Top Stories
ప్రధాన వార్తలు

కూటమిపై ఇదెక్కడి మాస్ ట్రోలింగ్ మావా!
ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం ఎలా ఉంది? అని ఓ సామాన్యుడిని ఓ విలేకరి అడిగారు. ‘‘ఓ బ్రహ్మాండంగా ఉందిగా...’’ అన్నది అతడి సమాధానం!. ‘‘ఏ ఏ స్కీములు అందాయి’’ అనే రిపోర్టర్ ప్రశ్నకు వచ్చిన జవాబు.. ‘‘ఒకటేమిటి అన్నీ అందాయి కదా!’’ అని!!! ఇదేమిటి ఇలా అంటున్నాడని ఆ విలేకరి మరో ప్రశ్న వేశారు. ‘‘రైతు భరోసా కింద నిధులు వచ్చాయా?’’ అంటే, ‘‘నలభై వేలు వచ్చాయి..’’ అని సమాధానమొచ్చింది. ‘‘హామీ ఇచ్చింది రూ.ఇరవై వేలే కదా..’’ అని రిపోర్టర్ ఆశ్చర్యపోతే.. ‘‘అవునండి.. రైతులు కష్టాలలో ఉన్నారని కూటమి ప్రభుత్వం రూ.నలభై వేలు ఇచ్చిందిలే..’’ అని నిట్టూరుస్తూ చెప్పాడు. అప్పుడు అర్థమైంది ఆ విలేకరికి.. ఆ సామాన్యుడి చమత్కారం!కూటమి ప్రభుత్వంపై ప్రజల మాస్ ట్రోలింగ్ ఈ మధ్యకాలంలో బాగా పెరిగిపోయింది. ఇక కొందరు పిల్లలు ‘‘నాకు పదిహేను వేలు, నాకు పదిహేను వేలు ఎక్కడ ముఖ్యమంత్రి గారూ’’ అంటూ అడిగిన వీడియో కూడా పాపులర్ అయింది. మరో వ్యక్తి పశువులను చూపుతూ ‘‘నీకు పదిహేను వేలు, నీకు పదిహేను వేలు’’ అంటూ మరో వీడియో చేశారు. కొందరు మహిళలు ఒక ఆర్టీసీ బస్సు ఎక్కి గతంలో చంద్రబాబు చెప్పిన డైలాగుల వీడియో ప్రదర్శించారు. అందులో ‘‘మీ చంద్రన్న డ్రైవర్ అయ్యాడు. మీరు ఏ బస్సైనా ఎక్కండి.. పుట్టింటికి వెళ్లండి.. లేదా పని చేసే చోటకు వెళ్లండి.. ఎవరైనా టిక్కెట్ అడిగితే చంద్రన్న పేరు చెప్పండి’’ అని చంద్రబాబు చేసిన ప్రకటన ఉంది. ఏపీలో ప్రభుత్వం ఎంత హేళనకు గురి అవుతుందో ఈ ఉదాహరణలన్నీ తెలియ చేస్తాయి. అయితే.. సమాధానం చెప్పవలసిన టీడీపీ, జనసేన, బీజేపీ ప్రభుత్వం ఆ పని చేయకుండా, ఇలా ప్రశ్నించిన వారిపై కేసులు పెడుతోంది. పోలీసులు అలా మాట్లాడిన వారిని గుర్తించి పోలీస్ స్టేషన్లకు తీసుకువెళ్లి వేధిస్తున్నారన్న ఫిర్యాదులు వస్తున్నాయి. ఏపీలో ప్రజలు అత్యధిక శాతం తాము చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ తదితర నేతల చేతిలో మోసపోయామని, వారు చేసిన వాగ్దానాలు నమ్మి దెబ్బతిన్నామని, రెండికి చెడ్డ రేవడి అయ్యామని బాధ పడుతున్నారు. ఈ దశలో శాసనసభ్యులు మాత్రం తమ సాంస్కృతిక కార్యక్రమాలలో మాజీ ముఖ్యమంత్రి జగన్‌పై స్కిట్లు వేస్తూ తమ కుసంస్కారాన్ని ప్రదర్శించుకుంటున్నారన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు. జగన్ పేరు నేరుగా చెప్పకపోయినా అగౌరవంగా సంభోధిస్తూ.. జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలు ఇద్దరు డైలాగులు చెప్పారు. ఆ క్రమంలో.. ‘‘లే..లే..నా రాజా..’’ అంటూ ఓ ఐటెమ్ సాంగ్‌ను పాడుకుని వెకిలి ఆనందం పొందారు. వారిద్దరూ ఏదో పిచ్చి స్కిట్ వేస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌లు పడి, పడి నవ్వుకుంటూ కూర్చున్నారు. పవన్ కళ్యాణ్ అయితే ఇంటికి వెళ్లినా నవ్వు ఆపుకోలేనని చెప్పారు. తోటి ఎమ్మెల్యేలపై ప్రభుత్వ కార్యక్రమంలో ఇలా నీచంగా ప్రదర్శనలు చేయవచ్చా? అనేది చాలామందికి వచ్చిన డౌటు. అందులో హాస్యం కన్నా వెకిలితనం ఎక్కువగా ఉందన్నది విశ్లేషకుల వ్యాఖ్య. 👉చిత్రం ఏమిటంటే.. ఇప్పుడు ఇలాంటి డ్రామాలు ఆడి వారిలో వారు సంతోషపడుతున్నారు కాని, ఎన్నికలకు ముందు నిజంగానే డ్రామాలు ఆడారు. ప్రజలను మాయ చేశారు. ఎక్కడలేని వాగ్దానాలు చేసి ప్రజలను బోల్తా కొట్టించామన్న ఆనందంలో కూటమి ఎమ్మెల్యేలు ఉండవచ్చు. కానీ ప్రజలు వీరి వికృత విన్యాసాలను జ్ఞప్తికి తెచ్చుకుని నిజంగానే వీరిని ఎద్దేవా చేస్తూ వ్యాఖ్యలు చేస్తున్నారు. శాసనసభలో ఒకరిద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు తప్ప ఎవరూ తామిచ్చిన హామీల గురించి ప్రభుత్వాన్ని ప్రశ్నించడం లేదు. గతంలో తాము ఇంటింటికి తిరిగి మరీ బాండ్లు పంచిన ఎమ్మెల్యేలకు, కూటమి నేతలకు ఆత్మ అనేది ఉంటే వాటిని గుర్తు చేసుకోవాలి. 👉ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొద్ది రోజుల క్రితం ఢిల్లీలో మాట్లాడుతూ తల్లికి వందనం స్కీము అమలు చేసేస్తున్నామనే భావన కలిగేలా మాట్లాడిన వీడియో చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. పిల్లలు ఎందరు ఉంటే అందరికి డబ్బులు ఇస్తున్నామని, పిల్లలు సంపాదించుకుంటున్నారని అంటున్నారు. మరో వైపు ఆయన కుమారుడు, విద్యా శాఖ మంత్రి లోకేష్ చట్టసభలో మాట్లాడుతూ లక్షల మంది విద్యార్ధులు ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీలలో తగ్గారని ఒక నిజాన్ని వెల్లడించారు. దానికి జగన్ ప్రభుత్వ విధానాలు అనే ఒక అబద్దాన్ని జత చేశారు. అంతే తప్ప తాము తల్లికి వందనం,తదితర పధకాలను హామీ ఇచ్చిన విధంగా అమలు చేయలేకపోతున్నామని మాత్రం చెప్పలేకపోయారు. 👉జగన్ టైమ్ లో ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్ధుల సంఖ్య పెరిగిందన్న విషయం మర్చిపోయి ఉండవచ్చు. కాని ఈ మద్య ఒక వీడియో వచ్చింది. పొలంలో కూలి పని చేసుకుంటున్న ఒక మహిళ ఒక బాలికను చూపుతూ.. డబ్బులు లేక స్కూల్ మాని పొలం పనికి వస్తోందని చెప్పింది. ఈ దృశ్యం హృదయ విదాకరంగా ఉంది. ఇలాంటి పరిస్థితిలో చేసిన బాసలను అధినేతలకు గుర్తు చేస్తూ స్కిట్లు ప్రదర్శించి ఉంటే బాగుండేది. లేదా మరో పని చేసి ఉండాల్సింది. ఎన్నికల ప్రచార సమయంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్‌లు ఎలాంటి స్పీచ్ లు ఇచ్చింది.. ప్రజలను ఎలా బోల్తా కొట్టించింది.. అన్న అంశాలపై నాటికలు ప్రదర్శించి ఉంటే చాలా రక్తి కట్టేవేమో! తాము ఎలా ప్రజలను మోసపూరిత హామీలతో నమ్మించింది చెప్పే స్కిట్లను వేసుకుని ఉండాల్సింది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు తల్లికి వందనం డబ్బులు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఎంతెంత ఇచ్చేది లెక్కలు వేసే చెప్పారు కదా. వలంటీర్లను కొనసాగిస్తామని, వారి పొట్టగొట్టమని, పదివేలకు గౌరవ వేతనం పెంచుతామని అధినేతలు చెప్పిన విషయాలను గుర్తు చేసుకుని సంబంధిత డ్రామాలు ప్రదర్శించుకుని ఉంటే అర్థవంతంగా ఉండేవేమో! లేదా ఆ వీడియోలను తెరపై ఒక్కసారి వేసుకుని చూసుకుని ఉంటే తెగ నవ్వు వచ్చేది కదా!. 'నీకు పదిహేను వేలు.. నీకు పదిహేను వేలు.. చిట్టి పాపా.. నీకు కూడా పదిహేను వేలు.." ఇది ఆంధ్రప్రదేశ్ లో బాగా ప్రచారంలోకి వచ్చిన డైలాగు. ప్రస్తుతం మంత్రిగా ఉన్న నిమ్మల రామానాయుడు ఆ రోజుల్లో ఇంటింటికి సైకిల్ వేసుకుని వెళ్లి మహిళలు, పిల్లలందరిని కలిసి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి రాగానే డబ్బులు తీసుకోవడమే ఆలస్యం అన్నట్లుగా కబుర్లు చెప్పి వచ్చారు. అలాగే యువతులు, గృహిణులు ఎవరు కనిపించినా..మీకు పద్దెనిమిది వేలు.. వలంటీర్ల దగ్గరకు వెళ్లి మీకు నెలకు పది వేలు ఖాయం అంటూ ఎన్నికల మానిఫెస్టో కరపత్రం అందించి మరీ చెప్పి వచ్చేవారు. అంతేకాదు..ప్రభుత్వం వచ్చిన వెంటనే హామీ అమలు పరుస్తామని, ఆ తర్వాత వలంటీర్లు తనకు స్వీట్లు, పూతరేకులు తెచ్చి తినిపంచాలని కూడా కోరారు.ఆ సన్నివేశం ఒక్కటి చాలు బాగా పండడానికి. ఆ వీడియోలను చూసుకుని ఉంటే వారంత కడుపారా నవ్వుకునే వారేమో! .చంద్రబాబు అయితే ఒక అడుగు ముందుకు వేసి మీకు ఓపిక ఉంటే ఇంకా పిల్లలను కనండని, వారికి కూడా ఇదే విధంగా ఆర్థిక సాయం చేస్తామని చెప్పేవారు. ఎమ్మెల్యేలు పిల్లలు కనమంటున్న చంద్రబాబుకు సంబంధించి స్కిట్ వేసినట్లున్నారు కాని, ఆ పిల్లలకు తల్లికి వందనం ఈ ఏడాది ఎగ్గొట్టిన సంగతి మాత్రం చెప్పలేదు. సాంస్కృతిక ప్రదర్శనలో కొంతమంది వికృత విన్యాసాలకు బాగా సంతోషించిన పవన్ కళ్యాణ్ ఒక మాట చెప్పారు. పిఠాపురం సభలో.. తనవల్లే టీడీపీ నిలబడిందని స్పీచ్ ఇచ్చినా, ఇక్కడ మాత్రం కారణం ఏమైనా, చంద్రబాబు మరో పదిహేనేళ్లు సీఎంగా కొనసాగాలని అంటూ పవన్ తన విధేయత ప్రదర్శించారు. చంద్రబాబు నుంచి చాలా నేర్పుకున్నానని ఆయన చెబుతుంటే బహుశా పరిపాలన కన్నా, ఇలా అబద్దాలు చెప్పి ప్రజలను ఏ విధంగా నమ్మించవచ్చు..ఆ తర్వాత ఎలా ఎగవేయవచ్చన్నది బాగానే నేర్చుకున్నారన్న భావన ఏర్పడుతోంది. సామాన్య ప్రజలు కూటమి ప్రభుత్వంపై వేస్తున్న ఛలోక్తులు సహజంగా ఉంటే.. ఎమ్మెల్యేల స్కిట్లు మాత్రం కృత్రిమంగా ఉన్నాయి.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

అది మనుషుల్ని చంపడం కన్నా ఘోరం: సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ: పర్యావరణాన్ని తమ కళ్లెదుటే నాశనం చేస్తుంటే చూస్తూ ఊరుకోబోమని.. ఇలాంటి చర్యలను అడ్డుకట్ట ఎలా వేయాలో తమకు బాగా తెలుసని దేశ సర్వోన్నత న్యాయస్థానం(Supreme Court) అంటోంది. చెట్లను నరికిన వ్యవహారంలో ఓ వ్యక్తికి భారీ జరిమానా విధించిన కోర్టు.. ఇలాంటి చర్యలు మనుషుల్ని చంపడం కన్నా ఘోరం అంటూ వ్యాఖ్యానించింది. తాజ్ ట్రాపిజెమ్ జోన్ పరిధిలోని మధుర-బృందావన్‌లో దాల్మియా ఫార్మ్స్ నిర్వాహకుడు శివ్ శంకర్ అగర్వాల్.. చెట్లు నరికిన కేసులో ఊరట కోసం సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. అయితే ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ ఉజల్ భుయాన్ ధర్మాసనం అక్రమంగా నరికిన ప్రతీ చెట్టుకు లక్ష రూపాయాల జరిమానా చెల్లించాలని తీర్పు ఇచ్చింది.అనుమతి లేకుండా అన్నేసి చెట్లు నరకడం అన్నింటికంటే ఘోరం. అంత వృక్షసంపదతో పచ్చదనం మళ్లీ కావాలంటే కనీసం వందేళ్లైనా పట్టొచ్చు. ఇది మనుషుల్ని చంపడం కంటే పెద్ద నేరం. ఇలాంటి చర్యలను చూస్తూ ఊరుకోలేం. కాలుష్య ప్రభావం రాబోయే తరాల మీద పడకుండా చూడాలంటే చెట్లు అవసరం.వాటిని పరిరక్షించడం మన అందరి బాధ్యత అని అభిప్రాయపడింది. ఇక.. ఈ వ్యవహారంపై దర్యాప్తు జరిపిన సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ కోర్టుకు ఓ నివేదిక సమర్పించింది. ఆ నివేదిక ఆధారంగానే కోర్టు చెట్టుకు లక్ష చొప్పున .. రూ.4 కోట్ల 54 లక్షల జరిమానా కట్టాలని ఆదేశించింది. అయితే.. అగర్వాల్ తరఫున వాదనలు వినిపించిన ముకుల్ రోహత్గీ.. తన క్లయింట్ తప్పును ఒప్పుకుని క్షమాపణలు చెప్పాడని, అందుకు సంబంధించి అఫిడవిట్ కూడా కోర్టుకు సమర్పించామని తెలియజేశారు. అయినప్పటికీ జరిమానా విషయంలో ధర్మాసనం అస్సలు తగ్గలేదు.మరోవైపు సమీపంలోని స్థలంలో తోటలు వేసుకునేందుకు అగర్వాల్ అనుమతి కోరగా.. అతనిపై దాఖలైన ధిక్కార పిటిషన్‌ను విచారణ తర్వాతే ఆ అంశంపై నిర్ణయం ప్రకటిస్తామని తెలిపింది. ఈ సందర్భంగా.. జోన్‌లోని అటవీయేతర, ప్రైవేట్ భూములలోని చెట్లను నరికివేయడానికి ముందస్తు అనుమతి పొందాలనే నిబంధనను తొలగిస్తూ 2019లో ఇచ్చిన ఉత్తర్వులను కూడా సుప్రీంకోర్టు గుర్తుచేసుకుంది.తాజ్ ట్రాపిజెమ్ జోన్‌ను కేంద్రం 1986లో పర్యావరణ పరిరక్షణ చట్టం కింద ఏర్పాటు చేసింది. కాలుష్య కోరల్లోంచి తాజ్ మహల్‌తో పాటు ఇతర వారసత్వ సంపదలను పరిరక్షించే ఉద్దేశంతో ఈ జోన్‌ను తీసుకొచ్చారు. మొత్తం 10,400 స్క్వేర్ కిలోమీటర్ల ప్రాంతం ఇది. ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్‌లో కొంత భాగం కూడా ఉంది. అత్యంత సున్నిత ప్రాంతంగా పేరున్న టీటీజెడ్ పర్యవేక్షణ కోసం ప్రత్యేక కాలుష్య నియంత్రణ మండలి కూడా ఉంది. అయితే..2019లో సుప్రీం కోర్టు టీటీజెడ్‌లో చెట్లను తొలగించడం కోసం ముందస్తు అనుమతి తీసుకోవాలన్న నిబంధనను ఎత్తేసింది. వ్యవసాయ, పశుపోషణ సంబంధిత కార్యకలాపాల కోసం చెట్లను తొలగిండచంలో తప్పేమీ లేదని అభిప్రాయపడింది. అయితే తర్వాతి రోజుల్లో ఆ ఉత్తర్వులను సమీక్షించిన సర్వోన్నత న్యాయస్థానం 2019 నాటి ఆదేశాలను ఉపసంహరించుకుంటున్నట్లు స్పష్టం చేసింది.

GT VS PBKS: నిస్వార్థమైన కెప్టెన్, సెంచరీ ముఖ్యం కాదన్నాడు: శ్రేయస్‌పై శశాంక్ ప్రశంసలు
ఐపీఎల్ 2025లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో నిన్న (మార్చి 25) జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ అద్భుత విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సెంచరీని త్యాగం చేసి మరీ తన జట్టును గెలిపించాడు. శ్రేయస్‌కు సెంచరీ చేసే అవకాశం ఉన్నా జట్టు ప్రయోజనాల కోసం శశాంక్ సింగ్‌కు స్ట్రయిక్ ఇచ్చి నిస్వార్దమైన కెప్టెన్ అనిపించుకున్నాడు. కెప్టెన్ త్యాగాన్ని శశాంక్ వృధా కానివ్వలేదు. సిరాజ్ వేసిన ఇన్నింగ్స్ చివరి ఓవర్లో ఏకంగా 23 పరుగులు సాధించాడు. ఫలితంగా పంజాబ్ భారీ స్కోర్ చేసింది. చివరి ఓవర్లో శశాంక్ చేసిన పరుగులే అంతిమంగా పంజాబ్ గెలుపుకు దోహదపడ్డాయి.ఒకవేళ శ్రేయస్ జట్టు ప్రయోజనాలు పట్టించుకోకుండా సెంచరీనే ముఖ్యమనుకునే ఉంటే ఈ మ్యాచ్‌లో పంజాబ్ ఓటమిపాలయ్యేది. ఎందుకంటే గుజరాత్, పంజాబ్ మధ్య పరుగుల తేడా కేవలం 11 పరుగులు మాత్రమే. శ్రేయస్ వ్యక్తిగత స్వార్దం చూసుకుని సెంచరీ కోసం ప్రయత్నించి ఉంటే చివరి ఓవర్లో మహా అయితే 10-15 పరుగులు వచ్చేవి. ఇదే జరిగి ఉంటే పంజాబ్ 230-235 పరుగులకు పరిమితం కావాల్సి వచ్చేది. అప్పుడు గుజరాత్ సునాయాసంగా లక్ష్నాన్ని ఛేదించి ఉండేది.పంజాబ్ ఇన్నింగ్స్ చివరి ఓవర్‌కు ముందు శ్రేయస్ 97 పరుగులతో అజేయంగా ఉన్నాడు. ఆ ఓవర్లో కనీసం ఒక్క బంతి ఎదుర్కొన్నా శ్రేయస్ సెంచరీ చేసేవాడు. కానీ అతను స్ట్రయిక్ కోసం పాకులాడలేదు. శశాంక్ మంచి టచ్‌లో ఉన్న విషయాన్ని గమనించి అతన్నే స్ట్రయిక్ తీసుకోమన్నాడు. శశాంక్‌కు సైతం స్ట్రయిక్ రొటేట్ చేసే అవకాశం రాలేదు. భారీ షాట్టు ఆడే క్రమంలో 5 బంతులు బౌండరీలకు తరలి వెళ్లగా.. ఓ బంతికి రెండు పరుగులు (రెండో బంతి) వచ్చాయి. వాస్తవానికి ఇక్కడ శ్రేయస్ స్ట్రయిక్ తీసుకుని (సింగిల్ తీసుంటే) ఉండవచ్చు. కానీ అతను అలా చేయలేదు.జట్టు ప్రయోజనాల కోసం సెంచరీ త్యాగం చేసిన అనంతరం యావత్ క్రికెట్ ప్రపంచం శ్రేయస్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తుంది. శశాంక్ సింగ్ సైతం మ్యాచ్ అనంతరం తన కెప్టెన్‌ను కొనియాడాడు. శశాంక్ మాటల్లో.. టీ20ల్లో, ముఖ్యంగా ఐపీఎల్లో సెంచరీ చేసే అవకాశం అంత ఈజీగా రాదు. కానీ మా కెప్టెన్ సెంచరీ చేసే అవకాశం ఉన్నా జట్టు ప్రయోజనాల దృష్ట్యా ఆ అవకాశాన్ని వదులుకున్నాడు. చివరి ఓవర్ మొత్తం నన్నే స్ట్రయిక్ తీసుకొని భారీ షాట్లు ఆడమన్నాడు. తన సెంచరీ గురించి ఆలోచించొద్దని చెప్పాడు. నేను స్వయంగా స్ట్రయిక్ రొటేట్ చేస్తానని చెప్పాను. కానీ అతను నాకు సెంచరీ ముఖ్యం కాదని చెప్పాడు. ఇలా చెప్పాలంటే ఏ కెప్టెన్‌కు అయినా చాలా గట్స్ ఉండాలి. మా కెప్టెన్‌కు ఆ గట్స్ ఉన్నాయి. శ్రేయస్ నన్ను ప్రతి బంతిని సిక్సర్ లేదా బౌండరీ కొట్టేందుకు ప్రయత్నించమని చెప్పాడు. అది నాకు చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చింది. కెప్టెన్ ఇచ్చిన ఫ్రీ హ్యాండ్‌తో నేను రెచ్చిపోయాను.కాగా, శ్రేయస్ (42 బంతుల్లో 5 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 97 పరుగులు నాటౌట్), శశాంక్‌తో పాటు (16 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 44 పరుగులు నాటౌట్), ప్రియాంశ్ ఆర్య (23 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 47 పరుగులు) చెలరేగడంతో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 243 పరుగులు చేసింది.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన గుజరాత్ 232 పరుగులకే పరిమితమై 11 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. గుజరాత్ ఇన్నింగ్స్‌లో సాయి సుదర్శన్ (41 బంతుల్లో 74; 5 ఫోర్లు, 6 సిక్సర్లు), శుభ్‌మన్ గిల్ (14 బంతుల్లో 33; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), జోస్ బట్లర్ (33 బంతుల్లో 54; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), రూథర్‌ఫోర్డ్ (28 బంతుల్లో 46; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) సత్తా చాటారు. పంజాబ్ బౌలర్లలో అర్షదీప్ 2, జన్సెన్, మ్యాక్స్‌వెల్ తలో వికెట్ పడగొట్టారు.

మళ్లీ పెరిగిన బంగారం ధర! తులం ఎంతంటే..
స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. కొన్ని రోజులుగా భారీగా పెరుగుతున్న బంగారం గడిచిన రెండు రోజుల్ల తగ్గుముఖం పట్టింది. తిరిగి ఈరోజు మళ్లీ ధరలో పెరుగుదల నమోదైంది. వివిధ ప్రాంతాల్లో బుధవారం రోజున గోల్డ్ రేట్లు(Today Gold Rate) ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.81,950 (22 క్యారెట్స్), రూ.89,400 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. మంగళవారం ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర వరుసగా రూ.100, రూ.110 పెరిగింది.చెన్నైలో బుధవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.100, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.110 పెరిగింది. దీంతో గోల్డ్ రేటు రూ.81,950 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.89,400 (24 క్యారెట్స్ 10 గ్రామ్ గోల్డ్)కు చేరింది.ఇదీ చదవండి: పీఎస్‌యూల్లో వాటా విక్రయం వాయిదాదేశ రాజధాని నగరం దిల్లీలో బంగారం ధర నిన్నటితో పోలిస్తే పెరిగింది. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ.100 పెరిగి రూ.82,100కు చేరుకోగా..24 క్యారెట్ల ధర రూ.110 పెరిగి రూ.89,550 వద్దకు చేరింది.వెండి ధరలుబంగారం ధరలు పెరుగుతున్నట్లు వెండి ధరల్లోనూ బుధవారం మార్పులు వచ్చాయి. నిన్నటితో పోలిస్తే ఈ రోజు వెండి ధరలు పెరిగాయి. కేజీ వెండి రేటు(Silver Price) మంగళవారంతో పోలిస్తే రూ.1000 పెరిగి రూ.1,11,000 వద్దకు చేరింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

గాజాలో హమాస్‌కు బిగ్ షాక్..
ఇజ్రాయెల్-హమాస్ పరస్పర దాడులు కొనసాగుతున్న వేళ ఆసక్తికర పరిమాణం చోటుచేసుకుంది. హమాస్‌కు వ్యతిరేకంగా గాజాలో పాలస్తీనియన్లు నిరసనలు తెలుపుతూ భారీ సంఖ్యలో రోడ్లకు మీదకు వచ్చారు. యుద్ధం ఆపాలంటూ నినాదాలు చేస్తూ వీధుల్లోకి వచ్చారు. మేము శాంతియుతంగా జీవించాలని అనుకుంటున్నాం అని రాసి ఉన్న ప్లకార్డులను ప్రదర్శించారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.గాజాలో హమాస్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఇజ్రాయెల్ దాడుల కారణంగా అనేక మంది పాలస్తీనియన్లు ప్రాణ భయంతో శిబిరాల్లో తలదాచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో హమాస్‌కు వ్యతిరేకంగా పాలస్తీనా వాసులు నిరసనలు తెలిపారు. ఇజ్రాయెల్‌తో ఘర్షణకు ముగింపు పలికి, అధికారం నుంచి వైదొలగాలని డిమాండ్ చేస్తూ వందలాది మంది పాలస్తీనియన్లు ఆందోళనలు చేశారు. ఉత్తర గాజాలోని బీట్ లాహియాతో సహా వివిధ ప్రాంతాల్లో మంగళవారం పెద్ద ఎత్తున నిరసనలకు దిగారు. ‘యుద్ధాన్ని ఆపాలి, మేము శాంతియుతంగా జీవించాలని అనుకుంటున్నాం అని రాసి ఉన్న ప్లకార్డులను ప్రదర్శించారు. ఈ సందర్భంగా గాజాలోని ప్రజలను రక్షించేందుకు హమాస్ తన అధికారాన్ని ఎందుకు వదులుకోదని వారు ప్రశ్నించారు. దీనికి సంబంధిచిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.అయితే, హమాస్‌కు వ్యతిరేకంగా నిరసనలకు ఎవరు నేతృత్వం వహించారు అనేది తెలియరాలేదు. టెలిగ్రామ్‌లో వచ్చిన సందేశాల ఆధారంగానే తాము ఆందోళనల్లో పాల్గొన్నామని నిరసనకారుల్లో కొందరు తెలిపారు. ఇదిలా ఉండగా.. 2007 నుంచి గాజాను హమాస్ పాలిస్తోంది. ఇజ్రాయెల్‌పై హమాస్ మెరుపు దాడుల కారణంగా యుద్ధం ప్రారంభమైంది. దాదాపు 17 నెలల నుంచి ఇజ్రాయెల్-హమాస్‌ల మధ్య యుద్ధం సాగుతోంది. యుద్ధం కారణంగా ఇప్పటివరకు చేసిన దాడులకు 50 వేల మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయినట్లు గాజా ఆరోగ్య శాఖ తెలిపింది. మరో 1.13 లక్షల మంది గాయపడినట్లు వెల్లడించింది.Large protests against Hamas's fascism in Gaza today, with thousands demanding dignity, an end to the war & destruction, and calling on the terror group to "get out." Listen to Palestinians in Gaza; cover these demonstrations; be their voice; amplify their cries. Down with Hamas! pic.twitter.com/c9iHyqvAO5— Ahmed Fouad Alkhatib (@afalkhatib) March 25, 2025ఈ యుద్ధం ప్రారంభం నుంచి గాజాలో హమాస్‌కు వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల తొలిదశ కాల్పుల విరమణ పొడిగింపును హమాస్ నిరాకరించింది. ఇటీవల కాల్పుల విరమణ ముగిసిన తర్వాత వారం వ్యవధిలోనే మళ్లీ దాడులు మొదలుకాగా.. వీటిలో దాదాపు 673 మంది చనిపోయారు. దీంతో, ఇజ్రాయెల్ దాడులను మరింతగా పెంచడంతో ప్రాణ నష్టం జరుగుతోంది. ఈనెల మొదట్లో గాజాలోకి మానవతా సాయాన్ని అడ్డుకోవడంతో అక్కడి పరిస్థితులు మరింత క్షీణించాయి."Out, out, out! #Hamas get out!"#Gaza residents pour on the streets chanting slogans against the militant organization that ruled Gaza for 20 years.pic.twitter.com/af9PKVZDhg— Ahmed Quraishi (@_AhmedQuraishi) March 26, 2025

అప్పులు చేయడంలో రికార్డు సృష్టించిన చంద్రబాబు
సాక్షి, విజయవాడ: ఏపీలో ఎన్నికలకు ముందు సంపద సృష్టిస్తామన్న చంద్రబాబు.. ఇప్పుడు అప్పులు చేయడంలో రికార్డు సృష్టించారు. కూటమి ప్రభుత్వానికి అప్పు వారమైన మంగళవారం(నిన్న) రోజున 7.09 శాతం వడ్డీతో మరో రూ.4,548 కోట్లు అప్పు తీసుకుంది కూటమి ప్రభుత్వం. దీంతో, చంద్రబాబు చేసిన అప్పులు రికార్డు స్థాయిలో రూ.1.52లక్షల కోట్లకు చేరుకున్నాయి.అప్పులు చేయడంలో చంద్రబాబు సర్కార్ దూసుకెళ్తోంది. తాజాగా కూటమి ప్రభుత్వం రూ.4,548 కోట్లు తీసుకుంది. ఇందుకు గాను 7.09 శాతం వడ్డీతో అప్పు తీసుకోవడం గమనార్హం. దీంతో, రాష్ట్ర చరిత్రలో ఒక్క ఏడాదిలో ఇంత అప్పులు చేసిన ఘనత చంద్రబాబుదే. బడ్జెట్లో చెప్పిన దానికి మించి కూటమి సర్కార్ అప్పులు చేసింది. బడ్జెట్ అప్పులు రూ.98,088 కోట్లకు చేరగా.. బడ్జెట్ బయట అప్పు రూ.54,700 కోట్లకు చేరుకుంది. దీంతో, బడ్జెట్ బయట, లోపల.. చంద్రబాబు చేసిన అప్పులు రూ.1.52లక్షల కోట్లకు చేరుకుంది. అయితే, ఇన్ని అప్పులు చేసినా.. కూటమి ప్రభుత్వం మాత్రం సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయడం లేదు.ఇదిలా ఉండగా.. సీఎం చంద్రబాబు పాలనలో రాష్ట్ర ఆదాయం తిరోగమనంలో ఉందని కాగ్ తేల్చేసింది. ఒకవైపు రెవెన్యూ రాబడి తగ్గిపోతుండగా.. మరోవైపు అప్పులు భారీగా పెరిగిపోతున్నాయని స్పష్టంచేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి వరకు బడ్జెట్ రాబడులు, వ్యయాలకు సంబంధించిన గణాంకాలను కాగ్ గత గురువారం వెల్లడించింది.భారీగా తగ్గిన రెవెన్యూ రాబడులు.. పన్నులు ఎటువంటి ఆర్థిక సంక్షోభాలు లేనందున సాధారణంగా అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో వచ్చిన రాబడులకన్నా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ రాబడులు పెరగాలి. అందుకు పూర్తి విరుద్ధంగా 2023–24 ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి వరకు వచ్చిన రెవెన్యూ రాబడుల కన్నా.. 2024–25 ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి వరకు వచ్చిన రెవెన్యూ రాబడుల్లో రూ.11,450కోట్ల మేర తగ్గుదల నమోదైంది. అంటే చంద్రబాబు పాలనలో సంపదలోనూ, వృద్ధిలోనూ రాష్ట్రం తిరోగమనంలో పయనిస్తున్నట్లు స్పష్టమవుతోంది. అమ్మకం పన్నుతోపాటు స్టాంప్స్, రిజిస్ట్రేషన్స్ ఆదాయం కూడా తగ్గిపోయింది. గత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే ప్రస్తుత ఆర్థిక ఏడాదిలో ఫిబ్రవరి వరకు అమ్మకం పన్ను ఆదాయం రూ.1,068 కోట్లు తగ్గినట్లు కాగ్ గణాంకాలు స్పష్టం చేశాయి. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల ఆదాయం కూడా రూ.721 కోట్లు తగ్గిపోయింది. అమ్మకం పన్ను ద్వారా వచ్చే ఆదాయం తగ్గడం అంటే ప్రజల కొనుగోలు శక్తి పడిపోవడమేనని ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు. భారీగా పెరిగిన అప్పులు... తగ్గిన కేంద్రం గ్రాంట్లు 2024–25 బడ్జెట్ అంచనాల్లో పేర్కొన్న దానికంటే రాష్ట్ర అప్పులు భారీగా పెరిగినట్లు కాగ్ గణాంకాలు స్పష్టం చేశాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి వరకే బడ్జెట్ పరిధిలోనే రూ.90,557 కోట్లు అప్పు చేసినట్లు కాగ్ వెల్లడించింది. ఆర్థిక సంవత్సరం మొత్తానికి రూ.70 వేల కోట్లు అప్పు చేస్తామని బడ్జెట్లో పేర్కొన్నారు. ఆర్థిక సంవత్సరం ముగియడానికి మరో నెల ఉండగానే అదనంగా రూ.20 వేల కోట్లు అప్పు చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రావాల్సిన గ్రాంట్లు కూడా భారీగా తగ్గిపోయాయి. గత ఆర్థిక సంవత్సరం ఫిబ్రవరితో పోలిస్తే ఈ ఆర్థిక ఏడాదిలో ఫిబ్రవరి వరకు గ్రాంట్ల రూపంలో రావాల్సిన నిధుల్లో రూ.16,766 కోట్ల తగ్గుదల నమోదైంది.

ట్రంప్ మరో సంచలన నిర్ణయం.. ఎన్నికల్లో పౌరసత్వ రుజువుకు పెద్దపీట
వాషింగ్టన్ డీసీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. అమెరికా ఎన్నికల ప్రక్రియలో భారీ మార్పులు చేస్తూ ఒక కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు. దీనిలో ఓటరు నమోదు కోసం పౌరసత్వానికి సంబంధించిన ధ్రువపత్రాన్ని తప్పనిసరి చేశారు. ఇటువంటి మార్పులు చేర్పుల కారణంగా చట్టపరమైన సవాళ్లు ఎదురుకానున్నాయి.ట్రంప్ సంతకం చేసిన ఉత్తర్వులోని వివరాల ప్రకారం ఇంతవరకూ అమెరికాలో జరుగుతున్న ఎన్నికల ప్రక్రియ(Election process)లో అత్యవసమైన ఎన్నికల నిబంధనలను అమలు చేయడంలో విఫలమయ్యారని ఆరోపించారు. అలాగే ఓటరు జాబితాలను వెలువరించడంలో, ఎన్నికల సంబంధిత నేరాలను విచారించడానికి అందరూ సమాఖ్య సంస్థలకు సహకరించాలని ఆ ఉత్తర్వులో కోరారు. ఎన్నికల నిబంధనలను పాటించని రాష్ట్రాలు సమాఖ్య నిధులలో కోతలను ఎదుర్కోవలసి ఉంటుందని ఆ ఉత్తర్వులో హెచ్చరించారని ఎన్డీటీవీ తన కథనంలో పేర్కొంది. సమాఖ్య ఎన్నికలలో ఓటు వేసేందుకు పాస్‌పోర్ట్ వంటి పౌరసత్వ రుజువును తప్పనిసరి చేశారు.ఎన్నికల రోజు తర్వాత అందుకున్న మెయిల్-ఇన్ బ్యాలెట్(Mail-in ballot)లను రాష్ట్రాలు ఇకపై అంగీకరించకూడదని దీనిలో స్పష్టం చేశారు. ట్రంప్ ప్రభుత్వం తాము తీసుకున్న ఈ నిర్ణయం ఎన్నికల్లో అక్రమాలు, మోసాలను అరికట్టేందుకేనని పేర్కొంది. ముఖ్యంగా మెయిల్-ఇన్ ఓటింగ్ సందర్భంలో డాక్యుమెంట్ మోసాలు జరుగుతున్నాయని ట్రంప్ పేర్కొన్నారు. ఈ ఆర్డర్‌పై సంతకం చేస్తున్నప్పుడు ట్రంప్ అమెరికా ఎన్నికల్లో జరుగుతున్న అవకతవకలను ప్రస్తావించారు. ఈ తాజా ఉత్తర్వు ఇటువంటి అవకతవకలను అంతం చేస్తుందని పేర్కొన్నారు.రిపబ్లికన్ చట్టసభ సభ్యులు ఈ ఉత్తర్వుకు మద్దతు ప్రకటించారు. ఇది ఎన్నికల సమగ్రతపై ప్రజల విశ్వాసాన్ని పునరుద్ధరించడానికి ఉపయోపగడుతుందని పేర్కొన్నారు. జార్జియా విదేశాంగ కార్యదర్శి బ్రాడ్ రాఫెన్స్‌పెర్గర్ మాట్లాడుతూ ఈ ఉత్తర్వు అమెరికన్ పౌరులు మాత్రమే ఇక్కడి ఎన్నికల ఫలితాలను నిర్ణయించేలా ఉందని పేర్కొన్నారు. మరోవైపు డెమొక్రాట్లు ఈ ఉత్తర్వును ఖండించారు. కొందరు ఓటర్లు ఓటు హక్కును కోల్పోతారని వారు పేర్కొన్నారు. 2023 నాటి ఒక నివేదిక ప్రకారం అర్హత కలిగిన అమెరికా పౌరులలో తొమ్మిది శాతం మందికి పౌరసత్వ రుజువు అందుబాటులో లేదని తెలుస్తోంది.మరోవైపు ఇప్పటివరకూ ఎన్నికల సమయంలో 18 రాష్ట్రాలు ఎన్నికల రోజు తర్వాత అందుకున్న మెయిల్ బ్యాలెట్లను ఆ తేదీకి ముందు పోస్ట్‌మార్క్ చేసినంత వరకు అంగీకరిస్తూ వస్తున్నాయి. అధ్యక్షుడు ట్రంప్ ఇకపై ఈ పద్ధతికి స్వస్తి పలికారు. కాగా కొలరాడో డెమోక్రటిక్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ జెనా గ్రిస్వోల్డ్ మాట్లాడుతూ ఈ ఉత్తర్వు సమాఖ్య ప్రభుత్వం వాడుతున్న చట్టవిరుద్ధమైన ఆయుధంగా అభివర్ణించారు. ట్రంప్ ఓటర్ల సంఖ్యను మరింతగా తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.ఇది కూడా చదవండి: Kashmir: హురియత్ దుకాణం బంద్.. వేర్పాటువాదుల నోటికి తాళం

ఐసీయూలో తల్లి.. IPLకు నో చెప్పిన హీరోయిన్
హీరోయిన్, ఐటమ్ సాంగ్స్ చేసి గుర్తింపు తెచ్చుతున్న నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్. తెలుగులోనూ ప్రభాస్ సాహో మూవీలో నటించింది. కెరీర్ పరంగా ఎప్పుడూ ఏదో ఓ సినిమా చేస్తూ బిజీగా ఉండే ఈమె.. సడన్ గా ఆస్పత్రిలో కనిపించింది. ఈమె తల్లి ఐసీయూలో ఉండటమే దీనికి కారణం.(ఇదీ చదవండి: పరువు పోతుందని భయపడ్డాను.. ఒకప్పటి హీరోయిన్ సుహాసిని)శ్రీలంకకు చెందిన జాక్వెలిన్.. చాన్నాళ్ల క్రితమే మన దేశానికి వచ్చేసింది. హిందీ మూవీస్ చేస్తూ ముంబైలో సెటిలైపోయింది. తెలుగు, కన్నడ, తమిళంలోనూ పలు చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. ఈమె తల్లితో పాటు కలిసుంటోంది. అయితే జాక్వెలిన్ తల్లి కిమ్ కి సోమవారం గుండెపోటు రావడంతో ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. ఇంకా ఆమె ఐసీయూలోనే ఉన్నారు. తాజాగా సల్మాన్ ఖాన్ కూడా పరామర్శించి వెళ్లినట్లు తెలుస్తోంది.ఇకపోతే ఐపీఎల్ లో గౌహతి వేదికగా గురువారం కోల్ కతా-రాజస్థాన్ మ్యాచ్ జరగనుంది. దీనికి ముందు ప్రారంభోత్సవ వేడుకలకు జాక్వెలిన్ హాజరై ఫెర్ఫార్మెన్స్ ఇవ్వాల్సి ఉంది. కానీ తల్లి ఐసీయూలో ఉండటంతో దీనికి నో చెప్పేసింది. ప్రస్తుతాకైతే ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలుస్తోంది.(ఇదీ చదవండి: మిలియన్ డాలర్ 'కోర్ట్'.. నానికి ఇది చాలా స్పెషల్)

కేటీఆర్‌పై కేసు నమోదు
సాక్షి, నల్లగొండ: మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై కేసు నమోదైంది. నల్లగొండ జిల్లాలో మున్సిపల్ మాజీ చైర్పర్సన్ రజిత ఫిర్యాదు మేరకు నకిరేకల్ పోలీసులు కేటీఆర్‌పై కేసు నమోదు చేసినట్టు తెలిపారు.వివరాల ప్రకారం.. తెలంగాణలో పదో తరగతి పరీక్షల్లో పేపర్ లీక్, మాస్ కాపీయింగ్ వ్యవహారంలో నిందితులతో తమకు సంబంధాలు ఉన్నాయంటూ తమపై కేటీఆర్ ట్వీట్ చేశారని మున్సిపల్ మాజీ చైర్పర్సన్ రజిత తెలిపారు. దీనికి సంబంధించి.. బీఆర్ఎస్ సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారంటూ రజిత.. కేటీఆర్‌పై ఫిర్యాదు చేశారు. పదో తరగతి పేపర్ లీక్ ఘటనలో కేటీఆర్‌తో పాటు క్రిషాంక్, కొణతం దిలీప్ తనపై తప్పుడు ఆరోపణలు చేశారని అన్నారు. నిరాధార ఆరోపణలు చేశారని మండిపడ్డారు. నిందితుడు చిట్ల ఆకాష్ తన డ్రైవర్ అంటూ తప్పుడు ప్రచారం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.ఆమె ఫిర్యాదుతో నకిరేకల్ పోలీసులు.. పలు సెక్షన్ల కింద కేటీఆర్‌పై రెండు కేసులు నమోదు చేసినట్టు తెలిపారు. ఇదిలా ఉండగా.. పేపర్ లీకేజీ ఘటనలో ఇప్పటికే పోలీసులు ఆరుగురిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. 🚨A Shocking Case of SSC Paper Leak as well as Nexus for Top Rankings - Congress leaders involved with Private School Management to send the SSC 10th Class Examination First Day Question paper through Whatsapp Groups...While 15 people have been involved,only 6 have been… pic.twitter.com/XHBScJBrY7— Dr.Krishank (@Krishank_BRS) March 24, 2025

‘క్లైమెట్ ఎమర్జెన్సీ’..ఇలాంటప్పడు ఈ సిరి ధాన్య పంటలే మేలు..!
కరువు, భూగర్భ జలాలు అడుగంటడం, సాధారణం కన్నా ఎక్కువగా 4–5 అధిక ఉష్ణోగ్రతలు నమోదవ్వడంతో భూతాపం ముందెన్నడూ ఎరుగనంతగా పెరిగిపోతోంది.. 2024 ఏడాదిలో అన్ని నెలలూ మానవాళి చరిత్రలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎల్‌నినో కారణంగా ఇలా జరిగిందేమో అనుకుంటే.. లానినా దశలో కూడా 2025లో మొదటి 3 నెలలు కూడా రికార్డు స్థాయిలో పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మనం ఇప్పుడు క్లైమెట్ ఎమర్జెన్సీ స్థాయిలో పర్యావరణ సంక్షోభాన్ని అనుభవిస్తున్నామని చెప్పకతప్పదు. అందుకు తాజా నిదర్శనం.. రిజర్వాయర్లు ఖాళీ అవుతున్నాయి. జీవనదులు ఎండి΄ోతున్నాయి. మట్టి ఉష్ణోగ్రత పెరిగిపోతోంది. పంటలకు గడ్డు కాలం వచ్చింది. ప్రస్తుత రబీ సీజన్లో తెలుగునాట కొన్ని జిల్లాల్లో వరి తదితర పంటలు, పండ్ల తోటలు నిలువునా ఎండిపోతున్నాయి. ఇది స్పష్టంగా ‘క్లైమెట్ ఎమర్జెన్సీ’ పరిస్థితే! కిం కర్తవ్యం?వాతావరణ మార్పులను తట్టుకునేవి, తక్కువ నీటి అవసరం కలిగినవి అయిన చిరుధాన్యాలను ప్రధాన ఆహార పంటలుగా సాగు చేయాలని హైదరాబాద్‌లోని భారతీయ చిరుధాన్యాల పరిశోధనా సంస్థ(ఐ.ఐ.ఎం.ఆర్.) సూచిస్తోంది. రైతుకు పర్యావరణ, ఆర్థిక, పౌష్టికాహార భద్రతనిచ్చే ఈ పంటలు వినియోగదారులకు సంపూర్ణ పౌష్టికాహారాన్ని అందిస్తాయి. ప్రకృతి వనరుల ఆధారంగానే వ్యవసాయం సాగేది. వర్షం మన వ్యవసాయానికి ముఖ్యాధారం. వర్షం ఎప్పుడొస్తుందో.. ఎంత తక్కువ కురుస్తుందో.. వర్షాకాలం మధ్యలో ఎన్ని రోజులు వర్షం మొహం చాటేస్తుందో తలపండిన వారికి కూడా అంతుపట్టని దశకు చేరాం. పెద్ద నదులపై ఉన్న రిజర్వాయర్లు సైతం వేసవి అడుగంటిపోవడంతో ఆయకట్టు భూములకు కూడా సాగు నీటి భద్రత కరువైపోయే పరిస్థితులు వచ్చాయి. దీని అర్థం ఏమిటంటే.. ఇంతకుముందు వేస్తున్న అధికంగా నీటి అవసరం ఉండే పంటల్నే గుడ్డిగా ఇక మీదట సాగు చేయలేం. నీటి అవసరం అంతగా అవసరం లేని ఆహార పంటల వైపు దృష్టి మరల్చడం రైతులకు, సమాజానికి శ్రేయస్కరం అంటున్నారు నిపుణులు. వచ్చే ఖరీఫ్ సీజన్లో సాగు చేసే పంటలను విజ్ఞతతో ఎంపిక చేసుకోవాలని ఆయన సూచిస్తున్నారు. ఈ కోవలో ముందు వరుసలో ఉండేవి.. చిరుధాన్య పంటలు. జొన్న, సజ్జ, రాగి, కొర్ర, ఊద, సామ, అరికెలు, ఒరిగెలు.. ఇవీ మనకు ముఖ్యంగా తెలిసిన చిరుధాన్య పంటలు (మిల్లెట్స్). దక్షిణ భారతీయులకు వేలాది ఏళ్ల క్రితమే బాగా పరిచయమైన పంటలివి.. కొత్తవి కాదు. హరిత విప్లవం పేరుతో వరి, గోధుమ వంటి ఆహార పంటలను ప్రభుత్వం వ్యాప్తిలోకి తేవడానికి ముందు వేలాది ఏళ్లుగా మన పూర్వీకులు తింటూ ఆరోగ్యంగా జీవించడానికి కారణభూతమైన పంటలివి. పర్యావరణ, వాతావరణ సంక్షోభకాలంలో తిరిగి ఈ పంటల వైపు మన ప్రజలు, రైతులు, ప్రభుత్వాలు దృష్టిసారించాల్సిన అవసరం తోసుకు వచ్చిన తరుణం ఇది.సి–4 రకం పంటలు మేలునీటి వనరులు అందుబాటులో లేని, సారం పెద్దగా లేని తేలిక, ఎర్ర నేలలు వరి, పత్తి వంటి పంటల సాగుకు అనుకూలం కావు. ఈ పంటలను సాంకేతిక పరిభాషలో ‘సి–3’ పంటలు అంటారు. తక్కువ వర్షం తోనే, కరువు కాలంలో సయితం అంతగా సారం లేని తేలిక, ఎర్ర నేలల్లోనూ ఖచ్చితమైన దిగుబడులనిచ్చేవి చిరుధాన్య పంటలు. సాంకేతిక పరిభాషలో వీటిని ‘సి–4’ పంటలు అంటారు.చిరుధాన్య పంటలు వరి కన్నా అనేక రకాలుగా మేలైనవి . సమాజానికి పౌష్టికాహార భద్రతతోపాటు రైతులకు కనీస ఆదాయ భద్రతను ఇవ్వడంతోపాటు, వరి గడ్డి కన్నా అధిక ΄ోషక విలువలున్న పశుగ్రాసాన్ని కూడా అందిస్తాయన్నారు. భూతాపం అసాధారణంగా పెరుగుతున్న సంక్షోభ కాలంలో ఇంతకు ముందు వేసిన పంటే వేస్తామని, ఇంతకు ముందు తినే ఆహారమే తింటామని అనుకుంటూ ఉండకూడదు. వాతావరణ అసమతుల్యతను తట్టుకొని పెరిగే చిరుధాన్యాలను ముఖ్య ఆహారంగా తినటం మొదలుపెడితే రైతులూ పండించడం మొదలు పెడతారు. తెలుగు రాష్ట్రాల వ్యవసాయ శాఖలు, రైతులు అనువుకాని భూముల్లో వరి, పత్తి, మొక్కజొన్న వంటి పంటలను లక్షల ఎకరాల్లో సాగు చేయడం మాని.. చిరుధాన్యాల సాగుపై దృష్టి సారించాలని నిపుణులు సూచిస్తున్నారు. సి–4 పంటల విశిష్టత ఏమిటి?సి–4 రకం పంటల విశిష్టత ఏమిటంటే.. అతి తక్కువ నీటితో, తక్కువ పంట కాలంలోనే కరువును, అధిక ఉష్ణోగ్రతను తట్టుకొని, అధిక పౌష్టిక విలువలతో కూడిన ఆహార ధాన్యాలను అందిస్తాయి. వాతావరణం నుంచి బొగ్గుపులుసు వాయువును, సూర్యరశ్మిని గ్రహించి అధిక ఉష్ణోగ్రతలు, కరువు పరిస్థితుల్లో సైతం ఆహారాన్ని ఉత్పత్తి చేసుకొని మంచి దిగుబడులు ఇవ్వడంలో సి–4 పంటలు సి–3 రకం పంటలకన్నా అధిక సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. భూతాపాన్ని పెంచే హరిత గృహ వాయువులను చిరుధాన్య పంటలతో పోల్చితే వరి పంట 20 రెట్లు ఎక్కువగా విడుదల చేస్తున్నది. అందుకే చిరుధాన్యాలు రైతులకు బీమా ఇవ్వగలిగిన పంటలన్నారు. పప్పుధాన్యాలు, నూనెగింజలతో కలిపి సమీకృత వ్యవసాయ పద్ధతుల్లో సాగు చేసినప్పుడు ఎరువుల అవసరం, చీడపీడల బెడద కూడా చిరుధాన్య పంటలకు పెద్దగా ఉండదు.తేలిక భూముల్లో, ఎర్ర నేలల్లో మొక్కజొన్న, పత్తి సాగు చేస్తే వర్షాలు సక్రమంగా పడనప్పుడు ఈ పంటలు రైతులను తీవ్ర నష్టాల పాలుజేయడానికి అవకాశాలెక్కువ. చెరకు సాగుకు 2,100 ఎం.ఎం, వరికి 1,250 ఎం.ఎం., పత్తికి 600 ఎం.ఎం. నీరు అవసరం. అయితే, జొన్నలకు 400 ఎం,ఎం., సజ్జ, రాగి, కొర్ర తదితర స్మాల్ మిల్లెట్లకు 350 ఎం.ఎం. నీరు సరి΄ోతుంది. వేరుశనగకు 450 ఎం.ఎం., పప్పుధాన్యాలకు 300 ఎం.ఎం., మొక్కజొన్నకు 500 ఎం.ఎం. నీరు అవసరమవుతుంది. వ్యవసాయ శాఖలు రైతులను చైతన్య పరచి జొన్న, సజ్జ, రాగి వంటి పంటలను సూచించాలి. స్మాల్ మిల్లెట్స్ అయిన కొర్రలు, సామలు, ఊదలు, అరికెలు, ఒరిగెలు వంటి పౌష్టిక విలువలు కలిగిన ఈ పంటల సాగును తెలుగు రాష్ట్రాల్లో వ్యవసాయ శాఖలు విస్తృతంగా ప్రోత్సహించాలి.తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న క్రాప్ కాలనీలలో ఆయా ప్రాంతాన్ని, నేల స్వభావాన్ని బట్టి కొన్ని రకాల పంటలను ప్రోత్సహించి, దగ్గర్లోనే ప్రాసెసింగ్ సెంటర్లను ఏర్పాటు చేయడం వల్ల రైతుల ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లభించే అవకాశం ఉంటుంది. పంటల కాలనీలలో చిరుధాన్య పంటలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉంది. సి–3 పంటలు 1. వరి, గోధుమ, పత్తి, పొద్దుతిరుగుడు..2. చల్లని వాతావరణం (20–25 డిగ్రీల సెల్షియస్) అనుకూలం. 3. భూమ్మీద మొక్కల్లో 95% వరకు సి–3 రకం మొక్కలుంటాయి4. అధిక ఉష్ణోగ్రతను, కరువును తట్టుకునే సామర్థ్యం తక్కువ5. వాతావరణంలో బొగ్గుపులుసు వాయువు వల్ల భూతాపం పెరిగేకొద్దీ దిగుబడి తగ్గుతుంది∙6. పంట కాలం ఎక్కువ.. 100–140 రోజులు7. సాగు నీరు బాగా అవసరం. బెట్ట పరిస్థితులను ఎక్కువ కాలం తట్టుకోలేవు8. వరికి 1,250 ఎం.ఎం., చెరకుకు 2,100 ఎం.ఎం., పత్తికి 600 ఎం.ఎం. వర్ష΄ాతం కావాలి 9. సారవంతమైన, నీటి వసతి ఉండే భూములు అనుకూలం10. వాతావరణంలో భూతాపం పెరుగుతున్నకొద్దీ ఈ పంటల్లో ΄ోషకాలు, ఖనిజ లవణాలు తగ్గుతాయి11. ఎరువుల అవసరం ఎక్కువసి–4 పంటలు1. కొర్ర, అరిక, సామ, అండుకొర్ర, ఊద, జొన్న, సజ్జ, రాగి.2. వేడి వాతావరణ (30–45 డిగ్రీల సెల్షియస్) పరిస్థితులను తట్టుకుంటాయి3. భూమ్మీద మొక్కల్లో 5% వరకు సి–4 రకం మొక్కలుంటాయి4. అధిక ఉష్ణోగ్రతను, కరువును తట్టుకునే సామర్థ్యం ఎక్కువ5. వాతావరణంలో బొగ్గుపులుసు వాయువు వల్ల భూతాపం పెరుగుతున్నా దిగుబడి తగ్గదు∙6. పంట కాలం తక్కువ.. 60–95 రోజులు (అరికలు 180 రోజులు)7. సాగు నీటి అవసరం బాగా తక్కువ. నీటి కొరతను ఎక్కువ కాలం తట్టుకోగలవు8. మొక్కజొన్నకు 500 ఎం.ఎం, జొన్నకు 400 ఎం.ఎం., రాగి, సజ్జలకు 350 ఎం.ఎం. చాలు. కొర్ర, సామ, అరిక, ఊద, అండుకొర్రలకు ఇంకా తక్కువ వర్షపాతం చాలు.9. తేలిక భూములు, భూసారం తక్కువగా ఉండే మెట్ట భూములు అనుకూలం10. పౌష్టిక విలువలు ఎక్కువ. పిండి పదార్థంతోపాటు అధిక పీచు, నాణ్యమైన మాంసకృత్తులు, ఖనిజ లవణాలు సమృద్ధిగా ఉన్న సిరిధాన్యాలివి 11. ఎరువుల అవసరం లేదు/తక్కువ జీఎస్టీ ఎత్తివేయాలిపర్యావరణానికి హాని కలిగించే వరి, గోధుమ వంటి పంటలకు సబ్సిడీలు ఇస్తున్న ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణకు దోహదపడే చిరుధాన్యాలపై మాత్రం ప్రభుత్వం జీఎస్టీ విధిస్తుండటం సమంజసం కాదు. జీఎస్టీ రద్దు చేయాలి. చిరుధాన్యాలను ప్రభుత్వాలు మద్దతు ధరకు సేకరించి, ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రజలకు సబ్సిడీ ధరకు అందివ్వాలి. సి4 రకం పంటలైన సిరిధాన్యాలతోనే ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ, ఆహార, ఆరోగ్య భద్రత చేకూరుతుందని అందరూ గ్రహించాలి.– డాక్టర్ ఖాదర్ వలి, ప్రముఖ ఆహార ఆరోగ్య నిపుణులు, పద్మశ్రీ పురస్కార గ్రహీత --పతంగి రాంబాబు, సాగుబడి డెస్క్(చదవండి: పంట పొలాల్లో డ్రోన్..! ఇక నుంచి ఆ పనుల్లో మహిళలు..)
ప్రధాని మోదీ ఆర్థిక సలహాదారుగా సంజయ్ మిశ్రా
సోమిరెడ్డి ఫిర్యాదుతోనే నాపై అక్రమ కేసు: కాకాణి
వాటాలు పంచుకుందాం..టాలీవుడ్ దర్శకులు ఓకే అంటారా?
మళ్లీ పెరిగిన బంగారం ధర! తులం ఎంతంటే..
గాజాలో హమాస్‌కు బిగ్ షాక్..
వాతావరణ ఆధారిత వ్యవసాయ సలహాలు..!
ICC: ఎలైట్ ప్యానెల్ అంపైర్ల జాబితా విడుదల.. ఆ ఇద్దరికి దక్కని చోటు
కూటమిపై ఇదెక్కడి మాస్ ట్రోలింగ్ మావా!
ODI WC Qualifiers: విండీస్ జట్టు ప్రకటన.. స్టార్ ఆల్‌రౌండర్ అవుట్
‘క్లైమెట్ ఎమర్జెన్సీ’..ఇలాంటప్పడు ఈ సిరి ధాన్య పంటలే మేలు..!
‘లిప్‌లాక్’ కి ముందు అతన్ని బ్రష్ చేసుకోమన్నా: నటి సురభి
‘విడాకులు మాత్రమే కావాలి.. నేనేమీ బికారిని కాదు.. ఆ దెయ్యం డబ్బు నాకొద్దు’
అలా అయితే.. నేను జట్టులో ఉండటం వేస్ట్: ధోని
అస్సలు జీర్ణించుకోలేకపోయా.. అయినా భాయ్‌కు అంతా తెలుసు: సిరాజ్
ఈ రాశి వారికి ఆర్థికాభివృద్ధి.. ధన, వస్తులాభాలు
రూ.కోట్లు కోల్పోయిన వ్యాపారవేత్త.. ఏం జరిగిందంటే..
'6 నెలల సమయమివ్వండి.. అర్జున్ వరల్డ్‌లోనే బెస్ట్ బ్యాటర్ అవుతాడు'
మన ఆస్కార్ అవార్డ్స్‌ను లాక్కున్నారు.. దీపికా పదుకొణె సంచలన వ్యాఖ్యలు
ఓట్లేయించుకున్నవారు జీతాలు పెంచుకున్నారు.. ఓటేసిన మనకు కనీస వేతనం లేదు!
టికెట్లివ్వగానే పని చేయడం మానేస్తున్నార్సార్!
ప్రధాని మోదీ ఆర్థిక సలహాదారుగా సంజయ్ మిశ్రా
సోమిరెడ్డి ఫిర్యాదుతోనే నాపై అక్రమ కేసు: కాకాణి
వాటాలు పంచుకుందాం..టాలీవుడ్ దర్శకులు ఓకే అంటారా?
మళ్లీ పెరిగిన బంగారం ధర! తులం ఎంతంటే..
గాజాలో హమాస్‌కు బిగ్ షాక్..
వాతావరణ ఆధారిత వ్యవసాయ సలహాలు..!
ICC: ఎలైట్ ప్యానెల్ అంపైర్ల జాబితా విడుదల.. ఆ ఇద్దరికి దక్కని చోటు
కూటమిపై ఇదెక్కడి మాస్ ట్రోలింగ్ మావా!
ODI WC Qualifiers: విండీస్ జట్టు ప్రకటన.. స్టార్ ఆల్‌రౌండర్ అవుట్
‘క్లైమెట్ ఎమర్జెన్సీ’..ఇలాంటప్పడు ఈ సిరి ధాన్య పంటలే మేలు..!
‘లిప్‌లాక్’ కి ముందు అతన్ని బ్రష్ చేసుకోమన్నా: నటి సురభి
‘విడాకులు మాత్రమే కావాలి.. నేనేమీ బికారిని కాదు.. ఆ దెయ్యం డబ్బు నాకొద్దు’
అలా అయితే.. నేను జట్టులో ఉండటం వేస్ట్: ధోని
అస్సలు జీర్ణించుకోలేకపోయా.. అయినా భాయ్‌కు అంతా తెలుసు: సిరాజ్
ఈ రాశి వారికి ఆర్థికాభివృద్ధి.. ధన, వస్తులాభాలు
రూ.కోట్లు కోల్పోయిన వ్యాపారవేత్త.. ఏం జరిగిందంటే..
'6 నెలల సమయమివ్వండి.. అర్జున్ వరల్డ్‌లోనే బెస్ట్ బ్యాటర్ అవుతాడు'
మన ఆస్కార్ అవార్డ్స్‌ను లాక్కున్నారు.. దీపికా పదుకొణె సంచలన వ్యాఖ్యలు
ఓట్లేయించుకున్నవారు జీతాలు పెంచుకున్నారు.. ఓటేసిన మనకు కనీస వేతనం లేదు!
టికెట్లివ్వగానే పని చేయడం మానేస్తున్నార్సార్!
సినిమా

పరువు పోతుందని భయపడ్డాను.. ఒకప్పటి హీరోయిన్ సుహాసిని
సెలబ్రిటీలు కూడా మనలాంటి మనుషులే. వాళ్లకు మనలానే అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. కాకపోతే చాలా తక్కువమంది మాత్రమే తమకు ఫలానా వ్యాధి ఉందని చెబుతుంటారు. రెండుమూడేళ్ల క్రితం హీరోయిన్ సమంత (Samantha) కూడా మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి బారిన పడ్డట్లు చెప్పింది. ఇప్పుడు సీనియర్ హీరోయిన్ సుహాసిని (Suhasini) కూడా తనకున్న అనారోగ్య సమస్యలు గురించి బయటపెట్టింది.తెలుగుతో పాటు దక్షిణాది భాషల్లో ఒకప్పుడు హీరోయిన్ గా చేసిన సుహాసిని.. ప్రస్తుతం తల్లి పాత్రల్లో నటిస్తున్నారు. మరోవైపు భర్తతో కలిసి నిర్మాతగానూ పలు సినిమాలు తీస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఈమె.. తనకు టీబీ (TB Disease) ఉందనే విషయాన్ని రివీల్ చేశారు. పరువు పోతుందనే భయంతో దీని గురించి దాచిపెట్టానని చెప్పుకొచ్చారు.(ఇదీ చదవండి: భార్య పుట్టినరోజు.. ఎన్టీఆర్ లవ్లీ పోస్ట్)'నాకున్న జబ్బుని నేను సీక్రెట్‌గా ఉంచాను. పరువు పోతుందని భయపడ్డాను. ఎవ్వరికీ తెలియకుండానే ఆరు నెలలు చికిత్స తీసుకున్నాను. కొన్నాళ్ల తర్వాత దీని గురించి బయటపెట్టి, అందరికీ టీబీ గురించి అవగాహన కల్పించాలని అనుకున్నాను' అని సుహాసిని చెప్పుకొచ్చారు.తమిళనాడుకు చెందిన సుహాసిని 1980లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. 1988లో దర్శకుడు మణిరత్నంని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీళ్లకు ఓ కొడుకు కూడా ఉన్నాడు. తమిళ స్టార్ హీరో కమల్ హాసన్.. ఈమెకు చిన్నాన్న అవుతాడు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి పూజా హెగ్డే డిజాస్టర్ సినిమా)

అమ్మలు హ్యాపీ బర్త్ డే.. భార్యపై ఎన్టీఆర్ పోస్ట్
జూ.ఎన్టీఆర్ (Ntr) ప్రస్తుతం జపాన్ లో ఉన్నాడు. గతేడాది మన దగ్గర రిలీజైన దేవర (Devara Movie).. ఈ 28న జపాన్ థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇదివరకే ప్రీమియర్స్ పడగా.. వాటికి తారక్ తోపాటు దర్శకుడు కొరటాల శివ కూడా హాజరవడం విశేషం.సతీసమేతంగా జపాన్ వెళ్లిన ఎన్టీఆర్.. తన భార్య ప్రణతి పుట్టినరోజు (Birthday) వేడుకల్ని మంగళవారం రాత్రి సెలబ్రేట్ చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన రెండు ఫొటోలని షేర్ చేసుకోవడంతో పాటు క్యూట్ క్యాప్షన్ కూడా పెట్టాడు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి పూజా హెగ్డే డిజాస్టర్ సినిమా)'అమ్మలు.. హ్యాపీ బర్త్ డే' అని తారక్ తన ఇన్ స్టాలో రాసుకొచ్చాడు. దీనికి నెటిజన్ల లైకులు కొట్టేస్తున్నారు. 2011లో తారక్-ప్రణతికి పెళ్లయింది. వీళ్లకు ఇద్దరు కొడుకులు ఉన్నారు.సినిమాల విషయానికొస్తే జపాన్ నుంచి వచ్చిన వెంటనే ఎన్టీఆర్.. ప్రశాంత్ నీల్ తీస్తున్న సినిమా షూటింగ్ లో పాల్గొంటాడు. తర్వాత షెడ్యూల్ బెంగళూరులో ఉన్నట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: కారు ప్రమాదంలో నటుడు సోనూసూద్ భార్య) View this post on Instagram A post shared by Jr NTR (@jrntr)

అభినవ్ సాహసాలు
‘ఆదిత్య, విక్కీస్ డ్రీమ్, డాక్టర్ గౌతమ్’ వంటి సందేశాత్మక బాలల చిత్రాలను తెరకెక్కించిన దర్శక–నిర్మాత భీమగాని సుధాకర్ గౌడ్ రూపొందించిన తాజా చిత్రం ‘అభినవ్’. సమ్మెట గాంధీ, సత్య ఎర్ర, మాస్టర్ గగన్, గీతా గోవింద్, అభినవ్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. శ్రీలక్ష్మీ ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ సమర్పణలో భీమగాని సుధాకర్ గౌడ్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ బాలల చిత్రం నవంబరు 14న విడుదల కానుంది.ఈ చిత్రం విలేకరుల సమావేశంలో భీమగాని సుధాకర్ గౌడ్ మాట్లాడుతూ– ‘‘స్వాతంత్య్ర సమరయోధుడైన తన తాతయ్య నారాయణరావు స్ఫూర్తితో అభినవ్ అనే సాహస బాలుడు ఓ గంజాయి మాఫియాను ఎలా అడ్డుకున్నాడు? అన్నదే ‘అభినవ్’ చిత్రం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగారు డ్రగ్స్ రహిత సమాజం కోసం సినిమా వాళ్లు చిన్న వీడియో చేయాలని కోరారు. నేను డ్రగ్స్ రహిత సమాజం కోసం నా వంతుగా ఈ సినిమాను నిర్మించి, దర్శకత్వం వహించాను’’ అని అన్నారు.

మేలో రైడ్
అజయ్ దేవగన్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘రైడ్ 2’. రాజ్‌కుమార్ గుప్తా దర్శకత్వం వహించారు. వీరిద్దరి కాంబినేషన్లో రూపొందిన సూపర్ హిట్ మూవీ ‘రైడ్’ (2018)కి సీక్వెల్‌గా ‘రైడ్ 2’ రూపొందింది. ఈ మూవీలో వాణీ కపూర్, రితేష్ దేశ్‌ముఖ్ ఇతర పాత్రలు పోషించారు. అభిషేక్ పాఠక్, కుమార్ మంగత్ పాఠక్, భూషణ్ కుమార్, గౌరవ్ నంద, క్రిషణ్ కుమార్, ప్రగ్యా సింగ్ నిర్మించారు.ఈ చిత్రాన్ని మే 1న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. ‘‘వాస్తవ ఘటనల నేపథ్యంలో రూపొందిన చిత్రం ‘రైడ్ 2’. ఈ మూవీలో ఐఆర్ఎస్ అధికారి అమయ్ పట్నాయక్‌గా అజయ్ దేవగన్ నటించారు. వాస్తవ ఘటనలకి సస్పెన్స్, థ్రిల్లింగ్ అంశాలు జోడించి తనదైన శైలిలో ఈ మూవీని తీర్చిదిద్దారు రాజ్‌కుమార్ గుప్తా. ‘రైడ్’ సినిమాలా ‘రైడ్ 2’ కూడా ప్రేక్షకులను అలరించేలా ఉంటుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది.
న్యూస్ పాడ్‌కాస్ట్
క్రీడలు

IPL 2025: అతడి యార్కర్లు అద్భుతం.. మా విజయావకాశాలను మేమే వదులుకున్నాం: గిల్
ఐపీఎల్ 2025లో భాగంగా నిన్న (మార్చి 25) జరిగిన మ్యాచ్‌లో గుజరాత్‌పై పంజాబ్ 11 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో శ్రేయస్ అయ్యర్ (97 నాటౌట్) సెంచరీ చేసే అవకాశం ఉన్నా, వదలుకుని తన జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఆరంభంలో ప్రియాంశ్ ఆర్య, ఆఖర్లో శశాంక్ సింగ్ మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడి పంజాబ్ భారీ స్కోర్ చేసేందుకు దోహద పడ్డారు.భారీ లక్ష్య ఛేదనలో గుజరాత్ కూడా అద్భుతంగా పోరాడింది. అయితే మధ్య ఓవర్లలో పంజాబ్ బౌలర్లు వారిని దెబ్బకొట్టారు. ఇన్నింగ్స్ 15, 16, 17 ఓవర్లలో గుజరాత్ కేవలం 18 పరుగులే చేయగలిగింది. ఇక్కడే ఆ జట్టు మ్యాచ్‌ను కోల్పోయింది. పంజాబ్ బౌలర్లలో విజయ్‌కుమార్ వైశాక్, అర్షదీప్ సింగ్ అద్భుతంగా బౌలింగ్ చేశారు. కీలక సమయంలో వరుస యార్కర్లతో విరుచుకుపడి గుజరాత్ బ్యాటర్లను కట్టడి చేశారు. గుజరాత్ తరఫున సాయి సుదర్శన్, రూథర్‌ఫోర్డ్ మెరుపు ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడ్డారు. అయినా వారి మెరుపులు సరిపోలేదు. ఇన్నింగ్స్ మధ్యలో పరుగులు రాబట్టలేకపోవడమే గుజరాత్ కొంపముంచింది.టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్.. నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 243 పరుగులు చేసింది. శ్రేయస్ 42 బంతుల్లో 5 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 97 పరుగులు (నాటౌట్), శశాంక్ 16 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 44 పరుగులు (నాటౌట్), ప్రియాంశ్ ఆర్య 23 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 47 పరుగులు చేశారు. మ్యాక్స్‌వెల్ డకౌట్ కాగా.. ఒమర్జాయ్ 16, స్టోయినిస్ 20 పరుగులు చేశారు. గుజరాత్ బౌలర్లలో సాయికిషోర్ అద్భుతంగా బౌలింగ్ చేసి 4 ఓవర్లలో కేవలం 30 పరుగులే ఇచ్చి 3 వికెట్లు తీయగా.. రబాడ, రషీద్ ఖాన్ తలో వికెట్ తీశారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన గుజరాత్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 232 పరుగులు మాత్రమే చేయగలిగింది. గుజరాత్ ఆటగాళ్లలో సాయి సుదర్శన్ (41 బంతుల్లో 74; 5 ఫోర్లు, 6 సిక్సర్లు), శుభ్‌మన్ గిల్ (14 బంతుల్లో 33; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), జోస్ బట్లర్ (33 బంతుల్లో 54; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), రూథర్‌ఫోర్డ్ (28 బంతుల్లో 46; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) సత్తా చాటారు. పంజాబ్ బౌలర్లలో అర్షదీప్ 2, జన్సెన్, మ్యాక్స్‌వెల్ తలో వికెట్ పడగొట్టారు.మ్యాచ్ అనంతరం గుజరాత్ కెప్టెన్ శుభ్న్ గిల్ మాట్లాడుతూ ఇలా అన్నాడు. బౌలింగ్, బ్యాటింగ్ చేస్తున్నప్పుడు మంచి అవకాశాలు లభించాయి. అయితే మేము వాటిని సద్వినియోగం చేసుకోలేకపోయాం. చాలా పరుగులు ఇచ్చామని అనుకుంటున్నాను. మా విజయావకాశాలను చేజేతులా వదులుకున్నాం. 15, 16, 17 ఓవర్లలో కేవలం 18 పరుగులే చేసాము. మొదటి మూడు ఓవర్లు కూడా ఎక్కువ పరుగులు చేయలేకపోయాము. ఇక్కడే మేము ఆటను కోల్పోయాము. చాలా సానుకూల అంశాలు కూడా ఉన్నాయి. సీజన్‌కు మంచి ప్రారంభం లభించిందని అనుకుంటున్నాను.విజయ్ కుమార్ వైశాక్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. 15 ఓవర్లు బెంచ్‌పై కూర్చొని, ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చి యార్కర్లు వేయడం అంత సులభం కాదు. వరుసగా యార్కర్లు వేయగలిగినందుకు వారికి (పంజాబ్ బౌలర్లు) క్రెడిట్ ఇవ్వాలి. ఈ వికెట్ బ్యాటింగ్ చేసేందుకు చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ ఈజీగా 240-250 పరుగులు స్కోర్ చేయవచ్చు. అయితే ఆ స్కోర్‌ను కాపాడుకోవాల్సి ఉంటుంది.

సెంచరీ త్యాగం చేసినందుకు బాధ లేదు.. ఆ పరుగులే మమ్మల్ని గెలిపించాయి: శ్రేయస్
పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ తొలి మ్యాచ్‌లోనే తన మార్కు చూపించాడు. సెంచరీ చేసే అవకాశం ఉన్నా, త్యాగం చేసి మరీ తన జట్టును గెలిపించాడు. శ్రేయస్ కెప్టెన్సీ ప్రభావం ఈ మ్యాచ్‌లో కొట్టొచ్చినట్లు కనిపించింది. బౌలర్లను మార్చడం, ఫీల్డ్‌ను సెట్ చేయడం, వ్యూహాలు పన్నడంలో శ్రేయస్ తిరుగులేని నాయకుడని మరోసారి నిరూపితమైంది. అర్షదీప్ సింగ్, విజయ్‌కుమార్ వైశాక్‌లను శ్రేయస్ అద్భుతంగా వాడుకున్నాడు. వ్యక్తిగతంగా సఫలమైన శ్రేయస్ సహచరుల్లో స్పూర్తి నింపడంలో కూడా సక్సెస్ అయ్యాడు. ఫలితంగా పంజాబ్ ఐపీఎల్లో తమ రెండో అత్యధిక స్కోర్‌ను నమోదు చేసి దాన్ని విజయవంతంగా కాపాడుకుంది.అహ్మదాబాద్ వేదికగా నిన్న (మార్చి 25) జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ గుజరాత్ టైటాన్స్‌ను 11 పరుగుల తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన గుజరాత్ తొలుత బౌలింగ్ చేసింది. గుజరాత్ నిర్ణయం తప్పని అరంగేట్రం ఆటగాడు ప్రియాంశ్ ఆర్య ఆదిలోనే నిరూపించాడు. 24 ఏళ్ల ఈ గవర్నమెంట్ టీచర్ కొడుకు (ఆర్య) తొలి మ్యాచ్ ఆడుతున్నాననే బెరుకు ఏమాత్రం లేకుండా గుజరాత్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 23 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 47 పరుగులు చేసి తృటిలో హాఫ్ సెంచరీ చేజార్చుకున్నాడు. మరో ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్ (8 బంతుల్లో 8; ఫోర్) ఆదిలోనే ఔటైనా శ్రేయస్ అయ్యర్ ఆర్యతో జతకట్టి ఇన్నింగ్స్‌ను నిర్మించాడు. వీరిద్దరి ధాటికి పంజాబ్ పవర్ ప్లేలో 73 పరుగులు చేసింది.బౌండరీతో ఖాతా ఓపెన్ చేసిన శ్రేయస్ ప్రసిద్ద్ కృష్ణ వేసిన ఇన్నింగ్స్ 17వ ఓవర్లో బీస్ట్ మోడ్‌లోకి వచ్చాడు. 3 సిక్సర్లు, బౌండరీ సహా 24 పరుగులు పిండుకున్నాడు. 19వ ఓవర్ తొలి బంతికే బౌండరీ బాది 95 పరుగులకు చేరిన శ్రేయస్.. ఆతర్వాత సెంచరీ చేసే అవకాశమున్నా (11 బంతులు మిగిలున్నాయి) శాశాంక్ సింగ్‌కు స్ట్రయిక్ ఇచ్చి అతని చేత విధ్వంసం సృష్టింపజేశాడు. సిరాజ్ వేసిన ఇన్నింగ్స్ చివరి ఓవర్లో పూనకాలు వచ్చినట్లు ఊగిపోయిన శశాంక్.. 5 బౌండరీలు సహా 23 పరుగులు పిండుకున్నాడు. ఫలితంగా పంజాబ్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 243 పరుగులు చేసింది. శ్రేయస్ 42 బంతుల్లో 5 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 97 పరుగులు చేసి అజేయంగా నిలువగా.. శశాంక్ 16 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 44 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. పంజాబ్ ఆటగాళ్లలో మ్యాక్స్‌వెల్ డకౌట్ కాగా.. ఒమర్జాయ్ 16, స్టోయినిస్ 20 పరుగులు చేశారు. గుజరాత్ బౌలర్లలో సాయికిషోర్ అద్భుతంగా బౌలింగ్ చేసి 4 ఓవర్లలో 30 పరుగులే ఇచ్చి 3 వికెట్లు తీయగా.. రబాడ, రషీద్ ఖాన్ తలో వికెట్ తీశారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన గుజరాత్‌కు సైతం మెరుపు అరంభమే లభించినప్పటికీ.. లక్ష్యం మరీ పెద్దది కావడంతో ఆ జట్టుకు ఓటమి తప్పలేదు. గుజరాత్ ఆటగాళ్లలో సాయి సుదర్శన్ (41 బంతుల్లో 74; 5 ఫోర్లు, 6 సిక్సర్లు), శుభ్‌మన్ గిల్ (14 బంతుల్లో 33; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), జోస్ బట్లర్ (33 బంతుల్లో 54; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), రూథర్‌ఫోర్డ్ (28 బంతుల్లో 46; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) సత్తా చాటారు. 14 ఓవర్ల వరకు గుజరాత్ టార్గెట్‌ను ఛేజ్ చేసేలా కనిపించింది. ఈ దశలో పంజాబ్ బౌలర్లు విజయ్‌కుమార్ వైశాక్, జన్సెన్, అర్షదీప్ గుజరాత్ బ్యాటర్ల జోరుకు కళ్లెం వేశారు. విజయ్‌కుమార్ గుజరాత్ బ్యాటర్లను బాగా కట్టడి చేశాడు. అంతిమంగా గుజరాత్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 232 పరుగులు మాత్రమే చేయగలిగింది. పంజాబ్ బౌలర్లలో అర్షదీప్ 2, జన్సెన్, మ్యాక్స్‌వెల్ తలో వికెట్ పడగొట్టారు.మ్యాచ్ అనంతరం శ్రేయస్ మాట్లాడుతూ ఇలా అన్నాడు. సీజన్ తొలి మ్యాచ్‌లోనే 97 పరుగులతో నాటౌట్‌గా నిలవడం శుభపరిణామం. తొలి బంతికే బౌండరీ కొట్టాను. అదే నన్ను ముందుకు నడిపించింది. రబాడ బౌలింగ్‌లో ఫ్లిక్ సిక్స్ కాన్ఫిడెన్స్‌ను పెంపొందించింది. చివరి ఓవర్లో శశాంక్ చేసిన పరుగులు చాలా కీలకం. సెంచరీ మిస్ చేసుకున్నందుకు బాధ లేదు. మేము ఓ టార్గెట్‌ను సెట్ చేసుకున్నాము. దాని కోసం ముందుకు వెళ్లాము. వైశాక్ అద్భుతంగా రాణించాడు. తొలి బంతి నుంచే యార్కర్లు వేయడం ప్రారంభించాడు. యార్కర్ల ప్లాన్ అమలు చేయడంలో అర్షదీప్ కీలకపాత్ర పోషించాడు. బంతి రివర్స్ స్వింగ్ అవుతుందని అర్షదీప్ చెప్పాడు. బంతికి ఉమ్ము రాయడం కలిసొచ్చిందని అనుకుంటున్నాను. అర్షదీప్ సాయి సుదర్శన్‌ను ఔట్ చేయడంతో మా గెలుపుకు బీజం పడింది. ఇదే ఊపును తదుపరి మ్యాచ్‌ల్లో కూడా ముందుకు తీసుకెళ్లాలని చూస్తున్నాము.

2032 తర్వాత ‘గాబా’ కనుమరుగు
బ్రిస్బేన్: ఆ్రస్టేలియాలోని ప్రఖ్యాత క్రికెట్ స్టేడియం ‘గాబా’ కనుమరుగు కానుంది. సుదీర్ఘకాలంగా ఎన్నో చిరస్మరణీయ మ్యాచ్‌లకు ఆతిథ్యమిచ్చిన బ్రిస్బేన్‌లోని ‘గాబా’ మైదానాన్ని 2032 ఒలింపిక్స్ తర్వాత కూల్చివేయనున్నారు. 2028 ఒలింపిక్స్‌కు లాస్ ఏంజెలిస్ ఆతిథ్యమిస్తుండగా... మరో నాలుగేళ్ల తర్వాత బ్రిస్బేన్ వేదికగా విశ్వక్రీడలు జరగనున్నాయి. దాని కోసం ఆ్రస్టేలియా ఇప్పటి నుంచే కసరత్తులు చేస్తోంది. ఇందులో భాగంగా... క్వీన్స్లాండ్ ప్రభుత్వం వేదికలపై కీలక నిర్ణయాలు తీసుకుంది. ఒలింపిక్స్ కోసం విక్టోరియా పార్క్‌లో 63 వేల మంది ప్రేక్షకుల సామర్థ్యంతో కూడిన నూతన అధునాతన స్టేడియం నిర్మాణం చేపట్టనున్నట్లు వెల్లడించింది. ఇందులోనే ఒలింపిక్స్ ఆరంభ, ముగింపు వేడుకలు నిర్వహించనున్నారు. విశ్వక్రీడలు ముగిసిన అనంతరం ‘గాబా’ మైదానాన్ని పూర్తిగా పడగొట్టి ఒలింపిక్స్ కోసం నిర్మించిన కొత్త స్టేడియంలోనే క్రికెట్ మ్యాచ్‌లు జరపనున్నారు. ఒకవేళ 2032 ఒలింపిక్స్ క్రీడల్లో క్రికెట్ మెడల్ ఈవెంట్‌గా కొనసాగితే క్రికెట్ ఈవెంట్ స్వర్ణ పతక పోరుకు మాత్రం పాత ‘గాబా’ మైదానమే ఆతిథ్యమివ్వనుంది. ‘గాబా స్టేడియానికి ఎంతో చరిత్ర ఉంది. దశాబ్దాలుగా ఇక్కడ ఎన్నో మరపురాని మ్యాచ్‌లు జరిగాయి. ఆటగాళ్లకు, అభిమానులకు ఈ మైదానంతో ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి.అయితే భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ఈ మైదానాన్ని కూల్చివేయనున్నారు. దీని స్థానంలో క్వీన్స్‌ల్యాండ్‌లో మరో కొత్త స్టేడియం సిద్ధమవుతుంది. అందులో ఐసీసీ ఈవెంట్లు, యాషెస్ సిరీస్, ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’ వంటి ప్రతిష్టాత్మక మ్యాచ్‌లు యధావిధిగా జరుగుతాయి’ అని క్వీన్స్‌ల్యాండ్ క్రికెట్ సీఈవో టెర్రీ స్వెన్సన్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. » 1931 నుంచి టెస్టు మ్యాచ్‌లకు ఆతిథ్యమిస్తున్న ‘గాబా’ స్టేడియంలో ఇప్పటి వరకు 67 పురుషుల టెస్టు మ్యాచ్‌లు, 2 మహిళల టెస్టులు జరిగాయి. »పేస్‌కు పెట్టింది పేరైన ‘గాబా’ పిచ్‌పై ఆ్రస్టేలియా జట్టు 1988 నుంచి 2021 వరకు ఒక్క టెస్టు మ్యాచ్ కూడా ఓడలేదు. 2020–21 పర్యటనలో భాగంగా ఆతిథ్య ఆస్ట్రేలియాపై టీమిండియా విజయం సాధించింది. »2032 ఒలింపిక్స్ ప్రణాళికల్లో భాగంగా ‘గాబా’ మైదానాన్ని ఆధునీకికరించాలని తొలుత భావించారు. అయితే అధిక వ్యయం కారణంతో ఆ ప్రణాళికను పక్కన పెట్టి పార్క్‌ల్యాండ్ ఇన్నర్ సిటీలో కొత్త స్టేడియం నిర్మాణం చేపడుతున్నారు. »ఒలింపిక్స్ ఆతిథ్య హక్కులు దక్కించుకున్న సమయంలో ‘గాబా’ మైదానాన్ని మరింత మెరుగు పరచాలని భావించినా... ఇప్పటికి నాలుగేళ్లు గడిచినా ఎలాంటి చర్యలు చేపట్టలేదు. »విశ్వక్రీడలకు మరో ఏడేళ్ల సమయమే ఉండటంతో కొత్త స్టేడియం నిర్మాణానికే మొగ్గుచూపారు. »ఇటీవల ఐఓసీ అధ్యక్షురాలిగా ఎన్నికైన క్రిస్టీ కొవెంట్రీ ప్రణాళికల విషయంలో పక్కాగా ఉండటంతో... ఆ్రస్టేలియా ప్రభుత్వం వేదికల నిర్మాణాన్ని వేగవంతం చేసింది.

ఇంగ్లండ్ లయన్స్‌తో భారత్ ‘ఎ’ జట్టు రెండు ప్రాక్టీస్ మ్యాచ్‌లు
న్యూఢిల్లీ: ఐపీఎల్ అనంతరం జరగనున్న ఇంగ్లండ్ పర్యటనకు బీసీసీఐ ప్రత్యేక ప్రణాళికలు వేస్తోంది. ఈ టూర్లో భాగంగా ఇంగ్లండ్‌తో టీమిండియా 5 మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడనుంది. 2007 తర్వాత ఇంగ్లండ్ గడ్డపై భారత జట్టు టెస్టు సిరీస్ గెలవలేదు. దీంతో ఈసారి మెరుగైన ఫలితం సాధించాలనే ఉద్దేశంతో టెస్టు సిరీస్ ఆరంభానికి ముందు ఇంగ్లండ్ లయన్స్ జట్టుతో భారత ‘ఎ’ టీమ్ రెండు ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడనుంది. ఎర్రబంతితో నాలుగు రోజుల పాటు సాగనున్న ఈ మ్యాచ్‌ల్లో ప్రధాన ఆటగాళ్లు కూడా బరిలోకి దిగే అవకాశాలున్నాయి. భారత్, ఇంగ్లండ్ మధ్య జూన్ 20 నుంచి హెడింగ్లే వేదికగా తొలి టెస్టు జరగనుంది. దానికంటే ముందే భారత ‘ఎ’ జట్టు ఇంగ్లండ్‌లో పర్యటించనుంది. ‘ఇంగ్లండ్ లయన్స్, భారత్ ‘ఎ’ జట్ల మధ్య మే 30న కాంటర్బరీలో తొలి ప్రాక్టీస్ మ్యాచ్ జరుగుతుంది. జూన్ 6 నుంచి నార్తంప్టన్‌లో రెండో మ్యాచ్ నిర్వహిస్తాం’ అని ఇంగ్లండ్, వెల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) వెల్లడించింది. ప్రస్తుతం టీమిండియా ప్లేయర్లంతా ఐపీఎల్లో బిజీగా ఉన్నారు. మే 25 ఐపీఎల్ ఫైనల్ జరగనుండగా... ఆ తర్వాతే ఇంగ్లండ్ పర్యటన ప్రారంభం కానుంది. కరుణ్ నాయర్‌కు పిలుపు.. దేశవాళీల్లో నిలకడగా రాణిస్తున్న సీనియర్ బ్యాటర్ కరుణ్ నాయర్‌ను భారత్ ‘ఎ’ జట్టు తరఫున ఇంగ్లండ్‌కు పంపాలని బీసీసీఐ భావిస్తోంది. విదర్భ జట్టు రంజీ ట్రోఫీ చేజిక్కించుకోవడంలో కీలకపాత్ర పోషించిన కరుణ్ నాయర్.. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలోనూ అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ‘జట్టును ప్రకటించేందుకు ఇంకా చాలా సమయం ఉంది. ఐపీఎల్ ప్లేఆఫ్స్‌కు ముందు ఆటగాళ్ల ఎంపికపై ఒక స్పష్టత వస్తుంది’ అని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ఇక సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో ‘వైట్ వాష్’కు గురైన టీమిండియా... ఆ తర్వాత ఆస్ట్రేలియాతో ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’లోనూ ఓటమి పాలైంది. దీంతో ప్రపంచ టెస్టు చాంపియన్íÙప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయింది. ఇంగ్లండ్ పర్యటనతో టీమిండియా 2025–27 డబ్ల్యూటీసీ సైకిల్‌ను ప్రారంభించనుంది.
బిజినెస్

టెస్లాను వెనక్కి నెట్టిన బీవైడీ
అమెరికన్ ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లాకు గట్టి పోటీనిస్తున్న చైనా కంపెనీ బీవైడీ తాజాగా ఆదాయంపరంగా పోటీ సంస్థను అధిగమించింది. బ్యాటరీ ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వాహన విక్రయాలు 40% ఎగియడంతో 2024లో 107 బిలియన్ డాలర్ల ఆదాయం ఆర్జించింది. గతేడాది టెస్లా ఆదాయం 97.7 బిలియన్ డాలర్లుగా నమోదైంది. మరోవైపు 2024లో బీవైడీ నికర లాభం 34% పెరిగి 5.6 బిలియన్ డాలర్లకు చేరింది. కంపెనీ గతేడాది 43 లక్షల ఈవీలను విక్రయించింది. ఇందులో 29% అమ్మకాల వాటా చైనా వెలుపల హాంకాంగ్, తైవాన్ తదితర దేశాలదే ఉంది. బీవైడీ ఈ మధ్యే 5 నిమిషాల్లోనే వాహనాలను చార్జింగ్ చేసే సూపర్ ఫాస్ట్ ఈవీ చార్జింగ్ సిస్టంను ప్రకటించింది. అలాగే, టెస్లా మోడల్ 3 పోలిన కిన్ ఎల్ ఈవీ సెడాన్‌ను సగం రేటుకే ప్రవేశపెట్టింది.ఇదిలాఉండగా, టెస్లా భారతదేశంలో తన కార్ల విక్రయాలను ప్రారభించడానికి సిద్ధమైంది. ఇప్పటికే దీనికి సంబంధించిన అన్ని సన్నాహాలు చేస్తున్న సంస్థ.. తాజాగా భారతదేశంలో రెండు ఎలక్ట్రిక్ కార్ల విక్రయాల కోసం.. సర్టిఫికేషన్ & హోమోలోగేషన్ ప్రక్రియను ప్రారంభించింది. దేశంలో కార్లను విక్రయించే ముందు సర్టిఫికేషన్ & హోమోలోగేషన్ ప్రక్రియ తప్పనిసరి. కాబట్టి టెస్లా ఇండియా మోటార్ & ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ భారతదేశంలో 'మోడల్ వై, మోడల్ 3' కార్ల హోమోలోగేషన్ కోసం రెండు దరఖాస్తులను సమర్పించింది. ఇదీ చదవండి: రూ.కోట్లు కోల్పోయిన వ్యాపారవేత్త.. ఏం జరిగిందంటే..హోమోలోగేషన్ అనేది.. ఒక వాహనం రహదారికి యోగ్యమైనదని, భారతదేశంలో తయారు చేసిన లేదా దేశంలోకి దిగుమతి చేసుకున్న అన్ని వాహనాలకు నిర్దేశించిన నిబంధనలకు అనుగుణంగా ఉందని ధృవీకరించే ప్రక్రియ. కేంద్ర మోటారు వాహన నియమాలకు అనుగుణంగా ఉద్గారం, భద్రత, రహదారి యోగ్యత పరంగా వాహనం భారత మార్కెట్ అవసరాలకు సరిపోతుందని సంబంధిత శాఖ నిర్దారించాలి.

హైదరాబాద్‌లో షిప్‌రాకెట్ సేమ్ డే డెలివరీ సేవలు
ఈ–కామర్స్ డెలివరీ సేవల సంస్థ షిప్‌రాకెట్ తాజాగా హైదరాబాద్‌లో చిన్న, మధ్య తరహా సంస్థల కోసం (ఎంఎస్ఎంఈ) సేమ్ డే డెలివరీ సర్వీసులను ప్రారంభించింది. ఇప్పటికే ఇవి ముంబై, బెంగళూరు, ఢిల్లీ–ఎన్సీఆర్, కోల్‌కతా నగరాల్లో అందుబాటులో ఉన్నాయి. కస్టమర్లకు ఉత్పత్తులను వేగవంతంగా అందించడంలో మిగతా పెద్ద సంస్థలతో ఎంఎస్ఎంఈలు పోటీపడేలా తోడ్పాటు అందించడంపై మరింతగా దృష్టి పెడుతున్నట్లు షిప్‌రాకెట్ ఎండీ సాహిల్ గోయల్ తెలిపారు. ఇందుకోసం పిక్ఎన్డెల్, పికో, బ్లిట్జ్, షాడోఫ్యాక్స్ తదితర సంస్థలతో జట్టు కట్టినట్లు వివరించారు. దేశీయంగా సేమ్ డే డెలివరీ మార్కెట్ 2028 నాటికి సుమారు 24 శాతం వార్షిక వృద్ధితో 10 బిలియన్ డాలర్ల స్థాయికి చేరుతుందనే అంచనాలు ఉన్నట్లు పేర్కొన్నారు.మెన్ ఆఫ్ ప్లాటినం ధోనీ కలెక్షన్ఐపీఎల్ సీజన్ సందర్భంగా ప్రముఖ క్రికెటర్ ఎంఎస్ ధోని సిగ్నేచర్ ఎడిషన్ కింద ప్లాటినం జ్యుయలరీ ప్రవేశపెట్టినట్లు మెన్ ఆఫ్ ప్లాటినం వెల్లడించింది. వీటిలో ప్లాటినం గ్రిడ్ బ్రేస్లెట్, ముమెంటం బ్రేస్లెట్, క్యూబ్ ఫ్యూజన్ బ్రేస్లెట్, బోల్డ్ లింక్స్ బ్రేస్లెట్, ప్లాటినం హార్మనీ చెయిన్ ఉన్నట్లు తెలిపింది. వీటిని 95% ప్లాటినంతో తీర్చిదిద్దినట్లు వివరించింది.

జీడీపీ వృద్ధికి ఎస్అండ్పీ కోత
న్యూఢిల్లీ: భారత జీడీపీ వృద్ధి అంచనాలను ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ తగ్గించింది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2025–26) 6.7 శాతం వృద్ధి నమోదవుతుందన్న గత అంచనాలను తాజాగా 6.5 శాతానికి సవరించింది. 2024–25 సంవత్సరం మాదిరే వృద్ధి అంచనాలను ఇస్తున్నట్టు ప్రకటించింది. వచ్చే రుతుపవనకాలం సాధారణంగా ఉంటుందని, కమోడిటీ, చమురు ధరలు కనిష్ట స్థాయిల్లోనే ఉంటాయన్న అంచనాల ఆధారంగా ఈ వృద్ధి రేటును ఇస్తున్నట్టు ఎస్అండ్పీ తెలిపింది. ద్రవ్యోల్బణం తగ్గడం, బడ్జెట్లో ప్రకటించిన పన్ను ప్రయోజనాలు, తక్కువ రుణ వ్యయాలు ఇవన్నీ భారత్‌లో విచక్షణారహిత వినియోగాన్ని పెంచుతాయని అంచనా వేసింది. ఆసియా పసిఫిక్ ప్రాంతంపై అమెరికా టారిఫ్‌ల పెంపు ప్రభావం, ప్రపంచీకరణ నుంచి వెనక్కి తగ్గడం వంటి సవాళ్లను ప్రస్తావించింది. అయినప్పటికీ వర్ధమాన దేశాల్లో చాలా వాటిల్లో దేశీ డిమాండ్ బలంగా కొనసాగుతుందని అంచనా వేసింది. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో సెంట్రల్ బ్యాంక్‌లు ఈ ఏడాది అంతటా వడ్డీ రేట్లను తగ్గించొచ్చని పేర్కొంది. ఒక శాతం వరకు రేట్ల తగ్గింపు.. ‘‘ఆర్బీఐ వడ్డీ రేట్లను మరో 0.75 శాతం నుంచి 1 శాతం వరకు ప్రస్తుత సైకిల్లో తగ్గించొచ్చు. ద్రవ్యోల్బణం తగ్గడం, తక్కువ చమురు రేట్ల ఫలితంగా ద్రవ్యోల్బణం ఆర్బీఐ లకి‡్ష్యత స్థాయి 4 శాతానికి సమీపంలో 2025–26లో ఉండొచ్చు’’అని ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ తన నివేదికలో వెల్లడించింది. బలమైన దేశీ డిమాండ్‌తో వర్ధమాన దేశాలు నిలదొక్కుకుంటాయని పేర్కొంది. దిగుమతులపై టారిఫ్‌లతో అమెరికా వృద్ధి తగ్గడమే కాకుండా, ద్రవ్యోల్బణం పెరుగుతుందని అంచనా వేసింది. దీంతో 2025లో యూఎస్ ఫెడ్ మరొక్కసారే 25 బేసిస్ పాయింట్ల మేర రేటు తగ్గించే అవకాశం ఉన్నట్టు తెలిపింది. రోడ్డు ప్రమాదాలతో జీడీపీకి నష్టంఏటా 3 శాతం కోల్పోవాల్సి వస్తోంది: గడ్కరీ న్యూఢిల్లీ: దేశంలో ఏటా 5 లక్షల వరకు రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని.. వీటి కారణంగా 3 శాతం జీడీపీని నష్టపోవాల్సి వస్తోందని కేంద్ర రహదారులు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. యూఎస్–భారత్ భాగస్వామ్యంతో ఢిల్లీలో రహదారి భద్రతపై ఏర్పాటు చేసిన సమావేశంలో భాగంగా మంత్రి మాట్లాడారు. దేశానికి రహదారి ప్రమాదాలు అతి ముఖ్యమైన సమస్యగా ఉన్నట్టు చెప్పారు. ఏటా 4.80 లక్షల రహదారి ప్రమాదాల్లో 1.88 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నట్టు తెలిపారు. ఇందులో 10,000 మంది 18 ఏళ్లలోపు ఉంటుండడంపై మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు.ఇదొక ప్రధానమైన ప్రజారోగ్య సమస్యే కాకుండా, ఏటా 3 శాతం జీడీపీని నష్టపోవాల్సి వస్తుండడంపై ఆవేదన వ్యక్తం చేశారు. బలహీన సమగ్ర ప్రాజెక్టు నివేదికలు (డీపీఆర్‌లు) రహదారి ప్రమాదాలకు కారణాల్లో ఒకటిగా పేర్కొన్నారు. ఖర్చు ఆదా చేసుకోవడం, ప్రాజెక్టు నిర్మాణాలను సీరియస్‌గా తీసుకోకపోవడం కూడా కొన్ని సందర్భాల్లో ప్రమాదాలకు కారణమవుతన్నట్టు చెప్పారు. రహదారి ప్రమాద బాధితులకు సాయాన్ని ప్రోత్సహించేందుకు నగదు బహుమతి ఇవ్వనున్నట్టు చెప్పారు. ‘‘ప్రమాద బాధితుల సాయానికి ముందుకు వచ్చే మూడో పక్ష వ్యక్తికి రూ.25,000 బహుమతి ఇవ్వాలని నిర్ణయించాం. ప్రమాదం లేదా ప్రమాదం అనంతరం ఎవరైనా ఆస్పత్రిలో చేరాల్సి వస్తే గరిష్టంగా రూ.1,50,000 లేదా ఏడేళ్ల పాటు చికిత్స వ్యయాలకు చెల్లింపులు చేయనున్నాం’’అని మంత్రి గడ్కరీ వెల్లడించారు.

సేవలపై ఫిర్యాదుకు వేచి చూడాల్సిందే
న్యూఢిల్లీ: ఏఐ ఏజెంట్లు, చాట్బాట్లు ఎన్ని కొత్త టెక్నాలజీలు వచ్చినా.. కస్టమర్ సేవల ఫిర్యాదులకు త్వరితగతిన పరిష్కారం లభించడం లేదు. ఫిర్యాదు నమోదు చేయడానికే గంటలు, రోజుల తరబడి వేచి చూడాల్సిన దుస్థితి నెలకొంది. 2024లో దేశీయ వినియోగదారులు సేవలపై ఫిర్యాదు నమోదు చేయడానికి వేచి చూసిన సమయం 1500 కోట్ల గంటలు. అంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ వివరాలను సర్విస్ నౌ ‘కస్టమర్ ఎక్స్‌పీరియెన్స్’ నివేదిక వెల్లడించింది. కస్టమర్ల అంచనాలు, లభిస్తున్న సేవల మధ్య ఉన్న ఎంతో అంతరం ఉన్నట్టు ఈ నివేదిక గుర్తించింది. 5,000 మంది కస్టమర్లు, 204 మంది కస్టమర్ సేవల ఏజెంట్లను ప్రశ్నించి, వచ్చిన వివరాల ఆధారంగా ఫలితాలను విశ్లేషించింది. ఓపిక పట్టాల్సిందే.. 80 శాతం భారత వినియోగదారులు కనీస అవసరాలైన ఫిర్యాదుల స్థితిని తెలుసుకోవడం, ఉత్పత్తుల సిఫారసుల కోసం ఏఐ చాట్బాట్లపై ఆధారపడుతున్నారు. కస్టమర్లు అంతా కలసి ఇందుకోసం ఏటా 1500 కోట్ల గంటల సమయం వెచ్చిస్తున్నారు. 2023తో పోల్చితే 2024లో ఒక ఫిర్యాదు పరిష్కారానికి వేచి చూడాల్సిన సమయం 3.2 గంటలు తగ్గింది. అయినప్పటికీ కస్టమర్ల అంచనాలకు, లభిస్తున్న సేవలకు మధ్య ఎంతో అంతరం ఉంది. 39 శాతం కస్టమర్ల ఫిర్యాదులను హోల్డ్‌లో పెట్టడం, 36 శాతం ఫిర్యాదులను బదిలీ చేయడం కనిపించింది. ఫిర్యాదుల ప్రక్రియ ఎంతో కష్టంగా ఉందని 34 శాతం మంది వినియోగదారులు అభిప్రాయపడుతున్నారు. నాసిరకం సేవల కారణంగా బ్రాండ్లను మార్చడానికి 89 శాతం వినియోగదారులు సంసిద్ధత వ్యక్తం చేశారు. బలహీనమైన సేవలపై ఆన్లైన్, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై ప్రతికూల అభిప్రాయాలను నమోదు చేస్తామని చెప్పారు. కస్టమర్ల సేవల్లో నెలకొన్న అంతరాన్ని తొలగించడానికి, వేగంగా పెరుగుతున్న కస్టమర్ల అవసరాలను తీర్చడానికి వీలుగా వ్యాపార సంస్థలు చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఈ నివేదిక తెలిపింది. ఏఐ ఆధారిత సామర్థ్యాలను పెంచుకోకుంటే కంపెనీలు కస్టమర్ల విశ్వాసాన్ని కోల్పోవాల్సి వస్తుందని సర్విస్‌నౌ ఇండియా ఎండీ సుమీత్ మాధుర్ అన్నారు.
ఫ్యామిలీ

పెను గాలుల నుంచి టేపులతో అరటికి రక్షణ!
అరటి తోటలను కంటికి రెప్పలా కాపాడుకుంటున్న రైతులకు పెనుగాలులు తీవ్ర నషాన్ని కలిగిస్తూ ఉంటాయి. లక్షలు పెట్టుబడి పెట్టి పెంచిన అరటి తోటల్లో కొద్ది రోజుల్లో గెలలు కోతకు వచ్చే దశలో సుడిగాలులు, తుపాన్లకు విరిగి పడిపోతే రైతులకు నూటికి నూరు శాతం నష్టం జరుగుతుంది. వెదురు బొంగుల ఊతంతో అరటి చెట్లకు గాలుల నుంచి రక్షించుకునేందుకు రైతులు విఫలయత్నం చేస్తూ వుంటారు. అయితే, కర్ణాటకలో అరటి తోటలు సాగు చేస్తున్న ఒక యువ రైతు సరికొత్త ఆలోచనతో, తక్కువ ఖర్చుతోనే అరటి తోటలను పెను గాలుల నుంచి చక్కగా రక్షించుకుంటున్నారు. చెట్టుకు నాలుగు వైపులా గూటాలు వేసి, వాటికి ప్లాస్టిక్ టేప్‌లను కట్టటం ద్వారా పెను గాలుల నుంచి అరటి చెట్లను చాలా వరకు రక్షించుకోవచ్చని యువ రైతు సురేష్ సింహాద్రి చెబుతున్నారు.. సురేష్ స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని తణుకు. కర్ణాటకలోని మైసూరుప్రాంతానికి వలస వెళ్లి కొన్ని సంవత్సరాల నుంచి యాలక్కి రకం అరటి తోటలను కౌలు భూముల్లో సాగు చేస్తున్నారు. చామరాజానగర జిల్లా కొల్లేగాలా తాలూకా, సత్తేగాల గ్రామంలో సురేష్ అరటి తోటలను సాగు చేస్తున్నారు. ఆయన అనుభవాలు.. ఆయన మాటల్లోనే..అరటి చెట్లకు నాలుగు వైపులా గూటాలు వేసి టేపులతో కట్టేస్తాంగాలుల నుంచి అరటి చెట్లకు గల సమస్యను అధిగమించడానికి తెలుగు రాష్ట్రాల్లో రైతులు సాధారణంగా వెదురు బొంగులను ఆసరాగా పెట్టి అరటి చెట్లకు రక్షణ కల్పిస్తుంటారు. ఇందుకోసం కర్రల కొనుగోలుకే ఎకరానికి రూ. లక్ష వరకు ఖర్చు చేస్తున్నారు. అయితే, మేము కర్రల అవసరం లేకుండా కేవలం టేపులతోనే అరటి చెట్టుకు నాలుగు వైపులా కట్టి గాలుల నుంచి విజయవంతంగా రక్షించుకుంటున్నాం. చెట్టుకు నాలుగు వైపులా నేలలోకి కట్టె గూటాలు దిగవేసి, వాటికి టేపులతో అరటి చెట్టు పై భాగాన్ని కడుతున్నాం. చెట్టుకు గట్టిగా బిగుతుగా కట్టకుండా కొంచెం వదులుగా ఉండేలా చెట్టు చుట్టూతా టేపులను రక్షణ చక్రం మాదిరిగా కడతాం. గాలులు వీచి చెట్టు అటూ ఇటూ ఊగినప్పుడు చెట్టు కాండం విరిగి పడిపోకుండా రక్షించుకుంటున్నాం. చెట్టుకు 6 నెలల వయసులో పువ్వు దశలో టేపు కట్టాలి. గత ఏడాది ఎప్పుడూ ఎరుగని రీతిలో మాప్రాంతంలో గాలి వాన వచ్చి అరటి తోటలే కాదు, కరెంటు స్థంభాలు కూడా కూలిపోయాయి. అయినా, మా తోటలో కొన్ని చెట్లు మాత్రమే ఒరిగాయి. మిగతా చెట్లు అదృష్టం కొద్దీ గాలులను చాలా వరకు తట్టుకున్నాయి. టేపులతో కట్టటం వల్లనే ఇది సాధ్యమైంది.ఎకరానికి రూ. 12 వేల ఖర్చుఎకరం అరటి తోటకు రూ. 12 వేల ఖర్చుతోనే టేపులతో రక్షణ కల్పించుకుంటున్నాం. ఎకరానికి 25 కిలోల టేపు అవసరం అవుతుంది. కిలో ధర రూ. 130. టేపులు కట్టడానికి కట్టె గూటాలు కావాలి. యూకలిప్టస్ లేత కర్రలను కొనుగోలు చేసి, 2 అడుగుల గూటాలను తయారు చేసుకొని వాడుతున్నాం. అడుగున్నర లోతు వరకు నేలలోకి ఏటవాలుగా దిగగొట్టి, ఆ గూటాలకు టేపులు కడతాం. దీని వల్ల గాలులు వచ్చినప్పుడు అవి చెక్కుచెదర కుండా చెట్టును కాపాడుతున్నాయి. కూలీల ఖర్చుతో కలిపితే చెట్టుకు రూ. 10 లకు మించి ఖర్చు కాదు. 6“6 దూరంలో అరటి మొక్కలు నాటితే ఎకరానికి 1200 మొక్కలు పడతాయి. అంటే.. ఎకరానికి టేపులు కట్టడానికి అయ్యే ఖర్చు కేవలం రూ. 12,000 మాత్రమే! కట్టిన టేపు రెండో పంటకు వాడటానికి పనికిరాదు. ప్రతి పంటకు మళ్లీ కట్టుకోవాలి. మేం యాలక్కి రకం నాటు రకం పిలకలను తెప్పించి నాటుతున్నాం. టిష్యూకల్చర్ మొక్కలు నాటితే అవి మరీ ఎత్తు పెరుగుతాయి. నాటు పిలకలు అయితే ఎత్తు తక్కువ పెరుగుతాయి, కాండం గట్టిగా కూడా ఉంటుంది. వరలక్ష్మి వ్రతం, వినియకచవితి రోజుల్లో ఈ రకం అరటికాయలకు మంచి గిరాకీ ఉంటుంది. కిలో కాయలను రూ. వందకు కూడా అమ్ముతూ ఉంటాం. రైతుగా నా అనుభవాలను, టేపులను అరటి చెట్లకు కట్టే విధానాన్ని చూపే వీడియోలను ‘మీ ఫార్మర్ సురేష్ (@MeFarmerSuresh)’ అనే నా యూట్యూబ్ ఛానల్లో పెట్టాను. రైతులు ఈ వీడియోలు చూసి అవగాహన పెంచుకోవచ్చు. నా ఫోన్ నంబర్: 99004 42287.

బతికాను.. బతికించాను
దినదిన గండం నూరేళ్ల ఆయుష్షుగా సాగింది కోవిడ్ కాలం! నిజంగానే ఫ్రంట్‌లైన్ వారియర్స్ ధైర్యంగా మనకు అండగా నిలబడకపోయుంటే ఎలా ఉండేదో మన జీవనం! ఆ టాస్క్‌లో వైద్యులది కీలకపాత్ర. ట్రాన్స్‌పోర్టేషన్ దగ్గర్నుంచి మందుల దాకా ఎదురైన సమస్యలన్నిటినీ పరిష్కరించుకుంటూ తమను తాము మోటివేట్ చేసుకుంటూ స్టాఫ్‌ని ముందుకు నడిపిస్తూ పేషంట్స్‌కి భరోసా ఇచ్చి, ప్రభుత్వ ఆసుపత్రుల గౌరవాన్ని పెంచిన డాక్టర్లలో హైదరాబాద్ ఉస్మానియా హాస్పిటల్ అప్పటి సూపరింటెండెంట్.. ఇప్పుడు మహేశ్వరం గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ బి. నాగేందర్ ఒకరు. ఆ రోజులను గుర్తుచేసుకుంటూ ఆయన చెప్పిన విషయాలు..‘‘కోవిడ్ ప్రకృతి వైపరీత్యంలా వచ్చింది. దీని గురించి ప్రజలకే కాదు.. డాక్టర్స్కీ అవగాహన లేదప్పుడు. నేనప్పుడు ఉస్మానియా హాస్పిటల్ సూపరింటెండెంట్‌గా ఉన్నాను. గాంధీ హాస్పిటల్ని కోవిడ్ హాస్పిటల్‌గా మార్చారు. అందుకని జనరల్ పేషంట్స్ అందరూ ఉస్మానియా కే వచ్చేవాళ్లు. వాళ్లకు కోవిడ్ ఉండొచ్చు.. లేకపోవచ్చు. టెస్ట్‌లో వాళ్లకు కోవిడ్ నిర్ధారణైతే గాంధీకి పంపేవాళ్లం. అప్పటికే అది ఎందరికో వ్యాపించేసేది. ఏదో ఒక జబ్బుతో వచ్చిన వాళ్లకు కోవిడ్ అని తేలితే కోవిడ్‌తో పాటు వాళ్లకున్న జబ్బుకూ ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వచ్చేది. ఉదాహరణకు అపెండిక్స్తో జాయిన్ అయిన వాళ్లకు కోవిడ్ అని తేలితే వాళ్లను గాంధీకి పంపలేకపోయేవాళ్లం. ఎందుకంటే గాంధీలో అప్పుడు అపెండిక్స్ ట్రీట్మెంట్ లేదు.. కేవలం కోవిడ్కే! దాంతో కోవిడ్ జాగ్రత్తలు తీసుకుంటూ ఆ పేషంట్‌కి ఉస్మానియాలోనే అపెండిక్స్‌కి ట్రీట్మెంట్ ఇచ్చేవాళ్లం. ఈ మొత్తం సర్వీస్‌లో నర్సింగ్ స్టాఫ్, శానిటేషన్ సిబ్బందిని అప్రిషియేట్ చేయాలి. వాళ్లు చాలా ధైర్యంగా నిలబడ్డారు. మా బలాన్ని పెంచింది.. లాక్డౌన్ ఎంత గడ్డు పరిస్థితో అందరికీ తెలుసు. రవాణా కూడా ఉండేది కాదు. హాస్పిటల్ స్టాఫ్ చాలా సమస్యలు ఎదుర్కొన్నారు. అందుకే వాళ్లకోసం ఆర్టీసీ సంస్థ వాళ్లతో మాట్లాడి స్పెషల్ బస్‌లు, పాస్‌లను ఏర్పాటు చేయించాం. ఫుడ్ కూడా సమస్య కూడా ఉండేది. కొన్ని మందుల కొరత వల్ల దొంగతనాలూ జరిగేవి. అన్ని సమస్య ల్లో.. అంత కోవిడ్ తీవ్రతలోనూ సర్జరీలు చేశాం. సరైన చికిత్స చేస్తూ రోగులకు ఇబ్బందుల్లేకుండా చూసుకోగలిగాం. ముగ్గురు పేషంట్లకు న్యూరో సర్జరీ అయిన వెంటనే కోవిడ్ సోకింది. వాళ్లను ఆరోగ్యవంతులను చేసి పంపాం. చికిత్సతోపాటు కౌన్సెలింగ్ చేస్తూ వాళ్లకు ధైర్యమిచ్చే వాళ్లం. పేషంట్స్ చూపించిన కృతజ్ఞత మా స్ట్రెంత్‌ను పెంచింది. ఐసీయూలో పేషంట్లను చూస్తుండటం వల్ల నాకూ కోవిడ్ వచ్చింది. గాంధీలో అడ్మిట్ అయ్యాను. తీవ్రమయ్యేసరికి నిమ్స్ లో చేరాల్సి వచ్చింది. నా పక్క బెడ్ అతని కండిషన్ సడెన్‌గా సీరియస్ అయి చనిపోయాడు. చాలా డిస్టర్బ్ అయ్యాను. నేను వీక్ అయితే నా స్టాఫ్ కూడా వీక్ అయిపోతారని నన్ను నేను మోటివేట్ చేసుకున్నాను. డిశ్చార్జ్ అవగానే డ్యూటీలో చేరాను. వ్యాక్సినేషన్ ప్రక్రియ స్టార్ట్ అయినప్పుడు కూడా వ్యాక్సిన్ తీసుకోవడానికి అందరూ భయపడుతుంటే నేనే ముందు వ్యాక్సిన్ తీసుకుని మిగతావాళ్లను మోటివేట్ చేశాను. సమర్ధంగా, సమన్వయంతో పనిచేసి... కోవిడ్ టైమ్‌లో మేము అందించిన సేవలతో ప్రభుత్వ ఆస్పత్రులకి మంచి పేరొచ్చింది. గౌరవం పెరిగింది. ప్రపంచ దేశాలతో పోలిస్తే మన దేశం కోవిడ్ పరిస్థితులను చక్కగా మేనేజ్ చేసింది. వైద్యరంగం, పోలీస్ వ్యవస్థ, మున్సిపల్ కార్పొరేషన్, స్వచ్ఛంద సంస్థలు, మీడియా సమన్వయంతో పనిచేయడం వల్ల సమర్థంగా కోవిడ్ సిట్యుయేషన్‌ను ఎదుర్కొన్నాం. కోవిడ్‌ను మానవ చరిత్రలో ఒక అధ్యాయంగా చెప్పుకోవచ్చు. గుణపాఠంగా మలచుకోవచ్చు. ఆరోగ్యాన్ని మించింది లేదని కరోనా మహమ్మారి నిరూపించింది. శుభ్రత నేర్పింది. మంచి జీవనశైలి అవసరాన్ని తెలియజెప్పింది. మానవ సంబంధాల విలువ చూపించింది’’ అంటూ నాటి గడ్డు రోజులను తాను అధిగమించిన తీరును గుర్తు చేసుకున్నారు డాక్టర్ నాగేందర్. – సరస్వతి రమ

మంచు పావురం
కశ్మీర్లో సైకిల్ తొక్కడం కష్టం. అయితే మగ పోస్ట్‌మేన్‌లే సైకిల్ తొక్కుతారు. ఉల్ఫతాబానోకు తన రెండు కాళ్లే సైకిల్ చక్రాలు. కశ్మీర్లో మొదటి మహిళా పోస్ట్ఉమన్గా ఆమె 30 ఏళ్లుగా నడిచి ఉత్తరాలు అందిస్తోంది. మంచు తుఫాన్లు, కాల్పుల మోతలు, భయం గొలిపే ఒంటరి మార్గాలు ఆమెను ఆపలేవు. ఇలా వార్తలు మోసే పావురం ఒకటి ఉందని తెలియడానికి ఇంత కాలం పట్టింది. ఇప్పుడుగాని మీడియా రాయడం లేదు. ఈ ఉత్తరం జీవితకాలం లేటు.మంచులో నడవడం మీకు వచ్చా? మూడు నాలుగడుగుల మంచులో నాలుగు అడుగులు నడవడం ఎంత కష్టమో తెలుసా? బాగా శక్తి ఉన్న యువతీ యువకులకే సాధ్యం కాదు. కాని 55 ఏళ్ల ఉల్ఫతా బానో గత 30 ఏళ్లుగా అలాంటి మంచులోనే నడిచి తన ఊరికి బయటి ప్రపంచానికి అనుసంధానకర్తగా ఉంది. ‘హిర్పురా’ అనే చిన్న పల్లెకి ఆమె ఏకైక మహిళా పోస్ట్ఉమన్. ఈ ఊరు శ్రీనగర్‌కు 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రపంచంతో తెగినట్టుండే ఈ ఊరిలో ఒక వార్త తెలియాలన్నా ఒక విశేషం అందాలన్నా ఉల్ఫతానే ఆధారం.5 నెలలు మంచులోనేదక్షిణ కశ్మీర్‌లోని హిర్పురాలో ప్రతి నవంబర్ నుంచి మార్చి వరకు ఐదు నెలల పాటు దారుణమైన వాతావరణం ఉంటుంది. దట్టమైన మంచు కురుస్తుంది. రోడ్లు మూసుకుపోతాయి. కాని హిర్పురాకు ప్రతిరోజూ కనీసం 30 ఉత్తరాలో, పార్శిళ్లో వస్తాయి. ఒక పురుష ఉద్యోగి జిల్లా హెడ్‌క్వార్టర్ అయిన షోపియన్‌కు వెళ్లి వాటిని పట్టుకొస్తాడు. ఇక పంచే బాధ్యత ఉల్ఫతా బానోదే. ‘నేను మెట్రిక్యులేషన్ చదవడం వల్ల ఈ ఉద్యోగం వచ్చింది. నా భర్త కూడా పోస్ట్‌మేన్‌గా పని చేసి రిటైర్ అయ్యాడు. నాకు ప్రస్తుతం 22 వేల రూపాయల జీతం వస్తోంది’ అని తెలిపింది ఉల్ఫతా బానో.ఎన్నో సవాళ్లు ధైర్యమే జవాబుఉల్ఫతాకు సైకిల్ తొక్కడం రాదు. సైకిల్ తొక్కడం కష్టమే ఆప్రాంతంలో. అందుకే తాను ఎక్కువగా నడుస్తుంది. ‘రోజుకు నాలుగైదు కిలోమీటర్లు నడుస్తాను’ అంటుందామె. ఉల్ఫతా ఎంతో అవసరం అయితే తప్ప లీవ్ పెట్టదు. ‘దట్టమైన మంచు కురుస్తున్నా లాంగ్బూట్లు వేసుకొని గొడుగు తీసుకొని డ్యూటీకి వెళతాను. పాపం... ఉత్తరాల కోసం ఎదురు చూస్తుంటారు కదా’ అంటుందామె. మంచులో ఒకో ఇంటికి మరో ఇంటికి కూడా సంబంధం తెగిపోయినా ఉల్ఫతా మాత్రం అక్కడకు వెళ్లి ఉత్తరం అందిస్తుంది. ‘ఊళ్లో చాలామంది స్టూడెంట్స్ స్టడీ మెటీరియల్ తెప్పించుకుంటూ ఉంటారు. వారికి నన్ను చూస్తే సంతోషం. వాళ్ళు చదువుకోవడానికి నేను సాయపడుతున్నందుకు తృప్తిగా ఉంటుంది’ అంటుందామె.క్రూరమృగాల భయంకశ్మీర్ సున్నితప్రాంతం. గొడవలు... కాల్పుల భయం ఉండనే ఉంటుంది. అయితే అది అటవీప్రాంతం కూడా. ‘మంచు కాలంలో ఆహారం దొరక్క మంచు చిరుతలు, ఎలుగుబంట్లు ఊరి మీద పడతాయి. నేను ఉత్తరాలు ఇవ్వడానికి తిరుగుతుంటే అవి ఎక్కడ దాడి చేస్తాయోననే భయం ఉంటుంది. కాని నాకెప్పుడు అవి ప్రమాదం తలపెట్టలేదు’ అంటుంది ఉల్ఫతా. సాధారణంగా ఇలాంటి ఊళ్లలో డ్యూటీ చేసినా చేయక పోయినా ఎవరూ పట్టించుకోరు. ‘కాని డ్యూటీ ఒప్పుకున్నాక చేయాలి కదా. అది పెద్ద బాధ్యత. ఆ బాధ్యతే నన్ను 30 ఏళ్లుగా పని చేసేలా చేస్తోంది’ అని సంతృప్తి వ్యక్తం చేస్తుంది ఉల్ఫతా.ఏసి ఆఫీసుల్లో ఉంటూ హాయిగా వాహనాల్లో వచ్చి పోతూ కూడా తమ డ్యూటీ తాము చేయడానికి అలక్ష్యం చేసే వారు ఉల్ఫతాను చూసి బాధ్యతను గుర్తెరగాలి.

యాక్సియల్ స్పాండిలో ఆర్థరైటిస్ అంటే ఏంటి..? నటి సమంత, దర్శకుడు విక్రమ్ భట్..
బాలీవుడ్ దర్శకుడు, నిర్మాత, నటుడు అయిన విక్రమ్ భట్ ఎన్నో బ్లాక్‌బస్టర్ మూవీలు అందించారు. అంతేగాదు ఆయనకు ఫిల్మ్‌ఫేర్, ఉత్తమ దర్శకుడు వంటి అవార్డులు కూడా వరించాయి. ఒకప్పుడు వరుస సినిమాలతో అలరించిన దిగ్గజ దర్శకుడు విక్రమ్ భట్ గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఓ మూవీ ప్రమోషన్లో పాల్గొన్నప్పడూ తన అనారోగ్యం గురించి బయటపెట్టారు. ఆ వ్యాధి కారణంగా తానెంతలా డిప్రెషన్‌కి గురయ్యానో కూడా వివరించారు. తన వ్యాధి నటి సమంత ఎదుర్కొంటున్న వ్యాధి దగ్గర దగ్గరగా ఉంటుందంటూ చెప్పుకొచ్చారు. అసలు విక్రమ్ భట్ ఈ వ్యాధిబారిన ఎలా పడ్డారు..? ఏంటా వ్యాధి తదితరాల గురించి సవివరంగా తెలుసుకుందామా..!.బాలీవుడ్లో మంచి పేరుగాంచిన రాజ్ మూవీ సీరిస్ దర్శకుడు విక్రమ్ భట్ తాను టాలీవుడ్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు ఎదుర్కొంటున్న మైయోసిటిస్ లాంటి వ్యాధితోనే బాధపడుతునట్లు వెల్లడించారు. దీని కారణంగా చాలా డిప్రెషన్‌కి గురైనట్లు చెప్పుకొచ్చారు. ఆ నేపథ్యంలోనే తన లైఫ్‌లో భార్య శ్వేత కూడా ఉండకూడదని నిర్ణయించుకున్నారట. అయితే తన భార్య అది నీ ఛాయిస్ కాదని తన నోరు మూయించేసిందన్నారు. ఆ కష్టకాలంలో తనతో ఉండి భరోసా ఇచ్చిందన్నారు. నిజానికి వ్యాధి కంటే దాని కాణంగా వచ్చే డిపప్రెషన్, ఆందోళనలే అత్యంత ప్రమాదకరమైనవన్నారు. ప్రస్తుతం యువత ఎదుర్కొంటున్న అతిపెద్ద అనారోగ్యం డిప్రెషన్ అని అన్నారు. దీనిపై సమంత, దీపికా పదుకునే లాంటి వాళ్లు మాట్లాడి యూత్‌ని చైతన్యపరుస్తున్నారని అభినందిచారు. దానివల్ల చిన్న వయసులోనే ఆత్మహత్యలు చేసుకోవడం వంటి ఘటనలు తగ్గుతాయన్నారు. ఇక అలాగే తాను ఎదుర్కొంటున్న వ్యాధి గురించి కూడా వివరించారు.ఆ వ్యాధి ఏంటంటే..విక్రమ్ ఆక్సియల్ స్పాండిలో ఆర్థరైటిస్‌తో బాధపడుతున్నారు. దీని కారణంగా ఎముకలు కలిసిపోతున్నట్లుగా ఉండే ఒక విధమైన ఆర్థరైటిస్ సమస్య అని తెలిపారు. ఫలితంగా చాలా నొప్పిని అనుభవిస్తానని 56 ఏళ్ల భట్ అన్నారు. ఆక్సియల్ స్పాండిలో ఆర్థరైటిస్ (AxSpA) అంటే..ఒక రకమైన ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్. ఇది ప్రధానంగా వెన్నెముక, సాక్రోలియాక్ కీళ్లను ప్రభావితం చేస్తుంది. ఈ పరిస్థితి కారణంగా దీర్ఘకాలికి వెన్నునొప్పిని ఎదుర్కొంటారు. అది భరించలేనదిగా ఉంటుందని చెబుతున్నారు వైద్యులు. ఎందుకు వస్తుందంటే..రోగనిరోధక వ్యవస్థ పొరపాటున ఆరోగ్యకరమైన కీళ్లపై దాడి చేసినప్పుడు ఇది సంభవిస్తుందట. ఫలితంగా వాపుతో కూడిన భరించలేని నొప్పి ఎదురవ్వుతుందని అన్నారు. దీనికి కుటుంబ డీఎన్ఏ కీలకపాత్ర పోషిస్తుందట. ఎందుకంటే కుటుంబంలో ఎవరికైన ఆర్థరైటిస్ ఉన్న చరిత్ర ఉంటే..ఈ పరిస్థితి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయట. ఇక ఈ పరిస్థితితో ఉన్నవారు ఉదయం లేచిన వెంటనే హాయిగా నడలేరట. ఎక్కడకక్కడ ఎముకలు బలంగా బిగిసుకుపోయి అలసటతో కూడిన నొప్పి వంటి లక్షణాలు ఉంటాయట. కాలక్రమేణ వెన్నెముక కదలికలు కష్టమై తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. సింపుల్‌గా చెప్పాలంటే కదలికలే ఉండవు. చికిత్స:అది ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తి వేరుగా ఉంటుందట. చికిత్సలో ఎక్కువ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ (NSAIDలు), ఫిజికల్ థెరపీ, జీవనశైలి మార్పులతో నయం అయ్యేలా చెస్తారు వైద్యులు. రోగ నిర్థారణ ఎంత తొందరగా జరిగిందన్న దానిబట్టే త్వరగా కోలుకోవడం అనేది ఉంటుందని చెబుతున్నారు. అయితే ఈ పరిస్థితికి శాశ్వత చికిత్స లేదట. కేవలం మందులతో ఈ రోగాన్ని అదుపులో ఉంచడమే మార్గమని అన్నారు వైద్యులు. మైయోసిటిస్కి పూర్తి భిన్నం..ఆక్సియల్ స్పాండిలో ఆర్థరైటిస్ కీళ్ల ధృడత్వాన్ని బలహీనపరుస్తుంది. అదే మైయోసిటిస్ అనేది కండరాల వాపుకి సంబంధించినది. దీనివల్ల రోజువారీ కార్యకలాపాలు చేయడం కష్టతరమవుతుంది. అదే ఆక్సియల్ స్పాండిలో ఆర్థరైటిస్ అయితే వెన్నెముక, కీళ్లను ప్రభావితం చేస్తుంది. ఇది దీర్ఘకాలిక నొప్పి, కదలకుండా ధృఢంగా అయిపోతాయి ఎముకలు. చెప్పాలంటే కదలికలనేవి ఉండవు అని చెబుతున్నారు నిపుణులు.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. మరింత సమాచారం కోసం వ్యక్తిగత నిపుణులను సంప్రదించడం ఉత్తమం(చదవండి: 'బిర్యానీ' పూర్తిగా మాంసం ఆధారిత వంటకమా?)
ఫొటోలు
International

‘ఉషా వాన్స్ రాక.. మమ్మల్ని రెచ్చగొట్టడమే!’
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సతీమణి ఉషా వాన్స్ ‘గ్రీన్లాండ్ పర్యటన’ ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది. రెండ్రోజులు ఆమె పర్యటించాల్సి ఉండగా.. ప్రకటన వెలువడి 24 గంటలు గడవక ముందే గ్రీన్లాండ్ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయ్యింది. ఉష పర్యటనను బహిష్కరించాలని అక్కడి తాత్కాలిక ప్రభుత్వం నిర్ణయించింది. విలువైన ఖనిజాలు ఉన్న ఈ అతిపెద్ద ద్వీపదేశాన్ని హస్తగతం చేసుకుంటానంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న వరుస ప్రకటనలే ఇందుకు కారణం. అమెరికా సెకండ్ లేడీ ఉషా వాన్స్(Usha Vance) ఈ నెల 27 నుంచి 29వ తేదీదాకా గ్రీన్లాండ్లో పర్యటించాల్సి ఉంది. అవన్నాట కిముస్సర్సులో జరగబోయే డాగ్స్లెడ్ రేసుకు హాజరు కావడంతో పాటు పలు ప్రాంతాల్లో ఆమె పర్యటించనున్నారు. అయితే ఈ పర్యటనను ఆ దేశ ప్రధాని మ్యూట్ ఎగేడే తీవ్రంగా విమర్శిస్తున్నారు. అమెరికా-గగ్రీన్లాండ్ మధ్య ఒకప్పటిలా మంచి సంబంధాలు లేవని.. అది ఈమధ్యే ముగిసిపోయిందని అన్నారాయన. అలాగే ఉషా వాన్స్ పర్యటన.. ముమ్మాటికీ గ్రీన్‌లాండ్‌ను రెచ్చగొట్టడం కిందకే వస్తుందని అంటున్నారాయన. అంతేకాదు.. ఆమె వెంట జాతీయ భద్రతా సలహాదారు మైక్ వాల్ట్జ్, ఎనర్జీ సెక్రటరీ క్రిస్ రైట్లతో కూడిన బృందాలు వస్తుండడంపైనా ఎగేడే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక తన పర్యటనకు ముందు ఉషా వాన్స్ ఓ వీడియోను పోస్ట్ చేశారు. SLOTUS VISITING GREENLAND 🇬🇱 Hands up If USA should purchase Greenland. pic.twitter.com/fkduBBVOPB— Usha Vance News (@UshaVanceNews) March 23, 2025 గ్రీన్లాండ్(GreenLand).. అతిపెద్ద ద్వీపం. అర్కిటిక్-అట్లాంటిక్ మహాసముద్రాల మధ్యలో ఉంటుంది. భౌగోళికంగా ఉత్తర అమెరికాలో భాగమైనప్పటికీ.. యూరప్ దేశాలతోనే రాజకీయ, సంప్రదాయపరంగా కలిసి ఉంది. అయితే ఇది స్వతంత్ర దేశం కాదు. కింగ్డమ్ ఆఫ్ డెన్మార్క్ సరిహద్దులో అటానమస్‌గా ఉండిపోయింది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచే గ్రీన్‌లాండ్‌ను చేజిక్కించుకోవడంపై ట్రంప్ వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. అయితే.. ఈ ప్రతిపాదనను ఇటు గ్రీన్లాండ్, అటు డెన్మార్క్ రెండూ వ్యతిరేకిస్తున్నాయి. రెండు నెలల కిందట ట్రంప్ పెద్ద కొడుకు గ్రీన్‌లాండ్‌ను సందర్శించారు.మార్చి 11వ తేదీన జరిగిన గ్రీన్లాండ్ పార్లమెంట్ ఎన్నికల్లో డెమోక్రట్స్ ఘన విజయం సాధించారు. డెమోక్రట్స్ నేత జెన్స్ ఫ్రెడ్రిక్ నీల్సన్ సైతం ఉషా వాన్స్ పర్యటనను తీవ్రంగా తప్పుబట్టారు. అయితే విమర్శలతో సంబంధం లేకుండా.. ఉషా వాన్స్ పర్యటన భద్రత కోసం అమెరికా నుంచి ప్రత్యేక బలగాలు గ్రీన్లాండ్కు చేరుకున్నాయి. మరోవైపు ఈ పర్యటనను వ్యతిరేకిస్తూనే.. అమెరికాతో దౌత్యపరమైన సంబంధాల దృష్ట్యా గ్రీన్లాండ్కు తమ పోలీసు బలగాలను డెన్మార్క్ పంపించింది.

ఇజ్రాయెల్ దాడికి మరోమారు గాజా విలవిల
దేర్ అల్ బలా: గాజాపై ఇజ్రాయెల్ నిరంతర దాడులకు తెగబడుతోంది. తాజాగా ఇజ్రాయెల్ సైన్యం(Israeli army) దక్షిణ గాజాలోని ప్రముఖ ఆస్పత్రిపై దాడి చేసింది. ఈ దాడిలో ఒకరు మరణించగా, పలువురు గాయపడ్డారు. ఇజ్రాయెల్ దాడుల అనంతరం ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం సంభవించిందని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.⭕️A key Hamas terrorist who was operating from within the Nasser Hospital compound in Gaza was precisely struck.The strike was conducted following an extensive intelligence-gathering process and with precise munitions in order to mitigate harm to the surrounding environment as… pic.twitter.com/C3pZqlC6NO— Israel Defense Forces (@IDF) March 23, 2025అంతకుముందు దక్షిణ గాజా ప్రాంతంలో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో హమాస్ సీనియర్ నాయకునితో సహా 26 మంది పాలస్తీనియన్లు(Palestinians) మృతిచెందారు. ఖాన్ యూనిస్ నగరంలోని నాసర్ ఆసుపత్రిని లక్ష్యంగా చేసుకుని తాజాగా దాడి జరిగిందని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇటీవల ఇజ్రాయెల్ వైమానిక దాడులతో గాజాలో యుద్ధాన్ని తిరిగి ప్రారంభించింది. ఈ నేపధ్యంలో పెద్ద సంఖ్యలో మృతులు, గాయపడిన వారిని నాసర్ ఆసుపత్రికి తీసుకువచ్చారు. మరోవైపు ఇజ్రాయెల్ సైన్యం ఆసుపత్రిపై దాడిని ధృవీకరించింది. యాక్టివ్‌గా ఉన్న హమాస్ ఉగ్రవాదులపై దాడి జరిగిందని తెలిపింది. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం(Israel-Hamas war)లో ఇప్పటివరకూ 50 వేల మందికి పైగా పాలస్తీనియన్లు మరణించారని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ యుద్ధంలో ఇప్పటివరకు ఒక లక్షా 13 వేల మందికి పైగా జనం గాయపడ్డారని పేర్కొంది. కాల్పుల విరమణ ముగిసిన తర్వాత ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో 673 మంది మృతిచెందారు. మృతుల్లో 15,613 మంది చిన్నారులు ఉన్నారు. వీరిలో 872 మంది ఏడాది లోపు వయసు కలిగినవారు. ఇజ్రాయెల్- హమాస్ మధ్య యుద్ధం 2023, అక్టోబర్ 7న ప్రారంభమైంది.ఇది కూడా చదవండి: కర్నాటక ముస్లిం కోటా బిల్లుపై రాజ్యసభలో రసాభాస

చైనాలో మెగా ఫ్యాక్టరీ.. అమెరికా సిటీ కంటే పెద్దగా..
బీజింగ్: వినూత్న, భారీ ప్రాజెక్టులకు పెట్టింది పేరైన చైనా దేశం మరోమారు తన భారీతనాన్ని చాటుకుంటోంది. ఏకంగా ఒక నగరం కంటే పెద్ద స్థాయిలో నూతనంగా ఫ్యాక్టరీని నిర్మిస్తోంది. అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో సిటీ కంటే ఎక్కువ విస్తీర్ణంలో అంటే దాదాపు 32,000 ఎకరాల విస్తీర్ణంలో ఈ కర్మాగారం నిర్మాణ పనులు చకచకా పూర్తవుతున్నాయి.చైనాలోని హెనాన్ ప్రావిన్సులోని ఝెన్ఝౌ నగరం శివారు ప్రాంతంలో బీవైడీ సంస్థ ఈ ఫ్యాక్టరీని నిర్మిస్తోంది. అన్ని రకాల ఎలక్ట్రిక్ వాహనాలను ఈ కర్మాగారంలో తయారుచేయనున్నారు. తాజాగా ఈ ఫ్యాక్టరీకి సంబంధించిన ఒక డ్రోన్ వీడియో ఆన్లైన్లో ప్రత్యక్షమవడంతో సామాజిక మాధ్యమాల్లో దీని గురించి చర్చ మొదలైంది. ఉత్పత్తి యూనిట్లు, పెద్ద భవనాలు, టెన్నిస్ కోర్టు, ఫుట్‌బాల్ మైదానాలతో సకల సదుపాయాలతో కర్మాగార పనులు కొనసాగుతున్నాయి. రోజు ఇక్కడ పనిచేసే కారి్మకులతో ఇప్పటికే ఈ ప్రాంతం కొత్త సిటీలా మారిపోయిందని డ్రోన్ వీడియోను చూస్తే అర్థమవుతోంది. ఇప్పటికే ఇదే ప్రాంత సమీపంలో బీవైడీ కంపెనీకి ఒక ఫ్యాక్టరీ ఉంది.ఈ ఫ్యాక్టరీ.. అమెరికాలో నెవడా రాష్ట్రంలో విద్యుత్‌కార్ల దిగ్గజం టెస్లాకు చెందిన ఫ్యాక్టరీ కంటే విస్తీర్ణంలో పెద్దదికావడం విశేషం. కొత్త ఫ్యాక్టరీని ఎనిమిది బ్లాకులుగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే బీవైడీ కంపెనీకి ప్రపంచవ్యాప్తంగా 9,00,000 మంది సిబ్బంది ఉన్నారు. మరో మూడు నెలల్లో 2,00,000 మంది సిబ్బందిని కొత్తగా నియమించుకోనున్నారు. ఝెన్ఝౌ నగరంలో నిర్మిస్తున్న కొత్త కర్మాగారంలో రోజు 60,000 మంది కారి్మకులు పనిచేస్తుండటంతో ఇప్పుడు అదొక కొత్త సిటీలా కనిపిస్తోందని ఒక నెటిజన్ అన్నారు. BYD has announced that their Zhengzhou factory will be 50 square miles, which is reportedly bigger than San Francisco at 46.9 square miles, per the Sun. pic.twitter.com/y39khwcyuc— unusual_whales (@unusual_whales) March 24, 2025

కుమారునికి డిస్నీలాండ్ చూపించి... గొంతు కోసి చంపేసింది!
న్యూయార్క్: పిల్లలకు తల్లి ఒడిని మించిన స్వర్గం లేదంటారు. కానీ అమెరికాలో ఓ కన్నతల్లే కొడుకు ప్రాణాలు తీసింది. సరితా రామరాజు అనే భారత సంతతికి చెందిన మహిళ ఈ ఘాతుకానికి పాల్పడింది. తన 11 ఏళ్ల కొడుకు యతిన్కు మూడు రోజుల పాటు డిస్నీలాండ్ తిప్పి చూపించింది. తర్వాత హోటల్ గదిలో గొంతు కోసి చంపేసింది. తానూ ఆత్మహత్య చేసుకుంటున్నట్టు 911కు ఫోన్ చేసి చెప్పింది. వాళ్లు వచ్చేసరికే బాలుడు శవమై కనిపించాడు. అపస్మారక స్థితిలో ఉన్న సరితను ఆస్పత్రికి తరలించారు. బాలుడు చనిపోయాకే ఆమె 911కు ఫోన్ చేసినట్లు పోస్టుమార్టంలో తేలింది. వంటకు ఉపయోగించే పెద్ద కత్తి హోటల్ గదిలో దొరికింది. దాంతోనే పొడిచి చంపినట్టు భావిస్తున్నారు. ఆమెకు 26 ఏళ్ల నుంచి యావజ్జీవ శిక్ష దాకా పడవచ్చని కాలిఫోర్నియాలోని ఆరెంజ్ కౌంటీ డిస్ట్రిక్ట్ అటార్నీ కార్యాలయం తెలిపింది. సరితది బెంగళూరు. భర్త ప్రకాశ్ రాజుతో 2018లో విడాకులు తీసుకుంది. కొడుకు యతిన్ రాజును కోర్టు తండ్రి సంరక్షణలో ఉంచింది. సరితకు సందర్శన హక్కులు మాత్రమే లభించాయి. విడాకుల తర్వాత సరిత కాలిఫోర్నియా నుంచి వర్జీనియాలోని ఫెయిర్ ఫాక్స్‌కు మారింది. యతిన్ను తనకు అప్పగించాలంటూ గత నవంబర్‌లో పిటిషన్ దాఖలు చేసింది. ‘‘కొడుకు వైద్యం, స్కూలింగ్ వంటి నిర్ణయాలు తన ప్రమేయం లేకుండానే తీసుకుంటున్నారు. నా మాజీ భర్తకు మాదకద్రవ్యాల వ్యసనముంది. మద్యం, ధూమపానం మత్తులో ఉంటాడు’’ అని ఆరోపించింది. ఇటీవల కొడుకును చూసేందుకు సరిత శాంటా అనాకు వచ్చింది. తనను మూడు రోజులూ డిస్నీల్యాండ్‌కు తీసుకెళ్లింది. ఈ నెల 19న కొడుకును తండ్రికి అప్పగించాల్సి ఉంది. ఆ రోజు ఉదయం 9.12కు ఈ ఘాతుకానికి పాల్పడింది. తనపై సరిత ఆరోపణలన్నీ అవాస్తవమని ప్రకాశ్ అన్నాడు. ‘‘ఆమెకు తీవ్రమైన మానసిక సమస్యలున్నాయి. తనతో మాట్లాడేందుకే యతిన్ భయపడేవాడు’’ అని ఆరోపించారు.
National

నువ్వు కూర్చో.. పార్టీ మీ ఆయనది
పట్నా: బిహార్ శాసన మండలిలో మంగళవారం సీఎం నితీశ్ కుమార్, మాజీ సీఎం రబ్డీదేవి మధ్య వాడీవేడి చర్చ జరిగింది. ఆర్జేడీ ఎమ్మెల్సీలు పచ్చ రంగు బ్యాడ్జీలు ధరించి సభలోకి రావడం, ఆ పార్టీ నేత తేజస్వీ యాదవ్‌కు అనుకూలంగా నినాదాలు చేయడంతో సీఎం నితీశ్ కోపంతో ఊగిపోయారు. ఎమ్మెల్సీల బ్యాడ్జీలను మీడియాకు చూపుతూ ఆయన..ఇలాంటివి ఆర్జేడీలోనే సాధ్యమంటూ ఎద్దేవా చేశారు.ఆ పార్టీ నేత, మాజీ సీఎం రబ్డీదేవి జోక్యం చేసుకునేందుకు యత్నించగా నితీశ్ బిహారీ యాసలో..‘నువ్వు కూర్చో..నీకేమీ తెలియదు. ఆర్జేడీ నీదికాదు, నీ భర్తది. ఈ విషయంలో నీ జోక్యం వద్దు’అంటూ అడ్డుకున్నారు. అంతటితో ఆగక.. ‘ఈమెకు ఏమీ తెలియదు. కష్టాల్లో చిక్కుకు న్నప్పుడు భర్త(లాలూ)ఈమెను సీఎంను చేశాడు’అని పేర్కొన్నారు. 1997లో సీఎంగా ఉన్న లాలు ప్రసాద్ దాణా కుంభకోణంలో ఇరుక్కుని, సీఎం కుర్చీపై భార్య రబ్డీని కూర్చోబెట్టడం తెల్సిందే.ఇటీవలి కాలంలో రబ్డీదేవి, నితీశ్ మధ్య తరచూ మాటల యుద్ధం జరుగుతోంది. గంజాయి మత్తులో సభకు వచ్చిన సీఎం నితీశ్, నాతోపాటు మహిళలను సైతం అవమానిస్తూ మాట్లాడారు’అంటూ రబ్డీదేవి ఆరో పించారు. ఓ కార్యక్రమానికి వెళ్లిన నితీశ్ జాతీయ గీతాలాపనను పట్టించుకోకుండా పక్కనున్న వారి తో సరదాగా మాట్లాడుతూ కన్పించడంతో ‘మానసికంగా అనర్హుడు’ అంటూ రబ్డీదేవి వ్యాఖ్యానించడం వివాదాస్పదమైంది.

‘ఇది పార్లమెంట్ సాక్షిగా జరిగిన అన్యాయం’
ఢిల్లీ పార్లమెంట్లో అరకు కాఫీస్టాల్ ప్రారంభోత్సవానికి స్థానిక పార్లమెంట్ సభ్యురాలిగా తనపట్ల వివక్ష చూపడం, కనీసం ఆహ్వానం లేకపోవడం అత్యంత బాధాకరమని అరకు ఎంపీ డాక్టర్ తనూజారాణి ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీలో ఎంపీలు పిల్లి సుభాష్‌చంద్రబోస్, గొల్ల బాబూరావులతో కలిసి మీడియాతో మాట్లాడుతూ ప్రజాస్వామ్యానికి దేవాలయం లాంటి పార్లమెంట్‌లోనే అణగారిన, వెనుకబడినవర్గాలకు అవమానం జరగడం దారుణమని అన్నారు. గిరిజన ఎంపీనైనందుకే అవమనించాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమానికి ఆహ్వానించలేదా అని ప్రశ్నించారు. దీనిపై స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు. ఇంకా ఆమె ఏమన్నారంటే...అరకు కాఫీకి అంతర్జాతీయ ఖ్యాతి ఉంది. అటువంటి కాఫీస్టాల్‌ను పార్లమెంట్లో ప్రారంభించే సందర్బంగా కనీసం అరకు ఎంపీగా ఉన్న నాకు ఆహ్వానం వస్తుందని ఆశించాను. అలాగే కనీసం కాఫీగింజలను పండించే పదిమంది గిరిజన రైతులను ఈ కార్యక్రమానికి పిలిస్తే, అద్భుతమైన ఈ కాఫీ రుచుల వెనుక వారి శ్రమ ప్రపంచానికి తెలిసేది. అరకుకే ప్రత్యేకమైన గిరిజన థింసా నృత్యాన్ని కూడా ఈ సందర్భంగా ప్రదర్శించి వుంటే జాతీయ స్థాయిలో గిరిజన సంస్కృతికి ఒక పరిచయ వేదికగా మారేది. అరకు అంటే కేవలం కాఫీ మాత్రమే కాదు సహజసిద్దమైన ఔషదగుణాలు ఉన్న పసుపు, అరుదైన సుగంధద్రవ్యాలు కూడా. ఇవ్వన్నీ పార్లమెంటేరియన్లకు పరిచయం చేసే సందర్భంగా ఆ కాఫీస్టాల్ ప్రారంభోత్సవం ఉండేది. కానీ దీనికి భిన్నంగా కేవలం ఎంపిక చేసుకున్న వారితోనే ఈ స్టాల్‌ను ప్రారంభించారు. కావాలనే స్థానిక ఎంపీగా ఉన్న నాకు ఆహ్వానం లేకుండా చేశారు. దీనిపై స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తున్నాము. అలాగే ప్రధానమంత్రికి లేఖ రాస్తున్నాము. ఈ వివక్షపై పార్లమెంట్ నుంచి సమాధానం వస్తుందని ఆశిస్తున్నాను.రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావు మాట్లాడుతూ..పార్లమెంట్లో అరకు కాఫీస్టాల్ ప్రారంభోత్సవంకు ఏపీ నుంచి రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి సంధ్యారాణి, ఏపీకి చెందిన కొందరు ఎంపీలను ఆహ్వానించారు. స్టాల్ ప్రారంభించిన తరువాత స్పీకర్ సహా ఎంపీలు కాఫీని సేవించి, దాని రుచిని గురించి ప్రశంసించారు. ఈ సందర్బంలో స్థానిక అరకు ఎంపీని ఎందుకు ఆహ్వానించలేదని ఎవరూ ప్రశ్నించకపోవడం దారుణం. గిరిజన మహిళ కావడం వల్లే ఆమెను అవమానించేందుకు ఆహ్వానించలేదా? వైయస్ఆర్సీపీ నుంచి గెలవడం వల్లే పిలవలేదా? పార్లమెంట్‌లోనే ఇటువంటి పరిణామాలు బాధాకరం’ అని అన్నారు గొల్ల బాబూరావు

ఓలా సీఈవోపై కునాల్ కమ్రా సూపర్ పంచ్‌లు
ప్రముఖ స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా (Kunal Kamra) ఇటీవల ముంబైలో నిర్వహించిన షో వివాదాస్పదమైంది. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండేను అవమానించారంటూ ఆయన మద్దతుదారులు కునాల్‌పై విరుచుకుపడుతున్నారు. కునాల్ షో నిర్వహించిన ముంబైలోని యూనికాంటినెంటల్ హోటల్ హాబిటాట్ స్టూడియోపై షిండే వర్గీయులు దాడికి పాల్పడ్డారు. కునాల్ కమ్రాపై పోలీసులు కేసు నమోదు చేశారు. షిండేపై అవమానకర వ్యాఖ్యలు చేసినందుకు కునాల్ క్షమాపణ చెప్పాలని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ డిమాండ్ చేశారు. తాను క్షమాపణ చెప్పబోనని, తనపై పెట్టిన కేసులను చట్టపరంగా ఎదుర్కొంటానని కునాల్ స్పష్టం చేశారు.ఇదిలావుంటే తన షోలో ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా, అజిత్ పవార్ (Ajit Pawar) సహా పలువురు ప్రముఖులపై కునాల్ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. వ్యాపార ప్రముఖులను కూడా ఆయన వదల్లేదు. ముఖ్యంగా ఓలా సీఈవో భవిశ్ అగర్వాల్‌పై వేసిన సెటైర్లు బాగా పేలాయి. గతంలో వీరిద్దరి మధ్య ట్విటర్లో మాటల యుద్ధం నడిచింది. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లకు సరైన సర్వీసు అందించడం లేదని వినియోగదారుల నుంచి వచ్చిన ఫిర్యాదులను భవిశ్ దృష్టికి తీసుకురాగా, ఆయన వెటకారంగా స్పందించారు. తమ సర్వీసు సెంటర్‌కు వచ్చి పనిచేస్తే, ఫ్లాప్ షోకు వచ్చిన దానికంటే ఎక్కువ డబ్బు ఇస్తానని కునాల్‌ను భవిశ్ అగర్వాల్ వెటకరించాడు. ఈ నేపథ్యంలో కునాల్ తాజా షోలో భవిశ్పై సెటైర్లు వేశాడు.‘భారత వ్యాపారవేత్తలు తాము తప్పు చేసినప్పుడు కూడా ఒప్పుకోరు. ఉదాహరణకు, ఓలా వ్యక్తిని తీసుకోండి. నేను ఏమి చెప్పినా అతడికి ఎందుకు కోపం వచ్చేస్తుంది? వారు ద్విచక్ర వాహనాలను తయారు చేస్తారు, కానీ వారి చక్రాలు రెండూ పనిచేయవు. అయినప్పటికీ, 'మాతో కలిసి పని చేయండి, మనమంతా కలిసి భారతదేశాన్ని నిర్మిద్దాం' అని అతడు నాతో అంటాడు. ఈ వ్యాపారవేత్తలందరికీ ఈ కోరిక ఎందుకు కలిగిందో? మీరు మంచి బైక్‌ను తయారు చేయలేరు కానీ, మొత్తం దేశాన్ని నిర్మించాలనుకుంటున్నారా? మీ ఆకాంక్షలను అదుపులో ఉంచుకోండి. సమస్యను పరిష్కరించడానికి బదులుగా, అతను కొత్త బైక్ రంగులను ప్రారంభించాడు. బహుశా వేరే రంగు సమస్యను అద్భుతంగా పరిష్కరిస్తుంది కాబోలు. డీటాక్స్ అవసరమైన చోట, వారు బోటాక్స్ అందిస్తున్నారు. నాకు డబ్బు ఇస్తానని అతడు అన్నాడు. అదేదో మీ కంపెనీ నుంచి రిఫండ్ కోసం వెయిట్ చేస్తున్న వారికి ఇవ్వొచ్చుగా.ఓలా (Ola) గురించి ట్వీట్ చేయడం మానేశాను. ఎందుకంటే నా కారణంగానే ఓలా షేర్లు పతనమవుతున్నాయని జనాలు నిందిస్తున్నారు. నేను నా ట్వీట్లు రాశాను, అతడు తన ట్వీట్లు రాశాడు. నేను ఎప్పుడూ ఓలాలో ఉద్యోగాన్ని అంగీకరించలేదు. ఓలా సీఈఓతో గొడవ తర్వాత కస్టమర్లు నాకు ట్యాగ్ చేయడంతో పాటు నేరుగా మెసేజ్‌లు కూడా పంపించారు. వినియోగదారుల రక్షణ కోసం ఉద్దేశించిన ప్రభుత్వం సంస్థలు శక్తిహీనంగా మారాయి. బాధితులు ఓలా యజమాని దగ్గరకు వెళతారు, అతడు మోదీ జీతో ఫోటో చూపిస్తాడు, వారు వెనక్కి తిరిగి వెళ్లిపోతారు! నేనేం చేయాలి?” అని కునాల్ కమ్రా చమత్కరించారు. కాగా, ఇన్ఫోసిస్ సుధామూర్తి, మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రాపైనా కునాల్ సెటైర్లు వేశారు. చదవండి: చట్టం అందరికీ సమానమేనా?.. స్టూడియో విధ్వంసంపై కునాల్ కమ్రా

శివసేన టార్గెట్‌గా కునాల్ కమ్రా వీడియో
ముంబై: నగరంలోని హబిటాట్ స్టూడియోను శివసేనకు చెందిన కార్యకర్తలు ధ్వంసం చేయడాన్ని తీవ్రంగా ఖండించిన స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా(Kunal Kamra).. తాజాగా ఓ వీడియోను రిలీజ్ చేశారు. తన స్టూడియోను శివసేన సేనకు చెందిన కొంతమంది ఎలా ధ్వంసం చేశారో చూపిస్తూ తన యూట్యూబ్ చానల్ లో వీడియోను పోస్ట్ చేశారు. చర్యకు ప్రతి చర్య ఉంటుందని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్ నాథ్ షిండే వ్యాఖ్యానించిన తర్వాత కునాల్ కమ్రా.. ఈ వీడియోను ప్రజల్లోకి తీసుకొచ్చాడు.కునాల్ కమ్రాకు షోలు చేసే ముంబైలోని హాబిటాట్ స్టూడియోను కూల్చివేసిన సంగతి తెలిసిందే. ఆదివారం రాత్రి ఒక వర్గానికి చెందిన వ్యక్తులు భారీ సంఖ్యలో వచ్చి స్టూడియోపై విరుచుకుపడ్డారు.మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేపై కమ్రా అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో జరిగిన పరిణామాల నేపధ్యంలో శివసేన కార్యకర్తలు స్టూడియోపై దాడిచేయడం, ఆ తరువాత ముందస్తు నోటీసు లేకుండా ముంబై మున్సిపల్ కార్పొరేషన్ కూల్చివేతలకు పాల్పడింది. ఇదిలా ఉండగా, షిండేపై చేసిన వ్యాఖ్యలపై శివసేన ఎమ్మెల్యే ముర్జి పటేల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కునాల్ కమ్రాపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
NRI

ఫ్లోరిడాలో అత్యున్నత స్థాయి ‘హెర్ హెల్త్ ఆంకాలజీ కాంగ్రెస్ 2025’
అమెరికాలోని ఫ్లోరిడాలోని ఓర్లాండో నగరంలో మెడికల్ కాన్ఫరెన్స్ ఘనంగా జరిగింది. 70-80 మంది ఆంకాలజిస్టులు, ప్రైమరి కేర్ డాక్టర్లు హాజరైన ఈ కార్యక్రమం, ఇన్నోవేటివ్ ఎడ్యుకేషన్‌కి ఒక వేదికగా పనిచేసిందని నిర్వాహకులు తెలిపారు. ఈ సదస్సు ప్రముఖ కీనోట్ వక్త, డాక్టర్ బార్బరా మెకనీ, మాజీ AMA ఉపాధ్యక్షురాలు ఆంకాలజి పరిశోధన, పక్షవాతం, పేషంట్ కేర్ మొదలైన అంశాల ప్రాముఖ్యాన్ని వివరించారు.‘హెర్ హెల్త్ ఆంకాలజీ కాంగ్రెస్ 2025 తన విజన్‌ను నిజం చేసింది. మహిళల కోసం క్యాన్సర్ సంరక్షణను ముందుకు తీసుకెళ్లడంలో వైద్య సమాజాన్ని శక్తివంతం చేయడానికి, అవగాహన నిమిత్తందీన్ని రూపొదిచామనీ, ఈమెడ్ ఈవెంట్స్, ఈమెడ్ ఎడ్ సీఈఓగా, శంకర నేత్రాలయ, యూఎస్ఏ సీఎమ్ఈ చైర్‌పర్సన్‌గా(USA CME) ఒక మహిళగా, మహిళా ఆరోగ్య సంరక్షణలో మార్పు తీసుకురావడానికి ఇదొక సదవకాశమని’ డాక్టర్ ప్రియా కొర్రపాటి సంతోషం వ్యక్తం చేశారు. మరిన్ని NRI వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి!చైర్పర్సన్ డాక్టర్ సతీష్ కత్తుల, ఆంకాలజిస్ట్, హెమటాలజిస్ట్, AAPI అధ్యక్షుడు, మహిళలలో సాధారణ క్యాన్సర్లను పరిష్కరించడం, నిరంతర అవగాహన ప్రాముఖ్యతను హైలైట్ చేశారు. కాంగ్రెస్‌లో 10 మంది అత్యున్నత నైపుణ్యం కలిగిన వక్తలు ఉన్నారని, ప్రతి ఒక్కరూ ఆంకాలజీలో పురోగతి, సమగ్ర రోగి సంరక్షణపై దృష్టిపెడుతున్నారని డా. ప్రియా అన్నారు. ఈ కాంగ్రెస్‌ను కేవలం ఒక కార్యక్రమం కాకుండా, కంటిన్యూస్ లర్నింగ్ చేయాలనే తమ లక్ష్యాన్ని బలోపేతం చేశారన్నారు. AAPI, CAPI (టంపా నుండి స్థానిక అధ్యాయం) eMed Ed తో కలిసి చేస్తున్న సహకార ప్రయత్నాలను డా. సతీష్ అభినందించారు. ప్రత్యేక ఆకర్షణలుNFL ఆటగాడు షెప్పర్డ్ స్టెర్లింగ్ ఈ సదస్సు హాజరు కావడం విశేషం. ఆంకాలజీ వంటి క్రిటికల్ కేర్ వైద్యులలో చాలా ఉద్యోగపరైమన ఒత్తిడి అధికంగా ఉంటుంది దాని కోసం ప్రత్యేకంగా ఆంకాలజీ బర్నవుట్ సెషన్ నిర్వహించటం మరో విశేషం. డాక్టర్ వర్షా రాథోడ్, ఇంటిగ్రేటివ్ మెడిసిన్ స్పెషలిస్ట్, ఓర్లాండో, ఫ్లోరిడా ఈ సెషన్ నిర్వహించారు. డాక్టర్ శైలజ ముసునూరి, ఇంటిగ్రేటెడ్ మెడిసిన్, చీఫ్ ఆఫ్ సైకియాట్రి, వుడ్ సర్వీసెస్, పెన్సిల్వేనియా వారు నిర్వహించిన సైకాలజికల్ ఆంకాలజీ సెషన్ ఆకట్టుకుంది. క్యాన్సర్ కేర్ లో మెడికల్ ట్రీట్మెంట్ మాత్రమే కాకుండా, రోగుల మానసిక, భావోద్వేగ స్థితిని కూడా సమర్థంగా నిర్వహించాలని పేర్కొన్నారు.వాలంటీర్ల దృక్పదంస్పీకర్లకి మించి, ఈ కాంగ్రెస్ స్వచ్ఛంద సేవకులకు కూడా గొప్ప అనుభవాన్ని ఇచ్చిందనీ, సెషన్లు, ఆసక్తిక్రమైన చర్చలు జరిగాయి. డాక్టర్లు అనేక ప్రశ్నలను చాలా లోతైన వివరణ, పరిస్కారాలు ఇచ్చారని, క్వెషన్ అండ్ ఆన్సర్ సెషన్ చాలా ఆసక్తిగా, ఉపయోగంగా ఉందని ఆమె తెలిపారు.ఆడియన్స్ అభిప్రాయాలుమహిళల క్యాన్సర్లపై దృష్టి సారించే ఆంకాలజీ సమ్మేళనాలు అరుదుగా ఉన్నాయని, ఈ కార్యక్రమం ఆంకాలజిస్ట్‌లు, ప్రమరి కేర్ డక్టర్లు ఇద్దరికీ ఒక అమూల్యమైన అవకాశం అని అన్నారు. రోగులను ఎప్పుడు రిఫర్ చేయాలి, కొత్త చికిత్సా విధానాల ఏమున్నాయి వంటి అవసరమైన అంశాలను ఎలా నిర్వహించాలనేది తమ అభిప్రాయాల ద్వారా వెల్లడించారు.హెర్ హెల్త్ ఆంకాలజీ కాంగ్రెస్ భవిష్యత్తు హెర్ హెల్త్ ఆంకాలజీ కాంగ్రెస్ 2026 కాంగ్రెస్ ఓహియోలో జరుగుతుందని ప్రకటించారు. ఈ కార్యక్రం విజయానికి సహకరించిన అందరికీ ప్రియా కొర్రపాటి ధన్యవాదాలు తెలిపారు. అలాగే మహిళల కోసం ఆంకాలజీ సంరక్షణను ముందుకు తీసుకెళ్లే మిషన్‌లో ముందుకు సాగడానికి ఇది స్ఫూర్తినిస్తుందని ఇప్పుడున్నఆంకాలజీని ముందుకు ముందుకు తీసుకెళ్ళటానికి కలిసి పనిచేద్దామనిఆమె పిలుపునిచ్చారు.

డాక్టర్ కావాలనుకుంది : భారతీయ విద్యార్థిని విషాదాంతం?!
డొమినికన్ రిపబ్లిక్లో కనిపించకుండాపోయిన భారతీయ విద్యార్థిని ప్రాణాలు కోల్పోయిందా అంటే అవుననే అనుమానాలు బాగా బలపడుతున్నాయి. గత వారం విహారయాత్రకు వెళ్లి కనిపించకుండా పోయిన పిట్స్బర్గ్ విశ్వవిద్యాలయ విద్యార్థిని నీటిలో మునిగి మరణించి ఉంటుందని భావిస్తున్నట్టు అధికారులు ఆదివారం ధృవీకరించారని ఏబీసీ న్యూస్ తెలిపింది. ప్రమాదవశాత్తూ నీటిమునిగి ఉంటుందని పోలీసులు వెల్లడించినట్టు తెలిపింది. మార్చి 6వ తేదీ,తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఆరుగురు స్నేహితులతో రిసార్ట్‌కు వెళ్లినట్లు సమాచారం. ప్రస్తుతం పిట్స్బర్గ్ యూనివర్శిటీలో గ్రాడ్యుయేషన్ చదువుతున్న సుదీక్ష కోణంకి ఈ నెల 6న ప్రముఖ పర్యాటక పట్టణమైన వ్యూంటా కానా ప్రాంతానికి వెళ్లింది. అక్కడ బీచ్‌లో ఒక స్నేహితుడితో కలిసి ఈతకోసం వెళ్లిన ఆమె ఎంతకీ తిరిగి రాకపోవడంతో మిగిలిన స్నేహితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై సోషల్ మీడియాలో ఆమె ఆచూకీ కోసం విస్తృతంగా ప్రచారం చేశారు. దీంతో ఆమె బీచ్‌లో కొట్టుకుపోయి ఉంటుందని పోలీసులు భావించి సముద్రంలో గాలింపు చర్యలు చేపట్టారు. డ్రోన్లు, హెలికాఫ్టర్లతో గత నాలుగు రోజులుగా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. భారతదేశానికి చెందిన సుదీక్ష తల్లిదండ్రులు రెండు దశాబ్దాల క్రితం అమెరికాకు వలస వెళ్లి అక్కడ శాశ్వత నివాస హోదా పొందారు. 20 ఏళ్ల నుంచి వర్జీనియాలో నివాసం ఉంటున్న సుదీక్ష కోణంకి పిట్స్బర్గ్ యూనివర్శిటీలోచదువుతోంది. తన కుమార్తె పిట్స్బర్గ్ విశ్వవిద్యాలయంలో ప్రీ-మెడికల్ స్టడీకి ముందు వెకేషన్కోసం పుంటా కానాకు వెళ్లిందని, స్నేహితులతో కలిసి రిసార్ట్‌లో పార్టీకి వెడుతున్నట్టు చెప్పిందని, అవే తనతో మాట్లాడిన చివరి మాటలని సుదీక్ష తండ్రి సుబ్బరాయుడు కోణంకి కన్నీటి పర్యంతమైనారు. తన బిడ్డ మెరిట్ స్టూడెంట్ అనీ, డాక్టర్ కావాలని కలలు కనేదని గుర్తు చేసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో స్నేహితులను పోలీసులు ప్రశ్నించారని, ఎవరిపైనా ఎలాంటి అభియోగాలు నమోదు కాలేదని అధికారులు తెలిపారు.

న్యూయార్లో ఘనంగా తెలుగువారి సంబరాలు.
అమెరికా వాణిజ్య రాజధాని న్యూయార్క్ లో తెలుగువారి సంబరాలు అంబరాన్ని అంటాయి. ఒకే రోజు రెండు ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకున్నారు. మహిళా దినోత్సవంతో పాటు మహా శివరాత్రి వేడుకలను కూడా ఓకేసారి న్యూయార్క్ లో స్థిరపడిన తెలుగువారి చేసుకున్నారు. న్యూయార్క్ తెలంగాణ తెలుగు సంఘం (నైటా) ఆధ్వర్యంలో ఫ్లషింగ్ గణేష్ టెంపుల్ ఆడిటోరియంలో ఈ వేడుకలు ఘనంగా జరిగాయి.వందలాది మంది తెలంగాణ, తెలుగు వాసులు తమ కుటుంబాలతో సహా చేరి ఉత్సవాల్లో పాల్గొని ఆడి పాడారు. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన న్యూయార్క్ మేయర్ ఎరిక్ ఆడమ్స్ మాట్లాడుతూ అమెరికాతో పాటు న్యూ యార్క్ మహానగరం అభివృద్ది, సంస్కృతిలో తెలుగువారు అంతర్భాగం అయ్యారని కొనియాడారు.తెలంగాణ ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్కమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, సీతక్క, తదితర ప్రముఖులు ప్రత్యేక సందేశాల ద్వారా నైటా కార్యక్రమాలను, ఆర్గనైజింగ్ కమిటీ కృషిని ప్రశంసిస్తూ ప్రత్యేక సందేశాలను పంపారు. వీటి సంకలనంతో పాటు నైటా సభ్యులు, కార్యక్రమాలతో కూడిన సమాహారంగా నైటా వార్షికోత్సవ సావనీర్ ను ఈ సందర్భంగా విడుదల చేశారు.ఈ ఫెస్టివల్ ఈవెంట్ లో తెలంగాణ సూపర్ రైటర్, సింగర్, మ్యూజిక్ డైరెక్టర్ కాసర్ల శ్యామ్ తో పాటు, యూకే నుంచి సింగర్ స్వాతి రెడ్డి, డాన్సింగ్ అప్సరాస్ గా పేరొందిన టీ అండ్ టీ సిస్టర్స్, ఇండియన్ ఫేమస్ ఫ్యూజన్ మ్యూజిక్ గ్రూప్ పరంపరా లైవ్ ఫెర్మామెన్స్ తో అదరగొట్టారు. కొన్ని గంటల పాటు జరిగిన కార్యక్రమం ఆద్యంతం అందరినీ కట్టిపడేసింది.తెలుగు యువత గుండెల్లో చిరకాలం నిలిచిపోయే పాటలను రచించటంతో పాటు, పాడిన యువ గాయకుడు కాసర్ల శ్యామ్ కొన్ని హిట్ సాంగ్స్ తో అందరినీ ఉర్రూతలూగించారు. అమెరికాలో తెలుగువారి బలగాన్ని, బలాన్ని తన పాటల ద్వారా శ్యామ్ చాటి చెప్పారు. ఇక కొంత ఆలస్యంగానైనా న్యూయార్క్ తెలుగువారు శివరాత్రి వేడుకలు జరుపుకున్నా ఆధ్యాత్మిక గీతాలు, చిన్నారులు భక్తి పాటలతో ఆడిటోరియటం మారు మోగింది.న్యూయార్క్ మహానగరంలో నిత్యం వారి వారి వృత్తుల్లో బిజీగా ఉండే మన తెలుగు వారు అన్నింటినీ పక్కన పెట్టి అటు శివ భక్తి, ఇటు మహిళా దినోత్సవాన్ని ఒకే సారి వేడుకగా జరుపుకున్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన నైటా ఆర్గనైజింగ్ టీమ్ తో పాటు తెరవెనుక సహకరించిన ప్రతీ ఒక్కరికీ పేరు పేరునా అధ్యక్షురాలు వాణీ రెడ్డి ఏనుగు కృతజ్జతలు తెలిపారు.నైటా కార్యక్రమాలకు వెన్నుముకగా నిలుస్తూ ప్రోత్సాహం అందిస్తున్న డాక్టర్ పైళ్ల మల్లారెడ్డిని నైటా టీమ్ ఘనంగా సత్కరించింది. ఈ కార్యక్రమంలో వందలాది మంది తెలుగు కుటుంబాలతో పాటు, న్యూయార్క్ కాంగ్రెస్ విమెన్ గ్రేస్ మెంగ్, ఇండియన్ కాన్సులేట్ జనరల్ నుంచి బిజేందర్ కుమార్ తదితరులు హాజరయ్యారు.

లండన్‌లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు
బిందువు బిందువు కలిస్తేనే సింధువు అనే విధంగా యూకే లో నివసిస్తున్న తెలుగు మహిళలు అందరూ “తెలుగు లేడీస్ యుకె” అనే ఫేస్బుక్ గ్రూప్ ద్వారా కలుసుకుని అంతర్జాతీయ మహిళా దినోత్సవ సంబరాలు జరుపుకున్నారు సహాయం కోరే వారికి మరియు సహాయం అందించే వారికి వారధిగా నిలిచే తెలుగు లేడీస్ ఇన్ యుకె గ్రూపును శ్రీదేవి మీనా వల్లి 14 ఏళ్ల క్రితం స్థాపించారు. ఈ గ్రూపులో ప్రస్తుతం ఐదు వేలకు పైగా తెలుగు మహిళలు ఉన్నారు.యూకే కి వచ్చినా తెలుగు ఆడపడుచులను ఆదరించి వారికి తగిన సూచనలు సలహాలు ఇస్తూ విద్యా వైద్య ఉద్యోగ విషయాల్లో సహాయం అందించడమే గ్రూప్ ఆశయమని శ్రీదేవి గారు తెలియజెప్పారు. ఈ సంవత్సరం యూకేలోని పలు ప్రాంతాల నుండి 300కు పైగా తెలుగు మహిళలు పాల్గొని ఆటపాటలతో ,లైవ్ తెలుగు బ్యాండ్ తో, పసందైన తెలుగు భోజనంతో పాటు,చారిటీ రాఫెల్ నిర్వహించి అవసరంలో ఉన్న మహిళలకు ఆసరాగా నిలిచారు.మస్తీ ఏ కాదు మానవత్వం లో కూడా ముందు ఉన్నాము అని నిరూపించారు.ఈవెంట్ లో డాక్టర్ వాణి శివ కుమార్ గారు మహిళలకు సెల్ఫ్ కేర్ గురించి ఎన్నో మంచి సూచనలు ఇచ్చారు. ఈవెంట్ కి వచ్చిన వాళ్లందరికీ మనసు నిండా సంతోషంతో పాటు మన తెలుగుతనాన్ని చాటిచెప్పేలా గాజులు,పూతరేకులు, కాజాలు వంటి పసందైన రుచులతో తాంబూలాలు పంచిపెట్టారు. ఈ ఈవెంట్లో శ్రీదేవి మీనావల్లితో పాటు సువర్చల మాదిరెడ్డి ,స్వాతి డోలా,జ్యోతి సిరపు,స్వరూప పంతంగి ,శిరీష టాటా ,దీప్తి నాగేంద్ర , లక్ష్మి చిరుమామిళ్ల , సవిత గుంటుపల్లి, చరణి తదితరులు పాల్గొన్నారు.
క్రైమ్

ఖాకీచకుడు.. కాటేయజూస్తున్నాడు
ఒంగోలు టౌన్: భర్త మరొకరితో వివాహేతర సంబంధం నెరుపుతూ తనను పట్టించుకోవడం లేదని న్యాయం కోసం పోలీస్ స్టేషన్‌కు వెళ్తే అక్కడ కానిస్టేబుల్ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని ఆరోపిస్తూ సోమవారం ఓ మహిళ కలెక్టరేట్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. సంచలనం సృష్టించిన ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి.. ఒంగోలు నగరం కమ్మపాలేనికి చెందిన జి.హర్ష వర్థిని జరుగుమల్లి మండలం కామేపల్లికి చెందిన నవీన్‌తో 2018లో వివాహమైంది. వీరికి ఇద్దరు ఆడపిల్లలు సంతానం. మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న నవీన్ భార్యాబిడ్డలను పట్టించుకోవడం మానేశాడు. ఈ నేపథ్యంలో న్యాయం కోసం ఒంగోలు టూటౌన్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. అయితే అక్కడి కానిస్టేబుల్ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని ఆరోపిస్తూ సోమవారం కలెక్టరేట్ ఎదుట హర్షవర్థిని తన పిల్లలతో సహా బైఠాయించింది. టూటౌన్ సీఐ మేడా శ్రీనివాసరావుతోపాటు మహిళా కానిస్టేబుళ్లు ఆమెకు సర్దిచెప్పేందుకు ప్రయత్నించినా మొండికేయడంతో కలెక్టరేట్ మెయిన్ గేటు వద్ద కాసేపు గందరగోళం నెలకొంది. జనాలు గుమిగూడడంతో ట్రాఫిక్ స్తంభించింది. కలెక్టర్‌ను కలిసి సమస్య తెలియజేయాలని సీఐ సూచించగా.. అక్కడకు వెళ్లినా పోలీసుల దగ్గరకే పంపిస్తారని, తనకు న్యాయం జరగదని పేర్కొనడం గమనార్హం. న్యాయం జరిగేలా చూస్తామని సీఐ చాలా సేపు బతిమాలడంతో ఎట్టకేలకు ఆమె ఆందోళన విరమించింది.

వెంటాడి వేటాడి..తండ్రిని చంపించిన కన్న కూతురు
సూర్యాపేటటౌన్: గ్రామంలో ఆధిపత్యం కోసం మామను అతికిరాతంగా హత్య చేయించాడు సొంత అల్లుడు. నూతనకల్ మండలం మిర్యాల గ్రామంలో హత్యకు గురైన మాజీ సర్పంచ్ మెంచు చక్రయ్యగౌడ్ హత్య కేసులో 13 మంది నిందితులను పోలీసులు సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను సోమవారం సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ నరసింహ విలేకరులకు వెల్ల డించారు. చక్రయ్యగౌడ్ ఆధిపత్యం సహించలేక..మెంచు చక్రయ్యగౌడ్ గ్రామంలో పెద్దమనిషిగా చలామణి అవుతూ గ్రామ సర్పంచ్‌గా కూడా పనిచేశాడు. అతడికి ఐదుగురు కుమార్తెలు సంతానం. తన మూడో కుమార్తె కనకటి సునీతను కూడా సర్పంచ్‌గా, మూడో అల్లుడు కనకటి వెంకన్నను పీఏఏసీఎస్ చైర్మన్‌గా చేశాడు. అల్లుడు కనకటి వెంకన్న పీఏసీఎస్ చైర్మన్ అయిన్నప్పటి నుంచి నూతనకల్ మండలంలో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాడు. గ్రామంలో చక్రయ్యగౌడ్ ఆధిపత్యం ఉండటం వెంకన్న వర్గీయులు సహించలేకపోయారు. చక్రయ్యగౌడ్కు వ్యతిరేకంగా వెంకన్న వర్గీయులు ఒక గ్రూపుగా ఏర్పడడంతో వారి మధ్య మనస్పర్ధలు వచ్చాయి. అసెంబ్లీ ఎన్నికల అనంతరం 2023లో చక్రయ్యగౌడ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2024లో కనకటి వెంకన్న కూడా కాంగ్రెస్‌లోకి వచ్చాడు. అయినప్పటికీ గ్రామంలో చక్రయ్యగౌడ్ ఆధిపత్యం కొనసాగుతోంది. దీంతో ఎలాగైనా మామ చక్రయ్యగౌడ్ను అడ్డు తొలగించుకోవాలని కనకటి వెంకన్న నిర్ణయించుకున్నాడు.బొడ్రాయి మహోత్సవంలో హత్యకు పథకం.. ఈ నెల 13న మిర్యాల గ్రామంలో బొడ్రాయి మహోత్సవం జరిగింది. గతంలో కనకటి వెంకన్న ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు జరిగేవి, చక్రయ్యగౌడ్ ఈసారి ఉత్సవాలను తన ఆధ్వర్యంలో జరపాలని బహిరంగంగా ప్రకటించడంతో వెంకన్న తట్టుకోలేకపోయాడు. దీంతో ఎలాగైనా చక్రయ్యగౌడ్ను హత్య చేయాలని తన వర్గీయులను కొంతమందిని వెంకన్న పురమాయించాడు. ఈ నెల 17వ తేదీ సాయంత్రం చక్రయ్యగౌడ్ తన వ్యవసాయ బావి వద్దకు వెళ్లి వస్తుండగా.. అతడి మొదటి అల్లుడు కనకటి ఉప్పలయ్య, ఐదో అల్లుడు కనకటి లింగయ్యతో పాటు వెంకన్న అనుచరులైన కనకటి శ్రవణ్, కనకటి శ్రీకాంత్, గంధసిరి వెంకటేష్, పెద్దింటి మధు, పెద్దింటి గణేష్ అడ్డగించి మారణాయుధాలు, వెదురు కరల్రతో చక్రయ్యగౌడ్పై దాడి చేసి హత్య చేశారు. ఇదంతా దూరంగా నుంచి గమనిస్తున్న వెంకన్న చక్రయ్యగౌడ్పై దాడి జరిగగానే అతడు చనిపోయాడని నిర్ధారించుకుని అక్కడి నుంచి అందరూ పారిపోయారు. ఈ హత్యపై నూతనకల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. సోమవారం ఉదయం తుంగతుర్తి పరిధిలో వాహనాల తనిఖీల్లో భాగంగా.. చక్రయ్యగౌడ్ హత్యలో ప్రత్యక్షంగా పాల్గొన్న అతడి మొదటి అల్లుడు కనకటి ఉప్పలయ్యతో పాటు హత్యకు కుట్ర పన్నిన మూడో అల్లుడు కనకటి వెంకన్న, వెంకన్న భార్య సునీత, మొదటి కుమార్తె కనకటి స్వరూప, ఐదో కుమార్తె కనకటి కల్యాణితో పాటు దిండిగల నగేశ్, జక్కి పరమేష్, మన్నెం రమేశ్, కనకటి వెంకన్న అలియాస్ మొండి వెంకన్న, కనకటి శ్రావ్య, కనకటి/వర్దెల్లి అనూష, జక్కి స్వప్న, భారీ సతీష్ రెండు కార్లలో వెళ్తుండగా పోలీసులు అదపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా.. చక్రయ్యగౌడ్ను హత్య చేసినట్లు నిజం ఒప్పుకున్నారు. నిందితుల నుంచి రెండు కార్లు, ఒక కర్ర, 10 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్‌కు తరలించినట్టు ఎస్పీ తెలిపారు. ఈ కేసులో మొత్తం 42 మందిపై కేసు నమోదైందని, దర్యాప్తు కొనసాగుతుందని ఎస్పీ తెలిపారు. ప్రత్యక్షంగా హత్యలో పాల్గొన్న ఏడుగురు నిందితుల్లో కనకటి ఉప్పలయ్య మినహా మిగతా ఆరుగురు గతంలోనే కోర్టులో లొంగిపోయినట్లు సమాచారం.కస్టడీ పిటీషన్ వేసి దర్యాప్తు చేస్తాంఈ హత్య కేసులో ప్రత్యక్షంగా, పరోక్షంగా పాల్గొన్న ఎవరినీ వదిలిపెట్టకుండా కచ్చితమైన ఆధారాలు సేకరిస్తూ దర్యాప్తు పారదర్శకంగా చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. కస్టడీ పిటిషన్ వేసి నిందితులను కస్టడీలోకి తీసుకుని దర్యాప్తు చేస్తామన్నారు. నిందితులను పట్టుకున్న పోలీసులకు ఎస్పీ రివార్డు అందజేశారు. ఈ కేసు ఛేదించిన సూర్యాపేట డీఎస్పీ రవి, సీఐ డి. శ్రీను, ఎస్ఐలు మహేంద్రనాథ్, ఎం. వీరయ్య, ఆర్. క్రాంతికుమార్‌ను ఎస్పీ అభినందించారు.

Hyderabad: ఇంజినీరింగ్ విద్యార్థుల దుర్మరణం
హైదరాబాద్: అతి వేగం ఇద్దరు విద్యార్థుల నిండు ప్రాణాలను తీసుకుంది. ఈ సంఘటన ఉస్మానియా యూనివర్సిటీ పోలీసు స్టేషన్ పరిధిలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం దుమ్ముగూడెం ప్రగలపల్లి గ్రామానికి చెందిన బంటు రాజ్‌కుమార్(20), పెద్దపల్లి జిల్లా, గోదావరిఖనికి చెందిన అటికెటి సిద్దార్ధ(21) ఓయూ ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజినీరింగ్ చదువుతున్నారు. ఆదివారం రాత్రి వీరు ఓయూ హాస్టల్ నుంచి బైక్‌పై విద్యానగర్ వెళుతుండగా అడిక్‌మెట్ ఫ్లైఓవర్‌పై వారు ప్రయాణిస్తున్న వాహనం అదుపుతప్పి కిందపడింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఇద్దరూ అక్కడిక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విద్యార్థుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సోమవారం పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు.

గృహిణికి అండగా ఉన్నందుకు...అంతమొందించాడు
హైదరాబాద్: లైంగిక వేధింపులకు గురవుతున్న ఓ మహిళకు అండగా ఉన్న లాయర్‌ను కక్షగట్టి దారుణంగా హత్య చేశాడు. చంపాపేటలో సోమవారం ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు, మృతుడి బంధువులు తెలి్పన వివరాల ప్రకారం..మహేశ్వరం మండల కేంద్రానికి చెందిన సీనియర్ న్యాయవాది ఎర్రబాబు ఇజ్రాయిల్ (56) నగరంలోని చంపాపేట డివిజన్ న్యూమారుతీనగర్ కాలనీలో నివసిస్తున్నాడు. తన ఇంటి సమీపంలోనే ఓ అపార్ట్మెంట్లో ఇటీవల ఫ్లాట్‌ను కొనుగోలు చేసి..ఓ గృహిణి కుటుంబ సభ్యులకు అద్దెకు ఇచ్చాడు. అదే కాలనీ సమీపంలోని సుల్తానా అల్వా కాలనీ శ్మశాన వాటిక కాపలాదారుడుగా పని చేస్తున్న గులాం దస్తగిరి ఖాళీ సమయంలో ప్రైవేట్ ఎలక్ట్రీషియన్‌గా కూడా పనిచేస్తున్నాడు.ఇజ్రాయిల్ కొనుగోలు చేసిన ఫ్లాట్‌లో దస్తగిరి విద్యుత్ మరమ్మతు పనులకు వెళ్తుండే వాడు. ఈ క్రమంలోనే ఫ్లాట్‌లో అద్దెకు ఉంటున్న గృహిణితో పరిచయం ఏర్పడింది. దీన్ని అలుసుగా తీసుకున్న దస్తగిరి తనను ప్రేమించాలని, అండగా ఉంటానని ఆమెను వేధించసాగాడు. వేధింపులు భరించలేని ఆ గృహిణి ఫ్లాట్ యజమాని ఇజ్రాయిల్‌కు ఫిర్యాదు చేసింది. వెంటనే స్పందించిన ఆయన దస్తగిరిని మందలించాడు. పోలీసులకు ఫిర్యాదు చేయించి.. దస్తగిరి వేధింపులు ఎక్కువ అవడంతో 25 రోజుల క్రితం ఇజ్రాయిల్ ఐఎస్‌సదన్ పోలీసులకు గృహిణితో ఫిర్యాదు చేయించాడు. ఆమెకు దస్తగిరి నుంచి ప్రాణహాని ఉందని హెచ్చరించాడు. ఆమెను బంధువుల ఇంటికి పంపించి వేశాడు. ఈ క్రమంలో పోలీసులు దస్తగిరిని స్టేషన్‌కు పిలిపించి..నామమాత్రంగా మందలించి, కౌన్సిలింగ్ చేసి పంపించేశారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన దస్తగిరి..ఇజ్రాయిల్‌పై కక్ష పెంచుకున్నాడు. ఎలాగైనా అతన్ని అంతం చేయాలని ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడు. గత మూడు రోజులుగా ఇజ్రాయిల్ ఇంటి ముందు రెక్కీ నిర్వహించిన దస్తగిరి సోమవారం ఉదయం 9 గంటలకు ఇజ్రాయిల్ తన స్కూటీపై ఒంటరిగా రావటాన్ని పసిగట్టి..ఒక్కసారిగా తన వెంట తెచ్చుకున్న కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. అనంతరం పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు.విషయం తెలసుకున్న స్థానికులు రక్తపు మడుగులో కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్న ఇజ్రాయిల్‌ను సమీపంలోని డీఆర్డీఓ అపోలో ఆసుపత్రిలో చేరి్పంచారు. పరీక్షించిన వైద్యులు ఇజ్రాయిల్ అప్పటికే మృతిచెందాడని నిర్ధారించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆధారాలు సేకరించి కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. కాగా పోలీసులు గృహిణి ఫిర్యాదును సీరియస్‌గా తీసుకోలేదని, తీసుకుని ఉంటే ఈ హత్య జరిగేది కాదని స్థానికులు విమర్శిస్తున్నారు. కాగా ఇజ్రాయిల్ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం రాష్ట్ర మాజీ డైరెక్టర్‌గా పనిచేశాడు. అలాగే కాంగ్రెస్ పార్టీ తరపున జెడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేశారు.