయన.. కెనడా 24వ ప్రధానిగా బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. తీవ్ర ప్రజా వ్యతిరేకతతో జస్టిన్‌ ట్రూడో ఈ జనవరిలో ప్రధాని పదవి నుంచి వైదొలగనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో లిబరల్‌ పార్టీకి కొత్త అధ్యక్షుడి ఎన్నిక అనివార్యమైంది. అయితే కొత్త నేత ఎన్నిక దాకా జస్టిన్‌ ఆ పదవిలో కొనసాగారు. ఇక కొత్త ప్రధానిగా బ్యాంక్‌ ఆఫ్‌ కెనడా మాజీ గవర్నర్‌ మార్క్‌ కార్నీ ఎన్నికయ్యారు . తాజాగా జరిగిన ఓటింగ్‌లో లిబరల్‌ పార్టీ సభ్యులు మొత్తం 1,50,000 మంది ఓటింగ్‌లో పాల్గొన్నారు. కార్నేకు 131,674 ఓట్లు పొలవ్వగా.. క్రిస్టియా ఫ్రీలాండ్‌ 11,134, కరినా గౌల్డ్‌కు 4,785, ఫ్రాంక్‌ బేలిస్‌కు 4,038 ఓట్లు వచ్చాయి. అంటే కార్నేకు వచ్చిన ఓట్లు 86 శాతమన్నమాట.ఆర్థిక మేధావిగా పేరున్న మార్క్‌ కార్నీ సరిగ్గా డొనాల్డ్‌ ట్రంప్‌ సుంకాల ముప్పు వంటి సవాళ్లను ఎదుర్కొంటున్న వేళలో ప్రధానిగా బాధ్యతలు స్వీకరిస్తుండడం గమనార్హం.ఎవరీ కార్నీ.. బ్యాక్‌గ్రౌండ్‌ ఇదే👉మార్క్‌ కార్నీ 1965లో ఫోర్ట్‌ స్మిత్‌లో జన్మించారు. హార్వర్డ్‌లో ఉన్నత విద్య అభ్యసించారు. గోల్డ్‌మన్‌ శాక్స్‌లో 13 ఏళ్లు పనిచేసిన ఆయన.. 2003లో బ్యాంక్‌ ఆఫ్‌ కెనడా డిప్యూటీ గవర్నర్‌గా ఎన్నికయ్యారు. 2004లో ఆ బాధ్యతల నుంచి వైదొలగి.. కెనడా ఆర్థిక మంత్రి పదవిని చేపట్టారు. 👉2008 ఫిబ్రవరి 1న సెంట్రల్‌ బ్యాంక్‌ గవర్నర్‌గా నియమితులయ్యారు. సరిగ్గా అదే సమయంలో కెనడా ఆర్థిక సంక్షోభంలో కొట్టు మిట్టాడుతోంది. ఆ టైంలో ఆయన అనూహ్యంగా.. వడ్డీ రేట్లను సున్నాకు తగ్గించారు. 👉మూడు శతాబ్దాల చరిత్ర కలిగిన బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లండ్‌కు గవర్నర్‌గా 2013లో కార్నీ ఎన్నికయ్యారు. తద్వారా ఆ సెంట్రల్‌ బ్యాంక్‌కు మొట్టమొదటి నాన్‌-బ్రిటిష్‌ గవర్నర్‌గా నిలిచారు. అంతేకాదు, జీ7లోని రెండు సెంట్రల్‌ బ్యాంకులకు నాయకత్వం వహించిన వ్యక్తిగానూ రికార్డుకెక్కారు. 2020లో బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లండ్‌ను వీడిన ఆయన.. ఐరాస ఆర్థిక, వాతావరణ మార్పుల విభాగం రాయబారిగా సేవలందించారు. తాజా లిబరల్‌ పార్టీ నూతన అధ్యక్షుడి ఎన్నికల రేసులో నిలిచిన నలుగురిలో అత్యధికారంగా విరాళాలు సేకరించిన అభ్యర్థి కూడా ఈయనే కావడం గమనార్హం.

Rohit Sharma Breaks Silence On Retirement After India Win Champions Trophy 2025 Title2
రిటైర్మెంట్‌పై రోహిత్ శ‌ర్మ కీల‌క ప్ర‌క‌ట‌న‌..

విశ్వ‌వేదిక‌పై మ‌రోసారి భార‌త జెండా రెప‌రెప‌లాడింది. ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోఫీ-2025 విజేత‌గా భార‌త క్రికెట్ జ‌ట్టు నిలిచింది. దుబాయ్ వేదిక‌గా జ‌రిగిన ఫైన‌ల్లో న్యూజిలాండ్‌ను 4 వికెట్ల తేడాతో ఓడించిన టీమిండియా.. ముచ్చ‌ట‌గా మూడోసారి ఛాంపియ‌న్స్ ట్రోఫీ టైటిల్‌ను ముద్దాడింది.ఈ విజ‌యంతో ఏడాది తిర‌గ‌క‌ముందే మ‌రో ఐసీసీ టైటిల్ భార‌త్ ఖాతాలో వేసుకుంది. కెప్టెన్‌గా రోహిత్ శర్మ వరుసగా రెండో ఐసీసీ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. ఈ క్ర‌మంలో త‌న వ‌న్డే రిటైర్మెంట్ వ‌స్తున్న వార్త‌ల‌కు రోహిత్ శ‌ర్మ చెక్ పెట్టాడు. మ్యాచ్ అనంత‌రం మాట్లాడిన హిట్‌మ్యాన్‌.. ఇప్ప‌టిలో రిటైర్ అయ్యే ఆలోచ‌న త‌న‌కు లేద‌ని స్పష్టం చేశాడు.ఇప్పుడే కాదు.."చాలా సంతోషంగా ఉంది. చక్కటి క్రికెట్‌ ఆడిన మాకు దక్కిన ఫలితమిది. మొదటి నుంచి మా స్పిన్నర్లు ప్రభావం చూపించారు. ఎన్నో అంచనాలు ఉన్న సమయంలో వారు నిరాశపర్చలేదు. ఈ సానుకూలతను మేం సమర్థంగా వాడుకున్నాం. రాహుల్‌ మానసికంగా దృఢంగా ఉంటాడు.సరైన షాట్‌లను ఎంచుకుంటూ ఒత్తిడి లేకుండా అతను ఈ మ్యాచ్‌ను ముగించగలిగాడు. అతని వల్లే అవతలి వైపు పాండ్యా స్వేచ్ఛగా ఆడగలిగాడు. మా బ్యాటర్లంతా ఆకట్టుకునే ప్రదర్శన ఇచ్చారు. వరుణ్‌ బౌలింగ్‌లో ఎంతో ప్రత్యేకత ఉంది. అతను కీలక సమయాల్లో వికెట్లు తీశాడు. ఇలాంటి పిచ్‌పై అలాంటి బౌలర్‌ కావాలని అంతా కోరుకుంటారు. మాకు ఇది సొంత మైదానం కాకపోయినా పెద్ద సంఖ్యలో వచ్చి మద్దతుగా నిలిచిన అభిమానులకు కృతజ్ఞతలు. దూకుడుగా బ్యాటింగ్‌ చేసేందుకు నన్ను కోచ్‌ ప్రోత్సహించారు. మరో విషయం నేను స్పష్టం చేయదల్చుకున్నాను. నేను ఈ ఫార్మాట్‌నుంచి రిటైర్‌ కావడం లేదు.ఎలాంటి వదంతులు రాకూడదని ఇది చెబుతున్నాను. సుదీర్ఘమైన క్రికెట్‌ ఆడినవారికి ఇంకా ఆడాలని ఉంటుంది. అయితే ఇది యువ ఆటగాళ్లపై ప్రభావం చూపుతోంది అని 38 ఏళ్ల రోహిత్ పోస్ట్‌మ్యాచ్ ప్రెస్‌కాన్ఫ‌రెన్స్‌లో పేర్కొన్నాడు. కాగా రోహిత్, కోహ్లి ఇద్ద‌రూ 2027 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ వ‌ర‌కు కొన‌సాగే అవ‌కాశముంది.భార‌త్ ఆల్‌రౌండ్ షో..ఈ ఫైన‌ల్ పోరులో టీమిండియా ఆల్‌రౌండ్ షోతో అద‌ర‌గొట్టింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ భార‌త బౌల‌ర్లు క‌ట్టుదిట్టంగా బౌలింగ్ చేయ‌డంతో నిర్ణీత ఓవ‌ర్ల‌లో 7 వికెట్లకు 251 పరుగులు చేసింది. కివీస్ బ్యాట‌ర్ల‌లో డారిల్ మిచెల్(101 బంతుల్లో 3 ఫోర్లతో 63), మైఖేల్ బ్రేస్‌వెల్(40 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 53 నాటౌట్) హాఫ్ సెంచ‌రీల‌తో రాణించారు.భార‌త బౌల‌ర్ల‌లో వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి, కుల్దీప్ యాద‌వ్ త‌లా రెండు వికెట్లు సాధించ‌గా.. మ‌హ్మ‌ద్ ష‌మీ, ర‌వీంద్ర జ‌డేజా త‌లో వికెట్ ప‌డ‌గొట్టారు. అనంత‌రం 252 ప‌రుగుల ల‌క్ష్యాన్ని భార‌త్ 49 ఓవ‌ర్ల‌లో 6 వికెట్లు కోల్పోయి చేధించింది. భార‌త కెప్టెన్ రోహిత్ శ‌ర్మ (83 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 76) అద్భుత‌మైన ఇన్నింగ్స్ ఆడ‌గా.. శ్రేయస్ అయ్యర్(62 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 48), కేఎల్ రాహుల్(33 బంతుల్లో ఫోర్, సిక్స్‌తో 34 నాటౌట్) కీల‌క నాక్స్ ఆడారు. కివీస్ బౌల‌ర్ల‌లో సాంట్న‌ర్‌, బ్రేస్‌వెల్ త‌లా రెండు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. ర‌వీంద్ర‌, జెమీస‌న్ చెరో వికెట్ సాధించింది.చదవం‍డి:మా స్పిన్నర్లు అద్భుతం.. ఆ ఇద్దరు సూపర్‌.. అతడు నాణ్యమైన బౌలర్‌: రోహిత్‌

Rasi Phalalu: Daily Horoscope On 10 March 2025 In Telugu3
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం.. చిన్ననాటి మిత్రులతో సంతోషంగా గడుపుతారు.

గ్రహం అనుగ్రహం: శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, తిథి: శు.ఏకాదశి ఉ.9.56 వరకు, తదుపరి ద్వాదశి, నక్షత్రం: పుష్యమి రా.2.25 వరకు, తదుపరి ఆశ్లేష, వర్జ్యం: ఉ.10.20 నుండి 11.56 వరకు, దుర్ముహూర్తం: ప.12.36 నుండి 1.24 వరకు, తదుపరి ప.2.59 నుండి 3.47 వరకు, అమృతఘడియలు: రా.8.05 నుండి 9.41 వరకు; రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు, యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు, సూర్యోదయం: 6.16, సూర్యాస్తమయం: 6.04.మేషం: వ్యవహారాలలో ప్రతిబంధకాలు. ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి. శ్రమాధిక్యం.నిర్ణయాలు మార్చుకుంటారు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.వృషభం: దీర్ఘకాలిక సమస్యలు తీరతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో నూతనోత్సాహం.మిథునం: కుటుంబంలో చికాకులు. ఆరోగ్య సమస్యలు. పనుల్లో ఆటంకాలు. బంధువులతో తగాదాలు. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి.కర్కాటకం: శ్రమలిస్తుంది. నూతన విద్యావకాశాలు. ఆస్తులు కొనుగోలు చేస్తారు. పరిచయాలు పెరుగుతాయి. దైవదర్శనాలు. అనుకున్న పనులలో విజయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి.సింహం: వ్యవహారాలు మందగిస్తాయి. శ్రమాధిక్యం. నిర్ణయాలలో మార్పులు. సోదరుల నుంచి ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాల విస్తరణ వాయిదా. ఉద్యోగాలలో చికాకులు.కన్య: శుభవర్తమానాలు. ఆకస్మిక ధనలాభం. చిన్ననాటి మిత్రులతో సంతోషంగా గడుపుతారు. ఆధ్యాత్మిక చింతన. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.తుల: ఆసక్తికర విషయాలు తెలుస్తాయి. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఆశ్చర్యకర సంఘటనలు. ఆకస్మిక ధనలబ్ధి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి.వృశ్చికం: రాబడి కొంత తగ్గవచ్చు. దూరప్రయాణాలు సంభవం. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.ధనుస్సు: కుటుంబంలో ఒత్తిడులు. అనుకోని ప్రయాణాలు. కొన్ని సమస్యలు చికాకు పరుస్తాయి. బంధువులతో వివాదాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో స్వల్ప ఆటంకాలు.మకరం: వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. చిన్ననాటి మిత్రులతో కష్టసుఖాలు విచారిస్తారు. వ్యాపారాలు వృద్ధి. ఉద్యోగాలలో సమస్యలు తీరే సమయం.కుంభం: పరిస్థితులు అనుకూలిస్తాయి. సమాజసేవలో పాల్గొంటారు. కొన్ని బాకీలు రాగలవు. వస్తులాభాలు. నూతన ఉద్యోగయోగం. వ్యాపార, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి.మీనం: కుటుంబంలో కొన్ని సమస్యలు. ఆకస్మిక ప్రయాణాలు. రుణాలు చేస్తారు. దైవదర్శనాలు. ఆస్తి వివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాదాసీదాగా ఉంటాయి.

Telangana Police Lathi Charge On Indian fans Celebrations AT Dilsukhnagar4
HYD: భారత్‌ విక్టరీపై ఫ్యాన్స్‌ సంబురాలు.. పోలీసుల లాఠీచార్జ్‌

సాక్షి, హైదరాబాద్‌: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో భారత్ విజయం సాధించింది. న్యూజిలాండ్‌ జట్టుపై నాలుగు వికెట్ల తేడాతో భారత్‌ జట్టు విజయాన్ని అందుకుంది. టీమిండియా విజయంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారత అభిమానాలు సంబురాలు జరుపుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఫ్యాన్స్‌ సంబురాలు చేసుకున్నారు. ఈ క్రమంలో ఒక్కసారిగా రోడ్ల మీదకు వచ్చిన అభిమానులపై పోలీసులు లాఠీచార్జ్‌ చేశారు.వివరాల ప్రకారం.. భారత జట్టు విజయం అనంతరం హైదరాబాద్‌లో అభిమానులు బాణాసంచా పేల్చి డ్యాన్స్‌లు చేస్తూ రోడ్లకు మీదకు వచ్చారు. ఈ క్రమంలో దిల్‌సుఖ్‌నగర్‌లో ఒక్కసారిగా భారీ సంఖ్యలో అభిమానులు బయటకు రావడంతో ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. అభిమానులు గట్టిగా కేకలు వేస్తూ డ్యాన్స్‌ చేశారు. దీంతో, పోలీసులు రోడ్ల మీదకు వచ్చిన వారిపై లాఠీచార్జ్‌ చేశారు. ఈ క్రమంలో ఫ్యాన్స్‌ పరుగులు తీశారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.బ్రేకింగ్ న్యూస్ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ లో భారత్ విజయంహైదరాబాద్‌లో సంబరాలు చేసుకున్న ఫ్యాన్స్‌ను చితకబాదిన పోలీసులఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత జట్టు గెలవడంతో హైదరాబాద్‌లో దిల్‌సుఖ్ నగర్‌లో రోడ్లపైకి వచ్చి సంబరాలు చేసుకున్న ఫ్యాన్స్‌ మీద లాఠీ ఛార్జ్ చేసిన పోలీసులు pic.twitter.com/UBabGMdvkG— Telugu Scribe (@TeluguScribe) March 9, 2025 Video Credit: TeluguScribeటీమిండియా విజయం సందర్బంగా ట్యాంక్‌ బండ్‌ మీదకు భారీగా అభిమానులు చేరుకుని సంబురాలు జరుపుకున్నారు. ఐటీ కారిడార్‌, అమీర్‌పేట్‌, కూకట్‌పల్లి సహా పలు ప్రాంతాల్లో అర్ధరాత్రి వరకు అభిమానులు సంబురాల్లో మునిగిపోయారు. విజయంపై తమ అభిమానం చాటుకున్నారు. MASSIVE CELEBRATIONS IN HYDERABAD FOR TEAM INDIA'S VICTORY. 🇮🇳pic.twitter.com/qhXpCzIEbJ— Mufaddal Vohra (@mufaddal_vohra) March 9, 2025 Champions trophy celebrations at Tankbund Hyderabad. pic.twitter.com/BpJvzC3KF0— 𝐒𝐚𝐟𝐟𝐫𝐨𝐧 𝐒𝐚𝐠𝐚𝐫 𝐆𝐨𝐮𝐝 (@Sagar4BJP) March 10, 2025India can win and celebrate in Muslim nation UAE but not in Hyderabad, India.Well done Telangana 👌pic.twitter.com/bnujojic5a— Vikram Pratap Singh (@VIKRAMPRATAPSIN) March 10, 2025

Where Is Rajamouli Mark In SSMB 29 Movie Shooting5
#SSMB29: వాట్‌ ద ఎఫ్‌.. రాజమౌళి?

ఒక ప్రొడక్టును సృష్టించడం కంటే.. దాని మార్కెటింగ్‌ ఎంత బాగా చేశామనేది వ్యాపారంలో పాటించాల్సిన ముఖ్య సూత్రం. మన దేశంలో.. సినిమా అనే వ్యాపారంలో దర్శకుడు ఎస్‌ ఎస్‌ రాజమౌళిని ఈ విషయంలో కొట్టగలిగేవారే లేరని ఇంతకాలం చెప్పుకున్నాం. అయితే తాజా #SSMB29 లీక్‌లతో ఈ విషయంలో కొన్ని అనుమానాలు తలెత్తుతున్నాయి.సినిమా మేకింగ్‌లో రాజమౌళి(Rajamouli)ది ఢిపరెంట్‌ స్కూల్‌. హీరోలతో సహా ప్రతీ టెక్నీషియన్‌కు కార్పొరేట్‌ కల్చర్‌ తరహాలో ఐడీ కార్డు జారీ చేస్తుంటారు. సెట్స్‌కి మొబైల్స్‌ తేవడం బ్యాన్‌.. అంతేకాదు ఈ విషయంలో ప్రత్యేక నిఘా కూడా పెడుతుంటారు. ఇలా.. ఒక సినిమా షూటింగ్‌ విషయంలో ఇంత జాగ్రత్తలు పాటిస్తుంటాడు దర్శకుధీరుడు. అంతెందుకు ఓ సినిమా మేకింగ్‌నే(RRR) ఏకంగా ఒక డాక్యుమెంటరీగా తీయించి వదిలిన ఘనత కూడా ఈయనకే దక్కుతుంది. అలాంటిది మహేష్‌ బాబుతో తీస్తున్న చిత్రం విషయంలో ఎక్కడ పారపాటు.. కాదు పొరపాట్లు జరుగుతున్నాయి?.సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు హీరో. మళయాళ స్టార్‌ హీరో ఫృథ్వీ రాజ్‌ సుకుమారన్‌(Prithviraj Sukumaran) ఓ కీలక పాత్ర. ఏకంగా.. ప్రియాంక చోప్రా(Priyanka Chopra) హీరోయిన్‌. ఇంకా ఊహించని సర్ప్రైజ్‌లు ఎన్నెన్నో ఉండొచ్చు. అలాంటిది పరిస్థితి ఇలాగే కొనసాగితే.. ఇలాంటి లీక్‌లతో అవన్నీ బయటకు వచ్చేయవా?..ఎక్కడో ఒడిషాలో మారుమూల చోట ప్రత్యేక సెట్టింగులలో షూటింగ్‌ జరుపుకుంటోంది SSMB20 చిత్రం. తొలుత అక్కడి పోలీస్‌ అధికారులతో దిగిన ఫొటోలు బయటకు వచ్చాయి. ఆ వెంటనే అక్కడి ఛానెల్స్‌లో సెట్స్‌ను లాంగ్‌షాట్స్‌లో లైవ్‌ చూపించేశాయి. ఆ మరుసటి రోజే.. మహేష్‌ బాబు పాల్గొన్న షూటింగ్‌ సీన్‌.. అదీ చాలా క్లోజప్‌ షాట్‌లో బయటకు రావడం ఎంబీఫ్యాన్స్‌నే కాదు.. యావత్‌ చలనచిత్ర పరిశ్రమేనే షాక్‌కు గురి చేసింది . దీంతో ఆ వీడియోను తొలగించే చర్యలు చేపట్టినట్లు చిత్ర యూనిట్‌ తరఫు నుంచి ఒక ప్రకటన బయటకు వచ్చింది.ఆర్‌ఆర్‌ఆర్‌ తరహాలోనే.. మహేష్‌ బాబు సినిమాకు సైతం సెట్స్‌కు ఫోన్లు తేవడం నిషేధించారు. అయినప్పటికీ ఆ సీన్‌ను ఎవరు.. ఎలా షూట్‌ చేశారు?. అదీ అది అంత దగ్గరగా ఉండి మరీ?. ప్రస్తుతం ఈ అంశంపై తీవ్ర చర్చ నడుస్తోంది. సాధారణంగా రాజమౌళి సినిమా షూటింగ్‌లకు బయటి వాళ్లను అనుమతించరు. షూటింగ్‌ కోసం తెచ్చే జూనియర్‌ ఆర్టిస్టులకు సైతం స్ట్రిక్‌ ఇన్‌స్ట్రక్షన్స్‌ వెళ్తుంటాయి. అలాంటప్పుడు లీకులకు అవకాశం ఎక్కడిది?. పనిరాక్షసుడిగా పేరున్న ఆయన పెట్టిన రూల్స్‌ బ్రేక్‌ చేసిందెవరు?. కొంపదీసి.. ఇది కావాలని చేసిన లీక్‌ కాదు కదా! అనే చర్చ సైతం ఇప్పుడు జోరుగా నడుస్తోంది. అయితే..సినిమా ప్రమోషన్‌ విషయంలో రాజమౌళి స్ట్రాటజీ ఎప్పుడూ కొత్తగానే ఉంటుంది. అంతేగానీ ఇంత చెత్తగా మాత్రం ఉండదు!. సినిమా ప్రమోషన్ల కోసం నిర్మాతతో మంచి నీళ్లలా డబ్బులు ఖర్చు చేయిస్తాడనే విమర్శ కూడా జక్కన్న మీద ఉంది కదా. అలాంటప్పుడు భారీ బడ్జెట్‌తో.. అదీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా విషయంలో ఇలా ఎందుకు జరగనిస్తాడు?. ఏది ఏమైనా రాజమౌళి-మహేష్‌ బాబు సినిమా నుంచి.. అదీ షూటింగ్‌ మొదలైన తొలినాళ్లలోనే ఇలాంటి లీకులు కావడంతో.. వాట్‌ ద F*** అని ఒక్కసారిగా అనుకుంది టీఎఫ్‌ఐ అంతా. ఇంత చర్చ నడుస్తుండడంతో.. ఇకనైనా లీకుల విషయంలో జాగ్రత్త పడతారేమో చూడాలి మరి!.ఇదీ చదవండి: రాజమౌళికి బిగ్‌ షాక్‌.. మహేష్‌ బాబు వీడియో బయటకు!

Russia uses gas pipeline to strike at Ukrainian troops6
గ్యాస్‌ పైప్‌లైన్‌లో నడిచొచ్చి.. వెనక నుంచి దాడి

కీవ్‌: యుద్ధంలో ఉక్రెయిన్‌ సేనలపై ఊహించని రీతిలో దాడిచేసేందుకు రష్యా బలగాలు ఒక గ్యాస్‌ పైప్‌లైన్‌ లోపలి నుంచి నడుచుకుంటూ వెళ్లిందని కథనాలు వెలువడ్డాయి. రష్యాలోని కరŠస్క్‌ రీజియన్‌లో ఈ యుద్ధ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. గత ఏడాది ఆగస్ట్‌లో ఉక్రెయిన్‌ సేనలు తొలిసారిగా రష్యా భూభాగాన్ని ఆక్రమించుకున్నాయి. రెండో ప్రపంచయుద్ధం తర్వాత రష్యా భూభాగంపై జరిగిన అతిపెద్ద దాడి ఘటన ఇదే. వ్యూహాత్మక సరిహద్దు పట్టణమైన సుడ్జా సహా 1,000 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని ఉక్రెయిన్‌ బలగాలు కైవసం చేసుకున్నాయి. వందలాది మంది రష్యా సైనికులను యుద్ధ ఖైదీలుగా బంధించాయి. దీంతో అమేయ సైనికశక్తిగా ఉన్న రష్యా దీనిని అవమానంగా భావించి ఏకంగా 50,000 మంది సైనికులతో భారీ ఎదురుదాడికి దిగింది. దీంతో వేలాది మంది ఉక్రెయిన్‌ సైనికులు వెనుతిరగాల్సిన పరిస్థితి తలెత్తింది. ఎలాగోలా సుడ్జా సిటీలో పోరాడుతున్న ఉక్రెయిన్‌ సైనికులను అన్నివైపులా నుంచి చుట్టుముట్టేందుకు ఆవలివైపుదాకా ఉన్న గ్యాస్‌పైప్‌లైన్‌ గుండా రష్యా సైనికులు వెళ్లారని యూరీ పోడోల్యాకా వెల్లడించారు. ఈయన ఉక్రెయిన్‌లో పుట్టి రష్యాకు అనుకూలంగా మాట్లాడే బ్లాగర్‌. సుడ్జా నగరంలో ఉక్రెయిన్‌ సేనలను వెనక వైపు నుంచి దాడిచేసేందుకు, అదును చూసి దెబ్బకొట్టేందుకు పైప్‌లైన్‌ లోపలే రష్యా సైనికులు రోజుల తరబడి గడిపారని ఈయన పేర్కొన్నారు. ఈ పైప్‌లైన్‌ పొడవు దాదాపు 15 కిలోమీటర్లు. యూరప్‌తో సత్సంబంధాలు తెగిపోకముందువరకు ఈ పైప్‌లైన్‌ గుండా గ్యాస్‌ను రష్యా సరఫరా చేసేది. ఇప్పుడు గ్యాస్‌ లేకపోవడంతో సైనికుల రాకపోకలు సాధ్యమయ్యాయని యూరీ చెప్పారు. మాస్క్‌లు ధరించిన సైనికులు పైప్‌లైన్‌ ద్వారా సుడ్జా నగరంలోకి ప్రవశించారని ‘టూ మేజర్స్‌’ అనే మరో యుద్ధ బ్లాగర్‌ చెప్పారు. రష్యా స్పెషల్‌ ఫోర్సెస్‌ బలగాలు పైప్‌లో నడిచివెళ్తున్న ఫొటోలను రష్యా టెలిగ్రామ్‌ చానెల్స్‌ అందరితో పంచుకున్నాయి. ‘‘శత్రుసేనల రాకను మేం కనిపెట్టాం. రాకెట్లు, శతఘ్నులతో దీటైన బదులిచ్చాం. రష్యాకు భారీ నష్టం జరిగింది’’ అని ఉక్రెయిన్‌ జనరల్‌ స్టాఫ్‌ తెలిపింది. అయితే ప్రాణనష్టం, ఎంత మంది రష్యా సైనికులు చనిపోయారనే విషయం వెల్లడికాలేదు.

some key differences between Exchange Traded Funds and index funds7
ఈటీఎఫ్‌లు–ఇండెక్స్‌ ఫండ్స్‌ మధ్య వ్యత్యాసం?

ఈటీఎఫ్‌లు, ఇండెక్స్‌ ఫండ్స్‌ మధ్య వ్యత్యాసం ఏంటి? – దీప్తిఈ రెండు సాధనాల మధ్య సూక్ష్మమైన వ్యత్యాసమే ఉంది. ఈ రెండూ కూడా ప్యాసివ్‌ పెట్టుబడుల కోసం రూపొందించినవే. ఇండెక్స్‌ను (నిఫ్టీ50, సెన్సెక్స్‌ తదితర) ప్రతిఫలిస్తూ పెట్టుబడులు పెడుతుంటాయి. వీటిల్లో వ్యయాలు చాలా తక్కువ. చూడ్డానికి ఈ రెండు ఒకే విధంగా ఉన్నప్పటికీ, వాటిల్లో పెట్టుబడుల పరంగా వ్యత్యాసం ఉంటుంది. ధరల అస్థిరతల భయం లేకుండా ఇన్వెస్ట్‌ చేసుకునేందుకు ఇండెక్స్‌ ఫండ్స్‌ వీలు కల్పిస్తాయి. సిస్టమ్యాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌ (సిప్‌) రూపంలో వీటిల్లో ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చు. చాలా సులభంగా, పెట్టుబడులను ఆటోమేట్‌ చేసే సాధనమే ఇండెక్స్‌ ఫండ్స్‌. ఈటీఎఫ్‌లు అలా కాదు. ఇవి స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో ట్రేడ్‌ అవుతుంటాయి. వీటిని మీరే స్వయంగా కొనుగోలు చేసుకోవాలి. అందుకోసం ట్రేడింగ్, డీమ్యాట్‌ ఖాతాలుండాలి. కొనుగోళ్లపై బ్రోకర్, ఇతర చార్జీలు చెల్లించాలి. దీర్ఘకాల ఇన్వెస్టర్లకు ఇండెక్స్‌ పండ్స్‌ సులభమైన ఎంపిక. వీటిని తరచుగా పర్యవేక్షించుకోనక్కర్లేదు. సిప్‌ రూపంలో పెట్టుబడి పెట్టుకోవచ్చు. డీమ్యాట్, ట్రేడింగ్‌ ఖాతాలుండి, మార్కెట్‌ కదలికలను అర్థం చేసుకుని పెట్టుబడులు పెట్టే వారికి ఈటీఎఫ్‌లు అనుకూలం.ఇదీ చదవండి: బిజినెస్‌లో గుజరాతీల సక్సెస్‌ సీక్రెట్స్‌.. ‘ఎక్స్’ పోస్ట్ వైరల్‌నేను ఒకే అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ పరిధిలో (ఏఎంసీ) ఈక్విటీ లింక్డ్‌ సేవింగ్స్‌ స్కీమ్‌ (ఈఎల్‌ఎస్‌ఎస్‌) ఫండ్‌ నుంచి, మరో ఈక్విటీ పథకంలోకి సిస్టమ్యాటిక్‌ ట్రాన్స్‌ఫర్‌ ప్లాన్‌ (ఎస్‌టీపీ) ద్వారా పెట్టుబడులను మార్చుకోవాలని అనుకుంటున్నాను. దీనిపై దీర్ఘకాల మూలధన లాభాల పన్ను పడుతుందా? – శ్రీకాంత్‌ ఎన్‌వీఈఎల్‌ఎస్‌ఎస్‌ పథకం నుంచి మరో ఈక్విటీ పథకంలోకి ఎస్‌టీపీ చేసుకుంటే అప్పుడు దీర్ఘకాల మూలధన లాభాల పన్ను వర్తిస్తుంది. ఆ రెండు ఒకటే ఏఎంసీ పరిధిలో ఉన్నా సరే ఈ నిబంధనే వర్తిస్తుంది. ఇన్వెస్టర్‌ ఎస్‌టీపీ ద్వారా ఒక ఈక్విటీ పథకంలోని పెట్టుబడులను క్రమంగా మరో ఈక్విటీ పథకంలోకి మార్చుకునేందుకు వీలు కల్పిస్తుంది. మధ్యలో బ్యాంక్‌ ఖాతా అవసరం ఉండదు. కానీ, పన్ను పరంగా చూస్తే ప్రతీ ఎస్‌టీపీ బదిలీని ఉపసంహరణగానే చట్టం కింద పరిగణిస్తారు. తిరిగి తాజా పెట్టుబడి కింద చూస్తారు. ఈఎల్‌ఎస్‌ఎస్‌ పథకాల్లో పెట్టుబడికి మూడేళ్ల లాకిన్‌ పీరియడ్‌ వర్తిస్తుంది. మూడేళ్ల కాలం ముగిసిన యూనిట్లనే ఎస్‌టీపీ ద్వారా బదిలీ చేసుకోగలరు. ఉపసంహరణపై వచ్చిన లాభం ఒక ఆర్థిక సంత్సరంలో రూ.1.25 లక్షలు మించితే, అదనపు మొత్తంపై 12.5 శాతం పన్ను పడుతుంది. పన్ను పడకుండా ఎస్‌టీపీ చేసుకోవాలంటే ఒక ఆర్థిక సంవత్సరంలో ఉపసంహరణ, బదిలీ అన్నది రూ.1.25 లక్షలు మించకుండా చూసుకోవాలి.- ధీరేంద్ర కుమార్‌, సీఈఓ, వ్యాల్యూ రీసెర్చ్‌

Yuzvendra Chahal With RJ Mahvash Spot In Champions Trophy Final Match8
డేటింగ్‌లో 'చాహల్'.. ఛాంపియన్స్‌ ట్రోఫీ మ్యాచ్‌కు ఆమెతో పాటు ఎంట్రీ

భారత క్రికెటర్‌ యుజ్వేంద్ర చాహల్, కొరియోగ్రాఫర్‌, నటి ధనశ్రీ వర్మ విడాకుల వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. దాదాపు నిజమే అయినప్పటికీ అధికారికంగా ప్రకటన రాలేదు. అయితే, చహల్‌ మరో యువతితో డేటింగ్‌లో ఉన్నాడని కూడా వార్తలు వచ్చాయి. ఆర్జే మహ్వాష్‌తో(RJ Mahvash) డేటింగే వల్లే చహల్ కాపురంలో చిచ్చు మొదలైందని పుకార్లు కూడా వచ్చాయి. కొద్దిరోజుల క్రితమే వాటిని మహ్వాష్‌ తిప్పికొట్టింది. అవన్నీ రూమర్స్‌ మాత్రమేనని ఆమె పేర్కొంది. అయితే, తాజాగా వారిద్దరూ కలిసి చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో సందడి చేశారు. దీంతో మరోసారి నెట్టింట వైరల్‌ అవుతున్నారు.ఛాంపియన్స్‌ ట్రోఫీలో భాగంగా దుబాయ్‌లో భారత్‌, న్యూజిలాండ్‌ల మధ్య ఫైనల్‌ మ్యాచ్‌ జరిగింది. 12 ఏళ్ల విరామం తర్వాత మళ్లీ ఛాంపియన్స్‌ ట్రోఫీని టీమ్‌ఇండియా అందుకుంది. ఇంతటి సంబరంలో కూడా యుజ్వేంద్ర చహల్, ఆర్జే మహ్వాష్‌ ఫోటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. మ్యాచ్‌ జరుగుతున్న సమయంలో వారిద్దరూ ప్రేక్షకుల గ్యాలరీలో సందడిగా కనిపించారు. చాలా సన్నిహితంగా ఉన్న ఫోటోలను షోషల్‌మీడియాలో కొందరు షేర్ చేశారు. గతంలో వీళ్లిద్దరూ రెస్టారెంట్‌లో కనిపించిగా ఆ ఫొటోలు వైరల్‌ అయ్యాయి. ఇప్పుడు ఇలా మరోసారి సన్నిహితంగా కనిపించడంతో వారిద్దరిపై వస్తున్న డేటింగ్‌ వార్తలు నిజమేననే అనుమానాలు మరింత బలపడే అవకాశం ఉంది. ఒక సందర్భంలో బాలీవుడ్‌ నటుడు వివేక్‌ ఒబేరాయ్‌ కూడా ఈ జంటతో ముచ్చటించారు. ఆయన కూడా చహల్‌, మహ్వాష్‌ ఫోటోలను షేర్‌ చేశారు.ఆర్జే మహ్వాష్‌ సినీ నటి మాత్రమే కాదు.. ప్రస్తుతం ఆమె ఒక సినిమాకు నిర్మాతగా ఉన్నారు. నిర్మాణ కార్యక్రమంలో ఉన్న ఆ చిత్రం త్వరలో విడుదల కానుంది. అయితే, ఆమెకు రేడియో జాకీగా మొదట బాగా గుర్తింపు వచ్చింది. ఇప్పుడు క్రికెటర్‌ యుజ్వేంద్ర చహల్‌తో డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు వస్తుండటంతో ఆమె పేరు ట్రెండ్‌ అవుతుంది.Following separation from actress-choreographer #DhanashreeVerma, cricketer #YuzvendraChahal was spotted with #RJMahvash watching #INDvsNZ Champions Trophy final in Dubai. pic.twitter.com/j5cjTXcdvL— Cinemania (@CinemaniaIndia) March 9, 2025

TDP seniors denied MLC seat9
సీనియర్లకు బాబు ఝలక్‌!

సాక్షి, అమరావతి: ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో టీడీపీ సీనియర్‌ నేతలు, గత ఎన్నికల్లో సీటు దక్కని ముఖ్య నేతలు, సిట్టింగ్‌లకు మొండిచేయే మిగిలింది. చివరి వరకు నమ్మించి, మరోమారు దగాకు గురిచేశారనే చర్చ ఆ పార్టీలో మొదలైంది. యనమల రామకృష్ణుడి స్థానాన్ని ఆయనకివ్వకుండా పూర్తిగా పక్కన పెట్టేశారు. పార్టీ కార్యాలయంలోనే ఉండి చంద్రబాబు చెప్పిన పనులన్నీ చేసిన మరో సిట్టింగ్‌ ఎమ్మెల్సీ అశోక్‌బాబుకు సైతం అవకాశం ఇవ్వలేదు. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు క్రియాశీలకంగా పని చేసిన మరో సిట్టింగ్‌ ఎమ్మెల్సీ దువ్వారపు రామారావుదీ అదే పరిస్థితి. మరోసారి ఎమ్మెల్సీ అవకాశం ఇస్తామంటూ ఆశ చూపించి, రాజీనామా చేయించి టీడీపీలో చేర్చుకున్న వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తికి చంద్రబాబు దెబ్బ కొట్టారు. మరో వైపు ఈసారి శాసన మండలిలో అడుగు పెట్టడం ఖాయమనుకున్న ఎస్‌వీఎస్‌ఎన్‌ వర్మ, దేవినేని ఉమామహేశ్వరరావుకు అవకాశం దక్కలేదు. దళిత నేత కేఎస్‌ జవహర్, బీసీ నేత బుద్ధా వెంకన్నతో పాటు ఈ సీట్లపై ఆశలు పెట్టుకున్న చాలా మంది నేతలను చంద్రబాబు పక్కన పెట్టారు. ఎమ్మెల్సీ స్థానాలపై ఆశలు పెట్టుకున్న నేతలకు ఆదివారం సాయంత్రం టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో ఫోన్‌ చేయించి ఈసారి అవకాశం ఇవ్వలేకపోతున్నామని చెప్పించారు. ఎంపిక చేసిన అభ్యర్థులకు చంద్రబాబు స్వయంగా ఫోన్‌ చేసి చెప్పినట్లు తెలిసింది. వారు సోమవారం నామినే­షన్లు దాఖలు చేయనున్నారు. పవన్‌ అడ్డుకోవడం వల్లే...పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్‌వీఎస్‌ఎన్‌ వర్మకు ఎమ్మెల్సీ స్థానం దక్కకపోవడంపై టీడీపీ శ్రేణుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. చంద్రబాబు ఆయనకు అవకాశం ఇవ్వకుండా ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్‌ అడ్డుకున్నారనే ప్రచారం జరుగుతోంది. వర్మను ఎమ్మెల్సీ చేస్తే పిఠాపురం నియోజక­వర్గంలో రెండో అధికార కేంద్రం తయారు చేసినట్లవుతుందని పవన్‌ భావించారని, అందుకే వర్మకు సీటు ససేమిరా అన్నారని చెబుతున్నారు. పవన్‌ అడ్డు చెప్పడం వల్లే వర్మకు చంద్రబాబు సీటు ఇవ్వలేదని టీడీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. పిఠాపురం పూర్తిగా తన చేతిలో ఉండాలంటే.. అక్కడ తాను తప్ప మరో నాయకుడు ఉండకూడదని పవన్‌ భావిం­చడం వల్లే వర్మను పక్కన పెట్టారని నియోజకవర్గంలో చర్చ మొదలైంది. ఇదివరకు రెండు చోట్ల ఓడిపోయిన పవన్‌ కళ్యాణ్‌ కోసం ఎమ్మెల్యే సీటు త్యాగం చేసిన వర్మకు ఇది తీరని అన్యాయమని టీడీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. హామీ ఇచ్చి.. చివరకు మోసంగత ఎన్నికల్లో పొత్తులో భాగంగా తన సీటును పవన్‌ కళ్యాణ్‌కు కేటాయించినప్పుడు వర్మ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒక దశలో టీడీపీకి రాజీనామా చేసేందుకు సిద్ధ­మయ్యారు. దీంతో చంద్రబాబు తన వద్దకు పిలిపించుకుని బుజ్జగించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి దఫాలోనే ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తానని, మంచి రాజకీయ భవిష్యత్‌ ఉంటుందని హామీ ఇచ్చారు. వర్మ రాజకీయ భవితవ్యా­నికి ఢోకా లేకుండా చేస్తానని నియోజకవర్గ నేతలకు సైతం మధ్యవర్తుల ద్వారా చెప్పించారు. పవన్‌ గెలుపు కోసం పని చేయాలని ఒత్తిడి చేశారు. దీంతో పార్టీ కోసం వర్మ తన సీటును త్యాగం చేయడంతోపాటు పవన్‌ పక్కనే నిలబడి ఆయన్ను గెలిపించేందుకు నియోజకవర్గం అంతా తిరిగారు. టీడీపీ శ్రేణులు పలుచోట్ల ఆందోళనలు చేసినా, ఎవరి కోసమో పని చేయడం ఏమిటని తిట్టినా పట్టించుకోకుండా పవన్‌ కోసం పని చేశారు. ఆయన ఎటువంటి ఇబ్బందులు సృష్టించకుండా పని చేయడం వల్లే శాసనసభలో అడుగుపెట్టాలనే పవన్‌ కల నెరవేరింది. తన కలను నెరవేర్చ­డానికి పని చేసిన వర్మను పవన్‌ రాజకీయంగా పూర్తిగా తొక్కే­యాలనుకోవడం, ఇందుకు చంద్రబాబు సహ­క­రించడం పట్ల సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. పార్టీ కోసం పని చేసిన వారిని పట్టించుకోకుండా పక్క పార్టీ కోసం పని చేయడం తమ వల్ల కాదని టీడీపీ నేతలు ఆవేదన చెందుతున్నారు. పవన్‌­కళ్యాణ్‌ తన రాజకీయ భవితవ్యం కోసం వర్మ అవ­కా­శాలను దెబ్బ తీయడం, ఇదే సమయంలో తన సోదరుడు నాగబాబుకు మాత్రం పదవి ఇప్పించుకోవడం దారుణమని వాపోతున్నారు.టీడీపీ అభ్యర్థులు వీళ్లే..టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల్లో ఒకరైన బీద రవిచంద్ర మంత్రి లోకేశ్‌కు అత్యంత సన్నిహితుడు కావడంతో ఆయన పేరు ఖరారు చేశారు. లోకేశ్‌ పాదయాత్రతో పాటు గత ఎన్నికల్లో ఆయన వ్యవహారాల్లో రవిచంద్ర కీలకంగా వ్యవహరించారు. రాయలసీమ ప్రాంతం నుంచి ఒక్కరికైనా అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో సిట్టింగ్‌ ఎమ్మెల్సీ బీటీ నాయుడుకు అవకాశం ఇచ్చారు. మూడో స్థానాన్ని టీడీపీ సీనియర్‌ నేత, మాజీ స్పీకర్‌ ప్రతిభా భారతి కుమార్తె గ్రీష్మను ఎంపిక చేశారు. ఇద్దరు బీసీలు, ఒక ఎస్సీకి అవకాశం ఇచ్చినట్లు టీడీపీ నేతలు తెలిపారు. జనసేన తరఫున నాగబాబుకు ఒక స్థానం, బీజేపీకి ఇంకో స్థానం కేటాయించారు. కాగా, బీజేపీ తన అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది. బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు, మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్‌ మాధవ్, పార్టీ నేతలు పాకా వెంకటసత్యనారాయణ, గారపాటి సీతారామాంజ­నేయచౌదరి, మాలతీరాణి పేర్లు అధిష్టానం పరిశీలనలో ఉన్నాయి.

H1B visas are difficult to get this year10
ఈ ఏడాది హెచ్‌1బీ వీసాలు కష్టమే

సాక్షి, అమరావతి: అమెరికా వీసాల్లో అత్యధిక డిమాండ్‌ ఉన్న హెచ్‌1బీ వీసాలు ఈ ఏడాది పొందడం చాలా కష్టంగా తయా­ర­య్యింది. అధిక నైపుణ్యంతో దీర్ఘకాలం పనిచేయడానికి ఉపయోగపడే హెచ్‌1బీ వీసాలు పొందడంలో మల్టీ నేషనల్‌ కంపెనీలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. ట్రంప్‌ అధికారం చేపట్టిన తర్వాత హెచ్‌1బీ వీసాల జారీపై కఠిన ఆంక్షలు విధించింది. దీనితో నైపుణ్యం కలిగిన మానవ వనరులను బహుళజాతి కంపెనీలు ఇతర దేశాల నుంచి తెచ్చుకోలేక అష్ట కష్టాలు పడుతున్నాయి. ఎన్నడూ లేని విధంగా అమెరికా ఈ ఏడాది ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 85,000 మందికి మించి హెచ్‌1బీ వీసాలు జారీ చేయకూడదన్న పరిమితిని విధించింది. మార్చి7న ప్రారంభమైన వీసాల జారీ ప్రక్రియ మార్చి 24తో ముగియనుంది. ఈ వీసాల కోసం ఇప్పటికే 4,23,028 మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఇందులో మూడు లక్షలకు పైగా దరఖాస్తులు తిరస్కరణకు గురి అవుతాయన్న అంచనాలను నేషనల్‌ ఫౌండేషన్‌ ఫర్‌ అమెరికా పాలసీ తాజాగా విడుదల చేసిన నివేదిక వెలువరించింది.కంపెనీలపై తీవ్ర ప్రభావంప్రస్తుత నిబంధనల ప్రకారం చూస్తే దరఖాస్తు చేసుకున్నవారిలో 20 శాతంకు మించి హెచ్‌1బీ వీసాలు వచ్చే అవకాశం కనిపించడం లేదు. విదేశాల్లో జన్మించిన శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, ఇతర అధిక నైపుణ్యం కలిగిన నిపుణులను దీర్ఘకాలం పనిచేసే విధంగా ఈ వీసా ద్వారా కంపెనీలు నియమించుకుంటాయి. తాజా కఠిన నిబంధనల వల్ల 3 లక్షలకు పైగా నైపుణ్యం కలిగిన మానవ వనరులను అమెరికా కోల్పోతోందని, ఈ నిర్భంధ నిబంధనలు కంపెనీ యాజమాన్యాలకు తీవ్ర సమస్యలను తీసుకు వస్తున్నాయని ఫోర్బ్స్‌ తన నివేదికలో వ్యాఖ్యానించింది.ఇతర వీసాల జారీ సులభంహెచ్‌1బీ వీసాకంటే ఇతర వీసాలు మంజూరు సులభంగా ఉంటోందని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. 2024లో దరఖాస్తు చేసుకున్న వారిలో సందర్శకులు కోటాలో జారీ చేసే బీ1/బీ2 వీసాలు 72 శాతం మందికి జారీ అయ్యాయి. వేసవి కార్మికులు, పరిశోధకుల కోటాలో జారీ అయ్యే జే1 వీసాలు 89 శాతానికి ఇమిగ్రేషన్‌ అధికారుల ఆమోదముద్ర పడింది. అమెరికాలో హెచ్‌1బీ వీసాలు కింద పనిచేసే ఉద్యోగులకు సగటున నెలకు భారతీయ కరెన్సీల్లో రూ.9 లక్షల నుంచి రూ.10 లక్షలపైనే వేతనం లభిస్తుంది. అందుకే ప్రతీ భారతీయుడు హెచ్‌1బీ వీసా కింద అమెరికాకు వెళ్లి పనిచేయాలనుకుంటాడు. అయితే మారిన పరిస్థితులు స్థానిక యువత ఆశలకు గండికొట్టిందని ఎంఎన్‌సీ కంపెనీలు వ్యాఖ్యానిస్తున్నాయి.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

NRI View all
title
న్యూయార్‌లో ఘనంగా తెలుగువారి సంబరాలు.

అమెరికా వాణిజ్య రాజధాని న్యూయార్క్ లో తెలుగువారి సంబరాలు అంబరాన్ని అంటాయి.

title
ఆస్ట్రేలియాలో మహిళలపై లైంగిక దాడి.. భారతీయ ప్రముఖుడికి 40 ఏళ్ల జైలు శిక్ష

సిడ్నీ: ఆస్ట్రేలియాలో ఐదుగురు మహిళలపై లైంగిక దాడికి పాల్పడిన

title
విశాఖకు ఎన్నారై మహిళ ఎందుకొచ్చింది?.. ఆ రూమ్‌లో ఏం జరిగింది?

విశాఖ సిటీ: విశాఖలో ఖాకీ క్రైమ్‌ కథా చిత్రం..

title
లండన్‌లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు

బిందువు బిందువు కలిస్తేనే సింధువు అనే విధంగా యూకే లో నివసిస్తున్న తెలుగు మహిళలు అందరూ “తెలుగు లేడీస్ యుకె” అనే ఫేస్‌బుక్

title
న్యూజెర్సీలో నాట్స్ ఇమ్మిగ్రేషన్ సెమినార్

న్యూ జెర్సీ: అమెరికాలో తెలుగు వారి కోసం అనేక కార్యక్రమాలు చ

Advertisement

వీడియోలు

Advertisement