Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today

Top Stories

ప్రధాన వార్తలు

Pawan Kalyan Faced Protests Every Where in AP1
ఝూటా వకీల్‌ సాబ్‌ పతనం మొదలైందా?

సూపర్ సిక్స్ హామీలు, ఎన్నికల ప్రణాళికలోని అంశాలతో తనకు సంబంధం లేనట్లు, అదేదో టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేశ్‌ల బాధ్యత అన్నట్లు ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ మాట్లాడుతున్నారు. ప్రశ్నించడానికే పార్టీని పెట్టానని గొప్పగా చెప్పుకున్న పవన్.. ఇప్పుడు చంద్రబాబు, లోకేశ్‌లను రాజకీయంగా మోయడానికి, తన ఉప ముఖ్యమంత్రి పదవిని ఎంజాయ్ చేయడానికే అన్నట్లు ప్రవర్తిస్తున్నారని విమర్శ. దీంతో ఆయనకు ఇప్పుడిప్పుడే నిరసన సెగ తగులుతోంది. కొద్ది రోజుల క్రితం విశాఖ, గిరిజన ప్రాంతాలకు వెళ్లినప్పుడు వలంటీర్లు పవన్‌ కల్యాణ్‌(Pawan Kalyan)ను నిలదీసే యత్నం చేశారు. ఇప్పటికే ఆయా చోట్ల వలంటీర్లు ధర్నాలు, ర్యాలీలు నిర్వహించారు. అయినా కూటమి ప్రభుత్వంలో కనీస స్పందన లేదు. కూటమి పెద్దలకు చీమ కుట్టినట్లుగా కూడా లేదు. దాంతో వలంటీర్లు నేతలను ప్రశ్నించడానికి సిద్ధమవుతున్నారు. నిజానికి వీరే కాదు. సూపర్ సిక్స్ తదితర హామీలు ఏమయ్యాయంటూ మహిళలు, నిరుద్యోగులు తదితర వర్గాలు నిరసన ర్యాలీలు చేయడం ఆరంభమైంది.వలంటీర్లకు సంబంధించి పవన్ చేసిన ప్రకటనను గమనిస్తే ఆయన ఎలా మాట మార్చుతున్నది ఇట్టే తెలిసిపోతుంది. గత ప్రభుత్వం వలంటీర్లను అధికారికంగా నియమించలేదని చంద్రబాబు, లోకేశ్‌లు క్యాబినెట్ సమావేశంలో చెప్పారని, వారికి ఇచ్చేది జీతం కాదు.. గౌరవ వేతనం మాత్రమేనని, అందుకే ఏమీ చేయలేదని తెలియ చేశారని పవన్ అన్నట్లుగా మీడియాలో కథనం వచ్చింది. లక్షన్నర మంది జీవితాలను నట్టేట ముంచేసి, అదేదో స్వల్ప విషయమన్నట్లుగా పవన్ వ్యవహరించడం శోచనీయం. 👉ఎన్నికల ప్రణాళికలో వలంటీర్లకు పదివేల జీతం ఇస్తామని, వారి సేవలను కొనసాగిస్తామని ప్రకటించింది వాస్తవం కాదా? పలు ఎన్నికల ప్రచార సభలలో పవన్ కళ్యాణ్ ఎన్నిసార్లు వలంటీర్ల అంశం ప్రస్తావించారో గుర్తు లేదా? వలంటీర్ల కడుపు కొట్టబోమని, అందులోను లక్షమంది యువతులకు అన్యాయం చేస్తానా? అని ప్రసంగించారు. వాస్తవానికి రాష్ట్రంలో రెండున్నర లక్షల మంది వలంటీర్లు ఉండే వారు. కాని ఎన్నికల సమయంలో సుమారు ఎనభై వేల నుంచి లక్ష మంది వరకు రాజీనామాలు సమర్పించారు. వైఎస్సార్‌ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఉంటే వారిని కూడా బాధ్యతలలోకి తీసుకునే వారు. కాని కూటమి ప్రభుత్వం రావడంతో తమకు గౌరవ వేతనం పెరుగుతుందని రాజీనామా చేయని వలంటీర్లు ఆశపడ్డారు. తీరా చూస్తే కూటమి ప్రభుత్వం అసలుకే మోసం తెచ్చింది. 👉వలంటీర్లు(Volunteers) అంటే స్వచ్ఛందంగా సేవలందించే వారని, వారికి గత జగన్ ప్రభుత్వం గౌరవ వేతనం ఇచ్చిందన్న సంగతి పవన్ కళ్యాణ్ కు తెలియదా? ఆ విషయం తెలియకుండానే, గుడ్డిగా చంద్రబాబుతో కలిసి ఎన్నికల ప్రణాళికపై సంతకం చేశారని నమ్మాలా? అదే వాస్తవం అయితే పవన్ కళ్యాణ్ ఈ పదవిలో ఉండడానికి అర్హుడవుతారా? పైగా క్యాబినెట్లో చంద్రబాబు, లోకేశ్‌లు ఏదో చెప్పారని వారిపై నెట్టేసి తప్పించుకునే యత్నం చేస్తారా? ప్రభుత్వంలో వారు ఏమి చేసినా సమర్థిస్తున్న పవన్ కళ్యాణ్ వలంటీర్ల విషయం తనకు ఏమీ తెలియదన్నట్లుగా నటించడం ధర్మమేనా?. వలంటీర్లకు ఇచ్చేది గౌరవ వేతనం కనుక ,వారికి ఆ బాధ్యతలు అప్పగించడం కుదరదని చంద్రబాబు, లోకేశ్‌ లు చెబితే పవన్ కళ్యాణ్ చెవిలో పువ్వు పెట్టుకుని విన్నారా?మనం హామీ ఇచ్చాం కదా! ఎందుకు చేయలేం. ప్రభుత్వం అనుకుంటే ఇది ఒక పెద్ద సమస్యా?అ ని పవన్ కళ్యాణ్ ప్రశ్నించి ఉండాలి కదా? ఉగాది పర్వదినానా పవిత్రమైన పూజలు నిర్వహించి మరీ వలంటీర్లకు హామీ ఇచ్చారు కదా? ఇప్పుడు కాదంటే పాపం కదా అని చంద్రబాబును అడగాలి కదా? అలా అడగలేదంటే ఏమిటి దాని అర్థం? వలంటీర్లు సామాన్యులు కనుక, వారిని ఏమి చేసినా ఏమీ కాదన్న భావనే కదా?. 👉జగన్ ప్రభుత్వం(Jagan Govt) విజయవంతంగా నిర్వహించిన వలంటీర్లు అంటే చంద్రబాబు, లేదా పవన్ కళ్యాణ్‌లకు ఎప్పుడూ గౌరవం లేదు. వారిని అసలు సమాజంలో గౌరవనీయమైన వ్యక్తులుగా చూడడానికి కూడా ఇష్టపడలేదు. చంద్రబాబు నాయుడు వీరిని మూటలు మోసే వారని, ఆడవాళ్ళు ఇళ్లలో ఉన్నప్పుడు వెళ్లి వేధించేవారని ఒకసారి నీచమైన రీతిలో వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ అయితే మరీ దారుణంగా వలంటీర్లను కిడ్పాపర్లతో పోల్చారు. ఏపీలో 30 వేల మంది అమ్మాయిలు తప్పిపోయారని అంటూ వలంటీర్లపై ఆరోపణలు చేశారు. కాని ప్రజలలో వలంటీర్ల పట్ల ఉన్న సానుకూలత వల్ల అది వైఎస్సార్‌సీపీకి ఎక్కడ అడ్వాంటేజ్ అవుతుందోనన్న భయంతో, మాట మార్చి తాము అధికారంలోకి వస్తే వలంటీర్లను కొనసాగించడమే కాకుండా, గౌరవ వేతనం రూ.ఐదు వేల నుంచి రూ.పది వేలు చేస్తామని ప్రకటించారు. అప్పటికి వారికి అధికారం వస్తుందన్న నమ్మం లేదు. కాని అనూహ్యంగా గెలిచేసరికి, ఇప్పుడు సూపర్ సిక్స్‌తో సహా అనేక అంశాలపై స్వరం మార్చుతున్నారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముందు సినీ నటుడు. ఆ తర్వాతే రాజకీయ నేత. సినిమాలలో వకీల్‌ సాబ్‌గా ఆయన నటన అభిమానులను మెప్పించింది. కానీ రాజకీయ జీవితంలో మాత్రం ఆయన వ్యవహారశైలి వకీల్‌సాబ్‌ పాత్రకు భిన్నంగా ఉంది. ఈ సంగతిని ప్రజలూ గుర్తిస్తున్నారు. కరడుకట్టిన, గుడ్డి అభిమానులు మినహా మిగిలిన వారిలో పవన్‌ కళ్యాణ్‌ మాట మార్చేస్తున్నారన్న భావన క్రమేపీ బలపడిపోతోంది. 👉అబద్దాలు బాగా ఆడతారన్న పేరు ఉన్న చంద్రబాబుకు తానా అంటే తందానా అని తబలా వాయిస్తున్న చందంగా పవన్ వ్యవహరిస్తున్నారు. ఆయనతో పోటీ పడి అసత్యాలు చెబుతున్నారు. తాము మాట మార్చుతున్నామని ధైర్యంగా పవన్ కళ్యాణ్ చెప్పి ఉంటే కొంతైనా బెటర్‌గా ఉండేది. అలా కాకుండా చంద్రబాబు, లోకేశ్‌లదే తప్పు అన్నట్లు, తనకేమీ సంబంధం లేదన్నట్లు పవన్ కళ్యాణ్ డ్రామా ఆడినట్లు డైలాగులు చెబితే ప్రజలను పిచ్చివాళ్లను చేసినట్లు కాదా? వలంటీర్లను మోసం చేయడం కాదా? 30 వేల మంది అమ్మాయిల మిస్సింగ్ గురించి ఏపీ అంతటా తిరిగి చేసిన ప్రచారం అంతా అసెంబ్లీ సాక్షిగా పచ్చి అబద్దం అని తేలింది కదా! కేవలం 47 మంది మాత్రమే మిస్ అయ్యారని, వారిలో ఎక్కువ మంది తిరిగి వచ్చారని అసెంబ్లీలో సమాధానం చెప్పింది కూటమి ప్రభుత్వమే కదా? పవన్ కళ్యాణ్ పచ్చి అబద్దం ప్రచారం చేసి ఆంధ్ర సమాజాన్ని చీట్ చేసినట్లు అవుతుందా? అవ్వదా?.చంద్రబాబు, లోకేశ్‌ల పట్ల పవన్ కళ్యాణ్ ఎంత విధేయుడిగా ఉన్నా ప్రజలకు అభ్యంతరం లేదు. కాని ఎన్నికల ప్రణాళికను చంద్రబాబుతో కలిసి ఆయన కూడా విడుదల చేశారన్న సంగతి మర్చిపోకూడదు కదా! వకీల్ సాబ్ పాత్రను సినిమాలలో పోషించడం కాదు.. ప్రజా జీవితంలో ఆ మాదిరి నిలబడితేనే మంచి పేరు వస్తుంది. పవన్ కళ్యాణ్ విశాఖ వెళ్లినప్పుడు ఆయన కాన్వాయ్ కోసం పోలీసులు ఆంక్షలు విధించడం, తత్పలితంగా సుమారు 30 మంది జెఈఈ పరీక్షలు రాయలేకపోయిన ఘటన కూడా కూటమి ప్రభుత్వ తీరుకు అద్దం పడుతుంది. పవన్ కళ్యాణ్ పదవిని ఎంజాయ్ చేసే మోజులో విద్యార్ధుల భవిష్యత్తును కూడా దెబ్బతీశారన్న విమర్శకు ఆస్కారం ఇచ్చారు. ఏది ఏమైనా వలంటీర్లను చంద్రబాబు, లోకేశ్‌లే కాదు.. పవన్ కళ్యాణ్ కూడా మోసం చేసినట్లే!. :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

GVMC Motion Updates: YSRCP Coporators Shocks Kutami Leaders2
విశాఖ: ప్రలోభాల పర్వంలో కూటమి నేతలకు ఛీత్కారాలు

విశాఖపట్నం, సాక్షి: అధికార దాహంతో.. గత 11 నెలల పదవి కాలంలో కూటమి ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేసింది. ఈ క్రమంలో ఇప్పుడు విశాఖ మేయర్‌పై అవిశ్వాసం వేళ (GVMC No Confidence Motion).. మరోసారి భారీగా ప్రలోభాలకు తెరలేపింది. ఈ క్రమంలోనే వైఎస్సార్సీపీ కార్పొరేటర్లకు గాలం వేసేందుకు కోట్లాది రూపాయలను మంచి నీళ్లలా ఖర్చు చేస్తోంది. అవిశ్వాసానికి సమయం దగ్గర పడుతుండడంతో కూటమి నేతలు ప్రలోభాల ఉధృతిని పెంచారు. వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్ల ఇళ్లకు వెళ్లి వాళ్ల కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నారు. భారీగా డబ్బు ఇస్తామని, భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా చూస్తామని హామీలు గుప్పిస్తున్నారు. అలాగే.. శ్రీలంక, కేరళ నుంచి విశాఖకు తీసుకురావడానికి ప్రత్యేక విమానం ఏర్పాటు చేస్తామంటున్నారు. విమానం కాకపోతే హెలికాప్టర్స్ అయినా ఏర్పాటు చేస్తామంటూ ఆఫర్లు చేస్తున్నారు. అయితే.. తాము వైఎస్సార్‌ అభిమానులమని, ఎలాంటి పరిస్థితుల్లోనైనా వైఎస్‌ జగన్‌(YS Jagan)తోనే ఉంటామని చెబుతూ వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు ఆ ఆఫర్లను తిరస్కరిస్తున్నారు. ఈ క్రమంలో బెదిరింపులకు సైతం కొందరు లొంగడం లేదని సమాచారం. దీంతో చేసేది లేక కూటమి నేతలు వెనుదిరుగుతున్నట్లు సమాచారం. జీవీఎంసీ(GVMC) ఎన్నికల్లో 58 స్థానాలను వైఎస్సార్‌ సీపీ కైవసం చేసుకుని మేయర్‌ పదవిని చేజిక్కించుకుందని, 30 స్థానాలు మాత్రమే గెలుచుకున్న టీడీపీ ఇప్పుడు మేయర్‌ పీఠాన్ని దక్కించుకోవాలనే దురాలోచనతో ఉంది. ఈ క్రమంలోనే భారీగా డబ్బు ఆశ చూపించడం, బెదిరింపులలాంటి అప్రజాస్వామిక ప్రయత్నాలకు దిగింది.

No Rush To End Tariffs Says Trump To Meloni3
మెలోనీతో భేటీ.. సుంకాలపై మెత్తబడ్డ ట్రంప్‌

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సుంకాల విషయంలో కాస్త మెత్తబడ్డారు. సుంకాలపై పలు దేశాలు అగ్రరాజ్యంతో చర్చలకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ అమెరికా అధినేతతో సమావేశమయ్యారు. ఈ భేటీ సందర్భంగా ఆయన సానుకూల వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఈయూ దేశాలపై అమెరికా 20 శాతం సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. అయితే దాని అమలును 90 రోజులపాటు నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పరిణామాల నడుమ.. ట్రంప్‌ను కలిసిన తొలి యూరప్‌ దేశపు నేత మెలోనీనే కావడం గమనార్హం. ఐరోపా సమాఖ్య(European Union)తో పాటు ఇతర దేశాలతో వాణిజ్య ఒప్పందం అంశంపై వీరు చర్చలు జరిపారు. అయితే ఈయూతో సుంకాలపై ఒప్పందం నూటికి నూరు శాతం కుదురుతుందని ట్రంప్‌ భరోసా ఇచ్చారు. ఈ డీల్‌ విషయంలో మాత్రం తాను తొందర పడటం లేదని వ్యాఖ్యానించడం గమనార్హం. ప్రతీ ఒక్కరూ అమెరికాతో డీల్‌ కుదుర్చుకోవాలని తాపత్రయపడుతున్నారు. ఒకవేళ అలా వాళ్లు అనుకోకుంటే గనుక మేమే వాళ్లతో ఒప్పందానికి దిగి వస్తాం అంటూ ట్రంప్‌ ఆసక్తికర వ్యాఖ్య చేశారు. ఇక.. మరోవైపు ఈ భేటీలో మెలోనీని ట్రంప్‌ ఆకాశానికెత్తారు. ఆమె ఓ అద్భుతమైన నేత అంటూ పొగడ్తలు గుప్పించారు. మరోవైపు.. పశ్చిమాన్ని గొప్పగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని, కలిసికట్టుగా ఆ పని చేయగలమని అనుకుంటున్నా’ అని ఓవల్‌ ఆఫీసులో రిపోర్టర్లతో మెలోనీ మాట్లాడారు. ట్రంప్‌ను రోమ్‌ను ఆహ్వానించిన మెలోనీ.. అక్కడ ఈయూ దేశాల ప్రతినిధులతో సుంకాల అంశంపై చర్చిస్తామని వెల్లడించారు. Rendiamo l’Occidente di nuovo grande - Make the West Great Again pic.twitter.com/Z499ZRGx85— Giorgia Meloni (@GiorgiaMeloni) April 17, 2025

MI vs SRH: Ishan Kishan Walks up to Nita Ambani Receives Gentle Pat on Cheek4
నీతా అంబానీ దగ్గరికి వెళ్లిన ఇషాన్‌.. మాజీ ఓనర్‌ రియాక్షన్‌ ఇదే!

ఐపీఎల్‌-2025 (IPL 2025)లో ముంబై ఇండియన్స్‌- సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (MI vs SRH) మ్యాచ్‌ సందర్భంగా గురువారం ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. రైజర్స్‌ స్టార్‌ బ్యాటర్‌ ఇషాన్‌ కిషన్‌ (Ishan Kishan).. ముంబై జట్టు యజమాని నీతా అంబానీ (Nita Ambani)ని కలిశాడు. ముంబై చేతిలో ఓటమి అనంతరం తన మాజీ ఓనర్‌ దగ్గరకు వెళ్లి మర్యాదపూర్వకంగా పలకరించాడు.ప్రేమగా చెంప నిమిరిన మాజీ ఓనర్‌బదులుగా ఇషాన్‌ కిషన్‌ చేతిని పట్టుకుని.. తల్లి మాదిరి ప్రేమపూర్వకంగా నీతా అంబానీ అతడి చెంప నిమిరారు. ఓటమికి కుంగిపోవాల్సిన పనిలేదన్నట్లుగా ఇషాన్‌ను ఓదార్చారు. ఇందుకు సంబంధించిన ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.ఈ నేపథ్యంలో లక్నో సూపర్‌ జెయింట్స్‌ ఓనర్‌ సంజీవ్‌ గోయెంకాపై మీమ్స్‌ పేలుతున్నాయి. ‘‘తమ జట్టుతో ప్రయాణించిన మాజీ ఆటగాడి పట్ల నీతా తల్లిలా ప్రేమను కురిపిస్తుంటే.. గోయెంకా మాత్రం ఒక్క మ్యాచ్‌లో ఓడినా తమ కెప్టెన్లను అందరి ముందే ఉతికి ఆరేస్తాడు.. ఇదే ఈ ఇద్దరికి ఉన్న తేడా’’ అంటూ ముంబై అభిమానులు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.కాగా 2016లో ఇషాన్‌ కిషన్‌ ఐపీఎల్‌లో అరంగేట్రం చేశాడు. గుజరాత్‌ లయన్స్‌ అతడిని రూ. 35 లక్షల కనీస ధరకు కొనుగోలు చేయగా.. రెండేళ్ల పాటు అదే జట్టుకు ఆడి 319 పరుగులు చేశాడు.ముంబైతో సుదీర్ఘ అనుబంధంఅయితే, గుజరాత్‌ ఫ్రాంఛైజీ ఐపీఎల్‌ నుంచి కనుమరుగైన తర్వాత ముంబై ఇండియన్స్‌ ఇషాన్‌ కిషన్‌ను కొనుగోలు చేసింది. 2018 వేలంలో ఈ ఎడమచేతి వాటం బ్యాటర్‌ను సొంత చేసుకోగా.. రోహిత్‌ శర్మ కెప్టెన్సీలో ఆ ఏడాది 500కు పైగా పరుగులు సాధించాడు. అప్పటి నుంచి ఏడేళ్లపాటు ముంబై జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. 2022 వేలంలో అత్యధికంగా రూ. 15.25 కోట్ల ధర పలికాడు.రూ. 11.25 కోట్లకు రైజర్స్‌కు సొంతంఅయితే, మెగా వేలం-2025కి ముందు ముంబై ఇషాన్‌ కిషన్‌ను వదిలేసింది. ఈ క్రమంలో వేలంపాటలోనూ అతడిని కొనుగోలు చేసేందుకు పెద్దగా ఆసక్తి చూపించలేదు. ఇక అతడి కోసం ఇతర ఫ్రాంఛైజీలతో పోటీ పడి మరీ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ రూ. 11.25 కోట్లకు ఇషాన్‌ను కొనుక్కుంది. ఇప్పటి వరకు ఐపీఎల్‌-2025లో విధ్వంసకర శతకం (106 నాటౌట్‌) బాదడం మినహా ఇషాన్‌ ఆకట్టుకోలేకపోతున్నాడు. ఏడు మ్యాచ్‌లలో కలిపి అతడు సాధించిన పరుగులు 138. నాలుగు వికెట్ల తేడాతో సన్‌రైజర్స్‌ ఓటమిఇక ముంబై- సన్‌రైజర్స్‌ మధ్య మ్యాచ్‌ విషయానికొస్తే.. వాంఖడేలో టాస్‌ గెలిచిన హార్దిక్‌ పాండ్యా తొలుత బౌలింగ్‌ ఎంచుకున్నాడు. ఈ క్రమంలో బ్యాటింగ్‌ దిగిన కమిన్స్‌ బృందం.. నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది.లక్ష్య ఛేదనకు దిగిన ముంబై ఆరు వికెట్లు నష్టపోయి 18.1 ఓవర్లలో టార్గెట్‌ను పూర్తి చేసింది. బంతితో, బ్యాట్‌తో రాణించిన ముంబై ఆల్‌రౌండర్‌ విల్‌ జాక్స్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు అందుకున్నాడు. ఆఫ్‌ స్పిన్నర్‌ అయిన జాక్స్‌ మూడు ఓవర్ల బౌలింగ్‌లో కేవలం 14 పరుగులే ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. ట్రవిస్‌ హెడ్‌ (28), ఇషాన్ కిషన్‌ (2) రూపంలో రెండు కీలక వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక లక్ష్య ఛేదనలో వన్‌డౌన్‌లో వచ్చిన విల్‌ జాక్స్‌ 26 బంతుల్లో 36 పరుగులు సాధించాడు.చదవండి: ఇలాంటి వికెట్‌ మీద కష్టమే.. మా వాళ్లు నిర్లక్ష్యంగా ఆడలేదు.. కానీ: కమిన్స్‌Applying the finishing touches 🤌🎥 #MI skipper Hardik Pandya gave them the final flourish with a brilliant cameo of 21(9)Scorecard ▶ https://t.co/8baZ67Y5A2#TATAIPL | #MIvSRH | @mipaltan | @hardikpandya7 pic.twitter.com/hPI3CxwzLF— IndianPremierLeague (@IPL) April 17, 2025

Texas Hit and Run Case: Telugu Student Deepthi No More5
Texas: మృత్యువుతో పోరాడి ఓడిన దీప్తి

ఆస్టిన్‌: అమెరికా టెక్సాస్‌లో తెలుగు విద్యార్థిని హిట్‌ అండ్‌ రన్‌ కేసు విషాదాంతంగా ముగిసింది. తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న వంగవోలు దీప్తి(Deepthi Vangavolu)కన్నుమూశారు. ఈ విషయాన్ని అక్కడి అధికారులు ఇచ్చిన సమాచారం ద్వారా కుటుంబ సభ్యులు ధృవీకరించారు. దీంతో గుంటూరులోని ఆమె స్వస్థలంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. దీప్తి(23) తండ్రి హనుమంత రావు చిరువ్యాపారి. ఆమె కుటుంబం గుంటూరు(Guntur) రాజేంద్రనగర్‌ రెండో లైనులో నివాసం ఉంటోంది. టెక్సాస్‌లోని డెంటన్‌ సిటీలో యూనివర్సిటీ ఆఫ్‌ నార్త్‌ టెక్సాస్‌లో ఎంఎస్‌ చేసేందుకు వెళ్లారు. మరో నెల రోజుల్లో కోర్సు పూర్తి కావాల్సి ఉంది. అయితే ఈలోపు రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు ఆమెను కబళించింది. ఈ నెల 12వ తేదీన స్నేహితురాలైన మేడికొండూరుకు చెందిన స్నిగ్ధతో కలిసి రోడ్డుపై నడచి వెళ్తుండగా వేగంగా ప్రయాణిస్తున్న కారు ఢీకొట్టింది. దీప్తి తలకు తీవ్ర గాయమైంది. స్నిగ్ధకు కూడా గాయాలయ్యాయి. దీప్తి స్నేహితురాళ్లు ప్రమాద విషయాన్ని ఆమె తండ్రి హనుమంతరావుకు తెలిపారు. క్రౌడ్‌ ఫండింగ్‌(Crowd Funding) ద్వారా ఆమె చికిత్స కోసం ప్రయత్నాలు కొనసాగగా.. మంచి స్పందన లభించింది. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. ఈ నెల 15న దీప్తి చికిత్స పొందుతూ కన్నుమూసింది. శనివారం(ఏప్రిల్‌ 19) నాటికి మృతదేహం గుంటూరుకు వచ్చే అవకాశం ఉంది. మరో బాధితురాలు స్నిగ్ధ ప్రస్తుతం అక్కడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె పరిస్థితి నిలకడగానే ఉందని సమాచారం. అవే ఆమె చివరి మాటలు..దీప్తి మృతి వార్త విని ఆ తల్లిదండ్రులు గుండెలు అవిసెలా రోదిస్తున్నారు. చదువులో చాలా చురుకైన విద్యార్థిని అని, అందుకే పొలం అమ్మి మరీ అమెరికాకు పంపించామని చెప్పారు. నెల రోజుల్లో గ్రాడ్యుయేషన్‌ పూర్తి కావాల్సి ఉందని, ఆ టైంకి మమ్మల్ని అమెరికాకు రావాలని ఆమె కోరిందని, అందుకు ఏర్పాట్లలో ఉండగానే ఇలా జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 10వ తేదీన దీప్తి చివరిసారిగా తమతో ఫోన్‌లో మాట్లాడినట్లు తెలిపారు. కాలేజీకి టైం అవుతోందని.. ఆదివారం మాట్లాడతానని చెప్పి హడావిడిగా ఫోన్‌ పెట్టేసిందని.. అవే తమ బిడ్డ మాట్లాడిన చివరి మాటలని గుర్తు చేసుకుని బోరున విలపించారు.

Vizag Gang allegedly cheated Women under the guise of a marriage bureau6
విశాఖలో కీచక ముఠా! 30 మంది యువతులకు మత్తు మందు ఇచ్చి..

విశాఖపట్నం, సాక్షి: కూటమి పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోతోంది. ఈ 11 నెలలకాలంలో అఘాయిత్యాలు పెరిగిపోయాయి. అదే సమయంలో విశాఖ నేరాలమయంగా మారిపోయింది. తాజాగా.. నగరంలో మ్యారేజ్‌ బ్యూరో పేరిట అరాచకాలకు పాల్పడుతున్న ఓ ముఠా గట్టు రట్టయ్యింది. యువతులకు మత్తు మందు ఇచ్చి అత్యాచారాలకు పాల్పడుతుండడమే కాకుండా.. ఆపై బ్లాక్‌మెయిల్‌ చేస్తున్న వ్యవహారం ఓ బాధితురాలు ముందుకు రావడంతో వెలుగు చూసింది. నాలుగో టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకున్న ఈ వ్యవహారం వివరాల్లోకి వెళ్తే.. మ్యారేజ్‌ బ్యూరో, హెర్బల్‌ ప్రొడక్ట్స్‌, టూవీలర్‌ రైడ్‌ యాప్‌ పేరిట ఓ ముఠా పెళ్లికాని అమ్మాయిల నుంచి వివరాలు సేకరిస్తోంది. ఆపై సంబంధాలు, ప్రొడక్టులను చూపించే వంకతో పరిచయాలు పెంచుకుంటోంది. మత్తు మందు ఇచ్చి యువతులు స్పృహలో లేనప్పుడు అత్యాచారం చేయడంతో పాటు వీడియోలు తీస్తోంది. అలా ఇప్పటిదాకా 30 మంది యువతుల నగ్న వీడియోలను సేకరించి బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్నట్లు బాధితురాలు చెబుతోంది. ఒకవేళ గర్భం దాలిస్తే బలవంతంగా అబార్షన్‌లు చేయిస్తున్నారని తెలిపిందామె. గర్భం దాల్చిన తననూ అబార్షన్‌ చేయించుకోవాలని ఆ ముఠా ఒత్తిడి చేసిందని, లేకుంటే సుపారీ ఇచ్చి చంపేయిస్తామని బెదిరించిందని ఆమె పోలీసులను ఆశ్రయించింది. అయితే.. ఈ విషయంలో పోలీసుల నుంచి కూడా తనకు న్యాయం జరగడం లేదంటూ బాధితురాలు మీడియా ముందు వాపోయింది. ఆ ముఠాను ఆగడాలను కట్టడి చేసి.. నిందితులను కఠినంగా శిక్షించాలని బాధితురాలు కోరుకుంటోంది. ఈ వ్యవహారంపై, యువతి చేస్తున్న ఆరోపణలపై పోలీసులు స్పందించాల్సి ఉంది.

Threat Letters Against Cm Revanth Reddy And Minister In Mahabubnagar7
ఖబడ్దార్‌ రేవంత్‌.. ‘సీఎం పదవి నుంచి దించేస్తాం’

మహబూబ్‌నగర్‌,సాక్షి: మహబూబ్ నగర్‌లో లేఖ కలకలం సృష్టించాయి. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు ఉత్తంకుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిలను హెచ్చరిస్తూ రాసిన లేఖలు మహబూబ్‌ నగర్ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని నారాయణ్‌పేట్‌ జిల్లా మక్తల్‌లో వెలుగులోకి వచ్చాయి. ఆ లేఖలో ‘మేం నియోజకవర్గ కాంగ్రెస్‌ కార్యకర్తలం. సీఎం రేవంత్‌రెడ్డికి ఇదే మా హెచ్చరిక. ఖబడ్దార్. మీ పలుకుబడి ఉపయోగించి మా ఎమ్మెల్యేకి(మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి) మంత్రి పదవి రాకుండా చేశావో అప్పుడు నీ భరతం పట్టడం ఖాయం. రాష్ట్రంలో పార్టీ అడ్రస్‌ గల్లంతవుతుంది. మిమ్మల్ని సీఎం పదవి నుంచి దించడం’ అని హెచ్చరిస్తూ లేఖలో రాశారు.ముదిరాజు సామాజిక వర్గం పేరుతో ఆ లేఖలు వెలుగులోకి రావడంపై పోలీసులు రంగంలోకి దిగారు. ఆ లేఖలు ఎవరు రాశారా? అని ఆరా తీస్తున్నారు.ఆ లేఖలపై సమాచారం అందుకున్న ముదిరాజు సంఘం నేతలు పోలీసులు ఫిర్యాదు చేశారు. ఆ లేఖలతో తమకు సంబంధం లేదని పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Karan Johar Sudden Weight Loss Netizens doubts Ozempic he DENIES8
కరణ్ జోహార్ షాకింగ్‌ వెయిట్‌ లాస్‌ ఒజెంపిక్‌ ఇంజెక్షన్లే కారణమా?

చిత్రనిర్మాత కరణ్ జోహార్ (Karan Johar) అకస్మాత్తుగా బరువు తగ్గి, బక్కిచిక్కిపోవడం అందర్నీ దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇంత త్వరగా బాగా బరువు తగ్గి అటు అభిమానులను, ఇటు నెటిజన్ల దృష్టిని ఆకర్షించాడు. అదనపు బరువును తగ్గించడానికి అసహజ పద్ధతులను ఉపయోగిస్తున్నాడనే పుకార్లు జోరుగా వ్యాపించాయి. బరువు తగ్గడానికి ఓజెంపిక్ (Ozempic) ఇంజెక్షన్లను ఉపయోగిస్తున్నాడనే ఆరోపణలు గుప్పుమన్నాయి. దీనిపై కరణ్ జోహార్ (కేజో) తాజాగా స్పందించాడు. అసలేంటీ ఓజెంపిక్‌ ఇంజెక్షన్‌, దీంతో అంత తొందరగా బరువు తగ్గవచ్చా? కరణ్ జోహార్ ఏమన్నాడు? తెలుసుకుందాం.స్టైలిష్‌; ఆరోగ్యంగా, ఫిట్‌గా కనిపించే కరణ్‌ జోహార్‌ క‌ర‌ణ్ ఉన్న‌ట్టుండి బక్కగా మారిపోవడం అందర్నీ షాక్‌కు గురిచేసింది. విపరీతంగా ఓజెంపిక్స్‌ తీసుకోవడంతోనే ఇలా అయ్యాడ‌ని కామెంట్లు వినిపించాయి.అయితే తాజాగా వీటిపై కరణ్‌ స్పందించాడు. తనపై వచ్చిన ఆరోపణలను ఖండించాడు. తాను బరువు తగ్గడానికి ప్రధానంగా రోజుకు ఒక‌సారి మాత్ర‌మే భోజ‌నం చేస్తున్నానని తెలిపాడు. కఠినమైన ఆహార ప్రణాళిక ఈ మార్పున‌కు కారణమని క‌ర‌ణ్‌ వెల్లడించాడు. ఇటీవల, కరణ్ జోహార్ తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో 'ఆస్క్ కేజో' సెషన్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా వినియోగదారులు అతని ఆకస్మిక బరువు తగ్గడం స్లిమ్‌గా మారడం వెనుక గల కారణం గురించి ప్రశ్నించారు. తాను ఇలా మారడానికి చాలా సమయం పట్టిందని, అందరూ అనుకున్నట్టుగా తాను ఎలాంటి మందులు తీసుకోలేదని స్పష్టంగా పేర్కొన్నాడు. ఆహార నియమాలు, జీవనశైలి మార్పులు, వ్యాయామంతో సరైన మార్గంలో బరువు తగ్గాను. ఇపుడు చాలా బావుంది.కొత్త ఉత్సాహం పని చేయడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపాడు. అంతేకాదు తాను ఆరోగ్యంగా,హ్యాపీగా ఉన్నానంటూ అభిమానులకు హామీ ఇచ్చాడు. నెటిజన్లు ఒప్పుకోవడం లేదుమరోవైపు కరణ్ జోహార్ ఓజెంపిక్‌ను ఉపయోగించడం లేదని చేసిన వాదనలపై నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. ‘ఓజెంపిక్‌తో మీరు బరువు తగ్గారని అంగీకరించడంలో తప్పు లేదు. బరువు తగ్గడానికి చాలా సమయం పడుతుంది. బరువు మీ జీవితాన్ని అనేక విధాలుగా ప్రభావితం చేస్తుంది, మీరు బరువు తగ్గిన తర్వాత బాగానే ఉంటే, మీరు దానిని ఎలా కోల్పోయారన్నది ముఖ్యం కాదు. మీరు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో గర్వపడండి మీ డ్రీమ్‌ అదే కదా .. ఉన్నది ఒక్కటే జీవితం. మన శరీరంతో సంతోషంగా ఉండాలనుకోవడంలో తప్పులేదు. ఆల్ ది బెస్ట్..’ అంటూ ఒక నెటిజన్‌ కామెంట్‌ చేశాడు. ‘‘అది ఓజెంపిక్ ముఖమే.. దానిని అంగీకరించడంలో సిగ్గు లేదు. ప్రపంచం మొత్తం ఇప్పుడు దీనిని ఉపయోగిస్తోంది .దాని గురించి బహిరంగంగా చెప్పే వ్యక్తులు గతంలో కంటే ఎక్కువ ప్రశంసలు దక్కించుకుంటున్నారు. సార్‌ నిజం నిర్భయంగా చెప్పడి" అంటూ మరో యూజర్‌ వ్యాఖ్యానించాడు. కరణ్‌ గణనీయంగా బరువుగా తగ్గడం ఇదే తొలిసారి కాదు. గత సంవత్సరం కూడా ఆయన బరువు తగ్గడం ఆకర్షించింది. బరువు తగ్గడానికి ముందు, తరువాత అంటూ ఫోటోలు నెట్టింట హల్‌చల్‌ చేశాయి. అలాగే కరణ్ జోహార్ ఓజెంపిక్ ఉపయోగిస్తున్నాడ‌ని ఎక్స్ ఖాతాలో ఒక యూజర్‌ ఆరోపించాడు. దీంతో ఈ ప్రచారం మరింత జోరందుకుంది.అసలేంటీ ఓజెంపిక్ టైప్ 2 డయాబెటిస్ మెల్లిటస్ ఉన్న పెద్దలలో ఆహారం, వ్యాయామంతో రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడటానికి ఇంజెక్షన్‌ ఒక మెడిసిన్‌గా వాడతారు. 2017లో తొలిసారి దీనికి ఆమోదం లభించింది. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు ఎక్కువగా ఉన్నప్పుడు శరీరంలోకి ఇన్సులిన్ సరైన విడుదలను ఇది నియంత్రిస్తుంది. Ozempic ఇంజెక్షన్ ఆకలిని తగ్గిస్తుంది . జీర్ణక్రియను నెమ్మదిస్తుంది. ఇది చివరికి బరువు తగ్గడానికి దారితీస్తుంది. అయితే దీన్ని వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే వాడాల్సి ఉంటుంది. ఇటీవలి సంవత్సరాల్లో బరువు తగ్గించే ఔషధంగా సెలబ్రిటీలు ఓజెంపిక్‌ను ఉపయోగిస్తున్నారా అని ఊహాగానాలు ఎక్కువయ్యాయి.

Narayana Murthys 17 Month Old Grandson To Earn over Rs 3 Crore From Infosys Dividend9
ఇన్ఫోసిస్ డివిడెండ్.. 17 నెలల బుడ్డోడికి రూ. 3.3 కోట్లు

దేశంలో అగ్రగామి ఐటీ సంస్థల్లో ఒకటైన ఇన్ఫోసిస్ 2025 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి డివిడెండ్‌ను ప్రకటించింది. ఈ డివిడెండ్‌ల నుంచి ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి మనవడు 17 నెలల ఎకాగ్రహ్ రోహన్ మూర్తి రూ. 3.3 కోట్లు అందుకోనున్నాడు. ఈ బుడ్డోడికి ఇన్ఫోసిస్‌లో 15 లక్షల షేర్లు (0.04% వాటా) ఉన్నాయి. ఎకాగ్రహ్ నాలుగు నెలల వయసున్నప్పుడు నారాయణ మూర్తి బహుమతిగా ఇచ్చారు. ఆ సమయంలో ఈ షేర్ల విలువ రూ. 240 కోట్లకు పైగా ఉండేది.ఇన్ఫోసిస్ త్రైమాసిక ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా 2025 ఆర్థిక సంవత్సరానికి గానూ ఒక్కో షేరుకు రూ. 22 డివిడెండ్‌ను ప్రకటించింది. దీని ద్వారా ఎకాగ్రహ్‌కు రూ. 3.3 కోట్ల డివిడెండ్ లభించనుంది. ఈ చిన్నారి ఇప్పటివరకు మొత్తం రూ. 10.65 కోట్ల డివిడెండ్‌ను సంపాదించాడు. చిన్న వయసులోనే ఎకాగ్రహ్‌కు రూ.కోట్లలో ఆదాయం లభించడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.ఇన్ఫోసిస్, భారత ఐటీ రంగంలో అగ్రగామిగా ఉంటూ, తన వాటాదారులకు స్థిరమైన డివిడెండ్‌లను అందిస్తోంది. నారాయణ మూర్తి తన మనవడికి ఇచ్చిన ఈ బహుమతి, ఎకాగ్రహ్ భవిష్యత్తును ఆర్థికంగా బలోపేతం చేయడమే కాకుండా, కుటుంబ ఆస్తుల పంపిణీలో ఒక ఉదాహరణగా నిలుస్తోంది. రాయణ మూర్తి, సుధా మూర్తి దంపతుల కుమారుడు రోహన్‌ మూర్తి, అపర్ణా కృష్ణన్‌ల ముద్దుల కొడుకే ఈ ఎకాగ్రహ్.ఇక నారాయణ మూర్తి కుమార్తె, యూకే మాజీ ప్రధాని సతీమణి అక్షతా మూర్తికి ఇన్ఫోసస్‌లో 3.89 లక్షల షేర్లు (1.04% వాటా) ఉన్నాయి. దీంతో ఆమె రూ.85.71 కోట్లు అందుకోబోతున్నారు. అలాగే నారాయణ మూర్తి రూ.93.33 కోట్లు, ఆయన భార్య సుధా మూర్తి రూ.76 కోట్లు ఈ డివిడెండ్‌ల ద్వారా ఆర్జించనున్నారు. ఈ డివిడెండ్‌లకు మే 30వ తేదీని రికార్డ్‌ డేట్‌గా ప్రకటించగా జూన్‌ 30న ఆయా మొత్తాలు వాటాదారుల చేతికి అందనున్నాయి.

Smita Sabharwal Tweet Against Telangana Government10
వెనక్కి తగ్గని ఐఏఎస్‌ స్మితా సబర్వాల్‌.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వరుస రీట్వీట్లు

హైదరాబాద్‌,సాక్షి: కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో మార్ఫింగ్‌ ఫొటోను రీ ట్వీట్ చేసిన ఐఏఎస్‌ స్మితా సబర్వాల్‌కు (Smita Sabharwal) తెలంగాణ పోలీసులు (telangana police) నోటీసులు ఇచ్చారు. అయితే, పోలీసులు నోటీసులు ఇచ్చిన ఐఏఎస్‌ స్మితా సబర్వాల్‌ వెనక్కి తగ్గడం లేదు. ప్రభుత్వ వ్యతిరేక ట్వీట్‌లను రీట్వీట్‌లు చేస్తున్నారు.కంచ గచ్చిబౌలి భూముల (Kancha Gachibowli row) ఇష్యూకు సంబంధించి పలువురు నేతలు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన పోస్టుల్ని డిలీట్‌ చేస్తున్నారు. కానీ ఐఏఎస్‌ స్మిత సబర్వాల్‌ మాత్రం వెనక్కి తగ్గడం లేదు.ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా వరుస ట్వీట్లు పెడుతున్నారు. తాజాగా, ప్రభుత్వ వ్యతిరేక ట్వీట్లపై వరుసగా రెండోరోజు రీపోస్ట్ చేశారు. వాటిల్లో 100 ఎకరాలను పునరుద్ధరించాలంటూ సుప్రీం ఆదేశాలు ఉన్న ఫొటో ఉంది. మరో పోస్టులో తెలంగాణ పోలీసులు సొంత ఐఏఎస్ అధికారికే నోటీసులిస్తరా? ఇది దేనికి సంకేతం?’ అంటూ ఓ ఇద్దరు మహిళలు పెట్టిన పోస్టును రీపోస్ట్ చేశారు. ఏఐతో క్రియేట్ చేసిన బుల్డోజర్లు, నెమళ్లు, జింకలు ఉన్న రెండు పోస్టులను స్మితా సబర్వాల్ రీపోస్ట్ చేయడం. ఆ పోస్టులకు వివరణ ఇవ్వాలంటూ తెలంగాణ పోలీసులు ఆమెకు నోటీసులు జారీ చేయడం..అయినప్పటికీ ప్రభుత్వ వ్యతిరేక ట్వీట్లను రీట్వీట్‌ చేయడంపై స్మితా సబర్వాల్ తీరుపై ఐఏఎస్ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement