Top Stories
ప్రధాన వార్తలు

దైవ సాక్షిగా.. 'మళ్లీ భక్తులే బలి'
‘మా పిల్లలు.. బంధువులను ప్రభుత్వమే చంపేసింది! చందనోత్సవం పుణ్యమా అంటూ ప్రభుత్వం మమ్మల్ని రోడ్డు పాల్జేసింది. మా కుటుంబాలలో విషాదం నింపింది...!’ ‘దగ్గరుండి బంధువులందరితో తెలుగుదేశంకు ఓటు వేయించాడు. ఆ ప్రభుత్వమే మా కొడుకు.. కోడలిని పొట్టనబెట్టుకుంది. ఇంటి దిక్కును కోల్పోయాం...!’‘చేతికి అందివచ్చిన కుమారుడికి త్వరలోనే పెళ్లి చేయాలనుకున్నా...!’ ‘నాకు పెద్ద దిక్కు అనుకున్న అన్నయ్య నన్ను వదిలి వెళ్లిపోయాడు..!’ కేజీహెచ్ మార్చురీ వద్ద మృతుల బంధువుల ఆక్రోశం ఇదీ!సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: టీడీపీ కూటమి సర్కారు పాపాలు భక్తులకు యమపాశాలుగా మారుతున్నాయి! తిరుపతిలో తొక్కిసలాట ఘటన మరువక ముందే.. సింహాచలంలో మరో విషాదం చోటు చేసుకుంది. నాడు వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల కోసం వచ్చిన ఆరుగురు భక్తులు తిరుపతిలో మృత్యువాత పడగా.. నేడు వరాహ లక్ష్మీ నృసింహస్వామి నిజరూప దర్శనం కోసం సింహాచలం వచ్చిన వారు నిర్జీవులుగా మారారు. సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనం ఏర్పాట్లలో సర్కారు నిర్లక్ష్యం ఏడు నిండు ప్రాణాలను బలి తీసుకుంది! అత్యంత నాసిరకంగా, కాలమ్స్ లేకుండా ఫ్లైయాష్‌తో కట్టిన గోడ గాలివానకు కూలిపోయి భక్తులను సజీవ సమాధి చేసింది. బుధవారం తెల్లవారుజామున ఈ విషాదం చోటు చేసుకుంది. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఉండగా వీరిలో ఐటీ ఉద్యోగాలు చేస్తున్న యువ దంపతులున్నారు. చనిపోయిన వారిలో అంబాజీపేటకు చెందిన కుంపట్ల మణికంఠ ఈశ్వర శేషారావు(29), పత్తి దుర్గా స్వామినాయుడు (30), విశాఖ వాసులు ఎడ్ల వెంకటరావు(58), పిల్లా ఉమా మహేశ్వరరావు(30), పిల్లా శైలజ (27), గుజ్జారి మహాలక్ష్మి, పైలా వెంకట రత్నం(45) ఉన్నారు. తమవారి ప్రాణాలు తీసేందుకే నాణ్యత లేని గోడ కట్టారని బాధిత కుటుంబాలు ఆక్రోశిస్తున్నాయి. ఈ విషాదం అందరినీ కలచి వేస్తుండగా విశాఖ ఎంపీ శ్రీభరత్ ఏమాత్రం చలించకుండా చందనోత్సవ దర్శనం చేసుకుని చల్లగా జారుకోవడంపై ప్రజలు మండిపడుతున్నారు. తనకేమీ పట్టనట్లుగా ఆయన ఢిల్లీ వెళ్లిపోయారు. ఇక టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు విశాఖ విడిచి పత్తా లేకుండా పోయారు. ప్రచారం ఘనం.. ఏర్పాట్లు శూన్యంఏడాదికోసారి జరిగే సింహాచలం చందనోత్సవం నిర్వహణ ఏర్పాట్లు ఈసారి భక్తులకు చుక్కలు చూపించాయి. కొండపైకి వెళ్లేందుకు బస్సుల కోసం గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక దర్శనానికి 5 నుంచి 8 గంటల పాటు క్యూలైన్లలో నరకయాతన అనుభవించారు. చందనోత్సవం వేడుకను తిలకించేందుకు దాదాపు రెండు లక్షల మంది భక్తులు తరలి వస్తారని అంచనా వేయగా నిర్వహణ ఏర్పాట్ల కోసం ఐదుగురు మంత్రులతో కమిటీని నియమించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చిన్న చిన్న అంశాలను సైతం పరిగణనలోకి తీసుకొని అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు హోంమంత్రి వంగలపూడి అనిత ప్రకటించారు. అప్పన్న నిజరూప దర్శనం వేళ.. ఏర్పాట్లలో డొల్లతనం బయట పడింది. చందనోత్సవం నిర్వహణ ఏర్పాట్ల విషయంలో మంత్రుల కమిటీ నిర్లక్ష్యం భక్తుల ప్రాణాలను బలి తీసుకుంది. ఏటా చందనోత్సవం రోజు వర్షం పడడం సాధారణం అయినప్పటికీ అందుకు అనుగుణంగా జాగ్రత్తలు తీసుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఫలితంగా వారం క్రితం నిర్మించిన నాసిరకం గోడ కూలి ఏడుగురి ప్రాణాలను బలి తీసుకుంది. అంత ఎత్తు గోడ కట్టినప్పుడు ఫ్లైయాష్ ఇటుక వాడవచ్చా? నీరు దిగేందుకు వీలుగా గోడకు పైపులు ఎందుకు అమర్చలేదు? ఇంజనీరింగ్ డిజైన్ ఇచ్చిందెవరు? అక్కడ ఉన్న షాపులు తొలగించమని ఎవరు చెప్పారు? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఘటనాస్థలంలో శిథిలాలను తొలగిస్తూ మృతుల కోసం వెదుకుతున్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వీఐపీల దర్శనం, టికెట్ల అమ్మకాలపైనే దృష్టిపవిత్ర చందనోత్సవం సమయంలో సైతం సింహాచలం దేవాలయానికి ప్రభుత్వం ఈవోను నియమించకపోవడం గమనార్హం. కేవలం ఇన్చార్జి ఈవోతో ఇంత భారీ కార్యక్రమాన్ని ముగించేందుకు సిద్ధమైంది. ఇన్చార్జి ఈవోను డమ్మీగా మార్చి ప్రభుత్వ పెద్దలు ఇష్టారీతిలో వ్యవహరించారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పాసుల జారీ మొదలుకుని.. టికెట్ల అమ్మకాలు, చందనోత్సవం కోసం చేపట్టిన వివిధ కాంట్రాక్టు పనులన్నింటిలోనూ అధికార పార్టీ నేతలు జోక్యం చేసుకున్నారు. వీఐపీల దర్శనం, టికెట్ల అమ్మకాలపై దృష్టి సారించి సాధారణ భక్తుల భద్రతను గాలికొదిలేసినట్లు స్పష్టమవుతోంది.హడావుడిగా తాత్కాలిక గోడకేశ ఖండనం, గాలి గోపురానికి వెళ్లే భక్తులు నడిచేందుకు ఆలయం పక్కన దారి ఉంది. అక్కడి నుంచి కిందకు వెళ్లేందుకు ఉన్న మెట్ల మార్గం పక్కనే గోడ నిర్మాణం జరుగుతోంది. వాస్తవానికి ఈ గోడకు బదులుగా గతంలో రిటైనింగ్ వాల్ ఉంది. పై నుంచి మట్టి ఊడిపడితే కింద వెళ్లే భక్తులకు ఇబ్బంది లేకుండా ఈ రిటైనింగ్ వాల్ కాపాడేది. అయితే, ప్రసాద్ స్కీమ్‌లో భాగంగా పాత రిటైనింగ్ వాల్ స్థానంలో కొత్త రిటైనింగ్ వాల్ నిర్మించాల్సి ఉంది. రిటైనింగ్ వాల్ నిర్మాణానికి సమయం పడుతుందని చందనోత్సవం సందర్భంగా హడావుడిగా తాత్కాలిక గోడను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ తాత్కాలిక గోడ నిర్మాణ పనులు నాలుగు రోజుల్లో పూర్తి చేశారు. పునాదులు, కాంక్రీట్, స్టీల్, రెయిన్‌ఫోర్స్‌మెంట్ స్ట్రక్చర్ లేకుండా కేవలం ఫ్లైయాష్ బ్రిక్స్‌తో భారీ గోడను నిర్మించేశారు. ఇటుకకు ఇటుకకు మధ్య కనీసం సిమెంటు లేకుండా ఇసుక ఎక్కువ పాలు వేసి అత్యంత నాసిరకంగా నిర్మించారనే విషయం చూస్తే స్పష్టంగా అర్థమవుతోంది. పాత రిటైనింగ్ వాల్ ఉండి ఉంటే ఈ ప్రమాదం తప్పేదని.. కనీసం గోడ నిర్మాణ సమయంలో ప్రభుత్వం నాణ్యతను పరిశీలించినా ఇంత పెను ప్రమాదం జరిగి ఉండేది కాదని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎలాగూ తాత్కాలిక గోడే కదా అనే నిర్లక్ష్యం.. పర్యవేక్షణ లోపంతో నాసిరకంగా నిర్మించడంతో చిన్నపాటి వర్షానికే కూలిపోయి భక్తులు ప్రాణాలు కోల్పోయారు.మృతుల ఫైల్ ఫొటోలు ముందస్తు జాగ్రత్తలేవి?లక్షల మంది భక్తులు తరలివచ్చే ఈ వేడుకల్లో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ప్రమాదం జరిగిన తరువాత కూడా సహాయక చర్యలు అందించడంలో తీవ్ర జాప్యం జరిగినట్లు తెలుస్తోంది. కొత్తగా నిర్మించిన రిటైనింగ్ వాల్ వైపు రూ.300 టికెట్ల క్యూలైన్లు ఏర్పాటు చేశారు. కానీ అక్కడ ఒక్క సిబ్బందిని కూడా అందుబాటులో ఉంచలేదు. ప్రమాదం జరిగిందన్న విషయం భక్తుల హాహాకారాలు చేస్తే గానీ అధికారుల దృష్టికి వెళ్లలేదు. భారీగా భక్తులు తరలివచ్చే కార్యక్రమాలకు ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా అంబులెన్సులు, పారా మెడికల్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందిని అందుబాటులో ఉంచాలి. కానీ ఇక్కడ ఆ పరిస్థితి కనిపించలేదు. దుర్ఘటన తెల్లవారుజామున సుమారు 3.05 గంటలకు జరగగా అధికారులు 3.30 గంటలకు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ తరువాత ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రప్పించారు. అప్పటికే దారుణం జరిగిపోయింది. ఇటుకల కింద ఏడుగురు భక్తులు సమాధి అయిపోయారు.మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలకే పెద్దపీట!ఒకవైపు ఆలయ ఇన్చార్జి ఈవోను డమ్మీని చేసి అన్ని నిర్ణయాలను కలెక్టరేట్, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల ఇంటి నుంచే ప్రభుత్వం అమలు చేసింది. ఎవరికి ఎన్ని వీఐపీ టికెట్లు ఇవ్వాలనే విషయాన్ని వారే నిర్ణయించారు. టీడీపీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు సిఫారసు లేఖలకు ఎన్ని కావాలంటే అన్ని పాస్‌లు కేటాయించారు. వారికి మాత్రమే కారు పాస్‌లు మంజూరు చేశారు. బీజేపీ నేతలకు సైతం వీఐపీ, రూ.1,500 టికెట్లు దక్కలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. సాధారణ భక్తులు రూ.300, రూ.1,000 టికెట్లను కొనుగోలు చేసేందుకు బ్యాంకులు, కౌంటర్ల వద్దకు వెళితే లేవని తిప్పి పంపేశారు. అప్పటికే ఆ టికెట్లను తమ వారి కోసం టీడీపీ నేతలు తీసేసుకున్నారు. సాధారణ భక్తులు దేవస్థానం బస్సుల్లోనే కొండపైకి చేరుకోవాల్సి వచ్చింది. బస్సులు తగినంతగా లేకపోవడంతో గంటల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొంది. గంటల పాటు వేచి చూడలేక పలువురు నడక మార్గంలో ఘాట్ రోడ్డు ద్వారా కొండపైకి చేరుకున్నారు. ఘాట్ రోడ్లో నడక దారిలో కిలోమీటరు మేర బారులు తీరి కనిపించారు. ఇన్చార్జి ఈవోనే దిక్కు...!ఏటా చందననోత్సవంతోపాటు గిరి ప్రదక్షిణకు భక్తులు పోటెత్తుతారు. అప్పన్న నిజరూప దర్శన వేడుకను తిలకించేందుకు ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాలతోపాటు ఒడిశా నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు. ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించడంలో ఈవోదే ప్రధాన బాధ్యత. అయితే చందనోత్సవం వేళ రెగ్యులర్ ఈవోను ప్రభుత్వం నియమించలేదు. రెగ్యులర్ ఈవోగా ఉన్న వి.త్రినాథరావు 3 నెలలు సెలవులో వెళ్లారు. అప్పటి నుంచి ఇన్చార్జి ఈవోగా కె.సుబ్బారావు కొనసాగుతున్నారు. ఏప్రిల్ 30న చందనోత్సవం ఉందని తెలిసినా రెగ్యులర్ ఈవోను నియమించపోవడం ఇష్టారాజ్యంగా వ్యవహరించేందుకేననే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మృతుల వివరాలు..పవిత్ర క్షేత్రాల్లో వరుస అపచారాలుపవిత్ర పుణ్యక్షేత్రాల్లో 11 నెలలుగా వరుసగా చోటు చేసుకుంటున్న అపచారాలు, అనూహ్య ఘటనలు భక్తకోటిని తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. భక్తుల మనోభావాలతో చెలగాటమాడుతూ వారి భద్రత పట్ల సర్కారు తీవ్ర నిర్లక్ష్యాన్ని బట్ట బయలు చేస్తున్నాయి. తిరుమల శ్రీవారి లడ్డూ విషయంలో ప్రభుత్వమే ‘కల్తీ’ ప్రచారానికి తెర తీయడం మొదలు.. వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లలో వైఫల్యం కారణంగా తిరుపతి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఆరుగురు భక్తులు మరణించడం.. టీటీడీ గోశాలలో గోవుల మృతి ఘటనను కప్పిపుచ్చుతూ సీఎం చంద్రబాబు నిస్సిగ్గుగా బుకాయించడం.. దశాబ్దాలుగా హైందవ ధర్మం, దాతృత్వానికి ప్రతీకగా నిలిచిన కాశీ నాయన ఆశ్రమాన్ని ప్రభుత్వమే నేలమట్టం చేయడం.. శ్రీకూర్మం గుడిలో తాబేళ్లు చనిపోవడం లాంటి ఘటనలన్నీ భక్తుల మనోభావాలను కలచి వేస్తున్నాయి. గతంలోనూ చంద్రబాబు సర్కారు కృష్ణా పుష్కరాల పేరుతో విజయవాడలో పలు ఆలయాలను నేల కూల్చిందని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు కనీసం ఓ గోడ కూడా కట్టలేక అప్పన్న సాక్షిగా భక్తుల ప్రాణాలను బలి తీసుకుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతిమృతుల కుటుంబాలకు రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా, గాయపడిన వారికి రూ.50 వేలుసాక్షి, న్యూఢిల్లీ: సింహాచలం క్షేత్రం వద్ద చోటుచేసుకున్న దుర్ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. ‘తమ వారిని కోల్పోయిన కుటుంబాలకు మనోధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తున్నా. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా’ అని రాష్ట్రపతి పేర్కొన్నారు. ప్రధాని స్పందిస్తూ ‘విశాఖపట్నంలో గోడ కూలిన ఘటనలో జరిగిన ప్రాణనష్టం చాలా బాధాకరం. తమ ప్రియమైన వారిని కోల్పోయిన వారికి సంతాపం. మృతుల బంధువులకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా, గాయపడిన వారికి రూ.50వేలు అందజేస్తాం’ అని ప్రకటించారు.రాహుల్ విచారంఈ ఘటనపై కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్‌గాంధీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

భారత్-పాక్ సరిహద్దుల్లో తీవ్ర ఉద్రికత్త
జమ్మూ: నియంత్రణ రేఖ(ఎల్ఓసీ)తోపాటు అంతర్జాతీయ సరిహద్దు వెంబడి పాకిస్తాన్ సైన్యం కవ్వింపు చర్యలు ఆగడం లేదు. భారత్-పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తత నెలకొంది. ఎల్వోసీ దగ్గర వరుసగా ఏడోరోజూ(గురువారం) పాక్ కాల్పులు జరిపింది. కుప్వారా, యూరి, అఖ్నూర్ సెక్టార్లో పాక్ కాల్పులను భారతసెన్యం సమర్థంగా తిప్పికొట్టింది. ఎల్ఓసీ వెంబడి పాక్ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడం ఇది వరుసగా ఏడోరోజు కావడం గమనార్హం. నిన్న(బుధవారం) సైతం పాక్ కాల్పులు కొనసాగగా... భారత జవాన్లు ప్రభావవంతంగా బదులిచ్చారు. జమ్మూకశ్మీర్‌లో నాలుగు సరిహద్దు జిల్లాల్లో కవ్వింపు చర్యలు కొనసాగాయి. చిన్నపాటి ఆయుధాలతో కాల్పులు జరుపుతుండడంతో ప్రాణనష్టం జరగడం లేదని అధికారులు పేర్కొన్నారు.పహల్గాంలో ఉగ్రవాద దాడి జరిగిన తర్వాత పాకిస్తాన్‌పై భారత ప్రభుత్వం పలు ఆంక్షలు విధించింది. సింధూనది జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది. దాంతో పాక్ సైన్యం ఆగ్రహంతో రగిలిపోతోంది. సరిహద్దులో భారత సైన్యమే లక్ష్యంగా నిత్యం కాల్పులకు దిగుతోంది. భారత జవాన్లు దీటుగా తిప్పికొడుతున్నారు. ప్రధానంగా జమ్మూ, రాజౌరి, బారాముల్లా, కుప్వారా జిల్లాల్లో ఈ కాల్పులు జరుగుతున్నాయి. భారత్–పాక్ మధ్య 3,323 కిలోమీటర్ల సరిహద్దు ఉంది.

HIT3 X Review: ‘హిట్ 3’ ట్విటర్ రివ్యూ
నేచురల్ స్టార్ నాని(Nani) నటించిన 'హిట్: ది థర్డ్ కేస్'(HIT3) సినిమా ఎట్టకేలకు నేడు(మే 1) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ‘హిట్’ ఫ్రాంచైజీలో మూడో చిత్రమిది. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటించింది. ఇందులో నాని ఎస్పీ అర్జున్ సర్కార్ పాత్రలో కనిపించాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ట్రైలర్‌కు భారీ స్పందన లభించింది. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో సినిమా పై హైప్ క్రియేట్ అయింది. భారీ లంచనాల మధ్య మే 1న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఓవర్సీస్తో పాటు పలు చోట్ల ఫస్ట్‌డే ఫస్ట్ షో పడిపోయింది. సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా ద్వారా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. హిట్ 3 కథేంటి? ఎలా ఉంది? నాని ఖాతాలో మరో హిట్ పడిందా లేదా తదితర అంశాలను ఎక్స్ వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చదివేయండి. ఇది కేవలం నెటిజన్ల అభిప్రాయం మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు సాక్షి బాధ్యత వహించదు.ఎక్స్‌లో హిట్ 3(HIT3 Review) సినిమాకు మిశ్రమ స్పందన లభిస్తోంది.కొంతమంది నెటిజన్స్ సినిమా మొదటి సగం అద్భుతంగా ఉందని, నాని నటన, రొమాంటిక్ ఎపిసోడ్లు ఆకట్టుకున్నాయని ప్రశంసింస్తే..మరికొంతమంది ఈ సినిమా సీట్ ఎడ్జ్ థ్రిల్లర్‌గా ఆకట్టుకోలేదని, గత హిట్ సినిమాలతో పోలిస్తే ఈ భాగం సాధారణంగా ఉందని అభిప్రాయపడ్డారు. సినిమా రెండో సగం కథలో మెరుగైన ఆలోచనలు, ఎగ్జిక్యూషన్ లోపించాయని కొందరు విమర్శించారు. అయినప్పటికీ, నాని పాత్రలో కొత్త జోన్లో కనిపించాడని, అతని నటన సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచిందని చాలామంది కొనియాడారు. #Hit3 is a very violent action crime thriller that has moments that work well but at the same time portions that are too run of the mill and narrated on the slower side.The first half is pretty average and predictable till the pre-interval which starts to engage. The second…— Venky Reviews (@venkyreviews) April 30, 2025 హిట్ 3' ఒక వయలెంట్ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్.కొన్ని సీన్స్ భాగా వర్కౌట్ అయ్యాయి.అదే సమయంలో కొన్ని రోటీన్ సన్నివేశాలు కూడా ఉన్నాయి. ఫస్టాఫ్ రొటీన్‌గా, ఊహించదగిన విధంగా ఉంటుంది. ప్రీ-ఇంటర్వెల్ వరకు, అక్కడ నుండి ఆసక్తికరంగా మారుతుంది. రెండవ సగం స్క్విడ్ గేమ్ నుండి ప్రేరణ పొందిన సెటప్‌ను కలిగి ఉంది. ముఖ్యంగా ప్రీ-క్లైమాక్స్ నుండి క్లైమాక్స్ కథనం ఆసక్తికరంగా సాగుతుంది. అయితే, ముందుగా చెప్పినట్లు కథనం ఊహించదగిన విధంగా ఉంటుంది, తక్కువ ట్విస్ట్‌లతో మరియు మాస్ మూమెంట్స్‌పై ఎక్కువగా ఆధారపడుతుంది. నిర్మాణ విలువలు మరియు సినిమాటోగ్రఫీ ప్రత్యేకంగా నిలుస్తాయి. సంగీతం ప్రభావవంతంగా లేదు . నాని అద్భుతంగా నటించాడు అంటూ ఓ నెటిజన్ ఈ సినిమాకు 2.75 రేటింగ్ ఇచ్చాడు.#Hit3One time watch for NaNiHighlights __________NaNi’s performance Cinematography Climax Negatives__________Forceful violenceNo twists and turnsUneven screenplayBGM— praneeth nukala (@praneethnukala) May 1, 2025 హిట్ 3 ఒక్కసారి చూడొచ్చు. నాని నటన, సినిమాటోగ్రఫీ, క్లైమాక్స్ ఈ సినిమాకు ప్లస్ పాయింట్ అయితే.. వయెలెన్స్ బలవంతగా ఇరికించడం, ట్విస్టులు,మలుపులు లేకపోవడం, స్క్రీన్‌ప్లే, బీజీఎం మైనస్ పాయింట్స్ అని మరో నెటిజన్ అభిప్రాయ పడ్డాడు#HIT3 #HIT3Review RAW..BLOODY..🎯🎯🎯🎯Not for family audiences or kids. What an actor @NameisNani . He is growing as multitalented, big box office star. Best of #Nani movie I have ever watched. Totally new experience 👏🏼👏🏼Strictly NO Kids ⛔️⛔️***BLOCKBUSTER***— Karthik (@meet_tk) April 30, 2025#HIT3 rating : ⭐⭐🌟3/5!!@NameisNani show🔥 an Griping action pack thriller, #SrinidhiShetty and #nani chamestry good overall an watchable.#hit3review #HIT3FromMay1st pic.twitter.com/guu9TKRMsS— its cinema (@iitscinema) April 30, 2025 ఇది నాని షో. గ్రిస్పింగ్ యాక్షన్‌ప్యాక్ థ్రిల్లర్. శ్రీనిధి శెట్టి, నాని కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. ఓవరాల్‌గా హిట్3 థియేటర్స్‌లో చూడాల్సిన సినిమా అంటూ మరో నెటిజన్ 3 రేటింగ్ ఇచ్చాడు.First half Good Second Half & Pre climax 💥💥💥💥💥💥💥💥💥💥💥. #HIT3 pic.twitter.com/8074TXw1v1— Vishnu Varthan Reddy (@RVVR9999) May 1, 2025#hit3review – Gritty & violent thriller with flashes of brilliance. First half dull, second half picks up with Squid Game vibes. Nani excels, but predictable plot, excess violence & weak music pull it down. Not for families.Rating: 2.75/5#Nani #HIT3TheThirdCase #HIT3 #hit3 pic.twitter.com/98Rk6J9tUs— Tha Cinema (@tha_cinema) May 1, 2025#HIT3Review:Positives• Nani🔥💥💥• The Final Act🥵👿• Concept😮• Sailesh's Screenplay👌• Cameos💥Suspenses🙌Investigation💥Final Verdict: An Engaging Suspense Thriller that serves its Purpose.#HIT3 | #NANI | #HIT3TheThirdCase #castesensuspic.twitter.com/eDn379ICBk— IndianCinemaLover (@Vishwa0911) May 1, 2025

భయపెట్టిన భారత్.. పాక్ సైన్యంలో పెను మార్పులు
ఇస్లామాబాద్: పహల్గాం ఉగ్రదాడితో భారత్-పాకిస్తాన్ దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఈ తరుణంలో పాక్ సైన్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది.పాకిస్తాన్ ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ మహ్మద్ అసిమ్ మాలిక్‌ను ఆ దేశ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ (ఎన్ఎస్ఏ)గా నియమిస్తూ పాక్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి.2024 సెప్టెంబర్ నుంచి ఐఎస్ఐ చీఫ్‌గా వ్యవహరిస్తున్న లెఫ్టినెంట్ జనరల్ మహ్మద్ అసిమ్ మాలిక్‌కు ఎన్ఎస్ఏగా అదనపు బాధ్యతలు అప్పగించినట్లు వెలుగులోకి వచ్చిన మీడియా కథనాలు హైలెట్ చేస్తున్నాయి. పహల్గాం ఉగ్ర దాడుల్లో 26 మంది మరణించారు. ఈ ఉగ్రదాడితో పాకిస్తాన్‌కు బుద్ధి చెప్పేలా భారత్ సామ, ధాన ,బేధ దండోపాయలను ఉపయోగిస్తోంది. వరుస కఠిన నిర్ణయాలతో అంతకంత దెబ్బతీస్తూనే ఉంది. దీంతో పాక్ సైన్యంలో ఆందోళన మొదలైంది. భారత్.. తమపై ఏ క్షణంలోనైనా దాడి చేయొచ్చని పాక్ మంత్రులు బహిరంగ ప్రకటనలు చేస్తున్నారు. దీనికి తోడు ఆ దేశ సైన్యాధిపతి జనరల్ సయీద్ అసిమ్ మునీర్ ఆచూకీ గల్లంతైంది. భారత్ దెబ్బకు దెబ్బ తీయొచ్చనే ఊహాగానాల నడుమ మునీర్ దేశం విడిచి భార్య పిల్లలతో పరాయి దేశంలో తలదాచుకుంటున్నట్లు తెలుస్తోంది. పహల్గాం ఉగ్రదాడి అనంతరం కొనసాగుతున్న వరుసర పరిణామలు, యుద్ధ భయాలతో పాక్ సైన్యంలో సైతం భయాందోళనలు మొదలయ్యాయి. బతికుంటే బలుసాకు తిని బతుకొచ్చు.. భారత్‌తో తలపడలేమనే సంకేతాలిస్తూ రెండు రోజుల వ్యవధిలో పాకిస్తాన్ ఆర్మీలో 4500 మంది సైనికులు, 250 మంది అధికారులు తమ పదవులకు రాజీనామ చేశారు. ఈ క్రమంలో అసిమ్ మాలిక్‌కు ఎన్ఎస్ఏ అడ్వైజర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించడం గమనార్హం.

ఈ రాశి వారికి స్థిరాస్తి వృద్ధి.. వృత్తి, వ్యాపారాలలో పురోగతి
గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, తిథి: శు.చవితి సా.4.22 వరకు, తదుపరి పంచమి, నక్షత్రం: మృగశిర రా.7.13 వరకు, తదుపరి ఆరుద్ర, వర్జ్యం: రా.3.19 నుండి 4.51 వరకు, దుర్ముహూర్తం: ఉ.9.48 నుండి 10.39 వరకు, తదుపరి ప.2.55 నుండి 3.46 వరకు, అమృతఘడియలు: ఉ.10.55 నుండి 12.24 వరకు; రాహుకాలం: ప.1.30 నుండి 3.00 వరకు, యమగండం: ఉ.6.00 నుండి 7.30 వరకు, సూర్యోదయం: 5.39, సూర్యాస్తమయం: 6.14. మేషం.... కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.వృషభం..... కుటుంబంలో చికాకులు. పనులలో విజయం. వ్యయప్రయాసలు. ధనవ్యయం. బంధువులతో వివాదాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో నిరాశ.మిథునం.... కుటుంబసౌఖ్యం. విలువైన సమాచారం. బంధువులను కలుసుకుని సంతోషంగా గడుపుతారు. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపార,ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి.కర్కాటకం.. వ్యవహారాలలో స్వల్ప ఆటంకాలు. ధనవ్యయం. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.సింహం.... వ్యవహారాలలో విజయం. దైవదర్శనాలు. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో ఆదరణ. వృత్తి, వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఆస్తి వివాదాలు తీరతాయి.కన్య.... ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యవహారాలలో విజయం. శుభవార్తలు. ఆహ్వానాలు అందుతాయి. వాహనయోగం. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.తుల..... రుణాలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. పనుల్లో జాప్యం. అనారోగ్యం. కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు.వృశ్చికం.... బంధువులతో వివాదాలు. ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. ఆస్తి విషయాలలో చికాకులు. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.ధనుస్సు..... శ్రమ ఫలిస్తుంది. నూతన విద్యావకాశాలు. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం. విలువైన వస్తువులు కొంటారు. వ్యాపార,ఉద్యోగాలలో నూతనోత్సాహం.మకరం...... కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. ఆశ్చర్యకరమైన సంఘటనలు. విలువైన సమాచారం. స్థిరాస్తి వృద్ధి. వృత్తి, వ్యాపారాలలో పురోగతి. ఆధ్యాత్మిక చింతన.కుంభం.. మిత్రులతో వివాదాలు. ధనవ్యయం. కుటుంబంలో ఒత్తిడులు. కొన్ని పనులు మందకొడిగా సాగుతాయి. వృత్తి, వ్యాపారాలలో మార్పులు ఉంటాయి.మీనం.. ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. ధనవ్యయం. కుటుంబసభ్యులతో వివాదాలు. ఆలోచనలు కలసిరావు. బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు నిరాశపరుస్తాయి.

జగన్ వస్తున్నారని తెలిసి ప్రభుత్వంలో వణుకు
ఆరిలోవ/డాబాగార్డెన్స్: సింహాచలం ఘటన గురించి తెలిసిన వెంటనే వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విశాఖకు బయలుదేరారన్న సమాచారం అందుకున్న ప్రభుత్వం కలవరపాటుకు గురైంది. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతారని వణికిపోయింది. వైఎస్ జగన్ కేజీహెచ్ మార్చురీకి చేరుకునేలోపే మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి వారి బంధువులకు అప్పగించేందుకు రాష్ట్ర హోం మంత్రి అనిత పడరాని పాట్లు పడ్డారు. పోస్టుమార్టంకు అంగీకరిస్తూ సంతకాలు చేయాలంటూ బాధిత కుటుంబాల కాళ్లావేళ్లాపడ్డారు.శవపంచనామాకు సహకరించాలని, ప్రభుత్వం ప్రకటించిన నష్టపరిహారంతోపాటు రూ.కోటి పరిహారం అందేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని మొరపెట్టుకున్నారు. తమను నమ్మాలని ప్రాధేయపడ్డారు. అయినా మృతుల కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు. వారం రోజుల్లోనే నాణ్యత లేకుండా గోడ నిర్మించి తమ కుటుంబీకుల మరణానికి కారణమైన ప్రభుత్వంపై తమకు నమ్మకం లేదంటూ భీష్మించారు. రాతపూర్వకంగా ఇవ్వాలని, లేదా మీడియా ముందు స్పష్టంగా ప్రకటించాలని తేల్చిచెప్పారు. దీంతో ఏం చేయాలో పాలుపోని హోంమంత్రి అనిత వైఎస్ జగన్ వచ్చేలోపే పోస్టుమార్టం పూర్తిచేసి మృతదేహాలను బంధువులకు అప్పగించాలని కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ పి.శివానంద్‌తోపాటు పోలీసు అధికారులను ఆదేశించారు. వారి చేత మృతుల కుటుంబాలపై తీవ్ర ఒత్తిడి చేయించారు. మృతులు భీమిలి నియోజకవర్గం వారు కావడంతో వారిని ఒప్పించాలని ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అనుయాయులనూ బతిమిలాడారు. ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణబాబు, విష్ణుకుమార్‌రాజు కూడా మృతుల కుటుంబ సభ్యులకు నచ్చజెప్పేందుకు శతవిధాలా యత్నించారు. చివరకు సంతకాలు లేకుండానే మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తిచేయించారు. సింహాచలం ఘటన గురించి విశాఖపట్నం ఎంపీ శ్రీభరత్ పట్టించుకోలేదు. సింహాచలం దేవస్థానం వైపు కన్నెత్తి చూడలేదు.

లాహోర్ నడిబొడ్డున సయీద్ అడ్డా!
హఫీజ్ సయీద్.. కరడుగట్టిన పాకిస్తాన్ ఉగ్రవాది. లష్కరే తోయిబా అధినేతగా భారత్‌లో రక్తపుటేరులు పారిస్తున్నాడు. జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో గతవారం జరిగిన ఉగ్రదాడికి కర్త, కర్మ, క్రియ అతడేనని నిఘా వర్గాలు గుర్తించాయి. ఈ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుపై అమెరికా ప్రభుత్వం 10 మిలియన్ డాలర్ల (రూ.84.58 కోట్లు) రివార్డు ప్రకటించింది. ఎన్నో ఉగ్రవాద దాడుల వెనుక మాస్టర్‌మైండ్‌గా వ్యవహరించిన హఫీజ్ సయీద్ పాకిస్తాన్లో స్వేచ్ఛగా తిరుగుతున్నాడు. పాక్ ప్రభుత్వం ఈగ కూడా వాలనివ్వడం లేదు. ఎలాంటి ఆంక్షలు లేకుండా నిర్భయంగా తన పని తాను చేసుకుపోతున్నాడు. పాకిస్తాన్లో రెండో పెద్దనగరమైన లాహోర్‌లో ఓ ఖరీదైన ప్రాంతంలో నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. ఈ ఇంటి శాటిలైట్ చిత్రాలను, వీడియోలను ‘ఇండియా టుడే’ వార్తాసంస్థ తాజాగా బహిర్గతం చేసింది. లాహోర్‌లో జోహర్ టౌన్ అనే ప్రాంతంలో ఉన్న ఈ భవనం సాధారణంగా ఉగ్రవాద నేతల ఇళ్ల కంటే భిన్నంగా కనిపిస్తోంది. శత్రువులు దాడి చేయకుండా ఎత్తుగడ అంతర్జాతీయ ఉగ్రవాదులైన అల్–ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్, జైషే మొహమ్మద్ అధినేత మసూద్ అజార్ సాధారణ జనావాసాలకు దూరంగా నివసించారు. ఒంటరి ఇళ్లలోనే వారు మకాం వేశారు. పాకిస్తాన్‌లోని అబోతాబాద్ ఇంటిపై అమెరికా సేనలు దాడి చేసి, లాడెన్‌ను అంతం చేసిన సంగతి తెలిసిందే. ఈ ఇంటి చుట్టూ ఖాళీ స్థలమే ఉండడం అమెరికా జవాన్లకు బాగా కలిసొచ్చిoది. 2019లో పుల్వామా దాడికి కారకుడైన మరో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది మసూద్ అజార్ పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్‌లోని బహల్వపూర్‌లో ఓ ఒంటరి ఇంట్లో నివసిస్తున్నట్లు భారత నిఘా వర్గాలు పసిగట్టాయి. ప్రధాన రహదారి పక్కనే ఈ ఇల్లు ఉంది కానీ చుట్టూ జనావాసాలేవీ లేవు. సామాన్య ప్రజలకు దూరంగా రహస్య ప్రాంతాల్లో ఉండడానికి ఉగ్రవాదులు ఇష్టపడుతుండగా, హఫీజ్ సయీద్ వ్యూహం మరోలా ఉండడం గమనార్హం. లాహోర్ నడిబొడ్డున అత్యంత రద్దీగా ఉండే చోట తన స్థావరం ఏర్పాటు చేసుకున్నాడు. శత్రువులు దాడి చేయకుండా ఈ జాగ్రత్త తీసుకున్నట్లు తెలుస్తోంది. సామాన్య ప్రజల నివాసాలు ఉన్నచోట దాడులు చేస్తే ప్రాణనష్టం అధికంగా జరిగే ప్రమాదం ఉంటుంది. ప్రపంచ దేశాల నుంచి విమర్శలు రావొచ్చు. అందువల్ల ప్రత్యర్థులు దాడులు చేయడానికి వెనుకాడవచ్చు. లాహోర్‌లో హఫీజ్ సయీద్ ఇల్లు శత్రుదుర్భేద్యంగా కనిపిస్తోంది. ఇదొక కాంపౌండ్ అని చెప్పొచ్చు. ఈ ప్రాంగణంలోనే ఒక పాత భవనంతోపాటు మరికొన్ని ఇళ్లు, మసీదు, మదర్సా(హఫీజ్ సయీద్ కార్యాలయం), ఒక ప్రైవేట్ పార్కు ఉన్నాయి. హఫీజ్ కుటుంబం కూడా ఇక్కడే ఉంటోంది. అతడికి పాకిస్తాన్ సైన్యంతోపాటు సొంత ప్రైవేట్ సైన్యం పటిష్టమైన భద్రత కల్పిస్తున్నాయి. ఇక్కడి మసీదులోనే హఫీజ్ సయీద్ ఎక్కువ సమయం గడుపుతుంటాడు. విద్యార్థుల ముసుగులో అతడి అనుచరులు సైతం ఇందులోనే ఆశ్రయం పొందుతున్నారు. ఇంటి కింద బంకర్ లాహోర్‌లోని అల్–ఖద్సియా మసీదు గతంలో హఫీజ్ సయీద్ కార్యకలాపాలకు అడ్డాగా ఉండేది. పుల్వామా ఉగ్రదాడి అనంతరం బాలాకోట్‌లో భారత సైన్యం సర్జికల్ స్రైక్ చేయడంతో అతడిలో భయం మొదలైంది. అల్–ఖద్సియా మసీదులో ఉండడం సురక్షితం కాదని ఇప్పుడున్న కాంపౌండ్‌కు మకాం మార్చాడు. 2021లో ఈ ఇంటికి సమీపంలో కారుబాంబు పేలుడు సంభవించింది. ముగ్గురు మరణించారు. దాంతో హఫీజ్ సయీద్ భద్రతను మరింత పటిష్టం చేశారు. ఈ కాంపౌండ్ లోపల, బయట గట్టి నిఘా ఉంటుంది. సాయుధులు రోజంతా నిర్విరామంగా పహారా కాస్తుంటారు. స్థానికులను కాంపౌండ్ సమీపంలోకి కూడా అనుమతించరు. అనుమతి ఉన్న వ్యక్తులు రావాలంటే రకరకాల తనిఖీలు ఉంటాయి. అంతేకాదు ఇక్కడ డ్రోన్లు ఎగురవేయడం నిషేధించారు. ఫొటోలు, వీడియోలు చిత్రీకరించడం కుదరదు. హఫీజ్ సయీద్ నివాసం కింద ఉక్కు కోట లాంటి బంకర్ ఉన్నట్లు తెలుస్తోంది. జైల్లో ఉన్నాడంటూ కల్లబొల్లి కబుర్లు ఉగ్రవాద కార్యాకలాపాలకు నిధులు సమకూర్చిన కేసులో హఫీజ్ సయీద్‌కు 31 ఏళ్ల జైలుశిక్ష పడిందని, జైల్లో పెట్టామని పాకిస్తాన్ పైకి నమ్మబలుకుతోంది. కానీ, అందులో ఎంతమాత్రం నిజం లేదని స్పష్టమతోంది. సయీద్‌ను ఐక్యరాజ్యసమితి, అమెరికా ప్రభుత్వం అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాయి. అతడిపై చర్యలు తీసుకోవాలని పాకిస్తాన్ ప్రభుత్వాన్ని ఆదేశించాయి. అయినప్పటికీ ఫలితం శూన్యం. స్వయంగా పాక్ సైన్యమే అతడిని కంటికి రెప్పలా కాపాడుకుంటోంది. పహల్గాంలో ఉగ్రవాద దాడికి పాల్పడింది తామేనని లష్కరే తోయిబా ముసుగు సంస్థ ద రెసిస్టెన్స్ ఫోర్స్(టీఆర్ఎఫ్) స్వయంగా ప్రకటించింది. ఈ దాడి వెనుక అసలు సూత్రదారి హఫీజ్ సయీద్ అని భారత దర్యాప్తు సంస్థలు ఇప్పటికే తేల్చాయి. ముష్కరుడి కోసం కోసం వేట మొదలుపెట్టినట్లు సమాచారం. ఒకవేళ లాహోర్‌లోని అతడి ఇంటిపై దాడి చేయాలన్నా అది సులభం కాదని చెబుతున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్

చెన్నై ఖేల్ ఖతం
సొంతగడ్డపై వరుసగా ఐదో మ్యాచ్‌లో పరాజయంతో ఈ ఐపీఎల్ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ కథ ముగిసింది. పేలవ ప్రదర్శనతో ఎనిమిదో ఓటమిని తమ ఖాతాలో వేసుకున్న ఐదుసార్లు చాంపియన్ మరో నాలుగు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే ప్లే ఆఫ్స్ రేసుకు దూరమైంది. మరోవైపు సమష్టి ప్రదర్శనతో పంజాబ్ కింగ్స్ కీలక విజయాన్ని నమోదు చేసింది. ముందుగా చహల్ ‘హ్యాట్రిక్’...బ్యాటింగ్‌లో శ్రేయస్, ప్రభ్‌సిమ్రన్ కలిసి జట్టును గెలిపించారు. చెన్నై: ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ జోరు కొనసాగుతోంది. బుధవారం జరిగిన పోరులో పంజాబ్ 4 వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్‌పై విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన చెన్నై 19.2 ఓవర్లలో 190 పరుగులకు ఆలౌటైంది. స్యామ్ కరన్ (47 బంతుల్లో 88; 9 ఫోర్లు, 4 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడగా, బ్రెవిస్ (26 బంతుల్లో 32; 2 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. యుజువేంద్ర చహల్ (4/32) ఒకే ఓవర్లో ‘హ్యాట్రిక్’ సహా నాలుగు వికెట్లు పడగొట్టడం విశేషం. అనంతరం పంజాబ్ కింగ్స్ 19.4 ఓవర్లలో 6 వికెట్లకు 194 పరుగులు చేసి గెలిచింది. శ్రేయస్ అయ్యర్ (41 బంతుల్లో 72; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు), ప్రభ్‌సిమ్రన్ (36 బంతుల్లో 54; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధసెంచరీలు సాధించారు. ఒకే ఓవర్లో 26 పరుగులు... చెన్నైకి ఓపెనర్లు సరైన ఆరంభం ఇవ్వలేకపోయారు. ఆంధ్ర ఆటగాడు షేక్ రషీద్ (11) తనకు లభించిన మరో అరుదైన అవకాశాన్ని వృథా చేసుకోగా, ఆయుశ్ మాత్రే (7) విఫలమయ్యాడు. హర్‌ప్రీత్ ఓవర్లో జడేజా (17) మూడు ఫోర్లు కొట్టినా అదే ఓవర్లో వెనుదిరిగాడు. ఈ దశలో కరన్, బ్రెవిస్ భాగస్వామ్యంలో జట్టు నిలదొక్కుకుంది. కరన్ చెలరేగిపోగా, బ్రెవిస్ కొన్ని ఆకట్టుకునే షాట్లు ఆడాడు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 50 బంతుల్లో 78 పరుగులు జోడించారు. 15 ఓవర్లలో జట్టు స్కోరు 134/4. సూర్యాంశ్ షెడ్గే వేసిన తర్వాతి ఓవర్లో కరన్ చెలరేగిపోయాడు. ఈ ఓవర్లో కరన్ వరుసగా 6, 6, 2 (నోబాల్), 2, 4, 4, 1 బాదడంతో మొత్తం 26 పరుగులు రావడం విశేషం. ఈ జోరులో కరన్ సెంచరీ, సీఎస్కే 200 దాటడం ఖాయంగా అనిపించాయి. అయితే చివరకు ఈ రెండూ జరగలేదు. యాన్సెన్ బౌలింగ్‌లో కరన్ అవుట్ కాగా...చహల్ వేసిన 19వ ఓవర్‌తో అంతా మారిపోయింది. 11 బంతుల వ్యవధిలో చెన్నై 6 వికెట్లు కోల్పోయింది. కీలక భాగస్వామ్యాలు... పంజాబ్ ఇన్నింగ్స్ మెరుగ్గా మొదలైంది. ప్రియాన్ష్ ఆర్య (15 బంతుల్లో 23; 5 ఫోర్లు), ప్రభ్‌సిమ్రన్ చక్కటి షాట్లతో 28 బంతుల్లో 44 పరుగులు జోడించారు. తొలి 6 ఓవర్లలో స్కోరు 51 పరుగులకు చేరింది. ప్రభ్‌సిమ్రన్, శ్రేయస్ రెండో వికెట్‌కు 50 బంతుల్లో 72 పరుగులు జత చేశారు. నూర్ ఈ జోడీని విడదీయగా, వధేరా (5) విఫలమయ్యాడు. మరోవైపు కరన్ ఓవర్లో సిక్స్, ఫోర్‌తో శ్రేయస్ 32 బంతుల్లో అర్ధ సెంచరీ సాధించాడు. ప్రభ్‌సిమ్రన్ వెనుదిరిగినా...శశాంక్ (23; 1 ఫోర్, 2 సిక్స్‌లు)తో కలిసి శ్రేయస్ జట్టును గెలుపు దిశగా నడిపించాడు. స్కోరు వివరాలు చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్: రషీద్ (సి) శశాంక్ (బి) అర్ష్ దీప్ 11; ఆయుశ్ (సి) శ్రేయస్ (బి) యాన్సెన్ 7; స్యామ్ కరన్ (సి) ఇన్‌గ్లిస్ (బి) యాన్సెన్ 88; జడేజా (సి) ఇన్‌గ్లిస్ (బి) హర్‌ప్రీత్ 17; బ్రెవిస్ (బి) అజ్మతుల్లా 32; శివమ్ దూబే (సి) శశాంక్ (బి) అర్ష్ దీప్ 6; ధోని (సి) వధేరా (బి) చహల్ 11; హుడా (సి) ఆర్య (బి) చహల్ 2; కంబోజ్ (బి) చహల్ 0; నూర్ (సి) యాన్సెన్ (బి) చహల్ 0; ఖలీల్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 16; మొత్తం (19.2 ఓవర్లలో ఆలౌట్) 190. వికెట్ల పతనం: 1–21, 2–22, 3–48, 4–126, 5–172, 6–184, 7–186, 8–186, 9–186, 10–190. బౌలింగ్: అర్ష్ దీప్ 3.2–0–25–2, యాన్సెన్ 4–0– 30–2, అజ్మతుల్లా 4–0–39–1, హర్‌ప్రీత్ 2–0– 21–1, చహల్ 3–0–32–4, సూర్యాంశ్ 3–0– 40–0. పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్: ప్రియాన్ష్ (సి) ధోని (బి) అహ్మద్ 23; ప్రభ్‌సిమ్రన్ (సి) బ్రెవిస్ (బి) నూర్ 54; శ్రేయస్ (బి) పతిరణ 72; వధేరా (సి) జడేజా (బి) పతిరణ 5; శశాంక్ (సి) బ్రెవిస్ (బి) జడేజా 23; ఇన్‌గ్లిస్ (నాటౌట్) 6; సూర్యాంశ్ (సి) నూర్ (బి) అహ్మద్ 1; యాన్సెన్ (నాటౌట్) 4; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (19.4 ఓవర్లలో 6 వికెట్లకు) 194. వికెట్ల పతనం: 1–44, 2–116, 3–136, 4–180, 5–188, 6–190. బౌలింగ్: ఖలీల్ 3.4–0–28–2, కంబోజ్ 2–0–20–0, జడేజా 3–0–32–1, నూర్ 4–0–39–1, స్యామ్ కరన్ 3–0–27–0, పతిరణ 4–0–45–2. చహల్ ‘హ్యాట్రిక్’ యుజువేంద్ర చహల్ తన తొలి 2 ఓవర్లలో 23 పరుగులిచ్చాడు. ఆ తర్వాత ఇన్నింగ్స్ 19వ ఓవర్ వేసే అవకాశం దక్కింది. వైడ్‌తో ఓవర్ మొదలు పెట్టగా తొలి బంతిని ధోని (11) సిక్సర్‌గా మలిచాడు. అయితే తర్వాతి బంతికే ధోని వెనుదిరగ్గా, మూడో బంతికి హుడా 2 పరుగులు తీశాడు. ఓవర్ చివరి మూడు బంతుల్లో వరుసగా హుడా (2), కంబోజ్ (0), నూర్ (0)లను చహల్ అవుట్ చేశాడు. ‘హ్యాట్రిక్’ పూర్తి కాగానే తనపై ఎన్నో మీమ్‌లకు కారణమైన ట్రేడ్ మార్క్ పొజిషన్లో కూర్చొని అతను సంబరాలు చేసుకున్నాడు. ఐపీఎల్లో చహల్ ‘హ్యాట్రిక్’ తీయడం ఇది రెండోసారి. 2022 సీజన్లో రాజస్తాన్ తరఫున ఆడుతూ కోల్‌కతాపై అతను హ్యాట్రిక్ నమోదు చేశాడు. ఐపీఎల్లో ఒకటికంటే ఎక్కువసార్లు హ్యాట్రిక్ తీసిన మూడో ఆటగాడిగా అతను నిలిచాడు. గతంలో అమిత్ మిశ్రా 3 సార్లు, యువరాజ్ 2 సార్లు హ్యాట్రిక్ సాధించారు. ఐపీఎల్లో నేడురాజస్తాన్ X ముంబై వేదిక: జైపూర్‌రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం

పదునైన వ్యూహంతో...
ప్రతీకారం దిశగా ఒక్కో అడుగే పడుతోంది. పహల్గాం సమీపంలో వారం రోజుల క్రితం 26 మంది పర్యాటకుల ప్రాణాలు తీసిన ఉగ్రవాదుల వేటకు రంగం సిద్ధమవుతోంది. దాడి ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా జరగాలో నిర్ణయం తీసుకునే స్వేచ్ఛను త్రివిధ దళాధిపతులకు ఇస్తూ ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ మంగళవారం తీసుకున్న నిర్ణయం అసాధారణమైనది. దాంతోపాటు జాతీయ భద్రతా సలహా బోర్డు(ఎన్ఎస్ఏబీ)ను బుధవారం పునర్వ్యవస్థీకరించటం కూడా కీలక పరిణామం. ‘రా’ మాజీ చీఫ్ అలోక్ జోషి సారథ్యంలో ఏర్పాటైన ఈ బోర్డు జాతీయ భద్రతా మండలి సెక్రటేరియట్‌కు అవసరమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందజేస్తుందంటు న్నారు. పదునైన వ్యూహం, పక్కా ప్రణాళిక, మెరికల్లాంటి దళాలను కీలక ప్రాంతాల్లో మోహరించటం వగైరాలన్నీ ఇలాంటి సమయాల్లో అత్యంత అవసరం. ఇప్పటికే పహల్గాం మారణకాండను తక్కువ చేసి చూపటానికి పాకిస్తాన్ చేయాల్సిందంతా చేస్తోంది. దాదాపు 45 యేళ్లుగా దాని వ్యూహం ఇదే. ఒకపక్క ఎల్ఓసీలో వరసగా కాల్పుల విరమణను ఉల్లంఘిస్తూ, సరిహద్దుల్లో నిఘా రాడార్లు, యుద్ధ సామగ్రి తరలిస్తూ మరోపక్క అమెరికా తదితర దేశాలముందు తన అమాయ కత్వాన్ని చాటుకోవటానికి ప్రయత్నిస్తోంది. మారణకాండ గురించి ‘నమ్మదగ్గ సమాచారం’ ఇస్తే చర్యలు తీసుకుంటామని చెప్పటం ఇప్పటి షెహబాజ్ సర్కార్‌కి మాత్రమే కాదు... కుట్రపూరితంగానో, ఎన్నికల మాటున సైన్యం ప్రాపకంతోనో అధికారాన్ని చేజిక్కించుకుంటూ వస్తున్న పాక్ అధినేతలందరికీ అలవాటైన విద్య. దీనికి ఎక్కడో అక్కడ అడ్డుకట్ట పడటం తప్పనిసరి. అందుకే ప్రభుత్వ తాజా నిర్ణయం అన్నివిధాలా ఆహ్వానించదగ్గది. మన సహనాన్ని చేతగానితనంగా, మన సుహృద్భావాన్ని అశక్తతగా భావించటం పాకిస్తాన్‌కు అలవాటైంది. మొన్న జరిగిన మారణకాండ అనంతరం దేశవ్యాప్తంగా ప్రజలందరూ ప్రతీకారేచ్ఛతో రగులుతున్నారు. కేవలం దాన్ని సంతృప్తిపరచటమే అంతిమ లక్ష్యం కారాదు. తాజా దాడిలో పాకి స్తాన్ సైన్యంలో పారా కమాండోగా పనిచేసిన హషీం మూసా అనే ఉగ్రవాది పాల్గొనటాన్నిబట్టి చూస్తే ఐఎస్ఐ పాత్రవుందని అర్థమవుతోంది. ఇలాంటివి నివారించాలంటే సరిహద్దుల్లో పటిష్టమైన నిఘావుండాలి. దాంతోపాటు వేర్వేరు సమయాల్లో జరిగిన దాడుల స్వభావాన్ని అధ్యయనం చేయాలి. నిరుడు అక్టోబర్‌లో మధ్య కశ్మీర్లో ఏడుగురు కార్మికులను పొట్టనబెట్టుకున్నది మొదలు మొన్నటి పహల్గాం మారణకాండ వరకూ జరిగిన నాలుగు ఉదంతాల్లో కీలకపాత్ర పోషించింది మూసాయే అంటున్నారు. అదే నిజమైతే మన నిఘా వ్యవస్థ సక్రమంగా లేదని భావించాలి. మొన్న విపక్షాలతో జరిగిన సమావేశంలో కూడా కేంద్ర ప్రభుత్వం నిఘా వైఫల్యం ఉన్నదని అంగీకరించింది. కనుక పాకిస్తాన్ ప్రాపకంతో చెలరేగుతున్న ఉగ్రవాదులను గురిచూసి కొట్టటానికి తగిన చర్యలు తీసుకుంటున్నట్టే మన నిఘా వ్యవస్థను కూడా మరింత పటిష్టం చేయాలి. జవాబుదారీ తనాన్ని నిర్ధారించాలి. ఉగ్రవాదులు మన లోటుపాట్లేమున్నాయో చూసుకునే దాడులకు దిగుతారు. ఆ పని మన నిఘా వర్గాలు చేయగలిగితే ఉగ్రవాదుల్ని నిరోధించటంతోపాటు వారిని చాకచక్యంగా పట్టి బంధించటానికి కూడా వీలవుతుంది. అప్రమత్తత లోపించటంవల్ల నిరాయుధ పౌరుల ప్రాణాలు మాత్రమేకాదు... స్థానికుల జీవిక కూడా దెబ్బతింటుంది. తాజాగా ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో కశ్మీర్‌లోని 50కి పైగా పర్యాటక స్థలాలను మూసివేసినట్టు అధికారులు ప్రకటిస్తున్నారు. అంటే కొన్ని వేల కుటుంబాల ఉపాధి దెబ్బతింటుంది. మున్ముందు తెరిచినా అటువైపు వెళ్లేందుకు పర్యాటకులు జంకుతారు గనుక ఆ రంగం కోలుకోవటానికి చాలా సమయం పడుతుంది. అన్నిటికన్నా మన నేతలు మాటలూ, చేతలూ అదుపులో పెట్టుకోవటం ప్రస్తుత పరిస్థితుల్లో అత్యవసరం. రెండు పక్షాలు పరస్పరం తలపడుతున్నప్పుడు ఎవరి బలం ఎక్కువన్న దాన్నిబట్టి ఫలితం ఆధారపడి వుండదు. ఎవరు కలిసికట్టుగా ఉన్నారో, ఎవరు మెరుగైన వ్యూహం పన్ను తున్నారో, ఎవరి ఎత్తుగడలు సరైనవో వారినే విజయం వరిస్తుంది. జరిగిన భద్రతాలోపాలకు బాధ్యులెవరో నిర్ణయించాలని అనటం, వారిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరటం వరకూ ఎవరికీ అభ్యంతరం ఉండదు. నిర్మాణాత్మకమైన విమర్శలూ ఆహ్వానించదగ్గవే. కానీ ప్రధాని చిత్రాన్ని ఒక పార్టీ తప్పుడుగా చిత్రిస్తే, మరొకరు దానికి జవాబుగా విపక్షనేత వెన్నుపోటుకు సిద్ధంగా వున్నట్టు మరో చిత్రాన్ని సామాజిక మాధ్యమాల్లో పెట్టారు. ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కాంగ్రెస్ నేతల్ని పాకిస్తాన్ పొమ్మంటూ ఉచిత సలహా ఇచ్చారు. 26 మంది అమాయకుల ఉసురు తీసిన ఉగ్రవాదులను ఏరిపారేయటానికి ఏం చేయాలన్న అంశంలో మన భద్రతా వ్యవస్థ తలమునకలై వుంది. ఈ పరిస్థితుల్లో ఐక్యతను చాటి ఆదర్శంగా వుండాల్సిన నాయకులు దిగజారుడు పోస్టులతో అధ్వాన్నంగా ప్రవర్తిస్తున్నారు. ఇదంతా దేశభక్తి అనే భ్రమలో వీరు కాలక్షేపం చేస్తున్నారు. వీరిని చూసి అనుచరగణాలు మరింత రెచ్చిపోతున్నాయి. మతం పేరిట, ప్రాంతం పేరిట విద్వేషాలు రెచ్చగొడుతున్నాయి. ఫలితంగా వేర్వేరు ప్రాంతాల్లోని కశ్మీరీ చిరువ్యాపారుల పైనా, విద్యార్థుల పైనా దాడులు జరుగుతున్నాయి. ఇదంతా మనపై మనమే యుద్ధం చేసుకోవటం. శత్రువుపై సమష్టిగా పోరాడాల్సిన సమయంలో బాధ్యత మరిచి అంతర్గత కలహాలకు దారితీసేలా ప్రవర్తించటం, పైస్థాయి నేతల ప్రాపకానికి వెంపర్లాడటం అత్యంత హీనం. పాపం. సక్రమంగా మాట్లాడటంరాని నేతలు కొన్నాళ్లయినా నోరుమూసుకోవటం ఉత్తమం.

కులగణనకు ఓకే..
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో ప్రతిపక్ష పార్టీలు ఎంతోకాలంగా డిమాండ్ చేస్తున్న కులగణనకు కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు అంగీకరించింది. త్వరలో దేశవ్యాప్తంగా చేపట్టబోయే జనగణనలో భాగంగా కులగణనను సైతం నిర్వహించాలని నిర్ణయించింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన బుధవారం నిర్వహించిన కేంద్ర రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీపీఏ) సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమావేశం అనంతరం కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 246 ప్రకారం ‘గణన’అనేది కేంద్ర జాబితాలో 69వ అంశంగా ఉందని, అందువల్ల జనగణన, కులగణన బాధ్యత పూర్తిగా కేంద్రం పరిధిలోనిదని స్పష్టంచేశారు. కొన్ని రాష్ట్రాలు తమకు అధికారాలు లేకపోయినా సర్వేల పేరుతో కులాల లెక్కలను అశాస్త్రీయంగా సేకరించాయని ఆరోపించారు. ఆ సర్వేల వల్ల గందరగోళం ఏర్పడి సమాజంలో చీలికలు రాకూడదన్న ఉద్దేశంతోనే పక్కా శాస్త్రీయంగా కులగణన నిర్వహించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. కులగణనకు కాంగ్రెస్ ఎప్పుడూ వ్యతిరేకమే కులగణనకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ వ్యతిరేకమేనని మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఆరోపించారు. గతంలో కులగణనను కాంగ్రెస్ ప్రభుత్వాలు వ్యతిరేకిస్తూ వచ్చాయని తెలిపారు. ‘కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎప్పుడూ కులగణనను వ్యతిరేకిస్తూ వచ్చాయి. స్వాతంత్య్రం వచి్చనప్పటి నుంచి నిర్వహించిన ఏ జనాభా గణనలోనూ కులగణనను చేర్చలేదు. 2010లో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ కులగణన అంశాన్ని కేబినెట్లో పరిశీలిస్తామని లోక్‌సభకు హామీ ఇచ్చారు. ఈ అంశంపై మంత్రుల బృందాన్ని ఏర్పాటుచేస్తే చాలా రాజకీయ పార్టీలు కులగణనకు అనుకూలంగా అభిప్రాయాలు తెలిపాయి. అయినా కాంగ్రెస్ ప్రభుత్వం కులగణనకు బదులుగా సోషియో ఎకనామిక్ అండ్ క్యాస్ట్ సెన్సెస్ (ఎస్ఈసీసీ) సర్వే నిర్వహించాలని నిర్ణయించింది’అని మండిపడ్డారు. రాజకీయ సాధనంగా వాడుతున్నారు.. కులగణనను ప్రతిపక్ష ఇండియా కూటమి రాజకీయ సాధనంగా వాడుకుంటోందని అశి్వనీవైష్ణవ్ ఆరోపించారు. ‘కొన్ని రాష్ట్రాలు కుల సర్వేలను బాగానే నిర్వహించాయి. కొన్ని రాష్ట్రాలు మాత్రం పారదర్శకత లేకుండా పూర్తిగా రాజకీయ కోణంలో నిర్వహించాయి. ఇటువంటి సర్వేలు సమాజంలో సందేహాలను లేవనెత్తాయి. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని దేశంలోని సున్నితమైన సామాజిక నిర్మాణం రాజకీయాల వల్ల చెదిరిపోకుండా కాపాడటానికే సర్వేలకు బదులుగా కులగణనను పారదర్శకంగా నిర్వహించాలని సీసీపీఏ నిర్ణయించింది. గతంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏ వర్గానికి ఇబ్బంది కలిగించకుండా ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఈడబ్ల్యూఎస్)కు 10 శాతం రిజర్వేషన్లు కల్పించింది’అని మంత్రి గుర్తుచేశారు. దేశంలో ఏ కులం జనాభా ఎంత ఉందో తెలుసుకునేందుకు కులగణన నిర్వహించాలని కాంగ్రెస్‌సహా పలు ప్రతిపక్ష పార్టీలు డిమాండ్‌చేస్తూ వస్తున్నాయి. గత లోక్‌సభ ఎన్నికల్లో కూడా ఈ అంశం ప్రధాన ప్రచారాస్త్రాల్లో ఒకటిగా నిలిచింది. తమ ఒత్తిడి కారణంగానే కేంద్రం కులగణనకు నిర్ణయం తీసుకుందని, ఇది సంపూర్ణంగా తమ విజయమని కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు ప్రకటించాయి. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం చరిత్రాత్మకమని బీజేపీ, ఎన్డీయే మిత్రపక్షాలు పేర్కొన్నాయి. మొదట్లో అన్ని కులాల డేటా.. మనదేశంలో జనాభా లెక్కల సేకరణ బ్రిటీష్ పాలనాకాలంలో 1881లో మొదలైంది. అప్పటి నుంచి ప్రతి పదేళ్లకు ఒకసారి దేశవ్యాప్తంగా ప్రభుత్వం నియమించే ఎన్యూమరేటర్లు ఇంటింటికీ వెళ్లి జనాభా లెక్కలను సేకరిస్తున్నారు. ఈ జనగణనలో ప్రజల సంఖ్యతోపాటు వారి ఆర్థిక స్థితి, జనాభా పెరుగుదల రేటు, మహిళలు– పురుషుల సంఖ్య, లింగ నిష్పత్తి, జనన– మరణాల రేటు వంటి సకల వివరాలను రికార్డు చేస్తున్నారు. నిజానికి మొదటి జనగణనతోపాటే.. అంటే 1881లో తొలిసారి నిర్వహించిన జనగణనలో కులగణన కూడా నిర్వహించారు. 1931 వరకు ఈ విధానం కొనసాగింది. ఆ తర్వాత జనగణన నుంచి కులగణనను తప్పించారు. కానీ, ఎస్సీ, ఎస్టీల సంఖ్యను మాత్రం లెక్కిస్తూ వస్తున్నారు. దీంతో ఓబీసీ, ఓసీల జనాభా ఎంత ఉందన్న అంశంపై స్పష్టత లేకుండా పోయింది. దేశంలో చివరి జనగణన 2011లో జరిగింది. 2020లో నిర్వహించాల్సిన జనగణనను కోవిడ్–19 కారణంగా వాయిదా వేశారు. త్వరలోనే జనగణన నిర్వహించేందుకు కేంద్రం ఏర్పాట్లు చేస్తోంది. అందులోనే కులగణనను చేర్చాలని తాజాగా నిర్ణయించింది. మనదేశంలో జనగణన సుదీర్ఘ ప్రక్రియ. ఇంటింటికి వెళ్లి వివరాల సేకరణ మొదలు.. పూర్తి డేటాను ప్రకటించటానికి దాదాపు 18 నెలల సమయం పడుతుంది.
TANA: ‘ఆంధ్ర బాలానంద సంఘం’ ముచ్చట్లు విజయవంతం
భారత్-పాక్ సరిహద్దుల్లో తీవ్ర ఉద్రికత్త
భయపెట్టిన భారత్.. పాక్ సైన్యంలో పెను మార్పులు
భారత్-పాకిస్తాన్.. ఎవరి బలమెంత?
ప్రభుత్వమే చంపేసింది
HIT3 X Review: ‘హిట్ 3’ ట్విటర్ రివ్యూ
ఈ రాశి వారికి స్థిరాస్తి వృద్ధి.. వృత్తి, వ్యాపారాలలో పురోగతి
తల్లి మరో దేశంలో.. తండ్రి జైలులో...అనాథైన చిన్నారి!
లాహోర్ నడిబొడ్డున సయీద్ అడ్డా!
టిక్.. టిక్... టిక్
TANA: ‘ఆంధ్ర బాలానంద సంఘం’ ముచ్చట్లు విజయవంతం
భారత్-పాక్ సరిహద్దుల్లో తీవ్ర ఉద్రికత్త
భయపెట్టిన భారత్.. పాక్ సైన్యంలో పెను మార్పులు
భారత్-పాకిస్తాన్.. ఎవరి బలమెంత?
ప్రభుత్వమే చంపేసింది
HIT3 X Review: ‘హిట్ 3’ ట్విటర్ రివ్యూ
ఈ రాశి వారికి స్థిరాస్తి వృద్ధి.. వృత్తి, వ్యాపారాలలో పురోగతి
తల్లి మరో దేశంలో.. తండ్రి జైలులో...అనాథైన చిన్నారి!
లాహోర్ నడిబొడ్డున సయీద్ అడ్డా!
టిక్.. టిక్... టిక్
సినిమా

పిల్లలు పుట్టరని మధుబాలను వదిలేసిన స్టార్ హీరో.. చివరికేమైంది?
మొఘల్ ఇ ఆజామ్.. 1960లో వచ్చిన అద్భుతమైన సినిమా ఇది. సలీం, అనార్కలిగా దిలీప్ కుమార్ (Dilip Kumar), మధుబాల (Madhubala) నటించారు. ఆన్‌స్క్రీన్‌పై సూపర్ హిట్ జోడీగా పేరు తెచ్చుకున్న వీళ్లు నిజ జీవితంలో కూడా ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుని జీవితాంతం కలిసుండాలనుకున్నారు. దంపతులుగా కనిపిస్తారనుకుంటే విడిపోయిన ప్రేమ పక్షులుగా మారారు. అసలు ఈ జంట ఎందుకు విడిపోయిందన్న విషయాన్ని ప్రముఖ నటి ముంతాజ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది.పిల్లలు పుట్టరని..ముంతాజ్ మాట్లాడుతూ.. మధుబాల దిలీప్‌కు బ్రేకప్ చెప్పలేదు. అతడే ఆమెతో ప్రేమబంధాన్ని తెంచేసుకున్నాడు. తనకు పిల్లలు పుట్టరని వదిలేసి.. సైరా భానును పెళ్లి చేసుకున్నాడు. సైరా ఎంతో మంచి మనిషి. దిలీప్ అంటే ఆమెకు ఎంతో అభిమానం, ప్రేమ. అతడి చివరి శ్వాస వరకు ఎంతో జాగ్రత్తగా చూసుకుంది. వీళ్లిద్దరి మధ్య వయసు వ్యత్యాసం ఎక్కువ. కానీ ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ వల్లే జీవితాంతం కలిసి కొనసాగారు.మొఘల్ ఇ ఆజామ్ సినిమాలో ఓ దృశ్యంఅందుకే వదిలేశాడుదిలీప్కు పిల్లలంటే ఇష్టం. పిల్లలు కావాలన్న కోరికతోనే సైరాను పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం నాకు స్వయంగా మధుబాల చెప్పింది. అప్పుడప్పుడు తనను కలుస్తూ ఉండేదాన్ని. తను సంతోషంగా కనిపించేది కాదు. నాతో ఏమనేదంటే.. జీవితంలో నేను ప్రేమించిన ఏకైక వ్యక్తి యూసఫ్ (దిలీప్ కుమార్‌ను యూసఫ్ అని పిల్చుకునేది). నేను ఎప్పటికీ తల్లిని కానని తెలిసి నన్ను ఒంటరిగా వదిలేశాడు. నాకున్న గుండె సమస్య వల్ల పిల్లల్ని కంటే నేను బతకనని చెప్పారు.ఏనాడూ నిందించలేదుఅందుకే ఇలాంటి పరిస్థితి వచ్చింది. అయినా ఏ మగవాడికైనా పిల్లలు కావాలని ఉంటుంది కదా.. ఇందులో అతడి తప్పేముందిలే అనుకునేదే తప్ప దిలీప్‌ను నిందించేది కాదు. కానీ విషాదమేంటంటే.. దిలీప్- సైరా భానులకు సంతానమే లేదు. ఈ విషయంలో సైరాను చూస్తుంటే బాధగా అనిపించేది. కనీసం ఒక్కరైనా పుట్టుంటే వాళ్లెంతో మురిపెంగా చూసుకునేవాళ్లు అని ముంతాజ్ చెప్పుకొచ్చింది.వేర్వేరు దారుల్లో ప్రేమజంటదిలీప్ కుమార్ - మధుబాల దాదాపు దశాబ్దంపాటు కలిసున్నారు. వీరి బ్రేకప్ అనంతరం మధుబాల.. 1960లో కిషోర్ కుమార్‌ను పెళ్లి చేసుకుంది. 1969లో గుండెపోటుతో మరణించింది. దిలీప్ కుమార్ 1966లో తనకంటే 22 ఏళ్లు చిన్నదైన సైరా భానును పెళ్లి చేసుకున్నాడు. 1981లో రెహ్మాన్‌ను రెండో పెళ్లి చేసుకోగా 1983లో ఈమెకు విడాకులిచ్చేశాడు. తర్వాత సైరా భానుతోనే కలిసున్న దిలీప్ కుమార్ 2021లో మరణించాడు.చదవండి: అమ్మ చనిపోయి 5 నెలలు.. వీడియో డిలీట్ చేయమని అడుక్కున్నా: సోహైల్

ఓటీటీకి డేవిడ్ వార్నర్ చిత్రం... ఆ రోజు నుంచే స్ట్రీమింగ్!
నితిన్, శ్రీలీల జంటగా నటించిన చిత్రం రాబిన్‌హుడ్. ఉగాది కానుకగా మార్చి 28న థియేటర్లలోకి వచ్చిన చిత్రం.. ఆశించిన స్థాయిలో అభిమానులను ఆకట్టుకోలేకపోయింది. దీంతో బాక్సాఫీస్ వద్ద వసూళ్లు రాబట్టడంలో తేలిపోయింది. ఈ మూవీ ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ సైతం కెమియో పాత్రలో మెరిశారు. వార్నర్ కోసమైనా థియేటర్లకు వస్తారనుకున్నప్పటికీ అది కూడా పెద్దగా వర్కవుట్ అవ్వలేదు.ఇప్పటికే ఈ సినిమా విడుదలై నెలరోజులు పూర్తవ్వడంతో ఈ మూవీ ఓటీటీకి ఎప్పుడొస్తుందా అభిమానులు ఎదురు చూస్తున్నారు. గతంలో మే 4న ఓటీటీ వస్తుందని వార్తలొచ్చాయి. కానీ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటనైతే రాలేదు. మరోవైపు వచ్చేనెల 10 నుంచి స్ట్రీమింగ్ కానుందని టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ హక్కులను జీ5 సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సంక్రాంతికి వస్తున్నాం తరహాలో ఓకేరోజు టీవీలతో పాటు ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది.రాబిన్‌హుడ్ కథేంటంటే..'రాబిన్ హుడ్' విషయానికొస్తే.. రామ్ (నితిన్) ఓ అనాథ. అనాథశ్రమాల కోసం రాబిన్ హుడ్ పేరుతో దొంగతనాలు చేస్తుంటాడు. కొన్ని కారణాల వల్ల ఓ సెక్యూరిటీ ఏజెన్సీలో చేరుతాడు. ఆస్ట్రేలియా నుంచి ఇండియాకు వచ్చిన నీరా (శ్రీలీల)కు సెక్యూరిటీగా ఉంటాడు. ఓరోజు నీరాని ఎవరో కిడ్నాప్ చేస్తారు. మరి రామ్, నీరాని ఎలా రక్షించాడు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.

అమ్మ చనిపోయి 5 నెలలు.. వీడియో డిలీట్ చేయమని అడుక్కున్నా: సోహైల్
బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినవాళ్లందరినీ ఉగ్రవాదుల ఖాతాలో వేశాడు ప్రపంచ యాత్రికుడు యూట్యూబర్ నా అన్వేషణ. బిగ్‌బాస్ షోలో పాల్గొన్న సోహైల్ (Syed Sohel Ryan), మెహబూబ్.. ఇలా ఎంతోమందిని ఉగ్రవాదులుగా పేర్కొన్నాడు. ఈ కామెంట్లపై నటుడు, తెలుగు బిగ్‌బాస్ నాలుగో సీజన్ కంటెస్టెంట్ సోహైల్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అతడు మాట్లాడుతూ.. కశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రదాడి (Pahalgam Terror Attack)కి పాల్పడ్డవాడు ఎక్కడికో పారిపోయాడు. వాడిని దొరకబట్టడం మానేసి మనదాంట్లో మనం కొట్టుకుచస్తున్నాం. నేను భారతీయుడినిఎక్కడో జరిగినదానికి నన్ను ఉగ్రవాదిగా చిత్రీకరించడమేంటి? బెట్టింగ్ యాప్స్ గురించి నన్ను తిట్టు.. అంతేకానీ ఉగ్రవాది అని ముద్ర వేయడమేంటి? వాడెవడో చెప్పినంత మాత్రాన నేను టెర్రరిస్టు అయిపోను. నేను భారతీయుడిని. కులమత బేధాలు లేకుండా పెరిగాను. శివుడికి పాలాభిషేకం చేశాను. సంక్రాంతికి మా ఇంట్లో అప్పాలు చేసుకుంటాం. రంజాన్ ఉంటే హిందూ స్నేహితులు నాతోపాటు నమాజ్ చదివేవాళ్లు. క్రిస్టియన్ ఫ్రెండ్‌తో కలిసి చర్చికి వెళ్లేవాళ్లం. వాడి ప్లాన్ సక్సెస్.. నువ్వు ఫెయిల్మా ఇరుగుపొరుగువారితో కలిసి కొండగట్టుకు వెళ్లిన రోజులున్నాయి. అలాంటి వాతావరణంలో పెరిగిన ముస్లింలు చాలామంది ఉన్నారు. అందులో నేనొకడిని. ఒక భారతీయుడివై ఉండి నన్ను ఉగ్రవాది అంటున్నావ్. నిజమైన ఉగ్రవాదుల గురించి మాట్లాడకుండా.. వాళ్ల మీద కోపం చూపించకుండా మనలో మనం కొట్టుకుంటున్నాం. ఈ లెక్కన ఉగ్రదాడికి పాల్పడ్డ వారి ప్లాన్ సక్సెస్ అయినట్లే.. భారతీయుడిగా నువ్వు ఫెయిల్ అయినట్లే!అడుక్కున్నా..మొన్న ఒక మహిళ.. భర్తను ముక్కలుముక్కలుగా నరికేసి డ్రమ్‌లో వేసింది. ఆ క్రూరత్వాన్ని టెర్రరిజం అనాలి. నేను పుట్టించిన మనిషిని చంపే హక్కు నీకు లేదు అని ఇస్లాంలో రాసుంది. ఆ ఉగ్రవాదులు నిజమైన ముస్లింలు కాదు. నా తల్లిని పోగొట్టుకుని ఐదారునెలలవుతోంది. ఇంతలో నాపై ఇలాంటి కామెంట్లు వినేసరికి చాలా బాధపడ్డాను. నాపై చేసిన వీడియో డిలీట్ చేయమని ఆ యూట్యూబర్ (నా అన్వేషణ)ను అడుక్కున్నాను. 'మా అమ్మ గతేడాది చివర్లో చనిపోయారు. మా అమ్మపై బూతులు మాట్లాడావు. గుర్తుపెట్టుకో, నీకు కూడా తల్లి ఉంది. మీ తల్లిలాంటిదే నా తల్లి కూడా!మీ వ్యూస్ కోసం నన్ను తిట్టుకోండినేను కూడా నిన్ను తిరిగి బూతులు అనొచ్చు. కానీ, అనను. మీ తల్లిదండ్రులను బాగా చూసుకో' అంటూ వీడియో డిలీట్ చేయమని మెసేజ్ చేశాను. కావాలంటే నన్ను తిట్టుకో, వ్యూస్ కోసం నన్ను ఎంతైనా తిట్టుకోండి. కానీ తల్లుల్ని తిట్టొద్దు. వాళ్లేం పాపం చేశారు. అందరికీ ఒకటే చెప్తున్నా.. మీ మతాన్ని ప్రేమించండి. మిగతా మతాల్ని గౌరవించండి అని సోహైల్ చెప్పుకొచ్చాడు.చదవండి: ఫేమస్ అవగానే మారిపోతారు.. అలాంటి క్రేజ్ నాకొద్దని..: నాని

'రావణాసురుడు నా లెక్క ఆలోచించకపోతే.. రామాయణం ఉండేది కాదు'
దీక్షిత్‌శెట్టి, శశి ఓదెల, యుక్తి తరేజ కీలక పాత్రల్లో నటిస్తోన్న తాజా చిత్రం 'కేజేక్యూ కింగ్.. జాకీ.. క్వీన్'. ఈ సినిమాకు కేకే దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్లో సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.టీజర్ చూస్తే ఈ మూవీని క్రైమ్ అండ్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ సిటీ.. గన్.. రెండు ఒక్కటే.. ఎవరి చేతిలో ఉంటుందో వాడి మాటే వింటుంది అనే డైలాగ్‌తో టీజర్ ప్రారంభమైంది. 'పెద్దదైనా..చిన్నదైనా రిస్క్ ఒక్కటే.. చేసేదేదో పెద్దదే చేద్దాం' అనే డైలాగ్ వింటే గ్యాంగ్‌స్టర్ కోణంలో ఈ మూవీని రూపొందిస్తున్నట్లు అర్థమవుతోంది. చివర్లో 'రావణాసురుడు నా లెక్క ఆలోచించకపోతే.. రామాయణం ఉండేది కాదు' అనే డైలాగ్ ఆడియన్స్‌లో అంచనాలు పెంచేసింది. కాగా.. ఈ చిత్రానికి పూర్ణచంద్ర తేజస్వి సంగీతమందిస్తున్నారు.
న్యూస్ పాడ్‌కాస్ట్
క్రీడలు

చరిత్ర సృష్టించిన చాహల్.. ఐపీఎల్ హిస్టరీలోనే తొలి ప్లేయర్‌గా
ఐపీఎల్-2025లో చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ హ్యాట్రిక్ వికెట్లతో చెలరేగాడు. తన బౌలింగ్ కోటాలో తొలి రెండు ఓవర్లలో భారీగా పరుగులు సమర్పించుకున్న చాహల్‌ను పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తిరిగి 19వ ఓవర్ వేసేందుకు ఎటాక్‌లో తీసుకొచ్చాడు. ఓ ఓవర్లో చాహల్ అద్బుతం చేశాడు. తొలి బంతిని సీఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోని సిక్సర్‌గా మలచగా.. అనంతరం రెండో బంతికి భారీ షాట్‌కు ప్రయత్నించి ఔటయ్యాడు. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన హుడా మూడో బంతికి రెండు పరుగులు తీశాడు. ఇక్కడ నుంచి చాహల్ మ్యాజిక్ మొదలైంది. నాలుగో బంతికి దీపక్ హుడా ఔట్ కాగా.. ఐదో బంతికి కాంబోజ్, ఆరో బంతికి నూర్ ఆహ్మద్ ఔటయ్యాడు. దీంతో చాహల్ ఖాతాలో రెండో ఐపీఎల్ హ్యాట్రిక్ వచ్చి చేరింది. ఓవరాల్ మూడు ఓవర్లు బౌలింగ్ చేసిన చాహల్..32 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో చాహల్ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.చాహల్ సాధించిన రికార్డులు ఇవే..👉ఐపీఎల్ పంజాబ్ కింగ్స్ తరపున హ్యాట్రిక్ వికెట్లు తీసిన నాలుగో బౌలర్‌గా చాహల్ రికార్డులకెక్కాడు. ఈ జాబితాలో దిగ్గజ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్, అక్షర్ పటేల్, సామ్ కుర్రాన్ ఉన్నారు.👉ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్‌పై హ్యాట్రిక్ వికెట్లు పడగొట్టిన తొలి బౌలర్‌గా చాహల్ చరిత్ర సృష్టించాడు. ఇప్పటివరకు ఏ బౌలర్‌గా కూడా ఈ ఫీట్ సాధించలేకపోయాడు.👉ఐపీఎల్లో అత్యధిక సార్లు హ్యాట్రిక్ వికెట్లు తీసిన బౌలర్‌గా యువరాజ్ సింగ్ రికార్డును చాహల్ సమం చేశాడు. యువీ, చాహల్ రెండు సార్లు హ్యాట్రిక్ సాధించాడు. ఈ అరుదైన రికార్డు సాధించిన జాబితాలో అమిత్ మిశ్రా(3) తొలి స్ధానంలో ఉన్నాడు.👉అదేవిధంగా ఐపీఎల్లో అత్యధిక సార్లు 4 వికెట్ల హాల్ సాధించిన బౌలర్‌గా చాహల్ నిలిచాడు. చాహల్ ఇప్పటివరకు 9 సార్లు నాలుగుకు పైగా వికెట్లు సాధించాడు. ఇంతకుముందు ఈ రికార్డు సునీల్ నరైన్(8) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో నరైన్ రికార్డును చాహల్ బ్రేక్ చేశాడు.చదవండి: #Glenn Maxwell: ఐపీఎల్-2025 నుంచి మాక్స్వెల్ ఔట్..

ఐపీఎల్-2025 నుంచి మాక్స్వెల్ ఔట్..
ఐపీఎల్-2025లో ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్, పంజాబ్ కింగ్స్ ఆటగాడు గ్లెన్ మాక్స్వెల్ ప్రయాణం ముగిసింది. చేతి వేలి గాయం కారణంగా ఈ ఏడాది సీజన్ మధ్యలోనే మాక్స్వెల్ వైదొలిగాడు. ప్రాక్టీస్ సెషన్లో మాక్స్వెల్ చేతి వేలికి ఫ్రాక్చర్ అయింది.ఈ విషయాన్ని సీఎస్కేతో మ్యాచ్ సందర్బంగా పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ధ్రువీకరించాడు. టాస్ సమయంలో అయ్యర్ మాట్లాడుతూ.. దురదృష్టవశాత్తూ మాక్స్వెల్ చేతి వేలికి ఫ్రాక్చర్ అయింది. నిజంగా మాకు ఇది గట్టి ఎదురుదెబ్బ. అతడి స్ధానాన్ని ఎవరితో భర్తీ చేయాలన్నది ఇంకా నిర్ణయించలేదు అని పేర్కొన్నాడు. మాక్స్వెల్ ప్రస్తుతం జట్టుతో పాటు ఉన్నప్పటికి త్వరలోనే తన స్వదేశానికి పయనం కానున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ ఏడాది సీజన్లో మాక్స్వెల్ దారుణ ప్రదర్శన కనబరిచాడు. బౌలింగ్‌లో ఒకట్రెండు వికెట్లు పడగొట్టినప్పటికి, బ్యాటింగ్‌లో మాత్రం పూర్తిగా తేలిపోయాడు. మాక్స్వెల్ 6 ఇన్నింగ్స్‌లలో 8.00 సగటు కేవలం 48 పరుగులు మాత్రమే చేశాడు.చదవండి: ZIM vs BAN: మమ్మల్నే ఓడిస్తారా? ప్రతీకారం తీర్చుకున్న బంగ్లాదేశ్

మమ్మల్నే ఓడిస్తారా? ప్రతీకారం తీర్చుకున్న బంగ్లాదేశ్
జింబాబ్వేతో తొలి టెస్టులో ఎదురైన ఓటమికి బంగ్లాదేశ్ ప్రతీకారం తీర్చుకుంది. చటోగ్రామ్ వేదికగా జరిగిన రెండో టెస్టులో జింబాబ్వేను ఇన్నింగ్స్ 106 పరుగుల తేడాతో బంగ్లా జట్టు చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే.. తమ మొదటి ఇన్నింగ్స్‌లో 227 పరుగులకు ఆలౌటైంది. జింబాబ్వే బ్యాటర్లలో సీన్ విలియమ్స్(67), నిక్ వెల్చ్(54) హాఫ్ సెంచరీలతో రాణించారు. మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. బంగ్లా బౌలర్లలో స్పిన్నర్ తైజుల్ ఇస్లాం 6 వికెట్లు పడగొట్టి జింబాబ్వే పతనాన్ని శాసించాడు. అతడితో పాటు నయీమ్ హసన్ రెండు, తాంజిమ్ ఒక్క వికెట్ సాధించారు. అనంతరం బంగ్లాదేశ్ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 444 పరుగుల భారీ స్కోర్ సాధించింది. బంగ్లా బ్యాటర్లలో షాద్మాన్ ఇస్లాం(120), మెహిదీ హసన్ మీరాజ్(104) అద్బుతమైన సెంచరీలతో చెలరేగారు. వారిద్దరితో పాటు ముష్ఫికర్ రహీం(40), మోనిమల్(33), షకీబ్(41) రాణించారు. జింబాబ్వే బౌలర్లలో విన్సెంట్ మసెకేసా 5 వికెట్లు పడగొట్టగా.. ముజారబానీ, వెల్లింగ్టన్ మసకడ్జా బెన్నట్ తలా వికెట్ సాధించారు. ఆ తర్వాత సెకెండ్ ఇన్నింగ్స్‌లో కూడా జింబాబ్వే ఆట తీరు ఏ మాత్రం మారలేదు. బంగ్లా బౌలర్ల దాటికి రెండో ఇన్నింగ్స్‌లో జింబాబ్వే 111 పరుగులకే కుప్పకూలింది.బంగ్లా బౌలర్లలో మెహదీ హసన్ 5 వికెట్లతో చెలరేగగా.. తైజుల్ ఇస్లాం మూడు వికెట్లు పడగొట్టాడు. జింబాబ్వే బ్యాటర్లలో బెన్ కుర్రాన్(46) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ విజయంతో రెండు టెస్టుల సిరీస్‌ను 1-1తో బంగ్లా సమం చేసింది.

సీఎస్కే పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం
Chennai Super Kings vs Punjab Kings Live Updates: సీఎస్కే పై పంజాబ్ కింగ్స్ ఘన విజయంఐపీఎల్-2025లో చెన్నై సూపర్ కింగ్స్ కథ ముగిసింది. చెపాక్ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో సీఎస్కే ఓటమి పాలైంది. దీంతో ప్లే ఆఫ్స్ రేసు నుంచి చెన్నై నిష్క్రమించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ 19.2 ఓవర్లలో 190 పరుగులకు ఆలౌటైంది. సీఎస్కే బ్యాటర్లలో సామ్ కుర్రాన్(88) అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అతడితో పాటు బ్రెవిస్(32) పరుగులతో రాణించాడు. పంజాబ్ బౌలర్లలో యుజ్వేంద్ర చాహల్ నాలుగు వికెట్లతో చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో చాహల్ హ్యాట్రిక్ వికెట్లు పడగొట్టాడు. చాహల్‌తో పాటు అర్ష్‌దీప్, జాన్సెన్ తలా రెండు వికెట్లు పడగొట్టారు.అయ్యర్ కెప్టెన్ ఇన్నింగ్స్..అనంతరం 191 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ కింగ్స్ 19.4 ఓవర్లలో చేధించింది. పంజాబ్ బ్యాటర్లలో శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. 40 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 72 పరుగులు చేశాడు. అతడితో పాటు ప్రభ్సిమ్రాన్ సింగ్(54) హాఫ్ సెంచరీతో మెరిశాడు. సీఎస్కే బౌలర్లలో పతిరానా రెండు వికెట్లు పడగొట్టగా.. రవీంద్ర జడేజా, నూర్ అహ్మద్,ఖాలీల్ అహ్మద్ తలా వికెట్ సాధించారు.ప్రభ్సిమ్రాన్ ఫిప్టీ..పంజాబ్ ఓపెనర్ ప్రభ్సిమ్రాన్ సింగ్ తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 11 ఓవర్లకు పంజాబ్ వికెట్ నష్టానికి 102 పరుగులు చేసింది.8 ఓవర్లకు పంజాబ్ స్కోర్: 102/18 ఓవర్లకు పంజాబ్ వికెట్ నష్టానికి 68 పరుగులు చేసింది. క్రీజులో ప్రభ్సిమ్రాన్ సింగ్(28), శ్రేయస్ అయ్యర్(15) ఉన్నారు.పంజాబ్ రెండో వికెట్ డౌన్..ప్రియాన్ష్ ఆర్య రూపంలో పంజాబ్ తొలి వికెట్ కోల్పోయింది. 23 పరుగులు చేసిన ఆర్య.. ఖాలీల్ అహ్మద్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి శ్రేయస్ అయ్యర్ వచ్చాడు.నిలకడగా ఆడుతున్న పంజాబ్.. 191 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ మూడు ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 24 పరుగులు చేసింది. క్రీజులో ఆర్య(15), ప్రభుసిమ్రాన్ సింగ్(8) ఉన్నారు.చాహల్ హ్యాట్రిక్.. 190 పరుగులకు సీఎస్కే ఆలౌట్చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ హ్యాట్రిక్ వికెట్లతో చెలరేగాడు. 19 ఓవర్ వేసిన చాహల్ నాలుగో బంతికి దీపక్ హుడా ఔట్ కాగా.. ఐదో బంతికి కాంబోజ్, ఆరో బంతికి నూర్ ఆహ్మద్ ఔటయ్యాడు. దీంతో చాహల్ ఖాతాలో రెండో ఐపీఎల్ హ్యాట్రిక్ చేరింది. ఇక టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన సీఎస్కే 19.2 ఓవర్లలో 190 పరుగులకు ఆలౌటైంది. సీఎస్కే బ్యాటర్లలో సామ్ కుర్రాన్(88) టాప్ స్కోరర్‌గా నిలవగా.. బ్రెవిస్(32) పరుగులతో రాణించాడు. పంజాబ్ బౌలర్లలో చాహల్‌తో పాటు అర్ష్‌దీప్, జాన్సెన్ తలా రెండు వికెట్లు పడగొట్టారు.పంజాబ్ ఐదో వికెట్ డౌన్..సామ్ కుర్రాన్ రూపంలో పంజాబ్ ఐదో వికెట్ కోల్పోయింది. 88 పరుగులతో అద్బుత ఇన్నింగ్స్ ఆడిన కుర్రాన్.. జాన్సెన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 18 ఓవర్లు ముగిసే సరికి సీఎస్కే 5 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. క్రీజులో ధోని(5), శివమ్ దూబే(2) ఉన్నారు.15 ఓవర్లకు సీఎస్కే స్కోర్: 134/415 ఓవర్లు ముగిసే సరికి సీఎస్కే 4 వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది. సామ్ కుర్రాన్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 56 పరుగులతో కుర్రాన్ తన బ్యాటింగ్‌ను కొనసాగిస్తున్నాడు.10 ఓవర్లకు సీఎస్కే స్కోర్: 89/310 ఓవర్లు ముగిసే సరికి సీఎస్కే మూడు వికెట్ల నష్టానికి 89 పరుగులు చేసింది. క్రీజులో బ్రెవిస్(20), సామ్ కుర్రాన్(29) ఉన్నారు.సీఎస్కే మూడో వికెట్ డౌన్..రవీంద్ర జడేజా రూపంలో సీఎస్కే మూడో వికెట్ కోల్పోయింది. 17 పరుగులు చేసిన జడేజా.. హర్‌ప్రీత్ బ్రార్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 8 ఓవర్లు ముగిసే సరికి సీఎస్కే మూడు వికెట్ల నష్టానికి 64 పరుగులు చేసింది.సీఎస్కే రెండో వికెట్ డౌన్..ఆయూష్ మాత్రే రూపంలో సీఎస్కే రెండో వికెట్ కోల్పోయింది. 7 పరుగులు చేసిన మాత్రే.. మార్కో జాన్సెన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 5 ఓవర్లు ముగిసే సరికి సీఎస్కే రెండు వికెట్ల నష్టానికి 36 పరుగులు చేసింది. క్రీజులో కుర్రాన్(8), రవీంద్ర జడేజా(5) ఉన్నారు.సీఎస్కే తొలి వికెట్షేక్ రషీద్ రూపంలో సీఎస్కే తొలి వికెట్ కోల్పోయింది. 11 పరుగులు చేసిన రషీద్.. అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. మూడు ఓవర్లు ముగిసే సరికి సీఎస్కే వికెట్ నష్టానికి 22 పరుగులు చేసింది.ఆచితూచి ఆడుతున్న సీఎస్కే..టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన సీఎస్కే రెండు ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టానికి 8 పరుగులు చేసింది. క్రీజులో షేక్ రషీద్(1), ఆయూష్ మాత్రే(6) ఉన్నారు.ఐపీఎల్-2025లో చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌కు గ్లెన్ మాక్స్వెల్ దూరమయ్యాడు. అతడి స్దానంలో సూర్యాంష్ షెగ్దే పంజాబ్ జట్టులోకి వచ్చాడు. తుది జట్లుచెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI): షేక్ రషీద్, ఆయుష్ మ్హత్రే, సామ్ కుర్రాన్, రవీంద్ర జడేజా, డెవాల్డ్ బ్రెవిస్, శివమ్ దూబే, దీపక్ హుడా, ఎంఎస్ ధోని(కెప్టెన్), నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, మతీషా పతిరానాపంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): ప్రియాంష్ ఆర్య, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), నెహాల్ వధేరా, శశాంక్ సింగ్, హర్‌ప్రీత్ బ్రార్, మార్కో జాన్సెన్, అజ్మతుల్లా ఒమర్జాయ్, సూర్యాంష్ షెగ్దే, యుజ్వేంద్ర చాహల్, అర్ష్‌దీప్ సింగ్
బిజినెస్

హైదరాబాద్‌లో భారీ బ్యాటరీ పరిశ్రమ
హైదరాబాద్: సిగ్ని ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ నగరంలో భారీ బ్యాటరీ పరిశ్రమను ఏర్పాటు చేసింది. హైదరాబాద్‌లోని ఈ-మొబిలిటీ వ్యాలీలో తన బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ (BESS) గిగాఫ్యాక్టరీ మొదటి దశను ప్రారంభించి భారతదేశ క్లీన్ ఎనర్జీ రంగంలో కొత్త ఒరవడిని సృష్టించింది.ఇది దేశంలోనే మొదటి లీడ్ (LEED - లీడర్షిప్ ఇన్ ఎనర్జీ అండ్ ఎన్విరాన్మెంటల్ డిజైన్) అర్హత పొందిన అత్యాధునిక ఫ్యాక్టరీ. 1,60,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఈ పూర్తి ఆటోమేటెడ్ ఫ్యాక్టరీని రూ.100 కోట్ల పెట్టుబడితో స్థాపించారు. గ్రిడ్-స్కేల్ స్టోరేజ్, ఎలక్ట్రిక్ వాహనాల (EV) కోసం 4.8 గిగావాట్-అవర్ల (GWh) బ్యాటరీ ప్యాక్‌లను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఈ ఫ్యాక్టరీకి ఉంది.తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ చేతుల మీదుగా ఈ ఫ్యాక్టరీని ప్రారంభించారు. ఈ కర్మాగారం క్లీన్ ఎనర్జీని ప్రోత్సహించడంతోపాటు స్థానిక ఉద్యోగ అవకాశాలను సృష్టించడంలో కీలక పాత్ర పోషిస్తుందని ఆయన ప్రశంసించారు. ఇక ఫ్యాక్టరీ రెండవ దశ ఎలా ఉండనుందో సిగ్ని ఎనర్జీ వ్యవస్థాపకుడు, సీఈఓ వెంకట్ రాజారామన్ వెల్లడించారు. రెండో దశలో మరో రూ.150 కోట్ల పెట్టుబడితో ఫ్యాక్టరీ సామర్థ్యాన్ని 10.8 GWhకు విస్తరించనున్నట్లు చెప్పారు. 24 నెలల్లో పూర్తయ్యే ఈ విస్తరణ 1,000 పైగా ఉద్యోగాలను సృష్టించి, ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేయనుందని వివరించారు.ఈ గిగాఫ్యాక్టరీ మెషిన్ లెర్నింగ్, డిజిటల్ ట్విన్ మోడలింగ్, స్మార్ట్-గ్రిడ్ ఇంటిగ్రేషన్ వంటి అధునాతన సాంకేతికతలను ఉపయోగించి బ్యాటరీ పనితీరు, ఉత్పత్తి సామర్థ్యాన్ని ఆప్టిమైజ్ చేస్తుంది. సిగ్ని, ఐఐటీ-మద్రాస్‌తో భాగస్వామ్యం ద్వారా సోడియం-అయాన్ బ్యాటరీలు, సూపర్కెపాసిటర్ల వంటి తదుపరి తరం బ్యాటరీ పదార్థాలను అభివృద్ధి చేస్తోంది. ఇవి శక్తి నిల్వ సామర్థ్యాన్ని మెరుగుపరచడంతో పాటు అరుదైన పదార్థాలపై ఆధారపడటాన్ని తగ్గిస్తాయి. 1 GWh ఆర్డర్ పైప్‌లైన్‌తో, సిగ్ని ఎనర్జీ దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో గణనీయమైన ప్రభావాన్ని చూపనుంది.

ఫ్లాట్‌గా ముగిసిన మార్కెట్లు..
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం ఫ్లాట్‌గా ముగిశాయి. బెంచ్ మార్క్ సూచీలు స్వల్ప శ్రేణిలో కన్సాలిడేట్ కావడంతో బీఎస్ఈ, ఎన్ఎస్ఈల్లో వరుసగా రెండో ట్రేడింగ్ సెషన్ లోనూ స్టాక్ స్పెసిఫిక్ ట్రేడింగ్ కార్యకలాపాలు జోరందుకున్నాయి. గురువారం (మే 1) ట్రేడింగ్ హాలిడే నేపథ్యంలో ట్రేడింగ్ కార్యకలాపాలు మందకొడిగా సాగాయి.బీఎస్ఈ సెన్సెక్స్ 80 పాయింట్ల లాభంతో 80,371 వద్ద ప్రారంభమై, ఆ తర్వాత ట్రేడింగ్‌లో ఎక్కువ భాగం కన్సాలిడేట్ అయింది. ట్రేడింగ్ చివరి 30 నిమిషాల్లో 80,526 (237 పాయింట్లు పెరిగింది) వద్ద గరిష్టానికి చేరుకుంది. కాని వెంటనే లాభాలను కోల్పోయి 79,879 వద్ద కనిష్టానికి పడిపోయింది. రోజులో గరిష్ట స్థాయి నుండి 647 పాయింట్లు పడిపోయింది. చివరకు సెన్సెక్స్ 46 పాయింట్ల నష్టంతో 80,0242 వద్ద ముగిసింది. ఈ క్రమంలోనే సెన్సెక్స్ 2,827 పాయింట్లు (3.6 శాతం) లాభంతో ఏప్రిల్ నెలను ముగించింది.ఇక ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 ఇండెక్స్ దాదాపు 200 పాయింట్ల రేంజ్లో కదలాడింది. 24,396 వద్ద గరిష్టాన్ని తాకింది. తరువాత 24,199 వద్ద కనిష్టానికి పడిపోయింది. చివరకు రెండు పాయింట్ల నష్టంతో 24,334 వద్ద స్థిరపడింది. నిఫ్టీ ఏప్రిల్ నెలలో 3.5 శాతం లేదా 815 పాయింట్లు లాభపడింది.సెన్సెక్స్ 30 స్టాక్స్‌లో బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్ షేర్లు 5 శాతానికి పైగా నష్టపోయాయి. టాటా మోటార్స్, ఎస్బీఐ 3 శాతం చొప్పున నష్టపోయాయి. అల్ట్రాటెక్ సిమెంట్, టాటా స్టీల్, ఏషియన్ పెయింట్స్ షేర్లు కూడా నష్టపోయాయి. మారుతీ మాత్రం 3 శాతానికి పైగా లాభపడింది. భారతీ ఎయిర్టెల్, సన్ ఫార్మా, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ షేర్లు కూడా 1 - 2 శాతం చొప్పున లాభపడ్డాయి.కాగా విస్తృత సూచీలు గణనీయ నష్టాలతో ముగిశాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్ 1 శాతం, స్మాల్ క్యాప్ 2 శాతం పడిపోయాయి. మొత్తంగా మార్కెట్ విస్తృతి చాలా ప్రతికూలంగా ఉంది. బీఎస్ఈలో పురోగమిస్తున్న ప్రతి షేరుకు దాదాపు 3 స్టాక్స్ క్షీణించాయి. రంగాలవారీగా చూస్తే బీఎస్ఈ పవర్, క్యాపిటల్ గూడ్స్ సూచీలు 1 శాతానికి పైగా నష్టపోయాయి. రియాల్టీ 1 శాతానికి పైగా లాభపడింది. బుధవారం ఇంట్రాడేలో రియల్టీ ఇండెక్స్ 4 శాతం పెరిగింది.

ఆ టికెట్‌తో ఇక రైలు ఎక్కలేరు! మే 1 నుంచి కొత్త రూలు..
దేశంలో కోట్లాది మంది రైలు ప్రయాణికులను ప్రభావితం చేసే కొత్త రూల్‌ను భారతీయ రైల్వే ప్రవేశపెడుతోంది. రైళ్లలో ప్రయాణ సౌకర్యాన్ని పెంచడం, రిజర్వ్డ్ కోచ్‌లలో రద్దీని నివారించడం లక్ష్యంగా ఇండియన్ రైల్వే మే 1 నుండి కొత్త నిబంధనను అమలు చేస్తోంది. ఈ నిబంధన ప్రకారం వెయిటింగ్ లిస్ట్ టికెట్లు ఉన్న ప్రయాణికులను ఇకపై స్లీపర్, ఏసీ బోగీల్లో అనుమతించరు.వీరిపైనే ప్రభావంరైల్వే అమలు చేస్తున్న ఈ కొత్త మార్గదర్శకాలు ముఖ్యంగా రైల్వే కౌంటర్ల నుంచి వెయిటింగ్ లిస్ట్ టికెట్లు బుక్ చేసుకునే వారిపై ప్రభావం చూపనున్నాయి. ఐఆర్సీటీసీ, ఇతర అధీకృత వెబ్సైట్ల ద్వారా ఆన్లైన్ చేసుకున్న టికెట్లు కన్ఫర్మ్ కాకపోతే ఆటోమేటిక్ అవి రద్దవుతాయి. ఆఫ్‌లైన్‌లో రైల్వే కౌంటర్ల ద్వారా బుక్ చేసుకున్న టికెట్లు కన్ఫర్మ్ కాకపోయినప్పటికీ ప్రయాణికులు వాటితో రైలు ఎక్కే అవకాశం ఉండేది. అలా ఎక్కిన ప్రయాణికులు ఎక్కడైనా ఖాళీ ఉంటే టీటీఈ ద్వారా వాటిని పొందే వీలు ఉండేది. అయితే ఇలా ఎక్కువ మంది స్లీపర్ లేదా ఏసీ బోగీల్లోకి ప్రవేశించి అన్ రిజర్వ్ డ్ సీట్లను ఆక్రమించుకోవడం లేదా ఆయా కోచ్‌లలో రద్దీకి కారణమవుతున్నారు.టీటీఈలకు అధికారాలుకొత్త ఆదేశాల ప్రకారం.. ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్లకు (టీటీఈ) భారతీయ రైల్వే కొన్ని అధికారాలు ఇచ్చింది. వెయిటింగ్ లిస్ట్ టికెట్లతో రిజర్వ్డ్ స్లీపర్ లేదా ఏసీ సీట్లను ఆక్రమించుకున్న ప్రయాణికులకు జరిమానా విధించవచ్చు. అలాగే అటువంటి ప్రయాణికులను అన్రిజర్వ్డ్ టికెట్ హోల్డర్లు ప్రయాణించే జనరల్ కోచ్‌కు పంపించే అధికారం టీటీఈలకు ఉంటుంది.ఈ నిబంధన ఎందుకంటే..ప్రయాణికుల సౌకర్యార్థం ఈ నిబంధనను అమలు చేస్తున్నామని నార్త్ వెస్ట్రన్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ కెప్టెన్ శశికిరణ్ వివరించారు. వెయిటింగ్ టికెట్ హోల్డర్లు కోచ్‌లలోకి ప్రవేశించి రిజర్వ్డ్ సీట్లను బలవంతంగా ఆక్రమించుకుంటున్నారని, ప్రయాణికులు తిరిగేందుకు కూడా వీలులేకుండా మార్గాలను స్తంభింపజేస్తున్నారని తరచూ ఫిర్యాదులు వస్తున్నాయని పేర్కొన్నారు.ఈ కొత్త నిబంధనతో రైళ్లలో ఎక్కేందుకు వెయిటింగ్ లిస్ట్ టికెట్లపై ఆధారపడే ప్రయాణికులు తమ ప్రయాణ ప్రణాళికలను పునరాలోచించుకోవాల్సి ఉంటుంది. ఇకపై స్లీపర్, ఏసీ బోగీల్లో ప్రయాణించాలంటే కన్ఫర్మ్ టికెట్ తప్పనిసరి. లేదంటే మీ ట్రిప్ క్యాన్సిల్ చేసుకోవడమో లేదా జనరల్ అన్ రిజర్వ్డ్ క్లాస్ లో ట్రావెల్ చేయడమో చేయాల్సి ఉంటుంది.

సమస్యలు విని.. పరిష్కారాలు చెబుతోంది!
కష్ట సమయాల్లో, ఉరుకుల పరుగుల జీవితంలో కాసేపు మనశ్శాంతి కోసం గుడికి వెళుతుంటారు. తమ కోరికలను దేవుడికి చెప్పుకొని మనసులోని భారాన్ని దించుకుంటారు. అదే ఆ దేవుడు నిజంగా మీ కోరికలు వింటే ఎంత బావుంటుంది.. అంతటితో ఆగకుండా సావధానంగా వాటికి పరిష్కారాలు అందిస్తే.. అసలు మీతోనే దేవుడు నేరుగా మాట్లాడితే.. ఇదంతా కలలోనే సాధ్యమని అనుకుంటున్నారా? ఇలలోనూ సాధ్యమే! ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో విప్లవాత్మక మార్పులు వస్తున్న నేపథ్యంలో మలేషియాలోని ఓ గుడిలో ఏఐ దేవత ‘మాజు’ను ఐమజిన్ అనే కంపెనీ తయారు చేసింది.దక్షిణ మలేషియా రాష్ట్రం జొహోర్లోని తియాన్హౌ అనే టావోయిస్ట్(చైనీస్ సంప్రదాయాలకు అనుగుణంగా ఉన్న గుడి) దేవాలయంలో దీన్ని ఏర్పాటు చేశారు. ప్రపంచంలోనే మొట్టమొదటి ఏఐ దేవత ‘మాజు’. ఇది అత్యంత గౌరవనీయమైన చైనీస్ సముద్ర దేవతను పోలి ఉన్న డిజిటల్ దేవత. ఇది భక్తులతో నేరుగా సంభాషిస్తుంది. వారి సమస్యలను సావధానంగా వింటోంది. వారి ప్రశ్నలకు సమాధానం ఇస్తుంది.ఇదీ చదవండి: రంగులు మార్చే చాట్‌జీపీటీ‘మాజు’ను అభివృద్ధి చేసిన మలేషియా టెక్ సంస్థ ఏఐ క్లోనింగ్ సేవలను అందించే మలేషియా టెక్నాలజీ కంపెనీ ఐమజిన్ ఈ డిజిటల్ దేవతను రూపొందించింది. ఏప్రిల్ 20న సముద్ర దేవత 1,065వ జన్మదిన వేడుకల సందర్భంగా ఈ ఏఐ మాజును లాంచ్ చేశారు. మాండరిన్తోపాటు ఇతర కొన్ని భాషల్లో ఈ దేవత సంబాషించగలదని కంపెనీ తెలిపింది. ఒక ప్రదర్శన వీడియోలో కంపెనీ వ్యవస్థాపకుడు షిన్ కాంగ్ ఏఐ మాజును కొన్ని ప్రశ్నలు అడిగినట్లు తెలిపారు. ‘మాండరిన్లో పెన్ కాయ్ ఉన్ అనే ఊహించని అదృష్టం నన్ను వరిస్తుందా?’ అని అడిగినప్పుడు, మాజు ‘మీరు ఇంట్లోనే ఉంటే ఊహించని సంపద రూపంలో మీరు అదృష్టవంతులు అవుతారు’ అని సావధానంగా సమాధానం ఇచ్చింది. నిద్రించడానికి ఇబ్బంది పడుతున్న ఒక యాత్రికుడికి ఏఐ మాజు దేవత సలహా ఇచ్చింది. ‘నిద్రపోయే ముందు గోరువెచ్చని నీరు త్రాగడంతో మీ సమస్యను పరిష్కరించుకోవచ్చు’ అని తెలిపింది.
ఫ్యామిలీ

కిచెన్ నైఫ్ పదును పోయిందా...!
అప్పుడప్పుడు వంటగది చాకులు పదును లేకుండా కూరగాయలు కోయడానికి విసిగిస్తూ ఉంటాయి. ఈ సమస్యను అధిగమించేందుకు చిన్న చిట్కాలున్నాయి.పదును పెట్టే రాయి.. పదును పెట్టే రాయిని ఒక్కసారి కొనేసుకుంటే అది ఎప్పటికీ పనిచేస్తుంది. కత్తులు, చాకులు ఇలా వేటినైనా ఈజీగా పదును పెట్టచ్చు. మనీ సేవ్ చేయడమే కాదు. సమయం కూడా వృథా కాదు.నైఫ్ షార్ప్‌నర్.. ఎలక్ట్రిక్, మాన్యువల్ కత్తి షార్ప్నర్లు సౌకర్యవంతంగా ఉంటాయి. మరీ ఎక్కువ పదును లేకుండా చూసుకుంటూ పదును పెట్టాలి.చాకుల్ని పొడిగా ఉంచాలి.. తేమ తుప్పు పట్టేలా చేస్తుంది. కూరగాయలు కోయడం అయి΄ోయాకా కత్తుల్ని కాగితం, తువ్వాళ్లలో కట్టి ఆరనీయాలి.చాపింగ్ బోర్ట్.. గాజు, గ్రానైట్ లేదా సిరామిక్ ప్లేట్లలో కూరగాయలు, ఇతర ఆహార పదార్థాలను కట్ చేయడం వల్ల చాకులు ఇట్టే పదును పోతాయి. ఈ పదును ఎక్కువ కాలం ఉండాలంటే చెక్క వస్తువు మీదనే కట్ చేసేలా చూడాలి.కటింగ్ టెక్నిక్.. చాకు మీద ఒత్తిడి తగ్గించి సరైన కటింగ్ మెథడ్స్ పాటిస్తూ కట్ చేయడం వల్ల పదును తగ్గే అవకాశాలు తక్కువగా ఉంటాయి. (చదవండి: 'రోబోటిక్ కేక్'..! శాస్త్రవేత్తలు, పేస్ట్రీ చెఫ్‌ల పాక నైపుణ్యం)

పర్యావరణ హిత: ఈ చిత్రాన్ని మీకు సమర్పిస్తున్న వారు...
కోల్‌కత్తాకు చెందిన అశ్వికాకపూర్ బీబీసి నేచురల్ హిస్టరీ యూనిట్ డైరెక్టర్. పశ్చిమబెంగాల్ అడవుల్లో ‘వణ్య్రప్రాణుల వేట’ పేరుతో ఉత్సవాలు చేస్తారు, ఇందులో పిల్లలు కూడా పాల్గొంటారు. దీనిపై ఆమె ‘క్యాటపల్ట్స్ టు కెమెరాస్’ చిత్రాన్ని తీసింది. ఈ చిత్రం న్యూయార్క్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ స్ఫూర్తిదాయక చిత్రంగా అవార్డు గెలుచుకుంది.అశ్వికాలాంటి ఎంతోమంది మహిళా దర్శకుల విజయానికి ‘రౌండ్‌గ్లాస్ సస్టెయిన్’ దారి చూపింది.‘రౌండ్‌గ్లాస్ సస్టెయిన్ ద్వారా వణ్య్రప్రాణుల గురించి వీలైనంత ఎక్కువగా తెలుసుకునే అవకాశం వచ్చింది. ఎప్పుడూ వినని అరుదైన జీవులు గురించి కూడా తెలుసుకున్నాను. వైల్డ్‌లైఫ్ ఫిల్మ్‌మేకర్‌గా ఇది నాకు ఎంతో ఉపయోగపడుతుంది’ అంటుంది అశ్వికాకపూర్. ‘రౌండ్‌గ్లాస్ సస్టెయిన్’ సంస్థను సియాటెల్‌కు చెందిన పారిశ్రామికవేత్త, దాత గుర్ప్రీత్ సన్నీసింగ్ స్థాపించారు. వణ్య్రప్రాణులపై విలువైన కథలు వెండితెరపై చెప్పడానికి వీలుగా ఇది మహిళా కథకులకు ఒక వేదికగా ఉపయోగపడుతుంది.‘రౌండ్‌గ్లాస్ సస్టెయిన్ ఫిల్మ్స్ దేశవ్యాప్తంగా ఉన్న మహిళా ఫిల్మ్‌మేకర్స్‌తో కలిసి పనిచేస్తోంది. ఫండింగ్ నుంచి దర్శకులకు మార్గనిర్దేశం చేయడం వరకు రౌండ్‌గ్లాస్ సస్టెయిన్ ఎన్నో చేస్తుంది’ అంటుంది రౌండ్‌గ్లాస్ సస్టెయిన్ ఫిల్మ్స్’ క్రియేటివ్ డైరెక్టర్, ఫిల్మ్‌మేకర్ సమ్రీన్ ఫారూఖీ. ‘రౌండ్‌గ్లాస్ సస్టెయిన్’ నిర్మాణ సంస్థ తన వెబ్సైట్ ద్వారా సినిమాలను విడుదల చేస్తుంది. సినిమాలను ప్రమోట్ చేయడానికి టీమ్ విస్తృతంగా మార్కెటింగ్ కూడా చేస్తుంది. దేశవ్యాప్తంగా పలు భాషల్లో ఆన్లైన్ స్క్రీనింగ్‌లు నిర్వహిస్తారు.‘విస్మరించబడిన కథలను వెలుగులోకి తీసుకురావాలనుకుంటుంది. పెద్దగా ఎవరికీ తెలియని ఆవాసాలు, పర్యావరణ వ్యవస్థలు, జాతులకు ప్రాధాన్యత ఇస్తోంది. దీనికి తోడు లోకల్ ఫిల్మ్మేకర్స్పై దృష్టి పెట్టింది. సహజ ప్రపంచం గురించి మాట్లాడడానికి మల్టీమీడియా విధానాన్ని ఉపయోగిస్తోంది. ఫోటో స్టోరీలు, ఇన్ఫోగ్రాఫిక్స్, వ్యాసాలు, కార్లూన్లు ఇందులో ఉంటాయి. కథలను సంచలనం కోసం చెప్పాలనుకోవడం లేదు. స్పష్టంగా చెప్పాలనుకుంటుంది’ అని రౌండ్‌గ్లాస్ సస్టెయిన్ గురించి చెబుతోంది సమ్రీన్.పిల్లల జీవితాలను మార్చిందివైల్డ్ లెఫ్ ఫోటోగ్రఫీ, చిత్రాల ద్వారా వేటకు వెళ్లే పిల్లల మనస్తత్వాలను మార్చాం. ఇప్పుడు వారు అడవి జంతువులను ‘వేట కోసం’ అన్నట్లుగా చూడడం లేదు. సంరక్షించుకోవాల్సిన అందమైన జీవులుగా చూస్తున్నారు. మా చిత్రనిర్మాణ ప్రక్రియ వన్య్రప్రాణులను కాపాడడమే కాదు పిల్లల జీవితాలను కూడా మార్చింది. తమ చుట్టూ ఉన్న సహజ ప్రపంచంతో కనెక్ట్ కావడానికి వారికి ఇది కొత్త మార్గాన్ని చూపించింది.– నేహా దీక్షిత్, ఫిల్మ్మేకర్వారే నిజమై హీరోలుభూగోళ సంక్షోభం గురించి నిరాశపడడం కంటే కార్యాచరణ అనేది ముఖ్యం. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది సంరక్షకులు, శాస్త్రవేత్తలు, రేంజర్ల రూపంలో ఆశ కనిపిస్తుంది. వారు నిజమైన హీరోలు. ఈ హీరోలు మన భూగోళాన్ని సురక్షితంగా ఉంచడానికి అవిశ్రాంతంగా పనిచేస్తున్నారు. వారి అంకితభావం మన ఆశావాదానికి బలాన్ని ఇస్తుంది. ఆ ఆశావాదాన్ని దశదిశలా వ్యాప్తి చేయడం ఫిల్మ్‌మేకర్‌గా నా బాధ్యత.– అశ్వికా కపూర్, ఫిల్మ్మేకర్నోరు లేని మూగజీవాలు, విలువైన ప్రకృతి గురించి చెప్పడానికి ఎన్నో కథలు ఉన్నాయి. వాటికి చిత్రరూపం ఇవ్వడానికి, మహిళలలోని సృజనాత్మకతను ప్రోత్సహించడానికి, వారిని డైరెక్టర్లుగా తీర్చిదిద్దడానికి ‘రౌండ్‌గ్లాస్ సస్టెయిన్’ అనే స్వచ్ఛంద సంస్థ కృషి చేస్తోంది.(చదవండి: ష్యూరిటీ ఇచ్చేముందే జాగ్రత్త పడాలి..!)

ఎక్కడికైనా సులభంగా చిన్న బయోచార్ యూనిట్
భూసారాన్ని పెంపొందించడంతో పాటు దీర్ఘకాలం పాటు ప్రభావం చూపటం ద్వారా పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించటంలో ఉపయోగపడే బయోచార్ (కట్టెబొగ్గు) ఇటీవల కాలంలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. పత్తి కట్టె, కంది కట్టె, వరి ΄పొట్టు వంటి పంట వ్యర్థాలతో ఒక ప్రత్యేక పద్ధతిలో దగ్ధం చేయటం ద్వారా బయోచార్ను ఉత్పత్తి చేస్తున్నారు. అందుకు ఇప్పటికే అనేక రకాల యంత్ర పరికరాలు అందుబాటులో ఉన్నాయి. అయినా, న్న, సన్నకారు రైతులకు ఉపయోగకరంగా ఉండే రొటేటింగ్ డ్రమ్ ఆటోథర్మల్ బయోచార్ యూనిట్‌ను భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలికి అనుబంధ సంస్థ, భోపాల్‌లోని కేంద్రీయ వ్యవసాయ ఇంజనీరింగ్ సంస్థ (ఐసిఎఆర్-సిఐఎఇ) రూపొందింంది. పేటెంట్ పొందదిన ఈ యూనిట్ పంట వ్యర్థాలను బయోచార్గా మారుస్తుంది. వంద కిలోల కట్టెను వాడితే 20–35% కట్టె బొగ్గును అందించే సామర్థ్యంతో పనిచేస్తుంది. చిన్నది. ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లవచ్చు. బయోచార్ను తయారు చేసే ప్రక్రియను పైరోలిసిస్ అంటారు. పైరోలిసిస్ ఛాంబర్‌తోపాటు రెండు సర్క్యులర్ బీమ్‌లు రెండు వైపులా ఉంటాయి. రొటేటింగ్ హేండిల్, చిమ్నీతో కూడిన గ్యాస్ అవుట్లెట్, మూతతోపాటు లోడింగ్ పోర్టు, వీటన్నిటినీ మోసే ఫ్రేమ్ ఉంటాయి. ఈ బయోచార్ ఉత్పత్తి యూనిట్‌ను ఆరుబయట ఉంచి, దాంట్లో పైన ఉండే మూత తీసి పంట వ్యర్థాలను లోపల వెయ్యాలి. ఆ తర్వాత నిప్పంటించాలి. మంట చిన్నగా రగులు కుంటున్నప్పుడు ఎయిర్ బ్లోయర్ ద్వారా గాలిని సరఫరా చెయ్యాలి. ఈ ఛాంబర్ పైభాగాన ఉన్న గ్యాస్ అవుట్లెట్ ద్వారా మంట పొగ బయటకు వస్తాయి. బాగా ఎండబెట్టిన (తేమ సుమారు 10–15% ఉండే) పంట వ్యర్థాలను రియాక్టర్‌లోకి వెయ్యాలి. పూర్తిగా నింపెయ్యకుండా 80% వరకు వెయ్యాలి. రియాక్టర్ యూనిట్‌ను 3–4 సార్లు తిప్పటం ద్వారా మంట కట్టెకు అన్ని వైపులా పూర్తిగా మంట వ్యాపించేలా చెయ్యాలి. బయోచార్ 20 శాతం నుంచి 30% మధ్యలో లభిస్తుంది. సామర్థ్యం: 1.2 క్యూబిక్ మీటర్లు (సుమారు 150 కిలోల పంట వ్యర్థాల ముక్కలు) ధర: రూ. లక్ష + 18% జిఎస్టి. వివరాలకు: డాక్టర్ సందీప్ మండల్, సీనియర్ సైంటిస్ట్, ఐసిఎఆర్– సిఐఎఇ, భోపాల్, భారత్. మొబైల్: 97203 23421

Akshaya Tritiya : ధగధగల వెనుక దగా!
బంగారం ధర ఆకాశాన్నంటుతోంది. ఊహించని విధంగా ధరలు పెరుగుతుండటంతో సామాన్య, మధ్య తరగతి ప్రజల్లో ఆందోళన అధికమవుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారానికి డిమాండ్ పెరగడం, అమెరికాలో వడ్డీ రేట్లు తగ్గడం, పెట్టుబడిదారులు బంగారంపైనే అధికంగా దృష్టి పెట్టడం తదితర కారణాలు ధరల పెరుగుదలకు కారణంగా తెలుస్తోంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా 2024, 2025 సంవత్సరాల్లోనే ధరలు దూసుకుపోతున్నాయి. ఇవాళ (ఏప్రిల్30) అక్షయ తృతీయ. ఆ రోజున బంగారం కొంటే లక్ష్మిదేవిని ఇంటికి ఆహ్వానించినట్లేనన్న నమ్మకం ప్రజల్లో ఉంది. మిగతా రోజులతో పోలిస్తే ఆ రోజున బంగారం వ్యాపారం మూడు, నాలుగు రెట్లు ఎక్కువగా ఉంటుంది. అయితే ధరలు పెరిగిన నేపథ్యంలో అక్షయ తృతీయ రోజున బంగారం వ్యాపారం ఎలా ఉంటుందోననే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. స్వచ్ఛమైన బంగారానికి హాల్ మార్క్ బంగారం కొనుగోలులో తగిన జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. స్వచ్ఛమైన బంగారానికి సాధారణంగా హాల్ మార్క్ ఉంటుంది. బ్యూరో ఆఫ్ స్టాండర్డ్ (బిఐఎస్) హాల్ మార్క్ ఇస్తుంది. అయితే కార్పొరేట్ సంస్థలు హాల్ మార్క్ సెటప్ చేసుకున్నట్లుగా ప్రకటించుకుంటూ నాణ్యతకు సొంత మార్కు ఇచ్చుకుంటున్నాయి. బంగారం కొనుగోలులో హాల్ మార్క్, క్యారెట్లను దృష్టిలో ఉంచుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. నిబంధనల మేరకు బంగారాన్ని బ్యాంకుల ద్వారా దిగుమతి చేసుకోవాల్సి ఉంది. ఐసీఐసీఐ, యాక్సిస్, ఇండియన్ ఓవర్సీస్ తదితర బ్యాంకులు సరఫరా చేస్తున్నాయి. బిల్లు తీసుకోకపోతే నష్టమే.. బంగారం వ్యాపారంలో 85 శాతం జీరో జరుగుతోంది. 90 శాతం వ్యాపారులు ఆథరైజ్డ్ బిల్లులు ఇవ్వడం లేదు. కేవలం షాపు పేరు కలిగిన కాగితాలపై బిల్లులు ఇస్తున్నారు. వీటిలో పాన్‌నెంబర్, వ్యాట్ నెంబర్ ఇతరత్రా వివరాలు ఉండవు. ఇలా ఇవ్వడం జీరో వ్యాపారం కిందకు వస్తుంది. మరికొందరు తెల్లపేపర్‌పైనే వివరాలు రాసిస్తుండటం గమనార్హం. వాణిజ్య పన్నుల శాఖ, ఆదాయపు పన్ను, కస్టమ్స్ ఎక్సైజ్ సుంకం అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు. బంగారం పోగొట్టుకున్నా.. దొంగలు ఎత్తుకెళ్లినా పోలీసులకు ఫిర్యాదు చేయడానికి బిల్లులు తప్పనిసరి. కొంతమంది వ్యాపారులు తూకాల్లో దగా చేస్తున్నట్లు తెలుస్తోంది. తూనికలు, కొలతల శాఖకు వారి టార్గెట్లకు అనుగుణంగా తనిఖీలు చేయడం, కేసులు పెట్టడం తప్ప అక్రమాలను అరికట్టాలనే చిత్తుశుద్ధి లోపించినట్లు తెలుస్తోంది. కొనుగోలులో అప్రమత్తత అవసరం స్వచ్ఛమైన బంగారం కొంటే తిరిగి అమ్ముకున్నప్పుడు ఆ రోజు ఉన్న ధర లభిస్తుంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో దాదాపు 1,500 వరకు బంగారం దుకాణాలు ఉన్నాయి. 24 క్యారెట్ బంగారం బిస్కెట్ రూపంలో లభిస్తుంది. ఇది పూర్తిగా స్వచ్ఛమైనది. బంగారం ఆభరణాలు మాత్రం 22 క్యారెట్లలో ఉంటాయి. వీటి స్వచ్ఛత 916 ఉంటుంది. జిల్లాలో జరిగే వ్యాపారంలో 80 శాతం వరకు 22 క్యారెట్ల బంగారం(నగలు, ఆభరాణాలు) కొనుగోలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వినియోగదారులు 22 క్యారెట్ల బంగారం విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.14, 16, 18 క్యారెట్ల బంగారానికి 22 క్యారెట్ల ధర వసూలు కర్నూలు, నంద్యాల జిల్లా కేంద్రాలతో సహా అన్ని ప్రాంతాల్లోని కొందరు వ్యాపారులు 14, 16, 18, 20 క్యారెట్ల బంగారం ఆభరణాలు అమ్ముతూ వాటికి 22 క్యారెట్ల ధర వసూలు చేస్తుండటం గమనార్హం. ప్రస్తుతం 10 గ్రాముల ఆర్నమెంటు బంగారం ధర రూ.89,400 పలుకుతోంది. ఒక క్యారెట్ విలువ రూ.4,063.63. 22 క్యారెట్లు(916 స్వచ్ఛత) ఉన్న బంగారమైతే ఈ ధర చెల్లించాలి. వినియోగదారులు కొనుగోలు చేసే బంగారం 20 క్యారెట్లు కలిగినదైతే 10 గ్రాముల ధర రూ.81,272 అవుతుంది. కానీ అధిక శాతం జ్యువెలరీ షాపుల్లో తక్కువ క్యారెట్లు ఉన్న బంగారానికి కూడా 22 క్యారెట్ల బాంగారం ధర వసూలు చేస్తుండటం గమనార్హం.కొనక తప్పడం లేదు బంగారం ధరలు అందుబాటులో ఉంటే కాస్త ఎక్కువ కొంటాం. మా కుటుంబంలో వివాహం ఉన్నందున ధర ఎంతు న్నా కొనక తప్పడం లేదు. అక్షయ తృతీయ నేపథ్యంలో ఆఫర్లు ఉండటంతో బంగారం కొనడానికి మలబార్ గోల్డ్‌కు వచ్చాం. ఆర్నమెంటు బంగారం 10 గ్రాముల ధర రూ.89,800 ఉన్నప్పటికీ డిజైన్‌ను బట్టి తరుగు కలుపుతుండటంతో రూ.లక్షపైనే అవుతోంది. ఇంత ధర ఉండటం నిజంగా బాధాకరమే. – ప్రత్యూష, సంతోష్‌నగర్, కర్నూలుధరలు తగ్గించాలి బంగారం ధరలు తగ్గించే దిశగా కేంద్రం చర్యలు తీసుకోవాలి. రోజురోజుకు ధరలు భారీగా పెరిగిపోతుండటం మధ్యతరగతి వారిని ఆందోళనకు గురిచేస్తోంది. ప్రస్తుతం శుభకార్యాలు, అక్షయ తృతీయ ఉండటంతో బంగారం కొనడానికి వచ్చాం. బంగారం అంటే ప్రతి ఒక్కరికి మక్కువ ఉన్నప్పటికీ వనరులను బట్టి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఉంది. – శైలజ, కోడుమూరు(చదవండి: అక్షయ ఫలాలనిచ్చే అక్షయ తృతీయ..! బంగారం కొనాల్సిందేనా..?)
ఫొటోలు
అంతర్జాతీయం

భారత్‌లో పాక్ రక్షణ మంత్రి ఎక్స్ ఖాతా నిలిపివేత
ఢిల్లీ: పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా మహమ్మద్ ఎక్స్ ఖాతాను భారత ప్రభుత్వం నిలిపివేసింది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత జమ్ముకశ్మీర్ పై పాక్ మంత్రి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారన్న కారణంతో ఎక్స్ ఖాతాను కేంద్రం బ్లాక్ చేసింది. భారత్, పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.ఇప్పటికే పాకిస్థాన్ కేంద్రంగా నిర్వహిస్తున్న పలు యూట్యూబ్ ఛానళ్ల ప్రసారాలను భారత్‌లో నిషేధించిన సంగతి తెలిసిందే. భారత్‌లో పాక్ జర్నలిస్టుల ఎక్స్ ఖాతాలను కూడా కేంద్ర ప్రభుత్వం నిలిపివేసింది. ఐఎస్ఐ, పాకిస్థాన్ ప్రభుత్వంతో కలిసి భారత్‌పై తప్పుడు ప్రచారం చేస్తున్నందుకు ఈ చర్యలు చేపట్టింది.భారత సైన్యం కదలికలపై పాక్ ఐఎస్ఐ కొత్త ఎత్తుగడమరోవైపు, భారత సైన్యం కదలికలపై పాక్ ఐఎస్ఐ కొత్త ఎత్తుగడలు వేస్తోంది. సైన్యం కదలికలపై పాకిస్థాన్ ఐఎస్ఐ ఆరా తీస్తోంది. సరిహద్దులోని మిలిటరీ సిబ్బంది, పౌరులకు.. భారతీయ సైనిక్ స్కూల్ ఉద్యోగులమంటూ ఐఎస్ఐ ఫోన్లు చేస్తోంది. గుర్తు తెలియని నెంబర్ల నుంచి వచ్చే ఫోన్ కాల్స్‌పై అప్రమత్తంగా ఉండాలని.. తెలియని వారికి ఎలాంటి సమాచారం ఇవ్వొద్దని సరిహద్దు ప్రజలకు కేంద్రం సూచిస్తోంది.కాగా, పహల్గాం దాడి తర్వాత పాక్ రక్షణ మంత్రి మీడియాతో మాట్లాడుతూ, అమెరికా, బ్రిటన్ కోసమే చెత్త పనులు చేశామని.. ఉగ్రవాదాన్ని పోత్సహించడం పొరబాటని అర్థమైందంటూ పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అమెరికా కోసమే ఉగ్రవాదులను పెంచిపోషించామంటూ ఆయన తప్పును ఒప్పుకున్నారు. ఉగ్రవాదం వల్ల చాలా ఇబ్బందులు పడ్డామన్నారు. ఉగ్ర సంస్థలకు నిధులు, ఉగ్రవాదులకు శిక్షణ నిజమేనంటూ స్వయంగా ఆ దేశ రక్షణమంత్రే అంగీకరించారు. ఓ అంతర్జాతీయ మీడియాతో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ట్రంప్ కోరుకునేది ఎన్నటికీ జరగదు.. విక్టరీ స్పీచ్‌లో మార్క్ కార్నీ
టొరంటో: కెనడాలో సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో అధికార లిబరల్ పార్టీ(Liberal Party of Canada) విజయం దిశగా దూసుకెళ్తోంది. వరుసగా నాలుగోసారి అధికారం చేపట్టడం దాదాపు ఖాయం కావడంతో ఆ పార్టీ శ్రేణులు సంబురాల్లో మునిగిపోయాయి. ఈ క్రమంలో మార్క్ కార్నీ(Mark Carney) మద్ధతుదారుల్ని ఉద్దేశిస్తూ విజయ ప్రసంగం చేస్తూ.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌పై విమర్శలు గుప్పించారు.‘‘కెనడా చరిత్రలో కీలకమైన క్షణం ఇది. అమెరికా(America)తో మన పాత ఏకీకరణ సంబంధం ఇప్పుడు ముగిసింది. ఇకపై అమెరికాను స్థిరమైన మిత్రదేశంగా నమ్మలేం. అమెరికా చేసిన ద్రోహం నుండి మనం తేరుకుంటున్నాం. నెలల తరబడి నుంచి నేను ఈ విషయంలో హెచ్చరిస్తూ వస్తున్నా. అమెరికా మన భూమిని, మన వనరులను, మన నీటిని, మన దేశాన్ని కోరుకుంటోంది. మనల్ని విచ్ఛిన్నం చేసి తద్వారా కెనడాను సొంతం చేసుకోవాలని ట్రంప్ ప్రయత్నించారు. కానీ, అది ఎప్పటికీ జరగదు’’ అని కార్నీ అన్నారు.అమెరికాతో సుంకాల యుద్ధం, కెనడా యూఎస్‌లో 51వ రాష్ట్రంగా చేరాలంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) బెదిరింపుల వేళ ఈ ఎన్నికలు అత్యంత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కెనడా పార్లమెంట్లో 343 సీట్లు ఉన్నాయి. ప్రభుత్వ ఏర్పాటునకు 172 మెజారీటీ అవసరం. ఇప్పటికే కన్జర్వేటివ్ పార్టీ నేత పియరీ పొయిలివ్రా ఓటమిని అంగీకరించారు. అయితే లిబరల్ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోయినప్పటికీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. దీంతో మిత్రపక్షాలతో కలిసి మార్క్ కార్నీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి.ఈ ఏడాది జనవరిలో జస్టిన్ ట్రూడో ప్రధాని పదవికి రాజీనామా చేయడంతో లిబరల్ పార్టీ సభ్యులు తదుపరి ప్రధానిగా ఆర్థిక వేత్త అయిన మార్క్ కార్నీని ఎన్నుకున్నారు. ప్రధాని బాధ్యతలు చేపట్టిన కార్నీ.. ముందస్తు ఎన్నికలకు వెళ్లారు.ఇదీ చదవండి: ట్రంప్‌తో కయ్యం.. ఎవరీ మార్క్ కార్నీ?

భారత్‌తో యుద్ధ భయం.. పాక్ సైన్యంలో భారీ రాజీనామాలు
ఇస్లామాబాద్: కశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధవాతావరణం నెలకొంది. భారత్ ఎప్పుడు, ఎలా దాడి చేస్తుందోనన్న భయంతో పాకిస్తాన్ వణికిపోతోంది. తమపై భారత్ వైమానిక దాడులకు దిగొచ్చని పాకిస్తాన్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో భారత వైమానిక దాడులను పసిగట్టడానికి సియాల్కోట్ ప్రాంతానికి పాక్ సైన్యం తన రాడార్ వ్యవస్థలను తరలిస్తున్నట్లు సమాచారం. అలాగే, అత్యవసరంగా తమ దేశ గగనతలాన్ని సైతం మూసివేసింది.ఇదిలా ఉండగా.. పహల్గాం దాడి తర్వాత భారత్ తీసుకుంటున్న చర్యలు, హెచ్చరికల కారణంగా పాకిస్తాన్‌కు టెన్షన్ మొదలైంది. ఈ క్రమంలో పాక్ ఆర్మీ కూడా భయాందోళనకు గురైనట్టు తెలుస్తోంది. ఈ ఉగ్రదాడి తర్వాత.. కేవలం రెండు రోజుల వ్యవధిలో పాకిస్తాన్ ఆర్మీలో 4500 మంది సైనికులు, 250 మంది అధికారులు తమ పదవులను విడిచిపెట్టి వెళ్లిపోయినట్టు ‘ది డేలీ గార్డియన్’ ఓ కథనంలో వెల్లడించింది. ఈ మేరకు పాక్ 11వ దళ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఉమర్ బుఖారీ లేఖను బయటపెట్టింది.కథనం ప్రకారం.. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్‌కు బుఖారీ ఒక లేఖ రాశారు. ఈ లేఖలో తమ దేశ సైనికుల ఆత్మస్థైర్యం వేగంగా క్షీణిస్తోందని హెచ్చరించారు. ఈ ధోరణి ఇలాగే కొనసాగితే.. ఒకవేళ భారత్‌తో యుద్ధం చేయాల్సి వస్తే.. పాకిస్తాన్ సైన్యం అసమర్థమైన ప్రతిఘటనను ప్రదర్శించవచ్చు. కొంతమంది సైనికులు ఇప్పటికే క్రియాశీల విధులను విడిచిపెట్టినప్పటికీ, మరికొందరు రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇది పాకిస్తాన్ సైనిక ర్యాంకుల్లో తీవ్ర సంక్షోభాన్ని సూచిస్తోంది. ఈ పరిణామం తీవ్రమైన ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు.. సామూహిక రాజీనామాలపై పాకిస్తాన్ సీనియర్ అధికారులు ఆందోళన వ్యక్తం చేసినట్టు సమాచారం.ఇదిలా ఉండగా.. పహల్గాం దాడి తర్వాత బలమైన భారత సైన్యం ప్రతీకారం తీర్చుకుంటుందనే భయమే రాజీనామాలకు ముఖ్య కారణంగా తెలుస్తోంది. భారత్ ఎప్పుడైనా దాడి చేయవచ్చనే భయంతో సైనికులు కుటుంబ సభ్యులు కూడా ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యుల ఒత్తిడి మేరకు సైనికులు రాజీనామాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. 🚨 Breaking News.4500 Soldiers and 250 Officers of Pakistan Army resigned from service amid arising tension with India after #PahalgamTerroristAttackLt. Gen Umar Ahmad Bukhari, 11 Corp Cdr has written this letter to the Chief of army Staff. This letter is being circulated on… pic.twitter.com/XLE1G84rrY— JK CHANNEL (@jkchanneltv) April 28, 2025మునీర్ ఎక్కడ?మరోవైపు.. సరిహద్దుల్లో యుద్ధమేఘాలు కమ్ముకుంటున్న వేళ సైన్యాధిపతి జనరల్ సయీద్ అసిమ్ మునీర్ కనిపించడం లేదన్న వార్తలు పాకిస్తాన్లో కలకలం రేపుతున్నాయి. కుటుంబంతో పాటుగా ఆయన దేశం వీడి పారిపోయారని స్థానిక మీడియాలో ఆదివారం వార్తలొచ్చాయి. ‘తొలుత కుటుంబాన్ని విదేశాలకు తరలించారు. తర్వాత తానూ పాక్ వీడారు’ అన్నది వాటి సారాంశం. కొద్ది రోజులుగా, ఆ మాటకొస్తే పహల్గాం దాడి జరిగినప్పటి నుంచీ మునీర్ బయట ఎక్కడా కన్పించడం లేదని ఆ కథనాలు చెబుతున్నాయి. దాడిపై ఆగ్రహంతో రగిలిపోతున్న భారత్ తీవ్రస్థాయిలో ప్రతీకార చర్యలకు దిగుతుందని పాక్ ఆందోళన చెందుతోంది. అందుకు తానే బాధ్యుడిని అవుతానని మునీర్ భయపడ్డారు. అందుకే దేశం నుంచి జారుకున్నట్టు కనిపిస్తోంది’ అని కథనాలు పేర్కొంటున్నాయి

కెనడాలో భారతీయ విద్యార్థిని అదృశ్యం విషాదాంతం
ఒట్టావా: కెనడాలో భారతీయ విద్యార్థిని వంశిక సైనీ(Vanshika Saini) మిస్సింగ్ కేసు విషాదాంతంగా ముగిసింది. స్థానికంగా ఓ బీచ్‌లో ఆమె శవమై కనిపించింది. ఆమె మృతదేహాన్ని రికవరీ చేసుకున్న స్థానిక పోలీసులు.. మృతికి గల కారణాలపై విచారణ చేపట్టారు. ఈ విషయాన్ని కెనడాలోని భారత హైకమిషన్ ధ్రువీకరిస్తూ.. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతి ప్రకటించింది.వివరాల్లోకి వెళ్తే.. పంజాబ్ ఆప్ నేత దేవిందర్ సింగ్ కుమార్తె వంశిక. ఆమె రెండున్నరేళ్ల కిందట డిప్లోమా కోర్సు కోసం కెనడా వెళ్లింది. ఏప్రిల్ 25వ తేదీన అద్దె ఇంటిని వెతికేందుకు బయటకు వెళ్లిన ఆమె తిరిగిరాలేదు. ఆమె నుంచి రెండు రోజులు ఫోన్ కాల్ లేకపోవడంతో కుటుంబ సభ్యులు ఆమె స్నేహితులకు కాల్ చేశారు. వాళ్లు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు విచారణ ప్రారంభించారు. ఈ క్రమంలోనే ఏప్రిల్ 28వ తేదీన ఆమె మృతదేహం ఒట్టావా బీచ్ వద్ద లభ్యమైంది.ఆమె మృతికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆమె మృతదేహాన్ని స్వస్థలానికి తరలించే అంశంతో పాటు ఈ కేసులో స్థానిక అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు భారతీయ రాయబార కార్యాలయం తెలిపింది.ఇదిలా ఉంటే.. ఇటీవల కెనడాలో భారతీయ విద్యార్థుల మరణాలు పెరిగిపోయాయి. తాజాగా.. గ్యాంగ్ వార్‌లో భాగంగా జరిగిన కాల్పుల్లో.. బస్టాప్‌లో వేచి చూస్తున్న 21 ఏళ్ల భారతీయ విద్యార్థిని హర్ సిమ్రత్ రంధావా బుల్లెట్ తగిలి అనూహ్యంగా చనిపోయింది. కొన్నాళ్ల కిందట.. రాక్లాండ్ ప్రాంతంలో ఓ భారతీయుడు కత్తి పోట్లకు గురై ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.
జాతీయం

అప్పు ఇవ్వొద్దు.. పాక్‌పై భారత్ ఆర్థిక యుద్ధం
ఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడితో ప్రతీకారంతో రగిలిపోతున్న భారత్ .. పాకిస్తాన్‌ను ఆర్ధికంగా మరింత ఇబ్బందే పెట్టే ప్రయత్నాల్ని ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా దాయాది దేశంపై భారత్ ఆర్థిక యుద్ధం ప్రకటించింది.పాకిస్తాన్‌కు అప్పు ఇవ్వొద్దంటూ భారత్ అంతర్జాతీయ ద్రవ్య నిధి (International Monetary Fund - IMF) పై ఒత్తిడి చేస్తోంది. ఆ మేరకు అభ్యంతరం తెలిపింది. గతేడాదిలో ప్రకటించిన పాకిస్తాన్‌కు ఏడు బిలియన్ డాలర్ల బెయిల్ అవుట్ ప్యాకేజీ విషయంలో సమీక్షించాలని కోరింది. పాక్‌కు నిధులు ఇస్తే ఉగ్రవాదులకు మళ్ళిస్తోందని ఐఏఎఫ్ మెంబర్స్‌కు భారత్ వివరిస్తోంది.మే 9న పాకిస్తాన్‌కు అప్పు ఇచ్చే అంశంపై ఐఎంఎఫ్ బోర్డు చర్చించనుంది. ఈ తరుణంలో పాక్‌కు ఎట్టి పరిస్థితుల్లో అప్పు ఇవ్వొదని భారత్ వాదిస్తోంది. ఇదే అంశంపై భద్రతామండలి నాన్ పర్మినెంట్ మెంబర్స్‌తో భారత విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ చర్చలు జరుపుతున్నారు. పాకిస్తాన్‌కు ఏడు బిలియన్ డాలర్ల బెయిల్ అవుట్ ప్యాకేజీని సమీక్షించాలని కోరనున్నారుIndia can voice opposition to Pakistan’s $1.3 billion IMF loan, but its 2.63% voting share limits its influence. The IMF typically approves loans by consensus, and a formal vote only needs a simple majority, not an 85% supermajority. To block the loan, India would need to build…— Grok (@grok) April 29, 2025

Kolkata: హోటల్లో ఘోర అగ్ని ప్రమాదం.. 14 మంది సజీవ దహనం
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కోల్‌కతాలో ఘోర విషాదం చోటు చేసుకుంది. బుర్రాబజార్ ఏరియా ఫల్పట్టి మచ్చువా అనే పండ్ల మార్కెట్ సమీపంలో ఉన్న హోటల్ రుతురాజ్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 14 మంది సజీవ దహనమయ్యారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద మరణాల్ని కోల్‌కతా సీపీ మనోజ్ కుమార్ వర్మ అధికారికంగా ప్రకటించారు. ఈ ఘటన మంగళవారం రాత్రి 8:15 గంటలకు జరిగినట్లు సమాచారం. VIDEO | Kolkata hotel fire: Police Commissioner Manoj Verma says, "A fire incident was reported at Ritu Raj Hotel in Mechuapatti area at about 8:15 am on Tuesday evening. At least 15 casualties have been reported so far and several people were rescued from rooms and roof of the… pic.twitter.com/8YkIfq6oSe— Press Trust of India (@PTI_News) April 30, 2025ఈ దుర్ఘటనపై సీపీ మనోజ్ కుమార్ మాట్లాడారు.‘ అగ్ని ప్రమాదంలో సజీవ దహనమైన పద్నాలుగు మృతదేహాలను వెలికితీశాం. గాయపడిన బాధితులను మెరుగైన వైద్యం కోసం ఆస్పత్రికి తరలించాం. మంటలు అదుపులోకి వచ్చాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి’ అని అన్నారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. దీనిపై సమగ్ర దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాల్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రాణాలతో బయటపడిన పలువురు ప్రమాదంపై మాట్లాడారు. ముందుగా హోటల్ కారిడార్లలో దట్టమైన పొగకమ్ముకుంది. ఆ తర్వాత కరెంట్ పోయిందని చెప్పారు. హోటల్లో ఉన్న పలువురు ప్రాణాల్ని రక్షించుకునేందుకు హోటల్ కిటికీలను పగలగొట్టి బయటపడేందుకు ప్రయత్నించారు. మరి కొంతమంది ప్రమాదం నుంచి బయటపడే దారిలేక అలాగే గదుల్లోనే ఉండిపోయారు. అగ్ని ప్రమాదంపై సమాచారం అందుకు సిబ్బంది వారిని రక్షించేందుకు ప్రయత్నించినట్లు వెల్లడించారు.

చుట్టుముట్టి చంపేశారు
శ్రీనగర్: తాజాగా మరికొంత మంది ప్రత్యక్ష సాక్షుల కథనాలతో పహల్గాంలోని బైసారన్‌లో ముష్కరుల కిరాతకకాండపై జాతీయ దర్యాప్తు సంస్థకు మరింత స్పష్టత వస్తోంది. అమాయకులను ముష్కరులు చుట్టుముట్టి చంపేశారని తెలుస్తోంది. ప్రత్యక్ష సాక్షుల కథనాల ప్రకారం.. బైసారన్ గడ్డి మైదానం లోపలికి వెళ్లడానికి, బయటకు రావడానికి ఒక ఎంట్రీ మార్గంతోపాటు ఒక ఎగ్జిట్ దారి ఉంది. ఈ రెండు చోట్లా ఉగ్రవాదులు నిలబడి మైదాన ప్రాంతం నుంచి ఎవరూ బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు. సుదూరంగా ఉన్న వాళ్లు కళ్లుగప్పి, ఫెన్సింగ్ దాటి ఎలాగోలా తప్పించుకున్నా మిగతా వాళ్లు మధ్యలోనే చిక్కుకుపోయి ఉగ్రతూటాలకు బలయ్యారని తెలుస్తోంది. ఎగ్జిట్ గేట్ వద్ద ఒక ఉగ్రవాది నిలబడి కాల్పులు మొదలెట్టాడు.దీంతో జనం భయపడి ఎంట్రీ గేట్ వైపు పరుగులు పెట్టారు. అయితే అప్పటికే ఎంట్రీ గేట్ వద్ద ఇద్దరు ఉగ్రవాదులు ఉన్నారు. మరో ఉగ్రవాది చెట్లలో దాక్కున్నట్లు తెలుస్తోంది. కాల్పులు జరుపుతున్న ఈ ముగ్గురు ఉగ్రవాదులకు ఏమైనా జరిగితే రంగంలోకి దిగేందుకు సిద్ధంగా ఉన్నాడని అర్థమవుతోంది. ఈ ముగ్గురు మాత్రమే పర్యాటకుల ప్రాణాలుతీశారు. వీరిలో ఇద్దరు భారత సైనిక యూనిఫామ్‌లో, ఒకడు కశ్మీరీ స్థానిక దుస్తుల్లో ఉన్నాడు. ఎగ్జిట్ గేట్ వద్ద తుపాకీ మోతతో ఎంట్రీ గేట్ వైపు పరుగెత్తుకొచ్చిన వాళ్లందర్నీ అక్కడి ఇద్దరు ఉగ్రవాదులు నిలువరించి మహిళలు వేరుగా నిలబడాలని ఆదేశించారు.భయపడుతున్నా ఎవ్వరూ వేరు వేరుగా నిలబడలేదు. దీంతో హిందూ, ముస్లింలుగా వేర్వేరుగా నిలబడాలని మరోసారి ఆదేశించారు. దీంతో ఇస్లామ్‌పై విశ్వాసం ఉందని ప్రకటించే ‘కల్మా’ను పఠించాలని ఆదేశించారు. ఈ క్రమంలోనే ఎంట్రీ గేట్ నుంచి వచి్చన యువ నేవీ అధికారి, లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ ఉగ్రతూటాలకు బలయ్యారని సాక్షులు తెలిపారు. రెండు వారాల ముందే రెక్కీ? ఉగ్రవాదులు సమీప హోటళ్లలో పర్యాటకులతో నిండిపోయాయా లేదా? అనే వివరాలను తెల్సుకున్నారని, ఇందుకోసం రెండు వారాల ముందే రెక్కీ నిర్వహించారని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ విషయాన్ని నిర్ధారించుకునేందుకు సమీప హోటళ్లు, రహదారి వెంట అమర్చిన సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. జిప్‌లైన్ ఆపరేటర్‌కు ఎన్ఐఏ సమన్లు రిషీ భట్ అనే పర్యాటకుడు జిప్‌లైన్ ఎక్కి బైసారన్ ఏరియల్ వ్యూను తన కెమెరాలో బంధించిన సందర్భంగా జిప్‌లైన్ ఆపరేటర్ వ్యవహారశైలి అనుమానాస్పదంగా ఉండటం ఆ వీడియోలో రికార్డయింది. అల్లా హు అక్బర్ అని పదేపదే అతను పలకడం అందులో రికార్డయింది. పర్యాటకుడిని జిప్‌లైన్‌లో ముందుకు తోస్తూ అలా పలకాల్సిన అవసరం ఏమొచి్చందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో దాడి విషయం ముందే తెలుసా? అనే కోణంలో వివరణ కోరుతూ ఎన్ఐఏ ఇతనికి సమన్లు జారీచేసింది. రెండ్రోజుల క్రితమే హతమార్చేవారా? ఏప్రిల్ 22వ తేదీన ఈ దాడి జరిగింది. వాస్తవానికి రెండు రోజుల ముందే ఉగ్రవాదులు దాడికి ప్రయతి్నంచారని తెలుస్తోంది. అయితే ఆ ముందు రెండు రోజులు అంటే 20, 21వ తేదీల్లో అక్కడ వర్షం పడటంతో బైసారన్ గడ్డిమైదానం అంతా బురదమయంగా ఉండటంతో పర్యాటకులు హోటళ్లను వదిలి బయటకు రాలేదని, సందడి లేకపోవడంతో ఉగ్రవాదులు తమ ప్రయత్నాన్ని వాయిదావేసుకున్నారని తెలుస్తోంది. 22వ తేదీన చక్కటి ఎండ కాయడంతో జనం పెద్ద సంఖ్యలో వచ్చారు. ఘటన జరిగిన రోజున బైసారన్, సమీప ప్రాంతాల్లో ఏకంగా 5,000 మంది స్థానిక, స్థానికేతరులు ఉన్నారని ‘పోనీ ఆపరేటర్’రౌఫ్ వానీ చెప్పారు. ఆ విషయం ఉగ్రవాదులు తెల్సుకుని తెగబడ్డారని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. అక్కడి ఫుడ్‌స్టాళ్ల వెనక వైపు చాలా సేపు ఇద్దరు ఉగ్రవాదులు ఊరకనే కూర్చుని మధ్యాహ్నం 2.30 గంటలకు జనం ఎక్కువైన తర్వాతే ముందువైపుకొచ్చి దాడి చేసినట్లు తెలుస్తోంది. ముందుగా ఇద్దరు ఉగ్రవాదులు నలుగురిని తలపై గురిచూసి చంపేశాకే అక్కడి జిప్‌లైన్ వెనుక నుంచి మరో ఇద్దరు వచ్చారని ఇంకొందరు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.

పాక్ విమానాలకు నో ఎంట్రీ
న్యూఢిల్లీ: పాకిస్తాన్‌పై మరిన్ని కఠిన ఆంక్షలను భారత ప్రభుత్వం సిద్ధమవుతోంది. తమ గగన తలం గుండా పాకిస్తానీ ఎయిర్‌లైన్స్ విమానాలు ప్రయాణించకుండా నిషేధం విధించాలని యోచిస్తున్నట్లు తెలిసింది. భారత గగనతలాన్ని మూసివేస్తే పాకిస్తాన్ విమానాలకు ప్రయాణం మరింత భారమవుతుంది. సింగపూర్, మలేషియా వంటి ఆగ్నేయ ఆసియా దేశాలకు వెళ్లాలంటే చుట్టూ తిరిగి చైనా లేదా శ్రీలంక మీదుగా ప్రయాణించాల్సి ఉంటుంది.మరోవైపు పాకిస్తాన్ నౌకలపైనా ఆంక్షలు అమల్లోకి వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. భారత ఓడరేవుల్లో పాకిస్తాన్ నౌకలకు ఎలాంటి అనుమతి ఇవ్వకూడదని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. భారత ప్రాదేశిక జలాల్లో ప్రవేశానికి సైతం అనుమతి ఉండబోదు. ఇండియా విమానాలు ప్రయాణించకుండా తమ గగనతలాన్ని పాక్ ప్రభుత్వం గత వారం మూసి వేసిన సంగతి తెలిసిందే.పహల్గాం ఉగ్రవాద దాడి తర్వాత భారత్–పాక్ మధ్య ఉద్రిక్తతలు పెరుగు తున్నాయి. ఇరుదేశాలు పరస్పరం ఆంక్షలు విధి స్తున్నాయి. ప్రధానంగా సింధూనది జలాల ఒప్పందాన్ని భారత ప్రభుత్వం నిలిపివేయడం సంచలనాత్మకంగా మారింది. ఇది తమపై ముమ్మాటికీ ప్రకటనేనని పాక్ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఎన్ఆర్ఐ

Texas: మృత్యువుతో పోరాడి ఓడిన దీప్తి
ఆస్టిన్: అమెరికా టెక్సాస్‌లో తెలుగు విద్యార్థిని హిట్ అండ్ రన్ కేసు విషాదాంతంగా ముగిసింది. తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న వంగవోలు దీప్తి(Deepthi Vangavolu)కన్నుమూశారు. ఈ విషయాన్ని అక్కడి అధికారులు ఇచ్చిన సమాచారం ద్వారా కుటుంబ సభ్యులు ధృవీకరించారు. దీంతో గుంటూరులోని ఆమె స్వస్థలంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. దీప్తి(23) తండ్రి హనుమంత రావు చిరువ్యాపారి. ఆమె కుటుంబం గుంటూరు(Guntur) రాజేంద్రనగర్ రెండో లైనులో నివాసం ఉంటోంది. టెక్సాస్‌లోని డెంటన్ సిటీలో యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సాస్‌లో ఎంఎస్ చేసేందుకు వెళ్లారు. మరో నెల రోజుల్లో కోర్సు పూర్తి కావాల్సి ఉంది. అయితే ఈలోపు రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు ఆమెను కబళించింది. ఈ నెల 12వ తేదీన స్నేహితురాలైన మేడికొండూరుకు చెందిన స్నిగ్ధతో కలిసి రోడ్డుపై నడచి వెళ్తుండగా వేగంగా ప్రయాణిస్తున్న కారు ఢీకొట్టింది. దీప్తి తలకు తీవ్ర గాయమైంది. స్నిగ్ధకు కూడా గాయాలయ్యాయి. దీప్తి స్నేహితురాళ్లు ప్రమాద విషయాన్ని ఆమె తండ్రి హనుమంతరావుకు తెలిపారు. క్రౌడ్ ఫండింగ్(Crowd Funding) ద్వారా ఆమె చికిత్స కోసం ప్రయత్నాలు కొనసాగగా.. మంచి స్పందన లభించింది. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. ఈ నెల 15న దీప్తి చికిత్స పొందుతూ కన్నుమూసింది. శనివారం(ఏప్రిల్ 19) నాటికి మృతదేహం గుంటూరుకు వచ్చే అవకాశం ఉంది. మరో బాధితురాలు స్నిగ్ధ ప్రస్తుతం అక్కడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె పరిస్థితి నిలకడగానే ఉందని సమాచారం. అవే ఆమె చివరి మాటలు..దీప్తి మృతి వార్త విని ఆ తల్లిదండ్రులు గుండెలు అవిసెలా రోదిస్తున్నారు. చదువులో చాలా చురుకైన విద్యార్థిని అని, అందుకే పొలం అమ్మి మరీ అమెరికాకు పంపించామని చెప్పారు. నెల రోజుల్లో గ్రాడ్యుయేషన్ పూర్తి కావాల్సి ఉందని, ఆ టైంకి మమ్మల్ని అమెరికాకు రావాలని ఆమె కోరిందని, అందుకు ఏర్పాట్లలో ఉండగానే ఇలా జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 10వ తేదీన దీప్తి చివరిసారిగా తమతో ఫోన్లో మాట్లాడినట్లు తెలిపారు. కాలేజీకి టైం అవుతోందని.. ఆదివారం మాట్లాడతానని చెప్పి హడావిడిగా ఫోన్ పెట్టేసిందని.. అవే తమ బిడ్డ మాట్లాడిన చివరి మాటలని గుర్తు చేసుకుని బోరున విలపించారు.

దుబాయి హతుల వారసులకు ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు
ఇటీవల దుబాయిలో హత్యకు గురైన ఇద్దరు తెలంగాణ యువకుల కుటుంబ సభ్యులకు ఔట్ సోర్సింగ్ లో ఉద్యోగాలు ఇవ్వాలని జపాన్ పర్యటన నుంచి ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారని తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ది కార్పోరేషన్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే అనిల్ ఈరవత్రి ఒక ప్రకటనలో తెలిపారు. నిర్మల్ జిల్లా సోన్ మండల కేంద్రానికి చెందిన అష్టపు ప్రేమ్ సాగర్‌తో పాటు, జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం దమ్మన్నపేట కు చెందిన స్వర్గం శ్రీనివాస్ లు దుబాయి లో హత్యకు గురైన విషయం తెలిసిందే. దుబాయి నుంచి మృత దేహాలను త్వరగా స్వదేశానికి తెప్పించడానికి చర్యలు తీసుకోవాలని సీఎం అధికారుల్ని ఆదేశించినట్లు అనిల్ తెలిపారు.. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దుబాయి లోని భారత రాయబార కార్యాలయానికి, ఢిల్లీ లోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు లేఖలు రాసినట్లు వెల్లడించారు. మరిన్ని NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి:ఎన్నారై అడ్వయిజరీ కమిటీ చైర్మన్ డా. బిఎం వినోద్ కుమార్ బృందం, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి లు మృతుల కుటుంబాలను పరామర్శించారు.

రాయలసీమ ప్రగతికి డాలస్‌లో జీఆర్ఏడీఏ అడుగులు
గ్రేటర్ రాయలసీమ అసోసియేషన్ ఆఫ్ డాలస్ ఏరియా (GRADA) ఆధ్వర్యంలో ఏప్రిల్ 13న ఫ్రిస్కో, టెక్సాస్‌లో రాయలసీమ ప్రాంతం ఎదుర్కొంటున్న సమస్యలపై సమావేశం జరిగింది. రాయలసీమ సమస్యలు, అభివృద్ధి అవకాశాలు, తెలుగు భాషా సాహిత్యాల ప్రాముఖ్యతపై చర్చ జరిగింది. ఈ కార్యక్రమానికి రాయలసీమకు చెందిన రచయిత భూమన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన తన ప్రసంగంలో రాయలసీమ ప్రస్తుత పరిస్థితి, ముఖ్యంగా దీర్ఘకాలంగా వేధిస్తున్న నీటి సమస్యలు, వెనుకబాటుతనం గురించి ఎంతో ఆవేదనతో, స్పష్టంగా వివరించారు.మన ప్రాంత సహజ సంపద అయిన శేషాచలం అడవుల గురించి, ముఖ్యంగా ఎర్రచందనం చెట్ల గురించి ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ విలువైన సంపదను అక్రమ మార్గాల్లో ఇతర దేశాలకు తరలించి లాభం పొందకుండా, స్థానికంగానే వాటి ఆధారిత పరిశ్రమలను స్థాపించి, ఉత్పత్తులను తయారు చేయడం ద్వారా మన ప్రాంతాన్ని ఎలా ఆర్ధికంగా బలోపేతం చేయవచ్చో ఆయన చక్కగా వివరించారు. ఆయన మాటలు మనందరిలో కొత్త ఆలోచనలను రేకెత్తించాయి. సహజ వనరులను సక్రమంగా వినియోగించుకుంటే రాయలసీమ భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందనే ఆశాభావాన్ని ఆయన కలిగించారు.మరో గౌరవ అతిథిగా కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం మాజీ వైస్‌ఛాన్సలర్, ప్రఖ్యాత విద్యావేత్త ప్రొఫెసర్ పి. కుసుమ కుమారి హాజరయ్యారు. ఆమె తన ప్రసంగంలో తెలుగు భాష మాధుర్యం, సాహిత్యం గొప్పదనం, పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకత గురించి వివరించారు. నంద కోర్వి, అనిత నాగిరెడ్డి, సతీష్ సీరం, బ్రహ్మ చిరా, హరినాథ్ పొగకు, హేమంత్ కాకుట్ల, జగదీశ్వర నందిమండలం, జగదీష్ తుపాకుల, పవన్ పల్లంరెడ్డి, ప్రసాద్ నాగారపు, రాజు కంచం, శివ అద్దేపల్లి, శివ వల్లూరు, శ్రీధర్ బొమ్ము, శ్రీకాంత్ దొంత, సురేష్ మోపూరు, ఉమా గొర్రెపాటి, మరియు కార్తీక్ మేడపాటి ఈ సమావేశానికి హాజరయ్యారు.

సింగపూర్‌లో ‘అంతర్జాతీయ ఉగాది సాహిత్య సమ్మేళనం’
'వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా' 'శ్రీ సాంస్కృతిక కళాసారథి - సింగపూర్' మరియు 'వంశీ ఇంటర్నేషనల్ - ఇండియా' సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో, ఆదివారం 13వ తేదీ హైదరాబాద్ , శ్రీ త్యాగరాయ గానసభలో ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు 12 గంటల పాటు నిర్విరామంగా "అంతర్జాతీయ ఉగాది సాహిత్య సమ్మేళనం" కార్యక్రమం అద్వితీయంగా నిర్వహించబడింది.ఈ మూడు సంస్థలు కలసి విశ్వావసు నామ సంవత్సర ఉగాదిని పురస్కరించుకొని 80 మంది కవులతో 'అంతర్జాతీయ కవి సమ్మేళనము', 20 నూతన గ్రంధావిష్కరణలు, ఆచార్య శలాక రఘునాథ శర్మ 'రాయప్రోలు వంశీ జాతీయ సాహితీ జీవన సాఫల్య పురస్కార' ప్రదానము డా. బులుసు అపర్ణచే ప్రత్యేక 'మహిళా అష్టావధానము' మొదలైన అంశాలతో ఈ 'అంతర్జాతీయ ఉగాది సాహిత్య సమ్మేళనం' కార్యక్రమాన్ని ప్రత్యేకంగా రూపొందించి నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ్యులు మండలి బుద్ధ ప్రసాద్, విశిష్ట అతిథులుగా కవి జొన్నవిత్తుల, కిమ్స్ ఆస్పత్రి వ్యవస్థాపకులు బొల్లినేని కృష్ణయ్య, తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు ఆచార్య వెలుదండ నిత్యానంద రావు, ప్రముఖ రాజకీయవేత్త వామరాజు సత్యమూర్తి తదితరులు హాజరయ్యారు.ఉదయం 9 గంటలకు డా వంశీ రామరాజు అందించిన స్వాగతోపన్యాసంతో ఆరంభమైన ప్రారంభోత్సవ సభలో, కార్యక్రమ ప్రధాన సమన్వయకర్త రాధిక మంగిపూడి సభా నిర్వహణలో, మండలి బుద్ధ ప్రసాద్, కవి జొన్నవిత్తుల, బొల్లినేని కృష్ణయ్య, వామరాజు సత్యమూర్తి, డా. జననీ కృష్ణ తదితరుల ప్రసంగాలు అందరినీ ఆకర్షించాయి.తదనంతరం ఖతార్ నుండి విచ్చేసిన విక్రమ్ సుఖవాసి నిర్వహణలో అతిథుల చేతుల మీదుగా 18 తెలుగు నూతన గ్రంథాలు ఆవిష్కరించబడ్డాయి. వాటిలో కథల కవితల సంకలనాలు, వ్యాస సంపుటాలు, జెవి పబ్లికేషన్స్, మిసిమి మాసపత్రిక వారి ప్రచురణలు, సిద్ధాంత గ్రంథాలు మాత్రమే కాకుండా, ప్రతిష్టాత్మకంగా 2024 నవంబర్‌లో ఖతార్ దేశ రాజధాని దోహా మహానగరంలో వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా ఆధ్వర్యంలో జరిగిన "9వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు సభా విశేష సంచిక" కూడా ఆవిష్కరించబడడం ఈ సభకు మరింత శోభను చేకూర్చింది.మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 4:30 వరకు కొనసాగిన "అంతర్జాతీయ కవి సమ్మేళనం"లో ఆస్ట్రేలియా, ఖతార్, దక్షిణాఫ్రికా, అమెరికా మొదలైన దేశాలనుండి, ఉభయ తెలుగు రాష్ట్రాలనుండి, ముంబై, అండమాన్ దీవులు మొదలైన ప్రాంతాలనుండి కూడా వచ్చిన సుమారు 80 మంది కవులు కవయిత్రులు పాల్గొని తమ కవితలు వినిపించారు. వంశీ అధ్యక్షురాలు డా. తెన్నేటి సుధాదేవి, రేవూరు అనంత పద్మనాభరావు, జి భగీరథ, గుండు వల్లీశ్వర్, ప్రొ. రామా చంద్రమౌళి మహెజబీన్, ప్రొ. త్రివేణి వంగారి, డా కేతవరపు రాజ్యశ్రీ, డా. చిల్లర భవానీ దేవి, డా. శంకరనారాయణ, అంబల్ల జనార్ధన్, డా చాగంటి కృష్ణకుమారి మొదలైన ఎందరో కవులు కవయిత్రులు ఈ కవిసమ్మేళనంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం కొందరు రచయితలు ప్రసంగవ్యాసాలు వినిపించారు. సభా వ్యాఖ్యాతలుగా పేరి, కృష్ణవేణి, రాధిక వ్యవహరించారు.అనంతరం సాయంత్రం ఆచార్య శలాక రఘునాథ శర్మను ఘనంగా సత్కరించి, వారికి మూడు నిర్వాహక సంస్థల తరఫున "రాయప్రోలు వంశీ జాతీయ సాహితీ జీవన సాఫల్య పురస్కారం" అందించారు. దీనికి తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు ఆచార్య వెలుదండ నిత్యానందరావు ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. అనంతరం శలాక మాట్లాడుతూ తెలుగువారికి సొంతమైన అవధాన ప్రక్రియలో 'సమస్యా పూరణం' అనే అంశంలో ఉండే చమత్కారాలు వివరణలు తెలియజేస్తూ "అవధాన కవిత్వం - సమస్యలు" అనే అంశంపై ప్రత్యేక ప్రసంగాన్ని అందించారు.సాయంత్రం 5:30 గంటల నుండి ద్విశతావధాని డా. బులుసు అపర్ణ చేసిన అష్టావధానం ఈ సదస్సుకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రాధిక మంగిపూడి సంచాలకత్వంలో అమెరికా, యుగాండా, ఆస్ట్రేలియా, ఖతార్, అండమాన్ దీవులు, ముంబై, విశాఖపట్నం, విజయవాడ నుండి వచ్చిన 8 మంది మహిళలు పృచ్ఛకులుగా పాల్గొనడంతో ఇది "సంపూర్ణ మహిళా అష్టావధానం"గా ప్రశంసలు అందుకుంది.ఈ కార్యక్రమానికి ప్రధాన నిర్వాహకులుగా వంగూరి ఫౌండేషన్ వ్యవస్థాపకులు డా. వంగూరి చిట్టెన్ రాజు, వంశీ వ్యవస్థాపకులు డా. వంశీ రామరాజు, సింగపూర్ సంస్థ వ్యవస్థాపకులుకవుటూరు రత్నకుమార్ వ్యవహరించగా, వంగూరి ఫౌండేషన్ భారతదేశ ట్రస్టీ శైలజ సుంకరపల్లి ఆధ్వర్యంలో వేదిక ఏర్పాట్లు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమం యూట్యూబ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా పంచవ్యాప్తంగా సాహిత్య అభిమానుల మన్ననలు అందుకుంది.
క్రైమ్

కొడుకు మృతదేహంతో మూడురోజులు
మంచిర్యాల క్రైం: మతిస్థిమితం కోల్పోయిన ఒక తండ్రి.. చనిపోయిన కుమారుడి శవం పక్కనే మూడు రోజుల పాటు ఉన్న ఘటన వెలుగు చూసింది. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని అశోక్‌రోడ్‌లో జరిగిన ఈ ఘటనపై స్థానికులు, ఎస్ఐ ప్రవీణ్‌కుమార్ తెలిపిన వివరాలివి. గూడెల్లి వెంకట్‌రెడ్డి అశోక్‌రోడ్డులో నివసిస్తున్నారు.ఈయనకు కుమారుడు లక్ష్మీనారాయణ ఉన్నాడు. వెంకట్‌రెడ్డి సింగరేణిలో పనిచేసి ఉద్యోగ విరమణ చేశారు. మూడేళ్ల క్రితం భార్య రాధమ్మ అనారోగ్యంతో చనిపోయాక వెంకట్‌రెడ్డి మతిస్థిమితం కోల్పోయారు. తండ్రీకొడుకులు ఇద్దరే ఇంట్లో ఉంటున్నారు. ఎస్టీపీపీలో కాంట్రాక్ట్ వర్కర్‌గా పనిచేస్తున్న కొడుకు లక్ష్మీనారాయణ.. తండ్రి బాగోగులు చూసుకునేవారు. ఇటీవల మద్యానికి బానిసైన లక్ష్మీనారాయణ.. ఆదివారం కూడా తాగి ఇంట్లోని సోఫాలో పడుకున్నారు. అప్పటి నుంచి బయటకు రాలేదు. మంగళవారం ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో.. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించగా.. సోఫాలో లక్ష్మీనారాయణ (30) శవమై కనిపించాడు. మరోవైపు వెంకట్‌రెడ్డి అచేతన స్థితిలో పడుకుని ఉన్నాడు. ‘నీ కొడుక్కి ఏమైంది..’ అని ప్రశ్నిస్తే.. ‘పడుకున్నాడు’.. అంటూ సమాధానం చెప్పారు. పోలీసులు లక్ష్మీనారాయణ మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, వెంకట్‌రెడ్డిని వైద్యం నిమిత్తం ఆసుపత్రిలో చేర్పించారు. వెంకట్‌రెడ్డి బంధువు గూడెల్లి శ్రీనివాస్‌రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు.

ఆడుకుంటూ వెళ్లి అసువులు బాసింది
చైతన్యపురి(హైదరాబాద్): ఇంటి పక్క నుంచి ఆడుకుంటూ వెళ్లిన ఆరేళ్ల బాలిక ప్రమాదవశాత్తు చెరువు నీళ్లలో పడి మృతి చెందిన ఘటన సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ సైదిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని నెల్లూరు జిల్లాకు చెందిన పాలకుర్తి శ్రీను, శ్రావణి దంపతులు. బతుకుదెరువు కోసం నగరానికి వచ్చి కూలిపనులు చేసుకుంటూ గ్రీన్‌పార్కు కాలనీ రోడ్‌నం.14లో నివసిస్తున్నారు. వీరికి నలుగురు కూతుళ్లు. సోమవారం సాయంత్రం 4 గంటల సమయంలో తల్లిదండ్రులు పక్కింటివారితో మాట్లాడుతుండగా రెండో కూతురు అభిత (6) ఆడుకుంటోంది. కొద్ది సేపటి తర్వాత తర్వాత చూడగా అభిత కనిపించలేదు. ఎక్కడ వెతికినా జాడ తెలియకపోవటంతో రాత్రి సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేశారు. మంగళవారం ఉదయం 9.30 గంటలకు అభిత మృతదేహం చెరువు నీటిలో తేలుతూ కనిపించింది. ఇంటి సమీపంలోనే చెరువు ఉండటంతో బాలిక ఆడుకుంటూ వెళ్లి అందులో పడి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. తమ ఆరేళ్ల కూతురు మృతి చెందడంతో శ్రీను, శ్రావణి దంపతులు కన్నీరుమున్నీరుగా విలపించారు. చెరువు చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని అధికారులకు ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా పట్టించుకోవడం లేదని కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇద్దరిని బలిగొన్న అతివేగం
బిట్రగుంట(నెల్లూరు): అతి వేగం ఇద్దరు స్నేహితుల ప్రాణాలను బలిగొంది. ఈ ఘటన కొడవలూరు మండలం నార్తురాజుపాళెం సమీపంలో ఆంజనేయస్వామి గుడి వద్ద హైవేపై సోమవారం అర్ధరాత్రి జరిగింది. పోలీసుల సమాచారం మేరకు.. బోగోలు పంచాయతీ బేతనీయపేటకు చెందిన షేక్ మన్సూర్‌బాషా (26), విశ్వనాథరావుపేట రామస్వామిపాళెంకు చెందిన బత్తుల ప్రవీణ్‌కుమార్ (26) చిన్ననాటి నుంచి స్నేహితులు. మన్సూర్‌కు వివాహమై రెండేళ్ల కుమారుడు ఉండగా, ప్రవీణ్‌కుమార్ అ వివాహితుడు. మన్సూర్ బిట్రగుంటలోనే వాహనాలకు నేమ్ బోర్డులు, స్టిక్కర్లు వేసే షాపు నిర్వహిస్తున్నాడు. ప్రవీణ్‌కుమార్ గౌరవరం టోల్‌ప్లాజా వద్ద పని చేస్తున్నాడు. స్నేహితులిద్దరూ పనిమీద సోమవారం నెల్లూరు వెళ్లారు. రాత్రి సుమారు 11.30 గంటల తర్వాత బైక్‌పై ఇంటికి బయలు దేరారు. బాగా ఆలస్యం కావడంతో త్వరగా ఇంటికి చేరుకొందామని బైక్‌ను వేగంగా నడుపుకొంటూ వచ్చారు. 12 గంటల ప్రాంతంలో నార్తురాజుపాళెం ఆంజనేయస్వామి గుడి వద్ద ఆగి ఉన్న లారీని అదే వేగంతో వెనుక వైపు ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న స్నేహితులు మన్సూర్, ప్రవీణ్‌కుమార్ అక్కడకక్కడే మృతి చెందారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఏఎస్సై గంధం ప్రసాద్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి మృతుల కుటుంబాలకు సమాచారం అందించారు. అనంతరం ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నెల్లూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై తెలిపారు.

చదివేది ఏడో తరగతి.. వాడేది ఐ ఫోన్
జీడిమెట్ల(హైదరాబాద్): ఆ బాలుడు ఏడో తరగతి చదువుతున్నాడు. ఇంట్లో ఎవరూ చూడకుండా సంవత్సర కాలంగా ఇంట్లో ఐ ఫోన్ వాడుతున్నాడు. కుమారుడు ఐ ఫోన్ వాడటాన్ని గమనించిన తండ్రి.. ‘నీకు ఫోన్ ఎలా వచి్చంది’ అని నిలదీయడంతో అసలు విషయం చెప్పేశాడు. ‘మన షాపులోంచి రోజూ కొంత డబ్బు తీసి ట్యూషన్ మాస్టారుకు ఇచ్చేవాణ్ని. మాస్టారే ఈ ఫోన్ కొనిచ్చాడు’ అని బాలుడు తన తండ్రికి వివరించాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు.పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.. షాపూర్‌నగర్‌కు చెందిన వ్యాపారవేత్త కమల్‌జైన్. ఆయన కుమారుడు ఏడో తరగతి చదువుతున్నాడు. సంవత్సర కాలంగా బాలుడు తమ షాపులోంచి కొంత నగదు దొంగిలించసాగాడు. ఆ డబ్బును తనకు ట్యూషన్ చెప్పే మాస్టారుకు ఇచ్చేవాడు. ఈ క్రమంలో బాలుడికి సదరు ట్యూషన్ మాస్టారు ఐ ఫోన్ కొనిచ్చాడు. ఈ విషయం ఇంట్లో తెలియడంతో కుమారుడికి ట్యూషన్ చెబుతున్న వ్యక్తిపై జీడిమెట్ల పీఎస్‌లో కమల్‌జైన్ ఫిర్యాదు చేశాడు. విచారణ చేపట్టిన పోలీసులు ట్యూషన్ మాస్టారు సందీప్‌పై కేసు నమోదు చేశారు. సంవత్సర కాలంగా కుమారుడు తమ షాపులోంచి డబ్బులు తీస్తున్న తండ్రి పసిగట్టకపోవడం గమనార్హం. అలాగే సంవత్సర కాలంగా కుమారుడు ఇంట్లో ఫోన్ వాడుతున్నా కుటుంబ సభ్యులు చూడకపోవడం మరో విచిత్రం. ఎవరైనా పిల్లలు ఇలాంటి పనులు చేస్తే వారికి కౌన్సెలింగ్ ఇప్పించాలని సీఐ గడ్డం మల్లేష్ తల్లిదండ్రులకు సూచించారు.