Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Caste survey to be part of upcoming population census1
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు

ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. జనగణనలోనే కుల గణన కూడా చేయడానికి కేబినెట్ అంగీకారం తెలిపింది. వచ్చే జనాభా లెక్కల్లో కులగణనను చేరుస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది జనగణన చేపట్టాలని కేబినెట్‌ నిర్ణయించింది. దీనిలో భాగంగా జనగణనతో కలిపి కులగణన కూడా చేయడానికి నిశ్చయించింది. 2019లోనే జనగణన చేయాల్సి ఉన్నప్పటికీ కరోనా కారణంగా అప్పుడు ముందుడగు పడలేదు. దాంతో పాటు షిల్లాంగ్-సిల్చారు జాతీయ రహదారి నిర్మాణానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. 22,864 కోట్ల రూపాయల ఖర్చుతో 166 కిలోమీటర్ల మేర గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఫలితంగా త్రిపుర, మిజోరం, మణిపూర్, అస్సాంలోని బరాక్ వ్యాలీకి కనెక్టివిటీ పెరగనుంది. అదే సమయంలో చెరకు మద్దతు ధర క్వింటా రూ. 350కు కేబినెట్ ఆమోదం తెలిపింది. కేబినెట్‌ భేటీ అనంతరం మంత్రి మండలి నిర్ణయాలను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.

Simhachalam Temple Tragedy: Ys Jagan To Visakha Updates2
విశాఖకు మాజీ సీఎం వైఎస్‌ జగన్‌

సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విశాఖ వెళ్లనున్నారు. సింహాచలం ఘటనలో బాధిత కుటుంబాలను ఆయన పరామర్శించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు వైఎస్‌ జగన్‌ విశాఖకు చేరుకోనున్నారు.విశాఖ జిల్లా సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవంలో గోడ కుప్పకూలి భక్తులు మృతి చెందడంపై వైఎస్‌ జగన్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చందనోత్సవం సందర్భంగా రూ. 300 టికెట్‌ క్యూలైన్‌ పై గోడ కుప్పకూలి భక్తులు మృత్యువాత పడటంపై తీవ్రవిచారం వ్యక్తం చేశారు. స్వామివారి నిజరూప దర్శనానికి వచ్చిన భక్తులు ఇటువంటి దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమన్నారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని, మరణించిన భక్తుల కుటుంబాలను ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.

Telangana Class 10 results to release today3
తెలంగాణ టెన్త్‌ ఫలితాలు విడుదల.. ఒక్క క్లిక్‌తో చెక్‌ చేస్కోండిలా

సాక్షి,హైదరాబాద్‌ : తెలంగాణ పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. బుధవారం మధ్యాహ్నాం రవీంద్ర భారతిలో జరిగిన కార్యక్రమంలో సీఎం రేవంత్‌ రెడ్డి, భట్టి ఇతరులు టెన్త్‌ ఫలితాలను విడుదల చేశారు. మొత్తం ఐదు లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాయగా.. 92.78 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ప్రకటించారు. గురుకులాల్లో 98 శాతం, ఆశ్రమ పాఠశాలల్లో 95 శాతం, ప్రైవేట్‌ పాఠశాలల్లో 94.12 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. మొత్తంగా.. గతేడాది కంటే 1.47 శాతం అధికంగా ఉత్తీర్ణత సాధించినట్లు విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. విద్యార్థులు తమ టెన్త్ ఫలితాలను కింద ఇచ్చిన సాక్షి అధికారిక ఎడ్యుకేషన్‌ వెబ్‌ సైట్‌లో పొందవచ్చు. 👇 👉Server 1 https://results2.sakshieducation.com/Results2025/telangana/SSC/2025/ts-ssc-10th-class-results-2025.html👉Server 2 https://education.sakshi.com/sites/default/files/exam-result/TS-SSC-10th-Class-Results-2025-Direct-Link.html👉Server 3 http://results1.sakshieducation.com/results/SSC/ts-10th-class-results-2025.htmlసరికొత్త విధానం..కాగా.. ఈసారి గ్రేడింగ్ స్థానంలో మార్కుల మెమోలపై సబ్జెక్ల వారీగా మార్కులు, గ్రేట్లను ఇచ్చారు. ఈమేరకు కొత్త మెమో నమూనాను కూడా విద్యాశాఖ విడుదల చేసింది. ఉమ్మడి రాష్ట్రంలో మార్కుల విధానాన్ని తొలగించి గ్రేడింగ్ విధానాన్ని అమలులోకి తెచ్చిన విషయం తెలిసిందే. 2009 నుంచి ఈ విధానం అమలులోకి వచ్చింది. ఏ-1, ఏ-2, బీ-1,బీ-2, సీ-1, సీ-2, డి, ఈలుగా గ్రేడ్‌లను ఇచ్చేవారు. సబ్జెక్ట్‌ల వారీగా గ్రేడ్లతో పాటు సీజీపీఏ ఇచ్చేవారు. అయితే ఇప్పుడు అనూహ్యంగా ఈ విధానాన్ని తొలగించి సీజీపీఏ కాకుండా సబ్జెక్టులవారీగా మార్కులు, గ్రేడ్లు ఇవ్వాలని విద్యాశాఖ నిర్ణయించింది. అయితే విద్యావేత్తలు, ఉపాధ్యాయ సంఘాలు, తల్లిదండ్రులు, విద్యార్థులతో చర్చించకుండానే సరికొత్త విధానాన్ని అమలు చేయడం పట్ల అనేక ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.

 Union Minister Bandi Sanjay Kumar Letter To TSPSC Chairman4
ఈ సందేహాలు తీర్చండి.. టీఎస్పీఎస్సీకి కేంద్ర మంత్రి బండి సంజయ్‌ లేఖ

న్యూఢిల్లీ, సాక్షి: తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షా ఫలితాల్లో అక్రమాలు, అవినీతి ఆరోపణలతోపాటు తీవ్రమైన తప్పిదాలు జరిగాయని ఆరోపణలు వెల్లువెత్తుతుండటంతో కరీంనగర్‌ ఎంపీ, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ రంగంలోకి దిగారు. గ్రూప్ 1 పరీక్షా ఫలితాలపై టీజీపీఎస్సీ నుండి సమాచారం కోరుతూ.. టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ బుర్రా వెంకటేశంకు ఆయన లేఖ రాశారు. అభ్యర్థుల నుంచి పెద్ద ఎత్తున తనకు విజ్ఞప్తులు వెల్లువెత్తడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల నిర్వహణ, మూల్యాంకన విధానం, ఫలితాల విషయంలో అనేక అక్రమాలు, అవకతవకలు, తప్పిదాలు జరిగాయని, నిబంధనల ఉల్లంఘన జరిగిందని పేర్కొంటూ గ్రూప్ 1 అభ్యర్థులు పలుమార్లు తన దృష్టికి తీసుకొచ్చిన నేపథ్యంలో.. ఆ అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత టీఎస్‌పీఎస్సీ పైన ఉందని ఆయన లేఖలో పేర్కొన్నారు. ప్రధానంగా మార్కుల ప్రకటన, నోటిఫికేషన్ ఉల్లంఘన, పరీక్షా పత్రాల మూల్యాంకనంలో జరిగిన పొరపాట్లతోపాటు ఉర్దూ మీడియంలో రాసిన అభ్యర్థులకు టాప్ ర్యాంకులు రావడాన్ని ఆ లేఖలో ప్రస్తావించారు. వీటికి సంబంధించి సమగ్ర సమాచారాన్ని వారం రోజుల్లో పంపాలని ఛైర్మన్ ను కేంద్ర మంత్రి బండి సంజయ్‌ కోరారు. మరోవైపు హైకోర్టులో గ్రూప్ 1 కేసు విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో.. టీజీపీఎస్సీ నుండి వచ్చిన సమాచారం ఆధారంగా అవసరమైతే తాను సైతం కేసులో ఇంప్లీడ్ కావాలని ఆయన నిర్ణయించారు. బండి సంజయ్‌ లేఖలో కోరిన అంశాలు1. మార్కుల ప్రకటన: ● UPSC తరహాలో ఎంపికైన మొత్తం 563 మంది అభ్యర్థుల పూర్తి మార్కుల జాబితాను(పేర్లతోసహా) అందించగలరు.●రీకౌంటింగ్ కు ముందునాటి జనరల్ ర్యాంకింగ్ జాబితా (GRL) మరియు ప్రొవిజనల్ మార్కుల జాబితా (PML) అందించగలరు. అట్లాగే నోటిఫికేషన్ యొక్క 15.2 & 15.3 నిబంధనలు ఉల్లంఘనకు కారణాలను వివరించగలరు.అభ్యర్థులకు వచ్చిన మార్కుల జాబితాను మీడియం వారీగా అందించగలరు. ప్రిలిమ్స్ & మెయిన్స్ హాల్ టికెట్ నంబర్లు, పేరు, వయస్సు, మీడియం, లింగం, కేటగిరీ, ప్రతి పేపర్‌కు సంబంధించిన మార్కులు మరియు మొత్తం మార్కులతో సహా తెలియజేయగలరు.2. మూల్యాంకన ప్రక్రియ: ●గ్రూప్ 1 పరీక్షల మూల్యాంకనానికి సంబంధించి మొత్తం దశల సంఖ్య, ప్రతి దశలో Evaluation జరిగిన రోజుల సంఖ్య, కేంద్రాలు లేదా పేపర్ వారీగా సమాచారం తెలియజేయగలరు. ప్రతిరోజు మూల్యాంకనకు ఉపయోగించిన గంటలు, మూల్యాంకనకారులకు ఇచ్చిన, మారిన సూచనలను తెలియజేయగలరు. ● పదవీ విరమణ పొందిన మూల్యాంకనకారులను ఎంపిక చేసిన ప్రమాణాలు ఏమిటి? బ్లూప్రింట్లు మీడియం స్పెసిఫిక్‌గా ఉన్నాయా లేక కేవలం ఇంగ్లీషులో మాత్రమేనా? ప్రతి పేపర్, ప్రతి మీడియంకు ప్రతి దశలో ఎంత మంది మూల్యాంకనకారులు ఉన్నారు? మూల్యాంకన సమయంలో ఉన్న CCTV ఫుటేజ్ భద్రత స్థితి ఏమిటి? గౌరవనీయ సుప్రీం కోర్టు ఆదేశించినట్లుగా UPSC స్థాయిలో మోడరేషన్ ప్రక్రియను పాటించకపోవడానికి కారణాలను తెలియజేయగలరు.3. హాజరు వివరాలు:● జనరల్ ఇంగ్లీష్ మరియు పేపర్లు 1–6కి పేపర్ వారీగా, మీడియం వారీగా హాజరు వివరాలను అందించగలరు. ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ హాజరు విధానం పాటించబడిందా లేదా? పాటించకపోతే కారణాలేమిటి? నమోదు అయిన హాజరులో ఉన్న వ్యత్యాసాలకు కారణాలను తెలియజేయగలరు.4. ఫలితాల ప్రకటనకు ముందు డేటా లీక్: ● మార్చి 15, 2025న ఒక టెలిగ్రామ్ గ్రూప్‌లో 450కి పైగా మార్కులు పొందిన అభ్యర్థుల సంఖ్య (618) సోషల్ మీడియాలో పోస్టు చేయబడింది. మార్చి 30న విడుదలైన GRLతో ఇది సమానం. సున్నితమైన డేటా లీక్‌కు బాధ్యులైన వారిపై తీసుకున్న చర్యలను తెలియజేయగలరు.5. కోడ్ ఆధారిత మార్కుల నకిలీ లక్షణాలు: ● 0–50 అంకెల తేడా ఉన్న హాల్ టికెట్ నంబర్ల కలిగిన 1,500కు పైగా అభ్యర్థుల జంటలకు ఒక్కటే మార్కులు రావడం, అంకె పదాంశాల వరకు సరిపోలేదని తెలిసింది. ఇది ఒక కోడెడ్ మార్కింగ్ అల్గోరిథం ఉపయోగించారని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. UPSC, APPSC లేదా గత TGPSC పరీక్షలలో ఇలాంటి ధోరణి కనుగొనబడలేదు. దీనికి కారణాలను వివరించగలరు.6. కేంద్రాల వారీగా అసమాన ఫలితాలు: ● కోఠి ఉమెన్స్ కాలేజ్ (సెంటర్లు 18 & 19) నుంచి ఎంత మంది మెయిన్స్ పరీక్ష రాశారు. వారిలో ఎంత మందికి టాప్ 500లోపు ర్యాంకులు వచ్చాయి? వివరించగలరు. అట్లాగే మిగిలిన కేంద్రాల నుండి ఎంత మంది పరీక్ష రాశారు? వారిలో ఎంత మందికి టాప్ 500లోపు ర్యాంకులు వచ్చాయి. కోఠి ఉమెన్స్ కాలేజీలో పరీక్ష రాసిన వారికే అత్యధిక ర్యాంకులు వచ్చినట్లు మా ద్రుష్టికి వచ్చింది? దీనిపై సమగ్ర వివరాలను అందించగలరు.7. అదనపు సమాచారం : ● హాల్ టికెట్లు మరియు పరీక్ష కేంద్రాల కేటాయింపు యాదృచ్ఛికంగా జరిగిందా లేక మానవీయంగా కల్పించారా?● UPSCలో హాల్ టికెట్ నంబర్లు స్థిరంగా ఉండగా, ఇక్కడ ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్ వరకు ఎందుకు మార్పు జరిగింది?● పరీక్ష కేంద్రాల వారీగా అభ్యర్థుల కూర్చునే పథకం, పర్యవేక్షణకారుల కేటాయింపు వివరాలు.● పరీక్ష కేంద్రాల నుంచి వచ్చిన CCTV ఫుటేజ్‌ భద్రత స్థితి.● సమాధాన పత్రాల కోడింగ్ విధానం, మరియు పేరు, జిల్లా కోడ్, పుట్టిన తేదీ వంటి వివరాలను ఎలా నిర్వహించారు?.. తదితర వివరాలను అందించాలని టీజీపీఎస్సీ చైర్మన్‌ బుర్రా వెంకటేశంను బండి సంజయ్‌ లేఖలో కోరారు.

Bangladesh To Tour Pakistan For 5 T20Is In May5
పాక్‌లో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ బంగ్లాదేశ్‌ క్రికెట్‌ జట్టు సాహసోపేత నిర్ణయం

ఏప్రిల్‌ 22న జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో గల ప్రశాంతమైన బైసారన్‌ లోయలో పాక్‌ ఉగ్రమూకలు కాల్పులకు తెగబడి 26 మంది పర్యాటకులను పొట్టన పెట్టుకున్నారు. ఈ ఉగ్రదాడి తర్వాత భారత ప్రభుత్వం పాక్‌పై చాలా సీరియస్‌గా ఉంది. ఏ క్షణంలోనైనా భారత బలగాలు పాకిస్తాన్‌పై దాడులు చేయవచ్చని ప్రచారం జరుగుతుంది.పాక్‌లో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ బంగ్లాదేశ్‌ పురుషుల క్రికెట్‌ జట్టు ఓ సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్‌లో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ఆడేందుకు ఒప్పుకుంది. ఈ సిరీస్‌ మే 25 నుంచి జూన్‌ 3 వరకు జరుగుతుంది. ఫ్యూచర్‌ టూర్‌ ప్రోగ్రాం (FTP) ప్రకారం పాక్‌ పర్యటనలో బంగ్లాదేశ్‌ మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడాల్సి ఉండింది. అయితే వచ్చే ఏడాది టీ20 వరల్డ్‌కప్‌ జరుగనుండటంతో ఇరు జట్ల బోర్డులు మూడు వన్డేల సిరీస్‌కు బదులు అదనంగా రెండు టీ20లు ఆడేందుకు ఒప్పందం చేసుకున్నాయి.ఈ సిరీస్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు ఇవాళ (ఏప్రిల్‌ 30) ప్రకటించింది. ఈ సిరీస్‌లోని మ్యాచ్‌లు ఫైసలాబాద్‌, లాహోర్‌ నగరాల్లో జరుగనున్నాయి. మే 25, 27న తొలి రెండు టీ20లు ఫైసలాబాద్‌లో జరుగనుండగా.. లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో మిగిలిన మూడు టీ20లు మే 30, జూన్‌ 1, జూన్‌ 3 తేదీల్లో జరుగనున్నాయి. ఈ సిరీస్‌ కోసం బంగ్లాదేశ్‌ క్రికెట్‌ జట్టు మే 21న పాకిస్తాన్‌కు చేరుకుంటుంది. ఫైసలాబాద్‌లో ఆ జట్టు మే 22-24వ తేదీ వరకు ప్రాక్టీస్‌ సెషన్స్‌లో పాల్గొంటుంది.ఇదిలా ఉంటే, పహల్గామ్‌ ఉగ్రదాడి తర్వాత భారత ప్రభుత్వం చాలా విషయాల్లో పాక్‌ను కోలుకోలేని దెబ్బలు కొట్టింది. సింధు జలాల ఒప్పందం రద్దు సహా ఆ దేశ ట్విటర్‌, సినిమాలపై నిషేధం విధించింది. పాక్‌కు చెందిన 16 యూట్యూబ్‌ ఛానళ్లను, ఆ దేశ జర్నలిస్ట్‌లను కూడా బ్యాన్‌ చేసింది. తాజాగా పాక్‌కు అప్పు ఇవ్వొద్దని IMFకు సూచించింది.

Prince Harry Meghan Markle Divorce Buzz check what meghan says6
ప్రిన్స్‌ హ్యారీతో విడాకులా? తొలిసారి మౌనం వీడిన మేఘన్‌

ప్రిన్స్ హ్యారీ (Prince Harry), మేఘన్ మార్కెల్ (Meghan Markle ) వివాహం ప్రపంచంలోనే అత్యధికమంది వీక్షించిన రాయల్‌ వెడ్డింగ్‌గా నిలిచింది. అయితేఈ దంపతులు విడిపోతున్నారనే ఊహాగానాలు బాగా వ్యాపించాయి. ఈ వార్తలను మేఘన్ మార్కెల్‌ తొలిసారి క్లారిటీ ఇవ్వడం విశేషం. తన భర్త మనసు చాలా మంచిదనీ, చాలా చాలా అందగాడని చెప్పుకొచ్చింది. ఇంకా వారి వివాహ బంధంపై ఆమె చెప్పిందో వివరాలను తెలుసుకుందాం. 2018, మే 19న యూకేలోని విండ్సర్ కాజిల్‌లోని సెయింట్ జార్జ్ చాపెల్‌లో అత్యంత ఘనంగా వీరి వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. బ్రిటిష్ రాచరికంలో సంచలన మార్పును ప్రకటించారు. 2020లో తాము తమ రాజ విధులనుండి తప్పుకున్నట్లు ప్రకటించి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఆ తరువాత ప్రిన్స్‌హ్యారీ, మేఘన్‌ విడిపోతున్నారనే వార్తలు జోరుగా వ్యాపించాయి. చాలా రోజుల తరువాత మేఘన్ మార్కెల్ భర్త ప్రిన్స్ హ్యారీతో తన అందమైన బంధాన్ని పంచుకుంది. తన స్నేహితురాలు, IT కాస్మెటిక్స్ CEO జామీ కెర్న్ లిమా పాడ్‌కాస్ట్‌లో ది జామీ కెర్న్ లిమా షో. చిట్-చాట్‌లో మేఘన్ మార్కెల్ మౌనం వీడి కొన్ని ఆసక్తికర సంగతులను పంచుకుంది. ఏడేళ్ల సుదీర్ఘ వివాహ బంధంలో తమ ప్రయాణాన్ని ఆనందంగా కొనసాగిస్తున్నామని తెలిపింది. అంతేకాదు తమ బంధాన్ని 1985 నాటి ప్రముఖ వీడియో గేమ్ సూపర్ మారియో బ్రదర్స్‌తో సరదాగా పోల్చారు. తన భర్త ప్రిన్స్ హ్యారీ చాలా, చాలా అందగాడని కితాబిచ్చింది. అతనికి చాలా మంచి హృదయం ఉన్నవాడని, తనను చాలా ప్రేమిస్తున్నాడని వెల్లడించింది. ఇద్దరం కలిసి ఒక అందమైన జీవితాన్ని నిర్మించు కున్నాం, ఇద్దరు అందమైన పిల్లలున్నారు. మాది చాలా హ్యాపీ ఫ్యామిలీ అంటూ చెప్పుకొచ్చింది.అదే పాడ్‌కాస్ట్‌లో, మేఘన్ మార్కెల్ డేటింగ్ , ప్రారంభ రోజులు ఎలా ఉన్నాయో కూడా వివరించింది. కాలక్రమేణా, ప్రతి సంబంధం అభివృద్ధి చెందుతుందని, అందుకే ఇదిఒకరికొకరు సహవాసాన్ని కొత్త మార్గంలో ఆస్వాదించడం లాంటిదని పేర్కొంది. హ్యారీతో ఆమె శాశ్వత ప్రయాణం ఇంకా కొనసాగుతుందా అని అడిగినప్పుడు 'అవును' అని స్పష్ట చేసింది మేఘన్.ఇదీ చదవండి: Akshaya tritiya 2025 దయచేసి ఇలా చేయండి : గాయని చిన్మయి ‘‘ మీకో విషయం తెలుసా? మా బంధం ప్రారంభంలో సీతాకోక చిలుకల్లా విహరించాం. ఆరు నెలల డేటింగ్‌ తరువాత పెళ్లి అనే బంధంలోకి వెళ్లాం. ఈ ఏడేళ్ల కాలం ఒకరినొకరు కొత్త మార్గంలో ఆనందిస్తున్నాం. మరో విధంగా చెప్పాలంటే ఇది మాకు హనీమూన్ కాలంలా అనిపిస్తుంది." అని మేఘన్ మార్కెల్ చెప్పడం విశేషం.2016లో, ఈ జంట తొలి సారు కలుసుకున్నారు. 2018లో పెళ్లి తరువాత, 2019లో తొలి బిడ్డ ప్రిన్స్ ఆర్చీని, 2021లో తమ రెండవ బిడ్డ ప్రిన్సెస్ లిలిబెట్‌ను స్వాగతించారు. ప్రస్తుతం, రాజ దంపతులు పిల్లలతో కలిసి అమెరికాలో ఉంటున్నారు.చదవండి: మనవడితో 50 ఏళ్ల మహిళ పెళ్లి : ఫ్యామిలీని లేపేసేందుకు కుట్ర?

Wall Collapse Simhachalam Temple Incident Updates7
సింహాచలం అప్పన్న సన్నిధిలో అపశ్రుతి.. ఏడుగురు భక్తులు మృతి

సాక్షి, విశాఖపట్నం: సింహాచలం చందనోత్సవంలో ఘోర అపశ్రు‍తి చోటుచేసుకుంది. గోడ కుప్పకూలి ఏడుగురు మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు. రూ.300 టికెట్‌ కౌంటర్‌ వద్ధ ఈ ప్రమాదం జరిగింది. ఇటీవలే అక్కడ గోడ నిర్మించారు. గోడ నాసిరకంగా నిర్మించడం వలనే కూలిపోయిందని అధికారులు భావిస్తున్నారు. తెల్లవారుజామున 2-3 గంటల మధ్య రూ.300 క్యూ లైన్‌లో ప్రమాదం జరిగింది. మృతులను యడ్ల వెంకటరావు(48),దుర్గా స్వామినాయుడు(32), మణికంఠ(28)గా గుర్తించారు.ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. మృతులను విశాఖపట్నం మధురవాడ సమీపంలోని చంద్రంపాలెం గ్రామానికి చెందిన పిళ్లా ఉమామహేశ్వరరావు (30), ఆయన భార్య శైలజ (26)గా అధికారులు గుర్తించారు. వీరితో పాటు పిల్లా శైలజ తల్లి వెంకటరత్నం, మేనత్త గుజ్జురి మహాలక్ష్మి కూడా ఈ ఘటనలో మృతిచెందారు. మృతదేహాలను కేజీహెచ్‌కు తరలించారు.👉ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఈ ప్రమాదం.. మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌తిరుపతిలో వైకుంఠ ఏకాదశి ఎంత విశిష్టత ఉంటుందోసింహాచలంలో చందనోత్సవానికి అంతే విశిష్టత ఉంటుందిప్రభుత్వ నిర్లక్ష్యం చేతకాని తనంతో ప్రమాదం జరిగిందిమూడు నాలుగు రోజుల క్రితం గోడ నిర్మించారుగోడ నిర్మాణంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోలేదుగోడ ప్లెక్సీ ఊగినట్లు ఊగిందని సాక్షులు చెప్పారుకొండవాలులో కాంక్రీట్ వాల్ నిర్మించాలిఇటుక బెడ్డలతో నిర్మాణం చేపట్టరాదుఒకే కుటుంబంలో నలుగురు చనిపోయారుచనిపోయిన వారి కుటుంబానికి కోటి రూపాయలు పరిహారం ఇవ్వాలిప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలిసంఘటన తెలిసిన వెంటనే వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారుకేజీహెచ్ లో బాధిత కుటుంబాలను పరామర్శిస్తారుప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే ప్రమాదం జరిగిందికొండపై చాలా గోడలు ఉన్నాయి.. అవి ఎందుకు పడుపోలేదునాణ్యాత లోపించింది కాబట్టే గోడ పడిపోయింది👉సింహాచలం దుర్ఘటన.. భక్తుల మృతిపై విచారణ కమిటీ ముగ్గురు అధికారులతో కమిటి వేసిన ప్రభుత్వం 👉సింహాచలం ఘటన.. ప్రభుత్వ వైఫల్యంపై మల్లాది విష్ణు ఫైర్ఈ ప్రభుత్వం మొద్దు నిద్ర పోతోంది...అచేతనంగా మారిపోయిందిప్రత్యర్థుల్ని ఇబ్బంది పెట్టడానికి మాత్రమే పోలీస్ శాఖ మాత్రమే పనిచేస్తుందితిరుపతి లడ్డూ అంశాన్ని తెరపైకి తెచ్చి వైఎస్ జగన్ పై బురద చల్లాలని చూశారుచందనోత్సవంలో అపశ్రుతి పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమేమంత్రులు, ప్రభుత్వం చేతకాని తనంతోనే భక్తులు ప్రాణాలు కోల్పోయారుచనిపోయిన వారిని తిరిగి తీసుకురాగలరా?రాష్ట్ర పండుగగా జరుపుకునే ఉత్సవానికి లోపభూయిష్టంగా ఏర్పాట్లు చేయడమేంటి?ఇంతపెద్ద ఘటన జరిగితే తప్పించుకునే ధోరణితో మంత్రులు, అధికారులు వ్యవహరిస్తున్నారువరుస అపచారాలు జరుగుతున్నా మొద్ద నిద్ర వీడటం లేదు 👉మరణించిన వారికి పోస్టుమార్టం చేయడానికి ఒప్పుకోని బంధువులుకోటి రూపాయల పరిహారం ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్తమ డిమాండ్లను ఒప్పుకున్న తర్వాతే పోస్టుమార్టం చేయాలంటున్న బంధువులుపోస్టుమార్టానికి సహకరించాలని బంధువులపై పోలీసులు ఒత్తిడిపోలీసులతో వాగ్వాదానికి దిగిన బంధువులుఎల్జీ పాలిమర్ ప్రమాదంలో చనిపోయిన వారికి కోటి రూపాయల పరిహారం చెల్లించారుఅదే తరహాలో నేడు కూడా పరిహారం చెల్లించాలని డిమాండ్..👉కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యమే: కొట్టు సత్యనారాయణతిరుపతి ఘటన మరవకముందే సింహాచలంలో ఏడుగురు భక్తులు మృతి దారుణంకూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందిలక్షలాది మంది భక్తులు వస్తారని తెలిసి కూడా ప్రభుత్వం ఏర్పాట్లు చేయలేదుసింహాచలం ఘటన బాధాకరంఘటన జరిగి కొన్ని గంటలు అవుతున్నా పవన్‌ కల్యాణ్‌ ఎక్కడ ఉన్నారు?క్యూలైన్ల దగ్గర ఎండోమెంట్‌,రెవెన్యూ అధికారులు ఎందుకు లేరు?గోదావరి పుష్కరాల్లో కూడా పదుల సంఖ్యలో భక్తులు చనిపోయారు.👉విశాఖకు మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మధ్యాహ్నం 3 గంటలకు విశాఖకు చేరుకోనున్న వైఎస్‌ జగన్‌బాధిత కుటుంబాలను పరామర్శించనున్న వైఎస్‌ జగన్‌👉 సింహాచలం ఘటనపై ప్రధాని మోదీ విచారంవిశాఖ జిల్లా సింహాచలం దేవస్థానంలో గోడ కూలిన ఘటనపై ప్రధాని మోదీ విచారం గోడకూలి భక్తులు చనిపోవడం బాధాకరంమృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిగాయపడిన భక్తులు త్వరగా కోలుకోవాలి పీఎం సహాయ నిధి నుంచి ఎక్స్‌గ్రేషియా మృతుల కుటుంబాలకు PMNRF నుండి రూ. 2 లక్షల పరిహారం గాయపడిన వారికి రూ. 50,000 పరిహారం ఇస్తున్నట్లు పీఎంవో కార్యాలయం ఎక్స్‌ వేదికగా ట్వీట్‌ Deeply saddened by the loss of lives due to the collapse of a wall in Visakhapatnam, Andhra Pradesh. Condolences to those who have lost their loved ones. May the injured recover soon.An ex-gratia of Rs. 2 lakh from PMNRF would be given to the next of kin of each deceased. The…— PMO India (@PMOIndia) April 30, 2025 👉కేజీహెచ్ మార్చురి వద్ద విషాద ఛాయలుకేజీహెచ్ మార్చురి వద్దకు చేరుకుంటున్న మృతుల కుటుంబ సభ్యులుకన్నీరు మున్నీరవుతున్న కుటుంబ సభ్యులు...దైవదర్శనానికి వెళ్లి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారంటూ ఆవేదన👉సింహాచలం ఘటనపై వీహెచ్‌పీ ఆగ్రహంసింహాచలం సరైన రీతిలో ప్రభుత్వం చర్యలు చేపట్టలేదునిర్మాణ లోపం వల్లే ప్రమాదం జరిగిందిసింహాచలంలో పాలన కాదు.. లాబీయింగ్‌ నడుస్తోందిఎండోమెంట్‌ వ్యవస్థ ఓ చెత్తభగవంతుడికి భక్తులకు దూరం చేయడమే వారిపనిహిందువుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయిపాలకుల కబంధ హస్తాల నుంచి ఎండోమెంట్‌ వ్యవస్థ బయటకు వస్తేనే భక్తులకు మంచి జరుగుతోందిచందనోత్సవంలో ఒక ప్రణాళిక లేదు.. ఓ ప్లాన్‌ లేదు👉తిరుపతి తొక్కిసలాట ఘటన మరవకముందే..ఘటనపై సమగ్ర విచారణ చేసి.. మృతుల కుటుంబాలను ఆదుకోవాలని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి డిమాండ్ చేశారు. తిరుపతి తొక్కిసలాట ఘటన మరవకముందే సింహాచలంలో ఇలాంటి ఘటన జరగడం బాధాకరమని ఆమె అన్నారు. మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం ఇవ్వాలి. అన్యాయంగా ఏడుగురు చనిపోయారు. ప్రభుత్వం సరైన చర్యలు చేపట్టకపోవడం వల్లనే ప్రమాదం జరిగిందని వరుదు కల్యాణి అన్నారు.👉వైఎస్‌ జగన్‌ దిగ్భ్రాంతివిశాఖ జిల్లా సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవంలో గోడ కుప్పకూలి భక్తులు మృతి చెందడంపై మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చందనోత్సవం సందర్భంగా రూ. 300 టికెట్‌ క్యూలైన్‌ పై గోడ కుప్పకూలి భక్తులు మృత్యువాత పడటంపై తీవ్రవిచారం వ్యక్తం చేశారు. స్వామివారి నిజరూప దర్శనానికి వచ్చిన భక్తులు ఇటువంటి దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమన్నారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని, మరణించిన భక్తుల కుటుంబాలను ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.👉సింహాచలం ఘటనపై తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర విచారంగోడ కూలి భక్తులు మరణించిన ఘటన తీవ్ర ఆవేదనను కలిగించిందివారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి ఆంధ్ర ప్రదేశ్ లోని సింహాచలం ఆలయం వద్ద గోడ కూలి భక్తులు మరణించిన ఘటనతీవ్ర ఆవేదనను కలిగించింది. వారి కుటుంబ సభ్యులకునా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ…మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని…భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.— Revanth Reddy (@revanth_anumula) April 30, 2025

Reorganization Of The National Security Advisory Board8
జాతీయ భద్రతా సలహా బోర్డు ఛైర్మన్‌గా అలోక్‌ జోషి

ఢిల్లీ: జాతీయ భద్రతా సలహా బోర్డును కేంద్ర ప్రభుత్వం పునర్‌వ్యవస్థీకరించింది. జాతీయ భద్రతా సలహా బోర్డు ఛైర్మన్‌గా ‘రా’ మాజీ చీఫ్‌ అలోక్‌ జోషిని నియమించింది. ఏడుగురు సభ్యులతో జాతీయ భద్రతా సలహా బోర్డు పునర్‌వ్యవస్థీకరించింది. సభ్యులుగా మాజీ ఐపీఎస్‌, ఐఎఫ్‌ఎస్‌, ఆర్మీ అధికారులను నియమించింది. కాగా, ప్రధాని నివాసంలో బుధవారం.. భద్రతా వ్యవహారాల క్యాబినెట్ భేటీ నిర్వహించారు.ఈ సమావేశంలో రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా, జయశంకర్, నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు. ఉగ్రవాదులపై కఠిన చర్యలకు ఇప్పటికే భద్రత బలగాలకు ప్రధాని మోదీ సంపూర్ణ స్వేచ్ఛనిచ్చిన సంగతి తెలిసిందే. సీసీఎస్ అనంతరం సీసీపీఏ, సీసీఈఏ సమావేశాలు నిర్వహించారు. చివర్‌లో క్యాబినెట్ సమావేశం నిర్వహించారు. భద్రత వ్యవహారాలను సీసీఎస్ చర్చించింది. రాజకీయ పరిస్థితులను సీసీపీఏ చర్చించింది. ఆర్థిక అంశాలపై సీసీఈఏ పలు నిర్ణయాలు తీసుకుంది.సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్‌పై భారత్‌ మరిన్ని ఆంక్షలు విధించనుంది. ఫార్మా ఎగుమతులను నిలిపివేసే అవకాశం, భారత గగనతలంలోకి పాకిస్తాన్ విమానాల నిషేధం.. అరేబియా సముద్రంలో పోర్టుల కార్యకలాపాలపై ఆంక్షలు విధించే అవకాశం ఉంది. ఆంక్షలతో పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థను దెబ్బకొట్టే వ్యూహంలో భారత్ ఉంది. ఇవాళ 3 గంటలకు సీసీఎస్‌, సీసీపీఏ, సీసీఈఏ, కేంద్ర కేబినెట్‌ నిర్ణయాలను ప్రెస్‌మీట్‌లో వెల్లడించనున్నారు.

Pakistan Firing At International Border9
పాక్‌ కపట నాటకం.. వరుసగా రోజు భారత సైన్యంపై పాక్‌ సైన్యం కాల్పులు

జమ్మూ : భారత్‌ ఓ వైపు సైనిక చర్యకు సిద్ధమైందని, ఆ పని చేయొద్దంటూ ఐక్య రాజ్య సమితిని పాకిస్తాన్‌ బతిమలాడుతోంది. అదే సమయంలో భారత్‌ను రెచ్చగొట్టేలా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి యధేశ్చగా కాల్పులకు తెగబడుతుంది. తాజాగా, మంగళవారం రాత్రి జమ్మూలోని అఖ్నూర్ సెక్టార్, పరగ్‌వాల్ సెక్టార్‌లో అంతర్జాతీయ సరిహద్దు వద్ద పాకిస్తాన్ సైన్యం భారీ కాల్పులు జరిపింది. పాక్‌ కాల్పులపై భారత సైన్యం స్పందించింది. జమ్మూ ప్రాంతంలోని మూడు ప్రధాన సెక్టార్లలో కూడా కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘించింది. వరుసగా ఆరో రోజు పాక్ సైన్యం కాల్పులు జరిపింది. అంతే ధీటుగా భారత సైన్యం బదులిస్తోందని భద్రతా బలగాలు తెలిపాయి. BREAKING news :What kind of Pakistani army is this that is hell-bent on breaking its own country into 5 pieces?Pakistan indulges in ceasefire violation along the International Border (IB) in Jammu’s Akhnoor Sector, Pargwal. This is not LoC but IB making it a serious… pic.twitter.com/Z5VWPu4MVL— श्रवण बिश्नोई (किसान) (@SharwanKumarBi7) April 29, 2025 ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్‌లో పహల్గాంలో ఉగ్రవాదులు 26మంది టూరిస్టుల ప్రాణాలు తీశారు. నాటి నుంచి భారత్‌-పాక్‌ల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. సైనిక దుస్తులు ధరించిన అమాయకుల ప్రాణాల్ని తీయడంపై భారత్‌.. పాక్‌ను అన్నీ అంశాల్లో దెబ్బకు దెబ్బతీయాలనే ప్రయత్నాల్ని ముమ్మరం చేస్తోంది.ఇందులో భాగంగా ఇండస్ వాటర్ ట్రీటీని తాత్కాలికంగా నిలిపివేసింది. ఏప్రిల్ 27 నుండి పాకిస్తాన్ పౌరులకు జారీ చేసిన వీసాలన్నీ రద్దు చేసింది. అటారీ బోర్డర్‌ను తక్షణమే మూసివేసింది.

Chandrababu Govt Negligence In Simhachalam Appanna Chandanotsavam10
తిరుపతి తొక్కిసలాట ఘటన మరవకముందే..

సాక్షి, విశాఖపట్నం: తిరుపతి తొక్కిసలాట ఘటన మరవకముందే.. సింహాచలంలో మరో ఘోర విషాదం జరిగింది. సింహాచలం అప్పన చందనోత్సవంలో ప్రభుత్వం నిర్లక్ష్యం ఫలితంగా.. గోడకూలి ఏడుగురు మృతిచెందారు. ఘటన జరిగిన సమయంలో ఒక్క పోలీసు కూడా కనిపించలేదు.. భక్తులను ఆదుకోవడానికి ఒక్క ఎండోమెంట్‌ ఉద్యోగి కూడా అక్కడ లేరు. అందుబాటులో ఉన్న వాలంటీర్లు, భక్తులు మాత్రమే సహాయక చర్యలు చేపట్టారు. కటిక చీకటిలో భక్తుల కోసం క్యూలైన్‌లు ఏర్పాటు చేయడంతో అంతా అంధకారం అలుముకుంది. గోడ కూలిపోవడంతో భక్తుల అరుపులు, రోదనలు మిన్నంటాయి. అప్పటికే భక్తుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.ఈ ఘటనపై సమగ్ర విచారణ చేసి.. మృతుల కుటుంబాలను ఆదుకోవాలని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి డిమాండ్‌ చేశారు. మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం ఇవ్వాలన్నారు. అన్యాయంగా ఏడుగురు చనిపోయారు. ఘటనపై పూర్తి వివరాలు అధికారులను అడిగి తెలుసుకుంటున్నాం. సరైన చర్యలు చేపట్టకపోవడం వల్లనే ప్రమాదం జరిగిందని వరుదు కల్యాణి అన్నారు. కటిక చీకట్లో భక్తుల కోసం క్యూలైన్లా?. తిరుపతి తొక్కిసలాట ఘటన మరవకముందే. ఈ ఘటన ప్రభుత్వ వైఫల్యాన్ని బయటపెడుతోందని ఆమె అన్నారు.మరోవైపు, సింహాచలం ఘటనపై వీహెచ్‌పీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సింహాచలం సరైన రీతిలో ప్రభుత్వం చర్యలు చేపట్టలేదని.. నిర్మాణ లోపం వల్లే ప్రమాదం జరిగిందని మండిపడింది.సింహాచలంలో పాలన కాదు.. లాబీయింగ్‌ నడుస్తోంది. ఎండోమెంట్‌ వ్యవస్థ ఓ చెత్త.. భగవంతుడికి భక్తులకు దూరం చేయడమే వారిపని.. హిందువుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.. పాలకుల కబంధ హస్తాల నుంచి ఎండోమెంట్‌ వ్యవస్థ బయటకు వస్తేనే భక్తులకు మంచి జరుగుతోంది.. చందనోత్సవంలో ఒక ప్రణాళిక లేదు.. ఓ ప్లాన్‌ లేదు’’ అంటూ వీహెచ్‌పీ ఆగ్రహం వ్యక్తం చేసింది.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement