Top Stories
ప్రధాన వార్తలు

సింహాచలం అప్పన్న సన్నిధిలో అపశ్రుతి.. ఏడుగురు భక్తులు మృతి
సాక్షి, విశాఖపట్నం: సింహాచలం చందనోత్సవంలో ఘోర అపశ్రుతి చోటుచేసుకుంది. గోడ కుప్పకూలి ఏడుగురు మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు. రూ.300 టికెట్ కౌంటర్ వద్ధ ఈ ప్రమాదం జరిగింది. ఇటీవలే అక్కడ గోడ నిర్మించారు. గోడ నాసిరకంగా నిర్మించడం వలనే కూలిపోయిందని అధికారులు భావిస్తున్నారు. తెల్లవారుజామున 2-3 గంటల మధ్య రూ.300 క్యూ లైన్లో ప్రమాదం జరిగింది. మృతుల్లో ముగ్గురిని అధికారులు గుర్తించారు. యడ్ల వెంకటరావు(48),దుర్గా స్వామినాయుడు(32), మణికంఠ(28)గా గుర్తించారు. మృతదేహాలను కేజీహెచ్‌కు తరలించారు.👉 సింహాచలం ఘటనపై ప్రధాని మోదీ విచారంవిశాఖ జిల్లా సింహాచలం దేవస్థానంలో గోడ కూలిన ఘటనపై ప్రధాని మోదీ విచారం గోడకూలి భక్తులు చనిపోవడం బాధాకరంమృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిగాయపడిన భక్తులు త్వరగా కోలుకోవాలి పీఎం సహాయ నిధి నుంచి ఎక్స్‌గ్రేషియా మృతుల కుటుంబాలకు PMNRF నుండి రూ. 2 లక్షల పరిహారం గాయపడిన వారికి రూ. 50,000 పరిహారం ఇస్తున్నట్లు పీఎంవో కార్యాలయం ఎక్స్ వేదికగా ట్వీట్ Deeply saddened by the loss of lives due to the collapse of a wall in Visakhapatnam, Andhra Pradesh. Condolences to those who have lost their loved ones. May the injured recover soon.An ex-gratia of Rs. 2 lakh from PMNRF would be given to the next of kin of each deceased. The…— PMO India (@PMOIndia) April 30, 2025 👉కేజీహెచ్ మార్చురి వద్ద విషాద ఛాయలుకేజీహెచ్ మార్చురి వద్దకు చేరుకుంటున్న మృతుల కుటుంబ సభ్యులుకన్నీరు మున్నీరవుతున్న కుటుంబ సభ్యులు...దైవదర్శనానికి వెళ్లి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారంటూ ఆవేదన👉సింహాచలం ఘటనపై వీహెచ్‌పీ ఆగ్రహంసింహాచలం సరైన రీతిలో ప్రభుత్వం చర్యలు చేపట్టలేదునిర్మాణ లోపం వల్లే ప్రమాదం జరిగిందిసింహాచలంలో పాలన కాదు.. లాబీయింగ్ నడుస్తోందిఎండోమెంట్ వ్యవస్థ ఓ చెత్తభగవంతుడికి భక్తులకు దూరం చేయడమే వారిపనిహిందువుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయిపాలకుల కబంధ హస్తాల నుంచి ఎండోమెంట్ వ్యవస్థ బయటకు వస్తేనే భక్తులకు మంచి జరుగుతోందిచందనోత్సవంలో ఒక ప్రణాళిక లేదు.. ఓ ప్లాన్ లేదు👉తిరుపతి తొక్కిసలాట ఘటన మరవకముందే..ఘటనపై సమగ్ర విచారణ చేసి.. మృతుల కుటుంబాలను ఆదుకోవాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి డిమాండ్ చేశారు. తిరుపతి తొక్కిసలాట ఘటన మరవకముందే సింహాచలంలో ఇలాంటి ఘటన జరగడం బాధాకరమని ఆమె అన్నారు. మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం ఇవ్వాలి. అన్యాయంగా ఏడుగురు చనిపోయారు. ప్రభుత్వం సరైన చర్యలు చేపట్టకపోవడం వల్లనే ప్రమాదం జరిగిందని వరుదు కల్యాణి అన్నారు.👉వైఎస్ జగన్ దిగ్భ్రాంతివిశాఖ జిల్లా సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవంలో గోడ కుప్పకూలి భక్తులు మృతి చెందడంపై మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చందనోత్సవం సందర్భంగా రూ. 300 టికెట్ క్యూలైన్ పై గోడ కుప్పకూలి భక్తులు మృత్యువాత పడటంపై తీవ్రవిచారం వ్యక్తం చేశారు. స్వామివారి నిజరూప దర్శనానికి వచ్చిన భక్తులు ఇటువంటి దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమన్నారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని, మరణించిన భక్తుల కుటుంబాలను ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.👉సింహాచలం ఘటనపై తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర విచారంగోడ కూలి భక్తులు మరణించిన ఘటన తీవ్ర ఆవేదనను కలిగించిందివారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి ఆంధ్ర ప్రదేశ్ లోని సింహాచలం ఆలయం వద్ద గోడ కూలి భక్తులు మరణించిన ఘటనతీవ్ర ఆవేదనను కలిగించింది. వారి కుటుంబ సభ్యులకునా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ…మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని…భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.— Revanth Reddy (@revanth_anumula) April 30, 2025

తిరుపతి తొక్కిసలాట ఘటన మరవకముందే..
సాక్షి, విశాఖపట్నం: తిరుపతి తొక్కిసలాట ఘటన మరవకముందే.. సింహాచలంలో మరో ఘోర విషాదం జరిగింది. సింహాచలం అప్పన చందనోత్సవంలో ప్రభుత్వం నిర్లక్ష్యం ఫలితంగా.. గోడకూలి ఏడుగురు మృతిచెందారు. ఘటన జరిగిన సమయంలో ఒక్క పోలీసు కూడా కనిపించలేదు.. భక్తులను ఆదుకోవడానికి ఒక్క ఎండోమెంట్ ఉద్యోగి కూడా అక్కడ లేరు. అందుబాటులో ఉన్న వాలంటీర్లు, భక్తులు మాత్రమే సహాయక చర్యలు చేపట్టారు. కటిక చీకటిలో భక్తుల కోసం క్యూలైన్లు ఏర్పాటు చేయడంతో అంతా అంధకారం అలుముకుంది. గోడ కూలిపోవడంతో భక్తుల అరుపులు, రోదనలు మిన్నంటాయి. అప్పటికే భక్తుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.ఈ ఘటనపై సమగ్ర విచారణ చేసి.. మృతుల కుటుంబాలను ఆదుకోవాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం ఇవ్వాలన్నారు. అన్యాయంగా ఏడుగురు చనిపోయారు. ఘటనపై పూర్తి వివరాలు అధికారులను అడిగి తెలుసుకుంటున్నాం. సరైన చర్యలు చేపట్టకపోవడం వల్లనే ప్రమాదం జరిగిందని వరుదు కల్యాణి అన్నారు. కటిక చీకట్లో భక్తుల కోసం క్యూలైన్లా?. తిరుపతి తొక్కిసలాట ఘటన మరవకముందే. ఈ ఘటన ప్రభుత్వ వైఫల్యాన్ని బయటపెడుతోందని ఆమె అన్నారు.మరోవైపు, సింహాచలం ఘటనపై వీహెచ్‌పీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సింహాచలం సరైన రీతిలో ప్రభుత్వం చర్యలు చేపట్టలేదని.. నిర్మాణ లోపం వల్లే ప్రమాదం జరిగిందని మండిపడింది.సింహాచలంలో పాలన కాదు.. లాబీయింగ్ నడుస్తోంది. ఎండోమెంట్ వ్యవస్థ ఓ చెత్త.. భగవంతుడికి భక్తులకు దూరం చేయడమే వారిపని.. హిందువుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.. పాలకుల కబంధ హస్తాల నుంచి ఎండోమెంట్ వ్యవస్థ బయటకు వస్తేనే భక్తులకు మంచి జరుగుతోంది.. చందనోత్సవంలో ఒక ప్రణాళిక లేదు.. ఓ ప్లాన్ లేదు’’ అంటూ వీహెచ్‌పీ ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఇప్పుడే జడ్జిమెంట్లు వద్దు.. మున్ముందు కఠిన సవాళ్లు: టీమిండియా మాజీ కోచ్
వైభవ్ సూర్యవంశీ.. క్రికెట్ వర్గాల్లో ఎక్కడ చూసినా అతడి గురించే చర్చ. పద్నాలుగేళ్ల వయసులోనే టీ20 క్రికెట్లో చరిత్ర సృష్టించిన ఈ చిచ్చర పిడుగును చూసి దిగ్గజ ఆటగాళ్లే ఆశ్చర్యపోతున్నారు. ఏమాత్రం భయం లేకుండా అంతర్జాతీయ స్థాయి బౌలర్లను ఎదుర్కొన తీరు తనకు ముచ్చటగొలిపిందని భారత లెజెండరీ బ్యాటర్ సచిన్ టెండుల్కర్ వైభవ్‌ను కొనియాడాడు.అసలు పద్నాలుగేళ్ల వయసులో ఇలాంటి ఆటను అస్సలు ఊహించలేమని.. వైభవ్ మాత్రం బౌలర్లకు కాళరాత్రిని మిగిల్చి చరిత్రలో తన పేరు లిఖించుకున్నాడని మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ అబ్బురపడ్డాడు. ఇర్ఫాన్ పఠాన్, యూసఫ్ పఠాన్, రాహుల్ ద్రవిడ్, మైకేల్ హస్సీ వంటి వారంతా రాజస్తాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ ఆట తీరుపై ప్రశంసలు కురిపించారు.అయితే, టీమిండియా మాజీ కోచ్, కామెంటేటర్ రవిశాస్త్రి మాత్రం కాస్త భిన్నంగా స్పందించాడు. ఇప్పడే వైభవ్ సూర్యవంశీపై ఓ అంచనాకు రాకూడదని.. భవిష్యత్తులో అతడు కఠిన సవాళ్లు ఎదుర్కోబోతున్నాడని పేర్కొన్నాడు. వైఫల్యాలు, ఒత్తిడిని అధిగమించే తీరుపైనే అతడి ఫ్యూచర్ ఆధారపడి ఉంటుందని వ్యాఖ్యానించాడు.ఈ మేరకు ఐసీసీ రివ్యూ షోలో భాగంగా రవిశాస్త్రి.. స్పోర్ట్స్ ప్రజెంటర్ సంజనా గణేషన్‌తో మాట్లాడుతూ.. వైభవ్ అరంగేట్రంలో ఆడిన తీరు తనను ఆశ్చర్యానికి గురిచేసిందన్నాడు. అతడికి అసాధారణ నైపుణ్యాలు ఉన్నాయని కొనియాడాడు. ‘‘లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో అతడు కొట్టిన మొదటి షాట్ ప్రేక్షకులను ఊపిరి బిగపట్టేలా చేసింది.అయితే, అతడు ఇంకా చిన్న పిల్లాడే. ఈ వయసులో వైఫల్యాలను ఎలా ఎదుర్కొంటాడో కూడా చూడాలి. ముఖ్యంగా తొలి బంతినే సిక్సర్‌గా మలిచిన వైభవ్ పట్ల బౌలర్లు ఇకపై కనికరం చూపబోరు.అతడి వయసు 14 లేదంటే 12, 20 ఏళ్లా అని చూడరు. అతడి ఆటకు తగ్గట్లుగా సరైన వ్యూహాలు, ప్రణాళికలతో ముందుకు వస్తారు. అలాంటి వారిని వైభవ్ ఎలా ఎదుర్కొంటాడో చూడాలి. అప్పుడే అతడి ఆట తీరుపై సరైన అవగాహన, అంచనాకు రాగలము’’ అని రవిశాస్త్రి పేర్కొన్నాడు. క్రమశిక్షణతో ముందుకు సాగితేనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని వైభవ్‌కు ఈ సందర్భంగా సలహా ఇచ్చాడు.కాగా ఐపీఎల్-2025 మెగా వేలంలో రాజస్తాన్ రాయల్స్ 1.10 కోట్లకు బిహార్ కుర్రాడు వైభవ్ సూర్యవంశీని కొనుగోలు చేసింది. కెప్టెన్ సంజూ శాంసన్ గాయం కారణంగా అతడికి రాజస్తాన్ ఓపెనర్‌గా అవకాశం వచ్చింది. లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్ సందర్భంగా ఐపీఎల్లో అరంగేట్రం చేసిన వైభవ్.. ఎదుర్కొన్న తొలి బంతినే సిక్సర్‌గా మలిచి రికార్డులకెక్కాడు.ఆడిన తొలి మ్యాచ్‌లో 20 బంతులు ఎదుర్కొని 34 పరుగులు సాధించిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. చివరగా గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ముప్పై ఐదు బంతుల్లోనే శతక్కొట్టి సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఈ నేపథ్యంలో వైభవ్‌పై ప్రశంసలు కురిపిస్తూనే.. ఇక ముందు మరింత జాగ్రత్తగా ఆడాలంటూ రవిశాస్త్రి హెచ్చరించాడు. In case you missed it… 🍿🔥pic.twitter.com/rOXwTuxgyX— Rajasthan Royals (@rajasthanroyals) April 29, 2025

సింహాచలం మహా విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
సాక్షి, విశాఖపట్నం: సింహాచలం కొండపై తెల్లవారుజామున జరిగిన గోడ కూలిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. మృతులను విశాఖపట్నం మధురవాడ సమీపంలోని చంద్రంపాలెం గ్రామానికి చెందిన పిళ్లా ఉమామహేశ్వరరావు (30), ఆయన భార్య శైలజ (26)గా అధికారులు గుర్తించారు. వీరితో పాటు పిల్లా శైలజ తల్లి వెంకటరత్నం, మేనత్త గుజ్జురి మహాలక్ష్మి కూడా ఈ ఘటనలో మృతిచెందారు.అధికారులు అందించిన వివరాల ప్రకారం, ఉమామహేశ్వరరావు, శైలజ ఇద్దరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా హైదరాబాద్‌లోని వేర్వేరు సంస్థల్లో పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఇద్దరూ ఇంటి నుంచే (వర్క్ ఫ్రమ్ హోం) విధులు నిర్వర్తిస్తున్నారు. వీరికి మూడేళ్ల క్రితం వివాహం జరిగింది. స్వామివారి దర్శనం కోసం తెల్లవారుజామున 2 గంటల సమయంలో రూ. 300 ప్రత్యేక దర్శనం క్యూలైన్లో వీరు వేచి ఉన్నారు. అదే సమయంలో అక్కడున్న ఒక గోడ ఒక్కసారిగా కూలి వారిపై పడటంతో తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందారు.ఉమామహేశ్వరరావు, శైలజ దంపతులు ఎంతో అన్యోన్యంగా ఉండేవారని, అందరితో కలివిడిగా మెలిగేవారని స్థానికులు, బంధువులు చెబుతున్నారు. ఉన్నత చదువులు చదివి, మంచి ఉద్యోగాలు చేస్తూ స్థిరపడుతున్న సమయంలో ఇలా అర్ధాంతరంగా తనువు చాలించడం వారి కుటుంబ సభ్యులను, బంధుమిత్రులను తీవ్ర విషాదంలో ముంచెత్తింది. వారి స్వగ్రామమైన చంద్రంపాలెంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ దురదృష్టకర సంఘటనపై పలువురు విచారం వ్యక్తం చేస్తున్నారు.

తక్కువ ధరకే బంగారం కావాలా!
అక్షయ తృతీయ కారణంగా ఈరోజు చాలామంది బంగారం కొనేందుకు షాపుల ముందు బారులు తీరుతున్నారు. దేశంలో పసిడి ధరలు దాదాపు తులం రూ.లక్షకు చేరువయ్యాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా భారీగా పెరుగుతున్న బంగారం ధర త్వరలో తులం రూ.ఒక లక్షకు చేరుతుందని కొందరు అంచనా వేస్తున్నారు. అయితే ప్రపంచంలోని కొన్ని దేశాల్లో భారత్ కంటే తక్కువ ధరకే బంగారం లభిస్తుంది. వాటి వివరాలు కింద తెలుసుకుందాం.దుబాయ్, యుఏఈఈ దేశం ‘బంగారు నగరం’గా ప్రసిద్ధి చెందింది. బంగారంపై తక్కువ పన్నులు ఉండడంతో ఇక్కడ అత్యంత సరసమైన ధరలకే పసిడి లభిస్తుంది. ఇక్కడ బంగారం సాధారణంగా భారతదేశం కంటే 10-15 శాతం చౌకగా ఉంటుంది. యూఏఈలో బంగారంపై విలువ ఆధారిత పన్ను(వ్యాట్) లేకపోవడం గమనార్హం. దీనికితోడు దిగుమతి సుంకాలు తక్కువగా ఉండడంతో సరసమైన ధరలకు బంగారాన్ని కొనుగోలు చేయాలనుకునే భారతీయులు ఈ దేశాన్ని అన్వేశిస్తున్నారు.థాయ్‌లాండ్‌ఇక్కడ బ్యాంకాక్, పట్టాయా బంగారం కొనుగోలుకు ప్రసిద్ధ ప్రదేశాలు. తక్కువ మేకింగ్ ఛార్జీలు, పన్నుల కారణంగా భారత్‌తో పోలిస్తే ఈ దేశం తక్కువ ధరకే బంగారు ఆభరణాలను అందిస్తోంది. సాధారణంగా థాయ్‌లాండ్‌లో బంగారం భారత్ కంటే 5-10 శాతం చౌకగా ఉంటుంది. ఆ దేశంలో తక్కువ తయారీ ఖర్చులు, బంగారంపై స్వల్పంగా పన్నులు విధిస్తున్నారు. భారత్‌తో పోలిస్తే సాపేక్షంగా తక్కువ మేకింగ్ ఛార్జీలతో బంగారు ఆభరణాలు లభిస్తాయి.సింగపూర్తక్కువ పన్నులు, బంగారం ధరల్లో పోటీ కారణంగా గోల్డ్ షాపింగ్‌కు సింగపూర్ కీలక గమ్యస్థానంగా ఉంది. నాణ్యమైన బంగారాన్ని విక్రయించడంలో ఈ దేశానికి మంచి పేరు ఉంది. ఇక్కడ ధరలు భారతదేశం కంటే 5-8 శాతం చౌకగా ఉంటాయి. ఈ దేశంలో గ్రేడ్ బంగారంపై జీఎస్టీ లేదు. దాంతో చౌకగా లభిస్తుంది.మలేషియాకౌలాలంపూర్‌లో సరసమైన బంగారం ధరలు ఉన్నాయి. తక్కువ తయారీ ఛార్జీలు, పన్నుల కోసం చూస్తున్న భారతీయ కొనుగోలుదారులను ఆకర్షిస్తున్నాయి. ఈ దేశంలో పోటీ ధరలను అందించే అనేక దుకాణాలు ఉన్నాయి. మలేషియాలో బంగారం భారతదేశం కంటే 5-10 శాతం చౌకగా ఉంటుంది. బంగారంపూ తక్కువ పన్నులు, మేకింగ్ ఛార్జీలను అందిస్తున్నారు.ఇదీ చదవండి: భారత్‌లో ఫాక్స్‌కాన్ ఆదాయం రూ.1.7 లక్షల కోట్లుహాంగ్ కాంగ్హాంగ్ కాంగ్ బంగారం, విలువైన లోహాలపై పన్ను మినహిస్తుంది. దాంతో తక్కువ ధరలకు లభిస్తాయి. ఈ దేశం బంగారం ట్రేడింగ్‌కు ప్రధాన కేంద్రంగా ఉంది. పోటీ ధరల కారణంగా చాలా మంది భారతీయులు ఇక్కడ బంగారాన్ని కొనుగోలు చేస్తారు. హాంకాంగ్‌లో బంగారం సాధారణంగా భారతదేశం కంటే 5-10 శాతం చౌకగా ఉంటుంది.

నాదేం లేదు.. దీనంతటికీ కారణం నా భార్య: స్టార్ హీరో
తమిళ హీరోల్లో అజిత్ కాస్త డిఫరెంట్. సినిమాలు చేసి ప్రేక్షకుల్ని అలరించడం తప్పితే మిగతా విషయాల్లో పెద్దగా తలదూర్చడు. తన పనేదో తాను అన్నట్లు ఉంటాడు. కారే రేసింగ్ లో ఈ మధ్య కాలంలో రఫ్ఫాడిస్తున్నాడనే చెప్పాలి. ఈసారి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పద్మభూషణ్ ఇతడిని వరించింది. తాజాగా ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి చేతుల మీదుగా అజిత్ ఈ పురస్కారం అందుకున్నాడు.(ఇదీ చదవండి: 'కోర్ట్'ని మించిపోయేలా ఉంటుంది.. ఓటీటీ డేట్ ఫిక్స్) ఈ క్రమంలోనే కుటుంబంతో కలిసి ఢిల్లీ వెళ్లిన అజిత్.. పద్మ భూషణ్ పురస్కారాన్ని అందుకున్నాడు. అయితే తను ఇలా ఉండటానికి భార్యనే కారణం అని చెబుతూ మొత్తం క్రెడిట్ ఆమెకే ఇచ్చేశాడు. తాజాగా ఓ ఇంగ్లీష్ వెబ్ సైట్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశాడు.'ఇప్పటికీ సామాన్యుడిలానే ఆలోచిస్తాను. ఇంత ఎత్తు ఎదిగానా అని ఒక్కోసారి ఆశ్చర్యం వేస్తుంటుంది. దీనంతటికీ నా భార్య షాలినినే కారణం. ఎందుకంటే నా కోసం చాలా త్యాగాలు చేసింది. ప్రతిదానిలో నాకు తోడుంది. ఒక్కోసారి కరెక్ట్ నిర్ణయాలు తీసుకోలేకపోయాను. ఆ టైంలోనూ షాలిని నాకు అండగా నిలిచింది తప్పితే నిరుత్సాహపరచలేదు'(ఇదీ చదవండి: థియేటర్, ఓటీటీలో బ్లాక్ బస్టర్.. ఇప్పుడు సీక్వెల్!)'నా జీవితంలో సాధించిన సక్సెస్ క్రెడిట్ అంతా షాలినికే ఇస్తాను. నటిగా ఎంతో గుర్తింపు ఉన్నప్పటికీ నాకోసం అన్నింటినీ వదులుకుంది. ఆమెకు చాలామంది అభిమానులున్నారు. వాళ్లకు నా థ్యాంక్స్. నేను కేవలం యాక్టర్ నే. సూపర్ స్టార్ అని పిలిపించుకోవడం నచ్చదు. అలాంటి ట్యాగ్స్ పై నాకు నమ్మకం లేదు' అని అజిత్ చెప్పుకొచ్చాడు.తమిళ హీరోగా అజిత్ చాలా ఫేమస్. హీరోయిన్ గా కలిసి పనిచేసిన షాలిని.. 2000లో ఇతడిని పెళ్లిచేసుకుంది. అప్పటినుంచి సినిమాలు, నటనకు దూరమైంది. ఈ జంటకు కొడుకు-కూతురు ఉన్నారు.(ఇదీ చదవండి: అల్లు అర్జున్ కోసం ఫ్లాపుల హీరోయిన్?)

ఢిల్లీలో పారని బాబు పాచిక!
సాక్షి, అమరావతి : బీజేపీ రాజ్యసభ అభ్యర్థిత్వం ఖరారులో ముఖ్యమంత్రి చంద్రబాబు నడిపిన మంత్రాంగం పని చేయలేదు. ఆయన్ను పట్టించుకోకుండా పార్టీకి చెందిన ముఖ్య నేత పాకా సత్యనారాయణను బీజేపీ అగ్ర నాయకత్వం ఎంపిక చేసింది. విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానాన్ని బీజేపీ తన ఖాతాలో వేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ స్థానాన్ని బీజేపీలో తనకు అనుకూలంగా ఉండే వారికి ఇప్పించుకోవడానికి చంద్రబాబు తెర వెనుక శాయశక్తులా ప్రయత్నించినట్లు తెలిసింది. ఇటీవల రెండుసార్లు ఢిల్లీ వెళ్లినప్పుడు కూడా ఈ విషయం గురించి ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌షాతో మాట్లాడినట్లు సమాచారం. కానీ వారు చంద్రబాబు సూచనను పరిగణనలోకి తీసుకోలేదని తెలుస్తోంది. ఆయన ఒక నాయకుడి పేరు చెప్పి ఆయనకు ఇస్తే కూటమికి ఉపయోగం ఉంటుందని తన మాయజాలంతో బీజేపీ పెద్దలను ఒప్పించేందుకు యత్నించారు. ఆ వ్యక్తికే అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయించేందుకు బీజేపీలోని తన మనుషులతో గట్టి లాబీయింగ్ కూడా చేయించారు. బీజేపీలో ఉంటూ చంద్రబాబు కోసం పనిచేసే నేతలు అటు ఢిల్లీలో, ఇటు రాష్ట్రంలో చాలా మంది ఉన్నారు. ముఖ్యమైన స్థానాల్లో ఉన్న వారంతా చంద్రబాబు సూచించిన వ్యక్తికి సీటు ఇప్పించేందుకు గట్టిగా ప్రయత్నించారు. కానీ బీజేపీ పెద్దలు మాత్రం అవేమీ పట్టించుకోకపోవడం విశేషం.రకరకాల ప్రచారాలు..ఎత్తులుతాను సూచించిన అభ్యర్థికి రాజ్యసభ అభ్యర్థిత్వం వచ్చే అవకాశం లేదని తెలిశాక, మొదటి నుంచి బీజేపీలోనే ఉంటూ ఇప్పుడు రేసులో ఉన్న నాయకుల్లో తనకు అనుకూలంగా ఉండే ఒక నేతను చంద్రబాబు ప్రోత్సహించినట్లు తెలిసింది. ఒక దశలో ఈ సీటును తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా పనిచేసిన అన్నామలైకి ఇస్తారనే ప్రచారం జరిగింది. కానీ బీజేపీ అనూహ్యంగా భీమవరానికి చెందిన ఆ పార్టీ సీనియర్ నేత పాకా సత్యనారాయణను ఎంపిక చేసింది. ఈ పేరు ఖరారైన తర్వాతే ఆయన గురించి అందరికీ తెలిసింది. నిజానికి ఒరిజినల్ బీజేపీకి చెందిన నేతలు చాలా మంది మాత్రం ఆయనకు అవకాశం ఉంటుందని భావించారు. కొద్ది రోజుల క్రితం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లోనే ఆయన పేరు బలంగా వినిపించింది. కానీ ఆ సీటును సోము వీర్రాజుకు కేటాయించారు. దీంతో ఇప్పుడు పాకా సత్యనారాయణకు రాజ్యసభ అవకాశం దక్కింది. ఈయనతో పాటు ప్రస్తుత కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, సోము వీర్రాజు వంటి వారంతా సుదీర్ఘకాలం నుంచి బీజేపీలో ఉంటూ ఆ పార్టీ కోసం క్రమశిక్షణతో పని చేస్తున్న వారుగా పేరుంది. చంద్రబాబుకు షాకే!చంద్రబాబు బీజేపీతో పొత్తు ఉన్నప్పుడు, లేనప్పుడు కూడా తనకు అనుకూలంగా ఉండే వారిని విడతల వారీగా బీజేపీలోకి పంపారు. ప్రస్తుత ఎమ్మెల్యేలు సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్, ఆదినారాయణరెడ్డి, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ వంటి చాలా మంది చంద్రబాబు అనుయాయులే. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరి చంద్రబాబుకు స్వయానా వదిన. ఈ నేపథ్యంలో ఏపీ బీజేపీలో సగం మంది చంద్రబాబు వర్గానికి చెందిన వారే కనిస్తారు. తద్వారా బీజేపీకి కేటాయించిన ఏ పదవినైనా తన వర్గంలోని ఎవరో ఒకరికి ఇప్పించేందుకు చంద్రబాబు ప్రయత్నిసూ్తనే ఉన్నారు. చాలా సందర్భాల్లో ఆయన మనుషులకే పదవులు కూడా దక్కాయి. కానీ కొద్ది కాలంగా బీజేపీ బాబు వ్యవహారాన్ని గమనించి సొంత నిర్ణయాలు తీసుకుంటోంది. ఫలితంగా శ్రీనివాసవర్మకు కేంద్ర మంత్రి పదవి, సోము వీర్రాజుకు ఎమ్మెల్సీ, ఇప్పుడు పాకా సత్యనారాయణకు రాజ్యసభ పదవులు దక్కాయి. ఈ నిర్ణయాలు ఒకరకంగా చంద్రబాబుకు షాక్‌లేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

రెండు సార్లు ఫెయిల్ అయ్యా... పట్టుదలతో నాన్న కల నెరవేర్చా..
‘నన్ను కలెక్టర్‌గా చూడాలనేది మా నాన్న కోరిక.. దాన్ని ఎలాగైనా నెరవేర్చాలని పాఠశాల స్థాయిలోనే నిర్ణయించుకున్నా.. ఆయన అందించిన ప్రోత్సాహంతో ముందుకు సాగా.. రెండుసార్లు విఫలమయ్యా.. అయినా నిరాశ చెందలేదు.. రాత్రింబవళ్లు మరింత కష్టపడి చదివా.. లోటుపాట్లు సవరించుకుని ముందడుగు వేశాను. మూడో ప్రయత్నంలో విజయం సాధించా.. 2023 యూపీఎస్సీ ఫలితాల్లో జాతీయ స్థాయిలో 29వ ర్యాంకు సాధించా.. ఐఏఎస్‌గా తెలంగాణ క్యాడర్‌కు ఎంపికయ్యా.. నాన్న కల నెరవేర్చడం నాకెంతో ఆనందాన్నిచ్చింది. ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలను అమలు చేసి, పేదలకు సేవ చేయడమే లక్ష్యమని అంటున్నారు జిల్లాకు నూతనంగా విచ్చేసిన ట్రెయినీ కలెక్టర్ సలోని చాబ్రా (Saloni Chhabra). ‘సాక్షి’కి మంగళవారం ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె పలు విషమాలు వెల్లడించారు.-కైలాస్నగర్సాక్షి: ‘గుడ్ మార్నింగ్ మేడమ్.. వెల్కమ్ టు ఆదిలాబాద్. ట్రెయినీ కలెక్టర్‌గా జిల్లాకు విచ్చేసిన మీకు మరోసారి ప్రత్యేక అభినందనలు. మీ కుటుంబ నేపథ్యం వివరాలు.. ట్రెయినీ కలెక్టర్: మాది హర్యానా రాష్ట్రంలోని గురుగ్రాం. నాన్న ఇంద్రజిత్, అమ్మ సీమ. ఇద్ద రూ గురుగ్రాంలోనే బిజినెస్ చేస్తుంటారు. అన్న గ్రాడ్యూయేషన్ పూర్తి చేశాడు. ఊరిలోనే అమ్మనాన్నలకు తోడుగా ఉంటూ వ్యాపారం చూసుకుంటారు.ఇదీ చదవండి: మనవడితో 50 ఏళ్ల మహిళ పెళ్లి : ఫ్యామిలీని లేపేసేందుకు కుట్ర?సాక్షి: మీ విద్యాభ్యాసం ఎక్కడెక్కడ సాగింది..ట్రెయినీ కలెక్టర్: ఒకటి నుంచి ఇంటర్మీడియెట్ వరకు గురుగ్రాంలోని బ్లూ బెల్స్‌లో చదివా. చిన్నతనం నుంచే చదువులో ముందుండేదాన్ని. స్కూల్లో నిర్వహించే డిబేట్లు, ఎక్స్ట్రా కరిక్యూలమ్‌లో పాల్గొంటూ ప్రతి భ కనబర్చుతుండేది. చదువులో ఎప్పుడూ ముందుండే నేను టెన్త్, ఇంటర్లో ఫస్ట్‌క్లాస్ లో పాసయ్యా. అనంతరం ఢిల్లీలోని శ్రీరాం కాలేజ్ ఆఫ్ కామర్స్ యూనివర్సిటీలో బీఏ ఆనర్స్ ఎకానావిుక్స్ పూర్తి చేశాను. ఆ వెంటనే సివిల్స్ పరీక్షలపై దృష్టి సారించాను. సాక్షి: యూపీఎస్సీ కోచింగ్ ఎక్కడ తీసుకున్నారు.. ఎన్నోసారి విజయం సాధించారు..ట్రెయినీ కలెక్టర్: పదో తరగతిలోనే ఐఏఎస్ సాధించాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నా. ఆ దిశగా అడుగులు వేశాను. ఢిల్లీలోని కోచింగ్ సెంటర్లో ఏడాది పాటు శిక్షణ పొందాను. ఆప్షనల్ సబ్జెక్ట్‌గా సోషియాలజీని ఎంచుకు న్నా. ప్రణాళికాబద్ధంగా చదివా. 2021లో తొలిసారి యూపీఎస్సీ పరీక్షలకు హాజరయ్యా. ఇంటర్వ్యూ వరకు వెళ్లాను. అయితే కొద్దిపాటి తేడాతో విజయం సాధించలేకపోయాను. మరో ప్రయత్నంలో ప్రిలిమ్స్‌లోనే ఆగిపోయాను. అయినా నిరాశ చెందలేదు. మూడో ప్రయత్నం 2023లో జాతీయస్థాయిలో 29వ ర్యాంకు సాధించాను. ఐఏఎస్ కావాలనే నా సంకల్పంతోపాటు నాన్న కలను నెరవేర్చాను. తెలంగాణ క్యాడర్‌కు ఎంపికై ప్రస్తుతం ట్రైనింగ్ నిమిత్తం ఆదిలా బాద్‌కు రావడం జరిగింది. ఏడాది పాటు జిల్లాలో పని చేయాల్సి ఉంటుంది. రెండుసార్లు విఫలమైన సమయంలో నేను ఆత్మవిశ్వాసం కోల్పోకుండా అమ్మనాన్నలు అండగా నిలిచారు. వెన్నుతట్టారు. వారందించిన ప్రోత్సాహం తోనే విజయం సాధించాను. సివిల్స్, ఇతర పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే యువతకు మీరిచ్చే సలహా.. ట్రెయినీ కలెక్టర్: సివిల్ సర్వీసెస్‌కు సన్నద్ధమయ్యే అభ్యర్థుల్లో చాలా మంది ఒకటి, రెండు ప్రయత్నాలకే నిరాశకు లోనవుతారు. ఇక మా వల్ల కాదంటూ వెనుకడుగు వేస్తుంటారు. అపజయాలను చూసి నిరాశ చెందొద్దు. సంకల్పం వీడకుండా ముందుడుగు వేయాలి. పట్టుదలతో ప్రణాళికాబద్ధంగా చదివితే తప్పకుండా విజయం సాధించవచ్చు. రోజుకు కనీసం 8 నుంచి 10 గంటలు చదవాలి. ముఖ్యంగా సెల్‌ఫోన్, సోషల్ మీడియాకు దూరంగా ఉండాలి. ప్రతిరోజు పత్రికలను చదవడం అలవాటు చేసుకోవాలి. వర్తమాన అంశాలపై పట్టు సాధించాలి. గత ప్రశ్నాపత్రాలను విశ్లేషించుకోవాలి. సందేహాలుంటే ఎప్పటికప్పుడు నివృత్తి చేసుకోవాలి. ఆత్మవిశ్వాసం, సంకల్పబలంతో ప్రయత్నిస్తే తప్పకుండా లక్ష్యాన్ని సాధించవచ్చు.

అక్షయ ఫలాలనిచ్చే అక్షయ తృతీయ..!
వైశాఖ శుద్ధ తదియనే అక్షయ తృతీయగా జరుపుకుంటారు. ఈ రోజునే సింహాచల వరాహ నరసింహ స్వామి వారి చందనోత్సవం కూడా జరుగుతుంది. స్వామి వారు భక్తులకు నిజరూప దర్శనం ఇస్తారు. అక్షయ తృతీయ ప్రాముఖ్యతలు చాలా ఉన్నాయి. అందులో కొన్ని చూద్దాం1. పరశురాముని జన్మదినం.2. పవిత్ర గంగా నది భూమిని తాకిన పర్వదినం.3. త్రేతాయుగం మొదలైన దినం.4. శ్రీకృష్ణుడు తన బాల్యమిత్రుడైన కుచేలుని కలుసుకొన్న దినం.5. వ్యాస మహర్షి “మహా భారతము”ను, వినాయకుని సహాయముతో , వ్రాయడం మొదలుపెట్టిన దినం.6. సూర్య భగవానుడు అజ్ఞాతవాసములో వున్న పాండవులకు “అక్షయ పాత్ర” ఇచ్చిన దినం.7. శివుని ప్రార్థించి కుబేరుడు శ్రీమహాలక్ష్మితో సమస్త సంపదలకు సంరక్షకునిగా నియమింపబడిన దినం.8. ఆదిశంకరులు “కనకధారాస్తవం” ను చెప్పిన దినం.9. అన్నపూర్ణా దేవి తన అవతారాన్ని స్వీకరించిన దినం.10. ద్రౌపదిని శ్రీకృష్ణుడు దుశ్శాసనుని బారినుండి కాపాడిన దినం.అక్షయ తృతీయ నాడు మనం చేపట్టిన ఏ కార్య ఫలమైనా , (అది పుణ్యం కావచ్చు , లేదా పాపం కావచ్చు) అక్షయంగా , నిరంతరం , జన్మలతో సంబంధం లేకుండా , మన వెంట వస్తూనే ఉంటుంది. పుణ్య కర్మలన్నీ విహితమైనవే. అందునా ఆ రోజు ఓ కొత్త కుండలో గానీ , కూజాలో గానీ , మంచి నీరు పోసి , దాహార్తులకు శ్రధ్ధతో సమర్పిస్తే, ఎన్ని జన్మలలోనూ, మన జీవుడికి దాహంతో గొంతు ఎండి పోయే పరిస్థితి రాదు. అతిథులకు , అభ్యాగతులకు , పెరుగన్నంతో కూడిన భోజనం సమర్పిస్తే , ఏ రోజూ ఆకలితో మనం అలమటించవలసిన రోజు రాదు. వస్త్రదానం వల్ల తదనుగుణ ఫలితం లభిస్తుంది. అర్హులకు స్వయంపాకం , దక్షిణ , తాంబూలాదులు సమర్పించుకుంటే , మన ఉత్తర జన్మలలో, వాటికి లోటు రాదు. గొడుగులు , చెప్పులు , విసన కర్రల లాటివి దానం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఆ రోజు నిషిధ్ధ కర్మల జోలికి వెళ్ళక పోవడం ఎంతో శ్రేయస్కరం. అక్షయ తృతీయ అదృష్టాన్ని, విజయాన్ని చేకూర్చుతుంది అని పౌరాణిక ఉదంతాలు కొన్ని చెబుతున్నాయి.బంగారానికీ అక్షయ తృతీయకీ సంబంధం ఏమిటి ?మన సంస్కృతిలో ప్రతి పండుగ వెనుకా ఓ కారణం కనిపిస్తుంది. కాకపోతే ఒక్కోసారి ఆ కారణాన్ని మర్చిపోయి , ఆచరణకే ప్రాధాన్యతని ఇస్తూ ఉంటాము. అందుకు ఉదాహరణే అక్షయ తృతీయ. అక్షయ తృతీయ రోజున బంగారం కొనితీరాల్సిందే అన్న స్థాయిలో ఇప్పుడు ఆలోచిస్తున్నారు. నిజంగా అక్షయ తృతీయ రోజు బంగారం కొనాల్సిందేనా ! అసలు బంగారానికీ అక్షయ తృతీయకీ సంబంధం ఏమిటి ?అక్షయ తృతీయ రోజున బంగారం కొనితీరాలని ఏ శాస్త్రంలోనూ లేదు. కాకపోతే ఈ రోజున ఏ కార్యాన్ని తలపెట్టినా నిర్విఘ్నంగా సాగుతుందని , ఏ పుణ్య కర్మని ఆచరించినా కూడా దాని ఫలితాలు అక్షయంగా లభిస్తాయని పురాణాలు పేర్కొంటున్నాయి. అందుకనే అక్షయ తృతీయ రోజున తప్పకుండా దానధర్మాలు చేయాలని చెబుతారు. ముఖ్యంగా ఎండలు విపరీతంగా ఉండే ఈ కాలంలో ఉదకుంభదానం పేరుతో నీటితో నింపిన కుండను దానం ఇవ్వమని పెద్దలు సూచిస్తూ ఉంటారు.అక్షయ తృతీయనాడు విష్ణుమూర్తిని పూజించాలని మత్స్య పురాణం పేర్కొంటోంది. విష్ణుమూర్తి పాదాలను అక్షతలతో అర్చించి , ఆ అక్షతలను దానం చేస్తే విశేషమైన ఫలితం వస్తుందని చెబుతోంది. జపం, హోమం, వ్రతం, పుణ్యం , దానం... ఇలా అక్షయ తృతీయ నాడు చేసే ప్రతి పనీ అనంతమైన ఫలితాన్నిస్తుందని మాత్రమే మతగ్రంథాలు పేర్కొంటున్నాయి. అక్షయ తృతీయనాడు వివాహం చేసుకుంటే ఆ బంధం చిరకాలం నిలుస్తుందనీ, జాతకరీత్యా వివాహబంధంలో ఎలాంటి దోషాలు ఉన్నా తొలగిపోతాయని నమ్ముతారు.అక్షయ తృతీయ రోజున ఏ పని చేసినా అక్షయమైన ఫలితం దక్కుతుంది కాబట్టి , ఈ రోజున బంగారాన్ని కొనుగోలు చేస్తే... మన సంపదలు కూడా అక్షయం అవుతాయన్న నమ్మకం మొదలైంది. అయితే కష్టపడో , అప్పుచేసో , తప్పు చేసో సంపదను కొనుగోలు చేస్తే మన కష్టాలు , అప్పులు , పాపాలు కూడా అక్షయంగా మారే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు పెద్దలు.అక్షయ తృతీయ రోజున వర్జ్యం , రాహుకాలంతో పనిలేదు''వైశాఖ శుక్ల పక్షోతు తృతీయ రోసిణి యుతాదుర్లభా బుధచారేణ సోమనాపి ఉతా తథా''మత్స్య పురాణంలో 65వ అధ్యాయం ప్రకారం ఈశ్వరుడు పార్వతీదేవికి అక్షయ తృతీయ వ్రతం గూర్చి చెప్పాడు. వైశాఖ శుద్ధ తదియ రోజున చేసే ఏ వ్రతమైనా , జపమైనా , దానాలు ఏవైనా సరే అక్షయమౌతుంది.పుణ్యకార్యాచరణతో వచ్చే ఫలితం అక్షయమైనట్లే , పాపకార్యాచరణతో వచ్చే పాపం అక్షయమే అవుతుంది. అక్షయ తృతీయ రోజున ఉపవాస దీక్ష చేసి ఏ పుణ్య కర్మనాచరించినా అక్షయముగా ఫలము లభిస్తుంది. అక్షయుడైన విష్ణువును పూజిస్తున్నందునే దీనికి అక్షయ తృతీయ అని పేరు వచ్చింది. ఈ రోజున ఏ శుభకార్యాన్నైనా వారం, వర్జ్యం, రాహుకాలం వగైరాలతో నిమిత్తం లేకుండా జరుపుకోవచ్చునని పండితులు చెప్తున్నారు. ఇందులో పిల్లలను పాఠశాలలో చేర్చడం, పుస్తకావిష్కరణ, పుణ్యస్థలాలను సందర్శించడం మంచి కార్యాలను చేయవచ్చునని పురోహితులు అంటున్నారు.ఇంకా గృహ నిర్మాణం , ఇంటిస్థలం కొనడం , బావి తవ్వడం వంటి పలు శుభకార్యాలను ప్రారంభించడం ద్వారా మంచి ఫలితాలు చేకూరుతాయని విశ్వాసం. అలాగే అక్షయ తృతీయనాడు శ్రీ నరసింహస్వామి ప్రహ్లాదుడిని అనుగ్రహించిన రోజేనని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ పర్వదినాన పుష్పమో , ఫలమో భగవంతుడికి సమర్పించినా , దైవనామస్మరణ చేసినా , చివరికి నమస్కారం చేసినా సంపద , పుణ్యఫలం ప్రాప్తిస్తుందని ప్రతీతి.- డీ వీ ఆర్(చదవండి: Akshaya Tritiya 2025 పదేళ్లలో పసిడి పరుగు, కొందామా? వద్దా?)

Kolkata: హోటల్లో ఘోర అగ్ని ప్రమాదం.. 14 మంది సజీవ దహనం
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కోల్‌కతాలో ఘోర విషాదం చోటు చేసుకుంది. బుర్రాబజార్ ఏరియా ఫల్పట్టి మచ్చువా అనే పండ్ల మార్కెట్ సమీపంలో ఉన్న హోటల్ రుతురాజ్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 14 మంది సజీవ దహనమయ్యారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద మరణాల్ని కోల్‌కతా సీపీ మనోజ్ కుమార్ వర్మ అధికారికంగా ప్రకటించారు. ఈ ఘటన మంగళవారం రాత్రి 8:15 గంటలకు జరిగినట్లు సమాచారం. VIDEO | Kolkata hotel fire: Police Commissioner Manoj Verma says, "A fire incident was reported at Ritu Raj Hotel in Mechuapatti area at about 8:15 am on Tuesday evening. At least 15 casualties have been reported so far and several people were rescued from rooms and roof of the… pic.twitter.com/8YkIfq6oSe— Press Trust of India (@PTI_News) April 30, 2025ఈ దుర్ఘటనపై సీపీ మనోజ్ కుమార్ మాట్లాడారు.‘ అగ్ని ప్రమాదంలో సజీవ దహనమైన పద్నాలుగు మృతదేహాలను వెలికితీశాం. గాయపడిన బాధితులను మెరుగైన వైద్యం కోసం ఆస్పత్రికి తరలించాం. మంటలు అదుపులోకి వచ్చాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి’ అని అన్నారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. దీనిపై సమగ్ర దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాల్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రాణాలతో బయటపడిన పలువురు ప్రమాదంపై మాట్లాడారు. ముందుగా హోటల్ కారిడార్లలో దట్టమైన పొగకమ్ముకుంది. ఆ తర్వాత కరెంట్ పోయిందని చెప్పారు. హోటల్లో ఉన్న పలువురు ప్రాణాల్ని రక్షించుకునేందుకు హోటల్ కిటికీలను పగలగొట్టి బయటపడేందుకు ప్రయత్నించారు. మరి కొంతమంది ప్రమాదం నుంచి బయటపడే దారిలేక అలాగే గదుల్లోనే ఉండిపోయారు. అగ్ని ప్రమాదంపై సమాచారం అందుకు సిబ్బంది వారిని రక్షించేందుకు ప్రయత్నించినట్లు వెల్లడించారు.
స్థిరంగా కదలాడుతున్న సూచీలు
ఆడుకుంటూ వెళ్లి అసువులు బాసింది
క్యాబ్.. క్యా సాబ్!
ప్లంబర్లుగా మహిళా శక్తి!
IPL 2025: రసవత్తరంగా సాగుతున్న ప్లే ఆఫ్స్ రేసు.. ఏ క్షణంలో ఏమైనా జరగవచ్చు..!
అతడిని బ్యాన్ చేయండి: టీమిండియా స్టార్‌పై నెటిజన్ల ఆగ్రహం
అక్షయ ఫలాలనిచ్చే అక్షయ తృతీయ..!
ఇద్దరిని బలిగొన్న అతివేగం
నాదేం లేదు.. దీనంతటికీ కారణం నా భార్య: స్టార్ హీరో
తక్కువ ధరకే బంగారం కావాలా!
సింహాచలం అప్పన్న సన్నిధిలో అపశ్రుతి.. ఏడుగురు భక్తులు మృతి
తిరుపతి తొక్కిసలాట ఘటన మరవకముందే..
సింహాచలం చందనోత్సవంలో ఘోర అపశ్రుతి
వివాహేతర సంబంధం.. భార్య కళ్లెదుటే ప్రియుడ్ని..
తక్కువ ధరకే బంగారం కావాలా!
సింహాచలంలో ఘోర విషాదం.. చంద్రబాబు సర్కారుపై వీహెచ్‌పీ ఆగ్రహం
సింహాచలం మహా విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
Kolkata: హోటల్లో ఘోర అగ్ని ప్రమాదం.. 14 మంది సజీవ దహనం
Vishakha: సింహాచలం ఘటనపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
IPL 2025: రసవత్తరంగా సాగుతున్న ప్లే ఆఫ్స్ రేసు.. ఏ క్షణంలో ఏమైనా జరగవచ్చు..!
అక్షయ ఫలాలనిచ్చే అక్షయ తృతీయ..!
DC VS KKR: చరిత్ర సృష్టించిన సునీల్ నరైన్
పహల్గాం ఉగ్రదాడి మృతులకు నివాళులర్పించిన కేతిరెడ్డి
థియేటర్, ఓటీటీలో బ్లాక్ బస్టర్.. ఇప్పుడు సీక్వెల్!
హైదరాబాద్‌లో ఆజాద్ ఇంజినీరింగ్ తయారీ ప్లాంటు
నాదేం లేదు.. దీనంతటికీ కారణం నా భార్య: స్టార్ హీరో
అల్లు అర్జున్ కోసం ఫ్లాపుల హీరోయిన్?
కెనడా కొత్త ప్రధానిగా మార్క్ కార్నీ
ఓటీటీలోకి వచ్చేసిన ఆంథాలజీ.. తెలుగులో స్ట్రీమింగ్
ఈ రాశి వారికి వృత్తి, వ్యాపారాలలో అనుకూలం
ఇండస్ఇండ్ సీఈఓ రాజీనామా!
ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం: మరో 195 మంది ట్రైనీలు..
ఇద్దరిని బలిగొన్న అతివేగం
మళ్లీ ఐపీవోల సందడి..!
అక్షయ తృతీయ.. రూ.16,000 కోట్ల అమ్మకాలు
పాక్ విమానాలకు నో ఎంట్రీ
Vaibhav Suryavanshi: ఈ ‘వైభవం’ కొనసాగాలి!
జూన్‌లో ఫిక్స్
రెండు సార్లు ఫెయిల్ అయ్యా... పట్టుదలతో నాన్న కల నెరవేర్చా..
చుట్టుముట్టి చంపేశారు
గజం రూ.లక్షల్లో ఉంటే ఎకరా 99 పైసలకే ఇచ్చేస్తారా?
ఢిల్లీలో పారని బాబు పాచిక!
ప్రభుత్వం విచక్షణాధికార పరిధిని దాటితే ఎలా?
ఓటీటీ జోరు... డిజిటల్ మీడియా హోరు
శ్రీశైలం డ్యామ్‌కు తక్షణమే మరమ్మతులు చేయాలి
రాజకీయ ప్రేరేపిత చర్య
రన్ వేపై రెక్కల ముక్కలు
ప్రతిష్టాత్మకంగా ‘మిస్ వరల్డ్’
లిబరల్ పార్టీ విజయం
కెమిస్ట్రీలో మూలకాలు.. ఫిజిక్స్‌లో థర్మోడైనమిక్స్
సోలార్ కాంట్రాక్టుల్లో అవకతవకలేమీ జరగలేదు
DC vs KKR: నైట్‌రైడర్స్ గెలుపు బాట
సూచీలకు స్వల్ప లాభాలు
బజాజ్ ఫైనాన్స్ బోనస్ బొనాంజా
కెనడాలో లిబరల్స్‌కు పట్టం
కొడుకు మృతదేహంతో మూడురోజులు
ఆడుకుంటూ వెళ్లి అసువులు బాసింది
అతడిని బ్యాన్ చేయండి: టీమిండియా స్టార్‌పై నెటిజన్ల ఆగ్రహం
బైబిల్... షేక్స్పియర్... అగథా క్రిస్టీ!
జనసేన కార్యాలయం వద్ద పీఈటీ అభ్యర్థుల నిరసన
ఎన్ఎఫ్హెచ్సీ.. సేవల్లో భేష్
ఎన్జీ రంగా అగ్రి వర్సిటీ వజ్రోత్సవాలు ప్రారంభం
అంతులేని అవినీతి.. అంతా అరాచకం: వైఎస్ జగన్
పార్లమెంట్‌ను సమావేశపర్చండి
ఎన్క్రిప్టెడ్ యాప్స్ ద్వారా డ్రగ్స్ దందా
కొత్త షెల్టర్ జోన్లకు మావో అగ్రనేతలు?
భూభారతిలో తప్పు చేస్తే కఠిన చర్యలు
పాస్‌బుక్ ఉంటే తహసీల్దార్.. లేదంటే ఆర్డీవోకు
సైన్యానికి పూర్తి స్వేచ్ఛ; ప్రధాని మోదీ
ఇంగ్లండ్ మహిళల జట్టు కొత్త కెప్టెన్‌గా సీవర్ బ్రంట్
స్నేహ్ మాయాజాలం
'వేతన యాతన'!
ఏడాదిలో ఎనిమిది!
మన రాష్ట్రంలో వీధి వీధికి బెల్ట్‌షాపులు తొలగించాలి సార్!
ఇంతకూ పరిష్కారం ఏమిటి?
నివేదిక అందించాలని డిప్యూటీ డైరెక్టర్ ఆదేశం
శ్రీవారి క్షేత్రంలో భక్తజన సందోహం
Akshaya Tritiya : ధగధగల వెనుక దగా!
ష్యూరిటీ ఇచ్చేముందే జాగ్రత్త పడాలి..!
చదివేది ఏడో తరగతి.. వాడేది ఐ ఫోన్
డాల్ఫిన్.. నాట్ ఫైన్!
విద్యా రుణం.. నిబంధనలు శరాఘాతం
ఏజెన్సీలో ఎదురుకాల్పులు
అధ్యక్షుడి కోసం.. నిరీక్షణ తప్పదా?
పాక్‌కు భారత ఫార్మా ఉత్పత్తులు బంద్!
నేడు కేంద్ర కేబినెట్ భేటీ
మళ్లీ ఓడిన భారత బ్యాడ్మింటన్ జట్టు
నిజాయితీగా పనిచేయండి
బొలేరో వాహనం ఢీకొని కూలీకి తీవ్ర గాయాలు
బసినికొండ ప్రభుత్వ స్థలంలో హెచ్చరిక బోర్డు
సెలవులొచ్చాయి ఆడించండి... చదివించండి..
వాటర్‌లో వార్
నాళం వారి సత్రం భూముల కౌలు వేలం వాయిదా
IPL 2025: కేకేఆర్ ఈజ్ బ్యాక్.. ఢిల్లీపై గ్రాండ్ విక్టరీ
IPL 2025: పదేళ్ల వయసులోనే 90 మీటర్ల భారీ సిక్సర్లు కొట్టాడు, ఇదెంత: వైభవ్ కోచ్ ఓఝా
తండ్రి త్యాగం, పట్టుదలతో 13 ఏళ్లకే కోటీశ్వరుడు.. ఇదీ టాలెంట్!
ముద్దుల మూట, మనసెలా వచ్చింది : వైద్యురాలి వీడియో వైరల్
చెల్లికి ఆస్తిలో వాటా.. తల్లిదండ్రులను ట్రాక్టర్‌తో ఢీకొట్టి..
పార్శిల్ సర్వీస్ సెంటర్ల తనిఖీ
ఇందిరమ్మ ఇంటికి రుణం
విద్యుత్ రంగ ప్రైవేటీకరణ తగదు
ఆఖరి నిమిషంలో వేలంలోకి ఎంట్రీ ఇచ్చిన డేంజరస్ బౌలర్
Hyderabad: సెకండ్ హ్యాండ్ బైక్‌లకు వడ్డీల మీద వడ్డీ
బ్యాగ్ సర్దుకోవాలన్నారు.. కంగనా గెలిచి చూపించింది
ఎందుకీ కన్ఫ్యూజన్?.. చంద్రబాబుపై సీపీఐ రామకృష్ణ సెటైర్లు
పర్యావరణ హిత: ఈ చిత్రాన్ని మీకు సమర్పిస్తున్న వారు...
పెట్టుబడుల కొనసాగింపుపై సెబీ ఛైర్మన్ సూచనలు
సింహాచలం ఘటనపై ప్రధాని మోదీ విచారం
భారత్‌లో ఫాక్స్‌కాన్ ఆదాయం రూ.1.7 లక్షల కోట్లు
అహోబిలంలో ‘బీ ట్యాక్స్’!
స్థిరంగా కదలాడుతున్న సూచీలు
ఆడుకుంటూ వెళ్లి అసువులు బాసింది
క్యాబ్.. క్యా సాబ్!
ప్లంబర్లుగా మహిళా శక్తి!
IPL 2025: రసవత్తరంగా సాగుతున్న ప్లే ఆఫ్స్ రేసు.. ఏ క్షణంలో ఏమైనా జరగవచ్చు..!
అతడిని బ్యాన్ చేయండి: టీమిండియా స్టార్‌పై నెటిజన్ల ఆగ్రహం
అక్షయ ఫలాలనిచ్చే అక్షయ తృతీయ..!
ఇద్దరిని బలిగొన్న అతివేగం
నాదేం లేదు.. దీనంతటికీ కారణం నా భార్య: స్టార్ హీరో
తక్కువ ధరకే బంగారం కావాలా!
సింహాచలం అప్పన్న సన్నిధిలో అపశ్రుతి.. ఏడుగురు భక్తులు మృతి
తిరుపతి తొక్కిసలాట ఘటన మరవకముందే..
సింహాచలం చందనోత్సవంలో ఘోర అపశ్రుతి
వివాహేతర సంబంధం.. భార్య కళ్లెదుటే ప్రియుడ్ని..
తక్కువ ధరకే బంగారం కావాలా!
సింహాచలంలో ఘోర విషాదం.. చంద్రబాబు సర్కారుపై వీహెచ్‌పీ ఆగ్రహం
సింహాచలం మహా విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
Kolkata: హోటల్లో ఘోర అగ్ని ప్రమాదం.. 14 మంది సజీవ దహనం
Vishakha: సింహాచలం ఘటనపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
IPL 2025: రసవత్తరంగా సాగుతున్న ప్లే ఆఫ్స్ రేసు.. ఏ క్షణంలో ఏమైనా జరగవచ్చు..!
అక్షయ ఫలాలనిచ్చే అక్షయ తృతీయ..!
DC VS KKR: చరిత్ర సృష్టించిన సునీల్ నరైన్
పహల్గాం ఉగ్రదాడి మృతులకు నివాళులర్పించిన కేతిరెడ్డి
థియేటర్, ఓటీటీలో బ్లాక్ బస్టర్.. ఇప్పుడు సీక్వెల్!
హైదరాబాద్‌లో ఆజాద్ ఇంజినీరింగ్ తయారీ ప్లాంటు
నాదేం లేదు.. దీనంతటికీ కారణం నా భార్య: స్టార్ హీరో
అల్లు అర్జున్ కోసం ఫ్లాపుల హీరోయిన్?
కెనడా కొత్త ప్రధానిగా మార్క్ కార్నీ
ఓటీటీలోకి వచ్చేసిన ఆంథాలజీ.. తెలుగులో స్ట్రీమింగ్
ఈ రాశి వారికి వృత్తి, వ్యాపారాలలో అనుకూలం
ఇండస్ఇండ్ సీఈఓ రాజీనామా!
ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం: మరో 195 మంది ట్రైనీలు..
ఇద్దరిని బలిగొన్న అతివేగం
మళ్లీ ఐపీవోల సందడి..!
అక్షయ తృతీయ.. రూ.16,000 కోట్ల అమ్మకాలు
పాక్ విమానాలకు నో ఎంట్రీ
Vaibhav Suryavanshi: ఈ ‘వైభవం’ కొనసాగాలి!
జూన్‌లో ఫిక్స్
రెండు సార్లు ఫెయిల్ అయ్యా... పట్టుదలతో నాన్న కల నెరవేర్చా..
చుట్టుముట్టి చంపేశారు
గజం రూ.లక్షల్లో ఉంటే ఎకరా 99 పైసలకే ఇచ్చేస్తారా?
ఢిల్లీలో పారని బాబు పాచిక!
ప్రభుత్వం విచక్షణాధికార పరిధిని దాటితే ఎలా?
ఓటీటీ జోరు... డిజిటల్ మీడియా హోరు
శ్రీశైలం డ్యామ్‌కు తక్షణమే మరమ్మతులు చేయాలి
రాజకీయ ప్రేరేపిత చర్య
రన్ వేపై రెక్కల ముక్కలు
ప్రతిష్టాత్మకంగా ‘మిస్ వరల్డ్’
లిబరల్ పార్టీ విజయం
కెమిస్ట్రీలో మూలకాలు.. ఫిజిక్స్‌లో థర్మోడైనమిక్స్
సోలార్ కాంట్రాక్టుల్లో అవకతవకలేమీ జరగలేదు
DC vs KKR: నైట్‌రైడర్స్ గెలుపు బాట
సూచీలకు స్వల్ప లాభాలు
బజాజ్ ఫైనాన్స్ బోనస్ బొనాంజా
కెనడాలో లిబరల్స్‌కు పట్టం
కొడుకు మృతదేహంతో మూడురోజులు
ఆడుకుంటూ వెళ్లి అసువులు బాసింది
అతడిని బ్యాన్ చేయండి: టీమిండియా స్టార్‌పై నెటిజన్ల ఆగ్రహం
బైబిల్... షేక్స్పియర్... అగథా క్రిస్టీ!
జనసేన కార్యాలయం వద్ద పీఈటీ అభ్యర్థుల నిరసన
ఎన్ఎఫ్హెచ్సీ.. సేవల్లో భేష్
ఎన్జీ రంగా అగ్రి వర్సిటీ వజ్రోత్సవాలు ప్రారంభం
అంతులేని అవినీతి.. అంతా అరాచకం: వైఎస్ జగన్
పార్లమెంట్‌ను సమావేశపర్చండి
ఎన్క్రిప్టెడ్ యాప్స్ ద్వారా డ్రగ్స్ దందా
కొత్త షెల్టర్ జోన్లకు మావో అగ్రనేతలు?
భూభారతిలో తప్పు చేస్తే కఠిన చర్యలు
పాస్‌బుక్ ఉంటే తహసీల్దార్.. లేదంటే ఆర్డీవోకు
సైన్యానికి పూర్తి స్వేచ్ఛ; ప్రధాని మోదీ
ఇంగ్లండ్ మహిళల జట్టు కొత్త కెప్టెన్‌గా సీవర్ బ్రంట్
స్నేహ్ మాయాజాలం
'వేతన యాతన'!
ఏడాదిలో ఎనిమిది!
మన రాష్ట్రంలో వీధి వీధికి బెల్ట్‌షాపులు తొలగించాలి సార్!
ఇంతకూ పరిష్కారం ఏమిటి?
నివేదిక అందించాలని డిప్యూటీ డైరెక్టర్ ఆదేశం
శ్రీవారి క్షేత్రంలో భక్తజన సందోహం
Akshaya Tritiya : ధగధగల వెనుక దగా!
ష్యూరిటీ ఇచ్చేముందే జాగ్రత్త పడాలి..!
చదివేది ఏడో తరగతి.. వాడేది ఐ ఫోన్
డాల్ఫిన్.. నాట్ ఫైన్!
విద్యా రుణం.. నిబంధనలు శరాఘాతం
ఏజెన్సీలో ఎదురుకాల్పులు
అధ్యక్షుడి కోసం.. నిరీక్షణ తప్పదా?
పాక్‌కు భారత ఫార్మా ఉత్పత్తులు బంద్!
నేడు కేంద్ర కేబినెట్ భేటీ
మళ్లీ ఓడిన భారత బ్యాడ్మింటన్ జట్టు
నిజాయితీగా పనిచేయండి
బొలేరో వాహనం ఢీకొని కూలీకి తీవ్ర గాయాలు
బసినికొండ ప్రభుత్వ స్థలంలో హెచ్చరిక బోర్డు
సెలవులొచ్చాయి ఆడించండి... చదివించండి..
వాటర్‌లో వార్
నాళం వారి సత్రం భూముల కౌలు వేలం వాయిదా
IPL 2025: కేకేఆర్ ఈజ్ బ్యాక్.. ఢిల్లీపై గ్రాండ్ విక్టరీ
IPL 2025: పదేళ్ల వయసులోనే 90 మీటర్ల భారీ సిక్సర్లు కొట్టాడు, ఇదెంత: వైభవ్ కోచ్ ఓఝా
తండ్రి త్యాగం, పట్టుదలతో 13 ఏళ్లకే కోటీశ్వరుడు.. ఇదీ టాలెంట్!
ముద్దుల మూట, మనసెలా వచ్చింది : వైద్యురాలి వీడియో వైరల్
చెల్లికి ఆస్తిలో వాటా.. తల్లిదండ్రులను ట్రాక్టర్‌తో ఢీకొట్టి..
పార్శిల్ సర్వీస్ సెంటర్ల తనిఖీ
ఇందిరమ్మ ఇంటికి రుణం
విద్యుత్ రంగ ప్రైవేటీకరణ తగదు
ఆఖరి నిమిషంలో వేలంలోకి ఎంట్రీ ఇచ్చిన డేంజరస్ బౌలర్
Hyderabad: సెకండ్ హ్యాండ్ బైక్‌లకు వడ్డీల మీద వడ్డీ
బ్యాగ్ సర్దుకోవాలన్నారు.. కంగనా గెలిచి చూపించింది
ఎందుకీ కన్ఫ్యూజన్?.. చంద్రబాబుపై సీపీఐ రామకృష్ణ సెటైర్లు
పర్యావరణ హిత: ఈ చిత్రాన్ని మీకు సమర్పిస్తున్న వారు...
పెట్టుబడుల కొనసాగింపుపై సెబీ ఛైర్మన్ సూచనలు
సింహాచలం ఘటనపై ప్రధాని మోదీ విచారం
భారత్‌లో ఫాక్స్‌కాన్ ఆదాయం రూ.1.7 లక్షల కోట్లు
అహోబిలంలో ‘బీ ట్యాక్స్’!
సినిమా

ఓటీటీలోకి థ్రిల్లర్ సినిమా.. తొమ్మిదేళ్ల తర్వాత తెలుగులో
'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా చూశారుగా. అందులో భాగ్యంగా తనదైన యాక్టింగ్ చేసిన ఐశ్వర్య రాజేశ్.. గత కొన్నాళ్లుగా తెలుగులో మూవీస్ చేస్తోంది. అయితే ఈమె నటించిన ఓ తమిళ చిత్రాన్ని ఇప్పుడు నేరుగా ఓటీటీలో రిలీజ్ చేశారు. ఇంతకీ ఏంటా సినిమా? ఎందులో స్ట్రీమింగ్ అవుతోంది.(ఇదీ చదవండి: 'కోర్ట్'ని మించిపోయేలా ఉంటుంది.. ఓటీటీ డేట్ ఫిక్స్) 1980ల్లో పలు తెలుగు సినిమాలు చేసిన రాజేశ్ అనే నటుడి కూతురే ఐశ్వర్య రాజేశ్. స్వతహాగా తెలుగమ్మాయి అయినప్పటికీ తమిళ నటిగా కెరీర్ ప్రారంభించింది. 2010 నుంచి అక్కడ వరస చిత్రాల్లో నటిస్తూ మంచి పేరు తెచ్చుకుంది. మలయాళం, హిందీలోనూ ఒకటి రెండు మూవీస్ చేసింది.కౌసల్య కృష్ణమూర్తి సినిమాతో తెలుగులోకి వచ్చిన ఈమె.. తర్వాత వరల్డ్ ఫేమస్ లవర్, టక్ జగదీష్, రిపబ్లిక్ తదితర చిత్రాలు చేసింది. అసలు విషయానికొస్తే ఈమె హీరోయిన్ గా చేసిన తమిళ మూవీ ఆరతు సీనం 2016లో రిలీజైంది. దీని తెలుగు వెర్షన్ ని ఇప్పుడు ఆహా ఓటీటీలో నేరుగా రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: నెలలోపే ఓటీటీలోకి వచ్చేసిన థ్రిల్లర్ సినిమా) దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత ఐశ్వర్య రాజేశ్ సినిమాని గరుడ 2.0 పేరుతో తెలుగులో రిలీజ్ చేశారు. దీన్ని థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ కథతో తీశారు. అరివళగన్ అనే దర్శకుడు దీన్ని తెరకెక్కించారు. అరుణ్ నిధి, ఐశ్వర్య దత్త, రోహిణి తదితరులు కీలక పాత్రలు పోషించారు.గరుడ 2.0 విషయానికొస్తే.. హీరో సీన్సియర్ పోలీస్ ఆఫీసర్. భార్య కూతురితో సంతోషంగా ఉంటాడు. కానీ కొందరు క్రిమినల్స్.. హీరో భార్య కూతురిని చంపేస్తారు. దీంతో మందుకి బానిస అవుతాడు. పై అధికారి చెప్పడంతో చాన్నాళ్ల తర్వాత మళ్లీ డ్యూటీలోకి వస్తాడు. అలా వరస హత్యల కేసు ఇతడికి అప్పగిస్తారు. మరి హీరో.. హంతకుడిని పట్టుకున్నాడా లేదా అనేదే స్టోరీ.(ఇదీ చదవండి: ఈవారం ఓటీటీలో 20 చిత్రాలు)

‘ఎల్లమ్మ’ దొరకట్లేదు.. ఇప్పుడెలా?
‘బలగం’ తర్వాత దర్శకుడు వేణు(venu yeldandi) చాలా గ్యాప్ తీసుకున్నాడు. తన రెండో సినిమా ‘ఎల్లమ్మ’ (Yellamma Movie) అని ప్రకటించి చాలా రోజులైంది కానీ, ఇంకా పట్టాలెక్కలేదు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో తొలుత నాని హీరోగా నటిస్తారనే ప్రచారం జరిగింది. నాని కూడా వేణుతో సినిమా చేస్తానని చెప్పారు. ఏం జరిగిందో తెలియదు కానీ నాని ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పకున్నాడు. చివరకు ఈ కథ అటు తిరిగి ఇటు తిరిగి నితిన్ (Nithiin) దగ్గర వెళ్లింది. కథ బాగా నచ్చడంతో నితిన్ ఈ చిత్రాన్ని వెంటనే ఓకే చేశాడు. డేట్స్ కూడా అరేంజ్ చేసుకున్నాడు. నిర్మాత దిల్ రాజు కూడా సినిమా షూటింగ్ స్టార్స్ చేసేందుకు రెడీగా ఉన్నాడు. కానీ ఈ సినిమాకు కీలకమైన హీరోయిన్ మాత్రం దొరకడం లేదట. ‘ఎల్లమ్మ’ కోసం అటు దిల్ రాజు, నితిన్.. ఇటు వేణు తెగ వెతుకుతున్నారట.బలగం మాదిరే ఈ కథ కూడా రూరల్ నేపథ్యంలోనే సాగుతుదంట. దర్శకుడు వేణు చాలా పకడ్బంధీగా ఈ సినిమా స్క్రిప్ట్ రెడీ చేసుకున్నాడట. అయితే ఈ చిత్రంలో హీరోయిన్ పాత్రకి చాలా ప్రాధాన్యత ఉంటుందట. కథ మొత్తం ఆమె చుట్టునే తిరుగుతుంది. అందుకే ఓ స్టార్ హీరోయిన్ని ఆ పాత్రకు తీసుకోవాలనుకున్నారట. తొలుత సాయి పల్లవి అయితే బాగుంటందని ఆమెను సంప్రదించారు. అయితే సాయి పల్లవి ఈ సినిమా చేయలేనని చెప్పేసిందట. దీంతో మరో స్టార్ హీరోయిన్ కీర్తి సురేశ్ అయితే ‘ఎల్లమ్మ’కు న్యాయం చేస్తుందని ఆమెను సంప్రదించారట. అయితే కథ, పాత్ర బాగా నచ్చినప్పటికీ.. డేట్స్ ఖాలీగా లేకపోవడం నో చెప్పేసిందట. శ్రీలీలను తీసుకుందామంటే.. అల్రెడీ నితిన్‌తో రెండు సినిమాలు చేసింది. అవి కూడా ఫ్లాప్ అవ్వడంతో దిల్ రాజు వెనకడుకు వేస్తున్నాడట. ఇక రష్మిక, సమంత లాంటి హీరోయిన్లు కూడా ఖాలీగా లేరు. నితిన్ ఎప్పుడైన తన సినిమాలకు ట్రెండింగ్ హీరోయిన్ని తీసుకుంటాడు. కానీ ఈ సారి మాత్రం అది వర్కౌట్ అయ్యేలా లేదు. స్టార్ హీరోహీరోయిన్లు అంతా బిజీగా ఉన్నారు. మరి ‘ఎల్లమ్మ’గా ఎవరు ఎంట్రీ ఇస్తారో చూడాలి.

13ఏళ్లకే హీరో, 15ఏళ్లకే టాలీవుడ్ స్టార్..ఒక్క యాక్సిడెంట్‌తో తెరమరుగు..
కెరీర్‌ను అందుకునే క్రమంలో బహుశా అతను సాధించినన్న రికార్డ్స్ మరే హీరో సాధించి ఉండడు. అత్యంత పిన్న వయసులో నటుడు, అత్యంత పిన్న వయసు హీరో, అత్యంత పిన్న వయసు స్టార్, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ తొలి సినిమా హీరో... హిందీ, తెలుగు, తమిళ, మళయాళం, కన్నడ..అన్ని భాషల్లోనూ స్వల్ప వ్యవధిలోనే 280 చిత్రాలు చేసిన హీరో...పాతికేళ్ల వయసులోనే ఇన్ని సాధించాడంటే ఇప్పుడెలా ఉండాలి? ఏభై ఏళ్ల వయసులో ఎంత గొప్ప స్థాయిలో ఉండాలి? ఎంత ఉన్నత స్థాయిలో ఉండాలి? కానీ అడ్రెస్ కూడా లేకుండా పోవడం ఏమిటి?అది 90వ దశకం.. భారతీయ సినీ పరిశ్రమకు ఒక మార్పు కాలం. ప్రధాన సినిమాలల్లో స్థిరపడిన తారల వయసు ముదిరిపోతుండగా, వారి స్థానాన్ని భర్తీ చేయడానికి యువ నటీనటులను పెద్ద సంఖ్యలో పరిచయం చేసిన కాలం. అలా తెరపైకి వచ్చిన యువతలో, అప్పుడే 15ఏళ్ల వయసులో హీరోగా అడుగుపెట్టిన ఒక యువ నటుడు ప్రత్యేకంగా నిలిచాడు అతడే హరీష్ కుమార్ (Harish Kumar), తెలుగు ప్రేక్షకులకు చిరపరిచితమైన హరీష్. బాలనటుడిగా తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించి ప్రధానంగా తెలుగు సినిమాల్లో నటించిన హరీష్, కొన్ని హిందీ, కన్నడ చిత్రాల్లోనూ నటించాడు. ఆ తర్వాత 1988లో, కేవలం 13ఏళ్ల వయసులోనే హీరో పాత్రలు పోషించడం మొదలుపెట్టాడు. దివంగత నిర్మాత రామానాయుడు 1990లో తీసిన ‘ప్రేమ ఖైదీ‘ తెలుగు సినిమాతో అప్పటి యూత్‌ని ఒక ఊపు ఊపాడు. తరువాతి ఏడాది, ఈ సినిమా హిందీ రీమేక్ లో కూడా నటించాడు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరిష్మా కపూర్ తొలి సినిమా విజయం సాధించింది. హరీష్–కరిష్మా కపూర్ (అప్పుడు ఇద్దరికీ 16ఏళ్లు) జోడీ ప్రేక్షకులకు ఎంతో నచ్చింది.తర్వాతి కాలంలో, ‘తిరంగా‘, ‘కాలేజ్ బుల్లోడు‘ వంటి విజయవంతమైన చిత్రాల్లో హరీష్ నటించాడు. ఆ సమయానికి, హరీష్‌ను హిందీ తెలుగు సినిమాల్లో ఉన్న అత్యుత్తమ యువ నటుల్లో ఒకరిగా గుర్తించారు. కొందరు ఆయనను షారుఖ్ ఖాన్, అక్షయ్ కుమార్ తదనంతర స్టార్‌గా కూడా భావించారు. కానీ తర్వాత తర్వాత హరీష్‌కు పూర్తిస్థాయి హీరోగా అవకాశాలు రాకున్నా మంచి పాత్రలే వచ్చాయి. టాప్ స్టార్స్ అయిన రజనీకాంత్, చిరంజీవి, నందమూరి బాలకృష్ణ నానా పాటేకర్, గోవిందా ల చిత్రాల్లో హరీష్ రెండవ హీరో, చిన్న పాత్రలకే పరిమితం అయ్యాడు.‘ద జెంటిల్మన్‘, ‘కూలీ నం.1‘, ‘హీరో నం.1‘ వంటి హిట్ చిత్రాల్లో నటించాక, 2001 ప్రాంతంలో అకస్మాత్తుగా తెరమరుగైన హరీష్... తిరిగి పదేళ్ల తర్వాత తెరపై కనిపించాడు. ఓ పుష్కర కాలం క్రితం ‘నాటీ ః 40‘, ‘చార్ దిన్ కి చాంద్ని‘ వంటి ఫ్లాప్ చిత్రాలతో తిరిగి సినిమాల్లో ప్రయత్నించాడు.ఆ తర్వాత ఏడేళ్ల క్రితం‘ఆ గయా హీరో‘ అనే చిత్రంలో గోవిందాతో కలిసి చివరిసారి తెరపై కనిపించాడు. ఏమైందో తెలీదు గానీ హరీష్ సినిమా జర్నీ ఎంత ఉధృతంగా మొదలైందో అంతే అకస్మాత్తుగా ముగిసింది.అందగాడని, ఎంతో భవిష్యత్తు ఉన్న నటుడు అని, డ్యాన్సులు, ఫైట్స్ బాగా చేస్తాడని మంచి పేరు తెచ్చుకున్న హరీష్..సినిమా కెరీర్‌ను వ్యక్తిగత జీవితంలోని ఒడిదుడుకులే నాశనం చేశాయని అంటారు. ఆయన ప్రేమ, పెళ్లి కూడా ఆయన సమస్యలకు కారణం అని కూడా కొందరు చెబుతారు.అయితే కొంత కాలం క్రితం ఆయన ఓ ఇంటర్వ్యూలో తన సినీ రంగం విడిచిపెట్టడానికి గల అసలు కారణం గురించి మాట్లాడాడు. చిన్నప్పుడు జరిగిన ఒక ప్రమాదంలో గాయపడిన తాను సంవత్సరాల తరబడి చికిత్స చేయించుకోకపోవడం వల్ల, సీరియస్ బ్యాక్ ప్రాబ్లెమ్‌కి గురయ్యాడని చెప్పారు. ‘ లంబార్ వెరిబ్రా ఎల్3 ఎల్5 ప్రాంతాల్లో స్లిప్డ్ డిస్క్ ఏర్పడింది. దీనివల్ల నడక కూడా కష్టమైంది. ఆ సమయంలో నేను చాలా నిర్లక్ష్యంగా ఉండి, గాయాన్ని గుర్తించలేకపోయాను. ఆపరేషన్ కూడా చేయించుకోవాలనుకోలేదు,‘ అని హరీష్ చెప్పాడు.చివరికి చికిత్స తీసుకున్న తరువాత, నెలల తరబడి మంచం మీద ఉండాల్సి వచ్చిందని, ఆ లోపు పరిశ్రమ తనను దాటి వెళ్లిపోయిందని హరీష్ తెలిపారు. ‘డాక్టర్ మొదట రెండేళ్ల పాటు పని చేయకూడదని చెప్పాడు. ఆ తర్వాత అలా అలా తెలియకుండానే పరిశ్రమ నుంచి మాయం అయ్యాను,‘ అని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం హరీష్ ప్రశాంత జీవితం గడుపుతున్నాడు. ‘నేను ఇంకా భారత్‌లోనే ఉన్నాను – చెన్నై, హైదరాబాద్, ముంబైలలో ఎక్కువగా ఉంటాను. సినిమా రంగం విడిచిన విషయం చాలా వ్యక్తిగతమైనది. దీనిపై ఎక్కువగా మాట్లాడాలని ఇష్టం లేదు,‘ అని హరీష్ స్పష్టం చేశాడు.

'కోర్ట్'ని మించిపోయేలా ఉంటుంది.. ఓటీటీ డేట్ ఫిక్స్
కోర్ట్ రూమ్ డ్రామా సినిమాలు తెలుగులో పెద్దగా రాలేదు. రీసెంట్ టైంలో మాత్రం 'కోర్ట్' అనే మూవీ సూపర్ హిట్ అయింది. తొలుత థియేటర్లలో హిట్ టాక్ తెచ్చుకుంది. ఆ పైన ఓటీటీలోకి వచ్చిన తర్వాత కూడా అదే జోరు చూపించింది. 'కోర్ట్'(Court Movie Telugu) గురించి కాసేపు పక్కనబెడితే ఇదే తరహాలో తీసిన వెబ్ సిరీసులు కూడా ఓటీటీలో ఉన్నాయి. అలాంటి వాటిలో ఒకటి 'క్రిమినల్ జస్టిస్'(Criminal Justice). 2019లో తొలి సీజన్ రిలీజ్ కాగా అద్భుతమైన స్పందన వచ్చింది. 'మీర్జాపుర్' ఫేమ్ పంకజ్ త్రిపాఠి(Pankaj Tripathi), విక్రాంత్ మస్సే ఇందులో నటించారు.(ఇదీ చదవండి: శోభిత ప్రెగ్నెంట్ అని రూమర్స్.. నిజమేంటి?) తొలి సీజన్ సూపర్ సక్సెస్ అయ్యేసరికి మరో కేసుని తీసుకుని 2020లో రెండో సీజన్, 2022లో మూడో సీజన్ రిలీజ్ చేశారు. వీటికీ మంచి స్పందన వచ్చింది. ఇప్పటివరకు వచ్చిన మూడు సీజన్లు కూడా థ్రిల్లింగ్ గా ఉన్నాయి. ఇప్పుడు చాలా గ్యాప్ తీసుకుని నాలుగో సీజన్ ని సిద్ధం చేశారు. 'క్రిమినల్ జస్టిస్: ఏ ఫ్యామిలీ మేటర్' పేరుతో నాలుగో సీజన్ టీజర్ తాజాగా రిలీజ్ చేశారు. మే 22 నుంచి హాట్ స్టార్ ఓటీటీలో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కాబోతున్నట్లు ప్రకటించారు. మరి ఈసారి ఎలాంటి కేసు వాదించబోతున్నారో అనేది చూడాలి?(ఇదీ చదవండి: నెలలోపే ఓటీటీలోకి వచ్చేసిన థ్రిల్లర్ సినిమా) Seedha aur simple toh Madhav Mishra ji ke syllabus mein hai hi nahi. Aapke favourite vakeel sahab aa rahe hain courtroom mein wapas! ⚖️#HotstarSpecials #CriminalJustice - A Family Matter, streaming from May 22, only on #JioHotstar@ApplauseSocial @BBCStudiosIndia @nairsameer… pic.twitter.com/Gu1B3bnLWF— JioHotstar (@JioHotstar) April 29, 2025
న్యూస్ పాడ్‌కాస్ట్
క్రీడలు

Vaibhav Suryavanshi: ఈ ‘వైభవం’ కొనసాగాలి!
క్రికెట్ బ్యాట్ పట్టడం కూడా తెలియని వ్యక్తి నుంచి మొదలుకొని... ఆటలో తలపండిన మేధావుల వరకు ఎక్కడ చూసినా ఒకటే చర్చ! ఊరు, వాడా, పట్టణం, నగరం అనే తేడా లేకుండా ఎవరి నోట విన్నా ఒకే పేరు! ‘ఏం కొట్టాడ్రా బాబు’ అని సాధారణ అభిమానులు కొనియాడుతుంటే... ఫ్లిక్, లాఫ్ట్, పుల్ అంటూ విశ్లేషకులు అతడి షాట్లను వర్ణిస్తున్నారు. ఒక్క ఇన్నింగ్స్‌తో యావత్ ప్రపంచాన్ని తనవైపు తిప్పుకున్న ఆ కుర్రాడే... బిహార్‌కు చెందిన 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ. అంతర్జాతీయ స్థాయి క్రికెట్‌తో సరిసమానంగా ఒత్తిడి ఉండే ఐపీఎల్లో అతడు బాదిన బాదుడు క్రీడాలోకాన్ని నివ్వెరపరిచింది. అతని దూకుడుకు అపార అనుభవం ఉన్న బౌలర్లు సైతం స్కూలు కుర్రాళ్లలా కనిపించారనడంలో రవ్వంత అతిశయోక్తి లేదు. ఐపీఎల్లో ఎదుర్కొన్న తొలి బంతికే సిక్స్... మూడో ఇన్నింగ్స్‌లోనే రికార్డు సెంచరీ... మరో సచిన్ టెండూల్కర్ దొరికాడు అనే ప్రశంసలతో ఆ పాలబుగ్గల పసివాడు ప్రస్తుతానికి శిఖరమంత ఎత్తులో ఉన్నాడు! ఇదంతా నాణేనికి ఒకవైపే! మన దేశంలో ఇలా ఒక్క ఇన్నింగ్స్‌తో సంచలనాలు రేకెత్తించిన వాళ్లు కోకొల్లలు. దేశవాళీ, అంతర్జాతీయ, ఐపీఎల్ వేదికలపై తళుక్కున మెరిసి... అంతే త్వరగా కనుమరుగై పోయిన వారికి కొదవే లేదు. అంచనాలకు మించి వచ్చే పేరు ప్రతిష్టలు... అవసరానికి మించి వచ్చి పడే డబ్బు ప్రవాహం... అప్పనంగా వచ్చే ప్రచార ఆర్బాటం ఇలా ఆటగాళ్ల దృష్టి మరల్చేవి ఎన్నో. పిన్న వయసులోనే విశేష గుర్తింపు తెచ్చుకొని ఆ తర్వాత సొదిలోనే లేకుండా పోయిన వాళ్లు ఎందరో! సదానంద్ విశ్వనాథ్, వినోద్ కాంబ్లీ, పృథ్వీ షా ఈ కోవలోకే వస్తారు. ప్రతిభకు క్రమశిక్షణ తోడైతేనే సుదీర్ఘ కాలం కెరీర్ కొనసాగించగలం అని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ నిరూపిస్తే... ఒక్కసారిగా వచ్చిన గుర్తింపుతో ఉక్కిరిబిక్కిరై కెరీర్‌ను నాశనం చేసుకున్న వాళ్లూ ఉన్నారు. వైభవ్ సూర్యవంశీ కూడా ఇలా ‘ఏక్ దిన్ కా సుల్తాన్’ కాకుండా ఉండాలంటే నిరంతర సాధన ముఖ్యమని మాజీలు సూచిస్తున్నారు. –సాక్షి క్రీడావిభాగం వయసుకు మించిన పరిణతితో అతడు బంతిని బాదుతుంటే... యావత్ ప్రపంచం విస్మయానికి గురైంది! బౌలర్‌తో సంబంధం లేకుండా అతడు విరుచుకుపడుతుంటే... అభిమాన గణం మైమరిచిపోయింది! ముఖంపై పసితనపు ఛాయలు కూడా పోని ఆ చిన్నోడు చిందేస్తుంటే... క్రీడా లోకం తన్మయత్వానికి లోనైంది! ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 18వ సీజన్లో భాగంగా సోమవారం గుజరాత్ టైటాన్స్‌తో జైపూర్‌లో జరిగిన పోరులో రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ 35 బంతుల్లోనే సెంచరీ సాధించి రికార్డులు తిరగరాశాడు. ఐపీఎల్లో అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన భారతీయుడిగా... ఓవరాల్‌గా టి20ల్లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన అత్యంత పిన్న వయసు్కడిగా చరిత్ర పుటల్లోకెక్కాడు. మొహమ్మద్ సిరాజ్, ఇషాంత్ శర్మ, ప్రసిధ్ కృష్ణ, వాషింగ్టన్ సుందర్ ఈ నలుగురు టీమిండియాకు ప్రాతినిధ్యం వహించిన వారే. ఇక టి20 లీగ్‌ల్లో రికార్డులు తిరగరాసే అఫ్గానిస్తాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ సరేసరి. ఇలాంటి బౌలర్లను ఎదుర్కొంటూ వైభవ్ సాగించిన ఊచకోత మాటలకందనిది! క్లాస్, మాస్, ఊరమాస్ ఇలా అతడి ఇన్నింగ్స్‌ను వర్ణించడానికి విశేషణాలు వెతుక్కోవాల్సిన పరిస్థితి. అతడి బాదుడుకు జైపూర్‌లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియం హోరెత్తింది. డగౌట్లో కూర్చున్న ప్రతి ఆటగాడు ఊగిపోతుంటే... మ్యాచ్ చూస్తున్న అభిమానులు బ్యాటింగ్ చేసేది తామే అన్నంతగా లీనమై పోయి ఆ ‘బుడ్డోడి’ ప్రతిభకు స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు. రాహుల్ ద్రవిడ్ చొరవతో... ఐపీఎల్ ప్రారంభమైన మూడేళ్ల తర్వాత బిహార్‌లోని సమస్తీపూర్‌లో జని్మంచిన వైభవ్... కఠోర సాధన, పట్టువదలని తత్వంతో అంచలెంచెలుగా ఎదుగుతూ ఈ స్థాయికి చేరుకున్నాడు. సహచరుడి తప్పిదం వల్ల రనౌట్ అయి బెంచ్‌మీద కూర్చొని వెక్కి వెక్కి ఏడుస్తున్న వైభవ్‌ను చూసిన వీవీఎస్ లక్ష్మణ్... అతడిలో ఆత్మవిశ్వాసం నింపి రాహుల్ ద్రవిడ్ దృష్టికి తీసుకెళ్లడంతో వైభవ్ దశ తిరిగింది. ప్రతిభాన్వేషణ సమయంలో బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్, రాజస్తాన్ టీమ్ మేనేజర్ రోమి... వైభవ్ షాట్ల ఎంపికకు ముగ్ధులయ్యారు. దీంతో వారు వైభవ్‌ను ద్రవిడ్‌కు పరిచయం చేయడంతో అతడి జీవితం మారిపోయింది. ప్రతిభను ప్రోత్సహించడంలో ముందుండే రాజస్తాన్ రాయల్స్ యాజమాన్యం గతేడాది ఐపీఎల్ వేలంలో రూ. 1 కోటీ 10 లక్షలకు వైభవ్‌ను కొనుగోలు చేసుకుంది. ద్రవిడ్ పర్యవేక్షణలో మరింత రాటుదేలిన వైభవ్... దాన్నే మైదానంలో చాటాడు. అప్పటికే భారత అండర్–19 జట్టుకు ఎంపికైన వైభవ్... గతేడాది జనవరిలోనే ముంబై జట్టుపై ఫస్ట్‌క్లాస్ అరంగేట్రం చేశాడు. నెట్స్‌లో తీవ్రంగా శ్రమించడం, కోచ్ చెప్పిన అంశాలను ఆచరణలో పెట్టడం. ఎంత కష్టాన్నైనా ఓర్చుకోవడం వంటి సానుకూల లక్షణాలు అతడిని మూడో మ్యాచ్‌లోనే సెంచరీ హీరోగా నిలిపాయి. పొలం అమ్ముకున్న తండ్రి.. వైభవ్ విజయం వెనక... తాను సాధించలేకపోయిన దాన్ని కుమారుడైనా అందుకోవాలని తపన పడ్డ ఓ మధ్యతరగతి తండ్రి ఆశయం ఉంది. కుమారుడికి మెరుగైన శిక్షణ అందించేందుకు ఉన్న కాస్త పొలం అమ్ముకున్న ఆ తండ్రి ఇప్పుడు అత్యంత ఆనంద క్షణాలు అనుభవిస్తున్నాడు. గతంలో రాజస్తాన్ రాయల్స్ ఆటగాడు యూసుఫ్ పఠాన్ 37 బంతుల్లో సెంచరీ చేయగా... ఇప్పుడు ఈ ఎడంచేతి వాటం బ్యాటర్ 35 బంతుల్లోనే మూడంకెల స్కోరు చేసి కొత్త చరిత్ర లిఖించాడు. దీని వెనక రాయల్స్ యాజమాన్య ప్రోత్సాహం ఉందని వైభవ్ తండ్రి సంజీవ్ సూర్యవంశీ పేర్కొన్నాడు. ‘వైభవ్ మెరుపుల వెనక బిహార్ క్రికెట్ సంఘం చీఫ్ రాకేశ్ తివారీ, రాజస్తాన్ రాయల్స్ జట్టు కృషి ఎంతో ఉంది. ఇక రాయల్స్ కోచ్ రాహుల్ ద్రవిడ్ గత మూడు, నాలుగు నెలలుగా పడ్డ కష్టానికి దక్కిన ఫలితమిది. వారికి జీవితాంతం రుణపడి ఉంటాం’ అని సంజీవ్ అన్నాడు. అయితే ఈ మెరుపులు కేవలం ఒకటీ అరా మ్యాచ్‌లకు మాత్రమే పరిమితం కాకుండా ఉండాలంటే... ఇదే సాధన కొనసాగించాలని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పేరు, డబ్బు తలకెక్కనివ్వకుండా క్రమశిక్షణతో ముందుకు సాగితే దేశానికి సుదీర్ఘ కాలం ప్రాతినిధ్యం వహించగల ప్రతిభావంతుడు లభించినట్లే! అమ్మ, నాన్న కృషి వల్లే... తొలి బంతికి సిక్స్ కొట్టడం నాకు పెద్ద విషయం కాదన్న వైభవ్... అమ్మానాన్న కృషి వల్లే ఈ స్థాయికి చేరుకున్నానని పేర్కొన్నాడు. ‘నేను ఇప్పటికే భారత అండర్–19 జట్టుకు ప్రాతినిధ్యం వహించా. దేశవాళీల్లో తొలి బంతికి చాలాసార్లు సిక్స్ కొట్టా. మొదటి 10 బంతులు ఎదుర్కొనేటప్పుడు ఎలాంటి ఒత్తిడికి గురికాను. బంతి నా పరిధిలో ఉంటే దాన్ని బలంగా కొట్టాలనే చూస్తా. తల్లిదండ్రుల సహకారం లేకుంటే నేను లేను. నా కోసం వాళ్లు ఎంతగానో కష్టపడ్డారు. తెల్లవారుజామను 3 గంటలకే నిద్రలేచే మా అమ్మ... మళ్లీ నేను పడుకున్న తర్వాత ఏ 11 గంటలకో గానీ నిద్రపోదు. వారు అలా నా కోసం అన్నీ వదిలేసుకొని శ్రమించడం వల్లే నేను ఆటపై దృష్టి సారించగలిగా. నాన్న నా వెంట ఉండటం వల్లే మరింత స్వేచ్ఛగా ఆడుతున్నా. కష్టానికి ఫలితం ఉంటుందని రుజువైంది. వారి కష్టానికి ప్రతిఫలమే ఇది’ అని వైభవ్ పేర్కొన్నాడు. మరో ఒకటీ రెండేళ్లలో వైభవ్ భారత టి20 జట్టులో చోటు దక్కించుకుంటాడని అతడి చిన్ననాటి కోచ్ మనీశ్ ఓఝా ఆశాభాహం వ్యక్తం చేశాడు. ‘కోచ్‌గా వైభవ్‌ను చూస్తే గర్వంగా ఉంది. బిహార్‌లో ఆటలకు పెద్దగా ఆదరణ ఉండదు. అలాంటి చోట నుంచి వచ్చి క్రికెట్‌పై తనదైన ముద్ర వేశాడు. ఇప్పుడు వైభవ్ ఎందరికో స్ఫూర్తి’ అని మనీశ్ ఓఝా అన్నాడు. రూ. 10 లక్షల నజరానా ఐపీఎల్లో సెంచరీతో రికార్డు సృష్టించిన వైభవ్ సూర్యవంశీకి బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ భారీ నజరానా ప్రకటించారు. 14 ఏళ్ల వైభవ్‌కు రూ. 10 లక్షల నగదు బహుమతి ప్రకటించారు. ‘గతేడాది వైభవ్‌తో మాట్లాడా. అతడిలో అపార ప్రతిభ ఉంది. తీవ్ర పోటీ ఉండే ఐపీఎల్లో 35 బంతుల్లో సెంచరీ చేయడం మామూలు విషయం కాదు. ఫోన్ ద్వారా అతడిని అభినందించా. రాష్ట్ర ప్రభుత్వం తరఫున వైభవ్ సూర్యవంశీకి రూ. 10 లక్షల నజరానా అందిస్తాం. భవిష్యత్తులోనూ అతడు ఇదే ఆటతీరు కొనసాగించాలని కోరుకుంటున్నాం. వైభవ్ దేశం తరఫున కూడా రాణించి పేరు ప్రఖ్యాతలు తీసుకొస్తాడని ఆశిస్తున్నాం’ అని నితీశ్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. వైభవ్ ఆటతీరు చూస్తుంటే ముచ్చటేస్తోంది. అతడిలో భయం ఏ కోశాన కనిపించడం లేదు. బ్యాట్ వేగం, బంతిని అంచనా వేసే తీరు చాలా బాగున్నాయి. 38 బంతుల్లో 101 పరుగులు చేసిన వైభవ్ ఇన్నింగ్స్ ఆసాంతం అలరించింది. –సచిన్ టెండూల్కర్14 ఏళ్ల వయసులో మీరేం చేశారో గుర్తు చేసుకొండి. ఈ కుర్రాడు మాత్రం అంతర్జాతీయ బౌలర్ల భరతం పట్టాడు. భయమన్నదే లేకుండా బౌలర్లకు నిద్రలేని రాత్రి మిగిల్చాడు. భవిష్యత్తుపై మరింత భరోసా పెంచుతున్న ఇలాంటి ప్లేయర్లను చూస్తే గర్వంగా ఉంది. –యువరాజ్ సింగ్

ఇంగ్లండ్ మహిళల జట్టు కొత్త కెప్టెన్‌గా సీవర్ బ్రంట్
లండన్: ఇంగ్లండ్ మహిళల క్రికెట్ జట్టుకు కొత్త సారథిగా ఆల్‌రౌండర్ నాట్ సీవర్ బ్రంట్ ఎంపికైంది. ఇటీవలి కాలంలో ఇంగ్లండ్ జట్టు స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోవడంతో నాయకత్వ మార్పు అనివార్యమైంది. తొమ్మిదేళ్లుగా హీథర్ నైట్ ఇంగ్లండ్ కెప్టెన్ గా వ్యవహరిస్తుండగా... గతేడాది టి20 ప్రపంచకప్‌లో ఆ జట్టు గ్రూప్ దశలోనే ఇంటిదారి పట్టింది. ఇక ఆ్రస్టేలియాతో మూడు ఫార్మాట్లలో కలిపి 16 మ్యాచ్‌లాడి ఒక్క దాంట్లోనూ విజయం సాధించలేకపోయింది. దీంతో ఇంగ్లండ్ వేల్స్ క్రికెట్ బోర్డు హీథర్ నైట్ స్థానంలో... మూడేళ్లుగా జట్టుకు వైస్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్న సీవర్ బ్రంట్‌కు పగ్గాలు అప్పగించింది. మూడు ఫార్మాట్లలోనూ బ్రంట్ జట్టును నడిపించనుంది. ‘ఇంగ్లండ్ మహిళల క్రికెట్ జట్టుకు కెప్టెన్ గా ఎంపికవడం గర్వంగా భావిస్తున్నా. జట్టును విజయవంతంగా నడిపించేందుకు నావంతు కృషి చేస్తా. మెరుగైన ప్రదర్శనతో అత్యుత్తమ ఫలితాలు సాధిస్తాం’ అని 32 ఏళ్ల బ్రంట్ పేర్కొంది. 2013లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన బ్రంట్... ఇంగ్లండ్ జాతీయ జట్టు తరఫున మూడు ఫార్మాట్లలో కలిపి 259 మ్యాచ్‌లాడింది. 2017లో ప్రపంచకప్ గెలిచిన జట్టులోనూ భాగంగా ఉంది. టెస్టుల్లో 46.47, వన్డేల్లో 45.91, టి20ల్లో 28.45 సగటుతో పరుగులు చేసిన బ్రంట్... మూడు ఫార్మాట్లలో కలిపి 181 వికెట్లు సైతం పడగొట్టింది. అంతర్జాతీయ క్రికెట్ మండలి మహిళల వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో బ్రంట్ 3వ స్థానంలో ఉంది. మే 21 నుంచి వెస్టిండీస్‌తో ఇంగ్లండ్ జట్టు పరిమిత ఓవర్ల సిరీస్‌లు ఆడనుంది.

మళ్లీ ఓడిన భారత బ్యాడ్మింటన్ జట్టు
ప్రతిష్టాత్మక సుదిర్మన్ కప్ ప్రపంచ మిక్స్డ్ టీమ్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత జట్టు కథ ముగిసింది. చైనాలో జరుగుతున్న ఈ మెగా ఈవెంట్లో భారత జట్టు వరుసగా రెండో పరాజయాన్ని చవిచూసి నాకౌట్ దశకు చేరుకునే అవకాశాన్ని కోల్పోయింది. డెన్మార్క్‌తో జరిగిన గ్రూప్ ‘డి’ తొలి లీగ్ మ్యాచ్‌లో 1–4తో ఓడిన భారత్... ఇండోనేసియా జట్టుతో మంగళవారం జరిగిన రెండో లీగ్ మ్యాచ్‌లోనూ 1–4తో ఓడిపోయింది. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో నెగ్గిన డెన్మార్క్, ఇండోనేసియా జట్లు గ్రూప్ ‘డి’ నుంచి నాకౌట్ దశకు అర్హత పొందాయి. ఇండోనేసియాతో జరిగిన పోటీలో మిక్స్డ్ డబుల్స్ తొలి మ్యాచ్‌లో ధ్రువ్–తనీషా క్రాస్టో 10–21, 21–18, 21–19తో రెహాన్–గ్లోరియాలపై గెలిచి భారత్‌కు 1–0తో ఆధిక్యం అందించారు. అయితే రెండో మ్యాచ్‌లో పీవీ సింధు 12–21, 13–21తో పుత్రి కుసుమ వర్థిని చేతిలో ఓడిపోయింది. మూడో మ్యాచ్‌లో ప్రణయ్ 21–19, 14–21, 12–21తో క్రిస్టీ చేతిలో ఓటమి చెందాడు. నాలుగో మ్యాచ్‌లో శ్రుతి–ప్రియా ద్వయం 10–21, 9–21తో ల్యానీ ట్రియా–సితి ఫాదియా జంట చేతిలో ఓడింది. ఐదో మ్యాచ్‌లో హరిహరన్–రూబన్ 20–22, 18–21తో షోహిబుల్ –డానియల్ చేతిలో పరాజయం పాలయ్యారు.

స్నేహ్ మాయాజాలం
భారత ఆఫ్‌స్పిన్నర్ స్నేహ్ రాణా 5 వికెట్ల ప్రదర్శన... వీటిలో ఒకే ఓవర్లో తీసిన 3 వికెట్లు... ప్రతీక రావల్ మరో అర్ధసెంచరీతో అద్భుత ఫామ్ కొనసాగింపు... తజ్మీన్ బ్రిట్స్ వీరోచిత సెంచరీ వృథా... భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన వన్డే మ్యాచ్‌లో హైలైట్స్ ఇవి. ముక్కోణపు టోర్నీలో భాగంగా ఆడిన రెండో మ్యాచ్‌లోనూ గెలిచిన హర్మన్ బృందం తమ అగ్రస్థానాన్ని పటిష్టం చేసుకుంది. కొలంబో: ముక్కోణపు వన్డే టోర్నీలో భారత మహిళలు మరో విజయాన్ని అందుకున్నారు. మంగళవారం జరిగిన పోరులో భారత్ 15 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా మహిళల జట్టును ఓడించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 276 పరుగులు చేసింది. ప్రతీక రావల్ (91 బంతుల్లో 78; 7 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ సాధించగా... జెమీమా రోడ్రిగ్స్ (32 బంతుల్లో 41; 4 ఫోర్లు), కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (48 బంతుల్లో 41 నాటౌట్; 4 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. అనంతరం దక్షిణాఫ్రికా 49.2 ఓవర్లలో 261 పరుగులకు ఆలౌటైంది. తజ్మీన్ బ్రిట్స్ (107 బంతుల్లో 109; 13 ఫోర్లు, 3 సిక్స్‌లు) సెంచరీ చేయగా, ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ స్నేహ్ రాణా (5/43) ఐదు వికెట్ల ప్రదర్శనతో సఫారీ టీమ్‌ను పడగొట్టడంలో ప్రధాన పాత్ర పోషించింది. కీలక భాగస్వామ్యాలు... భారత్‌కు ప్రతీక, స్మృతి మంధాన (54 బంతుల్లో 36; 5 ఫోర్లు) శుభారంభం అందించారు. తొలి వికెట్‌కు వీరిద్దరు 18.3 ఓవర్లలో 83 పరుగులు జోడించారు. స్మృతి వెనుదిరిగిన తర్వాత ప్రతీకకు హర్లీన్ డియోల్ (47 బంతుల్లో 29; 4 ఫోర్లు) సహకారం అందించింది. 58 బంతుల్లో ప్రతీక అర్ధ సెంచరీ పూర్తయింది. ప్రతీక, హర్లీన్ మూడు పరుగుల వ్యవధిలో వెనుదిరగ్గా... హర్మన్, జెమీమా 59 పరుగుల భాగస్వామ్యంతో ఇన్నింగ్స్‌ను నడిపించారు. చివర్లో రిచా ఘోష్ (14 బంతుల్లో 24; 3 ఫోర్లు, 1 సిక్స్) దూకుడైన ఆటను ప్రదర్శించగా...ఆఖరి 10 ఓవర్లలో భారత్ 82 పరుగులు సాధించింది. బ్రిట్స్ సెంచరీ వృథా... బ్రిట్స్ వరుస బౌండరీలతో చెలరేగిపోవడంతో ఛేదనలో దక్షిణాఫ్రికాకు మరింత ఘనమైన ఆరంభం దక్కింది. బ్రిట్స్‌తో తొలి వికెట్‌కు 140 పరుగులు జోడించిన తర్వాత కెప్టెన్ లౌరా వాల్వార్ట్ (75 బంతుల్లో 43; 3 ఫోర్లు) అవుట్ కాగా, ఆ తర్వాత 103 బంతుల్లో బ్రిట్స్ శతకం పూర్తయింది. ఆ తర్వాత తీవ్ర వేడి కారణంగా బ్రిట్స్ రిటైర్ట్‌హర్ట్‌గా వెనుదిరగ్గా... ఇక్కడే మ్యాచ్ మలుపు తిరిగింది. 80 పరుగుల వ్యవధిలో జట్టు చివరి 8 వికెట్లు కోల్పోయి ఓటమి పాలైంది. ఐదు వికెట్లతో చివరి 3 ఓవర్లలో 28 పరుగులు చేయాల్సి ఉండగా... 48వ ఓవర్ వేసిన స్నేహ్ రాణా 3 వికెట్లు పడగొట్టింది. తిరిగి మైదానంలోకి వచ్చి ఆదుకునే ప్రయత్నం చేసిన బ్రిట్స్ కూడా ఇదే ఓవర్లో అవుట్ కావడంతో జట్టు ఆశలు కోల్పోయింది. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: ప్రతీక (బి) ఎమ్‌లాబా 78; స్మృతి (సి) మెసో (బి) డెర్క్సన్ 36; హర్లీన్ (బి) ఎమ్‌లాబా 29; హర్మన్‌ప్రీత్ (నాటౌట్) 41; జెమీమా (సి) ఖాకా (బి) క్లాస్ 41; రిచా (సి) లూస్ (బి) ఖాకా 24; దీప్తి (సి) ట్రైయాన్ (బి) డిక్లెర్క్ 9; కాశ్వీ (నాటౌట్) 5; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (50 ఓవర్లలో 6 వికెట్లకు) 276. వికెట్ల పతనం: 1–83, 2–151, 3–154, 4–213, 5–247, 6–259. బౌలింగ్: ఖాకా 8–1– 42–1, క్లాస్ 9–1–43–1, లూస్ 4–0–24–0, డిక్లెర్క్ 9–1–39–1, ఎమ్‌లాబా 10–0–55–2, డెర్క్సన్ 3–0– 40–1, ట్రైయాన్ 7–0–33–0. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: వోల్వార్ట్ (ఎల్బీ) (బి) దీప్తి 43; బ్రిట్స్ (సి అండ్ బి) స్నేహ్ రాణా 109, గుడాల్ (బి) స్నేహ్ రాణా 9; మెసో (బి) అరుంధతి రెడ్డి 7; లూస్ (సి) (సబ్) అమన్‌జోత్ (బి) శ్రీచరణి 28; ట్రైయాన్ (సి) (సబ్) అమన్‌జోత్ (బి) స్నేహ్ రాణా 18; డెర్క్సన్ (సి) హర్లీన్ (బి) స్నేహ్ రాణా 30; డిక్లెర్క్ (బి) స్నేహ్ రాణా 0; క్లాస్ (రనౌట్) 2; ఎమ్‌లాబా (రనౌట్) 8; ఖాకా (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (49.2 ఓవర్లలో ఆలౌట్) 261. వికెట్ల పతనం: 1–140, 2–151, 3–181, 4–207, 5–240, 6–250, 7–251, 8–252, 9–253, 10–261. బౌలింగ్: కాశ్వీ గౌతమ్ 7.2–0–47–0, అరుంధతి రెడ్డి 9–0–59–1, స్నేహ్ రాణా 10–0–43–5, శ్రీచరణి 10–0–51–1, దీప్తి శర్మ 10–0–40–1, ప్రతీక 3–0–17–0.
బిజినెస్

సోలార్ కాంట్రాక్టుల్లో అవకతవకలేమీ జరగలేదు
న్యూఢిల్లీ: సౌర విద్యుత్ కాంట్రాక్టులు దక్కించుకునే విషయంలో తాము ఎలాంటి అవకతవకలకు పాల్పడలేదంటూ స్వతంత్ర దర్యాప్తులో తేలిందని అదానీ గ్రీన్ వెల్లడించింది. సౌర విద్యుత్ కాంట్రాక్టుల కోసం భారత్‌లో ప్రభుత్వ వర్గాలకు లంచాలిచ్చారని, అమెరికన్ ఇన్వెస్టర్ల నుంచి నిధులు సమీకరించే క్రమంలో ఆ విషయాన్ని దాచిపెట్టారని అదానీ గ్రూప్ చైర్మన్ గౌతం అదానీ, ఆయన సోదరుడి కుమారుడు సాగర్ అదానీ, ఎండీ వినీత్ జైన్‌లపై అమెరికాలో అభియోగాలు మోపారు. అదానీ గ్రూప్ ఈ ఆరోపణలను ఖండించింది. స్వతంత్ర దర్యాప్తులో అవకతవకలు జరగలేదని వెల్లడైనట్లు అదానీ గ్రీన్ పేర్కొంది.

హైదరాబాద్‌లో ఆజాద్ ఇంజినీరింగ్ తయారీ ప్లాంటు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: జీఈ వెర్నోవాకి చెందిన స్టీమ్ పవర్ సర్వీసెస్ అవసరాల కోసం హైదరాబాద్‌లో లీన్ తయారీ ప్లాంటును ప్రారంభించినట్లు ప్రెసిషన్ ఇంజినీరింగ్ సంస్థ ఆజాద్ ఇంజినీరింగ్ వెల్లడించింది. ఈ ప్లాంటు లో 180 మంది సుశిక్షితులైన ప్రొఫెషనల్స్ ఉండగా, రాబోయే రోజుల్లో వందల సంఖ్యలో మరింత మంది నిపుణులను రిక్రూట్ చేసుకోనున్నట్లు సంస్థ చైర్మన్ రాకేష్ చోప్దార్ వివరించారు. ఈ ఫ్యాక్టరీ నుంచి ఏటా 1,00,000 బ్లేడ్లను ఉత్పత్తి చేయనున్నట్లు చెప్పారు. ఏరోస్పేస్, డిఫెన్స్, ఎనర్జీ, ఆయిల్..గ్యాస్ తదితర రంగాల సంస్థలతో పటిష్టమైన భాగస్వామ్యాలు కుదుర్చుకునేందుకు ఇలాంటి వ్యూహాలు తోడ్పడగలవని రాకేష్ తెలిపారు.

సూచీలకు స్వల్ప లాభాలు
ముంబై: ఒడిదుడుకుల ట్రేడింగ్‌లో భాగంగా స్టాక్ సూచీలు మంగళవారం స్వల్ప లాభాలతో గట్టెక్కాయి. సెన్సెక్స్ 70 పాయింట్లు పెరిగి 80,288 వద్ద స్థిరపడింది. నిఫ్టీ ఏడు పాయింట్ల నామమాత్ర లాభంతో 24,336 వద్ద నిలిచింది. వరుసగా రెండో రోజూ లాభాల్లో నిలిచాయి. భారత్–పాక్‌ల మధ్య నెలకొన్న భౌగోళిక ఉద్రికత్త పరిస్థితుల దృష్ట్యా ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించారు. సెన్సెక్స్ 443 పాయింట్లు ఎగసి 80,661 వద్ద, నిఫ్టీ 129 పాయింట్లు పెరిగి 24,458 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకాయి.ఐటీ, క్యాపిటల్ గూడ్స్, ఇండస్ట్రియల్, కన్జూమర్ రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. మెటల్, యుటిలిటీ, టెలీకమ్యూనికేషన్, సర్విసెస్, బ్యాంకులు, ఫైనాన్స్ సర్విసెస్ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. డాలర్ మారకంలో రూపాయి విలువ 27 పైసలు బలపడి 84.96 వద్ద స్థిరపడింది. అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. మెరుగైన ఫలితాలతో పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్ 4% పెరిగి రూ.1,031 వద్ద నిలిచింది. ఇంట్రాడేలో 10% ఎగసి రూ.1,085 తాకింది రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు 2%, టీసీఎస్, ఇన్ఫోసిస్ షేర్లు ఒకశాతం చొప్పున రాణించి సూచీలకు దన్నుగా నిలిచాయి.

బజాజ్ ఫైనాన్స్ బోనస్ బొనాంజా
న్యూఢిల్లీ: ఎన్బీఎఫ్సీ దిగ్గజం బజాజ్ ఫైనాన్స్ గతేడాది(2024–25) చివరి త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. జనవరి–మార్చి(క్యూ4)లో నికర లాభం 16 శాతం ఎగసి రూ. 3,940 కోట్లను తాకింది. అంతక్రితం ఏడాది(2023–24) ఇదే కాలంలో రూ. 3,402 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 12,764 కోట్ల నుంచి రూ. 15,808 కోట్లకు జంప్ చేసింది.స్టాండెలోన్ ఫలితాలివి. వడ్డీ ఆదాయం రూ. 11,201 కోట్ల నుంచి రూ. 13,824 కోట్లకు బలపడింది. కాగా.. కన్సాలిడేటెడ్ నికర లాభం సైతం 19 శాతం వృద్ధితో రూ. 4,546 కోట్లకు చేరింది. నిర్వహణలోని మొత్తం ఆస్తులు(ఏయూఎం) 26 శాతం ఎగసి రూ. 4,16,661 కోట్లయ్యాయి. 2025 మార్చి31కల్లా స్థూల మొండి బకాయిలు(ఎన్పీఏలు) 0.96 శాతం, నికర ఎన్పీఏలు 0.44 శాతంగా నమోదయ్యాయి. అందుబాటులోకి షేరు బజాజ్ ఫైనాన్స్ వాటాదారులకు రూ. 2 ముఖ విలువగల ఒక్కో షేరుకి రూ. 44 డివిడెండ్ చెల్లించనుంది. రూ. 2 ముఖ విలువగల ప్రతీ షేరుని రూ. 1 ముఖ విలువగల 2 షేర్లుగా విభజించనుంది. అంతేకాకుండా 4:1 నిష్పత్తిలో బోనస్ ప్రకటించింది. అంటే వాటాదారుల వద్దగల ప్రతీ 1 షేరుకి 4 షేర్లు ఉచితంగా జారీ చేయనుంది. ఈ ప్రతిపాదనలను తాజాగా బోర్డు అనుమతించినట్లు కంపెనీ వెల్లడించింది. కాగా.. గతంలో నమోదు చేసిన రూ. 249 కోట్ల పన్ను వ్యయాలను రివర్స్ చేసింది. దీంతో పూర్తి ఏడాదిలో పన్ను ప్రొవిజన్ రూ. 99 కోట్లకు పరిమితమైనట్లు పేర్కొంది. వెరసి క్యూ4లో రూ. 348 కోట్ల పన్ను తగ్గినట్లు తెలిపింది. ఫలితాల నేపథ్యంలో బజాజ్ ఫైనాన్స్ షేరు బీఎస్ఈలో నామమాత్ర నష్టంతో రూ. 9,089 వద్ద ముగిసింది.
ఫ్యామిలీ

అక్షయ తృతీయ శుభ సమయం, మంగళవారం గోల్డ్ కొనొచ్చా?
అక్షయ తృతీయ (Akshaya Tritiya 2025) పర్వదినం అనగానే అందరికీ గుర్తు వచ్చేది బంగారం. నిజానికి ఈ పండుగను లక్ష్మీదేవి( Lakshmi Devi )కి సంబంధించిన వేడుకగా భావిస్తారు. అక్షయ తృతీయ రోజున కుబేరుడిని కూడా పూజిస్తారు. అలాగే ఈ రోజు తమ తాహతుకు తగ్గట్టు ఎంతో కొంత బంగారం( Gold) వెండి( Silver ) వస్తువులను తమ ఇంటికి తెచ్చుకోవాలని, ఇది తమకు చాలా శుభప్రదమని విశ్వసిస్తారు. తద్వారా ఏడాదంతా తమ ఇల్లు శుభప్రదంగా ఆర్థికంగా కళకళలాడుతుందని నమ్మకం. ఇదీ చదవండి: తండ్రి త్యాగం, పట్టుదలతో 13 ఏళ్లకే కోటీశ్వరుడు.. ఇదీ టాలెంట్! వైశాఖ శుద్ధ తదియ రోజున మనం అక్షయ తృతీయగా జరుపుకుంటాం.అక్షయ తృతీయ రోజు బంగారం, వెండి వంటి విలువైన వస్తువులు కొంటే అవి అక్షయంగా అంటే నాశనం లేకుండా ఉంటాయని నమ్మకం. . నిజానికి ఒకపుడు అక్షయ తృతీయ, బంగారం కొనుగోళ్లుపై పెద్దగా ప్రాచుర్యం ఉండేది కాదు. కానీ ఇటీవలి కాలంలో అక్షయ తృతీత సందడి బాగా పెరిగింది. దీనికి తగ్గట్టు జ్యుయల్లరీ వ్యాపారులు కూడా పలు రకాల ఆఫర్లతో ఆకర్షింటారు.దీంతోపాటు, అక్షయ తృతీయ ఏదైనా కొత్త వస్తువులను కొనుగోలు చేసుకోవాలనుకునేవారు తమ రాశి ప్రకారం కొనుగోలు చేస్తే మంచిదని పండితులు చెబుతున్నమాట.ఈ ఏడాది అక్షయ తృతీయ ముహూర్తం వివరాలు పంచాంగం ప్రకారం ఈ ఏడాది అక్షయ తృతీయ తిథి ఏప్రిల్ 29 సాయంత్రం 5:29 గంటలకు ప్రారంభమై మరుసటి రోజు అంటే ఏప్రిల్ 30న మధ్యాహ్నం 2:12 గంటలకు ముగుస్తుంది. సాధారణంగా ఉదయ తిథినే ప్రామాణికంగా భావిస్తాం కాబట్టి , ఈ సమయంలో ఏ వ్రతమైనా, పూజ అయినా ఆచరించవచ్చు. అలాగే అక్షయ తృతీయ రోజున శ్రేయస్సుకు చిహ్నమైన బంగారాన్ని ఇంటికి తెచ్చుకోవాలని భావిస్తారు. అయితే ప్రస్తుతం పసిడి ధర కొండెక్కి కూచున్న నేపథ్యంలో ఇతర వస్తువులను అయినా కొనుగోలు చేయవచ్చు. అలాగే దానధర్మాలు చేయాలని కూడా పెద్దలు చెబుతారు. అయితే ఏదైనా కొనుగోలు చేసేందుకు శుభ సమయం వచ్చేసి ఏప్రిల్ 30న ఉదయం 6:11 నుంచి మధ్యాహ్నం 2:12 వరకు.అక్షయ తృతీయ- బంగారం కొనడానికి శుభ సమయాలుఏప్రిల్ 29 మంగళవారం బంగారం కొనుగోలు సమయాలు - 05:31 PM నుండి 04:38 AM వరకుఏప్రిల్ 30న ఉదయం 6:11 నుంచి మధ్యాహ్నం 2:12 వరకు.

తండ్రి త్యాగం, పట్టుదలతో 13 ఏళ్లకే కోటీశ్వరుడు.. ఇదీ టాలెంట్!
వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) ఐపీఎల్ 2025 (Indian Premier League 2025) సీజన్లో ఒక సంచలనం. చిచ్చర పిడుగు. 14 ఏళ్ల వయసులోనే ఐపీఎల్లో అడుగుపెట్టి చర్రితను తిరగరాసిన అద్భుత ప్రతిభావంతుడు. ఐపీఎల్లో అత్యంత పిన్న వయస్కుడైన క్రికెటర్. రికార్డు బద్దలు కొట్టేశాడు. అయితే ఎవరి విజయమైనా అంత సులువుగా రాదు. కష్టాలు కన్నీళ్లు, కఠోర శ్రమతో తన కలను సాకారం చేసు కోవాల్సిందే. అలా అద్భుత ఇన్నింగ్స్ తో స్టార్‌గా మారిపోయాడు వైభవ. తరువాత ఈ సందర్బంగా కల తీరింది. భయంలేదు అంటూ తన జర్నీ గురించి మాట్లాడిన తీరు అమోఘంగా నిలిచింది. వైభవ్ సక్సెస్ జన్నీ ఎలా సాగింది, దేశంలోని అత్యుత్తమ క్రికెటర్‌గా తీర్చిదిద్దేందుకు వైభవ్ కుటుంబం చేసిన త్యాగం, కృషి ఏంటి అనేది నెట్టింట చర్చకు దారి తీసింది.వైభవ్ తండ్రి త్యాగం, పట్టుదల14 ఏళ్ల క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ, T20లలో అర్ధశతకం సాధించిన అతి పిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025లో జైపూర్‌లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడి ఈ ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్ ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. దీంతో యువ క్రికెటర్‌పై ప్రశంసలు వెల్లువెత్తాయి. కొడుకు కోసం స్వయంగా గ్రౌండ్, నాలుగేళ్ల క్రితం పొలం అమ్మేశాడువైభవ్ సూర్యవంశీ తండ్రి సంజీవ్ సూర్యవంశీ తన కొడుకు క్రికెటర్ కావాలనే కలను నెరవేర్చడానికి నాలుగు సంవత్సరాల క్రితం తన వ్యవసాయ భూమిని అమ్మేశాడు. 2011 మార్చి 27న బిహార్‌లోని తాజ్పూర్ అనే ఓ మారుమూల గ్రామంలో జన్మించాడు వైభవ్ సూర్యవంశీ. నాలుగేళ్ల వయసులోనే క్రికెట్ అంటే ఇష్టాన్ని, అతనిలోని ప్రతిభను తండ్రి , స్వయంగా క్రికెటర్ అయిన సంజీవ్ సూర్యవంశీ గుర్తించాడు. అంతే తనకున్న కొద్దిపాటి స్థలంలోనే వైభవ్ కోసం ఒక చిన్న ఆట స్థలాన్ని ఏర్పాటు చేశాడు. స్వయంగా ఆయన చేతుల మీదిగా ఆ నేలను చదును చేసి కొడుకు కోసం చిన్న ప్లే గ్రౌండ్ తయారు చేసి ఇచ్చాడు. అదే అతని కరియర్‌కు నాంది పలికింది. తొమ్మిదేళ్లు నిండగానే సమస్తిపూర్ పట్టణంలోని క్రికెట్ అకాడమీలో చేర్పించారు సంజీవ్. అంతేకాదు కొడుకును క్రికెటర్‌గా తీర్చిదిద్దాలన్న కోరిక, కొడుకు క్రికెట్ కలను సాకారం కావాలనే ఆశయంతో తన పొలాన్ని అమ్మేశారు. తండ్రి నమ్మకాన్ని ఎప్పుడూ వమ్ము చేయలేదు కొడుకు. రెండున్నరేళ్ల శిక్షణ తరువాత విజయ్ మర్చంట్ ట్రోఫీ కోసం అండర్-16లో సత్తా చాటాడు వైభవ్. అలాగే ప్రతి రోజు సమస్తిపూర్ నుండి పాట్నాకు 100 కిలోమీటర్ల ప్రయాణం చేసి మరీ మాజీ రంజీ ఆటగాడు మనీష్ ఓజా శిక్షణలో మరింత రాటు దేలాడు. అలా గత ఏడాది ఐపీఎల్ జట్టు రాజస్థాన్ రాయల్స్ అతి పిన్న వయస్కుడైన క్రికెటర్ ఎంపిక చేయడం వరకు అతని జర్నీ సాగింది. వైభవ్ తనకొడుకు మాత్రమే కాదని, మొత్తం బిహార్‌కు కొడుకునని సంతోషంగా ప్రకటించారు తండ్రి సంజీవ్. చదవండి : ముద్దుల మూట, మనసెలా వచ్చింది : వైద్యురాలి వీడియో వైరల్డోరేమాన్ నుంచి 13 ఏళ్లకే కోటీశ్వరుడుగాతాను కష్టపడి పనిచేసి వైభవ్‌కు శిక్షణ ఇప్పించాననీ, ఎనిమిదేళ్ల వయస్సు నుండి, క్రికెటర్ కావాలనే తన కలను సాధించేందుకు చాలా కష్టపడ్డాడంటూ కొడుకు పోరాటాన్ని గుర్తు చేసుకున్నారు సంజీవ్. చిన్నపుడు డోరేమాన్ చూసేవాడు.. ఆ తరువాత క్రికెట్ ఒకటే.. అదే అతని ప్రాణం. ఎనిమిదేళ్లకే U-16 జిల్లా ట్రయల్స్‌లో రాణించాడన్నారు. క్రికెట్ కోచింగ్ కోసం సమస్తిపూర్‌కు తీసుకెళ్లి, తీసుకొచ్చేవాడినంటూ ఆయన తన శ్రమను గుర్తు చేసుకున్నారు. తన శ్రమ, త్యాగం వృధా కాలేదు అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. వైభవ్‌ను క్రికెటర్‌గా చూడాలన్న ఆశయంకోసం వ్యవసాయ భూమిని అమ్మేశాను.ఇప్పటికీ ఆర్థిక సమస్యలున్నాయని చెప్పుకొచ్చారు.𝙏𝙖𝙡𝙚𝙣𝙩 𝙢𝙚𝙚𝙩𝙨 𝙊𝙥𝙥𝙤𝙧𝙩𝙪𝙣𝙞𝙩𝙮 🤗He announced his arrival to the big stage in grand fashion 💯It’s time to hear from the 14-year old 𝗩𝗮𝗶𝗯𝗵𝗮𝘃 𝗦𝘂𝗿𝘆𝗮𝘃𝗮𝗻𝘀𝗵𝗶 ✨Full Interview 🎥🔽 -By @mihirlee_58 | #TATAIPL | #RRvGT https://t.co/x6WWoPu3u5 pic.twitter.com/8lFXBm70U2— IndianPremierLeague (@IPL) April 29, 2025 IPL 2025 వేలం రెండవ రోజున, రాజస్థాన్ రాయల్స్ వైభవ్‌ను రూ. 1.10 కోట్లు వెచ్చింది. ఈ ఎన్నిక అంత ఆషామాషీగా ఏం జరగలేదు. ఈ మెగా వేలానికి ముందు, రాజస్థాన్ రాయల్స్ మేనేజ్మెంట్ నాగ్‌పూర్‌లో ఏర్పాటు చేసిన ట్రయల్స్ క్యాంప్‌లో సత్తా చాటుకున్నాడు. చిచ్చర పిడుగు సిక్సర్ల టాలెంట్ అప్పుడే బైటపడింది. ఇపుడు చరిత్రలో అతి పిన్న వయస్కుడైన ఆటగాడి తన పేరును లిఖించుకున్నాడు. ఐపీఎల్ 2025లో రాజస్థాన్ రాయల్స్ తరఫున అరంగేట్రం చేసి తొలి బాల్ సిక్స్‌కొట్టి ఔరా అనిపించుకున్నాడు వైభవ్ సూర్యవంశీ. ఐపీఎల్ చరిత్రలో మొదటి బంతికి సిక్స్ కొట్టిన పదో ఆటగాడిగా నిలిచాడు. అతని దూడుకును గమనిస్తే.. భవిష్యత్తులో మరిన్ని రికార్డులు రానున్నాయో అనిపించక మానదు. అందుకే యావత్ క్రికెట్ అభిమానులు ఆల్ ది బెస్ట్ అంటూ అభినందిస్తున్నారు.

నిధుల సమీకరణకు ఫ్యాషన్ షో..
గ్లోరియస్ మిస్ అండ్ మిసెస్ ఇండియా, రాయల్ మిస్టర్ ఇండియా వేడుకలను ఈ నెల 29, 30 తేదీల్లో తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ సోమాజీగూడలోని ది పార్కు హోటల్లో నిర్వహించనున్నారు. ఈ మేరకు బేగంపేటలోని ఐఏఎస్ ఆఫీసర్స్ బిల్డింగ్స్‌లో సోమవారం సన్నాహక కార్యక్రమం నిర్వహించారు. ఇందులో ఫౌండర్ అండ్ డైరెక్టర్స్ స్నేహల్‌తో పాటు క్రాంతి, సబీనా, రిని, చతుర్వేది హాజరై వివరాలను వెల్లడించారు. జేసీఐ సికింద్రాబాద్ ప్యారడైజ్ మద్దతులో ఎస్ఎస్కే క్రియేషన్స్ ఆధ్వర్యంలో గ్లోరియస్ మిస్ అండ్ మిసెస్ ఇండియా, రాయల్ మిస్టర్ ఇండియా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇది కేవలం అందాల పోటీ కాదని, ఇది ఒక లక్ష్యంతో ఏర్పడిన మిషన్ అని పేర్కొన్నారు. ఉమంగ్ ఫౌండేషన్, భారత సైన్యంతో కలిసి దేశ సరిహద్దు ప్రాంతాల్లోని పిల్లల కోసం పాఠశాలలు నిర్మించేందుకు నిధులు సమీకరిస్తున్నామన్నారు. పది సంవత్సరాలుగా దేశవ్యాప్తంగా తెలంగాణ జేసీఐ తరపున పాఠశాలల అభివృద్ధికి నిధుల సమీకరణ చేపడుతున్నామన్నారు. కాగా ఈ కార్యక్రమంలో అందాల భామలు ర్యాంప్‌వ్యాక్ చేసి ఆకట్టుకున్నారు. (చదవండి: ఆభరణాల క్రియేటివిటీ వెనుక ఇంట్రస్టింట్ స్టోరీ ఇదే..!)

Bone Fractures: కట్టుకట్టినా సెట్టవ్వలేదా..?
అది రోడ్డు ప్రమాదాలు గానీ, ఇంట్లో ఎత్తు నుంచి పడిపోవడంగానీ బాత్రూమ్లో జారిపడటం గానీ జరిగినప్పుడు మొదట అందరూ అడిగేది... ఎవరివైనా ఎముకలు విరిగాయా అని. ఇంగ్లిష్‌లో ఫ్రాక్చర్ అని పిలిచే ఈ ఎముకలు విరిగినప్పుడు ఆపరేషన్‌తో విరిగిన ఎముకల్ని దగ్గర చేయడం, ప్లేట్స్ వేయడం, సిమెంట్ కట్టు వేసి అతికించడానికి ప్రయత్నించడం వంటి వైద్య ప్రక్రియల్ని అనుసరిస్తూ ఉంటారు. విరిగిన ఎముకల్ని దగ్గరగా వచ్చేలా సెట్ చేసినప్పుడు చాలామందిలో సరిగ్గా అతుక్కునే ఎముకలు కొందరిలో అంతగా సెట్ కాకపోవచ్చు. దాంతో ఎముకలు సరిగా సెట్ కాలేదనీ, అతుక్కోలేదనీ కొందరు ఫిర్యాదు చేస్తుంటారు. ఇలాంటి కేసులనే ఫెయిల్యూర్ ఆర్థోపెడిక్స్ అని సాధారణ ప్రజలు చెబుతున్నప్పటికీ... వాస్తవానికి ఇలా సరిగా సెట్ కాని సందర్భాల్లో దీన్ని ‘నాన్ యూనియన్ ఆఫ్ ఫ్రాక్చర్’గా చెబుతున్నారు. ఇలా సరిగా అతకనప్పుడు ఎముకలు ఉన్న సదరు అవయవం సరిగా పనిచేయకపోవడం, నొప్పి రావడంతో పాటు కొన్నిసార్లు ఆ కండిషన్ ప్రాణాంతకం కావడం అనే ముప్పు కూడా రావచ్చు. ఇలా ఎముకలు సరిగా అతకని సందర్భాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అందించాల్సిన చికిత్సల వంటి పలు అంశాల గురించి తెలుసుకుందాం. వాటంతట అవే అతుక్కునే ఎముకలు...విరిగిన ఎముక సరిగా అతకకపోవడం జరిగినప్పుడు అందుకు కారణాలూ, అందులో ఇన్వాల్వ్ అయిన అంశాలూ ఎన్నో ఉండవచ్చు. ఉదాహరణకు ఒక ఎముక రెండుగా విరిగినప్పుడు దాన్ని సరిగా కూర్చలేకపోతే (సెట్ చేయలేకపోతే) ఆ కండిషన్‌ను ‘ఇన్‌సఫిషియెంట్ రిడక్షన్’ అంటారు. అలాంటి పరిస్థితుల్లో విరిగిన ఎముక చక్కగా అతకదు. ఫలితంగా పూర్తిగా, సరిగా నయం కాదు. ఆ పరిస్థితినే ‘నాన్‌యూనియన్’ అంటారు.ఏదైనా ఎముక విరిగినప్పుడు వాటిని సరిగా అమర్చి పెట్టి అలా కాలానికి వదిలేస్తే అవి వాటంతట అవే కుదురుకుని చక్కగా అతుక్కునే శక్తిని ప్రకృతి ఎముకకు ఇచ్చింది. అందుకే విరిగిన ఎముకను సరిగా సెట్ చేసి (అమర్చి) అలా వదిలేస్తే కాలం గడిచే కొద్దీ ఎముక దానంతట అదే నయమవుతుంది. ఇందుకు కావల్సినదల్లా ఆ విరిగిన ఆ ఎముక ముక్కల్ని సరిగా కూర్చడం / పేర్చడంలో నైపుణ్యమే. అయితే కొన్ని సందర్భాల్లో కాస్తంత ప్రత్యేక శ్రద్ధ, కొద్దిపాటి చికిత్స మాత్రం అవసరమవుతాయి. అందుకే చాలా సందర్భాల్లో అత్యంత నిపుణులైన వైద్యుల ఆధ్వర్యంలో చికిత్స జరగకపోయినా ఎముకలు కుదురుకుంటాయి. ఎముకకు ఉన్న ఈ గుణం మూలానే కొన్నిచోట్ల సంప్రదాయ వైద్యం పేరిట ఎముకలను సెట్ చేసేవారూ ఎముకల్ని అతకగలుగుతుంటారు. తనంతట తానే అతుక్కునే సామర్థ్యం ఎముకకు ఉన్నప్పటికీ నిపుణులైన వైద్యుల అవసరం ఎందుకు అవసరమంటే... విరిగిన ఎముకలకు కట్టు కట్టి పూర్తిగా సెట్ అయ్యేందుకు వదలాలంటే విరిగిన ప్రదేశంలో అవి సరిగా అమరేటట్లుగా ఉంచడమన్నది చాలా ప్రధానం. ఇది సరిగా జరగక΄ోతే విరిగిన ఎముక సరిగా (ఖచ్చితంగా) అతుక్కోకపోవచ్చు లేదా నయం కావడమన్నది చాలా ఆలస్యంగా జరగవచ్చు. ఇలా ఎముక అతుక్కోవడంలో జాప్యం జరిగితే దాన్ని ‘డిలేయ్డ్ యూనియన్’ అంటారు. ఈ పరిస్థితిని కొందరు ఎదుర్కొంటారు. ఇక కొందరిలో ఎముక సరిగా అతకనే అతకదు. ఈ పరిస్థితిని ‘నాన్ యూనియన్’ అంటారు.డిలేయ్డ్ యూనియన్ / నాన్ యూనియన్‌కు కారణాలుఎముక విరిగిన చోట కణజాలం కూడా తీవ్రంగా దెబ్బతినడం. ఎముక విరిగిన చోట మృదు కణజాలానికి కోలుకోలేనంత నష్టం జరగడం. ఎముక సరిగా అతకని ప్రాంతానికి తగినంత రక్తసరఫరా జరగకపోవడం. ఎముక సరిగా అతకని ప్రాంతంలో ఇన్ఫెక్షన్ రావడం. విరిగిన ఎముకను తగినంత సేపు కదలకుండా ఉంచక΄ోవడం, స΄ోర్టు తగినంతగా లభించక΄ోవడం (ఇన్‌సఫిషియెంట్ స్ప్లింటేజ్). రెండు ఎముకలు అతుక్కునేలా తగినంత ఒత్తిడి (కంప్రెషన్) కలిగించక΄ోవడం (ఒక ఎముక మరో ఎముకపై జారకుండా ఉండేలా... ఒకదానితో మరొకటి సరిగ్గా అమరిపోయేలా లేదా కలిసిపోయేలా ఉపయోగించే గరిష్ఠ ఒత్తిడిని కంప్రెషన్ అంటారు). ఎముక అతుక్కోకపోవడానికి కారణాలుఎముక అసలే అతుక్కోక΄ోవడాన్ని నాన్‌యూనియన్ అంటారు. సాధారణంగా ఆలస్యంగా అతుక్కోడానికి కారణమయ్యే అంశాలే ఎముక అసలు అతుక్కోక΄ోవడానికీ చాలావరకు కారణం కావచ్చు. దానితోపాటు మరికొన్ని కారణాలూ ఉండవచ్చు. అవేమిటంటే... ∙క్యాలస్ బ్రిడ్జ్ ఏర్పడకపోవడం : రెండు ఎముకలు అతికించేందుకు దగ్గర చేసినప్పుడు వాటి మధ్య కొంత గ్యాప్ రావడం. దీని గురించి ఇంగ్లిష్‌లో చె΄్పాలంటే... టూ లార్జ్ స్పేస్ ఫర్ ఫార్మేషన్ ఆఫ్ క్యాలస్ బ్రిడ్జ్‌గా దీన్ని పేర్కొంటారు... అంటే ఎముక అతుక్కునే ముందర రెండు ముక్కల మధ్య ఒక బ్రిడ్జ్‌లాంటిది ఏర్పడుతుంది. దాన్నే ‘క్యాలస్ బ్రిడ్జ్’ అంటారు. గ్యాప్ రావడం వల్ల అది ఏర్పడదు. ఇంటర్΄ పొజిషన్ ఆఫ్ సాఫ్ట్ టిష్యూ : అతుక్కోవాల్సిన రెండు ఎముకల మధ్య మృదుకణజాలం అడ్డుగా రావడం వల్ల ఎముక అతుక్కోదు. ఇలా జరగడాన్ని ఇంటర్పొజిషన్ ఆఫ్ సాఫ్ట్ టిష్యూ గా పేర్కొంటారు. అవసరమైన పరీక్షలు విరిగిన ఎముక సరిగా అతుక్కుందా లేక సరిగా అతుక్కోలేదా లేదా అతుక్కునే ప్రక్రియ ఆలస్యం అవుతోందా అన్న విషయాన్ని నిర్ధారణ చేయడానికి ఎక్స్–రే పరీక్ష ఎంతగానో ఉపయోగపడుతుంది. శస్త్రచికిత్స రహిత విధానాలుఇందులో సర్జరీ లేకుండానే క్యాల్షియమ్ సప్లిమెంటేషన్ ఇవ్వడం, తొడుగులు వంటి ఉపకరణాలను అమర్చడం వంటి ప్రక్రియలను అవలంబిస్తారు. చికిత్సఎముకలు సరిగా అతుక్కోకపోవడం లేదా ఆలస్యంగా అతుక్కోవడం వంటి సమస్య ఎదురైనప్పుడు అందుకు కారణమైన అంశాలను చూడాల్సి ఉంటుంది. కారణాన్ని బట్టి చికిత్స చేయాల్సి ఉంటుంది. ఎముక అతుక్కోవడంలో ఆలస్యం జరిగినప్పుడు ఎముక పెరిగేలా బోన్‌గ్రాఫ్ట్ వంటి ప్రక్రియలను కూడా అవలంబించాల్సి రావచ్చు. శస్త్రచికిత్సఎముక సరిగా అతకని చోట బాధితులకు అవసరమైన శస్త్రచికిత్సను చేయడం. ఎముకలు అతకని పరిస్థితి నివారణ ఇలా... ఇక ఎముక సరిగా అతకకపోవడం వంటి పరిస్థితిని నివారించడానికి... ఇలాంటి పరిస్థితిని నివారించాలంటే... ఎముక ఫ్రాక్చర్ అయిన వ్యక్తికి పొగతాగే అలవాటు ఉంటే దాన్ని తప్పనిసరిగా మానేయాలి. డాక్టర్ చెప్పిన చికిత్స ప్రక్రియను తప్పనిసరిగా అనుసరించాలి. అన్ని పోషకాలు అందేలా అన్ని ΄ోషకాలు ఉన్న ఆహారాన్ని వేళకు తింటుండాలి. పొగతాగేవారు, స్థూలకాయులు, మధుమేహం (డయాబెటిస్) సమస్య ఉన్నవారిలో నాన్–యూనియన్‌కు అవకాశాలు ఎక్కువ. కాబట్టి ఈ సమస్యలున్నవారు మరింత జాగ్రత్తగా ఉంటూ డాక్టర్ చెప్పే అని సూచనలనూ పాటించాల్సి ఉంటుంది.అతుక్కోని భాగాలు ఏవంటే...నిజానికి శరీరంలోని ఏ ఎముక అయినా సరిగా అతుక్కోక΄ోవడానికి ఆస్కారం ఉంది. అయితే మన శరీరంలో కొన్ని ఎముకలు మాత్రం ఒకపట్టాన అతుక్కోకుండా ఇబ్బంది పెడుతుంటాయి. అందుకు పలు అంశాలు కారణమవుతుంటాయి. ఉదాహరణకు మిగతా ఎముకలతో ΄ోలిస్తే ఆ ఎముకలకు రక్తసరఫరా సరిగా ఉండక΄ోవడం వంటివి. అందుకే ఆ ఎముకల విషయంలో తరచూ ఇలాంటి ఇబ్బంది కలుగుతుంది. ఆ ఎముకలు లేదా ఫ్రాక్చర్లు ఏవంటే... లాటెరల్ కాండైల్ హ్యూమరస్ ఫ్రాక్చర్: మోచేతిలో బయటవైపు ఉండే ఎముక విరిగితే దాన్ని లాటరల్ కాండైల్ హ్యూమరస్ ఫ్రాక్చర్ అంటారు. ఇది సరిగ్గా అతుక్కోవడంలో కొన్ని ఇబ్బందులు రావచ్చు.ఫీమోరల్ నెక్ ఫ్రాక్చర్: తుంటి ఎముకలో తొడలో ఉండే కాలి ఎముక సరిగ్గా ఓ గిన్నెలాంటి భాగంలో బంతిలా కూర్చుంటుంది. ఈ బంతికీ, మిగతా ఎముకకూ మధ్య ఉండే సన్నటి భాగం (నెక్) విరిగినప్పుడు అది అంత త్వరగా సెట్ కాకపోవచ్చు. ఫిఫ్త్ మెటాటార్సల్ (జోన్స్ ఫ్రాక్చర్)అరికాలిలో ఉండే ఎముకల్లో ఒకటైన ఈ ఎముక ఫ్రాక్చర్ అయినప్పుడు అతుక్కోవడం ఒకింత కష్టం కావచ్చు.టాలస్ ఫ్రాక్చర్‌చీలమండ ఎముకల మధ్య ఉండే ఎముకకు అయిన ఫ్రాక్చర్. స్కేఫాయిడ్ ఫ్రాక్చర్‌మణికట్టుపై బరువు పడినప్పుడు అయిన ఫ్రాక్చర్లు. సరిగా అతుక్కోకపోవడమన్నది చాలా కొద్దిమందిలోనే... ఫ్రాక్చర్ అయినవాళ్లలో కేవలం ఒక శాతం కేసుల్లోనే ఎముక అసలు అతుక్కోక΄ోవడం (నాన్–యూనియన్) జరుగుతుంటుంది. ఇలాంటి పరిస్థితి చాలావరకు కాళ్ల ఎముకల విషయంలోనే ఎక్కువ. ఎందుకంటే కాలి ఎముక విరిగాక మళ్లీ కాళ్లు కదిలించాల్సి వచ్చినప్పుడు తగిలిన చోటే మళ్లీ మళ్లీ దెబ్బలు తగిలే అవకాశాలు ఎక్కువ. కాబట్టి ఈ కండిషన్ పునరావృతమయ్యే అవకాశాలెక్కువ. ఎముక సరిగా అతకకపోయినా (నాన్‌యూనియన్‌లోనైనా) లేదా ఆలస్యంగా అతికినా (డిలేయ్డ్ యూనియన్‌లో) కనిపించే సాధారణ లక్షణాలివి... ఎముక విరిగిన చోట (ఫ్రాక్చర్ ప్రాంతంలో) నొప్పి తగ్గక΄ోవడం లేదా అదేపనిగా నొప్పి వస్తుండటం. ఎముక విరిగిన శరీర భాగాన్ని మునుపటిలా ఉపయోగించలేక΄ోవడం. ఎముక ఫ్రాక్చర్ అయిన చోట వాపు (స్వెల్లింగ్) రావడం. విరిగిన ఎముకకు సంబంధించిన కీలు (జాయింట్)ను కదల్చలేక΄ోవడం. విరిగిన ఎముక సరిగా అతుక్కోక కాస్త అటు ఇటు కదులుతుండటం. విరిగిన ఎముకలు అతుక్కోవడంలో ఎదురయ్యే సమస్యలివి... విరిగిన ఎముక నయమయ్యే సమయంలో ఇతరత్రా అనేక సమస్యలు ఎదురుకావచ్చు. అసలు ఒక ఎముక అతుక్కోనేలేదని ఎప్పుడు చెప్పవచ్చంటే... ∙మూడు నుంచి ఆర్నెల్ల తర్వాత కూడా విరిగిన ఎముక అతుక్కోకుండా ఉంటే దాన్ని ఎముక అతుక్కోవడంలో ఆలస్యం (డిలేయ్డ్ యూనియన్)గా చెప్పవచ్చు. ఒకవేళ ఆర్నెల్ల తర్వాత కూడా అతుక్కోకపోతే దాన్ని ‘నాన్‌యూనియన్’గా పేర్కొనవచ్చు. ∙ఒక చోట ఎముక అతకడంలో తీవ్రమైన ఆలస్యం జరుగుతోందంటే అక్కడ ఎముక అతుక్కోవడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని అర్థం. జాప్యం తీవ్రంగా ఉందంటే దాన్ని కొంతమేర అతకని ఎముక (నాన్‌యూనియన్)గానే పరిగణించాల్సి ఉంటుంది. ∙రెండుగా విరిగిన భాగాలు ఒకదానితో ఒకటి అతుక్కుపోయినప్పటికీ అది సరిగా ఖచ్చితమైన రీతిలో కూర్చినట్లుగా అతుక్కోక΄ోతే దాన్ని ‘మాల్‌యూనియన్’ అంటారు. సాధారణంగా ఎముక సరిగ్గా రెండు ముక్కలుగా విరిగినప్పుడు దాన్ని సరిగా కూర్చుండబెట్టినప్పుడు సరిగానే అతుక్కుంటుంది. అయితే కొన్నిసార్లు దెబ్బ చాలా బలంగా పడి కొన్ని ఎముక విరిగిన చోట ముక్కలుగా అయి΄ోవడం వల్ల అతికించే ప్రక్రియలో ఖచ్చితంగా కూర్చలేని పరిస్థితులు ఏర్పడవచ్చు. దాని వల్ల ఎముక నిడివి కాస్త తగ్గవచ్చు. దీన్ని ‘ఇన్‌సఫిషియెంట్ రిడక్షన్’గా పేర్కొంటారు. పైన వివరించిన పరిస్థితులు ఏవైనప్పటికీ విరిగిన ఎముక సరిగా అతకక΄ోయినా లేదా అతుక్కోవడంలో ఆలస్యం జరిగినా బాధితులు అనేక సమస్యలు ఎదుర్కొంటారు. డాక్టర్ బాలవర్థన్ రెడ్డిసీనియర్ కన్సల్టెంట్‌ఆర్థోపెడిక్ సర్జన్ (చదవండి: ఎనర్జిటిక్ హేమంగి..! న్యూక్లియర్ సైన్స్‌లో..)
ఫొటోలు
అంతర్జాతీయం

‘ఛీ’నా రాజకీయం...
అవకాశం దొరికింది కదాని ఇండియాను పాకిస్థాన్ భుజాల మీదుగా కాల్చాలని ప్రయత్నిస్తోంది కుటిల చైనా. ఆ దిశగానే బీజింగ్-ఇస్లామాబాద్ రక్షణ భాగస్వామ్యం బలపడుతోంది. పహల్గాంలో ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు పెచ్చరిల్లుతున్న తరుణంలో... గగనతలం నుంచి గగనతలంలోకి ప్రయోగించగల తమ అత్యాధునిక పీఎల్-15 క్షిపణులను పాక్ వైమానిక దళానికి చైనా అందించింది.బియాండ్ విజువల్ రేంజ్ (బీవీఆర్) పీఎల్-15 క్షిపణులను మోసుకెళుతున్న తమ జేఎఫ్-17 బ్లాక్ 3 యుద్ధ విమానాల ఫొటోలను పాక్ వైమానిక దళం (పీఏఎఫ్) ఇటీవల విడుదల చేయడం గమనార్హం. ‘పీఏఎఫ్’కు చైనా సరఫరా చేసినవి ఎగుమతులకు ఉద్దేశించిన ‘పీఎల్-15ఈ’ రకం క్షిపణులు అనుకుంటే పొరపాటు! తమ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ (పీఎల్ఏఏఎఫ్)కు చెందిన సొంత పీఎల్-15 క్షిపణులను చైనా నేరుగా పాక్ కు అందజేసినట్టు ‘యూరేషియన్ టైమ్స్’ ఓ కథనం ప్రచురించింది.భారత్, పాక్ నడుమ వైరం ముదురుతున్న అత్యంత కీలక తరుణంలో ఆగమేఘాలపై ఆయుధాలను సరఫరా చేయడానికి చైనా ఈ మార్గం ఎంచుకున్నట్టు తెలుస్తోంది. మరింత ఎక్కువ దూరం నుంచి భారత్ విమానాలను లక్ష్యంగా చేసుకోగల సామర్థ్యాన్ని పీఎల్-15 క్షిపణులు పాక్ యుద్ధ విమానాల పైలట్లకు కల్పిస్తాయి. అలా శత్రువుపై గెలుపును సునాయాసం చేస్తాయి.ఏమిటీ పీఎల్-15 మిసైల్?పీఎల్-15 క్షిపణి ఆధునిక వైమానిక యుద్ధరంగంలో చైనాకు ఓ ప్రధానాస్త్రం. ఇది ప్రభుత్వ ఏరోస్పేస్ సంస్థయిన ఏవియేషన్ ఇండస్ట్రీ కార్పొరేషన్ ఆఫ్ చైనా (ఏవీఐసీ) అభివృద్ధి చేసిన రాడార్ గైడెడ్ దూరశ్రేణి క్షిపణి. ధ్వని వేగానికి ఐదు రెట్లు (మ్యాక్ 5) మించిన వేగంతో గగనతలం నుంచి గగనతలానికి ప్రయోగించదగ్గ ఈ మిసైల్ 200-300 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదిస్తుంది.విదేశాలకు ఎగుమతి చేయడానికి ఉద్దేశించిన ‘పీఎల్-15ఈ’ వెర్షన్ మిసైల్ 145 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను మాత్రమే ఛేదించగలదు. జే-10సి, జే11-బి, జే-15, జే-16, జేఎఫ్-17 బ్లాక్ 3, జే-20 విమానాలకు పీఎల్-15 క్షిపణిని అమర్చవచ్చు. 160 కిలోమీటర్ల రేంజితో, శబ్ద వేగానికి నాలుగు రెట్ల వేగంతో ప్రయాణించగల అమెరికాకు చెందిన ఏఐఎం-120డి అమ్రామ్ క్షిపణితో పోలిస్తే రేంజి, వేగం పరంగా మెరుగైన ఈ పీఎల్-15 మిసైల్ 2018 నుంచి చైనా వైమానిక దళానికి సేవలు అందిస్తోంది.పీఎల్-15 వర్సెస్ మీటియర్... యూరోపియన్ ఎంబీడీఎం మీటియర్ క్షిపణితో పీఎల్-15ను పోల్చవచ్చు. గగనతలం నుంచి గగనతలానికి ప్రయోగించగల మీటియర్, ఎంఐసీఏ దూరశ్రేణి క్షిపణులను ప్రస్తుతం భారత్ చెంత ఉన్న రాఫెల్ యుద్ధ విమానాలకు అమర్చవచ్చు. లాంచ్ ప్లాట్ ఫాం, ఎత్తు, లక్ష్యపు చలనశీలత అంశాలపై ఆధారపడి మీటియర్ మిసైల్ పరిధి 100-200 కిలోమీటర్లు ఉంటుంది. ధ్వని వేగానికి నాలుగు రెట్లు మించిన వేగాన్ని అది అందుకోగలదు. సామర్థ్యం పరంగా పీఎల్-15ఈ (ఎగుమతి రకం)తో మీటియర్ క్షిపణిని పోల్చవచ్చు. కానీ పీఎల్-15 స్టాండర్డ్ వెర్షన్ (పాక్ కు చైనా సరఫరా చేసిన ప్రామాణిక రకం) మాత్రం మీటియర్ కంటే అధిక వేగం, దూరశ్రేణి గల క్షిపణి. రాంజెట్ ఇంజిన్ సాయంతో మీటియర్ క్షిపణి ప్రయాణమంతటా స్థిర వేగంతో దూసుకెళుతుంది.ఇందుకు భిన్నంగా పీఎల్-15 మిసైల్ డ్యూయల్ పల్స్ ఘన ఇంధన రాకెట్ మోటార్ సాయంతో ప్రయాణిస్తుంది. ఇందులోని ఘన ఇంధనం కొద్దిసేపు మాత్రమే జ్వలించినప్పటికీ రాంజెట్ ఇంజిన్ గల మీటియర్ కంటే ఎక్కువ వేగం అందిస్తుంది. అయితే ధ్వనికి ఐదు రెట్లు పైబడిన స్పీడ్ అందుకున్నా ప్రయాణం పొడవునా అదే వేగాన్ని పీఎల్-15 మిసైల్ కొనసాగించలేదు! క్షిపణుల బయటివైపు చిన్న రెక్కల్లాంటి భాగాలు (ఫిన్స్) ఉంటాయి. వాటిని మడవగలిగితే మరిన్ని క్షిపణులను యుద్ధవిమానాలకు అమర్చవచ్చు. ఈ బుల్లి రెక్కల్ని మడిచిన పీఎల్-15 క్షిపణి నమూనాను చైనా నిరుడు జూహాయ్ ఎయిర్ షోలో ప్రదర్శించింది. దీంతో జే-20 లాంటి యుద్ధవిమానాలు నాలుగు బదులుగా ఆరు పీఎల్-15 మిసైళ్లను మోసుకెళ్లే వీలు కలిగింది.రష్యన్ ‘ఆర్-37ఎం’ వైపు భారత్ చూపు?పాక్ మోహరించిన పీఎల్-15 మిసైళ్లతో భారత వైమానిక దళానికి తలనొప్పి తప్పేలా లేదు. వాటిపై పైచేయి సాధించే ఆప్షన్ ఇండియాకు లేకపోలేదు. అది... రష్యాకు చెందిన అత్యాధునిక ఆర్-37ఎం దూరశ్రేణి క్షిపణి! అతిధ్వానిక వేగాన్ని (మ్యాక్ 6) అందుకోగల ఈ హైపర్ సానిక్ మిసైల్ 300-400 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను తుత్తునియలు చేస్తుంది. ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా దీన్ని విస్తృతంగా వినియోగించింది. ఉక్రెయిన్ వైమానిక దళానికి ఆర్-37ఎం క్షిపణి నుంచే ప్రధాన ముప్పు ఎదురైందంటే అతిశయోక్తి కాదు.ఆర్-37ఎంను అమర్చిన మిగ్-31 విమానాలు పలు ఉక్రెయిన్ యుద్ధ విమానాలను కూల్చివేశాయి. ఉక్రెయిన్ ఎఫ్-16 యుద్ధ విమానాన్ని సైతం ఈ మిసైల్ సాయంతో రష్యా కూల్చివేసినట్టు ఇటీవల వార్తలు వచ్చాయి. విశేషం ఏమిటంటే సుఖోయ్ ఎస్యు-30ఎస్ఎం2 యుద్ధ విమానాలపై ఆర్-37ఎం క్షిపణులను మోహరించవచ్చు. భారత్ వద్ద ‘సుఖోయ్ ఎస్యు-30’ శ్రేణికి కొదవ లేదు. ప్రస్తుతం మనకు 260కి పైగా సుఖోయ్ ఎస్యు-30ఎంకెఐ యుద్ధ విమానాలు ఉన్నాయి.వాటిని సుఖోయ్ ఎస్యు-30ఎస్ఎం2 వేరియంట్లుగా ఉన్నతీకరించే అంశాన్ని భారత్ పరిశీలిస్తోంది. ఎస్యు-30ఎంకెఐ విమానాలకే ఆర్-37ఎం క్షిపణులను అమర్చాలంటే పెద్ద సాంకేతిక ప్రక్రియ ఉంది. దాదాపు 84 ఎస్యు-30ఎంకెఐ విమానాలను ఎస్ఎం2 వేరియంట్ స్థాయికి అప్‌గ్రేడ్ చేయడానికి రూ.63 వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా.ఆర్-37ఎం క్షిపణులను ఇండియాకు విక్రయించడానికి రష్యా కూడా ఆసక్తి కనబరుస్తోంది. రాఫెల్ యుద్ధ విమానాలపై ఈ క్షిపణులను మోహరించే అంశంలోనూ చర్చలు సాగుతున్నాయి. 2019లో బాలాకోట్ దాడుల సందర్భంగా ఇండియాకు చెందిన మిగ్-21 బైసన్ యుద్ధ విమానాన్ని పాక్ తన ఎఫ్-16 విమానం-అమ్రామ్ క్షిపణితో కూల్చివేసింది. నాడు ఇండియా చెంత దూరశ్రేణి క్షిపణులు లేకపోవడం పెద్ద లోటు. ఆ తర్వాత మీటియర్ క్షిపణులను అమర్చిన రాఫెల్ విమానాలను భారత్ మోహరించింది. - జమ్ముల శ్రీకాంత్

స్తంభించిన విద్యుత్.. మూడు దేశాలు అతలాకుతలం
మాడ్రిడ్: విద్యుత్ సప్లై పూర్తిగా నిలిచిపోవడంతో మూడు ఐరోపా దేశాలు అతలాకుతలమవుతున్నాయి. పవర్ గ్రిడ్ లో తీవ్రమైన సమస్యలు తలెత్తడంతో స్పెయిన్, పోర్చుగల్, ఫ్రాన్స్ దేశాలు పూర్తిగా స్తంభించిపోయాయి.ప్రస్తుతం పవర్ గ్రిడ్ తిరిగి పునరుద్దరించే పనిలో పడ్డ మూడు దేశాలు.. సోమవారమంతా చీకటిలో మగ్గిపోయాయి. విమానాల రాకపోకల్లో తీవ్ర సమస్యలే కాకుండా భారీ ట్రాఫిక్ జామ్ లు వంటి ఘటనలు ఆ దేశాల్లో తల్తెతాయి. దీనిపై ఆయా దేశాలు అత్యవసరంగా క్యాబినెట్ భేటీ నిర్వహించి పవర్ గ్రిడ్ ను పునరుద్దరించేందుకు కసరత్తులు చేస్తున్నాయి. ఎక్కడికక్కడే నిలిచిపోయిన రైళ్లు..చిమ్మ చీకటిలో గడుపుతున్న ఈ మూడు దేశాల్లో మెట్రో సేవలు ఉన్నపళంగా నిలిచిపోయాయి. . రైళ్లు కూడా ఎక్కడికక్కడి స్తంభించిపోయాయి. . దీంతో ఆయా దేశాల ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ సంక్షోభంపై ఇప్పటివరకూ ఎటువంటి క్లారిటీ లేకపోవడంతో జనాలు బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. మాడ్రిడ్ లోని నాలుగు టవర్ బిల్డింగ్ ల్లో ఒక దాన్ని ఖాళీ చేయించారు. ఇందులో బ్రిటీష్ ఎంబాసీ పనిచేస్తున్న దరిమిలా ఆ కార్యాలయాన్ని ఆకస్మింగా ఖాళీ చేయించారు.ఆఫీసులు వదిలి.. రోడ్లపైనేతీవ్రమైన విద్యుత్ సంక్షోభంతో కార్యాలయాలు ఏవీ పని చేయడం లేదు. ఆఫీసులకు వచ్చిన ఉద్యోగులు.. రోడ్లపైనే తిరుగుతూ కాలయాపన చేస్తున్నారు. అయితే దీనిపై స్పానిష్ ఎలక్ట్రిసిటీ గ్రిడ్ ఆపరేట్ రెడ్ ఎలక్ట్రికా స్పందించింది. విద్యుత్ ను తిరిగి పునరుద్దరించే క్రమంలో స్థానిక విద్యుత్ కంపెనీలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపింది. అన్ని యూరోపియన్ విద్యుత్ యూనియన్లను సమన్వయం చేసుకుంటూ సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు తాత్కాలిక ప్రయత్నాలు చేస్తున్నట్లు స్పష్టం చేసింది.

ఉక్రెయిన్‌లో రష్యా తాత్కాలిక కాల్పుల విరమణ
మాస్కో: ఉక్రెయిన్‌లో రష్యా తాత్కాలిక కాల్పుల విరమణ (Ceasefire)ను ప్రకటించింది. విక్టరీ డే నేపథ్యంలో వచ్చే నెల 8 నుంచి 10వ తేదీవరకు పూర్తిస్థాయి కాల్పుల విరమణ పాటిస్తామని క్రెమ్లిన్ వెల్లడించింది.మానవతా దృక్పథంతో దేశాధ్యక్షుడు పుతిన్ ఈమేరకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపింది. యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న వేళ ఈ ప్రకటన వెలువడింది. రెండో ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీపై విజయానికి గుర్తుగా రష్యా ప్రభుత్వం ఏటా మే 9న విక్టరీ డే వేడుకలు నిర్వహిస్తుంది.అమెరికా నుంచి శాశ్వత కాల్పుల విరమణ, శాంతి చర్చల ఒప్పందంపై ఒత్తిడి పెరుగుతున్న వేళ.. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ నిర్ణయం ప్రకటించారు. ఇదిలా ఉంటే.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉక్రెయిన్ మీద దాడులు ఆపాలంటూ రష్యాను కోరిన సంగతి తెలిసిందే. ఉక్రెయిన్‌పై రష్యా బలగాలు జరుపుతున్న భీకరదాడులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారాయన. అదే సమయంలో.. శాంతి ఒప్పందంలో భాగంగా క్రిమియాను వదులుకోవాలంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లోదిమిర్ జెలెన్స్కీకి సూచించారు కూడా.

Owaisi: నీ తల్లికి తూటా దింపిందెవరు?
న్యూఢిల్లీ: సింధు జలాల నదీ ఒప్పందం నిలిపివేత నేపథ్యంతో భారత్‌ను ఉద్దేశించి పలువురు పాక్ నేతలు అడ్డగోలు వ్యాఖ్యలు చేశారు. వారిలో బిలావల్ భుట్టో జర్దారీ చేసిన వ్యాఖ్యలకు ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ(Asaduddin Owaisi) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. నీ తాత, తల్లిని చంపిందెవరో ఒక్కసారి గుర్తు తెచ్చుకో అంటూ బిలావల్‌ను ఉద్దేశించి ప్రశ్న సంధించారాయన.‘‘ఇవన్నీ పిల్ల మాటలు. అతని తాతకు ఏం జరిగిందో అతనికి తెలియదా? అతని తల్లిని ఉగ్రవాదులేగా చంపేశారు. కనీసం అది గుర్తున్నా? అతను అలా మాట్లాడి ఉండడు. అమెరికా సాయం చేస్తేనేగానీ ముందుకు నడవలేని దేశం పాకిస్తాన్. అలాంటిది మీరా మనల్ని చిన్నచూపు చూస్తోంది? అంటూ బిలావల్‌ను ఉద్దేశించి ఒవైసీ ఘాటు వ్యాఖ్యలు చేశారు.అతని తల్లిని చంపినప్పుడు అది ఉగ్రవాదం.. అదే మన అమ్మలను, బిడ్డలను చంపినప్పుడు అది ఉగ్రవాదం కాదా?. ఇది కూడా అర్థం చేసుకోలేనివాడికి మనం ఏం చెప్పినా వ్యర్థమే’’ అని ఒవైసీ వ్యాఖ్యానించారు.పనిలో పనిగా పాక్ నేతలకూ ఆయన చురకలంటించారు. ‘‘ పాక్‌లో కూర్చుని అడ్డగోలుగా మాట్లాడొద్దు. పాక్ దేశ మొత్తం బడ్జెట్.. మా దేశ రక్షణ బడ్జెట్ కంటే తక్కువే.మీరు ఏ దేశంలోకి చొరబడి అమాయకుల ప్రాణాలు తీస్తుంటే ఎవరూ మౌనంగా ఉండరు. మతం అడిగి మరీ చంపడం.. వికృతమైన పని. ఉగ్రవాదులు మరోసారి దాడి చేసే సాహసం చేయకుండా ప్రధాని మోదీ కఠిన చర్యలు తీసుకోవాలి’’ అని ఒవైసీ అన్నారు. 2007 డిసెంబర్ 30వ తేదీన రావల్పిండిలో జరిగిన ర్యాలీలో.. ఆత్మాహుతి దాడి జరిగి బెనజీర్ భుట్టోతో పాటు మరో 20 మంది బలయ్యారు. ఇక..పాక్ మాజీ అధ్యక్షుడు, ప్రధాని అయిన ఆమె తండ్రి జుల్ఫీకర్ అలీ భుట్టోను ఓ హత్య కేసుకుగానూ 1979 ఏప్రిల్ 4వ తేదీన ఉరి తీశారు. అయితే అది రాజకీయ ప్రేరేపిత కేసు అనే అభియోగాలు ఉన్నాయి. 2023 దాకా విదేశాంగ మంత్రిగా పని చేసిన పీపీపీ నేత బిలావల్ భుట్టో.. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో కొనసాగుతున్నారు. ‘‘సింధూ నది మాదే. ఎప్పటికీ మాదే. నదిలో నీరైనా పారుతుంది లేదా వారి రక్తమైనా పారుతుంది. పాకిస్థాన్ గానీ అంతర్జాతీయ సమాజం కానీ ఈ యుద్ధ కాంక్షను అస్సలు సహించదు. వేల ఏళ్ల నాటి సింధూ నాగరికతకు తాము వారసులమని మోదీ అంటుంటారు. కానీ ఈ సంస్కృతికి పరిరక్షకులము మేమే. ఎట్టి పరిస్థితుల్లోనూ కాపాడుకుంటాము’’ అంటూ ఓ ర్యాలీలో మాట్లాడారు. ఈ వ్యాఖ్యలను కేంద్ర మంత్రులు సహా భారత్‌లోని పలువురు నేతలు ఇప్పటికే ఖండించారు కూడా.
జాతీయం

త్రివిధ దళాలకు ప్రధాని మోదీ ఫ్రీ హ్యాండ్.. సైన్యమే స్థలం,టైం చూసి..
ఢిల్లీ: పహల్గాంలో ఉగ్రదాడి నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలో వరుస కీలక సమావేశాలు కొనసాగుతున్నాయి. మంగళవారం జరిగిన త్రివిధ దళాదిపతులు సమావేశంలో ప్రధాని మోదీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉగ్రవాదుల్ని మట్టిలో కలిపేలా త్రివిధ దళాలకు పూర్తి స్థాయిలో స్వేచ్ఛ ఇచ్చారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. భారత దళాలపై పూర్తిగా నమ్మకం ఉంది. ఉగ్రవాదాన్ని అంత చేస్తాం. పహల్గాం దాడికి ధీటైన సమాధానం ఇస్తాం. సైన్యమే స్థలం,టైం చూసి జవాబు ఇస్తుంది’ అంటూ ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ నేతృత్వంలో జరిగిన రక్షణ శాఖ సమావేశంలో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్, సీడీఎస్ అనీల్ చౌహాన్లు పాల్గొన్నారు. ఈ సమావేశంలో గత బుధవారం భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల తీరుతెన్నులు ఎలా ఉన్నాయి. భద్రతా బలగాల మొహరింపు వంటి అంశాలపై చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.దీంతో పాటు త్వరలో ప్రారంభం కానున్న అమర్నాథ్ యాత్రలో పాక్ కవ్వింపులు చర్యలకు పాల్పడితే ఎలాంటి చర్యలు తీసుకోవాలి. ఒకవేళ పాక్ కవ్వింపులకు పాల్పడితే రక్షణ పరంగా ఎలా తిప్పికొట్టాలి. ఓ వైపు రక్షణ పరంగా దెబ్బకొడుతూనే.. దౌత్య పరంగా ప్రపంచ దేశాల ఎదుట పాకిస్తాన్‌ను ఇరుకున పెట్టేలా ఎలా దెబ్బకు దెబ్బ తీయాలనే తదితర అంశాలపై ప్రముఖంగా చర్చించారు. PM Modi chairs a meeting with Defence Minister, NSA, CDS and chiefs of all the Armed Forces. pic.twitter.com/fr9y5eVbet— ANI (@ANI) April 29, 2025

ప్రైవేట్ స్కూల్స్‌లో ఫీజుల దోపిడీకి చెక్.. చట్టం అమలుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్
ఢిల్లీ : ప్రైవేట్ స్కూళ్లల్లో అడ్డగోలు ఫీజుల దందాపై చరిత్రలో తొలిసారి ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మంగళవారం ఢిల్లీ స్కూళ్లలో ఫీజులు ఎంత మేరకు ఉండాలనే అంశంపై ప్రభుత్వం విధివిధానాల్ని ఖరారు చేసింది. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకోనుంది.ఫీజుల స్థిరీకరణ,నియంత్రణ బిల్లు- 2025పై ఢిల్లీ కేబినెట్ మీటింగ్ జరిగింది. ఈ సమావేశంలో పలు స్కూల్స్ ఏకపక్షంగా ఫీజుల పెంచుతున్నారంటూ వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో ఢిల్లీ కేబినెట్ మంగళవారం పాఠశాల ఫీజులను నియంత్రించడానికి చట్టాన్ని ఆమోదించింది. అనంతరం ఢిల్లీ సీఎం రేఖా గుప్తా మీడియాతో మాట్లాడారు. నా ఆనందానికి అవధుల్లేవు.ఢిల్లీ ప్రభుత్వం ధైర్యమైన నిర్ణయం నిర్ణయం తీసుకుంది. పలు స్కూల్స్ ఏకపక్షంగా ఫీజుల పెంచుతున్నారంటూ వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో ఢిల్లీ కేబినెట్ మంగళవారం పాఠశాల ఫీజులను నియంత్రించడానికి ఒక చట్టాన్ని ఆమోదించింది.📢 Big Reform in Delhi Education!CM Rekha Gupta: “For the first time in history, Delhi Govt has passed a foolproof Bill to regulate fees and set clear guidelines for all 1677 schools — aided, unaided, private, all included.”A bold step toward transparency and fairness in… pic.twitter.com/YzwzSBpLwP— भँ० अजीत सिंह तोमर (@Bhanwar_Ast) April 29, 2025 ఢిల్లీ ప్రభుత్వం చారిత్రాత్మక,సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. ఫీజుల స్థిరీకరణ,నియంత్రణ బిల్లు- 2025 ముసాయిదా బిల్లును ఈరోజు కేబినెట్ ఆమోదించిందని మీకు చెప్పడానికి నేను చాలా సంతోషంగా ఉన్నాను’అని అన్నారు.ఢిల్లీలోని 1,677 పాఠశాలలు ఎయిడెడ్, నాన్-ఎయిడెడ్ లేదా ప్రైవేట్ అయినా, ఫీజులకు సంబంధించిన పూర్తి మార్గదర్శకం, విధానాన్ని నిర్ణయిస్తారు. చరిత్రలో మొదటిసారిగా, అటువంటి బిల్లును ప్రభుత్వం రూపొందిస్తోందన్నారు. విద్యా మంత్రి ఆశిష్ సూద్ మాట్లాడుతూ, కొత్త నిబంధనలను అమలు చేయడానికి మూడు కమిటీలను ఏర్పాటు చేస్తామని, పాఠశాల మౌలిక సదుపాయాల ఆధారంగా మూడు సంవత్సరాల పాటు ఫీజులను ప్యానెల్లు నిర్ణయిస్తాయని అన్నారు. పాఠశాల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కూడా నిర్ణయం తీసుకునే ప్రక్రియలో పాల్గొంటారని చెప్పారు. ఈ నెల ప్రారంభంలో ఢిల్లీలోని పలు స్కూళ్లు ఏకపక్షంగా ఫీజులు వసూలు చేస్తున్నాయంటూ తల్లి దండ్రుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి.ఫిర్యాదులతో పలు పాఠశాలలకు ఢిల్లీ ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. తన ప్రభుత్వం పారదర్శకత, పిల్లల విద్యా హక్కు రక్షణకు కట్టుబడి ఉందని ఆ సమయంలో సీఎం రేఖా గుప్తా స్పష్టం చేశారు.

‘పెగాసస్’పై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: పెగాసస్ వ్యవహారంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం (Supreme Court) కీలక వ్యాఖ్యలు చేసింది. జాతీయ భద్రతా ప్రయోజనాల కోసం ఓ దేశం స్పైవేర్(Spyware)ను కలిగి ఉండటం తప్పులేదని పేర్కొంది. అయితే.. అది ఎలా? ఎవరిపై ఉపయోగించారనే విషయాలను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది.దాదాపు నాలుగేళ్ల క్రితం దేశ రాజకీయాలను కుదిపేసిన పెగాసస్ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ స్పైవేర్‌ను వినియోగించి దేశంలోని ప్రముఖ పాత్రికేయులు, పౌరసమాజ ప్రముఖులపై నిఘా పెట్టారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో.. పెగాసస్ ఆరోపణలపై స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై మంగళవారం విచారణ జరిగింది. పిటిషన్ తరఫున న్యాయవాది మాట్లాడుతూ.. పెగాసస్ స్పైవేర్‌ను ఉపయోగిస్తోందా? లేదా? అనే విషయాన్ని కేంద్రం స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు. అంతేగాక, ఈ ఆరోపణలపై దర్యాప్తు జరిపి సాంకేతిక నిపుణుల బృందం నివేదిక కోసం సర్వోన్నత న్యాయస్థానం గతంలో ఆదేశించిందని, ఇప్పటివరకూ ఆ నివేదిక అందలేదని, దానిని బయట పెట్టాలని ధర్మాసనాన్ని కోరారు. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎన్.కోటీశ్వర్ సింగ్‌తో కూడిన ధర్మాసనం స్పందిస్తూ.. దేశం స్పైవేర్‌ను వినియోగిస్తే గనుక అందులో తప్పేముంది. అయితే, దాన్ని ఎవరిపైన ఉపయోగిస్తున్నారన్నదే ఇక్కడ ప్రశ్న. పౌర సమాజంపై కాకుండా.. దేశ వ్యతిరేక శక్తులపై దీన్ని వినియోగిస్తే గనుక అందులో ఏ తప్పు లేదు. దేశ భద్రత విషయంలో రాజీపడకూడదు. ఒకవేళ సామాన్య పౌరులపై ఉపయోగిస్తే గనుక దాని గురించి మేం దర్యాప్తు జరిపిస్తాం. ఉగ్రవాదులు గోప్యత హక్కును కోరకూడదు. అయితే, సామాన్య పౌరుల గోప్యతకు మేం తప్పకుండా రక్షణ కల్పిస్తాం. ప్రస్తుతం మన దేశం ఎలాంటి పరిస్థితిలో ఉందో అందరికీ తెలుసు(పహల్గాం ఉగ్రదాడి ఘటనను పరోక్షంగా ప్రస్తావిస్తూ..). కాబట్టి మనం అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది’’ అని ద్విసభ్య ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఇక, సాంకేతిక బృందం నివేదిక గురించి మాట్లాడుతూ.. ‘‘దేశ భద్రత, సార్వభౌమత్వానికి సంబంధించిన నివేదికను బహిర్గతం చేయడం సరికాదు. ఒకవేళ ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు దాని గురించి తెలుసుకోవాలనుకుంటే.. వారికి సమాచారం అందిస్తాం’’ అని ధర్మాసనం స్పష్టం చేసింది.పెగాసస్ వ్యవహారం ఏంటంటే.. ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్ఎస్వో గ్రూప్ అనే సంస్థ ‘పెగాసస్’ స్పైవేర్‌ని అభివృద్ధి చేసింది. నిఘా కార్యకలాపాల కోసం ఈ స్పైవేర్‌ను ఎన్ఎస్వో పలు ప్రభుత్వాలు, ప్రభుత్వ అధీనంలో పనిచేసే సంస్థలకు విక్రయిస్తుంటుంది. అయితే, ఈ పెగాసస్‌ను ఉపయోగించి పాత్రికేయులు, పౌరసమాజ ప్రముఖుల ఫోన్లను హ్యాక్ చేశారంటూ 2021లో ఓ అంతర్జాతీయ పత్రిక సంచలన కథనం ప్రచురించింది. భారత్ నుంచి 300 మంది ఫోన్లు హ్యాక్ అయినట్లు పేర్కొంది. వీరిలో రాజకీయ ప్రముఖులు కూడా ఉన్నట్లు తెలిపింది. దీంతో ఈ వివాదం దేశ రాజకీయాలను కుదిపేసింది.

పాక్ నడ్డి విరిగేలా..
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ నేతృత్వంలో రేపు కేబినెట్ సమావేశం జరగనుంది. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యం కారణంగా ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. గత సమావేశంలో భద్రతా క్యాబినెట్ కమిటీ(CCS) పాకిస్తాన్ పై పలు కీలక నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే. వారం వ్యవధిలోనే సీసీఎస్ భేటీ జరుగుతుండడం గమనార్హం.సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేత , దౌత్య సంబంధాల తగ్గింపు, అటారీ సరిహద్దు మూసివేత, పాకిస్తాన్ జాతీయుల వీసా రద్దు తదితర నిర్ణయాలు తీసుకుంది. ఈ నేపథ్యంలో.. సరిహద్దుల్లో భద్రతా బలగల సన్నద్ధత, ఉగ్రవాదుల కోసం కొనసాగుతున్న ఆపరేషన్, పాకిస్తాన్‌పై ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోవడంపై కేబినెట్ చర్చించనుంది. ఆ వెంటనే ఆర్థిక భద్రతా కమిటీ జరుగుతుండడంతో పాక్ నడ్డి విరిగేలా ఈ నిర్ణయాలు ఉండనున్నట్లు తెలుస్తోంది.ఇదిలాఉంటే.. పహల్గాం దాడి జరిగిన మరుసటిరోజు ప్రధాని మోదీ నేతృత్వంలో భద్రతా కేబినెట్ కమిటీ (CCS) సమావేశమైంది. ఈ ఉన్నత స్థాయి భేటీలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, విదేశాంగ మంత్రి జై శంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ హాజరయ్యారు. కేబినెట్ కార్యదర్శి టీవీ సోమనాథన్, రక్షణశాఖ కార్యదర్శి రాజేశ్ కుమార్ సింగ్, విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ సహా ప్రధానమంత్రి ఇద్దరు ప్రిన్సిపల్ కార్యదర్శులు పీకే మిశ్రా, శక్తికాంతదాస్‌లు పాల్గొన్నారు. ఈ కమిటీలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కూడా ఉన్నప్పటికీ.. అమెరికా పర్యటనలో ఉన్నందున హాజరుకాలేకపోయారు.
ఎన్ఆర్ఐ

రాయలసీమ ప్రగతికి డాలస్‌లో జీఆర్ఏడీఏ అడుగులు
గ్రేటర్ రాయలసీమ అసోసియేషన్ ఆఫ్ డాలస్ ఏరియా (GRADA) ఆధ్వర్యంలో ఏప్రిల్ 13న ఫ్రిస్కో, టెక్సాస్‌లో రాయలసీమ ప్రాంతం ఎదుర్కొంటున్న సమస్యలపై సమావేశం జరిగింది. రాయలసీమ సమస్యలు, అభివృద్ధి అవకాశాలు, తెలుగు భాషా సాహిత్యాల ప్రాముఖ్యతపై చర్చ జరిగింది. ఈ కార్యక్రమానికి రాయలసీమకు చెందిన రచయిత భూమన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన తన ప్రసంగంలో రాయలసీమ ప్రస్తుత పరిస్థితి, ముఖ్యంగా దీర్ఘకాలంగా వేధిస్తున్న నీటి సమస్యలు, వెనుకబాటుతనం గురించి ఎంతో ఆవేదనతో, స్పష్టంగా వివరించారు.మన ప్రాంత సహజ సంపద అయిన శేషాచలం అడవుల గురించి, ముఖ్యంగా ఎర్రచందనం చెట్ల గురించి ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ విలువైన సంపదను అక్రమ మార్గాల్లో ఇతర దేశాలకు తరలించి లాభం పొందకుండా, స్థానికంగానే వాటి ఆధారిత పరిశ్రమలను స్థాపించి, ఉత్పత్తులను తయారు చేయడం ద్వారా మన ప్రాంతాన్ని ఎలా ఆర్ధికంగా బలోపేతం చేయవచ్చో ఆయన చక్కగా వివరించారు. ఆయన మాటలు మనందరిలో కొత్త ఆలోచనలను రేకెత్తించాయి. సహజ వనరులను సక్రమంగా వినియోగించుకుంటే రాయలసీమ భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందనే ఆశాభావాన్ని ఆయన కలిగించారు.మరో గౌరవ అతిథిగా కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం మాజీ వైస్‌ఛాన్సలర్, ప్రఖ్యాత విద్యావేత్త ప్రొఫెసర్ పి. కుసుమ కుమారి హాజరయ్యారు. ఆమె తన ప్రసంగంలో తెలుగు భాష మాధుర్యం, సాహిత్యం గొప్పదనం, పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకత గురించి వివరించారు. నంద కోర్వి, అనిత నాగిరెడ్డి, సతీష్ సీరం, బ్రహ్మ చిరా, హరినాథ్ పొగకు, హేమంత్ కాకుట్ల, జగదీశ్వర నందిమండలం, జగదీష్ తుపాకుల, పవన్ పల్లంరెడ్డి, ప్రసాద్ నాగారపు, రాజు కంచం, శివ అద్దేపల్లి, శివ వల్లూరు, శ్రీధర్ బొమ్ము, శ్రీకాంత్ దొంత, సురేష్ మోపూరు, ఉమా గొర్రెపాటి, మరియు కార్తీక్ మేడపాటి ఈ సమావేశానికి హాజరయ్యారు.

సింగపూర్‌లో ‘అంతర్జాతీయ ఉగాది సాహిత్య సమ్మేళనం’
'వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా' 'శ్రీ సాంస్కృతిక కళాసారథి - సింగపూర్' మరియు 'వంశీ ఇంటర్నేషనల్ - ఇండియా' సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో, ఆదివారం 13వ తేదీ హైదరాబాద్ , శ్రీ త్యాగరాయ గానసభలో ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు 12 గంటల పాటు నిర్విరామంగా "అంతర్జాతీయ ఉగాది సాహిత్య సమ్మేళనం" కార్యక్రమం అద్వితీయంగా నిర్వహించబడింది.ఈ మూడు సంస్థలు కలసి విశ్వావసు నామ సంవత్సర ఉగాదిని పురస్కరించుకొని 80 మంది కవులతో 'అంతర్జాతీయ కవి సమ్మేళనము', 20 నూతన గ్రంధావిష్కరణలు, ఆచార్య శలాక రఘునాథ శర్మ 'రాయప్రోలు వంశీ జాతీయ సాహితీ జీవన సాఫల్య పురస్కార' ప్రదానము డా. బులుసు అపర్ణచే ప్రత్యేక 'మహిళా అష్టావధానము' మొదలైన అంశాలతో ఈ 'అంతర్జాతీయ ఉగాది సాహిత్య సమ్మేళనం' కార్యక్రమాన్ని ప్రత్యేకంగా రూపొందించి నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ్యులు మండలి బుద్ధ ప్రసాద్, విశిష్ట అతిథులుగా కవి జొన్నవిత్తుల, కిమ్స్ ఆస్పత్రి వ్యవస్థాపకులు బొల్లినేని కృష్ణయ్య, తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు ఆచార్య వెలుదండ నిత్యానంద రావు, ప్రముఖ రాజకీయవేత్త వామరాజు సత్యమూర్తి తదితరులు హాజరయ్యారు.ఉదయం 9 గంటలకు డా వంశీ రామరాజు అందించిన స్వాగతోపన్యాసంతో ఆరంభమైన ప్రారంభోత్సవ సభలో, కార్యక్రమ ప్రధాన సమన్వయకర్త రాధిక మంగిపూడి సభా నిర్వహణలో, మండలి బుద్ధ ప్రసాద్, కవి జొన్నవిత్తుల, బొల్లినేని కృష్ణయ్య, వామరాజు సత్యమూర్తి, డా. జననీ కృష్ణ తదితరుల ప్రసంగాలు అందరినీ ఆకర్షించాయి.తదనంతరం ఖతార్ నుండి విచ్చేసిన విక్రమ్ సుఖవాసి నిర్వహణలో అతిథుల చేతుల మీదుగా 18 తెలుగు నూతన గ్రంథాలు ఆవిష్కరించబడ్డాయి. వాటిలో కథల కవితల సంకలనాలు, వ్యాస సంపుటాలు, జెవి పబ్లికేషన్స్, మిసిమి మాసపత్రిక వారి ప్రచురణలు, సిద్ధాంత గ్రంథాలు మాత్రమే కాకుండా, ప్రతిష్టాత్మకంగా 2024 నవంబర్‌లో ఖతార్ దేశ రాజధాని దోహా మహానగరంలో వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా ఆధ్వర్యంలో జరిగిన "9వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు సభా విశేష సంచిక" కూడా ఆవిష్కరించబడడం ఈ సభకు మరింత శోభను చేకూర్చింది.మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 4:30 వరకు కొనసాగిన "అంతర్జాతీయ కవి సమ్మేళనం"లో ఆస్ట్రేలియా, ఖతార్, దక్షిణాఫ్రికా, అమెరికా మొదలైన దేశాలనుండి, ఉభయ తెలుగు రాష్ట్రాలనుండి, ముంబై, అండమాన్ దీవులు మొదలైన ప్రాంతాలనుండి కూడా వచ్చిన సుమారు 80 మంది కవులు కవయిత్రులు పాల్గొని తమ కవితలు వినిపించారు. వంశీ అధ్యక్షురాలు డా. తెన్నేటి సుధాదేవి, రేవూరు అనంత పద్మనాభరావు, జి భగీరథ, గుండు వల్లీశ్వర్, ప్రొ. రామా చంద్రమౌళి మహెజబీన్, ప్రొ. త్రివేణి వంగారి, డా కేతవరపు రాజ్యశ్రీ, డా. చిల్లర భవానీ దేవి, డా. శంకరనారాయణ, అంబల్ల జనార్ధన్, డా చాగంటి కృష్ణకుమారి మొదలైన ఎందరో కవులు కవయిత్రులు ఈ కవిసమ్మేళనంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం కొందరు రచయితలు ప్రసంగవ్యాసాలు వినిపించారు. సభా వ్యాఖ్యాతలుగా పేరి, కృష్ణవేణి, రాధిక వ్యవహరించారు.అనంతరం సాయంత్రం ఆచార్య శలాక రఘునాథ శర్మను ఘనంగా సత్కరించి, వారికి మూడు నిర్వాహక సంస్థల తరఫున "రాయప్రోలు వంశీ జాతీయ సాహితీ జీవన సాఫల్య పురస్కారం" అందించారు. దీనికి తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు ఆచార్య వెలుదండ నిత్యానందరావు ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. అనంతరం శలాక మాట్లాడుతూ తెలుగువారికి సొంతమైన అవధాన ప్రక్రియలో 'సమస్యా పూరణం' అనే అంశంలో ఉండే చమత్కారాలు వివరణలు తెలియజేస్తూ "అవధాన కవిత్వం - సమస్యలు" అనే అంశంపై ప్రత్యేక ప్రసంగాన్ని అందించారు.సాయంత్రం 5:30 గంటల నుండి ద్విశతావధాని డా. బులుసు అపర్ణ చేసిన అష్టావధానం ఈ సదస్సుకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రాధిక మంగిపూడి సంచాలకత్వంలో అమెరికా, యుగాండా, ఆస్ట్రేలియా, ఖతార్, అండమాన్ దీవులు, ముంబై, విశాఖపట్నం, విజయవాడ నుండి వచ్చిన 8 మంది మహిళలు పృచ్ఛకులుగా పాల్గొనడంతో ఇది "సంపూర్ణ మహిళా అష్టావధానం"గా ప్రశంసలు అందుకుంది.ఈ కార్యక్రమానికి ప్రధాన నిర్వాహకులుగా వంగూరి ఫౌండేషన్ వ్యవస్థాపకులు డా. వంగూరి చిట్టెన్ రాజు, వంశీ వ్యవస్థాపకులు డా. వంశీ రామరాజు, సింగపూర్ సంస్థ వ్యవస్థాపకులుకవుటూరు రత్నకుమార్ వ్యవహరించగా, వంగూరి ఫౌండేషన్ భారతదేశ ట్రస్టీ శైలజ సుంకరపల్లి ఆధ్వర్యంలో వేదిక ఏర్పాట్లు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమం యూట్యూబ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా పంచవ్యాప్తంగా సాహిత్య అభిమానుల మన్ననలు అందుకుంది.

టెక్సాస్‌లో రోడ్డు ప్రమాదం, ప్రాణాపాయ స్థితిలో తెలుగు విద్యార్థిని దీప్తి
ఉన్నత చదువులకోసం అమెరికాకు వెళ్లిన తెలుగు విద్యార్థిని ప్రాణలతో పోరాడుతోంది. అమెరికాలోని టెక్సాస్‌లోని డెంటన్ నగరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తెలుగు అమ్మాయిలు గాయపడ్డారు. వీరిలో తీవ్రంగా గాయపడిన విద్యార్థినిని దీప్తి వంగవోలుగా గుర్తించారు. మరో విద్యార్థినికి కూడా తీవ్రంగా గాయపడిందని అయితే ఆమెకు ప్రాణాపాయం లేదని అమెరికా మీడియా నివేదికలు తెలిపాయి.ఈ ప్రమాదం శనివారం (ఏప్రిల్ 12) తెల్లవారుజామున, ఎన్. బోనీ బ్రే స్ట్రీ మరియు డబ్ల్యు. యూనివర్శిటీ డ్రైవ్ సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరుకు చెందిన దీప్తి వంగవోలు ,ఆమె స్నేహితురాలు కాలినడకన ఇంటికి చేరుకోబోతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. వెంటనే ఆ వాహనం డ్రైవర్ని అక్కడినుంచి పారిపోయాడు. దీప్తికి తలకు లోతైన గాయం అయిందని, ఆమెకు శస్త్రచికిత్స జరుగుతోందని స్థానిక మీడియా తెలిపింది. ప్రస్తుతం డెంటన్ పోలీసులు ఈ హిట్ అండ్ రన్ ఘటనపై దర్యాప్తు ముమ్మరం చేశారు. పరారీలో ఉన్న డ్రైవర్‌ను, ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించేందుకు ప్రజల సహాయం కోరుతూ ప్రకటన కూడా విడుదల చేశారు. ఈ ఘటనపై మరిన్నివివరాలు అందాల్సి ఉంది. లింక్డ్ఇన్ ప్రొఫైల్ ప్రకారం, దీప్తి వంగవోలు నార్త్ టెక్సాస్ విశ్వవిద్యాలయంలో కంప్యూటర్ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్‌లో మాస్టర్స్ చదువుతోంది. 2023లో నరసరావు పేట ఇంజనీరింగ్ కళాశాల నుండి బీటెక్ పూర్తి చేసింది.

సింగపూర్ ఎన్నికల్లో సత్తా చాటనున్న భారతీయులు: హింటిచ్చిన పీఎం
సింగపూర్‌లో ( Singapore ) సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రధానమంత్రి లారెన్స్ వాంగ్ (Lawrence Wong) తన పార్టీ పీపుల్స్ యాక్షన్ పార్టీ (PAP) కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సారి ఎన్నికల్లో భారతీయ సంతతికి చెందిన అభ్యర్థులను పోటీలో నిలపబోతున్నామని ప్రకటించారు. త్వరలో ఎన్నికలకు నగారా మోగనున్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.ఆదివారం భారతీయ యువతతో సింగపూర్ ప్రధానమంత్రి ముచ్చటించారు. భారతీయ సమాజం చిన్నదే అయినా ప్రభావం చాలా గొప్పదని, పీఎం అన్నారు. మీరు ఇప్పటికే ఆ సింగపూర్ స్పూర్తిని ప్రతిబింబిస్తున్నారనీ, అది ప్రభావంతమైందన్న వాంగ్ వ్యాఖ్యలను ది స్ట్రెయిట్స్ టైమ్స్ నివేదించింది. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో భారత సంతతికి చెందిన కొత్త అభ్యర్థులను ఎంపిక చేస్తుందని హామీ ఇచ్చారు. 2020 ఎన్నికల్లో భారతీయులకు చోటు దక్కలేదని గుర్తు చేసిన ఆయన ఈ సారి 30కంటే ఎక్కువమంది భారతీయులు కూడా ఉంటారన్నారు. ది ఇటీవలి చరిత్రలో అతిపెద్దదని పీఎం వాంగ్ వ్యాఖ్యానించారు. వాణిజ్యం, వ్యాపారం, పరిశ్రమలు, ప్రజా సేవ సహా అనేక రంగాలలో భారతీయ కమ్యూనిటీ దేశానికి చేస్తున్న కృషిని ఆయన ప్రశంసించారు. అయితే, PM వాంగ్ గత శనివారం వెల్లడించిన ఎనిమిది కొత్త ముఖాల్లో భారత సంతతికి చెందిన వైద్యుడు హమీద్ రజాక్ కూడా ఉన్నారని ది స్ట్రెయిట్ టైమ్స్ నివేదిక పేర్కొంది. అయితే, రాబోయే సార్వత్రిక ఎన్నికలలో వారు ఏ నియోజకవర్గం నుండి పోటీ చేస్తారో వెల్లడించలేదు.చదవండి: Amarnath Yatra 2025 రిజిస్ట్రేషన్లు షురూ! త్వరపడండి!సింగపూర్ నివేదికల ప్రకారం. 2004లో సింగపూర్ పౌరులలో భారతీయులు 7.6 శాతం మంది ఉండగా , మలయ్, చైనీయులు వరుసగా 15.1 శాతం, 75.6 శాతం మంది ఉన్నారు. 2024 డేటా ప్రకారం, ఆగ్నేయాసియా దేశ జనాభాలో వరుసగా 15శాతం, 75శాతం మంది మలేషియన్లు , చైనీయులు ఉన్నారు.90 నిమిషాల పాటు వాంగా ఇప్పో పెసలామ్ చాట్ (రండి, తమిళంలో చాట్ చేద్దాం) అనే వీఐపీ చాట్‌ను తమిళ్ మరసు వార్తాపత్రికి నిర్వహించింది.భారత సంతతికి చెందిన డిజిటల్ అభివృద్ధి, సమాచార శాఖ సీనియర్ సహాయ మంత్రి జనిల్ పుతుచ్చేరి సహా దాదాపు 130 మంది యువకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.2020 సార్వత్రిక ఎన్నికల్లో పీఏపీ 93 స్థానాల్లో 83 స్థానాలను గెలుచుకుని, ఎన్నికలను కైవసం చేసుకుంది. వీరిలో 27 మంది కొత్త అభ్యర్ధులకు అవకాశం కల్పించగా. వీరిలో భారతీయులెవ్వరూ లేరు. ఇది పార్లమెంటులో సమాజ ప్రాతినిధ్యంపై విమర్శలకు తావిచ్చింది. అమెరికా, కెనడా రాజకీయాల్లో భారతీయ సంతతి అభ్యర్తులు సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే. మరి తాజా పరిణామాలతో ఎంతమంది భారత సంతతి వారు గెలుపు గుర్రాలుగా నిలవనున్నారో చూడాలి.
క్రైమ్

చదివేది ఏడో తరగతి.. వాడేది ఐ ఫోన్
జీడిమెట్ల(హైదరాబాద్): ఆ బాలుడు ఏడో తరగతి చదువుతున్నాడు. ఇంట్లో ఎవరూ చూడకుండా సంవత్సర కాలంగా ఇంట్లో ఐ ఫోన్ వాడుతున్నాడు. కుమారుడు ఐ ఫోన్ వాడటాన్ని గమనించిన తండ్రి.. ‘నీకు ఫోన్ ఎలా వచి్చంది’ అని నిలదీయడంతో అసలు విషయం చెప్పేశాడు. ‘మన షాపులోంచి రోజూ కొంత డబ్బు తీసి ట్యూషన్ మాస్టారుకు ఇచ్చేవాణ్ని. మాస్టారే ఈ ఫోన్ కొనిచ్చాడు’ అని బాలుడు తన తండ్రికి వివరించాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు.పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.. షాపూర్‌నగర్‌కు చెందిన వ్యాపారవేత్త కమల్‌జైన్. ఆయన కుమారుడు ఏడో తరగతి చదువుతున్నాడు. సంవత్సర కాలంగా బాలుడు తమ షాపులోంచి కొంత నగదు దొంగిలించసాగాడు. ఆ డబ్బును తనకు ట్యూషన్ చెప్పే మాస్టారుకు ఇచ్చేవాడు. ఈ క్రమంలో బాలుడికి సదరు ట్యూషన్ మాస్టారు ఐ ఫోన్ కొనిచ్చాడు. ఈ విషయం ఇంట్లో తెలియడంతో కుమారుడికి ట్యూషన్ చెబుతున్న వ్యక్తిపై జీడిమెట్ల పీఎస్‌లో కమల్‌జైన్ ఫిర్యాదు చేశాడు. విచారణ చేపట్టిన పోలీసులు ట్యూషన్ మాస్టారు సందీప్‌పై కేసు నమోదు చేశారు. సంవత్సర కాలంగా కుమారుడు తమ షాపులోంచి డబ్బులు తీస్తున్న తండ్రి పసిగట్టకపోవడం గమనార్హం. అలాగే సంవత్సర కాలంగా కుమారుడు ఇంట్లో ఫోన్ వాడుతున్నా కుటుంబ సభ్యులు చూడకపోవడం మరో విచిత్రం. ఎవరైనా పిల్లలు ఇలాంటి పనులు చేస్తే వారికి కౌన్సెలింగ్ ఇప్పించాలని సీఐ గడ్డం మల్లేష్ తల్లిదండ్రులకు సూచించారు.

వివాహేతర సంబంధం.. భార్య కళ్లెదుటే ప్రియుడ్ని..
పెద్దపల్లిరూరల్: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌యార్డు ఆవరణలో సోమవారం పొలం కుమార్‌ను హతమార్చిన కేసులో నిందితులు వేల్పుల సంతోష్, వేల్పుల శైలజను మంగళవారం పోలీసులు అరెస్ట్ చేశారు. విలేకరుల సమావేశంలో వివరాలను ఏసీపీ గజ్జి కృష్ణ వెల్లడించారు. కొన్నిరోజులుగా కుమార్‌తో శైలజ సన్నిహితంగా ఉండడాన్ని చూసి వివాహేతర ఉందని సంతోష్ అనుమానించాడు. పద్ధతి మార్చుకోవాలని శైలజను మందలించాడు. అయితే తన వెంటపడుతూ ఇబ్బంది పెడుతున్నాడని ఆమె చెప్పడంతో కుమార్‌పై సంతోష్ కోపం పెంచుకున్నాడు. అయితే బంధువుల వద్ద శైలజతో సంబంధం ఉందని కుమార్ చెబుతున్నాడు. శైలజకు కూడా ఫోన్లు చేస్తుండడంతో కుమార్‌ను చంపాలనే నిర్ణయానికి వచ్చాడు. ఈక్రమంలో సోమవారం మాట్లాడుకుందాం రమ్మని కుమార్‌కు ఫోన్‌చేసి చెప్పడంతో వ్యవసాయమార్కెట్‌కు కారులో చేరుకున్నాడు. ఈలోగా పెద్దపల్లికి వచ్చిన సంతోష్.. జెండా వద్ద ఓ కత్తిని కొనుగోలు చేసి భార్య శైలజకు కుమార్‌ను చంపుదామనే విషయాన్ని చెప్పాడు. శైలజ దొంగతుర్తి నుంచి బస్సులో పెద్దపల్లికి చేరుకోగా.. ఆమెను బైక్‌పై తీసుకుని మార్కెట్ యార్డుకు చేరుకున్నారు. అక్కడ కొద్దిసేపు కుమార్, సంతోష్ గొడవపడ్డారు. ఆ సమయంలోనే తన వద్ద ఉన్న కత్తి తీసి మెడ, చాతి, ముఖంపై పొడిచి చంపారు. కుమార్ చనిపోయాడని నిర్ధారించుకుని నిందితులు పరారయ్యారు. ఈమేరకు నిందితులైన భార్యాభర్తలు సంతోష్, శైలజు దొంగతుర్తిలో ఉన్నారనే సమాచారంతో అక్కడకు వెళ్లి పోలీసులు అరెస్టు చేశారు. సమావేశంలో సీఐ ప్రవీణ్‌కుమార్, ఎస్సై మల్లేశ్ పాల్గొన్నారు.వివాహేతర సంబంధం.. శైలజ నుంచి ఫోన్ వచ్చిందని..!

ఎన్క్రిప్టెడ్ యాప్స్ ద్వారా డ్రగ్స్ దందా
సాక్షి, హైదరాబాద్: ఎన్క్రిప్టెడ్ యాప్స్ ద్వారా ఐదారేళ్లుగా సాగుతున్న అంతర్జాతీయ డ్రగ్స్ దందా గుట్టును హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ (హెచ్–ఎన్ఈడబ్ల్యూ) రట్టు చేసింది. నలుగురు నిందితులను అరెస్టు చేసి వారి నుంచి మొత్తంగా రూ. 1.4 కోట్ల విలువైన 1.38 కిలోల ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్‌గా (ఓజీ) పిలిచే హైడ్రోపోనిక్ గంజాయి, 44 ఎల్ఎస్డీ (లైసెర్జిక్ యాసిడ్ డైఎథిలమైడ్) బ్లాట్లు, 250 గ్రాముల మ్యాజిక్ మష్రూమ్స్ (సైలోసైబిన్ డ్రగ్), మరికొన్ని వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ నిందితులంతా ఉన్నత విద్యావంతులే కావడం గమనార్హం. టాస్‌్కఫోర్స్ డీసీపీ వైవీఎస్ సుదీంద్రతో కలిసి మంగళవారం విలేకరుల సమావేశంలో అదనపు సీపీ (నేరాలు) పి.విశ్వప్రసాద్ ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించారు.కస్టమర్ నుంచి పెడ్లర్‌గా మారి... సికింద్రాబాద్‌కు చెందిన అభిషేక్ ఛత్తీస్‌గడ్‌లోని రాయ్‌పూర్ ఐఐఐటీ నుంచి బీటెక్ పూర్తిచేశాడు. ప్రస్తుతం సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పని చేస్తూ నెలకు రూ. 2 లక్షలు సంపాదిస్తున్నాడు. రాయ్‌పూర్‌లో ఉండగా మాదకద్రవ్యాల వినియోగానికి అలవాటుపడిన అతను.. తేలిగ్గా డబ్బు సంపాదన కోసం పెడ్లర్గానూ మారాడు. అభిషేక్‌కు డార్క్ వెబ్‌లో ఉన్న డ్రెడ్ మార్కెట్ అనే కమ్యూనిటీ ద్వారా ‘హెచ్‌హెచ్ హ్యాండ్లర్’అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. తనకు కావాల్సిన ఓజీ, ఎల్ఎస్డీ కోసం సిగ్నల్, స్నాప్‌చాట్ వంటి ఎన్‌క్రిపె్టడ్ యాప్స్ ద్వారా ఆర్డర్ ఇచ్చేవాడు.జబల్పూర్కు చెందిన హర్షవర్థన్ శ్రీవాస్తవ బీ–ఆర్క్ పూర్తి చేసినప్పటికీ ఆ రంగంపై ఆసక్తిలేక ఓ స్టార్టప్ కంపెనీ తెరవడానికి డబ్బు కోసం డ్రగ్ పెడ్లర్ అవతారం ఎత్తాడు. డ్రెడ్ మార్కెట్ ద్వారానే ‘హెచ్‌హెచ్ హ్యాండ్లర్’కి లోకల్ ఏజెంట్‌గా మారాడు. అయితే అతనికి డ్రగ్స్ అలవాటు లేకపోవడం గమనార్హం. సికింద్రాబాద్‌కు చెందిన మరో ఆర్కిటెక్ట్ ధావల్ కూడా హర్షవర్థన్‌కు మరో పెడ్లర్‌గా వ్యవహరిస్తున్నాడు. అలాగే డ్రగ్స్ సప్లయిర్ అయిన చెన్నైవాసి బి. శ్రీనివాస రాహుల్‌ను కొన్నేళ్ల క్రితం పరిచయం చేసుకున్న అభిషేక్ అతన్నుంచి డ్రగ్స్ కొని విక్రయిస్తున్నాడు. ఈ దందాపై హెచ్–న్యూకు సమాచారం అందడంతో ఇన్స్పెక్టర్ జీఎస్ డానియేల్ నేతృత్వంలో ఎస్సై సి.వెంకట రాములు, నల్లకుంట ఇన్స్పెక్టర్ బి.జగదీశ్వర్‌రావు తమ బృందాలతో వలపన్ని హర్షవర్థన్, రాహుల్, ధావల్, అభిషేక్‌లను నగరంలో పట్టుకున్నారు. రాహుల్ చెన్నైతోపాటు బెంగళూరు, హైదరాబాద్‌లోని కస్టమర్లకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు తేలింది. ఈ కేసును తదుపరి చర్యల నిమిత్తం నల్లకుంట పోలీసులకు అప్పగించారు. పోలీసుల నిఘాకు చిక్కకుండా సరఫరా... థాయ్‌లాండ్ నుంచి ఓడల ద్వారా డ్రగ్స్ భారత్‌లోకి.. అక్కడి నుంచి జబల్పూర్లో ఉంటున్న హర్షవర్థన్ వద్దకు చేరుతున్నాయి. అతను వినియోగదారుడికి కొరియర్ సంస్థల ద్వారా పంపుతున్నాడు. పోలీసుల నిఘాకు చిక్కకుండా ఉండేందుకు పార్శిల్ బుక్ చేసేటప్పుడు చిరునామా, ఫోన్ నంబర్ ఇచ్చి ట్రాకింగ్ ఐడీని మాత్రం అభిõÙక్ వంటి వినియోగదారులకు పంపుతున్నాడు. ఆ పార్శిల్ కొరియర్ ఆఫీసుకు చేరగానే అక్కడకు వెళ్లి వారు తీసుకొనేవారు. హ్యాండ్లర్ నుంచి డ్రగ్స్‌ను ఔన్స్ (28.34 గ్రాములు)కు రూ. 15 వేల నుంచి రూ. 25 వేల వరకు క్రిప్టో కరెన్సీ రూపంలో చెల్లించి తెప్పించుకొని వినియోగదారులకు ఔన్స్‌కు రూ. 25 వేల నుంచి రూ. 35 వేల మధ్య విక్రయిస్తున్నారు.

యాదాద్రిలోని ప్రీమియర్ ఎక్స్‌ప్లోజివ్ కంపెనీలో భారీ పేలుడు
యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. మోటకొండూరు మండలం కాటేపల్లిలో ప్రీమియర్ ఎక్స్‌ప్లోజివ్ కంపెనీలో పేలుడు సంభవించింది. పేలుడు ఘటనలో కార్మికులు మరణించినట్లు తెలుస్తోంది.ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. మంగళవారం ప్రీమియర్ ఎక్స్పోజివ్ కంపెనీలో కార్మికులు విధులు నిర్వహిస్తుండగా పెద్ద శబ్ధంతో ఒక్కసారిగా రియాక్టర్ పేలింది. పేలుడు ధాటికి కంపెనీలో పనిచేస్తున్న ఇద్దరు కార్మికులు మరణించినట్లు సమాచారం. కార్మికుల మరణంపై పూర్తి స్థాయిలో సమాచారం తెలియాల్సి ఉండగా.. తీవ్రంగా గాయపడ్డ కార్మికులను భూవనగిరిలో ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.