Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today

Top Stories

ప్రధాన వార్తలు

Air India huge Losses Due To Pak Airspace Ban1
Air India: పాక్‌ గగనతలంపై ఆంక్షలు.. ఎయిరిండియాకు వేల కోట్ల నష్టం

ఢిల్లీ: కశ్మీర్‌లోని పహల్గాం భూతల స్వర్గం.. ఆ ప్రదేశంలో పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన దాడితో భారత్‌-పాకిస్తాన్‌ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ తరుణంలో పాకిస్తాన్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో భారత్‌లోని ప్రముఖ ఏవియేషన్‌ దిగ్గజం ఎయిరిండియాకు వేలకోట్ల నష్టం వాటిల్లింది.పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాక్‌పై భారత్‌ కఠిన చర్యలకు ఉపక్రమించింది. దీంతో పాక్‌ సైతం భారత్‌పై పలు ఆంక్షలు విధించింది. పాక్‌ గగన తలంపై భారత విమానాల రాకపోకలపై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది.ఆ నిర్ణయంతో ఎయిరిండియా సుమారు 600 మిలియన్‌ డాలర్ల నష్టం వాటిల్లినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. పాక్‌ గగనతలంపై భారత విమానాల రాకపోకలపై నిషేదం కారణంగా విమానాల దారి మళ్లింపు, పెరిగిన ప్రయాణ దూరం, అదనపు ఇంధనం ఖర్చు చేయాల్సి వస్తుంది. ఫలితంగా ప్రతీ ఏడాది తమ సంస్థకు 591 మిలియన్‌ డాలర్ల నష్టం వాటిల్లే అవకాశం ఉందని అంచనా వేసింది.ఈ నష్టం నుంచి బయటపడేందుకు ప్రభుత్వం రాయితీ ఇవ్వాలని కోరుతూ విమానయాన శాఖకు ఎయిరిండియా యాజమాన్యం లేఖ రాసినట్లు సమాచారం. గగనం తలంపై పాక్‌ తీసుకున్న నిర్ణయంతో ఒక్క ఎయిరిండియా మాత్రమే కాదని టాటా గ్రూప్‌కు చెందిన ఇతర విమానాల సర్వీసులపై ప్రభావం పడనున్నట్లు ఆ లేఖలో పేర్కొంది.ఉదాహరణకు ఇండిగో గురువారం న్యూఢిల్లీ-బాకు (అజర్‌బైజాన్‌లో) విమానం ఐదు గంటల 43 నిమిషాలు ప్రయాణించింది. పాక్‌ గగన తలం నుంచి కాకుండా దారి మళ్లించిన కారణంగా 38 నిమిషాలు ఎక్కువ సమయం పట్టింది. ఆ సమయానికి అదనంగా ఇంధనం వెచ్చించాల్సి ఉంటుంది. ప్రయాణ సమయంలో ప్రయాణికులకు అందించే ఇతర సర్వీసుల్లో సైతం భారీ మొత్తంలో ఖర్చు చేయాల్సి ఉంటుంది.అయితే, మిగితా విమానయాన సంస్థలతో పోలిస్తే ఎయిరిండియా పలు ప్రపంచ దేశాలకు విమానాల రాకపోకలన్నీ పాకిస్తాన్‌ గగన తలం నుంచే నిర్వహిస్తుంది. పాక్‌ తాజా నిర్ణయం ఎయిరిండియాపై కాస్త ప్రతికూల ప్రభావం పడనుంది. ఉదాహరణకు, ఢిల్లీ-మిడిల్ ఈస్ట్ విమానాలు ఇప్పుడు కనీసం ఒక గంట అదనంగా ప్రయాణించవలసి వస్తుంది, దీనికి ఎక్కువ ఇంధనం అవసరం అవుతుంది.ఎయిరిండియా దాని బడ్జెట్ సర్వీస్, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, ఇండిగోలు గత నెలలో పదిహేను రోజుల్లో న్యూఢిల్లీ నుండి యూరప్, మిడిల్ ఈస్ట్, ఉత్తర అమెరికాలోని గమ్యస్థానాలకు 1,200 విమానాలు బయలుదేరాయని అంచనా.

Veteran Congress leader Girija Vyas dies at 792
హారతి ఇస్తుండగా మంటలు అంటుకుని.. కేంద్ర మాజీ మంత్రి గిరిజా వ్యాస్‌ మృతి

జైపూర్‌: కేంద్ర మాజీ మంత్రి గిరిజా వ్యాస్‌ కన్నుమూశారు. ఈ ఏడాది మార్చి నెలలో తన ఇంటి పూజగదిలో హారతి ఇస్తుండగా అగ్ని ప్రమాదానికి గిరిజా వ్యాస్‌ చికిత్స పొందుతూ మరణించారు. The news of the demise of former Union Minister, former Rajasthan Congress President, and senior Congress leader Dr. Girija Vyas ji is deeply saddening.A distinguished intellectual, powerful orator, and capable administrator, she served the nation and the Congress Party with… pic.twitter.com/2fJN88nva7— B M Sandeep (@BMSandeepAICC) May 2, 2025మర్చి నెలలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మాజీ కేంద్రమంత్రి గిరిజా వ్యాస్ (Girija Vyas) అగ్ని ప్రమాదంలో పడ్డారు. రాజస్థాన్‌ రాష్ట్రం ఉదయపూర్‌లోని తన నివాసంలో పూజ చేసే సమయంలో హారతి (harathi) ఇచ్చే సమయంలో ఆమెకు మంటలు అంటుకున్నాయి. దీంతో అప్రమత్తమైన కుటుంబ సభ్యులు అత్యవసర చికిత్స నిమిత్తం ఉదయపూర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పలు వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు.. మెరుగైన వైద్యం కోసం ఆమెను 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న అహ్మదాబాద్‌కు తరలించాలని సూచించారు. ఇంట్లో జరిగిన అగ్ని ప్రమాదంపై గిరిజా వ్యాస్‌ సోదరుడు గోపాల్‌ శర్మ స్పందించారు. గిరిజా వ్యాస్‌ ఇంట్లో హారతి ఇచ్చే సమయంలో ప్రమాదవ శాత్తూ కింద నుంచి మంటలు ఆమె దుప్పటాకు మంటలు అంటుకున్నాయి. వెంటనే ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. తాజాగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గిరిజా వ్యాస్‌ కన్నుమూశారు. ఆమె మరణంపై పలువురు ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తున్నారు. 👉ప్రముఖ కాంగ్రెస్ నేత గిరిజా వ్యాస్ గతంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో కీలక పదవులు నిర్వహించారు.1985 నుండి 1990 వరకు ఎమ్మెల్యేగా, రాజస్థాన్ పర్యాటక మంత్రిగా పనిచేశారు1991లో తొలిసారిగా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో విజయం సాధించారు. 1996, 1999లో ఉదయపూర్ లోక్ సభ నియోజకవర్గం నుంచి,2009లో చిత్తోరగఘ్ నుండి లోక్ సభ సభ్యురాలిగా పనిచేశారుకేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా, అలాగే నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ (NCW) చైర్ పర్సన్‌గా సేవలందించారు.

Heavy Rain, Dust Storm In Delhi NCR3
ఢిల్లీలో వర్ష బీభత్సం.. తల్లి, ముగ్గురు పిల్లలు మృతి

ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో విషాదం చోటు చేసుకుంది. శుక్రవారం సృష్టించిన వర్షం బీభత్సంలో కుటుంబంలో నలుగురు మృతి చెందారు. వర్ష కారణంగా ద్వారాకాలో ఓ ఇంటిపై చెల్లి కూలింది. ఈ దుర్ఘటనలో తల్లి, ఆమె ముగ్గురు పిల్లలు మరణించారు. శుక్రవారం తెల్లవారు జామున ఢిల్లీ వాతావరణంలో అకస్మాత్తుగా మార్పులు చోటు చేసుకున్నాయి. దుమ్ముతో పాటు భారీ వర్షం నగరాన్ని అతలాకుతలం చేసింది. వర్షం కారణంగా జనజీవనం స్తంభించిపోయింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాతావరణ శాఖ సైతం ఢిల్లీలో రెడ్‌ జోన్‌ ప్రకటించింది. భారీ వర్షం కారణంగా ఏర్పడిన ఈదురుగాలులతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ అంతరాయం ఏర్పడింది. వర్షం దెబ్బకు విమానాల సర్వీసుల్ని రద్దు చేస్తున్నట్లు ఆయా విమానయాన సంస్థలు అధికారికంగా ప్రకటించాయి. Severe thunderstorms and rain lash Delhi and NCR.IMD forecasts heavy rainfall, thunderstorms, and gusty winds for the next two days, issuing a yellow alert for the national capital.#Rain #IMD #DelhiRains #rainfall #thunderstorms #Weather pic.twitter.com/fiZb2DPJJS— All India Radio News (@airnewsalerts) May 2, 2025 ఎయిర్‌ పోర్టుకు వెళ్లే ముందు ప్రయాణికులు తమ విమానాల రాకపోకల్ని పరిశీలించాలని ప్రముఖ విమానయాన సంస్థ ఎయిరిండియా ప్రయాణికుల్ని కోరింది. ఈ మేరకు ఎక్స్‌ వేదికగా ట్వీట్‌ చేసింది #TravelAdvisoryThunderstorms and gusty winds have affected flight operations in parts of Northern India. Some of our flights to and from Delhi are being delayed, which is likely to impact our overall flight schedule. We are doing our best to minimise disruptions.We advise our…— Air India (@airindia) May 2, 2025‘ఢిల్లీకి వెళ్లే, బయల్దేరే ఎయిరిండియా విమానాల సర్వీసుల్లో అంతరాయం ఏర్పడింది. ఢిల్లీలో దుమ్ము తుఫాను, వర్షం కారణంగా విమానాల్ని దారి మళ్లిస్తున్నాం. ఫలితంగా మొత్తం విమానాల రాకపోకలపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడనుంది. అంతరాయాలను తగ్గించడానికి మా వంతు మేం కృషి చేస్తున్నాం’ అంటూ ఎయిరిండియా ట్వీట్‌లో పేర్కొంది.

YSRCP President YS Jagan Fires On Chandrababu Govt Frauds4
కంచం లాగేశారు! : వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: ‘చంద్రబాబు రాక మునుపు ప్రతి ఇంట్లో మహిళలు, రైతన్న, చిన్న పిల్లాడికి నాలుగు వేళ్లు ఆనందంగా నోట్లోకి పోతుండేవి. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత వారి కంచాన్ని లాగేశాడు. మన ప్రభుత్వంలో అమలైన అన్ని పథకా­లను రద్దు చేశాడు. సూపర్‌ సిక్స్‌ సహా ఎన్నికల హామీలన్నీ పూర్తి మోసంగా మార్చేశాడు. ఎన్నికల ముందు మాత్రం జగన్‌ ఇచ్చినవి అన్నీ కొనసాగు­తాయి.. అంతే కాకుండా అధికంగా ఇస్తానని నమ్మ­బ­లి­కారు. చంద్రబాబు మాటలను నమ్మి ఆయన ఇచ్చిన బాండ్లను ప్రజలు ఇంట్లో పెట్టుకున్నారు. తమ ఇంటికి ఎవరైనా టీడీపీ కార్యకర్తలు వస్తే నిలదీయాలని ఎదురు చూస్తున్నారు. ఇవాళ ఏ టీడీపీ కార్యకర్త కూడా ప్రజల ఆశీస్సులు కోరే పరిస్థితి లేదు..’ అని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. ‘మనం రాక్షస రాజ్యంలో, కలియుగంలో ఉన్నామని చెప్పేందుకు ఈ రాష్ట్రంలో పాలన చూస్తే ఎవరికైనా ఇట్టే అర్థం అవుతుంది. అంతటి దారు­ణమైన, దుర్మార్గమైన పాలన చూస్తున్నాం..’ అని చంద్ర­బాబు సర్కారుపై నిప్పులు చెరిగారు. గురు­వారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాల­యంలో కాకినాడ జిల్లా పిఠాపురం మున్సిపాలిటీ, ప్రకాశం జిల్లా మార్కాపురం, శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం గాండ్లపెంట, చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీల్లో వైఎస్సార్‌సీపీకి చెందిన ప్రజా ప్రతినిధులతో వైఎస్‌ జగన్‌ సమావేశ­మ­య్యారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే..ఏ ఇంటికైనా కాలర్‌ ఎగరేసుకుని వెళ్లగలం.. మరి వాళ్లు వెళ్లగలరా?రాజకీయాలలో గెలుపోటములు సహజం. కానీ ఓడిపోయినా కూడా ప్రజల గుండెల్లో బతికే ఉన్నామా లేదా అన్నది చాలా ప్రాముఖ్యమున్న అంశం. వైఎస్సార్‌సీపీ కార్యకర్త గ్రామంలో ఏ ఇంటికైనా కాలర్‌ ఎగరేసుకుని వెళ్లగలుగుతాడు. మా పాలనలో మేం చెప్పిన ప్రతి మాట నెరవేర్చామని గర్వంగా చెప్పగలుగుతాడు. కానీ ఇవాళ చంద్ర­బాబు 12 నెలల పాలనలో ఆ పార్టీ కార్యకర్తలు ఎవరైనా ఏ ఇంటికైనా వెళ్లి వాళ్ల దీవెనలు, ఆశీర్వచనాలు పొందగలరా? ఆ పార్టీ కార్యకర్తలు చంద్రబాబు, కూటమి నేతల ఫొటోలు తీసుకుని ఏ ఇంటికి వెళ్లినా.. చిన్న పిల్లాడి దగ్గర నుంచి అందరూ ప్రశ్నిస్తారు. ఆ చిన్న పిల్లవాడు తల్లికి వందనం కింద నా రూ.15 వేలు ఏమయ్యాయని అడుగుతాడు. ఆ తర్వాత ఆ పిల్లాడి తల్లి బయటకు వచ్చి ఆడబిడ్డ నిధి కింద నా రూ.18 వేలు ఏమైందని అడుగుతుంది. ఆ తల్లుల అమ్మలు, అత్తలు బయటకు వచ్చి మాకు 50 ఏళ్లకే పెన్షన్ల ద్వారా రూ.48 వేలు ఇస్తామన్నారు కదా..! వాటి సంగతేంటని అడుగుతారు. అదే ఇంట్లో ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న యువకుడు నా రూ.36 వేల నిరు­ద్యోగ భృతి పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తాడు. అదే ఇంట్లో నుంచి రైతన్న బయటకు వచ్చి అన్నదాతా సుఖీభవ కింద నా రూ.26 వేల సంగతి ఏమిటని నిలదీస్తాడు.సూపర్‌ సిక్స్‌ గాలికి.. దారుణ వంచనచంద్రబాబు పాలనలో సూపర్‌ సిక్స్, సూపర్‌ సెవెన్‌ గాలికి ఎగిరిపోయాయి. చివరికి చిన్న చిన్న హామీ­లైన ఉచిత బస్సు లాంటివి కూడా గాలికి ఎగిరి­పో­యాయి. కడప నుంచి విశాఖపట్నం వెళ్లి వద్దామను­కున్నాం..! కర్నూలు నుంచి అమరావతికి పొద్దున పోయి సాయంత్రానికి చూసి వద్దామనుకున్నాం..! ఆ ఉచిత బస్సు ఏమైందని మహిళలు అడుగుతు­న్నారు. అన్నిటికన్నా దారుణమైన విషయం ఏమిటంటే.. చంద్రబాబు రాక మునుపు ప్రతి ఇంట్లో మహిళలు, రైతన్న, చిన్న పిల్లా­డికి నాలుగు వేళ్లు ఆనందంగా నోట్లోకి పోతుండేవి. చంద్రబాబు సీఎం అయిన తర్వాత వారి కంచాన్ని లాగే­శాడు. మన ప్రభుత్వంలో అమలైన అన్ని పథకా­లను రద్దు చేశాడు. ఆయన ఇచ్చిన హామీలన్నీ పూర్తిగా మోసంగా మార్చేశాడు. ఎన్నికల ముందు చంద్రబాబు మాటలు నమ్మి ఆయన ఇచ్చిన బాండ్లను ప్రజలు ప్రతి ఇంట్లో పెట్టుకున్నారు. ఎవరైనా టీడీపీ కార్యకర్తలు వస్తే అడగాలని చూస్తున్నారు. ఏ టీడీపీ కార్యకర్త కూడా ప్రజల ఆశీస్సులు కోరే పరిస్థితి లేదు. బాబుకు సింగిల్‌ డిజిటే..ఇంత దారుణమైన పాలన, ఇలాంటి దుర్మార్గం ఎక్కువ రోజులు నిలబడదు. దేవుడు, ప్రజలు అంతా చూస్తున్నారు. సమయం వచ్చినప్పుడు ఫుట్‌బాల్‌ను తన్నినట్లు తంతారు. ఎంతో మంచి చేసిన మనకే ఈ పరిస్థితి ఉంటే.. ఎన్నో మోసాలు చేసి, అబద్ధాలు చెప్పి, దుర్మార్గంగా పరిపాలన చేసిన ఆయన పరిస్థితి ఏమిటో ఊహించవచ్చు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు సింగిల్‌ డిజిట్‌కు రావడం ఖాయం. ఆ రోజు త్వరలోనే వస్తుంది. దానికోసం మనం అంతా గట్టిగా శ్రమించాలి.వ్యవస్థలన్నీ నిర్వీర్యం..⇒ గ్రామాల్లో ఇవాళ దారుణమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. స్కూళ్లలో నాడుృనేడు ఆగిపోయింది. గోరుముద్ద నాణ్యత లేకుండా పోయింది. ఇంగ్లిష్‌మీడియం పక్కకు పోయింది. మూడో తరగతి నుంచి అమలు చేసిన టోఫెల్‌ పీరియడ్‌ తీసేశారు. ఎనిమిదో తరగతికి వచ్చే సరికి ప్రతి పిల్లవాడికి ట్యాబులు ఇచ్చే స్కీం కూడా అటకెక్కించేశారు. మన హయాంలో ప్రభుత్వ బడులలో నో వేకెన్సీ బోర్డులు ఉన్న పరిస్థితి నుంచి.. ఇవాళ అమ్మో ప్రభుత్వ బడులకు వద్దనే దుస్థితికి తెచ్చేశారు. ప్రతి కుటుంబంలో పిల్లలు డాక్టరు, ఇంజనీర్‌ లాంటి పెద్ద చదువులు చదివితేనే ఆ కుటుంబం పేదరికం నుంచి బయటపడుతుంది. అలాంటి గొప్ప పరిస్థితులు రావాలని విద్యాదీవెన, వసతి దీవెన పేరుతో పూర్తి ఫీజులు చెల్లిస్తూ.. లాడ్జింగ్‌ బోర్డింగ్‌ ఖర్చుల కోసం వారి చేతిలో డబ్బులు పెడుతూ ప్రతి క్వార్టర్‌ ముగిసిన వెంటనే వారికి క్రమం తప్పకుండా అందించాం. ఇవాళ ఆ పిల్లలు ఫీజులు కట్టలేక చదువులు మానేస్తున్నారు. చంద్రబాబు పుణ్యమాని విద్యాదీవెన, వసతి దీవెన గాలికెగిరిపోయాయి.⇒ ఆరోగ్యశ్రీ చూస్తే.. పేదవాడు తలెత్తుకుని ఏ కార్పొరేట్‌ ఆసుపత్రికైనా వెళ్లి రూ.25 లక్షల వరకు ఉచితంగా చికిత్స పొందే పరిస్థితి మన హయాంలో ఉండేది. ఆ తర్వాత విశ్రాంతి తీసుకునే సమయంలో నెలకు రూ.5 వేలు ఆరోగ్య ఆసరా కింద వాళ్ల బ్యాంకు అకౌంట్లో వేసే పరిస్థితి ఉండేది. ఇప్పుడు 11 నెలల టీడీపీ పాలనలో ఆరోగ్యశ్రీ నాశనం అయింది. నెలకి రూ.300 కోట్లు చొప్పున ఏడాదికి దాదాపు రూ.3,500 కోట్లు బకాయిలు పెట్టారు. ఆరోగ్య ఆసరా లేదు. రూ.450 కోట్ల బకాయిలు ఇవ్వలేదు. పేదవాడు నెట్‌వర్క్‌ ఆసుపత్రులకు వస్తే వైద్యం చేయబోమని బోర్డు తిప్పేశారు. పేదవాడికి ఆరోగ్యం బాగా లేకపోతే అప్పులు పాలైతే గానీ వైద్యం అందే పరిస్థితి లేదు.⇒ మన ప్రభుత్వంలో రైతన్నలకు పెట్టుబడి సహాయం ఇస్తూ.. దళారీ వ్యవస్థ లేకుండా రైతుల పంటలు ఆర్బీకేల ద్వారా కొనుగోలు చేశాం. ఇవాళ చంద్రబాబు రైతుకు పెట్టుబడి సహాయంగా ఇస్తానన్న హామీ మోసంగా మిగిలిపోయింది. మన హయాంలో ఉచిత పంటల బీమా ఉంటే.. ఇవాళ రైతులు ఇన్సూరెన్స్‌ కట్టుకునే పరిస్థితి లేకుండా చేశాడు. ఆర్బేకేలు నీరుగారిపోయాయి. ఈృ క్రాప్‌ కనబడకుండా పోయింది. రైతులు ఏ పంటకూ గిట్టుబాటు ధర దక్కని దుస్థితిలో ఉన్నారు. ధాన్యం, మిర్చి, పత్తి, కందులు, పెసలు, మినుమలు, శనగ, అరటి, పామాయిల్, చీనీ.. ఇలా ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు.ఎక్కడ చూసినా మాఫియాలే..ఒకవైపు దారుణమైన పాలన చేస్తున్నారు.. మరోవైపు విచ్చలవిడిగా స్కామ్‌లు జరుగు­తు­న్నాయి. మన హయాంలో ఇసుక ద్వారా ప్రభుత్వానికి పారదర్శకంగా డబ్బులు వచ్చాయి. ఏడాదికి రూ.750 కోట్లు వచ్చేవి. ఈ ప్రభుత్వంలో విచ్చలవిడిగా అధిక రేట్లకు అమ్ముకుంటున్నారు. ప్రభు­త్వానికి ఆదాయం లేదు. ఇసుక మాఫియా, మట్టి, మద్యం మాఫియా అరాచకం నడు­స్తోంది. మన హయాంలో మద్యం అమ్మకాలు తగ్గించడానికి చర్యలు తీసుకుంటే.. ఇవాళ ఏ గ్రామంలో చూసినా.. గుడి, బడి, వీధి చివర ఎక్కడ చూసినా బెల్టు షాపులే. ప్రతి బెల్టు షాపులో ఎమ్మార్పీ కంటే రూ.20– రూ.30 ఎక్కువకే అమ్ముతున్నారు. ఎక్కడ చూసినా మాఫియాలే. నియోజక­వర్గంలో మైన్స్, ఫ్యాక్టరీలు నడపాలంటే ఎమ్మెల్యేకు అంతో ఇంతో ఇవ్వాలి. ఆయన ముఖ్యమంత్రికి ఇవ్వాలి. ఇలా రాష్ట్రమంతా రెడ్‌బుక్‌ రాజ్యాంగం, దోచుకో పంచుకో తినుకో (డీపీటీ) నడుస్తోంది.నీకింత.. నాకింత అని పంచుకుంటున్నారు..⇒ విశాఖపట్నం లాంటి పెద్ద నగరాల్లో ఏం చేస్తున్నారంటే.. రూపాయికి ఇడ్లీ వస్తుందో లేదో తెలియదు కానీ చంద్రబాబు తన బినామీలకు మాత్రం రూ.మూడు వేల కోట్ల విలువైన భూములిస్తారు. ఊరూ పేరు లేని ఉర్సా, లూలూ, లిల్లీ లాంటి కంపెనీలకు రూ.1,500 కోట్ల నుంచి రూ.2,000 కోట్ల విలువైన భూములను ధారాదత్తం చేస్తున్నారు. లంచాలు తీసుకుని నాకింత.. నీకింత అని పంచుకుంటున్నారు. ⇒ మనం మొబిలైజేషన్‌ అడ్వాన్సులు విధానాన్ని తీసేస్తే వీళ్లు అదే పనిగా తీసుకొచ్చారు. రివర్స్‌ టెండరింగ్‌ను మనం తెస్తే.. వీళ్లు రద్దు చేశారు. మనం తీసుకొచ్చిన జ్యుడిషియల్‌ ప్రివ్యూను రద్దు చేశారు. కాంట్రాక్టర్లు రింగ్‌గా మారి ఇష్టం వచ్చినట్లు రేట్లు పెంచి టెండర్లు వేస్తున్నారు. వారికి చంద్రబాబు మొబిలైజేషన్‌ అడ్వాన్స్‌ కింద 10 శాతం ఇచ్చి 8 శాతం తిరిగి వెనక్కి తీసుకుంటున్నారు. కుల గణన నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాంకుల గణన చేయాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేశారు. వైఎస్సార్‌సీపీ హయాంలో దేశంలోనే తొలిసారిగా బీసీ కుల గణన నిర్వహించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ‘కుల ఆధారిత జనాభా గణన నిర్వహించాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాను. కుల గణన చేయాలని నా నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో 2021 నవంబర్‌లో తీర్మానాన్ని ఆమోదించాం. 2024 జనవరిలో గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా దేశంలోనే మొట్టమొదటిసారిగా బీసీ కులాల వారీ గణనను నిర్వహించాం. కుల గణన ద్వారా వెనుకబడిన, అణగారిన వర్గాలకు మరింత సంక్షేమాన్ని అందించవచ్చు. సమాజంలోని అన్ని వర్గాలకు నిజమైన సామాజిక న్యాయాన్ని, అభివృద్ధిని అందించటంలో ఇది కీలక అడుగు’ అని వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు.

AP High Court Given Permission Given To Kethireddy Pedda Reddy5
కేతిరెడ్డి పెద్దారెడ్డికి హైకోర్టులో ఊరట.. జేసీకి షాక్‌

సాక్షి, అనంతపురం: తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. తాడిపత్రి వెళ్లేందుకు పెద్దారెడ్డికి హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఈ క్రమంలోనే మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డికి తగిన భద్రత కల్పించాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది.ఏపీలో గత 10 మాసాలుగా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి రానివ్వడం లేదని సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి.. హైకోర్టు దృష్టి కి తీసుకెళ్లారు. ఈ క్రమంలో విచారణ చేపట్టిన న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లొచ్చు.. ప్రజలను కలుసుకోవచ్చని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే సమయంలో తాడిపత్రిలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర హోం శాఖ, డీజీపీ, అనంతపురం ఎస్పీలను కోర్టు ఆదేశించింది. అలాగే, పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్లే క్రమంలో ఐదు వాహనాలకు మించి వెళితే పోలీసుల అనుమతి తీసుకోవాలని సూచించింది.ఇదిలా ఉండగా.. హైకోర్టు ఆదేశాలను టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి బేఖాతరు చేశారు. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిపై దాడికి టీడీపీ నేతలు స్కెచ్‌ వేశారు. జేసీ వర్గీయులు పెద్దారెడ్డి ఇంటికి సమీపంలో రాళ్లను సిద్ధం చేసి ఉంచారు. పెద్దారెడ్డిపై రాళ్ల దాడి చేసేందుకు ఇది పెద్ద కుట్రగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తాడిపత్రి టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇక, హైకోర్టు ఆదేశాలతో త్వరలోనే పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లనున్నారు.

Heavy Rain Fall Across AP6
ఏపీలో భారీ వర్షం.. ఈ జిల్లాల ప్రజలకు విపత్తుల శాఖ హెచ్చరిక

సాక్షి, ప్రకాశం: తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు దంచికొడుతున్నాయి. కర్ణాటక నుంచి రాజస్థాన్ వరకూ.. ఒక బలమైన ద్రోణి ప్రభావం ఆంధ్రప్రదేశ్, తెలంగాణపై కూడా కనిపిస్తోంది. ఈ కారణంగా ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. తాజాగా శుక్రవారం తెల్లవారుజాము నుంచి ప్రకాశం జిల్లాలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది.ఏపీలో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. గాలివాన కారణంగా పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం అనుపాలెం దగ్గర రోడ్డుపై భారీ వృక్షం విరిగిపడింది. రోడ్డుపై చెట్టు పడటంతో భారీగా ట్రాఫిక్ స్తంభించి పోయింది. దీంతో, పిడుగురాళ్ల -సత్తెనపల్లి మార్గంలో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రెండు గంటలుగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో పోలీసులు.. చెట్టు తొలగించి రాకపోకలను పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తున్నారు.రాష్ట్రంలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు కొనసాగనున్నట్లు , శుక్రవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామ రాజు, కాకినాడ, ప్రకాశం, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీవర్షాలు, pic.twitter.com/0sPdSsATQK— Andhra Pradesh State Disaster Management Authority (@APSDMA) May 1, 2025మరోవైపు.. ప్రకాశం జిల్లాలో ఈరోజు తెల్లవారుజాము నుంచి ఎడతెరిపిలేని భారీ వర్షం కురుస్తోంది. కనిగిరిలో ఈదురుగాలితో కూడిన భారీ వర్షం పడుతోంది. ఇక, అకాల వర్షాల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. మరోవైపు.. వాతావరణ శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీ, తెలంగాణలో మరో ఏడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా పడతాయి. అలాగే.. ఉరుములు, మెరుపులు, పిడుగులు కూడా పడే అవకాశం ఉంది. గాలి వేగం గంటకు 30 నుంచి 40 కిలోమీటర్లు ఉంటుంది. ఒక్కోసారి గంటకు 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని హెచ్చరించింది.శుక్రవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామ రాజు, కాకినాడ, ప్రకాశం, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీవర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే విశాఖపట్నం, అనకాపల్లి, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, నెల్లూరు, కర్నూలు, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల శాఖ హెచ్చరించింది. ప్రజలు చెట్ల క్రింద నిలబడరాదన్నారు. బలమైన ఈదురుగాలులు పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేసింది.ఐఎండీ ప్రకారం నేడు.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతోపాటూ.. కర్ణాటక, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, మహారాష్ట్రలో కొంత భాగం కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. బంగాళాఖాతం నుంచి ఏపీలోకి గాలులు బలంగా వస్తున్నాయి. ఈ రోజంతా ఈ పరిస్థితి ఉంటుంది. మరోవైపు.. దేశ రాజధాని ఢిల్లీలో సైతం భారీ వర్షం కురుస్తోంది. దీంతో, రోడ్లన్నీ జలమయమయ్యాయి.

lavanya tripathi and varun tej Will First Child Buzz News7
వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి 'మెగా' గుడ్‌న్యూస్‌..?

మెగాకపుల్ వరుణ్ తేజ్(Varun Tej)-లావణ్య త్రిపాఠి శుభవార్త చెప్పబోతున్నారని తెలుస్తోంది. ఈమేరకు సోషల్‌మీడియాలో పలు కథనాలు వైరల్‌ అవుతున్నాయి. ఈ దంపతులు త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నట్లు సమాచారం. మెగా ఇంటికి వారసుడు రాబోతున్నాడు అంటూ అభిమానులు కూడా పోస్టులు పెడుతున్నారు. 2023లో ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట మొదటి బిడ్డను ఆహ్వానించేందుకు సిద్ధంగా ఉన్నట్లు నెట్టింట వైరల్‌ అవుతుంది.పెళ్లి తర్వాత లావణ్య త్రిపాఠి( Lavanya Tripathi) మళ్లీ షూటింగ్స్‌లలో పాల్గొంటూ వచ్చారు. ఈ క్రమంలోనే ఒక వెబ్‌ సిరీస్‌ను ఆమె విడుదల చేశారు. ఆపై సతీ లీలావతితో పాటు కోలీవుడ్‌ మూవీ థనల్‌ను ఆమె పూర్తి చేశారు. అయితే, ఈ రెండు ప్రాజెక్ట్‌లను పూర్తి చేసిన తర్వాత ఆమె మళ్లీ కాస్త బ్రేక్‌ ఇచ్చారు. కొంతకాలం సినిమాలకు దూరంగా ఉండాలని ఆమె భావించారని తెలుస్తోంది. దీనికి కారణం ఆమె ప్రెగ్నెన్సీ అని అందుకే ప్రస్తుతం కొత్త ప్రాజెక్ట్‌లను ఒప్పకోవడం లేదని టాక్‌. అయితే, ఈ విషయంపై వారి నుంచి ఎలాంటి క్లారిటీ రాలేదు.వాస్తవానికి 2017లో వరుణ్‌, లావణ్యల మధ్య స్నేహం ఏర్పడింది. వీరిద్దరు కలిసి అప్పుడు ‘మిస్టర్‌’ అనే సినిమాలో నటించారు. ఆ సమయంలోనే వరుణ్‌, లావణ్య త్రిపాఠి క్లోజ్‌ అయ్యారు. మొదట్లో స్నేహం.. ఆ తర్వాత అది ప్రేమగా మార్చుకొని డేటింగ్‌ వరకు వెళ్లారు. కానీ ఈ విషయం బయటకు రాకుండా చాలా జాగ్రత్తగా పర్సనల్‌ లైఫ్‌ని ఎంజాయ్‌ చేశారు. సరిగ్గా పెళ్లికి కొద్దిరోజులు ముందు వారి ప్రేమ విషయాన్ని అందరికీ తెలిపారు. అలా వరుణ్‌, లావణ్యల పెళ్లి ఇట‌లీలో జరగగా.. హైదరాబాద్‌లో రిసెప్ష‌న్ ఘనంగా జరిగింది.

ysrcp mp gurumurthy Letter To AMit Shah Over Security in AP Temples8
పుణ్యక్షేత్రాల్లో భద్రత వైఫల్యాలు.. అమిత్‌ షాకు ఎంపీ గురుమూర్తి ఫిర్యాదు

సాక్షి, తిరుపతి: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమైన దేవాలయాల్లో భద్రత వైపల్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని తిరుపతి వైఎస్సార్‌సీపీ ఎంపీ డాక్టర్‌ మద్దిల గురుమూర్తి తెలిపారు. ఏపీలోని పుణ్యక్షేత్రాల్లో పరిపాలనా లోపాలు, భద్రతా వైఫల్యాల వల్ల తరచూ జరుగుతున్న దుర్ఘటనలపై వెంటనే సమగ్ర విచారణ చేపట్టాలని కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు గురువారం లేఖ రాసినట్లు ఎంపీ వెల్లడించారు.ఈ సందర్భంగా ఎంపీ గురుమూర్తి.. ‘విశాఖపట్నం జిల్లా సింహాచలం దేవాలయంలో చందనోత్సవం సందర్భంగా గోడ కూలి ఏడుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. గోడ నిర్మాణంలో సరైన ఇంజనీరింగ్‌ పద్ధతులు పాటించకపోవడం, నాణ్యత లేని మెటీరియల్‌ ఉపయోగించడమే ఈ దుర్ఘటనకు కారణం. శ్రీకాకుళం జిల్లాలోని శ్రీ కూర్మనాథ స్వామి ఆలయంలో భక్తులు పవిత్రంగా భావించే అరుదైన నక్షత్ర తాబేళ్లు అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించాయి. పోస్టుమార్టం చేయకుండానే వాటిని దహనం చేశారు.తిరుమలలో భద్రతా వ్యవస్థ పూర్తిగా విఫలమైంది. జనవరి 8న తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శన టికెట్‌ కౌంటర్ల క్యూ లైన్లలో తొక్కిసలాటి జరిగి భక్తులు ప్రాణాలు కోల్పోయిన తర్వాత కూడా టీటీడీ పరిపాలనలో ఎలాంటి మార్పు రాలేదు. ఇటీవల మూడంచెల భద్రత వ్యవస్థను దాటి కొంతమంది భక్తులు పాదరక్షలతో తిరుమల శ్రీవారి ఆలయ సింహద్వారం వరకు వెళ్లారు. టీటీడీ గోశాలలో 100కు పైగా గోవులు మరణించాయి. గోశాల నిర్వహణలో నిర్లక్ష్యం, నాణ్యతలేని దాణా అందించడం, వైద్యసేవల లోపం వల్లే ఈ దారుణం జరిగింది.’ అని లేఖలో పేర్కొన్నారు.

Mumbai Indians beat Rajasthan by 100 runs9
ముంబై ‘సిక్సర్‌’ రాజస్తాన్‌ ‘అవుట్‌’

ఐపీఎల్‌–2025లో ‘ప్లే ఆఫ్స్‌’ రేసుకు దూరమైన రెండో జట్టుగా రాజస్తాన్‌ రాయల్స్‌ నిలిచింది. సీజన్‌లో ఎనిమిదో పరాజయంతో ఆ జట్టు కథ ముగియగా, టాప్‌–4 బ్యాటర్లంతా చెలరేగడంతో ముంబై పట్టికలో ‘టాప్‌’కు దూసుకెళ్లిపోయింది. ముందుగా పేలవ బౌలింగ్‌తో ముంబై ఇండియన్స్‌కు భారీ స్కోరు చేసే అవకాశం కల్పించిన రాయల్స్‌... ఆ తర్వాత చెత్త బ్యాటింగ్‌తో పూర్తిగా చేతులెత్తేసింది. తిరుగులేని ఆటతో చెలరేగుతున్న హార్దిక్‌ పాండ్యా బృందం ఖాతాలో ఇది వరుసగా ఆరో విజయం కావడం విశేషం.జైపూర్‌: ఐపీఎల్‌ సీజన్‌లో చెన్నై తర్వాత ఇప్పుడు రాజస్తాన్‌ రాయల్స్‌ అధికారికంగా ‘ప్లే ఆఫ్స్‌’ అవకాశాలు చేజార్చుకుంది. గురువారం జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ 100 పరుగుల తేడాతో రాజస్తాన్‌పై ఘన విజయం సాధించింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ముంబై 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది. రికెల్టన్‌ (38 బంతుల్లో 61; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు), రోహిత్‌ శర్మ (36 బంతుల్లో 53; 9 ఫోర్లు) అర్ధ సెంచరీలతో శుభారంభం అందించగా... సూర్యకుమార్‌ యాదవ్‌ (23 బంతుల్లో 48 నాటౌట్‌; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), హార్దిక్‌ పాండ్యా (23 బంతుల్లో 48 నాటౌట్‌; 6 ఫోర్లు, 1 సిక్స్‌) అదే జోరును కొనసాగించారు. రికెల్టన్, రోహిత్‌ తొలి వికెట్‌కు 71 బంతుల్లోనే 116 పరుగులు జోడించగా... సూర్య, పాండ్యా మూడో వికెట్‌కు 44 బంతుల్లో అభేద్యంగా 94 పరుగులు జత చేశారు. అనంతరం రాజస్తాన్‌ 16.1 ఓవర్లలో 117 పరుగులకే ఆలౌటైంది. జోఫ్రా ఆర్చర్‌ (27 బంతుల్లో 30; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. సొంత మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో రాజస్తాన్‌ మేనేజ్‌మెంట్‌ ‘పింక్‌ ప్రామిస్‌’ పేరుతో సౌరశక్తికి సంబంధించి ప్రత్యేక ప్రచారాన్ని నిర్వహించింది. దీని ప్రకారం ఆటగాళ్లంతా పూర్తిగా ‘పింక్‌’ కిట్‌ ధరించగా... బ్యాటర్‌ కొట్టే ఒక్కో సిక్స్‌కు ఆరు ఇళ్లకు సౌరశక్తి సదుపాయాన్ని కల్పిస్తారు. టాప్‌–4 విధ్వంసం... ముంబై బ్యాటింగ్‌ మొదటి నుంచీ దూకుడుగా సాగింది. ఫారుఖీ ఓవర్లో వరుసగా 6, 4 కొట్టిన రికెల్టెన్‌... ఆర్చర్‌ ఓవర్లో వరుసగా 4, 6 బాదాడు. తీక్షణ ఓవర్లో రోహిత్‌ 3 ఫోర్లు కొట్టడంతో పవర్‌ప్లే ముగిసేసరికి స్కోరు 58 పరుగులకు చేరింది. కార్తికేయ ఓవర్లో భారీ సిక్స్‌తో 29 బంతుల్లో రికెల్టన్‌ అర్ధ సెంచరీ పూర్తి చేసుకోగా, కొద్ది సేపటికే 31 బంతుల్లో రోహిత్‌ హాఫ్‌ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. వీరిద్దరు 7 పరుగుల తేడాతో వెనుదిరిగిన తర్వాత సూర్య, పాండ్యా ధాటి మొదలైంది. ఫారుఖీ ఓవర్లో పాండ్యా 3 ఫోర్లు, సిక్స్‌తో చెలరేగిపోవడంతో 21 పరుగులు వచ్చాయి. ఆర్చర్‌ ఓవర్లో సిక్స్‌తో స్కోరును 200 దాటించిన సూర్య...ఆఖరి బంతికి సిక్స్‌తో ఇన్నింగ్స్‌ ముగించాడు. టపటపా... ఇన్నింగ్స్‌లో 5 ఓవర్లలోపే 5 వికెట్లు కోల్పోవడంతో రాజస్తాన్‌ గెలుపు అవకాశాలు అక్కడే ముగిసిపోగా, ఆ తర్వాత లాంఛనమే మిగిలింది. గత మ్యాచ్‌ సెన్సేషన్‌ వైభవ్‌ సూర్యవంశీ (0) ఈసారి డకౌట్‌ కావడంతో రాయల్స్‌ పతనం మొదలైంది. బౌల్ట్‌ ఓవర్లో రెండు సిక్స్‌లు కొట్టిన యశస్వి జైస్వాల్‌ (13) అదే ఓవర్లో వెనుదిరిగాడు. బౌల్ట్‌ తర్వాతి ఓవర్లో నితీశ్‌ రాణా (9) అవుట్‌ కాగా... బుమ్రా తన తొలి ఓవర్లోనే వరుస బంతుల్లో పరాగ్‌ (16), హెట్‌మైర్‌ (0)లను వెనక్కి పంపించాడు. ధ్రువ్‌ జురేల్‌ (11) ప్రభావం చూపలేకపోవడంతో రాజస్తాన్‌ కుప్పకూలింది. స్కోరు వివరాలు ముంబై ఇండియన్స్‌ ఇన్నింగ్స్‌: రికెల్టన్‌ (బి) తీక్షణ 61; రోహిత్‌ (సి) జైస్వాల్‌ (బి) పరాగ్‌ 53; సూర్యకుమార్‌ (నాటౌట్‌) 48; హార్దిక్‌ పాండ్యా (నాటౌట్‌) 48; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 2 వికెట్లకు) 217. వికెట్ల పతనం: 1–116, 2–123. బౌలింగ్‌: ఆర్చర్‌ 4–0–42–0, ఫారుఖీ 4–0–54–0, తీక్షణ 4–0–47–1, కార్తికేయ 2–0–22–0, మధ్వాల్‌ 4–0–39–0, పరాగ్‌ 2–0–12–1. రాజస్తాన్‌ రాయల్స్‌ ఇన్నింగ్స్‌: జైస్వాల్‌ (బి) బౌల్ట్‌ 13; వైభవ్‌ (సి) జాక్స్‌ (బి) చహర్‌ 0; నితీశ్‌ రాణా (సి) తిలక్‌ (బి) బౌల్ట్‌ 9; పరాగ్‌ (సి) రోహిత్‌ (బి) బుమ్రా 16; జురేల్‌ (సి అండ్‌ బి) కరణ్‌ శర్మ 11; హెట్‌మైర్‌ (సి) సూర్యకుమార్‌ (బి) బుమ్రా 0; శుభమ్‌ దూబే (సి) బౌల్ట్‌ (బి) పాండ్యా 15; ఆర్చర్‌ (సి) బుమ్రా (బి) బౌల్ట్‌ 30; తీక్షణ (సి) సూర్య (బి) కరణ్‌ శర్మ 2; కార్తికేయ (సి) చహర్‌ (బి) కరణ్‌ శర్మ 2; మధ్వాల్‌ (నాటౌట్‌) 4; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (16.1 ఓవర్లలో ఆలౌట్‌) 117. వికెట్ల పతనం: 1–1, 2–18, 3–41, 4–47, 5–47, 6–64, 7–76, 8–87, 9–91, 10–117. బౌలింగ్‌: దీపక్‌ చహర్‌ 2–0–13–1, బౌల్ట్‌ 2.1–0–28–3, బుమ్రా 4–0–15–2, బాష్‌ 3–0–29–0, హార్దిక్‌ పాండ్యా 1–0–2–1, కరణ్‌ శర్మ 4–0–23–3. ఐపీఎల్‌లో నేడుగుజరాత్‌ X హైదరాబాద్‌ వేదిక: అహ్మదాబాద్‌రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్‌ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం

Cognizant to hire 20000 freshers in 202510
కాగ్నిజెంట్‌లో ఫ్రెషర్లకు 20 వేల కొలువులు

అమెరికన్‌ ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్‌ ఈ ఏడాది సుమారు 20,000 మంది ఫ్రెషర్లను రిక్రూట్‌ చేసుకునే యోచనలో ఉంది. ఏఐ ఆధారిత సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్, మేనేజ్డ్‌ సర్వీసెస్‌ విభాగాల్లో ఈ కొలువులు ఉండనున్నాయి. ప్రస్తుతం కంపెనీలో మొత్తం ఉద్యోగుల సంఖ్య 3,36,300గా ఉంది.‘ఇన్వెస్టర్‌ డే సందర్భంగా చెప్పినట్లు మా వ్యూహంలో భాగంగా 20,000 మంది ఫ్రెషర్లను తీసుకోబోతున్నాం. గతేడాదితో పోలిస్తే ఇది రెట్టింపు‘ అని కంపెనీ సీఈవో ఎస్‌ రవి కుమార్‌ తెలిపారు. ఫ్రెషర్లను తీసుకోవడం, ఏఐ ద్వారా ఉత్పాదకతను పెంచుకోవడం, మానవ వనరుల వ్యయాలను తగ్గించుకునేలా సామర్థ్యాల వినియోగాన్ని మెరుగుపర్చుకోవడం వంటి మూడు అంశాలపై కంపెనీ ప్రధానంగా దృష్టి పెడుతున్నట్లు వివరించారు.ఈ ఏడాది జనవరి–మార్చ్‌ త్రైమాసికంలో కాగ్నిజెంట్‌ ఆదాయం సుమారు 7 శాతం పెరిగి 5.1 బిలియన్‌ డాలర్లకు చేరింది. కాగా ఈ ఆర్థిక సంవత్సరంలో టాప్‌ ఐదు ఐటీ కంపెనీలు మొత్తంగా 80 వేల నుంచి 84 మందిని కొత్తగా నియమించుకోనున్నట్లు సంకేతాలిచ్చాయి.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement