Top Stories
ప్రధాన వార్తలు

వైఎస్సార్సీపీలో కీలక నియామకాలు
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీలో నూతన నియామకాలు జరిగాయి. పార్టీలో పదవుల భర్తీలో భాగంగా పలు నియామకాలను ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టారు. ఆయన ఆదేశాల మేరకు వైఎస్సార్సీపీ పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులతో పాటు.. సింగనమల అసెంబ్లీ నియోజకవర్గం సమన్వయకర్తగా సాకే శైలజానాథ్‌ను నియమిస్తూ.. పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.వైఎస్సార్సీపీ పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు వీరే1.శ్రీకాకుళం-కుంభా రవిబాబు (ఎమ్మెల్సీ)2.విజయనగరం- కిల్లి సత్యనారాయణ3.అరకు- బొడ్డేటి ప్రసాద్4.అనకాపల్లి-శోభా హైమావతి (మాజీ ఎమ్మెల్యే)5.విశాఖ-కదిరి బాబూరావు (మాజీ ఎమ్మెల్యే)6.కాకినాడ- సూర్యనారాయణరాజు (మాజీ ఎమ్మెల్సీ)7.అమలాపురం-జక్కంపూడి విజయలక్ష్మి8.ఏలూరు-వంకా రవీంద్రనాథ్ (ఎమ్మెల్సీ)9.రాజమండ్రి- తిప్పల గురుమూర్తిరెడ్డి10.మచిలీపట్నం -జెట్టి గురునాథం11.నరసాపురం- ముదునూరి మురళీకృష్ణంరాజు12.విజయవాడ-మోదుగుల వేణుగోపాలరెడ్డి (మాజీ ఎంపీ)13.గుంటూరు-పోతిన మహేష్14.నరసరావుపేట-డా.పూనూరు గౌతంరెడ్డి15.బాపట్ల-తూమటి మాధవరావు (ఎమ్మెల్సీ)16.ఒంగోలు-బత్తుల బ్రహ్మానందరెడ్డి17.నెల్లూరు-జంకె వెంకటరెడ్డి (మాజీ ఎమ్మెల్యే)18.తిరుపతి-మేడా రఘునాథరెడ్డి (ఎంపీ)19.చిత్తూరు-చవ్వా రాజశేఖర్‌రెడ్డి20.రాజంపేట- కొత్తమద్ది సురేష్‌బాబు (మేయర్)21.కడప-కొండూరి అజయ్‌రెడ్డి22.అనంతరం-బోరెడ్డి నరేష్‌కుమార్‌రెడ్డి( మాజీ ఎమ్మెల్సీ)23.హిందూపురం-ఆర్.రమేష్‌రెడ్డి24.నంద్యాల- కల్పలతారెడ్డి (ఎమ్మెల్సీ)25.కర్నూలు-గంగుల ప్రభాకర్‌రెడ్డి (మాజీ ఎమ్మెల్సీ)

'వేతన యాతన'!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రలో అసంఘటిత రంగ కార్మీకుల కనీస వేతన సవరణ ప్రక్రియ ముందుకు సాగడం లేదు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత ఒక్కసారి కూడా కనీస వేతన సవరణ జరగలేదు. ఐదేళ్లకోసారి తప్పనిసరిగా కనీస వేతన సవరణను ఖరారు చేయాలని కార్మీక చట్టాల్లో ఉన్నప్పటికీ 11 ఏళ్లుగా ఆ దిశగా ప్రభుత్వాలు కసరత్తు చేయలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2006 నుంచి 2012 మధ్య ఇచ్చిన వేతన సవరణ ఉత్తర్వులే ఇప్పటికీ దిక్కయ్యాయి. ఆ ఉత్తర్వుల ప్రకారం వివిధ ఉపాధి రంగాల్లో కనీస వేతనం రూ. 3,370 నుంచి రూ. 5,138 మధ్య ఉంది. రాష్ట్రంలో 73 ఉపాధి రంగాలు ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించగా వాటిలో దాదాపు 1.27 కోట్ల మంది కార్మీకులు పనిచేస్తున్నారు. వారిలో 38 లక్షల మంది మహిళలు ఉన్నట్లు రాష్ట్ర కార్మీక శాఖ గణాంకాలు చెబుతున్నాయి. పెరుగుతున్న జీవన ప్రమాణాలు, మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ఐదేళ్లకోసారి ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం వేతన స్థిరీకరణ చేస్తుంది. అదే తరహాలో అసంఘటితరంగ కార్మికుల వేతన సవరణను కూడా ఐదేళ్లకోసారి చేయాల్సి ఉంది. ఈ ప్రక్రియలో రాష్ట్ర స్థాయిలోని కార్మీక వేతన సలహా బోర్డు పాత్ర కీలకం. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి ఇప్పటివరకు ఒక్కసారి కూడా వేతన సవరణ ప్రక్రియ కొలిక్కిరాలేదు. కొత్త రాష్ట్రంలో నాలుగు బోర్డులు... తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత నాలుగు కనీస వేతన సవరణ సలహా బోర్డులు ఏర్పాటయ్యాయి. మొదటి సలహా బోర్డు 2014 నవంబర్‌లో ఏర్పాటై 2016 నవంబర్‌తో ముగిసింది. రెండో బోర్డు 2016 డిసెంబర్ నుంచి 2018 డిసెంబర్ వరకు కొనసాగాల్సి ఉంది. కానీ తదుపరి బోర్డు ఏర్పాటులో జాప్యంతో 2021 ఫిబ్రవరి కొనసాగింది. ఈ కాలంలో మొత్తం ఆరుసార్లు సమావేశమైంది. ఆ తర్వాత మూడో బోర్డును ప్రభుత్వం 2023 మేలో ఏర్పాటు చేసింది. అయితే 2023 డిసెంబర్లో ఏర్పాటైన కొత్త ప్రభుత్వం నామినేటెడ్ పదవులను రద్దు చేయడంతో ఆ బోర్డు రద్దయ్యింది. 2024 మార్చిలో నాలుగో బోర్డు చైర్మన్‌ను నియమించిన ప్రభుత్వం.. పూర్తిస్థాయి బోర్డును 2024 డిసెంబర్లో నియమించింది. ఏయే బోర్డులు ఏం చేశాయి? అసంఘటితరంగ కార్మీకుల వేతన సవరణ కోసం రాష్ట్రంలో ఏర్పాటైన మొదటి బోర్డు పలు దఫాల చర్చల అనంతరం అన్‌స్కిల్డ్ కార్మీకుడి కనీస వేతనాన్ని రూ. 11,905.36 నుంచి రూ. 12,068.80 మధ్య ఉండేలా సిఫారసు చేసింది. మొత్తం 73 షెడ్యూల్డ్ రంగాలకుగాను 34 రంగాలకు ఈ వేతనాలను ఖరారుచేస్తూ కార్మీక శాఖకు ప్రతిపాదనలు పంపింది. ఇక రెండో బోర్డు.. మొదటి బోర్డు చేసిన సిఫార్సులను పునఃసమీక్షించి కేటగిరీలవారీగా వేతన సవరణ పూర్తిచేసి ప్రభుత్వానికి సిఫారసు చేసింది. అందులో 5 కేటగిరీలకు ప్రభుత్వం జీఓలు ఇచ్చినప్పటికీ వాటిని గెజిట్‌లో చేర్చలేదు. దీంతో మరో 12 కేటగిరీల ప్రతిపాదనలను పెండింగ్‌లో పెట్టింది. ఇక మిగిలిన 56 కేటగిరీల ప్రతిపాదనల ఊసేలేదు. ఆ తర్వాత ఏర్పాటైన మూడో బోర్డు ప్రస్తుతమున్న ఏడు కార్మిక కేటగిరీలను నాలుగుకు కుదించేందుకు ప్రయత్నించింది. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావడంతో మూడో బోర్డు రద్దైంది. ప్రస్తుత నాలుగో బోర్డు పలు దఫాలు సమావేశమైనా ఇంకా నిర్ణయాలేవీ తీసుకోలేదు. ఈలోగా రేవంత్ ప్రభుత్వం గతేడాది మొత్తం 73 ఉపాధి రంగాలకూ కనీస వేతన సవరణ చేయాలని నిర్ణయిస్తూ ప్రిలిమినరీ నోటిఫికేషన్లు జారీ చేసింది. దీంతో కనీస వేతన సవరణ ప్రక్రియ మళ్లీ మొదటికొచ్చింది. వేతన సవరణ లెక్క సూత్రం... ఒక కార్మీకుడి కుటుంబంలో నలుగురు సభ్యులుంటే అందులో కార్మీకుడిని ఒక యూనిట్ విలువగా, కార్మికుని భార్యను 0.8 యూనిట్‌గా, ఇద్దరు పిల్లల్ని 0.6 చొప్పున నిర్ధారిస్తారు. లేబర్ మినిస్టర్స్ కాన్ఫరెన్స్ ఆమోదం ప్రకారం ఒక కార్మీకుడు జీవించేందుకు అవసరమైన కేలరీలు 2,700. ఒక కుటుంబానికి ఏడాదికి కావాల్సిన వస్త్రం 72 గజాలు. ఇంటి అద్దె కింద 10 శాతం, పిల్లల చదువులు, వైద్యం, ఇతర ఖర్చులకు 20 శాతం చొప్పున లెక్కించి వేతన సవరణ చేయాలి. సవరణ సమయంలో నిత్యావసరాల ధరలు, మార్కెట్ పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాలి. శాస్త్రీయత పాటించకుంటే న్యాయ చిక్కులు కార్మికుల కనీస వేతన సవరణ ప్రక్రియను చట్టప్రకారం చేయాలి. అక్రాయిడ్ ఫార్ములా ఆధారంగా గణించాలి. గత ప్రభుత్వ నిర్ణయాల కంటే మెరుగ్గా వేతన సవరణ చేస్తామని ఇప్పటి ప్రభుత్వం చెబుతున్నా అందుకు శాస్త్రీయత, క్రమపద్ధతి పాటించకుంటే న్యాయ చిక్కులు తప్పవు. – ఎండీ యూసూఫ్, కనీస వేతన సలహా బోర్డు సభ్యుడు, ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు దుర్భరంగా కార్మీకుల జీవితాలు తెలంగాణ ఏర్పాటు తర్వాత అసంఘటితరంగ కార్మీకుల వేతన సవరణ కోసం చాలాసార్లు ప్రభుత్వానికి విన్నవించాం. అయినా వేతన సవరణ జరగకపోవడంతో కార్మీకుల జీవితాలు దుర్భరంగా ఉన్నాయి. నిత్యావసరాల ధరలు భారీగా పెరిగినా కనీస వేతన సవరణపై ప్రభుత్వం దృష్టిపెట్టకపోవడం సరికాదు. కేంద్రం కనీస వేతనాన్ని రూ. 21 వేలకు ఖరారు చేసినా తెలుగు రాష్ట్రాల్లో అత్యంత తక్కువగా వేతనాలున్నాయి. – సుంకరి మల్లేశం, ఈపీఎఫ్ఓ సీబీటీ మెంబర్, భారత్ మజ్దూర్ యూనియన్ అధ్యక్షుడు ఇది శ్రమ దోపిడీయే ప్రభుత్వం దశాబ్దన్నర కాలంగా వేతన సవరణ చేయకపోవడం కార్మీకుల శ్రమను దోచుకోవడమే. మొత్తం 73 ఉపాధి రంగాలకు వేతనాలను సవరించాలని రెండో కార్మీక వేతన సవరణ సలహా బోర్డు 2021 ఫిబ్రవరి 3న రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేస్తే అందులో 5 ఉపాధి రంగాలకు తుది ఉత్తర్వులు వెలువడ్డా గెజిట్‌లో ప్రచురించకపోవడం, మిగిలిన ఉపాధి రంగాలకు జీఓలు ఇవ్వకపోవడంతో కార్మీకులు నష్టపోతున్నారు. – దేవసాని భిక్షపతి, కనీస వేతన సలహా బోర్డు మాజీ సభ్యుడు, ఐఎన్టీయూసీ ప్రధాన కార్యదర్శి అసంఘటిత రంగ కార్మీకుల కనీస వేతన సవరణకు పడని ముందడుగుఅన్‌స్కిల్డ్ కార్మీకుడైన నర్సింహ 20 ఏళ్లుగా ఓ ప్రైవేటు నిర్మాణ సంస్థలో పనిచేస్తున్నాడు. ఉమ్మడి రాష్ట్రంలో 2007లో ఈ రంగానికి సంబంధించి జరిగిన వేతన సవరణ ప్రకారం ఆయన నెలవారీ కనీస వేతనంరూ. 3,370గా ఖరారైంది. ఆ నిబంధనల ప్రకారం ప్రస్తుతం నర్సింహ అందుకుంటున్న వేతనం రూ. 12,420 మాత్రమే. వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలో రెండో కనీస వేతన సవరణ సలహా బోర్డు సిఫార్సుకు అనుగుణంగా ప్రభుత్వం జారీ చేసిన జీఓ 22 ప్రకారం నర్సింహ నెలవారీ కనీస వేతనం రూ. 23,275గా ఉండాలి. కానీ ఆ జీఓను గెజిట్‌లో ప్రచురించకపోవడం వల్ల ఆయన ఏకంగా రూ. 10,855 తక్కువ వేతనం పొందుతున్నాడు.

ఇంతకూ పరిష్కారం ఏమిటి?
పహల్గామ్లో తీవ్రవాదుల ఘాతుకమైన దాడి ఏప్రిల్ 22న జరిగి వారం రోజులు గడిచాయి. ప్రతిగా భారత ప్రభుత్వం దౌత్య పరమైన చర్యలు కొన్ని తీసుకున్నది గాని, దేశంలో రగులుతున్న ఆగ్రహావేశాలు చల్లారు తున్న సూచనలు లేవు. ‘కశ్మీర్ రెసిస్టెన్స్’ పేరిట దాడి జరిపిన వారిని పట్టుకుని శిక్షించటం ఒకటైతే, ఇటువంటి సంస్థలను మొదటినుంచి ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్‌పై తగిన ప్రతీకార చర్య అన్నది అంతకుమించిన అవసరంగా సాధారణ భారతీయుల మనస్సులను దహించి వేస్తున్నది. పాక్‌తో గల సింధూ నదీ జలాల ఒప్పందం అమలును నిలిపివేస్తున్నామన్న ప్రకటన దాని పర్యవసానాల రీత్యా తీవ్రమైనదేగానీ, అంతకుమించిన తక్షణ చర్య, సూటిగా చెప్పాలంటే సైనిక చర్యను జనం కోరుతున్నారు. తీవ్రవాదుల కోసం కశ్మీర్లో ముమ్మరమైన తనిఖీలు సాగు తున్నాయి. అనుమానితులను ఇప్పటికే పెద్ద సంఖ్యలో అదుపులోకి తీసుకుని కొందరి ఇళ్ళను కూల్చివేస్తున్నారు. సాధారణంగా జరిగేట్లు ఇంతవరకు ఎవరినీ ఎన్కౌంటర్లలో కాల్చివేయలేదు. కశ్మీర్లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, సైన్యాధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేది పర్య టించి సైన్యాన్ని అప్రమత్తం చేశారు. వైమానిక బలగాన్ని కూడా. నౌకా బలాలు విన్యాసాలు జరిపాయి. అనగా త్రివిధ బలాలు సన్నద్ధ మవుతున్నాయన్నమాట. యుద్ధంతో మనకూ నష్టమే!కొద్ది రోజులుగా ప్రతి రోజూ రాత్రి సరిహద్దు దళాల మధ్య కాల్పులు జరుగుతున్నాయి. అది ‘తేలిక రకం’ ఆయుధాలతోనన్నది సైన్యం స్వయంగా చెప్తున్నమాట. తేలిక రకం అనే మాట కిందకు పలు రకాల ఆయుధాలు వస్తాయి. వాటిలో ప్రజలు వినే పేర్లు ఇన్సాస్ రైఫిళ్లు, లైట్ మెషీన్ గన్స్, సబ్ మెషీన్ గన్స్. వాటి ప్రయోగంతో రెండువైపులా ప్రాణ నష్టాలు ఇప్పటికి జరగలేదు. సరిహద్దులలో తగినంత దూరం పాటిస్తారు, బంకర్లలో ఉంటారు. గనుక ప్రాణ నష్టాలు సాధారణంగా జరగవు. తేలిక రకం ఆయుధాల వినియోగం స్థానిక కమాండర్ల నియంత్రణలో జరుగుతుంది. ఉన్నతాధికారుల ఆదేశాలతో భారీ ఆయుధాల వినియోగం జరిగితేనే ఘర్షణ పైస్థాయికి వెళ్లినట్లు! త్రివిధ బలాలను అప్రమత్తం చేసినందున పూర్తి స్థాయి యుద్ధమా? 2019లో పుల్వామా వద్ద భారత సైనికులపై దాడిలో 40 మంది చనిపోయిన దరిమిలా పాకిస్తాన్‌లోని బాలాకోట్ టెర్రరిస్టు స్థావరాలపై మెరుపు దాడులు జరిపి అంతకు పరిమితం కావడం వంటిదా? కొద్దిగా ఆలోచించినట్లయితే పూర్తి స్థాయి యుద్ధానికి అవకాశం కన్పించదు. ఇండియా కన్నా పాకిస్తాన్ సైనిక శక్తి తక్కువే గానీ మరీ అంత బలహీనమైనది కాదు. యుద్ధం దీర్ఘకాలం సాగితే పాకిస్తాన్ ఓడుతుంది గానీ భారతదేశానికి కూడా తీవ్ర నష్టాలు కలుగుతాయి. యుద్ధాన్ని అవకాశంగా తీసుకుని పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను స్వాధీనపరచుకోవచ్చునని ఎవరైనా భావిస్తే, కొత్త సమ స్యలు కొని తెచ్చుకోవటమవుతుంది. సగం కశ్మీర్‌తోనే ఇన్ని సమస్య లున్నాయి. అణు యుద్ధానికి ఇపుడెవరూ సుముఖంగా లేరు. కానీ పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను స్వాధీనపరచుకునే స్థితి అంటూ కనిపిస్తే, అణు ప్రయోగానికి పాక్ సైన్యం వెనుకాడబోదు. తూర్పు పాకిస్తాన్ తమది కాకుండా పోయిందనే ఆగ్రహం వారికి ఇప్పటికీ చల్లారలేదు.అందువల్ల, అటు ఇటుగా బాలాకోట్ నమూనా ప్రతిదాడులకే అవకాశాలు కనిపిస్తున్నాయి. వివాదాన్ని ముదరనివ్వకండంటూ ఇప్పటికే సూచనలు చేస్తున్న అమెరికా జోక్యాలు తెర వెనుక నుంచి ఎట్లుండవచ్చునన్నది మరో ప్రశ్న. అమెరికా మాటను కాదనే శక్తి భారత, పాకిస్తాన్లలో దేనికీ లేదన్నది ఒక చేదు నిజం. కశ్మీర్లో అంతర్గతంగా టెర్రరిజంపై, మిలిటెన్సీపై ఎటువంటి చర్యలైనా భారత భద్రతాదళాలు యథేచ్ఛగా తీసుకోగలవు. ఆ చర్యలు సుమారు 1990 నుంచి 35 సంవత్సరాలుగా తీసుకుంటున్నవే.అందువల్ల కలిగిన ఫలితాలేమిటన్నది వేరే ప్రశ్న.నీటిని ఆపగలమా?ప్రభుత్వం ఇప్పటికి ప్రకటించిన చర్యలలో నిజంగా తీవ్రమైనది సింధూ ఒప్పందాన్ని సస్పెండ్ చేయటం. 1960 నాటి ఆ ఒప్పందం పాకిస్తాన్‌కు కీలకమైనది. ఆ జలాలు ఆగినా, తగ్గినా వారి వ్యవ సాయం అల్లకల్లోలమవుతుంది. కనుకనే పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, అది తమపై ‘యుద్ధ చర్య’ కాగలదంటూ తీవ్రమైన భాషను ఉపయోగించారు. పాకిస్తాన్‌కు ‘ఒక్క చుక్క’ నీరు కూడా పోనివ్వమని భారత ప్రభుత్వ బాధ్యులు ప్రకటించనైతే ప్రకటించారు గానీ,పోకుండా ఆపటం నిజంగా సాధ్యమా? ప్రపంచబ్యాంకు ఆధ్వర్యాన జరిగిన ఈ అంతర్జాతీయ జలాల పంపిణీ ఒప్పందంలో ఐక్యరాజ్య సమితి పాత్ర ఉంది. బ్యాంకు పక్షాన ‘ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్’ (ఐబీఆర్డీ) సంతకం చేసింది. ఏదైనా వివాదం తలెత్తితే మొదట ‘తటస్థ నిపుణుని’ దృష్టికి, తర్వాత ‘కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్’ ముందుకు వెళ్లాలి. తిరిగి ఇందులోనూ రెండు దేశాల సార్వభౌమాధికారానికి ఏది వర్తిస్తుంది, ఏది వర్తించదనే మీమాంస ఉంది. లోగడ రెండుసార్లు వాస్తవంగా యుద్ధాలు జరిగి నపుడు కూడా ఇటువంటి సస్పెన్షన్లు జరగలేదు. ఇదంతా సాంకేతిక పరమైన కోణం కాగా, నీరు అటు పోకుండా ఆపగల జలాశయ నిర్మా ణాలు అసలు ఇండియాకు లేనే లేవనీ, ఆ నిర్మాణాలకు అనేక చిక్కు లున్నాయనే ఆచరణపరమైన విషయాలను నిపుణులు ప్రస్తావిస్తు న్నారు. అనగా, ఈ చర్య ఎంత ప్రభావం చూపగలిగేది అయినా ఇప్పటికిప్పుడు జరిగేది కాదన్నమాట.వాస్తవాధీన రేఖే పరిష్కారమా?మనం విస్మరించేదేమంటే కశ్మీర్ తరహా అనేక భౌగోళిక, సరిహద్దు సమస్యలను బ్రిటిష్ వలస పాలకులు ప్రపంచమంతటా సృష్టించిపోయారు. భారత–చైనా, భారత–బంగ్లాదేశ్, పాలస్తీనా– ఇజ్రాయెల్ వంటివన్నీ అందుకు ఉదాహరణలు. తిరిగి వాటిని సొమ్ము చేసుకుంటూ పాశ్చాత్య దేశాలు ఇరుపక్షాలకూ ఆయుధాలను అమ్ముకుంటున్నాయి.కశ్మీర్‌కు సంబంధించి ఒక వివేకవంతమైన పరిష్కార మార్గాన్ని మొదటిసారిగా కనుగొన్నది 1972లో అప్పటి ప్రధానులు ఇందిరా గాంధీ, జుల్ఫికర్ అలీ భుట్టో. 1971లో బంగ్లాదేశ్ యుద్ధం తర్వాత వారు సిమ్లాలో సమావేశమై, కశ్మీర్లో నియంత్రణ రేఖ (ఎల్ఓసీ, లేదా లైనా ఆఫ్ కంట్రోల్)ను శాశ్వత సరిహద్దుగా గుర్తించుకున్నట్ల యితే అన్ని సమస్యలూ సమసిపోగలవని సూత్రప్రాయమైన నిర్ణయం తీసుకున్నారు. కానీ, తమ రాజధానులకు తిరిగి వెళ్లి ప్రజాభిప్రాయా నికి జంకి వెనుకకు పోయారు. ఆచరణాత్మకంగా ఆలోచించినట్లయితే, అది మాత్రమే ఎప్పటికైనా శాశ్వత పరిష్కారం కాగలదా?ఇది భారత–పాకిస్తాన్ సమస్యల పరిష్కారం అయితే, ఇక మిగి లేది కశ్మీర్లో అంతర్గత సమస్యలు. మొదటిది తేలినపుడు రెండవది సగం మేర తేలుతుంది. తక్కినది అభివృద్ధి, ఉపాధి కల్పన, అవి నీతిని అదుపు చేయటం, స్వేచ్ఛాయుతమైన ఎన్నికలతో తప్పకుండా పరిష్కారమవుతుంది. ఈ మాట నేను 3 విడతలుగా 55 రోజుల పాటు కశ్మీర్ అన్ని ప్రాంతాలలో తిరిగి అన్ని వర్గాల ప్రజలతో మాట్లా డిన మీదట అంటున్నది. 1947 నుంచి ఇంతవరకు గల కశ్మీర్ చరిత్ర నేపథ్యంలో అక్కడి ప్రస్తుత పరిస్థితులను, యుద్ధం ద్వారా ఏదైనా తేలగలదా అనే అవకాశాలను, మిలిటెన్సీ–టెర్రరిజాల హెచ్చు తగ్గుల క్రమాన్ని, ముఖ్యంగా 1987 నుంచి తీవ్రవాదం తలెత్తి సాగుతున్న కారణాలను పరిశీలించినపుడు, ఇటువంటి అభిప్రాయం ఏర్పడుతు న్నది. అందువల్ల రెండు దేశాలూ విజ్ఞతతో ఆలోచించి ఇందిరాగాంధీ–భుట్టోల స్ఫూర్తితో రాజీ మార్గానికి రావటం సమస్యను శాశ్వ తంగా పరిష్కరించి ఇరు దేశాలకు ఎనలేని మేలు చేయగలదు.టంకశాల అశోక్‌వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు

కెనడాలో లిబరల్స్‌కు పట్టం
అనుకున్నట్టే అయింది. సోమవారం కెనడాలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో లిబరల్ పార్టీ మరోసారి విజయకేతనం ఎగరేయబోతున్నదని ఫలితాల సరళి తెలియజెబుతోంది. 343 స్థానాలున్న పార్లమెంటులో ఆ పార్టీకి పూర్తి స్థాయి మెజారిటీ వస్తుందా, లేక వేరే పార్టీల ఆసరా కావాల్సివస్తుందా అన్నది మరికొన్ని గంటల్లో తేలిపోతుంది. గత మూడేళ్లుగా అధికార లిబరల్ పార్టీ అసంతృప్తిని మూట గట్టుకుంది. ఈసారి దాని ఓటమి ఖాయమని అన్ని సర్వేలూ జోస్యం చెప్పాయి. మొన్న జనవరిలో సైతం కన్సర్వేటివ్‌ల కన్నా లిబరల్స్ 20 పాయింట్లు వెనకబడివున్నారు. ఈ దశలో అమెరికాలో డోనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడు కావటం, ఆయన మతిమాలిన ప్రకటనలు, ఎడాపెడా సుంకాల విధింపు లిబరల్ పార్టీకి వరంలా మారాయి. ఇతరేతర సమస్యలవీ మాయమై కెనడాను అమెరికా కబళిస్తుందన్న భయాందోళనలు ఆవహించి కన్సర్వేటివ్ పార్టీని కాదని జనం ఎప్పటిలా లిబరల్ పార్టీవైపే మొగ్గు చూపారు. ప్రధాని పదవి నుంచి జస్టిన్ ట్రూడో తప్పుకోవటం కూడా లిబరల్స్‌కు కలిసొచ్చింది. ఆయన స్థానంలో గత నెల మొదట్లో ప్రధానిగా వచ్చిన మార్క్ కార్నీ చకచకా చక్రం తిప్పారు. ట్రంప్‌తో సాన్నిహిత్యమున్న కన్సర్వేటివ్ పార్టీ వస్తే దేశాన్ని అమెరికా పాదాక్రాంతం చేయటం ఖాయమన్న ప్రచారం పనికొచ్చింది. కన్సర్వేటివ్ పార్టీ జాతకం తలకిందులైంది. ప్రపంచ సంపన్న రాజ్యాల్లో ఒకటిగా, అమెరికా సన్నిహిత మిత్ర దేశంగా, వాణిజ్య భాగస్వా మిగా దశాబ్దాలపాటు వెలుగులీనిన కెనడా కొన్నాళ్లుగా కష్టాల్లో కూరుకుపోయింది. అయిదేళ్ల నాడు విరుచుకుపడిన కోవిడ్ వల్ల ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. జీవనవ్యయం అపారంగా పెరిగింది. నిరుద్యోగం తారస్థాయికి చేరింది. ఇళ్ల ధరలు ఆకాశాన్నంటాయి. నగరాల్లో అద్దెలు విపరీతంగా పెరగటంతో శివారు ప్రాంతాలకు జనం తరలిపోయారు. గృహ కొనుగోలుదారులు ఆ ఆలోచనను వాయిదా వేసుకున్నారు. ఇళ్లు లేని పౌరుల సంఖ్య పెరుగుతూ పోయింది. వీటన్నిటి పర్యవసానంగా పుట్టుకొచ్చిన సామాజిక అశాంతి మాదకద్రవ్యాల వాడకాన్ని ఊహించని స్థాయికి తీసుకెళ్లింది. దాంతోపాటే నేరాల సంఖ్య ఎక్కువైంది. నిజానికి ఇది కెనడాకు మాత్రమే పరిమితమైన సమస్య కాదు. సంపన్న దేశాలన్నీ ఈ మాదిరే సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి. కానీ కెనడా పౌరులు దీన్నంతటినీ లిబరల్ పార్టీ చేతగానితనంగా పరిగణించారు. గత మూడేళ్లుగా కన్సర్వేటివ్ పార్టీ నాయకుడు పియర్ పొయ్లేవ్ దేశం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం తమకే సాధ్యమని ప్రచారం చేశారు. ఆవరించిన ఈ సంక్షోభం బహుశా చాలా దేశాల మాదిరే కెనడాలో కూడా మిత వాదపక్షాన్ని అందలం ఎక్కించివుండేది. కానీ ట్రంప్ అధిక సుంకాలు విధించటం, కెనడాను 51వ రాష్ట్రంగా విలీనం చేసుకోవటం ఖాయమని తరచు చెప్పటం కన్సర్వేటివ్‌ల ఆశల్ని అడియాసలు చేసింది. పౌరుల్లో ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. వారు గెలిస్తే అదే జరగొచ్చునన్న సంశయం బలపడింది. తమ సహజ వనరులు, ఆర్థిక సంపద దోచుకోవటానికి అమెరికా తహతహలాడు తున్నదని, దీన్ని నిలువరించగల పార్టీ లేకుంటే ట్రంప్ అన్నంతపనీ చేస్తారని వోటర్లు భావించారు. ఇళ్ల నిర్మాణానికి అధిక ప్రాధాన్యతనిచ్చి వాటి ధరలు దిగొచ్చేలా చేస్తామని రెండు ప్రధాన పక్షాలూ వాగ్దానం చేశాయి. కొత్త భవనాల నిర్మాణంపైవున్న ఆంక్షల్ని ఎత్తేస్తామని కన్సర్వేటివ్‌లు హామీ ఇస్తే... ఇళ్ల నిర్మాణానికి ఆర్థిక సాయం అందిస్తామని కార్నీ వాగ్దానం చేశారు. అమెరికా నిజ స్వరూపం తెలిసింది గనుక ఇకపై భద్రతకు ఆ దేశంపై ఆధారపడకుండా సొంతంగా సైన్యాన్ని రూపొందించుకోవాలని రెండు పార్టీలూ ప్రతిపాదించాయి. అధిక సుంకాల విషయంలో కూడా ఆ రెండు పక్షాలదీ ఒకే మాట. కెనడా ఎగుమతుల్లో 80 శాతం అమెరికాకే చేరతాయి. అధిక సుంకాలు విధిస్తే కెనడా తీవ్రంగా నష్టపోతుంది. తాము కూడా అధిక సుంకాల ప్రక్రియ మొదలెట్టామని,దాంతో ఆ దేశం గత్యంతరం లేక చర్చలకు దిగొచ్చిందని కార్నీ చెప్పారు. అయితే కన్సర్వేటివ్‌లు ఇంత బలంగా ట్రంప్‌పై విరుచుకుపడలేకపోయారు. ఇక అధిక వలసలపై కూడా ప్రజల్లో ఆగ్రహం వుంది. లిబరల్స్ ఏలుబడిలో వలసలు పెరిగాయని వారు నమ్మారు. పర్యావరణ పరిరక్షణ పేరుతో కొత్తగా ఖనిజాలు, శిలాజ ఇంధనాల వెలికితీతను నిలిపేయటంవల్ల ఆ రంగాల్లో ఉపాధి అవకా శాలు అడుగంటాయని, తామొస్తే దీన్ని సరిదిద్దుతామని కన్సర్వేటివ్‌లు హామీ ఇచ్చారు. నిజానికి ఈ సమస్యలే అమెరికాలో మితవాద రిపబ్లికన్ పార్టీని అందలం ఎక్కించాయి. కానీ ట్రంప్ రాకతో ఆ సమస్యలన్నీ మరుగునపడి కెనడాలోని మితవాద పక్షాన్ని కోలుకోలేని దెబ్బతీశాయి.కార్నీ ఏలుబడిలో మనతో కెనడా సంబంధాలు మెరుగుపడతాయన్న అభిప్రాయం అందరిలో వుంది. ఆర్థిక సంక్షోభం నుంచి దేశాన్ని గట్టెక్కించే దారి దొరక్క, ఆ అసంతృప్తిని కప్పిపుచ్చటానికి ట్రూడో భారత్‌తో కోరి వైరాన్ని తెచ్చుకున్నారు. తీరా జగ్మీత్ సింగ్ ఆధ్వర్యంలోని ఖలిస్తానీ అను కూల న్యూడెమాక్రటిక్ పార్టీ(ఎన్డీపీ)కే ఈసారి దిక్కులేకుండా పోయింది. బలపడిన జాతీయ వాదం ఎన్డీపీని దెబ్బతీసింది. సిక్కువోటర్లు లిబరల్స్ వైపే మొగ్గారు. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ గవర్నర్‌గా, కెనడా సెంట్రల్ బ్యాంక్ చీఫ్‌గా కార్నీకి ఆర్థిక రంగంలో అపార అనుభవం వుంది. దేశ ఆర్థికవ్యవస్థకు నూతన జవసత్వాలు తెచ్చేందుకు ఆయన సహజవాయు నిక్షేపాల, ఖనిజాల వెలికి తీతకు ప్రాధాన్యమిస్తారని అంచనాలున్నాయి. మొత్తానికి ఇరుగుపొరుగు దేశాల్లో మితవాదులుంటే వారిలో ఒకరికి మాత్రమే గెలుపు దక్కుతుందని... ఒకచోట మితవాదుల దూకుడు మరొక దేశ మితవాదులకు ప్రాణాంతకమవుతుందని కెనడా ఫలితం నిరూపించింది.

బాబు చేస్తున్న విధ్వంసం అంతా ఇంతా కాదు : వైఎస్ జగన్
గుంటూరు, సాక్షి: సీఎం చంద్రబాబుపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్రంలో చంద్రబాబు చేస్తున్న విధ్వంసం అంతా ఇంతా కాదంటూ మండిపడ్డారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులతో ఆయన సోమవారం సమావేశం అయ్యారు. ఈ భేటీలో తాజా రాజకీయ పరిణామాలు, పార్టీ భవిష్యత్ కార్యక్రమాలు సహా అనేక అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమానికి సీనియర్ నేతలు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా హాజరయ్యారు.ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. చంద్రబాబు చేస్తున్న విధ్వంసం అంతా ఇంతాకాదు. విద్య, వైద్యం, వ్యవసాయం ఇలా అన్నిరంగాల్లోనూ విద్వంసమే. రెడ్ బుక్ రాజ్యాంగం రాష్ట్రంలో అమలవుతోంది. విచ్చలవిడిగా అవినీతి జరుగుతోంది. వీటిని ప్రజల్లోకి బాగా తీసుకువెళ్లాలి’ అని సూచించారు. జిల్లాలో పార్టీ ఓనర్షిప్ మీదిప్రజా సంబంధిత అంశాల్లో ఒకరి ఆదేశాలకోసం మీరు ఎదురు చూడొద్దు. మీకు మీరుగా స్వచ్ఛందంగా కదలాలి. నియోజకవర్గ ఇన్‌ఛార్జితో కలిసి మొదట కదలాల్సిందే మీరే. ప్రజలకు అండగా మీరు చేస్తున్న కార్యక్రమాల వల్ల అది రాష్ట్రస్థాయి దృష్టిని ఆకర్షిస్తుంది. దీనిద్వారానే మీ పనితీరు బయటపడుతోంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ మన్ననలు పొందాల్సిన బాధ్యత మీది. సమాజంలో గొంతులేని వారికి బాసటగా నిలిచేది వైయస్సార్సీపీయే. ప్రతి సమస్యలోనూ బాధితులకు తోడుగా నిలిచేది వైఎస్సార్సీపీయే. మే నెలలోపు మండల కమిటీలు పూర్తిచేయాలిజూన్-జులైల్లో గ్రామస్థాయి, మున్సిపాల్టీలల్లో డివిజన్ కమిటీలు పూర్తిచేయాలి. ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరులో బూత్ కమిటీలు ఏర్పాటు కావాలి. ఈమేరకు లక్ష్యంగా పెట్టుకోండి. జిల్లా స్థాయి నుంచి పార్టీని గ్రామస్థాయి వరకూ తీసుకువెళ్లే బాధ్యతల్లో మీరు ఉన్నారు. పార్టీ వ్యవస్థీకృతంగా ముందుకు సాగాలి. జిల్లా అధ్యక్షుల పాత్ర పార్టీలో చాలా కీలకమైనది. గ్రామస్థాయి బూత్ కమిటీలు, గ్రామ కమిటీలు ఏర్పాటు అనేది అత్యంత కీలక విధుల్లో ఒకటి. పార్టీలో సమర్థులు ఎవరు, ప్రతిపక్షంలో ఎవరు లీడ్ చేయగలరు అని ఆలోచన చేసి మీకు బాధ్యతలు అప్పగించడం జరిగింది. మీమీ జిల్లాల్లో పార్టీ మీద మీకు పట్టు ఉండాలి. పార్టీ బలోపేతం కోసం గట్టిగా కృషిగా చేయాలి. బాధ్యతల నుంచే అధికారం వస్తుంది.జిల్లాల్లో మీరే సర్వం. మీరే పార్టీ.. పార్టీయే మీరుజిల్లాల్లో అన్నిస్థానాల్లో గెలిపించాల్సిన బాధ్యత మీది. మనసా వాచా కర్మేణా అదే తలంపుతో పార్టీని నడపాలి. జిల్లాల్లో అన్ని నియోజకవర్గాల్లో గెలిపించే బాధ్యత మీది. అది మీ ప్రధాన బాధ్యత. దీనికోసం ఏం చేయాలన్నదానిపై మీరు గట్టిగా పనిచేయాలి. జిల్లాస్థాయి నుంచి గ్రామస్థాయి వరకూ ప్రతి కమిటీ బలంగా ఉండాలి. ఏదైనా నియోజకవర్గ ఇన్‌ఛార్జి పనితీరు బాగోలేకపోతే పిలిచి చెప్పగలగాలి. అప్పటికీ పనితీరు బాగోలేకపోతే ప్రత్యామ్నాయం చూడ్డంలో మీ భాగస్వామ్యం కీలకం. పార్టీలో ఇద్దరి మధ్య వివాదం ఉన్నప్పుడు పిలిచి సమన్వయం చేయాల్సిన బాధ్యత మీది. మీ పరిధిలో 7కు ఏడు గెలిపించాల్సిన బాధ్యత మీది. బాధ్యత, అధికారం రెండూ తీసుకోండి. మీరు సమర్థులని భావించి, మీకు ఈ బాధ్యతలు అప్పగించడం జరిగింది. అసెంబ్లీ నియోజకవర్గాల్లో సమన్వయం చేయడం, జిల్లాస్థాయి నుంచి గ్రామస్థాయి వరకూ కమిటీ నిర్మాణం మీ ప్రధాన బాధ్యత. అలాగే ప్రజా సంబంధిత అంశాల్లో చురుగ్గా ఉండాలి.ప్రతిపక్షంలో ఉన్నప్పుడే మన నాయకత్వ ప్రతిభ బయటపడుతుందిప్రతిపక్షంలో ఉన్నప్పుడే మన నాయకత్వ ప్రతిభ బయటపడుతుంది. భారీ లక్ష్యం ఉన్నప్పుడే బ్యాట్స్‌మన్ ప్రతిభ బయటపడుతుంది. అప్పుడే ఆ బ్యాట్స్‌మెన్ ప్రజలకు ఇష్టుడు అవుతాడు. ఇదికూడా అంతే. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనం చేసే పనులవల్ల మనం ఎలివేట్ అవుతాం. ప్రజల దగ్గర, పార్టీలోనూ గౌరవం పెరుగుతుంది. ఇమేజీ పెరుగుతుంది. మన పనితీరు వల్లే మనం మన్ననలను పొందగలుగుతాం. అందరూ ధోనీల్లా తయారు కావాలి. అప్పుడే మీ జిల్లాల్లో ఏడుకు ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో గెలవగలుగుతాం. జిల్లాల్లో ఏ జరిగినా మీరు ప్రజల తరఫున నిలబడాలి.కార్యక్రమాలు చురుగ్గాచేయాలి, ఆయా కార్యక్రమాల్లో పాల్గొనాలి. ప్రజా వ్యతిరేక అంశాలమీద గట్టిగా పోరాటం చేయాలి. లేదంటే పార్టీపరంగా మనం అవకాశాలను కోల్పోయినట్టే. బాధితులకు మనం అండగా ఉండాలి.మనమంతా రాజకీయ నాయకులంమనమంతా రాజకీయ నాయకులం. మన జీవితాలను రాజకీయాలకోసం పెట్టామనే విషయం మరిచిపోవద్దు. ఎట్టి పరిస్థితుల్లోనూ మనం వెనకడుగు వేయకూడదు. ప్రతిపక్షంగా మనకు వచ్చిన అవకాశాలను వదిలిపెట్టకూడదు. జిల్లాస్థాయిలో ప్రజా సంబంధిత అంశాలను మీరు బాగా వెలుగులోకి తీసుకు వస్తేనే ప్రజలకు దగ్గరవుతాం. మనం అధికారంలోకి వస్తేనే ప్రజలకు మరింత మంచి చేయగలం. ప్రజలకు మరింత మంచి చేయాలన్న తపన, తాపత్రయం ఉంది కాబట్టే రాజకీయాలు చేస్తున్నాం. నాన్నగారు చనిపోయిన తర్వాత ప్రతి ఇంట్లో నా ఫొటో ఉండాలనుకున్నాను కాబట్టే నేను రాజకీయాలు చేస్తున్నాను. అలాగే ప్రతి జిల్లాల్లో మీ సేవల గురించి మాట్లాడుకోవాలి.రెండు మూడు సంవత్సరాలు అయితే కాని ప్రభుత్వ వ్యతిరేకత సాధారణంగా బయటకు కనిపించదు. కాని ఏడాదిలోపే ప్రభుత్వంమీద వ్యతిరేకత తీవ్రంగా ఉంది. అందుకే యుద్ధ ప్రాతిపదికన కమిటీ నిర్మాణం పూర్తిచేయాలి. దీని తర్వాత పార్టీ పరంగా మీకూ, నాకూ పూర్తిగా పని ఉంటుంది. అందరం కలిసికట్టుగా పార్టీపరంగా కార్యక్రమాలు బలంగా ముందుకు తీసుకెళ్లాలి. అందుకనే పార్టీ పరంగా నిర్మాణాన్ని వీలైనంత త్వరగా పూర్తిచేయాలి. గ్రామస్థాయిలోకూడా కమిటీలు, బూత్ కమిటీల ఏర్పాటు పూర్తిచేస్తే… పూర్తిస్థాయి సన్నద్ధతతో ఉన్నట్టు అవుతుంది ప్రతి జిల్లాల్లో పార్టీ నిర్మాణం ద్వారా దాదాపు 12వేల మంది పార్టీ కార్యక్రమాలకోసం మీకు అందుబాటులో ఉంటారు. ప్రతి నియోజకవర్గంలో కూడా దాదాపుగా 1500 మంది ఉంటారు.మద్దతు ధరలు దొరక్క రైతులు తీవ్రంగా నష్టపోతున్నారువివిధ జిల్లాల్లో రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. రైతుల తరఫున పోరాటాలు చేయాల్సిన అవసరం ఉంది. ఆ మేరకు జిల్లాల్లో రైతులకు అండగా ఉండాలి. రైతుల డిమాండ్లపై పోరాటం చేయాలి.

అందరి అనుమానం అదే.. NIA ప్రశ్నకు తడబడ్డ జిప్‌లైన్ ఆపరేటర్
జమ్మూ: ఎన్ఐఏ విచారణలో జిప్‌లైన్ ఆపరేటర్ ముజమ్మిల్ తీరుపై పలు అనుమానాలు వెలుగులోకి వస్తున్నాయి. పహల్గాం ఉగ్రదాడి సమయంలో జిప్‌లైన్‌పై ప్రయాణిస్తున్న ఓ టూరిస్ట్ తీసిన వీడియోలో ఉగ్రదాడి ఘటన రికార్డైంది. అయితే అప్పటికే కాల్పులు ప్రారంభమైనా తనను హెచ్చరించకుండా ఆపరేటర్ అల్లహో అక్బర్ అని అరుస్తూ తనను ముందుకు తోశాడని గుజరాత్‌కు చెందిన టూరిస్ట్ రిషి భట్ చెప్పాడు. రిషి వీడియో బయటకు రావడంతో జిప్ లైన్ ఆపరేటర్‌ను ఎన్ఐఏ అదుపులోకి తీసుకొని విచారిస్తోంది.ఎన్ఐఏ విచారణలో ముజమ్మిల్ అల్లాహు అక్బర్ అని అనడంలో ఎలాంటి అనుమానం లేదని ఎన్ఐఏ వర్గాల సమాచారం. ఆపత్కాలంలో హిందువులు రామా అని ఎలా స్మరిస్తారో.. ముజమ్మిల్ సైతం తాను కూడా అల్లాహో అక్బర్ అని పలికినట్లు చెప్పినట్లు తెలుస్తోంది. అంతవరకు బాగానే ఉన్నా.. ఎన్ఐఏ ప్రాథమిక విచారణలో ముజమ్మిల్‌కి ఈ ఉగ్రదాడిలో ప్రత్యక్ష పాత్ర లేకపోయినా, అతని తీరుపై పలు అనుమానాలు ప్రస్పుటమవుతున్నాయి. #PahalgamTerrorAttackA zipline operator when hears the first shot, said “Allah-hu-Akbar.” He’s at a vantage point—he sees everything unfolding belowInstead of stopping the ride, he waves next tourist in. He wasn’t scared. He seems complicit & aware!@smitaprakash@AartiTikoo pic.twitter.com/Fam4sYYOjg— Fatima Dar (@FatimaDar_jk) April 28, 2025ఘటనా స్థలంలో ఉగ్రవాదులు కాల్పులు జరిపినప్పుడు జిప్‌లైన్ ఆపరేటర్ ముజమ్మిల్.. టూరిస్ట్ రిషి భట్ని అల్లహో అక్బర్ అని అరుస్తూ ముందుకు తోశాడనేది ప్రశ్నార్ధకంగా మారింది. ఎన్ఐఏ అధికారులు జిప్ లైన్ ఆపరేటర్ ముజమ్మిల్ ప్రశ్నిస్తే.. ఆయన వ్యవహార శైలీ అనుమానాస్పదంగా మారింది. దీంతో ఎన్ఐఏ అధికారుల తమ దర్యాప్తును మరింత లోతుగా ముమ్మరం చేశారు.

చరిత్ర సృష్టించిన టీమిండియా ఓపెనర్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా
శ్రీలంక వేదికగా జరుగుతున్న ముక్కోణపు వన్డే సిరీస్‌లో భారత మహిళా క్రికెట్ జట్టు ఓపెనర్ ప్రతీక రావల్ దుమ్ములేపుతోంది. మంగళవారం దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ప్రతీక హాఫ్ సెంచరీతో మెరిసింది. రావల్ 91 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్సర్ తో 78 పరుగులు చేసింది.ఈ క్రమంలో రావల్ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకుంది. మహిళల వన్డే క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా 500 పరుగులు చేసిన బ్యాటర్‌గా ప్రతీక రికార్డులకెక్కింది. 24 ఏళ్ల ప్రతీక రావల్ (Pratika Rawal) తన వన్డే అరంగేట్రం నుంచి అదరగొడుతోంది.ఈ క్రమంలో కేవలం 8 మ్యాచ్‌లలోనే ప్రతీక 500 పరుగుల మార్క్‌ను అందుకుంది. ఇంతకుముందు ఈ రికార్డు ఇంగ్లండ్ మహిళల జట్టు మాజీ ప్లేయర్ చార్లెట్ ఎడ్వర్డ్స్ పేరిట ఉండేది. 9 ఇన్నింగ్స్‌లలో ఆమె ఈ ఫీట్‌ను సాధించింది. తాజా మ్యాచ్‌తో ఎడ్వర్డ్స్ ఆల్‌టైమ్ రికార్డును రావల్ బ్రేక్ చేసింది.మహిళల వన్డేల్లో అత్యంత వేగంగా 500 పరుగులు చేసిన ప్లేయర్స్ వీరే..ప్రతికా రావల్ - 8 ఇన్నింగ్స్లుషార్లెట్ ఎడ్వర్డ్స్ - 9 ఇన్నింగ్స్లునికోల్ బోల్టన్ - 11 ఇన్నింగ్స్లుబెలిండా క్లార్క్ - 12 ఇన్నింగ్స్లువెండీ వాట్సన్ - 12 ఇన్నింగ్స్లుఇక ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికాపై 15 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించింది. 277 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా అమ్మాయిలు..49. 2 ఓవర్లలో 261 పరుగులకు ఆలౌటైంది. ఓ దశలో సునాయాసంగా గెలిచే కన్పించిన సౌతాఫ్రికాను భారత స్పిన్నర్ స్నేహ్ రాణా దెబ్బతీసింది. రాణా తన 10 ఓవర్ల కోటాలో 43 పరుగులిచ్చి 5 వికెట్లు సాధించింది.చదవండి: సూర్యవంశీకి భారీ నజరానా.. రూ.10 లక్షలు ప్రకటించిన బిహార్ సీఎం

త్రివిధ దళాలకు ప్రధాని మోదీ ఫ్రీ హ్యాండ్.. సైన్యమే స్థలం,టైం చూసి..
ఢిల్లీ: పహల్గాంలో ఉగ్రదాడి నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలో వరుస కీలక సమావేశాలు కొనసాగుతున్నాయి. మంగళవారం జరిగిన త్రివిధ దళాదిపతులు సమావేశంలో ప్రధాని మోదీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉగ్రవాదుల్ని మట్టిలో కలిపేలా త్రివిధ దళాలకు పూర్తి స్థాయిలో స్వేచ్ఛ ఇచ్చారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. భారత దళాలపై పూర్తిగా నమ్మకం ఉంది. ఉగ్రవాదాన్ని అంత చేస్తాం. పహల్గాం దాడికి ధీటైన సమాధానం ఇస్తాం. సైన్యమే స్థలం,టైం చూసి జవాబు ఇస్తుంది’ అంటూ ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ నేతృత్వంలో జరిగిన రక్షణ శాఖ సమావేశంలో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్, సీడీఎస్ అనీల్ చౌహాన్లు పాల్గొన్నారు. ఈ సమావేశంలో గత బుధవారం భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల తీరుతెన్నులు ఎలా ఉన్నాయి. భద్రతా బలగాల మొహరింపు వంటి అంశాలపై చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.దీంతో పాటు త్వరలో ప్రారంభం కానున్న అమర్నాథ్ యాత్రలో పాక్ కవ్వింపులు చర్యలకు పాల్పడితే ఎలాంటి చర్యలు తీసుకోవాలి. ఒకవేళ పాక్ కవ్వింపులకు పాల్పడితే రక్షణ పరంగా ఎలా తిప్పికొట్టాలి. ఓ వైపు రక్షణ పరంగా దెబ్బకొడుతూనే.. దౌత్య పరంగా ప్రపంచ దేశాల ఎదుట పాకిస్తాన్‌ను ఇరుకున పెట్టేలా ఎలా దెబ్బకు దెబ్బ తీయాలనే తదితర అంశాలపై ప్రముఖంగా చర్చించారు. PM Modi chairs a meeting with Defence Minister, NSA, CDS and chiefs of all the Armed Forces. pic.twitter.com/fr9y5eVbet— ANI (@ANI) April 29, 2025

భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బీఆర్ గవాయి
ఢిల్లీ: సుప్రీంకోర్టు 52వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బీఆర్ గవాయి నియమితులయ్యారు. సీజేఐగా ఆయన నియామకానికి రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. మే 14న జస్టిస్ గవాయి బాధ్యతలు స్వీకరించనున్నారు.కాగా, మహారాష్ట్రలోని అమరావతికి చెందిన జస్టిస్ గవాయ్ 1985లో న్యాయవాదిగా ప్రాక్టీస్ ప్రారంభించారు. ప్రముఖ న్యాయవాది, మహారాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి రాజా భోన్సాలేతో కలిసి పనిచేశారు. 1987 నుండి 1990 వరకు ముంబై హైకోర్టులో స్వతంత్ర న్యాయవాదిగా పని చేశారు. 1992లో నాగ్‌పూర్ బెంచ్‌లో అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్‌గా, అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా నియమితులయ్యారు.2000లో ప్రభుత్వ న్యాయవాది, పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా వ్యవహరించారు. 2003లో హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా జస్టిస్ గవాయ్ నియమితులయ్యారు. 2005లో శాశ్వత న్యాయమూర్తిగా ప్రమోషన్ పొందారు. 2019లో సుప్రీంకోర్టుకు ప్రమోట్ అయ్యారు. జస్టిస్ గవాయ్ సుమారు ఆరు నెలలు ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగనున్నారు. ఆయన నవంబరులో పదవీవిరమణ చేయనున్నారు. 2007లో భారత అత్యున్నత న్యాయస్థాన పదవిని చేపట్టిన జస్టిస్ కేజీ బాలకృష్ణన్ తర్వాత, ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టే రెండో దళితుడు జస్టిస్ గవాయ్.

‘ఉగ్రవాదులు మొదట ప్రాణం తీసింది లెఫ్టినెంట్ వినయ్ నార్వల్‌నే’
జమ్మూ: జమ్మూకశ్మీర్ పహల్గాంలో ఉగ్రదాడి ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పక్కా ప్లాన్ ప్రకారం పాక్ టెర్రరిస్టులు.. టూరిస్టులపై కాల్పులకు తెగబడ్డట్లు తేలింది.జమ్మూకశ్మీర్ అనంత్ నాగ్ జిల్లా పహల్గాంలో మినీ స్విట్జర్లాండ్‌గా పేరొందిన బైసరీన్ వ్యాలీలో ఉగ్రవాదులు పర్యాటకులపై ఏ విధంగా కాల్పులకు తెగబడింది. ప్రాణాలు తీసింది. టూరిస్టులు తప్పించుకోకుండా టెర్రరిస్టులు ఎలా కాపలా కాసారో ప్రత్యక్ష సాక్షుల స్టేట్మెంట్ను కేంద్ర దర్యాప్తు సంస్థ రికార్డ్ చేశారు. వాటి ఆధారంగా ఎగ్జిట్, ఎంట్రన్స్ గేటులో ఉగ్రవాదులు కాపలాప్రకృతి అందాల్ని ఆస్వాధిస్తున్న పర్యాటకులు తప్పించుకునేందుకు వీలు లేకుండా బైసరీన్ వ్యాలీలో ఎంట్రీ గేటు వద్ద ఇద్దరు ఉగ్రవాదులు కాపలా, ఎగ్జిట్ గేటు వద్ద ఒక ఉగ్రవాది కాపలా ఉండగా.. ఆ ఇద్దరికి సమాచారం అందించేందుకు బైసరీన్ వ్యాలీ బయట అడవిలో ఉన్నట్లు తేలింది. ముందుగా టెర్రరిస్టులు ఎంట్రీ గేటు దగ్గర పర్యాటకులపై కాల్పులు జరిపారు. కాల్పులు మోతతో ఒక్కసారిగా భయపడ్డ టూరిస్టులు ప్రాణ భయంతో ఎగ్జిట్ వైపు పరిగెత్తారు. అయితే, అక్కడే ఉన్న ఇద్దరు ఉగ్రవాదులు పర్యాటకుల్ని అడ్డుకున్నారు. తమవద్ద ఉన్న మెషీన్ గన్లతో పర్యాటకుల్ని బెదిరించారు. Grief beyond words. Can’t forget, can’t forgive. Indian Navy Lieutenant Vinay Narwal's wife bids an emotional farewell to her husband, who was killed in the Pahalgam terror attackThe couple got married on April 16. pic.twitter.com/GJXjG368i7— Anjana Om Kashyap (@anjanaomkashyap) April 23, 2025 ఉగ్రవాదుల తొలి ప్రాణం తీసింది లెఫ్టినెంట్ వినయ్ నార్వల్నేఎంట్రీ గేటు వద్ద టూరిస్టులను ఒక చోటకు చేర్చారు. అనంతరం మహిళలు, పురుషులు వేరు కావాలని ఆదేశించారు. అయితే, టూరిస్టులు టెర్రరిస్టుల మాటల్ని పట్టించుకోలేదు.దీంతో కోపంతో ఊగిపోయిన టెర్రరిస్టులు హిందువులు, ముస్లింలు వేర్వేరుగా నిలబడాలని సూచించారు. అయినా టూరిస్టులు పట్టించుకోలేదు.ఆ తరువాత, ఉగ్రవాదులు తాము ఇస్లాం మతం స్వీకరిస్తున్నామని అంగీకరిస్తూ ‘కల్మా’ఉచ్ఛరించమని పర్యాటకులను ఆదేశించారు. పర్యాటకులు కల్మా అనడం పూర్తయిన తర్వాత ఉగ్రవాదులు..అమాయకులపై కాల్పులు జరిపి ప్రాణాలు తీసుకున్నారు. ఈ సమయంలో ఎంట్రీ గేటు ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో మరణించిన మొట్టమొదటి వ్యక్తి భారత నేవీ అధికారి, లెఫ్టినెంట్ వినయ్ నార్వల్ అని తెలుస్తోంది.ఈ మరణాలు ఎక్కువగా టీ స్టాల్, భేల్ పూరి స్టాల్ సమీపంలో సంభవించాయి.ఈ రెండు ప్రాంతాల్లో పర్యాటకులు అధిక సంఖ్యలో ఉండడం వల్ల భారీ మొత్తంలో ప్రాణ నష్టం జరిగింది.
బజాజ్ ఫైనాన్స్ బోనస్ బొనాంజా
ఇండస్ఇండ్.. రాజీనామా!
సెలవులొచ్చాయి ఆడించండి... చదివించండి..
'వేతన యాతన'!
ఏడాదిలో ఎనిమిది!
జూన్‌లో ఫిక్స్
మన రాష్ట్రంలో వీధి వీధికి బెల్ట్‌షాపులు తొలగించాలి సార్!
కెనడాలో లిబరల్స్‌కు పట్టం
వాటర్‌లో వార్
ఇంతకూ పరిష్కారం ఏమిటి?
ఇండస్ఇండ్.. రాజీనామా!
'వేతన యాతన'!
ఏడాదిలో ఎనిమిది!
కెనడాలో లిబరల్స్‌కు పట్టం
ఇంతకూ పరిష్కారం ఏమిటి?
సెలవులొచ్చాయి ఆడించండి... చదివించండి..
జూన్‌లో ఫిక్స్
మన రాష్ట్రంలో వీధి వీధికి బెల్ట్‌షాపులు తొలగించాలి సార్!
వాటర్‌లో వార్
బజాజ్ ఫైనాన్స్ బోనస్ బొనాంజా
సద్వినియోగం చేసుకోవాలి
నందిని, జ్యోతి యర్రాజీలకు స్వర్ణ పతకాలు
గోల్డ్ ఈటీఎఫ్‌లు కళకళ
కార్మికుల సేవతోనే ఆస్పత్రికి మంచిపేరు
IPL 2025: కేకేఆర్ ఈజ్ బ్యాక్.. ఢిల్లీపై గ్రాండ్ విక్టరీ
IND vs ENG: ఇంగ్లండ్ టూర్‌కు వైభవ్ సూర్యవంశీ..
రెడ్‌క్రాస్‌కు గోల్డ్ మెడల్
పోలీస్ అమరవీరుల స్మారక భవనం ప్రారంభం
బాహుబలి రిటర్న్స్
నాణ్యమైన సేవల కోసమే గ్రీవెన్స్
అకాల వర్షం.. అపార నష్టం
ఆట అదుర్స్.. అతడిని టీమిండియాకి ఎంపిక చేయండి: పీటర్సన్
ఆవేదన జీవితాంతం
హసీనాకు మరో అరెస్ట్ వారెంట్
కార్యకర్తలకు అండగా ఉంటా
మద్దతు ధర చట్టం అమలుకు మరో ఉద్యమం
అందని ఆరోగ్యశ్రీ
ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవం
భూసేకరణతో మా పొట్టకొట్టొద్దు
30న నాగపూర్‌కు మోదీ
Hyderabad: ఇంజినీరింగ్ విద్యార్థుల దుర్మరణం
రూ.1,500 కోట్లే చివరి రుణం
RCB Vs KKR: సాల్ట్, కోహ్లి విధ్వంసం.. కేకేఆర్‌ను చిత్తు చేసిన ఆర్సీబీ
వాటిపై శ్వేతపత్రం విడుదల చేసే దమ్ముందా?.. పుత్తా శివశంకర్‌రెడ్డి సవాల్
18వ సారైనా... బెంగళూరు రాత మారేనా!
శ్రీవారి దర్శనం పేరుతో నటిని మోసగించిన దళారి
కెనడా కొత్త ప్రధానిగా మార్క్ కార్నీ
గర్భిణులు పారాసిటమాల్ వాడితే... పిల్లల్లో ఏడీహెచ్‌డీ!
ప్రభుత్వ ప్రచారం బాధ్యత ప్రైవేటుకు..
‘ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ’ నగారా
13 ఏళ్లు రాజకీయాలకు దూరం.. రీఎంట్రీలో అదిరే విజయం
ఉపాధిలో వ్యవసాయమే మేటి
మూత్రంలో రక్తపు చార కనిపిస్తోందా?
కూటమికి ఏక్నాథ్ షిండే దూరం..? పొమ్మనలేక, పొగపెడుతున్న..
ఐఐటీ బాబా ట్రాక్ రికార్డ్ : 10,12వ తరగతి మార్కులు వైరల్
మలి ప్రేమ..: ఔను.. వాళ్లు ఇష్టపడ్డారు
CT 2025: చతికిలపడ్డ ఇంగ్లండ్.. గాయాల ఊబిలో ఆస్ట్రేలియా
ధనుశ్ డైరెక్షన్లో లవ్ ఎంటర్టైనర్.. ట్రైలర్ చూశారా?
నా వెనుక పవన్ ఉన్నాడు.. కిరణ్ రాయల్ బెదిరింపులు
భర్తకు విషెస్ చెప్పిన ఐశ్వర్య రాయ్.. ఎప్పటిలాగే ఆలస్యంగా!
'ఇట్స్ కాంప్లికేటెడ్' ట్రైలర్ చూశారా..?
ఐదేళ్ల తర్వాత విడుదల కానున్న సిద్ధూ జొన్నలగడ్డ సినిమా
హాలీవుడ్ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్!
శ్రీకాకుళం కళావతి కేసులో సంచలన విషయాలు..
మగువల మనసు దోచే ‘జమదానీ’
మతిలేని యుద్ధం ఆపండి
ఐపీవోకు ఆరు కంపెనీలు రెడీ
డెలివరీ సమయంలో వైద్యుల నిర్లక్ష్యం, రూ..11.42 కోట్ల జరిమానా
డీఎస్పీదే తప్పు: సీఎంకు కలెక్టర్ నివేదిక
ఏటా 40 కోట్ల మంది విమాన ప్రయాణం
రైనో కళ్లలో పడ్డారు, ఆపై.. కజిరంగా పార్క్‌లో భయానక ఘటన
టీవీలో నాన్నను చూసి మురిసిపోయిన క్లీంకార..వీడియో వైరల్
తాత్కాలిక అధ్యక్షుడికీ తప్పని అభిశంసన
ఓటీటీలో 'హారర్ థ్రిల్లింగ్' సినిమా స్ట్రీమింగ్
కోహ్లి నన్ను బ్లాక్ చేశాడు, ఎందుకో ఇప్పటికీ అర్థం కావట్లేదు: సింగర్
కిచ్చా సుదీప్ 'మ్యాక్స్' హంటింగ్ ట్రైలర్ విడుదల
ఏబీ వెంకటేశ్వరరావుకు కూటమి ప్రభుత్వ కానుక
కూటమి ఎమ్మెల్యే ఆదేశాలు.. పోలీసుల సమక్షంలో ఇళ్ల కూల్చివేతలు
అన్న క్యాంటీన్లు నిర్మించా... నాకు అన్నం లేకుండా చేస్తున్నారు
విశాఖలో డాక్‌యార్డు ఉద్యోగాల పేరిట భారీ మోసం
నీళ్ల కోసం రోడ్డెక్కిన రైతులు
ముద్గల మహర్షి కుమారుడు
పాలసీపై రాబడి ఉండాలా..? వద్దా..?
SA Vs PAK: రీజా హెండ్రిక్స్ విధ్వంసకర సెంచరీ.. పాక్‌ను చిత్తు చేసిన సౌతాఫ్రికా
రైతు భూమి వేలానికి దండోరా
వెంటనే ఆ పిచ్చి పని ఆపేయండి.. రష్యా-ఉక్రెయిన్‌కు ట్రంప్ పిలుపు
భర్తతో పార్టీకి వెళ్లిన ఐశ్వర్యరాయ్.. అభిషేక్‌తో సెల్ఫీలు
సుఖ్బీర్ సింగ్‌పై కాల్పులు.. కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు
అణుయుద్ధంగా మారనుందా?
అతడు టాక్సిక్ బాస్.. ‘పంత్‌తో రాహుల్ ముచ్చట’? హర్ష్ గోయెంకా స్పందన వైరల్
తెలుగువారిపై అనుచిత వ్యాఖ్యలు.. కస్తూరి అరెస్ట్
తెరకెక్కనున్న ఆర్బీఐ ప్రస్థానం!
లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు.. 40 మంది మృతి
ఇక పోలీస్ వద్ద ‘ఆధార్’
బిర్యానీ-ఫ్లేవర్డ్ ఐస్‌క్రీమ్ ఎప్పుడైనా ట్రై చేశారా..?
కార్తీకంలో ఆకాశదీపం ఎందుకు వెలిగిస్తారు ?
వెండితెరపైకి మళ్లీ రానున్న ఒకప్పటి ప్రముఖ హీరోయిన్
ఓటీటీలో 'ఈ కలయిక కాస్త ఘాటు గురూ'.. తెలుగులో స్ట్రీమింగ్
తీరం దాటిన ‘దానా’ తీవ్ర తుపాను
ఇదేం కమిషన్?
చిరంజీవి 'ఠాగూర్' వల్ల మా బతుకు నాశనం: ప్రముఖ డాక్టర్
భుజాలపై మోసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు: జూనియర్ ఎన్టీఆర్
తాను కన్నుమూస్తూ... మరో ఐదుగురికి ప్రాణదానం
రెండేళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చేస్తున్న హిట్ సినిమా
వెస్టిండీస్ ధనాధన్ విజయం
ఇలా అయితే కష్టం కోహ్లి!.. అసహనంగా వెళ్లిపోయిన బ్యాటర్
భీష్ముడు చెప్పిన.. పులి–నక్క కథ!
కమల గెలిస్తే శ్వేతసౌధంలో కర్రీ వాసనలే
సీజేఐ ఇంట్లో ప్రధాని మోదీ గణపతి పూజపై రాజకీయ దుమారం
వరద బాధితులకు చిన్నారి అభయ్ రామ్ విరాళం
బజాజ్ ఫైనాన్స్ బోనస్ బొనాంజా
ఇండస్ఇండ్.. రాజీనామా!
సెలవులొచ్చాయి ఆడించండి... చదివించండి..
'వేతన యాతన'!
ఏడాదిలో ఎనిమిది!
జూన్‌లో ఫిక్స్
మన రాష్ట్రంలో వీధి వీధికి బెల్ట్‌షాపులు తొలగించాలి సార్!
కెనడాలో లిబరల్స్‌కు పట్టం
వాటర్‌లో వార్
ఇంతకూ పరిష్కారం ఏమిటి?
ఇండస్ఇండ్.. రాజీనామా!
'వేతన యాతన'!
ఏడాదిలో ఎనిమిది!
కెనడాలో లిబరల్స్‌కు పట్టం
ఇంతకూ పరిష్కారం ఏమిటి?
సెలవులొచ్చాయి ఆడించండి... చదివించండి..
జూన్‌లో ఫిక్స్
మన రాష్ట్రంలో వీధి వీధికి బెల్ట్‌షాపులు తొలగించాలి సార్!
వాటర్‌లో వార్
బజాజ్ ఫైనాన్స్ బోనస్ బొనాంజా
సద్వినియోగం చేసుకోవాలి
నందిని, జ్యోతి యర్రాజీలకు స్వర్ణ పతకాలు
గోల్డ్ ఈటీఎఫ్‌లు కళకళ
కార్మికుల సేవతోనే ఆస్పత్రికి మంచిపేరు
IPL 2025: కేకేఆర్ ఈజ్ బ్యాక్.. ఢిల్లీపై గ్రాండ్ విక్టరీ
IND vs ENG: ఇంగ్లండ్ టూర్‌కు వైభవ్ సూర్యవంశీ..
రెడ్‌క్రాస్‌కు గోల్డ్ మెడల్
పోలీస్ అమరవీరుల స్మారక భవనం ప్రారంభం
బాహుబలి రిటర్న్స్
నాణ్యమైన సేవల కోసమే గ్రీవెన్స్
అకాల వర్షం.. అపార నష్టం
ఆట అదుర్స్.. అతడిని టీమిండియాకి ఎంపిక చేయండి: పీటర్సన్
ఆవేదన జీవితాంతం
హసీనాకు మరో అరెస్ట్ వారెంట్
కార్యకర్తలకు అండగా ఉంటా
మద్దతు ధర చట్టం అమలుకు మరో ఉద్యమం
అందని ఆరోగ్యశ్రీ
ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవం
భూసేకరణతో మా పొట్టకొట్టొద్దు
30న నాగపూర్‌కు మోదీ
Hyderabad: ఇంజినీరింగ్ విద్యార్థుల దుర్మరణం
రూ.1,500 కోట్లే చివరి రుణం
RCB Vs KKR: సాల్ట్, కోహ్లి విధ్వంసం.. కేకేఆర్‌ను చిత్తు చేసిన ఆర్సీబీ
వాటిపై శ్వేతపత్రం విడుదల చేసే దమ్ముందా?.. పుత్తా శివశంకర్‌రెడ్డి సవాల్
18వ సారైనా... బెంగళూరు రాత మారేనా!
శ్రీవారి దర్శనం పేరుతో నటిని మోసగించిన దళారి
కెనడా కొత్త ప్రధానిగా మార్క్ కార్నీ
గర్భిణులు పారాసిటమాల్ వాడితే... పిల్లల్లో ఏడీహెచ్‌డీ!
ప్రభుత్వ ప్రచారం బాధ్యత ప్రైవేటుకు..
‘ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ’ నగారా
13 ఏళ్లు రాజకీయాలకు దూరం.. రీఎంట్రీలో అదిరే విజయం
ఉపాధిలో వ్యవసాయమే మేటి
మూత్రంలో రక్తపు చార కనిపిస్తోందా?
కూటమికి ఏక్నాథ్ షిండే దూరం..? పొమ్మనలేక, పొగపెడుతున్న..
ఐఐటీ బాబా ట్రాక్ రికార్డ్ : 10,12వ తరగతి మార్కులు వైరల్
మలి ప్రేమ..: ఔను.. వాళ్లు ఇష్టపడ్డారు
CT 2025: చతికిలపడ్డ ఇంగ్లండ్.. గాయాల ఊబిలో ఆస్ట్రేలియా
ధనుశ్ డైరెక్షన్లో లవ్ ఎంటర్టైనర్.. ట్రైలర్ చూశారా?
నా వెనుక పవన్ ఉన్నాడు.. కిరణ్ రాయల్ బెదిరింపులు
భర్తకు విషెస్ చెప్పిన ఐశ్వర్య రాయ్.. ఎప్పటిలాగే ఆలస్యంగా!
'ఇట్స్ కాంప్లికేటెడ్' ట్రైలర్ చూశారా..?
ఐదేళ్ల తర్వాత విడుదల కానున్న సిద్ధూ జొన్నలగడ్డ సినిమా
హాలీవుడ్ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్!
శ్రీకాకుళం కళావతి కేసులో సంచలన విషయాలు..
మగువల మనసు దోచే ‘జమదానీ’
మతిలేని యుద్ధం ఆపండి
ఐపీవోకు ఆరు కంపెనీలు రెడీ
డెలివరీ సమయంలో వైద్యుల నిర్లక్ష్యం, రూ..11.42 కోట్ల జరిమానా
డీఎస్పీదే తప్పు: సీఎంకు కలెక్టర్ నివేదిక
ఏటా 40 కోట్ల మంది విమాన ప్రయాణం
రైనో కళ్లలో పడ్డారు, ఆపై.. కజిరంగా పార్క్‌లో భయానక ఘటన
టీవీలో నాన్నను చూసి మురిసిపోయిన క్లీంకార..వీడియో వైరల్
తాత్కాలిక అధ్యక్షుడికీ తప్పని అభిశంసన
ఓటీటీలో 'హారర్ థ్రిల్లింగ్' సినిమా స్ట్రీమింగ్
కోహ్లి నన్ను బ్లాక్ చేశాడు, ఎందుకో ఇప్పటికీ అర్థం కావట్లేదు: సింగర్
కిచ్చా సుదీప్ 'మ్యాక్స్' హంటింగ్ ట్రైలర్ విడుదల
ఏబీ వెంకటేశ్వరరావుకు కూటమి ప్రభుత్వ కానుక
కూటమి ఎమ్మెల్యే ఆదేశాలు.. పోలీసుల సమక్షంలో ఇళ్ల కూల్చివేతలు
అన్న క్యాంటీన్లు నిర్మించా... నాకు అన్నం లేకుండా చేస్తున్నారు
విశాఖలో డాక్‌యార్డు ఉద్యోగాల పేరిట భారీ మోసం
నీళ్ల కోసం రోడ్డెక్కిన రైతులు
ముద్గల మహర్షి కుమారుడు
పాలసీపై రాబడి ఉండాలా..? వద్దా..?
SA Vs PAK: రీజా హెండ్రిక్స్ విధ్వంసకర సెంచరీ.. పాక్‌ను చిత్తు చేసిన సౌతాఫ్రికా
రైతు భూమి వేలానికి దండోరా
వెంటనే ఆ పిచ్చి పని ఆపేయండి.. రష్యా-ఉక్రెయిన్‌కు ట్రంప్ పిలుపు
భర్తతో పార్టీకి వెళ్లిన ఐశ్వర్యరాయ్.. అభిషేక్‌తో సెల్ఫీలు
సుఖ్బీర్ సింగ్‌పై కాల్పులు.. కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు
అణుయుద్ధంగా మారనుందా?
అతడు టాక్సిక్ బాస్.. ‘పంత్‌తో రాహుల్ ముచ్చట’? హర్ష్ గోయెంకా స్పందన వైరల్
తెలుగువారిపై అనుచిత వ్యాఖ్యలు.. కస్తూరి అరెస్ట్
తెరకెక్కనున్న ఆర్బీఐ ప్రస్థానం!
లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు.. 40 మంది మృతి
ఇక పోలీస్ వద్ద ‘ఆధార్’
బిర్యానీ-ఫ్లేవర్డ్ ఐస్‌క్రీమ్ ఎప్పుడైనా ట్రై చేశారా..?
కార్తీకంలో ఆకాశదీపం ఎందుకు వెలిగిస్తారు ?
వెండితెరపైకి మళ్లీ రానున్న ఒకప్పటి ప్రముఖ హీరోయిన్
ఓటీటీలో 'ఈ కలయిక కాస్త ఘాటు గురూ'.. తెలుగులో స్ట్రీమింగ్
తీరం దాటిన ‘దానా’ తీవ్ర తుపాను
ఇదేం కమిషన్?
చిరంజీవి 'ఠాగూర్' వల్ల మా బతుకు నాశనం: ప్రముఖ డాక్టర్
భుజాలపై మోసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు: జూనియర్ ఎన్టీఆర్
తాను కన్నుమూస్తూ... మరో ఐదుగురికి ప్రాణదానం
రెండేళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చేస్తున్న హిట్ సినిమా
వెస్టిండీస్ ధనాధన్ విజయం
ఇలా అయితే కష్టం కోహ్లి!.. అసహనంగా వెళ్లిపోయిన బ్యాటర్
భీష్ముడు చెప్పిన.. పులి–నక్క కథ!
కమల గెలిస్తే శ్వేతసౌధంలో కర్రీ వాసనలే
సీజేఐ ఇంట్లో ప్రధాని మోదీ గణపతి పూజపై రాజకీయ దుమారం
వరద బాధితులకు చిన్నారి అభయ్ రామ్ విరాళం
సినిమా

ఓటీటీలోకి థ్రిల్లర్ సినిమా.. తొమ్మిదేళ్ల తర్వాత తెలుగులో
'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా చూశారుగా. అందులో భాగ్యంగా తనదైన యాక్టింగ్ చేసిన ఐశ్వర్య రాజేశ్.. గత కొన్నాళ్లుగా తెలుగులో మూవీస్ చేస్తోంది. అయితే ఈమె నటించిన ఓ తమిళ చిత్రాన్ని ఇప్పుడు నేరుగా ఓటీటీలో రిలీజ్ చేశారు. ఇంతకీ ఏంటా సినిమా? ఎందులో స్ట్రీమింగ్ అవుతోంది.(ఇదీ చదవండి: 'కోర్ట్'ని మించిపోయేలా ఉంటుంది.. ఓటీటీ డేట్ ఫిక్స్) 1980ల్లో పలు తెలుగు సినిమాలు చేసిన రాజేశ్ అనే నటుడి కూతురే ఐశ్వర్య రాజేశ్. స్వతహాగా తెలుగమ్మాయి అయినప్పటికీ తమిళ నటిగా కెరీర్ ప్రారంభించింది. 2010 నుంచి అక్కడ వరస చిత్రాల్లో నటిస్తూ మంచి పేరు తెచ్చుకుంది. మలయాళం, హిందీలోనూ ఒకటి రెండు మూవీస్ చేసింది.కౌసల్య కృష్ణమూర్తి సినిమాతో తెలుగులోకి వచ్చిన ఈమె.. తర్వాత వరల్డ్ ఫేమస్ లవర్, టక్ జగదీష్, రిపబ్లిక్ తదితర చిత్రాలు చేసింది. అసలు విషయానికొస్తే ఈమె హీరోయిన్ గా చేసిన తమిళ మూవీ ఆరతు సీనం 2016లో రిలీజైంది. దీని తెలుగు వెర్షన్ ని ఇప్పుడు ఆహా ఓటీటీలో నేరుగా రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: నెలలోపే ఓటీటీలోకి వచ్చేసిన థ్రిల్లర్ సినిమా) దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత ఐశ్వర్య రాజేశ్ సినిమాని గరుడ 2.0 పేరుతో తెలుగులో రిలీజ్ చేశారు. దీన్ని థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ కథతో తీశారు. అరివళగన్ అనే దర్శకుడు దీన్ని తెరకెక్కించారు. అరుణ్ నిధి, ఐశ్వర్య దత్త, రోహిణి తదితరులు కీలక పాత్రలు పోషించారు.గరుడ 2.0 విషయానికొస్తే.. హీరో సీన్సియర్ పోలీస్ ఆఫీసర్. భార్య కూతురితో సంతోషంగా ఉంటాడు. కానీ కొందరు క్రిమినల్స్.. హీరో భార్య కూతురిని చంపేస్తారు. దీంతో మందుకి బానిస అవుతాడు. పై అధికారి చెప్పడంతో చాన్నాళ్ల తర్వాత మళ్లీ డ్యూటీలోకి వస్తాడు. అలా వరస హత్యల కేసు ఇతడికి అప్పగిస్తారు. మరి హీరో.. హంతకుడిని పట్టుకున్నాడా లేదా అనేదే స్టోరీ.(ఇదీ చదవండి: ఈవారం ఓటీటీలో 20 చిత్రాలు)

'కశ్మీర్ అభివృద్ధిని చూసి ఓర్వలేకపోతున్నారు'.. ట్రైలర్ ఈవెంట్లో సునీల్ శెట్టి
బాలీవుడ్ నటుడు సూరజ్ పంచోలీ ప్రధాన పాత్రలో వస్తోన్న పీరియాడికల్ చిత్రం 'కేసరి వీర్..లెజెండ్స్ ఆఫ్ సోమనాథ్'. ఈ సినిమాలో సునీల్ శెట్టి, వివేక్ ఒబెరాయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సోమనాథ్ ఆలయాన్ని విధ్వంసానికి వ్యతిరేకంగా పోరాడిన రాజ్‌పుత్ యోధుడు హమీర్జి గోహిల్ జీవితం ఆధారంగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమాకు ప్రిన్స్ ధీమాన్ దర్శకత్వం వహించారు. ఈ ట్రైలర్ ఈవెంట్‌కు హాజరైన సునీల్ శెట్టి ఆసక్తికర కామెంట్స్ చేశారు. పహల్గామ్ ఉగ్రదాడిని ఉద్దేశించి మరోసారి మాట్లాడారు.కశ్మీర్లో అభివృద్ధిని చూసి ఓర్వలేని వారే ఉగ్రవాదులని సునీల్ శెట్టి ఉన్నారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్ అభివృద్ధికి భారత ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని తెలిపారు. కానీ కొందరు ఈ పురోగతిని చూసి ఓర్వలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి సమయంలోనే మనమంతా కలిసి నిలబడాలి.. భారత్ మాతా కీ జై అని అన్నారు. అంతకుముందే తాను త్వరలోనే వేకేషన్ కోసం కశ్మీర్లో పర్యటిస్తానని సునీల్ శెట్టి చెప్పారు. అక్కడి ప్రజలు భయంతో జీవించకూడదని ఆయన ఆకాంక్షించారు.కాగా.. ఈ చిత్రంలో సునీల్ శెట్టి యోధుడు వేగదా జీ పాత్రను పోషిస్తుండగా.. వివేక్ ఒబెరాయ్ విలన్ పాత్రలో జాఫర్ ఖాన్‌గా కనిపించనున్నారు. ఆకాంక్ష శర్మ రాజల్ అనే మహిళా యోధురాలిగా తొలిసారిగా నటించింది. ఈ ట్రైలర్ లాంఛ్‌కు హాజరైన సూరజ్ పంచోలి ఎమోషనలయ్యారు. ఈ సినిమా కోసం చాలా కష్టపడి పనిచేశామని వెల్లడించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న కేసరి వీర్ మే 16న 2025న థియేటర్లలోకి రానుంది.

రెడ్ మిర్చిలా రెజీనా... విష్ణుప్రియ మౌంటైన్ ట్రిప్
బీచ్ ఒడ్డున అందాలన్నీ ఆరబోస్తున్న మలైకా అరోరాకళ్లజోడుతో స్టైలిష్ పోజులిస్తున్న దుషారా విజయన్డ్యాన్స్ డే వీడియోలతో మౌనీ రాయ్, ఆదితీ రావువయ్యారాలు ఒలకబోస్తున్న రెజీనా కసాండ్రాచీరలో అలా నడిచొస్తూ మాయ చేసేస్తున్న అనసూయపాలరాతి శిల్పంలా తెల్లగా మెరిసిపోతున్న ప్రణీతకొండల్లో విహార యాత్రకు వెళ్లిన యాంకర్ విష్ణుప్రియ View this post on Instagram A post shared by KIARA (@kiaraaliaadvani) View this post on Instagram A post shared by Ruhani Sharma (@ruhanisharma94) View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by Vishnupriyaa bhimeneni (@vishnupriyabhimeneni) View this post on Instagram A post shared by Ananya 🌙 (@ananyapanday) View this post on Instagram A post shared by Jacqueline Fernandez (@jacquelienefernandez) View this post on Instagram A post shared by Aishwarya Rajesh (@aishwaryarajessh) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by RegenaCassandrra (@regenacassandrra) View this post on Instagram A post shared by Amy Jackson Westwick (@iamamyjackson) View this post on Instagram A post shared by Nivetha Pethuraj (@nivethapethuraj) View this post on Instagram A post shared by Dushara Vijayan🧿 (@dushara_vijayan) View this post on Instagram A post shared by Malaika Arora (@malaikaaroraofficial) View this post on Instagram A post shared by Neha Sharma 💫 (@nehasharmaofficial) View this post on Instagram A post shared by Aditi Rao Hydari (@aditiraohydari) View this post on Instagram A post shared by mon (@imouniroy)

‘ఎల్లమ్మ’ దొరకట్లేదు.. ఇప్పుడెలా?
‘బలగం’ తర్వాత దర్శకుడు వేణు(venu yeldandi) చాలా గ్యాప్ తీసుకున్నాడు. తన రెండో సినిమా ‘ఎల్లమ్మ’ (Yellamma Movie) అని ప్రకటించి చాలా రోజులైంది కానీ, ఇంకా పట్టాలెక్కలేదు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో తొలుత నాని హీరోగా నటిస్తారనే ప్రచారం జరిగింది. నాని కూడా వేణుతో సినిమా చేస్తానని చెప్పారు. ఏం జరిగిందో తెలియదు కానీ నాని ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పకున్నాడు. చివరకు ఈ కథ అటు తిరిగి ఇటు తిరిగి నితిన్ (Nithiin) దగ్గర వెళ్లింది. కథ బాగా నచ్చడంతో నితిన్ ఈ చిత్రాన్ని వెంటనే ఓకే చేశాడు. డేట్స్ కూడా అరేంజ్ చేసుకున్నాడు. నిర్మాత దిల్ రాజు కూడా సినిమా షూటింగ్ స్టార్స్ చేసేందుకు రెడీగా ఉన్నాడు. కానీ ఈ సినిమాకు కీలకమైన హీరోయిన్ మాత్రం దొరకడం లేదట. ‘ఎల్లమ్మ’ కోసం అటు దిల్ రాజు, నితిన్.. ఇటు వేణు తెగ వెతుకుతున్నారట.బలగం మాదిరే ఈ కథ కూడా రూరల్ నేపథ్యంలోనే సాగుతుదంట. దర్శకుడు వేణు చాలా పకడ్బంధీగా ఈ సినిమా స్క్రిప్ట్ రెడీ చేసుకున్నాడట. అయితే ఈ చిత్రంలో హీరోయిన్ పాత్రకి చాలా ప్రాధాన్యత ఉంటుందట. కథ మొత్తం ఆమె చుట్టునే తిరుగుతుంది. అందుకే ఓ స్టార్ హీరోయిన్ని ఆ పాత్రకు తీసుకోవాలనుకున్నారట. తొలుత సాయి పల్లవి అయితే బాగుంటందని ఆమెను సంప్రదించారు. అయితే సాయి పల్లవి ఈ సినిమా చేయలేనని చెప్పేసిందట. దీంతో మరో స్టార్ హీరోయిన్ కీర్తి సురేశ్ అయితే ‘ఎల్లమ్మ’కు న్యాయం చేస్తుందని ఆమెను సంప్రదించారట. అయితే కథ, పాత్ర బాగా నచ్చినప్పటికీ.. డేట్స్ ఖాలీగా లేకపోవడం నో చెప్పేసిందట. శ్రీలీలను తీసుకుందామంటే.. అల్రెడీ నితిన్‌తో రెండు సినిమాలు చేసింది. అవి కూడా ఫ్లాప్ అవ్వడంతో దిల్ రాజు వెనకడుకు వేస్తున్నాడట. ఇక రష్మిక, సమంత లాంటి హీరోయిన్లు కూడా ఖాలీగా లేరు. నితిన్ ఎప్పుడైన తన సినిమాలకు ట్రెండింగ్ హీరోయిన్ని తీసుకుంటాడు. కానీ ఈ సారి మాత్రం అది వర్కౌట్ అయ్యేలా లేదు. స్టార్ హీరోహీరోయిన్లు అంతా బిజీగా ఉన్నారు. మరి ‘ఎల్లమ్మ’గా ఎవరు ఎంట్రీ ఇస్తారో చూడాలి.
న్యూస్ పాడ్‌కాస్ట్
క్రీడలు

IPL 2025: ఢిల్లీ క్యాపిటల్స్‌పై కేకేఆర్ ఘన విజయం
ఢిల్లీ క్యాపిటల్స్‌పై కేకేఆర్ ఘన విజయంఅరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 14 పరుగుల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్ విజయం సాధించింది. 205 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 9 వికెట్లు కోల్పోయి 190 పరుగులు చేయగల్గింది.ఢిల్లీ బ్యాటర్లలో ఫాఫ్ డుప్లెసిస్(62) టాప్ స్కోరర్‌గా నిలవగా.. అక్షర్ పటేల్(43) ఫర్వాలేదన్పించాడు. వీరితో విప్రజ్ నిగమ్(19 బంతుల్లో 38) ఆఖరిలో మెరుపులు మెరిపించనప్పటికి జట్టును గెలిపించలేకపోయాడు. కేకేఆర్ బౌలర్లలో సునీల్ నరైన్ మూడు వికెట్లు పడగొట్టగా.. వరుణ్ చక్రవర్తి రెండు, అనుకుల్ రాయ్,రస్సెల్, ఆరోరా తలా వికెట్ సాధించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. కేకేఆర్ బ్యాటర్లలో రఘువంశీ(44) టాప్ స్కోరర్‌గా నిలవగా.. రింకూ సింగ్(36), గుర్భాజ్(26), నరైన్(27), రహానే(26) రాణించారు. ఢిల్లీ బౌలర్లలో మిచెల్ స్టార్క్ మూడు వికెట్లు పడగొట్టగా.. అక్షర్ పటేల్,విప్రజ్ నిగమ్ తలా రెండు వికెట్లు సాధించారు. ఈ విజయంతో కేకేఆర్ తమ ప్లే ఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది.ఢిల్లీకి షాక్.. ఓకే ఓవర్లో రెండు వికెట్లు14 ఓవర్లో ఢిల్లీ క్యాపిటల్స్ వరుసగా రెండు వికెట్లు కోల్పోయింది. రెండో బంతికి అక్షర్ పటేల్(43) ఔట్ కాగా.. ఆరో బంతికి స్టబ్స్ ఔటయ్యాడు. 15 ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ క్యాపిటల్స్ 5 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. క్రీజులో డుప్లెసిస్(62), విప్రజ్ నిగమ్(5) ఉన్నారు.ఢిల్లీ క్యాపిటల్స్ మూడో వికెట్ డౌన్..కేఎల్ రాహుల్ రూపంలో ఢిల్లీ క్యాపిటల్స్ మూడో వికెట్ కోల్పోయింది. 7 పరుగులు చేసిన రాహుల్.. రనౌట్ రూపంలో పెవిలియన్‌కు చేరాడు. 8 ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ క్యాపిటల్స్ మూడు వికెట్ల నష్టానికి 71 పరుగులు చేసింది. క్రీజులో ఫాఫ్ డుప్లెసిస్(32), అక్షర్ పటేల్(8) ఉన్నారు.ఢిల్లీ రెండో వికెట్ డౌన్..కరుణ్ నాయర్ రూపంలో ఢిల్లీ క్యాపిటల్స్ రెండో వికెట్ కోల్పోయింది. 15 పరుగులు చేసిన నాయర్.. వైభవ్ ఆరోరా బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు. 5 ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ రెండు వికెట్ల నష్టానికి 48 పరుగులు చేసింది.ఢిల్లీ తొలి వికెట్ డౌన్..205 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ తొలి వికెట్ కోల్పోయింది. 4 పరుగులు చేసిన అభిషేక్ పోరెల్.. అనుకుల్ రాయ్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. 2 ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ వికెట్ నష్టానికి 178) పరుగులు చేసింది. క్రీజులో డుప్లెసిస్(8), కరుణ్ నాయర్(4) ఉన్నారు.చెలరేగిన కేకేఆర్ బ్యాటర్లు.. ఢిల్లీ ముందు భారీ టార్గెట్అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ బ్యాటర్లు చెలరేగారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. కేకేఆర్ బ్యాటర్లలో రఘువంశీ(44) టాప్ స్కోరర్‌గా నిలవగా.. రింకూ సింగ్(36), గుర్భాజ్(26), నరైన్(27), రహానే(26) రాణించారు. ఢిల్లీ బౌలర్లలో మిచెల్ స్టార్క్ మూడు వికెట్లు పడగొట్టగా.. అక్షర్ పటేల్,విప్రజ్ నిగమ్ తలా రెండు వికెట్లు సాధించారు.కేకేఆర్ ఐదో వికెట్ డౌన్రఘువంశీ రూపంలో కేకేఆర్ ఐదో వికెట్ కోల్పోయింది. 44 పరుగులు చేసిన రఘువంశీ.. చమీరా బౌలింగ్‌లో ఔటయ్యాడు. 17 ఓవర్లు ముగిసే సరికి కేకేఆర్ 5 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. 14 ఓవర్లకు కేకేఆర్ స్కోర్: 142/414 ఓవర్లు ముగిసే సరికి కేకేఆర్ నాలుగు వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. క్రీజులో రఘువంశీ(35), రింకూ సింగ్(14) ఉన్నారు.రహానే ఔట్..కేకేఆర్ వరుస క్రమంలో రెండు వికెట్లు కోల్పోయింది. 7 ఓవర్ వేసిన విప్రజ్నిగమ్ బౌలింగ్‌లో సునీల్ నరైన్(27) ఔట్ కాగా.. 8 ఓవర్లో అక్షర్ పటేల్ బౌలింగ్ రహానే(26) పెవిలియన్‌కు చేరాడు. 8 ఓవర్లకు కేకేఆర్ స్కోర్6 ఓవర్లకు కేకేఆర్ స్కోర్: 79/06 ఓవర్లు ముగిసే సరికి కేకేఆర్ వికెట్ నష్టానికి 79 పరుగులు చేసింది. క్రీజులో సునీల్ నరైన్(26), రహానే(21) ఉన్నారు.కేకేఆర్ తొలి వికెట్ డౌన్రహ్మానుల్లా గుర్బాజ్ రూపంలో ఢిల్లీ క్యాపిటల్స్ తొలి వికెట్ కోల్పోయింది. 26 పరుగులు చేసిన గుర్భాజ్..స్టార్క్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 3 ఓవర్లు ముగిసే సరికి కేకేఆర్ వికెట్ నష్టానికి 48 పరుగులు చేసింది. క్రీజులో సునీల్ నరైన్(20), రహానే(0) ఉన్నారు.ఐపీఎల్-2025లో అరుణ్‌జైట్లీ స్టేడియం వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ తొలుత బౌలింగ్ ఎంచుకుంది.ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగింది. కేకేఆర్ మాత్రం తమ తుది జట్టులో ఓ మార్పు చేసింది. రమణ్‌దీప్ సింగ్ స్ధానంలో అనుకుల్ రాయ్ తుది జట్టులోకి వచ్చాడు.తుది జట్లుకోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI): రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), సునీల్ నరైన్, అజింక్యా రహానే (కెప్టెన్), వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్, అంగ్క్రిష్ రఘువంశీ, ఆండ్రీ రస్సెల్, రోవ్‌మన్ పావెల్, హర్షిత్ రాణా, అనుకుల్ రాయ్, వరుణ్ చక్రవర్తిఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI): ఫాఫ్ డు ప్లెసిస్, అభిషేక్ పోరెల్(వికెట్ కీపర్ ), కరుణ్ నాయర్, కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్(కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, విప్రజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, దుష్మంత చమీరా, ముఖేష్ కుమార్

ఉత్కంఠపోరు.. దక్షిణాఫ్రికాపై భారత్ విజయం
శ్రీలంక వేదికగా జరుగుతున్న మహిళల ముక్కోణపు వన్డే సిరీస్-2025లో భారత్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. ఈ ట్రై సిరీస్‌లో భాగంగా మంగళవారం దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో 15 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించింది. 277 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా అమ్మాయిలు..49. 2 ఓవర్లలో 261 పరుగులకు ఆలౌటైంది. ఓ దశలో సునాయాసంగా గెలిచే కన్పించిన సౌతాఫ్రికాను భారత స్పిన్నర్ స్నేహ్ రాణా దెబ్బతీసింది. 48వ ఓవర్లో మూడు కీలక వికెట్లు పడగొట్టి మ్యాచ్ స్వరూపాన్నే రాణా మార్చేసింది. రాణా ఓవరాల్‌గా తన 10 ఓవర్ల కోటాలో 43 పరుగులిచ్చి 5 వికెట్లు సాధించింది. దక్షిణాఫ్రికా 11 పరుగుల వ్యవధిలో ఐదు వికెట్లు కోల్పోయింది. దీంతో ఆమెకు ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు వరించింది. దక్షిణాఫ్రికా బ్యాటర్లలో టాజ్మిన్ బ్రిట్స్( 107 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్స్‌లతో 109) విరోచిత శతకంతో చెలరేగింది. ఆమెతో లారా వోల్వార్డ్ట్(43), అన్నేరీ డెర్క్సెన్(30) రాణించినప్పటికి.. వరుస క్రమంలో వికెట్లు కోల్పోవడంతో ప్రోటీస్ ఓటమి చవిచూడాల్సి వచ్చింది.ప్రతీక సూపర్ ఇన్నింగ్స్..ఇక ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 6 వికెట్ల నష్టానికి 276 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో ఓపెనర్ ప్రతీక రావల్(78) టాప్ స్కోరర్‌గా నిలిచింది. ఆమెతో కెప్టెన్ హర్మాన్ ప్రీత్ కౌర్(41), జెమీమా రోడ్రిగ్స్(41), మంధాన(36) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో మ్లాబా రెండు వికెట్లు పడగొట్టగా..ఖాకా, క్లాస్ తలా వికెట్ సాధించారు.చదవండి: సూర్యవంశీకి భారీ నజరానా.. రూ.10 లక్షలు ప్రకటించిన బిహార్ సీఎం

ఇంగ్లండ్ కెప్టెన్‌గా స్టార్ ఆల్‌రౌండర్..
ఇంగ్లండ్ మహిళల జట్టు కెప్టెన్‌గా స్టార్ ఆల్‌రౌండర్ నాట్ స్కైవర్-బ్రంట్ ఎంపికైంది. ఈ విషయాన్ని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు మంగళవారం సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. హీథర్ నైట్ స్దానాన్ని స్కైవర్ బ్రంట్ భర్తీ చేయనుంది. కాగా ఈ ఏడాది మార్చిలో ఇంగ్లండ్ మహిళల జట్టు కెప్టెన్సీ హీథర్ నైట్ రాజీనామా చేసింది.మహిళల యాషెస్ సిరీస్‌లో ఇంగ్లండ్ ఘోర పరాజయం పాలవ్వడంతో నైట్ ఈ నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా ప్రధాన కోచ్ జాన్ లూయిస్‌పై ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు వేటు వేసింది. అతడి స్ధానంలో మాజీ కెప్టెన్ చార్లెట్ ఎడ్వర్డ్స్‌ను ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు నియమించింది.ఇక ఇంగ్లండ్ కెప్టెన్‌గా ఎంపిక అయిన తర్వాత స్కైవర్-బ్రంట్ స్పందించింది. ఇంగ్లండ్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టడం నాకు దక్కిన అరుదైన గౌరవంగా భావిస్తున్నాను. నేను ఎంతో అభిమానించే చార్లెట్ ఎడ్వర్డ్స్ సూచన మెరకు నా ఈ కొత్త ప్రయాణాన్ని ప్రారంభించనున్నాను.2013లో అరంగేట్రం నుంచి ఇంగ్లండ్ క్రికెట్‌కు నా వంతు సహకారం అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నాను. జట్టును విజయపథంలో నడిపించడానికి నా శాయశక్తులా ప్రయత్నిస్తాను అని బ్రంట్ ఓ ప్రకటనలో పేర్కొంది. స్కైవర్-బ్రంట్‌కు కెప్టెన్‌గా అనుభవం ఉంది. హీథర్ నైట్ గైర్హజరీలో 11 టీ20ల్లో ఇంగ్లండ్ జట్టుకు సారథ్యం వహించింది.చదవండి: సూర్యవంశీకి భారీ నజరానా.. రూ.10 లక్షలు ప్రకటించిన బిహార్ సీఎం

సూర్యవంశీకి భారీ నజరానా.. రూ.10 లక్షలు ప్రకటించిన బిహార్ సీఎం
రాజస్తాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయాడు. సోమవారం జైపూర్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 14 ఏళ్ల సూర్యవంశీ సంచలన ప్రదర్శన కనబరిచాడు. అద్బుత సెంచరీతో క్రికెట్ ప్రపంచాన్ని తన వైపు తిప్పుకున్నాడు. అత్యంత చిన్న వయస్సులో ఐపీఎల్ సెంచరీ చేసిన ప్లేయర్‌గా సూర్యవంశీ చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో 38 బంతులు ఆడిన వైభవ్ సూర్యవంశీ ఏడు ఫోర్లు, పదకొండు సిక్సర్లతో 101 పరుగులు చేశాడు. బిహార్‌కు చెందిన సూర్యవంశీపై సర్వాత్ర ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ క్రమంలో వైభవ్‌కు బిహార్ సీఎం నితీష్ కుమార్ రూ.10 లక్షల నగదు బహుమతిని ప్రకటించారు."ఐపీఎల్ చరిత్రలో సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడిగా (14 సంవత్సరాలు) నిలిచిన వైభవ్ సూర్యవంశీకి అభినందనలు. సూర్యవంశీ తన అద్బుత టాలెంట్‌తో భారత క్రికెట్‌కు భవిష్యత్తు ఆశాకిరణంగా నిలిచాడు. అతడి అంకితభావాన్ని, పట్టుదలను చూసి మేము గర్విస్తున్నాము.నేను 2024లో సూర్యవంశీ, అతడి తండ్రిని కలిశాను. ఐపీఎల్లో అతడి అద్భుతమైన ప్రదర్శన తర్వాత, ఫోన్లో సూర్యవంశీతో మాట్లాడాను. వైభవ్ సూర్యవంశీకి రాష్ట్ర ప్రభుత్వం రూ. 10 లక్షల నగదు బహుమతి అందజేయనున్నాము. వైభవ్ భవిష్యత్తులో భారత జట్టుకు కూడా కొత్త రికార్డులు సృష్టిస్తాడని ఆశిస్తున్నాను" అని నితీష్ కుమార్ ఎక్స్‌లో పేర్కొన్నారు.చదవండి: IPL 2025: పదేళ్ల వయసులోనే 90 మీటర్ల భారీ సిక్సర్లు కొట్టాడు: వైభవ్ కోచ్ ఓఝాआई॰पी॰एल॰ के इतिहास में सबसे कम उम्र (14 साल) में शतक लगाने वाले खिलाड़ी बने बिहार के श्री वैभव सूर्यवंशी को बधाई एवं शुभकामनाएं। वे अपनी मेहनत और प्रतिभा के बलबूते भारतीय क्रिकेट की एक नई उम्मीद बन गए हैं। सभी को उन पर गर्व है। श्री वैभव सूर्यवंशी एवं उनके पिता जी से वर्ष 2024… pic.twitter.com/n3UmiqwTBX— Nitish Kumar (@NitishKumar) April 29, 2025
బిజినెస్

తయారీని బలోపేతం చేసేందుకు కమిటీ: నీతి ఆయోగ్ సీఈవో
న్యూఢిల్లీ: ప్రతిపాదిత జాతీయ తయారీ కార్యక్రమం రూపురేఖలను ఖరారు చేయడానికి వీలుగా ప్రభుత్వం ఓ అంతర్ మంత్రిత్వ కమిటీని నియమించింది. నీతి ఆయోగ్ సీఈవో బీవీఆర్ సుబ్రమణ్యం చైర్మన్‌గా ఏర్పాటైన ఈ కమిటీ భాగస్వాములతో విస్తృత సంప్రదింపులు నిర్వహించనున్నట్టు ఓ అధికారి తెలిపారు.భారత్‌లో తయారీని మరింత ప్రోత్సహించేందుకు కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు ప్రభుత్వం లోగడే ప్రకటించడం గమనార్హం. దీన్ని ఇప్పుడు ఆచరణలోకి తీసుకొచ్చింది. వ్యాపార నిర్వహణ వ్యయాలు తగ్గించడం, భవిష్యత్‌కు అనుగుణమైన ఉద్యోగులను సిద్ధం చేయడం, ఎంఎస్ఎంఈని బలోపేతం చేయడం, టెక్నాలజీ లభ్యత, నాణ్యమైన ఉత్పత్తులు.. అనే ఐదు అంశాలపై ఈ కమిటీని కీలక సిఫారసులు చేయనుంది.

భద్రత కోసం రూ.70 కోట్లు!.. సుందర్ పిచాయ్ జీతం ఎంతంటే?
ప్రపంచంలోని దిగ్గజ కంపెనీల సీఈఓల గురించి తెలుసుకునే చాలామంది.. మొదట సెర్చ్ చేసే విషయం జీతమే. ఎందుకంటే వారి వేతనాలు కోట్ల రూపాయల్లో ఉంటాయి. ఇప్పుడు తాజాగా 2024లో సుందర్ పిచాయ్ జీతానికి సంబంధించిన విషయాలు వెల్లడయ్యాయి. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.ఆల్ఫాబెట్ 2025 ప్రాక్సీ స్టేట్మెంట్ ప్రకారం, సుందర్ పిచాయ్ వేతనం 2024లో 10.73 మిలియన్ డాలర్లు (రూ. 91.4 కోట్లు). ఇందులో ఎక్కువ భాగం స్టాక్ అవార్డ్స్, ఇతర పరిహారాల రూపంలో అందింది. కాగా ఈయన బేసిక్ శాలరీ 2 మిలియన్ డాలర్లు (రూ. 17.04 కోట్లు). సాధారణ ఉద్యోగి జీతంతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. 2023లో పిచాయ్ వేతనం 8.8 మిలియన్ డాలర్లు మాత్రమే.జీతం విషయం పక్కన పెడితే.. సుందర్ పిచాయ్ భద్రత కోసం ఆల్ఫాబెట్ కంపెనీ ఏకంగా 8.27 మిలియన్ డాలర్లను (రూ. 70.45 కోట్లు) ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. అంతకు ముందు ఏడాది సంస్థ భద్రత కోసం చేసిన ఖర్చు 6.78 మిలియన్ డాలర్లు. అంటే సెక్యూరిటీ కోసం.. కంపెనీ అంతకు ముందు సంవత్సరం కంటే 22 శాతం ఎక్కువ ఖర్చు చేసింది.ఇదీ చదవండి: ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం: మరో 195 మంది ట్రైనీలు..కంపెనీ అందించే భద్రతా ప్యాకేజీలో.. ఇంటి నిఘా, ప్రయాణ రక్షణ, వ్యక్తిగత డ్రైవర్లు వంటివన్నీ ఉంటాయి. అయితే దీనిని సంస్థ సుందర్ పిచాయ్ వ్యక్తిగత ప్రయోజనంగా కాకుండా.. ఉద్యోగ భద్రతలో భాగంగానే భావిస్తుంది. నిజానికి, సీఈఓ సుందర్ పిచాయ్ జీతం సగటు ఉద్యోగి జీతం కంటే దాదాపు 32 రెట్లు ఎక్కువ.

18 ఏళ్లలో 33 లక్షల మంది కొన్న కారు: దీని గురించి తెలుసా?
2007లో ఇండియన్ మార్కెట్లో అరంగేట్రం చేసినప్పటి నుంచి 'హ్యుందాయ్ ఐ10' ఏకంగా 33 లక్షల యూనిట్ల అమ్మకాలను అధిగమించింది. ఒక్క భారతదేశంలోనే ఈ కారును 20 లక్షల కంటే ఎక్కువ మంది కొనుగోలు చేశారు. కాగా కంపెనీ 140 కంటే ఎక్కువ దేశాలలో మరో 13 లక్షల యూనిట్లను ఎగుమతి చేసినట్లు తెలుస్తోంది.హ్యుందాయ్ కంపెనీకి చెందిన ఐ10ను ఎక్కువగా దక్షిణాఫ్రికా, మెక్సికో, చిలీ, పెరూ దేశాలకు ఎగుమతి చేశారు. 2007లో మొదటి సారి ఇండియన్ మార్కెట్లో అడుగుపెట్టిన ఈ కారు.. ఆ తరువాత అనేక అప్డేట్స్ పొందుతూ.. ఐ10, గ్రాండ్ ఐ10, గ్రాండ్ ఐ10 నియోస్ అనే మూడు వేరియంట్లలో.. 1.2 లీటర్ పెట్రోల్ మాన్యువల్, 1.2 లీటర్ పెట్రోల్ ఆటోమాటిక్, CNGతో 1.2 లీటర్ పెట్రోల్ అనే మూడు ఇంజిన్ ఆప్షన్లలో అందుబాటులోకి వచ్చింది.ఇదీ చదవండి: ధర ఎక్కువైనా అస్సలు తగ్గని జనం: ఒకేరోజు 52 కార్ల డెలివరీహ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ ప్రతి ఏటా సగటున లక్ష యూనిట్ల కంటే ఎక్కువ ఐ10 కార్లను విక్రయించింది. ఇది మంచి డిజైన్, డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్, కీలెస్ ఎంట్రీ వంటి అనేక కొత్త ఫీచర్స్ పొందింది. గ్రాండ్ i10 నియోస్ ధర రూ. 5.92 లక్షల నుంచి రూ. 8.56 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. ఇది ఎరా, మాగ్నా, కార్పొరేట్, స్పోర్ట్జ్, ఆస్టా అనే ఐదు వేరియంట్లలో లభిస్తోంది.

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
మంగళవారం ఉదయం మిశ్రమంగా ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సరికి స్వల్ప లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 28.11 పాయింట్లు లేదా 0.035 శాతం లాభంతో.. 80,246.48 వద్ద, నిఫ్టీ 7.45 పాయింట్లు లేదా 0.031 శాతం లాభంతో 24,335.95 వద్ద నిలిచాయి.టాప్ గెయినర్స్ జాబితాలో మాలు పేపర్ మిల్స్, పరాస్ డిఫెన్స్ అండ్ స్పేస్ టెక్నాలజీస్, డేటా ప్యాటర్న్స్ (ఇండియా), గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ & ఇంజనీర్స్, టీబీఓ టెక్ వంటి కంపెనీలు చేరగా.. మ్యాక్స్ ఇండియా లిమిటెడ్, గ్లోబల్ వెక్ట్రా హెలికార్ప్, మనక్సియా, శివ మిల్స్ లిమిటెడ్, లక్ష్మీ ఫైనాన్స్ అండ్ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ వంటి కంపెనీలు నష్టాలను చవిచూశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు).
ఫ్యామిలీ

ఖాదీ కమ్ బ్యాక్
సాంస్కృతికపరంగానే కాదు వాణిజ్యపరంగా కూడా ఖాదీ పునర్జీవనం హైలెవెల్లో ఉంది. ఖాదీ గ్రామీణ పరిశ్రమల ఉత్పత్తుల అమ్మకాలు 2024–25 నాటికి అనూహ్యంగా రూ.1,70,551,37 కోట్లకు పెరిగాయి. గ్రామీణ భారతంలో ఖాదీ జీవనోపాధి వనరు, పట్టణాల్లో మాత్రం ప్రతీకాత్మక వస్త్రధారణగా మారింది. ప్రత్యేక సందర్భాల్లో ఖాదీ దుస్తులు ధరించే వారి సంఖ్య పెరుగుతోంది. ఎంతోమంది ఫ్యాషన్ డిజైనర్లు ఖాదీతో ఎక్స్పెరిమెంట్స్ చేయడం విశేషం. ఫ్యాషన్ ఇండస్ట్రీలో ‘న్యూ ఖాదీ ఫర్ ది న్యూ ఇండియన్’ ధోరణి వేళ్లూనుకుంది. ‘న్యూ ఖాదీ ఫర్ న్యూ ఇండియన్’ నినాదాన్ని తమ ప్రచారానికి వాడుకుంటుంది లూనా బ్రాండ్. ఆధునిక మార్కెట్ కోసం ఖాదీని పునర్నిర్వచిస్తున్న బ్రాండ్లలో బెంగళూరుకు చెందిన లూనా బ్రాండ్ ఒకటి. కొత్త బ్రాండ్లు ట్రెండ్ ఆధారిత ఫ్యాషన్‌కు ప్రాధాన్యత ఇస్తున్నాయి. ‘ఖాదీకి ప్రాముఖ్యత ఇవ్వడం ద్వారా విలాసవంతమైన, నైతిక, పర్యావరణ హితమైన భవిష్యత్తుకు పునాది వేయవచ్చు’ అంటున్నారు ఖాదీని ఇష్టపడే ఫ్యాషన్ డిజైనర్లు.(చదవండి: Rich Man's Disease: ఇవి తింటున్నారా? జాగ్రత్త!)

మూడో పంటగా సౌర విద్యుత్తు!
మెట్ట భూముల్లో సోలార్ ప్యానెళ్లను నేలపైనే ఏర్పాటు చేసి సౌర విద్యుత్తును ఉత్పత్తి చేయటం తెలిసిందే. అయితే, వ్యవసాయ భూమిని ఇలా సోలార్ ప్యానళ్ల మయం చేస్తూ పోతే సాగు విస్తీర్ణం తగ్గిపోతుందన్న భయాందోళనలు లేకపోలేదు. అందుకే, పంటలను సాగు చేస్తూ అదే పొలంలోనే సోలార్ ప్యానళ్లతో విద్యుత్తు ఉత్పత్తి చేస్తే మేలు కదా! ప్యానళ్ల ఏర్పాటులో కొన్ని మార్పులు చేసుకుంటే పొలాల్లో పంటలతో పాటు పనిలో పనిగా సౌర విద్యుత్తును కూడా నిక్షేపంగా పండించుకోవచ్చని విదేశీ అనుభవాలు చెబుతున్నాయి. వ్యవసాయ రంగంలో ఇది సరికొత్త ట్రెండ్. అదే ‘అగ్రివొల్టాయిక్స్’! ఏడాదికి రెండు (ఖరీఫ్, రబీ) పంటలతో పాటే అదే పొలంలో మూడో పంటగా సౌర విద్యుత్తు ఉత్పత్తిపై మన దేశంలోనూ ప్రయోగాలు జరుగుతున్నాయి. అనేక చోట్ల పైలట్ ప్రాజెక్టులు నడుస్తున్నాయి. ఆ సంగతులేమిటో చూద్దాం..!సోలార్ ప్యానళ్ల పక్కన పంటలునేలకు ఒకటి, రెండు అడుగుల ఎత్తులో గ్రౌండ్ మౌంటెడ్ సోలార్ ప్యానళ్లను వరుసలుగా ఏర్పాటు చేసుకొని, ఆ వరుసల మధ్యలో ఎక్కువ దూరం ఉండేలా చూసుకొని.. ఆ ఖాళీలో పంటలను పండిస్తున్న సంస్థలు ఉన్నాయి. కేరళలోని కొచ్చిన్ విమానాశ్రయంలో, గుజరాత్‌లోని సర్దోయ్లో కూడా ఇలాంటి ప్రయోగాత్మక సోలార్‌లో అంతర సాగు జరుగుతోంది. ప్యానళ్ల వరుసల మధ్యలో గోరింటాకు మొక్కలు సాగు చేస్తున్నారు. బలమైన గాలుల నుంచి సోలార్ ప్యానళ్లను రక్షించడానికి కూడా ఈ మొక్కలు ఉపయోగంగా ఉన్నాయంటున్నారు. ప్యానళ్లను కడిగే నీటిని ఈ మొక్కలకు మళ్లిస్తూ నీటిని పునర్వినియోగిస్తున్నారు.ప్యానళ్ల నీడలో పంటలుమహారాష్ట్రలోని పర్బనిలో 5 ఎకరాల్లో ఒక మోస్తరు ఎత్తున ఏర్పాటు చేసిన సోలార్ ప్యానళ్ల కింద తక్కువ ఎత్తు పెరిగే అల్లం, పసుపు, పెసలు, బెండ వంటి పంటలు పండిస్తున్నారు. 50 మెగావాట్ల ప్రాజెక్టును సన్‌సీడ్ ఎపివి, కనొడా ఎనర్జీ, జిఐజడ్ జెర్మన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉమ్మడిగా నెలకొల్పాయి. ‘సోలార్ ప్యానళ్ల కింద మేం పెట్టిన పంటలు బాగానే పెరుగుతున్నాయి. మామూలు పొలాల్లో సమానంగానే దిగుబడి వస్తోంది. అయితే, చెరకు వంటి బాగా ఎత్తుగా పెరిగే పంటలను సోలార్ ప్యానళ్ల కింద పెంచలేం’ అన్నారు ఈ క్షేత్రాన్ని నిర్వహిస్తున్న యువ రైతు గోవింద్ రసవె.ద్రాక్ష తోట కూడా,.మహారాష్ట్రలోని నాసిక్‌లో ఉన్న దేశంలోనే అతి పెద్ద రైతు ఉత్పత్తిదారుల సంఘం(ఎఫ్పిఓ) సహ్యాద్రి ఫామ్స్ కూడా ప్రయోగాత్మకంగా సోలార్ సేద్యం చేస్తోంది. ఒక ఎకరంలో సోలార్ ప్యానళ్లను 3.75 మీటర్ల ఎత్తున ఏర్పాటు చేసి, వాటి నీడన రకరకాల పంటలను సాగు చేస్తోంది. 250 కె.డబ్ల్యూ. సామర్థ్యంతో కూడిన బై–ఫేసియల్ ప్యానళ్లను ఏర్పాటు చేశారు. ఈ ప్యానళ్ల కింద ద్రాక్ష తోటలు పెంచుతున్నారు. ప్రత్యేకంగా పందిళ్లు వేయాల్సిన అవసరం లేకుండా ప్యానళ్ల కోసం ఏర్పాటు చేసే ఫ్రేమ్‌లకే ద్రాక్ష తీగలను పాకించవచ్చు. కీర, టొమాటో వంటి పంటలకు కూడా ప్రత్యేకంగా స్టేకింగ్ ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉండదు. ఆ ఖర్చు తగ్గుతుందని సహ్యాద్రి ఫామ్స్ ప్రోగ్రామ్ డైరెక్టర్ మహేశ్ షెల్కె చెప్పారు.బెండ, సొర, కొత్తిమీర..రాజస్థాన్‌లోని జో«ద్పుర్లో కేంద్రీయ మెట్ట ప్రాంత వ్యవసాయ పరిశోధనా సంస్థలో, గుజరాత్‌లోని జామ్‌నగర్ జిల్లాలోనూ 3 మీటర్ల ఎత్తున పెట్టిన సోలార్ ప్యానళ్ల నీడన బెండ, సొర, కొత్తిమీర, గోరుచిక్కుడు పండిస్తున్నారు. శీతాకాలంలో టొమాటోలు, కీరదోస, జుకిని, మిరప పంటలు పండిస్తున్నారు. మరో పద్ధతి ఏమిటంటే.. సోలార్ ప్యానళ్లను బల్లపరుపుగా కాకుండా, నిట్ట నిలువుగా ఏర్పాటు చేసి, వాటి మధ్యలో ధాన్యపు పంటలు పండించుకోవటం. మహారాష్ట్రలో ఇటువంటి వర్టికల్ బైఫేషియల్ సోలార్ అగ్రివొట్లాయిక్స్ ప్రాజెక్టును నెక్ట్స్2సన్, వాట్కార్ట్ సంస్థలు నెలకొల్పాయి. ఇలా 90% భూమిలో పంటలు పండించుకోవచ్చు. పది శాతం నేల మాత్రమే సోలార్ ప్యానళ్లకు సరిపోతుంది.ప్యానళ్ల కింద పశువుల పెంపకంమారుమూల ప్రాంతాల్లో వ్యవసాయానికి విద్యుత్తు దొరకదు. సోలార్ ప్యానళ్ల కింద పంటలు పండించుకుంటే, విద్యుత్తు సమస్య తీరుతుంది, పంటలపై కూడా ఆదాయం వస్తుంది. ఆ విధంగా రైతులకు అగ్రివోల్టాయిక్స్ ద్వారా అనేక ప్రయోజనాలు నెరవేరుతాయని మహేశ్ సంతృప్తిగా చెప్పారు. ఎలివేటెడ్ సోలార్ ప్యానళ్ల కింద పంటలనేæ పండించాలనేం లేదు, పశువులను కూడా పెంచుకోవచ్చు. ఢిల్లీ పరిసరాల్లో 2.5 ఎం.డబ్ల్యూ. సామర్థ్యం గల ఎలివేటెడ్ సోలార్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసి, అందులో పశువులను మేపితే మంచి ఆదాయం వచ్చిందని రుజువైందని ఆయన అన్నారు.రైతులకు రిస్క్ లేదుసన్సీడ్ ఎపివి సంస్థ అధిపతి వివేక్ సరఫ్ మాట్లాడుతూ ‘ఈ అగ్రివొల్టాయిక్స్ ప్రాజెక్టులో రైతులకు ఎటువంటి రిస్క్ లేదు. పెట్టుబడి మాది. పెట్టుబడి రిస్క్ మాకే ఉంటుంది. భూములు కౌలుకు ఇచ్చిన రైతులకు రిస్క్ ఏమీ లేదు. సాధారణ పంటలు సాగు చేస్తే రైతుకు ఎకరానికి ఏడాదికి రూ. 50 వేల వరకు వస్తాయి. అగ్రివొల్టాయిక్స్కు ఇస్తే ఆ పంట దిగుబడులతో పాటు కౌలు రూ. 50 వేల వరకు అదనపు ఆదాయం వస్తుంది. ఈ వ్యవసాయ పనులు చేసే రైతులకు ఇంకా అదనపు ఆదాయం కూడా వస్తుంది’ అన్నారు. అయితే, విడిగా రైతులు దీర్ఘకాలిక కౌలుకు ఇవ్వాలంటే వెనుకాడతారు. రైతులు బృందంగా, ఎఫ్పిఓగా ఏర్పాడితే అప్పుడు ఆ సంకోచం ఉండదు అన్నారాయన. సౌరవిద్యుత్తు ఉత్పత్తితో పాటు పంటల సాగులో వున్న సమస్యలు మున్ముందు తీరిపోతాయి. రైతులకు ఏటా రెండు పంటలతో పాటు సౌర విద్యుత్తును మూడో పంటగా పండించుకోవటం సులభ సాధ్యమవుతుందని, రైతుల ఆదాయం పెరుగుతుందని ఆశిద్దాం.

హిమాచలంలో ఉమెన్ పవర్
పర్యాటక ప్రేమికులకు సుపరిచితమైన పేరు... లాహౌల్ స్పితి. చుట్టూ హిమాలయ పర్వతాలతో మంత్రముగ్ధులను చేసే ప్రకృతి అందాలతో కనువిందు చేసే ఈ జిల్లా హిమాచల్‌ప్రదేశ్‌లో ఎక్కువ మంది సందర్శించేప్రాంతం. దేశంలోనే అతి తక్కువ జనాభా ఉన్న జిల్లాల్లో ఒకటి. ఉపాధికోసం పురుషులు ఎక్కువగా వలస పోవడంతో ఈప్రాంతంలో మహిళల జనాభా ఎక్కువ. 2024 ఉపఎన్నికల్లో అనురాధ రాణా శాసనసభ్యురాలిగా ఎన్నికైంది. జిల్లాలో ఆమె రెండో మహిళా శాసనసభ్యురాలు. రాజకీయాల్లో పెరిగిన మహిళలప్రాతినిధ్యానికి ఆమె విజయం అద్దం పడుతుంది.ఇక జిల్లా పాలనా యంత్రాంగం విషయానికి వస్తే... జిల్లా సూపరిండెంట్ ఆఫ్ పోలీస్... ఇల్మా ఆఫ్రోజ్, ఐఏఎస్ ఆఫీసర్ కిరణ్ బదన జిల్లా కలెక్టర్, ఆకాంక్ష శర్మ ‘సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్’గా కీలకమైన బాధ్యతలను నిర్వహిస్తున్నారు... ఇలా ఎంతోమంది మహిళలు జిల్లా పాలన యంత్రాంగంలో కీలకమైన స్థానాల్లో ఉన్నారు.కఠినమైన వాతావరణం, సుదూరప్రాంతం కారణంగా పోస్టింగ్‌కు ఎక్కువమంది ఇష్టపడని జిల్లాగా ఒకప్పుడు లాహౌల్ స్పితికి పేరుండేది. అయితే ఆ తరువాత సంప్రదాయ ఇమేజ్ చెరిగిపోవడం మొదలైంది. దీనికి కారణం... మహిళా అధికారులు. వృత్తిపరమైన సంతృప్తి,ప్రత్యేకమైన సవాళ్లను ఇష్టపడే మహిళా అధికారులు ఎక్కువగా ఇష్టపడే జిల్లాగా ‘లాహౌల్ స్పితి’ గుర్తింపు పొందింది.

72 ఏళ్ల వయసులో... కిలిమంజారోపైకి
‘వయసు పరిమితులు’ అంటుంటాం. అయితే క్రమశిక్షణ, సంకల్పబలం ఆ పరిమితులను తొలగించి గెలుపుదారిని చూపుతాయి. అందుకు తాజా ఉదాహరణ విద్యాసింగ్.72 ఏళ్ల వయసులో కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించిన ఓల్డెస్ట్ ఇండియన్ ఉమన్‌గా చరిత్ర సృష్టించింది...విద్యాసింగ్ పారిశ్రామికవేత్త, దాత, అథ్లెట్‌గా ప్రసిద్ధురాలు. 2013 నుంచి ట్రెక్కింగ్‌పై ఆసక్తి పెంచుకుంది. భారతదేశం, భూటాన్, దక్షిణ అమెరికా... 19 ట్రెక్కింగ్‌లను పూర్తి చేసింది. విజయనగరం రాజకుటుంబానికి చెందిన విద్యాసింగ్ మద్రాస్‌లో పెరిగింది. చర్చ్ పార్క్, స్టెల్లా మేరీస్ కాలేజి వంటి ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో చదువుకుంది. ఆమె తండ్రి గోల్ఫ్, టెన్నిస్ క్రీడాకారుడు. గుర్రపు స్వారీ చేసేవాడు. తల్లి అద్భుతమైన టెన్నిస్ క్రీడాకారిణి.పదమూడు సంవత్సరాల వయసు నుంచే తల్లితో కలిసి టెన్నిస్ టోర్నమెంట్లలో పాల్గొనేది విద్యాసింగ్. ‘టోర్నమెంట్ గెలిచిన తల్లీకూతుళ్ల జట్టు’ అని పత్రికల పతాక శీర్షికలలో వచ్చేది. మద్రాస్ యూనివర్శిటీ మహిళల టెన్నిస్ జట్టుకు విద్యాసింగ్ కెప్టెన్‌గా వ్యవహరించింది. మాస్టర్స్ స్విమ్మింగ్ చాంపియన్‌షిప్‌లో పతకాలు గెలుచుకుంది. ప్రతి వారాంతంలో తన బృందంతో కలిసి 50–60 కిలోమీటర్లు సైక్లింగ్ చేస్తుంది. మారథాన్లలో పాల్గొనడం, గుర్రపు స్వారీ చేయడం ఆమెకు ఇష్టం. కిలిమంజారో ‘ట్రెక్కింగ్ శిఖరం’ అయినప్పటికీ తీవ్రమైన పరిస్థితులు, తీవ్రమైన ప్రమాదాలు పొంచి ఉంటాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని చెన్నైకి చెందిన ‘గెట్ అప్ అండ్ గో’ అనే ట్రెక్కింగ్ కంపెనీతో కలిసి ట్రెక్కింగ్ చేసింది. ఈ బృందంలో 10 మంది ట్రెక్కర్లు ఉన్నారు.ఆరో రోజు రాత్రి 10.30 గంటలకు పర్వతారోహణ ప్రారంభమైంది. గంటల తరబడి కఠినమైన పర్వతారోహణ తరువాత తెల్లావారేసరికి ఈ బృందం స్టెల్లా పాయింట్‌కు చేరుకుంది. ఆపై మరో 45 నిమిషాలు ట్రెక్కింగ్ చేసి కిలిమంజారో ఉహురు శిఖరానికి చేరుకున్నారు. ‘రోజంతా ఆకాశంలో గడపడం అద్భుతంగా అనిపించింది. విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి’ అని ఆరోజును గుర్తు చేసుకుంది విద్యాసింగ్. వయసు పరిమితిని అధిగమించి విద్యాసింగ్ అపూర్వ విజయాన్ని సాధించడానికి కారణం ఏమిటి? ఆమె మాటల్లో చెప్పాలంటే... ‘గుడ్ జీన్స్’ ఇంకా చెప్పాలంటే క్రమశిక్షణతో కూడిన జీవనవిధానం, క్రమం తప్పని వ్యాయామాలు.
ఫొటోలు
అంతర్జాతీయం

స్తంభించిన విద్యుత్.. మూడు దేశాలు అతలాకుతలం
మాడ్రిడ్: విద్యుత్ సప్లై పూర్తిగా నిలిచిపోవడంతో మూడు ఐరోపా దేశాలు అతలాకుతలమవుతున్నాయి. పవర్ గ్రిడ్ లో తీవ్రమైన సమస్యలు తలెత్తడంతో స్పెయిన్, పోర్చుగల్, ఫ్రాన్స్ దేశాలు పూర్తిగా స్తంభించిపోయాయి.ప్రస్తుతం పవర్ గ్రిడ్ తిరిగి పునరుద్దరించే పనిలో పడ్డ మూడు దేశాలు.. సోమవారమంతా చీకటిలో మగ్గిపోయాయి. విమానాల రాకపోకల్లో తీవ్ర సమస్యలే కాకుండా భారీ ట్రాఫిక్ జామ్ లు వంటి ఘటనలు ఆ దేశాల్లో తల్తెతాయి. దీనిపై ఆయా దేశాలు అత్యవసరంగా క్యాబినెట్ భేటీ నిర్వహించి పవర్ గ్రిడ్ ను పునరుద్దరించేందుకు కసరత్తులు చేస్తున్నాయి. ఎక్కడికక్కడే నిలిచిపోయిన రైళ్లు..చిమ్మ చీకటిలో గడుపుతున్న ఈ మూడు దేశాల్లో మెట్రో సేవలు ఉన్నపళంగా నిలిచిపోయాయి. . రైళ్లు కూడా ఎక్కడికక్కడి స్తంభించిపోయాయి. . దీంతో ఆయా దేశాల ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ సంక్షోభంపై ఇప్పటివరకూ ఎటువంటి క్లారిటీ లేకపోవడంతో జనాలు బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. మాడ్రిడ్ లోని నాలుగు టవర్ బిల్డింగ్ ల్లో ఒక దాన్ని ఖాళీ చేయించారు. ఇందులో బ్రిటీష్ ఎంబాసీ పనిచేస్తున్న దరిమిలా ఆ కార్యాలయాన్ని ఆకస్మింగా ఖాళీ చేయించారు.ఆఫీసులు వదిలి.. రోడ్లపైనేతీవ్రమైన విద్యుత్ సంక్షోభంతో కార్యాలయాలు ఏవీ పని చేయడం లేదు. ఆఫీసులకు వచ్చిన ఉద్యోగులు.. రోడ్లపైనే తిరుగుతూ కాలయాపన చేస్తున్నారు. అయితే దీనిపై స్పానిష్ ఎలక్ట్రిసిటీ గ్రిడ్ ఆపరేట్ రెడ్ ఎలక్ట్రికా స్పందించింది. విద్యుత్ ను తిరిగి పునరుద్దరించే క్రమంలో స్థానిక విద్యుత్ కంపెనీలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపింది. అన్ని యూరోపియన్ విద్యుత్ యూనియన్లను సమన్వయం చేసుకుంటూ సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు తాత్కాలిక ప్రయత్నాలు చేస్తున్నట్లు స్పష్టం చేసింది.

ఉక్రెయిన్‌లో రష్యా తాత్కాలిక కాల్పుల విరమణ
మాస్కో: ఉక్రెయిన్‌లో రష్యా తాత్కాలిక కాల్పుల విరమణ (Ceasefire)ను ప్రకటించింది. విక్టరీ డే నేపథ్యంలో వచ్చే నెల 8 నుంచి 10వ తేదీవరకు పూర్తిస్థాయి కాల్పుల విరమణ పాటిస్తామని క్రెమ్లిన్ వెల్లడించింది.మానవతా దృక్పథంతో దేశాధ్యక్షుడు పుతిన్ ఈమేరకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపింది. యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న వేళ ఈ ప్రకటన వెలువడింది. రెండో ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీపై విజయానికి గుర్తుగా రష్యా ప్రభుత్వం ఏటా మే 9న విక్టరీ డే వేడుకలు నిర్వహిస్తుంది.అమెరికా నుంచి శాశ్వత కాల్పుల విరమణ, శాంతి చర్చల ఒప్పందంపై ఒత్తిడి పెరుగుతున్న వేళ.. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ నిర్ణయం ప్రకటించారు. ఇదిలా ఉంటే.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉక్రెయిన్ మీద దాడులు ఆపాలంటూ రష్యాను కోరిన సంగతి తెలిసిందే. ఉక్రెయిన్‌పై రష్యా బలగాలు జరుపుతున్న భీకరదాడులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారాయన. అదే సమయంలో.. శాంతి ఒప్పందంలో భాగంగా క్రిమియాను వదులుకోవాలంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లోదిమిర్ జెలెన్స్కీకి సూచించారు కూడా.

Owaisi: నీ తల్లికి తూటా దింపిందెవరు?
న్యూఢిల్లీ: సింధు జలాల నదీ ఒప్పందం నిలిపివేత నేపథ్యంతో భారత్‌ను ఉద్దేశించి పలువురు పాక్ నేతలు అడ్డగోలు వ్యాఖ్యలు చేశారు. వారిలో బిలావల్ భుట్టో జర్దారీ చేసిన వ్యాఖ్యలకు ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ(Asaduddin Owaisi) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. నీ తాత, తల్లిని చంపిందెవరో ఒక్కసారి గుర్తు తెచ్చుకో అంటూ బిలావల్‌ను ఉద్దేశించి ప్రశ్న సంధించారాయన.‘‘ఇవన్నీ పిల్ల మాటలు. అతని తాతకు ఏం జరిగిందో అతనికి తెలియదా? అతని తల్లిని ఉగ్రవాదులేగా చంపేశారు. కనీసం అది గుర్తున్నా? అతను అలా మాట్లాడి ఉండడు. అమెరికా సాయం చేస్తేనేగానీ ముందుకు నడవలేని దేశం పాకిస్తాన్. అలాంటిది మీరా మనల్ని చిన్నచూపు చూస్తోంది? అంటూ బిలావల్‌ను ఉద్దేశించి ఒవైసీ ఘాటు వ్యాఖ్యలు చేశారు.అతని తల్లిని చంపినప్పుడు అది ఉగ్రవాదం.. అదే మన అమ్మలను, బిడ్డలను చంపినప్పుడు అది ఉగ్రవాదం కాదా?. ఇది కూడా అర్థం చేసుకోలేనివాడికి మనం ఏం చెప్పినా వ్యర్థమే’’ అని ఒవైసీ వ్యాఖ్యానించారు.పనిలో పనిగా పాక్ నేతలకూ ఆయన చురకలంటించారు. ‘‘ పాక్‌లో కూర్చుని అడ్డగోలుగా మాట్లాడొద్దు. పాక్ దేశ మొత్తం బడ్జెట్.. మా దేశ రక్షణ బడ్జెట్ కంటే తక్కువే.మీరు ఏ దేశంలోకి చొరబడి అమాయకుల ప్రాణాలు తీస్తుంటే ఎవరూ మౌనంగా ఉండరు. మతం అడిగి మరీ చంపడం.. వికృతమైన పని. ఉగ్రవాదులు మరోసారి దాడి చేసే సాహసం చేయకుండా ప్రధాని మోదీ కఠిన చర్యలు తీసుకోవాలి’’ అని ఒవైసీ అన్నారు. 2007 డిసెంబర్ 30వ తేదీన రావల్పిండిలో జరిగిన ర్యాలీలో.. ఆత్మాహుతి దాడి జరిగి బెనజీర్ భుట్టోతో పాటు మరో 20 మంది బలయ్యారు. ఇక..పాక్ మాజీ అధ్యక్షుడు, ప్రధాని అయిన ఆమె తండ్రి జుల్ఫీకర్ అలీ భుట్టోను ఓ హత్య కేసుకుగానూ 1979 ఏప్రిల్ 4వ తేదీన ఉరి తీశారు. అయితే అది రాజకీయ ప్రేరేపిత కేసు అనే అభియోగాలు ఉన్నాయి. 2023 దాకా విదేశాంగ మంత్రిగా పని చేసిన పీపీపీ నేత బిలావల్ భుట్టో.. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో కొనసాగుతున్నారు. ‘‘సింధూ నది మాదే. ఎప్పటికీ మాదే. నదిలో నీరైనా పారుతుంది లేదా వారి రక్తమైనా పారుతుంది. పాకిస్థాన్ గానీ అంతర్జాతీయ సమాజం కానీ ఈ యుద్ధ కాంక్షను అస్సలు సహించదు. వేల ఏళ్ల నాటి సింధూ నాగరికతకు తాము వారసులమని మోదీ అంటుంటారు. కానీ ఈ సంస్కృతికి పరిరక్షకులము మేమే. ఎట్టి పరిస్థితుల్లోనూ కాపాడుకుంటాము’’ అంటూ ఓ ర్యాలీలో మాట్లాడారు. ఈ వ్యాఖ్యలను కేంద్ర మంత్రులు సహా భారత్‌లోని పలువురు నేతలు ఇప్పటికే ఖండించారు కూడా.

భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు.. దాయాదితో టచ్‌లోకి చైనా
ఇస్లామాబాద్: పహల్గాం ఉగ్రదాడి ఘటన భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలను పెంచింది. ఇందులో భాగంగా పాకిస్తాన్ విషయంలో భారత్ పలు చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో పొరుగు దేశం చైనా ఆచితూచి అడుగులు వేస్తోంది. తాజాగా ప్రస్తుత పరిస్థితుల్లో భారత్- పాకిస్థాన్‌లు సంయమనం పాటించాలని చైనా భావిస్తోంది అంటూ ఆ దేశ విదేశాంగశాఖ మంత్రి చెప్పుకొచ్చారు.తాజాగా చైనా విదేశాంగశాఖ మంత్రి వాంగ్ యీ, పాకిస్తాన్ విదేశాంగ మంత్రితో మాట్లాడారు. ఈ క్రమంలో వాంగ్ యీ మాట్లాడుతూ..‘పాకిస్తాన్, భారత్ మధ్య పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నాం. ఉగ్రదాడిపై నిష్పక్షపాత దర్యాప్తునకు మద్దతు ఇస్తాం. ప్రస్తుత పరిస్థితుల్లో రెండు దేశాలు సంయమనం పాటించాలని బీజింగ్ భావిస్తోంది. పరస్పరం ముందుకు సాగాలని, ఉద్రిక్తతలను తగ్గించేందుకు కృషి చేయాలని ఆశిస్తోంది’ అని చెప్పినట్లు చైనా మీడియా ఓ ప్రకటనలో పేర్కొంది. ఉగ్రవాదంపై పోరాటం అన్ని దేశాల ఉమ్మడి బాధ్యత అని స్పష్టం చేసినట్లు వెల్లడించింది.ఇదిలా ఉండగా.. పహల్గాం ఉగ్రదాడి దర్యాప్తు వ్యవహారంలో రష్యా, చైనాలు జోక్యం చేసుకోవాలని పాకిస్థాన్ కోరుకుంటున్నట్లు కథనాలు వెలువడ్డాయి. ‘ఈ ఘటన దర్యాప్తు విషయంలో రష్యా, చైనా లేదా పశ్చిమ దేశాలు సానుకూల పాత్ర పోషించగలవు. భారత్, మోదీ అబద్ధం చెబుతున్నారా? లేదా.. పాకిస్తాన్ నిజం చెబుతుందా? అనేది వెలికితీసేందుకు దర్యాప్తు బృందాన్ని కూడా ఏర్పాటు చేయవచ్చు’ అని కథనాలు వెలువడ్డాయి.China breaks its silence on the ongoing tensions between India and Pakistan.Chinese Foreign Minister Wang Yi spoke with Pakistan’s Deputy PM Ishaq Dar today and said that China supports Pakistan in safeguarding its sovereignty and security interests. pic.twitter.com/wIUt1Yz0UJ— Salt News (@SaltNews_) April 27, 2025మరోవైపు.. పహల్గాంలో ఉగ్ర దాడిని అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాశ్ పటేల్ ఖండించారు. ఈ విషయంలో భారత్‌కు పూర్తి మద్దతుగా నిలుస్తామని స్పష్టం చేశారు. ఉగ్రవాదం నుంచి ప్రపంచం ఎదుర్కొంటున్న బెదిరింపులను ఈ దాడి గుర్తు చేసిందని పేర్కొన్నారు. దాడి అనంతరం భద్రతా దళాలు స్పందించిన తీరును ప్రశంసించారు. ‘కశ్మీర్లో ఇటీవల జరిగిన దాడిలో మరణించిన వారికి ఎఫ్‌బీఐ సంతాపం తెలుపుతోంది. భారత్ ప్రభుత్వానికి పూర్తి మద్దతుగా నిలుస్తోంది’ అని వ్యాఖ్యానించారు.పహల్గాం ఉగ్ర దాడిని ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ ఖండించారు. ఉగ్రవాదాన్ని అడ్డుకోవడానికి ప్రాంతీయ సమన్వయం అవసరమని అభిప్రాయపడ్డారు. ప్రధాని మోదీకి తాను ఫోన్ చేసి దాడిని ఖండించినట్లు ఆయన ప్రకటించారు. పహల్గాం దుర్ఘటనలను ఈ ప్రాంతంలోని దేశాలు ఉమ్మడి బాధ్యతగా తీసుకుని స్పందించాలని సూచించారు. ఇరాన్లో పర్యటించాలని ప్రధాని మోదీకి ఆయన ఆహ్వానం పలికారు.
జాతీయం

పాకిస్తాన్‌ను వదిలే ప్రసక్తే లేదు.. ఐరాసలో భారత్ హెచ్చరిక
న్యూయార్క్: అంతర్జాతీయ వేదికపై దాయాది దేశం పాకిస్తాన్‌కు భారత్ గట్టి షాకిచ్చింది. సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ హింసకు పాల్పడుతున్న పాకిస్తాన్ కుట్రలను ఐక్యరాజ్యసమితిలో భారత్ ఎండగట్టింది. పాకిస్తాన్ ఇకపై ఏం చేసినా చూస్తూ ఊరుకునేది లేదని గట్టిగా హెచ్చరించింది.తాజాగా ఐక్యరాజ్యసమితిలో పహల్గాం ఉగ్రదాడి అంశాన్ని భారత్ లేవనెత్తింది. న్యూయార్క్‌లో ‘ఉగ్రవాద అనుబంధ నెట్వర్క్ బాధితుల’ కార్యక్రమంలో ఐరాసకు భారత డిప్యూటీ శాశ్వత ప్రతినిధిగా ఉన్న యోజన పటేల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పటేల్ మాట్లాడుతూ.. ‘పాకిస్తాన్ ప్రపంచ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోంది. ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తున్నామని స్వయంగా పాక్ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ బయటపెట్టారు. ఉగ్రవాదులకు మద్దతు ఇస్తున్నట్లు ఏకంగా రక్షణ మంత్రి ఇటీవల అంగీకరించడాన్ని ప్రపంచం మొత్తం విన్నది. ఇలాంటి బహిరంగ వ్యాఖ్యలు చేసిన తర్వాత కూడా పాకిస్తాన్‌ను ఎందుకు క్షమించాలి. ప్రపంచం ఇకపై కళ్లు మూసుకొని చూస్తూ ఉండదు. భారత్‌పై నిరాధార ఆరోపణలు చేయడానికి ఈ అంతర్జాతీయ వేదికను పాక్ దుర్వినియోగం చేస్తోంది’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.VIDEO | Speaking at launch of Victims of Terrorism Associations Network, Deputy Permanent Representative of India in UN, Yojna Patel, said: "It is unfortunate that one particular delegation has chosen to misuse and undermine this forum to indulge in propaganda and make baseless… pic.twitter.com/I0tMhjjcmW— Press Trust of India (@PTI_News) April 29, 2025ఇదిలా ఉండగా.. పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాక్, భారత్ మధ్య సంబంధాలు తెగిపోయి యుద్దం మేఘాలు కమ్ముకుంటున్న క్రమంలో పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో మీడియాతో మాట్లాడుతూ.. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడంతో, ఉగ్రవాద గ్రూపులకు నిధులు, మద్దతునివ్వడంతో పాకిస్తాన్ పాత్ర ఉందని అంగీకరించారు. సుమారు మూడు దశాబ్దాలుగా అమెరికా, బ్రిటన్ సహా పశ్చిమ దేశాలకోసం ఈ నీచమైన పని చేశామంటూ వ్యాఖ్యలు చేశారు. అలాగే, సోవియట్ యూనియన్ యుద్ధం, భారత్‌లో జరిగిన 9/11 దాడుల్లో పాల్గొనకపోయి ఉంటే పాకిస్తాన్ ట్రాక్ రికార్డు మరోలా ఉండేది. భారత్ నుంచి దాడి జరిగే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అందుకే మేము మా బలగాలను పటిష్టం చేశాం. ఈ పరిస్థితుల్లో కొన్ని వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది, ఆ నిర్ణయాలు తీసుకున్నాం అని చెప్పుకొచ్చారు.

4 సార్లు చిక్కినట్లే చిక్కి తప్పించుకున్నారు!
శ్రీనగర్: పైశాచికంగా అమాయకుల ప్రాణాలను బలిగొని దట్టమైన దక్షిణకశ్మీర్ అడవిలోకి పారిపోయిన ఉగ్రవాదులను తుదముట్టించేందుకు భద్రతా బలగాల వేట కొనసాగుతోంది. స్థానికులు ఇస్తున్న సమాచారం, నిఘా వివరాలతో ఎప్పటికప్పుడు ఉగ్రవాదుల జాడ కోసం వెతుక్కుంటూ వెళ్తున్నా ఆలోపే వాళ్లు అక్కడి నుంచి ఉడాయిస్తున్న ఉదంతాలు జరిగాయన్న అంశం తాజాగా వెలుగులోకి వచి్చంది. ఈ మేరకు జాతీయ మీడియా కథనం వెలువర్చింది. గత వారం రోజుల వ్యవధిలో ఉగ్రవాదులు చిక్కినట్లే చిక్కి నాలుసార్లు తప్పించుకున్నారని తెలుస్తోంది. ఒకసారి దూరం నుంచి పరస్పర ఎదురుకాల్పులు సైతం జరిగాయని ఆ కథనం పేర్కొంది. ఉగ్రవాదుల అన్వేషణ బృందం కూంబింగ్ ఆపరేషన్‌పై అవగాహన ఉన్న ఒక సైన్యాధికారి ఈ వివరాలను వెల్లడించారు. ‘‘ఇది పిల్లి, ఎలుకల గేమ్‌లా తయారైంది. ఉగ్రవాదులు నక్కిన ప్రాంతాన్ని దాదాపు చేరుకున్నాం. ఆలోపే వాళ్లు ఉడాయించారు. ఇలా నాలుగుసార్లు జరిగింది. దట్టమైన అడవిలో దూరం నుంచి ఒక వ్యక్తి కనిపించినా సరే వెంటనే వాళ్ల వెనకాలే పరుగెత్తలేం. కొన్ని భౌగోళిక అవాంతరాలు మన కాళ్లకు బంధనాలుగా మారతాయి. మేం త్వరలోనే వాళ్లను పట్టుకుంటాం లేదా అంతమొందిస్తాం. కొద్ది రోజుల్లో ఈ కథ సుఖాంతమవుతుంది’’అని ఆ అధికారి అన్నారు. తొలుత హర్‌పథ్‌నార్ గ్రామంలో.. ఉగ్రవాదుల జాడను తొలుత అనంత్‌నాగ్ జిల్లాలోని పహల్గాం తహసిల్‌లోని హర్‌పథ్‌నార్ గ్రామంలో గుర్తించారు. అయితే బలగాలు వచ్చేలోపే సమీప అటవీప్రాంతంలోకి పారిపోయారు. వాళ్లను బలగాలు వెంబడించాయి. అలా కుల్గాం ప్రాంతానికి వచ్చాక ఇరువైపులా కాల్పులు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. తర్వాత అక్కడి నుంచీ ఉగ్రవాదులు పారిపోయారు. తర్వాత థ్రాల్ కొండ అంచు వద్ద, ఆ తర్వాత చివరిసారిగా కోకెర్నాగ్ ప్రాంతంలో ఉగ్రవాదుల లొకేషన్‌ను బలగాలు గుర్తించాయి. ప్రస్తుతం కోకెర్నాగ్ సమీప అడవుల్లోనే ఉగ్రవాదులు సంచరిస్తున్నట్లు తెలుస్తోంది. తెలివిగా వ్యవహరిస్తున్న ముష్కరులు ఆహారం కోసం అడవి నుంచి బయటికొచ్చి సమీప గ్రామాలకు వస్తే ఉగ్రవాదులను మట్టుబెట్టడం సులభం. అలాకాకుండా వాళ్లు ఆయా గ్రామాల్లో తమకు తెల్సిన వ్యక్తుల ద్వారా అడవిలోకే ఆహారం తెప్పించుకునే ప్రయత్నాలు చేస్తారు. ఇలాంటి సందర్భాల్లో భద్రతాబలగాలకు ఉగ్రవాదులను చుట్టుముట్టే అవకాశం చిక్కుతుంది. ఆ అవకాశం లేకుండా ఉగ్రవాదులు తెలివిగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ‘‘రాత్రి ఒక గ్రామంలో భోజనానికి వెళ్లినట్లు మాకు సమాచారం అందింది. అక్కడికి మేం వెళ్లేలోపే మా రాకను పసిగట్టి వాళ్లు భోజనం చేయకుండా ఆహారాన్ని ఎత్తుకెళ్లిపోయారు’’అని సైన్యాధికారి చెప్పారు. ‘‘ఇక్కడ మరో సమస్య ఉంది. అత్యంత ఎత్తయిన పర్వతాలుండే పహల్గాం వెంటే కిష్టవార్ శ్రేణి ఉంది. వేసవికాలం కావడంతో ఇక్కడ మంచు తక్కువగా ఉంది. దీంతో తేలిగ్గా కొండలెక్కి అటువైపు వెళ్లి తప్పించుకోవచ్చు. అటువైపు ఉన్న జమ్మూ అడవులకు వెళ్తే పట్టుకోవడం చాలా కష్టం. జమ్మూ అడవులు మరింత దట్టంగా ఉంటాయి. కిష్్టవార్ అడవుల గుండా అటువైపు వెళ్లాలనేదే ఉగ్రవాదుల పథకం కావొచ్చు. ఇప్పటికైతే వాళ్లు ఇంకా దక్షిణ కశ్మీర్‌లోనే ఉన్నారని అంచనావేస్తున్నాం. స్థానికుడు, పర్యాటకుని నుంచి లాక్కున్న రెండు ఫోన్లు ఉగ్రవాదుల వద్ద ఉన్నాయి. వాటిని వాళ్లు ఉపయోగిస్తే అత్యంత ఖచి్చతమైన లొకేషన్ దొరుకుతుంది. దాక్కునే క్రమంలో ఉగ్రవాదులు చేసే ఏ ఒక్క పొరపాటైనా అది వాళ్లకు మరణశాసనమే’’అని అధికారి చెప్పారు.

ఫెన్సింగ్ కింద పాక్కుంటూ వెళ్లి.. గుంతలో దాక్కుని
పహల్గాం ఉగ్రవాదుల దాడి ప్రత్యక్ష సాక్షులను ఇంకా వెంటాడుతోంది. ఆ దాడి నుంచి తృటిలో తప్పించుకున్న మైసూరుకు చెందిన ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ తన అనుభవాలను ఎక్స్‌లో పోస్ట్ చేశారు. తన కుటుంబంతో పాటు మరో 35–40 మంది ఎలా ప్రాణాలతో బయటపడ్డారో వివరిస్తూ ఆయన రాసిన పోస్టు అందరినీ కదిలిస్తోంది. ‘అదో రాక్షస చర్య. స్వర్గ సౌందర్యాన్ని రక్తపు మరకలతో ఎరుపెక్కించిన ఓ భయా నక అనుభవం. దాన్నుంచి మేం బయటపడ్డాం. ప్రతికూల వాతావరణం కారణంగా మా పర్యటనను రెండు రోజులు వాయిదా వేసుకుని ఏప్రిల్ 22 మధ్యాహ్నం భార్య, తమ్ముడు, మరదలితో కలిసి కశ్మీర్ వెళ్లాం. నా సోదరుడు ఇండియన్ ఆర్మీలో సీనియర్ అధికారి. మాతో పాటు ట్రిప్‌లో ఉన్నాడు. ఏప్రిల్ 22వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 12:30 గంటలకు పహల్గాం పట్టణానికి చేరుకుని.. పోనీ రైడ్‌లో బైసారన్ లోయకు 1:35 గంటలకు చేరుకున్నాము. ఆ గంభీరమైన ప్రకృతి దృశ్యాన్ని ఆస్వాదిస్తూ ఓ కప్పు టీ తాగాం. 2:00 గంటలకు ఫోటోలు తీసుకోవడానికి లేచాం. ప్రవేశ ద్వారం ఎదురుగా ఉన్న దిశలో కదలడం మా అదృష్టం. పిల్లలు, తల్లిదండ్రుల గురించే ఆందోళన అలా మేం నలుగురం సంఘటనా స్థలానికి కొన్ని వందల మీటర్ల దూరంలో చెట్ల కింద ఉన్న ఇరుకైన గుంతలోకి వెళ్లాం. మధ్యాహ్నం 3 గంటల వరకు తుపాకీ కాల్పుల శబ్దం లోయలో ప్రతిధ్వనిస్తూనే ఉంది. అక్కడే ఉండాలా? మరోవైపు పరుగెత్తాలా? తెలియడం లేదు. అక్కడ ఉన్నంత సేపు ఇంట్లో ఉన్న మా తల్లిదండ్రులు, పిల్లల గురించి ఆందోళన చెందుతున్నాం. మధ్యాహ్నం 3.40 గంటలకు హెలికాప్టర్ శబ్దం వినిపించింది. భద్రతా దళాలు వచ్చాయని నిర్ధారించుకున్నాక బయటకు వచ్చాం. ఆ తుపాకీ కాల్పులు ఇప్పటికీ మా చెవుల్లో ప్రతిధ్వనిస్తున్నాయి. ఇలాంటి భయానక అనుభవాలు ఎవ్వరికీ రాకూడదని ప్రారి్థస్తున్నా. వారి ఆత్మల కోసం ప్రార్థిస్తున్నా’అని భట్ పేర్కొన్నారు. క్షణాల్లో రెండు మృతదేహాలు.. ప్రకృతిని ఆస్వాదిస్తూ ఫొటోలు తీసుకుంటుండగా మధ్యాహ్నం 2.25 గంటల సమయంలో మొదటి రెండు తుపాకీ శబ్దాలు వినిపించాయి. ఆ తర్వాత ఒక నిమిషం పాటు నిశ్శబ్దం. ఏం జరిగిందో అందరికీ అర్థమైంది. క్షణాల్లోనే రెండు మృతదేహాలు పడి ఉండటాన్ని చూశాం. ఇది ఉగ్రదాడి అని నా సోదరుడికి తెలిసిపోయింది. తుపాకీ శబ్దాలు పేలాయి. గందరగోళం ఏర్పడింది. జనం బిగ్గరగా అరుస్తూ ప్రాణాల కోసం పరిగెత్తుతున్నారు. మా దిశలో ఒక ఉగ్రవాది రావడాన్ని మేము గమనించాం. పరిస్థితిని అంచనా వేసిన మా తమ్ముడు 35–40 మంది పర్యాటకులతో మమ్మల్ని వ్యతిరేక దిశలో నడిపించాడు. అదృష్టవశాత్తూ ఫెన్సింగ్ కింద ఇరుకైన మార్గం కనబడింది. మాతోపాటు చాలా మంది ప్రజలు కంచె గుండా జారి వేరే మార్గంలో పరిగెత్తడం ప్రారంభించారు. అది కొంచెం లోయలా ఉండటంతో మేం ఎవరికీ కనిపించలేదు. – సాక్షి, నేషనల్ డెస్క్

బీబీసీది పక్షపాత రిపోర్టింగ్
న్యూఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడిపై బీబీసీ కవరేజ్ పట్ల కేంద్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బీబీసీది పక్షపాత రిపోర్టింగ్ అని విమర్శించింది. పాక్ జాతీయుల వీసాల రద్దుపై బీబీసీ రాసిన కథనంలో ఉగ్రదాడిని మిలిటెంట్ అటాక్‌గా పేర్కొనడంపై భారత ప్రభుత్వం తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఇది దేశం మనోభావాలను దెబ్బతీస్తుందని బీబీసీ ఇండియా హెడ్ జాకీ మార్టిన్‌కు విదేశాంగశాఖ లేఖ రాసింది. బీబీసీ రిపోర్టింగ్‌ను విదేశాంగ శాఖ పర్యవేక్షిస్తుందని లేఖలో పేర్కొంది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత సరిహద్దు వెంబడి తప్పుడు సమాచారం, రెచ్చగొట్టే సందేశాలను నిరోధించడానికి 16 పాకిస్తాన్ యూట్యూబ్ చానళ్లను భారత్ నిషేధించింది. నిషేధానికి గురైన చానళ్లలో పాకిస్తాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ యూట్యూబ్ ఛానల్ ఉండటం గమనార్హం.
ఎన్ఆర్ఐ

రాయలసీమ ప్రగతికి డాలస్‌లో జీఆర్ఏడీఏ అడుగులు
గ్రేటర్ రాయలసీమ అసోసియేషన్ ఆఫ్ డాలస్ ఏరియా (GRADA) ఆధ్వర్యంలో ఏప్రిల్ 13న ఫ్రిస్కో, టెక్సాస్‌లో రాయలసీమ ప్రాంతం ఎదుర్కొంటున్న సమస్యలపై సమావేశం జరిగింది. రాయలసీమ సమస్యలు, అభివృద్ధి అవకాశాలు, తెలుగు భాషా సాహిత్యాల ప్రాముఖ్యతపై చర్చ జరిగింది. ఈ కార్యక్రమానికి రాయలసీమకు చెందిన రచయిత భూమన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన తన ప్రసంగంలో రాయలసీమ ప్రస్తుత పరిస్థితి, ముఖ్యంగా దీర్ఘకాలంగా వేధిస్తున్న నీటి సమస్యలు, వెనుకబాటుతనం గురించి ఎంతో ఆవేదనతో, స్పష్టంగా వివరించారు.మన ప్రాంత సహజ సంపద అయిన శేషాచలం అడవుల గురించి, ముఖ్యంగా ఎర్రచందనం చెట్ల గురించి ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ విలువైన సంపదను అక్రమ మార్గాల్లో ఇతర దేశాలకు తరలించి లాభం పొందకుండా, స్థానికంగానే వాటి ఆధారిత పరిశ్రమలను స్థాపించి, ఉత్పత్తులను తయారు చేయడం ద్వారా మన ప్రాంతాన్ని ఎలా ఆర్ధికంగా బలోపేతం చేయవచ్చో ఆయన చక్కగా వివరించారు. ఆయన మాటలు మనందరిలో కొత్త ఆలోచనలను రేకెత్తించాయి. సహజ వనరులను సక్రమంగా వినియోగించుకుంటే రాయలసీమ భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందనే ఆశాభావాన్ని ఆయన కలిగించారు.మరో గౌరవ అతిథిగా కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం మాజీ వైస్‌ఛాన్సలర్, ప్రఖ్యాత విద్యావేత్త ప్రొఫెసర్ పి. కుసుమ కుమారి హాజరయ్యారు. ఆమె తన ప్రసంగంలో తెలుగు భాష మాధుర్యం, సాహిత్యం గొప్పదనం, పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకత గురించి వివరించారు. నంద కోర్వి, అనిత నాగిరెడ్డి, సతీష్ సీరం, బ్రహ్మ చిరా, హరినాథ్ పొగకు, హేమంత్ కాకుట్ల, జగదీశ్వర నందిమండలం, జగదీష్ తుపాకుల, పవన్ పల్లంరెడ్డి, ప్రసాద్ నాగారపు, రాజు కంచం, శివ అద్దేపల్లి, శివ వల్లూరు, శ్రీధర్ బొమ్ము, శ్రీకాంత్ దొంత, సురేష్ మోపూరు, ఉమా గొర్రెపాటి, మరియు కార్తీక్ మేడపాటి ఈ సమావేశానికి హాజరయ్యారు.

సింగపూర్‌లో ‘అంతర్జాతీయ ఉగాది సాహిత్య సమ్మేళనం’
'వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా' 'శ్రీ సాంస్కృతిక కళాసారథి - సింగపూర్' మరియు 'వంశీ ఇంటర్నేషనల్ - ఇండియా' సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో, ఆదివారం 13వ తేదీ హైదరాబాద్ , శ్రీ త్యాగరాయ గానసభలో ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు 12 గంటల పాటు నిర్విరామంగా "అంతర్జాతీయ ఉగాది సాహిత్య సమ్మేళనం" కార్యక్రమం అద్వితీయంగా నిర్వహించబడింది.ఈ మూడు సంస్థలు కలసి విశ్వావసు నామ సంవత్సర ఉగాదిని పురస్కరించుకొని 80 మంది కవులతో 'అంతర్జాతీయ కవి సమ్మేళనము', 20 నూతన గ్రంధావిష్కరణలు, ఆచార్య శలాక రఘునాథ శర్మ 'రాయప్రోలు వంశీ జాతీయ సాహితీ జీవన సాఫల్య పురస్కార' ప్రదానము డా. బులుసు అపర్ణచే ప్రత్యేక 'మహిళా అష్టావధానము' మొదలైన అంశాలతో ఈ 'అంతర్జాతీయ ఉగాది సాహిత్య సమ్మేళనం' కార్యక్రమాన్ని ప్రత్యేకంగా రూపొందించి నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ్యులు మండలి బుద్ధ ప్రసాద్, విశిష్ట అతిథులుగా కవి జొన్నవిత్తుల, కిమ్స్ ఆస్పత్రి వ్యవస్థాపకులు బొల్లినేని కృష్ణయ్య, తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు ఆచార్య వెలుదండ నిత్యానంద రావు, ప్రముఖ రాజకీయవేత్త వామరాజు సత్యమూర్తి తదితరులు హాజరయ్యారు.ఉదయం 9 గంటలకు డా వంశీ రామరాజు అందించిన స్వాగతోపన్యాసంతో ఆరంభమైన ప్రారంభోత్సవ సభలో, కార్యక్రమ ప్రధాన సమన్వయకర్త రాధిక మంగిపూడి సభా నిర్వహణలో, మండలి బుద్ధ ప్రసాద్, కవి జొన్నవిత్తుల, బొల్లినేని కృష్ణయ్య, వామరాజు సత్యమూర్తి, డా. జననీ కృష్ణ తదితరుల ప్రసంగాలు అందరినీ ఆకర్షించాయి.తదనంతరం ఖతార్ నుండి విచ్చేసిన విక్రమ్ సుఖవాసి నిర్వహణలో అతిథుల చేతుల మీదుగా 18 తెలుగు నూతన గ్రంథాలు ఆవిష్కరించబడ్డాయి. వాటిలో కథల కవితల సంకలనాలు, వ్యాస సంపుటాలు, జెవి పబ్లికేషన్స్, మిసిమి మాసపత్రిక వారి ప్రచురణలు, సిద్ధాంత గ్రంథాలు మాత్రమే కాకుండా, ప్రతిష్టాత్మకంగా 2024 నవంబర్‌లో ఖతార్ దేశ రాజధాని దోహా మహానగరంలో వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా ఆధ్వర్యంలో జరిగిన "9వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు సభా విశేష సంచిక" కూడా ఆవిష్కరించబడడం ఈ సభకు మరింత శోభను చేకూర్చింది.మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 4:30 వరకు కొనసాగిన "అంతర్జాతీయ కవి సమ్మేళనం"లో ఆస్ట్రేలియా, ఖతార్, దక్షిణాఫ్రికా, అమెరికా మొదలైన దేశాలనుండి, ఉభయ తెలుగు రాష్ట్రాలనుండి, ముంబై, అండమాన్ దీవులు మొదలైన ప్రాంతాలనుండి కూడా వచ్చిన సుమారు 80 మంది కవులు కవయిత్రులు పాల్గొని తమ కవితలు వినిపించారు. వంశీ అధ్యక్షురాలు డా. తెన్నేటి సుధాదేవి, రేవూరు అనంత పద్మనాభరావు, జి భగీరథ, గుండు వల్లీశ్వర్, ప్రొ. రామా చంద్రమౌళి మహెజబీన్, ప్రొ. త్రివేణి వంగారి, డా కేతవరపు రాజ్యశ్రీ, డా. చిల్లర భవానీ దేవి, డా. శంకరనారాయణ, అంబల్ల జనార్ధన్, డా చాగంటి కృష్ణకుమారి మొదలైన ఎందరో కవులు కవయిత్రులు ఈ కవిసమ్మేళనంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం కొందరు రచయితలు ప్రసంగవ్యాసాలు వినిపించారు. సభా వ్యాఖ్యాతలుగా పేరి, కృష్ణవేణి, రాధిక వ్యవహరించారు.అనంతరం సాయంత్రం ఆచార్య శలాక రఘునాథ శర్మను ఘనంగా సత్కరించి, వారికి మూడు నిర్వాహక సంస్థల తరఫున "రాయప్రోలు వంశీ జాతీయ సాహితీ జీవన సాఫల్య పురస్కారం" అందించారు. దీనికి తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు ఆచార్య వెలుదండ నిత్యానందరావు ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. అనంతరం శలాక మాట్లాడుతూ తెలుగువారికి సొంతమైన అవధాన ప్రక్రియలో 'సమస్యా పూరణం' అనే అంశంలో ఉండే చమత్కారాలు వివరణలు తెలియజేస్తూ "అవధాన కవిత్వం - సమస్యలు" అనే అంశంపై ప్రత్యేక ప్రసంగాన్ని అందించారు.సాయంత్రం 5:30 గంటల నుండి ద్విశతావధాని డా. బులుసు అపర్ణ చేసిన అష్టావధానం ఈ సదస్సుకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రాధిక మంగిపూడి సంచాలకత్వంలో అమెరికా, యుగాండా, ఆస్ట్రేలియా, ఖతార్, అండమాన్ దీవులు, ముంబై, విశాఖపట్నం, విజయవాడ నుండి వచ్చిన 8 మంది మహిళలు పృచ్ఛకులుగా పాల్గొనడంతో ఇది "సంపూర్ణ మహిళా అష్టావధానం"గా ప్రశంసలు అందుకుంది.ఈ కార్యక్రమానికి ప్రధాన నిర్వాహకులుగా వంగూరి ఫౌండేషన్ వ్యవస్థాపకులు డా. వంగూరి చిట్టెన్ రాజు, వంశీ వ్యవస్థాపకులు డా. వంశీ రామరాజు, సింగపూర్ సంస్థ వ్యవస్థాపకులుకవుటూరు రత్నకుమార్ వ్యవహరించగా, వంగూరి ఫౌండేషన్ భారతదేశ ట్రస్టీ శైలజ సుంకరపల్లి ఆధ్వర్యంలో వేదిక ఏర్పాట్లు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమం యూట్యూబ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా పంచవ్యాప్తంగా సాహిత్య అభిమానుల మన్ననలు అందుకుంది.

టెక్సాస్‌లో రోడ్డు ప్రమాదం, ప్రాణాపాయ స్థితిలో తెలుగు విద్యార్థిని దీప్తి
ఉన్నత చదువులకోసం అమెరికాకు వెళ్లిన తెలుగు విద్యార్థిని ప్రాణలతో పోరాడుతోంది. అమెరికాలోని టెక్సాస్‌లోని డెంటన్ నగరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తెలుగు అమ్మాయిలు గాయపడ్డారు. వీరిలో తీవ్రంగా గాయపడిన విద్యార్థినిని దీప్తి వంగవోలుగా గుర్తించారు. మరో విద్యార్థినికి కూడా తీవ్రంగా గాయపడిందని అయితే ఆమెకు ప్రాణాపాయం లేదని అమెరికా మీడియా నివేదికలు తెలిపాయి.ఈ ప్రమాదం శనివారం (ఏప్రిల్ 12) తెల్లవారుజామున, ఎన్. బోనీ బ్రే స్ట్రీ మరియు డబ్ల్యు. యూనివర్శిటీ డ్రైవ్ సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరుకు చెందిన దీప్తి వంగవోలు ,ఆమె స్నేహితురాలు కాలినడకన ఇంటికి చేరుకోబోతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. వెంటనే ఆ వాహనం డ్రైవర్ని అక్కడినుంచి పారిపోయాడు. దీప్తికి తలకు లోతైన గాయం అయిందని, ఆమెకు శస్త్రచికిత్స జరుగుతోందని స్థానిక మీడియా తెలిపింది. ప్రస్తుతం డెంటన్ పోలీసులు ఈ హిట్ అండ్ రన్ ఘటనపై దర్యాప్తు ముమ్మరం చేశారు. పరారీలో ఉన్న డ్రైవర్‌ను, ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించేందుకు ప్రజల సహాయం కోరుతూ ప్రకటన కూడా విడుదల చేశారు. ఈ ఘటనపై మరిన్నివివరాలు అందాల్సి ఉంది. లింక్డ్ఇన్ ప్రొఫైల్ ప్రకారం, దీప్తి వంగవోలు నార్త్ టెక్సాస్ విశ్వవిద్యాలయంలో కంప్యూటర్ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్‌లో మాస్టర్స్ చదువుతోంది. 2023లో నరసరావు పేట ఇంజనీరింగ్ కళాశాల నుండి బీటెక్ పూర్తి చేసింది.

సింగపూర్ ఎన్నికల్లో సత్తా చాటనున్న భారతీయులు: హింటిచ్చిన పీఎం
సింగపూర్‌లో ( Singapore ) సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రధానమంత్రి లారెన్స్ వాంగ్ (Lawrence Wong) తన పార్టీ పీపుల్స్ యాక్షన్ పార్టీ (PAP) కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సారి ఎన్నికల్లో భారతీయ సంతతికి చెందిన అభ్యర్థులను పోటీలో నిలపబోతున్నామని ప్రకటించారు. త్వరలో ఎన్నికలకు నగారా మోగనున్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.ఆదివారం భారతీయ యువతతో సింగపూర్ ప్రధానమంత్రి ముచ్చటించారు. భారతీయ సమాజం చిన్నదే అయినా ప్రభావం చాలా గొప్పదని, పీఎం అన్నారు. మీరు ఇప్పటికే ఆ సింగపూర్ స్పూర్తిని ప్రతిబింబిస్తున్నారనీ, అది ప్రభావంతమైందన్న వాంగ్ వ్యాఖ్యలను ది స్ట్రెయిట్స్ టైమ్స్ నివేదించింది. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో భారత సంతతికి చెందిన కొత్త అభ్యర్థులను ఎంపిక చేస్తుందని హామీ ఇచ్చారు. 2020 ఎన్నికల్లో భారతీయులకు చోటు దక్కలేదని గుర్తు చేసిన ఆయన ఈ సారి 30కంటే ఎక్కువమంది భారతీయులు కూడా ఉంటారన్నారు. ది ఇటీవలి చరిత్రలో అతిపెద్దదని పీఎం వాంగ్ వ్యాఖ్యానించారు. వాణిజ్యం, వ్యాపారం, పరిశ్రమలు, ప్రజా సేవ సహా అనేక రంగాలలో భారతీయ కమ్యూనిటీ దేశానికి చేస్తున్న కృషిని ఆయన ప్రశంసించారు. అయితే, PM వాంగ్ గత శనివారం వెల్లడించిన ఎనిమిది కొత్త ముఖాల్లో భారత సంతతికి చెందిన వైద్యుడు హమీద్ రజాక్ కూడా ఉన్నారని ది స్ట్రెయిట్ టైమ్స్ నివేదిక పేర్కొంది. అయితే, రాబోయే సార్వత్రిక ఎన్నికలలో వారు ఏ నియోజకవర్గం నుండి పోటీ చేస్తారో వెల్లడించలేదు.చదవండి: Amarnath Yatra 2025 రిజిస్ట్రేషన్లు షురూ! త్వరపడండి!సింగపూర్ నివేదికల ప్రకారం. 2004లో సింగపూర్ పౌరులలో భారతీయులు 7.6 శాతం మంది ఉండగా , మలయ్, చైనీయులు వరుసగా 15.1 శాతం, 75.6 శాతం మంది ఉన్నారు. 2024 డేటా ప్రకారం, ఆగ్నేయాసియా దేశ జనాభాలో వరుసగా 15శాతం, 75శాతం మంది మలేషియన్లు , చైనీయులు ఉన్నారు.90 నిమిషాల పాటు వాంగా ఇప్పో పెసలామ్ చాట్ (రండి, తమిళంలో చాట్ చేద్దాం) అనే వీఐపీ చాట్‌ను తమిళ్ మరసు వార్తాపత్రికి నిర్వహించింది.భారత సంతతికి చెందిన డిజిటల్ అభివృద్ధి, సమాచార శాఖ సీనియర్ సహాయ మంత్రి జనిల్ పుతుచ్చేరి సహా దాదాపు 130 మంది యువకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.2020 సార్వత్రిక ఎన్నికల్లో పీఏపీ 93 స్థానాల్లో 83 స్థానాలను గెలుచుకుని, ఎన్నికలను కైవసం చేసుకుంది. వీరిలో 27 మంది కొత్త అభ్యర్ధులకు అవకాశం కల్పించగా. వీరిలో భారతీయులెవ్వరూ లేరు. ఇది పార్లమెంటులో సమాజ ప్రాతినిధ్యంపై విమర్శలకు తావిచ్చింది. అమెరికా, కెనడా రాజకీయాల్లో భారతీయ సంతతి అభ్యర్తులు సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే. మరి తాజా పరిణామాలతో ఎంతమంది భారత సంతతి వారు గెలుపు గుర్రాలుగా నిలవనున్నారో చూడాలి.
క్రైమ్

రూ.15 వేల కోసం మహిళ హత్య
యశవంతపుర(కర్ణాటక): కొందరు పెడదారి పడుతూ పిల్లలను కూడా పాడు చేస్తున్నారు. తీసుకున్న అప్పును ఎగ్గొట్టడం కోసం ఏకంగా ఓ మహిళను హత్య చేసింది మరో మహిళ. ఇందుకు కొడుకు, కూతురు సహకారం కూడా తీసుకుంది. ఫలితంగా ముగ్గురూ కటకటాలు లెక్కిస్తున్నారు. ఈ దారుణం బెళగావి నగరంలో చోటుచేసుకుంది. దృశ్యం తరహాలో వివరాలు.. బెళగావి నగరంలోని లక్ష్మీనగరలో ఓ అపార్ట్మెంట్లో ఈ నెల 21న రాత్రి అంజనా దడ్డీకర్ (49) అనే మహిళను గొంతు పిసికి హత్య చేశారు. మంగళసూత్రం, బంగారు నగలను కూడా హంతకులు ఎత్తుకెళ్లారు. అంజన కూతురు అక్షత ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన క్యాంప్ ఏరియా పోలీసులు జ్యోతి బాందేకర్, ఆమె కూతురు సుహాని (19), మైనర్ కొడుకు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు గుర్తించారు. దృశ్యం సినిమాలో మాదిరిగా నిందితులు కుట్ర పన్నారు. హత్య జరిగిన రోజున తాము ఊళ్లోనే లేమని పోలీసులతో బుకాయించారు. అయితే ఫోన్ కాల్స్, సీసీ కెమెరా దృశ్యాలు, వేలిముద్రలతో నేరం బయటపడింది. తలపై బాది.. అంజనా దడ్డీకర్, జ్యోతి స్నేహితులు. ఆమె నుంచి జ్యోతి రూ.15 వేలు అప్పు తీసుకుంది. డబ్బులు వాపస్ ఇవ్వాలని అంజనా అడుగుతోంది. డబ్బు ఇవ్వడం ఇష్టం లేని జ్యోతి, కూతురు హత్యకు కుట్ర పన్నారు. కొడుకుతో కలిసి ఆ రోజు ఆమె ఫ్లాటుకు వెళ్లారు. ఆమెతో మాట్లాడుతూ తలపై బాది, గొంతు పిసికి చంపి మంగళసూత్రం, దొరికిన బంగారు నగలతో ఉడాయించారు. నిందితులను అరెస్టు చేసిన పోలీసులు బంగారు నగలు, బైక్, మొబైల్ఫోన్లు తదితరాలను స్వాధీనం చేసుకున్నారు.

ఊపిరితిత్తుల్లో వేరుశనక్కాయ ఇరుక్కుని..
అబ్దుల్లాపూర్‌మెట్(రంగారెడ్డి జిల్లా): ఊపిరితిత్తుల్లో వేరుశనగ కాయ ఇరుక్కోవడంతో ఓ చిన్నారి ప్రాణం కోల్పోయింది. పోలీసులు, బాధి త కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం లష్కర్‌గూడకు చెందిన బండారి శ్యామ్‌సుందర్, మహేశ్వరి దంపతుల కూతురు తన్విక (4) ఆదివారం సాయంత్రం వేరుశనగ కాయలు తింటుండగా.. ప్రమాదవశాత్తు ఓ కాయ ఊపిరితిత్తుల్లో ఇరుక్కుంది. దీంతో శ్వాస తీసుకునేందుకు చిన్నారి ఆయాస పడింది. వెంటనే తల్లిదండ్రులు ఆమెను చికిత్స నిమిత్తం నీలోఫర్ ఆస్పత్రికి తరలించారు. ఎక్స్‌రే తీయించిన వైద్యులు తని్వక ఊపిరితిత్తుల్లో వేరుశనగ కాయ ఉన్నట్లు గుర్తించారు. ఆపరేషన్ ద్వారా తొలగించాలని సూచించడంతో తల్లిదండ్రులు ఇందుకు అంగీకరించారు. సోమవారం శస్త్రచికిత్స చేస్తామని వైద్యులు తెలిపారు. ఇదిలా ఉండగా ఉదయం 7.55 గంటల సమయంలో బాలిక మృతిచెందింది. చిన్నారి తల్లి ఫిర్యాదు మేరకు అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు కేసు నమోదు చేశారు.

నా కోరిక తీర్చకపోతే మొహంపై యాసిడ్ పోస్తా..!
బంజారాహిల్స్(హైదరాబాద్): వివాహితపై కన్నేసిన ఆమెకు వరుసకు సోదరుడైన యువకుడు తన గదికి వచ్చి కోరిక తీర్చకపోతే మొహంపై యాసిడ్ పోస్తానంటూ బెదిరించిన సంఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. జూబ్లీహిల్స్‌లోని నందగిరిహిల్స్‌లో నివసించే మహిళకు (26)కు ముగ్గురు సంతానం. ఆమెకు భర్తకు దూరపు బంధువైన నవీన్ అనే యువకుడు నగరంలోనే ఉంటూ ఆటో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. తరచూ ఇంటికి వచ్చే అతను ఆమెతో మాటలు కలుపుతూ తన కోరికను బయటపెట్టేవాడు. తాను అడిగింది ఇవ్వకపోతే పరువు తీస్తానంటూ బెదిరించేవాడు. రెండు నెలల క్రితం బాధితురాలు ఈ విషయం తనకు భర్తకు చెప్పడంతో అప్పటి నుంచి నవీన్ ఆమెకు ఫోన్ చేయడం మానేశాడు. ఈ నెల 26న కొందరి వద్ద నవీన్ ఆమెపై అసభ్యకరంగా ప్రచారం చేశాడు. ఆమె పనిచేస్తున్న సెలూన్‌కు వెళ్లి నువ్వు బయటకు వస్తావా..? నన్ను లోపలికి రమ్మంటావా? అంటూ బెదిరించాడు. తాను బయటకు రానని చెప్పడంతో నువ్వు నా గదికి రాకపోతే మొహంపై యాసిడ్ పోసి చంపేస్తానంటూ బెదిరించాడు. దీంతో ఆందోళనకు గురైన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. జూబ్లీహిల్స్ పోలీసులు నవీన్‌పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

చంపేసి..లిఫ్ట్ గుంతలో పడేసి..
కవాడిగూడ: గుర్తుతెలియని ఓ యువకుడిని దారుణంగా హత్య చేసి...సమీప భవనంలోని లిఫ్ట్ గుంతలో శవాన్ని పడేసి వెళ్లిన ఘటన దోమలగూడ పీఎస్ పరిధిలోని హిమాయత్‌నగర్ స్ట్రీట్ నెంబర్ 8లో చోటు చేసుకుంది. ఆదివారం రాత్రి ఆ యువకుడిని గుర్తు తెలియని దుండగలు ముందుగా బండరాయితో మోది హత్య చేశారు. అనంతరం మృతదేహన్ని బట్టలో చుట్టి ప్లాజా అపార్ట్మెంట్లోని పంజాబ్ నేషనల్ బ్యాంకు పక్కనే ఉన్న లిఫ్ట్ గుంతలో పడేసి పారిపోయారు. సోమవారం ఉదయం అపార్ట్మెంట్ ప్రాంగణాన్ని శుభ్రం చేసేందుకు వచ్చిన సిబ్బంది రక్తపు మరకలు, దుస్తులు పడి ఉండటం చూసి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే దోమలగూడ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించగా అపార్ట్మెంట్లో ఉన్న పంజాబ్ నేషనల్ బ్యాంక్ పక్కనే ఉన్న లిఫ్ట్‌లో 32 సంవత్సరాల యువకుడి మృతదేహం నగ్నంగా పడి ఉంది. వెంటనే సెంట్రల్ జోన్ డీసీపీ శిల్పవల్లి, గాందీనగర్ డివిజన్ ఇన్చార్జీ ఏసీపీ గురురాఘవేంద్ర దోమలగూడ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, ఎస్ఐలు నిరంజన్, సాయిచంద్‌లు, క్లూస్‌టీం, డాగ్ స్క్వాడ్‌ను రప్పించి తనిఖీలు చేశారు. వివరాలు సేకరించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరిలించారు. ఇదిలా ఉండగా ప్రతి నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలో హత్య జరగడం సంచలనం సృష్టించింది. కాగా స్థానికుల వివరాల ప్రకారం..గుర్తుతెలియని యువకుడు ఆదివారం రాత్రి 12 గంటల ప్రాంతంలో భోజనం చేసి పంజాబ్ నేషనల్ బ్యాంక్ షట్టర్ ముందు నిద్రపోగా..మద్యం లేదా గంజాయి మత్తులో ఉన్నకొంత మంది దుండగులు అతని వద్దకు వచ్చి నిద్రలేపి పక్క వీధిలోకి తీసుకెళ్లి ఘర్షణ పడ్డారని తెలిసింది. ఈ క్రమంలోనే హత్య జరిగినట్లు భావిస్తున్నారు. ఈ సంఘటన అర్ధరాత్రి రెండు నుంచి మూడు గంటల మధ్య జరిగినట్లు సమాచారం.