Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today

Top Stories

ప్రధాన వార్తలు

Chandrababu Govt Looted Poor people lands in Amaravati1
‘అసైన్డ్‌’ దోపిడీకి రాజముద్ర!

అదే.. అమరావతి! అంతా.. రైతన్నలే..! కానీ రాజధాని ప్రాంతంలో.. గత ప్రభుత్వం పేదలకు కేటాయించిన ఇళ్ల స్థలాలను రద్దు చేసిన కూటమి ప్రభుత్వం.. అదే చోట నిరుపేద రైతుల నుంచి అసైన్డ్‌ భూములను కాజేసిన పచ్చ ముఠాలను ‘రాజముద్ర’తో సత్కరిస్తోంది. అమరావతిలో ఏకంగా 1,300 ఎకరాల అసైన్డ్‌ భూములు రిటర్న్‌బుల్‌ ప్లాట్ల ముసుగులో పచ్చ రాబందులకు ఫలహారంగా మారిపోతున్నాయి! అసలు అసైన్డ్‌ భూములను కొనడమే పెద్ద తప్పు.. ఇక వాటిని కొనుగోలు చేసిన టీడీపీ నేతలకు బదులుగా ప్లాట్లు కేటాయించడం అంతకంటే పెద్ద నేరం కాదా? రాష్ట్రవ్యాప్తంగా అసైన్డ్‌ భూములను సాగు చేసుకుంటున్న లక్షలాది మంది పేద రైతుల సమస్యకు పరిష్కారం చూపుతూ వాటిపై వారికి పూర్తి యాజమాన్య హక్కులు (ఫ్రీ హోల్డ్‌) కల్పిస్తూ గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. అయితే దీన్ని సైతం కూటమి సర్కారు వివాదాస్పదంగా మార్చింది. గత సర్కారు 22 ఏ నిషేధిత జాబితా నుంచి తొలగించిన లక్షలాది ఎకరాల భూములు, ఫ్రీ హోల్డ్‌ భూములపై తీసుకున్న నిర్ణయాలను తిరగతోడి వాటిని పారిశ్రామిక పార్కులు, ఇతర ప్రభుత్వ అవసరాల కోసం వినియోగించుకోవడంపై ప్రతిపాదనలు రూపొందించాలని ఇప్పటికే క్యాబినెట్‌ సమావేశంలో నిర్ణయించింది. ఒకవైపు ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టం, భూముల రీ సర్వే, అసైన్డ్‌ భూములకు యాజమాన్య హక్కుల కల్పన, చుక్కల భూములకు పరిష్కారం లాంటి అన్ని భూ సంబంధిత అంశాలను వివాదాలతో ముంచెత్తుతూ మరోవైపు ప్రక్షాళన పేరుతో తూతూమంత్రంగా రెవెన్యూ సదస్సులను నిర్వహించింది.సాక్షి, అమరావతి: రాజధాని అమరావతిలో 2014–19 మధ్య బరితెగించి సాగించిన ‘అసైన్డ్‌’ భూముల దోపిడీకి చంద్రబాబు ప్రభుత్వం రాజముద్ర వేస్తోంది. అమాయక ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులకు మాయ మాటలు చెప్పి రూ.5 వేల కోట్లకు పైగా విలువ చేసే 1,300 ఎకరాల అసైన్డ్‌ భూములను చంద్రబాబు బినామీలు, సన్నిహితులు చేజిక్కించుకున్నట్లు అప్పట్లోనే వెల్లడైంది. వీటిని రిజిస్ట్రేషన్‌ చేసేందుకు అధికారులు అంగీకరించకపోవడంతో ఈ దోపిడీదారులు హైకోర్టుకు వెళ్లి రైతుల ఫోర్జరీ సంతకాలతో ఏకంగా న్యాయస్థానాన్నే మోసగించడానికి ప్రయత్నించారు. ఇప్పుడు మళ్లీ చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రావడంతో భూ సమీకరణ కింద తీసుకున్న ఈ భూములకు అమరావతిలో ప్లాట్లు కేటాయించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ భూ దోపిడీకి వ్యతిరేకంగా అసైన్డ్‌ రైతులు న్యాయ పోరాటానికి సిద్ధపడ్డారు. తమకు న్యాయం చేయాలని తాజాగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేస్తున్నారు.పరిహారం ఇవ్వరంటూ భయపెట్టి..కేంద్ర ప్రభుత్వ అసైన్డ్‌ భూముల పరిరక్షణ చట్టాన్ని ఉల్లంఘిస్తూ, అప్పటి రెవెన్యూ అధికారుల అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ 2014–19 మధ్య టీడీపీ హయాంలో చంద్రబాబు బృందం ఏకంగా 1,300 ఎకరాల అసైన్డ్‌ భూముల దోపిడీకి పాల్పడింది. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చెందిన ఈ భూములను చేజిక్కించుకోవడానికి పక్కా పన్నాగం పన్నింది. రాజధాని కోసం అన్ని భూములను సమీకరణ కింద ప్రభుత్వం తీసుకుంటుందని, ఇవి అసైన్డ్‌ భూములైనందున ఎలాంటి పరిహారం ఇవ్వదని మొదట రెవెన్యూ అధికారుల ద్వారా గ్రామాల్లో ప్రచారం చేయించింది. ఇందులో భాగంగా భూ సమీకరణ విధానాలు ఖరారు చేస్తూ జారీ చేసిన జీవో 1 లోనూ అసైన్డ్‌ భూములకు భూ సమీకరణ ప్యాకేజీ ప్రకటించలేదు. దీంతో పేద రైతులు భయాందోళనకు గురయ్యారు. అదే అదునుగా టీడీపీ పెద్దల బినామీలైన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు రంగ ప్రవేశం చేశారు. అసైన్డ్‌ భూములు తమకు అమ్మేయాలని, లేకపోతే ప్రభుత్వం ఎలాంటి పరిహారం ఇవ్వకుండా వాటిని తీసేసుకుంటుందని ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులను భయపెట్టారు. అతి తక్కువ ధరకు సేల్‌ డీడ్‌ అగ్రిమెంట్లతో భూములను బదలాయించుకున్నారు. మొత్తం 1,300 ఎకరాలను చేజిక్కించుకున్నాక చంద్రబాబు ప్రభుత్వం వీటికి కూడా భూ సమీకరణ ప్యాకేజీ ప్రకటిస్తూ జీవో 41 జారీ చేసింది. అంటే అసైన్డ్‌ భూములను అక్రమంగా అతి తక్కువకు కొట్టేసిన టీడీపీ ముఠాకు రాజధానిలో విలువైన వాణిజ్య, నివాస స్థలాలను కేటాయిస్తామని తెలిపింది. దాంతో తాము మోసపోయామని అసైన్డ్‌ రైతులు గుర్తించి, ఆందోళన వ్యక్తం చేసినా చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదు. అప్పటికి ఎకరా రూ.కోటి విలువ ఉన్న భూములకు రాజధాని నిర్మిస్తే ఎకరా రూ.4 కోట్లు పలుకుతాయంటూ నాడు ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబే ప్రకటించారు. అంటే టీడీపీ ముఠా కొల్లగొట్టిన 1,300 ఎకరాల మార్కెట్‌ విలువ ఏకంగా రూ.5 వేల కోట్లు పైనే!రికార్డుల గల్లంతు మాయాజాలం1954 తర్వాత ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన అసైన్డ్‌ భూముల క్రయవిక్రయాలు నిబంధనలకు విరుద్ధమని రెవెన్యూ అధికారులు అభ్యంతరం తెలిపారు. అప్పటి గుంటూరు జిల్లా కలెక్టర్‌ కాంతిలాల్‌ దండే కూడా ఈ మేరకు లిఖిత పూర్వకంగా స్పష్టం చేశారు. ఈ భూముల రిజిస్ట్రేషన్లను అప్పటి మంగళగిరి సబ్‌ రిజిస్ట్రార్‌ తిరస్కరించారు. దాంతో దోపిడీదారులు ఆ భూములన్నీ 1954కు ముందు రైతులకు కేటాయించినవంటూ తప్పుడు అఫిడవిట్లు దాఖలు చేశారు. వాస్తవానికి అవన్నీ 1980 – 2006 మధ్య రైతులకు కేటాయించినవే. వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం 2006లో కేటాయించిన భూములు కూడా వీటిలో ఉన్నాయి. ఆ వాస్తవాన్ని కప్పిపుచ్చేందుకు టీడీపీ పెద్దలు గుంటూరు కలెక్టరేట్‌లో అసైన్డ్‌ భూముల రికార్డులను ఏకంగా మాయం చేశారు.ఫోర్జరీ సంతకాలతో హైకోర్టుకే మస్కాఅసైన్డ్‌ భూముల రిజిస్ట్రేషన్‌ను అధికారులు తిరస్కరించడంతో చంద్రబాబు బినామీలు, సన్నిహితులు హైకోర్టుకు వెళ్లారు. 1954కు ముందు కేటాయించిన ఈ భూములను ఎస్సీ, ఎస్టీ రైతులు తమకు స్వచ్ఛందంగానే విక్రయించారని హైకోర్టుకు తెలి­పారు. ఇందుకోసం ఆ రైతుల సంతకాలను ఫోర్జరీ చేసి అఫిడవిట్‌ దాఖలు చేశారు. ఆ భూములను రిజిస్ట్రేషన్‌ చేసేలా అధికారులను ఆదేశించాలని, వాటికి భూ సమీకరణ కింద రాజధానిలో అభివృద్ధి చేసిన ప్లాట్లు కేటాయించేలా సీఆర్‌డీఏను ఆదేశించాలని న్యాయస్థానాన్ని కోరారు. ఓ వైపు హైకోర్టులో ఈ వ్యాజ్యం సాగు­తుండగా.. మరో­పక్క అమరావతిలో అసైన్డ్‌ భూముల దోపిడీకి ఆమోద ముద్ర వేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం సిద్ధమవుతోంది. భూ సమీక­రణ కింద తీసుకున్న ఆ 1,300 ఎకరాల అసైన్డ్‌ భూము­లకు అమ­రావతిలో రిటర్నబుల్‌ ప్లాట్లు కేటాయించాలని సీఆర్‌డీఏను ఆదేశించింది. తదనుగుణంగా చంద్రబాబు బృందం సభ్యుల పేరిట రిటర్నబుల్‌ ప్లాట్ల రిజిస్ట్రేషన్‌కు సీఆర్‌డీఏ సన్నాహాలు చేస్తోంది.ప్లాట్ల రిజిస్ట్రేషన్‌ను అడ్డుకోండి..టీడీపీ కూటమి ప్రభుత్వ కుట్రను గుర్తించిన అసైన్డ్‌ రైతులు పలువురు హైకోర్టును ఆశ్రయించారు. తాము అసలు భూములు విక్రయించనే లేదని స్పష్టం చేశారు. తాము స్వచ్ఛందంగా భూములు విక్రయించినట్టు తమ సంతకాలు ఫోర్జరీ చేసి అఫిడవిట్లు దాఖలు చేశారని పలువురు అసైన్డ్‌ రైతులు న్యాయస్థానానికి నివేదించారు. తమ భూములకు ప్లాట్లను తమకే కేటాయించేలా సీఆర్‌డీఏను, ఇతరుల పేరిట ప్లాట్లు రిజిస్ట్రేషన్‌ చేయకుండా స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ శాఖ అధికారులను ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో పలువురు పిటిషన్లు దాఖలు చేశారు.భూ దోపిడీని ఆధారాలతో నిగ్గు తేల్చిన సిట్‌2019లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రాగానే అమరావతిలో అసైన్డ్‌ రైతులు తమకు జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేశారు. దాంతో గత ప్రభుత్వం విచారణకు సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్‌) నియమించింది. సిట్‌ దర్యాప్తులో చంద్రబాబు బృందం భూ బాగోతం మొత్తం ఆధారాలతో బట్టబయలైంది. అసైన్డ్‌ భూముల పరిరక్షణ చట్టానికి విరుద్ధంగా భూముల బదలాయింపు చేయకూ­డదని లిఖిత పూర్వకంగా అభ్యంతరం తెలిపామని అప్పటి గుంటూరు కలెక్టర్‌గా ఉన్న కాంతిలాల్‌ దండేతో సహా పలువురు అధికారులు సీఆర్‌పీసీ 164 కింద వాంగ్మూలాలు ఇచ్చారు. దాంతో ఏ1గా చంద్రబాబు, ఏ 2గా నారాయణతో పాటు పలువురిపై గతంలో సిట్‌ కేసు నమోదు చేసి న్యాయస్థానంలో చార్జిషీటు కూడా దాఖలు చేసింది.

AP Three MLC Election Results Live Updates2
AP: ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌ ప్రక్రియ ప్రారంభం

MLC Election Results Updates..ఏపీలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. ఏయూ ఇంజనీరింగ్‌ కాలేజీ, ఏలూరు సీఆర్‌ రెడ్డి కాలేజీ, గుంటూరు ఏసీ కాలేజీలోని కౌంటింగ్‌ కేంద్రాల్లో ఓట్లు లెక్కింపు జరుగుతోంది. రాష్ట్రంలో గత నెల 27న జరిగిన మూడు ఎమ్మెల్సీ స్థానాలకు 70 మంది అభ్యర్థులు పోటీ పడిన విషయం తెలిసిందే. ఉమ్మడి ఉత్తరాంధ్ర జిల్లాల టీచర్ల నియోజక­వర్గం, ఉమ్మడి ఉభయ గోదావరి, ఉమ్మడి కృష్ణ–గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గాల ఎన్నికల కౌంటింగ్‌ జరగనుంది. ఈ మూడు స్థానా­లకు పోటీ అధికంగా ఉండడం, ప్రాధాన్యత ఓట్ల ఆధారంగా లెక్కించాల్సి ఉండటంతో తుది ఫలితాలు వెలువడటానికి సుదీర్ఘ సమ­యం పడుతుందని అధికారులు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగ­కుండా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. విశాఖ..ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు..ఎనిమిది గంటలకు లెక్కింపు ప్రారంభం.ఏయూ ఇంజనీరింగ్ కాలేజీలో లెక్కింపు..బరిలో పదిమంది అభ్యర్థులు.123 బ్యాలెట్ బాక్సులు.20 టేబుల్స్ సిద్ధం చేసిన అధికారులుమొత్తం ఓట్లు 20,493, పోలైన ఓట్లు 20,795.తొలి ప్రాధాన్యత ఓటుతో తేలితే సాయంత్రం 5 గంటలకు ఫలితం.లేదా రాత్రి 9 గంటల దాటే అవకాశం..లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసిన అధికారులు..కౌంటింగ్ కేంద్రం వద్ద మూడు అంచెల భద్రత వ్యవస్థ ఏర్పాటు..కౌంటింగ్ కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలు.విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదన్న అధికారులుగుంటూరు..ఉమ్మడి కృష్ణ- గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గం ఎన్నికల కౌంటింగ్గుంటూరు ఏసీ కాలేజీలో కౌంటింగ్ ప్రక్రియఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభం కానున్న కౌంటింగ్మొత్తం 29 టేబుల్ ఏర్పాటుమూడు షిఫ్ట్ లో కౌంటింగ్ ప్రక్రియకౌంటింగ్ ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులుఏలూరు జిల్లా..ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ఏలూరులోని సీఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో ఓట్ల లెక్కింపు.456 కేంద్రాల్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు వేసిన 2,18,902 మంది ఓటర్లుమూడు షిప్టుల్లో 700 మంది సిబ్బందితో ఓట్ల లెక్కింపు28 టేబుల్స్ ఏర్పాటు17 రౌండ్స్‌లో తేలనున్న ఫలితం.కౌంటింగ్ కోసం పటిష్ట బందోబస్తు ఏర్పాటు

 Oscars 2025 Awards Winners List3
97వ ఆస్కార్‌ విజేతల జాబితా

97వ ఆస్కార్ అవార్డుల వేడుక అంగరంగ వైభవంగా లాస్‌ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో ఘనంగా జరుగుతున్నాయి. ముందుగా అనుకున్న సమయం కంటే కాస్త ఆసల్యంగానే అవార్డుల ప్రకటన ప్రారంభమైంది. ఈ క్రమంలో కొన్ని విభాగాల్లో విజేతలను కూడా ప్రకటించారు. అవార్డుల కోసం హాలీవుడ్‌ టాప్‌ నటీనటులతో పాటు సాంకేతిక నిపుణులు హాజరయ్యారు. రెడ్‌ కార్పెట్‌పై సరికొత్త ట్రెండీ దుస్తుల్లో వారందరూ మెరిసిపోతున్నారు. ఉత్తమ సహాయ నటుడు – కీరన్ కల్కిన్ (ఏ రియల్‌ పెయిన్‌)ఉత్తమ అడాప్టెడ్‌ స్క్రీన్‌ప్లే– పీటర్ స్ట్రౌగన్ (కాన్‌క్లేవ్‌)ఉత్తమ ఒరిజినల్‌ స్క్రీన్‌ప్లే – సీన్ బేకర్ (అనోరా)ఉత్తమ కాస్ట్యూమ్‌ డిజైన్‌ – పాల్ టాజ్‌వెల్ (విక్‌డ్‌- Wicked)ఉత్తమ యానిమేటెడ్‌ ఫీచర్‌ – (ఫ్లో- FLOW)ఉత్తమ యానిమేటెడ్‌ షార్ట్‌ ఫిలిం- ఇన్‌ ద షాడో ఆఫ్‌ ద సైప్రెస్‌ఉత్తమ మేకప్‌, హెయిల్‌స్టైల్‌ - ది సబ్‌స్టాన్స్‌ఉత్తమ ఎడిటింగ్ - సీన్‌ బేకర్‌ (అనోరా)ఉత్తమ సహాయ నటి – జోసల్దానా (ఎమీలియా పెరెజ్) ఉత్తమ ఒరిజినల్‌ సాంగ్‌ – "ఎల్ మాల్" (ఎమిలియా పెరెజ్)ఉత్తమ ప్రొడక్షన్‌ డిజైన్‌ – నాథన్ క్రౌలీ,లీ శాండల్స్ (విక్‌డ్‌- Wicked)ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్‌– నో అదర్ ల్యాండ్ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్‌ ఫిలిం- ది ఓన్లీ గర్ల్ ఇన్ ది ఆర్కెస్ట్రాఉత్తమ సౌండ్‌ - డ్యూన్‌- పార్ట్‌2ఉత్తమ లైవ్‌ యాక్షన్‌ షార్ట్‌ ఫిలిం- ఐ యామ్ నాట్ ఎ రోబోట్-విజేతల ప్రకటన కొనసాగుతుంది.. పూర్తి జాబితా కోసం మరికొంత సమయం పడుతుంది

Australia replace injured Matthew Short with Cooper Connolly for Champions Trophy semi-final vs India4
టీమిండియాతో సెమీఫైన‌ల్‌.. ఆసీస్ జ‌ట్టులోకి విధ్వంస‌క‌ర ఆట‌గాడు

ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోఫీ-2025లో తొలి సెమీఫైన‌ల్‌కు రంగం సిద్ద‌మైంది. మంగ‌ళ‌వారం(మార్చి 4) దుబాయ్ వేదిక‌గా సెమీఫైన‌ల్‌-1లో భార‌త్‌, ఆస్ట్రేలియా జ‌ట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్‌కు ముందు ఆసీస్‌కు భారీ షాక్ త‌గిలింది. స్టార్ ఆల్‌రౌండ‌ర్ మాథ్యూ షార్ట్ గాయం కార‌ణంగా కీల‌క‌మైన సెమీఫైన‌ల్‌కు దూర‌మ‌య్యాడు. అఫ్గానిస్తాన్‌తో మ్యాచ్‌లో షార్ట్ తొడ‌కండరాలు ప‌ట్టేశాయి.దీంతో అత‌డికి విశ్రాంతి అవ‌సర‌మ‌ని క్రికెట్ ఆస్ట్రేలియా వైద్య బృందం సూచించారు. తద్వారా అతడు సెమీఫైనల్‌కు దూరంగా ఉన్నాడు. ఈ క్రమంలో అతడి స్ధానాన్ని యువ ఆల్‌రౌండర్ కూపర్ కొన్నోలీతో క్రికెట్ ఆస్ట్రేలియా భర్తీ చేసింది. ట్రావెలింగ్ రిజర్వ్‌గా ఉన్న కొన్నోలీ.. ఇప్పుడు ప్రధాన జట్టులోకి వచ్చాడు. కొన్నోలీకి అద్భుతమైన ఆల్‌రౌండ్ స్కిల్స్‌​ ఉన్నాయి. ఇటీవలే జరిగిన బిగ్‌బాష్ లీగ్-2025 సీజన్‌లో కూపర్‌​ దుమ్ములేపాడు. అదేవిధంగా ఈ యువ ఆల్‌రౌండర్ ఆస్ట్రేలియా తరపున ఇప్పటివరకు ఆరు అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. అందులో మూడు వన్డేలు ఉన్నాయి. అయితే తుది జట్టులో మాత్రం టాప్-ఆర్డర్ బ్యాటర్ జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్ లేదా కొన్నోలీకి చోటు దక్కే అవకాశముంది. అదనపు స్పిన్‌​ అప్షన్‌ కావాలని ఆసీస్ మెనెజ్‌మెంట్‌ భావిస్తే కొన్నోలీకే ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కడం ఖాయం.ఇక సెమీస్ పోరు కోసం ఇప్పటికే దుబాయ్‌కు చేరుకున్న కంగారులు నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ మ్యాచ్‌లో గెలిచి ఫైనల్‌కు ఆర్హత సాధించాలని స్మిత్ సేన భావిస్తోంది. మరోవైపు భారత్ మాత్రం వన్డే ప్రపంచకప్‌​-2023 ఫైనల్ ఓటమికి బదులు తీర్చుకోవాలని కసితో ఉంది.సెమీస్‌కు ఆసీస్‌ జట్టు: స్టీవ్ స్మిత్ (కెప్టెన్‌), సీన్ అబాట్, అలెక్స్ కారీ, కూపర్ కొన్నోలీ, బెన్ ద్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, ఆరోన్ హార్డీ, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, స్పెన్సర్ జాన్సన్, మార్నస్ లబుషేన్‌, గ్లెన్ మాక్స్‌వెల్, తన్వీర్ సంగాచదవండి: Champions Trophy: వరుణ్‌ ‘మిస్టరీ’ దెబ్బ

Rasi Phalalu: Daily Horoscope On 03-03-2025 In Telugu5
ఈ రాశి వారికి వ్యాపారాలు వృద్ధి చెందుతాయి.. ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి

గ్రహం అనుగ్రహం: శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, తిథి: శు.చవితి రా.10.31 వరకు, తదుపరి పంచమి, నక్షత్రం: రేవతి ఉ.10.44 వరకు, తదుపరి అశ్వని, వర్జ్యం: తె.5.20 నుండి 6.47 వరకు (తెల్లవారితే మంగళవారం), దుర్ముహూర్తం: ప.12.34 నుండి 1.21 వరకు, తదుపరి ప.2.54 నుండి 3.42 వరకు, అమృతఘడియలు: ఉ.8.24 నుండి 9.57 వరకు; రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు, యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు, సూర్యోదయం: 6.22, సూర్యాస్తమయం: 6.02. మేషం... రుణభారాలు పెరుగుతాయి. ఆత్మీయులతో విభేదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. దూరప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. ఆస్తి వివాదాలు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు.వృషభం... సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆశయాలు నెరవేరతాయి. ఆర్థిక ప్రగతి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. వస్తులాభాలు. వ్యాపారాలలో మరింత ప్రగతి. ఉద్యోగాలలో నూతనోత్సాహం.మిథునం... కొన్ని వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. భూములు, వాహనాలు కొంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వాహనయోగం. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు.కర్కాటకం... మిత్రులతో మాటపట్టింపులు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. పనుల్లో ప్రతిబ«ంధకాలు. దూరప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలలో చికాకులు.సింహం.. వ్యయప్రయాసలు. బంధుమిత్రులతో వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబ, ఆరోగ్యసమస్యలు. ఆలయాలు సందర్శిస్తారు. ధనవ్యయం. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో ఊహించని మార్పులు.కన్య... కొత్త వ్యక్తుల పరిచయం. శుభకార్యాలకు హాజరవుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వాహనయోగం. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.తుల.. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. వస్తులాభాలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. విద్యార్థులకు నూతన విద్యావకాశాలు. శుభవార్తలు. వ్యాపారాలలో మరింత ప్రగతి. ఉద్యోగాలలో ఎదురుండదు.వృశ్చికం... కొత్త రుణయత్నాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ప్రయాణాలలో మార్పులు. పనులు వాయిదా వేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో కొంత గందగోళం. ఉద్యోగాలలో పనిఒత్తిడులు.ధనుస్సు... ఆర్థిక విషయాలు నిరాశ పరుస్తాయి. శ్రమాధిక్యం. పనులలో ప్రతిష్ఠంభన. ప్రయాణాలలో ఆటంకాలు. అనారోగ్యం. దైవచింతన. వ్యాపారాలు ముందుకు సాగవు. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు.మకరం... శుభకార్యాలలో పాల్గొంటారు. పాతమిత్రుల కలయిక. విందువినోదాలు. పనులు చకచకా సాగుతాయి. భూములు, వాహనాలు కొంటారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఆటుపోట్లు తొలగుతాయి.కుంభం... మిత్రులతో వివాదాలు. ధనవ్యయం. పనులు వాయిదా వేస్తారు. శ్రమ తప్పదు. దూరప్రయాణాలు. ఆలయ దర్శనాలు. ఆస్తి వివాదాలు. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాలలో నిదానం అవసరం.మీనం... కీలక నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం. ఆప్తులతో సఖ్యత. విందువినోదాలు. భూవివాదాలు పరిష్కారం. వాహనయోగం. మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలు మరింత లాభిస్తాయి. ఉద్యోగాలలో ఉన్నతస్థితి.

UK prime minister Keir Starmer balancing action, pulled between the US and Europe6
అమెరికా..  ఉక్రెయిన్‌ మధ్య సయోధ్య ఎలా?

లండన్‌: అధినేతలు డొనాల్డ్‌ ట్రంప్, జెలెన్‌స్కీ వాగ్యుద్ధంతో అమెరికా, ఉక్రెయిన్‌ సంబంధాలు అకస్మాత్తుగా దెబ్బతిన్న వైనం యూరప్‌ను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. వాటిని తిరిగి చక్కదిద్దే మార్గాల కోసం అవి మల్లగుల్లాలు పడుతున్నాయి. ఈ అంశంపై చర్చించేందుకు యూరప్‌ దేశాధినేతలు ఆదివారం లండన్లో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఇందుకు బ్రిటన్‌ ప్రధాని కియర్‌ స్టార్మర్‌ చొరవ తీసుకున్నారు. ‘సురక్షిత యూరప్‌ కోసం’ పేరిట జరిగిన ఈ శిఖరాగ్ర సమావేశంలో చర్చంతా అమెరికా, ఉక్రెయిన్‌ సంబంధాల చుట్టే తిరిగినట్టు సమాచారం. ఉక్రెయిన్‌కు మరిన్ని నిధులు అందించాలని నేతలు నిర్ణయానికి వచ్చారు. అవసరమైతే యూరప్‌ దేశాలన్నీ తమ సైన్యాన్ని కూడా ఉక్రెయిన్‌కు పంపేందుకు సిద్ధంగా ఉండాలని అభిప్రాయపడ్డారు. ఈ కీలక భేటీలో జెలెన్‌స్కీతో పాటు కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో కూడా పాల్గొన్నారు. తరానికోసారే! యూరప్‌ భద్రత కోసం ఖండంలోని దేశాలన్నీ ఒక్కతాటిపైకి రావాల్సిన అవసరముందని స్టార్మర్‌ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఇలాంటి అవసరం, అవకాశం తరానికి ఒక్కసారి మాత్రమే వస్తాయని అన్నారు. ‘‘రష్యా బారి నుంచి ఉక్రెయిన్‌కు శాశ్వత రక్షణ కల్పించాలి. యూరప్‌లోని ప్రతి దేశం భద్రతకూ ఇది చాలా కీలకం’’ అని చెప్పారు. ‘‘ఇందుకు మూడంచెల మార్గముంది. ఉక్రెయిన్‌ను సాయుధంగా పటిష్టపరచాలి. దాని భద్రతకు యూరప్‌ మొత్తం పూచీగా ఉండాలి. ఇక ఉక్రెయిన్‌తో కుదిరే ఒప్పందాలను రష్యా అధ్యక్షుడు పుతిన్‌ మళ్లీ తుంగలో తొక్కకుండా చూసే బాధ్యతను అమెరికా తీసుకోవాలి’’ అని ప్రతిపాదించారు. అంతకుముందు ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మాక్రాన్‌తో స్టార్మర్‌ విడిగా భేటీ అయ్యారు. అందులో జెలెన్‌స్కీ కూడా పాల్గొన్నారు. రష్యా, ఉక్రెయిన్‌ కాల్పుల విరమణకు నిర్దిష్ట కార్యారణ ప్రణాళిక రూపొందించి అమెరికా ముందుంచాలని వారు నిర్ణయానికి వచ్చారు. ఈ ప్రయత్నంలో మిగతా యూరప్‌ దేశాలన్నింటినీ కలుపుకుని వెళ్తామని చెప్పారు. అంతకుముందు ఉక్రెయిన్‌కు 3.1 బిలియన్‌ డాలర్ల రుణం అందించేందుకు బ్రిటన్‌ అంగీకరించింది.ట్రంప్‌తోనూ మాట్లాడా: స్టార్మర్‌ శిఖరాగ్రం అనంతరం నేతలు మీడియాతో మాట్లాడారు. వీలైనంత త్వర లో మరోసారి సమావేశమై అన్ని అంశాలపైనా లోతుగా చర్చించుకోవాలని నిర్ణయించినట్టు స్టార్మర్‌ వెల్లడించారు. అమెరికా నమ్మదగ్గ భాగస్వామి కాదన్న విమర్శలను తోసిపుచ్చారు. రష్యా, ఉక్రెయిన్‌ మధ్య శాంతి ఒప్పందం యూరప్‌ భద్రతకు చాలా కీలకమని పునరుద్ఘాటించారు. ఈ విషయమై ట్రంప్‌తో శనివారం రాత్రి ఫోన్లో సుదీర్ఘంగా మాట్లాడినట్టు వివరించారు. ‘‘యూరప్‌ ఒకరకంగా నాలుగు రోడ్ల కూడలిలో నిలిచింది. కనుక ప్రతి అడుగూ ఆచితూచి వేయాల్సిన సమయమిది. పరిస్థితులన్నీ పూర్తిగా అదుపు తప్పేందుకు ఒకే ఒక్క తప్పుడు నిర్ణయం చాలు’’ అని హెచ్చరించారు.

Political Suspense Over BJP Chief Post7
బీజేపీ అధ్యక్షుడి ఎంపికపై కసరత్తు.. రేసులో తెలంగాణ నేత?

సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ కొత్త అధ్యక్షుని ఎంపికపై అధిష్టానం చురుగ్గా కసరత్తు చేస్తోంది. రాబోయే ఐదేళ్లలో పలు రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలతోపాటు 2029 సార్వత్రిక ఎన్నికల్లో పార్టీని సమర్థంగా నడపగలిగే నేత కోసం బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ పెద్దలు కొన్ని నెలలుగా మంతనాల్లో మునిగి తేలారు. సంఘ్, పార్టీ మధ్య సమన్వయం చేసుకోగల సత్తా ఉన్న నాయకుడికే పగ్గాలు అప్పగించే అవకాశాలున్నాయి. ఇప్పటి కే ఒక జాబితా సిద్ధమైందని చెబుతున్నా రు. అందులోంచి ఒకరిని ఏకగ్రీవంగా ఎంపిక చేయనున్నారు. మార్చి 20 లోపు కొత్త అధ్యక్షుని ప్రకటన ఉంటుందని బీజేపీ వర్గాలు వెల్లడించాయి.2019లో అమిత్‌ షా కేంద్ర హోం మంత్రి అయ్యాక వెంటనే జగత్‌ ప్రకాశ్‌ నడ్డా తొలుత బీజేపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ అయ్యారు. ఆర్నెల్ల తర్వాత అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన పదవీకాలం 2023 జనవరిలో ముగియాల్సి ఉన్నా 2024 లోక్‌సభ ఎన్నికల దాకా పొడిగించారు. ఆ తర్వాత నడ్డా కేంద్ర కేబినెట్‌ మంత్రి అయినా మహారాష్ట్ర సహా పలు అసెంబ్లీ ఎన్నికల వల్ల కొత్త అధ్యక్షని ఎంపిక వాయిదా పడింది. నూతన అధ్యక్షుని ఎంపికపై రెండు రకాల ప్రతిపాదనలున్నట్టు చెబుతున్నారు.పంజాబ్, పశ్చిమ బెంగాల్, బిహార్, ఉత్తరప్రదేశ్‌ వంటి ముఖ్యమైన రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలున్నందున అక్కడ పార్టీని నడపడంలో సమర్థుడై ఉండటంతో పాటు ఆర్‌ఎస్‌ఎస్‌ నేప థ్యం కలిగి ఉన్న నేతను నియమించాలనేది ఒక ప్రతిపాదన. దక్షిణాదిలో చొచ్చుకెళ్లేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు పెద్దగా ఫలించడం లేదు. వచ్చే మూడేళ్లలో తమిళనాడు, కేరళ, కర్ణాటక వంటి దక్షిణాది రాష్ట్రాల్లో ఎన్నికలున్నాయి. కనుక దక్షిణాది నేతను అధ్యక్షున్ని చేస్తే పార్టీకి మేలన్నది.మరో ప్రతిపాదన..బీజేపీ వర్గాల సమాచారం ప్రకారం అధ్యక్ష రేసులో ఉత్తరాది నుంచి కేంద్ర మంత్రులు శివరాజ్‌ సింగ్‌ చౌహాన్, భూపేంద్ర యాదవ్, మనోహర్‌ లాల్‌ ఖట్టర్, ధర్మేంద్ర ప్రధాన్‌ పేర్లు గట్టిగా విన్పిస్తున్నాయి. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్‌ బన్సల్‌ పేరు కూడా ప్రస్తావనలో ఉంది. దక్షిణాది నుంచి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్‌ సంతోష్‌, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి తదితర పేర్లు షికారు చేస్తున్నాయి.

Citibank Mistakenly Sends Lakh Crore to Customer8
కస్టమర్‌ ఖాతాలోకి లక్షల కోట్లు!!

న్యూఢిల్లీ: బ్యాంకింగ్‌ సిస్టమ్స్‌లో లోపాల వల్ల కస్టమర్ల ఖాతాల్లోకి వేరే వాళ్ల డబ్బులొచ్చి పడుతుండటం, బ్యాంకులు నాలిక్కర్చుకుని మళ్లీ వెనక్కి తీసుకునే ఉదంతాలు మనకు అప్పుడప్పుడు కనిపిస్తూనే ఉంటాయి. సాధారణంగా ఇది వేలు, లక్షల రూపాయల స్థాయిలో ఉంటుంది. అమెరికన్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకింగ్‌ దిగ్గజం సిటీ గ్రూప్‌లోనూ అలాంటిదే జరిగింది. కాకపోతే, ఒకటి రెండూ లక్షలు కాదు ఏకంగా లక్షల కోట్ల డాలర్ల స్థాయిలో! సంబంధిత వర్గాల కథనం ప్రకారం.. 2023 ఏప్రిల్‌లో సిటీ గ్రూప్‌ ఉద్యోగి ఓ కస్టమర్‌ ఖాతాలోకి 280 డాలర్లు క్రెడిట్‌ చేయబోయి.. అక్షరాలా 81 లక్షల కోట్ల డాలర్లను క్రెడిట్‌ చేశారు. లావాదేవీలను పర్యవేక్షించాల్సిన మరో ఉద్యోగి కూడా దాన్ని క్లియర్‌ చేశారు. ఈ దెబ్బతో సిటీగ్రూప్‌ ఖజానా ఖాళీ అయిపోయింది. దాదాపు గంటన్నర తర్వాతెప్పుడో జరిగిన పొరపాటును ఇంకో ఉద్యోగి గుర్తించడంతో, ఇది బైటపడింది. చివరికి ఆ లావాదేవీని రివర్స్‌ చేసి, ఆ మొత్తాన్ని వెనక్కి తీసుకుని హమ్మయ్య అనుకున్నారు.నిజానికి సిటీ గ్రూప్‌ గత ఏడాది కాలంగా సుమారు 100 కోట్ల డాలర్ల మొత్తానికి సంబంధించి ఇలాంటి పది పొరపాటు లావాదేవీలను తృటిలో తప్పించుకుంది. వాస్తవానికి ఇలాంటి పొరపాట్ల సంఖ్య పదమూడు నుంచి పదికి తగ్గిందట. ఇలాంటి పొరపాట్లను నివారించడంలో ఆశించినంత పురోగతి సాధించనందుకు గాను సిటీగ్రూప్‌కు నియంత్రణ సంస్థ 13.6 కోట్ల డాలర్ల జరిమానా విధించగా, రిస్కులు.. డేటా వైఫల్యాలకు గాను 40 కోట్ల డాలర్ల పెనాల్టీ కూడా పడింది.

Oscars 2025 Title Nominations List9
ఆస్కార్‌ రేసులో ఉన్నదెవరు.. భారత్‌కు నిరాశ

97వ ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవం లాస్‌ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో ఘనంగా ప్రారంభమైంది. కాగా ఈ అవార్డులకు సంబంధించి రేసులో చాలామంది స్టార్స్‌ ఉన్నారు. ఉత్తమ చిత్రం విభాగంలో పది సినిమాలు పోటీ పడుతున్నాయి. ఉత్తమ దర్శకుడు,ఉత్తమ నటుడు, ఉత్తమ నటి రేసులో ఎవరెవరు ఉన్నారో చూద్దాం. ఈ వేడకలకు వ్యాఖ్యాతలుగా అమెరికన్‌ నటుడు బోవెన్‌ యాంగ్, నటి రాచెల్‌ సెన్నాట్‌లు వ్యవహరించారు.భారతీయ సినిమాకి నిరాశఆస్కార్‌ అవార్డ్స్‌ రిమైండర్‌ లిస్ట్‌లో నిలిచిన భారతీయ చిత్రాలు ‘కంగువ, ఆడు జీవితం (‘ది గోట్‌లైఫ్‌), సంతోష్, స్వతంత్రవీర్‌ సవార్కర్, ఆల్‌ ఉయ్‌ ఇమాజిన్‌ యాజ్‌ ఏ లైట్, గర్ల్స్‌ విల్‌ బీ గర్ల్స్, పుతల్‌’ ఆస్కార్‌ నామినేషన్‌ను దక్కించుకోలేకపోయాయి. అలాగే ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో నామినేషన్‌ కోసం ఈ ఏడాది ఫిల్మ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా పంపిన హిందీ చిత్రం ‘లాపతా లేడీస్‌’ ఆస్కార్‌ షార్ట్‌ లిస్ట్‌లోనూ చోటు దక్కించుకోలేకపోయిన విషయం తెలిసిందే. ఇలా ఈసారి భారతీయ సినిమాకి నిరాశ ఎదురైంది. కానీ, 97వ ఆస్కార్‌ అవార్డ్‌ల్లో బెస్ట్‌ లైవ్‌ యాక్షన్‌ షార్ట్‌ ఫిల్మ్‌ కేటగిరిలో ‘అనూజ’(Anuja) మాత్రమే భారత్‌ నుంచి రేసులో ఉంది. ఉత్తమ చిత్రం: అనోరా, ది బ్రూటలిస్ట్, ఎ కంప్లీట్‌ అన్ నోన్ , కాన్ క్లేవ్, డ్యూన్ : పార్ట్‌ 2, ఎమిలియా పెరెజ్, ఐయామ్‌ స్టిల్‌ హియర్, నికెల్‌ బాయ్స్, ది సబ్‌స్టాన్స్, విక్డ్‌ఉత్తమ దర్శకుడు: సీన్ బేకర్‌ (అనోరా), బ్రాడీ కార్బెట్‌ (ది బ్రూటలిస్ట్‌), జేమ్స్‌ మ్యాన్ గోల్డ్‌ (ది కంప్లీట్‌ అన్ నోన్ ), జాక్వెస్‌ ఆడియార్డ్‌ (ఎమిలియా పెరెజ్‌), కోరలీ ఫార్గేట్‌ (ది సబ్‌స్టాన్స్)ఉత్తమ నటుడు: అడ్రియాన్ బ్రాడీ (ది బ్రూటలిస్ట్‌), తిమోతీ చాలమెట్‌ (ది కంప్లీట్‌ అన్ నోన్ ), కోల్‌మెన్ డొమినింగో (సింగ్‌సింగ్‌), రే ఫియన్నెస్‌ (కాన్ క్లేవ్‌), సెబస్టియన్ స్టాన్ (ది అప్రెంటిస్‌)ఉత్తమ నటి: సింథియా ఎరివో (విక్డ్‌), కార్లా సోఫియా గాస్కన్ (ఎమిలియా పెరెజ్‌), మికే మాడిసన్ (అనోరా), డెమి మూర్‌ (ది సబ్‌స్టాన్స్), ఫెర్నాండా టోర్రెస్‌ (ఐ యామ్‌ స్టిల్‌ హియర్‌)ఉత్తమ సహాయ నటుడు: యురా బోరిసోవ్‌ (అనోరా), కిరెన్ కల్కిన్ (ది రియల్‌ పెయిన్ ), ఎడ్వర్డ్‌ నార్తన్ (ది కంప్లీట్‌ అన్ నోన్ ), గాయ్‌ పియర్స్‌ (ది బ్రూటలిస్ట్‌), జెరీమీ స్ట్రాంగ్‌ (ది అప్రెంటిస్‌)ఉత్తమ సహాయ నటి: మోనికా బార్బరో (ది కంప్లీట్‌ అన్ నోన్ ), అరియానా గ్రాండే (విక్డ్‌), ఫెసిలిటీ జోన్స్ (ది బ్రూటలిస్ట్‌), ఇసబెల్లా రోస్సెల్లిని (కాన్ క్లేవ్‌), జోయా సాల్దానా (ఎమిలియా పెరెజ్‌).

Dalit communities fires on Chandrababu Govt for Suspension of PV Sunil Kumar10
కక్ష సాధింపులో బరితెగింపు

సాక్షి, అమరావతి: దళిత అధికారులపై చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు కొనసాగిస్తోంది. ఇప్పటికే సీఐడీ పూర్వపు అదనపు డీజీ సంజయ్‌ని కుట్ర పూరితంగా సస్పెండ్‌ చేసిన కూటమి ప్రభుత్వం.. పలువురు దళిత ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారులకు పోస్టింగులు ఇవ్వకుండా ఉద్దేశ పూర్వకంగా అవమానిస్తోంది. అయినప్పటికీ చంద్రబాబు ప్రభుత్వ కక్ష చల్లారినట్టు లేదు. అందుకే డీజీ ర్యాంకులో ఉన్న సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి పీవీ సునీల్‌ కుమార్‌పై తాజాగా కక్ష సాధింపు చర్యలకు తెగబడింది. కనీసం నోటీసు కూడా జారీ చేయకుండా ఆయన్ను ఏకపక్షంగా సస్పెండ్‌ చేయడం విస్మయ పరుస్తోంది. అనుమతి లేకుండా విదేశీ పర్యటనలు చేశారనే అభియోగాలపై ఆయన్ను సస్పెండ్‌ చేస్తున్నట్టు ప్రభుత్వం ఆదివారం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. కానీ పీవీ సునీల్‌ కుమార్‌ ప్రభుత్వ ముందస్తు అనుమతితోనే విదేశీ పర్యటన చేశారు. అయినా పీవీ సునీల్‌ కుమార్‌ 2019–2024 మధ్య పలుసార్లు ప్రభుత్వ అనుమతి లేకుండా అమెరికా తదితర దేశాల్లో పర్యటించారని ప్రభుత్వం ఆరోపించింది. కీలక స్థానాల్లో ఉన్న ఐపీఎస్‌ అధికారి అనధికారిక విదేశీ పర్యటనలతో సున్నితమైన సమాచారం లీక్‌ అయ్యే అవకాశం ఉందనే సాకు చూపుతూ క్రమశిక్షణా చర్యల్లో భాగంగా సస్పెండ్‌ చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రభుత్వ అనుమతితోనే విదేశీ పర్యటనలు పీవీ సునీల్‌ కుమార్‌ను సస్పెండ్‌ చేస్తూ ప్రభుత్వం ­ఉత్తర్వుల్లో వెల్లడించిన కారణాలు పూర్తిగా అవాస్తవం. ఎందుకంటే 2019–2024 మధ్య కాలంలో ఆయన విదేశీ పర్యటనలకు ముందుగా ప్రభుత్వ అనుమతి తీసుకున్నారు. ఆ పర్యటనలకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వ్యక్తిగత పర్యటనలు కాబట్టి పీవీ సునీల్‌ కుమార్‌ తన సొంత ఖర్చుతో విదేశాలకు వెళ్లాలని కూడా పేర్కొంది. అందుకు సమ్మతించి, పూర్తిగా తన సొంత ఖర్చులతో, వ్యక్తిగత హోదాలో ఆయన అమెరికాలో ఉంటున్న కుమారుడిని చూడటానికి వెళ్లారు. అయినా సస్పెండ్‌ చేయడం కేవలం చంద్రబాబు ప్రభుత్వ కుట్రేనన్నది స్పష్టమవుతోంది. నిబంధనల ప్రకారం నోటీసు జారీ చేసి ఆయన వివరణ కోరాలి. ఆయన ఇచ్చే వివరణ సంతృప్తికరంగా లేకపోతే అప్పుడు తదుపరి చర్యలు తీసుకోవాలి. కానీ కూటమి ప్రభుత్వం ఈ నిబంధనలను ఏమాత్రం పట్టించుకోలేదు. ఎందుకంటే పీవీ సునీల్‌ కుమార్‌కు నోటీసులు జారీ చేస్తే.. తాను ప్రభుత్వ అనుమతితోనే, సొంత ఖర్చులతో విదేశాల్లో పర్యటించానని ఆయన ఆధారాలు సమరి్పస్తూ వివరణ ఇస్తారు. అందుకే ఆయనకు ఆ అవకాశం ఇవ్వకూడదనే ప్రభుత్వం కనీసం నోటీసు జారీ చేయకుండా ఏకపక్షంగా సస్పెండ్‌ చేసిందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఇది కూటమి ప్రభుత్వం కుట్ర దళిత అధికారి పీవీ సునీల్‌ కుమార్‌ను టీడీపీ కూటమి ప్రభుత్వం కుట్ర పూరితంగా సస్పెండ్‌ చేసిందని దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వ తీరును నిరసిస్తూ అంబేడ్కర్‌ ఇండియా మిషన్‌ (ఏఐఎం) ప్రతినిధులు, దళిత సంఘాల నేతలు శ్రీకాకుళంలోని బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహం వద్ద ఆదివారం ధర్నా నిర్వహించారు. అస్మదీయులైతే అనుమతి లేకున్నా ఏ దేశానికైనా వెళ్లొచ్చట! పలువురు ఐఏఎస్, ఐపీఎస్, ఇతర ఉన్నతాధికా­రులు ముందస్తు అనుమతి లేకుండానే విదేశాల్లో పర్యటిస్తున్నారు. వారు తమ విదేశీ పర్యటనల ఫొటోలను సోషల్‌ మీడియాలో కూడా అప్‌లోడ్‌ చేస్తున్నారు. అయినా ప్రభుత్వం వారిపై ఎలాంటి క్రమశిక్షణా చర్యలు తీసుకోవడం లేదు. పైగా ఆ ఉన్నతాధికారులు స్వదేశానికి వచ్చిన కొంత కాలం తర్వాత వారి విదేశీ పర్యటనను ర్యాటిఫై చేస్తూ ప్రభు­త్వం ఉత్తర్వులు జారీ చేస్తుండటం గమనా­ర్హం. సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి భాస్కర్‌ భూషణ్‌ 2018 మార్చిలో టీడీపీ ప్రభుత్వ హయాంలో విదేశాల్లో పర్యటించారు. ఆయన స్వదేశానికి వచ్చిన ఏడాది తర్వాత అంటే 2019 మార్చి 28న అప్పటి టీడీపీ ప్రభుత్వం ఆయన విదేశీ పర్యటనను ర్యాటిఫై చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అటువంటి చరిత్ర ఉన్న చంద్రబాబు ప్రభుత్వం.. ప్రస్తుతం ముందస్తు అనుమతి తీసుకుని మరీ విదేశాల్లో పర్యటించిన ఐపీఎస్‌ అధికారి పీవీ సునీల్‌ కుమార్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం విస్మయ పరుస్తోందని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

NRI View all
title
వలస కార్మికుల మృత్యు ఘోష

మోర్తాడ్‌ (బాల్కొండ): జగిత్యాల జిల్లా మల్లాపూర్‌ మండలం రేగుంటకు చెందిన కర్న గణేశ్‌ (55) రెండ్రోజుల కిందట సౌదీ అరేబియాలో

title
వీసా గోల్డెన్‌ చాన్సేనా?

గోల్డ్‌ కార్డ్‌ వీసా.. ప్రపంచవ్యాప్తంగా కొత్త చర్చకు దారితీసిన టాపిక్‌ ఇది.

title
తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) ఆధ్వర్యంలో శివాలయాల సందర్శన యాత్ర

తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) వారు గత మూడేళ్లుగా నిర్వహిస్తున్న మహా శివరాత్రి శివాలయాల సందర్శన యాత్రను  ఈ మహా శ

title
అమెరికా నుంచి భారత్‌కి అందుకే వచ్చేశా! సీఈవో హార్ట్‌ టచింగ్‌ రీజన్‌

మెరుగైన అవకాశాలు, ఆర్థిక భద్రత కోసం చాలామంది భారతీయులు విదేశాల బాటపడుతుంటార

title
USA: ‘కోమా’లో భారత విద్యార్థి.. ఎమర్జెన్సీ వీసాకు లైన్‌ క్లియర్‌

వాషింగ్టన్‌:  ఫిబ్రవ

Advertisement

వీడియోలు

Advertisement