Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Sakshi Editorial On Chandrababu Coalition Govt By Vardhelli Murali1
మాయలేళ్లూ... మరీచికలు!

‘చెప్పేదొకటి, చేసేదొకటి’ స్వభావం గలవాళ్లను మోసగాళ్లనే అంటాము. ప్రజా జీవితంలో ఉంటూ మచ్చుకైనా పారదర్శకత లేని ఇటువంటి బ్యాచ్‌ కూడా మోసగాళ్లే! మాయ లేడి వేషం వేసుకొని మోసగించిన మారీచునికి వీళ్లు వారసులనుకోవాలి. ఇటువంటి మూడు మాయలేళ్లు కలిసి కూటమి కట్టి ఏర్పాటు చేసిన ప్రభుత్వం నుంచి హామీల అమలు గురించి ఆశించడమంటే మరీచికల వెంట పరుగులు తీయడమే! ఈ కూటమి ప్రవేశపెట్టిన రెండో బడ్జెట్‌లో కూడా ఎన్నికల వాగ్దానాలకు నామం పెట్టారని ప్రతిపక్షం విమర్శిస్తున్నది. ప్రతిపక్షంగా అది వాళ్ల డ్యూటీ కావచ్చు.కూటమి మాత్రం ఆ విమర్శలను పట్టించుకోదు. మేనిఫెస్టో హామీలను అమలుచేయలేమనీ, చేయబోమనీ వారికి ముందే తెలుసు. రాష్ట్ర శ్రేయస్సు, ప్రజా సంక్షేమం వగైరాల కంటే పరమ పవిత్రమైన ఆశయాలు, ప్రయోజనాలు వారికి విడివిడిగా వేరే ఉన్నాయి. ఆ ప్రయోజనాలు నెరవేరాలంటే అధికారం కావాలి. విడివిడిగా ఉంటే అది కుదిరే పని కాదు. అందుకని ఒక్కటయ్యారు. అయినా నమ్మకం లేక ‘కొండమీది కోతిని నేలకు దించుతాం, బొందితో కైలాసం తీసుకుపోతాం, కళ్ల ముందటే వైకుంఠాన్ని నిలబెడతాం’ తదితరాల స్థాయికి తగ్గని హామీలను మేనిఫెస్టోలో చేర్చుకున్నారు. వాటిని నెరవేర్చి తీరుతామని కూటమి నేతలు వివిధ సభల్లో చేసిన మంగమ్మ శపథాలు,భీష్మ ప్రతిజ్ఞలు ఇప్పటికీ జనం చెవుల్లో గింగిరుమంటూనే ఉన్నాయి.పిట్టల దొర వాగ్దానాలకు తోడు ఢిల్లీ సర్కార్‌ సౌజన్యంతో ఎన్నికల సంఘం కూడా ఓ చేయి వేయడంతో కూటమి అధికారంలోకి వచ్చింది. వచ్చిన అధికారాన్ని ఏ రకంగా ఉపయోగించుకోవాలి అనే విషయంపై ఎవరి ప్రాధాన్యాలు వారికున్నాయి. జాతీయ స్థాయిలో కూటమికి పెద్దన్నగా బీజేపీ ఉంటున్నా ఏపీలో మాత్రం తెలుగుదేశం పార్టీదే పెద్దన్న పాత్ర. ఆ పార్టీ చంద్రబాబు నాయుడు నాయకత్వంలోకి మారిన తర్వాత ప్రజా సంక్షేమ కార్యక్రమాలను వ్యతిరేకించే వైఖరి తీసుకుంటున్నది. విద్య, వైద్యం వంటి ప్రాథమిక విషయాలు కూడా ప్రభుత్వ బాధ్యత కాదనీ, ఆ రంగాల్లో ప్రైవేట్‌ సేవలు అవసరమనీ చెప్పిన చరిత్ర బాబుది.ప్రభుత్వం నుంచి పొందే సేవలకు కూడా ప్రజలు యూజర్‌ ఛార్జీలు చెల్లించవలసిందేనని ఆయన గతంలోనే ఘంటా పథంగా ప్రకటించారు. అదేరకంగా పాలించారు. మొన్నటి ఎన్ని కల సందర్భంగా ఆయన ప్రకటించిన సూపర్‌ సిక్స్‌ వాగ్దానాలకు ఆయన సిద్ధాంతపరంగానే వ్యతిరేకి! అయినప్పటికీ అటువంటి మేనిఫెస్టోకు రూపకల్పన చేయడమంటే అధికారం పొందడం కోసం ఉద్దేశపూర్వకంగా మోసానికి తెగబడ్డారంటే తప్పవుతుందా? ఈ మోసాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఆయన ఈ మధ్యనే ‘పీ4’ అనే ఓ వంటింటి చిట్కాను ప్రకటించారు.ఈ ఉగాది నుంచి అమలుచేయ సంకల్పించిన ఈ ‘పీ4’ చిట్కాతో రాష్ట్రంలోని పేదరికం మటుమాయమైపోతుందట! పబ్లిక్‌–ప్రైవేట్‌–పీపుల్‌ భాగస్వామ్యమని దాని పూర్తి పేరు. సమాజంలోని పది శాతం మంది అత్యంత సంపన్నులు అట్టడు గున ఉన్న 20 శాతం మంది కడుపేదలను దత్తత తీసుకో వాలట! ఈ పేదవారి అవసరాలను ఆ సంపన్నులు గుర్తించి తృణమో పణమో సాయం చేసి పేదరికం నుంచి బయట పడేయాలట! ఈ ‘సామాజిక బాధ్యత’ నెరవేర్చినందుకు ఆ సంపన్నులకు ఏ సహజ వనరుల్ని కట్టబెడతారన్నది ఇక్కడ రహస్యం.కుల మత ప్రాంతీయ లింగ భేదాల్లేకుండా ఈ దేశంలో పుట్టిన ప్రతి మనిషికీ భారత రాజ్యాంగం సమాన హక్కులను కల్పించింది. చారిత్రకంగా వివిధ సమూహాల మధ్య అభివృద్ధి క్రమంలో ఏర్పడిన అంతరాలను పూడ్చడానికి ప్రభుత్వాలు పూనుకోవాలని ఆదేశించింది. సహజ వనరుల్లో అందరికీ సమాన భాగస్వామ్యం ఉండాలి. అందరూ సమానస్థాయిలో పోటీ పడగలిగే అవకాశాలు (లెవల్‌ ప్లేయింగ్‌ ఫీల్డ్‌) ఏర్పడాలని రాజ్యాంగం చెబుతున్నది. అటువంటి పరిస్థితులను ప్రభు త్వాలు ఏర్పాటు చేసినట్లయితే పేదరికాన్ని పేదలే జయిస్తారు. ఈ దేశాన్ని కూడా సంపన్న దేశంగా నిర్మిస్తారు. రాజ్యాంగం ఆశయం కూడా అదే! ఎవరి ఎంగిలి మెతుకుల తోనో పండుగ చేసుకొమ్మని చెప్పలేదు.ఈ ‘పీ4’ కార్యక్రమాన్ని గురించి రానున్న రోజుల్లోయెల్లో మీడియా ఏ రకమైన ప్రచారాన్ని చేపట్టబోతున్నదోనని ఊహించుకుంటేనే గగుర్పాటు కలుగుతున్నది. ఇంతటి మహత్తరమైన ఆలోచన గతంలో కార్ల్‌ మార్క్స్‌కు గానీ, అంబేడ్కర్‌కు గానీ, మరెవ్వరికీ గానీ రాలేదని వీరతాడు వేయవచ్చు. ఇకముందు రాబోదని కూడా ఛాలెంజ్‌ చేయవచ్చు. ఈ చిట్కా వైద్యంతో చిటికెలోనే పేదరికం పరారైందని కూడా ప్రకటించవచ్చు.‘పీ4’ సంక్షేమ ప్రచారం హోరులో తెలుగుదేశం పార్టీ అధినేతలకు మిగిలిన పవిత్ర కార్యక్రమం ఏమున్నది? ఒక్క అమరావతి తప్ప! దానికి అభివృద్ధి అనే ముసుగు వేయడం తప్ప! మిగిలిన ఈ మూడేళ్లూ (ఒక సంవత్సరం జమిలి ఎన్నికల కోత ఉండవచ్చు) అమరావతి సేవలోనే ప్రభుత్వం తరించే అవకాశం ఉన్నది. అమరావతి నిర్మాణానికి రూపాయి కూడా ప్రభుత్వం ఖర్చు చేయవలసిన అవసరం లేదని, దాని ల్యాండ్‌ బ్యాంక్‌ ద్వారా సంపాదించిన సొమ్ముతోనే నిర్మాణం జరిగి పోతుందని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు పలుమార్లు చెప్పిన విషయం పాఠకులకు గుర్తుండే ఉంటుంది. అందుకు భిన్నంగా ఇప్పటికే ప్రపంచ బ్యాంకు, జర్మనీ, ‘హడ్కో’ల ద్వారా 30 వేల కోట్లకు పైగా అప్పులు చేశారు. ఇంకో ఇరవై వేల కోట్ల రూపాయలను సీఆర్‌డీఏ ద్వారా సమీకరించేందుకు ఆదేశిస్తూ జీవో కూడా ఇచ్చారు.జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో నిర్మించిన ప్రభుత్వ భవనాలను గనక ఉపయోగంలోకి తెచ్చుకుంటే వైజాగ్‌ తక్షణమే అందుబాటులోకి వచ్చేది. ఆ సంగతి పక్కనబెట్టి, వైజాగ్‌ను విస్మరించి, ఇన్ని వ్యయప్రయాసలకోర్చడం వెనుక అసలు కథ ఇప్పటికే చాలామందికి అర్థమై ఉంటుంది. రాష్ట్ర రాజధాని పేరుతో అతి పెద్ద రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారానికి తెరతీశారని, దాని ద్వారా ఆ పార్టీ ముఖ్యనేతలు, వారి అనుయాయులు వేల కోట్ల రూపాయలు దండుకోవడానికి ప్రణాళికలు రచించారనే విమర్శలు చాలాకాలంగా వినిపిస్తున్నాయి. ఈ విమర్శలను పూర్వపక్షం చేసే సంతృప్తికరమైన సమాధానాన్ని తెలుగుదేశం నాయకత్వం ఇప్పటికీ ఇవ్వలేకపోతున్నది. ప్రతిపక్షం వారు రుజువులు చూపిస్తూ చేస్తున్న ఆరోపణలను సహేతుకంగా ఖండించనూ లేకపోతున్నది. దీన్నిబట్టి ఈ మూడేళ్లలో జరగ బోయేది – పేదలకు ‘పీ4’ గంజినీళ్లు! పాలక పెద్దలకు కనక వర్షం!!ఇక భారతీయ జనతా పార్టీది జాతీయ స్థాయి లక్ష్యం. వరసగా మూడుసార్లు కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసి బీజేపీ, సంఘ్‌ పరివార్‌లు మంచి ఊపుమీదున్నాయి. ఇక ఆరెస్సెస్‌ స్థాపిత లక్ష్యమైన హిందూ రాష్ట్ర ఎజెండాను బయటకు తీసే ముహూర్తం ఇప్పుడు కాక ఇంకెప్పుడని అవి భావిస్తు న్నాయి. మొన్నటి ‘మహా కుంభమేళా’ సందడిలోనే అందుకు అంకురార్పణ కూడా జరిగిపోయిందట! ‘అమర్‌ ఉజాలా’ అనే ఉత్తరాది హిందీ పత్రిక కోసం అలోక్‌ కుమార్‌ త్రిపాఠీ రాసిన వార్తా కథనాన్ని ఉటంకిస్తూ ‘ది వైర్‌ తెలుగు డాట్‌ ఇన్‌’ ఈ విషయాన్ని వెల్లడించింది. ఇంకో పాతికేళ్లలో దేశాన్ని హిందూ దేశంగా ప్రకటించే అవకాశం ఉన్నదట! అందుకు అవసరమైన అడుగులన్నీ ఇక వరసగా వేసుకుంటూ వెళతారు. ‘రుషి సంవిధాన్‌’ అనే పేరుతో ప్రత్యామ్నాయ రాజ్యాంగం కూడా సిద్ధమైందట! దీన్నే ‘సనాతన రాజ్యాంగ’మని పరివార్‌ ముఖ్యులు పిలుచుకుంటున్నారు. రాజ్యాంగాన్ని మార్చబో మంటూ బీజేపీ నేతలు పదేపదే ఇస్తున్న హామీలన్నీ బూటకమే నని ఇప్పుడు సిద్ధంగా ఉన్న ‘రుషి సంవిధాన్‌’ లేదా సనాతన రాజ్యాంగం రుజువు చేస్తున్నది.సంఘ్‌ పరివార్‌ తన అంతిమ గమ్యాన్ని చేరుకోవడానికి కీలకమైన తొలి అడుగు జమిలి ఎన్నికలు లేదా ఒన్‌ నేషన్‌ ఒన్‌ ఎలక్షన్‌ (ఒక జాతి... ఒకే ఎన్నిక). ఆ తర్వాత ‘ఒక జాతి... ఒకే భాష’, ‘ఒక జాతి... ఒకే మతం’ వంటి నినాదాలు మొదలు కావచ్చు. కనుక ఎట్టి పరిస్థితుల్లో జమిలి ఎన్నికల కార్యక్రమాన్ని ఈ దఫా వాయిదా వేసే అవకాశం లేదు. అందుకు అవసరమైన రాజ్యాంగ సవరణలకు సరిపోయే సంఖ్యాబలం ఎన్డీఏకు ఉన్నదా లేదా అనే శంకలు అనవసరం. సమకూర్చుకోగలమనే నమ్మకం ఎన్డీఏకు ఉన్నది. బీజేపీ శిబిరానికి దూరంగా ఉండే తటస్థ పార్టీలకు కూడా వాటి అవసరాలు వేరువేరుగా ఉండవచ్చు. ఆంధ్రప్రదేశ్‌లో తీవ్రమైన రాజకీయ కక్షను, స్టేట్‌ టెర్రర్‌ను ఎదుర్కొంటున్న వైసీపీ వాళ్లు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈ దమన కాండను వదిలించుకుందామనే దిశలో ఆలోచించవచ్చు.తెలంగాణలో బీఆర్‌ఎస్‌ పార్టీ కూడా ఏడాది ముందుగానే అధికారంలోకి వచ్చే అవకాశాన్ని వదులుకోకపోవచ్చు. ఈ రెండు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాల పట్ల వ్యతిరేకత స్పష్టంగానే కనిపిస్తున్నది. ఇల్లలకంగానే పండగ కాదు. జమిలి ఎన్నికలు జరిగినంత మాత్రాన హిందూ రాష్ట్ర ఏర్పాటుకు మార్గం సుగమమైనట్టు కాదు. ఇంకా చాలా దూరం ఉన్నది. జమిలి ఎన్నికలకు సహ కరించిన పార్టీలన్నీ ‘రుషి సంవిధాన్‌’కు సహకరించకపోవచ్చు. జమిలి ఎన్నికల్లో ఏమైనా జరగవచ్చు. కాకపోతే చాప కింద నీరులా బీజేపీ చేస్తున్న సన్నాహాలకూ, ఆ పార్టీ నేతలు పైకి చెబుతున్న మాటలకూ ఏమాత్రం పొంతన లేదనే విషయాన్ని ఈ పరిణామాలు రుజువు చేస్తున్నాయి.ఇక మాటలకూ, చేతలకూ పొంతన ఉండనివాళ్లు తమ బ్రాండ్‌ అంబాసిడర్‌గా ‘జనసేనాని’ని నియమించుకోవచ్చు. ఈ పదేళ్లలో ఆయన తన ఐడియాలజీని తలకిందులుగా వేలాడ దీశారు. ఆయన ఆరాధన చేగువెరా నుంచి సావర్కర్‌కు బదిలీ అయింది. తన మాటలకు విరుద్ధంగా తానే మాట్లాడిన ఉదంతాలు కోకొల్లలు. సనాతన రాజ్యాంగం గురించిన మాటలు సంఘ్‌ పరివారంలో వినపడగానే సనాతన ధర్మ పోరాట యోధుడి అవతారమెత్తడం గమనార్హం. ఏ రాజకీయ స్రవంతిలో కలిసిపోతే తన ప్రయాణం సుఖంగా సాగుతుందని భావిస్తారో అందులో దూకెయ్యడం ఆయనకు రివాజుగా మారింది. ఇలా మాట నిలకడ లేని, పారదర్శకత అసలే లేని ముగ్గురు కలిసి ఏర్పాటు చేసుకున్న కూటమి నుంచి హామీల అమలు గురించి ఆశించడం నీటి కోసం ఎండమావుల వెంట పరుగులు తీయడమే అవుతుంది. కాకపోతే ఈ రాజకీయ వంచనా శిల్పాన్ని ఎండగట్టడం, ప్రజలను జాగృతం చేయడం ప్రజాస్వామ్య ప్రియుల తక్షణ కర్తవ్యం.వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com

Online bettings by Gaming Apps, Loan Apps Harassment Taking Life of People2
ప్రాణాలతో బెట్టింగ్‌.. గేమింగ్‌ భూతానికి బతుకులు బలి

‘ఆన్‌లైన్‌ రమ్మీ’ చంపే వరకు వదల్లేదుకరీంనగర్‌ జిల్లా శంకరపట్నం మండలం గద్దపాక గ్రామానికి చెందిన బూస శంకరయ్య, స్వరూప దంపతుల కుమారుడు కార్తీక్‌ ఆన్‌లైన్‌ రమ్మీకి అలవాటు పడ్డాడు. సంపాదన అంతా పోగొట్టుకుని, అప్పుల పాలయ్యాడు. రైలుపట్టాలపై పడుకుని, ఆత్మహత్యకు ప్రయత్నించాడు. తల్లిదండ్రులు అప్పుడు కార్తీక్‌ను కాపాడుకోగలిగారు. రెండెకరాల భూమి అమ్మి మరీ అప్పులు తీర్చారు. అయినా కార్తీక్‌ను ఆన్‌లైన్‌ రమ్మీ భూతం వదల్లేదు. కార్తీక్‌ మళ్లీ అప్పులు చేసి, ఆవేదనతో గత నెలలో గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.సాక్షి, హైదరాబాద్‌: అవసరాలు తీరాలంటే డబ్బు కావాలి. కానీ ఆ డబ్బు సంపాదించేందుకు ఎంచుకునే మార్గాలు చాలా ముఖ్యం. కష్టార్జితం కొంతే అయినా జీవితం సాఫీగానే సాగుతుంది. కానీ కూర్చున్నచోటే శ్రమ లేకుండానే భారీగా డబ్బుకావాలని వెంపర్లాడితే జీవితం గాడి తప్పుతుంది. ఇటీవల వరుసగా జరుగుతున్న ఆత్మహత్యలు ఇదే విషయాన్ని రుజువు చేస్తున్నాయి. సులభంగా డబ్బు వస్తుందని ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లు, గేమ్‌లు, పేకాట, స్టాక్‌ మార్కెట్‌ ట్రేడింగ్‌కు అలవాటు పడి.. సంపాదన అంతా పోయి, అప్పుల పాలవుతున్నవారు ఎందరో. తెలిసినవారి దగ్గరే కాకుండా.. క్రెడిట్‌ కార్డులు, లోన్‌ డబ్బు తీసుకుంటున్నారు. చివరికి అది యమపాశమై ఆత్మహత్యలకు ప్రేరేపిస్తోంది. కుటుంబాలను కన్నీటి సంద్రంలో ముంచేస్తోంది. జీవితాలను తలకిందులు చేస్తోంది. రోజురోజుకు జడలు విప్పి కరాళ నృత్యం చేస్తున్న ఈ జాడ్యంపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లు.. మానలేని వ్యసనం.. ఒకసారి కొంత మొత్తంలో డబ్బులు రాగానే ఆన్‌లైన్‌ బెట్టింగ్, రమ్మీ వంటి ఆటలు మంచి ఆదాయ మార్గమని యువత భావిస్తున్నారు. కూర్చున్న చోటే రోజూ వేలకువేలు సంపాదించవచ్చనుకుంటూ ఉచ్చులో పడుతున్నారు. కొద్దిపాటి లాభాలు చూసిన తర్వాత అసలు ‘ఆట’ మొదలవుతుంది. ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లు, గేమ్స్‌ కొద్దిపాటి లాభాలు ఇస్తూ.. వీలైనంత దోచుకునేలా ప్రోగ్రామింగ్‌ చేసి ఉంటాయి. దీనిపై అవగాహన లేక బానిస అవుతారు. డబ్బులు పోగొట్టుకుంటారు. ఆ డబ్బులు వచ్చే వరకు మళ్లీ బెట్టింగ్‌లు చేద్దాం, తర్వాత మానేద్దాం అనుకుంటూ... పూర్తిగా ఈ ఊబిలో కూరుకుపోతారు. యువత మాత్రమేకాదు.. రిటైరైన ఉద్యోగులు, పెద్దవాళ్లు కూడా ఆన్‌లైన్‌ జూదం, గేమ్స్‌ బారినపడుతున్నారు. అప్పుల ఊబిలో కూరుకుపోయామని గుర్తించే సరికే.. అప్పులు ఇచి్చన వాళ్ల నుంచి, కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిళ్లు పెరిగి, తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. వేలం వెర్రిగా పుట్టుకొస్తున్న ఆన్‌లైన్‌ లోన్‌ యాప్‌లతో.. మనకు అవసరమున్నా, లేకున్నా నిమిషాల్లోనే అప్పులు ఇస్తామంటూ వస్తున్న ఆన్‌లైన్‌ లోన్‌యాప్‌లతో సమస్య మరింత పెరుగుతోంది. అందులో లోన్‌ పేరిట మోసగించేవి కొన్నయితే.. నిజంగానే లోన్‌ ఇచ్చి అడ్డగోలు వడ్డీలు, జరిమానాలతో, బలవంతపు వసూళ్ల ప్రయత్నాలతో వేధించేవి మరికొన్ని. సులువుగా సొమ్ము చేతికి వస్తుండటంతో.. ఇలాంటి యాప్‌ల నుంచి అప్పులు చేసి ఆన్‌లైన్‌ జూదంలో పోగొట్టుకుంటున్నవారి సంఖ్య పెరుగుతోంది. నిజానికి రిజర్వు బ్యాంకు నిబంధనల ప్రకారం లోన్‌ యాప్‌లు వినియోగదారుడి ఫొటోలు, వీడియోలు, కాంటాక్ట్‌ నంబర్ల లిస్ట్‌ తీసుకోకూడదు. కేవలం రుణమిచ్చే సమయంలో కేవైసీ కోసం ఒక్కసారి మాత్రమే కెమెరా, మైక్రోఫోన్, లొకేషన్‌ యాకెŠస్‌స్‌ చేయాలి. కానీ ఆన్‌లైన్‌ లోన్‌యాప్‌ కంపెనీలు అప్పులు తీసుకున్నవారి వ్యక్తిగత వివరాలన్నీ సేకరించి, వారి వ్యక్తిగత ప్రతిష్ట దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నాయి. ఆత్మహత్యలకు పురిగొల్పుతున్నాయి. ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ వెనుక భయపెట్టే నిజాలు.. ⇒ మన దేశంలో అక్రమ బెట్టింగ్‌ మార్కెట్‌ విలువ రూ.8.7 లక్షల కోట్లు అని అంచనా. ఇది ఏటా 30 శాతం పెరుగుతున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. ⇒ విదేశాల్లో, ప్రధానంగా చైనా కేంద్రంగా ఉండే ఆన్‌లైన్‌ బెట్టింగ్, లోన్‌ యాప్‌ కంపెనీలు.. ఇక్కడి మనవారి కష్టార్జితాన్ని దోచుకుని దేశవ్యతిరేక కార్యకలాపాలకు ఫండింగ్‌ చేస్తున్నాయి. ⇒ గేమింగ్, బెట్టింగ్‌.. యాప్‌ ఏదైనా సరే. వాటి వెనుక సూత్రధారులు మాత్రం చైనీయులే ఉంటున్నారు. ⇒ మనీలాండరింగ్, ఉగ్రమూకలకు నిధులు కూడా ఈ బెట్టింగ్‌ యాప్‌లు సమకూర్చుతున్నట్టు దర్యాప్తు సంస్థలు వెల్లడిస్తున్నాయి. ⇒ ‘ఫైవిన్‌’ అనే బెట్టింగ్‌ యాప్‌ మన దేశంలో రూ.400 కోట్ల మేర దోపిడీకి పాల్పడింది. ఆ సొమ్మంతా చైనా కంపెనీలకు చేరవేసిన కేసులో నలుగురు వ్యక్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ఇటీవలే అరెస్టు చేసింది. మన దగ్గర నిషేధం ఉన్నా.. ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ యాప్స్‌ సాధారణంగా రెండు రకాలు. మన దేశంలో ఆపరేట్‌ అయ్యేవి. చైనా కంపెనీలకు చెందినవి. అయితే ఈ ఆన్‌లైన్‌ బెట్టింగ్, డబ్బులు పెట్టి ఆడే గేమింగ్‌లపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అస్సాం రాష్ట్రాల్లో నిషేధం ఉంది. అందువల్ల మన దేశానికి చెందిన ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ యాప్‌లు ఈ రాష్ట్రాల్లో పనిచేయవు. ఫోన్లు ఈ రాష్ట్రాల్లోని లొకేషన్‌లో ఉంటే.. ఇక్కడ అందుబాటులో ఉండవని మెసేజీ చూపిస్తాయి. అందుకే ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ చేయడం కోసం నకిలీ జీపీఎస్‌ యాప్‌లతో తప్పుడు లొకేషన్స్‌ చూపేలా చేస్తుంటారు. అదే చైనా యాప్స్‌ ఏ నిబంధనలు పాటించవు కాబట్టి యథేచ్ఛగా వాటిలో ఆడుతున్నారు. మీ వాళ్లను ఇలా గమనించండి! ఆన్‌లైన్‌లో బెట్టింగ్‌లు, రమ్మీ వంటి జూదానికి అలవాటుపడే వారిని జాగ్రత్తగా గమనించడం ద్వారా గుర్తించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. వారి సూచనల మేరకు.. ఎవరైనా స్థాయికి మించి అప్పులు చేస్తున్నా, తరచూ ఏదో కారణాలతో డబ్బులు అడుగుతున్నా ఓ కన్నేసి ఉంచాలి. ఆ డబ్బు ఎలా ఖర్చు చేస్తున్నారో గమనిస్తూ ఉండాలి. కుటుంబ సభ్యులను, స్నేహితులను పక్కనపెట్టి అదేపనిగా మొబైల్‌ ఫోన్‌లో గడుపుతున్నా.. ఫోన్‌లో ఏం చేస్తున్నారన్నది ఇతరులకు తెలియకుండా జాగ్రత్తపడుతున్నా అనుమానించాలి. నష్టపోయినప్పుడు చిరాకు, ఆగ్రహం, ఆందోళన వంటివాటికి లోనవుతుంటారు. ఒంటరిగా గడుపుతుంటారు. ఇలాంటి లక్షణాలను గమనించాలి. ఆత్మహత్యలు వద్దు.. మీ బాధ పంచుకోండి.. ⇒ మీ సమస్య ఏదైనా, ఎలాంటిదైనా.. ప్రతిదానికీ పరిష్కారం ఉంటుందన్నది మర్చిపోవద్దు. ఆత్మహత్యలకు పాల్పడకుండా మీ బాధలను ఈ హెల్ప్‌లైన్‌ సెంటర్లతో పంచుకోవాలని, మీకు సమాధానం దొరకవచ్చని నిపుణులు చెబుతున్నారు. ⇒ రోష్నీ సూసైడ్‌ ప్రివెన్షన్‌ హెల్ప్‌లైన్‌: 040–66202000 ⇒ హైదరాబాద్‌కు చెందిన వన్‌లైఫ్‌ ఎన్జీఓ: 7893078930 ⇒ ఎయిమ్స్‌ (బీబీనగర్‌): 9493238208 ⇒ నేరుగా పోలీస్‌ సహాయం కోసం..: డయల్‌ 100 బెట్టింగ్, గేమింగ్‌ యాడ్స్‌ను పూర్తిగా నిషేధించాలి సులభంగా డబ్బు సంపాదన, అదీ పెద్ద మొత్తంలో ఆర్జించాలనే కోరిక కొందరిని ఆవహిస్తుంది. దీనిని ‘ఇన్‌పల్స్‌ కంట్రోల్‌ డిజార్డర్‌’అంటారు. క్రెడిట్‌ కార్డులు, లోన్‌యాప్‌ల ద్వారా సులభంగా డబ్బు సమకూరుతోంది. బెట్టింగ్, గేమింగ్‌లో కొంత కోల్పోయినా... మరోసారి ప్రయతి్నస్తే డబ్బు రావొచ్చన్న ఆశ వారిని నిలవనీయదు. లక్షల్లో అప్పుల్లో పడిపోతే దానిని తీర్చేయాలని మళ్లీ అప్పులు చేసి బెట్టింగ్‌ చేస్తున్నారు. ఈ విష వలయం నుంచి బయటికి రాలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. స్మోకింగ్‌కు సంబంధించిన ప్రకటనలను ఎలా నిషేధించారో అలా అన్ని ప్రచార, ప్రసార సాధనాల్లో బెట్టింగ్‌ కంపెనీల యాడ్లు, యాప్‌ల ప్రచారాన్ని నిషేధించాలి. వెచి్చంచే వ్యయంపై పరిమితి పెట్టడం, ఆధార్‌–పాన్‌ కార్డులతో అనుసంధానం చేయడం వంటివాటితో డబ్బు అతి వినియోగాన్ని నియంత్రించవచ్చు. ఎక్కువ మొత్తంలో అప్పులు చేయడం, రాత్రంతా ఫోన్‌లో గడుపుతూ ఆందోళనతో కనిపించడం వంటి వాటిని కుటుంబ సభ్యులు గుర్తించి వారిని నియంత్రించాలి. – డాక్టర్‌ నిషాంత్‌ వేమన, కన్సల్టెంట్‌ సైకియాట్రిస్ట్, కేర్, చేతన హాస్పటల్స్‌ అత్యాశకు పోయి ఊబిలో చిక్కుకోవద్దు సులభంగా డబ్బు సంపాదించాలనే సంస్కృతి పెరగడంతో ఆన్‌లైన్‌ గ్యాంబ్లింగ్, బెట్టింగ్, గేమింగ్‌ వంటి వాటికి అలవాటు పడుతున్నారు. గత 15, 20 ఏళ్లలో రియల్‌ ఎస్టేట్‌లో భారీగా డబ్బు సంపాదించిన వారు.. డాబుగా ఖర్చుచేయడం, విలాసవంతమైన కార్లు, భవనాలు కొనడంతో సంపాదన ప్రదర్శన జరుగుతోంది. మిగతావారు సైతం దీనిని ఓ మోడల్‌గా అనుకరించడం మొదలుపెట్టారు. కష్టపడి పనిచేయాలనే తత్వం మరుగున పడి, ఏదో ఒక విధంగా లక్షలు, కోట్లు సంపాదించాలనే ఆశలు పెరిగిపోతున్నాయి. సులభంగా డబ్బు సంపాదనే ధ్యేయంగా ప్రయత్నాలు చేసి అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. కరోనా అనంతర పరిస్థితుల్లో మధ్య తరగతి ప్రజల ఆదాయం తగ్గి అప్పులు పెరిగాయి. పర్సనల్‌ లోన్‌ యాప్స్‌ అధిక వడ్డీలతో సగటు జీవిని చిదిమేస్తున్నాయి. పాత అప్పులు తీర్చడానికి కొత్త అప్పులు చేస్తూ ఊబిలో కూరుకుపోతున్నారు. – డి.పాపారావు, ఆర్థిక రంగ విశ్లేషకుడు బెట్టింగ్, గ్యాంబ్లింగ్‌ యాప్‌లలో లాభాలు భ్రమే ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ మన రాష్ట్రంలో నిషిద్ధం. అలాంటి ఆన్‌లైన్‌ యాప్‌లు వాడితే చట్టప్రకారం శిక్ష తప్పదు. బాధితులపైనా కేసులు తప్పవన్నది గుర్తుంచుకోవాలి. బెట్టింగ్‌ యాప్‌లలో లాభాలు వస్తాయన్నది భ్రమ అని గుర్తించాలి. మొదట కొద్దిపాటి లాభాలు చూపి.. తర్వాత కచి్చతంగా మోసం చేస్తారు. దీనితో అప్పుల ఊబిలో కూరుకుపోవడంతోపాటు కుటుంబాలు చిక్కుల్లో పడతాయి. ఆన్‌లైన్‌ బెట్టింగ్, ఆన్‌లైన్‌ రమ్మీ వంటి ఆటలకు దూరంగా ఉండడం మంచిది. – కవిత, డీసీపీ, సైబర్‌క్రైమ్స్, హైదరాబాద్‌

CM Chandrababu Naidu Comments Against YSRCP3
వైఎస్సార్‌సీపీ శ్రేణులే లక్ష్యంగా చంద్రబాబు కక్షపూరిత వ్యాఖ్యలు

విజయవాడ: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కక్ష సాధింపు చర్యలు ఒక్కోక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. వైఎస్సార్సీపీ శ్రేణులే లక్ష్యంగా ఇప్పటికే కుట్ర పూరిత రాజకీయాలు చేస్తున్న చంద్రబాబు.. ఈసారి ఏకంగా ఆ పార్టీకి చెందిన వారికి ఏ పనులు చేయొద్దంటూ వ్యాఖ్యానించడం తీవ్ర దుమారం రేపుతోంది. వైఎస్సార్ సీపీకి చెందిన వారికి ఎటువంటి పనులు చేయొద్దని చంద్రబాబు బహిరంగంగానే వ్యాఖ్యానించారు. డైరెక్ట్ గా, ఇండైరెక్ట్ గా వైఎస్సార్ సీపీ శ్రేణులకు ఏ పనులు చేయకండని, అన్ని స్థాయిల్లోనూ ఇది వర్తిస్తుందని వ్యాఖ్యానించారు. తన సొంత జిల్లా(చిత్తూరు జిల్లా) పర్యటనలో భాగంగా ప్రజా వేదిక పేరుతో ఏర్పాటు చేసిన సభలో సీఎం చంద్రబాబు ఈ రకంగా కక్ష పూరిత వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు వ్యాఖ్యలపై విమర్శలుముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు ఈ తరహా కక్ష సాధింపు వ్యాఖ్యలు చేయడంపై విమర్శలు వస్తున్నాయి. గతంలో పార్టీ రహితంగా మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పాలన అందిస్తే, ఇప్పుడు చంద్రబాబు ఇలా వ్యాఖ్యానించడం కక్ష పూరిత రాజకీయం కాకపోతే ఏంటని రాజకీయ విమర్శకులు ప్రశ్నిస్తున్నారు. సీఎంగా ప్రమాణం చేసే సమయంలో రాజ్యాంగాన్ని గౌరవిస్తానంటూ చంద్రబాబు చేసిన ప్రమాణం ఏమైందని మండిపడుతున్నారు. ఇది రాజ్యాంగానికి, సీఎం ప్రమాణానికి విరుద్ధమంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Zelenskyy Stark Message To USA President Donald Trump4
ట్రంప్‌తో వాగ్వాదం.. ఆపై జెలెన్‌స్కీ కీలక ట్వీట్‌

కీవ్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‍, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీల మధ్య వైట్ హౌస్ వేదికగా జరిగిన చర్చలు పూర్తిగా విఫలం కావడమే కాదు.. ఆ చర్చ కాస్తా ‘ మూడో ప్రపంచ యుద్ధం’ అని ట్రంప్ నోట వచ్చే వరకూ వెళ్లింది. అంటే రష్యాతో శాంతి చర్చలకు తాము సిద్ధమంటూనే ట్రంప్ చెప్పిన ప్రతీ దానికి తలాడించలేదు జెలెన్ స్కీ. పూర్తిగా తమ భూభాగంపై ఎటువంటి కాల‍్పులు, బాంబుల మోత లేకుండా చూస్తామని అమెరికా తరఫున మీరు(ట్రంప్) మాటిస్తేనే మీతో వాణిజ్య ఖనిజాల ఒప్పందంపై సంతకం చేస్తామని కరాఖండీగా చెప్పేశారు జెలెన్ స్కీ.తమ భూ భాగంలో నివసిస్తే వేరే వాళ్ల పెత్తనం ఏమిటని జెలెన్ స్కీ కాస్త గట్టిగానే స్వరం వినిపించారు. ఇది ట్రంప్ కు నషాళానికి ఎక్కినట్లుంది. రష్యాతో శాంతి ఒప్పందం చేసుకోకపోతే మూడో ప్రపంచం యుద్ధం వచ్చినా రావొచ్చు అని ట్రంప్ హెచ్చరించారు. దాంతో వారి మధ్య చర్చ సంగతి పక్కన పెడితే, వాగ్వాదమే ఎక్కువ కనిపించింది.ఇలా వాదోపవాదాల నడుమనే ఎటువంటి ఒప్పందంపై సంతకం చేయకుండా వైట్ హౌస్ వీడారు జెలెన్ స్కీ. అయితే జెలెన్ స్కీ వైఖరి కచ్చితంగానే ఉందనే అభిప్రాయమో, ట్రంప్ పై కోపమో తెలీదు కానీ కొన్ని దేశాలు మాత్రం ఉక్రెయిన్ కు మద్దతు తెలిపాయి. కెనడా, బ్రిటన్ తో సహా పలు కీలక దేశాలు జెలెన్ స్కీకి జై కొట్టాయి.మీ సపోర్ట్ ఎప్పుడూ కీలకమే.. కానీ మాకు స్వేచ్ఛ కూడా ​అవసరంఅయితే ఇలా ట్రంప్ తో వాదించి వెళ్లిన జెలెన్ స్కీ గురించి ప్రపంచం అంతా చర్చించుకునే తరుణం ఇది. అగ్రదేశం, ఆ దేశ అధ్యక్షుడ్ని ఎదిరించి వాదించిన సిసలైన నాయకుడు అని, ‘వీడు మగడ్రా బుజ్జి’ అని సోషల్ మీడియా వరల్డ్ అనుకుంటున్న తరుణం.. అయితే ట్రంప్‌ తో వాగ్వాదం తర్వాత జెలెన్‌స్కీ.. తమకు యూఎస్ సపోర్ట్ అనేది కీలకమని మరోసారి స్పష్టం చేశారు. ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడిగా ఉన్న ట్రంప్ సపోర్ట్ చాలా కీలకమని వ్యాఖ్యానించారు. తన సోషల్ మీడియా హ్యాండిల్ ‘ఎక్స్’ వేదికగా జెలెన్ స్కీ ట్వీట్ చేశారు. ‘ మీ సపోర్ట్ మాకు అత్యంత కీలకం. ఇప్పటివరకూ రష్యాతో వార్ లో మాకు అందించిన ప్రతీ సహకారం మరువలేనింది. ఉక్రెయిన్ ప్రజలు మీకు ఎప్పుడూ రుణపడే ఉంటారు.ఇప్పుడు ట్రంప్ సపోర్ట్ మాకు అత్యంత కీలకం. ఆయన యుద్ధాన్ని ముగించాలని చూస్తున్నారు. యుద్ధాన్ని ముగించడానికి మా కంటే ఎక్కువ కోరుకునే వారు ఎవరూ ఉండరు. కానీ మేము యుద్ధంతోనే జీవనం సాగిస్తున్నాం. మా స్వాతంత్య్యం కోసం మేము చేస్తున్నా పోరాటం.. మా ప్రతీ ఒక్కరి ఆశయం, ఆశ కూడా మాకు స్వే‍చ్ఛగా మనుగడ సాగించడమే’ అని రాశారు. America’s help has been vital in helping us survive, and I want to acknowledge that. Despite the tough dialogue, we remain strategic partners. But we need to be honest and direct with each other to truly understand our shared goals.— Volodymyr Zelenskyy / Володимир Зеленський (@ZelenskyyUa) March 1, 2025 It’s crucial for us to have President Trump’s support. He wants to end the war, but no one wants peace more than we do. We are the ones living this war in Ukraine. It’s a fight for our freedom, for our very survival.— Volodymyr Zelenskyy / Володимир Зеленський (@ZelenskyyUa) March 1, 2025

Hariyana Congres Leader Himani Narwal Dies5
మహిళా కాంగ్రెస్ నేత హిమానీ దారుణ హత్య

చండీగఢ్: హర్యానా రాష్ట్రంలో రోహతక్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. మహిళా కాంగ్రెస్ నేత హిమానీ నార్వాల్ దారుణ హత్యకు గురయ్యారు. ఆమెను హత్య చేసిన అనంతరం సూట్ కేసులో మూటగట్టి ఓ నిర్మానుష ప్రాంతంలో పడేశారు దుండగులు. ఆమె మృతదేహం సూట్ కేసులో లభించింది. సప్లా బస్టాండ్ దగ్గర సూట్ కేసులో హిమానీ నార్వాల్ మృతదేహం ఉండటంతో స్థానికంగా కలకలం రేగింది. ఆ బస్టాండ్ వద్ద సూట్ కేసు పడి ఉండటంతో తెరిచి చూడటంతో ఈ దారుణం వెలుగు చూసింది. గతంలో కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన జోడో యాత్రలో ఆమె చురుగ్గా పాల్గొన్నారు.

Doubts Over Police Statement On Posani Krishna Murali Health6
పోసానిపై సీఐ స్టేట్‌మెంట్‌ ఇవ్వడమేంటి?.. ప్రకటనపై అనుమానాలు!

సాక్షి, వైఎస్సార్ జిల్లా: అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న పోసాని కృష్ణమురళిపై పోలీసులు మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నారు. జ్యూడీషియల్‌ కస్టడీలో ఉన్న పోసానిపై నాటకాలాడుతున్నారంటూ రైల్వే కోడూరు సీఐ వెంకటేశ్వర్లు చేసిన ప్రకటనపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. డాక్టర్లు ప్రకటన విడుదల చేయకుండా ముందుగానే సీఐ ​మాట్లాడటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు, పోసాని భద్రతపై ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. పోసాని ఆరోగ్యంపై పోలీసులు స్టేట్‌మెంట్‌ ఇవ్వడమేంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. కనీసం మానవత్వం లేకుండా పోలీసులు స్టేట్‌మెంట్లు ఇస్తున్నారు.గత రాత్రి నుంచి ఛాతి నొప్పితో బాధపడుతున్న పోసాని.. కొంతకాలంగా కడుపులో ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్నారు. ఎడమ భుజం నొప్పితో ఇబ్బందిపడుతున్నారు. తీవ్రమైన గొంతునొప్పితో కూడా బాధపడుతున్న పోసాని.. మాట్లాడానికి కూడా ఇబ్బందిపడుతున్నారు. పోసాని తీవ్రమైన గ్యాస్టిక్‌ సమస్యతో బాధపడుతున్నారు. అబ్డామిన్‌ హెర్నియా సర్జరీలో ఇన్‌ఫెక్షన్‌ వల్ల పోసానికి తీవ్రమైన సమస్య ఉంది.హెర్నియా సర్జరీ తర్వాత నెలరోజులు ఆస్పత్రిలోనే పోసాని చికిత్స తీసుకున్నారు తీవ్రమైన వెన్నునొప్పితో మూడుసార్లు వోకల్‌ కార్డు సర్జరీ జరిగింది. కొద్ది రోజుల క్రితం పోసానికి గుండెకు సంబంధించిన చికిత్స జరగగా, హార్ట్‌ సర్జరీ చేసిన స్టంట్‌ వేశారు వైద్యులు. హార్ట్‌ సర్జరీ తర్వాత ఛాతిలో నొప్పితో పోసాని బాధపడుతున్నారు.

Ys Jagan Wishes Muslims On The Occasion Of Beginning Of Holy Month Of Ramadan7
ముస్లిం సోదరులకు వైఎస్‌ జగన్‌ రంజాన్‌ శుభాకాంక్షలు

సాక్షి, తాడేపల్లి: ముస్లిం సోదరులకు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రంజాన్‌ శుభాకాంక్షలు తెలిపారు. పవిత్ర రంజాన్‌ మాసం ప్రారంభం సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులందరికీ ఆయన శుభాకాంక్షలు చెప్పారు. ‘‘ఉపవాస దీక్షలు చేస్తున్న అందరికీ అల్లా దీవెనలు మెండుగా ఉండాలని కోరుకుంటున్నాను’’ అని వైఎస్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు. పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులందరికీ శుభాకాంక్షలు. ఉపవాస దీక్షలు చేస్తున్న అందరికీ అల్లా దీవెనలు మెండుగా ఉండాలని కోరుకుంటున్నాను.— YS Jagan Mohan Reddy (@ysjagan) March 1, 2025

Venkatesh Sankranthiki Vasthunam Movie Ott Surprise To Audience8
ఓటీటీకి వచ్చేసిన 'సంక్రాంతి వస్తున్నాం'.. ఆడియన్స్‌కు బిగ్‌ ట్విస్ట్!

ఈ ఏడాది సంక్రాంతికి రిలీజై బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన చిత్రం 'సంక్రాంతికి వస్తున్నాం'. అనిల్ రావిపూడి- వెంకటేశ్ కాంబోలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అదరగొట్టింది. ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ మూవీలో ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లో దిల్‌ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. పొంగల్ కానుకగా జనవరి 14న థియేటర్లలో విడుదలైంది.సంక్రాంతికి వస్తున్నాం మూవీ బాక్సాఫీస్ వద్ద సక్సెస్ కావడంతో ఓటీటీ రిలీజ్ కోసం ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. ఎట్టకేలకు అభిమానుల నిరీక్షణకు తెరపడింది. ఈ రోజు సాయంత్రం ఆరు గంటల నుంచే టీవీలతో పాటు జీ5లోనూ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. అయితే ఓటీటీ వర్షన్‌లో సినీ ప్రియులకు షాకిచ్చారు సంక్రాంతికి వస్తున్నాం మేకర్స్. ఈ సినిమా నిడివిని తగ్గించి విడుదల చేశారు. థియేటర్లలో 2 గంటల 24 నిమిషాలు ఉన్న ఈ చిత్రం.. ఓటీటీలో మాత్రం 2 గంటల 16 నిమిషాల రన్‌టైమ్‌తో స్ట్రీమింగ్ అవుతోంది. దాదాపు ఎనిమిది నిమిషాల సీన్స్ తొలగించడంతో ఫ్యాన్స్‌ ఆశ్చర్యానికి గురవుతున్నారు. అయితే దీనిపై చిత్రబృందం క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.అయితే థియేటర్‌ వర్షన్‌ నిడివి కారణంగా కొన్ని కామెడీ సన్నివేశాలను దర్శకుడు అనిల్‌ రావిపూడి తొలగించారని ఇటీవల వార్తలొచ్చాయి. అవి ఓటీటీలో యాడ్‌ చేస్తారంటూ భావించారు. ముఖ్యంగా సినిమా ఫ్లాష్‌బ్యాక్‌లో మీనాక్షి చౌదరి, వెంకటేశ్‌ల మధ్య కొన్ని కామెడీ సీన్స్‌ను యాడ్‌ చేయనున్నారంటూ ప్రచారం జరిగింది. కానీ ‍అలా జరగపోగా.. ఉన్న నిడివి కాస్తా తగ్గడంతో టాలీవుడ్ ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

LPU 2025 Btech Final Year Student Bags Rs 1.03 Cr Placement Package9
ఎల్‌పీయూ విద్యార్థికి రూ.1.03 కోట్ల ప్యాకేజీ

లవ్లీ ప్రొఫెషనల్‌ యూనివర్శిటీ (ఎల్‌పీయూ)కు ఈ ఏడాది చాలా ఉత్సాహంతో మొదలైంది. ఫైనల్‌ ఇయర్‌ బీటెక్‌ విద్యార్థి రూ.1.03 కోట్ల (1,18,000 డాలర్లు)తో ఉద్యోగావకాశం పొందారు. రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్‌లో B.Tech చేస్తున్న బేతిరెడ్డి నాగవంశీరెడ్డి 2025 మేలో తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేయనున్నారు. ప్రముఖ ఏఐ రోబోటిక్స్ సంస్థలో రోబోటిక్స్ ఇంజినీర్‌గా చేరనున్నారు. ఈ అసాధారణ విజయం అటు పరిశ్రమ వర్గాల్లోనూ ఇటు విద్యా ప్రపంచంలోనూ సంచలనం సృష్టించింది. విద్యార్థులకు సూపర్‌ డూపర్‌ ప్యాకేజీలు అందించగల అత్యున్నత విద్యా సంస్థగా ఎల్‌పీయూ తనస్థానాన్ని సుస్థిరం చేసుకుంది.వేర్వేరు బీటెక్‌ విభాగాల్లోని మొత్తం 7361 మంది విద్యార్థులకు పాలో ఆల్టో నెట్‌వర్క్స్, నుటానిక్స్‌, మైక్రోసాఫ్ట్‌, సిస్కో, పేపాల్‌ అమెజాన్‌ వంటి ప్రతిష్టాత్మక మల్టీనేషనల్‌ కంపెనీల నుంచి ప్లేస్‌మెంట్లు లభించాయి. వీరిలో 1700 మంది టాప్‌ ఎమ్మెన్సీల నుంచి ఏడాదికి రూ.10 లక్షల నుంచి రూ.కోటి వరకూ ప్యాకేజీలు అందాయి. టాప్‌ ఎంఎన్‌సీలు ఇచ్చిన సగటు ప్యాకేజీ రూ.16 లక్షలు (ఏడాదికి). ఉద్యోగ మార్కెట్‌లో ఎల్‌పీయూకు ఉన్న అధిక డిమాండ్‌కు నిదర్శనాలు ఈ ప్లేస్‌మెంట్లు.గత ప్లేస్‌మెంట్‌ సీజన్‌ కూడా ఆకట్టుకునేదే. ఇండస్ట్రీలోనే అతిపెద్ద కంఎనీలు ఆకర్షణీయమైన ప్యాకేజీలు అందించాయి. పాలో ఆల్టో నెట్‌వర్క్స్ ఏకంగా ఏడాదికి రూ.54.75 లక్షల ప్యాకేజీని అందించగా నుటానిక్స్‌ రూ.53 లక్షల ప్యాకేజీ ఇచ్చింది. మైక్రోసాఫ్ట్‌ రూ.52.20 LPA ప్యాకేజీ అందించింది. మొత్తం 1912మందికి ఒకటి కంటే ఎక్కువ ఆఫర్లు అందాయి. 377 మందికి మూడు ఆఫర్లు, 97 మందికి నాలుగు ఆఫర్లు, 18 మందికి ఐదు, ఏడుగురికి ఆరు ఆఫర్లు లభించాయి. ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌ ఇంజినీరింగ్‌ విద్యార్థి ఆదిరెడ్డి వాసుకు నమ్మశక్యం కాని రీతిలో ఏకంగా ఏడు ఆఫర్లు వచ్చాయి. ఇదో అరుదైన, ఆకట్టుకునే రికార్డు.పైన చెప్పుకున్న కంపెనీలు మాత్రమే కాకుండా.. అమెజాన్‌ (రూ.48.64 LPA), ఇన్‌ట్యూట్‌ లిమిటెడ్‌ (రూ. 44.92 LPA), సర్వీస్‌ నౌ ( రూ. 42.86 LPA), సిస్కో (రూ. 40.13 LPA), పేపాల్‌ (రూ. 34.4 LPA), APNA (రూ.34 LPA), కామ్‌వాల్ట్‌ (రూ. 33.42 LPA), స్కేలర్‌ (రూ. 32.50 LPA)లు కూడా స్కిల్‌ డెవెలప్‌మెంట్‌, అత్యాధునిక టెక్నాలజీల్లో నైపుణ్యం అందించేందుకు ఎల్‌పీయూ చూపుతున్న శ్రద్ధకు నిదర్శనంగా నిలుస్తున్నాయి.ఎల్పీయూ పట్టభద్రుల సాంకేతిక పరిజ్ఞాన బుద్ధికుశలత కారణంగా భారీ నియామకాలు చేపట్టే ఆక్సెంచర్‌, క్యాప్‌జెమినీ, టీసీఎస్‌ తదితర ప్రముఖ కంపెనీల నుంచి మంచి డిమాండ్‌ ఉంది. క్యాప్‌జెమినీ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ 736 మంది విద్యార్థులకు అనలిస్ట్‌, సీనియర్‌ అనలిస్ట్‌ రోల్స్‌ కోసం ఉద్యగావకాశం ఇచ్చింది. అలాగే మైండ్‌ట్రీ 467 మంది విద్యార్థులను గ్రాడ్యుయేట్‌ ఇంజినీర్‌ ట్రైనీ పొజిషన్‌ కోసం తీసుకుంది. కాగ్నిజెంట్‌ టెక్నాలజీ సొల్యూషన్స్‌ కూడా 418 మంది విద్యార్థులను జెన్‌సీ రోల్స్‌ కోసం తీసుకుంది. ఎల్‌పీయూ నుంచి విద్యార్థులను ఎంపిక చేసుకున్న ఇతర కంపెనీల్లో ఆక్సెంచర్‌ (279 మంది), టీసీఎస్‌ (260 మంది), కేపీఐటీ టెక్నాలజీస్‌ (229 మంది), డీఎక్స్‌సీ టెక్నాలజీ (203), MPHASIS (94 మంది) కంపెనీలు ఉన్నాయి.రొబోటిక్స్‌, ఆటోమేషన్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌, మెకానికల్‌ ఇంజినీరింగ్‌ వంటి కోర్‌ ఇంజినీరింగ్‌ విభాగాల్లో అత్యధిక స్థాయిలో ప్లేస్‌మెంట్లు లభించాయి. పాలో ఆల్టో నెట్‌వర్క్స్‌, సిలికాన్‌ ల్యాబ్స్‌, ట్రైడెంట్‌గ్రూప్‌, నుటానిక్స్‌, ఆటోడెస్క్‌, అమెజాన్‌ వంటి దిగ్గజ కంపెనీలు ఈ విభాగాల్లోని విద్యార్థులను భారీగా నియమించుకుంటున్నాయి.‘‘ఎప్పటికప్పుడు మారిపోతున్న ప్రపంచానికి అనుగుణంగా విద్యార్థులు విజయం సాధించేలా చేసేందుకు ఎల్‌పీయూ కట్టుబడి ఉంది. ఎల్‌పీయూలో బోధించే అంశాలు కంపెనీల అవసరాలకు తగ్గట్టుగా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఎల్‌పీయూలో సంప్రదాయ పద్ధతులకు అతీతంగా సృజనాత్మక రీతిలో సాగే బోధన విద్యార్థులునిమగ్నమైయెలా ఉంటుంది. విద్యార్థులు పెద్ద సంఖ్యలో టాప్‌ కంపెనీల నుంచి ప్లేస్‌మెంట్‌ ఆఫర్లు పొందుతూండటం దీనికి నిదర్శనం. ఎల్‌పీయూ బోధనాంశాల సత్తానుచాటుతున్నాయి ఈ ప్లేస్‌మెంట్లు. జాతీయ, అంతర్జాతీయ ప్రముఖ సంస్థల్లో విద్యార్థులకు మంచి మంచి ప్లేస్‌మెంట్స్‌ సాధించిన రికార్డు ఎల్‌పీయూ సొంతం. అమెరికా, యూకే, ఆస్ట్రేలియాలల్లోని ఎన్నో పేరొందిన కంపెనీల్లో ఎల్‌పీయూ విద్యార్థులు ఏడాదికి రూ.కోటి కంటే ఎక్కువ ప్యాకేజీలతో పని చేస్తున్నారు. అత్యున్నత నైపుణ్యం కలిగిన ప్రొఫెషనల్స్‌ను తయారు చేయగల ఎల్‌పీయూ శక్తి సామర్థ్యాలకు, అంతర్జాతీయ స్థాయి ఎదుగుదలకు ఇవి నిదర్శనాలు.’’ అని రాజ్యసభ సభ్యులు, ఎల్‌పీయూ ఫౌండర్‌ ఛాన్సలర్‌ డాక్టర్‌ అశోక్‌ కుమార్‌ మిట్టల్‌ వివరించారు.2025 బ్యాచ్‌ కోసం దరఖాస్తు చేసుకునేందుకు చివరితేదీ దగ్గరపడింది. ఎల్‌పీయూలో అడ్మిషన్లకు పోటీ ఎక్కువ. యూనివర్శిటీలో అడ్మిషన్‌ కోసం విద్యార్థులు ప్రవేశ పరీక్ష రాయాల్సి ఉంటుంది. అలాగే ‘ఎల్‌పీయూ నెస్ట్‌ 2025’, ఇంటర్వ్యూలలోనూ పాసైన వారికి మాత్రమే కొన్ని ప్రత్యేక కార్యక్రమాల్లోకి ప్రవేశం లభిస్తుంది. పరీక్ష, అడ్మిషన్‌ ప్రాసెస్‌ గురించి తెలుసుకోవాలనుకునే ఆసక్తిగల విద్యార్థులు https://bit.ly/43340ai ను సందర్శించగలరు.

CT 2025 Klassen Dussen 50s South Africa Beat England By 7 Wickets10
SA vs Eng: ఇంగ్లండ్‌కు ఘోర అవమానం.. బాధతో బట్లర్‌ బైబై

చాంపియన్స్‌ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లో ఇంగ్లండ్‌కు ఘోర పరాభవం ఎదురైంది. ఒక్క మ్యాచ్‌ కూడా గెలవకుండానే ఈ ఐసీసీ వన్డే టోర్నమెంట్‌ నుంచి నిష్క్రమించింది. సౌతాఫ్రికాతో శనివారం నాటి మ్యాచ్‌తో పరాజయాల పరంపరను పరిపూర్ణం చేసుకుని ఇంటిబాట పట్టింది.ఈ మెగా టోర్నీలో గ్రూప్‌-‘బి’ నుంచి ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, అఫ్గనిస్తాన్‌లతో కలిసి ఇంగ్లండ్‌ బరిలోకి దిగింది. తమ తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను ఎదుర్కొన్న బట్లర్‌ బృందం.. ఐదు వికెట్ల తేడాతో ఓడిపోయింది. అనంతరం అఫ్గనిస్తాన్‌తో తలపడ్డ ఇంగ్లండ్‌.. ఆఖరి వరకు పోరాడి అనూహ్య రీతిలో ఎనిమిది పరుగుల స్వల్ప తేడాతో పరాజయాన్ని చవిచూసింది.ఇప్పటి వరకు ఇదే అత్యల్ప స్కోరుఈ క్రమంలో సెమీస్‌ రేసు నుంచి వైదొలిగిన ఇంగ్లిష్‌ జట్టు.. ఆఖరిగా సౌతాఫ్రికా(England vs South Africa)తో మ్యాచ్‌లోనైనా గెలవాలని భావించింది. కానీ ప్రొటిస్‌ జట్టు బట్లర్‌ బృందానికి ఆ అవకాశం ఇవ్వలేదు. కరాచీ వేదికగా శనివారం నాటి మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఇంగ్లండ్‌ తొలుత బ్యాటింగ్‌ చేసింది. అయితే, సౌతాఫ్రికా బౌలర్ల ధాటికి 179 పరుగులకే కుప్పకూలింది.ఓపెనర్లలో ఫిల్‌ సాల్ట్‌(8), వన్‌డౌన్‌ బ్యాటర్‌ జామీ స్మిత్‌(0)లతో సహా హ్యారీ బ్రూక్‌(19), లియామ్‌ లివింగ్‌స్టోన్‌(9) పూర్తిగా విఫలమయ్యారు. మిగతా వాళ్లలో జో రూట్‌ 37 పరుగులతో టాప్‌ రన్‌ స్కోరర్‌గా నిలవగా.. జోస్‌ బట్లర్‌(Jos Buttler- 21), జో జోఫ్రా ఆర్చర్‌(25) ఫర్వాలేదనిపించారు. ఈ క్రమంలో 179 పరుగులకే ఇంగ్లండ్‌ ఆలౌట్‌ కాగా.. చాంపియన్స్‌ ట్రోఫీ-2025లో ఇప్పటి వరకు ఇదే అత్యల్ప స్కోరుగా నమోదైంది.ఇక స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా 29.1 ఓవర్లలోనే పనిపూర్తి చేసింది. ఓపెనర్లలో రియాన్‌ రికెల్టన్‌(27) ఫర్వాలేదనిపించగా.. తన ప్రొఫెషనల్‌ కెరీర్‌లో తొలిసారిగా ఓపెనర్‌గా వచ్చిన ట్రిస్టన్‌ స్టబ్స్‌ డకౌట్‌ అయ్యాడు. అయితే, వన్‌డౌన్‌ బ్యాటర్‌ రాసీ వాన్‌ డెర్‌ డసెన్‌, హెన్రిచ్‌ క్లాసెన్‌ అర్ధ శతకాలతో చెలరేగారు. బాధతో బట్లర్‌ బైబైడసెన్‌ 87 బంతుల్లో 72 పరుగులతో అజేయంగా నిలవగా.. క్లాసెన్‌ 56 బంతుల్లో 64 రన్స్‌ సాధించాడు. ఈ క్రమంలో మూడు వికెట్లు కోల్పోయి సౌతాఫ్రికా టార్గెట్‌ను ఛేదించింది. సెమీస్‌ చేరడంతో పాటు గ్రూప్‌-బి టాపర్‌గా నిలిచింది. ఇక ఇదే గ్రూపు నుంచి ఆస్ట్రేలియా ఇప్పటికే సెమీస్‌ చేరగా.. గ్రూప్‌-ఎ నుంచి భారత్‌, న్యూజిలాండ్‌ తమ బెర్తులు ఖరారు చేసుకున్నాయి. ఇదిలా ఉంటే.. పరిమిత ఓవర్ల క్రికెట్లో ఇంగ్లండ్‌ వరుస పరాభవాల నేపథ్యంలో బట్లర్‌ కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పాడు. అఫ్గనిస్తాన్‌తో మ్యాచ్‌ తర్వాత తన నిర్ణయాన్ని వెల్లడించిన బట్లర్‌.. సౌతాఫ్రికా చేతిలో ఓటమి వల్ల చేదు అనుభవంతో తన కెప్టెన్సీ కెరీర్‌ను ముగించాడు.సౌతాఫ్రికా వర్సెస్‌ ఇంగ్లండ్‌👉వేదిక: నేషనల్‌ స్టేడియం, కరాచి👉టాస్‌: ఇంగ్లండ్‌..బ్యాటింగ్‌👉ఇంగ్లండ్‌ స్కోరు: 179 (38.2)👉సౌతాఫ్రికా స్కోరు: 181/3 (29.1)👉ఫలితం: ఏడు వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌పై సౌతాఫ్రికా విజయం👉ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌: మార్కో యాన్సెన్‌(3/39).చదవండి: Champions Trophy: టీమిండియాకు గుడ్‌ న్యూస్‌​..

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

NRI View all
title
తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) ఆధ్వర్యంలో శివాలయాల సందర్శన యాత్ర

తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) వారు గత మూడేళ్లుగా నిర్వహిస్తున్న మహా శివరాత్రి శివాలయాల సందర్శన యాత్రను  ఈ మహా శ

title
అమెరికా నుంచి భారత్‌కి అందుకే వచ్చేశా! సీఈవో హార్ట్‌ టచింగ్‌ రీజన్‌

మెరుగైన అవకాశాలు, ఆర్థిక భద్రత కోసం చాలామంది భారతీయులు విదేశాల బాటపడుతుంటార

title
USA: ‘కోమా’లో భారత విద్యార్థి.. ఎమర్జెన్సీ వీసాకు లైన్‌ క్లియర్‌

వాషింగ్టన్‌:  ఫిబ్రవ

title
Hong kong: హాంకాంగ్‌లో ఘనంగా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం

హాంకాంగ్ తెలుగు సమాఖ్య అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం 2025ని ఘనంగా జరుపుకుంది.

title
తానా ప్రపంచసాహిత్యవేదిక ఆధ్వర్యంలో “నా భాషే నా శ్వాస” సదస్సు విజయవంతం

డాలస్ :  ఉత్తరఅమెరికా తెలుగుసంఘం (తానా) సాహిత్యవిభాగం

Advertisement

వీడియోలు

Advertisement