Top Stories
ప్రధాన వార్తలు

కెనడా కొత్త ప్రధానిగా మార్క్ కార్నీ
ఒట్టావా: కెనడాలో తొమ్మిదేళ్ల జస్టిన్ ట్రూడో(Justin Trudeau) పాలనకు తెరపడింది. ఆ దేశ నూతన ప్రధానిగా మార్క్ కార్నీ(Mark Carney) ఖరారు అయ్యారు. తాజాగా జరిగిన సమావేశంలో తమ కొత్త సారథిగా అధికార లిబరల్ పార్టీ కార్నీని ఎన్నుకుంది. ఏనాడూ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయని, కేబినెట్లో పనిచేయని ఆయన.. కెనడా 24వ ప్రధానిగా బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. తీవ్ర ప్రజా వ్యతిరేకతతో జస్టిన్ ట్రూడో ఈ జనవరిలో ప్రధాని పదవి నుంచి వైదొలగనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో లిబరల్ పార్టీకి కొత్త అధ్యక్షుడి ఎన్నిక అనివార్యమైంది. అయితే కొత్త నేత ఎన్నిక దాకా జస్టిన్ ఆ పదవిలో కొనసాగారు. ఇక కొత్త ప్రధానిగా బ్యాంక్ ఆఫ్ కెనడా మాజీ గవర్నర్ మార్క్ కార్నీ ఎన్నికయ్యారు . తాజాగా జరిగిన ఓటింగ్‌లో లిబరల్ పార్టీ సభ్యులు మొత్తం 1,50,000 మంది ఓటింగ్‌లో పాల్గొన్నారు. కార్నేకు 131,674 ఓట్లు పొలవ్వగా.. క్రిస్టియా ఫ్రీలాండ్ 11,134, కరినా గౌల్డ్కు 4,785, ఫ్రాంక్ బేలిస్‌కు 4,038 ఓట్లు వచ్చాయి. అంటే కార్నేకు వచ్చిన ఓట్లు 86 శాతమన్నమాట.ఆర్థిక మేధావిగా పేరున్న మార్క్ కార్నీ సరిగ్గా డొనాల్డ్ ట్రంప్ సుంకాల ముప్పు వంటి సవాళ్లను ఎదుర్కొంటున్న వేళలో ప్రధానిగా బాధ్యతలు స్వీకరిస్తుండడం గమనార్హం.ఎవరీ కార్నీ.. బ్యాక్‌గ్రౌండ్ ఇదే👉మార్క్ కార్నీ 1965లో ఫోర్ట్ స్మిత్‌లో జన్మించారు. హార్వర్డ్‌లో ఉన్నత విద్య అభ్యసించారు. గోల్డ్‌మన్ శాక్స్‌లో 13 ఏళ్లు పనిచేసిన ఆయన.. 2003లో బ్యాంక్ ఆఫ్ కెనడా డిప్యూటీ గవర్నర్‌గా ఎన్నికయ్యారు. 2004లో ఆ బాధ్యతల నుంచి వైదొలగి.. కెనడా ఆర్థిక మంత్రి పదవిని చేపట్టారు. 👉2008 ఫిబ్రవరి 1న సెంట్రల్ బ్యాంక్ గవర్నర్‌గా నియమితులయ్యారు. సరిగ్గా అదే సమయంలో కెనడా ఆర్థిక సంక్షోభంలో కొట్టు మిట్టాడుతోంది. ఆ టైంలో ఆయన అనూహ్యంగా.. వడ్డీ రేట్లను సున్నాకు తగ్గించారు. 👉మూడు శతాబ్దాల చరిత్ర కలిగిన బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్‌కు గవర్నర్‌గా 2013లో కార్నీ ఎన్నికయ్యారు. తద్వారా ఆ సెంట్రల్ బ్యాంక్‌కు మొట్టమొదటి నాన్-బ్రిటిష్ గవర్నర్‌గా నిలిచారు. అంతేకాదు, జీ7లోని రెండు సెంట్రల్ బ్యాంకులకు నాయకత్వం వహించిన వ్యక్తిగానూ రికార్డుకెక్కారు. 2020లో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్‌ను వీడిన ఆయన.. ఐరాస ఆర్థిక, వాతావరణ మార్పుల విభాగం రాయబారిగా సేవలందించారు. తాజా లిబరల్ పార్టీ నూతన అధ్యక్షుడి ఎన్నికల రేసులో నిలిచిన నలుగురిలో అత్యధికారంగా విరాళాలు సేకరించిన అభ్యర్థి కూడా ఈయనే కావడం గమనార్హం.

మా స్పిన్నర్లు అద్భుతం.. అతడు ఒత్తిడిని చిత్తు చేశాడు: రోహిత్
పుష్కరకాలం తర్వాత టీమిండియా మరోసారి చాంపియన్స్ ట్రోఫీ(ICC Champions Trophy 2025)ని ముద్దాడింది. పాతికేళ్ల క్రితం న్యూజిలాండ్ చేతిలో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుని 2025 విజేతగా ఆవిర్భవించింది. దుబాయ్ వేదికగా ఆదివారం నాటి ఫైనల్లో కివీస్‌ను నాలుగు వికెట్ల తేడాతో ఓడించి టైటిల్ కైవసం చేసుకుంది. ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో సాంట్నర్ బృందంపై పైచేయి సాధించి అభిమానులకు కనులవిందు చేసింది.మా స్పిన్నర్లు అద్భుతంఈ నేపథ్యంలో విజయానంతరం భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) మాట్లాడుతూ సమిష్టి కృషి వల్లే గెలుపు సాధ్యమైందని సహచరులపై ప్రశంసలు కురిపించాడు. ముఖ్యంగా స్పిన్నర్లు చాంపియన్స్ ట్రోఫీ-2025 ఆసాంతం అదరగొట్టారని కితాబులిచ్చాడు. అదే విధంగా తమకు మద్దతుగా నిలిచిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపాడు.‘‘ఇది మా సొంత మైదానం కాదు. అయినప్పటికీ మాకు మద్దతుగా అభిమానులు ఇక్కడికి తరలివచ్చారు. మా హోం గ్రౌండ్ ఇదే అన్నంతలా మాలో జోష్ నింపారు. గెలుపుతో మేము వారి మనసులను సంతృప్తిపరిచాం.ఫైనల్లో మాత్రమే కాదు.. టోర్నీ ఆరంభం నుంచీ మా స్పిన్నర్లు గొప్పగా రాణించారు. దుబాయ్ పిచ్ స్వభావరీత్యా వారిపై భారీ అంచనాలు నెలకొన్నప్పటికీ ఒత్తిడికి లోనుకాకుండా పనిపూర్తి చేశారు. వారి నైపుణ్యాలపై నమ్మకంతో మేము తీసుకున్న నిర్ణయాలు సరైనవే అని నిరూపించారు. వారి బలాలను మాకు అనుకూలంగా మలచుకోవడంలో మేము సఫలమయ్యాం.అతడు ఒత్తిడిని చిత్తు చేశాడుఇక.. కేఎల్ రాహుల్(KL Rahul) గురించి చెప్పాలంటే.. ఎలాంటి పరిస్థితుల్లోనూ ఒత్తిడిని దరిచేరనీయడు. అందుకే మేము అతడి సేవలను మిడిల్లో ఎక్కువగా ఉపయోగించుకున్నాం. ఈరోజు తను బ్యాటింగ్ చేస్తున్నపుడు పరిస్థితులు మాకు అంత అనుకూలంగా లేవు. అయినప్పటికీ అతడు ఏమాత్రం తడబడకుండా షాట్ల ఎంపికలో సంయమనం పాటించాడు.తనతో పాటు బ్యాటింగ్ చేస్తున్న ఆటగాడు స్వేచ్ఛగా బ్యాట్ ఝులిపించేలా చక్కటి సహకారం అందిస్తాడు. తను సరికొత్తగా కనిపిస్తున్నాడు. నాణ్యమైన బౌలర్ఇక వరుణ్ టోర్నీ ఆరంభంలో ఆడలేదు. అయితే, న్యూజిలాండ్‌తో లీగ్ మ్యాచ్‌లో ఐదు వికెట్లతో మెరిసిన తర్వాత అతడి సేవలను పూర్తిగా వినియోగించుకోవాలని మేము నిర్ణయించుకున్నాం. అతడొక నాణ్యమైన బౌలర్. ట్రోఫీ గెలవడంలో ప్రతి ఒక్క సభ్యుడు తమ వంతు పాత్ర పోషించారు’’ అని జట్టు ప్రదర్శన పట్ల రోహిత్ శర్మ సంతృప్తి వ్యక్తం చేశాడు. కాగా చాంపియన్స్ ట్రోఫీ-2025 ఫైనల్లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్ చేసింది. డారిల్ మిచెల్(63), మైకేల్ బ్రాస్‌వెల్(53 నాటౌట్) అర్ధ శతకాలతో రాణించారు. ఈ క్రమంలో నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది.భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ రెండేసి వికెట్లు పడగొట్టగా.. షమీ, రవీంద్ర జడేజా ఒక్కో వికెట్ తీశారు.ఇక లక్ష్య ఛేదనలో భారత్‌కు ఓపెనర్లు కెప్టెన్ రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్(31) శుభారంభం అందించారు. విరాట్ కోహ్లి(1) విఫలం కాగా.. శ్రేయస్ అయ్యర్(48)తో కలిసి రోహిత్ ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. 76 పరుగుల వద్ద రోహిత్ స్టంపౌట్ కాగా.. అక్షర్ పటేల్(29), కేఎల్ రాహుల్(33 బంతుల్లో 34 నాటౌట్), హార్దిక్ పాండ్యా(18 బంతుల్లో 18), రవీంద్ర జడేజా(6 బంతుల్లో 9) వేగంగా ఆడి మరో ఓవర్ మిగిలి ఉండగానే జట్టును విజయతీరాలకు చేర్చారు. రోహిత్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం.. చిన్ననాటి మిత్రులతో సంతోషంగా గడుపుతారు.
గ్రహం అనుగ్రహం: శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, తిథి: శు.ఏకాదశి ఉ.9.56 వరకు, తదుపరి ద్వాదశి, నక్షత్రం: పుష్యమి రా.2.25 వరకు, తదుపరి ఆశ్లేష, వర్జ్యం: ఉ.10.20 నుండి 11.56 వరకు, దుర్ముహూర్తం: ప.12.36 నుండి 1.24 వరకు, తదుపరి ప.2.59 నుండి 3.47 వరకు, అమృతఘడియలు: రా.8.05 నుండి 9.41 వరకు; రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు, యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు, సూర్యోదయం: 6.16, సూర్యాస్తమయం: 6.04.మేషం: వ్యవహారాలలో ప్రతిబంధకాలు. ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి. శ్రమాధిక్యం.నిర్ణయాలు మార్చుకుంటారు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.వృషభం: దీర్ఘకాలిక సమస్యలు తీరతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో నూతనోత్సాహం.మిథునం: కుటుంబంలో చికాకులు. ఆరోగ్య సమస్యలు. పనుల్లో ఆటంకాలు. బంధువులతో తగాదాలు. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి.కర్కాటకం: శ్రమలిస్తుంది. నూతన విద్యావకాశాలు. ఆస్తులు కొనుగోలు చేస్తారు. పరిచయాలు పెరుగుతాయి. దైవదర్శనాలు. అనుకున్న పనులలో విజయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి.సింహం: వ్యవహారాలు మందగిస్తాయి. శ్రమాధిక్యం. నిర్ణయాలలో మార్పులు. సోదరుల నుంచి ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాల విస్తరణ వాయిదా. ఉద్యోగాలలో చికాకులు.కన్య: శుభవర్తమానాలు. ఆకస్మిక ధనలాభం. చిన్ననాటి మిత్రులతో సంతోషంగా గడుపుతారు. ఆధ్యాత్మిక చింతన. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.తుల: ఆసక్తికర విషయాలు తెలుస్తాయి. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఆశ్చర్యకర సంఘటనలు. ఆకస్మిక ధనలబ్ధి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి.వృశ్చికం: రాబడి కొంత తగ్గవచ్చు. దూరప్రయాణాలు సంభవం. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.ధనుస్సు: కుటుంబంలో ఒత్తిడులు. అనుకోని ప్రయాణాలు. కొన్ని సమస్యలు చికాకు పరుస్తాయి. బంధువులతో వివాదాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో స్వల్ప ఆటంకాలు.మకరం: వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. చిన్ననాటి మిత్రులతో కష్టసుఖాలు విచారిస్తారు. వ్యాపారాలు వృద్ధి. ఉద్యోగాలలో సమస్యలు తీరే సమయం.కుంభం: పరిస్థితులు అనుకూలిస్తాయి. సమాజసేవలో పాల్గొంటారు. కొన్ని బాకీలు రాగలవు. వస్తులాభాలు. నూతన ఉద్యోగయోగం. వ్యాపార, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి.మీనం: కుటుంబంలో కొన్ని సమస్యలు. ఆకస్మిక ప్రయాణాలు. రుణాలు చేస్తారు. దైవదర్శనాలు. ఆస్తి వివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాదాసీదాగా ఉంటాయి.

HYD: భారత్ విక్టరీపై ఫ్యాన్స్ సంబురాలు.. పోలీసుల లాఠీచార్జ్
సాక్షి, హైదరాబాద్: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్ విజయం సాధించింది. న్యూజిలాండ్ జట్టుపై నాలుగు వికెట్ల తేడాతో భారత్ జట్టు విజయాన్ని అందుకుంది. టీమిండియా విజయంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారత అభిమానాలు సంబురాలు జరుపుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఫ్యాన్స్ సంబురాలు చేసుకున్నారు. ఈ క్రమంలో ఒక్కసారిగా రోడ్ల మీదకు వచ్చిన అభిమానులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు.వివరాల ప్రకారం.. భారత జట్టు విజయం అనంతరం హైదరాబాద్‌లో అభిమానులు బాణాసంచా పేల్చి డ్యాన్స్‌లు చేస్తూ రోడ్లకు మీదకు వచ్చారు. ఈ క్రమంలో దిల్‌సుఖ్‌నగర్‌లో ఒక్కసారిగా భారీ సంఖ్యలో అభిమానులు బయటకు రావడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అభిమానులు గట్టిగా కేకలు వేస్తూ డ్యాన్స్ చేశారు. దీంతో, పోలీసులు రోడ్ల మీదకు వచ్చిన వారిపై లాఠీచార్జ్ చేశారు. ఈ క్రమంలో ఫ్యాన్స్ పరుగులు తీశారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.బ్రేకింగ్ న్యూస్ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ లో భారత్ విజయంహైదరాబాద్లో సంబరాలు చేసుకున్న ఫ్యాన్స్‌ను చితకబాదిన పోలీసులఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత జట్టు గెలవడంతో హైదరాబాద్‌లో దిల్సుఖ్ నగర్లో రోడ్లపైకి వచ్చి సంబరాలు చేసుకున్న ఫ్యాన్స్ మీద లాఠీ ఛార్జ్ చేసిన పోలీసులు pic.twitter.com/UBabGMdvkG— Telugu Scribe (@TeluguScribe) March 9, 2025 Video Credit: TeluguScribeటీమిండియా విజయం సందర్బంగా ట్యాంక్ బండ్ మీదకు భారీగా అభిమానులు చేరుకుని సంబురాలు జరుపుకున్నారు. ఐటీ కారిడార్, అమీర్‌పేట్, కూకట్పల్లి సహా పలు ప్రాంతాల్లో అర్ధరాత్రి వరకు అభిమానులు సంబురాల్లో మునిగిపోయారు. విజయంపై తమ అభిమానం చాటుకున్నారు. MASSIVE CELEBRATIONS IN HYDERABAD FOR TEAM INDIA'S VICTORY. 🇮🇳pic.twitter.com/qhXpCzIEbJ— Mufaddal Vohra (@mufaddal_vohra) March 9, 2025 Champions trophy celebrations at Tankbund Hyderabad. pic.twitter.com/BpJvzC3KF0— 𝐒𝐚𝐟𝐟𝐫𝐨𝐧 𝐒𝐚𝐠𝐚𝐫 𝐆𝐨𝐮𝐝 (@Sagar4BJP) March 10, 2025India can win and celebrate in Muslim nation UAE but not in Hyderabad, India.Well done Telangana 👌pic.twitter.com/bnujojic5a— Vikram Pratap Singh (@VIKRAMPRATAPSIN) March 10, 2025

గ్యాస్ పైప్‌లైన్‌లో నడిచొచ్చి.. వెనక నుంచి దాడి
కీవ్: యుద్ధంలో ఉక్రెయిన్ సేనలపై ఊహించని రీతిలో దాడిచేసేందుకు రష్యా బలగాలు ఒక గ్యాస్ పైప్‌లైన్ లోపలి నుంచి నడుచుకుంటూ వెళ్లిందని కథనాలు వెలువడ్డాయి. రష్యాలోని కరŠస్క్ రీజియన్‌లో ఈ యుద్ధ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. గత ఏడాది ఆగస్ట్‌లో ఉక్రెయిన్ సేనలు తొలిసారిగా రష్యా భూభాగాన్ని ఆక్రమించుకున్నాయి. రెండో ప్రపంచయుద్ధం తర్వాత రష్యా భూభాగంపై జరిగిన అతిపెద్ద దాడి ఘటన ఇదే. వ్యూహాత్మక సరిహద్దు పట్టణమైన సుడ్జా సహా 1,000 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని ఉక్రెయిన్ బలగాలు కైవసం చేసుకున్నాయి. వందలాది మంది రష్యా సైనికులను యుద్ధ ఖైదీలుగా బంధించాయి. దీంతో అమేయ సైనికశక్తిగా ఉన్న రష్యా దీనిని అవమానంగా భావించి ఏకంగా 50,000 మంది సైనికులతో భారీ ఎదురుదాడికి దిగింది. దీంతో వేలాది మంది ఉక్రెయిన్ సైనికులు వెనుతిరగాల్సిన పరిస్థితి తలెత్తింది. ఎలాగోలా సుడ్జా సిటీలో పోరాడుతున్న ఉక్రెయిన్ సైనికులను అన్నివైపులా నుంచి చుట్టుముట్టేందుకు ఆవలివైపుదాకా ఉన్న గ్యాస్‌పైప్‌లైన్ గుండా రష్యా సైనికులు వెళ్లారని యూరీ పోడోల్యాకా వెల్లడించారు. ఈయన ఉక్రెయిన్‌లో పుట్టి రష్యాకు అనుకూలంగా మాట్లాడే బ్లాగర్. సుడ్జా నగరంలో ఉక్రెయిన్ సేనలను వెనక వైపు నుంచి దాడిచేసేందుకు, అదును చూసి దెబ్బకొట్టేందుకు పైప్‌లైన్ లోపలే రష్యా సైనికులు రోజుల తరబడి గడిపారని ఈయన పేర్కొన్నారు. ఈ పైప్‌లైన్ పొడవు దాదాపు 15 కిలోమీటర్లు. యూరప్‌తో సత్సంబంధాలు తెగిపోకముందువరకు ఈ పైప్‌లైన్ గుండా గ్యాస్‌ను రష్యా సరఫరా చేసేది. ఇప్పుడు గ్యాస్ లేకపోవడంతో సైనికుల రాకపోకలు సాధ్యమయ్యాయని యూరీ చెప్పారు. మాస్క్‌లు ధరించిన సైనికులు పైప్‌లైన్ ద్వారా సుడ్జా నగరంలోకి ప్రవశించారని ‘టూ మేజర్స్’ అనే మరో యుద్ధ బ్లాగర్ చెప్పారు. రష్యా స్పెషల్ ఫోర్సెస్ బలగాలు పైప్‌లో నడిచివెళ్తున్న ఫొటోలను రష్యా టెలిగ్రామ్ చానెల్స్ అందరితో పంచుకున్నాయి. ‘‘శత్రుసేనల రాకను మేం కనిపెట్టాం. రాకెట్లు, శతఘ్నులతో దీటైన బదులిచ్చాం. రష్యాకు భారీ నష్టం జరిగింది’’ అని ఉక్రెయిన్ జనరల్ స్టాఫ్ తెలిపింది. అయితే ప్రాణనష్టం, ఎంత మంది రష్యా సైనికులు చనిపోయారనే విషయం వెల్లడికాలేదు.

#SSMB29: వాట్ ద ఎఫ్.. రాజమౌళి?
ఒక ప్రొడక్టును సృష్టించడం కంటే.. దాని మార్కెటింగ్ ఎంత బాగా చేశామనేది వ్యాపారంలో పాటించాల్సిన ముఖ్య సూత్రం. మన దేశంలో.. సినిమా అనే వ్యాపారంలో దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళిని ఈ విషయంలో కొట్టగలిగేవారే లేరని ఇంతకాలం చెప్పుకున్నాం. అయితే తాజా #SSMB29 లీక్‌లతో ఈ విషయంలో కొన్ని అనుమానాలు తలెత్తుతున్నాయి.సినిమా మేకింగ్‌లో రాజమౌళి(Rajamouli)ది ఢిపరెంట్ స్కూల్. హీరోలతో సహా ప్రతీ టెక్నీషియన్‌కు కార్పొరేట్ కల్చర్ తరహాలో ఐడీ కార్డు జారీ చేస్తుంటారు. సెట్స్‌కి మొబైల్స్ తేవడం బ్యాన్.. అంతేకాదు ఈ విషయంలో ప్రత్యేక నిఘా కూడా పెడుతుంటారు. ఇలా.. ఒక సినిమా షూటింగ్ విషయంలో ఇంత జాగ్రత్తలు పాటిస్తుంటాడు దర్శకుధీరుడు. అంతెందుకు ఓ సినిమా మేకింగ్‌నే(RRR) ఏకంగా ఒక డాక్యుమెంటరీగా తీయించి వదిలిన ఘనత కూడా ఈయనకే దక్కుతుంది. అలాంటిది మహేష్ బాబుతో తీస్తున్న చిత్రం విషయంలో ఎక్కడ పారపాటు.. కాదు పొరపాట్లు జరుగుతున్నాయి?.సూపర్ స్టార్ మహేష్‌బాబు హీరో. మళయాళ స్టార్ హీరో ఫృథ్వీ రాజ్ సుకుమారన్(Prithviraj Sukumaran) ఓ కీలక పాత్ర. ఏకంగా.. ప్రియాంక చోప్రా(Priyanka Chopra) హీరోయిన్. ఇంకా ఊహించని సర్ప్రైజ్లు ఎన్నెన్నో ఉండొచ్చు. అలాంటిది పరిస్థితి ఇలాగే కొనసాగితే.. ఇలాంటి లీక్‌లతో అవన్నీ బయటకు వచ్చేయవా?..ఎక్కడో ఒడిషాలో మారుమూల చోట ప్రత్యేక సెట్టింగులలో షూటింగ్ జరుపుకుంటోంది SSMB20 చిత్రం. తొలుత అక్కడి పోలీస్ అధికారులతో దిగిన ఫొటోలు బయటకు వచ్చాయి. ఆ వెంటనే అక్కడి ఛానెల్స్‌లో సెట్స్‌ను లాంగ్‌షాట్స్‌లో లైవ్ చూపించేశాయి. ఆ మరుసటి రోజే.. మహేష్ బాబు పాల్గొన్న షూటింగ్ సీన్.. అదీ చాలా క్లోజప్ షాట్లో బయటకు రావడం ఎంబీఫ్యాన్స్‌నే కాదు.. యావత్ చలనచిత్ర పరిశ్రమేనే షాక్‌కు గురి చేసింది . దీంతో ఆ వీడియోను తొలగించే చర్యలు చేపట్టినట్లు చిత్ర యూనిట్ తరఫు నుంచి ఒక ప్రకటన బయటకు వచ్చింది.ఆర్ఆర్ఆర్ తరహాలోనే.. మహేష్ బాబు సినిమాకు సైతం సెట్స్‌కు ఫోన్లు తేవడం నిషేధించారు. అయినప్పటికీ ఆ సీన్‌ను ఎవరు.. ఎలా షూట్ చేశారు?. అదీ అది అంత దగ్గరగా ఉండి మరీ?. ప్రస్తుతం ఈ అంశంపై తీవ్ర చర్చ నడుస్తోంది. సాధారణంగా రాజమౌళి సినిమా షూటింగ్‌లకు బయటి వాళ్లను అనుమతించరు. షూటింగ్ కోసం తెచ్చే జూనియర్ ఆర్టిస్టులకు సైతం స్ట్రిక్ ఇన్స్ట్రక్షన్స్ వెళ్తుంటాయి. అలాంటప్పుడు లీకులకు అవకాశం ఎక్కడిది?. పనిరాక్షసుడిగా పేరున్న ఆయన పెట్టిన రూల్స్ బ్రేక్ చేసిందెవరు?. కొంపదీసి.. ఇది కావాలని చేసిన లీక్ కాదు కదా! అనే చర్చ సైతం ఇప్పుడు జోరుగా నడుస్తోంది. అయితే..సినిమా ప్రమోషన్ విషయంలో రాజమౌళి స్ట్రాటజీ ఎప్పుడూ కొత్తగానే ఉంటుంది. అంతేగానీ ఇంత చెత్తగా మాత్రం ఉండదు!. సినిమా ప్రమోషన్ల కోసం నిర్మాతతో మంచి నీళ్లలా డబ్బులు ఖర్చు చేయిస్తాడనే విమర్శ కూడా జక్కన్న మీద ఉంది కదా. అలాంటప్పుడు భారీ బడ్జెట్‌తో.. అదీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా విషయంలో ఇలా ఎందుకు జరగనిస్తాడు?. ఏది ఏమైనా రాజమౌళి-మహేష్ బాబు సినిమా నుంచి.. అదీ షూటింగ్ మొదలైన తొలినాళ్లలోనే ఇలాంటి లీకులు కావడంతో.. వాట్ ద F*** అని ఒక్కసారిగా అనుకుంది టీఎఫ్ఐ అంతా. ఇంత చర్చ నడుస్తుండడంతో.. ఇకనైనా లీకుల విషయంలో జాగ్రత్త పడతారేమో చూడాలి మరి!.ఇదీ చదవండి: రాజమౌళికి బిగ్ షాక్.. మహేష్ బాబు వీడియో బయటకు!

సీనియర్లకు బాబు ఝలక్!
సాక్షి, అమరావతి: ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో టీడీపీ సీనియర్ నేతలు, గత ఎన్నికల్లో సీటు దక్కని ముఖ్య నేతలు, సిట్టింగ్‌లకు మొండిచేయే మిగిలింది. చివరి వరకు నమ్మించి, మరోమారు దగాకు గురిచేశారనే చర్చ ఆ పార్టీలో మొదలైంది. యనమల రామకృష్ణుడి స్థానాన్ని ఆయనకివ్వకుండా పూర్తిగా పక్కన పెట్టేశారు. పార్టీ కార్యాలయంలోనే ఉండి చంద్రబాబు చెప్పిన పనులన్నీ చేసిన మరో సిట్టింగ్ ఎమ్మెల్సీ అశోక్‌బాబుకు సైతం అవకాశం ఇవ్వలేదు. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు క్రియాశీలకంగా పని చేసిన మరో సిట్టింగ్ ఎమ్మెల్సీ దువ్వారపు రామారావుదీ అదే పరిస్థితి. మరోసారి ఎమ్మెల్సీ అవకాశం ఇస్తామంటూ ఆశ చూపించి, రాజీనామా చేయించి టీడీపీలో చేర్చుకున్న వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తికి చంద్రబాబు దెబ్బ కొట్టారు. మరో వైపు ఈసారి శాసన మండలిలో అడుగు పెట్టడం ఖాయమనుకున్న ఎస్వీఎస్ఎన్ వర్మ, దేవినేని ఉమామహేశ్వరరావుకు అవకాశం దక్కలేదు. దళిత నేత కేఎస్ జవహర్, బీసీ నేత బుద్ధా వెంకన్నతో పాటు ఈ సీట్లపై ఆశలు పెట్టుకున్న చాలా మంది నేతలను చంద్రబాబు పక్కన పెట్టారు. ఎమ్మెల్సీ స్థానాలపై ఆశలు పెట్టుకున్న నేతలకు ఆదివారం సాయంత్రం టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో ఫోన్ చేయించి ఈసారి అవకాశం ఇవ్వలేకపోతున్నామని చెప్పించారు. ఎంపిక చేసిన అభ్యర్థులకు చంద్రబాబు స్వయంగా ఫోన్ చేసి చెప్పినట్లు తెలిసింది. వారు సోమవారం నామినేషన్లు దాఖలు చేయనున్నారు. పవన్ అడ్డుకోవడం వల్లే...పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మకు ఎమ్మెల్సీ స్థానం దక్కకపోవడంపై టీడీపీ శ్రేణుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. చంద్రబాబు ఆయనకు అవకాశం ఇవ్వకుండా ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ అడ్డుకున్నారనే ప్రచారం జరుగుతోంది. వర్మను ఎమ్మెల్సీ చేస్తే పిఠాపురం నియోజకవర్గంలో రెండో అధికార కేంద్రం తయారు చేసినట్లవుతుందని పవన్ భావించారని, అందుకే వర్మకు సీటు ససేమిరా అన్నారని చెబుతున్నారు. పవన్ అడ్డు చెప్పడం వల్లే వర్మకు చంద్రబాబు సీటు ఇవ్వలేదని టీడీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. పిఠాపురం పూర్తిగా తన చేతిలో ఉండాలంటే.. అక్కడ తాను తప్ప మరో నాయకుడు ఉండకూడదని పవన్ భావించడం వల్లే వర్మను పక్కన పెట్టారని నియోజకవర్గంలో చర్చ మొదలైంది. ఇదివరకు రెండు చోట్ల ఓడిపోయిన పవన్ కళ్యాణ్ కోసం ఎమ్మెల్యే సీటు త్యాగం చేసిన వర్మకు ఇది తీరని అన్యాయమని టీడీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. హామీ ఇచ్చి.. చివరకు మోసంగత ఎన్నికల్లో పొత్తులో భాగంగా తన సీటును పవన్ కళ్యాణ్‌కు కేటాయించినప్పుడు వర్మ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒక దశలో టీడీపీకి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. దీంతో చంద్రబాబు తన వద్దకు పిలిపించుకుని బుజ్జగించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి దఫాలోనే ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తానని, మంచి రాజకీయ భవిష్యత్ ఉంటుందని హామీ ఇచ్చారు. వర్మ రాజకీయ భవితవ్యానికి ఢోకా లేకుండా చేస్తానని నియోజకవర్గ నేతలకు సైతం మధ్యవర్తుల ద్వారా చెప్పించారు. పవన్ గెలుపు కోసం పని చేయాలని ఒత్తిడి చేశారు. దీంతో పార్టీ కోసం వర్మ తన సీటును త్యాగం చేయడంతోపాటు పవన్ పక్కనే నిలబడి ఆయన్ను గెలిపించేందుకు నియోజకవర్గం అంతా తిరిగారు. టీడీపీ శ్రేణులు పలుచోట్ల ఆందోళనలు చేసినా, ఎవరి కోసమో పని చేయడం ఏమిటని తిట్టినా పట్టించుకోకుండా పవన్ కోసం పని చేశారు. ఆయన ఎటువంటి ఇబ్బందులు సృష్టించకుండా పని చేయడం వల్లే శాసనసభలో అడుగుపెట్టాలనే పవన్ కల నెరవేరింది. తన కలను నెరవేర్చడానికి పని చేసిన వర్మను పవన్ రాజకీయంగా పూర్తిగా తొక్కేయాలనుకోవడం, ఇందుకు చంద్రబాబు సహకరించడం పట్ల సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. పార్టీ కోసం పని చేసిన వారిని పట్టించుకోకుండా పక్క పార్టీ కోసం పని చేయడం తమ వల్ల కాదని టీడీపీ నేతలు ఆవేదన చెందుతున్నారు. పవన్‌కళ్యాణ్ తన రాజకీయ భవితవ్యం కోసం వర్మ అవకాశాలను దెబ్బ తీయడం, ఇదే సమయంలో తన సోదరుడు నాగబాబుకు మాత్రం పదవి ఇప్పించుకోవడం దారుణమని వాపోతున్నారు.టీడీపీ అభ్యర్థులు వీళ్లే..టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల్లో ఒకరైన బీద రవిచంద్ర మంత్రి లోకేశ్‌కు అత్యంత సన్నిహితుడు కావడంతో ఆయన పేరు ఖరారు చేశారు. లోకేశ్ పాదయాత్రతో పాటు గత ఎన్నికల్లో ఆయన వ్యవహారాల్లో రవిచంద్ర కీలకంగా వ్యవహరించారు. రాయలసీమ ప్రాంతం నుంచి ఒక్కరికైనా అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో సిట్టింగ్ ఎమ్మెల్సీ బీటీ నాయుడుకు అవకాశం ఇచ్చారు. మూడో స్థానాన్ని టీడీపీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ ప్రతిభా భారతి కుమార్తె గ్రీష్మను ఎంపిక చేశారు. ఇద్దరు బీసీలు, ఒక ఎస్సీకి అవకాశం ఇచ్చినట్లు టీడీపీ నేతలు తెలిపారు. జనసేన తరఫున నాగబాబుకు ఒక స్థానం, బీజేపీకి ఇంకో స్థానం కేటాయించారు. కాగా, బీజేపీ తన అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది. బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు, మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్, పార్టీ నేతలు పాకా వెంకటసత్యనారాయణ, గారపాటి సీతారామాంజనేయచౌదరి, మాలతీరాణి పేర్లు అధిష్టానం పరిశీలనలో ఉన్నాయి.

ఈ ఏడాది హెచ్1బీ వీసాలు కష్టమే
సాక్షి, అమరావతి: అమెరికా వీసాల్లో అత్యధిక డిమాండ్ ఉన్న హెచ్1బీ వీసాలు ఈ ఏడాది పొందడం చాలా కష్టంగా తయారయ్యింది. అధిక నైపుణ్యంతో దీర్ఘకాలం పనిచేయడానికి ఉపయోగపడే హెచ్1బీ వీసాలు పొందడంలో మల్టీ నేషనల్ కంపెనీలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. ట్రంప్ అధికారం చేపట్టిన తర్వాత హెచ్1బీ వీసాల జారీపై కఠిన ఆంక్షలు విధించింది. దీనితో నైపుణ్యం కలిగిన మానవ వనరులను బహుళజాతి కంపెనీలు ఇతర దేశాల నుంచి తెచ్చుకోలేక అష్ట కష్టాలు పడుతున్నాయి. ఎన్నడూ లేని విధంగా అమెరికా ఈ ఏడాది ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 85,000 మందికి మించి హెచ్1బీ వీసాలు జారీ చేయకూడదన్న పరిమితిని విధించింది. మార్చి7న ప్రారంభమైన వీసాల జారీ ప్రక్రియ మార్చి 24తో ముగియనుంది. ఈ వీసాల కోసం ఇప్పటికే 4,23,028 మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఇందులో మూడు లక్షలకు పైగా దరఖాస్తులు తిరస్కరణకు గురి అవుతాయన్న అంచనాలను నేషనల్ ఫౌండేషన్ ఫర్ అమెరికా పాలసీ తాజాగా విడుదల చేసిన నివేదిక వెలువరించింది.కంపెనీలపై తీవ్ర ప్రభావంప్రస్తుత నిబంధనల ప్రకారం చూస్తే దరఖాస్తు చేసుకున్నవారిలో 20 శాతంకు మించి హెచ్1బీ వీసాలు వచ్చే అవకాశం కనిపించడం లేదు. విదేశాల్లో జన్మించిన శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, ఇతర అధిక నైపుణ్యం కలిగిన నిపుణులను దీర్ఘకాలం పనిచేసే విధంగా ఈ వీసా ద్వారా కంపెనీలు నియమించుకుంటాయి. తాజా కఠిన నిబంధనల వల్ల 3 లక్షలకు పైగా నైపుణ్యం కలిగిన మానవ వనరులను అమెరికా కోల్పోతోందని, ఈ నిర్భంధ నిబంధనలు కంపెనీ యాజమాన్యాలకు తీవ్ర సమస్యలను తీసుకు వస్తున్నాయని ఫోర్బ్స్ తన నివేదికలో వ్యాఖ్యానించింది.ఇతర వీసాల జారీ సులభంహెచ్1బీ వీసాకంటే ఇతర వీసాలు మంజూరు సులభంగా ఉంటోందని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. 2024లో దరఖాస్తు చేసుకున్న వారిలో సందర్శకులు కోటాలో జారీ చేసే బీ1/బీ2 వీసాలు 72 శాతం మందికి జారీ అయ్యాయి. వేసవి కార్మికులు, పరిశోధకుల కోటాలో జారీ అయ్యే జే1 వీసాలు 89 శాతానికి ఇమిగ్రేషన్ అధికారుల ఆమోదముద్ర పడింది. అమెరికాలో హెచ్1బీ వీసాలు కింద పనిచేసే ఉద్యోగులకు సగటున నెలకు భారతీయ కరెన్సీల్లో రూ.9 లక్షల నుంచి రూ.10 లక్షలపైనే వేతనం లభిస్తుంది. అందుకే ప్రతీ భారతీయుడు హెచ్1బీ వీసా కింద అమెరికాకు వెళ్లి పనిచేయాలనుకుంటాడు. అయితే మారిన పరిస్థితులు స్థానిక యువత ఆశలకు గండికొట్టిందని ఎంఎన్సీ కంపెనీలు వ్యాఖ్యానిస్తున్నాయి.

మీ బ్యాంక్ డిపాజిట్ ఎంత భద్రం?
ముంబైకి చెందిన ధన్‌రాజ్ (50) ఉదయం నిద్రలేచి, పేపర్ చూడగానే ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యాడు. న్యూ ఇండియా సహకార బ్యాంక్‌లో స్కామ్ జరిగిందనేది ఆ వార్త సారాంశం. చిరుద్యోగి అయిన ధన్‌రాజ్ తన కుమార్తె వివాహం కోసమని రూ.4 లక్షలను అదే బ్యాంక్‌లో కొన్నాళ్ల క్రితం డిపాజిట్ చేశాడు. కంగారుగా బ్యాంక్ శాఖకు చేరుకుని విచారించగా, డిపాజిట్లకు ఢోకా లేదన్న సమాచారం విని కాస్తంత కుదుటపడ్డాడు. రూ.5 లక్షల వరకు డిపాజిట్లపై బీమా సదుపాయం ఉంటుందని కస్టమర్లు చెప్పుకుంటుండగా విని.. హమ్మయ్య అని ఊపిరిపీల్చుకున్నాడు. బ్యాంక్ డిపాజిట్.. దేశంలో చాలా మందికి తెలిసిన, ఇష్టమైన పెట్టుబడి సాధనం. చాలా మంది తమ పొదుపు సొమ్మును డిపాజిట్ రూపంలో మదుపు చేయడం కూడా చూస్తుంటాం. కానీ, ఇందులో ఉండే రిస్క్ ల గురించి అవగాహన ఉండదు. డిపాజిటర్లు అందరూ దీనిపై ఓసారి దృష్టి సారించాల్సిన అవసరాన్ని న్యూ ఇండియా కో ఆపరేటివ్ బ్యాంక్ ఉదంతం గుర్తు చేస్తోంది. ఒకప్పుడు ప్రతి కుటుంబ ఆర్థిక సాధనాల్లో బ్యాంక్ డిపాజట్ (ఎఫ్డీ) తప్పకుండా ఉండేది. కాలక్రమంలో ఇతర సాధనాల పట్ల ఆసక్తి పెరుగుతూ వస్తోంది. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్, గోల్డ్ ఈటీఎఫ్‌లు తదితర వాటిల్లో పెట్టుబడులు పెరుగుతూ, డిపాజిట్లు తగ్గుతున్నాయి. ఇప్పటికీ 15 శాతం గృహ పొదుపులు బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లలోకే (ఎఫ్డీలు/టర్మ్ డిపాజిట్లు) వెళుతున్నట్టు గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఎఫ్డీలు ఎంతో మందికి నమ్మకమైన, మెరుగైన సాధనం. దీర్ఘకాలంలో గొప్ప రాబడి రాకపోయినా సరే, అత్యవసరంలో వేగంగా వెనక్కి తీసుకునేందుకు అనుకూలంగా ఉండడం చాలా మందికి నచ్చే అంశం. పైగా డిపాజిట్ అంటే ఏ మాత్రం రిస్క్ ఉండదని చాలా మంది అభిప్రాయపడుతుంటారు. ప్రభుత్వ గ్యారంటీ (సావరీన్) ఉంటే తప్పించి, బ్యాంక్ ఎఫ్డీ అయినా, ఏ ఇతర పెట్టుబడి సాధనంలో అయినా ఎంతో కొంత రిస్క్ ఉంటుంది. దీనిపట్ల ప్రతి ఒక్కరికీ అవగాహన అవసరం. మెరుగైన నియంత్రణలు ఎఫ్డీ ఎంతో ప్రాచుర్యానికి నోచుకోవడం వెనుక అందులోని సరళత్వం, భద్రత కీలకమని చెప్పుకోవాలి. ఏవో కొన్ని బ్యాంకు వైఫల్యాలను పక్కన పెడితే, మన దేశంలో బ్యాంకింగ్ రంగం పటిష్ట నియంత్రణల మధ్య కొనసాగుతుంటుంది. ప్రజల్లో నమ్మకం ఏర్పడడానికి ఇది కూడా ఒక కారణం. బ్యాంక్ యాజమన్యాలు/ఉద్యోగుల మోసపూరిత వ్యవహారం, రుణ వ్యాపారంలో దూకుడైన తీరు కొన్ని సందర్భాల్లో సమస్యలు, సంక్షోభాలకు దారితీయవచ్చు. ఎంత కట్టుదిట్టమైన నియంత్రణలు ఉన్నా కానీ, 2019లో పంజాబ్ అండ్ మహారాష్ట్ర కోపరేటివ్ బ్యాంక్, 2020లో యస్ బ్యాంక్, ఇప్పుడు న్యూ ఇండియా కోపరేటివ్ బ్యాంక్ సంక్షోభాలు చోటుచేసుకున్నాయి. అంతకుముందు గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ కరాడ్ ఉదంతాలూ గుర్తుండే ఉంటాయి. కనుక బ్యాంక్ డిపాజిట్లలోనూ రిస్క్ ఉంటుందని అర్థం చేసుకోవాలి. కాకపోతే మనదగ్గర ఆర్బీఐ పటిష్ట నియంత్రణల కారణంగా ఈ తరహా సంక్షోభాలు చాలా తక్కువగా కనిపిస్తుంటాయి.డిపాజిట్‌పై బీమా ఆర్బీఐ నియంత్రణ పరిధిలోని అన్ని బ్యాంకుల్లోనూ రూ.5 లక్షల వరకు డిపాజిట్‌కు బీమా రక్షణ ఉంటుంది. అసలు లేదా అసలుతోపాటు వడ్డీ కలుపుకుని రూ.5 లక్షలకు మించి ఉన్నప్పటికీ బీమా రూ.5 లక్షలకే పరిమితం. బ్యాంక్ ఏదైనా సంక్షోభం పాలైతే అప్పుడు ఒక్కో డిపాజిట్ దారుడికి గరిష్టంగా రూ.5 లక్షలు వెనక్కి వస్తాయి. సేవింగ్స్, ఫిక్స్డ్, కరెంట్, రికరింగ్ ఇలా అన్ని డిపాజిట్లకూ ఈ రక్షణ వర్తిస్తుంది. ఈ వ్యవహారం అంతా చూసేది ఆర్బీఐ అనుబంధ సంస్థ అయిన ‘డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా’ (డీఐసీజీసీ). ప్రతి రూ.100 డిపాజిట్‌పై రూ.12 పైసలు చొప్పున ప్రీమియం కింద బ్యాంక్‌లు డీఐసీజీసీకి చెల్లించాల్సి ఉంటుంది. ఒక బ్యాంక్‌కు చెందిన ఒకటికి మించిన శాఖలో డిపాజిట్లు ఉన్నప్పటికీ.. ఒక్కో ఖాతాదారుని పేరు మీద గరిష్ట బీమా రూ.5 లక్షలుగానే ఉంటుంది. కనుక ఒక బ్యాంక్‌లో రూ.5 లక్షలకు మించి చేసే డిపాజిట్‌పై కచ్చితంగా రిస్క్ ఉంటుందని అర్థం చేసుకోవాలి. ఒకవేళ ఒక వ్యక్తి వేర్వేరు బ్యాంకుల్లో డిపాజిట్లు చేస్తే.. అప్పుడు విడిగా ఒక్కో బ్యాంక్ పరిధిలో సంబంధిత వ్యక్తికి గరిష్టంగా రూ.5 లక్షల డిపాజిట్‌కు బీమా రక్షణ వర్తిస్తుంది.బ్యాంక్ కుదుటపడితే.. బ్యాంకులో మోసం కావచ్చు. లేదా లిక్విడిటీ సంక్షోభం తలెత్తవచ్చు. రుణ ఎగవేతలతో క్లిష్ట పరిస్థితుల్లోకి వెళ్లిపోవచ్చు. ఇలాంటి సందర్భాల్లో ఆర్బీఐ తప్పకుండా జోక్యం చేసుకుంటుంది. తాత్కాలిక నిర్వహణ బాధ్యతల కోసం బోర్డ్‌ను ఏర్పాటు చేస్తుంది. బ్యాంక్ వ్యవహారాలను లోతుగా పరిశీలించి, చక్కదిద్దే వరకు డిపాజిట్ల ఉపసంహరణపై పూర్తిగా లేదా పాక్షికంగా ఆంక్షలు విధిస్తుంది. పంజాబ్ అండ్ మహారాష్ట్ర కోపరేటివ్ బ్యాంక్‌లో రుణ అవకతవకలు సంక్షోభానికి దారితీయగా, ఆర్బీఐ దాన్ని చక్కదిద్దింది. అది ఇప్పుడు యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌లో భాగం అయింది. యస్ బ్యాంక్‌లోనూ రుణ మోసాలు బయటపడగా, కొత్త బోర్డ్‌ను ఏర్పాటు చేసి గాడిన పెట్టింది. రూ.5 లక్షలకు పైగా డిపాజిట్లు కలిగిన వారు.., రూ.5 లక్షలకు పైబడిన మొత్తాన్ని తిరిగి పొందడం కోసం బ్యాంక్ గాడిన పడే వరకు వేచి చూడాల్సిందే. అప్పటికీ పూర్తి మొత్తం వెనక్కి వస్తుందన్న గ్యారంటీ ఉండదు. ఎంత కోత పడుతుందన్నది బ్యాంక్ ఆర్థిక పద్దుల ఆరోగ్యంపైనే ఆధారపడి ఉంటుంది.బ్యాంకు నుంచే చెల్లింపులు బ్యాంక్‌లో సమస్య తలెత్తినప్పుడు డిపాజిట్‌దారులు డీఐసీజీసీని సంప్రదించాల్సిన అవసరం ఉండదు. బ్యాంక్ నిర్వహణ బాధ్యతలు చూసే బోర్డ్.. డిపాజిట్‌దారుల వివరాలతో జాబితాను డీఐసీజీసీకి పంపిస్తుంది. ఆ వివరాల వాస్తవికతను 30 రోజుల్లోపు డీఐసీజీసీ తేల్చాలి. అక్కడి నుంచి 15 రోజుల్లోపు డిపాజిట్‌దారులకు చెల్లించాల్సిన బీమా మొత్తాన్ని బ్యాంక్‌కు డీఐసీజీసీ బదిలీ చేస్తుంది. అప్పుడు ఖాతాదారులకు బ్యాంక్ సిబ్బంది చెల్లింపులు చేస్తారు. బ్యాంక్‌పై ఆంక్షలు విధించిన నాటి నుంచి 90 రోజుల్లో డిపాజిట్‌దారులకు బీమా మొత్తం వెనక్కి చెల్లించాలని నిబంధనలు చెబుతున్నాయి. విచారించుకున్న తర్వాతే.. ఆర్బీఐ పరిధిలోని అన్ని బ్యాంక్‌లు తప్పనిసరిగా డీఐసీజీసీ పరిధిలోకి వస్తాయి. అవి డిపాజిట్లపై బీమా ప్రీమియం కచ్చితంగా చెల్లించాల్సిందే. సందేహం ఉంటే డిపాజిట్ చేసే ముందు బ్యాంక్ అధికారిని అడిగి బీమా ఉందా? అని నిర్ధారించుకోవచ్చు. అన్ని ప్రభుత్వరంగ బ్యాంక్‌లు, ప్రైవేటు షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంక్‌లు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌లు, భారత్‌లో కార్యకలాపాలు నిర్వహించే విదేశీ బ్యాంక్‌లు, కో ఆపరేటివ్ బ్యాంక్‌లు, లోకల్ ఏరియా బ్యాంక్‌లు, రీజినల్ రూరల్ బ్యాంక్‌లు, పేమెంట్స్ బ్యాంక్‌లు, స్టేట్ కో ఆపరేటివ్ బ్యాంక్‌లు, అర్బన్ కో ఆపరేటివ్ బ్యాంక్‌లు డీఐసీజీసీ పరిధిలోకి వస్తాయి. ప్రైమరీ కో ఆపరేటివ్ సొసైటీలు మాత్రం దీని కిందికి రావు.అధిక వడ్డీ రేట్లు.. అన్నీ చూసాకే ప్రభుత్వరంగ బ్యాంక్‌లు, ప్రైవేటు యూనివర్సల్ బ్యాంకులతో పోల్చితే స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు డిపాజిట్లపై అధిక వడ్డీ రేట్లను ఆఫర్ చేస్తుంటాయి. స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు రుణాలపై అధిక రేట్లను చార్జ్ చేస్తుంటాయి. కనుక అవి డిపాజిట్లను ఆకర్షించేందుకు ఎక్కువ రేట్లను ఇస్తుంటాయి. ఏ బ్యాంక్ అయినా సరే అధిక వడ్డీ రేట్లను ఆఫర్ చేస్తుంటే, అందులో ఇన్వెస్ట్ చేసే ముందు ఈ రేషియోలను ఒక్కసారి పరిశీలించడం మంచిది. సీఆర్ఏఆర్: క్యాపిటల్ టు రిస్క్ అస్సెట్ రేషియో అని, దీన్నే క్యాపిటల్ అడెక్వెసీ రేషియో అని కూడా అంటారు. ప్రభుత్వరంగ బ్యాంక్‌లకు ఇది కనీసం 12 శాతంగా, ప్రైవేటు షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్‌లకు 9 శాతం మేర ఉండాలి. అదే స్మాల్ ఫైనాన్స్‌బ్యాంక్‌లకు 15 శాతం ఉండాలి. బ్యాంక్ తనకు ఎదురయ్యే చెల్లింపుల బాధ్యతలను ఎంత సమర్థంగా ఎదుర్కోగలదన్నది ఇది తెలియజేస్తుంది. ఎల్‌సీఆర్: లిక్విడిటీ కవరేజీ రేషియో 100 శాతం ఉండాలి. 30 రోజుల అవసరాలకు సరిపడా నిధులు బ్యాంకుల వద్ద ఉంచడం కోసం ఈ నిబంధన. దీనివల్ల లిక్విడిటీ షాక్‌లను బ్యాంక్‌లు సమర్థంగా ఎదుర్కోగలవు. అసలు రాబడి ఎంత? అత్యవసర నిధిని అట్టి పెట్టుకునేందుకు, స్వల్పకాలిక అవసరాలకు ఉద్దేశించిన నిధులను బ్యాంక్ డిపాజిట్లలో ఇన్వెస్ట్ చేసుకుంటానంటే ఫర్వాలేదు. కానీ, దీర్ఘకాల లక్ష్యాల కోసం నిధిని సమకూర్చుకునేందుకు, సంపద సృష్టికి బ్యాంక్ డిపాజిట్ మెరుగైన సాధనం కాబోదు. ఈక్విటీలపై దీర్ఘకాలంలో 12 శాతం, బంగారంలో 8 శాతం మేర సగటు రాబడి ఉంటోంది. ఈక్విటీ, బంగారంలో పెట్టుబడిని విక్రయించినప్పుడే లాభాలపై పన్ను చెల్లిస్తే సరిపోతుంది. బ్యాంక్ డిపాజిట్లపై అలా కాదు. ప్రతి ఏటా ఆర్జించే వడ్డీ రాబడి అదే ఏడాది ఇన్వెస్టర్ వార్షిక ఆదాయానికి కలిపి చూపించాలి. అవసరమైతే పన్ను చెల్లించాలి. ఎఫ్డీ రాబడిపై పన్ను చెల్లించగా, మిగిలే నికర రాబడి ద్రవ్యోల్బణ స్థాయిలోనే ఉంటుంది. కనుక డిపాజిట్లలో కాంపౌండింగ్ ప్రయోజనం పెద్దగా ఉండదు.బీమా మరింత పెంచేనా..? 2019లో పంజాబ్ అండ్ మహారాష్ట్ర కోపరేటివ్ బ్యాంక్‌లో సంక్షోభం తలెత్తిన తర్వాతే.. డిపాజిట్లపై రూ.లక్షగా ఉన్న బీమా పరిమితిని 2020 ఫిబ్రవరిలో రూ.5 లక్షలకు పెంచారు. ఈ బీమా రక్షణను మరింత పెంచాలన్న ప్రతిపాదన పరిశీలనలో ఉందని కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి ఎం.నాగరాజు ఇటీవల చేసిన ప్రకటన ఈ దిశగా డిపాజిటర్లలో అంచనాలను పెంచింది. ఇప్పటికిప్పుడు దీన్ని పెంచకపోయినా, భవిష్యత్తులో ఇందుకు తప్పక అవకాశం ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. ఎన్బీఎఫ్సీ డిపాజిట్ల సంగతేంటి? బజాజ్ ఫైనాన్స్, శ్రీరామ్ ఫైనాన్స్ తదితర డిపాజిట్లు స్వీకరించే ఆర్బీఐ అనుమతి కలిగిన ఎన్బీఎఫ్సీలు (ఎన్బీఎఫ్సీ–డీ) దేశంలో 25 ఉన్నాయి. వీటి పరిధిలో 2024 మార్చి నాటికి రూ.1,02,994 కోట్ల డిపాజిట్లు ఉన్నాయి. మరి ఉన్నట్టుండి వీటిల్లో ఏదైనా ఎన్బీఎఫ్సీకి నిధుల సమస్య తలెత్తితే పరిస్థితి ఏంటి? బ్యాంకుల్లో మాదిరి వీటిల్లో డిపాజిట్లకు డీఐసీజీసీ కింద ఎలాంటి బీమా రక్షణ లేదు. ఇవన్నీ ప్రజల డిపాజిట్లే కనుక వీటిని సైతం డీఐసీజీసీ కిందకు తీసుకురావాలన్న డిమాండ్లు ఉన్నాయి. వీటిల్లో డిపాజిట్ చేసే ముందు ఇన్వెస్టర్లు రిస్క్ లను అర్థం చేసుకోవాలి. బ్యాంకులకూ రేటింగ్ ఉండాలి.. ఎన్బీఎఫ్సీలు తమ నిధుల అవసరాల కోసం బాండ్లు, ఎన్సీడీలను జారీ చేస్తుంటాయి. సంబంధిత ఎన్బీఎఫ్సీ ఆర్థిక ఆరోగ్యం ఆధారంగా రేటింగ్ ఏజెన్సీలు క్రెడిట్ రేటింగ్‌ను ప్రకటిస్తాయి. నిబంధనల ప్రకారం రేటింగ్ తప్పనిసరి. బ్యాంక్‌లు సైతం బాండ్లను జారీ చేయాలంటే రేటింగ్ తీసుకోవాల్సిందే. కానీ బ్యాంక్ డిపాజిట్లకు వచ్చే సరికి ఈ తరహా రేటింగ్ విధానం లేకపోవడాన్ని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. బ్యాంక్ డిపాజిట్లకు సైతం రేటింగ్‌ను తప్పనిసరి చేయడం వల్ల పాలన మెరుగుపడుతుందని ఎన్ఎస్జీ అండ్ పార్ట్నర్స్ పార్ట్నర్ రవి భడానీ అభిప్రాయపడ్డారు. దీనివల్ల డిపాజిట్ చేసే సమయంలో ఆయా బ్యాంక్‌లకు సంబంధించి రిస్క్ ను ఇన్వెస్టర్లు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందన్న అభిప్రాయం వినిపిస్తోంది. అలా చేస్తే అప్పుడు బలహీన బ్యాంక్‌ల నుంచి అధిక రేటింగ్ ఉన్న బ్యాంకుల్లోకి డిపాజిట్లు తరలిపోయే రిస్క్ ఏర్పడుతుందని ఆర్బీఐ సెంట్రల్ బోర్డ్ డైరెక్టర్ సతీష్ మరాటే పేర్కొన్నారు. దీనికి బదులు మెరుగైన రేటింగ్ ఉన్న బ్యాంకులకు డిపాజిట్లపై బీమా ప్రీమియం తక్కువ వసూలు చేసే విధానం ఫలితమిస్తుందన్నారు. – సాక్షి, బిజినెస్ డెస్క్

ఉడ్తా కేరళ!
అందమైన అడవులు, కొండలు, లోయలతో దేవుడు తీరిగ్గా తీర్చిదిద్దినట్టుగా ఉండే కేరళ మాదకద్రవ్యాల మత్తులో కూరుకుపోతోంది. రాష్ట్రాన్ని డ్రగ్స్ భూతం కబళిస్తోంది. చివరికి స్కూలు విద్యార్థులు కూడా డ్రగ్స్‌కు బానిసలవుతున్న పరిస్థితి! మాదకద్రవ్యాల వాడకంలో పంజాబ్‌ను కూడా దాటేసి దేశంలో తొలి స్థానంలో నిలిచింది. కేరళలోని కడక్కవూర్‌లో ఓ మహిళ డ్రగ్స్ మత్తులో టీనేజీ వయసున్న కన్న కొడుకుపైనే లైంగిక దాడులకు పాల్పడింది. దాంతో సహించలేక మరో కొడుకు ఆమెను చంపేశాడు! సంచలనం రేపిన ఈ ఘటన రాష్ట్రంలో సింథటిక్ డ్రగ్స్ విజృంభణకు ఉదాహరణ మాత్రమే.కేరళలో ఏ మూలన చూసినా డ్రగ్స్ ఘాటు గుప్పున కొడుతోందని నార్కోటిక్ గణాంకాలు చెబుతున్నాయి. 2024లో రాష్ట్రవ్యాప్తంగా నార్కోటిక్ డ్రగ్స్, సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ చట్టం,1985 కింద ఏకంగా 24,517 కేసులు నమోదయ్యాయి. డ్రగ్స్ అతి వాడకానికి మారుపేరుగా మారిన పంజాబ్‌లో నమోదైంది 9,734 కేసులే! ‘‘సింథటిక్ డ్రగ్స్ రాష్ట్రంలోకి అడుగుపెట్టకుండా కఠిన చట్టాలు చేయాల్సిన సమయమొచి్చంది. స్కూళ్ల ప్రాంగణాల్లోనూ డ్రగ్స్ బయటపడుతున్నాయి’’ అని కేరళ హైకోర్టు జస్టిస్ వీజీ అరుణ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు పరిస్థితికి అద్దం పడుతున్నాయి.330 శాతం అధికం 2021 నుంచి చూస్తే మూడేళ్లలో కేరళలో డ్రగ్స్ కేసులు 330 శాతం పెరిగాయి. నమోదవని ఘటనలు మరెన్నో రెట్లు ఉంటాయని చెబుతున్నారు. రాష్ట్రంలో తరచూ భారీ పరిమాణంలో మత్తుపదార్థాలను పోలీసులు స్వా«దీనం చేసుకుంటున్నారు. గతంలో స్థానికంగా దొరికే గంజాయి సేవించేవారు. ఇప్పుడు సింథటిక్ డ్రగ్స్ వైపు మళ్లుతున్నారని స్వయంగా హైకోర్టు న్యాయమూర్తే వాపోయారు. దీనిపై అసెంబ్లీలో రెండుసార్లు చర్చించడమే గాక సమస్య పార్లమెంటులోనూ ప్రస్తావనకు వచ్చింది. ఎన్నెన్ని విషాదాలో...! డ్రగ్స్‌కు బానిసలైన వారి కుటుంబాల్లో ఆనందం ఆవిరవుతోంది. యువత, ముఖ్యంగా మైనర్లు మత్తులో తూగుతున్నారు..→ కాలికట్ జిల్లాలో మత్తుకు బానిసైన పాతికేళ్ల ఆశిఖ్ తన తల్లినే నరికి చంపాడు. పైగా ‘నాకు జన్మనిచి్చనందుకు శిక్షించా’ అంటూ డ్రగ్స్ మత్తు లో చేసిన వ్యాఖ్యల వీడియో వైరల్‌గా మా రింది.→ త్రిసూర్‌లో మరో పాతికేళ్ల వ్యక్తి తల్లి నాలుక కోసేశాడు. జనవరి 1న త్రిసూర్‌లోనే 14, 16 ఏళ్ల టీనేజర్లు బహిరంగంగా డ్రగ్స్ తీసుకుంటూ హల్చల్ చేశారు. వారించిన 30 ఏళ్ల వ్యక్తిని అత్యంత దారుణంగా చంపేశారు.→ తమ అబ్బాయి డ్రగ్స్ వ్యసనాన్ని వదిలించలేకపోతున్నామంటూ పథినంతిట్ట జిల్లాలో ఒక వృద్ధ జంట ఆత్మహత్య చేసుకోవడం అందర్నీ కంటతడి పెట్టించింది.→ డ్రగ్స్ మానేయమన్న అక్క ముఖాన్ని బ్లేడుతో చెక్కేశాడో తమ్ముడు. మరో ప్రబుద్ధుడు మందలించిన తండ్రిపైనే దాడికి దిగాడు. ఇంకొకడు డ్రగ్స్ కొనేందుకు డబ్బివ్వలేదని తల్లినే చితకబాదాడు.→ డ్రగ్స్ తీసుకుంటూ టీచర్లకు పట్టుబడి, విషయం ఇంట్లో చెప్పొద్దని వాళ్లనే బెదిరిస్తున్న విద్యార్థులకు కొదవే లేదు. డార్క్‌వెబ్, క్రిప్టోకరెన్సీలో లావాదేవీలు డ్రగ్స్‌ను ముఠాలు పోలీసులకు చిక్కకుండా అత్యాధునిక సాంకేతికతను వాడుతున్నాయి. డార్క్‌వెబ్, క్రిప్టోకరెన్సీ, వాట్సాప్ గ్రూప్‌ల్లో లావాదేవీలు సాగిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. కేరళలో డ్రగ్ సరఫరా చేసే హాట్స్పాట్లు ఏకంగా 1,300కు పైగా ఉన్నట్లు చెబుతున్నారు. కొకైన్, హషి‹Ù, బ్రౌన్ షుగర్, హెరాయిన్ వాడకం ఎక్కువగానే ఉన్నా మిథేలిన్ డైఆక్సీ మిథాఫెటమైన్ (ఎండీఎంఏ) వీటన్నింటినీ మించిపోయింది. దీని వాడకం ఏడాదిలోనే ఏకంగా 65 శాతం పెరిగింది. ఎండీఎంఏ, మెథ్ వేరియంట్ డ్రగ్స్ బెంగళూరు, చెన్నై నుంచి కేరళలోకి వస్తున్నట్లు నిఘా వర్గాలు తెలిపాయి. 590 కిలోమీటర్ల సముద్రతీరం కూడా డ్రగ్స్ సరఫరాకు రాచమార్గంగా మారింది. జర్మనీ, ఫ్రాన్స్, థాయిలాండ్ దేశాల నుంచి డార్క్‌వెబ్ ద్వారా క్రిప్టో కరెన్సీని విక్రయించి బదులుగా కొరియర్ల ద్వారా డ్రగ్స్ తెప్పిస్తున్నారు.నాలుగేళ్లలో 93,599 అరెస్టులు! కేరళలో 2023లో ఏకంగా 30,697, 2024లో 24,517 డ్రగ్స్ కేసులు నమోదయ్యాయి. గత నాలుగేళ్లలో 87,101 కేసులు నమోదయ్యాయి. వీటిలో 93,599 మందిని అరెస్టు చేశారు. అంతకుముందు నాలుగేళ్లలో 37,228 కేసులు నమోదవగా 41,378 మందిని అరెస్టు చేసినట్టు సీఎం విజయన్ అసెంబ్లీలో చెప్పారు. గత జనవరిలో 2,000 డ్రగ్స్ కేసులు నమోదయ్యాయి.క్యాండీలు, ఐస్క్రీంల రూపంలో... సింథటిక్ డ్రగ్స్ వాడేవారిలో సమాజంలోని అన్నివర్గాల వారూ ఉన్నారు. విద్యార్థుల నుంచి వైద్యుల దాకా వాటికి బానిసలవుతున్నారు. ఎవరూ గుర్తు పట్టకుండా చాక్లెట్ల నుంచి ఐస్క్రీంల దాకా నానారకాలుగా వీటిని విక్రయిస్తున్నారు. పైగా వీటికి విద్యాసంస్థలే అడ్డాలుగా మారుతుండటం ఆందోళన కలిగిస్తోంది. దాంతో తల్లిదండ్రులు భయంతో వణికిపోతున్నారు. తమ పిల్లలు డ్రగ్స్‌కు అలవాటు పడ్డారేమో తేల్చుకోవడానికి టెస్ట్ కిట్లు కొనుగోలు చేస్తున్నారు. దాంతో వాటి అమ్మకాలు విపరీతంగా పెరిగాయి.సూపర్‌బైక్‌లపై డెలివరీ... స్మార్ట్ ఫోన్లో, వాట్సాప్ గ్రూప్‌లోనూ మెసేజ్ చేస్తే పావుగంటలోపే సూపర్ బైక్‌లపై వచ్చి మరీ డ్రగ్స్ డెలివరీ చేసే స్థాయికి కేరళ ఎదిగిందని అసెంబ్లీలో విపక్ష నేత ఇటీవలే ఎద్దేవా చేశారు. పెడ్లర్లు డ్రగ్స్ సరఫరాకు తప్పుడు/నకిలీ నంబర్ ప్లేట్లున్న సూపర్‌బైక్‌లను వాడుతున్నారు. పోలీసులకు చిక్కకుండా వాటిపై మెరుపు వేగంతో దూసుకెళ్తున్నారు. తోటి పెడ్లర్ల పోటీని తట్టుకునేందుకు, వేగంగా సరకు డెలివరీకి రాత్రిళ్లు ఈ బైక్‌లను వాడుతున్నట్టు ఎక్సయిజ్, పోలీసు విభాగాలు చెబుతున్నాయి. డ్రగ్స్ ముఠాలు 18–24 ఏళ్ల వారినే డెలీవరీకి ఎంచుకుంటున్నారు. ఒక ప్యాకెట్‌కు రూ.1,000, రోజంతా డెలీవరీ చేస్తే రూ.4,000 ఇస్తున్నారు. ఫ్యామిలీ అని భ్రమింపజేసేలా బైక్ వెనక మహిళను కూర్చోబెట్టుకుంటున్నారు. టీనేజర్లనే డ్రగ్స్ పెడ్లర్లుగా ఈ ముఠాలు వాడుకుంటున్నాయి. పోకిరీలతో పరిచయాలు కాకుండా తల్లిదండ్రులే తమ పిల్లలపై కన్నేసి ఉంచాలి– రిటైర్డ్ ఎస్పీ కేజీ సిమాన్ కేరళలో పదేళ్ల విద్యార్థులు కూడా గ్యాంగ్ ఫైట్లకు దిగుతున్నారు. కనీసం 10 నుంచి 15 క్రిమినల్ కేసులున్న విద్యార్థి నాయకులను ఆదర్శంగా తీసుకుంటున్నారు– కేరళ కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్‘‘అత్యధిక అక్షరాస్యతా రేటు, ఉన్నత విద్యార్హతలున్నా ఉపాధి లేక కేరళలో యువత నైరాశ్యంతో డ్రగ్స్ బారిన పడుతోంది’’ – ఐరాస అభివృద్ధి కార్యక్రమం (యూఎన్డీపీ) ఆసియా–పసిఫిక్ రీజియన్ మాజీ సలహాదారు జి.ప్రమోద్‌కుమార్– సాక్షి, నేషనల్ డెస్క్
New Ration Cards: తీసివేతలకు తిప్పలే!
మహిళలకూ కావాలి సమగ్ర బీమా
నామినేషన్లకు నేడే చివరి రోజు.. ఎమ్మెల్సీ ఎన్నిక ఏకగ్రీవం
ఈటీఎఫ్‌లు–ఇండెక్స్ ఫండ్స్ మధ్య వ్యత్యాసం?
పాపాహోం నుంచి శాటిలైట్ సెంటర్‌కు..
బాలికపై అత్యాచారం?
రూమ్ నంబరు 229లో ఏమి జరిగింది?
డేటింగ్లో 'చాహల్'.. ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌కు ఆమెతో పాటు ఎంట్రీ
అనాథ యువతి పెళ్లికి అన్నీ తామై..
#SSMB29: వాట్ ద ఎఫ్.. రాజమౌళి?
మా స్పిన్నర్లు అద్భుతం.. అతడు ఒత్తిడిని చిత్తు చేశాడు: రోహిత్
CT 2025 Final: రవీంద్ర జడేజా రిటైర్మెంట్..?
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం.. చిన్ననాటి మిత్రులతో సంతోషంగా గడుపుతారు.
ఏదో ఒక్క నిరుద్యోగులకు మాత్రమే ద్రోహం చేసినట్లు మాట్లాడుతున్నారేంటి సార్!
నిశ్చితార్థం చేసుకున్న 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' నటి
వైట్ జాకెట్స్... ఈ ‘చాంపియన్స్’కే ఎందుకు!
Virat Kohli: అద్భుత విజయం.. అంతులేని సంతోషం!.. ఆసీస్ టూర్ తర్వాత..
ఈ ఏడాది హెచ్1బీ వీసాలు కష్టమే
గోదావరిలో అస్థికలు కలిపిన యాంకర్ రష్మీ
ఐస్‌క్రీమ్‌లో పాము పిల్ల!
New Ration Cards: తీసివేతలకు తిప్పలే!
మహిళలకూ కావాలి సమగ్ర బీమా
నామినేషన్లకు నేడే చివరి రోజు.. ఎమ్మెల్సీ ఎన్నిక ఏకగ్రీవం
ఈటీఎఫ్‌లు–ఇండెక్స్ ఫండ్స్ మధ్య వ్యత్యాసం?
పాపాహోం నుంచి శాటిలైట్ సెంటర్‌కు..
బాలికపై అత్యాచారం?
రూమ్ నంబరు 229లో ఏమి జరిగింది?
డేటింగ్లో 'చాహల్'.. ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌కు ఆమెతో పాటు ఎంట్రీ
అనాథ యువతి పెళ్లికి అన్నీ తామై..
#SSMB29: వాట్ ద ఎఫ్.. రాజమౌళి?
మా స్పిన్నర్లు అద్భుతం.. అతడు ఒత్తిడిని చిత్తు చేశాడు: రోహిత్
CT 2025 Final: రవీంద్ర జడేజా రిటైర్మెంట్..?
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం.. చిన్ననాటి మిత్రులతో సంతోషంగా గడుపుతారు.
ఏదో ఒక్క నిరుద్యోగులకు మాత్రమే ద్రోహం చేసినట్లు మాట్లాడుతున్నారేంటి సార్!
నిశ్చితార్థం చేసుకున్న 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' నటి
వైట్ జాకెట్స్... ఈ ‘చాంపియన్స్’కే ఎందుకు!
Virat Kohli: అద్భుత విజయం.. అంతులేని సంతోషం!.. ఆసీస్ టూర్ తర్వాత..
ఈ ఏడాది హెచ్1బీ వీసాలు కష్టమే
గోదావరిలో అస్థికలు కలిపిన యాంకర్ రష్మీ
ఐస్‌క్రీమ్‌లో పాము పిల్ల!
సినిమా

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్.. ఈ స్పెషల్ వీడియో చూశారా?
టాలీవుడ్ హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిస్తోన్న చిత్రం కన్నప్ప. ఈ మూవీలో పలువురు అగ్రతారలు నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్, పాటలు అభిమానుల్లో భారీ అంచనాలు పెంచేశాయి. ఈ చిత్రానికి బాలీవుడ్ డైరెక్టర్ ముకేశ్‌కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో మోహన్‌బాబు, మోహన్‌లాల్, ప్రభాస్, అక్షయ్‌కుమార్, కాజల్ అగర్వాల్ నటిస్తున్నారు. ఇటీవలే రెండో టీజర్ విడుదల చేసిన ఈ భారీ ప్రాజెక్ట్ ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ వీడియోను మంచు విష్ణు సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఈ మూవీ మేకింగ్‌కు సంబంధించిన వీడియోను పంచుకున్నారు. ఇందులో మంచు విష్ణు పలు అంశాలపై టీమ్‌తో చర్చిస్తూ కనిపించారు. ఈ సినిమా తెర వెనుక సంగతులకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. The making of Kannappa#kannappa pic.twitter.com/hZCBKbjjYK— Vishnu Manchu (@iVishnuManchu) March 9, 2025

'బాలీవుడ్ నుంచి గెంటేయాలని చూశారు'.. గోవిందా సంచలన ఆరోపణలు
బాలీవుడ్ సీనియర్ నటుడు గోవిందా ఆసక్తికర కామెంట్స్ చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన గోవిందా బాలీవుడ్‌పై విమర్శలు చేశారు. బాలీవుడ్లో తనపై కుట్ర చేశారని షాకింగ్ కామెంట్స్ చేశారు. నన్ను ఇండస్ట్రీ నుంచి బయటికి పంపేందుకు కొందరు ప్రయత్నించారని వెల్లడించారు. తాను పెద్దగా చదువుకోలేదని.. వారంతా చదువుకున్న వారు కావడంతోనే నాతో ఆడుకున్నారని తెలిపారు. కేవలం నా నటన వల్లే ఇప్పటికీ ఇండస్ట్రీలో కొనసాగుతున్నానని వెల్లడించారు. నన్ను టార్గెట్ చేసిన వారి పేర్లను వెల్లడించడం తనకు ఇష్టం లేదని పేర్కొన్నారు. కాగా.. ముఖేష్ ఖన్నా యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గోవిందా ఈ వ్యాఖ్యలు చేశారు.పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించిన గోవిందా ప్రస్తుతం పెద్దగా కనిపించడం లేదు. ఆయన చివరిసారిగా 2019 విడుదలైన రంగీలా రాజాలో కనిపించాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేకపోయింది. నటుడు తన కెరీర్లో 100 కోట్ల ప్రాజెక్ట్‌లను చేయలేకపోయినట్లు వెల్లడించారు. నిజం చెప్పాలంటే తాను రూ. 100 కోట్ల చిత్రాలను తిరస్కరించానని తెలిపారు. వాటిని వద్దనుకున్నప్పుడు అద్దంలో చూసుకుని నన్ను చెంపదెబ్బ కొట్టుకునేవాడినని పేర్కొన్నారు.విడాకుల రూమర్స్..గత కొద్ది కాలంగా గోవిందాపై విడాకుల రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. తన భార్య సునీతా అహుజాతో విడిపోతున్నారని వార్తలు తెగ వైరలవుతున్నాయి. వీటిపై ఇటీవలే ఆయన భార్య కూడా స్పందించింది. గోవిందను... తనను ఎవరూ విడదీయలేరని సునీతా అహుజా తేల్చిచెప్పారు. మేము విడివిడిగా ఉంటున్నా మాట వాస్తవమే.. కానీ గోవింద రాజకీయాల్లోకి ఉండడం వల్లే తాము దూరంగా ఉంటున్నట్లు తెలిపింది. పిల్లలు పెద్దవాళ్లు అవుతున్నారు.. తరచుగా పార్టీకి చెందిన పలువురు మా ఇంటికి వస్తూ ఉంటారు..అందుకే మేము పక్కనే ఉన్న మరో ఇంట్లో ఉంటున్నామని తెలిపింది. కాగా.. గోవిందా, సునీత 1987లో వివాహం చేసుకున్నారు. వీరిద్దరికీ కుమారుడు యశ్వర్ధన్, కుమార్తె టీనా ఉన్నారు.

'ఈ జన్మలో నీ రుణం తీర్చుకోలేను'.. టాలీవుడ్ కమెడియన్ ఎమోషనల్ పోస్ట్
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో రచ్చ రవి అందరికీ సుపరిచితమే. బుల్లితెర కామెడీ షో జబర్దస్త్ ద్వారా పరిశ్రమలోకి అడుగు పెట్టాడు. తనదైన కామెడీ, పంచ్ డైలాగ్స్‌తో కమెడియన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవలే బాపు సినిమాలో రచ్చరవి నటించారు. ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించారు. నటుడిగా తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. టాలీవుడ్లో దాదాపు అందరు స్టార్ హీరోల సినిమాల్లో నటించారు.తాజాగా రచ్చ రవి సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది. ఇవాళ తన పెళ్లి రోజు కావడంతో భార్యకు ప్రత్యేకంగా విషెస్ తెలిపారు. తన పెళ్లి ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ తన ప్రేమను వ్యక్తం చేశారు. నా ప్రపంచానికి చిరుదివ్యల వెలుగును పంచుతూ నా జీవన ప్రయాణంలో తోడుగా నిలిచిన తన భార్య స్వాతిని ప్రశంసిస్తూ ఎమోషనల్ నోట్ రాసుకొచ్చారు. ఇది చూసిన రచ్చ రవి అభిమానులు తమ అభిమాన నటుడికి పెళ్లి రోజు శుభాకాంక్షలు చెబుతూ పోస్టులు పెడుతున్నారు.రచ్చ రవి తన ఇన్‌స్టాలో రాస్తూ..' నిన్ను పరిచయం చేసిన నీ... నా... తల్లిదండ్రుల రుణం తీరదు. నా జీవన ప్రయాణంలో నీ పూర్తి సహాయ సహకారం అందిస్తున్న నాకు తృప్తి ఉండదు. ఎన్ని ఆశలు.. కోరికలు.. ఇష్టాలు.. ఉన్నాయో నీకు వాటిని నేను తీర్చగలనో లేదో అని ఎన్నడు నేను అడగలేదు..నువ్వు చెప్పలేదు. నా ప్రపంచానికి చిరుదివ్యల వెలుగును పంచుతూ నా జీవన ప్రయాణానికి వసంతాలు పూయిస్తూ కష్టాలను భరిస్తూ దుఃఖాలను దిగమింగుకుంటూ... కాంప్రమైజ్ అవుతూ లైఫ్‌లో నన్ను సక్సెస్ చేయిస్తూ.... ఇదే జీవితంలో నీ ఇష్టాలు కోరికలు ఆశలను తీర్చాలని... అంత శక్తి నాకు భగవంతుడు ఇవ్వాలని.. నా నిస్వార్థ కోరిక అర్థం చేసుకొని ఇస్తాడని.... నీ రుణం కూడా తీరదని తెలిసి కూడా కనీసం వడ్డీగానైనా ప్రేమిస్తానని ప్రేమగా చూసుకుంటానని...నా సహచరికి పెళ్లిరోజు శుభాకాంక్షలు.. ఐ లవ్ యు స్వాతి..' అంటూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. View this post on Instagram A post shared by Ravi Racha (@meracharavi)

ఫిట్‌నెస్‌పై రూమర్స్.. కరణ్ జోహార్ క్లారిటీ!
బాలీవుడ్ డైరెక్టర్, నిర్మాత కరణ్ జోహార్ తాజాగా ఐఫా అవార్డుల వేడుకలో మెరిశారు. రాజస్థాన్‌లోని జైపూర్ వేదికగా జరిగిన ఈవెంట్లో ఆయన సందడి చేశారు. ఇటీవల తన ఫిట్నెస్ గురించి వస్తున్న వార్తలపై తాజా ఈవెంట్లో స్పందించారు. స్లిమ్‌గా కనిపించడానికి గల కారణాలను వివరించాడు. తన ఫిట్‌నెస్‌కు ప్రధాన కారణం అలవాట్లేనని కరణ్ జోహార్ వెల్లడించారు. సరైన టైమ్‌కి తినడం, వ్యాయామం చేయడం వల్లే సాధ్యమైందని తెలిపారు. ఫిట్‌నెస్‌కు క్రమశిక్షణతో కూడిన జీవనశైలి ముఖ్యమని డైరెక్టర్ సలహా ఇచ్చాడు. దీంతో కరణ్ బరువు తగ్గడంపై వస్తున్న వార్తలకు ఆయన చెక్‌పెట్టారు.(ఇది చదవండి: 'ఐఫా' అవార్డ్స్ 2025 విజేతల జాబితా)కరణ్ జోహార్ బరువు తగ్గేందుకు ఓజెంపిక్ వంటి డయాబెటిక్ మందుల వాడుతున్నారని రూమర్స్ వచ్చాయి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన సన్నిహిత మిత్రుడు మహీప్ కపూర్ వ్యాఖ్యల తర్వాత ఆ రూమర్స్ మరింత ఊపందుకున్నాయి. ప్రముఖ నెట్‌ఫ్లిక్స్ షో లైవ్స్ వర్సెస్ బాలీవుడ్ వైవ్స్లో మహీప్ కపూర్ ఈ విషయంపై మాట్లాడారు. తాజాగా కరణ్ క్లారిటీ ఇవ్వడంతో ఇకపై ఆ వార్తలకు చెక్ పడనుంది. కాగా.. గతంలో స్లిమ్‌గా ఉంటూ తన ఫిట్నెస్ పట్ల నిబద్ధతను చాటుకున్నారు కరణ్ జోహార్.
న్యూస్ పాడ్‌కాస్ట్
క్రీడలు

జొకోవిచ్‌కు చుక్కెదురు
కాలిఫోర్నియా: సెర్బియా టెన్నిస్ స్టార్ నొవాక్ జొకోవిచ్‌కు ఇండియన్ వెల్స్ ఏటీపీ–1000 మాస్టర్స్ టోర్నమెంట్లో చుక్కెదురైంది. 24 గ్రాండ్‌స్లామ్‌లు గెలిచిన ప్రపంచ మాజీ నంబర్‌వన్ జొకోవిచ్... ఈ టోర్నీలో రెండో రౌండ్లోనే ఇంటిబాట పట్టాడు. పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో ఆరో సీడ్ జొకోవిచ్ 2–6, 6–3, 1–6తో ‘లక్కీ లూజర్’ బొటిక్ వాన్ డి జాండ్‌షుల్ఫ్ (నెదర్లాండ్స్) చేతిలో పరాజయం పాలయ్యాడు. వాస్తవానికి జాండ్‌షుల్ప్ క్వాలిఫయింగ్ దశలోనే ఓడిపోయాడు. అయితే మెయిన్ ‘డ్రా’లో ఒక ప్లేయర్ వైదొలడగంతో క్వాలిఫయింగ్‌లో ఓడిపోయిన మెరుగైన ర్యాంకర్ జాండ్షుల్ప్కు ‘లక్కీ లూజర్’ హోదాలో మెయిన్ ‘డ్రా’లో ఆడే అవకాశం కల్పించారు. తొలి రౌండ్లో ‘బై’ దక్కించుకున్న జొకోవిచ్... బరిలోకి దిగిన తొలి పోరులోనే నిష్క్రమించాడు. గతంలో ఐదుసార్లు ఈ టోర్నీలో చాంపియన్‌గా నిలిచిన జొకోవిచ్... ఈసారి అదే జోరు కనబర్చలేకపోయాడు. 37 అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకున్నాడు. తొలి సెట్లోనే జొకో 14 అనవసర తప్పిదాలకు పాల్పడడంతో తిరిగి కోలుకోలేకపోయాడు.జాండ్‌షుల్ఫ్ బేస్‌లైన్‌తో పాటు నెట్ గేమ్‌తో అదరగొడితే... జొకో మ్యాచ్ ఆద్యాంతం తడబడ్డాడు. ఓవరాల్‌గా జాండ్‌షుల్ఫ్ 4 ఏస్‌లు సంధించగా... జొకో ఒక్క ఏస్ కూడా కొట్టలేకపోయాడు. నెదర్లాండ్స్ ప్లేయర్ 4 డబుల్ ఫాల్ట్స్ చేయగా... జొకోవిచ్ 3 డబుల్ ఫాల్ట్‌లకు పాల్పడ్డాడు. ‘గత కొంతకాలంగా పరిస్థితులు భిన్నంగా సాగుతున్నాయి. ఆశించిన స్థాయిలో ఆడేందుకు ఇబ్బంది పడుతున్నా. ఈ పోరాటం సవాలుతో కూడుకున్నది.మధ్యమధ్యలో ఒకటీ రెండు టోర్నీల్లో మంచి ప్రదర్శన కనబర్చగలుగుతున్నా... దాన్ని కొనసాగించడం ముఖ్యం. పేలవ ప్రదర్శనకు సాకులు వెతకాలనుకోవడం లేదు. ఇది నా రోజు కాదు. మరింత మెరుగైన ప్రదర్శన చేసేందుకు ప్రయత్నిస్తా’ అని జొకోవిచ్ అన్నాడు. ఈ ఏడాది 25వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ ఖాతాలో వేసుకునేలా కనిపించిన జొకోవిచ్... కండరాల నొప్పితో ఆ్రస్టేలియా ఓపెన్ సెమీఫైనల్ నుంచి వైదొలిగాడు. గాయం నుంచి కోలుకొని బరిలోకి దిగిన దోహా టోర్నీ తొలి రౌండ్లోనే జొకో పరాజయం పాలయ్యాడు. మరోవైపు అగ్రశ్రేణి ఆటగాళ్లపై ఆరంభ దశలోనే విజయాలు సాధించడాన్ని అలవాటుగా మార్చుకున్న జాండ్‌షుల్ఫ్ గతంలో... డేవిస్ కప్‌లో రాఫెల్ నాదల్ (స్పెయిన్)పై, యూఎస్ ఓపెన్‌లో అల్కరాజ్ (స్పెయిన్)పై కూడా విజయాలు సాధించాడు. ఇప్పుడు మరో సంచలన నమోదు చేస్తూ జొకోవిచ్పై గెలుపొందాడు. ఓవరాల్‌గా టాప్–10 ప్రత్యర్థులపై జాండ్షుల్ఫ్కు ఇది 8వ విజయం కావడం విశేషం. కాగా, ఈ టోర్నీలో టాప్‌సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ), నాలుగో సీడ్ కాస్పర్ రూడ్ (నార్వే) కూడా రెండో రౌండ్లోనే పరాజయం పాలయ్యారు.

వైట్ జాకెట్స్... ఈ ‘చాంపియన్స్’కే ఎందుకు!
దుబాయ్: వన్డే ప్రపంచకప్, టి20 ప్రపంచకప్, ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ)... అంతర్జాతీయ క్రికెట్లో మూడు ఫార్మాట్ల చాంపియన్లు అవతరిస్తారు. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మాత్రం ‘చాంపియన్స్ ట్రోఫీ’ విజేతలకు మాత్రమే ప్రత్యేకమైన తెలుపురంగు జాకెట్లను అందజేస్తుంది. జెంటిల్మెన్ క్రికెట్లో దర్పానికి, గొప్ప గౌరవానికి ప్రతీకగా ట్రోఫీతో పాటు జాకెట్లను ఇస్తారు. విన్నింగ్ టీమ్ సభ్యులందరూ ఈ వైట్ జాకెట్లు ధరించే బహుమతి ప్రదానోత్సవ వేడుకలో తెగ హంగామా చేస్తారు. 1998లో బంగ్లాదేశ్‌లో ఈ టోర్నీకి శ్రీకారం చుట్టారు. అప్పట్లో నాకౌట్ టోర్నీగా మొదలైన ఈ ఈవెంట్‌ను మినీ ప్రపంచకప్‌గా అభివర్ణించేవారు. ఇక వైట్ జాకెట్ల హంగు, వేదికపై ఆర్భాటం మాత్రం 2009లో మొదలైంది. ముంబైకి చెందిన ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ బబితా ఈ వైట్ జాకెట్ల రూపకర్త. మనకిది సాధారణ వైట్ సూట్లాగే కనిపిస్తుంది. కానీ ఇది ఎంతో ప్రత్యేకమైన ఇటాలియన్ వూల్‌తో తయారైంది. వినూత్న టెక్చ్సర్, స్ట్రిప్‌లు, బంగారు వర్ణ ఎంబ్రాయిడింగ్ వర్క్ చాంపియన్స్ ట్రోఫీ లోగోతో ఆ జాకెట్లకు మరిన్ని వన్నెలద్దారు డిజైనర్లు. పాక్ ఆతిథ్యమిచ్చిన తాజా టోర్నీకి సంబంధించిన ఈ ప్రత్యేకమైన జాకెట్లను ఆ దేశ దిగ్గజం, మాజీ కెప్టెన్ వసీమ్ అక్రమ్ విడుదల చేశాడు. ఈ సందర్భంగా అక్రమ్ మాట్లాడుతూ ‘ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ అత్యుత్తమ టోర్నీకి నిదర్శనం. క్రికెట్ గొప్పతనాన్ని విశ్వవ్యాప్తం చేసింది. ఆరంభం నుంచి విశేషాదరణ చూరగొంది’ అని అన్నాడు.

వన్డే విజయం తెచ్చిన ఆనందం...
నవంబర్ 19, 2023... కోట్లాది మంది భారతీయుల ఆశలు మోస్తూ వన్డే వరల్డ్ కప్‌లో ఫైనల్ బరిలోకి దిగిన భారత్ అనూహ్య పరాజయంతో అభిమానుల గుండెలు బద్దలయ్యాయి... జూన్ 29, 2024... టి20 ఫార్మాట్లో తమ స్థాయికి తగ్గ ఆటను కనబరుస్తూ భారత జట్టు వరల్డ్ కప్ గెలుచుకుంది...ఫ్యాన్స్‌కు కాస్త ఊరట... మార్చి 9, 2025... అంచనాలకు అనుగుణంగా ప్రతీ మ్యాచ్‌లో సంపూర్ణ ఆధిక్యంతో భారత జట్టు చాంపియన్స్ ట్రోఫీ సాధించింది... దేశవ్యాప్తంగా అన్ని చోట్లా ఆనందం... సాక్షి క్రీడా విభాగం : సుమారు 16 నెలల వ్యవధిలో భారత జట్టు మూడు ఐసీసీ టోర్నీల్లో ఫైనల్ చేరింది. వాటిలో రెండింటిలో విజేతగా నిలిచింది. వన్డే వరల్డ్ కప్ ఓటమి వేదన ఇప్పటికీ తీరనిది అయినా మిగతా రెండు విజయాలతో సాంత్వన దక్కిందనేది మాత్రం వాస్తవం. అంతర్జాతీయ క్రీడల్లో ఒక టోర్నమెంట్‌కు, మరో టోర్నమెంట్‌కు పోలిక ఉండదు. ఒక విజయానికి, మరో విజయానికి సంబంధం ఉండదు. దేని ప్రత్యేకత దానిదే. కానీ గెలుపు ఇచ్చే కిక్ మాత్రం ఎప్పుడైనా ఒకటే! ఇప్పుడు టీమిండియా ఆటగాళ్లు దానినే అనుభవిస్తున్నారు.వరల్డ్ కప్ కాకపోయినా టాప్–8 జట్ల మధ్య జరిగిన సమరంలో భారత్ తమ అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. 2013లో చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన జట్టులో సభ్యులైన రోహిత్, కోహ్లి, జడేజా ఇప్పుడూ ఉన్నారు. 2017 ఫైనల్లో పాక్ చేతిలో ఓడిన వారిలో ఈ ముగ్గురితో పాటు హార్దిక్ పాండ్యా, షమీ కూడా ఉన్నారు. షమీ, అయ్యర్, రాహుల్, హర్షిత్ రాణా, వరుణ్, సుందర్‌లకు ఇదే తొలి ఐసీసీ టైటిల్. దాని విలువ ఏమిటో వారి ఆనందంలోనే కనిపిస్తోంది. స్పిన్నర్లే విన్నర్లు... చాంపియన్స్ ట్రోఫీ కోసం జట్టును ప్రకటించినప్పుడు ‘ఐదుగురు స్పిన్నర్లా’ అంటూ అన్ని వైపుల నుంచి ఆశ్చర్యం వ్యక్తమైంది. పైగా అప్పటికే ఎంపిక చేసిన జట్టులో ఉన్న బ్యాటర్ యశస్వి జైస్వాల్‌ను తప్పించి మరీ వరుణ్ చక్రవర్తిని ఎంపిక చేశారు. టోర్నీలో మన స్పిన్నర్ల ప్రదర్శన చూస్తే ఇది ఎంత సరైన నిర్ణయమో తేలింది. సుందర్‌కు మ్యాచ్ ఆడే అవకాశం రాకపోగా... మిగతా నలుగురు వరుణ్, కుల్దీప్, అక్షర్, జడేజా పెను ప్రభావం చూపించారు. ఈ నలుగురు కలిసి మొత్తం 26 వికెట్లు పడగొట్టారు. ఇందులో వరుణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. కేవలం 15.11 సగటుతో అతను 9 వికెట్లు తీశాడు. లీగ్ దశలోనే కివీస్ పని పట్టిన అతను ఫైనల్లోనూ అదే ఆటను ప్రదర్శించి జట్టు విజయానికి కారణమయ్యాడు. కీలకమైన యంగ్, ఫిలిప్స్ వికెట్లు తీసిన అతను కనీసం ఒక్క బౌండరీ కూడా ఇవ్వకపోవడం విశేషం! టోర్నీకి ముందు అతను ఒకే ఒక వన్డే ఆడాడు. ‘వరుణ్ బౌలింగ్‌లో ఏదో ప్రత్యేకత ఉంది. నెట్స్‌లో కూడా అతను మాకు మామూలుగానే బౌలింగ్ చేస్తాడు. తన అసలైన ఆయుధాలను మ్యాచ్‌లోనే ప్రదర్శిస్తాడు. అలా చేస్తే చాలు’ అంటు రోహిత్ చేసిన ప్రశంస వరుణ్ విలువను చూపించింది. ఆరంభంలో కుల్దీప్ పెద్దగా ప్రభావం చూపకపోయినా... తుది పోరులో రెండు కీలక వికెట్లతో కివీస్‌ను నిలువరించాడు. జడేజా, అక్షర్ కూడా కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ప్రత్యర్థులను కట్టి పడేశారు. వీరిద్దరి ఎకానమీ 4.35 మాత్రమే ఉందంటే వారు ఎంత పొదుపుగా బౌలింగ్ చేశారో అర్థమవుతుంది. గాయం నుంచి కోలుకొని తిరిగొచ్చిన షమీ గతంలోలా అద్భుతంగా బౌలింగ్ చేయకపోయినా కీలక సమయాల్లో జట్టును ఆదుకున్నాడు. టోర్నీలో అతను తీసిన 9 వికెట్లలో సెమీస్‌లో స్మిత్‌ను అవుట్ చేసిన క్షణం హైలైట్‌గా నిలిచింది. బుమ్రా లేని లోటును పూరిస్తూ ఈ సీనియర్ బౌలర్ తన వంతు పాత్రను పోషించాడు. బ్యాటర్లు సమష్టిగా... బ్యాటింగ్‌లో ఎప్పటిలాగే విరాట్ కోహ్లి (మొత్తం 218 పరుగులు) భారత జట్టు మూల స్థంభంగా నిలిచాడు. 1 సెంచరీ, 1 అర్ధసెంచరీతో రెండుసార్లు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా అతను జట్టును గెలిపించాడు. టోర్నీకి ముందు అతని బ్యాటింగ్‌పై కాస్త సందేహాలు రేగినా... వాటిని అతను పటాపంచలు చేశాడు. కోహ్లినే స్వయంగా చెప్పినట్లు ఆ్రస్టేలియా టూర్ తర్వాత తాము ఒక విజయం కోసం చూస్తున్న స్థితిలో ఈ టైటిల్ దక్కింది. మొత్తం పరుగులు చూస్తే రోహిత్ శర్మ (180) తక్కువగానే కనిపిస్తున్నా... ఓపెనర్‌గా అతను చూపించిన ప్రభావం ఎంతో ఉంది. శ్రేయస్ అయ్యర్ (243) జట్టు అత్యధిక స్కోరర్‌గా నిలవగా, గిల్ (188 పరుగులు) ఒక సెంచరీతో తాను ప్రధాన పాత్ర పోషించాడు. తనపై వస్తున్న విమర్శలకు జవాబిస్తూ కేఎల్ రాహుల్ (140 పరుగులు) మూడు మ్యాచ్‌లలో చివరి వరకు నిలిచి జట్టును గెలుపు తీరం చేర్చాడు. ఐదో స్థానంలో ప్రమోట్ అయిన అక్షర్ పటేల్ (109 పరుగులు) కూడా ఆకట్టుకున్నాడు. టాప్–6 బ్యాటర్లు ఆశించిన స్థాయిలో ఆడటంతో ఆందోళన లేకపోయింది. ఐదు మ్యాచ్‌లలో భారత్ నాలుగు సార్లు సునాయాసంగా 232, 242, 265, 252 లక్ష్యాలను అందుకుంది. కెప్టెన్ గా రోహిత్ ముద్ర... భారత్ నుంచి ధోని మాత్రం కెపె్టన్‌గా ఒకటికి మించి ఐసీసీ టైటిల్స్ సాధించాడు. ఇప్పుడు రెండు ట్రోఫీలతో రోహిత్ శర్మ తన నాయకత్వ లక్షణాలను ప్రదర్శించాడు. మరో దాంట్లో ఫైనల్ కూడా చేర్చిన ఘనత, వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్‌లో ఫైనల్లో సారథిగా వ్యవహరించిన ఘనత కూడా అతని ఖాతాలో ఉంది. చాంపియన్స్ ట్రోఫీలో కీలక సమయాల్లో కెప్టెన్ గా అతను జట్టును నడిపించిన తీరు హైలైట్‌గా నిలిచింది. గంభీర్‌కు ఊరట... ద్రవిడ్ నుంచి కోచ్‌గా బాధ్యతలు తీసుకున్న తర్వాత గంభీర్ కోచింగ్‌లో చెప్పుకోదగ్గ ఫలితాలు రాలేదు. శ్రీలంకపై టి20 సిరీస్, స్వదేశంలో ఇంగ్లండ్‌తో సిరీస్ లు గెలిచినా వాటిని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. సొంతగడ్డపై న్యూజిలాండ్, ఆ తర్వాత ఆసీస్ చేతిలో టెస్టుల్లో చిత్తయిన అవమాన భారం మాత్రమే అందరికీ గుర్తుండిపోయింది.ఇలాంటి సమయంలో వచ్చిన గెలుపు కోచ్‌గా అతనికి ఊరటనిచ్చిoదనడంలో సందేహం లేదు. ‘అంతర్జాతీయ క్రికెట్లో సంతృప్తికరమైన ఆట ఎప్పటికీ ఉండదు. ప్రతీసారి ఏదో ఒక విషయం మెరుగు పర్చుకోవాల్సిందే. అప్పుడే నిలకడగా ఫలితాలు వస్తాయి’ అంటూ ఆటగాళ్లలో స్ఫూర్తి నింపిన కోచ్ ఇప్పుడు ఫైనల్ అనంతరం చిరునవ్వులు చిందించాడు.ప్రధాని ప్రశంసలు... మూడోసారి చాంపియన్స్ ట్రోఫీ టైటిల్ గెలిచిన భారత క్రికెట్ జట్టుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. ‘అద్భుతమైన మ్యాచ్...అద్భుతమైన ఫలితం... ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన మన క్రికెట్ జట్టును చూసి గర్వపడుతున్నా. టోర్నమెంట్ ఆసాంతం వారంతా చాలా బాగా ఆడారు. అసాధారణ ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబర్చిన మన జట్టుకు నా అభినందనలు’ అని ‘ఎక్స్’లో మోదీ పేర్కొన్నారు. టీమిండియాకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చందబ్రాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా అభినందనలు తెలిపారు.మాజీ సీఎం జగన్ అభినందనలు ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో అసాధారణ విజయం సాధించిన భారత జట్టుకు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఆదివారం రాత్రి తన ‘ఎక్స్’ ఖాతా ద్వారా స్పందించారు. ‘ఇది ఎంతో అర్హమైన అజేయ విజయం. మన దేశానికి గర్వకారణమైన క్షణం! టీమిండియాకు అభినందనలు’ అని ఆయన పేర్కొన్నారు.7 భారత్ సాధించిన అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టైటిల్స్ సంఖ్య. ఇందులో 2 వన్డే వరల్డ్‌కప్‌లు (1983, 2011), 2 టి20 వరల్డ్‌కప్‌లు (2007, 2024), 3 చాంపియన్స్ ట్రోఫీలు (2022, 2013, 2025) ఉన్నాయి. ఈ జాబితాలో ఆస్ట్రేలియా 10 ఐసీసీ టైటిల్స్‌తో అగ్రస్థానంలో ఉంది.ఎవరికెంత ప్రైజ్‌మనీ అంటే? విజేత భారత్ 22 లక్షల 40 వేల డాలర్లు (రూ. 19 కోట్ల 52 లక్షలు) రన్నరప్ కివీస్ 11 లక్షల 20 వేల డాలర్లు (రూ. 9 కోట్ల 76 లక్షలు)

మనమే చాంపియన్స్
భారత జట్టు మరోసారి తమ చాంపియన్ ఆటను ప్రదర్శించింది. తొలి మ్యాచ్ నుంచి అన్ని రంగాల్లో ఆధిక్యం ప్రదర్శిస్తూ వచ్చిన జట్టు అజేయంగా విజయప్రస్థానాన్ని ముగించింది. అటు బౌలింగ్‌లో, ఇటు బ్యాటింగ్‌లో సమష్టి ఆటతో ఒక్కో ప్రత్యర్థిని పడగొడుతూ వచ్చిన జట్టు తమ స్థాయికి తగ్గ విజయాన్ని అందుకుంది. ఏడాది వ్యవధిలో మరో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టైటిల్‌ను సొంతం చేసుకొని ప్రపంచ క్రికెట్‌పై తమ ఆధిపత్యాన్ని స్పష్టంగా చూపించింది. 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ ఓటమిని పూర్తిగా మరచిపోయేలా కాకపోయినా... ఈ ఫార్మాట్లో మరో ప్రతిష్టాత్మక టైటిల్‌ను గెలుచుకొని అభిమానులకు ఆనందాన్ని పంచింది. 2013లాగే ఒక్క ఓటమి కూడా లేకుండా టీమిండియా ట్రోఫీని గెలుచుకోవడం విశేషం. ఫైనల్లో టాస్ ఓడినా న్యూజిలాండ్‌ను సాధారణ స్కోరుకే పరిమితం చేయడంతోనే భారత్‌కు గెలుపు దారులు తెరుచుకున్నాయి. మన స్పిన్ చతుష్టయాన్ని ఎదుర్కోవడంలో మళ్లీ తడబడిన కివీస్ భారీ స్కోరు సాధించలేకపోయింది. ఛేదనలో రోహిత్ శర్మ దూకుడైన ఆరంభం లక్ష్యాన్ని అందుకునేందుకు తగిన పునాది వేసింది. మధ్యలో కొద్దిసేపు కివీస్ స్పిన్నర్లూ ప్రభావం చూపడంతో 17 పరుగుల వ్యవధిలో 3 కీలక వికెట్లు కోల్పోయి కొంత ఉత్కంఠ నెలకొంది. అయితే లక్ష్యం మరీ చిన్నది కావడంతో సమర్థమైన బ్యాటింగ్ లైనప్ తడబడకుండా టీమ్‌ను విజయతీరం చేర్చింది. క్రికెట్లో ‘మంచి బాలురు’వంటి న్యూజిలాండ్ టీమ్ మరోసారి ‘పోరాడి ఓడిన’ ముద్రతోనే నిరాశగా నిష్క్రమించింది.దుబాయ్: ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ–2025ను భారత్ సొంతం చేసుకుంది. లీగ్ దశలో మూడు మ్యాచ్‌లతో పాటు సెమీఫైనల్, ఫైనల్ కలిపి ఆడిన ఐదు మ్యాచ్‌లలో ఓటమి లేకుండా జట్టు టైటిల్ గెలుచుకుంది. దుబాయ్‌లో ఆదివారం జరిగిన ఫైనల్లో భారత్ 4 వికెట్ల తేడాతో మాజీ చాంపియన్ న్యూజిలాండ్‌పై విజయం సాధించింది. గతంలో భారత్ 2002, 2013లలో కూడా చాంపియన్స్ ట్రోఫీ టైటిల్‌ను గెల్చుకుంది. ఫైనల్లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కివీస్ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. డరైల్ మిచెల్ (101 బంతుల్లో 63; 3 ఫోర్లు), మైకేల్ బ్రేస్‌వెల్ (40 బంతుల్లో 53 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు చేశారు. అనంతరం భారత్ 49 ఓవర్లలో 6 వికెట్లకు 254 పరుగులు సాధించి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రోహిత్ శర్మ (83 బంతుల్లో 76; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు) చెలరేగగా... శ్రేయస్ అయ్యర్ (62 బంతుల్లో 48; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. టోర్నీ మొత్తంలో 263 పరుగులు చేసి 3 వికెట్లు తీసిన న్యూజిలాండ్ ప్లేయర్ రచిన్ రవీంద్ర ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’ అవార్డు గెల్చుకున్నాడు. మిచెల్ హాఫ్ సెంచరీ... కివీస్ ఇన్నింగ్స్‌ను రచిన్ రవీంద్ర (29 బంతుల్లో 37; 4 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగా మొదలు పెట్టాడు. పాండ్యా ఓవర్లో 2 ఫోర్లు, సిక్స్ కొట్టిన అతను షమీ ఓవర్లో మరో రెండు ఫోర్లు బాదాడు. దాంతో ఆరో ఓవర్లోనే భారత్ స్పిన్నర్ వరుణ్‌ను బౌలింగ్‌కు దింపింది. విల్ యంగ్ (23 బంతుల్లో 15; 2 ఫోర్లు)ను అవుట్ చేసి అతను ఓపెనింగ్ జోడీని విడదీశాడు. 10 ఓవర్లలో కివీస్ స్కోరు 69 పరుగులకు చేరింది. తన తొలి బంతికే రచిన్‌ను బౌల్డ్ చేసిన కుల్దీప్, తన రెండో ఓవర్లో విలియమ్సన్ (14 బంతుల్లో 11; 1 ఫోర్)ను పెవిలియన్ పంపించి ప్రత్య ర్థిని దెబ్బ కొట్టాడు.లాథమ్ (30 బంతుల్లో 14) కూడా ఎక్కువ సేపు నిలవలేకపోయాడు. ఈ దశలో మిచెల్, గ్లెన్ ఫిలిప్స్ (52 బంతుల్లో 34; 2 ఫోర్లు, 1 సిక్స్) కలిసి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. అయితే స్పిన్నర్లను ఎదుర్కోవడంలో బ్యాటర్లు బాగా ఇబ్బంది పడటంతో పరుగులు నెమ్మదిగా వచ్చాయి. వరుసగా 81 బంతుల పాటు బౌండరీనే రాలేదు. ఎట్టకేలకు 91 బంతుల్లో మిచెల్ అర్ధ సెంచరీ పూర్తయింది. ఒక వైపు తక్కువ వ్యవధిలో వరుసగా వికెట్లు కోల్పోయినా... ఆఖర్లో బ్రేస్‌వెల్ వేగంగా ఆడటంతో జట్టు స్కోరు 250 పరుగులు దాటింది. చివరి 10 ఓవర్లలో కివీస్ 79 పరుగులు చేసింది. నలుగురు భారత స్పిన్నర్లు కలిపి 38 ఓవర్లలో 144 పరుగులిచ్చి 5 వికెట్లు తీయగా... ఇద్దరు పేసర్లు 12 ఓవర్లలో 104 పరుగులిచ్చి ఒకే వికెట్ తీయడం మన స్పిన్నర్ల ప్రభావాన్ని చూపించింది. రాణించిన అయ్యర్... ఇన్నింగ్స్ రెండో బంతికే సిక్స్‌తో మొదలు పెట్టిన రోహిత్ తన ఇన్నింగ్స్ ఆసాంతం దూకుడుగా ఆడాడు. నాథన్ స్మిత్ ఓవర్లో అతను 2 ఫోర్లు, సిక్స్ కొట్టాడు. మరో ఎండ్‌లో శుబ్‌మన్ గిల్ (50 బంతుల్లో 31; 1 సిక్స్) పరుగులు చేయడానికి తీవ్రంగా శ్రమించాడు. 10 ఓవర్లలో స్కోరు 64 పరుగులు కాగా, 41 బంతుల్లోనే రోహిత్ హాఫ్ సెంచరీ మార్క్‌ను చేరుకున్నాడు. ఎట్టకేలకు శతక భాగస్వామ్యం తర్వాత గిల్ అవుట్ కావడంతో భారత్ తొలి వికెట్ కోల్పోయింది. ఆపై మరో 17 పరుగుల తేడాతో రెండు కీలక వికెట్లు తీసి కివీస్ పైచేయి సాధించింది. బ్రేస్‌వెల్ తొలి బంతికి కోహ్లి (1) వికెట్ల ముందు దొరికిపోగా, రోహిత్ భారీ షాట్‌కు ప్రయత్నించి స్టంపౌటయ్యాడు. ఈ దశలో అయ్యర్, అక్షర్ పటేల్ (40 బంతుల్లో 29; 1 ఫోర్, 1 సిక్స్) కలిసి చక్కటి సమన్వయంతో జాగ్రత్తగా ఆడుతూ మళ్లీ ఇన్నింగ్స్‌ను నడిపించారు. అయితే వీరిద్దరిని తక్కువ వ్యవధిలో వెనక్కి పంపడంతో కివీస్ బృందంలో ఆశలు రేగాయి. అయితే కేఎల్ రాహుల్ (33 బంతుల్లో 34 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్) ముందుండి నడిపిస్తూ జట్టును విజయం దిశగా తీసుకెళ్లాడు. 68 బంతుల్లో 69 పరుగులు చేయాల్సిన స్థితిలో బరిలోకి దిగిన రాహుల్‌కు హార్దిక్ పాండ్యా (18 బంతుల్లో 18; 1 ఫోర్, 1 సిక్స్) సహకరించాడు. 49వ ఓవర్ చివరి బంతిని జడేజా (6 బంతుల్లో 9 నాటౌట్; 1 ఫోర్) డీప్‌స్క్వేర్ లెగ్ దిశగా ఫోర్ కొట్టడంతో భారత్ విజయాన్ని పూర్తి చేసుకుంది. స్కోరు వివరాలు న్యూజిలాండ్ ఇన్నింగ్స్: యంగ్ (ఎల్బీ) (బి) వరుణ్ 15; రచిన్ (బి) కుల్దీప్ 37; విలియమ్సన్ (సి అండ్ బి) కుల్దీప్ 11; మిచెల్ (సి) రోహిత్ (బి) షమీ 63; లాథమ్ (ఎల్బీ) (బి) జడేజా 14; ఫిలిప్స్ (బి) వరుణ్ 34; బ్రేస్‌వెల్ (నాటౌట్) 53; సాంట్నర్ (రనౌట్) 8; స్మిత్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 16; మొత్తం (50 ఓవర్లలో 7 వికెట్లకు) 251. వికెట్ల పతనం: 1–57, 2–69, 3–75, 4–108, 5–165, 6–211, 7–239. బౌలింగ్: షమీ 9–0–74–1, పాండ్యా 3–0–30–0, వరుణ్ చక్రవర్తి 10–0–45–2, కుల్దీప్ యాదవ్ 10–0–40–2, అక్షర్ పటేల్ 8–0–29–0, రవీంద్ర జడేజా 10–0–30–1. భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (స్టంప్డ్) లాథమ్ (బి) రచిన్ 76; శుబ్‌మన్ గిల్ (సి) ఫిలిప్స్ (బి) సాంట్నర్ 31; కోహ్లి (ఎల్బీ) (బి) బ్రేస్‌వెల్ 1; శ్రేయస్ అయ్యర్ (సి) రచిన్ (బి) సాంట్నర్ 48; అక్షర్ పటేల్ (సి) రూర్కే (బి) బ్రేస్‌వెల్ 29; కేఎల్ రాహుల్ (నాటౌట్) 34; హార్దిక్ పాండ్యా (సి అండ్ బి) జేమీసన్ 18; జడేజా (నాటౌట్) 9; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (49 ఓవర్లలో 6 వికెట్లకు) 254. వికెట్ల పతనం: 1–105, 2–106, 3–122, 4–183, 5–203, 6–241. బౌలింగ్: జేమీసన్ 5–0–24–1, రూర్కే 7–0–56–0, స్మిత్ 2–0–22–0, సాంట్నర్ 10–0–46–2, రచిన్ 10–1–47–1, బ్రేస్‌వెల్ 10–1–28–2, ఫిలిప్స్ 5–0–31–0. ఫిలిప్స్ అసాధారణంఫీల్డింగ్ అత్యుత్తమ ప్రమాణాలు చూపిస్తూ తన స్థాయిని పెంచుకున్న ఫిలిప్స్ ఆదివారం మరోసారి దానిని ప్రదర్శించాడు. షార్ట్ కవర్ వైపు గిల్ షాట్ ఆడగా అసాధారణంగా గాల్లోకి ఎగురుతూ ఒంటి చేత్తో ఫిలిప్స్ అందుకోవడం అందరినీ ఒక్కసారిగా షాక్‌కు గురి చేసింది. ఈ టోర్నీలో అతను ఇప్పటికే కోహ్లి, రిజ్వాన్ క్యాచ్‌లను కూడా ఇదే తరహాలో అందుకున్నాడు. క్యాచ్‌లు వదిలేశారు...భారత జట్టు ఫీల్డింగ్‌లో పలు అవకాశాలు చేజార్చింది. కష్టసాధ్యమే అయినా ఏకంగా నాలుగు క్యాచ్‌లు వదిలేసింది. అయితే లైఫ్ లభించిన ఆటగాళ్లెవరూ దానిని పెద్దగా సది్వనియోగం చేసుకోలేకపోవడంతో పెద్దగా నష్టం జరగలేదు. రచిన్ రవీంద్ర స్కోరు 29 వద్ద ఉన్నప్పుడు రెండుసార్లు బతికిపోయాడు. షమీ రిటర్న్ క్యాచ్ వదిలేయగా, అయ్యర్ మరో క్యాచ్ వదిలేశాడు. మిచెల్ స్కోరు 38 వద్ద రోహిత్ క్యాచ్ వదిలేయగా, ఫిలిప్స్ స్కోరు 27 వద్ద గిల్ క్యాచ్ వదిలేసి అవకాశమిచ్చాడు. ఆ తర్వాత కివీస్ కూడా గ్రౌండ్ ఫీల్డింగ్ అద్భుతంగా చేసినా... రెండు క్యాచ్‌లు వదిలేసింది. గిల్ 1 పరుగు వద్ద మిచెల్ క్యాచ్ వదిలేయగా, అయ్యర్ 44 పరుగుల వద్ద ఉన్నప్పుడు జేమీసన్ అతి సులువైన క్యాచ్‌ను అందుకోలేకపోయాడు. 12 రోహిత్ శర్మ వరుసగా 12వసారి టాస్ ఓడిపోయాడు. ఈ జాబితాలో అగ్ర స్థానంలో ఉన్న వెస్టిండీస్ దిగ్గజం బ్రియాన్ లారా (12) రికార్డును సమం చేశాడు. అయితే మ్యాచ్‌లు గెలుస్తూ ఐసీసీ టైటిల్ సాధించిన వేళ ఇలాంటి టాస్‌లు ఎన్ని ఓడిపోయినా రోహిత్‌కు లెక్క లేదు! ‘నేను రిటైర్ కావడం లేదు’ చాలా సంతోషంగా ఉంది. చక్కటి క్రికెట్ ఆడిన మాకు దక్కిన ఫలితమిది. మొదటి నుంచి మా స్పిన్నర్లు ప్రభావం చూపించారు. ఎన్నో అంచనాలు ఉన్న సమయంలో వారు నిరాశపర్చలేదు. ఈ సానుకూలతను మేం సమర్థంగా వాడుకున్నాం. రాహుల్ మానసికంగా దృఢంగా ఉంటాడు. సరైన షాట్లను ఎంచుకుంటూ ఒత్తిడి లేకుండా అతను ఈ మ్యాచ్‌ను ముగించగలిగాడు. అతని వల్లే అవతలి వైపు పాండ్యా స్వేచ్ఛగా ఆడగలిగాడు. మా బ్యాటర్లంతా ఆకట్టుకునే ప్రదర్శన ఇచ్చారు. వరుణ్ బౌలింగ్‌లో ఎంతో ప్రత్యేకత ఉంది. అతను కీలక సమయాల్లో వికెట్లు తీశాడు. ఇలాంటి పిచ్‌పై అలాంటి బౌలర్ కావాలని అంతా కోరుకుంటారు. మాకు ఇది సొంత మైదానం కాకపోయినా పెద్ద సంఖ్యలో వచ్చి మద్దతుగా నిలిచిన అభిమానులకు కృతజ్ఞతలు. దూకుడుగా బ్యాటింగ్ చేసేందుకు నన్ను కోచ్ ప్రోత్సహించారు. మరో విషయం నేను స్పష్టం చేయదల్చుకున్నాను. నేను ఈ ఫార్మాట్‌నుంచి రిటైర్ కావడం లేదు. ఎలాంటి వదంతులు రాకూడదని ఇది చెబుతున్నాను –రోహిత్, భారత కెప్టెన్ గొప్పగా అనిపిస్తోంది. ఆ్రస్టేలియాతో సిరీస్ తర్వాత సరైన రీతిలో పునరాగమనం చేయాలని భావించాం. కుర్రాళ్ళతో కలిసి ఆడటం ఎంతో బాగుంది. వారు సరైన సమయంలో స్పందిస్తూ జట్టును ముందుకు తీసుకెళుతున్నారు. ఇన్నేళ్లుగా ఆడుతున్న తర్వాత ఒత్తిడి కొత్త కాదు. టైటిల్ గెలవాలంటే ఆటగాళ్లంతా రాణించాల్సి ఉంటుంది. అందరూ సమష్టిగా సత్తా చాటడంతోనే ఇది సాధ్యమైంది. సరైన, తగిన సమయం సమయం చూసి తప్పుకోవడం ముఖ్యం (రిటైర్మెంట్పై). –విరాట్ కోహ్లి
బిజినెస్

మీ బ్యాంక్ డిపాజిట్ ఎంత భద్రం?
ముంబైకి చెందిన ధన్‌రాజ్ (50) ఉదయం నిద్రలేచి, పేపర్ చూడగానే ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యాడు. న్యూ ఇండియా సహకార బ్యాంక్‌లో స్కామ్ జరిగిందనేది ఆ వార్త సారాంశం. చిరుద్యోగి అయిన ధన్‌రాజ్ తన కుమార్తె వివాహం కోసమని రూ.4 లక్షలను అదే బ్యాంక్‌లో కొన్నాళ్ల క్రితం డిపాజిట్ చేశాడు. కంగారుగా బ్యాంక్ శాఖకు చేరుకుని విచారించగా, డిపాజిట్లకు ఢోకా లేదన్న సమాచారం విని కాస్తంత కుదుటపడ్డాడు. రూ.5 లక్షల వరకు డిపాజిట్లపై బీమా సదుపాయం ఉంటుందని కస్టమర్లు చెప్పుకుంటుండగా విని.. హమ్మయ్య అని ఊపిరిపీల్చుకున్నాడు. బ్యాంక్ డిపాజిట్.. దేశంలో చాలా మందికి తెలిసిన, ఇష్టమైన పెట్టుబడి సాధనం. చాలా మంది తమ పొదుపు సొమ్మును డిపాజిట్ రూపంలో మదుపు చేయడం కూడా చూస్తుంటాం. కానీ, ఇందులో ఉండే రిస్క్ ల గురించి అవగాహన ఉండదు. డిపాజిటర్లు అందరూ దీనిపై ఓసారి దృష్టి సారించాల్సిన అవసరాన్ని న్యూ ఇండియా కో ఆపరేటివ్ బ్యాంక్ ఉదంతం గుర్తు చేస్తోంది. ఒకప్పుడు ప్రతి కుటుంబ ఆర్థిక సాధనాల్లో బ్యాంక్ డిపాజట్ (ఎఫ్డీ) తప్పకుండా ఉండేది. కాలక్రమంలో ఇతర సాధనాల పట్ల ఆసక్తి పెరుగుతూ వస్తోంది. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్, గోల్డ్ ఈటీఎఫ్‌లు తదితర వాటిల్లో పెట్టుబడులు పెరుగుతూ, డిపాజిట్లు తగ్గుతున్నాయి. ఇప్పటికీ 15 శాతం గృహ పొదుపులు బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లలోకే (ఎఫ్డీలు/టర్మ్ డిపాజిట్లు) వెళుతున్నట్టు గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఎఫ్డీలు ఎంతో మందికి నమ్మకమైన, మెరుగైన సాధనం. దీర్ఘకాలంలో గొప్ప రాబడి రాకపోయినా సరే, అత్యవసరంలో వేగంగా వెనక్కి తీసుకునేందుకు అనుకూలంగా ఉండడం చాలా మందికి నచ్చే అంశం. పైగా డిపాజిట్ అంటే ఏ మాత్రం రిస్క్ ఉండదని చాలా మంది అభిప్రాయపడుతుంటారు. ప్రభుత్వ గ్యారంటీ (సావరీన్) ఉంటే తప్పించి, బ్యాంక్ ఎఫ్డీ అయినా, ఏ ఇతర పెట్టుబడి సాధనంలో అయినా ఎంతో కొంత రిస్క్ ఉంటుంది. దీనిపట్ల ప్రతి ఒక్కరికీ అవగాహన అవసరం. మెరుగైన నియంత్రణలు ఎఫ్డీ ఎంతో ప్రాచుర్యానికి నోచుకోవడం వెనుక అందులోని సరళత్వం, భద్రత కీలకమని చెప్పుకోవాలి. ఏవో కొన్ని బ్యాంకు వైఫల్యాలను పక్కన పెడితే, మన దేశంలో బ్యాంకింగ్ రంగం పటిష్ట నియంత్రణల మధ్య కొనసాగుతుంటుంది. ప్రజల్లో నమ్మకం ఏర్పడడానికి ఇది కూడా ఒక కారణం. బ్యాంక్ యాజమన్యాలు/ఉద్యోగుల మోసపూరిత వ్యవహారం, రుణ వ్యాపారంలో దూకుడైన తీరు కొన్ని సందర్భాల్లో సమస్యలు, సంక్షోభాలకు దారితీయవచ్చు. ఎంత కట్టుదిట్టమైన నియంత్రణలు ఉన్నా కానీ, 2019లో పంజాబ్ అండ్ మహారాష్ట్ర కోపరేటివ్ బ్యాంక్, 2020లో యస్ బ్యాంక్, ఇప్పుడు న్యూ ఇండియా కోపరేటివ్ బ్యాంక్ సంక్షోభాలు చోటుచేసుకున్నాయి. అంతకుముందు గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ కరాడ్ ఉదంతాలూ గుర్తుండే ఉంటాయి. కనుక బ్యాంక్ డిపాజిట్లలోనూ రిస్క్ ఉంటుందని అర్థం చేసుకోవాలి. కాకపోతే మనదగ్గర ఆర్బీఐ పటిష్ట నియంత్రణల కారణంగా ఈ తరహా సంక్షోభాలు చాలా తక్కువగా కనిపిస్తుంటాయి.డిపాజిట్‌పై బీమా ఆర్బీఐ నియంత్రణ పరిధిలోని అన్ని బ్యాంకుల్లోనూ రూ.5 లక్షల వరకు డిపాజిట్‌కు బీమా రక్షణ ఉంటుంది. అసలు లేదా అసలుతోపాటు వడ్డీ కలుపుకుని రూ.5 లక్షలకు మించి ఉన్నప్పటికీ బీమా రూ.5 లక్షలకే పరిమితం. బ్యాంక్ ఏదైనా సంక్షోభం పాలైతే అప్పుడు ఒక్కో డిపాజిట్ దారుడికి గరిష్టంగా రూ.5 లక్షలు వెనక్కి వస్తాయి. సేవింగ్స్, ఫిక్స్డ్, కరెంట్, రికరింగ్ ఇలా అన్ని డిపాజిట్లకూ ఈ రక్షణ వర్తిస్తుంది. ఈ వ్యవహారం అంతా చూసేది ఆర్బీఐ అనుబంధ సంస్థ అయిన ‘డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా’ (డీఐసీజీసీ). ప్రతి రూ.100 డిపాజిట్‌పై రూ.12 పైసలు చొప్పున ప్రీమియం కింద బ్యాంక్‌లు డీఐసీజీసీకి చెల్లించాల్సి ఉంటుంది. ఒక బ్యాంక్‌కు చెందిన ఒకటికి మించిన శాఖలో డిపాజిట్లు ఉన్నప్పటికీ.. ఒక్కో ఖాతాదారుని పేరు మీద గరిష్ట బీమా రూ.5 లక్షలుగానే ఉంటుంది. కనుక ఒక బ్యాంక్‌లో రూ.5 లక్షలకు మించి చేసే డిపాజిట్‌పై కచ్చితంగా రిస్క్ ఉంటుందని అర్థం చేసుకోవాలి. ఒకవేళ ఒక వ్యక్తి వేర్వేరు బ్యాంకుల్లో డిపాజిట్లు చేస్తే.. అప్పుడు విడిగా ఒక్కో బ్యాంక్ పరిధిలో సంబంధిత వ్యక్తికి గరిష్టంగా రూ.5 లక్షల డిపాజిట్‌కు బీమా రక్షణ వర్తిస్తుంది.బ్యాంక్ కుదుటపడితే.. బ్యాంకులో మోసం కావచ్చు. లేదా లిక్విడిటీ సంక్షోభం తలెత్తవచ్చు. రుణ ఎగవేతలతో క్లిష్ట పరిస్థితుల్లోకి వెళ్లిపోవచ్చు. ఇలాంటి సందర్భాల్లో ఆర్బీఐ తప్పకుండా జోక్యం చేసుకుంటుంది. తాత్కాలిక నిర్వహణ బాధ్యతల కోసం బోర్డ్‌ను ఏర్పాటు చేస్తుంది. బ్యాంక్ వ్యవహారాలను లోతుగా పరిశీలించి, చక్కదిద్దే వరకు డిపాజిట్ల ఉపసంహరణపై పూర్తిగా లేదా పాక్షికంగా ఆంక్షలు విధిస్తుంది. పంజాబ్ అండ్ మహారాష్ట్ర కోపరేటివ్ బ్యాంక్‌లో రుణ అవకతవకలు సంక్షోభానికి దారితీయగా, ఆర్బీఐ దాన్ని చక్కదిద్దింది. అది ఇప్పుడు యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌లో భాగం అయింది. యస్ బ్యాంక్‌లోనూ రుణ మోసాలు బయటపడగా, కొత్త బోర్డ్‌ను ఏర్పాటు చేసి గాడిన పెట్టింది. రూ.5 లక్షలకు పైగా డిపాజిట్లు కలిగిన వారు.., రూ.5 లక్షలకు పైబడిన మొత్తాన్ని తిరిగి పొందడం కోసం బ్యాంక్ గాడిన పడే వరకు వేచి చూడాల్సిందే. అప్పటికీ పూర్తి మొత్తం వెనక్కి వస్తుందన్న గ్యారంటీ ఉండదు. ఎంత కోత పడుతుందన్నది బ్యాంక్ ఆర్థిక పద్దుల ఆరోగ్యంపైనే ఆధారపడి ఉంటుంది.బ్యాంకు నుంచే చెల్లింపులు బ్యాంక్‌లో సమస్య తలెత్తినప్పుడు డిపాజిట్‌దారులు డీఐసీజీసీని సంప్రదించాల్సిన అవసరం ఉండదు. బ్యాంక్ నిర్వహణ బాధ్యతలు చూసే బోర్డ్.. డిపాజిట్‌దారుల వివరాలతో జాబితాను డీఐసీజీసీకి పంపిస్తుంది. ఆ వివరాల వాస్తవికతను 30 రోజుల్లోపు డీఐసీజీసీ తేల్చాలి. అక్కడి నుంచి 15 రోజుల్లోపు డిపాజిట్‌దారులకు చెల్లించాల్సిన బీమా మొత్తాన్ని బ్యాంక్‌కు డీఐసీజీసీ బదిలీ చేస్తుంది. అప్పుడు ఖాతాదారులకు బ్యాంక్ సిబ్బంది చెల్లింపులు చేస్తారు. బ్యాంక్‌పై ఆంక్షలు విధించిన నాటి నుంచి 90 రోజుల్లో డిపాజిట్‌దారులకు బీమా మొత్తం వెనక్కి చెల్లించాలని నిబంధనలు చెబుతున్నాయి. విచారించుకున్న తర్వాతే.. ఆర్బీఐ పరిధిలోని అన్ని బ్యాంక్‌లు తప్పనిసరిగా డీఐసీజీసీ పరిధిలోకి వస్తాయి. అవి డిపాజిట్లపై బీమా ప్రీమియం కచ్చితంగా చెల్లించాల్సిందే. సందేహం ఉంటే డిపాజిట్ చేసే ముందు బ్యాంక్ అధికారిని అడిగి బీమా ఉందా? అని నిర్ధారించుకోవచ్చు. అన్ని ప్రభుత్వరంగ బ్యాంక్‌లు, ప్రైవేటు షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంక్‌లు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌లు, భారత్‌లో కార్యకలాపాలు నిర్వహించే విదేశీ బ్యాంక్‌లు, కో ఆపరేటివ్ బ్యాంక్‌లు, లోకల్ ఏరియా బ్యాంక్‌లు, రీజినల్ రూరల్ బ్యాంక్‌లు, పేమెంట్స్ బ్యాంక్‌లు, స్టేట్ కో ఆపరేటివ్ బ్యాంక్‌లు, అర్బన్ కో ఆపరేటివ్ బ్యాంక్‌లు డీఐసీజీసీ పరిధిలోకి వస్తాయి. ప్రైమరీ కో ఆపరేటివ్ సొసైటీలు మాత్రం దీని కిందికి రావు.అధిక వడ్డీ రేట్లు.. అన్నీ చూసాకే ప్రభుత్వరంగ బ్యాంక్‌లు, ప్రైవేటు యూనివర్సల్ బ్యాంకులతో పోల్చితే స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు డిపాజిట్లపై అధిక వడ్డీ రేట్లను ఆఫర్ చేస్తుంటాయి. స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు రుణాలపై అధిక రేట్లను చార్జ్ చేస్తుంటాయి. కనుక అవి డిపాజిట్లను ఆకర్షించేందుకు ఎక్కువ రేట్లను ఇస్తుంటాయి. ఏ బ్యాంక్ అయినా సరే అధిక వడ్డీ రేట్లను ఆఫర్ చేస్తుంటే, అందులో ఇన్వెస్ట్ చేసే ముందు ఈ రేషియోలను ఒక్కసారి పరిశీలించడం మంచిది. సీఆర్ఏఆర్: క్యాపిటల్ టు రిస్క్ అస్సెట్ రేషియో అని, దీన్నే క్యాపిటల్ అడెక్వెసీ రేషియో అని కూడా అంటారు. ప్రభుత్వరంగ బ్యాంక్‌లకు ఇది కనీసం 12 శాతంగా, ప్రైవేటు షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్‌లకు 9 శాతం మేర ఉండాలి. అదే స్మాల్ ఫైనాన్స్‌బ్యాంక్‌లకు 15 శాతం ఉండాలి. బ్యాంక్ తనకు ఎదురయ్యే చెల్లింపుల బాధ్యతలను ఎంత సమర్థంగా ఎదుర్కోగలదన్నది ఇది తెలియజేస్తుంది. ఎల్‌సీఆర్: లిక్విడిటీ కవరేజీ రేషియో 100 శాతం ఉండాలి. 30 రోజుల అవసరాలకు సరిపడా నిధులు బ్యాంకుల వద్ద ఉంచడం కోసం ఈ నిబంధన. దీనివల్ల లిక్విడిటీ షాక్‌లను బ్యాంక్‌లు సమర్థంగా ఎదుర్కోగలవు. అసలు రాబడి ఎంత? అత్యవసర నిధిని అట్టి పెట్టుకునేందుకు, స్వల్పకాలిక అవసరాలకు ఉద్దేశించిన నిధులను బ్యాంక్ డిపాజిట్లలో ఇన్వెస్ట్ చేసుకుంటానంటే ఫర్వాలేదు. కానీ, దీర్ఘకాల లక్ష్యాల కోసం నిధిని సమకూర్చుకునేందుకు, సంపద సృష్టికి బ్యాంక్ డిపాజిట్ మెరుగైన సాధనం కాబోదు. ఈక్విటీలపై దీర్ఘకాలంలో 12 శాతం, బంగారంలో 8 శాతం మేర సగటు రాబడి ఉంటోంది. ఈక్విటీ, బంగారంలో పెట్టుబడిని విక్రయించినప్పుడే లాభాలపై పన్ను చెల్లిస్తే సరిపోతుంది. బ్యాంక్ డిపాజిట్లపై అలా కాదు. ప్రతి ఏటా ఆర్జించే వడ్డీ రాబడి అదే ఏడాది ఇన్వెస్టర్ వార్షిక ఆదాయానికి కలిపి చూపించాలి. అవసరమైతే పన్ను చెల్లించాలి. ఎఫ్డీ రాబడిపై పన్ను చెల్లించగా, మిగిలే నికర రాబడి ద్రవ్యోల్బణ స్థాయిలోనే ఉంటుంది. కనుక డిపాజిట్లలో కాంపౌండింగ్ ప్రయోజనం పెద్దగా ఉండదు.బీమా మరింత పెంచేనా..? 2019లో పంజాబ్ అండ్ మహారాష్ట్ర కోపరేటివ్ బ్యాంక్‌లో సంక్షోభం తలెత్తిన తర్వాతే.. డిపాజిట్లపై రూ.లక్షగా ఉన్న బీమా పరిమితిని 2020 ఫిబ్రవరిలో రూ.5 లక్షలకు పెంచారు. ఈ బీమా రక్షణను మరింత పెంచాలన్న ప్రతిపాదన పరిశీలనలో ఉందని కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి ఎం.నాగరాజు ఇటీవల చేసిన ప్రకటన ఈ దిశగా డిపాజిటర్లలో అంచనాలను పెంచింది. ఇప్పటికిప్పుడు దీన్ని పెంచకపోయినా, భవిష్యత్తులో ఇందుకు తప్పక అవకాశం ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. ఎన్బీఎఫ్సీ డిపాజిట్ల సంగతేంటి? బజాజ్ ఫైనాన్స్, శ్రీరామ్ ఫైనాన్స్ తదితర డిపాజిట్లు స్వీకరించే ఆర్బీఐ అనుమతి కలిగిన ఎన్బీఎఫ్సీలు (ఎన్బీఎఫ్సీ–డీ) దేశంలో 25 ఉన్నాయి. వీటి పరిధిలో 2024 మార్చి నాటికి రూ.1,02,994 కోట్ల డిపాజిట్లు ఉన్నాయి. మరి ఉన్నట్టుండి వీటిల్లో ఏదైనా ఎన్బీఎఫ్సీకి నిధుల సమస్య తలెత్తితే పరిస్థితి ఏంటి? బ్యాంకుల్లో మాదిరి వీటిల్లో డిపాజిట్లకు డీఐసీజీసీ కింద ఎలాంటి బీమా రక్షణ లేదు. ఇవన్నీ ప్రజల డిపాజిట్లే కనుక వీటిని సైతం డీఐసీజీసీ కిందకు తీసుకురావాలన్న డిమాండ్లు ఉన్నాయి. వీటిల్లో డిపాజిట్ చేసే ముందు ఇన్వెస్టర్లు రిస్క్ లను అర్థం చేసుకోవాలి. బ్యాంకులకూ రేటింగ్ ఉండాలి.. ఎన్బీఎఫ్సీలు తమ నిధుల అవసరాల కోసం బాండ్లు, ఎన్సీడీలను జారీ చేస్తుంటాయి. సంబంధిత ఎన్బీఎఫ్సీ ఆర్థిక ఆరోగ్యం ఆధారంగా రేటింగ్ ఏజెన్సీలు క్రెడిట్ రేటింగ్‌ను ప్రకటిస్తాయి. నిబంధనల ప్రకారం రేటింగ్ తప్పనిసరి. బ్యాంక్‌లు సైతం బాండ్లను జారీ చేయాలంటే రేటింగ్ తీసుకోవాల్సిందే. కానీ బ్యాంక్ డిపాజిట్లకు వచ్చే సరికి ఈ తరహా రేటింగ్ విధానం లేకపోవడాన్ని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. బ్యాంక్ డిపాజిట్లకు సైతం రేటింగ్‌ను తప్పనిసరి చేయడం వల్ల పాలన మెరుగుపడుతుందని ఎన్ఎస్జీ అండ్ పార్ట్నర్స్ పార్ట్నర్ రవి భడానీ అభిప్రాయపడ్డారు. దీనివల్ల డిపాజిట్ చేసే సమయంలో ఆయా బ్యాంక్‌లకు సంబంధించి రిస్క్ ను ఇన్వెస్టర్లు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందన్న అభిప్రాయం వినిపిస్తోంది. అలా చేస్తే అప్పుడు బలహీన బ్యాంక్‌ల నుంచి అధిక రేటింగ్ ఉన్న బ్యాంకుల్లోకి డిపాజిట్లు తరలిపోయే రిస్క్ ఏర్పడుతుందని ఆర్బీఐ సెంట్రల్ బోర్డ్ డైరెక్టర్ సతీష్ మరాటే పేర్కొన్నారు. దీనికి బదులు మెరుగైన రేటింగ్ ఉన్న బ్యాంకులకు డిపాజిట్లపై బీమా ప్రీమియం తక్కువ వసూలు చేసే విధానం ఫలితమిస్తుందన్నారు. – సాక్షి, బిజినెస్ డెస్క్

టాటా స్టీల్ మూసివేత.. 900 మంది అప్పు తీర్చిన హాలీవుడ్ నటుడు
సౌత్ వేల్స్ లోని పోర్ట్ టాల్బోట్లోని టాటా స్టీల్ బ్లాస్ట్ ఫర్నేస్ మూసివేత తర్వాత అక్కడి వారి జీవితాలు దుర్భరంగా మారాయి. 2,800 మంది కార్మికుల ఉపాధిపై తీవ్ర ప్రభావం చూపింది. ఈ నేపథ్యంలో అదే ప్రాంతానికి చెందిన ప్రముఖ హాలీవుడ్ నటుడు మైఖేల్ షీన్.. తమ ప్రాంత ప్రజలను ఆదుకునేందుకు ముందుకువచ్చారు. సుమారు 900 మందికి చెందిన 1 మిలియన్ పౌండ్ల (సుమారు రూ.8 కోట్లు) రుణాలను తాను చెల్లించారు.ది క్వీన్, గుడ్ ఓమెన్స్, ట్విలైట్ చిత్రాల్లో నటించిన మైఖేల్ షీన్ బాధితుల ఆర్థిక భారాన్ని తగ్గించే బాధ్యతను తనపై వేసుకున్నాడు. షీన్ తన వ్యక్తిగత సంపాదన లోంచి 1,00,000 పౌండ్లు వెచ్చించి 900 మందికి సంబంధించిన రుణాలను తీర్చడం కోసం ఒక సంస్థను స్థాపించాడు. రుణ పరిశ్రమ ఎలా పనిచేస్తుందనే దానిపై మొదట్లో తనకు అవగాహన లేదని, కానీ మార్పు తీసుకురావాలని నిశ్చయించుకున్నానని షీన్ చెప్పాడు. మైఖేల్ షీన్ సీక్రెట్ మిలియన్ పౌండ్ గిఫ్ట్ గురించి త్వరలో ప్రసారం కానున్న ఛానెల్ 4 షోలో డాక్యుమెంట్ చేశారు.టాటా స్టీల్ మూసివేత ప్రభావంపోర్ట్ టాల్బోట్లోని టాటా స్టీల్ బ్లాస్ట్ ఫర్నేస్ మూసివేత ఈ ప్రాంతంలో సాంప్రదాయ ఉక్కు తయారీ ముగింపును సూచిస్తోంది. పునర్నిర్మాణ ప్రణాళికలో భాగంగా తీసుకున్న ఈ నిర్ణయం వల్ల గణనీయ సంఖ్యలో ఉద్యోగాలు కోల్పోవడంతోపాటు స్థానికులకు సైతం ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టింది. పోర్ట్ టాల్బోట్కు చెందిన షీన్.. కార్మికులు, వారి కుటుంబాల దుస్థితిని చూసి చలించిపోయారు. స్థానిక కేఫ్ ను సందర్శించిన సందర్భంగా ఆయన ఉద్యోగుల తొలగింపు భావోద్వేగాలను కళ్లారా చూశారు. ఉక్కు కార్మికులు తమ అనిశ్చిత భవిష్యత్తుపై కన్నీటి పర్యంతమయ్యారు. దీంతో వారిని ఆదుకునేందుకు ఏదైనా చేయాలని సంకల్పించారు.ఎవరీ మైఖేల్ షీన్?మైఖేల్ షీన్ బహుముఖ ప్రజ్ఞతోపాటు సామాజిక కారణాల పట్ల నిబద్ధతకు ప్రసిద్ధి చెందిన నటుడు. 1969లో వేల్స్ లోని న్యూపోర్ట్ లో జన్మించిన షీన్ రాయల్ అకాడమీ ఆఫ్ డ్రామాటిక్ ఆర్ట్ (రాడా)లో శిక్షణ పొంది నాటకరంగంలో తన కెరీర్ ను ప్రారంభించారు. ది క్వీన్ అండ్ ది స్పెషల్ రిలేషన్ షిప్ లో బ్రిటిష్ ప్రధాని టోనీ బ్లెయిర్ పాత్రలకు అంతర్జాతీయ ప్రశంసలు పొందాడు. తన నటజీవితానికి మించి, సామాజిక పోరాటకారుడైన షీన్.. తనను తాను "లాభాపేక్ష లేని నటుడిగా" ప్రకటించుకున్నాడు. తన సంపాదనను సామాజిక కార్యక్రమాల కోసం వెచ్చిస్తున్నాడు. ఇప్పుడే కాదు.. 2021లోనే అతను తన సంపదను ధార్మిక కార్యక్రమాలకు విరాళంగా ఇవ్వాలనే నిర్ణయాన్ని ప్రకటించాడు.

క్రెడిట్ కార్డు రూల్స్‌లో కీలక మార్పులు
ప్రభుత్వ రంగ బ్యాంక్ ఎస్బీఐ, ప్రయివేట్ ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంకులు తమ క్రెడిట్ కార్డు పాలసీల్లో కీలక మార్పులు చేస్తున్నాయి. ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ మైల్స్టోన్ టికెట్ వోచర్లతో సహా అనేక ప్రయోజనాలను నిలిపివేయనుండగా, ఎస్బీఐ తన క్లబ్ విస్తారా ఎస్బీఐ, క్లబ్ విస్తారా ఎస్బీఐ ప్రైమ్ క్రెడిట్ కార్డుల నిబంధనలను సవరించింది. 2025 ఏప్రిల్ 1 నుంచి ఈ మార్పులు అమల్లోకి రానున్నాయి.ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ క్రెడిట్ కార్డు మార్పులుఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ 2025 మార్చి 31 నుండి మైల్స్టోన్ టికెట్ వోచర్లు, పునరుద్ధరణ ప్రయోజనాలు, ఇతర ఫీచర్లను అందించడాన్ని నిలిపివేయనుంది. అయితే 2026 మార్చి 31 వరకు మహారాజా పాయింట్లు కొనసాగుతాయి. ఆ తర్వాత కార్డు పూర్తిగా నిలిచిపోతుంది. బ్యాంక్ ప్రకటన ప్రకారం కీలక మార్పులు ఇవే..క్లబ్ విస్తారా సిల్వర్ మెంబర్ షిప్ ఇకపై అందుబాటులో ఉండదు.వన్ ప్రీమియం ఎకానమీ టికెట్, వన్ క్లాస్ అప్ గ్రేడ్ వోచర్ తో సహా కాంప్లిమెంటరీ వోచర్లు నిలిచిపోతాయి.ప్రీమియం ఎకానమీ టికెట్లకు మైల్ స్టోన్ వోచర్లు ఇకపై జారీ కావు.2025 మార్చి 31 తర్వాత కార్డులను రెన్యువల్ చేసుకునే కస్టమర్ల వార్షిక రుసుమును ఏడాది పాటు రద్దు చేస్తారు.ఎస్బీఐ క్రెడిట్ కార్డు పాలసీల్లో మార్పులుక్లబ్ విస్తారా ఎస్బీఐ క్రెడిట్ కార్డుదారులకు ఎకానమీ టికెట్ వోచర్లు ఇకపై ఉండవు.రూ.1.25 లక్షలు, రూ.2.5 లక్షలు, రూ.5 లక్షల వార్షిక ఖర్చులకు మైల్ స్టోన్ బెనిఫిట్స్ నిలిపివేయనున్నారు.క్లబ్ విస్తారా ఎస్బీఐ ప్రైమ్ క్రెడిట్ కార్డు ఇకపై ప్రీమియం ఎకానమీ టికెట్ వోచర్లను అందించదు.బేస్ కార్డు రెన్యువల్ ఫీజు రూ.1,499, పీఎం కార్డు రెన్యువల్ ఫీజు రూ.2,999.వినియోగదారులకు ఫీజు మాఫీకి ఇంకా అవకాశం ఉంటుంది.మార్పుల వెనుక కారణంగత ఏడాది నవంబర్‌లో విస్తారా-ఎయిరిండియా విలీనం తర్వాత ఈ మార్పులు జరిగాయి. ఇది ఎయిరిండియా మహారాజా క్లబ్ లాయల్టీ కార్యక్రమంలో సర్దుబాట్లకు దారితీసింది. ఎస్బీఐ, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ తమ కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్ ప్రయోజనాలను సవరించగా, యాక్సిస్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్ ఇంకా ఎటువంటి మార్పులను ప్రకటించలేదు.

గుజరాతీలు జాబ్స్ ఎందుకు చేయరంటే..
వ్యాపారం, ఆర్థిక రంగాల్లో గుజరాతీల (Gujaratis) ఆధిపత్యం గురించి తెలిసిందే. అయితే వారు ఆయా రంగాల్లో అంతలా రాణించడానికి కారణాలు ఏంటి.. సంపద సృష్టిలో వారికున్న ప్రత్యేక లక్షణాలేంటి అన్న దానిపై పై స్టాకిఫీ వ్యవస్థాపకుడు అభిజిత్ చోక్సీ అద్భుతమైన విశ్లేషణ చేశారు. వారి ఆర్థిక ప్రభావాన్ని హైలైట్ చేసే గణాంకాలతో ఆయన ‘ఎక్స్’లో చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది.దేశంలోని 191 మంది బిలియనీర్లలో 108 మంది గుజరాతీలేనని రాసుకొచ్చిన చోక్సీ సంపద సృష్టిలో వారికున్న ప్రత్యేకతలను వివరించారు. చివరికి అమెరికాలో నివసిస్తున్న గుజరాతీ.. సగటు అమెరికన్ కంటే మూడు రెట్లు ఎక్కువ సంపాదిస్తున్నాడని చోక్సీ అభిప్రాయపడ్డారు. భారతదేశ జనాభాలో కేవలం 5% మాత్రమే ఉన్నప్పటికీ, గుజరాత్ దేశ జీడీపీకి 8% పైగా, దేశ పారిశ్రామిక ఉత్పత్తిలో 18% భాగస్వామ్యం వహిస్తోంది. భారత భూభాగంలో కేవలం 6% మాత్రమే ఉన్న గుజరాత్ దేశం మొత్తం ఎగుమతుల్లో 25% వాటాను కలిగి ఉంది.గుజరాతీల సక్సెస్‌కు కారణాలివే..మరి గుజరాతీలు వ్యాపారంలో అంత సక్సెస్ కావడానికి కారణం ఏమిటి? చోక్సీ ప్రకారం.. ఇది తరతరాలుగా వస్తున్న జ్ఞానం, వ్యవస్థాపక మనస్తత్వం, కొత్త మార్కెట్లను స్వీకరించడానికి, ఆధిపత్యం చేయడానికి సాటిలేని సామర్థ్యం కలయిక. గుజరాతీలు వ్యాపార, ఆర్థిక వ్యవహారాలను శాసించడానికి 20 కారణాలను ఆయన వివరించారు.ఉద్యోగాల (Jobs) కంటే వ్యాపారానికి తరతరాలుగా ప్రాధాన్యత ఇవ్వడమే ఈ విజయానికి కారణమని చోక్సీ పేర్కొన్నారు. "నౌకరీ తో గరీబోన్ కా దండా చే" (ఉద్యోగాలు పేదల కోసం) అనేది గుజరాతీ కుటుంబాలలో ఒక సాధారణ నమ్మకం. వ్యాపారం అనేదేదో నేర్చుకోవాల్సిన ఒక నైపుణ్యంలాగా కాకుండా గుజరాతీ పిల్లలు.. తమ కుటుంబాల్లో డబ్బును ఎలా నిర్వహిస్తున్నారు.. డీల్స్ ఎలా చేస్తున్నారు.. నష్టాలను ఎలా అంచనా వేస్తున్నారు.. అనేది నిత్యం చూస్తూ పెరుగుతారు.రిస్క్ తీసుకోవడం అనేది మరో ముఖ్యమైన లక్షణం. వజ్రాల ట్రేడింగ్ నుంచి స్టాక్ మార్కెట్ల వరకు గుజరాతీలు అనిశ్చితిని స్వీకరించి అవకాశాలను అందిపుచ్చుకుంటారు. ఈ మనస్తత్వం ప్రారంభ ఆర్థిక విద్య ద్వారా బలపడుతుంది. చాలా మంది పిల్లలు చిన్న వయస్సు నుండే కుటుంబ వ్యాపారాలలో సహాయపడతారు. ఏ ఎంబీఏ బోధించలేని రియల్ వరల్డ్ ఆర్థిక శాస్త్రాన్ని నేర్చుకుంటారు.నెట్ వర్కింగ్, కమ్యూనిటీ సపోర్ట్ కీలకం. రుణాలు, మార్గదర్శకత్వం, మార్కెట్ విషయంలో గుజరాతీలు ఒకరికొకరు చురుకుగా సహాయపడతారు. వారి పొదుపు జీవనశైలి కూడా ఒక పాత్ర పోషిస్తుంది. లాభాలను విలాసవంతంగా ఖర్చు చేయకుండా తిరిగి పెట్టుబడి పెడతారు. ఇది దీర్ఘకాలిక సంపద సేకరణకు దారితీస్తుంది.వివిధ పరిశ్రమల్లో గుజరాతీలు ఎలా ఆధిపత్యం చెలాయిస్తున్నారో కూడా చోక్సీ తెలియజేశారు. ప్రపంచంలోని 90 శాతం వజ్రాలను సూరత్ మాత్రమే ప్రాసెస్ చేస్తోందని, బెల్జియం, ఇజ్రాయెల్ లోని పోటీదారులను గుజరాతీ పారిశ్రామికవేత్తలు ఎలా అధిగమించారో ఆయన గుర్తు చేశారు. అదేవిధంగా, భారతదేశ స్టాక్ మార్కెట్ వ్యాపారులలో 60% పైగా గుజరాతీలు లేదా మార్వాడీలు ఉన్నారు.అమెరికాలో కూడా గుజరాతీలు వ్యాపార సామ్రాజ్యాలు నిర్మించుకున్నారు. అమెరికాలోని మొత్తం హోటళ్లలో 60 శాతానికి పైగా గుజరాతీ కుటుంబాలకు చెందినవేనని, ప్రధానంగా పటేల్ సామాజిక వర్గానికి చెందినవని చోక్సీ వెల్లడించారు. 1950వ దశకంలో చిన్న చిన్న పెట్టుబడులుగా ప్రారంభమైన ఈ పరిశ్రమ మల్టీ బిలియన్ డాలర్ల పరిశ్రమగా రూపాంతరం చెందింది.108 out of 191 Indian billionaires are Gujarati.A Gujarati living in America makes three times more than an average American.Gujarat, which has 5% of India’s population, contributes over 8% to the GDP and 18% of the industrial output.Gujarat has a land area of only 6% but… pic.twitter.com/ZId5idzCNS— Abhijit Chokshi | Investors का दोस्त (@stockifi_Invest) March 8, 2025
ఫ్యామిలీ

'యుద్ధాన్ని తలపించే పండుగ'..! కానీ అక్కడ అడుగుపెట్టారో..
శరవేగంగా పరుగులు తీసే గుర్రాలను అధిరోహించి, ఒకరిపై మరొకరు ఈటెలతో కలబడే ఆ దృశ్యాన్ని చూస్తే, అక్కడేదో యుద్ధం జరుగుతోందని ఎవరైనా పొరబడతారు. నిజానికి అది యుద్ధంకాదు, అక్కడి ప్రజలు జరుపుకొనే సంప్రదాయ పర్వదినం. ఇండోనేసియా తూర్పు ప్రాంతంలోని సుంబా దీవిలో జరిగే ఈ పండుగ పేరు ‘పసోలా’. ఏటా ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఈ పండుగను పంటకాలానికి ప్రారంభ సూచికగా జరుపుకొంటారు.పూర్వీకుల ఆత్మశాంతి కోసం, కుటుంబాల మధ్య అనుబంధాలను బలపరచుకోవడానికి, మూలాలను కాపాడుకోవడానికి ఈ పండుగ ఒక మార్గమని స్థానికులు చెబుతారు. ఈ పండుగలో ముఖ్యమైన ఘట్టం ఈటెల పోటీ. సత్తా ఉన్నవారంతా బరిలోకి దిగి, గుర్రాల మీద స్వారీ చేస్తూ, ప్రత్యర్థులతో కలబడతారు. ఎదురుగా దూసుకొచ్చే ఈటెలను తప్పుకోవడం ఒక ఎత్తయితే, గురిచూసి ఎదుటివారిని దెబ్బతీయడం మరో ఎత్తు. యుద్ధాన్ని తలపించే ఈ పోటీల్లో చాలామందికి గాయాలవుతుంటాయి.పసోలా అనే పదానికి సుంబా స్థానిక భాషల్లో ‘ఈటె విసరడం’ అని అర్థం. ఈ పోటీల్లో వినియోగించే ఈటెలను ‘హోలా’ అని పిలుస్తారు. ఈ పండుగ వెనుక పురాతన చరిత్ర ఉంది. స్థానిక పురాణాల ప్రకారం, పసోలా పండుగ ఆకాశంలో ఒకరితో ఒకరు పోరాడిన రెండు శక్తిమంతమైన ఆత్మల కథ నుంచి మొదలైందట! ఆ ఆత్మల సంఘర్షణ ఫలితంగా భూమిపై ఈటెల వర్షం కురిసిందట!. ఈ పౌరాణిక గాథ ప్రేరణతోనే ఈ పండుగ ప్రారంభమైంది. ఈ వేడుక కోసం గుర్రాలను పెంచడాన్ని గౌరవంగా, హోదాచిహ్నంగా భావిస్తుంటారు. పనికట్టుకుని ఈ పోటీలో పాల్గొనే పోటీదారులు తమ గుర్రాలను తామే పెంచుకుని, రోజుల తరబడి సాధన చేసి మరీ బరిలోకి దిగుతుంటారు. ఈ పోటీని చూడటానికి పెద్దసంఖ్యలో పర్యటకులు కూడా పోటెత్తుతారు. అడుగుపెడితే శిలైపోతారుభూమిపై ఇప్పటికీ అంతుచిక్కని రహస్యాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి వాటిలో ఉత్తర టాంజానియాలో ఉండే నాట్రాన్ సరస్సు ఒకటి. ఇందులోని నీరు నెత్తుటిలా ఎర్రగా ఉంటుంది. సరస్సంతా నెత్తుటి మడుగులా కనిపిస్తుంది. ఈ సరస్సును దయ్యాలు సృష్టించాయని, ఆ సరస్సులోకి మనుషులు గాని, జంతువులు గాని దిగితే, రాళ్లుగా మారిపోతారని స్థానికులు చెబుతుంటారు. అందుకే, సూర్యాస్తమయం తర్వాత ఎవరూ అక్కడ తిరగడానికి సాహసించరు. శాస్త్రవేత్తలు ఈ సరస్సును పరిశీలించి, ఈ సరస్సు నీటిలో సోడియం కార్బొనేట్, నైట్రో కార్బొనేట్ ఎక్కువగా ఉండటంతో, ఇందులోని నీరు ప్రాణాంతకంగా మారిందని తేల్చారు. ఈ సరస్సులోకి మనుషులు సహా ప్రాణులేవైనా వెళ్తే, ఇలా రాళ్లలా గడ్డకట్టిపోవడానికి గల కారణాలను మాత్రం శాస్త్రవేత్తలు ఇంకా కనిపెట్టలేకపోయారు. (చదవండి: గిన్నిస్‌కెక్కిన మహిళల వేడుక..!)

గిన్నిస్‌కెక్కిన మహిళల వేడుక..!
అందరూ మహిళలే జరుపుకొనే వేడుక ఇది. అత్యధిక సంఖ్యలో మహిళలు ఒకేచోట చేరి జరుపుకొనే కార్యక్రమంగా గిన్నిస్ బుక్‌లోకి ఎక్కిన అరుదైన వేడుక ఇది. ఈ వేడుకలో పాల్గొనడానికి పురుషులకు అనుమతి ఉండదు. తరతరాలుగా సాగుతున్న ఈ వేడుక కేరళ రాజధాని తిరువనంతపురం చేరువలోని అట్టుకల్ గ్రామంలో వెలసిన భగవతి అమ్మవారి ఆలయంలో జరుగుతుంది. ఏటా పదకొండు రోజుల పాటు జరిగే ఈ వేడుకలో లక్షలాది మంది మహిళలు పాల్గొంటారు.తిరువనంతపురం జిల్లా అట్టుకల్ గ్రామంలోని భగవతి అమ్మవారి ఆలయం చాలా పురాతనమైనది. అట్టుకల్ గ్రామంలో వెలసినందున ఈ అమ్మవారు ‘అట్టుకల్ భగవతి’గా ప్రసిద్ధి చెందింది. ఈ ఏడాది మార్చి 5 నుంచి 15 వరకు ఈ ఆలయంలో అట్టుకల్ భగవతి అమ్మవారి వేడుకలు జరుగుతున్నాయి. వేడుకల తొమ్మిదో రోజున లక్షలాది మంది మహిళలు ఇక్కడకు చేరుకుని, అమ్మవారికి పొంగలి నైవేద్యం సమర్పిస్తారు. ఈ కార్యక్రమాన్ని ‘అట్టుకల్ పొంగల్’ వేడుకగా పిలుస్తారు. తొమ్మిదో రోజున తిరువనంతపురం నగరంలోని అన్ని రహదారులూ అట్టుకల్ భగవతి అమ్మవారి ఆలయానికి వెళ్లే మహిళలతో కిటకిటలాడుతూ కనిపిస్తాయి. ఈ వేడుకల్లో పాల్గొనడానికి కేరళ నుంచే కాకుండా, ఇతర రాష్ట్రాల్లో స్థిరపడిన మలయాళీ మహిళలు పెద్దసంఖ్యలో ఇక్కడకు చేరుకుంటారు.ఇక్కడకు వచ్చే మహిళలు ఆలయ ప్రాంగణంలోను, ఆలయ పరిసరాల్లోని వీథుల్లోను ఇటుకలతో కట్టెల పొయ్యిలను ఏర్పాటు చేసుకుని, వాటి మీద పొంగలి, చక్కెరపొంగలి వండుతారు. ఆలయ ప్రధాన అర్చకుడు నిర్ణయించిన ముహూర్తానికి అందరూ ఒకేసారి పొయ్యిలు వెలిగించి వంట మొదలుపెడతారు. ముహూర్త సమయం ఆసన్నం కాగానే, అర్చకుడు గంట మోగిస్తాడు. అయితే, మహిళలు పొంగలి వండుతున్న ప్రదేశంలోకి ఆలయ అర్చకులు కూడా అడుగు పెట్టరు. ఈ వేడుకలో భాగంగా మహిళలందరూ తిరువనంతపురంలోని మనకాడు ప్రాంతంలో ఉండే శ్రీధర్మ శాస్త ఆలయం వరకు భారీ ఊరేగింపు జరుపుతారు. మొదటి రోజున ‘కప్పుకెట్టు’ కార్యక్రమంతో ఈ వేడుక మొదలవుతుంది. ఇందులో భాగంగా ‘కణ్ణగి చరిత’ను గానం చేస్తారు. ‘కణ్ణగి చరిత’గానం వరుసగా తొమ్మిది రోజుల పాటు జరుగుతుంది. చివరి రోజున ‘కురుత్తి తర్పణం’ పేరుతో తర్పణాలు విడిచిపెట్టడంతో ఈ వేడుకలు ముగుస్తాయి. వేడుక కొనసాగినన్ని రోజులూ అట్టుకల్ భగవతి అమ్మవారి ఆలయానికి చేరుకునే వీథులన్నీ రంగురంగుల అలంకరణలతో కనువిందు చేస్తాయి. ఈ వేడుకల సందర్భంగా వీథుల్లో ఏర్పాటు చేసే బహిరంగ వేదికలపై సంప్రదాయ నృత్య సంగీత సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. అట్టుకల్ పొంగల్ వేడుకలలో 1997 సంవత్సరంలో 15 లక్షల మందికి పైగా మహిళలు పాల్గొనడంతో తొలిసారి గిన్నిస్‌బుక్ రికార్డుల్లో నమోదైంది. ఆ తర్వాత 2009లో 25 లక్షలకు పైగా మహిళలు పాల్గొనడంతో మరోసారి గిన్నిస్‌బుక్‌లోకి ఎక్కింది. ఈ వేడుక ప్రశాంతంగా జరగడానికి వీలుగా కేరళ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లూ చేస్తుంది.(చదవండి: అంచనాలు నెరవేరకపోయినా..బంధం స్ట్రాంగ్‌గానే ఉండాలి..!)

అంచనాలు నెరవేరకపోయినా..బంధం స్ట్రాంగ్‌గానే ఉండాలి..!
అనిత, అరవింద్ ప్రేమించి, పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. యూనివర్సిటీ లెక్చరర్ అవ్వాలని అరవింద్ కలలు కన్నాడు. అదే లక్ష్యంగా చదువుతూ, అనితకు కూడా తన భవిష్యత్తుపై అదే ఆశను కల్పించాడు. కానీ పెళ్లయిన రెండేళ్ల తర్వాత, అరవింద్ తన ఆలోచన మార్చుకున్నాడు. అకడమిక్ కెరీర్ కంటే తనకు వ్యాపారం సరిపోతుందని భావించి, స్నేహితుడితో కలిసి టీవీ షోరూం ప్రారంభించాడు. అనితకు ఇది పెద్ద షాక్.అనిత ఎప్పుడూ ‘యూనివర్సిటీ ప్రొఫెసర్ భార్య’ అని తనను ఊహించుకుంది. కానీ అరవింద్ వ్యాపారం ప్రారంభించడం ఆమె అంచనాలను తారుమారు చేసింది. దాన్ని ఆమె భరించలేకపోయేది. ‘‘నువ్వు లెక్చరర్ అవుతావని నిన్ను పెళ్లి చేసుకున్నా!’’అంటూ తరచు విమర్శించేది. దానికితోడు వ్యాపారంలో అరవింద్‌కు నష్టం వచ్చింది. దాంతో అనిత విమర్శల జోరు పెరిగింది. ‘‘ఈ మాత్రం దాని కోసమేనా లెక్చరర్ ఉద్యోగం వద్దనుకుంది’’ అని దెప్పి పొడిచేది. కష్టాల్లో అండగా ఉండాల్సిన భాగస్వామి అలా మాట్లాడటం అరవింద్ మనసును తీవ్రంగా గాయపరిచింది. తనను తాను నిరూపించుకోవాలని అరవింద్ కసిగా పనిచేశాడు. వ్యాపారం పట్టాలెక్కింది. పట్టణంలో ఒక ప్రముఖ వ్యక్తిగా గుర్తింపు సంపాదించుకున్నాడు. తన వ్యాపారం పట్ల అరవింద్ ఎంత సంతోషంగా ఉన్నా, అనిత మాత్రం అతని మార్పును అంగీకరించలేదు. తన కలలను నాశనం చేశాడనే బాధ ఆమె మనసును దాటడంలేదు. దాంతో సూటిపోటి మాటలు అంటూనే ఉంది. దీంతో వారి మధ్య మాటలు తగ్గాయి. ఒకరి ఆనందాన్ని మరొకరు పంచుకోవడం మానేశారు. చివరకు ఒకరినొకరు ఇష్టపడటం కూడా మానేశారు. ఒకే ఇంట్లో ఉంటున్న ఇద్దరు అపరిచితులుగా మారిపోయారు.అంచనాలు నెరవేరకపోతే!?‘నా కలలు తుడిచిపెట్టుకుపోయాయి’ అనే భావనతో నిరాశ పెరుగుతుంది.‘నువ్వు నా జీవితాన్ని నాశనం చేశావు’ అంటూ విమర్శ తారస్థాయికి చేరుతుంది.‘ఇప్పటికైనా మారవచ్చు కదా’ అనే ఒత్తిడి పెరుగుతుంది. ‘ఇతను నా జీవితానికి సరైన వ్యక్తి కాదు’ అంటూ ప్రేమ తగ్గిపోతుంది ‘ఇదే కొనసాగితే విడిపోవడమే సరైన మార్గమేమో’ అనే ఆలోచన బలపడుతుంది.అసలైన సమస్య ఏమిటి?‘పెళ్లికి ముందు మాయ మాటలు చెప్పి నన్ను మోసం చేశాడు’ అని అనిత భావించడం.‘నా నిర్ణయాన్ని, నా కెరీర్ మార్పును భార్య అర్థం చేసుకోవడం లేదు!’ అని అరవింద్ భావించడం.నిజానికి ఇద్దరూ బాధితులే కాని, ఇద్దరూ ఒకరినొకరు బాధ్యుల్ని చేయడం.భాగస్వామి మారుతున్నప్పుడు మనం కూడా మారాలనే దృక్పథం లేకపోవడం.ఒకరి మార్పును మరొకరు అంగీకరించకపోవడం.ఆర్థిక భద్రత, భవిష్యత్తు పట్ల భయం సంబంధాన్ని దెబ్బతీసేలా మారడం. బంధాన్ని ఎలా కాపాడుకోవాలి? ‘నా దృష్టికోణం మాత్రమే నిజం’ అనే ఆలోచన వదలాలి. ‘అతను నన్ను మోసం చేశాడు’ అనే ఆలోచన పక్కనపెట్టి ‘అతనికి సంతోషం ఇచ్చే మార్గం మారిపోయింది. నేను దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు?’ అని ఆలోచించాలి.ఆశలకు, వాస్తవానికి మధ్య తేడా ఎక్కడుందో గుర్తించాలి. భర్త లెక్చరర్ అవ్వాలి, జీతం స్థిరంగా ఉండాలనేది అనిత ఆశ. భద్రత కంటే ఆనందం అరవింద్‌కు ముఖ్యం. ఈ తేడాను అంగీకరించకపోతే, సమస్య ఇంకా ఎక్కువ అవుతుంది!‘వ్యాపారంలో నష్టం వస్తే మన భవిష్యత్తు ఏమిటి?’ అనే భయాన్ని ‘మన ఇద్దరి భద్రత కోసం మనం కలిసి ప్లాన్ చేసుకోవచ్చు’ అని ప్రేమగా మార్చాలి.అరవింద్ అనితను ప్రేమించడంలేదని కాదు, అతను తన కలలను మార్చుకున్నాడు, కాని, అనిత తన ఊహల్లోనే ఉంది. కలిసుండాలంటే, ఒకరి కలలను మరొకరు అర్థం చేసుకోవాలి.అరవింద్ మారిన మార్గాన్ని అనిత అర్థం చేసుకోవాలి. భద్రత పట్ల ఉన్న అనిత భయాన్ని అర్థం చేసుకోవాలి. ఇద్దరూ సంపాదన, భద్రత, భవిష్యత్తు గురించి కలిసి చర్చించుకోవాలి.పెళ్లంటే ఒకరినొకరు మార్చడం కాదు, ఒకరి కోసం ఒకరు మారడమని, ఇద్దరూ కలిసి ప్రయాణం చేయడమని అర్థం చేసుకోవాలి. సంబంధాల్లో ప్రధానమైనది భాగస్వాముల ఆనందం. ఆర్థిక భద్రత అవసరమే కాని, అది మాత్రమే ప్రేమను నిర్వచించలేదు. పరిస్థితులకు అనుగుణంగా మన ఆలోచనలను సర్దుబాటు చేసుకోగలగాలిసైకాలజిస్ట్ విశేష్ www.psyvisesh.com(చదవండి: హీరోయిన్ నయనతారలాంటి స్టన్నింగ్ లుక్ కోసం..!)

భారతీయుల ఖర్చు మాములుగా లేదు..!
భారత్ ఖర్చు చేస్తోంది. షాపింగ్ ద్వారా సంతోషాన్ని కొని తెచ్చుకునేవారు కొందరైతే, ఇతరులకు పోటీగా హోదా ప్రదర్శించేవారు మరికొందరు. మారుమూల పల్లెలకూ ఇంటర్నెట్ చేరువ కావడం; చౌకగా డేటా లభించడం; విరివిగా స్మార్ట్ఫోన్ల వాడకం; ఈ–కామర్స్ దూకుడు; స్వదేశీ, విదేశీ బ్రాండ్ల మార్కెటింగ్ వ్యూహాలు; ఊరిస్తున్న ఫ్యాషన్ ప్రపంచం; ఊదరగొట్టే కంపెనీల ప్రకటనలు; సానుకూల మార్కెట్ వాతావరణం.. కారణం ఏదైతేనేం ప్రజల ఆదాయాల్లో వృద్ధి, మారుతున్న జీవన శైలి, పెరుగుతున్న ఆకాంక్షలు జనాలను ఖర్చుల వైపు నడిపిస్తున్నాయి. బ్యాంకింగ్, ఫిన్‌టెక్ కంపెనీలు టెక్నాలజీని ఆసరాగా చేసుకుని ప్రజలకు రుణాలను వేగంగా, విరివిగా అందించడమూ ఖర్చులకు ఆజ్యం పోస్తోంది. దినసరి కూలీలు, వేతన జీవులు, వ్యాపారస్తులు– ఉపాధిమార్గం ఏదైనా, ఆదాయం ఎంత ఉన్నా, డబ్బు ఖర్చుకు వెనుకాడడం లేదు. భారతీయులు తమ మొత్తం ఆదాయంలో అనవసర ఖర్చులకే 29 శాతం వెచ్చిస్తున్నారట! రూ.40 వేల కంటే అధిక ఆదాయం ఉన్న వ్యక్తులైతే అవసరాలను మించి అనవసర వ్యయాలు చేస్తున్నారంటే ప్రజలు హంగు, ఆర్భాటాలకు ఎంతలా ప్రాధాన్యమిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. మరీ విడ్డూరమేమిటంటే, రూ.20 వేలలోపు ఆదాయం ఉన్న అల్పాదాయ వర్గాల వారిలో ఆన్లైన్ గేమింగ్‌కు ఖర్చు చేస్తున్న వారి శాతం అత్యధికంగా 22% ఉంది. జనం ఎంతగా వెచ్చిస్తున్నారంటే, తాము చేసిన పెట్టుబడుల గడువు తీరక ముందే వాటిని ఉపసంహరించుకుని మరీ ఖర్చు చేస్తున్నారు.బలమైన వృద్ధి, పెరుగుతున్న మధ్య, అధిక–ఆదాయ తరగతి, డిజిటల్ మౌలిక సదుపాయాలు, వెరసి పెట్టుబడి, వినియోగదారుల కార్యకలాపాలకు ప్రపంచ హాట్‌స్పాట్‌గా భారత్ ఉద్భవించింది. భారత మార్కెట్లోకి భారీగా మూలధనం వెల్లువెత్తుతోంది. ప్రపంచంలోని ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో ఆర్థిక సేవల రంగంలో పెరుగుతున్న డిజిటలైజేషన్ తిరుగులేని ప్రభావాన్ని చూపుతోంది. పెరుగుతున్న మధ్యతరగతి, ఆదాయాల్లో వృద్ధి, విస్తరిస్తున్న గ్రామీణ మార్కెట్లు, మెరుగైన డిజిటల్ అనుసంధానత, జనాభాలో పెరుగుతున్న ఆకాంక్షల ఫలితంగా 2027 నాటికి భారత్ రెండు మెట్లు ఎక్కి ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద వినియోగదారుల మార్కెట్‌గా అవతరిస్తుందని పలు నివేదికలు చెబుతున్నాయి. దేశంలో వినియోగదారుల మార్కెట్ పరివర్తన దిశగా పయనిస్తోంది. వినియోగదారుల ప్రవర్తనలో శరవేగంగా మార్పులొస్తున్నాయి. వస్తువులు, సేవలకు డిమాండ్ పెరుగుతోంది.ఈ డైనమిక్ మార్కెట్లో భాగస్వామ్యం కోసం ఉవ్విళ్లూరుతున్న ఆర్థిక సంస్థలు, విధాన రూపకర్తలు, వ్యాపారులకు భారతీయులు ఖర్చు పెడుతున్న తీరును అర్థం చేసుకోవడం చాలా అవసరం. ‘భారత్ ఎలా ఖర్చు చేస్తోంది: వినియోగదారుల వ్యయాల తీరుతెన్నులపై లోతైన అధ్యయనం’ పేరుతో కన్సల్టింగ్, ఫైనాన్షియల్ అడ్వైజరీ సేవల్లో ఉన్న పీడబ్ల్యూసీ ఇండియా సహకారంతో ఫిన్‌టెక్ సాఫ్ట్వేర్ కంపెనీ పర్ఫియోస్ నివేదికను రూపొందించింది. 30 లక్షల మంది టెక్–ఫస్ట్ భారతీయ వినియోగదారుల లావాదేవీల సమాచారాన్ని విశ్లేషించి, వారు చేసే ఖర్చులను లోతుగా పరిశీలించింది. ఈ అధ్యయనం వివిధ ఆదాయ స్థాయులు, ప్రదేశాలలోని వ్యక్తుల ఖర్చు అలవాట్ల గురించి తెలియజేస్తుంది. భారతీయ వినియోగ, వ్యయ ధోరణులలోని మార్పులకు ఈ నివేదిక అద్దం పడుతుంది. ప్రజలు తప్పనిసరి ఖర్చులకు అత్యధిక మొత్తంలో డబ్బు కేటాయిస్తున్నారు. ఇది వారి మొత్తం వ్యయంలో 39 శాతం ఉంటోంది. అవసరాలకు 32 శాతం, హంగులు, ఆర్భాటాలు వంటి అనవసర ఖర్చులకు 29 శాతం వెచ్చిస్తున్నారు.అన్ని నగరాల్లోనూ వ్యక్తులు తమ ఆదాయంలో 33 శాతానికి పైగా నెల వాయిదాల (ఈఎంఐ) చెల్లింపులకు కేటాయిస్తున్నారు.అనవసర ఖర్చుల్లో 62 శాతం కంటే ఎక్కువ జీవనశైలి కొనుగోళ్లకు సంబంధించివే! అంటే ఫ్యాషన్, వ్యక్తిగత సంరక్షణ వస్తువుల షాపింగ్‌కు ఖర్చు చేస్తున్నారు.నెలకు రూ.20 వేల లోపు ఆదాయం ఉన్న ఎంట్రీ–లెవల్ సంపాదనపరుల్లో ఆన్లైన్ గేమింగ్‌కు ఖర్చు చేస్తున్న వ్యక్తుల సంఖ్య అత్యధికంగా 22 శాతం ఉంది.టైర్–1 నగరాల కంటే టైర్–2 నగరాల్లో ఇంటి అద్దెకు సగటున 4.5 శాతం ఎక్కువ ఖర్చు అవుతోంది. టైర్–2 నగరాల్లో నివసించే ప్రజలు వైద్య ఖర్చులకు సగటున రూ.2,450 వెచ్చిస్తున్నారు. మెట్రోలలో ప్రజలు నెలకు సగటున వైద్య ఖర్చులకు రూ.2,048 వెచ్చిస్తున్నారు.తప్పనిసరి ఖర్చులకు, అవసరాలు, అనవసర ఖర్చుల చెల్లింపులకు యూపీఐని ఎక్కువగా వినియోగిస్తున్నారు. అభివృద్ధి చెందుతున్న వినియోగదారుల దేశంగా భారత్ ఆకర్షిస్తోంది. 2023లో జీడీపీలో ప్రైవేట్ వినియోగం (వస్తు సేవలకు జనం చేసిన ఖర్చు) వాటా 60% నమోదు కావడం ఇందుకు నిదర్శనం. 2031 నాటికి ఏటా 13.4 శాతం వార్షిక సగటు వృద్ధితో దేశ వినియోగ ఆర్థిక వ్యవస్థ రూ.426.4 లక్షల కోట్లను తాకనుందని అంచనాలు ఉన్నాయి. పెరుగుతున్న మధ్యతరగతి, వస్తు సేవల వినియోగం, పట్టణీకరణ, పెరుగుతున్న ఆకాంక్షలు, యువజన జనాభా ఈ వృద్ధిని ముందుకు నడిపిస్తున్నాయి. వేతన జీవుల సంఖ్యలో 2019 నుంచి ఏటా సగటున 9.1 శాతం వృద్ధి నమోదవుతోంది. ఆదాయాల్లో స్థిర వృద్ధి గృహ వినియోగం పెరగడానికి, వస్తు సేవల గిరాకీకి కారణమవుతోంది. అయితే, భారతీయ కుటుంబాలు బ్యాంక్ డిపాజిట్లు, స్టాక్స్, బాండ్స్, లోన్ల వంటి తమ ఆర్థిక ఆస్తులలో క్షీణతను ఎదుర్కొంటున్న సమయంలో ఈ ధోరణి నెలకొనడం గమనార్హం. దేశ జీడీపీలో ఫైనాన్షియల్ అసెట్స్ వాటా 2022లో 7.2 శాతం నుంచి 2023లో 5.1 శాతానికి పడిపోయింది. గత యాభయ్యేళ్లలో ఇదే అత్యల్పస్థాయి అని ఆర్బీఐ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2024 నాటికి పర్సనల్ లోన్స్ 13.7 శాతం వార్షిక వృద్ధితో ఏకంగా రూ.55.3 లక్షల కోట్లకు చేరుకున్నాయంటే జనం ఏ స్థాయిలో ఖర్చు చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.డిజిటల్ అక్షరాస్యతవిభిన్న ఫీచర్లతో ఆకట్టుకుంటున్న స్మార్ట్ఫోన్లు, సామాన్యులకు చేరువైన టెలికం సేవలు 82 కోట్ల మంది భారతీయులకు ఇంటర్నెట్ను చేర్చింది. వాస్తవ వినియోగంలో ఉన్న స్మార్ట్ఫోన్ల వాటా మొత్తం జనాభాలో 72% మించిపోయింది. దేశంలో డిజిటల్ అక్షరాస్యత 38 శాతం ఉండగా, పట్టణ ప్రాంతాల్లో ఇది 61 శాతం ఉంది. వెబ్, మొబైల్ అప్లికేషన్లతో సేవలను అందించడం ద్వారా ఆర్థిక సేవల రంగం ఈ ధోరణిని ఉపయోగించుకుంటోంది. ఈ అంశమే వ్యక్తిగత రుణాల పెరుగుదలకు ఆజ్యం పోస్తోంది.ఆదాయాల జోరుదేశవ్యాప్తంగా 2019–24 మధ్య వ్యక్తుల వేతనాలు ఏడాదికి 9.1 శాతం కంటే ఎక్కువ రేటుతో పెరిగింది. వ్యక్తుల ఆదాయంలో ఈ పెరుగుదల వినియోగదారుల వ్యయాల తీరును నిర్ణయించే కీలక అంశాలలో ఒకటి. భారతీయుల తలసరి ఖర్చు చేయదగ్గ ఆదాయం 13.3 శాతం వృద్ధి రేటుతో 2023–24లో రూ.2.14 లక్షలకు పెరిగింది. 2023–24లో స్థూల పొదుపు 30 శాతం తగ్గింది. పొదుపులో తగ్గుదల పెరిగిన వ్యయాలను సూచిస్తుంది. ఉపాధి, ఉద్యోగ భద్రత2017–19 నుంచి 2022–23 మధ్య ఉపాధి రేటు 46.8 శాతం నుంచి 56 శాతానికి పెరిగింది. నిరుద్యోగ రేటు 6 శాతం నుంచి 3.2 శాతానికి తగ్గింది. పెరిగిన ఉపాధి రేటు వ్యక్తుల వినియోగ వ్యయం పెరగడానికి దోహదపడుతోంది.భావోద్వేగ వ్యయంసాధారణంగా వినియోగదారులు సంతోషం, ఒత్తిడి, ఆందోళన మొదలైన మానసిక స్థితి ద్వారా ప్రభావితం అవుతున్నారు. ఇది వారి వ్యయ ప్రవర్తనను ప్రభావితం చేస్తోంది. ఉదాహరణకు చాలామంది కస్టమర్లు తమ మానసిక స్థితిని మెరుగుపరచుకోవడానికి అంటే తమ సంతోషం కోసం ఇష్టమైన బ్రాండ్లు, నచ్చిన ఉత్పత్తులను కొనుగోలు చేసే రిటైల్ థెరపీలో పాల్గొంటున్నారు.సామాజిక ప్రభావంకుటుంబం, సహచరుల ప్రభావం, సామాజిక స్థితి, జీవనశైలి, సాంస్కృతిక ధోరణులు వంటి అనేక సామాజిక అంశాలు కస్టమర్ల ఖర్చు ప్రవర్తనను నిర్ణయిస్తాయి. ఉదాహరణకు తల్లిదండ్రులు చేస్తున్న ఖర్చులు, ఆదా చేసే విధానం వారి పిల్లల వ్యయ ప్రవర్తనపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. అలాగే, తోటివారి ఒత్తిడి యువ వినియోగదారులను వారి సామాజిక స్థితిని కొనసాగించడానికి, మెరుగుపరచడానికి ఖర్చు పెట్టేలా చేస్తోంది. భారతీయ సాంస్కృతిక పద్ధతులు వినియోగదారుల ఖర్చులను ప్రభావితం చేస్తున్నాయి. ఉదాహరణకు 2023 దీపావళి సీజన్లో భారత రిటైల్ మార్కెట్లో రూ.3.75 లక్షల కోట్ల విలువైన లావాదేవీలు జరిగాయి.సాంకేతికతతో వినియోగం దూకుడుటెక్నాలజీ అందుబాటులో ఉండటం, ఈ–కామర్స్ వృద్ధి, ఫిన్ టెక్ పరిష్కారాల పెరుగుదల భారతీయ వినియోగాన్ని దూసుకెళ్లేలా చేస్తున్నాయి. ఇంటర్నెట్, స్మార్ట్ఫోన్ల విస్తృతితో ఈ–కామర్స్ వృద్ధి వినియోగదారుల షాపింగ్ అనుభవాన్ని విప్లవాత్మకంగా మార్చింది. దేశంలో 2024లో ఈ కామర్స్ ఆధారిత అమ్మకాలు రూ.4,41,700 కోట్లు నమోదయ్యాయి. 2029 నాటికి ఏటా 11.45% వార్షిక వృద్ధితో ఇది రూ.7,59,200 కోట్లకు చేరుకుంటుందని అంచనా. ప్రభుత్వ విధానాలు, పన్నుల కారణంగా వివిధ ఉత్పత్తుల ధరలు ప్రభావితమవుతున్నాయి. ఆకట్టుకునే ప్రకటనలువినియోగదారుల ఖర్చును వ్యాపార ప్రకటనల ద్వారా కూడా ప్రభావితం చేయవచ్చు. ఇవి కస్టమర్లను ఆకట్టుకుంటూ, అమ్మకాలను మాత్రమే కాకుండా, బ్రాండ్ విధేయతను కూడా పెంచుతున్నాయి. దేశంలో ప్రకటన ఖర్చులు 2024లో 10.2 శాతం పెరిగి రూ.1,55,386 కోట్లు నమోదయ్యాయి. మార్కెట్ వాటాను పెంచుకోవడానికి, వినియోగదారులను ప్రభావితం చేయడానికి కంపెనీలు చేస్తున్న ప్రయత్నాన్ని ఈ గణాంకాలు సూచిస్తున్నాయి.ఈఎంఐలే తప్పనిసరి..తప్పనిసరి ఖర్చుల్లో గృహ, వాహన, వ్యక్తిగత రుణాలకు చెల్లించే ఈఎంఐలే సింహభాగం ఉంటున్నాయి. రుణ వ్యవస్థ సామాన్యులకు అందుబాటులోకి రావడంతో అప్పులు తీసుకోవడంలో వృద్ధి నమోదవుతోంది. ఆర్బీఐ డేటా ప్రకారం మొత్తం క్రెడిట్లో వ్యక్తిగత రుణాల వాటా 2023లో 30.6 శాతం నుంచి 2024 ఫిబ్రవరిలో 32.6 శాతానికి పెరిగింది. 2023 నాటికి మొత్తం రిటైల్ రుణాలలో గృహరుణాల వాటా ఏకంగా 47.2 శాతానికి చేరింది. ఈఎంఐలు 42 శాతానికి పెరిగాయి. మదుపు చేయడమూ తెలుసుఖర్చులే కాదు మదుపు చేయడమూ జనానికి తెలుసు. షేర్స్, బాండ్స్, మ్యూచువల్ ఫండ్స్‌ను నిల్వ చేసుకునే డీమ్యాట్ ఖాతాలు దేశవ్యాప్తంగా 2022 ఆగస్ట్ నాటికి 10 కోట్లు. 2025 జనవరి నాటికి ఈ సంఖ్య 18.8 కోట్లకు చేరిందంటే, పెట్టుబడుల పట్ల జనంలో ఆసక్తిపెరుగుతోందని చెప్పవచ్చు. మ్యూచువల్ ఫండ్స్ నిర్వహణలో ఉన్న ఆస్తులు (ఏయూఎం), బీమా, పదవీ విరమణ పొదుపులు 2013 నుంచి 2023 వరకు ఏటా 15% పెరిగాయి. బ్యాంక్ డిపాజిట్లు కూడా అదే కాలానికి 9% వార్షిక సగటు వృద్ధి నమోదు చేశాయి.(చదవండి: అంచనాలు నెరవేరకపోయినా..బంధం స్ట్రాంగ్‌గానే ఉండాలి..!)
ఫొటోలు
International View all

కెనడా కొత్త ప్రధానిగా మార్క్ కార్నీ
ఒట్టావా: కెనడాలో తొమ్మిదేళ్ల జస్టిన్ ట్రూడో(Justin Trudeau)

నీవల్లే కరోనా!.. చైనాకు అమెరికా కోర్టు జరిమానా
వాషింగ్టన్: డ్రాగన్ కంట్రీ చైనాకు అమెరికా భారీ షాకిచ్చింది

స్వామి నారాయణ్ ఆలయంపై...విద్వేష దాడి
న్యూయార్క్/న్యూఢిల్లీ: అమెరికాలో హిందూ ఆలయాలను లక్ష్యంగా చే

చైనా నుంచి మనూస్ ఏఐ
బీజింగ్: కొన్ని రోజుల క్రితం ‘డీప్‌సీక్’కృత్రిమ మేధ(

గర్భిణులు పారాసిటమాల్ వాడితే... పిల్లల్లో ఏడీహెచ్‌డీ!
కొందరు పిల్లలు చదువుతో పాటు ఆటపాటలు, అల్లరిలోనూ చురుగ్గా ఉంటారు. మరికొందరు మరీ అతి చురుకుదనం చూపిస్తారు.
National View all

రెండో విడత బడ్జెట్ సమావేశాలు నేటి నుంచే
సాక్షి, న్యూఢిల్లీ/చెన్నై: పార్లమెంట్ రెండో విడత బడ్జెట్ స

స్వామి నారాయణ్ ఆలయంపై...విద్వేష దాడి
న్యూయార్క్/న్యూఢిల్లీ: అమెరికాలో హిందూ ఆలయాలను లక్ష్యంగా చే

ఇస్రోకు మరో రెండు లాంచ్ ప్యాడ్లు
న్యూఢిల్లీ: వినూత్నమైన అంతరిక్ష ప్రయోగాల్లో దూసుకెళ్తున్న భా

ఉడ్తా కేరళ!
అందమైన అడవులు, కొండలు, లోయలతో దేవుడు తీరిగ్గా తీర్చిదిద్దినట్టుగా ఉండే కేరళ

సీఎం నితీష్‌కు మీరు ఏదో ఆఫర్ చేశారంట కదా?
పాట్నా: ఈ ఏడాది చివర్లో బీహార్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక
NRI View all

న్యూయార్లో ఘనంగా తెలుగువారి సంబరాలు.
అమెరికా వాణిజ్య రాజధాని న్యూయార్క్ లో తెలుగువారి సంబరాలు అంబరాన్ని అంటాయి.

ఆస్ట్రేలియాలో మహిళలపై లైంగిక దాడి.. భారతీయ ప్రముఖుడికి 40 ఏళ్ల జైలు శిక్ష
సిడ్నీ: ఆస్ట్రేలియాలో ఐదుగురు మహిళలపై లైంగిక దాడికి పాల్పడిన

విశాఖకు ఎన్నారై మహిళ ఎందుకొచ్చింది?.. ఆ రూమ్‌లో ఏం జరిగింది?
విశాఖ సిటీ: విశాఖలో ఖాకీ క్రైమ్ కథా చిత్రం..

లండన్‌లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు
బిందువు బిందువు కలిస్తేనే సింధువు అనే విధంగా యూకే లో నివసిస్తున్న తెలుగు మహిళలు అందరూ “తెలుగు లేడీస్ యుకె” అనే ఫేస్బుక్

న్యూజెర్సీలో నాట్స్ ఇమ్మిగ్రేషన్ సెమినార్
న్యూ జెర్సీ: అమెరికాలో తెలుగు వారి కోసం అనేక కార్యక్రమాలు చ
క్రైమ్

విశాఖకు ఎన్నారై మహిళ ఎందుకొచ్చింది?.. ఆ రూమ్‌లో ఏం జరిగింది?
విశాఖ సిటీ: విశాఖలో ఖాకీ క్రైమ్ కథా చిత్రం.. సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను తలపిస్తోంది. ఒక ఎన్ఆర్ఐ మహిళ, ఒక వైద్యుడు మధ్య ఏం జరిగిందన్న అంశం హాట్ టాపిక్‌గా మారింది. విశాఖకు చెందిన ఒక వైద్యుడు రెండు వారాలకు పైగా హోటల్లోనే ఎందుకు బస చేశాడు? అమెరికా పౌరసత్వం కలిగిన మహిళ విశాఖకు ఎందుకు వచ్చింది? ఆమె ఆ వైద్యుడు ఉన్న రూమ్ నెంబర్ 229లో ఎందుకు ఉంది? వారి మధ్య గొడవ జరగడానికి గల కారణమేంటి? కొద్ది నిమిషాల్లోనే ఆమె బాత్రూమ్లో నగ్నంగా విగతజీవిగా ఎలా మారింది?పోలీసులకు ఎవరు సమాచారమిచ్చారు? కిటికీ గానీ, హుక్గానీ లేని బాత్రూమ్లో ఆమె ఎలా ఉరి వేసుకుంది? ఆ సమయంలో వైద్యుడు అక్కడే ఉన్నాడా? రెండు రోజుల పాటు ఈ ఘటన బయటకు రాకుండా పోలీసులు ఎందుకు గోప్యంగా ఉంచారు? ఎఫ్ఐఆర్లో వైద్యుడి పేరును చేర్చారా? లేదా? అతడి సెల్ఫోన్లో ఎవరి ప్రైవేట్ వీడియోలు ఉన్నాయి? హోటల్ గదిలో పోలీసులు ఎటువంటి సామగ్రి గుర్తించారు? ఇంటెలిజెన్స్ అధికారులకు కూడా ఈ కేసు సమాచారం ఇవ్వకపోవడం వెనుక మర్మమేంటి? ఇలా ఒకటి కాదు.. రెండు కాదు.. అనేక ఊహకందని ప్రశ్నలు థ్రిల్లర్ సినిమాకు మించి సస్పెన్స్‌ను క్రియేట్ చేస్తున్నాయి. అయితే విశాఖ పోలీసులు మాత్రం ఆ ప్రశ్నలన్నింటినీ పక్కనపెట్టి.. సింపుల్‌గా అనుమానాస్పద మృతి అని తేల్చేశారు. ఈ కేసు విషయంలో పోలీసుల వ్యవహార శైలి తీవ్ర వివాదాస్పదమవుతోంది. గురువారం మధ్యాహ్నం ఘటన జరిగితే.. అదే రోజు సాయంత్రం ఎఫ్ఐఆర్ నమోదు చేసి కూడా శనివారం వరకు బయటకు రాకుండా ఉంచడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఇందుకోసం రూ.కోటి వరకు ఒప్పందం జరిగిందన్న ఊహాగానాలు చెలరేగుతున్నాయి. పోలీసుల తీరే ఈ ఆరోపణలు చెలరేగడానికి తావిస్తోంది. వైద్యుడు ఫ్యామిలీ ఫ్రెండ్? విశాఖకు చెందిన వైద్యుడు పిల్లా శ్రీధర్ రెండు వారాలకు పైగా హోటల్ మేఘాలయలో బస చేస్తున్నారు. సీతమ్మధార ప్రాంతానికి చెందిన కాకర్లపూడి రోజా ప్రస్తుతం వివాహం చేసుకొని యూఎస్‌లో స్థిరపడ్డారు. రోజా కుటుంబానికి శ్రీధర్ ఫ్యామిలీ ఫ్రెండ్‌గా తెలుస్తోంది. నాలుగు రోజుల క్రితం రోజా విశాఖకు వచ్చి శ్రీధర్ ఉన్న గదిలోనే ఉంటోంది. అయితే గత గురువారం వారిద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగినట్లు సమాచారం. కొద్ది నిమిషాల్లోనే ఆమె బూత్రూమ్లో అనుమానాస్పదంగా మృతి చెందింది. పోలీసులకు సమాచారం ఇచ్చింది ఎవరు? ఆమె మృతి చెందిన విషయాన్ని పోలీసులకు ఎవరు సమాచారం ఇచ్చారన్న విషయం సస్పెన్స్‌గా మారింది. అయితే మహిళ బాత్రూమ్లో ఉరి వేసుకొని చనిపోయిందని హోటల్ మేనేజర్ ఫిర్యాదు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. రూమ్‌లో శ్రీధర్ మాత్రమే ఉంటే.. హోటల్ మేనేజర్‌కు ఆమె చనిపోయిందన్న విషయం ఎలా తెలిసింది? ఆత్మహత్య చేసుకోవాలనుకునే రోజా ఎందుకు నగ్నంగా ఉంది. ఫ్యాన్ హుక్, కిటీకీ గానీ లేని బాత్రూమ్లో ఆమె ఎలా ఉరి వేసుకుంది? ఇలా అనేక ప్రశ్నలకు సమాధానాలు దొరకాల్సి ఉంది. పోలీసులు వచ్చిన సమయంలో శ్రీధర్ రూమ్‌లోనే ఉన్నారా? పోలీసులు అతడి పేరును ఎఫ్ఐఆర్లో నమోదు చేశారా? లేదా అన్న విషయం తేలాల్సి ఉంది. ఎందుకంత గోప్యం.. గురువారం మధ్యాహ్నం ఘటన జరిగితే అదే రోజు సాయంత్రం 5.30కి ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. శుక్రవారం రాత్రి విషయం బయటకు పొక్కడంతో మీడియా త్రీటౌన్ సీఐ రమణయ్యను సంప్రదించారు. అసలు అటువంటి ఘటనే జరగలేదని, తప్పుడు సమాచారమని చెప్పి తప్పించుకున్నారు. శనివారం ఉదయం ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళితే.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఇప్పటికీ కూడా ఈ కేసు పూర్తి వివరాలను పోలీసులు బయటకు వెల్లడించకపోవడం గమనార్హం.చదవండి: భర్త మటన్ కట్టింగ్.. ప్రియుడు కిరాణం షాపు.. చివరికి..కేసు మాఫీకి ప్రయత్నాలు? ఈ కేసును మాఫీ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఎన్ఆర్ఐ మహిళది హత్యా? ఆత్మహత్య? అన్నది తేలాల్సి ఉంది. ఆమెను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆ వార్తలకు పోలీసుల వ్యవహార శైలే బలాన్ని చేకూరిస్తున్నాయి. ఈ ఘటన బయటకు రాకుండా ఉండేందుకు భారీ స్థాయిలో ఒప్పందాలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇందులో ఒక ఉన్నతాధికారి పాత్ర కూడా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే శనివారం మహిళ మృతదేహానికి కేజీహెచ్‌లో పోస్టుమార్టం నిర్వహించారు. ఆ నివేదిక ఆధారంగా కేసులో చర్యలు తీసుకుంటామని నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి చెబుతున్నారు.

రన్యారావు కేసు కీలక మలుపు.. ఆమె శరీరంపై గాయాలు
బంగారం అక్రమ రవాణా కేసులో పట్టుబడిన నటి రన్యారావు(34) కేసు కీలక మలుపు తిరిగింది. తాజాగా ఆమెపై సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు. ఇక నుంచి ఆమె సీబీఐ బోనులోకి వెళ్లాల్సిందే. వారు అడిగే ప్రశ్నలకు ఉక్కిరిబిక్కిరి కావాల్సిందే. మరో రెండు రోజుల్లో ఆమెను సీబీఐ అధికారులు విచారించనున్నారు. రన్యారావును పోలీసులు విచారిస్తున్న క్రమంలో అనేక సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేవలం బంగారం అక్రమ రవాణా మాత్రమే కాకుండా సంఘవిద్రోహ శక్తులతో కూడా ఆమెకు సంబంధాలు ఉన్నట్లు వారు కనుగొన్నారు. సౌదీ అరేబియాతో పాటు అమెరికా, పశ్చిమాసియా, ఐరోపా దేశాలలో కూడా రన్యారావు ప్రయాణించినట్లు అధికారులు గుర్తించారు. ఈ కారణంతోనే సీబీఐ రంగంలోకి దిగింది.రన్యారావు నుంచి ఇప్పటికే 14 కిలోల బంగారు బిస్కెట్లు, రూ.2 కోట్ల విలువైన ఆభరణాలు, సుమారు రూ.3 కోట్ల నగదును డీఆర్ఐ అధికారులు జప్తు చేశారు. ఆమె వద్ద మొత్తం రూ. 18 కోట్ల ఆస్తులను గుర్తించినట్లు తెలుస్తోంది. ఆమెకు సంబంధించిన ఫోన్స్‌తో పాటు ల్యాప్‌టాప్‌లను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. ప్రస్తుతం ఆమె డీఆర్ఐ అధికారుల విచారణలో ఉంది. త్వరలో సీబీఐ అధికారులు కూడా ఆమెను ప్రశ్నించనున్నారు. వారు ఇప్పటికే పలు ఆధారాలను సేకరించే పనిలో ఉన్నారు.రన్యారావును విచారించిన డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ సంచలన విషయాలను తెలిపింది. ఆమె శరీరంపై పలుచోట్ల గాయాలున్నాయని తెలిపింది. అయితే, దుబాయ్‌కి వెళ్లక ముందే తనకు ఈ గాయాలు అయినట్లు ఆమె తెలియజేసిందని అధికారులు చెప్పారు. దీంతో ఆమెకు అవసరం అయితే వైద్య సాయం అందించాలని జైలు అధికారులను కోర్టు సూచించింది. రన్యారావు విచారణలో భాగంగా తమకు సహకరించడం లేదని డీఆర్ఐ అధికారులు కోర్టుకు తెలిపారు.

బ్యాంకింగ్ సంస్థల పేరిట బురిడీ!
సాక్షి, అమరావతి: బ్రాండింగ్ ముసుగులో సైబర్ నేరగాళ్లు పేట్రేగిపోతున్నారు. బ్యాంకింగ్, ఆర్థిక సంస్థల పేర్లతోనే అత్యధికంగా నిధులు కొల్లగొడుతున్నారు. రిటైల్, టెక్నాలజీ రంగాల పేరిట మోసాలు రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. ఇక సైబర్ నేరస్తులు నిధులు కొల్లగొట్టేందుకు ఫిషింగ్ యాప్‌లు, లింక్‌లనే ప్రధాన సాధనంగా చేసుకుంటున్నారు. ప్రముఖ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ ‘క్లౌడ్ సేక్’ దేశంలో సైబర్ నేరాల తీవ్రతపై తాజా నివేదికలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. 2025లో దేశంలో సైబర్ నేరగాళ్లు మరింతగా రెచ్చిపోయే అవకాశాలున్నాయని కూడా అంచనా వేసింది. నివేదికలోని ప్రధాన అంశాలివి..» బ్యాంకులు, ఆర్థిక సంస్థల పేరిట మోసాలే మొదటి స్థానంలో ఉన్నాయి. దేశంలో 39.5 శాతం సైబర్ నేరాలు బ్యాంకులు, ఆర్థిక సంస్థల పేరిటæ బురిడీ కొట్టించి నిధులు కొల్లగొడుతున్నారు. » రెండు, మూడు స్థానాల్లో రిటైల్/ఈ–కామర్స్, టెక్నాలజీ సంస్థలున్నాయి. రిటైల్ సంస్థల పేరుతో 21.4 శాతం, టెక్నాలజీ సంస్థల పేరిట 12.5శాతం సైబర్ నేరస్తులు బురిడీ కొట్టిస్తున్నారు. ఇక టెలీ కమ్యూనికేషన్ల సంస్థలు(9.1శాతం), ట్రావెల్ సంస్థలు(8.6శాతం), రియల్ ఎస్టేట్ సంస్థలు(2.5శాతం), బీమా కంపెనీలు(1.9%) పేరిట కూడా సైబర్ నేరస్తులు మోసాలకు పాల్పడుతున్నారు.» సైబర్ ముఠాలు అత్యధికంగా ఫిషింగ్ యాప్‌లు/లింకులనే తమ మోసాలకు సాధనంగా చేసుకుంటున్నాయి. ఫిషింగ్ యాప్‌లు/ లింకులు పంపి వాటిని క్లిక్ చేయగానే బ్యాంకు ఖాతాల్లో నిధులు కొల్లగొడుతున్నాయి. మొత్తం సైబర్ నేరాల్లో ఈ తరహా మోసాలు ఏకంగా 58% ఉండటం గమనార్హం. » తర్వాత స్థానాల్లో సోషల్ మీడియా మాధ్యమాలున్నాయి. ఫేక్ ఫేస్బుక్ ఐడీల పేరిట 25.7శాతం, యూట్యూబ్ ద్వారా 5.8శాతం, ఎక్స్( ట్విట్టర్) ఖాతాల ద్వారా 3.2శాతం, ఇన్స్టాగామ్ ద్వారా 2.5శాతం సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. » సైబర్ నేరస్తులు 2025లో దేశంలో ఏకంగా రూ.20 వేల కోట్లు కొల్లగొట్టే అవకాశం ఉందని అంచనా. దేశంలో సైబర్ మోసాలపై ఏకంగా 25 లక్షలకు పైగా ఫిర్యాదులు నమోదయ్యే అవకాశం ఉంది. వాటిలో 41 శాతం వరకు బ్యాంకింగ్, ఆర్థిక సంస్థల పేరిట మోసాలే ఉంటాయని భావిస్తున్నారు. ఇక దేశంలో మోసపూరితమైన యాప్‌లు 83 శాతం, ఫేక్ సోషల్ మీడియా ఖాతాలు 65 శాతం పెరగొచ్చని అంచనా.

‘అమ్మా..నాన్నా.. ఒక్కసారి మాట్లాడండి’
తిరుపతి: మండల కేంద్రమైన సైదాపురంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. గురువారం సైదాపురం–తిప్పవరపాడు మార్గమధ్యంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సైదాపురానికి చెందిన దొడ్డగా మునెయ్య, భార్య జ్యోతి అక్కడికక్కడే మృతిచెందారు. కుమార్తె వైష్ణవి రక్తగాయాలతో బయటపడింది. ఈ క్రమంలో శుక్రవారం సైదాపురంలో మృతదేహాలకు అంతిమ వీడ్కోలు పలికారు.కంటతడి పెట్టించిన కుమార్తెల మాటలుకళ్లెదుటే తల్లిదండ్రులు విగత జీవులుగా పడి ఉండడంతో ఆ పసి హృదయాలు తల్లడిల్లిపోయాయి. ‘అమ్మా..నాన్నా.. ఒక్కసారి మాట్లాడండి’ అంటూ వారిపై పడి గుండెలు బాదుకోవడం అక్కడి వారిని కలచివేసింది. గాయపడిన వైష్ణవి చివరగా తల్లిదండ్రుల అంతిమయాత్రలో టాటా చెప్పడం స్థానికులకు కన్నీళ్లు తెప్పించింది.గోకుల బృందావనంలో పుట్టి..మండల కేంద్రమైన సైదాపురం సమీపంలోనే ఉన్న గోకుల బృందావనం గ్రామంలో దొడ్డగ మునెయ్య జన్మించారు. ఆయనకు అన్నలు భాస్కర్, చంద్రయ్య ఉన్నారు. వారంతా గోకులబృందావనం గ్రామం వీడి సైదాపురానికి చేరుకుని అక్కడే స్థిరపడ్డారు. మునెయ్యకు పెళ్లి చేసి సైదాపురంలోనే ఇల్లు కటించి బాగోగులు చూసుకునే వారు. ఈ క్రమంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మునెయ్యతోపాటు భార్య జ్యోతి మరణించడంతో విషాదంలో మునిగిపోయారు. ముక్కుపచ్చలారని పసిబిడ్డలను వదిలివెళ్తున్నారా..! అంటూ కన్నీరుమున్నీరయ్యారు. మృతుని కుటుంబాన్ని వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ మన్నారపు రవికుమార్ పరామర్శించారు. మృతుని కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.‘అమ్మా..నాన్నా మమ్మల్ని వదిలి వెళ్లిపోయారా..!