Top Stories
ప్రధాన వార్తలు

ప్రపంచ కుబేరుడితో నాల్గవ బిడ్డకు జన్మనిచ్చింది: ఎవరీ షివోన్ జిలిస్?
ప్రపంచ కుబేరుడు 'ఎలాన్ మస్క్' (Elon Musk) గురించి తెలిసిన చాలామందికి.. అతని నలుగురు పిల్లలకు తల్లి అయిన 'షివోన్ జిలిస్' (Shivon Zilis) గురించి బహుశా తెలిసుండకపోవచ్చు. ఇంతకీ ఈమె ఎవరు? ఈమె గురించి ఆసక్తికరమైన విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం.నిజానికి.. షివోన్ జిలిస్ భారతీయ మూలాలున్న మహిళ. ఎలా అంటే ఈమె తల్లి పంజాబీ ఇండియన్ శారద. అయితే శారద కెనడియన్ అయిన రిచర్డ్‌ని వివాహం చేసుకుంది. వీరిద్దరికి పుట్టిన సంతానమే షివోన్ జిలిస్. ఈమె 1986 ఫిబ్రవరి 8న కెనడాలోని అంటారియోలోని మార్ఖమ్‌లో జన్మించింది.షివోన్ జిలిస్ అమెరికాలోని ప్రతిష్టాత్మక యేల్ విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్రం, తత్వశాస్త్ర డిగ్రీలు పూర్తి చేశారు. ఐటీ దిగ్గజం ఐబీఎం కంపెనీలో తన కెరీర్ ప్రారంభించింది. యేల్ యూనివర్సిటిలో చదువుకునే సమయంలో ఐస్ హాకీ జట్టులో కీలక సభ్యురాలు. గోల్ కీపర్‌గా ఆల్ టైమ్ బెస్ట్. ఆమె గిటార్, డ్రమ్స్ కూడా ప్లే చేసేది.షివోన్ జిలిస్ కెనడియన్ ఏఐ నిపుణురాలు, వెంచర్ క్యాపిటలిస్ట్. ఆమె మస్క్ వ్యాపార సామ్రాజ్యంలో కీలక పాత్ర పోషిస్తుంది. అంతే కాకుండా ఏఐ అండ్ మెషిన్ లెర్నింగ్‌లో ప్రత్యేకత కలిగిన టెస్లా, ఓపెన్ఏఐ, న్యూరాలింక్ వంటి కంపెనీలలో పనిచేసినట్లు సమాచారం.షివోన్ జిలిస్ 2016లో ఓపెన్ఏఐ (OpenAI)లో బోర్డు సభ్యురాలిగా చేరింది. తరువాత 2017 నుంచి 2019 వరకు టెస్లాలో పనిచేసింది, అక్కడ ఆమె కంపెనీ ఆటోపైలట్ ప్రోగ్రామ్, సెమీకండక్టర్ వంటి విభాగాల్లో కీలక పాత్ర పోషించింది. ఆ సమయంలో మస్క్ బ్రెయిన్ చిప్ స్టార్టప్ న్యూరాలింక్‌లో ప్రధాన పాత్ర పోషించింది. అక్కడ ఆమె ఆపరేషన్స్, ప్రత్యేక ప్రాజెక్టుల డైరెక్టర్‌గా పనిచేస్తోంది.ఇదీ చదవండి: ఆ నగరం భారతదేశ బాహుబలి: ఆనంద్ మహీంద్రా2021లో షివోన్ జిలిస్ కవలలకు జన్మనించింది, 2024లో మూడవ బిడ్డను స్వాగతించింది. కాగా ఇటీవల నాల్గవ బిడ్డకు జన్మనిచ్చినట్లు, బిడ్డకు సెల్డాన్ లైకుర్గస్ (Seldon Lycurgus) అని పేరు పెట్టినట్లు వెల్లడించింది. మొత్తం మీద ఇప్పుడు ఎలాన్ మస్క్ 14 మంది పిల్లలకు తండ్రి అయ్యారు.

చంద్రబాబు తప్పుడు మాటలు.. ఈనాడు రోత రాతలు: పేర్ని నాని
సాక్షి, తాడేపల్లి: ఈనాడు రోత రాతలపై వైఎస్సార్సీపీ మండిపడింది. వైఎస్ జగన్ లక్ష్యంగా ఈనాడు విషపు రాతలు రాస్తోందని ఆ పార్టీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. వివేకా హత్య కేసులో నారాయణ సాక్షిగా ఉన్నారని ఈనాడు రోత రాతలు రాసింది. కేబినెట్లో చంద్రబాబు ఏదో మాట్లాడితే.. ఈనాడు తప్పుడు వార్తలు వండి వార్చింది. వివేకా వాచ్మెన్ రంగయ్య మృతిని కూడా వైఎస్ జగన్‌కు ఆపాదించే యత్నం చేసింది. హామీలు అమలు గురించి తప్పించుకునేందుకు చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్’’ అంటూ పేర్ని నాని నిప్పులు చెరిగారు.‘‘డైవర్షన్ పాలిటిక్స్ చేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. సంపద సృష్టిస్తానన్న చంద్రబాబు.. ఎన్నికలయ్యాక చేతులెత్తేశారు. రాజకీయ ప్రత్యర్థులపై తప్పుడు వార్తలు రాయించడం బాబుకు వెన్నతో పెట్టిన విద్య. ఎన్టీఆర్ పరపతిని కూడా ఈనాడును అడ్డంపెట్టకుని బాబు దెబ్బతీశాడు. గతంలో లక్ష్మీపార్వతిపై కూడా ఈనాడులో ఇలాగే తప్పుడు రాతలు రాయించారు. వైఎస్ జగన్ వ్యక్తిత్వాన్ని హననం చేయడానికి ఈనాడును చంద్రబాబు వాడుతున్నారు. వైఎస్ వివేకా హత్యతో వైఎస్ జగన్‌కు ఏం సంబంధం?. వ్యవస్థలను ప్రభావితం చేసి వైఎస్సార్సీపీ నేతలను బాబు ఇబ్బంది పెట్టాలని చూశారు’’ అని పేర్ని నాని ధ్వజమెత్తారు.‘‘వైఎస్ జగన్, వైఎస్ అవినాష్‌రెడ్డిలపై విషం చిమ్మడమే చంద్రబాబు లక్ష్యం. న్యాయ వ్యవస్థలను కూడా ప్రభావితం చేసేలా ఈనాడులో వార్తలురాస్తున్నారు. డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగా రంగన్న మృతిని కేబినెట్లో చర్చించారు. నారాయణ యాదవ్ అనారోగ్యంతో మృతి చెందారు. గంగాధర్‌రెడ్డిది సహజ మరణమని పోస్టుమార్టం రిపోర్ట్ చెప్తుంది. గంగాధర్‌రెడ్డి మరణం అనుమానం అంటూ బాబు డైరెక్షన్లో ఈనాడు తప్పుడు రాతలు రాసింది. గన్మెన్లు ఉండగా రంగన్న మృతిపై చంద్రబాబుకు సందేహం ఏంటో అర్థం కావడం లేదు. చంద్రబాబు ఇచ్చిన గన్మెన్లు ఉండగా.. రంగన్న మృతి ఎలా అనుమానాస్పదం?’’ అంటూ పేర్ని నాని ప్రశ్నించారు.‘‘పరిటాల మృతి తర్వాత చంద్రబాబు సీఎం అయ్యారు. 2014- 2019 మధ్య పరిటాల సునీత కూడా మంత్రిగా ఉన్నారు. పరిటాల రవి హత్యపై ఎందుకు విచారణ చేయలేదు. వివేకా హత్య కేసులో నారాయణ సాక్షి కాదని రికార్డులు చెప్తూ ఉంటే.. నారాయణ సాక్షి అని ఈనాడు ఎలా రాస్తోంది?’’ పేర్ని నాని నిలదీశారు.‘‘వివేకా హత్య కేసులో ఈనాడు తప్పుడు వార్తలు రాసింది. సుగాలి ప్రీతి హత్య కేసు గురించి తీవ్రంగా పరిగణించరుగానీ రంగయ్య మృతిపై మాత్రం తీవ్రంగా స్పందిస్తారంట. జగన్ డ్రైవర్ నారాయణ యాదవ్ ఆ కేసులో సాక్షి అంటూ తప్పుడు కథనాలు రాశారు. జగన్ లక్ష్యంగా విషపు రాతలు రాసింది. చంద్రబాబువి.. తప్పుడు మాటలు, ఈనాడువి తప్పుడు రాతలు. కేబినెట్లో ప్రజలకు చేయాల్సిన మేలు గురించి చర్చించలేదు. ఎన్నికలలో ఓట్ల కోసం ప్రజలను మోసం చేస్తారు. అధికారంలోకి వచ్చాక తన తప్పుడు హామీల నుండి బయట పడటానికి డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారు. హామీలకు పంగనామాలు పెట్టారు...రాజకీయ ప్రత్యర్థులపై ఈనాడులో విషం కక్కించటం చంద్రబాబుకు అలవాటే. ఎన్టీఆర్ కు వెన్నుపోటు నుండి అనేక అంశాలలో ఇదే జరిగింది. లక్ష్మీ పార్వతి విషయంలో కూడా అప్పట్లో ఇలాగే రాయించారు. అవినాష్ కు సంబంధం లేకపోయినా కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. న్యాయవ్యవస్థను కూడా ప్రభావితం చేసేలాగ పెద్దపెద్ద అక్షరాలతో వార్తలు రాయిస్తున్నారు. నారాయణకు వివేకా కేసుకు ఎలాంటి సంబంధం లేదు. బ్రెయిన్ ట్యూమర్ తో నారాయణ చనిపోయారు. కల్లూరి గంగాధరరెడ్డిని 243వ సాక్షిగా ఉన్నాడు. దీర్ఘకాలంగా షుగర్ వ్యాధితో మృతి చెందారు. ఆయనది సహజ మరణం అని పోస్టుమార్టం రిపోర్టు కూడా ఉంది. శ్రీనివాసరెడ్డి 2018 సెప్టెంబరు లో ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వేధింపుల కారణంగానే సూసైడ్ చేసుకున్నట్టు సూసైడ్ నోట్ రాశారు..వైఎస్ అభిషేక్‌రెడ్డి తీవ్ర అనారోగ్యంతో మృతి చెందారు. జగన్, సునీతమ్మ ఇద్దరికీ అభిషేక్ బంధువే. మల్టీ ఆర్గన్స్ డేమేజ్ వలన అభిషేక్ మృతి చెందిన సంగతి అందరికీ తెలిసినా ఈనాడు విషపు రాతలు రాసింది. వాచ్మెన్ రంగన్నకు పోస్టుమార్టం అయ్యాక ఖననం చేశారు. రంగన్న గురించి కేబినెట్లో చర్చించారు. డీజీపీతో పాటు కడప నుండి పోలీసు అధికారులు వచ్చి ప్రభుత్వ పెద్దల సందేశం తీసుకుని వెళ్లారు. రంగన్నకు 2+2 గన్ మెన్లతో జగన్ ప్రభుత్వం భద్రత కల్పించారు. చంద్రబాబు వచ్చాక 1+1 భద్రతకు తగ్గించారు. చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన గన్‌మెన్ ఉండగా ఎలా అనుమానాస్పదంగా రంగన్న మృతి చెందారు?. ఖననం చేసిన రంగన్న మృతదేహాన్ని మళ్ళీ బయటకు తీసి రీపోస్టుమార్టం చేస్తున్నారు. ఆ నివేదికలు రాకముందే ఈనాడులో తప్పుడు కథనాలు ఎలా రాశారు?..పరిటాల రవి హత్యలో సాక్షుల మృతిపై చంద్రబాబు ఎందుకు విచారణ జరపలేదు?. ఎప్పుడో చనిపోయిన నారాయణ యాదవ్ మృతితో సహా అందరిపై విచారణ చేస్తారట, ఎవరిని ఇరికించటానికి విచారణల పేరుతో వ్యవస్థలను నాశనం చేస్తారు?. ఎన్నికల హామీలను డైవర్షన్ చేయటానికి ఇలాంటి తప్పుడు వార్తలు, తప్పుడు విచారణలు చేయిస్తున్నారు. రంగన్న ఇచ్చిన 164 స్టేట్మెంటులో అవినాష్ రెడ్డి పేరు లేదు. అసలు ఏ సాక్షి కూడా అవినాష్ పేరు చెప్పలేదు. ఇలాంటి తప్పుడు కథనాలు రాసే విష సంస్కృతి మానుకోవాలి’’ అని పేర్ని నాని హితవు పలికారు.

మనవడి చితిలోనే తాత మరణ శాసనం..
భోపాల్: ఇదొక కల్లోలం.. ముగ్గురి జీవితాలపై విధి ఆడిన వింత నాటకం. సాఫీగా సాగుతున్న జీవితంలో ఒక్క ఉదుటను దూకిన ‘మృత్యుఘోష’. ఈ ఘటనలో ఒకరు హత్యకు గురైతే, మరొకరు ఆత్మహత్య చేసుకున్నారు. ఇంకొకరు ఆత్మాహుతి చేసుకున్నారు. మధ్యప్రదేశ్ లో జరిగిన ఈ విషాద ఘటన తలుచుకుంటేనే ఒళ్లు గగుర్పాటుకు గురౌవుతుంది.రాష్ట్రంలోని బాహ్రి పోలీస్ స్టేషన్ పరిధిలో సిహోలియా గ్రామంలో ఈ దారుణం చోటు చేసుకుంది. ముందుగా భార్యను చంపిన భర్త ఆపై ఆత్మహత్య చేసుకున్నాడు. మెడకు ఉరితాడు బిగించుకుని తాను కూడా ప్రాణాలు విడిచాడు. ఆ తర్వాత మనవడి మరణాన్ని జీర్ణించుకోలేని తాత.. అదే చితిమంటల్లో దూకి ఆత్మార్పణం చేసుకున్నాడు.అభయ్ రాజ్ అనే 34 ఏళ్ల వ్యక్తి.. భార్య సవితా యాదవ్(31)ను హత్య చేశాడు. ఇక తనులేని జీవితం వద్దనుకున్నాడో, లేక జైలు పాలు కావాల్సి వస్తుందని భయపడ్డాడో కానీ ఉరి వేసుకుని అతను కూడా తనువు చాలించాడు. ఇది శుక్రవారం ఉదయం జరగ్గా, అదే రోజు సాయంత్ర వారి అంత్యక్రియలు నిర్వహించారు. అయితే మనవడిఅభయ్ రాజ్) లేని జీవితం వద్దనుకున్న తాత రామావతార్.. తాను కూడా ఆ మనవడి అంత్యక్రియలు నిర్వహించిన చితి మంటల్లోనే దూకి ప్రాణం తీసుకున్నాడు. అయితే శనివారం ఉదయమే ఈ వార్త తెలుసుకున్న పోలీసులు.. అక్కడకు చేరుకుని కాలిన మృతదేహాన్ని బయటకు తీశారు. అయితే ఒక హత్య, రెండు ఆత్మహత్యల వెనుక కారణాలు ఏమిటో తెలియలేదని సిధి జిల్లా డీఎస్పీ గాయత్రి తివారీ తెలిపారు. దీనిపై దర్యాప్తు సాగిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.

ఉక్రెయిన్‌పై రష్యా మరోసారి భీకర దాడి.. 14 మంది మృతి
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగింపు దిశగా ప్రయత్నాలు జరుగుతోన్న క్రమంలో కూడా రష్యా భీకర దాడులు కొనసాగుతూనే ఉంది. తాజాగా, ఉక్రెయిన్‌పై మరోసారి క్షిపణులతో విరుచుకుపడింది. డోబ్రాపిలియా ప్రాంతంపై జరిగిన మిస్సైల్ దాడిలో 14 మంది మృతి చెందారు. ఉక్రెయిన్ తూర్పు నగరం డోబ్రాపిలియా, ఖార్కివ్ ప్రాంతంలోని ఒక స్థావరంపై రాత్రిపూట రష్యా క్షిపణి, డ్రోన్ దాడులు జరిపింది. ఈ దాడుల్లో ఐదుగురు పిల్లలు సహా 37 మంది గాయపడ్డారని ఉక్రెయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ శనివారం తెలిపింది.కాగా, రెండు రోజుల క్రితం జెలెన్స్కీ సొంత పట్టణంలోని కూడా క్షిపణి దాడి జరిగిన సంగతి తెలిసిందే. రాత్రి సమయంలో క్రీవి రీహ్‌లోని ఓ హోటల్‌పై రష్యా క్షిపణిదాడిలో నలుగురు మృతి చెందారు. ఆ హోటల్లో తమ దేశ పౌరులతో పాటు అమెరికా, బ్రిటన్ జాతీయులు ఉన్నారని ఉక్రెయిన్ అధ్యక్షుడు తెలిపారు. ఈ ఘటనలో సుమారు 30 మంది గాయపడ్డారు. 112 షాహెడ్, డెకాయ్ డ్రోన్లను, రెండు బాలిస్టిక్ ఇస్కందర్ మిస్సైల్స్‌ను ప్రయోగించినట్టు ఉక్రెయిన్ వైమానికదళం ప్రకటించింది.యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఉక్రెయిన్‌కు అమెరికా మద్దతుగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే, ట్రంప్ అధ్యక్ష బాధ్యతలను స్వీకరించిన తర్వాత ఆ దేశం పట్ల ఆయన కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఉక్రెయిన్‌కు మిలిటరీ, ఇంటెలిజెన్స్ సాయాన్ని కూడా అమెరికా నిలిపేసింది. మరో వైపు, ఉక్రెయిన్ భద్రత కోసం రష్యాను బెదిరించేందుకు అవసరమైతే తన అణ్వాయుధాలను నిరోధంగా వాడేందుకు సిద్ధమంటూ ఫ్రాన్స్ వివాదాస్పద ప్రతిపాదన చేసిన సంగతి విదితీమే.గత గురువారం బెల్జియం రాజధాని బ్రసెల్స్‌లో యూరోపియన్ యూనియన్ దేశాల తాజా శిఖరాగ్ర సమావేశం ఇందుకు వేదికైంది. రష్యా బారినుంచి యూరప్‌కు రక్షణ కల్పించేందుకు ఫ్రాన్స్ అణుపాటవాన్ని ఆయుధంగా ఉపయోగించేందుకు సిద్ధమని అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఈ సందర్భంగా ప్రకటించారు. సభ్య దేశాల నుంచి ఇందుకు భారీ స్పందన లభించింది.

ప్లేస్మెంట్లో ఒక్కడికే ఏకంగా ఏడు ఆఫర్లు!!.. కోటి రూపాయల ప్యాకేజీతో కుర్రాడికి జాబ్
లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్శిటీ (ఎల్పీయూ)కు ఈ ఏడాది చాలా ఉత్సాహంతో మొదలైంది. ఫైనల్ ఇయర్ బీటెక్ విద్యార్థి రూ.1.03 కోట్ల (1,18,000 డాలర్లు)తో ఉద్యోగావకాశం పొందారు. రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్‌లో B.Tech చేస్తున్న బేతిరెడ్డి నాగవంశీరెడ్డి 2025 మేలో తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేయనున్నారు. ప్రముఖ ఏఐ రోబోటిక్స్ సంస్థలో రోబోటిక్స్ ఇంజినీర్‌గా చేరనున్నారు. ఈ అసాధారణ విజయం అటు పరిశ్రమ వర్గాల్లోనూ ఇటు విద్యా ప్రపంచంలోనూ సంచలనం సృష్టించింది. విద్యార్థులకు సూపర్ డూపర్ ప్యాకేజీలు అందించగల అత్యున్నత విద్యా సంస్థగా ఎల్పీయూ తనస్థానాన్ని సుస్థిరం చేసుకుంది.వేర్వేరు బీటెక్ విభాగాల్లోని మొత్తం 7361 మంది విద్యార్థులకు పాలో ఆల్టో నెట్వర్క్స్, నుటానిక్స్, మైక్రోసాఫ్ట్, సిస్కో, పేపాల్ అమెజాన్ వంటి ప్రతిష్టాత్మక మల్టీనేషనల్ కంపెనీల నుంచి ప్లేస్మెంట్లు లభించాయి. వీరిలో 1700 మంది టాప్ ఎమ్మెన్సీల నుంచి ఏడాదికి రూ.10 లక్షల నుంచి రూ.కోటి వరకూ ప్యాకేజీలు అందాయి. టాప్ ఎంఎన్‌సీలు ఇచ్చిన సగటు ప్యాకేజీ రూ.16 లక్షలు (ఏడాదికి). ఉద్యోగ మార్కెట్లో ఎల్‌పీయూకు ఉన్న అధిక డిమాండ్‌కు నిదర్శనాలు ఈ ప్లేస్మెంట్లు.గత ప్లేస్మెంట్ సీజన్ కూడా ఆకట్టుకునేదే. ఇండస్ట్రీలోనే అతిపెద్ద కంఎనీలు ఆకర్షణీయమైన ప్యాకేజీలు అందించాయి. పాలో ఆల్టో నెట్వర్క్స్ ఏకంగా ఏడాదికి రూ.54.75 లక్షల ప్యాకేజీని అందించగా నుటానిక్స్ రూ.53 లక్షల ప్యాకేజీ ఇచ్చింది. మైక్రోసాఫ్ట్ రూ.52.20 LPA ప్యాకేజీ అందించింది. మొత్తం 1912మందికి ఒకటి కంటే ఎక్కువ ఆఫర్లు అందాయి. 377 మందికి మూడు ఆఫర్లు, 97 మందికి నాలుగు ఆఫర్లు, 18 మందికి ఐదు, ఏడుగురికి ఆరు ఆఫర్లు లభించాయి. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజినీరింగ్ విద్యార్థి ఆదిరెడ్డి వాసుకు నమ్మశక్యం కాని రీతిలో ఏకంగా ఏడు ఆఫర్లు వచ్చాయి. ఇదో అరుదైన, ఆకట్టుకునే రికార్డు.పైన చెప్పుకున్న కంపెనీలు మాత్రమే కాకుండా.. అమెజాన్ (రూ.48.64 LPA), ఇన్ట్యూట్ లిమిటెడ్ (రూ. 44.92 LPA), సర్వీస్ నౌ ( రూ. 42.86 LPA), సిస్కో (రూ. 40.13 LPA), పేపాల్ (రూ. 34.4 LPA), APNA (రూ.34 LPA), కామ్వాల్ట్ (రూ. 33.42 LPA), స్కేలర్ (రూ. 32.50 LPA)లు కూడా స్కిల్ డెవెలప్మెంట్, అత్యాధునిక టెక్నాలజీల్లో నైపుణ్యం అందించేందుకు ఎల్పీయూ చూపుతున్న శ్రద్ధకు నిదర్శనంగా నిలుస్తున్నాయి.ఎల్పీయూ పట్టభద్రుల సాంకేతిక పరిజ్ఞాన బుద్ధికుశలత కారణంగా భారీ నియామకాలు చేపట్టే ఆక్సెంచర్, క్యాప్‌జెమినీ, టీసీఎస్ తదితర ప్రముఖ కంపెనీల నుంచి మంచి డిమాండ్ ఉంది. క్యాప్‌జెమినీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 736 మంది విద్యార్థులకు అనలిస్ట్, సీనియర్ అనలిస్ట్ రోల్స్ కోసం ఉద్యగావకాశం ఇచ్చింది. అలాగే మైండ్‌ట్రీ 467 మంది విద్యార్థులను గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీ పొజిషన్ కోసం తీసుకుంది. కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ కూడా 418 మంది విద్యార్థులను జెన్సీ రోల్స్ కోసం తీసుకుంది. ఎల్పీయూ నుంచి విద్యార్థులను ఎంపిక చేసుకున్న ఇతర కంపెనీల్లో ఆక్సెంచర్ (279 మంది), టీసీఎస్ (260 మంది), కేపీఐటీ టెక్నాలజీస్ (229 మంది), డీఎక్స్‌సీ టెక్నాలజీ (203), MPHASIS (94 మంది) కంపెనీలు ఉన్నాయి.రొబోటిక్స్, ఆటోమేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్ వంటి కోర్ ఇంజినీరింగ్ విభాగాల్లో అత్యధిక స్థాయిలో ప్లేస్మెంట్లు లభించాయి. పాలో ఆల్టో నెట్వర్క్స్, సిలికాన్ ల్యాబ్స్, ట్రైడెంట్‌గ్రూప్, నుటానిక్స్, ఆటోడెస్క్, అమెజాన్ వంటి దిగ్గజ కంపెనీలు ఈ విభాగాల్లోని విద్యార్థులను భారీగా నియమించుకుంటున్నాయి.‘‘ఎప్పటికప్పుడు మారిపోతున్న ప్రపంచానికి అనుగుణంగా విద్యార్థులు విజయం సాధించేలా చేసేందుకు ఎల్పీయూ కట్టుబడి ఉంది. ఎల్పీయూలో బోధించే అంశాలు కంపెనీల అవసరాలకు తగ్గట్టుగా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఎల్పీయూలో సంప్రదాయ పద్ధతులకు అతీతంగా సృజనాత్మక రీతిలో సాగే బోధన విద్యార్థులునిమగ్నమైయెలా ఉంటుంది. విద్యార్థులు పెద్ద సంఖ్యలో టాప్ కంపెనీల నుంచి ప్లేస్మెంట్ ఆఫర్లు పొందుతూండటం దీనికి నిదర్శనం. ఎల్పీయూ బోధనాంశాల సత్తానుచాటుతున్నాయి ఈ ప్లేస్మెంట్లు. జాతీయ, అంతర్జాతీయ ప్రముఖ సంస్థల్లో విద్యార్థులకు మంచి మంచి ప్లేస్‌మెంట్స్ సాధించిన రికార్డు ఎల్పీయూ సొంతం. అమెరికా, యూకే, ఆస్ట్రేలియాలల్లోని ఎన్నో పేరొందిన కంపెనీల్లో ఎల్పీయూ విద్యార్థులు ఏడాదికి రూ.కోటి కంటే ఎక్కువ ప్యాకేజీలతో పని చేస్తున్నారు. అత్యున్నత నైపుణ్యం కలిగిన ప్రొఫెషనల్స్‌ను తయారు చేయగల ఎల్పీయూ శక్తి సామర్థ్యాలకు, అంతర్జాతీయ స్థాయి ఎదుగుదలకు ఇవి నిదర్శనాలు.’’ అని రాజ్యసభ సభ్యులు, ఎల్పీయూ ఫౌండర్ ఛాన్సలర్ డాక్టర్ అశోక్ కుమార్ మిట్టల్ వివరించారు.2025 బ్యాచ్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు చివరితేదీ దగ్గరపడింది. ఎల్పీయూలో అడ్మిషన్లకు పోటీ ఎక్కువ. యూనివర్శిటీలో అడ్మిషన్ కోసం విద్యార్థులు ప్రవేశ పరీక్ష రాయాల్సి ఉంటుంది. అలాగే ‘ఎల్పీయూ నెస్ట్ 2025’, ఇంటర్వ్యూలలోనూ పాసైన వారికి మాత్రమే కొన్ని ప్రత్యేక కార్యక్రమాల్లోకి ప్రవేశం లభిస్తుంది. పరీక్ష, అడ్మిషన్ ప్రాసెస్ గురించి తెలుసుకోవాలనుకునే ఆసక్తిగల విద్యార్థులు https://bit.ly/43340ai ను సందర్శించగలరు.

IPL 2025: ముంబై ఇండియన్స్‌తో జతకట్టిన సౌతాఫ్రికా ఆల్‌రౌండర్
సౌతాఫ్రికా ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్ కార్బిన్ బాష్ ఫైవ్ టైమ్ ఐపీఎల్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌తో జతకట్టాడు. సహచరుడు లిజాడ్ విలియమ్స్ గాయం కారణంగా తదుపరి సీజన్‌కు దూరం కావడంతో అతని స్థానాన్ని బాష్ భర్తీ చేస్తున్నాడు. 30 ఏళ్ల బాష్‌ను ముంబై ఇండియన్స్ తమ హ్యామిలీలోకి ఆహ్వానించింది. రైట్ హ్యాండ్ బ్యాట్, రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలింగ్ వేసే బాష్ సౌతాఫ్రికా తరఫున ఓ టెస్ట్, 2 వన్డేలు ఆడాడు. బాష్ గతేడాది డిసెంబర్లో టెస్ట్‌ల్లో అరంగేట్రం చేశాడు.బాష్ తన తొలి టెస్ట్ మ్యాచ్‌లోనే ఇరగదీశాడు. పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో బాష్ తొలి ఇన్నింగ్స్‌లో అజేయమైన 81 పరుగులు చేయడంతో పాటు బౌలింగ్‌లో 4 వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌లో బాష్ అద్భుత ఆల్‌రౌండ్ ప్రదర్శన కారణంగా సౌతాఫ్రికా పాకిస్తాన్‌ను 2 వికెట్ల తేడాతో చిత్తు చేసింది.ఈ మ్యాచ్‌కు ముందు బాష్ అదే పాకిస్తాన్‌పైనే వన్డే అరంగేట్రం చేశాడు. బాష్ ఇప్పటివరకు 2 వన్డేలు ఆడి 2 వికెట్లు సహా 55 పరుగులు చేశాడు. అరంగేట్రం ఇన్నింగ్స్‌లో బాష్ 44 బంతుల్లో 40 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇదే అతనికి వన్డేల్లో అత్యధిక స్కోర్. బాష్ తన రెండో వన్డేను కూడా పాక్‌తోనే ఆడాడు. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు జరిగిన ట్రై సిరీస్‌లో బాష్ పాకిస్తాన్ మ్యాచ్‌లో ఆడాడు.అంతర్జాతీయ అరంగేట్రం అనంతరం బాష్ సౌతాఫ్రికా టీ20 లీగ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ ఏడాది బాష్ ఎంఐ కేప్‌టౌన్ తరఫున బరిలో నిలిచాడు. ఈ సీజన్లో బాష్ 8 మ్యాచ్‌ల్లో 11 వికెట్లు తీసి ఎంఐ కేప్‌టౌన్ తమ తొలి టైటిల్ సాధించడంలో కీలకపాత్ర పోషించాడు.బాష్ సౌతాఫ్రికా 2014 అండర్-19 వరల్డ్‌కప్ గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. నాడు పాకిస్తాన్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో చెలరేగి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు. ఆ మ్యాచ్‌లో బాష్ 4 వికెట్లు తీశాడు. బాష్ తన కెరీర్లో వివిధ ఫార్మాట్లలో ఇప్పటివరకు 2500కు పైగా పరుగులు చేసి 150కిపైగా వికెట్లు తీశాడు. బాష్ టీ20ల్లో 86 మ్యాచ్‌లు ఆడి 59 వికెట్లు తీశాడు. బాష్ చేరికతో ముంబై ఇండియన్స్‌లో ఆల్‌రౌండర్ల సంఖ్య 9కి చేరింది. ఇప్పటికే ఆ జట్టులో కెప్టెన్ హార్దిక్ పాండ్యా, బెవాన్ జాకబ్స్, మిచెల్ సాంట్నర్, విల్ జాక్స్, అర్జున్ టెండూల్కర్ తదితర ఆల్‌రౌండర్లు ఉన్నారు. త్వరలో ప్రారంభంకానున్న ఐపీఎల్-2025 ఎడిషన్‌లో ముంబై తమ తొలి మ్యాచ్‌ను మార్చి 23న ఆడుతుంది. చెన్నైలో జరిగే ఆ మ్యాచ్‌లో ముంబై సీఎస్కేను ఢీకొంటుంది.ఐపీఎల్-2025లో ముంబై ఇండియన్స్..రోహిత్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార యాదవ్, నమన్ ధిర్, బెవాన్ జాకబ్స్, రాజ్ బవా, విల్ జాక్స్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), విజ్ఞేశ్ పుథుర్, సత్యనారాయణ రాజు, కార్బిన్ బాష్, మిచెల్ సాంట్నర్, అర్జున్ టెండూల్కర్, ర్యాన్ రికెల్టన్, కృష్ణణ్ శ్రీజిత్, రాబిన్ మింజ్, జస్ప్రీత్ బుమ్రా, అశ్వనీ కుమార్, కర్ణ్ శర్మ, ట్రెంట్ బౌల్ట్, దీపక్ చాహర్, ముజీబ్ ఉర్ రెహ్మాన్

‘అది ఫ్రిజ్, వాషింగ్ మెషీన్ కాదు.. యుద్ధ విమానం’
న్యూఢిల్లీ: ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎఫ్-35 ఫైటర్ జెట్ విమానాలను భారత్ కు అమ్మడానికి హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో అధునాతన ఐదో తరం ఎఫ్ 35 జెట్ విమానాలను భారత్ కు విక్రయించడానికి ట్రంప్ హామీ ఇచ్చారు. అయితే ఈ ఒక్కో ఫైటర్ జెట్ విమానం విలువ 80 మిలియన్ డాలర్లు( సుమారు రూ. 680 కోట్లు) ఉంటుంది. ఇలా వెళ్లి అలా తెచ్చుకునే వస్తువు కాదు..అయితే దీనిపై భారత ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఏపీ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇండియా టుడే కాంక్లేవ్ లో ఏపీ సింగ్ మాట్లాడుతూ.. ఈ జెట్ ఫైటర్స్ ను పూర్తిగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందన్నారు. అది ఏమీ మార్కెట్ కు ఇలా వెళ్లి అలా తెచ్చుకునే వాషింగ్ మిషీన్, ఫ్రిడ్జ్ లాంటి కాదని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం భారత్ కు అధునాతన యుద్ధ విమానాల ఆవశక్యత ఉందంటూనే, మనం వాటిని కొనుగోలు చేసే క్రమంలో టెక్నాలజీని అన్ని విధాలు పరిక్షీంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇక్కడ ఒక జెట్ ఫైటర్ ను కొనుగోలు చేస్తున్నామంటే దాని సామర్థ్యంతో పాటు దాని ఖరీదును కూడా బేరీజు వేసుకోవాలన్నారు. ఆ జుట్ ఫైటర్స్ ను కొనుగోలు చేయడానికి ఇంకా తమకే అమెరికా నుంచి ఆపర్ ఏమీ రాలేదని, వచ్చినప్పుడు దానిపై సమ గ్రంగా పరిశీలన చేసిన నిర్ణయం తీసుకుంటామన్నారుమన దేశం నుంచి 2035లోనే..ప్రస్తుతం చైనా ఆరో జనరేషన్ యుద్ధ విమానాలను వాడటానికి సిద్ధమైన క్రమంలో మనం ఇంకా ఐదో జనరేషన్ ప్రోగ్రామ్ లో ఉన్నామన్నారు. మన దేశ ఐదవ తరం ఫైటర్ జెట్ ప్రోగ్రామ్ లో భాగంగా అడ్వాన్స్డ్ ఇండియా కాంబేట్ ఎయిర్ క్రాప్ట్(ఏఎంసీఏ) ఇంకా అభివృద్ధి దశలోనే ఉందని, మన దేశం నుంచి అధునాతన యుద్ధ విమానం 2035లో అందుబాటులోకి రావచ్చని పేర్కొన్నారు. అప్పటివరకూ యుద్ధ విమానాలను బయట నుంచే తెచ్చుకోక తప్పదన్నారు. ప్రస్తుత తరుణంలో చైనా ఆరో తరం ఫైటర్ జెట్ ల వాడకానికి సిద్ధం కాగా, పాకిస్తాన్ ఎఫ్ 16 ఫైటర్ జెట్ ల కోసం అమెరికా నుంచి నిధులు సమకూరుస్తున్న తరుణంలో అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకోవాల్సి న అవసరం ఉందని ఏపీ సింగ్ తేల్చి చెప్పారు. ఎఫ్-35.. అంతు ‘చిక్కదు’

కష్టాల్లో ఉన్నప్పుడు అమ్మ ఇంటికి రావొద్దంది: చిరంజీవి సోదరి
పిల్లలు ఇబ్బందుల్లో ఉంటే ఆ తల్లి అల్లాడిపోతుంది. అదే సమయంలో ఆ ఇబ్బందులను ఎలా ఎదుర్కోవాలో కూడా నేర్పుతుంది. చిరంజీవి తల్లి అంజనమ్మ తన కూతుర్లకు విలువైన సలహాలు ఇచ్చి వారిని బలంగా నిలబెట్టింది. ఏ కష్టం వచ్చినా సరే ఎవరి మీదా ఆధారపడకూడని, ఆధారపడితే నీ ఆత్మగౌరవాన్ని కోల్పోయినట్లేనని చెప్పేదట. మహిళా దినోత్సవం సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi Konidela), నాగబాబు, అంజనమ్మ, మెగా సిస్టర్స్ విజయ దుర్గా, మాధవి ముచ్చట్లు పెట్టారు. ఈ సందర్భంగా ఎన్నో విషయాల్ని పంచుకున్నారు.కష్టాల్లో ఉన్నా ఒంటరిగా పోరాడాలందివిజయదుర్గ (Vijaya Durga) మాట్లాడుతూ .. ‘మా అమ్మ ఎప్పుడూ కూడా మమ్మల్ని స్వతంత్ర భావాలతోనే పెంచారు. ఎప్పుడూ ఎవరి మీదా ఆధారపడకూడదు. నీ కాళ్ల మీద నువ్వు నిలబడాలి.. సొంతంగా ఎదగాలి.. సొంతంగా నిలబడాలి అని చెబుతూ ఉండేవారు. నేను కష్టాల్లో ఉన్నప్పుడు కూడా నువ్వు ఒక్కదానివే పోరాడాలి. ఎవరి దగ్గరా ఉండకూడదు, మా దగ్గర కూడా ఉండొద్దు. నీ ఇద్దరు పిల్లలతో నువ్వే ఉండు అని చెప్పారు. ఎవరి దగ్గరైనా ఉంటే నీ గౌరవం తగ్గిపోతుందనేవారు.అమ్మ ఇచ్చిన ధైర్యం వల్లే..ఇప్పటికీ నాకు మా అమ్మ చెప్పిన మాటలు గుర్తుకు వస్తాయి. ఆ మాటలు నాకు ఎంతో ధైర్యాన్ని ఇస్తాయి. అందుకే నాకు ఎన్ని సమస్యలు వచ్చినా ఒంటరిగా పోరాడేందుకు ప్రయత్నిస్తాను. ఈ ధైర్యాన్ని నాకు మా అమ్మే ఇచ్చారు’ అని అన్నారు. మాధవి (Madhavi) మాట్లాడుతూ.. ‘నేను మానసిక ఒత్తిడిలో ఉన్నప్పుడు మా అమ్మ నాకు అండగా నిలబడింది. కొన్ని సందర్భాల్లో నేను ఒంటరిని అయిపోయానే అని బాధపడుతూ ఉన్నాను. ఆ టైంలో మా అమ్మ నా వద్దకు వచ్చి ఎంతో ధైర్యాన్ని ఇచ్చారు. ఎవ్వరు ఏమన్నా.. ఏం జరిగినా.. ఈ అమ్మ నీ వెంటే ఉంటుంది.. నీకు సపోర్ట్‌గా నిలుస్తుంది అని చేయి పట్టుకుని ధైర్యాన్ని ఇచ్చారు’ అని అన్నారు.శ్రీజ విషయంలో ఆమె వల్లే..చిరంజీవి మాట్లాడుతూ.. నా కూతురు శ్రీజ (వైవాహిక) జీవితంలో కొన్ని సమస్యలు వచ్చాయి. అప్పుడు శ్రీజ (Sreeja Konidela) ఏమందంటే.. నేను నానమ్మ దగ్గరకు వెళ్లాను. తనిచ్చిన భరోసాతో నాలో ఎక్కడలేని ఎనర్జీ వచ్చింది. నానమ్మతో ఎప్పుడు కూర్చున్నా పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది అని నాతో షేర్ చేసుకుంది. అప్పుడు నేను శ్రీజతో ఒకటే చెప్పా.. ఏం పర్లేదమ్మా.. జీవితమంటే ఒక్కరితోనే అయిపోదు. ఆ ఒక్కరు మనల్ని నియంత్రించలేరు. నీ గురించి నువ్వు ఆలోచించుకో.. నీ మనసులో ఏదనిపిస్తే అది చేయు అని సూచించాను అని పేర్కొన్నారు. కాగా శ్రీజ.. రెండుసార్లు పెళ్లి చేసుకోగా రెండుసార్లూ విడాకులిచ్చింది.చదవండి: కట్నంగా 40 గోల్డ్ బ్యాంగిల్స్ దానం.. నాకు 3 కిలోల బంగారం..: సింగర్ కల్పననా సోదరి మరణం.. ఇప్పటికీ మరిచిపోలేను: చిరంజీవి

నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారో తెలియడం లేదు: పోసాని
సాక్షి, విజయవాడ: పోసాని కృష్ణమురళీపై కూటమి ప్రభుత్వం కక్షసాధింపును కొనసాగిస్తూనే ఉంది. వరుస కేసుల్లో అరెస్ట్ చేస్తూ స్టేషన్ల చుట్టూ పోలీసులు తిప్పుతున్నారు. ఇవాళ విజయవాడ చీఫ్ మెట్రోపాలిటిన్ మెజిస్ట్రేట్ కోర్టులో పోసానిని పోలీసులు హాజరుపరిచారు. ఈ నెల 20 వరకు కోర్టు రిమాండ్ విధించింది. తనకు ఆనారోగ్య సమస్యలున్నాయని న్యాయమూర్తికి పోసాని చెప్పారు. గుండె ఆపరేషన్ అయ్యిందని.. పక్షవాతం కూడా వచ్చిందని ఆయన తెలిపారు. ‘‘నాపై అక్రమ కేసులు పెట్టారు. నన్ను ఎక్కడికి తీసుకెళుతున్నారో కూడా తెలియడం లేదు’’ అంటూ పోసాని ఆవేదన వ్యక్తం చేశారు.పోలీసు వాహనంలో గంటల తరబడి కూర్చోలేకపోతున్నానని.. తనను ఒకే జైలులో ఉంచేలా ఆదేశాలివ్వాలని పోసాని కోరగా, పిటి వారెంట్‌పై వచ్చినందున తాను ఎలాంటి ఆదేశాలివ్వలేనని న్యాయమూర్తి తెలిపారు. పోసాని కృష్ణమురళికి ఈనెల 20 వరకూ న్యాయమూర్తి రిమాండ్ విధించారు. పోసానిని కర్నూలు జైలుకి తరలించారు.కాగా, అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో పోసానికి బెయిల్ మంజూరు చేస్తూ కడప మొబైల్ కోర్టు శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చింది. పోసానికి బెయిలు ఇవ్వకూడదని పోలీసుల తరపు న్యాయవాదులు వాదనలు వినిపించినప్పటికీ.. కోర్టు పోసాని తరఫు న్యాయవాదుల వాదనలతో ఏకీభవిస్తూ... బెయిల్ మంజూరు చేసింది. పోసాని కస్టడీ పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. ఈ కేసులోనే పోసాని ఫిబ్రవరి 26వ తేదీన అరెస్టయ్యారు.

కట్నంగా 40 గోల్డ్ బ్యాంగిల్స్ దానం.. నాకు 3 కిలోల బంగారం..: సింగర్ కుమారుడు
కొత్త పెళ్లికూతురా రారా.., ఓహో బావా.. మార్చుకో నీ వంకరటింకర దోవ.., కాశీకి పోయాను రామా హరి.. వంటి ఎన్నో హిట్ సాంగ్స్ ఆలపించింది లెజెండరీ సింగర్ స్వర్ణలత (Singer Swarnalatha). తెలుగు సినిమా స్వర్ణయుగ కాలంలో ఎన్నో హాస్య గీతాలు ఆలపించింది. ఎనిమిది భాషల్లో పాటలు పాడిన ఆమె దాదాపు 30 చిత్రాల్లో నటించింది కూడా! ఈమె పుట్టుక, చావు ఒకే రోజు జరిగాయి. ఆమె పెద్ద కుమారుడు ఆనంద్ రాజ్ తెలుగు, తమిళ చిత్రాల్లో విలన్‌గా ఎన్నో సినిమాల్లో నటించాడు. చిన్న కుమారుడు అనిల్‌రాజు పలు సినిమాల్లో డ్యాన్స్‌మాస్టర్‌గా పని చేశాడు. మరో ఏడుగురు సంతానం డాక్టర్స్ అయ్యారు.ఏడేళ్లకే గాయనితాజాగా అనిల్ రాజు ఓ ఇంటర్వ్యూలో తల్లి గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ఆయన మాట్లాడుతూ.. అమ్మ ఏడు సంవత్సరాల వయసులోనే గాయని అయింది. తన అసలు పేరు మహాలక్ష్మి. రేడియోలో అమ్మ గాత్రం విని డైరెక్టర్ బాలచందర్ తనకు తొలి అవకాశం ఇచ్చాడు. అలా సినిమాల్లోకి వచ్చింది. మా అమ్మగారికి తొమ్మిదిమంది సంతానమవగా పదిమంది కుక్కల్ని పెంచుకునేది. ఓసారి అమ్మ ముస్లింకుటుంబ వివాహానికి వెళ్లింది. కట్నం ఇవ్వలేదని వరుడు పెళ్లే వద్దనడంతో అమ్మ తన చేతికున్న 40 బంగారు గాజుల్ని ఇచ్చి ఆ పెళ్లి చేసింది. ఆ మాటలు బాధించేవిఅయితే అన్నల పెళ్లిళ్లయ్యేసరికి కొన్ని సమస్యలు వచ్చిపడ్డాయి. మా వదిన.. అమ్మను వృద్ధాశ్రమంలో వదిలేద్దామనేది. అవి అమ్మ మనసును బాధించేవి. అమ్మ ఎప్పుడూ బంగారు ఆభరణాలు ధరించేది. 1972లో సినిమా ఇండస్ట్రీ నుంచి బయటకు వచ్చేసి భక్తిగీతాలు పాడేది. అలా 1997న మార్చి 5న నేను, అమ్మ చెన్నై నుంచి హైదరాబాద్‌కు వస్తున్నాం. అప్పుడు అమ్మ ఒంటిమీద రూ.4.50 లక్షల విలువైన బంగారం ఉంది. చిన్నవంగల్ అనే గ్రామానికి రాగానే గుర్తు తెలియని దుండగులు మా కారును ఆపేశారు.3 కిలోల బంగారండ్రైవర్ను, నన్ను, అమ్మను కొట్టారు. ఐదురోజులవరకు అమ్మ ఆస్పత్రిలో పోరాడుతూ మార్చి 10న తుదిశ్వాస విడిచింది. అమ్మ నివసించిన ఇంటిని అమ్మేయగా రూ.100 కోట్లు వచ్చాయి. దాన్ని తొమ్మిది మంది పంచుకున్నాం. అందులో రూ.3 కోట్లతో తన జీవితకథపై సినిమా తీస్తున్నాం. అమ్మ వెళ్లిపోతూ నాకు 3 కిలోల బంగారం ఇచ్చింది. తన 500 పట్టుచీరలు ఇప్పటికీ నాదగ్గరే ఉన్నాయి. కొన్ని చీరల్లో బంగారంతో తయారు చేసినవి.నేను హిజ్రా..నాకు 16 ఏళ్ల వయసు రాగానే నాలో ఆడలక్షణాలు ఎక్కువయ్యాయి. ఇంట్లో నుంచి ముంబైకి వెళ్లిపోయాను. మా అమ్మకు విషయం అర్థమై.. నువ్వు చీర కట్టుకో, ప్యాంటు షర్ట్ వేసుకో.. ఎలాగైనా ఉండు, కానీ నేను చనిపోయేవరకు నా దగ్గరే ఉండు అంది. మా అన్నకేమో నేను హిజ్రాలా ఉంటే నచ్చేది కాదు. చాలా ఏండ్లు కాటుక, లిప్‌స్టిక్ పెట్టుకుని చీర కట్టుకుంటూ ఉండేవాడిని. అన్నదమ్ములెవరూ నాతో మాట్లాడేవారు కాదు. ఇప్పుడు నాలో హిజ్రా లక్షణాలు తగ్గిపోయాయి అని చెప్పుకొచ్చాడు.చదవండి: ‘ఛావా’ తెలుగు వెర్షన్‌కి ఊహించని ఓపెనింగ్స్!
మనవడి చితిలోనే తాత మరణ శాసనం..
కల్యాణ్ రామ్.. అర్జున్ సన్నాఫ్ వైజయంతి
సీఎం రేవంత్ రెడ్డికి మందకృష్ణ మాదిగ బహిరంగ లేఖ
ప్రపంచ కుబేరుడితో నాల్గవ బిడ్డకు జన్మనిచ్చింది: ఎవరీ షివోన్ జిలిస్?
మీకు మీరే ట్రోల్ చేసుకుంటున్నారు.. బాగుందయ్యా రాహుల్!
వైఎస్సార్సీపీలో నూతన నియామకాలు
ఛాంపియన్స్ ట్రోఫీ విజేతకు ప్రైజ్‌మనీ ఎంతో తెలుసా..?
హీరోయిన్ 'మీటూ' కేసు కొట్టేసిన హైకోర్ట్
‘ఇది చరిత్రలో నిలిచిపోయే యూనివర్శిటీ కావాలి’
విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో భారీగా కార్మికుల తొలగింపు
వీళ్లిచ్చిన స్టేట్మెంట్తో మనం వాళ్లతో కలిసి పని చేస్తున్నామని అనుకుంటార్సార్!
Chhaava Review: ‘ఛావా’(తెలుగు వెర్షన్) మూవీ రివ్యూ
ఈ రాశి వారికి వ్యాపారాలలో స్వల్ప లాభాలు.. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు.
చెల్లెలితో అన్న శారీరక సంబంధం
Sakshi Cartoon: ఉక్రెయిన్‌కు నిఘా సమాచారం నిలిపివేసిన అమెరికా
‘అమ్మానాన్నా.. ఐ యామ్ సారీ’
ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 34 సినిమాలు
సాల్ట్ అండ్ పెప్పర్: అందాల ఈ పెళ్లి కూతుర్నిచూసి షాకవ్వకండి!
డీఏ పెంపు.. ఈ సారి ఎంత ఉంటుందంటే?
శుబ్‌మన్ గిల్‌కు ప్రమోషన్.. ఏకంగా రూ. 7 కోట్ల జీతం!?
మనవడి చితిలోనే తాత మరణ శాసనం..
కల్యాణ్ రామ్.. అర్జున్ సన్నాఫ్ వైజయంతి
సీఎం రేవంత్ రెడ్డికి మందకృష్ణ మాదిగ బహిరంగ లేఖ
ప్రపంచ కుబేరుడితో నాల్గవ బిడ్డకు జన్మనిచ్చింది: ఎవరీ షివోన్ జిలిస్?
మీకు మీరే ట్రోల్ చేసుకుంటున్నారు.. బాగుందయ్యా రాహుల్!
వైఎస్సార్సీపీలో నూతన నియామకాలు
ఛాంపియన్స్ ట్రోఫీ విజేతకు ప్రైజ్‌మనీ ఎంతో తెలుసా..?
హీరోయిన్ 'మీటూ' కేసు కొట్టేసిన హైకోర్ట్
‘ఇది చరిత్రలో నిలిచిపోయే యూనివర్శిటీ కావాలి’
విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో భారీగా కార్మికుల తొలగింపు
వీళ్లిచ్చిన స్టేట్మెంట్తో మనం వాళ్లతో కలిసి పని చేస్తున్నామని అనుకుంటార్సార్!
Chhaava Review: ‘ఛావా’(తెలుగు వెర్షన్) మూవీ రివ్యూ
ఈ రాశి వారికి వ్యాపారాలలో స్వల్ప లాభాలు.. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు.
చెల్లెలితో అన్న శారీరక సంబంధం
Sakshi Cartoon: ఉక్రెయిన్‌కు నిఘా సమాచారం నిలిపివేసిన అమెరికా
‘అమ్మానాన్నా.. ఐ యామ్ సారీ’
ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 34 సినిమాలు
సాల్ట్ అండ్ పెప్పర్: అందాల ఈ పెళ్లి కూతుర్నిచూసి షాకవ్వకండి!
డీఏ పెంపు.. ఈ సారి ఎంత ఉంటుందంటే?
శుబ్‌మన్ గిల్‌కు ప్రమోషన్.. ఏకంగా రూ. 7 కోట్ల జీతం!?
సినిమా

అసత్య ప్రచారాలు.. మహిళా కమిషన్‌కు కల్పన ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: సింగర్ కల్పన (Kalpana Raghavendar) మహిళా కమిషన్‌ను ఆశ్రయించింది. నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం అంటూ కొందరు అసత్య ప్రచారాలు చేస్తున్నారని మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారదకు ఫిర్యాదు చేసింది. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ తన ప్రైవేట్ వీడియోలతో ట్రోల్ చేస్తున్నారని ఆరోపించింది. తనపై తప్పుడు ప్రచారం చేసినటువంటివారిపై చర్యలు తీసుకోవాలని కోరింది. కల్పన ఫిర్యాదుపై నేరెళ్ళ శారద స్పందిస్తూ.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మహిళలపై అసభ్యకర పోస్టులు పెట్టేవారిపై స్పెషల్ ఫోకస్ పెట్టామన్నారు. ఇష్టం వచ్చిన పోస్టులు పెడితే కఠిన చర్యలు ఉంటాయని ట్రోలర్స్‌ను హెచ్చరించారు.ఏం జరిగింది?సింగర్ కల్పన ఇటీవల తన ఇంట్లో అపస్మారకస్థితిలో కనిపించింది. ఆమె నిద్రమాతలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని తొలుత ప్రచారం జరిగింది. ఆస్పత్రిలో చికిత్స అనంతరం కోలుకున్న కల్పన.. తాను చనిపోవడానికి ప్రయత్నించలేదని, కేవలం మంచి నిద్ర కోసం నిద్రమాత్రలు వేసుకున్నానని తెలిపింది. అయితే మెడిసిన్ ఎక్కువ మోతాదులో తీసుకోవడంతో స్పృహ కోల్పోయినట్లు వివరించింది. తమ కుటుంబంలో ఎటువంటి విభేదాలు లేవని క్లారిటీ ఇచ్చింది. 45 ఏళ్ల వయసులోనూ పీహెచ్డీ, ఎల్ఎల్బీ చేస్తున్నానని, అది భర్త సహకారంతోనే సాధ్యమైందని వివరించింది.చదవండి: అమ్మపై దాడి చేసి రూ.4.50 లక్షల బంగారం దోచేశారు.. నాకు 3 కిలోల బంగారం మిగిల్చింది: సింగర్ కుమారుడు

ఉమెన్స్ డే స్పెషల్.. సమంత అలా నమ్రత ఇలా
వదిన-మరదలుతో మహేశ్ భార్య నమ్రతచీరలో చూడచక్కగా మెరిసిపోతున్న ఆషికా రంగనాథ్క్యూట్ అండ్ స్వీట్ వీడియోతో సామ్ పోజులుమొరాకోలో చిల్ అవుతున్న దృశ్యం పాప ఎస్తర్నీలం పట్టు చీరలో మెరిసిపోతున్న యాంకర్ విష్ణుప్రియఛార్టెడ్ ఫ్లైట్ లో పోజులతో చితక్కొట్టేసిన కరీనా కపూర్హరిద్వార్ లో భక్తిలో మునిగిపోయిన సుప్రీత View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Reba Monica John (@reba_john) View this post on Instagram A post shared by Vishnupriyaa bhimeneni (@vishnupriyabhimeneni) View this post on Instagram A post shared by Kareena Kapoor Khan (@kareenakapoorkhan) View this post on Instagram A post shared by Shruti Sodhi (@aslishrutisodhi) View this post on Instagram A post shared by Neha Sharma 💫 (@nehasharmaofficial) View this post on Instagram A post shared by Sakshi Agarwal (@iamsakshiagarwal) View this post on Instagram A post shared by Bandaru Sheshayani Supritha (@_supritha_9) View this post on Instagram A post shared by Kriti Kharbanda (@kriti.kharbanda) View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) View this post on Instagram A post shared by Anshu (@actressanshuofficial) View this post on Instagram A post shared by Vani Bhojan (@vanibhojan_) View this post on Instagram A post shared by Manjima Mohan Gautham (@manjimamohan) View this post on Instagram A post shared by Aathmika 🦁 (@iamaathmika) View this post on Instagram A post shared by Sanya Malhotra (@sanyamalhotra_) View this post on Instagram A post shared by Esther (@_estheranil) View this post on Instagram A post shared by Ashika Ranganath (@ashika_rangnath) View this post on Instagram A post shared by Amyra Dastur (@amyradastur) View this post on Instagram A post shared by Jacqueliene Fernandez (@jacquelienefernandez) View this post on Instagram A post shared by Meenakshi Dixit (@meenakshidixit)

మాజీ ప్రేమికులు మళ్లీ కలిశారు..
మాజీ ప్రేమికులు మళ్లీ కలిశారు. బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ (Kareena Kapoor), హీరో షాహిద్ కపూర్ (Shahid Kapoor) రాజస్తాన్‌లోని జైపూర్‌లో జరుగుతున్న ఐఫా (ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిలిం అకాడమీ అవార్డ్స్) కార్యక్రమానికి వెళ్లారు. అక్కడ ఇద్దరూ ఒకరికొకరు తారసపడటంతో ఆత్మీయంగా హగ్ ఇచ్చుకుని పలకరించుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన అభిమానులు ఇన్నాళ్లకు మీరిద్దరూ మెచ్యూర్డ్‌గా ప్రవర్తించారు. ఇలా మీ ఇద్దర్నీ చూస్తుంటే సంతోషంగా ఉంది అని కామెంట్లు చేస్తున్నారు.గతంలో ప్రేమజంటకాగా కరీనా, షాహిద్లు గతంలో ప్రేమించుకున్నారు. వీరిద్దరూ ఫిదా, చుప్ చుప్ కే, జబ్ వి మెట్ వంటి చిత్రాల్లో జంటగా నటించారు. ఆన్‌స్క్రీన్‌పైనే కాకుండా ఆఫ్ స్క్రీన్‌లోనూ జోడీగానే కనిపించేవారు. జబ్ వి మెట్ సినిమా షూటింగ్‌కు ముందు వీరిద్దరి మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయి. దీంతో విడిపోక తప్పలేదు. అనంతరం కరీనా.. సైఫ్ అలీ ఖాన్‌ను పెళ్లి చేసుకోగా వీరికి ఇద్దరు కుమారులు సంతానం. షాహిద్ కపూర్.. మీరా రాజ్‌పుత్‌ను పెళ్లాడగా వీరికి ఓ కుమారుడు, కూతురు జన్మించారు. View this post on Instagram A post shared by Manav Manglani (@manav.manglani) View this post on Instagram A post shared by Manav Manglani (@manav.manglani) చదవండి: కట్నంగా 40 గోల్డ్ బ్యాంగిల్స్ దానం.. నాకు 3 కిలోల బంగారం..: సింగర్ కుమారుడు

రష్మికని హింసించకండి.. నటి రమ్య కౌంటర్
రష్మిక ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్. భాషతో సంబంధం లేకుండా మూవీస్ చేస్తూ దూసుకుపోతోంది. కానీ ఈమెపై సొంత రాష్ట్రం కర్ణాటకలోనే తీవ్రమైన ట్రోలింగ్ జరుగుతూనే ఉంటుంది. మొన్నటిమొన్న కాంగ్రెస్ నాయకుడు కూడా రష్మికపై నోరు పారేసుకున్నాడు. ఈ క్రమంలోనే రష్మికపై జరుగుతున్న ట్రోలింగ్ పై కన్నడ నటి రమ్య స్పందించింది. విమర్శకులకు కౌంటర్ ఇచ్చింది.(ఇదీ చదవండి: చివరి కోరిక తీరకుండానే చనిపోయిన ఎన్టీఆర్ అభిమాని)నటి-రాజకీయ నాయకురాలిగా దక్షిణాది ప్రజలకు పరిచయమున్న నటి రమ్య.. తెలుగులోనూ ఓ సినిమాలో నటించింది. కానీ అది ఫ్లాప్ కావడంతో పూర్తిగా కన్నడకే పరిమితమైంది. తాజాగా బెంగళూరు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో మాట్లాడుతూ రష్మికకు అండగా నిలిచింది.'రష్మిక లాంటి నటీమణుల్ని ట్రోల్స్ ద్వారా అవమానించడం దయచేసి ఆపండి. ఇది అమానవీయం. ఆడపిల్లలు మెత్తగా ఉంటారు. ఏమన్నా సే తిరిగి మాట్లాడరు కాబట్టి ఇలా హింసించడం తగదు. ఇప్పుడు సినిమా అనే కాదు అన్ని రంగాల్లోనూ మహిళలకు అన్యాయం జరుగుతోంది. దీనికి వ్యతిరేకంగా మనమందరం ఐక్యం కావాలి' అని నటి రమ్య చెప్పుకొచ్చారు.(ఇదీ చదవండి: 'రేఖాచిత్రం' సినిమా రివ్యూ (ఓటీటీ))కెరీర్ ప్రారంభంలో రష్మిక పలు కన్నడ సినిమాలు చేసింది. ఎప్పుడైతే ఫేమ్ వచ్చిందో అప్పటినుంతి తెలుగు, హిందీ, తమిళ మూవీస్ మాత్రమే చేస్తోంది. మొన్నీమధ్య తనది హైదరాబాద్ అని చెప్పడం కన్నడ ప్రేక్షకులకు ఆగ్రహం తెప్పించింది. దీంతో అదేపనిగా ట్రోల్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే రమ్య, రష్మికకు అండగా నిలిచింది.రమ్య తెలుగులో కళ్యాణ్ రామ్ అభిమన్యు చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. ఆమె తెలుగులో నటించిన ఒకే ఒక చిత్రం అదే. ఆ మూవీ పరాజయం చెందడంతో మళ్ళీ తెలుగులో రమ్య కనిపించలేదు. రష్మిక విషయానికొస్తే కొన్నిరోజుల క్రితం 'పుష్ప 2', తాజాగా 'ఛావా'తో బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టింది.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 34 సినిమాలు))
న్యూస్ పాడ్‌కాస్ట్
క్రీడలు

CT 2025: ఒకే వేదికపై ఆడటం వల్ల టీమిండియా లబ్ది పొందింది.. విమర్శకులకు ఇచ్చిపడేసిన అశ్విన్
ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భారత్ తమ మ్యాచ్‌లను దుబాయ్‌లో ఆడుతున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీకి పాక్ ఆతిథ్యమిస్తున్నప్పటికీ.. భద్రతా కారణాల రిత్యా టీమిండియా తమ మ్యాచ్‌లను దుబాయ్‌లో ఆడుతుంది. అయితే టీమిండియా తమ మ్యాచ్‌లను ఒకే వేదికపై ఆడటాన్ని కొందరు ప్రస్తుత, మాజీ క్రికెటర్లు తప్పుబడుతున్నారు. ఒకే వేదికపై మ్యాచ్‌లు ఆడటం వల్ల టీమిండియా లబ్ది పొందుతుందని ఆరోపిస్తున్నారు.ఈ ఆరోపణలపై భారత స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ స్పందించాడు. ఒకే వేదికపై ఆడటం వల్ల టీమిండియా లబ్ది పొందుతుందనడం సరికాదన్నాడు. గతంలో (2009 ఛాంపియన్స్ ట్రోఫీ) సౌతాఫ్రికా ఒకే వేదికపై అన్ని మ్యాచ్‌లు ఆడినా ఫైనల్‌కు చేరలేదన్న విషయాన్ని గుర్తు చేశాడు. బాగా ఆడితేనే టోర్నమెంట్లు గెలుస్తారని, సాకుల వల్ల కాదని చురకలంటించాడు. దుబాయ్‌లో ఆడటం వల్ల టీమిండియా లబ్ది పొందుతుందని తమ కెప్టెన్, కోచ్‌లను ప్రశ్నించినప్పుడు నవ్వుకున్నానని అన్నాడు. టీమిండియా చివరిగా కోవిడ్‌కు ముందు 2018లో (ఆసియా కప్) దుబాయ్‌లో ఆడిందన్న విషయాన్ని గుర్తు చేశాడు. టీమిండియా తర్వాత న్యూజిలాండ్, ఇంగ్లండ్, సౌతాఫ్రికా దుబాయ్‌లో ఆడాయని అన్నాడు. ప్రయాణించడం వల్ల ఆటగాళ్లు అలసిపోతారన్న విషయంతో ఏకీభవించిన అశ్విన్.. షెడ్యూల్ ఫిక్స్ చేయడంలో టీమిండియా ప్రమేయం ఉండదన్న విషయాన్ని గుర్తు చేశాడు. సౌతాఫ్రికా ఆటగాడు డేవిడ్ మిల్లర్ చేసిన వ్యాఖ్యలకు ప్రతిగా ఈ విషయాన్ని ప్రస్తావించాడు.ఎంతమంది ఎన్ని రకాలుగా టీమిండియాపై ఆరోపణలు (ఒకే వేదిక అంశం) చేసినా న్యూజిలాండ్ ఆటగాళ్లు మాత్రం ఎలాంటి వ్యాఖ్యలు చేయరని కితాబునిచ్చాడు. ఇలాంటి చౌకబారు వ్యాఖ్యలు చేయకుండా కేవలం ఆటపై దృష్టి పెడుతుంది కాబట్టే న్యూజిలాండ్‌కు భారీ సంఖ్యలో అభిమానులున్నారని అన్నాడు. ఫైనల్లో గెలిచినా ఓడినా న్యూజిలాండ్ ఆటగాళ్లు హుందాగా ప్రవర్తిస్తారని తెలిపాడు.కాగా, ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భారత్ అదరగొడుతున్న విషయం తెలిసిందే. గ్రూప్ దశలో బంగ్లాదేశ్, పాక్, న్యూజిలాండ్‌పై విజయాలు సాధించిన భారత్.. సెమీస్‌లో ఆసీస్‌ను మట్టికరిపించి అజేయ జట్టుగా ఫైనల్‌కు చేరింది. మరోవైపు న్యూజిలాండ్ గ్రూప్ దశలో పాకిస్తాన్, బంగ్లాదేశ్‌పై విజయాలు సాధించి, భారత్ చేతిలో ఓడింది. అయినా గ్రూప్-ఏలో రెండో స్థానంలో నిలిచి సెమీస్‌కు చేరింది. సెమీస్‌లో కివీస్ సౌతాఫ్రికాను చిత్తు చేసి తుది పోరుకు అర్హత సాధించింది. దుబాయ్ వేదికగా రేపు (మార్చి 9) జరుగబోయే తుది సమరంలో న్యూజిలాండ్ రోహిత్ సేనతో అమీతుమీ తేల్చుకోనుంది.ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో న్యూజిలాండ్ భారత్‌ను ఎదుర్కోవడం ఇది రెండోసారి. 2000 ఎడిషన్ ఫైనల్లో కివీస్ భారత్‌ను ఢీకొట్టి విజేతగా నిలిచింది. న్యూజిలాండ్‌కు అది తొలి ఐసీసీ టైటిల్.

ఆర్సీబీకి ఆడాలని ఆరాటపడుతున్న పాక్ ఫాస్ట్ బౌలర్
పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ మొహమ్మద్ అమీర్ ఐపీఎల్ ఆడాలని తెగ ఆరాటపడిపోతున్నాడు. ప్రత్యేకించి ఐపీఎల్లో ఆర్సీబీకి ప్రాతినిథ్యం వహించాలని కలలు కంటున్నాడు. భారత్‌తో దౌత్యపరమైన సంబంధాలు సరిగ్గా లేని కారణంగా పాక్ ఆటగాళ్లకు ఐపీఎల్లో ఎంట్రీ లేని విషయం తెలిసిందే. అయితే అమీర్ బ్రిటన్ పౌరసత్వం పొంది తన ఐపీఎల్ కల నెరవేర్చుకోవాలని ఆశిస్తున్నాడు. అమీర్‌కు 2026 నాటికి యూకే పాస్ట్‌పోర్ట్ వస్తుంది. అప్పుడు ఐపీఎల్ వేలంలో తన పేరును రిజిస్టర్ చేసుకోవాలని అనుకుంటున్నాడు.విరాట్ అంటే అమితమైన అభిమానంఎడమ చేతి వాటం ఫాస్ట్ బౌలర్ అయిన అమీర్‌కు విరాట్ కోహ్లి అంటే అమితమైన అభిమానం. ఈ విషయాన్ని అమీర్ చాలా సందర్భాల్లో చెప్పాడు. 2016 టీ20 ప్రపంచకప్‌కు ముందు కోహ్లి తనకు బ్యాట్‌ను బహుమతిగా ఇచ్చిన విషయాన్ని అమీర్ ఇటీవల ఓ ఇంటర్వ్యూ సందర్భంగా గుర్తు చేసుకున్నాడు. ఇదే సందర్భంగా అమీర్ కోహ్లిపై ప్రశంసల వర్షం కురిపించాడు. కోహ్లి ప్రతిభను ఆరాధించే వ్యక్తి అని కొనియాడాడు. కోహ్లి తనకు బ్యాట్ ఇచ్చినప్పుడు ఉప్పొంగిపోయానని చెప్పుకొచ్చాడు. తాను కోహ్లి బ్యాటింగ్‌ను ఆరాధిస్తానని.. కోహ్లి తన బౌలింగ్‌ను గౌరవిస్తాడని తెలిపాడు. కోహ్లి ఇచ్చిన బ్యాట్‌తో చాలా మంచి ఇన్నింగ్స్‌లు ఆడానని గుర్తు చేసుకున్నాడు. అమీర్ ఆర్సీబీలో చేరితే ఆ జట్టు టైటిల్ కల నెరవేరుతుందని మరో పాకిస్తాన్ ఆటగాడు అహ్మద్ షెహజాద్ అభిప్రాయపడ్డాడు. ఆర్సీబీ బౌలింగ్ సమస్యలు పరిష్కరించడానికి అమీర్ లాంటి బౌలర్ అవసరమని షెహజాద్ అన్నాడు. ఆర్సీబీ బ్యాటింగ్ ఎల్లప్పుడూ బలంగా ఉంది. వారికి బౌలింగే పెద్ద సమస్య. అమీర్ వారితో చేరితే వారు టైటిల్ గెలుస్తారని షెహజాద్ జోస్యం చెప్పాడు.కాగా, 32 ఏళ్ల అమీర్ 2020లో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. తిరిగి 2024లో (టీ20 ప్రపంచకప్ కోసం) రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నాడు. అయితే 2024 ప్రపంచకప్ కోసం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అమీర్‌ను ఎంపిక చేయలేదు. ప్రస్తుతం అమీర్ ప్రపంచవ్యాప్తంగా వివిథ లీగ్‌ల్లో (ఐపీఎల్ మినహా) ఆడుతున్నాడు.ఇదిలా ఉంటే, ఆర్సీబీ ఈ ఏడాది ఐపీఎల్ ఆరంభ మ్యాచ్‌లోనే డిఫెండింగ్ ఛాంపియన్ కేకేఆర్‌తో తలపడనుంది. మార్చి 22న జరిగే ఈ మ్యాచ్ కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరుగనుంది. ఈ ఏడాది ఆర్సీబీ నూతన కెప్టెన్‌గా మధ్యప్రదేశ్ ఆటగాడు రజత్ పాటిదార్ ఎంపికయ్యాడు. గత రెండు సీజన్లలో సారథ్యం వహించిన డుప్లెసిస్‌ను ఆర్సీబీ మెగా వేలానికి ముందు వదులుకుంది.ఈ ఏడాది ఆర్సీబీ జట్టు..రజత్ పాటిదార్ (కెప్టెన్), విరాట్ కోహ్లి, దేవ్‌దత్ పడిక్కల్, టిమ్ డేవిడ్,స్వస్థిక్ చికార, కృనాల్ పాండ్యా, లియామ్ లివింగ్‌స్టోన్, మనోజ్ భాండగే, జేకబ్ బేతెల్, రొమారియో షెపర్డ్, స్వప్నిల్ సింగ్, మోహిత్ రతీ, ఫిలిప్ సాల్ట్, జితేశ్ శర్మ, జోష్ హాజిల్‌వుడ్, భువనేశ్వర్ కుమార్, లుంగి ఎంగిడి, రసిక్ దార్ సలామ్, సుయాశ్ శర్మ, యశ్ దయాల్, నువాన్ తుషార, అభినందన్ సింగ్ఐపీఎల్ 2025లో ఆర్సీబీ షెడ్యూల్మార్చి 22- కేకేఆర్తోమార్చి 28- సీఎస్కేఏప్రిల్ 2- గుజరాత్ఏప్రిల్ 7- ముంబైఏప్రిల్ 10- ఢిల్లీఏప్రిల్ 13- రాజస్థాన్ఏప్రిల్ 18- పంజాబ్ఏప్రిల్ 20- పంజాబ్ఏప్రిల్ 24- రాజస్థాన్ఏప్రిల్ 27- ఢిల్లీమే 3- సీఎస్కేమే 9- లక్నోమే 13- సన్రైజర్స్మే 17- కేకేఆర్

'రోహిత్, కోహ్లి కాదు.. ఫైనల్లో అతడే గేమ్ ఛేంజర్'
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 టైటిల్‌ను ముద్దాడేందుకు టీమిండియా అడుగుదూరంలో నిలిచింది. దుబాయ్ వేదికగా ఆదివారం జరగనున్న ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో భారత్ తాడోపేడో తెల్చుకోనుంది. 2017 ఛాంపియన్స్ ట్రోఫీలో తుది మెట్టుపై బోల్తా పడిన భారత జట్టు.. ఈసారి మాత్రం ఎలాగైనా విజేతగా నిలవాలని పట్టుదలతో ఉంది. అందుకు తగ్గట్టు ఫైనల్ మ్యాచ్ కోసం రోహిత్ సేన ప్రత్యేక వ్యూహాలను రచిస్తోంది. హెడ్‌కోచ్ గౌతం గంభీర్ నేతృత్వంలో భారత జట్టు నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తోంది. మరోవైపు న్యూజిలాండ్ సైతం ఛాంపియన్స్ ట్రోఫీ-2000 ఫైనల్ ఫలితాన్ని పునరావృతం చేయాలని భావిస్తోంది.2000లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో కివీస్ చేతిలో మెన్ ఇన్ బ్లూ ఓటమి చవిచూసింది. అయితే అప్పటికంటే ఇప్పుడు భారత జట్టు అన్ని విభాగాల్లో పటిష్టంగా కన్పిస్తోంది. టీమిండియాను ఓడించడం అంత సులువు కాదు. ఈ నేపథ్యంలో భారత మాజీ బ్యాటర్ సబా కరీం ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు."ఛాంపియన్స్ ట్రోఫీ-2025ను గెలుచుకునేందుకు భారత్‌కు అన్ని రకాల అర్హతలు ఉన్నాయి. ప్రస్తుత భారత జట్టులో అద్బుతమైన ఆటగాళ్లు ఉన్నారు. 2013 ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచిన తర్వాత మరోసారి 2017లో భారత్‌కు టైటిల్‌ను సొంతం చేసుకునే అవకాశం లభించింది. కానీ ఆ ఎడిషన్‌లో భారత్ తుది మెట్టుపై బోల్తా పడింది.కానీ ఈసారి మాత్రం టీమిండియా వద్ద అద్బుతమైన స్పిన్నర్లు ఉన్నారు. ఈ ఫైనల్ మ్యాచ్‌లో భారత జట్టుకు శ్రేయస్ అయ్యర్ కీలకంగా మారనున్నాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలు ఎక్స్ ఫ్యాక్టర్లగా మారుతారని నేను అనుకోవడం లేదు. వారిద్దరూ అనుభవజ్ఞులైన ఆటగాళ్లు అయినప్పటికి.. న్యూజిలాండ్ బౌలర్ల ముందు కాస్త బలహీనంగా కన్పించే ఛాన్స్ ఉంది. అయితే ఈ సీనియర్ ద్వయం నుంచి ఫైటింగ్ నాక్స్ ఆశించవచ్చు.ప్రస్తుత జట్టుపై మాత్రం నాకు పూర్తి నమ్మకం ఉంది. ఇంగ్లండ్‌ను 3-0 తేడాతో ఓడించి ఈ మెగా టోర్నీలో అడుగుపెట్టారు. ఇక్కడ కూడా గ్రూపు మ్యాచ్‌లన్నీ గెలిచి.. ఆ తర్వాత సెమీస్‌లో ఆస్ట్రేలియాపై విజయం సాధించి ఫైనల్‌కు చేరుకున్నారు. రోహిత్ శర్మ అండ్ కో మంచి రిథమ్‌లో కన్పిస్తున్నారు.అయితే బ్లాక్ క్యాప్స్‌ను ఓడించడం అంత సలువు కాదు. గతంలో చాలా టోర్నమెంట్లలో చివరవరకు వచ్చి ఓటములను ఎదుర్కొన్నారు. అయితే ఐసీసీ టోర్నీల్లో మాత్రం భారత్‌పై వారికి మంచి రికార్డు ఉంది. కాబట్టి ఈ మ్యాచ్ రసవత్తరంగా సాగడం ఖాయమని" స్టార్‌స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కరీం పేర్కొన్నాడు.చదవండి: పాతికేళ్ల పరాజయానికి భారత్ ప్రతీకారం తీర్చుకుంటుందా?

రోహిత్‌తో నాకు మంచి అనుబంధం ఉంది.. అతడు చాలా గ్రేట్: గంభీర్
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ఫైనల్ పోరులో భారత్-న్యూజిలాండ్ జట్లు తలపడేందుకు సిద్దమయ్యాయి. ఆదివారం దుబాయ్ అంతర్జాతీయ స్టేడియం వేదికగా ఈ హైవోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌కు భారత కెప్టెన్ రోహిత్ శర్మపై హెడ్‌కోచ్ గౌతం గంభీర్ ప్రశంసల వర్షం కురిపించాడు.రోహిత్ శర్మతో తనకు మంచి అనుబంధం ఉందని గంభీర్ తెలిపాడు. కాగా రోహిత్ సారథ్యంలోని భారత జట్టు ప్రస్తుతం అద్బుతమైన ప్రదర్శన కనబరుస్తోంది. ఛాంపియన్స్ ట్రోఫీలో వరుస విజయాలతో టీమిండియా ఫైనల్‌కు దూసుకెళ్లింది. అయితే ఫైనల్‌కు చేరడంలో కోచ్ గంభీర్ పాత్ర కూడా ఉంది. అక్షర్ పటేల్‌ను బ్యాటింగ్ ఆర్డర్లో ప్రమోట్ చేయడం, వరుణ్ చక్రవర్తిని జట్టులోకి తీసుకురావడం వంటివి గంభీర్ తీసుకున్న నిర్ణయాలే. అయితే వైట్‌బాల్ క్రికెట్లో కెప్టెన్‌గా, కోచ్‌గా అదరగొడుతున్న రోహిత్-గంభీర్ జోడీ.. రెడ్ బాల్ క్రికెట్లో ఇంకా తమ మార్క్ చూపించలేకపోయారు.న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25లో ఘోర పరాభావం తర్వాత వీరద్దరూ తీవ్రమైన విమర్శలు ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచి విమర్శించిన వారితోనే శెభాష్ అన్పించుకోవాలని వీరు భావిస్తున్నారు."రోహిత్ శర్మ తనొక కెప్టెన్ అని, అన్ని అధికారాలు ఉన్నాయని ఎన్నడూ భావించలేదు. అద్భుతమైన వ్యక్తిత్వం కలవాడు. అతడితో నాకు బలమైన అనుబంధం ఉంది. మంచి మనసు ఉన్న వారు మంచి నాయకుడిగా కూడా మారుతారు. అందుకే ఐపీఎల్లో అతడు కెప్టెన్‌గా అన్ని టైటిల్స్ సాధించగలిగాడు.భారత్‌కు టీ20 ప్రపంచకప్‌ను అందించాడు. అయితే చరిత్ర ఎప్పుడు గతంగానే ఉంటుంది. ఇప్పుడు మా ముందు కొత్త సవాలు ఉంది. ఫైనల్ మ్యాచ్‌లో కూడా అతడు బ్యాటర్ గానే కాకుండా సారథిగా కూడా అత్యుత్తమ ప్రదర్శన చేయగలడని ఆశిస్తున్నాను" అని ఐసీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో గౌతీ పేర్కొన్నాడు. కాగా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ తర్వాత హిట్‌మ్యాన్ భారత వన్డే కెప్టెన్సీ నుంచి వైదొలిగే సూచనలు కన్పిస్తున్నాయి.చదవండి: పాతికేళ్ల పరాజయానికి భారత్ ప్రతీకారం తీర్చుకుంటుందా?
బిజినెస్

2030 నాటికి రూ.115-125 లక్షల కోట్ల రుణ సమీకరణ.. ఎందుకంటే..
దేశీయ కార్పొరేట్ కంపెనీల మూలధన వ్యయం పెరుగుతోంది. దాంతో 2030 నాటికి సుమారు రూ.115-125 లక్షల కోట్లు రుణాన్ని సమీకరించనున్నాయని అంచనాలు వెలువడుతున్నాయి. ఈ భారీ నిధులు ఆయా కంపెనీలకు మూలధన వ్యయం (CAPEX), వర్కింగ్ క్యాపిటల్ అవసరాలు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలకు (NBFC) ఫైనాన్సింగ్ కోసం ఉపయోగించబోతున్నట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు. కార్పొరేట్ రంగంలో భవిష్యత్తులో మౌలిక సదుపాయాల రంగం కీలక పాత్ర పోషిస్తుందని, ఈ పెట్టుబడుల్లో సింహభాగం అందుకే ఖర్చు చేస్తాయని భావిస్తున్నారు.రుణ కేటాయింపులు ఇలా..మూలధన వ్యయం: మొత్తం రుణంలో సుమారు రూ.45-50 లక్షల కోట్లు కాపెక్స్‌కు కేటాయిస్తారు. ఉత్పత్తి సామర్థ్యాలను విస్తరించడానికి, సాంకేతిక పరిజ్ఞానాన్ని అప్‌గ్రేడ్ చేయడానికి, వివిధ పరిశ్రమల్లో కొత్త సౌకర్యాలను సిద్ధం చేయాడానికి ఈ పెట్టుబడి కీలకం.వర్కింగ్ క్యాపిటల్, ఎన్బీఎఫ్సీ ఫైనాన్సింగ్: మిగిలిన రూ.70-75 లక్షల కోట్లు వర్కింగ్ క్యాపిటల్ అవసరాలు, ఎన్బీఎఫ్సీ ఫైనాన్సింగ్ అవసరాలను తీరుస్తాయి. కార్పొరేట్ ఎకోసిస్టమ్‌లో కార్యకలాపాలు సజావుగా, లిక్విడిటీ ఉండేలా ఈ ఫండ్స్ దోహదపడతాయి.మౌలిక సదుపాయాలు: కార్పొరేట్ కంపెనీ అభివృద్ధిలో భాగంగా మొత్తం పెట్టుబడుల్లో దాదాపు మూడొంతుల వాటాను మౌలిక సదుపాయాలకు ఖర్చు చేస్తారు. ఇందులోనూ ప్రధానంగా కింది విభాగాల్లో ఖర్చులు పెరగన్నాయని చెబుతున్నారు.రవాణా: కనెక్టివిటీ, లాజిస్టిక్స్ సామర్థ్యాన్ని పెంచడానికి రోడ్లు, రైల్వేలు, ఓడరేవుల్లో పెట్టుబడులు పెడుతారు.ఎనర్జీ: పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల విస్తరణ, పవర్ గ్రిడ్ల ఆధునీకరణకు ఇన్వెస్ట్ చేస్తారు.పట్టణాభివృద్ధి: పట్టణ ప్రాంతాల్లో గృహనిర్మాణం, నీటి సరఫరా, పారిశుద్ధాన్ని మెరుగుపరిచేందుకు చర్యలు చేపడుతారు.ఇదీ చదవండి: 2025 ఆర్థిక సంవత్సరంలో గోధుమల దిగుమతి ఎంతంటే..సవాళ్లు, అవకాశాలురుణ ఆధారిత కార్పొరేట్ కంపెనీల విస్తరణ అపారమైన అవకాశాలను అందిస్తున్నప్పటికీ ఈ విధానంలో కొన్ని సవాళ్లు ఎదురయ్యే అవకాశాలు లేకపోలేదు. బ్యాంకులు, కార్పొరేట్ బాండ్లు, బాహ్య వాణిజ్య రుణాలు(ఈసీబీ) సహా ఫైనాన్సింగ్ ఎకోసిస్టమ్ వార్షికంగా 10 శాతం చొప్పున వృద్ధి చెందుతుందని భావిస్తున్నారు. అయితే పెరుగుతున్న రుణ అవసరాలను తీర్చడానికి ఈ వృద్ధి సరిపోకపోవచ్చు. ఇది రూ.10-20 లక్షల కోట్ల నిధుల అంతరానికి దారితీస్తుంది. ఈ అంతరాన్ని పూడ్చడానికి కార్పొరేట్ బాండ్ మార్కెట్ కీలకపాత్ర పోషించాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఆ నగరం భారతదేశ బాహుబలి: ఆనంద్ మహీంద్రా
ప్రముఖ పారిశ్రామికవేత్త 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra).. ఆసక్తికరమైన విషయాలను ఎప్పటికప్పుడు తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో షేర్ చేస్తూ ఉంటారు. ఇందులో భాగంగానే తాజాగా గుజరాత్‌లోని ఓ చిన్న పట్టణానికి చెందిన వీడియో షేర్ చేశారు. ఇది నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.మహీంద్రా & మహీంద్రా చైర్మన్ షేర్ చేసిన వీడియోలో.. గుజరాత్‌లోని మోర్బి, సిరామిక్ పరిశ్రమలో దాని ఆధిపత్యాన్ని వెల్లడించడం చూడవచ్చు. కేవలం 9 కి.మీ. విస్తీర్ణంలో ఉన్న మోర్బి పట్టణం భారతదేశ సిరామిక్ ఉత్పత్తిలో 90% వాటాను కలిగి.. ప్రపంచ సిరామిక్ హబ్‌గా ఎలా అభివృద్ధి చెందిందో ఈ వీడియోలో చూడవచ్చు. 1930 నుంచి దాదాపు 1,000 కుటుంబాల యాజమాన్యంలో ఈ పరిశ్రమ వృద్ధి చెందింది.నాణ్యతలో ఏ మాత్రం తీసిపోకుండా.. తక్కువ ధరలోన సిరామిక్ వస్తువులు లభిస్తున్నాయి. ప్రపంచంలోని మొత్తం సిరామిక్ ఉత్పత్తిలో మోర్బి గణనీయమైన వాటాను కలిగి ఉంది. మోర్బి వ్యవస్థాపకులను ప్రశంసిస్తూ.. భారతీయ వ్యాపారాలు చైనాతో పోటీ పడగలవా? బహుశా మనం విజయగాథల కోసం సరైన ప్రదేశాల కోసం వెతకడం లేదు. 'మోర్బి' ప్రభావానికి సంబంధించిన ఈ వీడియో చూసి నేను సంతోషించాను. ఇది చిన్న పట్టణమే అయినప్పటికీ.. భారతదేశ 'బాహుబలి' అని ఆనంద్ మహీంద్రా అన్నారు.మోర్బి సిరామిక్ పరిశ్రమ ఎదుర్కొంటున్న సవాళ్లుప్రపంచవ్యాప్తంగా విజయం సాధించినప్పటికీ.. మోర్బి సిరామిక్ పరిశ్రమ దేశీయ, అంతర్జాతీయ డిమాండ్ తగ్గడంతో ఇబ్బంది పడుతోంది. గ్యాస్ వినియోగంపై పన్నులను తగ్గించాలని, వ్యాట్ నుంచి GSTకి మారాలని.. ఇన్పుట్ టాక్స్ క్రెడిట్ ప్రయోజనాల వంటివి కావాలని ప్రభుత్వాన్ని తయారీదారులు కోరుతున్నారు. ఈ పరిశ్రమ రోజుకు దాదాపు మూడు మిలియన్ క్యూబిక్ మీటర్ల గ్యాస్‌ను వినియోగిస్తుంది. తయారీదారులు దీనికే ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తోంది.ఇదీ చదవండి: శివ్ నాడార్ కీలక నిర్ణయం: కుమార్తెకు భారీ గిఫ్ట్సౌదీ అరేబియా, ఖతార్, తైవాన్ వంటి దేశాలు 50% నుంచి 106% వరకు యాంటీ డంపింగ్ సుంకాలు విధించడం వల్ల ఎగుమతులు కూడా దెబ్బతిన్నాయి. అంతే కాకుండా.. ఇరాన్‌పై వాణిజ్య ఆంక్షలు కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, అజర్‌బైజాన్‌లకు ఎగుమతి మార్గాలను దెబ్బతీశాయి. దీని వలన తయారీదారులు ఖరీదైన ప్రత్యామ్నాయ షిప్పింగ్ మార్గాలను ఎంచుకోవలసి వచ్చింది. ఇన్ని సవాళ్ళను ఎదుర్కొంటూనే.. మోర్బి ప్రపంచ సిరామిక్ నాయకుడిగా భారతదేశం ఖ్యాతిని నలుదిశల వ్యాపింపజేస్తోంది.Can Indian businesses compete with China?Maybe we’re not looking in the right places for success stories.I was delighted to see this video on the ‘Morbi’ effect.Agile, small-town entrepreneurs—The ‘bahubalis’ of India.👏🏽👏🏽👏🏽 pic.twitter.com/L4PiMVzYZl— anand mahindra (@anandmahindra) March 7, 2025

ఇల్లే బంగారమాయె..
బంగారం, గృహం, స్టాక్ మార్కెట్.. ఈ మూడింట్లో ఎందులో పెట్టుబడులకు ఆసక్తి చూపుతున్నారని మహిళలను అడిగితే.. ఠక్కున చెప్పే సమాధానం బంగారమే! కానీ, నేటి మహిళల పెట్టుబడి ఆలోచనల్లో ఎన్నో మార్పులు వచ్చాయి. మొదట సొంతిల్లు.. ఆ తర్వాతే బంగారం, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్ అంటున్నారు. 69 శాతం మంది మహిళలు సొంత ఇంటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తుండగా.. 31 శాతం మంది పెట్టుబడి కోసం ప్రాపర్టీలను కొనుగోలు చేస్తున్నారని అనరాక్ కన్జ్యూమర్ సెంటిమెంట్ సర్వే వెల్లడించింది. – సాక్షి, సిటీబ్యూరో మన దేశంలో గృహ కొనుగోలు ప్రక్రియలో మహిళలు ఎల్లప్పుడూ కీలక నిర్ణయాధికారులే. మహిళలు స్వతంత్ర, వ్యక్తిగత ఆస్తుల కొనుగోళ్లకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రాపర్టీ కొనుగోళ్లలో మెజారిటీ మహిళలు తుది వినియోగదారులే. పెట్టుబడి రీత్యా ఆస్తుల కొనుగోళ్లూ ఆశించిన స్థాయిలోనే ఉండటం గమనార్హం. పెరుగుతున్న స్వాతంత్య్రం, వ్యక్తిగత స్వేచ్ఛ, నిర్ణయాధికారం, మెరుగైన ఆదాయ వనరులు కారణంగా గృహ విభాగంలో మహిళా పెట్టుబడిదారులు ఎక్కువగా వస్తున్నారు. 2022 హెచ్2 (జులై–డిసెంబర్)లో మహిళా గృహ కొనుగోలుదారుల్లో తుది వినియోగం: పెట్టుబడి నిష్పత్తి 79:21గా ఉండగా.. 2024 హెచ్2 నాటికి 69:31గా ఉందని తెలిపింది.లాంచింగ్ ప్రాజెక్టుల్లోనే.. సర్వేలో పాల్గొన్న 69 శాతం మహిళలకు రియల్ ఎస్టేట్ అత్యంత ప్రాధాన్యత కలిగిన ఆస్తి తరగతిగా భావిస్తున్నారు. 2022 హెచ్2లో ఇది 65 శాతంగా ఉండగా.. కోవిడ్ కంటే ముందు 2019 హెచ్2లో 57 శాతంగా ఉంది. గతంలో కొత్తగా ప్రారంభించిన ప్రాజెక్ట్‌లలో కొనుగోళ్లకు 10 శాతం మంది మహిళలు మొగ్గుచూపగా.. ఇప్పుడది 18 శాతానికి పెరిగింది. నిర్మాణం పూర్తయి, గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్న ఇళ్లు (రెడీ టు మూవ్) కొనుగోళ్ల ప్రాధాన్యత 29 శాతం మేర తగ్గింది.లగ్జరీకే మొగ్గు.. లగ్జరీ ప్రాపర్టీలకు మహిళలూ ఆసక్తి చూపిస్తున్నారు. రూ.90 లక్షల కంటే ఎక్కువ ధర ఉండే ప్రీమియం ఇళ్ల కొనుగోళ్లకు 52 శాతం ఉమెన్స్ మొగ్గు చూపిస్తున్నారు. వీటిలో 33 శాతం మంది రూ.90 లక్షల నుంచి రూ.1.5 కోట్ల ధర ఉండే ప్రాపర్టీలను ఇష్టపడుతుండగా.. 11 శాతం మంది రూ.1.5 కోట్ల నుంచి రూ.2.5 కోట్ల ధర ఉండే గృహాలను, 8 శాతం మంది రూ.2.5 కోట్ల కంటే ఎక్కువ ధర ఉండే అల్ట్రా లగ్జరీ ప్రాపర్టీల కొనుగోళ్లకు ఆసక్తి చూపిస్తున్నారు. దేశంలో మహిళా హై నెట్‌వర్త్ ఇండివిడ్యువల్స్ (హెచ్ఎన్ఐ) పెరుగుదలకు ఇదే నిదర్శనం.గోల్డ్, స్టాక్ మార్కెట్.. ప్రాపర్టీ తర్వాత మగువలకు అమితాసక్తి బంగారమే. అందుకే రియల్ ఎస్టేట్ తర్వాత గోల్డ్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్‌కే మహిళలు జై కొడుతున్నారు. 2022 హెచ్2లో బంగారంలో పెట్టుబడులకు 8 శాతం మంది మహిళలు ఆసక్తి చూపించగా.. 2024 హెచ్2 నాటికి 12 శాతానికి పెరిగింది. ఇక, ఏటేటా స్టాక్ మార్కెట్ ఆకర్షణ కోల్పోతుంది. రెండేళ్ల క్రితం మార్కెట్లో పెట్టుబడులకు 20 శాతం మంది మహిళలు ఆసక్తి చూపిస్తే.. ఇప్పుడది ఏకంగా 2 శాతానికి పడిపోయింది.

కుమార్తెకు భారీ గిఫ్ట్: శివ్ నాడార్ కీలక నిర్ణయం
వారసత్వ ప్రణాళికను క్రమబద్దీకరించడానికి.. ఫ్యామిలీ హోల్డింగ్లను ఏకీకృతం చేయడానికి, ఒక ముఖ్యమైన చర్యలో భాగంగా.. దేశంలో మూడో అతిపెద్ద ఐటీ కంపెనీ హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ఫౌండర్ 'శివ్ నాడార్' (Shiv Nadar) కీలక నిర్ణయం తీసుకున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని.. హెచ్‌సీఎల్ కంపెనీలో మాత్రమే కాకుండా.. ప్రమోటర్ కంపెనీలైన వామ సుందరి ఇన్వెస్ట్మెంట్స్ (ఢిల్లీ) ప్రైవేట్ లిమిటెడ్‌లలోని తనకు చెందిన మొత్తంలో 47 శాతం వాటాను తన కుమార్తె 'రోష్ని నాడార్ మల్హోత్రా'కు బదిలీ చేస్తూ గిఫ్ట్ డీడ్లను అమలు చేశారు.ఈ బదిలీలకు ముందు, శివ్ నాడార్.. రోష్ని నాడార్ మల్హోత్రా రెండు సంస్థలలోనూ వరుసగా 51%, 10.33% వాటాలను కలిగి ఉన్నారు. లావాదేవీల తరువాత, HCL కార్పొరేషన్, VSIPL లలో రోష్ని వాటాలు 57.33 శాతానికి పెరిగాయి, శివ్ నాడార్ వాటా 4 శాతానికి చేరుకున్నాయి.రోష్ని నాడార్ మల్హోత్రా (Roshni Nadar Malhotra)టెక్ దిగ్గజం, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ వ్యవస్థాపకులు 'శివ్ నాడార్'కు ఏకైక సంతానంగా ఢిల్లీలో 1982లో జన్మించిన రోష్ని.. వసంత్ వ్యాలీ పాఠశాలలో చదువుకున్నారు. నార్త్‌వెస్టర్న్ యూనివర్సిటీ నుంచి కమ్యూనికేషన్స్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ, కెలాగ్స్ యూనివర్సిటీ నుంచి ఎంబిఏ చేశారు. చదువు పూర్తి కాగానే బ్రిటన్‌లో న్యూస్ ప్రొడ్యూసర్‌గా కెరీర్ ప్రారంభించారు. 27 సంవత్సరాలు వచ్చేసరికి తండ్రి ప్రారంభించిన వ్యాపారంలో భాగస్వాములయ్యారు. హెచ్‌సీఎల్‌లో చేరిన సంవత్సరానికే ఆ కంపెనీకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా మాత్రమే కాకుండా కంపెనీ సీఈఓగా బాధ్యతలు కూడా చేపట్టారు.ఇదీ చదవండి: నెలకు ఒకరోజు సెలవు.. దిగ్గజ కంపెనీ కీలక నిర్ణయం
ఫ్యామిలీ

లీడర్షిప్ కావాలి
నేను ఐపీఎస్ జాయిన్ అయినప్పుడు అంటే 1995లో పోలీస్ డిపార్ట్మెంట్లో రెండు లేదా మూడు శాతం మాత్రమే మహిళలు ఉండేవారు. ఐపీఎస్ క్యాడర్లో ఇంకా తక్కువ.. ఎంతంటే నేను ఏ పోస్ట్‌కి వెళ్లినా ఆ పోస్ట్‌లో ఫస్ట్ ఉమన్‌ని నేనే అయ్యేంత! కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. మా బ్యాచ్‌లో పదమూడు మంది మహిళలం ఉంటే ఇప్పుడు 60 మంది వరకూ ఉంటున్నారు. ఇంతకుముందు పోలీసులు అంటే కేవలం పురుషులే అన్న ఇమేజ్ ఉండేది. ఇప్పుడది మారిపోయింది. డిపార్ట్మెంట్లోని అన్ని స్థాయుల్లోకి మహిళలు వస్తున్నారు. తెలంగాణలో 33 శాతం రిజర్వేషన్ కల్పించింది ప్రభుత్వం. దాంతో మహిళల సంఖ్య పెరుగుతోంది. అందుకే ఇప్పుడు పోలీస్ అంటే మహిళలు కూడా అనే ఇమేజ్ స్థిరపడిపోయింది. పోలీస్ స్టేషన్స్‌లో సౌకర్యాలూ విమెన్ ఫ్రెండ్లీగా మారుతున్నాయి. తెలంగాణనే తీసుకుంటే.. ప్రతి స్టేషన్లో మహిళల కోసం సపరేట్ వాష్ రూమ్స్‌ని కట్టించాం. కొన్ని జిల్లాల్లో అయితే బేబీ కేర్ సెంటర్స్‌ని కూడా ఏర్పాటు చేశాం. ఈ మధ్య సైబరాబాద్ కమిషనరేట్‌లో కూడా బేబీ కేర్ సెంటర్‌ను పెట్టారు. ఇదివరకు బందోబస్త్‌లు, గణేశ్ నిమజ్జనానికి మహిళా పోలీస్‌లు డ్యూటీకి వెళితే వాష్‌రూమ్స్ ఉండక చాలా అవస్థపడాల్సి వచ్చేది. ఇప్పుడు మొబైల్ వాష్‌రూమ్స్ సౌకర్యం వచ్చింది. ఎక్కడ బందోబస్త్ ఉంటే అక్కడికి ఈ మొబైల్ వాష్‌రూమ్‌ని పంపిస్తున్నారు. ఇలా మహిళలు చక్కగా పనిచేసుకోవడానికి అనుగుణమైన వసతులు ఏర్పాటవుతున్నాయంటే మహిళల పనికి గుర్తింపు, డిమాండ్ వచ్చినట్టే కదా!దృష్టి పెడతారు.. ఏ రంగంలో అయినా ఎంతమంది మహిళలు వస్తే అంత వేగంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది. మొత్తం వ్యవస్థలోనే విమెన్ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ ఏర్పడుతుంది. అంతేకాదు లీడర్షిప్ రోల్స్‌ని పొందే అవకాశం వస్తుంది. లీడర్షిప్ రోల్స్‌లో మహిళలు ఉంటే స్త్రీల అవసరాల మీద దృష్టిపెడతారు. సమస్యలు త్వరగా పరిష్కారమవుతాయి.చెప్పుకోదగ్గదే కానీ.. మహిళా సాధికారత సాధించాలంటే ముందు స్త్రీల హక్కుల గురించి స్త్రీలతోపాటు సమాజమూ తెలుసుకోవాలి. స్త్రీ సెకండ్ సిటిజన్ కాదు.. తోటి ΄ûరురాలే అన్న స్పృహ రావాలి. అది ఇంటినుంచే మొదలవ్వాలి. నన్ను మా బ్రదర్‌తో సమానంగా చదివిస్తేనే కదా నా ఐపీఎస్ కల సాధ్యమైంది. అలా కొడుకైనా కూతురైనా ఇద్దరూ సమానమే.. హక్కులు, అవకాశాలు ఇద్దరికీ సమానమే అనే భావన పేరెంటింగ్‌లో కనిపించాలి. తర్వాత స్కూల్లో టీచింగ్‌లోనూ భాగం కావాలి. అప్పుడే అది సమాజంలో రిఫ్లెక్ట్ అవుతుంది. స్త్రీల పట్ల గౌరవం పెరుగుతుంది. ఆడపిల్లలు చదువును నిర్లక్ష్యం చేయకూడదు. ఆర్థికస్వాతంత్య్రానికి అదే మెట్టు! కాబట్టి అమ్మాయిలు అందరూ చదువు మీద దృష్టిపెట్టాలి. ఎలాంటి టాస్క్లకైనా సిద్ధమే! ఏ రంగంలో అయినా మహిళలు శారీరక శ్రమలో కానీ.. బుద్ధికుశలతలో కానీ పురుషులతో సమంగా ఉంటున్నారు. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా! మహిళలు కదా అని తేలికపాటి టాస్క్‌లు ఇవ్వడం ఉండదు. కీలకమైన బాధ్యతలనూ అప్పగిస్తారు. నన్నే తీసుకుంటే నేను మావోయిస్ట్ ఏరియాల్లో కూడా పని చేశాను. కాబట్టి మహిళలకు సమాన అవకాశాలే ఉన్నాయి.. ఉంటాయి.. ఉండాలి కూడా!– సరస్వతి రమ

శ్రమతోనే సక్సెస్
పూసర్ల వెంకట సింధు... ఒలింపిక్స్‌లో పతకాలు సాధించింది.కామన్వెల్త్... వరల్డ్ చాంపియన్‌షిప్‌లలో స్వర్ణాలు సొంతం చేసుకుంది.ప్రపంచవేదికల మీద దేశ పతాకాన్ని సగర్వంగా ఎగురవేసింది.భారత మాత మెడలో పతకాల హారం వేసి బంగారు సింధు అయింది.ఈ ఏడాది మహిళాదినోత్సవాన్ని శ్రీమతి సింధుగా వేడుక చేసుకుంటోంది.సాధికారత దిశగా పయనిస్తున్న మహిళలకు అభినందనలు చెప్పింది.ఈ తరంలో మహిళలు బిజినెస్, స్పోర్ట్స్‌తోపాటు అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారు. కేవలం తమకు తాము నిలదొక్కుకోవడంతో సరిపెట్టడం లేదు, ఆ రంగంలో నంబర్ వన్‌గా నిలవడానికి శ్రమిస్తున్నారు. నంబర్ వన్ లక్ష్యాన్ని సాధిస్తున్నారు కూడా. ఈ స్ఫూర్తిని, ఇదే పంథాను కొనసాగించాలని అభిలషిస్తున్నాను. సక్సెస్‌కు దారి! ప్రతి ఒక్కరూ తమ కోసం తాము కొన్ని లక్ష్యాలను నిర్దేశించుకోవాలి. వాటిని చేరుకోవడానికి తగినంత శ్రమించాలి. సక్సెస్ అనే లక్ష్యాన్ని చేరడానికి ఉన్న ఏకైక దారి హార్డ్‌వర్క్. హార్డ్‌వర్క్‌తో మాత్రమే విజయానికి చేరువ కాగలుగుతాం. అది కూడా ఒక నెల శ్రమతోనో ఏడాది శ్రమతోనో శిఖరాన్ని చేరాలని ఆశించకూడదు. కొన్నేళ్ల కఠోరశ్రమ, అంకితభావంతో శ్రమించినప్పుడే సక్సెస్ మనదవుతుంది. అయితే కొందరికి సక్సెస్ కొంత త్వరగా రావచ్చు, మరికొందరికి ఆలస్యం కావచ్చు. మన మీద మనం నమ్మకాన్ని కోల్పోకూడదు. ఆశను వదులుకోకూడదు, నిరాశపడకూడదు. మనం మనవంతుగా శ్రమిస్తూ ఉండాలి. సక్సెస్ వచ్చినప్పటి నుంచి మరింత బాధ్యతగా పని చేయాలి. సక్సెస్ అనే శిఖరాన్ని చేరాం అని రిలాక్స్ కాకూడదు. నంబర్ వన్‌కి చేరడానికి నేనలాగే కష్టపడ్డాను, కష్టపడుతూనే ఉంటాను కూడా. అమ్మానాన్న... భర్త! ఇప్పటి వరకు నన్ను, నా ఆర్థిక వ్యవహారాలను అమ్మానాన్న చూసుకునేవారు. టోర్నమెంట్‌కి తోడుగా నాన్న వచ్చేవారు. ఇప్పుడు మా వారు వస్తున్నారు. నా గురించి అన్నీ వాళ్లే చూసుకుంటారు. నా ఫోకస్ అంతా ఆట మీదనే కేంద్రీకరించడానికి తగిన వెసులుబాటునిస్తున్నారు. పేరెంట్స్ నడిపించాలి! దేశానికి కొత్తతరం క్రీడాకారులు తయారు కావాలి. క్రీడాకారులను తయారు చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. పిల్లలకు స్పోర్ట్స్ మీద ఆసక్తి ఉన్నప్పటికీ తల్లిదండ్రుల సహకారం లేకపోతే క్రీడాకారులు తయారుకారు. పిల్లలను క్రీడల దిశగా నడిపించడం పేరెంట్స్ చేతిలోనే ఉంటుంది. ఆటలు, చదువు రెండూ కీలకమే. రెండింటినీ ఎలా బాలెన్స్ చేసుకోవాలో నేర్పించగలిగింది కూడా పేరెంట్సేనని నా అభి్రపాయం. పేరెంట్స్‌కి కోరిక ఉన్నప్పటికీ పిల్లలకు ఆడాలనే ఆసక్తి లేకపోతే ఆ పిల్లలు దీర్ఘకాలం కొనసాగడం కష్టం. అలాగే ఆటల పట్ల ఆసక్తి ఉన్న పిల్లలకు పేరెంట్స్ సహకారం లేకపోతే తొలి అడుగు కూడా పడదు. అందుకే తల్లిదండ్రుల పాత్ర చాలా ముఖ్యం.సింధుగానే గుర్తించాలి! సమాజం నన్ను సింధుగానే గుర్తించాలి. ‘పీవీ సింధు’ అనగానే చేతిలో రాకెట్‌తో నా రూపం కళ్ల ముందు మెదులుతుంది. అలా నాకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాను. దేశం కోసం ఆడగలిగే స్థాయికి చేరాను. దేశం కోసం ఆడాను. దేశానికి ఎన్నో పతకాలను సాధించాను. దేశానికి గౌరవాన్ని పెంచడంలో నా శ్రమ కూడా ఉందని సంతోషపడుతున్నాను. ఈ గుర్తింపు ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి

సమతుల్యత సాధించాలి
‘‘ఏ రంగంలోనైనా నాయకత్వం వహించడానికి దూరదృష్టి, కొత్త ఆవిష్కరణలపై అవిశ్రాంత కృషి అవసరం. సాంకేతికతంగా వస్తున్న మార్పులను అమలు చేయడంలో, టీమ్ వర్క్‌ను బలోపేతం చేయడంలో ముందుండాలి. బలమైన నాయకులుగా ఉండాలంటే పనిలో నైపుణ్యాలతో పాటు వైవిధ్యాన్నీ పెంపొందించాలి. సక్సెస్ ఉద్దేశం ఒక్కరమే ఎదగడం కాదు, అర్థవంతమైన మార్పుతో మనతోపాటు ఉన్నవారితో కలిసి నడవడం.సమతుల్యం చేయడంలోనే సవాళ్లువైద్య రంగంలో మహిళలు అతిపెద్ద కీలక పాత్ర పోషిస్తున్నారు. అయినప్పటికీ నిత్యం సవాళ్లను ఎదుర్కొంటూనే ఉన్నారు. వృత్తిపరంగా ఎదగడంలోనూ, వ్యక్తిగత బాధ్యతలతో బాలెన్స్ చేయడం అనేది అతిపెద్ద అడ్డంకిగా మారింది. కెరీర్– ఇల్లు రెండింటినీ సమర్థంగా నిర్వహించడానికి సమాజం ఇప్పటికీ మహిళలపై చెప్పలేనన్ని అంచనాలను ఉంచుతోంది. రెండుచోట్లా మహిళలు అభివృద్ధి చెందడానికి వీలు కల్పించే వాతావరణం ఉండాలి. అలా లేకపోవడంతో ‘ఆమె సమర్ధత’కు ప్రతిబంధకాలు ఏర్పడుతున్నాయి. మన సమాజంలో మరొక సవాల్ లోతుగా పాతుకుపోయిన లింగ వివక్ష. నాయకత్వ అవకాశాలను పరిమితం చేసేది ఇదే.నాయకత్వం జెండర్‌తో కాదు సామర్థ్యం వల్లే సాధ్యం అని నిరూపించడానికి మహిళ మరింత కష్టపడి పనిచేయాలి. మహిళల అభివృద్ధి నుండి మహిళల నేతృత్వంలోని అభివృద్ధికి మరింత చురుగ్గా వ్యవహరించాలి. డెసిషన్ మేకర్స్ జాబితాలో ఎక్కువ మంది మహిళలకు స్థానం ఉండేలా చూసుకోవాలి. మిగతావాటికన్నా వైద్యరంగం భిన్నమైనది, లోతైనది కూడా. ఎందుకంటే ఇక్కడప్రాణాలను కాపాడటం, ఆరోగ్య ఫలితాలలో మంచి మార్పులు తీసుకురావడంపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. టెక్నాలజీని అందిపుచ్చుకోవడం, సరిహద్దులను దాటి ఆలోచించడం, యథాతథ స్థితి కొనసాగేలా టీమ్స్‌ను ప్రోత్సహించడం... వంటివి వేగంగా అభివృద్ధి చెందుతున్న పరిశ్రమలో మనల్ని ముందు ఉంచుతుంది.నెట్‌వర్క్‌ను నిర్మించుకోవాలిసాధారణంగా మహిళలు రిస్క్ తీసుకొని, తమ స్థానాన్ని సాధించేందుకు వెనకాడతారు. మీ ముందు చూపును, అంతర్దృష్టిని నమ్మండి. బలమైన మద్దతునిచ్చే నెట్‌వర్క్‌ను నిర్మించుకోండి. విజయం ఎప్పుడూ ఒంటరి ప్రయాణం కాదు. మిమ్మల్ని సవాలు చేసేవారు, మార్గదర్శకులు, సహచరులు, టీమ్స్‌తో ముందుకు కదలాలి. నేర్చుకోవడాన్ని ఎప్పుడూ ఆపవద్దు. సవాళ్లను సోపానక్రమాలుగా స్వీకరించాలి. ప్రతి అడ్డంకిని నూతనంగా ఆవిష్కరించడానికి, అభివృద్ధి చెందడానికి ఒక అవకాశం అనుకోవాలి. మహిళా వ్యవస్థాపకులు పరిశ్రమలను రూపొందిస్తున్నారు, ఇది మన సమయం అని గుర్తించండి’’ అంటూ మహిళాభ్యున్నతికి మార్గదర్శకం చేస్తున్నారు డాక్టర్ సంగీతారెడ్డి. మార్పులు తప్పనిసరిరోల్ మోడల్స్ మార్గదర్శకత్వంతో పాటు అవకాశాలను అందిపుచ్చుకుంటూ ముందుకు వెళ్లాలి. వ్యవస్థాగత అడ్డంకులను పరిష్కరించాలి. పనిప్రదేశంలో సమాన వేతనం, నిష్పాక్షికమైన కెరీర్ పురోగతికి మద్దతు ఇవ్వాలి. ముఖ్యంగా, మహిళల అభివృద్ధి నుండి మహిళల నేతృత్వంలోని అభివృద్ధికి మారాలి. మహిళలు ఆరోగ్య సంరక్షణలో పాల్గొనేవారు మాత్రమే కాదు, భవిష్యత్తుకు చురుకైన రూపశిల్పులుగా మారాలి.– నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి

Womens Day 2025: సృష్టికి మూలం ఆమె..! కనీసం ఈ రోజున..
అంతర్జాతీయ మహిళా దినోత్సవం మూలాలు 20వ శతాబ్దం ప్రారంభంలో గుర్తించారు. 1900 సంవత్సరం ప్రారంభ కాలంలో కార్మిక ఉద్యమాలు, సోషలిస్ట్ క్రియాశీలత ముఖ్యమైన పాత్ర పోషించాయి . అమెరికాలో సోషలిస్ట్ పార్టీ ఫిబ్రవరి 28, 1909న జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించింది. 1910లో కాపెన్హాగన్లో జరిగిన అంతర్జాతీయ సోషలిస్ట్ మహిళల సమావేశంలో " క్లారా జెట్కిన్ " అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఆలోచనను ప్రతిపాదించారు. 1911లో తొలి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మార్చి 19న అనేక యూరోపియన్ దేశాలలో నిర్వహించారు. 1917 సంవత్సరం ఫిబ్రవరి 23 న, రష్యా లో మహిళలు " ఆహారం, శాంతి" ( బ్రెడ్ అండ్ పీస్ ) కోసం సమ్మెకు వెళ్ళారు. రష్యన్ విప్లవానికి దోహదపడిన ఈ సంఘటన అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా మారింది. అలా ఏటా మార్చి8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకోవడం ప్రారంభించారు.భారతదేశంలో మహిళా సామాజిక సంస్కర్తలు సావిత్రిబాయి ఫూలే , దుర్గాబాయి దేశ్ ముఖ్ లు సామాజిక అన్యాయాలకు వ్యతిరేకంగా చురుకుగా ప్రచారం చేసారు. మహిళల విద్య , బాల్య వివాహలు నిరోధించడం, వితంతువులకు ఆశ్రయం, అట్టడుగు వర్గాలను శక్తిమంతం చేయడానికి పనిచేసారు.ఐక్యరాజ్యసమితి 1975 నుంచి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకోవడం ప్రారంభించింది. దీన్ని ప్రపంచ దేశాలన్నీ గుర్తించేలా ప్రోత్సహించింది. ఈ దినోత్సవం మహిళలు తమ లక్ష్యాలను సాధించడానికి, వారి హక్కుల కోసం పోరాడటానికి సమాజంలో నాయకత్వ పాత్రలను చేపట్టడానికి ప్రేరణ, ప్రోత్సాహాన్ని అందించింది.దేశాల వారిగా మహిళల శాతం..ఇవాళ ప్రపంచ జనాభా 810 కోట్లు . ప్రపంచ జనాభా లో 50.30% పురుషులు , 49. 70% మహిళలు. హాంకాంగ్ లో 54. 92 % , లాట్వియా లో 54% , రష్యా లో 54.3%, ఉక్రెయిన్ లో 54% , లిథువేనియా లో 54% మంది చొప్పున ఆయా దేశ జనాభాలో మహిళలు ఉన్నారు.ఖతార్ లో 28.48% , యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో 30.9% , ఒమన్ లో 35.8% , బహ్రెయిన్ లో 38% , సౌదీ అరేబియా లో 43.2% మంది మహిళా జనాభా ఉంది. ప్రపంచవ్యాప్తంగా మహిళలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతున్నప్పటికీ, ఐస్లాండ్, నార్వే, స్వీడన్ వంటి దేశాలు లింగ సమానత్వానికి ప్రసిద్ధి చెందాయి. ఈ దేశాలలో మహిళకు సమాన అవకాశాలు..ఇక్కడ మహిళలకు ఉద్యోగ అవకాశాలు, వేతన సమానత్వం ఎక్కువగా ఉంటాయి. కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి దేశాలు కూడా మహిళలకు అనుకూలమైన కార్యాలయ వాతావరణాన్ని, ప్రభుత్వ మద్దతును అందిస్తున్నాయి. భారతదేశంలో మహిళలకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతున్నప్పటికీ, లింగ వివక్ష , వేతన అసమానతలు ఇంకా ఎక్కువగా ఉన్నాయి. ఐటీ, బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, ఆరోగ్య సంరక్షణ, విద్య, స్వయం ఉపాధి వంటి రంగాలలో మహిళలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి. ఈ దినోత్సవం ప్రాముఖ్యత..భారతదేశంలో "అంతర్జాతీయ మహిళా దినోత్సవం" అనేక ముఖ్యమైన పాత్రలను పోషిస్తున్నది. అవేంటంటే..మహిళా సాధికారతను ప్రోత్సహించడానికి, వారి హక్కులు సమానత్వం గురించి అవగాహన పెంచడానికి ఒక వేదికగా పనిచేస్తుంది. సైన్స్, రాజకీయాలు, వ్యాపారం, క్రీడలు, కళలు వంటి వివిధ రంగాలలో మహిళల విజయాలను గుర్తించడానికి ఉపయోగపడుతోంది.లింగ సమానత్వం , మహిళలపై హింసను అంతం చేయడం, సమాజంలో వారి సమాన భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం వంటి సమస్యలపై దృష్టి సారించడానికి ఇది ఒక అవకాశం. నాయకత్వ పాత్ర పై , విద్య, వాణిజ్య , ఉద్యోగ , ఆరోగ్య, ఉపాధి , ఆర్థిక స్థిరత్వంలో మహిళలను ప్రేరేపించడం, మహిళా సాధికారతను ప్రోత్సహించడం మహిళలు ఎదుర్కొంటున్న గృహ హింస, లైంగిక వేధింపులు మహిళలకు సరిపోని ఆరోగ్య సంరక్షణ , మెరుగైన పని వాతావరణం వంటి సవాళ్ల గురించి ప్రభుత్వం, దృష్టికి తీసుకురావడం ఈ మహిళా దినోత్సవం ప్రధాన ఉద్దేశ్యం.బీజింగ్ డిక్లరేషన్ ప్రకారం ఐక్యరాజ్య సమితి ఈ మహిళా దినోత్సవం 2025ను మహిళలు-బాలికలకు అందరికీ హక్కులు, సమానత్వం, సాధికారత వంటి అంశాల మార్పుకు ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం శక్తిమంతమైన వేదికగా నిలవాలి ఆకాంక్షిస్తుంది. ఇక ఈ ఏడాది మహిళా దినోత్సవాన్ని .. 'Accelerate Action' అనే థీమ్‌తో నిర్వహిస్తున్నారు. మహిళల పురోగతికి ఉపయోగపడే వ్యూహాలు, వనరులు, చొరవలను గుర్తించి.. వాటిని విస్తృతంగా, వేగంగా అమలు చేయాలనే ఉద్దేశాన్ని ఇది చెబుతోంది. .చివరగా ఈ దినోత్సవం రోజున ఉభయ తెలుగు రాష్ట్రాలలో ప్రభుత్వం ఆర్థిక స్వావలంబన కోసం వివిధ పథకాలను అందిస్తోంది. ఇక కార్పొరేట్లు, స్వచ్ఛంద సంస్థలు, యాజమాన్యాలు మహిళా దినోత్సవం సందర్భంగా అనేక చర్చలు , గోస్టులు, ఆటలు, పాటలు, ఆరోగ్య శిబిరాలు, ప్రతిభ చూపిన మహిళలుకు సన్మాన కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నాయి. సృష్టికి మూలం అయిన స్త్రీమూర్తులందరికీ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు. వారికి జేజేలు. వెంకట సూర్య వేణుగోపాల్ నాగుమళ్ల, విశ్రాంత ఆర్ టీసి డిపో మేనేజర్, (చదవండి: మేము సైతం..! ఆటల్లో సత్తా చాటుతున్న నారీమమణులు)
ఫొటోలు
National View all

మనవడి చితిలోనే తాత మరణ శాసనం..
భోపాల్: ఇదొక కల్లోలం..

మీకు మీరే ట్రోల్ చేసుకుంటున్నారు.. బాగుందయ్యా రాహుల్!
అహ్మదాబాద్: కొందరు కాంగ్రెస్ నేతలు..

‘అది ఫ్రిజ్, వాషింగ్ మెషీన్ కాదు.. యుద్ధ విమానం’
న్యూఢిల్లీ: ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్

Women's Day : మహిళలకు ప్రతీ నెల రూ. 2,500!
ఢిల్లీ: మహిళా దినోత్సవం రోజున బీజేపీ నేతృత్వంలోని ఢిల్లీ ప్ర

ఛావా ఎఫెక్ట్.. గుప్తనిధుల కోసం జనం ఉరుకులు పరుగులు
విక్కీ కౌశల్ లీడ్ రోల్లో తెరకెక్కిన ఛావా(Chhaava) చిత్రం బ్లాక్‌బస్టర్ టాక్‌తో..
International View all

ఉక్రెయిన్‌పై రష్యా మరోసారి భీకర దాడి.. 14 మంది మృతి
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగింపు దిశగా ప్రయత్నాలు జరుగుతోన్న క్రమంలో కూడా రష్యా భీకర దాడులు కొనసాగుతూనే ఉంది.

దక్షిణ కొరియా: జైలు నుంచి యోల్ విడుదల
సియోల్: మార్షల్ లా విధించిన కేసులో అభిశంసనకు గురై పదవి కోల

భారత్‌తో చాలా కష్టం.. వదిలిపెట్టే ప్రసక్తే లేదు: ట్రంప్ హెచ్చరిక
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భా

ట్రంప్ కేబినెట్ మీటింగ్‌లో రచ్చ.. రచ్చ!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షతన

ఈ ఏడాదితో ఉత్తరాల బట్వాడా బంద్
కోపెన్‌హాగెన్: డెన్మార్క్‌లో ఉత్తరాల బట్వాడాను ఈ ఏడాది చివర
NRI View all

లండన్‌లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు
బిందువు బిందువు కలిస్తేనే సింధువు అనే విధంగా యూకే లో నివసిస్తున్న తెలుగు మహిళలు అందరూ “తెలుగు లేడీస్ యుకె” అనే ఫేస్బుక్

న్యూజెర్సీలో నాట్స్ ఇమ్మిగ్రేషన్ సెమినార్
న్యూ జెర్సీ: అమెరికాలో తెలుగు వారి కోసం అనేక కార్యక్రమాలు చ

అమెరికాలో కాల్పులు.. కేశంపేట యువకుడి మృతి
కేశంపేట: ఉన్నత ఆశయాలతో అమెరికా వెళ్లిన ఓ విద్యార్థి..

గిఫ్ట్ సిటీ ఫండ్స్‌లో భారీగా ఎన్నారైల పెట్టుబడులు
ముంబై: గిఫ్ట్ సిటీలోని ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్‌లో ప్రవాస భారతీయులు దాదాపు 7 బిలియన్ డాలర్ల పెట్టుబడులు (Investments) ప

మిసెస్ ఇండియా పోటీలకు తెలుగు ఎన్ఆర్ఐ
సాక్షి, సిటీబ్యూరో: లండన్ వేదికగా ప్రముఖ బహుళ జాతి సంస్థలో
క్రైమ్

బస్సులోనే శాశ్వత నిద్రలోకి.!
కరీంనగర్, సాక్షి: చావు ఎవరికి చెప్పి రాదు!. అప్పటిదాకా ఉన్న ఆనంద క్షణాలను.. హఠాన్మరణాలు హరించి వేస్తున్న ఘటనలు ఈ మధ్యకాలంలో ఎక్కువగా చూస్తున్నవే. అలాంటిదే కరీంనగర్లో చోటు చేసుకుంది. డ్యూటీకి వెళ్లొస్తానంటూ ఇంట్లో చెప్పి బయల్దేరిన ఆ వ్యక్తి.. ప్రయాణంలోనే గుండె ఆగి ఊరిలో విషాదం నింపాడు. జమ్మికుంట(Jammikunta) నుంచి కరీంనగర్ చేరుకున్న బస్సులో శుక్రవారం ఉదయం ఓ వ్యక్తి అచేతనంగా పడి ఉన్న దృశ్యం కండక్టర్ కంట పడింది. నిద్రపోయాడనుకుని లేపే ప్రయత్నం చేశాడు. అయితే ఆ వ్యక్తి శాశ్వత నిద్రలోకి జారుకున్నాడని కాస్త ఆలస్యంగా గుర్తించాడు. వీణవంక(Veenkavanka) మండలం రెడ్డిపల్లికి చెందిన ఓదెలు.. కరీంనగర్ ఐసీఐసీఐ బ్యాంకులో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. ఊరిలో బస్సెక్కి కరీంనగర్ వెళ్తున్న క్రమంలో కన్నుమూశాడు. కరీంనగర్(Karim Nagar) వెళ్లిన తరువాత గుర్తించిన బస్సు కండక్టర్.. పోలీసులకు సమాచారం అందించాడు. గుండెపోటు(Heart Attack)తోనే అతను చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు. ఓదెలు హఠాన్మరణంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

‘నా చావుకు ధనలక్ష్మియే కారణం..’
విశాఖపట్నం: అచ్చియ్యమ్మపేటలో ఒక మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. అప్పు తీసుకున్న ఇంట్లోనే ఆమె శవమై కనిపించడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె ఆత్మహత్యకు పాల్పడ్డారా లేదా హత్యకు గురయ్యారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇది ఆత్మహత్య కాదని హత్యేనని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ టూటౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు.టూటౌన్ సీఐ బి.తిరుమలరావు తెలిపిన వివరాలివి.. అంగడిదిబ్బ ప్రాంతానికి చెందిన బొడ్డు సుగుణ(34), తన భర్త అప్పన్న, ఇద్దరు పిల్లలతో కలిసి జీవిస్తున్నారు. సుగుణ అచ్చియ్యమ్మపేటకు చెందిన ధనలక్ష్మి వద్ద లక్ష రూపాయలు అప్పుగా తీసుకున్నారు. ఆ సమయంలో ధనలక్ష్మి డబ్బులు ఇచ్చినందుకు వీడియో కూడా తీసింది. రూ.లక్షకు వారానికి రూ.20 వేలు అసలు, వడ్డీ చెల్లించేలా ఒప్పందం కుదిరింది. అయితే, సుగుణ సకాలంలో వడ్డీ చెల్లించలేకపోవడంతో, ధనలక్ష్మి, ఆమె కుమారుడు భరత్ గురువారం సుగుణ ఇంటికి వెళ్లి గొడవపడ్డారు. వెంటనే డబ్బులు చెల్లించాలని, లేకపోతే వీడియోను అప్పన్నకు పంపిస్తానని బెదిరించారు. దీంతో మనస్తాపం చెందిన సుగుణ గురువారం సాయంత్రం 4 గంటల సమయంలో రూ.40 వేలు పట్టుకుని ధనలక్ష్మి ఇంటికి బయలుదేరింది. డబ్బులు ఇచ్చేందుకు ఆమె ఇంట్లోకి వెళ్లగా.. ధనలక్ష్మి లేరు. ఇంట్లో ఆమె చిన్న కుమారుడు ఒక్కడే ఉన్నాడు. కాగా.. రాత్రి 7 గంటలకు ఇంటికి తిరిగి వచ్చిన ధనలక్ష్మి.. గదిలో ఫ్యానుకు వేలాడుతున్న సుగుణ మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించింది. వారు ఘటనా స్థలానికి చేరుకుని తలుపులు బద్దల గొట్టి మృతదేహాన్ని కిందకు దించారు. విషయం తెలుసుకున్న సుగుణ భర్త అప్పన్న, తన భార్యను ధనలక్ష్మి కుటుంబ సభ్యులే హత్య చేశారని, ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఆరోపించారు.పోలీసులు కూడా వారితో కుమ్మక్కయ్యారని బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఉదయం అప్పన్న, అతని ఇద్దరు కుమారులు, మృతురాలి బంధువులు టూటౌన్ పోలీస్ స్టేషన్ వద్ద ధర్నాకు దిగారు. తమకు న్యాయం చేయాలని, ధనలక్ష్మి, ఆమె కుటుంబ సభ్యులపై హత్య కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు ధనలక్ష్మిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అప్పన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. సుగుణ చనిపోయే ముందు బయట నుంచి స్టూలు పట్టుకుని ధనలక్ష్మి ఇంట్లోకి వెళ్లినట్లు సీసీ ఫుటేజ్‌లో రికార్డ్ అయి ఉందని పోలీసులు వెల్లడించారు.‘నా చావుకు ధనలక్ష్మియే కారణం..’మరణించే ముందు సుగుణ తన భర్త అప్పన్నకు వాయిస్ మెసేజ్ పంపింది. ‘నా చావుకు ధనలక్ష్మి, ఆమె కుమారుడు భరత్ కారణం. నా కోసం బాధపడవద్దు. నేను అప్పులు మాత్రమే చేశాను. నా వల్ల నువ్వు, పిల్లలు సుఖపడలేరు. ధనలక్ష్మి నన్ను టార్చర్ పెడుతోంది. ఈ టార్చర్ నాతోనే పోవాలి. నా వల్ల మీరు బాధపడకూడదు. పిల్లలను హాస్టల్లో చేర్పించి బాగా చదివించు. నువ్వు నా కోసం బాధపడవద్దు’అని సుగుణ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ వాయిస్ మెసేజ్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ORR Accident: రోడ్డు ప్రమాదంలో తీగల కృష్ణారెడ్డి మనువడు మృతి
హైదరాబాద్: ఓఆర్ఆర్పై గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో(ORR Accident) మూసారంబాగ్ మాజీ కార్పొరేటర్ తీగల సునరితా అజిత్‌రెడ్డి పెద్ద కుమారుడు కనిష్క్ రెడ్డి(19)(Kanishk Reddy) దుర్మరణం పాలయ్యాడు. కనిష్క్ రెడ్డి మేడ్చల్ టెక్ మహీంద్ర యూనివర్సిటీలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. గురువారం రాత్రి అతను జూబ్లీహిల్స్‌లోని స్నేహితుడి ఇంట్లో ఫంక్షన్‌కు హాజరై బెంజ్ కారులో తుక్కుగూడలోని ఇంటికి తిరిగి వెళుతుండగా ఔటర్ రింగ్‌రోడ్డుపై గొల్లపల్లె కలాన్ వద్ద కారు ముందు వెళుతున్న ట్రాలీని ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో కనిష్క్ రెడ్డి తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న శంషాబాద్ పోలీసులు ఘటనా స్ధలానికి చేరుకుని బాధితుడిని చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న కుటుంబ సభ్యులు అతడిని మెరుగైన చికిత్స నిమిత్తం మలక్‌పేట యశోద ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతి చెందాడు. ఉస్మానియా ఆసుపత్రిలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని మూసారంబాగ్ డివిజన్ సలీంనగర్‌లోని స్వగృహానికి తీసుకొచ్చారు. రెండు నిమిషాల్లో ఇంట్లో ఉంటా అన్నాడు.. ఆలస్యమైంది ఎక్కడ ఉన్నావ్ అని ఫోన్ చేయగా.. రెండు నిమిషాల్లో ఇంట్లో ఉంటానని చెప్పాడని, అంతలోనే ఘోరం జరిగిపోయిందని అతడి తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. కనిష్క్ రెడ్డి మృతితో సలీంనగర్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రముఖుల పరామర్శ... కనిష్క్ రెడ్డి మరణ వార్త తెలియడంతో పలువురు ప్రజా ప్రతినిధులు, నాయకులు కనిష్క్ రెడ్డి మృతదేహం వద్ద శ్రద్ధాంజలి ఘటించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అజిత్‌రెడ్డి, సునరితారెడ్డిలను ఓదార్చి ధైర్యం చెప్పారు. మాజీ హోంమంత్రి మహమూద్ అలీ, మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఎమ్మెల్యేలు అహ్మద్ బలాల, దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, పలువురు కార్పొరేటర్లు మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు. శుక్రవారం సాయంత్రం నాగోల్ ఫతుల్లాగూడ మహాప్రస్థానం హిందూ శ్మశాన వాటికలో కనిష్క్ రెడ్డి అంత్యక్రియలు నిర్వహించారు.

ప్రియుడితో కలిసి తల్లి, సోదరి హత్య
అడ్డగుట్ట/జవహర్‌నగర్: వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నారనే కారణంగా ఓ మహిళ తన ప్రియుడితో కలిసి తల్లిని, సోదరిని దారుణంగా హత్య చేసింది. ఆ మృతదేహాన్ని స్వాదీనం చేసుకున్న జవహర్‌నగర్ పోలీసులు.. నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు విచారణ చేస్తున్న క్రమంలో తన అక్కను సైతం హత్య చేసినట్లు ఆమె అంగీకరించడంతో లాలాగూడ రైల్వే క్వార్టర్స్ నుంచి ఆ మృతదేహాన్నీ రికవరీ చేశారు. పరారీలో ఉన్న ప్రియుడి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. అతడు చిక్కితేనే ఈ హత్యలకు సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వస్తాయని అధికారులు చెబుతున్నారు. నార్త్ లాలాగూడ ప్రాంతానికి చెందిన వడుగుల నాగయ్య, సుశీల (60)కు జ్ఞానేశ్వరి (45), లక్ష్మి (40), ఉమామహేశ్వరితో పాటు శివకైలాష్ సంతానం. ముగ్గురు కుమార్తెలూ అవివాహితులే. వివాహితుడైన శివ ప్రస్తుతం అమెరికాలో ఉద్యోగం చేస్తున్నారు. అతడి భార్య స్రవంతి అత్తింట్లోనే ఉంటున్నారు. వివాహేతర సంబంధంపై నిత్యం గొడవలు.. సుశీల పెద్ద కుమార్తె జ్ఞానేశ్వరికి మానసిక సమస్యలు ఉన్నాయి. చిన్న కుమార్తె ఉమామహేశ్వరి లాల్ బజార్‌లోని ఓ కాల్ సెంటర్లో పని చేస్తున్నారు. రైల్వేలో పని చేసిన సుశీల భర్త నాగయ్య కొన్నేళ్ల క్రితం అనారోగ్యంతో చనిపోయారు. దీంతో కారుణ్య నియామకం కింద ఆ ఉద్యోగం వారి రెండో కుమార్తె లక్ష్మికి వచ్చింది. 2018 నుంచి ఈ కుటుంబం లాలాగూడలోని రైల్వే క్వార్టర్స్‌లోనే ఉంది. ఆ తర్వాత జవహర్‌నగర్ పోలీసుస్టేషన్ పరిధిలోని కౌకూర్ భరత్‌నగర్‌లో ఇల్లు కట్టుకోవడంతో సుశీల, ఉమామహేశ్వరి, స్రవంతి అక్కడికి మారారు. లక్ష్మి లాలాగూడలోని రైల్వే వర్క్‌షాప్‌లో ఉద్యోగం చేస్తుండడంతో ఆమెతో పాటు అక్క జ్ఞానేశ్వరితో కలిసి ఉంటోంది. సైనిక్‌పురి ప్రాంతానికి చెందిన తాపీమేస్తీ బిల్డర్ అరవింద్ కుమార్‌తో (45) ఈ కుటుంబానికి 2010 నుంచి పరిచయం ఉంది. భరత్‌నగర్‌లో ఇల్లు కూడా అతడే కట్టడంతో లక్ష్మితో పరిచయం మరింత పెరిగింది. ఈ క్రమంలో వీరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. నిత్యం వీరిద్దరూ కలుస్తుండటంతో విషయం లక్ష్మి కుటుంబ సభ్యులకు తెలిసింది. దీని పై పలుమార్లు ఇంట్లో గొడవలు కూడా జరిగాయి. సుశీల మెడకు చీరతో ఉరి బిగించి.. గురువారం ఉదయం 9.30 గంటలకు ఉమా మహేశ్వరి, స్రవంతి తన ఉద్యోగాల నిమిత్తం బయటకు వెళ్లిపోగా సుశీల ఒక్కరే ఇంట్లో ఉన్నారు. రాత్రి 7.17 గంటలకు ఆ ఇంట్లో నుంచి శబ్ధాలు వస్తుండటం గమనించిన పక్కింట్లో ఉండే వెంకటేష్ విషయాన్ని ఫోన్ ద్వారా ఉమా మహేశ్వరికి తెలిపారు. ఆమె తన తల్లి సుశీలకు ఫోన్ చేయగా స్పందన లేదు. దీంతో మళ్లీ వెంకటేష్ కు ఫోన్ చేసిన ఆమె ఇంట్లోకి వెళ్లి చూడాల్సిందిగా కోరారు. ఆయన సమీపంలో ఉండే సారంగపాణితో కలిసి సుశీల ఇంటి వద్దకు వెళ్లారు. బెడ్రూంలో విగతజీవిగా పడి ఉన్న సుశీలను చూసి ఉమామహేశ్వరికి సమాచారం ఇచ్చారు. అదే సమయంలో అరవింద్ ఆమె ఇంటి మొదటి అంతస్తు నుంచి పక్కింటి పైకి దూకి పారిపోవడాన్నీ గమనించారు. 8 గంటల ప్రాంతంలో ఇంటికి తిరిగి వచ్చిన ఉమామహేశ్వరి తన తల్లి నోట్లో వ్రస్తాలు కుక్కి, చీరతో మెడకు ఉరి బిగించి చంపినట్లు గుర్తించింది. అరవింద్ కుమార్ తన తల్లిని చంపాడని, ఆమె ఒంటిపై ఉన్న మూడున్నర తులాల బంగారం దోచుకుపోయాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. తరచూ తమ ఇంటికి వచ్చే అరవింద్ బుధవారం సాయంత్రం కూడా వచి్చవెళ్లినట్లు పేర్కొంది. అక్క జ్ఞానేశ్వరిని కూడా హతమార్చినట్లు.. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న జవహర్‌నగర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సుశీల మృతదేహాన్ని పోస్టుమార్టం పరీక్షల నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. దర్యాప్తు నేపథ్యంలో పోలీసులు లక్ష్మి, అరవింద్ మధ్య ఉన్న వివాహేతర సంబం«ధాన్ని గుర్తించారు. సుశీల హత్యలో లక్ష్మి పాత్ర ఉన్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. విచారణ నేపథ్యంలో తాను అరవింద్‌తో కలిసి అక్క జ్ఞానేశ్వరి చంపామని ఆమె బయటపెట్టింది. బుధవారమే ఆమెను చంపి, మృతదేహాన్ని మూటకట్టి సమీపంలో రైల్వే క్వార్టర్స్‌లో ఉన్న పాడుబడిన బావిలో పడేసినట్లు అంగీకరించింది. దీంతో లక్ష్మిని తీసుకుని లాలాగూడ వచ్చిన జవహర్‌నగర్ పోలీసుల జ్ఞానేశ్వరి మృతదేహాన్నీ రికవరీ చేశారు. కుళ్లిన స్థితిలో ఉన్న ఈ మృతదేహాన్ని సైతం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ రెండు హత్యలు ఒకేసారి, ఒకే ప్రాంతంలో చేశారా? లేక వేర్వేరుగా చేశారా? అనే దానిపై లక్ష్మి నోరు విప్పట్లేదు. పరారీలో ఉన్న అరవింద్ కోసం గాలిస్తున్న అధికారులు అతడు చిక్కితే పూర్తి వివరాలు తెలుస్తాయని చెబుతున్నారు.