Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today

Top Stories

ప్రధాన వార్తలు

Kumar Mangalam Birla Wife Neerja Birla Says About 8 8 8 Rule in Work Life Balance1
'8-8-8 రూల్ పాటించండి': పనిగంటలపై నీర్జా బిర్లా

దేశం మొత్తం మీద పనిగంటల ప్రస్తావన జరుగుతున్న సమయంలో.. ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార్ మంగళం బిర్లా భార్య.. 'నీర్జా బిర్లా' (Neerja Birla) తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రోజులోని 24 గంటలను '8-8-8' నియమంగా విభజించుకుంటే.. జీవితం సాఫీగా సాగుతుందని పేర్కొన్నారు.పనికి 8 గంటలు, నిద్రకు 8 గంటలు, విశ్రాంతికి మిగిలిన 8 గంటలు కేటాయించుకోవాలి. ఇలా విభజించుకుంటే.. 24 గంటలు సరిపోతుంది. పనిని మాత్రమే కాకుండా.. వ్యక్తిగత జీవితాన్ని కూడా బ్యాలెన్స్ చేసుకోవడంపై ద్రుష్టి సారించాలి. ఈ నియమం పాటించడానికి కొంత కష్టంగా ఉన్నప్పటికీ.. సమతుల్యం చేసుకోవడానికి ప్రయత్నించాలని నీర్జా బిర్లా స్పష్టం చేశారు.వారానికి 70 గంటలు, 90 గంటలు పనిచేయాలని ఇన్ఫోసిస్ నారాయణమూర్తి, ఎల్ & టీ చైర్మన్ సుబ్రమణ్యన్ చెప్పారు వ్యాఖ్యానించారు. ఈ మాటలను ఆనంద్ మహీంద్రా, గౌతమ్ అదానీ, ఎంక్యూర్ ఫార్మాస్యూటికల్స్ సీఈఓ 'నిమితా థాపర్' మొదలైనవారు విమర్శించారు. తాజాగా నీర్జా బిర్లా కూడా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.పని గంటలపై ఆకాష్ అంబానీముంబై టెక్ వీక్ కార్యక్రమంలో 'ఆకాష్ అంబానీ' మాట్లాడుతూ.. ఆఫీసులో ఎంతసేపు (ఎన్ని గంటలు) ఉంటారనేది ముఖ్యం కాదు, చేస్తున్న పనిలో నాణ్యత ఉండాలి, దాని గురించి మాత్రమే ఆలోచిస్తాను అని అన్నారు. వృద్ధి అంటే జీవితం అనేది రిలయన్స్ నినాదం, అది వ్యక్తిగత జీవితానికి కూడా వరిస్తుందని అన్నారు. కాబట్టి మీరు ప్రతి రోజు ఎదగడానికి కృషి చేయాలని పేర్కొన్నారు.ఇదీ చదవండి: 'అర్ధరాత్రి 2 గంటల వరకు మేల్కొనే ఉంటారు': తండ్రి గురించి చెప్పిన ఆకాశ్ అంబానీ

Posani Krishna Murali falls ill in jail2
ఇంత క్రూరత్వమా..?.. పోసాని పట్ల ప్రభుత్వ దాష్టీకం

సాక్షి కడప : రెడ్‌బుక్‌ రాజ్యాంగాన్ని ప్రయోగించి 67 ఏళ్ల వయస్సులో ఉన్న ప్రముఖ సినీనటుడు, రచయిత, నిర్మాత పోసాని కృష్ణమురళిని అక్రమ కేసులో ఇరికించి, అరెస్టు చేయడమే కాకుండా, ఆయన ఆరోగ్యం పట్ల కూడా ప్రభుత్వం కుట్రపూరితంగానే వ్యవహరించింది. బుధవారం రాత్రి హైదరాబాద్‌లో అరెస్టు చేసిన పోసాని మురళిని గురువారం రాత్రి కోర్టులో హాజరుపరిచి, శుక్రవారం రాజంపేట సబ్‌జైలుకు తీసుకెళ్లారు. అక్కడ విరే­చనాలు అయినట్లు కుటుంబ సభ్యులకు పోసాని తెలిపారు. శనివారం గుండెల్లో, కడుపులో నొప్పిగా ఉందని చెప్ప­డంతో ముందుగా అక్కడి పీహెచ్‌సీకి తరలించారు. అక్కడ ప్రాథమికంగా పరీక్షలు చేయించి, వైద్యుల సూచన మేరకు కడపలోని రిమ్స్‌కు తరలించారు. ఇక్కడ కూడా ఆయన పట్ల ప్రభుత్వం, పోలీసులు అత్యంత క్రూరంగా వ్యవహరించారు. గుండెల్లో, కడుపు నొప్పితో బాధపడుతున్నా అంబులెన్సులో కాకుండా పోలీసు వాహనంలోనే తీసుకెళ్లడం క్రూరత్వమే. పైగా, ఆయనది అనారోగ్యం కాదని, నటన అంటూ రైల్వే కోడూరు రూరల్‌ సీఐ వెంకటేశ్వర్లు రిమ్స్‌ ఆవరణలోనే మీడియాతో మాట్లాడుతూ చెప్పడం అందరినీ విస్మయపరిచింది. 67 ఏళ్ల వయస్సులో ఉన్న ఓ ప్రముఖుడు, సీనియ­ర్‌ సిటిజన్‌ పట్ల ఓ సీఐ ఇంత దారుణంగా మా­ట్లాడటం ప్రభుత్వ కర్కశత్వానికి నిదర్శనమని పలువురు మండిపడుతున్నారు. ఇదే తరుణంలో పోసో­ని మురళీకృష్ణకు ఏదైనా జరగరానిది జరిగితే బా«­ద్యత ఎవరిదంటూ ఆయన అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఇలాగేనా ఆస్పత్రికి తీసుకెళ్లేది? పోసానికి ఇప్పటికే ఓసారి గుండె ఆపరేషన్‌ అయింది. మరికొన్ని ఆరోగ్య సమస్యలూ ఉన్నాయి. ఓబులవారి పల్లె పోలీసు స్టేషన్‌లో స్థానిక పీహెచ్‌సీ వైద్యులు పరీక్షించినప్పుడు ఆయనకు కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నట్లు వెల్లడించారు. గుండెకు సంబంధించే కాకుండా ఇతర అరోగ్య సమస్యలు ఉన్నట్లు కుటుంబ సభ్యులు కూడా పేర్కొంటున్నారు. బుధవారం రాత్రి హైదరాబాద్‌లో అరెస్టు చేసిన ఆయన్ని పోలీసు వాహనంలో తిప్పీ తిప్పీ గురువారం మధ్యాహ్నం ఓబులవారిపల్లె పోలీసు స్టేషన్‌కు తీసుకొచ్చారు. అక్కడ 9 గంటలు విచారణ జరిపి, ఆ తర్వాత రైల్వేకోడూరు కోర్టులో హాజరుపరిచారు. కోర్టులో రాత్రంతా వాదనలు జరిగాయి. శుక్రవారం రాజంపేట సబ్‌జైలుకు తీసుకొచ్చేవరకు.. అంటే రెండు రాత్రులు, రెండు పగళ్లు ఆయనకు విశ్రాంతి, నిద్ర లేవు. ఆయన బాగా అలసిపోయారు. జైలుకు తీసుకొచ్చేప్పటికే బాగా నీరసించిపోయారు. సబ్‌జైలుకు తరలించిన తర్వాత విరేచనాలు అయినట్లు, ఇతర సమస్యలు ఎదుర్కొన్నట్లు ఆయన ములాఖత్‌లో సన్నిహితులకు తెలిపారు. శనివారం గుండెల్లో, కడుపులో నొప్పితో బాధపడ్డారు. ఇలాంటి తరుణంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన జైలు, పోలీసు అధికారులు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు స్పష్టంగా కనిపించింది. ఇలాంటి సమస్యలతో ఉన్న వారిని ఆస్పత్రికి తీసుకెళ్లాలంటే తప్పనిసరిగా ఆక్సిజన్, ఇతర అత్యవసర వైద్య సౌకర్యాలు ఉన్న అంబులెన్సులోనే తీసుకెళ్లాలి. వైద్యులు వెంట ఉండాలి. రాజంపేట పీహెచ్‌సీలో ఈసీజీ, ఇతర ప్రాథమిక వైద్య పరీక్షల అనంతరం మెరుగైన వైద్య సేవల కోసం కడపలోని రిమ్స్‌కు తీసుకెళ్లాలని వైద్యులు సూచించడం ఒకింత తీవ్రతకు నిదర్శనమే. అయినా పోలీసులు ఆయన్ని రాజంపేట పీహెచ్‌సీ నుంచి కడప రిమ్స్‌కు అంబులెన్స్‌లో కాకుండా పోలీసు వాహనంలో తీసుకెళ్లారు. అదీ.. సరిగా గాలి కూడా ఆడకుండా ఇద్దరు పోలీసుల మధ్య కూర్చోబెట్టి తీసుకెళ్లారు. రిమ్స్‌లో కూడా స్ట్రెచర్‌ కానీ, వీల్‌ చెయిర్‌ కానీ ఏర్పాటు చేయలేదు. వాహనం నుంచి ఆస్పత్రిలోకి నడిపించుకుంటూనే తీసుకెళ్లారు. రిమ్స్‌ వైద్యులు పరీక్షల అనంతరం పోసాని కిడ్నీలో రాయి ఉన్నట్లు చెప్పారు.ఇలాంటి పరిస్థితుల్లో ఎప్పుడైనా కడపులో నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు కూడా అంబులెన్సులో కాకుండా పోలీసు వాహనంలోనే తిరిగి రాజంపేటకు తరలించారు. పోసాని పట్ల ప్రభుత్వం క్రూరత్వానికి ఇదే నిదర్శనమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. కుటుంబ సభ్యులు అభిమానుల్లో ఆందోళన పోసాని కృష్ణమురళి ఆరోగ్యంపై కుటుంబ సభ్యులతోపాటు అభిమానుల్లోనూ ఆందోళన వ్యక్తమవుతోంది. అనారోగ్యంతో ఉన్న ఆయ­న్ని పోలీసు వాహనాల్లో తీసుకెళ్తున్నారని, ఏదై­నా అత్యవసరం అయితే పరిస్థితి ఏమిటని ప్రశ్ని­స్తున్నారు. శనివారం ములాఖత్‌లో రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి ఆయన్ని సబ్‌ జైలులో కలిశారు. అనంతరం ఆయన అనారోగ్యంతో బాధపడుతున్న తీరును సబ్‌జైలు అధికారులకు కూడా ఆకేపాటి వివరించారు. పోసాని ఛాతినొప్పి, ఇతర అరోగ్య సమస్యలతో బాధపడుతున్న నేపథ్యంలో ఏదైనా జరిగితే బాధ్యత వహించాల్సి ఉంటుందని కూడా అధికారులను హెచ్చరించారు. ఈ నేపథ్యంలో అధికారులు పోసానిని పీహెచ్‌సీకి తీసుకెళ్లి, అక్కడి నుంచి కడప రిమ్స్‌కు వైద్యం కోసం తరలించారు.

Australia team arrives in Dubai,South afrcia to fly to UAE ahead of Indias CT 2025 semifinal: Reports3
టీమిండియా కోసం.. అన్ని జట్లు దుబాయ్‌లోనే?

ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోఫీ-2025లో సెమీస్ బెర్త్‌లు అధికారికంగా ఖారార‌య్యాయి. గ్రూపు-ఎ నుంచి భార‌త్‌, న్యూజిలాండ్, గ్రూపు-బి నుంచి ద‌క్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జ‌ట్లు సెమీఫైన‌ల్‌కు చేరుకున్నాయి. అయితే ఈ నాలుగు జ‌ట్లు సెమీస్‌కు చేరిన‌ప్ప‌టికి వాటి స్థానాలు ఇంకా ఖారారు కాలేదు.ఆదివారం న్యూజిలాండ్‌-భార‌త్ మ‌ధ్య జ‌రిగే ఆఖ‌రి లీగ్ మ్యాచ త‌ర్వాతే సెమీస్‌లో ఎవ‌రి ప్ర‌త్య‌ర్ధి ఎవ‌ర‌న్న‌ది తేల‌నుంది. కాగా మంగళవారం జరగనున్న తొలి సెమీఫైనల్లో భారత ఆడటం ఇప్పటికే ఖాయమైన సంగ‌తి తెలిసిందే. కానీ ప్ర‌త్య‌ర్ధి సౌతాఫ్రికా లేదా ఆస్ట్రేలియా నా అన్న‌ది నేడు ఖారారు కానుంది. ఈ క్ర‌మంలో చాంపియన్స్‌ ట్రోఫీ గ్రూప్‌ ‘బి’ నుంచి సెమీఫైనల్‌కు అర్హత సాధించిన దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు దుబాయ్‌కు పయనమయ్యాయి. రెండింటిలో ఒక జట్టు మైదానంలోకి దిగకుండానే మళ్లీ లాహోర్‌కు రావాల్సి ఉంటుంది. కివీస్‌తో చివరి పోరులో భారత్‌ విజయం సాధిస్తే ఆస్ట్రేలియాతో రోహిత్‌ సేన మంగళవారం తొలి సెమీఫైనల్‌ ఆడుతుంది.ఇదే జరిగితే దక్షిణాఫ్రికా జట్టు తిరిగి పాకిస్తాన్‌ చేరుకుంటుంది. ఒకవేళ కివీస్‌ చేతిలో ఓడితే టీమిండియా ప్రత్యర్థి దక్షిణాఫ్రికా కానుంది. కంగారూలు రెండో సెమీఫైనల్‌ కోసం పాకిస్తాన్‌కు తిరుగు పయనం కానున్నారు. కీలక సెమీఫైనల్‌కు ముందు దుబాయ్‌ మైదానంలో ప్రాక్టీస్‌ చేయడంతో పాటు అక్కడి పరిస్థితులను అర్థం చేసుకోవడానికి దక్షిణాఫ్రికా, ఆ్రస్టేలియా జట్లకు ఇది ఉపయోగపడనుంది.ఇక కివీస్‌తో ఆఖరి లీగ్‌ మ్యాచ్‌కు టీమిండియా అన్ని విధాల సిద్దమైంది. ఈ మ్యాచ్‌కు ముందు భారత కెప్టెన్‌ రోహిత్‌ శర్మ పూర్తి ఫిట్‌నెస్‌ సాధించాడు. ఈ ఆఖరి మ్యాచ్‌లో భారత్‌​ ఓమార్పుతో బరిలోకి దిగింది.తుది జట్ల వివరాలు (అంచనా) భారత్‌: రోహిత్‌ శర్మ (కెప్టెన్ ), శుబ్‌మన్‌ గిల్, కోహ్లి, శ్రేయస్‌ అయ్యర్, రిషబ్‌ పంత్, హార్దిక్‌ పాండ్యా, రవీంద్ర జడేజా, వాషింగ్టన్‌ సుందర్, హర్షిత్‌ రాణా, వరుణ్ చక్రవర్తి, అర్ష్ దీప్‌ సింగ్‌. న్యూజిలాండ్‌: మిచెల్‌ సాంట్నర్‌ (కెప్టెన్ ), డెవాన్‌ కాన్వే, రచిన్ రవీంద్ర, కేన్‌ విలియమ్సన్, డార్లీ మిచెల్, టామ్‌ లాథమ్, గ్లెన్‌ ఫిలిప్స్, బ్రేస్‌వెల్, జేమీసన్,హెన్రీ, రూర్కే.చదవండి:SA vs Eng: ఇంగ్లండ్‌కు ఘోర అవమానం.. బాధతో బట్లర్‌ బైబై

Donald Trump,Volodymyr Zelensky and JD Vance discussion in white house4
ట్రంప్‌ వర్సెస్‌ జెలెన్‌స్కీ.. అధ్యక్షుల వాగ్వాదం జరిగిందిలా!

వాషింగ్టన్‌ చరిత్రలోనే ఎన్నడూ లేనివిధంగా అధ్యక్షుల వాగ్వాదానికి, పరస్పర ఆక్షేపణలకు, వాగ్బాణాలకు వైట్‌హౌస్‌ శుక్రవారం వేదికగా నిలిచింది. మీడియా సాక్షిగా ప్రపంచవ్యాప్తంగా ప్రత్యక్షంగా ప్రసారమైన భేటీలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్, ఉక్రెయిన్‌ అధినేత వొలొదిమిర్‌ జెలెన్‌స్కీ మధ్య సాగిన విమర్శలపర్వం సర్వత్రా చర్చనీయం­గా మారింది. నిజానికి ఈ రగడకు అగ్గి రాజేసింది వారితో పాటు చర్చల్లో పాల్గొన్న అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌. అలా ఒక్కసారిగా వేడెక్కిన పరిస్థితి కాస్తా చూస్తుండగానే అదుపు తప్పిపోయింది. చివరికి జెలెన్‌స్కీని ట్రంప్‌ వైట్‌హౌస్‌ వదిలి పొ­మ్మనడం, చర్చలకు అర్ధాంతరంగా ఫుల్‌స్టాప్‌ పెట్టి ఆయన వెనుదిరగడం దాకా వెళ్లింది! జెలెన్‌స్కీ వైట్‌­హౌస్‌ సందర్శన రద్దవడమే గాక రష్యాతో యుద్ధంలో ఉక్రెయిన్‌కు అమెరికా దన్ను కొనసాగడం కూడా అనుమానంలో పడింది. వారి మధ్య వాగ్యుద్ధం ఎలా జరిగిందంటే... వాన్స్‌: (బైడెన్‌ను ఉద్దేశించి) నాలుగేళ్లుగా అమెరికా (తాజా మాజీ) అధ్యక్షుడు (బైడెన్‌) రష్యా అధినేత పుతిన్‌ను ఉద్దేశించి గట్టి మాటలు మాట్లాడు­తూ వచ్చారు. అయినా పట్టించుకోకుండా ఉక్రెయిన్‌ౖ­పె దండెత్తిన పుతిన్‌ ఆ దేశాన్ని చాలావరకు నేల­మట్టం చేశారు. ఇప్పుడిక దౌత్యమే శాంతికి మార్గం. నామమాత్రపు బెదిరింపులకు దిగుతూ, ఛాతీ చరుచుకుంటూ బైడెన్‌ చూపిన దారి పనికొచ్చేది కాదని తేలిపోయింది. దౌత్యానికి బాటలు వేసినప్పుడే అమెరికా మంచి దేశమని అనిపించుకోగలదు. ట్రంప్‌ సరిగ్గా అదే చేస్తున్నారు. జెలెన్‌స్కీ: నేనొకటి అడగొచ్చా? వాన్స్‌: తప్పకుండా. జెలెన్‌స్కీ: పుతిన్‌ మా దేశాన్ని ఆక్రమించాడు. నిజమే. 2014లోనూ అతనదే చేశాడు. క్రిమియాను ఆక్రమించాడు. మా ప్రజలను భారీగా పొట్టన పె­ట్టు­కున్నాడు. అప్పుడెవరూ అతన్ని ఆపలేదు. ఇన్నేళ్లుగా కూడా ఆపడం లేదు. 2014లో ఒబామా, తర్వా­త ట్రంప్, ఆ తర్వాత బైడెన్‌... ఏ అధ్యక్షుడూ పట్టించుకోలేదు. దేవుని దయవల్ల పుతిన్‌ను ఇప్పుడు బహుశా ట్రంప్‌ ఆపుతారేమో. ట్రంప్‌: 2015లోనా? జెలెన్‌స్కీ: 2014లో ట్రంప్‌: అవునా? అప్పుడు అధ్యక్షున్ని నేను కాదుగా. వాన్స్‌: అదే కదా! జెలెన్‌స్కీ: కావచ్చు. కానీ 2014 నుంచి 2022 దాకా కూడా మా దుస్థితి అలాగే కొనసాగుతూ వచ్చింది. సరిహద్దుల వెంబడి మా ప్రజలు నిస్సహాయంగా చనిపోతూనే వచ్చారు. ఈ దారుణాన్ని ఆపేవారే లేకపోయారు. పుతిన్‌తో చర్చలు జరిపాం. ఒక్కసారి కాదు. ఎన్నోసార్లు. అతనితో ఒప్పందా­లు కూడా కుదుర్చుకున్నాం. (ట్రంప్‌నుద్దేశించి) మీరు కూడా 2019లో పుతిన్‌తో ఒప్పందం చేసుకున్నా­రు. (ఫ్రాన్స్‌ అధ్యక్షుడు) మాక్రాన్, (నాటి జర్మ­నీ చాన్సలర్‌) మెర్కెల్‌ కూడా. కాల్పుల విరమణ ఒప్పందాలూ కుదిరాయి. పుతిన్‌ వాటిని ఉల్లంఘించబోడనే మీరంతా మాకు హామీ ఇచ్చారు. కానీ ఏం జరిగింది? దానికతను తూట్లు పొడిచాడు. మావాళ్లను మరింతగా పొట్టన పెట్టుకున్నాడు. ఖైదీల మార్పిడి ఒప్పందాన్నీ తుంగలో తొక్కాడు. ఇదెక్కడి దౌత్యం? జేడీ! మీరేం మాట్లాడుతున్నారో, వాటికి అర్థమేమిటో మీకైనా తెలుస్తోందా?వాన్స్‌: మీ దేశంలో సాగుతున్న వినాశనానికి తెర దించగలిగే దౌత్యం గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నా. కానీ ఒక్కటి మాత్రం మీకు స్పష్టంగా చెప్పదలచుకున్నా. ఇలా ఓవల్‌ ఆఫీసులో కూ­ర్చుని అమెరికా మీడియా సమక్షంలో మీరిలా వాదన­కు దిగడం చాలా అమర్యాదకరం. మీకిప్పు­డు రష్యా­తో పోరాడేందుకు సరిపడా సైన్యమే లేదు. మరో దారిలేక పౌరులకు ఆయుధాలిచ్చి బలవంతంగా యుద్ధక్షేత్రంలోకి నెడుతున్నారు. అలాంటి ఘర్షణ­కు తెర దించేందుకు కృషి చేస్తున్నందుకు అధ్యక్షుడు ట్రంప్‌కు మీరు నిజానికి కృతజ్ఞతలు తెలపాలి. జెలెన్‌స్కీ: మాకెలాంటి సమస్యలున్నాయో కళ్లతో చూసినట్టే చెబుతున్నారు! మీరెప్పుడైనా ఉక్రెయిన్‌లో పర్యటించారా? వాన్స్‌: అవును. జెలెన్‌స్కీ: ఓసారి ఇప్పుడొచ్చి చూడండి. వాన్స్‌: ఉక్రెయిన్‌లో ఏం జరుగుతోందో చూశా­ను. కథలు కథలుగా విన్నాను. నిజానికి మీరు తర­చూ దేశాధినేతలు తదితరులను మీ దేశానికి రప్పించుకుంటూ ఉంటారు. అవన్నీ ఫక్తు ప్రచార టూర్లు. మీకు సమస్యలున్నది నిజం కాదంటా­రా? సైన్యంలో చేరేందుకు జనమే లేకపోవడం నిజం కదా? జెలెన్‌స్కీ: అవును. మాకు సమస్యలున్నాయి. వాన్స్‌: అలాంటప్పుడు అమెరికాలో పర్యటిస్తూ, వైట్‌హౌస్‌లో ఓవల్‌ ఆఫీసులో కూర్చుని మరీ, అదీ అధ్యక్షుని సమక్షంలోనే మా యంత్రాంగంపై దాడికి దిగడం మర్యాదా? మీ దేశ వినాశనానికి అడ్డుకట్ట వేసేందుకు ప్రయతి్న­స్తున్న మా ప్రభుత్వంపై నోరు పారేసు­కోవడం సబబా?జెలెన్‌స్కీ: వరుసబెట్టి చాలా ప్రశ్నలే అడిగేశారు. అన్నింటినీ ఒక్కొక్కటిగా చర్చిద్దాం. వాన్స్‌: అలాగే కానిద్దాం. జెలెన్‌స్కీ: ముందుగా మీరొకటి అర్థం చేసుకోవాలి. యుద్ధ సమయంలో ఎవరికైనా సమస్యలే ఉంటాయి. రేపు మీకైనా అంతే. కాకపోతే ఇప్పుడు మీకది తెలియకపోవచ్చు. భవిష్యత్తులో అలాంటి పరిస్థితి వస్తే మీకూ తెలిసొస్తుంది. ట్రంప్‌: మున్ముందు మాకెలా అనిపిస్తుందో మీరేమీ మాకు చెప్పాల్సిన అవసరం. మేం కేవలం మీ సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నాం. మీ పరిస్థితే మాకొస్తే ఎలా ఉంటుందో మాకు చెప్పే సాహసం చేయకండి. జెలెన్‌స్కీ: నేను మీకేమీ చెప్పడం లేదు. నాకు సంధించిన ప్రశ్నలకు బదులిస్తున్నానంతే. ట్రంప్‌: అలా కాదు. ఏం జరగాలో, ఎలా జరగాలో నిర్దేశించే పరిస్థితిలో మీరు ఎంతమాత్రమూ లేరు. వాన్స్‌: కానీ మీరు ఎంతసేపూ కేవలం మీకేం కా­వా­లో మాకు నిర్దేశించే ప్రయత్నమే చేస్తూ వస్తున్నారు. ట్రంప్‌: మాకూ మీలాంటి పరిస్థితే వస్తే మాకెలా ఉంటుందో చెప్పే పరిస్థితిలో మీరు లేరు. ముందు అది తెలుసుకోండి. మేం బాగుంటాం. జెలెన్‌స్కీ: (మాలాంటి పరిస్థితే గనక వస్తే) ఎంతోమంది ప్రభావితం చేసేందుకు ప్రయతి్నంచడం మీకూ అనుభవంలోకి వస్తుంది. ట్రంప్‌: మేమెప్పుడూ శక్తిమంతంగా ఉంటాం.జెలెన్‌స్కీ: మళ్లీ చెబుతున్నా. అలాంటి పరిస్థితే వస్తే ఎలా ఉంటుందో అప్పుడు మీకూ అనుభవంలోకి వస్తుంది. ట్రంప్‌: ప్రస్తుతం మీ పరిస్థితి అస్సలు బాగా లేదు. ఇదంతా స్వయంకృతం. మీరు స్వయంగా కొనితెచ్చుకున్నదే. జెలెన్‌స్కీ: యుద్ధం మొదలైనప్పటి నుంచీ... ట్రంప్‌: (మధ్యలోనే అడ్డుకుంటూ) చెప్తున్నాగా. మీరు తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నారు. మీ దగ్గర ప్రస్తుతం వాడేందుకు ఎలాంటి కార్డులూ లేవు. మేం దన్నుగా ఉన్నప్పుడే మీరు ఏమైనా చేయగలిగేది! జెలెన్‌స్కీ: నేనేమీ కార్డులు ప్లే చేయడం లేదు. సమస్య పరిష్కారానికి చాలా చిత్తశుద్ధితో ఉన్నా. మిస్టర్‌ ప్రెసిడెంట్‌! మీరది అర్థం చేసుకోవాలి. ట్రంప్‌: లేదు లేదు. ఎంతసేపూ మీరు కార్డులే ప్లే చేస్తున్నారు. లక్షలాది జీవితాలతో చెలగాట­మాడుతున్నారు. అందరినీ మూడో ప్రపంచ యుద్ధ భయంలోకి నెడుతున్నారు. జెలెన్‌స్కీ: మీరేం మాట్లాడుతున్నారు! ట్రంప్‌: అవును. మీరు అందరినీ మూడో ప్రపంచయుద్ధం దిశగా నెట్టే జూదానికి దిగారు. అంతేకాదు! మీ ప్రవర్తన అమెరికా పట్ల అత్యంత అమర్యాదకరంగా ఉంది. కేవలం మాటలు చెప్పే ఎన్నో దేశాల కంటే మీకు అన్నివిధాలా దన్నుగా నిలిచింది మేమే. వాన్స్‌: అందుకు మీరు కనీసం ఒక్కసారన్నా కృతజ్ఞతలు తెలిపారా? జెలెన్‌స్కీ: ఒక్కసారి కాదు. ఎన్నోసార్లు చెప్పా! ఇప్పుడూ చెబుతున్నా. వాన్స్‌: నేననేది ఈ భేటీలో. ఇప్పటిదాకా మాపై, మా దేశంపై విమర్శలే తప్ప కృతజ్ఞతాపూర్వకమైన మాటలు ఒక్కటైనా మాట్లాడారా? గత అక్టోబర్లో పెన్సిల్వేనియాలో మా ప్రత్యర్థి పార్టీకి అనుకూలంగా ప్రచారం చేసిన చరిత్ర మీది! జెలెన్‌స్కీ: నేనలా చేయలేదు.వాన్స్‌: ఇప్పటికైనా అమెరికాకు, మీ దేశాన్ని కాపాడేందుకు కృషి చేస్తున్న మా అధ్యక్షునికి కృతజ్ఞతగా కనీసం మంచి మాటలైనా చెప్పండి. జెలెన్‌స్కీ: మీరేమనుకుంటున్నారు? గొంతు చించుకు అరిస్తే సరిపోతుందా... ట్రంప్‌: (ఆగ్రహంగా మధ్యలోనే కలగజేసుకుంటూ) ఆయన (వాన్స్‌) గొంతు చించుకోవడం లేదు. అంత గట్టిగా మాట్లాడటం లేదు. వాస్తవమేమిటంటే, మీ దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది.జెలెన్‌స్కీ: ఆయన అన్నదానికి నన్ను కనీసం సమాధానమైనా చెప్పనిస్తారా? ట్రంప్‌: చెప్పనిచ్చే సమస్యే లేదు. ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడేశారు. ఓవైపు మీ దేశమే చాలా సమస్యల్లో ఉంది. జెలెన్‌స్కీ: అవును. నాకు తెలుసు. ట్రంప్‌: మీరు (యుద్ధం) గెలవబోవడం లేదు. ఈ ఆపద నుంచి బయట పడేందుకు మీకున్న ఏకైక అవకాశం మా దన్ను మాత్రమే. జెలెన్‌స్కీ: మిస్టర్‌ ప్రెసిడెంట్‌! మేమెవరినీ ఆక్రమించలేదు. మా దేశంలో మేం బతుకుతున్నాం. ఈ యుద్ధం మొదలైనప్పటి నుంచీ మేం ఒంటరిగానే పోరాడుతున్నాం. అయినా సరే, మీ దేశం పట్ల మొదటినుంచీ కృతజ్ఞతగానే ఉన్నాం. ఇప్పుడు కూడా చెబుతున్నా. కృతజ్ఞతలు. ట్రంప్‌: కాల్పుల విమరణకు మీరు అంగీకరించి తీరాల్సిందే. మా సాయుధ సాయం లేకపోతే ఈ యుద్ధం రెండే రెండు వారాల్లో ముగిసిపోయేది. జెలెన్‌స్కీ: కాదు. మూడే రోజుల్లో. అలాగని పుతిన్‌ కూడా అన్నారు. ట్రంప్‌: ఏమో! అంతకంటే కూడా ముందే ముగిసేదేమో! ఇలాగైతే మీతో ఒప్పందం కుదుర్చుకోవడం చాలా చాలా కష్టం. వాన్స్‌: ఇప్పటికైనా కనీసం కృతజ్ఞతలు తెలపండి. జెలెన్‌స్కీ: ఒక్కసారి కాదు. ఎన్నోసార్లు చెప్పా. అమెరికా పౌరులకు కృతజ్ఞతలు. వాన్స్‌: మన మధ్య అభిప్రాయ భేదాలున్నాయని అంగీకరించండి. మీరు చేస్తున్నదే తప్పు. అలాంటప్పుడు వాటిని చర్చించుకుని పరిష్కరించుకోవాలి. అంతే తప్ప ఇలా అమెరికా మీడియా సాక్షిగా మాతో గొడవకు దిగడం చాలా తప్పు. ట్రంప్‌: కానీ నా ఉద్దేశంలో ఇదీ మంచిదే. ఏం జరుగుతోందో ఇప్పుడు అమెరికా ప్రజలంతా చూస్తున్నారు. వారికీ తెలియనీయండి. ఇది చాలా ముఖ్యం. అందుకే ఈ సంవాదాన్ని ఇంతసేపు కొనసాగించా. జెలెన్‌స్కీ అమెరికాకు కృతజు్ఞడై ఉండాల్సిందే. జెలెన్‌స్కీ: అవును. నేను కృతజు్ఞన్ని. ట్రంప్‌: మీ దగ్గర వాడటానికి ఇంకే కార్డులూ లేవు. మీరు నిండా మునిగారు. మీ జనం చనిపోతు­న్నా­రు. పోరాడేందుకు మీకు సైనికుల్లేరు. ఎలా చూసు­కున్నా యుద్ధానికి తెర దించడమే మీకు మంచిది. కానీ మీరు చూస్తే కాల్పు విరమణే వద్దంటున్నారు! అది కావాలి, ఇది కావాలని పేచీకి దిగుతున్నారు! మీకొక్క­టే చెప్పదలచుకున్నా. కాల్పుల విరమణకు ఇప్పుడే, ఇక్కడే ఒప్పుకుంటారా సరేసరి. మీ దేశంపై తూటాల వర్షం ఆగుతుంది. జన నష్టానికి తెర పడుతుంది. జెలెన్‌స్కీ: యుద్ధం ఆగాలనే మేమూ కోరుతు­న్నాం. కానీ అందుకోసం మేం కోరుతున్న హామీలు కావాలి. ఆ విషయం మీకిప్పటికే స్పష్టంగా చెప్పా. ట్రంప్‌: అంటే ఏమిటి మీరనేది? కాల్పుల విరమణ వద్దా? నాకైతే అదే కావాలి. ఎందుకంటే ఈ పరిస్థితుల్లో మీరు కోరుతున్న ఒప్పందాల కంటే మీకు త్వరగా దక్కేది కాల్పుల విరమణే! జెలెన్‌స్కీ: కాల్పుల విరమణపై మీవాళ్లనే అడిగి చూడండి. మీకే తెలుస్తుంది!ట్రంప్‌: దానితో నాకు సంబంధం లేదు. అదంతా బైడెన్‌ అనే వ్యక్తి ఉండగా జరిగిన వ్యవహారం. కానీ అతనంత సమర్థుడు కాదు. జెలెన్‌స్కీ: అప్పుడాయన మీ దేశాధ్యక్షుడు. ట్రంప్‌: ఏం మాట్లాడుతున్నారు? బైడెన్‌ అనే కాదు. అంతకుముందు ఒబామా మాత్రం మీకేం సాయం చేశాడు? కేవలం కాగితాలిచ్చి సరిపెట్టాడు. నేనేమో మీకు శత్రువులపైకి ప్రయోగించేందుకు ఆయుధాలు సమకూర్చా. అందుకే చెప్తున్నా. మీరు నిజానికి మరింతగా కృతజు్ఞలై ఉండాలి. మీరిప్పుడు నిస్సహాయులు. మా దన్నే మీకు బలం. మేమే లేకపోతే మీకేమీ లేదు. పుతిన్‌ నన్ను గౌరవిస్తున్నాడంటే కారణం అధ్యక్షునిగా తొలి టర్ములో నా శైలిని దగ్గర్నుంచి గమనించాడు గనుకే.(రష్యా గనుక కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే ఏమిటన్న ఒక రిపోర్టర్‌ ప్రశ్నను ట్రంప్‌కు వాన్స్‌ వినిపించారు)ట్రంప్‌: ఎందుకీ ఊహాజనిత ప్రశ్నలు? ఇప్పటికిప్పుడు మీ నెత్తిపై బాంబు పడితే? రష్యా ఒకవేళ ఉల్లంఘిస్తే ఏం జరుగుతుందో నాకైతే తెలియదు. బైడెన్‌తో చేసుకున్న ఒప్పందాన్ని రష్యా నిజంగానే ఉల్లంఘించింది. ఎందుకంటే అతనంటే వారికి గౌరవం లేదు. ఒబామా అన్నా అంతే. కానీ నా విషయం అలా కాదు. నేనంటే రష్యాకు, పుతిన్‌కు ఎంతో గౌరవం. ఒక్కటి చెప్తా వినండి. పుతిన్‌కు నేను చుక్కలు చూపించా! నేను చెప్పేదల్లా ఒక్కటే. ఒబామా­తోనో, బుష్‌తోనో, చివరికి బైడెన్‌తో కూడా ఒప్పం­దాలను పుతిన్‌ ఉల్లంఘించి ఉండొచ్చు. నాకు తెలియదు. కానీ నాతో మాత్రం ఆయన అలా చేయలేదు. ఇప్పుడు కూడా ఒప్పందం చేసుకోవాలనే పుతిన్‌ అనుకుంటున్నాడు. (జెలె­న్‌­స్కీని ఉద్దేశించి) కానీ కాల్పుల విమరణకు ఒప్పుకునే ఉద్దేశం మీకేమాత్రం ఉందో లేదో నాకైతే తెలియదు. మిమ్మల్ని నేను బలశాలిగా, శక్తిమంతునిగా తీర్చిదిద్దా. అమెరికా దన్నే లేకపోతే మీకెన్నటికీ అంతటి శక్తి ఉండేదే కాదు. మీ ప్రజలు చాలా ధైర్యశాలులు. చివరిగా ఒక్కటే మాట. మాతో (ఖనిజ వనరుల) ఒప్పందం చేసుకుంటారా, సరేసరి! లేదంటే రష్యా, ఉక్రెయిన్‌ మధ్య శాంతి యత్నాల నుంచి అమెరికా వైదొలగుతుంది. అప్పుడిక మీ పోరాటం మీదే. అదంత సులువని నేనైతే అనుకోను. ఎందుకంటే పోరాడేందుకు మీ దగ్గర ఏమీ లేదు. మాతో ఒప్పందం కుదుర్చుకుంటే మీరు చాలా మెరుగైన స్థితిలో ఉంటారు. కానీ ఏ దశలోనూ మీరు కాస్త కూడా కృతజ్ఞతపూర్వకంగా వ్యవహరించడం లేదు. ఇది ఎంతమాత్రమూ సరైన పద్ధతి కాదు. నిజంగా చెప్తున్నా. మీ తీరు అస్సలు సరికాదు. చూడాల్సిందంతా చూసేశాం. కదా! టీవీలకైతే ఇదంతా నిజంగా పండుగే!

Chandrababu coalition govt Cheated AP People with budget 20255
AP: ఉద్యోగులకు ఉత్తచెయ్యి

సాక్షి, అమరావతి: పేద, సామాన్య ప్రజానీకాన్ని రెండు బడ్జెట్లలో మోసం చేసిన విధంగానే కూటమి ప్రభుత్వం ఉద్యోగులు, పెన్షనర్లను కూడా దగా చేసింది. సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రెండు బడ్జెట్‌లు ప్రవేశ పెట్టినప్పటికీ.. అందులో ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యల గురించి ప్రస్తావనే చేయకుండా మొండి చేయి చూపింది. వారికి ఇచ్చిన హామీలను గాలికి వదిలేసింది. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రభుత్వ ఉద్యోగులకు ఐఆర్‌ ప్రకటిస్తామని ఉమ్మడి మేనిఫెస్టోలో టీడీపీ, జనసేన చెప్పాయి. ప్రభుత్వం ఏర్పాటై పది నెలలు కావస్తున్నా ఐఆర్‌కు దిక్కు లేకుండా పోయిందని ఉద్యోగులు, పెన్షనర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఐఆర్‌ గురించి సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ ఒక్క మాట కూడా మాట్లాడక పోవడం చూస్తుంటే మోసపోయినట్లు అర్థం అవుతోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి కేబినెట్‌ సమావేశంలోనే ఉద్యోగులకు 27 శాతం ఐఆర్‌ ప్రకటించిన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. బకాయిలు, డీఏల మాటేంటి? ఉద్యోగులు, పెన్షనర్లకు చెల్లించాల్సిన బకాయిలను వెంటనే ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తామని టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోలో పేర్కొన్నప్పటికీ, అధికారంలోకి వచ్చి పది నెలలైనా ఆ ఊసే ఎత్తడం లేదని ఉద్యోగ వర్గాలు పేర్కొంటున్నాయి. పది నెలలైనా చెల్లించక పోవడంతో బకాయిలు మరో రూ.3 వేల కోట్లు పెరిగి మొత్తంగా రూ.26 వేల కోట్లకు చేరాయని చెబుతున్నారు. మొదటి బడ్జెట్‌లో అసలు ఉద్యోగుల గురించి ప్రస్తావించలేదని, ఇప్పుడు రెండో బడ్జెట్‌లో కూడా ఉద్యోగుల అంశాలను ప్రస్తావించక పోవడం చూస్తుంటే కూటమి సర్కారుపై నమ్మకం సడలి పోతోందని ఉద్యోగ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. డీఏల గురించి కూడా సీఎం, డిప్యూటీ సీఎం మాట్లాడటం లేదని ఉద్యోగులు వాపోతున్నారు. గత ఏడాది జనవరి, జూలై డీఏలు పెండింగ్‌లో పెట్టిందని, ఈ బడ్జెట్‌లోనైనా ఐఆర్‌తో పాటు వాటిని చెల్లిస్తారని ఆశించామని.. అయితే తమ ఆశలపై కూటమి సర్కారు నీళ్లు చల్లిందని ఉద్యోగ వర్గాలు మండిపడుతున్నాయి. సీపీఎస్‌ ఉద్యోగులను నమ్మించి మోసం సీపీఎస్, జీపీఎస్‌ విధానాన్ని పునః సమీక్షించి ఆమోదయోగ్యమైన పరిష్కారానికి కృషి చేస్తామని ఉమ్మడి మేనిఫెస్టోలో చెప్పినప్పటికీ, ఇప్పటి వరకు దాని గురించి ఆలోచనే చేయక పోవడం ఉద్యోగులను మోసం చేయడమేనని ఉద్యోగ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి. సీపీఎస్‌ విధానాన్ని కొనసాగిస్తున్నట్లు బడ్జెట్‌ డాక్యుమెంట్‌లో పేర్కొన్నారని, ఇది సీపీఎస్‌ ఉద్యోగులను మోసం చేయడమేనని ఉద్యోగులు పేర్కొంటున్నారు. పీఆర్సీ ఆశలపై నీళ్లుఉద్యోగులకు మెరుగైన పీఆర్‌సీ అమలు చేస్తామని, అలవెన్స్‌ పేమెంట్స్‌పై కూడా పునః పరిశీలన చేస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చినప్పటికీ పది నెలలైనా పీఆర్‌సీ గురించి అసలు మాట్లాడకపోగా, గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన పీఆర్‌సీ చైర్మన్‌ చేత రాజీనామా చేయించారని ఉద్యోగులు గుర్తుచేస్తున్నారు. తక్కువ జీతాలు పొందే ఔట్‌ సోర్సింగ్, కాంట్రాక్టు, కన్సాలిడేటెడ్‌ ఉద్యోగులకు ప్రభుత్వ పథకాలు వర్తింపచేస్తామని మేనిఫెస్టోలో చెప్పినా, అది అమలుకు నోచుకోలేదని, తుదకు చిరుద్యోగులు కూడా దగాకు గురైయ్యారని ఉద్యోగ వర్గాలు అంటున్నాయి. వలంటీర్లకు గౌరవ వేతనం రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచుతామని మేనిఫెస్టోలో మాట ఇచ్చి, కూటమి ప్రభుత్వం మాట తప్పిందని.. ఉద్యోగుల విషయంలో కూడా అలా చేయదనే గ్యారెంటీ లేదనే అభిప్రాయం ఉద్యోగ వర్గాల్లో వ్యక్తం అవుతోంది. రూ.26 వేల కోట్ల బకాయిలు, రెండు డీఏలతో పాటు ఐఆర్‌ కోసం ఉద్యోగులందరూ ఎదురు చూస్తున్నారని, వీటి గురించి అటు కూటమి నేతలు, ఇటు ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదని సచివాలయ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Allu Arjun Next Movie Update And Which Director6
బన్నీ నెక్స్ట్ మూవీకి ఏంటి సమస్య?

'పుష్ప 2' వచ్చి మూడు నెలలు దాటేసింది. అల్లు అర్జున్ ఇప్పుడు ఏ సినిమా.. ఎవరితో చేస్తాడనేది మాత్రం ఇంకా సస్పెన్స్ గానే ఉంది. ఎందుకంటే ఇద్దరి డైరెక్టర్ల పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. అసలింతకీ ఏంటి సమస్య? ఎవరితో ఫస్ట్ చేయొచ్చు?అల్లు అర్జున్ తో సినిమాలు చేసేందుకు చాలామంది దర్శకులు రెడీగా ఉన్నారు కానీ ఇదివరకే త్రివిక్రమ్ తో సినిమా చేసేందుకు బన్నీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. పీరియాడిక్ సెటప్ ఉన్న కథ కావడంతో ప్రీ ప్రొడక్షన్ కే చాలా టైమ్ పట్టేలా ఉంది. నిర్మాత నాగవంశీ.. రీసెంట్ గానే మాట్లాడుతూ ఈ ఏడాది ద్వితియార్థంలో ప్రాజెక్ట్ మొదలవుతుందని క్లారిటీ ఇచ్చారు. అంటే మరో ఆరేడు నెలలు బన్నీ ఖాళీగానే ఉంటాడు.(ఇదీ చదవండి: మెగాస్టార్ చిరంజీవిపై ఫేక్ న్యూస్.. ఏమైంది?)మరోవైపు అల్లు అర్జున్.. తమిళ డైరెక్టర్ అట్లీతో సినిమా చేసేందుకు రెడీగా ఉన్నాడని ఇండస్ట్రీలో టాక్. కాకపోతే బడ్జెట్-రెమ్యునరేషన్ దగ్గరే చిక్కంతా వచ్చి పడిందని తెలుస్తోంది. రూ.600 కోట్ల బడ్జెట్ కాగా.. పారితోషికం కింద తనకే రూ.100 కోట్లు ఇవ్వాలని అట్లీ అంటున్నాడట. ఈ పాయింట్ దగ్గరే డిష్కసన్స్ నడుస్తున్నాయని, ఏదో ఒక విషయం తేలితో త్వరలో బన్నీ-అట్లీ కాంబోపై క్లారిటీ వస్తుందని టాక్.అట్లీ ప్రాజెక్ట్ ఓకే అయితే మాత్రం త్రివిక్రమ్ తో చేయాల్సిన సినిమా వచ్చే ఏడాదే మొదలవుతుంది. లేదంటే మాత్రం ఈ ఏడాది చివర్లో షురూ చేసేస్తారు. మరి బన్నీ ఏం చేస్తాడనేది చూడాలి?(ఇదీ చదవండి: ఓటీటీకి వచ్చేసిన 'సంక్రాంతి వస్తున్నాం'.. స్ట్రీమింగ్ అందులోనే)

International Women Day: lady superstars of telugu cinema7
International Women's Day: సినీ మేడమ్స్

కథానాయికలు(Heroines) కనిపిస్తేనే వెండితెరకు నిండుదనం. సినిమాల ఘనవిజయాల్లో వారి పాత్ర గణనీయం దర్శకత్వం, రచన, నిర్మాణ నిర్వహణ, సినిమాటోగ్రఫీ.. వంటి తెరవెనుక పాత్రల్లోనూ కొందరు మహిళలు రాణిస్తున్నారు. తెరపైనా, తెరవెనుకా రాణించే సినీ మేడమ్స్‌ ముచ్చట్లు.. అంతర్జాతీయ మహిళా దినోత్సవం(International Women's Day) సందర్భంగా...దీపిక కొండిమన సమాజంలో పురుషాధిక్యత, లింగ వివక్ష, అసమానతలు వంటి రకరకాల అవరోధాలు మహిళల అభివృద్ధికి సవాలుగా నిలుస్తున్నాయి. ఈ సమస్యలు అన్ని రంగాల్లోనూ ఉన్నాయి. వెండితెరపై కథానాయికలుగా మహిళలు వెలుగొందే సినీరంగం కూడా ఈ సామాజిక రుగ్మతలకు అతీతం కాదు. ఎన్ని సమస్యలు ఉన్నా, ఏటికి ఎదురీదుతూ ఎప్పటికప్పుడు తమ సత్తా చాటుకుంటున్న మహిళలు కూడా సినీరంగంలో ఉన్నారు. వారే నేటితరాలకు స్ఫూర్తి ప్రదాతలు. తాజాగా ఆర్మాక్స్‌ మీడియా భారతీయ చలనచిత్ర పరిశ్రమలోని మహిళా ప్రాతినిధ్యంపై ఓ వుమానియా! 2024 నివేదిక విడుదల చేసింది. ఈ నేపథ్యంలోనే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా, సినిమాలను ప్రేమించి, సినిమాల కోసం పనిచేసే సినీ మేడమ్స్‌ గురించిన ప్రత్యేక కథనం..‘ఓ వుమానియా!’... భారతీయ చలన చిత్రపరిశ్రమలోని మహిళా ప్రాతినిధ్యంపై వెలువడిన నివేదిక. గత నాలుగేళ్లుగా ప్రముఖ మీడియా కన్సల్టింగ్‌ సంస్థ ‘ఆర్మాక్స్‌ మీడియా’ ఏటా ఈ నివేదికను విడుదల చేస్తూ వస్తోంది. ఈ నివేదికను ఫిల్మ్‌ కంపానియన్‌ స్టూడియోస్‌ వీడియో రూపంలో నిర్మించగా, ప్రముఖ డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌ ‘అమెజాన్‌ ప్రైమ్‌’ విడుదల చేసింది. తాజాగా ‘ఓ ఉమానియా–2024’ నివేదిక ప్రస్తుత ధోరణులపై మరింత లోతైన వివరాలను అందించింది. సినిమా నిర్మాణం, సినీ నిర్మాణ సంస్థల్లోని కార్పొరేట్‌ నాయకత్వం, మార్కెటింగ్‌ వంటి కీలక రంగాలలో మహిళా ప్రాతినిధ్యంలోని అసమానతలను గుర్తించింది.2023లో మొత్తం తొమ్మిది (తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ, మరాఠీ, పంజాబీ, బెంగాలీ, గుజరాతీ) భారతీయ భాషలలో విడుదల చేసిన 169 సినిమాలు, సిరీస్‌లను విశ్లేషించింది. వీటిని మళ్లీ థియేట్రికల్‌ సినిమాలు (70), డిజిటల్‌ స్ట్రీమింగ్‌ సినిమాలు (30), సిరీస్‌(69)లుగా విభజించింది.ఇందులో మన దక్షిణాది నుంచి లియో, జవాన్, ఆదిపురుష్, వాల్తేరు వీరయ్య, పొన్నియిన్‌ సెల్వన్‌ 2, భగవంత్‌ కేసరి, 2018, దసరా, విరూపాక్ష, సార్, హాయ్‌ నాన్న, భోళాశంకర్, మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి, ఇంటింటి రామాయణం సహా పలు సినిమాలు ఎంపికయ్యాయి. బాలీవుడ్‌ నుంచి జైలర్, ఓ మై డాడ్‌ 2, మిషన్‌ మజ్ను, ది ఆర్చీస్, లస్ట్‌ స్టోరీస్‌ 2 వంటి పలు చిత్రాలున్నాయి. స్వీట్‌ కారం కాఫీ, మోడర్న్‌ లవ్‌ చెన్నై, షైతాన్, దూత, సేవ్‌ ది టైగర్స్, కుమారి శ్రీమతి సిరీస్‌లు సిరీస్‌ విభాగంలో సెలెక్ట్‌ అయి, మంచి మార్కులు సాధించాయి. ట్రైలర్‌ టాక్‌టైమ్‌‘ఓ వుమానియా’ నివేదిక ప్రకారం, మహిళలు ట్రైలర్లలో 29 శాతం టాక్‌టైమ్‌కు పరిమితమయ్యారు. గత రెండేళ్లలో ఇది నామమాత్రంగా పెరిగినప్పటికీ, ఓటీటీ స్ట్రీమింగ్‌ సినిమాలు ప్రమోషనల్‌ ట్రైలర్లలో మహిళలకు ఎక్కువ టాక్‌టైమ్‌ కేటాయించే ధోరణిని చూపిస్తున్నాయి. వీటిల్లో కొన్ని 55 శాతం ట్రైలర్‌ టాక్‌టైమ్‌తో అగ్రస్థానంలో ఉన్నాయి.తెలుగు: బూ, హాయ్‌ నాన్న; హిందీ: మేడ్‌ ఇన్‌ హెవెన్‌ సీజన్‌ 2, వెడ్డింగ్‌.కాన్, సాస్‌ బహు ఔర్‌ ఫ్లెమింగో, జానే జాన్, రెయిన్‌బో రిష్ట, తాలీ; మరాఠీ: జిమ్మ; తమిళం: స్వీట్‌ కారమ్‌ కాఫీపాత బెచ్‌డెల్‌ పరీక్షసినిమాల్లో స్త్రీలను ఎలా ప్రదర్శిస్తున్నారో కొలిచే కొలమానం ‘బెచ్‌డెల్‌’ పరీక్ష. దీనిని 1985లో కార్టూనిస్ట్‌ అలిసన్‌ బెచ్‌డెల్‌ రూపొందించారు. అప్పటి నుంచి దశాబ్దాలుగా ఈ పరీక్షను చిత్రపరిశ్రమలో లింగవివక్షపై అంతర్జాతీయ కొలమానంగా పరిగణించారు. ఒక సినిమాలో కనీసం ప్రతి రెండు సన్నివేశాల్లో ఇద్దరు పేరున్న మహిళలు మాట్లాడుతుంటే, ఆ సినిమా బెచ్‌డెల్‌ టెస్ట్‌లో నెగ్గినట్లు పరిగణిస్తారు. అయితే, సినిమాల కంటే సిరీస్‌లకు ఎక్కువ రన్‌టైమ్‌ ఉంటుంది. కాబట్టి దానిని దృష్టిలో ఉంచుకొని, ఆ ప్రమాణాన్ని ప్రస్తుతం సిరీస్‌లకు రెండు నుంచి మూడు సన్నివేశాలుగా మార్చారు.నవరత్నాలుచలనచిత్ర పరిశ్రమలోని మొత్తం తొమ్మిది విభాగాల్లో పనిచేసే మహిళల స్థితిగతులను ఈ నివేదిక విశ్లేషించింది. దర్శకత్వం, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, రైటింగ్, ప్రొడక్షన్, డిజైనింగ్, సంగీతం వంటి కీలక విభాగాలలో 15 శాతం మాత్రమే మహిళలు ఉన్నారు. దీన్ని ఓటీటీ, థియేట్రికల్‌గా విభజిస్తే థియేట్రికల్‌కు 6 శాతం మాత్రమే! దక్షిణాదిలో ఈ సంఖ్య చాలా తక్కువ. గత ఏడాదితో పోలిస్తే ఈ సంఖ్య ఒక శాతం తగ్గింది. ఓటీటీలో మాత్రం పరిస్థితి మెరుగ్గా ఉంది. స్ట్రీమింగ్‌ సినిమాలు, సిరీస్‌ రెండింటిలోనూ 20 శాతం కంటే ఎక్కువ స్థానాల్లో మహిళలు నాయకత్వం వహిస్తున్నారు. 18 శాతం కంటే ఎక్కువగా మహిళా నాయకత్వం ఉన్న విభాగాలలో ఎడిటింగ్‌ ముందంజలో ఉంది. డైరెక్టర్‌ స్థానాల్లో 8 శాతం మాత్రమే మహిళలు ఉన్నారు, గత సంవత్సరంతో పోలిస్తే ఇది కొంచెం తగ్గింది.టూల్‌కిట్‌ టెస్ట్‌మహిళల ప్రాతినిధ్యంపై ప్రశ్నావళినాలుగు భిన్నమైన ప్రశ్నలతో తయారుచేసిన ఒక టూల్‌కిట్‌ను కూడా ఈ నివేదిక విడుదల చేసింది. ఈ టూల్‌కిట్‌ ఆధారంగా విశ్లేషించిన స్ట్రీమింగ్‌ సినిమాల్లో కేవలం 31శాతం మాత్రమే లింగ సమానత్వ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాయి. వీటిలో సిరీస్‌లు ముందంజలో ఉన్నాయి, వాటిలో 45 శాతం పరీక్షలో ఉత్తీర్ణత సాధించాయి. సినిమాలు, సిరీస్‌లు తదితరమైన వాటి నిర్మాణంలో వివిధ విభాగాలకు మహిళలు నాయకత్వం వహించినప్పుడు వాటిలో మహిళలకు సముచిత ప్రాతినిధ్యం లభించిందని, అవి బాగా విజయవంతమయ్యాయని ఈ నివేదిక వెల్లడించింది. థియేట్రికల్‌ సినిమాల్లో 18 శాతం మాత్రమే మహిళల నాయకత్వంలో రూపొందాయి.పురుషులు లేని సంభాషణ, డైలాగ్‌ కనీసం ఒకటైనా ఉందా? కథానాయకుడితో ప్రేమ లేదా కుటుంబ సంబంధం లేని పాత్రను పోషించిన ఒక మహిళా పాత్ర ఉందా?2. షో/సినిమా కథకు కీలకమైన ఆర్థిక, గృహసంబంధ, సామాజిక నిర్ణయాలను తీసుకోవడంలో, కనీసం ఒక్కరైనా చురుకైన మహిళ పాత్రను పోషిస్తున్నారా? కథానాయిక ప్రాధాన్యం ఉన్న సినిమాలు, సిరీస్‌లలో పురుష పాత్రలపై వ్యతిరేక దృక్పథాన్ని వ్యక్తపరచే అంశం ఉందా?షో/సినిమా స్త్రీలను లైంగికంగా చిత్రీకరించడం లేదా మహిళలపై హింసను సాధారణంగా లేదా ఆమోదయోగ్యంగా చిత్రీకరిస్తుందా?మొదటి మూడు ప్రశ్నలకు సానుకూల సమాధానం ‘అవును’, అయితే నాల్గవ ప్రశ్నకు అది ‘లేదు’ అని సమాధానాలు వచ్చినట్లయితేనే, తమ సినిమాలో లేదా సిరీస్‌లో మహిళలకు సముచిత ప్రాతినిధ్యం దక్కుతున్నట్లు నిర్మాతలు ఎవరికి వారే తేల్చుకోవచ్చు. అందుకు ఈ ప్రశ్నావళి ఉపయోగపడుతుంది.మహిళా జట్టు సినిమాల హిట్టుపూర్తి మహిళా బృందంతో చిత్రీకరించిన తొలిచిత్రం ‘ది మైడెన్‌’. 2018లో అలెక్స్‌ హూమ్స్‌ రచించి, దర్శకత్వం వహించిన ఈ సినిమాను విక్టోరియా గ్రెగరీ ‘న్యూ బ్లాక్‌ ఫిల్మ్స్‌’ నిర్మించింది. ఇందులో ఒక అమ్మాయి సెకండ్‌ హ్యాండ్‌ నౌకను కొని, నౌకాయానం నేర్చుకొని, రేసులో ఎలా గెలుస్తుందో చూపించారు. ఇదేవిధంగా మహిళలు ప్రధానంగా, ఎక్కువ సంఖ్యలో ఉండి ఎన్నో సినిమాలు తీశారు. వాటిల్లో ముఖ్యమైనవి, చెప్పుకోదగినవి ‘ది వుమెన్‌’. 1939లో విడుదలైన ఈ సినిమాలో ఒక్క పురుషుడు కూడా కనిపించడు. మొత్తం 130 మంది మహిళలు ఇందులో నటించారు.అలాగే ‘స్టీల్‌ మాగ్నోలియాస్‌’ సినిమాలో లూసియానా పట్టణంలోని ఒక స్త్రీల బృందం జీవితం, ప్రేమను చూపిస్తుంది. ‘ఎ లీగ్‌ ఆఫ్‌ దేర్‌ ఓన్‌’ ఇదొక బేస్‌బాల్‌ బృందం కథ. తక్కువ అంచనాలతో విడుదలైన ఈ సినిమా ఎంతోమంది చేత కంటతడి పెట్టిస్తుంది. 1993లో విడుదలైన ‘ది జాయ్‌ లక్‌ క్లబ్‌’ సినిమా చైనీస్‌ మహిళల వలసలు, తల్లుల మధ్య సంబంధాలను అద్భుతంగా చిత్రీకరించింది. 2018లో విడుదలైన ‘ఓసెన్స్‌ 8’ చిత్రం, మహిళలు దోపిడీలు చేస్తే ఎలా ఉంటుందో కాస్త నవ్విస్తూనే అందరినీ ఆశ్చర్యపరచేలా చూపించింది.తెలుగు తెర మెరుపులు..మహానటి సావిత్రిమహానటి సావిత్రి గొప్ప నటిగానే కాకుండా, దర్శకురాలిగానూ పేరు సంపాదించుకున్నారు. హీరోయిన్‌గా కెరీర్‌ పీక్స్‌లో ఉన్నప్పుడే ఆమె దర్శకత్వంలో ప్రయోగం చేశారు. సావిత్రి దర్శకత్వం వహించిన తొలి సినిమా ‘చిన్నారి పాపలు’. 1968లో ‘శ్రీమాతా పిక్చర్స్‌’ నిర్మాణ సంస్థ విడుదల చేసిన ఈ చిత్రానికి సావిత్రి స్వయంగా కథారచన చేశారు. వాణిజ్యపరంగా ఇది విఫలమైనప్పటికీ, విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ‘మాతృదేవత’, ‘వింత సంసారం’ వంటి సినిమాలకు కూడా ఆమె దర్శకత్వం వహించారు. బహుముఖ ప్రజ్ఞశాలి భానుమతి తెరపై కథానాయికగానే కాదు, తెర వెనుక అనేక విభాగాల్లోనూ పనిచేసిన నటి భానుమతి రామకృష్ణ. ‘చండీరాణి’ సినిమాతో డైరెక్టర్‌గా మారిన ఆమె, ‘నాలో నేను’ అనే పుస్తకంతో పాటు, మరెన్నో పాటలకు రచన, గాత్రం అందించారు. భర్త రామకృష్ణతో కలసి చిత్ర నిర్మాణంలోనూ పాలు పంచుకున్నారు. కళారంగంలో ఆమె చేసిన కృషికి జాతీయ చలనచిత్ర అవార్డుతోపాటు, పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డులను అందుకున్నారు. రికార్డు నెలకొల్పిన విజయనిర్మల సినీ ప్రపంచంలోకి ఒంటరిగా అడుగుపెట్టి, తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న మహిళ విజయనిర్మల. కేవలం నటిగానే కాదు, నిర్మాతగా, దర్శకురాలిగా వెండితెరపై తన పేరుకు తగ్గట్లుగానే ఎన్నో విజయాలు సాధించారు. ప్రపంచంలోనే అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించి, గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్ట్స్‌లో స్థానం సంపాదించుకున్నారు. సినీ సీతమ్మ అంజలీదేవిసీతాదేవి అనగానే ఠక్కుమని గుర్తొచ్చే నటి అంజలీదేవి. అభినయ సీతమ్మగా పాపులర్‌ అయిన ఆమె నటిగా, డ్యాన్సర్‌గానే కాదు, నిర్మాతగానూ చేశారు. తన భర్త ఆదినారాయణరావుతో కలసి నెలకొల్పిన ‘అంజలీ పిక్చర్స్‌’ నిర్మాణ సంస్థ ద్వారా ‘భక్త తుకారం’, ‘చండీప్రియ’ సహా మొత్తం 27 సినిమాలను నిర్మించారు. కృష్ణవేణి ఎన్టీఆర్‌లాంటి మహానటుడిని చిత్రసీమకు పరిచయం చేసిన, ప్రముఖ నిర్మాత చిత్తజల్లు కృష్ణవేణి బాలనటిగా రంగప్రవేశం చేశారు. ఇటీవల మరణించిన ఆమె, మీర్జాపురం రాజావారితో వివాహం అనంతరం ‘జయా పిక్చర్స్‌’ బాధ్యతలనూ తీసుకున్నారు. తర్వాత ‘శోభనాచల స్టూడియోస్‌’గా పేరు మార్చి ఎన్నో చిత్రాలను నిర్మించారు. ఆమె కుమార్తె అనురాధ కూడా తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో 17 సినిమాలు నిర్మించి, అత్యధిక చిత్రాలను నిర్మించిన మహిళా నిర్మాతగా లిమ్కా బుక్‌ రికార్డ్స్‌ సాధించారు. కృష్ణవేణి తన 98 ఏళ్ల వయసులో 2022లో ‘సాక్షి ఎక్సలెన్స్‌’ అవార్డుల్లో భాగంగా ‘జీవిత సాఫల్య పురస్కారం’ అందుకున్నారు. మరెందరో!నటి జీవితా రాజశేఖర్‌ ‘శేషు’ సినిమాతో దర్శకురాలిగా మారి, ‘సత్యమేవజయతే’, ‘మహంకాళి’ వంటి సినిమాలను రూపొందించారు. సూపర్‌స్టార్‌ కృష్ణ వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మంజుల ఘట్టమనేని ‘మనసుకు నచ్చింది’ సినిమాకు దర్శకత్వం వహించారు. మరెన్నో సినిమాలకు నిర్మాతగానూ వ్యవహరించారు. తొలి చిత్రం ‘ఆంధ్రా అందగాడు’ సినిమాతో విమర్శలు అందుకున్న సుధ కొంగర, తాజాగా ఆకాశమే హద్దు అనిపించారు.‘ద్రోహి’, ‘గురు’ చిత్రాలతో పాటు, ‘ఆకాశమే నీ హద్దు రా’ సినిమాతో వరుస విజయాలు అందుకున్నారు. ‘అలా మొదలైంది’ చిత్రంతో డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చిన నందినిరెడ్డి, ‘కళ్యాణ వైభోగమే’, ‘ఓ బేబీ’ మరెన్నో విజయవంతమైన చిత్రాలను చిత్రీకరించారు. దశాబ్దంపాటు, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దగ్గర అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచే సి, తొలిచిత్రం ‘పెళ్లి సందడి’తో విజయం సాధించారు డైరెక్టర్‌ గౌరీ రోణంకి. నిర్మాణ రారాణులుసినీ ప్రపంచంలో నిర్మాతలుగా రాణిస్తున్న రాణులు కూడా లేకపోలేదు. దిల్‌రాజు కుమార్తె హన్షితా రెడ్డి, తండ్రి బాటలోనే సుమారు 50కి పైగా సినిమాలు నిర్మించారు. మెగా కుటుంబం నుంచి వచ్చిన నిహారిక కొణిదెల కూడా ఇటు ప్రొడక్షన్‌ రంగంలో గుర్తింపు తెచ్చుకున్నారు. పలు వెబ్‌ సిరీస్‌లు, షార్ట్‌ ఫిల్మ్స్‌ నిర్మించారు. చిన్న సినిమాలే కాదు, భారీ బడ్జెట్‌ చిత్రాలను నిర్మించారు, నిర్మాత అశ్వనీ దత్‌ కూతుర్లు అయిన స్వప్న దత్, ప్రియాంక దత్‌. అన్నపూర్ణ స్టూడియోస్‌ సీఈఓ, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ సుప్రియ యార్లగడ్డ కూడా ఎన్నో చిత్రాలను నిర్మించింది. వీరితో పాటు నటి సమంత ‘ట్రలాలా మూవింగ్‌ పిక్చర్స్‌’ , నయనతార ‘రౌడీ పిక్చర్స్‌’, జ్యోతికలు వివిధ ప్రొడక్షన్‌ హౌస్‌లు స్థాపించి, తమదైన రీతిలో రాణిస్తున్నారు. చిత్రపరిశ్రమలో వైవిధ్యం, స్త్రీ పురుష సమానత్వం ఉన్నట్లయితే, సమాజంలో సానుకూల మార్పులకు అవి దోహదపడతాయి. వినోదరంగంలో మహిళలకు మరిన్ని అవకాశాలను సృష్టిస్తూ, వైవిధ్యభరితమైన, సమ్మిళితమైన, సమానమైన పరిస్థితులను కల్పించాలి. ప్రతి ఒక్కరూ స్త్రీలను చూసేలా, వినగలిగేలా, సానుకూలంగా చెప్పుకునేలా చేయాలి. అప్పుడే సినిమా బతుకుతూ, మరెందరినో బతికిస్తుంది.

Sakshi Editorial On Chandrababu Coalition Govt By Vardhelli Murali8
మాయలేళ్లూ... మరీచికలు!

‘చెప్పేదొకటి, చేసేదొకటి’ స్వభావం గలవాళ్లను మోసగాళ్లనే అంటాము. ప్రజా జీవితంలో ఉంటూ మచ్చుకైనా పారదర్శకత లేని ఇటువంటి బ్యాచ్‌ కూడా మోసగాళ్లే! మాయ లేడి వేషం వేసుకొని మోసగించిన మారీచునికి వీళ్లు వారసులనుకోవాలి. ఇటువంటి మూడు మాయలేళ్లు కలిసి కూటమి కట్టి ఏర్పాటు చేసిన ప్రభుత్వం నుంచి హామీల అమలు గురించి ఆశించడమంటే మరీచికల వెంట పరుగులు తీయడమే! ఈ కూటమి ప్రవేశపెట్టిన రెండో బడ్జెట్‌లో కూడా ఎన్నికల వాగ్దానాలకు నామం పెట్టారని ప్రతిపక్షం విమర్శిస్తున్నది. ప్రతిపక్షంగా అది వాళ్ల డ్యూటీ కావచ్చు.కూటమి మాత్రం ఆ విమర్శలను పట్టించుకోదు. మేనిఫెస్టో హామీలను అమలుచేయలేమనీ, చేయబోమనీ వారికి ముందే తెలుసు. రాష్ట్ర శ్రేయస్సు, ప్రజా సంక్షేమం వగైరాల కంటే పరమ పవిత్రమైన ఆశయాలు, ప్రయోజనాలు వారికి విడివిడిగా వేరే ఉన్నాయి. ఆ ప్రయోజనాలు నెరవేరాలంటే అధికారం కావాలి. విడివిడిగా ఉంటే అది కుదిరే పని కాదు. అందుకని ఒక్కటయ్యారు. అయినా నమ్మకం లేక ‘కొండమీది కోతిని నేలకు దించుతాం, బొందితో కైలాసం తీసుకుపోతాం, కళ్ల ముందటే వైకుంఠాన్ని నిలబెడతాం’ తదితరాల స్థాయికి తగ్గని హామీలను మేనిఫెస్టోలో చేర్చుకున్నారు. వాటిని నెరవేర్చి తీరుతామని కూటమి నేతలు వివిధ సభల్లో చేసిన మంగమ్మ శపథాలు,భీష్మ ప్రతిజ్ఞలు ఇప్పటికీ జనం చెవుల్లో గింగిరుమంటూనే ఉన్నాయి.పిట్టల దొర వాగ్దానాలకు తోడు ఢిల్లీ సర్కార్‌ సౌజన్యంతో ఎన్నికల సంఘం కూడా ఓ చేయి వేయడంతో కూటమి అధికారంలోకి వచ్చింది. వచ్చిన అధికారాన్ని ఏ రకంగా ఉపయోగించుకోవాలి అనే విషయంపై ఎవరి ప్రాధాన్యాలు వారికున్నాయి. జాతీయ స్థాయిలో కూటమికి పెద్దన్నగా బీజేపీ ఉంటున్నా ఏపీలో మాత్రం తెలుగుదేశం పార్టీదే పెద్దన్న పాత్ర. ఆ పార్టీ చంద్రబాబు నాయుడు నాయకత్వంలోకి మారిన తర్వాత ప్రజా సంక్షేమ కార్యక్రమాలను వ్యతిరేకించే వైఖరి తీసుకుంటున్నది. విద్య, వైద్యం వంటి ప్రాథమిక విషయాలు కూడా ప్రభుత్వ బాధ్యత కాదనీ, ఆ రంగాల్లో ప్రైవేట్‌ సేవలు అవసరమనీ చెప్పిన చరిత్ర బాబుది.ప్రభుత్వం నుంచి పొందే సేవలకు కూడా ప్రజలు యూజర్‌ ఛార్జీలు చెల్లించవలసిందేనని ఆయన గతంలోనే ఘంటా పథంగా ప్రకటించారు. అదేరకంగా పాలించారు. మొన్నటి ఎన్ని కల సందర్భంగా ఆయన ప్రకటించిన సూపర్‌ సిక్స్‌ వాగ్దానాలకు ఆయన సిద్ధాంతపరంగానే వ్యతిరేకి! అయినప్పటికీ అటువంటి మేనిఫెస్టోకు రూపకల్పన చేయడమంటే అధికారం పొందడం కోసం ఉద్దేశపూర్వకంగా మోసానికి తెగబడ్డారంటే తప్పవుతుందా? ఈ మోసాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఆయన ఈ మధ్యనే ‘పీ4’ అనే ఓ వంటింటి చిట్కాను ప్రకటించారు.ఈ ఉగాది నుంచి అమలుచేయ సంకల్పించిన ఈ ‘పీ4’ చిట్కాతో రాష్ట్రంలోని పేదరికం మటుమాయమైపోతుందట! పబ్లిక్‌–ప్రైవేట్‌–పీపుల్‌ భాగస్వామ్యమని దాని పూర్తి పేరు. సమాజంలోని పది శాతం మంది అత్యంత సంపన్నులు అట్టడు గున ఉన్న 20 శాతం మంది కడుపేదలను దత్తత తీసుకో వాలట! ఈ పేదవారి అవసరాలను ఆ సంపన్నులు గుర్తించి తృణమో పణమో సాయం చేసి పేదరికం నుంచి బయట పడేయాలట! ఈ ‘సామాజిక బాధ్యత’ నెరవేర్చినందుకు ఆ సంపన్నులకు ఏ సహజ వనరుల్ని కట్టబెడతారన్నది ఇక్కడ రహస్యం.కుల మత ప్రాంతీయ లింగ భేదాల్లేకుండా ఈ దేశంలో పుట్టిన ప్రతి మనిషికీ భారత రాజ్యాంగం సమాన హక్కులను కల్పించింది. చారిత్రకంగా వివిధ సమూహాల మధ్య అభివృద్ధి క్రమంలో ఏర్పడిన అంతరాలను పూడ్చడానికి ప్రభుత్వాలు పూనుకోవాలని ఆదేశించింది. సహజ వనరుల్లో అందరికీ సమాన భాగస్వామ్యం ఉండాలి. అందరూ సమానస్థాయిలో పోటీ పడగలిగే అవకాశాలు (లెవల్‌ ప్లేయింగ్‌ ఫీల్డ్‌) ఏర్పడాలని రాజ్యాంగం చెబుతున్నది. అటువంటి పరిస్థితులను ప్రభు త్వాలు ఏర్పాటు చేసినట్లయితే పేదరికాన్ని పేదలే జయిస్తారు. ఈ దేశాన్ని కూడా సంపన్న దేశంగా నిర్మిస్తారు. రాజ్యాంగం ఆశయం కూడా అదే! ఎవరి ఎంగిలి మెతుకుల తోనో పండుగ చేసుకొమ్మని చెప్పలేదు.ఈ ‘పీ4’ కార్యక్రమాన్ని గురించి రానున్న రోజుల్లోయెల్లో మీడియా ఏ రకమైన ప్రచారాన్ని చేపట్టబోతున్నదోనని ఊహించుకుంటేనే గగుర్పాటు కలుగుతున్నది. ఇంతటి మహత్తరమైన ఆలోచన గతంలో కార్ల్‌ మార్క్స్‌కు గానీ, అంబేడ్కర్‌కు గానీ, మరెవ్వరికీ గానీ రాలేదని వీరతాడు వేయవచ్చు. ఇకముందు రాబోదని కూడా ఛాలెంజ్‌ చేయవచ్చు. ఈ చిట్కా వైద్యంతో చిటికెలోనే పేదరికం పరారైందని కూడా ప్రకటించవచ్చు.‘పీ4’ సంక్షేమ ప్రచారం హోరులో తెలుగుదేశం పార్టీ అధినేతలకు మిగిలిన పవిత్ర కార్యక్రమం ఏమున్నది? ఒక్క అమరావతి తప్ప! దానికి అభివృద్ధి అనే ముసుగు వేయడం తప్ప! మిగిలిన ఈ మూడేళ్లూ (ఒక సంవత్సరం జమిలి ఎన్నికల కోత ఉండవచ్చు) అమరావతి సేవలోనే ప్రభుత్వం తరించే అవకాశం ఉన్నది. అమరావతి నిర్మాణానికి రూపాయి కూడా ప్రభుత్వం ఖర్చు చేయవలసిన అవసరం లేదని, దాని ల్యాండ్‌ బ్యాంక్‌ ద్వారా సంపాదించిన సొమ్ముతోనే నిర్మాణం జరిగి పోతుందని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు పలుమార్లు చెప్పిన విషయం పాఠకులకు గుర్తుండే ఉంటుంది. అందుకు భిన్నంగా ఇప్పటికే ప్రపంచ బ్యాంకు, జర్మనీ, ‘హడ్కో’ల ద్వారా 30 వేల కోట్లకు పైగా అప్పులు చేశారు. ఇంకో ఇరవై వేల కోట్ల రూపాయలను సీఆర్‌డీఏ ద్వారా సమీకరించేందుకు ఆదేశిస్తూ జీవో కూడా ఇచ్చారు.జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో నిర్మించిన ప్రభుత్వ భవనాలను గనక ఉపయోగంలోకి తెచ్చుకుంటే వైజాగ్‌ తక్షణమే అందుబాటులోకి వచ్చేది. ఆ సంగతి పక్కనబెట్టి, వైజాగ్‌ను విస్మరించి, ఇన్ని వ్యయప్రయాసలకోర్చడం వెనుక అసలు కథ ఇప్పటికే చాలామందికి అర్థమై ఉంటుంది. రాష్ట్ర రాజధాని పేరుతో అతి పెద్ద రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారానికి తెరతీశారని, దాని ద్వారా ఆ పార్టీ ముఖ్యనేతలు, వారి అనుయాయులు వేల కోట్ల రూపాయలు దండుకోవడానికి ప్రణాళికలు రచించారనే విమర్శలు చాలాకాలంగా వినిపిస్తున్నాయి. ఈ విమర్శలను పూర్వపక్షం చేసే సంతృప్తికరమైన సమాధానాన్ని తెలుగుదేశం నాయకత్వం ఇప్పటికీ ఇవ్వలేకపోతున్నది. ప్రతిపక్షం వారు రుజువులు చూపిస్తూ చేస్తున్న ఆరోపణలను సహేతుకంగా ఖండించనూ లేకపోతున్నది. దీన్నిబట్టి ఈ మూడేళ్లలో జరగ బోయేది – పేదలకు ‘పీ4’ గంజినీళ్లు! పాలక పెద్దలకు కనక వర్షం!!ఇక భారతీయ జనతా పార్టీది జాతీయ స్థాయి లక్ష్యం. వరసగా మూడుసార్లు కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసి బీజేపీ, సంఘ్‌ పరివార్‌లు మంచి ఊపుమీదున్నాయి. ఇక ఆరెస్సెస్‌ స్థాపిత లక్ష్యమైన హిందూ రాష్ట్ర ఎజెండాను బయటకు తీసే ముహూర్తం ఇప్పుడు కాక ఇంకెప్పుడని అవి భావిస్తు న్నాయి. మొన్నటి ‘మహా కుంభమేళా’ సందడిలోనే అందుకు అంకురార్పణ కూడా జరిగిపోయిందట! ‘అమర్‌ ఉజాలా’ అనే ఉత్తరాది హిందీ పత్రిక కోసం అలోక్‌ కుమార్‌ త్రిపాఠీ రాసిన వార్తా కథనాన్ని ఉటంకిస్తూ ‘ది వైర్‌ తెలుగు డాట్‌ ఇన్‌’ ఈ విషయాన్ని వెల్లడించింది. ఇంకో పాతికేళ్లలో దేశాన్ని హిందూ దేశంగా ప్రకటించే అవకాశం ఉన్నదట! అందుకు అవసరమైన అడుగులన్నీ ఇక వరసగా వేసుకుంటూ వెళతారు. ‘రుషి సంవిధాన్‌’ అనే పేరుతో ప్రత్యామ్నాయ రాజ్యాంగం కూడా సిద్ధమైందట! దీన్నే ‘సనాతన రాజ్యాంగ’మని పరివార్‌ ముఖ్యులు పిలుచుకుంటున్నారు. రాజ్యాంగాన్ని మార్చబో మంటూ బీజేపీ నేతలు పదేపదే ఇస్తున్న హామీలన్నీ బూటకమే నని ఇప్పుడు సిద్ధంగా ఉన్న ‘రుషి సంవిధాన్‌’ లేదా సనాతన రాజ్యాంగం రుజువు చేస్తున్నది.సంఘ్‌ పరివార్‌ తన అంతిమ గమ్యాన్ని చేరుకోవడానికి కీలకమైన తొలి అడుగు జమిలి ఎన్నికలు లేదా ఒన్‌ నేషన్‌ ఒన్‌ ఎలక్షన్‌ (ఒక జాతి... ఒకే ఎన్నిక). ఆ తర్వాత ‘ఒక జాతి... ఒకే భాష’, ‘ఒక జాతి... ఒకే మతం’ వంటి నినాదాలు మొదలు కావచ్చు. కనుక ఎట్టి పరిస్థితుల్లో జమిలి ఎన్నికల కార్యక్రమాన్ని ఈ దఫా వాయిదా వేసే అవకాశం లేదు. అందుకు అవసరమైన రాజ్యాంగ సవరణలకు సరిపోయే సంఖ్యాబలం ఎన్డీఏకు ఉన్నదా లేదా అనే శంకలు అనవసరం. సమకూర్చుకోగలమనే నమ్మకం ఎన్డీఏకు ఉన్నది. బీజేపీ శిబిరానికి దూరంగా ఉండే తటస్థ పార్టీలకు కూడా వాటి అవసరాలు వేరువేరుగా ఉండవచ్చు. ఆంధ్రప్రదేశ్‌లో తీవ్రమైన రాజకీయ కక్షను, స్టేట్‌ టెర్రర్‌ను ఎదుర్కొంటున్న వైసీపీ వాళ్లు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈ దమన కాండను వదిలించుకుందామనే దిశలో ఆలోచించవచ్చు.తెలంగాణలో బీఆర్‌ఎస్‌ పార్టీ కూడా ఏడాది ముందుగానే అధికారంలోకి వచ్చే అవకాశాన్ని వదులుకోకపోవచ్చు. ఈ రెండు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాల పట్ల వ్యతిరేకత స్పష్టంగానే కనిపిస్తున్నది. ఇల్లలకంగానే పండగ కాదు. జమిలి ఎన్నికలు జరిగినంత మాత్రాన హిందూ రాష్ట్ర ఏర్పాటుకు మార్గం సుగమమైనట్టు కాదు. ఇంకా చాలా దూరం ఉన్నది. జమిలి ఎన్నికలకు సహ కరించిన పార్టీలన్నీ ‘రుషి సంవిధాన్‌’కు సహకరించకపోవచ్చు. జమిలి ఎన్నికల్లో ఏమైనా జరగవచ్చు. కాకపోతే చాప కింద నీరులా బీజేపీ చేస్తున్న సన్నాహాలకూ, ఆ పార్టీ నేతలు పైకి చెబుతున్న మాటలకూ ఏమాత్రం పొంతన లేదనే విషయాన్ని ఈ పరిణామాలు రుజువు చేస్తున్నాయి.ఇక మాటలకూ, చేతలకూ పొంతన ఉండనివాళ్లు తమ బ్రాండ్‌ అంబాసిడర్‌గా ‘జనసేనాని’ని నియమించుకోవచ్చు. ఈ పదేళ్లలో ఆయన తన ఐడియాలజీని తలకిందులుగా వేలాడ దీశారు. ఆయన ఆరాధన చేగువెరా నుంచి సావర్కర్‌కు బదిలీ అయింది. తన మాటలకు విరుద్ధంగా తానే మాట్లాడిన ఉదంతాలు కోకొల్లలు. సనాతన రాజ్యాంగం గురించిన మాటలు సంఘ్‌ పరివారంలో వినపడగానే సనాతన ధర్మ పోరాట యోధుడి అవతారమెత్తడం గమనార్హం. ఏ రాజకీయ స్రవంతిలో కలిసిపోతే తన ప్రయాణం సుఖంగా సాగుతుందని భావిస్తారో అందులో దూకెయ్యడం ఆయనకు రివాజుగా మారింది. ఇలా మాట నిలకడ లేని, పారదర్శకత అసలే లేని ముగ్గురు కలిసి ఏర్పాటు చేసుకున్న కూటమి నుంచి హామీల అమలు గురించి ఆశించడం నీటి కోసం ఎండమావుల వెంట పరుగులు తీయడమే అవుతుంది. కాకపోతే ఈ రాజకీయ వంచనా శిల్పాన్ని ఎండగట్టడం, ప్రజలను జాగృతం చేయడం ప్రజాస్వామ్య ప్రియుల తక్షణ కర్తవ్యం.వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com

LPU 2025 Btech Final Year Student Bags Rs 1.03 Cr Placement Package9
ఎల్‌పీయూ రికార్డు.. 1700 విద్యార్థులకు 10 లక్షలపైనే ప్యాకేజీలు

లవ్లీ ప్రొఫెషనల్‌ యూనివర్శిటీ (ఎల్‌పీయూ)కు ఈ ఏడాది చాలా ఉత్సాహంతో మొదలైంది. ఫైనల్‌ ఇయర్‌ బీటెక్‌ విద్యార్థి రూ.1.03 కోట్ల (1,18,000 డాలర్లు)తో ఉద్యోగావకాశం పొందారు. రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్‌లో B.Tech చేస్తున్న బేతిరెడ్డి నాగవంశీరెడ్డి 2025 మేలో తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేయనున్నారు. ప్రముఖ ఏఐ రోబోటిక్స్ సంస్థలో రోబోటిక్స్ ఇంజినీర్‌గా చేరనున్నారు. ఈ అసాధారణ విజయం అటు పరిశ్రమ వర్గాల్లోనూ ఇటు విద్యా ప్రపంచంలోనూ సంచలనం సృష్టించింది. విద్యార్థులకు సూపర్‌ డూపర్‌ ప్యాకేజీలు అందించగల అత్యున్నత విద్యా సంస్థగా ఎల్‌పీయూ తనస్థానాన్ని సుస్థిరం చేసుకుంది.వేర్వేరు బీటెక్‌ విభాగాల్లోని మొత్తం 7361 మంది విద్యార్థులకు పాలో ఆల్టో నెట్‌వర్క్స్, నుటానిక్స్‌, మైక్రోసాఫ్ట్‌, సిస్కో, పేపాల్‌ అమెజాన్‌ వంటి ప్రతిష్టాత్మక మల్టీనేషనల్‌ కంపెనీల నుంచి ప్లేస్‌మెంట్లు లభించాయి. వీరిలో 1700 మంది టాప్‌ ఎమ్మెన్సీల నుంచి ఏడాదికి రూ.10 లక్షల నుంచి రూ.కోటి వరకూ ప్యాకేజీలు అందాయి. టాప్‌ ఎంఎన్‌సీలు ఇచ్చిన సగటు ప్యాకేజీ రూ.16 లక్షలు (ఏడాదికి). ఉద్యోగ మార్కెట్‌లో ఎల్‌పీయూకు ఉన్న అధిక డిమాండ్‌కు నిదర్శనాలు ఈ ప్లేస్‌మెంట్లు.గత ప్లేస్‌మెంట్‌ సీజన్‌ కూడా ఆకట్టుకునేదే. ఇండస్ట్రీలోనే అతిపెద్ద కంఎనీలు ఆకర్షణీయమైన ప్యాకేజీలు అందించాయి. పాలో ఆల్టో నెట్‌వర్క్స్ ఏకంగా ఏడాదికి రూ.54.75 లక్షల ప్యాకేజీని అందించగా నుటానిక్స్‌ రూ.53 లక్షల ప్యాకేజీ ఇచ్చింది. మైక్రోసాఫ్ట్‌ రూ.52.20 LPA ప్యాకేజీ అందించింది. మొత్తం 1912మందికి ఒకటి కంటే ఎక్కువ ఆఫర్లు అందాయి. 377 మందికి మూడు ఆఫర్లు, 97 మందికి నాలుగు ఆఫర్లు, 18 మందికి ఐదు, ఏడుగురికి ఆరు ఆఫర్లు లభించాయి. ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌ ఇంజినీరింగ్‌ విద్యార్థి ఆదిరెడ్డి వాసుకు నమ్మశక్యం కాని రీతిలో ఏకంగా ఏడు ఆఫర్లు వచ్చాయి. ఇదో అరుదైన, ఆకట్టుకునే రికార్డు.పైన చెప్పుకున్న కంపెనీలు మాత్రమే కాకుండా.. అమెజాన్‌ (రూ.48.64 LPA), ఇన్‌ట్యూట్‌ లిమిటెడ్‌ (రూ. 44.92 LPA), సర్వీస్‌ నౌ ( రూ. 42.86 LPA), సిస్కో (రూ. 40.13 LPA), పేపాల్‌ (రూ. 34.4 LPA), APNA (రూ.34 LPA), కామ్‌వాల్ట్‌ (రూ. 33.42 LPA), స్కేలర్‌ (రూ. 32.50 LPA)లు కూడా స్కిల్‌ డెవెలప్‌మెంట్‌, అత్యాధునిక టెక్నాలజీల్లో నైపుణ్యం అందించేందుకు ఎల్‌పీయూ చూపుతున్న శ్రద్ధకు నిదర్శనంగా నిలుస్తున్నాయి.ఎల్పీయూ పట్టభద్రుల సాంకేతిక పరిజ్ఞాన బుద్ధికుశలత కారణంగా భారీ నియామకాలు చేపట్టే ఆక్సెంచర్‌, క్యాప్‌జెమినీ, టీసీఎస్‌ తదితర ప్రముఖ కంపెనీల నుంచి మంచి డిమాండ్‌ ఉంది. క్యాప్‌జెమినీ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ 736 మంది విద్యార్థులకు అనలిస్ట్‌, సీనియర్‌ అనలిస్ట్‌ రోల్స్‌ కోసం ఉద్యగావకాశం ఇచ్చింది. అలాగే మైండ్‌ట్రీ 467 మంది విద్యార్థులను గ్రాడ్యుయేట్‌ ఇంజినీర్‌ ట్రైనీ పొజిషన్‌ కోసం తీసుకుంది. కాగ్నిజెంట్‌ టెక్నాలజీ సొల్యూషన్స్‌ కూడా 418 మంది విద్యార్థులను జెన్‌సీ రోల్స్‌ కోసం తీసుకుంది. ఎల్‌పీయూ నుంచి విద్యార్థులను ఎంపిక చేసుకున్న ఇతర కంపెనీల్లో ఆక్సెంచర్‌ (279 మంది), టీసీఎస్‌ (260 మంది), కేపీఐటీ టెక్నాలజీస్‌ (229 మంది), డీఎక్స్‌సీ టెక్నాలజీ (203), MPHASIS (94 మంది) కంపెనీలు ఉన్నాయి.రొబోటిక్స్‌, ఆటోమేషన్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌, మెకానికల్‌ ఇంజినీరింగ్‌ వంటి కోర్‌ ఇంజినీరింగ్‌ విభాగాల్లో అత్యధిక స్థాయిలో ప్లేస్‌మెంట్లు లభించాయి. పాలో ఆల్టో నెట్‌వర్క్స్‌, సిలికాన్‌ ల్యాబ్స్‌, ట్రైడెంట్‌గ్రూప్‌, నుటానిక్స్‌, ఆటోడెస్క్‌, అమెజాన్‌ వంటి దిగ్గజ కంపెనీలు ఈ విభాగాల్లోని విద్యార్థులను భారీగా నియమించుకుంటున్నాయి.‘‘ఎప్పటికప్పుడు మారిపోతున్న ప్రపంచానికి అనుగుణంగా విద్యార్థులు విజయం సాధించేలా చేసేందుకు ఎల్‌పీయూ కట్టుబడి ఉంది. ఎల్‌పీయూలో బోధించే అంశాలు కంపెనీల అవసరాలకు తగ్గట్టుగా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఎల్‌పీయూలో సంప్రదాయ పద్ధతులకు అతీతంగా సృజనాత్మక రీతిలో సాగే బోధన విద్యార్థులునిమగ్నమైయెలా ఉంటుంది. విద్యార్థులు పెద్ద సంఖ్యలో టాప్‌ కంపెనీల నుంచి ప్లేస్‌మెంట్‌ ఆఫర్లు పొందుతూండటం దీనికి నిదర్శనం. ఎల్‌పీయూ బోధనాంశాల సత్తానుచాటుతున్నాయి ఈ ప్లేస్‌మెంట్లు. జాతీయ, అంతర్జాతీయ ప్రముఖ సంస్థల్లో విద్యార్థులకు మంచి మంచి ప్లేస్‌మెంట్స్‌ సాధించిన రికార్డు ఎల్‌పీయూ సొంతం. అమెరికా, యూకే, ఆస్ట్రేలియాలల్లోని ఎన్నో పేరొందిన కంపెనీల్లో ఎల్‌పీయూ విద్యార్థులు ఏడాదికి రూ.కోటి కంటే ఎక్కువ ప్యాకేజీలతో పని చేస్తున్నారు. అత్యున్నత నైపుణ్యం కలిగిన ప్రొఫెషనల్స్‌ను తయారు చేయగల ఎల్‌పీయూ శక్తి సామర్థ్యాలకు, అంతర్జాతీయ స్థాయి ఎదుగుదలకు ఇవి నిదర్శనాలు.’’ అని రాజ్యసభ సభ్యులు, ఎల్‌పీయూ ఫౌండర్‌ ఛాన్సలర్‌ డాక్టర్‌ అశోక్‌ కుమార్‌ మిట్టల్‌ వివరించారు.2025 బ్యాచ్‌ కోసం దరఖాస్తు చేసుకునేందుకు చివరితేదీ దగ్గరపడింది. ఎల్‌పీయూలో అడ్మిషన్లకు పోటీ ఎక్కువ. యూనివర్శిటీలో అడ్మిషన్‌ కోసం విద్యార్థులు ప్రవేశ పరీక్ష రాయాల్సి ఉంటుంది. అలాగే ‘ఎల్‌పీయూ నెస్ట్‌ 2025’, ఇంటర్వ్యూలలోనూ పాసైన వారికి మాత్రమే కొన్ని ప్రత్యేక కార్యక్రమాల్లోకి ప్రవేశం లభిస్తుంది. పరీక్ష, అడ్మిషన్‌ ప్రాసెస్‌ గురించి తెలుసుకోవాలనుకునే ఆసక్తిగల విద్యార్థులు https://bit.ly/43340ai ను సందర్శించగలరు.

Weekly Horoscope Telugu 02-03-2025 To 08-03-202510
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..

మేషం...అనుకున్న పనులు సజావుగా పూర్తి కాగలవు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. స్థిరాస్తి వివాదాలు కొంతమేర పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. మీ నిర్ణయాలను అందరూ స్వాగతిస్తారు. నూతన విద్య, ఉద్యోగావకాశాలు దక్కించుకుంటారు. సమాజసేవలో భాగస్వామువులతారు. గత సంఘటనలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి, ఉద్యోగాలలో అనుకున్న హోదాలు దక్కుతాయి. రాజకీయవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు సంభవం. వారం చివరిలో అనారోగ్యం. బంధువులతో తగాదాలు. ఆకుపచ్చ, నీలం. కనకధారాస్తోత్రాలు పఠించండి.వృషభం....పరిచయాలు మరింత పెరుగుతాయి. మిత్రులు, బంధువుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. భూములు, వాహనాలు కొనుగోలు ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. నూతన ఉద్యోగాలు లభిస్తాయి. విద్యార్థుల ప్రతిభ వెలుగుచూస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు పుంజుకుని లాభాలు అందుకుంటారు. ఉద్యోగస్తులకు విధి నిర్వహణ లో ఆటంకాలు తొలగుతాయి. పారిశ్రామికవర్గాలకు శ్రమ ఫలిస్తుంది. వారం చివరిలో ఆరోగ్య సమస్యలు. సోదరులతో విభేదాలు. ఆకుపచ్చ, నేరేడు రంగులు. హనుమాన్‌ ఛాలీసా పఠించండి.మిథునం...గతంలో నిలిచిపోయిన పనులు కూడా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి కీలక సమాచారం అందుతుంది. సంఘంలో గౌరవమర్యాదలు మరింత పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి రుణబాధలు తొలగుతాయి. ఎంతోకాలంగా వేధిస్తున్న సమస్య నుంచి గట్టెక్కుతారు. ప్రత్యర్థులను సైతం ఆకట్టుకుంటారు. పరిచయాలు విస్తృతమవుతాయి. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో అదనపు బాధ్యతల నుంచి బయటపడతారు. కళారంగం వారికి కొత్త అవకాశాలు దక్కుతాయి. వారం చివరిలో వ్యయప్రయాసలు. ఆరోగ్యభంగం. ఆకుపచ్చ, తెలుపు రంగులు. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.కర్కాటకం...కొత్తగా తీసుకున్న నిర్ణయాలను కుటుంబసభ్యులు ఆమోదిస్తారు. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో సఖ్యత ఏర్పడుతుంది. ఉద్యోగయత్నాలు సానుకూలం. కొత్త వ్యక్తుల పరిచయం సంతోషం కలిగిస్తుంది. కాంట్రాక్టులు దక్కి ఉత్సాహంగా ముందడుగు వేస్తారు. గృహ నిర్మాణయత్నాలు సానుకూలమవుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఆటుపోట్లు తొలగుతాయి. రాజకీయవర్గాలకు మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం ప్రారంభంలో బంధువిరోధాలు. శ్రమాధిక్యం. గులాబీ, పసుపు రంగులు. శ్రీరామస్తోత్రాలు పఠించండి.సింహం...ఏ పని చేపట్టినా విజయవంతంగా పూర్తి చేస్తారు. నూతన విద్యలు, ఉద్యోగాలు దక్కుతాయి. ఆస్తుల కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థికంగా గడ్డుస్థితి నుంచి బయటపడతారు. తీర్థయాత్రలు చేస్తారు. బంధువులతో సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. వ్యతిరేకులు కూడా మీపై ప్రశంసలు కురిస్తారు. వ్యాపారాలు ఆశించినదాని కంటే మరింత మెరుగ్గా ఉంటాయి. ఉద్యోగాలలో ప్రతిబం«ధకాలు తొలగుతాయి. రాజకీయవర్గాలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారం ప్రారంభంలో అనారోగ్యం. కుటుంబసభ్యులతో విభేదాలు. ఎరుపు, గులాబీ రంగులు. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.కన్య...వ్యవహారాలు కొంత జాప్యమైనా పూర్తి చేస్తారు. ఆలోచనలు అమలు చేస్తారు. సంఘంలో విశేష గౌరవం పొందుతారు. ఆస్తుల వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. ఎంతటి వారినైనా ఆకట్టుకుంటారు. కొత్త వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి. వాహనాలు, గృహం కొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రముఖుల నుంచి కీలక సమాచారం అందుతుంది. వ్యాపారాలు మరింత లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో హోదాలు దక్కవచ్చు. కళారంగం వారికి అప్రయత్న కార్యసిద్ధి. వారం మధ్యలో వృథా ఖర్చులు. ఆరోగ్యసమస్యలు. నీలం, నేరేడు రంగులు. హయగ్రీవస్తోత్రాలు పఠించండి.తుల...చేపట్టిన వ్యవహారాలు పూర్తి చేస్తారు. ఆత్మీయులు, బంధువులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. ఆలోచనలు తక్షణం అమలు చేసి అందర్నీ ఆశ్చర్యపరుస్తారు. అనుకున్న విధంగా డబ్బు సమకూరి అవసరాలు తీరతాయి. చిన్ననాటి మిత్రుల నుంచి అందిన సమాచారం ఊరటనిస్తుంది. ఆస్తులు కొనుగోలులో ఆటంకాలు అధిగమిస్తారు. వ్యాపారస్తులకు మరింత ఉత్సాహవంతంగా గడుస్తుంది. ఉద్యోగులకు హోదాలు రాగలవు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు ఉండవచ్చు. వారం చివరిలో ధనవ్యయం. ఆరోగ్యసమస్యలు. పసుపు, తెలుపు రంగులు. శివాష్టకం పఠించండి.వృశ్చికం...కొత్త వ్యక్తుల పరిచయం ఉత్సాహాన్నిస్తుంది. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. నిరుద్యోగుల నిరీక్షణ ఫలించి ఉద్యోగాలు దక్కించుకుంటారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉల్లాసంగా గడుపుతారు. వాహనయోగం. వివాహాది వేడుకలకు హాజరవుతారు. వ్యాపారాలు లాభసాటిగా సాగి పెట్టుబడులు కూడా అందుతాయి. ఉద్యోగాలలో పదోన్నతులు రావచ్చు. రాజకీయవర్గాలకు పదవులు లభించే అవకాశం. వారం చివరిలో సోదరులతో విభేదాలు. ధనవ్యయం. పసుపు, ఆకుపచ్చ రంగులు. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.ధనుస్సు...కుటుంబ సమస్యల నుంచి బయటపడతారు. మీ ఆలోచనలతో కుటుంబసభ్యులు ఏకీభవిస్తారు. సంఘంలో గౌరవమర్యాదలు మరింత పొందుతారు. విలువైన వస్తువులు సేకరిస్తారు. పాత సంఘటనలు గుర్తుకు వస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందుతాయి. ముఖ్యమైన పనులు సమయానికి పూర్తి చేస్తారు. ఆర్థికపరమైన ఇబ్బందులు తీరతాయి. వ్యాపారాలు గతం కంటే పుంజుకుంటాయి. ఉద్యోగాలలో హోదాలు పెరిగే అవకాశం. పారిశ్రామికవర్గాలకు ఉత్సాహంగా గడుస్తుంది. వారం ప్రారంభంలో అనారోగ్యం. కుటుంబసభ్యులతో విభేదాలు. నీలం, పసుపు రంగులు. . దేవీస్తోత్రాలు పఠించండి.మకరం....ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. విలువైన సమాచారం అంది సంతోషంగా గడుపుతారు. సోదరులు చేయూతనందిస్తారు. ఆదాయం ఆశాజనకంగా ఉండి అవసరాలు తీరతాయి. ఇతరుల నుంచి బాకీలు కూడా అందుతాయి. దూరమైన బంధువులు తిరిగి దగ్గరకు చేరతారు. మీ ఆలోచనలను క్రమేపీ అమలు చేస్తారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో కొత్త హోదాలు. రాజకీయవర్గాలకు నూతనోత్సాహం. వారం మధ్యలో అనారోగ్యం. కుటుంబసభ్యులతో వైరం. నీలం, ఆకుపచ్చ రంగులు. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.కుంభం...ఆదాయానికి మించి ఖర్చులు ఎదురై ఇబ్బందిపడతారు. ఆలోచనలు కలసిరావు.. కుటుంబసభ్యులతో అకారణంగా తగాదాలు. ముఖ్యమైన పనులు ముందుకు సాగవు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. బంధువులను కలిసి ముఖ్య విషయాలు చర్చిస్తారు. నూతన విద్యావకాశాల కోసం శ్రమిస్తారు. స్థిరాస్తి వివాదాలు నెలకొంటాయి. మిత్రులేæ శత్రువులుగా మారతారు. వ్యాపారాలలో కొంత నిదానం అవసరం. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు. పారిశ్రామికవర్గాలు అగ్రిమెంట్లు కొన్ని రద్దు చేసుకుంటారు. వారం మధ్యలో శుభవర్తమానాలు. ధనలాభాలు. ఎరుపు, నేరేడు రంగులు. శివస్తోత్రాలు పఠించండి.మీనం...దూరపు బం«ధువులను కలుసుకుని ముఖ్య విషయాలు చర్చిస్తారు. అందరిలోనూ గౌరవమర్యాదలు పొందుతారు. ఆస్తి విషయంలో కొన్ని చిక్కులు వీడతాయి. ఒక సమాచారం ఊరటనిస్తుంది. పనుల్లో విజయం. నూతన ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు. శత్రువులు మిత్రులుగా మారతారు. తీర్థయాత్రలు చేస్తారు. వాహన, గృహయోగాలు. వ్యాపారాలలో పెట్టుబడులు అందుకుంటారు. ఉద్యోగాలలో కోరుకున్న మార్పులు ఉండవచ్చు. రాజకీయవర్గాలకు ఊహించని సన్మానాలు, విదేశీ పర్యటనలు. వారం చివరిలో వృథా ఖర్చులు. ఆప్తులతో విభేదాలు. పసుపు, ఆకుపచ్చ రంగులు. విష్ణుధ్యానం చేయండి.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

NRI View all
title
తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) ఆధ్వర్యంలో శివాలయాల సందర్శన యాత్ర

తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) వారు గత మూడేళ్లుగా నిర్వహిస్తున్న మహా శివరాత్రి శివాలయాల సందర్శన యాత్రను  ఈ మహా శ

title
అమెరికా నుంచి భారత్‌కి అందుకే వచ్చేశా! సీఈవో హార్ట్‌ టచింగ్‌ రీజన్‌

మెరుగైన అవకాశాలు, ఆర్థిక భద్రత కోసం చాలామంది భారతీయులు విదేశాల బాటపడుతుంటార

title
USA: ‘కోమా’లో భారత విద్యార్థి.. ఎమర్జెన్సీ వీసాకు లైన్‌ క్లియర్‌

వాషింగ్టన్‌:  ఫిబ్రవ

title
Hong kong: హాంకాంగ్‌లో ఘనంగా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం

హాంకాంగ్ తెలుగు సమాఖ్య అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం 2025ని ఘనంగా జరుపుకుంది.

title
తానా ప్రపంచసాహిత్యవేదిక ఆధ్వర్యంలో “నా భాషే నా శ్వాస” సదస్సు విజయవంతం

డాలస్ :  ఉత్తరఅమెరికా తెలుగుసంఘం (తానా) సాహిత్యవిభాగం

Advertisement

వీడియోలు

Advertisement