Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today

Top Stories

ప్రధాన వార్తలు

Pawan Kalyan Faced Protests Every Where in AP1
ఝూటా వకీల్‌ సాబ్‌ పతనం మొదలైందా?

సూపర్ సిక్స్ హామీలు, ఎన్నికల ప్రణాళికలోని అంశాలతో తనకు సంబంధం లేనట్లు, అదేదో టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేశ్‌ల బాధ్యత అన్నట్లు ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ మాట్లాడుతున్నారు. ప్రశ్నించడానికే పార్టీని పెట్టానని గొప్పగా చెప్పుకున్న పవన్.. ఇప్పుడు చంద్రబాబు, లోకేశ్‌లను రాజకీయంగా మోయడానికి, తన ఉప ముఖ్యమంత్రి పదవిని ఎంజాయ్ చేయడానికే అన్నట్లు ప్రవర్తిస్తున్నారని విమర్శ. దీంతో ఆయనకు ఇప్పుడిప్పుడే నిరసన సెగ తగులుతోంది. కొద్ది రోజుల క్రితం విశాఖ, గిరిజన ప్రాంతాలకు వెళ్లినప్పుడు వలంటీర్లు పవన్‌ కల్యాణ్‌(Pawan Kalyan)ను నిలదీసే యత్నం చేశారు. ఇప్పటికే ఆయా చోట్ల వలంటీర్లు ధర్నాలు, ర్యాలీలు నిర్వహించారు. అయినా కూటమి ప్రభుత్వంలో కనీస స్పందన లేదు. కూటమి పెద్దలకు చీమ కుట్టినట్లుగా కూడా లేదు. దాంతో వలంటీర్లు నేతలను ప్రశ్నించడానికి సిద్ధమవుతున్నారు. నిజానికి వీరే కాదు. సూపర్ సిక్స్ తదితర హామీలు ఏమయ్యాయంటూ మహిళలు, నిరుద్యోగులు తదితర వర్గాలు నిరసన ర్యాలీలు చేయడం ఆరంభమైంది.వలంటీర్లకు సంబంధించి పవన్ చేసిన ప్రకటనను గమనిస్తే ఆయన ఎలా మాట మార్చుతున్నది ఇట్టే తెలిసిపోతుంది. గత ప్రభుత్వం వలంటీర్లను అధికారికంగా నియమించలేదని చంద్రబాబు, లోకేశ్‌లు క్యాబినెట్ సమావేశంలో చెప్పారని, వారికి ఇచ్చేది జీతం కాదు.. గౌరవ వేతనం మాత్రమేనని, అందుకే ఏమీ చేయలేదని తెలియ చేశారని పవన్ అన్నట్లుగా మీడియాలో కథనం వచ్చింది. లక్షన్నర మంది జీవితాలను నట్టేట ముంచేసి, అదేదో స్వల్ప విషయమన్నట్లుగా పవన్ వ్యవహరించడం శోచనీయం. 👉ఎన్నికల ప్రణాళికలో వలంటీర్లకు పదివేల జీతం ఇస్తామని, వారి సేవలను కొనసాగిస్తామని ప్రకటించింది వాస్తవం కాదా? పలు ఎన్నికల ప్రచార సభలలో పవన్ కళ్యాణ్ ఎన్నిసార్లు వలంటీర్ల అంశం ప్రస్తావించారో గుర్తు లేదా? వలంటీర్ల కడుపు కొట్టబోమని, అందులోను లక్షమంది యువతులకు అన్యాయం చేస్తానా? అని ప్రసంగించారు. వాస్తవానికి రాష్ట్రంలో రెండున్నర లక్షల మంది వలంటీర్లు ఉండే వారు. కాని ఎన్నికల సమయంలో సుమారు ఎనభై వేల నుంచి లక్ష మంది వరకు రాజీనామాలు సమర్పించారు. వైఎస్సార్‌ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఉంటే వారిని కూడా బాధ్యతలలోకి తీసుకునే వారు. కాని కూటమి ప్రభుత్వం రావడంతో తమకు గౌరవ వేతనం పెరుగుతుందని రాజీనామా చేయని వలంటీర్లు ఆశపడ్డారు. తీరా చూస్తే కూటమి ప్రభుత్వం అసలుకే మోసం తెచ్చింది. 👉వలంటీర్లు(Volunteers) అంటే స్వచ్ఛందంగా సేవలందించే వారని, వారికి గత జగన్ ప్రభుత్వం గౌరవ వేతనం ఇచ్చిందన్న సంగతి పవన్ కళ్యాణ్ కు తెలియదా? ఆ విషయం తెలియకుండానే, గుడ్డిగా చంద్రబాబుతో కలిసి ఎన్నికల ప్రణాళికపై సంతకం చేశారని నమ్మాలా? అదే వాస్తవం అయితే పవన్ కళ్యాణ్ ఈ పదవిలో ఉండడానికి అర్హుడవుతారా? పైగా క్యాబినెట్లో చంద్రబాబు, లోకేశ్‌లు ఏదో చెప్పారని వారిపై నెట్టేసి తప్పించుకునే యత్నం చేస్తారా? ప్రభుత్వంలో వారు ఏమి చేసినా సమర్థిస్తున్న పవన్ కళ్యాణ్ వలంటీర్ల విషయం తనకు ఏమీ తెలియదన్నట్లుగా నటించడం ధర్మమేనా?. వలంటీర్లకు ఇచ్చేది గౌరవ వేతనం కనుక ,వారికి ఆ బాధ్యతలు అప్పగించడం కుదరదని చంద్రబాబు, లోకేశ్‌ లు చెబితే పవన్ కళ్యాణ్ చెవిలో పువ్వు పెట్టుకుని విన్నారా?మనం హామీ ఇచ్చాం కదా! ఎందుకు చేయలేం. ప్రభుత్వం అనుకుంటే ఇది ఒక పెద్ద సమస్యా?అ ని పవన్ కళ్యాణ్ ప్రశ్నించి ఉండాలి కదా? ఉగాది పర్వదినానా పవిత్రమైన పూజలు నిర్వహించి మరీ వలంటీర్లకు హామీ ఇచ్చారు కదా? ఇప్పుడు కాదంటే పాపం కదా అని చంద్రబాబును అడగాలి కదా? అలా అడగలేదంటే ఏమిటి దాని అర్థం? వలంటీర్లు సామాన్యులు కనుక, వారిని ఏమి చేసినా ఏమీ కాదన్న భావనే కదా?. 👉జగన్ ప్రభుత్వం(Jagan Govt) విజయవంతంగా నిర్వహించిన వలంటీర్లు అంటే చంద్రబాబు, లేదా పవన్ కళ్యాణ్‌లకు ఎప్పుడూ గౌరవం లేదు. వారిని అసలు సమాజంలో గౌరవనీయమైన వ్యక్తులుగా చూడడానికి కూడా ఇష్టపడలేదు. చంద్రబాబు నాయుడు వీరిని మూటలు మోసే వారని, ఆడవాళ్ళు ఇళ్లలో ఉన్నప్పుడు వెళ్లి వేధించేవారని ఒకసారి నీచమైన రీతిలో వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ అయితే మరీ దారుణంగా వలంటీర్లను కిడ్పాపర్లతో పోల్చారు. ఏపీలో 30 వేల మంది అమ్మాయిలు తప్పిపోయారని అంటూ వలంటీర్లపై ఆరోపణలు చేశారు. కాని ప్రజలలో వలంటీర్ల పట్ల ఉన్న సానుకూలత వల్ల అది వైఎస్సార్‌సీపీకి ఎక్కడ అడ్వాంటేజ్ అవుతుందోనన్న భయంతో, మాట మార్చి తాము అధికారంలోకి వస్తే వలంటీర్లను కొనసాగించడమే కాకుండా, గౌరవ వేతనం రూ.ఐదు వేల నుంచి రూ.పది వేలు చేస్తామని ప్రకటించారు. అప్పటికి వారికి అధికారం వస్తుందన్న నమ్మం లేదు. కాని అనూహ్యంగా గెలిచేసరికి, ఇప్పుడు సూపర్ సిక్స్‌తో సహా అనేక అంశాలపై స్వరం మార్చుతున్నారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముందు సినీ నటుడు. ఆ తర్వాతే రాజకీయ నేత. సినిమాలలో వకీల్‌ సాబ్‌గా ఆయన నటన అభిమానులను మెప్పించింది. కానీ రాజకీయ జీవితంలో మాత్రం ఆయన వ్యవహారశైలి వకీల్‌సాబ్‌ పాత్రకు భిన్నంగా ఉంది. ఈ సంగతిని ప్రజలూ గుర్తిస్తున్నారు. కరడుకట్టిన, గుడ్డి అభిమానులు మినహా మిగిలిన వారిలో పవన్‌ కళ్యాణ్‌ మాట మార్చేస్తున్నారన్న భావన క్రమేపీ బలపడిపోతోంది. 👉అబద్దాలు బాగా ఆడతారన్న పేరు ఉన్న చంద్రబాబుకు తానా అంటే తందానా అని తబలా వాయిస్తున్న చందంగా పవన్ వ్యవహరిస్తున్నారు. ఆయనతో పోటీ పడి అసత్యాలు చెబుతున్నారు. తాము మాట మార్చుతున్నామని ధైర్యంగా పవన్ కళ్యాణ్ చెప్పి ఉంటే కొంతైనా బెటర్‌గా ఉండేది. అలా కాకుండా చంద్రబాబు, లోకేశ్‌లదే తప్పు అన్నట్లు, తనకేమీ సంబంధం లేదన్నట్లు పవన్ కళ్యాణ్ డ్రామా ఆడినట్లు డైలాగులు చెబితే ప్రజలను పిచ్చివాళ్లను చేసినట్లు కాదా? వలంటీర్లను మోసం చేయడం కాదా? 30 వేల మంది అమ్మాయిల మిస్సింగ్ గురించి ఏపీ అంతటా తిరిగి చేసిన ప్రచారం అంతా అసెంబ్లీ సాక్షిగా పచ్చి అబద్దం అని తేలింది కదా! కేవలం 47 మంది మాత్రమే మిస్ అయ్యారని, వారిలో ఎక్కువ మంది తిరిగి వచ్చారని అసెంబ్లీలో సమాధానం చెప్పింది కూటమి ప్రభుత్వమే కదా? పవన్ కళ్యాణ్ పచ్చి అబద్దం ప్రచారం చేసి ఆంధ్ర సమాజాన్ని చీట్ చేసినట్లు అవుతుందా? అవ్వదా?.చంద్రబాబు, లోకేశ్‌ల పట్ల పవన్ కళ్యాణ్ ఎంత విధేయుడిగా ఉన్నా ప్రజలకు అభ్యంతరం లేదు. కాని ఎన్నికల ప్రణాళికను చంద్రబాబుతో కలిసి ఆయన కూడా విడుదల చేశారన్న సంగతి మర్చిపోకూడదు కదా! వకీల్ సాబ్ పాత్రను సినిమాలలో పోషించడం కాదు.. ప్రజా జీవితంలో ఆ మాదిరి నిలబడితేనే మంచి పేరు వస్తుంది. పవన్ కళ్యాణ్ విశాఖ వెళ్లినప్పుడు ఆయన కాన్వాయ్ కోసం పోలీసులు ఆంక్షలు విధించడం, తత్పలితంగా సుమారు 30 మంది జెఈఈ పరీక్షలు రాయలేకపోయిన ఘటన కూడా కూటమి ప్రభుత్వ తీరుకు అద్దం పడుతుంది. పవన్ కళ్యాణ్ పదవిని ఎంజాయ్ చేసే మోజులో విద్యార్ధుల భవిష్యత్తును కూడా దెబ్బతీశారన్న విమర్శకు ఆస్కారం ఇచ్చారు. ఏది ఏమైనా వలంటీర్లను చంద్రబాబు, లోకేశ్‌లే కాదు.. పవన్ కళ్యాణ్ కూడా మోసం చేసినట్లే!. :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

GVMC Motion Updates: YSRCP Coporators Shocks Kutami Leaders2
విశాఖ: ప్రలోభాల పర్వంలో కూటమి నేతలకు ఛీత్కారాలు

విశాఖపట్నం, సాక్షి: అధికార దాహంతో.. గత 11 నెలల పదవి కాలంలో కూటమి ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేసింది. ఈ క్రమంలో ఇప్పుడు విశాఖ మేయర్‌పై అవిశ్వాసం వేళ (GVMC No Confidence Motion).. మరోసారి భారీగా ప్రలోభాలకు తెరలేపింది. ఈ క్రమంలోనే వైఎస్సార్సీపీ కార్పొరేటర్లకు గాలం వేసేందుకు కోట్లాది రూపాయలను మంచి నీళ్లలా ఖర్చు చేస్తోంది. అవిశ్వాసానికి సమయం దగ్గర పడుతుండడంతో కూటమి నేతలు ప్రలోభాల ఉధృతిని పెంచారు. వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్ల ఇళ్లకు వెళ్లి వాళ్ల కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నారు. భారీగా డబ్బు ఇస్తామని, భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా చూస్తామని హామీలు గుప్పిస్తున్నారు. అలాగే.. శ్రీలంక, కేరళ నుంచి విశాఖకు తీసుకురావడానికి ప్రత్యేక విమానం ఏర్పాటు చేస్తామంటున్నారు. విమానం కాకపోతే హెలికాప్టర్స్ అయినా ఏర్పాటు చేస్తామంటూ ఆఫర్లు చేస్తున్నారు. అయితే.. తాము వైఎస్సార్‌ అభిమానులమని, ఎలాంటి పరిస్థితుల్లోనైనా వైఎస్‌ జగన్‌(YS Jagan)తోనే ఉంటామని చెబుతూ వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు ఆ ఆఫర్లను తిరస్కరిస్తున్నారు. ఈ క్రమంలో బెదిరింపులకు సైతం కొందరు లొంగడం లేదని సమాచారం. దీంతో చేసేది లేక కూటమి నేతలు వెనుదిరుగుతున్నట్లు సమాచారం. జీవీఎంసీ(GVMC) ఎన్నికల్లో 58 స్థానాలను వైఎస్సార్‌ సీపీ కైవసం చేసుకుని మేయర్‌ పదవిని చేజిక్కించుకుందని, 30 స్థానాలు మాత్రమే గెలుచుకున్న టీడీపీ ఇప్పుడు మేయర్‌ పీఠాన్ని దక్కించుకోవాలనే దురాలోచనతో ఉంది. ఈ క్రమంలోనే భారీగా డబ్బు ఆశ చూపించడం, బెదిరింపులలాంటి అప్రజాస్వామిక ప్రయత్నాలకు దిగింది.

Bhagavad Gita, Natyashastra get Unesco honour3
Bhagavad Gita: గర్వించ దగ్గ క్షణం.. భగవద్గీతకు యునెస్కో గుర్తింపు

సాక్షి,న్యూఢిల్లీ: భగవద్గీతకు అరుదైన గుర్తింపు లభించింది. యునెస్కో మెమరీ ఆఫ్‌ వరల్డ్‌ రిజిస్టర్‌లో భగవద్గీతకు చోటు దక్కింది. భగవద్గీత,భరతముని రాసిన నాట్య శాస్త్రానికి గుర్తింపు లభించింది.ఈ ఘనతపై ప్రధాని మోదీ ఎక్స్‌ వేదికగా ట్వీట్‌ చేశారు. ‘భారత నాగరిక వారసత్వానికి ఒక చారిత్రాత్మక క్షణం ఇది. భగవద్గీత, భరతముని నాట్యశాస్త్రం ఇప్పుడు యునెస్కో మెమరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్‌లో లిఖించబడ్డాయని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఎక్స్‌వేదికగా ట్వీట్‌ చేశారు. ప్రధాని మోదీ స్పందిస్తూ రీట్వీట్ చేశారు.‘ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి భారతీయుడికి గర్వకారణమైన క్షణం ఇది. యునెస్కో మెమొరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్ లో గీత, నాట్యశాస్త్రం చేర్చబడటం మన కాలాతీత జ్ఞానం, గొప్ప సంస్కృతికి ప్రపంచవ్యాప్త గుర్తింపు. భగవత్ గీత,నాట్యశాస్త్రం శతాబ్దాలుగా నాగరికతను, చైతన్యాన్ని పెంపొందించాయి. అవి ప్రపంచానికి స్ఫూర్తినిస్తూనే ఉన్నాయి’ అని మోదీ పేర్కొన్నారు. A proud moment for every Indian across the world! The inclusion of the Gita and Natyashastra in UNESCO’s Memory of the World Register is a global recognition of our timeless wisdom and rich culture. The Gita and Natyashastra have nurtured civilisation, and consciousness for… https://t.co/ZPutb5heUT— Narendra Modi (@narendramodi) April 18, 2025

MI vs SRH: Ishan Kishan Walks up to Nita Ambani Receives Gentle Pat on Cheek4
నీతా అంబానీ దగ్గరికి వెళ్లిన ఇషాన్‌.. మాజీ ఓనర్‌ రియాక్షన్‌ ఇదే!

ఐపీఎల్‌-2025 (IPL 2025)లో ముంబై ఇండియన్స్‌- సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (MI vs SRH) మ్యాచ్‌ సందర్భంగా గురువారం ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. రైజర్స్‌ స్టార్‌ బ్యాటర్‌ ఇషాన్‌ కిషన్‌ (Ishan Kishan).. ముంబై జట్టు యజమాని నీతా అంబానీ (Nita Ambani)ని కలిశాడు. ముంబై చేతిలో ఓటమి అనంతరం తన మాజీ ఓనర్‌ దగ్గరకు వెళ్లి మర్యాదపూర్వకంగా పలకరించాడు.ప్రేమగా చెంప నిమిరిన మాజీ ఓనర్‌బదులుగా ఇషాన్‌ కిషన్‌ చేతిని పట్టుకుని.. తల్లి మాదిరి ప్రేమపూర్వకంగా నీతా అంబానీ అతడి చెంప నిమిరారు. ఓటమికి కుంగిపోవాల్సిన పనిలేదన్నట్లుగా ఇషాన్‌ను ఓదార్చారు. ఇందుకు సంబంధించిన ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.ఈ నేపథ్యంలో లక్నో సూపర్‌ జెయింట్స్‌ ఓనర్‌ సంజీవ్‌ గోయెంకాపై మీమ్స్‌ పేలుతున్నాయి. ‘‘తమ జట్టుతో ప్రయాణించిన మాజీ ఆటగాడి పట్ల నీతా తల్లిలా ప్రేమను కురిపిస్తుంటే.. గోయెంకా మాత్రం ఒక్క మ్యాచ్‌లో ఓడినా తమ కెప్టెన్లను అందరి ముందే ఉతికి ఆరేస్తాడు.. ఇదే ఈ ఇద్దరికి ఉన్న తేడా’’ అంటూ ముంబై అభిమానులు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.కాగా 2016లో ఇషాన్‌ కిషన్‌ ఐపీఎల్‌లో అరంగేట్రం చేశాడు. గుజరాత్‌ లయన్స్‌ అతడిని రూ. 35 లక్షల కనీస ధరకు కొనుగోలు చేయగా.. రెండేళ్ల పాటు అదే జట్టుకు ఆడి 319 పరుగులు చేశాడు.ముంబైతో సుదీర్ఘ అనుబంధంఅయితే, గుజరాత్‌ ఫ్రాంఛైజీ ఐపీఎల్‌ నుంచి కనుమరుగైన తర్వాత ముంబై ఇండియన్స్‌ ఇషాన్‌ కిషన్‌ను కొనుగోలు చేసింది. 2018 వేలంలో ఈ ఎడమచేతి వాటం బ్యాటర్‌ను సొంత చేసుకోగా.. రోహిత్‌ శర్మ కెప్టెన్సీలో ఆ ఏడాది 500కు పైగా పరుగులు సాధించాడు. అప్పటి నుంచి ఏడేళ్లపాటు ముంబై జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. 2022 వేలంలో అత్యధికంగా రూ. 15.25 కోట్ల ధర పలికాడు.రూ. 11.25 కోట్లకు రైజర్స్‌కు సొంతంఅయితే, మెగా వేలం-2025కి ముందు ముంబై ఇషాన్‌ కిషన్‌ను వదిలేసింది. ఈ క్రమంలో వేలంపాటలోనూ అతడిని కొనుగోలు చేసేందుకు పెద్దగా ఆసక్తి చూపించలేదు. ఇక అతడి కోసం ఇతర ఫ్రాంఛైజీలతో పోటీ పడి మరీ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ రూ. 11.25 కోట్లకు ఇషాన్‌ను కొనుక్కుంది. ఇప్పటి వరకు ఐపీఎల్‌-2025లో విధ్వంసకర శతకం (106 నాటౌట్‌) బాదడం మినహా ఇషాన్‌ ఆకట్టుకోలేకపోతున్నాడు. ఏడు మ్యాచ్‌లలో కలిపి అతడు సాధించిన పరుగులు 138. నాలుగు వికెట్ల తేడాతో సన్‌రైజర్స్‌ ఓటమిఇక ముంబై- సన్‌రైజర్స్‌ మధ్య మ్యాచ్‌ విషయానికొస్తే.. వాంఖడేలో టాస్‌ గెలిచిన హార్దిక్‌ పాండ్యా తొలుత బౌలింగ్‌ ఎంచుకున్నాడు. ఈ క్రమంలో బ్యాటింగ్‌ దిగిన కమిన్స్‌ బృందం.. నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది.లక్ష్య ఛేదనకు దిగిన ముంబై ఆరు వికెట్లు నష్టపోయి 18.1 ఓవర్లలో టార్గెట్‌ను పూర్తి చేసింది. బంతితో, బ్యాట్‌తో రాణించిన ముంబై ఆల్‌రౌండర్‌ విల్‌ జాక్స్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు అందుకున్నాడు. ఆఫ్‌ స్పిన్నర్‌ అయిన జాక్స్‌ మూడు ఓవర్ల బౌలింగ్‌లో కేవలం 14 పరుగులే ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. ట్రవిస్‌ హెడ్‌ (28), ఇషాన్ కిషన్‌ (2) రూపంలో రెండు కీలక వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక లక్ష్య ఛేదనలో వన్‌డౌన్‌లో వచ్చిన విల్‌ జాక్స్‌ 26 బంతుల్లో 36 పరుగులు సాధించాడు.చదవండి: ఇలాంటి వికెట్‌ మీద కష్టమే.. మా వాళ్లు నిర్లక్ష్యంగా ఆడలేదు.. కానీ: కమిన్స్‌Applying the finishing touches 🤌🎥 #MI skipper Hardik Pandya gave them the final flourish with a brilliant cameo of 21(9)Scorecard ▶ https://t.co/8baZ67Y5A2#TATAIPL | #MIvSRH | @mipaltan | @hardikpandya7 pic.twitter.com/hPI3CxwzLF— IndianPremierLeague (@IPL) April 17, 2025

Arjun son of Vyjayanthi Twitter Review5
'అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి' ట్విటర్‌ రివ్యూ

విజయశాంతి (Vijayashanthi), నందమూరి కల్యాణ్‌రామ్‌ (Nandamuri Kalyan Ram) తల్లీ కుమారులుగా నటించిన సినిమా ‘అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి’ (Arjun son of Vyjayanthi) నేడు (ఏప్రిల్‌ 18) విడుదల కావాల్సిన ఈ చిత్రం ఇప్పటికే ఓవర్సీస్‌లో బొమ్మ పడింది. నూతన దర్శకుడు ప్రదీప్‌ చిలుకూరి ఈ మాస్‌ చిత్రంతో డైరెక్టర్‌గా నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని అశోక క్రియేషన్స్‌, ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌పై అశోక్‌ వర్ధన్‌, సునీల్‌ నిర్మించారు. అమ్మ కోసం మనం ఎన్ని త్యాగాలైనా చేయొచ్చు అని చాటి చెప్పేలా అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి చిత్రం ఉందంటూ అభిమానులు చెబుతున్నారు.ఓవర్సీస్‌లో ఇప్పటికే అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి ఫస్టాఫ్‌ పూర్తి అయిందని చెబుతున్నారు. కళ్యాణ్ రామ్, విజయశాంతి యాక్టింగ్‌ పోటీపడి నటించారని చెబుతున్నారు. చాలారోజుల తర్వాత విజయశాంతిని మళ్లీ ఇలా పోలీస్ ఆఫీసర్‌గా చూడటం చాలా సంతోషంగా ఉందని కామెంట్లు చేస్తున్నారు. ఇప్పటివరకు రెగ్యులర్ కమర్షియల్ యాక్షన్ స్టోరీగా సినిమా ఉందంటున్నారు.. అయితే, కొన్ని యాక్షన్ సన్నివేశాలు బాగున్నాయంటున్నారు. ముఖ్యంగా నేపథ్య సంగీతం ఆ సన్నివేశాలకు మరింత బలాన్ని అందించాయని తెలుపుతున్నారు. ఫస్టాఫ్‌ వరకు కథాంశంలో ఎటువంటి ఆశ్చర్యకరమైన మలుపులు వంటివి లేవని నెటిజన్లు పోస్ట్‌లు పెడుతున్నారు. ఇలాంటి స్టోరీస్‌తో చాలా సినిమాలు వచ్చాయని అంటున్నారు. ఎన్టీఆర్‌ నటించిన జనతా గ్యారేజ్‌ చిత్రానికి దగ్గరగా అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి స్టోరీ ఉంటుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇంటర్వెల్ బ్లాక్స్‌లో కల్యాణ్‌రామ్‌, విలన్‌ల మధ్య వచ్చే భారీ యాక్షన్‌ సీన్‌ అదుర్స్‌లా ఉంటుందని ఒకరు తెలిపారు. ఇప్పటి వరకు అయితే, ఫస్టాఫ్‌ పూర్తి అయింద పెద్దగా కొత్తదనం ఏమీ లేదంటున్నారు. కానీ, యాక్షన్‌ సినిమాలు ఇష్టపడేవారిని ఈ చిత్రం ఎంతమాత్రం నిరాశపరచదని ఎక్కువమంది చెప్పడం విశేషం.ఇక ఇంటర్వెల్‌ తర్వాత ప్రీ క్లైమాక్స్ సన్నివేశాలు గూస్ బంప్స్ తెప్పించేలా ఉన్నాయని అంటున్నారు. కొడుకు కోసం తల్లి పడే ఆరాటం ఎలా ఉంటుంది ఈ చిత్రంలో చూడొచ్చన్నారు. అదే సమయంలో అమ్మ కోసం కొడుకు చేసే పోరాటాన్ని కూడా ఇందులో చూస్తారని చెబుతున్నారు. ఫస్ట్ హాఫ్ రొటీన్‌గా సాగడం.. సెకండ్ హాఫ్‌లో కొన్ని సన్నివేశాలు మరీ ఎక్కువగా సాగదీసినట్లు ఉండడం ఈ చిత్రంలో మైనస్ అని పేర్కొంటున్నారు. పెద్దగా ట్విస్ట్‌లు ఏమీ లేకున్నా తల్లి కొడుకుల సెంటిమెంట్, పవర్ ఫుల్ యాక్షన్ ఎపిసోడ్స్‌తో మెప్పించారని నెటిజన్లు తెలుపుతున్నారు. సినిమా ప్రమోషన్స్‌ సమయంలో చెప్పినట్లు క్లైమాక్స్‌ సీన్‌కు చాలామంది ఎమోషనల్‌ అవుతారని తెలుపుతున్నారు. సినిమా తప్పకుండా భారీ విజయం అందుకుంటుందని చెబుతున్నారు. పూర్తి రివ్యూ కోసం ఇంకాస్త సమయం పడుతుంది. ఇది కేవలం నెటిజన్ల అభిప్రాయం మాత్రమేBlockbuster reports for overseas Plus: pointsBest emotional 👍mass action 👌👌Peak climax💯🔥🔥Excellent bgm score💥💥Kalyanram come back 💯#ArjunSonOfVyjayanthi pic.twitter.com/V0W2IV0Bk3— Tarak cults 👑🐯🐅 (@gopiraju1993) April 18, 2025Just done with first half of #ArjunSonOfVyjayanthiUsual Formula or just an extended Janata Garage concept. Works fine in places. Visuals and Music are decent though songs didn’t catch on. Camera work is patchy, doesn’t look great with actors close up shots.Good to see… pic.twitter.com/7wJX8mtIxr— Majid (@iammajidzz) April 18, 2025Blockbuster talk from early shows 🔥@NANDAMURIKALYAN nailed it. Peak performance.Congratulations #ArjunSonOfVyjayanthi whole teampic.twitter.com/y3bxQSbEC3— Amaravati_Techie (@Amaravati_IT) April 18, 2025Just now watched the movies first half good and second half is excellent emotions worked very well Blockbuster movie 🔥🔥🔥🔥🔥🔥🔥🔥 #ArjunSonOfVyjayanthi pic.twitter.com/YjO96lB3bW— CMTarakMainFanPage🌐 (@tarakdevote9998) April 18, 2025#ArjunSonOfVyjayanthi Strictly Average 1st Half! Starts off with an interesting mother-son setup and has a few engaging sequences but quickly turns into a run of the mill and template commercial film. Music/BGM is a big drawback and fails to elevate the proceedings. Needs a…— Venky Reviews (@venkyreviews) April 18, 2025

Trump criticized Fed Chair Jerome Powell with his warnings6
ఫెడ్‌ ఛైర్మన్‌ను తొలగిస్తామని ట్రంప్‌ హెచ్చరిక

అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ ఛైర్మన్‌ జెరోమ్‌ పావెల్‌ తొలగింపు త్వరగా జరగకూడదని భావిస్తున్నట్లు అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పరోక్షంగా హెచ్చరించారు. పావెల్‌ పనితీరుపట్ల ట్రంప్‌ మండిపడ్డారు. ఇతర సెంట్రల్‌ బ్యాంకులు వడ్డీరేట్లను తగ్గిస్తున్నా తాను అనుకున్న విధంగా అమెరికా వేగంగా వాటిని తగ్గించడంలేదని అభిప్రాయపడ్డారు.తీవ్ర అనిశ్చితి పరిస్థితుల నేపథ్యంలో అమెరికా ఆర్థిక వ్యవస్థ మందగమనంలోకి అడుగుపెట్టొచ్చని ఫెడరల్‌ రిజర్వ్‌ ఛైర్మన్‌ జెరోమ్‌ పావెల్‌ ఇటీవల ఓ సమావేశంలో తెలిపారు. వినియోగదారుల వ్యయంలో మందగమనం సంభవించే అవకాశముందని, ముఖ్యంగా ఆర్థిక పరిస్థితులపై తీవ్ర అనిశ్చితి కొనసాగుతోందని వ్యాపార వర్గాల్లో అంచనాలు నెలకొన్న సమయంలో ఫెడ్‌ ఛైర్మన్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. ట్రంప్‌ ప్రభుత్వ విధానాలు ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపుతాయో అన్న అంశంపై స్పష్టత వచ్చే వరకు ఫెడ్‌ వడ్డీ రేట్లను తగ్గించడంలో ఏ మాత్రం తొందరపడబోమని పావెల్‌ స్పష్టం చేశారు. కానీ ట్రంప్‌ త్వరగా వడ్డీరేట్ల కోతను కోరుకుంటున్నారు.ఇదీ చదవండి: గ్రిడ్‌ స్థిరీకరణకు స్టోరేజ్‌ సిస్టమ్‌ఇమిగ్రేషన్, టాక్సేషన్, నియంత్రణలు, టారిఫ్‌ వంటి విధానపరమైన మార్పుల వల్ల ఆర్థిక వ్యవస్థపై కలిగే ప్రభావంపట్ల ఫెడరల్‌ రిజర్వ్‌ స్పష్టత కోరుతోందని పావెల్‌ పేర్కొన్న మరుసటి రోజే ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. యూరోపియన్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ (ఈసీబీ) ఎప్పుడో రేట్లు తగ్గించిందని ట్రంప్‌ అన్నారు. ఇకనైనా పావెల్‌ రేట్ల కోతకు పూనుకోవాలని సూచించారు. ఫెడరల్‌ రిజర్వ్‌ ఛైర్మన్‌గా జెరోమ్‌ పావెల్‌ తొలగింపు త్వరగా జరగకూడదని భావిస్తున్నట్లు ట్రంప్‌ పరోక్షంగా హెచ్చరించారు. పావెల్‌ పదవీ కాలం 2026 చివరి వరకు ఉంది. ఆయనను 2017లో ట్రంప్‌ ప్రతిపాదించారు. తర్వాత 2022లో బైడెన్‌ మరో నాలుగేళ్ల పాటు ఫెడ్‌ ఛైర్మన్‌గా కొనసాగించారు.

Experts Warn Common Cooking Oil Linked To Aggressive Breast Cancer7
అతిగా వంటనూనెలు వాడుతున్నారా..? నిపుణుల స్ట్రాంగ్‌ వార్నింగ్‌

ఇన్నాళ్లు వంటలు చేయగా మిగిలిన నూనెని తిరిగి వాడొద్దని హెచ్చరించేవారు. ఇప్పుడు ఏకంగా అసలు వంటనూనెలే వాడొద్దని వార్నింగ్‌ ఇచ్చేస్తున్నారు. పైగా అవి కేన్సర్‌ ప్రమాదాన్ని పెంచుతాయంటూ.. విస్తుపోయే విషయాలు చెబుతున్నారు. ఇదేంటి ఇంకేం వాడాలి వంటకు అన్న అనుమానం రావడం సహజమే. కానీ తాజా పరిశోధనలు వంట నూనెలు కేన్సర్‌ ప్రమాదాన్ని ప్రోత్సహిత్సాయని చెబుతున్నాయి. అంతేగాదు అదెలా జరుగుతుందో కూడా సవివరంగా వివరించారు పరిశోధకులు.వీల్ కార్నెల్ మెడిసిన్ పరిశోధకుల బృందం చేసిన పరిశోధనల్లో వంట నూనెలు, కూరగాయల నూనెలు అతిగా వాడకూడదని తేలింది. ఆ నూనెల్లో ఉండే లినోలెయిక్ కేన్సర్ కణాల పెరుగుదలను ప్రోత్సహిస్తుందట. ముఖ్యంగా రొమ్మ కేన్సర్‌(Breast Cancer)లోని కణాల్లో పెరుగుదల అనూహ్యంగా ఉంటుందని తెలిపాయి. అత్యంత ప్రమాదకరమైన ట్రిపుల్-నెగటివ్ రొమ్ము కేన్సర్‌ ప్రమాదాన్ని ఈ లినోయిక్‌ ఆమ్లం వేగవంతం చేస్తుందట. అంటే సాధారణ రొమ్ము కేన్సర్‌లో కంటే ఈ ట్రిపుల్‌ నెగటివ్‌లో కేన్సర్‌ కణాలు వేగంగా అభివృద్ధి చెందుతుంటాయి. ఇక మనం వాడే ఈ నూనెలు ఆ కేన్సర్‌ కణాలను మరింత అభివృద్ధి చేస్తాయని గుర్తించామని అంటున్నారు నిపుణులు. ముఖ్యంగా సోయాబీన్‌, కుసుమ నూనె వంటి సీడ్స్‌ ఆయిల్స్‌, పందిమాంసం, గుడ్లు వంటి జంతువుల్లో కనిపించే ఒమేగా 6 కొవ్వు ఆమ్లం లినోలెయిక్ చికిత్స చేయడానికే కష్టతరమైన ట్రిపుల్‌ నెగిటివ్ రొమ్ము కేన్సర్‌ పెరుగదలను ప్రత్యేకంగా పెంచగలదని పరిశోధనలో నిరూపితమైందన్నారు. లినోలెయిక్ ఆమ్లం FABP5 అనే ప్రోటీన్‌తో బంధించడం ద్వారా కేన్సర్‌ కణితి కణాలను మరింత వేగంగా అభివృద్ధి చెందేలా సక్రియం చేస్తుందని పరిశోధకులు గుర్తించారు. కానీ ఇతర హార్మోన్‌ సెన్సిటివ్‌ ఉప రకాల్లో అలా జరగడం లేదు. అంటే ఇక్కడ లినోలెయిక్ ఆమ్లం అధికంగా ఉన్న ఆహారం కేన్సర్‌ కణితి పెరుగుదల మెరుగ్గా ఉంచుతుందని క్లియర్‌గా నిరూపితమైందన్నారు. ఈ పరిశోధన ఆహార కొవ్వులు, కేన్సర్‌ మధ్య సంబంధాన్ని వివరించడంలో సహాయపడటటేమ గాక నిర్దిష్ట పోషక సిఫార్సులు ఏ రోగులకు ఎక్కువ ప్రయోజనం అనేది క్లియర్‌ నిర్వచించగలమని అంటున్నారు పరిశోధకులు. (చదవండి: నలుగురిలో కలవనివ్వకుండా చేసే వ్యాధి.. ! గంటల్లోనే నయం అయిపోతుందట..)

Vizag Gang allegedly cheated Women under the guise of a marriage bureau8
విశాఖలో కీచక ముఠా! 30 మంది యువతులకు మత్తు మందు ఇచ్చి..

విశాఖపట్నం, సాక్షి: కూటమి పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోతోంది. ఈ 11 నెలలకాలంలో అఘాయిత్యాలు పెరిగిపోయాయి. అదే సమయంలో విశాఖ నేరాలమయంగా మారిపోయింది. తాజాగా.. నగరంలో మ్యారేజ్‌ బ్యూరో పేరిట అరాచకాలకు పాల్పడుతున్న ఓ ముఠా గట్టు రట్టయ్యింది. యువతులకు మత్తు మందు ఇచ్చి అత్యాచారాలకు పాల్పడుతుండడమే కాకుండా.. ఆపై బ్లాక్‌మెయిల్‌ చేస్తున్న వ్యవహారం ఓ బాధితురాలు ముందుకు రావడంతో వెలుగు చూసింది. నాలుగో టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకున్న ఈ వ్యవహారం వివరాల్లోకి వెళ్తే.. మ్యారేజ్‌ బ్యూరో, హెర్బల్‌ ప్రొడక్ట్స్‌, టూవీలర్‌ రైడ్‌ యాప్‌ పేరిట ఓ ముఠా పెళ్లికాని అమ్మాయిల నుంచి వివరాలు సేకరిస్తోంది. ఆపై సంబంధాలు, ప్రొడక్టులను చూపించే వంకతో పరిచయాలు పెంచుకుంటోంది. మత్తు మందు ఇచ్చి యువతులు స్పృహలో లేనప్పుడు అత్యాచారం చేయడంతో పాటు వీడియోలు తీస్తోంది. సాక్షి టీవీతో బాధితురాలుఅలా ఇప్పటిదాకా 30 మంది యువతుల నగ్న వీడియోలను సేకరించి బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్నట్లు బాధితురాలు చెబుతోంది. ఒకవేళ గర్భం దాలిస్తే బలవంతంగా అబార్షన్‌లు చేయిస్తున్నారని తెలిపిందామె. గర్భం దాల్చిన తననూ అబార్షన్‌ చేయించుకోవాలని ఆ ముఠా ఒత్తిడి చేసిందని, లేకుంటే సుపారీ ఇచ్చి చంపేయిస్తామని బెదిరించిందని ఆమె పోలీసులను ఆశ్రయించింది. అయితే.. ఈ విషయంలో పోలీసుల నుంచి కూడా తనకు న్యాయం జరగడం లేదంటూ బాధితురాలు మీడియా ముందు వాపోయింది. ఆ ముఠాను ఆగడాలను కట్టడి చేసి.. నిందితులను కఠినంగా శిక్షించాలని బాధితురాలు కోరుకుంటోంది. ఈ వ్యవహారంపై, యువతి చేస్తున్న ఆరోపణలపై పోలీసులు స్పందించాల్సి ఉంది.

Threat Letters Against Cm Revanth Reddy And Minister In Mahabubnagar9
ఖబడ్దార్‌ రేవంత్‌.. ‘సీఎం పదవి నుంచి దించేస్తాం’

మహబూబ్‌నగర్‌,సాక్షి: మహబూబ్ నగర్‌లో లేఖ కలకలం సృష్టించాయి. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు ఉత్తంకుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిలను హెచ్చరిస్తూ రాసిన లేఖలు మహబూబ్‌ నగర్ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని నారాయణ్‌పేట్‌ జిల్లా మక్తల్‌లో వెలుగులోకి వచ్చాయి. ఆ లేఖలో ‘మేం నియోజకవర్గ కాంగ్రెస్‌ కార్యకర్తలం. సీఎం రేవంత్‌రెడ్డికి ఇదే మా హెచ్చరిక. ఖబడ్దార్. మీ పలుకుబడి ఉపయోగించి మా ఎమ్మెల్యేకి(మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి) మంత్రి పదవి రాకుండా చేశావో అప్పుడు నీ భరతం పట్టడం ఖాయం. రాష్ట్రంలో పార్టీ అడ్రస్‌ గల్లంతవుతుంది. మిమ్మల్ని సీఎం పదవి నుంచి దించడం’ అని హెచ్చరిస్తూ లేఖలో రాశారు.ముదిరాజు సామాజిక వర్గం పేరుతో ఆ లేఖలు వెలుగులోకి రావడంపై పోలీసులు రంగంలోకి దిగారు. ఆ లేఖలు ఎవరు రాశారా? అని ఆరా తీస్తున్నారు.ఆ లేఖలపై సమాచారం అందుకున్న ముదిరాజు సంఘం నేతలు పోలీసులు ఫిర్యాదు చేశారు. ఆ లేఖలతో తమకు సంబంధం లేదని పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Smita Sabharwal Tweet Against Telangana Government10
వెనక్కి తగ్గని ఐఏఎస్‌ స్మితా సబర్వాల్‌.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వరుస రీట్వీట్లు

హైదరాబాద్‌,సాక్షి: కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో మార్ఫింగ్‌ ఫొటోను రీ ట్వీట్ చేసిన ఐఏఎస్‌ స్మితా సబర్వాల్‌కు (Smita Sabharwal) తెలంగాణ పోలీసులు (telangana police) నోటీసులు ఇచ్చారు. అయితే, పోలీసులు నోటీసులు ఇచ్చిన ఐఏఎస్‌ స్మితా సబర్వాల్‌ వెనక్కి తగ్గడం లేదు. ప్రభుత్వ వ్యతిరేక ట్వీట్‌లను రీట్వీట్‌లు చేస్తున్నారు.కంచ గచ్చిబౌలి భూముల (Kancha Gachibowli row) ఇష్యూకు సంబంధించి పలువురు నేతలు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన పోస్టుల్ని డిలీట్‌ చేస్తున్నారు. కానీ ఐఏఎస్‌ స్మిత సబర్వాల్‌ మాత్రం వెనక్కి తగ్గడం లేదు.ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా వరుస ట్వీట్లు పెడుతున్నారు. తాజాగా, ప్రభుత్వ వ్యతిరేక ట్వీట్లపై వరుసగా రెండోరోజు రీపోస్ట్ చేశారు. వాటిల్లో 100 ఎకరాలను పునరుద్ధరించాలంటూ సుప్రీం ఆదేశాలు ఉన్న ఫొటో ఉంది. మరో పోస్టులో తెలంగాణ పోలీసులు సొంత ఐఏఎస్ అధికారికే నోటీసులిస్తరా? ఇది దేనికి సంకేతం?’ అంటూ ఓ ఇద్దరు మహిళలు పెట్టిన పోస్టును రీపోస్ట్ చేశారు. ఏఐతో క్రియేట్ చేసిన బుల్డోజర్లు, నెమళ్లు, జింకలు ఉన్న రెండు పోస్టులను స్మితా సబర్వాల్ రీపోస్ట్ చేయడం. ఆ పోస్టులకు వివరణ ఇవ్వాలంటూ తెలంగాణ పోలీసులు ఆమెకు నోటీసులు జారీ చేయడం..అయినప్పటికీ ప్రభుత్వ వ్యతిరేక ట్వీట్లను రీట్వీట్‌ చేయడంపై స్మితా సబర్వాల్ తీరుపై ఐఏఎస్ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement