Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Ysrcp Chief Ys Jagan Meeting With Party Mlas Mlcs Updates1
ప్రజల పక్షాన పోరాడితే గెలుపు మనదే: వైఎస్‌ జగన్‌

సాక్షి,తాడేపల్లి: క్షేత్రస్థాయిలో ప్రభుత్వం మీద వ్యతిరేకత తీవ్రంగా ఉందని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ అన్నారు. అసెంబ్లీ నుంచి వాకౌట్‌ చేసి బయటికి వచ్చిన తర్వాత సోమవారం(ఫిబ్రవరి24) తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో వైఎస్‌ జగన్‌ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ‘మనం యుద్ధ రంగంలో ఉన్నాం, విజయం దిశగా అడుగులు వేయాలి. ప్రజా సమస్యల విషయంలో రాజీలేని పోరాటం చేయాలి. నిజాయితీ, చిత్తశుద్ధితో ప్రజల తరఫున పోరాటం చేయాలి.ప్రజలకు తోడుగా, ప్రజల్లో ఉంటే గెలుపు సాధించినట్టే. అందుకనే ప్రజాసమస్యలపై పోరాటంలో వెనుకడుగు వేయొద్దు. ఈ ప్రభుత్వాన్ని చూసి భయపడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరికీ నేను భరోసా ఇస్తున్నాను, అండగా ఉంటా.ప్రతిపక్షంలో మన సమర్థతను నిరూపించుకోవడానికి ఇదొక అవకాశం. పార్టీకోసం, ప్రజలకోసం గట్టిగా పనిచేస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది. కళ్లుమూసుకుని, తెరిచేలోగా ఏడాది గడిచిపోతోంది. జమిలి ఎన్నికలు అంటున్నారు. అదే జరిగితే ఎన్నికలు మరింత ముందుగా వస్తాయి. అందుకే ప్రజా సమస్యల విషయంలో ఎక్కడా రాజీ వద్దు. ప్రజల తరఫున గొంతు విప్పే విషయంలో ఎక్కడా తగ్గాల్సిన అవసరం లేదు. రాజకీయాల్లో మనం విలువలు, విశ్వసనీయత పాటిస్తున్నాం కాబట్టే ఎన్నో క్లిష్టపరిస్థితులను అధిగమించాం. ఇంత దూరం ప్రయాణం చేశాం. అసెంబ్లీలో మనం తప్ప వేరే ప్రతిపక్షం లేదు. ప్రతిపక్ష హోదా విషయంలో అధికార పార్టీ వైఖరిని ప్రజలకు తేటతెల్లం చేసేందుకే ఇవాళ అసెంబ్లీకి వెళ్లాం. ప్రతిపక్షహోదా ఇస్తే.. హక్కుగా మనకు సమయం ఇవ్వాల్సి వస్తుంది. సభా నాయకుడితో దాదాపు సమాన స్థాయిలో సమయం ఇవ్వాల్సి ఉంటుంది. అందుకనే ప్రతిపక్ష హోదాను ఇచ్చేందుకు ముందుకు రావడంలేదు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. నేను ఏ అంశంపై మాట్లాడినా నిందలకు, దూషణలకు దూరం. ప్రతి అంశాన్నీ ఆధారాలు, రుజువులతో మాట్లాడతాను. అసెంబ్లీలో ఎలాగూ అవకాశం లేదు కాబట్టి ప్రెస్‌మీట్లలో ప్రజలకు వివరిస్తున్నాను. కౌన్సిల్‌లో మంచి మెజార్టీ ఉంది. దీన్ని వినియోగించుకోవాలి’ అని వైఎస్‌ జగన్‌ సూచించారు.అన్యాయంగా ఇళ్లపట్టాలు రద్దు చేస్తున్నారు: వైఎస్‌ జగన్‌ దృష్టికి తీసుకు వచ్చిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలుమన ప్రభుత్వ హయాంలో 31 లక్షలమందికి ఇళ్లపట్టాలు ఇచ్చామని వైఎస్‌ జగన్‌ అన్నారు. ‘పార్టీలు చూడకుండా, పక్షపాతం లేకుండా ఇళ్లపట్టాలు ఇచ్చాం, ఎవరైనా ఇళ్లుకట్టుకోకపోతే ప్రభుత్వం వారికి ఇళ్లు మంజూరుచేసి ఇవ్వాలి. అంతేగాని, పేదలపై కక్ష కట్టి పట్టాలు రద్దుచేయడం ఏంటి? పట్టాలు రద్దు చేస్తే తప్పకుండా కోర్టును ఆశ్రయిస్తాం. ఎవరు ఇళ్లస్థలాలు ఇచ్చారో, ఎవరు కాలనీలు ఏర్పాటు చేశారో ప్రజలకు తెలుసు. విజయవాడలో అంబేద్కర్‌ స్మృతి వనాన్ని మనం నిర్మించాం. కాని పేరు తీసేయాలన్న ఉద్దేశంతో ఏకంగా అంబేద్కర్‌ విగ్రహంమీదే దాడికి దిగారు. ప్రభుత్వం ఆదేశాలతో ఏకంగా అధికారులే దీనికి ఒడిగట్టారు. స్మృతివనం ఎవరు కట్టారో ప్రజలకు తెలియదా?’ అని వైఎస్‌ జగన్‌ ప్రశ్నించారు.

Elon Musk Reply After Get Message From Donald Trump2
మస్క్ గొప్ప పని చేస్తున్నాడు, కానీ..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ప్రపంచ కుబేరుడు 'ఎలాన్ మస్క్' (Elon Musk)ను ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. ఫెడరల్ వర్క్‌ఫోర్స్‌ను పునర్నిర్మించడానికి చేసిన ప్రయత్నాలను కొనియాడుతూ.. మరింత దూకుడుగా వ్యవహరించాలని అన్నారు. దీనికి సంబంధించిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.''ఎలాన్ గొప్ప పని చేస్తున్నాడు, కానీ అతను మరింత దూకుడుగా ఉండటం నేను చూడాలనుకుంటున్నాను. గుర్తుంచుకోండి, మనం కాపాడుకోవాల్సిన దేశం ఉంది, ఇంతకు ముందు కంటే గొప్పగా చేయాలి" అని అన్నారు. దీనికి మస్క్ రిప్లై ఇస్తూ.. ''చేస్తాను మిస్టర్ ప్రెసిడెంట్'' అని అన్నారు.డొనాల్డ్ ట్రంప్.. ఆదేశాల మేరకు ఫెడరల్‌ ఉద్యోగులందరికీ ఒక మెయిల్‌ వస్తుందని, గత వారం వారంతా ఏం పనిచేశారో రిపోర్ట్‌ ఇవ్వాలన్నారు. ఎవరైతే ఈ మెయిల్‌కు స్పందించరో వారు రాజీనామా చేసినట్లుగా భావించాల్సి వస్తుందని ఎలాన్ మస్క్‌ పేర్కొన్నారు.ఇదీ చదవండి: రోజుకు రూ.27 కోట్లు విరాళం ఇచ్చిన వ్యక్తి.. ఈయన గురించి తెలుసా?మస్క్‌ తన ట్వీట్‌లో చెప్పినట్లుగానే ఉద్యోగులకు శనివారం రాత్రి మెయిల్స్‌ అందాయి. ఈ మెయిల్‌లో ఐదు బుల్లెట్‌ పాయింట్లలో ప్రశ్నలు అడిగారు. గత వారం మీరు మీ పనిలో ఏం సాధించారనేది ఆ ప్రశ్నల సారాంశం. ఈ మెయిల్‌కు సమాధానమిచ్చేందుకు ఉద్యోగులకు సోమవారం రాత్రి దాకా సమయమిచ్చారు. అయితే మెయిల్‌కు సమాధానమివ్వని వారిపై ఏం చర్య తీసుకుంటారన్నది ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది.Will do, Mr. President! pic.twitter.com/2VMS2wY7mw— Elon Musk (@elonmusk) February 22, 2025

PM Modi S Jaishankar To Attend Assams Largest Jhumoir Event3
Mega Jhumur: ప్రధాని మోదీ గెస్ట్‌గా మెగా ఝుమైర్

ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో సోమవారం అస్సాం అతిపెద్ద ఝుమైర్‌ నృత్య కార్యక్రమం జరగనుంది. ఇందులో ఎనిమిదివేల మందికి పైగా పాల్గొంటారు. అంతేగాదు ఈ నృత్య ప్రదర్శనను విదేశాంగ మంత్రి జైశంకర్‌ నేతృత్వంలో సుమారు 60 మందికి పైగా విదేశీ దౌత్యవేత్తలు వీక్షించనున్నారు. అలాగే ప్రజలందరూ వీక్షించేలా దాదాపు 800 టీ ఎస్టేట్‌లలో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ఇంతకీ అసలేంటీ నృత్యం..? దాని ప్రాముఖ్యత తదితరాల గురించి తెలుసుకుందాం. అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ ఝుమైర్‌ ప్రాముఖ్యత గురించి పలుమార్లు పునరుద్ఘాటించారు. ఇది అస్సామీ సంస్కృతిలో అంతర్భాగం, టీ తెగ కమ్యూనిటీ భావాలను ప్రతిబింబిస్తోంది. ముఖ్యమంత్రి బిస్వా ఢిల్లీలో రాబోయే ప్రదర్శనల ప్రణాళికలను ప్రకటిస్తూ..అంతర్జాతీయ వేదికపై కూడా ఈ నృత్యం ప్రదర్శించాలనే తన ఆశయాన్ని వ్యక్తం చేశారు. ఇంతలా అస్సాం గిరిజనులతో లోతుగా పాతుకు పోయిన ఝుమైర్‌ నృత్యం అంటే ఏంటంటే.. ఝుమైర్‌ నృత్యం అంటే.. ఝుమోయిర్ అనేది అస్సాంలోని టీ తెగ సంఘం, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఒడిశా వంటి పొరుగు రాష్ట్రాల గిరిజనులు ప్రదర్శించే సంప్రదాయ జానపద నృత్యం. ఇది టీ తోట కార్మికుల రోజువారీ జీవితాలలో లోతుగా పాతుకుపోయింది. తరచుగా పండుగలు, పంటకోత వేడుకలు, సామాజిక సమావేశాల సమయంలో ప్రదర్శిస్తారు. చూడటానికి ముగ్ధమనోహరంగా డప్పుల దరువులకు అనుగుణంగా లయబద్ధమైన కదలికలతో కూడిన ఝుమైర్‌ నృత్యం ఇది. సంప్రదాయ మడోల్‌(డ్రమ్‌) లయబద్ధమైన దరువులు నడుమ టీతోటల శ్రమైక జీవుల కథలను శ్రావ్యమైన జానపద పాటలతో చెబుతారు. ఈ నృత్యాన్ని సమూహాలుగా చేస్తారు. ఒకరి నడుములు ఒకరు పట్టుకుని లయబద్ధమైన చప్పట్లు, డ్రమ్‌ లయలకు అణుగుణంగా పాదాలు కదుపుతారు. ఈ సాంస్కృతిక దృశ్య రూప నృత్యం టీ తోటల కార్మికుల ఐక్యత, సాముహిక స్ఫూర్తిని తెలియజేస్తుంది. అంతటి ప్రాముఖ్యతను సంతరించుకున్న ఈ నృత్యాన్ని ఇందిరా గాంధీ అథ్లెటిక్ స్టేడియంలో ప్రధాన మోదీ సమక్షంలో ప్రదర్శించనున్నారు. అంతేగాదు ఈ ప్రతిష్టాత్మక కళారూపానికి జాతీయ, ప్రపంచ గుర్తింపు తీసుకురావాలనే లక్ష్యంతో ఉంది అస్సాం రాష్ట్రం. అస్సాం గతంలో 2023లో ఇదే వేదికపై సుమారు 12 వేల మందికి పైగా నృత్యకారులతో రికార్డు స్థాయి బిహు నృత్య ప్రదర్శన ఇచ్చి చరిత్ర సృష్టించింది. మళ్లీ ఈసారి కూడా ఆ స్థాయిలో శాశ్వత ముద్రను వేసే దిశగా అగుడులు వేస్తున్నారు అస్సాం ప్రదర్శనకారులు.(చదవండి: నో ఛాన్స్‌ మోడల్‌ కాలేవంటూ తిరస్కారాలు..కానీ అతడే ఇవాళ..)

BJP Telangana President Kishan Reddy writes A letter To CM Revanth4
సీఎం రేవంత్‌కు కిషన్‌రెడ్డి బహిరంగ లేఖ

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(Revanth Reddy)కి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్‌రెడ్డి బహిరంగ లేఖ రాశారు. కాంగ్రెస్ ప్రభుత్వం 14 నెలల పాలనపై కిషన్‌కెడ్డి(Kishan Reddy) లేఖ రాశారు. ‘14 నెలల మీ పాలన అసంతృప్తిగా ఉంది. డీఏలు, జీపీఎఫ్, పెండింగ్ బకాయిలు చెల్లించకుండా ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లను రోడ్డున పడేస్తారా?, రిటైర్‌మెంట్ బెన్ ఫిట్స్ కూడా చెల్లించకుండా మానసిక క్షోభకు గురిచేయడం ఎంత వరకు న్యాయం?, ఉద్యోగులకు రోటీన్ గా చెల్లించాల్సిన బిల్లుల్లో కూడా సీలింగ్ పెట్టడం సిగ్గు చేటు, నిజాయితీగా పనిచేసే ఉద్యోగులకు మీరు ఏ సందేశం ఇస్తున్నట్లు?, కళాశాలల యాజమాన్యాలపట్ల మీ తీరు దుర్మార్గం, ఏళ్ల తరబడి ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు చెల్లించకుండా వేధిస్తున్నారు. కాలేజీల యాజమాన్యాలు బిచ్చమెత్తుకునే దుస్థితి దాపురించింది. ఏప్రిల్, మే నెలలో బకాయిలు చెల్లిస్తామని కాలేజీ యాజమాన్యాలను మళ్లీ మభ్యపెట్టడం ఎంత వరకు కరెక్ట్?, ఎమ్మెల్సీ ఎన్నికల్లో గట్టెక్కేందుకు మళ్లీ మోసపూరిత హామీలకు సిద్ధమవడం సిగ్గు చేటు, నిరుద్యోగ భృతి ఆశ చూపి 14 నెలలుగా రూ.56 వేల బకాయిపడి యువతను దగా చేశారు. మీలో ఏమాత్రం నిజాయితీ ఉన్నా యుద్ద ప్రాతిపదికన బకాయిలు విడుదల చేయండి. ఈరోజే రూ.7500 కోట్ల ఫీజు రీయింబర్స్ మెంట్ సొమ్మును కాలేజీ యాజమాన్యాల ఖాతాల్లో జమ చేయండి. ఉద్యోగుల రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ బకాయిలన్నీ ఈరోజే విడుదల చేయండి. యువత అకౌంట్లలో 14 నెలల బకాయి కలిపి రూ.56 వేల నిరుద్యోగ భృతి జమ చేయాలి. ఇవన్నీ యుద్ద ప్రాతిపదికన విడుదల చేసిన తరువాతే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు అడగాలి. దగా హామీలు, మోసపు మాటలతో మభ్యపెడితే మోసపోయేందుకు పట్టభద్రులు, ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ వర్గాలు సిద్ధంగా లేవు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్(Congress) తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు’ కిషన్‌రెడ్డి హెచ్చరించారు.

Babar Azam is a fraud: Shoib Akter fires shots after IND vs PAK Champions Trophy match5
బాబ‌ర్ ఆజం ఒక మోసగాడు.. మొద‌టి నుంచి అంతే: షోయబ్‌ అక్తర్‌

ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోఫీ-2025లో పాకిస్తాన్ వ‌రుస‌గా రెండో ఓట‌మి చ‌విచూసింది. దీంతో త‌మ సెమీస్ అవ‌కాశాల‌ను పాక్ జ‌ట్టు సంక్లిష్టం చేసుకుంది. తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో ఓట‌మి చ‌విచూసిన పాకిస్తాన్‌.. రెండో మ్యాచ్‌లో కూడా అదే ఫలితం పున‌రావృతమైంది. దుబాయ్‌​ వేదికగా భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో పాక్ పరాజయం పాలైంది. బ్యాటింగ్‌, బౌలింగ్ రెండింటిలోనూ విఫలమైన ఆతిథ్య జట్టు ఈ ఘోర ఓటమిని మూటకట్టుకుంది.దీంతో పాక్‌​ జట్టు ఇంటాబయట విమర్శలు ఎదుర్కొం‍టుంది. తాజాగా ఈ జాబితాలోకి పాకిస్తాన్ ఫాస్ట్ బౌలింగ్ దిగ్గజం షోయబ్ అక్తర్ చేరాడు. ఈ మ్యాచ్‌లో విఫలమైన పాక్ స్టార్ ప్లేయర్ బాబర్‌​ ఆజం(Babar Azam)పై విమర్శలు గుప్పించాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగిన బాబర్ ఆట తీరును అక్తర్ తప్పుబట్టాడు."మనం ఎప్పుడూ బాబర్ ఆజంను విరాట్‌​ కోహ్లితో పోలుస్తాం. విరాట్‌కు బాబర్‌కు చాలా వ్యత్యాసం ఉంది. కోహ్లి.. సచిన్ టెండూల్కర్‌ను రోల్‌మోడల్‌గా తీసుకుని తన కెరీర్‌ను ప్రారంభించాడు. టెండ్కూలర్ అంతర్జాతీయ ‍క్రికెట్‌లో 100 సెంచరీలు చేశాడు. విరాట్ ఇప్పుడు అతడి వారసత్వాన్ని పొందేందుకు ప్రయత్నిస్తున్నాడు.సచిన్ సెంచరీలకు చేరువతున్నాడు. కానీ బాబర్ ఆజంకు ఎవరూ ఆదర్శం లేరు. అతడి ఆలోచిన విధానం సరిగ్గాలేదు. అనవసరమైన విషయాలపై దృష్టి పెట్టి తన రిథమ్‌ను కోల్పోయాడు. బాబ‌ర్ ఆజం ఒక మోస‌గాడు. అత‌డు కెరీర్ ఆరంభం నుంచి సెల్ఫిష్‌గా ఉన్నాడు. పాకిస్థాన్ క్రికెట్ జట్టు గురించి మాట్లాడేందుకు నాకు ఆస‌క్తి లేదు" అని అక్త‌ర్ ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో పేర్కొన్నాడు. కాగా ఈ మ్యాచ్‌లో బాబర్‌​ ఆజం 23 పరుగులు చేసి ఔటయ్యాడు.విరాట్ కోహ్లి సూప‌ర్ సెంచ‌రీ..కాగా ఈ మ్యాచ్‌లో 242 పరుగుల టార్గెట్‌ను భారత్ కేవలం నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి 42.3 ఓవర్లలో చేధించింది. భార‌త బ్యాట‌ర్ల‌లో విరాట్ కోహ్లి ఆజేయ సెంచ‌రీతో చెల‌రేగాడు. కోహ్లి 111 బంతుల్లో 7 ఫోర్లతో సరిగ్గా 100 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.అత‌డితో పాటు శ్రేయస్‌ అయ్యర్‌(67 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 56), శుబ్‌మన్‌ గిల్‌(46) పరుగులతో రాణించారు. పాక్‌ బౌలర్లలో షాహీన్‌ అఫ్రిది రెండు వికెట్లు పడగొట్టగా.. ఆర్బర్‌ ఆహ్మద్‌, కుష్దిల్‌ షా తలా రెండు వికెట్లు వికెట్‌ సాధించారు.చదవండి: పాకిస్తాన్‌ మ్యాచ్‌లో హార్దిక్‌ ధరించిన వాచీ ధర తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే..!

Unni Mukundan Snatches fan Phone for Filming Him, Video Goes Viral6
అభిమాని అత్యుత్సాహం.. కోపంతో ఫోన్‌ లాక్కున్న హీరో

మార్కో సినిమాతో బాక్సాఫీస్‌ విధ్వంసం సృష్టించాడు ఉన్ని ముకుందన్‌ (Unni Mukundan). ఈ మూవీలో యాక్షన్‌ హీరోగా రక్తపాతాన్ని పారించిన ఆయన నిర్మాతలకు కాసుల వర్షం కురిపించాడు. ఇటీవల ఆయన ప్రధాన పాత్రలో నటించిన గెట్‌ సెట్‌ బేబీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ఓ మల్టీప్లెక్స్‌కు వెళ్లాడు హీరో. అతడిని చూసిన ఓ అభిమాని హీరోకు దగ్గరగా వెళ్లాడు. ఉన్ని ముకుందన్‌ నడుస్తూ ఉంటే అతడిని వెంబడిస్తూ ఫోన్‌లో వీడియో చిత్రీకరించాడు.ఫోన్‌ లాక్కున్న హీరోఅది చూసి సహనం నశించిన హీరో సదరు అభిమాని దగ్గరి నుంచి ఫోన్‌ లాక్కున్నాడు. దాన్ని జేబులో పెట్టుకుని కోపంతో అలాగే ముందుకు నడుచుకుంటూ వెళ్లిపోయాడు. అభిమాని బతిమాలడంతో ఫోన్‌ వెనక్కిచ్చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇది చూసిన అభిమానులు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.ఇంకా నయం.. ఫోన్‌ తీసుకెళ్లిపోలేదులేమీరు హీరోగా ఎదిగే సమయంలో ఎవరైనా మీ అభిమాని అని మీ దగ్గరకు వస్తే సంతోషపడతారు. ఇలా స్టార్‌డమ్‌ వచ్చాక మాత్రం ఇరిటేట్‌ అవుతుంటారు అని ఓ వ్యక్తి రాసుకొచ్చాడు. మరికొందరేమో.. హీరోకు మరీ అంత దగ్గరగా వెళ్లి వీడియో షూట్‌ చేయాలా? అలా చేస్తే ఎవరికైనా ఇరిటేషన్‌ వస్తుంది.. ఫోన్‌ను అలాగే తీసుకెళ్లకుండా తిరిగిచ్చేసినందుకు సంతోషించండి. అని కామెంట్లు చేస్తున్నారు. Marco Mode of Unni Mukundan in Real Time.Fan should not take advantage of stars like this.#UnniMukundan#Marco#GetSetBaby pic.twitter.com/mq2AOxLkq2— Deepak Kaliamurthy (@Dheeptweet) February 23, 2025చదవండి: రూ.50 లక్షల ప్రైజ్‌మనీ.. ఇంతవరకు ముట్టనేలేదు: బిగ్‌బాస్‌ విజేత

High Court Reserved Judgment On Kcr Petition Over Medigadda Barrage Issue7
KCR: హైకోర్టులో కేసీఆర్ పిటిష‌న్‌పై తీర్పు రిజ‌ర్వ్

సాక్షి,హైదరాబాద్‌: మేడిగడ్డ వ్యవహారంపై తెలంగాణ హైకోర్టులో ఇవాళ కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్‌ఎస్‌ అధినేత.. మాజీ సీఎం కేసీఆర్‌(KCR), మాజీ మంత్రి హరీష్‌ రావులు వేసిన పిటిషన్‌ను విచారించిన కోర్టు.. తీర్పు రిజర్వు చేసింది. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు.. తీర్పును తర్వాత వెల్లడిస్తామని తెలిపింది. మేడిగడ్డ కుంగిన వ్యవహరంపై భూపాలపల్లి కోర్టు ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ కేసీఆర్‌, హరీష్‌ రావులు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై ఇవాళ (ఫిబ్రవరి24) హైకోర్టు విచారణ జరపింది. విచారణ సందర్భంగా.. లోయర్ కోర్టులో పిటిషన్ వేసిన రాజలింగమూర్తి(Raja Lingamurthy) చనిపోయాడని కేసీఆర్‌, హరీష్‌ తరుఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అయితే.. కేసు వేసిన పిటిషనర్ చనిపోయినా లీగల్‌ హైర్‌(Legal Heir)ను ఇంప్లీడ్‌ చేస్తే.. పిటిషన్‌ మెయింటేనబుల్ అని పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ వాదించారు. కాబట్టి, మళ్లీ లోయర్‌ కోర్టుకు రిఫర్‌ చేయాలని బెంచ్‌కు విజ్ఞప్తి చేశారు. అయితే.. ఇది క్రిమినల్ పిటిషన్ కాబట్టి లీగల్‌ హైర్‌కు ఆస్కారం ఉండబోదని కేసీఆర్ అడ్వకేట్ వాదించారు. లీగల్ హైర్ ను ఇంప్లీడ్ చేయడం సమన్స్ కేసుకు మాత్రమే వర్తిస్తుందని కోర్టుకు నివేదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు తీర్పు రిజర్వ్‌ చేసింది.

Pawan Kalyan Bizarre Comments On YSRCP Opposition Demand8
జనసేన ఉండగా ప్రతిపక్షం ఎలా ఇస్తారు?: పవన్‌ కల్యాణ్‌

అమరావతి, సాక్షి: వైఎస్సార్‌సీపీ ప్రతిపక్ష హోదా అంశంపై జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌(Pawan Kalyan) విచిత్రమైన వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం తర్వాత సభలో ఉంది తామేనని, కాబట్టి ప్రజాగళం వినిపించేందుకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ వైఎస్సార్‌సీపీ(YSRCP) డిమాండ్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. ఆ లోటును తాము భర్తీ చేస్తామన్న రీతిలో పవన్‌ మాట్లాడారు.గవర్నర్‌ ప్రసంగం ముగిశాక.. అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద జనసేన ఎమ్మెల్యేలతో పవన్‌ మాట్లాడారు. అసెంబ్లీలో అధికార టీడీపీ తర్వాత రెండో అతిపెద్ద పార్టీ జనసేన పార్టీ(Jana Sena Party). అలాంటిది జనసేన ఉండగా వైఎస్సార్‌సీపీకి ప్రతిపక్ష హోదా ఎలా ఇస్తారు?. జనసేన కంటే ఒక్క సీటు వచ్చి ఉన్నా వాళ్లకు ప్రతిపక్ష హోదా దక్కేది.ఓట్ల శాతం ప్రకారం ప్రతిపక్ష హోదా కావాలని అనుకుంటే గనుక జర్మనీకి వెళ్లాలి. ఎందుకంటే అక్కడ మాత్రమే అది సాధ్యమవుతుంది. ఇవాళ గవర్నర్‌ ప్రసంగాన్ని(Governor Speech) వైఎస్సార్‌సీపీ బహిష్కరించడం కరెక్ట్‌ కాదు. అది ఎవరో ఇచ్చేది కాదు. గౌరవీనయులైన సీఎం చంద్రబాబుగారి చేతిలో అది లేదు. దానికి రూల్స్‌ రెగ్యులేషన్స్‌ ఉన్నాయి. ఈ ఐదేళ్లలో మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వబడదు. దానికి మీరు ప్రిపేర్‌ అవ్వండి’’ అని పవన్‌ వైఎస్సార్‌సీపీని ఉద్దేశించి అన్నారు.ఇదీ చదవండి: ఇదీ చంద్రబాబు రాజకీయం!

KSR Comment on YS Jagan Adani SECI Yellow Media Row9
చంద్రబాబు రాజకీయం ఇలాగే ఉంటుంది!

అడ్డగోలు వాదనలు చేయడంలో కొంతమంది రాజకీయ నేతలు సిద్దహస్తులుగా ఉంటారు. వారిలో మొదటి పేరు ఎవరిదైనా చెప్పవలసి వస్తే అది ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుదే అవుతుంది. అలాగే అడ్డగోలు చెత్త కథనాలు ప్రచారం చేయడంలో ఈనాడు, ఆధ్రజ్యోతి వంటి ఎల్లో మీడియాకు మొదటి ర్యాంకు ఇవ్వవలసిందే. ఈ విషయం పలుమార్లు రుజువు అవుతూనే ఉంది. తాజాగా సోలార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా( సెకీ ) నుంచి ఏపీకి విద్యుత్ కొనుగోలు చేయడానికి గత జగన్ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందంపై విషం చిమ్మడానికి టీడీపీతో పాటు, ఎల్లో మీడియా పోటీ పడ్డాయి. సాధారణంగా.. నిజం నిలకడమీద తెలుస్తుందంటారు. కాకపోతే వాస్తవం బయటపడే లోపు అబద్దాలు లోకం అంతా చుట్టేస్తుంటాయి. సెకీతో ఒప్పందం వల్ల ఏపీకి జగన్ తీరని నష్టం చేశారని ఎల్లో మీడియా అసత్యాన్ని ఒకటికి పదిసార్లు ప్రచారం చేసింది. లక్ష కోట్ల భారం ఏపీపై జగన్ వల్ల పడిందని కూడా ఆ మీడియా సంస్థలు ఆరోపించాయి. వాస్తవం ఏమిటంటే జగన్ చేసుకున్న ఒప్పందం వల్ల లక్షా పదివేల కోట్ల రూపాయల మేర ఏపీ ప్రజలకు ఆదా అయింది. ఒకరకంగా చెప్పాలంటే జగన్ వల్ల ఏపీకి లక్ష కోట్లకు పైగా ఆదాయం వచ్చినట్లన్నమాట.👉సెకీ(SECI)తో విద్యుత్ కొనుగోలు ఒప్పందం ప్రకారం యూనిట్ 2.49 రూపాయలకు ఏపీకి సరఫరా అవుతుంది. ఇంత తక్కువ ధరకు గతంలో ఎప్పుడూ ఒప్పందం జరగలేదు. అయినా అది చాలా ఎక్కువ ధర అని, దీనికి ట్రాన్సిమిషన్ చార్జీలు అదనంగా చెల్లించాలంటూ ఇష్టం వచ్చినట్లు ఆ మీడియా ప్రచారం చేయడం, దానిని చంద్రబాబు తలకు ఎత్తుకుని విమర్శలు చేయడం.. కొద్ది నెలల క్రితం నిత్యకృత్యంగా సాగింది. రాష్ట్రం ఏమైపోయినా ఫర్వాలేదు..పెట్టుబడులపై ప్రభావం చూపినా ఫర్వాలేదన్నట్లుగా జగన్ పై దుష్ప్రచారం చేశాయి.అర్ధరాత్రి టైమ్ లో ఫైల్ పై సంతకం పెట్టించారని జనసేనలోకి వెళ్లిన మాజీ విద్యుత్ శాఖ మంత్రితో చెప్పించారు. అయినా జగన్ చేసింది రాష్ట్రానికి మంచి అని ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వమే ఒప్పుకోక తప్పలేదు. 👉తాము ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు(Super Six Promises), ఎన్నికల ప్రణాళిక వాగ్దానాలనుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి అదాని,జగన్ మద్య లింక్ అని, అదాని నుంచి జగన్ లంచం తీసుకున్నారని, అమెరికాలో కేసు అయిందని విపరీతంగా పబ్లిసిటీ చేశారు. ఏపీ ప్రభుత్వంతో నేరుగా అదానీ ఒప్పందమే జరగనప్పుడు లంచాల ప్రస్తావన ఎలా వస్తుందని వైఎస్సార్‌సీపీ వారు చెప్పినా.. తమ దుర్మార్గపు మీడియాతో పదే పదే ప్రచారం చేయించారు. సరే.. వారు చెబుతున్నారు కదా! సెకీతో ఒప్పందం వల్ల ఏపీకి లక్ష కోట్ల భారం పడుతుందని అంటున్నారు కదా! దానిని రద్దు చేసుకోండని ఎవరైనా సవాల్ చేస్తే మాత్రం దానికి జవాబు చెప్పేవారు కారు. వైఎస్‌ జగన్‌పై ఈ విద్యుత్ ఒప్పందంపై ఏసీబీతో విచారణ చేయిస్తున్నామని కూడా బిల్డప్ ఇచ్చారు. అవన్నీ ఉత్తిత్తివేనని అందరికి తెలుస్తూనే ఉంది. కాకపోతే జగన్ పై ప్రజలలో ఒక అపనమ్మకం కలిగించడానికి ఈనాడు, ఆంధ్రజ్యోతి మీడియా సంస్థలు నానా చెత్త అంతా ప్రచారం చేసేవి. దానికి అనుగుణంగా చంద్రబాబు మాట్లాడడమో,లీక్ ఇవ్వడమో చేస్తుండేవారు. విశేషం ఏమిటంటే దేశం బీజెపీయేతర రాజకీయ పక్షాలు అదానీపై, ప్రధాని మోదీపైన విమర్శలు చేస్తుంటే, చంద్రబాబు మాత్రం వారిని పల్లెత్తి అనకుండా, జగన్ పై మాత్రం ఆరోపణలు గుప్పిస్తుండేవారు. ఇలా ఉంటుంది చంద్రబాబు రాజకీయం. ఇప్పుడు ఏపీలో విద్యుత్ నియంత్రణ మండలి(AP ERC) సెకీ ఒప్పందం సక్రమమని, దానివల్ల ఎపికి మేలు జరుగుతుందని, కేంద్ర విద్యుత్ నియంత్రణ మండలి కూడా ఈ ఒప్పందానికి ఆమోదం తెలిపిందని స్పష్టం చేసింది. ఏపీఈఆర్సి లో చైర్మన్ ను చంద్రబాబు ప్రభుత్వమే నియమిస్తుంది. అంటే ప్రభుత్వ అభిష్టానికి వ్యతిరేకంగా ఈ మండలి సాధారణంగా నిర్ణయాలు తీసుకోదు. మండలి ఒప్పుకున్నా.. కోకున్నా చంద్రబాబు ప్రభుత్వం తాము సెకీతో ఒప్పదం ప్రకారం విద్యుత్ సరఫరా చేసుకోబోమని కూడా చెప్పి ఉండవచ్చు. ఆ పని చేయలేదు. అంటే చంద్రబాబు అండ్ కో(Chandrababu & Co) ఎప్పటిమాదిరే డబుల్ గేమ్ ఆడారన్నమాట. 👉జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల వచ్చే ప్రయోజనం వారు పొందాలి. అదే టైమ్ లో జగన్ ను బదనాం చేయాలి..ఇది వారి వ్యూహం. అదానీ వివాదం చెలరేగినప్పుడు చాలా స్పష్టంగా ఏ విచారణకు అయినా సిద్దం అని జగన్ చాలెంజ్ చేశారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వం యూనిట్ విద్యుత్‌ను రూ.4.50 నుంచి రూ.6 వరకు కొనుగోలు చేయడానికి చేసుకున్న ఒప్పందాలను సమీక్షించడానికి జగన్ ప్రభుత్వం ప్రయత్నిస్తే.. దానిని టీడీపీ, ఎల్లో మీడియా వ్యతిరేకించి పెట్టుబడులపై ప్రభావం పడుతుందని ప్రచారం చేశాయి. అదే జగన్ రూ.2.49 ఒప్పందం అయితే మాత్రం ఏదో ఘోరం జరిగినట్లు అబద్దాలు సృష్టించారు. ఇప్పుడు ఏపీఈఆర్సీ నిర్ణయంతో చంద్రబాబుకాని, ఎల్లో మీడియాకాని ఎంత తప్పుడు ప్రచారం చేసింది జనానికి పూర్తిగా అర్దం అవుతుంది. 👉ఈనాడు మీడియాలో వచ్చిన హెడింగ్‌లు చూస్తే.. జర్నలిజం ఇంత నీచంగా మారిందా? అనే బాధ కలుగుతుంది. అదానీ కేసులో జగన్ పేరు లేకపోయినా, పనికట్టుకుని ఒకటికి రెండుసార్లు ఆయన పేరు రాసేవారు. నేరుగా అదానీ నుంచి జగన్‌కు రూ. 1,750 కోట్ల లంచం అందిందని అచ్చేశారు. ఇప్పుడు అదే ఒప్పందాన్ని చంద్రబాబు కొనసాగిస్తున్నందున ఆయనకు రూ.2,750 కోట్ల ముడుపులు ముట్టాయా? అని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది.👉అబద్దాల ఆంధ్రజ్యోతి ఇప్పటికీ ఏదో రూపంలో వైఎస్సార్‌సీపీ బురదచల్లడానికి నిస్సిగ్గుగా యత్నిస్తోంది. ఈనాడు పెట్టిన కొన్ని శీర్షికలు చూడండి..⇒నిబంధనలు ఉల్లంఘించి అదానీకి అనుమతిచ్చేశారుఅసలు అదానీతో ఒప్పందమే లేదని ఈఆర్సీ నివేదిక ప్రకారం కూడా తెలుసుకోవచ్చు. జగన్ ఈ అంశంపై తన వాదన తెలిపితే.. ⇒అవినీతి ఒప్పందానికి అడ్డగోలు సమర్ధనా? అని ఈనాడు విషం కక్కింది. ఇప్పుడు ఈనాడు ఎవరి నుంచి ముడుపులు తీసుకుని ఇలాంటి అవినీతి కధనాలు రాసిందో అని వైఎస్సార్‌సీపీ ప్రశ్నిస్తోంది.'రాష్ట్రానికి నష్టం..రాజస్తాన్ కు లాభం" అంటూ మరో వార్త ఇచ్చారు. రాజస్తాన్ కు ఇందులో ప్రత్యేకంగా వచ్చే లాభం ఏమి ఉండదు. అదానీ లేదంటే ఇతర పారిశ్రామికవేత్తలు ఆయా చోట్ల నెలకొప్పిన సౌర విద్యుత్ కేంద్రాల నుంచి కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీ విద్యుత్ కొనుగోలు చేసి రాష్ట్రాలకు సరఫరా చేస్తుంది. పైగా అక్కడ నుంచి ఏపీకి ట్రాన్సిమిషన్ చార్జీలు ఉండవని కేంద్రం స్పష్టం చేసినా.. జగన్ పై బురదచల్లుడు కధనాలు ఇచ్చి తన కుసంస్కారాన్ని ప్రదర్శించుకుంది.అంతర్జాతీయ స్థాయికి జగన్ అవినీతి అంటూ చంద్రబాబు ,ఈనాడు,ఆంధ్రజ్యోతి దారుణాతిదారుణంగా ప్రచారం చేశాయి. ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో పరువు పొగొట్టుకున్నది చంద్రబాబు, ఎల్లో మీడియా కాదా?. అదానీ స్కామ్ నిజంగా జరిగి ఉంటే.. అందులో చంద్రబాబు, ఎల్లో మీడియాకు వాటా ఉన్నట్లు అనుకోవాల్సిందేగా! ఏది ఏమైనా ద్వేషంతో జర్నలిజం ప్రాధమిక సూత్రాలను విస్మరించి ఈనాడు చేస్తున్నది పచ్చి పాపం అని చెప్పాలి. అందుకే జగన్ ఈ మీడియాపై పరువు నష్టం దావా వేశారు.అది ఎప్పటికి తేలుతుందో కాని,కచ్చితంగా న్యాయం నిలబడి వారికి శిక్షపడడానికి ఇప్పుడు ఈఆర్సీ చేసిన నిర్ణయం ఒకటే సరిపోవచ్చు.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

SLBC Rescue Operation Continues At Tunnel Live Updates10
SLBC: ఎనిమిది మంది సేఫ్‌ కంటైనర్‌లోకి వెళ్తే ప్రాణాలతో ఉండే అవకాశం

టన్నెల్‌ వద్ద సహాయక చర్యలు అప్‌డేట్స్‌.. నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని దోమలపెంట సమీపంలో ఉన్న ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. టన్నెల్‌లో ఇరుక్కున్న ఎనిమిది రక్షించేందుకు చర్యలు చేపట్టారు. ఈ ఆపరేషన్‌లో ఎన్డీఆర్‌ఎఫ్‌, ఆర్మీ, సింగరేణి రెస్క్యూ టీమ్‌, హైడ్రా, సికింద్రాబాద్‌ బైసన్‌ డివిజన్‌ ఇంజినీరింగ్‌ టాస్క్‌ఫోర్స్‌ సిబ్బంది పాల్లొన్నారు.తీవ్రంగా శ్రమిస్తున్న ఎన్డీఆర్ఎప్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలుకార్మికులు ఉన్న ప్రాంతానికి దగ్గరగా వెళ్లిన బృందాలుగ్యాస్ కట్టర్లతో బోర్ మిషన్ ను కట్ చేసేందుకు యత్నం ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌ను సందర్శించిన జానారెడ్డిఎస్ఎల్‌బీసీ వద్ద విషాద ఘటన జరిగిందిపనులు ముమ్మరంగా జరుగుతున్న సమయంలో ఘటన జరగటం విషాదంరెస్క్యూలో అందరు చురుకుగా పని చేస్తున్నారుఏ పద్దతుల్లో వారిని గుర్తించగలమో చర్యలు చేపడుతున్నారుఆచూకీ దొరక్క వారు చనిపోతే మృతదేహాలను ఎలా తీసుకురావాలో చూస్తున్నారుబాధితుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది.మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కామెంట్స్ఘటనకు తీవ్రంగా బాధపడుతున్నానుమా ప్రాజెక్టు పనుల కోసం వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికులు ప్రమాదంలో పడటం విచారకరంఎనిమిది మందిని ప్రాణాలతో తీసుకురావటమే మా ముందున్న లక్ష్యంశ్రీశైలం మల్లన్న దయతో బాధితులు బయటకు రావాలి.రాజకీయాలు చేయాలని చూస్తున్న వారి విజ్ఞతకే వదిలేస్తున్నాంసిరిసిల్ల ఘటనలో చనిపోయిన వారి గురించి కేటీఆర్‌కు గుర్తుకురాలేదా?సహయక చర్యలకు ఆటంకం కలగవద్దని సీఎం రేవంత్ రెడ్డి ఘటన స్థలానికి రావటం లేదుగతంలో పెద్ద పెద్ద ఘటనలు జరిగినప్పుడు పలకరించని కేటీఆర్ ఇప్పుడు రాద్దాంతం చేస్తున్నారుప్రతిపక్ష నాయకుడిగా ఇక్కడికి వచ్చి తెలుసుకోవాలనే చిత్తశుద్ది కేసీఆర్‌కు లేదు ప్రత్యేక పరికరాలతో టన్నెల్‌లో గాలింపు చర్యలు..ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో టన్నెల్‌లో 50 గంటలకు పైగా కొనసాగుతున్న సహాయక చర్యలుతీవ్రంగా శ్రమించి టన్నెల బోరింగ్‌ మిషన్‌ వద్దకు చేరుకున్న సహాయక బృందంబురదలో మరో 40 మీటర్లు ముందుకు వెళ్లేందుకు తీవ్ర ప్రయత్నాలుగల్లంతైన వారికోసం బురదలోనూ గాలిస్తున్న ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలుబురదలో కూడా వ్యక్తులను గుర్తించే పరికరాలతో గాలింపు చర్యలుటన్నెల్‌ బోరింగ్‌ మిషన్‌లో సేఫ్‌ కంటైనర్‌ ఉంటుందని తెలిపిన సిబ్బందికార్మికులు సేఫ్‌ కంటైనర్‌లోకి వెళ్తే ప్రాణాలతో ఉండే అవకాశం ఉందన్న సిబ్బందిఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ సహాయక చర్యలపై క్లారిటీ ఇచ్చి ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు.శిథిలాలను తొలగించడానికి నెల రోజుల సమయం పట్టొచ్చు.టన్నెల్‌లో చిక్కుకున్న వాళ్లు ప్రాణాలతో ఉంటారని భావించలేం.ప్రస్తుతం శిథిలాలను తొలగించడం ఒక సవాల్‌.టీబీఎంను తొలగిస్తే గానీ శిథిలాల తొలగింపు సాధ్యం కాదు.శిథిలాలు టీబీఎంపై పడిపోయి పూర్తిగా ధ్వంసమైంది.సొరంగం లోపల నెలకొన్న పరిస్థితులను చూస్తే దాదాపు నెల రోజుల సమయం పట్టే అవకాశం ఉంది.ప్రమాదం జరిగిన ప్రాంతంలో కరెంట్‌ కూడా పునరుద్దరించలేదు.నడుము లోతు వరకు నీరు, బురద పేరుకుపోయి ఉంది.టన్నెల్‌ బోరింగ్‌ మిషన్‌ పూర్తిగా కట్‌ చేయాల్సిందే.మట్టి, సిమెంట్‌ రింగుల శిథిలాలతో సొరంగం మూసుకుపోయింది.శిథిలాలను తొలగించాలంటే ఉన్న ఏకైక మార్గం రైల్వే ట్రాక్‌.రైల్వే ట్రాక్‌ కూడా రెండు కిలోమీటర్ల వరకు నీటిలో మునిగిపోయింది.సొరంగం లోపల నెలకొన్న పరిస్థితులు చూస్తే పప్రమాదం జరిగిన ప్రాంతం నుంచి 500 మీటర్ల వరకు మూసుకుపోయింది. 👉సొరంగంలో మట్టి, నీరు భారీగా చేరడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో సొరంగం పైనుంచి లోపలికి వెళ్లే అంశాన్ని పరిశీలిస్తున్నామని అధికారులు వెల్లడించారు. ఇక, నిరంతరం ఆక్సిజన్‌ పంపింగ్‌ చేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు.టన్నెల్‌ వద్దకు మంత్రి కోమటిరెడ్డి..👉మరోవైపు.. తాజాగా ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ వద్ద పనులను పరిశీలించేందుకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హైదరాబాద్‌ నుంచి బయలుదేరారు. టన్నెల్‌ వద్ద ప్రమాద సహాయకచర్యలు పూర్తి అయ్యేంత వరకు మంత్రి అక్కడే ఉండనున్నట్టు తెలుస్తోంది. పనులను పర్యవేక్షించనున్నారు.మరో 50 మీటర్లే.. 👉ఇక, టన్నెల్‌లోని 13.5 కిలోమీటరు వద్ద పైకప్పు కూలింది. అక్కడి వరకు వెళ్లిన సహాయక బృందాలు టన్నెల్‌ బోరింగ్‌ మిషన్‌ వద్దకు వెళ్లేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అక్కడి నుంచి అర కిలోమీటరు వెళ్లేందుకు మట్టి, నీటితో అడ్డంకులు ఏర్పడుతున్నాయి. హై కెపాసిటీ పంపింగ్‌ సెట్లు, క్రేన్లు, బుల్డోజర్ల సాయంతో ముందుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు.👉టన్నెల్‌లో 14వ కి.మీ వద్ద 100 మీటర్ల మేర 15 అడుగుల ఎత్తు బురద పేరుకుపోయింది. ఫిషింగ్‌ బోట్లు, టైర్లు, చెక్కబల్లలు వేసి దాటేందుకు ప్రయత్నిస్తున్నారు. మరో 50 మీటర్ల బురద స్థలాన్ని దాటితేనే ప్రమాద స్థలానికి వెళ్లగలమని సహాయక బృందాలు చెబుతున్నాయి. ఆర్మీ వైద్య బృందాలు కూడా సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. బాధితుల ఆచూకీ ఇంకా తెలియలేదని ఎన్డీఆర్‌ఎఫ్ డిప్యూటీ కమాండెంట్‌ సుఖేంద్‌ తెలిపారు. సహాయక చర్యల కోసం నేవీ బృందం శ్రీశైలం చేరుకోనుంది.ఆందోళనలో బాధితుల కుటుంబ సభ్యులు.. 👉టన్నెల్‌లోకి చిక్కుకుపోయిన వారిని కాపాడేందుకు అన్ని రకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో వారు ఎలా ఉన్నారోనని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎనిమిది మంది ఆచూకీ ఎప్పుడు తెలుస్తుందా? అని ఎదురుచూస్తున్నారు. టన్నెల్‌ లోపల ఉన్నది వీరే.. జేపీ సంస్థకు చెందిన మనోజ్‌కుమార్‌ (పీఈ), శ్రీనివాస్‌ (ఎస్‌ఈ), రోజువారీ కార్మికులు సందీప్‌సాహు (28), జక్తాజెస్‌ (37), సంతోష్‌సాహు (37), అనూజ్‌ సాహు (25) ఉన్నారు. రాబిన్‌సన్‌ సంస్థకు చెందిన ఆపరేటర్లు సన్నీ సింగ్‌ (35), గురుదీప్‌ సింగ్‌ (40) సొరంగం లోపల చిక్కుకు పోయారు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

International View all
title
యుద్ధభూమిలో ఉక్రెయిన్.. మూడేళ్ళలో జరిగిన నష్టాలు

ఉక్రెయిన్ - రష్యా యుద్ధం ప్రారంభమై.. మూడేళ్లు పూర్తయ్యాయి. ఈ రోజుకి (సోమవారం) నాలుగో ఏడాదిలోకి అడుగుపెడుతోంది.

title
ఛాంపియన్స్‌ ట్రోఫి మ్యాచ్‌లు..పాక్‌ ఇంటెలిజెన్స్‌ వార్నింగ్‌

ఇస్లామాబాద్‌: ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీ-2025 మ్యాచ్‌లకు సంబంధ

title
13 ఏళ్లు రాజకీయాలకు దూరం.. రీఎంట్రీలో అదిరే విజయం

ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో పార్టీ ఓడింది.

title
Ukraine War ఈ యుద్ధంలో అంతిమ విజయం అమెరికాదే?

గత మూడు సంవత్సరాలుగా జరుగుతున్న ఉక్రెయిన్, రష్యా యుద్ధాన్ని ఆపే ప్రయత్నంలో అమెరికా ఆధ్యక్షుడు ట్రంప్‌ 90 నిమిషాలపాటు పుత

title
ట్రంప్‌ సంచలనం.. రెండు వేల మంది ఉద్యోగులు అవుట్‌

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ దూకుడు పెం

NRI View all
title
ఎఫ్‌బీఐ డైరెక్టర్‌ కాశ్‌ పటేల్‌ లవ్‌స్టోరీ : అందంలోనే కాదు టాలెంట్‌లోనూ!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌  ట్రంప్‌ (Donald Trump) తన  మద్దతు ద

title
మాట నూతన కార్యవర్గం ఏర్పాటు

మన అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌-మాట బోర్డు మీటింగ్‌ డల్లాస్ లో ఘనంగా జరిగింది.

title
న్యూయార్క్ వేదికగా ఇంద్రాణి ఫేమ్ అంకితా జాదవ్ ఆల్బమ్ సాంగ్స్

ఇంద్రాణి ఫేమ్ అంకితా జాదవ్ నటించిన తెలుగు , హిందీ ఆల్బమ్ పాటలు  న్యూయార్క్ వేదికగా రిలీజ్ కానున్నాయి.

title
సులభతర వీసా విధానం అవసరం

న్యూఢిల్లీ: వైద్య చికిత్సల కోసం భారత్‌కు వచ్చే విదేశీ రోగులకు సులభతర వీసా విధానాన్ని ప్రవేశపెట్టాలని అపోలో హాస్పిటల్స్‌

title
గుంటూరులో కుట్టుమిషన్లను పంపిణి చేసిన నాట్స్

Advertisement

వీడియోలు

Advertisement