Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Sajjala Ramakrishna Reddy Key Comments Over YSRCP Yuvatha Poru1
ప్రతీ పల్లెలో ఘనంగా వైఎస్సార్‌సీపీ ఆవిర్భావ వేడుకలు: సజ్జల

సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ ఈనెల 12న చేపట్టిన ‘యువత పోరు’ ద్వారా రాష్ట్రంలో యువతను, నిరుద్యోగులను మోసం చేస్తున్న కూటమి ప్రభుత్వ వైఖరిని నిలదీయాలని పార్టీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. అలాగే, 12వ తేదీన వైఎస్సార్‌సీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని వాడవాడలా పార్టీ ఆవిర్భావ వేడుకలను ఉత్సాహంగా జరుపుకోవాలన్నారు. ప్రతి పల్లెలోనూ పార్టీ జెండాలను ఎగురవేయాలని సూచించారు.యువత పోరు, పార్టీ ఆవిర్భావ దినోత్సవాలపై ఆదివారం తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులతో సజ్జల రామకృష్ణారెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘రాష్ట్ర వ్యాప్తంగా యువకులు, నిరుద్యోగులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కూటమి ప్రభుత్వం సకాలంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయకపోవడంతో లక్షలాది మంది విద్యార్ధులు ఆందోళన చెందుతున్నారు. మొత్తం రూ.3900 కోట్ల మేరకు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు ఉంటే ఈ బడ్జెట్‌లో కేవలం రూ.2600 కోట్లు కేటాయించడం దుర్మార్గం. అంటే విద్యార్ధుల సంఖ్యను కూడా కుదించేందుకు ఈ ప్రభుత్వం కుట్ర చేస్తోంది.బకాయిలు పెండింగ్‌..పేద, మధ్యతరగతి విద్యార్ధులను చదువులకు దూరం చేసేలా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. అయిదు త్రైమాసికాలుగా ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పెండింగ్ పెట్టడం రాక్షసత్వం. ఫీజులు చెల్లించకపోవడంతో కాలేజీల నుంచి విద్యార్ధులను వెళ్లగొడుతున్నారు. దిక్కుతోచని స్థితిలో చదువులు మధ్యలో ఆగిపోతున్నా సర్కారు చోద్యం చూస్తోంది. పేద పిల్లలకు పెద్ద చదువులు సాకారం చేస్తూ ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని ఆనాడు మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి తీసుకువచ్చారు. నిరుపేద ఇళ్ల నుంచి డాక్టర్లు, ఇంజనీర్లు, సైంటిస్టులు తయారు కావాలన్న సమున్నత లక్ష్యంతో నాడు ఫీజు రీయింబర్స్‌మెంట్ కు శ్రీకారం చుట్టారు.చంద్రబాబు సర్కార్ 2014-19 మధ్యలో ఈ పథకానికి తిలోదకాలు ఇచ్చింది. ఉద్దేశపూర్వకంగా బకాయిలు పెట్టి, కాలేజీ యాజమాన్యాలను, విద్యార్ధులను ఇబ్బందుల పాలు చేసింది. వైఎస్సార్‌ బాటలో మరో రెండు అడుగులు ముందుకు వేసిన వైఎస్‌ జగన్ 93 శాతం మంది విద్యార్ధులకు మేలు చేసేలా ఈ పథకాన్ని విస్తరింపచేశారు. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు కూటమి సర్కార్ ఈ పథకాన్ని నీరు గార్చేందుకు ప్రయత్నిస్తోంది.నిరుద్యోగులను వంచిస్తున్న కూటమి..కూటమి ప్రభుత్వంపై యువతలోనూ ప్రభుత్వం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. నిరుద్యోగ యువతకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీని విస్మరించారు. ఇరవై లక్షల ఉద్యోగాలు లేదా ప్రతినెలా మూడు వేల రూపాయల చొప్పున నిరుద్యోగ భృతి చెల్లిస్తామంటూ ఇచ్చిన హామీ ఏమైంది?. ఈ హామీని అమలు చేయాలంటే ఏడాదికి రూ.7200 కోట్లు అవసరం. కానీ గత బడ్జెట్ లో దీనికి కేటాయింపులు లేవు. ఈ ఏడాది బడ్జెట్ లోనూ పైసా కూడా కేటాయించలేదు.మెడికల్‌ కాలేజీలు ప్రైవేటుపరం..ప్రజారోగ్య రంగాన్ని బలోపేతం చేసేందుకు వైఎస్సార్‌సీపీ హయాంలో పదిహేడు కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టారు. ఇందులో అయిదు కాలేజీల నిర్మాణం పూర్తై, తరగతులు కూడా ప్రారంభమయ్యాయి. మిగిలిన వాటిల్లో నిర్మాణపనులు పూర్తిచేసి, తరగతులను ప్రారంభించాల్సి ఉంది. కానీ వాటిని కూడా ప్రైవేటీకరించేందుకు కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తోంది. ఇచ్చిన మెడికల్ సీట్లను కూడా వద్దంటూ రాష్ట్రప్రభుత్వమే లేఖ రాయడం దుర్మార్గం. 2019లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎనిమిది వేల కోట్ల రూపాయలకు పైగా నిధులతో ఒకేసారి పదిహేడు ప్రభుత్వ వైద్య కళాశాలలకు శ్రీకారం చుట్టింది.వీటిల్లో విజయనగరం, ఏలూరు, రాజమహేంద్రవరం, మచిలీపట్నం, నంద్యాల కాలేజీలు 2023లో ప్రారంభమయ్యాయి. వీటి ద్వారా అదనంగా 750 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వచ్చాయి. 2019 వరకు రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలో కేవలం 11 వైద్య కాలేజీలే ఉండేవి. వందేళ్ళ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒకేసారి 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని చేపట్టిన ఘనత వైఎస్‌ జగన్‌కు దక్కుతుంది. అయితే కొత్త మెడికల్ కాలేజీలను, వాటిద్వారా వచ్చే సీట్లను కూటమి ప్రభుత్వం అడ్డుకుంటోంది. వాటిని ప్రైవేటుపరం చేసేందుకు ప్రయత్నిస్తోంది.విద్యార్థి సంఘాలు కలిసి రావాలి..ఈ తరుణంలో ప్రధాన ప్రతిపక్షంగా వైఎస్సార్‌సీపీ.. యువతకు, విద్యార్ధులకు అండగా నిలిచి ప్రభుత్వం విధానాలపై పోరాడాలి. అందుకోసం తలపెట్టిన యువత పోరులో కలిసి వచ్చే అన్ని విద్యార్థిసంఘాలు, యువజన సంఘాలతో వైఎస్సార్‌సీపీ నేతృత్వంలో శాంతియుతంగా నిరసన కార్యక్రమాలను నిర్వహించాలి. అన్ని జిల్లా కలెక్టరేట్ల ఎదుట విద్యార్థులు, నిరుద్యోగులు, యవతతో కలిసి వైఎస్సార్‌సీపీ శ్రేణులు ప్రదర్శన, ధర్నా కార్యక్రమం చేపట్టాలి. అనంతరం కలెక్టర్లకు సమస్యలపై విజ్ఞాపన పత్రాలు అందజేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని జిల్లా పార్టీ అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు, మండల స్థాయి నేతలు సమన్వయంతో విజయవంతం చేయాలి.వాడవాడలా పార్టీ ఆవిర్భావ వేడుకలు..ఈనెల 12వ తేదీ వైఎస్సార్‌సీపీ ఆవిర్భావ దినోత్సవం. రాష్ట్రంలోని వాడవాడలా పార్టీ ఆవిర్భావ వేడుకలను ఉత్సాహంగా జరుపుకోవాలి. ప్రతి పల్లెలోనూ పార్టీ జెండాలను ఎగురవేయాలి. ప్రజల్లో వైఎస్సార్‌సీపీకి ఉన్న బలాన్ని చాటుకోవాలి. పార్టీ పట్ల సానుభూతితో ఉన్న శ్రేణులను ఆవిర్భావ వేడుకల్లో భాగస్వాములను చేయాలి. ప్రజల్లో పార్టీకి ఉన్న ఆదరణను నిలబెట్టుకుంటూ, రానున్న రోజుల్లో వారికి అండగా ఉంటామనే భరోసాను కల్పించాలి. మండలస్థాయి కమిటీల ఏర్పాటుకు కూడా నియోజకవర్గ ఇన్‌చార్జీలు వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు.

Kash Patel Wants Direct Hotline To Trump2
ఎఫ్‌బీఐ డైరెక్టర్‌ కాష్‌ పటేల్‌ వింత కోరిక.. ట్రంప్‌ అందుకు ఒప్పుకుంటారా?

వాషింగ్టన్‌: అమెరికాలోని అత్యున్నత దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐకు సారథ్యం వహిస్తున్న భారత సంతతికి చెందిన కాష్ పటేల్ తన నీడను తానే నమ్మడం లేదు. అందుకే తనకు అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు మధ్య ఫోన్‌ కాల్స్‌ కనెక్ట్‌ చేసేందుకు ఎఫ్‌బీఐలో ఓ వ్యవస్థ ఉంది. దానికి బదులుగా నేరుగా ట్రంప్‌తో మాట్లాడే సదుపాన్ని కల్పించాలని ఆదేశించారు. అందుకు ట్రంప్‌ ఒప్పుకుంటారా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఎఫ్‌బీఐ డైరెక్టర్‌గా కాష్‌ పటేల్‌ తన పనిమీద రాజకీయ ప్రమేయం ఉండకూడదని భావిస్తున్నారు. అందుకే జోబైడెన్‌ ప్రభుత్వ హయాం నుంచి ఎఫ్‌బీఐ కార్యాలయంలో పనిచేస్తున్న అధికారులు,ఏజెంట్ల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.తాను ఎఫ్‌బీఐ ఆఫీస్‌లో ఉన్నప్పుడు, ఇంట్లో ఉన్నప్పుడు ట్రంప్‌తో నేరుగా మాట్లాడే అవకాశం ఉందా? ఉంటే సాధ్యసాధ్యాలను చూడాలని సంబంధిత శాఖ అధికారులకు సూచించారు. ఎఫ్‌బీఐ డైరెక్టర్‌గా వచ్చీ రాగానే ఎఫ్‌బీఐ కార్యాలయం ఏడవ ఫ్లోర్‌లోని అధికారులను తొలగించారు. ఆ ఫ్లోర్‌లో డైరెక్టర్‌గా ఏదైనా నిర్ణయం తీసుకున్నా, దాన్ని అమలు చేయాలన్నా ఎఫ్‌బీఐ డైరెక్టర్‌ హోదాలో డిప్యూటీ అటార్నీ జనరల్‌తో మాట్లాడుతారు.డిప్యూటీ అటార్నీ జనరల్‌ ఇతర సీనియర్‌ అధికారులతో మంతనాలు జరిపి కార్యకలాపాలు నిర్వహిస్తారు. వారినే తొలగించి మరో ఫ్లోర్‌లో విధులు నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు.సెక్యూరిటీ రిత్యా సీనియర్ ఎఫ్‌బీఐ అధికారులు తమ కార్యాలయాల్లోకి సెల్‌ఫోన్‌లను నిషేధించారు. తాజాగా,వైట్ హౌస్ స్విచ్‌బోర్డ్, సీఐఏ, ఇతర జాతీయ భద్రతా సంస్థలతో మాట్లాడేందుకు వీలుగా ట్రంప్‌తో మాట్లాడేలా సురక్షితమైన ల్యాండ్‌లైన్ వ్యవస్థ ఇప్పటికే చాలా మంది ఎఫ్‌బీఐ అధికారుల డెస్క్‌లపై ఉంది. బదులుగా కాష్‌ పటేల్ ట్రంప్‌తో నేరుగా మాట్లాడేలా చూడాలని కోరినట్లు వెలుగులోకి వచ్చిన మీడియా కథనాలు హైలెట్‌ చేస్తున్నాయి. అదనంగా, పటేల్ తన రక్షణ కోసం ఇప్పటికే ఎఫ్‌బీఐ ఏజెంట్లను నియమించినప్పటికీ, తన సొంత ప్రైవేట్ భద్రతా సిబ్బందిని నియమించుకోవాలని పరిశీలించినట్లు సమాచారం. పటేల్ ఎఫ్‌బీఐ ఏజెంట్లను పూర్తిగా విశ్వసించడం లేదని, కాబట్టే ప్రైవేట్‌ భద్రతా సిబ్బందిని నియమించుకోనున్నారు.కాగా,చరిత్రలో తొలిసారి ఎఫ్‌బీఐ తొలిడైరెక్టర్‌ జే. ఎడ్గార్ హూవర్ తన ఇంటి నుండి అధ్యక్షుడికి నేరుగా ఫోన్‌లో మాట్లాడేవారు. ఆ తర్వాత నుంచి ఎఫ్‌బీఐ, వైట్‌ హౌస్‌ల మధ్య ఓ ఫోన్‌ కాల్‌ వ్యవస్థ ఏర్పాటైంది. మళ్లీ ఇప్పుడు కాష్‌ పటేల్‌ ఆ సంప్రదాయానికి స్వస్తి పలకాలని భావిస్తున్నట్లు ది వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదించింది.

Champions Trophy 2025 Final, IND VS NZ: Indian Fielders Dropped Catches3
CT 2025 Final: నాలుగు క్యాచ్‌లు జారవిడిచిన టీమిండియా ఫీల్డర్లు.. మూల్యం తప్పదా..?

ఛాంపియన్స్‌ ట్రోఫీ-2025 ఫైనల్లో ఇవాళ (మార్చి 9) భారత్‌, న్యూజిలాండ్‌ జట్లు తలపడుతున్నాయి. దుబాయ్‌ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేస్తుంది. భారత స్పిన్నర్లు అద్భుతంగా బౌలింగ్‌ చేస్తుండటంతో న్యూజిలాండ్‌ 196 పరుగులకు (44 ఓవర్లలో) సగం​ వికెట్లు కోల్పోయింది. డారిల్‌ మిచెల్‌ (51), మైఖేల్‌ బ్రేస్‌వెల్‌ (21) క్రీజ్‌లో ఉన్నారు. భారత బౌలర్లలో వరుణ్‌ చక్రవర్తి, కుల్దీప్‌ యాదవ్‌ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. రవీంద్ర జడేజా ఓ వికెట్‌ దక్కించుకున్నాడు. వరుణ్‌, కుల్దీప్‌ న్యూజిలాండ్‌ ఆటగాళ్లు భాగస్వామ్యాలు నెలకొల్పుతున్న సమయంలో వికెట్లు తీసి భారత్‌ను తిరిగి ఆటలోకి తెచ్చారు. భారత్‌కు తొలి ఫలితం​ వరుణ్‌ చక్రవర్తి అందించాడు. ఇన్నింగ్స్‌ 8వ ఓవర్‌ చివరి బంతికి వరుణ్‌ విల్‌ యంగ్‌ను (15) ఎల్బీడబ్ల్యూ చేశాడు. అనంతరం కుల్దీప్‌ తన మొదటి బంతికే ఇన్‌ ఫామ్‌ బ్యాటర్‌ రచిన్‌ రవీంద్రను (37) క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. కొద్ది సేపటికే కుల్దీప్‌ మరో అద్భుత బంతితో స్టార్‌ ఆటగాడు కేన్‌ విలియమ్సన్‌ను (11) క్యాచ్‌ అండ్‌ బౌల్డ్‌ చేశాడు. మిచెల్‌, లాథమ్‌ క్రీజ్‌లో కుదురుకుంటుండగా.. జడేజా లాథమ్‌ను (14) వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. మిచెల్‌తో కలిసి 50 పరుగులకు పైగా భాగస్వామ్యాన్ని నెలకొల్పి ప్రమాదకరంగా కనిపిస్తున్న ఫిలిప్స్‌ను (34) వరుణ్‌ చక్రవర్తి మరో అద్బుతమైన బంతితో క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు.ఇంతవరకు బాగానే ఉన్నా, ఈ మ్యాచ్‌లో భారత ఫీల్డర్ల ప్రదర్శన చాలా దారుణంగా ఉండింది. 40 ఓవర్లలోపే భారత ఫీల్డర్లు నాలుగు క్యాచ్‌లు డ్రాప్‌ చేశారు. తొలుత రచిన్‌ రవీంద్ర అందించిన రెండు క్యాచ్‌లను శ్రేయస్‌ అయ్యర్‌, మహ్మద్‌ షమీ నేలపాలు చేశారు. అయితే అదృష్టవశాత్తు రచిన్‌ ఔట్‌ కావడంతో భారత ఆటగాళ్లు ఊపిరిపీల్చుకున్నారు. తర్వాత భారత ఫీల్డర్లు రోహిత్‌ శర్మ, శుభ్‌మన్‌ గిల్‌ మరో రెండు క్యాచ్‌లు జారవిడిచారు. డారిల్‌ మిచెల్‌ క్యాచ్‌ను రోహిత్‌.. ఫిలిప్స్‌ క్యాచ్‌ను గిల్‌ వదిలేశారు. ప్రమాదకరంగా కనిపిస్తున్న ఫిలిప్స్‌ ఔటయ్యాడు కానీ మరో డేంజర్‌ బ్యాటర్‌ డారిల్‌ మిచెల్‌ ఇంకా క్రీజ్‌లోనే ఉన్నాడు. మిచెల్‌ డ్రాప్‌ క్యాచ్‌కు టీమిండియా మూల్యం చెల్లించకుంటుందేమో వేచి చూడాలి.

TDP leaders violence in Nandyal district4
నంద్యాల జిల్లాలో టీడీపీ నేతల అరాచక పర్వం.. వంతపాడుతున్న పోలీసులు

సాక్షి,నంద్యాల జిల్లా : నంద్యాల జిల్లాలో టీడీపీ నేతల అరాచకాలు తారస్థాయికి చేరుకున్నాయి. కొలిమిగుండ్ల మండలం చింత లాయపల్లె గ్రామంలో టీడీపీ నాయకులు కక్ష సాధింపు చర్యలకు దిగారు. చీనితోటను జేసీబీతో నాశనం చేశారు. అయితే, చీనితోటను నాశనం చేయొద్దంటూ అడ్డుపడిన మహిళలపై కట్టెలు, రాళ్లతో దాడులకు దిగారు. ఈ దాడుల్లో ముగ్గురు మహిళలు,ఓ బాలిక తీవ్రంగా గాయపడ్డారు.అయితే, ఈ చీనితోట పంటవేసిన మూడు ఎకరాల పొలంపై కోర్టులో కేసు నడుస్తోంది. కేసు విచారణ కొనసాగుతుండగా సివిల్ కేసులో కొలిమిగుండ్ల సీఐ రమేష్ జోక్యం చేసుకున్నారు. ఆ పొలాన్ని టీడీపీ వర్గీయులకు అప్పగించాలంటూ సదరు పొలం యజమానిపై ఒత్తిడి తెచ్చారు. అయినా బాధితులు తలొగ్గక పోవడంతో కొలిమిగుండ్ల పోలీసులు దాడికి ఉసిగొల్పాడు.ఇక టీడీపీ నేతల దాడిలో బనగానపల్లె ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భాదితుల్ని బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి పరామర్శించారు. బాధితులకు వైఎస్సార్‌సీపీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

India Vs New Zealand ICC Champions Trophy 2025 Final Live Updates5
Champions Trophy Final: ఆరో వికెట్‌ కోల్పోయిన న్యూజిలాండ్‌

IND vs NZ Final Live Updates: దుబాయ్‌ వేదికగా భారత్‌-న్యూజిలాండ్‌ మధ్య ఫైనల్‌ మ్యాచ్‌ జరుగుతోంది.ఆరో వికెట్‌ కోల్పోయిన న్యూజిలాండ్‌45.4వ ఓవర్‌: 211 పరుగుల వద్ద న్యూజిలాండ్‌ ఆరో వికెట్‌ కోల్పోయింది. షమీ బౌలింగ్‌లో రోహిత్‌ శర్మ క్యాచ్‌ పట్టడంతో డారిల్‌ మిచెల్‌ (63) ఔటయ్యాడు. ఔట్‌ కాకముందు మిచెల్‌ షమీ బౌలింగ్‌లో రెండు బౌండరీలు కొట్టాడు.డేంజరెస్‌ బ్యాటర్‌ గ్లెన్‌ ఫిలిప్స్‌ ఔట్‌37.5వ ఓవర్‌: డేంజరెస్‌ బ్యాటర్‌ గ్లెన్‌ ఫిలిప్స్‌ ఔటయ్యాడు. వరుణ్‌ చక్రవర్తి ఫిలిప్స్‌ను క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. 38 ఓవర్ల తర్వాత న్యూజిలాండ్‌ స్కోర్‌ 165/5గా ఉంది. డారిల్‌ మిచెల్‌కు (44) జతగా బ్రేస్‌వెల్‌ క్రీజ్‌లోకి వచ్చాడు. నిలకడగా ఆడుతున్న మిచెల్‌, ఫిలిప్స్‌లాథమ్‌ వికెట్‌ పడ్డ తర్వాత న్యూజిలాండ్‌ మరో వికెట్‌ కోల్పోకుండా జాగ్రత్తగా ఆడుతుంది. డారిల్‌ మిచెల్‌ (41), గ్లెన్‌ ఫిలిప్స్‌ (28) నిలకడగా ఆడుతున్నారు. 36 ఓవర్ల తర్వాత న్యూజిలాండ్‌ స్కోర్‌ 156/4గా ఉంది. కివీస్‌ నాలుగో వికెట్‌ డౌన్‌..టామ్‌ లాథమ్‌ రూపంలో న్యూజిలాండ్‌ నాలుగో వికెట్‌ కోల్పోయింది. 14 పరుగులు చేసిన లాథమ్‌ జడేజా బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి గ్లెన్‌ ఫిలిప్స్‌ వచ్చాడు. 26 ఓవర్లకు న్యూజిలాం‍డ్‌ స్కోర్‌: 116/4నిలకడగా ఆడుతున్న మిచెల్‌, లాథమ్‌..22 ఓవర్లు ముగిసే సరికి న్యూజిలాండ్‌ 3 వికెట్ల నష్టానికి 104 పరుగులు చేసింది. మిచెల్‌(18), టామ్‌ లాథమ్‌(14) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు.విలియమ్సన్‌ ఔట్‌..కేన్‌ విలియమ్సన్‌ రూపంలో న్యూజిలాండ్‌ మూడో వికెట్‌ కోల్పోయింది. 11 పరుగులు చేసిన విలియమ్సన్‌.. కుల్దీప్‌ యాదవ్‌ బౌలింగ్‌లో విలియమ్సన్‌ రిటర్న్‌ క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. క్రీజులోకి టామ్‌ లాథమ్‌ వచ్చాడు. 15 ఓవర్లకు న్యూజిలాండ్‌ స్కోర్‌: 82-3కివీస్‌ స్పిన్‌​ మ్యాజిక్‌.. రవీంద్ర క్లీన్‌ బౌల్డ్‌రచిన్‌ రవీంద్ర రూపంలో న్యూజిలాండ్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. 37 పరుగులు చేసిన రవీం‍ద్ర.. కుల్దీప్‌ యాదవ్‌ బౌలింగ్‌లో క్లీన్‌ బౌల్డయ్యాడు. క్రీజులోకి డార్లీ మిచెల్‌ వచ్చాడు. 11 ఓవర్లకు భారత్‌ స్కోర్‌: 73/3వరుణ్‌​ మ్యాజిక్‌.. కివీస్‌ తొలి వికెట్‌​ డౌన్‌న్యూజిలాండ్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. 15 పరుగులు చేసిన విల్‌ యంగ్‌.. వరుణ్‌ చక్రవర్తి బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. క్రీజులోకి కేన్‌ విలియమ్సన్‌ వచ్చాడు. 8 ఓవర్లు ముగిసే సరికి న్యూజిలాండ్‌ వికెట్‌ నష్టానికి 58 పరుగులు చేసింది. రవీంద్ర 34 పరుగులతో తన బ్యాటింగ్‌ను కొనసాగిస్తున్నాడు.దూకుడుగా ఆడుతున్న రచిన్‌..టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌ దూకుడుగా ఆడుతోంది. 4 ఓవర్లు ముగిసే సరికి కివీస్‌ వికెట్‌ నష్టపోకుండా 21 పరుగులు చేసింది. క్రీజులో రచిన్‌ రవీంద్ర(16), విల్‌ యంగ్‌(8) ఉన్నారు.ఛాంపియ‌న్స్ ట్రోఫీ-2025లో భార‌త్‌-న్యూజిలాండ్ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్‌కు తెర‌లేచింది. దుబాయ్ అంత‌ర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదిక‌గా జ‌ర‌గుతున్న ఈ టైటిల్‌ పోరులో టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌కు కివీస్‌ స్టార్‌ పేసర్‌ మాట్‌ హెన్రీ దూరమయ్యాడు. అతడి స్ధానంలో నాథన్‌ స్మిత్‌ తుది జట్టులోకి వచ్చాడు. భారత్‌ మాత్రం ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగింది.తుది జ‌ట్లున్యూజిలాండ్ (ప్లేయింగ్ XI): విల్ యంగ్, రాచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్, టామ్ లాథమ్(వికెట్ కీప‌ర్‌), గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ బ్రేస్‌వెల్, మిచెల్ సాంట్నర్(కెప్టెన్‌), కైల్ జామిసన్, విలియం ఓరూర్కే, నాథన్ స్మిత్భార‌త్‌ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మాన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్‌ రాహుల్(వికెట్ కీప‌ర్‌), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తిమరి కాసేపటిలో టాస్‌..ఛాంపియ‌న్స్ ట్రోఫీ-2025లో భార‌త్‌-న్యూజిలాండ్ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్‌కు సర్వం సిద్దమైంది. మరికాసేపట్లో టాస్‌ పడనుంది. ఇరు జట్లకు టాస్‌ కీలకంగా మారనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచేందుకు ఇరు జట్లు తమ ఆస్తశాస్త్రాలను సిద్దం చేసుకున్నాయి. 25 ఏళ్ల తర్వాత ఐసీసీ వన్డే టోర్నీ ఫైనల్లో ఇరు జట్లు తలపడుతున్నాయి.హెడ్ ​​టు హెడ్ రికార్డ్..ఇప్ప‌టివ‌ర‌కు భార‌త్‌-న్యూజిలాండ్ జ‌ట్లు ముఖాముఖి 119 వ‌న్డేల్లో త‌ల‌ప‌డ్డాయి. ఇందులో భార‌త్ 61 మ్యాచ్‌ల్లో విజ‌యం సాధించ‌గా.. న్యూజిలాండ్ 50 మ్యాచ్‌ల్లో గెలుపొందింది. మ‌రో 7 మ్యాచ్‌ల్లో ఫ‌లితం తేల‌క‌పోగా.. ఓ మ్యాచ్ టై అయింది.

Chiranjeevi Vishwambhara, Pawan Kalyan Hari Hara Veeramallu Latest Update6
సమ్మర్‌ కష్టమే.. ఫ్యాన్స్‌కి హ్యాండిచ్చిన ‘మెగా’ బ్రదర్స్‌!

టాలీవుడ్‌కి సంక్రాంతి తర్వాత సమ్మర్‌ మంచి సీజన్‌. వేసవి సెలవుల్లో పలు పెద్ద సినిమాలతో పాటు మీడియం, చిన్న చిత్రాలు కూడా విడుదల అవుతుంటాయి. స్కూల్‌, కాలేజీ పిల్లలకు సెలవులు ఉండడంతో వారిని టార్గెట్‌ చేస్తూ సినిమాలను రిలీజ్‌ చేస్తుంటారు. అయితే ప్రతి సమ్మర్‌కి కనీసం రెండు, మూడు పెద్ద సినిమాలైనా సందడి చేసేవి. కానీ ఈ సారి మాత్రం యావరేజ్‌ సినిమాలతోనే సరిపెట్టుకోవాలేమో. సమ్మర్‌లో సందడి చేస్తామని చెప్పిన మెగా హీరోలు చిరంజీవి, పవన్‌ కల్యాణ్‌.. ఫ్యాన్స్‌కి హ్యాండిచ్చేలా కనిపిస్తోంది. వీరితో పాటు ప్రభాస్‌ కూడా వేసవి సీజన్‌కి దూరంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.చిరంజీవి(Chiranjeevi) హీరోగా నటించిన ‘విశ్వంభర’ మూవీ సంక్రాంతికి రిలీజ్‌ కావాల్సింది. కానీ కొడుకు రామ్‌ చరణ్‌ కోసం చిరు వెనక్కి తగ్గాడు. దీంతో రామ్‌ చరణ్‌ ‘గేమ్‌ ఛేంజర్‌’సంక్రాంతికి రిలీజైంది. కానీ చిరంజీవి చేసిన త్యాగానికి గేమ్‌ ఛేంజర్‌ న్యాయం చేయలేకపోయింది. అది పక్కన పెడితే.. విశ్వంభర సమ్మర్‌లో రిలీజ్‌ చేస్తామని ప్రకటించారు. కానీ మేకర్స్‌ మళ్లీ మనసు మార్చుకున్నారట. సమ్మర్‌లో కాకుండా.. ఆగస్ట్‌లో ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేయాలని ప్లాన్‌ చేస్తున్నారట. అదే నిజమైతే సమ్మర్‌లో చిరును తెరపై చూడడం కష్టమే.మరోవైపు పవన్‌ కల్యాణ్‌(Pawan Kalyan ) ‘హరిహర వీరమల్లు’ కూడా రిలీజ్‌ని వాయిదా వేసుకునే అవకాశం ఉంది. వాస్తవానికి ఈ చిత్రం ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ ఇంకా షూటింగ్‌ జరుగుతోంది. ప‌వ‌న్ కు సంబంధించిన కొన్ని కీల‌క స‌న్నివేశాలు తెర‌కెక్కించాల్సి ఉందట.ఈ షూటింగ్‌ ఎప్పుడు పూర్తవుతుందో తెలియదు. వీఎఫెక్స్‌ వర్క్‌ కూడా పెండింగ్‌లోనే ఉంది. ఈ లెక్కన ఈ చిత్రం కూడా వేసవిలో రిలీజ్‌ అవ్వడ కష్టమే అంటున్నారు సినీ పండితులు.ఇక మెగా ఫ్యామిలీ హ్యాండిచ్చినా.. ప్రభాస్‌ అయినా సమ్మర్‌లో ఎంటర్‌టైన్‌ చేస్తారనుకుంటే.. అది కూడా కష్టమే అంటున్నారు. ఇంకా షూటింగ్‌ పూర్తి కాలేదట. ఈ చిత్రాన్ని ముందు చెప్పినట్లుగా ఏప్రిల్‌లో రిలీజ్‌ చేయడం కష్టమే అంటున్నారు. జూన్‌ లేదా జులైలో ఈ చిత్రం రిలీజయ్యే అవకాశం ఉంది. ఇలా పెద్ద సినిమాలన్నీ తమ విడుదలను వాయిదా వేసుకుంటే.. యావరేజ్‌, చిన్న చిత్రాలు మాత్రం రిలీజ్‌కు రెడీ అంటున్నాయి.

Janasena Leader Thammayya Babu Overaction In Prathipadu Chc7
జనసేన నేత వీరంగం.. వైద్యురాలిపై దౌర్జన్యం

సాక్షి, కాకినాడ జిల్లా: అధికారం చేతిలో ఉంది కదా అని కూటమి నేతలు బరితెగిస్తున్నారు. జనసేన నాయకుడు రెచ్చిపోయాడు. ప్రత్తిపాడు సిహెచ్‌సీ వైద్య సిబ్బందిపై దౌర్జన్యానికి దిగారు. ఒళ్లు దగ్గర పెట్టుకుని ఉద్యోగం చేయాలంటూ వేలు చూపిస్తూ వైద్యులకు నియోజకవర్గ జనసేన ఇన్‌ఛార్జ్‌ వరుపుల తమ్మయ్య బాబు వార్నింగ్‌ ఇచ్చాడు.రోగులకు వైద్యం చేస్తున్న సమయంలో డాక్టర్‌ శ్వేతకు తమ్మయ్యబాబు ఫోన్‌ చేశారు. ఆయనెవరో తెలియదని.. వేరొకరికి వైద్యం చేస్తున్నానని వైద్యురాలు చెప్పారు. ఫోన్‌లో మాట్లాడడానికి వైద్యురాలు నిరాకరించడంతో తమ్మయ్య బాబు.. నేరుగా ఆసుపత్రికి వచ్చి డాక్టర్‌ శ్వేతతో పాటుగా అక్కడున్న వైద్య సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించారు. జ్ఞానం ఉందా?.. నోర్మూయ్ అంటూ వైదురాలిపై అరుపులతో వీరంగం సృష్టించారు.

Sunita Williams and Barry Wilmore set to return to earth8
ఐఎస్‌ఎస్‌ కమాండ్‌ బాధ్యతలు.. రష్యా వ్యోమగామికి అప్పగించిన సునీత

వాషింగ్టన్‌: కేవలం పది రోజుల మిషన్‌ కోసం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఎస్‌)కి వెళ్లి అనుకోని పరిస్థితుల్లో 9 నెలలపాటు అక్కడే ఉండిపోయిన భారత సంతతి అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్‌ (Sunita Williams) ఈ నెల 19న తిరుగు పయనం కానున్నారు. ఇందుకు సన్నాహకంగా ఆమె అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఎస్‌) కమాండ్‌ బాధ్యతలను శనివారం రష్యా వ్యోమగామి అలెక్సీ ఒవ్‌చినిన్‌కు అధికారికంగా అప్పగించారు. ఈ నెల 12 లేదా 13వ తేదీన ప్రయోగించే స్పేస్‌ ఎక్స్‌ క్రూ–10 మిషన్‌లో నాసా (NASA) వ్యోమగాములు అన్నె మెక్‌ క్లయిన్, నికోల్‌ అయెర్స్‌తోపాటు జపాన్‌కు చెందిన టకుయా ఒనిషి, రష్యా వ్యోమగామి కిరిల్‌ పెస్కోవ్‌ ఉంటారు.ఐఎస్‌ఎస్‌లో కొత్త వారికి బాధ్యతలను అప్పగించే కార్యక్రమం మరో వారంపాటు కొనసాగనుంది. మార్చి 19వ తేదీన సునీతతోపాటు నాసాకే చెందిన బుచ్‌ విల్మోర్, నిక్‌ హేగ్, రష్యా వ్యోమగామి అలెగ్జాండర్‌ గొర్బునోవ్‌లు స్పేస్‌ ఎక్స్‌ క్రూ–10 మిషన్‌లో భూమికి తిరిగి రానున్నారు. నూతనంగా ఐఎస్‌ఎస్‌ కమాండ్‌ బాధ్యతలు చేపట్టిన ఒవ్‌చినిన్‌ ఏప్రిల్‌ వరకు అక్కడే ఉంటారు. గతేడాది జూన్‌లో బుచ్‌ విల్మోర్‌తో కలిసి సునీతా విలియమ్స్‌ బోయింగ్‌ స్టార్‌ లైనర్‌లో ఐఎస్‌ఎస్‌కు చేరుకోవడం, స్టార్‌ లైనర్‌లో సాంకేతిక సమస్యల కారణంగా అక్కడే ఇన్నాళ్లూ చిక్కుకుపోవడం తెలిసిందే.కొలంబియా వర్సిటీపై ట్రంప్‌ ఆగ్రహంవాషింగ్టన్‌: డొనాల్డ్‌ ట్రంప్‌ షాకుల పరంపర తన, పర అనే తేడా లేకుండా కొనసాగుతోంది. క్యాంపస్‌లో యూదు వివక్షను, యూదు విద్యార్థులపై వేధింపులు, దాడులను అడ్డుకోవడంలో విఫలమైందంటూ న్యూయార్క్‌లోని ప్రఖ్యాత కొలంబియా యూనివర్సిటీపై అధ్యక్షుడు తాజాగా కన్నెర్రజేశారు. అందుకు శిక్షగా వర్సిటీకి అందుతున్న ప్రభుత్వ నిధుల్లో ఏకంగా 40 కోట్ల డాలర్ల మేరకు కోత పెడుతున్నట్టు ప్రకటించారు! గాజాపై యుద్ధంలో ఇజ్రాయెల్‌కు అమెరికా మద్దతు నేపథ్యంలో గతేడాది పాలస్తీనా అనుకూల నిరసనలు, ఆందోళనలతో వర్సిటీ అట్టుడికిపోవడం తెలిసిందే. చ‌ద‌వండి: స్మ‌గ్లింగ్.. కోడి గుడ్డేం కాదు!ఇలాంటి చట్టవిరుద్ధ నిరసనలకు వేదికలుగా మారే విద్యా సంస్థలు, వర్సిటీలకు నిధులు నిలిపేస్తానని గత వారమే ట్రంప్‌ హెచ్చరించారు. క్యాంపస్‌లో యూదు విద్యార్థులు నిరంతర వేధింపులు, వివక్ష, హింస ఎదుర్కొంటున్నా వర్సిటీ పాలక వర్గం చేష్టలుడిగిందని అమెరికా విద్యా శాఖ మంత్రి లిండా మెక్‌మోహన్‌ ఆరోపించారు. ‘‘దీన్ని సహించేది లేదు. కొలంబియాతో పాటు ఇతర వర్సిటీలకూ ఇదో హెచ్చరిక’’అని ఆమె చెప్పారు. పరిశోధనలు తదితరాలను ఈ నిధుల కోత తీవ్రంగా ప్రభావితం చేస్తుందని వర్సిటీ తాత్కాలిక ప్రెసిడెంట్‌ కత్రీనా ఆర్మ్‌స్ట్రాంగ్‌ ఆందోళన వెలిబుచ్చారు.

Pasola Festival western Sumba Indonesia9
'యుద్ధాన్ని తలపించే పండుగ'..! కానీ అక్కడ అడుగుపెట్టారో..

శరవేగంగా పరుగులు తీసే గుర్రాలను అధిరోహించి, ఒకరిపై మరొకరు ఈటెలతో కలబడే ఆ దృశ్యాన్ని చూస్తే, అక్కడేదో యుద్ధం జరుగుతోందని ఎవరైనా పొరబడతారు. నిజానికి అది యుద్ధంకాదు, అక్కడి ప్రజలు జరుపుకొనే సంప్రదాయ పర్వదినం. ఇండోనేసియా తూర్పు ప్రాంతంలోని సుంబా దీవిలో జరిగే ఈ పండుగ పేరు ‘పసోలా’. ఏటా ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఈ పండుగను పంటకాలానికి ప్రారంభ సూచికగా జరుపుకొంటారు.పూర్వీకుల ఆత్మశాంతి కోసం, కుటుంబాల మధ్య అనుబంధాలను బలపరచుకోవడానికి, మూలాలను కాపాడుకోవడానికి ఈ పండుగ ఒక మార్గమని స్థానికులు చెబుతారు. ఈ పండుగలో ముఖ్యమైన ఘట్టం ఈటెల పోటీ. సత్తా ఉన్నవారంతా బరిలోకి దిగి, గుర్రాల మీద స్వారీ చేస్తూ, ప్రత్యర్థులతో కలబడతారు. ఎదురుగా దూసుకొచ్చే ఈటెలను తప్పుకోవడం ఒక ఎత్తయితే, గురిచూసి ఎదుటివారిని దెబ్బతీయడం మరో ఎత్తు. యుద్ధాన్ని తలపించే ఈ పోటీల్లో చాలామందికి గాయాలవుతుంటాయి.పసోలా అనే పదానికి సుంబా స్థానిక భాషల్లో ‘ఈటె విసరడం’ అని అర్థం. ఈ పోటీల్లో వినియోగించే ఈటెలను ‘హోలా’ అని పిలుస్తారు. ఈ పండుగ వెనుక పురాతన చరిత్ర ఉంది. స్థానిక పురాణాల ప్రకారం, పసోలా పండుగ ఆకాశంలో ఒకరితో ఒకరు పోరాడిన రెండు శక్తిమంతమైన ఆత్మల కథ నుంచి మొదలైందట! ఆ ఆత్మల సంఘర్షణ ఫలితంగా భూమిపై ఈటెల వర్షం కురిసిందట!. ఈ పౌరాణిక గాథ ప్రేరణతోనే ఈ పండుగ ప్రారంభమైంది. ఈ వేడుక కోసం గుర్రాలను పెంచడాన్ని గౌరవంగా, హోదాచిహ్నంగా భావిస్తుంటారు. పనికట్టుకుని ఈ పోటీలో పాల్గొనే పోటీదారులు తమ గుర్రాలను తామే పెంచుకుని, రోజుల తరబడి సాధన చేసి మరీ బరిలోకి దిగుతుంటారు. ఈ పోటీని చూడటానికి పెద్దసంఖ్యలో పర్యటకులు కూడా పోటెత్తుతారు. అడుగుపెడితే శిలైపోతారుభూమిపై ఇప్పటికీ అంతుచిక్కని రహస్యాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి వాటిలో ఉత్తర టాంజానియాలో ఉండే నాట్రాన్‌ సరస్సు ఒకటి. ఇందులోని నీరు నెత్తుటిలా ఎర్రగా ఉంటుంది. సరస్సంతా నెత్తుటి మడుగులా కనిపిస్తుంది. ఈ సరస్సును దయ్యాలు సృష్టించాయని, ఆ సరస్సులోకి మనుషులు గాని, జంతువులు గాని దిగితే, రాళ్లుగా మారిపోతారని స్థానికులు చెబుతుంటారు. అందుకే, సూర్యాస్తమయం తర్వాత ఎవరూ అక్కడ తిరగడానికి సాహసించరు. శాస్త్రవేత్తలు ఈ సరస్సును పరిశీలించి, ఈ సరస్సు నీటిలో సోడియం కార్బొనేట్, నైట్రో కార్బొనేట్‌ ఎక్కువగా ఉండటంతో, ఇందులోని నీరు ప్రాణాంతకంగా మారిందని తేల్చారు. ఈ సరస్సులోకి మనుషులు సహా ప్రాణులేవైనా వెళ్తే, ఇలా రాళ్లలా గడ్డకట్టిపోవడానికి గల కారణాలను మాత్రం శాస్త్రవేత్తలు ఇంకా కనిపెట్టలేకపోయారు. (చదవండి: గిన్నిస్‌కెక్కిన మహిళల వేడుక..!)

Rescue Operation In Slbc Tunnel Enters 16th Day Updates10
SLBC: కాంక్రీట్‌లో కూరుకుపొయిన మృతదేహం గుర్తింపు

Slbc Tunnel Rescue Operation Updates:👉జీపీఆర్‌, కేడవర్ డాగ్స్ గుర్తించిన ప్రదేశాలలో చిక్కుకున్న వారి ఆచూకీ కోసం తవ్వకాలు ముమ్మరం చేశారు. టీబీఎంకు ఎడమ పక్కన కనిపించిన ఓ మృతదేహానికి సంబంధించిన చేయిని గుర్తించారు. మృతదేహం పూర్తిగా కాంక్రీట్‌లో కూరుకుపోయింది. డ్రిల్లింగ్ ద్వారానే బయటికి తీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. నేడు రెస్క్యూ ఆపరేషన్‌లో 130 మంది నిపుణుల బృందం పాల్గొంటున్నారు.👉ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో 16వ రోజు రెస్క్యూ ఆపరేషన్‌ కొనసాగుతోంది. ఇంకా 8 మంది కార్మికుల జాడ తెలియలేదు. ఇక రోబోల వినియోగం తప్పదని అధికారులు అంటున్నారు. ఆ మేరకు చర్యలకు ఉపక్రమిస్తున్నారు. చివరి 50 మీటర్ల ప్రాంతంలో సహాయక చర్యలు క్లిష్టంగా మారాయి. టెన్నెల్‌ ఎండ్‌ పాయింట్‌లో కీలక స్పాట్స్‌ను గుర్తించారు. కీలకమైన స్పాట్స్‌లో ర్యాట్‌ హోల్‌ మైనర్ల తవ్వకాలు చేపట్టారు. రెస్య్కూలో జాతీయ, అంతర్జాతీయ నిపుణులు పాల్గొంటున్నారు.👉కాగా, ఎనిమిది మందిని గుర్తించేందుకు చేపడుతున్న సహాయక చర్యలకు అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఇప్పటి వరకు 13.50 కిలోమీటర్ల దూరం వరకు వెళ్లిన రెస్క్యూ బృందాలు మిగిలిన 50 మీటర్ల ముందుకు వెళ్లడానికి చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. సొరంగంలోకి నీటి ఊట వేగంగా వస్తుండటంతో ప్రత్యేక మోటార్ల ద్వారా నీటిని బయటికి తోడేస్తున్నారు. 👉కన్వేయర్‌ బెల్ట్‌ పూర్తిగా మరమ్మతు జరగడంతో.. పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి. సొరంగంలో పేరుకుపోయిన మట్టి, బురద, రాళ్లు, టీబీఎం విడిభాగాలు (ఇనుము), ఊడిపోయిన కాంక్రీట్‌ సెగ్మెంట్లను తొలగించే రోబోలు తయారు చేసేందుకు కనీసం వారం రోజుల సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే రోబోలు సాయం వారం రోజుల తర్వాతే వినియోగంలోకి వస్తోంది. 👉ప్రమాదం జరిగిన సొరంగంలో పరిశోధన చేసేందుకు కేరళ నుంచి వచ్చిన కాడవర్‌ డాగ్స్‌ కూడా ఇది వరకు గుర్తించిన డాగ్స్‌ స్థానాల్లోనే గుర్తించాయి. 13.500 కి.మీ., అవుతల ఒకే దగ్గర ముగ్గురు వ్యక్తుల అవశేషాలు ఉన్నట్లు నిర్ధారించాయి. కారి్మకులు చిక్కుకున్నట్లు డాగ్స్‌ చూపించిన ప్రదేశాల్లో శనివారం రెస్క్యూ బృందాలు తవ్వకాలు ప్రారంభించాయి. టీబీఎం పరికరాలు గ్యాస్‌ కట్టర్‌తో కత్తిరించి లోకో ట్రైన్‌ ద్వారా సొరంగం బయటికి పంపించారు. కూలిపడిన పైకప్పు మట్టి దిబ్బలను హిటాచీతో ఒకవైపు తరలిస్తున్నారు. రోజుకో బృందాన్ని సింగరేణి నుంచి రప్పించి సహాయక చర్యలు ముమ్మరం చేస్తున్నారు. సొరంగంలో వస్తున్న దుర్వాసన సహాయక చర్యలకు ఇబ్బంది కలిగిస్తోంది.👉టన్నెల్‌లో జరిగిన ప్రమాదం జాతీయ విపత్తు అని, అందులో చిక్కుకున్న కార్మికులను రక్షించడానికి ప్రపంచంలోని అత్యుత్తమ సాంకేతికత ఉపయోగిస్తున్నామని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. శనివారం టన్నెల్‌ను సందర్శించిన ఆయన రెస్క్యూ బృందాల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.👉సొరంగంలో చిక్కుకున్న కార్మికులను గుర్తించేందుకు ఇప్పటి వరకు జరిగిన పురోభివృద్ధి గురించి రాష్ట్ర డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ కార్యదర్శి అరవింద్‌కుమార్, ఆర్మీ కమాండెంట్‌ పరీక్షిత్‌ మెహ్రా మంత్రికి వివరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ సహాయక చర్యల్లో అవంతరాలను అధిగమిస్తూ వేగంగా ముందుకెళ్తున్నామని, సొరంగం లోపల ఆక్సిజన్‌ సరిగా లేకపోవడం, నీటి ఊట అధికంగా రావడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు. 👉టీబీఎం దృఢమైన లోహ శకలాలు, రాళ్లు, మట్టితో కూరుకుపోయి ఇబ్బందులు ఉన్నప్పటికీ సహాయక చర్యలు కొనసాగించేందుకు ప్రభుత్వం కృతనిత్చయంతో ఉందన్నారు. రెస్క్యూ ఆపరేషన్‌లో పనిచేసే కారి్మకులకు, అధికారులకు ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌, ఎస్పీ వైభవ్‌ గైక్వాడ్‌ రఘనాథ్, అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ, మిలటరీ ఇంజినీర్‌ వికాస్‌సింగ్, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ కమాండెంట్‌ ప్రసన్నకుమార్, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ కమాండెంట్‌ ప్రభాకర్, సింగరేణి, రైల్వే, ఎన్‌జీఆర్‌ఐ, హైడ్రా తదితర బృందాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

International View all
title
ఎఫ్‌బీఐ డైరెక్టర్‌ కాష్‌ పటేల్‌ వింత కోరిక.. ట్రంప్‌ అందుకు ఒప్పుకుంటారా?

వాషింగ్టన్‌: అమెరికాలోని అత్యున్నత దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐకు

title
ఐఎస్‌ఎస్‌ కమాండ్‌ బాధ్యతలు.. రష్యా వ్యోమగామికి అప్పగించిన సునీత

వాషింగ్టన్‌: కేవలం పది రోజుల మిషన్‌ కోసం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఎస్‌)కి వెళ్లి అనుకోని పరిస్థితుల్లో 9 నెలలపాట

title
వీడియో: న్యూయార్క్‌లో కార్చిర్చు మంటలు.. ఎమర్జెన్సీ విధింపు

న్యూయార్క్‌: అమెరికాలోని న్యూయార్క్‌ నగరంలో కార్చిర్చు అంటుక

title
భారత్‌ వ్యతిరేక రాతలు.. అమెరికా టెంపుల్‌ ధ్వంసం

కాలిఫోర్నియా: అమెరికాలో హిందూ దేవాలయంపై దాడి జరిగింది.

title
పాకిస్థాన్‌, భారత్‌ సరిహద్దులకు వెళ్లకండి.. అమెరికా పౌరులకు హెచ్చరిక

వాషింగ్టన్‌: పాకిస్థాన్‌ విషయంలో అమెరికా మరో కీలక నిర్ణయం తీ

National View all
title
TG: తుది దశకు కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక

ఢిల్లీ ; తెలంగాణ రాష్ట్రంలోని ఎమ్మెల్యే కోటా ఎంఎల్‌సీ అభ్యర్థుల ఖరారు అంశం తు

title
ఉప రాష్ట్రపతి జగదీప్ దన్కర్ త్వరగా కోలుకోవాలి: ప్రధాని

న్యూఢిల్లీ:  భారత ఉపరాష్ట్రపతి జగదీప్ దన్కర్ త్వరలో కోల

title
ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్‌కు అ‍స్వస్థత.. ఎయిమ్స్‌కు తరలింపు

ఢిల్లీ: భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్‌(Jagdeep Dhankar) అస

title
సెలవు లేదన్న హెడ్మాస్టర్‌.. లెక్కల టీచర్‌ ఏం చేశారంటే?

భువనేశ్వర్‌: తీవ్ర అనారోగ్యం పాలైన ఓ ఉపాధ్యాయుడు సెలవు కోసం

title
వీడియో: అమ్మాయిని పగబట్టిన కుక్కలు.. భయానక దాడి

జైపూర్‌: ఓ యువతి ఫోన్‌ మాట్లాడుతూ ఇంట్లో నుంచి బయటకు రావడమే

NRI View all
title
ఆస్ట్రేలియాలో మహిళలపై లైంగిక దాడి.. భారతీయ ప్రముఖుడికి 40 ఏళ్ల జైలు శిక్ష

సిడ్నీ: ఆస్ట్రేలియాలో ఐదుగురు మహిళలపై లైంగిక దాడికి పాల్పడిన

title
విశాఖకు ఎన్నారై మహిళ ఎందుకొచ్చింది?.. ఆ రూమ్‌లో ఏం జరిగింది?

విశాఖ సిటీ: విశాఖలో ఖాకీ క్రైమ్‌ కథా చిత్రం..

title
లండన్‌లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు

బిందువు బిందువు కలిస్తేనే సింధువు అనే విధంగా యూకే లో నివసిస్తున్న తెలుగు మహిళలు అందరూ “తెలుగు లేడీస్ యుకె” అనే ఫేస్‌బుక్

title
న్యూజెర్సీలో నాట్స్ ఇమ్మిగ్రేషన్ సెమినార్

న్యూ జెర్సీ: అమెరికాలో తెలుగు వారి కోసం అనేక కార్యక్రమాలు చ

title
అమెరికాలో కాల్పులు.. కేశంపేట యువకుడి మృతి

కేశంపేట: ఉన్నత ఆశయాలతో అమెరికా వెళ్లిన ఓ విద్యార్థి..

Advertisement

వీడియోలు

Advertisement