Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today

Top Stories

ప్రధాన వార్తలు

Champions Trophy 2025: India Beat New Zealand By 44 Runs1
CT 2025: ఐదేసిన వరుణ్‌.. న్యూజిలాండ్‌పై టీమిండియా ఘన విజయం

ఛాంపియన్స్‌ ట్రోఫీ-2025లో టీమిండియా హ్యాట్రిక్‌ విజయాలు నమోదు చేసింది. గ్రూప్‌-ఏలో భాగంగా న్యూజిలాండ్‌తో ఇవాళ (మార్చి 2) జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 44 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 249 పరుగులు చేయగా.. ఛేదనలో తడబడిన న్యూజిలాండ్‌ 45.3 ఓవర్లలో 205 పరుగులకు ఆలౌటైంది. వరుణ్‌ చక్రవర్తి ఐదు వికెట్లు తీసి న్యూజిలాండ్‌ పతనాన్ని శాశించాడు. కేన్‌ విలియమ్సన్‌ (81) న్యూజిలాండ్‌ను గెలిపించేందుకు విఫలయత్నం చేశాడు. ఈ గెలుపు అనంతరం భారత్‌ గ్రూప్‌-ఏ టాపర్‌గా నిలిచింది. తద్వారా సెమీస్‌లో గ్రూప్‌-బిలో రెండో స్థానంలో నిలిచిన ఆస్ట్రేలియాతో తలపడతుంది. మార్చి 4న ఈ మ్యాచ్‌ జరుగనుంది. అనంతరం మార్చి 5న జరిగే రెండో సెమీఫైనల్లో గ్రూప్‌-ఏలో రెండో స్థానంలో నిలిచిన న్యూజిలాండ్‌.. గ్రూప్‌-బి టాపర్‌ సౌతాఫ్రికాను ఢీకొట్టనుంది.రాణించిన శ్రేయస్‌, హార్దిక్‌, అక్షర్‌తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌.. శ్రేయస్‌ అయ్యర్‌ (79), అక్షర్‌ పటేల్‌ (42), హార్దిక్‌ పాండ్యా (45) రాణించడంతో గౌరవప్రదమైన స్కోర్‌ చేయగలిగింది. ఈ మ్యాచ్‌లో భారత టాప్‌-3 బ్యాటర్లు రోహిత్‌ శర్మ (15), శుభ్‌మన్‌ గిల్‌ (2), విరాట్‌ కోహ్లి (11) విఫలమయ్యారు. మధ్యలో కేఎల్‌ రాహుల్‌ (23) కాసేపు నిలకడగా ఆడాడు. ఆఖర్లో రవీంద్ర జడేజా 16, షమీ 5 పరుగులకు ఔటయ్యారు. న్యూజిలాండ్‌ బౌలర్లలో జేమీసన్‌ ఐదు వికెట్లు తీసి టీమిండియాను దెబ్బకొట్టాడు. విలియమ్‌ రూర్కీ, మిచెల్‌ సాంట్నర్‌, రచిన్‌ రవీంద్ర తలో వికెట్‌ తీశారు.ఐదేసిన వరుణ్‌250 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్‌.. భారత బౌలర్లు మూకుమ్మడిగా దాడి చేయడంతో లక్ష్యానికి 45 పరుగుల దూరంలో నిలిచిపోయింది. కెరీర్‌లో రెండో వన్డే ఆడుతున్న వరుణ్‌ ఐదు వికెట్లు తీసి న్యూజిలాండ్‌ పతనాన్ని శాశించాడు. కుల్దీప్‌ 2, హార్దిక్‌ పాండ్యా, అక్షర్‌ పటేల్‌, రవీంద్ర జడేజా తలో వికెట్‌ తీసి భారత్‌ గెలుపులో తమవంతు పాత్ర పోషించారు. వీరందరూ చెలరేగడంతో భారత్‌ 250 పరుగుల లక్ష్యాన్ని విజయవంతంగా కాపాడుకుంది. ఓ పక్క క్రమం తప్పకుండా వికెట్లు పడుతున్నా న్యూజిలాండ్‌ను గెలిపించేందుకు విలియమ్సన్‌ విఫలయత్నం చేశాడు. అయితే అతనికి సహచరుల నుంచి ఎలాంటి సహకారం లభించలేదు. న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌లో విల్‌ యంగ్‌ 22, రచిన్‌ రవీంద్ర 6, డారిల్‌ మిచెల్‌ 17, టామ్‌ లాథమ్‌ 14, గ్లెన్‌ ఫిలిప్స్‌ 12, బ్రేస్‌వెల్‌ 2, మ్యాట్‌ హెన్రీ 2, విలియమ్‌ ఓరూర్కీ 1 పరుగు చేశారు. ఆఖర్లో మిచెల్‌ సాంట్నర్‌ (28) బ్యాట్‌ ఝులిపించినా అప్పటికే జరగాల్సిన నష్టం​ జరిగిపోయింది.

Mayawati Removes Nephew Akash Anand as Party National Coordinator2
మేనల్లుడికి మరోసారి మాయావతి షాక్‌

ఢిల్లీ : బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయవతి కీలక నిర్ణయం తీసుకున్నారు. తన మేనల్లుడు ఆకాష్‌ ఆనంద్‌కు మరోసారి ఝలక్‌కు ఇచ్చారు. తాజాగా, ఆకాశ్ ఆనంద్‌ను పార్టీ జాతీయ సమన్వయకర్తతో పాటు అన్నీ పదవుల నుంచి తొలగించారు. గతేడాది ఆకాష్‌ ఆనంద్‌కు ఇదే పదవిలో కొనసాగుతుండగా.. తొలగిస్తూ మాయావతి అన్యూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత తిరిగి నియమించారు. ఈ క్రమంలో తాజాగా మరోసారి బాధ్యతల నుంచి ఆకాష్‌ నుంచి పార్టీ పదవుల నుంచి తొలగించారు మాయావతి. ఆకాష్‌ స్థానంలో ఆయన తండ్రి ఆనంద్ కుమార్, సీనియర్ నాయకుడు రామ్‌జీ గౌతమ్‌లను జాతీయ సమన్వయకర్తలుగా నియమించారు.2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు ఆకాష్‌ ఆనంద్ రాజకీయ అరంగేట్రం చేశారు. సోషల్ మీడియా ప్రచారంలో కీలక పాత్ర పోషించిన ఆయన, 2023 చివర్లో పార్టీ జాతీయ సమన్వయకర్తతో నియమితులయ్యారు. అయితే, లోక్‌సభ ఎన్నికలకు ముందు మాయావతి అతనిని పార్టీలోని పదవుల నుంచి తొలగించింది. రాజకీయాల్లో ఆకాష్‌ మరింత పరిణితి పొందాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీఎస్పీ సున్నా స్థానాలకే పరిమితమైంది. ఆ తర్వాత జూన్ 2024లో ఆకాష్‌ ఆనంద్‌ను తిరిగి పార్టీకి తీసుకున్నారు. పలు పార్టీ పదవుల్ని కట్టబెట్టారు. మళ్లీ ఏమైందో ఏమో ఆ మేనల్లుడిని అన్నీ పార్టీ పదవుల నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకోవడం చర్చాంశనీయంగా మారింది.

Ysrcp Mla Tatiparthi Chandrasekhar Fires On Chandrababu3
చంద్రబాబూ.. ఇంత బరితెగింపా?: ఎమ్మెల్యే చంద్రశేఖర్

సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు విజన్ ఉన్న నాయకుడు కాదని.. విషం చిమ్మే నాయకుడంటూ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ మండిపడ్డారు. చంద్రబాబు బరితెగించి మాట్లాడుతున్నారని.. ఆయనకు ఎందుకింత కక్ష అంటూ ధ్వజమెత్తారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘చంద్రబాబు చేసింది విద్వేషపూరిత వ్యాఖ్యలు.. మేం తలుచుకుంటే వైఎస్సార్‌సీపీ నేతలు రోడ్లపై తిరగలేరని హోంమంత్రి మాట్లాడుతున్నారు’’ అని చంద్రశేఖర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘చంద్రబాబుకి ముఖ్యమంత్రిగా కొనసాగే అవకాశం ఉందా?. పచ్చబిళ్ల పెట్టుకున్న వాళ్ల పనులు చేసిపెట్టమన్న అచ్చెన్నాయుడి వ్యాఖ్యలకు కొనసాగింపే చంద్రబాబు వ్యాఖ్యలు. రాగ ద్వేషాలతో సీఎం, హోంమంత్రి మాట్లాడుతున్నారు. వైఎస్సార్‌సీపీ నేతలు మాట్లాడితే అక్రమంగా కేసులు పెడుతున్నారు. దాడులు చేస్తున్నారు. అనారోగ్యంతో ఉన్నా క్రూరంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యమంత్రి కేవలం టీడీపీ నేతల కోసం పనిచేస్తారా.. లేక ప్రజలందరి కోసం పనిచేస్తారా?’’ అంటూ చంద్రశేఖర్‌ నిలదీశారు.‘‘తన కొడుకును సీఎం చేసుకోవటానికి లోకేష్ నియోజకవర్గానికి నిధులు మళ్లిస్తున్నారు. ప్రశ్నించిన వైఎస్సార్‌సీపీ నాయకులపై అక్రమ కేసులు పెట్టి జైళ్లకు పంపిస్తున్నారు. కులం, మతం చూడకుండా జగన్ పాలన చేశారు. ప్రస్తుత కూటమి పాలనలో అంతా వివక్షే. రెడ్డి సామాజికవర్గంపై కక్ష సాధిస్తున్నారు. దళిత ఆఫీసర్లను ఇబ్బందులు పెడుతున్నారు. తన వ్యాఖ్యలపై చంద్రబాబు తక్షణమే క్షమాపణ చెప్పాలి. చంద్రబాబు వ్యాఖ్యలపై గవర్నర్, కేంద్రం స్పందించాలి’’ అని చంద్రశేఖర్‌ డిమాండ్‌ చేశారు.‘‘గుక్కెడు నీటి కోసం ఇబ్బంది పడే పశ్చిమ ప్రకాశంపై ఎందుకు మీకింత పగ?. వెలిగొండ ప్రాజెక్ట్‌పై నిజాలు మాట్లాడే దమ్ముందా?. మంత్రి నిమ్మల రామానాయుడు వెలిగొండ ప్రాజెక్టు ఆర్అండ్‌ఆర్ ప్యాకేజ్‌కు నిధులు కేటాయించకుండా మాటలు చెబుతున్నారు. వెలిగొండ కోసం త్వరలో పాదయాత్ర చేపట్టబోతున్నాం. ఎర్రగొండపాలెనికి మీ శాఖ ద్వారా ఏం చేశారో పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి. వెలిగొండను సందర్శించి పవన్ కళ్యాణ్ వాస్తవాలు తెలుసుకోవాలి’’ అని చంద్రశేఖర్‌ హితవు పలికారు.

Cm Revanth Reddy Visit Slbc Tunnel live Updates4
మరో రెండ్రోజులు పట్టొచ్చు.. SLBC రెస్క్యూ ఆపరేషన్‌పై సీఎం రేవంత్‌

సాక్షి,హైదరాబాద్‌ : నాగర్‌కర్నూల్‌ జిల్లా అమ్రాబాద్‌ మండలం దోమలపెంట సమీపంలోని ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ సహాయక చర్యల్ని సీఎం రేవంత్‌రెడ్డి పరిశీలించారు. ఆదివారం ఎస్‌ఎల్‌బీసీ రెస్క్యూ ఆపరేషన్స్‌ పరిశీలించిన రేవంత్‌.. ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష అనంతరం మీడియాతో మాట్లాడిన రేవంత్‌.. సహాయక చర్యలు పూర్తయ్యేందుకు రెండు మూడ్రోజుల సమయం పడుతుందన్నారు. ఈ సందర్భంగా రేవంత్‌ మాట్లాడుతూ.. ‘ఎస్‌ఎల్‌బీసీ పనులు 2005లో మొదలయ్యాయి. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్ట్‌లను నిర్లక్ష్యం చేసింది. పనులు చేస్తుండగా అనుకోని ప్రమాదం జరిగింది. గత 10ఏళ్లలో రెండు కిలోమీటర్లు కూడా టన్నెల్‌ తవ్వలేదు. మేం వచ్చాక పనులు ఊపందుకున్నాయి. నిపుణలతో చర్చించి పనులు ప్రారంభించాం. ఇలాంటి ప్రమాదం జరిగినప్పుడు రాజకీయాలకు అతీతంగా ముందుకు రావాలి. 11కేంద్ర రాష్ట్రాల రెస్క్యూ బృందాలు సహాకచర్యల్లో పాల్గొన్నాయి. తీవ్రంగా శ్రమిస్తున్న రెస్క్యూ సిబ్బందిని అభినందిస్తున్నా. రెస్క్యూ ఆపరేషన్‌కు మరో రెండు మూడ్రోజుల సమయం రెస్క్యూ ఆపరేషన్‌ పూర్తయ్యే సరికి మరో రెండు, మూడు రోజులు పట్టే అవకాశం ఉంది. ప్రమాదం జరిగిన వెంటనే మంత్రులను పంపించా, సమీక్ష నిర్వహించా. ప్రపంచంలోనే ఇదే అతిపెద్ద,పొడవైన టన్నెల్‌. బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. బాధితుల పట్ల సానుభూతి చూపించాలి. ఎన్ని రోజులైనా మృత దేహాలను వెలికి తీయాల్సిందే.. బాధిత కుటుంబాలకు అప్పగించాల్సిందే. కన్వేయర్‌ బెల్ట్‌ను రేపటిలోగా అందుబాటులోకి తెస్తామన్నారు. కన్వేయర్‌ బెల్ట్‌ అందుబాటులోకి వస్తే రెస్క్యూ వేగవంతం అవుతుంది. అవసరమైతే రోబోలను పంపి రెస్క్యూ ఆపరేషన్‌ వేగవంతం చేయిస్తాం. ఏం జరిగినా ప్రభుత్వం మీద బురద చల్లే ప్రయతం చేస్తున్నారు . ఏం జరిగినా ప్రాజెక్ట్‌లను పూర్తి చేయాలనే దృఢసంకల్పంతో ఉంది. గతంలో శ్రీశైలం ప్రాజెక్ట్‌లో ప్రమాదం జరిగితే చూసేందుకు వెళ్లిన నన్ను పోలీసులు అరెస్ట్‌ చేశారు’ అని వ్యాఖ్యానించారు. యాక్షన్‌ ప్లాన్‌ సిద్ధం చేయాలిఅంతకుముందు ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ వద్ద సీఎం రేవంత్‌ రెస్క్యూ ఆపరేషన్‌పై అధికారులతో సమీక్ష నిర్వహించారు. తక్షణం చేయాల్సిన పనులపై నివేదిక ఇవ్వవాలని అధికారులకు ఆదేశించారు. అధికారులతో నిర్వహించిన సమీక్షలో సీఎం రేవంత్‌.. ఈ ఘటనను కేస్‌ స్టడీగా తీసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో రెస్క్యూ ఆపరేషన్‌ కొనసాగాలి. మరింత మంది నిపుణులను రప్పించండి. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదు. ఎన్‌జీఆర్‌ఐ నిపుణులు వచ్చాక మరింత వేగంగా సహాయక చర్యలు చేపట్టాలి. త్వరలో సిస్మాలజీ నిపుణులు కూడా వస్తారు. విభాగాల వారీగా చేయాల్సిన పనులపై యాక్షన్‌ ప్లాన్‌ రూపొందించాలి. తక్షణం చేయాల్సిన పనులపై నివేదిక ఇవ్వాలని సూచించారు. రెస్క్యూ ఆపరేషన్‌కు ఆటంకంగా నీటి ఊట నాగర్‌కర్నూల్‌ జిల్లా అమ్రాబాద్‌ మండలం దోమలపెంట సమీపంలోని ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ రెస్క్యూ ఆపరేషన్‌కు నీటి ఊట ఆటంకంగా మారింది. దీంతో ఆ నీటి ఊట ఎక్కడి నుంచి వస్తుందో జియోలాజికల్‌ టీమ్‌ సర్వే చేసేందుకు రంగంలోకి దిగారు. ఇందులో భాగంగా ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌పై భాగమైన అమ్రాబాద్‌ అటవీ ప్రాంతంలో జియోలాజికల్‌ అధికారులు సర్వే నిర్వహించారు. అధికారుల సర్వేలో ప్రమాదం స్థలం పైభాగంలో 450 మీటర్ల లోతున నీటి పొరలు ఉన్నట్లు గుర్తించారు. స్థానికంగా ఉసురు వాగు,మల్లెల వాగు,రామతీర్దం, మల్లెల తీర్థం వాగుల నీరు ప్రవహిస్తుంటుంది.ఈ వాగుల్లోని మల్లెల తీర్థం నుంచి వచ్చే నీటి ప్రవాహాం మారుతున్నట్లు అధికారులు గుర్తించారు. మల్లెలతీర్ధం నుంచి నీరు కృష్ణ నది వైపు ప్రవహిస్తున్నది. వాగుల ప్రవాహం వల్లే ఎస్‌ఎల్‌బీసీ టెన్నెల్‌లో నీటి ఊట ఉన్నట్లు నిర్ధారించారు. జియోలాజికల్‌ అధికారులు పరీక్షించారు. నీటి ఊట ఎక్కడి నుంచి వస్తుందో ఆరాతీశారు. అయితే ఉసురు వాగు,మల్లెల వాగు,రామతీర్దం, మల్లెల తీర్థం నుంచి ప్రవహించే నీరు కృష్ణ నది వైపు ప్రవహిస్తుంది. వాటిలో మల్లెల తీర్ధం నుంచి వచ్చే నీటి ప్రవాహాం మారుతున్నట్లు అధికారులు గుర్తించారు. జీపీఆర్‌ ద్వారా గల్లంతైన వారి ఆచూకీ లభ్యంమరోవైపు రెస్క్యూ సిబ్బంది జీపీఆర్‌ ద్వారా ఒక ప్రాంతంలో 2మీటర్ల లోతులో గల్లంతైన వారిలో నలుగురి ఆచూకీ , మరో ప్రాంతంలో ఏడు మీటర్ల లోతులో మరో నలుగురి ఆచూకీ లభ్యమైనట్లు సమాచారం. ఎస్‌ఎల్‌ బీసీ వద్దకు సీఎం రేవంత్‌తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఆదివారం సాయంత్రం ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ వద్దకు వెళ్లనున్నారు. టన్నెల్‌లో చిక్కుకున్న 8 మంది కోసం కొనసాగుతున్న సహాయక చర్యలను పర్యవేక్షించనున్నట్లు సమాచారం. సీఎం రేవంత్‌ ఇవాళ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించనున్నారు. అనంతరం రోడ్డు మార్గం ద్వారా ఎస్‌ఎల్‌బీసీ సొరంగం వద్దకు వెళ్లనున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం, అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. దాదాపు 18 ఏజెన్సీలు, వాటి పరిధిలోని 54 మంది ఉన్నతాధికారులు, 703 మంది సహాయ చర్యల్లో పాల్గొంటున్నారు. సింగరేణి నుంచి 200 మంది రెస్క్యూ సిబ్బంది వచ్చారు. ప్రతి షిప్టునకు 120 మంది చొప్పున 24 గంటలు పూడికతీత చేపడుతున్నారు. టీబీఎం కింద చిక్కుకున్న వారిని వెలికి తీయడానికి మూడు నుంచి నాలుగు రోజులు పట్టే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. శనివారం ఆయన నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ, సీఎస్‌ శాంతికుమారితో కలిసి రెస్క్యూ ఏజెన్సీలు, సభ్యులతో టన్నెల్‌ వద్ద సమీక్ష నిర్వహించారు. అనంతరం, ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో చిక్కుకున్న కార్మికుల కోసం జరుగుతున్న సహాయ చర్యల్లో పురోగతి కనిపించిందని, ఆదివారం సాయంత్రానికి ఏదైనా సమాచారం లభ్యమయ్యే అవకాశముందని ఆబ్కారీ, పర్యాటక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రకటించారు. ఈనేపథ్యంలో సీఎం రేవంత్‌ ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ వద్దకు వెళ్లనున్నారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా అమ్రాబాద్‌ మండలం దోమలపెంట సమీపంలోని ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలో ఫిబ్రవరి 22న ఉదయం 8.30 గంటల ప్రాంతంలో పైకప్పు కూలిన విషయం తెలిసిందే. అక్కడ ఎనిమిది రోజులుగా సహాయ చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి.

Champions Trophy 2025: India To Take On Australia In Semis5
CT 2025: సెమీస్‌లో టీమిండియా ‍ప్రత్యర్థి ఆస్ట్రేలియా.. నాటి పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంటుందా..?

ఛాంపియన్స్‌ ట్రోఫీ-2025 సెమీఫైనల్లో ఏయే జట్లు తలపడబోతున్నాయో తేలిపోయింది. ఇవాళ (మార్చి 2) జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై విజయంతో భారత్‌ గ్రూప్‌-ఏ టాపర్‌గా నిలిచింది. తద్వారా సెమీస్‌లో గ్రూప్‌-బిలో సెకెండ్‌ ప్లేస్‌లో నిలిచిన ఆస్ట్రేలియాతో అమీతుమీకి సిద్దమైంది. భారత్‌, ఆస్ట్రేలియా వన్డే ఫార్మాట్‌లో చివరిసారిగా 2023 వన్డే వరల్డ్‌కప్‌ ఫైనల్లో తలపడ్డాయి. నాటి మ్యాచ్‌లో ఆసీస్‌ భారత్‌ను ఓడించి జగజ్జేతగా నిలిచింది. దాదాపుగా ఏడాదిన్నర తర్వాత భారత్‌కు ఆసీస్‌పై ప్రతీకారం తీర్చుకునే అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని టీమిండియా సద్వినియోగం చేసుకుంటుందో లేదో వేచి చూడాలి. భారత్‌, ఆస్ట్రేలియా మధ్య తొలి సెమీఫైనల్‌ మార్చి 4న దుబాయ్‌ వేదికగా జరుగనుంది.నేటి మ్యాచ్‌లో ఫలితంతో రెండో సెమీస్‌లో ఎవరెవరు తలపడబోతున్నారో కూడా తేలిపోయింది. భారత్‌ చేతిలో ఓటమితో న్యూజిలాండ్‌ గ్రూప్‌-ఏలో రెండో స్థానంలో నిలిచింది. తద్వారా గ్రూప్‌-బి టాపర్‌ అయిన సౌతాఫ్రికాను రెండో సెమీస్‌లో ఢీకొంటుంది. ఈ మ్యాచ్‌ లాహోర్‌ వేదికగా మార్చి 5న జరుగుతుంది. అనంతరం రెండు సెమీఫైనల్స్‌లో విజేతలు మార్చి 9న జరిగే ఫైనల్లో అమీతుమీ తేల్చుకుంటాయి. తొలి సెమీస్‌లో ఆసీస్‌ను ఓడించి టీమిండియా ఫైనల్‌కు చేరితే దుబాయ్‌ వేదికగా అంతిమ సమరం జరుగుతుంది. ఒకవేళ సెమీస్‌లో టీమిండియా ఆసీస్‌ చేతిలో ఓడితే లాహోర్‌ ఫైనల్‌ మ్యాచ్‌కు వేదికవుతుంది.హ్యాట్రిక్‌ విజయాలుభారత్‌ గ్రూప్‌-ఏలో హ్యాట్రిక్‌ విజయాలు సాధించి అజేయ జట్టుగా సెమీస్‌కు చేరింది. తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను ఓడించిన టీమిండియా.. రెండో మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను మట్టికరిపించింది. చివరిగా ఇవాళ జరిగిన మ్యాచ్‌లో భారత్‌ న్యూజిలాండ్‌పై ఘన విజయం​ సాధించింది. మరోవైపు ఆస్ట్రేలియా ఈ టోర్నీలో ఒకే ఒక మ్యాచ్‌లో విజయం​ సాధించినప్పటికీ సెమీస్‌కు అర్హత సాధించింది. గ్రూప్‌ దశలో ఆఫ్ఘనిస్తాన్‌, సౌతాఫ్రికా మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దు కాగా.. ఆసీస్‌ ఇంగ్లండ్‌పై మాత్రమే గెలుపొందింది. 44 పరుగుల తేడాతో కివీస్‌ను చిత్తు చేసిన టీమిండియాగ్రూప్‌-ఏలో భాగంగా ఇవాళ జరిగిన చివరి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్‌ 44 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 249 పరుగులు చేయగా.. ఛేదనలో తడబడిన న్యూజిలాండ్‌ 45.3 ఓవర్లలో 205 పరుగులకు ఆలౌటైంది. వరుణ్‌ చక్రవర్తి ఐదు వికెట్లు తీసి న్యూజిలాండ్‌ పతనాన్ని శాశించాడు. కేన్‌ విలియమ్సన్‌ (81) న్యూజిలాండ్‌ను గెలిపించేందుకు విఫలయత్నం చేశాడు.

Sergey Brin Urges Google Employees to Embrace 60 Hour Workweeks for AGI Development6
ఉద్యోగులూ.. 60 గంటలు కష్టపడితేనే..

ఉద్యోగుల పని గంటల గురించి రోజుకో చర్చ నడుస్తోంది. యాజమాన్యాలు పనిఒత్తిడి పెంచి తమకు వ్యక్తిగత, కుటుంబంతో గడిపే సమయాన్ని దూరం చేస్తున్నాయని ఓవైపు ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తుంటే మరోవైపు పరిశ్రమ ప్రముఖులు, వ్యాపారాధినేతలు దీనిపై విభిన్న వ్యాఖ్యానాలు చేస్తూనే ఉన్నారు. తాజాగా గూగుల్ కో ఫౌండర్‌ సెర్గీ బ్రిన్.. వారానికి 60 గంటలు కష్టపడాలని తమ ఉద్యోగులను కోరారు.ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ (ఏజీఐ) అభివృద్ధిని వేగవంతం చేయడానికి సాహసోపేతమైన చర్యలో, గూగుల్‌కు చెందిన జెమినీ ఏఐ మోడళ్లలో పనిచేసే ఉద్యోగులు వారానికి 60 గంటలు పని చేసే విధానాన్ని అవలంబించాలని, రోజూ ఆఫీస్‌కు రావాలని సెర్గీ బ్రిన్ పిలుపునిచ్చారు. అంతర్గత మెమోలో పేర్కొన్న ఈ ఆదేశం, యంత్రాలు మానవ మేధస్సును మించిన మైలురాయి అయిన ఏజీఐని సాధించే రేసులో పెరిగిన అత్యవసరతను, పోటీ ఒత్తిడిని తెలియజేస్తోంది.తుది రేసు మొదలైందికృత్రిమ మేధ పరిశ్రమలో పోటీ తీవ్రమైన నేపథ్యంలో బ్రిన్ ఇచ్చిన ఈ పిలుపునకు ప్రాధాన్యం ఏర్పడింది. ముఖ్యంగా 2022లో చాట్‌జీపీటీని ప్రారంభించిన తరువాత ఏఐ పరిశ్రమలో పోటీ పెరిగింది. ఇది జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో వేగవంతమైన పురోగతిని ప్రేరేపించింది. "ఏజీఐకి తుది రేసు ప్రారంభమైంది" అని బ్రిన్ తన మెమోలో పేర్కొన్నారు. ఉద్యోగులు తమ ప్రయత్నాలను "టర్బోచార్జ్" చేస్తే.. ఈ రేసులో గెలవడానికి అవసరమైన అన్ని అంశాలు గూగుల్ వద్ద ఉన్నాయన్నారు.ఉత్పాదకతకు ప్రమాణంవారానికి 60 గంటలు పనిచేయడం ఉత్పాదకత ప్రమాణాన్ని సూచిస్తుందని, అదే ఈ పరిమితిని మించితే బర్న్అవుట్‌కు దారితీస్తుందని కూడా బ్రిన్ హెచ్చరించారు. మరోవైపు ఉద్యోగులు 60 గంటల కంటే తక్కువ పని చేయడంపైనా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇటువంటి ప్రవర్తన "అనుత్పాదకంగా ఉండటమే కాకుండా, ఇతరులకు చాలా నిరుత్సాహాన్ని కలిగిస్తుంది" అని పేర్కొన్నారు. బ్రిన్ సిఫార్సులు కార్పొరేట్ అమెరికాలో విస్తృత ధోరణిని ప్రతిబింబిస్తున్నాయి. ఇక్కడ కంపెనీలు ఉత్పాదకత, టీమ్ వర్క్ ను పెంచడానికి హైబ్రిడ్ పని విధానాలను తిప్పికొడుతున్నాయి.సెల్ఫ్ ఇంప్రూవ్‌మెంట్ కోసం ఏఐ వినియోగంఎక్కువ పని గంటల కోసం వాదించడంతో పాటు, వారి కోడింగ్, పరిశోధన సామర్థ్యాలను పెంచడానికి గూగుల్ స్వంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాధనాలను ఉపయోగించాలని బ్రిన్ ఉద్యోగులను కోరారు. "మన స్వంత కృత్రిమ మేధను ఉపయోగించడం ద్వారా ప్రపంచంలోనే అత్యంత సమర్థవంతమైన కోడర్లు, ఏఐ శాస్త్రవేత్తలుగా మారాలి" అని జెమినీ టీమ్ సభ్యులకు ప్రత్యేకంగా పిలుపునిచ్చారు.ఈ విధానం ఏజీఐని సాధించడంలో ఏఐ ఆధారిత స్వీయ-మెరుగుదల ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది.వర్క్‌ఫోర్స్‌పై ప్రభావంమరింత కఠినమైన పని షెడ్యూళ్ల కోసం బ్రిన్ చేస్తున్న ఒత్తిడి ఏజీఐ అభివృద్ధిలో గూగుల్ నాయకత్వం వహించాలనే ఆయన దార్శనికతను ప్రతిబింబిస్తున్నప్పటికీ, ఇది శ్రామిక శక్తిపై ప్రభావాన్ని గురించి కూడా ప్రశ్నలను లేవనెత్తుతుంది. ఏజీఐని సాధించాల్సిన ఆవశ్యకత స్పష్టంగా కనిపిస్తోంది. ఇది గూగుల్‌లో సాంకేతిక పురోగతి అత్యవసరతను ప్రతిబింబిస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అభివృద్ధిలో పోటీ తీవ్రమవుతున్న తరుణంలో ఏఐ బృందానికి బ్రిన్ ఆదేశం గూగుల్ కు కీలక సమయంలో వచ్చింది.

Madhya Pradesh Government Offers Permanent Power to Farmers for Just rs57
రైతులకు శుభవార్త..రూ.5కే శాశ్వత విద్యుత్‌ కనెక్షన్‌.. ఎక్కడంటే?

రైతులకు మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రైతులకు శాశ్వత విద్యుత్ కనెక్షన్‌ను కేవలం రూ.5 మాత్రమే అందిస్తున్నట్లు ఆ రాష్ట్ర సీఎం మోహన్ యాదవ్ ప్రకటించారు. మధ్యప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఈ పథకాన్ని త్వరలో అమలు చేయనుంది.ఈ సందర్భంగా సీఎం మోహన్‌ యాదవ్‌ మాట్లాడుతూ... మధ్యప్రదేశ్‌ ప్రభుత్వ లక్ష్యం రైతులను ప్రోత్సహించడం. వారి జీవితాలను మెరుగుపరచడం. విద్యుత్ సమస్యలు లేకుండా, సాగునీటి అవసరాలను తీర్చేందుకు సౌర (సోలార్) పంప్‌లను ఏర్పాటు చేయబోతున్నాం. వచ్చే మూడు సంవత్సరాల్లో 30 లక్షల సోలార్‌ పంప్‌లను రైతులకు అందించేందుకు ప్రణాళిక రూపొందించామని చెప్పారు. రైతుల నుండి సౌర విద్యుత్‌ను ప్రభుత్వం కొనుగోలు చేయబోతుంది. తద్వారా రైతులు అదనపు ఆదాయాన్ని పొందే అవకాశముంది.కాంగ్రెస్ పాలనలో గ్రామాల్లో సరైన రోడ్లు, విద్యుత్, మౌలిక సదుపాయాలు లేకుండా ఇబ్బంది పడ్డాం. కానీ, బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి పూర్తిగా మారిపోయింది’ అని వ్యాఖ్యానించారు.

LPU 2025 Btech Final Year Student Bags Rs 1.03 Cr Placement Package8
ఎల్‌పీయూ రికార్డు.. 1700 విద్యార్థులకు 10 లక్షలపైనే ప్యాకేజీలు

లవ్లీ ప్రొఫెషనల్‌ యూనివర్శిటీ (ఎల్‌పీయూ)కు ఈ ఏడాది చాలా ఉత్సాహంతో మొదలైంది. ఫైనల్‌ ఇయర్‌ బీటెక్‌ విద్యార్థి రూ.1.03 కోట్ల (1,18,000 డాలర్లు)తో ఉద్యోగావకాశం పొందారు. రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్‌లో B.Tech చేస్తున్న బేతిరెడ్డి నాగవంశీరెడ్డి 2025 మేలో తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేయనున్నారు. ప్రముఖ ఏఐ రోబోటిక్స్ సంస్థలో రోబోటిక్స్ ఇంజినీర్‌గా చేరనున్నారు. ఈ అసాధారణ విజయం అటు పరిశ్రమ వర్గాల్లోనూ ఇటు విద్యా ప్రపంచంలోనూ సంచలనం సృష్టించింది. విద్యార్థులకు సూపర్‌ డూపర్‌ ప్యాకేజీలు అందించగల అత్యున్నత విద్యా సంస్థగా ఎల్‌పీయూ తనస్థానాన్ని సుస్థిరం చేసుకుంది.వేర్వేరు బీటెక్‌ విభాగాల్లోని మొత్తం 7361 మంది విద్యార్థులకు పాలో ఆల్టో నెట్‌వర్క్స్, నుటానిక్స్‌, మైక్రోసాఫ్ట్‌, సిస్కో, పేపాల్‌ అమెజాన్‌ వంటి ప్రతిష్టాత్మక మల్టీనేషనల్‌ కంపెనీల నుంచి ప్లేస్‌మెంట్లు లభించాయి. వీరిలో 1700 మంది టాప్‌ ఎమ్మెన్సీల నుంచి ఏడాదికి రూ.10 లక్షల నుంచి రూ.కోటి వరకూ ప్యాకేజీలు అందాయి. టాప్‌ ఎంఎన్‌సీలు ఇచ్చిన సగటు ప్యాకేజీ రూ.16 లక్షలు (ఏడాదికి). ఉద్యోగ మార్కెట్‌లో ఎల్‌పీయూకు ఉన్న అధిక డిమాండ్‌కు నిదర్శనాలు ఈ ప్లేస్‌మెంట్లు.గత ప్లేస్‌మెంట్‌ సీజన్‌ కూడా ఆకట్టుకునేదే. ఇండస్ట్రీలోనే అతిపెద్ద కంఎనీలు ఆకర్షణీయమైన ప్యాకేజీలు అందించాయి. పాలో ఆల్టో నెట్‌వర్క్స్ ఏకంగా ఏడాదికి రూ.54.75 లక్షల ప్యాకేజీని అందించగా నుటానిక్స్‌ రూ.53 లక్షల ప్యాకేజీ ఇచ్చింది. మైక్రోసాఫ్ట్‌ రూ.52.20 LPA ప్యాకేజీ అందించింది. మొత్తం 1912మందికి ఒకటి కంటే ఎక్కువ ఆఫర్లు అందాయి. 377 మందికి మూడు ఆఫర్లు, 97 మందికి నాలుగు ఆఫర్లు, 18 మందికి ఐదు, ఏడుగురికి ఆరు ఆఫర్లు లభించాయి. ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌ ఇంజినీరింగ్‌ విద్యార్థి ఆదిరెడ్డి వాసుకు నమ్మశక్యం కాని రీతిలో ఏకంగా ఏడు ఆఫర్లు వచ్చాయి. ఇదో అరుదైన, ఆకట్టుకునే రికార్డు.పైన చెప్పుకున్న కంపెనీలు మాత్రమే కాకుండా.. అమెజాన్‌ (రూ.48.64 LPA), ఇన్‌ట్యూట్‌ లిమిటెడ్‌ (రూ. 44.92 LPA), సర్వీస్‌ నౌ ( రూ. 42.86 LPA), సిస్కో (రూ. 40.13 LPA), పేపాల్‌ (రూ. 34.4 LPA), APNA (రూ.34 LPA), కామ్‌వాల్ట్‌ (రూ. 33.42 LPA), స్కేలర్‌ (రూ. 32.50 LPA)లు కూడా స్కిల్‌ డెవెలప్‌మెంట్‌, అత్యాధునిక టెక్నాలజీల్లో నైపుణ్యం అందించేందుకు ఎల్‌పీయూ చూపుతున్న శ్రద్ధకు నిదర్శనంగా నిలుస్తున్నాయి.ఎల్పీయూ పట్టభద్రుల సాంకేతిక పరిజ్ఞాన బుద్ధికుశలత కారణంగా భారీ నియామకాలు చేపట్టే ఆక్సెంచర్‌, క్యాప్‌జెమినీ, టీసీఎస్‌ తదితర ప్రముఖ కంపెనీల నుంచి మంచి డిమాండ్‌ ఉంది. క్యాప్‌జెమినీ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ 736 మంది విద్యార్థులకు అనలిస్ట్‌, సీనియర్‌ అనలిస్ట్‌ రోల్స్‌ కోసం ఉద్యగావకాశం ఇచ్చింది. అలాగే మైండ్‌ట్రీ 467 మంది విద్యార్థులను గ్రాడ్యుయేట్‌ ఇంజినీర్‌ ట్రైనీ పొజిషన్‌ కోసం తీసుకుంది. కాగ్నిజెంట్‌ టెక్నాలజీ సొల్యూషన్స్‌ కూడా 418 మంది విద్యార్థులను జెన్‌సీ రోల్స్‌ కోసం తీసుకుంది. ఎల్‌పీయూ నుంచి విద్యార్థులను ఎంపిక చేసుకున్న ఇతర కంపెనీల్లో ఆక్సెంచర్‌ (279 మంది), టీసీఎస్‌ (260 మంది), కేపీఐటీ టెక్నాలజీస్‌ (229 మంది), డీఎక్స్‌సీ టెక్నాలజీ (203), MPHASIS (94 మంది) కంపెనీలు ఉన్నాయి.రొబోటిక్స్‌, ఆటోమేషన్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌, మెకానికల్‌ ఇంజినీరింగ్‌ వంటి కోర్‌ ఇంజినీరింగ్‌ విభాగాల్లో అత్యధిక స్థాయిలో ప్లేస్‌మెంట్లు లభించాయి. పాలో ఆల్టో నెట్‌వర్క్స్‌, సిలికాన్‌ ల్యాబ్స్‌, ట్రైడెంట్‌గ్రూప్‌, నుటానిక్స్‌, ఆటోడెస్క్‌, అమెజాన్‌ వంటి దిగ్గజ కంపెనీలు ఈ విభాగాల్లోని విద్యార్థులను భారీగా నియమించుకుంటున్నాయి.‘‘ఎప్పటికప్పుడు మారిపోతున్న ప్రపంచానికి అనుగుణంగా విద్యార్థులు విజయం సాధించేలా చేసేందుకు ఎల్‌పీయూ కట్టుబడి ఉంది. ఎల్‌పీయూలో బోధించే అంశాలు కంపెనీల అవసరాలకు తగ్గట్టుగా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఎల్‌పీయూలో సంప్రదాయ పద్ధతులకు అతీతంగా సృజనాత్మక రీతిలో సాగే బోధన విద్యార్థులునిమగ్నమైయెలా ఉంటుంది. విద్యార్థులు పెద్ద సంఖ్యలో టాప్‌ కంపెనీల నుంచి ప్లేస్‌మెంట్‌ ఆఫర్లు పొందుతూండటం దీనికి నిదర్శనం. ఎల్‌పీయూ బోధనాంశాల సత్తానుచాటుతున్నాయి ఈ ప్లేస్‌మెంట్లు. జాతీయ, అంతర్జాతీయ ప్రముఖ సంస్థల్లో విద్యార్థులకు మంచి మంచి ప్లేస్‌మెంట్స్‌ సాధించిన రికార్డు ఎల్‌పీయూ సొంతం. అమెరికా, యూకే, ఆస్ట్రేలియాలల్లోని ఎన్నో పేరొందిన కంపెనీల్లో ఎల్‌పీయూ విద్యార్థులు ఏడాదికి రూ.కోటి కంటే ఎక్కువ ప్యాకేజీలతో పని చేస్తున్నారు. అత్యున్నత నైపుణ్యం కలిగిన ప్రొఫెషనల్స్‌ను తయారు చేయగల ఎల్‌పీయూ శక్తి సామర్థ్యాలకు, అంతర్జాతీయ స్థాయి ఎదుగుదలకు ఇవి నిదర్శనాలు.’’ అని రాజ్యసభ సభ్యులు, ఎల్‌పీయూ ఫౌండర్‌ ఛాన్సలర్‌ డాక్టర్‌ అశోక్‌ కుమార్‌ మిట్టల్‌ వివరించారు.2025 బ్యాచ్‌ కోసం దరఖాస్తు చేసుకునేందుకు చివరితేదీ దగ్గరపడింది. ఎల్‌పీయూలో అడ్మిషన్లకు పోటీ ఎక్కువ. యూనివర్శిటీలో అడ్మిషన్‌ కోసం విద్యార్థులు ప్రవేశ పరీక్ష రాయాల్సి ఉంటుంది. అలాగే ‘ఎల్‌పీయూ నెస్ట్‌ 2025’, ఇంటర్వ్యూలలోనూ పాసైన వారికి మాత్రమే కొన్ని ప్రత్యేక కార్యక్రమాల్లోకి ప్రవేశం లభిస్తుంది. పరీక్ష, అడ్మిషన్‌ ప్రాసెస్‌ గురించి తెలుసుకోవాలనుకునే ఆసక్తిగల విద్యార్థులు https://bit.ly/43340ai ను సందర్శించగలరు.

Union Minister Raksha Khadse Says Her Daughter Harassed By Youths In Jalgaon9
కేంద్ర మంత్రి కుమార్తెకు పోకిరీల వేధింపులు

జల్‌గావ్‌: తన కుమార్తెను వేధించారంటూ కేంద్ర యువజన వ్యవహారాల శాఖ సహాయ మంత్రి రక్షా ఖడ్సే పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహారాష్ట్రలో శాంతి భద్రతలపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. జల్‌గావ్‌ జిల్లా ముక్తాయ్‌నగర్‌లో ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న తన కుమార్తెను అక్కడ కొందరు యువకులు వేధించారని.. పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు మంత్రి వెల్లడించారు.“ప్రతి ఏడాది మహాశివరాత్రి సందర్భంగా మా ప్రాంతంలో సంత్ ముక్తాయ్ యాత్ర జరుగుతుంది. రెండు రోజుల క్రితం నా కూతురు యాత్రకు వెళ్లింది. కొందరు యువకులు ఆమెను వేధించారు. వారిపై ఫిర్యాదు చేసేందుకు నేను పోలీస్ స్టేషన్‌కు వెళ్లాను' అని మీడియాకు కేంద్ర మంత్రి ఖడ్సే చెప్పారు. అడ్డుకున్న భద్రతా సిబ్బందిపైనా ఆ యువకులు దురుసుగా ప్రవర్తించారు. గుజరాత్‌ పర్యటన నుంచి నేను ఇంటికి రాగానే నా కుమార్తె ఈ విషయం చెప్పింది. కేంద్ర మంత్రి కుమార్తెకే ఇలాంటి పరిస్థితి ఎదురైతే.. సాధారణ మహిళల సంగతి ఏంటో అర్థం చేసుకోవచ్చంటూ కేంద్ర మంత్రి ఖడ్సే వ్యాఖ్యానించారు.రక్షా ఖడ్సే మామ ఏక్‌నాథ్‌ ఖడ్సే మాట్లాడుతూ.. ఈ యువకులపై గతంలోనూ పోలీసులకు ఫిర్యాదులు వచ్చాయి. వారు కరుడుగట్టిన నేరస్థులు. మహారాష్ట్రలో నేరస్థులకు పోలీసులంటే భయమే లేదు. రోజురోజుకు మహిళలపై నేరాలు పెరుగుతున్నాయి. బాధిత మహిళలు ఫిర్యాదు చేయడానికి ముందుకు రావడం లేదు. వారి తల్లిదండ్రులు కూడా తమ కుమార్తెల పేర్లు బయటకు రాకూడదని భావిస్తున్నారు. వేరే మార్గం లేకనే ఫిర్యాదు చేశాం’’ అని ఏక్‌నాథ్‌ ఖడ్సే తెలిపారు.పోలీస్‌ స్టేషన్‌కు వెళితే రెండు గంటలు మమ్మల్ని కూర్చోబెట్టారని.. అమ్మాయిల విషయం కావడంతో ఆలోచించుకోవాలంటూ పోలీసులు మాకు సలహా ఇచ్చారు. వేధింపులకు పాల్పడ యువకులకు రాజకీయ నాయకుల అండ ఉంది. డీఎస్పీ, ఐజీతో కూడా చెప్పాను’’ అని ఖడ్సే తెలిపారు.

Amroha District: UP Woman Cat Dies10
మరణించిన పిల్లితో రెండురోజులు గడిపి.. చివరికి షాకింగ్‌ నిర్ణయం

లక్నో: పెంపుడు పిల్లి మృతితో కుంగిపోయిన ఓ మహిళ షాకింగ్‌ నిర్ణయం తీసుకుంది. తీవ్ర మనస్తాపం చెందిన ఆమె.. మళ్లీ బతికి వస్తుందనే ఆశతో రెండు రోజుల పాటు తన పెంపుడు పిల్లి మృతదేహంతోనే గడిపింది. చివరికి మూడో రోజు ఆత్మహత్య చేసుకుని మరణించింది. ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లాలో ఈ ఘటన జరిగింది. హసన్‌పూర్‌లో నివసించే 32 ఏళ్ల పూజకు ఎనిమిదేళ్ల కిందట ఢిల్లీకి చెందిన వ్యక్తితో వివాహం కాగా.. రెండేళ్ల తర్వాత భార్యాభర్తలు విడిపోయారు. దీంతో నాటి నుంచి తల్లి గజ్రా దేవి వద్ద ఆమె నివసిస్తోంది.ఒంటరితనం నుంచి బయటపడడానికి పూజ ఒక పెంపుడు పిల్లిని తీసుకొచ్చి పెంచుకుంటోంది. ఆ పిల్లి హఠాత్తుగా చనిపోవడంతో ఆమె తల్లి.. పిల్లిని పాతిపెట్టమని చెప్పింది. అందుకు పూజ నిరాకరించింది. అది తిరిగి బతికి వస్తుందంటూ.. రెండు రోజుల పాటు ఆ పిల్లి మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచింది. ఖననం చేయామని కుటుంబ సభ్యులు ఎన్ని సార్లు చెప్పిన కానీ పూజ వినిపించుకోలేదు.పిల్లి మృతితో తీవ్ర కుంగుబాటుకు గురైన పూజ.. శనివారం మధ్యాహ్నం ఆమె తమ ఇంటి మూడో అంతస్తులోని తన గదిలోకి వెళ్లి ఆత్మహత్యకు పాల్పడింది. గజ్రా దేవి తన కూతురిని చూడటానికి తలుపులు తీసి చూడగా పూజ సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

NRI View all
title
వలస కార్మికుల మృత్యు ఘోష

మోర్తాడ్‌ (బాల్కొండ): జగిత్యాల జిల్లా మల్లాపూర్‌ మండలం రేగుంటకు చెందిన కర్న గణేశ్‌ (55) రెండ్రోజుల కిందట సౌదీ అరేబియాలో

title
వీసా గోల్డెన్‌ చాన్సేనా?

గోల్డ్‌ కార్డ్‌ వీసా.. ప్రపంచవ్యాప్తంగా కొత్త చర్చకు దారితీసిన టాపిక్‌ ఇది.

title
తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) ఆధ్వర్యంలో శివాలయాల సందర్శన యాత్ర

తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) వారు గత మూడేళ్లుగా నిర్వహిస్తున్న మహా శివరాత్రి శివాలయాల సందర్శన యాత్రను  ఈ మహా శ

title
అమెరికా నుంచి భారత్‌కి అందుకే వచ్చేశా! సీఈవో హార్ట్‌ టచింగ్‌ రీజన్‌

మెరుగైన అవకాశాలు, ఆర్థిక భద్రత కోసం చాలామంది భారతీయులు విదేశాల బాటపడుతుంటార

title
USA: ‘కోమా’లో భారత విద్యార్థి.. ఎమర్జెన్సీ వీసాకు లైన్‌ క్లియర్‌

వాషింగ్టన్‌:  ఫిబ్రవ

International View all
title
వైట్‌ హౌస్‌లో మాటల మంటలు.. డొనాల్డ్‌ ట్రంప్‌కు భారీ షాక్‌!

వాషింగ్టన్‌ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (

title
Vivek Ramaswamy: పాదరక్షలు లేకుండా ఇంటర్వ్యూ.. ట్రోలింగ్‌ బారిన వివేక్‌ రామస్వామి

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన భారత సంతతికి చెందిన వివేక్ రామస్వామి(

title
Zelensky: నా దారి రహదారి.. ఎక్కడా తగ్గేదేలే..!

వాషింగ్టన్: అమెరికా(USA) అధ్యక్షుడితో భేటీ

title
ట్రంప్‌ Vs జెలెన్‌స్కీ.. వెల్లువెత్తిన జోక్స్, మీమ్స్‌

ఓవైపు ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే ఇంకొకరు వచ్చి చుట్ట కాల్చుకోవడానికి నిప్పు కావాలని అడగాడట. ఉక్రెయిన్, రష్యా యుద్ధం..

title
ఎదురెదురుగా ఢీకొన్న రెండు బస్సులు.. 37 మంది మృతి

బొలివియా: బొలివియా దేశంలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంద

Advertisement

వీడియోలు

Advertisement