Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today

Top Stories

ప్రధాన వార్తలు

No Rush To End Tariffs Says Trump To Meloni1
మెలోనీతో భేటీ.. సుంకాలపై మెత్తబడ్డ ట్రంప్‌

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సుంకాల విషయంలో కాస్త మెత్తబడ్డారు. సుంకాలపై పలు దేశాలు అగ్రరాజ్యంతో చర్చలకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ అమెరికా అధినేతతో సమావేశమయ్యారు. ఈ భేటీ సందర్భంగా ఆయన సానుకూల వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఈయూ దేశాలపై అమెరికా 20 శాతం సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. అయితే దాని అమలును 90 రోజులపాటు నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పరిణామాల నడుమ.. ట్రంప్‌ను కలిసిన తొలి యూరప్‌ దేశపు నేత మెలోనీనే కావడం గమనార్హం. ఐరోపా సమాఖ్య(European Union)తో పాటు ఇతర దేశాలతో వాణిజ్య ఒప్పందం అంశంపై వీరు చర్చలు జరిపారు. అయితే ఈయూతో సుంకాలపై ఒప్పందం నూటికి నూరు శాతం కుదురుతుందని ట్రంప్‌ భరోసా ఇచ్చారు. ఈ డీల్‌ విషయంలో మాత్రం తాను తొందర పడటం లేదని వ్యాఖ్యానించడం గమనార్హం. ప్రతీ ఒక్కరూ అమెరికాతో డీల్‌ కుదుర్చుకోవాలని తాపత్రయపడుతున్నారు. ఒకవేళ అలా వాళ్లు అనుకోకుంటే గనుక మేమే వాళ్లతో ఒప్పందానికి దిగి వస్తాం అంటూ ట్రంప్‌ ఆసక్తికర వ్యాఖ్య చేశారు. ఇక.. మరోవైపు ఈ భేటీలో మెలోనీని ట్రంప్‌ ఆకాశానికెత్తారు. ఆమె ఓ అద్భుతమైన నేత అంటూ పొగడ్తలు గుప్పించారు. మరోవైపు.. పశ్చిమాన్ని గొప్పగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని, కలిసికట్టుగా ఆ పని చేయగలమని అనుకుంటున్నా’ అని ఓవల్‌ ఆఫీసులో రిపోర్టర్లతో మెలోనీ మాట్లాడారు. ట్రంప్‌ను రోమ్‌ను ఆహ్వానించిన మెలోనీ.. అక్కడ ఈయూ దేశాల ప్రతినిధులతో సుంకాల అంశంపై చర్చిస్తామని వెల్లడించారు. Rendiamo l’Occidente di nuovo grande - Make the West Great Again pic.twitter.com/Z499ZRGx85— Giorgia Meloni (@GiorgiaMeloni) April 17, 2025

TTD Goshala Row: Case Filed against TTD Ex Chairman Bhumana2
Goshala Row: ఎవరిది అసత్య ప్రచారం?.. ప్రశ్నిస్తే కేసులే!

తిరుపతి, సాక్షి: శ్రీవారి గోశాలలో గోమాతల మరణాల వ్యవహారంలో ఊహించిందే జరిగింది. వైఎస్సార్‌సీపీ నేత, టీటీడీ మాజీ చైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి(Bhumana Karunakar Reddy)పై కూటమి ప్రభుత్వం కేసు నమోదు చేయించింది. గోమాతల మరణాలపై ఆయన ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చర్చకు రావాలంటూ టీడీపీ నేతలే ఆయనకు సవాల్‌ విసిరారు. అదే టైంలో.. పోలీసుల సాయంతో భూమనను నిర్భందించి ఇబ్బంది పెట్టడంతో నిన్నంతా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తాజాగా.. గోశాలలో గోవుల మృతిపై ప్రశ్నించిన టీటీడీ మాజీ చైర్మన్(TTD Ex Chairman) భూమన కరుణాకరరెడ్డి పై కేసు బనాయించింది కూటమి ప్రభుత్వం. గోశాలపై అతస్య ప్రచారం చేస్తూ మీడియాను తప్పుదోవ పట్టించారని, భక్తుల మనోభావాలు దెబ్బ తీశారంటూ టీటీడీ పాలకమండలి సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి ఫిర్యాదు చేశారు. దీంతో ఎస్వీ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్‌లో భూమనపై కేసు నమోదు అయ్యింది. గురువారం రాత్రి 8 గంటలకు ఫిర్యాదు నమోదు కాగా.. పోలీసులు ఆగమేఘాల మీద కేసు నమోదు చేశారు. బీఎన్‌ఎస్‌ యాక్ట్ 353(1), 299, 74 ఆఫ్ ఐటీ యాక్ట్ సెక్షన్ లు ఈ కేసులో నమోదు అయినట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. శ్రీవారి ఎస్వీ గోశాలలో గోమాతల విషయంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలోనే గోమాతలు చనిపోతున్నాయి. గోశాలలో 191 ఆవులు ఏడాది కాలంలో చనిపోయాయి అంటూ గోశాల అధికారులే స్పష్టం చేయడం తెలిసిందే. అయినా కూడా గోవులు మృతి చెందలేదంటున్న పాలకమండలి వాదిస్తుండడం కొసమెరుపు.

It Wasnt Easiest Wicket There Wasnt Reckless Hitting But: Cummins on SRH Loss To MI3
ఇలాంటి వికెట్‌ మీద కష్టమే.. మా వాళ్లు నిర్లక్ష్యంగా ఆడలేదు.. కానీ: కమిన్స్‌

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (SRH)కు మరోసారి చేదు అనుభవమే మిగిలింది. ఐపీఎల్‌-2025 (IPL 2025)లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో కమిన్స్‌ బృందం నాలుగు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. వాంఖడే స్టేడియంలో గురువారం జరిగిన మ్యాచ్‌లో సమిష్టి వైఫల్యం కారణంగా ఈ సీజన్‌లో ఐదో పరాజయాన్ని మూటగట్టుకుంది.అంతేకాదు.. ఐపీఎల్‌ తాజా ఎడిషన్‌లో ఇప్పటి వరకు సొంత మైదానం వెలుపల ఒక్క మ్యాచ్‌ కూడా గెలవని ఏకైక జట్టుగా నిలిచింది. ఈ నేపథ్యంలో ముంబై చేతిలో ఓటమి అనంతరం సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌ (Pat Cummins)తీవ్ర విచారం వ్యక్తం చేశాడు.ఇలాంటి వికెట్‌ మీద కష్టమే..‘‘వాంఖడే వికెట్‌పై పరుగులు రాబట్టడానికి కష్టపడాల్సి వచ్చింది. బ్యాటింగ్‌కు వచ్చినప్పుడు సులువుగానే రన్స్‌ చేయొచ్చనే అనిపించింది. కానీ అనూహ్యంగా పిచ్‌ పరిస్థితి అందుకు భిన్నంగా మారిపోయింది. ఏదేమైనా వాళ్లు అద్భుతంగా బౌలింగ్‌ చేశారు.ఎక్కడిక్కడ మమ్మల్ని కట్టడి చేశారు. మేము కూడా బాగానే బ్యాటింగ్‌ చేశాం. ఇలాంటి వికెట్‌ మీద 160 అనేది మెరుగైన స్కోరే. కానీ మేము ఇంకాస్త బెటర్‌గా బ్యాటింగ్‌ చేయాల్సింది. ఈరోజు మా వాళ్లు పవర్‌ప్లేలో ఎలాంటి తొందరపాటు చర్యలకు పోలేదు.మా వాళ్లు నిర్లక్ష్యంగా ఆడలేదు.. కానీనిర్లక్ష్య రీతిలో హిట్టింగ్‌ కూడా ఆడలేదు. కానీ ఇలా జరిగిపోయింది. మేము ఇంకొన్ని పరుగులు చేసి ఉంటే ఫలితం వేరేలా ఉండేదేమో!.. ఇక మా బౌలింగ్‌ విషయానికొస్తే డెత్‌ ఓవర్లలో మా ప్రదర్శన పర్వాలేదనిపించింది.ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా వచ్చిన బౌలర్‌తో 1-2 ఓవర్లు మాత్రమే వేయించగలము అనిపించింది. అందుకే రాహుల్‌ చహర్‌ను తీసుకువచ్చాం. ఫైనల్‌కు చేరుకోవాలంటే హోం గ్రౌండ్‌ వెలుపల ఎక్కువగా మ్యాచ్‌లు గెలవాల్సి ఉంటుంది.కానీ దురదృష్టవశాత్తూ ఈ సీజన్‌లో మేము ఇంత వరకు ఇతర వేదికలపై ఒక్క మ్యాచ్‌ కూడా గెలవలేకపోయాం. పొరపాట్లను సమీక్షించుకుని సానుకూలంగా ముందుకు వెళ్తాం. తదుపరి మా సొంత మైదానంలో మ్యాచ్‌ ఆడబోతున్నాం. మాకు అక్కడి పరిస్థితులపై పూర్తి అవగాహన ఉంది కాబట్టి.. అనుకున్న ఫలితం రాబట్టగలమని నమ్ముతున్నాం’’ అని ప్యాట్‌ కమిన్స్‌ పేర్కొన్నాడు.శైలికి భిన్నంగాకాగా వాంఖడే వేదికగా టాస్‌ ఓడిన సన్‌రైజర్స్‌ తొలుత బ్యాటింగ్‌ చేసింది. దూకుడైన తమ శైలికి భిన్నంగా రైజర్స్‌ ఓపెనర్లు అభిషేక్‌ శర్మ (28 బంతుల్లో 40), ట్రవిస్‌ హెడ్‌ (29 బంతుల్లో 28) నెమ్మదిగా ఆడారు. ఇషాన్‌ కిషన్‌ (2), నితీశ్‌ రెడ్డి (21 బంతుల్లో 19) పూర్తిగా విఫలం కాగా.. క్లాసెన్‌ (28 బంతుల్లో 37) ఫర్వాలేదనిపించాడు.ఆఖర్లో అనికేత్‌ వర్మ (8 బంతుల్లో 18 నాటౌట్‌), కమిన్స్‌ (4 బంతుల్లో 8 నాటౌట్‌) కాస్త వేగంగా ఆడగా.. 20 ఓవర్లు పూర్తయ్యేసరికి రైజర్స్‌ ఐదు వికెట్ల నష్టానికి 162 పరుగులు చేయగలిగింది. ముంబై బౌలర్లలో బుమ్రా, కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా చెరో వికెట్‌ తీయగా.. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ విల్‌ జాక్స్‌ రెండు వికెట్లు కూల్చాడు.పాండ్యా మెరుపులుఇక లక్ష్య ఛేదనకు దిగిన ముంబై ఆరు వికెట్లు కోల్పోయి 18.1 ఓవర్లలోనే పని పూర్తి చేసింది. ఓపెనర్లు రియాన్‌ రికెల్టన్‌ (31), రోహిత్‌ శర్మ (26) ఫర్వాలేదనిపించగా.. విల్‌ జాక్స్‌ (36), సూర్యకుమార్‌ యాదవ్‌ (26), తిలక్‌ వర్మ (17 బంతుల్లో 21 నాటౌట్‌) రాణించారు. హార్దిక్‌ పాండ్యా కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ (9 బంతుల్లో 21)తొ మెరిసి ముంబై విజయంలో కీలక పాత్ర పోషించాడు. రైజర్స్‌ కెప్టెన్‌ కమిన్స్‌కు మూడు, ఇషాన్‌ మలింగకు రెండు, హర్షల్‌ పటేల్‌కు ఒక వికెట్‌ దక్కాయి. చదవండి: అభిషేక్‌ శర్మ, నితీశ్‌ కుమార్‌కు జాక్‌ పాట్‌..?Applying the finishing touches 🤌🎥 #MI skipper Hardik Pandya gave them the final flourish with a brilliant cameo of 21(9)Scorecard ▶ https://t.co/8baZ67Y5A2#TATAIPL | #MIvSRH | @mipaltan | @hardikpandya7 pic.twitter.com/hPI3CxwzLF— IndianPremierLeague (@IPL) April 17, 2025

Arjun son of Vyjayanthi Twitter Review4
'అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి' ట్విటర్‌ రివ్యూ

విజయశాంతి (Vijayashanthi), నందమూరి కల్యాణ్‌రామ్‌ (Nandamuri Kalyan Ram) తల్లీ కుమారులుగా నటించిన సినిమా ‘అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి’ (Arjun son of Vyjayanthi) నేడు (ఏప్రిల్‌ 18) విడుదల కావాల్సిన ఈ చిత్రం ఇప్పటికే ఓవర్సీస్‌లో బొమ్మ పడింది. నూతన దర్శకుడు ప్రదీప్‌ చిలుకూరి ఈ మాస్‌ చిత్రంతో డైరెక్టర్‌గా నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని అశోక క్రియేషన్స్‌, ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌పై అశోక్‌ వర్ధన్‌, సునీల్‌ నిర్మించారు. అమ్మ కోసం మనం ఎన్ని త్యాగాలైనా చేయొచ్చు అని చాటి చెప్పేలా అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి చిత్రం ఉందంటూ అభిమానులు చెబుతున్నారు.ఓవర్సీస్‌లో ఇప్పటికే అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి ఫస్టాఫ్‌ పూర్తి అయిందని చెబుతున్నారు. కళ్యాణ్ రామ్, విజయశాంతి యాక్టింగ్‌ పోటీపడి నటించారని చెబుతున్నారు. చాలారోజుల తర్వాత విజయశాంతిని మళ్లీ ఇలా పోలీస్ ఆఫీసర్‌గా చూడటం చాలా సంతోషంగా ఉందని కామెంట్లు చేస్తున్నారు. ఇప్పటివరకు రెగ్యులర్ కమర్షియల్ యాక్షన్ స్టోరీగా సినిమా ఉందంటున్నారు.. అయితే, కొన్ని యాక్షన్ సన్నివేశాలు బాగున్నాయంటున్నారు. ముఖ్యంగా నేపథ్య సంగీతం ఆ సన్నివేశాలకు మరింత బలాన్ని అందించాయని తెలుపుతున్నారు. ఫస్టాఫ్‌ వరకు కథాంశంలో ఎటువంటి ఆశ్చర్యకరమైన మలుపులు వంటివి లేవని నెటిజన్లు పోస్ట్‌లు పెడుతున్నారు. ఇలాంటి స్టోరీస్‌తో చాలా సినిమాలు వచ్చాయని అంటున్నారు. ఎన్టీఆర్‌ నటించిన జనతా గ్యారేజ్‌ చిత్రానికి దగ్గరగా అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి స్టోరీ ఉంటుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇంటర్వెల్ బ్లాక్స్‌లో కల్యాణ్‌రామ్‌, విలన్‌ల మధ్య వచ్చే భారీ యాక్షన్‌ సీన్‌ అదుర్స్‌లా ఉంటుందని ఒకరు తెలిపారు. ఇప్పటి వరకు అయితే, ఫస్టాఫ్‌ పూర్తి అయింద పెద్దగా కొత్తదనం ఏమీ లేదంటున్నారు. కానీ, యాక్షన్‌ సినిమాలు ఇష్టపడేవారిని ఈ చిత్రం ఎంతమాత్రం నిరాశపరచదని ఎక్కువమంది చెప్పడం విశేషం.ఇక ఇంటర్వెల్‌ తర్వాత ప్రీ క్లైమాక్స్ సన్నివేశాలు గూస్ బంప్స్ తెప్పించేలా ఉన్నాయని అంటున్నారు. కొడుకు కోసం తల్లి పడే ఆరాటం ఎలా ఉంటుంది ఈ చిత్రంలో చూడొచ్చన్నారు. అదే సమయంలో అమ్మ కోసం కొడుకు చేసే పోరాటాన్ని కూడా ఇందులో చూస్తారని చెబుతున్నారు. ఫస్ట్ హాఫ్ రొటీన్‌గా సాగడం.. సెకండ్ హాఫ్‌లో కొన్ని సన్నివేశాలు మరీ ఎక్కువగా సాగదీసినట్లు ఉండడం ఈ చిత్రంలో మైనస్ అని పేర్కొంటున్నారు. పెద్దగా ట్విస్ట్‌లు ఏమీ లేకున్నా తల్లి కొడుకుల సెంటిమెంట్, పవర్ ఫుల్ యాక్షన్ ఎపిసోడ్స్‌తో మెప్పించారని నెటిజన్లు తెలుపుతున్నారు. సినిమా ప్రమోషన్స్‌ సమయంలో చెప్పినట్లు క్లైమాక్స్‌ సీన్‌కు చాలామంది ఎమోషనల్‌ అవుతారని తెలుపుతున్నారు. సినిమా తప్పకుండా భారీ విజయం అందుకుంటుందని చెబుతున్నారు. పూర్తి రివ్యూ కోసం ఇంకాస్త సమయం పడుతుంది. ఇది కేవలం నెటిజన్ల అభిప్రాయం మాత్రమేBlockbuster reports for overseas Plus: pointsBest emotional 👍mass action 👌👌Peak climax💯🔥🔥Excellent bgm score💥💥Kalyanram come back 💯#ArjunSonOfVyjayanthi pic.twitter.com/V0W2IV0Bk3— Tarak cults 👑🐯🐅 (@gopiraju1993) April 18, 2025Just done with first half of #ArjunSonOfVyjayanthiUsual Formula or just an extended Janata Garage concept. Works fine in places. Visuals and Music are decent though songs didn’t catch on. Camera work is patchy, doesn’t look great with actors close up shots.Good to see… pic.twitter.com/7wJX8mtIxr— Majid (@iammajidzz) April 18, 2025Blockbuster talk from early shows 🔥@NANDAMURIKALYAN nailed it. Peak performance.Congratulations #ArjunSonOfVyjayanthi whole teampic.twitter.com/y3bxQSbEC3— Amaravati_Techie (@Amaravati_IT) April 18, 2025Just now watched the movies first half good and second half is excellent emotions worked very well Blockbuster movie 🔥🔥🔥🔥🔥🔥🔥🔥 #ArjunSonOfVyjayanthi pic.twitter.com/YjO96lB3bW— CMTarakMainFanPage🌐 (@tarakdevote9998) April 18, 2025#ArjunSonOfVyjayanthi Strictly Average 1st Half! Starts off with an interesting mother-son setup and has a few engaging sequences but quickly turns into a run of the mill and template commercial film. Music/BGM is a big drawback and fails to elevate the proceedings. Needs a…— Venky Reviews (@venkyreviews) April 18, 2025

Smita Sabharwal Tweet Against Telangana Government5
వెనక్కి తగ్గని ఐఏఎస్‌ స్మితా సబర్వాల్‌.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వరుస రీట్వీట్లు

హైదరాబాద్‌,సాక్షి: కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో మార్ఫింగ్‌ ఫొటోను రీ ట్వీట్ చేసిన ఐఏఎస్‌ స్మితా సబర్వాల్‌కు (Smita Sabharwal) తెలంగాణ పోలీసులు (telangana police) నోటీసులు ఇచ్చారు. అయితే, పోలీసులు నోటీసులు ఇచ్చిన ఐఏఎస్‌ స్మితా సబర్వాల్‌ వెనక్కి తగ్గడం లేదు. ప్రభుత్వ వ్యతిరేక ట్వీట్‌లను రీట్వీట్‌లు చేస్తున్నారు.కంచ గచ్చిబౌలి భూముల (Kancha Gachibowli row) ఇష్యూకు సంబంధించి పలువురు నేతలు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన పోస్టుల్ని డిలీట్‌ చేస్తున్నారు. కానీ ఐఏఎస్‌ స్మిత సబర్వాల్‌ మాత్రం వెనక్కి తగ్గడం లేదు.ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా వరుస ట్వీట్లు పెడుతున్నారు. తాజాగా, ప్రభుత్వ వ్యతిరేక ట్వీట్లపై వరుసగా రెండోరోజు రీపోస్ట్ చేశారు. వాటిల్లో 100 ఎకరాలను పునరుద్ధరించాలంటూ సుప్రీం ఆదేశాలు ఉన్న ఫొటో ఉంది. మరో పోస్టులో తెలంగాణ పోలీసులు సొంత ఐఏఎస్ అధికారికే నోటీసులిస్తరా? ఇది దేనికి సంకేతం?’ అంటూ ఓ ఇద్దరు మహిళలు పెట్టిన పోస్టును రీపోస్ట్ చేశారు. ఏఐతో క్రియేట్ చేసిన బుల్డోజర్లు, నెమళ్లు, జింకలు ఉన్న రెండు పోస్టులను స్మితా సబర్వాల్ రీపోస్ట్ చేయడం. ఆ పోస్టులకు వివరణ ఇవ్వాలంటూ తెలంగాణ పోలీసులు ఆమెకు నోటీసులు జారీ చేయడం..అయినప్పటికీ ప్రభుత్వ వ్యతిరేక ట్వీట్లను రీట్వీట్‌ చేయడంపై స్మితా సబర్వాల్ తీరుపై ఐఏఎస్ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది.

Texas Hit and Run Case: Telugu Student Deepthi No More6
Texas: మృత్యువుతో పోరాడి ఓడిన దీప్తి

ఆస్టిన్‌: అమెరికా టెక్సాస్‌లో తెలుగు విద్యార్థిని హిట్‌ అండ్‌ రన్‌ కేసు విషాదాంతంగా ముగిసింది. తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న వంగవోలు దీప్తి(Deepthi Vangavolu)కన్నుమూశారు. ఈ విషయాన్ని అక్కడి అధికారులు ఇచ్చిన సమాచారం ద్వారా కుటుంబ సభ్యులు ధృవీకరించారు. దీంతో గుంటూరులోని ఆమె స్వస్థలంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. దీప్తి(23) తండ్రి హనుమంత రావు చిరువ్యాపారి. ఆమె కుటుంబం గుంటూరు(Guntur) రాజేంద్రనగర్‌ రెండో లైనులో నివాసం ఉంటోంది. టెక్సాస్‌లోని డెంటన్‌ సిటీలో యూనివర్సిటీ ఆఫ్‌ నార్త్‌ టెక్సాస్‌లో ఎంఎస్‌ చేసేందుకు వెళ్లారు. మరో నెల రోజుల్లో కోర్సు పూర్తి కావాల్సి ఉంది. అయితే ఈలోపు రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు ఆమెను కబళించింది. ఈ నెల 12వ తేదీన స్నేహితురాలైన మేడికొండూరుకు చెందిన స్నిగ్ధతో కలిసి రోడ్డుపై నడచి వెళ్తుండగా వేగంగా ప్రయాణిస్తున్న కారు ఢీకొట్టింది. దీప్తి తలకు తీవ్ర గాయమైంది. స్నిగ్ధకు కూడా గాయాలయ్యాయి. దీప్తి స్నేహితురాళ్లు ప్రమాద విషయాన్ని ఆమె తండ్రి హనుమంతరావుకు తెలిపారు. క్రౌడ్‌ ఫండింగ్‌(Crowd Funding) ద్వారా ఆమె చికిత్స కోసం ప్రయత్నాలు కొనసాగగా.. మంచి స్పందన లభించింది. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. ఈ నెల 15న దీప్తి చికిత్స పొందుతూ కన్నుమూసింది. శనివారం(ఏప్రిల్‌ 19) నాటికి మృతదేహం గుంటూరుకు వచ్చే అవకాశం ఉంది. మరో బాధితురాలు స్నిగ్ధ ప్రస్తుతం అక్కడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె పరిస్థితి నిలకడగానే ఉందని సమాచారం. అవే ఆమె చివరి మాటలు..దీప్తి మృతి వార్త విని ఆ తల్లిదండ్రులు గుండెలు అవిసెలా రోదిస్తున్నారు. చదువులో చాలా చురుకైన విద్యార్థిని అని, అందుకే పొలం అమ్మి మరీ అమెరికాకు పంపించామని చెప్పారు. నెల రోజుల్లో గ్రాడ్యుయేషన్‌ పూర్తి కావాల్సి ఉందని, ఆ టైంకి మమ్మల్ని అమెరికాకు రావాలని ఆమె కోరిందని, అందుకు ఏర్పాట్లలో ఉండగానే ఇలా జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 10వ తేదీన దీప్తి చివరిసారిగా తమతో ఫోన్‌లో మాట్లాడినట్లు తెలిపారు. కాలేజీకి టైం అవుతోందని.. ఆదివారం మాట్లాడతానని చెప్పి హడావిడిగా ఫోన్‌ పెట్టేసిందని.. అవే తమ బిడ్డ మాట్లాడిన చివరి మాటలని గుర్తు చేసుకుని బోరున విలపించారు.

Is Vijayasais testimony valid In AP liquor scam probe7
విజయసాయి సాక్ష్యం చెల్లుబాటు అవుతుందా?

వైఎస్ జగన్‌ మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త లిక్కర్ పాలసీ(New Liquor Policy) తీసుకురావడం ద్వారా.. విక్రయాల్లో పారదర్శకతకు పెద్దపీట వేశారు. విక్రయాలు ప్రభుత్వం చేతిలోనే ఉండడం వల్ల, బెల్టు షాపులను నూరుశాతం కట్టడి చేయడం అప్పట్లో సాధ్యం అయింది. అయితే చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచార సమయం నుంచి కూడా.. లిక్కర్ అమ్మకాల్లో పెద్ద స్కామ్ జరుగుతున్నట్టుగా దుష్ప్రచారం ప్రారంభించారు. .. దాదాపు 50వేల కోట్ల దాకా స్వాహా పర్వం జరిగినట్టుగా పదేపదే గోబెల్స్ ప్రచారం చేస్తూ ప్రజలను బురిడీ కొట్టించి అధికారంలోకి వచ్చారు. తీరా గద్దె ఎక్కిన తర్వాత.. అన్ని ఆరోపణలు చేసిన లిక్కరు విక్రయాల విషయంలో ఏదో ఒకటిచేయకపోతే పరువు పోతుందనే భయంతో.. ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. 50వేల కోట్ల అవినీతి అనే ఆరోపణల స్థానంలో.. 3వేల కోట్ల అవినీతి జరిగిందని ఆ సిట్ గణాంకాలను తయారుచేసింది. ఇక విచారణలు ప్రారంభించారు. జగన్‌ మోహన్‌రెడ్డి(Jagan Mohan Reddy) ప్రభుత్వంలో ఐటీ సలహాదారుగా ఉన్న కసిరెడ్డి రాజశేఖర రెడ్డిని నిందితుడిగా చేర్చారు. ఆయనను విచారించాలంటే నోటీసులు ఇవ్వడానికి అందుబాటులో లేరని తేల్చారు. ఐటీ సలహాదారుగా అప్పట్లో ఉన్న తనను మద్యం స్కామ్ లో ఎందుకు విచారణకు పిలుస్తారంటూ ఆయన ఇచ్చిన మెయిల్ కు జవాబు లేదు. ఈలోగా.. వైఎస్సార్‌సీపీ రాజీనామా చేసిన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి(Vijaya Sai Reddy)ని సాక్ష్యంగా విచారణకు పిలిచారు. ఈ నేపథ్యంలో.. అసలు విజయసాయిరెడ్డి సాక్ష్యం చెప్పడానికి ఏ రకంగా అర్హుడు? ఆయన సాక్ష్యానికి చట్టబద్ధత ఉంటుందా? చెల్లుబాటు అవుతుందా? అనే సందేహాలు ప్రజల్లో కలుగుతున్నాయి. సాధారణంగా ఒక కుంభకోణం(Scam) జరిగిందని ప్రభుత్వం భావిస్తే దానితో ప్రత్యక్షంగా సంబంధం ఉన్నవారినే విచారణకు పిలవాలి. ఎవరైతే నేరం చేశారని అనుకుంటున్నారో వారిని విచారించడానికి నోటీసులు ఇచ్చే తరహాలోనే.. దానితో సంబంధం ఉందనిపించిన వారిని సాక్షిగా పిలిచి ధ్రువీకరించుకోవచ్చు. మద్యం డిస్టిలరీల నుంచి భారీగా సొమ్ములు తీసుకోవడం ద్వారా అవినీతికి పాల్పడ్డారనేది ఇక్కడ ఆరోపణ. మహా అయితే డిస్టిలరీల యజమానులను పిలిచి విచారించడానికి అవకాశం ఉంది. అయితే ఈ వ్యవహారంతో ఏ మాత్రం సంబంధం లేని విజయసాయిరెడ్డిని ఏ కారణం చేత సాక్షిగా వివరాలు చెప్పాలని పిలుస్తున్నారో ప్రజలకు అర్థం కావడం లేదు.విజయసాయిరెడ్డి వైఎస్సార్‌సీపీ(YSRCP)కి రాజీనామా చేశారు. బయటకు వెళ్లిన తర్వాత పార్టీ మీద ఇప్పుడు రకరకాల నిందలు వేస్తున్నారు. ఇటీవల లిక్కర్ స్కామ్ జరిగిందని ఆయన ధ్రువీకరిస్తూ.. ఆ స్కామ్ కు కర్త కర్మ క్రియ అన్నీ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అని అన్నారు. ఎవరో మూడో వ్యక్తి.. హఠాత్తుగా తెరమీదకు వచ్చి. ‘ఫలానా స్కామ్ లో ఫలానావాళ్లు అవినీతి చేశారు.. నేను చెబుతున్నాను’ అని చెబితే అది చెల్లుబాటు అవుతుందా? ఈ లెక్కన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో విభేదించి బయటకు వెళ్లిన నాయకులు ఇంకా అనేక మంది ఉన్నారు. వారందరినీ అధికార కూటమి ప్రలోభపెట్టి, బెదిరించి, మభ్యపెట్టి ఏదో ఒక విధంగా.. వైఎస్సార్‌సీపీ నేతల మీద బనాయించిన రకరకాల కేసుల్లో సాక్షులుగా మార్చేస్తే దాని పర్యవసానాలు చాలా ఘోరంగా ఉంటాయి కదా అనేది పలువురు అభ్యంతరంగా ఉంది. వైఎస్సార్‌సీపీ నుంచి బయటకు వచ్చిన వారిని, ఏమాత్రం సంబంధం లేని కేసుల్లో కూడా సాక్షులుగా మార్చేసుకోవడం ఒక సాంప్రదాయంగా మారిందంటే గనుక.. అది అనేక విపరిణామాలకు దారితీస్తుంది. అధికారంలోకి వచ్చిన ప్రతిపార్టీ తమ ప్రత్యర్థుల్ని వేధించడానికి ఒక అడ్డదారిని ఎంచుకున్నట్టుగా అవుతుంది. విజయసాయిరెడ్డి సిట్ ముందు హాజరైనా సరే.. ఎవరిమీదనైనా నిందలు వేయగలరు. కానీ..ఆ సమాచారం తనకు ఎలా తెలిసిందో సహేతుకంగా నిరూపించుకోవాల్సిన బాధ్యత ఆయనకు ఉంటుంది. ఆయన చెప్పే సాక్ష్యం మూలాలను కూడా నిర్ధారించుకుంటే తప్ప సిట్ పోలీసులు సమర్థంగా వ్యవహరించినట్టు కాదు.. అని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు.:::ఎం. రాజ్యలక్ష్మి

MR Guided Focused Ultrasound Treatment For Parkinsons Disease8
గంటల్లోనే వణుకుడు వ్యాధి మాయం..!

చేతులు, కాళ్లు విప‌రీతంగా వ‌ణికిపోతూ.. మ‌న‌మీద మ‌న‌కే నియంత్ర‌ణ లేకుండా చేసే దారుణ‌మైన స‌మ‌స్య‌ ..పార్కిన్స‌న్స్ డిసీజ్‌. దాదాపు ఏడాది క్రితం వ‌ర‌కు దీనికి డీప్ బ్రెయిన్ స్టిమ్యులేష‌న్ అనే ఒక శ‌స్త్రచికిత్స మాత్ర‌మే ఉండేది. కానీ వైద్య ప‌రిజ్ఞానం అభివృద్ధి చెంద‌డంతో ఇప్పుడు ఓ స‌రికొత్త చికిత్స వ‌చ్చింది. అదే.. ఎంఆర్ గైడెడ్ ఫోక‌స్డ్ అల్ట్రాసౌండ్ (ఎంఆర్‌జీఎఫ్‌యూఎస్). దీని సాయంతో.. కేవ‌లం మూడు నుంచి నాలుగు గంట‌ల్లోనే వ‌ణుకుడు స‌మ‌స్య పూర్తిగా మ‌టుమాయం అయిపోతుంద‌ని కిమ్స్ ఆస్ప‌త్రికి చెందిన వైద్య ప్ర‌ముఖులు చెబుతున్నారు. పార్కిన్స‌న్స్ వ్యాధి బాధితులు, వారి కుటుంబ‌స‌భ్యుల‌కు ఈ స‌మ‌స్య, దాని ల‌క్ష‌ణాలు, ఉన్న చికిత్స అవ‌కాశాల గురించి ఒక అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాన్ని కిమ్స్ హాస్పిటల్స్లోని మూవ్‌మెంట్ డిజార్డర్స్ బృందం డాక్టర్ మానస్, డాక్టర్ జయశ్రీ, డాక్టర్ గోపాల్ మూవ్‌మెంట్ డిజార్డర్ బృందం ఆధర్యంలో గురువారం నిర్వ‌హించారు. సుమారు 150 మంది రోగులు, వారి కుటుంబ‌స‌భ్యులు ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌రై.. త‌మ అనుమానాలు నివృత్తి చేసుకున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో న్యూరోస‌ర్జ‌రీ విభాగాధిప‌తి, చీఫ్ న్యూరోస‌ర్జ‌న్‌ డాక్ట‌ర్ మాన‌స్ కుమార్ పాణిగ్రాహి మాట్లాడుతు.. “పార్కిన్స‌న్స్ డిసీజ్ అనేది మ‌నిషిని పూర్తిగా కుంగ‌దీసే స‌మ‌స్య‌. దీనివ‌ల్ల వ‌చ్చే శారీర‌క స‌మ‌స్య‌ల‌తో పాటు.. అవి ఉన్నాయ‌న్న బాధ వ‌ల్ల వ‌చ్చే మాన‌సిక స‌మ‌స్య‌లు కూడా ఎక్కువే. ఇంత‌కాలం మందులు, డీబీఎస్ లాంటి శ‌స్త్రచికిత్స‌లు మాత్ర‌మే దీనికి ప‌రిష్కారంగా ఉండేవి. ఇప్పుడు చిన్న కోత కూడా అవ‌స‌రం లేకుండా కేవ‌లం ఎంఆర్ఐ యంత్రానికి మ‌రో ఫోక‌స్డ్ అల్ట్రాసౌండ్ యంత్రాన్ని అమ‌ర్చి మూడు నాలుగు గంట‌ల పాటు చికిత్స చేస్తాం. ఇది పూర్త‌య్యి రోగి బ‌య‌ట‌కు రాగానే ఒక‌వైపు ఉన్న స‌మ‌స్య పూర్తిగా న‌యం అయిపోతుంది. అప్ప‌టివ‌ర‌కు ఉన్న వ‌ణుకు మ‌టుమాయం అవుతుంది. పైగా ఈ ప్ర‌క్రియ చేసేట‌ప్పుడే వ‌ణుకు త‌గ్గిందా లేదా అని చూసుకుంటూ ఉంటాం కాబ‌ట్టి... పూర్తిగా తగ్గిన త‌ర్వాతే చికిత్స పూర్త‌వుతుంది. అంతేకాదు గ‌తంలో డీబీఎస్ లాంటి శ‌స్త్రచికిత్స‌ల‌కు ఎంత వ్య‌యం అయ్యేదో.. దాదాపుగా దీనికి కూడా అంతే అవుతుంది. వ‌ణుకు ప్రాథ‌మిక ద‌శ‌లో ఉన్న‌వారి నుంచి బాగా తీవ్రంగా ఉన్న‌వారి వ‌ర‌కు ఎవ‌రైనా ఈ చికిత్స చేయించుకోవ‌చ్చు. వారికి ఒక చిన్న ప‌రీక్ష చేసి, ఈ చికిత్స వారికి స‌రిపోతుందో లేదో నిర్ణ‌యిస్తాం. ఆ త‌ర్వాత చికిత్స చేయించుకుని.. హాయిగా ఎవ‌రి సాయం లేకుండా ఒక్క‌రే న‌డుచుకుంటూ వెళ్లిపోవ‌చ్చు” అని తెలిపారు.ఈ కార్య‌క్ర‌మానికి నిర్వాహక కార్య‌ద‌ర్శిగా వ్య‌వ‌హ‌రించిన కిమ్స్ ఆస్ప‌త్రి క‌న్స‌ల్టెంట్ న్యూరాల‌జిస్ట్, మూమెంట్ డిజార్డ‌ర్ స్పెష‌లిస్ట్ డాక్ట‌ర్ ఎం జ‌య‌శ్రీ మాట్లాడుతూ, “ఎంఆర్‌జీ ఎఫ్‌యూఎస్ అనేది చాలా అత్యాధునిక‌మైన చికిత్స‌. ఇప్ప‌టికే కిమ్స్ ఆస్ప‌త్రిలో ఎనిమిది మంది రోగుల‌కు దీని సాయంతో చికిత్స చేసి స‌త్ప‌ఫ‌లితాలు సాధించాం. ఇందులో ఎలాంటి కోత అవ‌స‌రం లేకుండా ఎంఆర్ఐతోనే అల్ట్రాసౌండ్ త‌రంగాల‌ను పంపుతారు. పార్కిన్స‌న్స్ వ్యాధి వ‌ల్ల మెద‌డులో ప్ర‌భావిత‌మైన ప్రాంతాల‌ను ఎంఆర్ఐ ద్వారా గుర్తించి, వెంట‌నే చికిత్స చేసేటప్పుడు ముందుగా తక్కువ హీట్‌తో టెంపరెరీ థర్మోఅబ్లేషన్న్ చేసి వణుకు తగ్గిందా లేదా అని చూస్తాం. త‌ర్వాత ఎక్కువ హీట్ తో పర్మినెంట్ థర్మోఅబ్లేషన్ ద్వారా పూర్తి చికిత్స చేయడం జరుగుతుంది. అలా చేస్తుడంగానే వణుకు పూర్తిగా తగ్గిపోతుంది. సాధార‌ణంగా పార్కిన్స‌న్స్ రోగుల‌కు ఒక‌వైపే (కుడి లేదా ఎడ‌మ‌) స‌మ‌స్య తీవ్రంగా ఉంటుంది. వ్యాధి త్రీవత ఎక్కువ ఉన్న వైపు చికిత్స చేయడం వల్ల వారికి ఎక్కువ ప్ర‌యోజ‌నం కనిపిస్తుంది. ఈ మొత్తం చికిత్స‌కు సుమారు 3-4 గంటల స‌మ‌యం ప‌డుతుంది. ఫ‌లితాలు మాత్రం వెంట‌నే క‌నిపిస్తాయి."ఓ కేసులో 28 ఏళ్ల యువ‌కుడు, ఇంకా పెళ్లి కూడా కాలేదు. టీచ‌ర్ అవుదామ‌నుకుంటే ఆ ఉద్యోగం కూడా రాలేదు. చికిత్స పొందిన త‌ర్వాత ఇప్పుడు హాయిగా టీచ‌ర్ ఉద్యోగం చేసుకుంటున్నాడు, చాలామందికి సాయ‌ప‌డుతున్నాడు. అలాంటి నాణ్య‌మైన జీవితాన్ని అంద‌రికీ ఇవ్వాల‌ని కిమ్స్ త‌హ‌త‌హ‌లాడుతుంటుంది. కిమ్స్ ఆస్పత్రిలోని న్యూరాల‌జీ బృందం అత్యుత్త‌మ సేవ‌లు అందిస్తోంది. అందుకు వారికి అభినంద‌న‌లు” అని కిమ్స్ ఆస్ప‌త్రి సీఎండీ డాక్ట‌ర్ బొల్లినేని భాస్క‌ర‌రావు తెలిపారు.చీఫ్ క‌న్స‌ల్టెంట్ న్యూరాల‌జిస్ట్ డాక్ట‌ర్ ఎస్. మోహ‌న్ దాస్, క‌న్స‌ల్టెంట్ న్యూరాలజిస్టులు డాక్టర్. సీతా జయలక్ష్మి, డాక్ట‌ర్ ఈఏ వ‌ర‌ల‌క్ష్మి, డాక్ట‌ర్ ప్ర‌వీణ్ కుమార్ యాడా, సీనియ‌ర్ క‌న్స‌ల్టెంట్ న్యూరాల‌జిస్ట్ డాక్ట‌ర్ సుభాష్ కౌల్, మెడిక‌ల్ డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ సంబిత్ సాహు, క‌న్స‌ల్టెంట్ న్యూరోస‌ర్జ‌న్ డాక్ట‌ర్ గోపాల‌కృష్ణ త‌దిత‌రులు మాట్లాడారు. “సాధార‌ణంగా పార్కిన్స‌న్స్ వ్యాధిలో రెండు ర‌కాల స‌మ‌స్య‌లు ఉంటాయి. అవి మోటార్‌, నాన్ మోటార్‌. మోటార్ స‌మ‌స్య‌లు అంటే క‌ద‌లిక‌ల‌కు సంబంధించిన‌వి. వ‌ణుకు, గ‌ట్టిగా అయిపోవ‌డం, నెమ్మ‌దించ‌డం లాంటివి ఇందులో ప్ర‌ధానంగా ఉంటాయి. చేతులు, కాళ్లు విపరీతంగా వ‌ణుకుతుంటాయి. ఏవీ ప‌ట్టుకోలేరు, స‌రిగా న‌డ‌వ‌లేరు. న‌డ‌క‌మీద నియంత్ర‌ణ ఉండ‌దు. ఐదు నిమిషాల్లో అయిపోయే ప‌నికి 20 నిమిషాలు ప‌డుతుంది. ముఖంలో క‌ద‌లిక‌లు త‌గ్గిపోతాయి. ఇక నాన్ మోటార్ స‌మ‌స్య‌ల్లో నిద్ర లేక‌పోవ‌డం, మూత్ర‌విస‌ర్జ‌న‌పై నియంత్ర‌ణ లేక‌పోవ‌డం, మ‌ల‌బ‌ద్ధ‌కం, మాన‌సిక స‌మ‌స్య‌లు, వాస‌న లేక‌పోవ‌డం లాంటి వాటితో పాటు.. శ‌రీరం బ్యాలెన్స్ లేక‌పోవ‌డం వ‌ల్ల త‌ర‌చు ప‌డిపోయి గాయ‌ప‌డ‌తారు. ఈ స‌మ‌స్యల వ‌ల్ల వాళ్లు న‌లుగురితో క‌ల‌వ‌లేక ఒంట‌రిగా మిగిలిపోతారు. పెళ్లిళ్లు, ఇత‌ర ఫంక్ష‌న్ల‌కు వెళ్లలేరు. విప‌రీత‌మైన కుంగుబాటు ఉంటుంది. ఇలాంటి స‌మ‌స్య‌ల‌న్నీ పార్కిన్స‌న్స్ వ‌ల్ల అద‌నంగా వ‌స్తాయి.(చదవండి: శిల్పారామంలో..సమ్మర్‌ ఆర్ట్‌ క్యాంపు.. )

Telangana: Two Sons And Mother Lost Their Lives In Gajularamaram9
ఇద్దరు కొడుకుల గొంతుకోసి చంపి.. తల్లి ఆత్మహత్య

జీడిమెట్ల: కడుపున పుట్టిన ఇద్దరు కొడుకుల గొంతుకోసి చంపింది ఓ తల్లి. ఆపై తను కూడా అపార్ట్‌మెంట్‌లోని 5వ అంతస్తు పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన జీడిమెట్ల పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని గాజులరామారంలోని బాలాజీ లేఅవుట్‌లో చోటు చేసుకుంది. బాలానగర్‌ డీసీపీ కె.సురేష్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పరిధిలోని చోడవరం గ్రామానికి చెందిన గాండ్ర వెంకటేశ్వరరెడ్డి భార్య తేజస్విని(35), ఇద్దరు కుమారులు ఆశిష్ రెడ్డి(7), హర్షిత్‌రెడ్డి(5)లతో కలిసి బాలాజీ లేఅవుట్‌లోని సహస్ర మహేష్‌ హెయిట్స్‌ అపార్ట్‌మెంట్‌లోని ఫ్లాట్‌నంబర్‌ 204లో ఉంటున్నారు.వెంకటేశ్వరరెడ్డి బొంతపల్లిలోని ఓ పరిశ్రమలో నాలుగేళ్లుగా పనిచేస్తున్నాడు. పిల్లలిద్దరూ స్థానికంగా ఉన్న ఓ పాఠశాలలో 1వ తరగతి, నర్సరీ చదువుతున్నారు. గురువారం ఉదయం వెంకటేశ్వరరెడ్డి డ్యూటీకి వెళ్లగా, ఇంట్లో తేజస్విని, పిల్లలు ఉన్నారు. మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో తేజస్విని అపార్ట్‌మెంట్‌ పైనుంచి దూకడంతో పెద్ద శబ్దం వచ్చింది. ఇది విన్న అపార్ట్‌మెంట్‌ వారు వెళ్లి చూడగా, తేజస్విని అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది. వెంటనే అపార్ట్‌మెంట్‌ వాసులు సెకండ్‌ ఫ్లోర్‌లోని తేజస్విని ఇంట్లోకి వెళ్లి చూడగా, కిచెన్‌లో ఆశిష్ రెడ్డి అప్పటికే మృతి చెంది రక్తపుమడుగులో పడి ఉండగా, హర్షిత్‌రెడ్డి కొనప్రాణంతో కొట్టుమిట్టాడుతున్నాడు.వెంటనే అపార్ట్‌మెంట్‌ వారు హర్షిత్‌ను షాపూర్‌నగర్‌లోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లగా, అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. సంఘటన జరిగిన పరిసరాలను పరిశీలిస్తే...తేజస్విని తన ఇద్దరు కొడుకులను విచక్షణారహితంగా చంపినట్టు ఉందని స్థానికులు చెప్పారు. విషయం తెలుసుకొని సంఘటన స్థలానికి వచ్చిన బాలానగర్‌ డీసీపీ సురేష్ కుమార్, అడిషనల్‌ డీసీపీ హన్మంత్‌రావు, జీడిమెట్ల ఇన్‌స్పెక్టర్‌ గడ్డం మల్లేశ్‌లు వివరాలు సేకరించారు. మృతదేహాలను పోస్టుమార్టమ్‌ నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించగా, పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.8 పేజీల లేఖ స్వాధీనంతేజస్విని ఉంటున్న ఫ్లాట్‌లో పోలీసులకు 8 పేజీల ఓ లేఖ దొరికింది. అందులో తన ఇద్దరు పిల్లలకు కంటి సమస్య ఉందని, రెండు గంటలకు ఒకసారి కంట్లో మందు వేయకుంటే పిల్లలు నొప్పితో ఏడుస్తారని...దేవుడా నా పిల్లలకు ఎందుకు ఇంత బాధను ఇచ్చావు అని రాసి ఉంది. తనను అందరూ పిచ్చిది అంటున్నారని, ఆ మాటలు భరించలేకపోతున్నానంటూ ఆ లేఖలో పేర్కొంది. కాగా తేజస్విని మానసిక పరిస్థితి సరిగ్గా లేదని, అపార్ట్‌మెంట్‌లోనూ ఎవరితో మాట్లాడదని స్థానికులు అంటున్నారు.

Chandrababu Naidu has committed massive irregularities in the liquor policy10
మద్యం మాఫియా మూలవిరాట్టు బాబే

సాక్షి, అమరావతి: మద్యం విధానంపై కూటమి సర్కారు సారథి, సీఎం చంద్రబాబు శ్రీరంగ నీతులు చెబుతుండడం దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నంత విడ్డూరంగా ఉంది. ఎందుకంటే.. రాష్ట్రంలో మద్యం మాఫియా సృష్టికర్త చంద్రబాబే. మద్యం మాటున మహా దోపిడికీ బ్రాండ్‌ అంబాసిడర్‌ ఈ 40 ఇయర్స్‌ ఇండస్ట్రీనే అన్నది బహిరంగ రహస్యం. అయినప్పటికీ.. రెడ్‌బుక్‌ కుట్రలో భాగంగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాం నాటి మద్య విధానంపై అక్రమ కేసు నమోదు చేసింది. ఐదేళ్ల పాటు పాదర్శకంగా అమలు చేసిన విధానంపై టీడీపీ వీరవిధేయ పోలీసు అధికారులతో సిట్‌ ఏర్పాటు చేసింది. దర్యాప్తు పేరుతో అబద్ధపు వాంగ్మూలాల నమోదు, తప్పుడు సాక్ష్యాల సృష్టికి కూటమి ప్రభుత్వం కుతంత్రాలు పన్నుతోంది. ఈ హడావుడి అంతా.. అసలు మద్యం దందా ఘనాపాఠి చంద్రబాబే అన్నది మరుగునపరచాలన్నది పన్నాగం. కానీ, టీడీపీ మద్యం సిండికేట్‌ మహా దోపిడీ దాచేస్తే దాగేది కాదు. తన బినామీలు, సన్నిహితులకు డిస్టిలరీల లైసెన్సులు ఇచ్చి.. టీడీపీ ప్రజాప్రతినిధులతో మద్యం సిండికేట్‌ ఏర్పాటు చేసి.. ఊరూరా బెల్ట్‌ దుకాణాలు తెరిచి.. ఊరూపేరు లేని బ్రాండ్లను ప్రవేశపెట్టి.. మూడు బార్లు ఆరు దుకాణాలుగా రాష్ట్రమంతా మద్యం ఏరులై పారించిన ఘనత చంద్రబాబుదే. ఈ క్రమంలో చీకటి జీవోలతో కనికట్టు చేశారు.. 2014–19 మధ్య ప్రభుత్వ ఖజానాకు రూ.5 వేల కోట్ల పన్ను రాబడికి గండికొట్టారు. సిండికేట్‌ ద్వారా రూ.20 వేల కోట్లు కొల్లగొట్టారు. చంద్రబాబు పాలనకు పూర్తి విరుద్ధంగా మద్యం విధా­నంపై వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వినూత్న సంస్కరణలు తీసుకువచ్చింది. ప్రైవేటు దుకాణాలను రద్దు చేసి సిండికేట్‌ను రూపుమాపింది. దశలవారీ మద్య నియంత్రణను సమర్థంగా అమలు చేసింది. కొత్తగా ఒక్క డిస్టిలరీకీ అనుమతినివ్వ లేదు. దీంతో టీడీపీ ప్రభుత్వ హయాంతో పోలిస్తే వైఎస్సార్‌సీపీ పాలనలో మద్యం అమ్మకాలు గణనీయంగా తగ్గాయి. మద్యం అమ్మకాలు పెరిగితే డిస్టిలరీలు కమీషన్లు ఇస్తాయి. కానీ, తగ్గితే కమీషన్లు ఇవ్వవన్నది ఎవరైనా ఠక్కున చెప్పే వాస్తవం. కానీ, కుట్రపూరితంగానే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో కమీషన్లు తీసుకున్నారని కూటమి ప్రభుత్వం అక్రమ కేసు నమోదు చేసింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పాతిపెట్టిన ప్రైవేట్‌ మద్యం సిండికేట్‌ భూతాన్ని చంద్రబాబు ప్రభుత్వం తవ్వి తీసి ప్రజలపైకి వదిలింది. యథేచ్ఛగా దోపిడీకి బరితెగిస్తోంది. అందుకే.. ప్రజలకు వాస్తవాలను వివరించేందుకు.. చంద్రబాబు మద్యం దోపిడీ సమగ్ర కుట్రను చాటేందుకు.. మద్యం మాఫియాను వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం సమర్థంగా కట్టడి చేసిన విధానాన్ని చెప్పేందుకు.. ప్రస్తుతం మళ్లీ పేట్రేగుతున్న మద్యం దందాను తెలియజేస్తోంది ‘సాక్షి’. » 2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు తన బినామీలు, సన్నిహితుల మద్యం కంపెనీల ముసుగులో ఖజానాకు భారీగా గండికొట్టారు. నిబంధనలకు విరుద్ధంగా.. వారి కంపెనీలకు అడ్డగోలు లబ్ధి కలిగించారు. సీఎం హోదాలో చంద్రబాబు స్వయంగా సంతకాలు చేసి మరీ కుంభకోణానికి పాల్పడ్డారు. తద్వారా ఖజానాకు ఏటా రూ.1,300 కోట్ల మేర గండి కొట్టారు. ఈ విషయమై.. రాజ్యాంగబద్ధ సంస్థ కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) ఆధ్వర్యంలో స్వతంత్రంగా విధులు నిర్వర్తించే ప్రిన్సిపల్‌ అకౌంటెంట్‌ జనరల్‌ తన అభ్యంతరాలను స్పష్టంగా నివేదించారు కూడా. » చంద్రబాబు ముఠా బాగోతం ఆధారాలతో సహా బయటపడటంతో 2023లోనే సీఐడీ కేసు నమోదు చేసింది. 2014–19 మధ్య సీఎంగా ఉన్న చంద్రబాబు, ఎక్సైజ్‌ కమిషనర్‌గా వ్యవహరించిన ఐఎస్‌ నరేష్, అప్పటి ఎక్సైజ్‌ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, తదితరులపై ఐపీసీ సెక్షన్లు: 166, 167, 409, 120(బి) రెడ్‌ విత్‌ 34, అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్లు: 13(1),(డి), రెడ్‌ విత్‌ 13(2) కింద సీఐడీ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. 5 డిస్టిలరీల నుంచే.. ముసుగులో చంద్రబాబు దందా డిస్టిలరీలతో కుమ్మక్కయి కొన్ని ఉత్పత్తులకు కృత్రిమ డిమాండ్‌ను సృష్టించి దోపిడీకి తెరతీసింది చంద్రబాబు ప్రభుత్వం. 2015–19 మధ్య ఇలా కేవలం ఐదు డిస్టిలరీలకే లబ్ధి చేకూరింది. వీరి నుంచే 50 శాతానికిపైగా కొనుగోళ్లు చేశారు. అందుకు కొన్ని తార్కాణాలు ఇవిగో... » 2017–18లో టీడీపీ ప్రభుత్వం మొత్తం రూ.8,106 కోట్ల మద్యం కొనుగోలు ఆర్డర్లు ఇచ్చింది. వాటిలో రూ.4,122.28 కోట్లు ఐదు డిస్టిలరీలలకే ఇవ్వడం గమనార్హం. పెర్ల్‌ డిస్టిలరీకే రూ.1,374.79 కోట్ల మద్యం ఆర్డర్లు ఇవ్వగా.. పెర్నోడో రిచర్డ్‌ ఇండియా లిమిటెడ్‌కు రూ.548.03కోట్లు, ఎస్వీఆర్‌ డిస్టిలరీస్‌కు రూ.395.1 కోట్లు, అలైడ్‌ బ్లెండర్స్‌–డిస్టిలరీస్‌కు రూ.457.86కోట్లు, ఎస్వీవై ఆగ్రో ఇండస్ట్రీస్‌కు రూ.319.57కోట్ల మద్యం ఆర్డర్లు ఇచ్చారు. » 2018–19లో టీడీపీ ప్రభుత్వం మొత్తం రూ.4,765.75 కోట్ల మద్యం ఆర్డర్లు ఇచ్చింది. వాటిలో కేవలం మూడు డిస్టిలరీలకే ఏకంగా రూ.2,244.44కోట్ల మద్యం ఆర్డర్లు ఇవ్వడం గమనార్హం. » పెర్ల్‌ డిస్టిలరీస్‌కు అత్యధికంగా రూ.1,462.41కోట్ల మద్యం ఆర్డర్లు ఇవ్వగా.. సెంటిని బయో ప్రొడక్ట్స్‌కు రూ.638.52కోట్లు, ఎస్పీవై ఆగ్రో ప్రొడక్ట్స్‌ రూ.143.51 కోట్ల ఆర్డర్లు ఇచ్చారు. తద్వారా కేవలం ఈ మూడు డిస్టిలరీల నుంచే రూ.47.09 శాతం మద్యం కొనుగోలు చేశారు. బార్లలోనూ అదే బరితెగింపు.. చంద్రబాబు ఆదేశాలతో బార్లపై ప్రివిలేజ్‌ ఫీజును రద్దు చేసేందుకు ఎక్సైజ్‌ చట్టం 10(ఏ) నిబంధన తొలగించాలంటూ ఎక్సైజ్‌ కమిషనర్‌ 2015 సెప్టెంబరు 1న సర్క్యులర్‌ ఇచ్చారు. ప్రివిలేజ్‌ ఫీజు రద్దుపై 2015 సెప్టెంబరు 9న బార్ల యజమానులు వినతిపత్రం సమర్పించినట్లు రికార్డుల్లో చూపారు. సెపె్టంబరు 9న వినతిపత్రం సమర్పిస్తే దానికి 9 రోజులు ముందుగానే సెపె్టంబరు 1నే ప్రివిలేజ్‌ ఫీజు రద్దు చేయాలని ఎక్సైజ్‌ కమిషనర్‌ సర్క్యులర్‌ ఎలా ఇచ్చారన్నది చంద్రబాబే చెప్పాలి. బార్లకు ప్రివిలేజ్‌ ఫీజు రద్దుపై కూడా ఆర్థిక శాఖ అనుమతి తీసుకోలేదు. కేబినెట్‌ ఆమోదమూ పొందలేదు. ప్రివిలేజ్‌ ఫీజును రద్దు చేస్తూ 2015 డిసెంబరు 11న జీవో 468 జారీ అయింది. అందుకు సంబంధించిన నోట్‌ ఫైళ్లపై ఎక్సైజ్‌ శాఖ మంత్రి హోదాలో కొల్లు రవీంద్ర 2015 డిసెంబరు 3న సంతకం చేయగా సీఎం హోదాలో చంద్రబాబు 2015 డిసెంబరు 4న డిజిటల్‌ సంతకాలు చేయడం వారి పన్నాగానికి నిదర్శనం. డిస్టిలరీలన్నిటికీ అనుమతినిచ్చింది చంద్రబాబు ప్రభుత్వమే మద్యం విధానం ముసుగులో చంద్రబాబు తన బినామీలు, సన్నిహితులకు చెందిన డిస్టిలరీలకు అడ్డగోలుగా లబ్ధి చేకూర్చారు. వారి ద్వారా ఖజానాకు గండి కొట్టి నిధులను సొంత ఖజానాకు మళ్లించుకున్నారు. రాష్ట్రంలో 20 మద్యం డిస్టిలరీలు ఉండగా 14 డిస్టిలరీలకు చంద్రబాబు సర్కారే అనుమతులిచ్చింది. మిగిలిన ఆరు డిస్టిలరీలకు అంతకుముందటి ప్రభుత్వాలు అనుమతులిచ్చాయి.వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉన్న 2019–24లో రాష్ట్రంలో ఒక్క డిస్టిలరీకి కూడా అనుమతి ఇవ్వనేలేదు. 2014 నవంబరులో జీవో నంబర్‌ 993 ప్రకారం రెవెన్యూ (ఎౖక్సైజ్‌2) డిపార్ట్‌మెంట్‌ ఏర్పాటు చేసిన కమిటీ సిఫార్సులకు విరుద్ధంగా, కమిటీ సూచించిన వాటి కంటే ఎక్కువ డిస్టిలరీల స్థాపనకు టీడీపీ ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. కేబినెట్‌కు చెప్పకుండానే.. 2015లో చంద్రబాబు ప్రభుత్వం కొత్త మద్యం విధానం తెచ్చింది. నాడు కేబినెట్‌ సమావేశానికి ముందు ఎక్సైజ్‌ కమిషనర్‌ మద్యం దుకాణాలు, బార్లపై ప్రివిలేజ్‌ ఫీజును కొనసాగించడమే కాక 10 రెట్లు పెంచాలని ఓ నోట్‌ ఫైల్‌ను పంపారు. ఈ ప్రతిపాదనను చంద్రబాబు కేబినెట్‌ అజెండాలో చేర్చలేదు. కొత్త మద్యం విధానంపై కేబినెట్‌ సమావేశంలో చర్చించి 2015 జూన్‌ 22న జీవోలు 216, 217 జారీ చేశారు. ఆ రెండు జీవోల్లోనూ మద్యం దుకాణాలకు ప్రివిలేజ్‌ ఫీజు తొలగిస్తున్నట్లు పేర్కొనలేదు. కానీ, అదే రోజు సాయంత్రం అప్పటి ఎక్సైజ్‌ కమిషనర్‌ ప్రివిలేజ్‌ ఫీజు తొలగించాలని ప్రతిపాదిస్తూ, ఎక్సైజ్‌ చట్టం 16(9) నిబంధనను రద్దు చేయాలని సిఫార్సు చేశారు. ఆ నోట్‌ ఫైల్‌ను చంద్రబాబు కార్యాలయానికి పంపారు. ఈ మేరకు ‘కాపీ టు పీఎస్‌ టు సీఎం’ అని నోట్‌ ఫైల్‌లో స్పష్టంగా పేర్కొన్నారు. అంటే ప్రివిలేజ్‌ ఫీజును తొలగిస్తున్న విషయం చంద్రబాబుకు స్పష్టంగా తెలుసనేది సుస్పష్టం. అదే రోజు అంటే.. 2015 జూన్‌ 22న సాయంత్రం గుట్టుగా జీవో 218 జారీ అయింది. దీని గురించి కేబినెట్‌లో చర్చించలేదు. ఖజానాకు నష్టం వాటిల్లే అంశాలపై ముందుగా ఆర్థిక శాఖ ఆమోదం తప్పనిసరి. కానీ ప్రివిలేజ్‌ ఫీజు రద్దు విషయాన్ని ఆర్థిక శాఖకు తెలియజేయనే లేదు. ‘పవర్‌ స్టార్‌’, ‘లెజెండ్‌’లను తెచ్చింది ఎవరు?పవర్‌ స్టార్, లెజెండ్‌.. ఇవేవో టీడీపీ కూటమిలోని నాయకుల పేర్ల ముందు ఉండే బిరుదులు కావు. మద్యం బ్రాండ్లు. ఈ రెండే కాదు.. ఊరూ పేరు తెలియని అనేక బ్రాండ్ల మద్యంకు చంద్రబాబు ప్రభుత్వమే అనుమతులిచ్చింది. దాదాపు 200 రకాల బ్రాండ్లను మార్కెట్‌లో ప్రవేశపెట్టి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడింది. టీడీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మద్యం బ్రాండ్లలో కొన్ని .. ప్రెసిడెంట్‌ మెడల్‌: ఈ బ్రాండ్‌కు 2017 నవంబరు 22న చంద్రబాబు ప్రభుత్వం అనుమతినిచ్చింది. హై వోల్టేజ్, వోల్టేజ్‌ గోల్డ్, ఎస్‌ఎన్‌జీ 10000, బ్రిటీష్‌ అంపైర్‌ సూపర్‌ స్ట్రాంగ్‌ ప్రీమియం బీర్, బ్రిటీష్‌ ఎంపైర్‌ అల్ట్రా బ్రాండ్‌ బీర్‌ ఉత్పత్తులకు 2017 జూన్‌ 7న చంద్రబాబు ప్రభుత్వం ఓకే చెప్పింది. గవర్నర్‌ రిజర్వ్, లెఫైర్‌ నెపోలిన్, ఓక్టోన్‌ బారెల్‌ ఏజ్డ్, సెవెన్త్‌ హెవెన్‌ బ్లూ బ్రాండ్ల విస్కీలకు 2018 అక్టోబరు 26న అంగీకారం తెలిపారు. రాయల్‌ ప్యాలస్, న్యూ కింగ్, సైన్‌ అవుట్‌ పేర్లతో విస్కీ, బ్రాందీ బ్రాండ్లకు 2018 నవంబరు 9న అనుమతిచ్చింది. బీరా 91 పేరుతో మూడు రకాల బీర్‌ బ్రాండ్లకు 2019 మే 13న అప్పటి టీడీపీ ప్రభుత్వమే పచ్చజెండా ఊపింది. టీఐ మ్యాన్షన్‌ హౌస్, టీఐ కొరియర్‌ నెపోలియన్‌ విస్కీ, బ్రాందీ బ్రాండ్లకు 2018 మే 15న అనుమతినిచ్చింది. అసలు స్కాం ఎవరిది? లంచాలు ఎవరికి ఇస్తారు?టీడీపీ ప్రభుత్వంతో పోలిస్తే వైఎస్సార్‌సీపీ పాలనలో అమ్మకాలు తగ్గాయి.. ఈ నేపథ్యంలో లిక్కర్‌ వ్యవహారంలో వాస్తవంగా స్కాంలు చేసింది ఎవరు? అనేది పరిశీలిస్తే.. » మద్యాన్ని ఎక్కువగా అమ్మితే లంచాలు ఇస్తారా? అమ్మకాలు తగ్గిస్తే లంచాలు ఇస్తారా? » మద్యం అమ్మకాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తే లంచాలు ఇస్తారా? లేక ప్రభుత్వం ద్వారా మాత్రమే అమ్మితే లంచాలు ఇస్తారా? » విక్రయ వేళలను తగ్గిస్తే లంచాలు ఇస్తారా? లేక ఎక్కువ సమయం అమ్మేలా చేస్తే లంచాలు ఇస్తారా? » మద్యం దుకాణాలను పెంచితే లంచాలు ఇస్తారా? దుకాణాలను తగ్గిస్తే లంచాలు ఇస్తారా? »దుకాణాలకు తోడు పర్మిట్‌ రూమ్‌లు, బెల్టు షాప్‌లు పెడితే లంచాలు ఇస్తారా? లేక బెల్టు షాపులు తీసేసి, పర్మిట్‌ రూమ్స్‌ను రద్దు చేస్తే లంచాలు ఇస్తారా? » 2014 - 19లో చంద్రబాబు నిర్ణయించిన బేసిక్‌ రేట్లను పెంచి.. డిస్టిలరీల నుంచి కొనుగోళ్లు చేస్తే లంచాలు వస్తాయా? లేక పాత రేట్లను కొనసాగిస్తే లంచాలు వస్తాయా? » మద్యంపై తక్కువ ట్యాక్స్‌ల ద్వారా ఎక్కువ అమ్మకాలు చేసే విధంగా డిస్టిలరీలకు మేలు చేస్తే లంచాలు వస్తాయా? లేక ట్యాక్స్‌లు పెంచి, తద్వారా అమ్మకాలు తగ్గితే లంచాలు వస్తాయా? » ఎంపిక చేసుకున్న 4-5 డిస్టిలరీలకు మాత్రమే అధికంగా ఆర్డర్లు ఇస్తే లంచాలు ఇస్తారా? అన్ని డిస్టిలరీలకు సమాన స్థాయిలో ఆర్డర్లు ఇస్తే లంచాలు ఇస్తారా? » ఇప్పుడున్న డిస్టిలరీలలో అధిక భాగం అనుమతులు ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వంలో ఉన్న వారికి లంచాలు వస్తాయా? లేక ఏ ఒక్క డిస్టిలరీకీ అనుమతివ్వని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఉన్నవారికి లంచాలు వస్తాయా? వైఎస్సార్‌సీపీ హయాంలో.. » 2019-24 మధ్య ఐదేళ్లలో కొత్తగా ఒక్క డిస్టిలరీకి కూడా అనుమతి ఇవ్వలేదు. మద్యం విధానంలో అక్రమ దందా సాగించే సిండికేట్‌ వ్యవస్థను పూర్తిగా ఎత్తివేసింది. » లిక్కర్‌ షాపుల నుంచి పూర్తిగా ప్రైవేటు వ్యక్తులను తొలగించింది. ప్రభుత్వ ఆధీనంలోనే అమ్మకాలు సాగించింది. » 33 శాతం మద్యం దుకాణాలను తీసివేసింది. షాపుల సంఖ్యను 4,380 నుంచి 2,934కు తగ్గించింది. » మద్యం దుకాణాలకు అనుబంధంగా ఉన్న 43 వేల బెల్టు షాపులను, 4,380 పర్మిట్‌ రూమ్‌లను రద్దు చేసింది. » మద్యం ధరలను షాక్‌ కొట్టేలా పెంచింది. ఎక్సైజ్‌కు సంబంధించిన నేరాలకు పాల్పడితే శిక్షలను కఠినం చేసింది. » మద్యం విక్రయాల వేళలను కుదించింది. ప్రతి ఊరికి ఒక మహిళా పోలీసును నియమించింది. దీంతో మద్యం అమ్మకాలు బాగా తగ్గాయి. లబ్ధి పొందిన చంద్రబాబు బినామీలు, సన్నిహితులు వీరు టీడీపీ సీనియర్‌ నేత యనమల రామకృష్ణుడు వియ్యంకుడు, టీటీడీ మాజీ చైర్మన్, వైఎస్సార్‌ జిల్లా మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్‌ యాదవ్‌. ప్రస్తుత ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌ యాదవ్‌కు తండ్రి ఈయన. టీడీపీ మాజీ ఎంపీ దివంగత డీకే ఆదికేశవుల నాయుడు కుటుంబం టీడీపీ నేత, మాజీ ఎంపీ ఎస్పీవై రెడ్డి కుటుంబం. 2014లో వైఎస్సార్‌సీపీ తరపున ఎంపీగా గెలిచిన ఎస్పీవై.. నిబంధనలకు విరుద్ధంగా టీడీపీలో చేరినందుకు నజరానాగా ఆయన డిస్టిలరీకి చంద్రబాబు అనుమతిచ్చారు. 2019 ఎన్నికలకు ముందు ఆగమేఘాల మీద 2019, ఫిబ్రవరి 25న అనుమతినిచ్చిన విశాఖ డిస్టిలరీస్‌ అప్పటి టీడీపీ సీనియర్‌ నేత, ప్రస్తుత స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు కుటుంబానికి చెందింది.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement